Activities calendar

12 March 2018

21:55 - March 12, 2018

అనుకున్నట్టే అయ్యింది.. తెలంగాణ అసెంబ్లీ పేరంటం పెంట పెంట అయ్యింది.. ఓదిక్కు గవర్నర్ నర్సింహన్ సారు ఎనలేని పథకాల కీర్తిని వివరిస్తుంటే.. కాంగ్రెసోళ్లు కాయిదాలు చింపి ఇశిరేశిండ్రు.. ఇగ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జర్ర ఓవరాక్షన్ జేశి హెడ్ ఫోన్సు ఇశిరేస్తె స్వామీగౌడ్ సారు కంటికి దాకింది.. ఆయన మీద చర్యలు దీస్కుంటరట రేపు.. ఇదిట్లుంటే.. అప్పటి అసెంబ్లీ గాదుగదా.?? అందుకే కాంగ్రెసోళ్లు కయ్యానికి దిగకముందుకే మార్షల్సును వెట్టి కంట్రోలింగ్ జేశింది సర్కారు.. సభ వాయిదా.మీ సీన్మలు ఇడ్దలైతున్నయంట.. కాయకష్టం జేశిన పైకమంత దీస్కపోయి మీ సీన్మలు జూస్తం.. మీ సంపద వెంచుకునెతందుకు మేము ఉపయోగపడ్తున్నంగదా..? శీన్మ హీరోలు.. మరి మా ప్రజలకు బాధైనప్పుడు మీరెందుకు మాట్లాడ్తలేరు..? అని ప్రశ్నిస్తున్నరు ఆంధ్ర రాష్ట్రంల పోరగాళ్లు.. మీరు నిజంగ హీరోలే అయితే.. ప్రత్యేక హోదా కోసం కొట్లాడుమంటున్నరు..సింగరేణి కాడ అగ్గిరాసుకున్నది.. లంచాలు అడ్గితె చెప్పుతోని గొట్టుండ్రి అని కార్మికులకు పిల్పునిచ్చిన ముఖ్యమంత్రిగారు..లంచాలు మింగే నాయకులనే మళ్ల కమిటీల వెట్టి తమాష జేస్తున్నడని కార్మికులు కండ్లెర్ర జేస్తున్నడు.. అవినీతి కేసుల అరెస్టైన రాజిరెడ్డిని మళ్ల కమిటీల ఎట్ల వెడ్తరని ప్రశ్నిస్తున్నరు.. ఇదిట్లుంటే.. ఇగ టీఆర్ఎస్ సంఘం ఆఫీసుకు నిప్పుగూడ వెట్టిండ్రు.. నిజామాబాద్ జిల్లా బోధన్ కాడ నిన్న బీజేపీ పార్టోళ్ల సభ అయ్యింది.. సభంటె మామూలు సభగాదు.. ఉశ్కెవోస్తె రాలకుంటొచ్చిండ్రు జనం.. ఒక్కొక్క కుర్చీల ఇద్దరిద్దరు గూసున్నరు.. ఏం మంది ఏం మంది అని వచ్చిన నేతలు గూడ జనాన్ని జూస్కుంట సూస్కుంట నిద్రలు దీశిండ్రు.. సభ అంటే ఈ నమూన గావాలె.. ఇంత అద్భుతంగ ఉండాలే అని కుర్చీలు గూడ అనుకున్నయట..పావుల పనికి పన్నెండు రూపాల ప్రచారం అంటే ఎట్లుంటదో సూస్తరా..? మన రైతు ఆత్మహత్యల మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిగారు జెప్తున్నడు.. ఇంటాంటే మీకు గూడ ఇనిపిస్త.. బాన్సువాడ దిక్కు ఆడోటి ఆడోగి కట్కం సుర్వు జేశ్న డబుల్ బెడ్రూం ఇండ్ల కాడ కుర్చేస్కోని అహో ఆంధ్రా బోజా లేవళ్ల సారు దంచికొడ్తున్నడు పాండ్రి సూపెడ్త..చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభక్క గొట్టిందట.. ఒకాయినను ఆయన పోలీసోళ్లతానికొచ్చి అక్కమీద చర్యలు దీస్కోండ్రి..అడ్డగోల్గ తిట్టింది నన్ను.. చెవ్వు వడివెట్టింది అని పోలీసోళ్లకు ఫిర్యాదు జేశిండట.. మరి పంచాది ఏడొచ్చింది బొడిగె శోభక్క అంత ఉగ్రరూపం ఎందుకు దాల్చింది అనేది ఒక్కపారి వొయ్యి అర్సుకొద్దాం పాండ్రి.. ఈనడ్మ శోభక్కకు అంత బీపీ ఎందుకు వెర్గుతున్నదో..చంద్రశేఖర్ రావు ఏలువడిల తెలంగాణల రైతులకు గోస ఎట్లున్నదో.. అటు చంద్రాలు ఏలువడిల ఆంధ్రా రైతుల పరిస్థితి అంతే ఉన్నది.. అప్పుల బాధలు తట్టుకోలేక కర్నూలు కాడ ఒక రైతు జీవిదీస్కున్నడు.. మన చంద్రాలు ఏం జేప్తడు ముచ్చట జెప్పుమంటే.. కొత్త తరహా వ్యవసాయం అంటడు.. ఆధునిక పద్దతులు అంటడు.. కని అసలు మద్దతు ధర మాత్రం ఇప్పియ్యలేకపోతడు.. పార్లమెంట్ పగటేశకాడు మళ్ల ఇయ్యాళ ఇంకో ఏశంల దిగిండు.. సంగీతానికి ప్రత్యేక హోదా రాలగొట్టెతందుకు పీకె చేతుల వట్కోని కూతలు వెడ్తున్నడు.. అదేనుల్లా.. చిత్తూరు శివప్రసాదు.. ఈన లోపట తక్వుంటడు బైట ఎక్వుంటది.. ఈన గట్టిన ఏశాలకు దశావతారం సీన్మల ఒక్కొక్క సీన్ డబుల్ రోల్ల వాడుకొవచ్చన్నట్టు..చర్లపల్లి సెంట్రల్ జైలు కాడ ఒక ఖైదీ పోలీసోళ్లకు పట్టవగటీలే సుక్కలు జూపెట్టిండు.. దన్నున ఉర్కిపొయ్యి కరెంటి పోలు మీదికి ఎక్కిండు.. దిగురా మయ్యగాని అంటే దిగడు.. ఆఖరికి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీసొచ్చి ఫోన్ల గూడ బతిలాడిండు.. లేదు నేను నా భార్యను సంపలేదు.. ఎస్సై నాగరాజే నా భార్యతోని అక్రమ సంబంధం బెట్టుకోని నన్ను జైలు పాలు జేశిండని ఓ ఉత్తరం రాశి కిందేశిండు పాండ్రి దించన్నొద్దాం..వనపర్తి మున్సిపాల్టీ పరిస్థితి బీడి బిచ్చె కల్లు ఉద్దుర లెక్కైందట.. కనీసం చెత్త ఊడ్సెటోళ్లకు గూడ జీతాలిచ్చెతందకు పైకం లేవట.. ఇగ పాత బకాయి కాయిదాలు ముంగటేస్కోని వసూళ్లు జేస్తున్నరట.. వనపర్తి కాడ వ్యాపారులు మున్సిపాల్టీకి ఐదు కోట్ల రూపాల అప్పున్నరట.. అవ్వన్ని జమజేస్తున్నరు.. పాపం ఇంత పెద్ద బంగారు తెలంగాణల ఒక మున్సిపాల్టీ తాన జీతాలిచ్చె పైకం లేవంటె సూడుండ్రి ఎంత గొప్పగున్నది ముచ్చట..గిదో గమ్మతి ముచ్చటున్నది.. దేవుని ముంగట అగ్గిగుండాలని ఒక కార్యం ఉంటది.. అండ్లకెళ్లి నడిస్తె పాపాలు వొతయ్.. పుణ్యాలు పుట్లకొద్దొచ్చిపడ్తయ్ అని భక్తుల నమ్మకం అయితే.. ఎవ్వలన్న శిగమూగితె దేవుడొచ్చిండని అంటరు.. మరి దేవుడు పెయ్యిల గూసున్నంక అగ్గిగుండాలు తొక్కుడు గాదు.. నిప్పుల మీద బొర్రినా ఏం గావొద్దుగదా..? పాండ్రి పబ్లీకు భక్తీ కథ సూపెడ్త..

21:44 - March 12, 2018

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా నినాదాలు మార్మోగుతున్నాయి. టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంటు ముందు నిరసనకు దిగారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ మరోసారి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ప్రధాని మోదీ మనసు కరగాలని నాదస్వరం ఊదుతూ నిరసన తెలిపారు.

పోటాపోటీ నిరసనలు
పార్లమెంటు ముందు ఏపీ ఎంపీలు పోటాపోటీగా నిరసనలు తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని..ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ.. ఓసారి ఆలోచించండి.. అందరికీ న్యాయం చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అన్యాయం చేస్తున్నారని నినాదాలతో హెరెత్తించారు.

సన్నాయి వాయించి నిరసనతెలిపిన ఎంపీ శివప్రసాద్
పార్లమెంటు భవనం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగిన టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఐదకోట్ల మంది ఏపీ ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఎంపీ శివప్రసాద్‌ అయితే మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు. పార్లమెంటుకు రావడమే నాదస్వర కళాకారుడి వేషంలో వచ్చారు. నాదస్వరం ఊదుతూ.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రధాని మోదీది రాతి గుండె అని...సంగీతంతోనైనా ఆయన గుండె కరుగుతుందోమోనన్నారు శివప్రసాద్‌. విభజన హామీల అమలుకోసం తాము పోరాటం చేస్తున్నామని.. కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూస్తామన్నారు మాజీ మంత్రి అశోకగజపతి రాజు.

హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు : వైసీపీ
అటు వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంటు ముందు ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. తాము గత మూడేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదాకోసం పోరాడుతూనే ఉన్నామని తెలిపారు వైసీపీ ఎంపీలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలకోసం చిత్తశుద్ధితో పనిచేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. పార్లమెంటు లోపల, బయట వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న ఏపీ ఎంపీలు.. ప్రత్యేక హోదా డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. మోదీ ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

21:40 - March 12, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీపై నమ్మకంతోనే ఎన్డీఏలో చేరాం.. కాని మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ శాసన మండలిలో ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర పరిస్థితిపై సీఎం మాట్లాడారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని చంద్రబాబు స్పష్టంచేశారు. తనను విమర్శించడం మానుకుని.. ఏపీకి న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర బీజేపీ నేతలకు చంద్రబాబు సభాముఖంగా సూచించారు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో ప్రకటించిన హామీలన్నీ అమలు కావాల్సిందే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రం పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న చంద్రబాబు.. ఏపీ పరిస్థితిపై శాసన మండలిలో సుదీర్ఘంగా మాట్లాడారు.

మోదీపై నమ్మకంతోనే ఎన్డీఏలో చేరాం
ఏపీకి న్యాయం చేసే విషయంలో ప్రధాని మోదీపై నమ్మకం ఉందని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాముకూడా అదే నమ్మకంతో ఎన్డీయే ప్రభుత్వంలో చేరామన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ప్రతిపక్షంగా పలు విలువైన సూచనలు ఇవ్వాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులు.. తమ బాధ్యతను దులపరించుకుని రోడ్లపై తిరుగుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై కూడా సీఎం నిరసన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించడం మానుకుని రాష్ట్రానికి మేలుజరిగేలా ప్రధాని మోదీపై ఒత్తడి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.

అమరావతిలో కేంద్ర సంస్థలు ఎందుకు ఏర్పాటు చేయరు ?
హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో ఏర్పాటు చేసినట్టు.. అమరావతిలో కేంద్ర సంస్థలు ఎందుకు ఏర్పాటు చేయరని సీఎం సభలో ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పాటు చేసిన సందర్భంలో నయారాయ్‌పూర్‌ నిర్మాణానికి సహకరించినట్టే అమరావతి నిర్మాణానికి చేయూతనివ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఏపీ విషయంలో ఎందుకు వివక్షాపూరితంగా ప్రవర్తిస్తున్నారు.. ఏపీ ఇండియాలో భాగంకాదా అని సభా ముఖంగా చంద్రబాబు కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు.

మొదటిసారి విద్యుత్‌ సంస్కరణలు చేసిన ఘనత
దేశంలో మొదటిసారిగా పవర్‌సెక్టార్‌లో సంస్కరణలు విజయవంతంగా అమలు చేసింది తానేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలును సభకు వివరించారు. సోలార్‌ ఎనర్జీ విషయంలో దేశంలోనే మొదటిసారిగా దారి చూపింది తానేనన్నారు. హుద్‌హుద్‌ తుఫాన్‌లో తీవ్రంగా నష్టపోయిన విశాఖలో సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఇంప్లిమెంట్‌ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన తర్వాతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సోలార్‌ ఎనర్జీ గురించి మాట్లాడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి సభకు వివవరించారు.

రైతు రుణమాఫీలో రాజీ పడలేదు
అటు రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా.. రైతురుణమాఫీ విషయంలో రాజీపడలేదని చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించక పోయినా.. ఆర్బీఐ వద్దన్నా ..ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర రైతులకు 24వేల 5వందల కోట్ల రూపాయల రుణాలు మాఫీచేశామన్నారు. అటు డ్వాక్రా సంఘాలకు కూడా పదివేల కోట్లరూపాయల రుణాలు ఇచ్చామన్నారు.

సెంటిమెంటుకు డబ్బులు రావనడంపై బాబు ఆగ్రహం
ఇక సెంటిమెంటుకు డబ్బులు రావన్న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు సభాముఖంగా ఖండించారు. సెంటిమెంట్‌ ను అనుసరించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్రం పెద్దలు మర్చిపోయారా అని బాబు ప్రశ్నించారు. తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తెలుగు ప్రజల కోసమే అని ఉద్వేగంగా ప్రసంగిచారు ఏపీ ముఖ్యమంత్రి.

బీజేపీ, వైసీపీలపై బాబు విమర్శలు
మొత్తానికి అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాటు రాష్ట్రంలో వైసీపీ తీరును సభా ముఖంగా ఖండించిన సీఎం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా.. సంక్షేమ పథకాల అమలులో రాజీపడేది లేదని ఏపీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని చంద్రబాబు కోరారు. 

21:34 - March 12, 2018

హైదరాబాద్ : బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తుందని.. రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు గవర్నర్‌ ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్టగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం
తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విపక్షాల ఆందోళన మధ్యే గవర్నర్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ప్రభుత్వం అందిస్తోందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నట్లు గవర్నర్‌ చెప్పారు.

ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత : గవర్నర్
అలాగే తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్‌ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక విద్యుదుత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించిందని.. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలను ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు.

గవర్నర్‌ ప్రసంగాన్ని తప్పు పట్టిన విపక్షాలు
మరోవైపు గవర్నర్‌ ప్రసంగాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ప్రసంగం మొత్తం అబద్దాలే ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తుల విషయంలోనూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దిగజార్చారని రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు.గవర్నర్‌ ప్రసంగం మొత్తం సత్యదూరంగా ఉందంటూ ప్రసంగం మధ్యలోనే బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోలోని ఏ అంశాన్నీ గవర్నర్‌ ప్రసంగంలో పెట్టలేదని టీడీపీ ఆరోపించింది. చివరిబడ్జెట్‌లోనైనా న్యాయం చేస్తారనుకుంటే అదీ లేదని ఆపార్టీ ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య మండిపడ్డారు.

రైతులను విస్మరించారు : సున్నం రాజయ్య
రైతు రుణమాఫీ, కౌలు రైతులకు ఎరువుల సాయం అంశాలను గవర్నర్‌ ప్రసంగంలో విస్మరించారని సీపీఎం ఆరోపించింది. మిషన్‌ భగీరథ 90 శాతం పూర్తయిందనడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఖండించారు. స్కీమ్‌ వర్కర్లు, కాంట్రాక్ట్‌ వర్కర్లు, నిరుద్యోగుల అంశాన్ని గవర్నర్‌ ప్రస్తావించలేదన్నారు.

21:27 - March 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు రణరంగాన్ని తలపించింది. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రసంగం కాపీలను చించివేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్‌సెట్‌ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలి గాయమైంది. వెంటనే ఆయనను సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై టీఆర్‌ఎస్‌ మండిపడింది. మరోవైపు సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తొలి రోజే గందరగోళం ..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజే గందరగోళం నెలకొంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు చేపట్టిన నిరసన... సభలో గందరగోళానికి దారితీసింది. గవర్నర్ ప్రసంగాన్ని వెల్‌లోకి వెళ్లి అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీంతో మరింత ముందుకెళ్ళాలని భావించిన సభ్యులు...తమ చేతిలోని ప్రసంగం కాపీలను చించి విసిరారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. టేబుల్‌పైనున్న హెడ్‌సెట్‌ను పోడియం వైపు విసరడంతో.. అది గవర్నర్‌ పక్కనే ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ కంటికి తగిలింది. దీంతో ఆయన కంటికి స్వల్పగాయమైంది. గవర్నర్‌ ప్రసంగం అయ్యే వరకు అలాగే ఉండి తర్వాత సరోజనీ దేవి ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. కంటికి ఎలాంటి ప్రమాదం లేదని.. కొద్దిగా వాపు రావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

దాడికి పాల్పడిన సభ్యులపై కఠిన చర్యలు :
సభలో కాంగ్రెస్ సభ్యులు అనుసరించిన తీరును టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. దాడికి పాల్పడిన సభ్యులపై స్పీకర్‌ కఠిన చర్యలు తీసుకుంటారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులకు సభలో ఉండటం ఇష్టం లేదని హరీష్‌ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు గుండాల్లాగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, కొండాసురేఖ విమర్శించారు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారమే కాంగ్రెస్ సభ్యులు దాడి చేశారని మీడియా పాయింట్‌ వద్ద అన్నారు.

గొంతునొక్కేస్తున్నారు : విపక్షాలు
ఇటు కాంగ్రెస్ నేతలు సైతం టీఆర్ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని అంతే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సభలో తమగొంతునొక్కేస్తున్నారని.. అసలు నిరసన తెలిపే హక్కు లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహిరించదని ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగంలో రైతు సమస్యల గురించి మాట మాత్రమైనా లేదని.. అందుకే తాము ఆందోళన చేశామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. విపక్ష సభ్యులుగా మా నిరసన తెలియజెప్పడానికి స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళ్లామన్నారు... అయితే మార్షల్స్‌ తమకు అడ్డుతగిలి దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. గలాటాలోతన కాలికి గాయం అయినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చూపించారు. అయితే తమ ఆందోళన గవర్నర్‌ మీదే తప్ప...మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ మీద కాదని..ఇది అనుకోకండా జరిగిన పరిణామం అని విచారం వ్యక్తం చేశారు.

27 వరకు శాసనసభ సమావేశాలు
అనంతరం జరిగిన బిజినెస్‌ అడ్వయిజరీ మీటింగ్‌లో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 15న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

21:01 - March 12, 2018

మహారాష్ట్ర : రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ముంబైలోని ఆజాద్‌ మైదానంలో రైతులనుద్దేశించి ఏచూరి ప్రసంగించారు. ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు భగత్‌ సింగ్‌ బాంబు వేస్తే...ఈనాటి పాలకుల కళ్లు తెరిపించేందుకు రైతులు ఆందోళన ద్వారానే మహా విస్ఫోటనం సృష్టించగలరని ఏచూరి అన్నారు. అన్నదాత ఆందోళనకు దిగితే దేశమే ఆకలితో చస్తుందని హెచ్చరించారు. ఇలా జరగకుండా ఉండాలంటే రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏచూరి ప్రభుత్వానికి సూచించారు.

20:49 - March 12, 2018

పరీక్షలు దగ్గరకు వచ్చాయంటే చాలు విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి గురవటం సర్వ సాధారణంగా మారిపోయింది. కాగా గతకొంతకాలంగా విద్యార్ధుల ఆత్మహత్యలు కూడా సర్వసాధారణంగా మారిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి కారణాలేమిటి? విద్యార్ధులు ఒత్తిడి జయించాలంటే ఎటువంటి విధానాలు అవలంభించాలి? అనే అంశాలపై 10టీవీ చర్చ. ఈ చర్చలో ప్రముఖ సైకాలజిస్ట్ జవహర్ లాల్ నెహ్రూ పాల్గొన్నారు. మరి వారు ఎటువంటి సూచనలు చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:48 - March 12, 2018

మహారాష్ట్ర దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పాలకులను దిగొచ్చేలా చేసింది. రైతుల డిమాండ్లకు మహా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 నెలల్లో అన్ని డిమాండ్లను నెరవేర్చుతామని ఫడ్నవిస్‌ ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. దీంతో రైతులు తమ ఆందోళన విరమించారు.

ఎర్ర సముద్రాన్ని తలపించిన ముంబై
తలకు ఎర్రటోపీలు, చేతిలో ఎర్ర బ్యానర్లు పట్టుకుని రైతులు నిశ్శబ్ద విప్లవంలా తమ యాత్రను సాగించారు. 50 వేల మంది రైతులతో ముంబై నగరం ఎర్ర సముద్రాన్ని తలపించింది.నాసిక్‌లో మార్చి 6 న ప్రారంభమైన మహారైతు పాదయాత్ర.. ఆదివారం ముంబైకి చేరుకుంది. మండుటెండలను లెక్కచేయక, కాలినడకన దాదాపు 180కిలోమీటర్లు ప్రయాణించారు. అన్నదాతలకు ముంబయి వాసులు నైతికంగా అండగా నిలిచారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆహార పదార్థాలు, మంచినీటిని రైతులకు అందించింది.

విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా రైతుల ర్యాలీ
సోమవారం ఉదయం టెన్త్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రైతుల ర్యాలీ ఆదివారం అర్థరాత్రే ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల డిమాండ్లపై ఫడ్నవిస్‌ ప్రభుత్వం దిగొచ్చింది. సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా ఆరుగురు మంత్రులతో కూడిన కమిటీ రైతులతో చర్చించి సానుకూలంగా స్పందించింది. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇచ్చింది.

రైతులనుద్దేశించి ఏచూరి ప్రసంగం
ఆజాద్‌ మైదానంలో రైతులనుద్దేశించి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రసంగించారు. 30 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం కారణంగా రుణాల ఊబిలో కూరుకు పోయి అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఏచూరి అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఏచూరి పిలుపునిచ్చారు. ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు భగత్‌ సింగ్‌ బాంబు వేస్తే...ఈనాటి పాలకుల కళ్లు తెరిపించేందుకు రైతులు ఆందోళన ద్వారానే మహా విస్ఫోటనం సృష్టించగలరని ఏచూరి అన్నారు. అన్నదాత ఆందోళనకు దిగితే దేశమే ఆకలితో చస్తుందని హెచ్చరించారు. దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశ రైతాంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.  

20:34 - March 12, 2018

దేశంలో ఎక్కడా లేని విధంగా మహారాష్ట్ర రైతన్నలు తమ సమస్య పరిష్కారం కోసం మహా లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పదులు కాదు.. వందలు కాదు.. ఏకంగా 35 వేల మంది రైతులు...! అకుంఠిత దీక్షతో.. ఏకంగా 180 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా కదిలారు. రోజూ పాతిక కిలోమీటర్లు చొప్పున నడుస్తూ.. తమ సమస్యల పరిష్కారం కోసం కదలివస్తున్నారు. మహారాష్ట్ర నాసిక్‌లో మొదలైన రైతుల ప్రస్థానం.. రాజధాని ముంబై చేరుకుంది. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నేతృత్వంలో.. వేలకొద్దీ రైతులు.. నేడు అసెంబ్లీని ముట్టడించేందుకు కదం తొక్కారు. వేలకొద్దీ రైతాంగం..ఎర్రటి తలపాగా.. తెల్లటి వస్త్రాలతో కూడిన ఆహార్యం.. వందల కిలోమీటర్ల దూరం...ఘాట్‌రోడ్లను దాటుకుంటూ సాగే దృశ్యం..అపూర్వం.. అద్భుతం.. రైతుల అకుంఠితత్వం.. మహారాష్ట్ర రైతాంగం.. తమ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గోదావరి నదీ జన్మస్థానమైన నాసిక్‌ నుంచి మొదలై కొండలు, గుంటలను దాటుకుని కొనసాగిన అన్నదాతల మహాపాదయాత్ర ముంబైకి చేరుకుంది. అంతేకాదు ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని కదిలించింది. అంతేకాదు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. దీంతో కదలివచ్చిన ప్రభుత్వం వారి సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. దీంతో తమ ఆందోళనను రైతన్నలు విరమించారు. దేశ వ్యాప్తంగా వున్న రైతుల సమస్యలు పరిష్కరించాలంటే పాదయాత్రలు చేయాల్సిందేనా? అంతే తప్ప రైతుల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అనే అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో ఆలిండియా రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి ఇందిరా శోభన (కాంగ్రెస్ అధికార ప్రతినిథి), ప్రకాశ్ రెడ్డి, బీజేపీ, నర్శింహారెడ్డి పాల్గొన్నారు. ఈ చర్చపై మరింత సమాచారం కోసం వీడియోను క్లిక్ చేయండి..

ఏపీకి రైల్వే జోన్ ఇవ్వటం కుదరదన్న కేంద్రం!..

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేజోన్‌ ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ దినేశ్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తేల్చి చెప్పారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. రైల్వేజోన్‌ సాధ్యాసాధ్యాల నివేదికలు వ్యతిరేకంగా ఉన్నాయని, రైల్వే బోర్డు కూడా వ్యతిరేకంగా ఉందని ఆయన చెప్పారు.

రైతులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు..

అనంతపురం : హంద్రీనీవా కాలువ 9వ ప్యాకేజీలో భూమి కోల్పోయిన రైతులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నష్టపరిహారం చెల్లించేంత వరకూ పనులు చేపట్టకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 

ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష..

అమరావతి : పోలవరం ప్రాజెక్టు సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెల్లర్ గ్రౌండ్ ఇంజనీరింగ్ సంస్థకు `సీఐడీసీ విశ్వకర్మ అవార్డు -2018'ను ప్రకటించారు.పోలవరం గ్రౌండ్ ఇంజనీరింగ్ పనులు చేపట్టిన కెల్లర్ గ్రౌండ్ ఇంజనీరింగ్ సంస్థను చంద్రబాబు అభినందించారు. మే నెలలోగా డయాఫ్రమ్ వాల్, జూన్ 15 నాటికి జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 

ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష..

అమరావతి : పోలవరం ప్రాజెక్టు సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెల్లర్ గ్రౌండ్ ఇంజనీరింగ్ సంస్థకు `సీఐడీసీ విశ్వకర్మ అవార్డు -2018'ను ప్రకటించారు.పోలవరం గ్రౌండ్ ఇంజనీరింగ్ పనులు చేపట్టిన కెల్లర్ గ్రౌండ్ ఇంజనీరింగ్ సంస్థను చంద్రబాబు అభినందించారు. మే నెలలోగా డయాఫ్రమ్ వాల్, జూన్ 15 నాటికి జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 

గాయమైతే రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి

హైదరాబాద్‌: అసెంబ్లీలో ఈ ఉదయం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు గాయం అయినట్టు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఘటన జరిగిన చాలాసేపటి తరువాత గాయమైందని నాటకాలాడి ఆసుపత్రికి తరలించారని కోమటిరెడ్డి ఆరోపించారు. 

సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీపై బదిలీ వేటు..

అమరావతి : ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ ఎంబీ రామ్ గోపాల్ పై బదిలి వేటు పడింది. వెంటనే జీఏడీకి రిపోర్ట్ చేయాలని రామ్ గోపాల్ కు ప్రభుత్వ ఆదేశించింది. రామ్ గోపాల్ స్థానంలో ఐఏఎస్ అధికారి సూర్యకుమారిని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మహా లాంగ్ మార్చ్ కు బాలీవుడ్ సలాం..

మహారాష్ట్ర : వ్యవసాయం రంగం సంక్షోభం సందర్భంగా మహారాష్ట్రలోని రైతులు చేపట్టిన మహా `లాంగ్ మార్చ్ 'కు బాలీవుడ్ నటులు సలాం కొట్టారు. అర్థరాత్రి కూడా మహాపాదయాత్రకు విరామం లేకుండా కొనసాగించి ఆదాన్ మైదాన్ కు చేరుకున్న రైతన్నలకు బాలీవుడ్ నటులు మద్దతు పలికారు. రైతన్నలకు సంఘీభావం తెలిపినవారిలో రితేశ్ దేశ్ ముఖ్, దియామీర్జా, ప్రకాశ్ రాజ్, సిద్ధార్జ్ బసు, శృతి సేథ్, ప్రీతీష్ తదితరులు వున్నారు.  

అల్మూరులో విషాదం..

అనంతపురం : జిల్లాలోని ఆల్మూరులో విషాదం నెలకొంది. ప్రమాదవశాతత్తు చెరువులోపడి తల్లీ, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు లక్ష్మీనారాయణమ్మ, అఖిల్, కిషోర్ లుగా గుర్తించారు. 

అల్మూరులో విషాదం..

అనంతపురం : జిల్లాలోని ఆల్మూరులో విషాదం నెలకొంది. ప్రమాదవశాతత్తు చెరువులోపడి తల్లీ, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు లక్ష్మీనారాయణమ్మ, అఖిల్, కిషోర్ లుగా గుర్తించారు. 

ఆరు నెలల్లో రైతుల సమ్యలకు పరిష్కారం: ఫడ్నవీస్

మహారాష్ట్ర : ఎట్టకేలకు రైతన్నలతో చర్చించేందుకు మహారాష్ట్ర సర్కార్ దిగివచ్చింది. రైతు నాయకులతో చర్చలు జరిపేందుకు ఓ కమిటీని వేసిన ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఫడ్నవీస్ రైతు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. డిమాండ్ ల సాధన కోసం మహా లాంగ్ మార్చ్ నాసిక్ నుండి ముంబైలోని ఆజాద్ మైదానానికి మహాలాంగ్ మార్చ్ గా రైతన్నలు తరలివచ్చింది. 50 వేల మంది రైతులతో ముంబై ఎర్ర సముద్రాన్ని తలపించిన రైతుల లాంగ్‌ మార్చ్‌ ముంబైలోని ఆజాద్‌ మైదానానికి చేరుకుంది.

18:20 - March 12, 2018
18:08 - March 12, 2018

మహారాష్ట్ర : ఎట్టకేలకు రైతన్నలతో చర్చించేందుకు మహారాష్ట్ర సర్కార్ దిగివచ్చింది. రైతు నాయకులతో చర్చలు జరిపేందుకు ఓ కమిటీని వేసిన ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఫడ్నవీస్ రైతు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. డిమాండ్ ల సాధన కోసం మహా లాంగ్ మార్చ్ నాసిక్ నుండి ముంబైలోని ఆజాద్ మైదానానికి మహాలాంగ్ మార్చ్ గా రైతన్నలు తరలివచ్చింది. 50 వేల మంది రైతులతో ముంబై ఎర్ర సముద్రాన్ని తలపించిన రైతుల లాంగ్‌ మార్చ్‌ ముంబైలోని ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రైతులతో చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరుగురు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, పాండురంగ్‌ ఫుడ్‌కర్, గిరీష్‌ మహాజన్, విష్ణు సవారా, సుభాష్‌ దేశ్‌ముఖ్, ఏక్‌నాథ్‌ షిండే సభ్యులుగా ఉన్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయి. రైతుల లాంగ్‌ మార్చ్‌కు శివసేన ఇప్పటికే సమర్థించింది. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు గత మంగళవారం నాసిన్‌ నుంచి లాంగ్‌ ప్రారంభించి ముంబైకి చేరుకున్నారు. ముంబై విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రైతుల పాదయాత్ర శాంతియుతంగా సాగింది.

17:58 - March 12, 2018

హైదరాబాద్ : సభలో విపక్షం లేకుండా చేయడమే కేసీఆర్ ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. ఇవాళ సభలో.. జరిగిన తమ ఆందోళనను పెద్దదిగా చేసి.. ప్రయోజనం పొందాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. మొదట మాములుగా కనిపించిన మండలి ఛైర్మన్.. తరువాత ఆసుపత్రికి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీలో కాంగ్రెస్‌ అనుసరించిన తీరుపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మటిరెడ్డితో పాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

17:53 - March 12, 2018

జమ్ముకశ్మీర్‌ : అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల్లో ఇద్దర్ని కోకర్‌నాగ్‌కు చెందిన సయ్యద్‌ ఒవైస్‌, శ్రీనగర్‌కు చెందిన బిటెక్‌ స్టూడెంట్‌ ఫజ్లీగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదులకు ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. అనంత్‌నాగ్‌ జిల్లా హకూరా ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఉగ్రవాది వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి ఎకె 47 రైఫిల్స్, పిస్టల్స్‌, హ్యాండ్‌ గ్రెనేడ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్రవాదుల్లో ఒకరు ఇటీవల సౌరా ప్రాంతంలో పోలీసులపై జరిగిన దాడి ఘటనతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. 

17:51 - March 12, 2018

ఉత్తరప్రదేశ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోది, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌లు కలిసి ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్‌లోనే అతి పెద్ద సౌర విద్యుత్‌ ప్లాంట్‌ కావడం విషేషం. ఇక్కడ 75 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఫ్రాన్స్‌కు చెందిన సోలార్ పవర్ గెయింట్ ఇంజీ సోలార్ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మీర్జాపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలియెన్స్ ప్రోగ్రామ్‌కు కింద చేపట్టారు. నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన మాక్రన్ వారణాసిలో పర్యటిస్తున్నారు.

17:48 - March 12, 2018

ఢిల్లీ : ఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కార్తీ చిదంబరంను రిమాండ్‌ అనంతరం సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల జుడీషియల్‌ కస్టడీ విధించింది. మార్చి 24 వరకు జైలులో ఉండనున్నారు. కార్తికి జైలులో భద్రత కల్పించాలని, వైద్యుడి పర్యవేక్షణలో మందులు ఇవ్వాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. మార్చి 15న కార్తీ బెయిలుపై విచారణ జరగనుంది. కార్తీ, ఆయన సిఎ భాస్కర్‌ రమణ్‌ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించేందుకు అనుమతించాలని సిబిఐ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఆమోదం లభించేలా వ్యవహరించినందుకు కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి.

17:41 - March 12, 2018

సంగారెడ్డి : ఉదయం అసెంబ్లీ వ్యవహారాలు చూసుకోవాల్సిన మంత్రి హరీష్‌రావు అర్ధరాత్రి వరకు సంగారెడ్డిలో జరిగిన ఉర్దూ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఉర్దూ కవి భాషా ఖాద్రి చదివిన హాస్య ముషాయిరాలను విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. సంగారెడ్డికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఉర్దూ గజల్‌ గాయకుడు రహీ మెమోరియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. 

17:37 - March 12, 2018

శ్రీకాకుళం : వేతనాలు చెల్లించాలంటూ శ్రీకాకుళం జిల్లా రిమ్స్‌ వైద్యశాలలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తోన్న జై బాలాజీ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమ్మెకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు పలికారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ, కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరించారు. 

17:35 - March 12, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 స్థానాల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పోటీ చేస్తుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రైతులకు రుణమాఫీతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో బీఎల్‌ఎఫ్‌ సామాజిక న్యాయంతో ముందుకెళ్తుందన్నారు. 

17:28 - March 12, 2018

అమరావతి : సెంటిమెంట్‌ ను అనుసరించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం.. ఇపడు ఏపీ విషయంలో మాత్రం సెంటుమెంటుకు డబ్బులు రావనడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ శాసనమండలిలో కేంద్ర ప్రభుత్వ వివక్షను సీఎం ఎండగట్టారు. కేంద్రం మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు ఖండించారు. తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తెలుగు ప్రజల కోసమే అని ఉద్వేగంగా ప్రసంగిచారు ఏపీ ముఖ్యమంత్రి. 

17:24 - March 12, 2018
17:13 - March 12, 2018

హైదరాబాద్ : మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడిని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతు..గూండాల్లాగా కాంగ్రెస్ శాసన సభ్యులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. హెడ్ ఫోన్ సెట్ ను తిప్పి తిప్పి కొట్టటం ఎంతవరకూ సమంజసం అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ ఘటనపై సీసీ పుటేజ్ ను పరిశీలించి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతోంది. కాగా తాము చేసింది నిరసనలో బాగమే తప్ప ఉద్ధేశ్యపూర్వకంగా కాదనీ..మాపై చర్యలు తీసుకుందుకు మాపై టీఆర్ఎస్ సర్కార్ కుట్రపన్నుతోందని వారు ఆరోపిస్తున్నారు. గౌరవనీయులై సభాధ్యక్షుడిపై గూండాల్లా ప్రవర్తించిన మీది కుట్రా? ప్రజాస్వామ్య బద్ధంగా సభ నడుపుతున్న మాది కుట్రా? అని ప్రశ్నించారు. కాగా ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కోమటిరెడ్డితో సహా మరో ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కార్ సమాలోచన చేస్తోంది. కాగా మండలి చైర్మన్ స్వామి గౌడ్ పై కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్ ఫోన్ విసరటం, అనంతరం ఆయనను సరోజినీదేవి కంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన విషయం తెలిసిందే.

రైతన్నలకు మేమున్నాం : రాహుల్ గాంధీ

మహారాష్ట్ర : మహారాష్ట్ర రైతులు చేస్తున్న డిమాండ్‌లను నెరవేర్చాలని ప్రధాని మోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. రైతుల మహాధర్నాపై ఆయన ట్వీట్ చేశారు. రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శించరాదు అని అన్నారు. ముంబైలో రైతులు మహార్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

16:21 - March 12, 2018

మహారాష్ట్ర : 50 వేల మంది రైతులతో ముంబై ఎర్ర సముద్రాన్ని తలపిస్తోంది. రైతుల లాంగ్‌ మార్చ్‌ ముంబైలోని ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రైతులతో చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరుగురు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, పాండురంగ్‌ ఫుడ్‌కర్, గిరీష్‌ మహాజన్, విష్ణు సవారా, సుభాష్‌ దేశ్‌ముఖ్, ఏక్‌నాథ్‌ షిండే సభ్యులుగా ఉన్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయి. రైతుల లాంగ్‌ మార్చ్‌కు శివసేన ఇప్పటికే సమర్థించింది. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు గత మంగళవారం నాసిన్‌ నుంచి లాంగ్‌ ప్రారంభించి ముంబైకి చేరుకున్నారు. ముంబై విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రైతుల పాదయాత్ర శాంతియుతంగా సాగింది.

16:07 - March 12, 2018

నేపాల్ : విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానానికి ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో చక్రాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 78 మంది ప్రయాణికులున్నారు. ఢాకా నుంచి ఖాట్మాండుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

16:03 - March 12, 2018

అమరావతి : విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆదుకోవాలని కేంద్రాన్ని మరోసారి కోరుతున్నామని బాబు అన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో ఏర్పాటు చేసినట్టు.. అమరావతిలో కేంద్ర సంస్థలు ఎందుకు ఏర్పాటు చేయరని సీఎం ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పాటు చేసిన సందర్భంలో నయారాయ్‌పూర్‌ నిర్మాణానికి సహకరించినట్టే అమరావతి నిర్మాణానికి చేయూతనివ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఏపీ విషయంలో ఎందుకు వివక్షాపూరితంగా ప్రవర్తిస్తున్నారు.. ఏపీ ఇండియాలో భాగంకాదా అని సభా ముఖంగా చంద్రబాబు కేంద్రానికి ప్రశ్నిలు సంధించారు. 

16:01 - March 12, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇది ఆఖరి బడ్జెట్‌ అన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపించివేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పట్ల గవర్నర్‌ స్పీచ్‌లో ప్రస్తావించకపోవడంపై మండిపడ్డారు. తెలంగాణలో 4వేల మంది చనిపోయిన రైతులవి ఆత్మహత్యలు కాదని కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన హత్యలేనన్నారు ఉత్తమ్‌. తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లలో లక్షా నలభైవేల కోట్ల అప్పు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 

రైతన్నల కోసం మరాఠా సర్కార్ కమిటీ..

 

మహారాష్ట్ర : రాష్ట్రంలో రైతన్నలు చేస్తున్న మహాలాంగ్ మార్చ్ కు మరాఠా సర్కార్ లో కదలికలు వచ్చాయి. రైతన్నల సమస్యలపై చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఆరుగురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. కాగా ఇప్పటికే మహా లాంగ్ మార్చ్ కు కాంగ్రెస్, ఎన్సఈపీ,శివసేన, తదితర విపక్షాలు మద్దతు పలికిన విషయం తెలిసిందే.  

15:49 - March 12, 2018

హైదరాబాద్ : గత కొన్ని దశాబ్దాలుగా మహిళా రిజరేషన్ బిల్లు పార్లమెంట్ లో మగ్గిపోతోంగి. కాగా ఈ బిల్లు ఎప్పటికి పాస్ అవుతుంది? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు సైతం సమాచారం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాలలోనైనా ఈ బిల్లుకు మోక్షం లభిస్తుందా అని దేశ వ్యాప్తంగా మహిళా లోకం ఎదురు చూస్తోంది. ఈ నేథ్యంలో చర్చను చేపట్టింది వేదిక..

త్రిభువన్ లో విమాన ప్రమాదం..

నేపాల్ : నేపాల్‌లో ఘోరం జ‌రిగింది. యూఎస్‌-బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఖాట్మాండు విమానాశ్ర‌యంలో కూలింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 50 మంది మ‌ర‌ణించి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. ఢాకా నుంచి వ‌స్తున్న విమానం.. ఖాట్మాండులోని త్రిభువ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. ల్యాండింగ్ స‌మ‌యంలో అక‌స్మాత్తుగా విమానం ర‌న్‌వేపై జారింది. దీంతో ఆ ప్లేన్‌కు మంట‌లు అంటుకున్నాయి. ఆ త‌ర్వాత అదే స్పీడ్‌లో ర‌న్‌వే ప‌క్క‌న ఉన్న ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో కూలింది. ఈ ఘటనలో దాదాపు 50మంది మృతి చెందినట్లుగా సమాచారం.

15:32 - March 12, 2018

ఢిల్లీ : మహారాష్ట్ర రైతుల ఆందోళనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. రైతుల సమస్య కేవలం మహారాష్ట్రకే పరిమితం కాలేదు...దేశ వ్యాప్తంగా ఉందని రాహుల్‌ గాంధీ అన్నారు. గత కొంతకాలంగా రైతుల సమస్యను రాహుల్‌ గాంధీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే.

15:22 - March 12, 2018
15:16 - March 12, 2018

ఢిల్లీ : ఏపీ టీడీపీ ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా ఎంపీ శివప్రసాద్‌ వినూత్నంగా నిరసన తెలిపారు. నాదస్వరం ఊదుతూ.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ప్రధాని మోదీది రాతి గుండె అని...సంగీతంతోనైనా ఆయన గుండె కరుగుతుందోమోనన్నారు శివప్రసాద్‌. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మోదీ భవిష్యత్‌ శూన్యమే అన్నారు శివప్రసాద్‌.

15:13 - March 12, 2018

కరీంనగర్‌ : శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్‌లో సరైన భోజనం పెట్టడంలేదంటూ వర్సిటీ రిజిస్ట్రార్‌ బిల్డింగ్‌ ఎదుట భైటాయించి నిరసన తెలిపారు. రిజిస్ట్రార్‌ కోమల్‌ రెడ్డిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ ప్రాంగణంలో పోలీసులు భారీగా మొహరించారు. 

15:11 - March 12, 2018

మహారాష్ట్ర : 50 వేల మంది రైతులతో ముంబై ఎర్ర సముద్రాన్ని తలపిస్తోంది. రైతుల లాంగ్‌ మార్చ్‌ ముంబైలోని ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రైతులతో చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరుగురు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, పాండురంగ్‌ ఫుడ్‌కర్, గిరీష్‌ మహాజన్, విష్ణు సవారా, సుభాష్‌ దేశ్‌ముఖ్, ఏక్‌నాథ్‌ షిండే సభ్యులుగా ఉన్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయి. రైతుల లాంగ్‌ మార్చ్‌కు శివసేన ఇప్పటికే సమర్థించింది. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు గత మంగళవారం నాసిన్‌ నుంచి లాంగ్‌ ప్రారంభించి ముంబైకి చేరుకున్నారు. ముంబై విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రైతుల పాదయాత్ర శాంతియుతంగా సాగింది.

15:07 - March 12, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగిస్తుండగా మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడికి పాల్పడిన కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలకు సర్కార్‌ సిద్దమైంది. కోమటిరెడ్డి, సంపత్‌, మరో ఇద్దరు సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. వీడియో ఫుటేజి పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 

14:59 - March 12, 2018

హైదరాబాద్ : ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం ముగిసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్‌ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన భేటీకి ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. సీఎల్‌పీ నేత జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ శాసనసభాక్ష నేత కిషన్‌ రెడ్డి, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈనెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 12 రోజుల పాటు సభ జరుగుతుంది. 

14:31 - March 12, 2018
14:27 - March 12, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. గవర్నర్ ప్రసంగం టీఆర్ ఎస్ కరపత్రంలా ఉందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యను ప్రస్తావించలేదని తెలిపారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పడం దారుణమన్నారు. 

 

కాంగ్రెస్ సభ్యులది హేయమైన చర్య : నాయిని

హైదరాబాద్ : శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు హేయమైన చర్యకు పాల్పడ్డారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే గవర్నర్‌పై దాడికి యత్నించారు. స్పీకర్ ముందుజాగ్రత్త చర్య వల్ల ఆయనకు ప్రమాదం తప్పిందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం.. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని హోంమంత్రి స్పష్టం చేశారు. సభలో దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

14:21 - March 12, 2018
14:20 - March 12, 2018
14:19 - March 12, 2018

హైదరాబాద్ : నగరంలోని కూకట్ పల్లిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. మూసాపేటకు చెందిన సుధీర్ ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా కూకట్ పల్లిలో అతనిపై దాడి చేసి, వేటకొడవళ్లతో నరికి చంపారు.  

 

కాంగ్రెస్ సభ్యులపై వేటుకు అవకాశం..

హైదరాబాద్ : తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై దాడికి పాల్పడిన కాంగ్రెస్ సభ్యులపై వేటుకు టీఆర్ఎస్ సర్కార్ సిద్ధపడే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. చైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరిన నేపథ్యంలో వేటుకు అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.  సభలో కాంగ్రెస్ సభ్యులు మైక్ విసరడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం అయింది. దీంతో ఆయన సరోజినాయుడు కంటి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై  కోమటిరెడ్డి వెంటకరెడ్డి, సంపత్ లతో సహా మరో ఇద్దరు సభ్యులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

14:13 - March 12, 2018

ముంబై : మహారాష్ట్రలో రైతులు కదం తొక్కారు. ఇవాళ అసెంబ్లీని రైతుల ముట్టడించనున్నారు. ఈనెల 5న నాసిక్ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. 180 కిమీ. మేర లాంగ్ మార్చ్ కొనసాగనుంది. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో 60 వేల మంది రైతులు ముంబై చేరుకున్నారు. కాసేపట్లో రైతులు ఆజాద్ మైదాన్ నుంచి అసెంబ్లీకి ముట్టడికి బయల్దేరనున్నారు. లక్ష మందికిపైగా రైతుల అసెంబ్లీ ముట్టడిలో పాల్గొంటారని ఆంచనా. రుణమాఫీ, మద్దతు ధర, స్వామనినాథన్ సిఫారసుల కోసం రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులను అడ్డుకోవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అసెంబ్లీ ముట్టడిని విరమించుకోవాలని రైతులకు ప్రభుత్వం విన్నవించింది. శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని ఏఐకేఎస్ నేతలు అంటున్నారు. రైతు ర్యాలీకి శివసేన,కాంగ్రెస్, ఎన్సీపీ, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనలు మద్దతు ప్రకటించాయి.

14:10 - March 12, 2018
14:06 - March 12, 2018
14:05 - March 12, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ..తాగుబోతని ఆరోపించారు. వాళ్లదంతా తాగుబోతుల సంఘం ఎద్దేవా చేశారు. అందుకే రాత్రి గంటల వరకు వైన్ షాప్ కు అనుమతి ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని అందరినీ తాగుబోతులుగా చేశారని పేర్కొన్నారు.  

14:01 - March 12, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. స్వామిగౌడ్ పై మైక్ విసిరి, గాయపరిచిన కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రెండోసారి గురి చూసి మైక్ విసిరారని  ఆరోపించారు. పేపర్లు విసిరి వేయవచ్చు...నేలపై కూర్చుని నిరసన తెలపవచ్చు కాని ఇలా చేయడం సరికాదన్నారు. వారిపై 302, అటెమ్ట్ మర్డర్ కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. 
గూండాల్లా వ్యవహరించిన కాంగ్రెస్ సభ్యులు : శ్రీనివాస్ రెడ్డి
మండలి చైర్మన్ పై హెడ్ ఫోన్ విసిరేయడం తప్పు అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తన గర్హనీయమన్నారు. కాంగ్రెస్ సభ్యులు గూండాల్లా వ్యవహరించారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ నాయకురాలు కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇది బ్లాక్ డే అని అన్నారు. 

 

13:56 - March 12, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ద్వంద్వ నీతి మానుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే.అరుణ అన్నారు. టీఆర్ ఎస్ సభ్యులు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ సభ్యులు నీతులు చెప్పడం ఆపాలన్నారు. సభలోకి పోలీసులను చొప్పించరాని, ప్రీప్లాన్డ్ గా చేశారని ఆరోపించారు. హామీల అమలు లేదన్నారు. నిరసన వ్యక్తం చేయడం సర్వసాధారణం అన్నారు. సస్పెన్షన్లకు భయపడమని చెప్పారు.

13:52 - March 12, 2018

హైదరాబాద్ : టీసర్కార్... సస్పెన్షన్లు, బెదిరింపులకు బెదరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే హక్యు తమకు ఉందన్నారు. కానీ మార్షల్స్ తోటి తమపై దాడి చేయించారని తెలిపారు. పైగా తమపై అంబాండాలు వేస్తున్నారని వాపోయారు. సీసీ ఫుటేజీని హరీష్ రావు కిందికి మీదికి చేస్తాడని ఆరోపించారు. సస్పెన్షన్లకు, బెదిరింపులకు బెదరనని... తన గొంతుక ఆగదన్నారు.

 

13:46 - March 12, 2018

హైదరాబాద్ : సభలో కాంగ్రెస్ సభ్యులు మైక్ విసరడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం అయింది. సరోజినాయుడు కంటి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. కోమటిరెడ్డి, వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్ లు చైర్మన్ వైపు మైకులు విసిరారని భావిస్తున్నారు... అయితే ఎవరు విసిరిన మైక్ స్వామిగౌడ్ కు తగలిందో చూడాల్సిందన్నారు. సీపీ ఫుటీజీని పరిశీలించనున్నారు. వారిపై వేటు పడే అవకాశం ఉంది. 

 

13:43 - March 12, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో 4 వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని..అవి కేసీఆర్ ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గవర్నర్ ప్రసంగంలో అనేక ప్రాధాన్యత కల్గిన అంశాలను మెన్షన్ చేయలేదన్నారు. ముస్లీం, మైనారిటీల రిజర్వేషన్ల విషయాన్ని గవర్నర్ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని... వారి ప్రస్తావనే ప్రసంగంలో లేదన్నారు. దళితులకు మూడెకరాలు, వ్యవసాయం విషయంలో అన్యాయంగా మాట్లాడారు. రైతు రుణమాఫీ టోటల్ గా ఫెయిల్ అయిందని.. ఎవరికీ రుణమాఫీ చేయలేదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని పేర్కొన్నారు. తమపైకి పోలీసులను ఎగదోశారని తెలిపారు. తమను తొక్కి, అణచివేసే ప్రయత్నం చేశారని వాపోయారు.

13:37 - March 12, 2018

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. గవర్నర్ చేత అన్ని అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం మొత్తం అబద్దాలన్నారు. నాలుగేళ్లలో ప్రజలకు ఏమీ చేయని ప్రభుత్వం... మళ్లీ అవే అబద్దాలు చెబుతుంటే తట్టుకోలేక సభ నుంచి వాకౌట్‌ చేశామని చెప్పారు.

 

13:33 - March 12, 2018

హైదరాబాద్ : తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేసేందుకు టీసర్కార్ కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. విపక్షాలు సభలో ఆందోళన చేయడం, నిరసన తెలపడం సర్వ సాధారణమన్నారు. గతంలో హరీష్ రావు కూడా మైకును విరిశారని.. గవర్నర్ ప్రంగాన్ని అడ్డుకుని, పేపర్లను చించి పైకి విసిరారని గుర్తు చేశారు. స్వామిగౌడ్ కంటికి గాయం పేరుతో తమను సస్పెండ్ చేయాలని పన్నాంగ పన్నారని మండిపడ్డారు. ఎప్పుడూ ఇంతమంది పోలీసులను వెల్ లో చూడలేదన్నారు. చైనా వాల్ లాగా పోలీసులతో తమను అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇది పోలీసు రాజ్యంగా ఉందని విమర్శించారు.

 

శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం

హైదరాబాద్ : సభలో కాంగ్రెస్ సభ్యులు మైక్ విసరడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం అయింది. సరోజినాయుడు కంటి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

గవర్నర్ ప్రసంగం సమగ్రంగా లేదు : సున్నం రాజయ్య

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు భిన్నంగా ఉందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. గవర్నర్ ప్రసంగం సమగ్రంగా లేదన్నారు. రైతుల రుణమాఫీ ప్రస్తావవ లేదని తెలిపారు. కౌలు రైతులకు కూడా రెండు పంటలకు  8వేలు ఇవ్వాలన్నారు. పండిన పంటలకు గిట్టుబాట ధర లేదని చెప్పారు. స్వామినాథన్, జయతిఘోష్ సిఫారసులను పాటించడం లేదున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. రైతాంగం, కార్మికులు, యువత, విద్యార్థలు,నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చారని అన్నారు. 

గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు : ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేవని... ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలనే ప్రస్తావించారని అన్నారు. పాత పథకాలనే ప్రస్తావించారని తెలిపారు. ఫీజురియంబర్స్ మెంట్ కింద విద్యార్థులకు ఈ సం.ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. 

ఇవాళ అసెంబ్లీని ముట్టడించనున్న రైతుల

ముంబై : మహారాష్ట్రలో రైతులు కదం తొక్కారు. ఇవాళ అసెంబ్లీని రైతుల ముట్టడించనున్నారు. ఈనెల 5న నాసిక్ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. 180 కిమీ. మేర లాంగ్ మార్చ్ కొనసాగనుంది. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో 60 వేల మంది రైతులు ముంబై చేరుకున్నారు. కాసేపట్లో రైతులు ఆజాద్ మైదాన్ నుంచి అసెంబ్లీకి ముట్టడికి బయల్దేరనున్నారు. లక్ష మందికిపైగా రైతుల అసెంబ్లీ ముట్టడిలో పాల్గొంటారని ఆంచనా. రుణమాఫీ, మద్దతు ధర, స్వామనినాథన్ సిఫారసుల కోసం రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులను అడ్డుకోవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అసెంబ్లీ ముట్టడిని విరమించుకోవాల

13:21 - March 12, 2018

హైదరాబాద్ : సభలో కాంగ్రెస్ సభ్యులు మైక్ విసరడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం అయింది. సరోజినాయుడు కంటి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. కోమటిరెడ్డి, వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్ లు చైర్మన్ వైపు మైకులు విసిరారని భావిస్తున్నారు... అయితే ఎవరు విసిరిన మైక్ స్వామిగౌడ్ కు తగలిందో చూడాల్సిందన్నారు. సీపీ ఫుటీజీని పరిశీలించనున్నారు. వారిపై వేటు పడే అవకాశం ఉంది. 

13:12 - March 12, 2018

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు భిన్నంగా ఉందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. గవర్నర్ ప్రసంగం సమగ్రంగా లేదన్నారు. రైతుల రుణమాఫీ ప్రస్తావవ లేదని తెలిపారు. కౌలు రైతులకు కూడా రెండు పంటలకు  8వేలు ఇవ్వాలన్నారు. పండిన పంటలకు గిట్టుబాట ధర లేదని చెప్పారు. స్వామినాథన్, జయతిఘోష్ సిఫారసులను పాటించడం లేదున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. రైతాంగం, కార్మికులు, యువత, విద్యార్థలు,నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చారని అన్నారు. 

13:07 - March 12, 2018

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేవని... ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలనే ప్రస్తావించారని అన్నారు. పాత పథకాలనే ప్రస్తావించారని తెలిపారు. ఫీజురియంబర్స్ మెంట్ కింద విద్యార్థులకు ఈ సం.ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారదిగా గవర్నర్ ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రలు ఉన్నాయన్న గవర్నర్ మాటలతో ఆయన విభేదించారు. రాష్ట్రంలో ఎక్కడ శాంతి నెలకొని ఉందో గవర్నర్ తెలపాలన్నారు. ధర్నా చౌక్ ఎత్తివేశారని, నిజాం కాలేజీ గ్రౌండ్ లో సభలకు అనుమతించడం లేదన్నారు. గవర్నర్ కు మాత్రమే శాంతి భద్రలు బాగున్నాయని అనిస్తుందని...ఎవరికీ అనిపించడం లేదని తెలిపారు. చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపడితే గవర్నర్ కు తెలుస్తుందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. పేద ప్రజల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.

 

12:56 - March 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభ సంయుక్త సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. బంగారు తెలంగాణ సాధనే ప్రభుత్వ లక్ష్యమని నరసింహన్‌ చెప్పారు. 
పురోగమిస్తున్న వ్యవసాయ రంగం
తెలంగాణలో వ్యవసాయ రంగం పురోగమన దిశలో పయనిస్తోందని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. రైతుల ఆర్థిక పురోభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉభయ సభల సంయుక్త సమావేశంలో చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత 
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నదని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 
త్వరలోనే మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ త్వరలోనే మిగులు విద్యుత్‌ ఉత్పత్తి రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని నరసింహన్‌ చెప్పారు. 12,900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్త ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. 
ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానం 
ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని గవర్నర్‌ చెప్పారు. జీడీపీ 7.5 శాతం ఉంటే జీఎస్‌డీపీ 8.6 శాతంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జీఎస్‌డీపీ 4 శాతం మించిలేదని చెప్పారు. విభజన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు.

 

12:48 - March 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తుంగా.. అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సభ్యులు ప్రయత్నించారు. రైతుల ఆత్మహత్యలపై నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శించారు. స్పీకర్‌ పోడియంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులను మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఇదిలావుంటే... కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన మధ్యే గవర్నర్‌ ప్రసంగం ముగిసింది. ఇక కాంగ్రెస్‌ సభ్యులు మైక్‌ విసరడంతో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి గాయమైంది. 

 

12:45 - March 12, 2018

సొంతింటి నిర్మాణానికి భూమిపూజ చేసిన పవన్ కళ్యాణ్

గుంటూరు : పాలకులు.. ప్రజా సమస్యలను పట్టించుకోన్నపుడు తన స్పందన బలంగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాజాలో సొంతింటి నిర్మాణానికి పవన్ భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎవరిని వెనకేసుకరానని..ఎవరితో తనకు శతృత్వం లేదన్నారు. ఉగాది వరకు ఇక్కడే ఉంటానని తెలిపారు. ఒత్తిళ్లతో కూడిన రాజకీయాలు ఉన్నాయన్నారు. స్పష్టంగా ఉన్న బలమైన దిశా నిర్ధేశం చేయాలని తెలిపారు. ఒకరి సీనియారిటీ, అనుభవాన్ని తక్కువ చేసి చూడనని అన్నారు. యువతకు ఉడుకు రక్తం, పెద్దల సంయమనం రెండూ ఉండాలని చెప్పారు. తనవి ఎవరినీ దోచి సంపాదించిన ఆస్తులు కావని..

12:41 - March 12, 2018

గుంటూరు : పాలకులు.. ప్రజా సమస్యలను పట్టించుకోన్నపుడు తన స్పందన బలంగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాజాలో సొంతింటి నిర్మాణానికి పవన్ భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎవరిని వెనకేసుకరానని..ఎవరితో తనకు శతృత్వం లేదన్నారు. ఉగాది వరకు ఇక్కడే ఉంటానని తెలిపారు. ఒత్తిళ్లతో కూడిన రాజకీయాలు ఉన్నాయన్నారు. స్పష్టంగా ఉన్న బలమైన దిశా నిర్ధేశం చేయాలని తెలిపారు. ఒకరి సీనియారిటీ, అనుభవాన్ని తక్కువ చేసి చూడనని అన్నారు. యువతకు ఉడుకు రక్తం, పెద్దల సంయమనం రెండూ ఉండాలని చెప్పారు. తనవి ఎవరినీ దోచి సంపాదించిన ఆస్తులు కావని.. ప్రజలు ప్రేమతో ఇచ్చిన ఆస్తులు అని తేల్చి చెప్పారు. తన ఆస్తులన్నీ క్లియర్ గా ఉన్నాయన్నారు.

 

12:33 - March 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడివేడీగా ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య గవర్నర్ ప్రంసంగం కొనసాగింది. ఉభయసభల్లో ప్రసంగించడం సంతోషకరంగా ఉందన్నారు. బంగారు తెలంగాణ సాధనకై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందన్నారు. రాష్ట్ర జీడీపీ..దేశంతో పోలిస్తే ఎక్కువని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నారు. సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన చేపట్టారు. రైతుల ఆత్మహత్యపై నినాదాలు చేశారు. వెల్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. 

 

వరంగల్ నిట్ లో విద్యార్థికి కత్తిపోట్లు

వరంగల్ : నిట్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. వసంతోత్సవం వేడుకల్లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ విద్యార్థికి కత్తిపోట్లు పడ్డాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. నిట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

 

11:55 - March 12, 2018

వరంగల్ : నిట్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. వసంతోత్సవం వేడుకల్లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ విద్యార్థికి కత్తిపోట్లు పడ్డాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. నిట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

కార్చిచ్చులో పెరిగిన మృతుల సంఖ్య

చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా కురంగణి అడవుల్లో కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరిగింది. పది మంది అగ్నికి ఆహుతయ్యారు. 39 మంది విద్యార్థులు పర్వతారోహణకు వెళ్లారు. పర్వతారోహణ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 39 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో 10 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. హెలికాప్టర్ల సహాయంతో అధికారులు 15 మందిని రక్షించారు. ఇంకా ఆచూకీ తెలియని వారి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

 

11:49 - March 12, 2018

చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా కురంగణి అడవుల్లో కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరిగింది. పది మంది అగ్నికి ఆహుతయ్యారు. 39 మంది విద్యార్థులు పర్వతారోహణకు వెళ్లారు. పర్వతారోహణ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 39 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో 10 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. హెలికాప్టర్ల సహాయంతో అధికారులు 15 మందిని రక్షించారు. ఇంకా ఆచూకీ తెలియని వారి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

10:55 - March 12, 2018

ముంబై : మహారాష్ట్రలో రైతులు కదం తొక్కారు. ఇవాళ అసెంబ్లీని రైతుల ముట్టడించనున్నారు. ఈనెల 5న నాసిక్ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. 180 కిమీ. మేర లాంగ్ మార్చ్ కొనసాగనుంది. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో 60 వేల మంది రైతులు ముంబై చేరుకున్నారు. కాసేపట్లో రైతులు ఆజాద్ మైదాన్ నుంచి అసెంబ్లీకి ముట్టడికి బయల్దేరనున్నారు. లక్ష మందికిపైగా రైతుల అసెంబ్లీ ముట్టడిలో పాల్గొంటారని ఆంచనా. రుణమాఫీ, మద్దతు ధర, స్వామనినాథన్ సిఫారసుల కోసం రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులను అడ్డుకోవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అసెంబ్లీ ముట్టడిని విరమించుకోవాలని రైతులకు ప్రభుత్వం విన్నవించింది. శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని ఏఐకేఎస్ నేతలు అంటున్నారు. రైతు ర్యాలీకి శివసేన,కాంగ్రెస్, ఎన్సీపీ, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనలు మద్దతు ప్రకటించాయి.

 

టీఅసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు సభలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేయత్నం చేశారు. వెల్ లోకి దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ సభ్యులు యత్నించగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు సభలో నినాదాలు చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలపై నినాదాలు చేస్తున్నారు. 

 

ఉభయసభల్లో ప్రసంగించడం సంతోషకరం : గవర్నర్

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. ఉభయసభల్లో ప్రసంగించడం సంతోషకరంగా ఉందన్నారు. బంగారు తెలంగాణ సాధనకై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. ఈనెల 15న ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వాడివేడీగా సమావేశాలు జరుగనున్నాయి.  

గవర్నర్ నరసింహన్ కు సీఎం కేసీఆర్, స్పీకర్ స్వాగతం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కు సీఎం కేసీఆర్, స్పీకర్ స్వాగతం పలికారు. ఉభయసభలు ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఈనెల 15న ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వాడివేడీగా సమావేశాలు జరుగనున్నాయి.  

 

10:12 - March 12, 2018

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనచారి ఆయనకు స్వాగతం పలికారు. ఉభయసభలు ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఈనెల 15న ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వాడివేడీగా సమావేశాలు జరుగనున్నాయి.  

 

10:07 - March 12, 2018

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలు ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఈనెల 15న ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వాడివేడీగా సమావేశాలు జరుగనున్నాయి.  

 

09:53 - March 12, 2018
09:20 - March 12, 2018

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలు ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఈనెల 15న ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వాడివేడీగా సమావేశాలు జరుగనున్నాయి.  

09:17 - March 12, 2018

హైదరాబాద్ : ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని సూచించారు. ఓ జాతీయ చానెల్ లో వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించారు.

 

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేటినుంచి బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇక ప్రశ్నోత్తరాల్లో డ్వాక్రా రుణాలు, రూ.5 భోజన పథకం అమలుపై చర్చించనున్నారు. అలాగే నిత్యావసరాల ధరల పెరుగుదలపై కూడా సభలో చర్చ జరగనుంది. ఇక శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగం ధన్యవాదాల తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. 

 

09:13 - March 12, 2018

మహారాష్ట్రలో రైతుల మహా పాదయాత్రపై వక్తలు మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి, టీఆర్ ఎస్ నేత రాకేష్, బీజేపీ జనరల్ సెక్రటరీ టి.ఆచారి, టీడీపీ నేత దుర్గాప్రసాద్ పాల్గొని, మాట్లాడనున్నారు. దేశంలో తీవ్ర వ్యవసాయ సంక్షోభం నెలకొని ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలు ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఈనెల 15న ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

 

ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్ : ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని సూచించారు. ఓ జాతీయ చానెల్ లో వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించారు.

 

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటినుంచి బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇక ప్రశ్నోత్తరాల్లో డ్వాక్రా రుణాలు, రూ.5 భోజన పథకం అమలుపై చర్చించనున్నారు. అలాగే నిత్యావసరాల ధరల పెరుగుదలపై కూడా సభలో చర్చ జరగనుంది. ఇక శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగం ధన్యవాదాల తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. 

 

09:01 - March 12, 2018

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటినుంచి బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇక ప్రశ్నోత్తరాల్లో డ్వాక్రా రుణాలు, రూ.5 భోజన పథకం అమలుపై చర్చించనున్నారు. అలాగే నిత్యావసరాల ధరల పెరుగుదలపై కూడా సభలో చర్చ జరగనుంది. ఇక శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగం ధన్యవాదాల తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. 

 

08:56 - March 12, 2018

చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా కురంగణి అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఐదుగురు విద్యార్థులను బలి తీసుకుంది. మున్నార్‌ ప్రాంతంలోని సూర్యనెల్లి నుంచి పర్వతారోహణకు వెళ్లిన 39 మంది విద్యార్థుల్లో  ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 15 మందిని హెలికాప్టర్ల సహాయంతో  అటవీ, రక్షణ శాఖల అధికారులు రక్షించారు.  వీరందర్నీ బోడినైకనూర్‌ ఆస్పత్రికి తరలించారు.  ఇంకా ఆచూకీ తెలియని మరికొందరు విద్యార్థుల కోసం గాలింపు విస్తృతం చేశారు. కొరంగణి ప్రాంతంలో పర్వతారోహణ శిక్షణకు వెళ్లిన విద్యార్థులు కొండెక్కే సమయంలో అకస్మాత్తుగా కార్చిచ్చు రేగడంతో ఈ ఘటన జరిగింది. అధికారులు సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. 

 

 

08:52 - March 12, 2018

ప.గో : తణుకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కింది అంతస్తుల్లో ఆంధ్రా, ఐసీఐసీఐ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకు అధికారులు ఆందోళనలో ఉన్నారు.

 

08:47 - March 12, 2018

బహుజన లెఫ్ట్‌ ప్రంట్‌ ఏర్పడిన కొన్ని రోజులలోనే తెలంగాణ ప్రజలోకి విస్తృతంగా వెళ్తోంది. సామాజిక తెలంగాణ నినాదంగా అన్ని వర్గాలను ఐక్యం చేస్తూ బీఎల్‌ఎఫ్ దూసుకుపోతుంది. కేసీఆర్‌ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో నిలదీస్తుంది. ఎన్నికల నాడు ఇచ్చిన హామీల అమలును డిమాండ్‌ చేస్తోంది. బీఎల్‌ఎఫ్‌ ప్రస్థానం, కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలపై జనపథం కార్యక్రమంలో బీఎల్ ఎఫ్ స్టేట్‌ ట్రెజరర్‌ ఇబ్రహీం చర్చించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:44 - March 12, 2018

చెన్నై : తమిళనాడులో పర్వతారోహణకు వెళ్లిన విద్యార్థినులు ఐదుగురు కార్చిచ్చుకు బలైపోయారు. మున్నార్‌ ప్రాంతంలోని సూర్యనెల్లి నుంచి తమిళనాడులోని తేని జిల్లాలోని కుంగణి ప్రాంతానికి 25మంది విద్యార్థినులు పర్వతారోహణ శిక్షణ కోసం వచ్చారు. కొండెక్కే సమయంలో అకస్మాత్తుగా అడవిలో కార్చిచ్చు చెలరేగింది. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు మరణించారు.  ఆ ప్రాంతంలో వెలుగు తక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఇబ్బందిగా మారింది. 15 మంది విద్యార్థినులను హెలికాప్టర్ల సాయంతో రక్షించామని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పర్వతారోహణ సమయంలో మంటలు భారీగా నలువైపులా వేగంగా వ్యాపించడంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు.  వెంటనే అటవీశాఖ సిబ్బంది, సమీప ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని కార్చిచ్చును అదుపుచేసే ప్రయత్నాలతోపాటు విద్యార్థినులను రక్షించే చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి  జిల్లా కలెక్టర్‌, రెవెన్యూశాఖ అధికారులు చేరుకుని పరిస్థితి సమీక్షించారు.  

 

08:37 - March 12, 2018

హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యా విధానంలో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో... కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. పలు కాలేజీలనుండి ఎదురౌతున్న పోటీతో పాటు.. 30శాతం సీట్లు భర్తీ కాకుంటే కాలేజీలే గల్లంతయ్యే అవకాశమూ ఉంది.ఈ పరిస్థితుల్లో  సీట్ల భర్తీపై ఇంజినీరింగ్ కళాశాలలు కుస్తీపడుతున్నాయి.
సీట్ల భర్తీకి మల్లగుల్లాలు 
ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేయడానికి  కాలేజీ యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. స్వయంప్రతిపత్తి హోదా కలిగిన విశ్వవిద్యాలయాలు నుంచి కూడా ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దీంతో ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్-2018 అనుసరించి దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైంది. గతేడాది చాలావరకు సీట్లు మిగిలిపోగా.. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీల నుంచి కూడా గట్టి పోటీ ఎదురౌతోంది.. పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సీట్ల భర్తీకి మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తానికి ఈసారి ఇంజినీరింగ్‌  సీట్ల భర్తీ ఆసక్తికరంగా మారింది. 
గతేడాది 5 కళాశాలల్లో ఒక్కరూ చేరలేదు
గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఐదు కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 273 ప్రైవేట్ కళాశాలల్లో.. 386 బ్రాంచిల్లో 30 శాతం సీట్లు భర్తీకాలేదు. కన్వీనర్ కోటా కింద ఉన్న మొత్తం 98,251 సీట్లలో 28,395 సీట్లు మిగిలాయి. ఈసారి ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు రాసేవారిలో.. 3.98 లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వరుసగా మూడేళ్లు 30 శాతం సీట్లు భర్తీకాని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని ఏఐసీటీఈ గతంలోనే ప్రకటించింది. అదే జరిగితే  చాలా వరకూ కాలేజీలు మూతపడే అవకాశం ఉంది.  
విద్యావిధానంలో ఏఐసీటీఈ  మార్పులు
ఏఐసీటీఈ  చేపట్టిన మార్పుల  ప్రకారం... సంబంధిత పరిశ్రమలో విద్యార్థులు తప్పనిసరిగా రెండు మూడు నెలలపాటు ఇంటర్న్ షిప్ చేయాలి. ఇందుకోసం పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఇంజినీరింగ్ చేసిన వారిలో చాలామంది విద్యార్థులకు తగిన నైపుణ్యం లేకపోవడంతో ఉపాధి దొరకడంలేదు..  ఉత్తమ అధ్యాపకులు ఉన్న కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీకాని కళాశాలల పరిస్థితి సందిగ్ధంగా మారనుంది. 
డీమ్డ్ వర్సిటీ, జేఈఈ, ఐఐటీవైపే మొగ్గు 
మంచి ర్యాంకులు సాధించిన వారు డీమ్డ్ వర్సిటీ, జేఈఈ, ఐఐటీవైపే మొగ్గుచూపుతున్నారు కానీ.. ఎంసెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దీనికి తోడు  ఏఐసీటీఈ మార్పు చేసిన నిబంధనలను కఠినంగా అమలు చేస్తే చాలా వరకూ కాలేజీలు ప్రవేశాలు లేని బ్రాంచిలను స్వచ్ఛందంగా  మూసుకునే  పరిస్థితి ఉంటుంది.

08:32 - March 12, 2018

కరీంనగర్‌ : టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో చొప్పదండి ఎమ్మెల్యే శోభపై టీఆర్‌ఎస్‌ నాయకుడు తడగొండ నర్సంహబాబు ఫిర్యాదు చేశాడు.కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ ఇంట్లో తనపై దాడి చేసిందని నర్సింహ బాబు అన్నారు. తన గన్‌ మెన్‌ కూడా పురమాయించడంతో తాను వెంటనే లిఫ్ట్‌ నుండి బయటకు వచ్చానని చెప్పాడు. రాష్ట్ర ఎస్సీ సెల్‌ సుంకె రవిశంకర్‌ అనుచరుడన్న కోపంతోనే దాడి చేశారని నర్సింహ ఆరోపించాడు.

 

08:27 - March 12, 2018

పెద్దపల్లి : బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరిస్తే అన్నింటా నష్టపోతామని ప్రొఫెసర్‌, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ అన్నారు.  బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన బొగ్గు పరిశ్రమల ప్రైవేటీకరణ - దాని పర్యవసానాలు సెమినార్‌ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరించడం మూలంగా.. ప్రతి వస్తువుపై చార్జీలు పెరుగుతాయన్నారు.  బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్‌ చార్జీలు పెరిగుతాయని చెప్పారు. పర్యావరణ సంక్షోభం ఏర్పడి.. కార్మికులకు భద్రత  కరువైతుందని తెలిపారు.  కార్మికులు, అధికారులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

08:24 - March 12, 2018
08:23 - March 12, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. నల్లగొండ, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లా నుంచి అభ్యర్థులను ఎంపిక చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పేర్లను ప్రకటించి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. వీరంతా సోమవారం నామినేషన్ వేయనున్నారు.
టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు 
ఈనెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించింది. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో.. ఆదివారం అభ్యర్థులను గులాబీదళపతి ఖరారు చేశారు. ఈమేరకు ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్‌ ప్రకటించారు. 
బడుగుల లింగయ్య యాదవ్‌ అవకాశం
నల్లగొండజిల్లాలో బీసీ నేతగా మంచి పేరున్న బడుగుల లింగయ్య యాదవ్‌ను రాజ్యసభకు పంపాలని గులాబీపార్టీ నిర్ణయించింది. కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన బడుగుల నల్లగొండ ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ కాలం టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా  కొనసాగుతున్న తనను రాజ్యసభ అభ్యర్తిగా ఎంపిక చేయడంపై లింగయ్య యాదవ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జోగినపల్లి సంతోష్‌ కుమార్‌కు రాజ్యసభ అవకాశం 
రాజ్యసభకు అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న జోగినపల్లి సంతోష్ కుమార్ స్వస్థలం కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక. సంతోష్‌కుమార్‌ పుణె యూనివర్సిటీ నుంచి  ఎంబీఏ పూర్తి చేశారు.  టీఆర్ఎస్ ఆవిర్భావంలో జోగినపల్లి క్రియాశీలంగా వ్యవహరించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ గులాబీదళంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంతోష్‌కుమార్‌ను  రాజ్యసభకు ఎంపిక చేశారు గులాబీదళపతి. 
రాజ్యసభ అభ్యర్థిగా బండ ప్రకాశ్‌
ఇక వరంగల్‌కు చెందిన బండప్రకాశ్‌కు రాజ్యసభ ఛాన్స్‌ దక్కింది. ఎంఏ పీహెచ్‌డీ పూర్తిచేసిన బండ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బండప్రకాశ్‌ను రాజ్యసభకు పంపాలని టీఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయించడంపై గులాబీపార్టీలో హర్షం వ్యక్తం అవుతోంది. రాజ్యసభ అభ్యర్థులుగా వరంగల్‌ నుంచి ముదిరాజ్‌ సామాజిక వర్గానికి ఛాన్స్‌ ఇచ్చిన కేసీఆర్‌.. నల్లగొండ జిల్లా నుంచి యాదవ కులానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక కరీంనగర్‌ నుంచి ఓసీ వర్గానికి చెందిన జోగినపల్లి సంతోశ్‌కుమార్‌కు అవకాశం ఇచ్చారు. మొత్తానికి గులాబీదళపతి సామాజిక, పొలిటికల్‌ లెక్కలన్నీ పక్కాగా వేసుకునే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక చేసినట్టు అభిప్రాయాలు వస్తున్నాయి.

 

08:18 - March 12, 2018

గుంటూరు : ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘంగా సాగిన  టీడీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు.. ఫైనల్‌ అయింది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా.. సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్లు ఖరారు చేశారు. ఈసారి రాజ్యసభ సీటు గ్యారెంటీ అనుకున్న వర్లరామయ్యకు మాత్రం ఆశాభంగం ఎదురైంది.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఎట్టకేలకు ఫైనల్‌ 
సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఎట్టకేలకు ఫైనల్‌ అయింది. ఇద్దరు అభ్యర్థులనూ చంద్రబాబు స్వయంగా ఎంపిక చేశారు. దీంతో గత వారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఉహించినట్లుగానే... టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం రమేశ్‌కు మరోసారి అవకాశం కల్పించింది.
సీఎం రమేశ్‌కు మరోసారి అవకాశం 
ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేశ్‌కు మరోఅవకాశం ఇచ్చిన టీడీపీ అధినేత.. రెండో అభ్యర్థి విషయంలో మాత్రం తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. సామాజిక, రాజకీయ ఈక్వేషన్స్‌ను  బేరీజు వేసిన చంద్రబాబు.. చివరి నిముషంలో కనకమేడల రవీంద్రకుమార్‌ వైపు మొగ్గుచూపారు. ప్రస్తుతం టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్న కనకమేడలను రాజ్యసభకు పంపించడానికి నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, టీడీపీకి సంబంధించిన పలు కేసులను ఆయన వాదించారు. రవీంద్ర ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఢిల్లీ, హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో టీడీపీ కేసులను వాదించింది. అందువల్లే చివరి నిమిషంలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. 
వర్ల రామయ్యకు ఆశాభంగం
అయితే గత వారం రోజులగా పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బీద మస్తాన్ రావు, మసాలా పద్మజ,  నల్లగట్ల స్వామిదాసు,  కంభంపాటి రామ్మోహన్‌రావుతోపాటు వర్లరామయ్య పేర్లు పరిశీలనకు వచ్చాయి. ముఖ్యంగా వర్లరాయమ్య కు ఈసారి అవకాశం ఖచ్చితంగా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. చివరి క్షణం వరకు ఉత్కంఠను కొనసాగించిన టీడీపీ అధినేత.. ఆఖరికి వర్లరామయ్యకు మొండిచేయి చూపించారు. అయితే భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని.. వర్లరామయ్యకు ఫోన్‌చేసి మరీ చంద్రబాబు బుజ్జగించినట్టు తెలుస్తోంది.  
ఎస్సీ, బీసీలకు దక్కని అవకాశం 
మొత్తానికి టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలకు అవకాశం ఉండగా..  అరడజనుకుపైగా నేతలు తీవ్ర ప్రయత్నాలే చేశారు. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కొందరు స్వయంగా వెళ్లి కలవగా.. మరికొందరు నేతలు మాత్రం మంత్రులను సైతం వెంటబెట్టుకుని చంద్రబాబును కలిసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. పైగా  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల సమతుల్యత పాటిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. రెండు స్థానాల్లోనూ ఓసీలకే అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ, బీసీల నుంచి ఒకరికైనా అవకాశం కలుగుతుందని భావించిన పార్టీ నేతలకు టీడీపీ అధినేత షాక్‌ ఇచ్చినంత పనిచేశారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.  

 

08:13 - March 12, 2018

మహారాష్ట్ర : పదులు కాదు.. వందలు కాదు.. ఏకంగా 35 వేల మంది రైతులు...! అకుంఠిత దీక్షతో.. ఏకంగా 180 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా కదిలారు. రోజూ పాతిక కిలోమీటర్లు చొప్పున నడుస్తూ.. తమ సమస్యల పరిష్కారం కోసం కదలివస్తున్నారు. మహారాష్ట్ర నాసిక్‌లో మొదలైన రైతుల ప్రస్థానం.. రాజధాని ముంబై చేరుకుంది. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నేతృత్వంలో.. వేలకొద్దీ రైతులు.. నేడు అసెంబ్లీని ముట్టడించేందుకు కదం తొక్కనున్నారు. 
వేలకొద్దీ రైతాంగం..
వేలకొద్దీ రైతాంగం..ఎర్రటి పాగా.. తెల్లటి వస్త్రాలతో కూడిన ఆహార్యం.. వందల కిలోమీటర్ల దూరం...ఘాట్‌రోడ్లను దాటుకుంటూ సాగే దృశ్యం..అపూర్వం.. అద్భుతం.. రైతుల అకుంఠితత్వం.. మహారాష్ట్ర రైతాంగం.. తమ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సాగుతోన్న అన్నదాతల మహాపాదయాత్ర ముంబైకి చేరుకుంది. గోదావరి నదీ జన్మస్థానమైన నాసిక్‌ నుంచి మొదలైన ఈ పాదయాత్ర ఇప్పుడు దేశం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. పాదయాత్రగా సాగుతున్న 35వేలకు పైగా రైతులు.. దారిలో వచ్చే కొండలు.. గుట్టలు.. అవలీలగా దాటుకుంటూ.. ప్రభుత్వాన్ని కదిలించాలన్నదే లక్ష్యంగా కదిలివచ్చారు. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆధ్వర్యంలో సాగుతోన్న ఈ పాదయాత్రలో.. ప్రతి రైతూ స్వచ్ఛందంగా భాగస్వామి అయ్యారు. 
మార్చి 5 సాయంత్రం లాంగ్‌ మార్చ్‌ ప్రారంభం
సెంట్రల్‌ నాసిక్‌లోని సిబిఎస్‌ చౌక్‌ నుంచి మార్చి 5 సాయంత్రం లాంగ్‌ మార్చ్‌ ప్రారంభమైన యాత్ర.. ఆదివారానికి ముంబై సమీపానికి  చేరుకుంది. ముంబై-ఆగ్రా జాతీయ రహదారి మీదుగా 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర తర్వాత  సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీని రైతులు ముట్టడించనున్నారు. వరుస కరువులు, విత్తనాలు, ఎరువుల వ్యాపారుల మోసాలు.. కుదేలు చేయడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ఆదుకోవడంలో.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. రైతులు ఈ పాదయాత్ర దీక్షను చేపట్టారు.  హైవేలు, బుల్లెట్‌ ట్రెయిన్‌ల పేరిట ప్రభుత్వం  రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం ఆపివేయాలని అఖిలభారత కిసాన్‌ సభ డిమాండ్‌ చేస్తోంది. 
ప్రభుత్వ పెద్దల గుండెల్లో గుబులు 
అప్పులు, కరువు కాటకాలు, పంట నష్టం కారణంగా రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లోనే మహా రైతు.. దీక్షాదక్షుడై ఈ అపూర్వ పాదయాత్రను చేపట్టాడు. ప్రభుత్వ పెద్దల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. 

 

08:05 - March 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు బడ్జెట్‌ సమావేశాలకు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యారు. పార్టీ నాయకులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ వారికి సూచనలు చేశారు. దీంతో విపక్షాలపై అధికారపక్షం ఎదురుదాడి చేయనున్నట్టు తెలుస్తోంది.
సమావేశాలను సీరియస్‌గా తీసుకుంటోన్న అధికార పార్టీ 
నేటి నుంచి మొదలయ్యే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు గులాబీ పార్టీ నేతలు సిద్ధం అయ్యారు. గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మూడు వారాలకుపైగాసాగే ఈ సమావేశాలను అధికారపార్టీ సీరియస్‌గా తీసుకుంటోంది. సభలో ప్రతిపక్ష పార్టీలు తమ పాలనపై విమర్శలకు ఏమాత్రం ఇవ్వకుండా వ్యవహరించే అవకాశముంది.  నాలుగేళ్లుగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శాసనసభా వేదికగా ప్రజలకు వివరించాలన్న యోచనలో అధికారపార్టీ ఉంది.
విపక్షాలపై ఎదురుదాడి అస్త్రాన్ని ప్రయోగించనున్న టీఆర్‌ఎస్‌  
సభలో విపక్షాలపై ఎదురుదాడి అస్త్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రయోగించనుంది. ఇందుకోసం మంత్రులంతా తమ శాఖలకు సంబంధించిన సంపూర్ణ సమాచారంతో సభకు హాజరుకావాలని సీఎం ఆదేశించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు రెచ్చగొట్టాలని చూస్తే.. సమన్వయంతో వ్యవహరించి సమాధానం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్‌ సూచించారు. గవర్నర్‌ ప్రసంగాన్ని కూడా విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తాయన్న అనుమానం సీఎం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
దేశ రాజకీయాలపై కేసీఆర్ పలు వ్యాఖ్యలు 
ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టిపెట్టిన కేసీఆర్‌... టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలోనూ దేశ రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మరోసారి అధికారం దక్కించుకున్నా.. జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు తనకు సహకరించాలని పార్టీ నేతలను ఆయన కోరినట్టు సమాచారం. ఇప్పటి వరకు నిర్వహించిన రెండు సర్వేల్లోనూ 103 నుంచి 106 స్థానాలు కైవసం చేసుకుంటామన్న ఫలితం వచ్చిందని కేసీఆర్‌ వారికి వివరించారు. మరో సర్వే వివరాలు కూడా త్వరలో అందుతాయని చెప్పారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ అవకాశం కల్పిస్తామన్న భరోసాను సమావేశంలో ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా విధిగా హాజరుకావాలి : సీఎం కేసీఆర్ 
బడ్జెట్‌ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా విధిగా హాజరుకావాలని సీఎం నేతలను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకునేలా నేతలంతా వ్యవహరించాలని సూచించారు. మొత్తానికి ఇటు అధికారపక్షం, అటు విపక్షం అస్త్రశస్త్రాలతో బడ్జెట్‌ సమావేశాలకు సిద్ధం అయ్యాయి. దీంతో ఈదఫా సమావేశాలు హాట్‌హాట్‌గా జరిగే అవకాశముంది.

 

07:55 - March 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వంపై సమర శంఖం పూరించేందుకు ప్రతిపక్షాలు....ప్రతిపక్షాల ఎత్తుగడలను అణచివేసేందుకు ప్రభుత్వం... ఇలా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఆఖరి బడ్జెట్‌
సోమవారం నుండి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇది ఆఖరి బడ్జెట్‌. సమావేశాలకు ఇటు టీఆర్‌ఎస్‌, అటు ప్రతిపక్షాలు సైతం వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయం అంటూ తాము పెట్టుకున్న లక్ష్యాలను ఎంతమేరకు చేరుకున్నామో... సమావేశాల్లో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయనుంది. 
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు
తమదెప్పుడూ మిగులు రాష్టమే అని చెప్పుకుంటున్న ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. సంక్షేమ రంగాలతో పాటు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని, కనీసం గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని...శాఖల వారిగా గణాంకాలతో సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తోంది. 
5 బిల్లులకు చట్టసవరణ చేయాలని నిర్ణయం
ఈ నెల 14 లేదా 15వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. శాసన మండలిలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశాల్లో సుమారు 5 బిల్లులకు చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇందులో కొత్త పంచాయితీ రాజ్‌ చట్టం, తెలుగును తప్పనిసరి చేస్తూ... అసైన్డ్‌ ల్యాండ్‌కు సవరణ, పట్టదారు పాసు పుస్తకాల సవరణ, 50వేలకు పైగా జనాభా ఉన్న మేజర్‌ గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీగా మార్చే చట్ట సవరణను కూడా ఈ సమావేశాల్లో తీసుకువచ్చే అవకాశాలున్నాయి. వీటికి సంబంధించి మంత్రి వర్గంతో చర్చించి కొన్ని బిల్లులకు కేబినేట్‌ ఆమోదించాలనుకున్నప్పటికీ.... సమీక్ష నిర్వహించకుండానే మంత్రులకు కేబినేట్‌ నోట్‌ను సర్క్యులేట్‌ చేశారు. 
ఆసక్తిని రేకెత్తిస్తున్న బడ్జెట్ సమావేశాలు
సోమవారం ఉదయం స్పీకర్‌ అధ్యక్షతన జరగబోయే బీఏసీ ఎజెండాను ఖరారు చేయనుంది. కొత్తగా ఏయే అంశాలు చర్చలోకి వస్తాయో ఈ సమావేశలో తెలియనుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

 

ఇవాళ్టి నుంచి టీబడ్జెట్ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వంపై సమర శంఖం పూరించేందుకు ప్రతిపక్షాలు....ప్రతిపక్షాల ఎత్తుగడలను అణచివేసేందుకు ప్రభుత్వం... ఇలా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. 

07:45 - March 12, 2018

అనంతపురం : జిల్లా గార్లదిన్నె మండలంలోని ఎగువపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న టెన్‌ విల్లర్‌ లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉనన 40 మంది ప్రయాణీకులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.  కొంతమందికి కాళ్లు, చేతులు విరిగాయి.  గాయపడ్డ వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఢీకొన్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బస్సుల్లో ఇరుక్కున్న వారిని బయటకుతీసి ఆస్పత్రికి తరలించారు. వోల్వోబస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతోపాటు అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ప్రైవేటు బస్సును ఢీకొట్టిన లారీ

అనంతపురం : గార్లదిన్నె మండలం ఎగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.

తణుకులో అగ్నిప్రమాదం

ప.గో : తణుకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. కింది అంతస్తుల్లో ఆంధ్రా, ఐసీఐసీఐ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకు అధికారులు ఆందోళనలో ఉన్నారు. 

 

Don't Miss