Activities calendar

16 March 2018

22:07 - March 16, 2018

ఢిల్లీ : సీపీఎం పొలిటిబ్యూరో సమావేశాలు ప్రారంభమయ్యాయి.  22వ అఖిలభారత మహాసభల్లో  ప్రవేశపెట్టనున్నపార్టీ నిర్మాణ నివేదికపై చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులోగా నివేదిక  కేంద్రకమిటీ  ముందుకు రానుంది. కేంద్ర కమిటీలో చర్చించిన తర్వాత పార్టీనిర్మాణ నివేదికకు తుదిరూపు ఇవ్వనున్నారు. తర్వాత పార్టీ మహాసభల్లో నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీలోని సీపీఎం కేంద్రకార్యాలయంలో జరగుతున్న పొలిట్‌బ్యూరో సమావేశాలు శనివారం కూడా కొనసాగనున్నాయి. 

 

22:04 - March 16, 2018

గుంటూరు : టౌన్‌లో తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ మేరకు ఆయన అతిసారంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించారు. డయేరియా బాధితులతో పాటు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన కలిశారు. ప్రభుత్వం స్పందించకపోతే.. గుంటూరు బంద్ చేపడతామని పవన్ హెచ్చరించారు.

అభివృద్ధి అంటూ మాటలు చెబుతోన్న ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్‌లో ‌అతిసారం బారిన పడిన వారిని పవన్‌ పరామర్శించారు. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరులో అతిసారంతో 23 మంది చనిపోతే ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఎందుకు సీనియర్‌ ఐఏఎస్‌తో కమిటీ వేయలేదని ప్రశ్నించారు. 

ప్రజలకు కనీసం తమ సమస్యను చెప్పుకునేందుకు కార్పొరేటర్‌ కూడా లేకపోవడం దారుణమన్నారు పవన్‌. 8 సంవత్సరాలుగా గుంటూరులో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించకపోవడంపై మండిపడ్డారు. చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించే దుస్తితికి ప్రజలను తీసుకువెళ్లవద్దన్నారు. గుంటూరు కల్తీలకు అడ్డాగా మారిందన్నారు. అతిసారం వ్యాపించేందుకు కారణమైన అండర్‌గ్రౌండ్‌ పనులు చేపట్టిన వారిని కోర్టుకీడుస్తామన్నారు పవన్‌..

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తూతూ మంత్రంగా చర్చించారన్నారు పవన్‌. వైసీపీ అసెంబ్లీలో ప్రజా సమస్యలు నిలదీయాలి గాని బహిష్కరించకూడదన్నారు. గుంటూరు సమస్యపై 48 గంటల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే బంద్‌కు పిలుపునిస్తామన్నారు. అవసరమైతే దీక్షకు కూర్చుంటామని పవన్‌ తెలిపారు. 


గుంటూరు జీజీహెచ్‌లో రోగులను కలిసిన జనసేన అధినేత పవన్‌

22:01 - March 16, 2018

గుంటూరు : ప్రత్యేక హోదాపై రాహుల్‌ గాంధీ మద్దతు పలకాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడాల్సిన రీతిలో పోరాడతామన్నారు. అవిశ్వాసంపై వైసీపీకి క్లారిటీలేదన్నారు. అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదన్న టీడీపీ మళ్లీ అవిశ్వాసం పెట్టడం ఏంటని ప్రశ్నించారు. 

 

22:00 - March 16, 2018

ఢిల్లీ : కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వైసీపీ రెండోసారి నోటీసు ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశంపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని.. ఆ నోటీసులో కోరారు. ఇదే క్రమంలో హోదా కోసం అవసరమైతే టీడీపీ అవిశ్వాసానికీ మద్దతునిస్తామని వైసీపీ నేతలు తెలిపారు. 
అవిశ్వాస రాజకీయం 
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తూ.. ఇప్పటికే స్పీకర్‌ కార్యాలయానికి ఒక నోటీసు అందించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. శుక్రవారం మరోసారి నోటీసును అందించింది. పార్టీకి చెందిన ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఈ నోటీసును అందించారు. తాము అవిశ్వాస తీర్మానానికి నోటిసులు ఇవ్వడంతోనే.. టీడీపీ ఉరుకులు పరుగులు పెడుతోందని వైసీపీ ఎంపీలు ఎద్దేవా చేశారు.  హోదా విషయంపై నాలుగేళ్లుగా ఉలుకూపలుకూ లేకుండా ఉన్న టీడీపీ  విధిలేని పరిస్థితుల్లో హోదా కోసం పోరాటం మొదలుపెడుతోందని జగన్‌  ట్విటర్‌లో విమర్శించారు. ఇంతకు ముందు తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామన్న చంద్రబాబు.. ఇపుడు సొంతంగా తీర్మానం పెడతామనడాన్ని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.  
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకూ సిద్ధం: వైసీపీ 
తెలుగుదేశం పార్టీ రాజకీయ దురుద్దేశాలు ఎలా ఉన్నా.. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం.. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకూ తాము సిద్ధమని వైసీపీ నేతలు చెప్పారు. తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తృణముల్‌ కాంగ్రెస్‌తోపాటు  శివసేన, కాంగ్రెస్‌,  తదితర పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా అంశం కాస్తా.. ఇప్పుడు కేంద్రంపై  అవిశ్వాస తీర్మానానికి దారి తీసింది. తమకు మెజారిటీ బీజేపీయేతర పక్షాలు మద్దతు ఇస్తున్నాయని వైసీపీ, టీడీపీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఏది ఏమైనా.. అవిశ్వాసంపై సోమవారం ఏమి జరగనుంది..? అన్న ఉత్కంఠ ఏపీ ప్రజల్లో నెలకొంది. 

 

21:57 - March 16, 2018

గుంటూరు : శాసన మండలిలో  సీఎం చంద్రబాబు.. మోదీ, పవన్‌ కల్యాణ్‌, జగన్‌లపై నిప్పులు చెరిగారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోడానికి జగన్‌ కేంద్రంతో లాలూచి పడుతుంటే.. బీజేపీతో కుమ్మక్కైన  పవన్‌ కల్యాణ్‌ .. రాష్ట్రానికి అన్యాయం చేసేలా ప్రవర్తిస్తున్నారని బాబు  దుయ్యబట్టారు. తమిళనాడు తరహాలో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందంటూ విరుచుకుపడ్డారు.  విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని నెరవేర్చాలని కేంద్రాన్ని మరోసారి డిమాండ్‌ చేశారు.  దీనికి సంబంధించిన తీర్మానాన్ని శాసనమండలి మూజువాణి ఓటుతో  ఆమోదించింది.  
విభజన హామీలపై కేంద్రం నిర్లక్ష్యం 
చట్టసభ సాక్షిగా... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపారు. విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లి మొరపెట్టుకున్నా.. మోదీ ప్రభుత్వం కరగలేదన్నారు. అమరావతి శంకుస్థాపనకోసం పవిత్ర జలాలను, మట్టిని తీసుకొచ్చిన మోదీ.. డబ్బులు ఇవ్వడం మాత్రం మర్చిపోయారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంకాని.. పదవులు కాదన్నారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 
ప్రత్యేక హోదాను జగన్‌ తాకట్టు పెట్టారు  
రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీల తీరునూ చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రత్యేక హోదాను వైసీపీ అధినేత జగన్‌, మోదీ దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. 2017లో మోదీని కలిసిన జగన్‌ ..రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగబోనని చెప్పివచ్చారని బాబు ఆరోపించారు. దాంతోపాటు రాష్ట్ర పతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను ప్రకటించగానే బీహార్‌కు వెళ్లిన జగన్‌, విజయ్‌సాయి.. ఆయన కాళ్లమీద పడ్డారని చంద్రబాబు అన్నారు. మోదీ, రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఫోటోలు దిగి.. తమకు కేంద్రంలో పెద్దలతో పరిచయం ఉందని.. సీబీఐ,ఈడీలకు మెసేజ్‌ వెళ్లేలా ప్రయత్నించారని విమర్శించారు.  
పవన్‌ తీరుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు 
ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీరును కూడా సభలో కడిగిపారేశారు చంద్రబాబు. నాలుగేళ్లుగా కనిపించని అవినీతి పవన్‌కు ఇపుడే కనిపించిందా అని ప్రశ్నించారు.  ఎవరో  ఆడిస్తుంటే పవన్‌ ఆడుతున్నారని విమర్శించారు. గుంటూరు సభలో పవన్‌ సంధించిన ప్రశ్నలకు మండలిలో సీఎం క్లారిటీ ఇచ్చారు. అసలు ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ చేయడానికి వీరెవరు.. వీళ్లు అడిగితే సమాధానం చెప్పాలా.. అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా .. కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలు అందించామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 75వేల కోట్లు రావాల్సి ఉందని తన సొంత కమిటీ తేల్చినా.. పవన్‌ ఎందుకు సైలెంట్‌ అయ్యారని చంద్రబాబు ప్రశ్నించారు.  అన్యాయం చేసిన మోదీని నిలదీయదీయకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఏంటన్నారు ముఖ్యమంత్రి. 
పోలవరం, అమరావతి నిర్మాణాలను కేంద్రమే పూర్తిచేయాలి 
పోలవరం ప్రాజెక్టుతోపాటు.. రాజధాని అమరావతి నిర్మాణాన్ని కేంద్రమే పూర్తి చేయాల్సి ఉందన్నారు.  పోలవరం నిర్మాణంలో అవినీతి అంటూ.. నిధులను అడ్డకుంటూ సృష్టిస్తున్న కేంద్రం.. రాజధాని విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వేలకోట్ల రూపాయలతో పూర్తికావాల్సిన ప్రాజెక్టులకు అరకొరగా నిధులు విదిల్చారని  సభకు వివరించారు. పోలవరం ముంపు మండలాలు ఏపీ కలవడానికి తన పోరాటమే కారణం అన్నారు. అటు దుగరాజపట్నం పోర్టు విషయంలో  కూడా మోదీ ప్రభుత్వ తీరును చంద్రబాబు దుయ్యబట్టారు. నాలుగేళ్ల తర్వాత దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం సాధ్యంకాదని చెబుతున్నారని... ఒకవేళ ఇపుడు ప్రత్యామ్నాయం చూపెట్టినా పోర్టును నిర్మిస్తారన్న నమ్మకం ఏంటని కేంద్రాన్ని ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు. 
విభజన హామీలు నెరవేర్చాలని తీర్మానం 
తన ప్రసంగం ఆసాంతం.. మోదీ, జగన్‌, పవన్‌కల్యాణ్‌పై నిప్పలు చెరిగిన చంద్రబాబు.. ఇప్పటికైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం, రాజధాని నిర్మాణం, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు, విశాఖ రైల్వేజోన్‌తోపాటు.. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ మూజువాణి ఓటుతో తన మోదం తెలిపింది. 

 

21:53 - March 16, 2018

దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రముఖ విశ్లేషకులు ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయని తెలిపారు. బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరం బలపడుతుందన్నారు. బీజేపికి అనుకూల వాతారణం లేదని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రుల నుంచి అసహనం వస్తుందన్నారు. బీజేపీకి మిత్రులు దూరమవుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట ఓడిపోతున్నారని తెలిపారు. 2019 లో ఎన్డీఏకి ప్రమాదం పొంచి ఉందన్నారు. 'ఎన్డీయేలో లుకలుకలు' అనే అంశంపై ప్రొ.కె.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
ప్రత్యేకహోదా విషయంలో బీజేపీకి దగ్గరయేందుకు వైసీపీ సుముఖత చూపడం లేదు. బీజేపీకి టీడీపీ పెద్ద మిత్రపక్షం. ఎన్ డీఎ నుంచి టీడీపీ వైదొలగడాన్ని కాన్ టెస్టు లో చూడాలి. బీజేపీకి వ్యతిరేక వస్తుంది. 2004లో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీకి మిత్రులు దూరమవుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట ఓడిపోతున్నారు. యాంటి బీజేపీ పెరుగుతున్న కాలంలో మిత్రులు దూరమవుతున్నారు. ఎన్డీఏలో ఇమ్యునిటీ తగ్గుతుంది. ఏ ఒక్క పార్టీకి దేశ వ్యాప్త వాతావరణం లేదు. 29 రాష్ట్రాల్లో మోడీని బీట్ చేసే ప్రాంతీయ నాయకులు ఉన్నారు. మోడీని ఓడించేవారు దేశంలో లేరని బీజేపీ నేతలు చెబుతున్న మాటలు అవాస్తవం. దేశంలోని అన్ని రాష్ట్రాలో మోడీని ఓడించేవారు ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:38 - March 16, 2018

తెలంగాణ జనం సంతోషంగున్నరు...ఆనందం ఎల్లగక్కిన అధినేత కేసీఆర్, మందక్రిష్ణను మళ్ల అణచివేస్తమన్న సీఎం..మస్తుగ జూశ్నం మీ అసొంటోళ్లనన్నక్రిష్ణ, అయ్యా భజన సుర్వు జేశ్న నారా లోకేశం...ఆర్కేస్ట్రా టీం ఒక్కటే తక్వుండే అసెంబ్లీల, చైర్మన్ సారు కంటి చికిత్స విజయవంతం...డాక్టర్లకు రుణపడి ఉన్న తెలంగాణ జనం, ఎంపీ, ఎమ్మెల్యే కీసులాటకు సీఐ బలి...బహుజన పోలీసు అధికారి సస్పెండ్, ఉంటె పులన్న ఉండాలే లేదంటె మేమన్న..చిర్తపులి రావొద్దని ఊరి జనాల ధర్నా... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

21:31 - March 16, 2018

ఢిల్లీ రాజకీయ పరిణామాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, టీడీపీ నేత చందూ సాంబశివరావు, బీజేపీ నేత విష్ణు పాల్గొని, మాట్లాడారు. వైసీపీ, టీడీపీ అవిశ్వాస తీర్మానాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:22 - March 16, 2018

గుంటూరు : తెలుగుదేశం పార్టీ.. ఎన్డీయే కూటమికి తలాఖ్‌ చెప్పింది. అంతేకాదు.. మోదీ సర్కారుపై విశ్వాసం లేదంటూ.. లోక్‌సభ స్పీకర్‌కు అవిశ్వాస నోటీసునూ అందించింది. గురువారం రాత్రి వరకూ వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామంటూ వచ్చిన తెలుగుదేశం.. అనూహ్యంగా, ఈ ఉదయం.. సొంతంగా అవిశ్వాసం ప్రతిపాదించాలని నిర్ణయించింది. దీనికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే పనిని ప్రారంభించింది. అటు వైసీపీ కూడా తమ అవిశ్వాస తీర్మానానికి వివిధ రాజకీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. 
మోదీ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం
ఎన్డీయే కూటమితో ఎన్నికల ముందు నుంచీ కొనసాగుతూ వచ్చిన సంబంధాన్ని.. తెలుగుదేశం పార్టీ తెంపేసుకుంది. విభజన హామీల అమలులోనూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ నెరవేర్చడంలోనూ విఫలమైన కారణంగా.. తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. అంతేకాదు.. మోదీ ప్రభుత్వంపై స్వయంగా అవిశ్వాసాన్ని ప్రతిపాదించాలని నిర్ణయించింది.
ఎన్డీయే నుంచి వైదొలగాలని నిర్ణయం
ఎన్డీయేలో కొనసాగడంపై శుక్రవారం సాయంత్రం జరిగే పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయం తీసుకోవాలని ముందుగా భావించినప్పటికీ.. ఉదయాన్నే సీఎం చంద్రబాబు.. హడావుడిగా.. పొలిట్‌బ్యూరో సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్డీయే నుంచి వైదొలగాలని, కేంద్రప్రభుత్వంపై తామే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించారు. గురువారం రాత్రి వరకూ వైసీపీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తామన్న చంద్రబాబు.. అనూహ్యంగా మనసు మార్చుకున్నారు. వైసీపీ కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడుతోందని, వారి తీర్మానానికి మద్దతిస్తే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని, ప్రజా ప్రయోజనాల కోసం సొంతంగానే అవిశ్వాసం ప్రతిపాదించాలని నిర్ణయించారు.
అవిశ్వాసం నోటీసు అందించిన తోట నరసింహం
కేంద్రంపై అవిశ్వాసం ప్రతిపాదించాలని నిర్ణయించగానే.. ఈమేరకు, ఢిల్లీలో ఉన్న ఎంపీ తోట నరసింహానికి ఫోన్‌ చేసి... తక్షణమే స్పీకర్‌ కార్యాలయానికి అవిశ్వాసతీర్మానం నోటీసును అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తోట నరసింహం, తమ పార్టీ తరఫున కేంద్ర మంత్రిమండలిపై అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నట్లు స్పీకర్‌ కార్యాలయంలో నోటీసు అందించారు. ఈ విషయాన్ని లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ చదివి వినిపించారు. అవిశ్వాస తీర్మానాలకు మద్దతునిస్తున్నామంటూ కాంగ్రెస్‌, సీపీఎం సహా వివిధ పార్టీల సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. అదే సమయంలో.. తెరాస, అన్నాడింఎకేలు నిరసనకు దిగారు. దీంతో అవిశ్వాసంపై చర్చ లేకుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. 
వేడెక్కిన హస్తిన రాజకీయాలు
తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు రావాలని నిర్ణయించడంతో పాటు.. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్నీ ప్రతిపాదించడంతో.. హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ, వైసీపీలు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే పనిలో బిజీబిజీగా గడిపారు. మరోవైపు, అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఆజాద్‌, జ్యోతిరాదిత్య మొదలైన వారు.. టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానంపై సుమారు 20 పార్టీలతో సంప్రదింపులు జరుపినట్లు ప్రచారం జరిగింది. 
కనీస మద్దతు 54 మంది సంతకాల సేకరణలో టీడీపీ బిజీ
అవిశ్వాసం తీర్మానంపై 54 మంది ఎంపీల సంతకాలు చేయించి సోమవారానికల్లా లోక్‌సభలో తీర్మానం చర్చకు వచ్చేలా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ.. టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. శివసేన త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించింది. ఎంఐఎం అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ టీడీపీ ఎంపీల అవిశ్వాస నోటీసుపై సంతకం చేయడం విశేషం. 
టీడీపీకి అన్నాడిఎంకె మద్దతిచ్చినట్లు ప్రచారం
టీడీపీ ప్రతిపాదిస్తోన్న అవిశ్వాస తీర్మానానికి 37 మంది సభ్యులున్న అన్నాడిఎంకె మద్దతిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. పార్టీ ఎంపీ తంబిదురై ఈ విషయాన్ని తోసిపుచ్చారు. మద్దతు కోసం తమను ఎవరూ సంప్రదించలేదన్నారు. మరోవైపు, టీడీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజిస్తే.. ఈరోజు బీజేపీ కూడా టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందంటూ పార్టీ అధినేత మండిపడుతున్నారు. అందుకే.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది. ఈ దిశగా వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. 

21:15 - March 16, 2018

స్వామి రారా నుంచి కంటెంట్ ఓరియంటెడ్ కథలను ఎంచుకుంటు.. ప్రామిసింగ్ హీరోగా మారిన నిఖిల్.. కిరిక్ పార్టీ అనే కన్నడ బ్లాక్ బాస్టర్ మూవీని కిరాక్ పార్టీ అనే పేరుతో రిమేక్ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆల్ రెడీ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాకు సుథీర్ వర్మ స్క్రీన్ ప్లే, చందు మెండేటి డైలాగ్స్ అందించడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.. అలా భారీ అంచనాలు పెంచిన కిరాక్ పార్టీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
కథ విషయానికి వస్తే..   
కథ విషయానికి వస్తే హ్యాపీగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఇజనీరింగ్ కాలేజిలో ఎంజాయిబుల్ స్టూడెంట్ గా లైఫ్ ను గడిపేస్తుంటాడు కృష్ట. అతను సీనియర్ అయిన మీరాను చూసి, ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా కృష్టను ఇష్టపడుతుంది.. అనుకోని ఇన్సిడెంట్ వలన మీరా చనిపోతుంది.. ఆ తరువాత రెబంల్ గా మారిన కృష్ణ.. కాలేజి పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి, ప్రెసిడెంట్ అవుతాడు.. అక్కడ నుండి అతను ఆటిట్యూడ్ ఎలా టర్న్ అయ్యింది.. ఎలా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాడు లాంటి ఇన్సిడెంట్స్ తో కథ ముగుస్తుంది..
నటీనటుల విషయానికి వస్తే..  
నటీనటుల విషయానికి వస్తే..  తన ప్రతి సినిమా లాగే ఈ సినిమాకు కూడా నటన పరంగా పూర్తి న్యాయం చేశాడు నిఖిల్..ఇంజనీరింగ్ లోని వివిధ దశల్లో ఉన్న స్టూడెంట్ లా కనిపించడానికి, బాడీ పరంగా మెకోవర్ కూడా అయ్యాడు.. ఫీల్ పరంగా, అల్లరి పరంగా కృష్ణ పాత్రలోని వేరియేషన్స్ బాగా ప్రసెంట్ చేశాడు.. కాకపోతే అక్కడక్కడ కథ పక్కదారి పట్టడంతో చేసేది ఎం లేక నిఖిల్ కూడా చూస్తూ ఉండిపోయాడు.. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. మీరా పాత్ర చేసిన సిమ్రాన్ పరింజ లుక్స్ పరంగా మెప్పించింది.. యాంక్టింగ్ పరంగా ఓకే అనిపించింది.. ఇక కన్నడ కిరీక్ పార్టీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంయుక్త హెగ్డే.. తెలుగు వర్షన్ లో సత్య పాత్రలో కనిపించింది.. ఆమె లుక్స్ పరంగా యావరేజ్ గా ఉన్నప్పటికి ఎనర్జీలెవల్స్ బాగున్నాయి.. కొన్ని చోట్ల మాత్రం ఆమె నటన అతిగా అనిపించింది.. ఇక నిఖిల్ ఫ్రెండ్స్ గా కనిపించిన యూత్ బ్యాచ్.. చాలా వరకు మెప్పించారు.. మిగతా నటీనటులు పాత్రల పరిది మేర పర్వాలేదు అనిపించారు.. 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే..   
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాతో డైరక్టర్ గా పరిచయం అయిన చందు మొండేటి అసోసియోట్ శరణ్ కొప్పిశెట్టి బెస్ట్ అవుట్ పుట్ అవ్వడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అవ్వలేదు అని చెప్పాలి. యూత్ ఫుల్ కంటెంట్ ను, ఎమోషనల్ ట్రాక్ ను, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను బాలన్స్  చేయడంలో పూర్తిగా తడబడ్డాడు.. దానివలన సినిమా ప్లో అర్ధరహితంగా తయారుఅయ్యింది.. అయితే దీనికి పూర్తిగా అతన్ని బాధ్యున్ని చేయలేం.. సుధీర్ వర్మ లాంటి టాలేంటెడ్ అండ్ ఎక్స్ పీరియన్సడ్ స్క్రీన్ ప్లే రైటర్ పేపర్ మీద రాసిన దాన్ని అతను స్క్రీన్ పై ప్రజంట్ చేయడానికి ట్రై చేశాడు.. ఇక చందూ మొండేటి డైలాగ్స్ కూడా చెప్పుకోనేంత గొప్పగా లేవు... కాలేజీ బ్యాగ్ డ్రాప్ ఎపిసోడ్ లో వాట్సప్ జోకులను.. అలాగే పాత జోకులను కొత్త పేపర్ లో చూట్టి అందించడానికి ట్రై చేశాడు.ఇక కన్నడ కిరీక్ పార్టీకి బ్యాక్ బోన్ గా నిలిచిన అజనీష్ లోక్ నాథ్ సంగీతం, ఈ కిరాక్ పార్టీకి కొంత వరకు హెల్ప్ అయ్యింది. మిగతా వాటిల్లో నెటివిటీ అని పాకులాడిన మేకర్స్, మ్యూజిక్ విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు అని చెప్పాలి...  కెమెరా మెన్ అద్వైత గురుమూర్తి పనితనం మెప్పిస్తుంది.. లిమిటెడ్ లొకేషన్స్ లో తక్కువ ఖర్చులో కలర్ఫుల్ విజ్యూవల్స్ అందించడంలో అతను చాలా వరకు సక్సెస్ అయ్యాడు.. ఎడిటర్ ఎమ్మార్ వర్మ ఇకాస్త కేర్ తీసుకుని సినిమాను ట్రిమ్ చేయాల్సి ఉంది.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే..   
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే,, కన్నడలో అక్కడ నెగిటివిటీతో కాలేజ్ ఇన్సిడెన్స్ ఒక ఫ్రెష్ పాకేజ్ లా తెరకెక్కిన కిరీక్ పార్టీనీ ఇక్కడ ఇంకా గొప్పగా తీయాలి అన్న ఉద్దేశ్యంతో చిన్న చిన్న మార్పులు చేశారు.. దాంతో సినమాలో ఉన్న ఫీల్ మిస్ అయ్యి ఫన్ పలుచబడిపోయింది.. కిరాక్ పార్టీ కాస్త, ఆర్డినరీ పార్టీ అయిపోయింది.. అయితే మేకర్స్ అనుకున్నట్టు స్టుడెట్స్ కి, మిగత టార్గెటెడ్ ఆడియన్స్ కి ఈవారం రోజుల పాటు కాలక్షేపంగా అనిపిస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావం చూపించగలుగుతుంది కిరాక్ పార్టీ.. లేదంటే మాత్రం, డిస్స్పాయింటెడ్ మూవీగా మిగులుతుంది..   
    
ప్లస్ పాయింట్స్
నిఖిల్ మేకోవర్ 
సినిమాటోగ్రఫీ
రెండు పాటలు
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
డైలాగ్స్ 
ఓల్డ్  కామెడీ..
ఫీల్ లేని లవ్ ట్రాక్స్

రేటింగ్
1.5 / 5

21:06 - March 16, 2018

జగిత్యాల : జిల్లాలోని దరూర్‌ వద్ద గల ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్‌ కరీంనగర్‌ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఆయకట్టు గ్రామాల రైతులు ఎస్‌ఆర్‌ఎస్‌పి సాగునీరు తమ పొలాలకు అందడం లేదని, రైతులు ఎండిన వరి పంటలను తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. ఎన్ని సార్లు నాయకులకు , అధికారులకు మొర పెట్టుకున్నా వినిపించుకోవడం లేదని వాపోయారు. తక్షణం స్పందించిన ఎస్ ఆర్ ఎస్ పీ అధికారులు  రేపటి నుండి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

 

21:01 - March 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు అన్యాయం జరిగిందని ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ బడ్జెట్ రైతు ప్రయోజనాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన విత్తన సబ్సిడీ చట్టం, ప్రకృతి వైపరిత్యాల పరిహారం, మార్కెట్ జోక్య పధకం, ఆత్మహత్యల కుటుంబాలకు సహాయం తదితర కీలక అంశాలను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించలేదని సారంపల్లి మల్లారెడ్డి ఆరోపించారు. 

20:32 - March 16, 2018

ఢిల్లీ : వైసీపీ అవిశ్వాసానికి మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన  సోమవారం నుంచి ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. వామపక్షాలు తమకు మొదటి నుంచి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సభ ఆర్డర్ లో లేకపోవడంతో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. 

 

20:24 - March 16, 2018

ఢిల్లీ : అవిశ్వాసంతో ప్రధాని మోదీకి బుద్ధి చెబుతామని టీడీపీ ఎంపీ తోట నరసింహం అన్నారు. ప్రధాని మోదీ ఏపీని అన్ని విధాల అన్యాయం చేశారని మండిపడ్డారు. అవిశ్వాసానికి విపక్షాల మద్దతు కూడగడుతున్నామని చెప్పారు. 

 

గేట్ 2018 ఫలితాలు వెల్లడించిన గౌహతి ఐఐటీ

అస్సాం : గేట్ 2018 ఫలితాలను గౌహతి ఐఐటీ వెల్లడించారు. ఈనెల 20 నుంచి మే 31 వరకు స్కోర్ కార్డులు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది.

 

19:35 - March 16, 2018
19:34 - March 16, 2018

పంజాబ్ : మనుషుల అక్రమ రవాణా కేసులో ప్రఖ్యాత పాప్‌ సింగర్ దలేర్‌ మెహందీకి శిక్ష పడింది. పంజాబ్‌లోని  పటియాలా కోర్టు దలేర్‌ మెహందీని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దలేర్‌ సోదరుడు షంషేర్‌ సింగ్‌ని కూడా కోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం దలేర్‌ మెహందీ పంజాబ్‌ పోలీసుల కస్టడీలో ఉన్నారు. తన మ్యూజిక్‌ టీమ్‌లో భాగస్వామిగా చేర్చుకుని కొంతమందిని అక్రమంగా విదేశాలకు తరలించాడని దలేర్‌ మెహందీపై ఆరోపణలున్నాయి. దలేర్‌ సోదరులు క్రూ మెంబర్‌ పేరిట విదేశాలకు తీసుకెళ్లేవారు. ఇందుకోసం వాళ్ల దగ్గర డబ్బు వసూలు చేసేవారు. ఇద్దరు సోదరులు కలిసి 1998-99లో 10 మందిని అమెరికాకు తరలించారు. బఖ్షీష్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు 2003లో దలేర్‌పై మనుషుల అక్రమ రవాణా కేసు నమోదైంది.

 

19:30 - March 16, 2018

కర్నూలు : జూనియర్ డాక్టర్ల సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. చేతులకు సంకెళ్లు వేసుకొని వినూత్న రీతిలో జూడాలు తెలిపారు. తక్షణం స్టైఫెండ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

19:25 - March 16, 2018

వరంగల్ : దమ్మన్నపేటలో ఎమ్మెల్యే అరురి రమేష్ కు చుక్కెదురైంది. నాలుగేళ్లలో తట్టెడు మట్టిగా కూడా పోయలేదంటూ ప్రజలు ఆగ్రహించారు. ఓ దాత సాయంతోనే అభివృద్ధి పనులు జరిగాయని గ్రామస్తులు అంటున్నారు. ఎమ్మెల్యే వల్ల ఒరింగేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో చేసిన పనులను మీరెలా ప్రారంభిస్తారంటూ నిలదీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

 

19:19 - March 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌లో సామాజిక సమతుల్యత లోపించిందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బడ్జెట్‌లో చిన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని, ఎంబీసీలకు కులాల జాబితా ప్రకటించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలకు అవకాశం కల్పించాలన్నారు. ఈ నెల 19న బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

 

 

19:15 - March 16, 2018

రాజమండ్రి : చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రజలు నమ్ముతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రతి దాడికి సిద్ధమైయ్యాకే...పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లారని తెలిపారు. పవన్ కు స్ర్కిప్టు రాసి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని తేల్చి చెప్పారు.

19:08 - March 16, 2018

గుంటూరు : గుంటూరులో తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుంటే గుంటూరు బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు. గుంటూరు కార్పొరేటర్లు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అండర్ గ్రౌండ్ పనులు చేపట్టిన వారిని కోర్టుకు ఈడుస్తామని మండిపడ్డారు.

 

18:43 - March 16, 2018

గుంటూరు : రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ మాట తప్పారని అన్నారు. అమరావతి నిర్మాణానికి  శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు మర్చిపోయారని బాబు ప్రశ్నించారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో అహ్మదాబాద్‌, ముంబైలో మెట్రో ప్రాజెక్టులకు వందల కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వానికి అమరావతి ఎందుకు కనిపించడంలేదని సభలో సీఎం నిలదీశారు. ఏపీ ప్రజల పట్ల బీజేపీ పాలకులకు ఎందుకు ఈ వివక్ష..? అని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుపై క్లీయర్‌గా నివేదిక 
2014లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌  మంత్రివర్గం చివరి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై క్లీయర్‌గా నివేదిక ఇచ్చారని... చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం అంతా కేంద్రమే భరిస్తుందని ఆరోజు పేర్కొన్నారని బాబు చెప్పారు. తర్వాత 2014 మేనెలలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే తాను పోలవరం ప్రాజెక్టుపై చర్చించాన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలపాలని తానే పట్టుపట్టానన్నారు. తన పట్టుదలతోనే 7మండలాలను ఏపీలో కలిపారని చంద్రబాబు సభకు తెలిపారు. 
అమరావతి నిర్మాణం పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదే...
అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. శానమండలిలో ఏపీ ఆర్థిక పరిస్థితి, కేంద్రం సహాయ నిరాకరణపై ఆయన మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి పుణ్యక్షేత్రా నుంచి పవిత్ర, జలాలు, మట్టి తీసుకొచ్చిన ప్రధానిమోదీ.. డబ్బులివ్వడం మాత్రం మర్చిపోయారని బాబు విమర్శించారు. అటు దుగరాజపట్నం పోర్టును విషయంలో కూడా 4ఏళ్లు తాత్సారం చేసి..ఇపుడు ప్రత్నామ్నాయం చూసుకోవాలని అంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే  బీజేపీ పాలకులు ప్రయత్నిస్తున్నారని ఏపీ సీఎం విమర్శించారు. 
జగన్‌పై విమర్శలు గుప్పించిన చంద్రబాబు 
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై ఏపీ శాసన మండలిలో సీఎం చంద్రబాబు విమర్శలతో విరుచుకు పడ్డారు. 2017లో ప్రధానిని కలిసిన జగన్‌ ఏపీకి ప్రత్యేక హోదా అడగబోమని చెప్పారన్నారు. అటు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించగానే బీహార్‌కు వెళ్లి ఆయన కాళ్లమీద పడి.. రాబోయే రోజుల్లో తమపై కేసులు లేకుండా చేయించుకోడానికి ప్రయత్నించారని బాబు విమర్శించారు. మోదీ,  రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఫోటోలు దిగి..తమకు కేంద్రం పెద్దల అండఉందన్న మెసేజ్‌ను  సీబీఐ, ఈడీలకు పంపించే ప్రయత్నిం చేశారని చంద్రబాబు  విమర్శించారు. జగన్‌ మాటలు వినే ప్రధాని మోదీ ఏపీకి నిధులు రాకుండా చేస్తున్నారని సీఎం అన్నారు. 

 

18:22 - March 16, 2018

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ బీజేపీ నేత అన్వర్ ఖాన్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భారత భద్రతా బలగాలు హతమార్చాయి. పుల్వామా జిల్లా బల్హామా ప్రాంతంలో అన్వర్‌ఖాన్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అన్వర్‌ ఖాన్‌ అంగరక్షకుడు బిలాల్‌ అహ్మద్‌ సర్వీస్‌ రివాల్వర్‌ను మిలిటెంట్లు లాక్కునే యత్నాన్ని సెక్యూరిటీ పోలీసులు వమ్ము చేశారు. ఈ పెనుగులాటలో అహ్మద్‌ ఓ తూటా తగిలి గాయపడ్డాడు. వెంటనే ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. మిలిటెంట్లకు, సిఆర్‌పిఎఫ్‌ బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాది ఉంటాడని అనుమానిస్తున్నారు.

 

18:20 - March 16, 2018

పంజాబ్ : పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్‌ మాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీలో మాత్రం కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అకాలిదళ్‌ నేత విక్రమ్ మజీఠియాకు క్షమాపణ కోరినందుకు మాన్‌తో పాటు పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో డ్రగ్స్‌ మాఫియా అంశాన్ని ప్రస్తావించిన ఆప్‌...ఇందుకు అకాలిదళ్‌ బాధ్యత వహించాలని టార్గెట్‌ చేసింది. డ్రగ్స్‌ వ్యాపారంతో సంబంధముందని కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై విక్రమ్ మజీఠియా పరువునష్టం దావా కేసు వేశారు. దీంతో దిగివచ్చిన కేజ్రీవాల్ మజీఠియాపై చేసిన ఆరోపణలపై ఆధారాలు లేవంటూ  క్షమాపణ చెప్పారు. కేసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  కేజ్రీవాల్‌పై జైట్లీ, గడ్కరి తదితరులు కూడా పరువునష్టం దావా వేశారు. కోర్టుల చుట్టూ తిరగడానికే సమయం వృథా అవుతున్నందున వీటిని ముగింపు పలికేందుకు క్షమాపణ చెప్పాలని కేజ్రీవాల్‌ నిర్ణయించినట్లు సమాచారం. డ్రగ్స్‌, అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందని మాన్‌ స్పష్టం చేశారు. 

 

18:13 - March 16, 2018

ఢిల్లీ : సేతు సముద్రం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా జాతి హితాన్ని దృష్టిలో పెట్టుకుని రామసేతుకు ఎలాంటి నష్టం కలిగించమని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. రామసేతు కేసులో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ చారిత్రక నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంచేసింది. 1990లో అప్పటి భారత ప్రభుత్వం సేతుసముద్రం ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించింది. యూపీఏ హయాంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి తుదిరూపు ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా 350 నాటికల్ మైల్స్ దూరం మేర ప్రయాణం తగ్గుతుంది. సేతుసముద్రం ప్రాజెక్ట్ కారణంగా రామసేతు నిర్మాణం దెబ్బతింటుందని 2014లో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కోర్టుకెక్కారు. రామసేతుకు జాతీయ వారసత్వ సంపద హోదా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. 

 

టీడీపీ అవిశ్వాసం అంటే అన్ని పార్టీలు మద్దతు : బాబు

అమరావతి : వైసీపీ రెండు నెలల నుండి అవిశ్వాసం తీర్మానం పెడతామని అంటున్నా ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదనీ..టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడతామన్నగానే అనేక పార్టీలు మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. దీన్ని బట్టి ఏ పార్టీకి ఎంతటి విలువ వుందో అర్థం అవుతోందన్నారు. 

ఎయిర్ బస్ అత్యవసర ల్యాండింగ్..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ బస్ 380 విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ ప్రయాణీకుడికి తీవ్ర అస్వస్థతగా వున్న నేపథ్యంలో దుబాయ్ నుండి బ్యాంకాక్ వెళుతున్న విమానాన్ని అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ జపిన తక్షణం సదరు వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సూడాన్ దేశానికి చెందిన మహ్మద్ గా అధికారులు తెలిపారు.

చింతమనేని ప్రభాకర్ కు ఊరట..

అమరావతి : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో ఊరట కలిగింది. రెండేళ్ల క్రితం ప్రభాకర్ కు శిక్ష వేస్తు ఇచ్చిన ఆర్డర్ ను కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ప్రభాకర్ కు కోర్టులో ఊరట కలిగింది. 

దొంగ పార్టీ వెనుక మేం వెళ్లం : చంద్రబాబు

అమరావతి : ఒక దొంగ పార్టీ అవిశ్వాస తీర్మానం వెనుక తాము వెళ్లబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంత వరకూ తాను ఏ పార్టీలతోను మాట్లాడలేదన్నారు. వైసీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని అందుకనే తామే అవిశ్వాస తీర్మానం పెట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు.  

17:14 - March 16, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సభ్యుల సభ్యత్వం రద్దుపై హై కోర్టులో వాదనలు ముగిశాయి. రాజకీయ దురుద్దేశంతోనే సభ్యత్వం రద్దు చేశారని పిటిషనర్‌ తరపు న్యాయవాది జంద్యాల రవి కోర్టుకు తెలిపారు. సభ్యత్వం రద్దు చట్టవిరుద్ధమని వాదించారు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో బాగానే ఉన్న మండలి చైర్మన్‌... ఆతర్వాత ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యాడని తెలిపారు. ఎమ్మెల్యే సంపత్‌ వీడియోలో లేనప్పటికీ అతనిపై కూడా చర్యలు తీసుకున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. న్యాయవాది వాదనలు విన్న కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

 

జనసేనానికి సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే..

అమరావతి : జనసేన అధినేత పవన్ పై కల్యాణ్ తనపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. తనపై పవన్ పోటీ చేయాలనుకుంటే...స్వాగతిస్తానని పేర్కొన్నారు.తన సత్తా ఏంటో పవన్ కు చూపిస్తానని చెప్పారు. 

బాలికల భద్రతపై హార్యానాలో కొత్త చట్టం..

ఢిల్లీ : 12 ఏళ్లు, ఆలోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే, నిందితులను ఉరితీసే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బాలికలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. చిన్నారి బాలికలను కాపాడుకునేందుకు ఈ చట్టం ఓ మైలురాయి అవుతుందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. 

కాంగ్రెస్ గతే బీజేపీకి : ఉండవల్లి

హైదరాబాద్ : ఏపీకి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ... కేవలం 2 శాతం ఓట్లకు మాత్రమే పరిమితమైందని... రాబోయే రోజుల్లో బీజేపీకి కూడా అదే గతి పట్టబోతుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నట్లుగా సమాచారం. ఈ విషయంపై ఢిల్లీకి ఏపీ నుండి బలమైన గట్టి సంకేతాలు ఢిల్లీకి వెళ్లాయన్నారు. బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను 90 శాతం మంది ప్రజలు విశ్వసించారని తెలిపారు. పవన్ తో తన సంబంధం జేఎఫ్సీ వరకే పరిమితమని స్పష్టం చేశారు.

బాబూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు : ఉండవల్లి

తూర్పుగోదావరి : 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం వున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడటం ఆయన ప్రత్యేకత. అటువంటి చంద్రబాబు ఇప్పుడు పద్మవ్యూహంలో అభిమన్యుడిలా అయిపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ మేధావిగా పేరొందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు కొన్ని సూచనలిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను సాధించే క్రమంలో చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు... ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్ లో పడకూడదని అన్నారు.

`సింధ్' పదాన్ని తొలగించాలంటు తీర్మానం?!..

ఢిల్లీ : జాతీయగీతంలో ఉన్న సింధ్ అన్న పదాన్ని తొలగించి దాని స్థానంలో ఈశాన్య భారతాన్ని చేర్చాలని కోరుతు కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా ఓ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈశాన్య ప్రాంతానికి భారత్‌లో చాలా ప్రాముఖ్యత ఉందనీ..ఆ ప్రస్తావన జాతీయ గీతంలో లేకపోవడం విచారకరమని తీర్మానంలో పేర్కొన్నారు. సింధ్ అనే పదంతో తమకు పనిలేదనీ...ఇప్పుడా ప్రాంతం శత్రు దేశమైన పాకిస్థాన్‌లో ఉంది అంటూ రిపున్ బోరా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఈ మేరకు మార్పులు తీసుకురావాల్సిందిగా సభను కోరుతున్నట్లు తీర్మానంలో పేర్కొన్నట్లుగా సమాచారం.

16:52 - March 16, 2018

గుంటూరు : కేంద్రప్రభుత్వానికి తెలుగు సెంటిమెంట్ అంటే అంత చులకనా..? అని సీఎం చంద్రబాబు అన్నారు. 'ఎందుకు పోరాటం చేస్తున్నారు..? మేము లేమా 'అని మోదీ అన్నారు. 'మేం పోరాడుతుంటే మాట్లాడదామని కూడా మోదీ పిలవలేదు' అని వాపోయారు. హోదా ప్రయోజనాలు అమలయ్యేలా ప్యాకేజీ ఇస్తామన్నారు. ఏపీ కష్టాలను కేంద్రం అసలు పెట్టించుకోలేదని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్దన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రయోజనాలు, పోర్టు ఫోలియోల కోసం కేబినెట్లో చేరలేదన్నారు. తెగదెంపులు చేసుకున్నాకే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఓ పద్ధతి ప్రకారం ఎన్డీఏ నుంచి వైదొలిగామని చెప్పారు. 

చంద్రబాబుకు ములాయం ఫోన్..

ఢిల్లీ : చంద్రబాబుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఫోన్ చేసినట్లు సమాచారం. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ, తమకు మద్దతుగా ఇతర పార్టీలను కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ప్రకటిస్తున్నట్టు ములాయం పేర్కొన్నట్టు తెలుస్తోంది.

16:42 - March 16, 2018

గుంటూరు : ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధానమంత్రి మోదీ అమరావతి శంకుస్థాపన సమయంలో మాట ఇచ్చారని..కానీ ఇచ్చిన మాటలను మోదీ నిలబెట్టుకోలేకపోయారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ మెట్రో రైళ్లకు రూ.100 కోట్లు ఇచ్చిన మోదీ ఏపీకి మాత్రం మొండి చేయి చూపించారని విమర్శించారు. ఏపీ ప్రజలంటే కేంద్రానికి ఎందుకంత వివక్ష? ఎంతుకంత చిన్నచూపు? అని ఆవేదనగా ప్రశ్నించారు. 

పవన్ ఆరోపణలపై బాబు ఆవేదన..

అమరావతి : ఇసుక విక్రయాలలో జరిగుతున్న అవకతవకలపై జనసేన అధినేత టీడీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలపట్ల సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక విక్రయాలలో జరిగిన పొరపాట్లకు మైనింగ్‌ స్కామంటూ భారీ మైనింగ్ స్కామ్ కు పాల్పడిన గాలి జనార్దన్‌రెడ్డితో పవన్ ముడిపెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

సెన్సెక్స్ మరోసారి భారీ పతనం..

ముంబై : బీఎస్‌ఈ సెన్సెక్స్ మరోసారి భారీగా పతనమైంది. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం ఏకంగా 509.54 పాయింట్లు నష్టపోయింది. ఆయిల్, గ్యాస్ రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. మెటల్స్, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లు కూడా బేర్‌మన్నాయి. సెన్సెక్స్ 33128.99 పాయింట్ల దగ్గర ముగిసింది. అటు నిఫ్టీ కూడా 165 పాయింట్లు కోల్పోయి 10195.15 పాయింట్లకు పతనమైంది. టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, హీరోమోటో కార్ప్ షేర్లు భారీగా పడిపోయాయి. గురువారం కూడా సెన్సెక్స్ 150, నిఫ్టీ 50 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే.

గనుల శాఖపై కేటీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : గనుల శాఖలో సాంతికేక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం రాతి ఇసుక వినియోగాన్ని పెంచాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, ఆర్ అండ్ బీ నిర్మాణాల్లో రాతి ఇసుక వినియోగం పెంచాలని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గనుల శాఖపై సమీక్ష సమావేశంతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాతి ఇసుక వినియోగం పెంచేందుకు ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు. టీఎస్‌ఎండీఎస్ ద్వారా కూడా రాతి ఇసుక క్రషర్‌ల ఏర్పాటును పరిశీలించాలని పేర్కొన్నారు. 

ఏపీ శాసన మండలి వాయిదా..

అమరావతి : ఏపీ శాసన మండలి మంగళవారానికి వాయిదా పడింది. మండలిలో సీఎం చంద్రబాబు అనే విషయాలను ప్రస్తావించారు. ఎన్డీయే ప్రభుత్వం నుండి వైదొలగటం, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం వంటి అతి పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సిన వచ్చింది అనే పలు కీలక అంశాలపై ఆయన సుదీర్ఘం మాట్లాడారు. అనంతరం సభను మండలి చైర్మన్ ఫరూక్ మంగళవారానికి వాయిదా వేశారు. 

16:13 - March 16, 2018

గుంటూరు : ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగటం అనే అంశం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప తన స్వప్రయోజనాల కోసం కాదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. గత నాలుగేళ్లలో ఢిల్లీకి 29 సార్లు వెళ్లానని, అనేక సార్లు ప్రత్యేక హోదా గురించి అడిగానని ఆయన గుర్తు చేశారు. మోదీ సర్కార్ తన చివరి బడ్జెట్‌లో ఏపీ గురించి ప్రత్యేక నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అందుకే తమ మంత్రులు క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారన్నారు. విభజన హామీలు ఇంత వరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేరిస్తే ఈ సమస్య ఉండేదికాదన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మనోభావాలతో నిధులను పెంచలేమని మంత్రి జైట్లీది నిర్లక్ష్య ధోరణి అని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సెంటిమెంట్ ఆధారంగానే ఇచ్చారని, ప్రజల మనోభావాలు చాలా శక్తివంతమైనవని, ఇప్పుడు కూడా కేంద్రం అన్యాయం చేస్తోందని బాబు ఆరోపించారు. గతంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నామని, ఇలాంటి పరిస్థితులను ఈజీగా దాటేస్తామన్నారు. ప్రధాని లేఖ రాసినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై పవన్ కు అవగాహన వుందా?
పోలవరం ప్రాజెక్టుపై పవన్ కళ్యాణ్ అవగాహన వుండి మాట్లాడుతున్నారా? లేక మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై పవన్ లేని పోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కలిసి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సిన వచ్చిందో తెలుసుకోవాలని పవన్ కు సూచించారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా ఏపీకి ఇస్తానని వాగ్ధానం చేసిన రైల్వే జోన్ ను ఇవ్వటం సాధ్యం కాదనటం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు.
ఎన్డీయే డొంక తిరుగుడు విధానం
రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానాలు చెబుతోందని, పార్లమెంటులో తాము పోరాడుతుంటే ఒక్కసారయినా కూర్చోబెట్టి ప్రధాని మోదీ చర్చించారా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తాము నిన్నటి వరకు వేచి చూశామని, ఇక తాము ఎన్డీఏలో ఎందుకు ఉండాలని ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న తరువాతే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకుని అదే విధంగా చేశామని అన్నారు.
నాలుగు బడ్జెట్లలోనూ ఏపీకి అన్యాయం
భాజపా ప్రభుత్వం గత నాలుగు బడ్జెట్లలోనూ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ... భాజపాతో ఉండబోదని తెదేపా నిర్ణయించిందని, ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్‌ కష్టాలను కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు నెరవేరుస్తామని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన భాజపా.. అధికారంలోకి రాగానే మరిచిపోయింది. శాసన మండలిలో ఎన్డీయే నుండి విడిపోయిన అంశాలను, విభజన సమంయలో ఏన్డీయే ఇచ్చిన హామీలను, అనంతరం అవలంభిస్తున్న విధానాలను, దీనిపై కొనసాగుతున్న రాజీకీయ పరిణామాలను, పార్లమెంట్ లో పెట్టిన అవిశ్వాస తీర్మానం వంటి పలు అంశాలపై చంద్రబాబు సుదీర్ఘంగా వివరించారు. అనంతరం సభను మండిలి చైర్మన్ ఫరూక్ మంగళవారానికి వాయిదా వేశారు.

వారికి ఇచ్చినప్పుడు మమ్మల్ని అడిగారా?: బాబు

అమరావతి : రైల్వేజోన్ విషయంలో కేంద్రం దాటవేత ధోరణి అవలంభిస్తోంది. ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. త్వరలోనే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇతర రాష్ట్రాలకు రైల్వేజోన్‌ ఇచ్చినప్పుడు మమ్మల్ని అడిగారా? అని ప్రశ్నించారు. ఈరోజు మండలిలో మాట్లాడుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఎందుకు విడిపోవాల్సిన వచ్చింది? అని అంశంపై పలు విషయాలను ప్రస్తావించారు.

ఇచ్చిన మాటను ప్రధాని తప్పారు : బాబు

అమరావతి : ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధానమంత్రి మోదీ అమరావతి శంకుస్థాపన సమయంలో మాట ఇచ్చారని..కానీ ఇచ్చిన మాటలను మోదీ నిలబెట్టుకోలేకపోయారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ మెట్రో రైళ్లకు రూ.100 కోట్లు ఇచ్చిన మోదీ ఏపీకి మాత్రం మొండి చేయి చూపించారని విమర్శించారు. ఏపీ ప్రజలంటే కేంద్రానికి ఎందుకంత వివక్ష? ఎంతుకంత చిన్నచూపు? అని ఆవేదనగా ప్రశ్నించారు. 

15:37 - March 16, 2018

ఢిల్లీ : హస్తినలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్, ఎంఐఎం మద్దతు తెలిపాయి. మిగతా రాజకీయపార్టీల మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్ జాతీయ నేత మల్లిఖార్జున ఖర్గే నిమగ్నమయ్యారు. లెఫ్ట్, ఎస్పీ, ఆప్, టీఎంసీ, శివసేన మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. వైసీపీ అవిశ్వాసానికి లెఫ్ట్, ఎస్పీ, ఆప్, టీఎంసీ, శివసేన మద్దతు ఇచ్చాయి. ఆప్ ..4, సీపీఎం.. 9, ఎస్పీ..7, శివసేన..18.

రాష్ట్రం కోసమే నా కోసం కాదు : చంద్రబాబు

అమరావతి : ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగటం అనే అంశం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప తన స్వప్రయోజనాల కోసం కాదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. గత నాలుగేళ్లలో ఢిల్లీకి 29 సార్లు వెళ్లానని, అనేక సార్లు ప్రత్యేక హోదా గురించి అడిగానని ఆయన గుర్తు చేశారు. మోదీ సర్కార్ తన చివరి బడ్జెట్‌లో ఏపీ గురించి ప్రత్యేక నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అందుకే తమ మంత్రులు క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారన్నారు. విభజన హామీలు ఇంత వరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్భయ తల్లిపై మాజీ డీజీపీ హేయమైన వ్యాఖ్యలు..

కర్నాటక : దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన నిర్భయ ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. 2012లో జరిగిన ఈ ఘటనపై నిందితులకు శిక్ష కూడా పడింది. ఈ క్రమంలో ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానా మాట్లాడుతూ..నిర్భయ ఆశాదేవిది మంచి శరీరాకృతి అని వ్యాఖ్యానించారు. ఈవిడే ఇంత అందంగా ఉంటే ఆమె కూతురు నిర్భయ ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాకుండా.. మహిళలకు శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ, రేపిస్టులకు లొంగిపోవాల్సిందేనని పేర్కొన్నారు. అప్పుడే మీ జీవితాలు సురక్షితంగా ఉంటాయి.

పోలవరంపై పవన్ కు అవగాహన వుందా?: బాబు

అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై పవన్ కళ్యాణ్ అవగాహన వుండి మాట్లాడుతున్నారా? లేక మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై పవన్ లేని పోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కలిసి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సిన వచ్చిందో తెలుసుకోవాలని పవన్ కు సూచించారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా ఏపీకి ఇస్తానని వాగ్ధానం చేసిన రైల్వే జోన్ ను ఇవ్వటం సాధ్యం కాదనటం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. 

టీ.కాంగ్రెస్ సభ్యత్వ రద్దుపై కోర్టులో విచారణ..

హైదరాబాద్ : టీ.కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయటంపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్ ఫోన్ విసిర ఘటనను సీరియస్ గా తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం సదరు కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాన్ని సభ నుండి రద్దు చేసింది. ఈ క్రమంలోనే మరో 11మంది సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసిన విషం తెలిసిందే.

విద్యార్దుల అస్వస్థతపై మేజిస్ట్రేట్ ఆదేశాలు..

ఉత్తరప్రదేశ్‌ : కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటనలో జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ లోని ఇటాలో కస్తూర్బా గాంధీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం భోజనం వికటించటంతో విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

టీడీపీ అవిశ్వాసానానికి టీఆర్ఎస్ మద్దతు..

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో చర్చకు వస్తే టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. 

ఎన్డీయే డొంక తిరుగుడు విధానం : చంద్రబాబు

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానాలు చెబుతోందని, పార్లమెంటులో తాము పోరాడుతుంటే ఒక్కసారయినా కూర్చోబెట్టి ప్రధాని మోదీ చర్చించారా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తాము నిన్నటి వరకు వేచి చూశామని, ఇక తాము ఎన్డీఏలో ఎందుకు ఉండాలని ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న తరువాతే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకుని అదే విధంగా చేశామని అన్నారు. 

అవిశ్వాసానికి బీజేపీ భయపడదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : ఇతర పార్టీలు పెట్టే అవిశ్వాస తీర్మానాలకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు నిలదీస్తే... వారిద్దరినీ బీజేపీ రెచ్చగొట్టిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం భావ్యం కాదని చెప్పారు. ఎవరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ అనుకూల గాలి వీస్తోందని... ఎలాంటి ఫ్రంట్ కు అవకాశం లేదని చెప్పారు.

తెలుగు సెంటిమెంట్ అంటే అంత చులకనా?: బాబు

అమరావతి : కేంద్రానికి తెలుగు వారి మనోభావాలన్నా, వారి సెంటిమెంట్ అన్నా అంత చులకనగా వుందా? అని ఏసీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. విభజన తరువాత ఏపీ పడుతున్న కష్టాల గురించి కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు బడ్జెట్ కేటాయింపుల్లోను రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్రం నుండి ఎటువంటి స్పందన రాలేదన్నారు. రాష్ట్రానికి నిధులు అడిగితే డిఫెన్స్ కు నిధులు వుండద్దొ. అంటారన్నారు. ఏది ఏమైనా ఓ పద్దతి ప్రకారం ఎన్డీయేతో విడిపోయామని..రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు.

14:48 - March 16, 2018

గుంటూరు : ఎట్టకేలకు బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. ఉదయమే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ శాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపబోమని స్పష్టం చేశారు. ఏపీకి నిధులడిగితే డిఫెన్స్ కి నిధులు ఉందొద్దా అంటున్నారు... డిఫెన్స్ కి నిధులు ఇవ్వొద్దని చెబుతామా అని అన్నారు. హోదా ప్రయోజనాలు అమలయ్యేలా ప్యాకేజీ ఇస్తామన్నారని పేర్కొన్నారు. బీజేపీ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలని పేర్కొన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి అడిగినా కేంద్రం నుంచి స్పందన లేదని చెప్పారు. కేంద్రం సరిగ్గా సహకరించకపోయినా... రాష్ట్రంలో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందంటే... అది టీడీపీ ప్రభుత్వం ఘనత అన్నారు. కేంద్రం సహకరించమంటే సహాయ నిరాకరణ చూపిస్తే ఏం చేయాలని అన్నారు. ఏపీని వేరే రాష్ట్రాలతో ఏవిధంగా పోల్చుతారని తెలిపారు. విభజన జరిగినప్పుడు ఆస్తులను వదులుకొని వచ్చామన్నారు. కాంగ్రెస్ విభజన బిల్లు పెట్టినప్పుడు దానికి బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. 

 

13:20 - March 16, 2018

హస్తినలో అవిశ్వాసం వేడి..

ఢిల్లీ : హస్తినలో రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. మరింత రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏపీకి విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష వైఖరికి నిరసనగా టీడీపీ, వైసీపీ పార్టీలు అవిశ్వాసన తీర్మానం ప్రటించేందుకు సిద్ధపడ్డాయి.ఈ నేపథ్యంలో ఈరోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఎవరికి వారు తమ తీర్మానాలను అందజేశారు. ఈ క్రమంలో వైసీపీ అవిశ్వాసానికి లెఫ్ట్, ఎస్పీ,ఆప్, టీఎంసీ, శివసేన మద్దతు పలుకే అకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ కు 4 సభ్యులు, సీపీఎం 9, ఎస్పీ 7, శివసేన 18 ఎంపీల చొప్పున వున్నారు. టీడీపీకి కాంగ్రెస్ మద్ధతు పలకటం విశేషం.

బడ్జెట్ పై శ్వేతపత్రం విడుదల చేయాలి : తమ్మినేని

హైదరాబాద్ : బడ్జెట్ తీరు తెన్నులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గత బడ్జెట్ లో ఎంబీసీలకు రూ.1000 కోట్లు కేటాయించి ఒక్క రూపాలయి కూడా ఖర్చుపెట్టలేదని ఆయన ఆరోపించారు. ఎంబీసీ కులాలను ఇంతవరకూ ప్రకటించలేదన్నారు. ప్రభుత్వ పాలన వలెనే బడ్జెట్ కూడా అంకెల గారడీగానే వుందని ఆయన విమర్శించారు. బడ్జెట్ లో సామాజిక సమతుల్యత లేదన్నారు. తెలంగాణ బడ్జెట్ లో చిన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. 

ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెసే : రఘువీరా

హైదరాబాద్ : ఎప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెసే నని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించింది, ఇచ్చేది కాంగ్రెస్సే నని ఆయన పేర్కొన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం అంశంపై కాంగ్రెస్ పూర్తి మద్దతు వుంటుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో మిత్రపక్షాల మద్దతు కూడగట్టమని సోనియా గాంధీ ఆదేశించారని తెలిపారు. ఖర్గే, జ్యోతిరాదిత్చ సింధియాలతో సోనియా మాట్లాడారని తెలిపారు.  

ఆర్డర్ లేదు, అవిశ్వాసం చేపట్టలేదు : లోక్ సభ స్పీకర్

ఢిల్లీ : టీడీపీ, వైసీపీ పార్టీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాసన తీర్మానాలను స్పీకర్ విడివిడిగా ప్రస్తావించారు. వారి అవిశ్వాస తీర్మానాలు అందాయని ఆమె ప్రకటించారు. కానీ సభలో గందరగోళం మధ్య సభ్యులు ఆర్డర్ లో లేనందున చర్చను చేపట్టలేకపోతున్నామని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. దీంతో విపక్షాల ఆందోళన మధ్య సభను సోమవారానికి వాయిదా వేశారు. టీడీపీ తరపున తోట నర్శింహులు ఇచ్చారని,వైసీపీ తరపున అవిశ్వాస తీర్మానాన్ని వైవీ రామసుబ్బారెడ్డి ఇచ్చారనీ..స్పీకర్ ప్రకటించారు.

12:24 - March 16, 2018

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైసీపీ..టిడిపిలు ఇచ్చిన వాయిదా తీర్మానం సభలో ప్రవేశ పెట్టలేదు. విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో సభ వాయిదా పడింది. శుక్రవారం ప్రారంభమైన సభ ప్రారంభం కాగానే వాయిదా పడింది. మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమైన సభలో టీఆర్ఎస్..ఇతర సభ్యులు ఆందోళన చేపట్టారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తారని..ఆందోళన ఉండదని అనుకున్నా అలాంటి పరిస్థితిలు కనిపించలేదు.

మధ్యాహ్నం ప్రారంభమైన సభలో స్పీకర్ వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభలో ప్రస్తావించారు. తీర్మానానికి సభ్యుల మద్దతు అవసరం ఉంటుందని, కానీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అందర్నీ కౌంట్ చేయాలంటే సభ సజావుగా జరగాల్సి ఉంటుందని స్పీకర్ వెల్లడించారు. అందరూ వెళ్లి తమ తమ సీట్లలో కూర్చొవాలని కోరినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. దీనితో తీర్మానాన్ని తీసుకోలేకపోతున్నట్లు పేర్కొని సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఒక్కసారిగా ప్రకటించేశారు. దీనితో సభను వాయిదాలు వేసేందుకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాన విషయంలో కూడా ఇలాగే జరిగింది. 

లోక్ సభ సోమవారానికి వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా ఏపి విభజన హామీలను నెరవేర్చాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల ఎంపీలు తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తున్న నేపథ్యంలో సభ సోమవారానికి వాయిదా పడింది. 

మిస్డ్ కాల్ పార్టీలో పవన్ : సోమిరెడ్డి

అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు సభలో టీడీపీపై చేసిన విమర్శల నేపథ్యంలో టీడీపీ కూడా ఘాటుగా స్పందిస్తోంది. ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పై పరుష వ్యాఖ్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలో జగన్ తరహాలోనే పవన్ కూడా మిస్డ్ కాల్ పార్టీల జాబితాలో చేరారంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ దుయ్యబట్టారు. వైకాపాలాగే మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చేస్తామని పవన్‌ చెబుతున్నారని.. అంటే జగన్‌ను ఆయన అనుసరిస్తున్నారని అనుకోవచ్చా? అని ప్రశ్నించారు. పవన్ తన మనసు ఎవరి మీదైనా పారేసుకుంటారని...ఆ తర్వాత మూడు నాలుగేళ్లకు ఆరేసుకుంటారని ఎద్దేవా చేశారు. 

పన్నీర్ సెల్వంగా పవన్ : సోమిరెడ్డి

అమరావతి: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పన్నీర్ సెల్వంగా మారిపోయారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పిన పవన్‌.. ఒక్కసారిగా పన్నీరు సెల్వంలా ఎలా మారిపోయారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. 

11:59 - March 16, 2018

విజయవాడ : ఎన్డీయే నుండి బయటకు రావాలని టిడిపి నిర్ణయం తీసుకొందో లేదో అప్పుడే మాటల తూటాలు పేలుతున్నాయి. బిజెపి పార్టీపై..మోడీపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేత బుద్ధా వెంకన్నతో టెన్ టివి మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీయే అంత చేయిస్తున్నారని..బిజెపి చెప్పినట్లుగా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై కక్షతో మోడీ ఇలా చేస్తున్నారని, జగన్...ఒక పక్క..మరో పక్క పవన్ ను పెట్టుకుని నాటకాలు ఆడిస్తున్నారని, త్వరలోనే వివరాలు బయట పెడుతానన్నారు. పవన్...మోడీకి మధ్య మధ్యవర్తిత్వ వహించారో ఆ వ్యక్తి వివరాలు త్వరలోనే బహిర్గతం చేయిస్తానని వెల్లడించారు. వైసిపి పెట్టిన అవిశ్వాస తీర్మానం బోగస్ అని తాము పెడుతున్న తీర్మానం పక్కా అని పేర్కొన్నారు. 

ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. శంషాబాద్ నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఏపీకి చెందిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బ్యాగులో నాలుగు బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. సాయి ప్రసాద్ రెడ్డిని విచారించి బుల్లెట్లు తీసుకెళ్లడం తప్పని చెప్పి వదిలేసినట్లు సమాచారం.

ఎస్ఐ ఆత్మహత్య!..

బీహార్ : రాష్ట్రంలోని గయ జిల్లాలో సబ్‌ఇన్‌స్పెక్టర్ గౌరీశంకర్ ఠాకూర్ తన పోలీస్‌స్టేషన్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు. ఉన్నతాధికారులు తన సెలవు అభ్యర్థనను తిరస్కరించడంతో మనస్థాపానికి గురైన ఎస్‌ఐ గౌరీశంకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్‌ఐ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. 

11:51 - March 16, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంతో విపక్షాలు ఏకమౌతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు చేయకపోవడం..కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీకి చెందిన వైసీపీ, టిడిపిలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. శుక్రవారం ప్రారంభమైన లోక్ సభ కొద్దిసేపటికే వాయిదా పడింది. తాము ఎందుకు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చింది ? ఎన్డీయే గూటి నుండి ఎందుకు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందనే దానిపై జాతీయ పార్టీలకు టిడిపి వివరిస్తోంది. మద్దతు తెలియచేయాలని వైసిపి..టిడిపి పార్టీలు కోరుతున్నాయి. 20 విపక్షాల కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతోంది. కూటమి నుండి బయటకు రావడం పట్ల టీఎంసీ అధినేత మమత బెనర్జీ ప్రశంసించారు. విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం, సీపీఐ, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించగా శివసేన మధ్యాహ్ననానికి మద్దతు విషయంలో నిర్ణయం తీసుకోనుంది. 

టీడీపీ అవిశ్వాసానికి పెరుగుతున్న మద్దతు..

ఢిల్లీ : కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని టీడీపీ తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా  దాదాపు అన్ని పార్టీల నుండి మద్దతు లభిస్తోంది. దీంతో టీడీపీ అవిశ్వాసానికి అంతకంతకు మద్దతు పెరుగుతోంది. అందరి కంటే ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. అదే దారిలో సీపీఎం, సీపీఐలతో పాటు పలు పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. దీనిపై 20 మంది విపక్షాలతో కాంగ్రెస్ నేతలు సంప్పదింపులు చేస్తున్నారు. కాగా మధ్యాహ్నాం కల్లా తన నిర్ణయం తెలుపుతామని శివసేన తెలిపింది.

11:40 - March 16, 2018

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై టిడిపి మంత్రులు ఎదురు దాడికి దిగారు. గుంటూరు జిల్లాలో టిడిపి పార్టీ, చంద్రబాబు..నారా లోకేష్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో టిడిపి మంత్రులు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. 175 నియోజకవర్గాలను పవన్ గంపగుత్తగా అమ్మకున్నాడని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:37 - March 16, 2018

డ్రగ్స్ ఇచ్చి కోపైలట్ ను రేప్ చేసిన పైలట్ ?!..

హైదరాబాద్ : డ్రగ్స్ ఇచ్చి నాపై లైంగిక దాడికి ప్పాలడ్డాని ఓ మహిళా కో పైలల్ పైలట్  అలస్కా ఎయిర్‌లైన్స్‌ పై ఫిర్యాదు చేసింది. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కోపైలట్‌ బ్రెట్టీ పినా విమానయాన సంస్థపై దావా వేశారు. అలస్కా ఎయిర్‌లైన్స్‌ పైలట్‌‌ తనకు డ్రగ్స్‌ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. గత ఏడాది జూన్‌లో ఈ ఘటన జరగగా ఎయిర్‌లైన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని, సదరు పైలట్‌ ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారని ఆమె ఆరోపించారు. దీంతో ఆమె ఎయిర్‌లైన్స్‌పై ఫిర్యాదు చేశారు.

టీడీపీ,వైసీపీవి నాటకాలు : పవన్

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి లేదనీ ఇరు పార్టీలు నాటకాలాడుతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో కాలయాపన చేసిన తీరా పార్లమెంట్ సభలు పూర్తి కావస్తున్న క్రమంలో తేదీలను వెనక్కి, ముందుకు జరిపి ఇరు పార్టీలు నాటకాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. 

తక్షణమే మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించాలి : పవన్

గుంటూరు : అతిసార బాధితులను పరామర్శించిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాన్ మాట్లాడుతు..ఇక్కడ తక్షణమే మెడికల్ ఎమర్జన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఇక్కడి పరిస్థితిపై ఇంతవరకూ ఎటువంటి కమిటీ వేయలేదనీ..ఇక్కడ సమస్యలపై ప్రజాప్రతినిథులకు పట్టటంలేదని విమర్శించారు. జీజీహెచ్ లో వున్న అతిసార బాధితులతో మాట్లాడారు. వారి కష్టసుఖాల గురించి పపన్ అన్ని వివరాలను తెలుసుకుంటున్నారు. కాగా గతంలో శ్రీకాకుళంలోని ఉద్దానంలో ప్రర్యటించి కిడ్నీ సమస్య బాధితుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు.

11:17 - March 16, 2018

ఢిల్లీ : లోక్ సభలో పరిస్థితిలో ఏ మార్పు రావడం లేదు. ఏ ఒక్క రోజైనా సభ జరగకపోవడం..ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచాలని ఏపీ ఎంపీలు...ఇతర అంశాలపై వివిధ పక్షాల ఎంపీలు ఆందోళన చేస్తుండడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో సభ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. శుక్రవారం నాడు ఇలా ప్రారంభమై అలా వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహజన్ ఇటీవలే మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాంకింగ్ మృతిపై సభ సంతాపం వ్యక్తం చేసింది. అనంతరం ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నట్లు ప్రకటించగానే విపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీనితో సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

టీడీపీ లేని ఎన్డీయే బలం ఇదే..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోతున్న నేపథ్యంలో టీడీపీ వైదొలగిన తరువాత ఎన్డీయే బలాన్ని చూద్దాం. అకాలీదళ్ తన మద్దతు బీజేపీకే ఉంటుందని తెలిపింది. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చేది లేదని ప్రకటించింది. బీజేపీకి సొంతంగా లోక్‌సభలో 274 మంది సభ్యులు ఉన్నారు. ఎస్ఎస్ 18, ఎల్జేపీ 6, ఎస్ఏడీ 4, ఇంకా ఇతరులు 11 మంది మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు.

ఇది టీడీపీ స్వయంకృతాపరాధం : బీజేపీ

ఢిల్లీ : టీడీపీ, బీజేపీ పూర్తిగా తెగిపోయింది. ఎన్డీయే కేబినెట్ నుండి గతకొన్ని రోజు క్రితం బైటకు వచ్చిన టీడీపీ నేడు వారి కూటమి నుండి కూడా బైటపడింది. దీనిపై బీజేపీ ఇది స్పందించింది. టిడిపిది స్వయంకృపారాదమని, తాను కూర్చొన్న కొమ్మను బాబు నరుక్కున్నారని బిజెపి వ్యాఖ్యానించింది. 20 రాష్ట్రాల్లో మిత్రపక్షాల ప్రభుత్వాలున్నాయని, అందులో 15 రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాలున్నాయని బిజెపి నేత ఢిల్లీలో మీడియతో తెలిపారు. టిడిపి తీసుకున్న స్వతహాగా తీసుకున్న నిర్ణయమని, కేంద్ర మంత్రుల రాజీనామా విషయంలో కూడా వారే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

11:09 - March 16, 2018

గుంటూరు : ఏపీ ప్రభుత్వానికి జనసేనానీ మరోసారి డెడ్ లైన్ విధించారు. అతిసారతో మృతి చెందిన ఘటనలో కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. జీజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్న ఆయన అతిసార వ్యాధితో బాధ పడుతున్న వారిని పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరు...అతిసార వ్యాధి ప్రబలడంపై ఆయన వారితో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ టిడిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కనీసం నీళ్ల సౌకర్యం కల్పించకపోవడం పాలకుల పాలన తీరుకు నిదర్శనమని విమర్శించారు. వెంటనే 48గంటల్లోగా అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుంటూరు జిల్లాకు శాంతియుత బంద్ కు పిలుపునిస్తానని..ఘటన జరిగిన ప్రదేశంలో తాను కూర్చొంటానని పవన్ హెచ్చరించారు. అనంతరం అతిసార వ్యాధితో మృత్యువాత పడిన ప్రదేశాన్ని సందర్శించిన పవన్ అక్కడి వారితో మాట్లాడారు. ఇటీవలే గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధితో పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ డెడ్ లైన్ పై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించిన దీదీ..

ఢిల్లీ : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. విభజన నేపథ్యంలో అడ్డగోలుగా వ్యవహరించిన యూపీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఘోరంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో ఆనాటి బీజేపీ యూపీఏకి మద్ధతునిచ్చింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ విభజన క్రమంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనే ఆశతో ఏపీ బీజేపీకి 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది.

11:04 - March 16, 2018

ఢిల్లీ : టిడిపి - బిజెపి సంబంధం తెగిపోయింది. ఎన్డీయే కూటమి నుండి బయటకు వస్తున్నట్లు టిడిపి పేర్కొంటోంది. దీనిపై బిజెపి స్పందించింది. టిడిపిది స్వయంకృపారాదమని, తాను కూర్చొన్న కొమ్మను బాబు నరుక్కున్నారని బిజెపి వ్యాఖ్యానించింది. 20 రాష్ట్రాల్లో మిత్రపక్షాల ప్రభుత్వాలున్నాయని, అందులో 15 రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాలున్నాయని బిజెపి నేత ఢిల్లీలో మీడియతో తెలిపారు. టిడిపి తీసుకున్న స్వతహాగా తీసుకున్న నిర్ణయమని, కేంద్ర మంత్రుల రాజీనామా విషయంలో కూడా వారే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఏపీలో బలం పెంచుకొనే విధంగా మంచి అవకాశం వచ్చిందని, ప్రజలు దీనిని తిరస్కరిస్తారని తెలిపారు. 

బీజేపీకి బుద్ధి చెప్పే కార్యక్రమం చేపట్టాం : ఎంపీ తోట

ఢిల్లీ : బీజేపీకి బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టిందని టీడీపీ ఎంపీ తోట నర్శింహం తెలిపారు. కేంద్రంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చామని టీడీపీ ఎంపీ తోట నర్శింహం తెలిపారు. మా నాయకుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీలు, వామపక్ష పార్టీల మద్ధతును కూడగడతామని ఆయన పేర్కొన్నారు. అన్యాయానికి గురైన రాష్ట్రానికి న్యాయం చేయకపోగా వ్యంగ్య ధోరణిని అవలంభిస్తోందన్నారు. 

డ్రస్ కోడ్ పై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తు వార్తల్లో నిలిచే మంత్రి ఆల్ఫోన్స్ మరోసారి తన నోటికి పని కల్పించారు. భాతర్ కు వచ్చే టూరిస్టుల డ్రస్ కోడ్ పై కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలు చేసారు. భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులకు ఆహార విషయంలో సూచనలు చేసిన ఆల్ఫోన్స్‌ తాజాగా వారి దుస్తులపై వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వచ్చే టూరిస్టులు ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలన్నారు. ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను ఇతర దేశీయులు గౌరవించాలని చెప్పారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నిర్ణయంపై బావమరిది స్పందన..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత నందమూరి హరికృష్ణ స్పందించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతు..కేంద్రంపై టీడీపీ అవిశ్వాస నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడడంలో రాజీపడే ప్రసక్తే లేదని హరికృష్ణ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు.

10:35 - March 16, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్న వైసీకి మద్దతు పలికిన టిడిపి తెల్లారేసరికి మాట మార్చేసింది. ఆ ఐదుగురితో ఎందుకు వెళ్లాలని..ఆర్థిక నేరస్థుడి పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయని టిడిపి భావించింది. దీనితో టిడిపిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం టిడిపి ఎంపీలు, మంత్రులు..పొలిట్ బ్యూరో..కీలక నేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పలు సంచలన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్డీయే నుండి బయటకు రావాలని మెజార్టీ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైసీపీకి మద్దతివ్వడం కంటే సొంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఎంపీలు లోక్ సభ సెక్రటరీకి లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషణ అందించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అతిసార బాధితులతో జనసేనాని..

గుంటూరు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతిసార బాధితులను పరామర్శించారు. జీజీహెచ్ లో వున్న అతిసార బాధితులతో మాట్లాడారు. వారి కష్టసుఖాల గురించి పపన్ అన్ని వివరాలను తెలుసుకుంటున్నారు. 

10:25 - March 16, 2018

న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో తాము ఎన్డీయే నుండి బయటకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టిడిపి ఎంపీలు ప్రకటించారు. కాసేపటి క్రితం టిడిపి ఎంపీలు, పొలిట్ బ్యూరో సభ్యులు..కీలక నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవాలని మెజార్టీ అభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భంగా టిడిపి ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యంగ్యంగా ప్రకటనలు చేస్తున్నారని, కొంతమందిని ప్రేరేపించి వ్యక్తులతో ప్రచారం చేయిస్తున్నారని ఎంపీ తోట నరసింహం పేర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని అభివర్ణించారు. ఎన్డీయే నుండి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నట్లు ఇందుకు జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సరియైన విధంగా గుణపాఠం చెప్పే విధంగా టిడిపి పార్టీ తగిన వ్యూహాలు రచిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని, తామే సొంతంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు. 

ఇంఫాల్ లో మోడీ...

మణిపూర్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ కు చేరుకున్నారు. ఇంఫాల్ యూనివర్సిటీలోని 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. 

09:58 - March 16, 2018

ఢిల్లీ : కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై రెండు పార్టీలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నాయి. ఇందులో నాలుగేళ్ల నుండి బంధం కొనసాగిస్తూ తాజాగా గుడ్ బై చెప్పిన టిడిపి కాగా..మరొకటి వైసిపి. దీనితో పార్లమెంట్ లో ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక హోదా..విభజన హామీలపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతున్న సంగతి తెలిసిందే. దీనికి మద్దతిస్తామని కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని టిడిపి పేర్కొంటోంది. మరోవైపు తీర్మానానికి మద్దతు కూడగట్టే విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ తప్పుబడుతోంది.

మరోవైపు బిజెపికి గుడ్ బై చెప్పాలని టిడిపి తాజాగా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. సాయంత్రం జరిగే టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. తాము ఎందుకు ఎన్డీయే నుండి బయటకు వెళుతున్నామో..గత నాలుగేళ్లుగా ఏం జరిగింది ? తదితర విషయాలో కూడిన లేఖను టిడిపి జాతీయ పార్టీలకు ఇవ్వనున్నట్లు సమాచారం. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

టీఆర్ఎస్..కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ...

సూర్యాపేట : చింతలపాలెం (మం) కిష్టాపురంలో టిఆర్ఎస్...కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్ల దాడి చేసుకున్నారు. మూడు గడ్డివాములు దగ్ధం కాగా పలువురికి గాయాలయ్యాయి. 

అవిశ్వాస తీర్మానం పెట్టాలని టిడిపి నిర్ణయం...

విజయవాడ : ఎన్డీయేపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టిడిపి నిర్ణయించింది. స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసును పంపింది. 

సింగరేణి కార్మికులపై తేనేటీగల దాడి...

మంచిర్యాల : బెల్లంపల్లి శాంతిఖని బొగ్గుగనిలో సింగరేణి కార్మికులు తేనేటీగలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 30మందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 

09:23 - March 16, 2018
09:14 - March 16, 2018

విజయవాడ : నాలుగేళ్ల బంధం విడిపోనుంది...టిడిపి - బిజెపి అనుబంధం తెగిపోనుంది..బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని తాజాగా టిడిపి నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. విభజన హామీలు..ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై టిడిపి గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రంతో పోరాడి హక్కులు సాధించుకుంటామని చెబుతున్న టిడిపి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో రాజీనామా చేసిన టిడిపి ఎన్డీయేలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే జనసేన అధినేత పవన్ ఏపీ ప్రభుత్వం..సీఎం చంద్రబాబు..నారా లోకేష్ లపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుండడంతో అధికారపక్షంపై విమర్శలు అధికమయ్యాయి. చివరకు వైసీపీకి మద్దతివ్వాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. కానీ తామే సొంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు..ఎంపీలు..ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఎన్డీయేలో నుండి బయటకు రావాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సాయంత్రం జరిగే టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు అధికారికంగా నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. టిడిపి తీసుకొనే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. 

ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ భేటీ...

ఢిల్లీ : ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ భేటీ నేడు జరుగనుంది. శని, ఆదివారాల్లో జరిగే ప్లీనరీ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నారు. 

ఎన్డీయేకి టిడిపి గుడ్ బై ?

విజయవాడ : ఎన్డీయే నుండి టిడిపి బయటకు రానుందా ? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నిజమనే సంకేతాలు తెలియచేస్తున్నాయి. శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో నేతలతో సీఎం బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీయే నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

వైసీపీకి కాంగ్రెస్ మద్దతిస్తుందా ?

ఢిల్లీ : కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై మద్దతు ఇవ్వాలని వైసీపీ అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ చర్యలు కేవలం మొక్కుబడిగా కనిపిస్తున్నాయని, హోదాకు మొదటి నుండి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్ లాబీల్లో మద్దతు కోరడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్..సోనియాను ఎందుకు కలవలేదని వైసీపీ ఎంపీలను ప్రశ్నించినట్లు సమాచారం. కాంగ్రెస్ అనుకూల విపక్షాలను సమన్వయం చేసుకుంటే ఫలితం ఉండేదని, ప్రతిపక్షాలన్నీ ఏకమైతే అవిశ్వాసానికి ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు.

08:23 - March 16, 2018
08:21 - March 16, 2018

ఢిల్లీ : కేంద్రంపై వైసీపీ ప్రవేశ పెడుతున్న తీర్మానం నిలబడుతుందా ? తీర్మానాన్ని ఆమోదిస్తారా ? తీర్మానం ఒకవేళ పాస్ అయితే స్పీకర్ ఎప్పుడు చర్చకు అనుమతినిస్తారు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. కేంద్రంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. వైసీపీకి ఉన్న సంఖ్యా బలం కేవలం ఐదు. కానీ తీర్మానానికి అవసరమైన బలం 50 కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పలువురి మద్దతు కోరుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు జాతీయ నేతలను కలిసి మద్దతు కోరారు. టిడిపి కూడా వైసీపీకి మద్దతు పలికింది. సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వైసీపికి మద్దతు ప్రకటించాయి. తీర్మానానికి మద్దతినిచ్చే సంఖ్య 34 మందికిపైగా ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ కీలకం కానుంది. ఒకవేళ లోక్ సభ ప్రారంభమైన సమయంలో విపక్షాలు ఆందోళన చేపడితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం సమయంలో ఎంత మంది నిలబడుతారో ? లేదో చూడాలి.

విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ...కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై వైసీపీ ఆగ్రహంగా ఉంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబోతోంది. ఈ మేరకు బుధవారం లోక్ సభ సెక్రటరీకి లేఖ అందించారు. ఇందుకు సంబంధించి వైసీపీ విప్ జారీ చేసింది. చీప్ విప్ వైవీ సుబ్బారెడ్డి విప్ జారీ చేశారు. అవిశ్వాస సమయంలో లేచి నిలబడి మద్దతివ్వాలంటూ విప్ లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అవిశ్వాస తీర్మానంపై మద్దతు ఇవ్వాలని వైసీపీ అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ చర్యలు కేవలం మొక్కుబడిగా కనిపిస్తున్నాయని, హోదాకు మొదటి నుండి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్ లాబీల్లో మద్దతు కోరడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్..సోనియాను ఎందుకు కలవలేదని వైసీపీ ఎంపీలను ప్రశ్నించినట్లు సమాచారం. కాంగ్రెస్ అనుకూల విపక్షాలను సమన్వయం చేసుకుంటే ఫలితం ఉండేదని, ప్రతిపక్షాలన్నీ ఏకమైతే అవిశ్వాసానికి ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు. విపక్షాలతో చర్చించి అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

08:20 - March 16, 2018

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ఇవ్వనుంది. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీకి లేఖ పంపించారు. తీర్మానానికి మద్దతివ్వాలని జాతీయ పార్టీలను వైసీపీ అధ్యక్షుడు జగన్ కోరారు. టిడిపి కూడా తీర్మానానికి మద్దతినిచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మద్దతిస్తున్నట్లు, కేంద్రంతో లాలూచీ పడుతోందని టిడిపి ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో లక్ష్మీ పార్వతి (వైసీపీ), విష్ణుశ్రీ (బీజేపీ), చందూ సాంబశివరావు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

08:18 - March 16, 2018

వ్యవసాయరంగానికి, సాగునీటి రంగానికి పెద్ద పీట వేస్తున్నాం... పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఎనిమిది వేలు ప్రతి రైతుకూ ఇస్తున్నాం.. ఇవి బడ్జెట్‌ ప్రవేశపెడుతూ తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ చెప్పిన మాటలు.. మరి ఈ బడ్జెట్‌ కేటాయింపుల వల్ల తెలంగాణ రైతు కష్టాలు తీరనున్నాయా...? వ్యవసాయానికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందా..? ప్రస్తుతం ఆందోళనలో ఉన్న రైతుకు మేలు జరగాలంటే ప్రభుత్వ విధానాల్లో రావాల్సిన మార్పులేంటి... ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ రైతు సంఘం రాష్ర్ట కార్యదర్శి సాగర్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

వైసీపీ ఎంపీలకు విప్ జారీ...

ఢిల్లీ : వైసీపీ ఎంపీలకు విప్ జారీ అయ్యింది. ఈ మేరకు చీప్ విప్ వైవీ సుబ్బారెడ్డి విప్ జారీ చేశారు. అవిశ్వాస సమయంలో లేచి నిలబడి మద్దతివ్వాలంటూ విప్ లో పేర్కొన్నారు. 

కాసేపట్లో వైసీపీ అవిశ్వాస తీర్మానం...

ఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం నేడు లోక్ సభలో కేంద్రంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనుంది. అవిశ్వాస తీర్మానానికి వైసీపీ నోటీసులు జారీ చేసింది. 

07:38 - March 16, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో తవ్వే కొద్దీ స్కాంలు బయటికి వస్తున్నాయి. ముంబై పిఎన్‌బి బ్రాంచీలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. 9.9 కోట్ల మోసం జరిగినట్టు గుర్తించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారుల సహకారంతో చంద్రీ పేపర్‌ అండ్‌ అలైడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమెటెడ్ కంపెనీ స్కాంకు పాల్పడినట్టు సమాచారం. ఈ స్కాంపై పీఎన్‌బీ అధికారులు కానీ, చంద్రీ పేపర్‌ కంపెనీ ఇంతవరకు స్పందించలేదు. నీరవ్‌ మోదీ ఆయన మేనమామ మెహుల్‌ చోక్సీ పీఎన్‌బీ ముంబై బ్రాంచ్‌లో 12,700 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ స్కాం బయటికి రాకముందే విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సిలను భారత్‌కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు కృషి చేస్తున్నాయి. మోదీ, చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీచేయాలని ఈడీ ఇంటర్‌పోల్‌ను కోరుతోంది.

07:34 - March 16, 2018

చెన్నై : తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. శశికళ మేనల్లుడు, ఆర్కే నగర్‌ ఎమ్మెల్యే టిటివి దినకరన్ కొత్త పార్టీ పెట్టారు. మధులై జిల్లా మేలూరులో 'అమ్మ మక్కల్‌ మున్నెట కళగం'గా పార్టీ పేరును ప్రకటించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న పార్టీ జెండాపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను ముద్రించారు. పన్నీరు సెల్వం, పళని స్వామీలు అన్నాడీఎంకేను మోసం చేశారని దినకరన్‌ ఆరోపించారు. తమిళనాడులో జాతీయ పార్టీలున్నప్పటికీ ద్రవిడ సెంట్‌మెంట్‌తో పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలదే హవా. ఇప్పటికే కమల్‌ హసన్‌ పార్టీ స్థాపించగా...త్వరలో రజనీకాంత్‌ కూడా కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.

07:27 - March 16, 2018

ఢిల్లీ : పాకిస్థాన్ హై కమిషనర్‌ సోహెల్‌ మహమూద్‌ను వెనక్కి రప్పించాలని పాక్‌ నిర్ణయించింది. ఢిల్లీలోని పాకిస్తాన్‌ దౌత్య కార్యాలయ సిబ్బంది, వారి కుటుంబాలు వేధింపులకు గురవుతున్నాయని పాక్ ఆరోపించింది. తమ సిబ్బందిపై వేధింపులు ఎక్కువవుతున్నా... భారత్ పట్టించుకోవడం లేదని పాకిస్తాన్‌ చెబుతోంది. ఇటీవల కొందరు వ్యక్తుల సమూహం ఢిల్లీలో పాకిస్తాన్‌ హైకమిషనర్‌ కారును ఛేజింగ్‌ చేయడమే కాకుండా డ్రైవర్‌ను తిట్టడాన్ని ఉదహరించింది. ఇలాంటి ఘటనలు మరి కొన్నింటిని పాకిస్తాన్‌ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దీంతో వేధింపుల అంశాలను చర్చించేందుకు తమ కమీషనర్‌ను ఇస్లామాబాద్‌కు పిలిపించినట్లు పాక్ పేర్కొంది. పాక్‌ దౌత్య సిబ్బందికి భద్రత కల్పించినట్లు భారత విదేశాంగ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లో భారతీయ దౌత్యసిబ్బందిని వేధించడం సాధారణమేనని భారత్‌ తెలిపింది. పాక్ వేధింపులు తట్టుకోలేక భారత కుటుంబాలు స్వదేశానికి తిరిగి వచ్చాయి.

07:25 - March 16, 2018

ఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ మీడియా వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఓవైపు మీడియా స్వాతంత్ర్యానికి గౌరవమిస్తూనే మరోవైపు బాధ్యతలను కూడా గుర్తు చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా తమను తాము పోప్‌గా భావించకూడదని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా, వెబ్‌సైట్‌లో రాసేవాళ్లు తాము ఏదైనా రాయొచ్చని హద్దు లేకుండా ప్రవర్తిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. జర్నలిస్ట్‌ రోహిణి సింగ్‌ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ హెచ్చరిక చేసింది. 'ద వైర్‌' వెబ్‌సైట్‌ జర్నలిస్టు రోహిణి సింగ్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కేసు విచారణపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 12కి వాయిదా వేసింది. అక్రమ ఆస్తులపై రాసినందుకు 'ద వైర్‌' జర్నలిస్టు రోహిణి సింగ్‌పై అమిత్‌ షా కుమారుడు జై షా పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

07:12 - March 16, 2018

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బిజెపి పాలన పట్ల ప్రజల వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి సిపిఎం మద్దతివ్వడంపై అఖిలేష్‌ కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. మతతత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా లౌకిక శక్తుల్లో అవగాహన పెరుగుతోందన్నారు. మోది ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని ఏచూరి చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందనడానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.

 

07:07 - March 16, 2018

విజయవాడ : ఉగాది పర్వదినం పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిలో వసంత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించనుండటంతో... దుర్గమ్మ సన్నిధిలో ఉగాది శోభ సంతరించుకుంది.

ఉగాది ఉత్సవాలకు విజయవాడ శ్రీ కనకదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబవుతోంది... వసంత నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టారు.. మార్చి 18 నుంచి 26 వరకు 9 రోజులపాటు అమ్మవారి ఆలయంలో విలంబి నామ సంవత్సర చైత్రమాస ఉగాది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామికి 24వ తేదీన లక్ష తమలపాకులతో పూజ నిర్వహించనున్నారు. 25న శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తారు. 26న శ్రీరామ పట్టాభిషేకం, వసంత నవరాత్రి ముగింపు, పూర్ణాహుతి, వసంతోత్సవం జరుగుతాయి.

మార్చి 18న ఉగాది పర్వదినం సందర్భంగా.. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి సుప్రభాతం తర్వాత స్నపనాభిషేకం, ప్రభాత అర్చన నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 9 గంటలకు నవరాత్రి కలశ స్థాపన, ప్రత్యేక పుష్పార్చనలు, అగ్నిప్రతిష్టాపన, మూలమంత్ర హవనం జరుగుతుంది. ఉదయం 10గంటల 30నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పంచాంగ శ్రవణం జరుగుతుంది. స్నపనాభిషేకం నిర్వహించనుండటంతో... వేకువజామున జరిగే ఖడ్గమాలార్చన, త్రికాలార్చన, స్వర్ణ పుష్పార్చనలను రద్దు చేశారు.

ఉగాది పండుగ సందర్బంగా.. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని వెండి రథంపై నగర వీధుల్లో ఊరేగిస్తారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు... శ్రీనివాస మహల్, మొయిన్ రోడ్డు మీదుగా పోలీస్ స్టేషన్, కాళేశ్వరరావు మార్కెట్, వినాయక గుడి, రథం సెంటర్ మీదుగా కొండపైకి చేరుకుంటుంది. వెండి రథంతో పాటు అమ్మవారి ప్రచార రథాన్ని విద్యుత్ దీపకాంతులతో పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు... 9 రోజులపాటు దుర్గగుడిలో నిర్వహించే ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. ఉగాది ఉత్సవాలకు అమ్మవారి ఆలయాన్ని ముస్తాబుచేస్తున్న అధికారులు... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది పండుగను కన్నులపండుగా నిర్వహించే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

07:01 - March 16, 2018

హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్ష ముగిసింది. 48 గంటల దీక్ష అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ కుమార్‌లకు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డిలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే తన కుటుంబ సభ్యులను ఎవరినైనా నల్గొండ నుంచి పోటీ చేయించి గెలవాలని కోమటి రెడ్డి సవాల్‌ విసిరారు. ఎమ్యెల్యేగా చివరిసారి మాట్లాడుతున్నానంటూ.. సంపత్ కుమార్ ఉద్వేగానికి లోనయ్యారు. అలంపూర్ ప్రజలు ఎప్పటికి తన గుండెల్లో ఉండిపోతారని అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగనందునే తన పై కక్ష కట్టారని సంపత్‌ కుమార్‌ ఆరోపించారు.

తమ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ, 48 గంటల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు కూర్చున్న కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లు దీక్షను విరమించారు. గురువారం నాడు టీ పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, గీతారెడ్డిలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఉత్తమ్‌, జానారెడ్డితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు రోజుల పాటు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు బుధవారం ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలుపగా.. చివరి రోజు జేఏసీ ఛైర్మన్‌ కోదండ రామ్‌ గాంధీ భవన్‌కు వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు మద్దతు ప్రకటించారు. ఎథిక్స్ కమిటీ సిఫారసు లేకుండా ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని తప్పుబట్టిన కోదండరామ్‌ వారి సభ్యత్వ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ... సీఎం కేసీఆర్‌ పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. కేసీఆర్‌ తెలంగాణకు పట్టిన శని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పై పోరాటం చేస్తామనే కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీని ఫాం హౌస్‌లోనో, ప్రగతి భవన్‌లో గానీ నిర్వహించుకుంటే బాగుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను బహిష్కరించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించారన్నారు. సహజ సూత్రాలకు వ్యతిరేకంగా స్పీకర్‌ కాంగ్రెస్‌ సభ్యులపై నిర్ణయం తీసుకున్నారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. స్వామిగౌడ్‌కు హెడ్‌ సెట్‌ తగిలిందనడం పచ్చి అబద్ధం అని, ఆధారాలుంటే చూపాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్‌ చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ పై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. కేసీఆర్‌కు దమ్ముంటే నల్గొండ నుంచి పోటీ చేసి గెలవాలని.. లేదంటే తన కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా పోటీచేసి గెలవాలని సవాల్‌ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాల్లో ఉండనని.. గాంధీ భవన్‌ మెట్లు కూడా ఎక్కనని శపథం చేశారు. నల్లగొండతో పెట్టుకుంటే మాడిపోతావ్‌ అంటూ కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు. దీక్షలో కూర్చున్న మరో నేత సంపత్‌ కుమార్‌.. ఎమ్మెల్యేగా చివరిసారిగా మట్లాడుతున్న.. బాధగా ఉందంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పార్టీ మారనందుకే తనపై కక్ష కట్టి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని సంపత్‌ కుమార్‌ ఆరోపించారు.

ఓ వైపు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌, ఇంకో వైపు స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్‌ సభ్యులు వేసిన వాజ్యం శుక్రవారం కోర్టు బెంచ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం చీఫ్ ఎలక్షన్‌ కమిషన్‌ను కలిసి శాసన సభ్యత్వ రద్దు పై ఫిర్యాదు చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓట్లు తగ్గించేందుకే కుట్రపూరితంగా ఇద్దరు సభ్యుల శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు.

06:57 - March 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు మొండి చేయి చూపించింది. విశ్వనగరంగా చేస్తామని చెబుతోన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించడంలో విఫలమైంది. వేల కోట్లల్లో ప్రతిపాదనలు పంపినా ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగకపోవడంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మారుస్తాం...అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. కాని దాన్ని ఆచరణలో మాత్రం పెట్టడంలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాజధానికి పెద్దగా వాటా ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా HMDA, వాటర్‌బోర్డు, మెట్రో రైల్‌, మూసీ, రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు ఈ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

కొన్ని విభాగాలకు నిధులు పెద్ద మొత్తంలోనే కేటాయించినా కొన్ని సంస్థలకు మాత్రం మొండి చేయి చూపించింది బడ్జెట్‌. ఇందులో జీహెచ్‌ఎమ్సీకి బడ్జెట్‌ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయి. చట్టం ప్రకారం రావాల్సిన కొన్ని నిధుల్లో భారీ కోత విధించింది ప్రభుత్వం. నాలాల వైడనింగ్‌, సమగ్ర రోడ్ల అభివృద్ధి పథకం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన బల్దియాకు బడ్జెట్‌ నిరాశపరిచింది. అలాగే ఆస్తిపన్ను, మోటర్‌ వెహికిల్‌ టాక్స్‌, వృత్తిపన్ను, వేతనాల కోసం వందకోట్లకు మించి కేటాయింపులు చేయలేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

ఇక కొన్ని సంస్థలకు గ్రాంట్లు ఇవ్వకుండా కేవలం రుణాల రూపంలో నిధులు సమకూర్చింది ప్రభుత్వం. హైదరాబాద్‌ వాటర్‌ బోర్డుకు 1,420కోట్ల రూపాయ‌లు రుణం అందించ‌డానికి బ‌డ్జెట్ కేటాయింపులు చేశారు. అలాగే హెచ్‌ఎమ్‌డీఏకు 485 కోట్లు, మెట్రో రైల్‌కు 200 కోట్లు, మూసీ నది అభివృద్ధికి 377 కోట్లు కేటాయించారు. గ్రేటర్‌లో రోడ్డు కార్పొరేషన్‌కు గతేడాది 566 కోట్లు కేటాయించింది బడ్జెట్. ఇందులో 377 కోట్లు ఇప్పటికీ ఖర్చు కాలేదు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలోనూ తమ వాటా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భారాన్ని భరించడంతో బడ్జెట్‌ కేటాయింపులు ఎక్కువగా లేవన్నారు జీహెచ్‌ఎమ్ సీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా చివరి బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు చేయలేదు. అరకొర నిధులతో హైదరాబాద్‌ను ఎప్పుడు అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తారని సిటిజన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

06:53 - March 16, 2018

విజయవాడ : గుంటూరు జనసేన సభలో పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పవన్‌ మాట్లాడారని నేతలు విమర్శించారు. బీజేపీ అండతోనే పవన్‌ టీడీపీపై విరుచుకుపడ్డారని దేశం నేతలు ఆరోపించారు. ఎవ్వరు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. లొకేష్‌పై చేసిన తప్పుడు ఆరోపణలకు పవన్‌ క్షమాపణలు చెప్పాలన్నారు టీడీపీ నేతలు.

 

06:52 - March 16, 2018

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ, జనససేన పార్టీలపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వంతో లాలూచీ పడి వైసీపీ అధినేత పార్లమెంటులో అవిశ్వాసం అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. జగన్‌ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీకి వంతపాడుతున్నారని బాబు ఆరోపించారు. అటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పైఔ కూడా చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. తాము రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాటం చేస్తుంటే.. పవన్‌ మాత్రం మోసం చేసిన ప్రధాని మోదీని పల్లెత్తుమాటకూడా అనడం లేదని బాబు అన్నారు. 

టిడిపి పొలిట్ బ్యూరో భేటీ...

విజయవాడ : టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం నేడు జరుగనుంది. సాయంత్రం 5గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. 

గుంటూరులో పవన్ పర్యటన...

గుంటూరు : నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అతిసారతో మృత్యువాత పడిన వారి కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. ఆసుపత్రిలో బాధితులను కూడా ఆయన పరామర్శించనున్నారు. 

ధర్నా చౌక్ కు పవన్...

విజయవాడ : నేడు ధర్నా చౌక్ లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సామూహిక నిరహార దీక్షలు జరుగనున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. 

వైసీపీ అవిశ్వాస తీర్మానం...

ఢిల్లీ : ప్రత్యేక హోదా హామీని నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అవిశ్వాస తీర్మానం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన నోటీసును లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు అందించింది. మరోవైపు.. వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు నివ్వాలని భావిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. రెండు ప్రధాన రాజకీయ పక్షాలూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనమే తమకు ముఖ్యమని స్పష్టం చేశాయి. 

కోమటిరెడ్డి..సంపత్ ల పిటిషన్ పై విచారణ...

హైదరాబాద్ : స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని టి.కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్.. విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ రేపు హైకోర్టు ముందు విచారణకు రానుంది. తమ శాసనసభ్యుల సభ్యత్వం రద్దుపై టీకాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. 

ఈసీని కలిసిన శశిధర్..వీహెచ్...

హైదరాబాద్ : హైకోర్టు నిర్ణయం వచ్చే వరకు.. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై వేచి చూడాలని.. టీకాంగ్రెస్ కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, వీ హనుమంతరావు.. ఈసీ అధికారులను కలిశారు. 

విజయం సాధించడం పట్ల అఖిలేష్ సంతృప్తి...

ఉత్తర్ ప్రదేశ్ : దళితులు, బిసిలు, మైనారిటీ వర్గాల అండతోనే ఉప ఎన్నికల్లో విజయం సాధించామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. తమకు సహకరించిన అన్నీ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర్‌ నుంచి ఎంపికైన యువ ఎంపీలను మీడియా సమావేశంలో ఆయన అభినందించారు.

బీజేపీ పాలన పట్ల ప్రజల వ్యతిరేకత - ఏచూరి...

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బిజెపి పాలన పట్ల ప్రజల వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి సిపిఎం మద్దతివ్వడంపై అఖిలేష్‌ కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. 

ఎలక్ట్రానిక్ మీడియా తీరుపై సుప్రీం వ్యాఖ్యలు...

ఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ మీడియా వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఓవైపు మీడియా స్వాతంత్ర్యానికి గౌరవమిస్తూనే మరోవైపు బాధ్యతలను కూడా గుర్తు చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా తమను తాము పోప్‌గా భావించకూడదని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా, వెబ్‌సైట్‌లో రాసేవాళ్లు తాము ఏదైనా రాయొచ్చని హద్దు లేకుండా ప్రవర్తిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.

 

ప్రశ్నాపత్రం లీక్ ను ఖండించిన సీబీఎస్ఈ...

ఢిల్లీ : సీబీఎస్‌ఈ అకౌంటన్సీ ప్రశ్నాపత్రం లీకైన వార్తలను సీబీఎస్‌ఈ ఖండించింది. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ ప్రశ్నాపత్రాల సీల్డ్‌ కవర్లు ఎలాగున్నాయో అలాగే ఉన్నాయని స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈనీ బద్నాం చేయడానికి కొన్ని అరాచక శక్తులు కావాలనే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం లీకైందని వదంతులు వ్యాపింపజేశాయని ఆరోపించింది.

 

పాక్ హై కమిషనర్ వెనక్కి..పాక్ నిర్ణయం ?

ఢిల్లీ : పాకిస్థాన్ హై కమిషనర్‌ సోహెల్‌ మహమూద్‌ను వెనక్కి రప్పించాలని పాక్‌ నిర్ణయించింది. ఢిల్లీలోని పాకిస్తాన్‌ దౌత్య కార్యాలయ సిబ్బంది, వారి కుటుంబాలు వేధింపులకు గురవుతున్నాయని పాక్ ఆరోపించింది. తమ సిబ్బందిపై వేధింపులు ఎక్కువవుతున్నా... భారత్ పట్టించుకోవడం లేదని పాకిస్తాన్‌ చెబుతోంది.

తమిళనాడులో దినకరన్ కొత్త పార్టీ...

చెన్నై : తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. శశికళ మేనల్లుడు, ఆర్కే నగర్‌ ఎమ్మెల్యే టిటివి దినకరన్ కొత్త పార్టీ పెట్టారు. మధులై జిల్లా మేలూరులో 'అమ్మ మక్కల్‌ మున్నెట కళగం'గా పార్టీ పేరును ప్రకటించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

పీఎన్ బీ బ్యాంకులో మరో స్కాం...

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో తవ్వే కొద్దీ స్కాంలు బయటికి వస్తున్నాయి. ముంబై పిఎన్‌బి బ్రాంచీలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. 9.9 కోట్ల మోసం జరిగినట్టు గుర్తించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారుల సహకారంతో చంద్రీ పేపర్‌ అండ్‌ అలైడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమెటెడ్ కంపెనీ స్కాంకు పాల్పడినట్టు సమాచారం. 

బీజేపీ నేతపై ఉగ్ర దాడి...

జమ్ము కశ్మీర్‌ : పుల్వామా జిల్లాలో బీజేపీ నేత అన్వర్‌ ఖాన్‌పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మిలిటెంట్ల కాల్పుల్లో అన్వర్‌ ఖాన్‌ వ్యక్తిగత అంగరక్షకుడు బిలాల్‌ అహ్మద్‌కు గాయలయ్యాయి. గాయపడ్డ పర్సనల్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ను ఆసుపత్రిలో చేర్చినట్టు అధికారులు తెలిపారు.

Don't Miss