Activities calendar

15 March 2018

21:52 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ అంకెల గారడీగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపాదనలు- ఖర్చుల వివరాలు అసంబద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఎం విమర్శించాయి. రైతులను, నిరుద్యోగులను, స్కీమ్‌ వర్కర్‌ను వంచించేదిగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
హామీలు అమలు లేదన్న రేవంత్‌రెడ్డి 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చివరి బడ్జెట్‌లోనైనా అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనుకుంటే అదీ లేదన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు తక్కువమొత్తంలో నిధులు కేటాయించారని.. వాటితో పేదల ఇళ్ల పథకం ఎప్పటికీ పూర్తి కాదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు, అమరవీరులకు నయాపైసా కేటాయించలేదని ఇది తెలంగాణ అమరవీరులను, రైతులను అవమానించడమేనన్నారు.
బడ్జెట్‌ కేటాయింపులే తప్ప ఖర్చు లేదు : టీడీపీ 
బడ్జెట్‌ కేటాయింపులే తప్ప ఖర్చుపెట్టేది కాదని టీడీపీ ఆరోపించింది. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూములకు బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించారని.. వీటితో ఆ పథకాలు పూర్తి కావని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు వస్తున్నాయని.. నిరుద్యోగులకు మాత్రం రావడం లేదని ఆయన మండిపడ్డారు. 
బడ్జెట్‌లో లెక్కలకు... వాస్తవాలకు వ్యత్యాసం : కిషన్ రెడ్డి
బడ్జెట్‌లో లెక్కలకు... వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి. ప్రభుత్వం ఆర్భాటంగా పథకాలు ప్రవేశపెడుతుందే తప్ప అవి పూర్తి చేయడం లేదన్నారు. పథకాలన్నీ పూర్తి చేయాలంటే మరో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి అన్నారు. 
బడ్జెట్‌ అంకెల గారడీ : సున్నం రాజయ్య  
బడ్జెట్‌ అంకెల గారడీగా ఉందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. బడ్జెట్‌ ప్రగతి నిరోధకంగా ఉందన్నారు. బలహీనవర్గాలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయని  మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి  తీసుకుంటున్న చర్యలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడాన్ని రాజయ్య తప్పుపట్టారు. మొత్తంగా సంక్షేమ బడ్జెట్‌ అని ప్రభుత్వం అంటుంటే.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారని విపక్షాలు మండిపడుతున్నాయి. 

21:46 - March 15, 2018

గుంటూరు : ప్రజాజీవితంలోనే తనకు సంతృప్తి ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. తన సుదీర్ఘ రాజకీయ జీవింతంలో అనేక ఆటుపోట్లను చూశానన్నారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌ను, రాజకీయ విజయాలను ఇచ్చిన ప్రజలను తన జీవితంలో మర్చిపోలేనన్నారు. ఎన్టీఆర్‌ను   తన తల్లిదండ్రులకంటే ఎక్కువగా గౌవరవిస్తానన్నారు. చంద్రబాబు 40ఏళ్ల రాజీకీయ ప్రస్థానంపై ఏపీ శాసన సభలో  ఆకస్తికర చర్చ జరిగింది.
చంద్రబాబుపై సభ్యులు ప్రశంశలు
సీఎం చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ఏపీ శాసన సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు చంద్రబాబుపై ప్రశంశలు కురిపించారు. నాలుగు దశాబ్దాలుగా పాలిటిక్స్‌లో ఎదురులేకుండా సాగుతున్న చంద్రబాబు జీవితం యువ రాజకీయనాయకులకు స్ఫూర్తిగా నిలుస్తోందని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. 
ప్రజలకు సేవచేయడమే సంతృప్తి : సీఎం చంద్రబాబు
తనకు కుటుంబం కంటే.. ప్రజలకు సేవచేయడమే సంతృప్తి ఇస్తుందన్నారు సీఎం చంద్రబాబు. తాను ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టానని.. స్వయంకృషి, పట్టుదలతో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగానన్నారు. తనకు రాజకీయాలు నేర్పంది ఎన్టీఆర్‌ అయితే.. రాజీకీయ జీవితాన్ని ఇచ్చింది ప్రజలే అన్నారు. తనకు ఎవరూ బాస్‌లు లేరని.. ప్రజలనే బాస్‌లు అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం సాగుతున్నపోరాటాన్ని కొందరు  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారికి  జనమే సమాధానం చెబుతారని చంద్రబాబు అన్నారు.
వైసీపీ కొత్త లాలూచీ రాజకీయాలు : సీఎం చంద్రబాబు
అటు పార్లమెంటులో అవిశ్వాసం పేరుతో వైసీపీ కొత్త లాలూచీ రాజకీయాలకు తెరతీసిందని.. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎవరు పోరాడినా మద్దతిస్తామని.. అదే సమయంలో రాజకీయ స్వార్థాలను కూడా ఎండగడతామన్నారు. ఇక  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  తనపై చేసిన విమర్శలను చంద్రబాబు పరోక్షంగా తిప్పికొట్టారు. తనపై విమర్శలు చేసే వ్యక్తులు ఓసారి ఆలోచించుకోలన్నారు. ప్రధాని మోదీ మోసం చేశారని తాను పోరాటం చేస్తుంటే.. తనను బలపరచాల్సిందిపోయి..ఇలా విమర్శలకు దిగడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. 
యువతకూ చంద్రబాబు ఆదర్శం : లోకేష్ 
చంద్రబాబు నలబైఏళ్ల రాజకీయ జీవితం తనతోపాటు ప్రస్తుతం యువతకూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి లోకేశ్‌. జీవితంలో ఎన్నో సవాళ్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న నేతగా చంద్రబాబు తనకు ఎన్నటికీ గర్వకారణమే అన్నారు లోకేశ్‌..
చంద్రబాబుపై విష్ణుకుమార్‌రాజు చలోక్తులు 
చంద్రబాబు రాజకీయ జీవితంపై సభలో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు.. తన చలోక్తులతో నవ్వులు పూయించారు. చంద్రబాబు సినిమాటోగ్రఫి మంత్రిగా ఉన్నపుడు తాము మూవీ టెక్కట్లకోసం ఆయనతో సిఫార్స్‌ లెటర్‌ తెచ్చుకోడానికి పడిన తపనను ఆసక్తికరంగా వివరించారు. చంద్రబాబు యూత్‌లోనూ, ఇప్పడూ  గ్లామర్‌గా గానే ఉన్నారన్న విష్ణుకుమార్‌రాజు మాటలతో సీఎం చంద్రబాబుతో సహా సభయావత్తు నవ్వులతో నిండిపోయింది. 
ప్రజల సేవలలోనే కొనసాగుతా : సీఎం 
నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసమే తాను రాజకీయాలు చేశానన్న చంద్రబాబు.. ఇక ముందు కూడా ప్రజల సేవలలోనే కొనసాగుతానన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి పెద్దకొడుకుగా  అండగా ఉంటానన్నారు.   ఏపీని కష్టాల నుంచి బయటపడేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తాన్నన్నారు. 

21:41 - March 15, 2018

గుంటూరు : ప్రత్యేక హోదా హామీని నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, రేపు అవిశ్వాస తీర్మానం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన నోటీసును లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు అందించింది. మరోవైపు.. వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు నివ్వాలని భావిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. రెండు ప్రధాన రాజకీయ పక్షాలూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
మార్చి 21న అవిశ్వాసం ప్రతిపాదించాలని భావించిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. మొదట్లో ఈనెల 21న తీర్మానం ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ.. పార్లమెంటు సమావేశాలను శుక్రవారంతో ముగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఐదురోజుల ముందుగానే అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటీసులను, పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు అందించారు. రాష్ట్ర విభజన సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని.. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని.. వైసీపీ నాయకులు తెలిపారు. 
మద్దతు కోసం జాతీయ పార్టీలకు వైసీపీ లేఖలు
తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ.. వైసీపీ అధినేత జగన్‌.. ఇప్పటికే జాతీయ పార్టీలకు లేఖలు రాశారు. బీజేడీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ల మద్దతును కోరారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పార్టీ మంత్రులు, ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వరాదని పలువురు సూచించారని, మోదీపై విశ్వాసం ప్రకటిస్తూనే ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంలోని ద్వంద్వ వైఖరినీ టీడీపీ నాయకులు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ నిర్ణయానికి మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

21:36 - March 15, 2018
21:26 - March 15, 2018

హైదరాబాద్ : భారీ సైజ్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల.. సాగునీటి రంగానికి 25వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పంటల పెట్టుబడి పథకానికి పన్నెండు వేల కోట్లు కేటాయించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకానికి కేవలం రెండు వేల 643 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తంగా.. లక్షా 74 వేల 453 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలను ఈటల రాజేందర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. 
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఈటల  
2018-19 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. లక్షా 74 వేల 453 కోట్ల రూపాయల బడ్జెట్‌లో..రెవెన్యూ వ్యయం లక్షా 25 వేల 454 కోట్లు .. రెవెన్యూ మిగులు 5 వేల 520కోట్లు, ద్రవ్యలోటు 29 వేల 77కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్ర ఆదాయం 73 వేల 751కోట్లు కాగా.. కేంద్రం వాటా 29 వేల 41కోట్లు ఉందని ఈటల తెలిపారు. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్
ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈటల రాజేందర్‌.. ఒక గంటా 20 నిమిషాల పాటు బడ్జెట్‌ సారాంశాన్ని చదివి వినిపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్. బడ్జెట్‌లో సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈటల చెప్పారు. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. మొదటి పంట రుణాలను మాఫీ చేశామన్న ఆయన.. పంట పెట్టుబడి మద్దతుకు 12 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఎకరానికి 4 వేల చొప్పున రెండు పంటలకు మొత్తం 8 వేల రూపాయలు రైతుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమగ్రభూ సర్వేతో భూముల ప్రక్షాళన జరిగిందన్న ఆయన.. రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522 కోట్లు, బిందు, తుంపర సేద్యానికి 127 కోట్లు, పాలీ-గ్రీన్‌హౌజ్‌కు 120 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పౌరసరఫరాల రంగానికి 2 వేల 946 కోట్లు, నీటి పారుదల రంగానికి 25వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటల తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థలకు 1500కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 1000 కోట్లు కేటాయించారు. గొర్రెల పెంపకంతో గొల్లకురుమలకు, చేపల పెంపకంతో ముదిరాజ్‌లకు చేయూత లభించిందన్నారు. పౌల్ట్రీలో దేశంలో రెండోస్థానంలో ఉన్నామన్న ఈటల.. పౌల్ట్రీరంగానికి 109 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 
సంక్షేమ రంగానికి పెద్దపీట 
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తుందని ఈటల అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి 1450 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 1799 కోట్లు, ఎస్సీ ప్రగతి నిధికి 16 వేల 453 కోట్లు, ఎస్టీల ప్రగతి నిధికి 9 వేల 693 కోట్లు కేటాయించారు. అలాగే.. షెడ్యూల్‌ కులాల శాఖకు 12 వేల 709 కోట్లు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కోసం 1469 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో పొందుపర్చారు. అలాగే ఎస్టీ సంక్షేమ శాఖకు 8వేల 63 కోట్లు ప్రతిపాదించారు. ఎంబీసీల సంక్షేమానికి వెయ్యి కోట్లు, రజకుల ఫెడరేషన్‌కు 200 కోట్లు, నాయిబ్రాహ్మణులకు 250 కోట్లు కేటాయించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధికై ఈసారి బడ్జెట్‌లో 5వేల 920 కోట్లు కేటాయించారు. మైనార్టీ శాఖకు 2 వేల కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి 100కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి 75 కోట్లు ప్రతిపాదించారు.
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు 2 వేల 643కోట్లు
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు 2 వేల 643కోట్లు, అమ్మఒడి పథకానికి 561 కోట్లు, వైద్య రంగానికి 7వేల 375 కోట్లు కేటాయించారు. విద్యారంగానికి 10 వేల 830 కోట్లు ప్రతిపాదించారు. సాంకేతిక విద్యకు 95 కోట్లు, కళాశాలల్లో మౌళిక వసతులకు 247 కోట్లు, ఉన్నత విద్యా రంగానికి 2 వేల 448 కోట్లు, రెసిడెన్షియల్‌ సంస్థలకు 2వేల 823 కోట్లు కేటాయించారు. మిషన్‌ భగీరథ పథకం కోసం 1801 కోట్లు, తెలంగాణకు హరితహారం పథకానికి 1166 కోట్లు,  రవాణా-రోడ్లు, భవనాల శాఖకు 5 వేల 575 కోట్లు, పంచాయితీరాజ్‌-గ్రామీణాభివృద్ధికి 15 వేల 563 కోట్లు, విద్యుత్‌ రంగానికి 5 వేల 650 కోట్లు కేటాయించారు. 
చేనేత, టెక్స్‌టైల్‌ రంగానికి 1200 కోట్లు
చేనేత, టెక్స్‌టైల్‌ రంగానికి 1200 కోట్లు, పరిశ్రమలు-వాణిజ్య శాఖకు 1286 కోట్లు, ఐటీ రంగానికి 289 కోట్లు కేటాయించారు. పురపాలక-పట్టణాభివృద్ధికి 7 వేల 251 కోట్లు,  సాంస్కృతిక రంగానికి 58 కోట్లు, యాదాద్రి అభివృద్ధికి 250 కోట్లు, వేములవాడ దేవాలయ అభివృద్ధికి 100కోట్లు,  భద్రాచలం, బాసర, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి 200కోట్లు ప్రతిపాదించారు. హోం శాఖకు 5 వేల 790 కోట్లు కేటాయించారు. అనేక ప్రతికూల పరిస్థితులు, సవాళ్ల మధ్య ఏర్పడిన నూతన రాష్ట్రం అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగిందని ఈటల రాజేందర్‌ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. 

21:21 - March 15, 2018
21:20 - March 15, 2018

హైదరాబాద్ : ఉగాది పండగ సందర్భంగా సరికొత్త డిజైన్లతో మహిళలను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది బంగారు, డైమండ్‌ ఆభరణాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన తనిష్క్‌ జ్యూవెలరీ. దక్షిణాది వారి పండుగను దృష్టిలో ఉంచుకొని.. నూతన డిజైన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పద్మావతి కలెక్షన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ డిజైన్లను... ట్రెడిషన్, స్టైల్‌ను కలగలిగి రూపొందించారు. నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలతో లక్షలాది కస్టమర్లకు అందించేందుకే ఈ డిజైన్లను తీసుకొచ్చినట్లు తనిష్క్ సిబ్బంది తెలిపారు. 

 

21:18 - March 15, 2018

ఢిల్లీ : హైకోర్టు నిర్ణయం వచ్చే వరకు.. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై వేచి చూడాలని.. టీకాంగ్రెస్ కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, వీ హనుమంతరావు.. ఈసీ అధికారులను కలిశారు. సభలో జరిగిన పరిణామాలను వివరించారు. తాము హైకోర్టుకు వెళ్లినందున.. తీర్పు వెలువడే వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరినట్లు మర్రి తెలిపారు.

 

21:13 - March 15, 2018

టీ.బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, కాంగ్రెస్ అధికారి ప్రతినిధి అద్దంకి దయాకర్, టీఆర్ఎస్ నేత సుధాకర్ రెడ్డి, బీజేపీ నేత రాకేష్ రెడ్డి లు పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ తో పేదలకు ఒరిగేమీలేదని విమర్శించారు. వివిధ శాఖలకు నిధుల కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

21:02 - March 15, 2018

లక్షా డెబ్బైవేల కోట్ల రూపాల బడ్జెట్..బడ్జెట్ దండిగ.. పేదల బత్కు ఎండగ,  ఇర్వైఏడువేల ఉద్యోగాలు భర్తీ జేశ్నం..లక్షా పన్నెండువేల సంగతేంది సారు, జగిత్యాల కాడ అన్నదాతల ఆవేదన..మద్దతు ధర అడ్గుడే పాపం అరెస్టులు, నకిలీ ట్విట్టర్ ఫాలోయింగు గుట్టురట్టు...కేటీఆర్ మిలియన్ కథ జెప్పిన జనం, సర్కారు అధికారి మీద రంగారావు దాడి... ముఖ్యమంత్రి సుట్టాన్ని అని బెదిరింపులు, ముహూర్తం ఆల్చమైందని పెండ్లొద్దన పిల్ల....పీటల మీద ఒక్కడే గూసున్న పిలగాడు.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:55 - March 15, 2018

గుంటూరు : రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కె.సత్యనారాయణ ధృవీకరణ పత్రం అందజేశారు. టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర, సీఎం రమేశ్ ఎంపిక అయ్యారు.

20:49 - March 15, 2018

గుంటూరు : 'నాయకుడిగా చంద్రబాబు నాలాంటి యువకులకు రోల్ మోడల్' అని మంత్రి లోకేష్ అన్నారు. 60 ఏళ్ల వయసులోనూ నాయకుడిగా చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పారు. అలిపిరి బాంబు దాడి, 2004లో ఎన్నికల్లో ఓటమి సందర్భాల్లో చంద్రబాబు ఆత్మస్థైర్యంతో నిలబడ్డారని తెలిపారు. 

20:43 - March 15, 2018

గుంటూరు : చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై విష్ణుకుమార్ రాజు ఆసక్తికరంగా మాట్లాడారు. చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు చలోక్తులు విసిరారు. చంద్రబాబుపై తన అభిప్రాయాన్ని చెప్పి సభలో నవ్వులు పూయించారు.

 

20:23 - March 15, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు దీక్ష విరమించారు. గాంధీభవన్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. కోమటిరెడ్డి, సంపత్ లు 48 దీక్ష చేప్టారు. నేడు వారు దీక్ష విరమించారు.

20:20 - March 15, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్న తనను బీజేపీ నాయకులు బలపర్చాలి..తప్ప బలహీన పర్చవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. తనకు మనుషులు ముఖ్యం కాదు..దేశం, రాష్ట్రం ముఖ్యమన్నారు. మనుషుల మనోభావాలు ముఖ్యమన్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దన్నారు. తన జీవితమే తనకు పాటమన్నారు. 'నేను కూడా ఒక మనిషినే.. మిషన్ ను కాదు' అని అన్నారు. తనకు మనోధైర్యం, మనో నిబ్బరం ఉందని తెలిపారు. దేశంలో అవినీతి పోవాలంటే ఫిజికల్ కరెన్సీ పోవాలన్నారు. అవినీతి పోవాలంటే సంస్కరణలు తీసుకురావాలన్నారు. రాజకీయాల్లో అవినీతి పోయే వరకు కృషి చేస్తానని చెప్పారు. గతంలో టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, లాల్ జాన్ పాషా, మాధవరెడ్డి, బాలయోగి, ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందిన విషయాలను ప్రస్తావించారు. మనం సమైక్యంగా ఉండాలన్నారు. అనునిత్యం ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలి.. ఆర్థిక అసమానతులు పోవాలని ఆకాంక్షించారు. ప్రజలు మెరుగైన జీవనం సాగించేందుకు కృషి చేస్తామన్నారు.

 

ఎన్ టీఆర్ నుంచి ఎన్నో నేర్చుకున్నా : సీఎం చంద్రబాబు

గుంటూరు : కుటుంబ వ్యవస్థ భారతదేశానికి పెద్ద సంపద అని సీఎం చంద్రబాబు అన్నారు. ఫ్యామిలీ బంధాలతోపాటు పార్టీ విషయాలను కూడా ఆలోచిస్తున్నానని తెలిపారు. ఎన్ టీఆర్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని పేర్కొన్నారు. ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కితిరిగి చూడలేదన్నారు. తన జీవితమే తనకు పెద్ద పాటమన్నారు. తాను సాధారణ..మద్య తరగతి కుటుంబంలో జన్మించానని తెలిపారు. తమ నాన్న వ్యవసాయం చేసేవారని చెప్పారు. ప్రభుత్వ స్కూల్ లో చదివానని పేర్కొన్నారు. రోడ్డు, వాగులు, వంకల్లో నడుచుకుంటూ బడికి పోయానని గుర్తు చేశారు. తమ ఊరి నుంచి బస్సులో భోజనం పంపించేవారని తెలిపారు. 

19:09 - March 15, 2018

గుంటూరు : కుటుంబ వ్యవస్థ భారతదేశానికి పెద్ద సంపద అని సీఎం చంద్రబాబు అన్నారు. ఫ్యామిలీ బంధాలతోపాటు పార్టీ విషయాలను కూడా ఆలోచిస్తున్నానని తెలిపారు. ఎన్ టీఆర్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని పేర్కొన్నారు. ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కితిరిగి చూడలేదన్నారు. తన జీవితమే తనకు పెద్ద పాటమన్నారు. తాను సాధారణ..మద్య తరగతి కుటుంబంలో జన్మించానని తెలిపారు. తమ నాన్న వ్యవసాయం చేసేవారని చెప్పారు. ప్రభుత్వ స్కూల్ లో చదివానని పేర్కొన్నారు. రోడ్డు, వాగులు, వంకల్లో నడుచుకుంటూ బడికి పోయానని గుర్తు చేశారు. తమ ఊరి నుంచి బస్సులో భోజనం పంపించేవారని తెలిపారు. కష్టపడితే ఏదైనా సాధ్యమన్నారు. విద్యార్థి నాయకుడిగా కూడా ఉన్నానని తెలిపారు. తాను చిన్నప్పుడు వినాకయక సంఘం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు దివిసీమ, నెల్లూరు తుపాను విపత్తులు వచ్చినప్పుడు సహాయసహకారాలు చేశానని..పాత బట్టటు కలెక్ట్ చేసి.. బాధితులకు పంపిణి చేసినట్లు తెలిపారు. చదువులు పూర్తయ్యాక.. లెక్చరర్ గా చేయమని చెప్పారు..కానీ చేయనని చెప్పానని అన్నారు. తాను ఎమ్మేల్యే అవుతానని చెప్పా...అయ్యానని చెప్పారు. అతి చిన్నవయసులో ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. ఏ ఊరికి రోడ్డు లేదు...బస్సు లేదన్నారు. 1980లో మంత్రి అయ్యాను.. 1983 వరకు మంత్రిగా ఉన్నానని తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను.. పెళ్లి గ్రాండ్ గా జరిగిందని... ఎన్ టీఆర్ సూపర్ స్టార్ గా ఉన్నారని చెప్పారు. లోకేష్ పెళ్లి జరిగినప్పుడు లుంబిని పార్కులో బాంబు పేలిందని.. తర్వాత ఘటన స్థలికి వెళ్లాలని చెప్పారు. 13 సం.రాలు ముఖ్యమంత్రిగా పని చేశానని తెలిపారు. 1993 లో జన్మభూమి కార్యక్రమం తెచ్చినట్లు  తెలిపారు. 1998 లో హైటెక్ 
సిటీ నిర్మించామని తెలిపారు. 

దళిత యువకుడిని హత్యచేసిన అగ్రవర్ణాలు

కడప : బుడ్డాయపల్లెలో అగ్రవర్ణాల దాష్టీకం బయటపడింది. తమ అమ్మాయిని ప్రేమించాడని దళిత యువకుడిని అగ్రవర్ణాల వారు హత్యచేశారు. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న బుడ్డాయపల్లెకు చెందిన విజయ్..అగ్రవర్ణానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇది సహించని.. ఆమె బంధువులు.. ఆదివారం రాత్రి విజయ్‌ను కొట్టి... రైలుపట్టాలపై వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు సు నమోదు చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న దళితసంఘాలు... నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దర్యాప్తు జరిపి... అనుమానితులను విచారించగా... తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

18:54 - March 15, 2018

కడప : బుడ్డాయపల్లెలో అగ్రవర్ణాల దాష్టీకం బయటపడింది. తమ అమ్మాయిని ప్రేమించాడని దళిత యువకుడిని అగ్రవర్ణాల వారు హత్యచేశారు. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న బుడ్డాయపల్లెకు చెందిన విజయ్..అగ్రవర్ణానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇది సహించని.. ఆమె బంధువులు.. ఆదివారం రాత్రి విజయ్‌ను కొట్టి... రైలుపట్టాలపై వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు సు నమోదు చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న దళితసంఘాలు... నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దర్యాప్తు జరిపి... అనుమానితులను విచారించగా... తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం : కోమటిరెడ్డి, సంపత్

హైదరాబాద్ : తమ శాసనసభ్యుల సభ్యత్వం రద్దుపై టీకాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని... ప్రోసీడింగ్ ప్రాపర్‌గా జరగలేదని... తమ వివరణ తీసుకోకుండానే సభ్యత్వాల రద్దు సరికాదని పిటిషన్‌లో కోమటిరెడ్డి, సంపత్ పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. రేపు పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది.

స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం : కోమటిరెడ్డి, సంపత్

హైదరాబాద్ : తమ శాసనసభ్యుల సభ్యత్వం రద్దుపై టీకాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని... ప్రోసీడింగ్ ప్రాపర్‌గా జరగలేదని... తమ వివరణ తీసుకోకుండానే సభ్యత్వాల రద్దు సరికాదని పిటిషన్‌లో కోమటిరెడ్డి, సంపత్ పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. రేపు పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది.

18:49 - March 15, 2018

హైదరాబాద్ : తమ శాసనసభ్యుల సభ్యత్వం రద్దుపై టీకాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని... ప్రోసీడింగ్ ప్రాపర్‌గా జరగలేదని... తమ వివరణ తీసుకోకుండానే సభ్యత్వాల రద్దు సరికాదని పిటిషన్‌లో కోమటిరెడ్డి, సంపత్ పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. రేపు పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది.

18:45 - March 15, 2018

గుంటూరు : జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అండతోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టీడీపీపై విరుచుకుపడ్డారని హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. ఈమేరకు చినరాజప్పతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఎవ్వరు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పారు.

 

18:40 - March 15, 2018

గుంటూరు : ఢిల్లీలో తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. వైసీపీ అవిశ్వాస తీర్మానంపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో రేపు లోక్‌సభలో వైసీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

18:27 - March 15, 2018

తూర్పుగోదావరి : కాకినాడ గొంతెండుతోంది... దప్పికగొన్న గొంతులు తల్లడిల్లిపోతున్నాయి.. నగరశివారు ప్రాంతాల ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా... తరాలు మారుతున్నా... సమస్య మాత్రం తీరడం లేదు.. వేసవి ఆరంభంలోనే... దాహం కేకలు వినిపిస్తున్నాయి. 
కాకినాడలో తాగునీటి కష్టాలు
అత్యంత వేగంగా అభివృద్ధి చెందున్నకాకినాడ నగరంలో.. అంతే వేగంగా ప్రజల కష్టాలూ పెరిగిపోతున్నాయి. పారిశ్రామికంగా విస్తరిస్తోన్న నగరంలో..  తరతరాలుగా వేధిస్తున్న మంచినీటి సమస్య మాత్రం తీరడంలేదు.. వేసవి ముదరకముందే... నీటి సమస్య జటిలంగా మారింది. ఎప్పుడో వేసిన తాగునీటి పైప్‌లైన్‌ విస్తరణా ముందుకు సాగకపోవడంతో... అనేక ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తీవ్రమౌతున్నాయి. ముఖ్యంగా నగరంలోని విలీన ప్రాంతాల ప్రజల బాధలు వర్ణనాతీతం.. 
గ్రామాల్లో నీటి కటకట
కాకినాడ నగర శివార్లలోని తూరంగి సహా అనేక ప్రాంతాల్లో పైప్‌ లైన్లకు మోక్షం కలగడంలేదు. దీంతో ప్రజల తాగునీటి కష్టాలు తీరడమూ లేదు.  ఇంద్రపాళెం, చీడిగ వంటి విలీన గ్రామాల ప్రజలను కూడా తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకూ ట్యాంకుల ద్వారా నీటిని అందించిన మున్సిపల్‌ వాటర్‌వర్క్స్‌ అధికారులు...  ఇప్పుడు వాటిని కూడా ఆపేయడంతో...  సమస్య మరింత తీవ్ర రూపందాల్చింది.
ప్రజలు ఆవేదన 
ఎన్ని ప్రభుత్వాలు మారినా... తరాలు మారుతున్నా.. నీటి సమస్య మాత్రం తీరడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య తీర్చాలంటూ ప్రజలు గత కొన్ని వారాలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ.. సమస్య మాత్రం తీరడంలేదు. దాంతో తీవ్ర నిరాశతో ఉన్న తూరంగి ప్రాంత ప్రజలు కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు. తమ దాహాన్ని తీర్చేందుకు తాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందరో ప్రజాప్రతినిధులు హామీలిచ్చి మరచిపోతున్నారు.. తమ గోడు తీర్చడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
చెరువునుంచి టిన్నులు తీసుకెళ్ళాల్సిన దుస్థితి 
తూరంగి, ఇంద్రపాళెం, చీడిగతోపాటు అనేక ప్రాంతాల ప్రజలు నేటికీ తాగునీటి కోసం కాకినాడ వాటర్‌ వర్క్స్ కుళాయి చెరువునుంచి టిన్నులు తీసుకెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది.. చాలా దూరంనుంచి బైకులమీద నీటిని తెచ్చుకుంటూ ప్రమాదాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి.  వేసవి తీవ్రమౌతున్న నేపథ్యంలో తాగునీటి కష్టాలు మరింత పెరిగి తాము అవస్థలు పడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు... ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించకుంటే ఉధృతంగా ఉద్యమిస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. తాగునీటికోసం ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్నా రాతిగుండెల అధికారులు, నాయకులు స్పందించకపోవడం దారుణం అంటూ ప్రజలు మండిపడుతున్నారు ... ఇప్పటికైనా స్పందించకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

18:24 - March 15, 2018
17:59 - March 15, 2018

అనంతపురం : జిల్లాలో చెరువుల నీళ్ల విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లాలో భూగర్భ జలం మట్టం పెరిగిందని, ఆయకట్టు సాగైందని అధికారపార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్న టైమ్‌లో ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల  సూర్యనారాయణ  మంత్రి సునీత తీరు పై మండిపడ్డాడు. తన నియోజకవర్గంలోని చెరువులు నింప కుండా నీళ్లను మంత్రి తన నియోజకవర్గానికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.  సునీత తీరును నిరసిస్తూ ఆయన హంద్రీనీవా కార్యాలయంలో బైఠాయించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరా రావు జోక్యంతో గొడవ సద్దుమనిగింది.
అనంతపురం జిల్లాలో 1200 చెరువులు
అనంతపురం జిల్లాలోని ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణకు మంత్రి పరిటాల సునీతకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.  ఇద్దరి మధ్య జలయుద్ధం నడుస్తోంది. తన నియోజకవర్గానికి రావాల్సిన నీటిని మంత్రి సునీత మళ్లించుకున్నారన్నది సూర్యనారాయణ ప్రధాన ఆరోపణ. 
చంద్రబాబు చొరవతో అనంతపురం జిల్లాకు కృష్ణా నీళ్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కృష్ణానది నీళ్లు అనంతపురం జిల్లాలోకి వచ్చాయి. దీంతో టీడీపీ నేతలు రైతులతో కలిసి జలహారతి కార్యక్రమం నిర్వహించారు. కృష్ణానది నీళ్లకు తోడు హంద్రినీవా నీళ్లు కూడా అనంతలో ప్రవహిస్తున్నాయి. దీంతో చెరువుల కింద ఆయకట్టు సాగవుతుందని టీడీపీ ప్రచారం చేస్తోంది. జిల్లాలో 12 వందల చెరువుల్లో 5వందల చెరువులు వర్షపునీటితో నిండాయి. మిగతా చెరువులను కృష్ణానది, హంద్రినీవా నీళ్లతో నింపడం కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
సూర్యనారాయణకు మంత్రి సునీతకు మధ్య విభేదాలు 
అనంతకు ఇప్పటి వరకు 30 టీఎంసీల నీరు చేరిందన్న ప్రచారం అధికారపార్టీ చేసుకుంటోంది. అయితే  నీటి విడుదలలో నోరున్న వాళ్లదే రాజ్యం  అన్న చందంగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. నీటి విడుదలపై ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పూర్తిగా అసహనంతో ఉన్నారు.  తన దత్తత గ్రామం గోట్లూరుకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని హంద్రీనీవా ఇంజనీర్లను నిలదీయడంతో  గొడవ ప్రారంభమైంది. మంత్రి  పరిటాల సునీత తన రాప్తాడు నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోతోందని సూర్యనారాయణ హంద్రీనీవా కార్యాలయంలో బైఠాయించారు. 
వెంటనే స్పందించిన మంత్రి ఉమామహేశ్వరరావు 
సూర్యనారాయణ ధర్నా విషయం తెలుసుకున్న  జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు  వెంటనే ఇంజనీర్లతో చర్చించారు.  గొట్లూరు, పోతుకుంట గ్రామాల చెరువులకు నీళ్లు విడుదల చేయాలని ఆదేశించారు. ధర్మవరం నియోజకవర్గం చెరువులకు కూడా  నీరు విడుదల చేస్తామని, కాలువలపై గస్తీ కూడా  ఏర్పాటు చేస్తామని ఇంజనీర్లు హామీ ఇవ్వడంతో సూర్యనారాయణ ఆందోళన విరమించారు. ఇంజనీర్ల పనితీరుతో అటు రైతులు ఇటు నేతలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తే నీటి గొడవలు జరుగవని రైతులు చెప్తున్నారు. 

17:52 - March 15, 2018

విశాఖ : కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ విశాఖలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో  కార్మిక పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ రంగం పరిశ్రమల పరిరక్షణ కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం వీడియోలో చూద్దాం... 

17:49 - March 15, 2018

కృష్ణా : విజయవాడలో గ్రామ పంచాయితీ కార్మికులు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ నిర్భందం విధించారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగాతామని కార్మికులు హెచ్చరించారు. గ్రామ పంచాయితీ కార్మికుల ఆందోళనపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

17:46 - March 15, 2018

హైదరాబాద్ : బడ్జెట్‌లో లెక్కలకు... వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి. ప్రభుత్వం ఆర్భాటంగా పథకాలు ప్రవేశపెడుతుందే తప్ప అవి పూర్తి చేయడం లేదన్నారు. పథకాలన్నీ పూర్తి చేయాలంటే మరో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన అవసరముందన్నారు. 

 

17:44 - March 15, 2018

గుంటూరు : ఢిల్లీలో తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. వైసీపీ అవిశ్వాస తీర్మానంపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. 

17:41 - March 15, 2018

ఢిల్లీ : కడప ఉక్కుపై త్వరలోనే ఏపీ ప్రజలు శుభవార్త వింటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిభాబు అన్నారు. ఢిల్లీలో  కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌తో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవకాశాలపై  చర్చించామన్నారు. అటు పార్లమెంటులో టీడీపీ వైఖరి సరిగా లేదన్నారు హరిబాబు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ.. ఆ ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం తగదన్నారు. ఇక కొత్తగా వచ్చేపార్టీలన్నీ కొత్తసినిమాలా ఉరిస్తాయని, ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే హిట్టా,ఫట్టా అనేది తేలిపోతుందని కంభంపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

17:36 - March 15, 2018

ఢిల్లీ : లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు వైసీపీ అవిశ్వాస తీర్మానం కాపీని పంపింది. రేపటిసభా కార్యకలాపాల్లో అవివ్వాస తీర్మానాన్ని చేర్చాలని సెక్రటరీ జనరల్‌ను వైవి సుబ్బారెడ్డి కోరారు. రూల్ 198బి ప్రకారం కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెటింది. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీలను కలిసి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని వైసీపి ఎంపీలు కోరారు. 

 

17:31 - March 15, 2018

గుంటూరు : ఎన్డీయే నుంచి బయటకు వచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో శుక్రవారం సమావేశం కానుంది. రేపు సాయంత్రం ఐదుగంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న పొలిట్‌బ్యూరోలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి తదుపరి వ్యూహం సిద్ధం చేసుకోనున్నారు. తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకు మహాకుట్ర జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో నేతల వద్ద ప్రస్తావించాక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్డీయేలో ఇంకా కొనసాగడం భావ్యంకాదనే అభిప్రాయాన్ని మెజార్టీ నేతలు వ్యక్తం చేశారు. జగన్‌, జనసేనలను బీజేపీ దగ్గరకు చేర్చుకుని ఆడిస్తున్న నాటకం కుట్రలో భాగమనే నిర్ధారణకు తెలుగుదేశం నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే భావనకు అధినేత చంద్రబాబు వచ్చారు. ఇందుకు అనుగుణంగా రేపు సాయంత్రం పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించి ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చే అంశంపై ఓ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.

 

16:49 - March 15, 2018

ఈ మధ్య చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్య థైరాయిడ్. అసలు ఈ థైరాయిడ్ ఎందుకొస్తుంది ? దీన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇదే అంశంపై నిర్వహించిన మానవి డాక్టర్ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్టు డా.నర్మద పాల్గొని, పలు విషయాలను తెలిపారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే...
'థైరాయిడ్ ఒక హార్మోన్. థైరాయిడ్ 5 మైక్రో గ్రామ్ కంటే తక్కువగా ఉండాలి. థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి. ఎక్కువగా ఉంటే హైపర్ థైరాయిండ్ అంటారు. తక్కువగా ఉంటే హైపో థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ ఫిమేల్ లో ఎక్కువగా వస్తుంది... పురుషుల్లో తక్కువగా వస్తుంది' అని తెలిపారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:04 - March 15, 2018

నిజామాబాద్ : జిల్లా కలెక్టరేట్ ముందు కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

 

ముఖ్య నేతలతో ముసిగిన చంద్రబాబు భేటీ..

అమరావతి : అందుబాటులో వున్న మంత్రులు, సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. విభజన హామీలపై కేంద్రం తీరు, జనసేన పార్టీ వ్యవహారంపై సమావేశం చర్చించింది. కాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిచ్చేందుకు టీడీపీ రెఢీగా వున్నట్లుగా సమాచారం.  

దేశానికి తెలిసేలా అవిశ్వాస తీర్మానం:వైవీ

ఢిల్లీ : కేంద్రం ఏపీకి ఏం న్యాయం చేస్తుందో దేశానికి తెలిసేలా అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అన్ని పార్టీలు సానుకూలంగా వున్నాయని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మేము కేవలం ఐదుగురం ఎంపీలం మాత్రమేననీ..టీడీపీ ఎంపీలు మద్ధతిస్తఏ ఇతర రాష్ట్రాల ఎంపీకు కూడా మద్దతునిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా వున్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తామన్నట్లు సమాచారం. 

సురక్షితమైన అమెరికా కోసం విద్యార్ధుల ర్యాలీ ..

ఢిల్లీ : అమెరికాలో రోజురోజుకీ పెరిగిపోతున్న తుపాకీ విష సంస్కృతిని నిరసిస్తు విద్యార్ధులు రోడ్లపైకి వచ్చారు. పుస్తకాలు, గాడ్జెట్స్‌ విడిచిపెట్టి ప్లకార్డులు పట్టుకున్నారు. తుపాకీతో జరుగుతున్న హింసను ఆరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శాంతియుతమైన జీవితాన్ని ఇవ్వాలని కొన్నిచోట్ల గాల్లోకి బెలూన్స్ వదిలారు. సురక్షితమైన అమెరికాను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పది గంటల నుంచి సుమారు ఇరవై నిమిషాల పాటు ఈ నిరసన ప్రదర్శన జరిగింది.

తుపాకీ సంస్కృతిపై ప్రజాగ్రహం..

ఢిల్లీ : అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతిపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. విద్యాసంస్థల్లో వీటి వినియోగం పట్ల అందరిలో ఆందోళన పెరుగుతోంది. దీంతో తుపాకీ సంస్కృతిని ఆరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అమెరికాలో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. యాభై రాష్ట్రాల్లోని విద్యార్థులంతా తరగతులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చారు. ఎక్కడికక్కడ విద్యార్థులంతా ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ప్రజా జీవనానికి ఎక్కడా ఆటంకం కలగకుండా శాంతియుత మార్గంలో ర్యాలీ నిర్వహించారు.

15:43 - March 15, 2018

ఢిల్లీ : పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పదించి రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది. 

గడ్కరీతో భేటీకానున్న హరీశ్..

హైదరాబాద్ : తెలంగాణ జలవనరుల శాఖా మంత్రి హరీశ్ రావు హస్తినకు పయనమాయ్యరు. సాయంత్రం 7 గంటలకు కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీతో హరీశ్ రావు భేటీ కానున్నారు. 

15:36 - March 15, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగుతోంది. ముస్లిం సోదరుడి వేషధారణలో ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే టీడీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

 

బీజేపీ, టీడీపీల మధ్య ఆసక్తికర చర్చ..

అమరావాతి : అసెంబ్లీ లాబీలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ల మధ్య ఆసక్తికర చర్చ కొనసాగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ వుందని పయ్యావుల అంటే మేము పవన్ తో లేము పవన్ తోనే వున్నామంటు ఇద్దరు చమత్కరించుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఆసక్తికర చర్చ కొనసాగింది. కాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ చర్చ కొనసాగింది.

నిజాంసాగర్ లో ఇద్దరు యువకులు గల్లంతు..

నిజామాబాద్ : ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వర్నిలోని నిజాం సాగర్ ప్రధాన కాలువలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని గల్లంతయినవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

15:24 - March 15, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

ఇది ఎన్నికల బడ్జెట్ కాదు : మంత్రి ఈటల

హైదరాబాద్ : ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ కాదని ప్రజా సంక్షేమ బడ్జెట్ అని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి అధికంగా ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. ఈసారి 26 శాతం అదనంగా కేటాయింపులు చేశామన్నారు. ఇది దేశంలో ఎక్కడ సాధ్యంకాదన్నారు. 2014కు ముందు కేంద్రం కన్నా తక్కువగా రాష్ట్ర జీఎస్ డీపీ ఉండేదనీ..నేడు కేంద్రం జీఎస్ డీపీ 6.6 ఉంటే రాష్ట్రంలో అది 10.2గా వుందన్నారు. గత బడ్జెట్ లో రూ.25వేల కోట్లకు గాను..రూ.22వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

ఎంపీ శివప్రసాద్ మరో వినూత్న వేషం..

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో డీపీపీ ఎంపీల దీక్ష కొనసాగుతోంది. విచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే ఎంపీ శివప్రసాద్ ఈసారి ముస్లిం వేషధారణ వేయగా మరికొందరు ఎంపీలు డప్పుకొట్టి ఆయనకు మద్దతు తెలుపుతు ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

రేపు పార్లమెంట్ లో వైసీపీ అవిశ్వాస తీర్మానం?..

ఢిల్లీ : వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభ జన్ రల్ సెక్రటరీకి అవిశ్వాస తీర్మానాన్ని పంపించారు. రేపటి పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ తరపున అవిశ్వాసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని లోక్ సభ సెక్రటరీ జన్ రల్ ను కోరారు. 

ప్రజా సమస్యలపై పవన్ తో కలిసి పోరాటం : సీపీఎం మధు

విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై కలిసి పనిచేద్దామని కోరారని సీపీఎం ఏపీ కార్యదర్శి పి. మధు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను తాము అంగీకరించామని తెలిపారు. ఈ నెల 19న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని.. ఈ సమావేశంలో జనసేన, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితితో కలిసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా సమవేశమయ్యామని మధు తెలిపారు. ప్రత్యేక హోదా, హామీల అమలులో టీడీపీ వైఫల్యాలు వంటి పలు అంశాలపై చర్చించామన్నారు. ప్రజా సమస్యల విషయంలో కలిసి పనిచేద్దామని పవన్ కోరారని మధు తెలిపారు.

14:49 - March 15, 2018

గుంటూరు : రేపు సాయంత్రం 5 గంటలకు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. ఎన్ డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం. 

పవన్ కు అత్తారింటికి దారి తెలీదన్న మంత్రి..

గుంటూరు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్తారింటికి దారెటో తెలీదని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు రాజకీయం అంటే ఒక సరదా అనీ..రాజకీయాలు సినిమా అనుకుని ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు.మిత్రపక్షంగా వున్నప్పుడు వేచి చూడాలని అందుకే వేచి చూస్తున్నామనీ..లోకేష్ గురించి పవన్ కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. లోకేష్ పై పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా టీడీపీ ఎదురు దాడిపై సవన్ కూడా స్పందించారు.

పార్లమెంట్ భవనం ఎక్కిన విజయసాయిరెడ్డి..

ఢిల్లీ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ భవనం ఎక్కారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటు నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటు నినాదాలుచేశారు. 

ఎన్డీయే నుండి టీడీపీ వైదొలగనుందా?..

అమరావతి : రేపు సాయంత్రం 5 గంటలకు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఎన్డీయే ప్రభుత్వం నుండి బైటకు రావాలా? లేదా? అనే అంశంపై పోలిట్ బ్యూరో చర్చించనుంది. దీనిపై ఈ సమావేశంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకోనుంది. 

ఏసీబీకి చిక్కిన సర్వేయర్ నాగేశ్వరరావు..

గుంటూరు : రూ.12 వేలు లంచం తీసుకుంటు సర్వేయర్ నాగేశ్వర రావు ఏసీబీకి చిక్కారు. నూజెండ్లలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ నాగేశ్వర రావు రూ.12వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. కాగా దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి వుంది. 

కాంగ్రెస్ దీక్షకు కోదండరాం మద్దతు..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో దీక్ష చేస్తున్న టి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జేఏసీ చైర్మన్ కోదండరామ్ మద్దతు తెలిపారు. మండలి చైర్మన్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్ తగిలి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి దెబ్బతగిలిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లను శాసనసభ సభ్యత్వం నుండి తొలగించిన విషయం తెలిసిందే.

13:31 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మోసపూరితంగా ఉందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. గురువారం శాసనసభలో మంత్రి ఈటెల 2018-19 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లుగా ప్రకటించారు. బడ్జెట్ పై సున్నం రాజయ్య మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ మోసపూరితంగా ఉందని, అన్ని వర్గాల..ప్రజలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ప్రణాళిక నిధి పేరిట డైవెర్ట్ చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు లేవని..పోరాటాలు చేస్తేనే కొంతమందికి జీతాలు ఇచ్చారని...సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రూ. 1,74,453 కోట్లు అమలు చేస్తామంటే నమ్మశక్యంగా లేదన్నారు. మొత్తంగా బడ్జెట్ అంకెలగారడీగా ఉందన్నారు. 

13:17 - March 15, 2018

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ స్పందించారు. ఏ ఏజెండాతో ప్లేటు ఫిరాయించారో అర్థం కావడం లేదని..అతని వెనుక కొన్ని శక్తులున్నాయన్నారు. ఆ శక్తి బీజేపీ అని అందరికీ తెలుస్తోందని, ఒక బీజేపీ స్ర్కిప్ట్ చదివినిట్లుగా ఉందన్నారు. నియోజకవర్గానికి రూ. 25 కోట్లు ఖర్చు పెడుతున్నారని పవన్ ఆరోపించడం తగదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ చేతిలో కీలు బొమ్మలా జనసేన అధినేత వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

13:14 - March 15, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ సమర్థించుకున్నారు. గుంటూరులో ఎన్ఆర్ఐ లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు పాలనపై వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు విధానాలను పరిశీలించడం జరిగిందని, బాబు మారే పరిస్థితి లేకపోవడంతోనే తాను దూకుడుగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. ఒక మాట అనే ముందు చాలా ఆలోచించాల్సి మాట్లాడుతుంటానని, అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా పట్టించుకోనని భయపడనన్నారు..

13:11 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పెదవి విరిచారు. బీసీలకు బడ్జెట్ లో ప్రాధాన్యం కల్పించలేదని పేర్కొన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టాలని చాలా రోజుల నుండి డిమాండ్స్ ఉందని..రూ. 20 వేల కోట్లతో సబ్ ప్లాన్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో కొంతమంది బీసీలు బాధ పడుతున్నారని, ఈ సంవత్సరం రెసిడెన్షియల్ పాఠశాలలు కావాలని 119 రెసిడెన్షియల్ ఇస్తామని చెప్పి బడ్జెట్ లో కేటాయించలేదని, వెంటనే బడ్జెట్ లో కేటాయించే విధంగా చూడాలన్నారు. 

టీడీపీపై బురుద చల్లటమే పవన్ పనా? : కళా

అమరావతి : టీడీపీపై బురుద చల్లటమే పవన్ పనిగా పెట్టుకున్నారా? అని మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం విడ్డూరంగా వుందనీ..అసలు జనసేన పాలసీ ఏమిటీ వెంకట్రావు ప్రశ్నించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత కోరితేనే శేఖర్ రెడ్డికి పదవి ఇచ్చామనీ ఆయనపై ఆరోపణలు వచ్చిన వెంటనే టీడీపీ మెండర్ నుండి సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. 

12వ తరగతి ప్రశ్నాపత్రం లీక్?!..

ఢిల్లీ : సీబీఎస్ ఈ 12 వ తరగతి అకౌంట్స్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. పరీక్ష ప్రాంభానికి ముందే వాట్సాప్ లో ప్రశ్నాపత్రం రిలీజ్ అయినట్లుగా సమాచారం. కాగా దీనిపై మరింత సమాచారం తెలియాల్సివుంది. 

12వ తరగతి ప్రశ్నాపత్రం లీక్?!..

ఢిల్లీ : సీబీఎస్ ఈ 12 వ తరగతి అకౌంట్స్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. పరీక్ష ప్రాంభానికి ముందే వాట్సాప్ లో ప్రశ్నాపత్రం రిలీజ్ అయినట్లుగా సమాచారం. కాగా దీనిపై మరింత సమాచారం తెలియాల్సివుంది. 

12:54 - March 15, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈటెల 2018-19 బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ తో పాటు కార్పొరేషన్ లకు పంచాయతీలకు..గ్రామాలకు నిధులు కేటాయించడం జరిగిందని, హైదరాబాద్ లో ఉండే పరిశ్రమల స్థాపన ఇతర జిల్లాలకు విస్తరించాయన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, హాస్టల్ స్కాలర్ షిప్, మెస్ ఛార్జీలు తదితర ఎన్నో సమస్యలు పరిష్కరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు..ప్రవేశ పెడుతోందని, పెట్టుబడి ఫ్రీగా వచ్చే విధంగా..బీమాను కూడా ప్రవేశ పెట్టిందన్నారు. అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈటెల ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎంతో బాగుందన్నారు. పనిలోపనిగా ప్రతిపక్షంపై పలు విమర్శలు గుప్పించారు. 

12:53 - March 15, 2018

గుంటూరు : జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీ అనంతరం మధు మీడియాతో మాట్లాడారు. సీపీఎం...జనసేన పార్టీల అభిప్రాయాలు ఒకరినొకరం తెలుసుకోవడం జరిగిందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలు, కడప ఉక్కు...ఇలాంటి అనేక పెండింగ్ సమస్యలపై ఉమ్మడిగా పోరాడుదామని పేర్కొన్నారని..దీనికి తాము సమ్మతించడం జరిగిందన్నారు. ఎప్పుడు ? ఎలాంటి పోరాటం చేయాలనే త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. 19వ తేదీన జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కేంద్రం మెడలు వంచి సమస్యల పరిష్కారించే విధంగా పోరాటం చేస్తామన్నారు. పొత్తులు..ఎన్నికలకు సంబంధించిన వాటిపై చర్చించడం లేదని, ఎన్నికల సమయంలోనే వీటిపై దృష్టి సారించడం జరుగుతుందని మధు తెలిపారు. 

బడ్జెట్ అనంతరం టీ.అసెంబ్లీ వాయిదా..

హైదరాబాద్ : శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన అనంతరం సభను సోమవారానికి వాయిదా వేసినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

సీపీఎం నేతలతో పవన్ భేటీ..

విజయవాడ : జనసేన పార్టీ సమన్వయ కమిటీ కార్యాలయంలో ఏపీ సీపీఎం కార్యదర్శి మధుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చలు జరిపారు. కాగా వామపక్ష నేతలతో కలిసి పనిచేస్తానని పవన్ కళ్యాణ్ గతంలోనే పేర్కొన్న విషయం తెలిసిందే.

టీడీపీని దెబ్బతీసేందుకు కుట్ర : చంద్రబాబు

అమరావతి: రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన తెదేపా ఇలాంటి కుట్రలెన్నింటినీ దాటుకుని వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఉదయం ఎంపీలు, సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారికి దిశానిర్ధేశం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను రాజకీయంగా బలహీనపరిచేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. బలమైన నాయకత్వం ఉన్న చోట బలహీన పరిచేలా కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 

వ్యవసాయానికి పెద్దపీట : ఈటల

హైద‌రాబాద్ : బ‌డ్జెట్‌లో వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట వేసామని మంత్రి ఈటల పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో వ్య‌వ‌సాయ రంగ‌మే కీల‌క‌మ‌న్న ఈట‌ల వ్యవసాయం కోసం ఏడాదికి రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రెండు పంట‌ల‌కు క‌లిపి ఎక‌రాకు రూ.8 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు రూ.522 కోట్లు కేటాయించారు. భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న కోసం ధ‌ర‌ణి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. పాలీ, గ్రీన్‌హౌజ్ కోసం రూ.12 కోట్లు. రైతు బీమా ప‌థ‌కం కోసం రూ.500 కోట్లు ,రైతుల‌కు రూ.5 ల‌క్ష‌ల బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్లు ఈట‌ల చెప్పారు.

పట్టు బిగించిన మిథాలీ సేన..

హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య భారత మహిళల జట్టు పట్టుబిగించింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ నికోలా బోల్టన్  ఏక్తా బిష్ఠ్ ఔట్ చేసి భారత్ శిబిరంలో ఉత్సాహం నింపింది. మిగతా బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోకుండా ఆతిథ్య బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ఆసీస్ భారీ స్కోరు సాధించకుండా సమష్టిగా పోరాడుతున్నారు. 

పవన్ మాటలకు రాజకీయ సన్యాసం చేస్తానన్న జలీల్..

అమరావతి : గుంటూరు పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. సభలో పవన్ కనక దుర్గగుడి పార్కింగ్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జలీల్ ఖాన్ మాట్లాడుతూ... బీజేపీ దగ్గర ప్యాకేజీ తీసుకుని పవన్ అకస్మాత్తుగా వైఖరి మార్చుకున్నారని మండిపడ్డారు. మంత్రి లోకేశ్ అవినీతిపై పవన్ కల్యాణ్ దగ్గర ఆధారాలున్నాయా...? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

కుక్కర్‌ తో కొనసాగుతాం..

తమిళనాడు : ‘రెండాకుల గుర్తు’ కోసం తాము పోరాడుతామని, అప్పటిదాకా ఎన్నికల సంఘం కేటాయించిన కుక్కర్‌ గుర్తుతోనే కొనసాగుతామని అన్నాడీఎంకే మాజీ నేత, ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే టీటీవీ తెలిపారు. తమిళనాట మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. అన్నాడీఎంకే మాజీ నేత, ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ ‘అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. గురువారం మదురైలో జరిగిన సభలో పార్టీ పేరుతో పాటు జెండాను కూడా ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండాపై తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను ముద్రించారు.

మహిళా,శిశు సంక్షేమానికి రూ. 1799 కోట్లు..

హైదరాబాద్ : -మహిళా శిశు సంక్షేమానికి రూ. 1799 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి రూ. 1799 కోట్లు,-కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కు రూ. 1450 కోట్లు చొప్పున  బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వరుసగా ఐదవసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టం సంతోషంగా వుందని అసెంబ్లీలో 2018/19 సంవత్సరానికి బడ్జెట్ పెడుతున్న సందర్భంగా మంత్రి ఈటల పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు, నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు, -పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు, రైతు బీమా పథకానికి రూ.

11:27 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2018-19 బడ్జెట్ ను మంత్రి ఈటెల సమర్పించారు. గురువారం ఐదోసారి మంత్రి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తం బడ్జెట్ రూ. 1.74, 453 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ. 1.25, 454 కోట్లుగా ప్రకటించారు. ప్రజల ఆకాంక్షల నెరవేర్చడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించడం జరిగిందని, ఈ ఏడాది వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సభకు తెలిపారు. వ్యవసాయ రంగంలో వృద్ధి 6.9 శాతానికి చేరుకుందని, ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ 10.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది తలసరి ఆదాయం రూ. 1,75,534గా ఉంటుందని, ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 14.1 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2017-18లో పారిశ్రామిక వృద్ధి రేటు 7.6 శాతం, రాష్ట్ర ఆదాయం రూ. 73,751 కోట్లుగా ఉందని, కేంద్రం వాట రూ. 29.041 కోట్లుగా ఉందన్నారు. రెవెన్యూ మిగులు రూ. 5520 కోట్లు అంచనా వేస్తున్నట్లు, ద్రవ్యలోటు రూ. 29,077 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

 • మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు
 • ఈ ఏడాది నుండి రైతులకు రూ. 5లక్షల బీమా పథకం. త్వరలో ధరణి వెబ్ సైట్ ఆవిష్కరణ.
 • రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు.
 • రైతుల పెట్టుబడి పథకానికి రూ. 12వేల కోట్లు.
 • పౌలీ హౌస్ నిర్మాణాలకు రూ. 120 కోట్లు.
 • బిందు, తుంపర సేద్యానికి రూ. 127 కోట్లు.
 • వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు.
 • నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు.
 • మహిళా, శిశు సంక్షేమానికి రూ. 1799 కోట్లు.
 • పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు.
 • మైనార్టీల సంక్షేమానికి రూ. 2,500 కోట్లు.
 • మిషన్ భగీరథకు రూ. 1,081 కోట్లు.
 • ఎంబీసీ కార్పొరేషన్ కు రూ. వెయ్యి కోట్లు.
 • విద్యాశాఖకు రూ. 10,830 కోట్లు.
 • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,563 కోట్లు.
 • వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 7,375 కోట్లు.
 • గురుకులాలకు రూ. 2,823 కోట్లు.
 • దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీకి రూ.1469 కోట్లు.
 • బీసీల సంక్షేమానికి రూ. 5,920 కోట్లు.
 • ఎస్టీ ప్రగతి నిధికి రూ. 9,693 కోట్లు.
 • ఎస్టీల సంక్షేమానికి రూ. 8,063 కోట్లు.
 • ఎస్సీల సంక్షేమానికి రూ. 12,709 కోట్లు.
 • ఎస్సీ ప్రగతి నిధికి రూ. 16,453 కోట్లు.
 • పట్టణాభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు.
 • గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1500 కోట్లు.
 • కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కు రూ. 1450 కోట్లు.
 • డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు.
 • ఆర్ అండ్ బికి రూ. 5,575 కోట్లు.
 • విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు
 • చేనేత, జౌళి రంగానికి రూ. 1,200 కోట్లు.
 • పరిశ్రమల శాఖకు రూ. 1,286 కోట్లు. 
 • పట్టణాభివృద్ధికి రూ. 7,251 కోట్లు.
 • రోడ్లు భవనాల శాఖకు రూ. 5,575 కోట్లు.
 • సాగునీటి ప్రాజెక్ట్ లకు రూ. 25వేల కోట్లు.
 • ఐటీ శాఖకు - రూ. 289 కోట్లు.
 • చేనేత, టెక్స్ టైల్ రంగానికి - రూ. 1,200 కోట్లు.
 • ఆరోగ్యలక్ష్మి పథకానికి - రూ. 298 కోట్లు.
 • మిషన్ భగీరథకు - రూ. 1,801 కోట్లు.
 • మిషన్ కాకతీయకు - రూ. 25వేల కోట్లు.
 • సాంస్కృతిక శాఖకు - రూ. 2వేల కోట్లు.
 • యాదాద్రి అభివృద్ధికి - రూ. 250 కోట్లు.
 • వేములవాడ దేవాలయం అభివృద్ధికి - రూ. 100 కోట్లు.
 • బాసర ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు.
 • ధర్మపురి ఆలయ అభివృద్ధికి - రూ. 50 కోట్లు.
 • భద్రాచలం ఆలయ అభివృద్ధికి - రూ. 100 కోట్లు.
 • అర్చకుల జీతభత్యాలకు - రూ. 72 కోట్లు.
 • హోంశాఖకు - రూ. 5,790 కోట్లు.
 • పౌరసరఫరాల రంగానికి - రూ. 2,946 కోట్లు.
 • విద్యుత్ రంగానికి - రూ. 5,650 కోట్లు.
 • వైద్య ఆరోగ్యశాఖకు - రూ. 7,375 కోట్లు.
 • విద్యాశాఖకు - రూ. 10,830 కోట్లు.

రూ.1,74,458 కోట్లతో టీ. బడ్జెట్..

హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పైగా వృద్ధికి అనుగుణంగా బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని మంత్రి ఈటల రాజేంద్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటం కోసం ఎన్నో మైలురాళ్లను అధిగమించామన్నారు. రాష్ట్ర జీడీపీ ఏటేటా పెరుగుతోందని తెలిపారు. మొత్తం బడ్జెట్ రూ.1,74,458 కోట్లని ఆయన తెలిపారు. దీంట్లో రెవెన్యూ వ్యయానికి రూ.1,25,454 కోట్లు కాగా, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించామన్నారు. ఈ ఏడాది తలసిరి ఆదాయం రూ. 1,75,534 అని అంచనా వేశామని..ఈ ఏడాది వృద్ధి రేటు 10.4 శాతంగా వుంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 

ఎన్నో మైలురాళ్లు అధిగమించాం: ఈటల

హైదరాబాద్ : రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సభలో ఆర్థిక మంత్రి ఈటల వినిపిస్తున్నారు. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని ఆయన తెలిపారు. అస్తవ్యస్థంగా వున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆర్థిక స్థితిని గాడిలోకి తెచ్చఆరనీ..ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది సీఎం కాగా కేసీఆర్ సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే.

టీడీపీ, జనసేనాని మధ్య మాటల యుద్ధం షురూ..

గుంటూరు : టీడీపీ, జనసేనాని మధ్య మాటల యుద్ధం ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ టీడీపీని ఒక్కమాట కూడా అనని పవన్ కళ్యాణ్ నిన్న గుంటూరులో జనసేన ఆవిర్భావ సభలు విమర్శనాస్త్రాలు సంధించిన విషయంపై టీడీపీ ఎదురు దాడికి దిగింది ఈ నేపథ్యంలో  నాకు రాజకీయపరంగానే తప్ప ఎవ్వరితోను వ్యక్తిగత శతృత్వం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేను ఎప్పుడు మాట్లాడినా ఆచి తూచి మాట్లాడుతానుతప్ప ఆవేశంగా మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు. అన్ని విషయాలలోను ముందు జాగ్రత్త తీసుకుంటానని తెలిపారు.

అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం..అరెస్ట్..

హైదరాబాద్ : ఏబీవీపీ నేతలు నిజాం కాలేజ్ నుండి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. పెండింగ్ లో వున్న స్కారల్ షిప్ లను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ తో ఏబీవీపీ నేతలు అసెంబ్లీని ముట్టడించేందుకు బయలుదేరిన వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం బేగంబజార్ పీఎస్ కు తరలించారు. 

పార్టీ పేరు ప్రకటించిన దినకరన్..

తమిళనాడు : కొత్త పార్టీని దినకరన్ ప్రకటించారు. `అమ్మ ముక్కళ్ మున్నెట్ర కళగం' అని తన పార్టీ పేరును ప్రకటించారు. గత కొంత కాలంగా దినకరన్‌ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నాడంటూ తమిళ రాజకీయాల్లో చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పార్టీ పేరును దినకరన్ ప్రకటించారు. ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోవడంతో దినకరన్‌ కొత్త పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన విషయం కూడా తెలిసిందే.

10:46 - March 15, 2018

హైదరాబాద్ : ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయినట్లుంది...పలువురు క్షణికావేశాలతో తమ వారికి ఫోన్ చేసి లైవ్ లో సూసైడ్ చేసుకుంటున్నారు..తాము ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో పేర్కొంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఐటీఐ విద్యార్థి లైవ్ లో సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన మల్కాజ్ గిరిలో చోటు చేసుకుంది. సాగర్ అనే ఐటీఐ విద్యార్థి మల్కాజ్ గిరిలోని తన సోదరి ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. జ్యోతి అనే యువతితో పరిచయం ఏర్పడింది..ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. కానీ వీరిద్దరూ మైనర్లు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లిని నిరాకరించారు. దీనితో సాగర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రియురాలికి ఫోన్ చేసి తాను తీవ్ర మనస్థాపానికి గురయినట్లు..తాను చనిపోతున్నట్లు లైవ్ లో చెబుతూ ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ దృశ్యాలు చూసిన ప్రియురాలు వారించినా అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

లైవ్ లో ఉరి వేసుకున్న విద్యార్థి..

హైదరాబాద్ : నగరంలోని మాల్కజిగిరిలో విషాదం నెలకొంది. సాగర్ అనే ఐటిఐ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్కాజిగిరిలో చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసిందనే భయంతో ప్రియురాలికి వీడియో ఫోన్ చేసిన లైవ్ లో వుండగానే సాగర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలు వద్దని బతిమాలినా వినని సాగర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా జీవితం క్షణికావేశంలో ముగించుకోకూడదనే విచక్షణను తెలుసుకోవాల్సిన అవుసరం నేటి యువతరానికి ఎంతైనావ ఉంది.

పార్లమెంట్ నిరవధిక యోచనలో మోదీ సర్కార్?..

ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మోదీ సర్కార్ నిరవధిక వాయిదా వేసే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 వరకూ సమావేశాలు జరగాల్సి వుండగా..లోక్ సభలో ఆర్థిక బిల్లు ఆమోదించిన నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీల ఆందోళనతో గందరగోళం నెలకొనటంతో ముస్లిం మహిళలకు సంబంధించిన ట్రిపుల్ తలాక్ బిల్లు, ఆర్థిక నేరస్తుల బిల్లులు పాస్ కాకుండానే సమావేశాలు వాయిదా పడే అవకాశముంది. కాగా ఈనెల 5న బడ్జెట్ మలిదశ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండే సభలో విపక్షాలు ఆందోళనచేపట్టిన విషయం తెలిసిందే. 

10:20 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుండి తమను బలవంతంగా బయటకు పంపేశారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో గురువారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ వేటు వేయడం...ఇద్దరు సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో టెన్ టివితో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని అభివర్ణించారు. గవర్నర్ ప్రసంగం మొత్తం వీడియో చిత్రీకరిస్తారని..స్వామిగౌడ్ పై దాడి జరిగితే పశ్చాతాపం వ్యక్తం చేస్తామని..కానీ దాడి జరిగిన ఘటన వీడియో ఫుటేజ్ ను బయట పెట్టాలన్నారు. బడ్జెట్ కేటాయింపులు ప్రధానం కాదని..ఖర్చు ప్రధానమైందన్నారు. రూ. 21వేల కోట్లు దళితుల సంక్షేమం కోసం వెచ్చించాల్సి ఉందని కానీ అలా చేయలేదన్నారు. ఆధారాలు ఉంటే తెలియచేయాలని..నిర్ణయం తీసుకోవడం అంటే ఏకపక్షమేనని జీవన్ రెడ్డి తెలిపారు. 

దేశానికే టీ.బడ్జెట్ దిక్చూచి అట!..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 2018/19 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ దేశానికే దిక్సూచిగా ఉండబోతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అణగారిన వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన ఆయన తెలిపారు. నీటిపారుదల రంగం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి అత్యధిక ప్రాధ్యానత ఇచ్చామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పైగా వృద్ధికి అనుగుణంగా బడ్జెట్ ఉండనున్నట్లు సమాచారం. 

తెలంగాణ సర్కార్ భారీ బడ్జెట్?!..

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ వార్షిక బడ్జెట్ ను భారీగా ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. గత వార్షిక బడ్జెట్ కంటే ఈ సారి బడ్జెట్ ఎక్కువ శాతం వున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి బడ్జెట్ లో పెద్దపీట వేశామని అధికార వర్గాల సమాచారం. ఈ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించారట. దాదాపు లక్షా 73 వేల కోట్లతో భారీ బడ్జెట్ ను టీఆర్ఎస్ సర్కార్ రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఎన్నారైలతో జనసేనాని భేటీ..

అమరావతి : ఎన్నారైలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై పవన్ వారితో చర్చించారు. ఈ చర్చ అనంతరం వామపక్ష నేతలతో పవన్ భేటీ కానున్నారు. 

10:07 - March 15, 2018

లోకేష్ పై పవన్ యాక్షన్..పల్లె రియాక్షన్..

అమరాతి : ఏపీ మంత్రి నారా లోకేష్ పై జనసేనన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పల్లె రఘునాథ రెడ్డి స్పందించారు. తండ్రి చంద్రబాబు నాయుడికి తలవంపులు తెచ్చే పని లోకేష్ ఏనాడూ చేయలేదని మంత్రి పల్లె తెలిపారు. లోకేష్ పై పవన్ వ్యాఖ్యలు ఆధారాలు లేనివన్నారు. పవన్ ఆవేశంతో మాట్లాడారే తప్ప ఆలోచనతో కాదని ఆధారాలు లేని విమర్శలు సరైనవి కాదని పవన్ కళ్యాణ్ కు పల్లె సూచించారు.

ప్రజాపాలన, పౌర సేవల్లో పూణెకు ప్రథమస్థానం..

మహారాష్ట్ర : నగరాల్లో ఉత్తమ పాలన, పౌర సేవలకు సంబంధించి జనాగ్రహ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పూణె నగరానికి ప్రథమస్థానం దక్కింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్‌షిప్ అండ్ డెమోక్రసీ తన వార్షిక సర్వే నివేదికను ఇండియన్ సిటీ సిస్టమ్స్ పేరుతో బుధవారం విడుదల చేసింది. ప్రజాపాలన, పౌర సేవలకు సంబంధించి 89 ప్రశ్నలతో సర్వే నిర్వహించామని వెల్లడించింది. 23 భారతీయ నగరాల్లో మహారాష్ట్రలోని పుణె అగ్రస్థానంలో నిలువగా కోల్‌కతా, తిరువనంతపురం, భువనేశ్వర్, సూరత్ తర్వా తి స్థానాల్లో నిలిచాయి.

భాగ్యనగరానికి ఎనిమిదో స్థానం..

హైదరాబాద్ : నగరాల్లో ఉత్తమ పాలన, పౌర సేవలకు సంబంధించి జనాగ్రహ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్‌షిప్ అండ్ డెమోక్రసీ తన వార్షిక సర్వే నివేదికను ఇండియన్ సిటీ సిస్టమ్స్ పేరుతో బుధవారం విడుదల చేసింది. సంస్థ 2017లో 20 రాష్ర్టాల్లోని 23 ప్రధాన నగరాల్లో అమలైన ప్రజాపాలన, ప్రభుత్వ సేవల గురించి సర్వే చేపట్టింది. ఈ సర్వేలో హైదరాబాద్ కు పాలన, పౌర సేవల్లో ఎనిమిదో స్థానం లభించింది. 

09:51 - March 15, 2018

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ టిడిపిలో సునామీ సృష్టిస్తోంది. పవన్ వ్యాఖ్యలను ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఆరోపణలు చేయడంపై నేతలు ఆగ్రహంగా ఉన్నారు. నారా లోకేష్..సీఎం చంద్రబాబు నాయుడు..ఇతర అంశాలపై పవన్ గుంటూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

పవన్ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. టిడిపి ఎంపీలు, మంత్రులతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన తనయుడు నారా లోకేష్ పై విమర్శలు..ఆరోపణలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అన్నీ వదులకుని ప్రజా సేవ చేసేందుకు నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని, సంపాదించేందుకు లోకేష్ కు చాలా వ్యాపారులున్నాయన్నారు. అన్యాయం చేసిన వారిని అనడానికి పవన్ కు నోరు రాలేదని కేవలం టిడిపిని తిట్టడానికే గుంటూరులో పవన్ సభ పెట్టినట్లుగా ఉందని తెలిపారు. పవన్ ను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరో గ్రహించాలని, పవన్ ఆరోపణలకు ప్రతి సమాధానమే ఇవ్వాలి కానీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లవద్దని బాబు సూచించారు. కేంద్రాన్ని ఒక్కమాట వినకుండా పోరాడుతుంటే ఇంకా మాటలు ఎందుకు అంటారని బాబు ప్రశ్నించారు. 

పవన్ వ్యాఖ్యల్ని తిప్పి కొట్టండి : చంద్రబాబు

అమరావతి : పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన అధినేత టీడీపీపై చేసిన విమర్శనాస్త్రాను తీవ్రంగా తిప్పికొట్టాలని వారికి ఆదేశించారు. పవన్ వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశౄరు. ఇప్పటి వరకూ టీడీపీపై ఎటువంటి విమర్శలు చేయని పవన్ గుంటూరు ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యల్ని ఖండించాలే తప్ప వ్యక్తిగత ఆరోపణలకు దిగవద్దని సూచించారు. కేంద్రాన్ని ఒక్కమాట కూడా అనకుండా రాష్ట్రం లబ్ది కోసం పోరాడుతున్న తమపై విమర్శలు చేయటం సరికాదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సూచించారు. 

పవన్ ఆరోపణలను ఖండిస్తున్నాం : మంత్రి పల్లె

అమరావతి : బుధవారం నాడు గుంటూరులో జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ అధికార పార్టీపై వాడివేడిగా విమర్శనాస్త్రలు కురిపించారు. ఈ అంశంపై మంత్రి పల్లె రఘునాధ రెడ్డి మాట్లాడుతు..పవన్ కళ్యాణ్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పవన్ వెనుక బీజేపీ హస్తముందని తాము అనుమానిస్తున్నామన్నారు. పవన్ ను బీజేపీ పాములా వాడుకుంటోందని ఆరోపించారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాడాలి కాని తమపై దాడి చేయటం సరికాదని మంత్రి పల్లె పవన్ కళ్యాణ్ కు సూచించారు.

09:42 - March 15, 2018

విజయవాడ : గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గురువారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీకి టెన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతోందని, 6-7 స్టార్ లున్న గ్రామ పంచాయతీలను ప్రోత్సాహిస్తామన్నారు. దాదాపు 15వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేయడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10వేల ఆదాయం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని, 4వేల 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని సభకు తెలిపారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావడం లేదని...అభివృద్ధి చెందే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆదాయం లేని గ్రామ పంచాయతీలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని, ప్రతి పేదోడి ఇంటి ముందట సీసీ రోడ్లు ఉండే విధంగా కృషి చేయడం జరుగుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. 

09:38 - March 15, 2018

హైదరాబాద్ : బాల కార్మికుల రవాణా ఆగడం లేదు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు తరలిస్తూ శివారు ప్రాంతాల్లోని పలు పరిశ్రమల్లో పనుల్లోకి పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ ట్రైన్ లో బాల కార్మికులను తరలిస్తున్న గుట్టు రట్టైంది. బీహార్ నుండి హైదరాబాద్ కు బాలకార్మికులను తరలిస్తున్నారని సమాచారం అందింది. దీనితో బాల కార్మికుల సంరక్షణ అధికారులు, పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. దానాపూర్ ఎక్స్ ప్రెస్ లో బాల కార్మికులను గుర్తించారు. వీరిని తరలిస్తున్న దళారులు పారిపోయారు. ఈ ఘటనలో 26 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. పాతబస్తీ గాజుల పరిశ్రమలో పనిచేయించేందుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరినీ సైదాబాద్ లోని బాలల సంరక్షణ కార్యాలయాలకు తరలించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని తాము కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. బాల కార్మికులను తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు..తాము రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని అధికారి పేర్కొన్నారు. 

09:23 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30గంటల నుండి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.15 వరకు పరీక్ష జరుగనుంది. ఈ సందర్భంగా విద్యా శాఖ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 38 వేల 867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఎస్‌ఎస్‌సీ బోర్డు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గతేడాది తరహాలోనే ఐదు నిమిషాల ఆలస్యం నిబంధనను అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

 • రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 38వేల 867 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
 • 2లక్షల 62వేల 479 మంది బాలికలు.. 2లక్షల 76వేల 388 మంది బాలురు ఉన్నారు.
 • 5లక్షల 3వేల 117 మంది విద్యార్థులు రెగ్యులర్‌ పరీక్షలు రాయనున్నారు.
 • ప్రైవేటుగా రాసేందుకు 35వేల 750 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
 • ఒకేషనల్ విద్యార్ధులు 20వేల 838 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
 • హైకోర్టు ఆదేశాల మేరకు 431పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు.
 • విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లరాదు.
 • ఆర్టీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.
 • అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర 144సెక్షన్ అమలులో ఉండనుంది.

కాసేపట్లో టెన్త్ పరీక్షలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిదన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల 15 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.

 

ఎన్నికల బడ్జెట్ కాదన్న రామలింగారెడ్డి...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో నేడు ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఉదయం 11గంటలకు అసెంబ్లీలో మంత్రి ఈటెల, శాసనమండలిలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరిలు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదని..ప్రజల బడ్జెట్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి టెన్ టివితో తెలిపారు. 

09:10 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కీలకం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ పద్దును ఆయన ప్రతిపాదిస్తారు. శాసనమండలిలో బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ఇప్పటికే బుధవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.

ఈ సారి రాష్ట్ర బడ్జెట్‌ లక్షా 73వేల కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతియేటా పద్దును 15శాంత పెంచి చూపుతున్న సర్కారు.. ఇప్పుడు కూడా అదేవిధంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. దీంతో లక్షా 73 వేల నుంచి 75 వేల కోట్ల మధ్య బడ్జెట్‌ ఉండనున్నట్టు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:32 - March 15, 2018

విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నారు. గురువారం నాడు కొనసాగే సమావేశాల్లో పలు అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. సాధారణ బడ్జెట్ పై ఆర్థిక మంత్రి ఉభయసభల్లో సమధానం ఇవ్వనున్నారు. సంక్షేమ రంగంపై లఘు చర్చ జరుగనుంది. విద్యా సంస్థల వద్ద మహిళలపై వేధింపులు...గాలేరు - నగరి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు...పంచాయతీ రాజ్ సంస్థల పటిష్టం తదితర అంశాలపై చర్చ జరుగనుంది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో అడుగు పెట్టి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శాసనమండలిలో అభినందన తీర్మానం చేస్తారని తెలుస్తోంది. మరోవైపు పవన్ చేసిన తీవ్ర విమర్శలపై టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు. మీడియా పాయింట్ వద్ద పవన్ పై టిడిపి నేతలు విమర్శలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఏపీ అసెంబ్లీ..కాసేపట్లో...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థల వద్ద మహిళలపై వేధింపులు...గాలేరు - నగరి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు...పంచాయతీ రాజ్ సంస్థల పటిష్టం తదితర అంశాలపై చర్చ జరుగనుంది. 

07:55 - March 15, 2018

పోరాడాలి అంటారు..ప్రజలు రావద్దని పవన్ పేర్కొంటున్నారని...ఇది సినిమా కాదు..రాజకీయం..ఇది సమాజం....వన్ మ్యాన్ షో నడవదని ప్రముఖ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహించిన జనసేన నిర్వహించిన సభలో పవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ప్రధానంగా టిడిపి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రొ.నాగేశ్వర్ తో టెన్ టివి ప్రత్యేకంగా ముచ్చటించింది. ప్రజలు ముందుకు రావాల్సి ఉంటుందని...ప్రజా ఉద్యమం వస్తేనే ప్రజాస్వామ్యం వస్తుందన్నారు. ఈ విషయంలో పవన్ తన విధానాన్ని మార్చుకోవాల్సినవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి..జనసేన కలుస్తుంది అంటూ ఒక రాజకీయ అభిప్రాయం ఉందని..జనసేనను కలుపుకోవాలని టిడిపి అనుకొంటూ ఉంటుందన్నారు. ఇంత జరిగినా టిడిపితో జనసేన వెళితే ఆత్మహత్య అవుతుందన్నారు. వైసీపీతో కలుపుకొనే అవకాశం లేదని..చిన్నచిన్న పార్టీలతో కలిసే అవకాశం ఉందన్నారు. కొన్ని కులాల అధిపత్యం ఉందని..విధానాలపై విమర్శలు చేయవచ్చని...కానీ పవన్ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. పవన్ అనుకొంటే పార్లమెంట్ కు పోయే అవకాశం ఉండేదని..2014లో ఒక్క సీటు ఆశించకుండా మద్దతిచ్చారని గుర్తు చేశారు. పవన్ పై విమర్శలు చేయడం టిడిపికి ఇబ్బందికరమన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:43 - March 15, 2018

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టిడిపిని ఉతికిపారేశాడని ప్రముఖ విశ్లేషకులు ప్రొ. నాగేశ్వర్ పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహించిన జనసేన నిర్వహించిన సభలో పవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ప్రధానంగా టిడిపి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రొ.నాగేశ్వర్ తో టెన్ టివి ప్రత్యేకంగా ముచ్చటించింది.

పవన్ కళ్యాణ్ పై గతంలో విమర్శించారు..కొందరు ప్రశ్నించారు..ఆవేశం ఉంది..ఆలోచన లేదన్నారని..కానీ వీటన్నింటికీ ఈ సభ ద్వారా సమాధానం ఇచ్చాడన్నారు. ప్రశ్నల్లో ఒక నిర్దిష్టత చూపించారని, అవినీతి ఆరోపణలపై స్పష్టంగా ఉదహారాణలతో చెప్పారని తెలిపారు. శేఖర్ రెడ్డి కుంభకోణంలో మంత్రి లోకేష్ తో సంబంధం ఉందా ? అంటూ నాకైతే తెలియదు అంటూ..వనజాక్షి దాడిలో ఎమ్మెల్యేను ఎందుకు వెనుక వేశారంటూ ప్రశ్నించారని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాపై కాకినాడ..తిరుపతిలో మాట్లాడిన అనంతరం పవన్ ఎక్కడకు వెళ్లాడు ? అనే విమర్శలకు పవన్ ఈ సభ ద్వారా సమాధానం చెప్పారని తెలిపారు. హోదాపై వామపక్ష నేతలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణనను ప్రకటిస్తానని పేర్కొనడం ద్వారా విమర్శలకు సమాధానం చెప్పారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించకుండా ప్రతిపక్షంపై ప్రశ్నించడం లేదని విమర్శలు వచ్చాయని..ఈ సభలో అధికారపక్షంపై పలు విమర్శలు చేశారని తెలిపారు. ప్రతిపక్షంపై కూడా సునితంగా విమర్శలు చేశారని వెల్లడించారు. పార్టీ దేనిపై స్టాండ్ తీసుకొంటుందనే దానిపై కూడా పవన్ వివరించడం జరిగిందన్నారు. థర్డ్ ఫ్రంట్ కు అవకాశం ఉందా ? అనే భావన కూడా కలుగుతోందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:38 - March 15, 2018

రాబోయే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఇక మండలిలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పీట వేస్తుందని సర్కార్‌ చెప్తున్న నేపథ్యంలో ఈటెల బడ్జెట్‌ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈటెలతో టెన్ టివి ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బడ్జెట్ విశేషాలను తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బాల కార్మికుల అక్రమ గుట్టు రట్టు...

హైదరాబాద్ : బీహార్ నుండి హైదరాబాద్ కు బాలకార్మికుల అక్రమ రవాణా గుట్టు రట్టైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దానాపూర్ ఎక్స్ ప్రెస్ లో బాల కార్మికులను గుర్తించారు. వీరిని తరలిస్తున్న దళారులు పారిపోయారు. ఈ ఘటనలో 23 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. 

భారత్ ఘన విజయం...

ఢిల్లీ : ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా.... బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.  17 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసి ఫైనల్‌కు చేరింది. టీమ్‌ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ రోహిత్‌శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. నిదహాస్ ట్రోఫీ T20 ట్రై సీరిస్‌లో భారత్‌ మరో విజయాన్ని అందుకుంది. 

07:17 - March 15, 2018

తెలంగాణలో పోడు భూములు సాగు చేసుకునే గిరిజనులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎకరానికి 4వేల పథకం వారికి వర్తింప జేయకపోవడంపై వారు పోరుకు సిద్ధమయ్యారు. వీరి ఆందోళనకు గల కారణాలు, వీరి పట్ల ప్రభుత్వ విధానాలపై టెన్ టివి జనపథంలో ఆదివాసీ గిరిజన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవికుమార్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:14 - March 15, 2018

ఢిల్లీ : ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా.... బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసి ఫైనల్‌కు చేరింది. టీమ్‌ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ రోహిత్‌శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. నిదహాస్ ట్రోఫీ T20 ట్రై సీరిస్‌లో భారత్‌ మరో విజయాన్ని అందుకుంది.

టాస్‌ ఓడిన ఇండియా.. ముందుగా బ్యాటింగ్‌ చేసింది. కొద్దిరోజులుగా నిలకడలేమితో సతమతమవుతున్న కెప్టెన్‌ రోహిత్‌శర్మ... ఈ మ్యాచ్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 61 బంతుల్లో 89రన్స్‌ చేసి భారీ స్కోరుకు బాటలు వేశౄడు. అర్థసెంచరీ వరకు నిలకడగా ఆడిన రోహిత్‌ తరువాత తనదైన శైలిలో చెలరేగాడు. రోహిత్‌కు శిఖర్‌ ధావన్‌ జతకలవడంతో భారత్‌ స్కోరు పరుగులు పెట్టింది. శిఖర్‌ ధావన్‌ 27 బంతుల్లో 35 రన్స్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రైనా కూడా రోహిత్‌కు చక్కటి భాగస్వామ్యం అందించాడు. రైనా 30 బంతుల్లో 47 రన్స్‌ చేశాడు. భారత బ్యాట్స్‌మెన్‌లు రాణించడంతో.. మూడు వికెట్ల నష్టానికి భారత్‌ 176 పరుగులు చేసింది.

177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్స్‌ చుక్కలు చూపించారు. వాషింగ్టన్‌ సుందర్‌ బంగ్లాకు ఆరంభంలోనే షాక్‌ ఇచ్చాడు. ఓపెనర్‌ లిటన్‌దాస్‌, సౌమ్యా సర్కార్‌, తమీమ్‌ ఇక్బాల్‌లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ బాట పట్టించాడు. ఆ తర్వాత కొంత సమయానికే కెప్టెన్‌ మహ్మదుల్లా చాహల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటై పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో కష్టాల్లోపట్ట బంగ్లాను రహీమ్‌ ఆదుకున్నాడు. ముష్ఫికర్‌ రహీం 55 బంతుల్లో 72 పరుగులు చేశాడు. చివరిదాకా పోరాడి గెలిపించే ప్రయత్నం చేశాడు. మొదట్లో భారత్ బౌలింగ్‌లో ఇబ్బంది పడినా, క్రమంగా బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో సిరీస్‌లో మరో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో విజయం భారత్‌ వశమైంది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల చేసింది. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్‌ మూడు వికెట్లు తీయగా, సిరాజ్‌, శార్దూల్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు.

07:12 - March 15, 2018

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. వసతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

రాష్ర్టవ్యాప్తంగా 6,17,484 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. 6,08,190మంది రెగ్యులర్ విద్యార్థులు, 9,294 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు రాసేవారిలో 6,15,650మంది ఎస్సెస్సీ, 1834 మంది ఓఎస్సెస్సీ విద్యార్థులు ఉన్నారు. ఇందుకోసం 2,834 పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షాకేంద్రానికి 11మంది చొప్పున 3,11,74మంది ఇన్విజిలేటర్లను, 156 తనిఖీ బృందాలను నియామించారు. అన్ని పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్‌ విధించామన్నారు.

రాష్ర్ట వ్యాప్తంగా టెన్త్‌ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కలిపించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అనారోగ్య పరిస్థితులు తలెత్తితే వైద్య సేవలు అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం టెన్త్‌ పరీక్షలను చాలా పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. సందేహాల నివృత్తికోసం కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేసింది. 1800-599-4550కు ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఎస్సెస్సీ 2018 మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందించారు.

తెలంగాణలో...
తెలంగాణలోనూ నేటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 38 వేల 867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఎస్‌ఎస్‌సీ బోర్డు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గతేడాది తరహాలోనే ఐదు నిమిషాల ఆలస్యం నిబంధనను అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు గంట మోగింది. గురువారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల 103 పాఠశాలకు చెందిన 5 లక్షల 38వేల 867 మంది విద్యార్థలు పరీక్ష రాయనున్నారు. ఉదయం తొమ్మిదన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల 15 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 542 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్నీ సెంటర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్భంది ఏర్పాట్లు చేశామని అధికారులు అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 38వేల 867 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా ఇందులో 2లక్షల 62వేల 479 మంది బాలికలు.. 2లక్షల 76వేల 388 మంది బాలురు ఉన్నారు. 5లక్షల 3వేల 117 మంది విద్యార్థులు రెగ్యులర్‌ పరీక్షలు రాయనుండగా, ప్రైవేటుగా రాసేందుకు 35వేల 750 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఒకేషనల్ విద్యార్ధులు 20వేల 838 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు 431పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని SSC అధికారులు తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లరాదని SSC బోర్డు అధికారులు స్పష్టం చేశారు. టెన్త్ పరీక్షలు సజావుగా సాగేందుకు ఇప్పటికే బోర్డు అధికారులు వివిధ శాఖలతో చర్చించారు. విద్యుత్ శాఖతో పాటు రెవెన్యూ, పోలీసు డిపార్టమెంట్‌తో సంప్రదించామని అధికారులు తెలిపారు. ఆర్టీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర 144సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

పదో తరగతి పరీక్షల దృష్ట్యా ఈ సారి బందోబస్తును పెంచినట్లు అధికారులు చెప్పారు. పరీక్షల కేంద్రాల చుట్టు ఉన్న జీరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లను కూడా మూసివేయనున్నట్లు అధికారులు అన్నారు. ఈసారి కూడా ఐదు నిమిషాల ఆలస్యం నిబంధనను అమలు చేస్తున్నట్లు SSC అధికారులు ప్రకటించారు. 

07:06 - March 15, 2018

హైదరాబాద్ : రాబోయే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఇక మండలిలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పీట వేస్తుందని సర్కార్‌ చెప్తున్న నేపథ్యంలో ఈటెల బడ్జెట్‌ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ పద్దును ఆయన ప్రతిపాదిస్తారు. శాసనమండలిలో బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ఇప్పటికే బుధవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.

ఈ సారి రాష్ట్ర బడ్జెట్‌ లక్షా 73వేల కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతియేటా పద్దును 15శాంత పెంచి చూపుతున్న సర్కారు.. ఇప్పుడు కూడా అదేవిధంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. దీంతో లక్షా 73 వేల నుంచి 75 వేల కోట్ల మధ్య బడ్జెట్‌ ఉండనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పూర్తిస్థాయిలో ప్రతిపాదించబోయే చివరి బడ్జెట్‌. వచ్చే ఏడాది శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్న దృష్ట్యా అప్పుడు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇవాళ అసెంబ్లీలో ఈటల ప్రవేశపెట్టబోయే బడ్జెట్ టీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకం.

వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయానికి పెట్టుబడి పథకంతోపాటు సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశముంది. సాగునీటి రంగానికి కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశముంది. సంక్షేమ రంగానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ తమది ప్రజాబడ్జెట్‌ అని చెబుతున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమంటున్నారు. ఈ నేపథ్యంలో.. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక అత్యంత కీలకమైన సామాజిక, ఆర్థిక సర్వేను ఇవాళే శాసనసభలో ప్రవేశపెట్టనుంది.

07:03 - March 15, 2018

విజయవాడ : టీడీపీ ప్రభుత్వంపైనా, నారా లోకేష్‌పైనా పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ ముఖ్యమంత్రి తప్పుపట్టారు. జనసేన సభ ముగిసిన తర్వాత చంద్రబాబు.. కొందరు మంత్రులు, పార్టీ సీనియర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రానికి రావాల్సిన సాయం రాబట్టడానికి టీడీపీ తన సర్వశక్తులూ ఒడ్డుతోంటే... తమపై దాడి చేయాల్సిన అవసరం పవన్‌కు ఏంటని చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ శక్తులన్నీ ఏకమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతున్నారని.. ఉభయ సభలను స్తంభింపచేస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రమంత్రులతోనూ రాజీనామా చేసి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే పవన్‌కు ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వాన్నిగానీ.. నరేంద్రమోదీనిగానీ పల్లెత్తుమాట అనకుండా తమను తిట్టడమేంటన్నారు. ఈ నాటకాలు ఎవరాడిస్తున్నారని అన్నారు. ఈ సమావేశం తనను, లోకేష్‌ను, ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే పెట్టినట్టుగా ఉందన్నారు. ఇదంతా ఎవరో ఆడిస్తున్న నాటకంలా ఉందన్నారు. సాక్షి పత్రికలో వచ్చిన అంశాలనే పవన్‌ ప్రస్తావిస్తున్నారన్నారు.  

07:01 - March 15, 2018

గుంటూరు : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉద్యమశంఖం పూరించారు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు. గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న పవన్‌... పార్టీ శ్రేణులకు దిశ-దశా, కార్యాచరణ ప్రకటించారు. టీటీడీ అవినీతిపైనా పదునైన విమర్శలు చేశారు. ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష వైసీపీ తీరునూ ఎండగట్టారు.

టీడీపీపైనా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగేళ్లలో మూడు మాటలు - ఆరు అబద్దాలుగా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. ఏపీ స్కామ్‌ ఆంధ్ర అవ్వలేదుకానీ.. కరప్షన్‌ ఆంధ్రను మాత్రం చెయ్యగలిగారని ఎద్దేవా చేశారు. ఇది తనకు బాధ కలిగించదని చెప్పారు. తాను మద్దతు పలికింది ఏపీ పునర్మిర్మాణానికే కానీ.. తెలుగుదేశం పునర్నిర్మాణానికి కాదని స్పష్టం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌పైనా పవన్‌ కల్యాణ్‌ అవినీతి ఆరోపణలు చేశారు. మంత్రి లోకేష్‌ అవినీతి సీఎం చంద్రబాబుకు తెలుసా అని పవన్‌ ప్రశ్నించారు. విభజన తర్వాత ఏపీ అవినీతిలో నంబర్‌ వన్‌ అని ఓ సంస్థ వెల్లడించిందని.. ఇదీ చంద్రబాబు సాధించిన ప్రగతి అని ప్రశ్నించారు. టీడీపీ నేతల అవినీతిని చూసి ప్రజలు భయపడుతున్నారన్నారు. ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఇప్పుడు కరప్షన్‌ చేసుకుంటామని టీడీపీ నేతలు బాహాటంగానే మాట్లాడుతుంటే.. అంతుకుమించిన బరితెగింపు ఇంకేమి ఉందన్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనా పవన్‌ మండిపడ్డారు. వైసీపీ అసెంబ్లీకి వెళ్లొద్దని నిర్ణయం తీసుకుందని.. మరి ప్రజల కోసం ఇంకేం పోరాడుతుందని ప్రశ్నించారు. వైసీపీ అధినేత సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తారా అని నిలదీశారు. ఇందుకేనా ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించిందన్నారు. తాను సీఎం కాకపోయినా సమస్యలపై పోరాటం చేయడంలేదా అందూ వైసీపీని దుయ్యబట్టారు.

ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ మాటలు మారుస్తున్నాయని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఏపీ ప్రజలకు చేసిన అన్యాయం తమను రగిలింపచేస్తోందన్నారు. సెంటిమెంట్‌తో ప్రత్యేక హోదా రాదన్న జైట్లీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎలా మద్దతు పలికారని ప్రశ్నించారు. మోదీ, జైట్లీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనప్పుడు.. మీ చట్టాలను మేమెందుకు పాటించాలో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. కేంద్రమంటే తమకు భయంలేదని.. తామెవరికీ భయపడబోమన్నారు.

ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని పపన్‌ స్పష్టం చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేకహోదా సాధించేందుకు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆమరణ నిరాహార దీక్ష అవసరం ఉంటుందనే తాను భావిస్తున్నాని చెప్పారు. హోదాపై కలిసి వచ్చే పార్టీలన్నింటితో చర్చిస్తామన్నారు. ముందుగా సీపీఎం, సీపీఐ నేతలతో జనసేన కార్యాలయంలో చర్లచు జరపనున్నట్టు చెప్పారు. ప్రజల నిశ్శబ్దాన్ని కేంద్రం అసమర్థతగా భావించవద్దని ఆయన హెచ్చరించారు.

ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు పవన్‌ ప్రకటించారు. జనసేన సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక నంబర్‌ కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ శకం ప్రారంభమైందని... ఈ రోజు నుంచే టీడీపీ వైఫల్యాలను ఎండగడతామని పవన్‌ స్పష్టం చేశారు. ఇక నుంచి టీడీపీతో స్నేహం చేయబోమని.. ఎదురు తిరుగుతామని తేల్చి చెప్పారు. 

నేడు టి. బడ్జెట్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో మంత్రి ఈటెల ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిట్టచివరి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

పదో తరగతి పరీక్షలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 38 వేల 867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఎస్‌ఎస్‌సీ బోర్డు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గతేడాది తరహాలోనే ఐదు నిమిషాల ఆలస్యం నిబంధనను అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గురువారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

 

ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై వీహెచ్ మండిపాటు...

ఢిల్లీ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై వీహెచ్ మండిపడ్డారు. స్వామిగౌడ్ కు హెడ్ సెట్ తగిలిందా ? లేక మైక్ తగిలిందా ? అన్నది స్పష్టత లేదన్నారు. ఈ విషయంలో అందర్నీ సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. గౌడ్ల ఓట్ల కోసం స్వామిగౌడ్ కు గాయమైనట్లు నాటకాలు ఆడుతున్నారని, ఇది చీకటి రాజ్యం..కేటీఆర్ కోసమే ఈ పనులు చేస్తున్నారని విమర్శించారు. 

నాలుగో విడత మిషన్ కాకతీయ నిధుల విడుదల...

హైదరాబాద్ : నాలుగో విడత మిషన్ కాకతీయ నిధులు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. 134 చెరువుల మరమ్మత్తు కోసం రూ. 34.17 కోట్లు నిధులు విడుదల చేశారు. 5493.17 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయనున్నారు. 

Don't Miss