Activities calendar

20 March 2018

22:02 - March 20, 2018

గుంటూరు : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆరోపణలపై ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనాని ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. నిరాధారమైన ఆరోపణలకు స్పదించాల్సిన అవసరంలేదన్న లోకేశ్‌.. తాత ఎన్డీఆర్‌, తండ్రి చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకురానన్నారు. తనపై సీబీఐ విచారణ వేస్తారని జరుగుతున్న ప్రచారంపై  లోకేశ్‌ స్పందిస్తూ ... దేనిపై వేస్తారని ప్రశ్నించారు. వేసుకుంటే వేసుకోనివ్వండంటూ.. ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ అవినీతికి పాల్పడుతున్నారంటూ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి. దీనిపై చంద్రబాబు ఇంతకు ముందు స్పందించారు. ఇప్పుడు మీడియా చిట్‌చాట్‌లో  లోకేశ్‌  కూడా తన వాదాన్ని వినిపించారు. 

పవన్‌ చేసిన ఆరోపణలను ఆధారాలుంటే బయటపెట్టాలని లోకేశ్‌ డిమాండ్‌ చేయడం జనసేనానిని నేరుగా ఢీ కొట్టినట్టు అయిందని  భావిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై టీడీపీ చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా రుజువు చేసిన విషయాన్ని లోకేశ్‌ ప్రస్తావించారు. పోలవరం అవినీతి గురించి కూడా పవన్‌  ఆరోపణలు చేశారు. దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ... ఒక్క టెండర్‌ కూడా టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. పోలవరం నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వెళ్లిందని, తన అకౌంట్‌లోకి వచ్చాయా.. అంటూ ప్రశ్నించారు. లోకేశ్‌పై సీబీఐ విచారణ వేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా చినబాబు తీవ్రంగా స్పందించారు. దేనిపై  వేస్తారంటూనే... వేసుకుంటే వేసుకోనివ్వండని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేయనప్పుడు భయపడాల్సిన పనిలేదన్న వాదాన్ని వినిపించారు. 

తాను పద్ధతిగా కమ్రశిక్షణతో పెరిగిన విషయాన్ని గుర్తు చేసిన లోకేశ్‌... తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకురానంటూ...  పవన్‌ ఆరోపణలు బాధ కలించాయన్నారు. ఏనిమిదేళ్లుగా ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నానని... ఎక్కువ ఉంటే తీసుకోవాలని సవాల్‌ విసిరారు. పవన్‌ చేసిన ఆరోపణలను ఆధారాలుంటే.. ఒక్క రోజులోనే మాటెలా మార్చాలని లోకేశ్‌ నిలదీశారు.  ప్రణాళికా మండలి సభ్యుడు పెద్దిరామారావుతో ఉన్న ఫోటోను నోట్ల మార్పిడి కేసులో పట్టుపడ్డ శేఖర్‌రెడ్డితో కలిసి ఉన్నట్టు ప్రచారం చేయడాన్ని లోకేశ్‌ తప్పు పట్టారు. బహిరంగ సభలో ఆధారాలులేని ఆరోపణలు చేస్తే విలువ ఉండదన్న లోకేశ్‌... పవన్‌ వద్ద తన ఫోన్‌ నంబర్‌ ఉన్నప్పుడు... నేరుగా నేరుగా విషయాన్నిచెప్పొచ్చు కాదా.. అని ప్రశ్నించారు. పవన్‌ ఆరోపణలపై పరువు నష్టం కేసు వేస్తారా.. అన్న ప్రశ్నకు ఈ విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండున్నర మార్కులు ఇస్తానన్న పవన్‌ కల్యాణ్‌ విమర్శలపై లోకేశ్‌ ఘాటుగా స్పందించారు. ఈ మార్కులు ఇవ్వడానికి పవన్‌ ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ పడుతున్న కష్టం... హైదరాబాద్‌లో ఉండేవారికి ఏం తెలుసని ముక్తాయింపు ఇచ్చారు. 

 

21:55 - March 20, 2018

చెన్నై : కొత్త పార్టీ, జెండా, ఎజెండా ఎప్పుడనేది కాలమే నిర్ణయిస్తుందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. ఏప్రిల్ 14న పార్టీ జెండా ఆవిష్కరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. హిమాలయాల్లో ఆధ్మాత్మిక యాత్ర ముగించుకుని చెన్నైకి చేరుకున్న రజనీ మీడియాతో మాట్లాడారు. హిమాలయ యాత్ర తనలో కొత్త శక్తి ఇచ్చిందని పేర్కొన్నారు. తన వెనక బిజెపి ఉందన్న వార్తలను రజనీ ఖండించారు. తన వెనక ద్రవిడ పార్టీలు, వ్యక్తులు ఎవరూ లేరని తాను స్వయంగా ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. రామరాజ్య రథయాత్ర కారణంగా మత విద్వేషాలు చెలరేగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రజనీకాంత్‌ స్పష్టం చేశారు.

 

21:51 - March 20, 2018

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ప్రకారం రావలసిన నిధులు, ఎక్సైజ్ సుంకం రానప్పుడు స్పెషల్ స్టేటస్‌తో ఉపయోగమేంటని మాత్రమే తాను అన్నానని చెప్పారు. నిధులు, హోదా రెండూ కావాలన్నదే జనసేన డిమాండ్ అని ట్వీట్ చేశారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఏపీకి తక్షణ సహాయం కావాలని, అది హోదానా? ప్యాకేజీనా? అన్నది పెద్ద విషయం కాదని పవన్ వ్యాఖ్యానించినట్టుగా ఓ మీడియా సంస్థ పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగడంతో... నిన్ననే జనసేన పార్టీ స్పందించింది. తాజాగా ఇవాళ పవన్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. 

 

21:47 - March 20, 2018

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేయాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ  సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశంపై  సీరియస్‌గా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, లోక్‌సభలో టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా జరుగుతున్న తీరుపై సమీక్షించారు. ఏపీకి అన్యాయం చేయడానికి సిద్ధమైన బీజేపీ.. తనపై కూడా దాడి చేస్తోందని  చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి అంటే రాష్ట్రానికి బలహీనపరచడమేనన్న విషయాన్ని సమన్వయ కమిటీ దృష్టికి తెచ్చారు. వైసీపీ, జనసేన నాయకులు  బీజేపీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని విమర్శించిన చంద్రబాబు.... వారి దురుద్దేశం ప్రజలకు అర్థమైందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆరోపణలను చంద్రబాబు ప్రస్తావించారు. జనసేనాని నిరాధారమైన ఆరోపణలు, పొంతనలేని ప్రకటనలు, నిలకడలేని నిర్ణయాలను అందరూ గ్రహిస్తున్నారని సమన్వయ కమిటీ దృష్టికి తెచ్చారు.  
 

21:44 - March 20, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అనర్హత-  హైకోర్టులో జరిగిన పరిణామాలపై టీ కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌, షబ్బీర్అలీ పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలతో పాటు కాంగ్రెస్ సభ్యల సభ్యత్వం రద్దు, హైకోర్టులో జరిగిన పరిణామాలు, రాజ్యసభ ఎన్నికల తీరుతెన్నులపై చర్చించినట్లు టీకాంగ్‌ నేతలు చెప్పారు. కేసీఆర్ కలకత్తా పర్యటన, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై టీ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.  నాలుగేళ్ల పాలనపై ప్రశ్నిస్తామనే భయంతోనే తెలంగాణ ప్రభుత్వం.. కాంగ్రెస్ సభ్యులపై వేటు వేసిందన్నారు. 

 

21:42 - March 20, 2018

గుంటూరు : కేంద్రంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఇక్కట్లలోకి నెట్టవద్దని అభ్యర్థించారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకూ ఏపీకి సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఇంకా కష్టాల్లోకి నెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు. రాష్ట్రానికి సహకరిస్తారనుకుంటే నిరాదరణకు గురిచేశారని ఆయన శాసనసభలో అన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని పార్లమెంట్‌లో అన్ని పార్టీలు అడుగుతుంటే విభజన హామీల అమలు అంశం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలన్న బీజేపీ ఇప్పుడు ఎందుకు వెనుకంజ వేస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. 

పోలవరం ప్రాజెక్టు తాను తీసుకోలేదని, తాను అధికారంలోకి రాకముందే పోలవరం కాంట్రాక్టులు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు పోలవరం విషయంలో కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం 5 కోట్లమంది ప్రజల ఆకాంక్ష అన్న చంద్రబాబు... సున్నితమైన విషయాలపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. 

విశాఖలో మూడేళ్లుగా భాగస్వామ్య సదస్సులు నిర్వహించామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు చెప్పారు. టెక్స్‌టైల్‌ పాలసీలో సవరణలు తీసుకొస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాను పారిశ్రామిక, ఆటోమొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో సుస్థిరతపై దృష్టిసారించామన్న చంద్రబాబు..  కాంగ్రెస్‌ అవినీతి వల్లే రాష్ట్రానికి వచ్చిన వోక్స్‌వ్యాగన్‌ పూణేకి వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. హోదాపై చంద్రబాబు ప్రసంగం అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రకటించారు.

భర్త అంత్యక్రియల కోసం శశికళకు 15రోజుల పెరోల్

చెన్నై : భర్త అంత్యక్రియల కోసం శశికళకు 15రోజుల పెరోల్ లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన ఆగ్రహారం జైల్లో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు.

 

నకిలీ సిఫార్సు లేఖలతో దళారి దందా

తిరుమల : నకిలీ సిఫార్సు లేఖలతో దళారి దందాకు తెర తీశారు. ఐఏఎస్ అధికారి సిఫార్సు లేఖపై దళారి 5 సుప్రభాత సేవా టికెట్లు పొందారు. తాను ఎవరికీ సిఫార్సు లేఖలు ఇవ్వలేదని ఐఏఎస్ అధికారి టీటీడీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

 

21:15 - March 20, 2018

కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ సాధ్యమేనా ? బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యామ్నాయం అంటే విధానాల ప్రత్యామ్నాయమా..అధికారంలోకి రావటమా? ఇదే అంశంపై ప్రముఖ విశ్లేషకులు వీక్షణం వేణుగోపాల్ తో టెన్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్.. థర్డ్ ఫ్రంట్ అధికార వాంఛ అని అన్నారు. పార్టీలు కాదు.. విధానాలు మారాలన్నారు. వామపక్షాలే ప్రత్యామ్నాయం కావాలని ఆకాంక్షించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

రాష్ట్ర విభజనకు చిరంజీవి కారుకుడు : మంత్రి నారాయణ

అమరావతి : రాష్ట్ర విభజనకు చిరంజీవి కారుకుడని మంత్రి నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడడానికి పవన్ కారణం అవుతున్నాడని విమర్శించారు. 

21:04 - March 20, 2018

తెలంగాణ ప్రభుత్వానికి అసలైన పంచాంగం నిరుద్యోగులే జెప్పెతట్టున్నరు రాబోయే ఎన్నికలళ్ల.. మొన్న అసెంబ్లీల ముఖ్యమంత్రిగారు ఏం జెప్పిండు.. ఇప్పటికే ఇర్వై ఏడువేల ఉద్యోగాలు భర్తీ జేశ్నం.. ఇంకా భర్తీగావాల్సినయ్ ఉన్నయ్ అన్నడుగదా..? కని ముఖ్యమంత్రిగారు జెప్పిన లెక్కలకు మీడియా జేశిన ఎంకువైరీకి పొంతన గలుస్తనే లేదు..

కేసీఆర్ గారు గట్టవోతున్న మూడో ఫ్రంట్.. ఇది మూడో ఫ్రంటు గాదు.. బీజేపీ పార్టీకి బీ టీం అసొంటిది.. నరేంద్రమోడీకి ఎవ్వలైతె వ్యతిరేకంగ ఉన్నరో వాళ్లను చిల్లర కల్లెర జేస్తందుకు తప్పితె.. ఆయన దేశ రాజకీయాలను ఉద్దరిచ్చెతందుకు ఉర్కొస్తున్న మొనగాడేం గాదు అని కాంగ్రెస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇజ్జత్ తీశేశిండు..

ఈ ముచ్చట ఇంకా కొత్తగనిపియ్యవట్టే.. పండుగ పూట అందరు పసందైన బువ్వదింటరుగదా..? కని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సారు ఇర్వైమూడేండ్ల సంది ఉగాదినాడు సొంటెండ వెట్టుకునే కార్యం జేస్తున్నడట.. అదనుకు ఉగాది పండుగ నాడు ఢిల్లీ ప్లీనరీకి వొయ్యిండుగదా.?? ఇగ ఆ సారు ఇంటామె సారు చేపట్టిన ఆనవాహితిని కొనాసగించింది..

ఓదిక్కు జీహెచ్ఎంసీ కార్మికుల జీతాలు వెంచిండ్రు..వాళ్లను పర్మినెంట్ జేస్తమని చెప్పిండ్రు.. వాళ్లను కడ్పుల వెట్టుకోని సాదుకుంటమన్నరు.. ఎంత జెప్పానా..? జీహెచ్ఎంసీ కార్మికులు టీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మలే.. కార్మిక సంఘం ఎన్నికలళ్ల చిత్తు చిత్తుగ ఓడగొట్టి చెవ్వులు మూశిండ్రు.. ఇంత జేశ్నా కార్మికులు ఓడగొట్టిడ్రంటే.. రేపు పొద్దుగాళ్ల తెలంగాణ ప్రజలు గూడ ఇదే పనిజేస్తె టీఆర్ఎస్ పరిస్థితి ఏంది..? 

తాగుడు నోట్లె మన్నువొయ్య.. తాగిపిచ్చెటోనికి శిగ్గులేదు.. తాగెటోనికి శిగ్గులేదు.. తాగకపోతె సస్తారు నీ జనం సల్లగుండ.. అరే ఏమున్నదమ్మా..? హైద్రావాద్ పాతబస్తీల ఒకడు కుత్కెల దాక తాగొచ్చి పెండ్లాం మీద గ్యాస్ నూనే వోశిండట సంపేస్తాని..? సుట్టుముట్టున్నోళ్లు జూశి ఆమెను దావఖనకు గొంచవొయ్యిండ్రట.. ఇంత అద్వాహ్నమా..? చెప్పుండ్రి లోకంల.. 

హురక ఇదెక్కడి ఉగాది పండుగరో... బాపణోళ్ల శాస్త్రాల ప్రకారం ఉగాది పండుగంటే.. పచ్చడి జేస్కోని ఆరు రూచుల సంగమం జేశి.. పచ్చటి ఆకులళ్ల వోస్కోని తాగాలే.. ఆయాళ జేశ్న బచ్చాలు తినాలే ఇదిగదా..? కని ఈ అయ్యగార్ల మాటలు వట్టిచ్చుకోకుంట యాదాద్రి బోనగిరి జిల్లా మోత్కురు కాడ ఒక ఊరి జనం ఏం జేశిండ్రో సూడుండ్రి.. ఉగాది పండుగనాడు..

హురక సంగారెడ్డికాడ ఉగాది పండుగ గమ్మతైంది.. పబ్లీకు మీదికి లడ్డులు ఇశిరేసుడు.. వాళ్లు అందుకునుడు.. అదే ప్రసాదం లెక్క తినుడు.. యవ్వారమంత గమ్మతే ఉన్నది పాండ్రి మరి మనం గూడ ఆ లడ్డూలేంటియి.? ఆ కథ ఏంది అర్సుకొద్దాం..

21:02 - March 20, 2018

అవిశ్వాసంపై హాట్ డిబేట్ జరిగింది. వక్తలు భిన్నవాదనలు వినిపించారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామకృష్ణ, బీజేపీ ఏపీ నేత విల్సన్, వైసీపీ అధికార ప్రతినిధి కొణిజేటి రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, టీఆర్ఎస్ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:50 - March 20, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో ఇవాళ కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. విపక్షాల ఆందోళనతో ఉభయసభలు దద్దరిల్లాయి. టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చజరగకుండానే వాయిదా పడ్డాయి. అవిశ్వాస తీర్మానానికి కేంద్రం భయపడుతుందని టీడీపీ ఆరోపించింది. మోదీ సర్కార్‌ తీరుపై బీజేపీ ఎంపీలు సైతం వ్యతిరేకతతో ఉన్నారని మండిపడింది. అటు వైసీపీ సైతం హోదా పోరును కొనసాగించింది. టీడీపీకి చిత్తశుద్ధి లేదని.. అందుకే హోదా రాలేదని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతివ్వబోమని టీఆర్‌ఎస్‌  తేల్చి చెప్పింది.
అవిశ్వాస తీర్మానాలపై జరగని చర్చ
అదే రభస.. అదే తీరు.. మళ్లీ అదే నిర్ణయం. పార్లమెంట్‌ ఉభయసభలూ విపక్షాల ఆందోళనలతో వాయిదాపడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే కావేరీ జలాలపై- అన్నాడీఎంకే, రిజర్వేషన్లపై- టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్‌ సభలో చదివి వినిపించారు. అవిశ్వాస తీర్మానాలకు మద్దతుగా సభ్యులు లేచి నిలబడేందుకు అవకాశం ఇవ్వాలని.. ఆందోళన చేస్తున్న ఎంపీలను స్పీకర్‌ కోరారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. ఎంత చెప్పినా వారు వినిపించుకోకపోవడంతో.. సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు.
రాజ్యసభలోనూ.. ఇదే పరిస్థితి 
అటు రాజ్యసభలోనూ.. ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్‌ వెంకయ్యనాయుడు రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు.
గులాంనబీ ఆజాద్‌ తీవ్ర అసంతృప్తి 
పార్లమెంట్ ఉభయ సభలు చర్చలు జరగకుండా వాయిదా పడటంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ ఆర్డర్‌లో లేకపోవడానికి కేంద్రమే కారణమని ఆజాద్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభ వాయిదా పడటం వల్ల  కోట్లాది రూపాయల బ్యాంకు కుంభకోణాలు, ఏపి ప్రత్యేక హోదా, కావేరి జలాలు వంటి ప్రధాన అంశాలు చర్చకు రావడం లేదన్నారు. 
స్కూల్‌ పిల్లాడి వేశంలో ఎంపీ శివప్రసాద్‌  
మరోవైపు పార్లమెంట్‌ భవనం ముందు టీడీపీ, వైసీపీ ఎంపీలు ఫ్లకార్డులు పట్టుకుని వేరువేరుగా ఆందోళనలు కొనసాగించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ స్కూల్‌ పిల్లాడి వేశంలో వినూత్న నిరసన తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకు కేంద్రం భయపడుతోందని టీడీపీ ఆరోపించింది. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతోనే బీజేపీ అడ్డుకుంటోందని టీడీపీ ఎంపీలు అన్నారు. మోదీ ఒంటెద్దు పోకడలతో బీజేపీ ఎంపీలు సైతం విసిగిపోయారని.. ఈ పరిస్థితుల్లో అవిశ్వాసంపై రహస్యఓటింగ్‌ పెడితే సొంతపార్టీ నేతలే వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నారు. పార్లమెంటులో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలను రాష్ట్రపతికి నివేదిస్తామని టీడీపీ ఎంపీలు తెలిపారు.
నోటీసులు ఇస్తామన్న వైసీపీ
అవిశ్వాసంపై చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తామని వైసీపీ స్పష్టం చేసింది. సభ వాయిదా అనంతరం వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ జనరల్‌ సెకట్రరీకి నాలుగో సారి నోటిసులు ఇచ్చారు. హోదాపై చర్చ జరిగే వరకు వదిలేది లేదన్నారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్థి సాధ్యమని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. 
అవిశ్వాసంపై టీఆర్‌ఎస్‌ అనూహ్య నిర్ణయం 
మరోవైపు అవిశ్వాసంపై టీఆర్‌ఎస్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా పోరాటాన్ని సమర్థించిన టీఆర్‌ఎస్‌.. అవిశ్వాసానికి మాత్రం మద్దతు ఇవ్వమని తెలిపింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలంటూ తాము ఆందోళన చేస్తున్నామని.. అవిశ్వాస నోటీసులు ఇచ్చిన టీడీపీ, వైసీపీ తమను సంప్రదించలేదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు అంటున్నారు. ఒకరి  రాజకీయ అజెండా కోసం తాము పనిచేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మొత్తానికి అవిశ్వాసం నోటీసు చర్చకు రాకుండానే పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదాపడ్డాయి. గురువారం మరోసారి అవిశ్వాసనోటీసులు చర్చకు వస్తాయో.. లేక విపక్షాల ఆందోళనతో వాయిదా పడుతాయో చూడాలి.

 

20:41 - March 20, 2018

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 2 ఏళ్ల నిషేధం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ...ఐపీఎల్‌ 11వ సీజన్‌ కోసం ఇప్పటికే ప్రమోషనల్‌ క్యాంపెయిన్స్‌తో బిజీగా ఉంది. నయా సీజన్‌ కోసమే సరికొత్త ప్రమోషనల్‌ సాంగ్‌ను రాజస్థాన్ రాయల్స్‌ టీమ్ మేనేజ్‌మెంట్‌ విడుదల చేసింది.

ఆస్ట్రేలియన్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సారధ్యంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు...ఐపీఎల్‌ 11వ సీజన్‌ టైటిల్‌ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. స్టీవ్‌ స్మిత్‌, అజింక్య రహానే,బెన్‌ స్టోక్స్‌, డార్సీ షార్ట్‌, జయదేవ్‌ ఉనద్కత్‌,జాస్‌ బట్లర్‌ వంటి టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లతో పటిష్టమైన జట్టుతో రాయల్స్‌ జట్టు టైటిల్‌ వేట స్టార్ట్‌ చేయనుంది.

20:38 - March 20, 2018

హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌.... శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడి చేసి ఉంటే కేసులు ఎందుకు పెట్టలేదని టీమాస్‌ ఫోరం కన్వీనర్‌ కంచ ఐలయ్య ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో స్వామిగౌడ్‌ కేసు పెట్టలేదో  చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, మరో 11 మంది సభ్యులను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌ చర్య అప్రజాస్వామికమన్నారు. 

 

20:30 - March 20, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పులు కుప్పగా మారిందన్న ప్రతిపక్షాల విమర్శలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం తిప్పకొట్టింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేయడం తప్పుకాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ జీఎస్‌డీపీలో 21 శాతం అప్పులు ఉన్నాయని బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చ సందర్భంగా సీఎం ఈ విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానం ఇస్తూ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని సీపీఎం, బీజేపీ, టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. 
చర్చకు మంత్రి ఈటల సమాధానం 
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఈనెల 15న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌పై సాధారణ చర్చ ముగిసింది. చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానం ఇచ్చారు. ఈటల సమాధానం సందర్భంగా విపక్ష సభ్యులు అప్పులు విషయాన్ని ప్రస్తావించారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని.. అప్పులు చేయడం  తప్పుకాదని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు రుణాలు తీసుకోక తప్పదని సభ దృష్టికి తెచ్చారు. 
రుణమాఫీ ప్రచార ఆర్భాటంగా మారిందన్న లక్ష్మణ్  
బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యుడు లక్ష్మణ్‌... వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ప్రస్తావించారు. రైతుల రుణమాఫీ ప్రచార ఆర్భాటంగా మారిందని విమర్శించారు. 
సీపీఎస్‌ రద్దు చేయాలన్న సున్నం రాజయ్య 
చర్చలో పాల్గొన్న సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య... కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకంతో రిటైన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయాలని సభ దృష్టికి తెచ్చారు. 
లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు : ఈటల 
బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానం ఇస్తూ.. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న విషయాన్ని ప్రస్తావించారు. లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకొంటున్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. 
బీజేపీ, సీపీఎం, టీడీపీ సభ్యులు వాకౌట్‌ 
ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ, సీపీఎం, టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ ముగిసిన తర్వాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ మధుసూదనాచారి అసెంబ్లీని బుధవారానికి వాయిదా వేశారు. 

 

20:24 - March 20, 2018

హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తమిళనాడులో మాతృభాష బోధన విధానాన్ని అధ్యయనం చేసిన అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధివిధానాలపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తెస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. మొదటి దశలో పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. తెలుగు సబ్జెక్ట్‌కు సిలబస్ రూపొందించాలని తెలుగు యూనివర్సిటీ, సాహిత్య అకాడమీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
 

 

20:19 - March 20, 2018

రాజన్న సిరిసిల్ల : ప్రజా సేవ చేయాల్సిన నాయకులు... ప్రజల భూమిని కాజేయడమే పనిగా పెట్టుకున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న తమ భూమిని.. సర్పంచ్‌ కబ్జా చేశాడని బాధితులు మండిపడుతున్నారు. ఆయన అక్రమాల నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కంగళ్ళపల్లి మండలం అంకుషపూర్‌ గ్రామస్థులు.
5 ఎకరాల మిగులు భూమిపై కన్నేసిన సర్పంచ్‌ 
ఎన్నికల్లో ప్రజాసేవే మా లక్ష్యం అని చెప్పే నాయకులు.. అధికారంలోకి రాగానే అక్రమాలే పనిగా పెట్టుకుంటున్నారు.. ప్రజా సమస్యలు తీర్చాల్సిన నాయకులు వారే సమస్యగా మారుతున్నారు.. గత కొన్ని నెలల క్రితం ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంకుషాపూర్‌లో అధికారులు సర్వే చేశారు. దీంతో ఐదెకరాలు మిగులు భూమి తేలింది... దానిపై కన్నేశాడు ఆ ఊరి సర్పంచ్‌ అడ్డగట్ల భాస్కర్‌...  దాన్ని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం నుంచి పట్టా  పొందాడని ఆ పొలం యజమానులు ఆరోపిస్తున్నారు.
న్యాయం చేయాలంటూ అధికారులకు వినతిపత్రం
తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ వస్తున్న సర్వేనంబర్ 571, 572, 573, 575 భూమి సర్పంచ్‌ భార్య, తల్లి పేరుతో విలేజ్‌ రెవెన్యూ అధికారి కార్యాలయంలోని జాబితాలో పేర్కొనడం అన్యాయం అంటున్నారు బాధితులు. ఈమేరకు అధికారులకు బాధితులు వినతిపత్రం కూడా ఇచ్చారు. ఆ భూమిపై ఐదు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని.. ఇలా తమ పొట్టకొట్టడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.  గతంలో ఉపాధి హామీ పనుల్లోనూ సర్పంచ్ అవకతవకలకు పాల్పడ్డాడనీ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.... విచారణలో  వాస్తవాలు తేలడంతో  ప్రభుత్వానికి లక్షరూపాయలు చెల్లించాడని  చెబుతున్నారు. ఈ భూమి విషయంలో అధికారులు స్పందించకుంటే.. కలెక్టర్‌ కు ఫిర్యాదు చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
 

 

19:59 - March 20, 2018

కర్నూలు : ఉగాది పర్వదినం  అంటే... షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి.. పంచాంగ శ్రవణం... ఇదీ తెలుగువారు జరుపుకునే సంప్రదాయం... కానీ ఇదే వేడుకల్లో.. రక్తం చిందించే పోరాటం కూడా ఆనవాయితీగా వస్తోంది... దానిపేరే పిడకల సమరం.. అనాగకరికమని తెలిసినా.... సంస్కృతిలో భాగమన్నది అక్కడి వారి వాదన.. కర్నూలు జిల్లాలో ఉగాది సంబరాల్లో భాగంగా జరుపుకునే ఈ సమరం వెనుక ఆసక్తికరమైన ప్రేమ, పెళ్ళి కథనం ఉంది.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
యుద్ధరంగాన్ని తలపించే దృశ్యాలు ... 
ఇది కర్నూలు జిల్లా.. ఆస్పరి మండలంలోని కైరుప్పల గ్రామం... యుద్ధరంగాన్ని తలపించే.. ఈ దృశ్యాలు ... పగ, ప్రతీకారాలతో తన్నుకుంటున్న ఫ్యాక్షన్‌ గొడవేమో అనిపించినా... ఉగాది ఉత్సవాల్లో ఇదో భాగం.. దీనిపేరు పిడకల సమరం..  ఉగాది పండుగ మరుసటి రోజు జరిగే ఈ పిడకల పోరాటంలో పాల్గొనేది.. ఎవరో వైరివర్గం కాదు... అంతా ఆ గ్రామస్థులే.. గ్రామంలోని ప్రజలంతా రెండుగా విడిపోయి ఈ పోరాటంలో పాల్గొంటారు..
వీరభద్రస్వామి, భద్రకాళి  ప్రేమ కథే  పిడకల సమరానికి కారణం
ఈ పిడకల సమరం గురించి తొలిసారి విన్నవారికి వింతగా తోచినా... దీనివెనుక ఆసక్తికరమైన ప్రేమ... పెళ్ళి వ్యవహారం ఉంది.  వీరభద్రస్వామి, భద్రకాళి  ప్రేమ కథే  ఈ సమరానికి కారణం.. ప్రేమ వ్యవహారంలో వారిద్దరి మధ్య విబేధాలు రావడంతో.. భద్రకాళిని ప్రేమించిన వీరభద్రుడు మోసం చేశారంటూ.. పేడతో దాడికి దిగారన్నది కథనం.. ఇదే ఆనవాయితీని పిడకల సమరంగా ప్రజలు జరుపుకుంటారు. 
గాయాలవుతున్నా ఆగని పోరు.. 
ఎన్నో ఏళ్ళుగా జరుపుకుంటున్న ఈ సంబరం ఉగాది మరుసటి రోజు సుమారు ఐదు గంటలపాటు పోరు సాగుతుంది.. ఈ పిడకల యుద్ధంలో చాలామంది గాయపడుతుంటారు... అలా తగిలిన గాయాలకు వీరభద్రస్వామి విభూదినే మందుగా రాసుకుంటారు..అనాగరికమని తెలిసినా కూడా... అనాదిగా వస్తున్న ఆనవాయితీ కాబట్టి ఆచరించకతప్పదని గ్రామస్థులు అంటున్నారు.
ఆనవాయితీగా పిడకల యుద్ధం
ఈ గ్రామస్థులు ఉద్యోగం, ఉపాధి కోసం ఏ ప్రాంతంలో ఉన్నా... ఉగాది పండుగకు మాత్రం ఈ గ్రామానికి వచ్చి పిడకల యుద్ధంలో సైనికుల్లా పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అనాదిగా వస్తున్న ఈ ఆచారం, భక్తుల విశ్వాసానికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా పోలీసులు సైతం బందో బస్తు ఏర్పాటు చేస్తారు..
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల యుద్ధం

 

19:36 - March 20, 2018

హైదరాబాద్ : నవతెలంగాణ దినపత్రికకు మూడు వసంతాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఎస్వీకేలో నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కార్టూన్లను ప్రదర్శించారు. కార్టూన్ ప్రదర్శనను సినీ నిర్మాత నరసింహరావు ప్రారంభించారు. కార్టూన్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

19:29 - March 20, 2018

హైదరాబాద్ : ప్రముఖ డాక్టర్, వివేకానందా హాస్పిటల్ చైర్మన్ వల్లూరి వెంకటరత్నం మృతి చెందారు. కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. వెంకటరత్నం మృతితో ఆయన నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకటరత్నం మృతితో ఆయన బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్ లోని శ్రీరామ్ నగర్ లోని ఆయన పార్థీవదేహానికి పలువురు నివాళులర్పించారు. వీఆర్ ఎస్ ఛారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీగా వల్లూరి ఉన్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ లో వైద్య సేవలు అందించారు. వైద్యరంగంలోనే కాకుండా సమాజంలో ఎందరికో మార్గనిర్ధేశం చేసిన వ్యక్తి వెంకటరత్నం అని పలువురు కొనియాడారు. 

 

పవన్ మార్కులు మాకు అనవసరం : చినరాజప్ప

గుంటూరు : పవన్ మార్కులు తమకు అనవసరమని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పవన్ ప్రజల్లో జీరో అయ్యాడని ఎద్దేవా చేశారు. ఎవరో డైరెక్షన్ లో పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. 

 

18:47 - March 20, 2018

నిజామాబాద్ : పాలకవర్గాలు రైతును పట్టించుకోవడం లేదని ప్రొ.కోదండరామ్ విమర్శించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. చేసిన అప్పులు తీరే మార్గంలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు రైతు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారానికి బలమైన ప్రజా ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు.

 

 

18:35 - March 20, 2018

కరీంనగర్ : బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు. కరీంనగర్ లో బీఎల్ ఎఫ్ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణలోని 113 స్థానాలకు అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. ప్రజలు ఆశించిన స్థాయిలో కేసీఆర్ పాలనలేదన్నారు. రాష్ట్రం పోలీసు రాజ్యంగా ఏర్పడిందని విమర్శించారు. సభకు ముందు తిమ్మాపూర్ నుంచి సభాస్థలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఎల్ ఎఫ్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

 

 

18:20 - March 20, 2018

ముంబై : రైల్వైలో ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ముంబైలో నిరుద్యోగులు రైలు రోకో చేపట్టారు. రైలు ట్రాక్ లపై విద్యార్థులు ఆందోళనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ జరిపి నిరసనకారులను చెదరగొట్టారు.

18:14 - March 20, 2018

తమిళనాడు : శశికళ భర్త నటరాజన్ చనిపోవడంతో 15 రోజుల పెరోల్ మంజూరు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా శశికళ భర్త నటరాజన్ తెల్లవారుజామున మృతి చెందారు. పరప్పన అగ్రహారం జైలు నుంచి పెరోల్ పై శశికళ బయటికి వచ్చారు.   

18:07 - March 20, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ముందు వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలంటూ నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ..నినాదాలు చేశారు. హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు.

17:52 - March 20, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానాన్ని చూసి కేంద్రం భయపడుతోందని టీడీపీ ఎంపీలు అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఎంపీలు నిరసన తెలిపారు. అవిశ్వాసానికి మద్దుతుగా 150 ఎంపీలు లేచి నిలబడుతున్నారని చెప్పారు. రహస్య ఓటింగ్ పెడితే బీజేపీ ఎంపీలు సైతం మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నారు. కేంద్రం భయపడే అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించడం లేదని ఆరోపించారు. 

17:47 - March 20, 2018

గుంటూరు : ప్రత్యేకహోదా విషయంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 'హోదా పదేళ్లు ఇవ్వాలని అడిగింది మీరే...హోదాపై ఇప్పుడెందుకు మొహం చాటేస్తున్నారు' అని ప్రశ్నించారు. కుదుటపడే సమయంలో సహకరిస్తారనుకుంటే నిరాదరణకు గురి చేశారని వాపోయారు. సహకరిస్తుందనుకున్న మిత్రపక్షమే అన్యాయం చేయడం బాధాకరమన్నారు. నిలదొక్కుకునేందుకు హోదా అడిగితే తమపైనే పోరాడతామంటున్నారని పేర్కొన్నారు.
పోలవరం విషయంలో చేతులు పెడితే..చేతులు కాలతాయన్నారు : సీఎం చంద్రబాబు 
పోలవరం ప్రాజెక్టు విషయంలో చేతులు పెడితే.. చేతులు కాలతాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం విషయంలో కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం 5 కోట్లమంది ప్రజల ఆకాంక్ష అన్నారు. సున్నితమైన విషయాలపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. కలలు కనండి కానీ చెడు కలలు కనొద్దని చంద్రబాబు సూచించారు. 

 

 

 

కొనసాగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ

గుంటూరు : టీడీపీ సమన్వయ కమిటీ కొనసాగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

17:34 - March 20, 2018

గుంటూరు : టీడీపీ సమన్వయ కమిటీ ప్రారంభమైంది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

 

17:31 - March 20, 2018

కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కలకలం రేగింది. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ రామ్మోహన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 14 వ ఆర్థిక సంఘం నిధుల్లో తనకు తక్కువగా కేటాయించారని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఎల్ ఆర్ ఎస్ నిధుల్లో తన వార్డుకు తక్కువగా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కలకలం

కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కలకలం రేగింది. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ రామ్మోహన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఎల్ ఆర్ ఎస్ నిధుల్లో తన వార్డుకు తక్కువగా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కలకలం

కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కలకలం రేగింది. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ రామ్మోహన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఎల్ ఆర్ ఎస్ నిధుల్లో తన వార్డుకు తక్కువగా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

17:01 - March 20, 2018

ఢిల్లీ : ఇరాక్ లో ఐసిస్ చేతిలో బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు మృతి చెందారు. భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి వికెసింగ్ ఇరాక్ వెళ్లారు. 39 మంది భారతీయులు మృతి చెందినట్లు రాజ్యసభలో సుష్మాస్వరాజ్ వెల్లడించారు. 39 మంది డిఎన్ ఏ వారి బంధువుల డిఎన్ ఏతో సరిపోయిందన్నారు. 

 

16:49 - March 20, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడుతుండడంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ ఆర్డర్ లో లేకపోవడానికి కేంద్రమే కారణమన్నారు. వాయిదాల కారణంగా జాతీయ ప్రధాన అంశాలు చర్చకు రావడం లేదన్నారు. పీఎన్ బీ స్కాం, ప్రత్యేకహోదా, కావేరీ జలాలపై చర్చకు విపక్షాలు సిద్ధమన్నారు.

16:41 - March 20, 2018

హైదరాబాద్ : రుణాలు వారసత్వంగా వస్తున్నవేనని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర అప్పులపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. తీసుకొచ్చిన ప్రతి రూపాయి అభివృద్ధి, సంక్షేమానికే వెచ్చిస్తున్నామని చెప్పారు. తమ హయాంలో ఇసుకపై అధిక ఆదాయం వచ్చిందన్నారు. ఉద్యోగుల వేతనాల సవరణకు త్వరలో పీఆర్ సీ వేస్తామని చెప్పారు. 

టీడీపీ సమన్వయ కమిటీ ప్రారంభం

గుంటూరు : టీడీపీ సమన్వయ కమిటీ ప్రారంభమైంది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

15:48 - March 20, 2018

హైదరాబాద్ : ఇండస్ట్రీ ఇన్సెంటీస్ కింద ఈ సం.416 కోట్లు రిలీజ్ చేశామని..మిగతా వాటిని దళల వారిగా రిలీజ్ చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో మంత్రి ఈటల ప్రసంగించారు. రాష్ట్రంలోని 4500 మంది అర్చకుల్లో 2200 మందికి పీఈర్ సీ కింది వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. రైతాంగానికి ఎప్పటికప్పుడు వడ్డీ జమ అవుతుందన్నారు. ప్రస్తుతం కేంద్రం కంటే రాష్ట్రం అధిక అభివృద్ధిలో ఉందని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపథంలో కొనసాగుతుందన్నారు. నాయి బ్రాహ్మణ, రజక, ఎంబీసీ వృత్తుల వంటి సబ్బండ జాతులకు ఉన్నంతలో ఎక్కువమందికి నిధులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. 

 

15:36 - March 20, 2018

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు కేటాయించింది ఎంత ? ఇదే అంశంపై మానవి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభ, ఐద్వా నాయకురాలు హైమావతి పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ లో సంపన్నులకు కేటాయింపులున్నాయని.. మహిళలను చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. కంటితుడుపు చర్యగా మహిళలకు కేటాయింపులు ఉన్నాయన్నారు. పేరుకు మాత్రమే కేటాయింపులు ఉంటాయని..ఖర్చు చేయడం లేదని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:29 - March 20, 2018

గుంటూరు : ఏపీకి కేంద్ర సహకారం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగింది... హేతుబద్ధత లేదన్నారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం లేదన్నారు. చట్టంలో పొందుపరిచిన అంశాలు..ప్రత్యేక హోదాపై సమీక్షించమన్నామని తెలిపారు. కనీసం సమీక్షించే పరిస్థితిలో కూడా కేంద్రం లేదన్నారు. దేశంలో 7.4 శాతం వృద్ధిరేటు ఉందన్నారు. మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇచ్చామని తెలిపారు. 2014...15 లో వ్యవసాయ రంగంలో 3.5 శాతం వృద్ధిరేటు ఉందన్నారు. దేశంలో వ్యవసాం రంగంలో 0.2 శాతం వృద్ధి రేటు ఉందని తెలిపారు. వ్యవసాయ రంగంలో సుస్థిరతపై దృష్టి సారించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అవినీతికి మారుపేరు అని ఎద్దేవా చేశారు. ఫోక్స్ వ్యాగన్ వచ్చి ఉంటే రాష్ట్ర ఆటో మొబైల్ హబ్ గా ఉండేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 533 పరిశ్రమలు ఏర్పడ్డాయని తెలిపారు. 

 

తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. అంతకముందు వివిధ అంశాలపై సభలో చర్చ జరిగింది.  

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

గుంటూరు : ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. అంతకముందు వివిధ అంశాలపై సభలో చర్చ జరిగింది.  

15:01 - March 20, 2018

 ఢిల్లీ : సభ జరిగినన్ని రోజులు అవిశ్వాసంపై నోటీసులు ఇస్తూనే ఉంటామని టీడీపీ ఎంపీలు అన్నారు. పార్లమెంట్ భవన్ ముందు ఎంపీలు నిరసన తెలిపారు.  అరకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని ఎంపీ మురళీమోహన్ ఆరోపించారు. నో కాన్ఫ్ డెన్స్ పెడితే తమ బండారం బయట పడుతుందని కేంద్రం భయపడుతోందని ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శించారు.

 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి లోకేష్

అమరావతి : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మంత్రి లోకేష్ తప్పుబట్టారు. పవన్ తనపై దుమ్మెత్తి పోస్తే తాను దులుపుకోవాలా అన్నారు. నిరాధారమైన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 

 

దేశ జీడీపీ రూ.167 లక్షల కోట్లు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : దేశ జీడీపీ రూ.167 లక్షల కోట్లు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. అందులో 49.5 శాతం మేర కేంద్రప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. కేంద్రం చెల్లిస్తున్న అప్పులు రూ.8.76 లక్షల కోట్లు అన్నారు.

మరో డ్రగ్ ముఠా గుట్టు రట్టు..

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ ముఠా తన సామాజ్రాన్ని చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర డ్రగ్స్ సప్లయిర్ గణేష్ అలియాస్ బాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుండి కొకైన్, ఎల్ఎస్టీలను తీసుకువచ్చిన నగరంలోని కొండాపూర్ లో విక్రయిస్తున్నవారి నుండి కిలో గంజాయి,15 ఎల్ఎస్టీ, 10 అంఫేటమిన్ స్వాధీనం చేసుకున్నారు. బాబీ కృష్ణా జిల్లా చెక్కపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. బాబీతో పాటు ముఠాలో షేక్ అహ్మద్, షేక్ రషీద్, అరవింద్ రెడ్డి, అర్చిద్ మీర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

13:01 - March 20, 2018

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద రెండవ రోజు తన నియోజక వర్గంలోని బాచుపల్లి గ్రామం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఎమ్మెల్యే వివేకానంద తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయాణించారు. ఎమ్మెలే వివేక్‌ ప్రయాణిస్తున్న బస్సు వివేకానందనగర్‌ స్టాప్‌లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ , కూకట్‌ పల్లి బస్సు స్టాప్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిసి ప్రయాణించారు. ఆర్టీసీ బస్సుల్లో సమస్యలు, ట్రాన్స్‌పోర్టు, ట్రాఫిక్‌ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్‌ ఇండియా రేడియో బస్‌ స్టాప్‌ వద్ద దిగి కాలినడకన అసెంబ్లీకి చేరుకున్నారు.

12:58 - March 20, 2018

హైదరాబాద్ : కోటి 42 లక్షల భూమికి.. ఆర్డర్‌ చెక్కులను 6 బ్యాంకుల ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు మంత్రి పోచారం అసెంబ్లీలో ప్రకటించారు. SBI, ఆంధ్రాబ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, IOB, సిండికేట్‌ బ్యాంక్‌ల ద్వారా చెక్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌలు రైతులు భూమిపై ఎప్పుడు ఉంటారో తెలియనందున ఈ పథకాన్ని వారికి వర్తింప చేయట్లేదని అన్నారు. చెక్కుల పంపిణీకి ఒక నియోజక వర్గంలో 70 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. 4 శాతం వివాదాస్పద భూములు ఉన్నట్లు, ఈ భూములకు 12 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు.

12:56 - March 20, 2018

హైదరాబాద్ : ఒక హైటెక్‌ సిటీ నుండి మాత్రమే ఎయిర్‌పోర్టుకు మెట్రోను కలపడం సరియైంది కాదని, మిగతా ప్రాంతాలైన ఫలక్‌నుమా, నాగోల్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానం చేయాల్సిన అవసరముందని అసెంబ్లీలో కేటీఆర్‌ అన్నారు. నివాస ప్రాంతాల నుంచి సులువుగా ఎయిర్‌పోర్టుకు చేరుకునే విధంగా మెట్రోను నిర్మించాలనేది సీఎం కేసీఆర్‌ కోరిక అని చెప్పారు కేటీఆర్‌. పాత బస్తీకి మెట్రో అనుసంధానం కొంత ఆలస్యమైన విషయం నిజమేనని, ప్రభుత్వం త్వరలోనే పాత బస్తీ ప్రజలకు మెట్రో సేవలను అందించే విధంగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 

12:50 - March 20, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీల నిరసన కంటిన్యూ అవుతోంది. ఇవాళ పార్లమెంటు భవనం ముందు టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎంపీ శివప్రసాదు మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు. స్కూలు పిల్లాడి వేశంలో వచ్చిన శిప్రసాద్‌ .. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే నని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్లమెంటు భవనం ముందు నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 

12:42 - March 20, 2018

హైదరాబాద్ : మీర్ పేట పీఎస్ పరిధిలోదారుణం చోటుచేసుకుంది. భార్యా పిల్లలను హత్యచేసిన దారుణం వెలుగు చూసింది. భార్యా పిల్లను చంపివేసి పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. లింగంపల్లికి చెందిన సురేందర్‌ నిన్న మీర్‌పేట్‌లోని అత్తగారింటికి వచ్చాడు. ఉదయాన్నే మామను, బామర్దిని కల్లు కోసం బయటకు పంపి కల్లు కోసం మామను, బావమరిదిని బైటకు పంపి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి కూతురు వరలక్ష్మీ, మనవడు, మనవరాలు అపస్మారకస్థితిలో ఉన్నారు. దీంతో నిర్ఘాంతపోయిన వారు వారిని ఒవైసీ ఆస్పత్రి తరలించేసరికే మృతి చెందారు. హత్య అనంతరం నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ హత్యలకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

12:30 - March 20, 2018

ఢిల్లీ : ఒకరి రాజకీయ ఎజెండా కోసం మేము పనిచేయమని టీఆర్ఎస్ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పేర్కొన్నారు. అవిశాస్వస తీర్మానానికి టీడీపీ, వైసీపీ పార్టీలు తమను సంప్రదించలేదని తెలిపారు. కాగా తెలంగాణలో రిజర్వేషన్ల పెంపుకోసం పార్లమెంట్ లో తమ ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం చేసే ఉద్ధేశం వుంటే మా మద్దతు కోరేవారేమోనన్నారు. రిజర్వేషన్ల విషయంలో స్పందించేంత వరకూ లోక్ సభలో పోరాటం చేస్తునే వుంటామని బూర నరసయ్య గైడ్ పేర్కొన్నారు. రాజకీయ ఎజెండాతో కాకు ప్రజల ఎజెండాతో ముందుకెళతామన్నారు. 

12:18 - March 20, 2018

ఢిల్లీ : లోక్‌సభలో సేమ్‌సీన్‌ రిపీట్‌ అయింది. టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాసం నోటీసులపై తీర్మానానికి అవకాశం రాలేదు. మూడోరోజూ టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు గందరగోళం సృష్టించారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు... కావేరి జలాల వివాదాల పరిష్కారానికి డిమాండ్‌ చేస్తూ అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో మొదటి వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైన 15 నిముషాల వ్యవధిలోనే వాయిదా పడింది. విదేశాంగశాఖా మాంత్రి సుష్మస్వరాజ్‌.. ఇరాక్‌లో భారతీయుల సమస్యలపై గందరగోళం మధ్యనే ప్రకటన చేశారు. గొడవ చేయొద్దంటూ స్పీకర్‌ చేసిన విజ్ఞప్తిని టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకే సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభ ఆర్డ్‌లో లేకుండా నడిపించలేమంటూ ప్రకటించిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఏపీ సమస్యలపై సభలో చర్చ జరగకుండానే మూడో రోజు సమావేశాలు ముగిశాయి.

శ్మశానాలు నిర్మిస్తాం : జూపల్లి

హైదరాబాద్ : గ్రామాల్లో శ్మశాన వాటికలను నిర్మిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా శ్మశానవాటికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. శ్మశానవాటికల ఏర్పాటు విషయంలో తీవ్రమైన సమస్య ఉందన్నారు. అయితే శ్మశానవాటికల నిర్మాణానికి సంభందించి అధికారాలు జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం జరిగిందన్నారు. శ్మశానవాటికలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో టాయిలెట్లు నిర్మాణం నరేగా ద్వారానే జరుగుతుందని మంత్రి జూపల్లి తెలిపారు.

అవిశ్వాసం పిల్లలాట కాదు : ఎంపీ బూర

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానం అంటే పిల్లలాట కాదని టీఆర్ఎస్ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పేర్కొన్నారు. అవిశ్వాసానికి మద్దతివ్వమని మా అధ్యక్షుడిని కోరలేదనీ..నాలుగేళ్లు కలిసి వుండి విడిపోయామన్నారు. దీంతో మద్దతు ఇవ్వమంటే ఇచ్చేస్తామా? అని ప్రశ్నించారు. తెలంగాణను విమర్శిస్తు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని అడగటం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో స్పందించేంత వరకూ లోక్ సభలో పోరాటం చేస్తునే వుంటామని బూర నరసయ్య గైడ్ పేర్కొన్నారు. రాజకీయ ఎజెండాతో కాకు ప్రజల ఎజెండాతో ముందుకెళతామన్నారు. 

ఆర్డర్ లేకపోవటానికి కేంద్రమే కారణం :ఆజాద్

ఢిల్లీ : సభలో ఆర్డర్ లేనందుకే అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టలేకపోతున్నామని బీజేపీ చెప్తుండటంపై కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ ఆగ్రహించారు. సభ ఆర్డర్ లేకపోవటానికి ప్రభుత్వమే కారణమన్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా ఇంత వరకూ ఆ హామీని బీజేపీ నెరవేర్చలేదని కాంగ్రెస్ సభ్యులు గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విపక్షాలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవటంలేదనీ..దీనిపై చర్చకు రాకుండా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. 

రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఏపీ విభజన సమయంలో తాము ప్రకటించిన ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా ఇంత వరకూ ఆ హామీని బీజేపీ నెరవేర్చలేదని కాంగ్రెస్ సభ్యులు గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విపక్షాలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవటంలేదనీ..దీనిపై చర్చకు రాకుండా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనటంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు.

కిడ్నాప్ అయిన భారతీయులు మృతి: సుష్మ స్వరాజ్

ఢిల్లీ : ఇరాక్ లో కిడ్నాప్ అయిన 39మంది భారతీయులు మృతి చెందారని రాజ్యసభలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం వారి మృతదేహాలను బాగ్దాద్ తరలించామని ఆమె తెలిపారు. ఈరోజు రాజ్యసభలో సుష్ప ఈ విషయాన్ని తెలిపారు.

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : ఢిల్లీ : లోక్ సభ ప్రారంభమయిన కొద్ది నిమిషాలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మ.12.00లకు వాయిదా వేశారు. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. కావేరీ జలాల విషయంలో అన్నాడీఎంకే సభ్యులు నినాదాలు చేయగా..రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తు వెల్ లోకి దీసుకెళ్లారు. దీంతో సభ ప్రారంభమయిన 45 నిమిషాలకు స్పీకర్ మ.12.00లకు సభను స్పీకర్ వాయిదా వేశారు.

సుల్తాన్ బజార్ లో మెట్రో విస్తరణ: కేటీఆర్

హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ఏరియాలో 66 అగుడుల వరకు విస్తరిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈరోజు టీ.అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా..సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తు..మెట్రోపనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్ని చోట్ల రోడ్ల వెడల్పు 200 అడుగుల మేర విస్తరిస్తున్నామని తెలిపారు. . పాత బస్తీలో ప్రాజెక్టు పనులను వందకు వంద శాతం పూర్తి చేస్తామన్నారు. జేబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు మెట్రో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు మొత్తం కాస్ట్ రూ.14 వేల 133 కోట్లు, కాగా ఇప్పటి వరకు రూ. 2,296 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

ఎయిర్ పోర్ట్ వరకూ మెట్రో : కేటీఆర్

హైదరాబాద్ : నాగోల్, హైటెక్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోను విస్తరిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జేబీఎస్, ఎంజీబీఎస్ వద్ద మెట్రో పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. మెట్రో మార్గాల్లో రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

10:54 - March 20, 2018

చిత్తూరు : తిరుపతిలోని కొంకావీధిలో విజయలక్ష్మీ అనే మహిళ దారుణ హత్యకు గురయ్యింది. మధ్యాహ్నం అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన ఆగంతకులు.. అడ్వాన్స్‌ తెస్తామంటూ వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రం 8గంటలకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. అద్దె అడ్వాన్స్‌ ఇచ్చే నెపంతో ఇంట్లోకి వచ్చారు. మహిళ ఒంటరిగా ఉన్నట్టు గమనించారు. ఇదే అదనుగా మహిళ నగలు దోచుకోడానికి యత్నంచారు. విజయక్ష్మీ తిరగబడటంతో .. ఆమెపై కత్తులతో దాడిచేసి.. ఒంటిమీద ఉన్న నగలును దోచుకెళ్లారని కుటుంబసభ్యులు అంటున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

వైసీపీ, జనసేన బీజేపీ కోవర్టులు : చంద్రబాబు

అమరావతి : బీజేపీ పార్టీలకు వైసీపీ,జనసేన పార్టీలు కోవర్టులుగా పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ మూడు పార్టీల ఎజెండా ఒక్కటేననీ..ఒక పద్ధతి ప్రకారం సమస్యను పక్కదారి పట్టించి టీడీపీపై బురద చల్లటమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను గమనించి ప్రతీరోజు అప్రమత్తంగా వుండాలని.. ఎంపీలకు సూచించారు.

10:31 - March 20, 2018

హైదరాబాద్ : పార్లమెంట్ లో సేమ్ సీన్ రిపీట్ కాబోతోందా? సభ ఆర్డర్ లో లేదనే వంకతో సోమవారం స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో మంగళవారం కూడా టీడీపీ, వైసీపీ పార్టీలు మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ కు సమర్పించారు. చర్చకు మేము సిద్ధమేనని ఒకపక్క చెబుతునే మరోపక్క వాయిదాలతో కాలం వెళ్లబుచ్చుతున్న ఎన్డీయే ప్రభుత్వం భయపడుతోందా? మాకు అవిశ్వాసాన్ని ఎదుర్కొనేంత మద్దతువుందని పైకి చెబుతున్నా..అది వాస్తవం కాదనేది సుస్పంగా తెలుస్తోంది.ఈ క్రమంలో మరోసారి సీన్ రిపీట్ కానుందా? లేదా చర్చకు ఎన్డీయే ప్రభుత్వం చేపడుందా? బీజేపీకి అంతర్గతంగా విభేదాలు ఏర్పడుతున్న క్రమంలో బీజేపీకి వున్న 271 ఎంపీల బలం మాత్రమే వున్న క్రమంలో కమలనాధులు భయపడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై మరోసారి ఎన్డీయే కప్పదాటుగా వ్యవహరిస్తుందా? అనే అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నగేశ్, వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామశర్మ,బీజేపీనేత విష్ణుశ్రీ చర్చలో పాల్గొన్నారు.

భార్యా,పిల్లలను హత్య చేసిన భర్త..

హైదరాబాద్ : మీర్ పేట పీఎస్ పరిధిలోదారుణం చోటుచేసుకుంది. భార్యా పిల్లలను హత్యచేసిన దారుణం వెలుగు చూసింది. భార్యా పిల్లను చంపివేసి పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సురేందర్ అనే వ్యక్తి భార్యా పిల్లను చంపివేసి మీర్ పేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. హత్యకు గురైనవారు భార్య వరలక్ష్మి, పిల్లలు ఐదేళ్ల నితీష్, మూడేళ్ల యనశ్వినిగా పోలీసులు గుర్తించారు. 

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..

అమరావతి : మూడు రోజుల విరామం తర్వాత ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. టీబీ వ్యాధి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానమిచ్చారు. టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని మంత్రి యనమలకు స్పీకర్ కోడెల శివప్రసాద్ సూచించారు.

రైల్వే ఉద్యోగాల కోసం రైల్వే ట్రాక్ పై ఆందోళన..

హైదరాబాద్ : ముంబైలో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగాల కోసం విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా రైల్ రోకోను చేపట్టారు. రైల్వే విభాగంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా ఆందోళన బాట పట్టారు. విద్యార్థులు ముంబైలోని మతుంగ-ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్ మార్గాల వద్ద రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. విద్యార్థుల ఆందోళనతో ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

టీ.అసెంబ్లీ వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సభ బీజేపీ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం ఇవ్వనుంది. అలాగే టీడీపీ 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ పై వాయిదా తీర్మానం ఇవ్వనుంది. అలాగే అనేక తీర్మానాలు సభలో చర్చకు వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

09:47 - March 20, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అవిశ్వాస తీర్మానపు వేడి కొనసాగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో మరోసారి అవిశ్వాసపు సెగ రాజుకోనుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ ఎంపీలు గత నాలుగేళ్లగా వేడుకుంటునే వున్నా..ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో టీడీపీ, వైసీపీ పార్టీలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపట్టకుండానే స్పీకర్ వాయిదా వేయటంతో ఈరోజు కూడా అవిశ్వాసంపై చర్చ కొనసాగుతుందా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలను టీడీపీ, వైసీపీ పట్టుపట్టనున్నాయి. ఈ క్రమంలో శివసేన ఎన్డీయేకే మద్దతునిస్తామని ప్రకటించింది. 

09:46 - March 20, 2018

అమరావతి : అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోసం అన్ని పార్టీల నేతలతో మాట్లాడతానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రెండవరోజు కూడా టీడీపీ, వైసీపీలు అవిశ్వాసంపై స్పీకర్ కు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంపై ఈరోజు కూడా తాజా పరిణామాలపై ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి వారికి దిశా నిర్ధేశం చేసారు. ప్రతీరోజు అప్రమత్తంగా వుండాలనీ..సమయం, సందర్భాన్ని బట్టి ఎంపీలు వ్యవహరించాలని చంద్రబాబు వారికి సూచించారు.సోమవారం ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం విషయంలో ఎటువంటి తీరును అనుసరిస్తోంది చూస్తున్నామనీ..ఈ నేపథ్యం అన్ని పార్టీల సభా నేతలతో సమన్వయం చేసుకోవాలని ఆలోచనలో చంద్రబాబు వున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకు పలు పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాగా టీడీపీ, వైసీపీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. 

09:09 - March 20, 2018

హైదరాబాద్ : తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎలాంటి పొరపాట్లు చేయకుండా అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించబోతుంది. తమకు ఉన్న మెజారిటీ ప్రకారం మూడు స్థానాలు తమకే దక్కే అవకాశం ఉన్నప్పటికీ... కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని పోటీకి నిలపడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే.. తమ ఎమ్మెల్యేలు ఎవరెవరికి ఓటు వేయాలి.. ఎలా వేయాలనే అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనుంది గులాబీ పార్టీ.

రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనివార్యం..
తెలంగాణలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనివార్యం కావడంతో అధికార పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలకు ఓటింగ్‌ విధానంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉండడంతో.. ఎమ్మెల్యేలను మూడు బ్యాచ్‌లుగా విభజించి ఎవరెవరికి ఎవరు ఓటు వేయాలో పార్టీ సూచించనుంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి 30 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కాగా.. దానికనుగుణంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం రచిస్తోంది.

విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్‌ పావులు
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా... ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కారెక్కినా... వారితో రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయించకుండా ఉండే అవకాశాలను పరిశీలిస్తోంది. ఫిరాయింపుల ఎమ్మెల్యేల లెక్కతేల్చేందుకే కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని రంగంలోకి దించడంతో... ఆ ఆరోపణలకు తెరదించాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయకపోయినా... గెలిచే అవకాశాలున్నాయని అధికార పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు సొంత ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరారు. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ మొత్తం ఎమ్మెల్యేల బలం 90గా ఉంది. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు... మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక టీడీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించగా.. బీజేపీ, సీపీఎంలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి అధికార పార్టీ మూడు స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

 

09:05 - March 20, 2018

హైదరాబాద్ : న్యాయపోరాటం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు కాస్త ఊరటగా నిల్చింది. తమ సభ్యత్వ రద్దుపై కోమటిరెడ్డి, సంపత్‌లు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆరు వారాల పాటు.. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వకుండా స్టే విధిస్తూ ఈసీని ఆదేశించింది. మరోవైపు గవర్నర్‌ ప్రసంగం రోజున అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్పందించిన కోర్టు... లైవ్‌ ఫుటేజిని అందించాలని ఆదేశించింది.


మటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో కాస్త ఊరట
తమ సభ్యత్వ రద్దుపై ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగ సందర్భంగా తలెత్తిన గందరగోళంలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై కోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయి.

న్యాయసూత్రాలను పాటించలేదన్న న్యాయవాది
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్‌ మధుసూదనాచారి సహజ న్యాయసూత్రాలను పాటించలేదని.. అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్యేల తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ కోర్టులో వాదనలు వినిపించారు. గవర్నర్‌ పరిధిలో ఉన్న అంశంపై స్పీకర్‌ ఎలా నిర్ణయం తీసుకుంటారన్నారు. దీనిపై స్పందించిన కోర్టు గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా మొత్తం లైవ్‌ ఫీడ్‌ను కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

లాంటి నోటిఫికేషన్‌ ఇవ్వవద్దని ఈసీని హైకోర్టు ఆదేశం..
ఇక ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో... ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వకుండా స్టే విధించడంపై కోర్టు ఈసీ అభిప్రాయం కోరింది. అనంతరం ఈసీ ఇచ్చిన అభిప్రాయం ప్రకారం ఆరు వారాల పాటు ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వవద్దని ఈసీని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ నేతలు సంతోషం
హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రానున్న కర్నాటక ఎన్నికలతో పాటు ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని తహతహలాడిన అధికార పార్టీ.. హైకోర్టు తీర్పుతో డిఫెన్స్‌లో పడిందంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉప ఎన్నికలను ఫ్రీఫైనల్‌గా చేసుకోవాలని భావించిన టీఆర్‌ఎస్‌కు.. ఈ తీర్పు పపెట్టులాంటిదన్నారు. ఇక హైకోర్టు తీర్పుతో ఈసీ తీసుకునే చర్యలకు కాస్త బ్రేక్‌ పడింది. ఈనెల 22న ప్రభుత్వం కోర్టుకు సమర్పించే లైవ్‌ ఫుటేజ్‌ ఎలా ఉంటుంది... దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో... ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోవడంపై కోర్టు ఎలా స్పందిస్తుందనే సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. 

నేడు పద్మ పురస్కారాల ప్రధానం..

ఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. వివిధ రంగాలలో సంగీత సామ్రాట్‌ ఇళయరాజా, హిందూత్వ సిద్ధాంతకర్త పరమేశ్వరన్‌ పరమేశ్వరన్‌ సహా 41 మంది ప్రముఖులకు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేబినెట్‌ మంత్రులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ముగ్గురికి పద్మవిభూషణ్‌, తొమ్మిది మందికి పద్మభూషణ్‌ సహా 84 మందికి పద్మ అవార్డులు ఇస్తామని కేంద్రం తెలిపింది. ఏటా గణతంత్ర దినోత్సవంనాడు వీటిని ప్రకటిస్తారు.

08:14 - March 20, 2018

ఢిల్లీ : పరువునష్టం దావా కేసులలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్షమాపణల పర్వం కొనసాగుతోంది. తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబ్బల్‌, ఆయన కుమారుడు అమిత్‌ సిబ్బల్‌కు కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పారు. కేజ్రీవాజ్‌ క్షమాపణ చెప్పడంతో తమ కేసులను వారు వాపస్‌ తీసుకోనున్నట్లు సమాచారం. అవినీతిపరుల జాబితాలో గడ్కరి పేరు కూడా ఉందని కేజ్రీవాల్‌ ఆరోపించడంతో కేంద్రమంత్రి ఆయనపై పరువునష్టం కేసు వేశారు. గతంలో తాను చేసిన ఆరోపణలు నిరాధారమని చింతిస్తూ కేజ్రీవాల్‌ గడ్కరికి లేఖ రాశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని 2013లో అమిత్‌ సిబ్బల్‌పై కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. గతవారం అకాలీదళ్ నేత, మాజీ పంజాబ్‌ మంత్రి బిక్రమ్‌సింగ్‌ మజీఠీయాకు క్షమాపణ చెప్పడంపై పంజాబ్‌ ఆప్‌ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌పై మొత్తం 33 పరువునష్టం కేసులున్నాయి. ఈ కేసుల నుంచి విముక్తి పొందడానికి కేజ్రీవాల్‌ శరణు వేడుకుంటున్నారు.

08:11 - March 20, 2018

కర్ణాటక: లింగాయత్‌ల ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. లింగాయత్‌ను ప్రత్యేక మతంగా గుర్తించడానికి సిద్ధరామయ్య కేబినెట్‌ అంగీకరించింది. ఈ మేరకు సిఫారసును కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదా ఇవ్వాలన్న జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని రాష్ట్ర మంత్రి, లింగాయత్ నేత ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నిర్ణయం బిజెపిని చిక్కుల్లో పడేసింది. కాంగ్రెస్‌ సమాజాన్ని చీల్చే రాజకీయం చేస్తోందని బిజెపి మండిపడింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కూడా లింగాయతే కావడం గమనార్హం. లింగాయత్‌ను హిందూయేతర మతంగా గుర్తించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఒప్పుకోవడం లేదు. కర్ణాటకలో 18 శాతం మంది లింగాయత్‌లున్నారు.

08:03 - March 20, 2018

హైదరాబాద్ : దేశం రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాం ఏర్పాట్లకు బీజం పడిందా? కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు అవలంభిస్తున్న విధానాలకు ప్రత్నామ్నాయం రాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ధర్ట్ ఫ్రంట్ కోసం నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ దీనికి అత్యంత ప్రాధాన్యతను కలిగిస్తోంది. వీరితో పాటు మరికొంతమంది స్థానిక పార్టీలు ఈ దిశలో పయనించే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు బలమైన ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ దీదీల మొదటి సమావేశం మొదటి అడుగు పడిందని తెలుస్తోంది. మరి ప్రత్యామ్నాం దేశ ప్రజలకు ప్రత్యామ్నాం కానుందా? థర్ట్ ఫ్రంట్ సక్సెస్ అవుతుందా? బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలను థర్ట్ ఫ్రంట్ చెక్ పెడుతుందా. వంటి పలు అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్, టీఆర్ఎస్ సీనియర్ నేత సమ్మారావు, బీజేపీ అధికార ప్రతినిథి కుమార్ పాల్గొన్నారు. 

07:36 - March 20, 2018

తమిళనాడు : దివంగత నేత, తమిళనాడు సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ మృతి చెందారు. గత కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న నటరాజన్ రెండు వారాల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతు మృతి చెందారు. 1975లో శశికళను వివాహం చేసుకున్న నటరాజన్ జయలలితకు కొన్నాళ్లపాటు రాజకీయ సలహాదారుగా కూడా పనిచేశారు. కాగా నటరాజన్ విద్యార్థి దశ నుంచి డీఎంకేలో చురుకైన పాత్రను పోషించేవారు. నటరాజన్ కు శశికళకు డీఎంకే అధినేత కరుణానిధి ఇరువురికి వివాహం జరిపించారు. కాగా నటరాజన్ భౌతికకాయాన్ని చెన్నై నుండి తంజావూరుకు తరలించనున్నారు. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ పెరోల్ రాగానే తంజావూర్ వెళ్లనున్నారు. 

మరో సెల్ఫీ సూసైడ్..

హైదరాబాద్ : నగరంలో మరో సెల్ఫీ సూసైడ్ చోటు చేసుకుంది. వివాహం జరగటంలేదనే మనస్తాపంతో ఓ యువకుడు సెల్ఫీ సూసైడ్ కు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా యత్నించినా వివాహం జరగటంలేదనే మనస్తాపంతో ఫ్యాన్ కు ఉరివేసుకుని జశ్వంత సెల్ఫీ సూసైడ్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది. 

శశికళ భర్త నటరాజన్ మృతి..

తమిళనాడు : దివంగత నేత, తమిళనాడు సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ మృతి చెందారు. గత కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న నటరాజన్ రెండు వారాల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతు మృతి చెందారు. 1975లో శశికళను వివాహం చేసుకున్న నటరాజన్ జయలలితకు కొన్నాళ్లపాటు రాజకీయ సలహాదారుగా కూడా పనిచేశారు. 

Don't Miss