Activities calendar

21 March 2018

21:53 - March 21, 2018

శ్రీకాకుళం : జిల్లాలో అర్జీలు అమలుకు నోచుకోవడం లేదు. చిన్న చిన్న సమస్యలకు సైతం ప్రజలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. మండల స్థాయిలో ఫిర్యాదులకు మోక్షం లభించకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొక్కుబడిగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో వాటిని పరిష్కరించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళంలో కాగితాలకే పరిమితవుతున్న అర్జీలు
శ్రీకాకుళం జిల్లాలో ఫిర్యాదుల విభాగాలు అబాసుపాలవుతున్నాయి. అర్జీలు కేవలం కాగితాలకే పరిమితమవుతూ.. బాధితుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. మండల స్థాయిలో ఫిర్యాదులు పరిష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌ సెల్‌ విభాగానికి 26 శాఖలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌లైన టెక్కలి, పాలకొండతో పాటు 38 మండలాల నుండి జిల్లా కేంద్రంలోని ఫిర్యాదుల విభాగానికి అర్జీలు వస్తున్నాయి.

గత ఏడాది 1.67 వేల ప్రజా వినతులు
అర్జీలు సమర్పిస్తున్నా ప్రజలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. గత ఏడాది లక్ష 67 వేల వరకు ప్రజలు వినతులను అధికారులకు సమర్పించారు. అయితే వీటికి సంబంధించి ఇంతవరకు పదుల్లో కూడా పరిష్కారం లభించిన దాఖలాలు లేవు. దీంతో ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలతో పాటు పాలకులు అధికారులను విమర్శిస్తున్నారు. ఎక్కువ శాతం ఫిర్యాదులు రెవెన్యూ, పంచాయితీరాజ్‌ విభాగాల్లో రావడంతో అర్జీలు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సమస్యలు పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలి : -ప్రజా సంఘాలు
ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని, సమస్యల పరిష్కారానికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ఉన్నాతాధికారులను ప్రజా సంఘాలు కోరుతున్నాయి. మరో వైపు ప్రతివారం జిల్లా కేంద్రంలో ఉన్నాతాధికారుల సమక్షంలో ఫోనులో అందుకుంటున్న ప్రజావాణి ఫిర్యాదులు సైతం పెద్ద ప్రవాసనంగా మారుతున్నాయన్న విమర్శలున్నాయి. గ్రీవెన్స్‌ సెల్‌, ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని అర్జీదారులు, ప్రజా సంఘాలు కలెక్టర్‌కు విన్నవించినా చర్యలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రజల సమస్యలు పరిష్కరిస్తారో లేదో చూడాలి.

21:48 - March 21, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దళితులు కదం తొక్కారు. పార్లమెంటు స్ట్రీట్‌లో భారీర్యాలీ నిర్వహించారు. దళిత శోషణ్‌ ముక్తిమంచ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌, సుభాషిణి అలీ, పార్టీ ఎంపీలు, డీఎస్‌ఎంఎం నాయకులు రామచంద్రన్‌, శ్రీనివాసరావుతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళితులపై దాడులకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మోదీ పాలనలో దళితులపై అకృత్యాలు పెరిగిపోవడం పట్ల డీఎస్‌ఎంఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 

21:47 - March 21, 2018

విజయవాడ : స్పెషల్ స్టేటస్‌ కోసం రేపు ఏపీలో ప్రత్యేక హోదా సాధన నేతృత్వంలో జాతీయ రహదారుల దిగ్బంధం జరగనుంది. రాజకీయాలకు అతీతంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని వామపక్ష నేతలు కోరారు. విద్యార్థుల పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల దిగ్బంధం చేస్తామని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని వారు తెలిపారు. 

21:45 - March 21, 2018

ఢిల్లీ : నాలుగు రోజులు.. 8 అవిశ్వాసాలు.. నిర్ణయం మాత్రం మళ్లీ అదే. పార్లమెంట్‌లో నాలుగురోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు అవిశ్వాస తీర్మానాలు పెట్టడం.. సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్‌ వాయిదా వేయడం రిపీటవుతోంది. అవిశ్వాసంపై ఓటింగ్‌ జరిపే వరకు.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని టీడీపీ, వైసీపీ అంటుండగా.. కేంద్రం మాత్రం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపింది.

చర్చ జరగకుండానే పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా
అవిశ్వాసంపై చర్చ జరగకుండానే పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభంలోనే.. రిజర్వేషన్లపై-టీఆర్‌ఎస్‌, కావేరీ జలాలపై- ఏఐడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. పోడియాన్ని చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌. అనంతరం సభ ప్రారంభం కాగానే.. మళ్లీ టీఆర్‌ఎస్‌, ఏఐడీఎంకే ఆందోళన చేపట్టాయి. టీడీపీ ఎంపీ తోటనర్సింహులు, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస నోటీసులను స్పీకర్‌ చదివి వినిపించారు. సభ ఆర్డర్‌లో లేనికారణంగా చర్చను చేపట్టలేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌ కీలక ప్రకటన చేశారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి మోదీ సర్కార్‌ సిద్ధంగా ఉందని, ఓటింగ్‌లోనూ నెగ్గుతామన్నారు. చర్చ జరగాలంటే మాత్రం సభ ఆర్డర్‌లో ఉండాలన్నారు.

రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి
సభ్యులు ఎవరిస్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ కోరినా ఫలితం లేకపోవడంతో.. సభను గురువారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభం కాగానే.. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ నినదించారు. దీంతో చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్‌ వెలుపల వైసీపీ, టీడీపీ ఎంపీలు ఎవరికి వారుగా ఆందోళన చేపట్టారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ హరిశ్చంద్రుని వేశంలో పార్లమెంట్‌కు వచ్చి నిరసన తెలిపారు. కేంద్రం హరిశ్చంద్రున్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

సహనాన్ని పరీక్షిస్తే... గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే : టీడీపీ
నాలుగురోజులుగా పరిణామాలను చూస్తుంటే ఎన్డీయే కావాలనే సభ జరగకుండా చూస్తుందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. తమ సహనాన్ని పరీక్షిస్తే... గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. కేంద్రానికి ధైర్యముంటే అవిశ్వాసంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు.

అవిశ్వాసంపై చర్చజరిగేవరకూ నోటీసులు : వైసీపీ
అవిశ్వాసంపై చర్చజరిగేవరకూ నోటీసులు ఇస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. టీఆర్‌ఎస్‌, ఏఐడీఎంకే ఎంపీల ఆందోళలనను తప్పుపట్టలేమన్న వైసీపీ ఎంపీలు.. సభను ఆర్డర్‌లో పెట్టే బాధ్యత కేంద్రానిదే అన్నారు. అవిశ్వాస తీర్మానం తమకు ప్రాధాన్యత కాదని టీఆర్‌ఎస్‌ మరోసారి స్పష్టం చేసింది. పక్క రాష్ట్రం సమస్యల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. ఇతర రాష్ట్రాల ఫ్లకార్డులు పట్టుకోవడానికి తాము ఛీర్స్‌గర్ల్స్‌మా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

జీత, భత్యాలు నిలిపివేయాలి : ఎంపీ మనోజ్‌ తివారి
భా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న ఎంపీలకు నో వర్క్‌ నోపే కింద జీత, భత్యాలు నిలిపివేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనోజ్‌ తివారి కేంద్రానికి రాసిన లేఖను విపక్షాలు ఖండించాయి. తమ ప్రాంత సమస్యలపై పోరాడుతున్న తమకు ఇది వర్తించదని వైసీపీ, టీఆర్‌ఎస్‌ కొట్టిపారేశాయి.

21:44 - March 21, 2018

అమరావతి : పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్న బీజేపీ సభ్యుల ఆరోపణతో ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. విపక్ష బీజేపీ, అధికార టీడీపీ సభ్యులు సరస్పర ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభ అట్టుడికింది. పట్టిసీమలో జరిగిన అవినీతిపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణకు బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ను అధికార పక్షం తిరస్కరించింది. look.

పట్టిసీమ ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ
పట్టిసీమ ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. బడ్జెట్‌లోసాగునీటి పద్దులపై చర్చ ప్రారంభించిన బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దాదాపు 371 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని సభ దృష్టికి తెచ్చారు. పట్టిసీమలో జరిగిన అక్రమాలను కాగ్‌ నివేదికలో తప్పుపట్టిన విషయాన్ని ప్రస్తావించిన విష్ణుకుమార్‌రాజు.. దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణకు డిమాండ్‌ చేశారు. అయితే ఈ ఆరోపణలను నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తిప్పికొట్టారు.

టీడీపీ,బీజేపీ వాదన..
అసెంబ్లీ వేదికగా గతంలో పట్టిసీమ ప్రాజెక్టును ప్రశంచిన బీజేపీ సభ్యులు... ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. పీఏసీ చైర్మన్‌, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇచ్చిన స్క్రిప్టును విష్ణుకుమార్‌రాజు వల్లె వేశారని కాల్వ చేసిన విమర్శలను.. బీజేపీ సభ్యుడు మాణిక్యాలరావు తప్పుపట్టారు. పట్టిసీమపై అసెంబ్లీలో ఆరోపణలు చేస్తున్న బీజేపీ సభ్యులు... బయట మీటింగ్‌ పెడితే ఏం జరుగుతుందో చూడాలన్న మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై విష్ణుకుమార్‌రాజు మండిపడ్డారు.

తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు
పట్టిసీమలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విపక్ష బీజేపీ, అధికార టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు కొనసాగుతున్న సమయంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుని, బడ్జెట్‌లో నీటిపారుదల శాఖ పద్దులపై చర్చ ముగిసిందని ప్రకటించారు. చర్చకు గురువారం మంత్రి సమాధానం ఇస్తారని ప్రకటించి సభను వాయిదా వేశారు.

 

21:42 - March 21, 2018

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శృంగేరి మఠాన్ని సందర్శించారు. సీనియర్‌ పార్టీ నేతలతో కలిసి చిక్‌మగలూర్‌లోని శృంగేరి శారదాంబ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. రాహుల్‌ సంప్రదాయ పంచెను ధరించి ఆలయానికి వెళ్లారు. శృంగేరీ మఠాధిపతి జగద్గురు శంకరాచార్యను రాహుల్‌ కలుసుకున్నారు. శృంగేరి మఠంలోని వేదపాఠశాల విద్యార్ధులతో కూడా కొద్దిసేపు ముచ్చటించారు.

మసాబ్ ట్యాంక్ లో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ : మసాబ్ ట్యాంక్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని ఇన్ కమ్ ట్యాక్స్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భవనంలోని ఎనిమిదో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతోమంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచరం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.  కాగా ప్రమాదానికి గల కారణం తెలియాల్సి వుంది. 

20:43 - March 21, 2018

ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రతిపత్తి కి సంబంధించి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చామని కేంద్రం పేర్కొంటోంది. దీనికి పూర్తి భిన్నంగా..రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనను తెలుపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభత్వం దేనికి ఎంత విడుదల చేశామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. మరి దీంట్లో వాస్తవాలు ఎంత? అవాస్తవాలు ఎంత? అసలు విభజన చట్టంలో ఎటువంటి అంశాలను పొందుపరిచారు? ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా ఏమిటి? దేనివ ల్ల ఎటువంటి లబ్ధి వుంది? అనే అంశాలను వివరించేందుకు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వివరించేందుకు 10టీవీలోవున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందన్నారు. కాబట్టి విభజన చట్టంలోవున్న హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చి తీరాలని డిమాడ్ చేశారు. 

20:26 - March 21, 2018

మల్లన్నముచ్చట్లు : మోదీకీ పవనాలకి లగ్గం చేసిన టీడీపీ తమ్ముళ్లు.. ఏపీకి అవిశ్వాస తీర్మానానికి అడ్డుతగులుతుందంట. గో పక్కేమో కవితమ్మ ఏపీకి హోదా గివ్వాలనే..మరోపక్క టీఆర్ఎస్ ఎంపీలు సఢ స్టాట్ చేయంగనే వెల్ కాడికెల్లి లొల్లి లొల్లి పెడుతుండే..దీనిపై ప్రజలు చెవులు కొనుకుండ్రంట..పనిచేయనివాళ్లకు జీతం ఇవ్వొద్దని లోక్ సభ స్పీకర్ కు ఉత్తరం ఇచ్చిన మనోజ్ తివారీ..బస్ లల్ల అసెంబ్లీకొచ్చి షో చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..గిసువంటి మస్తు ముచ్చట్లు మన మల్లన్న తాత గీరోజు కూడా పట్టుకొచ్చిండు..మరి గీ ముచ్చట్లు చూడాలంటే మల్లన్న ముచ్చట్టు చూడాల్సిందే. మరిగెందుకు ఆలిసం చూడుండ్రి..

పవన్ ని సున్నాలు పెట్టుకోమన్న నటుడు..

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కు బ్లాంక్ చెక్ ఇస్తాననీ దానిపై ఆయన ఎన్ని సున్నాలు పెట్టుకున్నా పరవాలేదని నటుడు, రచయిత అయిన పోసాని కృష్ణ మురళీ పేర్కొన్నారు. పవన్ ప్యాకేజీల స్టార్ అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోసాని స్పందించారు. పవన్ డబ్బులు తీసుకున్నాడని అంటే తాను నమ్మననీ..ఆయన డబ్బుకు అమ్ముడుపోయే మనిషి కాదన్నారు. తను మళ్లీ సినిమాలు చేస్తా అంటే బ్లాంక్ చెక్ ఇస్తా అన్నారు. ఎన్ని సున్నాలు పెట్టుకున్నా పర్వాలేదని.. కేవలం టాలీవుడ్‌లోనే కాదని.. దేశంలోనే అంత డిమాండ్ ఉన్న నాయకుడని అన్నారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నిర్వాకానికి ప్రజలు ఏడుస్తున్నారు: అచ్చెన్న

అమరావతి : బీజేపీ పార్టీ చేసిన నిర్వాకానికి రాష్ట్ర ప్రజలు కష్టాలు పడుతున్నారనీ,ఏడుస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి కాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని ప్రస్తుతం బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరులుగా ముందు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలని, ఆ తర్వాత రాజకీయాల గురించి ఆలోచించవచ్చని సూచించారు.

బీజేపీకి కొత్త అర్థం చెప్పిన మంత్రి..

అమరావతి : బీజేపీకి ఏపీ మంత్రి కొత్త అర్థాన్ని చెప్పారు. బీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్, పీ అంటే పవన్ కల్యాణ్ అంటూ బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. ఈ బీ.జే.పీలు ప్లాన్ ప్రకారం ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రాన్ని మరింత నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

''మీ బెస్ట్ ఫ్రెండ్ శత్రువయ్యారా కేసీఆర్ జీ``

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ కోసం ప్ర‌య‌త్నాలను ముమ్మరం చేశారు. దీనిపై కేసీఆర్‌కి తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి శ్రవ‌ణ్ దాసోజు బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్‌కి బెస్ట్ ఫ్రెండ్ అయిన మోదీ ఇప్పుడెందుకు శత్రువయ్యారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 2009లోనూ కేసీఆర్, చంద్రబాబు, లెఫ్ట్ పార్టీలన్నీ కలసి మహా కూటమి కట్టినప్పుడు ఏం జరిగిందో మర్చిపోయారా? అని లేఖలో ప్రశ్నాస్త్రాలు సంధించారు.

అరగంట పని, అరగంట నిరసన ఓకేనా?..

అమరావతి : కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి సాయం అందేవరకు తాము కూడా నిరసనల్లో పాల్గొంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. కానీ అది జపాన్ తరహా నిరసలుగా వుండాలన్నారు. అరగంట పనిచేసి, మరోఅరగంట నిరసనలు తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై పోరాడే క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రాష్ట్రాభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అందుకే జపాన్ తరహాలో ప్రతిరోజు అర్ధగంట నిరసన చేద్దామని పిలుపునిచ్చారు.

అరగంట పని, అరగంట నిరసన ఓకేనా?..

అమరావతి : కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి సాయం అందేవరకు తాము కూడా నిరసనల్లో పాల్గొంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. కానీ అది జపాన్ తరహా నిరసలుగా వుండాలన్నారు. అరగంట పనిచేసి, మరోఅరగంట నిరసనలు తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై పోరాడే క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రాష్ట్రాభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అందుకే జపాన్ తరహాలో ప్రతిరోజు అర్ధగంట నిరసన చేద్దామని పిలుపునిచ్చారు.

అప్పుడు అద్భుతం, ఇప్పుడు అవినీతా? : పరిటాల సునీత

అమరావతి : పట్టిసీమ ప్రాజెక్టుపై నిధులు వృధాగా అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో అన్న మాటలకు మంత్రి పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. పట్టిసీమ ప్రాజెక్టు అద్భుతంగా ఉందని గతంలో విష్ణుకుమార్ రాజు ప్రసంశించి ఇప్పుడు అవినీతి జరిగిందనటాన్ని ఈ విధంగా ఎలా మాట్లాడారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చాక బీజేపీ నేతలకు ఏపీలో అవినీతి కనపడిందా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు కీలక నిర్ణయం!..

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనలకు తాము సిద్ధంగా వున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈరోజు సాధికారత మిత్రల సదస్సుల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విపక్షాలు సహా ఎవరు ఆందోళన చేపట్టినా సహకరిస్తామన్నారు. కాగా రేపు ప్రత్యేక హోదా సమితి ఆధ్వర్యంలో వామపక్షాలు ఏపీ జాతీయ రహదారులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆందోళనకు సహకరిస్తామని తెలిపటం విశేషం. కాగా శాంతి భద్రతలకు ఏమాత్రం ఆటంకం లేకుండా ఆందోళన చేయాలని సూచించారు.

చంద్రబాబు కీలక నిర్ణయం!..

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనలకు తాము సిద్ధంగా వున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈరోజు సాధికారత మిత్రల సదస్సుల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విపక్షాలు సహా ఎవరు ఆందోళన చేపట్టినా సహకరిస్తామన్నారు. కాగా రేపు ప్రత్యేక హోదా సమితి ఆధ్వర్యంలో వామపక్షాలు ఏపీ జాతీయ రహదారులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆందోళనకు సహకరిస్తామని తెలిపటం విశేషం. కాగా శాంతి భద్రతలకు ఏమాత్రం ఆటంకం లేకుండా ఆందోళన చేయాలని సూచించారు.

19:18 - March 21, 2018

విశాఖ : మాడుగుల మండలం గిరిగోయపాలెంలో చిరుతపులి సంచరించడంతో గ్రామస్తులు పరుగులు తీసారు. చిరుతపులి తన పిల్లతో గ్రామంలోకి రావడంతో స్థానికులు భయందోళనకు గురైయారు. స్థానికంగా ఉన్న కొంత మంది వ్యక్తులు చిరుతను వెంబడించడంతో పులి పారిపోగా చిరుత పిల్లను పట్టుకున్నారు. ప్రస్తుతం చిరుత పిల్ల గ్రామస్తుల సంరక్షణలో ఉంది.

19:16 - March 21, 2018

ఢిల్లీ : నవ తెలంగాణ దినపత్రిక మూడో వార్షికోత్సవ సభ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రచయిత కేంద్ర సాహితీ పురస్కార అవార్డు గ్రహిత అంపశయ్య నవీన్‌ హాజరయ్యారు. ప్రజా గొంతుగా నవ తెలంగాణ పత్రిక పని చేస్తుందని కొనియాడారు. విమర్శలనే ప్రశంసలుగా మార్చుకొని ముందుకు సాగుతామన్నారు నవతెలంగాణ పత్రిక ఎడిటర్‌ వీరయ్య. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో... నవతెలంగాణ ముందందని... పత్రికలో పని చేస్తున్నవారిని అభినందించారు టెన్‌ టీవీ ఎండీ వేణుగోపాల్‌. 

19:11 - March 21, 2018

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా ఎలాంటి కారణం లేకుండా తమ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్.. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో వీరిరువురు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిశారు. ఈ నిర్ణయంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చిందని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో తమ పేర్లను తొలగించారని... వాటిని చేర్చాలని ఈసీని కోరినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. 

19:07 - March 21, 2018

అమరావతి : రాజధానిలో 15వేల కోట్ల రూపాయల పనులు జరుగుతుంటే... కేంద్రం కేవలం 1500కోట్లు ఇచ్చి... ఏం పనులు చేశారని ప్రశ్నించడం సరికాదన్నారు చీఫ్ విప్ పల్లె రఘనాథ్. అమరావతిలో ఇప్పటికే 6లక్షల చదరపు అడుగుల తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ నిర్మాణం జరిగిందన్నారు. ఇంకా పలు పనులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా... ఏం పనులు చేశారని ఢిల్లీ పెద్దలు అడుగుతున్నారని... ఇప్పటికైనా వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పల్లె సూచించారు.

18:47 - March 21, 2018

కర్నూలు : ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలులో వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని వాగ్దానం చేసిన క్రమంలో రాష్ట్ర విడిపోయిన నాలుగేళ్లవుతున్నా ఇంతవరకూ ఇచ్చిన హాలను నెరవేర్చలేకపోవటంపై వామపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, వైసీపీ, జనసేన పార్టీ నేతలు హాజరయ్యారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోరుతూ రేపు జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని నేతలు పేర్కొంటున్నారు.

18:41 - March 21, 2018

ఢిల్లీ : రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తమకు నో వర్క్‌ నో పే వర్తించదని.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. అవిశ్వాసానికి మద్దతు కూడగట్టేందుకు తమ స్థానాల్లోనే ఉండి పోరాడుతున్నామన్నారు. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటున్న విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

18:37 - March 21, 2018

అమరావతి : నూతన రాజధాని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి ప్రయివేట్ యూనివర్శిటీ ``విట్''స్పెషల్ 10టీవీ ప్రత్యేక కార్యక్రమం..

పట్టిసీమపై దర్యాపు అవసరం : విష్ణుకుమార్ రాజు

అమరావతి : పట్టిసీమ ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడి వేడీ చర్చ జరిగింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతు..పట్టిసీమ ప్రాజెక్టులు అక్రమాలు జరిగాయని..నిధులు వృధా అవుతున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రై.190 కోట్లు ఈ ప్రాజెక్టుపై వృధాగా ఖర్చుపెట్టారని కాగ్ ఆరోపించిన విషయాన్ని విష్ణుకుమార్ రాజు ప్రస్తావించారు. అలాగే రై.371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. క్యూబిక్ మీటర్ మట్టి తీయటానికి రూ.21,350 ఖర్చు చేశారన్నారు.

స్పీకర్ ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారు : గల్లా

కేంద్ర ప్రభుత్వంతో పాటు లోక్‌సభ స్పీకర్ ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారని టీడీపీ ఎంపీ గలా జయదేవ్ విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం పారిపోతోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ రోజు అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ ఎంపీల నిరసనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదాపడిన విషయం తెలిసిందే. అనంతరం పార్లమెంటు వెలుపల గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు.

మంత్రిగా వున్నప్పుడు నోరు రాలేదా? దేవినేని

అమరావతి : వైసీపీ మాటల్నే బీజేపీ నేతలు పలుకుతున్నారని మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో మంత్రిగా వున్నప్పుడు ప్రశంసించన బీజేపీ నేతలు ఇప్పుడు విమర్శిస్తున్నారనీ పట్టిసీమ విషయంలో ఇన్నేళ్లు కనిపించని అవినీతి ఇప్పుడు కనిపించిందా..? అంటూ తీవ్రస్థాయిలో బీజేపీ నేతలపై దేవినేని ఫైర్ అయ్యారు. మాణిక్యాలరావు వ్యాఖ్యలపై విరుచుకుపడిన మంత్రి దేవినేని..అప్పట్లో మంత్రిగా ఉన్న మీరు ఎందుకు అడగలేదని నిలదీశారు. అప్పుడు నోరు లేదా ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ, బీజేపీ హాట్ హాట్..

అమరావతి:  ఏపీ అసెంబ్లీలో టీడీపీ వర్సెస్ బీజేపీగా వాతావరణం మారింది. ఇవాళ్టి చర్చలో రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్రస్థాయిలో విమర్శించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపణలపై నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. పట్టిసీమపై వైసీపీ నేత బుగ్గన రాజేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలనే విష్ణుకుమార్ రాజు చేస్తున్నారని విమర్శించారు. ఏడాదిలోగా పూర్తి చేసేపనిని.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐదున్నర నెలల కాలంలోనే పూర్తి చేశామన్నారు. గోదావరి జలాలు.. ప్రకాశం బ్యారేజీకి తెచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. 

రైతులకు పెట్టుబడి రాయితీ : సోమిరెడ్డి

అమరావతి : రైతులకు పెట్టబడి రాయితీ రూ.3వేల కోట్లకు పైగా ఇచ్చామన్నారు. రైతులకు విత్తనాల సరఫరాను, స్ర్పింకర్లను రాజీ పడకుండా అందజేస్తున్నాని తెలిపారు. కరవు సమయంలో పంట నష్టంపై శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అంచనా వేస్తున్నామన్నారు. ప్రతీ కుటుంబానికి నెలకు రూ.10వేలు ఆదాయాం రావాలనేది సీఎం ఆలోచనల మేరకు కృషి చేస్తున్నామని సోమిరెడ్డి పేర్కొన్నారు. అధిక వర్షపాతం వల్ల పంటలు దెబ్బతంటే పరిహారం కూడా చెల్లిస్తున్నామనీ..10లక్షల పశువుల బీమాకు బడ్జెట్ లో అదనంగా రూ.50కోట్లు కేటాయించామన్నారు.

మహిళలతో అభివృద్ధి : చంద్రబాబు

అమరావతి : మహిళలు తలచుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాధికారమిత్రలో సమావేశమయిన చంద్రబాబు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను మహిళలకు అప్పగించామన్నారు. ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలలోను మహిళలను ఇన్ వాల్వ్ చేస్తున్నామని సాధికార మిత్రల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పేర్కొన్నారు. డిజిటల్ ఆర్గనైజేషన్,నర్సరీలు పెంచే బాధ్యత, మెప్మా వంటి అన్ని బాధ్యతలను మహిళలకిచ్చామన్నారు.సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు మహిళలు కృషి చేయాలన్నారు. 

పంటల్లో అధికోత్పత్తి సాధిస్తున్నాం : సోమిరెడ్డి

అమరావతి : రాష్ట్రంలో 21.43 లక్షల మెట్టిక్ టన్నుల మొక్కజొన్నను ఉత్తత్తి చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. నేడు అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతున్న సందర్భంగా గత ఏడాది కంటే 29 శాతం అధికంగా ఉత్తత్పి చేస్తున్నామని తెలిపారు. ఈసారి 11.44 లక్షల మెట్టిక్ టన్నుల పప్పు ధాన్యల ఉత్పత్తి జరిగిందన్నారు. అలాగే గత ఏడాది కంటే 23 శాతం అధికంగా ఉత్పత్తి చేశామన్నారు. 

17:10 - March 21, 2018

అమరావతి : పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో తీవ్ర రగడ చోటుచేసుకుంది. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ... దీనిపై సీబీఐ లేదా హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని అసెంబ్లీలో బీజేపీ డిమాండ్‌ చేసింది. బడ్జెట్‌లో సాగునీటి పద్దులపై చర్చ ప్రారంభించిన బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు.. పట్టిసీమ నిర్మాణంలో టెండర్‌ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ విషయాన్ని కాగ్‌ నివేదిక తప్పుపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. విష్ణుకుమార్‌రాజు ఆరోపణలపై మంత్రులు తీవ్రంగా స్పందించారు. గతంలో పట్టిసీమను ప్రశంసించిన బీజేపీ సభ్యులు ఇప్పుడు.. విచారణ కోరడాన్ని తప్పుపట్టారు. విష్ణుకుమార్ రాజు విమర్శలకు మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పట్టిసీమను ప్రశంచిన బీజేపీ సభ్యులకు ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి కనిపిస్తోందా? ఆరోజు మీకు నోరు రాలేదా? అని మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ నిర్మాణం పారదర్శకంగా జరిగిందనీ..అర్ధం పర్థం లేకుండా కావాలని చేసే విమర్శలు సరికావన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు జాతి ద్రోహులుగా మారిపోతారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. బీజేపీ పట్టిసీమపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మరోమంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

 

17:00 - March 21, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానం తమ రాష్ట్ర అంశం కాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. పక్కరాష్ట్రం సమస్యలు తమకు ప్రధానం కాదన్నారు. తాము సభ ప్రారంభమైననాటి నుంచి రిజర్వేషన్ల అంశంపై ఆందోళన చేస్తున్నామని.. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. నో వర్క్‌ నోపే అంశం ఎంపీలకు మాత్రమే కాదు.. కేంద్ర మంత్రులకూ వర్తిస్తుందంటున్న బూరనర్సయ్య గౌడ్‌ పేర్కొన్నారు.

16:57 - March 21, 2018

ఢిల్లీ : అవిశ్వాసంపై చర్చను చేపట్టేందుకు కుంటిసాకులు చెబతున్న కేంద్రం సభను ఆర్డర్‌లో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అవలంబిస్తున్న తీరుపై తన నిరసనలను కొనసాగిస్తున్న వైసీపీ ఎంపీలు ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వైసీపీ స్పష్టం చేసింది. అవిశ్వాసంపై తాము మొదటి నుంచీ పట్టుపడుతున్నామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. 

16:52 - March 21, 2018

అమరావతి : వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు కృష్ణా, గోదావరి డెల్టాలకు జూన్‌లోనే సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కల్పన నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ వరకు అన్నింటిపైనా కేంద్రం సమీక్షించుకోవాలని సూచించారు. ఎగుమతులు, దిగుమతుల్లో హేతుబద్ధ విధానాలు ఉండాలని అసెంబ్లీలో చెప్పారు. 

16:48 - March 21, 2018

విజయవాడ : వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం. ఇందుకోసం కృష్ణా నది నుండి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యతలేని నీటిని అమ్మకం చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా జిల్లాలో ప్రజలకు మంచినీటి ఏర్పాటు, నదీజలాల విడుదల వంటి అంశాలపై కలెక్టర్‌ లక్ష్మీకాంతం పేర్కొన్నారు.

16:46 - March 21, 2018

తూర్పుగోదావరి : జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో మాట మాట్లాడుతున్నారని... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే పోలవరం పనులు అప్పగించామని గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం చెప్పిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం పనులు అప్పగించాలని తాము అడగలేదని అంటున్నారని మండిపడ్డారు. జాతీయ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ఎందుకు చేపట్టారని ఉండవల్లి ప్రశ్నించారు. 

16:35 - March 21, 2018

భారత ప్రభుత్వం గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005ని తీసుకొచ్చింది. జమ్ము, కాశ్మీర్‌ తప్ప దేశమంతా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది ఒక సివిల్‌ చట్టం. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధిత స్తీలకు ఉపశమనం కల్పించేదిశగా ఈ చట్టం ఏర్పడింది. మరి ఎటువంటి సమయంలో ఎటువంటి సందర్బంలో ఈ చట్టాన్ని వినియోగించుకోవచ్చు? ఎటువంటి బాధితులు ఈ చట్టాన్ని వినియోగించుకోవచ్చు? అనే అంశాలపై మైరైట్ లో అడ్వకేట్ పార్వతిగారి సలహాలు, సూచలను ఈనాటి మైరైట్ కార్యక్రమంలోచూద్దాం..

16:23 - March 21, 2018

అమరావతి : మహిళలు తలచుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాధికారమిత్రలో సమావేశమయిన చంద్రబాబు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను మహిళలకు అప్పగించామన్నారు. ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలలోను మహిళలను ఇన్ వాల్వ్ చేస్తున్నామని సాధికార మిత్రల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పేర్కొన్నారు. డిజిటల్ ఆర్గనైజేషన్,నర్సరీలు పెంచే బాధ్యత, మెప్మా వంటి అన్ని బాధ్యతలను మహిళలకిచ్చామన్నారు.సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు మహిళలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం చేసే అన్ని పనులు అన్ని కార్యక్రమాలు మీకే అప్పగించామన్నారు. మీరందరు గనుక తలచుకుంటే మీ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దేంత సత్తా మహిళలకున్నాయన్నారు. 60 సంత్సరాల పాటు హైదరాబాద్ కేంద్రంగా కష్టపడ్డామన్నారు. అనంతం ఆంధ్రకు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపేందుకు విశేషమైన కృషిని చేస్తున్నామని దీనికి అందరి సహకారం కావలని చంద్రబాబు సాధికార మిత్రలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు.  

16:21 - March 21, 2018

నల్లగొండ : 10టీవీ కథనంపై నల్లగొండ జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మిర్యాలగూడ ఎంఈవో చంప్లా నాయక్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. నెలల తరబడి పాఠశాలకు గైర్హాజరయినా.... ముడుపులు తీసుకుని ఉపాధ్యాయులకు హజరు వేస్తోన్న చంప్లా అవినీతి భాగోతాన్ని 10 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. 10టీవీ కథనానికి స్పందించిన జిల్లా డైట్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ విచారణ జరిపారు. ఏడాదిగా పాఠశాలకు గైర్హాజరు అవుతూ వేతనం తీసుకుంటున్న ఉట్లపల్లి ఉపాధ్యాయురాలు సుమతీ, ఎంఈవో చంప్లాను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో ఉపాధ్యాయుడు రాంబాబుకు మెమో ఇచ్చారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇచ్చినట్లు డీఈవో తెలిపారు. అవినీతి పరుల సస్పెన్షన్‌ పై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 

15:51 - March 21, 2018

కడప : కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులకు దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు గురయిన ఇద్దరు స్నేహితులు అశోక్, ఖాదర్ హత్యపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు డబ్బు కోసమే హత్య జురిగినట్లుగా కొందరు మరికొందరు లేక ఇది రాజకీయ హత్యలుగా అనుమానాలు వస్తున్నాయి. కాగా అశోక్ హత్య వివాహేతర సంబంధం వల్లగా అనుమానిస్తుండగా..ఖాదర్ హత్య మాత్రం వాహనంపై వెళుతుండగా ప్రమాదం వల్ల చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

15:34 - March 21, 2018

అమరావతి : రైతుల ఆత్మహత్యలు జరగకుండా అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నామని దానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విధి లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటే రూ.5లక్షల పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. నేడు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆయన అనేక అంశాలపై మాట్లాడాదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఆలవాటు మారుతున్నాయని మారిన అలవాట్లకు అనుగుణంగానే పంటలు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యానవన పంటల్లో రాష్ట్రం అగ్రస్థానం ఉండేందుకు రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. పాడి పరిశ్రమ, ఆక్వా కల్చర్ ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని సూచించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు నిత్యం కృషి చేస్తున్నామన్నారు. దీంతో ఈ సారి రాష్ట్రంలో 1.8 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. 

తెలంగాణ ధనిక రాష్ట్రం : కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఈరోజు సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమనీ, రాష్ట్ర రెవెన్యూలో 22 శాతం అభివృద్ధిని సాధించామని కేసీఆర్ తెలిపారు. బడ్జెట్ పై సభ్యులు అనేక విమర్శలు చేస్తున్నారనీ..దానిపై అవగాహన పొంది సభ్యులు మాట్లాడాలని సూచించారు. 

రాష్ట్రానికి టీడీపీ తీవ్ర అన్యాయం : మధు

విశాఖ : విశాఖకు రైల్వే జోన్‌ కావాలని డిమాండ్‌ చేస్తూ.... విశాఖ మద్దిల పాలం వద్ద మహా పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. ఇవ్వాళ్టి నుండి మార్చ్‌ 29 వరకు విశాఖ లోని 72 వార్డుల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు మాటలు తాటి మట్టల వంటివని ఆయన మండిపడ్డారు. టీడీపీ చరిత్రలో ఎప్పుడు ఒంటరి కాలేదని చంద్రబాబు వల్లే ఒంటరి అయ్యిందన్నారు. బీజేపితో కలిసి టీడీపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చేసిన ద్రోహానికి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చేప్పాలని మధు డిమాండ్‌ చేశారు. 

 

13:50 - March 21, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ పరిధిలో నిర్మాణ రంగం ఊపందుకుంది. రోజురోజుకు నగరంలో కొత్త కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రతి యేటా 5 వేల నిర్మాణాలకు అనుమతిచ్చే జీహెచ్‌ఎంసీ.. ఈ ఏడాది 13,595 అనుమతులిచ్చింది. దేశంలోని మిగతా నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ జోరు తగ్గగా... భాగ్యనగరంలో మాత్రం 34 శాతం వృద్ధి సాధించిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకుపోతుంది. నూతన భవనాల కొనుగోలు వ్యాపారంలో భాగ్యనగరం మొదటి స్థానంలో ఉందని జెఎల్‌ఎల్‌ సంస్థ సర్వే స్పష్టం చేసింది. మెట్రో నగరాలలో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌పై.. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో విశేష అనుభవమున్న జెఎల్‌ఎల్‌ సంస్థ సర్వే నిర్వహించింది. గత ఐదేళ్లుగా దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, చెన్నై, కోల్‌కత్తాలో నూతన భవనాల నిర్మాణం, కొనుగోళ్లు 41 శాతం పడిపోగా... గ్రేటర్‌ హైదరాబాద్‌లో 34 శాతం పెరుగుదల ఉందని తెలిపింది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... రాజకీయ సుస్ధిరత, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించడమే ఈ అభివృద్ధికి కారణమని జెఎల్‌ఎల్‌ విశ్లేషిచింది. 2013-14లో దేశ రాజధానిలో ఒక లక్షా 16 వేల 250 నూతన ఆస్తి కొనుగోళ్లు జరగగా... 2015-16లో 62,300కు పడిపోయింది. 2017 నాటికి అది మరింత క్షీణించి 37,600 కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. అలాగే... ముంబైలో 27 శాతం, చెన్నైలో 45 శాతం, పుణెలో 29 శాతానికి కొనుగోళ్లు పడిపోయాయి. ఐటీ నగరమైన బెంగళూరులోనూ గతేడాదికి కొనుగోళ్లు 17 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. అన్ని నగరాల్లో క్షీణదశల్లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ రంగం హైదరాబాద్‌లో మాత్రం భారీగా పుంజుకుందంటున్నారు బల్దియా కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి. 2013-14లో ఆస్తుల విక్రయాలు 11,450 ఉండగా.. 2017లో అది 15,100కు చేరిందన్నారు.

ఇక కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాట్‌తో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం చూపి కుదేలవ్వగా.. హైదరాబాద్‌పై మాత్రం స్వల్ప ప్రభావం మాత్రమే పడిందంటున్నారు. ప్రధానంగా నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పనల వల్ల నూతన గృహ క్రయ విక్రయాల్లో గణనీయ పురోగతి సాధించిందని అధికారులంటున్నారు. 

13:47 - March 21, 2018

గుంటూరు : భవిష్యత్‌ కార్యాచరణపై టీడీపీలో అంతర్మథనం మొదలైంది. ఓవైపు పాలన..మరోవైపు రాజకీయం.. ఇంకోవైపు కేంద్రంపై ఒత్తిడి. ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేందుకు చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని నేతలు సూచిస్తున్నా... రాష్ట్ర ప్రయోజనాలే చూస్తానంటూ బాబు స్పష్టం చేశారు. 

రాష్ట్ర విభజన అనంతరం బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ... ఆ బంధానికి ముగింపు పలికింది. ఇన్నాళ్లూ ఉన్న అవకాశాలను వినియోగించుకుని రాష్ట్రానికి నిధుల లోటు లేకుండా చూసుకుంది. అయితే... తాజాగా ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావడంతో నిధులు రాబట్టడంలో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు, ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఎలా వ్యవహరించాలనే దానిపై టీడీపీ కసరత్తు చేస్తోంది. 

గత కొంతకాలంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన అంశాలపై కేంద్రంతో విభేదాలు తలెత్తిన క్రమంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. దీంతో ఓవైపు రాజకీయం చేస్తూనే... అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలని టీడీపీ భావిస్తోంది. ఇదిలావుంటే... ఎన్డీయే నుంచి బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం టార్గెట్‌ చేసుకునే అవకాశం ఉందని... నిధుల విడుదలలో కొర్రీలు వేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  అయితే... నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సర్కార్‌ వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రాన్ని కేంద్రం కావాలని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే... ఆ విషయాన్ని జాతీయస్థాయి దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నిటికి సిద్దపడే కేంద్రంతో అమీతుమీకి టీడీపీ సిద్దమైనట్లు సమాచారం. 

ఇక బీజేపీ ఎత్తుగడలకు జగన్‌, పవన్‌ సహకరిస్తున్నారనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమను ఇబ్బంది పెట్టాలనే దిశగా బీజేపీ తెర వెనుక మంత్రాంగం నడిపిస్తుందని భావిస్తున్నారు. ఇందులోభాగంగానే కర్నూలు డిక్లరేషన్‌ పేరుతో రాయలసీమ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందంటున్నారు. సున్నితమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న చంద్రబాబు... రాయలసీమలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

గత కొన్నేళ్లుగా టీడీపీ జాతీయస్థాయిలో సరైన పాత్ర పోషించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో... ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయడమో... లేక మూడో ప్రత్యామ్నాయం వచ్చేలా తెర వెనక ఉండి ప్రణాళికలు రచించాలనే అభిప్రాయాన్ని మెజారిటీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తే.. మూడో కూటమి ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత.. జాతీయస్థాయిలో చంద్రబాబుకు మద్దతుగా అనేక పార్టీలు స్పందించిన తీరే దీనికి నిదర్శనమంటున్నారు. తాజాగా మారిన పరిస్థితులు మారిన నేపథ్యంలో... రాష్ట్రంలో పాలన, రాజకీయాలతో పాటు.. కేంద్రంపై పోరాటాలను సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు వేసే అడుగులు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. 

13:44 - March 21, 2018

హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధి ఉదారంగా సాయం అందించాల్సిన కేంద్రం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు కేంద్రాన్ని 24వేల  కోట్లు సాయం అడిగామన్నారు. కాని మోదీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ అన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విపక్షసభ్యులు బడ్జెట్‌పై పూర్తిగా అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారని  సీఎం విమర్శించారు. అప్పులు చేయకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కేంద్రం ప్రభుత్వం కూడా జీడీపీలో 49శాతానికై పై అప్పులు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్‌డీపీలో 21శాతం మాత్రమే అప్పుల తీసుకుంటోందన్నారు. 

13:43 - March 21, 2018

విశాఖ : విశాఖకు రైల్వే జోన్‌ కావాలని డిమాండ్‌ చేస్తూ.... విశాఖ మద్దిల పాలం వద్ద మహా పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. ఇవ్వాళ్టి నుండి మార్చ్‌ 29 వరకు విశాఖ లోని 72 వార్డుల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు మాటలు తాటి మట్టల వంటివని ఆయన మండిపడ్డారు. టీడీపీ చరిత్రలో ఎప్పుడు ఒంటరి కాలేదని చంద్రబాబు వల్లే ఒంటరి అయ్యిందన్నారు. బీజేపితో కలిసి టీడీపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చేసిన ద్రోహానికి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చేప్పాలని మధు డిమాండ్‌ చేశారు. 

 

13:40 - March 21, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ హయాంలో మిడ్‌మానేరుకు ఎలాంటి అనుమతులూ తీసుకరాలేదని మంత్రి హారీష్‌రావు అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టులకు రీ డిజైన్‌ చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో పంపిన ప్రతిపాదనలు బాగా లేవని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ పంపిందని అన్నారు. రీ ఇంజనీరింగ్‌ చేసిన తర్వాతే సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అనుమతులు ఇచ్చిందని మంత్రి హారీష్‌రావు అన్నారు

 

13:37 - March 21, 2018

ఢిల్లీ : పార్లమెంటు భవనం ముందు వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ ఆర్డర్‌లో లేదన్న సాకుతో నాలుగవ రోజు కూడా వాయిదా వేయడంపై ఎంపీలు నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీలపై కేంద్రం వైఖరిని వారు ఖండించారు. రేపు మరోసారి అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇస్తామన్నారు. 

13:32 - March 21, 2018

నల్గొండ : 10 టీవీ కథనంపై నల్గొండ జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మిర్యాలగూడ ఎంఈవో చంప్లా నాయక్ పై సస్పెన్షన్ వేటు వేశారు. నెలల తరబడి పాఠశాలకు గైర్హాజరైనా ముడుపులు తీసుకుని ఉపాధ్యాయులకు హాజరు వేస్తున్న చంప్లా నాయక్ అవినీతి భాగోతాన్ని 10 టివి వెలుగులోకి తీసుకొచ్చింది. 10 టివి కథనానికి స్పందించిన జిల్లా డైట్ ప్రన్సిపల్ సత్యనారాయణ విచారణ జరిపారు. ఏడాదిగా పాఠశాలకు గైర్హాజరవుతూ వేతనం తీసుకుంటున్న
ఉట్లపల్లి ఉపాధ్యాయురాలు శ్రీమతి సుమతి, ఎంఈవో చంప్లాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో ఉపాధ్యాయుడు రాంబాబుకు మెమో ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్లు డీఈవో చెబుతున్నారు. అవినీతి పరుల సస్పెన్షన్ పై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 

 

12:48 - March 21, 2018

ఢిల్లీ : నాలుగవరోజు కూడా లోక్‌సభను అర్థాంతరంగా వాయిదా వేయడంపై టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు.  పార్లమెంటు భవనం ముందున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై వెంటనే కేంద్రం స్పందించాలని డిమాండ్‌ చేశారు. మరోసారి అవిశ్వాసం నోటీసు ఇస్తామని ఎంపీలు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం సాగిస్తామని టీడీపీ ఎంపీలు తేల్చి చెప్పారు.  మరోవైపు ఎంపీ శివప్రసాద్ నాలుగవ రోజుకూడా వినూత్న నిరసకు దిగారు. సత్యహరిశ్చందుని వేషంలోపార్లమెంటుకు వచ్చారు. వారణాసి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రధాని మోదీ .. హరిశ్ఛందుణ్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని శిశప్రసాద్‌ డిమాండ్ చేశారు. 

డి.రాజా, కనిమొళికి హైకోర్టు నోటీసులు జారీ

ఢిల్లీ : 2జీ స్పెక్ట్రం స్కామ్ లో డి.రాజా, కనిమొళికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణ మే 25కు వాయిదా పడింది. 

 

12:23 - March 21, 2018

ఢిల్లీ : లోక్‌సభ తీరుమారలేదు. నాలుగవ రోజుకూడా అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసనకు దిగారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ఒక్కనిముషం లోపుగానే మొదటిసారి వాయిదా పడిన సభ..తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. కాని.. గందరగోళం యథావిధిగా కొనసాగింది. అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఈ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ మాట్లాడారు. గొడవ సృష్టిస్తున్న సభ్యులపై చర్యలకు ప్రతిపాదిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో స్పీకర్‌ పదే పదే చేసిన విజ్ఞప్తిని సభ్యులెవరూ పట్టించుకోలేదు. సభ్యుల అరుపులు, కేకలతో సభయావత్తు గందగోళంగా మారంది. దీంతో సభను గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. 

 

లోక్ సభ రేపటికి వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ రేపటికి వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభలో అధికార, విపక్షాల ఆందోళనలతో గందరగోళం కొనసాగింది. స్పీకర్ ఎంత చెప్పినా సభ్యులు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

జీహెచ్ ఎంసీ పరిధిలో ప్రతిరోజు 30 లక్షల మంది బస్సు ప్రయాణం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పరిధిలో ప్రతిరోజు 30 లక్షల మంది బస్సు ప్రయాణం చేస్తున్నారని మంత్ర కేటీఆర్ తెలిపారు. తెలంగాణ శాసనమండలిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 90 లక్షల మంది ఆర్టీసీ బస్సు ప్రయాణాలు చేస్తున్నారని చెప్పారు. 

6 లక్షల 81 మందికి ఇళ్లు మంజూరు : మంత్రి నారాయణ

గుంటూరు : రాష్ట్రంలో 4170 కోట్ల పనులు సాగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అమరావతిలో 59 వేల 150 కోట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. 6 లక్షల 81 మందికి ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు.

 

12:00 - March 21, 2018

గుంటూరు : రాష్ట్రంలో 4170 కోట్ల పనులు సాగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అమరావతిలో 59 వేల 150 కోట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. 6 లక్షల 81 మందికి ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు.

11:57 - March 21, 2018

చిత్తూరు : సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ కు మూడేళ్లు నిండిన సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రహ్మణి, తదితర కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధించేలా ధైర్యం ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నానని తెలిపారు. స్వామివారి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడనంటూనే కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని సీఎం వివరించారు. విభజన చట్టంలో హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటం కొనసాగుతుందన్నారు. 

 

నీరు అందించడం సీఎం కేసీఆర్ లక్ష్యం : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. నీరు అందించడం సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యారేజీ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

 

11:37 - March 21, 2018

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఆదిబట్ల ఓఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, మినీ ట్రక్ ఢీ కొన్నాయి. ఈఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు శ్రీశైలం యాదవ్ గా గుర్తించారు. అతివేగంతో ఉన్న బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:21 - March 21, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయసభలు వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. రాజ్యసభలోనూ గందరగోళం తలెత్తింది. ఏపీ ప్రత్యేకహోదా  అంశంపై ఎంపీలు నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టిన టీడీపీ, వైసీపీ సభ్యులు ప్రత్యేక హోదాపై కంద్రం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో తీవ్ర గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 

లోక్ సభ వాయిదా

ఢిల్లీ : లోక్ సభ వాయిదా పడింది. ప్రారంభమైన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రమహాజన్ ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు మాట్లాడుతున్నారు. 

తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు మాట్లాడుతున్నారు. 

స్పీకర్‌కు బిజెపి ఎంపీ మనోజ్ తివారి లేఖ

ఢిల్లీ : ఎంపీల వేతనాలు కట్ చేయాలని స్పీకర్‌కు బిజెపి ఎంపీ మనోజ్ తివారి లేఖ రాశారు. చట్టసభల్లో ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులపై చర్చ జరగనివ్వకుండా విలువైన సభా సమయాన్ని, ప్రజా ధనాన్ని ఎంపీలు వృథా చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నో వర్క్ నో పేలో భాగంగా ఎంపీల వేతనాలు కట్ చేయాలని స్పీకర్‌ను కోరారు.

10:30 - March 21, 2018

ఢిల్లీ : ఎంపీల వేతనాలు కట్ చేయాలని స్పీకర్‌కు బిజెపి ఎంపీ మనోజ్ తివారి లేఖ రాశారు. చట్టసభల్లో ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులపై చర్చ జరగనివ్వకుండా విలువైన సభా సమయాన్ని, ప్రజా ధనాన్ని ఎంపీలు వృథా చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నో వర్క్ నో పేలో భాగంగా ఎంపీల వేతనాలు కట్ చేయాలని స్పీకర్‌ను కోరారు.

 

09:52 - March 21, 2018

గుంటూరు : టిడిపి ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి నుంచి ఢిల్లీ పరిణామాలను సీఎం నిశితంగా పరిశీలిస్తున్నారు. చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.  ఆగస్ట్ సంక్షోభంలో 161మంది ఎమ్మెల్యేలు ఒకే తాటిపై చివరిదాకా పోరాడి విజయం సాధించారన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాడాలన్నారు. మనకు ఎవరిమీదా కోపం లేదు.. ద్వేషం లేదని స్పష్టం చేశారు. బిజెపి మినహా అన్ని పార్టీలు ఏపీ పట్ల సానుభూతిగా ఉన్నాయన్నారు. వైసీపీది లాలూచి అవిశ్వాసమని విమర్శించారు. టిడిపిది 5కోట్ల ప్రజల అవిశ్వాసమని పేర్కొన్నారు.

స్పీకర్‌కు మరోసారి అవిశ్వాస నోటీసులు ఇచ్చిన టీడీపీ, వైసీపీ

ఢిల్లీ : ఇవాళ కూడా  పార్లమెంటులో  అవిశ్వాస పోరు కొనసాగనుంది. టీడీపీ, వైసీపీ లు మరోసారి స్పీకర్‌కు అవిశ్వాస నోటీసులు ఇచ్చాయి. అయితే సభ ఆర్డర్‌లో ఉందని భావిస్తేనే స్పీకర్‌ చర్చను చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు గొడవ సృష్టిస్తున్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే సభలో తమ నిరసన కొనసాగుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు.   మరోవైపు అవిశ్వాసానికి మద్దతు ఇస్తామంటున్న  సీపీఎం, కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదిలావుంటే ..

09:46 - March 21, 2018

ఢిల్లీ : ఇవాళ కూడా  పార్లమెంటులో  అవిశ్వాస పోరు కొనసాగనుంది. టీడీపీ, వైసీపీ లు మరోసారి స్పీకర్‌కు అవిశ్వాస నోటీసులు ఇచ్చాయి. అయితే సభ ఆర్డర్‌లో ఉందని భావిస్తేనే స్పీకర్‌ చర్చను చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు గొడవ సృష్టిస్తున్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే సభలో తమ నిరసన కొనసాగుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు.   మరోవైపు అవిశ్వాసానికి మద్దతు ఇస్తామంటున్న  సీపీఎం, కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదిలావుంటే .. పార్లమెంటు సమావేశాల తీరుపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేడు ఎంపీలకు ఇవ్వనున్న విందును రద్దుచేసిన్టు తెలుస్తోంది. 

 

తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై టీడీపీ, డబుల్ బెడ్ రూం ఇళ్లపై బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండు ప్రశ్నలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించనున్నారు. 

 

09:30 - March 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై టీడీపీ, డబుల్ బెడ్ రూం ఇళ్లపై బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండు ప్రశ్నలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించనున్నారు. 

 

09:19 - March 21, 2018

గుంటూరు : ఇవాళ ఏపీ అసెంబ్లీలో పలు సంక్షేమ, అభివృద్ది పథకాలపై చర్చ జరగనుంది. స్మార్ట్ పల్స్ సర్వే,  ప్రభుత్వం ఆధ్వర్యంలోకి ఏపీఎస్ ఆర్టీసీ, గిరిజన తండాలను గ్రామపంచాయితీల స్థాయికి పెంచే అంశంపై శాసన సభలో చర్చలు జరగనున్నాయి. దాంతోపాటు కరువు జిల్లా అనంతపురంలో  చెరువులను నింపే నోటీసు పై చర్చకూడా చర్చ జరగనుంది. ఎకనామికల్ డెవలప్‌మెంట్‌ బోర్డు-2018 బిల్లు ను సీఎం చంద్రబాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. అటు 
వ్యవసాయ అనుబంధ రంగాలు, పంటల బీమా,  కరువు నివారణ, రైతు బజార్లపై లఘు చర్చ జరిగే అవకాశం ఉంది. 
శాసన మండలిలో కూడా పలు అంశాలపై చర్చ 
ఇక శాసన మండలిలో కూడా పలు అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల భవనాల నాణ్యత, కెరీర్ అడ్వాన్‌మెంట్స్  స్క్రీమ్‌పై చర్చ  జరగనుంది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం, సిటిజన్స్‌ చార్టులు, ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, గంజాయి ఎగుమతి, ఎన్టీఆర్ ఆరోగ్య పథకం తదితర అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు అవకాశం ఉంది. దాంతోపాటు సంక్షేమం, గృహ నిర్మాణం, గ్రామీణ నీటి సరఫరా, జలవనరుల ప్రాజెక్టులపై   కూడా మండలిలో  లఘు చర్చ జరిగే అవకాశం ఉంది. 

టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

గుంటూరు : టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహంచారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చంద్రబాబు అన్నారు. చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలని సూచించారు. 

నేడు ఐదేళ్లలోపు పిల్లలు, తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

తిరుమల : నేడు ఐదేళ్లలోపు పిల్లలు, తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు.

ఏపీ శాసనసభలో నేటి ప్రశ్నోత్తరాలు

గుంటూరు : ఏపీ శాసనసభలో నేటి ప్రశ్నోత్తరాలు. రాష్ట్రంలో స్మార్ట్ పల్స్ సర్వేపై, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్వంలోకి ఏపీ ఎస్ ఆర్టీసీపై చర్చించనున్నారు. గిరిజన తండాలను పంచాయితీల స్థాయికి పెంచే అంశంపై ఎస్టీ హోదాకు సంబంధించిన కేసుల పరిష్కారం అంశాలపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసుపై చర్చించనున్నారు. సభలో నేడు ఆర్థిక అభివృద్ధి బోర్డు 2018 బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయరంగంలో వృద్ధి, కరువు నివారణ, రైతు బజారుల అంశాలపై లఘు చర్చ జరుగుంది. ఏకీకృత నీటిపారుదల అభివృద్ధిపై లఘు చర్చ జరుగనుంది.

 

నేడు ఈసీని కలవనున్న టీ.కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ : నేడు ఎన్నికల కమిషన్ ను టీ.కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, సంపత్ కలవనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ఈసీని కోరనున్నారు.

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు

తిరుమల : నేడు శ్రీవారిని సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు. 

నేడు శశికళ భర్త నటరాజన్ అంత్యక్రియలు

తమిళనాడు : తంజావూరులో నేడు శశికళ భర్త నటరాజన్ అంత్యక్రియలు జరుగనున్నాయి. భర్త నటరాజన్ అంత్యక్రియల కోసం నిన్న శశికళ పెరోల్ పై జైలు నుంచి బయటికి వచ్చారు.

నేడు 117 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

గుంటూరు : నేడు 117 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. ఉప్పలపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మిట్టపాలెం, గొట్టిపాడు, దండమూడిలో యాత్ర కొనసాగనుంది. సాయంత్రం చిలకలూరిపేటలో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

 

07:56 - March 21, 2018

రాష్ట్ర అప్పులు చేస్తుంది..కానీ అభివృద్ధి జరగడం లేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు సారంపల్లి మల్లారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి కొల్లి మాధవి, టీఆర్ఎస్ నేత మన్నె గోదర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. అప్పులు ఘనంగా చేస్తున్నారని..అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:47 - March 21, 2018

కారణాలేవైనా.. కుల దురహంకార హత్యలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. కాలం మారింది. కులం పోయింది.. అన్న మాటలు ఒట్టిదే అన్నట్లుగా కులం.. పేరుతో... జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. పాలకుల చర్యలు వీటిని ఆపలేకపోతున్నాయి. అసలీ కులదురహంకార హత్యలకు కారణాలేంటి.. వీటిని ఆపాలంటే.. తీసుకోవాల్సిన చర్యలేంటి.. అనే అంశంపై 10టీవీ ప్రత్యేక చర్యను చేపట్టింది... ఈ అంశంపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:42 - March 21, 2018

ఢిల్లీ : ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు 39 మంది భారతీయులను పొట్టనపెట్టుకున్నారు. నాలుగేళ్లక్రితం బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకుని ఇరాక్‌కు వెళ్లిన 39 భారతీయులను ఐసిస్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి అతి కిరాతకంగా చంపారు. 39 మంది భారతీయులు మృతి చెందినట్లు కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించింది.
39 మంది భారతీయులు మృతి చెందినట్లు అధికారిక ప్రకటన 
ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్‌ చేసిన 39 మంది భారతీయులు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ విషయాన్ని కేంద్రం ధృవీకరించింది. 38 మంది డిఎన్‌ఏ వారి బందువుల డిఎన్‌ఏతో సరిపోయిందని... మరొకరిని మాత్రం గుర్తించాల్సి ఉందని పేర్కొంది. మృతుల్లో 27 మంది పంజాబ్‌కు చెందినవారు కాగా... ఐదుగురు బిహార్, నలుగురు హిమాచల్‌ ప్రదేశ్‌, ఇద్దరు బెంగాల్‌కు చెందినవారని కేంద్రం తెలిపింది. వారి భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి వికె సింగ్‌ స్వయంగా ఇరాక్‌ వెళ్లనున్నారని రాజ్యసభలో కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు.
భారతీయుల మృతిపై కాంగ్రెస్ దిగ్భ్రాతి 
ఇరాక్‌లో భారతీయుల మృతిపై దిగ్భ్రాతి వ్యక్తం చేసిన కాంగ్రెస్... కిడ్నాప్‌కు గురైన భారతీయులు క్షేమంగా ఉన్నారని కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది.  ఈ అంశంపై సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. 
కాంగ్రెస్‌ తీరుపై సుష్మాస్వరాజ్‌ మండిపాటు
రాజ్యసభలో సుష్మాస్వరాజ్‌ ప్రసంగంపై అడ్డుపడని కాంగ్రెస్‌ లోక్‌సభలో అడ్డుకుంది.  కాంగ్రెస్‌ తీరుపై సుష్మాస్వరాజ్‌ మండిపడ్డారు. భావనాత్మకమైన ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం తగదని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదుల నుంచి తప్పించుకున్న హర్జిత్‌ మసి 
ఉపాధి కోసం ఇరాక్‌లోని మోసూల్‌ నగరం వెళ్లి కూలీలుగా పనిచేస్తున్న 40 మంది భారతీయుల బృందాన్ని 2014లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్‌ చేసింది. వీరిలో ఒకరు పంజాబ్‌కు చెందిన హర్జిత్‌ మసి ఉగ్రవాదుల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. తనతో పాటు బందీలుగా ఉన్న మిగతావారిని బాదుష్‌ సమీపంలోని ఎడారిలో చంపివేసినట్లు హర్జిత్‌ మీడియాకు తెలిపాడు.
హర్జిత్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన కేంద్రం 
హర్జిత్ వ్యాఖ్యలను కేంద్రం తోసిపుచ్చింది. హర్జిత్‌ బందీల్లో లేరని ఉగ్రవాదుల నుంచి రక్షించుకునేందుకు అలీగా తన పేరు మార్చుకుని బంగ్లాదేశీయులతో కలిసి తప్పించుకునే యత్నం చేశాడని తెలిపింది. ఇరాక్‌ ఆర్మీకి చిక్కిన హర్జిత్‌ 3 నెలల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. 
కుటుంబీకులకు కేంద్రం ప్రకటన షాక్‌ 
ఇరాక్‌లో కిడ్నాప్‌కు గురైన తమవాళ్లు ఎప్పటికైనా తిరిగివస్తారని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన కుటుంబీకులకు కేంద్రం ప్రకటన షాక్‌కు గురి చేసింది. తమవాళ్లు లేరన్న వార్తను మృతుల బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

07:29 - March 21, 2018

కరీంనగర్ : బహుజనులకు రాజ్యాధికారం అందించేందుకు బీఎల్‌ఎఫ్‌ పోరాడుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు తమ్మినేనితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేసీఆర్‌ ప్రజలను, రైతాంగాన్ని మోసం చేస్తున్నారని... బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య, రైతులకు మద్దతు ధర ఇస్తామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.

 

07:24 - March 21, 2018

పెద్దపల్లి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని  కాంగ్రెస్‌ మాజీ మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించడం, 11 మందిని సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. మరో వైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి  రాజ్యసభ సీట్లు ఇవ్వని టీఆర్‌ఎస్‌ వైఖరిని శ్రీధర్‌బాబు తప్పు పట్టారు. 

 

07:21 - March 21, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా 1400 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి 1795 కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం.. నాబార్డు ద్వారా 1400 కోట్లు రుణం మంజూరుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ, కేంద్ర జలవనరుల శాఖకు సమాచారమిచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఆడిట్లు వచ్చిన తర్వాత మిగిలిన 300 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది. 

 

07:18 - March 21, 2018

గుంటూరు : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంత్రి లోకేశ్‌పై చేసిన ఆరోపణలను నేరుగా సమాధానం ఇవ్వని టీడీపీ నాయకులు.. తమపై అవాకులు, చవాకులు మాట్లాడుతన్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు.  తాము ఏది మాట్లాడినా వైసీపీ స్క్రిప్టు అని టీడీపీ నేతలు విమర్శించడాన్ని వీర్రాజు తప్పు పట్టారు.  

 

07:14 - March 21, 2018

గుంటూరు : పవన్‌కల్యాణ్‌ తెలిసీ తెలియన్నట్లు మాట్లాడుతున్నాడని తాను అనుకోవడం లేదన్నారు చంద్రబాబు. పక్కా ప్రణాళికతోనే పవన్‌ను ఎవరో నడిపిస్తున్నారని.. అయితే వారి డైరెక్షన్‌ అర్ధం కాక అడ్డంగా దొరికిపోతున్నారన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ ఆడుతున్న డ్రామాలు, విభజన హామీలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాబలంతో తిప్పికొట్టాలని టీడీపీ సమన్వయ కమిటీలో నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. 
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం 
అమరావతిలోని సీఎం నివాస ప్రాంగణంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయ కమిటీ సభ్యలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించిన చంద్రబాబు.. కేంద్రం ఆడిస్తున్న నాటకంపై మండిపడ్డారు. పవన్‌ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 
హక్కులు కాపాడాలని అడిగితే బీజేపీకి కోపం : చంద్రబాబు 
రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేస్తుందని నాలుగేళ్లు ఓపికగా ఎదురుచూశామన్నారు చంద్రబాబు. తొలి ఏడాది ఇవ్వాల్సిన ఆర్థికలోటు నిధులను ఇవ్వకుండా నాన్చరని.. ఇప్పుడు 138 కోట్లే ఇస్తామంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని 19 అంశాలు, పార్లమెంట్‌లో ఇచ్చిన ఆరు హామీలు ఏదికూడా పూర్తిగా నేరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని... ప్రజల హక్కులు కాపాడాలని అడిగితే బీజేపీకి కోపం వస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఇతర రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు చేసి.. ఏపీని విస్మరించారని... అదేరోజు దానిని ప్రశ్నించామన్నారు. ఫైనాన్స్‌ స్టేట్‌మెంట్‌ నాటికన్నా సరిదిద్దుతారని ఆశించినా ఫలితం దక్కలేదని అందుకే ఎన్డీయే నుంచి వైదొలిగామన్నారు చంద్రబాబు. ఇచ్చిన అవకాశాన్ని బీజేపీ సక్రమంగా వినియోగించుకోలేదని.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు అవిశ్వాస తీర్మానం : సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామన్నారు చంద్రబాబు. అవిశ్వాసం నోటీసు అనుమతించకుండా సభను వాయిదా వేయడం సరికాదన్నారు. కుట్ర రాజకీయాలకు తెలుగు ప్రజల ధీటైన సమాధానం ఇస్తారని... రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలకు పాల్పడి ప్రజలకు పూర్తిగా దూరమయ్యిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై అందరూ కేంద్రం తీరును తప్పుపడుతుంటే... వైసీపీ, జనసేన పార్టీల వేళ్లు తనవైపు చూపిస్తున్నాయన్నారు చంద్రబాబు. 
పవన్‌కళ్యాణ్‌ నిమిషానికో మాట : సీఎం చంద్రబాబు
పవన్‌కల్యాణ్‌ నిమిషానికి ఒకటి మాట్లాడుతున్నారన్నారు చంద్రబాబు. లోకేశ్‌పై తొలుత విమర్శలు చేసి.. తర్వాత అందరూ అన్నారు కాబట్టే అన్నాను తప్ప ఆధారాలు లేవన్న పవన్‌కల్యాణ్‌... ఇప్పుడు ఆధారాలున్నాయనడం చూస్తుంటే ఎప్పుడేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ వేసి.. కేంద్రం నుంచి 75 వేల కోట్లు రావాలని తేల్చిన పవన్‌కల్యాణ్‌... గుంటూరు సభలో ఆ విషయమే ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.
రాష్ట్రానికి కేంద్రం అన్యాయం
కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోని గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించి.. ప్రజలను చైతన్యపర్చాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మొత్తానికి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సమగ్రంగా చర్చించారు. 

 

విద్యార్థులపై వేధింపులతో అధ్యాపకుడి సస్పెండ్

సూర్యాపేట : జిల్లాలోని తుంగతుర్తి గిరిజన గురుకుల కళాశాలలో శ్రీనివాస్ అనే అధ్యాపకుడిని ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. పీజీటీగా పని చేస్తున్న శ్రీనివాస్ విద్యార్థులపై వేధింపులు, కళాశాలలో మద్యం సేవించాడనే ఆరోపణలపై సస్పెన్షన్ వేటు వేశారు. అధికారుల కమిటీ రిపోర్ట్ ఆధారంగా శ్రీనివాస్ సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు జారీ చేశారు.

Don't Miss