Activities calendar

18 March 2018

21:54 - March 18, 2018

మందకృష్ణ మాదిగ..మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘ స్థాపకుడు.14 మంది యువకులతో ప్రారంభమైన దండోరా.. ఒక చిన్న గ్రామం ఇదుముడి, ప్రకాశం జిల్లా నుండి మొదలై రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగ గూడెంలో దండోరా జెండా ఎగిరేలా చేసారు మందకృష్ణ మాదిగ. సామాజిక వర్గాలైన మాదిగ మాదిగ ఉప కులాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక సామజిక అంశాలలో స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 50 ఏళ్లు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులం మాదిగ కులం చెప్తూ మాకు కూడా అన్ని రంగాలలో సమానమైన అవకాశాలు కావాలంటూ నినదిస్తూ ముందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో 10టీవీ ఫేస్ టూ ఫేస్..

21:43 - March 18, 2018

ఢిల్లీ : రష్యా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కే ఎక్కువ విజయవకాశాలున్నాయి. ముందస్తు సర్వేలో పుతిన్‌కు 69.7 శాతం ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి ప్రావెల్‌ గ్రెడినిన్‌కు 7.1 శాతమే ప్రజలు మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికలు ఏకపక్షంగా సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఎన్నికల అంచనాలు నిజమై ఈ ఎన్నికల్లో పుతిన్ గెలిస్తే 2024 వరకు ఆయనకు తిరుగే ఉండదు. 

21:41 - March 18, 2018

ఢిల్లీ : ప్రధాని మోదీ, బీజేపీలపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధునిక కౌరవులని విమర్శించారు. తాము సత్యంకోసం పోరాడిన పాండవుల వంటివారమని అభివర్ణించారు. బీజేపీ ఓ సంస్థ గొంతుకగా నిలిస్తే... తాము దేశ ప్రజల గొంతుగా పనిచేస్తున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల్లో ముగింపు ఉపన్యాసం చేసిన ఆయన... దేశ భవిష్యత్తును మార్చే శక్తి కాంగ్రెస్‌కే ఉందని ఉద్ఘాటించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఉత్సాహంగా ముగిశాయి. ప్లీనరీ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రసంగంతో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుత రాజకీయాలను ఆయన మహాభారతంతో పోల్చారు. బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధునిక కౌరవులని రాహుల్‌ అభివర్ణించారు. తాము సత్యం కోసం పోరాడిన పాండవుల వంటి వారమన్నారు. కౌరవుల మాదిరిగా బీజేపీ అధికారం కోసం పాకులాడుతోందని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో దేశంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కార్పొరేట్ల కోసమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చనిపోతుంటే ఇండియా గేటు ముందు యోగాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చాక హామీలు విస్మరించారు : రాహుల్
ఎన్నికలకు ముందు బ్లాక్‌మనీ బయటపెడతామంటూ ఊదరగొట్టిన మోదీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారని విమర్శించారు. అవినీతిని అంతం చేస్తామన్న మోదీ... ఇప్పుడు అవినీతిపరులకు అండగా నిలుస్తున్నారన్నారు. 33వేల కోట్లు దోచుకున్న నీరవ్‌మోదీ, లలిత్‌మోదీలను ప్రధాని కాపాడుతున్నారని ఆరోపించారు.

నిరుద్యోగం పెరిగింది : రాహుల్
దేశంలో నిరుద్యోగం పెరిగిందని.... యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుందని రాహుల్‌ అన్నారు. దేశంలో అభివృద్ధి ఎక్కడుందో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు. దేశంలో ఏ వస్తువు చూసినా ఇతర దేశాల్లో తయారైందే కనిపిస్తోందన్నారు. దీంతో మా ఉపాధి సంగతేంటని దేశ యువత ప్రశ్నిస్తోందన్నారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు. ప్లీనరీ సమావేశంలో అక్కడక్కడ ఖాళీ ప్రదేశం ఉందని.. దాన్నంతా యువతతో నింపుతామని ఛమత్కరించారు. పార్టీలో యువతకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.

అచ్చేదిన్‌ పేరుతో మోసాలు : రాహుల్
ముఖ్యమైన సమస్యలపై ప్రధాని మౌనం దాలుస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. అచ్చేదిన్‌ పేరుతో అందరినీ మోసగిస్తున్నారన్నారు. రైతులు , నిరుద్యోగులపై మోదీకి ఏమాత్రం ప్రేమలేదని.. కాంగ్రెస్‌ పార్టీయే వారికి మేలు చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు దేశ భవితవ్యాన్ని మార్చే శక్తి ఉందన్నారు. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ, భద్రతా, వ్యవసాయ విధానాలపై ప్లీనరీలో తీర్మానాలు ఆమోదించారు. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు క్యాడర్‌లో నూతనోత్తేజం నింపాయి.

21:35 - March 18, 2018

రంగారెడ్డి : కేసీఆర్‌ చెప్తోన్న థర్డ్‌ ఫ్రంట్‌తో ఓరిగేదేమీ లేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. నాలుగేళ్లుగా మోదీ భజన చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు అకస్మాత్తుగా థర్డ్‌ఫ్రంట్‌ గురించి మాట్లాడితే ప్రజలు నమ్మబోరన్నారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో టీమాస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న తమ్మినేని 2019లో బహుజనులు రాజ్యాధికారంలోకి వచ్చేలా బీఎల్‌ఎఫ్‌ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇదే సభలో పాల్గొన్న టీమాస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్ కంచె ఐలయ్య... అసెంబ్లీ వేదికగా మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడి జరిగితే.. చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. స్వామిగౌడ్‌పై దాడిచేసిన కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని నిలదీశారు. 

ఎంపీలకు టీడీపీ విప్ జారీ..

అమరావతి: పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ విప్‌ జారీ చేసింది. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఎన్డీఏ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా సభ ఆర్డర్‌లో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోలేదని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం సభ ముందుకు వచ్చే అవకాశముంది.

వివాహాలకు సివిల్‌ ఒప్పందం చట్టం అవసరం: ఇందిరా

హైదరాబాద్ : వివాహాలకు సైతం సివిల్‌ ఒప్పందం తరహా చట్టం అవసరమని సుప్రీంకోర్టు సినీయర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ అభిప్రాయపడ్డారు. సైఫాబాద్‌లో షహీ స్త్రీ వనరులు, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక చర్చా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతు..పెళ్లి ఒప్పందం నుంచి బయటకు రావాలనుకుంటే భార్యా పిల్లలకు రక్షణ కల్పించేలాచట్టం ఉండాలన్నారు. పెళ్లి అనేది పరస్పర అంగీకారంతో కుదిరేఒక ఒప్పందం లాంటిదేనని ఇందిరా జైసింగ్‌ పేర్కొన్నారు. కేవలం ఒకరికి నచ్చకపోతే ముమ్మారు తలాక్‌ ద్వారా బయటకు రావడమేమిటని ఆమె ప్రశ్నించారు. 

రాహుల్ కు స్మృతి కౌంటర్..

ఢిల్లీ : ‘గౌరవనీయులైన రాహుల్‌గాంధీ గారు.. మీరు ప్రపంచంలోనే అతిపొడవైన పట్టాభిషేక కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఖాళీ సమయం ఉంటే ప్రపంచబ్యాంకు ఇచ్చిన నివేదికను ఓ సారి పరిశీలించండి. జీఎస్‌టీ గురించి ప్రపంచబ్యాంకు ఎంతబాగా విశ్లేషించిందో మీరు తెలుసుకోండి’ అంటూ స్మృతి ఇరానీ రాహుల్‌కు చురకలేస్తూ ఆర్టికల్‌ను ట్విటర్‌లో పోస్టు చేశారు. వస్తు, సేవల పన్ను గురించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలకు కేంద్రమంత్ర స్మృతి ఇరానీ కౌంటర్‌ వేశారు.

మావోయిస్టు నేత అరెస్ట్..

కొత్తగూడెం: సాయుధ న్యూడెమోక్రసీ దళానికి పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన పాల్వంచ మండలం ఉల్వనూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. భీమా అనే దళసభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి మూడు తుపాకులు, కిట్‌బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

20:43 - March 18, 2018

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాగ శ్రవణం చెప్పారు. వివిధ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా పడుతాయని.. చెరువులు నిండుతాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని.. అన్ని రంగాల్లోని స్త్రీలకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు..
తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది తెలంగాణకు అన్నీ శుభఫలితాలే వస్తాయన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో దూసుకు పోతున్న రాష్ట్రం.. కొత్త ఏడాదిలో మరింత పురోభివృద్ధివైపు అడుగులు వేస్తుందన్నారు. ఉగాది రోజు స్వీకరించే పచ్చడి.. మనిజీవితంలో సంభవించే కష్టసుఖాలకు, లాభనష్టాలకు ప్రతీకలని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తనకు తాను అభివృద్ధి చెందుతూ.. జాతీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. పూజారులకు, ఇమాంలకు జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు కేసీఆర్‌. ఉగాది వేడుకలనుఏర్పాట్ల ను అద్భుతంగా చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖను ముఖ్యమత్రి అభినందించారు.
ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మదాయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడకల్లో వేదపఠనం, వ్యవసాయ, ఉద్యానవన పంచాంగం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. డా.ప్రభల సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు.

ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు
ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలో జరిగిన పంచాంగ శ్రవణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉగాది పచ్చడి రుచిచూశారు. పండితుల ఆశీదర్వాదం తీసుకున్నారు. కొత్త ఏడాదిలో తెలుగు ప్రజలకు శుభం జరగాలని కోరుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మనిషి జీవితంలో అనుభవాలకు గుర్తులని.. కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని ఉగాది మనికు సందేశం ఇస్తుందన్నారు ఏపీ సీఎం.

కేంద్రం బడ్జెట్‌ను చూసి తీవ్ర నిరాశకు లోనయ్యా : చంద్రబాబు
కేంద్రం చివరిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి తాను తీవ్ర నిరాశకు లోనయ్యానన్నారు. మాట ఇచ్చి మోసం చేస్తున్నారని కేంద్రాన్ని గట్టి నిలదీశానన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యుద్ధం చేస్తామని చెబుతోందని.. ఆయుద్ధం ఎవరిపై చేస్తారు.. తెలుగు జాతిపైనేనా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. గత 60 ఏళ్లలో ఆంధ్ర ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారని సీఎం చంద్రబాబు అన్నారు.60వేల కోట్ల అప్పుతో అమరావతికి వచ్చిన ఏపీ ప్రజలు.. ఉగాది సందేశాన్ని స్వీకరించి.. అభివృద్ధి దిశగా పట్టుదలతో సాగాలన్నారు సీఎం చంద్రబాబు. 

కాకుమానూరులో ఉగాది వేడుకల్లో జగన్‌..
తిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ప్రజాసంకల్పయాత్ర శిబిరం దగ్గర జరిగిన ఉగాది వేడుకల్లో పండితులు, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా జగన్‌ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి తెలుగు ఇంట మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పంచాగ శ్రవణం చేసిన పండితులు... ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి జగన్‌ జాతకంలోని సమస్యలన్నీ తీరిపోతాయని.. అటుపై రాజయోగం పడుతుందన్నారు. 2019లో జగన్‌ సీఎం అవుతారని.. వైసీపీకి 135 సీట్లు వస్తాయని చెప్పారు. 

ఉద్దండరాయునిపాలెంలో పవన్ ఉగాది వేడుకలు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని ఎస్సీకాలనీలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్‌ కల్యాణ్‌కు పండితులు పంచాంగం చదివి వినిపించారు. ప్రస్తుత పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని... అవి జనసేనకు అనుకూలంగా మారుతాయని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌... లంకభూముల విషయంలో దళితులకు అన్యాయం జరిగిందని.. దీనిపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

20:35 - March 18, 2018

తొమ్మిదేళ్ల రమ్మశ్రీ, ఐదేళ్ల చిన్నారి బుడత యోధ కోడలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తుంటారు. అత్తాకోడళ్లుగా రమ్యశ్రీ, యోధలు చక్కటి హవభావాలు పలికిస్తు తెగ హల్ చల్ చేసేస్తుంటారు. వీరు అటు పటాస్ లోను, ఇటు జబర్ధస్త్ లోను కూడా తమ నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరిద్దరు అసలే గడుగ్గాయిలు. వీరితో తోడు మరో గడుగ్గాయి తోడయింది. వీరంతా 10టీవీలో ఉగాతి సెలబ్రేషన్స్ లో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. మరి ఇంకెందుకు ఆసల్యం వారి ఆటలను, పాటలను, ముద్దు ముద్దుగా వారు చేసే అల్లరిని చూడాలంటే ఈ వీడియో క్లిక్ చేయాల్సిందే..

20:32 - March 18, 2018

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు. అలాగే ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఉగాది పండుగలను జరుపుకుని పంచాగ శ్రవణం విన్నారు. ప్రజల్లో ఆనందం వెల్లివిరియాలను నాయకులు ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో వారు వారి రాశి ఫలాల ఆధారంగా జ్యోతిష్యులు వారి జాతకాలను తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అంటాడు ఓ జ్యోతిష్యుడు, పవన్ కళ్యాణ కే పవర్ అంటాడు ఇంకొక జ్యోతిష్యుడు. జగనే కాబోయే రాజు అంటాడు ఇంకొక జ్యోతిష్యుడు..వీటిలో ఏది నిజం..?జరిగే కాలాన్ని ముందే తెలుసుకోవచ్చా..? అసలు పంచాంగానికి శాస్త్రీయత వుందా? పంచాగానికి జ్యోతిష్యానికి సంబంధం వుందా?వీటిలో వాస్తవాలెంత? అనే అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో టీవీ రావు (జేవీవీ), కాంతారావు(రచయిత), నాగ్ నాథ్ పాల్గొన్నారు. మరి మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

బడుగులకు రాజ్యాధికారం కోసమే టీమాస్: తమ్మినేని

రంగారెడ్డి : బడుగులకు రాజ్యాధికారం దగ్గర చేసేందుకే బీఎల్ఎఫ్ ఉద్ధేశ్యమన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కొత్త పోకడలకు పోతున్నారని టీమాస్ బహిరంగ సభలో తమ్మినేని పేర్కొన్నారు. రాజకీయాలను అన్ని వర్గాల వారికీ దగ్గర చేసేందుకే టీమాస్,బీఎల్ఎఫ్ ఆవిర్భవించిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి,టీమాస్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అందరికీ సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి చేసేందుకే 30 పార్టీలనుఏకతాటిపైకి తెచ్చామని తెలిపారు. నాలుగేళ్ల మోదీ పాలన భేషుగ్గా వుందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడన్నారు. 

'గాంధీ`నుండి చంచల్ గూడకు 'గాంధీ`..

హైదరాబాద్ : నాంపల్లి లేబర్ కోర్టు న్యాయమూర్తి గాంధీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గాంధీని అధికారులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. కాగా గాంధీకి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ సెషన్స్ జడ్జి మల్లంపాటి గాంధీ ఏసీబీ డిప్యూటి డైరెక్టర్ మల్లంపాటి గాంధీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వారాసీగూడలో అతడిని అదుపులోకి తీసుకొనే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

టెక్నాలజీతో పాలనలో పారదర్శకత : సీతారామన్

ఢిల్లీ : రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాలనలో పారదర్శకత తీసుకొచ్చామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ టెక్నాలజీకి వ్యతిరేకమనీ.. ఈవీఎంలను కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. వ్యవసాయ కుంభకోణాన్ని కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడుతోందనీ...దివంగత నేత ఇందిరాగాంధీపై తీర్పు వచ్చినప్పుడు న్యాయవ్యవస్థ పట్ల మీరు ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోవాలని సూచించారు. 

లొంగిపోయిన మహిళా మావోయిస్టు..

శ్రీకాకుళం : మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు సుందరమ్మ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయింది. సుందరమ్మ అలియాస్ సాధన స్వస్థలం వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం వాసి. 

ఎడ్లబండ్ల ప్రదర్శనలో అపశృతి..

కామారెడ్డి: ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహిస్తుండగా ఎడ్లు బెదిరి జనంపైకి బండి దూసుకెళ్లడంతో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన దోమకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఉగాది సంబరాల్లో భాగంగా ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహిస్తుండగా జనంపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా బోరెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. మిగితా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కొనసాగుతున్న టీ.మాస్ బహిరంగ సభ..

రంగారెడ్డి : కిస్మత్ పూర్ లో టీ.మాస్ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభకు ప్రొఫెసర్ కంచె ఐలయ్య, తమ్మినేని వీరభద్రం, విమలక్క,జాన్ వెస్లీ, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచె ఐలయ్య మాట్లాడుతు..బడుగు, బలహీన వర్గాలను నాయకులుగా తీర్చిదిద్దుతామని టీ.మాస్ చైర్మన్ కంచె ఐలయ్య పేర్కొన్నారు.  టీఆర్ఎస్ లో కేవలం నలుగురే నాయకులున్నారని మిగతావారంతా కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలేనని ఎద్దేవా చేశారు.

18:59 - March 18, 2018

గుంటూరు : ఏసీబీ డిఎస్పీ గోసాల మురళీకృష్ణకు ఉగాది మహోన్నత సేవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 1985 ఫిబ్రవరిలో పోలీసు శాఖలో చేరిన మురళీకృష్ణ ఇప్పటికే పలు అవార్డులను అందుకున్నారు. 2 వేల 11 లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇండియన్‌ పోలీసు మోడల్‌ అవార్డును స్వీకరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గతంలో అత్యాధునిక ఆయుధ సామాగ్రిని కాపాడినందుకు పలు రివార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మురళీకృష్ణకు అవార్డు ప్రకటించడంతో అవినీతినిరోధక శాఖ, పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు. 

18:53 - March 18, 2018

జమ్ము కాశ్మీర్ : సరిహద్దుల్లో పాకిస్తాన్‌ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ సరిహద్దుల్లో కాల్పులతో తెగబడింది. పౌరులే లక్ష్యంగా గ్రామాలపై బుల్లెట్లు, మోర్టార్‌షెల్స్‌ వర్షం కురిపించింది. ఈ దాడిలో ఐదుగురు పౌరులు మరణించారు. ఫూంచ్‌ సెక్టార్‌ బాల్‌కోట్‌ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయి. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు పేర్కొన్నారు. పాక్ కాల్పులకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా జవాబిచ్చింది. 

అతిసార బాధితులకు పరిహారం : ఏపీ మంత్రులు

గుంటూరు : అతిసార బాధితులకు పరిహారం అందజేస్తామని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఆనందబాబులు హామీ ఇచ్చారు. అతిసార బాధిత ప్రాంతాలలో ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,నాయరణ, ఆనందబాబులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు..అతిసారం పూర్తిగా తగ్గినా ఆ ప్రాంతంలో వైద్య శిభిరాలను కొనసాగిస్తామని తెలిపారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్ల వల్లనే నీరు కలుషితమైనట్లు భావిస్తున్నామన్నారు. సర్వజనాసుపత్రిలో 43 మంది అతిసార బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు.

18:38 - March 18, 2018

రంగారెడ్డి : టీ.మాస్ ఆవిర్భావ సభ కొనసాగుతోంది. ఈ సభలో టీ.మాస్ చైర్మన్ కంచె ఐలయ్య ప్రసంగించారు. ప్రతీ వెనుకబడిన కులాలలో నాయకులను సృష్టించాలని టీ.మాస్ సభలో మాట్లాడుతున్న సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ టీ. మాస్ లో అనేకమంది ఉద్యమ నాయకులున్నారని పేర్కొన్నారు. ప్రజాగాయకుడు గద్దర్, విమలక్క వంటి మహా ఉద్యమకారులున్నారని తెలిపారు. విమలక్కను మించిన గాయకురాలు లేరనీ రాష్ట్ర ఉద్యమంలో ఆమె గజ్జెకంటి పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచిన మంచి గాయకురాలని ఆమెను ప్రశంసించారు. రాష్ట్ర విముక్తి కోసం తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందన్నారు. అటువంటి ఆమె టీ.మాస్ స్ట్రీరింగ్ కమిటీ సభ్యురాలుగా వుందన్నారు. వేలాది కిలోమీటర్ల కొద్ది తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకున్న తమ్మినేని వీరభద్రం సెక్రటరీగా వున్నారన్నారు. కానీ 2001లో పుట్టిన టీఆర్ఎస్ లో కేవలం నలుగురు నాయకులే వున్నారన్నారు. ఈ నాయకులంతా కేసీఆర్ కుటుంబ సభ్యులేనని విమర్శించారు. 

18:35 - March 18, 2018

ఢిల్లీ : ప్రధాని మోదీ, బీజేపీలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన బీజేపీపై మునుపెన్నడూ చేయని విధంగా ఆరోపణలు చేశారు. ఓ నిందితుడిని అధ్యక్షుడిగా చేసుకున్న పార్టీ బీజేపీ అంటూ విమర్శించారు. తాము మహాభారతంలోని పాండవుల్లా ధర్మం కోసం పోరాడుతుంటే... బీజేపీ, ఆర్ఎస్ఎస్ కౌరవుల్లా అధికారం కోసం పాకులాడుతున్నాయన్నారు. మోదీపై యువత పెట్టుకున్న నమ్మకం తొలగిపోతోందన్నారు. అవినీతిపై యుద్ధం చేస్తామన్న ప్రధాని.. లలిత్ మోదీ, నీరవ్ మోదీ విదేశాలకు పారిపోతే ఏం చేశారని ప్రశ్నించారు. 

18:33 - March 18, 2018

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్‌లో ఉన్న చిన జీయర్‌ స్వామి ఆశ్రమంలో ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, చిన్న జీయర్‌ స్వామి, కిన్నర వెల్‌ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగ చంద్రిక దేవీ హాజరైయ్యారు. సమాజ అభివృద్ధికి మహిళలు ఎంతో తోడ్పడుతున్నారని మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. సమాజం బాగుపడలంటే కుటుంబ వ్యవస్థ ఎంతో ముఖ్యమని, అందుకే సమాజంలో ప్రతి ఒక్కరు అమ్మలాంటి మహిళలను గౌరవించాలని ఆయన సూచించారు. 

18:12 - March 18, 2018

ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుంటామని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 2019లో 100 ఎమ్మెల్యేలతో పాటు 16 ఎంపీలను గెల్చుకుంటామన్నారు. నియంతృత్వ పాలన సాగిస్తోన్న కేసీఆర్‌ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. థర్డ్‌ఫ్రంట్‌ అంటున్న కేసీఆర్‌... మోదీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మెదీ అధికారంలోకి వచ్చాక పెట్రోలు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆరోపించారు. దేశ ప్రజలు జీఎస్టీ,డీమానిటేషన్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. రైతులు పంటకు కనీస మద్ధతు ధర కూడా లేదన్నారు. రాజీవ్ గాంధీ సంస్కరణలు తెచ్చినట్లుగా రాహుల్ కూడా దేశంలో పలు మార్పులను తీసుకొస్తారని అభిప్రాయపడ్డారు.   

18:09 - March 18, 2018

ఢిల్లీ : మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ కవల పిల్లలని కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ చెప్తోన్నది థర్డ్‌ఫ్రంట్‌ కాదని... అదో స్టంట్‌అని కొట్టిపారేశారు. కేసీఆర్‌ను మోదీ వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. మోదీపై వస్తున్న వ్యతిరేకతను కాంగ్రెస్‌వైపు మళ్లకుండా కేసీఆర్‌తో థర్డ్‌ఫ్రంట్‌ నాటకం ఆడిస్తున్నారని కొట్టిపారేశారు. ఈ కూటములను ప్రజలు నమ్మరని.. కాంగ్రెస్‌నే ప్రజలు గెలిపిస్తారని తెలిపారు.

18:01 - March 18, 2018
17:58 - March 18, 2018

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుగు భాషపై గౌరవం లేనప్పుడు కేంద్రప్రభుత్వం తెలుగువారిని ఎలా పట్టించుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ విమర్శించారు. విజయవాడలోని ఎంబీవీకే భవన్‌లో అభ్యుదయ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు వారు ఉగాది పండుగను అతి పెద్ద పండుగగా భావిస్తారని, అయితే ప్రస్తుతం యువత దీని ప్రాముఖ్యత తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉందన్నారు. ఇంగ్లీష్‌ మీడియం చదువులతో తెలుగు భాష కనుమరుగైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా తెలుగు వారి డిమాండ్‌ అని... దీనిని ఎన్నికల స్టంట్‌ చూడకుండా ప్రతి ఒక్కరు హోదా సాధన కోసం ఉద్యమించాలని ఎంవీఎస్‌ శర్మ పిలుపునిచ్చారు.

17:56 - March 18, 2018

విజయవాడ : ప్రతి ఏడాది లాగే మామిడి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఏడాది ఏడాదికి మామిడి మార్కెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. పూత పూయడం ఆలస్యం కావడం, కాపు సగానికి పడిపోవడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యాపార క్రయ విక్రయాలు అంతకంతకు పడిపోతుండడంతో రైతులు అనేక అటుపోట్లు చవిచూడాల్సి వస్తోంది.

మామిడి మార్కెట్‌కు గడ్డు పరిస్థితులు
ఆసియాలోనే అతిపెద్దగా ఉన్న మామిడి మార్కెట్‌కు గడ్డు పరిస్థితులు తలెత్తుతునే ఉన్నాయి. ఉగాది వచ్చినా మామిడి మార్కెట్‌కు కళ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటు తెలంగాణలోని ఖమ్మం ఇతర ప్రాంతలలో నుంచి విజయవాడ రూరల్‌ మండలంలో ఉన్న మార్కెట్‌కు మామిడి రవాణా జరుగుతుంది. గత కొంత కాలం నుండి కాపు అంతంత మాత్రంగా ఉండడంతో మామిడి మార్కెట్‌ పై తీవ్ర ప్రభావం పడుతు వస్తోంది. ప్రతి ఏడాది ఉగాది నాటికి మార్కెట్లో 100 టన్నుల క్రయ, విక్రయాలు జరిగేవి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా జరిగింది.

దేశంలో అత్యధికంగా మామిడి పండించే రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ
దేశం మొత్తం మీద మామిడిని అత్యధికంగా పండించే రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 3 లక్షల 36 వేల 956 హెక్టర్లలో మామిడి సాగవుతుంది. దేశంలోని మొత్తం మామిడి ఉత్పత్తిలో 24 శాతం ఏపీ నుంచే వస్తోంది. బంగినపల్లి, నీలాలు వంటి వాటితో పాటు సుమారు 20 రకాల మామిడి పండ్లను రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. మామిడి పూతకు వచ్చే సమయంలో వర్షాలు, మబ్బులు పట్టే వాతవరణం ఉండరాదు. అలా ఉంటే ఫలదీకరణ సరిగ్గా జరగక దిగుబడి ఉండదు. వాతావరణంలో మార్పుల కారణంగా పూత ఆలస్యం జరిగింది. మామిడి పూత సాధారణంగా జనవరిలో రావాలి. కానీ ఈ సారి పూత ఇంకా ఆలస్యంగా రావడం, వచ్చింది సరిగ్గా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3,36,956 హెక్టార్లలో మామిడి సాగు
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3 లక్షల 36 వేల 956 హెక్టర్లలో మామిడి సాగు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ లెక్కలు చెపుతున్నాయి. ఇందులో కృష్ణా జిల్లాలో 60 వేల హెక్టార్లు, అనంతపురంలో 49 వేల 430, విజయనగరంలో 43 వేల 467 హెక్టార్లు, చిత్తూరులో 77 వేల 637, శ్రీకాకుళంలో 10 వేల 215, విశాఖపట్నంలో 16 వేల 790, తూర్పు గోదావరిలో 15 వేల 864, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 వేల 499, గుంటూరులో 984, ప్రకాశం 8 వేల 458, నెల్లూరులో 10 వేల 520, కడప 27వేల 500 కర్నూలులో 9 వేల 012 హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ లెక్కలు చెపుతున్నాయి. మామిడి తోటకు ఏటా 55 నుంచి 60 వేల ఖర్చు చేస్తామని రైతులు చెపుతున్నారు. మంచి కాపు వస్తే 10 టన్నుల దిగుబడి ఉంటుందన్నారు.

17:53 - March 18, 2018

అనంతపురం : పట్టణంలోని కృష్ణాకళా మందిరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంప్రదాయ బద్దంగా వేద పండితులు పంచాగ శ్రవణం చేయగా, అందులో రాశి ఫలాలు, రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను పండితులు వివరించారు. ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజలకు సుపరిపాలన అందించడంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు కాలువ శ్రీనివాసులు.

17:51 - March 18, 2018

హైదరాబాద్ : సామాన్యులకు కూడా రామాయణాన్ని అర్థం చేసుకునే విధంగా ఈ పుస్తకం రూపొందించడం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. వాల్మీకి కవి సార్వభౌమ శ్రీ వాసుదాస స్వామి అనువదించిన వాల్మీకి రామాలయం బాలకాండను ముఖ్యమంత్రి సీపీఆర్వో... వనం జ్వాలా నరసింహారావు శిష్ట వ్యావహారిక భాషలో అనువదించారు. శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం పేరుతో రూపొందించిన ఈ బాలాకాండ మందర మకరందం రెండో ప్రచురణను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్వాలా నరసింహరావు ఆదివారం అందచేశారు. 

17:47 - March 18, 2018

గంటూరు : లంకభూముల విషయంలో దళితులకు అన్యాయం జరిగిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దీనిపై జ్యుడీషల్‌ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్‌.. రైతులను కలిసి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం జరింగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.    

17:45 - March 18, 2018

సంగారెడ్డి : పటాన్‌చెరు మండలం కర్దనూర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా ఢికొన్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందగా .. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పటాన్ చెరు నుండి హైదర్ గూడకు ఇటుకల లోడుతో వెళుతున్న లారీ శంకర్ పల్లి నుండి పటాన్ చెరువైపు సిమెంట్ లోడుతో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీ కొంది. ఈ ఘటనలో ఇటుకలారీలో వున్న నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. అయితే అక్కడ గోడ అడ్డుతగలడంతో పెనుప్రమాదం తప్పింది. లారీకి తగిలి తెగిన విద్యుత్‌ వైర్లు రోడ్డుకు అడ్డంగా డిపోయాయి. గాయపడ్డవారిని సంగారెడ్డిలోని ఆస్పత్రికి రలించారు.బాధితులు మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటకు చెందిన వారిగా గుర్తించారు.

వపన్ డిమాండ్..మంత్రుల యాక్షన్..

గుంటూరు : అతిసార బాధిత ప్రాంతాలలో ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,నాయరణ, ఆనందబాబులు పర్యటించారు. ఆనంతపేట, సుద్దపల్లికొండలోని మురుగునీటి పంప్ కేంద్రాలను మంత్రులు పరిశీలించారు. నగరంలో అతిసార ప్రభావం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో యుద్ధప్రాతిపదికన వంద కిలోమీటర్ల మేర నూతన పైప్ లైన్లను నిర్మిస్మాన్నామని తెలిపారు. 

లారీలు ఢీ, ఒకరు మృతి..

సంగారెడ్డి : ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడినవారిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

మేము పాండవులం,వారు కౌరవులు : రాహుల్

ఢిల్లీ : ఏఐసీసీ ప్లీనరీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిజాయితీగా తాము దేశం కోసం పాండవుల్లా పోరాడతుంటే..బీజేపీ అధికారం కోసం కౌరవుల్లా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లా ప్రవర్తించలేదన్నారు. ఈ నేపథ్యంలో దేశం మొత్తం కాంగ్రెస్ పైనే ఆశలుపెట్టుకుందన్నారు. కాంగ్రెస్ కు దేశ భవితను మార్చే శక్తి వుందని ధీమా వ్యక్తం చేశారు. 

మోదీ హయాంలో పెట్రోలు ధరలు పైకే : కోమటిరెడ్డి

ఢిల్లీ : మెదీ అధికారంలోకి వచ్చాక పెట్రోలు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆరోపించారు. దేశ ప్రజలు జీఎస్టీ,డీమానిటేషన్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. రైతులు పంటకు కనీస మద్ధతు ధర కూడా లేదన్నారు. రాజీవ్ గాంధీ సంస్కరణలు తెచ్చినట్లుగా రాహుల్ కూడా దేశంలో పలు మార్పులను తీసుకొస్తారని అభిప్రాయపడ్డారు.   

కేసీఆర్ ను ఓడించటమే మా లక్ష్యం : కోమటిరెడ్డి

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను ఓడించటమే తమ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకుంటామని ఉద్వేగంతో తెలిపారు. 100 అసెంబ్లీ స్థానాలు, 16 ఎంపీ స్థానాలు సాధిస్తామని కోమటి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. థర్డ్ ఫ్రంట్ అంటున్న కేసీఆర్ కేంద్రంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎందుకు మద్ధతు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

మా తీర్మానానికి 150 మంది మద్దతు : గంటా

అమరావతి : గత ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా బీజేపీతో క‌లిశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందక పోవడంతో తెలుగువారి ఆత్మ‌గౌర‌వం కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు పోరాట మార్గం ఎంచుకున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ తీసుకున్న నిర్ణ‌యం చ‌రిత్రాత్మ‌క‌మైందని, చంద్ర‌బాబు నిర్ణ‌యం దేశంలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. దేశ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని అనేక పార్టీలు కోరుతున్నాయని అన్నారు.

అవిశ్వాస తీర్మానాన్ని తేలిగ్గా ఓడిస్తాం : అమిత్ షా

ఢిల్లీ : ఎన్డీఏకు 300 మందికిపైగా ఎంపీల మద్దతు ఉందని..కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తాము తేలికగా ఓడిస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కాగా విభజన హామీల అమలు విషయంలో ఎన్డీయే ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా టీడీపీ కేంద్ర కేబినెట్ నుండి, ఎన్డీయే కూటమి నుండి కూడా వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. దీనికి ఎన్డీయే మిత్రపక్షాలు కూడా మద్దతునిస్తామని ప్రకటించాయి.

అవిశ్వాస తీర్మానాన్ని తేలిగ్గా ఓడిస్తాం : అమిత్ షా

ఢిల్లీ : ఎన్డీఏకు 300 మందికిపైగా ఎంపీల మద్దతు ఉందని..కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తాము తేలికగా ఓడిస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కాగా విభజన హామీల అమలు విషయంలో ఎన్డీయే ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా టీడీపీ కేంద్ర కేబినెట్ నుండి, ఎన్డీయే కూటమి నుండి కూడా వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. దీనికి ఎన్డీయే మిత్రపక్షాలు కూడా మద్దతునిస్తామని ప్రకటించాయి.

మోదీ వల్ల దేశ పరువు మంటగలుస్తోంది : మన్మోహన్

ఢిల్లీ : మోదీ స‌ర్కారు విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఉన్న పేరు చెడిపోతోందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలు పాకిస్థాన్‌, చైనాల పట్ల భారత ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ స‌ర్కారు అనుసరిస్తోన్న విధానాలపై మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీలో రెండో రోజు జరుగుతోన్న‌ కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న మ‌న్మోహ‌న్ సింగ్ మాట్లాడుతూ... జమ్ముకశ్మీర్‌ వివాదాన్ని మోదీ స‌ర్కారు తప్పుదోవ పట్టిస్తోందని, ఆ రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయని విమ‌ర్శించారు. 

పవన్ దారిలో జన, జల ప్రవాహాలు : పండితులు

గుంటూరు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లిన చోట జన, జన ప్రవాహాలు పుష్కలంగా వుంటాయని పంచాంగ కర్తలు తెలిపారు. ఆయన కాలిడిన చోట కుంభమేళను తలపించేలా ప్రజలు తలపిస్తారని తెలిపారు. రాజధాని ప్రాంతంలోను ఉద్దండరాయుని పాలెంలో పర్యటించారు. ఆ ప్రాంత రైతులతో కలిసి ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి పంచాంగ శ్రవణాన్ని విన్నారు. ఈ క్రమంలో పవన్ రాశి ఫలాలను సిద్దాంతులు తెలిపారు. పవన్ కళ్యాణ్ రాశి ఫలాలు అద్భుతంగా వున్నాయని తెలిపారు. రాజకీయంగా ఉన్నత పదవులను పొందుతారనీ..జనసేన నాయకత్వంతో ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకుంటారని పంచాంగ కర్తలు పేర్కొన్నారు.

అభివృద్ధి కొందరికే పరిమితం కారాదు : పవన్

గుంటూరు : అభివృద్ధి కొందరికే పరిమితం కాకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉద్దండరాయుని పాలెంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ లంక భూములను పరిశీలించి వివరాలను కనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడానని రాజధానికి ఇష్టపూర్వంగానే భూములు ఇచ్చామనిరైతులు తెలిపారన్నారు. భూములను అవసరం మేరకే తప్ప అవసరానికి మించి తీసుకోకూడదని సూచించారు. ప్రపచం స్థాయి రాజధాని నిర్మించాలంటే దశాబ్దాల కాలం పడుతుందన్నారు. సింగపూర్ తరహా అభివృద్ది జరగాలంటే పాలన కూడా అదేస్థాయిలో వుండాలన్నారు.

డీఎస్పీ మురళీకృష్ణకు ఉగాది పురస్కారం..

విజయవాడ : ఏసీబీ డీఎస్పీ మురళీకృష్ణ ఉగాది మహోత్సవ పురస్కారం అందుకున్నారు. విజయవాడ ఏసీబీ డీజీ కార్యాలయంలో డీఎస్పీ మురళీకృష్ణ విధులు నిర్వహిస్తు మురళీ కృష్ణకు అత్యుత్తమ ఇండియన్ పోలీస్ మెడల్ తో పాటు..250 రివార్డులు దక్కాయి. నిబద్ధతతోకూడిన మెరుగైన పనితీరుకు ఈ సేవా పతకాలను మురళీ కృష్ణ సాధించినట్లుగా తెలుస్తోంది. మహోన్నత సేవా పథకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఏసీబీ డీజీ కార్యాలయంలో డీఎస్పీ మురళీకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. 

మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన..

జమ్ము కశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి తన దుర్భుద్ధిని బైటపెట్టింది. మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ సైన్యం కాల్పుల్లో ఐదుగురు భారత పౌరులు మృతి చెందారు. 

14:50 - March 18, 2018

హైదరాబాద్ : ఉగాది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. అలాగే అందరి జీవితాలలోను కూడా కష్టాలు సుఖాలు వచ్చి పోతుంటాయి. ఈ క్రమంలో ఉగాదికి మనిషి జీవితానికి చాలా దగ్గరు సంబంధాలున్నాయి. అలాగే ఉగాది పండుగలో శాస్త్రీయత కూడా ఇమిడి వుంది. సాధారణంగా పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి వుంటాయి. వాటిలో ఉగాది పండుగ కూడా ఒకటి. కాలాలు మారుతున్న క్రమంలో శీతాకాలం తరువాత వచ్చే వేసవి కాలం ఆరంభంలో వచ్చే పండుగ ఉగాది. ఇది ముఖ్యంగా తెలుగు వారి పండుగ అని చెబుతుంటారు. కానీ ఇది అందరి పండుగ. ఎందుకంటే కాలాలు మారుతున్న క్రమంలో అంటే శీతాకాలం వెళ్లి వేసవి కాలంలో వచ్చే వ్యాధులను నుండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉగాది పండుగకు చేసే ఉగాది పచ్చడి చాలా ఉపయోగపడుతుంది. ఈ పచ్చడిలో వాడే పదార్ధాలన్నీ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లం, మామిడి కాయ, వేపపూతలోని చేదు, చెరుకులోని తీపి ఇలా అన్నింటిలోను మనిషి ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలే కావటంతో ఉగాది మనిషితో ఆరోగ్యంతో ముడిపడిన పండుగగా చెప్పుకోవచ్చు. అలాగే మనిషికి సంగీతం, నృత్యం,ఆటలు,పాటలు వంటివి మనిషిని ఉత్సాహంగా ఉంచేందుకు, ఆరోగ్యం వుండేదుకు దోహద పడతాయి. అందుకనే ఉగాది పర్వదినాన 10టీవీ గాయకుల గానాలతో అందరి మనస్సులను ఉల్లాసపరిచేందుకు గాయకులతో ఉగాది ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది. మీకోసం మీ మనస్సులను ఉల్లాసపరిచేందుకు మీ ముందుకు వచ్చారు. సంగీత దర్శకుడు భీమ్స్, గాయకులు సాహితి,రఘురామ్ లతో మీ ముందుకు వచ్చింది ఉగాది ప్రత్యేక కార్యక్రమం.. మరి వారి గానమృతంతో మనస్సుని ఉల్లాసపరుచుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయాల్సిందే...

13:32 - March 18, 2018

హైదరాబాద్ : బంగారు, డైమండ్‌ ఆభరణాలకు తనిష్క్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. మహిళా మణులను ఆకట్టుకునేందుకు తనిష్క్‌ జ్యూవెల్లరీ ఎప్పుడూ సరికొత్త వెరైటీస్‌ను పరిచయం చేస్తుంది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగువారికి సరికొత్త వెరైటీస్‌తో బంగారు, డైమండ్‌ ఆభరణాలను అందించబోతోంది. దేశంలో నాణ్యమైన, నమ్మకమైన బంగారు ఆభరణాలకు ట్రేడ్‌మార్క్‌ అయిన తనిష్క్‌ జ్యువెలరీ సరికొత్త డిజైన్స్‌ను తీసుకొచ్చింది. ఉగాది పర్వదినాన కనీవినీఎరుగని రీతిలో ఆఫర్స్‌తో ఆకట్టుకుంటూ మగువల మనసు దోస్తున్న తనిష్క్‌ జ్యూవెలరీ ఆఫర్స్‌పై 10టీవీ కథనం... బంగారు, డైమండ్‌ ఆభరణాలకు పెట్టింది పేరు తనిష్క్‌ జ్యువెలరీ. టాటా గ్రూపునకు చెందిన తనిష్క్‌ జ్యువెలరీ .. సాటిలేని డిజైన్లు, తిరుగులేని నాణ్యతకు మారుపేరుగా నిలుస్తోంది. అందుకే రెండు దశాబ్దాల కాలంలో దేశంలో ఎక్కువమంది అభిమానించే జ్యువెలరీ బ్రాండ్‌గా ఎదిగింది తనిష్క్‌.

మారుతున్న కలానికి అనుగుణంగా.. మగువల మనసు దోసుకోవడంలో తనిష్క్‌ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుంది. భారతీయ మహిళా మనసెరిగిన సంప్రదాయాన్ని ఆధునిక, అభిరుచులను అవసరాలను మేళవించిన ఏకైన ఆభరణాల సంస్థగా తనిష్క్‌ జ్యువెలరీ పేరుపొందింది. గత ఏడాది దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన జ్యువెలరీ బ్రాండ్‌గా ట్రస్ట్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ అవార్డును సైతం తనిష్క్‌ సొంతం చేసుకుంది.

దేశంలో అతిపెద్ద, ఎక్కువ మంది అభిమానించే జ్యువెలరీ బ్రాండ్‌గా తనిష్క్‌ బంగారు ఆభరణాల విక్రయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తోంది. దేశంలోనేకాదు... ప్రపంచవ్యాప్తంగా తనిష్క్‌ జ్యువెలరీ గోల్డ్‌, డైమండ్‌ ఆభారణాలకు పెట్టింది పేరు. కనుమరుగవుతున్న పద్మావతి కలెక్షన్‌లోని అందె ఉంగరాలు, గాజులు, మెడపట్టి, నెక్లెస్‌లు, పాపిడ పిందెలు, వంకీలు, దండకడియాలు, ఉంగరాలు, బ్రేస్‌లెట్లు, దిద్దులులాంటి ఐటెమ్స్‌ జ్యువెలరీని మార్కెట్‌లోకి తీసుకొచ్చి కొనుగోలుదార్లను తనవైపు తిప్పుకుంటోంది.

దేశంలోని ప్రముఖ జ్యువెలరీలకు తనిష్క్‌ ఏమాత్రం తీసిపోదు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు వెరైటీస్‌ను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా వెడ్డింగ్‌ కలెక్షన్స్‌లో తనిష్క్‌ది అందెవేసిన చేయి. నాణ్యమైన, సరసమైన ధరలతో లక్షలాది కస్టమర్లకు గోల్డ్‌, డైమండ్‌ ఆభరణాలను అందిస్తోంది. తెలుగువారి నూతన సంవత్సర పర్వదినం ఉగాదిని పురస్కరించుకుని సరికొత్త వెరైటీస్‌ను పరిచయం చేస్తోంది. అందేకాదు. ఉగాది ఆఫర్స్‌తో గోల్డ్‌, డైమండ్‌ ఆభరణాలను అందిస్తోంది.

నమ్మకం, విశ్వాసంతోపాటు అస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా ఆభరణాలను అందిస్తోంది తనిష్క్‌ జ్యువెలరీ. అందుకే తనిష్క్‌ ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటుంది. తనిష్క్‌ అంటే నమ్మకమని.. అందుకే ఏ చిన్న ఆభరణాలు తీసుకోవాలన్నా తనిష్క్‌నే ఎంచుకుంటామని కస్టమర్లు చెబుతున్నారు. ఇవాళ రేపు ఉగాది ఆఫర్లతో తనిష్క్‌ జ్యువెలరీ ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే వెళ్లి మీకు ఇష్టమైన బంగారు, డైమండ్‌ ఆభరణాలు తెచ్చుకోండి.

13:29 - March 18, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలో జరిగిన పంచాంగ శ్రవణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉగాది పచ్చడి రుచిచూశారు. పండితుల ఆశీదర్వాదం తీసుకున్నారు. కొత్త ఏడాదిలో తెలుగు ప్రజలకు శుభం జరగాలని కోరుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మనిషి జీవితంలో అనుభవాలకు గుర్తులని.. కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని ఉగాది మనికు సందేశం ఇస్తుందన్నారు ఏపీ సీఎం.

కేంద్రం చివరిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి తాను తీవ్ర నిరాశకు లోనయ్యానన్నారు. మాట ఇచ్చి మోసం చేస్తున్నారని కేంద్రాన్ని గట్టి నిలదీశానన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యుద్ధం చేస్తామని చెబుతోందని.. ఆయుద్ధం ఎవరిపై చేస్తారు.. తెలుగు జాతిపైనేనా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. గత 60 ఏళ్లలో ఆంధ్ర ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారని సీఎం చంద్రబాబు అన్నారు.60వేల కోట్ల అప్పుతో అమరావతికి వచ్చిన ఏపీ ప్రజలు.. ఉగాది సందేశాన్ని స్వీకరించి.. అభివృద్ధి దిశగా పట్టుదలతో సాగాలన్నారు సీఎం చంద్రబాబు. 

13:28 - March 18, 2018

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మదాయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడకల్లో వేదపఠనం, వ్యవసాయ, ఉద్యానవన పంచాంగం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. డా.ప్రభల సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు.  

కౌడిపల్లిలో విషాదం...

మెదక్ : కౌడిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మహ్మద్ నగర్ చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. 

12:37 - March 18, 2018

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాగ శ్రవణం చెప్పారు. వివిధ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా పడుతాయని.. చెరువులు నిండుతాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని.. అన్ని రంగాల్లోని స్త్రీలకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది తెలంగాణకు అన్నీ శుభఫలితాలే వస్తాయన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో దూసుకు పోతున్న రాష్ట్రం.. కొత్త ఏడాదిలో మరింత పురోభివృద్ధివైపు అడుగులు వేస్తుందన్నారు. ఉగాది రోజు స్వీకరించే పచ్చడి.. మనిజీవితంలో సంభవించే కష్టసుఖాలకు, లాభనష్టాలకు ప్రతీకలని కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం తనకు తాను అభివృద్ధి చెందుతూ.. జాతీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. పూజారులకు, ఇమాంలకు జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు కేసీఆర్‌. ఉగాది వేడుకల ఏర్పాట్లను అద్భుతంగా చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖను ముఖ్యమంత్రి అభినందించారు. 

పవన్ రాశి అద్భుతం - పండితులు...

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ రాశి అద్భుతంగా ఉందని పండితులు పేర్కొన్నారు. రాజకీయంగా ఉన్న పదవులు పొందుతారని, జనసేన నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. పవన్ వెళ్లిన చోట, జల ప్రవాహాలు పుష్కలమన్నారు. కళ్యాణ్ ఉన్న చోట కుంభమేళ జరుగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎత్తుపల్లాలు వస్తాయన్నారు. 

మొదటి నుండి అదే అడుగుతున్నా - బాబు..

విజయవాడ : స్పెషల్ స్టేటస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని మొదటి నుండి అడుగుతూనే ఉన్నానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుమ్మలపళ్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెబుతున్నారని, కానీ ఇతర రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తున్నారని ప్రశ్నించారు. కవులు..కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. 

12:19 - March 18, 2018

గుంటూరు : అసమానతలతో విశ్వనగరం ఏర్పాటు కాదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాల్లోని ఉద్ధండరాయుపాలెంలో రైతులతో కలిసి ఆయన ఉగాది పర్వదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...బాపట్లలో పుట్టినవాడిగా..ఇక్కడ రాజధాని ఏర్పాటు కావాలని ఆకాక్షించానని, రాజధాని లేకుండా గెంటేశారని...విభజనలో అన్యాయం జరగడంతో జనసేన ఆవిర్భావానికి కారణమని తెలిపారు. చండీగడ్ మొదటి ఫేజ్ లో నెమ్మదిగా అభివృద్ధి జరిగిందని, రాత్రికి రాత్రి రాజధాని కట్టేయాలని సీఎం చంద్రబాబు నాయుడులో ఉండవచ్చని..ఇక్కడి రైతుల్లో కూడా ఉండవచ్చన్నారు. అవసరమేర భూములు తీసుకోవాలని...స్వచ్చందంగా ఇస్తే భూములు తీసుకోవాలన్నారు. సింగపూర్ రాజధాని తరహా కావాలని కలలు కంటున్నారని, కానీ అక్కడి పాలకుల పాలన ఏ విధంగా ఉంటుందో ఇంటర్నెట్ లో చూడాలని సూచించారు.

అభివృద్ధి కొంతమందికి మాత్రమే వర్తించకుండా అందరికీ అందే విధంగా చూడాలని, అసమానతలే చాలా గొడవలకు దారి తీస్తాయన్నారు. గట్టుకు ఒకవైపు ఒక న్యాయం..గట్టు మరోవైపు మరొక న్యాయం జరుగుతుంటే కష్టించే రైతులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతుందన్నారు.

అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఎమ్మెల్యే అయినా ఒకే విధంగా చూడాలని, రాజకీయ లబ్ది కోణంలో జనసేన చూడదన్నారు. అసమానతలతో విశ్వనగరం ఏర్పాటు చేయలేమని, సమానమైన న్యాయం చేయాలని...కొంతమందికి ఇక్కడ అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని సూచించారు. పాలసీ విధానంలో తప్పులుంటే నిలదీయడం జరుగుతుందని, వ్యక్తుల మీద దాడి చేయవద్దని సూచించారు. 

తప్పులుంటే నిలదీస్తాం - పవన్...

గుంటూరు : పాలసీ విధానంలో తప్పులుంటే నిలదీయడం జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యక్తుల మీద విమర్శల దాడి చేయవద్దని జనసేన కార్యకర్తలకు సూచించారు. 

అసమానతలతో విశ్వనగరం చేయలేం - పవన్...

గుంటూరు : అసమానతలతో విశ్వనగరం ఏర్పాటు చేయలేమని, సమానమైన న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ తెలిపారు. కొంతమందికి ఇక్కడ అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని సూచించారు.

అన్యాయం జరిగిందనే జనసేన ఆవిర్భావం - పవన్...

గుంటూరు : రాజధాని లేకుండా గెంటేశారని...విభజనలో అన్యాయం జరగడంతో జనసేన ఆవిర్భావానికి కారణమని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ తెలిపారు. చండీగడ్ మొదటి ఫేజ్ లో నెమ్మదిగా అభివృద్ధి జరిగిందని, రాత్రికి రాత్రి రాజధాని కట్టేయాలని సీఎం చంద్రబాబు నాయుడులో ఉండవచ్చని..ఇక్కడి రైతుల్లో కూడా ఉండవచ్చన్నారు. 

రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి - మన్మోహన్ సింగ్...

ఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 84వ కాంగ్రెస్‌ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. 

బాబు ఉన్నంత వరకు ఢోకా లేదన్న అఖిల ప్రియ...

విజయవాడ : రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండనుంది. ? కేంద్ర నిధులు వస్తాయా ? రావా ? అనేక సందేహాలు నెలకొన్నాయని, కానీ ఇక్కడ బాబు ఉన్నంతవరకు ఎలాంటి ఢోకా లేదని మంత్రి భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఉగాది వేడుకలు జరిగాయి. 

11:27 - March 18, 2018

విజయవాడ : రైతులు అందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అఖిల ప్రియ పాల్గొని మాట్లాడారు. రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండనుంది. ? కేంద్ర నిధులు వస్తాయా ? రావా ? అనేక సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇక్కడ బాబు ఉన్నంతవరకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నీళ్ల సమస్యలేదని, ఇక్కడి రైతులు ఎంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం నుండి మరికొంత సహకారం వస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడుల విషయంలో ఏపీ రాష్ట్రం వైపు అందరూ చూస్తున్నారని తెలిపారు. కేవలం బాబుపై నమ్మకంతోనే ఇది జరుగుతోందని పేర్కొన్నారు. 

శ్రీరామ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక...

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్...మంత్రులు...అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను పండితులు ఆశ్వీరచనం చేశారు. ఈసందర్బంగా భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ పత్రికను కేసీఆర్ కు పండితులు అందచేశారు.

11:03 - March 18, 2018

విజయవాడ : తుమ్మలపల్లి కళాక క్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు, మనువడు దేవాన్ష్ పాల్గొన్నారు. స్పీకర్ కోడెలతో పాటు మంత్రులు...అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రబల సుబ్రమణ్య శర్మ పంచాగ శ్రవణం వినిపించారు. అంతకంటే ముందు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పచ్చడి వితరణ జరిగింది. జ్యోతిష్య శాస్త్రం చక్కటి ప్రతీక అని, ఏడాది శుభాధికంగా ఉండే అవకాశం ఉందని ప్రబల సుబ్రమణ్య శర్మ పేర్కొన్నారు. పాడి వృద్ధిలో ఉంటుందని, సుభిక్షంగా ఉంటుందని, పంటలకు అనుకూలంగా వానలు బాగానే కురుస్తాయన్నారు. పది భాగాలు సముద్రంలో ఏడు భాగాలు పర్వతంలో రెండు భాగాలు భూమిపై పడుతుందన్నారు. 9 భాగాలు ఉపయోగపడుతాయన్నారు. పంచాంగం ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ప్రగతి భవన్ లో కేసీఆర్..గుంటూరులో జగన్...

హైదరాబాద్ : ఉగాది వేడుకల్లో ప్రముఖులు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రగతి భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఉగాది వేడుకల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు. 

ఉద్దండరాయునిపాలెంలో పవన్...

గుంటూరు : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దండరాయునిపాలెంకు చేరుకున్నారు. కరకట్ట వెంట ఉన్న రైతుల పొలాలను ఆయన పరిశీలించారు. 

దుర్గగుడి పవిత్రోత్సవాలు...

విజయవాడ : దుర్గగుడి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు జరిగాయి. 9 రోజుల్లో రోజుకో రకం పూలతో పుష్పార్చన చేయనున్నారు. 

రఘువీరా మౌన దీక్ష...

ఢిల్లీ : రాజ్ ఘాట్ దగ్గర ఏపీసీసీ చీఫ్ రఘువీరా మౌన దీక్ష చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గంటపాటు రఘువీర మౌన దీక్ష చేశారు. 

ఉగాది పచ్చడి సేవించిన బాబు దంపతులు...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు ఉగాది పచ్చడిని సేవించారు. కాసేపటి క్రితం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బాబు దంపతులతో పాటు మనువడు దేవాన్ష్..మంత్రులు..అధికారులు పాల్గొన్నారు. 

ఉగాది వేడుకల్లో బాబు దంపతులు...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాసేపటి క్రితం విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో బాబు దంపతులు పాల్గొన్నారు. 

ఉద్దండరాయునిపాలెంకు పవన్...

విజయవాడ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉద్దండరాయునిపాలెంకు వెళ్లనున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆయన, ఈ ఉదయం ఉగాది పండగను జరుపుకోనున్నారు. అమరావతి పరిధిలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన ప్రధాన గ్రామాల్లో ఒకటైన ఉద్దండరాయునిపాలెంలో రైతులను కలువనున్నారు.

 

09:31 - March 18, 2018

టీ20 ట్రై సిరీస్‌ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రోహిత్‌ శర్మ సారధ్యంలో భారత్‌కు షకీబ్‌ అల్‌ హసన్ సారధ్యంలోని బంగ్లాదేశ్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. బంగ్లాదేశ్‌పై టీ20ల్లో ఓటమంటూ లేని టీమిండియా తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ను కొనసాగించాలని పట్టుదలతో ఉండగా...శ్రీలంకను ఓడించి సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు సైతం షాకివ్వాలని తహతహలాడుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌,బంగ్లాదేశ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. గ్రూప్‌ దశలో లంకపై 2 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో పాటు , బంగ్లాదేశ్‌పై బ్యాక్‌ టు బ్యాక్ విజయాలతో ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఇప్పటివరకూ టీ20ల్లో బంగ్లాదేశ్‌పై తిరుగులేని భారత్‌....తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో ట్రై సిరీస్‌ విజేతగా నిలవాలని తహతహలాడుతోంది. ట్రై సిరీస్‌ ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి రావడంతో భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేధ్యంగా కనిపిస్తోంది.

శిఖర్‌ ధావన్‌, సురేష్‌ రైనా,మనీష్‌ పాండే నిలకడగా రాణిస్తుండటం...భారత జట్టు బ్యాటింగ్‌లో బలంగా ఉంది. ఫామ్‌లోకి వచ్చిన రోహిత్‌తో పాటు శిఖర్‌ ధావన్‌, సురేష్‌ రైనా,మనీష్‌ పాండే మరోసారి చెలరేగితే ఫైనల్‌లో భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. గ్రూప్‌ దశ 4 టీ20ల్లోనూ యజ్వేంద్ర చహాల్‌,వాషింగ్టన్‌ సుందర్‌ ఎలా స్పిన్‌ మ్యాజిక్‌తో ఆకట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శార్దూల్‌ ఠాకూర్‌,విజయ్‌ శంకర్‌లతో కూడిన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్ భారత్‌కు అదనపు బలం అనడంలో సందేహమే లేదు.కీలక మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ స్థానంలో జయదేవ్‌ ఉనద్కత్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. అన్ని విభాగాల్లో సమిష్టిగా చెలరేగితే బంగ్లాదేశ్‌ను మరోసారి ఓడించడం భారత్‌కు పెద్ద సవాలేమీ కాదు.

మరో వైపు బంగ్లాదేశ్‌ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది.శ్రీలంకపై రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో సంచలన విజయాలు సాధించిన బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌కు సైతం షాకివ్వాలని తహతహలాడుతోంది. బంగ్లాదేశ్‌పై టీ20ల్లో తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ను కొనసాగించాలని భారత్‌ పట్టుదలతో ఉంది.టీ20ల్లో ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌ ప్రత్యర్ధిగా భారత్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. బంగ్లాదేశ్‌తో ఆడిన 7 టీ20 మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే విజయం సాధించింది. తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో పాటు,పవర్‌ఫుల్‌ టీమ్‌ కాంబినేషన్‌ కలిగిన టీమిండియాకే ఫైనల్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా....బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం భారత్‌కు భంగపాటు తప్పదు.బంగ్లాదేశ్‌ను ఓడించి ట్రై సిరీస్‌ టైటిల్‌ దక్కించుకోవాలంటే ..ఫైనల్‌లో భారత్‌ స్థాయికి తగ్గట్టుగా రాణించాల్సిందే.

09:27 - March 18, 2018

హైదరాబాద్ : నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ సెషన్స్ జడ్జి మల్లంపాటి గాంధీ ఏసీబీ డిప్యూటి డైరెక్టర్ మల్లంపాటి గాంధీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వారాసీగూడలో అతడిని అదుపులోకి తీసుకొనే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గాంధీ సృహ తప్పిపడిపోవడంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు..అక్రమస్తులు సంపాదించారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. లెక్కల ప్రకారం రూ. 3 కోట్లకు పైగానే ఆస్తులున్నట్లు సమాచారం. తనపై కక్షతోనే బంధువులు ఏసీబీకి ఫిర్యాదు చేశారని, తన భార్యకు పుట్టింటి వారిచ్చిన బంగారాన్ని కూడా అక్రమాస్తులుంటున్నారని గాంధీ పేర్కొంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:30 - March 18, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ బలపరిచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఓటమి చెందింది. బీఎంఎస్ అధ్యక్షుడు యూనియన్ శంకర్ విజయం సాధించారు. 5570 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ యూనియన్ కార్మిక సంఘం నేతలు సంబరాలు జరుపుకున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 9 సంఘాలున్నా ఎన్నికల బరిలో నాలుగు సంఘాలు నిలిచాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:30 - March 18, 2018
08:24 - March 18, 2018
07:22 - March 18, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశం మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ మతం పేరిట దేశాన్ని రెండుగా విభజించే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించింది. రాజ్యాంగ సంస్థలపై దాడులు పెరిగిపోయాయని, విపక్షాలను టార్గెట్‌ చేస్తోందని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన నినాదాలు 'సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, న ఖావుంగా...న ఖానేదూంగా'...నాటకమేనని తేలిపోయిందని విమర్శించింది. దేశ ప్రజల ఆకాంక్షలను కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని పేర్కొంది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ ఏఐసీసీ ప్లీనరీ రాజకీయ తీర్మానంలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్లీనరీ సమావేశంలో యూపీఏ ఛైర్మన్ సోనియాగాంధీ మోది పాలనపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగ సంస్థలపై దాడులు, పార్లమెంట్‌ను నిర్లక్ష్యం చేయడం, మతపరంగా దేశాన్ని విభజించడం, విపక్షాలను టార్గెట్‌ చేసే మోది ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని సోనియా స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలను నీరుగార్చడం మినహా మోది ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. మోది హయాంలో చోటుచేసుకున్న అవినీతిని కాంగ్రెస్‌ బయటపెడుతుందని సోనియా స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో మోది నినాదాలు 'సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, న ఖావుంగా...న ఖానేదూంగా'... ఓ నాటకమేనని తేలిపోయిందన్నారు. 2019 ఎన్నికల్లో విజయాన్ని ఆహ్వానిస్తూ... కాంగ్రెస్‌ విజయమే దేశ విజయమని సోనియా పేర్కొన్నారు. త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

అంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..మోది ప్రభుత్వ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని రెండుగా విడగొట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అసంతృప్తి, ఆగ్రహం కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితులను మార్చి, మళ్లీ దేశాన్ని ఒక్కటిగా చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉందని రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే దేశానికి సరైన దిశా నిర్దేశం చేయగలదని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్లీనరీ పలు తీర్మానాలు చేసింది. 2019 ఎన్నికల్లో మోది ప్రభుత్వాన్ని ఓడించడానికి భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పారదర్శకతపై భరోసా కల్పించేందుకు మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమల్లోకి తేవాలని ఈసీని కోరుతూ ప్లీనరీ రాజకీయ తీర్మానం చేసింది. ఈవీఎంల దుర్వినియోగంపై రాజకీయ పార్టీలు, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ నిర్ణయాన్ని కూడా ప్లీనరీ తప్పుపట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన విధానం. కార్యాచరణ కూడా అసాధ్యమేనని పేర్కొంది.

07:19 - March 18, 2018

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లోని హుక్కా కేంద్రాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. హుక్కా సేవిస్తున్న పలువురు యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుక్కా కేంద్రాలపై కేసు నమోదుచేసి, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. యువతీ యువకులకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. 

భద్రాద్రిలో శ్రీరామ తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు...

ఖమ్మం : భద్రాచలం రామక్షేత్రంలో ఆదివారం నుంచి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 26 న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 27న శ్రీరామ మహాపట్టాభిషేకోత్సవం నిర్వహించనున్నారు.

ఉద్ధండరాయుని పాలెంకు పవన్...

శ్రీకాకుళం: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఉద్ధండరాయుని పాలెంకు వెళ్లనున్నారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉద్ధండరాయుని పాలెం గ్రామస్తుల కోరిక మేరకు ఆయన అక్కడకు వెళ్లనున్నారు. 

07:06 - March 18, 2018

ఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గడ్డుకాలమే అంటున్నారు విశ్లేషకులు. జరుగుతున్న పరిణామాలు.. వెల్లడవుతున్న ఫలితాలు పరిశీలిస్తే.. ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితే కనిపిస్తోంది. విపక్షాలు ఐక్యంగా రంగంలోకి దిగితే బీజేపీ విడిగా.. వంద స్థానాలకు మించి దక్కించుకునే అవకాశం లేదని విశ్లేషకుల అంచనా. బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఇదే రకమైన అంచనా వేసింది.

 • కమలం గుబాళింపులు తగ్గినట్లేనా..?
 • మోదీ-అమిత్‌షా నేతృత్వంలో 21రాష్ట్రాల్లో బీజేపీ పాలన..!
 • 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు..!
 • బీజేపీలో 2019 ఎన్నికల కలవరం
 • ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ దూరం
 • యూపీ, బీహార్‌ ఉప ఎన్నికల్లో వాడిన కమలం
 • గోరఖ్‌పూర్‌ ఫలితంతో కొత్త అంచనాలకు ఊతం
 • గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి
 • సీఎం ఆదిత్యనాథ్‌ అడ్డాలోనే కమలనాథులకు పరాభవం
 • 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బంపర్‌ మెజారిటీ
 • ఏడాదిలోపే చతికిలపడ్డ కమలదళం..!
 • ఎస్పీ, బిఎస్పీ కలయికతో కమలదళానికి షాక్‌
 • వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి..?
 • 2014, 2017 ఎన్నికల్లో ఓట్ల శాతంపై విశ్లేషణ
 • 2017లో యూపీలో 403 స్థానాలకు ఎన్నికలు
 • 325 స్థానాల్లో బీజేపీ జయకేతనం
 • 47చోట్ల ఎస్పీ, 19 చోట్ల బీఎస్పీ, ఏడింట కాంగ్రెస్‌ గెలుపు
 • విడివిడిగా తలపడ్డ ఎస్పీ, బీఎస్పీ
 • గోరఖ్‌పూర్‌ తరహాలో సాగి వుంటే 50చోట్ల బీజేపీకి గడ్డుస్థితి..!
 • ఎస్పీ, బీఎస్పీ ఓట్లు కలిపితే 57చోట్ల ఈ కూటమికే విజయం..!
 • బీజేపీ 23 స్థానాలకే పరిమితం అయ్యే పరిస్థితి
 • ఎస్పీ, బీఎస్పీల ఓట్లు కలిపితే 1.45 లక్షల ఓట్ల లీడ్‌
 • 23 స్థానాల్లో మాత్రమే బీజేపీకి 58వేల లీడ్‌
 • వారణాసి, ఘజియాబాద్‌, గౌతంబుద్ధనగర్‌లో బీజేపీకి లక్ష మెజారిటీ
 • 2014 ఎన్నికల్లోనూ ఇదే తరహా పరిస్థితి
 • 2014లో 80కి గాను 73 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ
 • ఎస్పీ, బీఎస్పీల ఓట్లు కలిపితే 41 స్థానాల్లో లీడ్‌
 • బీజేపీ 37 స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితి
 • ఎన్డీయేతో కలహాల కాపురం చేస్తోన్న శివసేన
 • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 110 సీట్లు తగ్గుతాయన్న శివసేన
 • మోదీ పీఎం అయ్యాక 10చోట్ల ఉప ఎన్నికలు
 • తొమ్మిది స్థానాల్లో బీజేపీ పరాజయం
 • మసకబారుతోన్న మోదీ ప్రాభవం..!
 • 2019లో లౌకిక పక్షాల కూటమికి అనుకూలం..!
07:05 - March 18, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానం వల్ల ఎన్డీయేకు నష్టం లేదని కేంద్ర మంత్రి అంనంతకుమార్‌ అన్నారు. పార్లమెంటు బయట, లోపల ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉందన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన, వామపక్షాలు చేస్తున్న ఉద్యమానికి కౌంటర్‌తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించామని కమలనాథులు అంటున్నారు. టీడీపీ కొన్ని విషయాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని అవిశ్వాసం అంటూ హడావిడి చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. మోదీ ప్రభుత్వం ఏపీ రూపకల్పన కోసం అదనంగా రూ.24వేల కోట్లు విడుదల చేసిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఇంత మొత్తంలో నిధులు ఇవ్వలేదని.. అమరావతి నిర్మాణానికి, పోలవరం, జాతీయ రహదారులు, ఇరిగేషన్‌, పేదలకు ఇళ్లు కట్టించేందుకు కేంద్రం నిధులు ఇచ్చి సాయం చేసిందని అంటున్నారు. ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయిన ఏపీ బీజేపీ నేతలు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు అవిశ్వాసం కోసం చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై చర్చించారు. ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో భావోద్వేగాన్ని ప్రేరేపిస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అన్నారు. ప్రత్యేక హోదాతో ఎన్ని నిధులు వస్తాయో అంతకు పైసా కూడా తగ్గకుండా ఇవ్వాలనే దానికి మేం ఇప్పటికీ కట్టుబడే ఉన్నామన్నారు.

టీడీపీ ఎన్డీయే నుంచి వైదొలగడంతోపాటు అవిశ్వాసం పెట్టి తనంతట తానే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడిందని ఆపార్టీ జాతీయ నేత రామ్‌మాధవ్‌ అన్నారు. ఇప్పటిదాకా చంద్రబాబు,టీడీపీ నేతలు మమ్మల్ని ప్రశ్నించారు.. రాబోయే రోజుల్లో మేం లేవనెత్తే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సి వస్తుందని రామ్‌మాధవ్‌ అన్నారు.

మరోవైపు టీడీపీని , చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా అది బీజేపీ స్క్రిప్ట్‌ అంటూ విమర్శలు మొదలుపెడుతున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని గతంలో చంద్రబాబే ప్రకటించారని.. ప్రత్యేక హోదాపై ఎవరైనా మాట్లాడితే జైలుకెళతారని హెచ్చరించిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. మొత్తానికి వైసీపీ, టీడీపీ కోరుతున్న అవిశ్వాసం పరీక్షలో తాము ఈజీగా విన్‌ అవుతామని కమలనాధులు చెబుతున్నారు. విపక్షాలన్నీ ఏకం అయినా మోదీ ప్రభుత్వానికి ప్రమాదమేమి లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఏపీలో వివిధ పార్టీల తీరును ఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం వ్యూహాలు రూపొందిస్తోంది.

06:58 - March 18, 2018

హైదరాబాద్ : కేంద్రంపై అవిశ్వాస అస్త్రానికి విపక్షపార్టీలు పదునుపెడుతున్నాయి. బీజేపీ వ్యతిరేకులను ఏకతాటిపై తెచ్చేదుకు జోరుగా మంత్రాంగాలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న టీడీపీ అధినేత తన చాణక్యాన్ని హై రేంజ్‌కు చేర్చారు. ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్‌, మరోవైపు వామపక్షాలు కూడా అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో.. ఢిల్లీలో రాజకీయం రంజుగా మారింది. సభ ఆర్డర్‌లో లేదన్న సాకుతో శుక్రవారం తప్పించుకున్నా.. సోమవారం అవిశ్వాసంపై చర్చ జరగాల్సిందేనని విపక్షపార్టీలన్నీ పట్టుదలగా ఉన్నాయి. మోదీ వ్యూహం గెలుస్తుందా .. చంద్రబాబు చాణక్యం ఫలిస్తుందా అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

పార్లమెంటులో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి పలు పార్టీల నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నేతలను ఇతర పార్టీలు నమ్మడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాగా తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ కు పట్టుబట్టాలని, డివిజన్ అడగాలని పార్టీ ఎంపీలకు బాబు దిశానిర్ధేశం చేశారు. పార్టీ ఎంపీలు, వ్యూహకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు ఆరుగురు ఎంపీల బృందం ఈ రెండురోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని ఆయన ఆదేశించారు. అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి, అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలన్నారు.

సోమవారం దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అవిశ్వాసానికి ... జాతీయస్థాయిలో పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని, ఇది ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని షాక్‌గా పరిణమించిందని టీడీపీ నేతలు అంటున్నారు. అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన జగన్‌, విజయసాయిరెడ్డి.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని మంత్రి దేవినేని విమర్శించారు.

అటు వైసీపీ నేతలు మాత్రం టీడీపీ తప్పిదాలవల్లే రాష్ట్రానికి ప్రత్యే హోదా రాకుండా పోయిందని విమర్శిస్తున్నారు. పార్లమెంటులో అవిశ్వాసం పెడతామంటూ జగన్‌ ప్రకటించిన తర్వాతే టీడీపీలో కదలిక వచ్చిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో లెఫ్ట్‌పార్టీలు దూకుడు పెంచాయి. నో కాన్ఫిడన్స్‌ మోషన్‌కు మద్దతు ఇచ్చి మోదీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు వామపక్ష నేతలు. తమ మద్దతు తోపాటు మోదీ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. పార్లమెంట్‌లో సోమవారం ఎవరు అవిశ్వాసం పెట్టినా తాము తప్పకుండా మద్దతు ఇస్తామన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాలే తమకు ప్రాధాన్యత అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు.

అటు ప్రధాని మోదీపై కారాలు మిరియాలు నూరుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా అవిశ్వాసానికి మద్దుతు ఇవ్వాలని సీపీఐ ఏపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఏపీలో అవినీతి పాలన నడుస్తోందని, ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఒప్పుకున్నారని అందువల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందన్నారు రామకృష్ణ.

విపక్షాలన్నీ ఏకం అవుతుండటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడుతోందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.. చివరికి కొందరు బీజేపీ ఎంపీలు కూడా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. సభ ఆర్డర్‌లో లేదన్న సాకుతో శుక్రవారం అవిశ్వాస గండం నుంచి తప్పించుకున్న మోదీ ప్రభుత్వం సోమవారం కూడా ఇదే వ్యూహాన్ని అమల్లో పెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. దీనికోసం ఎన్డీయే మిత్రపక్షాలను ఉసిగిగొల్పి.. సభలో గందరగోళం సృష్టించడానికి మోదీ అండ్‌ టీమ్‌ సిద్ధం అయినట్టు విమర్శలు వస్తున్నాయి. అయితే అన్ని పరిణామాలకు సిద్ధపడే రంగంలోకి దిగామని, హౌస్‌ ఆర్డర్‌లో లేదనే సాకుతో అవిశ్వాసాన్ని తిరస్కరిస్తే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. 

06:56 - March 18, 2018

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ప్రారంభించిన శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్‌తో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. షడ్రుచులను ఆస్వాదించినట్లే జీవితంలో జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాలని సూచించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రారంభించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, మండ‌లి చైర్మన్‌ స్వామిగౌడ్‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ప్రజాప్రతినిధుల, అధికారులు హాజ‌ర‌య్యారు.

ఉగాది పచ్చడిలాగే మన జీవితంలోనూ షడ్రుచులు ఉంటాయన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. షడ్రుచులను ఆస్వాదించినట్లే జీవితంలో జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాలన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలకు హాజరైన వెంకయ్యనాయుడు తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మన జీవితం, పండుగలు అంతా ప్రకృతితో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతితో మమేకమై జీవించడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్‌ తరానికి అందించాల్సిన అవసరముందన్నారు.

శ్రీవిళంబినామ సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు గవర్నర్‌ నరసింహన్‌. ఈ సంవత్సరాన్ని గవర్నర్‌ మానవత్వ సంవత్సరంగా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రజలంతా సౌభాగ్యం, సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఉగాది పండుగ సందర్బంగా రాష్ట్ర ప్రజల తరపున సీఎం కేసీఆర్‌ ఉప రాష్ట్రపతి, గవర్నర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఏదో ఒక సంవత్సరమే కాకుండా ప్రతి ఏడాది నిష్టతో చాలాచక్కగా గవర్నర్‌ ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నరసింహన్‌ గవర్నర్‌గా వచ్చిన తర్వాత కొత్త సంప్రదాయానికి తెరదీశారన్నారు. ప్రజలంతా శ్రీవిళంబి నామ సంవత్సరంలో సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ఒగ్గుడోలు విన్యాసాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవనార్‌ బ్లైండ్‌ స్కూల్‌ విద్యార్థుల సీతా స్వయంవరం ఆకట్టుకుంది. 

06:54 - March 18, 2018

హైదరాబాద్ : తెలుగు వారి ఆత్మీయ పండుగ ఉగాది .. తెలుగు వారి నమ్మకాలకు పునాది ఉగాది.. కోయిల పాడితే ఉగాది .. చెట్లు చిగురిస్తే ఉగాది .. ఆరు రుచులు కలబోస్తే ఉగాది .. ఆస్వాదించే మనసుంటే ... అడవేకాదు అపార్ట్‌మెంటైన సరే అంటూ ఆమని ఇట్టే వచ్చేస్తుంది. సుఖ సంతోషాలను తన వెంట మోసుకొచ్చింది విళంబి నామ సంవత్సరం. ఉగాది. తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. మొదటిది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది అన్న తెలుగు మాట యుగాది అన్న సంస్కృత పదానికి వికృతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున .. బ్రహ్మ సృష్టి నిర్మాణం ఆరంభించాడని సూర్య సిద్ధాంతం అనే ఖగోళ జ్యోతిష గ్రంథం చెబుతోంది. దీని ఆధారంగానే ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు.

వసంత ఋతువు కూడా ఉగాదితోనే మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. ఉగాది మనిషికి కొత్త ఆశలు మోసుకోస్తుంది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని రుచులను పరిచయం చేస్తుంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్లు, మామిడికాయలు, వేపపువు్వ, చింతపండు, జామకాయలు, బెల్లం వాడుతారు. వసంత ఋతువులో కోయిలమ్మల కమ్మనిగానం మనసును హాయిరాగాలు పలికిస్తుంది.

ప్రకృతికి దూరమౌతోన్న మనిషి తనకు తానే వికృతంగా మారిపోతున్నాడు. ప్రకృతిని ప్రేమిస్తే మనిషి తనను తాను ప్రేమించుకుంటాడు. తనను తాను ప్రేమించుకుంటే ప్రేమ పరమార్ధం అర్ధమౌతుంది. ఇలాంటి అద్భుతమైన భావనను మన సొంతం చేసే ఏకైక పండగ ఉగాది. ఈ ఏడాది విళంబి నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని ఆశిద్దాం. 

నేడు ఉగాది పర్వదినం...

హైదరాబాద్ : నేడు ఉగాది పర్వదినం. తెలుగు రాష్ట్రాల గవర్నర్, ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదిన సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆయా పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగనుంది. 

19న కోల్ కతాకు వెళ్లనున్న కేసీఆర్...

ఢిల్లీ : ఈనెల 19న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోల్‌కతాకు వెళ్లనున్నారు. థర్డ్ ఫ్రంట్ సాధ్య సాధ్యాలపై అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతతో చర్చలు జరపనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ కోల్‌కతా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.  

చిత్తూరులో టెన్త్ హిందీ పేపర్ లీక్ ?

చిత్తూరు : జిల్లాలో 10వ తరగతి హిందీ పేపర్‌ లీక్‌ కావడం కలకల రేపింది. నగరి, విజయపురం మండలాల్లో ఉదయం 7.30 గంటలకు హిందీ పేపర్‌ లీక్‌ అయినట్లు తెలుస్తోంది. దీనిపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

రెండో రోజు కాంగ్రెస్ జాతీయ ప్లీనరీ సమావేశాలు...

ఢిల్లీ : 84వ కాంగ్రెస్‌ జాతీయ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. మోది ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో కాంగ్రెస్‌ ప్లీనరీ విరుచుకుపడింది. బిజెపి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని చీల్చుతోందని సోనియా ధ్వజమెత్తారు. 

ముగిసిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు...

ఢిల్లీ : సీపీఎం పొలిటిబ్యూరో సమావేశాలు ముగిశాయి. 22వ అఖిలభారత మహాసభల్లో ప్రవేశపెట్టనున్నపార్టీ నిర్మాణ నివేదికపై చర్చించారు. ఈ నెలాఖరులోగా నివేదిక కేంద్రకమిటీ ముందుకు రానుంది. కేంద్ర కమిటీలో చర్చించిన తర్వాత పార్టీనిర్మాణ నివేదికకు తుదిరూపు ఇవ్వనున్నారు. అటు మహారాష్ట్రలో రైతులు ఉద్యమం సక్సెస్‌పై పొలిట్‌బ్యూరోలో చర్చించారు.  

వరల్డ్ ట్రేడ్ ఆర్గనేజేషన్ సమావేశానికి పాక్ డుమ్మా...

ఢిల్లీ : త్వరలో ఢిల్లీలో జరిగే వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్ సమావేశానికి తాము హాజరు కావడం లేదని పాకిస్తాన్‌ తెలిపింది. పాక్‌ వాణిజ్యమంత్రి మహ్మద్‌ పర్వేజ్‌ మాలిక్‌ హాజరవుతారని తొలుత ధృవీకరించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో పాకిస్తాన్‌ చివరి నిముషంలో ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 19-20 తేదీల్లో ఢిల్లీ వేదికగా డబ్లూటీవో మంత్రిత్వ స్థాయి సమావేశం జరగనుంది.

బంగ్లాదేశ్ జట్టు సవాల్...

ఢిల్లీ : టీ20 ట్రై సిరీస్‌ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రోహిత్‌ శర్మ సారధ్యంలో భారత్‌కు షకీబ్‌ అల్‌ హసన్ సారధ్యంలోని బంగ్లాదేశ్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. బంగ్లాదేశ్‌పై టీ20ల్లో ఓటమంటూ లేని టీమిండియా తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ను కొనసాగించాలని పట్టుదలతో ఉండగా...శ్రీలంకను ఓడించి సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు సైతం షాకివ్వాలని తహతహలాడుతోంది.

Don't Miss