Activities calendar

17 March 2018

21:52 - March 17, 2018

కడప : తెలుగు రాష్ట్రాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాలంగా కురిసిన వర్షాలకు రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు మండలంలో శుక్రవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది.. పెనుగాలులతో కూడిన వర్షానికి అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో అరటి, మామిడి పంటలు సాగు చేస్తుంటారు.. కాగా రాత్రి కురిసిన వర్షంతో పండ్ల తోటల్లో పూత, పిందెలు రాలిపోవడంతో పాటు... చెట్లు నేలకొరిగాయి.... ముఖ్యంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పు చేసిన తోటలు సాగుచేశామని... ఎలాగైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

గిట్టుబాటు ధరలేక ఆందోళన
అసలే గిట్టుబాటు ధరలేక ఆందోళన చెందుతోన్న రైతులను రాత్రి కురిసిన అకాల వర్షం మరింత నిరాశ పరిచింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో రైతులు గిట్టుబాటు ధరలేక మర్కెట్‌ యార్డు వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. రాత్రి కురిసిన వర్షంతో అది కాస్తా తడిచి పోయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని వదిలేసేందుకు సిద్ధమయ్యారు. తమను ఆదుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భారీ వర్షం
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భారీ వర్షంతో తడిసి ముద్దయ్యింది.. తెల్లవారు జామునుంచి కురుస్తున్న వర్షంతో.... అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో దారులన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి అస్తవ్యస్తంగా మారాయి. కుండపోత వర్షంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఏకధాటిగా వర్షం కురవడంతో.. ప్రజలు ఇళ్ళలోనుంచి బయటికి రాలేని పరిస్థితినెలకొంది..

21:46 - March 17, 2018

గుంటూరు : అతిసార వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు. వ్యాధి ప్రభలిన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. డయేరియాతో ఇప్పటికే 25 మంది వరకు చనిపోతే.. పది మంది మాత్రమే మృతిచెందరాని ప్రభుత్వం దొంగలెక్కలు చెబుతోందని మధు ఆరోపించారు. నీటి కలుషితంపై సమగ్ర దర్యాప్తు జరిపి, మృతుల కుటుంబాలకు 15లక్షల పరిహారం చెల్లించాలని మధు డిమాండ్‌ చేశారు.  

21:42 - March 17, 2018

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అరచేతిలో వైకుంఠం చూపించేలా ఉందని టీ మాస్‌ ఫోరం నేతలు విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్ సమావేశంలో మేధావులు, ప్రొఫెసర్లు, రైతు సంఘం నేతలు, ప్రజా సంఘల నేతలు పాల్గొన్నారు. ఈ బడ్జెట్‌లో దళితులు, గిరిజనులు, బీసీ, ఎంబీసీ, మైనార్టీలకు అన్యాయం చేశారన్నారు. బడుగుల సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా అమలు చేయకుంటే... బడుగుల పక్షాన పోరాడుతామని టీమాస్‌ రాష్ర్ట నాయకులు జాన్ వెస్లీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నేత సాగర్, నవతెలంగాణ సంపాదకులు వీరయ్యతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

21:39 - March 17, 2018

హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌... ఆ దిశగా వేగం పెంచారు. అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానన్న కేసీఆర్‌... థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటుకు తొలి అడుగేశారు.. కేసీఆర్‌కు ఫోన్‌ చేసి అభినందించిన పశ్చిమ్‌బంగ సీఎం మమతా బెనర్జీ.. తామూ మీ వెంటే నడుస్తాని చెప్పినట్లు కేసీఆర్‌ తెలిపారు. ఈనెల 19న కేసీఆర్‌ కోల్‌కతా వెళ్లి మమతతో చర్చలు జరపనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ కోల్‌కతా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

21:36 - March 17, 2018

అమరావతి : పార్లమెంటులో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి పలు పార్టీల నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు అమరావతిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నేతలు.. కేంద్రంపై అవిశ్వాసం పెడతామన్నా.. ఇతర పార్టీలు నమ్మడం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాగా తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ కు పట్టుబట్టాలని , డివిజన్ అడగాలని పార్టీ ఎంపీలకు బాబు దిశానిర్ధేశం చేశారు. ఆరుగురు సభ్యుల ఎంపీల బృందం ఈ రెండురోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని ఆయన ఆదేశించారు. అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి, అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలన్నారు. మోదీ ప్రభుత్వంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామన్న చంద్రబాబు.. జగన్, పవన్ .. కేంద్రాన్ని ప్రశ్నించకుండా తనను విమర్శించటమేమిటని చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. తమకు కావాల్సింది రాజకీయం కాదని.. రాష్ట్రానికి న్యాయం జరగడమే లక్ష్యమని టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.

21:15 - March 17, 2018

హైదరాబాద్ : 1999లో 13వ లోక్ సభ స్థానానికి మొదటిసారి ఎన్నికై, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖలలో సభ్యునిగా పనిచేశారు. 2009లో 15వ లోక్ సభ స్థానానికి రెండవసారి ఎన్నికై ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని..తెలంగాణ రైతు సమన్వయ సమిత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో వన్ టూ వన్..

21:04 - March 17, 2018

సీఎం క్యాంప్ ఆపీసుకాడ కాపుకాసిన వికలాంగులు.. బంగారు తెలంగాణ తెస్తనన్నకేసీఆర్ పాలనలో మాకేంటీ ఈ తిప్పలు అంటున్న వికలాంగులు.. బీజేపీకి టీడీపీకు హోదా పురిటి నొప్పులట..ప్రజలే సేయలట కాన్పు..కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపేంత వరకూ ఊరుకోనంటున్న కోమటి రెడ్డి. గంతవరకూ ఢిల్లీలోనే మకాం ఏస్తడంట. తెలంగాణ ఆడబిడ్డలు మంచినీటికోసం బిందెలు పట్టుకోని రోడ్ల మీదకు రానివ్వమని ప్రగల్బాలు పలిచిన కేటీఆర్ నియోజకవర్గంలో ఖాళీ బిందెలు నిరసన చేస్తున్న మహిళలు..

20:59 - March 17, 2018

నేపథ్య గాయకుడు పవన్ చరణ్ తన గానంతో టాలీవుడ్ లో తనకంటు ఓప్రత్యేకతను సంపాదించుకున్నారు. బసంతి సినిమాలో తనకు వచ్చిన అవకాశంతో తనకు మంచి పేరు తీసుకొచ్చిందని పవన్ చరణ్ తెలిపారు. తన కెరీర్ ప్రారంభం, తనకు ఎదురైన అనుభవాలను టెన్ టీవీతో పంచుకున్నారు.మరి ఆ విశేషాలను చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మరి ఇంకెందుకు పవన్ చరణ్ పాటల పల్లకీలో ఊయలలూగండి..

బాబుకు మేము వేస్తాం ప్రశ్నలు : రామ్ మాధవ్

అమరావతి : మాతో మిత్రత్వంగా వున్న సీఎం చంద్రబాబు ఇప్పటి వరకూ మమ్మల్ని ప్రశ్నించారనీ..ఇకపై మేము వేసిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వాల్సి వుంటుందని ఏపీ బీజేపీ సమన్వయ కర్త రామ్ మాధవ్ పేర్కొన్నారు. ఏపీని అభివృద్ది చేసేందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి వుందని ఏపీ బీజేపీ సమన్వయ కర్త రామ్ మాధవ్ తెలిపారు. ఏపిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కంటే బీజేపీ ముందు వరుసలోవుందన్నారు. ఎన్డీయే నుండి వైదొలగటం వల్లనే టీడీపీ మాకు వ్యతిరేకమయ్యిందనీ..ఏపీకి బీజేపీ చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు రామ్ మాధవ్ తెలిపారు. 

ఏపీ బీజేపీ సమన్వయకర్తగా రామ్ మాధవ్..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ, కేంద్రం ప్రభుత్వం మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రామ్ మాధవ్ కు బాధ్యలు అప్పగించారు. కేంద్రం నుండి కావాల్సిన సమాచారాన్ని రామ్ మాధవ్ ద్వారా పొందాలని అమిత్ షా ఏపీ బీజేపీ నేతలకు ఆదేశించారు. అంశాల వారీగా ప్రజలకు కచ్ఛితమైన సమాచారాన్ని కేంద్రం నుండి తీసుకోవాలని సూచించారు. 

పీఠాధిపతులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..

ఢిల్లీ : ఏపీలోని శ్రీశైలం పీఠాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభమయిన నేపథ్యంలో ప్రధాని పీఠాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఆలయ విశిష్టతపై ప్రధాని కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. శ్రీశైలం బసవేశ్వరుడు నడయాడిన స్థలం అనీ..త్రివేణి సంగమమని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని పవిత్ర స్థలాల్లో శ్రీశైలం కూడా ఒకటిగా విరాజిల్లుతోందన్నారు. 

ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు..

హైదరాబాద్: ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని సీఎం కేసీఆర్ కోరారు. రాజ్‌భవన్‌లో జరిగిన శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ప్రజలందరికీ విళంబినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలు ఉగాదిని ఘనంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు. నరసింహన్ గవర్నర్‌గా వచ్చిన తర్వాత రాజ్‌భవన్‌లో ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు జరుపుతున్నారన్న సీఎం.. పండుగలను ఆచరిస్తున్న గవర్నర్‌కు తెలుగు ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.

రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు..

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో శ్రీవిళంబినామ సంవ‌త్స‌ర‌ ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రారంభించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఒగ్గుడోలు విన్యాసాలు అతిథులను అలరించాయి. దేవనార్ బ్లైండ్‌ స్కూల్ విద్యార్థుల సీతా స్వయంవరం ఆకట్టుకున్నది.

బెంగాల్ వెళ్లనున్న కేసీఆర్..

హైదరాబాద్: ఈనెల 19న సీఎం కేసీఆర్ కోల్‌కతా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశం కానున్నారు. థర్డ్ ఫ్రంట్‌పై మమతతో సీఎం చర్చించనున్నారు. థ‌ర్డ్ ఫ్రంట్‌పై మమత సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకోనున్నారు.

19:51 - March 17, 2018

నల్లగొండ : అభం శుభం తెలియని చిన్నారులు ఆడుకునేందుకు వెళ్లి నీట మునిగి మృతి చెందిన తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి చిన్నారులు మృతి చెందిన ఘటనతో గుడి తండాలో తీవ్ర విషాదం నెలకొంది. ఒంటిపూట స్కూల్స్ కు వెళ్లి వచ్చిన అనంతరం పెద్దవారంతా కూలిపనులకు వెళ్లిన నేపథ్యంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోవటంతో చిన్నారులంతా చెరువుకు ఈత కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొండపల్లేపల్లి మండలం పెండ్లిపాకల గుండి తండాలో ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఐదుగురు చిన్నారులు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందటంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది.

ఒకే ఊరిలో తీవ్ర విషాదం..

నల్లగొండ : చెరువులో ఈతకు వెళ్లి చిన్నారులు మృతి చెందిన ఘటనతో గుడి తండాలో తీవ్ర విషాదం నెలకొంది. కొండపల్లేపల్లి మండలం పెండ్లిపాకల గుండి తండాలో ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఐదుగురు చిన్నారులు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందటంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. 

19:01 - March 17, 2018

కర్నూలు : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరుపై సీఐటీయూ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మండిపడ్డారు. కార్మిక చట్టాలను కాలరాసేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో నిర్వహించిన సీఐటియూ సమావేశంలో గఫూర్‌ పాల్గొని.. ప్రసంగించారు.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కార్మిక లోకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు.. కార్మికుల సంక్షేమంతోపాటు.. కార్మిక సంఘాలను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని గఫూర్‌ పిలుపునిచ్చారు. 

18:59 - March 17, 2018

తూ.గోదావరి : మంత్రి దేవినేని ఉమ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం జైలుకెళ్ళడానికైనా, ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. ఏ1, ఏ2 ముద్దాయిలా అవిశ్వాసం పెట్టేదంటూ నిలదీశారు. 

18:53 - March 17, 2018

గుంటూరు: ఎన్డీయే నుండి టీడీపీ బయటకు రావటంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారని మంత్రులు పుల్లారావు, నక్కా ఆనంద బాబు అన్నారు. ఏపీని ఆదుకుంటామని బీజేపీ నేతల మాటలు నమ్మి వారితో పొత్తు పెట్టుకున్నామన్నారు. అయితే బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి సాయం రాష్ట్రానికి చేయలేదన్నారు. వైసీపీ అవిశ్వాసంపై దేశంలో ఇతర పార్టీలకు నమ్మకం లేదన్నారు. సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ఇతర పార్టీలు తమకు మద్దతు తెలిపాయన్నారు. మోదీ ప్రభుత్వం మిత్ర పక్షాల విశ్వాసం కోల్పోయిందన్నారు. మోడీ డైరెక్షన్‌లో జగన్‌, పవన్‌ ఆడుతున్నారని ఆరోపించారు. 

18:48 - March 17, 2018

కర్నూలు : పరిస్థితులను, సందర్భాలకు అద్దం పట్టేలా విచిత్ర వేషాలు ధరించి నిరసనలు తెలిపే బంగి అనంతయ్య తాజాగా మరో వినూత్న రీతిలో కేంద్రంపై తన నిరసనలు తెలిపారు. పలువురు టీడీపీ పార్టీ కార్యకర్తలతో కలిసి శిరోముండనం చేయించుకుని తన నిరసనను తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుండు గీయించుకొని నిరసన తెలిపారు. విభజన హామీలలోప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనివున్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రతిపక్షనేతలు విమర్శలు చేయడం దారుణమన్నారు బంగి అనంతయ్య.

హామీల అమలుకు కట్టుబడి వున్నాం : హరిబాబు

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇస్తానని హామీలన్నింటికి బీజేపీ కట్టుబడి వుందని ఆ పార్టీ ఎంపీ హరిబాబు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో చిత్తశుద్ధితో వున్నామని ఆయన తెలిపారు. హోదాతో వచ్చే ప్రతీ ప్రయోజనాన్ని ప్యాకేజీ ద్వారా ఇస్తామన్న మాటకు కట్టుబడి వున్నామని ఆయన తెలిపారు. ఈరోజు ఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన ఏపీ నేతలతో జరిగిన భేటీ అనంతరం హరిబాబు ఈ విషయాలను తెలిపారు. 

17:58 - March 17, 2018
17:53 - March 17, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. దీంతో జనం బ్యాంకులు చుట్టు చెప్పుల అరిగెలా తిరుగుతున్నారు. కీలక అవసరాలకు నగదు లభించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగదు కోసం బ్యాంకు సిబ్బందిని నిలదీస్తే... రిజర్వ్‌ బ్యాంక్‌ నుండి నగదు రావట్లేదన్న సమాధానం వస్తోంది. నిజామాబాద్‌లో నగదు కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 10టీవీ కథనం..

నిజామాబాద్‌ జిల్లాలో నగదు కష్టాలు
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ప్రజలకు నగదు కష్టాలు ఎక్కువయ్యాయి. నగదు దొరకక ప్రజలు తెగ ఇబ్బందిపడుతున్నారు. నెల రోజుల నుండి బ్యాంకులలో, ఏటీఎం సెంటర్లలో నగదు ఉండడం లేదు. ఏ ఏటీఎంకు వెళ్లినా నోక్యాష్‌ బోర్డులే కనిపిస్తున్నాయి. రోజుల తరబడి నోక్యాష్‌ బోర్డులు అలానే ఉంటున్నాయి. రేపో మాపో నగదు వస్తుందని ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 366 బ్యాంక్‌లు
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో 3 వందల 66 బ్యాంక్‌ శాఖలు ఉన్నాయి. దాదాపు 392 ఏటీఎంలు ఉన్నాయి. ఈ బ్యాంక్ శాఖలన్నింటికి గత నెల రోజుల నుండి డబ్బులు రావటం లేదు. దీంతో ఖాతాదారులు డిపాజిట్ చేసిన డబ్బులనే లావాదేవీలకు ఉపయోగిస్తున్నారు. ఈ లావాదేవీల్లో కూడా ఖాతాదారులకు 5 నుండి 10 వేలు మాత్రమే ఇస్తుండడంతో నగదు ఇబ్బందులు తప్పడం లేదు.

మూతపడిన 96శాంత ఏటీఎంలు
గత సంవత్సర కాలంగా 96 శాతం ఏటీఎంలు మూతపడి ఉండగా కేవలం నాలుగు శాతం మాత్రమే ఏటీఎంలు తెరిచి ఉంటున్నాయి. ఇందులోనూ అంతంత మాత్రంగానే నగదు ఉంటోంది. ఉదయం నగదు ఉంటే.. సాయంత్రానికి ఖాళీ అవుతోంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు నగదు ఉంటుందో అర్థంకాని పరిస్థితి. రోజువారి లావాదేవీలకు డబ్బులు లేకపోడంతో.. ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరానికి డబ్బులు ఉపయోగపడక పోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే రిజర్వ్‌ బ్యాంక్‌ నుండి డబ్బులు తెచ్చే ప్రయత్నం చేసి తమ సమస్యను తీర్చలని ఖాతాదారులు కోరుతున్నారు.

17:50 - March 17, 2018

అనంతపురం : ఒకరిని హీరోని చేయడం తనకు ఇష్టంలేదని, తెలుగు ప్రజల్లో తామే సూపర్‌స్టార్లమన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. జిల్లాలో హిందూపురంలో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. మూడవరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో ఎన్టీఆర్‌ ఇన్‌డోర్‌ స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా హిందూపురం అభివృద్ధికి ఎల్లపుడు పనిచేస్తానని బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో క్రీడల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. అటు మంత్రి నారాలోకేష్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన విమర్శలపై తాను స్పందించనన్నారు. 

17:46 - March 17, 2018

ఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌లో సోమవారం అవిశ్వాసం పెడితే తాము తప్పకుండా మద్దతు తెలుపుతామన్నారు. నాలుగేళ్ల తర్వాత టీడీపీ కళ్లుతెరిచి ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని ఏచూరి అన్నారు.  

17:45 - March 17, 2018

అమరావతి : పార్లమెంటులో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి పలు పార్టీల నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు అమరావతిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నేతలు.. కేంద్రంపై అవిశ్వాసం పెడతామన్నా.. ఇతర పార్టీలు నమ్మడం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాగా తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ కు పట్టుబట్టాలని , డివిజన్ అడగాలని పార్టీ ఎంపీలకు బాబు దిశానిర్ధేశం చేశారు. ఆరుగురు సభ్యుల ఎంపీల బృందం ఈ రెండురోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని ఆయన ఆదేశించారు. అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి, అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలన్నారు. మోదీ ప్రభుత్వంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామన్న చంద్రబాబు.. జగన్, పవన్ .. కేంద్రాన్ని ప్రశ్నించకుండా తనను విమర్శించటమేమిటని చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. తమకు కావాల్సింది రాజకీయం కాదని.. రాష్ట్రానికి న్యాయం జరగడమే లక్ష్యమని టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.

17:37 - March 17, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోది ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోది హయాంలో చోటుచేసుకున్న అవినీతిని కాంగ్రెస్‌ బయటపెడుతుందని సోనియా స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో మోది 'సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, నేను తినను...ఇతరులను తిననివ్వను' లాంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలపై దాడులు, పార్లమెంట్‌ను నిర్లక్ష్యం చేయడం, మతపరంగా దేశాన్ని విభజించడం, విపక్షాలను టార్గెట్‌ చేసే మోది ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని సోనియా పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని సోనియాగాంధీ అన్నారు. 

17:35 - March 17, 2018

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్‌కేవీ, బీఎంఎస్‌ మధ్య పోటీ కొనసాగుతోంది.. టీఆర్‌ఎస్‌కేవీనే విజయ ఢంకా మోగిస్తుందని ఆ సంఘం నేత గోపాల్‌ పేర్కొన్నారు.

17:32 - March 17, 2018

హైదరాబాద్‌ : కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంకు టీఆర్‌ఎస్‌ మద్దతు పలకాలని సీపీఐ ఏపి కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఏపీలో అవినీతి పాలన నడుస్తోందని ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఒప్పుకున్నారని... అందువల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఈ నెల 19న ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశామని... దీనికి పవన్‌ కల్యాణ్‌ కూడా హాజరుకానున్నట్లు రామకృష్ణ తెలిపారు. కమ్యూనిస్టు ఆఫీసును సందర్శించిన పవన్‌ కల్యాణ్‌ వెనుక బీజేపీ లేదన్నారు.

17:23 - March 17, 2018

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆ పార్టీ నేతల భేటీ అయ్యారు. ఎన్డీయే నుండి టీడీపీ పార్టీ వైదొలగిన నేపథ్యంలో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా చర్చలు జరుపనున్నారు. కాగా విభజన హామీలు నెరవేర్చలేదనే నిరసనతో టీడీపీ బీజేపీ పార్టీ నుండి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ అధికారికంగా ప్రకటించారు. కాగా వచ్చే సోమవారం 19వ తేదీన అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా నేతలతో చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు, విష్ణుకుమార్‌ రాజు, ఆకుల సత్యనారాయణ, పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, కావూరి సాంబశివరావు, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, మాధవ్‌, కంఠేటి సత్యనారాయణరాజు అలాగేవైసీపీ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొనటం విశేషం. కాగా గత 18 నెలలుగా వైసీపీకి వ్యూహ కర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఈ సమావేవంలో పాల్గొనటం గమనించాల్సిన విషయం. ఇటు బీజేపీకి, అటు వైసీపీకి ఇరు పార్టీలకు వ్యూహ కర్త ప్రశాంత్ కిషోరే కావటం గమనించాల్సిన విషయం. 

ముగిసిన జీహెచ్ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిసాయి. దీంతో జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. సాయంతం్ర 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 

బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ..

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆ పార్టీ నేతల భేటీ అయ్యారు. ఎన్డీయే నుండి టీడీపీ పార్టీ వైదొలగిన నేపథ్యంలో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా చర్చలు జరుపనున్నారు. కాగా విభజన హామీలు నెరవేర్చలేదనే నిరసనతో టీడీపీ బీజేపీ పార్టీ నుండి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ అధికారికంగా ప్రకటించారు. కాగా వచ్చే సోమవారం 19వ తేదీన అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

అన్యాయాలపై గొంతు ఎత్తేది కాంగ్రెసే : సోనియా

ఢిల్లీ : అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ క్షీణిస్తున్న దశలో తాను పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అందరి ఐక్యత వల్లే పదేళ్లు అధికారంలో ఉండగలిగాం. 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. యూపీఏ-1లో చేసిన అభివృద్ధి వల్లే రెండోసారి అధికారంలోకి రాగలిగామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం ప్రతి ఒక్కరి విజయంగా భావించాలని సూచించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సోనియా పిలుపునిచ్చారు.

మోదీవి ఓటుబ్యాంకు రాజకీయాలు : సోనియా

ఢిల్లీ : ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. 40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ చిక్‌మగ్‌లూరు నుంచి అఖండ విజయం సాధించి దేశానికి సేవలందించారు. త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సోనియా ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. 

15:53 - March 17, 2018

నల్లగొండ : అడవిదేవులపల్లి మండలంలో పట్టాలున్న గిరిజన రైతుల భూములను తీసుకోవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని పలు గ్రామాల గిరిజన ప్రజలకు పట్టాలిచ్చారని ఆయా గ్రామాల్లో జాయింట్ కలెక్టర్‌ నారాయణరెడ్డితో కలిసి పంట పొలాలను జూలకంటి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఎండ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని ప్రస్తత ఫారెస్టు అధికారులు వచ్చి ఫారెస్టు భూమిగా పరిగణించి లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వే నిర్వహించి నిజమైన అర్హులకు పరిహారం, పునరావాసం కల్పించాలని ప్రభుత్వాని కోరారు.

15:47 - March 17, 2018

చిత్తూరు : జిల్లాలో 10వ తరగతి హిందీ పేపర్‌ లీక్‌ కావడం కలకల రేపింది. నగరి, విజయపురం మండలాల్లో ఉదయం 7.30 గంటలకు హిందీ పేపర్‌ లీక్‌ అయినట్లు తెలుస్తోంది. దీనిపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. కాగా పరీక్ష సమయాల్లో ఇటువంటి సంఘటనలు ప్రతీ ఏడాది ఎక్కడ అక్కడ జరుగుతుండటం విశేషం.

15:43 - March 17, 2018

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడలో విద్యాశాఖలోని అక్రమాలపై టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనాలపై అధికారుల స్పందించారు. మిర్యాలగూడ ఎంఈవో చాంప్లా నాయక్ అవినీతిపై జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఎంఈవో అక్రమాలపై ఇంటెలిజెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. కమీషన్లు తీసుకొని పాఠశాలకు రాకపోయినా ఉపాధ్యాయులకు వేతనాలు అందిస్తున్న ఎంఈవో చంప్లాపై చర్యలు తీసుకోవాలంటూ.... ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. 

మోదీ హయాంలో అవినీతి : సోనియా గాంధీ

ఢిల్లీ : నగరంలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతు..ప్రధాని మోదీ హయాంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ అస్థిత్వంపై సందేహాలు లేవనెత్తుతున్న వారికి తగినతీరిలో బుద్ధి చెబుతామని సోనియా తెలిపారు. 

కాంగ్రెస్ మళ్లీ విజయం సాధిస్తుంది :సోనియా గాంధీ

ఢిల్లీ : అపజయం పాలైన కాంగ్రెస్ మళ్లీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధిస్తుందనీ..ప్రజల మనోభావాలను అనుగుణంగానే కాంగ్రెస్ పాలన చేసిందని సోనియాగాంధీ పేర్కొన్నారు. ఢిల్లీ జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరగుతున్న సందర్భంగా ఆమె తన ఆశాభావాన్ని వ్యక్త పరిచారు. 

15:16 - March 17, 2018

అమరావతి : పార్లమెంట్ లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఏపార్టీ పెట్టినా దానికి సీపీఎం మద్దతునిస్తుందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘువులు తెలిపారు. కానీ తీర్మానం చర్చకు రాకుండా చేసేందుకు కేంద్రం అడ్డుకునే అవకాశముందన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రాభవం తగ్గుతోందన్నారు. దేశ రాజకీయాలు చాలా త్వరితగతిన మారిపోతున్నాయన్నారు. ఇప్పటి వరకూ బీజేపీతో అంటకాగిన టీడీపీ నాలుగేళ్లకు కళ్లు తెరిచిందన్నారు. ఏది ఏమైనా ప్రజా సమస్యలపై సీపీఎం తన పోరాటాలను కొనసాగిస్తునే వుంటుందని బీవీ రాఘువులు పేర్కొన్నారు. మిత్రపక్షాల నుండి వ్యతిరేకత రావటం బీజేపీ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. 

అవిశ్వాసానికి సీపీఎం మద్దతు: రాఘువులు

అమరావతి : పార్లమెంట్ లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఏపార్టీ పెట్టినా దానికి సీపీఎం మద్దతునిస్తుందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘువులు తెలిపారు. కానీ తీర్మానం చర్చకు రాకుండా చేసేందుకు కేంద్రం అడ్డుకునే అవకాశముందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రాభవం తగ్గుతోందన్నారు. దేశ రాజకీయాలు చాలా త్వరితగతిన మారిపోతున్నాయన్నారు. 

దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక్కటవ్వాలి : స్టాలిన్

తమిళనాడు : దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక్కటవ్వాలనీ..దక్షిణాది రాష్ట్రాలు 'ద్రవిడియన్ నాడు'గా ఒక్కటయ్యే పరిస్థితి వస్తే స్వాగతిస్తాననీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ వెలిబుచ్చారు. తమిళనాడులోని ఈరోడ్ లో ఆయన మాట్లాడుతూ, నిజంగా అదే జరిగితే తాను మనస్పూర్తిగా స్వాగతిస్తానని చెప్పారు. ఆ పరిస్థితి వస్తుందనే తాను భావిస్తున్నానని తెలిపారు. అయితే ద్రవిడియన్ నాడు కోసం ప్రచారం చేస్తానని తాను చెప్పడం లేదని అన్నారు.

పోలవరంపై ఏవిచారణకైనా సిద్ధం : దేవినేని

అమరావతి : రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. పోలవరంపై ఏ విచారణకైనా సిద్ధమని, ప్రాణత్యాగం చేసైనా ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ చేయించిన ఫిర్యాదుల కారణంగానే పోలవరం ఆలస్యం అవుతోందని తెలిపారు. పోలవరం పనులు ఇప్పటివరకు 54.4 శాతం పూర్తయ్యాయని వివరించారు.    

ప్రతిపక్షాల లేకుండా చేయాలని మోదీ కుట్ర :ప్రత్తిపాటి

గుంటూరు : ప్రతిపక్షాల లేకుండా చేయాలని మోదీ కుట్ర పన్నుతున్నారనీ ఏపీ మంత్ని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.ఎన్డీయే నుండి టీడీపీ బయటకు రావటంపై 5కోట్ల ఆంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్డీయే మిత్రపక్షాలన్నీ చంద్రబాబుకు మద్దతిచ్చాయనీ..మోదీ మిత్రపక్షాల విశ్వాసాన్ని మోదీ కోల్పోయారని మంత్రి పేర్కొన్నారు. జగన్ ను, పవన్ ను,మోదీ వాడుకున్నారనీ కాబట్టి పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.  

14:06 - March 17, 2018

కడప : అగ్రవర్ణాల యువతిని ప్రేమించడమే నేరమైపోతోంది. దళిత యువకులు అగ్రవర్ణాలకు చెందిన యువతిని ప్రేమిస్తే అదో పాపమై పోతుంది. ఆ యుకుడిని ఏం చేసేందుకైనా సిద్ధమైపోతున్నారు. పరువు - ప్రతిష్ట పేర్లతో దారుణాలకు వడిగడుతున్నారు. దళిత యువకులను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. ఇదే తరహాలో కడప జిల్లాలో జరిగిన దళిత యువకుడి హత్య అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమకు కులం, మతం, హోదాలు వెతుకూత జంటపక్షులను హతమారుస్తున్న విధానంపై 10టీవీ కథనం..

దళితుల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారి బతుకుల్లో వెలుగులు నిండడం లేదు. 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలోనూ వారి బతుకులు ఎక్కవ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. వారికి ఏ చట్టం న్యాయం చేయదు. పోలీసులు అండగా నిలవరు. వారిపై జరుగుతున్న దారుణాలు, అకృత్యాలను ఏ చట్టమూ అడ్డుకోలేకపోతోంది. 
కడప జిల్లా ఖాజీపేట మండలం బుడ్డాయపల్లెలో దారుణం జరిగింది.  అగ్రవర్ణాల దాష్టీకం మరోసారి వెలుగుచూసింది. కుల రక్కసి బుసలు కొట్టింది. బుడ్డాయపల్లెకు చెందిన విజయ్‌కుమార్‌ అనే దళితయువకుడు...  గత సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఖాజీపేటలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్న విజయ్‌.. అదే ప్రాంతంలోని అగ్రవర్ణాలకు చెందిన  ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయి నుంచి కూడా అంగీకారం తెలపడంతో కొంతకాలంగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. చదువు పూర్తయిన తర్వాత వివాహం చేసుకుంటానని ఆ అమ్మాయికి హామీనిచ్చాడు. 

విజయ్‌కుమార్‌ ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో అమ్మాయి తండ్రి విజయ్‌కుమార్‌ను మందలించాడు. మరోసారి మా అమ్మాయి జోలికొస్తే చంపేస్తానని బెదిరించాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అయినా విజయ్‌- అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ ఆగిపోలేదు. రోజూ కలుసుకునేవారు. ఎప్పటిలాగానే ఓ రోజు విజయ్‌కుమార్‌ సాయంత్రం ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందు గ్రామంలోని పాఠశాల దగ్గరికి వెళ్లాడు. ఆ తర్వాత అతను మళ్లీ తిరిగి రాలేదు. కమలాపురం దగ్గర రైలు పట్టాలమీద శవమై తేలాడు.  అమ్మాయి తల్లిదండ్రులే ఈ దారుణానికి ఒడిగట్టారని విజయ్‌ బంధువులు, దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విజయ్‌ను చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

విజయ్‌కుమార్‌ది ముమ్మాటికి హత్యేనని కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి.. మృతుడి కుటుంబానికి  న్యాయం చేయాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. లేకుండా ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. విజయ్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని వారు కోరుతున్నారు. నిందితులను తక్షణమే అరెస్ట్‌  చేసి.. కఠినంగా శిక్షించాలని  డిమాండ్‌ చేస్తున్నారు

14:03 - March 17, 2018

నెల్లూరు : అసలే గిట్టుబాటు ధరలేక ఆందోళన చెందుతోన్న రైతులను రాత్రి కురిసిన అకాల వర్షం మరింత నిరాశ పరిచింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో రైతులు గిట్టుబాటు ధరలేక మర్కెట్‌ యార్డు వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. రాత్రి కురిసిన వర్షంతో అది కాస్తా తడిచి పోయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని వదిలేసేందుకు సిద్ధమయ్యారు. తమను ఆదుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. 

 

14:00 - March 17, 2018

సిద్దిపేట : జిల్లా హుస్నాబాద్‌ ఆర్ డీవో కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ భూ సమస్య పరిష్కరించాలని నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాయి. అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య యత్నం చేశారు.  తమకున్న మూడెకరాల భూమిలో ఎకరంనర భూమి   ఇతరుల పేరు పై రిజిస్ట్రేషన్‌ అయిందని, ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. బాధితులు బాల్రెడ్డి, వెంకటవ్వల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

 

13:56 - March 17, 2018


హైదరాబాద్ : లేబర్ కోర్టు ప్రెసీడింగ్ ఆఫీసర్ సెషన్స్ జడ్జ్ గాంధీ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న అభియోగంపై ఏసీబీ సోదాలు చేపట్టింది. హైకోర్టు అనుమతితో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వారాసిగూడలోని గాంధీ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. గాంధీ బంధువుల ఇళ్లల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈమేరకు డిప్యూటీ డైరెక్టర్ టెన్ టివితో మాట్లాడుతూ 3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించామని చెప్పారు. ఏడు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్, రాజమండ్రి, కొవ్యూరులలో సోదాలు చేస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. హైదరాబద్ లో ఇల్లు, రెండు ప్లాట్లు, 3 వాహనాలు గుర్తించామన్నారు. కొవ్వూరు మండలంలో 18 ఎకరాలు భూమిని గుర్తించామని తెలిపారు. బంగారం, లాకర్ ను గుర్తించినట్లు ప్రకటించారు. తెలంగాణ, ఏపీలోని గాంధీ బంధువుల ఇళ్లళ్లో సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగుతాయని తెలిపారు.
 

13:51 - March 17, 2018

విశాఖ : జిల్లాలోని నక్కపల్లి మండలం ఉపమాకలో విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురి మృతి చెందారు. ఒక వ్యక్తి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు ట్యాంక్ లోకి దిగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతన్ని కాపాడేందుకు మరికొంతమంది సెప్టిక్ ట్యాంక్ లోకి దిగారు. దీంతో నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్ర అవస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.  వీరి మృతిలో ఉపమాకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

13:36 - March 17, 2018

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ 84 వ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు, రేపు సమావేశాలు జరుగనున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారి ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నూతన శకం ఆరంభమైందన్నారు. తండ్రిని మించిన తనయుడిగా రాహుల్ గాంధీ రాణిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. రాహుల్ నాయకత్వం దేశానికే మార్గదర్శకం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

13:01 - March 17, 2018

ఖమ్మం : రాపర్తి నగర్ బైపాస్ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖమ్మం కార్పొరేషన్ డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో నున్నా నాగేశ్వరరావు, విక్రమ్ లు ఉన్నారు.

12:55 - March 17, 2018
12:54 - March 17, 2018

హైదరాబాద్ : లేబర్ కోర్టు ప్రెసీడింగ్ ఆఫీసర్ సెషన్స్ జడ్జ్ గాంధీ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న అభియోగంపై ఏసీబీ సోదాలు చేపట్టింది. హైకోర్టు అనుమతితో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వారాసిగూడలోని గాంధీ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. గాంధీ బంధువుల ఇళ్లల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ, తూగో, ప.గో జిల్లాలో సోదాలు చేస్తున్నారు. మూడు కోట్ల వరకు ఆస్తులున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో రెండు ప్లాట్లు, ఒక లాకర్ ను గుర్తించారు. 30తులాల బంగారం, 18 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:46 - March 17, 2018

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ 84 వ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ, రేపు సమావేశాలు జరుగనున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారి సమావేశాలు జరుతున్నాయి. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సభ్యులు, పిసిసి నేతలు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ వైఫల్యాలు, యూపీఏ పాలన, కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణపై ప్లీనరీ చర్చించనుంది. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగం, పేదరిక నిర్మూళన, అవినీతిపై కాంగ్రెస్ తీర్మానాలు చేయనుంది. వ్యవసాయం, రాజకీయాల తీర్మానాలపై రేపు ప్లీనరీలో చర్చించనున్నారు. మన్మోహన్ సింగ్ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. రేపు రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:44 - March 17, 2018

కృష్ణా : జిల్లాలోని గుడివాడలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులను హత్య చేసి చోరీకి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులను దుండగులు దొంగలు హత్య చేశారు. హత్య అనంతరం ఇంట్లో బంగారం, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీపీ కెమెరాల ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగతనం కోసమే హత్య చేశారా లేక వేరే కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

గుడివాడలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం

కృష్ణా : జిల్లాలోని గుడివాడలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులను హత్య చేసి చోరీకి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులను దొంగలు హత్య చేశారు. హత్య అనంతరం ఇంట్లో బంగారం, ఇతర వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు. 

 

కొనసాగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ 84 వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కొనసాగుతున్నాయి. ఇవాళ, రేపు సమావేశాలు జరుగనున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారి సమావేశాలు జరుగుతున్నాయి. 

 

వారాసిగూడలోని గాంధీ ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

హైదరాబాద్ : లేబర్ కోర్టు ప్రెసీడింగ్ ఆఫీసర్ సెషన్స్ జడ్జ్ గాంధీ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న అభియోగంపై ఏసీబీ సోదాలు చేపట్టింది. హైకోర్టు అనుమతితో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వారాసిగూడలోని గాంధీ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

 

 

12:14 - March 17, 2018

హైదరాబాద్ : లేబర్ కోర్టు ప్రెసీడింగ్ ఆఫీసర్ సెషన్స్ జడ్జ్ గాంధీ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న అభియోగంపై ఏసీబీ సోదాలు చేపట్టింది. హైకోర్టు అనుమతితో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వారాసిగూడలోని గాంధీ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:02 - March 17, 2018

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ 84 వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ, రేపు సమావేశాలు జరుగనున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారి సమావేశాలు జరుతున్నాయి. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సభ్యులు, పిసిసి నేతలు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ వైఫల్యాలు, యూపీఏ పాలన, కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణపై ప్లీనరీ చర్చించనుంది. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగం, పేదరిక నిర్మూళన, అవినీతిపై కాంగ్రెస్ తీర్మానాలు చేయనుంది. వ్యవసాయం, రాజకీయాల తీర్మానాలపై రేపు ప్లీనరీలో చర్చించనున్నారు. మన్మోహన్ సింగ్ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. రేపు రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. మరిన్ని వివరాలను   వీడియోలో చూద్దాం.. 

 

11:53 - March 17, 2018

ప్రారంభమైన జీహెచ్ ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

హైదరాబాద్ : నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 25పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2012లో జీహెచ్ ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. నాలుగేళ్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. టీఆర్ ఎస్ కేవీ, బీఎంఎస్ మధ్యే పోటీ నెలకొంది. 

11:49 - March 17, 2018

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 25పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2012లో జీహెచ్ ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. నాలుగేళ్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. టీఆర్ ఎస్ కేవీ, బీఎంఎస్ మధ్యే పోటీ నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి ప్లీనరీ సమావేశం

ఢిల్లీ : నేటి నుండి ఢిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. రెండు రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. కాసేపట్లో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఏఐసీపీ ప్లీనరీ ప్రారంభం కానుంది. జెండా ఆవిష్కరణతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి పీసీపీ నేతలు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. మరణించిన నాయకులకు సంతాపం, స్వాతంత్య్ర సమరయోధులకు నేతలు నివాళులర్పించనున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్లీనరీలో రాహుల్ గాంధీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు.

నేటి నుంచి ఏఐసీపీ ప్లీనరీ సమావేశాలు

ఢిల్లీ : నేటి నుండి ఢిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. రెండు రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. కాసేపట్లో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఏఐసీపీ ప్లీనరీ ప్రారంభం కానుంది. జెండా ఆవిష్కరణతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి పీసీపీ నేతలు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. మరణించిన నాయకులకు సంతాపం, స్వాతంత్య్ర సమరయోధులకు నేతలు నివాళులర్పించనున్నారు.  రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్లీనరీలో రాహుల్ గాంధీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు.

11:24 - March 17, 2018

ఢిల్లీ : నేటి నుండి ఢిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. రెండు రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. కాసేపట్లో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఏఐసీపీ ప్లీనరీ ప్రారంభం కానుంది. జెండా ఆవిష్కరణతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి పీసీపీ నేతలు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. మరణించిన నాయకులకు సంతాపం, స్వాతంత్య్ర సమరయోధులకు నేతలు నివాళులర్పించనున్నారు.  రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్లీనరీలో రాహుల్ గాంధీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఎన్డీఏ వైఫల్యాలు, యూపీఏ పాలన, కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణపై ప్లీనరీ చర్చించనుంది. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగం, పేదరిక నిర్మూళన, అవినీతిపై కాంగ్రెస్ తీర్మానాలు చేయనుంది. వ్యవసాయం, రాజకీయాల తీర్మానాలపై రేపు ప్లీనరీలో చర్చించనున్నారు. మన్మోహన్ సింగ్ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. రేపు రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు.

 

నల్గొండ జిల్లా విద్యా శాఖలో నయా దందా

నల్గొండ : జిల్లా విద్యా శాఖలో నయా దందా మొదలైంది. 10టివి నిఘాలో నిజాలు బయటపడ్డాయి. మిర్యాలగూడ ఎంఈవో చంప్లా అక్రమాలకు కేరాఫ్ అడ్డాగా మారాడు. ఉపాధ్యాయులతో కుమ్మక్కై ఎంఈవో అక్రమాలకు పాల్పడుతున్నారు. రెండు రిజిస్టర్లు మెయిన్ టెన్ చేస్తూ విద్యా శాఖను తప్పుదోవపట్టిస్తున్నారు. కమీషన్ ఇస్తే పాఠశాలకు రాకున్న పూర్తి అటెండెన్స్ వేయిస్తున్నారు. ఉపాధ్యాయురాలు సుమతి పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాల ముఖం చూడలేదు. పాఠశాలకు రాకున్నా సుమతి ప్రతి నెలా జీతం అందుకుంటుంది. ఈ ఘటనపై ఎస్ ఎఫ్ ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.

10:08 - March 17, 2018

నల్గొండ : జిల్లా విద్యా శాఖలో నయా దందా మొదలైంది. 10టివి నిఘాలో నిజాలు బయటపడ్డాయి. మిర్యాలగూడ ఎంఈవో చంప్లా అక్రమాలకు కేరాఫ్ అడ్డాగా మారాడు. ఉపాధ్యాయులతో కుమ్మక్కై ఎంఈవో అక్రమాలకు పాల్పడుతున్నారు. రెండు రిజిస్టర్లు మెయిన్ టెన్ చేస్తూ విద్యా శాఖను తప్పుదోవపట్టిస్తున్నారు. కమీషన్ ఇస్తే పాఠశాలకు రాకున్న పూర్తి అటెండెన్స్ వేయిస్తున్నారు. ఉపాధ్యాయురాలు సుమతి పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాల ముఖం చూడలేదు. పాఠశాలకు రాకున్నా సుమతి ప్రతి నెలా జీతం అందుకుంటుంది. ఈ ఘటనపై ఎస్ ఎఫ్ ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఈవో ఆఫీస్ ముందు ధర్నా చేపడతామని...అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:01 - March 17, 2018

అవిశ్వాస తీర్మానాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. పార్లమెంట్ లో వైసీపీ, టీడీపీలు స్పీకర్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాల్లో రాజకీయ కోణం ఉందన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, టీడీపీ నేత మన్నెం సుబ్బారావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

టిప్పర్ ను ఢీకొన్న కారు..ఇద్దరు మృతి

రంగారెడ్డి : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కడ్తాల్ మండలం మైసిగండి వద్ద అతివేగంగా వస్తున్న కారు ఆగివున్న టిప్పర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు కారులో ఇరుకున్న వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. 

పార్క్ హయత్ హోటల్ లో చోరి కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన చోరి కేసును పోలీసులు చేధించారు. ముంబైలో నిందితుడు జయేష్ ను అరెస్టు చేశారు.

 

08:39 - March 17, 2018

రంగారెడ్డి : శ్రీశైలానికి వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సైదాబాద్ కు చెందిన ఏడుగురు కారులో శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నారు. మార్గంమధ్యలో కడ్తాల్ మండలం మైసిగండి వద్ద అతివేగంగా వస్తున్న కారు ఆగివున్న టిప్పర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు కారులో ఇరుకున్న వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

నేడు జీహెచ్ ఎంసీ కార్మిక సంఘం ఎన్నికలు

హైదరాబాద్ : నేడు జీహెచ్ ఎంసీ కార్మిక సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. 5,300 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో నాలుగు కార్మిక సంఘాలు ఉన్నాయి. 

 

114వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర 114వ రోజుకు చేరుకుంది. నేడు వల్లభరావుపాలెం నుంచి పాదయాత్ర కొనసాగనుంది. పెద్దపాలెం, తెలగాయపాలెం, బండ్లవారిపాలెం మీదుగా జగన్ పాదయాత్ర సాగనుంది. 

 

నేడు ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు

ఢిల్లీ : నేడు ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు రాహుల్ గాంధీ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్లీనరీలో సోనియా ప్రసంగించనున్నారు. రాజకీయం, వ్యవసాయ అంశాలపై రేపు ఏఐసీసీ ప్లీనరీలో చర్చించనున్నారు.
 

 

ఫైనల్ చేరిన బంగ్లా...

ఢిల్లీ : నిదహాస్‌ ముక్కోణపు టోర్నీలో బంగ్లాదేశ్‌ ఫైనల్‌ చేరింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను బంగ్లా చిత్తు చేసింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో చివరికి విజయం బంగ్లాదేశ్‌నే వరించింది. ఆతిథ్య శ్రీలంక జట్టును బంగ్లా రెండు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ భారత్‌తో తలపడనుంది.

06:30 - March 17, 2018

ఢిల్లీ : నిదహాస్‌ ముక్కోణపు టోర్నీలో బంగ్లాదేశ్‌ ఫైనల్‌ చేరింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను బంగ్లా చిత్తు చేసింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో చివరికి విజయం బంగ్లాదేశ్‌నే వరించింది. ఆతిథ్య శ్రీలంక జట్టును బంగ్లా రెండు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ భారత్‌తో తలపడనుంది.

06:29 - March 17, 2018

ఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 100-110 సీట్లకు పడిపోతుందని ఎన్డీయే మిత్రపక్షం శివసేన జోస్యం చెప్పింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ ఉప ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని అంచనా వేసింది. ఈశాన్య రాష్ర్టాల అసెంబ్లీ ఫలితాల్లో సత్తాచాటిన బిజెపికి గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్‌లో వెలువడిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయని పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల గెలుపుతో కమలం క్యాంపులో కలవరం మొదలైందని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో వివరించింది. 2014లో ప్రజాదరణతో బీజేపీ భారీ విజయం సాధించిందని, ప్రస్తుతం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అందులో పేర్కొంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బిజెపి 9 లోక్‌సభ స్థానాలను కోల్పోయి 282 నుంచి 272 స్థానాలకు మెజారిటీకి పడిపోయింది.

 

06:27 - March 17, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌లో దారుణం జరిగింది. బెంగాల్‌కు చెందిన వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగాల్‌లోని ఘోష్‌పార గ్రామం డోంజార్‌, హౌరాకు చెందిన స్వరూప్‌ గోపాల్‌దాస్‌ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ఆయన భార్య దీప, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. స్వరూప్‌ గోపాల్‌దాస్‌ జనరల్‌ బజార్‌లో గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదుకానీ.. ఇంట్లో తను, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం పోలీసులకు అందించగా తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికే విగత జీవులుగా పడిఉన్నారు. పోలీసులు నలుగురి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. స్వరూప్‌ కుటుంబ ఆత్మహత్యకు ఆర్థిక కారణాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 5570 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా 25 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే పోలింగ్‌... సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

06:24 - March 17, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం కార్మికశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. చావోరేవో తేల్చుకునేందుకు కార్మిక సంఘాలు రెడీ అవుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు రావడంతో తమ సత్తా చాటేందుకు కార్మికసంఘాల నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే జోరుగా ప్రచారం నిర్వహించిన కార్మిక నాయకులు.. తమనే గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

2012లో జీహెచ్‌ఎంసీ గుర్తింపు సంఘం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి జరగాల్సిన ఈ ఎన్నికలు వివిధ కారణాలతో నాలుగేళ్లు వాయిదా పడుతూ వచ్చాయి. కోర్టు మొట్టికాయలతో ఎట్టకేలకు కార్మికశాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇవాళ ఎన్నికలు నిర్వహించేందుకు లేబర్‌ కమిషన్‌ సిద్ధమైంది. గ్రేటర్‌ పరిధిలోని 9 సంఘాలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతను కల్పించింది. ప్రచారం కోసం ఒక్కో సంఘానికి ఒక్కోరోజు కేటాయిస్తూ.. ఈనెల15 వరకు ప్రచారానికి అవకాశం చ్చింది. దీంతో ప్రచార హోరు సాగించాయి కార్మిక సంఘాలు. 5570 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా 25 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే పోలింగ్‌... సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

గత ఎన్నికల్లో 7424 మంది కార్మికులు ఉండగా.. 6352 మంది కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గుర్తింపు సంఘంగా ఎన్నికైన గ్రేటర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత గోపాల్‌కు 3548 ఓట్లురాగా... సమీప ప్రత్యర్థి బీఎంఎస్‌కు 2175 ఓట్లు లభించాయి. ఇక అప్పటి హెచ్‌ఎంఎస్‌ తరపు పోటీ చేసిన నాయిని నర్సింహారెడ్డికి 316 ఓట్లు, ఐఎన్‌టీయూసీ సంజీవరెడ్డికి 181 ఓట్లు వచ్చాయి. నాడు ఎన్నికల్లో ఆరు సంఘాలు పోటీపడగా.. ఇప్పుడు 9 సంఘాలు ఎన్నికల అర్హత సాధించాయి. అయితే ప్రధాన పోటీమాత్రం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌... బీఎంఎస్‌ మధ్యే ఉంది. 25 పోలింగ్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ ముగిశాక జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీలో హోరాహోరీగా జరుగనున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. అధికార పార్టీకూడా ఎన్నికలను ప్రిస్టేజ్‌ గా తీసుకొని ఉన్న గుర్తింపును కాపాడుకునేందుకు మంత్రులను సైతం ప్రచారంలోకి దింపింది. అయితే కార్మికులు ఎవరికి జై కొడతారో వేచిచూడాలి.

06:22 - March 17, 2018

హైదరాబాద్ : టీ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లకు ఢిల్లీ తెలంగాణ భవన్‌లోకి ఎంట్రీ లభించలేదు. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుతో వారిద్దరూ మాజీలయినందున... వారికి గదులు కేటాయించొద్దని తెలంగాణ సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఫోన్లో అందిన ఆదేశాలమేరకు తెలంగాణ భవన్ అధికారులు గదులు కేటాయించేందుకు నిరాకరించారు. దీంతో తెలంగాణ భవన్ అధికారుల తీరుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

06:20 - March 17, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఒకవైపు జాతీయ స్థాయిలో కీలకంగా వ్యహరించాలని నిర్ణయించింది. అయితే దీనిపై ప్రతిపక్షపార్టీల విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలతో ఆ గులాబీదళం డైలమాలో పడింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఎలా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతోంది. చివరి నిముషం వరకు వేచి చూసే నిర్ణయం తీసుకునే అవకాశమే కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త చిక్కు వచ్చిపడింది. అదే టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఈ అవిశ్వాస తీర్మానమే ఇప్పుడు గులాబీ బాస్‌కు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. మొన్నటికి మొన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీలతో దేశానికి ఒరిగిందేమీలేదని.. ఈ రెండింటికి ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ రావాలన్నారు. దానికి అవసరమైతే తాను నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, కమలం పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో వేదికను ఏర్పాటు చేసే పనిలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాయి. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేస్తున్న కేసీఆర్‌.. వాస్తవానికైతే ఈ తీర్మానానికి మద్దతు తెలపాలి. మరి కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.

ప్రత్యేకహోదా అంశంపై టీడీపీ, వైసీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతునిస్తే తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏమిటన్నది అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలు అవిశ్వాసానికి మద్దతు పలికాయి. టీఆర్‌ఎస్‌ కూడా మద్దతు తెలిపితే ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న సంకేతాలు వెళ్తాయన్న వాదన గులాబీ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో చర్చకు వచ్చే అవకాశమే లేదని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. శుక్రవారం సభ అదుపులో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాలను స్వీకరించడం లేదని స్పీకర్‌ తేల్చి చెప్పారు. దీంతో సోమవారమైనా ఈ తీర్మానాలను స్వీకరిస్తోందో లేదో తెలియదు. అయితే టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం కేంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయకుండా అడ్డుకుంటుందన్న అంచనాలో ఉంది. దీంతో అవిశ్వాస తీర్మానం చర్చకు రాదని.. ఏ నిర్ణయం తీసుకోవాల్సి అవసరం లేదన్నది టీఆర్‌ఎస్‌ శ్రేణుల వాదన. అవిశ్వాస తీర్మానం ఒకవేళ స్వీకరించి సభలో చర్చకు వస్తే ఏం చేయాలన్నదానిపై గులాబీ బాస్‌ దృష్టి సారించారు. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా రాజకీయంగా మార్పులు వచ్చే అవకాశం లేకపోవడంతో తటస్థంగా ఉండాలన్న యోచనలో టీఆర్‌ఎస్‌ ఉంది. 

బీజేపీపై శివసేన జోస్యం...

ఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 100-110 సీట్లకు పడిపోతుందని ఎన్డీయే మిత్రపక్షం శివసేన జోస్యం చెప్పింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ ఉప ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని అంచనా వేసింది. ఈశాన్య రాష్ర్టాల అసెంబ్లీ ఫలితాల్లో సత్తాచాటిన బిజెపికి గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్‌లో వెలువడిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయని పేర్కొంది.

సుప్రీంలో రామసేతు కేసు...

ఢిల్లీ : సేతు సముద్రం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా జాతి హితాన్ని దృష్టిలో పెట్టుకుని రామసేతుకు ఎలాంటి నష్టం కలిగించమని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. రామసేతు కేసులో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ చారిత్రక నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంచేసింది.

సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ప్రారంభం...

ఢిల్లీ : సీపీఎం పొలిటిబ్యూరో సమావేశాలు ప్రారంభమయ్యాయి. 22వ అఖిలభారత మహాసభల్లో ప్రవేశపెట్టనున్నపార్టీ నిర్మాణ నివేదికపై చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులోగా నివేదిక కేంద్రకమిటీ ముందుకు రానుంది. 

2000 నోటు రద్దు లేదు - రాధాకృష్ణన్...

ఢిల్లీ : 2000 నోటును రద్దు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి రాధాక్రిష్ణన్ లోక్‌సభలో ప్రకటించారు. కొత్తగా 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.

దలేర్ మెహందీకి శిక్ష...

పంజాబ్ : మనుషుల అక్రమ రవాణా కేసులో ప్రఖ్యాత పాప్‌ సింగర్ దలేర్‌ మెహందీకి శిక్ష పడింది. పంజాబ్‌లోని పటియాలా కోర్టు దలేర్‌ మెహందీని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దలేర్‌ సోదరుడు షంషేర్‌ సింగ్‌ని కూడా కోర్టు దోషిగా తేల్చింది. దలేర్‌ మెహందీకి వెంటనే బెయిలు కూడా మంజూరైంది. 

ఎంపీ భగవత్ మాన్ రాజీనామా...

పంజాబ్‌ : ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్‌ మాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీలో మాత్రం కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అకాలిదళ్‌ నేత విక్రమ్ మజీఠియాకు క్షమాపణ కోరినందుకు మాన్‌తో పాటు పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. 

ఇద్దరు ఉగ్రవాదుల హతం...

జమ్మూకశ్మీర్ : పుల్వామా జిల్లాలో బీజేపీ నేత అన్వర్ ఖాన్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భారత భద్రతా బలగాలు హతమార్చాయి. హతులను త్రాల్‌కు చెందిన రాసిక్‌ నబీ భట్, అవంతీపురాకు చెందిన షబీర్‌ డార్‌గా పోలీసులు గుర్తించారు. వీరికి ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. బల్హామా ప్రాంతంలో అన్వర్‌ఖాన్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. 

Don't Miss