Activities calendar

19 March 2018

21:51 - March 19, 2018

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ కలకలం రేపింది. విభజన కారణంగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేకహోదా పెద్ద విషయం కాదని.. పేరు ఏదైనా కేంద్రం ఆర్థికసాయం చేస్తే చాలు అని పవన్‌ చెప్పినట్టు ఆ ఛానల్‌ ప్రసారం చేసింది. పవన్‌ వ్యాఖ్యలపై ఏపీలోని పలువురు నేతలు ప్రశ్నించడంతో... జనసేన తన అధికారిక ట్విట్టర్‌లో పవన్‌ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. జనసేన ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉందని... ఇంగ్లీష్‌ ఛానల్‌ రిపోర్టరే తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరించింది.

21:46 - March 19, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బహుజనలు, వామపక్షాలతో కలిసి ఏర్పాటైన బీఎల్‌ఎఫ్‌ మాదిరిగానే దేశంలో ఇలాంటి ఫ్రంట్‌ అవసరమని సామాజిక ఉద్యమ నాయకుడు, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవాని అన్నారు. బహుజనులు, లెఫ్ట్‌ పార్టీలతో ఏర్పాటైన ఫ్రంట్‌లతోనే... సంఘ్‌ పరివార్‌ ఫాసిస్టు శక్తులను దేశం నుంచి తరిమివేయవచ్చన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ క్రాస్‌ రోడ్‌లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెవాని.. తెలంగాణలో బహుజనుల అభివృద్ధి కోసం బీఎల్‌ఎఫ్‌ ఏ కార్యక్రమం చేపట్టినా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం కట్టబెట్టేందుకే బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందన్నారు. 2019లో బీఎల్‌ఎఫ్‌ రాజ్యాధికారం సాధిస్తుందని అన్నారు. 

 బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌పరివార్‌ నియంతృత్వ పోకడలు: జిగ్నేష్ 
దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌పరివార్‌ నియంతృత్వ పోకడలు రోజురోజుకు అధికమవుతున్నాయని సామాజిక ఉద్యమ నాయకుడు, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవాని అన్నారు. వీరి పోకడలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దళిత , బహుజనులు ఏకమైతేనే ఇది సాధ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో.. మహాజన పాదయాత్ర వార్షికోత్సవ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిగ్నేష్‌ మెవాని... తెలంగాణలో బహుజన సంఘాలు, లెఫ్ట్‌ పార్టీలు ఏకతాటిపైకి రావడం శుభసూచకమన్నారు. ఇదే సభలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... కేసీఆర్‌ చెప్తోన్న ఫెడరల్‌ ఫ్రంట్‌తో ఒరిగేదీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌తో బీఎల్‌ఎఫ్‌ పొత్తుపెట్టుకోబోదన్నారు. 119 స్థానాల్లోనూ బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

21:43 - March 19, 2018

హైదరాబాద్ : స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చే నెల 13 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియలో ఫెస్ట్‌ నిర్వహించనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి, కార్యదర్శి చంద్రమోహన్‌, కార్యనిర్వాహక సభ్యుడు, ఏఐఐఈఏ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌, నాగేశ్వరరావు, జగదీశ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. సైన్స్‌, ప్రభుత్వరంగ సంస్థలు సహా వివిధ విభాగాల్లో ప్రత్యేక పెవిలియన్లు ఏర్పాటు చేస్తారు. ప్రజలను రోజువారీ ఒత్తిళ్ల నుంచి దూరంచేసి, మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు దోహదం చేసే విధంగా హైదరాబాద్‌ ఫెస్ట్‌ నిర్వహించనున్నారు.

21:38 - March 19, 2018

అమరావతి : ప్రత్యేకహోదా ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది. ఇటు రాష్ట్రంలోనూ... అటు ఢిల్లీలోనూ ఉద్యమం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచడం, హోదా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా.. ప్రత్యేక హోదా సాదన సమితి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నాయకులతో చర్చించి ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. ఈనెల 22న జాతీయ రహదారుల నిర్బంధానికి పిలుపునిచ్చారు.

ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం తీవ్రతరం
ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం తీవ్రతరం అవుతోంది. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి విజయవాడలో ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్‌, జనసేనతోపాటు వివిధ ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీరని అన్యాయం చేశాయి: మధు
ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీరని అన్యాయం చేశాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి బుద్దిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకహోదా కోసం కేవలం రాజకీయ పార్టీల నేతలు మాత్రమే పోరాటం చేస్తే సరిపోదని... ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చెయ్యాలన్నారు. గ్రామస్థాయి నుంచి హోదా ఉద్యమాలు జరగాలని మధు అన్నారు.

తెలుగుజాతి పోరాటం శుభ పరిణామం: శివాజీ
జాతీయ స్థాయిలో తెలుగుజాతి పోరాటం వినిపిస్తుండడం శుభపరిణామమని సినీ నటుడు శివాజీ అన్నారు. ఆంధ్రులకు కోపం వస్తే బీజేపీ పునాదులు కదలిపోతాయన్నది ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. ఆంధ్రుల హక్కులను కాలరాసేందుకు చూస్తే ఉద్యమాలతోనే సమాధానం చెప్తామన్నారు. అవసరమతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు.

హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం : చలసాని
హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రత్యేకహోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 22న జాతీయ రహదారులను దిగ్బంధించనున్నట్టు ప్రకటించారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చేశారు. హోదా కోసం ఇక నుంచి అంతా కలిసే ఉద్యమించాలని తీర్మానించారు. హోదా పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేసేలా మండల స్థాయిలో జేఏసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

21:33 - March 19, 2018

ఢిల్లీ : విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ దద్దరిల్లింది. అవిశ్వాసంపై చర్చజరగకుండానే ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. పార్లమెంట్‌ బయట టీడీపీ, వైసీపీ నేతలు నిరసనలతో హోరెత్తించారు. కేంద్రం భయపడుతుందని మండిపడ్డారు. మరోవైపు అవిశ్వాసంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు.

చర్చ జరగకుండానే పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదా
కేంద్రంపై టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరగకుండానే పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదాపడ్డాయి. విపక్షాల ఆందోళనతో లోక్‌సభలో గందరగోళ నెలకొంది. టీడీపీ, వైసీపీ సభ్యల అవిశ్వాస తీర్మానాలను స్పీకర్‌ సుమిత్రామహజన్‌ స్వీకరించారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కావేరీ అంశంపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై టీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లి తమ ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పినా.. విపక్ష సభ్యులు వినకపోవడంతో.. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ ఆందోళనలు
అటు రాజ్యసభలోనూ ఆందోళనలు కొనసాగాయి. వివిధ అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేయడంతో సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

అవిశ్వాసానికి బీజేపీ భయపడుతోంది : టీడీపీ
మరోవైపు పార్లమెంట్‌ వెలుపల టీడీపీ, వైసీపీ ఎంపీలు వేర్వేరుగా ఆందోళన కొనసాగించారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పార్లమెంటు భవనం ముందు టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ చీరకట్టులో వినూత్న నిరసన చేపట్టారు.అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చకు కేంద్రం బయపడి పారిపోతోందని టీడీపీ ఎంపీలు అన్నారు. నాలుగేళ్లుగా ఏపీకి అది చేస్తాం.. ఇది చేస్తామంటూ పబ్బం గడిపిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సమాధానం చెప్పలేకపోతోందని విమర్శించారు. విభజన సమస్యలపై చర్చ జరిగేవరకూ రోజూ అవిశ్వాస తీర్మానం ఇస్తూనే ఉంటామన్నారు.

నిరసనలు కొనసాగిస్తాం : వైసీపీ
అటు వైసీపీ సైతం ఏపీకి హోదా వచ్చే వరకూ తమ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సభ వాయిదాపడిన తర్వాత కేంద్రంపై మరోమారు అవిశ్వాసతీర్మానం నోటీసులు ఇచ్చారు ఆపార్టీ నేతలు. మొన్నటిదాకా ప్యాకేజీ చాలన్న సీఎం.. దేశంలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోతోందని గమనించి మళ్లీ హోదా కావాలంటూ యూటర్న్‌ తీసుకున్నారని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. బాబును ఎవరూ నమ్మరని అన్నారు.

చర్చకు సిద్ధమన్న రాజ్ నాథ్
కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసంపై చర్చకు సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. సభలో చర్చ జరగాలని కేంద్రం బలంగా కోరుకుంటుందని.. చట్ట సభలు ఉన్నవి కూడా అందుకేనని అన్నారు. సభ సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. మొత్తానికి ఏపీ పొలిటికల్‌ హీట్‌ ఢిల్లీని వేడెక్కిస్తోంది. మంగళవారమైనా అవిశ్వాసం మీద చర్చజరుగుతుందో లేదో చూడాలి. 

21:27 - March 19, 2018

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశ‌గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయ‌త్నాలు మొద‌లు పెట్టారు. ప‌శ్చిమ‌బంగా సిఎం మ‌మ‌తా బెన‌ర్జీతో సుమారు రెండు గంట‌ల పాటు భేటీ అయి ఫ్రంట్ భ‌విష్యత్‌ కార్యాచ‌ర‌ణపై చ‌ర్చించారు. ఇది శుభ‌సూచ‌కమని ఇద్దరు ముఖ్యమంత్రులూ వ్యాఖ్యానించారు.

చ‌క్రం తిప్పేందుకు రెడీ అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌
జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు రెడీ అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ త‌న ప‌నిని మొద‌లు పెట్టారు. కాంగ్రెస్, బీజేపీల‌ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో భేటీలు ప్రారంభించారు. అందులో భాగంగా కేసీఆర్‌ కోల్‌క‌త్తాలో ప‌శ్చిమబంగా సీఎం మ‌మ‌తా బెనర్జీతో భేటీ అయ్యారు. సుమారు రెండు గంట‌ల పాటు జ‌రిగిన ఈ భేటీలో ప‌లు జాతీయ అంశాల‌పై చ‌ర్చించారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మూడో కూట‌మిని బ‌లంగా ఏర్పాటు చేసేందుకు అనుస‌రించాల్సిన విధానాలపై దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌ను వ్యతిరేకించే భావ‌సారూప్యత ఉన్నపార్టీల‌ను ఒకే వేదిక‌పై తెచ్చేందుకు రెడీ అవుతున్నట్లు భేటీ అనంత‌రం ఇద్దరు సీఎంలు వెల్లడించారు.

దేశంలో గుణాత్మక మార్పు
70 ఏళ్లుగా దేశంలో అధికార ప‌గ్గాలు ద‌క్కించుకున్న పార్టీల‌తో ప్రజ‌ల‌కు పెద్దగా ఒరిగిందేమీ లేద‌న్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తం చేశారు. రైతు స‌మ‌స్యలు, ప్రత్యామ్నాయ అభివృద్ధిపై ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టక పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. జాతీయ స్థాయిలో త‌మ కూట‌మితో దేశంలో గుణాత్మక మార్పు రానుందన్నారు. ఇది రాజ‌కీయ కోణంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని దేశ అభివృద్ధి కోణంలో చూడాల‌ని కేసీఆర్‌ అన్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశ‌గా జ‌రుగుతున్న యత్నం : మమత
ఎన్నో జాతీయ అంశాల‌పై త‌మ భేటీలో చ‌ర్చకు వ‌చ్చాయ‌ని మమతాబెనర్జీ చెప్పారు. ఇది ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశ‌గా జ‌రుగుతున్న ప్రయ‌త్నమ‌ని.. రాజకీయాలు నిరంతర ప్రక్రియ అని ఆమె అన్నారు. ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డంలో తొంద‌ర ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, భావ‌సారూప్యత క‌లిగిన అన్ని రాజ‌కీయ పార్టీల‌ను భాగ‌స్వామ్యం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అభిప్రాయ ప‌డ్డారు.

త్వర‌లో మ‌రోసారి భేటీ
త్వర‌లో మ‌రోసారి భేటీ కావాల‌న్న అభిప్రాయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు వ‌చ్చారు. శాస‌న‌స‌భా బ‌డ్జెట్ స‌మావేశాల అనంత‌రం....కేసీఆర్‌ మ‌రికొంత మంది నేత‌ల‌ను క‌లిసి ఫ్రంట్ ఏర్పాట్లను ముమ్మరం చేయాల‌ని భావిస్తున్నట్లు స‌మాచారం. కోల్‌కత్తాలోని ప్రఖ్యాత కాళీ మందిరాన్ని కేసీఆర్‌ దర్శించుకున్నారు. అనంతరం పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ తిరుగుప్రయాణమయ్యారు.

 

20:43 - March 19, 2018

టీడీపీ, వైసీపీ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలు రెండు పార్లమెంట్ సభ ముందుకు వచ్చాయి. కానీ దానిపై చర్చమాత్రం జరగలేదు. సభ ఆర్డర్ లో లేని కారణంగా చర్చను చేపట్టలేకపోతున్నామని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చకు మేము సిద్ధంగా వున్నామంటోంది. మరి దీంట్లో కేంద్రం రాజకీయ ఎత్తుగడతో బీజేపీ తప్పించుకునేందుకు చూస్తోందా? వంటి పలు అంశాలపై ప్రముఖ విశ్లేషకులు నాగేశ్వర్ గారితో చర్చను చేపట్టింది 10టీవీ..

20:41 - March 19, 2018

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ రానుందట..కోదండరాముడు పార్టీ పెడ్తుండు..జెండా ఏందో...ఎజెండా ఏందో తెలియనుందట..దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేటందుకు బెంగాల్ పోయిన కేసీఆర్ సారు..కలకత్తా అక్కతోని చర్చలన్నీ సేసేసిండు..అవిశ్వాసంపై ఎన్నో అభిప్రాయాలు వచ్చేసినుల్ల..మోదీగారి సర్కార్ కు గండమని గన్ని మీడియాలు లొల్లి లొల్లి సేసేనియ్యి...మోడీ..నీరవ్ మోడీ ఒకటే నన్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ..సిరిసిల్లల మున్సిపల్ మేడము మళ్లీ లొల్లి లొల్లిగా మాట్లాడిండు..

''పవన్ అభిప్రాయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు``

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన అభిప్రాయాలను న్యూస్ 18 రిపోర్టర్ పొరపాటుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 

టేకులపల్లి మండలంలో విషాదం..

భద్రాద్రి : టేకులపల్లి మండలంలో విషాదఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో ఈతకు వెళ్లి చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 

పవన్‌ అవుసరం లేదన్న మంత్రి?..

అమరావతి: పవన్‌ లాంటి వ్యక్తుల అవసరం రాష్ట్రానికి లేదని ఏపీ మంత్రి అమర్ నాథ్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అన్న పవన్‌.. ఇప్పుడెలా మాట మార్చారని ప్రశ్నించారు. హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్న వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అటువంటివారితో రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతోందన్నారు.

19:57 - March 19, 2018

పార్లమెంట్ ఉభయసభలు ఈరోజుకూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో టీడీపీ, వైసీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలని ఏపీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ సభలో ఆర్డర్ లేదనే వంకతో ఇరు సభలు వాయిదాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో చర్చను చేపట్టటం ఇష్టం లేక సభలను వాయిదా వేశారని, చర్చను చేపట్టేందుకు ఎన్డీయే భయపడుతోందని టీడీపీ ఎంపీలు ఎద్దేవా చేశారు. మరోపక్క అవిశ్వాస తీర్మానంపై చర్చనుచేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్సఇంగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై అసలు చర్చజరుగుతుందా? లేదా వాయిదాల పర్వం కొనసాగుతుందా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో పార్టీలు ఎటువంటి విధానాన్ని అవలంభించాలి? అనే అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ.ఈ చర్చలో వైసీపీ ఏపీ కార్యదర్శి రాజశేఖర్, బీజేపీ ఏపీ అధికార ప్రతినిథి రమేశ్ నాయుడు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బాబురావు, టీడీపీ శాసనమండలి సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు. 

18:55 - March 19, 2018

ఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలపై ఓ నివేదిక రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, మరో మూడు రాష్ట్రాలను ఆదేశించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలను మయన్మార్‌కు పంపించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రోహింగ్యాల అంశం జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారమని కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది. ఈ అంశాన్ని రాజకీయంగా పరిష్కరించేందుకు ప్రభుత్వానికి వదిలేయాలని, వార్తల్లో హెడ్‌లైన్‌ కోసం ఆదేశం ఇవ్వకూడదని కేంద్రం అభిప్రాయపడింది. దేశంలో శరణార్థులుగా ఉన్న రోహింగ్యాలకు విద్య, వైద్య సేవలు అందడం లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ ఆరోపించారు. వైద్య సేవలు అందడం లేదన్న వాదనను కేంద్రం కొట్టి పారేసింది. ఆసుపత్రికి వచ్చే రోగిని ఏ దేశానికి చెందిన పౌరుడని అడగరని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.  

18:53 - March 19, 2018

విజయవాడ : పార్టీ కోసం పనిచేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించారని టీడీపీ ఎంపీగా ఎన్నికైన కనకమేడల రవీంద్రకుమార్‌ చెప్పారు. కనకమేడల రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా విజయవాడ బార్‌ అసోసియేషన్‌లో అభినందన సభ జరిగింది. పలువురు న్యాయవాదులు రవీంద్రకుమార్‌ సేవలను ప్రస్తావించారు. విజయవాడ బార్ అసోసియేషన్‌ నుంచి హైకోర్టు వరకు ఉన్న అనుబంధాన్ని కనమేడల గుర్తు చేసుకున్నారు. 

18:50 - March 19, 2018

నెల్లూరు: రైస్‌ మిల్లర్లు... రైతుల నుంచి తూకానికి మించి ఎక్కువ దాన్యం తీసుకుంటే సహించేబోమని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు. గిట్టుబాటు ధరల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లు, గిట్టుబాటు ధరలపై నెల్లూరులో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

18:42 - March 19, 2018

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ ముగిసింది. అనంతరం ఇరు సీఎంలు   ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశంలో ప్రజలు మరో ప్రత్యామ్నాయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ కు ఇది తొలి అడుగు మాత్రమేనన్నారు. మా థర్డ్ ఫ్రంట్ దారిలో పలువురు మిత్రులు కలిసివస్తారని ఆశిస్తున్నామన్నారు. 2019 ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతపై చర్చించామని తెలిపారు. 

18:39 - March 19, 2018

కామారెడ్డి : జుక్కల్‌ మండలంలోని ఎక్స్‌రోడ్డులో 600 మంది పైగా రైతులు మండుటెండను లెక్క చేయకుండా ధర్నా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు అస్సెన్మెంట్‌ భూమికి సంబంధించిన పట్టాదారుల వివరాలు... ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన మొదటి విడుతలో నమోదు కాకపోవడం గ్రహించి ధర్నాకు దిగారు. సుమారు వెయ్యి ఎకరాల సాగు భూమిలో ఫారెస్ట్‌ అధికారులు ట్రెంచ్‌ పనులు నిర్వహించడంతో రైతుల ఆందోళన ఉధృతం చేశారు. రైతుల ధర్నాకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యాక్షులు, పలు దళిత నాయకులు పాల్గొన్నారు. రైతుల ధర్నాకు స్పందించిన స్థానిక తహసిల్దార్‌ మీ భూములు ఎక్కడి పోవు అని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

బీఎల్ఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిగ్నేష్

హైదరాబాద్ : ముషీరాబాద్ లో బీఎల్ఎఫ్ కార్యాలన్ని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వామపక్ష భావజాలం వున్న సంఘలతో కూడిన బహుజన లెఫ్ట్ పార్టీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోబీఎల్ఎఫ్ ను బలోపేతం చేసేందుకు నేతలు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2017లో సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి, ప్రభుత్వ హామీలు, అమలు డిమాండ్లతో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర వేలాది కిలో మీటర్లు కొనసాగి విజయవంతంగా ముగిసింది.

18:11 - March 19, 2018

దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : మమతా బెనర్జి

హైదరాబాద్ : దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి సమావేశమయిన అనంతరం ఇరువురు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశాభివృద్ధి, రైతు సమస్యలపై కూడా చర్చించామని మమతా తెలిపారు. భవిష్యత్తులో థర్డ్ ఫ్రంట్ బలమైన కూటమిగా అవతరించబోతోందనిఈ సందర్భంగా మమతా మాట్లాడుతు...భవిష్యత్తులో మాది బలమైన ఫెడరల్ కూటమిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సందర్భంగా ఈరోజు సీఎం కేసీఆర్ మమతా బెనర్జీతో సమావేశమయిన విషయం తెలిసిందే.

ఈ సమావేశం తొలి అడుగు : కేసీఆర్

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ ముగిసింది. అనంతరం ఇరు సీఎంలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశంలో ప్రజలు మరో ప్రత్యామ్నాయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ కు ఇది తొలి అడుగు మాత్రమేనన్నారు. 

17:39 - March 19, 2018

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడలో విద్యాశాఖలోని అక్రమాలపై టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనాలపై అధికారుల స్పందించారు. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిని మిర్యాలగూడ ఎంఈవో చాంప్లా నాయక్ అవినీతిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసారు. దీంతో ఎంఈవో అక్రమాలపై ఉన్నతాధికారులు ఓకమిటీని వేశారు. డైట్ కాళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఈ కమిటీ అక్రమాలపై విచారణ చేపట్టింది. దీంతో ఎంఈవో కార్యాలయంలో కమిటీ సభ్యులు తనిఖీలుచేపట్టారు. పాఠశాలకు నెలల తరబడి ఉపాధ్యాయులు రాకున్నా కమీషన్లు తీసుకొని వేతనాలను మాత్రం పూర్తిగా ఇస్తున్నారు. కాగా చాంప్లాపై చర్యలు తీసుకోవాలంటు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. దీనిపై 10టీవీ కథనాలను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో 10టీవీ కథనాలపై స్పందించిన విద్యాశాఖాధికాలు ఎంఈవో చాంప్లాపై విచారణ చేపట్టారు. 

16:53 - March 19, 2018

పశ్చిమ బెంగాల్ : బెంగాల్ సచివాలయంలో మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చను కొనసాగిస్తున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొంటారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర సచివాలయం చేరుకున్న కేసీఆర్‌కు.. మమత పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ కూడా మమతకు పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. 

16:49 - March 19, 2018

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన ఫిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి వీడియోలను షీల్డ్ కవర్‌లో పెట్టి ఈనెల 22న కోర్టుకు అందజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆరు వారాలపాటు ఈ రెండు స్థానాలకు ఎన్నికల నోటిషికేషన్ ఇవ్వరాదని ఈసీకి ధర్మాసనం సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్‌ఫోన్స్ విసిరి దాడికి పాల్పడ్డారంటూ కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

16:41 - March 19, 2018

మహారాష్ట్ర : నవనిర్మాణ్‌ సేన చీఫ్‌ రాజ్‌థాకరే 'మోది ముక్త్‌ భారత్‌'కు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి 2019 ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఓడించాలని రాజ్‌ థాకరే పిలుపునిచ్చారు. భారత్‌ 1947లో మొదటి స్వాతంత్రం సాధించిందని, 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రెండోసారి భారత్‌కు విముక్తి లభించిందని... 2019 ఎన్నికల్లో మోది ముక్త్‌ భారత్‌ ద్వారా మూడోసారి స్వాతంత్ర్యం సముపార్జించాలని రాజ్‌థాకరే అన్నారు. ఆదివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగిన ఎంఎన్‌ఎస్‌ ర్యాలీలో ఆయన మాట్లాడారు. మోది బూటకపు వాగ్దానాలతో దేశం విసిగిపోయిందని చెప్పారు. 1947 తర్వాత దేశంలో అతి పెద్ద స్కాం నోట్ల రద్దేనని థాకరే తెలిపారు. ఇటీవల మృతి చెందిన నటి శ్రీదేవి దేశానికి ఏం మేలు చేశారని ఆమెకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారని రాజ్‌ థాకరే ప్రశ్నించారు. 

16:40 - March 19, 2018

ఢిల్లీ : పొగాకు, సుపారీ తినొద్దని 40 ఏళ్ల కిందటే తనను ఎవరైనా హెచ్చరించి ఉంటే బాగుండేదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. నోటిక్యాన్సర్‌ను రూపుమాపేందుకు ముంబైలో ఏర్పాటైన 'ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ మిషన్‌' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవార్‌ పాల్గొన్నారు. క్యాన్సర్‌ నుంచి తాను బయటపడ్డ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. క్యాన్సర్‌ నుంచి ప్రాణాలతో బయటపడేందుకు ఆపరేషన్‌ చేసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆ సర్జరీ వల్ల తాను ఎంతో వేదనకు గురయ్యాని...శస్త్ర చికిత్స సమయంలో పళ్లు తీసేశారు...నోరు పెద్దగా రవలేకపోతున్నాను...సరిగా మాట్లాడలేకపోతున్నాను...ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉందన్నారు. పొగాకుకు బానిసైన లక్షలాదిమంది యువతకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తానని... ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని పవార్‌ వెల్లడించారు.

16:38 - March 19, 2018

బీహార్ : నాల్గవ దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్‌ లాలుప్రసాద్‌ యాదవ్‌ను రాంచీ కోర్టు దోషిగా తేల్చింది. దుమ్కా ట్రెజరీ నుంచి 3 కోట్ల రూపాయలను అక్రమంగా విత్‌డ్రా చేశారని లాలుపై ఆరోపణలున్నాయి. కోర్టు ఈ కేసులో శిక్షను శుక్రవారం ఖరారు చేయనుంది. అస్వస్థతో గత మూడు నాలుగురోజులుగా లాలూ ఆసుపత్రిలో ఉన్నారు. లాలు ఆసుపత్రి నుంచి నేరుగా కోర్టుకు వచ్చారు. మరో దాణా స్కాం కేసులో లాలుకు ఇప్పటికే మూడున్నరేళ్ల జైలు శిక్ష పడింది. బిర్సాముండా జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు.

16:32 - March 19, 2018

ప్రకాశం : గతంలో ఆదర్శవంతంగా నిలిచిన ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాల... నేడు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఆకతాయిల చిల్లర వేషాలకు నిలయంగా తయారైంది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు ఉంటే కానీ... సీటు దొరకని వైభవం నుంచి... కాలేజీనే కనుమరుగయ్యే దుస్థితికి చేరిన ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై టెన్‌ టీవీ కథనం..

దేవాలయంలాంటి విద్యాలయంలో అసాంఘీక కార్యకలాపాలు
వాయిస్- దేవాలయం వంటి కళాశాలలో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డు అదుపూ లేకుండాపోయింది... నానాటికీ ఆకతాయిలు నిర్లజ్జగా రెచ్చిపోతున్నారు. మద్యం, వ్యభిచారాలకు కేరాఫ్‌గా మారిన కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గురించి పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇక్కడి విద్యార్థులకు డిగ్రీ కళాశాల అంటే... అందని ద్రాక్షే... ఇక్కడివారంతా కాలేజీ విద్యకోసం కావలి, ఒంగోలు ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది... అలాంటిది... 1983లో అప్పటి మంత్రి ముక్కు కాశిరెడ్డి చొరవతో.. విశాల ప్రాంగణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటైంది. ఈ కాలేజీలో అప్పట్లో సీటు కావాలంటే... ఎమ్మెల్యే, మినిస్టర్‌ సిఫార్సు ఉన్నా కూడా అసాధ్యంగానే ఉండేది..

ప్రహరీగోడ, నైట్‌ వాచ్‌ మెన్‌వంటి రక్షణ ఏర్పాట్లు నిల్‌
ఊరికి దూరంగా విసిరేసినట్లున్న ఈకాలేజీకి ప్రహరీగోడ, నైట్‌ వాచ్‌ మెన్‌వంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో.... అసాంఘీక కార్యకలాపాలకు నెలవుగా మారింది... దీంతో కళాశాల ప్రాభవం తగ్గి.. విద్యార్థుల శాతం పడిపోయింది... బీఎస్సీ కంప్యూటర్ కోర్సును సైతం ఎత్తేశారు... గతంలో ఇక్కడ లెక్చరర్లు, దాతల సాయంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కలిపించారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు పలు సేవా కార్యక్రమాలతో పలువురికి దర్శవంతంగానూ నిలిచారు కానీ... అదంతా గతించిన చరిత్రగానే మిగిలిపోయింది..ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి... ఈ కళాశాలకు పూర్వవైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే.. ఇక్కడి కంప్యూటర్లతోపాటు కాలేజీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటున్నారు..

మమతో భేటీ అయిన కేసీఆర్..

పశ్చిమ బెంగాల్ : బెంగాల్ సచివాలయంలో మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చిస్తున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. 

16:26 - March 19, 2018

హైదరాబాద్ : తెలంగాణలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రంగుల కలగానే మిగిలిపోయాయని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మూడు లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం... ఇప్పటి వరకు 9వేల ఇళ్లు మాత్రమే నిర్మించిందన్నారు. మిగిలిన 2 లక్షల 91వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు కేవలం 2643 కోట్లు కేటాయించి... 2లక్షల 91వేల ఇళ్లను ఎలా నిర్మిస్తారని నిలదీశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. పేదవాళ్లకు ఇళ్లు నిర్మించే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. 

16:23 - March 19, 2018

హైదరాబాద్ : ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలను ఈ బడ్జెట్‌లో విస్మరించారన్నారు. విద్యా,వైద్యం,ఉపాధిపై బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఆదివాసీలు, గిరిజనులకు అటవీభూములపై హక్కులు కల్పించాలని సీపీఎం ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ భారీ అంకెల బడ్జెట్‌అని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. తెలంగాణ నిర్మాణానికి ఈ బడ్జెట్‌ ఏమాత్రం ఉపయోగడపదని విమర్శించారు.

కోమటిరెడ్డి, సంపత్ లకు ఊరట..

హైదరాబాద్ : తమ శాసనసభ సభ్యత్వాన్ని టీఆర్ఎస్ సర్కార్ శాశ్వతంగా రద్దు చేయటంపై కోమటిరెడ్డి, సంపత్ లు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారికి ఊరట లభించింది. ఆరు వారాల పాటుఈసీ నోటిఫికేషన్ ఇవ్వరాదని హైకోర్టు వారికి మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. కాగా మండలి చైర్మన్ స్వామిగైడ్ పై కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసరటాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వీరిద్దరి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తమకు న్యాయం జరపాలంటు వారు కోర్టును ఆశ్రయించిన క్రమంలో వారికి స్వల్పంగా ఊరట లభించింది. 

16:11 - March 19, 2018

ఢిల్లీ : ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అవిశ్వాస తీర్మాణం పెడితే సభ సజావుగా లేదని తప్పించుకోవడం సరికాదని ఆయన అన్నారు. సభను ఆర్డర్‌లో పెట్టి అవిశ్వాసంపై చర్చించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం కుంటిసాకులు చెప్పడం సరికాదని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ డిమాండ్ చేశారు.

16:09 - March 19, 2018

కేసీఆర్ కు ఘన స్వాగతం..

పశ్చిమబెంగాల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోల్‌కతాలోని సచివాలయానికి చేరుకున్నారు. తొలుత కోల్‌కతా విమానాశ్రయంలో ఆయనకు పశ్చిమ్‌బంగ మంత్రి మంత్రి పూర్ణేన్ధ్ బసు తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సచివాలయం వద్ద పశ్చిమ్‌బంగ సీఎం మమతా బెనర్జీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసిన మమత సాదర స్వాగతం పలికారు. ఇరువురి నేతల భేటీ ప్రారంభమైంది. తృతీయ కూటమి ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ భేటీ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. కేసీఆర్‌ వెంట కె.

ప్రజాప్రతినిథి భార్యకు లైంగిక వేధింపులు!..

కేరళ : ఆమె సాక్షాత్తూ ఎంపీ జోస్ మణి భార్య. ఆమెకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. తనపై తాను రాసుకున్న బుక్‌ను రిలీజ్ చేశారు. ఆ సందర్భంలో తనపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురయినట్లుగా ఆమె తెలిపారు. పైగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించింది మరో రాజకీయ నాయకుడే కావడం గమనార్హం. తాను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో సదరు వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించారని నిషా చెప్పారు. 2012లో జరిగిన ఈ ఘటనపై అక్కడే ఉన్న ట్రెయిన్ టీటీఈకి చెప్పినా.. ఆయన పట్టించుకోలేదని ఆమె వాపోయారు.

కళ్యాణ లక్ష్మి పథకం పెంపు.ఆడబిడ్డల హర్షం..

హైదరాబాద్ : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మనసున్న మారాజు అని మహిళలు ప్రసంశలు కురిపిస్తున్నారు. మా ఇంటి అన్నయలాగ, మేనమామలాగ కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఆడపడుచులు అంటున్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు. తమ బిడ్డల పెళ్లిళ్లకు ఆసరాగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం రూ.

15:24 - March 19, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వతరపు వాదనలు వినిపించారు. గవర్నర్‌ ప్రసంగం రోజు జరిగిన వీడియో ఫుటేజీలన్నింటిని సీల్డ్‌ కవర్‌లో సోమవారం సమర్పించాలని ఆదేశించారు. ఈ కేసు పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ఎలక్షన్‌ నిర్వహించొద్దని ఈసీకి సూచించింది.

15:14 - March 19, 2018

ఢిల్లీ : టీడీపీ, వైసీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోమ్ మంత్రి ఎట్టకేలకు రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతు...ఏపీ పార్టీలు ఇచ్చఇన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా వుందని ఆయన తెలిపారు. చట్టసభలు వున్నది సమస్యలపై చర్చించేదుకేనని ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు మేము సిద్ధంగా వున్నామని ఆయన తెలిపారు. ఈ అంశంపై సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరుతున్నామనీ..చట్టసభలు వున్నవి సమస్యలపై చర్చించేందుకేనని ఆయన స్పష్టం చేశారు.సభ దృష్టికి వచ్చిన సమస్యలను చర్చించాలని సభ బలంగా కోరుకుంటోందని రాజ్ నాథ్ పేర్కొన్నారు.

అవిశ్వాస తీర్మానంపై స్పందించిన రాజ్ నాథ్ సింగ్ ..

ఢిల్లీ : టీడీపీ, వైసీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతు...ఏపీ పార్టీలు ఇచ్చఇన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా వుందని ఆయన తెలిపారు. చట్టసభలు వున్నది సమస్యలపై చర్చించేదుకేనని ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు మేము సిద్ధంగా వున్నామని ఆయన తెలిపారు. 

15:01 - March 19, 2018

హైదరాబాద్ : ప్రత్యేకహోదా అంశంలో సీఎం చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. 2016లో ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్న అరుణ్‌జైట్లీకి చంద్రబాబు సన్మానం చేశారని ఆమె ఎద్దేవా చేశారు. గంటకో మాట మారుస్తున్న టీడీపీ అధినేత.. ఏపీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రతిక్షాన్ని బలహీన పరచడానికి ప్రయత్నం చేసిన చంద్రబాబు.. ఇపుడు ప్రభుత్వంతోపాటు టీడీపీని బలహీన పరిచారని లక్ష్మీపార్వతి అన్నారు.  

14:56 - March 19, 2018

పెద్దపల్లి : ప్రతి పంటకు నీళ్లందిస్తామని అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు. తీరా సమయానికి చేతులెత్తేశారు. దీంతో పంట వేసిన రైతన్నలు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. పంటలు ఎండుతున్నా.. మాటిచ్చిన నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఆరు మండలాల్లో వరి పంటలు ఎండిపోయి రైతన్నలు నష్టాల బారినపడ్డారు.

నీరు లేక ఎండుతున్న పంటలు
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్, ఓదెల ఎలిగెడు జుల్లపల్లి, కాల్య శ్రీరాంపూర్‌లో సాగునీరు లేక వరి పంటలు ఎండిపోతున్నాయి.. అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి... పంటలు వేశామంటున్నారు రైతులు.. కానీ.. హుజురాబాద్, మానకోండూర్ నియోజక వర్గాలకు ఎస్సారెస్పీ కాలువల నీరు తీసుకుపోవడంతో పెద్దపల్లి నియోజకవర్గానికి నీరు అందలేదు.. దీంతో సుమారు ఆరు మండలాల్లో పంటలన్నీ ఎండిపోయాయి...

సాగు నీరందించడంలో ప్రభుత్వం విఫలం
పెద్దపల్లి నియోజకవర్గంలో సాగు నీరందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ నాయకుడు చేతి ధర్మయ్య విమర్శించారు. ఎనిమిది తడుల వరకు రైతులకు సరిపడా నీరందిస్తామని... స్థానిక ఎమ్మెల్యే సమావేశాల్లో పదేపదే చెప్పడంతోనే రైతులు పంటలు వేసుకున్నారని.... కానీ ఇప్పుడు ఎండుతున్న పొలాలు చూస్తుంటే.. కడుపు తరుక్కుపోతోందని ధర్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ నుంచి చివరి ఆయకట్టు వరకు నీరు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు.. మంత్రులు పచ్చగా కళకళలాడుతుంటే... పంటలు మాత్రం ఎండిపోతున్నాయన్నారు.... భవిష్యత్తులో ప్రజలు టీఆర్ఎస్‌కు తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి... ఎండిన ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.

14:54 - March 19, 2018

హైదరాబాద్ : నిరంతరం నేరాలు చేసే వారిపై పీడీయాక్ట్ పెట్టి, జైల్లో వేయడం వల్ల పాక్షికంగా నేరాలు తగ్గాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. పోలీసులు నేరస్తులను శిక్షించడం వల్ల మార్పు తీసుకొచ్చారని చెప్పారు. ఈ మధ్యనే హోంమంత్రి, హోం సెక్రటరి, రాష్ట్ర డీజీపితో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని నేరస్తుల గురించి చర్చించామన్నారు. రాష్ట్ర పోలీసుల చర్యలతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం మంతట పాక్షికంగా నేరాలు తగ్గాయని చెప్పారు. 

14:52 - March 19, 2018

హైదరాబాద్ : కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకం కింద ఆడపిల్ల పెండ్లి కోసం అందించే సహాయాన్ని 75 వేల నూట 16 నుండి ఒక లక్ష నూట 16కు పెంచుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. 3 లక్షల 60 వేల లబ్దిదారులకు ఈ పథకం ద్వారా చెక్కులు పంపిణీ చేశామన్నారు. చెక్కుల పంపిణీ సమయంలో లబ్దిదారులు ప్రభుత్వానికి దీవెనలను అందిస్తున్నారని చెప్పారు. కళ్యాణ లక్ష్మీ పథకం వల్ల లబ్దిదారులు వివాహా గుర్తింపు, చట్ట బద్దత సాధిస్తున్నారని కేసీఆర్‌ తెలిపారు. ఈ పథకానికి 18 సంవత్సరాలు వయోపరిమితిగా నిర్ణయించడం వల్ల బాల్య వివాహాలను నిరోధించడానికి ఉపయోగపడుతున్నాదని అన్నారు.

14:49 - March 19, 2018

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం ఉద్యమాన్ని మరింతవ ఉధృతం చేస్తామన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విజయవాడలో ప్రత్యేక సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. హోదా సాధన కోసం గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రజల్ని కదిలించడానికి పార్టీలన్నీ కలిసిరావాలని మధు పిలుపునిచ్చారు. పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, మహిళలు అందరూ ఉద్యమంలోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ప్రత్యేక సాధన సమితికి సూచించారు. అటు నిన్నటిదాకా ప్రజలన్ని మభ్యపెట్టిన టీడీపీ నాయకులు ఇపుడు ప్రత్యేక హోదా అంటూ తెగ హడావిడి చేస్తున్నారని మధు విమర్శించారు. 

14:43 - March 19, 2018

హైదరాబాద్ : కేంద్రంపై తెదేపా, వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు. సభ సజావుగా సాగనందువల్లే నోటీసులు తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ స్పష్టం చేశారు. సభ నిర్వహణ సక్రమంగా సాగకపోతే నోటీసులు స్వీకరించలేమన్నారు. టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో ఇవాళ దీనిపై లోక్‌సభలో చర్చ జరుగుతుందని అనుకున్నారు. కానీ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. గంట తర్వాత సభ ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితి నెలకొంది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపు అంశంపై తెరాస సభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్యే స్పీకర్‌ కాసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అయినా ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు సభ్యులు వీలు కల్పించాలని స్పీకర్‌ కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ లోక్‌సభలో స్పష్టం చేశారు. విపక్ష సభ్యులు ఆందోళన విరమించి సభ సక్రమంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

13:43 - March 19, 2018
13:36 - March 19, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వతరపు వాదనలు వినిపించారు. గవర్నర్‌ ప్రసంగం రోజు జరిగిన వీడియో ఫుటేజీలన్నింటిని సీల్డ్‌ కవర్‌లో సోమవారం సమర్పించాలని ఆదేశించారు. ఈ కేసు పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ఎలక్షన్‌ నిర్వహించొద్దని ఈసీకి సూచించింది.

 

స్వామిగౌడ్ దాడి ఘటనకు ఆధారాలు - అడ్వకేట్ జనరల్...

హైదరాబాద్ : కోమటిరెడ్డి..సంపత్ సభ్యత్వాల రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పై దాడికి సంబంధించిన ఆధారాలున్నాయని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఘటన దృశ్యాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని కోర్టు సూచించింది. కేసు విచారణ ఈనెల 22కి వాయిదా వేసింది. 

స్పీకర్ విందుకు ఎంపీల తిరస్కరణ...

ఢిల్లీ : నేడు ఎంపీలకు లోక్ సభ స్పీకర్ విందు ఇవ్వనున్నారు. కానీ ఈ విందుకు టిడిపి, వైసిపి ఎంపీలు నిరాకరించారు. అవిశ్వాస తీర్మానంపై మంగళవారం కూడా నోటీసులు అందచేస్తామని ఎంపీలు ప్రకటించారు. 

12:58 - March 19, 2018

అందరం కలిసి పోరాడాలన్న శివాజీ...

విజయవాడ : తెలుగుజాతి ఉద్యమం దేశస్థాయిలోకి వెళ్లడం శుభపరిణామమని, ఈ సమయంలో అందరం కలిసి పోరాడాలని సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. ఆంధ్రులకు కోపం వస్తే దేశంలోనే బీజేపీ కనబడకుండా పోతుందన్నారు. 

హోదా ఉద్యమం క్లైమాక్స్ - తులసీరెడ్డి...

విజయవాడ : హోదా ఉద్యమం క్లైమాక్స్ కు వచ్చిందని..తాడోపేడో తేల్చుకోవాలని, దేనికైనా సిద్ధపడేలా ఉద్యమ కార్యచరణ ఉండాలని కాంగ్రెస్ నేత తులసీరెడ్డి తెలిపారు. హోదా సాధన కోసం ఎలాంటి ఉద్యమానికైనా మద్దతు వెల్లడిస్తామని, కాంగ్రెస్ ప్లీనరీలో హోదా కోసం తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఎన్డీయే హోదా ఇవ్వకుంటే అధికారంలోకి రాగానే తొలి సంతకం హోదాపై పెడుతామని పేర్కొన్నారు. 

ధైర్యం ఉంటే చర్చ చేపట్టాలి - వైసీపీ ఎంపీ...

ఢిల్లీ : ఏదో ఒక నెపంతో సభ వాయిదా వేస్తూ తప్పుడు చేస్తున్నారని, అవిశ్వాసం చర్చకొస్తుందని ప్రతి రోజు ఎదురు చూస్తున్నట్లు వైసీపీ ఎంపీ వరప్రసాద్ రావు పేర్కొన్నారు. ధైర్యం ఉంటే అవిశ్వాసంపై చర్చకు అవకాశం ఇవ్వాలని, చంద్రబాబు రోజుకో మాట మాట్లాడడం సబబు కాదన్నారు. మూడేళ్లు ప్యాకేజీ అడగి హోదాను హేళన చేశారని, ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే అవిశ్వాసంపై పోరాడలేమన్నారు. ఆఖరి అస్త్రంగా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని, టీఆర్ఎస్ ఎంపీలు అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు. 

12:17 - March 19, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానం ఉత్కంఠ కొనసాగుతోంది. సభ ఆర్డర్ లో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం ముందుకు తీసుకెళ్లలేమని స్పీకర్ సుమిత్రా మహజన్ సోమవారం వెల్లడించారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ టిడిపి..వైసిపి ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం సభ వాయిదా పడిన అనంతరం సోమవారం లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ ఎంపీలు..ఇతర విపక్షాలు స్పీకర్ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టాయి. దీనితో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. తిరిగి ప్రారంభమైన తరువాత కూడా విపక్షాలు ఆందోళన చేపట్టాయి.  కావేరీ మండలాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ఎంపీలు..రిజర్వేషన్ అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేయడంతో సభ దద్దరిల్లింది. ఈ సమయంలో పలు బిల్లులను సభ ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ తరుణంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జోక్యం చేసుకున్నారు. వైసిపి..టిడిపి పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. 

టిడిపి..వైసిపి సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలు సభ ఎదుట వచ్చాయని కానీ సభ ఆర్డర్ లో లేకపోవడంతో చర్చను ప్రారంభించలేకపోతున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ పేర్కొన్నారు. సభ్యులు తమ తమ సీట్లలో కూర్చొవాలని ఆందోళన చేస్తున్న సభ్యులకు స్పీకర్ సూచించారు. కానీ సభలో పరిస్థితి ఏ మాత్రం మార్పు రాలేదు. చివరకు సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. దీనితో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

మంగళవారానికి లోక్ సభ వాయిదా...

ఢిల్లీ : లోక్ సభ మంగళవారానికి వాయిదా పడింది. కేంద్రంపై సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ముందుకు తీసుకెళ్లాలంటే సభ ఆర్డర్ లో ఉండాలని స్పీకర్ వెల్లడించారు. సభ ఆర్డర్ లో లేనందున మంగళవారానికి సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

అవిశ్వాస తీర్మానంపై రాజ్ నాథ్ సింగ్ స్పందన...

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. వైసిపి..టిడిపి పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. 

లోక్ సభ సమావేశాలు..తిరిగి ప్రారంభం...

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభ్యులు మాత్రం ఆందోళన చేపడుతున్నారు. టిడిపి..వైసిపి ఇచ్చిన తీర్మానాల విషయంపై ఉత్కంఠ నెలకొంది. 

ఆడపిల్లల వివాహాల ధన సహాయం పెంపు...

హైదరాబాద్ : పేదింటి ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం ఇస్తున్న ధన సహాయాన్ని పెంచుతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో ఈమేరకు ఆయన ప్రకటించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఇస్తున్న మొత్తాన్ని లక్షా నూటపదహారు రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.

 

11:55 - March 19, 2018
11:25 - March 19, 2018

విజయవాడ : ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని..విభజన హామీలు అమలు చేయాలని ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. విజయవాడలో విభజన హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై కేంద్రం అనుసరించే వైఖరిని బట్టి ప్రతిఘటన ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుందని హెచ్చరించారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగాలని..కానీ ముందే నిరవధిక వాయిదా వేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన సమితి..విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేయాలని సూచించారు. ఈ ఆందోళనలు..ఉద్యమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు మండల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఏప్రిల్ నెలలో మహాసభలు ఏర్పాటు చేయాలని, బస్సు యాత్రలు కూడా నిర్వహించాలన్నారు. పార్లమెంట్ లో తీర్మానంపై అనుసరించే వైఖరిని బట్టి యాక్షన్ ప్లాన్ చేయాలన్నారు. 

11:21 - March 19, 2018

ఢిల్లీ : లోక్ సభ సమావేశాల్లో వైసిపి..టిడిపి సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానం సభ ఎదుట వస్తుందా ? లేదా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఆ రెండు పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందచేసిన సంగతి తెలిసిందే. సభ ఆర్డర్ లో ఉంటేనే తీర్మానం అనుమతినిస్తామని స్పీకర్ కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. దీనితో అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వైసిపి..టిడిపి పార్టీలు కోరుతున్నాయి. కానీ సోమవారం సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ సభ్యులు..ఇతర సభ్యులు వెల్ లోకి వెళ్లి నినాదాలు..ఆందోళన చేశాయి. దీనితో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాకుండానే సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

11:06 - March 19, 2018

లోక్ సభ వాయిదా...

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. టీఆర్ఎస్, ఇతర ఎంపీలు వెల్ లోకి ఆందోళన చేపట్టారు. దీనితో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

టిడిపి ఎంపీ ఆందోళన..

విజయవాడ : ఏపీకి న్యాయం చేయాలంటూ టిడిపి ఎంపీలు నిరసన చేపట్టారు. ఎంపీ శివ ప్రసాద్ వినూత్నంగా నిరసన చేపట్టారు. చీర కట్టులో ఆయన వచ్చిన ఆయన ఆందోళన చేపట్టారు. 

జగన్ 115వ రోజు...

గుంటూరు: వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. 115వ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను నుంచి ప్రారంభమైంది. పెద్దివారిపాలెం, కొమ్మూరు, నాగులపాడు, పెదనందిపాడు శివారు వరకు పాదయాత్ర జరుగనుంది. 

'హోదా' ఉద్యమంలో విద్యార్థులను భాగస్వాములు చేయాలి - పల్లె...

విజయవాడ : తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులదే కీలక పాత్ర పోషించిందని, ప్రత్యేక హోదా అంశంలో విద్యార్థులను కూడా భాగస్వాములు చేయాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. గుంటూరు సభలో పవన్ చేసిన తప్పు తిట్టడం..ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి రూ. 75 వేల కోట్ల నిధులు కేంద్రం నుండి రావాలన్న పవన్ ఆ విషయాన్ని ఎందుక సభలో ప్రస్తావించలేదని ప్రశ్నించారు. 

నిరసన ప్రదర్శనలు చేయాలన్న బాబు...

విజయవాడ : అవిశ్వాసం తీర్మానం తిరస్కరిస్తే రాజ్యాంగాన్ని కాపాడాలని, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పవన్..జగన్ డ్రామాలు..కేంద్రం చేసిన అన్యాయం ప్రజలకు వివరించేందుకు టిడిపి కిందిస్థాయి నాయకత్వానికి వివరిస్తానని తెలిపారు. బీజేపీ చేసిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా మండల..గ్రామస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేయాలని సూచించారు. ఈ అంశంలో దేశ వ్యాప్తంగా చర్చను లేవనెత్తగలిగామన్నారు.

మావోయిస్టుల దుశ్చర్య...

ఛత్తీస్ గడ్ : మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. బిజాపూర్ లో ఆరు వాహనాలకు నిప్పు పెట్టారు. నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్ ను చంపేశారు. 

అవిశ్వాస తీర్మానం కేంద్రం కుట్ర - వీహెచ్...

ఢిల్లీ : పార్లమెంట్ లో చర్చకు రాకుండా చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని..పార్టీలు మనస్పూర్తిగా మద్దతిస్తే అవిశ్వాసం తీర్మానంపై చర్చకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదని..కానీ ఆ పార్టీ సభ్యులు లోక్ సభలో ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు.

10:14 - March 19, 2018

ఢిల్లీ : ఏపీ రాష్ట్ర విభజనలు..ప్రత్యేక హోదా తదితర హామీలు అమలు చేయాలంటూ వైసిపి..టిడిపి పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సభ ముందుకు వస్తుందా ? లేదా ? అనేది ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. ఇప్పటికే పలు పార్టీలు మద్దతిచ్చాయని ఆ పార్టీలు పేర్కొంటుండగా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని..మిత్రపక్షాలు అన్నీ కలిసే ఉన్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ వీహెచ్ తో టెన్ టివి మాట్లాడింది.

పార్లమెంట్ లో చర్చకు రాకుండా చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని..పార్టీలు మనస్పూర్తిగా మద్దతిస్తే చర్చకు వచ్చే అవకాశం ఉందని వీహెచ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదని..కానీ ఆ పార్టీ సభ్యులు లోక్ సభలో ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరుగుతోందంటూ కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని, రాష్ట్రాలకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈయన క్యారెక్టర్ తెలిసిన వారు ఎవరూ మద్దతివ్వరని, మమత బెనర్జీకి ఆయన సంగతి తెలియదన్నారు. 

బీజేపీ వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ...

ఢిల్లీ : రాజకీయం హీటెక్కాయి. లోక్‌సభలో వైసీపీ, టీడీపీ అవిశ్వాస నోటీసులు అందచేసిన సంగతి తెలిసిందే. తమ ఎంపీలకు టీడీపీ, వైసీపీ పార్టీలు విప్ జారీ చేశాయి. బీజేపీ వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

09:31 - March 19, 2018

విజయవాడ : లోక్ సభలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి ? అవిశ్వాస తీర్మానం సభలో రావడానికి ఎలాంటి వైఖరి అనుసరించానే దానిపై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు దిశా..నిర్ధేశం చేశారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైసిపి..టిడిపి పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుటిలాగే టిడిపి ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సభ ఎదుట తీర్మానం వచ్చే విధంగా చూడాలని...పలు పార్టీల నేతల మద్దతు తీసుకోవాలని బాబు సూచిస్తున్నారు. తృణముల్ కాంగ్రెస్ కలిస్తే 50 మంది మద్దతు లభిస్తుందని..ఆ పార్టీ అధిష్టానం..నేతలతో మాట్లాడి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయాలని బాబు సూచించారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ, లెఫ్ట్, ఆర్జేడీ, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. 

టి. అసెంబ్లీ..ప్రశ్నలు...

హైదరాబాద్ : సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్..సీఎం కేసీఆర్ లేకుండానే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై చర్చ జరుగనుంది. ప్రశ్నోత్తరాల్లో మొత్తంగా పది ప్రశ్నలున్నాయి. డ్రగ్స్ వ్యవహారంపై ఎలాంటి విషయాలు తెలిశాయి ? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం ఇస్తున్నారని..9 వస్తువులు ఇచ్చే ప్రతిపాదన ఏదైనా ఉందా ? కొత్త జిల్లాలు..కొత్త మండలాల్లో గిడ్డంగుల విషయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొంటోంది..కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టిన అనంతరం ప్రసవాల సంఖ్య పెరిగిందా ?

09:24 - March 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోల్ కతాకు వెళ్లనున్నారు. థర్డ్ ఫ్రంట్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో కేసీఆర్ చర్చలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన పలువురు జాతీయ నాయకులతో ఫోన్ లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్..సీఎం కేసీఆర్ లేకుండానే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై చర్చ జరుగనుంది.

మరోవైపు సభలో పలువురు సభ్యులు వేసే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. మొత్తంగా పది ప్రశ్నలున్నాయి. డ్రగ్స్ వ్యవహారంపై ఎలాంటి విషయాలు తెలిశాయి ? తదితర విషయాలన్నీ సభ ఎదుట పెట్టాలనే ప్రశ్నపై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. రేషన్ కార్డు ద్వారా గతంలో 9 వస్తువులు ఇచ్చేవారని..టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం ఇస్తున్నారని..9 వస్తువులు ఇచ్చే ప్రతిపాదన ఏదైనా ఉందా ? తదితర విషయాలు చెప్పాలని సభ్యులు ప్రశ్నించనున్నారు. కొత్త జిల్లాలు..కొత్త మండలాల్లో గిడ్డంగుల విషయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొంటోంది..చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించనున్నారు. ఇక కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టిన అనంతరం ప్రసవాల సంఖ్య పెరిగిందా ? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చెప్పాలని సభ్యులు ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించనున్నారు. ఉచితంగా నేత్ర పరీక్షలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారని...ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్లు చేశారు ? తదితర వివరాలు ప్రభుత్వం చెప్పాలని సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు. 

09:11 - March 19, 2018

ఢిల్లీ : అందరి దృష్టి లోక్ సభపైనే...లోక్ సభలో ఏం జరుగుతుంది ? ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ రాష్ట్రానికి చెందిన వైసీపీ..టిడిపిలు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని..ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ...టిడిపి పార్టీలు వేర్వేరుగా తీర్మానాలు ఇచ్చాయి. కానీ సభ సజావుగా జరిగే అవకాశం లేదని..తీర్మానాలను తీసుకోవడం లేదని సోమవారానికి సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. సోమవారం కూడా సభ సజావుగా జరుగుతుందా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. టీఆర్ఎస్ ఎంపీలు..ఇతర పార్టీల ఎంపీలు ఆందోళన చేస్తుండడంతో స్పీకర్ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఇదిలా ఉంటే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ టిడిపి..వైసిపి పార్టీలు పలు పార్టీలను కోరుతున్నాయి. తీర్మానానికి మద్దతిస్తామని పలు పార్టీలు పేర్కొన్నాయని తెలుస్తోంది. 54మంది సంతకాలతో టిడిపి సోమవారం నోటీసు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కానీ పది శాతం తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. 54 మంది సభ్యులు లేచి ఉంటే తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతినిస్తారు. ఏ రోజుల్లో చర్చకు అనుమతినిస్తారనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏ తీర్మానాన్ని స్పీకర్ ముందు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మోడీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని..ఎన్డీయే పక్ష పార్టీలన్నీ ఒకే అభిప్రాయంపై ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

లోక్ సభ సజావుగా జరుగుతుందా ?

ఢిల్లీ : లోక్ సభలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వంపై టిడిపి..వైసిపి అవిశ్వాస తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసలిందే. కానీ సభ సజావుగా జరిగితేనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతినిచ్చే అవకాశం ఉంది. 

ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల అరెస్టు...

తమిళనాడు : ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం చెన్నై ఎయిర్ పోర్టులో బాంబు ఉందనే కాల్ రావడం..ఈ ఘటనలో ఇంజినీర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

08:18 - March 19, 2018

అవిశ్వాస తీర్మానంపై మరోసారి నోటిస్ ఇవ్వడానికి సిద్ధమని టిడిపి స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటిసు ఇచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ కూడా తీర్మానం నోటీసు అందచేసింది. కానీ సభ ఆర్డర్ లేకపోవడంతో తీర్మానం తీసుకోవడం లేదని స్పీకర్ పేర్కొన్నారు. సోమవారం కూడా సభ ఆర్డర్ లేకపోతే తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ అంశంపై చర్చలో దుర్గా ప్రసాద్ (కాంగ్రెస్), తెలకపల్లి రవి (విశ్లేషకులు), శేఖర్ రెడ్డి (టీఆర్ఎస్), గోపిరెడ్డి (వైసీపీ), బాజి (బిజెపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:50 - March 19, 2018

ఒక అందమైన పెద్ద కట్టడాన్ని చూసి, కట్టించిన వారి గురించి, పెట్టిన ఖర్చు గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ భవనాన్ని నిర్మించిన కార్మికుల గురించి ఎవరూ మాట్లాడరు. అందమైన బిల్డింగ్‌ నిర్మాణం అయ్యిందంటే.. దాని వెనుక కార్మికుల శ్రమ ఉంటుంది. తక్కువ కూలి ఇస్తూ... వారితో ఎక్కువ కష్టం చేయిస్తారు. వారి ప్రయోజనాలు ఎవరికీ పట్టవు. భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనాలు ఎప్పుడూ విస్మరించబడుతూనే ఉన్నాయి. ఇదే ఆందోళనలో బిల్డింగ్‌ వర్కర్స్‌ ఉన్నారు. వారిపట్ల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణలోని బిల్డింగ్‌ వర్కర్స్‌ ఈ నెల 20వ తేదీన ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపనున్నారు. ఈ కార్యక్రమానికి గల కారణాలు, వారి పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై టెన్ టివి జనపథంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంగూరి రాములు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:48 - March 19, 2018

ఢిల్లీ : రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్‌ పుతిన్‌ నాలుగోసారి ఎన్నికయ్యారు. పుతిన్‌కు 73.9శాతం ఓట్లు పడినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడయింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు భారీ ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 10.7 కోట్ల మంది ఓటర్లు ఉండగా.... మధ్యాహ్నానికి 52 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో పుతిన్‌తో పాటు మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండగా... న్యాయపరమైన కారణాలతో పుతిన్‌ ప్రధాన ప్రత్యర్థి ఆలెక్సీ నావల్నీని ఎన్నికల బరి నుంచి తప్పించారు. దీంతో పుతిన్‌ ఎన్నిక కావడం లాంఛనమేననే తేలిపోయింది. దాదాపు 19 ఏళ్ల క్రితం పుతిన్‌ తొలిసారిగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. నాటినుంచి అధికారంలో కొనసాగుతున్నారు. 

07:47 - March 19, 2018

కొమరం భీం ఆసిఫాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో... మారుమూలన ఉన్న ఓ పీహెచ్‌సీ ఎంతో మెరుగైన సేవలందిస్తోంది. నార్మల్‌ డెలివరీలకు కాలం చెల్లిందని అందరూ భావిస్తున్న తరుణంలో... గర్భీణీలందరికీ ప్రసవాలన్నీ నార్మల్‌గానే చేసేందుకు సిబ్బంది ఎంతో ప్రయత్నిస్తున్నారు. గర్భిణీలకు వైద్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు... సరైన సమయంలో సరైన వైద్యం అందించేలా నిత్యం ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ పీహెచ్‌సీకి నీతి అయోగ్‌ గుర్తింపు కూడా లభించింది. దీంతో మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... ప్రధాని మోదీ కూడా ఈ పీహెచ్‌సీని సందర్శించే అవకాశాలున్నాయి.

కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లా..కౌటాల మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాష్ట్రంలోని ఇతర వైద్యశాలలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. సర్కారు వైద్యంపై నమ్మకం లేకుండాపోయిన ఈ రోజుల్లో ఈ ఆరోగ్య కేంద్రం చరిత్ర తిరగరాస్తుంది. గడిచిన రెండేళ్లలో వెయ్యి నార్మల్‌ ప్రసవాలు చేసి శబాష్ అనిపించుకుంటుంది. కౌటాల లాంటి మారుమూల ప్రాంతంలోని ఈ పీహెచ్‌సీ డాక్టర్లు గర్బిణిల కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే సిజేరియన్లు కాకుండా నార్మల్‌ డెలివరీలు చేస్తూ, డబ్చుతో పాటు బాలింతల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు.

ప్రయివేటు ఆసుపత్రిలకు దీటుగా ఈ పీహెచ్‌సీలో సకల సౌకర్యాలున్నాయి. గర్భిణిలలో అవగాహన కల్పిస్తూ.. నార్మల్‌ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు 102 వాహనాలు... ఐటీడీఏ అంబులెన్స్‌లు బాలింతలను ఇంటినుండి ఆస్పత్రికి,... ఆస్పత్రి నుండి ఇంటికి చేరుస్తూ గ్రామీణుల ఆదరణ పొందుతోంది. తెలంగాణ ప్రభుత్వం గర్బణిలకు అందిస్తున్న పలు సౌకర్యాలు.. కేసీఆర్‌ కిట్‌తో పాటు స్థానిక సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా పౌష్టికాహారం, కిట్లు కూడా ప్రభుత్వం వైద్యంపైన ప్రజలు మొగ్గు చూపేలా చేస్తున్నాయి.

గ్రామాలలో ఆశావర్కర్స్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు గర్బిణిలకు ఆరోగ్యం పట్ల, సర్కారు వైద్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెల 9వ తేదీన ఇక్కడి పీహెచ్‌సీలో ప్రత్యేక పరీక్షలు చేసి, వారి ఆరోగ్యానికి కృషి చేయడం వల్ల ఈ ఘనత సాధించినట్టు కౌటాల ఆరోగ్య కేంద్రం వైద్యులు అంటున్నారు.

కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలను నీతి అయోగ్‌ సంస్థ గుర్తించింది. కౌటాల పీహెచ్‌సీకి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నీతి అయోగ్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వెనుకబడిన ప్రాంతాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ పీహెచ్‌సీలో అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని సందర్శిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంతైనా మారుమూల ప్రాంతంలోని చిన్న ప్రాథమిక కేంద్రంలో ప్రజలకు సేవలు అందిస్తున్న సిబ్బందికి హాట్సాప్‌ చెప్పాల్సిందే

07:38 - March 19, 2018

సంగారెడ్డి : ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకోవడం సంప్రదాయం... ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనాలు ఎప్పట్నుంచో చూస్తున్నాం.... కానీ.. సంగారెడ్డిలో మాత్రం ఉగాది పర్వదినాన ఎక్కడాలేనివిధంగా వినూత్నంగా లడ్డూల ఉత్సవం జరుపుకుంటారు. ఎన్నో ఏళ్ళుగా ఆనవాయితీగా ఈ లడ్డూల ఉత్సవం కొనసాగుతోందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:36 - March 19, 2018

జగిత్యాల : ప్రకృతిలో జరిగే మార్పుతో ఉగాది పర్వదినం వస్తే... ఈ గ్రామంలో మాత్రం ఉగాది పండుగతో వారి జీవితాల్లో కొత్త మార్పు వస్తుంది. తెలుగు నూతన సంవత్సరం వచ్చిందంటే... చాలు ఈ ఊరిలో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతుంది.. పిల్లాపాపలు సుఖసంతోషాలతో ఉండాలని దేవాతామూర్తులను వేడుకుంటారు గ్రామస్థులు... అందరూ ఏకమై.. ఉల్లాసంగా నిర్వహించే ఉగాది వేడుకలతో... ఆదర్శంగా నిలుస్తోంది.. జగిత్యాల జిల్లాలోని వెల్లుల్ల గ్రామం...

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఉగాది వచ్చిందంటే చాలు... ఊరుఊరంతా కలిసి ఉత్సవాలకు కదులుతారు. ఇక్కడ ఎడ్ల బండ్ల ప్రదర్శన ప్రతి ఏటా ఉగాదికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ఇంటికో ఎడ్లబండిని తీసుకువచ్చి వాటిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గోదావరి నుంచి తెచ్చిన జలాలతో గ్రామంలోని దేవాతామూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.. మంగళ హారతులతో డప్పుచప్పుళ్లతో హనుమాన్‌ దీక్షాపరుల భజనల మధ్య భక్తి శ్రద్ధలతో ఎడ్ల బండ్లను ఊరేగిస్తారు.

పండించిన పంటలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం... గ్రామ శివారులోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు. ఎడ్లబండ్లతో ఆలయం చుట్టు ఐదు ప్రదక్షిణలు చేసి... స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. ఆలయ పూజారి వినిపించే.. పంచాంగ శ్రవణం కార్యక్రమం తర్వాత... గ్రామస్థులు ఉగాది పచ్చడిని పంచుతారు... కుటుంబ సమేతంగా వచ్చిన వారంతా ఇక్కడే భోజనాలు చేస్తారు..ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఉగాది వేడుకలను తిలకించేందుకు వెల్లుల్ల గ్రామ ప్రజలతోపాటు.. చుట్టుపక్కల గ్రామాల వారు సైతం తరలివస్తారు.. 

07:34 - March 19, 2018

ఢిల్లీ : ముక్కోణపు టీ-20 సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. బంగ్లాదేశ్‌పై సునాయసంగా గెలవాల్సిన భారత్‌.. చివరి వరకు టెన్షన్‌ పుట్టించింది. దినేశ్‌కార్తీక్‌ మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ ఓటమి తీరం నుండి బయటపడింది. చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా... బాల్‌ను సిక్సర్‌ బాదడంతో సిరీస్‌ భారత్‌ కైవసం అయ్యింది.

శ్రీలంకలో జరిగిన ముక్కోణపు టీ 20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. దినేశ్‌ కార్తీక్‌ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 29 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించాడు. చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు కావాల్సిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ చెలరేగి ఆడాడు. విజయం భారత్‌ చేజారి పోయిందనుకున్న తరుణంలో దినేశ్‌ కార్తీక్‌ ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో మైమరిపించాడు. ఓవరాల్‌గా ట్రై సిరీస్‌ను దినేశ్‌ కార్తీక్‌ గెలిపించి భారత్‌ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాడు.

టాస్‌ గెలిచిన ముందుగా బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి అనేక కష్టాలు పడింది. షబ్బీర్‌ రెహ్మాన్‌ నిలకడగా ఆడి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. షబ్బీర్‌ రెహ్మాన్‌ ఔటైన తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌లో వేగం తగ్గి.. 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్‌ మూడు వికెట్లు, జయదేవ్‌ ఉనాద్కత్‌ రెండు వికెట్లు తీశారు.

అనంతరం 167 పరుగుల విజయలక్ష్యం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆటగాళ్లు... ఆరంభంలో తడపడ్డారు. 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. శిఖర్‌ ధావన్‌, రైనాలు నిరాశపరిచారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌శర్మ బాధ్యతాయుతంగా ఆడి హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విజయ్‌ శంకర్‌ బంతులను అనవసరంగా వృథా చేయడంతో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకానొక దశలో భారత్‌ ఓటమి పాలవుతుందన్న తరుణంలో దినేశ్‌ కార్తీక్‌ చెలరేగి ఆడాడు. టీ-20 మ్యాచ్‌ అంటే చూపించాడు. చివరి ఓవర్‌లో 12 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి రెండు బంతులకు ఒక పరుగు మాత్రమే వచ్చింది. మూడో బంతికి కార్తీక్‌ పరుగు సాధించగా,... నాలుగో బంతికి విజయ్‌ శంకర్‌ ఫోర్‌ కొట్టాడు. ఐదో బంతికి విజయ్‌శంకర్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా.. స్ట్రైకింగ్‌కు వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ ఎలాంటి తడబాటు లేకుండా చివరి బంతిని సిక్స్‌ కొట్టి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దినేశ్‌ కార్తీక్‌ మెరుపు బ్యాటింగ్‌ చేసి మొత్తం 8 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మ్యాచ్‌ను గెలిపించిన దినేశ్‌కార్తీక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. వాషింగ్టన్‌ సుందర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ లభించింది.

07:14 - March 19, 2018

హైదరాబాద్ : జాతీయస్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో ఇవాళ కీలకమైన అడుగు పడనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇవాళ కోల్‌కతా వెళ్లి.. సీఎం మమతాబెనర్జీతో భేటీ కానున్నారు. ఫ్రంట్‌ ప్రకటన అనంతరం కేసీఆర్‌ తొలిసారి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి కోల్‌కత్తా వెళ్లనున్నారు. కేసీఆర్‌ వెంట కేశవరావు, కవిత వెళ్తున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ లక్ష్యాలు, భవిష్యత్‌ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. 

07:12 - March 19, 2018

విజయవాడ : ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని ఏపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించారు. శుక్రవారం అవిశ్వాస నోటీసు ఇచ్చినా అనివార్య కారణాలతో చర్చ జరగలేదు. మరోసారి ఇవాళ టీడీపీ, వైసీపీలు అవిశ్వాస నోటీసులు ఇవ్వనున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ, వైసీపీలు కృషి చేస్తున్నాయి. దీంతో ఇవాళ సభలో ఏం జరగనుంది ? స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై ఎత్తుకు‌ పైఎత్తులు హీట్ పెంచుతున్నాయి. అవిశ్వాసానికి మద్దతు కోసం వైసీపీ, టీడీపీ వేగంగా పావులు కదుపుతున్నాయి. టీడీపీ, వైసీపీలు అవిశ్వాసానికి మద్దుతుగా ఎంపీల సంతకాలు సేకరిస్తున్నారు. మరోవైపు టీడీపీ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. శుక్రవారం అవిశ్వాస తీర్మానం వైసీపీ, టీడీపీలు అవిశ్వాస తీర్మానం ఇవ్వగా... లోక్‌సభ ఆర్డర్‌లో లేని నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో మరోసారి ఈరోజు వైసీపీ, టీడీపీలు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్నాయి. అయితే... ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుంది... స్పీకర్ ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది.

అవిశ్వాసంపై స్పీకర్ ఏం తేల్చబోతున్నారు. చర్చకు అనుమతిస్తారా..?. రచ్చ పేరుతో వాయిదా వేస్తారా..? అనే సందిగ్ధం నెలకొంది. మరోవైపు అవిశ్వాసంపై బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే చాలా పార్టీలు టీడీపీ, వైసీపీల అవిశ్వాసానికి మద్దతిచ్చాయి. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం చేసేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 200 మంది ఎంపీలు మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి 300కు పైగా ఎంపీలు ఉన్నప్పటికీ నైతికంగా దెబ్బతీయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. గత రెండు రోజులుగా పార్లమెంట్‌కు సెలవులు ఉన్నప్పటికీ ఎంపీలు ఢిల్లీలోనే ఉండి... ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టేందుకు వ్యూహం రచించారు. ఇవాళ ఉదయం 9.30 గంటల వరకు సాధ్యమైనంత వరకు అన్ని పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు.

ఓ వైపు అవిశ్వాస తీర్మానంపై బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అవుతుండగా... బీజేపీ తేలికగా తీసుకుంది. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వానికి నష్టమేమీ లేదని స్పష్టం చేస్తున్నా... మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా చూసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ లోక్‌సభ జరుగుతుందా ? రోజు మాదిరిగానే వాయిదా పడుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక సభ జరిగితే స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ కూడా నెలకొంది. మొత్తానికి ఏపీ ఎంపీల అవిశ్వాస తీర్మానంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 

నగరానికి రానున్న ఎమ్మెల్యే జిగ్నేశ్...

హైదరాబాద్ : గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ నగరానికి రానున్నారు. మహాజన పాదయాత్ర ముగిసి నేటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఎస్వీకేలో ఏర్పాటు చేసిన మహాజన పాదయాత్ర ముగింపు వార్సికోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం బిఎల్ఎఫ్ రాష్ట్ర కార్యలయాన్ని ప్రారంభించనున్నారు. 

నేడు బిఎల్ఎఫ్ కార్యాలయం ప్రారంభం...

హైదరాబాద్ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కార్యాలయం నేడు ప్రారంభం కానుంది. గొల్కోండ లోని సీపీఎం నగర కార్యాలయం వద్ద గల ఈ ఆఫీసును గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. 

నేడు కోల్ కతాకు సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోల్ కతాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్న కేసీఆర్ మధ్యాహ్నం 3.30 గంటలకు మమత బెనర్జీతో భేటీ కానున్నారు. కొత్త ఫ్రంట్ పై ఏర్పాటుపై చర్చలు జరుగనున్నాయి. 

'వైసీపీ ప్రజా సంకల్ప మానవహారం'...

విజయవాడ : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు 'వైసీపీ ప్రజా సంకల్ప మానవహారం' పేరిట కార్యక్రమం చేపట్టనుంది. 115వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొమ్మూరులో జగన్ మానవహారంలో పాల్గొననున్నారు. 

టీ 20 సిరీస్ విజేతగా భారత్...

కొలంబో : ముక్కోణపు టీ 20 సిరీస్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 4 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేయగా భారత్ 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి దినేష్ కార్తీక్ మ్యాచ్ ను గెలిపించాడు. 

శశికళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమం ?

చెన్నై : వీకే శశికళ భర్త ఎం.నటరాజన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు 16వ తేదీన గుండెనొప్పి వచ్చిన సంగతి తెలిసిందే. ఆనాటి నుండి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నటరాజన్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 

లోక్ సభకు అవిశ్వాస తీర్మానాలు...

ఢిల్లీ : లోక్‌సభ ముందుకు టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానాలు నేడు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యాయి. 

ముగిసిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు...

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఉత్సాహంగా ముగిశాయి. ప్లీనరీ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రసంగంతో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శల వర్షం కురిపించారు.

 

పుతిన్ కే ఎక్కువ అవకాశాలు...

రష్యా : దేశంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కే ఎక్కువ విజయవకాశాలున్నాయి. ముందస్తు సర్వేలో పుతిన్‌కు 69.7 శాతం ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి ప్రావెల్‌ గ్రెడినిన్‌కు 7.1 శాతమే ప్రజలు మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికలు ఏకపక్షంగా సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఎన్నికల అంచనాలు నిజమై ఈ ఎన్నికల్లో పుతిన్ గెలిస్తే 2024 వరకు ఆయనకు తిరుగే ఉండదు. 

Don't Miss