Activities calendar

10 March 2018

21:58 - March 10, 2018

వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదా వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. హోదా వచ్చే వరకు వామపక్షాలను కలుపుకుని పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేకహోదా పరిశ్రమలు వస్తాయని తెలిపారు. కేంద్రం హోదా ఇస్తుందని భావిస్తున్నామని చెప్పారు. హోదా ఎవరిస్తే వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:55 - March 10, 2018

మహారాష్ట్ర : పదులు కాదు.. వందలు కాదు.. ఏకంగా 35 వేల మంది రైతులు...! అకుంఠిత దీక్షతో.. ఏకంగా 180 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా కదిలారు. రోజూ పాతిక కిలోమీటర్లు చొప్పున నడుస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మహారాష్ట్ర నాసిక్‌లో మొదలైన రైతుల ప్రస్థానం.. రాజధాని ముంబై దిశగా సాగుతోంది. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నేతృత్వంలో.. వేలకొద్దీ రైతులు.. సోమవారం అసెంబ్లీని ముట్టడించేందుకు కదం తొక్కుతున్నారు. ఇంతకీ అన్నదాతల ఆకాంక్ష ఏంటి..? 
వేలకొద్దీ రైతాంగం.. 
వేలకొద్దీ రైతాంగం.. ఎర్రటి పాగా.. తెల్లటి వస్త్రాలతో కూడిన ఆహార్యం..వందల కిలోమీటర్ల దూరం... ఘాట్‌రోడ్లను దాటుకుంటూ సాగే దృశ్యం.. అపూర్వం.. అద్భుతం.. రైతుల అకుంఠితత్వం.. మహారాష్ట్ర రైతాంగం.. తమ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సాగుతోన్న తీరిది. గోదావరి నదీ జన్మస్థానమైన నాసిక్‌ నుంచి పాదయాత్రగా సాగుతున్న 35వేలకు పైగా రైతులు.. దారిలో వచ్చే కొండలు.. గుట్టలు.. అవలీలగా దాటుకుంటూ.. ప్రభుత్వాన్ని కదిలించాలన్నదే లక్ష్యంగా సాగుతున్న తీరు.. దేశం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆధ్వర్యంలో సాగుతోన్న ఈ పాదయాత్రలో.. ప్రతి రైతూ స్వచ్ఛందంగా భాగస్వామి అయ్యారు. ఆకలి దప్పులను లెక్కచేయక.. తదేక ధ్యాసతో.. రాష్ట్ర శాసనసభ వరకూ సాగుతూనే ఉన్నారు. ఈ పాదయాత్రలో.. ఇటీవలే ఆత్మహత్యలు చేసుకున్న పాతిక మంది రైతుల పిల్లలు కూడా కలిసి సాగుతున్నారు. 
ఠాణేకు చేరుకున్న లాంగ్‌ మార్చ్‌  
సెంట్రల్‌  నాసిక్‌లోని సిబిఎస్‌ చౌక్‌ నుంచి మార్చి 5 సాయంత్రం లాంగ్‌ మార్చ్‌ ప్రారంభమై శుక్రవారం ముంబై సమీపంలోని ఠాణేకు చేరుకుంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా రైతులు ఓ దండులా ముందుకు కదులుతున్నారు. ముంబై-ఆగ్రా జాతీయ రహదారి మీదుగా 180 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర  కొనసాగి మార్చి 12న  సోమవారం ముంబైకి చేరుకుంటుంది. అదేరోజు మహారాష్ట్ర అసెంబ్లీని రైతులు ముట్టడించనున్నారు. లాంగ్‌ మార్చ్‌ అసెంబ్లీ వద్దకు చేరుకునేసరికి పాదయాత్రికుల సంఖ్య లక్షకు పైనే చేరుతుందని భావిస్తున్నారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అసెంబ్లీ ముందు నుంచి కదిలేది లేదని ఆలిండియా కిసాన్‌ సభ స్పష్టం చేసింది.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాదయాత్ర దీక్ష 
వరుస కరువులు, విత్తనాలు, ఎరువుల వ్యాపారుల మోసాలు.. కుదేలు చేయడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ఆదుకోవడంలో.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. రైతులు ఈ పాదయాత్ర దీక్షను చేపట్టారు.  రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో.. మహా రైతులు.. అపూర్వ  రీతిలో ఈ ఆందోళనకు దిగారు. హైవేలు, బుల్లెట్‌ ట్రెయిన్‌ల పేరిట ప్రభుత్వం  రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం ఆపివేయాలని రైతుల పాదయాత్రకు నేతృత్వం వహిస్తోన్న అఖిలభారత కిసాన్‌ సభ డిమాండ్‌ చేస్తోంది. కొన్నేళ్లుగా అడవుల్లో సాగు చేసుకుంటున్న భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని ర్యాలీలో పాల్గొన్న రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
రైతుల ఆత్మహత్యపై ఆందోళన 
మహారాష్ట్ర ప్రభుత్వం 34 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ప్రకటన చేసినా ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించింది. ఏడాది కాలంలో 1,753 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. రుణమాఫీతో పాటు పంట నష్టం వాటిల్లిన రైతులకు సరైన పరిహారం అందించాలని డిమాండ్‌ చేసింది.
రైతులు వరుసగా ఆత్మహత్యలు 
అప్పులు, కరువు కాటకాలు, పంట నష్టం కారణంగా రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 17 ఏళ్లలో 26, 339 మంది రైతులు మృతి చెందారని మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు 580 మంది రైతులు సుసైడ్‌ చేసుకోగా...ఒక్క అకోలా జిల్లాలోనే 115 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లోనే మహా రైతు.. దీక్షాదక్షుడై ఈ అపూర్వ పాదయాత్రను చేపట్టాడు. వీరికి మహారాష్ట్రకు చెందిన కీలక రాజకీయ పక్షం శివసేన కూడా మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం మహారైతులు.. రోజురోజుకీ రెట్టించిన ఉత్సాహంతో.. ముంబై దిశగా సాగుతున్నారు. ప్రభుత్వ పెద్దల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. 

 

21:49 - March 10, 2018

ప్రకాశం : స్వాతంత్ర్యం కోసం భారతీయుల పోరాటానికి జడిసిన బ్రిటీషువాళ్లు.. పోతుపోతూ ఇది నేనిచ్చిన స్వాతంత్ర్యం' అంటే ఎలా ఉంటుందో.. ఇప్పుడు చంద్రబాబు తీరు కూడా అలాగే ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల బహిరంగ సభలో చంద్రబాబు తీరుపై జగన్‌ మండిపడ్డారు. హోదా విషయంలో నాలుగేళ్లపాటు రోజుకో మాట మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పలేదన్నారు. తానే హోదా పోరాటం చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని జగన్‌ అన్నారు. 

 

21:44 - March 10, 2018

గుంటూరు : రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై టీడీపీలో సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావుతో  చర్చించిన చంద్రబాబు  ఆదివారం మరోసారి  భేటీ కానున్నారు. కాగా రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు సోమవారంతో గడువు ముగియనుంది. దీంతో టీడీపీ నుంచి ఎవరికి ఛాన్స్‌ వస్తుందోనని ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 
రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠ 
ఓ వైపు రాజ్యసభ ఎన్నికలకు సమీపిస్తున్న గడువు.. మరోవైపు ఇప్పటికీ పూర్తికాని అభ్యర్థుల ఖరారు. ఏపీ టీడీపీలో ఇపుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠను రేపుతోంది. పార్టీ సీనియర్‌ నేతలు, మంత్రులతో సమాలోచనలు జరపుతున్న చంద్రబాబు.. ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాజ్యసభ సీటును ఆసిస్తున్న టీడీపీ నేతల్లో టెన్షన్‌ కంటిన్యూ అవుతోంది. 
ఏపీ నుంచి ముగ్గురు ఎంపిక 
ఈ నెల 23న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీ నుంచి ముగ్గురు  ఎంపిక కానున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు  రెండు సీట్లలోనే తమ అభ్యర్థులను రంగంలోకి దించనున్నారు. అయితే  ఆ అభ్యర్థులు ఎవరనేది మాత్రం చంద్రబాబు ఇంతరకు ప్రకటించలేదు. అయితే ఆశావహలు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.  అమరావతికి వచ్చి తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సీఎం రమేష్, బీద మస్తాన్ రావు, వర్లరామయ్య, మసాలా పద్మజ,  నల్లగట్ల స్వామిదాసుతో పాటు  కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా .. చంద్రబాబుని కలిశారు. ఈసారి తమకే  ఛాన్స్‌ ఇవ్వాలని ఎవరికి వారు విన్నపాలు చేసుకుంటున్నారు.  
సామాజిక, రాజకీయ ఈక్వేషన్స్‌పై బాబు కసరత్తు 
ఉన్నవి రెండు సీట్లు.. ఆశావహులు మాత్రం అరడజనుకు  పైగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో  సామాజిక, రాజకీయ ఈక్వేషన్స్‌ ప్రకారం అవకాశం కల్పించేందుకు టీడీపీ అధినేత తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఆదివారం మరోసారి భేటీ అయి.. దీనిపై తుదినిర్ణయం తీసుకోవాలని బాబు అనుకుంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 
వైసీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ 
మరోవైపు విపక్ష వైసీపీ ఓ సీటులో తమ అభ్యర్థి చేత నామినేషన్‌ కూడా వేయిచింది. వైసీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇక టీడీపీలో అభ్యర్థులు ఎవరన్నది ఆసక్తిగా మారింది. అయితే ఆదివారం మరోసారి సీనియర్‌ మంత్రులతో సమాలోచనల అనంతరం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు సోమవారంతో ముగుస్తుండటంతో .. ఆదివారమే టీడీపీ అభ్యర్థులు ఎవరనేది స్పష్టంకానుంది.. 

 

21:40 - March 10, 2018

హైదరాబాద్‌ : ట్యాంక్‌బండ్‌ పోలీసుల నిర్బంధంతో నిర్మానుష్యంగా మారింది. మిలియన్‌మార్చ్‌ స్ఫూర్తి సభకు వస్తున్న ప్రజాసంఘాలు, వామపక్ష నేతలు, జేఏసీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ను తార్నాకలోని తన ఇంటివద్దే అరెస్ట్‌ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. తెలంగాణ ప్రభుత్వ తీరును టీజేఏసీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. 
మిలియన్‌మార్చ్‌ స్ఫూర్తి సభ
హైదరాబాద్‌లో మరోసారి నిర్బంధకాండ కొనసాగింది. టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ పిలుపు మేరకు మిలియన్‌మార్చ్‌ స్ఫూర్తి సభకు వచ్చేందుకు ప్రయత్నించిన.. జేఏసీ, వామపక్ష, ప్రజాసంఘాల నేతలను కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభకు వెళ్లేందుకు ప్రయత్నించిన కోదండరామ్‌ను ఆయన ఇంటివద్దే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తార్నాకలోని కోదండరాం ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన అనుచరులను అడ్డుకొని అరెస్టు చేశారు. 
మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభపై ఆంక్షలు 
అనంతరం కోదండరాంను బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డిని నారాయణగూడలోని మగ్దూం భవన్‌ వద్ద అదుపులోకి తీసుకోగా.. ట్యాంక్‌బండ్‌ వద్ద మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జేఏసీ చేపట్టిన మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభపై ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్యాంక్‌బండ్‌తో పాటు చుట్టుపక్కల పరిసరాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలను అనుమతించలేదు. ఇరువైపులా బారికేడ్లు ఉంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ జేఏసీ నేతలు, కోదండరామ్‌ అనుచరులు నినాదాలు చేశారు. పోరాటాలను అణచివేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంక్షలతో ఉద్యమ ఆకాంక్షలను ఆపలేరన్నారు. 

 

21:31 - March 10, 2018

హైదరాబాద్ : పాలనలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ఎన్నో అవకాశాలు వచ్చాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పూర్తి మెజార్టీ సాధించలేవని చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా ఒక్కపైసా రాలేదన్నారు. కేంద్రం నుంచి ఏపీకి కూడా అన్యాయం చేయడంతోనే టీడీపీ ఎన్ డీఏ నుంచి వైదొలిగిందన్నారు. టీడీపీ, శివసేన బయటికి వచ్చిన తర్వాత ఎన్ డీఏ కూటమిలో ఎవరూ లేరని పేర్కొన్నారు. అధికారమంతా ఢిల్లీలో కేంద్రీకృతమవడం సరికాదని అభిప్రాయపడ్డారు. దేశంలో రెండు పార్టీల వ్యవస్థ లేదన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయబోయేది థర్డ్ ఫ్రంట్ కాదు.. ఫస్ట్ ఫ్రంటేనని తెలిపారు. 

 

గోషామహల్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : గోషామహల్ సాయినాథ్ గంజ్ పీఎస్ పరిధిలోని ఆశీర్వాద్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

సీఎం చంద్రబాబును కలిసిన ఆశావాహులు

అమరావతి : సీఎం చంద్రబాబును ఆశావాహులు కలిశారు. సీఎం రమేష్, జూపూడి, బీద మస్తాన్ రావు, వర్ల రామయ్య, మసాలా పద్మజ,కంభంపాటి రామ్మోహన్, దాసరి రాజమాస్టర్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. 

 

620 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ : చీడికాడ మండలం ఖండివరం కల్లాల వద్ద రవాణాకు సిద్ధంగా ఉంచిన 620 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 

20:46 - March 10, 2018

ప్రముఖ పారిశ్రామికవేత్త దుర్గాప్రసాద్ తో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రత్యేకహోదా ఉంది కాటట్టి అక్కడ పరిశ్రమలు పెట్టినట్లు తెలిపారు. జీఎస్ టీ వల్ల పరిశ్రమలకు వచ్చే లాభాలు తగ్గిపోయాయని తెలిపారు. జీఎస్ టీ ప్యారలల్ ఎకానమీ, రాయితీలు తగ్గిపోయాయన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే కొత్తగా పరిశ్రమలు వస్తాయి.. ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

20:22 - March 10, 2018

మిలియన్ మార్చ్ సభకు సర్కారు అడ్డంకి...సడాకులు బందు వెట్టి.. నేతలను దొర్కవట్టి, కోదండం పిల్పు నిస్తడు కేసీఆర్ సక్సస్ జేస్తడు..అడ్డుకోని జేఏసీకి సాయం జేస్తున్న సీఎం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలదంట...మేమే అన్ని జేశ్నమంటున్న హరీష్ రావు, కేసీఆర్కు ఝలకిచ్చిన మమతా బెనర్జీ...కాంగ్రెస్ తోని పొత్తుకు తయ్యారున్నన్నది, కరీంనగర్ పట్నానికి చేరిన డీఎస్పీ యాత్ర..భారత రాజ్యాంగం ప్రతి ఇంట్ల ఉండాల్నంట, ఇండ్లళ్లకు జొర్రవడ్డ చిరుత పులి..ఇండోర్ పట్నంల ఇర్సుక పడ్డ జనం.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:10 - March 10, 2018

ఛత్రపతి మూవీ ఫేమ్ చంద్రశేఖర్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన సినీ కెరీర్ ను వివరించారు. తన అనుభవాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆశావాహులు...

గుంటూరు : రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగుతోంది. రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు.. సోమవారంతో గడువు ముగియనుంది. మరోవైపు రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆశావాహులు... అమరావతికి వచ్చి తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సీఎం రమేష్, బీద మస్తాన్ రావు, వర్లరామయ్య, మసాలా పద్మజ, కంభంపాటి... చంద్రబాబుని కలిసి.. తమకే రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరారు. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పుట్టా సుధాకర్ యాదవ్.. ముఖ్యమంత్రిని కోరారు. మరోవైపు రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆశావాహులు... అమరావతికి వచ్చి తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతోన్న టీడీపీ కసరత్తు

గుంటూరు : రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగుతోంది. సీనియర్ మంత్రులు యనమల, కళా వెంకట్రావుతో చంద్రబాబు ఇప్పటికో ఓ దఫా చర్చించారు. రేపు మరోసారి నేతలతో చర్చించనున్నారు. రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు.. సోమవారంతో గడువు ముగియనుంది. 

19:57 - March 10, 2018

చిత్తూరు : తిరుమల అంటే .. ఆధ్యాత్మిక కేంద్రాలు.. నిత్యం శ్రీవారి భజనలు, కీర్తనలు, వేద పారాయణాలు.  మనకు తెలిసింది ఇదే. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి  మారింది. తిరుమల మఠాలు కాంట్రాక్టర్ల  చేతుల్లో స్టార్‌ హోటళ్లుగా, కన్వెన్షన్‌ సెంటర్లుగా మారాయి.  పెళ్లిల్ల సీజన్ కావడంతో మఠాలను కాంట్రాక్టర్లు వ్యాపార కేంద్రాలుగా మార్చి, కోట్లు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీటీడీ అటు వైపు కూడా చూడటం లేదు.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో పుష్పగిరి మఠం, శారదా పీఠం, గోవింద సాయి, ఉత్తరాది మఠం ఇలా 32 మఠాల వరకు ఉన్నాయి. ఇవన్ని ఒకప్పుడు ఆలయ మాడవీధుల్లో  ఇరుకైన సందులలో ఉండేవి. తిరుమల అభివృద్ధిలో భాగంగా వీటిని తొలగించి రింగ్‌ రోడ్డు సమీపంలో స్థలాలు కేటాయించారు. ఇదే అదునుగా మఠాల నిర్వాహకులు మఠాలను ఫంక్షన్‌ హాల్లుగా, కన్వెన్షన్‌ సెంటర్లుగా మార్చేశారు. పెళ్ళిళ్ల సీజన్‌లో కాంట్రాక్టర్లకు లీజ్‌కు ఇచ్చి కోట్లు గడిస్తున్నారు. 

చాలా మంది తిరుమలలో శ్రీవారి సన్నిధిలో పెళ్లిల్లు చేసుకుంటే సుఖసంతోషాలతో ఉంటారని ప్రగాఢంగా నమ్ముతారు.  ఈ సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్లు 5 లక్షల నుండి  10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. టిటిడికి సంబంధించి తిరుమలలో సామూహిక వివాహాలు నిర్వహించే కళ్యాణవేదిక, మరికొన్ని మ్యారేజీ కాటేజీలు తప్ప చేప్పుకోదగ్గ స్థాయిలో కళ్యాణ మండపాలు లేవు. దీంతో వివాహాలు చేసుకునే వారు మఠాలను ఆశ్రయిస్తున్నారు. రెండు వందల మంది హాజరయ్యే పెళ్లికి ఒక్క అతిథి భోజనానికి వెయ్యి నుండి రెండు వేల రూపాయల వరకు  చెల్లించాల్సి వస్తోంది.

పెళ్ళిళ్లు చేసుకునే వారికే కాదు, తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. దర్శనానికి వచ్చే భక్తులకు ఇవ్వాల్సిన కాటేజీలను కాసులకు కక్కుర్తి పడి పెళ్లిళ్లకు వచ్చే అతిథులకు బ్లాక్‌లో కేటాయిస్తున్నారు. మఠాల్లో సాధువులు, సన్యాసులు, భక్తులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు సత్‌సంఘ్‌ పేరిట ప్రత్యేక హాలు ఉంది. దీన్ని  కూడా నిర్వాహకులు కళ్యాణ మండపంగా మార్చారు. ఏటా 5 వేల రూపాయలు అద్దె చెల్లించే ప్రాతిపదికన టిటిడి మఠాలను నిర్వాహకులకు ఇచ్చింది. కాని మఠాల నిర్వాహకులు ఇష్టానుసారంగా మఠాలను కల్యాణ వేదికలకుగా మార్చి కోట్లు దండుకుంటున్నారు. దీనిపై టీటీడీ దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

19:51 - March 10, 2018

గుంటూరు : అతిసార వ్యాధితో 10 మంది చనిపోయినా అధికారుల్లో చలనం లేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత గుంటూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే  వాటర్ ట్యాంక్ లను పరిశీలించారు. వాటర్ ట్యాంకులు శిథిలావస్థలో ఉన్నాయని, మంచి నీటిని సరిగా శుద్ధి చేయడం లేదని ముస్తఫా అరోపించారు. అధికారుల తీరుపై మండిపడుతున్న ఎమ్మెల్యే ముస్తఫాతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:16 - March 10, 2018

అనంతపురం : ఏప్రిల్ 5 లోపలే.. అన్ని పార్టీలు కలిసి హోదా కోసం పోరాడాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆ తరువాత ఏ పార్టీ ఏ త్యాగం చేసినా ఉపయోగం లేదన్నారు. 2019లో యూపీఏ అధికారంలోకి రాగానే ఏపీకి.. ప్రత్యేకహోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటన చేశారని.. రఘువీరా అనంతపురం జిల్లా మడకశిరలో తెలిపారు. దేశంలో థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదని... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు రఘువీరా. 

 

19:12 - March 10, 2018

రాజమండ్రి : కేంద్రంపై అవిశ్వాసం పెడతామంటూనే... ప్రధాని మోదీ పట్ల విశ్వాసం ఉందని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి జవహర్‌ ఎద్దేవా చేశారు. బీజేపీని నమ్మి మూడున్నరేళ్లు నానా కష్టాలు పడ్డామని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమించే పార్టీలతో తాము కలిసేది లేదని.. కావాలంటే విపక్షాలే  తమ వెనుక నడవాలని  మంత్రి జవహర్‌ వ్యాఖ్యానించారు. 

19:06 - March 10, 2018

విజయనగరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్టు వైసీపీ నేతలు నటిస్తున్నారని మంత్రి సుజయ కృష్ణరంగారావు విమర్శించారు. రాష్ట్ర విభజనకు ఆనాడు సహకరించిన బొత్ససత్యనారాయణ.. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్న టీడీపీపై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవాచేశారు. బీజేపీతో కలిసి సాగేందుకు వైసీపీ ఆరాటపడుతోందని.. మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు.

19:00 - March 10, 2018

అనంతపురం : తమ నిరసనలతో కేంద్రం దిగివస్తుందనుకోవడం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం వచ్చిన ఆయన.. కేంద్రం తాను పట్టిన కుందేలుకు మూడుకాళ్లు అన్నట్లుగా వ్యవహహిస్తోందన్నారు. పార్లమెంట్‌ జరిగినంత కాలం తమ నిరసన కొనసాగిస్తామన్న ఆయన.. కేంద్రానికి మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఏపీ ప్రజలకు ఏదో చేస్తారనే నమ్మకం కూడా తమకు లేదన్నారు.  కేంద్రంతో కలిసి నడుస్తామని చెప్పలేమని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.

రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆశావాహులు...

గుంటూరు : రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగుతోంది. సీనియర్ మంత్రులు యనమల, కళా వెంకట్రావుతో చంద్రబాబు ఇప్పటికో ఓ దఫా చర్చించారు. రేపు మరోసారి నేతలతో చర్చించనున్నారు. రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు.. సోమవారంతో గడువు ముగియనుంది. మరోవైపు రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆశావాహులు... అమరావతికి వచ్చి తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సీఎం రమేష్, బీద మస్తాన్ రావు, వర్లరామయ్య, మసాలా పద్మజ, కంభంపాటి... చంద్రబాబుని కలిసి.. తమకే రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరారు. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పుట్టా సుధాకర్ యాదవ్.. ముఖ్యమంత్రిని కోరారు. 

18:54 - March 10, 2018

గుంటూరు : రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగుతోంది. సీనియర్ మంత్రులు యనమల, కళా వెంకట్రావుతో చంద్రబాబు ఇప్పటికో ఓ దఫా చర్చించారు. రేపు మరోసారి నేతలతో చర్చించనున్నారు. రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు.. సోమవారంతో గడువు ముగియనుంది. మరోవైపు రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆశావాహులు... అమరావతికి వచ్చి తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సీఎం రమేష్, బీద మస్తాన్ రావు, వర్లరామయ్య, మసాలా పద్మజ, కంభంపాటి... చంద్రబాబుని కలిసి.. తమకే రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరారు. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పుట్టా సుధాకర్ యాదవ్.. ముఖ్యమంత్రిని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:50 - March 10, 2018

జగిత్యాల : కొత్తగా ఏదైనా చేయాలనే తపించి పోయే ఆ కుర్రాడు.. అతని ఆలోచనలకు పదును పెట్టాడు. ఆ ఆలోచన నుండి వచ్చిందే వినూత్న సైకిల్‌. సామాన్యుడికి వరంగా మారనున్న ఈ సైకిల్ వివరాలు మనమూ తెలుసుకుందాం.. 

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సిరిపురం చంద్రశేఖర్, భారతిల చిన్న కొడుకు సిరిపురం సాయి. పదో తరగతి వరకు కోరుట్లలో చదువుకుని, నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లమా కోర్స్‌లో జాయిన్‌ అయ్యాడు. ఆరోగ్య సమస్యల వల్ల డిప్లమా చదువును మధ్యలోనే ఆపివేశాడు. కానీ ఏదో కొత్తగా  రూపొందించాలనే తపనతో..  వినూత్న సైకిల్ రూపొందించాడు. ఒక పాత సైకిల్‌ కొని దానికి బ్యాటరీ అమర్చి, డైనమోతో కనెక్షన్‌ ఇచ్చాడు. దాంతో పవర్‌ ఉత్పత్తితో సైకిల్ నడిచే విధంగా చేశాడు. 

ఈ సైకిల్‌కు సోలార్‌ మరియు వాటర్‌ కూడా అనుసంధానించి నడిచేటట్లు చేశాడు. ఈ సైకిల్‌ 120 కేజీల బరువు మోయగలుగుతుంది. అర లీటర్‌ నీటితో.. జరిగే విద్యుత్ ఉత్పత్తితో... 30 కిలోమీటర్ల వరకు వెలుతుందని సాయి చెపుతున్నాడు. పొల్యూషన్‌ను నివారించే విధంగా అతి తక్కువ ఖర్చుతో మల్టీ విధానంతో నడిచే సైకిల్‌ రూపొందించినందుకు సిరిపురం సాయిని అందరూ అభినందిస్తున్నారు. 

18:46 - March 10, 2018

నిజామాబాద్‌ : ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణాలో సమస్యలు తీరుతాయనుకున్న విద్యార్ధులకు నిరాశే మిగిలింది...  తాము అధికారంలోకి వస్తే వంద కోట్లతో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి  హామీ అమలుకు  నోచుకోలేదు. నిధుల కొరతతో నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి... ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని విద్యార్థులు ఆవేదన చెందుతన్నారు. 
సవాల్‌గా నిధుల కొరత 
తెలంగాణలో మూడో యూనివర్సిటీగా తెలంగాణా విశ్వవిద్యాలయం పేరుగాంచింది. ఇది ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులేస్తున్న క్రమంలో నిధుల కొరత సవాల్‌గా మారింది. రూసా నిదులు వస్తాయన్న ఆశతో అప్పటి రిజిస్త్రార్, వైస్ ఛాన్సలర్   నూతన కళాశాల భవనానికి భూమి పూజ కూడా చేశారు.. కానీ నిధుల జాడే లేక నిర్మాణ పనులు కార్యరూపం దాల్చలేదు. 
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిధుల ప్రతిపాదనలు 
గతేడాది అక్టోబర్‌లో అప్పటి వైస్ ఛాన్సలర్ పార్థసారథి రిజిస్ర్టార్ల నేతృత్వంలో 50 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపించారు. న్యాక్ గుర్తింపు వచ్చిన తరువాత మళ్లీ ఈ సంవత్సరం మార్చి నెలలో 20 కోట్ల రూసా నిధుల కోసం రెండోసారి కూడా ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర  ప్రభుత్వం వాటిని కేంద్ర మానవ వనరుల శాఖకు పంపింది. ఇలా రెండు సార్లు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదు.. దీంతో నిధుల ప్రతిపాదనలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు 
తెలంగాణా యూనివర్సిటీతో పాటు న్యాక్ గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ లోని యోగి వేమన వర్సిటీకి 20 కోట్ల రూపాయలు రూసా నిధులు మంజూరైనట్లు కేంద్రం నుంచి వారికి సంకేతాలు అందాయి. జిల్లాలోని  ఎంపీలు, ఎమ్మల్యేలు కృషి చేస్తే  నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది.మరో వైపు ప్రభుత్వం నుంచి ఏలాంటి గ్రాంటు రాకపోవడంతో  విద్యార్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సొంత రాష్ట్రంలో సమస్యలు తీరతాయనుకుంటే మరింతగా పెరిపోయాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు ఒకరిపై మరొకరు ఆరోణలు చేసుకుంటూ కాలయాపన చేయకుండా.. యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడాలని విద్యార్థులు కోరుతున్నారు.

 

18:41 - March 10, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో ప్రధానంగా పండించే పంట ఎర్రజొన్న. ఇప్పుడిదే పంట అక్కడి రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు వణుకుపుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో... నేతల భవితవ్యాన్ని సైతం ఈ పంటే తేల్చనుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
ఎర్రజొన్నకు ప్రసిద్ధి చెందిన ఆర్మూర్‌
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఎర్రజొన్నకు ఎంతో ప్రసిద్ధి. విత్తన పంటగా పేరొందిన ఎర్రజొన్నకు ఉత్తర భారతదేశంలో ఎంతో డిమాండ్‌ ఉంది. ప్రతి ఏటా ఉత్తరాది వ్యాపారులు స్థానిక రైతులకు విత్తనాలు సరఫరా చేసి పంట చేతికొచ్చాక వ్యాపారులే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తారు. కేవలం వంద రోజుల్లో చేతికొచ్చే ఈ ఎర్రజొన్నను కొందరు స్థానిక వ్యాపారులు కూడా దళారులుగా వ్యవహరిస్తూ కొనుగోళ్లు చేస్తారు. 
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వివాదం
ఇంత డిమాండ్‌ ఉన్న ఎర్రజొన్నను కొనుగోలు చేసి డబ్బులు సమయానికి చెల్లించకపోవడంతో 2008లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు రైతులు. ఆగ్రహంతో ఆ వ్యాపారి ఇంటితో పాటు పోలీసు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దీంతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఎర్రజొన్న కొనుగోళ్లు ఏదో రకంగా వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో అదే పరిస్థితి కొనసాగుతోంది. 
2009 ఎన్నికలపై ప్రభావం చూపిన ఎర్రజొన్న
అయితే ఇప్పుడు ఎర్రజొన్నల అంశం కేవలం పంట కొనుగోళ్లకు, మార్కెటింగ్‌కి మాత్రమే పరిమితం కాలేదు. రాజకీయంగా ఎంతో ప్రభావం చూపుతోంది. 2008లో కాల్పుల అనంతరం జరిగిన 2009 సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని చుట్టుప్రక్కల నియోజకవర్గాలపై కూడా ఎర్రజొన్న ప్రభావం పడింది. కాంగ్రెస్‌ హయాంలో ఈ కాల్పుల ఘటన జరగడంతో జిల్లాలో ఆ పార్టీ ఓటమికి పరోక్షంగా ఎర్రజొన్న ప్రభావం కూడా కారణమైంది. 
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీట్లు తీసుకొచ్చిన ఎర్రజొన్న
2014 సాధారణ ఎన్నికల్లో సైతం ఎర్రజొన్న పంటే టీఆర్‌ఎస్‌ నేతలకు సీట్లు వచ్చేలా చేసింది. ఎర్రజొన్న బకాయిలు చెల్లిస్తామన్న హామీతో గులాబీ పార్టీ ఎన్నికల్లో గెలిచింది. అయితే ప్రస్తుతం అదే అంశం అధికార పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మద్దతు ధర కోసం రైతులు ఉద్యమ బాట పట్టారు. రోజు రోజుకీ ఉద్యమం ఉధృతం అవడంతో సమస్యను ఎలా పరిష్కరించాలో తెలీక నేతలు తలలు పట్టుకుంటున్నారు. రైతుల ఆందోళనతో  ప్రభుత్వం 2వేల 300 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. అయితే తమకు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ఎంతకు సరిపోదంటూ రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. 
మళ్లీ రాజకీయ అస్త్రంగా ఎర్రజొన్న
రైతుల ఆందోళనలు ఇలా ఉంటే ఓ వైపు ఎన్నికల హడావిడి మొదలైంది. దీంతో ఎర్రజొన్న అంశం మళ్లీ రాజకీయ అస్త్రంగా మారనుంది. ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆర్మూర్‌ నియోజకవర్గంలో రైతు సదస్సు నిర్వహించి మద్దతు ధరలపై ఎన్నికల డిక్లరేషన్‌ ప్రకటించింది. అంతే కాకుండా ఎర్రజొన్న రైతులకు మద్దతుగా మోర్తాడ్‌లో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించింది. దీంతో ఎర్రజొన్న అంశం రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయాల పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

 

18:34 - March 10, 2018

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి హరీష్‌రావుపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గతంలో కేసీఆర్‌ను విబేధించి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరుదామనుకున్నది నిజము కాదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత పదవిని ఇవ్వనందునే హరీష్‌రావు వైఎస్‌ఆర్‌ను కలిశారని చెప్పారు. అలాగే 2009 ఎన్నికల తర్వాత.. కేసీఆర్‌, కేటీఆర్‌ను పక్కన పెట్టి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని హరీష్‌రావు ప్రయత్నించారని.. అయితే దురదృష్టవశాత్తు వైఎస్‌ఆర్‌ అప్పుడే చనిపోయారని చెప్పారు. 
అవినీతికి పాల్పడ్డ ఈటల :  రేవంత్‌
పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అవినీతికి పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత.. పది జిల్లాల పేరుతో రేషన్‌కార్డులు ప్రింట్‌ చేయించారని.. ఇందులో కోటీ 50 లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఈ రేషన్‌కార్డులన్నీ నిరుపయోగంగా మారాయన్నారు. 

 

టీ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా బలరాంనాయక్ పేరు ఖరారు

హైదరాబాద్ : తెలంగాణ నుంచి తమ రాజ్యసభ అభ్యర్థిగా బలరాంనాయక్ పేరును టీపీసీసీ ఖరారు చేసింది. సోమవారం బలరాంనాయక్‌ నామినేషన్‌ దాఖలుచేయనున్నారు. త్వరలో తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగనుంది. 

18:18 - March 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ నుంచి తమ రాజ్యసభ అభ్యర్థిగా బలరాంనాయక్ పేరును టీపీసీసీ ఖరారు చేసింది. సోమవారం బలరాంనాయక్‌ నామినేషన్‌ దాఖలుచేయనున్నారు. త్వరలో తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

18:16 - March 10, 2018

హైదరాబాద్ : మిలియన్‌మార్చ్‌ స్ఫూర్తి సభకు తరలివస్తున్న ప్రజాసంఘాలు, జేఏసీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాలన్నీ పోలీసుల దిగ్బంధంలో ఉన్నాయి. తార్నాకలో జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి.. బొల్లారం పీఎస్‌కు తరలించారు. ట్యాంక్‌బండ్‌కు వస్తున్న పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు,... జేఏసీ, వామపక్ష, ప్రజాసంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌లకు తరలించారు. హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. 

 

18:06 - March 10, 2018

నెల్లూరు : రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కంటతడిపెట్టారు. బెంగళూరులో ఉన్న తన కూతురును పలకరించడానికి వెళితే.. అజ్ఞాతంలోకి వెళ్లాండంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. ఓఎస్‌డీ విఠలేశ్వర్‌ పోలీస్‌డ్యూటీ మానుకుని పొలిటికల్‌ డ్యూటీ చేస్తున్నారని  విమర్శించారు. తనపై అక్రమకేసులు పెట్టిన పోలీసులు రాజకీయగేమ్‌లు అడుతున్నారని, ఈ కుట్రలను తాను ఎదుర్కొంటానన్నారు. 

17:51 - March 10, 2018

హైదరాబాద్ : పుట్టింది టీఆర్ ఎస్ లోనే, చచ్చేది టీఆర్ ఎస్ లోనే అని హరీష్ రావు అంటున్నారని...కానీ హరీష్ రావు టీఆర్ ఎస్ లో ఉంటే నూటికి నూరు శాతం చస్తారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. 'మీ మామ, అల్లుడు నిన్ను చంపడానికి కంకణం కట్టుకున్నారు అని ఆరోపించారు. అందులో ఉంటే నిన్ను చంపుతరని బయటికి వెళ్లేందుకు అమిత్ షాను కలిసి వుండొచ్చని తెలిపారు. 'నీవు నిప్పు, నీ మామ ఉప్పు...అని చెప్పే మాటలు మానండి మీకెప్పుడో తుప్పుబట్టిందని' ఎద్దేవా చేశారు. 'అల్లుడు ఆణిముత్యం..మామ స్వాతి ముత్యం' అని కేసీఆర్, ఆయన అనుచరులు చెబుతుంటారని అన్నారు. ప్రజలను మభ్యపెట్ట, బుజ్జగించి, మోస గించి అధికార పీఠ మెక్కి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని... పక్క పార్టీలను బలహీన పర్చి, పేరు సంపాదించుకున్న ఆయ పార్టీల నేతలు టీఆర్ ఎస్ లో చేరుతున్నారని ప్రచారం చేసి.. వారిని బదునాం చేసి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారంలో కేడీల కుటుంబానిది అందె వేసిన చెయ్యి అని అన్నారు. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించి, గబ్బు పట్టించారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులకు ప్రజల్లో విలువ లేకుండా చేసిన పార్టీ టీఆర్ ఎస్ అని అన్నారు. 

 

ట్యాంక్ బండ్ పై రాకపోకల పునరుద్ధరణ..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై బారికేడ్లు తొలగిపోయాయి. వాహన రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. జేఏసీ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ దృష్ణ్యా పోలీసులు పలు ఆంక్షలను విధించారు. దీంతో ఉ. 11 గంటల నుండి వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య, నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. 

బాధితుల ప్రాణాలతో వైద్యుల చెలగాటం..

కరీంనగర్ : అపోలో రిచ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకం బట్టబయలయ్యింది. ఆసుపత్రిలో వైద్యం అందక రోడ్డు ప్రమాద బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో గాయపడ్డ కళావతి, ప్రియాంక అనే మహిళలకు చికిత్స చేయం అని వైద్యులు నిర్లక్ష ధోరణి వహించారు. ప్రమాద బాధితులకు ఆరోగ్యశ్రీ వర్తించదు కాబట్టి వైద్యం చేయమని వైద్యులు తెలుపగా మరో ఆసుపత్రికి తీసుకెళతామని బంధువులు విన్నవించుకున్నారు. అయినా పేషెంటులను బైటకు ఇచ్చేది లేదని నగదు కడితే వైద్యం చేస్తామని వైద్యులు నిర్లక్షంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

17:24 - March 10, 2018

గుంటూరు : స్వలాభం కోసం పుట్టిన పార్టీ వైసీపీ అని మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలు కూడా కాదని స్వలాభం కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి ఒక సిద్ధాంతం, విలువలు లేవని ఎద్దేవా చేశారు. ఆయనపై ఉన్న కేసులు మాఫీ చేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. జగన్ కు రాష్ట్రానికి మేలు చేసే చిత్తశుద్ధి  లేదని చెప్పారు. ఏ1, ఏ2 జైలుకు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ.. ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ కాదని.. స్వార్థప్రయోజనాల కోసం పుట్టిందని చెప్పారు. 

 

17:20 - March 10, 2018

ప్రపంచ వ్యాప్తంగా నేడు అనేక మంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలో చర్మం తర్వాతి రెండవ అతి పెద్ద అవయవం కాలేయమే! దాదాపు 1,500 గ్రాముల బరువుండే కాలేయం పని తీరు కూడా భారీగానే ఉంటుంది. లివర్ వ్యాధులు రావడానికి ప్రధానంగా అతిగా మద్యం సేవించడం, హెపటైటిస్ ఏ, బీ, సీ, ఈ వంటి వైరల్ ఇన్పెక్షన్లు కారణంగా వస్తున్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు.లివర్ శరీరంలోని వ్యాధికారక ఇన్‌ఫెక్షన్లతో పోరాడటం, రక్తస్రావం కాకుండా ఆపటం, ఇంతటి కీలకమైన జీవక్రియలను నిర్వర్తించే కాలేయం కూడా కొన్ని కారణాల వల్ల వ్యాధులకు గురవుతూ ఉంటుంది. ఆ వ్యాధులు జన్యుపరంగా, వైర్‌సల వల్ల, క్రమం తప్పిన జీవన విధానం వల్ల సంక్రమిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా మన అలవాట్లు మంచిగా వుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అధిక కొవ్వు పదార్ధాలు తింటే అందులో ఉన్న కొవ్వు పోతుంది. మరి అటువంటి ఆహార పదార్ధాలు తీసుకుంటే లివర్ లో తొలగిపోతుందో తెలుసుకుందాం.

పాలు : కొవ్వు తీసిన పాలలో ఉండే ప్రోటీన్లు లివర్‌కు మంచి చేస్తాయి. లివర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

ఆకు పచ్చగా వుండే కూరగాయలు : ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు కూరలు, కూరగాయలను రోజూ తినాలి. వీటిల్లో ఉండే ఔషధ గుణాలు లివర్‌లో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గిస్తాయి. లివర్ బాగా పనిచేసేలా చేస్తాయి.

చేపలు : చేపల్లో పుష్కలంగా వుండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌లో ఉండే కొవ్వును కరిగిస్తాయి. లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో వాపుకు గురయిన మెరుగుపడుతుంది.

ఓట్స్ : ఓట్స్‌లో ఉండే పీచు పదార్థం అధికంగా వుంటుంది. ఇది లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లివర్‌ను సంరక్షిస్తుంది. హానికారక పదార్థాలను బయటకు పంపుతుంది.

కాఫీ : కాఫీలో ఉండే కెఫీన్ లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. లివర్‌లో తయారయ్యే హానికారక ఎంజైమ్‌లను తొలగించడంలో కెఫీన్ బాగా పనిచేస్తుంది. కనుక రోజూ కాఫీ తాగితే లివర్‌ను సంరక్షించుకోవచ్చు.

వాల్‌నట్స్ : వాల్‌నట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌కు మేలు చేస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గిస్తాయి. లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. ఇవి కాకుండా పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆలివ్ ఆయిల్, అవకాడోలు, వెల్లుల్లి, గ్రీన్ టీ వంటి ఆహారాలు కూడా లివర్ వ్యాధులను తగ్గిస్తాయి. లివర్‌లో ఉండే కొవ్వు కరిగేలా చేస్తాయి. దీంతో లివర్ సంరక్షింపబడుతుంది. మరి ఈ పదార్ధాలను తీసుకుని లివర్ ను ఆరోగ్యకంగా వుంచుకుందా..

17:14 - March 10, 2018

గుంటూరు : జగన్ ఆరాటం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని... కేసుల తొలగింపుకేనని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. కేసుల నుండి బయటపడే ప్రయత్నంలో వైసీపీ పార్టీ ఉందని ఆరోపించారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు పట్టని పార్టీ వైసీపీ పార్టీ అని విమర్శించారు. రాబోయే రోజుల్లో వైసీపీకి గుణపాఠం చెప్పే బాధ్యత కూడా మనపై ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో వైసీపీ నేతలు పార్లమెంట్ లో డ్రామాలు ఆడారని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో రాష్ట్రానికి న్యాయం జరగాలని జగన్ పని చేయయడం లేదని.. కేసుల తొలగింపు గురించే పని చేస్తున్నారని తెలిపారు. బీజేపీ చుట్టూ ప్రదక్షిణలు చేసి....కేసులు తొలగించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి, కేసుల లబ్ధి గురించే వైసీపీ నేతల ప్రయత్నమని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం జరిగే పోరులో జగన్ తో కలిసి వెళ్తారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు ముద్దాయితో ఎవరు వస్తారని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి టీడీపీ బయటికి వచ్చిన తర్వాత కూడా పోరాటం చేస్తున్నారని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చైనా ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను సాధించుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయామని చెప్పారు. ఏపీకి కేంద్రం ఏం చేయలేదని అనలేమని... కొంతమేరకు చేసిందన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలన్నారు.

16:51 - March 10, 2018

కరీంనగర్ : విషారదన్ మహారాజు చేపట్టిన పాదయాత్ర కరీంనగర్ కు చేరుకుంది. మాదిగల అభ్యున్నతే లక్ష్యంగా విషారదన్ పాదయాత్ర చేపట్టారు. 5 వేల కిలోమీటర్ల లక్ష్యంగా పాదయాత్ర సాగుతోంది. ఇప్పటివరకు 4200 కిమీలు పూర్తి చేసుకుంది. పాదయాత్రకు విశేషాధరణ అభిస్తోంది.  ఈమేరకు టెన్ టివితో ఆయన మాట్లాడారు. దళిత అభ్యున్నతికి తోడ్పడతామని అన్నారు. మహారాజుల చరిత్రను తెలుపుతూ... దళితులను చైతన్య వంతులను చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై ఎలాంటి డిమాండ్ లేదని.. ఏమీ అడగడం లేదన్నారు. ఓడిపోయిన వారిని అంటరాని వారిగా చేశారని.. 3 వేల సం.రాలుగా అంటరానివారుగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. దేశంలో అంటారిని వారే..  మొట్టమొదటి సిటిజన్స్ అని అన్నారు. దేశంలో 21 కోట్ల మంది అంటరాని పౌరులు ఉన్నారని అన్నారు. అంటరాని వాడు కూడా పాలకుడయ్యే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందన్నారు.

 

మోదీ రాఖీ సోదరి మృతి..

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాఖీ సిస్టర్‌ షర్బతీ దేవి కన్ను మూశారు. గత సంవత్సరం ప్రధాని మోదీకి రాఖీ కట్టాలని ఉందంటూ లేఖ రాసి వార్తల్లో నిలిచారు షర్బతీ దేవి. 50 ఏళ్ళ క్రితం సోదరుడిని కోల్పోయిన ఆమె ప్రధాని మోదీకి రాఖీ కట్టాలనే కోరికను వ్యక్తపరుస్తూ కుమారుడు ద్వారా ప్రధానికి లేఖ రాశారు. దీనికి మోదీ ఆమోదం తెలపడంతో రాఖీ పర్వదినాన లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో మెదీకి రాఖీ కట్టిన షర్బతీ దేవి అత్యంత ఆనందానికి లోనైన సంగతి తెలిసిందే. 

పితృస్వామ్యం పోవాలి : శాంతా సిన్హా

హైదరాబాద్: సమాజంలో పితృస్వామ్యం పోవాలని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శ్రీమతి శాంతా సిన్హా అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శాంతా సిన్హా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సమాజంలో సమానత్వం రావాలని, మహిళలంతా విద్యావంతులుగా, చైతన్యవంతులు కావాలన్నారు. అలాగే బాల్యవివాహాలు అంతరించిపోవాలన్నారు. మహిళలపై ఆంక్షలు తొలగిపోవాలని ఆమె ఆకాంక్షించారు.

16:39 - March 10, 2018

విశాఖ : అనకాపల్లిలోని మాకవరంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు బావిలో పడి దంపతులు మృతి చెందారు. మాకవరం గ్రామానికి చెందిన క్రిష్ణస్వామినాయుడు, కాసులమ్మ దంపతులు. రోజూలాగే పోలానికి నీళ్ల బావి నుంచి నీళ్లు తోడేందుకు వెళ్లారు. అయితే కాసులమ్మ కాలుజారి ప్రమాదవశాత్తు నీళ్ల బావిలో పడిపోయింది. అక్కడే ఉన్న ఆమె భర్త క్రిష్ణ ఆమెను రక్షించేందుకు నీళ్లబావిలోకి దూకాడు. దీంతో ఇద్దరు బావిలో పడి చనిపోయారు. స్థానికులు దంపతుల మృతదేహాలను బయటికి తీసి, అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. దంపతుల మరణంతో ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.

 

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం..

ఢిల్లీ : దేశంలో మహానీయుల విగ్రహాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. త్రిపురలో మొదలైన విగ్రహాల విధ్వంసం దేశ వ్యాప్తంగా పాకింది. ఉత్తరప్రదేశ్‌లోని అజాంఘర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సుభాష్ చంద్రబోస్ విగ్రహాం, త్రిపురలో లెనిన్ విగ్రహం, తమిళనాడులో పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. 

కేసు మాఫీ పైనే వైసీపీ రాకీయాలు : యనమల

అమరావతి : రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేస్తున్నామని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మేము పోరాటం చేస్తుంటే వైసీపీ నేతలు బీజేపీ చుట్టు తిరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీ రాజకీయ లబ్ది కేసుల మాఫీపైనే వుందని ఎద్దేవా చేశారు. వైసీపీ రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. విభజన హామీలు సాధించుకునేంత వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని యనమల పేర్కొన్నారు. 

ప్రేమజంటపై దాడి,యువతిపై అత్యాచారం..

తూ.గోదావరి : కాట్రేనికోన మండలంలో దారుణం చోటుచేసుకుంది. బ్రహ్మసమేద్యం సముద్రతీరం వద్ద ఓ ప్రేమజంటపై దాడి చేసి యువతిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరిస్తుండగా కొందరు యువకులు అడ్డుకున్నారు. వీరిపై సదరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో సదరు యువకులు పోలీసులకు సమాచారం అందించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా వీరిలో పరారీలో వున్న ఇద్దరు యువకుల గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఏపీ ఆదరణ పథకం విధివిధానాలు..

అమరావతి : ఏపీ ప్రభుత్వం ఆదరణ పథక విధివిధానాలను జారీ చేసింది. బీసీ వర్గాలకు ఆధునిక పనిముట్లు కొనుగోలుకు..ప్రభుత్వం చేయూతనందివ్వనుంది. ఈ సహాయం మూడు కేటగిరీలలో అందజేయనున్నారు. రూ.30వేలు,రూ.20 వేలు, రూ.10వేలు చొప్పున సహకారం ప్రభుత్వం అందివ్వనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.55లక్షల మందికి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలుజేయనుంది. 

కూలిన హెలికాప్టర్..

మహారాష్ట్ర : ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ కూలింది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మురుద్ సమీపంలోని నంద్‌గావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

16:01 - March 10, 2018

హైదరాబాద్ : తార్నాకలో తార్నాకలో జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ , సీసీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బోల్లారం పీఎస్ కు తరలించారు. మిలియన్ మార్చ్ కు ప్రజా సంఘాలు, జేఏసీ కార్యకర్తలు తరలివస్తున్నారు. మిలియన్ మార్చ్ కు తరలివస్తున్న కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు పోలీసుల దిగ్బంధంలో ఉన్నాయి. ట్యాంక్ బండ్ కు తరలివస్తున్న పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు జేఏసీ, వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు అరెస్టు చేసి పీఎస్ లకు తరలించారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. 
సీపీ.. 
'హైదరాబాద్ లో 150 నుంచి 200 మంది వరకు అదుపులోకి తీసుకున్నాం.. ప్రివెంట్ కస్టడీలోకి తీసుకున్నాం. ఐదు గంటలు, లేదా ఐదున్నర గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. ఇళ్లళ్లోకి వెళ్లి అరెస్టు చేయలేదు..రోడ్లపైనే అరెస్టు చేశాం. అరెస్టు చేసినవారికి నీరు, గ్లూకోజ్, స్నాక్, భోజనాలు ఏర్పాటు చేశాం. ఇంటర్ కెమిస్ట్రీల, కామర్స్ ఎగ్జామ్స్ ను నిర్వహించి తీరుతాం' అని చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

సురేశ్ ప్రభుకు అదనపు బాధ్యత..

ఢిల్లీ: కేంద్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి సురేశ్‌ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతల్ని అప్పగించింది. రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ తెదేపా అధిష్ఠానం ఆదేశం మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి పదవికి అశోక్‌గజపతిరాజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని సురేశ్‌ ‌ప్రభుకు అప్పగించాలని ప్రధాని నిర్ణయించారు. పీఎంవో సూచన మేరకు రాష్ట్రపతి కార్యాలయం శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది.

 

15:42 - March 10, 2018

సంగారెడ్డి : జిల్లాలోని ఆల్గోల్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు టిప్పర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డిప్పర్ డ్రైవర్ మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీసీ టీవీ ఫుటేజీలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

భారత్, ఫ్రాన్స్ మధ్య పలు కీలక ఒప్పందాలు..

ఢిల్లీ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేలు ఒక్రాన్ పర్యటనలో భారత్, ఫ్రాన్స్ మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. 14 ఒప్పందాలపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతుందని..హిందు మహాసముద్రం ప్రాంతంలో సహకారంపై ఫ్రాన్స్ తో ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ తెలిపారు. హైస్వీడు రైళ్లు, రక్షణ,అంతరిక్షం వంటి అంశాలపై చర్చలు జరిగాయని తెలిపారు. ప్రపంచ యుద్ధాల్లో ఇరు దేశాలు కలిసి పోరాడామనీ..భారత్, ఫ్రాన్స్ మధ్య బంధాలు సుదీర్ఘకాలం కొనసాగించామన్నారు.

15:34 - March 10, 2018

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్ బండ్ పై భారీగా పోలీసులు మోహరించారు. మిలియన్ మార్చ్ కు తరలివస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, జేఏసీ, వామపక్ష, ప్రజాసంఘాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

చంద్రబాబుపై మరోసారి రోజు ఫైర్..

హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు చేసిన ట్వీట్ చాలా చవకబారుగా వుందన్నారు. మహిళా భద్రత కోసం చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పెట్టారు కానీ దాన్ని గాలికొదిలేశారని ఆమె పేర్కొన్నారు. టీడీపీ రౌడీలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.బెల్ట్ షాపుల విషయంలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. ఆయనకు ఐపాడ్స్ కు, సానిట్రీ పాడ్స్ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.

ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత నెలకొంది. మిలియన్ మార్చ్ కు తరలివస్తున్న పలువురు జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, జేఏసీ, వామపక్ష, ప్రజాసంఘాల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తిత పరిస్ధితులు నెలకొన్నాయి. 

ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం..

అమరావతి : పార్టీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సచివాలంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు కళా వెంకట్రావు, యనమల, సోమిరెడ్డి చంద్రమోహన్ లు హాజరయ్యారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక, తాజా రాజకీయ పరిణామాలు వంటి తదితర అంశాలపై చర్చించనున్నారు. 

జీఎస్టీ మండలి సమావేశం..

ఢిల్లీ : విజ్నానభవన్ లో 26వ జీఎస్టీ మండలి సమావేశమయ్యింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఈ మండలి సమావేశమయ్యింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 

జమ్మూ కశ్మీర్‌లో భూ ప్రకంపనలు..

ఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఇవాళ ఉదయం స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. పలు నగరాల్లోని ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందనీ.. ఈ కారణంగా కొద్ది సెకన్ల పాటు రాష్ట్రంలో పలుచోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నాయని భారత వాతావరణ శాఖ  వెల్లడించింది. ఈ భూకంప ప్రభావం ‘‘స్వల్పం’’గానే ఉంటుందని ప్రకటించింది.

జనసేనలోకి కాంగ్రెస్ నేత?..

నెల్లూరు : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన మాదాసు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా, పోలీసు హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గత కొంతకాంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

జనసేనలోకి కాంగ్రెస్ నేత?..

నెల్లూరు : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన మాదాసు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా, పోలీసు హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గత కొంతకాంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

13:08 - March 10, 2018

అమరావతి : రాజ్యసభ ఎన్నికలకు నోటిపికేషన్ విడుదల కావడంతో వైసిపీలో కలవరం మొదలైంది... తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ హ్యండిస్తారోనన్న టెన్షన్‌ పట్టుకుంది.. దీంతో పార్టీ అధినాయకత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను క్యాంపులకు తలరిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను మరోసారి జరకుండా ఎమ్మెల్యేలను నీడలా అంటిపెట్టుకుని ఉంటున్నారు.. వైసీపీ నేతలుఅనుభవాలు ద్రుష్యా ఎమ్మెల్యేలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది వైసీపి..

రాజ్యసభ సీటును కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ
రాజ్యసభ ఎన్నికల నోటిఫిషేన్ కు ముందుగానే వైసీపి రాజ్యసభ అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత వేమిరెడ్డి‌ ప్రభాకర్ రెడ్డిని ‌ప్రకటించారు వైసీపి అధ్యక్షుడు జగన్. అప్పటి నుండి వైసీపి లో వున్న 44 మంది ఎమ్మెల్యే లను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చివరి నిమిషం‌లోనైనా ఎమ్మెల్యే లను‌ప్రలోభాలకు గురి చేసి తమ నుంచి లాక్కొంటారనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. దీంతో 44 మందిలో ఎ ఒక్క ఎమ్మెల్యే చేజారి పోకుండా వారిని క్యాంపులకు తరలించారు ఆ పార్టీ అగ్రనేతలు. కొంత మందిని డిల్లీ శివార్ల లో ఓ రిసార్ట్ లో వుంచగా.. మరికొద్ద మందిని మాత్రం బ్యాచ్ ల వారిగా ఫారిన్ టూర్లు ఏర్పాటు చేసి వారిని కాపాడుకునేలా ప్రణాళికలు చేసారు.

అధికాపార్టీ ప్రలోభాలకు గురిచేస్తే.. సాక్ష్యాలతో పట్టించేందుకు వైసీపీ వ్యూహాలు
మరోవైపు ఇప్పటికే వైసీపీ నుంచి టీడిపి లోకి ఫిరాయించిన వారిలో 23 మంది ఎమ్మెల్యే లలో ఓ ఆరుగురిని తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ పనిలో ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ నేత బిజీగా ఉన్నట్టు వైసీలో చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. మరో ఇద్దరు టీడిపి ఎమ్మెల్యే లు కూడా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారని అధికారపార్టీని గందరగోళంలోకి నెడుతున్నారు.. విపక్షపార్టీ నేతలు. ఎన్నికల సమయంలో ఒక వేళ అధికార పార్టీ ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తే. గతం లో ఎమ్మెల్యే లను ఆకర్షించడానికి అధికార పార్టీ చేపట్టిన విధానాలను ఆధారాలతో సహాపెట్టాలని వైసీపి తమ వ్యూహానికి పదును పెట్టింది. కాని అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించిన వైసీపీ రాజ్యసభ సీటను కైవసం చేసుకునేందుకు ప్రగడ్బందీగా ప్రణాళిలకు రచిందింది. 

13:04 - March 10, 2018

హైదరాబాద్ : మిలియన్‌ మార్చ్‌ స్పూర్తి సభ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ రోడ్‌ బస్టాప్‌ వద్ద ఆస్పత్రికి వెళుతోన్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నేతలు పోలీసులతో వారించారు. దీంతో వారిని పోలీసులు ఆటోలో పంపించారు. 

12:54 - March 10, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో స్వేచ్ఛ గుర్తుకు వచ్చిందనీ..తాము కూడా కేసీఆర్ వలనె హక్కుల కోసం పోరాడతున్నామన్నారు. హక్కుల కోసం ఢిల్లీ వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారనీ మీకు హక్కులు కావాలి కానీ మాకు మా హక్కులు అవసరం లేదాని ఆగ్రహంతో ప్రశ్నించారు. మిలియన్‌ మార్చ్‌ను గుర్తు చేసుకోవడం పాలకులకు ఇష్టం లేదన్నారు టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌. ప్రజలు సోయిలోకి వస్తే ప్రశ్నిస్తారని టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందన్నారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు వెళ్లనీయకుండా వేలాది మంది జేఏసీ నాయకులను అరెస్ట్‌ చేశారని, తన ఇంటిని పూర్తిగా పోలీస్ దిగ్భందంలో ఉంచారన్నారు. నిన్నటి నుంచి జేఏసీ నేతలను పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించారని, అరెస్టయిన నేతలకు పోలీసులు కనీసం భోజనం కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ నేతల అరెస్టులపై కోర్టుకెళ్తామన్నారు కోదండరామ్‌. ట్యాంక్‌బండ్‌పై ప్రజాకాంక్షను చాటుతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఢిల్లీలో స్వేచ్ఛ గుర్తుకు వచ్చిందని...తాము కూడా కేసీఆర్‌ లాగే హక్కుల కోసం పోరాడుతామన్నారు కోదండరామ్‌.

12:32 - March 10, 2018
12:30 - March 10, 2018
12:24 - March 10, 2018

మంచిర్యాల :పురాతనమైన మొసళ్ళ పునరావాస కేంద్రం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైంది. మంచిర్యాల జిల్లాలోని శివ్వారం దగ్గర ఉన్న ఎల్. మడుగు మొసళ్ళ సంరక్షణ కేంద్రం ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూపరులను ఇట్టే ఆకుట్టుకుంటుంది. సహజ సిద్దమైన ఈ మడుగులో 60 కి పైగా మొసళ్ళు.. సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి... అధికారులు ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పిస్తే... పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి సాధిస్తుందని స్థానికులు అంటున్నారు.

మొసళ్ళ పునరావాస కేంద్రంపై అధికారుల నిర్లక్ష్యం
మంచిర్యాల జిల్లాలో శివ్వారం దగ్గర ఉన్న సహజసిద్దమైన ఎల్. మడుగు మొసళ్ళ సంరక్షణ కేంద్రం ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఎంతగానో ఆకట్టుకుంటోంది.. కానీ.. అధికారుల నిర్లక్ష్యంతో కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఫలితంగా పర్యాటకులతో సందడిగా ఉండాల్సిన ఈ కేంద్రం వెలవెల బోతోంది. గోదావరి నది నుంచి పాయగా వచ్చిన నీటి ప్రవాహంతో రెండు కిలో మీటర్లకు పైగా ఉన్న ఈ నీటి మడుగునే... ఎల్‌.మడుగుగా పిలుస్తారు. ఇది చెన్నూరు మండలం భీరెల్లి వరకు 15 కిలోమీటర్ల మేర విస్తరించింది.

1978లో వైల్డ్‌లైఫ్ నిపుణుడు అధ్యయనం
1978లో పుష్పకుమార్ అనే వైల్డ్‌లైఫ్ నిపుణుడు ఈ ప్రాంతంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు.. అప్పటినుంచి దీన్ని మొసళ్ల పునరావాస కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. కాకతీయుల కాలం నాటి సహజ సిద్దమైన ఈ మడుగు 9 కిలోమీటర్ల వెడల్పు, 29 కిలోమీటర్ల పొడవుతో ఉంది. ఇక్కడ 60కి పైగా మొసళ్ళు, 102 నీటి కుక్కలు, అరుదుగా ఉండే దొనచేప, స్టార్‌ఫిష్‌లతోపాటు పలురకాల చేపలు, నీటి జంతువులు జీవిస్తున్నాయి. అలాగే కృష్ణ జింకలు, గడ్డి జింకలు, అడవి కోళ్లు, నెమళ్లు, దుప్పులు, అడవి పందులు, ముళ్లపందులు వందల సంఖ్యలో నివాసం ఏర్పర్చుకున్నాయి. నల్ల మద్ది, తిర్మణి, చెన్నంగ, ఏగీస, సోని, బూరగ, అందుగు, సిందుగు, పాల, కొడిశ వంటి అరుదైన వృక్ష జాతులు సైతం ఉన్నాయి.

కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడ దూరం
ఇక్కడి వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు అధికారులు నీటికుంటలను ఏర్పాటు చేశారు.. దీంతోపాటు 20 చోట్ల నిరంతర ప్రవాహానికి అడ్డుకట్టలు వేశారు.. గతంలో ఈ మొసళ్ళ పునరావాస కేంద్రానికి వెళ్లాలంటే శివ్వారం గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల మేర కాలినడకన వెల్లాల్సి ఉండేది. ఇందులో రెండు కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలు, చెట్లు, చిన్నచిన్న మొక్కలను తొలగిస్తూ.. దారి చేసుకుని మడుగుకు చేరుకోవాల్సి ఉండేది... కానీ ఇప్పుడు మట్టి రోడ్డు వేయడంతో ఒకింత సులభతరంగా మారిందనే చెప్పొచ్చు.

విశేషంగా ఆకట్టుకునే పురాతన గుహాలయాలు-
ఇక్కడ నదికి ఇరువైపులా ఉండే ఆలయాల రాతికట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బోట్ లో విహరిస్తూ పకృతి అందాలను వీక్షించి మైమరిచిపోతుంటారు పర్యాటకులు. అందాలను తిలకించేందుకు వీలుగా వ్యూ పాయింట్‌, వాచ్‌టవర్‌ నిర్మించారు. అయితే పూర్తిస్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు. దీనికోసం ప్రభుత్వానికి ప్రణాళిక పంపించామని చెబుతున్నారు. ఇప్పటికైన పురాతన కాలం నాటి ఎల్‌మడుగు వద్ద సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

12:17 - March 10, 2018

హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల్లో సర్కార్ పై సమరానికి కాంగ్రెస్ రెడీ అవుతోంది. కేసీఆర్ హామీలే ఆయుధంగా మలచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. బడ్జెట్‌ సమావేశాల్లో ఎలా వ్యవహిరించాలన్న దానిపై హైదరాబాద్‌లో భేటీ అయిన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం విస్తృతంగా చర్చించింది. మరోవైపు వర్గీకరణకోసం ఎమ్మార్పిఎస్ తలపెట్టిన రాష్ట్రబంద్ కు మద్దతు ఇవ్వాలని కూడా సీఎల్పీ నిర్ణయించింది.

వ్యూహాలకు పదును
ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. సమావేశాల్లో సర్కార్ పై పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రజాచైతన్య బస్సుయాత్రతో ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన హస్తం నేతలు... ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదే ఉత్సాహాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ కొనసాగించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది ఉత్తమ్‌ అండ్‌ టీమ్‌..

హామీలే ప్రధాన ఆయుధంగా టీ.కాంగ్
దళితులకు మూడెకరాల భూమితో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల హామీలను సమావేశంలో ప్రధాన ఆయుధాలుగా కేసీఆర్ ను నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. దీనిపై పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా దిశానిర్దేశం చేశారని హస్తంపార్టీ నేతలు అంటున్నారు. బైట్ .. సంపత్ కుమార్ , ఎమ్మెల్యే (ఫీడ్ సీఎల్పీ నుండి ) అటు రాబోయే రాజ్యసభ ఎన్నికలపై కూడా సీఎల్పీలో హాట్ హాట్ చర్చ జరిగింది . ఎన్నికల్లో అభ్యర్థిని నిలపాలని పార్టీలో వివిధ స్థాయిల్లో డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దీనిపై సాధ్యాసాధ్యాలను సీఎల్పీ ప్రధానంగా చర్చించింది.సమావేశంలో పాల్గొన్న మెజార్టీ సభ్యులు తమ అభ్యర్థిని బరిలో దింపాలని అభిప్రాయపడినట్టు సమాచారం. మాజీ ఎంపీలు అజారుద్దీన్, రవీంద్ర నాయక్, పీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. కాగా అభ్యర్థి ఎంపిక బాధ్యతను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసిసి ఇంచార్జీ కుంతియాలకు అప్పగిస్తూ సీఎల్పీ నిర్ణయం తీసుకుంది..

ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు హస్తంపార్టీ ప్లాన్స్‌
రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపటం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు కూడా హస్తంపార్టీ ప్లాన్స్‌ రెడీ చేసింది. పార్టీ తరఫున విప్ జారీ చేస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయే అవకాశం ఉండటంతో... కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు ఇదే సరైన మార్గమని కాంగ్రెస్‌ నేతలు బావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఈసారి బడ్జెట్‌ సమావేశాల్లో అధికాపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తేందుకు సిద్ధమయ్యామంటున్నారు హస్తంపార్టీ నేతలు. 

12:11 - March 10, 2018
12:09 - March 10, 2018

వికారాబాద్ : వికారాబాద్‌ జిల్లా అత్తెల్లి గ్రామంలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో చంటి బిడ్డతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో... మనస్థాపం చెందిన భార్య వరాలు బిడ్డతో కలిసి బావిలో దూకింది. భర్త వేధింపులే ఈ ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బావిలో నుండి శవాలను బయటికి తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

12:07 - March 10, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది...అధికార టీడీపీలో రాజ్యసభ హడావుడికి తెరలేచింది. ఈనెల 12 నామినేషన్‌కు చివరితేదీ కావడంతో... ఆశావహులు ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్... అంటూ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇంతకూ టీడీపీ తమకొచ్చే రెండు స్థానాలతో సరిపెట్టుకుంటుందా.. లేక మూడోదానికోసం ప్రయత్నిస్తుందా అన్నది... అందరిలోనూ ఆసక్తిరేపుతోంది. అటు నిన్నటివరకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పడు ఎలాంటి స్టాండ్‌ తీసుకుంటుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ అంకానికి తెర
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ అంకానికి తెరలేచింది... ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తన్న చిరంజీవి, దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరీ కాలపరిమితి ఏప్రిల్‌ రెండో తేదీతో ముగియనుంది.. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం రమేష్, రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్దన్ రెడ్డిల కాలపరిమితి కూడా అదే సమయానికి ముగుస్తుంది.. పాల్వాయి గోవర్దన్ రెడ్డి మృతితో ఏర్పడ్డ ఖాలీ ఇంతవరకూ భర్తీ చేయలేదు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ర్టాలనుంచి మొత్తం ఆరు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను నిలపాల్సి ఉంది.

ఇప్పటికే వైసీపీనుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు
ఏపీలో టీడీపీకి ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం మూడింటిలో రెండు రాజ్యసభ స్థానాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మూడోది ప్రతిపక్ష వైసీపీకి దక్కనుంది. ఇప్పటికే వైసీపీనుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా... టీడీపీ రెండింటితో సరిపెట్టుకుంటుందా... లేక మూడో దానికి పోటీ చేస్తుందా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రెండింటికే పరిమితం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పార్టీలోని ఇతర నేతలు మాత్రం మూడో దానికి పోటీచేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
టీడీపీ గూటికి వైసీపీ నేతలు
ఇప్పటికే వైసీపీనుంచి 22 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీ గూటికి చేరారు. రాజ్యసభ ఎన్నికలలోపు మరో ఇద్దరు లేదా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే ఖచ్చితంగా మూడో సీటు కూడా తమకే వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఒకవేళ వైసీపీనుంచి టీడీపీలోకి ఎవరూ రాకపోతే... టీడీపీ రెండింటితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్ధులపై దృష్టి పెట్టని టీడీపీ
కాగా.. టీడీపీ అధినేత అభ్యర్థుల ఎంపికపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఈ ఆదివారం చంద్రబాబు నివాసంలో నిర్వహించే పొలిట్‌ బ్యూరో సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసేఅవకాశం కనిపిస్తోంది.

బెడిసికొట్టిన బీజేపీ, టీడీపీ పొత్తు :
మరోవైపు గత రాజ్యసభ ఎన్నికలనాటి పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీల మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. ఇరువైపులా మత్రులు రాజీనామా కూడా చేసిన నేపథ్యంలో బీజేపీ ఎలాంటి స్టాండ్‌ తీసుకుంటుందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అలా ఉంచితే.. అసలు టీడీపీలో రాజ్యసభ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. గత కొన్నేళ్ళుగా రాజ్యసభకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం లభించడం లేదనే భావన ఆ వ్యక్తమౌతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి ఎస్సీ సామాజికవర్గానికే రాజ్యసభ టికెట్ దక్కుతుందని పార్టీవర్గాలు ర్కొంటున్నాయి. మరోవైపు మాదిగ సామాజిక వర్గానికి టీడీపీ నుంచి ప్రాతినిథ్యం లేదుకాబట్టి.. మాదిగలకు ఇవ్వాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ వర్గం నుంచి వర్ల రామయ్య, మహిళా కోటాలో సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ, ఆశిస్తుండగా... అటు మాల సామాజిక వర్గంనుంచి జూపూడి, ప్రతిభా భారతి, బల్లి దుర్గా ప్రసాద్, పరసా రత్నం ఆశిస్తున్నారు. ఇక బీసీ కోటానుంచి బీద మస్తాన్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఓసీ సామాజిక వర్గం నుంచి చాలా మంది పోటీపడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేష్ మరో సారి తననే కొనసాగిస్తారన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. అటు రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి, రఘునాథరెడ్డి, పుత్తానరసింహారెడ్డి చంద్రబాబుని కలిసి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కలిపిస్తే... ఆ ప్రాంతంలో పార్టీ బలపడుతుందని వారు అంటున్నారు. రాజ్యసభ మూడో స్థానానికి అవసరమైన సంఖ్యా బలాన్ని టీడీపీ సాధిస్తుందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. కానీ .. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడో స్థానానికి పోటీ పెట్టకపోవడమే మంచిదన్న అభిప్రాయం కూడా టీడీపీ వర్గాల్లో వ్యక్తం మవుతోంది.

11:57 - March 10, 2018

హైదరాబాద్ : కాసేపట్లో ట్యాంక్‌బండ్‌పై టీ-జేఏసీ మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి ప్రారంభం కానుంది. ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజాసంఘాలు, విద్యార్ధులు తరలివస్తున్నారు. అయితే... మిలియన్‌ మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పలువురిని అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎవరైనా ట్యాంక్‌బండ్‌కు వస్తే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కోదండరామ్‌ జేఏసీ నేతలతో భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్‌ నిర్వహిస్తామని జేఏసీ నేతలంటున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తాం : కోదండరాం
ఎట్టి పరిస్థితుల్లోనూ మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామన్నారు కోదండరామ్‌. పోలీసులు అత్యుత్సాహంగా మిలియన్‌ మార్చ్‌కు తరలి వచ్చే వారిని అరెస్ట్‌ చేస్తున్నారన్నారు. తాము ట్యాంక్‌బండ్‌కు బయల్దేరుతామని... పోలీసులు అరెస్ట్‌ చేసినా లెక్కచేయమన్నారు కోదండరామ్‌. 

11:45 - March 10, 2018

చిత్తూరు : ప్రధాని మోదీగారు తెలుగు వారి దెబ్బ రుచి చూస్తారా? అంటు టీడీపీ ఎంపీ శివప్రసాద్ డప్పు కొట్టి మరీ హెచ్చరించారు. రాజకీయ పరిణామాలకు అద్దంపట్టేలా విచిత్రంగా, వినూత్నంగా వేషాలు వేసి అలరించే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరో విచిత్ర వేషాధారణతో దర్శనమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తు చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద డప్పు కొడుతు తన నిరసనను వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.లేదంటే తెలుగువారి దెబ్బ రుచి చూపిస్తామని ఎంపీ శివప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని హెచ్చరించారు. కేంద్రం ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తారనే ఉద్ధేశ్యంతో గత నాలుగేళ్లుగా ఓపిక పట్టిన ఏపీ ప్రభుత్వం కేంద్ర కేబినెట్ నుండి తమ మంత్రి పదవులకు, ఏపీ కేబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి పవులకు రాజీనామాలు చేసిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులు ఉత్కంఠను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. 

చిన్నారితో కలిసి తల్లి ఆత్మహత్య..

వికారాబాద్: అత్వెల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. చంటి బాబుతో సహా బావిలో పడి తల్లి మృతి చెందింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికుల సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హోదా కోసం డప్పు కొట్టిన ఎంపీ..

చిత్తూరు : రాజకీయ పరిణామాలకు అద్దంపట్టేలా విచిత్రంగా, వినూత్నంగా వేషాలు వేసి అలరించే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరో విచిత్ర వేషాధారణతో దర్శనమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తు చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద డప్పు కొడుతు తన నిరసనను వ్యక్తంచేశారు. 

ప్రొ. కోదండరాం హౌస్ అరెస్ట్..

హైదరాబాద్ : టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు  హౌస్  అరెస్ట్ చేశారు. మిలియన్ మార్చ్ కు వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను గృహం నిర్భంధం చేశారు. దీంతో ఆయన కార్యకర్తలతో చర్చిస్తున్నారు. ఎన్ని ఆంక్షలనైనా ఎదుర్కొని మిలియన్ మార్చ్ ను జరిపితీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఏ క్షణంలోనైనా కోదండరాంను అరెస్ట్ చేసే అవకాశమున్నట్లుగా ఆక్కడి వాతావరణం నెలకొంది. 

10:56 - March 10, 2018

విజయవాడ : రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ల గడువు సమీపిస్తోంది. కానీ టిడిపి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఎంపికపై టిడిపి తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు టిడిపి అధిష్టానం ముందు కోరుతున్నారు. దీనితో ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

రాజ్యసభ అభ్యర్థుల ఖరారు చేసేందుకు ఏపీ మంత్రి యనమల, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ లు టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ కానున్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యం కల్పించాలని బాబుపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కొందరు....రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించాలని, ఫలితంగా పార్టీ బలోపేతం అవుతుందని ఇంకొందరు టిడిపి అధిష్టానం ఎదుట కోరికలు వినిపిస్తున్నారు. బీసీల నుండి బీద మస్తాన్ రావుకు ఇవ్వాలని నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీల నుండి మాదిగా సామాజిక వర్గానికి చెందిన వారు లేరు కాబట్టి వర్ల రామయ్యకు టికెట్ ఇవ్వాలని మరికొంతమంది కోరుతున్నారు.

మొత్తానికి విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, పార్టీ అధికారి ప్రతినిధి లంకా దినకర్‌బాబు, చిత్తూరుజిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హేమలత, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి తదితరులు రాజ్యసభ అభ్యర్థుల రేసులో ఉన్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌ ఎంపీలు చిరంజీవి, రేణుకా చౌదరి, తెలుగుదేశం ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ పదవీ విరమణ చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో సీట్ల కేటాయింపు కారణంగా దేవేంద్రగౌడ్‌ తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికయ్యారు. అధికార, విపక్ష పార్టీలలో రాజ్యసభ సీటుకు విపరీతమైన పోటీ నెలకొంది.

10:55 - March 10, 2018

ఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్ మోడీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లింక్ లున్నట్లు సీబీఐ దర్యాప్తులో బయటపడుతున్నాయి. ఆయనతో సంబంధం ఉన్న వారిపై..ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సంస్థలపై సీబీఐ దృష్టి సారించింది. అందులో భాగంగా గుంటూరులో జిల్లాలో ఓ ఆటోమొబైల్ సంస్థ డీలర్ తో నీరవ్ మోడీ సంబంధాలు పెట్టుకున్నట్లు నిర్ధారించింది. వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. ఆటో మొబైల్ డీలర్ కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఇందులో కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. త్వరలోనే ఆ డీలర్ ను సీబీఐ అధికారులు విచారించినట్లు సమాచారం. ముంబై..ఢిల్లీ నగరాలతో మోడీకి లింక్ ఉన్నట్లు భావించిన అధికారులు ఇతర రాష్ట్రాల్లో కూడా లావాదేవీలు జరిపాడా ? లేడా ? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. 

10:52 - March 10, 2018

విమలక్క అరెస్ట్..

హైదరాబాద్ : ప్రముఖ ఉద్యమకారిణి, కళాకారిణి అయిన విమలక్కను పోలీసులు అరెస్టు చేశారు. మిలియన్ మార్చ్ కు వెళ్లకుండా విమలక్కను బాగ్ లింగంపల్లిలోని ఎస్వీకే వద్ద విమలక్కను అరెస్ట్ చేశారు.కాగా నగరంలో పలువురు ఉద్యమకారులు మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిలియన్ మార్చ్ సభకు పోలీసులు అనుమతిని ఇవ్వని కారణంగా సభకు వెళ్లేందుకు యత్నిస్తున్నవారిని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ లను కొనసాగిస్తున్నారు. 

సామాజిక న్యాయంపై చర్చలు : ప్రధాని

ఢిల్లీ : సామాజిక న్యాయంపై చర్చలను కొనసాగుతున్నాయని ప్రజాప్రతినిథుల సదస్సు పాల్గొన్న ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. దేశరాజధాని ఢిల్లీలో ప్రజాప్రతినిథుల సదస్సు ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలురాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఒక గ్రామంలో విద్యుత్ వుండి మరో గ్రామంలో లేకుంటే సామాజిక న్యాయం జరగనట్లేనని ఆయన పేర్కొన్నారు.

పెద్దలసభ అభ్యర్థిపై టీడీపీలో ఉత్కంఠ..

అమరావతి : రాజ్యసభ అభ్యర్థులను ఎన్నిక చేసేందుకు టీడీపీ కసరత్తును ఇప్పటి వరకూ ప్రారంభించిలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో ఎరినికి ఎన్నుకుంటారనే విషయంలో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థులను ఎన్నిక చేయాలని టీడీపీ భావిస్తోంది. దీనికి సంబంధించి ఈరోజు మంత్రులు యనమల, కళా వెంకట్రావులతో చంద్రబాబు భేటీ కానున్నారు. కాగా రాయలసీమ ప్రాంతం నుండి రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు మంత్రులు చంద్రబాబును తెలిపినట్లుగా సమాచారం.

భారత్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన..

ఢిల్లీ: భారత్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడఉ ఇమ్మానుయేల్ మోక్రాన్ పర్యటిస్తున్నారు.ఢిల్లీలోని రాజ్ ఘట్ వద్ద వున్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోక్రాన్ దంపతులు నివాళులర్పించారు. కాగా నేడు ప్రధాని మోదీ, ఇమ్మానుయోల్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగునున్నాయి. 

భారత్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన..

ఢిల్లీ: భారత్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడఉ ఇమ్మానుయేల్ మోక్రాన్ పర్యటిస్తున్నారు.ఢిల్లీలోని రాజ్ ఘట్ వద్ద వున్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోక్రాన్ దంపతులు నివాళులర్పించారు. కాగా నేడు ప్రధాని మోదీ, ఇమ్మానుయోల్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగునున్నాయి. 

మిలియన్ మార్చ్ జరిపితీరుతాం: కోదండరాం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. పాలకులు ఎన్ని నిర్భంధాలు విధించినా మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను జరిపితీరుతామని ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. మిలయన్ మార్చ్ సభను అనుమతినివ్వకపోవటం కేసీఆర్ నిరుంకుశ పాలను నిదర్శనమని ఆయన విమర్శించారు. గతంలో కూడా పాలకులు ఎన్ని ఆటంగాలు విధించినా సభను జరిపినట్లే ఇప్పుడు కూడా జరుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ తెలంగాణలో ఇన్ని నిర్భంధాలు వుంటాయనుకోలేదని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూ డెమెక్రసీ నేతలు అరెస్ట్..

నిజామాబాద్ : హైదరాబాద్ లో జరుగనున్న మిలియన్ మార్చ్ కు వెళ్లకుండా జిల్లాలో పోలీసులు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలను చేపట్టారు. మోర్తాండ్, సిరికొండ, కమ్మరపల్లి, గడ్కకోల్ గ్రామాలలో..న్యూ డెమెక్రసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మిలియన్ మార్చ్ లో పాల్గొనేందుకు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వారిని విడుదల చేయాలని టీజేఏసీ డిమాండ్ చేసింది.

మరో ప్రేమజంట ఆత్మహత్య..

యాదాద్రి : రామన్నపేట శివారులో ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రేమజంట మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా చిద్రమైపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

నీవర్ మోదీ లింకులుగుంటూరులో..

ఢిల్లీ : సంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణ నిందితుడు నీరవ్ మోదీకి గుంటురుకు లింకులు వున్నట్లుగా సీబీఐ విచారణలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. గుంటూరులోని ఆటోమొబైల్ డీలర్, నీవర్ మోదీ మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నట్లుగు సీబీఐ విచారణలో వెల్లడయింది.ఆటోమొబైల్ ఖాతాల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది.  

నీవర్ మోదీ లింకులుగుంటూరులో..

ఢిల్లీ : సంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణ నిందితుడు నీరవ్ మోదీకి గుంటురుకు లింకులు వున్నట్లుగా సీబీఐ విచారణలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. గుంటూరులోని ఆటోమొబైల్ డీలర్, నీవర్ మోదీ మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నట్లుగు సీబీఐ విచారణలో వెల్లడయింది.ఆటోమొబైల్ ఖాతాల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది.  

ఆర్టీసీ స్థలంలో గుడిసెల తొలగింపు....

అనంతపురం : ఆర్టీసీ వద్ద గల స్థలంలో గుడిసెలను తొలగించారు. కోర్టు తీర్పు మేరకు అధికారులు గుడిసెలను తొలగిస్తున్నారు. గుడిసె వాసులు అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. 

నీరవ్ మోడీకి గుంటూరు వాసితో లింక్...

ఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్ మోడీకి గుంటూరులోని ప్రముఖ ఆటో మొబైల్ డీలర్ తో లింక్ లున్నట్లు సీబీఐ గుర్తించింది. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సీబీఐ నిర్ధారించింది. ఈ మేరకు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 

జగన్ 108వ రోజు...

ప్రకాశం : జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. నేడు 108వ రోజు చీరాల నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. చీరాలాలో బహిరంగసభ జరుగనుంది. ఈ సందర్భంగా జగన్ చేనేత సదస్సులో పాల్గొననున్నారు. 

పోలీసుల ఆధీనంలో ట్యాంక్ బండ్...

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. మిలియన్ మార్చ్ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

08:33 - March 10, 2018

జహీరా బాద్ లో బస్సు ప్రమాదం...

సంగారెడ్డి : జహీరాబాద్ బై పాస్ రోడ్డులో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అలుగోలు సెంటర్ లో అదుపు తప్పి టిప్పర్ ను, విద్యుత్ స్తంభాన్ని ప్రైవేటు బస్సు ఢీకొంది. ఒకరు మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి. 

తాకని సూర్యకిరణాలు...

శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకలేదు. దీనితో వరుసుగా రెండో రోజు కూడా భక్తులు నిరాశగా వెళ్లిపోయారు. స్వామిని ఆదివారం సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

08:15 - March 10, 2018

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. శనివారం మిలియన్ మార్చ్ స్పూర్తిని గుర్తుకు తెచ్చుకొనే విధంగా ఆట..పాట.. నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించడం..దీనికి పోలీసులు అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనితో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది. కోదండరాంను ముందస్తు అరెస్టు చేస్తారంటూ పుకార్లు షికారు చేశాయి. ట్యాంక్ బండ్ వద్ధ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా టెన్ టివితో కోదండరాం మాట్లాడారు. సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇది ఒక్క జేఏసీ కార్యక్రమం కాదన్నారు. ..ఎంతో మంది..ప్రజా సంఘాలు..విద్యార్థి సంఘాలు సమిష్టిగా ఇందులో పాల్గొంటున్నాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:11 - March 10, 2018

హైదరాబాద్ : మార్చి 10...2011 మిలియన్ మార్చ్...మిలియన్ మార్చ్ విజయం తెలంగాణ ఆశకు, ఆశయానికి స్ఫూర్తినిచ్చింది. జేఏసీ మీద తెలంగాణ సమాజంలో విశ్వాసాన్ని పెంచింది. మార్చ్… ఎందరి గుండెల్లోనో.. మరుపురాని జ్ఞాపకంగా.. నిత్య స్ఫూర్తిగా నిలిచింది. అలాంటి మార్చ్ స్పూర్తి మరొక్కసారి గుర్తుకు తెచ్చుకొనేందుకు టీజేఏసీ ప్రయత్నాలు చేసింది. ట్యాంక్ బండ్ పై ఉన్న కవి మొఖ్దుం మొహియుద్దీన్ విగ్రహం వద్ద ఆట..పాట నిర్వహిస్తామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. మిలియన్ మార్చ్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు. కానీ మార్చ్ నిర్వహించి తీరుతామని, నిర్భందం ప్రయోగించడం సబబు కాదని నేతలు పేర్కొంటున్నారు. శనివారం ఉదయం ట్యాంక్ బండ్ పై పోలీసులు భారీగా మోహరించారు. సుమారు 12వేల మంది పోలీసులు మోహరించారు. కేసీఆర్ ద్వంద్వ వైఖరితో కనబరుస్తున్నారని కోదండరాం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ట్యాంక్ బండ్ పై ఉదయం 11 నుండి సాయంత్రం 5గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచించారు. మరోవైపు ట్యాంక్ బండ్ కు సమీపంలో ఉన్న లుంబునీ పార్క్, ఎన్టీఆర్ పార్కు, సంజీవయ్య పార్కులను మూసివేశారు. ట్యాంక్ బండ్ పై ఎలాంటి సభలు..సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని, ఏర్పాట్లు చేస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. 

07:44 - March 10, 2018

తెలంగాణలో ప్రజాసంఘాల నిరసనలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ధర్నా చేసినా.. ప్రదర్శన నిర్వహించినా.. ప్రభుత్వ అనుమతి లభించడం లేదు. మొన్న ధర్నాచౌక్‌.. నిన్న కొలువుల కొట్లాట.. ఇపుడు మిలియన్‌ మార్చ్‌.. కార్యక్రమం ఏదైనా ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోంది. ఈ అంశంపై టెన్ టివి చర్చా కార్యక్రమంలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), పున్నా కైలాశ్ (కాంగ్రెస్), మన్నె గోవర్ధన్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:37 - March 10, 2018
07:31 - March 10, 2018

నెల్లూరు : మున్సిపాల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గాంధీ సెంటర్‌ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌తో పాటు కార్పొరేటర్లు, టీచర్లు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. మేయర్‌ అబ్దుల్ అజీజ్‌ డాన్సులు చేస్తూ సందడిచేశారు. 

07:27 - March 10, 2018

హైదరాబాద్‌ : క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వివేక్‌, శేష్‌నారాయణలను పదవుల నుంచి తొలగిస్తూ క్రికెట్‌ అంబుడ్స్‌మెన్‌ తీర్పు ఇవ్వడం పట్ల తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న వివేక్‌ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా జోడు పదవులు నిర్వహించారు. శేష్‌ నారాయణపై ఏసీబీ కేసులు ఉన్నాయి. వీరిపై అందిన ఫిర్యాదులను విచారించిన క్రికెట్‌ అంబుడ్స్‌మెన్‌ జస్టిస్‌ నర్సింహారెడ్డి.. ఇద్దర్నీ తొలగిస్తూ తీర్పు చెప్పారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఏసీకి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ కోరింది.

 

07:25 - March 10, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటి టెస్ట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 18న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సెట్‌ కన్వీనర్‌, ఏయూ వీసీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ తెలిపారు. మార్చి 26 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. జూన్‌ 1వ తేదీన పరీక్ష జరుగుతుందని నాగేశ్వర్‌ అన్నారు.

 

07:22 - March 10, 2018

సంగారెడ్డి : జిల్లా పటన్ చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ.. ఇక్రిశాట్‌ను ఇథియోపియా ప్రతినిధి బృందం సందర్శించింది. ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి అలై నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇక్రిశాట్‌లో పంటలపై జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు. నీటివనరుల సద్వినియోగ విధానాలను తెలుసుకున్నారు. మిషన్‌ కాకతీయ పనులపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్న పరిశోధనల పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇథియోపియా ప్రతినిధి బృందం... తమ దేశంలో కూడా ఇలాంటి పద్ధతులను అమలు చేస్తామని తెలిపారు.

07:17 - March 10, 2018

హైదరాబాద్ : గిరిజన రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన బాధ్యతలు విస్మరించి.. కేంద్రంపై నెట్టడాన్ని జీవన్‌రెడ్డి తప్పుపట్టారు. నాలుగేళ్లుగా ప్రధాని మోదీకి భేషరతుగా మద్దతు తెలిపిన కేసీఆర్‌... రిజర్వేషన్ల పెంపును ఎందుకు సాధించుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

 

07:10 - March 10, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాసంఘాల నిరసనలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ధర్నా చేసినా.. ప్రదర్శన నిర్వహించినా.. ప్రభుత్వ అనుమతి లభించడం లేదు. మొన్న ధర్నాచౌక్‌.. నిన్న కొలువుల కొట్లాట.. ఇపుడు మిలియన్‌ మార్చ్‌.. కార్యక్రమం ఏదైనా ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోంది.

తెలంగాణలో ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. హక్కుల కోసం రోడ్డెక్కితే నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ఎవరైనా తమ సమస్య పరిష్కారం కోసం కార్యక్రమం తలపెడితే వారిని పోలీసులు నిర్బంధిస్తున్నారు. అరెస్ట్‌లు చేస్తున్నారు. అంతకుమించి ఆలోచిస్తే.. జైళ్లకు పంపుతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ప్రజాగొంతుకకు వేదికగా నిలిచిన ఇందిరాపార్క్‌ దగ్గరి ధర్నాచౌక్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ధర్నాచౌక్‌లో జెండాలు ఎగురకుండా చేసి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నిర్బంధాలు, అరెస్ట్‌లతో ప్రజలు నిరసన తెలిపే హక్కునూ యధేచ్చగా కాలరాస్తోంది.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. మహాజన పాదయాత్ర ముగింపు సభకు సిటీలో అనుమతివ్వకుండా సరూర్‌నగర్‌ స్టేడియంలో అనుమతించింది. గత ఆరునెలల కిందట టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తలపెట్టిన కొలువుల కొట్లాట కార్యక్రమానికి అనేక అవాంతరాలు అడ్డంకులు, నిర్బంధాలు సృష్టించింది. కోర్టు మెట్లెక్కి అనుమతి తెచ్చుకుంటేతప్ప.. సభకు అనుమతివ్వని దుస్థితి ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.

తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసి.. రాష్ట్ర ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన కార్యక్రమం మిలియన్‌మార్చ్‌. ఈ కార్యక్రమం జరిగి మార్చి 10తో ఏడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ట్యాంక్‌బండ్‌పైనున్న ముగ్దూమ్‌ విగ్రహం దగ్గర వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు కోదండరామ్‌ అధ్యక్షతన మిలియన్‌మార్చ్‌ స్ఫూర్తి కార్యక్రమం తలపెట్టాయి. నాటి ఉద్యమ స్ఫూర్తిని ఒకసారి నెమరువేసుకుంటూ.. ఆ స్ఫూర్తితో భవిష్యత్‌ ఉద్యమాలకు నాందిపలకాలని నిర్ణయించారు. అయితే ఈ సభకు అనుమతి ఇవ్వలేమంటూ హైదరాబాద్‌ పోలీసులు తేల్చి చెప్పారు. ఎవరైనా మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి కార్యక్రమానికి వస్తే అరెస్ట్‌లు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అరెస్ట్‌లు, నిర్బంధాలకు తెరతీశారు. ఇప్పటికే లెఫ్ట్‌ పార్టీలకు చెందిన 500 మందికిపైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ట్యాండ్‌ బండ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 5 గంటల నుంచే దారులు మూసేస్తున్నట్టు ప్రకటించారు. నెక్లెస్‌రోడ్డు, లిబర్టీ, బషీర్‌బాగ్‌ల రహదారులను మూసేయనున్నారు. లుంబినీపార్క్‌, ఎన్టీఆర్‌ పార్క్‌లను మూసివేస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి కార్యక్రమం జరుగుతుందా లేదా అన్న టెన్షన్‌ నెలకొంది.

లంక..బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్...

ఢిల్లీ : ముక్కోణపు టీ 20 సిరీస్ లో నేడు శ్రీలంక - బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వేటపాలెం నుండి జగన్ పాదయాత్ర కొనసాగనుంది. 

ట్యాంక్ బండ్ మూసివేత...

హైదరాబాద్ : మిలియన్ మార్చ్ చేపడుతామని టీజేఏసీ ప్రకటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరిస్తున్నామని హైదరాబాద్ సీపీ వెల్లడించారు. ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.  

ట్యాంక్ బండ్ వద్ద భారీగా పోలీసులు...

హైదరాబాద్ : మిలియన్ మార్చ్ చేపడుతామని టీజేఏసీ ప్రకటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీజేఏసీ ప్రముఖులను అరెస్టు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ప్రొ.కోదండరామ్ ఇంటి వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు చేరుకున్నట్లు తెలుస్తోంది. 

11న టిడిపి పొలిట్ బ్యూరో భేటీ...

విజయవాడ : ఈనెల 11న టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సమావేశంలోనే టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఎన్డీయేలో కొనసాగాలా... వద్దా అన్నది కూడా ఈ సమావేశంలోనే తేల్చనున్నారు.

కొనసాగుతున్న 'హోదా' ఉద్యమం..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ ప్రత్యేక హోదా పోరు మరింత ఉధృతమైంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యమ హోరు పెంచాయి. వరుసగా ఐదో రోజు శుక్రవారం కూడా ధర్నాలు, నిరసనలతో ఢిల్లీ దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. హోదా ఉద్యమం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 

రాజ్యసభ ఎన్నికల బరిలో టి.కాంగ్రెస్...

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీ పెట్టాలని తెలంగాణ సీఎల్‌పీ నిర్ణయించింది. సీఎల్‌పీ నేత జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే అంశంతోపాటు పాలు విషయాలు చర్చించారు. రాజ్యసభ ఎన్నికల కోసం మూడు పేర్లను పరిశీలించారు. మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, పార్టీ నేత గూడూరు నారాయణరెడ్డి పేర్లపై చర్చ జరిగింది. 

మిలియన్ మార్చ్ కు నో..

హైదరాబాద్ : మిలియన్‌ మార్చ్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రిజర్వేషన్ల కోటాపై ఢిల్లీలో నిరసన తెలిపే హక్కు కేసీఆర్‌కు ఉన్నప్పుడు.. ఇక్కడ అదే హక్కును ఎందుకు కాలరాస్తున్నారని ప్రశ్నించారు. 

ఎన్డీయే సర్కార్ పై సోనియా విమర్శలు...

ఢిల్లీ : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2018లో పాల్గొన్న సోనియా వివిధ అంశాలపై మాట్లాడారు. మోది పాలనలో దేశ వ్యాప్తంగా అసహన పరిస్థితులు నెలకొన్నాయని...మత ఘర్షణలు, బెదిరింపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

గౌరీ లంకేష్ హత్య కేసులో...

ఢిల్లీ : జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న కె.టి నవీన్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నవీన్‌ కుమార్‌ను ప్రశ్నించేందుకు సిట్‌ 5 రోజుల కస్టడీకి తీసుకుంది. గతవారం కూడా నవీన్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

కార్తీకి కోర్టులో ఊరట..సీబీఐలో మాత్రం...

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కార్తీ చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కార్తీని ఈడీ అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 20వ తేదీ వరకు కార్తీని అరెస్టు చేయరాదంటూ హైకోర్టు ఈడీని ఆదేశించింది. సిబిఐ కోర్టులో మాత్రం కార్తీకి చుక్కెదురైంది. 6 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని సిబిఐ కోర్టును కోరగా 3 రోజుల కస్టడీకి పటియాల కోర్టు అనుమతించింది. 

ట్రంప్...కిమ్ జోంగ్ ముఖాముఖి...

ఢిల్లీ : ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ముఖా ముఖి చర్చలకు సిద్ధమయ్యారు. కిమ్‌జోంగ్‌తో చర్చలు జరిపేందుకు ట్రంప్‌ ఒప్పుకున్నారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. వీరిద్దరు మే నెలలో సమావేశమయ్యే అవకాశం ఉందని...ఎప్పుడు ఎక్కడ అనేది త్వరలోనే వెల్లడిస్తామని వైట్‌హౌస్‌ పేర్కొంది. ఇద్దరు నేతల భేటి చారిత్రాత్మకం కానుంది.

Don't Miss