Activities calendar

06 March 2018

22:24 - March 6, 2018

ఢిల్లీ : త్రిపురలో గెలుపుతో.. కాషాయదళంలో బలుపు పెరిగింది. కమ్యూనిస్టులపై ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతోంది. నిప్పులాంటి కమ్యూనిస్టు యోధుల ఘన చరిత్రకు చెదలు పట్టించే విఫలయత్నం చేస్తోంది. ఒకటి కాదు... రెండు కాదు.. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నలభై ఎనిమిది గంటల్లోపే.. వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి.. కాషాయదళాలు. రష్యన్‌ విప్లవ నాయకుడు లెనిన్‌ విగ్రహాన్ని.. కసిగా.. బుల్‌ డోజర్లతో పెకిలించి వేశాయి. ఈ దాడులపై సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. తమ నిరసనను లేఖ ద్వారా ప్రధానికి వెల్లడించింది. త్రిపుర ఘటనలకు నిరసనగా.. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్షాలు, ప్రజాస్వామ్య వాదులు, శాంతికాముకులకు పిలుపునిచ్చింది. 
బీజేపీ శ్రేణుల దాష్టీకం
514 మందికి గాయాలు..196 ఇళ్ల దహనం.. 1539 ఇళ్లపై దాడులు.. 134 సీపీఎం కార్యాలయాలపై దాడులు.. 208 సీపీఎం కార్యాలయాల కబ్జా.. ఇవీ.. త్రిపురలో, గెలుపు బలుపుతో కొట్టుకుంటున్న బీజేపీ శ్రేణుల దాష్టీకానికి నిదర్శనాలు. పాతికేళ్ల కమ్యూనిస్టుల ఏలుబడిని దెబ్బతీశామన్న కమలదళం వెకిలితనపు వికృత చేష్టలకు దర్పణం.. అవును.. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గెలిచిన బీజేపీ.. ఇంకా అధికార పగ్గాలైనా చేపట్టకనే.. తన విషపూరిత లక్షణాన్ని చాటుకుంటోంది. ఆటవిక, అరాచక చేష్టలకు తెగబడుతోంది. సిపిఎం కార్యకర్తలు, కార్యాలయాలే లక్ష్యంగా దాడులను పెంచేశాయి కాషాయదళాలు. రష్యన్‌ కమ్యూనిస్టు యోధుడు వ్లాదిమన్‌ లెనిన్‌ విగ్రహాన్ని కూల్చి తమ అప్రజాస్వామిక విధానాన్ని చాటుకున్నారు. 
కషాయదళం మూఢత్వం 
కషాయదళం మూఢత్వం ఎంత పరాకాష్టకు చేరుకుందంటే...ఏకంగా బుల్‌డోజర్‌తో లెనిన్‌ విగ్రహాన్ని పెకిలించివేశారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ విధ్వంసం జరిగింది. విగ్రహాన్ని కూల్చే సమయంలో కాషాయ కార్యకర్తలు 'భారత్‌మాతాకీ జై' అంటూ నినదించారు. లెనిన్‌ విగ్రహాన్ని కూల్చిన అనంతరం హిందుత్వ ఉన్మాదులు స్వీట్లు పంచి మరీ సంబరాలు జరుపుకున్నారు.
ఈ ఘటనపై తీవ్ర నిరసనలు
ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తూతూ మంత్రంగా జెసిబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. త్రిపురలో తమ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై బీజేపీ శ్రేణుల దాడులను సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. సీపీఎం సహా, ఇతర వామపక్ష కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య వ్యతిరేక ఫాసిస్టు ధోరణుల ఆర్‌ఎస్ఎస్‌ చెలరేగిపోవడాన్ని ఖండించింది. ఈ ఘటనలకు నిరసనగా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, శాంతికాముకులు...  నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. త్రిపురలో శాంతిని కాపాడాలని ప్రధాని మోదీకి ఓ వినతిపత్రాన్ని సమర్పించింది. 
సీపీఎం కార్యకర్తలకు తీవ్ర గాయాలు 
సోమవారం సాయంత్రం ఐదున్నర వరకు అందిన సమాచారం ప్రకారం త్రిపురలో.... సంఘ్‌పరివార్‌ శక్తులు 514 మంది సీపీఎం కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచారు. 1539 ఇళ్లపై దాడులు చేశారు. కమ్యూనిస్టులకు చెందిన 196 ఇళ్లను ఏకంగా తగుల బెట్టేశారు. 134 పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి ధ్వంసరచన కొనసాగించిన సంఘ్‌ పరివార్‌ శ్రేణులు 208 వామపక్ష, ప్రజాసంఘాలకు చెందిన కార్యాలయాలను కబ్జా చేశాయి.. ఇవేకాదు.. చాలావరకు ప్రజాసంఘాల కార్యాలయాలపైనా దాడులు చేశారు.
లెనిన్‌ తరహాలోనే పెరియార్‌ విగ్రహాల ధ్వంసమూ : హెచ్.రాజా 
త్రిపుర ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదుల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు హెచ్‌.రాజా పార్టీ విద్వేష నైజాన్ని మరోమారు చాటుకున్నారు. లెనిన్‌ తరహాలోనే రాష్ట్రంలో పెరియార్‌ విగ్రహాల ధ్వంసమూ జరుగుతుందంటూ ట్వీట్‌ చేశారు. అయితే.. దీనిపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తడం, రాష్ట్ర ప్రజల్లో నిరసనోద్యమం రావడంతో.. ఆయన తక్షణమే తన ట్వీట్‌ను తొలగించారు. 
బీజేపీ అనైతిక, అప్రజాస్వామిక విధానాలు
మొత్తమ్మీద, దేశవ్యాప్తంగా, బీజేపీ శ్రేణులు, వామపక్ష భావజాల ఫోబియాతో అనైతిక, అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారన్నది సుస్పష్టం. త్రిపురలో ధనబలం, కేంద్ర ప్రభుత్వ అండదండలతో బిజెపి 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో బిజెపి-ఏపిఎఫ్‌టి 43 సీట్లను గెలుచుకుంది. సిపిఎం 16 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపికి 43 శాతం ఓట్లు రాగా...సిపిఎంకు 42.3 శాతం వచ్చాయి. గెలుపు ఓటముల మధ్య తేడా కేవలం 0.7 శాతం ఓట్లు మాత్రమే కావడం గమనార్హం. 

22:18 - March 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రెండోరోజు కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. ఏపికి ప్రత్యేక హోదాపై పట్టుబడుతూ టిడిపి, వైసిపిలు పార్లమెంట్‌ ఉభయ సభలను స్తంభింపజేశాయి.  నీరవ్‌మోది స్కాం, త్రిపురలో హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండోరోజు కూడా కొనసాగలేదు. ఏపీకి ప్రత్యేక హోదా, పిఎన్‌బి స్కాం, త్రిపురలో హింసాత్మక ఘటనలపై ఉభయసభల్లో నిరసనలు హోరెత్తాయి. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే ఏపికి చెందిన సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభ 11.30 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభ తిరిగి ప్రారంభమైన అదే పరిస్థితి. ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో  మధ్యాహ్నం 2 గంటలకు, అనంతరం మూడున్నరకు సభ వాయిదా పడింది. విపక్షాల సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో డిప్యూటి ఛైర్మన్ కురియన్‌ సభను బుధవారానికి వాయిదా వేశారు. 

లోక్‌సభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే  ప్రత్యేక హోదాపై ఏపీ ఎంపీలు, రిజర్వేషన్ల కోటా పెంపు అంశంపై టిఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాతా ఆందోళన కొనసాగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తెలుగు ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సభను సజావుగా సాగించాలని కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ వివిధ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తీవ్ర గందరగోళం నడుమ  స్పీకర్‌ లోక్‌ సభను బుధవారానికి వాయిదా వేశారు.

22:14 - March 6, 2018

విజయవాడ : ఎన్ని ఉద్యమాలు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ప్రకటించడాన్ని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. గత ఎన్నికల సమయంలో ఏపీని ఆదుకుంటామన్న బీజేపీ ఇప్పుడు మాట మార్చడం మోసం చేయడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు అన్నారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామన్నారు. కేంద్రం వ్యాఖ్యలను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ ఖండించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకోసం ఉన్నారా.. లేక స్వార్థ రాజకీయాల కోసం ఉన్నారో తేల్చుకోవాలన్నారు. 

 

22:12 - March 6, 2018

గుంటూరు : ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం అలవంభిస్తున్న వైఖరిని టీడీపీ సభ్యులు తప్పుపట్టగా, బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థించుకున్నారు. ప్రత్యేక హోదాతో ఒరిగేమీలేదన్న బీజేపీ సభ్యుడు ఆకుల సత్యనారాయణ వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షం కాబట్టే ఇంతకాలం సంయమనం పాటించానని, లేకపోతే పరిస్థితి వేరుగా ఉండేదని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోయిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బీజేపీకి చురకలు అంటించారు.  

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న అధికార టీడీపీ సభ్యులు ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. హోదాతో ఒరిగేదేమీలేదన్న బీజేపీ సభ్యుల వ్యాఖ్యలపై రగడ జరిగింది. హోదాతో మూడు వేల కోట్ల రూపాయలు మించిరాదని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని బీజేపీ సభ్యుడు ఆకుల సత్యనారాయణ ప్రస్తావించారు. హోదాతో నిధులు వరదలా వెల్లవెత్తాయనుకుంటే పొరపాటన్న ఆకుల వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 

కాంగ్రెస్‌ చేసిన విభజన చట్టం అస్పష్టంగా ఉందని ఆకుల వ్యాఖ్యానించారు. దీనిపై తాము కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేయడంలేదన్న ధోరణిలో మాట్లాడారు. మరోవైపు ఏపీ ప్రజల మనోభవాలను కించపరిచేలా ఎవరు వ్యవహరించినా సహించేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు. మంత్రి అచ్చెన్నాయుడు సహా... చర్చలోపాల్గొన్న టీడీపీ సభ్యులందరూ హోదా విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 
 

22:05 - March 6, 2018


ఢిల్లీ : హోదా హుళక్కే అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఏపీ ప్రజల ఆవేదనను పెడ చెవిన పెడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తెగేసి చెప్పింది. సెంటిమెంట్‌కు తలొగ్గి ఏపీకి హోదా ఇస్తే.. ఇతర రాష్ట్రాలు సైతం ఇదే డిమాండ్‌ చేస్తాయని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో... బీజేపీతో తెగదెంపులు చేసుకుందామా.. మరికొంత కాలం వేచిచూద్దామా అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరడం కీలకంగా మారింది. మెజార్టీ ఎమ్మెల్యేలు కటీఫ్‌ చెప్పేందుకే మొగ్గుచూపినట్లు సమాచారం.  


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి శివప్రతాప్‌ శుక్ల లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

ప్రత్యేక హోదా కన్నా ఇంతకుముందు ప్రకటించిన ప్యాకేజీనే ఉత్తమమని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ప్యాకేజీని మాత్రమే అమలు చేసి... మిగిలిన హామీలు సాధ్యం కాదని ప్రకటించాలని ఆర్థిక శాఖ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. సోమవారం జరిగిన భేటీలో ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు ఇవ్వాలని టీడీపీ నేతలు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీని కోరారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి కూడా ఇస్తే వెనుకబడిన రాష్ట్రాలైన యూపీ, బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలు కూడా డిమాండ్‌ చేసే అవకాశం ఉందని కేంద్రం వాదిస్తోంది. ఏపీ నేతలు తెలుగువారి ఆత్మగౌరవం అంటూ రాజకీయ వేడిని రగులుస్తున్నారని.. ఇలాంటి సెంటిమెంట్‌ అంశాలకు లొంగితే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉందని కేంద్రం అంటోంది. 

గడచిన నాలుగేళ్లలో పోలవరం, రెవెన్యూలోటు సహా పలు పద్దుల కింద రాష్ట్రానికి 12,500 కోట్ల రూపాయలు ఇచ్చినా రాష్ట్రం ఒక్క రూపాయికి కూడా లెక్కలు చూపలేదని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. ఇప్పుడేమీ యుద్ధాలు జరగడంలేదు కదా.. రక్షణ శాఖకు అన్ని నిధులు ఎందుకని అడిగినా అడుగుతారంటూ ఆర్థికశాఖ ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. సైన్యానికి కేటాయించిన నిధులు కూడా ఏపీకి కేటాయించాలని డిమాండ్‌ చేసినా చేస్తారని ఆర్థిక శాఖ అధికారులు అన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏపీకి హోదా, రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. 

మరోవైపు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీఎల్పీ భేటీలో.. సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్రం ఇలా ఎందుకు చేస్తుందో అర్ధం కావడంలేదన్న ఆయన.. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. అందరూ హోదా కోసం పట్టుబట్టాలని చంద్రబాబు నేతలకు సూచించారు. కేంద్రం నుంచి బయటకు వద్దామా..? కొంతకాలం ఎదురు చూద్దామా..? లేదా పోరాటం కొనసాగిస్తూ ఒత్తిడి పెంచుదామా అంటూ మూడు ప్రశ్నలను ఎమ్మెల్యేల ముందుంచారు చంద్రబాబు.  అయితే.. మెజార్టీ ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి బయటకు వచ్చేద్దామన్నట్లు సమాచారం. ఆరుగురు సభ్యులు మరికొంత కాలం వేచి చూద్దామన్నట్లు తెలుస్తోంది. 

కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు లేవా.. గెలుస్తున్న పార్టీలు లేవా అని చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంటే.. రక్షణశాఖ నిధులతో పోలిక తెచ్చి లీకులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కష్టమైనా.. నష్టమైనా.. అంతా మీ వెంటే ఉంటామన్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బుధవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో అన్నీ మాట్లాడుతానని చంద్రబాబు అనడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. 

22:02 - March 6, 2018

విజయం సాధించినప్పుడు పండుగ చేసుకుంటే తప్పులేదు..పతంగులు ఎగురవేసుకుంటే తప్పులేదు.. కానీ విధ్వంసానికి పాల్పడితే, పగ ప్రతీకారాలకు తెగబడితే ప్రజాస్వామ్యానికే చేటు. భారత రాజ్యాంగ ప్రవచించిన మౌలిక సూత్రాల విలువలకే సిగ్గుచేటు. మూర్తీభవించిన మూర్ఖత్వం సిద్ధాంత మూర్తుల విగ్రహాలపై పగబడితే ఏమనాలి ? ఇది రాజకీయా ? కట్టుతప్పిన మౌఢ్యమా ? ఏ విలువలకు ఈ ప్రస్తానం. శాంతిభద్రతలను చెరపట్టిన దుష్టపన్నాగం, ప్రత్యర్థులను దునుమాడడమేనా రాజ్యాధికారం. అనూహ్యవిజయంతో త్రిపురలో రెచ్చిపోయిన సంఘ్ పరివార్ శక్తులు భారత్ సమాజానికే సవాల్ విసురుతున్నాయి. ఒకవైపు అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక పార్లమెంట్ సమావేశాల్లో ఉండగానే..ఈశాన్య రాష్ట్రాన ఈ మూకల ముట్టడి గగుర్పాటు కల్గిస్తోంది. ఇది విజయగర్వం కాదు.. వికటాట్టహాసం.. ప్రజాతీర్పుపైనే పరాభవం. త్రిపురలో జరిగిన ఘట్టాలు ఒకసారి మననం చేసుకుంటే ప్రజాస్వామ్య హితైశిలు కన్నీళ్లు పెట్టకమానరు. కళ్లెర్రచేయకపోరు...134 పార్టీ కార్యాలయాలపై దాడి..514 మందిపై హింసాత్మ కగాయాలు, 196 గృహాలు దహనం, 1500 ఇళ్లపై విరుచుకుపడడం, ఇదా రాజనీతి? ఎటు తీసుకెళ్తున్నారు ఈ దేశాన్ని ? నేటి భారతం ప్రశ్నిస్తోంది..ఎవరు సమాధానం ఇవ్వగలరు? ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదంటారు.. కానీ రాజ్యమే అందుకు తెగబడితే... అడిగేవారెవరు ? త్రిపుర పరిణామాలు, పర్యవసానాలు, అసలు వీటికి కారణాలపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకట్ పాల్గొని, మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:40 - March 6, 2018

రైతు పోరుకు రెడీ అంటున్న సీపీఎం..సర్కారు మోసం జేస్తుందన్నతమ్మినేని, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు విల్వలేదా..?..హామీలిచ్చి మరచిని చంద్రాలు ఏందీ కథ?, అన్నంకోసం అద్దరాత్రి రోడ్డెక్కిన స్టూడెంట్స్...శాతవాహన యూనివర్సిటీల శాతగాని పాలన, కేసీఆర్ కిట్ అద్భుతనుకొచ్చిన కడియం...సద్వుల సంగతి చెప్పెతందుకు బిడియం, తెలంగాణల రాలిపోతున్న రైతన్న బత్కులు...నిన్న ఒక్కనాడే ముగ్గురు రైతుల ఆత్మహత్య, తొవ్వ దప్పిన చంద్రన్న బీమా పథకం...పీన్గెల మీద పేలాలేరుతున్న అధికారులు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

21:35 - March 6, 2018

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏపీ మంత్రి జవహర్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

యాదాద్రి జిల్లాలో దారుణం

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు మండలం బుజిలాపురం గ్రామంలో దారుణం వెలుగుచూసింది. ప్రేమించినట్టు నటించి పెళ్ళి చేసుకో అడగ్గానే ప్రియురాలు భార్గవిని.. ప్రియుడు నరేశ్ దారుణంగా హత్య చేసి చంపేశాడు. అనంతరం..తమ వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టాడు. భార్గవిని హత్య చేసిన తర్వాతిరోజే నిందితుడు.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు.  
 

కేంద్రం నుంచి బయటకు రావాలన్న మెజార్టీ ఎమ్మేల్యేలు

గుంటూరు : ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలను టీడీఎల్పీలో చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్ర ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. అందరూ హోదా కోసం పట్టుబట్టాలన్నారు. 
కేంద్రం నుంచి బయటకు వద్దామా ? ఓపిగ్గా ఎదురు చూద్దామా ? అంటూ ఎమ్మెల్యేల ముందు రెండు ఆప్షన్లు చంద్రబాబు ఉంచారు. కేంద్రం నుంచి బయటకు రావాలని మెజార్టీ ఎమ్మేల్యేలు అభిప్రాయపడ్డారు. 

21:23 - March 6, 2018

గుంటూరు : ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలను టీడీఎల్పీలో చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్ర ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. అందరూ హోదా కోసం పట్టుబట్టాలన్నారు. కేంద్రం నుంచి బయటకు వద్దామా ? ఓపిగ్గా ఎదురు చూద్దామా ? అంటూ ఎమ్మెల్యేల ముందు రెండు ఆప్షన్లు చంద్రబాబు ఉంచారు. కేంద్రం నుంచి బయటకు రావాలని మెజార్టీ ఎమ్మేల్యేలు అభిప్రాయపడ్డారు. 

21:14 - March 6, 2018

నిజామాబాద్ : జిల్లాలో ప్రభుత్వం నుంచి భూమి రాలేదంటూ... టీమాస్‌ ఆధ్వర్యంలో 11 వందల ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు ఆక్రమించారు. నిజామాబాద్‌ జిల్లా ఏడపల్లి మండలం ఏమస్సీ ఫారం వద్ద ప్రభుత్వం భూమిలో జెండాలు పాతారు. సీఎం కేసీఆర్‌ దళితులకు 11 వందల ఎకరాల భూమిని ఇస్తానని మాట తప్పరని దళితులు విమర్శించారు. విషయం తెలుసుకున్న పోలీసులు... ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని... జెండాలను తొలగించారు. 

 

21:02 - March 6, 2018

హైదరాబాద్ : కూకట్‌పల్లి సప్తగిరి కాలనీలోని నారాయణ జూనియర్‌ కళాశాలని జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. గత రెండేళ్లుగా 27 లక్షల 50 వేల రూపాయల ఆస్తి పన్ను కట్టడం లేదని, నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సీజ్‌ చేశామని డీసీ మంగతాయారు అన్నారు. ఇంటర్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తరగతి గదులను సీజ్‌ చేయలేదని ఆమె తెలిపారు. యాజమాన్యం టాక్స్‌ పే చేసిన తరువాత సీల్‌ తిస్తామని టాక్స్‌ కట్టని వారు ఎవరైనా సరే కఠిన చర్యలుంటాయని డీసీ మంగతాయారు హెచ్చరించారు. 

 

21:01 - March 6, 2018

సంగారెడ్డి : వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ప్రజలు తనను గెలిపిస్తే 30 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు గృహాలు నిర్మించి ఇస్తానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. లేకపోతే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

20:56 - March 6, 2018
20:55 - March 6, 2018

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు మండలం బుజిలాపురం గ్రామంలో దారుణం వెలుగుచూసింది. ప్రేమించినట్టు నటించి పెళ్ళి చేసుకో అడగ్గానే ప్రియురాలు భార్గవిని.. ప్రియుడు నరేశ్ దారుణంగా హత్య చేసి చంపేశాడు. అనంతరం..తమ వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టాడు. భార్గవిని హత్య చేసిన తర్వాతిరోజే నిందితుడు.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు.  

 

త్రిపురలో మరో లెనిన్ విగ్రహం కూల్చివేత

అగర్తల : త్రిపురలో మరో లెనిన్ విగ్రహాన్ని కాషాయ మూకలు కూల్చివేశాయి. రెండు రోజుల క్రితం బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థలు సాబ్రూమ్ లో లెనిన్ విగ్రహాన్ని నేలమట్టం చేశాయి. బెలోనియాలో కూడా మార్క్సిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని జేసీబీతో బీజేపీ శక్తులు కూల్చివేశాయి.

19:45 - March 6, 2018
19:40 - March 6, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో వామక్షాలు ధర్నా నిర్వహించాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్రం వెంటనే స్పందించి.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతపక్షనేత వైఎస్‌ జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లికి వచ్చి హోదా పోరును ఉధృతం చేయాలన్నారు. అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతోందని లెఫ్ట్‌పార్టీల నేతలు అంటున్నారు. మరిన్న వివరాలను వీడియోలో చూద్దాం... 

 

19:21 - March 6, 2018

ఢిల్లీ : ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. గతంలో ప్రకటించిన ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలమని తెలిపింది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమన్న కేంద్రం... పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం కుదరదని కూడా స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పలేదన్నారు. 

ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి

ఢిల్లీ : ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. గతంలో ప్రకటించిన ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలమని తెలిపింది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమన్న కేంద్రం... పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం కుదరదని కూడా స్పష్టం చేసింది. 

19:13 - March 6, 2018

విశాఖ : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఐద్వా మహిళలు డిమాండ్‌ చేశారు.  విశాఖపట్నంలో ఐద్వా మహిళలు  పోలీసు జాయింట్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ మూవీ వల్ల యువత పక్కదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ విశాఖలో సభ పెడితే అడ్డుకుంటామని ఐద్వా నేతలు హెచ్చరించారు.

18:54 - March 6, 2018

ఢిల్లీ : త్రిపురలో కాషాయ శ్రేణులు రెచ్చిపోతున్నాయని సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. త్రిపురలో కాషాయ శ్రేణులు అరాచకం సృష్టిస్తున్నాయని అన్నారు. ఆ రాష్ట్రంలో లెనిన్‌ విగ్రహాన్ని కూల్చడాన్ని ఆయన తప్పుబట్టారు. లెనిన్‌ విగ్రహాన్ని కూల్చి బీజేపీ తమ అరాచక సంస్కృతిని చాటుకుందని ఎద్దేవాచ చేశారు. సీపీఎం ఆఫీసుల మీద దాడులు చేస్తూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అరాచకానికి తెరతీశాయని ఆగ్రహం వక్తం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులను ప్రజా ఉద్యమాలతో ఎదుర్కొంటామని పేర్కొన్నారు. 

18:49 - March 6, 2018

నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ పాలన అవినీతి, దోపిడీకి ఆలవాలంగా మారిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. టీపీసీసీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్మల్‌లో జరిగిన సభలో కాంగ్రెస్‌ నాయకులు  కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకుపడ్డారు. అప్రజాస్వామిక పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని జానారెడ్డి అన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.  

18:29 - March 6, 2018
18:27 - March 6, 2018
18:22 - March 6, 2018

హైదరాబాద్ : చార్మినార్ దగ్గర నగల వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 10మంది దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి .. ఇంట్లో చొరబడి.. 5కిలోల బంగారు అభరణాల అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. పాత ఉద్యోగులే నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరిలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 

 

18:20 - March 6, 2018

ఢిల్లీ : త్రిపురలో సీపీఎం కార్యకర్తలపై, కార్యాలయాలపై బీజేపీ దాడులు చేయడాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు తీవ్రంగా ఖండించారు. సీపీఎం బలంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ దాడులకు తెగబడుతూ ప్రజలను భయాందోళలను గురిచేస్తోందని మండిపడ్డారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. లెనిన్‌ విగ్రహాన్ని కూల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విగ్రహాలు కూల్చినంతమాత్రాన వారి పేరు ప్రతిష్టలు తగ్గిపోవన్నారు. సీపీఎం శాంతిని కోరుకుంటుందన్నారు. 45 శాతం ప్రజలు సీపీఎంకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు.

 

18:15 - March 6, 2018

గుంటూరు : రెండు జాతీయ పార్టీలు ప్రజలను పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో చర్చించినవే ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. సమావేశాలకు ప్రతి ఒక్క సభ్యుడు హాజరుకావాలన్నారు.

 

సాయంత్రం అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది నాయకులతో భేటీ

ఢిల్లీ : కర్నాటక ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీ... సాయంత్రం ఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది నాయకులతో భేటీ అవుతోంది. సాయంత్రం 5గంటలకు జరిగే ఈ భేటీకి తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నాయకుడు కిషన్ రెడ్డి హాజరవుతున్నారు. ఇటీవల మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు, థర్డ్ ఫ్రంట్‌పై అమిత్ షాకు వివరించనున్నారు. 

18:08 - March 6, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీ వేదికగా విపక్షాలు ఆందోళనను ముమ్మరం చేశాయి. పార్లమెంట్‌ స్ట్రీట్‌లో జరిగిన ఆందోళనలో వామపక్ష నేతలతో పాటు వైసీపీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను రాజీనామా చేయించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలు బీజేపీతో తెగదెంపులు చేసుకోకపోతే.. ప్రజలు ఏపీలో స్థానం లేకుండా చేస్తారంటున్న రాఘవులుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఏపీకి హోదా విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్రంలోని టీడీపీ మంత్రులు రాజీనామా చేయాలని చెప్పారు. హోదా పోరాటంలో టీడీపీ నేతలు కలిసిరావాలన్నారు. 

17:50 - March 6, 2018

గుంటూరు : రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి సచివాలయం గేట్‌-2 ముందు రాయలసీమ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో అధికారాన్ని ఒకేచోట కేంద్రీకరించకుండా.. రాయలసీమలో కనీసం హైకోర్టును ఏర్పాటు చేయాలని బైఠాయించారు. అభివృద్ధి అంతా అమరావతి చుట్టూ చేస్తున్నారని ఆవేదన చెందదారు. వారి ఆందోళనపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:47 - March 6, 2018

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ కార్తీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.  సిబిఐ, ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు... ఈ కేసులో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సిబిఐ కార్తీ చిదంబరాన్ని ఫిబ్రవరి 28న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో ఎఫ్‌ఐపిబి క్లియరెన్స్‌ కోసం ఐఎన్‌ఎక్స్‌ మీడియా నుంచి కార్తి చిదంబరం ముడుపులు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. సీబీఐ వాదన అవాస్తవమని..రాజకీయ కక్షతోనే తనను వేధిస్తున్నారని కార్తీ ఆరోపిస్తున్నారు.

 

17:44 - March 6, 2018

ఢిల్లీ : పీన్ బీ స్కామ్‌లో మరో ట్విస్ట్‌ నెలకొంది. నీరవ్‌ మోదీ, గీతాంజలి జ్యూయలరీ విచారణలో భాగంగా... ఐసిఐసిఐ బ్యాంక్‌ ఎండి చందాకొచ్చర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండి శిఖా శర్మలకు సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్విస్టిగేషన్‌ ఆఫీస్‌ (SFIO) నోటీసులు జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు 31 బ్యాంకులతో కూడిన కన్సార్టియంకు నాయకత్వం వహిస్తోంది. ఈ కన్సార్టియం పీఎన్‌బీ స్కాంలో నిందితుడిగా ఉన్న గీతాంజలి గ్రూప్స్‌ అధినేత మెహుల్‌ ఛోక్సీకి రుణాలు ఇచ్చింది. కొన్ని విషయాల్లో స్పష్టత కోసమే చందా కొచ్చర్‌, శిఖా శర్మలను ప్రశ్నించేందుకు పిలిచామని, నిందితులుగా కాదని SFIO అధికారులు స్పష్టంచేశారు. నీరవ్‌ మోదీ గ్రూప్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. కానీ ఇతర బ్యాంకులతో కలిసి రుణం ఇచ్చినట్లు తెలిపింది. పిఎన్‌బిలో స్కాంలో వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోది, ఆయన మామ మెహుల్‌ చోక్సీ 12 వేల 7 వందల కోట్ల మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే.

 

17:40 - March 6, 2018

కృష్ణా : విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో  మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో  సమాజంలో మహిళల స్థానం, సాధించుకోవాల్సిన హక్కులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు పాల్గొంటున్నారు.  ఈసందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

 

17:38 - March 6, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలోని పహాడీషరీఫ్‌లో ఓ తండ్రి కుమారుడి చెయ్యి నరికివేశాడు. మాంసం వ్యాపారి అయినా ఖయ్యుం ఖురేషి పెద్దకుమారుడు ఖలెద్‌ ఖురేషి మొబైల్‌ ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూస్తున్నడని మాంసం కత్తితో కుడి చెయ్యి నరికేశాడు. అస్తమానం ఫోన్‌లో అశ్లీల దృశ్యాల చూడటాన్ని గమనించిన తండ్రి ఇటీవల కొడుకును మందలించాడు. సోమవారం రాత్రి అదే పని చేస్తుండడంతో  ఖయ్యుం ఆగ్రహంతో చెయ్యి నరికివేశాడు. తల్లి స్థానికుల సాయంతో కొడుకును ఆసుపత్రిలో చేర్పించగా,  ఖయ్యు పోలీసులకు లొంగిపోయాడు.

 

17:36 - March 6, 2018


పశ్చిమ గోదావరి : జిల్లా.. ద్వారకాతిరుమల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికలకు ఇవ్వవలసిన యూనిఫామ్‌లు, చెప్పులు ప్రిన్సిపాల్‌ అమ్ముకుంటుదని విద్యార్థులు ఆరోపించారు. ఈమేరకు విద్యార్థినులు తరగతులను బహిష్కరించి, పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్‌ తమను కులం పేరుతో దూషిస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే తొలంగించాలని డిమాండ్‌ చేశారు. 

 

17:33 - March 6, 2018

విజయవాడ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు పిలవాలన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంది.... కానీ ప్రజలకు మేలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఇది మనుషుల ప్రభుత్వం కాదు...మృగాళ్ల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.

 

17:28 - March 6, 2018

నిజామాబాద్ : తినే తిండి, కట్టే బట్టపై బీజేపీ ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ అన్నారు. బస్సుయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాంతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో ఈ వాదనను బీజేపీ ముందుకు తెచ్చిందన్నారు. బీఫ్ తినడాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రజలు ఎం తినాలో, ఏ దుస్తులు వేసుకోవాలో, ఏం చేయాలో బీజేపీ నేతలు నిర్ధేశిస్తుందన్నారు. ముస్లీం, మైనార్టీలపై దాడులకు పాల్పడుతుందని తెలిపారు. తెలంగాణలో ముస్లీంలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ముస్లీంల ఓట్లు పొందడానికి టీఆర్ ఎస్ కు హర్షత లేదన్నారు. టీసర్కార్ నాలుగేళ్ల పాలనలో ఉర్దూ అకాడమీ అటకెక్కిందన్నారు. 

 

17:11 - March 6, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్నారు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి హోదా ఇస్తామని ఆయన చెప్పారు. విభజన హామీలపై పార్లమెంట్‌ స్ట్రీట్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన అఖిలపక్ష నేతల ధర్నాకు రాహుల్‌ మద్దతు తెలిపారు. 
 

17:00 - March 6, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఆందోళనల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నిన్న విశాఖలో కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ చేసిన ఆందోళనపై విష్ణుకుమార్‌రాజు ఫైర్‌ అయ్యారు. అయితే విష్ణుకుమార్‌రాజు టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను.... గణేష్‌కుమార్‌ ఖండించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న గణేష్‌కుమార్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. నాలుగేళ్లుగా ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇంకా చేస్తాం.. చూస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.

 

16:55 - March 6, 2018

గుంటూరు : ఏపీ మీడియా పాయింట్‌ దగ్గర ప్రస్తుత పరిణామాలు మారిపోయాయి. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోగా... తాజాగా మిత్రపక్షమైన టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. టీడీపీ నేతలపై విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలు కోసం పోరాడుతుంటే... బీజేపీ నేతలు ఎదురుదాడి చేయడం సరికాదని అంటున్న టీడీపీ ఎమ్మెల్యే అనితతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. విభజన హామీల కోసం తాము పోరాటం చేస్తామన్నారు. బీజేపీ, వైసీపీ కలిసిపోయినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. బీజేపీ లీడర్లపైనే క్రైమ్ రేట్ ఎక్కువగా ఉందన్నారు. 

 

నగల వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం

హైదరాబాద్ : చార్మినార్ దగ్గర నగల వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 10మంది దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి .. ఇంట్లో చొరబడి.. 5కిలోల బంగారు అభరణాల అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. పాత ఉద్యోగులే నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరిలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 

15:53 - March 6, 2018

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో బీజేపీ సభ్యుల ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు. బీజేపీ సభ్యులు మాట్లాడాల్సింది ఇక్కడ కాదని... కేంద్రంతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. విభజనలో జరిగిన నష్టాన్ని సరిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు పట్టిన గతిని బీజేపీ గుర్తించుకోవాలన్నారు. విభజన హామీలపై వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ఏడు మండలాలు తెలంగాణలో ఉంటే పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదన్నారు.  

త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చడాన్ని ఖండిస్తున్నాం : ఏచూరి

ఢిల్లీ : త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చడాన్ని ఖండిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కూల్చబడిన లెనిన్ విగ్రహం వద్దే ఆందోళన చేస్తామని చెప్పారు. త్రిపురలో డబ్బు వెదజల్లి బీజేపీ అధికారం చేజిక్కించుకుందన్నారు. బీజేపీ గెలిచిన వెంటనే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు. 

 

14:54 - March 6, 2018

ఢిల్లీ : హస్తినలో వామపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో పాల్గొన్న సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, విభజన హామీల సాధన సమితి, ప్రజాసంఘాల నేతలు మద్దతిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఐక్యంగా పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి పి.మధు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ తప్ప అన్ని పార్టీలు ధర్నాకు మద్దతు ఇచ్చాయని, పాల్గొన్నాయని తెలిపారు.
సీపీఐ నేత రాజా మాట్లాడుతూ కేంద్రంపై పోరాటం కొనసాగించాలని అన్నారు. కాంగ్రెస్ నేత కేవీపీ మాట్లాడుతూ ఎన్ డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేకహోదా సాధించు కోవాలన్నారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అన్నారు. 

 

రాజ్యసభ మ.3.30 గంటలకు వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిప్యూటీ చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా నిరసన తెలిపారు. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు.

14:42 - March 6, 2018

ఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిప్యూటీ చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా నిరసన తెలిపారు. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు.

 

'మీరు ఆందోళన చేయాల్సింది ఇక్కడ కాదు' : సీఎం చంద్రబాబు

గుంటూరు : మిత్రపక్షంగా ఉన్న కాబట్టి గమ్మున్న ఉన్నానని....లేకుంటే ఇంకా ఎక్కువగా ఫైట్ చేసేవాన్ని అని సీఎం చంద్రబాబు అన్నారు. 'మీరు ఆందోళన చేయాల్సింది ఇక్కడ కాదని.. ఢిల్లీలో ఆందోళన చేయాలి' అని బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారు. 60 సం.రాలు హైదరాబాద్ లో ఉన్నానని తెలిపారు. తన కృషి వల్ల హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉందన్నారు. హక్కుల సాధనలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు. తాను ప్రజల పక్షాన ఉంటానని తెలిపారు. 

14:31 - March 6, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఐక్యంగా పోరాడాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. 5 కోట్ల ప్రజల మనోభావాలు ఒకలా ఉంటే మన మనోభావాలు మరోలా ఉండడం సబబు కాదన్నారు. ప్రధాని మోడీ, బీజేపీల పై తమకు వ్యతిరేకత లేదని తెలిపారు. ప్రజల మనోభవాలకు వ్యతిరేకంగా పార్టీలు వెళ్లకూడదన్నారు. రాష్ట్ర హక్కుల కోసం సమైక్యంగా వెళ్లాలని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్రం అమలు చేయాలని పేర్కొన్నారు. 

14:21 - March 6, 2018

గుంటూరు : మిత్రపక్షంగా ఉన్న కాబట్టి గమ్మున్న ఉన్నానని....లేకుంటే ఇంకా ఎక్కువగా ఫైట్ చేసేవాన్ని అని సీఎం చంద్రబాబు అన్నారు. 'మీరు ఆందోళన చేయాల్సింది ఇక్కడ కాదని.. ఢిల్లీలో ఆందోళన చేయాలి' అని బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారు. 60 సం.రాలు హైదరాబాద్ లో ఉన్నానని తెలిపారు. తన కృషి వల్ల హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉందన్నారు. హక్కుల సాధనలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు. తాను ప్రజల పక్షాన ఉంటానని తెలిపారు. 

 

14:14 - March 6, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. లోక్‌సభలో ఏపీ సభ్యుల ఆందోళనతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు పార్లమెంట్‌ వెలుపల కూడా ఏపీ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టి... ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌  చేశారు. అలాగే పార్లమెంట్‌ స్ట్రీట్‌లో కాంగ్రెస్‌ ఆత్మగౌరవ దీక్ష చేపడుతోంది. 
లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన
లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ ప్రారంభమైన వెంటనే టీఆర్‌ఎస్ ఎంపీలు.. రిజర్వేషన్ల అమలు రాష్ర్టాలకే అప్పగించాలంటూ నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీఆర్‌ఎస్‌, ఏపీ సభ్యుల ఆందోళనతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. 

 

14:03 - March 6, 2018

ఢిల్లీ : మౌంటెయిన్‌ బైకింగ్‌ స్టంట్ రైడర్‌ యానిక్‌ గ్రానెరీ పర్వతాలపై చేయాల్సిన రైడింగ్‌....ఐస్‌ ట్రాక్‌పై చేసి ఆకట్టుకున్నాడు. క్రాష్ట్ ఐస్‌ కోర్స్‌పై స్లోప్‌ స్టైల్‌ మౌంటెయిన్‌ బైకింగ్‌ చేసి అలరించాడు.

14:02 - March 6, 2018

ఢిల్లీ : టీ20ల్లో తిరుగులేని టీమిండియా....ఫటా ఫట్‌ ఫార్మాట్‌లో తొలిసారిగా ట్రై సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌...టీ20 మాజీ చాంపియన్‌ శ్రీలంక జట్ల మధ్య తొలి రౌండ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

తొలి సారిగా టీ20 ఫార్మాట్‌లో ట్రై సిరీస్‌ ఆడబోతోన్న టీమిండియా విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సంచలనాలకు మారుపేరైన శ్రీలంక జట్టు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో టీమిండియా జోరుకు బ్రేక్‌ వేయాలని పట్టుదలతో ఉంది.

 స్టార్‌ బ్యాట్స్‌మెన్ రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ట్రై సిరీస్‌ టైటిల్ రేస్‌లో బరిలోకి దిగనుంది.టీ20 ట్రై సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ట్రై సిరీస్‌ కోసం ప్రకటించిన భారత  జట్టులో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, సురేష్‌ రైనా, మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ ,దినేష్‌ కార్తీక్‌,  యజ్వేంద్ర చహాల్‌, విజయ్‌ శంకర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయదేవ్‌ ఉనద్కత్‌,మహమ్మద్‌ సిరాజ్‌, రిషభ్‌ పంత్‌ ఉన్నారు .

ధోనీ, విరాట్‌కొహ్లీ,హార్దిక్ పాండ్య,భువనేశ్వర్‌ కుమార్‌,బుమ్రా,కుల్దీప్ యాదవ్‌ వంటి మ్యాచ్‌ విన్నర్లు లేకుండా బరిలోకి దిగబోతోన్న భారత్‌ ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి. 

మరోవైపు దినేష్‌ చాందిమల్‌ సారధ్యంలోని శ్రీలంక జట్టు భారత్‌కు షాకివ్వాలని ప్లాన్‌లో ఉంది. భారత్‌తో పోల్చుకుంటే బలహీనంగా ఉన్న శ్రీలంక జట్టు సొంతం గడ్డపై అంచనాలకు మించి రాణించాలని పట్టుదలతో ఉంది. 

టీమ్‌ కాంబినేషన్‌తో పాటు ట్రాక్ రికార్డ్‌ పరంగా టీమిండియాకే తొలి మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా....సొంతగడ్డపై శ్రీలంకను తక్కువ అంచనా వేయలేం.మరి తొలి రౌండ్‌  టీ20లో నెగ్గి రోహిత్‌ శర్మ అండ్‌ కో ట్రై సిరీస్‌లో శుభారంభం చేయగలదో లేదో చూడాలి.

టీ20ల్లో తిరుగులేని టీమిండియా

తొలిసారిగా ట్రై సిరీస్‌ ఆడనున్న టీమిండియా 

13:59 - March 6, 2018

హైదరాబాద్ : త్వరలో ఖాళీకానున్న రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడడంతో గులాబీ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. మూడు స్థానాల్లో ఒక స్థానంపై ఇప్పటికీ స్పష్టతరాగా... మరో రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 
రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. గులాబీ పార్టీలోని ఆశావహుల్లో ఉత్సాహం నింపుతోంది. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో.. పార్టీ అధినేత కేసీఆర్‌ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.  శాసనసభ్యుల సంఖ్యాబలం దృష్ట్యా మూడు స్థానాలు కూడా అధికార పార్టీకే దక్కనున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసినా ఒక్కా స్థానం కూడా దక్కించుకునే అవకాశం లేదు. ఒకవేళ విపక్షాలు అభ్యర్థిని నిలిపినా గెలవడం కష్టసాధ్యమైన పని. ఖాళీ అవుతున్న మూడు స్థానాలు కూడా గులాబీ పార్టీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆసక్తికరంగా మారిన అభ్యర్థుల ఎంపిక
టీఆర్‌ఎస్‌కు మూడు రాజ్యసభ స్థానాలు దక్కనుండడంతో ఆ ముగ్గురు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు ఎవరన్నదానిపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అభ్యర్థుల ఎంపికపై అధినేత కేసీఆర్‌ కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. కేసీఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ అంశం ఎత్తుకోవడంతో.. రాజ్యసభ సభ్యుల ఎంపిక కూడా ఆసక్తిరేపుతోంది. పార్టీ జాతీయ స్థాయిలో మరింత బలపడేందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్న ప్రచారం మొదలైంది.
మరో ఏడాదిలోపే సార్వత్రిక ఎన్నికలు
సాధారణ ఎన్నికలు కూడా మరో ఏడాదిలోపే రానున్నాయి. దీంతో పార్టీ నేతల్లో ఉత్సాహం నింపేలా కూడా రాజ్యసభ సభ్యుల ఎంపిక ఉండబోతుందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన నేతలకే పదవులు వరించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.  సీఎం సమీప బంధువు, ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌ వెన్నంటి ఉన్న జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ పేరు రాజ్యసభకు దాదాపు ఖరారు అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు స్థానాలకే అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఒక స్థానంలో గొల్ల, కురుమల్లో ఒకరికి అవకాశం కల్పిస్తానన్న హామీని సీఎం కేసీఆర్‌ ఇవ్వడంతో.... ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. పార్టీలో సీనియర్‌ అయిన రాజయ్య యాదవ్‌ సహా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, నోముల నర్సింహ్మయ్యతోపాటు మరికొంతమంది ఆశలు పెంచుకున్నారు. అయితే ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న రాజయ్య యాదవ్‌  అభ్యర్థిత్వమే ఖరారయ్యే ఛాన్స్‌ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.  మరో స్థానంలో మైనార్టీ లేదా.. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించే ఛాన్స్‌ ఉంది. లేదంటే మహిళకు రాజ్యసభ సీటు దక్కే చాన్స్‌ కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక తుదిదశకు చేరుకుందని.. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

 

13:49 - March 6, 2018

హైదరాబాద్ : ప్రత్యేక హోదా.. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరి నోట విన్నా ఇదే మాట.. ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు సైతం.. పార్లమెంట్ సమావేశాల సాక్షిగా పోటాపోటీగా పోరాడుతున్నాయి... ఐతే హోదాకోసం పోరాడతానన్న జనసేన అధ్యక్షుడు పన్‌ కళ్యాణ్‌ మాత్రం సరైన సమయంలో... మౌనం వహిస్తున్నాడు... జనసేనాని వైఖరి విమర్శలకు తావిస్తోంది.. 
మూడు దశల్లో ఉద్యమిస్తానన్న జనసేనాని
ఏపీకి ప్రత్యకే హోదా డిమాండ్‌తో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ 2016లో కేంద్రంపై యుద్ధాన్నే ప్రకటించాడు. హోదా స్థానంలో ఇస్తామన్న ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చాడు పవన్‌ కళ్యాణ్.  అప్పట్లో దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ... తిరుపతి, అనంతపురం, కాకినాడల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించాడు. ఈ సభల్లో కేంద్రంపై  జనసేనాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఐతే ప్రత్యేక హోదా కోసం మూడు దశల్లో ఉద్యమిస్తానని అప్పట్లో  ప్రకటించాడు.
ఏపీ ఎంపీలపైనా విరుచుకుపడ్డ పవన్
పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ఎంపీలపైనా విరుచుకుపడ్డారు. ఎంపీలు వ్యాపారాలు చక్కబెట్టుకునేందుకే తమ పదవులను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అప్పటి  కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని సైతం పవన్ వదలకుండా విమర్శించారు. అంతేఘాటుగా ఎంపీలు కేశినేనినాని, కేంద్రమంత్రి సుజనాచౌదరి సైతం పవన్‌ను విమర్శించారు.. ఆ తర్వాత కాలంలో పవన్‌ ప్రత్యేకహోదాపై పెద్దగా  స్పందించ చేయలేదు. గతేడాది పలు దఫాలుగా ఏపీలో పర్యటించినా.. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటానికే పరిమితం అయ్యారు తప్ప... ఎలాంటి పోరాట కార్యక్రమాలు నిర్వహించలేదు.
జేఎఫ్‌సీలో సైతం  హోదా ఇవ్వాలంటూ తీర్మానం
తాజాగా జేఎఫ్‌సీలో సైతం ఏపీకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని తీర్మానం చేశారు. హోదాతోనే ఏపీ కోలుకుంటుందన్నారు. మరోవైపు హోదా ఉద్యమాన్ని లీడ్‌ చేయాల్సిందిగా వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు పవన్‌ను కోరుతున్నాయి. ఆయన అభిమనులు,కార్యకర్తలు సైతం ఫోన్లు, సోషల్‌ మీడియా ద్వారా కోరుతున్నారు. మరోవైపు రాష్ర్టంలో  అధికార, ప్రతిపక్షాలన్న తేడా లేకుండా అన్ని రాజకీయపార్టీలు కేంద్రంపై  పోరాడున్నాయి.  మిత్రపక్షం అయ్యుండి కూడా టీడీపీ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తోంది. ప్రతిపక్ష వైసీపీ ఢిల్లీలో హోదా కోసం ధర్నా చేస్తోంది. కాంగ్రెస్‌ సైతం హోదా కోసం ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది. కానీ పవన్‌ మాత్రం ఎక్కడా పోరాట విధానం కనబరచడం లేదు. రాష్ర్టంలో ఇంత జరుగుతున్నా.. పవన్‌ మాత్రం ప్రత్యక్ష పోరాటంలోకి రాకుండా...కేవలం స్టేట్‌మెంట్లు మాత్రమే ఇస్తుండడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

 

13:43 - March 6, 2018

ఢిల్లీ : హస్తినలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీక్షలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, విభజన హామీల సాధన సమితి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కేవీపీ మాట్లాడుతూ ఎన్ డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేకహోదా సాధించు కోవాలన్నారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అన్నారు. హోదా, విభజన హామీలు సాధించుకునేవరకు ఐక్య పోరాటం చేయాలన్నారు. 

 

13:39 - March 6, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. లోక్‌సభలో ఏపీ సభ్యుల ఆందోళనతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. విభజన హామీలపై చర్చకు టీడీపీ వాయిదా తీర్మానం, ప్రత్యేక హోదా అంశంపై చర్చించాలని లోక్‌సభలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చాయి. సభ్యుల ఆందోళనలతో ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయసభలు వాయిదా పడ్డాయి. మరోవైపు పార్లమెంట్‌ వెలుపల కూడా ఏపీ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టి... ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌  చేశారు. అలాగే పార్లమెంట్‌ స్ట్రీట్‌లో కాంగ్రెస్‌ ఆత్మగౌరవ దీక్ష చేపడుతోంది. 

 

13:28 - March 6, 2018

ఢిల్లీ : గత 25 ఏళ్లుగా సీపీఎం పాలన ఎలా ఉంటుందో...కాషాయ దళ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా ఉంటుందో రెండు రోజుల్లోనే ప్రపంచానికి తెలిసిపోయింది. కొన్ని సంవత్సరాలుగా త్రిపురలో ఉన్న ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా చెడిపోయింది. ఎక్కడ చూసినా ఘర్షణలు..దాడులు జరుగుతున్నాయి. సీపీఎం కార్యాకర్తలు..సీపీఎం కార్యాలయాలను కాషాయ దళం టార్గెట్ చేస్తోంది. కార్యాలయాలకు నిప్పు పెట్టడం..కార్యకర్తలపై భౌతికంగా దాడులకు దిగుతోంది. మొత్తంగా త్రిపురలో హింస ప్రజరిల్లుతుండడంపై ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ సందర్భంగా కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ అధికార దురహంకారానికి పాల్పడుతుందని అన్నారు. త్రిపుర గిరిజనులు చైతన్యవంతులని తెలిపారు. ఓటమి, గెలుపులను బట్టి రాజకీయాలు ఉండవన్నారు. విధ్వంసకర చర్యలను ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసినంత మాత్రాన కమ్యూనిస్టు ఉద్యమం ఆగదన్నారు. విగ్రహాలు కూల్చడం భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమైన సంస్కృతి అని పేర్కొన్నారు. బీజేపీ హిందూత్వం గురించి చెబుతూ భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుందని మండిపడ్డారు. పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం, విగ్రహాలను కూల్చడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదరమైంది. బీజేపీ దౌర్జన్యాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

 

ఢిల్లీలో వామపక్షాల ఆందోళన

ఢిల్లీ : హస్తినలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీక్షలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, విభజన హామీల సాధన సమితి నేతలు పాల్గొన్నారు. 

11:46 - March 6, 2018

పిఎన్ బి స్కాం..

ఢిల్లీ : పీఎన్ బి స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చందాకొచ్చార్, శిఖా శర్మలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. నీరవ్ మోడీ, గీతాంజలి జ్యుయలరీ స్కామ్ పై విచారణ కొనసాగుతోంది. నీరవ్ తో సంబంధాలు లేవని చందాకొచ్చార్ పేర్కొన్నారు. ఇప్పటికే యాక్సిస్, ఐసీసీఐ ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. 

లెనిన్ విగ్రహం కూల్చివేత...

త్రిపుర : బెలోనియాలో మార్కిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని బీజేపీ నేతలు కూల్చివేశారు. త్రిపుర గవర్నర్, డీజీపీకి కేంద్ర హోం మంత్రి ఫోన్ చేశారు. ఎన్నికల అనంతరం నెలకొన్న హింస కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించింది. 

11:29 - March 6, 2018

ఢిల్లీ : విభజన హామీలు..ప్రత్యేక హోదా కోరుతూ టిడిపి ఎంపీలు పోరు కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఆందోళనను రెండో రోజు కూడా కంటిన్యూ చేశార. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా..కల్పించాలని నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే రోజుకో వేషంతో నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి ఎంపి శివప్రసాద్ మంగళవారం ఎన్టీఆర్ వేషధారణతో వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

టిడిపి ఎంపీల ఆందోళన...

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీలు నిరసనకు దిగగా ఎంపీ శివ ప్రసాద్ ఎన్టీఆర్ వేష ధారణలో వచ్చి కేంద ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. 

ఉభయసభల్లో గందరగోళ...

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేస్తుండడంతో మధ్యాహ్నం 12గంటల వరకు సభను స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభను మధ్యాహ్నం 11.30గంటల వరకు వాయిదా వేశారు. 

11:20 - March 6, 2018
11:17 - March 6, 2018

ఢిల్లీ : గత 25 ఏళ్లుగా సీపీఎం పాలన ఎలా ఉంటుందో...కాషాయ దళ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా ఉంటుందో రెండు రోజుల్లోనే ప్రపంచానికి తెలిసిపోయింది. కొన్ని సంవత్సరాలుగా త్రిపురలో ఉన్న ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా చెడిపోయింది. ఎక్కడ చూసినా ఘర్షణలు..దాడులు జరుగుతున్నాయి. సీపీఎం కార్యాకర్తలు..సీపీఎం కార్యాలయాలను కాషాయ దళం టార్గెట్ చేస్తోంది. కార్యాలయాలకు నిప్పు పెట్టడం..కార్యకర్తలపై భౌతికంగా దాడులకు దిగుతోంది. మొత్తంగా త్రిపురలో హింస ప్రజరిల్లుతుండడంపై ఆందోళనలు నెలకొంటున్నాయి.

త్రిపురలో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ - ఐపీఎఫ్ టీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సీపీఎం పరాజయం చెందినా ఓట్ల శాతంలో అగ్రస్థానంలో ఉంది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే కాషాయ దళం హింసకు తెరలేపింది. ఏకంగా బుల్ డౌజర్ లను తెచ్చి లెనిన్ విగ్రహం తొలగించడం పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సీపీఎం కార్యాలయాలపైకి దాడి చేసి ఫర్నీచర్ లను ధ్వంసం చేసి నిప్పు పెడుతున్నారు. కార్యకర్తలపై దాడులకు దిగారు. దీనితో భయానక పరిస్థితి ఏర్పడింది. లక్షలాది మంది కార్యకర్తలు ఇళ్లలోకి వెళ్లలేకపోతున్నారు. 240 మంది గాయపడగా 500 చోట్ల ఇళ్లను తగులబెట్టారు.

ఈ ఘటనను సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. 25 ఏళ్లుగా లేని హింస అధికారంలోకి వచ్చిన గంటల్లోనే హింస చెలరేగిపోయిందని విమర్శించింది. గిరిజనులు..గిరిజనేతరులను ఐక్యంగా ఉంచుతూ..సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని సీపీఎం నేతలు గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్..బీజేపీ నేతలకు రాజ్యసభ గవర్నర్ మద్దతు పలకడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం పేర్కొంది.

ఇదిలా ఉంటే ఎన్నికల అనంతరం త్రిపుర ప్రజలు ఇలాంటి వాతావరణం కోరుకోలేదని, బీజేపీ - ఐపీఎఫ్ టీ కూటమి కలిసి దాడులకు పాల్పడుతోందని మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. సీపీఎంను బలపరిచిన 45 శాతం మంది ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, లక్షలాది మంది సీపీఎం కార్యకర్తలు ఇళ్లకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

త్రిపురలో హింస...

ఢిల్లీ : త్రిపురలో కాషాయ దళం రెచ్చిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే త్రిపురలో హింసపర్వానికి తెరలేపారు. లెనిన్ విగ్రహాన్ని తొలగించారు. పలు జిల్లాలో సీపీఎం కార్యలయాలకు కాషాయదళం నిప్పు పెట్టింది. వామపక్ష కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల అనంతరం త్రిపుర ప్రజలు ఇలాంటి వాతావరణం కోరుకోలేదని, బీజేపీ - ఐపీఎఫ్ టీ కూటమి కలిసి దాడులకు పాల్పడుతోందని మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. సీపీఎంను బలపరిచిన 45 శాతం మంది ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, లక్షలాది మంది సీపీఎం కార్యకర్తలు ఇళ్లకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వాసుపల్లి గణేష్ పై బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం...

విజయవాడ : వాసుపల్లి గణేష్ పై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి గణేష్ హాజరు కాకుండా విశాఖలో ధర్నాలో పాల్గొన్నారని బిజెపి ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, సత్యనారాయణలు పేర్కొన్నారు.

 

 

పులివెందులను అభివృద్ధి చేశామన్న దేవినేని...

విజయవాడ : తాము అధికారంలోకి వచ్చిన తరువాత కడప జిల్లాలో పులివెందులలో పెద్ద ఎత్తున్న అభివృద్ధి చేపడుతున్నట్లు మంత్రి దేవినేని పేర్కొన్నారు. మంగళవారం ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

10:57 - March 6, 2018

విజయవాడ : తాము అధికారంలోకి వచ్చిన తరువాత కడప జిల్లాలో పులివెందులలో పెద్ద ఎత్తున్న అభివృద్ధి చేపడుతున్నట్లు మంత్రి దేవినేని పేర్కొన్నారు. మంగళవారం ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పంట కుంటలు తవ్వుకోవడానికి రైతులు ముందుకు రావడం లేదని, భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యంలో పంట కుంటలు తవ్వుకోవడానికి రైతులు ముందుకొస్తే కూలీలకు ఉపాధి దొరుకుతుందని ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఎన్ఆర్ జిఎస్ టీ కింద నిబంధనలు పెట్టకుండా చూడాలని కోరారు.

సాగునీటి రంగంపై...ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిందని...సాక్షి పత్రిక అనేక అవాస్తవ వార్తలు ప్రచురించిందని మంత్రి దేవినేని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు..ఎన్ని కుట్రలు చేసినా ఫలించలేదని, పాతాళగంగ..వంద అడుగులకు వచ్చిందని సభకు తెలిపారు. తాము చేపట్టిన చర్యలతో పులివెందులలో ఉన్న రైతులు సంతోషంగా ఉన్నారని సభకు తెలిపారు. పులివెందులలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని, బాబు కష్టానికి ఫలాలు అందుతున్నాయన్నారు. 

మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి - మంత్రి నారాయణ...

విజయవాడ : స్వచ్చభారత్ మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రతింటిలో మరుగుదొడ్లు నిర్మాణం చేయడం జరుగుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నలు వేశారు. 

10:43 - March 6, 2018

విజయవాడ : స్వచ్చభారత్ మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రతింటిలో మరుగుదొడ్లు నిర్మాణం చేయడం జరుగుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయా ? అంటే మంత్రి లేదని చెప్పడం జరిగిందని..కానీ ఏ ప్రభుత్వ శాఖకు వెళ్లినా మరుగుదొడ్లు అధ్వాన్నస్థితిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్వాక్రా ఉమెన్ సమావేశాలు నిర్వహించుకొనేందుకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ చాలా చోట్ల టాయిలెట్స్ లేవన్నారు. దీనితో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభకు తెలిపారు.

దీనిపై మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. కమ్యూనిటీ హాల్..పబ్లిక్ టాయిలెట్స్ లను ఏర్పాటు చేస్తున్నట్లు, డ్వాక్రా ఉమెన్స్ లకు టాయిలెట్స్ లేవని సభ్యులు పేర్కొన్నారని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. 

గాలి మృతికి బాబు శాసనమండలిలో సంతాపం...

విజయవాడ : టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మ మృతి బాధాకరమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం శాసనసమండలి ప్రారంభమైంది. గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడి మృతికి సంతాపం తెలియచేస్తూ మంత్రి యనమల తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ....ఆయన చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని, ఒంటిరిగా తిరుగుతుంటారని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లే వ్యక్తి అని, రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటారన్నారు.

10:20 - March 6, 2018

విజయవాడ : టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ మృతి బాధాకరమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం శాసనసమండలి ప్రారంభమైంది. గాలి ముద్దుకృష్ణమ నాయుడి మృతికి సంతాపం తెలియచేస్తూ మంత్రి యనమల తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ....ఆయన చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని, ఒంటిరిగా తిరుగుతుంటారని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లే వ్యక్తి అని, రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటారన్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆదర్శంగా నిలుస్తారని, ఆయన మృతికి తాను సంతాపం తెలియచేస్తున్నట్లు...వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు బాబు వెల్లడించారు.

గాలి ముద్దుకృష్ణమ నాయుడు అందరితో కలిసిపోయే వ్యక్తి అని మంత్రి కామినేని తెలిపారు. ఆరోగ్యం బాగా లేదని తాను సూచిస్తే చూయించుకుంటానని పేర్కొన్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో నగరిలో ఉన్న ఏదైనా మంచి సంస్థకు గాలి ముద్దు కృష్ణమ నాయుడు పేరు పెట్టే విధంగా ఆలోచించాలన్నారు. విదేశాల్లో ఉన్న సమయంలో మృతి విషయం తెలిసిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సభకు తెలిపారు. 

10:12 - March 6, 2018

ఢిల్లీ : దేశ రాజధానిలో 'విభజన హామీలు..హోదా' ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు పార్టీల నేతలు ఢిల్లీలో మోహరించి హోదా ఇవ్వాల్సిందేనంటూ గళమెత్తుతున్నారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడం..తమ ఆందోళనలతో కేంద్రం మెడలు వంచుతామని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. టిడిపి ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విభజన హామీలు..హోదాపై చర్చించాలని కాంగ్రెస్ నుండి మల్లిఖార్జున ఖర్గే నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ నోటీసును తిరస్కరిస్తే స్పీకర్ వెల్ లోకి వెళ్లి ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

పార్లమెంట్ ఎదుట వామపక్షాలు కూడా ధర్నా చేపట్టనున్నాయి. 11గంటలకు పార్లమెంట్ స్ట్రీట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట దీక్షలు చేయనున్నాయి. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలోనూ ధర్నాలు జరుగనున్నాయి. ఈ ధర్నాలో పలు ప్రజా సంఘాలు..విద్యార్థి సంఘాలు..ప్రొఫెసర్లు పాల్గొననున్నారు.

ఆయా పార్టీలు జాతీయ స్థాయిలో మద్దతు కూడగొట్టేందుకు ప్రయత్నాలు చేపడుతున్నాయి. మిత్రపక్షంగా ఉన్న తమకు అన్యాయం జరుగుతోందని, తమ సమస్యలపై సభలో ప్రస్తావించాలని జాతీయ పార్టీల నేతలను టిడిపి ఎంపీలు కోరుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కొందరు జాతీయ నేతలతో భేటీలు జరుపుతున్నారు. అందులో భాగంగా తాము చేపడుతున్న ఆందోళనలో పాల్గొనాల్సిందిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను నేతలు ఆహ్వానించారు. ఎన్నికల కోణంలో టిడిపి ఈ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఎంపీలు..విపక్షాలు..ఇతర నేతలు చేపడుతున్న ఆందోళనతో కేంద్రం ఏదైనా ప్రకటిస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

ఢిల్లీలో 'విభజన హామీలు..హోదా' ఆందోళనలు..

ఢిల్లీ : విభజన హామీలు..ప్రత్యేక హోదా కోరుతూ హస్తినలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కాసేపట్లో పార్లమెంట్ ఎదుట వామపక్షాలు ధర్నా చేపట్టనున్నాయి. 11గంటలకు పార్లమెంట్ స్ట్రీట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట దీక్షలు చేయనున్నాయి. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలోనూ ధర్నాలు జరుగనున్నాయి. ఈ ధర్నాలో పలు ప్రజా సంఘాలు..విద్యార్థి సంఘాలు..ప్రొఫెసర్లు పాల్గొననున్నారు.

 

09:46 - March 6, 2018

విజయవాడ : ఏపీ శాసనసభ రెండో రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం నాడు ప్రారంభమైన సభలో టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పాత్ర పోషించారు. వైసీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం 71.02 లక్షల హౌసింగ్స్ టాయిలెట్స్ నిర్మించాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగిందని 43.03 లక్షల టాయిలెట్స్ నిర్మించడం జరిగిందన్నారు. ఇంకా 5.48వేలు బ్యాలెన్స్ ఉన్నాయన్నారు. పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్..లను నిర్మించడం జరుగుతోందన్నారు. ఇందులో రాష్ట్రం 40 శాతం, కేంద్రం 50 శాతం నిధులు ఇస్తుందని..అంటే రూ. 7500 కేంద్రం, రూ. 4,500 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం అదనంగా రూ. 3వేలు ఇస్తోందన్నారు. పేమెంట్ విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు.

తమ నియోజకవర్గంలో ఐఎస్ఎల్ పథకంలో పలు అవినీతి చోటు చేసుకొంటోందని ఎమ్మెల్యే అప్పల నాయుడు సభ దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్లు...తూట్లు పొడిచే విధంగా చేస్తున్నారని తెలిపారు. గజపతి నగరంలో మండలం..వివిధ మండలాల్లో వెలుగు ప్రాజెక్టు నుండి వీవోస్ లు పలువురి కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని సభకు తెలిపారు. అంతేగాకుండా మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే రూ. 15వేలు కూడా లబ్దిదారులకు అందివ్వలేదన్నారు.

తమ జిల్లా ను ఓడీఎఫ్ జిల్లాగా డిసెంబర్ నెలలో ప్రకటించడం జరిగిందని ఎమ్మెల్యే జోగేశ్వర్ రావు పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గంలో 700 మందికి పేమెంట్ ఇవ్వాల్సి ఉందని, మార్చి 18వరకు పేమెంట్ ఇస్తామని చెప్పారని..వెంటనే ఇవ్వాలని కోరారు.

ఎంపీలతో మాట్లాడిన బాబు...

విజయవాడ : ఏపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం నుండి అన్ని అంశాల్లో స్పష్టత రావాలని, స్పష్టత వచ్చే వరకు పోరాటం ఆపొద్దని బాబు సూచించారు. జైట్లీతో గత రాత్రి సమావేశ వివరాలను సీఎంకు తోట నరసింహం వివరించారు. సమావేశానికి అమిత్ షా హాజరు కాకపోడం ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. రెండు అంశాలు మాత్రమే ప్రస్తావించి మిగిలిన అంశాలు వాయిదా వేశారని ఎంపీలు తెలిపారు. 

పెళ్లి బృందం ట్రక్కు బోల్తా...20 మంది మృతి...

గుజరాత్ : భావ్ నగర్ లో ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన ఓ ట్రక్కు లోయలో పడిపోయింది. 20 మంది మృతి చెందారు. పెళ్లి బృందంతో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఏపీ అసెంబ్లీ..ప్రశ్నోత్తరాలు...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పంచాయతీ పరిధిలోని ఛిద్రమైన రోడ్లపై సభ్యులు పలు ప్రశ్నలను సంధించారు. 

09:20 - March 6, 2018

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పంచాయతీ పరిధిలోని ఛిద్రమైన రోడ్లపై సభ్యులు పలు ప్రశ్నలను సంధించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీ రోడ్లు తమ నియోజకవర్గంలో ఛిద్రమయ్యాయని, ఏదైనా ప్రత్యామ్నాయం చూపి రోడ్ల మరమ్మత్తులకు అధిక నిధులు కేటాయించాలని టిడిపి ఎమ్మెల్యే కోరారు.

మృణాళిని : సీఎం బాబు నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు వేయడం జరిగిందని, కానీ గ్రామం..గ్రామం..మధ్యలో ఉన్న లింక్ రోడ్లు పాడైపోయాయని, వెంటనే నిధులు విడుదల చేసి రోడ్లను బాగు చేయాలని కోరారు.

శ్రీనివాస్ రెడ్డి : నెల్లూరు జిల్లాలో 2015లో కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో గ్రామీణ వ్యవస్థలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని సభ దృష్టికి తెలిపారు. జాతీయ రహదారి...గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, పంచాయతీ రాజ్ శాఖ నుండి అధిక నిధులు కేటాయించాలని కోరారు.

రవి కుమార్ : శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ తుపాన్ తో పాటు నాగావళి వరదలు భారీగా వచ్చాయని తెలిపారు. ఆ సమయంలో ఛిద్రమైన రోడ్లు ఇంతవరకు బాగు చేయలేదన్నారు. గుంప ప్రాంతంలో రెండు నదుల మధ్యలో సోమేశ్వర ఆలయం ఉంటుందని, ఇక్కడ ఉన్న రోడ్డు వరదలతో కొట్టుకపోయిందని పేర్కొన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేఊసే విధంగా చూడాలన్నారు.

దీనిపై ఏపీ మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు.

2017-18లో రూ. 825 కోట్లతో ప్రణాళిక వేయడం జరిగిందని మంత్రి నారాయణ సభకు తెలిపారు. అందులో రూ. 117 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, నా బార్డు కింద రూ. 409.22 కోట్లు కేటాయించగా రూ. 113 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగిందన్నారు. 

ఎంజీఎంకు మంత్రి లక్ష్మారెడ్డి...

వరంగల్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య విభాగాలు, నూతన భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేస్తూ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. తీర్మానాన్ని ప్రభాకర్ చౌదరి ప్రవేశ పెట్టనుండగా నిమ్మల రామానాయుడు బలపరచనున్నారు. అనంతరం సభ్యులు ప్రసంగించనున్నారు.

15 నుండి ఒంటిపూడ బడులు...

హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులను నడుపాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

08:27 - March 6, 2018

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సోమవారం నాడు ప్రారంభమైన సమావేశాల్లో గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేస్తూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. తీర్మానాన్ని ప్రభాకర్ చౌదరి ప్రవేశ పెట్టనుండగా నిమ్మల రామానాయుడు బలపరచనున్నారు. అనంతరం సభ్యులు ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని క్యాష్ చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. విభజన హామీల విషయంలో కేంద్రం ఇచ్చిన హామీలు..అమలు..లను అసెంబ్లీలో ఎండగట్టాలని టిడిపి భావిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రిపేర్ అయినట్లు సమాచారం. మరోవైపు బిజెపి కూడా కేంద్ర ఇచ్చిన నిధులు..ప్రభుత్వ ఖర్చులను సభ ద్వారా బయటకు చెప్పాలని యోచిస్తోందని సమాచారం. దీనిద్వారా ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టాలని భావిస్తోంది. ఇటీవలే మృతి చెందిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడికి శాసనమండలి నివాళులర్పించనుంది. 

08:10 - March 6, 2018

హైదరాబాద్ : ఇటీవలే చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ కు ప్రతికారం తీర్చుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని..ప్రతికారం తీర్చుకుంటామని మావోయిస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సుకుమా జిల్లా కుత్తి వద్ద రెండు బస్సులు..ఒక ట్రాక్టర్ కు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఒక బస్సు బైలడిల్లా నుండి హైదరాబాద్ కు వస్తోందని తెలుస్తోంది.

ప్రయాణీకులను కిందకు దించి ఒకరిని కాల్చి చంపేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతను ఇన్ ఫార్మర్ అని మావోయిస్టులు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ, ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

గోరఖ్ నాథ్ టెంపుల్ వద్ద జనతా దర్బార్...

ఉత్తర్ ప్రదేశ్ : సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ నాథ్ కు చేరుకున్నారు. గోరఖ్ నాథ్ దేవాలయంలో ఆయన జనతా దర్బార్ నిర్వహించారు. 

ఏపీ శాసనసమండలిలో...

విజయవాడ : ఏపీ శాసనసమండలి మంగళవారం ప్రారంభం కానుంది. నేడు ప్రారంభమయ్యే సభలో ఇటీవలే మృతి చెందిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు సంతాపం తెలియచేస్తూ ఏపీ మంత్రి యనమల సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. సంతాప తీర్మానం అనంతరం మండలి వాయిదా పడనుంది. 

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రవేశ పెట్టనున్నారు. ఈ తీర్మానానికి ఎమ్మెల్యే రామానాయుడు మద్దతు తెలియచేయనున్నారు. 

ఢిల్లీలో నారా లోకేష్...

విజయవాడ : ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఐటి..ఎలక్ర్టానిక్ కంపెనీల సీఈవోలతో లోకేష్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ ఆహ్వానించనున్నారు. 

జూ.డా.ల సమ్మె...

విజయవాడ : నేటి నుండి జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 28లోగా హామీలు అమలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పడంతో సమ్మెకు జు.డాలు పిలుపునిచ్చాయి. 

07:32 - March 6, 2018

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని...విభజన హామీలు నెరవేర్చాలంటూ విపక్షాలు హస్తినలో ఆందోళనలు చేపట్టాయి. ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు మారు మోగాయి. టిడిపి ఎంపీలు పార్లమెంట్ వెలుపలా..లోపల ఆందోళన చేపట్టాయి. మరోవైపు వైసీపీ శ్రేణులు భారీగా ఢిల్లీకి చేరుకుని ధర్నాలు..ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనలు చేపట్టాయి. ఈ ఆందోళనల వెనుక రాజకీయ కోణం దాగి ఉందా ? ఇతర కారణాలు ఏంటీ అనే దానిపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), షఫీ (విశ్లేషకులు), మనోజ్ (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:26 - March 6, 2018

ఉపాధి హామీ..వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రారంభించిన పథకం. ఈ పథకం క్రమంగా నిర్వీర్యం అవుతోందని విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్‌లో పెట్టడం, ఈ పథకానికి కేటాయించిన నిధులను వేరే పథకాలకు మళ్లించడం లాంటి విధానాలపై వ్యవసాయ కార్మిక సంఘం మండిపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆందోళన బాటపడుతోంది. అసలు ఉపాధి హామీ పథకం పట్ల ప్రభుత్వాల విధానాలు, ఆందోళనకు దారి తీస్తున్న కారణాలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు విజయవాడ టెన్ టివి స్టూడియోలో విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:24 - March 6, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కాం, ఏపి స్పెషల్‌ స్టేటస్‌పై పార్లమెంట్‌ దద్దరిల్లింది. ఉభయ సభల్లో ఆందోళనకు దిగిన విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ స్టేటస్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపి సభ్యులు నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు కొద్ది సేపు సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ టిడిపి, వైసిపి సభ్యులు నినాదాలు చేశారు. సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ సభను 2 గంటలకు వాయిదా వేశారు.. తిరిగి ప్రారంభమైనా సభలో అదే పరిస్థితి నెలకొనడంతో డిప్యూటి చైర్మన్ కురియన్‌ రాజ్యసభను మంగళవారానికి వాయిదా వేశారు.

పిఎన్‌బి స్కాంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. దీనిపై చర్చకు అనుమతించాలని కోరుతూ రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ, ఎస్పీ నేత నరేష్‌ అగర్వాల్‌ నోటీసు ఇచ్చారు. ఈ స్కాం ప్రధాని మోది హయాంలోనే వెలుగు చూసిందని, నీరవ్‌ మోది విదేశాలకు పారిపోవడంపై ఆయన స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. పిఎన్‌బి స్కాం కాంగ్రెస్‌కు సంబంధముందని వారి పాలనలోనే ఇది మొదలైందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ ఎదురుదాడి చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం పాత్రను ప్రశ్నిస్తూ బిజెపి ఎంపి సహస్ర బుద్ధే 267 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. లోక్‌సభలోనూ అదే పరిస్థితి. ఉదయం సభ ప్రారంభం కాగానే లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిఎన్‌బి స్కాం, ఏపీకి ప్రత్యేక హోదా, రిజర్వేషన్ల అంశంపై చర్చకు సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సమావేశాలను కొద్దిసేపు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో స్పీకర్‌ లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.

జగన్ 105వ రోజు...

ప్రకాశం : జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. 105వ రోజు అద్దంకి నియోజకవర్గంలోని తక్కెళ్లపాడు నుంచి పాదయాత్ర కొనసాగనుంది. 

త్రిపురలో సీపీఎం కార్యాలయాల ధ్వంసం..

త్రిపుర : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎం కార్యాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలను ధ్వంసం చేశారు. 

07:17 - March 6, 2018

అనంతపురం : పోలీసులు క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేశారు. పలుప్రాంతాల్లో ఉంటూ... అనంతపురం కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్ సాగించే.... నిర్వాహకులతోపాటు... బెట్టింగ్ రాయుళ్ళను అనంతపురం నగర వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులనుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

07:16 - March 6, 2018

కరీంనగర్ : పుట్టినరోజే ఆ చిన్నారి జీవితానికి చివరికి రోజైంది. స్నేహితులందరికీ చాక్లెట్లు పంచిన ఓపాప.. స్కూల్లోనే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. చిన్నప్పటినుంచే హృద్రోగంతో బాధపడుతున్న లహరి అనే ఎనిమిదేళ్ళ బాలిక రెండోతరగతి చదువుతోంది. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో.. స్కూల్లో అన్ని తరగతుల వారికి చాక్లెట్లు పంచింది. కొద్దిసేపటికే గుండెనొప్పి అంటూ విలవిల్లాడుతూ కిందపడి చనిపోయింది. కొత్తగౌను, చేతినిండా గాజులు.. జెడలో పూలతో ముస్తాబై బడికి వచ్చిన బాలిక... విగత జీవిగా మారడంతో తోటి విద్యార్థులు, స్కూల్ టీచర్లతోపాటు గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. చొప్పదండి గ్రామానికి చెందిన బుచ్చయ్య సంతానం లేకపోవడంతో ఈ బాలికను దత్తత తీసుకుని పెంచుకున్నాడు.

07:15 - March 6, 2018

అనంతపురం : నగరపాలక సంస్థ అద్దె చెల్లించలేదని మనస్తాపం చెందిన అద్దెవాహన యజమాని... గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడంతో వెంటనే అక్కడే ఉన్న నగరపాలక సిబ్బంది, పోలీసులు అడ్డుకొన్నారు. నగరపాలక సంస్థలో గత రెండేళ్ళుగా వాహనాలకు అద్దె చెల్లించకుండా.... తిప్పుకుంటున్నారంటూ వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. ఒక్కో వాహనానికి 80 వేలరూపాయలు చొప్పున 15 వాహనాలకు అద్దె ఇవ్వాల్సి ఉందంటున్నారు. డి.ఇ. సుదర్శన్ అద్దె ఇవ్వకుండా తన ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నాడని మేయర్, కమీషనర్ దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదంటున్నారు.

07:13 - March 6, 2018

హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం జాతీయ స్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన KCR... తన భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భవిష్యత్‌ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటుకు నాయకత్వం వహిస్తానని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్‌ ఆదిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు, సంఘాలు, ప్రముఖులతో భేటీలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు.

మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటులో భాగంగా మొదటగా దేశవ్యాప్తంగా ఆలిండియా సర్వీస్‌ల నుంచి రిటైర్డ్‌ అయిన అధికారులతో సమాలోచనలు జరపడానికి కేసీఆర్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో ఏళ్లతరబడి పరిపాలనా దక్షత, అనేకరాజకీయ పరిణామాలను చూసిన అనునభం ఉన్న అధికారుల నుంచి తగిన సలహాలు, సూచనలు స్వీకరించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. దీనికోసం ఇప్పటికే కొందరు వ్యక్తులను రంగంలోకి దింపినట్టు గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతోంది.

మొదటి అంచలో ఆలిండియా సర్వీస్‌ మాజీ అధికారులను కలిసిన తర్వాత...రెండో విడతలో సైనిక, వాయు, వైమానిక శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అధికారులతో మంతనాలు జరపనున్నారు సీఎం కేసీఆర్‌. దాంతోపటు దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయనిపుణులు, అఖిల భారత రైతు సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతుల సంఘాల ప్రతినిధులతో సమావేశం అవడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాంతోపాటు కేంద్ర, రాష్ట్రల్లోని ఉద్యోగ సంఘాల నేతలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ సమావేశ కావడానికి సిఎం సన్నాహాలు చేస్తున్నారని కేసీఆర్‌ సన్నిహితుల నుంచి సమాచారం వస్తోంది.

థర్డ్‌ఫ్రంట్‌ అంటూ అలా ప్రకటించారో లేదో మద్దుతు ఇస్తామంటూ మమతా బెనర్జీలాంటి పలువురు ఫోన్లు చేయడంతో కేసీఆర్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా పర్యటించి మరింతగా మద్దతు కూడగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని గులాబీపార్టీలో నేతలు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాల్లో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. వివిధ వర్గాల ప్రతినిధులతో వరుస సమావేశాల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆయా వర్గాలను సంప్రదించడానికి, సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా సమన్వయకర్తలను కూడా ముఖ్యమంత్రి నియమించినట్టు గులాబీ లీడర్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్‌ తన ఢిల్లీ కలలను సాకారం చేసుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి జాతీయ రాజకీయాల్లోకి ఘనంగా అడుగు పెట్టడానికి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మావోయిస్టుల దుశ్చర్య...

ఛత్తీస్ గడ్ : మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సుకుమా జిల్లా కుత్తిలో ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు, మూడు టిప్పర్లకు నిప్పు పెట్టారు. అంతేగాకుండ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు. 

శ్రీలంక..టీమిండియా తొలి మ్యాచ్...

ఢిల్లీ : ట్వంటీ ట్వంటీ తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా ...టీ20 మాజీ చాంపియన్‌ శ్రీలంక మధ్య అసలు సిసలు సమరానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. టీ20ల్లో తిరుగులేని టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ట్రై సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు కొలంబోలోని ప్రేమదాస క్రికెట్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది.

06:49 - March 6, 2018

విజయవాడ : ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకంగా మారిన భూ సేకరణ సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం సూచించారు. భూసేకరణకు బదులుగా భూ గర్భ పైపులైన్లు వేసి... ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ పైపులైన్లకు ప్రత్యేకంగా ఎవరి అనుమతులు అవసరం లేదని... అలాగే భూసేకరణకు అయ్యే ఖర్చు కూడా ఆదా అవుతుందని సీఎం చెప్పారు. సోమవారం సచివాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 28 ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం.. మరో 20కిపైగా ప్రాజెక్టులను ఈ జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చేపట్టిన 28 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చాలావరకూ పూర్తి కావస్తున్నందున... కొత్త ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి ఇంకా మిగిలి ఉన్న డిజైన్లను శరవేగంగా రూపొందించి, కేంద్రం నుంచి ఆమోదం పొందేలా చూడాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. డిజైన్ల రూపకల్పనకు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారిని నియమించాలన్నారు. 2018 జనవరి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ కోసం 13, 053.91 కోట్లు ఖర్చు చేయగా... జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం 7,918.04 కోట్లు ఖర్చు చేసిట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి 9వరకూ కేంద్రం 4,932.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో 2,985.78కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. గడచిన వారం రోజుల్లో 24వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టితవ్వకం పనులు చేపట్టగా... 11వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్‌ వాల్‌ 7.6 మీటర్ల వరకూ నిర్మాణం జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు.

పోలవరం ప్రాజెక్టులో మొత్తం మీద 1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకూ 777.54 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్‌వే, స్టల్లింగ్ బేసిన్, స్పిల్‌ ఛానల్‌కు సంబంధించి 35.14లక్షల క్యూబిక్ మీటర్ల వరకూ కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటికి 5.4 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్‌ వాల్‌కుగాను 1011.6 మీటర్ల వరకూ నిర్మాణం పూర్తయింది. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా. 1,62,739 ఎకరాల భూసేకరణ చేస్తుండగా ఇప్పటివరక 4,922.76కోట్లు చెల్లించి.. 1,02,480.90 ఎకరాలు సేకరణ పూర్తి చేశామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇంకా 60,25,8.10 ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉందని, ఇందుకు 28,302.98కోట్లు అవసరమవుతాయని చెప్పారు. త్వరిత గతిన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. 

06:38 - March 6, 2018

విజయవాడ : టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది... తాజాగా ఆ రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మిత్రపక్షంగా ఉంటూనే... తమ పార్టీని కించపరిచేలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేతలు విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ర్టానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ రాష్ర్టానికి మోసం చేసిందంటూ.. ఈ ఫ్లెక్సీల్లో అనేక విమర్శలు గుప్పించారు టీడీపీ నేతలు. పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది.

విజయవాడలో టీడీపీ నేత ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌పై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలోనూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చర్చ సాగింది. టీడీపీ నేతల చేసిన ఫ్లెక్సీలను తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ ప్రకటించారు. ఇది పార్టీ వైఖరా.. లేక వ్యక్తిగత వైఖరా తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా.. బీజేపీకి వ్యతికరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పూర్తిగా తన వ్యక్తిగతమని టీడీపీ నేత కాట్రగడ్డబాబు ప్రకటించారు.. కేంద్రం రాష్ర్టానికి అన్యాయం చేసింది కాబట్టే... సామాన్య పౌరుడిగా ఆవేదన చెంది.. ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశానన్నారు. ఈ వ్యవహారంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్రం ఏపీ ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి రాష్ర్టానికి న్యాయం చేయాలని కోరారు. లేదంటే... ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. మొత్తానికి టీడీపీ నేతల ఫ్లెక్సీల వ్యవహారంతో బీజేపీ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.... మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి...

06:33 - March 6, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ఆశలు అడుగంటుతున్నాయి. సోమవారం సాయంత్రం కేంద్ర ఆర్థికమంత్రితో టీడీపీ జరిపిన సంప్రదింపులు కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కహామీ ఇవ్వలేదు. పార్లమెంట్‌లోనే ప్రకటన చేస్తామంటూ అరుణ్‌జైట్లీ తేల్చి చెప్పారు. దీంతో ఏపీకి సాయంపై కేంద్రం కరుణిస్తుందా.. లేదా అన్న సందిగ్దం నెలకొంది.

ఢిల్లీలో ప్రత్యేక హోదా ఉద్యమం హోరెత్తుతోంది. ఏపీకి చెందిన ఎంపీలు పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని ఉద్యమిస్తున్నారు. పార్లమెంట్‌ బయటా, లోపలా తమ ఆందోళనలు ఉధృతం చేశారు. టీడీపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలంటూ నిరసన హోరు పెంచారు. ఒకవైపు నిరసనలు తెలుపుతూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కేంద్రం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సోమవారం సాయంత్రం కీలక భేటీ జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో టీడీపీ ఎంపీలు, ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు అరుణ్‌జైట్లీని కోరారు. రెవెన్యూలోటు 16వేల కోట్లను భర్తీ చేయాల్సిన విషయాన్ని జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు ఇచ్చినప్పుడు ఏపీకి కూడా ఇవ్వాలని కోరారు. గత కొద్దిరోజులుగా ఏపీలో హోదా కోసం జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు, రాజకీయ పరిణామాలను కూలంకషంగా జైట్లీకి వివరించారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రిని కోరినట్టు యనమల రామకృష్ణుడు తెలిపారు. న్యాయపరంగా రావాల్సిన హక్కులను అమలు చేయాలని కోరామన్నారు.

ఆర్థికలోటు, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా అటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తామని జైట్లీ చెప్పినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అంగీకరించిన విషయాల అమలులో కొంత ఆలస్యం జరుగుతోందన్న భావన ఉందన్నారు. రాబోయే రోజుల్లో నిర్ణయం చేసిన మేరకు వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని జైట్లీ హామీనిచ్చారని హరిబాబు తెలిపారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ఏ ఒక్క అంశంపైనా అరుణ్‌జైట్లీ స్పష్టమైన హామీనివ్వలేదు. ఇతర కేంద్రమంత్రులతో మాట్లాడి చెబుతామంటూ దాటవేశారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఏ విషయమైనా పార్లమెంట్‌లోనే చెబుతానని చెప్పారు. మరి దీనిపై టీడీపీ ఏం చేయనుందో చూడాలి. 

కాంగ్రెస్ ఆత్మగౌరవ పేరిట దీక్ష...

ఢిల్లీ : హస్తినలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్ నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. 6, 7వ తేదీల్లో పార్లమెంట్ స్ట్రీట్ లో ఆత్మగౌరవ పేరిట దీక్ష. 8వ తేదీన పార్లమెంట్ ముట్టడి చేపట్టనుంది. 

12 నుండి టి. అసెంబ్లీ...

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈనెల 12 నుంచి టీఎస్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. 

పార్లమెంట్ సెకండ్ డే...

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కాం, ఏపి స్పెషల్‌ స్టేటస్‌పై పార్లమెంట్‌ సోమవారం దద్దరిల్లింది. ఉభయ సభల్లో ఆందోళనకు దిగిన విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

మౌనం వీడిన రాహుల్...

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో తమ పార్టీ ఓటమిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మౌనాన్ని వీడారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ప్రజల తీర్పును గౌరవిస్తామని ట్వీట్‌ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేయడం ద్వారా తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని పేర్కొన్నారు. 

ఎంజీఆర్ విగ్రహం ఆవిష్కరించిన తలైవా...

చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఎంజీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెలప్పన్‌వాడీలో ఉన్న డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన ఎం.జి.రామచంద్రన్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 

పరీక్షల స్కాంపై సీబీఐ విచారణ..

ఢిల్లీ : స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ పరీక్షల కుంభకోణంపై కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఎస్‌ఎస్‌సి పేపర్‌ లీక్‌పై విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

Don't Miss