Activities calendar

09 March 2018

21:36 - March 9, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ ప్రత్యేక హోదా పోరు మరింత ఉధృతమైంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యమ హోరు పెంచాయి. వరుసగా ఐదో రోజు కూడా ధర్నాలు, నిరసనలతో ఢిల్లీ దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. హోదా ఉద్యమం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఐదో రోజు కూడా ఢిల్లీలో హోదా పోరు కొనసాగింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎవరికి వారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ధర్నాలు, నిరసనలతో దేశ రాజధాని హోరెత్తించాయి.

పీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అందోళన..
పీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అశోక్‌గజపతిరాజు కూడా ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌.. కోయదొర వేషంలో వినూత్నంగా నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ జైరామ్‌ రమేశ్‌.. ధర్నా చేస్తున్న టీడీపీ ఎంపీలతో ఏపీకి హోదా ఇవ్వడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంతో ఇకపై యుద్ధం తప్పదని టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్‌ హెచ్చరించారు.
వైసీపీ నిరసన
హోదా కోసం వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంటు మెయిన్‌ గేటు వద్ద నిరసన తెలిపారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగిన టీడీపీ... ఎన్డీయే నుంచి కూడా బయటకు రావాలని వైసీపీ ఎంపీ వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

టీడీపీ, బీజేపీల గుర్తింపు రద్దు చేయాలని ఏపీసీసీ నేతల డిమాండ్‌
ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చి అమలు చేయడంలో విఫలమైన టీడీపీ, బీజేపీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీసీసీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ప్రజా సంఘాల ధర్నా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రజా సంఘాలు ఢిల్లీలో ధర్నా చేశాయి. ఏపీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వరుసగా ఐదు రోజుల పాటు ఢిల్లీలో ధర్నాలు
శని, ఆదివారాల్లో పార్లమెంటు సమావేశాలకు సెలవు కావడంతో... వరుసగా ఐదు రోజుల పాటు ఢిల్లీలో ధర్నాలు, నిరసనలతో హోరెత్తించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నాయకులు, కార్యకర్తలు రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. ఈ రెండు రోజులూ.. టీడీపీ ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి, హోదాపై కేంద్రం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించనున్నారు. విజయవాడలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించాలని వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు నిర్ణయించారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. మరోవైపు రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహంతోపాటు మెయిన్‌ గేటు వద్ద నిరసన తెలిపారు. 

21:28 - March 9, 2018

అమరావతి : బీజేపీ పొత్తుతో టీడీపీకి అదనంగా ఒరిగిందేమీ లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్న ఒకేఒక కారణంతో కేంద్రంలో భాగస్వామ్యం అయినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరనందునే.. తమ మంత్రులతో రాజీనామా చేయించినట్టు తెలిపారు. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండడంతో.. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఓ వ్యూహ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈనెల 11న పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించి.. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించాలని డిసైడ్‌ అయ్యారు.

ఏపీలో వేగంగా మారుతున్న పాలిటిక్స్‌
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ కేంద్రమంత్రుల రాజీనామా తర్వాత ఈ పరిణామాలు మరింత వేగం పుంజుకున్నాయి. బీజేపీ- టీడీపీ పొత్తు తెగదెంపులు కావడంపై జోరుగా చర్చసాగుతోంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించుకునేలా ఓ వ్యూహ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సీనియర్‌మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్‌, మంత్రులు సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులతోపాటు మండలి చీప్‌విఫ్‌ పయ్యావుల కేశవ్‌, పరకాల ప్రభాకర్‌, కుటుంబరావు ఉన్నారు. రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ పార్టీ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు కమిటీ సభ్యులను ఆదేశించారు.

వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ
వ్యూహ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఆ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్రమంత్రుల రాజీనామాలతోపాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీజేపీ పొత్తుతో టీడీపీ ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల్లో వచ్చిన ఓట్లే సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీకి వచ్చాయని గుర్తు చేశారు. బీజేపీతో పొత్తువల్ల అదనంగా ఓట్లేమీ పడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న కారణంతోనే పొత్తుపెట్టుకున్నట్టు తెలిపారు. ఇక కేంద్రమంత్రుల రాజీనామాల తర్వాత ప్రజాభిప్రాయం ఎలా ఉందని చంద్రబాబు ఆరా తీశారు. 98శాతం మంది ప్రజలు పార్టీ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్టు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర సాయంతో రాష్ట్రంలో అమలయ్యే ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే.. నిధులు రాబట్టుకోవడం కోసం ఎంచేయాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించారు.

ఉపాధి హామీ పథకం బకాయిలపై చర్చ
ఉపాధిహామీ పథకంలో బకాయిల కారణంగా కూలీలు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి కూలీ బకాయిలకు రాష్ట్ర నిధుల నుంచే చెల్లింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇదే తరహా ఇబ్బందులొస్తే ప్రత్యామ్నాయ వనరులు సమకూర్చుకోవడం గురించీ చర్చించారు. తామెప్పుడూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కష్టపడుతున్నామని మంత్రులు స్పష్టం చేశారు.

బీజేపీతో టీడీపీకి తలాక్‌ : జేసీ
బీజేపీతో టీడీపీకి తలాక్‌ అయిపోయిందని... ఇకనుంచి తాము ఎన్నిపోరాటాలు చేసినా బీజేపీ పట్టించుకోదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఎన్ని ఆందోళనలు చేసినా ఉపయోగం ఉండబోదన్నారు. వైసీపీ రాజీనామా ఆరోపణలపై స్పందించిన జేసీ... జగన్‌కు దమ్ముంటే విజయసాయిరెడ్డితో రాజీనామా చేయించమని సవాల్‌ విసిరారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే.. తాను చేస్తానని స్పష్టం చేశారు. ఈనెల 11న టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సమావేశంలోనే టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. అంతేకాదు.. ఎన్డీయేలో కొనసాగాలా... వద్దా అన్నది కూడా ఈ సమావేశంలోనే తేల్చనున్నారు.

21:16 - March 9, 2018

త్రిపుర ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన విజయాన్ని స్వంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనే పరిణామాలు సంభవిస్తున్నాయి. సీపీఎం కార్యకర్తలపై దాడులు, మహానేత లెనిన్ విగ్రహాల ధ్వంసం వంటి పలు అసాంఘీక కార్యక్రమాలను పాల్పడుతోంది. ఈక్రమంలో నెలకొన్న రాజకీయ పరిణాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:35 - March 9, 2018

మందకృష్ణ మాదిగ మర్డర్ కు సర్కార్ కుట్ర పన్నిందట. ఈ కుట్రలో ఓ మంత్రిగారి ప్రమేయముందని మందకృష్ణ సెప్పిండంట..బీజేపీ వైఖరి దున్నపోతుపై వాన పడినట్లేనన్న జేసీ దివాకర్ రెడ్డి. మీడియా కోసమే తప్ప ఎవరికీ చిత్తశుద్ధి లేదంట. రెండు పెగ్ లేస్తే..ఫ్రంట్ ఏదో బ్యాక్ తెలీని కేసీఆర్ కు ఫ్రంట్ అవసరమా అనే విమర్శలు, సెంట్రల్ లో మోదీ, ఇక్కడ చూస్తే కేడీ అంటున్న రేవంత్ రెడ్డి..మిషన్ భగీరథ పైపు లనుండి వాటర్ పాల్ లెక్క ఎగజిమ్ముతన్న నీళ్లు. సీఎం పదవినుండి తొలగిపోగానే సీఎం క్యాంప్ ఆఫీస్ కాళీ చేసిన త్రిపుర సీఎం మాణిక్ సర్కార్. కానీ నాలుగేళ్లు సీఎం పదవిలోవున్న కేసీఆర్ మాత్రం క్యాంప్ ఆఫీస్ వున్నాగాను అతి పెద్ద భవనాన్ని కట్టిండు. మరి చూడుండ్రి ఈ తేడా.ఈత వనంల కెల్లి తాగిన ఐపీఎస్ అకుల్ సబర్వాల్ సార్..మీసాల సేపల తరలింపును పట్టుకున్న పోలీసోల్లు..గిసువంటి మస్తు ముట్లన్నీ పట్టుకొచ్చిండి గీరోజు మల్లన్న తాత.. మీరు కూడా ఖుషీ అవ్వాలంటే గీ ముచ్చట్లను మీరు కూడా చూడుండ్రి మల్ల..

19:29 - March 9, 2018

అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను బీజేపీ, టీడీపీ మంత్రుల రాజీనామాలు చేయటంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఏపీకి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని విభజన సమయంలో మాట ఇచ్చిన బీజేపీ ప్రస్తుతం అవలంభిస్తున్న తీరుపై ఆగ్రహంతో వున్న టీడీపీ మంత్రులు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. అలాగే ఏపీ కేబినెట్ లో మంత్రులుగా వున్న బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ పదవులనుండి వైదొలగినా...ఎంపీలుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోపక్క తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబబు స్ట్రాటజీ కమిటీని వేసి ఎప్పటికప్పుడు పరిణామాలపై చర్చలను కొనసాగిస్తున్నారు. మరి ఈ పరిణామాల ఎలా వుండబోతున్నాయి? బీజేపీ వైఖరి ఏమిటి? టీడీజీ స్ట్రాటజీ ఏమిటి? అనే అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో చందు సాంబశివరావు (టీడీపీ),జాబీ (బీజేపీ), గఫూర్ (సీపీఎం)లు పాల్గొన్నారు. ఈ చర్చపై మరింత సమాచారం కోసం వీడియోను క్లిక్ చేయండి..

19:02 - March 9, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ చిలకలగూడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏడోతరగతి చదువుతున్న అమ్మాయిని నర్సింహ్మా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధితురాలు బస్తీవాసులకు తెలియజేయడంతో, చిలకలగూడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హమాల్‌ బాధితురాలుపై అదే బస్తీకి చెందిన ఆటోడ్రైవర్‌ నర్సింహ్మా పలుమార్లు అత్యాచార యత్నం చేశాడని పోలీసులు చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు కూలీ పని చేస్తారని, నిందితుడిపై గతంలో పలు నేరాలు వున్నట్లుగా తెలుస్తోంది. 

18:58 - March 9, 2018

యాదాద్రి : మోత్కూరులో జరిగిన భార్గవి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని ఎంబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శ పైళ్ళ ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రేమ పేరుతో మోసగించి దారుణంగా హత్యచేసిన నరేందర్‌ను అందుకు సహకరించిన తల్లిదండ్రులను కఠినంగా శిక్షించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. నిమ్న కులాలపై దాడులు పెరిగాయని, వెంటనే ఆ కులాల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆశయ్య డిమాండ్‌ చేశారు. 

18:54 - March 9, 2018

విజయవాడ : ఏపీకి చెందిన ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేందుకు బీజేపీ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఏపీకి కేంద్రం మంజూరు చేసిన జాతీయ ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. రాజధాని నిర్మాణానికి ఇంకా డిజైన్లు ఖరారుకాకుండానే.. కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె... రాష్ట్రానికి ఏ విషయంలో అన్యాయం జరిగిందో టీడీపీ నేతలు చెబితే.. వాటిని మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 

18:47 - March 9, 2018

చిత్తూరు : కాణిపాకం వినాయక స్వామి అలయంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సత్యప్రమాణం చేశారు. తాను మంత్రిగా పనిచేస్తున్నప్పుడు అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయని.. కావున మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే కాణిపాకం ఆలయంలో సత్యప్రమాణం చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నానని అందుకే రాజీనామా అనంతరం సత్యప్రమాణ చేశానని ఆయన తెలిపారు. నా శాఖలో జరుగుతున్న అవినీతిని అడ్డుకున్నాని కామినేని పేర్కొన్నారు. కాగా కాణిపాకంలో గణపతి దేవుడు సత్యప్రమాణాలకు ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. బీజేపీ, టీడీపీల మధ్య నెలకొన్న అస్థిరత మూలంగా ఏపీ కేబినెట్ లోని తన మంత్రి పదవికి కామినేని రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే. 

18:45 - March 9, 2018

సంగారెడ్డి : గుమ్మడిదల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికి మూడుసార్లు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

18:40 - March 9, 2018

అనంతపురం : హిందూపురంలోని ముక్కడిపేటలో విషాదం నెలకొంది. ఆహారం, కూల్‌డ్రింక్‌ సేవించిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు చనిపోయాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ముక్కడిపేటకు చెందిన ప్రదీప్‌, శివ, బాలాజీ స్నేహితులు. ఈ మధ్యాహ్నం ముగ్గురు కలిసి భోజనం చేసిన తర్వాత కూల్‌డ్రింగ్‌ తాగారు. వెంటనే స్పృహతప్పి పడిపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు యువకులు చనిపోయారు. మరో యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

18:37 - March 9, 2018

ఢిల్లీ : జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న కె.టి నవీన్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నవీన్‌ కుమార్‌ను ప్రశ్నించేందుకు సిట్‌ 5 రోజుల కస్టడీకి తీసుకుంది. గతవారం కూడా నవీన్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నవీన్‌ కుమార్‌కు హిందుత్వ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం హిందూ యువతను టార్గెట్‌ చేస్తోందని బిజెపి ఆరోపించింది. 2017 సెప్టెంబర్‌ 5న బెంగళూరులోని తన ఇంటి సమీపంలో 55 ఏళ్ల గౌరీ లంకేష్‌ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు.

18:35 - March 9, 2018

హైదరాబాద్ : మిలియన్‌ మార్చ్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రిజర్వేషన్ల కోటాపై ఢిల్లీలో నిరసన తెలిపే హక్కు కేసీఆర్‌కు ఉన్నప్పుడు.. ఇక్కడ అదే హక్కును ఎందుకు కాలరాస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. 

కాణిపాకంలో కామినేని సత్యప్రమాణం..

చిత్తూరు : కాణిపాకం వినాయక స్వామి అలయంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సత్యప్రమాణం చేశారు. తాను మంత్రిగా పనిచేస్తున్నప్పుడు అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయని.. కావున మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే కాణిపాకం ఆలయంలో సత్యప్రమాణం చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నానని అందుకే రాజీనామా అనంతరం సత్యప్రమాణ చేశానని ఆయన తెలిపారు. కాగా కాణిపాకంలో గణపతి దేవుడు సత్యప్రమాణాలకు ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. బీజేపీ, టీడీపీల మధ్య నెలకొన్న అస్థిరత మూలంగా ఏపీ కేబినెట్ లోని తన మంత్రి పదవికి కామినేని రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే.

పెద్దలసభ స్థానాలు ఎవరికో?!..

ఢిల్లీ : రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కుతాయోనని తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ నెలకొంది. రేపు, ఎల్లుండి సెలవులు రావడం, నామినేషన్‌ దాఖలుకు సోమవారామే చివరి రోజు కావడంతో ఎవరికి అవకాశం వస్తుందోనని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరిగే పొలిట్‌బ్యూరో సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం నాలుగో నామినేషన్‌ వేస్తుందా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది.

13న ఇంటర్ పరీక్ష యథాతథం..

హైదరాబాద్ : ఈ నెల 13న ఇంటర్ పరీక్ష యథాతథంగా ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షకు బంద్ తలపెట్టిన ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంద్ రోజున ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న తెలంగాణ బంద్‌కు ఎమ్మార్పీఎస్ పిలునిచ్చిన విషయం తెలిసిందే.

17:40 - March 9, 2018

హైదరాబాద్ : తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, సీఎం కేసీఆర్ బాటే తన బాటని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. నా పుట్టుక టీఆర్ఎస్ లోనే..చావు కూడా టీఆర్ఎస్ లోనేనని హరీశ్ రావు పునరుద్ఘాటించారు. ఇప్పటికీ ఈ విషయాన్ని తాను పలుసార్లు చెప్పానని..దీనిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వార్తలు రాయొద్దని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు హరీశ్ రావు తెలిపారు.

స్ట్రాటజీ కమిటీతో బాబు ..

అమరావతి : తాజా రాజకీయ పరిణామాలపై వేసిన స్ట్రాటజీ కమిటీతో సీఎం చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోమారు స్ట్రాటజీ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా వున్న మంత్రులు యనమల, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరకాల ఈ భేటీలో పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై కమిటీ చర్చించింది

17:34 - March 9, 2018

అమరావతి : తాజా రాజకీయ పరిణామాలపై వేసిన స్ట్రాటజీ కమిటీతో సీఎం చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోమారు స్ట్రాటజీ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా వున్న మంత్రులు యనమల, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరకాల ఈ భేటీలో పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై కమిటీ చర్చించింది. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు నిరసనగా టీడీపీ ఎంపీలు కేంద్ర కేబినెట్ నుండి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు వేడెక్యాయి. ఢిల్లీలో జరుగుతున్న రాజకీయపరిణామాలపై సీఎం చంద్రబాబు స్ట్రాటజీ కమిటీని వేసినవిషయం తెలిసిందే. ఈక్రమంలో కమిటీతో చంద్రబాబు చర్చలను జరుపుతున్నారు. 

17:27 - March 9, 2018

చెన్నై : కేకే నగర్ లో వున్న ఓ కళాశాల వద్ద దారుణం చోటు చేసుకుంది. కళాశాల గేటు ముందు అశ్విని అనే విద్యార్థినిపై ఓ యువకుడు దారుణంగా దాడి చేశారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం యువతిని ఆసుపత్రికి తరలించారు. కేకే నగర్ లోని మీనాక్షి కళాశాలలో బి.కామ్ చదువుతున్న అశ్వినిగా గుర్తించారు. అశ్వినిపై దాడి చేసిన యువకుడు ఆమె చాతీపైనా, కడుపులోను కత్తితో దాడి చేశాడు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఇది ప్రోమోన్మాది దాడి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కేకే నగర్ లో దారుణం..

చెన్నై : కేకే నగర్ లో వున్న ఓ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. కళాశాల గేటు ముందు అశ్విని అనే విద్యార్థినినపై ఓ  యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది.  దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని చితకబాది యువతిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ యువతి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ ..

సంగారెడ్డి: గుమ్మడిదల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్రమ్ముల్లో ఉన్న రసాయనాల వల్ల పేలుడు సంభవించింది. రసాయన డ్రమ్ములు ఒకదాని తర్వాత మరొకటి పేలుతుండటంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.

16:57 - March 9, 2018

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కార్తీ చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కార్తీని ఈడీ అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 20వ తేదీ వరకు కార్తీని అరెస్టు చేయరాదంటూ హైకోర్టు ఈడీని ఆదేశించింది. కార్తీకి మరో 6 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని సిబిఐ కోర్టును కోరింది. ఈ కేసులో కార్తీ సిఎ భాస్కర రామన్ జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 22 వరకు పొడిగించింది. ఈ కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు కార్తీకి నార్కో టెస్ట్‌ జరిపేందుకు అనుమతించాలి సిబిఐ బుధవారం కోర్టును కోరింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఆమోదం లభించేలా వ్యవహరించినందుకు కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి.

16:53 - March 9, 2018

అనంతపురం : ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి కేసు తుది దశకు చేరుకుంది. ఏడేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. సూరి కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను నాంపల్లి కోర్టు మరోసారి విచారించనుంది. సూరి హత్యకు సంబంధించిన అన్ని వివరాలను తెలంగాణ సిఐడి పోలీసులు కోర్టుకు సమర్పించారు. విచారణ ఈ రోజుతో పూర్తి అవుతున్న నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే నాంపల్లి కోర్టు తుది తీర్పు ప్రకటించనుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తివివరాలు వీడియో చూడండి..

16:49 - March 9, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైన టీడీపీ... ఎన్డీయే నుంచి కూడా బయటకు రావాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. హోదా ఉద్యమంతో తమతో టీడీపీ కలిసిరావాలని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ కోరారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమని, ఈ విషయంలో టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 

16:46 - March 9, 2018

ఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రంతో రాజకీయ యుద్ధం కొనసాగుతుందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ ప్రకటించారు. హోదా ఇచ్చే వరకు పోరు ఆగదని, పార్లమెంటు ఉభయ సభలను స్తంభంప చేస్తామని చెప్పారు. ఎన్డీయేతో తెగతెంపులు తప్పవన్నారు. కాగా రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చని క్రమంలో టీడీపీ ఎంపీలు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటికీ స్పందించకుంటే ఎన్డీయే ప్రభుత్వం నుండి కూడా వైదొలగుతామని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు.

16:05 - March 9, 2018

ఢిల్లీ : ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ముఖా ముఖి చర్చలకు సిద్ధమయ్యారు. కిమ్‌జోంగ్‌తో చర్చలు జరిపేందుకు ట్రంప్‌ ఒప్పుకున్నారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. వీరిద్దరు మే నెలలో సమావేశమయ్యే అవకాశం ఉందని...ఎప్పుడు ఎక్కడ అనేది త్వరలోనే వెల్లడిస్తామని వైట్‌హౌస్‌ పేర్కొంది. ఇద్దరు నేతల భేటి చారిత్రాత్మకం కానుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడిని కలవనున్న తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కావడం విశేషం. దక్షిణ కొరియా అధికారుల చొరవతో కిమ్‌, ట్రంప్‌ల మధ్య సమావేశం జరుగుతోంది. అణు కార్యక్రమాలు, క్షిపణి పరీక్షలను నిలిపివేసేందుకు కిమ్‌ కట్టుబడి ఉన్నారని వైట్‌ హౌస్‌ తెలిపింది. 70 ఏళ్లుగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య సత్సంబంధాలు లేవు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఉత్తరకొరియా అణు, క్షిపణి ప్రయోగాలకు పాల్పడుతూనే ఉండడంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతూ వచ్చింది. 

16:02 - March 9, 2018

ఢిల్లీ : త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్‌కుమార్ దేవ్, డిప్యూటీ సీఎంగా జిష్ణు దేవ్ బర్మన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తథాగతరాయ్ విప్లవ్‌కుమార్‌దేవ్, జిష్ణు దేవ్ బర్మన్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ ఎంపీ మురళి మనోహర్‌జోషి, త్రిపుర మాజీ సీఎం మానిక్ సర్కార్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తదితరులు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన 49 ఏళ్ల విప్లవ్‌ కుమార్‌ దేవ్ 16 ఏళ్ల పాటు సంఘ్‌ కార్యకర్తగా పనిచేశారు. త్రిపురలో పాతికేళ్లుగా సిపిఎం అధికారంలో ఉంది. ఫిబ్రవరి 18న జరిగిన ఎన్నికల్లో బీజేపీ-ఐపీటీఎఫ్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 

15:56 - March 9, 2018

అమరావతి : వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అడుగులేస్తున్నారు. ఇన్నాళ్ళూ ఇతర పార్టీలకు మద్దతిచ్చిన జనసేనాని.. ఇక నేరుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్దం అవుతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు రాజకీయాల్లో తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించనున్నారు. మార్చి 14న బహిరంగ సభలో జనసేనాని ఏమి మాట్లాడబోతున్నారు... పవర్‌ స్టార్‌ ప్రకంపనలు ఎవరిని తాకనున్నాయి.. ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా... తెలుగు రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న జనసేనపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం...

ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్ :
ఇంతవరకూ ఇతర రాజకీయ పార్టీలకు మద్ధతిస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. ఇక నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేందుకు సన్నద్ధం అవుతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఏళ్ళ తరబడి మూసపద్ధతిలో సాగుతున్న రాజకీయాల ట్రెండ్‌ మార్చి.. జనంతో మమేకం అయ్యేందుకు అనుగుణంగా అడుగులేస్తున్నారు. 2014 మార్చి 14న జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవర్‌ స్టార్‌ పవన్‌ ... దేశ, రాష్ర్ట రాజకీయాలను నిశితంగా గమనిస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై... ఇక నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ప్రజలతో కలిసి పనిచేసేందుకు సమాయత్తమయ్యారు. అందుకోసం కార్యాచరణ రూపొందించే దిశగా వడివడిగా అడుగులేస్తున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలే జనసేన టార్గెట్‌
2019 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధం అవుతున్నారు జనసేనాని. గుంటూరులో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో భవిష్యత్తు కార్యాచరణ వెల్లడించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇంతకీ ఆవిర్భావ సభలో ఏం ప్రకటించబోతున్నారు.. ఆ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.. అన్న అంశాలను రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పార్టీ ఏర్పడినప్పటినుంచీ జనసేన అధినేత పవన్‌ ఎప్పుడూ మీడియా హెడ్స్‌ ను కలవలేదు. ఇప్పటి వరకు వారితో అడపాదడపా తెరవెనుక సంప్రదింపులకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు మీడియా ముఖ్యులతో చిట్‌చాట్‌ పెట్టి... దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే తాను ఏర్పాటుచేసిన పార్టీ, భవిష్యత్ కార్యాచరణపై మనసులోని విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

దివంగత ఎంజీఆర్‌ ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చా-పవన్‌ కళ్యాణ్

తమిళనాట రాజకీయాల్లో తలపండిన నేత దివంగత ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు పవన్‌ కళ్యాణ్.... నేడు తెలుగు రాష్ర్టాల్లో రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోందన్న పవన్... అధికార, ప్రతిపక్షపార్టీల వ్యవహారం పారదర్శకంగా లేదన్నారు. రాజకీయ పార్టీలు మాటలతో మభ్యపెడుతూ... పబ్బం గడుపుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ఏమి చేస్తే బాగుంటుందన్న దానిపై మీడియా ప్రతినిధులతో సూచనలు, సలహాలు తీసుకునే ప్రయత్నం చేశారు. కాగా 2019 ఎన్నికల బరిలో నిలవనున్న జనసేనాని... ఏపార్టీని బలహీన పరుస్తాడో.. ఏ పార్టీకి బలంగా నిలుస్తాడో.. లేక తానే సీఎం అభ్యర్థిగా నిలిచి.. వారసత్వ రాజకీయాలకు చెక్‌ పెడతాడా అన్నది సర్వత్రా చర్చనీయాంశగామారింది. రాజకీయాల్లో తాను పోషించబోయే పాత్రతో పాటు.. అన్నివిషయాలను పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రకటిస్తానంటూ పవన్‌ కళ్యాణ్‌ కొద్దిరోజులుగా చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో... వెండితెరమీద ఓ వెలుగు వెలిగిన తారలు సినీజీవితానికి పుల్‌స్టాప్‌ పెట్టి.. రాజకీయాలవైపు అడుగులేస్తున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయాల్లో జనసేనాని ఏమేరకు సక్సెస్‌ అవుతాడన్నది తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.. 

15:52 - March 9, 2018

ఢిల్లీ : త్రిపురలో వామపక్ష కార్యకర్తలు, ప్రజలపై జరుగుతున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులను ఆపాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్‌ డిమాండ్‌ చేశారు. త్రిపురలో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వారం రోజులుగా సీపీఎం కార్యాలయాలు, కార్యకర్తలపై యథేచ్చగా దాడులు జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దాడులపై విచారణ కూడా జరపడం లేదన్నారు. త్రిపురలో దాడులను నిరసిస్తూ ఢిల్లీలో 6 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి హాజరైన ప్రకాశ్‌కారత్‌... ఇప్పటి వరకు ఆరువందలకుపైగా వామపక్ష కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగాయని.. ఇందులో 700 మంది గాయపడ్డారన్నారు. ఇదే ర్యాలీలో పాల్గొన్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు... బీజేపీ త్రిపురలో గెలిచిన తర్వాత విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. విగ్రహాలను కూలదోయడం నాగరికత ఏమాత్రం అనిపించుకోదన్నారు. దాడులతో వామపక్ష కార్యర్తలను భయపెట్టాలనుకోవడం అమాయకత్వమే అవుతుందన్నారు. త్రిపురలో జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సీపీఎం నేత వి. శ్రీనివాసరావు కోరారు. 

15:49 - March 9, 2018
15:47 - March 9, 2018

హస్తినలో వామపక్ష పార్టీల చలో పార్లమెంట్..

ఢిల్లీ : ఆరు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ కు ర్యాలీ నిర్వహించారు. త్రిపురలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులను నిరసిస్తూ చలో పార్లమెంట్ ను నిర్వహించారు. త్రిపురలో సీపీఎం కార్యకర్తల దాడిని, లెనిన్ విగ్రహాల కూల్చివేతలపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీలో పాల్గొన్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీలో ప్రకాశ్ కరత్, డి.రాజా, కవితా కృష్ణన్, బీవీ, రాఘువులు, వి, శ్రీనివాసరావులతో పాటు ఇతర వామపక్ష కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

నా చావు, పుట్టుక ఇక్కడే : హరీశ్

హైదరాబాద్ : తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, సీఎం కేసీఆర్ బాటే తన బాటని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. నా పుట్టుక టీఆర్ఎస్ లోనే..చావు కూడా టీఆర్ఎస్ లోనేనని హరీశ్ రావు పునరుద్ఘాటించారు. ఇప్పటికీ ఈ విషయాన్ని తాను పలుసార్లు చెప్పానని..దీనిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వార్తలు రాయొద్దని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు హరీశ్ రావు తెలిపారు.

15:03 - March 9, 2018

శ్రీకాకుళం : జిల్లా అరసవల్లిలో మూలవిరాట్టును తాకే సూర్యకిరణాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీలలో సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. అయితే మబ్బులు పట్టడంతో సూర్యనారాయణ స్వామి పాదాలకు ఇవాళ సూర్యకిరణాలు తాకకపోవడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. 

14:59 - March 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వనున్న పెట్టుబడి రాయితీని కౌలు, పోడు రైతులకు ఇవ్వాలని టీ రైతు సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో...ప్రభుత్వం ఇచ్చే 4వేల రూపాయల రాయితీని కౌలు, పోడు రైతులకు వర్తింప జేయాలంటూ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలో ఎక్కువగా కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని.... దీనిని నివారించేందుకు పెట్టుబడి రాయితీ పథకాన్ని వర్తింప జేయాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

14:56 - March 9, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోందని, హామీలకు అనుగుణంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని అన్నారు. హోదా వస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని, స్పెషల్‌ స్టేటస్‌ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్పారు.

14:54 - March 9, 2018

ఢిల్లీ : రిజర్వేషన్లు పెంచుకొనే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలంటూ పార్లమెంట్ లోపలా బయటా తెలంగాణ రాష్ట్ర సమితి తన ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నది. వరుసగా ఐదోరోజు ఎంపీలు.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తమ గళం వినిపించారు. సభలో నినాదాలతో పాటు.. పార్లమెంటు ద్వారం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్ర అధికారాలపై కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదని ఆ పార్టీ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. 

14:51 - March 9, 2018

అమరావతి : నాలుగేళ్లు ఓపిక పట్టామని, టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు ముఖ్యంకాదని ఏపీ మంత్రులు సోమిరెడ్డి, కాల్వశ్రీనివాసులు అన్నారు. మోదీ ఫోన్‌ చేసినప్పుడు కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. ఏ రోజు , ఏ విషయంపైనా కేంద్రంపై ఒత్తిడి తేలేదని, రాష్ర్ట ప్రయోజనాల కోసమే అన్ని సార్లు కేంద్రం చుట్టూ తిరిగామని అన్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

14:49 - March 9, 2018

ఢిల్లీ : ఎన్ని పోరాటాలు చేసినా బీజేపీ రాష్ట్రాన్ని పట్టించుకోదన్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇకపై ఆందోళనలు చేసినా ఉపయోగం లేదన్నారు. బీజేపీతో మాకు తలాక్ అయిపోయిందని... విడిపోయిన భార్యభర్తలు పిల్లల కోసం.. మాట్లాడుకున్నట్లే.. మేము కూడా బీజేపీతో మాట్లాడుతున్నాయని తెలిపారు. హోదా కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకోవాల్సిందేనని జేసీ సూచించారు. 

14:45 - March 9, 2018

అమరావతి : అమరావతిలో ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల, పరకాల, కుటుంబరావు సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీలో పరిణామాలను నిశితంగా గమనించాలని కమిటీని చంద్రబాబు ఆదేశించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ... పార్లమెంటులో ఏపీ సభ్యుల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడగా...రాజ్యసభను మధ్యాహ్నం 2.30గంటల వరకు వాయిదా వేశారు. పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం ముందు టీడీపీ, వైసీపీ సభ్యుల ధర్నా ఇవాళ కూడా కొనసాగింది. మరోవైపు పార్లమెంటు స్ట్రీట్‌లో ప్రత్యేకాంధ్ర పోరాట సమితి ఆందోళనకు దిగింది. 

14:41 - March 9, 2018

హైదరాబాద్ : మార్చి 8వ తేదీ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా అడ్వకేట్ పార్వతిగారు మహిళా దినోత్సవ విశేషాలను తెలిపారు. 

బీజేపీతో మాకు తలాక్ : జేసీ

ఢిల్లీ : భారతీయ జనతా పార్టీతో తమకు తలాక్ అయిపోయిందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.భార్యాభర్తలు తలాక్ తీసుకున్నాక పిల్లల కోసం ఏమి చేయాలనే దానిపై మాట్లాడుకున్నట్టే తాము కూడా భాజాపాతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా భాజాపా తమని పట్టించుకోదని.. ఇకపై ఆందోళనలు చేసి కూడా ఉపయోగం లేదన్నారు. ఎన్నికలకు వెళ్ళి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.తాను పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. వైకాపా అధినేత జగన్‌కు దమ్ముంటే ముందు విజయసాయిరెడ్డితో రాజీనామా చేయించాలని సవాల్‌ చేశారు.

తాజా పరిణామాలపై స్ట్రాటజీ కమిటీ..

అమరాతి : తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ కమిటీని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు యనమన, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరకాల, కుటుంబరావు కమిటీలో వున్నారు. 

13:30 - March 9, 2018

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ చేపట్టిన ప్రజా సక్సెస్ యాత్ర సక్సెస్ అయ్యిందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. ఇటీవలే బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఐదు జిల్లాల్లో 17 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగి మొదటి విడత యాత్ర పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఉత్తమ్ తో టెన్ టివి మాట్లాడింది. తాము చేపట్టిన బస్సు యాత్ర నుండి ప్రజల నుండి స్పందన వచ్చిందని, యాత్ర సంకల్పం నెరవేరిందన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:28 - March 9, 2018

విజయవాడ : టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు కోరుతూ ఎంపీలు..ఇతర నేతలు..ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలపై జేసీ మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం దక్కదని..ఏమీ కాదని తేల్చిచెప్పారు.

తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు. బీజేపీతో తమకు తలాక్ అయిపోయిందని, భార్యభర్తలు తలాక్ తీసుకున్నాకా పిల్లల కోసం ఏమి చేయాలనే దానిపై మాట్లాడుకున్నట్లే తాము కూడా బీజేపీ వారితో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. హోదా కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకోవాల్సిందేనని తెలిపారు. 

13:11 - March 9, 2018

ఢిల్లీ : తాము తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాం..వైద్య ఖర్చులకు డబ్బులు లేవు...వైద్యం అందించినా బతకలేం...తాము ఎన్నో బాధలు పడుతున్నాం...మరణానికి అనుమతినివ్వండి అంటూ ఎంతో మంది కోర్టులను..సుప్రీంకోర్టును..ప్రభుత్వాలను కోరుతుండడం చూస్తూనే ఉంటాం. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కారుణ్య నియామకాలపై తీర్పును వెలువరించింది. ‘గౌరవంగా మరణించే హక్కు మనుషులకు ఉంటుంది' అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కారుణ్య మరణానికి అనుమతినించాలని పేర్కొంటూ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆరోగ్యం కుదుటపడదు అని వైద్యులు రిపోర్టు ఇచ్చిన అనంతరం కారుణ్య మరణానికి అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది. వెంటిలేషన్..లేవలేని పరిస్థితిలో ఉన్న సమయంలోనే ఇది వర్తిస్తుందని..ఎవరూ ఇష్టమొచ్చినట్లుగా కోరితే అనుమతించవద్దని సూచించింది. 

కారుణ మరణాలపై సుప్రీం తీర్పు...

ఢిల్లీ : ఇష్టపూర్వక అనాయస మరణంపై సుప్రీం సంచలనాత్మక తీర్పును వెల్లడించింది. బాధ నివారణ కోసం ఇష్టపూర్వక అనాయాస మరణానికి అనుమతినిచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. 

13:02 - March 9, 2018
 • పకోడీ..సమోసాలు రుచికరంగా...కరకరలాడుతూ రావాలంటే...కొద్దిగా పాలు పోసి పిండి కలుపుకుని..ఆ తరువాత చిటికెడు ఉప్పు వేసి నూనెలో వేయించుకురని చూడండి.
 • వేపుడు కూరలు చేసుకుంటున్నారా ? అయితే రుచికరంగా ఉండడం లేదా ? మీ సమస్య ఇదే అయితే వేపు కూర దించే ముందు కొద్దిగా శనగపిండి చల్లి చూడండి.
 • పాలు మరిగే సమయంలో విరగకుండా ఉండాలంటే కొద్దిగా తేనే..లేదా సోడా వేయవచ్చు.
 • బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే అందులో కరివేపాకు ఆకులు బియ్యంలో వేస్తే సరిపోతుంది.
 • కూరలు రుచిగా ఉండాలంటే దించే ముందు కొత్తిమీర తురుము, ధనియాల పొడి చల్లి దించితే కూర రుచిగా ఉంటుంది.
 • కూరగాయ ముక్కల్లో క్రిములు..దుమ్ము ఉంటుంటాయి. కూరగాయ ముక్కలు కడిగే సమయంలో నీళ్లలో పసుపు వేసి కడిగి చూడండి.
 • నెయ్యి త్వరగా పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.

పదవులు ముఖ్యం కాదు - మంత్రి సోమిరెడ్డి...

విజయవాడ : ప్రధానమంత్రి ఫోన్ చేసినప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఒకే విషయం చెప్పారని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మంత్రులు రాజీనామా చేయడం జరిగిందని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. పదవులు ముఖ్యం కాదని..సమస్యలు పరిష్కారం కావాలన్నారు. 

12:52 - March 9, 2018

ఫ్రిజ్...ప్రస్తుతం అందరి ఇంట్లో కామన్ అయిపోయింది. ఎండాకాలం వచ్చేసరికి దీనికి యమ డిమాండ్ ఉంటుంది. ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు..ఇతరత్రా పెడితే ఎక్కువ రోజులు వస్తాయని భావిస్తుంటారు. అదే ఎండాకాలం బయటపెట్టడం వల్ల కొద్ది రోజుల్లోనే పాడైపోతుంటాయని అనుకొంటూ ఫ్రిజలలో పలు వస్తువులను భద్రపరుస్తుంటారు. కానీ ఎక్కువ రోజులు పెట్టడం మంచిదేనా ?

ఫ్రిజ్ లో నుండి తీసుకున్న ఆహారం..తినడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు ఆహారం అందులో ఉండడం వల్ల దానిపై బ్యాక్టీరియా చేరుతుందని..దీనిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఫ్రిజ్ లో పండ్లు..కూరగాయాలు ఎక్కువ సమయం ఉండకుండా చూసుకోండి. ఫ్రిజ్ నుండి బయటకు తీసే వస్తువులను కనీసం 30 నిమిషాల వరకు ముట్టుకోకండి. అనంతరం వాటిని బాగా కడుక్కొని అప్పుడు వండుకోవడం..తినడం మంచిందని పేర్కొంటునాన్రఉ. 

12:45 - March 9, 2018

ఎండాకాలం వచ్చేసింది..ఇప్పటి నుండే ఎండలు మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యంపై ఒకింత శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. నీరు ఎక్కువగా దొరికే వాటిలో 'కీర' ఒకటి. ఇది ఆరోగ్యానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు.

 • కీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో బాగా పనిచేస్తుంది.
 • పాస్పరస్‌, విటమిన్లు, పోటాషియం, నీటి శాతం, మెగ్నీషియం, మినరల్స్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి.
 • ప్రతి రోజు రెండు గ్లాసుల కీరా జ్యూస్ తాగితే కడుపు నొప్పి..అల్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
 • కీరలో 95 శాతం నీరు ఉండడం వల్ల శరీరానికి చల్లదనం అందిస్తుంది.
 • వేసవిలో కీర ముక్కలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదిని వైద్యులు పేర్కొంటుంటారు. 

ఏపీని కేంద్రం ఆదుకుంటుంది - పురంధేశ్వరీ...

విజయవాడ : ఏపీ రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా న్యాయం చేస్తుందని బీజేపీ నేత పురంధేశ్వరీ పేర్కొన్నారు. అమరవాతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే పాతిక కోట్లు ఇచ్చిందన్నారు. 

12:31 - March 9, 2018

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక సినీ ఇండస్ట్రీ గా ఉన్న తెలుగు సినిమా ఒకే ఒక్క సినిమా తో తన స్థాయి పెంచుకుంది. మార్కెట్ కూడా పెరిగింది. తన డైరెక్షన్ తో తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ మార్కెట్ పెంచిన డైరెక్టర్ ఇప్పుడు మరో అద్భుతం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇంతకు ముందు తెలుగు సినిమాలు అంటే చులకనభావంతో చూసే కొన్ని ఇండస్ట్రీస్ కి బాహుబలి సినిమా ఒక ఆన్సర్ చెప్పింది. వరల్డ్ సినిమాని ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది బహుబలి సినిమా. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న డైరెక్టర్ రాజమౌళి, తన క్రియేటివ్ థాట్స్ కి గ్రాఫిక్స్ ని అద్దె రంగుల తెరల మాంత్రికుడు రాజమౌళి ఈ బాహుబలి సినిమాని బాగా తెరకెక్కించాడు.

వరుస సినిమాలతో హిట్ ట్రాక్ లో ఉన్న హీరో జూనియర్ 'ఎన్ టి ఆర్'. తన ప్రీవియస్ సినిమా 'జై లవ కుశ'లో మూడు పత్రాలు పోషించి మెప్పించాడు. ప్రెజెంట్ సినిమాల్లో స్పీడ్ పెంచి తన మార్కు యాక్టింగ్ తో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పిస్తున్న యంగ్ హీరో జూనియర్ ఎన్ టి ఆర్ విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్నాడు. డాన్స్ లోను ఫైట్స్ లోను తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పరుచుకున్న ఎన్ టి ఆర్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అయ్యాడు.

తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న మరో హీరో రామ్ చరణ్ తేజ్. ఇప్పుడు 'రంగస్థలం' సినిమా మీద ఫుల్ ఫోకస్ లో ఉన్న రాంచరణ్ నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో ఎన్ టి ఆర్ తో మల్టి స్టారర్ అనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా 'ఎన్టీఆర్- చరణ్' ఇద్దరూ కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చారు. వీరిద్దరితో ఓ వర్క్ షాప్ నిర్వహించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. అంటే రాజమౌళి మరో రికార్డుకి రెడీ అయ్యాడన్నమాట.

12:27 - March 9, 2018

ఈ వారం సినిమాల రిలీజ్ తక్కువనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ బంద్ వల్లనో లేక వేరే ఏ కారణం వల్లనో ఈ వీక్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా లేవు అనుకునే టైంలో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో ఒకటి విమెన్ ఓరియెంటెడ్ అయితే ఇంకోటి యూత్ ఫుల్ లవ్ స్టోరీ. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు కథల్లో కొత్తదనంతో దూసుకుపోతుంది. ఇలాంటి టైం లో పరభాష రీమేక్ తో రాబోతున్నాడు హీరో నిఖిల్. 'కేశవ' లాంటి డిఫెరెంట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు 'నిఖిల్'. ఇప్పుడు నిఖిల్ కన్నడలో హిట్ అయిన 'కిరాక్ పార్టీ' సినిమాని తెలుగులో కిర్రాక్ పార్టీ గా తెస్తున్న విషయం తెలిసిందే. యూత్ ఫుల్ సబ్జెక్టు తో లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్న ఈ 'కిర్రాక్ పార్టీ' ఎలా ఉంటుందో చూడాలి.

సీనియర్ హీరోయిన్స్ తమ వయసుకి తగ్గ పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. తన గ్లామర్ తో యూత్ ని ఆకట్టుకుని హీరోయిన్ గా రాణించిన ఈ సౌత్ బ్యూటీ 'నయనతార' ఇప్పుడు పవర్ఫుల్ కలెక్టర్ రోల్ లో కనిపించబోతుంది. బాలకృష్ణ తో 'జై సింహ' సినిమాలో గ్లామర్ రోల్ లో నటించిన 'నయనతార' ఇప్పుడు 'కర్తవ్యం' అనే టైటిల్ తో తెలుగులో రాబోతుంది. ఈనెల 16న నిఖిల్ 'కిర్రాక్ పార్టీ', 'నయనతార' 'కర్తవ్యం' రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

12:23 - March 9, 2018

నాచురల్ లుక్స్ తో ఉండే ఈ హీరో ఆడియన్స్ కి నచ్చే కథలతో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్నాడు. ప్రతి సినిమాలో డిఫెరెంట్ స్టోరీ లైన్ తో వచ్చి రెగ్యులర్ సినిమాలు చేసే హీరోలకి షాక్ ఇస్తున్నాడు. తెలుగులో వచ్చిన కొన్ని సినిమాలే అయినా తెలుగు ఆడియన్స్ కి సుపరిచితుడు తమిళ్ హీరో ధనుష్. చిన్న చిన్న సినిమాలతో పెద్ద స్టార్ అయ్యాడు హీరో ధనుష్. 'రఘువరన్ బీటెక్' తో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. సౌత్ ఇండియా నుండి బాలీవుడ్ కి వెళ్లి హీరో గా హిట్ కొట్టి ఇప్పుడు హాలీవుడ్ లో అడుగు పెట్టాడు ఈ యంగ్ హీరో. తన నటనతో ఎలాంటి పాత్రకి అయినా జీవం పొయ్యగల ఈ యంగ్ హీరో ఇంజినీరింగ్ చదివిన నిరుద్యోగిగా రఘువరన్ బీటెక్ లో బాగా నటించాడు.

ధనుష్ తన నెక్స్ట్ సినిమాలో ఎప్పటిలాగానే వైవిధ్యం చూపిస్తున్నాడు. తమిళంలో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో 'వడ చెన్నై' ఒకటి. ఇది ధనుష్ డ్రీమ్ ప్రాజెక్టు. ఈ సినిమా కోసం అతను ఐదేళ్లుగా సన్నాహాలు చేసుకుంటుండటం విశేషం. ఇంతకుముందు ధనుష్ తో 'పొల్లాదవన్’.. 'ఆడుగళం' లాంటి క్లాసిక్స్ తీసిన వెట్రిమారన్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఫస్ట్ లుక్ చూస్తేనే ఇంటరెస్టింగ్ గా ఉంది ఈ వడ చెన్నై. 

12:12 - March 9, 2018

ఢిల్లీ : లోక్ సభలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. వి వాంట్ జస్టిస్ అంటూ ఏపీ ఎంపీలు నినాదాలో హోరెత్తిస్తున్నారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ పునర్ విభజన చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం..గురవారం కీలక నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నుండి తెగదెంపులు చేసుకుంటున్నట్లు టిడిపి వెల్లడించగానే కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలను రాష్ట్రపతి శుక్రవారం ఉదయం ఆమోదించారు.

శుక్రవారం ఉదయం లోక్ సభ..రాజ్యసభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళనను కంటిన్యూ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీ ఎంపీలు నినదించారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో వెంటనే సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రారంభమైన సభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. వెల్ లోకి వెళ్లి సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. చివరకు స్పీకర్ సుమిత్రా మహజన్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

అగర్తాలకు మోడీ...

త్రిపుర : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అగర్తాలకు చేరుకున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా బిప్లాబ్ దేవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

 

తిరిగి లోక్ సభ ప్రారంభం..గందరగోళం...

ఢిల్లీ : లోక్ సభ వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం 12గంటలకు తిరిగి సభ ప్రారంభమైంది. ప్రతిపక్షాలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ వెల్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 

11:49 - March 9, 2018
11:48 - March 9, 2018

ఢిల్లీ : కేంద్ర మంత్రులుగా ఇన్నాళ్లు ఉన్న అశోక్ గజపతి రాజు..సుజనా చౌదరీలు కాసేపటి క్రితం మాజీలయ్యారు. ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు..ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు చేయడం లేదని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం బీజేపీకి గుడ్ బై చెప్పింది. దీనితో కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాజీనామాలను గురువారం సమర్పించారు. సెంటిమెంట్ కోణంలోనే తాము రాజీనామాలు చేయడం జరిగిందని ప్రధానికి వివరించారు. అనంతరం ఈ రాజీనామాలను రాష్ట్రపతి కార్యాలయానికి పీఎం పంపించారు.

శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజీనామాలపై నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 75 (2) ప్రకారం రాజీనామాలను ఆమోదించారు. రాష్ట్రపతి సూచన మేరకు పౌర విమానయాన శాఖల బాధ్యతలను ప్రధాన మంత్రి మోడీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

భాను కిరణ్ ను విచారించనున్న కోర్టు...

అనంతపురం : ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూర్యనారాయణ హత్య కేసు తుది దశకు చేరుకుంది. నేటితో సూరి కేసు విచారణ ముగియనుంది. కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ను మరోసారి నాంపల్లి కోర్టు విచారించనుంది. 

11:37 - March 9, 2018

అనంతపురం : ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూర్యనారాయణ హత్య కేసు తుది దశకు చేరుకుంది. నేటితో సూరి కేసు విచారణ ముగియనుంది. కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ను మరోసారి నాంపల్లి కోర్టు విచారించనుంది. మద్దెల చెరువు సూరి 2011 జనవరి 3న భాను కిరణ్ కాల్చి చంపిన సంగతి తెలిసిందే. సుమారు ఏడు సంవత్సరాల పాటు ఈ విచారణ కొనసాగనుంది. సూరి హత్యకు సంబంధించి అన్ని వివరాలను తెలంగాణ సీఐడీ కోర్టుకు సమర్పించింది. సూరి డ్రైవర్ మధు మోహన్ రెడ్డి వాంగ్మూలంతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు కూడా సమర్పించింది. మరి ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

కీలక నేతలతో బాబు భేటీ...

అనంతరం : ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. తాజా పరిణామాలపై చర్చించేందుకు స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా యనమల, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, అచ్చెన్న నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పరరకాల, కుటుంబరావులున్నారు.  

11:28 - March 9, 2018

ఢిల్లీ : ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలని టిడిపి ఎంపీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఎంపీలు తమ నిరసనను తెలియచేస్తున్నారు. కానీ కేంద్రం పట్టించుకోకపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించగానే కేంద్ర మంత్రులుగా ఉన్న సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు తమ పదవులుకు రాజీనామా చేశారు.

శుక్రవారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీలు ధర్నా చేపట్టారు. ధర్నాలో అశోక గజపతి రాజు పాల్గొన్నారు. రోజుకో వేషంతో వస్తున్న టిడిపి ఎంపీ శివప్రసాద్ ఈసారి కోయదోర వేషంతో తన నిరసన తెలియచేశారు. మరోవైపు వైసీపీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆందోళనలు చేపడుతున్నాయి. 

టిడిపి ఎంపీల ధర్నా...

ఢిల్లీ : గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీలు ధర్నా చేపట్టారు. ధర్నాలో అశోక గజపతి రాజు పాల్గొన్నారు. కోయదోర వేషంతో ఎంపీ శివప్రసాద్ వచ్చి తన నిరసన తెలియచేశారు. 

11:14 - March 9, 2018

ఢిల్లీ : లోక్ సభలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండది విపక్ష సభ్యులు ఆందోళన చేపడుతుండడంతో సభా కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇతర విపక్ష సభ్యులు ఆందోలన చేపట్టాయి. రాజ్యసభ..లోక్ సభలలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సభ ప్రారంభం కాగానే సభ్యులు చేస్తున్న ఆందోళనతో సభలను స్పీకర్..ఛైర్మన్ లు వాయిదా వేస్తున్నారు.

శుక్రవారం నాడు ఉదయం ప్రారంభయ్యాయి. లోక్ సభను రిపబ్లిక్ ఆఫ్ కొరియా సభ్యులు సందర్శించారు. ఈ సందర్భగా స్పీకర్ సుమిత్రా మహజన్ స్వాగతం పలికారు. అనంతరం ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వెంటనే సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఛైర్మన్ వెంకయ్య నాయుడు జీరో అవర్ అని ప్రస్తావించగానే సభ్యులు వెల్ లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. సభను మధ్యాహ్నం 02.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 

లోక్ సభ వాయిదా....

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా రాజ్యసభ..లోక్ సభలలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా లోక్ సభలో సభ్యులు ఆందోళన చేపట్టాయి. దీనితో స్పీకర్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

లోక్ సభలో లొల్లి...

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా రాజ్యసభ..లోక్ సభలలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా లోక్ సభలో సభ్యులు ఆందోళన చేపట్టాయి. 

పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభం...

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా రాజ్యసభ..లోక్ సభలలో ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతుండడంతో సభలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. 

భార్గవి హత్య కేసులో వెలుగు చూస్తున్న నిజాలు...

యాదాద్రి : మోత్కూరు (మం) బుజిలాపురంలో జరిగిన భార్గవి హత్య కేసులో నిజాలు వెలుగు చూస్తున్నాయి. భార్గవిని హత్య చేసిన అనంతరం తల్లిదండ్రుల సహకారం తీసుకున్నాడని వెలుగు చూసింది. హత్య అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న తల్లిదండ్రులు సత్తయ్య...ఆండాలు మృతదేహాన్ని నరేందర్ పూడ్చిపెట్టాడు. నరేందర్..తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

10:52 - March 9, 2018

హైదరాబాద్ : తెలంగాణా రాష్ర్ట ప్రభుత్వం పోలీస్‌ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోందా... పోలీస్‌ శాఖలో ఉన్నత క్యాడర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ నియామకంలో కేంద్రం జోక్యం చేసుకునే పద్ధతికి చెక్‌పెట్టేందుకు నిర్ణయం తీసుకోనుందా... ఆ మేరకు తెలంగాణ పోలీస్ ఫోర్సెస్‌ యాక్ట్‌ను తీసుకురానుందా... రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడుతోందా..? తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పోలీస్‌ శాఖలో విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. పోలీస్ శాఖలో ఉన్నతాధికారి డీజీపీ నియామకాన్ని రాష్ర్ట ప్రభుత్వమే చేపట్టేలా నూతన చట్టం తీసుకురానున్నట్లు సమాచారం. డీజీపీ నియామకంపై కేంద్రానికున్న అధికారానికి చెక్‌పెట్టాలని చూస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసం హెడ్ ఆఫ్ ది పోలీస్‌ ఫోర్సెస్ యాక్ట్‌ 2018 బిల్లును రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది..

ప్రస్తుత విధానం ప్రకారం డీజీపీని నియమించాలంటే డీజీపీ హోదాగల ఐపీఎస్ అధికారుల జాబితాను రాష్ర్ట ప్రభుత్వం యూపీఎస్‌సీకి పంపిస్తుంది... అందులో ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్సీ, డీవోపీటీ రాష్ర్టానికి తిరిగి పంపుతాయి. అందులో ఒకరిని సీఎం విచక్షాణాధికారం మేరకు డీజీపీగా నియమిస్తారు. కానీ... కొత్త చట్టం అమల్లోకి వస్తే.. యూపీఎస్సీ, కేంద్రంతో సంబంధం లేకుండా డీజీపీ హోదాగల ఐపీఎస్ అధికారుల్లో ఒకరిని సీనియారిటీ ప్రకారం ముఖ్యమంత్రే నియమించవచ్చు.

రాష్ర్ట విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసినట్లే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాలని చూస్తోంది.. జేవీ రాముడు డీజీపీగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఇలాగే చట్టం చేసింది. అదే మాదిరిగానే తెలంగాణలో కూడా చట్టాన్ని తీసుకురానుంది ప్రభుత్వం. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు గతవారమే సాధారణ పరిపాలనా శాఖ అనుమతి ఇవ్వగా... న్యాయశాఖ తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే... రాష్ర్ట ముఖ్యమంత్రే నేరుగా డీజీపీని నియమించుకునే అవకాశం ఉంటుంది... ఇప్పటికే రాష్ర్టాలపై కేంద్రం పెత్తనాన్ని తగ్గించాలని భావిస్తున్న కేసీఆర్‌... ఈ కొత్తచట్టంతో ఆ దిశగా ఒక అడుగు ముందుకేసినట్లే అవుతుందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది.

10:50 - March 9, 2018

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలంటే.. గ్రేటర్‌ ప్రజల మనస్సు చూరగొనాలి... గ్రేటర్‌లో ఉన్న నలభై శాతం సెటిలర్స్‌ను ప్రసన్నం చేసుకోకుండా అధికార పీఠం ఎక్కడం ఎలా సాధ్యం.. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న విశ్లేషణ.అందుకే హైదరాబాద్‌లోని సెటిలర్స్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది హస్తం పార్టీ.. ఇందులో భాగంగా సెటిలర్స్‌కు చేరువయ్యేందుకు స్పీడ్‌ పెంచారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్.

2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. అందుకోసం పటిష్టమైన ప్రణాళికతో అడుగులేస్తోంది. ఇప్పటికే బస్సుయాత్రతో సీఎం కేసీఆర్‌ హామీలను ఎండగడుతున్న కాంగ్రెస్‌ నేతలు.. ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్‌ ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎత్తిచూపుతూనే.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది సూటిగా చెబుతున్నారు.ఉత్తర తెలంగాణలో కారు జోరుకు బ్రేకులు వేసేందుకు యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేసుకుని... క్షేత్రస్థాయిలో దూసుకుపోతోంది కాంగ్రెస్‌ పార్టీ. కానీ.. సౌత్‌ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడం ఖాయమని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. ఉత్తర తెలంగాణలో కూడా ప్రతి జిల్లాకు కనీసం మూడు నుంచి నాలుగు సీట్లు దక్కించుకుంటామనే ధీమాతో వారున్నారు. కానీ... దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాలనుంచి వచ్చే సీట్లతోనే అధికార పీఠం ఎక్కగలమా అన్న సందేహంలో ఉన్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేతలు. -

కాంగ్రెస్‌ పార్టీ దక్షిణ తకెలంగాణలో మెజార్టీ సీట్లు దక్కించుకున్నా.. అధికార పీఠం ఎక్కాలంటే గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అసెంబ్లీ స్థానాల సంఖ్య కీలకంగా మారనుంది. గ్రేటర్‌లో సీట్లు సాధించకుండా అధికారం సాధ్యం కాదనే భావన కాంగ్రెస్‌లో నేతల్లో అంతర్లీనంగా ఉంది.. అధికారం దక్కాలంటే... గ్రేటర్‌లో దాదాపు నలభైశాతం వరకూ ఉన్న సెటిలర్స్ కీలకంగా మారనున్నారు. సెటిలర్ల్స్ ఎటువైపు మొగ్గు చూపుతారో.. ఆ పార్టీదే అధికారమనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు కాంగ్రెస్ కూడా సరిగ్గా ఇదే విషయంపై దృష్టి పెట్టింది.. సెటిలర్స్ మనసు చూరగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ర్ట విభజన తర్వాత కాంగ్రెస్‌ను దూరం పెట్టిన సెటిలర్స్‌కు చేరువయ్యేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతోంది పీసీసీ. అధికార పార్టీకి ధీటుగా తమ వ్యూహాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు హస్తం నేతలు. ఇతరపార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్న ఆంధ్ర సెటిలర్స్‌లోని కమ్మ, కాపు సామాజిక వర్గాల వారికి కాంగ్రెస్‌ కండువా కప్పేందుకు ముమ్మరంగా లాబీయింగ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

సెటిలర్స్ టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌... ఆ పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీడీపీ ఓటు బ్యాంకు తమ వైపు మళ్ళాలంటే.. ఇదే సరైన మార్గంగా భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. అందుకోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ఆకర్ష్‌ అస్ర్తాన్ని ప్రయోగిస్తోంది. టీడీపీ ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు టీఆర్ఎస్‌ దూకుడుగా వెళుతుంటే... కాంగ్రెస్‌ కూడా అదే స్పీడ్‌లో వెళుతోంది.
సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో.. అదే వర్గానికి చెందిన ముఖ్యనేతలను బరిలోకి దింపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది కాంగ్రెస్. మొత్తానికి సెటిలర్స్‌లో ఆకర్షణగల వారిని ముందుపెట్టి... ఆయా వర్గాల ఓట్లు కొల్లగొట్టేందుకు చూస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. గ్రేటర్‌ పరిధిలో కనీసం సగం అసెంబ్లీ సీట్లైనా దక్కించుకోకుంటే.. తమ కలలు కల్లలయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు కాంగ్రెస్‌ పెద్దలు. అందుకే ఆదిశలో వేగంగా అడుగులేస్తున్నారు. సెటిలర్స్ మనసు గెలుచుకునేందుకు ఎన్ని ప్రయత్నాలుచేసినా.. గ్రేటర్‌లో పార్టీ కమిటీ సరిగ్గా లేకుంటే లక్ష్యం చేరుకోవడం అసాధ్యం. గ్రేటర్ కమిటీ పూర్తిగా చతికలబడిపోయిన నేపథ్యంలో ముందుగా కమిటీకి జవసత్వాలు నింపేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీలోని సీనియర్ నేతలు సూచిస్తున్నారు.  

10:30 - March 9, 2018
10:07 - March 9, 2018

టిడిపి ఎంపీలతో బాబు...

ఢిల్లీ : టిడిపి ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. ప్రధానితో జరిగిన తన ఫోన్ కాల్ సంభాషణను ఎంపీలకు బాబు వివరించారు. జాతీయస్థాయిలో పార్టీల అభిప్రాయాలను బాబు అడిగి తెలుసుకున్నారు. టిడిపి నిర్ణయాన్ని అన్ని పార్టీలు ప్రశంసించాయని తెలిపారు.

 

10:01 - March 9, 2018
09:24 - March 9, 2018

నిర్మల్ : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తలను...మొండాన్ని వేరు చేశారు. ఈ ఘటన భైంసాలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం బస్టాండు సమీపంలో మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఓ బ్యాగు ఉండడం చూసి దానిని చెత్త వ్యాన్ లో వేసేందుకు ప్రయత్నించారు. బ్యాగులో నుండి తల పడడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కొద్దిదూరంలో మొండెం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. హత్య చేసిన వారు ఎవరు ? హత్యకు గురికాబడ్డ వ్యక్తి ఎవరు ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. 

భైంసాలో దారుణం...

నిర్మల్ : జిల్లాలోని భైంసాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తల..మొండాన్ని గుర్తు తెలియని దుండుగులు వేరు చేశారు. ప్రభుత్వాసుపత్రి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు...

ఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఆందోళనలు కొనసాగించాలని టిడిపి..వైసిపి నిర్ణయించాయి. గాంధీ విగ్రహం ఎదుట సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఉదయం పది గంటలకు ఏపీ భవన్ లో ఏపీ జర్నలిస్టులు, సీపీఐ, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా జరుగనుంది. 11.30గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ కలువలనుంది. బీజేపీ, టిడిపిపై ఫిర్యాదు చేయనుంది. ఎన్నికల హామీలను విస్మరించినందుకు గాను బిజెపి, టిడిపి పార్టీల గుర్తింపు రద్దు చేయాలని నేతలు కోరనున్నారు. 

09:18 - March 9, 2018

ఢిల్లీ : ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ వివిధ పార్టీల నేతలు..ప్రజా సంఘాలు..చేస్తున్న ఆందోలన కంటిన్యూ అవుతోంది. గత నాలుగు రోజులుగా ఆందోళనలు..నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరి ఆందోళనలపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ పీఎస్ లకు తరలిస్తున్నారు. కానీ ఆందోళనలకు మాత్రం తెరపడడం లేదు. దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడం గమనార్హం.

ఇక పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఆందోళనలు కొనసాగించాలని టిడిపి..వైసిపి నిర్ణయించాయి. గాంధీ విగ్రహం ఎదుట సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఉదయం పది గంటలకు ఏపీ భవన్ లో ఏపీ జర్నలిస్టులు, సీపీఐ, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా జరుగనుంది. 11.30గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ కలువలనుంది. బీజేపీ, టిడిపిపై ఫిర్యాదు చేయనుంది. ఎన్నికల హామీలను విస్మరించినందుకు గాను బిజెపి, టిడిపి పార్టీల గుర్తింపు రద్దు చేయాలని నేతలు కోరనున్నారు. 

09:11 - March 9, 2018

ఖమ్మం : పారాణి ఆరకముందే వరుడు విగతజీవిగా మారగా...వధువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోరమైన దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పచ్చటి పందిళ్ల మధ్య బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దుర్గతో వరంగల్ జిల్లా వర్దన్నపేటకు చెందిన రామకృష్ణతో వివాహం నిశ్చయమైంది. గురువారం రాత్రి తణుకులో వివాహం చేసుకున్న అనంతరం ఇన్నోవా వాహనంలో వధువు..వరుడుతో పాటు మరో ఎనిమిది మంది వర్ధన్నపేటకు బయలుదేరారు.

వ్యాన్ లో ఆనందంగా గడుపుతున్న వీరిని విధి కబలించి వేసింది. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద లారీని తప్పించబోయి చెట్టును ఇన్నోవా వాహనం ఢీకొంది. వరుడు రామకృష్ణ (28), పద్మ (35), శ్రీదేవి (33), డ్రైవర్ శ్రీనివాస్ (30) మృతి చెందిన వారిలో ఉన్నారు. వధువు దుర్గతో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఇరు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతివేగమే కారణమని తెలుస్తోంది. 

రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి...

ఖమ్మం : కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో వరుడు మృతి చెందగా వధువుకు గాయాలయ్యాయి. ఇన్నోవా వాహనం ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. పెళ్లి కుమారుడు రామకృష్ణ (28), పద్మ (35), శ్రీదేవి (33), డ్రైవర్ శ్రీనివాస్ (30) మృతి చెందిన వారిలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వివాహం జరిగాక స్వగ్రామం వరంగల్ జిల్లాలోని వర్దన్నపేటకు వస్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. 

08:30 - March 9, 2018
08:14 - March 9, 2018

ఖమ్మం : అప్పటి వరకు పెళ్లి ఇంట బంధువులతో ఆనందంగా గడిపారు. పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు. పెళ్లి వేడుకులను ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరిన వారు వారి వారి ఇళ్లకు చేరుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వాసులు ఖమ్మంలోని బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఏడుగురు ఇన్నోవా వాహనంలో వెళ్లారు. తిరిగి శుక్రవారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరారు. కొణిజర్ల మండలం పల్లిపాడు వద్దకు రాగానే లారీని తప్పించబోయి చెట్టును ఇన్నోవా ఢీకొంది. దీనితో ఐదుగురు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో వాహనం ఎంత వేగంగా వెళుతుందో అర్థం చేసుకోవచ్చు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బంధువుల ఇంట్లో..వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం...

ఖమ్మం : జిల్లాలోని కొణిజర్ల (మం) పల్లిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈఘటన చోటు చేసుకుంది. మృతులు వరంగల్ జిల్లా వర్ధన్నపేట వాసులుగా గుర్తించారు. 

07:45 - March 9, 2018

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించలేమని కేంద్రం కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పడం..బీజేపీకి టిడిపి గుడ్ బై చెప్పడంతో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. టిడిపి పార్టీకి చెందిన ఇద్దరు కేంద మంత్రులు..ఏపీకి చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయడం జరిగిపోయాయి. తాము కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతామని ఇందుకు టిడిపి మద్దతివ్వాలని వైసీపీ కోరుతోంది. ఒకేసారి టిడిపి..వైసీపీ నేతలు రాజీనామాలు చేయాలని..ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొంటున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో లక్ష్మీపార్వతి (వైసీపీ), అద్దెపల్లి శ్రీధర్ (విశ్లేషకులు), వజీర్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:42 - March 9, 2018

కనీస వేతనాలు కల్పించాలి. మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేయాలి. ఇది తెలంగాణలో ఎప్పటికప్పుడు వినిపిస్తున్న డిమాండ్‌. తాజాగా ఇదే డిమాండ్‌తో గిరిజన మినీ గురుకులాల టీచర్లు, నాన్‌ టీచర్లు ఆందోళన బాట పట్టారు. వీరి ఆందోళనకు గల కారణాలు వీరి సమస్యలపై టెన్ టివి జనపథంలో మినీ గురుకులాల టీచర్స్‌- నాన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకురాళ్లు నిర్మల, శారద, కవిత విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:30 - March 9, 2018

ఢిల్లీ : నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా ఎన్‌డిపిపి నేత నెయిఫియు రియో ప్రమాణ స్వీకారం చేశారు. కోహిమాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ పి.బి. ఆచార్య నెయిఫియు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు, బిజెపి చీఫ్‌ అమిత్‌షా, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌లతో పాటు మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. నాగాలాండ్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 18 మంది సభ్యులున్న నేషనల్‌ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్‌ పార్టీ బిజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రియో మార్చి 16 లోగా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

నిరాశతో వెనుదిరిగిన భక్తులు...

శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో పొగమంచు కారణంగా మూలవిరాట్ ను సూర్య కిరణాలు తాకలేదు. దీనితో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. 

భారత్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు...

ఢిల్లీ : నేటి నుండి భారత్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాస్ పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ పర్యటన కొనసాగనుంది. 

07:23 - March 9, 2018

ఢిల్లీ : దేశంలో మహనీయుల విగ్రహాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కేరళలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. కన్నూరు జిల్లాలోని తాలిపరాంబా తాలూకా ఆఫీస్ దగ్గర్లోని గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గాంధీ విగ్రహంపైకి రాళ్లు విసరడంతో కళ్లద్దాలు, మెడలోని దండ ధ్వంసమయ్యాయి. ఇవాళ ఉయదం ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెనిన్ విగ్రహం కూల్చివేతతో ఈ పరంపర మొదలైంది. తమిళనాడులో పెరియార్, పశ్చిమబెంగాల్‌లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ, ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. విగ్రహాలు ధ్వంసంచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రధాని మోది హెచ్చరించినప్పటికీ ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.

07:18 - March 9, 2018

మహారాష్ట్ర : రుణమాఫీ, గిట్టుబాటు ధర, స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలని కోరుతూ మహారాష్ట్రలో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వేలాది మంది రైతులు నాసిక్‌ టు ముంబై లాంగ్‌ మార్చ్‌ను మొక్కవోని దీక్షతో కొనసాగిస్తున్నారు. నాసిక్‌లోని సిబిఎస్‌ చౌక్‌ నుంచి మంగళవారం సాయంత్రం లాంగ్‌ మార్చ్‌ ప్రారంభమైంది. ముంబై-ఆగ్రా జాతీయ రహదారి మీదుగా మార్చ్‌ కొన సాగుతోంది. మార్చి 12 వరకు రైతులు 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించనున్నారు. లాంగ్‌ మార్చ్‌ అసెంబ్లీ వద్దకు చేరుకునేసరికి పాదయాత్రికుల సంఖ్య లక్షకు పైనే చేరుతుందని భావిస్తున్నారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అసెంబ్లీ ముందు బైఠాయిస్తామని ఈ యాత్రకు నేతృత్వం వహిస్తున్న ఏఐకేఎస్‌ నేత సునీల్‌ మలుసరే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. రుణమాఫీ ప్రకటన తర్వాత కూడా రాష్ట్రంలో 1,753 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఏఐకేఎస్‌ గుర్తు చేసింది.

టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం..

హైదరాబాద్: ఈనెల 11న మ.2:30 గంటలకు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

07:11 - March 9, 2018

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సరూర్‌నగర్‌రోడ్‌లోని టీఎన్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు నుంచి దూకి ఇద్దరు పదోతరగతి విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సావని, భార్గవి పటేల్‌ టెన్త్‌ క్లాస్‌ చదువుతున్నారు. కంబైన్డ్‌ స్టడీ కోసం భార్గవి ఇంటికి సావని వచ్చింది. ఈ నేపథ్యంలో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం...

మహారాష్ట్ర : ఫల్గార్స్ తరపూర్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులకు గాయాలయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

07:07 - March 9, 2018

హుస్నాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు గుంజుకుంటూ టీఆర్‌ఎస్‌ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు హుస్నాబాద్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకపడ్డారు. 

07:06 - March 9, 2018

హైదరాబాద్ : మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఉమెన్ ఎంట్రీప్రె న్యూర్ హబ్-వీహబ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌... గురువారం వీహబ్‌ను ప్రారంభించారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ముగింపు కార్యక్రమంలో కేటీఆర్ దీనిపై ప్రకటన చేశారు. ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా... అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలోని టీసాట్ కార్యాలయంలో వీహబ్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను పోత్సహించడం కోసమే.. వీహబ్‌ను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.

 

07:05 - March 9, 2018

హైదరాబాద్ : నేటి నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ ఈనెల 2 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. సర్వీస్‌ ప్రొవైడర్లతో నిర్మాతల మండలి జరిపిన చర్చలు ఫలించడంతో.... నేటి నుంచి సినిమా ప్రదర్శనలు ప్రారంభంకానున్నాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో ఈనెల 2 నుంచి థియేటర్లు మూసివేశారు. సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. సౌత్‌ ఇండియా సినిమా నిర్మాతల మండలి జేఏసీ నిర్ణయంతో 7 రోజులపాటు సినిమా ప్రదర్శలను ఆగిపోయాయి. వీపీఎఫ్‌ ధరలు తగ్గించే వరకు బంద్‌ పాటించాలని నిర్ణయించింది. వీరికి ఐదు రాష్ట్రాల్లోని నిర్మాతల పంపిణీదారులు మద్దతు తెలిపారు. దీంతో వారం రోజులపాటు వీరి నిరసన కొనసాగింది.

వీపీఎఫ్‌ ధరలు తగ్గించాలని నిర్మాతలు డిమాండ్‌ చేశారు. సర్వీస్‌ ప్రొవైడర్లతో నిర్మాతల మండలి నేతలు చర్చలు జరిపారు. వీరి చర్చలు సఫలం అయ్యి... ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చారు. ఇప్పుడు వసూలు చేస్తున్న వీపీఎఫ్‌ ధరలను 19-21 శాతం మధ్య తగ్గించేలా డీల్‌ కుదిరింది. క్యూబ్‌, యూఎఫ్‌ఓ సంస్థలు ఇందుకు అంగీకరించాయి. దీంతో తమ సమ్మెను విరమిస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

వారం రోజులపాటు థియేటర్లు మూతపడడంతో సినీ పరిశ్రమ భారీగానే నష్టపోయింది. సాధారణంగా ఒక రోజు థియేటర్లు మూతపడితేనే లక్షల్లో నష్టపోయే పరిశ్రమ... వారం రోజులపాటు థియేటర్లు మూతపడడంతో కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఈ నష్టాన్ని ఒక విధంగా భర్తీ చేయలేనిదే అయినప్పటికీ సినీ ప్రేక్షకుడి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని, వినోదాన్ని ఆస్వాదించడానికి వచ్చే ప్రేక్షకులు ఇబ్బందులు పడకూడదని సినీ పరిశ్రమ భావిస్తోంది. మొత్తాన్ని థియేటర్లు పున:ప్రారంభం కావడంతో వినోదం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 

07:03 - March 9, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి పిలిచినా వెళ్లే స్థాయి దాటిపోయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని ఆయన మోదీకి వివరించారు. ఏపీకి సాయం చేయాలనుకుంటే ఇప్పటికీ ఆ అవకాశం ఉందని ప్రధానికి తేల్చి చెప్పారు. టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయడంతో ప్రధాని .. చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. తాజా పరిణామాలపై ఇద్దరూ చర్చించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రిపదవులకు టీడీపీ గుడ్‌బై చెప్పడంతో ప్రధాని మోదీ చంద్రబాబుతో ఫోన్‌ మాట్లాడారు. వీరి ఇద్దరి మధ్య దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్‌ సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. వీరిద్దరి సంభాషణలో ప్రధానంగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ ఇద్దరి మంత్రుల రాజీనామాకు దారితీసిన కారణాలను చంద్రబాబు మోదీకి వివరించారు.

మోదీతో ఫోన్‌ సంభాషణ ముగియగానే.. చంద్రబాబు పార్టీ ముఖ్యులు, అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. మోదీతో జరిగిన సంభాషణలు వారికి చంద్రబాబు వివరించారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేదని మోదీ అన్నట్టు వివరించారు. నాలుగేళ్లుగా ఎంతో ఓపిక పట్టామని మోదీతో తాను అన్నట్టు చంద్రబాబు తెలిపారు. ప్రధాని పిలిచినా ఇప్పుడు వెనక్కి తగ్గే పరిస్థితే లేదని వ్యాఖ్యానించారు. తాము తీసుకున్నది సొంత నిర్ణయం కాదని.. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి రాజీనామాల నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానికి వివరించానని చెప్పారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తాము వెనక్కి తగ్గబోమని.. ఆ స్థాయి దాటిపోయిందనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానన్నారు. రాష్ట్రానికి ఇంకా ఏదైనా చేయాలనుకుంటే కేంద్రానికి ఆ అవకాశం ఉందని.. ఇదే విషయాన్ని మోదీతో చెప్పినట్టు తెలిపారు. అన్ని విషయాలు మాట్లాడుకునేందుకు ఢిల్లీ రావాలని మోదీ తనను ఆహ్వానించారని... ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయిందని తాను మోదీకి తేల్చిచెప్పానన్నారు చంద్రబాబు.

07:00 - March 9, 2018

హైదరాబాద్ : మహిళా దినోత్సవం సందర్భంగా నగర పోలీసులు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లిహిల్స్ లోని రోడ్ నెంబర్ 10లో నిర్వహించిన ఈ తనిఖీల్లో మద్యం సేవించిన వారికి నోటీసులు అందచేశారు. రాత్రి 10 నుండి మధ్యరాత్రి 1గంట వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. నాలుగు కార్లు...11 బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసు అధికారి పేర్కొన్నారు. మద్యం సేవించిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

 

మంత్రుల రాజీనామాల ఆమోదం..

విజయవాడ : కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులు సమర్పించిన లేఖలను ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. గురువారం ఉదయం సీఎం చంద్రబాబును కామినేని, మాణిక్యాలరావు కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించిన సంగతి తెలిసిందే. 

జూబ్లీ హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్...

హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందిపై కేసు నమోదు చేశారు. 16 బైక్ లు 8 కార్లను సీజ్ చేశారు. 

లంకపై భారత్ విజయం...

ఢిల్లీ : కొలంబో టీ 20లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేయగా భారత్ 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. : కొలంబో టీ 20లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేయగా భారత్ 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. 

సీబీఐకి మెహుల్ చోక్సీ లేఖ...

ముంబై : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాం ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్‌ చోక్సీ సిబిఐకి లేఖ రాశారు. తన పాస్‌పోర్టును ఎందుకు రద్దు చేశారో కారణం చెప్పాలని అధికారులపై ఎదురు దాడికి దిగారు. తాను భారత్‌కు రావడం అసంభవమని తేల్చి చెప్పారు.

 

నాసిక్ టు ముంబై రైతుల లాంగ్ మార్చ్...

మహారాష్ట్ర : రుణమాఫీ, గిట్టుబాటు ధర, స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలని కోరుతూ మహారాష్ట్రలో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వేలాది మంది రైతులు నాసిక్‌ టు ముంబై లాంగ్‌ మార్చ్‌ను మొక్కవోని దీక్షతో కొనసాగిస్తున్నారు. నాసిక్‌లోని సిబిఎస్‌ చౌక్‌ నుంచి మంగళవారం సాయంత్రం లాంగ్‌ మార్చ్‌ ప్రారంభమైంది.

కొనసాగుతున్న విగ్రహాల కూల్చివేతలు...

ఢిల్లీ : దేశంలో మహనీయుల విగ్రహాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కేరళలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. కన్నూరు జిల్లాలోని తాలిపరాంబా తాలూకా ఆఫీస్ దగ్గర్లోని గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

ఫరూఖ్ తక్లా అరెస్టు...

ముంబై : అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, 1993 ముంబై పేలుళ్ల కుట్రదారుడు ఫరూఖ్‌ తక్లాను సీబీఐ దుబాయ్‌లో అరెస్ట్‌ చేసింది. ఫరూఖ్‌ను దుబాయ్‌ నుంచి ముంబైకి తీసుకొచ్చారు. 

లవ్ జిహాద్ కేసులో సుప్రీం సంచలన తీర్పు...

ఢిల్లీ : కేరళ లవ్ జిహాద్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. హదియా, షఫీన్‌లది ప్రేమ వివాహామేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. హదియా, షఫీన్‌ ఎవరి కస్టడీలోనూ ఉండాల్సిన అవసరం లేదని, వారు భార్యాభర్తలుగా తమ జీవితాన్ని స్వేచ్ఛగా కొనసాగించవచ్చని కోర్టు పేర్కొంది. 

గర్బిణీ ప్రాణం తీసిన తమిళనాడు కాప్స్...

చెన్నై : తమిళనాడులో పోలీసుల హెల్మెట్‌ తనిఖీలు ఓ నిండు గర్భిణి ప్రాణం తీసింది. తిరుచ్చి జాతీయ రహదారిపై పోలీసులు హెల్మెట్‌ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

 

నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా...

ఢిల్లీ : నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా ఎన్‌డిపిపి నేత నెయిఫియు రియో ప్రమాణ స్వీకారం చేశారు. కోహిమాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ పి.బి. ఆచార్య నెయిఫియు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు, బిజెపి చీఫ్‌ అమిత్‌షా, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌లతో పాటు మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Don't Miss