Activities calendar

07 March 2018

22:25 - March 7, 2018

రంగారెడ్డి : త్రిపురలో కాషాయ దళం చేస్తున్న దాడులు ఆపకపోతే ఊరుకునేది లేదని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హెచ్చరించారు. ఈమేరకు కాషాయ దళం చేస్తున్న దాడులను నిరసిస్తూ ఇబ్రహీంపట్నంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు.  

22:21 - March 7, 2018

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమంతో మూడో రోజు కూడా దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. ర్యాలీలు, దీక్షలతో ఉద్రిక్తంగా మారింది.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో పార్లమెంటు స్ట్రీట్‌లో నిరసన తెలిపిన వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మగౌరవ దీక్షలో లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, డీఎంకే ఎంపీ కనిమొళి పాల్గొని... హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మరోవైపు రిజర్వేషన్లపై రాష్ట్రాలకే హక్కు ఉండాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు వరుసగా మూడో రోజు కూడా పార్లమెంటు మెయిగ్‌ గేట్‌ వద్ద నిరసన తెలిపారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు ఢిల్లీలో సమరశంఖం పూరించాయి. మూడో రోజు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. పార్లమెంటు స్ట్రీట్‌లో కమ్యూనిస్టు పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. విపక్షాల ర్యాలీలు, ధర్నాలతో ఢిల్లీ దద్దరిల్లింది.

పార్లమెంటు వైపు దూసుకుపోతున్న వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్రం దిగొచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. 

హోదా ఉద్యమం ఇంతటితో ఆగదని, మోదీ ప్రభుత్వం ఏపీకి చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని వామపక్ష నేతలు తేల్చి చెప్పారు.  బీజేపీ, టీడీపీలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు, కార్యకర్తల ఉద్యమంతో పార్లమెంటు స్ట్రీట్‌ ఉద్రిక్తంగా మారడంతో.. ఆందోళనకారులతోపాటు  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్‌ చలసాని శ్రీనివాస్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. 


మరోవైపు ఏపీసీసీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఆత్మగౌరవ దీక్షా శిబిరాన్ని పలు పార్టీల నేతలు సందర్శించి, ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత  మల్లికార్జున ఖర్గే, డీఎంకే ఎంపీ కనిమొళి.. ఉద్యమానికి  అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీ ప్రజల న్యాయమైన హోదా హక్కు సాధన కోసం పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మల్లికార్జున ఖర్గే చెప్పారు. పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందని డీఎంకే ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. 


ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా గురువారం పార్లమెంటును ముట్టడించాలని ఏపీసీసీ నిర్ణయించింది. మరోవైపు రిజర్వేషన్ల కోటా పెంచాలని, ఈ విషయంలో రాష్ట్రాలకే హక్కు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు మెయిన్‌ గేట్‌ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. మొత్తం మీద ఏపీ రాజకీయ పార్టీల హోదా ఉద్యమంతో ఢిల్లీ వీధులు హోరెత్తుతున్నాయి. 


 

22:17 - March 7, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా సాధ్యంకాదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చి చెప్పారు. హోదాతో సమానమైనవన్నీ కూడా ప్యాకేజీ రూపంలో ఇస్తున్నామని, ఇందుకు ఏపీ కూడా ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న తరహాలోనే ఏపీకి కూడా 90-10 నిష్పత్తిలోనే నిధులు అందిస్తున్నామని చెప్పారు. look.

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మళ్లీ పాతపాటే పాడారు. హోదా అనే మాట తప్ప.. దీంతో వచ్చే అన్ని ప్రయోజనాలను ప్యాకేజీలో వర్తింప చేస్తున్నామని తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీ అమలుకూ తాము కట్టుబడి ఉన్నామని... హోదాతో వచ్చే అన్ని ప్రయోజనాలను ప్యాకేజీ రూపంలో ఇస్తున్నామని చెప్పారు. 

హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం జరుగుతోంది. మూడు రోజులుగా ఏపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపచేస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హోదాపై వివరణ ఇచ్చారు. రాజకీయాలు, సెంటిమెంట్లు రాష్ట్రానికి వచ్చే సహాయం మొత్తాన్ని పెంచలేవన్న విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ కంటే తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలు కూడా హోదాతోపాటు ఎక్కువ నిధులు అడిగితే.. ఏ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం వద్ద నిధులు  వరదలా ప్రవహించడంలేదన్న జైట్లీ,  ఉన్న నిధులనే రాజ్యాంగానికి లోబడి అన్ని రాష్ట్రాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రానికి వచ్చే ఆదాయాన్నంతా రాష్ట్రాలకు పంచలేమన్నారు. దేశ భద్రత కేంద్ర ప్రభుత్వ  బాధ్యత అన్న వాస్తవాన్ని మర్చిపోరాదన్నారు. 

పోలవరం నిర్మాణానికి 5 వేల కోట్ల రూపాయలు, రాజధాని అమరావతికి 2,500 కోట్ల ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన అరుణ్‌ జైట్లీ.... రెవెన్యూ లోటు భర్తీకి ఇప్పటికే 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఏపీకి ఇవ్వాల్సింది ఇంక 138 కోట్లేనని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలన్నింటినీ నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

 

22:14 - March 7, 2018

గుంటూరు : అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు అత్యసవరస భేటీ అయ్యారు. ఎంపీలతో టెలికాన్ఫరెన్సులో సీఎం అభిప్రాయాలు తీసుకుంటున్నారు. జైట్లీ ప్రకటనపై చంద్రబాబు అసంతృప్తి చెందారు. రెండు ప్రతిపాదనలపై చంద్రబాబు టీడీపీ నేతలతో చర్చిస్తున్నారు. తొలి ప్రతిపాదనగా కేంద్రమంత్రులతో రాజీనామాలు, రెండో ప్రతిపాదనగా కేంద్రం మంత్రులతోనూ నిరసన కార్యక్రమాలు చేయాలని ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. చర్చల అనంతరం ఎన్డీయేకి కటీఫ్ చెప్పాలని ఎంపీలు సీఎంకు తేల్చి చెప్పారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, లోకేష్, చినరాజప్ప, సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. 

 

21:57 - March 7, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన..పదేళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ .. ఇప్పుడెందుకివ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదన్న ఆయన.. కేంద్రం ఏపీని అన్నివిధాలా ఆదుకోవాలన్నారు. మరోవైపు కేంద్రం ఇప్పటికే 85 శాతం హామీలను పూర్తి చేసిందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు హోదా ఇస్తే ఏపీకీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. 

రాష్ట్రవిభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బీజేపీ ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందువల్లే ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని ఇప్పుడు బీజేపీ అంటోందని, అలాంటప్పుడు ప్రస్తుతం హోదా కింద ఏయే రాష్ట్రాలకు ఎంతమేర నిధులు, సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన హామీలపై కీలక ప్రసంగం చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.      

విభజన సమయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు హోదా ఇస్తామని ప్రకటించిందని.. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు. పారిశ్రామికంగా ప్రోత్సాహం కల్పించేందుకు పన్ను రాయితీలు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారన్నారు. ప్రజలకు చేసిన వాగ్దానాల నుంచి బీజేపీ తప్పించుకోలేదని చంద్రబాబు అన్నారు. 

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చి ఉధారంగా ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి కావాలంటే 58వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని.. కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది 5 వేల 349 కోట్లు మాత్రమేనని చంద్రబాబు అన్నారు. ఇంకా కేంద్రం 42 వేల కోట్ల రూపాయలు పోలవరానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. 

రెవెన్యూ లోటు 16 వేల 72 కోట్లు ఉందని.. ఇందులో కేంద్రం 3 వేల 900 కోట్లు మాత్రమే ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. రెవెన్యూ లోటు గురించి అడిగితే లెక్కలు అడుగుతున్నారని అన్నారు. అలాగే.. విశాఖకు రైల్వే జోన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీని మించిన నగరాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని ఆనాడు ప్రధాని తిరుపతిలో హామీ ఇచ్చారని... హైదరాబాద్‌ లాంటి నగరం నిర్మాణానికి 5లక్షల కోట్లు అవుతుందని చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. 

రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలకు రాష్ట్రం తరఫున 291 ఎకరాల భూములు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. వాటి నిర్మాణానికి 11 వేల 673 కోట్లు ఖర్చవుతుందని.. అయితే కేంద్రం ఇప్పటివరకు కేవలం రూ.421 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అలాగే దుగరాజపట్నం పోర్టును నిర్మించాలన్నారు. ఏపీ శాసనసభ సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ చేసినప్పుడు ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పోరాడి బిల్లులో కొన్ని అంశాలు పెట్టి పాస్‌ చేయించారు. మరి దాన్ని అమలుచేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మళ్లీ తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా పైనేనని ప్రకటనలు చేసే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. 

లాలూచీ రాజకీయాలు తన జీవితంలో చేయలేదన్నారు చంద్రబాబు. దేశంలో సీనియర్‌ రాజకీయనాయకుల్లో తాను ఒకరినన్నారు. తనకు తెలుగు జాతి ఇచ్చిన గౌరవం ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు. తనపై ఎందరో కేసులు వేయాలని ప్రయత్నించారని అవన్నీ విఫలమయ్యాయన్నారు. 

ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబుకు- బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌ రాజుకు మధ్య స్వల్ప చర్చ జరిగింది. తాను అడిగేది న్యాయమో కాదో చెప్పాలని బీజేపీ సభ్యులను చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అయితే కేంద్రం ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 85 శాతం పూర్తి చేసిందని విష్ణుకుమార్‌రాజు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే.. ఏపీకి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తామన్నారు.

ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సాగిన ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై సుధీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రానికి కేంద్రం చేసింది.. స్వల్పమని ఇంకా చాలా ఇవ్వాలని టీడీపీ అంటుంటే.. బీజేపీ సభ్యులు మాత్రం 85 శాతం కేంద్రం ఇచ్చేసిందని.. చెప్పుకొచ్చారు.
 

21:53 - March 7, 2018

భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించేటటువంటి భారతీయ సమాజంలో ఈరోజున చోటుచేసుకుంటున్న సంఘటనలు కల్చర్ ఆఫ్ హ్యాండలిజం దేశ వ్యాప్తంగా చర్చనీయమవుతున్నాయి. త్రిపురలో చోటుచేసుకున్నవంటి ఘటనలు దాని అనంతరం వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నటువంటి సంఘనలు దేశ వ్యాప్తంగా చర్చనీయమవ్వడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతంగా మారుతున్నాయి. భారతీయ రాజ్యాంగ విలువలనే పరిహసించే విధంగా ఉన్నాయి. ఈ సంఘటన వెనుకున్న కారణాలు, దీని పర్యవనాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ? దీన్ని ఏరకంగా చూడాలి ? వీటిని అరికట్టేందుకు కావొచ్చు, అడ్డుకునేందుకు కావొచ్చు భారతీయ సమాజం, రాజకీయ పార్టీలు ఏ రకంగా వ్యవహరించాల్సివుంటుంది. ఈ పర్యవసానాలు ప్రధానంగా ఎలా ఉండబోతున్నాయనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఈ అంశంపై సీనియర్ రాకీజయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ తో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించిన ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:32 - March 7, 2018

వచ్చెసారి ఓట్ల వర్కుతెలంగాణ రాజకీయం...మూడు కూటములదే అసలైన పోరాటం, కేసీఆర్ను ఉత్కి ఆరేస్తున్న ఉత్తంకుమార్...అంతే స్థాయిల అర్సుకున్న కోదండరాం, ప్రత్యేక నిరసనకు దిగిన చిత్తూరు ఏశకాడు..మోడీ ఇచ్చిన మట్టీ, నీళ్లు వాపసిస్తడట, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏడు కోట్లతోని బస్సు..మళ్లొక్కటి గొనెతందుకు సర్కారు సమాయత్తం, విపరీతంగ వెర్గిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం...బస్సుఆపి మరీ తన్నుకున్న క్యాడర్, అలియాస్ డల్లాసుల ఆగని దోపిడీలు.. హైద్రావాద్ భద్రత అంత డొల్లనే ఉంది.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:21 - March 7, 2018

ఢిల్లీ : ప్రస్తుతం దేశంలోని ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలేవి లేవన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా పదం ఇప్పుడు లేదన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే.. ఈశాన్య రాష్ట్రాలు, 3 పర్వత ప్రాంత రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చామన్నారు. విభజన చట్టంలో ఏపీకి జరిగిన రెవెన్యూ లోటు పూడ్చాలని ఉందని.. దానిని తాము పాటిస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని.. నిధుల లేమితో ఇబ్బంది పడుతోందని అంగీకరించారు. ఏపీకి పన్ను మినహాయింపులు ఇస్తే... ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని.. జైట్లీ తెలిపారు. ఆర్థిక అంశాలకు, రాజకీయ అంశాలకు ఎక్కడా సంబంధం కలపడం సరికాదన్నారు. ఏపీ మీద తమకు సానుభూతి ఉందని.. అయితే సానుభూతితో నిధులు రావన్నారు. 

 

20:59 - March 7, 2018

జగిత్యాల : జిల్లాలోని కోరుట్లలో కాంగ్రెస్‌ బస్సు  యాత్రలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.  కాంగ్రెస్‌ బస్సు యాత్ర ఇబ్రహీంపట్నం చేరుకోగానే బస్సుకు స్వాగతం పలికే సమయంలో.. కొమ్మిరెడ్డి రాములు వర్గీయులు, జేఎన్ వెంకట్ వర్గీయులు కర్రలతో దాడులు చేసుకున్నారు. పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌ కుమార్‌ ముందే ఘర్షణకు దిగడంతో.. ఆయన తన ప్రసంగాన్ని తొందరగా ముగించాల్సి వచ్చింది. ఈ గొడవలో నలుగురు కాంగ్రెస్‌ కార్యకర్తలు గాయపడ్డారు

 

20:56 - March 7, 2018

మంచిర్యాల : జిల్లాలోని తాండూరు మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని రోడ్డుపై బైఠాయించారు. ఖాళీ కడుపులతో... ఎండలో ఆందోళన చేయడంతో  కొందరు విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు... పాఠశాలలో వంటలు వండే స్థలాన్ని సందర్శించి సిబ్బందిని మందలించారు.

 

20:51 - March 7, 2018

కర్నూలు : త్రిపురలో లెనిన్ విగ్రహం ధ్వంసం, సీపీఎం కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు కలెక్టరేట్ వద్ద సీపీఎం ధర్నా నిర్వహించింది. నగరంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ,ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. త్రిపురలో గెలిచిన తరువాత... బీజేపీ తన వాస్తవ నైజాన్ని కనబరుస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. బీజేపీ అరాచకాలకు విగ్రహాల విధ్యంసమే నిదర్శనమన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. 
జనగామలో 
త్రిపురలో జరుగుతున్న మతోన్మాద దాడులను నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో సిపియం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన చేపట్టారు. ధర్నాలో ఎంఆర్ పీఎస్, టీజాక్ నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి నెహ్రూ పార్కు మీదుగా ఆర్టీసీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. హిందుత్వ వాదులది పిరికిపందల చర్య అంటూ.. సీపీఎం నేతలు మండిపడ్డారు. 
వికారాబాద్‌లో 
వికారాబాద్‌లో సీపీఎం నాయకులు ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. త్రిపురలో లెనిన్‌ విగ్రహం కూల్చివేత, సీపీఎం నాయకులపై దాడులకు వ్యతిరేకిస్తూ.. మోదీ దిష్టి బొమ్మతో రోడ్డుపైకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దిష్టి బొమ్మ లాక్కోవడంతో... పోలీసులు, సీపీఎం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలుపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు.

 

20:46 - March 7, 2018

గుంటూరు : ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబుకు బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌ రాజుకు మధ్య స్వల్ప చర్చ జరిగింది. తాను అడిగేది న్యాయమా కాదో చెప్పాలని బీజేపీ సభ్యులను చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అయితే కేంద్రం ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 85 శాతం పూర్తి చేసిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే.. ఏపీకి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తామన్నారు. 

 

20:45 - March 7, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించిన కాంగ్రెస్‌ను ప్రజలు భూ స్థాపితం చేశారని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికీ హోదా ఇవ్వడం లేదని చెప్పిన కేంద్రం.. ప్యాకేజీ రూపంలో సాయం చేస్తానని చెప్పిందన్నారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాలకు హోదా రూపంలో సాయం చేస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. 11 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. హోదా విషయంలో రాజీపడే ప్రశ్నే లేదని చంద్రబాబు అన్నారు. 

19:56 - March 7, 2018

ఢిల్లీ : విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు... అయితే 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ప్రతిపాదించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నిధులు లేక ఏపీ ఇబ్బంది పడుతోంది..అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పారు. ఏపీ విభజన హామీల అమలుపై అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతోందన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే ఈశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేకహోదా ఇచ్చామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇష్టం లేకుండానే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ప్రత్యేకహోదా ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ముఖ్యమన్నారు. తర్వాత కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేకహోదా అనే అంశం మనుగడలోలేదన్నారు. రెవెన్యూ లోటు పూడ్చాలని ఏపీ విభజన చట్టంలో ఉందన్నారు. ప్రస్తుతం ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలు లేవన్నారు. ఏపీ తీసుకునే విదేశీ రుణాల్లో 90 శాతం కేంద్రమే చెల్లిస్తుందన్నారు. తాము ఇస్తామన్న వాటితో పోలిస్తే ప్రత్యేక హోదా వల్ల ఏపీకి వచ్చేది తక్కువగా ఉంటుందన్నారు. ప్రత్యేకహోదాతో సమకూరే ప్రయోజనాలు ప్యాకేజీతో ఇవ్వడానికి నిరాకరించలేదన్నారు. 2014..16 వరకు ఉన్న రెవెన్యూ లోటును లెక్కించండి... దానికి మరో 10 నెలలు అదనంగా కలిపి లెక్కించండన్నారు. దాదాపు రూ.4 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. ఇంకా అవసరమైన నిధులు చెల్లిస్తామని చెప్పారు. 

 

18:19 - March 7, 2018

కృష్ణా : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు ఇచ్చే కేంద్రం రాష్ట్రానికి ఇవ్వరా అంటూ సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపట్ల నిర్లక్ష్యం వహిస్తోందంటూ నేతలు మండిపడుతున్నారు. విజయవాడలో వామపక్షాల ధర్నాపై మరింత సమాచారం  కోసం వీడియో చూడండి..

18:15 - March 7, 2018

ఢిల్లీ : రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలకే అధికారం ఉండాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు వరుసగా మూడోరోజు తమ ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రిజర్వేషన్లపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదన్నారు. 

18:12 - March 7, 2018

ఢిల్లీ : ఢిల్లీలో ప్రత్యేక హోదా నినాదాలు హోరెత్తాయి. ఏపీకి ప్రత్యేహోదా ఇవ్వాలంటూ వరుసగా మూడవ రోజు వామపక్షాలు ధర్నాకు దిగాయి. పార్లమెంటు స్ట్రీట్‌లో లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు కదం తొక్కారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. విభజన చట్టంలో హామీలపై మాటతప్పిన మెదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందంటూ లెఫ్ట్‌నేతలు ధ్వజమెత్తారు. వామపక్షాలు -ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళన కారులకు మధ్య తోపులాటి జరిగింది. సీపీఎం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణతోపాటు ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదాను వెంటనే ప్రకటించాలని లెఫ్ట్‌పార్టీల నేతలు మరోసారి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  

కేరళ అసెంబ్లీలో గ్రనేట్ కలకలం..

ఢిల్లీ : కేరళ అసెంబ్లీలో గ్రనేట్ కలకలం రేగింది. స్మోక్ గ్రనేడ్ తో కేరళ అసెంబ్లీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చారు. దీనిపై విచారణకు సీఎం పినరాయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. 

నీట్ కు ఆధార్ తప్పనిసరి కాదు : సుప్రీం కోర్టు

ఢిల్లీ: నీట్‌తో సహా అఖిల భారత స్థాయిలో జరిగే ఏ పరీక్షలకైనా ఆధార్‌ తప్పని సరికాదని సుప్రీం కోర్టు మధ్యంతర  ఉత్తర్వులు జారీ చేసింది. వోటర్‌ ఐడీ, బ్యాంక్‌ ఖాతా, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, రేషన్‌ కార్డు వంటివి కూడా గుర్తింపు కార్డులుగా చూపించవచ్చని పేర్కొంది. గతంలో సీబీఎస్‌ఈ నీట్‌ పరీక్షలకు ఆధార్‌ కార్డును తప్పని సరి చేసింది. మరోపక్క సీబీఎస్‌ఈ నిర్వహించే నీట్‌ పరీక్షల దరఖాస్తు గడువు మార్చి 9తో ముగియనుంది. ఈ కేసుపై వాదనల సందర్భంగా  అటార్ని జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ..

బీజేపీ తప్పించుకోలేదు : బాబు

అమరావతి : కాంగ్రెస్ తో కలిసి రాష్ట్రాన్ని విభజించిన బీజేపీ పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మ్యానిఫోస్టోలో పెట్టినవారు ఇప్పుడిలా మాట తప్పటం సరికాదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ బీజేపీ నేతలు మాపై ఎదురు దాడి చేయటం మానుకుని ఢిల్లీకి వెళ్లి ఏపీకి రావాల్సిన హక్కులను సాధించుకురావాలని సూచించారు. వారి తీరు మారకపోతే ప్రజలు వారికి క్షమించరన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు హోదా ఇస్తామంటోంది అన్నీ చేస్తామన్న బీజేపీ ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు.

విభజన హామీలపై రాజీపడే ప్రసక్తే లేదు : బాబు

అమరావతి : విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇస్తామన్నారనీ, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సౌకర్యాలను ఇస్తున్నప్పుడు మా రాష్ట్రానికి కూడా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు ఏపీకి ఎందుకు ఇవ్వరని చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. 

బీజేపీ న్యాయం చేస్తుందనే పొత్తు : బాబు

అమరావతి : టీడీపీ, బీజేపీలు రెండు కలిపి రాష్ట్ర విభజన చేశాయని విభజన హామీలు నెరవేరుస్తారనే ఆశతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. విభజన బిల్లును పాస్ చేయించుకునేందుకు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నో హామీలిచ్చారనీ, ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని ఆ బాధ్యత కేంద్రానిదేనన్నారు.  

లెక్కలన్నీ కేంద్రానికి పంపించాం : బాబు

అమరావతి : కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదని కేంద్రం ఆరోపించటంలో వాస్తవం లేదని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి లెక్కలను వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.13,054 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రం రూ.12వేల కోట్లు ఇచ్చి దానికి లెక్క చెప్పలేదనటం సరికాదన్నారు. పోలవరం అధారిటీకి లెక్కలను ఎప్పటికప్పుడు పంపించామని తెలిపారు. రెవెన్యూ లోటు కింద రూ.3,900 కోట్లు ఇచ్చారని వీటికి లెక్కలు చెప్పాల్సిన అవుసరం లేదన్నారు.

పదేళ్లని చెప్పిన బీజేపీ ఇప్పుడిలానా? : చంద్రబాబు

అమరావతి: రాష్ట్రవిభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన భాజపా ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందువల్లే ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని ఇప్పుడు భాజపా అంటోందని, అలాంటప్పుడు ప్రస్తుతం హోదా కింద ఇప్పుడు ఏయే రాష్ట్రాలకు ఎంతమేర నిధులు, సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. 

16:02 - March 7, 2018

గుంటూరు : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చినప్పుడు మనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. హోదాపై రాజీపడబోనని తెలిపారు. ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. బీజేపీ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి ప్రత్యేకహోదాపై మాట్లాడాలని సూచించారు.
విభజన హేతుబద్ధంగా జరగలేదు 
రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని సీఎం అన్నారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిన కాంగ్రెస్ ను ప్రజలు ఓడించారని గుర్తించారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని అన్నారు. ఈ ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసుకోవాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్ లేదని స్పష్టం చేశారు. పోలవరం అథారిటీకి ఎప్పటికప్పుడు ఖర్చుల వివరాలు పంపుతున్నామని చెప్పారు. ఆర్థికలోటు రూ.16 వేల కోట్లు ఉందన్నారు.
ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామన్నారు..
ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇవ్వాలని కోరారు. జీడీపీలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. మన కష్టంతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. ఆరు నెలల్లోనే ఇస్తామన్న రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీ లు ఇవ్వలేదనడం సరికాదన్నారు. యూసీలు పంపిన తర్వాత డబ్బులు ఇస్తున్నారని చెప్పారు. ఢిల్లీని మించి ఏపీ రాజధానిని నిర్మిస్తామని మోడీ హామీ ఇచ్చారు. అమరావతికి ఇచ్చింది..రూ. 2500 కోట్లేనని తెలిపారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఉదార సహాయం చేయాలని కోరారు. భారతదేశంలో నెంబర్ వన్ సీటీగా అమరావతిని చేస్తామన్నారు. 

 

కమిటీల పేరుతో కేంద్రం కాలయాపన : బాబు

అమరావతి : ఏపీకి ఇచ్చిన విభజన హామీలను కేంద్ర కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతున్న చంద్రబాబు విభజన హామీల సమస్యలపై కేంద్ర వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు కేంద్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు రాజ్యసభలో పోరాడి ఇప్పుడు ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ లీకులు చూస్తుంటే బాధగా వుందన్నారు. విశాఖకు రైల్వేజోన్ ఆరు నెలల్లో ఇస్తామన్న హామీ ఇంతవరకూ లేదనీ, కొత్త బడ్జెట్ లో రూ.100 కోట్లు ఇచ్చారని తెలిపారు.

15:55 - March 7, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మేనిఫెస్టో పెట్టిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న విధంగా ఇన్సెంటివ్ లు ఇప్పించేవిధంగా మోదీపై బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలాన్నారు. అవసరమైతే తాము కూడా ఢిల్లీకి వస్తామని చెప్పారు. 

 

ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలి : సీఎం చంద్రబాబు

గుంటూరు : ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్  ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇవ్వాలని కోరారు. జీడీపీలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. మన కష్టంతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశామని తెలిపారు.

 

పోలవరం రాష్ట్రానికి జీవనాడి : సీఎం చంద్రబాబు

గుంటూరు : పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసుకోవాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్ లేదని స్పష్టం చేశారు. 

విభజన హేతుబద్ధంగా జరగలేదు : సీఎం చంద్రబాబు

గుంటూరు : రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిన కాంగ్రెస్ ను ప్రజలు ఓడించారని గుర్తించారు.

 

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు : సీఎం చంద్రబాబు

గుంటూరు : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చినప్పుడు మనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

హోదా నినాదాల హోరు...

ఢిల్లీ : ప్రత్యేక హోదా నినాదాలు హోరెత్తాయి. ఏపీకి ప్రత్యేహోదా ఇవ్వాలంటూ వరుసగా మూడవ రోజు వామపక్షాలు ధర్నాకు దిగాయి. పార్లమెంటు స్ట్రీట్‌లో లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు కదం తొక్కారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. విభజన చట్టంలో హామీలపై మాటతప్పిన మెదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందంటూ లెఫ్ట్‌నేతలు ధ్వజమెత్తారు.

పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన...

ఢిల్లీ : రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలకే అధికారం ఉండాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు వరుసగా మూడోరోజు తమ ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రిజర్వేషన్లపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదన్నారు.

హామీల అమలుకు కట్టుడి ఉన్నాం - విష్ణు...

విజయవాడ : విభజన హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్లు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని.. ప్రజల మనోభావాలు కేంద్రంలోని పెద్దలకు తెలియజేస్తామన్నారు విష్ణుకుమార్‌రాజు.

 

13:43 - March 7, 2018

యాదాద్రి : భార్గవి హత్య చేసిన నరేందర్‌కు కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. భార్గవి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. నరేందర్‌కు ఉరిశిక్ష పడితేనే తమకు న్యాయం జరుగుతుందని భార్గవి కుటుంబ సభ్యులంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలు చూడండి..

పొత్తుపై బాబు నిర్ణయం ఏంటీ ?

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం నుంచి సమాచారం లీక్‌ కావడంతో... బీజేపీతో పొత్తుపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు వివాదం ముదురుతోంది. చంద్రబాబు అసెంబ్లీలో పొత్తుపై ఎలా స్పందిస్తారు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

నరేందర్ కు శిక్ష పడాలన్న భార్గవి ఫ్యామిలీ...

యాదాద్రి : భార్గవి హత్య చేసిన నరేందర్‌కు కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. భార్గవి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి.

13:41 - March 7, 2018

సినిమాకి ప్రాణం మ్యూజిక్. మ్యూజికల్ హిట్ అయిన సినిమాలు ఆడియన్స్ థియేటర్స్ కి రప్పించగలవ్. అదే హిట్ ఫార్ములాతో సాంగ్స్ రిలీజ్ చేస్తూ అడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ డైరెక్టర్ అప్ డేట్స్. తన ట్యూన్ తో హీరోయిజాన్ని మరింత బలంగా మలచి కొత్త ఫీల్ తో ఆడియన్స్ ని హీరోస్ ని దగ్గరచేసే పాటల మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్. 'ఖైదీ నెంబర్ 150' సినిమా చిరంజీవి రీ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించిన సినిమా ఇది. ఈ సినిమాలో మ్యూజిక్ చాల బాగుంది అనే టాక్ కూడా వచ్చింది. 'ఉన్నదీ ఒకేటే జిందగీ' అంటూ యూత్ ని ఫోకస్ చేసిన మ్యూజిక్...మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ మాస్ కి క్లాస్ కి నచ్చే మ్యూజిక్ ఇచ్చ్చిన అది దేవిశ్రీ ప్రసాద్ సొంతం.

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్. 'నాన్నకు ప్రేమతో' లాంటి సూపర్ క్లాస్ ఫిలిం తీసిన తరువాత సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా 'రంగస్థలం'. 'మహేష్ బాబు'తో 'వన్' 'నేను ఒక్కడినే' సినిమా తీసిన సుకుమార్ తన ప్రతి సినిమాలో మ్యూజిక్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాడు.

స్టోరీ లో డిఫెరెంట్ తో పాటు మేకింగ్ లో కూడా వైవిధ్యం చూపిస్తున్నాడు సుకుమార్. వెరైటీ తరహా కథతో వస్తున్న సినిమా 'రంగస్థలం'. రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది. లిరికల్ వీడియోస్ అంటూ వచ్చిన సాంగ్ అయితే ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సుకుమార్ దేవిశ్రీప్రసాద్ కలిసి మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారనడంలో సందేహం లేదు. 

13:32 - March 7, 2018

అమరావతి : రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన వివాదాలు నేటికి కొనసాగుతునే వున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో విభజన హామీలకు సంబంధించిన సమస్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతు..రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తు ఊరుకోమని పేర్కొన్నారు. విభజన హామీలన విషయంలో కేంద్ర కట్లుబడి వుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర అవగాహనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనీ.. రాష్ట్ర అభివృద్ధికి, ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి వుందన్నారు. కుటిల రాజకీయాలతో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు కేంద్రానికి విన్నవిస్తామని తెలిపారు. ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం తెలిపిందనీ, ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి వచ్చఏ ఆదాయం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా వుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే అనేక జాతీయ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 

13:28 - March 7, 2018

తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాఫీ స్టోరీల గోల పట్టుకుంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా కాఫీ కట్స్ లా మారిపోతున్నారు అనే టాక్ ఉందట. కొన్ని సార్లు అది నిజమే అనడానికి అధరాలు కూడా నెట్ లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు స్టార్ హీరో చేస్తున్న సినిమా కూడా ఇలాంటి కాఫీ సినిమానే అనే టాక్ వచ్చింది. టెక్నాలజీ పెరిగింది ఇంటర్ నెట్ యుగం అయింది. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ క్షణాల్లో వస్తుంది. ఏ డైరెక్టర్ ఏ సినిమాని కాపీ కొట్టాడు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ట్యూన్ ని కాపీ కొట్టాడు అనేది యు ట్యూబ్ లో చూసి పెట్టేస్తున్నారు ఆడియన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా ఓ ప్రెంచ్‌ సినిమా లార్గో వించ్‌కు కాపీ అన్న వార్తలు కూడా నిజం కావటంతో తీవ్ర విమర్శల పాలైంది.

ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ కూడా హాలీవుడ్ సినిమాల ప్రభావంతోనే తన సినిమాలను రూపొందిస్తున్నాడు. అయతే ఒక్క వర్మ మాత్రమే నా సినిమాకు హాలీవుడ్‌ సినిమాలే ప్రభావం అని ధైర్యంగా ప్రకటించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నాగార్జునతో తీస్తున్న 'ఆఫీసర్' సినిమా కూడా టేకెన్ అనే ఇంగ్లీష్ సినిమా కాపీ అనే టాక్ వస్తుందట. ముఖ్యంగా హాలీవుడ్ క్లాసిక్ గాడ్ ఫాదర్ ఆధారంగా అమితాబ్‌ హీరోగా సర్కాస్ సీరీస్‌ ను రూపొందించి విజయం సాధించాడు వర్మ. 

13:25 - March 7, 2018

సినిమా సినిమాకి తన స్పెషల్ మార్క్ డైరెక్షన్ ని చూపిస్తూ ఆడియన్స్ కి క్యూరియాసిటీని పెంచేస్తున్న డైరెక్టర్ ఇప్పుడు మరో టెక్నికల్ ఓరియెంటెడ్ సినిమాని రెడీ చేస్తున్నాడు. స్టార్ హీరోస్ తో రాబోతున్న ఈ సినిమా అప్ డేట్స్. ఆలోచింపచేసే కథలతో తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ 'శంకర్'. తన ప్రతి సినిమా లో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా సినిమాల కథలను సెలెక్ట్ చేసుకుంటాడు. శంకర్ డైరెక్షన్ లో 'రజని కాంత్' హీరోగా వచ్చిన 'రోబో' సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. టెక్నికల్ గా హిట్ సినిమాలు తీయడంలో 'శంకర్' కి స్పెషల్ స్టైల్ ఉంది. అసలు శంకర్ సినిమాలు అంటేనే టెక్నికల్ గా హైలో ఉంటాయి.

ఇపుడు శంకర్ డైరెక్టర్ గా 'రజని' కాంత్ హీరో గా వస్తున్న 'రోబో 2 .0' సినిమా విశేషాలు వస్తున్నాయి. తాజాగా '2.0' విఎఫ్ ఎక్స్ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్టర్ శంకర్. విలన్ గా చేస్తున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. టెక్నికల్ టీంలోని ముఖ్యమైన వాళ్లు.. గ్రాఫిక్స్ చేస్తున్న థర్డ్ ఫ్లోర్ కంపెనీలోని నిపుణులు ఈ సినిమాను ఎంత రిచ్ గా తెరకెక్కిస్తున్నారో చెప్పుకొచ్చారు. దాంతోపాటు తెరపై కనిపించే యాక్షన్ సన్నివేశాలను కార్టూన్ లో డిజైన్ కూడా చేసి చూపించారు. 

13:19 - March 7, 2018

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి ఇపుడు డిఫరెంట్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్నాడు యంగ్ హీరో. తన ప్రీవియస్ సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా చూసుకుంటూ సినిమాలని హిట్ ట్రాక్ లో పెడుతున్నాడు. హీరో 'నితిన్' లవ్ స్టోరీ తో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ తరువాత కొన్ని యాక్షన్ సినిమాలు చేసాడు. యూత్ ని ఆకట్టుకుంటూ సినిమాలు సెలెక్టివ్ గా చేస్తున్న ఈ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. 'అ ఆ' సినిమాలో ఫామిలీ హీరోగా కనిపించి ఎంటర్టైన్ చేసాడు నితిన్. సమంత కి జోడిగా నటించిన ఈ 'అ ఆ' సినిమా ఆడియన్స్ నుండి మంచి టాక్ తెచ్చుకుంది.

కెరీర్ స్టార్టింగ్ లో లవ్ సినిమాలు చేస్తూ లవర్ బాయ్ గ తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో నితిన్. 'లై' సినిమాతో తాను హాలీవుడ్ లెవెల్ లో యాక్షన్ సీక్వెన్స్ కూడా చెయ్యగలను అని నిరూపించాడు నితిన్. ఇప్పుడు 'చల్ మోహన రంగ' అంటూ అలరించడానికి రెడీ అయ్యాడు. లిరికల్ వీడియోతోపాటు రిలీజ్ అయినటీజర్ కి కూడా మంచి టాక్ వస్తోంది.

13:17 - March 7, 2018

టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తదనంతో కధలు దూసుకెళుతున్నాయి. కథల్లో ఉండే దమ్ముతో బాలీవుడ్ సైతం తెలుగు సినిమాలను రీమేక్ చేస్తుంది. ఇలాంటి టైం లో మన టాలీవుడ్ యంగ్ హీరో రీమేక్స్ మీద మంచి ఇంటరెస్ట్ తో ఉన్నాడు. ఆల్రెడీ ఒక సినిమా చేస్తూనే రెండో సినిమాకి ఓకే అన్నాడట. 'కేశవ'లాంటి డిఫెరెంట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు 'నిఖిల్'. యంగ్ హీరోల సినిమాలు వరదలా వస్తున్నాయి. కంటెంట్ ని పట్టించుకోకుండా కథలో దమ్ము లేకుండా కేవలం హీరోయిజంని మాత్రమే చూపించే సినిమాల్లా కాకుండా వెరైటీ స్టోరీ లైన్స్ తో వచ్చిన హీరోలకే గుర్తింపు ఉంటుంది. ప్రెజెంట్ 'నిఖిల్' కన్నడ సినిమా రీమేక్ 'కిరాక్ పార్టీ' మీద చాల కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు.

'నిఖిల్' లేటెస్ట్ గా 'కిరాక్ పార్టీ' అనే సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినా కూడా పెద్ద ఏమి టాక్ లేదంట. ఇప్పుడు తమిళ్ రీమేక్ మీద కూడా వర్క్ చేస్తున్నాడట. హీరో 'నిఖిల్' కొత్త సినిమా ఎక్కువ సౌండ్ చేయకుండా సెట్స్ పైకి వెళ్లిపోయింది. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'కనితన్' రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో నిఖిల్ ఒక రిపోర్టర్ గా నటించబోతున్నాడు. కనితన్ ఒరిజినల్ వెర్షన్ తీసిన టిఎన్ సంతోష్ తెలుగుకు కూడా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. మరి ఈ రీమేక్ ని నమ్ముకుంటే ఏంటి పరిస్థితి 'నిఖిల్' అనుకుంటున్నారట ఫిలిం పీపుల్.

13:13 - March 7, 2018
13:12 - March 7, 2018

కథలని నమ్ముకుంటూ డైరెక్టర్స్ మీద నమ్మకంతో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని దగ్గరౌతున్నాడు ఈ యంగ్ హీరో. తన సినిమాల్లో కచ్చితంగా వైవిధ్యం ఉండేలా చూస్తూ కెరీర్ ని ప్లాన్ చేస్తున్న ఈ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్ డేట్స్..'ప్రేమమ్' సినిమాతో హిట్ ట్రాక్ ని నిలబెట్టుకున్నాడు 'నాగచైతన్య'. ఇదే ఫ్లోలో తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. ఆడియన్స్ కి నచ్చాలంటే కావాల్సింది బ్యాగ్రౌండ్ కాదు, నటన, ఎంచుకునే కధలు, పెర్ఫామెన్స్ ఇవన్నీ బాగుంటేనే ఆడియన్స్ చూస్తారు హీరోని చేస్తారు. మలయాళం సూపర్ హిట్ మూవీ 'ప్రేమమ్'ని అదే టైటిల్ తో తెలుగులో కూడా హిట్ ఫిక్స్ చేసాడు డైరెక్టర్ చందు.

'ప్రేమమ్' సినిమాతో 'నాగ చైతన్య'కి తిరుగులేని హిట్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటి. 'చందు మొండేటి' లవ్ స్టోరీ ని బాగా హ్యాండిల్ చేసాడు అనే టాక్ వచ్చింది. 'చైతు- చందూ' కాంబినేషన్ లో వచ్చిన 'ప్రేమమ్' మంచి సక్సెస్ సాధించింది. డైరెక్టర్ చందు మొండేటి , అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త సినిమా 'సవ్యసాచి' హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జూన్ 14న 'సవ్యసాచి'ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేలా నిర్మాతలు నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ నెల 18 విడుదల చేయబోతున్నారు.

13:09 - March 7, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీలు నెరవేర్చాలనే డిమాండ్ తో వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలను దారితీసింది. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్ తో చేస్తున్న వామపక్ష నేతల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై నేతలు బైఠాయించటంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. 

13:08 - March 7, 2018

స్టార్ హీరో సినిమాల్లో స్పీడ్ పెంచాడు. ఒక ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకే చేశాడు. ఈ సారి ఎమోషనల్ ఎంటెర్టైనేమేంట్ సినిమాలు తీసే డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేసాడు ఈ స్టార్ హీరో. 'ఊపిరి' సినిమాతో క్లాస్ ఆడియన్స్ ని కట్టిపడేసాడు డైరెక్టర్ వంశి పైడిపల్లి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో స్టార్ హీరోలు చెయ్యాలని అనుకుంటున్నారట. 'ఊపిరి' సినిమాతో హిట్ ట్రాక్ లో ఉన్న వంశి పైడిపల్లి ఇప్పుడు మరో పర్ఫెక్ట్ స్టోరీతో పక్కాగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. నాగార్జున, కార్తీ తో మంచి మల్టీ స్టారర్ ఊపిరి సినిమా తీసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు వంశి పైడిపల్లి. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ స్టార్ హీరో హోదా దక్కించుకున్నాడు మహేష్ బాబు. 'స్పైడర్' సినిమాతో ఆలోచనల్లో పడ్డ మహేష్ బాబు ఇప్పుడు తన కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఒక సైకోని ఎదుర్కొని పోరాడే హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా మహేష్ బాబులో నటుడిని బాగానే చూపించింది కానీ అనుకున్నంత హిట్ టాక్ తేలేకపోయింది.

భారీ సినిమాల నిర్మాతలు దిల్ రాజు అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మించబోతున్న మహేష్ బాబు 25వ సినిమాకు రంగం సిద్ధమవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ఇండస్ట్రీ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. 2006లో వచ్చిన డాన్ - గత ఏడాది వచ్చిన రయీస్ - జబ్ హారీ మీట్స్ సీజేల్ ఈ సినిమాలకి సినిమాటోగ్రఫీ చేసిన కెయు మోహనన్ ఇప్పుడు మహేష్ బాబు హీరోగా వంశి డైరెక్షన్ లో రాబోయే సినిమాకి వర్క్ చెయ్యనున్నారు.

13:02 - March 7, 2018

అమరావతి : బీజేపీ, టీడీపీ పార్టీల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని టీడీపీ, కోరిందల్లా ఇవ్వటం సాధ్యం కాదని బీజేపీ ఇలా ఎవరి పట్టువారు వీడటంలేదు. ఈ క్రమంలో ఏపీ సర్కారులో మంత్రులుగా వున్న బీజేపీ నేతలు తమ మంత్రి పదవులకు వీడ్కోలు పలికే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది. విభజన హామీలను నెరవేరుస్తారనే ఆశతో ఇప్పటి వరకూ వున్న టీడీపీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించే పరిస్థితులు నెలకొంటున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ వైఖరిపై నిరసనతో వున్న సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తును ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ లో వున్న బీజేపీ మంత్రులు రాజీనామా చేసే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి కామినేనికి హైకమాండ్ నుండి ఆదేశాలు అందాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నట్లు సమాచారం. 

13:00 - March 7, 2018

జీన్స్...యువతకు ఫ్యాషన్. మగవారే కాకుండా యువతులు కూడా జీన్స్ వేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఎంతో సౌకర్యంగా ఉంటుందని భావిస్తూ జీన్స్ వేసుకుంటుంటారు. కానీ ఇంట్లో వారికి జీన్స్ ఉతకాలంటే పెద్ద గగనం అని అనుకుంటుంటారు. కొన్ని జీన్స్ ఉతకగానే కలర్స్ పోవడం..షేడ్ అయిపోవడం అవుతుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే జీన్స్ పాడు కాకుండా ఉంటాయి.

 • జీన్స్ ఉతికే సమయంలో కొంతమంది బ్రష్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీన్స్ తొందరగా చినిగిపోయే అవకాశం ఉంది. బ్రష్ తో గట్టిగా రుద్దకోవడం మేలు.
 • ముందుగా జీన్స్ ను డిటర్జెంట్ లో పది నిమిషాల పాటు నానబెట్టాలి. అనంతరం రెండు లేదా మూడు సార్లు జాడించాలి. దీనివల్ల ప్యాంట్ కు ఉన్న నురగ పోతుంది.
 • డిటర్జెంట్ పౌడర్ మంచి నాణ్యతతో కూడినది..ఘాటు తక్కువగా తేలికగా ఉండే పౌడర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
 • ఇక జీన్స్ ఉతకగానే దానికి కండీషనర్ వాడితే చక్కటి ప్రయోజనం ఉంటుంది. క్లాత్ మెత్తగా ఉండడమే కాకుండా రంగు పోకుండా ఉండే అవకాశం ఉంది.
 • ఒక వేళ తెలుపు రంగు జీన్స్ ఉంటే వెనిగర్, అమెనియా, బేకింగ్ సోడాలు వాటర్ లో కలపాలి. ఈ నీటిలో జీన్స్ ప్యాంట్ ను 15 నిమిషాల సేపు నానబెట్టాలి. అనంతరం సబ్బుతో రుద్దాలి. ప్యాంట్‌ ను చేతులతో ఉతకడం మంచిది.
 • జీన్స్ ను ఐరన్‌ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల క్లాత్‌ మీద ఉండే బ్యాక్టీరియా పోతుంది.
 • ఇక జీన్స్ ఉతికిన అనంతరం పిండకుడా అలాగే ఆరవేయాలి. 
12:45 - March 7, 2018

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సినవసరం ఏర్పడుతుంది. ప్రధానంగా చర్మం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోవడం..డీ హైడ్రైట్ అవడం జరుగుతుంటాయి. ముఖం నల్లగా మారిపోతుండడంతో పలువురు ఎన్నో క్రీములు..ఇతర సౌందర్య సాధనాలను వాడుతుంటారు. కానీ ముఖాని కోమలంగా తయారు చేసుకోవాలంటే..కాంతివంతంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు..

 • ఒక చెంచా టమాట గుజ్జు తీసుకోవాలి. అందులో ఒక చెంచా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఒక 20 నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి.
 • కలబంద గుజ్జును రాత్రి పడుకొనే ముందు పెట్టుకోవాలి. పెట్టుకోకముందే అందులో గులాబీ నీళ్లను కొద్దిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పడుకోవాలి. ఉదయం లేచిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి.
 • పచ్చిపాలల్లో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల అనంతరం శుభ్రమైన చేతులతో కొద్దిసేపు రుద్ది ఆ తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి.
 • ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. దాంతో పాటు చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
12:40 - March 7, 2018

హైదరాబాద్ : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా త్రిపురలో విజయం సాధించిన బీజేపీ తన పంజాను విప్పింది. తన వాస్తవ నైజాన్ని కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, తమిళనాడులో పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేసి తన వైఖరిని బైటపెట్టుకుంది. ఈ ఘటనపై తెలంగాణలో సీపీఎం బీజేపి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు.. బీజేపీ అరాచకాలకు విగ్రహాల విధ్యంసకర ఘటనలు నిదర్శనమన్నారు. వామపక్షాలపై తనకున్న వైఖరిని ప్రదర్శిస్తోందనీ..తన విధ్వంసాన్ని కనబరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీని రూపుమాపాలను బీజేపీ ఉద్ధేశ్యం ఎప్పటికీ నెరవేరదని పేర్కొన్నారు. లౌకికవాదాన్ని నియంత్రించాలనే బీజేపీ ఆలోచనను అణచివేసేందుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలని తెలంగాణ సీపీఎం రాష్ల్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలపునిచ్చారు. మహానేతల విగ్రహాలను ధ్వంసం చేయటం, సీపీఎం కార్యాలపై దాడులు, వాటిని స్వాధీనం చేసుకోవటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాట వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతు..వామపక్షాలపై కేవలం 0.3 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణమని చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలను నిరసిస్తు దేశ వ్యాప్తం ఆందోళనలకు సిద్దం అవుతామని పేర్కొన్నారు. 

శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై చర్చ...

విజయవాడ : శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానాన్ని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వర ప్రసాద్ ప్రవేశ పెట్టారు. తీర్మానంపై మండలిలో చర్చ కొనసాగుతోంది. 

రాజీనామాలకు సిద్ధంగా ఉండాలన్న బీజేపీ అధిష్టానం...

విజయవాడ : రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ మంత్రులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. పొత్తు నుండి బయటకు వస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే వెంటనే సభలో రాజీనామాలు చేయాలని మంత్రులు కామినేని, మాణిక్యాలరావులకు ఆదేశాలు జారీ చేసింది. 

పార్లమెంట్ చట్టానికే విలువ లేకపోతే ఎలా - డొక్కా...

విజయవాడ : ప్రత్యేక హోదాపై కాకుండా మరో దానిపై చర్చిమని మండలిలో డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ప్రజల వాణిని కేంద్రానికి సభల ద్వారా వినిపించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల గౌరవాన్ని, ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని సూచించారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టానికే విలువలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. 

ఢిల్లీలో వామపక్ష నేతల అరెస్టు..

ఢిల్లీ : ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ఢిల్లీలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన నేతనలు పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధం...

హైదరాబాద్ : త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చడంపై వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోలనకు దిగాయి. నగరంలో సీపీఎం ఆందోళన చేపట్టింది. బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. 

11:59 - March 7, 2018
11:58 - March 7, 2018

విశాఖపట్టణం : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ విశాఖకు వస్తున్నారని తెలుసుకున్న మహిళా సంఘాలు ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశాయి. గత కొద్ది రోజుల కింద 'జీఎస్టీ' పేరిట వర్మ షార్ట్ ఫిల్మ్ ను తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో పీఎస్ లో ఫిర్యాదు చేయగా యూ ట్యూబ్ ఛానెల్ లో ఉన్న ఫిల్మ్ ను ఆపుచేయడం..విచారణకు హాజరు కావాలని వర్మకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఏపీ రాష్ట్రంలో మాత్రం వర్మపై కేసు నమోదు చేయకపోవడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. చివరకు ఆయనపై కేసు నమోదు చేశాయి. కానీ మహిళలపై వర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖకు వస్తానని..తాను వచ్చి మహిళలకు సమాధానం చెబుతానని తెలిపారు. దీనితో విశాఖ ఎయిర్ పోర్టుకు మహిళా సంఘాలు చేరుకుని ఆందోళన చేపట్టాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

వర్మ పర్యటన, మహిళల ఆందోళన..

విశాఖ : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈరోజు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళనను చేపట్టారు. ఎయిర్ పోర్ట్ వద్ద వర్మను అడ్డుకునేందుకు మహిళా సంఘాలు సిద్ధంగా వుండటంతో ఎయిర్ పోర్ట్ లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా జీఎస్టీ పేరుతో వర్మ ఓ పిల్మ్ ను తీసిన సంఘటనలో పలు వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వర్మ విశాఖ పర్యటన సందర్భంగా మహిళా సంఘాలు తమ ఆందోళనను కొనసాగించనున్నాయి. 

పోలీసుల అదుపులో దుండగులు..

తమిళనాడు : ద్రవిడ ఉద్యమనేత పెరియార్ విగ్రహాన్ని ఆందోళకారులు ధ్వంసం చేశారు. తిరుత్తూర్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో వున్న పెరియార్ విగ్రహం ఈ ఘటనలో పెరియార్ విగ్రహాం ముక్కును ఛిద్రం చేశారు. కాగా పెరియార్ పై ఫేస్ బుక్ లో రాష్ట్ర బీజేపీ నేత వ్యాఖ్యల అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవటం గమనించాల్సిన విషయం. కాగా విగ్రహ ధ్వంసం ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఢిల్లీ సభల్లో హామీల లొల్లి..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లోను విభజన హామీల సెగలు మిన్నంటుతున్నాయి. ప్రారంభమయిన కొద్దిసేపటికే వాయిదా పడిన లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తమ ఆందోళనలను కొసాగిస్తున్నారు. విభజన హామీలను నెరవేర్చాలను డిమాండ్ చేస్తున్నారు. ఋ క్రమంలో ప్రారంభమయిన కొద్దిసేపటికే ఇరు సభలు వాయిదా పడిన విషయం తెలిసిందే. 

11:29 - March 7, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీ మురళీ మోహన్ దురుసుగా ప్రవర్తించారని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ దేశ రాజధానిలో నేతలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు టిడిపి ఎంపీ మురళీ మోహన్ నివాసానికి వెళ్లారు. తాము చేస్తున్న పోరాటాలకు..ఆందోళనలకు మద్దతు తెలియచేయాలని..ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆందోళనలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే ఆందోళనలు..నిరసనలను కేంద్రం పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో ఏపీ ఎంపీలు నినదిస్తున్నారు. ఉభయసభల్లో తెలుగు ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. లోక్ సభలో స్పీకర్ పోడియాన్ని టిడిపి ఎంపీలు చుట్టుముట్టారు. విభజన హామీలు అమలు చేయాలంటూ నినదించారు. స్పీకర్ ఎంత వారించినా సభ్యులు వినిపించుకోలేదు. పార్లమెంట్ వెలుపల వైసీపీ, టిడిపి ఎంపీలు నిరసన..ఆందోళన నిర్వహించారు.

అమరావతి శంకుస్థాపకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మట్టి..నీరు ఇచ్చారని..చివరకు అదే మిగిలిందని ఎంపీ శివప్రసాద్ పేర్కొన్నారు. ఈ మట్టి..నీరును మోడీకి ఇస్తామని..ఆయన లేకపోతే పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద పెడుతామని పేర్కొన్నారు. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి. 

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి నోటీసులు ..

నెల్లూరు : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి పోలీసులు నోటీసులు పంపించారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్లు జరుగుతున్న కారణంగా తాను విచారణకు హాజరు కాలేనంటూ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పోలీసులకు వివరణ ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాత్రపై అప్పట్లో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. కోటంరెడ్డి పాత్రపై పోలీసుల వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కుండలు ప్రధానికే : ఎంపీ

ఢిల్లీ : విచిత్ర వేషధారణలతో పరిస్థితులకు అద్దపట్టేలా వేషాలు వేసి నిరసనలు తెలిపే ఎంపీ శివప్రసాద్ మరో వేషధారణతో తన నిరసనలు కొనసాగిస్తున్నారు. రెండు కుండలతో పార్లమెంట్ కు వచ్చిన ఎంపీ శివప్రసాద్ ప్రధాని మోదీ ఇచ్చిన నీటిని, మట్టిని మోదీకే ఇచ్చేస్తామన్నారు. ప్రధాని తీసుకోకుంటే గాంధీ విగ్రహం వద్ద వాటిని సమర్పించేస్తామన్నారు. మిత్రపక్షం కాబట్టి రాష్ట్రానికి న్యాయం చేస్తారనుకుంటే..కేవలం మట్టి, నీరును ఇచ్చి ప్రధాని చేతులు దులుపుకున్నారని ఎంపీ శివప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. 

11:16 - March 7, 2018

ఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లో విగ్రహాలు కూల్చడంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. లోక్ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేక హోదాపై తెలుగు ఎంపీలు..వివిధ అంశాలపై ఇతర ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ఎన్నిమార్లు విజ్ఞప్తులు చేసినా సభ్యులు శాంతించలేదు. దీనితో సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు విగ్రహాల కూల్చివేతలపై ప్రకటన చేశారు. తమిళనాడు, త్రిపుర ఇతర రాష్ట్రాల్లో విగ్రహాలు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు జరగడం దురదృష్టకరమని, షేమ్ అని అభివర్ణించారు. వెంటనే విపక్ష సభ్యులు నినాదాలు..ఆందోళన చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు సభను మధ్యాహ్నం 2.00గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య వెల్లడించారు. 

11:10 - March 7, 2018

ఆందోళన మధ్య లోక్ సభ, రాజ్యసభలు వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ వాయిదా పడింది. ప్రారంభమయిన కొద్దిసేపటికే లోక్ సభ వాయిదా పడింది. విపక్షాల ఆందోళనతో ప్రారంభమయిన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేక హోదా నిమిత్తం కొనసాగుతున్న ఆందోళనల మధ్య సభ వాయిదా పడింది.కాగా రాజ్యసభలో కూడా ఆందోళనలను కొనసాగటంతో  మ2.00లకు వాయిదా పడింది.

తన ఆఫీస్ ను వాడేసుకోమన్న లోకేష్..

అమరావతి : ఏపీ మంత్రి లోకేష్, బీజేపీ ఎమ్మెల్చే విష్ణుకుమార్ రాజుల మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. శాసనమండలికి వెళ్తున్న లోకేష్ ను ఆపి.. బీజేపీఎల్పీ ఆఫీస్ కు  లోకేష్ ను విష్ణుకుమార్ రాజు తీసుకెళ్లి తన కార్యాలయంలో వాస్తు బాగోలేదని చూపించారు. మీ ఆఫీసు బాగుండకపోతే తన ఆఫీస్ ను వినియోగించుకోమని లోకేష్ చెప్పారు. దీంతో మీరు మంత్రులు మీ ఆఫీస్ ను నేనెలా వాడుకుంటానని నేను మీ ఆఫీసును వాడుకుంటానని  మీరు నా ఆఫీస్ ను వాడుకోమని చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. 

10:54 - March 7, 2018

నల్గొండ : సూర్యాపేటలోని చింతపాలెం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు లకావత్ రామారావు ఆయన సతీమణి ఎంపీటీసీ సుభద్రపై నిందితుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడి వెనుక డబ్బుల వ్యవహారమే కారణమని తెలుస్తోంది. డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు, ఇవ్వకపోవడంతో నిందితుడు దాడికి పాల్పడినట్లు సమాచారం. రూ. 1.60 వేలు తీసుకున్నారని, కొంత డబ్బు వాపస్ ఇచ్చారని నిందితుడు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇతర పథకాల పేరిట పేదల దగ్గరి నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా... దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

10:48 - March 7, 2018

విగ్రహాల కూల్చివేతపై స్పందించిన ప్రధాని మోదీ..

ఢిల్లీ : త్రిపుర, తమిళనాడులో విగ్రహాల కూల్చివేత ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విగ్రహాల కూల్చివేతపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు, ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మంచికాదన్నారు. విగ్రహాల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలనీ కేంద్ర హోంశాఖలు ప్రధాని ఆదేశించారు. ఈ ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

త్రిపుర నుండి తమిళనాడుకు ఆందోళనలు..

ఢిల్లీ: త్రిపురలో రష్యా కమ్యూనిస్టు నేత వ్లాదిమర్‌ లెనిన్‌ విగ్రహాన్ని కూల్చివేయడంతో ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆందోళనలు దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడుకు పాకాయి. తమిళనాడులోని వెల్లూర్‌లో పెరియార్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఇక్కడ కూడా ఆందోళనలు చోటుచేసుకున్నాయి.

ప్రత్యేక హోదాపై కత్తి వాయిదా తీర్మానం తిరస్కరణ..

అమరావతి : ఏపీకి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాపై చర్చించాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ కత్తి నర్శింహారెడ్డి వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఐదు కోట్లమంది ప్రజల సమస్యలపై చర్చించాలని కత్తి నర్శింహారెడ్డి పట్టుపట్టారు. కాగా తరువాత చర్చింద్దామని తీర్మానాన్ని మండలి ఛైర్మన్ ఫక్ తిరస్కరించారు.  

ఢిల్లీలో కొనసాగుతున్న విభజన సెగలు..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై దేశ రాజధాని ఢిల్లీలో విభజన సెగలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ రెండవ వీధిలో రెండవ రోజు కూడా కాంగ్రెస్ ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ముట్టడికి వామపక్షఆలు, ప్రత్యేక హోదా, విభజన హామీల సమితి, ప్రజాసంఘాలు, కాంగ్రెస్ ఎంపీలు యత్నించాలని వ్యూహంలో వున్నాయి.  

10:13 - March 7, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలంటూ విపక్షాలు..వివిధ పార్టీల నేతలు..ప్రజా సంఘాలు..చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రంపై వత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు..నిరసనలు తెలియచేస్తున్నాయి. బుధవారం వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి, విభజన హామీల సాధన సమితి, ప్రజా సంఘాలు పార్లమెంట్ ను ముట్టడి చేపట్టనున్నాయి.

పార్లమెంట్ స్ట్రీట్ లో కాంగ్రెస్ ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. మొదటి రోజు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. రెండో రోజు కాంగ్రెస్ జాతీయ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు పాల్గొననున్నారు.

గాంధీ విగ్రహం వద్ద టిడిపి, కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేయనున్నారు. పార్లమెంట్ ఉభయసభలలో టిడిపి, వైసీపీ వాయిదా తీర్మానాలిచ్చాయి. రిజర్వేషన్లు, విభజన హామీలపై పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలియచేయనున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం సానుకూలంగా స్పందించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జవాన్ సూసైడ్...

జమ్మూ కాశ్మీర్ : ఓ ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకున్నాడు. కుప్వారాలో బీరేందర్ సిన్హా జవాన్ తన సర్వీస్ రైఫిల్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : చంద్రబాబు

అమరావతి : పార్టీ ఎంపీలలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి ఏమీ చేసేది లేదని కేంద్ర పరోక్ష విధానాన్ని అవలంభిస్తోందన్నారు. పరోక్ష విధానంలో లీక్లు ఇవ్వటంపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తంచేశారు. విభజన హామీలపై స్పష్టత వచ్చేలా పోరాడాలని చంద్రబాబు ఎంపీలకు టెలీకాన్ఫరెన్స్ లో దిశానిర్ధేశం చేశారు. కేంద్రం చేసిన వాగ్ధానాలకే అడుగుతున్నామనీ, రాష్ట్ర ప్రజల మనోభావాలను అవమానపరిచేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్కన నిలబడతామన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా మన పోరును ఉదృతం చేయాలన్నారు.  

09:59 - March 7, 2018

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు మండలం బుజిలాపురం గ్రామంలో దారుణం వెలుగుచూసింది. ప్రేమించినట్టు నటించి పెళ్ళి చేసుకో అడగ్గానే ప్రియురాలు భార్గవిని.. ప్రియుడు నరేశ్ దారుణంగా హత్య చేసి చంపేశాడు. అనంతరం..తమ వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టాడు. భార్గవిని హత్య చేసిన తర్వాతిరోజే నిందితుడు.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే చివరిసారిగా సోదరితో భార్గవి మాట్లాడిన ఫోన్ కాల్ బయటకొచ్చింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఆలీ ఘడ్ ముస్లిం యూనివర్సిటీలో...

ఢిల్లీ : ఆలీ ఘఢ్ ముస్లిం యూనివర్సిటీలో భారీ ఎత్తున బలగాలు మోహరించాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన నేపథ్యంలో విద్యార్థుల నుండి నిరసన ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

09:45 - March 7, 2018

విజయవాడ : ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ పై ప్రభుత్వ నియంత్రణ లేదని అనిపిస్తోందని టిడిపి సభ్యుడు శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఉచిత విద్యపై సభ్యులు మాట్లాడారు. ప్రైవేటు స్కూళ్లకు వివిధ పేర్లను పెడుతున్నారని..ఇందులో ఎలాంటి విద్య చెబుతారనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. జిల్లా పరిషత్ స్కూళ్లు ప్రభుత్వ హాయాంలో ఎక్కువయ్యాయని, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ పై ప్రభుత్వ నియంత్రణ లేదని అనిపిస్తోందన్నారు. స్కూళ్లు పెట్టడానికి కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుందని..కానీ వివిధ జిల్లాల్లో అపార్ట్ మెంట్లలో కళాశాలలు నడుస్తున్నాయన్నారు. టెన్త్ పరీక్షలు రాయకముందే విద్యార్థులను వారి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కొంతమంది సేకరించారని..తమ కళాశాలల్లో చేర్పించాలని వత్తిడి తెస్తున్నారని..ఈ ఫోన్ నెంబర్లు ఎలా సేకరించారు ? ఇందులో అధికారుల పాత్ర ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు చేయని వారు ఎక్కువగా ఉన్నారని..ఆయా కళాశాలల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు లేవన్నారు. 

09:40 - March 7, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలుపై కేంద్ర వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో బాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. దీనితో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఏపీ అసెంబ్లీని చక్కగా ఉపయోగించుకోవాలని బాబు నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బాబు ప్రసంగించనున్నారు. ఇందులో కేంద్ర వైఖరిపై బాబు క్లారిటీ ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ ఎంపీలతో బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయబోదని పరోక్ష పద్ధతిలో కేంద్రం చెబుతోందని పేర్కొన్నారు. పరోక్ష విధానంలో లీక్ లు ఇవ్వడంపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన హామీల విషయంలో కేంద్ర వైఖరిలో స్పష్టత వచ్చేలా చేయాలని, కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచాలని బాబు సూచించారు. 

09:19 - March 7, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఐదు విడతలుగా జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, మొత్తంగా 59 లక్షల 9వేల 158 దరఖాస్తులు రావడం జరిగిందని మంత్రి యనమల పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న జన్మభూమి అంశాన్ని మొదట తీసుకోవడం జరిగిందని స్పీకర్ కోడెల తెలిపారు. జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖాల పరంగా ఎన్ని వచ్చాయో సభకు యనమల వివరించారు. అనంతరం ఆయా జన్మభూమిలలో కమ్యూనిటీ హాల్స్ నిర్మించే విధంగా చూడాలని..బడ్జెట్ లో అందుకనుగుణంగా నిధులు కేటాయించాలని సభ్యురాలు యామిని బాల ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మంత్రి యనమల మాట్లాడారు.

జన్మ భూమి - మా ఊరు కార్యక్రమానికి ప్రజల నుండి విపరీతంగా స్పందన వచ్చిందని టిడిపి సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. వంద గజాల వరకు ఉచిత స్థలాలు ఇవ్వాలని ఉందని, 388 జీవో వల్ల పట్టాలు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. రెగ్యులరైజేషన్ కోసం చాలా మంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగిందన్నారు. 

జన్మభూమికి మంచి స్పందన - బోండా...

విజయవాడ : జన్మ భూమి - మా ఊరు కార్యక్రమానికి ప్రజల నుండి విపరీతంగా స్పందన వచ్చిందని టిడిపి సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. జన్మభూమి - మా ఊరుపై సభ్యులు మాట్లాడారు. వంద గజాల వరకు ఉచిత స్థలాలు ఇవ్వాలని ఉందని, 388 జీవో వల్ల పట్టాలు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. రెగ్యులరైజేషన్ కోసం చాలా మంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగిందన్నారు. 

ఏపీ అసెంబ్లీ..ప్రశ్నోత్తరాలు...

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఐదు విడతలుగా జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, మొత్తంగా 59 లక్షల 9వేల 158 దరఖాస్తులు రావడం జరిగిందని మంత్రి యనమల పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు

లోక్ సభలో వైసీపీ ఎంపీ వాయిదా తీర్మానం...

ఢిల్లీ : లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

09:12 - March 7, 2018

చెన్నై : కాషాయ మూకలు రెచ్చిపోతున్నాయి. కమ్యూనిస్టులను టార్గెట్ చేస్తున్నాయి. త్రిపురలో అధికారంలోకి వచ్చిన రెండు..మూడు రోజులకే సీపీఎం కార్యకర్తలపై దాడులు..సీపీఎం కార్యాలయాలను ధ్వంసం చేస్తూ హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు. ఇది మరిచిపోకముందే తమిళనాడులో మరో ఘటన చోటు చేసుకుంది. తిరుపత్తూర్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ విగ్రహంపై దుండగులు దాడి నిర్వహించారు. కళ్లద్దాలు ధ్వంసం చేసి పెరిగాయర్ ముక్కు భాగాన్ని ఛిద్రం చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెరియార్ పై ఫేస్ బుక్ లో రాష్ట్ర బీజేపీ నేత వ్యాఖ్యలు చేసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ద్రవడి సంఘాలు వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. 

09:11 - March 7, 2018

విజయవాడ : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలు...ప్రత్యేక హోదా...కేంద్రం ఇచ్చిన నిధులు..తదితర విషయాలను బాబు క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశం ఉంది. టిడిపి..బిజెపి పొత్తుపై కూడా వ్యాఖ్యలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర వైఖరిపై బాబు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ నెలకొంది.

 

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. బాబు ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

శామీర్ పేటలో రోడ్డు ప్రమాదం...

రంగారెడ్డి : శామీర్ పేట పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రెండు కార్లను మరో కారు ఢీకొంది. ఘటనాస్థలం వద్ద చూస్తున్న యువకులను ఇంకొక కారు ఢీకొంది. 

కలుషిత ఆహారం..మహిళ మృతి...

తూర్పుగోదావరి : జగ్గంపేట (మం) రామవరంలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని 30 మంది అస్వస్థతకు గురయ్యారు. మహిళ మృతి చెందగా పలువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.

 

09:00 - March 7, 2018

బాబు ఏం చెబుతారు ?

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. కేంద్ర వైఖరిపై ఆయన క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. 

07:40 - March 7, 2018

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనని తెగేసి చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తుపై ఆయన పార్టీ ప్రజాప్రతినిధులందరి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలం వేచిచూద్దామా.... తెగదెంపులు చేసుకుందామా.. లేక పోరాటం కొనసాగిస్తూ కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుదామా అని ప్రశ్నించారు. ఈ అంశంపై టెన్ టివి విజయవాడ స్టూడియోలో జరిగిన చర్చలో పట్టాభిరామ్ (టిడిపి), బాజి (బీజేపీ), మండల హనుమంతరావు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మద్యం సేవించి ఇద్దరు మృతి...

ప్రకాశం : పొంగులూరు (మం) కొండమంజులూరులో విషాదం చోటు చేసుకుంది. అనధికార మద్యం షాపులో మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతదేహాలతో బంధువులు ఆందోళన చేపట్టారు. 

మూసాపేట ఫ్లై ఓవర్ పై ప్రమాదం...

హైదరాబాద్ : మూసాపేట ఫ్లై ఓవర్ పై ప్రమాదం చోటు చేసుకుంది. ఫై ఓవర్ పై నుండి ప్రైవేటు బస్సు కిందపడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. 

07:23 - March 7, 2018

రాబోయే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ... వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి. ఇది తెలంగాణలో రైతు సంఘాలు ఐక్యంగా చేస్తున్న డిమాండ్‌. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలంటే ప్రత్యేకంగా బడ్జెట్‌ అవసరమని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రత్యేక బడ్జెట్‌ వల్ల వ్యవసాయ రంగానికి జరిగే మేలేంటి..? దీనిపట్ల ప్రభుత్వ వైఖరేంటి..? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:21 - March 7, 2018

యాదాద్రి : ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. మాయమాటలు చెప్పి పొలానికి రప్పించాడు. పక్కాప్లాన్‌తో హత్యచేసి పూడ్చి పెట్టారు. మరునాడు మరో యువతి మెడలో తాళికట్టాడు. పెళ్లైన రెండోరోజే హత్య విషయం బయటపడి కటకటాల పాలయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి భార్గవి - బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని నరేష్‌ ఐదు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. భార్గవి ఆత్మకూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. గతంలో పెట్రోల్‌ బంక్‌లో పనిచేసిన నరేష్‌.. ప్రస్తుతం భార్గవి పనిచేస్తోన్న ఆస్పత్రిలోనే అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరి కులాలు వేరైనా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి గురించి వీరి మధ్య పలుమార్లు ప్రస్తావన వచ్చినా నరేష్‌ వ్యూహాత్మకంగా ఆ విషయం దాటవేస్తూ వస్తున్నాడు. మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని సాకులు చెప్తూ భార్గవిని నమ్మిస్తూ వచ్చాడు.

ఒకవైపు భార్గవితో ప్రేమాయణం సాగిస్తూనే మరోవైపు పెళ్లికి రెడీ అయ్యాడు నరేష్‌. ఈనెల 4నే మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్గవి.. ప్రియుడు నరేష్‌ను నిలదీసింది. తనకూ ఆ పెళ్లి ఇష్టంలేదని.. పెద్దవాళ్లే బలవంతంగా చేస్తున్నారని నమ్మించాడు. వ్యవసాయ బావి వద్దకు వస్తే అన్నీ మాట్లాడుకుందామని... ఆపై యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. నరేష్‌ మాటలు నిజమని నమ్మిన భార్గవి.. పొలం దగ్గరికి వెళ్లింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం భార్గవి తలపై బండరాయితో మోది చంపేశాడు. అనంతరం బావికోసం పూడిక తీసిన మట్టిలో పూడ్చిపెట్టాడు.

భార్గవిని పక్కా ప్లాన్‌తో హత్య చేసిన నరేష్‌.. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్టుగా మరునాడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు తమ కూతురు రెండు రోజులుగా కనిపించకుండా పోవడంతో భార్గవి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వస్తుండడంతో ఆందోళన రెట్టింపు అయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ప్రేమ వ్యవహారంపై కూలీ లాగారు. నరేష్‌ను మొదట ప్రశ్నించగా ప్రేమించిన మాట వాస్తవమేనని.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా అసలు నిజం బయటకు కక్కాడు. తనే భార్గవిని హత్య చేసినట్టు అంగీకరించాడు.

నరేష్‌ ఇచ్చిన సమాచారంతో వ్యవసాయ బావి దగ్గరి భార్గవి మృతదేహాన్ని బయటకు తీశారు. డెడ్‌బాడీని పోస్టుమార్టంకు పంపించి నరేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును కిరాతంగా హత్యచేసిన నరేష్‌ను కఠినంగా శిక్షించాలని భార్గవి తల్లిదండ్రులు కోరుతున్నారు.

07:18 - March 7, 2018

హైదరాబాద్ : ఈసారి, టీఆర్ఎస్‌ ప్లీనరీ.. యువ నాయకత్వానికి జేజేలు పలుకబోతోంది. కేటీఆర్‌ సహా.. కీలక నేతలకు... ఈ ప్లీనరీ.. విశేష బాధ్యతలు అందించబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించడంతో.. ఆయన వారసుడిగా.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఎన్నిక కావడం లాంఛనమే అన్న ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటే.. కవితకూ కీలక భూమిక అప్పజెబుతారని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ జాతీయ రాజ‌కీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో కేసీఆర్‌ వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారు..? పార్టీ బాధ్యతలు ఎవరు చేపడతారు అన్న ప్రశ్నలు తలెత్తాయి. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ కవితల్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారు..? అన్న ఆసక్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే.. వీటన్నింటికీ, వచ్చే నెలలో జరిగే ప్లీనరీ సమాధానమిస్తుందని టీఆర్ఎస్‌ కీలక నేతలు పరోక్ష సంకేతాలిస్తున్నారు.

ఏప్రిల్‌ నెలలో టీఆర్ఎస్‌ ప్లీనరీ నిర్వహించబోతోంది. సీఎం కేసీఆర్‌ తనయుడు కల్వకుంట్ల తారకరామారావు, ఇదే వేదికపై తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ చర్య ద్వారా.. కేటీఆర్‌ పార్టీపైన మరింత గట్టి పట్టు సాధిస్తారని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల నాటికి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో.. కేటీఆర్‌ తన విన్నింగ్‌ టీమ్‌ను ఎంచుకునే వీలుంటుందని చెబుతున్నారు.

రాజకీయంగా పట్టు సాధించే దిశగా.. కేటీఆర్‌ కొంతకాలంగా జిల్లాల పర్యటనల్లో బాగా బిజీగా ఉన్నారు. ఇటీవల గద్వాల, తుంగతుర్తి, వరంగల్‌, కోదాడ పట్టణాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎక్కడికక్కడ విపక్ష కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని పెంచడం.. భావి యువ నాయకత్వాన్ని గుర్తించడం.. లక్ష్యాలుగానే కేటీఆర్‌ ఈ పర్యటనలు చేస్తున్నారని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తనయుడు కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు.. తనయ కవితకూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. కవిత కూడా కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలపైనే మక్కువ చూపుతున్నట్లు చెబుతున్నారు. పైగా కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న నేపథ్యం వల్ల కూడా కవితకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన బాధ్యతలు అప్పగించ వచ్చని తెలుస్తోంది. అయితే.. కేటీఆర్‌, హరీశ్‌రావుల తర్వాతే.. కవితకు బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. 

07:16 - March 7, 2018

విజయవాడ : నిన్నటి దాకా వారంతా కలిసి మెలిసి తిరిగారు. ఒకరి కార్యక్రమంలో మరొకరు పాలుపంచుకునేవారు. ఒకరికి బాధకలిగితే మరొకరి కళ్లలో నీళ్లు సుడులు తిరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరి తీరు ఒకరికి అస్సలు నచ్చడం లేదు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఎవరు వారు? ఏమిటా ఇద్దరు మిత్రుల కథ? 2014 ఎన్నికల్లో వీరి మధ్య పొత్తు పొడిసింది. ప్రజలు వీరి మిత్రబంధానికి జై కొట్టడంతో అధికారం చేపట్టారు. అప్పటి నుంచి వీరి మధ్య మిత్రబంధం కొనసాగుతోంది. ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరయ్యేవారు. కలిసి మెలిసి ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. విశాఖలోనైతే వీరు మరీ దగ్గరయ్యారు.

మిత్రుల మధ్య ప్రత్యేక హోదా అంశం చిచ్చురాజేసింది. హోదా ఉద్యమం హోరు పెరగడంతో వీరి మధ్య దూరం పెరిగింది. విశాఖకు రైల్వేజోన్‌ కావాలని .. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ విశాఖ టీడీపీ అర్బన్‌ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ మెడలు వంచుతూ ప్రదర్శన కూడా నిర్వహించారు. టీడీపీ నిర్వహించిన ఈ ధర్నాలో ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నాయకుడు కూడా పాల్గొన్నారు.

హత్యకేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నాయకుడు ఈ ధర్నాలో పాల్గొనడం కాషాయనేతలకు అస్సలు నచ్చలేదు. దీంతో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. రౌడీలకు అద్దెకు తీసుకొచ్చి టీడీపీ నేతలు ధర్నాలు నిర్వహిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు ఎక్కుపెట్టారు. అంతేకాదు.. టీడీపీ నేతలకు మంచి బుద్ది ప్రసాదించాలని జీవీఎంసీ దగ్గర ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ఎమ్మెల్యే గణేష్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

టీడీపీ నేతలు కూడా బీజేపీ నాయకులపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బీజేపీ నేతలు ఆరోపిస్తున్న వ్యక్తి కోర్టు నుంచి క్లీన్‌చిట్‌ పొందాడనీ స్పష్టం చేశారు. అయినా ప్రత్యేకహోదా అంశం తేల్చకుండా ధర్నాలో పాల్గొన్న ఒకరిని టార్గెట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న పసుపు - కాషాయ మిత్రుల స్నేహబంధానికి బ్రేకులు పడుతున్నాయి. ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. 

07:14 - March 7, 2018

విజయవాడ : కసిగా పనిచేస్తూ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుదామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఢిల్లీ పరిణామాలపై ఆయన టీడీఎల్పీ సమావేశంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు లేవా అని ప్రశ్నించారు. నేడు శాసనసభలో బీజేపీ పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనని తెగేసి చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తుపై ఆయన పార్టీ ప్రజాప్రతినిధులందరి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలం వేచిచూద్దామా.... తెగదెంపులు చేసుకుందామా.. లేక పోరాటం కొనసాగిస్తూ కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుదామా అని ప్రశ్నించారు. దీంతో మెజార్టీ సభ్యులు తెగదెంపులు చేసుకొనేలా తక్షణమే కీలక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టుగా తెలుస్తోంది. కేంద్రం సమస్యను ఇంకా ఎందుకు జఠిలం చేస్తుందో అర్థంకావడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

నరేంద్ర మోదీ ప్రధానిగా తొలిరోజు పార్లమెంట్‌లో అడుగు పెడుతూ నేలకు నమస్కరించిన సందర్భం చూసి తమ రోమాలు నిక్కబొడిచాయని... కానీ ఇప్పుడు రైతులు తమ వద్ద డబ్బున్నా పదివేలు కూడా డ్రా చేసుకోలేని దుస్థితి చూస్తే అందరిలోనూ అసహనం వ్యక్తమవుతోందని తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్న చంద్రబాబు... గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో అన్ని విషయాలు మాట్లాడుతానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీనికి నేతలు స్పందిస్తూ.... కష్టమైనా.. నష్టమైనా అంతా మీవెనకే ఉంటామని సీఎంతో అన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే రక్షణ శాఖ నిధులతో పోలిక తెచ్చి లీకులు ఇవ్వడం ఎంతవరు సమంజసమని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందిగ్దం వద్దని.. ప్రత్యేకహోదానే మన విధానమని నేతలకు ఆయన స్పష్టం చేశారు.

విభజన హామీల కోసం మొదటి నుంచి తీవ్రంగా ప్రయత్నం చేసినట్టు నేతలకు చంద్రబాబు వివరించారు. గొడవలు పెట్టుకుంటే ముందుకెళ్లలేమనే భావనలో ఇన్నాళ్లూ ఓపికపట్టామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం కావాలనేదే మన డిమాండ్‌ అని.. అందుకు నికరండా పోరాడాలని సూచించారు. విభజన చట్టంలోని 19 అంశాలు అప్పటి ప్రధాని ఇచ్చిన 6 హామీలు అమలు కావాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి మరింత ప్రయోజనం కలుగుతుందనే కేంద్రంలో చేరామన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 6 మంత్రిపదవులు ఇస్తామన్నా తీసుకోలేదని.. వాటితో పోలిస్తే ఈ రెండు పదవుల్లో ఏముందని అన్నారు. బలం, బలహీనతలనేవి సమయాన్ని బట్టి మారుతుంటాయన్నారు. 1984లో బీజేపీకి రెండు ఎంపీ సీట్లు ఉంటే... టీడీపీ 35 సీట్లతో జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం సానుకూలంగా ఉంటే తాము ఉంటామని.. లేకుంటే లేదని తేల్చి చెప్పారు.

ప్రత్యేకహోదా కోసం తాను పట్టుబట్టడం లేదన్న విపక్షాల విమర్శలను ఆయన కొట్టిపారేశారు. కేంద్రాన్ని పట్టుబట్టబట్టే నీతి ఆయోగ్‌తో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. తమ కృషితోనే ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించి.. దానికి చట్టబద్దత కల్పించారని అన్నారు. తమ ప్రయత్నంలో ఎక్కడా లోపం లేదని గుర్తు చేశారు. కేంద్ర ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుకోవడం సరైందికాదన్నారు. రాష్ట్ర హక్కులు కాపాడుకోవడంలో రాజీ ఉండబోదని.. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పనిచేద్దామని పిలపునిచ్చారు.

పెరియార్ విగ్రహంపై దాడి...

చెన్నై : తిరుపత్తూర్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో పెరియార్ విగ్రహంపై దుండగులు దాడి నిర్వహించారు. కళ్లద్దాలు ధ్వంసం చేసి పెరిగాయర్ ముక్కు భాగాన్ని ఛిద్రం చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెరియార్ పై ఫేస్ బుక్ లో రాష్ట్ర బీజేపీ నేత వ్యాఖ్యలు చేసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. 

లంక విజయం...

ఢిల్లీ : భారత్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు విజయం సాధించింది. భారత్ 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయగా లంక జట్టు 5 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 

స్వాగత్ హోటల్ లో ఫైర్ ఆక్సిడెంట్...

హైదరాబాద్‌ : ఏఎస్‌ రావు నగర్‌లోని స్వాగత్‌ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. నాల్గవ అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు భయంతో పరుగులు తీశారు. భారీ పొగలు వ్యాపించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ హోటల్‌ భవనంలోనే రిలయన్స్‌ డిజిటల్‌ షాపు ఉంది. భారీ ఆస్తి నష్టం జరిగింది. 

పార్లమెంట్ లో థర్డ్ డే...

ఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా సభా కార్యకలాపాలను సభ్యులు ఆందోళన చేపడుతుండడంతో వాయిదా పడుతూ వస్తోంది. రెండో రోజు కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. ఏపికి ప్రత్యేక హోదాపై పట్టుబడుతూ టిడిపి, వైసిపిలు పార్లమెంట్‌ ఉభయ సభలను స్తంభింపజేశాయి. నీరవ్‌మోది స్కాం, త్రిపురలో హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

మావోయిస్టు సుప్రీం కమాండర్‌ అనారోగ్యం...

హైదరాబాద్ : మావోయిస్టు సుప్రీం కమాండర్‌ ముప్పల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. గణపతి నడవలేని పరిస్థితి ఉండడంతో ఆ బాధ్యతలను సెంట్రల్‌ మిలటరీ కమిషన్ కార్యదర్శి నంబాలా కేశవరావుకు అప్పగించారు. నంబాల కేశవరావు అలియాస్ గంగన్న పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఇందుకోసం మావో అగ్రనేతలు త్వరలో సమావేశం కానున్నారు.

మేఘాలయా సీఎంగా...

ఢిల్లీ : మేఘాలయా నూతన ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమంలో కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీఏ సంగ్మా కుమారుడైన కాన్రాడ్‌ సంగ్మా మేఘాలయాకు 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు వాయిదా..

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ కార్తీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. సిబిఐ, ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు... ఈ కేసులో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. 

లంకలో అత్యవర పరిస్థితి...

ఢిల్లీ : శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత ఘర్షణల నేపథ్యంలో పది రోజుల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు వెల్లడించింది. శ్రీలంకలోని కాండీ జిల్లాలో బౌద్ధులు, ముస్లింల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అల్లర్లలో ఇద్దరు మరణించారు.

 

Don't Miss