Activities calendar

11 March 2018

22:13 - March 11, 2018

బీజింగ్ : చైనా అధ్యక్ష పదవిలో జిన్ పింగ్ జీవితకాలం కొనసాగనున్నారు. చనిపోయేంతవరకు ఆయన అభ్యక్షునిగా కొనసాగనున్నారు. 2012లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ సవరణకు చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు 2958 మంది శాసనకర్తలు మద్దతు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత చైనా పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది.

 

22:03 - March 11, 2018

తమిళనాడు : విజ్ఞాన యాత్రలో విషాదం నెలకొంది. విజ్ఞాన యాత్ర కోసం అడవులోకి వెళ్లిన విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు మృతి చెందారు. ఈరోడ్, కోయంబత్తూర్ కు చెందిన 50 మంది కాలేజీ అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు విజ్ఞాన యాత్రకోసం తేని జిల్లా బోడి సమీపంలోని కురంగణి అడవులకు వెళ్లారు. అడవుల్లో కార్చిచ్చు రేగింది. కిలో మీటరు మేర మంటలు చెలరేగాయి. 53 మంది కాలేజీ విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. విద్యార్థులను రక్షించే ప్రయత్నాలకు అంతరాయం కలుగుంది. సెల్ ఫెన్ సిగ్నల్స్ కలవడం లేదు. విద్యార్థుల పరిస్థితిపై ఆందోళన కలుగుతుంది. తేని జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫైర్ సిబ్బంది విద్యార్థులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. దీంతో విద్యార్థులను రక్షించడంలో అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు విద్యార్థులతో సమాచారం సంబంధం తెగిపోవడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. 

 

21:43 - March 11, 2018

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జైళ్ల శాఖ ఓ కొత్త కార్యక్రమానికి, వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మనం చాలా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చూస్తుంటాం భిక్షగాళ్లను, బెగ్గర్స్. వాళ్లందరినీ మామూళ్లు మనుషులను చేయాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఆనందాశ్రమం పేరుతో చంచల్ గూడ జైలులో ఆశ్రమం లాగా ఏర్పాటు చేశారు. అందులో అందరికీ కేవలం ఫుడ్ మాత్రమే కాకుండా సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తూ ..అందులో ఉండే ఖైదీలతోటే వారికి కొంత సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లందరినీ మామూలు మనుషులుగా చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ జైళ్ల శాఖ చెబుతుంది. కొంతమంది మేం ఇందులోనే ఉంటామని...మరికొంతమంది మేం బయటికి వెళ్లి డబ్బులు సంపాదించుకుంటామని చెబుతున్నారు. టెన్ టివి చంచల్ గూడ జైలును సందర్శించి.. వారిని పలకరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

సీఎం చంద్రబాబు నివాసముంటున్న కొండకి నిప్పు పెట్టిన ఆకతాయిలు

అమరావతి : సీఎం చంద్రబాబు నివాసముంటున్న ఉండవల్లి వద్ద కొండకి ఆకతాయిలు నిప్పుపెట్టారు. కొండపై చెట్లు, ఎండు గడ్డి అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. 

సమస్యలు పరిష్కారయ్యేవరకు అసెంబ్లీ ముందు బైఠాయిస్తాం : రైతులు

ముంబయి : మహారాష్ట్ర రైతులు పాదయాత్ర ముంబయి సమీపానికి చేరుకుంది. రైతులు రేపు అసెంబ్లీని ముట్టడించనున్నారు. 35 వేలకు పైగా రైతులు పాదయాత్రగా సాగుతున్నారు. నాసిక్ నుంచి ముంబై వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈనెల 5న సీబీఎస్ చౌక్ నుంచి లాంగ్ మార్చ్ ప్రారంభం అయింది. 180 కి.మీ మేర అన్నదాతల పాదయాత్ర సాగనుంది. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అసెంబ్లీ ముందు బైఠాయిస్తామని రైతులు అంటున్నారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర, స్వామినాథన్ సిఫార్సుల అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైవేలు, బుల్లెట్ ట్రెయిన్ ల పేరిట ప్రభుత్వం భూసేకరణ ఆపాలని రైతులు అంటున్నారు.

ముంబయి సమీపానికి మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్

ముంబయి : మహారాష్ట్ర రైతులు పాదయాత్ర ముంబయి సమీపానికి చేరుకుంది. రైతులు రేపు అసెంబ్లీని ముట్టడించనున్నారు. 35 వేలకు పైగా రైతులు పాదయాత్రగా సాగుతున్నారు. నాసిక్ నుంచి ముంబై వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈనెల 5న సీబీఎస్ చౌక్ నుంచి లాంగ్ మార్చ్ ప్రారంభం అయింది. 180 కి.మీ మేర అన్నదాతల పాదయాత్ర సాగనుంది. 

21:00 - March 11, 2018

ఎంపీ కేశినేని నానితో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ చేసిన తప్పిదమే బీజేపీ చేస్తుందన్నారు. బీజేపీ ఏపీలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు. ఏపీని కేంద్రంలో బీజేపీ మోసం చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా ఇస్తామని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆశచూపిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టకున్నామని తెలిపారు. బీజేపీ చేసిన మోసాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించబోతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాలుగేళ్లుగా ఓపికపట్టామన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:44 - March 11, 2018

ముంబయి : మహారాష్ట్ర రైతులు పాదయాత్ర ముంబయి సమీపానికి చేరుకుంది. రైతులు రేపు అసెంబ్లీని ముట్టడించనున్నారు. 35 వేలకు పైగా రైతులు పాదయాత్రగా సాగుతున్నారు. నాసిక్ నుంచి ముంబై వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈనెల 5న సీబీఎస్ చౌక్ నుంచి లాంగ్ మార్చ్ ప్రారంభం అయింది. 180 కి.మీ మేర అన్నదాతల పాదయాత్ర సాగనుంది. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అసెంబ్లీ ముందు బైఠాయిస్తామని రైతులు అంటున్నారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర, స్వామినాథన్ సిఫార్సుల అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైవేలు, బుల్లెట్ ట్రెయిన్ ల పేరిట ప్రభుత్వం భూసేకరణ ఆపాలని రైతులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:32 - March 11, 2018

థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమా ఇప్పుడు మనింట్లోనే హోమ్ థియేటర్ లోనే రిలీజ్ కాబోతోంది. వీరశంకర్ నిర్మాతగా... వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అలా నేను..ఇలా నువ్వు' ప్రపంచవ్యాప్తంగా హోమ్ థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత వీరశంకర్, సీఈవో శ్రీరామ్, హెచ్ టీవో క్లబ్ అడ్వైజర్, ప్రజెంటర్ రాజ్ కందుకూరు పాల్గొని, మాట్లాడారు. సినిమా విశేషాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:21 - March 11, 2018

హైదరాబాద్ : పంటలకు  పెట్టుబడి ఇస్తామంటూ ఊరిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రైతులను మోసం చేస్తోందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 4వేలు, 8వేలు నగదు ఇస్తే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగవన్నారు. పంటలకు గిట్టుబాటుధరలు కల్పించనంతవరకు రైతులకు మేలు జరగదన్నారు. మిర్చి రైతులకు క్వింటాలుకు 10వేల రూపాయలు దక్కాల్సి ఉండగా 2నుంచి 3వేలకే అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. క్వింటా మిర్చిపైనే 8వేల రూపాయల వరకు నష్టపోతున్న రైతులు... ఎకరా పంటమీద దాదాపుగా రెండులక్షల రూపాయల వరకు దోపిడీకి గురువుతన్నారని తమ్మినేని అన్నారు.  గిట్టుబాటుధరలు కల్పించడానికి ప్రయత్నించని కేసీఆర్‌ ప్రభుత్వం .. 4వేల రూపాయల పంటపెట్టుబడి ఇస్తామంటోందని తమ్మినేని విమర్శించారు. 

 

20:17 - March 11, 2018

ముంబై : మహారాష్ట్రలో రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. ఈనెల 5న సీబీఎస్‌ చౌక్‌నుంచి ప్రారంభమైన లాంగ్‌మార్చ్‌ రేపు ముంబై చేరుకోనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని 35 వేలకుపైగా రైతులు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. నాసిక్‌ నుంచి మొదలైన యాత్ర... 180 కిలోమీటర్లు కొనసాగి రేపు చేరుకోనుంది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అసెంబ్లీ ముందు భైఠాయిస్తామని రైతులు స్పష్టం చేశారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర, స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

20:14 - March 11, 2018

విజయవాడ : సినీనటి కవిత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కవితకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో మహిళలకు సముచిత స్థానం లేదని కవిత ఆరోపిస్తున్నారు. ఈమేరకు కవితతో టెన్ టివి ఫేస్‌టు ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇమడలేకే టీడీపీకీ దూరం అయ్యానని ఆమె చెప్పారు. 1983నుంచి టీడీపీకోసం ఎంతో కష్టపడి సేవలందిస్తే... ఎలాంటి పదవీ ఇవ్వకపోగా... తనను పార్టీ నుంచి గెంటేశారని వాపోయారు. టీడీపీలో ఇమడలేకే దూరమయ్యాయని పేర్కొన్నారు.

 

20:08 - March 11, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాత పదిజిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీచేస్తుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. రంగారెడ్డిజిల్లా ఎల్బీనగర్‌లో జరిగిన బీఎల్‌ఎఫ్‌ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పేదవర్గాల వారు ఎవరూ ఓటు వేయొద్దని తమ్మినేని పిలుపునిచ్చారు. అలాగే సామాజిక న్యాయం కనిపించని కాంగ్రెస్‌లో బీసీ నేతలు ఉండొద్దన్నారు. కాంగ్రెస్‌ను వీడి బీఎల్‌ఎఫ్‌తో కలవాలని బీసీనేతలకు పిలుపునిచ్చారు. బహుజనులంటే.. ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఎంబీసీ, మైనార్టీ వర్గాలే కాదని, ఉన్నత వర్గాల్లోని పేదలు కూడా బహుజనులే అన్నారు. ఉన్నత కులాల్లో ఉన్న పేదల కోసం కూడా బీఎల్‌ఎఫ్‌ పనిచేస్తుందన్నారు. గ్రామగ్రామాన మార్క్స్‌, అంబేద్కర్‌,  పూలే ఆలోచన విధానాలను ప్రచారం చేస్తూ.. రాజ్యాధికారం దిశగా పేదవర్గాలను కదిలిస్తామన్నారు. బీఎల్‌ఎఫ్‌ బలం నాయకుల్లోకాదు అజెండాలోనే ఉందన్నారు. గ్రామ సర్పంచ్‌ నుంచి సీఎం దాకా ప్రజా ప్రతినిధులందరూ బహుజనులే ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలో నూటికి  93శాతం  ఎస్సీ,ఎస్టీ ,బీసీ, ఎంబీసీ, మైనార్టీ ప్రజలే 
ఉన్నారని తెలిపారు. ఉన్నత కులాల్లో పేదల సంక్షేమాన్ని కూడా బీఎల్‌ఎఫ్‌ కోరుతోందన్నారు. 

 

20:01 - March 11, 2018

హైదరాబాద్ : టీఆర్ ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, బండప్రకాశ్‌ ముదిరాజ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వీరు రేపు నామినేషన్లు వేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్ ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ వీరి పేర్లను ప్రకటించారు. అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బడుగుల లింగయ్య యాదవ్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్ తనకు రాజ్యసభ సీటు ఇవ్వడం పట్ల బడుగుల లింగయ్య యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి యాదవులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో... తెలంగాణ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని అన్నారు.

 

19:53 - March 11, 2018
19:52 - March 11, 2018

ముంబై : మహారాష్ట్రలో రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. ఈనెల 5న సీబీఎస్‌ చౌక్‌నుంచి ప్రారంభమైన లాంగ్‌మార్చ్‌ రేపు ముంబై చేరుకోనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని 35 వేలకుపైగా రైతులు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. నాసిక్‌ నుంచి మొదలైన యాత్ర... 180 కిలోమీటర్లు కొనసాగి రేపు చేరుకోనుంది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అసెంబ్లీ ముందు భైఠాయిస్తామని రైతులు స్పష్టం చేశారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర, స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

19:50 - March 11, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో చేసినప్పటికీ ఏమీ చేయలేదంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. విభజన హామీల్లో కేవలం మూడే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని సమీక్షించేందుకు బీజేపీ కోర్‌ కమిటీ ఇవాళ విజయవాడలో సమావేశమైంది. ఇతర రాష్ట్రాలతో చర్చించిన అనంతరం విశాఖ రైల్వేజోన్ వస్తుందని, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైందని కంభంపాటి తెలిపారు. బీజేపీ వల్లే రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి చెందిందని తాను ఆత్మవిశ్వాసంతో చెప్పగలనని ధీమాగా చెప్పారు. 

 

19:46 - March 11, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, బండ ప్రకాశ్‌ల పేర్లు ఖరారయ్యాయి. నోటిఫికేషన్ వెలువడ్డ 3 స్థానాలకు టీఆర్ఎస్‌ బరిలోకి దిగింది. ఈ ముగ్గురి పేర్లను తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు రేపు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

 

మన బలమంతా బీఎల్ ఎఫ్ ఎజెండానే : తమ్మినేని

హైదరాబాద్ : తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారంలోకి రావాలనే బీఎల్ ఎఫ్ ఎజెండాలోనే మన బలం ఉందని...అదే బీఎల్ ఎఫ్ బలం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. కారల్ మార్క్స్, పూలే, అంబేద్కర్ మాటలను ప్రతి గ్రామం, ప్రతి మనిషిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పాత 14 నియోజకవర్గాల్లో బీఎల్ ఎఫ్ పోటీ చేయడం ఖాయమన్నారు. 

19:37 - March 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారంలోకి రావాలనే బీఎల్ ఎఫ్ ఎజెండాలోనే మన బలం ఉందని...అదే బీఎల్ ఎఫ్ బలం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. కారల్ మార్క్స్, పూలే, అంబేద్కర్ మాటలను ప్రతి గ్రామం, ప్రతి మనిషిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పాత 14 నియోజకవర్గాల్లో బీఎల్ ఎఫ్ పోటీ చేయడం ఖాయమన్నారు. రాష్ట్రంలో నూటికి 93 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎంబీసీలు ఉన్నారని.. మిగిలిన 7 శాతం అగ్రవర్గాలు ఉన్నారని పేర్కొన్నారు. అయితే అగ్రవర్ణాల్లోని పేదలు కూడా మనకు శత్రువులు కాదని.. వారు కూడా బహజనుల కిందికి వస్తారని చెప్పారు. అగ్రకులాల్లోని పేదవారు చూడా బహజనులే అవుతారని అన్నారు. రాష్ట్రంలో 98  శాతం మంది మనవాళ్లే ఉన్నారని చెప్పారు. ఎన్నికలు అంటేనే మద్యం, బిర్యానీ పొట్లాలు, డబ్బులు పంచడంగా మారిందని..ఇవన్నీ లేకుండా మీరెలా గెలుస్తారని అడుగుతున్నారని..అవన్ని తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. డబ్బులను ఎన్నికల బాక్సులో వేస్తే గెలవరని.. ఓట్లు వేస్తే గెలుస్తారని చెప్పారు. డబ్బులు పంచి ఓట్లు వేయించుకుంటారు.. కానీ ఓట్లు వేసే వాళ్లే మావారు అయినప్పుడు డబ్బు అవసరం ఏముందన్నారు. 

 

19:13 - March 11, 2018

హైదరాబాద్ : పోరాట యోధురాలు కామ్రేడ్ కమలమ్మ కన్నుమూసారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికఖాయానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బి.వెంకట్, డీజీలతోపాటు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కామ్రేడ్ కమలమ్మ జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. జీవితాన్ని ఉద్యమాలకే అంకింతం చేసిన పోరాట యోధురాలు కమలమ్మ అని కొనియాడారు.

త్రిపురలో సీపీఎం ఆఫీసులపై దాడిని ఖండిస్తున్నాం : నల్లా సూర్యప్రకాశ్

హైదరాబాద్ : చరిత్రలో హిట్లర్ కు పట్టినగతే దేశంలో బీజేపీ పాలకులకు పడుతుందని బీఎల్ ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ఎల్బీనగర్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభ జరిగింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను అడ్డుకోవడంపై బీఎల్ ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ర్యాలీగా బీఎల్ ఎఫ్ కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురలో సీపీఎం ఆఫీసులపై దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు.  

 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభ

హైదరాబాద్ : ఎల్బీనగర్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభ జరిగింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను అడ్డుకోవడంపై బీఎల్ ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ర్యాలీగా బీఎల్ ఎఫ్ కార్యకర్తలు తరలి వచ్చారు. 

18:44 - March 11, 2018

హైదరాబాద్ : చరిత్రలో హిట్లర్ కు పట్టినగతే దేశంలో బీజేపీ పాలకులకు పడుతుందని బీఎల్ ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ఎల్బీనగర్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభ జరిగింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను అడ్డుకోవడంపై బీఎల్ ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ర్యాలీగా బీఎల్ ఎఫ్ కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురలో సీపీఎం ఆఫీసులపై దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు.  

 

18:15 - March 11, 2018

విజయవాడ : ప్రత్యేకహోదా, ప్యాకేజీల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తామని బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ  చెప్పారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. విమర్శలను తిప్పికొట్టేందుకు కోర్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించడం సరికాదన్నారు. ప్రజల్లోకి వెళ్లి కేంద్ర పథకాలను వివరించాలని సమావేశంలో నిర్ణయం 
తీసుకున్నామని తెలిపారు. 

17:54 - March 11, 2018

రంగారెడ్డి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ కోసం రోడ్‌షో ప్రారంభమైంది. హైదరాబాద్‌ ఉప్పల్లోని అంబేద్కర్‌  విగ్రహం నుంచి రోడ్‌షోను ప్రారంభించారు. బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం రోడ్‌షోను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లోనూ బీసీలకు అన్యాయం చేస్తూనే ఉందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గొర్రెలు, బర్రెల పేరుతో  ప్రజలను మోసంచేస్తున్నారని ఆరోపించారు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే సామాజిక న్యాయం రాదన్నారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎల్‌ఎఫ్‌ ముందుకు సాగుతోందన్నారు. 
ఉమ్మడి రంగారెడ్డిజిల్లా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ

17:46 - March 11, 2018

ముంబై : మహారాష్ట్రలో రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. ఈనెల 5న సీబీఎస్‌ చౌక్‌నుంచి ప్రారంభమైన లాంగ్‌మార్చ్‌ రేపు ముంబై చేరుకోనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని 35 వేలకుపైగా రైతులు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. నాసిక్‌ నుంచి మొదలైన యాత్ర... 180 కిలోమీటర్లు కొనసాగి రేపు చేరుకోనుంది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అసెంబ్లీ ముందు భైఠాయిస్తామని రైతులు స్పష్టం చేశారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర, స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

17:44 - March 11, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థులుగా జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌, లింగయ్య యాదవ్‌, బండ ప్రకాశ్‌ల పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. కాసేపట్లో జరిగే టీఆర్‌ఎస్ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.  

 

17:43 - March 11, 2018

గుంటూరు : ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘంగా సాగిన టీడీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు.. ఫైనల్‌ అయింది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా.. సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్లు ఖరారు చేశారు. వర్లరామయ్యకు ఈసారి అవకాశం గ్యారెంటీ అని ప్రచారం జరిగినా ఆఖరి నిమిషంలో ఆయన ఆశాభంగం కలిగింది. చివరి నిముషంలో రవీంద్రకుమార్‌ వైపు మొగ్గుచూపిన సీఎం చంద్రబాబు.. వర్ల రామయ్యకు స్వయంగా ఫోన్‌ చేసి బుజ్జగించారు. భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని సీఎం వర్ల రామయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారు. 

 

17:36 - March 11, 2018

హైదరాబాద్ : కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాలో 3కే రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయంతి సంపత్‌ కుమార్‌ పాల్గొన్నారు. రన్నింగ్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిదని, గతంలో చేనేత చీరలను ప్రమోట్‌ చేయడానికి రన్నింగ్‌ చేశానని జయంతి అన్నారు. రెయిన్‌బో విస్టాలో మొదటి సారి 3కే రన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. 

 

17:31 - March 11, 2018

విశాఖ : టైథ్లాన్‌ ఛాంపియన్‌ షిప్‌ను పోలీసు శాఖ ఘనంగా నిర్వహిచింది. విశాఖ పోలీసు కమిషనర్‌ యోగానంద్‌ పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తొంభై మందికి పైగా పాల్గొన్నారు.  ఇందులో స్విమ్మింగ్‌, నలభై కిలో మీటర్ల సైక్లింగ్‌, పది కిలోమీటర్ల రన్నింగ్‌ నిర్వహించామని చెప్పారు. కామన్వెల్త్‌, ఏషియన్‌గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులను టైథ్లాన్‌ ఛాంపియన్‌ షిప్‌ నుండి సెలక్ట్‌ చేయనున్నామని, ఇంత కఠినమైన పోటీల్లో అమ్మాయిలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని కమిషనర్‌ యోగానంద్‌ తెలిపారు.

 

17:28 - March 11, 2018

కరీంనగర్ : లక్ష్య సాధనతో ముందుకు సాగితే ఎంతటి కఠిన లక్ష్యాన్నైనా చేధించవచ్చని ఆ యువకుడు నిరూపించాడు.  కరీంనగర్‌ జిల్లా.. కోతిరాపూర్‌కు చెందిన రాపెల్లి శ్రీనివాస్‌ గత పదేళ్లుగా కాలి వేళ్ల మట్టలపై పరిగెత్తే ప్రక్రియను ప్రాక్టీస్‌ చేశాడు. వేలి మట్టలపై పరిగెత్తడంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఒక నిమిషంలో కాలివేళ్ల మట్టలపై వంద మీటర్లు పరిగెత్తి సరికొత్త రికార్డ్‌ సాధించాడు. అత్యంత కఠినతరమైన ఈవెంట్‌లో తన ప్రతిభను చాటిన రాపెల్లి శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.

 

17:22 - March 11, 2018

ముంబై : మహారాష్ట్రలో రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. ఈనెల 5న సీబీఎస్‌ చౌక్‌నుంచి ప్రారంభమైన లాంగ్‌మార్చ్‌ రేపు ముంబై చేరుకోనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని 35 వేలకుపైగా రైతులు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. నాసిక్‌ నుంచి మొదలైన యాత్ర... 180 కిలోమీటర్లు కొనసాగి రేపు చేరుకోనుంది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అసెంబ్లీ ముందు భైఠాయిస్తామని రైతులు స్పష్టం చేశారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర, స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

17:20 - March 11, 2018

విజయవాడ : రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఏపీ ఎమ్ ఐడీసీ చైర్మన్‌ లక్ష్మీపతి అన్నారు. చంద్రబాబు పనితీరుతో కేంద్రం నుంచి అత్యధిక స్థాయిలో నిధులు తెస్తున్నారని తెలిపారు. ఈమేరకు లక్ష్మీపతితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ప్రత్యేక హోదాపై  కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని.. హోదాకు ఏమాత్రం తగ్గని స్థాయిలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయన్నారు. టీడీపీ, బీజేపీ మైత్రికి ప్రస్తుతం వచ్చిన ప్రమాదమేమి లేదన్నారు. భవిష్యత్తులో టీడీపీతో కలిసి సాగే అవకాశం ఉందన్నారు. ఇటు ఏపీ ఎంఐడీసీలో అవినీతికి చాన్సేలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితులు గత మూడేళ్లలో గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు.

 

17:13 - March 11, 2018

గుంటూరు : బాబు వస్తేనే జాబ్‌ వస్తుందన్న నినాదంతో  అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు... నిరుద్యోగ యువతకు మొండి చేయిచూపారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. మరో ఏడాదిలో మళ్ళీ ఎన్నికలు రానున్నాయి... ఐనా నిరుద్యోగ భృతికోసం యువత ఎదురు చూపులు చూస్తూనే ఉంది.... ఇంతకీ నిరుద్యోగ భృతికి మోక్షం లభిస్తుందా...లేదా... 
నిరుద్యోగ భృతిపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేవు 
బాబు వస్తే జాబ్‌ వస్తుందంటూ ఎన్నికలముందు గొప్పలు చెప్పిన టీడీపీ... అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిరాశలో ముంచేసింది. అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు, మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పోరాటం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ భృతిపై ఎలాంటి  స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీడీపీ హామీలు హామీలుగానే మిగిలిపోయాయి.. మరో ఏడాదిలో మళ్ళీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో... మూడున్నరేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతిపై స్పందించారు. కానీ.. ఎప్పట్నుంచి అమలు చేస్తారనే విషయంలో  మాత్రం స్పష్టత  ఇవ్వలేదు.. 
బడ్జెట్‌లో అంకెలుగానే మిగలనున్న నిరుద్యగ భృతి
నిరుద్యోగులకు సాయంగా అందిస్తామన్న నిరుద్యోగ భృతి విషయం బడ్జెట్‌లో అంకెలుగానే మిగలనుంది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించారు. కానీ అవి ఎంత మేరకు ఖర్చు చేశారన్న లెక్క తేలలేదు. కారణం ఏమంటే... యువజన విధానానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి విధివిధానాలు ఖరారు చేయలేదు. సర్కార్ అందించే భృతికోసం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలు ఎదురు చూపులు చూస్తున్నాయి. 
నిరుద్యోగుల సంఖ్యను తగ్గించి చూపుతున్న ప్రభుత్వం
మరోవైపు అర్హులైన నిరుద్యోగుల సంఖ్యను కుదించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రభుత్వం చేపట్టిన సాధికార సర్వేలో 33.88 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కాగా.. ఉపాధి కల్పనా కార్యాలయంలో 9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇంటర్‌లోపు చదువుకున్న వారు నిరుద్యోగ భృతి కి  అనర్హులని ముసాయిదాలో యువజన శాఖ పేర్కొంది. దీంతో 12 లక్షల మంది భృతి పొందే ఛాన్స్ కోల్పోనున్నారు. దీనికితోడు నిరుద్యోగ భృతికి  వయో పరిమితిని కూడా తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. రేషన్ కార్డు వివరాల ప్రకారం కుటుంబంలోని ఒక్కరు మాత్రమే నిరుద్యోగ భృతికి అర్హులని ముసాయిదాలో పొందుపరిచారు. ఇంటిలో ఒకరికి మాత్రమే ఇచ్చే నిరుద్యోగ భృతితో భృతితో కుటుంబం గడుస్తుందా అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 
హామీలు గుప్పించిన చంద్రబాబు
2014 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు యువతపై హామీల వర్షం కురిపించారు. అది నమ్మిన యువత, నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని, ఇంటర్ లోపు విద్యార్థులకు రూ.900, డిగ్రీ చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు రూ.3 వేలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.. ఇందుకు బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించినట్లు సీఎం చంద్రబాబు గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాజా పరిణామాలు చూస్తుంటే ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కలిగే భాగ్యం లేకుండా సర్కార్ ఎత్తుగడ వేస్తుందనేది నిరుద్యోగుల్లో కలుగుతోంది. 
ఏటా ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థుల సంఖ్యం  2.5 లక్షలు
రాష్ట్రంలో ఏటా సగటున 2.5 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టాలతో బయటకు వస్తున్నారు. 15 వేల మంది వరకూ వైద్యవిద్య పూర్తిచేస్తున్నారు. వీరందరిలో గరిష్టంగా 30 శాతం మంది మాత్రమే వెంటనే ఉపాధి పొందుతున్నారని  ప్రభుత్వం అంచనా వేసింది.. ఇక రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థల్లో ఎన్ని ఖాళీలున్నాయి, వారికి ఏఏ అర్హతలున్నవారు అవసరమన్న వివరాలను సేకరించి... గుర్తించిన నిరుద్యోగులకు  నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించాలని చూస్తోంది. దేశంలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, కేరళ రాష్ర్టాల తరహాలోనే ఏపీలో కూడా  నిరుద్యోగ భృతి కల్పించి   ఆదుకోవాల్సిన అవసరం ఉందని నిరుద్యోగులు డిమాండ్‌  చేస్తున్నారు., దీనిపై తక్షణం విధివిధానాలు  ప్రకటించి చర్యలు తీసుకోవాలని  పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని యువతీ యువకులు కోరుతున్నారు. ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులను టీడీపీ సర్కార్ ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

టీఆర్ ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, ప్రకాశ్

హైదరాబాద్ : టీఆర్ ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. టీఆర్ ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ లను ఖరారు చేశారు.

16:48 - March 11, 2018

కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్‌ కాలేజీ నుంచి మున్సిల్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ వరకు జరిగిన ర్యాలీలో వేలాది మంది సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసురావాలని డిమాండ్‌ చేశారు. 

16:23 - March 11, 2018

హైదరాబాద్ : రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని అఖిల భారత రైతుల కూలీ సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వ్యవసాయానికి 10శాతం నిధులు కేటాయించాలని సారంపల్లి డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ రుణమాఫీ చేయని సర్కార్‌.. భవిష్యత్‌లో రైతులకు ఏమీ చేయదన్నారు. స్వామినాథన్‌ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని.. నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకోకపోతే.. మహారాష్ట్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడిన విధంగానే.. తెలంగాణలోనూ పరిస్థితి ఉంటుందని సారంపల్లి హెచ్చరించారు. 

 

16:21 - March 11, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం ఇవాళ జరుగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షత మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. శాసనసభ్యుల పనితీరు, నియోజకవర్గాల్లో పరిస్థితిపై కేసీఆర్‌ చేయించిన సర్వే వివరాలను కూడా వెల్లడించే అవకావం ఉంది. దీంతో శాసనసభ్యుల్లో టెన్షన్‌ నెలకొంది. 
కేసీఆర్‌ ఆధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ 
శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన ఈ మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ కానుంది. సభలో అన్ని విషయాల్లో ఆధిపత్యం ఎలా నిరూపించుకోవాలన్న అంశంపై కేసీఆర్‌ సభ్యులకు  దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలను దీటుగా ఎలా తిప్పకొట్టాలన్న అంశంపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇవే చివరి పూర్తి స్థాయి  బడ్జెట్ సమావేశాలు కావడంతో అన్ని విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు రాబోయే రోజుల్లో చేపట్టబోయే  కార్యక్రమాలను సభ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది.  నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల వంటి కీలక పథకాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు పథకాలను  చర్చకు పెట్టాలని భావిస్తోంది.  
ఎమ్మెల్యేల్లో ఆందోళన 
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.  దీంతో ఎవరి జాతకం ఎలా ఉందో అన్న అంశంపై ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. అలాగే రాజ్యసభ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీలో ప్రకటించే అవకాశం ఉంది.

 

ప్రతి బడ్జెట్‌లోనూ బీసీలకు అన్యాయం : తమ్మినేని

ఉమ్మడి రంగారెడ్డి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ కోసం రోడ్‌షో ప్రారంభమైంది. హైదరాబాద్‌ ఉప్పల్లోని అంబేద్కర్‌  విగ్రహం నుంచి రోడ్‌షోను ప్రారంభించారు. బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం రోడ్‌షోను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లోనూ బీసీలకు అన్యాయం చేస్తూనే ఉందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గొర్రెలు, బర్రెల పేరుతో  ప్రజలను మోసంచేస్తున్నారని ఆరోపించారు.  బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎల్‌ఎఫ్‌ ముందుకు సాగుతోందన్నారు. 

ప్రతి బడ్జెట్‌లోనూ బీసీలకు అన్యాయం : తమ్మినేని

ఉమ్మడి రంగారెడ్డి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ కోసం రోడ్‌షో ప్రారంభమైంది. హైదరాబాద్‌ ఉప్పల్లోని అంబేద్కర్‌  విగ్రహం నుంచి రోడ్‌షోను ప్రారంభించారు. బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం రోడ్‌షోను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లోనూ బీసీలకు అన్యాయం చేస్తూనే ఉందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గొర్రెలు, బర్రెల పేరుతో  ప్రజలను మోసంచేస్తున్నారని ఆరోపించారు.  బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎల్‌ఎఫ్‌ ముందుకు సాగుతోందన్నారు. 

ప్రారంభమైన బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ కోసం రోడ్‌షో

ఉమ్మడి రంగారెడ్డి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ కోసం రోడ్‌షో ప్రారంభమైంది. హైదరాబాద్‌ ఉప్పల్లోని అంబేద్కర్‌  విగ్రహం నుంచి రోడ్‌షోను ప్రారంభించారు. బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం రోడ్‌షోను ప్రారంభించారు. 

 

మహారాష్ట్రలో కొనసాగుతున్న రైతుల పాదయాత్ర

ముంబై : మహారాష్ట్రలో రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. ఈనెల 5న సీబీఎస్‌ చౌక్‌నుంచి ప్రారంభమైన లాంగ్‌మార్చ్‌ రేపు ముంబై చేరుకోనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని 35 వేలకుపైగా రైతులు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. నాసిక్‌ నుంచి మొదలైన యాత్ర... 180 కిలోమీటర్లు కొనసాగి రేపు చేరుకోనుంది. 

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థులుగా జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌, లింగయ్య యాదవ్‌, బండ ప్రకాశ్‌ల పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. కాసేపట్లో జరిగే టీఆర్‌ఎస్ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.  

 

15:47 - March 11, 2018

నెల్లూరు : ఎంపీల రాజీనామా, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పేరుతో వైసీపీ అధినేత జగన్‌ నాటకాలు ఆడుతున్నారని మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. ఎంపీ రాజీనామా, అవిశ్వాసంతో రాష్ట్రానికి ఒరిగేదీమీ లేదన్నారు. అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారో జగన్‌ చెప్పాలని నారాయణ డిమాండ్‌ చేశారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్‌ కేంద్రంతో లాలూచీ పడుతున్నారని మండిపడ్డారు. 

 

15:42 - March 11, 2018

విశాఖ : ఏపీకి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి విమర్శించారు. ప్రత్యేక హోదా నుంచి రైల్వే జోన్‌ వరకు అన్ని విషయాల్లో అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రధాని మోదీ నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకు తెలిసిందన్నారు. 
 

15:10 - March 11, 2018

గుంటూరు : టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు అభ్యర్థులు ఖరారు అయ్యారనుకుంటున్న సందర్భంలో మళ్లీ సందిగ్ధత నెలకొంది. అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నివాసం నుంచి యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు వెళ్లిపోయారు. అభ్యర్థులకు ఇంకా సమాచారం అందలేదు. సమీకరణాలు మారుతున్నాయా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాయంత్రం మరోసారి చంద్రబాబుతో యనమల, కళా వెంకట్రావు భేటీ కానున్నారు. 

 

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు

గుంటూరు : టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ లను ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో వర్ల రామయ్యకు ఆశాభంగం కల్గింది. తీవ్ర ఉత్కంఠలో చివరి నిమిషంలో రవీంద్రకుమార్ వైపు చంద్రబాబు మొగ్గుచూపారు. వర్ల రామయ్యకు స్వయంగా సీఎం చంద్రబాబు ఫోన్ చేసి బుజ్జగించారు. భవిష్యత్ లో తనకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని వర్ల రామయ్యకు సీఎం సూచించారు.

 

 

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు

గుంటూరు : టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ లను ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో వర్ల రామయ్యకు ఆశాభంగం కల్గింది. తీవ్ర ఉత్కంఠలో చివరి నిమిషంలో రవీంద్రకుమార్ వైపు చంద్రబాబు మొగ్గుచూపారు. వర్ల రామయ్యకు స్వయంగా సీఎం చంద్రబాబు ఫోన్ చేసి బుజ్జగించారు. భవిష్యత్ లో తనకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని వర్ల రామయ్యకు సీఎం సూచించారు.

 

 

ముంబైకి చేరువలో మహా రైతులు...

ముంబై : తమ సమస్యలు పరిష్కరించాలంటూ మహా రాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. కాసేపటి క్రితం ముంబైకి సమీపానికి చేరుకుంది. సోమవారం లక్షలాది మంది రైతులతో మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని వెల్లడించింది. 

13:43 - March 11, 2018

ముంబై : మండుటెండలో వేలాది మంది రైతులు అకుంఠిత దీక్షతో రైతులు నిర్వహించిన లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. నాసిక్ నుండి ఈ లాంగ్ మార్చ్ జరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని హ్చెచ్చరించింది. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో సుమారు 180 కిలో మీటర్ల రైతుల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ముంబైలోనే కూర్చొంటారని ఆలిండియా కిసాన్‌ సభ స్పష్టం చేసింది. ముంబైకి కేవలం పది కిలోమీటర్ల దూరంలో రైతులున్నారు. వీరికి స్థానికం సీఐటీయూ నేతలు స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా అక్కడి నేతలతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:34 - March 11, 2018

నిజామాబాద్ : ఒకప్పుడు నిజామాబాద్‌ జిల్లాలో జోరుగా ఎగరిసిన పసుపుజెండా.. ప్రస్తుతం కనిపించకుండా పోతోంది. సైకిల్‌కు పంక్చర్‌ అయ్యింది. రేవంత్‌రెడ్డి హస్తంపార్టీతో దోస్తీ కట్టడంతో జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మరి నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏంటి? పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు? టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చే నేతలెవరు? తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒకప్పుడు మంచి పట్టు ఉండేది. రాజకీయ పరిణామాలు మారుతుండడంతో... టీడీపీ పలుచబడుతూ వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న మెజార్టీ నాయకులు టీడీపీ వారే. నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకత్వంలో మెజార్టీగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. క్యాడర్‌ కూడా వారితోపాటే గులాబీ కండువా కప్పుకుంది.

ఈ మధ్యకాలంలో టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి హస్తంతో దోస్తీ కట్టారు. జిల్లాలో టీడీపీ నాయకత్వం ఆయనతోపాటే కాంగ్రెస్‌గూటికి చేరింది. జిల్లాలో పార్టీని తమ బుజాలమీద నడిపించిన జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, ఆర్మూర్‌ ఇంచార్జ్‌ రాజారాంయాదవ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీ పరిస్థితి అయోమయంలో పడింది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఇద్దరు టీడీపీ సీనియర్‌నేతలు ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. వివిధ మంత్రిపదవులు చేపట్టిన మండవ వెంకటేశ్వరరావు..సీనియర్‌ నాయకురాలు అన్నపూర్ణమ్మ టీడీపీ నమ్ముకునే ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటికీ సైకిల్‌తోనే సై అంటున్నారు. కానీ ఈ మధ్యే వీరు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా ఉంటే అలావచ్చి అలా వెళ్లిపోతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన నడస్తోంది. దీంతో జిల్లాలో టీడీపీని నడిపించే నాయకుడు కరువయ్యాడు.

మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ ఇద్దరూ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారన్న గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అన్నపూర్ణమ్మ అధికార పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొంతకాలం స్తబ్దుగా ఉండి... ఆ తర్వాత సైకిల్‌ను వీడి కారెక్కుతారని అనుచరులు చెప్తున్నారు. ఇక మండవ కూడా గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన అధికార పార్టీ నుంచి నిజామాబాద్‌ రూరల్‌లో పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెప్తున్నారు. టీడీపీని వీడే యోచనలో ఉండడంతోనే.. వీరిద్దరూ పార్టీకి కొంతకాలంగా దూరంపాటిస్తున్నట్టు తెలుస్తోంది.

కామారెడ్డి జిల్లాలోనూ టీడీపీ దాదాపు ఖాళీ అయ్యింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ పార్టీని నడిపించేవారే కరువయ్యారు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యింది. పార్టీలో ఉన్నవారు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఎన్నికలకల్లా ఉన్న నేతలు కూడా ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. దీంతో జిల్లాలో టీడీపీ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోతోంది.

13:25 - March 11, 2018

ముంబై : రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ముంబైలోనే కూర్చొంటారని ఆలిండియా కిసాన్‌ సభ స్పష్టం చేసింది. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో సుమారు 180 కిలో మీటర్ల రైతుల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 12న సోమవారం ముంబైకి చేరుకోనుంది. అక్కడి అసెంబ్లీని ముట్టడించనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి పలువురితో ముచ్చటించింది.

రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలన్న డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రైతులు చేస్తున్న లాంగ్ మార్చ్ కు శివసేన మద్దతినిస్తోంది. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని శివసేన పేర్కొంది. రైతుల సమస్యలు ఏంటీ ? అసెంబ్లీ ముట్టడికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:07 - March 11, 2018

విజయవాడ : చంద్రబాబు నాయుడు తనకు న్యాయం చేయలేదని..పార్టీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని సినీ నటి కవిత పేర్కొన్నారు. విజయవాడలో బిజెపి పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. టిడిపి నుండి బయటకు రాలేదని ఆ పార్టీ నుంచి గెంటివేయబడ్డానని, ఎన్నో అవమానాలకు గురయ్యానని తెలిపారు. తిట్టిన వారికి పదవులిస్తున్నారని, పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి ఏమి చేయ్యడం లేదన్నారు. 

టిడిపిపై కవిత ఆరోపణలు...

విజయవాడ : సినీ నటి కవిత బీజేపీలో చేరారు. ఈసందర్భంగా టిడిపి పలు ఆరోపణలు గుప్పించారు. టిడిపి నుండి బయటకు రాలేదని ఆ పార్టీ నుంచి గెంటివేయబడ్డానని, ఎన్నో అవమానాలకు గురయ్యానని తెలిపారు. తిట్టిన వారికి పదవులిస్తున్నారని, పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి ఏమి చేయ్యడం లేదన్నారు. 

బీజేపీలో సినీ నటి కవిత..

విజయవాడ : ప్రముఖ సినీ నటి కవిత బీజేపీ కండువా కప్పుకున్నారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.

ఇంటర్ పరీక్ష యథాతథం...

హైదరాబాద్ : ఈ నెల 13న ఇంటర్ పరీక్ష వాయిదా వేయడం లేదని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకై మార్చి 13న ఎమ్మార్పీఎస్ బంద్‌కు పిలుపునివ్వడం సరికాదని, 13వ తేదీన పరీక్షను వాయిదా వేద్దామంటే వీలు కావడం లేదని స్పష్టం చేశారు. 

12:19 - March 11, 2018

విజయవాడ : రాజ్యసభ అభ్యర్థుల విషయంలో టిడిపికి ఉన్నవే రెండు సీట్లు...ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములాంటిదని టిడిపి నుండి రాజ్యసభ అభ్యర్థి రేసులో ఉన్న మసాల పద్మజ పేర్కొన్నారు. తాను కూడా టికెట్ రేసులో ఉండడం జరిగిందని, కానీ కొన్ని కారణాల వల్ల వర్ల రామయ్యకు టికెట్ ఇచ్చారని..చాలా సంతోషమన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై రఘువీరా కామెంట్స్...

విజయవాడ : కేసీఆర్ ప్రకటించిన థర్డ్ ఫ్రంట్ పై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా స్పందించారు. టీఆర్ఎస్ థర్డ్ ఫ్రంట్ పెట్టినా నిలదొక్కుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు. 

12:13 - March 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ నుండి టి.కాంగ్రెస్ కూడా రాజ్యసభ బరిలో నిలిచింది. ఆ పార్టీ నేత బలరాం నాయక్ ను బరిలో నిలిపారు. సోమవారం బలరాం నాయక్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. ఫిరాయింపుల చట్టం అమలు చేసి విప్ జారీ చేసే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కేకే పోటీ చేసిన సమయంలో తాము సహకరించడం జరిగిందని, ప్రస్తుతం తమకు కూడా సహకరించాలని సీఎంకు ఆయన కోరారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:31 - March 11, 2018

ముంబై : ముంబై-ఆగ్రా జాతీయ రహదారి మీదుగా 180 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. మార్చి 12న సోమవారం ముంబైకి చేరుకుంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎదుట బైఠాయించనున్నారు. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నారు. రైతులకు శివసేన మద్దతినిస్తోంది. ఈ సందర్భంగా టెన్ టివి అక్కడి రైతులతో, శివసేన నేతలతో ముచ్చటించింది. శివసేన మొదటి నుండి రైతులకు మద్దతుగా నిలబడడం జరిగిందని, రైతులు కోరుతున్న డిమాండ్లు పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతోందని శివసేన నేత తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో సీఎంతో మాట్లాడడం జరిగిందన్నారు. 

బిజెపి కోర్ కమిటీ భేటీ...

విజయవాడ : జిల్లాలో కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు హరిబాబు, రాష్ట్ర ఇన్ ఛార్జీ సతీష్, పురందేశ్వరీ, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టిడిపి దుష్ర్పచారాలు, కేంద్రం సాయం - చేయూత, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. 

11:23 - March 11, 2018

విజయవాడ : బిజెపితో పొత్తు విషయంలో టిడిపి తీసుకున్న నిర్ణయం అనంతరం రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిపోతోంది. పార్టీలకు సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రుల చేత రాజీనామాలు చేయించారు. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతుండడం గమనార్హం.

ఈ నేపథ్యంలో విజయవాడలో బిజెపి కోర్ కమిటీ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధ్యక్షుడు హరిబాబు, రాష్ట్ర ఇన్ ఛార్జీ సతీష్, పురందేశ్వరీ, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టిడిపి దుష్ర్పచారాలు, కేంద్రం సాయం - చేయూత, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:09 - March 11, 2018

విజయవాడ : టిడిపి రాజ్యసభ అభ్యర్థుల ఖరారు విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా సీనియర్ నేతలు..ఇతరులతో సమావేశాలు జరిపారు. చివరకు ఆదివారం ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల రేసులో ఉన్న వారందరినీ బాబు బుజ్జగించారు. ఎంపిక చేయకపోవడం కారణాలు..రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని...రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పించడం జరుగుతుందని బాబు వారికి సూచించారు. ప్రధానంగా రేసులో ఉన్న బీద మస్తాన్ రావును బుజ్జగించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందని బాబు హామీనిచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన వర్ల రామయ్య, ఓసీ సామాజిక వర్గానికి సీఎం రమేశ్ లను ఖరారు చేసినట్లు టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

కానీ మూడో అభ్యర్థి విషయంలో టిడిపి కొంత వెనుకంజ వేసినట్లు చెప్పవచ్చు. బీజేపీ నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కోరాల్సి ఉంటుందని..ఇద్దరు ఎమ్మెల్యేలను ఫిరాయింపులు చేయాల్సి ఉంటుందని భావించినట్లు సమాచారం. ఈ సమయంలో అలాంటి ప్రయత్నాలు చేస్తే పార్టీపై చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని భావించి మూడో అభ్యర్థి విషయాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. 

టిడిపి రాజ్యసభ అభ్యర్థులుగా...

విజయవాడ : టిడిపి రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. సీఎం రమేశ్, వర్ల రామయ్యలకు స్థానం కల్పించినట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

10:22 - March 11, 2018

ముంబై : సెంట్రల్‌ నాసిక్‌లోని సిబిఎస్‌ చౌక్‌ నుంచి మార్చి 5 సాయంత్రం లాంగ్‌ మార్చ్‌ ప్రారంభమై శుక్రవారం ముంబై సమీపంలోని ఠాణేకు చేరుకుంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా రైతులు ఓ దండులా ముందుకు కదులుతున్నారు. ముంబై-ఆగ్రా జాతీయ రహదారి మీదుగా 180 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర కొనసాగి మార్చి 12న సోమవారం ముంబైకి చేరుకుంటుంది. అదేరోజు మహారాష్ట్ర అసెంబ్లీని రైతులు ముట్టడించనున్నారు. లాంగ్‌ మార్చ్‌ అసెంబ్లీ వద్దకు చేరుకునేసరికి పాదయాత్రికుల సంఖ్య లక్షకు పైనే చేరుతుందని భావిస్తున్నారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అసెంబ్లీ ముందు నుంచి కదిలేది లేదని ఆలిండియా కిసాన్‌ సభ స్పష్టం చేసింది. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నారు. 

జగన్ పాదయాత్ర 109వ రోజు...

చీరాల : వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. చీరాల నియోజక వర్గంలో ప్రస్తుతం ప్రారంభమైంది. కొత్తపేట, ఆంధ్రకేసరి జూనియర్‌ కాలేజీ, బాలాజీ థియేటర్‌, పేరాల, ఐటీసీ మీదుగా కొనసాగనుంది. 

10:08 - March 11, 2018

కేబీఆర్ పార్కు వద్ద రన్ ఫర్ కేన్సర్...

హైదరాబాద్ : కేబీఆర్‌ పార్క్‌ వద్ద రన్‌ ఫర్‌ కేన్సర్‌ కార్యక్రమం జరిగింది. కేన్సర్‌పై అవగాహన తీసుకొచ్చేందుకు జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ లో మంత్రి హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

09:24 - March 11, 2018

ఎర్రటి పాగా.. తెల్లటి వస్త్రాలతో కూడిన ఆహార్యం..వందల కిలోమీటర్ల దూరం...ఘాట్‌రోడ్లను దాటుకుంటూ సాగుతున్నారు...

మహారాష్ట్ర : పదులు కాదు.. వందలు కాదు.. ఏకంగా 35 వేల మంది రైతులు...! అకుంఠిత దీక్షతో.. ఏకంగా 180 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా కదిలారు. రోజూ పాతిక కిలోమీటర్లు చొప్పున నడుస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మహారాష్ట్ర నాసిక్‌లో మొదలైన రైతుల ప్రస్థానం.. రాజధాని ముంబై దిశగా సాగుతోంది. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నేతృత్వంలో.. వేలకొద్దీ రైతులు.. ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇటీవలే ఆత్మహత్యలు చేసుకున్న పాతిక మంది రైతుల పిల్లలు కూడా కలిసి సాగుతున్నారు. సోమవారం అసెంబ్లీని ముట్టడించేందుకు కదం తొక్కుతున్నారు. ఇంతకీ అన్నదాతల ఆకాంక్ష ఏంటి..? తదితర విషయాల కోసం టెన్ టివి మహారాష్ట్ర రైతులతో ముచ్చటించింది. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:11 - March 11, 2018

విజయవాడ : ఉన్నవి రెండు సీట్లు.. ఆశావహులు మాత్రం అరడజనుకు పైగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సామాజిక, రాజకీయ ఈక్వేషన్స్‌ ప్రకారం అవకాశం కల్పించేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. సోమవారంతో గడువు ముగియనుంది. దీనితో అభ్యర్థులనేది తెలియరావడం లేదు. కానీ సీఎం రమేష్ కు మాత్రం సీటు ఖరారయినట్లు టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. మరొక్కస్థానం కోసం బీద మస్తాన్ రావు, వర్ల రామయ్య మధ్య పోటీ నెలకొంది. మూడో స్థానానికి అభ్యర్థిని నిలబెట్టకూడదని టిడిపి నిర్ణయించినట్లు సమాచారం.

రేసులో ఉన్న వారితో చంద్రబాబు విడివిడిగా మాట్లాడుతూ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఆదివారం మధ్యాహ్నం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

తెలంగాణ బొగ్గుగని కేంద్ర కార్యాలయంలో...

పెద్దపల్లి : గోదావరిఖనిలో సింగరేణి గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గుగని కేంద్ర కార్యాలయంలో దుండగులు ఫర్నీచర్ కు నిప్పు పెట్టారు. కంప్యూటర్లు, ఫర్నీచర్ లు ధ్వంసమయ్యాయి. 

టిడిపి అభ్యర్థులపై ఉత్కంఠ...

విజయవాడ : టిడిపి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రమేష్ పేరును ఖరారైందని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. మరోస్థానానికి బీద మస్తాన్ రావు, వర్ల రామయ్య మధ్య పోటీ నెలకొందని చెప్పవచ్చు. మూడో స్థానానికి అభ్యర్థిని నిలబెట్టరాదని టిడిపి నిర్ణయం తీసుకుంది. రేసులో ఉన్న అభ్యర్థులతో చంద్రబాబు విడివిడిగా మాట్లాడారు. ఈ రోజు మధ్యాహ్నానానికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

08:30 - March 11, 2018

కర్నూలు : నన్నూర్ నారాయణ కాలేజీ హాస్టల్ లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. లక్షలాది రూపాయలు తీసుకుని తమకు సరియైన భోజనం పెట్టడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కళాశాలపైకి దాడికి దిగారు. కళాశాలలో ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులకు కళాశాల యాజమాన్యం సమాచారం అందించడంతో అక్కడకు వచ్చిన పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. ఫీజులు కట్టించుకుని సరైన భోజనం పెట్టడం లేదని, ఈ విషయాన్ని ప్రశ్నిస్తే రూమ్ లో వేసి కొడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అనేక రోజుల నుండి సరైన భోజనం కల్పించడం లేదని...డీన్..డీఈకి తెలిపినా పట్టించుకోవడం లేదని..దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఈ ఘటనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

నవ వధువు మృతి...

సూర్యాపేట : పెళ్లింట విషాదం నెలకొంది. గాయత్రి అనే నవ వధువు కన్నుమూసింది. పెళ్లైన కొన్ని గంటలకే మృతి చెందడం అందర్నీ కంట తడిపెట్టించింది. శనివారం మధ్యాహ్నం గాయత్రికి వేణుతో వివాహం జరిగింది. గుడిలో కుప్పకూలిపోయిన గాయత్రిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. 

08:24 - March 11, 2018

సూర్యాపేట : పెళ్లి ఇంట్ల చావు డప్పులు మోగుతున్నాయి. వివిధ కారణాల వల్ల నూతన దంపతులు మృతి చెందుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనితో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. మొన్న వరంగల్ జిల్లా నుండి వెళుతున్న పెళ్లి కుటుంబం ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ఢీకొనడంతో వరుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా సూర్యాపేటలో మరో ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు మృతి చెందింది.

సూర్యాపేటకు చెందిన కటకం గాయతి (22) వివాహం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో నిశ్చయమైంది. శనివారం వీరి వివాహం ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. పెళ్లి అనంతరం బంధువులులు..మిత్రుల సంబరాల మధ్య వధువు ఇంటికి ఊరేగింపుగా బయలుదేరారు. మార్గమధ్యలో ఉన్న దేవాయంలోకి వెళ్లి వస్తుండగా వధువు గాయత్రి ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రాంతీయ వైద్య శాలకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. గాయత్రి చనిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

08:14 - March 11, 2018
08:13 - March 11, 2018

విభజన హామీల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారపక్షంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవులకు టిడిపి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతుండడం పట్ల వైసీపీ ఆక్షేపిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు మళ్లీ సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. మరోవైపు సోమవారం రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ గడువు ముగియబోతోంది. టిడిపి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఖరారు విషయంలో నగదు ప్రవాహం తీవ్రంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై టెన్ టివి విజయవాడ స్టూడియో లో జరిగిన చర్చా వేదికలో బాబు రావు (సీపీఎం), నాగుల మీరా (టిడిపి), బొప్పన భవ కుమార్ (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:57 - March 11, 2018
07:04 - March 11, 2018

విజయవాడ : బాబు వస్తేనే జాబ్‌ వస్తుందన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు... నిరుద్యోగ యువతకు మొండి చేయిచూపారు.నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. మరో ఏడాదిలో మళ్ళీ ఎన్నికలు రానున్నాయి. అయినా నిరుద్యోగ భృతికోసం యువత ఎదురు చూపులు చూస్తూనే ఉంది. ఇంతకీ నిరుద్యోగ భృతికి మోక్షం లభిస్తుందా...లేదా... బాబు వస్తే జాబ్‌ వస్తుందంటూ ఎన్నికలముందు గొప్పలు చెప్పిన టీడీపీ... అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిరాశలో ముంచేసింది.

అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు, మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పోరాటం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ భృతిపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీడీపీ హామీలు హామీలుగానే మిగిలిపోయాయి.. మరో ఏడాదిలో మళ్ళీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో... మూడున్నరేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతిపై స్పందించారు. కానీ.. ఎప్పట్నుంచి అమలు చేస్తారనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

నిరుద్యోగులకు సాయంగా అందిస్తామన్న నిరుద్యోగ భృతి విషయం బడ్జెట్‌లో అంకెలుగానే మిగలనుంది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించారు. కానీ అవి ఎంత మేరకు ఖర్చు చేశారన్న లెక్క తేలలేదు. కారణం ఏమంటే... యువజన విధానానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి విధివిధానాలు ఖరారు చేయలేదు. సర్కార్ అందించే భృతికోసం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలు ఎదురు చూపులు చూస్తున్నాయి.

మరోవైపు అర్హులైన నిరుద్యోగుల సంఖ్యను కుదించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రభుత్వం చేపట్టిన సాధికార సర్వేలో 33.88 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కాగా.. ఉపాధి కల్పనా కార్యాలయంలో 9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇంటర్‌లోపు చదువుకున్న వారు నిరుద్యోగ భృతికి అనర్హులని ముసాయిదాలో యువజన శాఖ పేర్కొంది. దీంతో 12 లక్షల మంది భృతి పొందే ఛాన్స్ కోల్పోనున్నారు. దీనికితోడు నిరుద్యోగ భృతికి వయో పరిమితిని కూడా తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. రేషన్ కార్డు వివరాల ప్రకారం కుటుంబంలోని ఒక్కరు మాత్రమే నిరుద్యోగ భృతికి అర్హులని ముసాయిదాలో పొందుపరిచారు. ఇంటిలో ఒకరికి మాత్రమే ఇచ్చే నిరుద్యోగ భృతితో భృతితో కుటుంబం గడుస్తుందా అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

2014 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు యువతపై హామీల వర్షం కురిపించారు. అది నమ్మిన యువత, నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని, ఇంటర్ లోపు విద్యార్థులకు రూ.900, డిగ్రీ చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు రూ.3 వేలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.. ఇందుకు బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించినట్లు సీఎం చంద్రబాబు గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాజా పరిణామాలు చూస్తుంటే ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కలిగే భాగ్యం లేకుండా సర్కార్ ఎత్తుగడ వేస్తుందనేది నిరుద్యోగుల్లో కలుగుతోంది.

రాష్ట్రంలో ఏటా సగటున 2.5 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టాలతో బయటకు వస్తున్నారు. 15 వేల మంది వరకూ వైద్యవిద్య పూర్తిచేస్తున్నారు. వీరందరిలో గరిష్టంగా 30 శాతం మంది మాత్రమే వెంటనే ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వం అంచనా వేసింది.. ఇక రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థల్లో ఎన్ని ఖాళీలున్నాయి, వారికి ఏఏ అర్హతలున్నవారు అవసరమన్న వివరాలను సేకరించి... గుర్తించిన నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించాలని చూస్తోంది. దేశంలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, కేరళ రాష్ర్టాల తరహాలోనే ఏపీలో కూడా నిరుద్యోగ భృతి కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై తక్షణం విధివిధానాలు ప్రకటించి చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు కోరుతున్నారు. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని యువతీ యువకులు కోరుతున్నారు. ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులను టీడీపీ సర్కార్ ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

06:59 - March 11, 2018

హైదరాబాద్ : దేశంలో అంబేద్కర్‌, లెనిన్‌, పెరియార్‌ విగ్రహాలను హిందూత్వ శక్తులు ధ్వంసం చేయడాన్ని టీమాస్ తీవ్రంగా తప్పుపట్టింది. త్రిపుర ఎన్నికల్లో గెలిచిన అహంకారంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీఎల్‌ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ఆరోపించారు. హిందూత్వ వాదులు.. విగ్రహాలను కూల్చగలరేమో కానీ.. ప్రజల మనసుల్లో వారి స్థానాన్ని తొలగించలేరన్నారు. సంఘ్ పరివార్ దుశ్చర్యలను ఖండిస్తూ.. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీ మాస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విగ్రహాల ధ్వంసానికి బీజేపీనే బాధ్యత వహించాలని టీమాస్ కన్వీనర్ జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

06:58 - March 11, 2018

హైదరాబాద్ : విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాటిని అమలు చేయించుకోవడంలో తెలుగు రాష్ట్రాలు రెండూ విఫలమయ్యాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాజకీయ ఎజెండా, వాళ్ళ వ్యక్తిగత ఎజెండా నేపథ్యంలో రాష్ట్రాల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు కూడా రాజ్యసభకు రాష్ట్ర ప్రయోజనాల కొరకు పోరాడే వారిని పంపించాలని పారిశ్రామిక వేత్తలను కాదని పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. 

06:57 - March 11, 2018

విజయవాడ : చివరి బడ్జెట్‌లోనూ మహిళలకు చంద్రబాబు అన్యాయం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. డ్వాక్రామహిళలకు అసలు వడ్డీ మాఫీ చేస్తానన్న సీఎం.. ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించలేదన్నారు. మహిళల అక్రమ రవాణాలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని.. చంద్రబాబు పాలనలో మహిళకు భద్రత కరువైందని ఆరోపించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే ఇప్పటి వరకు శిక్షల్లేవన్నారు. బెల్టు షాపులను దశలవారీగా ఎత్తేస్తామన్న సీఎం హామీ ఏమైందన్నారు. మరోవైపు మహిళల కోటాలో లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారన్న రోజా.. లోకేష్‌ను మంత్రిని చేస్తే.. రాష్ట్రమంతటా ఉద్యోగాలిచ్చినట్లేనా అని ప్రశ్నించారు.

06:56 - March 11, 2018

మేడ్చల్‌ : జిల్లా జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్ ఆదేశాలమేరకు... రౌడీషీటర్లు, సంఘ విద్రోహకశక్తులు, తప్పించుకు తిరుగుతున్న నేరస్థులు లక్ష్యంగా తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారు ఐదు వందల మంది పోలీసు అధికారులు ఈ కార్డన్‌ సెర్చ్‌లో పాల్గొన్నారు. 

పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం...

హైదరాబాద్ : నేడు తెలుగు రాష్ట్రాల్లో రెండో విడత పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు. 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలకు ఏర్పాట్లు చేశారు. 

రాజ్యసభ..టిడిపి అభ్యర్థులు ఎవరు ?

హైదరాబాద్ : ఆదివారం మరోసారి సీనియర్‌ మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమాలోచనలు చేయనున్నారు. అనంతరం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు సోమవారంతో ముగుస్తుండటంతో .. ఆదివారమే టీడీపీ అభ్యర్థులు ఎవరనేది స్పష్టంకానుంది.

సోమవారం బలరాం నాయక్ నామినేషన్...

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కూడా బరిలోకి దిగింది. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌ను తమ అభ్యర్థిగా పోటీకి దించాలని కాంగ్రెస్ అధిస్టానం నిర్ణయించింది. సోమవారం బలరాం నాయక్ తన నామినేషన్ వేయనున్నారు.

సాగుతున్న 'మహా' రైతుల పాదయాత్ర...

మహారాష్ట్ర : రాష్ట్ర రైతాంగం.. తమ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సాగుతోన్న తీరిది. గోదావరి నదీ జన్మస్థానమైన నాసిక్‌ నుంచి పాదయాత్రగా సాగుతున్న 35వేలకు పైగా రైతులు.. దారిలో వచ్చే కొండలు.. గుట్టలు.. అవలీలగా దాటుకుంటూ.. ప్రభుత్వాన్ని కదిలించాలన్నదే లక్ష్యంగా సాగుతున్న తీరు.. దేశం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆధ్వర్యంలో సాగుతోన్న ఈ పాదయాత్రలో.. ప్రతి రైతూ స్వచ్ఛందంగా భాగస్వామి అయ్యారు. ఆకలి దప్పులను లెక్కచేయక.. తదేక ధ్యాసతో.. రాష్ట్ర శాసనసభ వరకూ సాగుతూనే ఉన్నారు. ఈ పాదయాత్రలో.. ఇటీవలే ఆత్మహత్యలు చేసుకున్న పాతిక మంది రైతుల పిల్లలు కూడా కలిసి సాగుతున్నారు. 

సురేశ్ ప్రభుకు అదన బాధ్యతలు...

ఢిల్లీ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు అదనంగా పౌర విమానయాన శాఖ బాధ్యతలను అప్పగించారు. ప్రధాని కార్యాలయం సూచన మేరకు సురేశ్ ప్రభుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలను అప్పగించినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. 

ఇండియా..ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు...

ఢిల్లీ : భారత్, ఫ్రాన్స్ దేశాలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్, ప్రధాని మోదీ మధ్య చర్చలు జరిగాయి. అనంతరం భద్రత, అణు విద్యుత్‌ తదితర14 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

మాకు 'హోదా' ఇవ్వాలన్న నవీన్ పట్నాయక్...

ఢిల్లీ : తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ డిమాండ్‌ చేశారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని సిఎం పేర్కొన్నారు. 

మోదికి కేజ్రీ లేఖ...

ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్రమోదికి లేఖ రాశారు. ఢిల్లీలో సీజ్‌ చేసిన దుకాణాల సమస్యలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దుకాణాలు మూసివేయడం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఇది శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Don't Miss