Activities calendar

13 March 2018

కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వం రద్దు

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ శాసన సభ సభ్యత్వం రద్దు అయింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణలో 2 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు సీఈసీకి అధికారులు సమాచారం పంపనున్నారు. వీడియో పుటేజీని అసెంబ్లీ కార్యాలయం క్షుణ్ణంగా పరిశీలించింది. మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు అనుచితంగా వ్యవహరించినట్లు వీడియోలో పుటేజీలో గుర్తించారు. మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులపై చర్యలకు రంగం సిద్ధమైంది. 

 

ఢిల్లీలో పోలవరం నిధులపై కసరత్తు

ఢిల్లీ : హస్తినలో పోలవరం నిధులపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర జలవనరుల శాఖ అధికారులను ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషన్ కుమార్, పోలవరం చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు కలిశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై కేంద్ర ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది.

 

22:04 - March 13, 2018

ఢిల్లీ : బ్యాంకు ఖాతాలకు, మొబైల్‌ ఫోన్లకు ఆధార్‌ అనుసంధానం గడువు మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ చెల్లుబాటుపై  సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించేవరకు ఎలాంటి డెడ్‌లైన్‌ లేదని తేల్చి చెప్పింది. తీర్పు వచ్చే వరకు బ్యాంకు ఖాతాలకు, మొబైల్ ఫోన్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్‌ పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.  బ్యాంకు ఖాతా, మొబైల్‌, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ లాంటి సేవలకు ఆధార్‌ తప్పనిసరి కాదని....ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రం ఆధార్‌ అనుసంధానం తప్పనిసరని కోర్టు పేర్కొంది. 

 

22:01 - March 13, 2018

గుంటూరు : కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు శాసనసభలో తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. స్పెషల్‌ స్టేటస్‌లో ఇచ్చేవన్నీ ఏపీకి ఇస్తే తప్ప ఆందోళన ఆగదని ఆయన అన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని తీర్మానంలో స్పష్టం చేశారు. 

విభజన చట్టంలోని హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. స్పెషల్‌ స్టేటస్‌లో ఇచ్చేవన్ని ఏపీకి ఇస్తే తప్ప ఆందోళన ఆగదని ఆయన అన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని అన్నారు. 
    
సెంటిమెంటుతో డబ్బులు రావని చెబుతున్న కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీకి.. సెంటిమెంటుతోనే రాష్ట్రాన్ని విభజించిన సంగతి గుర్తులేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు వచ్చే ప్రయోజనాలన్నీ ఇస్తామని హామీ ఇస్తేనే ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామన్నారు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్న తనకే బీజేపీ నేతలు కొత్తగా చెబుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. 
    
ఆంధ్రప్రదేశ్‌ పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆదుకోవాని కేంద్రాన్ని కోరుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కేంద్రం సాయం వల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని బీజేపీ నేతలు అంటున్నారు. మరి బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ వృద్ధి ఎందుకు జరగడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. మనం కష్టపడుతున్నాము కాబట్టే అభివృద్ధి సాధించగలుగుతున్నామన్నారు. నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చింది కూడా పెద్దగా ఏం లేదని చంద్రబాబు అన్నారు. అసంబద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ప్రజలు తుడిచిపెట్టేశారని.. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటూ పరోక్షంగా బీజేపీకి సూచించారు. 

రాష్ట్రానికి రావల్సిన హక్కుల విషయంలో రాజీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీకి హోదా ఇవ్వడంతోపాటు రెవిన్యూలోటును భర్తీ చేయాలని..  పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌, అమరావతి నిర్మాణం, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం, కేంద్ర విద్యాసంస్థలకు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

విభజన చట్టంలోని హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మాణాన్ని సభ్యులందరూ ఆమోదించారు. సభలో ఉన్న ముగ్గురు బీజేపీ సభ్యులు తీర్మాణానికి వ్యతిరేకంగా గానీ.. అనుకూలంగాగానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.

21:57 - March 13, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలపై వేటు అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచుకునేందుకు.. కాంగ్రెస్ పార్టీ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. గాంధీభ‌వ‌న్ వేదిక‌గా నిర‌హార దీక్షతో గులాబీ స‌ర్కారుపై సమరభేరి మోగించాలని హస్తం నేతలు నిర్ణయించారు. కేసీఆర్ నియంతృత్వ పోక‌డ‌పై ఇక స‌మ‌ర‌మే అంటున్న కాంగ్రెస్‌ నేత‌లు .. ప్రజల్లోకి వెళ్లడం.. కోర్టు మెట్లెక్కడం ద్వారా కూడా... గులాబీ బాస్‌పై ఒత్తిడిని పెంచాలని భావిస్తున్నారు. 

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం రోజున..  కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్షం దూకుడు .. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ సభనుంచి స‌స్పెండ్‌ చేసేదాకా వెళ్ళింది. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఏకంగా సభ్యత్వాన్నే కోల్పోయారు. ప్రభుత్వ చర్యపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి అప్రజాస్వామిక వైఖరికి పాల్పడిందని కాంగ్రెస్‌ నాయకులు దుయ్యబడుతున్నారు. 

తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసిన అంశాన్ని రాజకీయాస్త్రంగా మలచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్‌ నాయకత్వం.. ఇప్పుడు 48 గంటల దీక్ష చేపట్టారు. శాసనసభ్యత్వాన్ని కోల్పోయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంటకరెడ్డి, సంపత్‌లు.. గాంధీభవన్‌ వేదికగా ఈ దీక్షలో ప్రధానంగా పాల్గొంటున్నారు.
 
తమ ఎమ్మెల్యేలను ఏకపక్షంగా సస్పెండ్‌ చేశారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం.. ప్రభుత్వ వైఖరిపై కోర్టును ఆశ్రయించడం.. తెలంగాణ వీధివీధినా ప్రభుత్వాన్ని నిలదీయడం.. లాంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. 

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, ప్రాజెక్టుల రీ డిజైన్స్‌ పేరిట వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని, దీన్ని నిలదీస్తామన్న వణుకుతోనే ప్రభుత్వం తమను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేసిందని, స్పీకర్‌ కూడా పక్షపాతంగా వ్యవహరించారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. 

సభ నుంచి గెంటేసినా.. ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో నిలదీసేందుకు కాంగ్రెస్‌ తెలంగాణ నాయకత్వం సిద్ధమవుతోంది. దీంతోపాటే.. రాష్ట్రంలో అధికార పక్షం వైఖరిపై రాష్ట్రప‌తికి  ఫిర్యాదు చేయాలని కూడా యోచిస్తోంది. 

21:50 - March 13, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఘటనకు బాధ్యులైన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆరుగురు ఎమ్మెల్సీలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అలాగే మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్‌ విసిరి గాయపర్చారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌‌ల శాసనసభ సభ్యత్వాలను స్పీకర్‌ రద్దు చేశారు. మరోవైపు ప్రభుత్వ చర్యను కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. సభలో ప్రతిపక్షాలు ఉండొద్దనే సస్పెన్షన్‌ చేశారని మండిపడింది. దీనిపై న్యాయసలహా తీసుకుంటామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.  
11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌..
శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై సోమవారం అసెంబ్లీలో జరిగిన దాడిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను శాసనసభాపతి మధుసూదనాచారి సస్పెండ్‌ చేశారు. జానారెడ్డితోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాదవరెడ్డి, వంశీచంద్‌రెడ్డిపై సస్పెన్షన్‌వేటు వేశారు. ఈ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ బహిష్కరణ ఉంటుందని స్పీకర్‌ ప్రకటించారు.
కోమటిరెడ్డి, సంపత్‌ సభ్యత్వాలు రద్దు 
అలాగే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభా సభ్యత్వాలను రద్దు చేశారు. సభలో దాడిపై స్పీకర్ మధుసూదనాచారి విచారం వ్యక్తం చేశారు. శాసనవ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ సభ్యుల చర్యలను తీవ్రంగా ఖండించారు. 11 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌, మరో ఇద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ హరీష్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానానికి స్పీకర్ మధుసూదనాచారి ఆమోదం తెలిపారు.
శాసనమండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యుల సస్పెండ్‌ 
అటు శాసన మండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేశారు. షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆకుల లలిత, సంతోష్‌, దామోదర్‌రెడ్డిపై వేటు వేస్తూ డిఫ్యూటీ చైర్మన్‌ నేతివిద్యాసాగర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్‌ ముగిసే వరకూ వీరిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందన్నారు.
అరాచకాలు సృష్టిస్తామంటే సహించేది లేదన్న సీఎం కేసీఆర్‌ 
సభలో అరాచకాలు సృష్టిస్తామంటే సహించేది లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అది ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్‌ సభ్యులపై వేటు వేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఈ విషయంలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ కిషన్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ మధ్య వాడీవేడి సంవాదం నడిచింది. జానారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు ఎలా వేశారని కిషన్‌రెడ్డి ప్రశ్నించగా..  కాంగ్రెస్‌ సభ్యుల్లో అసహనం పెరిగిపోయిందని సీఎం ఆగ్రహించారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందికాదని బీజేపీ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచింది. పార్లమెంట్‌లోనూ విపక్షాలు నిరసన తెలుపుతున్నాయని.. అక్కడ వారిని సస్పెండ్‌ చేయడం లేదని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. 
టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ మద్దతు 
అటు టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలను మజ్లిస్‌ సమర్థిస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ చెప్పారు. 
ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన కాంగ్రెస్‌  
మరోవైపు ప్రభుత్వ చర్యలను కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై కాంగ్రెస్‌ సభ్యులు దాడి చేశారనడంలో నిజం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని కావాలనే అసెంబ్లీ నుంచి గెంటేశారని ఆరోపించారు. స్పీకర్‌ తమ వాదన వినకుండానే సస్పెన్షన్ వేటు వేయడం దారుణమన్నారు. గతంలో హరీశ్‌రావు శాసనసభలో ప్రవర్తించిన తీరును కేసీఆర్‌ మరిచిపోయారా అని ప్రశ్నించారు. 
నాపై ఎందుకు వేటు వేశారన్న జానారెడ్డి 
సభలో జరిగిన ఘటనతో ఏ సంబంధం లేని తనపై ఎందుకు వేటు వేశారని విపక్షనేత జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తోందని మండిపడ్డారు. బడ్జెట్‌లో లోపాలను ఎత్తి చూపుతామన్న ఆందోళనతోనే ముందుగానే తమను సభ నుంచి గెంటేశారని ఆరోపించారు. 
కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలు సరైనదే : మంత్రి జగదీష్‌రెడ్డి 
కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలు సరైనదేనని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. దాడి చేసిన సభ్యులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టే అధికారం స్పీకర్‌కు ఉంటుందని ఆయన మీడియాపాయింట్‌లో తెలిపారు. కాంగ్రెస్‌ ముఠాకు నాయకత్వం వహించింది జానారెడ్డి అని అందుకే ఆయనపై వేటు పడిందన్నారు. దాడి చేసి టెర్రరిస్టులు ఆనందపడ్డట్లు కాంగ్రెస్‌ సభ్యులు ఆనందపడ్డారని జగదీష్‌రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ తీరుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఖండన
ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని.. అంతమాత్రాన్నే సస్పెండ్‌ చేస్తారా అని ప్రశ్నించారు. విపక్షాలను బెదిరించడమే లక్ష్యంగా ప్రభుత్వం తమపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు.
కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై ఈసీకి నివేదిక ? 
కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై నివేదికను.. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ అసెంబ్లీ పంపేందుకు సిద్ధమవుతోంది. ఈసీ అంగీకారం లభిస్తే... కర్ణాటకతో పాటు ఆ రెండు ఎమ్మెల్యే స్థానాలకు.. ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అనర్హత వేటును నిరసిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ గాంధీభవన్‌లో 48 గంటల దీక్షకు దిగారు. అలాగే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామన్నారు.

 

21:46 - March 13, 2018

ఆధార్ పరిధిలోకి రావాలన్న ప్రభుత్వ హుంకారానికి సుప్రీంకోర్టు కళ్లెంవేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మనదేశంలో ఒక బిగ్ బ్రదర్ ను కనిపెట్టారు.. నిరంతర నిఘాకు మార్గం వేశారు.. దానిని నిర్బంధం చేశారు..పిడికెడు బియ్యంతో కడుపునింపుకునే పేద బ్రతుకుకు ఆధార్, రైతు ఎరువుకు ఆధార్, కళ్లు కాయలుకాసే ముసలి అవ్వ పిన్షన్ కు ఆధార్, సమస్త సంక్షేమ పథకాల అమలుకు ఆధార్, సరేసరి ఒప్పుకుందాం.. దుర్వినియోగం అరికట్టడానికే అని ప్రభుత్వం చెబుతున్న సాకులు సహేతుకమైనవే అని అనుకుందాం.. కానీ బ్యాంకు ఖాతాకు ఆధార్, మొబైల్ సిమ్ కు ఆధార్, 
డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్, ప్రావిడెండ్ ఫండ్ కు ఆధార్, ప్రత్యామ్నాయ వ్యవస్థలున్న చోట కూడా ప్రతి పనికి ఆధార్..దీనికి ఎలా చూడాలి? పౌర స్వేచ్ఛపై ప్రభుత్వ నిఘా, నియంత్రణ, పెత్తనం... ఎటు దారితీస్తుంది ? సమాధానం వెతకాల్సిందే.. ఇది న్యాయ సమ్మతమేనా..? సొంత పౌరులపై ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనను రాజ్యాంగం అనుమతిస్తుందా.?  ఈ సందేహమే సుప్రీంకోర్టు గడపతొక్కించింది. మార్చి 31 తో సమస్త పౌర సమాచారం ఆధార్ పరిధిలోకి రావాలన్న ప్రభుత్వ హుంకారానికి సుప్రీంకోర్టు కళ్లెంవేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆర్థిక నిపుణులు శశికుమార్ పాల్గొని, మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:08 - March 13, 2018

కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ది హిందూ రెసిడెంట్ ఎడిటర్, ప్రముఖ విశ్లేషకులు నగేష్ కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత బెల్యానాయక్, మాజీ ఎంపీ, టీఆర్ ఎస్ నేత మంద జగన్నాథం పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:04 - March 13, 2018

హైదరాబాద్ : గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా నిన్న అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారంటూ... 11 మంది కాంగ్రెస్‌ సభ్యులను ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్‌ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే సభాపతి మధుసూదనాచారి ఈ అంశంపై తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన పది మంది కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానాన్ని సభ  ఆమోదించింది. 
 

 

21:01 - March 13, 2018

కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వాలు రద్దు..సర్కారు ఇడ్సిపెడ్తలేదుగదా తన జిద్దు, మూకుమ్మడి రాజీమాలకు కాంగ్రెస్ ప్లాన్...మీడియా సహకరిస్తలేదన్న ఉత్తంరెడ్డి, కోమటిరెడ్డితోని కేసీఆర్ ప్లాన్ ఏశిండా.?..కాంగ్రెస్ ఏలుతోని కాంగ్రెస్ కంటికే గాయం, కాంగ్రెస్ను క్లీన్ బోల్డ్ జేయవోతున్నకేసీఆర్..రాజ్య సభ ఎన్నికల కోసం పక్కా స్కెచ్, తెలంగాణ రాష్ట్రంల ధర్నాలే ధర్నాలు...బంగారు తెలంగాణల బత్కులేని జనాలు, సమంత చెవ్వు గిచ్చిన అభిమానురాలు.. ఆయింత మాత్రం ఓర్సుకోకుంట ఎట్లమ్మా?... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:57 - March 13, 2018

గుంటూరు : 14వ ఆర్థిక సంఘం వారు ఎక్కడా స్పెషల్ స్టేటస్ ఇవ్వొద్దని చెప్పలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. తాము పార్లమెంటులో చేసిన చట్టంలోని హామీలను మాత్రమే అమలు చేయమని కోరుతున్నామన్నారు. సెంటిమెంట్‌తో డబ్బులు రావని జైట్లీ చెప్పడాన్ని బాబు తప్పుపట్టారు. అదే సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో జరిగిన చర్చలో బాబు మాట్లాడారు. విభజన వల్ల ఏపీ కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చంద్రబాబు మరోసారి డిమాండ్ చేశారు.
పోలవరం నుంచి నీళ్లు ఇవ్వలేం: చంద్రబాబు
2018నాటికి గ్రావిటీతో... పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలని అనుకున్నామని... కేంద్రం సహకారం సరిగాలేక ఆలస్యమవుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. 2019నాటికి ఖచ్చితంగా నీళ్లు ఇస్తామన్నారు. అందుకోసం కేంద్రం ముందుగా డీపీఆర్ 2 ఓకే చేయాలని కోరారు. మరోవైపు ఏపీకి రైల్వే జోన్ ఇవ్వలేమన్న కేంద్రం ప్రకటనపై కూడా బాబు మండిపడ్డారు. రైల్వే జోన్ విభజన హామీ అని.. ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చిచెప్పారు. 

20:47 - March 13, 2018

హైదరాబాద్ : టీఆర్ ఎస్..నియంతృత్వానికి మారు పేరు అని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ప్రారంభంలో ఆయన మాట్లాడారు. కనీసం రాష్ట్రంలో దిష్టిబొమ్మలు దగ్ధం చేయలేని స్థితి ఉందన్నారు. ఆనాడు హరీష్ రావు ఇంతకంటే ఎక్కువ ఆందోళన చేశారని తెలిపారు. నాడు తెలంగాణ కోసం కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారని... సంపత్ ఆత్మబలిదానాకి యత్నించారని తెలిపారు. అలాంటి వారిని సస్పెండ్ చేసి, సభ్యత్వాన్ని రద్దు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.  

 

19:22 - March 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ పై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎదుట యూత్ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

 

19:16 - March 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ప్రారంభం అయింది. సస్పెన్షన్స్, సభ్యత్వ రద్దుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు దీక్షకు పూనుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు.

 

19:04 - March 13, 2018

సంగారెడ్డి : జిల్లా రామచంద్రాపురం మండలం బిహెచ్‌ఈఎల్‌, ఎంఐజీ ఫేస్‌2లోని మార్గదర్శిని హైస్కూల్‌ 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు ఈ వేడుకలను ప్రారంబించారు. రచయిత పిఎన్‌మూర్తి అధ్యక్షతన సాగిన వార్షికోత్సవాల్లో విద్యార్థులు విశిష్ట సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ముందుతరం మార్గదర్శకులను స్మరించుకుంటూ.. జీవితాలను సమున్నతంగా తీర్చిదిద్దుకోవాలని, కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రచయిత పిఎన్‌మూర్తి విద్యార్థులకు బోధించారు. తమ పాఠశాలలో మహిళలకు విశిష్ట గౌరవం ఇస్తున్నామని కరెస్పాండెంట్‌ సంజీవరావు అన్నారు. 

 

19:03 - March 13, 2018

కరీంనగర్ : అనతి కాలంలోనే అద్భుత ఫలితాలను సాధిస్తూ ప్రభంజనం సృష్టిస్తుంది ఢిల్లీ డిఫెన్స్‌ అకాడమీ. త్రివిధ దళాల్లో ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థుల్లో చాలామంది వివిధ విభాగాలలో ఉద్యోగాలను సాధించారు.  ఇటీవల జరిగిన ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌లో టెక్నికల్‌ విభాగంలో 17 మంది, ఆర్మీ జనరల్‌ డ్యూటీలో 26 మంది, ఆర్మీ ట్రేడ్‌ మెన్‌లో నలుగురు, నర్సింగ్‌ అసిస్టెంట్‌లో ముగ్గురు, నేవి విభాగంలో 9 మంది ఉద్యోగాలు పొందారు. పలు విభాగాల్లో విద్యార్థులు ఉద్యోగాలను సాధించడం పట్ల ఢిల్లీ డిఫెన్స్‌ అకాడమి డైరెక్టర్‌ సతీష్‌ రెడ్డి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు మెరుగైన సిబ్బందితో బోధన చేస్తూనే, వారి శారీరక సామర్థ్యాలకు అనుగుణంగా  వ్యాయామ శిక్షణ ఇస్తున్నట్లు సతీష్‌ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులైన తమను ఉద్యోగులయ్యేలా తీర్చిదిద్దిన ఢిల్లీ డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ సతీశ్‌రెడ్డికి, సంస్థ పూర్వవిద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ప్రారంభం

హైదరాబాద్ : సస్పెన్షన్స్, సభ్యత్వ రద్దుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ప్రారంభం అయింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు.

18:57 - March 13, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అంతా ఖండించాలని మండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. కవిత లోక్‌ సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేయవచ్చుకానీ... మేం మాత్రం ఎందుకు చేయకూడదంటున్న షబ్బీర్ అలీతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏమాత్రం సరిగాలేదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లోనే తేల్చుకుంటామన్నారు. 

 

18:50 - March 13, 2018
18:48 - March 13, 2018

ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సలహాదారు వీకే జైన్ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ సీఎంవో, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసులకు తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వికె జైన్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్‌పై దాడి కేసులో జైన్‌ సాక్షిగా ఉన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చర్చనీయాంశంగా మారింది. సిఎస్‌ దాడి కేసులో రెండు రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు వీకే జైన్‌ను ప్రశ్నించారు.  

18:45 - March 13, 2018

గుంటూరు : కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని తెలిపారు. 14వ ఫైనాన్ష్ కమిషన్ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వవద్దని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని..రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సెంటిమెంట్ ఆధారంగా నిధులు రావని జైట్లీ అన్నారని...సెంటిమెంట్ కారణంగా తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా అని అన్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వమని బీజేపీ అనడం సరికాదన్నారు. విష్ణుకుమార్ రాజు.. స్పెషల్ స్టేసస్ ను సింప్లిఫై చేసి మాట్లాడడం సరికాదన్నారు. తానే దేశంలో సీనియర్ నాయకున్ని అని..తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని తెలిపారు. హైదరాబాద్ కంటే మిన్నగా అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రత్యేకహోదా రాష్ట్రాలకు పన్ను రాయితీ ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. 1995లో సీఎం అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్ టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. బీజేపీతోసహా లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చారని తెలిపారు. తాను ఎప్పుడూ పదవులు, డబ్బులు అడగలేదన్నారు. తాము కష్టపడి డబ్బులు సంపాదించుకుంటామని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీపై మాట్లాడింది తానేనని అన్నారు. బీజేపీ మద్దతుతోనే రాష్ట్ర విభజన బిల్లు పాస్ అయిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ రాలేదని..ఏపీలో వచ్చిందన్నారు. భారతదేశంలో సంపద, మానవ వనరులున్నాయన్నారు. ఇంకా తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తుల విభజన జరగలేదన్నారు. పెన్షన్స్ జనాభా ప్రకారం ఇచ్చారని తెలిపారు. 'ఎందుకు మీరు, మేము కలిసి పోటీ చేశామో తెలుసా అని  అన్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకు 120సం.రాల కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అది ఆ పార్టీ స్వయంకృత అపరాదమన్నారు. ఆ విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్ టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించారు. ప్రత్యేకహోదాను సింపుల్ ఫై చేసి మాట్లాడడం సరికాదన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, వరం అని అన్నారు. 

 

ఆధార్ కార్డు లింక్ గడువు పొడిగింపు

ఢిల్లీ : ఆధార్ కార్డు లింక్ గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. మొబైల్, బ్యాంకింగ్ కు ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలు, సేవలు, రాయితీలకు మాత్రమే ఆధార్ తప్పనిసరి అని కోర్టు తెలిపింది. 

 

నేనే సీనియర్ నాయకున్ని : సీఎం చంద్రబాబు

గుంటూరు : దేశంలో ఉండే రాజకీయ నాయకుల కంటే తానే సీనియర్ నాయకుడనని సీఎం చంద్రబాబు అన్నారు. 1995లో సీఎం అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్ టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. బీజేపీతోసహా లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చారని తెలిపారు.

17:59 - March 13, 2018

ప్రకాశం : జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాని తాము ఆందోళనలు చేస్తుంటే... అరెస్టులు చేయడం దారుణమన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు. ఇటీవల సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడిలో నాయకులు, కార్యకర్తలపై బనాయించిన కేసులు ఉపసంహరించుకొని బేషరుతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా ప్రశాంతంగా నిరసన చేస్తున్న తమ కార్యకర్తలపై పోలీసులను ప్రభుత్వం ఉసిగొల్పిందని మధు ఆరోపించారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరన్నారు. ప్రభుత్వతీరును నిరసిస్తూ.. ప్రజాసంఘాలతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని మధు హెచ్చరించారు.  

 

17:56 - March 13, 2018

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేసీఆర్, టీసర్కార్ చీకటి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ పోకడలను ప్రజలు ఏమాత్రం సహించరని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏమాత్రం సరిగ్గాలేదన్నారు. విపక్షాలను బెదిరించడమే లక్ష్యంగా ప్రభుత్వం తమపై సస్పెన్షన్ వేటు వేశారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ బెదిరింపులకు తాము బెదరబోమంటున్న డీకే అరుణతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. టీఆర్ ఎస్ ఒంటెత్తు పోకడలకు పోతుందన్నారు. తమ సభ్యులు మైకులు విసిరిన విజువల్స్ చూపిస్తున్నారని పేర్కొన్నారు. మైక్ లు స్వామిగౌడ్ కు తగిలిన విజువల్స్ కూడా చూయించాలన్నారు. ఈ ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని..టీఆర్ ఎస్ దుర్బిద్ధితో పని చేస్తుందని మండిపడ్డారు. పట్టించుకోనప్పుడు సభలో సభ్యులు ఆవేశానికి గురవ్వడం సహజమన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దొరతనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకున్ని సభ నుంచి బయటికి పంపడం దేశంలో ఎక్కడా జరగలేదని.. తెలంగాణలోనే మొదటిసారిగా జరిగిందన్నారు. 

 

17:47 - March 13, 2018

గుంటూరు : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. పార్లమెంటులో ఎంపీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొతులు వెలిగించి ర్యాలీలు నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని  పార్టీ ఎంపీలకూ సూచించారు.
ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ 
ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పార్లమెంటు సభ్యులతోపాటు వ్యూహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఎంపీలు చేస్తున్న ఉద్యమాన్ని సమీక్షించారు. పునర్విభజన చట్టంలోని హామీలు అమలయ్యే వరకు ఉద్యమాన్నికొనసాగించాలని నిర్ణయించారు.
ప్రజల మనోభావాలను పట్టించుకోని కేంద్రం 
ప్రజల తరపున ఎంపీలు నిలబడాలని, జనవాణి పార్లమెంటులో ప్రతిధ్వనింపచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలను కేంద్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తప్పుపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, దాన్ని ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి...  అభివృద్ధి ఆగకుండా, నిర్మాణాత్మకంగా పోరాటం చేయాలని ఎంపీలకు సూచించారు. 
సెంటిమెంటుతో ప్రజలను రోడ్డుపైకి నెట్టారు 
ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాటం చేస్తూ... పార్లమెంటులో కలిసొచ్చే ఇతర పార్టీల ఎంపీలను కూడా కలుపుకుపోవాలని చంద్రబాబు ఆదేశించారు. సెంటిమెంటుతో రాష్ట్రానికి వచ్చే నిధులు పెరగవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి... అదే సెంటిమెంటుతో తెలంగాణ ఇవ్వలేదా.. అని ప్రశ్నించారు. సెటిమెంటుతో రాష్ట్ర ప్రజలను నడిరోడ్డుపైకి నెట్టారన్న చంద్రబాబు... అదే సెంటిమెంటును ఇప్పుడు ఎందుకు గౌరవించడంలేదని నిలదీశారు. రాష్ట్ర డిమాండ్లు  సహేతుకమైనవని, విభజన చట్టంతోపాటు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయరా.. అని ప్రశ్నించారు.
కేంద్రంపై వైసీపీ నాటకాలు 
ఆర్థిక నేరస్థులు ప్రధానిని కలవడం ఎక్కడైనా ఉందా... అంటూ.. వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రధాని కార్యాలయం చుట్టూ ఏ-2 నిందితుడు ప్రదక్షిణలు చేయడం.. ఏరకమైన సంకేతాలకు నిదర్శనమని  ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే విషయంలో నాటకాలు ఎందుకని నిలదీశారు. వైసీపీని ప్రజలు అసహ్యించుకునే రోజులు దగ్గర్లో ఉన్నాయన్న చంద్రబాబు... టీడీపీ ఎంపీలు కలిసికట్టుగా, చిత్తశుద్ధితో పోరాటం చేయాలని కోరారు. కీలక సమయంలో ఎంపీలెవరూ సభకు గైర్హాజరు కావొద్దని ఆదేశించారు. కేంద్ర నుంచి అందిన సాయంతోపాటు ఇంకా రావాల్సిన నిధుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని  అధికారులను ఆదేశించారు. ఈ సమాచారాన్ని ఎంపీలు వినియోగించుకుని ముందుకుసాగాలని సూచించారు. 
సస్పెండ్‌ చేస్తే.. బయటకొచ్చి పోరాటం చేయాలి... 
పార్లమెంటు నుంచి సస్పెండ్‌ చేస్తే.. బయటకొచ్చి పోరాటం చేయాలని ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. ఏ సభ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందో.. అక్కేడే న్యాయం జరగాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలే న్యాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 
 

 

17:35 - March 13, 2018

ఢిల్లీ : దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఎంపీగా బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ సతీమణి జయాబచ్చన్‌ నిలవనున్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు పోటీ చేస్తున్న ఆమె నామినేషన్‌ పత్రాలతో పాటు తన ఆస్తులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో పొందు పర్చారు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో వెయ్యికోట్ల ఆస్తులను చూపారు. 2012లో జయాబచ్చన్ తన ఆస్తులను 493 కోట్లుగా చూపారు. ప్రస్తుతం అమితాబ్‌, జయ స్థిరాస్తులు 460 కోట్లు కాగా..చరాస్తులు 540 కోట్లుగా పేర్కొన్నారు. 62 కోట్ల విలువ చేసే బంగారం, 13 కోట్ల విలువ చేసే 12 కార్లు, 3.4 కోట్ల వాచ్‌లు, 51 లక్షల నగదు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇవికాక ఫ్రాన్స్‌లో రెసిడెన్షియల్‌ ఫ్లాట్.. నోయిడా, భోపాల్‌, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్, బరబంకిలో స్థలాలున్నాయి.

 

17:33 - March 13, 2018

ఢిల్లీ : బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు రాత్రి విపక్షాలకు విందు సమావేశం ఏర్పాటు చేశారు. డిఎంకె, తృణమూల్‌, ఆర్జేడి, ఎస్పీ, వామపక్షాలతో పాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించారు. పిఎన్‌బి స్కాం, రైతుల సమస్యలు, రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో అక్రమాలు తదితర అంశాలపై మోది ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఓ వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

 

17:28 - March 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌, ఇద్దరు సభ్యులపై అనర్హత వేటు సరైనదేనని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. దాడి చేసిన సభ్యులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టే అధికారం స్పీకర్‌కు ఉంటుందని ఆయన మీడియాపాయింట్‌లో తెలిపారు. కాంగ్రెస్‌ ముఠాకు నాయకత్వం వహించింది జానారెడ్డి అని అందుకే ఆయనపై వేటు పడిందన్నారు. దాడి చేసి టెర్రరిస్టులు ఆనందపడ్డట్లు కాంగ్రెస్‌ సభ్యులు ఆనందపడ్డారని జగదీష్‌రెడ్డి విమర్శించారు.

 

కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వ రద్దుపై నివేదికను ఈసీకి పంపనున్న టీ.అసెంబ్లీ

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వ రద్దుపై నివేదికను తెలంగాణ అసెంబ్లీ ఈసీకి పంపనుంది. కర్ణాటకతోపాటు ఆ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. 

 

కోమటిరెడ్డి, సంపత్ 48 గంటల దీక్ష

హైదరాబాద్ : గాంధీభవన్ లో సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య పరిక్షణ దీక్ష చేపట్టనున్నారు. అనర్హత వేటును నిరసిస్తూ కోమటిరెడ్డి, సంపత్ లు 48 గంటల దీక్షకు దిగనున్నారు. 

16:56 - March 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వ రద్దుపై నివేదికను తెలంగాణ అసెంబ్లీ ఈసీకి పంపనుంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకతోపాటు ఆ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. 

 

16:52 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేశారు. దీనికి నిరసనగా గాంధీభవన్ లో సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య పరిక్షణ దీక్ష చేపట్టనున్నారు. అనర్హత వేటును నిరసిస్తూ కోమటిరెడ్డి, సంపత్ లు 48 గంటల దీక్షకు దిగనున్నారు. 

16:17 - March 13, 2018
16:05 - March 13, 2018

భారతదేశంలో డయాబెటిక్ సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇటీవలికాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతొక్కరు ఈ డయాబెటిక్ బారిన పడుతున్నారు. అసలు డయాబెటిక్ రావడానికి ప్రధానమైన కారణమేంటి ? ఇది వంశపారపర్యంగా వచ్చే అవకాశముందా? ఇది నెక్ట్స్ జరేషన్ కు కూడా కంటిన్యూ అయ్యే అవకాశముందా ? దీన్ని పూర్తిగా నివారించవచ్చా? అసలు నిపుణులు ఏమని చెబుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.... ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో డయాబెటిక్ ఎడ్యుకేటర్ వసుధరాణి, న్యాచురోపతి మరియు ఆక్యుపెంచర్ వైద్య నిపుణులు సాగర్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయాబెటిక్ అనేది రోగం కాదన్నారు. డయాబెటిక్ తో వచ్చే రోగాలే అనారోగ్యానికి గురిచేస్తాయన్నారు. డయాబెటిక్ ఉన్నవారు అధిక నిద్ర, ఎప్పుడూ నీరసంగా ఉంటారని తెలిపారు. పలు విలువలైన సలహాలు, సూచనలు చేశారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:47 - March 13, 2018

ఢిల్లీ : రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లపై రాష్ట్రాలకే అధికారం ఉండాలని టీఆర్ఎస్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్రకో నీతి ఉన్నప్పుడు తెలంగాణలోని రిజర్వేషన్లపై కేంద్రం పెత్తనం ఏంటని టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. 

15:45 - March 13, 2018

ఢిల్లీ : ఇవాళ కూడా పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్‌ మెయిన్‌ గేట్‌ వద్ద వైసీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని.. రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

 

15:43 - March 13, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్‌ ఆవరణలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. విభజన హామీలను అమలు చేయాలని, రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. 

 

కాంగ్రెస్‌ నాయకులు ఎలాంటి తప్పు చేయలేదన్న కుంతియా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయడంపై ఏఐసీసీ స్పందించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్‌ చేయడం దురదృష్టకరమన్నారు తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా. స్వామిగౌడ్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాడి చేశారనడం అవాస్తవమన్నారు. సభలో గందరగోళనం జరిగిన ఫుటేజి బయటపెట్టాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ప్రభుత్వ చర్యను ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ ఖండించాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో హరీష్‌రావు అసెంబ్లీలో వ్యవహరించిన  తీరు గుర్తు లేదా ? అని ప్రశ్నించారు.

15:40 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయడంపై ఏఐసీసీ స్పందించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్‌ చేయడం దురదృష్టకరమన్నారు తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా. స్వామిగౌడ్‌పై  కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాడి చేశారనడం అవాస్తవమన్నారు. సభలో గందరగోళనం జరిగిన ఫుటేజి బయటపెట్టాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ప్రభుత్వ చర్యను ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ ఖండించాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో హరీష్‌రావు అసెంబ్లీలో వ్యవహరించిన  తీరు గుర్తు లేదా ? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి గందరగోళం చేసినప్పుడు లేని తప్పు.. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేస్తే వచ్చిందా అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు తమను తాము ప్రజాస్వామ్యవాదులనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసినంత మాత్రాన తమ ఆందోళనలు ఆగవని.... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే రాంబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ మారిన 22 మంది వైపీసీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్‌ కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీ కేబినెట్‌లో చేరిన మంత్రులకూ కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

 

15:36 - March 13, 2018

హైదరాబాద్ : వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే రాంబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ మారిన 22 మంది వైపీసీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్‌ కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీ కేబినెట్‌లో చేరిన మంత్రులకూ కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

తెలంగాణ..ఛత్తీస్ గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్

ఛత్తీస్ గఢ్‌ : తెలంగాణ..ఛత్తీస్ గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు అకస్మాత్తుగా జరిపిన దాడిలో 8మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. సుఖుమా జిల్లాల్లో గొల్లపల్లి కిష్టారం సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. ముందుగా పేలుడు జరిపిన మావోయిస్టులు తరువాత.. కాల్పులకు జరిపారు. ఎదురుకాల్పుల్లో మరో ఆరుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయపూర్ ఆసుపత్రికి, మృతదేహాలను భద్రాచలం ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

15:27 - March 13, 2018

ఛత్తీస్ గఢ్‌ : తెలంగాణ..ఛత్తీస్ గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు అకస్మాత్తుగా జరిపిన దాడిలో 8మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. సుఖుమా జిల్లాల్లో గొల్లపల్లి కిష్టారం సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. ముందుగా పేలుడు జరిపిన మావోయిస్టులు తరువాత.. కాల్పులకు జరిపారు. ఎదురుకాల్పుల్లో మరో ఆరుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయపూర్ ఆసుపత్రికి, మృతదేహాలను భద్రాచలం ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

మందు పాతర పేలి 8 మంది సైనికులు మృతి

హైదరాబాద్ : తెలంగాణ..చత్తీస్ ఘడ్ సరిహద్దులో మందు పాతర పేలుడు సంభవించింది. కోబ్రా దళానికి చెందిన 8 మంది సైనికులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. 

14:03 - March 13, 2018

ముంబై : ఇండిగో విమాన సంస్థ దేశీయంగా 47 విమానాలను రద్దు చేసింది. రెండు వారాల్లో మూడోసారి ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇంజన్‌లో ఫెయిల్‌ కావడంతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ రెగ్యులేటర్‌ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఇండిగోకు చెందిన ఎనిమిది ఎ-320 నియో విమానాలను, గో ఎయిర్‌ సంస్థ నిర్వహిస్తున్న 3 విమానాలను డీజీసీఏ నిలిపేసింది. ఈ నేపథ్యంలో మార్చి 13 నుంచి 47 డోమస్టిక్‌ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోలకతా, హైదరాబాద్, బెంగళూరు, పట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్‌సర్ గువహటి తదితర నగరాల నుంచి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. సోమవారం అహ్మదాబాద్‌ నుంచి కోల్‌కతాకు 186మందితో వెళ్లిన ఎ320 నియో విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఇంజిన్లలో ఒకటి విఫలం కావడంతో 40 నిముషాల్లోనే తిరిగి వెనక్కి మళ్లించారు. ఇండిగో ప్రతి రోజూ దాదాపు 1000 విమానాలు నడుపుతోంది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 40శాతం... గోఎయిర్‌కు 10శాతం మార్కెట్‌ షేర్‌ ఉంది. 

14:02 - March 13, 2018

ముంబై : జయాబచ్చన్‌పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై పార్టీల కతీతంగా విమర్శలు రావడంతో బిజెపి నేత నరేష్‌ అగర్వాల్‌ క్షమాపణ చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండని మీడియా ముందు తెలిపారు. తాను బాధతో అలా వ్యాఖ్యానించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సినిమాల్లో నటిస్తూ డ్యాన్సులు చేసుకునేవారికి రాజ్యసభ టికెట్‌ ఇచ్చారని నరేష్‌ అగర్వాల్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్ తదితరులు తీవ్రంగా ఖండించారు. ఎస్పీ జయాబచ్చన్‌కు రాజ్యసభ టికెట్‌ కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్‌ నేత నరేష్‌ అగర్వాల్‌ ఎస్పీని వీడి బిజెపిలో చేరారు. 

14:00 - March 13, 2018

ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న అమితాబ్ అనారోగ్యం బారిన పడటంతో వెంటనే.. స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం ఆయన కోలుకున్నారని... ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు బిగ్ బీకి చికిత్స అందించడానికి ముంబై నుంచి జోధ్‌పూర్‌కు ప్రత్యేక వైద్య బృందం కూడా బయలుదేరింది. అమితాబ్ కొంత కాలంగా మెడ నొప్పి, వెన్నునొప్పితో బాధ పడుతున్నారు. 70 ఏళ్ల వయసున్న అమితాబ్... ప్రస్తుతం... థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాతో పాటు బ్రహ్మస్త్రా, 102 అనే చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

13:33 - March 13, 2018

నల్గొండ : జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మంగళవారం నాడు బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం..కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఖూని చేసిందని, దీనిపై మండలాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టి.కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

దీనితో చిట్యాలలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోమటిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంటికి వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. చిట్యాలలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. 

చిట్యాలలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం...

నల్గొండ : కోమటిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంటికి వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. చిట్యాలలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. 

కీలక నేతలతో పవన్ భేటీ...

గుంటూరు : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలో జరిగే సభలో ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి..కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. 

బిగ్ బికి అస్వస్థత...

ముంబై : అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్ర షూటింగ్ త‌ర్వాత బిగ్ బీ అస్వ‌స్థ‌తకి గురయ్యారు. వెంటనే ఆయన్ను జోధ్‌పూర్‌లోని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అమితాబ్ బచ్చన్ కు చికిత్స అందించేందుకు ముంబై నుండి జోధ్‌పూర్‌కి ప్ర‌త్యేక వైద్య బృందం వెళ్లినట్లు సమాచారం. 

12:36 - March 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం...ఇద్దరు సభ్యుల సభత్వాన్ని రద్దు చేయడం పట్ల టి.కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. మంగళవారం ప్రారంభమైన సభలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనిపై సీఎల్పీ భేటీ జరిగింది. అనంతరం ఉత్తమ్..మల్లు భట్టు విక్రమార్కలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

నాటకీయంగా జరిగిందని, అబద్ధమని ఆన్ రికార్డు చెప్పడం జరిగిందని ఉత్తమ్ పేర్కొన్నారు. కానీ కొన్ని పత్రికలు తామే తప్పు చేసినట్లు రాశాయని, మరి దెబ్బ తగిలిన వీడియో ఎందుకు చూపెట్టడం లేదన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదా ? అని ప్రశ్నించారు. కౌన్సిల్ ఛైర్మన్ అంటే తమకు అభిమానమని, సభలో ప్రజా గొంతుక ఉండొద్దని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని, స్పీకర్ ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఘటన మొత్తం టీఆర్ఎస్ డ్రామా అని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని గెంటేసిందని..ఇలా అయితే అసెంబ్లీని ప్రగతి భవన్ కు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. చివరి బడ్జెట్ సెషన్ లో నాలుగేండ్లు దోపిడి చేసి..అందర్నీ మోసం చేసి జవాబు ఇవ్వొద్దనే ఇలా చేశారన్నారు.
మల్లు...
బడ్జెట్ లో చర్చ లేకుండా పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇది దుర్మార్గమని మల్లు భట్టు విక్రమార్క తెలిపారు. సభ్యులను సస్పెండ్ చేయడమే కాకుండా ఇద్దరు సభ్యులను సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వ తీరుపై పోరాటం చస్తామని, సభ్యుల నుండి కనీసం అభిప్రాయం తీసుకోలేదన్నారు. అసెంబ్లీని పార్టీ కార్యాలయంగా మార్చేశారని విమర్శించారు. 

12:27 - March 13, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని మొత్తం సస్పెండ్ చేస్తారా ? నిరసనలో చేస్తున్న సమయంలో సంయమనం పాటిస్తున్న తనను కూడా సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను సస్పెండ్...ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాన్ని మొత్తంగా సస్పెండ్ చేయడం..ఇద్దరు శాసనసభ్యులను సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వార్తలు వినడం జరిగిందని, ఏ రూల్ కింద..రాజ్యంగ పరిధిలో చేస్తున్నారననే దానిపై న్యాయ నిపుణులతో చర్చించడం జరుగుతోందన్నారు. పార్లమెంట్ లో గత వారం రోజులుగా సభ్యులు ఆందోళన చేస్తున్నది దృష్టిలో ఉంచుకోవాలని, అక్కడ ఆందోళన చేస్తున్న సభ్యుల పార్టీ ఇక్కడ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం ఆలోచించాలని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా..రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలీని కూడా సస్పెండ్ చేయడం తగదన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో అంకెలపై తప్పుల తడక అంటూ వివరించే ప్రయత్నం చేయడం జరుగుతోందని, కానీ ఈసారి అది జరగకుండా ఉండేందుకే తమను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. 

ఇది దుర్మార్గం - మల్లు భట్టి విక్రమార్క...

హైదరాబాద్ : బడ్జెట్ లో చర్చ లేకుండా పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇది దుర్మార్గమని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సభ్యులను సస్పెండ్ చేయడమే కాకుండా ఇద్దరు సభ్యులను సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికమన్నారు. 

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు...

హైదరాబాద్ : ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని తెలిపారు. 

ముగిసిన సీఎల్పీ భేటీ...

హైదరాబాద్ : సీఎల్పీ భేటీ కాసేపటి క్రితం ముగిసింది. ఈ సందర్భంగా జానారెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. 

11:59 - March 13, 2018

ముంబై : దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పాలకులను దిగొచ్చేలా చేసింది. రైతుల డిమాండ్లకు మహా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 నెలల్లో అన్ని డిమాండ్లను నెరవేర్చుతామని ఫడ్నవిస్‌ ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. దీంతో రైతులు తమ ఆందోళన విరమించారు. ఎర్ర సముద్రాన్ని తలపించిన ముంబై..ఆజాద్‌ మైదానంలో 50 వేల మంది రైతులు..నిశ్శబ్ద విప్లవంలా సాగిన రైతుల పాదయాత్ర..రైతుల ఆందోళనకు దిగొచ్చిన ఫడ్నవిస్‌ సర్కార్‌..తలకు ఎర్రటోపీలు, చేతిలో ఎర్ర బ్యానర్లు పట్టుకుని రైతులు నిశ్శబ్ద విప్లవంలా తమ యాత్రను సాగించారు. 50 వేల మంది రైతులతో ముంబై నగరం ఎర్ర సముద్రాన్ని తలపించింది.

నాసిక్‌లో మార్చి 6 న ప్రారంభమైన మహారైతు పాదయాత్ర.. ఆదివారం ముంబైకి చేరుకుంది. మండుటెండలను లెక్కచేయక, కాలినడకన దాదాపు 180కిలోమీటర్లు ప్రయాణించారు. అన్నదాతలకు ముంబయి వాసులు నైతికంగా అండగా నిలిచారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆహార పదార్థాలు, మంచినీటిని రైతులకు అందించింది.

సోమవారం ఉదయం టెన్త్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రైతుల ర్యాలీ ఆదివారం అర్థరాత్రే ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల డిమాండ్లపై ఫడ్నవిస్‌ ప్రభుత్వం దిగొచ్చింది. సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా ఆరుగురు మంత్రులతో కూడిన కమిటీ రైతులతో చర్చించి సానుకూలంగా స్పందించింది. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇచ్చింది.

ఆజాద్‌ మైదానంలో రైతులనుద్దేశించి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రసంగించారు. 30 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం కారణంగా రుణాల ఊబిలో కూరుకు పోయి అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఏచూరి అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఏచూరి పిలుపునిచ్చారు. ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు భగత్‌ సింగ్‌ బాంబు వేస్తే...ఈనాటి పాలకుల కళ్లు తెరిపించేందుకు రైతులు ఆందోళన ద్వారానే మహా విస్ఫోటనం సృష్టించగలరని ఏచూరి అన్నారు. అన్నదాత ఆందోళనకు దిగితే దేశమే ఆకలితో చస్తుందని హెచ్చరించారు. దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశ రైతాంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 

11:43 - March 13, 2018

హైదరాబాద్ : టి.సర్కార్ పై టి.కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులపై సస్పెండ్...ఇద్దరు సభ్యులను సభత్యాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం మంగళవారం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టి.కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సీఎల్పీ అత్యవసర భేటీ జరిపింది. ఈ భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ భేటీలో భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళుతోందని..ఒకరకంగా నియంతలాగా వ్యహరిస్తోందని తెలిపారు.వెంటనే కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చింది. మరోవైపు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. సభలో ప్రతిపక్షం ఉండనీయకుండా ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

11:31 - March 13, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు పార్లమెంట్ సమావేశాలను చక్కగా ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని రోజులుగా ప్రత్యేక హోదా..విభజన హామీల సాధన అమలు చేయాలంటూ టిడిపి ఎంపీలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు ఉదయం పార్టీ ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు..ఢిల్లీలో జరుగుత్ను పరిణామాలను ఆయన తెలుసుకుంటున్నారు.

మంగళవారం కూడా ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిశ..నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక నేరస్తులు ప్రధానిని కలవడం ఎక్కడైనా ఉందా ? అని వ్యాఖ్యానించారు. పీఎంవో చుట్టూ ఏ 2 నిందితుడు ప్రదిక్షణలు చేస్తున్నారని, ఒకవైపు విశ్వాసం అంటూనే మరోవైపు అవిశ్వాసం పెడుతామని అంటున్నారని విమర్శించారు. ఏందుకు నాటకాలు ? ఎందుకీ డ్రామాలు అని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు వైసీపీని ఛీ కొట్టే రోజులు దగ్గరపడ్డాయయని, టిడిపి ఎంపీలు మాత్రం కలిసికట్టుగా పోరాటం చేయాలని సూచించారు. ఇది కీలక సమయమని, సభకు ఎవరూ గైర్హాజర్ కావొద్దన్నారు. సభ నుండి సస్పెండ్ చేస్తే బయటపోరాటం ఉధృతం చేయాలని హితబోధ చేశారు. ఏ సభ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలని బాబు ఆకాక్షించారు. 

వైసీపీలో కాంగ్రెస్ నేత...

గుంటూరు : కాంగ్రెస్ పార్టీ నేత చేజర్ల నారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. తన అనుచరులతో సహా వచ్చిన చేజర్ల జగన్ ను కలిసిన వైసీపీ కండువా కప్పుకున్నారు. 

రాజీనామా చేసే యోచనలో కాంగ్రెస్ నేతలు ?

హైదరాబాద్ : సీఎల్పీలో జానారెడ్డి అధ్యక్షతనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. రాజీనామాలు చేయాలని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

టీఎస్ మండలిలో...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మండలిలోని ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. షబ్బీర్ ఆలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను సస్పెన్షన్ కు గురయ్యారు. 

బ్లాక్ డే - షబ్బీర్ ఆలీ...

హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ సభ్యులను సస్పెండ్ చేశారో కారణాలు చెప్పలేదని ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. ప్రజా స్వామ్యంలో ఈ రోజు బ్లాక్ డే అని అభివర్ణించారు. దేశంలో ఏ అసెంబ్లీలో ఇలా ఉండదని, సస్పెండ్ అయిన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. 

11:11 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో అసహనం ఉందని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు జరిగిన ఘటనపై ఆయన మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో వ్యవహరిస్తున్న తీరును కిషన్ అసెంబ్లీలో ప్రస్తావించగా దీనిపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

బీఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించుకోవడం జరిగిందని, హరీష్ రావు ప్రవేశ పెట్టిన తీర్మానం ప్రవేశ పెట్టకముందే ఫ్లోర్ లీడర్లను పిలిచి మాట్లాడిస్తే బాగుండేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ వ్యవస్థలో ఎవరూ ఆ విధంగా చేయకూడదన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి బాధను వ్యక్తపరచడం జరిగిందని, పరిగణలోకి తీసుకోకపోవడం..జానారెడ్డిని సస్పెండ్ చేయడం సభకు హుందాతనం అనిపించుకోదన్నారు.

దీనిపై కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. పార్లమెంట్ లోని విషయాన్ని ఇక్కడ ప్రస్తావించవద్దని..సభలో లేని వ్యక్తుల అంశాన్ని ప్రస్తావిస్తే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇంకా ఎలా మాట్లాడారో వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:08 - March 13, 2018

హైదరాబాద్ : సోమవారం నాడు జరిగిన ఘటన బ్లాక్ డే అని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మంగళవారం నాడు ప్రారంభమైన సభలో టి.కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టింది. స్పీకర్ మధుసూధనాచారి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడారు. ఘటన జరగడం దురదృష్టకరమని, ఇలా జరగడం బాధాకరమన్నారు. దాడిపై క్షమాపణలు చెప్పాల్సింది పోయి..గవర్నర్ పై దాడి చేయాలని అనుకున్నామని కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పరాజయం పాలవుతుండడంతో ఇక్కడి కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని ఎద్దేవా చేశారు. 

11:07 - March 13, 2018

హైదరాబాద్ : అరాచక శక్తుల పీచమణుస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం నాడు జరిగిన ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశార. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం సమర్థిస్తున్నట్లు, ఇలాంటి ఘటనలు గత నాలుగు సంవత్సరాల నుండి జరగలేదన్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై విషపూరిత ప్రచారం చేస్తున్నారని, అంతేగాకుండా తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని, రాజకీయాల్లో ఇంత అసహనం పనికి రాదన్నారు. శాసనసభను హుందాగా నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యునిపై ఉందని సభకు తెలిపారు.

నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు అదుపులో ఉండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అరాచక శక్తులను ఎలాంటి పరిస్థితిలో ప్రోత్సహించడం జరగదన్నారు. రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పలుసార్లు చెప్పడం జరిగిందని, ఎన్ని రోజులైనా చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు గొడవ చేయడం సబబు కాదన్నారు. 

కాంగ్రెస్ ముందస్తు ప్రకారమే దాడి - కేసీఆర్...

హైదరాబాద్ : ఎలాగైనా బయటకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం సమయంలో దాడి చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని, సభా హక్కులకు భంగం కలిగించొద్దని సీఎం సూచించారు. కాంగ్రెస్ నేతలే నాటకాలు ఆడుతున్నారని, తమకు నాటకం ఆడాల్సిన అవసరం లేదన్నారు.

జానాను సస్పెండ్ పట్ల కిషన్ రెడ్డి...

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత జానారెడ్డిని సస్పెండ్ చేయడం కరెక్టు కాదని బీజేపీ నేత కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సభలో సోమవారం జరిగిన పరిణామాలపై ఆయన మాట్లాడారు. ఇలా జరగడం బాధాకరమని, ఇలా జరగాల్సి ఉండకూడదని ప్రతిపక్ష నేత జానారెడ్డి బాధను వ్యక్తపరచడం పరిగణలోకి తీసుకోకపోవడం..జానారెడ్డిని సస్పెండ్ చేయడం సభకు హుందాతనం అనిపించుకోదన్నారు. 

ప్రజలు సంతోషంగా ఉన్నారు - కేసీఆర్...

హైదరాబాద్ : నాలుగేళ్ల నుంచి తెలంగాణాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. అరాచక శక్తులను ప్రోత్సహించమని, రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పలుసార్లు చెప్పడం జరిగిందని, ఎన్ని రోజులైనా చర్చ చేసేందుకు సిద్ధమన్నారు. 

10:35 - March 13, 2018

హైదరాబాద్ : అందరూ ఊహించినట్టే జరిగింది. కాంగ్రెస్ శాసనసభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు ప్రారంభమైన శాసనసభలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ ప్రసగించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో డిప్యూటి ఛైర్మన్ స్వామిగౌడ్ గాయపడడం కలకలం రేగింది. మంగళవారం ప్రారంభమైన సమయంలో స్పీకర్ తొలుత మాట్లాడారు. ఘటన జరగడం బాధాకరమని, ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టారు. అరాచక చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, ఎన్.ఉత్తమ్, డికే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, మాధవరెడ్డి, పద్మావతిలు సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు, అంతేగాకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వం ను రద్దు చేస్తున్నట్లు, ఈ తీర్మానాన్ని ఆమోదించాలని మంత్రి హరీష్ రావు సభలో తెలిపారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు, సస్పెండ్ అయిన వారు సభలో నుండి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. 

కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్...

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, ఎన్.ఉత్తమ్, డికే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, మాధవరెడ్డి, పద్మావతిలు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. 

కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వం రద్దు...

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వం ను రద్దు చేస్తున్నట్లు, ఈ తీర్మానాన్ని ఆమోదించాలని మంత్రి హరీష్ రావు సభలో తెలిపారు. దీనితో వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

11 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్...

హైదరాబాద్ : సోమవారం నాడు జరిగిన ఘటనలపై పది మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెన్షన్ చేసేందుకు తీర్మానం ప్రవేశ పెడుతున్నట్లు, సమావేశాలు ముగిసేంత వరకు వీరిని సస్పెండ్ కు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దీనిని సభ ఆమోదించాలని కోరారు. 

ఖండిస్తున్నా..హరీష్ సస్పెన్షన్ తీర్మానం...

హైదరాబాద్ : సోమవారం నాడు జరిగిన ఘటనను ఖండిస్తున్నట్లు, దాడి చేసిన కాంగ్రెస్ సభ్యులను సమావేశాలు జరిగేంతవరకు సస్పెన్షన్ కు తీర్మానం ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. 

టి.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు జరిగిన ఘటన తనను బాధించిందని స్పీకర్ పేర్కొన్నారు. 

10:00 - March 13, 2018

విజయవాడ : టిడిపి ఎంపీలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు దిశా..నిర్ధేశం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రత్యేక హోదా..విభజన సమస్యలపై టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతి రోజు ఉదయం ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం కూడా యదావిధిగా ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆందోళనలు నిర్మాణాత్మకంగా ఉండాలని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. ప్రజల తరపునే ప్రతినిధులు నిలబడాలని, ప్రజల గొంతు పార్లమెంట్ లో ప్రతిధ్వనించాలన్నారు. ఐదు కోట్ల ప్రజల మనోభావాలపై కేంద్రం ఉదాసీనత భావ్యం కాదని, అభివృద్ధి ఆగిపోరాదని..హక్కులలో రాజీలేదన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంపీలు పోరాటం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకొంటూ పోవాలని సూచించారు. ఆనాడు సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలన్నారు. 

ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : టిడిపి ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆందోళనలు నిర్మాణాత్మకంగా ఉండాలని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. ప్రజల తరపునే ప్రతినిధులు నిలబడాలని, ప్రజల గొంతు పార్లమెంట్ లో ప్రతిధ్వనించాలన్నారు. ఐదు కోట్ల ప్రజల మనోభావాలపై కేంద్రం ఉదాసీనత భావ్యం కాదని, అభివృద్ధి ఆగిపోరాదని..హక్కులలో రాజీలేదన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంపీలు పోరాటం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకొంటూ పోవాలని సూచించారు.

గవర్నర్ చర్యలు తీసుకోవాలి - రేవంత్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మార్షల్ పెట్టి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత గవర్నర్ తన విశేష అధికారాలను ఉపయోగించడం లేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదన్నారు. తక్షణమే సభలో జరిగిన పూర్తి వివరాలపై గవర్నర్ నివేదిక తెప్పించుకుని...వీడియో ఫుటేజ్ లను పరిశీలించి అనంతరం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

దాడులు చేస్తారా - జీవన్ రెడ్డి...

హైదరాబాద్ : మర్డర్ చేసిన తరువాత తప్పయింది అంటారా ? అంటూ టీఆర్ఎస్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఒక నిండు శాసనసభలో ప్రసంగం చదువుతుంటే కాంగ్రెస్ నేతలు ఇలా చేయడం గూండాయిజం కాదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రవర్తనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, బీజేపీ నేతలు ఆలోచించాలని సూచించారు. నిరసన తెలియచేసే కార్యక్రమాలు వేరే ఉంటాయని, డైరెక్ట్ గా దాడులు చేయడం కరెక్టేనా ? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:38 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మార్షల్ పెట్టి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నాడు జరిగిన ఘటన చెదురుముదురు ఘటనలని అభివర్ణించారు. ఈ ఘటనపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత గవర్నర్ తన విశేష అధికారాలను ఉపయోగించడం లేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదన్నారు. తక్షణమే సభలో జరిగిన పూర్తి వివరాలపై గవర్నర్ నివేదిక తెప్పించుకుని...వీడియో ఫుటేజ్ లను పరిశీలించి అనంతరం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పది గంటలకు మొదలు కావాల్సిన గవర్నర్ ప్రసంగం ఐదు నిమిషాల ఆలస్యం అయ్యిందని దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మామా..అల్లుళ్ల నాటకానికి తెరదింపాలని..ప్రజా సమస్యలపై చర్చించాలని..రైతులకు అండగా నిలబడాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

కాంగ్రెస్ సభ్యులపై చర్యలు ?

హైదరాబాద్ : సోమవారం నాడు శాసనసభలో జరిగిన ఘటనపై సర్కార్ చర్యలకు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. శాసనసభా సభ్యత్వాల రద్దు...పదవీకాలం ముగిసే దాక వరకు లేదా ప్రస్తుత సమావేశాలు ముగిసేదాక సస్పెన్షన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

09:27 - March 13, 2018

హైదరాబాద్ : మర్డర్ చేసిన తరువాత తప్పయింది అంటారా ? అంటూ టీఆర్ఎస్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం చేసే సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి విసిరన హెడ్ సెట్ మండలి ఛైర్మన్ కు తగిలిందని..ఆయన కంటికి గాయమైందని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. దీనిపై జీవన్ రెడ్డితో టెన్ టివి మాట్లాడింది. ఒక నిండు శాసనసభలో ప్రసంగం చదువుతుంటే కాంగ్రెస్ నేతలు ఇలా చేయడం గూండాయిజం కాదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రవర్తనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, బీజేపీ నేతలు ఆలోచించాలని సూచించారు. నిరసన తెలియచేసే కార్యక్రమాలు వేరే ఉంటాయని, డైరెక్ట్ గా దాడులు చేయడం కరెక్టేనా ? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:23 - March 13, 2018

హైదరాబాద్ : అంతే..మళ్లీ సభలో సేమ్ సీన్స్ రిపీట్ అవుతున్నాయి...అధికార పక్షం..విపక్షం పై చేయి సాధించుకోవడం కోసం పాకులాడుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చ కావాల్సిన సభ రణరంగంగా మారిపోయింది. ప్రజలకు సంబంధించిన సమస్యలు పక్కకు పోయి నేతల సవాళ్లు..ప్రతి సవాళ్లు ముందుకొస్తున్నాయి.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సభలనుద్దేశించి ప్రసంగించారు. కానీ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేయడం..పేపర్లు చించడం చేశారు. ఈ నేపథ్యంలోనే శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైందనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ సభ్యులు మద్యం తాగి సభకు వచ్చారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపణలు చేయడం మరింత వివాదానికి దారి తీసింది. దీనిపై నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం నాడు జరిగిన ఘటనపై సర్కార్ చర్యలకు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. శాసనసభా సభ్యత్వాల రద్దు...పదవీకాలం ముగిసే దాక వరకు లేదా ప్రస్తుత సమావేశాలు ముగిసేదాక సస్పెన్షన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

09:13 - March 13, 2018

విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ప్రారంభమైన సభలో స్పీకర్ కోడెల తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఆంజనేయులు పలు ప్రశ్నలను సంధించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావాలని ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఎస్సీ, ఎస్టీలు మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకంజలో ఉంటున్నారని, వీరిని ప్రోత్సాహించే విధంగా అదనంగా వెయ్యి రూపాయలు కేటాయించే విధంగా చూడాలని కోరారు. స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కానీ కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టి..మొక్కలు నాటే విధంగా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే రాష్ట్రం ఇచ్చే నిధులే కాకుండా కేంద్రం అదనంగా నిధులు ఇవ్వాలని కోరారు. 

ఏపీ అసెంబ్లీ...స్టార్ట్...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మంత్రి నారా లోకేష్ పలు ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. 

టి.అసెంబ్లీలో బీజేపీ వాయిదా తీర్మానం...

హెదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పలు పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. తాగునీటి ఎద్దడిపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

08:56 - March 13, 2018

ఆత్మకూరు కాప్స్ ఓవర్ యాక్షన్...

కర్నూలు : ఆత్మకూరు పీఎస్ లో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. న్యాయం కోసం వచ్చిన ఆరుగురిని పోలీసులు చితకబాదారు. ఎస్ బూటుకాలితో విచక్షణారహితంగా తన్నాడని బాధితులు ఆరోపించారు. 

08:20 - March 13, 2018

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం నాడు కొనసాగే ఈ సమావేశాల్లో అనేక అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం నిర్వాసితుల సమస్యలు...సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై...పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన...అమరావతిలో జల రవాణా అభివృద్ధిపై ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంపై లఘు చర్చ చేపట్టనున్నారు. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణపై అత్యవసర ప్రయోజన నోటీసులపై చర్చ జరుగనుంది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి అనేక హామీలిచ్చారని..కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. శాసనమండలిలో సోమవారం సీఎం చంద్రబాబు కేంద్ర వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. 

07:59 - March 13, 2018

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు రణరంగాన్ని తలపించింది. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రసంగం కాపీలను చించివేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్‌సెట్‌ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలి గాయమైంది. వెంటనే ఆయనను సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై టీఆర్‌ఎస్‌ మండిపడింది. మరోవైపు సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో మహేష్ రెడ్డి (టి.కాంగ్రెస్), మన్నె గోవర్దన్ (టీఆర్ఎస్), బి.వెంకట్ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఏపీ శాసనమండలిలో...

విజయవాడ : ఏపీ శాసనమండలిలో రైతులుకు రుణాల మంజూరుపై చర్చ జరుగనుంది. పప్పు ధాన్యాల సాగు అంశం..ప్రభుత్వాసుపత్రుల్లో ఫీజుల వసూలు, ఏకీకృత సర్వీసు నియమాలపై, గిరిజన ప్రాంతాల్లో రేషన్ దుకాణాలపై..ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు పొందడంలో చర్చ జరుగనుంది.

 

ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని...

రంగారెడ్డి : నార్సింగి పరిధిలోని చెరువు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెబెల్ సిటీ అపార్ట్ మెంట్ 18వ అంతస్తు పై నుండి దూకి షేక్ ఆరిఫా (28) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శంషాబాద్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. 

07:47 - March 13, 2018

ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తమకు ఇచ్చే పారితోషకాలు పెంచాలని తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నారు. ఇచ్చే పారితోషకాలను కూడా బకాయిలు లేకుండా ఇవ్వాలని వారు కోరుతున్నారు. వారి సమస్యలు, వారి ఆందోళనకు దారి తీసిన కారణాలు, వారి పట్ల కేంద్ర, రాష్ట్ర విధానాలపై టెన్ టివి జనపథంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు ధనలక్ష్మి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:45 - March 13, 2018

ముక్కోణపు టీ20 సిరీస్‌లో లంకపై భారత్‌ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి మ్యాచ్‌లో ఓడినదానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. టాస్‌ గెలిచిన భారత్‌... శ్రీలంకకు బ్యాటింగ్‌ అప్పగించింది. లంక ఓపెనర్స్‌ కుశాల్‌ మెండిస్‌ 38 బంతుల్లో 55 రన్స్‌ చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్‌ గుణతిలక 17రన్స్‌ చేసి నిరాశపరిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ ఒకటి , రెండు మెరుపులతో నిష్క్రమిస్తున్నా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ చక్కటి షాట్లు కొట్టాడు. ఆడిన తొలి బంతినే సిక్స్‌ కొట్టాడు.

ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఎవరూ భారత్‌ బౌలర్ల ముందు నిలువలేక పోయారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేశారు. 19 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన లంక కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో ఠాకూర్‌ 4వికెట్లు తీయగా... సుందర్‌ 2, చాహల్‌, శంకర్‌, ఉనద్కత్‌ తలా ఒక వికెట్‌ తీశారు. 153 పరుగుల బరిలోకి దిగిన ఇండియా తక్కువ స్కోరుకే ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌ వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ 11 పరుగులకే ఔటై నిరాశపర్చాడు. మంచి ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ కూడా 8 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. జట్టు స్కోరు 22 రన్స్‌ దగ్గర ఓపెనర్ల వికెట్లు కోల్పియింది. ఆతర్వాత వచ్చిన కేఎల్‌ రాహుల్‌, రైనా వేంగా పరుగులు జోడించి రన్‌రేట్‌ పడిపోకుండా చూశారు. వీరు 3.4 ఓవర్లలోనే 40 పరుగులు సాధించారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటుంగా ప్రదీప్‌ బౌలింగ్‌లో రైనా షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. మూడు ఓవర్ల అనంతరం రాహుల్‌ హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి విజయానికి 55 బంతుల్లో 68 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పాండే, కార్తీక్‌ కుదురుకుని... బౌండరీలు బాదుతూ..సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ పని పూర్తి చేశారు. ఇంకా 9 బాల్స్‌ మిగిలి ఉండగానే విజయాన్ని ఖరారు చేశారు. శార్దుల్‌ ఠాకూర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

07:27 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన తనకు... రాజ్యసభ ఎన్నికల్లో పార్టీలకతీతంగా మద్దతివ్వాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌. ఈ మేరకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. అన్ని పార్టీల్లోని బడుగు, బలహీన వర్గాల ఎమ్మెల్యేలు గిరిజన నాయకుడైన తనకు ఈ ఎన్నికల్లో పోటీకి మద్దతు ఇవ్వాలని కోరారు. తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

శ్రీవారి ఆలయం శుద్ధి...

చిత్తూరు : నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉగాది సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు స్వామి వారి దర్శనం కల్పించనున్నారు.

 

జగన్ 111వ రోజు...

గుంటూరు : ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి 111వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని మూర్తినగరం, కొండబొట్లపాలెం, అప్పికట్ల, పుండ్లమ్ క్రాస్, ఏడేరులో జగన్ పాదయాత్ర కొనసాగనుంది.

 

హెడ్ ఫోన్స్ విసిరిన ఘటనపై నేడు నిర్ణయం...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటి ఛైర్మన్ స్వామి గౌడ్ పై హెడ్ ఫోన్స్ విసిరిన ఘటనపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

నేడు పవన్ కీలక సమావేశం...

విజయవాడ : పార్టీ ముఖ్యనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం జనసేన బహిరంగసభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

07:13 - March 13, 2018

గుంటూరు : వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లా బాపట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా నాలుగేళ్ల చంద్రబాబు పాలనలోని లోపాలను జగన్‌ ఎత్తి చూపారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధరలేక రైతులు తల్లడిల్లిపోతున్నారని మండిపడ్డారు.

విజయవాడ : మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి వైసీపీ, బీజేపీలపై ఫైర్‌ అయ్యారు. ఏపీకి అన్యాయం చేయడంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పోటీపడుతున్నాయని విమర్శించారు. ఏపికి ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టలంలో పేర్కొన్న పలు హామీలు నెరవేర్చలేదన్నారు. పార్లెమెంటులో ఏపీ కోసం పోరాడుతోంది టీడీపీ మాత్రమే అన్నారు. ప్రజల సమస్యల పట్ల వైసీపీకి చిత్తశుద్ధిలేదన్నారు. గత ఆరునెలలుగా అసెంబ్లీకి హాజరుకాని వారు.. సంతకాలు పెట్టి భత్యాలు మాత్రం తీసుకుంటున్నారని సోమిరెడ్డి విమర్శించారు. 

07:05 - March 13, 2018

గుంటూరు : జనసేన అవిర్భావ సభలో తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. గుంటూరు జిల్లా కాజలో కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన పవన్‌ కల్యాణ్‌... పార్టీ నిర్మాణం, హోదాపై పోరు సహా భవిష్యత్‌కు సంబంధించిన అన్ని విషయాలను ఆవిర్భావ సభలో వెల్లడిస్తానన్నారు. ఉగాది వరకు అమరావతిలోనే ఉంటానని చెప్పారు. 

06:59 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థుల రాజకీయం రసవత్తరంగా మారింది. రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఖాళీలు మూడు ఉంటే.. బరిలో నలుగురు అభ్యర్థులు ఉన్నారు. దీంతో పోటీ అనివార్యమైంది. దీంతో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. టీఆర్‌ఎస్‌ ముగ్గురు అభ్యర్థులను దింపడం వరకు బాగానే. ఇక్కడే అసలు కథ మొదలైంది. బరిలో కేవలం టీఆర్‌ఎస్‌ ముగ్గురు అభ్యర్థులు ఉంటే ఏ చిక్కా ఉండేది కాదు. పైగా ఎన్నికలు నిర్వహించకుండానే ఏకగ్రీవంగా ముగ్గురు సభ్యులు ఎన్నికయ్యేవారు. కానీ ప్రతిపక్షపార్టీ అయిన కాంగ్రెస్‌ కూడా.. అభ్యర్థిని బరిలో నిలిపింది. గతంతో ఎంపీగ పనిచేసిన బలరాం నాయక్‌ను రాజ్యసభ బరిలో దించుతున్నట్టు ప్రకటించింది. దీంతో పోటీ అనివార్యం అయ్యింది.

వాస్తవానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవడానికే ఎక్కువగా అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం కూడా మద్దతునిస్తోంది. దీంతో అధికారపార్టీ బలం పెరిగింది. మూడు స్థానాలను గెలుచుకునే సంఖ్యా బలం ఆ పార్టీకి ఉన్నది. పార్టీల బలాల బలాలను గమనిస్తే.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి 12, టీడీపీ నుంచి ఏడుగురు, బీఎస్‌పీ నుంచి ఇద్దరు టీఆర్‌ఎస్‌లో చేరారు. వైసీపీ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అంటే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు ఇతర పార్టీలో చేరే వారితో కలుపుకుంటే మొత్తంగా...90మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక వీరికి మరో 7 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. అంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మొత్తంగా 97 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌ ఉందన్నమాట. దీంతో ముగ్గురు అభ్యర్థులను గెలిపించుకోనే బలం టీఆర్‌ఎస్‌కు ఉంది.

ఫార్టీ ఫిరాయింపుల వ్యవహారం చర్చనీయాంశం చేయడమే లక్ష్యం. మరి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎందుకు నిలిపిందనేదే ఇక్కడ చర్చించాల్సిన విషయం. వాస్తవానికి కాంగ్రెస్‌కు ప్రస్తుతం 12మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్‌రెడ్డి, ఓ ఇండిపెండెంట్‌ను కలుపుకుంటే వీరి సంఖ్య 14కు చేరింది. రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి ఈ బలం ఏమాత్రం సరిపోదు. మరి అన్ని తెలిసీ అభ్యర్థిని నిలపడం వెనుక అసలు కథ ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారాన్ని మరోసారి చర్చనీయాంశం చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలిపినట్టు తెలుస్తోంది.

మూడు స్థానాలు ఏకగ్రీవంగా తమకే దక్కుతాయని అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయినా ప్రతిపక్షపార్టీ అభ్యర్థిని నిలపడంతో పోటీ తప్పడం లేదు. అయితే బీజేపీకి 5మంది ఎమ్మెల్యేలు, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మరి వీరు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.

నేటి నుండి హైదరాబాద్ ఫెస్ట్...

హైదరాబాద్ : నేటి నుండి హైదరాబాద్ ఫెస్ట్ కార్యక్రమం జరుగనుంది. ఈనెల 13వ తేదీ నుండి 22 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఫెస్ట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 'మాస్ వాయిస్' ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. 

టి.అసెంబ్లీ 12 రోజులు...

హైదరాబాద్ : బిజినెస్‌ అడ్వయిజరీ మీటింగ్‌లో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 15న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

కోదండరాం పార్టీలోకి దిలీప్ కుమార్ దంపతులు...

హైదరాబాద్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోశించి టీఆర్‌ఎస్‌, బీజేపీలలో పని చేసిన మాజీ ఎంఎల్‌సీ దిలీప్‌ కుమార్‌.... జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ సమక్షంలో ఆయన పెట్టబోయే పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ దిలీప్‌ కుమార్‌ను, ఆయన భార్యను పార్టీలోకి ఆహ్వానించారు. 

14న జనసేన ఆవిర్భావ సభ...

గుంటూరు : ఈనెల 14వ తేదీన గుంటూరులో జరిగే జనసేన అవిర్భావ సభలో తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. గుంటూరు జిల్లా కాజలో కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన పవన్‌ కల్యాణ్‌... పార్టీ నిర్మాణం, హోదాపై పోరు సహా భవిష్యత్‌కు సంబంధించిన అన్ని విషయాలను ఆవిర్భావ సభలో వెల్లడించనున్నారు. 

ఆందోళనను విరమించిన 'మహా' రైతులు...

ముంబై : దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పాలకులను దిగొచ్చేలా చేసింది. రైతుల డిమాండ్లకు మహా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 నెలల్లో అన్ని డిమాండ్లను నెరవేర్చుతామని ఫడ్నవిస్‌ ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. దీంతో రైతులు తమ ఆందోళన విరమించారు.

 

ఖాట్మండులో కూలిన విమానం..50 మంది మృతి...

నేపాల్‌ : రాజధాని ఖాట్మండులో జరిగిన విమాన ప్రమాదంలో సుమారు 50 మంది మృతి చెందారు. బంగ్లాదేశ్‌ నుంచి ప్రయాణీకులతో వస్తోన్న యూఎస్‌ బంగ్లాకు చెందిన విమానం త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కుప్పకూలిపోయింది. విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

2జీ స్కాం కేసు విచారణపై సుప్రీం ఆగ్రహం...

 

ఢిల్లీ : 2జీ స్కాం కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు కేంద్రంపై మండిపడింది. ఈ కేసు విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లను కోర్టు ఆదేశించింది. 2జీ స్కాం విచారణపై స్థాయీ నివేదికను రెండు వారాల్లోగా తమకు సమర్పించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది.

 

 

బీజేపీలో ఎస్పీ సీనియర్ నేత...

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత నరేష్ అగర్వాల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆయనకు కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ పాలన బాగుందని నరేష్‌ అగర్వాల్‌ ఈ సందర్భంగా కొనియాడారు.

తీహార్ జైలులో కార్తీ చిదంబరం...

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కార్తీ చిదంబరంను రిమాండ్‌ అనంతరం సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల జుడీషియల్‌ కస్టడీ విధించింది. మార్చి 24 వరకు ఆయన తీహార్‌ జైలులో ఉండనున్నారు. కార్తికి జైలులో భద్రత కల్పించాలని, వైద్యుడి పర్యవేక్షణలో మందులు ఇవ్వాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. మార్చి 15న కార్తీ బెయిలుపై విచారణ జరగనుంది. 

Don't Miss