Activities calendar
14 March 2018
జనసేనాని రూటు మార్చాడా..? 2019లో కొత్త రాజకీయ శకానికి నాందిపలుకుతాడా? బాబు, లోకేష్ అవినీతిపై గట్టిగా మాట్లాడటం వెనుక వ్యూహమేంటీ ? ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో జనసేనకు స్కోప్ ఉందా ? ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొని, మాట్లాడారు. పవన్ స్పష్టంగా మాట్లాడారని.. చాలా సూటిగా ముందుకొచ్చారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
చక్రాల కుర్చికి అతుక్కుపోయిన దేహం. కదలడానికే సహకరించని శరీరం, మాట్లాడానికి సైతం కంప్యూటరే ఆధారం, అయినా నిలువెళ్లా ఆత్మస్తైర్యం..నిండైన ఆత్మవిశ్వాసం. ఆలోచనల పరంపరతో వైజ్ఞానిక అన్వేషణ, విశ్వ సృష్టి రహస్యాలను చేధించాలన్న తపన కలగలిస్తే అతడే..మానవ మహాద్భుతం స్టీఫెన్ విలియం హాకింగ్. మరణం తర్వాత జీవితం లేదు.. స్వర్గం అనేది ఓ కల్పన. మరణం తర్వాత జీవిత, స్వర్గం, నరకం అనేవి ఏవీ లేవు. ఇవ్వన్ని మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలే. మనిషి మెదడు కూడా కంప్యూటర్ లాంటిదే. విడి భాగాలు పాడైతే కంప్యూటర్ పని చేయదు. అలాగే దేహం కూడా. చేయాల్సింది చాలా ఉంది. అది ఇక్కడే సాధించాలి అంటూ చివరి క్షణం వరకూ శాస్త్రీయ విజ్ఞాన తృష్ణకు, నవీన ఆవిష్కరణలకు తనను తాను అంకితం చేసుకున్న హాకింగ్.. అద్భుత మేదస్సు, అనర్గల కృషికి నిలువెత్తు రూపం, శారీరక వైకల్యం కాదు నేస్తమా.. ఆటంకం సంకల్పమే సమస్త విజయమని చాటి చెప్పిన స్ఫూర్తి ప్రధాత, విశ్వ సృష్టికి మూలం దేవుడు కాదు..గురుత్వాకర్షణ అంటూ ద గ్రాండ్ విజయం గుట్టు విప్పిన హేతువాది. సిద్ధాంతాల లోతుపాతులను వెలికితీసిన సైద్ధాంతిక భౌతికవేత్త.. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అంటూ తన రచనలను కళ్లముందు నిలిపారు. ప్రాణాంతక వ్యాధిని జయించి ఐదు దశాబ్ధాల పాటు అహరం ప్రజా సైన్స్ అందించిన హాకింగ్ నేడు భౌతికంగా దూరమైన వైజ్ఞానిక ప్రపంచంలో ఆయన వెలుగు శాశ్వతం. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ హేతువాది, సైన్స్ ఫర్ సొసైటీ వ్యవస్థాపకులు బాబుగోగినేని, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి, రచయిత సత్యప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. స్టీఫెన్ హాకింగ్ జీవిత విశేషాలు, సైన్స్ గురించి వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష : పవన్ కళ్యాణ్
గుంటూరు : ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఆత్మబలి దానానికైనా సిద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. హోదా కోసం ఒకవేల బలిదానం చేయాల్సివస్తే తానే చేస్తానని మీరు సుఖంగా ఉండాలని యువత, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగువాడి తెగింపు, పోరాట పటిమ భారత ప్రభుత్వానికి రుచి చూపించాలన్నారు. పొట్టిశ్రీరాములు ఇచ్చిన స్ఫూర్తి మనలో ఉందన్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, టీడీపీ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ప్రత్యేకహోదా ఇస్తా మని చెప్పిన ఎన్ డీఏ ఇప్పుడు ఎందుకు మాట మార్చుతుందన్నారు. కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వనప్పుడు టీడీపీ ఎందుకు నిలదీయలేదని...పోరాటం చేయలేదని అడిగారు. ప్రత్యేకహోదా తీసుకురావడంలో టీడీపీ కూడా విఫలం అయిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు.
సమకాలీన రాజకీయ వ్యవస్థ కోసమే జనసేన
సమకాలీన రాజకీయ వ్యవస్థ కోసమే జనసేన పార్టీ ఆవిర్భావించిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సమస్యలపై పోరాటం ఇష్టం, దేశం కోసం పారాడటం ఇష్టమన్నారు. సమకాలీన రాజకీయ వ్యవస్థ కావాలన్నారు. ప్రజలను వంచించి, మోసం చేసి, మభ్యపెట్టి, పబ్బం గడుపుతుంటే...చూస్తూ ఊరుకోలేకనే జనసేన పార్టీ ఏర్పాటు చేయాల్సివచ్చిందన్నారు. 'మీ ఇంట్లో వాడిగా... మీ అన్నగా, మీ తుమ్మడిగా జనసేన పార్టీ పెట్టానని అన్నారు. జనసేన పార్టీ పెట్టి నాలుగేళ్లు అయింది. 'దోపిడీ చేసే వారికి పిరికితనం...మనకు కాదు' అని అన్నారు. 'మనం టంగుటూరి ప్రకాశం పంతులు వారసులం... సైమన్ కమిషన్ వస్తే చొక్కా చింపుకుని కాల్చమని టంగుటూరి నిలబడ్డారు' అని అన్నారు. హోదా, విభజన హామీలను నెరవేర్చాలని కోరామని తెలిపారు. నాలుగేళ్లుగా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తనకు బాధ కల్గుతుందన్నారు. 'చట్టాలను మీరు పాటించనప్పుడు.. ఎందుకు మీ చట్టాలను మేం పాటించాలి' అని అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలిపారు. మిమ్మల్ని పదువులకు ఎక్కించింది..మమ్మల్ని తొక్కడానికా అని
టీడీపీ, బీజేపీ నేతలను ఉద్ధేశించి ప్రశ్నించారు. దేశం, రాష్ట్రంలో ప్రభుత్వాల పాలన కంచే చేనుమేస్తుందన్న చందంగా ఉందన్నారు. పంచాయతీ, మండల్, మున్సిపాలిటి, కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలన్నారు. కార్యకర్తలు, యువత ప్రాణాలు తనకు చాలా విలువైనవి అన్నారు. 'నేను ముఖ్యమంత్రి అల్డుడిని కాదు..ముఖ్యమంత్రి కొడుకుని కాను.. సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకును.. నేను పుట్టింది బాపట్లలో అని తెలిపారు.
రాజకీయాల్లో బాధ్యతగా ఉండాలి
రాజకీయాల్లో బాధ్యతగా ఉండాలన్నారు. సమాజం పట్ల ప్రేమ ఉందన్నారు. తనకు సంఘం, సమాజం, ప్రజలంటే ప్రేమ, ఇష్టమన్నారు. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి.. ఢిల్లీ వారు కాపాడరని పేర్కొన్నారు. రాజు నీతి తప్పితే నేల స్థానం తప్పుతుంది అన్న చందంగా బీజేపీ, టీడీపీ పాలన ఉందన్నారు. విడిపోయిన రాష్ట్రానికి పరిపాలనా అనుభవం ఉండాలని టీడీపీకి సపోర్టు చేశానని తెలిపారు. టీడీపీ మూడు మాటల్లో ఆరు అబద్ధాలున్నాయన్నారు. టీడీపీకి అండగా ఉన్నది... ఏపీ పునర్నిర్మాణానికి కానీ టీడీపీ పునర్నిర్మాణానికి కాదు అన్నారు. ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. రాజకీయాలు చేయడం చాలా కష్టమన్నారు. ఎదురుదెబ్బలు తినాలని, కష్టాలు పడాలన్నారు.
అభివృద్ధి కొందరికేనా...అందరికీ కాదా...
రాజధాని నిర్మాణానికి 15 వందల ఎకరాలు ఉంటే సరిపోతుందని తనకు చంద్రబాబు చెప్పారు. కానీ 33 వేల నుంచి లక్షల ఎకరాల దాకా విస్తరించిందన్నారు. అభివృద్ధి కొందరికేనా...అందరికీ కాదా అని నిలదీశారు. టీడీపీ నేతలు అభివృద్ధి చేయలేదు.. రాష్ట్రానికి రూపాయి రాలేదన్నారు. రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైతే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం వచ్చినట్లుగా ఏపీలో మరో ఉద్యమం రాదా అన్నారు. ప్రత్యేకహోదా విషయంలో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొన్నారు. కేంద్రం, టీడీపీ తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టారని చెప్పారు. సమస్యలపై మాట్లాడానికి వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రారా అని అన్నారు. ఏపీ యువత ప్రాణాలను పణంగా పెట్టను... నా నేల కోసం.. మాతృభూమి కోసం చనిపోయేందుకు సిద్ధమన్నారు. చంద్రబాబు... అమరావతి నిర్మాణం కోసం బాధపడుతున్నారు.. గుంటూరులో కలరా వచ్చి చనిపోతే చంద్రబాబుకు బాధ కల్గదా...అని ప్రశ్నించారు.
కరెప్షన్ అంధ్రా చేసిన టీడీపీ నాయకులు
ఏపీని టీడీపీ నాయకులు కరెప్షన్ అంధ్రా చేశారని విమర్శించారు. లోకేష్ కరెప్షన్ మీ దృష్టికి వచ్చిందా.. అని చంద్రబాబును అడిగారు. టీడీపీకి తను మద్దతు ఇచ్చింది..దోపిడీ చేస్తుంటే చూస్తు ఊరుకోవడానికా అని ప్రశ్నించారు. 2019లో టీడీపీకి ఎందుకు సపోర్టు చేయాలన్నారు. ప్రజలకు హెరిటేజ్ మిల్క్ నుంచి, మీ ఆస్తులు ఖర్చు పెట్టడం లేదు కదా..అని అన్నారు. 'మీరు చేసే పనులకు టంగుటూరి, ఎన్ టీఆర్ ఆత్మలు శోభిస్తాయని అన్నారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగతంగా గొడవలు లేవన్నారు. 2019 లో ప్రజలు కొత్త పార్టీని, కొత్త నాయకున్ని ఎన్నుకుంటారని తెలిపారు. వచ్చే ఎన్నికలు అంత సుఖంగా ఉండవన్నారు. అమరావతి రైతుల నుంచి భూములు తీసుకున్నారని...వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
దోచేవారిని తరిమికొట్టాలి..
డబ్బు దోచేవారిని తరిమికొట్టాలన్నారు. దేశంలో ఎక్కడా లేని అవినీతి విడిపోయిన ఏపీలో ఉన్నందుకు సిగ్గుగా ఉంది. ఫాతిమా కాలేజీ విద్యార్థులు చేసిన తప్పేంటి ? అని అన్నారు. జనసేన జనం కోసం..ఉందని.. ప్రజలకు అండగా ఉంటుందన్నారు. పాలనలో టీడీపీ విఫలం అయింది...నమ్మకం కోల్పోయింది.. ప్రజలకు మోసం చేసిందన్నారు. నెరవేర్చని హామీలను మ్యానిపెస్టోలో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. నేడు..వాడీవేడీ ఉన్న యువత ఉందన్నారు. సరికొత్త రాజకీయ శకం మొదలైందని తెలిపారు. వాస్తవాలు చెప్పండి.. కల్లబొల్లి మాటలు చెప్పవద్దన్నారు. పర్యావరణాన్ని కాపాడేది అభివృద్ధి అని చెప్పారు. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. పర్యావరణాన్ని రక్షించాలని పోరాడిన మహిళ ఆరేటి సత్యవతిని 40రోజులు జైల్లో పెడతారా..అని నిలదీశారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు మహిళా తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే దాడి చేస్తాడా... ఎమ్మెల్యేకు కొమ్ములున్నాయా....అని అన్నారు. తహసీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేస్తే ప్రభుత్వం ఆయనకు కొమ్ముకాస్తుందా అని ప్రశ్నించారు. సహనం చేతకానితనం కాదన్నారు. చాలా భయంకరమైన తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సింగపూర్ తరహా రాజధాని కావాలంటే...సింగపూర్ తరహా పాలన కావాలన్నారు. అభివృద్ధికి జనసేన అడ్డంకి కాదన్నారు. అభివృద్ధి అంటే తనకు తెలుసు అన్నారు. కొంతమంది దగ్గర వేల కోట్లు మూలుగుతున్నాయన్నారు. భూమిని తవ్వితే భూమి తనలోకి లాక్కెళ్తుందన్నారు. ఉద్ధానం సమస్య ప్రభుత్వానికి తెలియదా...? అభివృద్ధి, అవకాశం, అధికారం కొందరికేనా.. అందరికీ దక్కాలి... అన్ని కులాలకు అధికారం, అవకాలు రావాలన్నారు. రాయలసీమ వెనుకబాటుతనానికి భౌగోళిక పరిస్థితి, రాజకీయ నేతలు కారణమన్నారు. రాయలసీమ నుంచి ఎంతమంది సీఎంలు అయిన అభివృద్ధి జరగలేదన్నారు. టీడీపీ నాయకులు ఏ కాలంలో నివసిస్తున్నారని అన్నారు. టీడీపీ, ఎన్ డీఏ ప్రభుత్వాలను కంట్రాక్టు, పదవులు అడగలేదు...ఇప్పించలేదు.. ప్రజలకు మేలు చేయాలని చెప్పాను.. వారు అది చేయలేకపోయారని తెలిపారు. చంద్రబాబుపై ఓటుకునోటు అభియోగాలున్నాయని చెప్పారు. చంద్రబాబు బుద్ధి, ఆలోచన, పద్ధతి మారలేదన్నారు. ఆశించిన దానికి ఆశాభంగం చేశారని మండిపడ్డారు. ఎవరైనా కన్నతల్లిని దోస్తారా...అని అన్నారు. తెలుగు తల్లిని దోచిన టీడీపీ ఎమ్మెల్మేలకు శాపం తగులుందన్నారు. దళిత మహిళల భూములను టీడీపీ నాయకులు లాక్కొన్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎక్కువ కబ్జాలు జరుగుతాయన్నారు. పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. పోరాడితేపోయేది లేదు... ఎదవ బానిస సంకెళ్లు తప్ప అని అన్నారు. చాలా దురదృష్టకర పరిస్థితులు ఉన్నాయని... ఏపీ రాజకీయ చిత్ర పటం మారబోతుందన్నారు. సరికొత్త రాజకీయ వ్యవస్థ వస్తుంది, కావాలన్నారు.
ఆగస్టు 14న జనసేన మ్యానిపెస్టో విడుదల
ఆగస్టు 14న జనసేన మ్యానిపెస్టో విడుదల చేస్తామన్నారు. జనసేన సభ్యత్వం కోసం 9394022222 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి అని అన్నారు. ప్రత్యేకహోదా, సమస్యల పరిష్కారంపై సీపీఎం, సీపీఐ నాయకులతో చర్చలు జరుపుతామని చెప్పారు.
సమస్యలపై పోరాటం, దేశం కోసం పారాడటం ఇష్టం : పవన్ కళ్యాణ్
బీహార్ లో ఆర్జేడీ గెలుపు
యూపీలో ఎస్పీ విజయం
బీజేపీకి వ్యతిరేక పవనాలు
ఢిల్లీ : ఉత్తరాది ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగలింది. యూపీలోని రెండు సిట్టింగ్ స్థానాల్లో కమలానికి ఎదురు దెబ్బ తగలింది. యూపీలో సీఎం యోగీ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ లో కమలం వెనుకబడింది. గోరఖ్ పూర్ లో ఎస్పీ 26 వేల మెజార్టీతో దూసుకెళ్తోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పూల్ పూర్ లోనూ ఎస్పీ విజయం సాధించింది. బీహార్ లోని ఆరారియా లోక్ సభ స్థానంలో ఆర్జేడీ గెలుపొందింది. జహానాబాద్ అసెంబ్లీ స్థానం ఆర్జేడీ ఖాతాలోనే పడింది.
సభా ప్రాంగణానికి చేరుకున్న పవన్ కళ్యాణ్
మేడ్చల్ : జిల్లాలోని జవహార్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కౌకుర్ భరత్ నగర్లో 9వ తరగతి చదువుతున్న మణి అనే బాలుడుని తండ్రి ప్రహ్లాద్ చితక బాదడంతో బాలుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. తండ్రి ప్రహ్లాద్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మేడ్చల్ : జిల్లాలోని కాప్రా పరిధిలోని తులసి ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన జమాల్ అనే వ్యక్తికి ఆరోగ్య శ్రీ కార్డు రాలేదని వైద్యం చేయడానికి నిరాకరించారు డాక్టర్లు. దీంతో వైద్యం అందక జమాల్ ఆస్పత్రిలోనే మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జమాల్ మృతి చెందాడని బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. కోపంతో ఆస్పత్రిలోని అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేతలు తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయడాన్ని చీకటి రోజుగా అభివర్ణించారు బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాష్. హైదారాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడిన బీఎల్ఎఫ్... తెలంగాణ సర్కార్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న అన్నివర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి.. వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు సన్నద్ధం అవుతోందన్నారు.
విశాఖపట్నం : అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రప్రభుత్వం నిర్వీర్యం చేసే పనిలో పడిందని సీఐటీయు రాష్ర్ట అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు విమర్శించారు. విశాఖలో డ్రెగ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాల్యేషన్ కమిటీని అడ్డుకుంటామని ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం మార్చి 15న తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వాటాలు అమ్మేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... తన వైఖరిని మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
ఢిల్లీ : నిజాం పాలనను తలపించేలా తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన ఉందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని తెలుసుకోవడానికి చంద్రబాబుకు నాలుగేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 25 నుండి 29 వరకు కేరళలోని కొల్లాంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే అంశంపై చర్చిస్తామని నారాయణ తెలిపారు.
విజయవాడ : సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకోవడం ఏ మాత్రం సరైంది కాదని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 2016 సెప్టెంబర్ 6న కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం పెట్టిన బాబు ఇప్పుడు ప్రత్యేక హోదా పల్లవి అందుకోవడం ఏంటని ప్రశ్నించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : శాసనసభలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అక్షర సత్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ స్పీచ్ విషయంలో విపక్షాలు రకరకాల రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదువుతారని అన్నారు. గవర్నర్ స్పీచ్‌కు కేబినెట్ ఆమోదం తెలుపుతుందని చెప్పారు. ప్రభుత్వం సాధించుకున్న లక్ష్యాలను.. నిర్దేశించుకున్న లక్ష్యాలను గవర్నర్ సభలో చదవి వినిపించారన్నారు. ఇందులో ఎలాంటి అసత్యాలు లేవని కేసీఆర్ సభలో అన్నారు. సభ్యులు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని సీఎం అన్నారు.
రాష్ట్ర అప్పులపై సీఎం కేసీఆర్ వివరణ
రాష్ట్ర అప్పులపై సీఎం కేసీఆర్ శాసనసభలో వివరణ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచి ఇచ్చిన అప్పు 72 వేల కోట్ల రూపాయలు అని తెలిపారు. ఈ రోజు నాటికి పాతవి, కొత్తవి మొత్తం కలిసి అప్పు1 లక్షా 42 వేల కోట్ల రూపాయలని చెప్పారు. నాలుగేళ్లలో 72 వేల కోట్ల అప్పుమాత్రమే చేశామన్నారు. ప్రతిపక్షాలు.. 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చారనడం సరికాదన్నారు. అప్పుల వివరాలు కాగ్, ఆర్బీఐతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద కూడా ఉంటాయని కేసీఆర్ చెప్పారు. 23 జిల్లాల ఏపీ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు క్యాపిటల్ ఖర్చు 1 లక్షా 29 వేల 683 కోట్లని చెప్పారు. జానాభా ప్రకారం తెలంగాణకు 54 వేల కోట్లు ఖర్చు పెట్టాలని అంత ఖర్చుపెట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో తెలంగాణ క్యాపిటల్ ఖర్చు 1.25 కోట్లు అని కేసీఆర్ చెప్పారు.
ట్యాంక్‌బండ్‌పై ధర్నాలు, నిరసనలు నిషేధించాం : కేసీఆర్
ట్యాంక్‌బండ్‌పై ధర్నాలు, నిరసనలు నిషేధించామని సీఎం కేసీఆర్ శాసనసభా సాక్షిగా తేల్చిచెప్పారు. నిరసనకారుల పట్ల కఠినంగానే ఉంటామన్నారు. చంద్రబాబు హయాంలో నిషేధాజ్ఞలు తీసుకువచ్చారు. అనుమతి లేకున్నా, కోర్టు వద్దన్నా ధర్నాలు చేస్తామంటే తాము అనుమతించమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలపాలన్న ఆయన.. బస్సు యాత్రలు, పాదయాత్రలు ఆపామా? అని ప్రశ్నించారు. పరిమితికి లోబడి నిరసన తెలిపితే ఎవరైనా స్వీకరిస్తారని కేసీఆర్ అన్నారు.
తూర్పుగోదావరి : రాజమండ్రిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్నట్లు తలపడ్డాయి. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురెదురుగా తలబడి నినాదాలు చేసుకున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గోకవరం బస్టాండ్ వద్ద నున్న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేయగా వివాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీలు హోరా హోరిగా నినాదాలు చేసుకోవటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్క దిద్దారు.
ఢిల్లీ : పార్లమెంటులో తామెప్పుడు హెడ్‌పోన్‌లు విసిరేయడం, కాగితాలు చించివేయడం లాంటి ఘటనలకు పాల్పడలేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. సభలో తాము రిజర్వేషన్ల కోటా పెంచాలని మాత్రమే ప్లకార్డులతో నిరసన చేస్తున్నామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు చేసినట్లుగా... తాము ప్రవర్తించలేదన్నారు.
ఢిల్లీ : రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లపై రాష్ట్రాలకే అధికారం ఉండాలని టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. తమిళనాడు, మహారాష్ట్రకో నీతి ఉన్నప్పుడు తెలంగాణలోని రిజర్వేషన్లపై కేంద్రం పెత్తనం ఏంటని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.
జనసేన సభలో ఉద్రిక్తత..
సీఈసీ ఆశ్రయించిన టీ.కాంగ్రెస్..
తుది దశలో బాబ్రి మసీదు కేసు..
అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..
గుంటూరు : జనసేన ఆవిర్భావ సభకు జన సైనికులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. నాగార్జున యూనివర్శిటీలోని 14 ఎకరాల సభా ప్రాంగణం జన సునామీని తలపిస్తోంది. ఇప్పటికే సభా ప్రాంగంణం నిండిపోయింది. అభిమానులకు జనసేన తగిన ఏర్పాట్లను చేసింది. రెండు రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో విజయవాడ, గుంటూరు రహదారులు కిక్కిరిసిపోయాయి. సాయంత్రం 5 గంటలకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ సభలో పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను పవన్ వివరించనున్నారు.
శరవేగంగా దేశ రాజకీయాలు : చంద్రబాబు
రేపు ఈటల బడ్జెట్ ప్రవేశం..
జనసేనా సభకు భారీగా అభిమానులు..
మెదక్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజీ కృషి చేస్తోంది. ఈ మేరకు కాలేజీలో ఇండియన్ ప్రోకార్ట్ ఎన్డ్యూరెన్స్ చాంపియన్ షిప్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. ఈ నెల 13 నుండి 16 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 36 టీమ్‌లు, వెయ్యి మంది విద్యార్థులు పాల్గోనున్నారు. బీవీఆర్ఐటీ కాలేజీ నుండి 4 టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఈ పోటీలతో ఇంజనీరింగ్ విద్యతో పాటు వాహనాల తయారీలోనూ విద్యార్థులకు పూర్తిగా అవగాహన వస్తుందని విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు తెలిపారు.
ప్రతీ మండలానికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ : కేసీఆర్
క్రిష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో హెచ్ఐఎల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భద్రతను ప్రతి ఒక్కరూ తమజీవన శైలిలో భాగంగా చేసుకోవాలని వారు సూచించారు. పనిప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో ఓ వివాహం ఆగిపోయింది. పెళ్లికి అన్నీ సిద్ధమయ్యాక ముహూర్తం ఆలస్యమైందంటూ పెళ్లి మండపం నుండి పెళ్లి కూతురు వెళ్లిపోయింది. దీంతో పెళ్లి కొడుకు బంధువులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.
భేటీ కానున్న టీడీపీ సమన్వయ కమిటీ..
ఢిల్లీ : ఉత్తరాది ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి తగులుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని రెండు సిట్టింగ్ స్థానాల్లో కమలం పార్టీ వెనకబడింది. యూపీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌లో.. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫూల్పూర్లోనూ బీజేపీ వెనకబడింది. ఇక బీహార్‌లోని ఆరారియాలో ఆర్జేడీ ముందంజలో ఉంది. ఇక గోరఖ్‌పూర్‌లో మీడియాపై ఆంక్షలు విధించారు. కౌంటింగ్ వివరాలు బయటకు వెల్లడించకుండా అధికారులు నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది.
బీజేపీ పతనం ఆరంభం : మమత
బద్ధలైన కాషాయ కోట..
హైదరాబాద్ : రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ చేయిస్తామని అన్నారు. అందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సభ్యులకు సభ నుంచి బయటికి వెళ్లేందుకే ఇష్టపడుతున్నారని తెలిపారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఏ కార్యక్రమాన్ని అయినా పోత్సహించమన్నారు. కాంగ్రెస్ కుచ్చిత రాజకీయాలు మానుకోవాలన్నారు. ప్రాజెక్టులపై స్టేలు తేవడం పారాకాష్టకు చేరుకుందని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.... అరాచక పద్ధతులు అవలంభిస్తున్నారని మండిపడ్డారు.
లా అండ్ ఆర్డర్ లో మార్పులు: సీపీ సజ్జనార్
కారుణ్య మరణాలు అంటే ఏమిటి ? అనే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. కారుణ్య మరణం అంటే స్వచ్ఛందంగా చనిపోవడానికి అనుమతి కోరడమని తెలిపారు. కొంతమంది అచేతనంగా ఉంటారని, తీవ్ర అనారోగ్యంగా ఉంటారని చెప్పారు. 17 దేశాల్లో మెర్సింగ్ కిల్లింగ్ ఉందని.... మనదేశంలో లేదని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
సీన్ రివర్స్, పెండ్లి కుమార్తె జంప్?!..

సినిమా ఇండ్రస్ట్రీలో మరో వారసుల అరగ్రేటం జరుగనుంది. ఇప్పటికే సినిమా పరిశ్రమలో వారసుల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో స్టార్ నటుడి వారసురాలు అరంగ్రేటం చేయనుంది. కాగా ఈ వారసత్వం పురుషులే ఎక్కువగా వున్నారనేది తెలిసిన విషయమే. కానీ సదరు సెలబ్రిటీ కుమార్తెలు రావటం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్ షాగా పేరొందిన షారూఖ్ కాన్ కుమార్తె అరగ్రేటం చేసేందుకు ఉత్సాహపడుతోంది.
అందరి దృష్టీ సుహానే మీదే :
ఇప్పుడు అందరి దృష్టి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్పైనే పడింది. కొద్ది రోజులుగా సుహానా ఎంట్రీపై పలు చర్చలు జరుగుతుండగా, షారూఖ్ భార్య గౌరీ ఖాన్ ఓ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ‘హలో... హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన గౌరీఖాన్ ‘సుహానా ఒక మ్యాగజైన్ కవర్‌పేజీ కోసం షూటింగులో పాల్గొన్న ఆమె ఆ మ్యాగజైన్ అనేది చెప్పలేదామె.ఈ ఏడాది ఎగ్జయిటింగ్ మూవ్మెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని గౌరీ ఖాన్ అన్నారు. అంటే షారూఖ్ భార్య చెప్పిన మాటలని బట్టి చూస్తుంటే సుహానా తెరపై కనిపించేందుకు ఇంకెంతో టైం పట్టదని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే షారూఖ్.. సుహానే చదువు పూర్తయిన తర్వాత బాలీవుడ్‌లోకి ఆమె ప్రవేశిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. పలు నాటకాలలో నటించిన సుహానే తన తండ్రితో పాటు ఎందరో మనసులు దోచుకుంది. అందుకే సుహానే వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. సుహానే అప్పుడప్పుడు తన ఫోటోలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ నెటిజన్స్‌కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే షారూఖ్ జీరో చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షారూఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. ఆయన సరసన కత్రినా కైఫ్, అనుష్క శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. మరి సుహానే తండ్రిలా మెప్పిస్తుందో లేదో చూడాల్సిందే.
హైదరాబాద్ : రైతు రుణమాఫీ ఒకేసారి చేయడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. రుణమాఫీపై కేంద్రానికి అనేకసార్లు లేఖలు రాశానని తెలిపారు. లెక్కలు అబద్ధాలు చెప్పడం ఉండదన్నారు. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు అప్పు చేయడం కుదరదని తెలిపారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని వాస్తవాలేనని అన్నారు. ఎక్కడ ఆందోళన చేసినా పోలీసుల అనుమతి తప్పనిసరి ఉండాలన్నారు. నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. 17 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో 17 వేల చెరువులు తవ్వామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు విపక్షాల కళ్లకు కనపడం లేదని.. కళ్లకు చికిత్స చేయించుకుంటే బాగుటుందని హితవు పలికారు. గాలి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆన్ లై న్ టెండర్లలో అవినీతి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాలన్నారు. తెలంగాణలో రాజకీయ సుస్థిరత ముఖ్యమన్నారు. నిన్న తనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు.
బాలీవుడ్ నటుడు మృతి..
రాష్ట్ర అభివృద్ధి కోసం వేలాది పరిశ్రమలు : కేసీఆర్
పేదల కోసం లక్ష ఇళ్లు : కేసీఆర్
ట్యాంక్ బండ్ పై నిరసనలు నిషేధం : కేసీఆర్
తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెసే : కేసీఆర్
నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి : కేసీఆర్
మాది ప్రజాస్వామ్య పాలన కేసీఆర్

హైదరాబాద్ : ఆనాటి నుండి ఈ నాటి వరకు తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుండి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం..ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని కేసీఆర్ సమర్థించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు..ఏర్పడిన తరువాత కాంగ్రెస్ విలన్ గా ఉందన్నారు. 1999లో ఉద్యమం ప్రారంభం అయ్యిందని..వేల గంటలు చర్చ చేయడం జరిగిందన్నారు. 2001లో ఏప్రిల్ 21 కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో ఉద్యమం ప్రారంభించడం జరిగిందని, తెలంగాణ ఈ విధంగా నాశనం కావడానికి విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అని జలదృశ్యంలో పేర్కొనడం జరిగిందన్నారు. తాను బాధ్యత లేకుండా ఈ విషయం చెప్పలేదని..ఆ నాటి నుండి ఈ నాటి వరకు కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉందన్నారు. 1969లో కూడా కాంగ్రెస్ విలన్ అని సభకు తెలిపారు. ఇంకా ఏమీ మాట్లాడారో వీడియోలో చూడండి.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు..ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని..వస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఇటీవలే కోదండరాం నిర్వహించతలపెట్టిన మిలియన్ మార్చ్ కు అనుమతినివ్వలేదనే విషయం తెలిసిందే. వీటిపై శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు...ట్యాంక్ బండ్ అయితే ఏందీ...శాసనసభా సమావేశాలు జరుగుతుంటే ఇవ్వాలా అంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరూర్ నగర్ దగ్గర పెట్టుకోవాలని...చెప్పామని..సరూర్ నగర్ అయితే ఏందీ ? ఏ నగర్ అయితే ఏందీ అని పేర్కొన్నారు. పరిమితికి లోబడి నిరసన వ్యక్తం చేస్తే ఎవరైనా స్వీకరిస్తారని, పర్మిషన్ లేకున్నా చేస్తాం..ఇష్టపూర్వకంగా తాము కోరుకున్న చోటే ధర్నాలు..ఆందోళనలు చేస్తామంటే తప్పకుండా పర్మిషన్ ఇవ్వమని ఖరాఖండిగా చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నామని ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం అక్షరసత్యమని...అప్పులు పెరిగాయని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది అసత్య దూరమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి చేసిన ప్రసంగం అసత్యదూరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం నెలకు రూ. 10,500 వేల కోట్లు ఉంటుందని...
ఎంత అప్పు చేశామో..ఎవరి దగ్గర అప్పు చేశామో..తదితర వివరాలు ఆర్బీఐ దగ్గర ఉంటుందని..దీనికి సంబంధించిన డబ్బు ప్రతిదీ కట్ చేయించడం జరుగుతోందన్నారు. రూ. 5 నుండి రూ. 6వేల కోట్ల రూపాయలు వివిధ చెల్లింపులు చేయాల్సి వస్తుందన్నారు. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలా చేయడం సాధ్యం కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటికి రూ. 72 వేల కోట్ల రూపాయలు అప్పు కేటాయించడం జరిగిందని ప్రస్తుతం రూ. 1.42వేల కోట్లు అప్పు ఉందన్నారు.
23 జిల్లాలున్న సమయంలో పది సంవత్సరాల క్యాపిటల్ ఎక్స్ పెండించర్ రూ. 1, 29,683 కోట్లు...ఇందులో జనాభా ప్రకారం రూ. 54వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉండేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1,24,966 కోట్లు క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ సాధించడం జరిగిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో అనిన్ వాస్తవాలే ఉన్నాయని, కొందరు కావాలని దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. రైతు రుణమాఫీపై కేంద్రానికి అనేకమార్లు లేఖలు రాయడం జరిగిందని, ఒకేసారి రుణమాఫీ చేయడం సాధ్యం కాదని ఆర్బీఐ ఒప్పుకోకపోవడంతో నాలుగుసార్లు చేయడం జరిగిందన్నారు.
'తెలంగాణ ఆదాయం నెలకు రూ. 10,500 వేల కోట్లు'...
1999లో తెలంగాణ ఉద్యమం - కేసీఆర్...

గుంటూరు : కాసేపట్లో గుంటూరులో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఇందుకోసం జనసేన నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నాగార్జున యూనివర్సిటీ ఎదుట 14 ఎకరాల స్థలంలో సభ జరగనుంది. సభలో పాల్గొనేందుకు పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

ఢిల్లీ : పార్లమెంట్లో వైసీపీ ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గేట్ నెంబర్.1 దగ్గర ప్లకార్డులతో వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు వచ్చేవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ సమాయత్తమవుతుంది. వివిధ పార్టీల అధ్యక్షులు, ఎంపీలకు జగన్ లేఖలు రాయనున్నారు. కేంద్రంపై అవిశ్వాసానికి పార్టీలను ఏకం చేసేందుకు వైసీపీ యత్నిస్తోంది.
ఢిల్లీలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. రోజుకో వేషధారణతో వినూత్న నిరసనలు తెలుపుతున్న ఎంపీ శివప్రసాద్... ఈరోజు జీసస్ వేషధారణలో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ : లోక్‌సభలో తెలుగు ఎంపీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విభజన హామీలపై ఏపీ ఎంపీలు, రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీలు సభలో నిరసనలు తెలిపారు. మరోవైపు ఎంపీల నిరసనల మధ్యే ఆర్థికమంత్రి బిల్లులు ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే.. మూజువాణి ఓటుతో ఆర్ధిక బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం సభ్యుల గందరగోళం నెలకొనడంతో... సభ రేపటికి వాయిదా పడింది.

హైదరాబాద్ : తమ శాసనసభ సభ్యత్వం రద్దుపై కాసేపట్లో ఇద్దరు టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని... ప్రోసీడింగ్ ప్రాపర్‌గా జరగలేదని వాదనలు వినిపించనున్నారు. తమ వివరణ తీసుకోకుండానే సభ్యత్వాల రద్దు రూల్స్‌కు విరుద్ధమని ఇద్దరు సభ్యులు వాదించనున్నారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరనున్నారు. మధ్యాహ్నం తరువాత పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వంపై టీ.కాంగ్ పిటీషన్..

హైదరాబాద్ : నగరం చేపట్టే మిషన్ భగీరథ పథకం చేపట్టడం జరుగుతోందని ఎక్కడైతే నీళ్లు లేవో మొదట కనెక్షన్లు ఇవ్వడం జరుగుతోందని..కొన్ని చోట్ల నీళ్లు రావడం లేదని చెబుతున్నారని..వీటిపై దృష్టి సారించడం జరుగుతోందన్నారు. రెండేళ్లు వర్షాలు పడకపోయినా...కరవు వచ్చినా ఎదుర్కొవడానికి రిజర్వాయర్లు నిర్మించడం జరుగుతోందన్నారు. కేశవాపురం టెండర్ కూడా పూర్తయ్యిందని..త్వరలో పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ పథకంలో కొన్ని సాదక బాధలున్నాయని, కొన్ని సమస్యలను సభ్యులు ప్రస్తావించారని ఆయా సమస్యలు పూర్తి చేస్తామన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
కేటీఆర్ బంధువునంటు వ్యక్తి వీరంగం..
స్టీఫెన్ హాకింగ్ ఎప్పటికీ స్ఫూర్తే : కేసీఆర్
యూపీలో బీజేపీకి ఎదురు గాలి..
లోక్ సభలో నిరసనల పర్వం..
తులసి ఆసుపత్రిలో దారుణం..

విజయవాడ : విభజన అనంతరం ఏపీకి కేంద్రం చేసిన సహాయంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఈ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రానికి కేంద్రం ఏటా వేల కోట్ల రూపాయలు ఇస్తుంటే ఏమి చేయలేదని ఏపీ మంత్రులు..టిడిపి నేతలు చెప్పడం కరెక్టు కాదని విమర్శించారు. దీనిని ఏపీ మంత్రి యనమల తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. కేంద్ర పన్నుల్లో వచ్చే వాటాను కూడా బీజేపీ నేతలు సహాయం కింద పరిగణించడం కరెక్టు కాదన్నారు. 2014-15 సంవత్సరానికి రూ. 37 వేల కోట్లు...2015-16లో రూ. 43,564 కోట్లు..2016-17 లో రూ. 49, 845 కోట్లు...12-03-2018 వరకు 17-18 సంవత్సరానికి 49, 137 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ఇంత ఇచ్చినా కేంద్రం ప్రభుత్వం అన్యాయం చేస్తోందని..బీజేపీ డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
త్వరలో జిల్లా స్థాయిలో పోరాటం : చంద్రబాబు

విజయవాడ : ఏపీలోని సంస్కృతి..కళలు..సంప్రదాయాలను కాపాడటానికి ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోందని ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. భారతదేశం గురించి..మాట్లాడితే సంస్కృతి..సంప్రదాయాలు గుర్తుకొస్తాయని, ఏపీలో 13 జిల్లాలున్నాయని ఇక్కడి మాట్లాడే భాష..యాస...ఒక్కో రకంగా ఉంటుదన్నారు.
ప్రతొక్క గ్రామంలో సర్వే చేయిస్తే నేర్చుకోవాల్సినవి...బయటకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. ప్రతొక్క గ్రామ స్థాయిలో సర్వే చేయించి కళలు..సంస్కృతి..ఇతర వాటిని బయటకు తీసుకొచ్చే విధంగా ఒక ప్రాజెక్టు రూపొందించడం జరిగిందన్నారు. వచ్చిన సమాచారాన్ని డిజిటల్ కింద మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు, భావితరాలకు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు.

విజయవాడ : మంత్రి భూమా అఖిల ప్రియ ఇచ్చిన సమాధానం పట్ల టిడిపి సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మోదుగుల పలు ప్రశ్నలు సంధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...సంస్కృతిని..చరిత్రను మరిచిపోతే వేళ్లూలేని చెట్టులాగా అయిపోతుందని పెద్దలు పేర్కొన్నారని, హస్తకళలు..ఇతర కళలు కనుమరుగై పోయాయ్యాయని తెలిపారు. బడ్జెట్ లో కేటాయించిన విధంగా నిధులు కేటాయించడం లేదని, ప్రాచీన భాషా ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. ఏ హెరిటేజ్ కాపాడుతున్నారు ? రాష్ట్ర ప్రభుత్వం ఉన్న హెరిటేజేస్ ను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకొంటోంది ? చెప్పాలన్నారు. సంస్కృతిని కాపాడుకొంటూ భావితరానికి అందించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకొంటారనే దానిపై సమాధానం చెప్పాలని కోరారు.
కేంద్రానికి మిత్రం పక్షం టీడీపీనా? వైసీపీనా : బాబు

విజయవాడ : విభజన హామీలు..ప్రత్యేక హోదా అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం కాకపోవడం గమనార్హం. గత కొన్ని రోజులుగా టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల ప్రారంభమైనప్పటి నుండి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి రోజు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాబు వారికి దిశా..నిర్ధేశం చేస్తున్నారు.
బుధవారం కూడా ఎంపీలతో బాబు మాట్లాడారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం అన్యాయమని, పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు తీరును సమీక్షించే విధంగా ఒత్తిడి తేవాలని సూచించారు. ఏపికి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి న్యాయం జరిగేంతవరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. టిడిపి ఎంపీలను కలవడానికి ఇష్టపడని కేంద్ర మంత్రులు వైసీపీ ఎంపీలతో భేటీ అవుతున్నారని, ఈ సమాచారాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని సూచించారు. ఇక శాసనసభ..మండలిలో విస్తృతంగా చర్చించడం జరుగుతోందని..ఏదో ఒక విధంగా కేంద్రంపై తమ నిరసన తెలియచేయడం జరుగుతోందని, ఇదే విధంగా పోరాటం కంటిన్యూ చేయాలని సూచించారు.

హైదరాబాద్ : త్వరలో కేసీఆర్ కుటుంబం జైల్లో ఉంటుందని..ఇందుకు తాము పోరాటం చేస్తామని శాసనసభ సభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జరిగిన ఘటనలో టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మంగళవారం స్పీకర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనితో కోమటిరెడ్డి..సంపత్ లు గాంధీ భవన్ వద్ద 48గంటల పాటు దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి టెన్ టివితో మాట్లాడారు. రాజ్యాంగాన్ని అణదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనిని కాంగ్రెస్ అడ్డుకొంటోందన్నారు. తాము చేసిన ఆందోళనపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సింది పోయి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. దీనిపై తాము పోరాటం చేస్తున్నామని, హైకోర్టుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. రోజా సస్పెండ్ చేసిన సమయంలో సంవత్సరం పాటు విచారణ చేశారన్నారు.
మాజీ మంత్రి చిన్నారెడ్డి...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికం వ్యవహరిస్తోందని..కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఇందుకా అని మాజీ మంత్రి చిన్నారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని, స్వామిగౌడ్ కు ఎలాంటి దెబ్బ తగలలేదన్నారు. హెడ్ ఫోన్ స్వామిగౌడ్ కు తగిలినట్లుగా వీడియో ఫుటేజ్ చూపించలేదన్నారు. నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి వారు నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. తాము కూడా కోర్టుకు వెళుతున్నట్లు తెలిపారు. చిట్ట చివరి బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష వాయిస్ వినిపించవద్దని ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనాసాగుతున్నాయి. మూడో రోజు ప్రారంభమైన సభలో డిప్యూటి స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మంగళవారం ప్రతిపక్షం కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశ్నోత్తరాలను సభ్యులు సింగరేణిపై పలు ప్రశ్నలు సంధించారు. టీఆర్ఎస్ సభ్యుడు నల్లాల ఓదేలు ప్రశ్నలు అడగకుండా ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రశ్న అడగాలని..డిప్యూటి స్పీకర్ పలు మార్లు సూచించినా నల్లా ఓదేలు వినిపించుకోలేదు. చివరకు ఆయన ప్రశ్న అడిగిన అనంతరం జలగం వెంకట్రావు మాట్లాడారు.శ్రీరాంపూర్ లో ఆరు కొత్త బావులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, 14 లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తారని, కానీ ఇక్కడ ఉపయోగిచే టెక్నాలజీ పాతదని తెలిపారు. ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మైనింగ్ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతోంది ? ఉపాధి ఎంత మందికి కల్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

హైదరాబాద్ : కొందరి మరణం సంచలనం. మరికొందరి మరణం మిస్టరీ. ఇంకొందరి మరణం మాత్రం ప్రపంచానికే లోటు మారిపోతుంది. ఇటువంటి అరుదైన,అద్భుతమైన, అద్వితీయమైన వ్యక్తులు అతి కొద్దిమంది మాత్రమే వుంటారు. అటువంటి అరుదైన అఖండ మేధావుల్లో ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ప్రపంచంలో ఎంతోమంది మేధావులు వున్నారు. కానీ అరుదైన, మానవీయ మేధావి మాత్రం స్టీఫెన్ హాకింగ్ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొందరి మేధస్సు వారి ఇంటికే పరిమితమవుతుంది. మరికొందరి మేధస్సు వారి వ్యాపార విస్తరణకు,వారి అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ అతి కొద్దిమంది మాత్రమే ప్రపంచ మానవాళి మనుగడకు, వారి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అదిగో అటువంటి మేధావుల్లో ప్రధముడిగా నిలుస్తారు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఖగోళ రంగంలో ఆయన ముద్రను ఎవ్వరు అధిగమించలేరు. అటువంటి మేధావిని కోల్పోయిన ప్రపంచం కేవలం ఒక మేధావినే కాదు అద్భుతమైన మానవత్వాన్ని కోల్పోయింది.
స్టీఫెన్ హాకింగ్ మానవీయతకు నిలువెత్తు రూపం స్టీఫెన్
స్టీఫెన్ హాకింగ్ మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. చరిత్రలో పొత్తిళ్ళలో భద్రంగా దాచుకోదగిన ఆణిముత్యం. జీవన యుద్ధంలో తనను కునారిల్లేలా చేయిన అంగవైకల్యాన్ని సైతనం ఓడించి.. దాన్ని సవాల్ చేసిన నిలబడిన ఆత్మవిశ్వానికి నిలువెత్తు నిదర్శనం స్టీఫెన్ హాకింగ్. ఈ శతాబ్దంలో `స్టీఫెన్ హాకింగే` ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ, అఖండ మేధస్సుకు నిలువెత్తు నిదర్శనం స్టీఫెన్ హాకింగ్ అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. స్టిపెన్ హాకింగ్ గా ప్రసిద్ధి చెందిన ఆయన పూర్తి పేరు స్టీఫెన్ విలియం హాకింగ్. చచ్చుపడిపోయిన కాళ్ళు…మూగబోయిన గొంతు…ఎటూ కదల్లేక చక్రాల కుర్చీలో గడిచిపోతున్న జీవిత. కానీ ఖగోళ శాస్త్ర పరిశోధనలో చరిత్ర సృష్టించిన మహోన్నత మానవ రూపం…నిత్యం చైతన్య జ్వలితం ఆయన జీవితం. ఈ తరానికే కాదు భవిష్యత్ తరానికి కూడా ఆదర్శవంతంగా ఆయన జీవితం.
ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ జనించిన స్టీఫెన్ :
నిత్య చైతన్యం ఆయన మేధస్సు. తేజోరూపం స్టీఫెన్ హాకింగ్. రిగ్గా ఇదే రోజు 1942 జనవరి 8న ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ ఆయన జన్మించిన ఆయన తండ్రి లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. అక్కడే స్టీఫెన్ జన్మించారు. భౌతిక శాస్త్రం డిగ్రీ అందుకున్న స్టీఫెన్ 1962లో కాస్మాలజి, జనరల్ రిలేటివిటీ పరిశోధనల కోసం ఆక్స్ ఫర్ద్ కి వెళ్ళారు.
`మోటార్ న్యూరాన్ వ్యాధి` బారిన పడిన స్టీఫెన్
త్వరలోనే పి.హెచ్.డి అందుకోవాల్సిన సమయంలో స్టీఫెన్ ను తీవ్రమైన వ్యాధి వెంటాడింది. స్టీఫెన్ శరీరం ఏ పనికీ సహకరించలేదు. పరీక్షలు చేసిన వైద్య నిపుణులు స్టీఫెన్ కు భయంకరమైన `మోటార్ న్యూరాన్ వ్యాధి` సోకినట్టు నిర్ధారించారు. నరాలు, వెన్నపూసపై ప్రభావం చూపించే ఈ వ్యాధిని `ఆర్మీట్రోఫిక్ లేటరల్ స్కిలోరోసిస్` అని కూడా అంటారు. డాక్టరేట్ కూడా అందుకోకుండానే స్టీఫెన్ మరణించవచ్చని అందరూ భావించారు. అయితే, విధిని ఎదిరించారు. మొక్కవోని దీక్షతో, పట్టుదలతో పిహెచ్ డి పూర్తి చేయటమే కాక ఖగోళ శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి ప్రపంచానికి అందించారు. ఆయన `కృష్ణ బిలాలు`పై పరిశోధన చేసి అనేక ఫలితాలను రాబట్టారు. `హాకింగ్స్ రేడియేషన్` గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ సిద్ధాంత కర్తగా స్టీఫెన్ హాకింగ్ ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించారు. 1970 నుంచి ఆయన కృష్ణ బిలాలపై పరిశోధనలు చేశారు. జనరల్ రిలేటివిటి, క్వాంటమ్ థియరీ ఆధారంగా కృష్ణ బిలాలు కూడా `ధార్మిక శక్తి`ని కలిగి ఉంటాయని తన పరిశోధనల ద్వారా తెలియచెప్పారు.
`కృష్ణ బిలాల`కు సంబంధించి పలు రచనలు :
1971 నుంచి `బిగ్ బ్యాంగ్`పై పరిశోధనలు ప్రారంభించిన ఆయన `కృష్ణ బిలాల`కు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో “ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్“ పుస్తకరచన ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని తయారు చేసుకున్నారు. దాని సాయంతోనే `ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్“ రచనను పూర్తి చేసి 1988లో ఆ పుస్తకాన్ని మార్కెట్ లోకి విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో విడుదలైన ఆ పుస్తకం అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. `కాలం కథ` పేరుతో తెలుగులో కూడా ఆ పుస్తకం విడుదలైంది. పదేళ్ళ తరువాత 1998 లో ఆ పుస్తకం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. 1975 నుంచి 2006 వరకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రఖ్యాత అవార్డులు అందుకున్నారు. 1975లో ఎడింటంగ్ అవార్డు అందుకున్న ఆయన ఆ తరువాత రాయల్ సొసైటీ హ్యుస్ మెడల్ ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్, కంపానియన్ ఆఫ్ ఆనర్, రాయల్ సొసైటీ కాప్లీ వంటి అనేక ప్రసిద్ధ అవార్డులను అందుకున్నారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా అనేక సేవలందించిన స్టీఫెన్ హాకింగ్ మృతి చెందటం ప్రపంచానికే లోటు అనటంలో ఎటువంటి సందేహం లేదు.

లండన్ : ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సంతాపం తెలియచేశారు. ప్రపంచ మేధావి వర్గంలో ఆయనది ఓ ప్రత్యేకమైన స్థానం ఉందనే సంగతి తెలిసిందే. ఖగోళ శాస్త్ర రంగంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివి అనే సంగతి తెలిసిందే. అల్బర్ట్ ఐన్ స్టీన్ తరువాత అంతటి పరిశోధనలు చేసిన వ్యక్తిగా పేరొందారు.
1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో ఆయన జన్మించారు. స్టీఫెన్ తండ్రి వృత్తిరీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. 1963 నుండి న్యూరాన్ వ్యాధితో వీల్ ఛైర్ కే పరిమితమయ్యారు. కనీసం కదలడానికి ఆయన శరీరం సహకరించలేదు. 1970 నుండి కృష్ణ బిలాలపై పరిశోధనలు చేశారు. అంతేగాకుండా ప్రపంచంలోని పలు విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు చేశారు. బ్రిటన్ లోని కేంబ్రిడ్స్ యూనివర్సిటీలో వివిధ హోదాల్లో హాకింగ్ పనిచేశారు. బ్లాక్ హోల్స్ పై ఆయన పరిశోధనలు...ఖగోళ శాస్త్రంలో అతిపెద్ద విప్లవం సృష్టించాయి. ఖగోళ భౌతిక శాస్త్రంపై పలు పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాల్లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అత్యంత ప్రత్యేకమైంది. హాకింగ్ పై 2014లో ది థియరీ ఆఫ్ ఎన్విరిథింగ్ సినిమా వచ్చింది. దీనిపై ఆదినారాయణ జేవీవీ, ప్రముఖ హేతువాది బాబు గోగినేనిలు టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
కొనసాగుతున్న కోమటిరెడ్డి దీక్ష..
హైదరాబాద్ : ఏప్రిల్ 18 నుండి 22వ తేదీ వరకు జరిగే సీపీఎం జాతీయ మహాసభల పురస్కరించుకుని 2కే రన్ నిర్వహించారు. ఆర్టీసీ కార్యాలయంలోని ఎంబీ భవన్ నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ఈ రన్ కొనసాగింది. పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఎం జాతీయ మహాసభలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈనెల 25 నుండి రెండు బస్సు జాతాలను నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలపై మహాసభల్లో చర్చిస్తామని పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రశ్నించే వారిని అణగదొక్కే విధంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ పై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే అవకాశం లేకుండా..విమర్శించే అవకాశం లేకుండా తప్పు చేశారనే సాకు చూపించి ప్రతిపక్షాన్ని శాశ్వతంగా బహిష్కరించడం ఎంత దారుణమైన పరిస్థితో అర్థం చేసుకోవచ్చన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాబోదని...వామపక్ష ప్రజాతంత్ర సామాజిక శక్తులే తెలంగాణలో ఉన్న బాధలకు పరిష్కారమని...ఇందుకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ చేస్తోందన్నారు. ఇప్పటికే 28 పార్టీలతో బీఎల్ఎఫ్ ఏర్పాటైందని..ఇందులో అనేక మంది చేరే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు మహాసభలను ఉపయోగిస్తామన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు తీసుకొంటోందని జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
ఖగోళ మేధావి స్టీఫెన్ హాకింగ్ మృతి..
ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి..

గుంటూరు : జనసేన పార్టీ ఏర్పడి అప్పుడే నాలుగేళ్లు నిండాయి. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు సినీ నటుడు పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదుట 14 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభ వేదికగా పవన్ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. అంతేగాకుండా తన మనసులోని మాటను వ్యక్తీకరించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగసభకు వచ్చేందుకు భారీగా జనసేన కార్యకర్తలు..పవన్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
జనసేన సభ విశేషాలు...
- 120 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో సభ వేదికను డిజైన్ చేశారు.
- ఒకే వేదికగా కాకుండా.... మూడు భాగాలుగా నిర్మించనున్నారు.
- ప్రతి విభాగానికి ఒక ప్రవేశ ద్వారం.. అన్ని విభాగాలకు మధ్యలో నేరుగా దారి ఉండేలా ప్లాన్ చేశారు.
- వేదికమీద వెనుకభాగంలో పెద్ద ఎల్ఈడి స్ర్కీన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
- ఈ సభలో బార్కోడ్ విధానాన్ని అనుసరిస్తున్నారు.
- ఎప్పటిలాగే వేదిక మీద పార్టీ ఆధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.
- జనసేన పార్టీకోసం అనూప్‌రూబెన్స్ రూపొందించిన పాటలను కూడా వినిపించనున్నారు.
జనసేన సభకు భారీ ఏర్పాట్లు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ చివరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకొంటోంది. గవర్నర్ ప్రసంగిస్తుండగా చోటు చేసుకున్న పరిణామాలను కేసీఆర్ సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. టి.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల సభ్యత్వాలను ఏకంగా రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీ అయినట్లు ఈసీకి కూడా సమాచారం అందించింది. దీనిపై టి.కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది.
సోమవారం నాడు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తుండగా టి.కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి మైక్ హెడ్ సెట్ విసిరారు. ఈ నేపథ్యంలో డిప్యూటి ఛైర్మన్ కంటికి గాయమైంది. హెడ్ సెట్ విసరడంతోనే గాయమైందని..ప్రభుత్వం పేర్కొంటోంది. దీనిని టి.కాంగ్రెస్ ఖండించింది. మంగళవారం నాడు ప్రారంభమైన సభలో 11 మంది కాంగ్రెస్ సభ్యులను సమావేశాల వరకు...కోమటిరెడ్డి..సంపత్ కుమార్ ల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బిజెపి, టిడిపి సమర్థిస్తుండగా ఎంఐఎం మాత్రం సమర్థిస్తోంది.

హైదరాబాద్ : గాంధీభవన్ కు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై టి.కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 'ప్రజాస్వామ్య పరిరక్షణ' పేరిట కోమటిరెడ్డి, సంపత్ లు 48గంటల పాటు గాంధీభవన్ లో దీక్షకు పూనుకున్నారు. వీరి దీక్షకు టి.కాంగ్రెస్ మద్దతు పలికింది.
వీరు దీక్షలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వారి వారి నియోజకవర్గాలత్లో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బుధవారం గాంధీభవన్ కు ఆలంపూర్, నల్గొండ నియోజకవర్గాలకు చెందిన నేతలు భారీగా తరలివస్తున్నారు. వారు చేపడుతున్న దీక్షకు మద్దతు తెలియచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై టి.కాంగ్రెస్ కోర్టుకు వెళ్లనుంది.
టి.అసెంబ్లీ..వాయిదా తీర్మానాలు..
ఆటో బైక్ ఢీ..ఇద్దరు మహిళల మృతి...
కొనసాగుతున్న కోమటిరెడ్డి..సంపత్ ల దీక్ష...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 38 వేల 867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఎస్ఎస్సీ బోర్డు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గతేడాది తరహాలోనే ఐదు నిమిషాల ఆలస్యం నిబంధనను అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గురువారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల 103 పాఠశాలకు చెందిన 5 లక్షల 38వేల 867 మంది విద్యార్థలు పరీక్ష రాయనున్నారు. ఉదయం తొమ్మిదన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల 15 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 542 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్నీ సెంటర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్భంది ఏర్పాట్లు చేశామని అధికారులు అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 38వేల 867 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా ఇందులో 2లక్షల 62వేల 479 మంది బాలికలు.. 2లక్షల 76వేల 388 మంది బాలురు ఉన్నారు. 5లక్షల 3వేల 117 మంది విద్యార్థులు రెగ్యులర్ పరీక్షలు రాయనుండగా, ప్రైవేటుగా రాసేందుకు 35వేల 750 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఒకేషనల్ విద్యార్ధులు 20వేల 838 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు 431పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని SSC అధికారులు తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లరాదని SSC బోర్డు అధికారులు స్పష్టం చేశారు. టెన్త్ పరీక్షలు సజావుగా సాగేందుకు ఇప్పటికే బోర్డు అధికారులు వివిధ శాఖలతో చర్చించారు. విద్యుత్ శాఖతో పాటు రెవెన్యూ, పోలీసు డిపార్టమెంట్‌తో సంప్రదించామని అధికారులు తెలిపారు. ఆర్టీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర 144సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.
పదో తరగతి పరీక్షల దృష్ట్యా ఈ సారి బందోబస్తును పెంచినట్లు అధికారులు చెప్పారు. పరీక్షల కేంద్రాల చుట్టు ఉన్న జీరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను కూడా మూసివేయనున్నట్లు అధికారులు అన్నారు. ఈ సారి కూడా ఐదు నిమిషాల ఆలస్యం నిబంధనను అమలు చేస్తున్నట్లు SSC అధికారులు ప్రకటించారు.

ఢిల్లీ : ఈ నెలాఖరులోనే పోలవరం ప్రాజెక్టు కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈనెల 16వ తేదీలోపే దీనికి ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న కేంద్ర ఆర్థిక, జలవనరులు, జలసంఘం అధికారులతో భేటీ అయిన ఏపీ అధికారులు.. పోలవరం నిధులు, డీపీఆర్ ఆమోదం, భూసేకరణపై సమగ్రంగా చర్చించారు.
2017-18 ఆర్థిక సంవత్సరం ఈ నెలతోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, జలవనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆర్థిక, జలవనరులు, జలసంఘం అధికారులతో వేర్వేగా భేటీ అయ్యారు. పోలవరం నిధులు, డీపీఆర్ , సహాయ పునరావాసంపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు కొత్త డీపీఆర్‌ను ఆమోదించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈనెల 16వ తేదీలోపే ఇందుకు ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.
2017-18 ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం కొత్త డీపీఆర్‌ను ఆమోదిస్తామని కేంద్రం నుంచి హామీవచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్‌కు రాష్ట్ర అధికారులు పోలవరం పనుల పురోగతిని వివరించారు. డీపీఆర్‌ను ఆమోదిస్తే.. ఆ అంచనా వ్యయాల మేరకు పనులు చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు. రాష్ట్ర అధికారులతో ఏకీభవించిన యూపీ సింగ్.. వెంటనే కేంద్ర ఆర్థిక కార్యదర్శిలో ఫోన్లో మాట్లడారు. ఈనెల 16లోగా కొత్త డీపీఆర్‌కు ఆమోదం తెలిపితే.. రెండు రోజుల్లో దానిపై తాము ఉత్తర్వు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాతే నాబార్డు రుణం తీసుకునేందుకు వీలవుతుందని చెప్పారు. ఏపీ అధికారుల సమక్షంలో సంభాషణ సాగతంతో రెండు మూడు రోజుల్లో కొత్త డీపీఆర్‌పై స్పష్టత వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు పోలవరం కోసం రాష్ట్రం ఖర్చు పెట్టిన మొత్తంలో 1800 కోట్లను త్వరలోనే రీఎంబర్స్ చేస్తామని కేంద్ర ఆర్థిక కార్యదర్శి హామీనిచ్చారు. త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. కేంద్ర జలసంఘం డైరెక్టర్ రవికుమార్, సీఈ దాస్లతో ఏపీ అధికారులు సమావేశమయ్యారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను సమగ్రంగా వివరించి వారిని ఒప్పించగలిగారు. పోలవరానికి సంబంధించిన సమగ్ర నివేదికను సీడబ్ల్యూసీకి మరోసారి పంపాలని ఏపీ బృందం నిర్ణయించింది.
జనసేనాని పవన్ కల్యాణ్.. భవిష్యత్ ప్రణాళికను ఇవాళ ప్రకటించనున్నారు. గుంటూరు వేదికగా.. ఆయన తన మనసులోని మాటను వ్యక్తీకరించనున్నారు. పవన్ అంతరంగ ఆవిష్కారానికి అవసరమైన వేదికను రూపొందించడంలో.. జనసేన సైన్యం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో భారీ జనసమూహానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో సూర్య ప్రకాష్ (టిడిపి), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), రమేష్ నాయుడు (బిజెపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
పూణేలో అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి...
జవాన్లకు సీఎం రమణ్ సింగ్ నివాళులు...
గోరఖ్ పూర్ బై పోల్...

ఢిల్లీ : టీ20 ట్రై సిరీస్‌లో టీమిండియా మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవడానికి బంగ్లాదేశ్‌తో కీలక పోరుకు భారత్ సిద్ధమైంది. బంగ్లాదేశ్‌పై టీ20ల్లో ఓటమంటూ లేని టీమిండియా తిరుగులేని ట్రాక్ రికార్డ్‌ను కొనసాగించాలని పట్టుదలతో ఉండగా...శ్రీలంకపై 215 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు సైతం షాకివ్వాలని తహతహలాడుతోంది.
రోహిత్ శర్మ సేన నాయకత్వంలోని భారత్‌కు మహ్మదుల్లా సారధ్యంలోని బంగ్లాదేశ్ జట్టు సవాల్ విసురుతోంది. శ్రీలంకతో జరిగిన తొలి రౌండ్లో తేలిపోయిన భారత జట్టు...ఆ తర్వాత వరుస విజయాలతో టైటిల్ రేస్‌లో నిలిచింది. బంగ్లాదేశ్‌పై తొలి రౌండ్లో సునాయాస విజయం సాధించిన భారత్....శ్రీలంకతో జరిగిన సెకండ్ రౌండ్ మ్యాచ్‌లోనూ స్థాయికి తగ్గట్టుగా రాణించి ఫైనల్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్...సెకండ్ రౌండ్లోనూ నెగ్గి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది.
శిఖర్ ధావన్,సురేష్ రైనా,మనీష్ పాండే ఫామ్‌లో ఉన్నా...రోహిత్ శర్మ విఫలమవుతుండటంతో భారత్ జట్టు బ్యాటింగ్‌లో ప్రత్యర్ధి జట్లపై ఆరంభ ఓవర్ల నుంచే ఆధిపత్యం ప్రదర్శించలేకపోతోంది. రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్టుగా చెలరేగితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు.మూడు టీ20ల్లో యజ్వేంద్ర చహాల్,వాషింగ్టన్ సుందర్ ఎలా స్పిన్ మ్యాజిక్‌తో ఆకట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్,విజయ్ శంకర్‌లతో కూడిన పేస్ బౌలింగ్ ఎటాక్ భారత్‌కు అదనపు బలం అనడంలో సందేహమే లేదు. బంగ్లాదేశ్‌పై విజయ్ శంకర్, శ్రీలంకపై శార్దూల్ ఠాకూర్ అంచనాలకు మించి రాణించి భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.అన్ని విభాగాల్లో సమిష్టిగా చెలరేగితే బంగ్లాదేశ్‌ను మరోసారి ఓడించడం భారత్‌కు పెద్ద సవాలేమీ కాదు.
మరో వైపు బంగ్లాదేశ్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది.శ్రీలంకపై 215 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు సైతం షాకివ్వాలని తహతహలాడుతోంది. బంగ్లాదేశ్‌పై టీ20ల్లో తిరుగులేని ట్రాక్ రికార్డ్‌ను కొనసాగించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌తో ఆడిన 6 టీ20 మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే విజయం సాధించింది. తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో పాటు,పవర్ఫుల్ టీమ్ కాంబినేషన్ కలిగిన భారత జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా....బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేస్తే భంగపాటు తప్పదు.బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే భారత్ స్థాయికి తగ్గట్టుగా రాణించాల్సిందే.

గుంటూరు : జనసేనాని పవన్ కల్యాణ్.. భవిష్యత్ ప్రణాళికను ఇవాళ ప్రకటించనున్నారు. గుంటూరు వేదికగా.. ఆయన తన మనసులోని మాటను వ్యక్తీకరించనున్నారు. పవన్ అంతరంగ ఆవిష్కారానికి అవసరమైన వేదికను రూపొందించడంలో.. జనసేన సైన్యం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో భారీ జనసమూహానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు.
జనసేన పార్టీ ఆవిర్భావ సభ బుధవారం, గుంటూరులో జరగనుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట... 14 ఎకరాల స్థలంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి... వేదిక మొదలు.. వివిధ అంశాల్లో దేనికదే విభిన్నంగా విశిష్టంగా ఉండేలా సభను నిర్వహించబోతున్నారు. 120 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో సభ వేదికను డిజైన్ చేశారు. దీన్ని ఒకే వేదికగా కాకుండా.... మూడు భాగాలుగా నిర్మించనున్నారు. ప్రతివిభాగానికి ఒక ప్రవేశ ద్వారం ఉండేలా.. అన్ని విభాగాలకు మధ్యలో నేరుగా దారి ఉండేలా ప్లాన్ చేశారు. ఎక్కడా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పక్కా ప్రణాళికలు రూపొందించారు. వేదికమీద వెనుకభాగంలో పెద్ద ఎల్ఈడి స్ర్కీన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
రాజకీయ సభల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా.. జనసేన సభలో బార్కోడ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనికి కావాల్సిన కంప్యూటర్లతోపాటు ఇతర పరికరాలను జనసేన నేతలు కొనుగోలు చేశారు. అలాగే సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఎల్ఈడి స్ర్కీన్లను కూడా తాత్కాలిక అవసరానికి కాకుండా శాశ్వత ప్రాతిపదికన కొనుగోలు చేశారు. ఈసభ అనంతరం కూడా జనసేన సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా వినియోగించేందుకు వీలుగా వీటిని భద్రపరచనున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ పార్టీలు నిర్వహించే ప్లీనరీ సమావేశాల తరహాలో సాగే ఈ సభకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి జనం పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.. ప్రాథమికంగా నాలుగు నుంచి ఐదు లక్షల మందిని సమీకరించాలని జనసేన భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఖరారు చేసిన వ్యూహాన్ని ఆచరణలో పెట్టినట్లు తెలుస్తోంది. సభా వేదికపై ఎవరెవరు ఉంటారన్న వివరాలు ఇంకా జనసేన పార్టీ వెల్లడించలేదు.. ఇటీవల జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించిన జేపీ, ఉండవల్లి, కృష్ణారావు, పద్మనాభయ్య వంటి వారు ఈ సభకు రావచ్చని అంటున్నారు. జనసేన పార్టీ వర్గాల కథనం ప్రకారం.. ఎప్పటిలాగే వేదిక మీద పార్టీ ఆధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు... జనసేన పార్టీకోసం అనూప్‌రూబెన్స్ రూపొందించిన పాటలను కూడా వినిపించనున్నారు. మొత్తానికి జనసేనాని గుంటూరులో నిర్వహించనున్న సభపై ప్రజలతోపాటు..రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్ : చట్ట సభల్లో నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉంటుంది. అయితే అనుచితంగా మాత్రం వ్యహరించకుండా... సభ్యులు సభామర్యాదలు పాటించాల్సి ఉంటుంది. పార్లమెంట్ నుంచి అసెంబ్లీల వరకు అనుచితంగా ప్రవర్తించి చాలా మంది బహిష్కరణకు గురైన ఘటనలు అనేకం ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయడంతో ఇప్పుడు ఈ అంశం రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆందోళనతో మొదలయ్యాయి. మొదటి రోజే సభలో కాంగ్రెస్ శాసనసభ్యులు రెచ్చిపోయారు. రణరంగాన్ని తలపించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. అంతటితో ఆగకుండా మైకులు విసిరారు. ఈ ఘర్షణలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం కూడా అయ్యింది. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికార టీఆర్ఎస్... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సెషన్ మొత్తం సస్పెండ్ చేసింది. అనుచిత ప్రవర్తనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
సభలో ప్రతి సభ్యుడు సభా మర్యాదలు పాటించి తీరాలి. హుందాగా ఉంటూ సభా గౌరవాన్ని పెంచాలి. కానీ నాటి నుంచి నేటి వరకు పార్లమెంట్ మొదలుకొని రాష్ట్రాల అసెంబ్లీల వరకు చట్టసభల్లో చాలా మంది సభ్యులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్... ఉద్యమం సమయంలో ఇదే గవర్నర్‌పైకి ప్రసంగ పేపర్లు చింపి విసిరింది. గవర్నర్‌పైకి మైకులు విసిరింది. కానీ అప్పుడు ఇంత కఠినంగా కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపట్ల కాంగ్రెస్‌తోపాటు సామాన్య ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అనుచితంగా ప్రవర్తించి సభ్యులపై చర్యలు తీసుకున్న ఘటనలు దేశంలో చాలానే ఉన్నాయి. 1951 సెప్టెంబర్ 25వ తేదీన నాటి పార్లమెంట్ సభ్యులు హెచ్‌సి ముద్గల్‌ను డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై సభ నుంచి బహిష్కరించారు. 1976 నవరంబర్ 15న రాజ్యసభ నుంచి సుబ్రహ్మణ్యస్వామి సభలో అనుచితంగా ప్రవర్తించారంటూ సభ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1977 నవంబర్18న ఇందిరాగాంధీని కూడా లోక్‌సభ నుంచి బహిష్కరించారు. 1964 జూన్ 13న అనుచిత ప్రవర్తన కారణంగా మహారాష్ట్ర శాసనసభ ఒక సభ్యుడిని బహిష్కరించింది. 2005 డిసెంబర్లో 11 మంది రాజ్యసభ సభ్యులను ఓటుకు నోటు కేసులో బహిష్కరించారు. 2015లో ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా... సీఎం, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 194(3) ఆర్టికల్ ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారు.
1966 ఆగస్టు 29న ఇద్దరు ఎమ్మెల్యేను బహిష్కరించిన యశ్వంతరావు మేఘావల్ వర్సెస్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ కేసులో అక్కడి హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధించింది. సభ్యుల ప్రవర్తన నేపథ్యంలో ఎలాంటి చర్యలనైనా తీసుకునే అధికారం శాసనసభకు ఉందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 194(3) ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. శాసనసభ నిబంధనావళిని రూపొందించుకోకపోయినా సభ తీర్మానం చేసి చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడింది. సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉన్న సందర్భంలో శాసనసభకు, స్పీకర్‌కు తమ విశేషాధికారాలను వినియోగించుకునే అధికారం ఉంటుంది.