Activities calendar

08 March 2018

22:11 - March 8, 2018
22:02 - March 8, 2018

అమరావతి : లక్షా 91 వేల 63 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం లక్షా 50 వేల 270 కోట్లు కాగా.. మూలధన వ్యయం 28 వేల 678 కోట్లు. ఆర్థిక లోటును 24 వేల 205 కోట్లుగా అంచనా వేశారు. గతంలో పోలిస్తే 21.70శాతం బడ్జెట్‌ పెరిగింది.

1 లక్షా 91 వేల 63 కోట్ల బడ్జెట్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను.. 1 లక్షా 91 వేల 63 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం చేశారు. రెవెన్యూ వ్యయం 1 లక్షా 50 వేల 270కోట్లు కాగా.. మూలధన వ్యయం.. 28 వేల 678కోట్లు. ఆర్థిక లోటును 24 వేల 205 కోట్లుగా అంచనా వేశారు. గతంలో పోలిస్తే 21.70శాతం బడ్జెట్‌ పెరిగినట్లు యనమల తెలిపారు.

రెండంకెల వృద్ధి
రాష్ట్ర పునర్నిర్మాణానికి సాయం అందడం లేదని.. విభజనలో ఆదాయాన్ని, రాజధానిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిందని యనమల అన్నారు. అసంబద్దంగా జరిగిన విభజన వల్లే రాష్ట్రానికి సమస్యలు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక పోవడం సమస్యను రెట్టింపు చేసిందన్నారు. మూడేళ్లలో జాతీయ సగటు వృద్ధి 7.30 శాతంతో పోలిస్తే.. రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందని చెప్పారు.

వ్యవసాయ రంగానికి 12 వేల 352కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 12 వేల 352కోట్లు కేటాయించారు. ఇది గతంలో పోలిస్తే 35.91 శాతం అదనం. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని యనమల అన్నారు. ఇందుకు కర్నూలు జిల్లాలోని మెగా సీడ్‌ పార్క్‌కు 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైతు రుణమాఫీకి 4 వేల 100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

సాగునీటి రంగానికి 16 వేల 978 కోట్లు
సాగునీటి రంగానికి 16 వేల 978 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 20 వేల 815కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు. అలాగే.. ఇంధన రంగానికి 5 వేల 52కోట్లు, పరిశ్రమల శాఖకు 3 వేల 74కోట్లు, రవాణా శాఖకు 4 వేల 653కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణ శాఖకు 3 వేల 679కోట్లు కేటాయించిన యనమల.. 2020 నాటికి పట్టణ ప్రాంతాల్లో ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేదే లక్ష్యమన్నారు. ఇళ్ల స్థలాల సేకరణకు 575 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సాధారణ సేవల కోసం 56 వేల 113 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టుకు 9 వేల కోట్లను బడ్జెట్‌లో చేర్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు యనమల.

విద్యా రంగానికి 24 వేల 185కోట్లు
విద్యా రంగానికి 24 వేల 185కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు 100కోట్లు, బీసీలకు 100కోట్లు కేటాయిస్తున్నట్లు యనమల తెలిపారు. సామాజిక భద్రత కోసం 3 వేల 29కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు బోధన ఫీజు కోసం 700కోట్లు, కాపు సామాజిక విద్యార్థులకు 400కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 4 వేల 477కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి 12 వేల 200కోట్లు, కాపుల సంక్షేమానికి వెయ్యి కోట్లు , వైశ్యుల సంక్షేమం కోసం 30కోట్లు, మేదరుల సంక్షేమానికి 30కోట్లు, నాయీ బ్రాహ్మణుల కోసం 30కోట్లు, కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం 70కోట్లు కేటాయించారు. చేతివృత్తులకు ఆదరణ పథకానికి గాను 750 కోట్లు బడ్జెట్‌లో పొందుపర్చారు. చేనేతలను ప్రోత్సహించేందుకు జనతా వస్త్రాల పథకం కింద 250కోట్లు కేటాయించారు.

హోంశాఖకు 6 వేల 226కోట్లు
హోంశాఖకు 6 వేల 226కోట్లు, పర్యాటక శాఖకు 290కోట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం కోసం 2 వేల 623కోట్లు కేటాయించారు. ఫైబర్‌ గ్రిడ్‌ కోసం 600కోట్లు, అన్నా క్యాంటీన్ల కోసం 200కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు. పౌష్టకాహార లోపం నియంత్రణకు 360కోట్లు కేటాయించారు. హిజ్రాల సంక్షేమానికి 20కోట్లు బడ్జెట్‌లో పెట్టారు. తమ ప్రభుత్వం వైద్య-ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్న యనమల.. ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవకు 1000కోట్లు కేటాయించారు. మొత్తంగా వైద్య ఆరోగ్యానికి 8 వేల 463 కోట్లు కేటాయించారు.న్యాయశాఖకు 886కోట్లు, నిరుద్యోగ భృతికి వెయ్యి కోట్లు, ఎన్టీఆర్‌ ఫించన్లకు 5 వేల కోట్లు కేటాయించారు. ప్రజల రాజధాని అయిన అమరావతి అభివృద్ధికి గత ఏడాది కంటే 49 శాతం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి యనమల తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో 7,741 కోట్లు కేటాయించారు. మొత్తంగా ప్రధాన ప్రతిపక్షం లేకుండానే.. లక్షా 91 వేల 63 కోట్లతో రాష్ట్ర బడ్డెట్‌ ప్రతిపాదనలను అసెంబ్లీలో యనమల ప్రవేశపెట్టారు.   

21:57 - March 8, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం ఢిల్లీలో నాల్గవ రోజు కూడా కొనసాగింది. హోదా సాధ్యంకాదని కేంద్రం తేల్చి చెప్పిన తర్వాత వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించిన వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులను పోలీసు అరెస్టు చేశారు. మరో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటు భవన్‌ వద్ద వైసీపీ, టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. look.

హోదా హోరు
ప్రత్యేక హోదా కోసం ఏపీ రాజకీయ నాయకులు చేసిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. హోదా పోరుతో పార్లమెంటు స్ట్రీట్‌ హోరెత్తింది. వామపక్షాల అర్ధనగ్న ప్రదర్శన, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల పార్లమెంటు ముట్టడి కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారితీసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వామపక్షాలు నిర్వహించిన అర్ధనగ్న ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. భద్రత వలయాన్ని ఛేదించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన లెఫ్ట్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పార్లమెంటు ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

పార్లమెంటు భవన్‌ వద్ద టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళన :
మరోవైపు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు భవన్‌ వద్ద టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు, మెయిన్‌ గేట్‌ వద్ద వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తుండగా... ఇటువైపు వచ్చిన తెలుగుదేశం జేసీ దివాకర్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. తామంతా రాజీనామాలకు సిద్ధమని, దమ్ముంటే మీరు కూడా రాజీనామాలు చేయాలని జేసీ సవాల్‌ విసిరారు. ఇందుకు వైసీపీ ఎంపీలు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో జేసీ మీసం మెలేసి, తొడకొట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ ఎంపీలు విమర్శించారు. మరోవైపు ముస్లిం మైనారిటీలు, ఎస్టీ రిజర్వేషన్ల పెంచాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు భవన్‌ వద్ద ఆందోళన చేశారు. 

21:53 - March 8, 2018

విజయవాడ : ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలతో కలిసిపోరాడే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. కేంద్రం చేసిన మోసంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రుల రాజీనామాతో సరిపెట్టకుండా, ఎన్డీయే నుంచి కూడా బయటకు రావావాలని మధు డిమాండ్‌ చేశారు. 

21:51 - March 8, 2018

ప్రకాశం : కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలగడంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజల ఒత్తడితోనే చంద్రబాబు రాజీనామాల నిర్ణయం తీసుకున్నారన్నారు. జైట్లీ ప్రకటన ఇవాళ కొత్తదేం కాదని.. గత సెప్టెంబర్‌లో ఇవే విషయాలు చెప్పారన్నారు. అప్పుడు చంద్రబాబు గొప్పగా స్పందించారని.. వెంకయ్య, జైట్లీలకు సన్మానాలు చేశారన్నారు. అంతేగాక ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే గొప్పదన్నట్టు మాట్లాడారన్నారు. ఇవాళ కూడా అరుణ్ జైట్లీ అవే మాట్లాడితే... కొత్తగా మాట్లాడినట్టు చంద్రబాబు అతిగా స్పందించారన్నారు. ఇవాళ యూ టర్న్ తీసుకుని కేబినెట్ పదవులకు రాజీనామా చేశారన్నారు. దీనికి ఒకటే కారణమని.. ప్రజల వల్లే చంద్రబాబు వెనకడుగు వేశారన్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యానే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారన్నారు. తాము కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్నామని.. చంద్రబాబు మద్దతిస్తారా ? అని జగన్‌ ప్రశ్నించారు. ఒకవేళ చంద్రబాబు అవిశ్వాసం పెడితే తాము మద్దతిస్తామన్నారు. పార్లమెంట్‌ సమావేశాల చివరిరోజున ఎంపీలు రాజీనామా చేస్తారని... చంద్రబాబు కోరితే అంతకన్నా ముందే రాజీనామాలు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు జగన్‌. 

21:47 - March 8, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నుంచి కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు వైదొలిగారు. ఉదయం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో చంద్రబాబును కలిసి ఇరువురు నేతలు రాజీనామా లేఖలను ఆయనకు అందజేశారు. నాలుగేళ్ల కాలంలో ఇద్దరూ సమర్థంగా పనిచేశారని వారిని చంద్రబాబు అభినందించారు. అసెంబ్లీలోనూ కామినేని, మాణిక్యాలరావు తమ రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు.

ఏపీలో శరవేగంగా మారిన రాజకీయాలు :
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలుగుతున్నామని టీడీపీ ప్రకటించడంతో.. ఇటు ఏపీ కేబినెట్‌లో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాల రావు తమ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం కార్యాలయంలో చంద్రబాబును కలిసి రాజీనామా లేఖలను అందించారు. అంతకుముందు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో కూర్చుని ఉండగా టీడీపీ మంత్రులు వారిని కలిశారు. పదవుల నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా ఉందా? అని ప్రశ్నించగా... రాజకీయాల్లో ప్రవేశంతో పాటు నిష్క్రమణ కూడా గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామినేని చెప్పారు.

రాజీనామా అంశాన్ని ప్రస్తావించిన కామినేని
అనంతరం శాసనసభలో రాజీనామా అంశాన్ని కామినేని ప్రస్తావించారు. మంత్రిగా మూడున్నరేళ్ల పదవీకాలం తనకు పూర్తి సంతృప్తి ఇచ్చిందని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీఎం చంద్రబాబు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చారని.. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించగలిగానన్నారు. తన జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. మూడున్నరేళ్లలో తనపై ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. రాజకీయ కారణాలతో కొందరు తనపై బురద జల్లేందుకు ప్రయత్నించారని.. అవన్నీ నేను పట్టించుకోనని కామినేని చెప్పారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా : మానిక్యాల రావు
మంత్రి పదవికి తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా చేయాల్సి వస్తోందని పైడికొండల మాణిక్యాలరావు అసెంబ్లీలో అన్నారు. మూడున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన శాఖలో ఏనాడూ జోక్యం చేసుకోలేదన్నారు. తాడేపల్లిగూడెంలో తన గెలుపునకు టీడీపీ శ్రేణులు ఎంతో కృషి చేశాయన్నారు. ఏపీ అభివృద్ధి చెందుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్ధత, కేంద్రం సహకారం వల్లే సాధ్యమైందని మాణిక్యాలరావు అన్నారు.

నాలుగేళ్ల పాటు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు : చంద్రబాబు
మంత్రి పదవులకు రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు నాలుగేళ్ల పాటు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రం విభజించిన దానికంటే విభజించిన తీరే ఆంధ్రులను తీవ్రంగా బాధించిందన్నారు. విభజన జరిగిన సమయంలో పెట్టిన బిల్లులోని అంశాలు, తర్వాత రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పిన తర్వాతే బీజేపీతో పొత్తు పెట్టుకుమని.. ఇప్పుడేమో నిబంధనలు అడ్డొస్తున్నాయని చెబుతున్నారన్నారు. జాతీయ పార్టీగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ప్రజలకు జాతీయపార్టీలపై నమ్మకం పోతుందని చంద్రబాబు అన్నారు.

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు: 
మహిళా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక యుగంలో అవకాశం వస్తే ఆకాశమే హద్దుగా మహిళలు ముందుకెళ్తున్నారన్నారు. టీడీపీ మొదటి నుండి మహిళలకు అనేక విధాలుగా సహకరిస్తూ వస్తోందని అన్నారు.

21:41 - March 8, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి నిరసన అంటూ.. టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి సాయంత్రం ప్రధానిని కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు.

కేంద్ర పభుత్వ వైఖరికి నిరసనగా మంత్రుల రాజీనామా:
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర పభుత్వ వైఖరికి నిరసన తెలుపుతూ.. టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలిగారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి పదవులకు రాజీనామా చేశారు. ఉదయమే ఇద్దరు మంత్రులూ రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినా.. ప్రధాని మోదీ.. రాజస్థాన్‌ పర్యటనలో ఉండడంతో.. ప్రక్రియ ఆలస్యమైంది. ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటన ముగించుకుని సాయంత్రం రాగానే.. ఇద్దరు మంత్రులూ ఆయన్ను కలిసి రాజీనామా లేఖలు అందచేశారు.

ప్రధాని మోదీకి రాజీనామాలు :
రాజీనామాలు సమర్పించడానికి ముందు.. సుజనాచౌదరి ఇంటికి వెళ్లిన అశోక్‌గజపతిరాజు... ఆయనతో కలిసి కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఇద్దరూ కూడా ప్రభుత్వం సమకూర్చిన వాహనాలను పక్కనపెట్టి, ప్రైవేటు కార్లలో ప్రధాని నివాసానికి వెళ్లారు. మోదీతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత రాజీనామా లేఖలు అందజేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతోపాటు రాజీనామాలకు దారితీసిన కారణాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏ పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో అశోక్‌గజపతి, సుజన ప్రధానికి వివరించారు.

ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న తర్వాత ఫోన్‌ చేసి చంద్రబాబుతో మాట్లాడినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మోదీ, చంద్రబాబులిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. కేంద్ర మంత్రివర్గం నుంచి ఇద్దరు టీడీపీ మంత్రుల రాజీనామాకు దారితీసిన కారణాలను చంద్రబాబు వివరించినట్లు ప్రచారం జరుగుతోంది.  

భవనంపై నుండి దూకి విద్యార్ధినిలు ఆత్మహత్య!..

హైదరాబాద్: సరూర్‌నగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. టీఎన్ఆర్ అపార్ట్‌మెంట్ నుంచి ఇద్దరు టెన్త్ విద్యార్థినులు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎనిమిదో అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు భార్గవిపటేల్, శ్రావణిగా గుర్తించారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

కూర్చుని మాట్లాడదామని ప్రధాని అన్నారు : బాబు

అమరావతి : అందుబాటులో వున్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధాని తనతో ఫోన్ లో మాట్లాడిన అంశాలపై మంత్రులకు తెలిపారు. అన్ని విషయాలను ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందామని ప్రధాని అన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతవరకూ వచ్చిన తరువాత ప్రధాని పిలిచినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ఇది మనం మాత్రమే తీసుకున్న నిర్ణయం కాదని ప్రజల సెంటిమెంట్ ను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా వెనక్కి తగ్గలేమనీ.. కూర్చుని మాట్లాడే పరిస్థితి దాటిపోయిందని ప్రధానితో తాను మాట్లాడానని సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించారు. 

20:42 - March 8, 2018

హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అత్యంత భారంగా తయారైన డిజిటల్‌ ప్రొవైడర్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు ప్రదర్శనలను నిలిపివేశాయి. దీంతో సినీ అభిమానులు నిరాశపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడ పడ్డాయి. దీనికి కారణమేమిటి? దీనిపై సినిమా పరిశ్రమ డిమాండ్స్ ఏమిటి? తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? బంద్ వల్ల సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం వుందా? అనే అంశాలపై ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో 10టీవీ ప్రత్యేక చర్చ..

20:29 - March 8, 2018

హైదరాబాద్ : మహిళలతో అంత్యాక్షరి ఆడించిన మల్లన్న..భారత రాజ్యాంగ కర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడుకున్న అమెరికా పార్లమెంట్, చొప్పదండి ఎమ్మెల్యే శోభక్క పెనిమిటి. మరి గిసువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న తాతా మోసుకొచ్చిండు..మీరు కూడా మస్తుగా ఖుషి అవ్వాలంటే మన మల్లన్న ముచ్చట్లు చూడాల్సింది. మరి జాగెందుకు చూడుండ్రి మల్ల..

మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు..

అమరావతి : అందుబాటులో వున్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్ లో మాట్లాడిన అంశాలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు హాజరయ్యారు. 

20:00 - March 8, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్ల బడ్జెట్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. విభజనలో ఆదాయాన్ని, రాజధానిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిందన్నారు. అసమజసంగా జరిగిన విభజన వల్లే రాష్ట్రానికి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన వివిధ అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో ప్రముఖ విశ్లేషకులు తులసీరాం,  పట్టాబిరాం (టీడీపీ) కిలారి రోశయ్య (వైసీపీ) ఈ అంశంపై మరింత సమాచారం కోసం వీడియోను క్లిక్ చేయండి..

19:17 - March 8, 2018
19:15 - March 8, 2018
19:06 - March 8, 2018

ఢిల్లీ : సమస్యల పరిష్కారం కోసం మా శాయశక్తులా ప్రయత్నించామని అయినా ఫలితం లేకపోయిందని టీడీపీ మంత్రి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తెలిపారు. ఒక జాతీయ పార్టీ ద్రోహం చేస్తే, మరో జాతీయ పార్టీ మోసం చేసిందని పేర్కొన్నారు. జాతీయ రాష్ట్ర ప్రయోజనాల మేరకు తమ నాయకుడు ఆదేశాల మేరకు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశామన్నారు. ప్రధాని మోదీకి రాజీనామాలు సమర్పించిన అనంతరం టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ నాయకుడు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని తెలిపారు. మరికొద్ది సేపట్లో తమ రాజీనామాలను ఆమోదం పొందుతాయన్నారు. విభజన చట్టాలలోని అంశాలను అమలు చేయాలని ప్రధానికి కోరామన్నారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర కేబినెట్ లో తమకు మంత్రులుగా అవకాశమిచ్చినందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఏపీకి అండగా వుంటామని ప్రధాని తెలిపారని తెలిపారు. మంత్రి పదవులకు రాజీనామా చేసినా ఎన్డీయేలో కొనసాగుతున్నామన్నారు. ఏపీలో ఎటువంటి సమస్యలున్నాయనేది ప్రధానికి తెలుసని ఆ సమస్యలను పరిష్కరించాలని..ఏది ఏమైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

19:01 - March 8, 2018
18:38 - March 8, 2018
18:26 - March 8, 2018

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం నుంచి తమ ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఈ ఉదయం నుంచి రాజీనామా పత్రాలతో ప్రధానిని కలిసేందుకు వేచిచూసిన కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోక్‌గజపతి రాజుకు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్‌ లభించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. దాంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులను, తాము రాజీనామాలు చేసేందుకు దారితీసిన పరిస్థితులను వివరించారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి వర్గం నుండి టీడీపీ విడిపోవాల్సిన అంశాలపై ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో దాదాపు 10 నిమిషాల పాటు సంభాషించారు. దానికి సంబంధించిన అన్ని అంశాలను చంద్రబాబు మోదీకి వివరించారు. కాగా ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కేంద్రం అలంభిస్తున్న తీరుపై అసంతృప్తితో వున్న టీడీపీ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర సహాయ సహకారాలు సరైన తీరులో లేనందున తీవ్ర అంసతృప్తితో వుంది. దీనిపై తరచు కేంద్రంతో తమ గోడు విన్నవించుకుంటున్నా రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం వ్యవహరిస్తున్న నిర్లక్ష వైఖరిని సుదీర్ఘకాలం పాటు భరించిన చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు బీజేపీతో తన పొత్తును తెగతెంపులు చేసుకుంది. 

సుజనా, గజపతిరాజుల రాజీనామా..

ఢిల్లీ : టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు తమ కేంద్రమంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. ఈ అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఎటువంటి పరిస్థితుల్లో రాజీనామాలు చేయాల్సి వచ్చిందో ప్రధానికి చంద్రబాబు వివరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చని క్రమంలో ఎట్టకేలకు కేంద్రంతో తన పొత్తును కట్ చేసుకుంది.  

17:55 - March 8, 2018

నిజామాబాద్ : నిరుపేద కుటుంబంలో పుట్టిన ఓ యువతి క్రమశిక్షణ, అలుపెరగని శ్రమతో క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యెండల సౌందర్య ఆర్థిక కష్టాలను లెక్కచేయకుండా... అకుంఠిత దీక్షతో జాతీయ స్థాయి హాకీ క్రీడాకారణిగా ఎదిగి...భారత హాకీ జట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించి ఎన్నో రికార్డులు సృష్టించింది. మహిళా దినోత్సవం సందర్భంగా దేశం గర్వించదగ్గ హాకీ క్రీడాకారిణిపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం

దేశం గర్వించే స్థాయికి ఎదిగిన యువతి :

ఆడవారు సాధించలేనిది ఏదీ లేదన్న విషయాన్ని నిజామాబాద్‌ నగరానికి చెందిన హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య మరో సారి రుజువు చేసింది. తండ్రి వ్యవసాయ కూలీ.. తల్లి బీడీలు చుడుతుంది.. నిరుపేదల కుటుంబాల్లో ఉండే అన్నిరకాల ఇబ్బుందులూ వీరింట్లోనూ ఉండేవి... ఐనా వాటన్నింటినీ అధిగమించి దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఎదిగింది.. ఎందరో యువతులకు ఆదర్శంగా నిలిచింది. జాతీయ మహిళా హాకీ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా సారథ్యం వహించింది. అంతేకాదు.. ఎన్నో అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుతమైన ఆటతీరుతో దేశానికి విజయాలు అందించింది.

98 అంతర్జాతీయ మ్యాచ్ లు, 26 అంతర్జాతీయ టోర్నమెంట్లలో అడిన సౌందర్య

సౌందర్య ఇప్పటి వరకు 98 అంతర్జాతీయ మ్యాచ్ లు, 26 అంతర్జాతీయ టోర్నమెంట్లలో అడారు. అలాగే జూనియర్, సీనియర్, వరల్డ్ కప్స్ ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీలో కూడా పాల్గొన్నారు. 2012 ఒలింపిక్స్ లో భారత్ క్వాలిఫైడ్ కావడానికి సౌందర్య చేసిన నాలుగు గోల్సే కారణం. 2011లో న్యూజిలాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా మొదటి సారి ఎంపికై జట్టును విజయ పథంలో నడిపించింది. 2000 సంవత్సరం నుంచి 2006 వరకు 16 సార్లు జాతీయ ఛాంపియన్ షిప్ లో ప్రాతినిథ్యం వహించింది. 2006 నుంచి 2008 వరకు వరుసగా మూడు సార్లు స్వర్ణ పతకాలు సాదించింది. 2006 జపాన్ లో జరిగిన అంతర్జాతీయ హాకీ సిరీస్ లో స్వర్ణ పతకం సాదించింది. 2007 లో మలేషియాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో రజత, కాంస్య పతకాలను సాదించింది. 2009లో అమెరికా సీనియర్ కప్ 2010లో అర్జైంటైనాలో సీనియర్ ప్రపంచకప్‌లో దేశం తరపున ప్రాతినిథ్యం వహించింది. 2010 కొరియలో జరిగిన ఛాంపియన్ కాంస్య పతకం సాదించింది. 2012 లో ఢిల్లీలో జరిగిన ఒలింపిక్‌లో రజత పతకం సాదించి ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. 2013లో మలేషియా సీనియర్ కప్‌లో కాంస్యం 2013 లో జపాన్‌లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో రజతం కైవసం చేసుకుంది.

ఇబ్బందులు ఎదురైనా.. మొక్కవోని దీక్ష :

తాము వద్దన్నా వినకుండా హాకీ ప్రాక్టీస్‌ చేసి.. దూరప్రాంతాలకు వెళ్ళి పోటీల్లో పాల్గొనిందని సౌందర్య తల్లి లక్ష్మీ చెబుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగి.. విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్నప్పటి నుంచి క్రీడలంటే ప్రాణమని... అలాంటి సౌందర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు వ్యాపింప చేసిన ఘనత సౌందర్యదేనని ఆ కాలనీ వాసులు తెలిపారు.

కేసీఆర్‌ సీఎం అయ్యాకే తగిన గుర్తింపు...

పేదకుటుంబంలో పుట్టిన తనకు గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభింలేదని... కానీ... కేసీఆర్‌ సీఎం అయ్యాకే తనకు తగిన గుర్తింపు... ఆర్థిక ప్రోత్సాహం లభించిందని సౌందర్య చెబుతోంది. తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కృతజ్ఞతలు తెలుపుతోంది.అన్ని సౌకర్యాలు ఉన్నవారు ఏ దైనా సాధించగలరు కానీ... నిరుపేద కుటుంబంలో పుట్టిన మహిళలు దేశం గర్వించే స్థాయికి చేరడమంటే మాటలు చెప్పినంత తేలిక కాదు... అహర్నిశలు శ్రమించి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా కీర్తి పొందిన సౌందర్య లాంటి మగువలను చూస్తే ... ఎవరైనా సరే ... ఆడాళ్ళూ మీకు జోహార్లు అనాల్సిందే...

ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ పై కేసు నమోదు..

హైదరాబాద్ : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ పై నగరంలోను మలక్ పేటలో ఫయాజ్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. వివాదాస్పద బాబ్రి మసీదుపై రవిశంక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

బాబుకు మోదీ ఫోన్ ..

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలపై సుమారు 10 నిమిషాల పాటు ఆయన చంద్రబాబుతో మాట్లాడినట్టు సమాచారం. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చకపోవడంతో కేంద్ర కేబినెట్‌లో ఉన్న తమ ఇద్దరి మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్లు తెదేపా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఉదయం రాజస్థాన్‌లో భేటీ పడావో- భేటీ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ ఈ సాయంత్రం 4.30గంటలకు తన నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు ఫోన్‌చేసి మాట్లాడినట్టు సమాచారం.

17:38 - March 8, 2018

చిత్తూరు : అన్నింటా సగమై వ్యవహరిస్తున్న అతివలకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఏపీలో మహిళా రైల్వే స్టేషన్ ఏర్పాటుకు పూనుకుంది రైల్వే శాఖ. మొత్తం మహిళా ఉద్యోగినులే ఇక్కడ విధులు నిర్వర్తిస్తారు. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి రైల్వే స్టేషన్. మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రగిరి మహిళా రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజున తమకు అటువంటి అవకాశం కలిగించటం గర్వంగా వుందన్నారు.

17:34 - March 8, 2018

విజయవాడ : మహిళా దినోత్సవం సందర్భంగా తమ హక్కుల సాధనకై విజయవాడలో ఆశా వర్కర్లు కదం తొక్కారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, నెలకు 6 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అలంకార్ ధర్నా చౌక్ వరకు వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. గత కొన్నేళ్ళుగా ప్రభుత్వాన్ని అనేక రకాలుగా తమ వేతనాలు పెంచమని మొర పెట్టుకుంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదని... చంద్రబాబు మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఆశావర్కర్ల భారీ ర్యాలీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహా అందిస్తారు..

17:31 - March 8, 2018

కర్నూలు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కర్నూలులో మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా... కర్నూలులో బంగి అనంతయ్య స్ర్తీ వేషధారణతో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని లేదంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. ఆంధ్రుల నిరసనలు ప్రధాని చెవికెక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయి ఏపీ ఇబ్బందులు పడుతోందంటున్న మాజీ మేయర్ బంగి అనంతయ్య పరిస్థితులకు అద్దంపట్టేలా వేషధారణలతో ప్రజల్లో చైతన్యం కలుగుజేయటం అనంతయ్య స్టైల్ అనే విషయం తెలిసిందే. 

17:24 - March 8, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ శత్రువు కాదు మిత్రువు అన్నారు మంత్రి మాణిక్యాలరావు. ఏపీ అభివృద్ధి చెందుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్ధత, కేంద్రం సహకారం వల్లే సాధ్యమైందన్నారు. కేంద్రాన్ని రాష్ట్ర ప్రజలు త్వరలోనే అర్థం చేసుకుంటారన్నారు. కేంద్రం నుండి నిధులు తెచ్చే విషయంలోనే కాదు ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు మాణిక్యాలరావు. 

17:20 - March 8, 2018

అమరావతి : మూడున్నరేళ్లు మంత్రి పదవిలో చంద్రబాబు కూడా చాలా సపోర్ట్‌ చేశారన్నారు మంత్రి పదవి చాలా సంతృప్తినిచ్చిందన్నారు కామినేని శ్రీనివాస్‌. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాన కారణమని... కామినేని. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడడలేదని... కొంతమంది కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కొన్ని కారణాలతో మంత్రి పదవికి రాజీనామా చేశామని... దానిని సీఎం అంగీకరించాలని కోరారు కామినేని. కాగా ఏపీ మంత్రివర్గం నుంచి బీజేపీ మంత్రులు వైదొలిగారు. బీజేపీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు సీఎం చంద్రబాబును కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. 

17:16 - March 8, 2018

అమరావతి : ఏపీ బడ్జెట్‌లో లెక్కలన్నీ అవాస్తవాలేనని, నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గతంలో మాదిరిగానే బడ్జెట్‌లో గొప్పలు చెప్పారు తప్ప, లెక్కలు వాస్తవ దూరం అన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే.. వృద్ధిరేటు రెండంకెలు దాటిందని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన రుణమాఫీ నిధులు.. ఏ మేరకు సరిపోతాయని బుగ్గన ప్రశ్నించారు. 

17:14 - March 8, 2018

ఢిల్లీ : ప్రస్తుతం ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలు అంశాలపై దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. విభజన హామీలను నెరవేర్చాలంటు నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రంతో వున్న పొత్తును ఏపీ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో తాజా పరిణామాలపై దాదాపు 10 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఋ క్రమంలో నే కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్న సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు తమ రాజీనామా లేఖలను సిద్ధపరుచుకున్నారు. ప్రధాని మోదీని కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా వున్నారు. కాగా ప్రధాని రాజస్థాన్ పర్యటనలో వున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ చేరుకున్న మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే నేరుగా రాజీనామా పత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా వున్నారు. 

బీజేపీతో టీడీపీ కట్!..

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీ రాక్ష విభజన హామీల విషయంలో కేంద్రం అవలంభిస్తున్న తీరుకు తీవ్రంగా భంగపడింది. దీంతో కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్న సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు తమ రాజీనామా లేఖలను సిద్ధపరుచుకున్నారు. ప్రధాని మోదీని కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా వున్నారు. కాగా ప్రధాని రాజస్థాన్ పర్యటనలో వున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ చేరుకున్న మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే నేరుగా రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు. 

16:44 - March 8, 2018

ఢిల్లీ : ఎట్టకేలకూ కమలంతో టీడీపీ అన్ని విధాల తెగతెంపులు తీసుకునేందుకు సిద్ధపడుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీ రాక్ష విభజన హామీల విషయంలో కేంద్రం అవలంభిస్తున్న తీరుకు తీవ్రంగా భంగపడింది. దీంతో కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్న సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు తమ రాజీనామా లేఖలను సిద్ధపరుచుకున్నారు. ప్రధాని మోదీని కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా వున్నారు. కాగా ప్రధాని రాజస్థాన్ పర్యటనలో వున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ చేరుకున్న మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే నేరుగా రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు. కాని పక్షంలో కేబినెట్ సెక్రటరీని కలిసి రాజీనామాలు ఇచ్చే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఏపీ కేబినెట్ లో మంత్రులుగా వున్న కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

మెడికల్ పీజీ స్టూడెంట్స్ కు శుభవార్త!..

హైదరాబాద్ : పీజీ పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పీజీ పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులు కచ్చితంగా ఏడాదిపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలనే నిబంధన తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఈ నిర్ణయం ఏడాది నుంచే అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయకున్నా వారి విద్యార్హతలను రిజిస్టర్ చేయాలన్నారు.

16:04 - March 8, 2018

అమరావతి : ఏపీ విభజన హామీలు నెరవేర్చే క్రమంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. బీజేపీ వ్యవహారంపై ఆవేదన వ్యక్తంచేసిన బాబు మాట్లాడుతు..జాతీయపార్టీలపై నమ్మకం పోతుందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు.. నాలుగేళ్ల పాటు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం విభజించిన దానికంటే విభజించిన తీరే ఆంధ్రులను తీవ్రంగా బాధించిందన్నారు. ఆనాడు విభజనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై భాజపా ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. విభజన జరిగిన సమయంలో పెట్టిన బిల్లులోని అంశాలు, తర్వాత రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పిన తర్వాతే భాజపాతో పొత్తు పెట్టుకుమని.. ఇప్పుడేమో నిబంధనలు అడ్డొస్తున్నాయని కథలు చెబుతున్నారన్నారు. జాతీయ పార్టీగా భాజపా వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. 

15:57 - March 8, 2018
15:51 - March 8, 2018

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాష్ట్ర శాసన సభలో రిజర్వేషన్ల అంశాన్ని పెట్టి, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తీర్మానం చేశామని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. ఈ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదంతో రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రతుల్ని పంపినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో నిరసన చేపట్టామన్నారు. 

15:48 - March 8, 2018

ఢిల్లీ : రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. రాష్ట్రానికి రావాల్సిన దాని కోసం మూడున్నర సంవత్సరాలుగా కేంద్రంతో ఉండి అన్ని రకాలుగా ప్రయత్నించామన్నారు. దశల వారిగా హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కేంద్రం పట్టించుకోకపోవడం వల్లే కేంద్రం నుండి బయటకు వచ్చామన్నారు. తీవ్ర అన్యాయానికి గురైన ఏపీని అన్ని రాష్ట్రాలతో ఏపీని కేంద్రం సమానంగా చూస్తోందన్నారు. 

15:43 - March 8, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తుండగా.. పార్లమెంటు ముఖద్వారం వద్ద వైసీపీ ఎంపీలో ప్లకార్డులు పట్టుకుని నిల్చున్నారు. వైసీపీ ఎంపీలను గమనించి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లి నిన్న నువ్వు మాట్లాడింది ఏంటయ్యా.. నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. మేము కూడా రాజీనామా చేస్తాం. మళ్లీ పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు దమ్ముందా అంటూ మీసం మెలేసి తొడకొట్టి సవాల్ విసిరారు. తాము కూడా రాజీనామాకు సిద్ధమేనని వైసీపీ ఎంపీలు కూడా ప్రతి సవాల్ చేశారు. ఆ సమయంలో ఎంపీలు కొట్టుకొంటున్నారేమో అన్నట్లు వాతావరణం ఉండడంతో పార్లమెంటు సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే కొద్ది సేపటికే పరిస్థితి సద్దుమణిగి ఇరు పార్టీల ఎంపీలు పార్లమెంటులోకి వెళ్లి వెల్‌లో తమ నిరసన తెలియజేశారు.

మా వాటా మాకివ్వవంటున్న మహిళా ఎంపీలు..

ఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మహిళా ఎంపీలు రాజ్య‌స‌భ‌లో మాట్లాడారు. పార్ల‌మెంట్‌తో పాటు అసెంబ్లీల్లోనూ మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఎంపీలంతా డిమాండ్ చేశారు. గ‌తంలో మ‌హిళా బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. కానీ ఆ బిల్లుకు ఇంకా లోక్‌స‌భ‌లో ఆమోదం ద‌క్క‌ని విషయం తెలిసిందే.

కందూరులో విషాదం ..

వనపర్తి : అడ్డాకుల మండలం కందూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు శ్రీరామలింగేశ్వరస్వామి కోనేరులో పడి మృతి చెందారు. జాతర సందర్భంగా కోనేరులో స్నానానికి వెళ్లిన రవికుమార్, పవన్‌కుమార్, ఆంజనేయులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురు సోదరులు మహబూబ్‌నగర్ కు చెందినవారుగా గుర్తించారు. 

భాగ్యనగరంలో ఉమెన్ రైల్వే స్టేషన్!..

హైదరాబాద్: నగరంలోని బేగంపేట రైల్వే స్టేషన్‌ను ఆల్ ఉమెన్ స్టేషన్‌గా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈమేరకు గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ బేగంపేట రైల్వే స్టేషన్‌ను ఆల్ ఉమెన్ స్టేషన్‌గా ప్రకటించారు. ఇకనుంచి మహిళా ఉద్యోగులు రైల్వే స్టేషన్‌లో సేవలు అందించనున్నారు.

వైసీపీ ముందు మీసం తిప్పిన జేసీ..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తుండగా.. పార్లమెంటు ముఖద్వారం వద్ద వైసీపీ ఎంపీలో ప్లకార్డులు పట్టుకుని నిల్చున్నారు. వైసీపీ ఎంపీలను గమనించి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వైవీ సుబ్బారెడ్డితో నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. మేము కూడా రాజీనామా చేస్తాం. మళ్లీ పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు దమ్ముందా’’అంటూ మీసం మెలేసి తొడకొట్టి సవాల్ విసిరారు.

14:49 - March 8, 2018

హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లభించని మోక్షం ఎప్పుడెప్పుడాని దేశవ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల నుండి అంటే 1996 నుంచి పార్లమెంట్‌లో నానుతోంది మహిళా బిల్లు. ఈ నేపథ్యంలో 2010 మార్చి 9 మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందింది. కానీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో పాస్‌ కాలేదు. అప్పటి నుండి మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతూవున్నాయి. మరి ఈ బిల్లుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందని, దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిఅవసరం ఎంతైనా వుందని ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వాలని దేశవ్యాప్తంగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ ఈచర్చలో సామాజిక కార్యకర్త దేవీ, ఐద్వా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ, ప్రొఫెసర్ రేణుక పాల్గొన్నారు. 

14:38 - March 8, 2018

హైదరాబాద్ : ఒక పువ్వు జీవిత కాలం ఒక రోజు..ఒక మనిషి జీవిత కాలం వందేళ్లు.. ఇలా దేనికైనా ఒక కాలం, పరిమితి ఉంది. కాని మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఎప్పుడు మోక్షం లభిస్తుంది అన్న దానికి మాత్రం సమాధానం కాని, కాల పరిమితి కాని కనిపించడం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వస్తున్నాయి..పోతున్నాయి.. ఈ ఒక్క రోజు మాత్రం సర్వం నారీమణే. ఆ తరువాత పాలకులు మహిళా రిజర్వేషన్‌ బిల్లుకాని, చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యంపైన కాని నోరు మెదపరు..మెదపనివ్వరు. అలాంటి మహిళాలోకం చట్టసభలను శాసించలేకపోతోంది. చక్రం తిప్పగల సత్తా ఉన్నా పాలకుల నిస్సిగ్గు చర్యలకు , నిర్లక్ష్యానికి ఇంకా భర్త చాటు పాలనకే పరిమితం అవుతోంది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లభించని మోక్షం :
ఏళ్లకు ఏళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఈ ఏడాది చదివిన ప్రసంగాన్నే పాలకులు, ప్రతినిధులు మరోసారి చదవి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపేసి చేతులు దులుపుకుంటున్నారు. కాని చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యాన్ని పెంచే మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మాత్రం బూజును వదిలించడం లేదు.

1996 నుంచి నానుతున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు: 
పార్లమెంటులో ఎక్కువ కాలం ఆమోద ముద్ర పడకుండా ప్రతీసారి చర్చకు వస్తున్న బిల్లే మహిళా రిజర్వేషన్‌ బిల్లు. 1996 నుంచి మహిళా రిజ్వేషన్‌ బిల్లు పార్లమెంటులో నానుతూనే ఉంది. చట్టసభల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన ఈ బిల్లుకు ఇప్పటి వరకు ఆమోదముద్ర పడలేదు అంటే మహిళల పట్ల పాలకులకు ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థం అవుతుంది.

2010 మార్చి 9 రాజ్యసభ ఆమోదం : 
108 సవరణల తరువాత మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు 2010 మార్చి తొమ్మిదవ తేదీన రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. కాని లోక్‌సభలో బిల్లు అక్కడే ఉండిపోయింది. కారణం పాలకులు చెప్తున్నది మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇప్పుడు ఉన్న మద్దతు సరిపోదు అని.

చట్టసభల గడపతొక్కుతున్న మహిళల సంఖ్య నామమాత్రం: 
ఫలితం
అత్యున్నత చట్టసభ గడపతొక్కుతున్న నారీ మణుల సంఖ్య అరకొరగానే ఉంటోంది. లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం అంతంతమాత్రమే. దీనికి తెలుగు రాష్ర్టాలు కూడా అతీతమేమీ కాదు. మన రాష్ట్రం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టిన మహిళల సంఖ్య తక్కువుగానే ఉంటోంది.

లోక్‌సభకు మొదటిసారిగా 1952లో ఎన్నికలు : 
లోక్‌సభకు మొదటిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 28 మంది మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మెజార్టీ సభ్యులను దిగువసభకు పంపిన క్రెడిట్‌ కాంగ్రెస్‌దే. తరువాత స్థానం టీడీపీది. సీపీఐ, టీఆర్‌ఎస్‌ల నుంచి ఒక్కొక్కరు లోక్‌సభ గడపతొక్కారు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. సీపీఐ నుంచి వి విమలాదేవి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1957లో లోక్‌సభకు ముగ్గురు మహిళలు : 
మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి మహిళలెవరూ ఎన్నిక కాలేదు. 2వ లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళా ప్రాతినిధ్య ప్రస్థానం ప్రారంభమైంది. 1957లో జరిగిన ఈ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు దిగువసభకు ఎన్నికయ్యారు.

1957 లోక్‌సభ ఎన్నికలు : 
కాంగ్రెస్‌ నుంచి మొత్తం 19 మంది లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1957లో ఏలూరు నియోకవర్గం నుంచి కెయం వేద కుమారి, విజయవాడ నుంచి కె అచ్చమాంబ, మెదక్‌ నుంచి సంగం లక్ష్మిభాయి లోక్‌సభ గడప తొక్కారు. 1962లో ఖమ్మం నుంచి టి లక్ష్మీకాంతం, కర్నూలు నుంచి యశోదారెడ్డి, మెదక్‌ నుంచి సంగం లక్ష్మీబాయి గెలిచారు. 1967లో టి లక్ష్మీకాంతం ఖమ్మం నుంచి, భద్రాచలం నుంచి రాధాబాయి , సంగం లక్ష్మిభాయి మెదక్‌ నుంచి దిగువసభకు ఎన్నికయ్యారు. ఇలా ప్రతీసారి చట్టసభలకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య నామమాత్రంగానే ఉంది. 33.33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం లభిస్తేనే కాని ఈ పరిస్థితి మారదు అన్నది అక్షర సత్యం. ఇది చేయకుండా పాలకులు ఎన్ని మహిళా దినోత్సవాలను జరిపినా అది మహిళా సాధికారితకు ఏ మాత్రం ఉపయోగపడదు అన్నది కూడా కఠిన వాస్తవం.

14:01 - March 8, 2018

అమరావతి : అసెంబ్లీ సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 19,070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెట్టారు. రెండో అర్థ సంవత్సరంలో 24.5 శాతం వృద్ధి సాధించామని.. జాతీయ స్థాయి వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు 14శాతం అధికంగా నమోదైందని తెలిపారు. రబీలో 42శాతం వర్షపాతం తక్కువగా నమోదైనందువల్ల వరి దిగుబడి స్వల్పంగా తగ్గినా హెక్టారుకు 5,176 కిలోల ఉత్పత్తి నమోదు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మొక్కజొన్న ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానం, వరి ఉత్పాదనలో మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. పట్టిసీమ ద్వారా ముందస్తు నీటి విడుదల వల్ల అధికోత్పత్తి సాధ్యమైందని...రబీ పంట చివరి దశ సాగునీటికి మార్గం సుగమమైందని మంత్రి పేర్కొన్నారు. విభజన తర్వాత నాగార్జున సాగర్‌ నుంచి రాష్ట్ర నీటి వాటా 132 టీఎంసీలు మాత్రమే వచ్చాయన్నారు. రైతులకు వందశాతం రాయితీతో సూక్ష్మ పోషకాల పంపిణీ చేస్తు్న్నట్లు వెల్లడించారు. నాణ్యమైన విత్తనాల సరఫరాల కోసం ఆధార్‌ అనుసంధానం అమలు చేస్తు్న్నామన్నారు. విత్తన సరఫరాలో పారదర్శకతకు రాష్ట్రానికి జాతీయస్థాయిలో అవార్డు లభించిందన్నారు. వేరు శనగ విత్తనాలను 90శాతం రాయితీతో సరఫరా చేశామన్నారు. కర్నూలు జిల్లా తంగడంలో అంతర్జాతీయ విత్తన పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పామని.. ఇది దేశంలో మొట్టమొదటి మెగా సీడ్‌ పార్క్‌ అని తెలిపారు. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రిటెక్‌ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఉత్తరాంధ్రలో తగ్గుతున్న ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి : 

ఉత్తరాంధ్రలో తగ్గుతున్న ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. గత ఏడాది కంటే వేరు శనగ ఉత్పత్తి విస్తీర్ణం 31 శాతం తగ్గిందన్నారు. కాగా వేరు శెనగ విత్తనాలను 90 శాతం రాయితీతో సరఫరా చేశామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ముందస్తు నీటి విడుదలతో అధికోత్పత్తి సాధ్యమయిందన్నారు. రైతులకు వందశాతం రాయితీలో సూక్ష్మపోషకాల పంపిణీ చేపట్టామని తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీని అమలు చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన సంకేతిక పరిజ్నానం అందించేందుకు అగ్రిటెక్ ను ఉపయోగిస్తున్నామన్నారు. నాణ్యమైన విత్తన సరఫరా కోసం ఆధార్ తో అనుసంధానం చేశామన్నారు. సాయిన ఎరువుల వాడకంలో దేశంలో ఆరోస్థానంలో వున్నామన్నారు. దేశంలో మొదటిసారిగా ఈ మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లాలో దేశంలోను తొలిసారిగా సీడ్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. నూతన పద్దతులతో కూరగాయల సాగు 35 శాతం పెంచగలిగామన్నారు. అలాగే ఉద్యానవన పంటలతో రైతుల ఆదాయం మెరుగుపడుతోందన్నారు. రాబోయే రోజుల్లో వేయికి పైగా రైతు సంఘాల ఏర్పాటు చేస్తామన్నారు.

  • పశు సంవర్థక శాఖకు రూ.223 కోట్లు
  • మత్స్యశాఖకు రూ.386 కోట్లు
  • మెగా సీడ్ పార్క్ కు రూ.100 కోట్లు
  • జైకా ప్రాజెక్ట్ కింద రూ.2000 కోట్లు
  • కౌలు రైతుల రుణాలకు రూ.2,346 కోట్లు
  • కరవు నివారణకు రూ.1,042కోట్లు
  • అజిమ్ ప్రేమ్ జీ సంస్థతో పరిశోధనలకు రూ.100 కోట్లతో ఒప్పందం
  • వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహాలకు రూ.420 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.258 కోట్లు
  • ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ రంగానికి రూ.4730 కోట్లు
  • రెవెన్యూ వ్యయం.. రూ.18,602.98కోట్లు
  • పెట్టుబడి వ్యయానికి రూ.467.38కోట్లు
  • రైతు రథం పథకం కింద రూ.2.50లక్షల రాయితీతో ట్రాక్టర్ల మంజూరు

 

 

12:38 - March 8, 2018

గుంటూరు : ఏపీ వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. 2018 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్ తరువావ సభ ముందుకు వ్యవసాయ బడ్జెట్ రానుంది. రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరగడంతో ఆదాయం భారీగా కోల్పోయామని తెలిపారు. కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక ఇబ్బందిపడ్డామని చెప్పారు. సమస్యలున్నా కూడా ఆర్ధికాభివృద్ధికి బలమైన పునాదులు వేశామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులతో బడ్జెట్ తో రూపొందించామన్నారు. బడ్జెట్ లో సంక్షేమ రంగానికే పెద్దపీట వేశామని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే తమ ధ్వేయమన్నారు. అమరావతిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయని తెలిపారు. 

  • మొత్తం బడ్జెట్ రూ.1,91,06, 361 కోట్లు
  • గత ఏడాది 10.96 వృద్ధ సాధించాం... 
  • క్యాపిటల్ అంచనా వ్యయం రూ.28,678.49 కోట్లు
  • ఆర్థిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లు 
  • ఎస్టీ, బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక అమలు 
  • ఇందుకోసం చెరో వందకోట్లు కేటాయింపు 
  • సాగునీటి రంగానికి రూ.16,975 కోట్లు
  • సంక్షేమ రంగానికి రూ.13.720 కోట్లు
  • వ్యవసాయానికి రూ.12,355 కోట్లు 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు 
  • వెనకబడిన వర్గాల కోసం 35 శాతం ఆదనపు నిధులు
  • హిజ్రాల సంక్షేమం కోసం రూ.20 కోట్లు 
  • చంద్రన్న పెళ్లి కానుక రూ.100 కోట్లు
  • కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70 కోట్లు
  • కాపు కార్పొరేషన్ కు రూ.100 కోట్లు 
  • సెకండరీ విద్య కోసం రూ.21,612 కోట్లు 
  • వెనుబడిన వర్గాల కోసం 35 శాతం అదనపు నిధులు 
  • ఆదరణ పథకానికి రూ.750 కోట్లు 
  • మత్స్యకారుల సంక్షేమానికి 77 కోట్లు 
  • ఏపీ వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100 కోట్లు 
  • గ్రామీణాభివృద్ధికి రూ.20,816 కోట్లు 
  • చేనేత రంగానికి రూ.200 కోట్లు 
  • వైద్య రంగానికి రూ.8,463 కోట్లు
  • గృహ నిర్మాణానికి రూ.3,679 కోట్లు 
  • వైశ్యుల సంక్షేమానికి రూ.30 కోట్లు 
  • నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.30 కోట్లు 

 

ఏపీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న యనమల

గుంటూరు : ఏపీ వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెడుతున్నారు. 2018 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్ తరువావ సభ ముందుకు వ్యవసాయ బడ్జెట్ రానుంది. రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరగడంతో ఆదాయం భారీగా కోల్పోయామని తెలిపారు

12:19 - March 8, 2018

కొన్ని రాజకీయ కారణాలతో మంత్రులు రాజీనామా : సీఎం చంద్రబాబు

గుంటూరు : తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్ టీఆర్ కాంగ్రెస్ యేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారని... ఫెడరల్ సెటప్ కు శ్రీకారం చుట్టారని చెప్పారు. కొన్ని రాజకీయ కారణాలతో బీజేపీ మంత్రులు రాజీనామా చేశారని తెలిపారు. కామినేని, మాణిక్యాలరావు మంత్రులుగా మంచిగా పని చేశారని అభినందించారు. చాలా సమర్థవంతంగా పని చేశారని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను మాణిక్యాలరావు సమర్థవంతంగా నిర్వహించారని...ఎండో మెంట్ ను స్ట్రీమ్ లైన్ చేశారని కొనియాడారు. 

 

రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదన్న సీఎం చంద్రబాబు

గుంటూరు : కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని చెప్పారు. ఏపీకి పద్ధతి ప్రకారం న్యాయం చేయలేదని వాపోయారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని కేంద్రంతో పొత్తుపెట్టుకున్నామని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం ప్రజల నుంచి ఒత్తిడి ఉందన్నారు. జాతీయ పార్టీలు జాతీ ప్రయోజనం కోసం బాధ్యతగా ఉండాలని సూచించారు. 

12:16 - March 8, 2018

గుంటూరు : కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని చెప్పారు. ఏపీకి పద్ధతి ప్రకారం న్యాయం చేయలేదని వాపోయారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని కేంద్రంతో పొత్తుపెట్టుకున్నామని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం ప్రజల నుంచి ఒత్తిడి ఉందన్నారు. జాతీయ పార్టీలు జాతీ ప్రయోజనం కోసం బాధ్యతగా ఉండాలని సూచించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. ఎన్ టీఆర్ కాంగ్రెస్ యేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారని... ఫెడరల్ సెటప్ కు శ్రీకారం చుట్టారని చెప్పారు. కొన్ని రాజకీయ కారణాలతో బీజేపీ మంత్రులు రాజీనామా చేశారని తెలిపారు. కామినేని, మాణిక్యాలరావు మంత్రులుగా మంచిగా పని చేశారని అభినందించారు. చాలా సమర్థవంతంగా పని చేశారని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను మాణిక్యాలరావు సమర్థవంతంగా నిర్వహించారని...ఎండో మెంట్ ను స్ట్రీమ్ లైన్ చేశారని కొనియాడారు. 

 

చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్న కేవీపీ

ఢిల్లీ : ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీ అంటే చంద్రబాబుకు ముద్దు అని కాంగ్రెస్ నేత కేవీపీ అన్నారు. ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈమేరకు ఆయన మాట్లాడారు. మోడీ, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య విభేదాలు వచ్చింది.. ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో కాదని.. కాంట్రాక్టర్ట విషయంలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. ప్రత్యేకహోదా సాధనలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం సాగే ఉద్యమంలో అన్ని పార్టీలు వచ్చాయన్నారు. రాకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని భావించే పోరాటాలు చేస్తున్నాయని చెప్పారు.

 

12:09 - March 8, 2018

ఢిల్లీ : ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీ అంటే చంద్రబాబుకు ముద్దు అని కాంగ్రెస్ నేత కేవీపీ అన్నారు. ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈమేరకు ఆయన మాట్లాడారు. మోడీ, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య విభేదాలు వచ్చింది.. ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో కాదని.. కాంట్రాక్టర్ట విషయంలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. ప్రత్యేకహోదా సాధనలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం సాగే ఉద్యమంలో అన్ని పార్టీలు వచ్చాయన్నారు. రాకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని భావించే పోరాటాలు చేస్తున్నాయని చెప్పారు.

 

12:01 - March 8, 2018

గుంటూరు : ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు అన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ శత్రువు కాదని.. మిత్రువే అని అన్నారు. తనకు చంద్రబాబు స్ఫూర్తి అని అన్నారు. చంద్రబాబు నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. చక్కటి పరిపాలన దక్షతతో సీఎం చంద్రబాబు పని చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీకి లాభం చేకూరిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మెడికల్ కాలేజీలో లేదని సీఎం దృష్టికి తెచ్చినట్లు గుర్తు చేశారు.

 

చంద్రబాబుపై కామినేని ప్రశంసలు

గుంటూరు : సీఎం చంద్రబాబులా ఎవరూ కష్టపడలేదని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బాబు లాంటి నాయకులుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను మంత్రిగా సఫలం అయ్యాయని చెప్పారు. తాను మంచి స్నేహితులను సంపాదించుకున్నానని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చాలా చేశారని చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి వెంకయ్యనాయుడు, బీజేపీ నాయకత్వం కారణమన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. కొన్ని పేపర్లు, కొందరు తనపై బురద జల్లేందుకు ప్రయత్నించారు. రాజకీయ అవినీతికి పాల్పడలేదన్నారు.  

 

11:45 - March 8, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబులా ఎవరూ కష్టపడలేదని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బాబు లాంటి నాయకులుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను మంత్రిగా సఫలం అయ్యాయని చెప్పారు. తాను మంచి స్నేహితులను సంపాదించుకున్నానని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చాలా చేశారని చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి వెంకయ్యనాయుడు, బీజేపీ నాయకత్వం కారణమన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. కొన్ని పేపర్లు, కొందరు తనపై బురద జల్లేందుకు ప్రయత్నించారు. రాజకీయ అవినీతికి పాల్పడలేదన్నారు.  

 

11:34 - March 8, 2018

ఢిల్లీ : కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని టీడీపీ ఎంపీ సుచనా చౌదరి అన్నారు. మంత్రివర్గంలో ఉన్నా లేకున్నా తమ పోరాటం ఆగదని అన్నారు. పార్టీ ఆదేశం మేరకు నడుచుకుంటామని తెలిపారు. 

చంద్రబాబుకు రాజకీయ విలువల్లేవు : జగన్

ప్రకాశం : ప్రజల ఒత్తిడి వల్లే చంద్రబాబులో మార్పు వచ్చిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. గతంలోనే చంద్రబాబు స్పందించి ఉంటే బాగుండేదన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యం.. చంద్రబాబుకు అవి లేవని విమర్శించారు. చంద్రబాబుకు చరమగీతం పాడేరోజు దగ్గరోనే ఉందన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు మేం సిద్ధం...చంద్రబాబు మద్దతిస్తారా అని ప్రశ్నించారు. మూకుమ్మడిగా రాజీనామా చేద్దామన్నారు. జైట్లీ ప్రకటన కొత్తదేమీ కాదన్నారు. 

11:27 - March 8, 2018

గుంటూరు :  ఏపీ బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఆవరణంలో సీఎం చంద్రబాబుకు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు.  సీఎంకు కామినేని, మాణిక్యాలరావు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామాలు చేస్తున్నట్లు కామనేని, మాణిక్యాలరావు పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:16 - March 8, 2018

గుంటూరు : రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రత్యేకహోదా పేరు ఇవ్వకపోయినా అంతకన్నా ఎక్కువ నిధుల ఇచ్చామని తెలిపారు. 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తామని మూడున్న రేళ్లలో అభివృద్ధి చేయడం తప్పా అని అన్నారు.  గతంలో ఏ కేంద్రప్రభుత్వం కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదని చెప్పారు.చంద్రబాబును కలిసి తమ మంత్రులు రాజీనామా చేస్తారని చెప్పారు. 

 

11:08 - March 8, 2018

ప్రకాశం : ప్రజల ఒత్తిడి వల్లే చంద్రబాబులో మార్పు వచ్చిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. గతంలోనే చంద్రబాబు స్పందించి ఉంటే బాగుండేదన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యం.. చంద్రబాబుకు అవి లేవని విమర్శించారు. చంద్రబాబుకు చరమగీతం పాడేరోజు దగ్గరోనే ఉందన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు మేం సిద్ధం...చంద్రబాబు మద్దతిస్తారా అని ప్రశ్నించారు. మూకుమ్మడిగా రాజీనామా చేద్దామన్నారు. జైట్లీ ప్రకటన కొత్తదేమీ కాదన్నారు. 

 

మంత్రి పదవులకు కామినేని, మాణిక్యాలరావు రాజీనామా

గుంటూరు : మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఆవరణంలో సీఎం చంద్రబాబుకు రాజీనామా పత్రాలను సమర్పించారు. సీఎంకు కామినేని, మాణిక్యాలరావు ధన్యవాదాలు తెలిపారు.

మారుతున్న రాజకీయ పరిణామాలు

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ లోపల, బయట నేతలు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగనుంది. అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ప్రధాని మోడీకి రాజీనామాలు అందజేయనున్నారు. 

09:48 - March 8, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ లోపల, బయట నేతలు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగనుంది. అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ప్రధాని మోడీకి రాజీనామాలు అందజేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

సీఎంకు రాజీనామా పత్రం సమర్పించనున్న మంత్రి కామినేని

గుంటూరు : మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా పత్రాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎంకు రాజీనామా పత్రం సమర్పించనున్నారు. అసెంబ్లీలో రాజీనామాకు గల కారణాలను తెలిపేందుకు కామినేని శ్రీనివాస్ స్పీకర్ ను అనుమతి కోరారు. మంత్రులు అచ్చెంనాయుడు, గంటా శ్రీనివాస్ కామినేనిని కలిశారు. రాజీనామా ఆమోదం పొందే వరకు మంత్రిగానే ఉంటారని వ్యాఖ్యానించారు. 

09:41 - March 8, 2018

గుంటూరు : మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా పత్రాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎంకు రాజీనామా పత్రం సమర్పించనున్నారు. అసెంబ్లీలో రాజీనామాకు గల కారణాలను తెలిపేందుకు కామినేని శ్రీనివాస్ స్పీకర్ ను అనుమతి కోరారు. మంత్రులు అచ్చెంనాయుడు, గంటా శ్రీనివాస్ కామినేనిని కలిశారు. రాజీనామా ఆమోదం పొందే వరకు మంత్రిగానే ఉంటారని వ్యాఖ్యానించారు. 

 

రాజీనామా బాటలో ఏపీ బీజేపీ నేతలు

గుంటూరు : ఏపీ బీజేపీ నేతలు రాజీనామా బాటలో ఉన్నారు. రాత్రి బీజేపీ నేతల అత్యవసర భేటీ అయ్యారు. మంత్రివర్గ భేటీకి బీజేపీ మంత్రులు డుమ్మా కొట్టనున్నారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు రాజీనామా చేయనున్నారు.

ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

గుంటూరు : ప్రత్యేక హోదా పోరు తారాస్థాయికి చేరింది. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావాలని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయనున్నారు. అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామాలు సమర్పించనున్నారు. 

08:47 - March 8, 2018

గుంటూరు : ప్రత్యేక హోదా పోరు తారాస్థాయికి చేరింది. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ నుంచి బయటికి రావాలని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామాలు సమర్పించనున్నారు. ఏపీ బీజేపీ నేతలు రాజీనామా బాటలో ఉన్నారు. రాత్రి బీజేపీ నేతలు అత్యవసర భేటీ అయ్యారు. మంత్రివర్గ భేటీకి బీజేపీ మంత్రులు డుమ్మా కొట్టనున్నారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు రాజీనామా చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

రాష్ట్రానికి న్యాయమేమీ జరగలేదు : సీఎం చంద్రబాబు

అమరావతి : రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఎన్డీఏలో భాగస్వాములయ్యామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి న్యాయమేమీ జరగలేదని చెప్పారు. సైన్యం నిధులతో ముడిపెట్టడం బాధగా ఉందన్నారు. జైట్లీ మాటలు చూస్తే సహాయం చేసే ఉద్దేశం కనిపించలేదన్నారు. ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చడం సరికాదని చెప్పారు. తెలుగు ప్రజల సెంటిమెంట్ ను పట్టించుకోలేదని వాపోయారు. ప్రత్యేక హోదా రాష్ట్ర హక్కు అని స్పష్టం చేశారు. 

 

08:20 - March 8, 2018

టీడీపీ, బీజేపీ బంధంపై హాట్ డిబెట్ జరిగింది.  టీడీపీ, బీజేపీ మిత్రబంధంపై వక్తలు భిన్నవాదలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ రామృకృష్ణ, బీజేపీ నేత విష్ణుశ్రీ, విశాలాంధ్ర ఎడిటర్ ముత్యాల ప్రసాద్, వైసీపీ నేత మాల్లాది విష్ణు పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:12 - March 8, 2018

నేడు మహిళా దినోత్సవం. ఆకాశంలో సగం మహిళలంటారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. అయితే.. దేశంలో మహిళల పట్ల వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఆడపిల్ల పుడుతుందంటే వద్దనుకునే తల్లిదండ్రులు ఉన్నారు. స్వాతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలైనా.. మహిళలంటే చిన్నచూపే. 25 ఏళ్లుగా మహిళా బిల్లు పార్లమెంట్‌లో నలుగుతూనే ఉంది. మహిళలకు సమానత్వం రావాలంటే ఇంకెన్నాళ్లు కావాలి.? ఇవే అంశాలపై నిర్వహించిన   జనపథం కార్యక్రమంలో మహిళా ఉద్యమకారిణి, జర్నలిస్ట్‌ వనజ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:07 - March 8, 2018

మెదక్ : రైతులు పంటల సాగుచేసేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేటలో జరిగిన నిరుద్యోగ, రైతాంగ సదస్సుకు కోదండరామ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ రాష్ట్రంలోని రైతు సమస్యలను విడిచిపెట్టి.. దేశ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

08:03 - March 8, 2018

సిరిసిల్ల : తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని.. అందులో టీఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు కొట్టుకుపోకతప్పదని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనపై ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకే.. థర్డ్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర.. సిరిసిల్లకు చేరుకుంది. తెలంగాణ ఇచ్చింది.. ఇక్కడి వారి బాధలు అర్థం చేసుకునేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ అధికారంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

 

07:58 - March 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతానికి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిచ్చే ఆలోచన లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ రాష్ట్రంలోని 14 వీసీలతో ఆయన సమావేశమై సమస్యలపై చర్చించారు. వర్సిటీల్లో మౌలిక వసతుల కోసం 420 కోట్ల రూపాయలు మంజూరు చేశామని... 31 మార్చిలోపు టెండర్లు పిలిచి పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అదేశించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు 6 నెలల్లో అమలు చేస్తామని వీసీలు హామీఇచ్చినా.... ఆశించిన మేరకు అమలు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేయాలన్నారు. అందుకు అవసరమైన అనుమతులు.. వీసీలకే ఇచ్చినట్లు కడియం తెలిపారు.

 

07:54 - March 8, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేలా భారీ కేటాయింపులతో బడ్జెట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందు  ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌ కావడంతో కొత్త పథకాలతో ఆకర్షణీయంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఉదయం 11.30కు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ఈ ఆకర్షణీయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తర్వాత  పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ మండలిలో ప్రవేశపెడతారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం పెట్టనుంది.
  

07:52 - March 8, 2018

హైదరాబాద్ : ఏపీ కేబినెట్‌ నుంచి బీజేపీ మంత్రులు వైదొలగనున్నారు. ఇవాళ తమ రాజీనామాలను ఇద్దరు మంత్రులు సమర్పించనున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని టీడీపీ నిర్ణయం తీసుకోవడంతో.... బీజేపీ నేతలు ఈ మేరకు నిర్ణయించారు. 
రాష్ట్రమంత్రివర్గం నుంచి వైదొలగాలని బీజేపీ నేతలు నిర్ణయం
ఆంధప్రదేశ్‌లో టీడీపీ - బీజేపీ బంధానికి తెరపడింది.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడంతో టీడీపీ తీవ్ర నిరాశకు లోనైంది. దీంతో కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు.  ఇవాళ తమ మంత్రులిద్దరూ మంత్రిపదవులకు రాజీనామా చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు ప్రెస్‌కాన్ఫరెన్స్‌ ముగియగానే.. బీజేపీ నేతలు బెజవాడలో అత్యవసరంగా భేటీ అయ్యారు. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో సమావేశమయ్యారు. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.  టీడీపీ కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలుగుతుండడంతో.. తాము కూడా రాష్ట్రమంత్రివర్గం నుంచి వైదొలగాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఇవాళ తమ మంత్రిపదవులకు రాజీనామా చేస్తారని బీజేపీ నేతలు ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. దీంతో ఇవాళ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు రాజీనామా చేయనున్నారు. ఇవాళ జరిగే కేబినెట్‌ సమావేశానికి వారు హాజరుకాబోరని తెలిపారు.
చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజం లేదన్న ఎమ్మెల్యే ఆకుల 
రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందన్న చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజం లేదని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.  విభజన చట్టంలోని అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. మొత్తానికి ప్రత్యేకహోదా పెట్టిన చిచ్చుతో టీడీపీ -బీజేపీ మిత్రబంధం తెగదెంపులు అయ్యింది. ఇన్నాళ్లూ మిత్రులుగా ఉన్న నేతలు.. వైరిపక్షాలుగా మారారు.

07:48 - March 8, 2018

హైదరాబాద్ : ప్రజావ్యతిరేకతను గమనించే బీజేపీ, టీడీపీలు కొత్త డ్రామాకు తెరలేపాయని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేంద్రకేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేయడం ఓ డ్రామా అన్నారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వారిపదవులకోసం నాలుగేళ్ళుగా రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టుపెట్టారని తీవ్రంగ మండిపడ్డారు. రాజీనామాలంటూనే... ఎన్డీయేలో కొనసాగడం చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయించిన బీజేపీ

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని బీజేపీ నిర్ణయించింది. నేడు మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయనున్నారు.  

07:42 - March 8, 2018

హైదరాబాద్ : కేంద్ర కేబినెట్‌ మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్న టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ నేత నారాయణ అన్నారు. బీజేపీ మోసాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు..  చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో బీజేపీ ఆయనపై కక్షపూరితంగా.. వేధింపులకు పాల్పడే అవకాశం ఉందని.. ఐనా భయపడకుండా పోరాడలని నారాయణ చెప్పారు.

 

07:40 - March 8, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేకహోదా పోరు తారస్థాయికి చేరింది.  బీజేపీతో తెగదెంపులు చేసుకునే దిశగా తెలుగుదేశంపార్టీ తొలి అడుగు వేసింది. కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. తమ కేంద్రమంత్రులు ఇద్దరు మంత్రిపదవులకు ఇవాళ రాజీనామా చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి ఇవాళ రాజీనామా చేయనున్నారు.
టీడీపీ - బీజేపీ మిత్రబంధానికి బ్రేక్‌లు  
టీడీపీ - బీజేపీ నాలుగేళ్ల మిత్రబంధానికి బ్రేక్‌లు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వంతో కటీఫ్‌ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు పడ్డాయి. ఏపీకి సాయంపై కేంద్రం వైఖరిని తేటతెల్లం చేసిన వెంటనే.. అమరావతిలో పరిణమాలు శరవేగంగా మారిపోయాయి. జైట్లీ స్పందనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.  అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచి మాట్లాడారు.  ఢిల్లీలో ఉన్న ఎంపీలతోనూ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వబోమని ఖరాఖండీగా చెప్పిన తర్వాత కేంద్రంలో కొనసాగడం అనవసరమన్న అభిప్రాయాన్ని ఎంపీలు వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకోవాడానికి ఇదే సరైన సమయమని సూచించారు.  ఇద్దరు కేంద్రమంత్రులతోనూ చంద్రబాబు మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కేంద్ర కేబినెట్‌ నుంచి తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు వైదొలుగుతారని చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ రాజీనామాలు సమర్పించనున్నట్టు తెలిపారు. తీవ్ర ఆవేదన, బాధతోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఇది తాము వేస్తున్న మొదటి అడుగు అని... ఎన్డీయే కూటమిలో కొనసాగాలా, వద్దా అనేది తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 
ఈ నిర్ణయంతో ఇబ్బందులు రావొచ్చన్న చంద్రబాబు 
కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని తాము తీసుకున్న నిర్ణయంతో కష్టాలు , ఇబ్బందులు రావొచ్చని చంద్రబాబు అన్నారు. అయినా వాటికి భయపడబోమని... ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాబోయే సమస్యలపై అవగాహన ఉండటం వల్లే నాలుగేళ్లుగా ఓపికతో వ్యవహరించి.. కేంద్రానికి నచ్చజెప్పడం ద్వారా రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకునే ప్రయత్నం చేశామన్నారు. 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ఆశించిన ప్రయోజనం దక్కనందునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సమస్యను అధిగమించే శక్తి తెలుగువారికి ఉందని.. ఇప్పుడు వచ్చిన సమస్యను కూడా సమష్టి కృషితో అధిగమించగలమన్న ధీమా వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించాలని, విభజన చట్టం ప్రకారం సాయం చేయాలని కోరుతున్నట్టు తెలిపారు.
జైట్లీ అవమానకరంగా మాట్లాడారన్న బాబు
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యంకాదని జైట్లీ చెప్పారని...ఆ ప్రకటన చూస్తే రాష్ట్రానికి సాయం చేసే ఉద్దేశం వారిలో కనిపించడం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములయ్యామని... ఆ లక్ష్యం నెరవేరనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావడమే మంచిదని అన్నారు. ప్రతి దానికీ రాజకీయాలు ముడిపెట్టవద్దని.. దేశ రక్షణకు ఇచ్చే డబ్బులు అడుగుతున్నారని ఆర్థికమంత్రి జైట్లీ అవమానకరంగా మాట్లాడారన్నారు.
పోలవరంకు కోసం 13వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం : చంద్రబాబు  
పోలవరం ప్రాజెక్ట్‌ కోసం 13వేల కోట్లకుపైగా ఖర్చుచేశామని చంద్రబాబు అన్నారు. పోలవరానికి ఖర్చు చేసిన దాంట్లో ఇంకా 2,568 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతా అభివృద్ధికి ఈ ఏడాది జనవరి 31వ తేదీన 350 కోట్లు విడుల చేశారని.. ఆ వెంటనే ప్రధాని ఆమోదం లేదంటూ మొత్తం డబ్బును వెనక్కి తీసుకున్నాని చెప్పారు.  కేంద్రం నుంచి విడుదలైన ప్రతి రూపాయికీ లెక్కలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న పెద్దలు వినే ధోరణిలో ఉంటే సవివరంగా చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రతి ఒక్కరూ సహకరించాలన్న చంద్రబాబు
రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించే ప్రతి ఒక్కరూ సహకరించాలని చంద్రబాబు కోరారు. హక్కుల కోసం పోరాడుతూనే... రాష్ట్ర ప్రయోజనాలను  కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు.  హోదా కోసం పోరాడుతున్న వారందరికీ చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఒరవడి కొనసాగించాలని కోరారు.

 

నేడు రాజీనామా చేయనున్న టీడీపీ కేంద్రమంత్రులు

ఢిల్లీ : నేడు టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయనున్నారు. కేంద్ర టీడీపీ మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా చేయనున్నారు. 

 

కాసేపట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్ : కాసేపట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు.

నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న యనమల

అమరావతి : నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.30 గంటలకు మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి : ఉదయం 7.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఏపీ బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 
 

Don't Miss