Activities calendar

22 March 2018

కోమటిరెడ్డి..సంపత్ లపై తీర్పుపై ఉత్కంఠ...

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ సభ్యత్వం రద్దుపై హైకోర్టు విచారించింది. అసెంబ్లీ సభ్యత్వం విషయంలో స్పీకర్ నిర్ణయమే అంతిమం అని సీఈసీ తేల్చిన నేపధ్యంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.

బీజేపీకి నాగం రాం..రాం...

హైదరాబాద్ : నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. తన అనుచరులతో కలిసి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగర్ కర్నూలులో అనుచరులతో నిర్వహించిన సమావేశంలో తన నిర్ణయాన్ని పక్రటించారు. 

మత ఘర్షణల కేసులు ఎత్తివేస్తారా ?!

ఉత్తరప్రదేశ్‌ : మత ఘర్షణలకు సంబంధించిన కేసులను ఎత్తివేసే దిశగా యోగి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. 2013లో ముజఫర్‌నగర్, షమ్లి జిల్లాల్లో మత ఘర్షణలకు సంబంధించి 131 కేసులను ఎత్తివేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇందులో 13 హత్య కేసులు, 11 హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి.

జయ మరణంపై మరో సంచలన విషయం...

తమిళనాడు :  మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై మరో సంచలన విషయం వెలుగు చూసింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సిసిటీవీ కెమెరాలు పనిచేయలేదు. ఈ విషయాన్ని అపోలో ఛైర్మన్ సి.ప్రతాప్‌రెడ్డి మీడియాకు స్వయంగా వెల్లడించారు.

తాజ్ మహల్ పై సుప్రీం ఆదేశాలు...

ఉత్తర్ ప్రదేశ్ : తాజ్‌మహల్‌ సంరక్షణకు సంబంధించి 4 నెలల్లోపు విజన్‌ డాక్యుమెంట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజ్‌మహల్‌ సంరక్షణపై కోర్టు విచారణ జరిపింది. తాజ్‌మహల్‌ సంరక్షణకు విజన్‌ డాక్యుమెంట్‌ పనులు జరుగుతున్నాయని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 

21:20 - March 22, 2018

హైదరాబాద్ : గౌడ కులస్థులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. తాటి, ఈత చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఎస్సీ సంక్షేమంపై శాసనసభలో వాడీవేడీగా చర్చ జరిగింది. దళితులకు 3ఎకరాల హామీని అమలు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేయగా.... రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్స్‌ను క్రమబద్దీకరించాలని టీడీపీ కోరింది. సీఎం కేసీఆర్‌ గౌడ కులస్థులకు అసెంబ్లీ సాక్షిగా వరాల జల్లు కురిపించారు. తాటి, ఈత చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గౌడ భవనం నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి, ఐదు కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. టీఎఫ్‌టీ కార్మికులకు కూడా ఫెన్షన్‌ ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం చెందినా.. ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. లైసెన్స్‌ రెన్యూవల్‌ గడువును ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. గడిచిన మూడేళ్లలో 6.38 కోట్ల పరిహార బకాయిలు చెల్లించినట్టు వెల్లడించారు.

అనంతరం దళితుల సంక్షేమంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి .. సీఎం కేసీఆర్‌కు దళితుల సంక్షేమంపై ఒక విజన్‌ ఉందన్నారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో దళితులు పూర్తిస్థాయి అభివృద్ధిలోకి రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఎన్నికల్లో కేసీఆర్‌ చేసిన వాగ్దానాన్ని ఎప్పుడు అమలు చేస్తారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సభలో ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు కూడా సరిగా ఖర్చు చేయడం లేదన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ టీచర్స్‌ను క్రమబద్దీకరించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. కళాశాలల హాస్టల్స్‌లో సరిపడ సిబ్బందిని నియమించాలని కోరారు. పలు అంశాలపై సభలో చర్చ జరిగింది. అనంతరం స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

21:17 - March 22, 2018

విజయవాడ : సినీనటుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమిత నేత శివాజీ రాష్ట్రంలో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాలపై సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏపీతోపాటు దక్షిణాదిలో ఉన్న అవకాశాలను వాడుకునేందుకు ఓ జాతీయ పార్టీ ఆపరేషన్‌ ప్రారంభించిందన్నారు. ఆపరేషన్‌ ద్రవిడ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం కోసం.. ఏపీలో ఆపరేషన్‌ గరుడ నిర్వహిస్తోందని చెప్పారు. కర్నాటకలో ఆపరేషన్‌ కుమార, తమిళనాడు, కేరళకు సంబంధించి ఆపరేషన్‌ రావణ పేరుతో జాతీయ పార్టీ చేస్తున్న రాజకీయాలను శివాజీ వివరించారు.

ఆపరేషన్‌ గరుడలో ఒక ముఖ్య పార్టీ నేత బలిపశువు అయ్యే అవకాశాలు ఉన్నాయని శివాజీ చెప్పారు. ఈ ముఖ్య పార్టీ నేతపై దాడి జరిగే అవకాశం ఉందని, అది రాష్ట్రంలో అల్లర్లకు దారితీస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లోగా అధికార పార్టీ నిర్వీర్యమైతే.. కొత్త పార్టీ, మరో ముఖ్యమైన పార్టీకి సీట్లు వస్తాయని చెప్పారు. కొత్త పార్టీ నేతకు కేంద్ర మంత్రి పదవి ఆశపెడితే, ఆయన మళ్లీ తన పాత పని చేసుకుంటారని శివాజీ చెప్పారు. ముఖ్యమంత్రి పదవిపై ముఖ్య పార్టీ నేత పెట్టుకున్న ఆశలు గల్లంతవడంతోపాటు జైలుకెళ్లడం ఖాయమని, చివరికి రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రానికి చెందిన జాతీయ పార్టీ నేతే ముఖ్యమంత్రి అవుతారని శివాజీ ముక్తాయింపు ఇచ్చారు. శివాజీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్రం వాడీవేడిగా చర్చ జరుగుతోంది. 

21:15 - March 22, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఏపీలో రాజకీయ పార్టీల జాతీయ రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. హోదా నినాదాలతో అన్ని రహదారులు హోరెత్తాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నేషనల్‌ హైవేలపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. ఆందోళనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో వామపక్షాలుతోపాటు వైసీపీ, కాంగ్రెస్‌, అధికార టీడీపీ ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని చోట్ల వామపక్షాలు, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌ కలిసి ఆందోళన చేపట్టాయి.

విజయవాడలోని కనకదుర్గ వారధి వద్ద జాతీయ రహదారిని వామపక్షాలు, జనసేన, వైసీపీ నాయకులు దిగ్బంధించారు. దీంతో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మరోవైపు టీడీపీ నాయకులు రామవరప్పాడు రింగ్‌రోడ్డు సెంటర్‌లో రహదారులను దిగ్బంధించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని నేతలు ప్రకటించారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. విజయనగరంలో వామపక్షాలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారులను దిగ్బంధించారు. విశాఖ జిల్లాలో రహదారుల ముట్టడి ఆందోళన సక్సెస్‌ అయింది. జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించారు.

ఉభయగోదావరి జిల్లాల్లో రహదారులు దిగ్బంధం కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లాలో వాపమక్షాలు, వైసీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారులపై బైఠాయించారు. హోదా కోసం టీడీపీ నాయకులు ఒక రోజు దీక్ష చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, సిద్ధాంతం, ఏలూరు తదితర ప్రాంతాల్లో రహదారులను ముట్టడించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. జాతీయ రహదారులను ముట్టడించిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుతోపాటు, జిల్లా వ్యాప్తంగా జరిగిన రహదారులు దిగ్బంధం కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించారు.

కర్నూలులో వామపక్ష నాయకులు, కార్యకర్తలు బెంగళూరు - హైదరాబాద్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రహదారుల ముట్టడితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో జాతీయ రహదారులు ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. అన్ని చోట్ల వామపక్షాలు, వైపీసీ, జనసేన నాయకులు, కార్యకర్తలు రహదారులను ముట్టడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మొత్తంమీద ఏపీకి హోదా కోసం జాతీయ రహదారుల దిగ్బంధం ఆందోళన విజయవంతం కావాడంతో హోదా సాధన సమితి, వామపక్షాల నాయకులు తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారు.

21:11 - March 22, 2018

విజయవాడ : టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. తనపై కేసులు పెట్టేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రధాని మోదీని ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు కేసులకు భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. రాజకీయ కుయుక్తులతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు

తనపై అక్రమ కేసులు పెట్టించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రధాని మోదీని ప్రభావితం చేస్తున్నారని, ఇందుకు రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా వంతపలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ఏపీకి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ప్రకటిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. విభజన చట్టంలోని హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జలవనరుల సంరక్షణపై మండలిలో కూడా చంద్రబాబు ప్రకటన చేశారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై బీజేపీ సభ్యులు చేస్తున్న ఆరోపణలు, ప్రత్యేక హోదా ఇవ్వమంటూ కేంద్రం చేస్తున్న ప్రకటనలు చంద్రబాబు విరుచుకుపడ్డారు. దీనిపై బీజేపీ సభ్యులు మాధవ్‌ ఘాటుగా స్పందించారు. హోదాతో సమానమైన నిధులు తెచ్చేందుకు తమవంతు కృషి చేస్తామని మాధవ్‌ హామీ ఇవ్వగా... ప్యాకేజీ ప్రకటించిన ఏడాదిన్నర తర్వాత కూడా పైసా ఇవ్వని కేంద్రం.. ఇప్పుడు ఇస్తుందన్న నమ్మకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చ ముగిసిన తర్వాత మండలి సభ్యులతో జలవనరుల సంరక్షణపై చైర్మన్‌ ఫరూక్‌ ప్రతిజ్ఞ చేయించి, సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

21:09 - March 22, 2018

ఢిల్లీ : గురువారం కూడా పార్లమెంట్‌ ఉభయ సభల్లో సేమ్‌సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఐదో రోజు కూడా వాయిదాల పర్వమే కొనసాగింది. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే.. ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ ఎంపీలు తేల్చి చెప్పగా... కేంద్రం దిగిరాకపోతే రాజీనామాలకు కూడా వెనుకాడబోమని వైసీపీ ఎంపీలు స్పష్టం చేశారు.

గురువారం లోక్‌సభ ప్రారంభం కాగానే కావేరీ జలాలపై..ఏఐఏడీఎంకే, రిజర్వేషన్లపై-టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభ ప్రారంభమైన 30 సెకన్లకే సభ వాయిదా పడింది. 12 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌, టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. తాము అవిశ్వాసంపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని.. ఇతర అంశాలపై కూడా చర్చకు రెడీ అని కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డే చెప్పారు. అయితే సభలో ప్రతి ఒక్కరూ కూర్చోవాలని, సభ ఆర్డర్‌లో ఉంటేనే అది సాధ్యమని స్పష్టం చేశారు. అయినా సభ్యులు పట్టువిడవక ఆందోళన కొనసాగించడంతో స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ విపక్ష సభ్యుల ఆందోళనలు కొనగాయి. టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీ, అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకురావడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్‌ వెంకయ్యనాయుడు శుక్రవారానికి వాయిదా వేశారు.

పార్లమెంట్‌ వెలుపల టీడీపీ, వైసీపీ ఎంపీలు ఎవరికి వారుగా ఆందోళ చేపట్టారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ పారిశుద్ధ్య కార్మికుని వేశంలో పార్లమెంట్‌కు వచ్చి నిరసన తెలిపారు. స్వచ్ఛ మోదీ కావాలని శివప్రసాద్‌ అన్నారు. మోదీ మనసు స్వచ్ఛంగా ఉంటేనే దేశం స్వచ్ఛంగా ఉంటుందన్నారు.

ఐదు రోజులుగా తాము ఆందోళన చేపడుతుంటే స్పీకర్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌ తీరు బాధాకరమని అన్నారు. ఏపీ హక్కుల కోసం ఎన్ని మార్గాల్లో ప్రయత్నం చేయాలో అన్నీ చేస్తామన్నారు. కొన్ని పార్టీల సహకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే తాము అడుతున్నామని... తాము కిరీటం పెట్టమని కోరటం లేదని వైసీపీ విమర్శించింది. అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ఆపార్టీ నేతలు అన్నారు. తెలుగు ప్రజల గొంతు కోయడానికి బీజేపీ వెనుకాడటం లేదన్నారు. ప్రత్యేక హోదా నుంచి ప్యాకేజీ కోసం చంద్రబాబు లాలూచీ పడ్డారని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని.. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రాజీనామాలు చేయడానికి తాము వెనుకాడబోమని వైసీపీ ఎంపీలు అన్నారు. మరోవైపు తమ డిమాండ్లను పరిష్కరించాలని టీఆర్‌ఎస్‌, ఏఐడీఎంకే ఎంపీలు కేంద్రాన్ని కోరారు. అప్పటి వరకూ సభలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని ఏపీ ఎంపీలు ముక్తకంఠంతో కోరుతున్నారు. లేదంటే బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

20:47 - March 22, 2018

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ కు సంబంధించి యూజర్ల డేటా చోరీ ‌వ్యవహారం ప్రకంపాలు సృష్టిస్తోంది. ఫేస్‌బుక్‌ నుంచి యూజర్ల డేటా దొంగలించి… పలు దేశాల్లో రాజకీయ పార్టీలకు ఉపయోగపడిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థతో కాంగ్రెస్ కు లింక్‌ ఉందని కేంద్ర ఐటి, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ఆరోపించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపణలకు కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా గాని, దేశంలో దాని అనుబంధ సంస్థ అయిన ఓవ్లెనో సంస్థ సేవలను గాని తమ పార్టీ వినియోగించుకోలేదని స్పష్టం చేసింది. దీనిపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో టెక్నాలజీ పాలసీ రీసెర్చ్ నిపుణులు కొడాలి శ్రీనివాస్ పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

సిర్పూర్ పేపర్ మిల్లు రీ ఓపెన్...

హైదరాబాద్ : సిర్పూర్ పేపర్ మిల్లు రీ ఓపెన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జేకే పేపర్ లిమిటెడ్ కంపెనీకి సిర్పూర్ పేపర్ మిల్లు బాధ్యతలు అప్పగిస్తూ టి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదేళ్లు రాయితీ ఇస్తూ..యదావిధిగా ఉద్యోగాలకు జేకే కంపెనీ తీసుకోనుంది. 

20:25 - March 22, 2018

తెలంగాణల నీళ్ల పంచాది సుర్వైనట్టే అనిపిస్తున్నది.. ఇంక ఎండకాలం పూరాగ రానేలేదు అప్పుడే ఆడోళ్లంత బిందెలు చేతుల వట్కోని రోడ్ల మీదికొస్తున్నరు..తెలంగాణ గౌడన్నలు.. మీరంత తలా ఇంత చెక్కరి దీస్కోని నోట్లె వోస్కోండ్రి మీకు తియ్యటి ముచ్చట జెప్పిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు..ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంల సద్వులు సత్రోలున్నయ్ రా నాయనా అంటే.. ఇప్పుడు టెన్త్ ప్రశ్నా పత్రం మళ్ల లీక్ జేశిండ్రట..ఉట్టి కెగరలేనోడు.. స్వర్గానికెగిశినట్టుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చట అంటున్నడు జేఏసీ చైర్మన్ కోదండరాం సారు.. దేశం గాని దేశం బొయ్యి తిప్పలవడ్తున్నరు తెలంగాణ బిడ్డెలు..ముందే డీజీపీ అంటె పోలీసోళ్లకు పెద్దాయిననాయే.. ఇగ ఆయన సుట్టాలంటే ఎట్లుంటది కథ..? అమ్మరె కొడ్క వాని పేరేంది... ఆ హార్దిక్ ప్యాండ్య.. వాడు సప్పుడు జేక కిర్ కేట్ ఆడుకోని బత్కకా..? బాబా సాహెబ్ అంబేదర్క్ అంటే ఎవ్వడు.. తొవ్వొంట వోతుంటే పదిరూపాల నోటు దొర్కిందే అనుకో ఏం జేస్తం..ఉప్పు నిర్పకాయల పప్పు బెల్లాలు నకిలీయి తయ్యారు జేస్తున్నరంటె ఇన్నంగని..గిసొంటి ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:19 - March 22, 2018

విజయవాడ : సినీ నటుడు, ప్రత్యేక సాధన సమితి నేత శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఓ జాతీయ పార్టీ పెద్ద ఆప‌రేష‌న్ చేస్తోంద‌ని వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మూడు విభాగాలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అందులో ప్రధానమైంది 'అధికార పార్టీ’ కాగా రెండోది 'కొత్త నాయకుడు' చివరిది 'ఇంకో ముఖ్యపార్టీ’. అన్ని జరిగిన తరువాత సెప్టెంబ‌రు 1న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. అదే చివరి తేదీ. ఎందుకంటే ఆ నేత ఇదే రోజున ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం ఎన్నికల్లో కొత్త నాయకుడికి, ఏపీలోని ముఖ్య పార్టీకి సీట్లు పడతాయి. ఎన్నికల తరువాత ముఖ్య పార్టీకి చెందిన వ్యక్తిని కూడా కేసుల్లో చివరకు జైలుకి వెళ్లేలా చేస్తారు. ఇక ఈ కొత్త నాయకుడిని కేంద్ర మంత్రిగా ఉండాలని చెబుతారు. కేంద్ర మంత్రిగా ఉండడం ఇష్టం లేక ఆ కొత్త నాయకుడు అలిగి వెళ్లిపోతాడు. జాతీయ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి ఎవరవుతారంటే.. ఆ పార్టీకి చెందిన ఓ తెలుగు వ్యక్తి అవుతారు. ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలిసిందే' అని శివాజీ తెలిపారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:15 - March 22, 2018

విజయవాడ : సినీ నటుడు, ప్రత్యేక సాధన సమితి నేత శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఓ జాతీయ పార్టీ పెద్ద ఆప‌రేష‌న్ చేస్తోంద‌ని వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మూడు విభాగాలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అందులో ప్రధానమైంది 'అధికార పార్టీ’ కాగా రెండోది 'కొత్త నాయకుడు' చివరిది 'ఇంకో ముఖ్యపార్టీ’. 'ఇందులో ఉన్న నేతపై సీబీఐ కేసులు నిరూపితం కాలేదు. జాతీయ పార్టీలో తేలికగా చేరొచ్చని వీరని అనుకుంటారు. కానీ తలుపులు తెరిచిందే జాతీయ పార్టీ. ఇందులోకి వచ్చిన తరువాత వెళ్లడం తెలియదు. ఈ ముఖ్య పార్టీ నాయ‌కుడి మీద గుంటూరు, హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే రెక్కీ నిర్వ‌హించారు. ప్రాణ‌హాని లేని దాడి చేస్తారు. దీంతో ఈ రాష్ట్రంలో అల‌జ‌డులు మొద‌ల‌వుతాయి. ఈ సమయంలోనే కొన్ని విష‌యాల్లో ఈ ముఖ్య నాయ‌కుడికి ఊర‌ట‌లు ల‌భిస్తాయి. పూర్తి ఊర‌ట మాత్రం రాదు. దీనితో అధికారంలో ఉన్న పార్టీకి ఇబ్బందులు వస్తుంటాయి. బీహార్, ఒడిశా నుంచి వ‌చ్చి కొంద‌రు రాష్ట్రంలో అల్ల‌ర్లు మొద‌లు పెడ‌తారు’. అని శివాజీ పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:11 - March 22, 2018

 

విజయవాడ : సినీ నటుడు, ప్రత్యేక సాధన సమితి నేత శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఓ జాతీయ పార్టీ పెద్ద ఆప‌రేష‌న్ చేస్తోంద‌ని వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మూడు విభాగాలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అందులో ప్రధానమైంది 'అధికార పార్టీ’ కాగా రెండోది 'కొత్త నాయకుడు' అని చెప్పారు. 'పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు పాపం ఈ నాయకుడికి తెలియదు. అక్కడి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం ఈయన లక్ష్యం. అందులో భాగంగా ప్రజలకు కొన్ని మాటలు చెబుతారు. ఇందులో ఇద్దరు ఉన్నత అధికారులు...ఒక సీనియర్ జర్నలిస్టు ఉంటారు. కొత్త నాయకుడు రాష్ట్రం పట్ల తనకు చాలా బాధ్యత ఉన్నట్లు...సమాజం పట్ల ప్రేమ ఒలకబోస్తాడు. ఇక రాజకీయాల్లో ఉండకుండా ఉన్న వారిని ఈ నాయకుడు కలుస్తాడు. వీరికి ఆ కొత్త నాయకుడిపై నమ్మకం కలుగుంది. కానీ ఇక్కడ వీరు పావులని తెలియదు. ఇక్కడ తెలుగువారికి స‌హ‌జంగా ఉండే స్వార్థాన్ని ఆ జాతీయ పార్టీ ఉప‌యోగించుకుంటోంది’. అని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:07 - March 22, 2018

విజయవాడ : సినీ నటుడు, ప్రత్యేక సాధన సమితి నేత శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఓ జాతీయ పార్టీ పెద్ద ఆప‌రేష‌న్ చేస్తోంద‌ని వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మూడు విభాగాలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అందులో ప్రధానమైంది 'అధికార పార్టీ’. 'సీబీఐ కేసులని రీ ఓపెన్ చేయడం...ఆర్థికంగా దెబ్బ తీయడం..చక్ర బంధం చేయడం. ఆ పార్టీని చివరకు ఒంటరిని చేస్తారు. తద్వారా నిర్వీర్యం చేయడం వ్యూహ లక్ష్యాలు’. అని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారో వీడియోలో చూడండి.

20:04 - March 22, 2018

ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఓ జాతీయ పార్టీ పెద్ద ఆప‌రేష‌న్ చేస్తోంద‌ని సినీన‌టుడు, ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఏడాది ఢిల్లీలో కొన్ని నిజాల‌ను తెలుసుకున్నాన‌ని అన్నారు. ఓ జాతీయ పార్టీకి ఓ అనుబంధ సంస్థ నేతలు స్వీప‌ర్ సెల్స్ లా ప‌నిచేస్తున్నారని అన్నారు. కర్ణాటకకు చెందిన 'కల్యాణ్ జీ' అనే వ్య‌క్తి ఒకరు ఉన్నారని, దక్షిణాదిన ఆ జాతీయ పార్టీకి కల్యాణ్ జీ అనే ఆ వ్యక్తే స‌హ‌క‌రిస్తున్నార‌ని తెలిపారు.1. అధికార పార్టీ 2. ఓ కొత్త రాజకీయ నాయకుడు 3. ఇంకో ముఖ్యపార్టీ లతో ఇదంతా ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:00 - March 22, 2018

శ్రీరామనవమి శోభా యాత్ర...

హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా నగరంలో ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అంజనికుమార్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ జనార్దన్‌రెడ్డిలు పర్యవేక్షించారు. 

పోలవరం కోసం రూ. 13, 201 కోట్ల ఖర్చు - బాబు...

విజయవాడ : పోలవరం కోసం మనం ఇప్పటి వరకు రూ. 13, 201 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో 11 ప్రాజెక్టుల పనులే ప్రారంభం కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం తన జీవితాశయమన్నారు. 

జేడీ ఏ పార్టీలో చేరినా టిడిపికే లాభం - పయ్యావుల...

విజయవాడ : లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరినా టిడిపికే లాభమని పయ్యావుల కేశవ్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతిపక్షాల ఓట్లు చీల్చుతారని, ప్రతిపక్షం కోసం ఇప్పటికే జగన్ పవన్ పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. 

టీఆర్ఎస్ ఎంపీల డ్రామాలు - వీహెచ్...

హైదరాబాద్ : పార్లమెంట్ లోపల..బయట టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలుడుతున్నారని కాంగ్రెస్ నేత వీహెచ్ తెలిపారు. రిజర్వేషన్ల అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలన్న డిమాండ్ లో చిత్తశుద్ధి లేదన్నారు. 

జేడీ రాజీనామా...

ఢిల్లీ : మహారాష్ట్ర అడిషనల్ డీజీ పదవికి జేడీ రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో సీబీఐ జేడీగా ఆయన పనిచేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన రాజకీయాల్లో వస్తారని తెలుస్తోంది. 

షమీకి ఊరట...

ఢిల్లీ : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై మ్యాచ్ ఫికింగ్స్ ఆరోపణలు నిజం కాదని బీసీసీఐ తేల్చింది. దీంతో ఆయనకు బీ గ్రేడ్ వార్షిక ఒప్పందం కొనసాగించనుంది.

ప్రశ్నాపత్రం లీక్ పై చర్యలు...

జగిత్యాల : కొడిమ్యాల మండల బాలికల హై స్కూల్ లో పదో తరగతి గణితం పేపర్ - 2 ప్రశ్నాపత్రం లీక్ పై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఆరుగురిని డీఈవో సస్పెండ్ చేశారు. సత్యనారాయణ, రమేష్, పద్మ, శ్రీనివాస్, రాధ, లింగవ్వలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 

పోలవరంకు కేంద్రం నిధులు...

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసింది. రూ. 1089 కోట్లు డ్రా చేసుకోవ్చచని పేర్కొన్న కేంద్ర జలవనరుల శాఖ జాతీయ జలాభివృదిధ సంస్థ డీజీకి పలు ఆదేశాలు జారీ చేసింది. కానీ రూ. 1790 కోట్లు అడిగితే రూ. 1089 కోట్లు ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి జలవనరుల శాఖ పేర్కొంది. 

పోఖ్రాన్ క్షిపణి పరీక్ష...

ఢిల్లీ : రాజస్థాన్‌లోని పోఖ్రాన్ క్షిపణి కేంద్రం నుంచి ఉదయం 8 గంటల 42 నిముషాలకు బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. భారత్‌, రష్యాలు కలిసి రూపొందించిన బ్రహ్మోస్‌ లక్ష్యాన్ని 400 కిలోమీటర్లకు పొడిగించారు.

ఫేస్ బుక్ సమాచారం లీక్ పై రాహుల్ ట్వీట్...

ఢిల్లీ : ఫేస్‌బుక్‌ సమాచారం లీకేజీ వివాదంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. ఉద్దేశ పూర్వకంగా ఈ అవాస్తవపు అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. ఇరాక్‌లో 39మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంలో కేంద్రం అబద్ధాలు ఆడుతూ దొరికిపోయిందని... ఆ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బిజెపి కాంగ్రెస్‌పై అవాస్తవ డాటా చోరీ ఆరోపణలు చేస్తోందని రాహుల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

మౌనం వీడిన జుకర్ బర్గ్...

ఢిల్లీ : ఫేస్‌బుక్ డేటా లీకేజీ వివాదంపై ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ మౌనం వీడారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో దీనిపై వివరణ ఇచ్చిన జూకర్‌బర్గ్‌ తన తప్పును అంగీకరించారు. ఫేస్‌బుక్‌లో ప్రజలకు సంబందించిన డాటాను భద్రపరచడం తమ బాధ్యత... ఈ విషయంలో తాము విఫలమైతే తప్పు చేసినట్లేనని ఆయన తెలిపారు. 

తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఊరట...

ఢిల్లీ : జర్నలిస్ట్‌ రాజ్‌దేవ్‌ రంజన్‌ హత్య కేసులో బిహార్‌ మాజీ మంత్రి, లాలు తనయుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తేజ్‌ప్రతాప్‌కు సిబిఐ క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో సుప్రీంకోర్టు కేసును మూసివేసింది.

పాస్ పోర్టు సేవలు మరింత చేరువ...

హైదరాబాద్ : పాస్‌పోర్టు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విదేశీ మంత్రిత్వశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. హైదరాబాద్‌లో ప్రాంతీయ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

18:42 - March 22, 2018

హైదరాబాద్ : ఇప్పటికి నాలుగుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో జరిగిన పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. గత మూడు బడ్డెట్‌లో ప్రవేశపెట్టిన నిధులలో ఒక్క రూపాయి కూడా పేదలకు ఖర్చు చేయలేదని.. రమణ విమర్శించారు. 

18:40 - March 22, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్‌ ఎంపీ జేడీ శీలం అన్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే అవిశ్వాసంపై ఓటింగ్‌ పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

18:38 - March 22, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే వరకు పార్లమెంట్‌లో తమ ఆందోళనలు కొనసాగుతాయని టీడీపీ ఎంపీ మాగంటి బాబు స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం ఇన్ని రోజులుగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్న మాగంటి బాబుతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:37 - March 22, 2018

ఢిల్లీ : కావేరీ నదీ యాజమాన్య నీటి పంపకంపై స్పష్టత వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏఐఏడీఎంకే ఎంపీ తంబి దురై అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఆందోళన పార్లమెంట్‌లో కొనసాగిస్తామని తంబిదురై టెన్ టివితో తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:34 - March 22, 2018

ఢిల్లీ : రిజర్వేషన్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. 13 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. తమ పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఈ సందర్భంగా టెన్ టివి టీఆర్‌ఎస్‌ ఎంపీలు సీతారాంనాయక్‌, బాల్క సుమన్‌ లతో ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:32 - March 22, 2018

ఢిల్లీ : తమ ఆందోళనలను లోక్‌సభ స్పీకర్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. తమ ఎంపీల విజ్ఞప్తులపై స్పీకర్‌ సానుకూలంగా స్పందించలేదన్నారు. స్పీకర్‌ తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ హక్కుల కోసం ఎన్ని మార్గాల్లో ప్రయత్నం చేయాలో అన్నీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పార్టీల సహకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు. సమస్య పరిష్కరిద్దామనే ఆలోచన ఉంటే ఎలాగైనా చేయవచ్చని.. సభ ఆర్డర్‌లో లేదంటూ పదేపదే వాయిదా వస్తున్నారన్నారు. స్పీకర్‌ అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

18:29 - March 22, 2018

కర్నూలు : శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై పోలీసులు అసభ్య కరంగా ప్రవర్తించారంటూ.... స్థానిక పీఎస్‌ ఎదుట ఆందోళనకు దిగారు మహిళలు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే జాతీయ రహదారులను దిగ్బంధం చేసిన సీపీఐ, సీపీఐ, కాంగ్రెస్‌, జనసేన, వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

18:27 - March 22, 2018
18:26 - March 22, 2018
18:24 - March 22, 2018

 

విజయవాడ : సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ప్రత్యేక హోదా...విభజన హామీలు అమలు చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను వాడుకొనేందుకు ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ మొదలుపెట్టిందని వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ ద్రవిడ' పేరిట ఈ ఆపరేషన్ చేస్తోందని, 2019 నాటికి ఏపీపై అధిపత్యం దక్కించుకోవడం కోసం పెద్ద కుట్ర జరుగుతోందని, ఏడాదిగా ఈ ఆపరేషన్ జరుగుతోందన్నారు. మొత్తం రూ. 4, 800 కోట్లు కేటాయించారని ఆరోపించారు. బీజేపీ అనుబంధ సంఘానికి చెందిన కర్నాటకకు చెదిన కళ్యాణ్ జీ అనే వ్యక్తి ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఈ ఆపరేషన్ ద్రవిడలో మూడు సబ్ ఆపరేషన్లు ఉన్నాయని, తమిళనాడు, కర్ణాటకకు ఆపరేషన్ సుకుమార...తమిళనాడు,కేరళకు సంబంధించి ఆపరేషన్ రావణ చేస్తున్నారన్నారు. ఆపరేషన్ కు సంబంధించిన అన్ని వివారాలు పెన్ డ్రైవ్ లో వున్నాయని శివాజీ పేర్కొన్నారు. అని పేర్కొన్నారు. కానీ ఇలా చేయడం వల్ల లేనిపోని కష్టాలకు పోతారని, ప్రజలను మాత్రం చులకనగా చూడవద్దన్నారు. 

18:23 - March 22, 2018

ఢిల్లీ : మోదీ ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. ఏపీకి హోదా ఇవ్వకపోతే ప్రజలే బీజేపీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలనూ అమలు చేయాలని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

బ్రతికివున్నవాళ్లను చనిపోయారన్న మంత్రి సుష్మా?!..

ఢిల్లీ : ఇరాక్‌లో కిడ్నాప్ అయిన 39 మంది భారతీయులు మృతిచెందారన్న అంశంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోసుల్‌లో కిడ్నాప్ అయిన భారతీయులు క్షేమంగా, ప్రాణాలతో ఉన్నట్లు గతంలో సుష్మా సభలో ప్రకటించారని కాంగ్రెస్ తెలిపింది. కానీ ఇప్పుడు వాళ్లు చనిపోయినట్లు ప్రకటన చేయడం దారుణమని పేర్కొన్నది. పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అంబికా సోనీ.. సభలో సుష్మాపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నారు. 

బ్రెజిల్ లో వరద బీభత్సం..

హైదరాబాద్ : గతంలో ఎన్నడూ లేనంతగా బ్రెజిల్‌లో వరదలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు బెలో హారిజోంటీ తడిసి ముద్దవుతోంది. బలంగా వీస్తున్న గాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోతున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరద నీట్లో వాహనలు బొమ్మల్లా కొట్టుకుపోతున్నాయి. వరద నీటితో నిండిపోయిన లోతట్టు ప్రాంతాలు, రోడ్లు నదుల్లా మారాయి. కేవలం 20 నిమిషాల్లోనే 49 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు అయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

వీహెచ్ పీ పిటీషన్ ను కొట్టివేసిన హైకోర్ట్..

హైదరాబాద్ : వీహెచ్ పీ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఉగాది పండుగ నుండి హనుమాన్ జయంతి వరకూ రథయాత్ర చేసుకునేందుకు అనుమతినివ్వాలంటు గతంలో వీహెచ్ పీ అనుమతి కోరింది. వీహెచ్ పీ తలపెట్టిన శ్రీరామ రథయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీనిపై పోలీసులు అనుమితికి ఆదేశించాలంటు న్యాయస్థానంలో వీహెచ్ పీ పిటీషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టకుండానే కోర్టు పిటీషన్ ను కొట్టివేసింది.

కొడుకును సీఎం చేసేందుకు థర్డ్ ఫ్రంట్ : వీహెచ్

హైదరాబాద్ : కొడుకును సీఎంను చేసేందుకు సీఎం కేసీఆర్ థర్ట్ ఫ్రంట్ పై ఆసక్తి చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత వీహెచ్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ లోపల, బయటా టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వీహెచ్ విమర్శించారు. రాష్ట్రానికి రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ లో చిత్రశుద్ధి లేదన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ కు అసదుద్దీన్ ఎందుకు టీఆర్ఎస్ తో కలిసిరాలేదని ప్రశ్నించారు. మద్దతునిచ్చేందుకు రిజర్వేషన్లపై రాష్ట్రానికి అధికారం కావాలంటునన్న కేసీఆర్ రాష్ట్రంలో సర్పంచ్ లకు, జెబ్పీటీసీలకు ఏం అధికారాలిచ్చారని ప్రశ్నించారు.

రక్తసిక్తమవుతున్న విద్యాలయాలు..

హైదరాబాద్ : అమెరికా ఫ్లోరిడాలోని మేరీల్యాండ్‌ లోని గ్రేట్‌ మిల్స్‌ హైస్కూల్‌ లోకి సాయుధుడైన గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరూ మృతి చెందలేదని తెలిపిన పాఠశాల యాజమాన్యం, పాఠశాలకు ఎవరూ రావొద్దని సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు సూచించింది. ఆ పరిసరాల్లోని ఇతర స్కూళ్లను కూడా యాజమాన్యాలు మూసివేశాయి. ఇటీవలే ఒక పాఠశాలలో పూర్వ విద్యార్థి కాల్పులు జరిపి 17 మందిని పొట్టన బెట్టుకున్న ఘటన మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఫ్లోరిడా ఆందోళన చెందుతోంది.

నిందితులకు వీఎంవోలో గస్తీలా: చంద్రబాబు

అమరావతి : దేశంలో నిందితులకు పీఎంవోలో గస్తీ కాస్తారా? అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీని ఎద్దేవా చేశారు. ఒక అవినీతిపరుడు ప్రధానికి కలిస్తే ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. పీఎంవోలో విజయసాయిరెడ్డి దాగుడుమూతలు ఆడుతున్నారని విమర్శించారు. నన్ను జైల్లో పెట్టేంత వరకూ ప్రధానిని కలుస్తునే వుంటానని విజయసాయిరెడ్డి అంటున్నారని అలా అయితే పీఎంవోలో కాపురం పెట్టుకోమని చంద్రబాబు ఇరువురికి చురకలంటించారు. కాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:38 - March 22, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చెప్పిన వాగ్ధానాలే అడుగుతున్నామని కిరీటం పెట్టమంటున్నమా ? అని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. లోక్ సభ పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. యదావిధిగా ప్రారంభమై కొంత వ్యవధిలో సభను వాయిదా వేశారు. ఈసందర్భంగా మీడియాతో వైపీపీ ఎంపీలు మాట్లాడారు. ప్రభుత్వం దిగిరాకపోతే రాజీనామాలు చేస్తామన్నారు. సభ జరుగుతున్న తీరు ఒక మచ్చలాగా ఉండిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రజలంతా హోదా కోరుకుంటున్నారని, కానీ ప్రజల గొంతు కోయడానికి బిజెపి వెనుకాడడం లేదన్నారు. ప్రత్యేక హోదా నుండి ప్యాకేజీకి బాబు లాలూచీ పడ్డారని ఆరోపించారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలున్నాయని దీనిని నిజనిర్ధారణ చేసుకోవాలని వెంటనే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

అత్యాచారం తప్పించుకునేందుకు ఓ యువతి సాహసం..

హైదరాబాద్ : తనపై జరుగుతున్న అత్యాచారయత్నం నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి ఆరో అంతస్తు నుంచి దూకేసి తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన దుబాయ్ లో చోటుచేసుకుంది. ఓ పని నిమిత్తం దుబాయ్ వచ్చిన రష్యాకు చెందిన మోడల్ ఎకతేరినా స్టేట్సీయుక్ ఓ స్టార్ హోటల్ లో బస చేసిన నేపథ్యంలో అదే హోటల్ లో దిగిన అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఆమె గదికి వెళ్లి అత్యాచారానికి పాల్పడగా విధిలేని పరిస్థితుల్లో అతనినుండి తప్పించుకునేందుకు ఆమె ఆరో అంతస్తు నుంచి కిందకు దూకింది. ఇది గమనించిన హొటల్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

లల్లూ కుమారుడికి ఊరట..

హైదరాబాద్ : రాష్ట్రంలోని సివాన్‌ జిల్లాకి చెందిన జర్నలిస్ట్ రాజ్‌దేవ్ రంజన్ హత్య కేసులో రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కి భారీ ఉపశమనం లభించింది. తదుపరి విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ హత్యతో తేజ్ ప్రతాప్‌కు సంబంధముందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ సీబీఐ చెప్పడంతో కోర్టు ఈ మేరకు తీర్పునివ్వడం గమనార్హం. 

23న పార్లమెంట్ కు సెలవివ్వండంటున్న ఎంపీ..

ఢిల్లీ : ఈ నెల 23న పార్లమెంటుకు సెలవు ప్రకటించాలని శిరోమణి అకాలీ దళ్ ఎంపీ ప్రేమ్ సింగ్ చందుమజ్రా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు ఇవాళ ఆయన లేఖ రాశారు. దేశ స్వాంతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు నివాళిగా ఈ నెల 23న పార్లమెంటుకు సెలవు ప్రకటించాలని పేర్కొన్నారు. ఎలాగూ గత 15 రోజులుగా పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడం లేదనీ... కనీసం అమర వీరులకు నివాళిగానైనా వారు ప్రాణత్యాగం చేసిన రోజును సెలవుగా ప్రకటించాలన్నారు. 

పట్టిసీమను సవాలుగా తీసుకున్నాం: చంద్రబాబు

అమరావతి : పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందనే పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టులపై మాట్లాడుతున్న సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టుల గురించి సమగ్రంగా సమాచారాన్ని వివరించారు. విపక్షాలు ఆటంకాలు సృష్టించినా, ఎన్ని విమర్శలు చేసినా సవాలుగా తీసుకుని పట్టిసీమను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. పట్టిసీమ వల్ల గోదావరి డెల్టా ఎడారిగా మారుతుందని ప్రజల్లో అపోహలు సృష్టించి రెచ్చగొట్టారనీ అయినా దాన్ని సవాలుగా తీసుకుని విజయవంతంగా పూర్తి చేయటమే కాక వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని స్పష్టం చేశారు. 

15:53 - March 22, 2018

హైదరాబాద్ : గిరిజనులు కోరుకున్న చోటు గృహ నిర్మాణ స్థలాలు కేటాయించాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య కోరారు. గురువారం ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ కులాలు 50లక్షలకు పైబడి ఉన్నారని, వీరికి కేటాయించిన బడ్జెట్ చాలా తక్కువగా ఉందని..వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. వీరికి ఉద్యోగ అవకాశాలు లేవని, వీరికి సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించే విధంగా చూడాలన్నారు. భద్రాద్రి నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం కావాలని సీఎంతో సహా ఎంతో మందిని కోరడం జరిగిందని కానీ కల్పించలేదన్నారు. అంబేద్కర్ జయంతి రోజు పురస్కరించుకుని నిధులు కేటాయించాలని కోరారు. 2.50వేల మందికి పై బడి ఉన్న దళితులకు భూములు ఎక్కడ ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో...ఎకరానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని సూచించారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుందా ? ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగాల్లో గిరిజనులకు స్థానం కల్పించలేదన్నారు. భద్రాచలానికి అనుమతి అయిన గిరిజన గురుకుల పాఠశాలల భద్రాచలానికే కేటాయించాలని, ఐటీడీఏలకు ఐఏఎస్ అధికారి లేరని సభ దృష్టికి తీసుకొచ్చారు. 

పోలవరం నా జీవితాశయం: చంద్రబాబు

అమరావతి : పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం తన జీవితాశయం అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో డీపీఆర్ 1 పూర్తిగా ఖర్చుపెట్టిన ప్రాజెక్టు పోలవరం అని తెలిపారు. పోలవరం జాతీయ సంపద అని ఇందులో కుట్రలు చేయవద్దని విపక్షాలకు చంద్రబాబు విజ్నప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటి వరకూ రూ.13,201 కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

15:45 - March 22, 2018

విజయవాడ : వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధిక వృద్ధి సాధించడం జరిగిందని, కేంద్ర సహకారం ఇవ్వకపోయినా తమ ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. వెలిగొండ కెనాల్ కు టెండర్లు పిలుస్తున్నట్లు, గోదావరి నది నీళ్లు పెన్నా వరకు తీసుకెళ్లడానికి కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. ఇందుకు రూ. 80 వేల కోట్లు ఖర్చు అవుతుందని తద్వార రెండు కోట్ల ఎకరాలకు నీరందించే అవకాశం వస్తుందన్నారు. నదుల అనుసంధానమే కాకుండా నీరు చెట్టు కింద 70 కోట్ల క్యూబిక్ పనులు చేయించడం జరిగిందని, చెక్ డ్యామ్ లతో పాటు పనుల కోసం రూ. 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. జల సంరక్షణ ఉద్యమం ప్రస్తుతం నడుస్తోందని, ఎక్కడికక్కడ అన్ని చెరువుల మరమ్మత్తు..ఇతర పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏమీ మాట్లాడారో వీడియో క్లిక్ చేయండి. 

శివాజీ సంచలన వ్యాఖ్యలు!..

విజయవాడ : రాష్ట్రంల్లో వున్న అవకాశాలను వాడుకునేందుకు ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ మొదలుపెట్టిందని ప్రత్యేక హోదా సమితి సభ్యులు, నటుడు శివాజీ ఎద్దేవా చేశారు. ఆపరేషన్ ద్రవిడ పేరుతో ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టిందనీ అందులో భాగమే ఆపరేషన్ గరుడ అని శివాజీ పేర్కొన్నారు. కర్ణాటకకు సంబంధించి ఆపరేషన్ కుమార్ చేపట్టారని శివాజీ పేర్కొన్నారు. ఆపరేషన్ కు సంబంధించిన అన్ని వివారాలు పెన్ డ్రైవ్ లో వున్నాయని శివాజీ వ్యంగ్యాస్త్రరాలను విసిరారు. తమిళనాడు,కేరళకు సంబంధించి ఆపరేషన్ రావణ అని పేర్కొన్నారు.ఈ ఆపరేషన్ ల కోసం రూ.

15:39 - March 22, 2018

విజయవాడ : ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే తేడా లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తున్నామని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు నీరందిస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో దిగుబడి పెరుగుతున్నందున, భూగర్భ జలలు పెంచి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంచుతామని చెప్పారు.

జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ఎంట్రీ?!..

హైదరబాద్ : అవినీతిపరులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సీబీఐ మాజీ డైరెక్టరు లక్ష్మీనారాయణ రాజకీయాల్లో రానున్నట్లుగా సమాచారం. అతి పెద్ద అవినీతి కేసు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్, సత్యం కుంభకోణం వంటి అత్యంత కీలక కేసేలను దర్యాప్తుచేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన లక్ష్మీనారాయణ ఇప్పటికే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను చేరబోయే పార్టీ పేరును త్వరలో వెల్లడిస్తానని ఆయన తెలిపారు. 

15:35 - March 22, 2018

హైదరాబాద్ : కల్లు గీత కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో కల్లు గీత కార్మికులకు సీఎం కేసీఆర్‌ పలు హామీలు ప్రకటించారు. గీత కార్మికులు కల్లు గీసుకోవడానికి వేసే చెట్ల పన్ను తొలగిస్తున్నామని చెప్పారు. TFT సొసైటీలో లేని 30 వేల కార్మికులకు కూడా ఇక నుండి పెన్షన్‌ ఇస్తామన్నారు. గీత కార్మికుల సొసైటీ రెన్యువల్‌ను 5 నుండి 10 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలిపారు. హరితహారంలో కోటి 70 లక్షలు చెట్లను ఇప్పటి వరకు నాటమని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

15:33 - March 22, 2018

హైదరాబాద్ : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రానున్నారా ? ప్రస్తుతం దీనిపై పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన లక్ష్మీనారాయణ చేరబోయే పార్టీ గురించి త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసును లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, సత్యం కుంబకోణం లాంటి కేసుల్లోనూ దర్యాప్తు చేశారు. 

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు అవమానం..

హైదరాబాద్: భారతదేశపు ఉప ప్రధాని అయిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు అవమానం జరిగింది. ఆయన విగ్రహానికి బాటిళ్ల దండను వేసిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియ‌ని వ్యక్తులు పటేల్ విగ్రహం మెడలో ఖాళీ బాటిళ్ల దండవేసి అవమానించారు. కాగా దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం, వాటిపై రంగులు చల్లడం, చెప్పుల దండలు వేయడం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ నిరసన సెగ గుజరాత్‌ను తాకింది. కాగా ఈనేపథ్యంలో గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని ఓ లైబ్రరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని గమనించిన స్థానికులు ఆ దండను తొలగించారు.

బాబుపై సీబీఐ విచారణ వేయాలి : విజయసాయి

ఢిల్లీ: 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీని బలపరిచి అధికారంలోకి తీసుకొచ్చారనీ..ఇప్పుడు ఆ పార్టీలే చంద్రబాబుని అవినీతిపరుడు అని విమర్శలు చేస్తున్నాయన్నాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాను నీతిపరుడైతే తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఎంక్వయిరీ వేయించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన నిజాతీయని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు. వారంలోగా సీబీఐ విచారణ వేయించుకోకపోతే తాను అవినీతిపరుడని బాబు ఒప్పుకున్నట్లేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

కోమటి రెడ్డి పతనం ప్రారంభం: వీరేశం

అమరావతి : నల్లగొండలో కోమటిరెడ్డి పతనం ఎప్పుడో ప్రారంభమయ్యిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ప్రతీ ఎన్నికలలోను ట్రిక్కులు ప్లేచేసిన గెలిచే కోమటిరెడ్డిని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ బలమైన శక్తిగా మారిందని ఆయన తెలిపారు. అందుకే కోమటిరెడ్డి మాపైనా,టీఆర్ఎస్ పైనా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 

14:03 - March 22, 2018

హైదరాబాద్ : మాదాపూర్‌లోని సైబర్‌ టవర్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రి పక్కన ఉన్న దాదాపు 100 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. 

 

14:01 - March 22, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వం రద్దుపై  హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నర్ ప్రసంగం రోజు జరిగిన వీడియోలను,ఒర్జినల్ సీడీలను సీల్డ్ కవర్లో 22 తేదీన  కోర్టుకు  సమర్పించాలని హైకోర్టు గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇంకా వీడియోలు సిద్ధం కాలేదని కొంత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. 27 తేదీన ఈ  కేసుకు సంబంధించిన ఒర్జినల్ సీడీలను ,కౌంటర్‌ను దాఖలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

 

13:59 - March 22, 2018

జగిత్యాల : జిల్లాలోని కొడిమ్యాల మండలంలో పదవ తరగతి మ్యాథ్య్‌ 2 ప్రశ్నాపత్రాన్ని లీక్‌ చేసేందుకు ప్రయత్నించారు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సత్యనారాయణ. ఒక స్కూల్‌ టీచర్‌ ఇంట్లో ప్రిన్సిపల్‌, ఎమ్‌ఈవో వెంకటేశ్వరరావు, ముగ్గురు మహిళా టీచర్లు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. కొడిమ్యాల ఇంచార్జ్‌ ఎస్సై సోమసతీష్‌ కుమార్‌ వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎమ్‌ఈవో, ముగ్గురు మహిళలు తప్పించుకున్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్‌ సత్యనారాయణ పోలీసుల అదుపులో ఉన్నారు. 

13:57 - March 22, 2018

విజయవాడ : ఏపీలో ప్రత్యేక హోదా కోసం పోరు కొనసాగుతోంది.  ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారులను దిగ్బంధిస్తున్నారు. ఈ ఆందోళనకు  వైసీపీ, జనసేన, వామపక్షాలు, టీడీపీలు సంఘీభావం ప్రకటించాయి. ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆందోళన  చేస్తున్నారు.
రాజమండ్రి
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ.... పార్టీలకతీతంగా రాజమండ్రిలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. 
ప్రకాశం 
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్రకాశం జిల్లాలో ప్రతిపక్షాలు జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పెషల్‌ స్టేటస్‌ సాధన సమితి పిలుపు మేరకు వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు చెన్నై రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మరికొందరు ఆందోళన కారులు రహదారిపై కబడీ ఆడుతూ నిరసనలు తెలిపారు.
కర్నూలు 
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూలులో జాతీయ రహదారులను దిగ్బంధించారు సీపీఐ, సీపీఐ, కాంగ్రెస్‌, జనసేన, వైసీపీ నేతలు. 

 

13:50 - March 22, 2018

ఢిల్లీ : లోక్‌సభ వాయిదా తర్వాత పార్లమెంట్‌లో అద్వానిని కలిశారు టీఆర్‌ఎస్‌ఎంపీలు. రిజర్వేషన్ల అంశంపై ఆయనకు వివరించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల వివరణను అద్వాని స్పీకర్‌కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుననేలా చొరవ చూపాలని అద్వాని స్పీకర్‌ను కోరారు. 

 

13:48 - March 22, 2018

ఢిల్లీ : ఐదో రోజు కూడా పార్లమెంట్‌లో అదే సీన్‌ రిపీట్ అయింది. రెండు వాయిదాలతో సభ మళ్లీ రేపటికి వాయిదా పడింది. లోక్‌సభ ప్రారంభం కాగానే నిమిషం వ్యవధిలోనే వాయిదా పడింది. గంట తర్వాత తిరిగి ప్రారంభమైన సభలోను అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చకు సహకరించాలని స్పీకర్‌ కోరినా వారు వినలేదు.  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ  ప్రభుత్వం అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.  ఆందోళన  విరమించాలని కోరారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుని సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ సభలో గందరగోళం తగ్గకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ గందరగోళం 
రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. విభజన హామీలను నెరవేర్చాలని ఏపీ ఎంపీలు, కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేసారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని ఏంపీ సీఎం రమేష్ డిమాండ్‌ చేశారు. నాలుగు సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నేడు ప్రత్యేక హోదా కోసం బాధపడుతున్నారని, కేంద్రం దీనిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

13:38 - March 22, 2018

గుంటూరు : ఇన్నేళ్లు మౌనంగా ఉన్న బీజేపీ నేతలకు ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి కనిపిస్తుందా అని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టుపై ఎంక్వైరీ కోరుతున్న బీజేపీ నేతులు...కేంద్రంపై సీబీఐ అనేక రిపోర్టులు ఇస్తుందని... వాటిపై ఎంక్వైరీ చేస్తారా అని అడిగారు. రాష్ట్రంలో కుట్ర జరుగుతుందన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేసి నీరందించాలన్న కృతనిశ్చయంతో పని చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క పైసా కూడా అవినీతి లేదు కాబట్టి... పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళన చేయాలంటే సేవే మార్గమన్నారు. ఆధారాలుంటే ఆరోపణలు చేయాలని లేకుంటే మానుకోవాలన్నారు. మూడు పార్టీలు ఒక్కటై పోయాయని తెలిపారు. అవినీతి పరుడు విజయసాయిరెడ్డి ప్రధాని వద్దకు వెళ్లి సిగ్గు లేకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసులకు భయపడమని.. టీడీపీకి ఎవరికీ భయపడదన్నారు. విభజన చట్టంలోని హామీల్లో వేటిని నెరవేర్చారో తెలపాలన్నారు. ఏపీకి న్యాయం, రాష్ట్ర హక్కులు కోసం పోరాడుతున్నాననిచె ప్పారు. స్పెషల్ స్టేటస్ లో పేర్కొన్న అన్నింటినీ ఇస్తామంటే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నానని అన్నారు. నాలుగేళ్లు అయింది ఇవ్వలేదు.. బడ్జెట్ లో ఇవ్వలేదని..పైగా బడ్జెట్ బాగుందని మెచ్చుకున్నారని పేర్కొన్నారు. పోలవరంపై జరిగే కుట్రలు, కుతంత్రాలను అధ్యయనం చేయాలని అన్నారు. 52 ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. మహాసంగమం చేస్తామని చెప్పారు. 

 

10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్..

జగిత్యాల : జిల్లాలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం సృష్టించింది. క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందనే సమాచారం అందుకున్న ఎస్సై సతీష్ సివిల్ డ్రస్ లో వెళ్లి పట్టుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఒక టీచర్ ఇంట్లో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ గౌడ్ మాస్ కాపీయింగ్ కు పాల్పడిన నేపథ్యంలో సివిల్ డ్రస్ లో వెళ్లి చాకచక్యంగా కొడిమ్యాల ఇంచార్జ్ సతీస్ పట్టుకున్నారు. దీంతో సంబంధం వున్న ఎంఈవో, మరో ముగ్గురు మహిళా టీచర్లు తప్పించుకున్నారు.ఈ ఘటనకు పాల్పడిన ప్రిన్సిపల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కోట్లు ఖర్చు చేసిన కోమటిరెడ్డి గెలవలేరు : వీరేశం

హైదరాబాద్ : రూ.100కోట్లు ఖర్చు పెట్టినా వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలవలేరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి గన్ మెన్ల ఉపసంహరణ వెనుక ఎటువంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. ప్రతీ ఎన్నికల్లోను కోమటిరెడ్డి ట్రిక్స్ ప్లే చేసి గెలుస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డితో పాటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్లు కూడా గెలవలేరన్నారు.  

రాష్ట్ర విభజన నాటి పరిస్థితుల్లా వున్నాయి : యనమల

అమరావతి : ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభలు జరుగుతున్న తీరు చూస్తుంటే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ నుండి ఏపీకి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

అందుకే కల్లు దుకాణాలు : కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ఉద్యమం జరిగే రోజుల్లో కల్లుగీత కార్మికులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చామని అందుకే టీఆర్ఎస్ హయాంలో కల్లు దుకాణాలను తెరిపించామని  సీఎం కేసీఆర్ర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతు..సమైక్య రాష్ట్రంలో కుల వృత్తులు ఆగమయ్యాయని విమర్శించారు. కల్లు గీసే సమయంలో చెట్టుపై నుండి పడి మృతి చెందిన గీత కార్మికులకు పరిహారాన్ని రూ.2లక్షల నుండి రూ.5లక్షలకు పెంచామన్నారు.

పోలవరం పనులు 54 శాతం పూర్తి : చంద్రబాబు

అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై ప్రతీవారం జరుగుతున్న పనులను ఆన్ లైన్ లో వుంచుతున్నామనీ దీంట్లో గోప్యం ఏమీ లేదని తెలిపారు. నవయుగ సంస్థ పెద్ద ప్రాజెక్టును పూర్తిచేస్తే..మంచినీరు వస్తుందనీ..పోలవరాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. అన్ని ఆటంకాలను అధిగమించి పోలవరం ప్రాజెక్టు 54 శాతం పనులను పూర్తిచేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2019కల్లా గ్రావెటీ ద్వారా నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

13:09 - March 22, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. ఉభయసభల్లో ఎంపీల ఆందోళనలు కొనసాగాయి. నిరసనల మధ్యే ఉభయసభల సమావేశాలు కొనసాగాయి. స్పీకర్ ఎంత చెప్పిన వినకుండా ఎంపీలు ఆందోళన చేపట్టాయి. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ లోక్ సభను, చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.  

 

ప్రాజెక్టుల ప్రగతిని చూసి మాట్లాడండి: చంద్రబాబు

అమరావతి : ప్రాజెక్టులపై విమర్శలు చేసేముందు ప్రాజెక్టు ప్రగతిని చూసి మాట్లాడమని ప్రతిపక్షాలకు సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలకు చంద్రబాబు స్పందించారు. గోదావరి రైతులకు అన్యాయం జరగకుండా నీరు తీసుకెళ్తామని రైతుల సమక్షంలో మాట ఇచ్చామనీ ఆ మాట ఇచ్చినట్టుగా చేశామని ఆసెంబ్లీ సమావేశాలలు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

పెద్దల సభలో కూడా గ్రాట్యుటీ బిల్ పాస్..

ఢిల్లీ : విపక్షాల ఆందోళన మధ్య కేంద్రం గ్రాట్యుటీ బిల్ ను పాస్ చేసింది. గ్రాట్యుటీ బిల్ పై ఏమాత్రం చర్చ చేపట్టకుండానే బిల్ కు రాజ్యసభ ఆమోదం పలిచింది. కాగా గత నాలుగు రోజుల నుండి అవిశ్వాస తీర్మానంపై చర్చకు మాత్రం ఉభయసభలు నిర్లక్ష్యం చేస్తున్న విషయం తెలిసిందే. సభలో గందరగోళం తలెత్తటంతో చర్చను చేపట్టలేమని వాయిదాలను ఉభయసభలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్యే గత గురువారం నాడు గ్రాట్యుటీ చట్ట సవరణ బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది.

13:01 - March 22, 2018

గుంటూరు : కేంద్రం తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇవాళ బ్లాక్ డ్రస్ లో వచ్చి నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్నామని చెప్పారు. న్యాయబద్దమైన కోరికలకు ఎవ్వరైనా తలవంచాల్సిందేనని అన్నారు. 

12:57 - March 22, 2018

విజయవాడ : సీఎం చంద్రబాబు ప్రత్యేకహోదాకు సమాధి కట్టారని వైసీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్న నాడే ప్రత్యేకహోదాకు చంద్రబాబు సమాధి కట్టారని తెలిపారు. టీడీపీది దిగజారిందన్నారు. టీడీపీ నాటకాలు, రాజకీయాలు ఆపాలని చెప్పారు. అనైతికంగా రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. మన్మోహన్ సింగ్ కాబినెట్ తీర్మానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. 

పెద్దల సభలో కూడా గ్రాట్యుటీ బిల్ పాస్..

ఢిల్లీ : విపక్షాల ఆందోళన మధ్య కేంద్రం గ్రాట్యుటీ బిల్ ను పాస్ చేసింది. గ్రాట్యుటీ బిల్ పై ఏమాత్రం చర్చ చేపట్టకుండానే బిల్ కు రాజ్యసభ ఆమోదం పలిచింది. కాగా గత నాలుగు రోజుల నుండి అవిశ్వాస తీర్మానంపై చర్చకు మాత్రం ఉభయసభలు నిర్లక్ష్యం చేస్తున్న విషయం తెలిసిందే. సభలో గందరగోళం తలెత్తటంతో చర్చను చేపట్టలేమని వాయిదాలను ఉభయసభలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్యే గత గురువారం నాడు గ్రాట్యుటీ చట్ట సవరణ బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది.

12:52 - March 22, 2018

గుంటూరు : ప్రత్యేకహోదా కోసం ఏపీలో పోరు కొనసాగుతోంది. ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం జరుగుతుంది. 12 గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధం జరుగనుంది. వైసీపీ, జనసేన, వామపక్షాలు, టీడీపీ సంఘీభావం ప్రకటించాయి. ఎక్కడికక్కడే రహదారులను దిగ్బంధించారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రహదారులు దిగ్బంధం చేశారు. 

 

నిరూపించకుంటే వైసీపీని మూసేయండి : ప్రత్తిపాటి

గుంటూరు: ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. తనపై జగన్‌ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని అన్నారు. తనపై జగన్ చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని... ఆరోపణలను నిరూపించలేకపోతే వైసీపీని మూసేయాలని సవాల్ చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అవినీతికి పాల్పడ్డారని జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఈ మేరకు సవాల్ చేశారు. 

ప్రజల మనోభావాలను గౌరవించండి :సీఎం రమేశ్

ఢిల్లీ : ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ తో ఈరోజు రాష్ట్ర ప్రజానీయం రోడ్లపైకి వచ్చి జాతీయ రహదారులను దిగ్భంధిస్తున్నారనీ..వారి మనోభావాలను గౌరవించాల్సిన అవుసరముందని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి విజ్నప్తి చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తానని రాజ్యసభలో గతం చేసిన వాగ్ధానాలను నిలుపుకోవాలన్నారు. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఈరోజు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారనీ..

12:32 - March 22, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం వెంకట్ అనే యువకుడు తిరుపతి నుంచి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేశారు. ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో సైకిల్ యాత్ర చేశానని తెలిపారు. సామాన్యుడికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. 

చర్చకు సహకరించండి : అనంతకుమార్

ఢిల్లీ : టీడీపీ, వైసీపీ నేతలు ఇచ్చిన అవిశ్వాసం తీర్మానంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా వుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు సిద్ధంగా వుందని దానికి సభ్యులు సహకరించాలని కోరారు. కాగా గత నాలుగు రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కావాలని అవిశ్వాసం తీర్మానంపై దాటవేత ధోరణిని అవలంభిస్తోందని టీడీపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. 

12:20 - March 22, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద ఏపీ టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగించారు. ఎంపీ శివప్రసాద్ పారిశుద్ధ్య కార్మికుని వేశంలో పార్లమెంట్ కు వచ్చి నిరసన తెలిపారు. స్వచ్ఛ మోడీ కావాలని శివప్రసాద్ అన్నారు. మోడీ మనుసు స్వచ్ఛంగా ఉంటే మోడీ మనసు స్వచ్ఛంగా ఉంటుందని అన్నారు. 

టాప్ నక్సల్ కమాండర్ మృతి..

హైదరాబాద్ : మావోయిస్టులకు గట్టిదెబ్బ తగిలింది. టాప్ నక్సల్ కమాండర్ గా, తలపై రూ. 1.50 కోట్ల రివార్డున్న కీలక నేతగా ఉన్న దేవ్ కుమార్ సింగ్ అలియాస్ అరవింద్ జీ అలియాస్ నిషాంత్ గుండెపోటుతో మృతిచెందాడు. అంతర్ జిల్లా మావో కార్యకలాపాల్లో ఆరితేరిన దేవ్ కుమార్, జార్ఖండ్ పోలీసుల రికార్డుల ప్రకారం, నక్సల్ కార్యక్రమాలకు ప్రధాన వ్యోహకర్తగా ఎన్నో దాడులకు పాల్పడ్డారు. దేవ్ కుమార్ ను మట్టుబెట్టాలని కూంబింగ్ దళాలు ఎన్నోమార్లు వలపన్నినా, ఆయన తప్పించుకు తిరుగటంతో దేవ్ కుమార్ దిట్ట. 

12:13 - March 22, 2018

తెలంగాణలో... తునికాకు చాలామంది గిరిజనులకు మంచి ఆదాయ వనరు. కానీ తునికాకు కోయవద్దంటూ.. ప్రభుత్వం ఆర్డర్ వేయడంపై చాలామంది గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పోడుభూములు సాగుచేయడంపై ప్రభుత్వం కన్నెర్ర చేయడం, తాజాగా తునికాకు కోయవద్దనడం.. ఇలా నిబంధనలతో... అడవిపై తమ హక్కులను కాలరాస్తున్నారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పుడీ అంశంపై 10టీవీ జనపథం ప్రత్యేక చర్చను చేపట్టింది...ఇదే అంశంపై గిరిజన సంఘం నాయకులు శోభానాయక్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

లోక్ సభలో వాయిదాల పర్వం..

ఢిల్లీ : లోక్ సభలో సీన్ సేమ్ గా రిపీట్ అయింది. వాయిదా అనంతరం ప్రారంభమైన అతి కొద్ది సేపటికే సభను స్పీకర్ సుమితా మహాజన్ రేపటికి వాయిదా వేశారు. అంతా వారి అనుకున్నప్రకారంగానే సభను కొనసాగిస్తున్నారు. సభ ఆర్డర్ లో లేదు కాబట్టి ఓటింగ్ చేయలేమని అందుకే అవిశ్వాసంపై చర్చను చేపట్టలేమని మరోసారి స్పీకర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేశారు. కాగా ఇప్పటికే రాజ్యసభ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అన్ని ప్రాంతాలకు రహదారులు : జూపల్లి

హైదరాబాద్: బంగారు తెలంగాణ కావాలంటే అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని భావించినట్లు సంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ... గ్రామాల్లోని బీటీ రోడ్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే అన్ని గ్రామాలు, ప్రాంతాలకు రహదారులు మంజురు చేసినట్లు చెప్పారు. పాలసీ ప్రకారం రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. 14,980 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ 2,246 కోట్ల మంజూరు చేసినట్లు ఇప్పిటికే రూ. 1700 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

12:04 - March 22, 2018

ఆఫ్గనిస్తాన్‌ : కాబూల్‌లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. కాబూల్‌లోని అలీబాద్‌ హాస్పిటల్‌ ఎదురుగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయని టోలో న్యూస్‌ పేర్కొంది. ఉగ్రవాది నడచుకుంటూ వచ్చి తనని తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు హోంశాఖ వెల్లడించింది. కాబూల్‌ యూనివర్సిటి సమీపంలోనే ఆత్మాహుతి దాడి జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.

 

12:01 - March 22, 2018

ఢిల్లీ : 2జీ స్కాం కేసులో మాజీ కేంద్రమంత్రి ఏ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు మరో 17 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ స్కాం కేసులో ఇటీవల ప్రత్యేక సీబీఐ కోర్టు రాజాతో పాటు ఇతరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐతో పాటు ఈడీలు హైకోర్టులో అప్పీలు చేశాయి. ఈడీ సిబిఐ అప్పీలు మేరకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ మార్చి 25కి వాయిదా వేసింది. 2జీ కేసులో తాము సరైన ఆధారాలు ఇచ్చినా.. ప్రత్యేక సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సరిగా లేదని సీబీఐ పేర్కొంది. 2 జి కేసులో గత ఏడాది డిసెంబర్ 21న రాజా, కనిమొళిలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 

 

11:58 - March 22, 2018

చెన్నై : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కాం విచారణ కేసు ఓ కొలిక్కి రాకముందే మరో జ్యూయలరీ కంపెనీ మోసం వెలుగు చూసింది. చెన్నైలోని కనిష్క గోల్డ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్ ఎస్‌బిఐ సహా 14 బ్యాంకులకు 824  కోట్ల మేర కుచ్చుటోపి పెట్టింది. చెన్నై రాజాజీ సాలైలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు మేరకు కనిష్క్‌ జ్యూయలరీ సంస్థల డైరెక్టర్లు రూపేష్‌ జైన్, ఆయన భార్య నీతా జైన్‌లపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎస్‌బిఐ, పిఎన్‌బి, సెంట్రల్‌ బ్యాంక్, కార్పోరేషన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకులను వీరు మోసం చేసినట్లు సిబిఐకి ఫిర్యాదు అందింది. రుణం మొత్తానికి వడ్డీతో కలిపి 1000 కోట్ల వరకు బ్యాంకులు నష్టపోయాయి. కనిష్క్‌ జ్యూయలరీ సంస్థకు చెన్నైతో పాటు హైదరాబాద్‌, కొచ్చి, ముంబైలలో కూడా బ్రాంచీలున్నాయి. రూపేష్‌ జైన్‌ను రుణ ఎగవేత దారుడని గత ఏడాది బ్యాంకులు ప్రకటించాయి. ఆరు నెలల కిందట 20 కోట్ల ఎక్సైజ్‌ పన్ను మోసం కేసులో రూపేష్ జైన్‌ అరెస్ట్‌ అయ్యాడు. బెయిలుపై విడుదలైన రూపేష్‌ దంపతులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

 

హోదా కోసం ఆమరణ దీక్షలు : మధు

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడమని సీపీఎం కార్యదర్శి మధు తెలిపారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలనీ..రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5కోట్ల ఆంధ్రులను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో ప్రారంభమయిన ఈ ఉద్యమం నిరవధికంగా కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం హోదా కోసం ఆమరణ దీక్షలకు సిద్ధమవుతోందన్నారు. 

కోమటిరెడ్డి కేసుపై టీ.సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్వత్వ రద్దుకు సంబంధించిన కేసు హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ అంశంపై కోమటిరెడ్డి వేసిన పిల్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈరోజు కూడా విచారణను కొనసాగించింది. దీనికి సంబంధించి ఒరిజినల్ సీడీలను కోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై కొంత గడువు కావాలని ప్రభత్వ తరపు న్యాయవాది కోరగా ఈ కేసులు ఈ నెల 27కు వాయిదా వేసింది.

11:49 - March 22, 2018

చెన్నై : ఫేస్‌బుక్ డేటా ప్రైవసీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థతో రాహుల్‌ గాంధీకి సంబంధముందని బిజెపి చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ సేవలను రాహుల్‌ ఎన్నడూ ఉపయోగించుకోలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిథి రణదీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు. 2010లో జరిగిన బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ ఆ సంస్థ సేవలను ఉపయోగించుకుందని పేర్కొంది. బీజేపీని బూటకపు వార్తల కర్మాగారంగా పేర్కొన్న సూర్జేవాలా... మరొక బూటకపు వార్తను ఉత్పత్తి చేసిందని ధ్వజమెత్తారు. అంతకుముందు కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థతో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధాలు ఏమిటో చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.2019 ఎన్నికల్లో ఓట్లను పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ డేటా మానిప్యులేషన్, చౌర్యంపై ఆధారపడుతుందా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ తీవ్ర సంక్షోభాన్ని  ఎదుర్కొంటోంది. అనుమతి లేకుండా 5 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. 

 

హోదా కోసం అర్థనగ్న ప్రదర్శన..

.గోదావరి : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో అఖిల పక్షం ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ రహదారుల నిర్భంధం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వద్ద వున్న ఎన్ హెచ్ పై జనసేన,సీపీఎం, సీపీఐ,వైసీపీ నేతలు అర్థనగ్న ప్రదర్శనతో తమ నిరసన తెలిపారు. దీంతో ఆప్రాంతంలో దాదాపు 10కి.మీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించిపోయింది. 

10 కి.మీ మేర ట్రాఫిక్ జామ్..

అమరావతి : ఏపీలోని 13 జిల్లాలలో ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఆందోళనలు కొనసాగుతోంది. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నగర శివారులో వున్న ఆశ్రమం ఆసుపత్రి జాతీయ రహదారిపై 10కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది.

11:39 - March 22, 2018

వైజాగ్ : విశాఖ స్టీల్‌ విక్రయాల్లో రికార్డులు సాధిస్తోంది. గతేడాది 19 శాతం ప్రగతి సాధించగా... ఈ ఏడాది 35శాతం వృద్ధి లక్ష్యంగా కొనసాగుతోంది. ఏడాది కాలంగా అమరావతిలో నిర్మాణాలు ఊపందుకోవడంతో స్టీల్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయాలపై విశాఖ స్టీల్‌ దృష్టి సారించింది. 
ఆంధ్రుల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం 
గత కొన్నాళ్లుగా నష్టాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కు స్టీల్‌ ఫ్యాక్టరీ లాభాల బాట పట్టిందంటోంది యాజమాన్యం. అమరావతిలో భవన నిర్మాణాలు ఊపందుకోవడంతో... విశాఖ స్టీల్స్‌ అమ్మకాలు పెరిగాయి. దీంతో గత రెండేళ్లుగా విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ లాభాలు చవిచూస్తోంది. ఆంధ్రుల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది. ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి చూపించడమే కాకుండా... తెలుగు రాష్ట్రాలకు అవసరమైన స్టీల్‌ను అందిస్తోంది. దేశంలోని సముద్ర తీరప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారంగా 2010లో నవరత్న హోదాను పొందింది. 3.4 మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో రష్యా, జపాన్‌ల సాంకేతిక సహకారంతో ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుని... 23 ఏళ్ల జీవితకాలాన్ని పూర్తి చేసుకుంది. 2009లో యూపీఏ సర్కార్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు నిర్ణయించింది. 4 వేల కోట్ల వ్యయంతో ప్లాంట్‌ సామర్ధ్యాన్ని 6.3 మిలియన్‌ టన్నులకు పెంచింది. అయితే... గత కొంతకాలంగా స్టీల్‌ డిమాండ్‌ తగ్గడంతో విశాఖ స్టీల్స్‌ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఏపీ నూతన రాజధాని అమరావతిలో కొత్త నిర్మాణాలు, ప్రాజెక్టులు చేపట్టుతుండడంతో విశాఖ స్టీల్స్‌ దశ తిరిగింది. గతేడాది 19 శాతం వృద్ధి సాధించగా... ఈ ఏడాది 35 వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
ముడిపదార్థాల ధరలు పెరగడంతో కొంతమేర కంపెనీపై భారం 
ఇక ముడిపదార్థాల ధరలు పెరగడంతో కొంతమేర కంపెనీపై భారం పడుతుందన్నారు అధికారులు. దేశంలో మేలైన బొగ్గు లభించకపోవడంతో.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే ఐరన్‌ఓర్‌ను చత్తీస్‌గఢ్‌, ఒడిస్సాల నుండి తెప్పిస్తున్నారు. అయితే... ఐరన్‌ ఓర్‌ తీసుకుంటే.. స్థానికంగానే ఉత్పత్తి చేపట్టాలని పక్క రాష్ట్రాలు మెలిక పెడుతుండడంతో కంపెనీకి కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు ప్రాంతంలో సుమారు 30 మిలియన్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ లభించే గనులున్నాయని... వాటిని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. దీనిపై ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
మార్కెటింగ్‌పై దృష్టి 
ఉత్పత్తి సామర్ధ్యాన్ని 7 మిలియన్‌ టన్నులకు పెంచుకున్న విశాఖ స్టీల్‌... మార్కెటింగ్‌పై దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఔట్‌ లెట్ల ప్రారంభించేందుకు యోచిస్తోంది. మొత్తానికి ఒక్కొక అడుగు ముందుకు వేస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అభివృద్ధి దిశగా పయనిస్తుండడంతో తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

టీ హబ్ ను విస్తరిస్తాం : కేటీఆర్

హైదరాబాద్: వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ ఐదు నగరాల్లో ఐటీని విస్తరిస్తున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో టీహబ్ విస్తరణ, ఎంతమంది ఉపయోగం, ఖమ్మం ఐటీ హబ్‌కు ఇంక్యుబేటర్ ఏర్పాటు వంటి తదితరాలపై సభ్యులు గణేష్ గుప్తా, పువ్వాడ అజయ్ సభలో ప్రశ్నలను లేవనెత్తారు. మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అన్నారు. టీహబ్-2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ కాబోతుందన్నారు. 3 లక్షల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్-2 నిర్మాణం రూపుదిద్దుకుంటుందన్నారు.

11:32 - March 22, 2018

ఢిల్లీ : లోక్ సభ వాయిదా పడింది. ప్రారంభమైన రెండు నిమిషాలకే సభ వాయివా పడింది. స్వీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అన్నాడీఎంకే, టీఆర్ ఎస్ పార్టీల నేతలు ఆందోళన చేపట్టాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ఆర్డర్ లో లేకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

సామాన్యులపై ఆందోళన ప్రభావం..

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పలు విపక్ష పార్టీలు జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వడం, అధికారంలో ఉన్న టీడీపీ సైతం దీనికి మద్దతు పలకడంతో, రాష్ట్రంలోని రోడ్లన్నీ స్తంభించిపోయాయి. పలు ప్రాంతాల్లో వామపక్ష, కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు తెలుగుదేశం నేతలు సైతం రోడ్లపైకి వచ్చి ధర్నాలకు దిగడంతో ప్రజా జీవితంపై ప్రభావం పడింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

నిలిచిపోయిన ట్రాఫిక్..

విజయవాడ : నగరంలో యువనేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వందలాది మంది జాతీయ రహదారిని అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. నెల్లూరు, కర్నూలు, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కాగా, శాంతియుత నిరసనలకు తాను మద్దతిస్తానని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం సహించేది లేదని చంద్రబాబునాయుడు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

11:29 - March 22, 2018

విజయవాడ : పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపితే అసలు విషయాలు తెలుస్తాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. 24 గంటల దీక్ష... 48 గంటల దీక్షలు.. ఆఖరికి నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. హోదాపై బీజేపీ బుకాయిస్తుందన్నారు. కేంద్రం ఏపీలో గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలు పెడతామని చెప్పారు...కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కమీషన్లు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. టీడీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 

ఉభయ సభల్లో వాయిదాల పర్వం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల్లోను వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఐదవ రోజుకు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రారంభమయిన కొద్దిసేపటికే వాయిదా పడిన లోక్ సభ మ.12 గంటలకు వాయిదా పడగా..రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ క్రమంలో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

ప్రత్యేక హోదా కోసం సైకిల్ యాత్ర..

ఢిల్లీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వాలని గత నాలుగేళ్లుగా ఏపీకి ప్రజలు కోరుతునే వున్నారు. కానీ దానిపై పలువిధాలుగా సమస్యలు పక్కదోవ పట్టిస్తున్న కేంద్రం హోదా ఇవ్వకపోగా ప్యాకేజీతో సరిపెట్టింది. ఈ నేపథ్యంలో ప్యాకేజీ విషయంలో వున్న హామీలను కూడా నెరవేర్చకపోగా ఏపీపై ఎదురుదాడి చేస్తోంది. దీన్ని నిరసిస్తున వెంకట్ అనే యువకుడు తిరుపతి నుండి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపట్టాడు. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వెంకట్ డిమాండ్ చేస్తున్నాడు.  

11:22 - March 22, 2018

విజయవాడ : ఏపీలో ప్రత్యేకహోదా పోరు కొనసాగుతోంది. యువత, సామాన్య ప్రజలను కదలించే దిశగా రాజకీయపార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇవాళ జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయించాయి. రహదారుల దిగ్బంధానికి వైసీపీ, జనసేన, వామపక్షాలు, టీడీపీలు సంఘీభావం ప్రకటించాయి. శాంతియుతంగా ఆందోళన చేయాలని టీడీపీ సూచించింది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఆందోళన చేయాలని రాజకీయపక్షాలు సూచించాయి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నారు. 

 

గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఆందోళన..

ఢిల్లీ : పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తు..తాము ఇచ్చిన అవిశ్వాసన తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ తో నినాదాలు చేస్తు ఆందోళన చేపట్టారు. కాగా గత నాలుగు రోజులు అవిశ్వాసన తీర్మానాన్ని సభలో ఇస్తున్నా స్పీకర్ దానిపై చర్చ చేపట్టకపోగా వాయిదాలపై వాయిదాలు వేస్తు తీరును నిరసిస్తు వారు ఆందోళనచేపట్టారు. 

లోక్ సభలో వాయిదాల పర్వం..

ఢిల్లీ : లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఐదవరోజు సభ ప్రారంభమయిన నిమిషంలోపే స్పీకర్ సభను మ.12 గంటలకు వాయిదా పడింది. ప్రారంభమయిన కొద్ది సేపటికే లోక్ సభ వాయిదా పడింది. గత నాలుగు రోజు లనుండి ఇదే వైనం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కావాలని టీఆర్ఎస్ , అన్నాడీఎంకే సభ్యుల నినాదాలతో మరోసారి హోరెత్తటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను 12గంటలకు వాయిదా వేశారు. 

11:08 - March 22, 2018

ఢిల్లీ : పార్లమెంటులో టీడీపీ, వైసీపీలు ఐదో రోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. సభ ఆర్డర్‌లో ఉందని భావిస్తేనే స్పీకర్‌ అవిశ్వాస తీర్మానం స్వీకరించే అవకాశం ఉంది. ఆందోళన చేస్తున్న టిఆర్ఎస్,ఎఐడిఎంకే ఎంపీలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారు.

 

పరిశ్రమల ప్రోత్సాహం కొరకే టీహబ్ : కేటీఆర్

హైదరాబాద్ : అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలనే సంకల్పంతో టీ హబ్ ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక ఇంక్యూబేటర్స్ హైదరాబాద్ లోనే వున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు స్టార్టప్సప్ ద్వారా వస్తాయని తెలిపారు. అందుకే తెలంగాణ ప్రభత్వం స్టార్టప్స్ కు ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తుందనీ..అన్ని రంగాల నుండి వస్తున్న ఆవిష్కరణలను తీసుకుంటున్నామన్నారు. 

11:02 - March 22, 2018

సంగారెడ్డి : భూ బకాసురులు అడ్డూ అదుపూ లేకుండా బరితెగిస్తున్నారు... జాగా కనిపిస్తే చాలు.. పాగా వేసేస్తున్నారు. వారి భూ దాహానికి  ప్రభుత్వ భూమి,  ప్రైవేటు భూమి అన్న తేడా కూడా లేదు... చెరువుల్ని, కుంటల్ని  కూడా మింగేస్తున్నారు.. సంగారెడ్డి జిల్లాలో కబ్జారాయుల ఆగడాలపై టెన్‌టీవీ స్పెషల్‌ ఫోకస్‌.... 
జాగా కనిపిస్తే.. చాలు పాగా వేసేస్తున్నారు
ఆక్రమణలకు కాదేదీ అనర్హం... అన్నచందంగా ఉంది కబ్జారాయుళ్ళ తీరు..జాగా కనిపిస్తే.. చాలు పాగా వేసేస్తున్నారు.... ఆ భూమి ప్రభుత్వానిదా.. ప్రైవేటు వ్యక్తులదా అన్నపట్టింపు లేకుండా బరితెగిస్తున్నారు... భూదాహంతో.. చెరువులు, కుంటల్ని కూడా మింగేస్తున్నారు.. భూ బకాసురులు
మల్లెవానికుంట ఆక్రమణ 
ఇది సంగారెడ్డి జిల్లాలోని మల్లేపల్లి గ్రామం.. జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది... ఈ గ్రామ శివారులోని మల్లెవానికుంట.. ఇప్పుడు పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఈ స్థలంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు.. స్థానిక టీఆర్ఎస్‌ నేత అండదండలతో వెంచర్‌ను వేసేస్తున్నారు... దీని లోపలికి వెళ్ళేందుకు ఏకంగా... ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు వేస్తున్నారు. స్థానిక టీఆర్ఎస్‌ నేత దేశ్‌పాండే ఇక్కడి దళితులకు మాయమాటలు చెప్పి.. కారుచౌకగా  భూముల్ని కొట్టేసి... రియల్టర్ల చేతిలో పెట్టేస్తున్నాడు... ఇలా అప్పనంగా భూమిని కాజేసిన వెంచర్‌ యజమాని.. ఆ భూమి పక్కనే ఉన్న మల్లెవానికుంటను కలిపేసుకుని... భారీఎత్తున వెంచర్‌ వేస్తున్నాడు.. 
కుంటను కాపాడాలంటున్న స్థానిక రైతులు 
ఇటు నీటిపారుదల శాఖ, అటు రెవెన్యూ శాఖ అధికారులు ఈ కుంట ఏ సర్వే నెంబర్‌లో ఉందో కూడా చెప్పలేకపోవడం కొసమెరుపు.. కాసులకు కక్కుర్తిపడిన అక్రమార్కులెవరో దీనిగురించి.. కబ్జారాయుళ్ళకు చెప్పి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి... ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. కుంటను కాపాడాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
అధికారులు ఏం చేస్తున్నారు : స్థానిక యూత్‌ నేతలు
మరోవైపు  ఎఫ్‌టిఎల్‌ స్థలంతోపాటు... బఫర్‌జోన్‌ ప్రాంతాన్ని కూడా ఆక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తుంది... గత జనవరిలో నీటి పారుదల శాఖ, రెవెన్యూశాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి.. హద్దులు కూడా నిర్ధారించారు. ఐతే కబ్జారాయుళ్ళు సరిహద్దు రాళ్ళను తీసేసి.. ఆ స్థలాన్ని వెంచర్‌లో కలిపేసుకున్నారు.. ప్రధాన రహదారిపై ఉన్న ఈ  వెంచర్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు..  భూ బకాసురులు బరితెగిస్తుంటే.. అధికారులు ఏం చేస్తున్నారంటూ...  స్థానిక యూత్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
కబ్జా స్థలంలో అక్రమంగా వెంచర్‌ 
కబ్జాచేసిన స్థలంలో అక్రమంగా వెంచర్‌ వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది.. ఓ వైపు స్థానిక ప్రజలు, నాయకులు ఈ విషయంపై నిలదీస్తున్నా.. అన్ని అనుమతులు తీసుకున్నాకే వెంచర్‌ వేస్తున్నామని బుకాయిస్తున్నాడు అక్కడి సూపర్‌ వైజర్‌.
అధికారుల అలసత్వం 
క్షేత్రస్థాయిలో అక్రమ అధికారులకు కాసులు అందే ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.. అందుకే.. కబ్జా వ్యవహారం బట్టబయలైనా.. సరైన చర్యలు తీసుకోవడంలేదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.. బాధ్యతగా నడుచుకోవాల్సిన అధికారులు... ఇలా అలసత్వం ప్రదర్శిస్తే ఎలా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.

 

పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపీ..

ఢిల్లీ : విచిత్ర వేషధారణలో పరిస్థితికి అద్దం పట్టేలా వేషాలు వేసి అందరినీ ఆకట్టుకునే టీడీపీ ఎంపీ ఈరోజు మరో వేషధారణతో పార్లమెంటుకు చేరుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుడి వేషధారణతో నిరసన తెలుపుతు ఎంపీ శివప్రసాద్ వచ్చారు. 

రాష్ట్రపతికి కలిసే యోచనలో టీడీపీ..

ఢిల్లీ : హస్తినలో గత నాలుగు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై రగడ కొనసాగుతునే వుంది. ఈ నేపథ్యంలో ఐదవరోజు కూడా తమ అవిశ్వాస తీర్మానాలను టీడీపీ, వైసీపీ సభ్యులు స్పీకర్ కు ఇవ్వనున్నారు. గత నాలుగు రోజుల నుండి విచిత్ర ధోరణితో కాలయాపన చేస్తున్ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై అటు ప్రజలు, ఇటు పార్టీలు మండిపడుతున్నాయి. ఈనేపథ్యంలో ఈరోజు కూడా అదేతీరు సభలో కొనసాగితే..టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి కలిసి పరిస్థితిని వివరించే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది.

10:47 - March 22, 2018

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని..విభజన హామీలు నెరవేర్చాలనే డిమాండ్ తో అఖిల పక్షం పోరుబాటు పట్టింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకూ జాతీయ రహదారులనుదిగ్భంధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ, జనసేన,వామపక్షాలు, ప్రజాసంఘాలతో సహా అందరు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి ఎన్నో హామీలు ఇచ్చాయని కానీ ఇంతవరకూ అవి నెరవేరకపోవటంపై ఏపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానాలు పెట్టినా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరి సరైందరని కాదనీ..మరోపక్క ఈ పార్టీలు బైట ఒకలా లోపల ఒకలా వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్దులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆందోళన చేయాలని రాజకీయ పక్షాలు పిలుపునిచ్చాయి. అలాగే సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు కలిగించకుండా ఆందోళన కొనసాగించాలని అఖిల పక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ హెచ్ ల దిగ్భంధం కొనసాగుతోంది. కాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ఆందోళన చేపట్టినా సహకరిస్తామని అధికార టీడీపీ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాంతియుతంగా ఆందోళన కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. 

మూడు పార్టీలు ముప్పేట దాడి : చంద్రబాబు

అమరావతి : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలను ఇవ్వాలని, న్యాయంగా ఏపీకి రావాల్సిన హక్కులను అడుగుతుంటే కేంద్రం తనపై ఎదురు దాడి చేస్తున్నాయని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ నసేన, వైసీపీ పార్టీలు కలిసి ఏపీపై, తనపై ముప్పేట దాడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి ఏడాదినుంచే గొడవలు పెట్టుకుంటే రాష్ట్రం దెబ్బతింటుందనే ఇన్నాళ్లూ ఓపికపట్టామని, కనీసం చివరి బడ్జెట్‌లోనైనా ఏపీకి న్యాయం చేస్తారని ఎదురు చూశామని.. ఆ బడ్జెట్ కూడా నిరాశపరిచిందని అన్నారు.

అన్నింటికీ సిద్ధంగా వుండాలి : బాబు

అమరావతి : కేంద్రం ఏపీపై కక్ష సాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయని, అన్నింటికీ అందరూ సిధ్ధంగా ఉండాలని, ప్రజలను చైతన్యపరచాలని సీఎం పార్టీ నేతలకు సూచించారు. తనను, లోకేష్‌ను, మంత్రులను, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాల కేంద్రం ఆదుకుంటుందన్న ఉద్దేశంతోనే ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్నామని, నాలుగేళ్లు ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

10:25 - March 22, 2018

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సంతృప్తికరంగా లేవని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన వాటిని నివృత్తి చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. కేంద్రం నిధులు  ఇచ్చామని చెబుతుందని.. రాష్ట్రం ఇవ్వలేదంటుందని అన్నారు. రాష్ట్రంపై కేంద్రం పూర్తిగా వివక్ష చూపుతుందని చెప్పారు.  

 

'రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి`

ఢిల్లీ : బాబూ రాజేంద్రపరసాద్ వ్యాఖ్యలు నాతో సహా సినీ పరిశ్రమలోని అందరినీ బాధ కలిగించాయని నటుడు, నిర్మాత, టీడీపీ ఎంపీ అయిన మురళీ మోహన్ తెలిపారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సినీ పరిశ్రమలోని వ్యక్తులు స్పందించటంలేదని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  

10:11 - March 22, 2018

గుంటూరు : రాష్ట్రానికి నిధులు ఇవ్వని మోడీపై సీబీఐ ఎంక్వైరి వేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఏ1 తిరుగుతున్న జగన్, ఏ 2గా తిరుగుతున్న విజయసాయిరెడ్డి లను మోడీ ఏమీ అనరని..కానీ ఎలాంటి అవినీతి లేని చంద్రబాబుపై మాత్రం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎవరూ ప్రశ్నించవద్దని మోడీ అంటున్నారని తెలిపారు. ఢిల్లీలో అన్నాడిఎంకే, టీఆర్ఎస్ లతో, రాష్ట్రంలో వైసీపీ, పవన్ కళ్యాణ్ లతో బీజేపీ ఆటలాడిస్తుందని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని వాపోయారు. లక్షల కోట్ల అవినీతి చేసిన జగన్ ను మోడీ ఏమీ అనరని అన్నారు. పెద్ద స్కాం చేసిన కనిమొళి, రాజాలకు క్లీన్ చీట్ ఇచ్చారని తెలిపారు. బ్యాంకులను లూటీ చేసి... నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలు విదేశాలకు వెళ్లారని అన్నారు. తాము ఎవ్వరికీ భయపడమని... నీతి వంతమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకహోదా ఏపీ హక్కు అన్నారు.

 

హోదా పోరు ఉదృతం..

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని..విభజన హామీలు నెరవేర్చాలనే డిమాండ్ తో అఖిల పక్షం పోరుబాటు పట్టింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకూ జాతీయ రహదారులనుదిగ్భంధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ, జనసేన,వామపక్షాలు, ప్రజాసంఘాలతో సహా అధికారంలో వున్న టీడీపీ పార్టీ కూడా పాల్గొనటం విశేషం.

10:07 - March 22, 2018

ఢిల్లీ : పార్లమెంటులో టీడీపీ, వైసీపీలు ఐదో రోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. సభ ఆర్డర్‌లో ఉందని భావిస్తేనే స్పీకర్‌ అవిశ్వాస తీర్మానం స్వీకరించే అవకాశం ఉంది. ఆందోళన చేస్తున్న టిఆర్ఎస్,ఎఐడిఎంకే ఎంపీలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారు.

 

10:05 - March 22, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఎంఎంటిఎస్‌ రెండో దశ పనులు, రైతు సమన్వయ సమితుల పనితీరు, సింగరేణి కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు, జీహెచ్‌ఎంసి బాండ్ల ద్వారా నిధుల సమీకరణపై సభలో చర్చ జరగనుంది.

 

09:59 - March 22, 2018

గుంటూరు : పార్లమెంట్‌, అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో టీడీపీ ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేంద్రం అవిశ్వాసం చేపట్టకుండా పదేపదే వాయిదాలు వేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వమని అడిగితే కేంద్రం తమపై ఎదురు దాడికి దిగుతుందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు సీఎం. ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. కేంద్రం మాట తప్పిందన్నారు. 

09:53 - March 22, 2018

ఏలూరు : ఏపీలో ప్రత్యేకహోదా పోరు కొనసాగుతోంది. యువత, సామాన్య ప్రజలను కదలించే దిశగా రాజకీయపార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇవాళ జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయించాయి. రహదారుల దిగ్బంధానికి వైసీపీ, జనసేన, వామపక్షాలు, టీడీపీలు సంఘీభావం ప్రకటించాయి. శాంతియుతంగా ఆందోళన చేయాలని టీడీపీ సూచించింది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఆందోళన చేయాలని రాజకీయపక్షాలు సూచించాయి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

గుంటూరు : ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్, అసెంబ్లీ పరిణామాలపై మాట్లాడారు. అవిశ్వాసం పెట్టకుండా కేంద్రం పార్లమెంట్ ను పదే పదే వాయిదా వేస్తోందని అన్నారు. కేంద్రం ప్రవర్తన గత కొంతకాలంగా భిన్నంగా ఉందన్నారు. 

 

ఏపీ అసెంబ్లీలో నేటి ప్రశ్నోత్తరాలు

గుంటూరు : నేడు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలపై చర్చ జరుగనుంది. అల్పాదాయ వర్గాలకు గృహనిర్మాణం, శిల్పారామాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఆడశిశువులకు ఆర్థికసాయం, మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై చర్చ చేపట్టనున్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన, రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాల ఏర్పాటుపై చర్చ చేయనున్నారు. రైతులకు పట్టాల పంపిణీపై అత్యవసర ప్రజాప్రయోజనాల నోటీసు, చర్చ ఉంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త అంగన్ వాడీలపై చర్చ జరుగనుంది.  

08:41 - March 22, 2018

గుంటూరు : నేడు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలపై చర్చ జరుగనుంది. అల్పాదాయ వర్గాలకు గృహనిర్మాణం, శిల్పారామాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఆడశిశువులకు ఆర్థికసాయం, మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై చర్చ చేపట్టనున్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన, రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాల ఏర్పాటుపై చర్చ చేయనున్నారు. రైతులకు పట్టాల పంపిణీపై అత్యవసర ప్రజాప్రయోజనాల నోటీసు, చర్చ ఉంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త అంగన్ వాడీలపై చర్చ జరుగనుంది. 

ఏపీలో కొనసాగుతోన్న ప్రత్యేకహోదా పోరు

విజయవాడ : ఏపీలో ప్రత్యేకహోదా పోరు కొనసాగుతోంది. యువత, సామాన్య ప్రజలను కదలించే దిశగా రాజకీయపార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇవాళ జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయించాయి. రహదారుల దిగ్బంధానికి వైసీపీ, జనసేన, వామపక్షాలు, టీడీపీలు సంఘీభావం ప్రకటించాయి. శాంతియుతంగా ఆందోళన చేయాలని టీడీపీ సూచించింది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఆందోళన చేయాలని రాజకీయపక్షాలు సూచించాయి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నారు. 

08:26 - March 22, 2018

విజయవాడ : ఏపీలో ప్రత్యేకహోదా పోరు కొనసాగుతోంది. యువత, సామాన్య ప్రజలను కదలించే దిశగా రాజకీయపార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇవాళ జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయించాయి. రహదారుల దిగ్బంధానికి వైసీపీ, జనసేన, వామపక్షాలు, టీడీపీలు సంఘీభావం ప్రకటించాయి. శాంతియుతంగా ఆందోళన చేయాలని టీడీపీ సూచించింది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఆందోళన చేయాలని రాజకీయపక్షాలు సూచించాయి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:12 - March 22, 2018

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగరంలో ఓపెన్‌ లాండ్స్‌ను వినియోగించేందుకు  జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. నిరూపయోగంగా ఉన్న ప్రైవేట్‌ ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ ఏర్పాటుకు యోచిస్తోంది. అలాగే ఓపెన్‌ ప్లాట్స్‌ ఉన్నవారు తమ స్థలాల్లో పార్కింగ్‌ కల్పించేందుకు అవకాశమిస్తోంది. ఖాళీ స్థలాలను వినియోగంలోకి తేవడమే కాకుండా... తక్కువ రుసుముతో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతోంది బల్దియా. 
చెత్త సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం  
భాగ్యనగరంలో చెత్త సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్న 11 వేలకుపైగా ఓపెన్‌ గార్బెజ్‌ పాయింట్స్‌ను తొలగించిన బల్దియా అధికారులు... ఇతర ప్రాంతాలపై దృష్టి సారించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, నిర్మాణాలు చేయకుండా ఉన్న ప్లాట్లలో భారీ ఎత్తున చెత్త పేరుకుపోతుంది. ఇలాంటి ప్రాంతాల్లో చిరు వ్యాపారులు... స్థానికులు సైతం చెత్తను వేయడంతో ప్రజలు దుర్వాసనతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు గ్రేటర్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 
ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ఉండేందుకు చర్యలు
నగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి. ఎక్కడ అయితే చెత్త సమస్య ఉందో.. అక్కడ సామాజిక స్పృహ ఉన్నవారిని స్వచ్ఛ అంబాసిడర్లుగా నియమిస్తామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బల్దియాకు చెందిన సూపర్‌వైజర్లను నియమించి అక్కడ చెత్త వేయకుండా స్థానికులకు కౌన్సిలింగ్‌ ఇస్తామన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు పెంచడం లేదా చిన్న చిన్న గేమ్స్‌కు వినియోగించే అవకాశాలను పరిశీలించనున్నారు. 
విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్‌ 
ఇక నగరంలో రోజురోజుకు ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజు దాదాపు 45 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇక అనేక ప్రాంతాల్లో పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ఫుట్‌పాత్‌లపై కూడా వాహనాలు నిలపడంతో పాదాచారులు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్యపై దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ... గ్రేటర్‌లో ఖాళీగా ఉన్న వివిధ స్థలాలను పార్కింగ్‌ యార్డులుగా ఉపయోగించాలని యోచిస్తున్నారు. గతంలో మల్టీలెవల్‌ పార్కింగ్‌ భవనాల నిర్మాణాల కోసం ప్రణాళికలు రూపొందించినా... సక్సెస్‌ కాకపోవడంతో కొత్త తరహా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
పార్కింగ్‌ యార్డులకు అనుకూలంగా 56,660 స్థలాలు
నగరంలో పార్కింగ్‌ యార్డులకు 56,660 స్థలాలు అనుకూలంగా ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. 41,550 ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, 15,110 ప్రాంతాల్లో ఫోర్‌వీలర్స్‌ వాహనాలు పార్క్‌ చేయవచ్చు. వివిధ ప్రాంతాల్లో ఈ స్థలాలు ఉండడంతో ఆయా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన స్థలాల్లో కూడా పార్కింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. టూవీలర్స్‌కు 2 గంటల వరకు 10 రూపాయలు, తరువాత ప్రతి రెండు గంటలకు ఐదు రూపాయలు వసూలు చేసుకునేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు. అదేవిధంగా ఫోర్‌ వీలర్స్‌కు మొదటి రెండు గంటలకు 20 రూపాయలు, తరువాతి ప్రతి రెండు గంటలకు ఐదు రూపాయలు వసూలు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పార్కింగ్‌కు అనుకూలంగా ఉన్న ప్రైవేట్‌ వ్యక్తుల స్థలాల్లో పార్కింగ్‌కు ప్రత్యేక లైసెన్స్‌ విధానాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈవిధంగా పార్కింగ్‌ ఏర్పాటు చేసేవారికి ఆస్తిపన్నులో కూడా మినహాయింపు ఇస్తామంటున్నారు అధికారులు.
జీహెచ్‌ఎంసీ కార్యక్రమాలపై స్పందన కరువు
అయితే... జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా స్పందన ఉండడం లేదు. ఇదిలావుంటే... కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతున్న వారు.. తమకు అదనపు అంతస్తులు నిర్మించుకోవడం కోసం అనుమతులు ఇస్తే పార్కింగ్‌కు తమ స్థలం కేటాయిస్తామని నగరవాసులంటున్నారు. అయితే దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. 

07:58 - March 22, 2018

హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధి ఉదారంగా సాయం అందించాల్సిన కేంద్రం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు కేంద్రాన్ని 24వేల కోట్ల సాయం అడిగామన్నారు. కాని మోదీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ అప్పుల పాలైందనడం సరికాదన్న కేసీఆర్‌.. బీజేపీ అధికారంలో ఉన్న 21 రాష్ర్టాలు అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి అప్పులు చేస్తే తప్పేంటి అని అన్నారు. 
రెవెన్యూలో 22 శాతం అభివృద్ధి సాధించాం : సీఎం 
తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర రెవెన్యూలో 22 శాతం అభివృద్ధిని సాధించామని తెలిపారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చకు సమాధానం చెప్పిన సీఎం ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్‌ను విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకోవాలన్నారు. బడ్జెట్ అంకెల గారడీ అనడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని మాట్లాడటాన్ని సీఎం తప్పుపట్టారు. దేశం 82 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని.. అందులో మోదీ ప్రభుత్వం రూ. 24 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 21 రాష్ర్టాలు అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి అప్పులు చేస్తే తప్పేంటి అని అన్నారు. నిధులు ఉంటేనే ప్రగతి సాధ్యమన్న కేసీఆర్‌.. అన్ని అర్హతలు ఉండి పైరవీలు చేస్తే గాని కేంద్రం వద్ద పనులు జరగడం లేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ. 24 వేల కోట్లు అడిగితే 24 రూపాయాలు కూడా ఇవ్వలేదన్నారు. ఈ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ చెప్పినా కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం అన్నారు. 
ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేశాం : మంత్రి హరీష్‌రావు 
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేసేందుకే ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేశామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శాసనసభలో చెప్పారు. భవిష్యత్‌లో ఈ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే భాండాగారంగా మారాలని ఆకాంక్షించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం విపరీతంగా పెంచారని.. కొన్ని ప్రాజెక్టులకు డీపీఆర్ కూడా ఉండటం లేదన్న.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను హరీష్‌రావు ఖండించారు. 
నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం మొండివైఖరి : ఈటల 
తెలంగాణ ప్రభుత్వం మానవీయకోణంలో ప్రజల కష్టాలను దూరం చేసేలా పథకాలు రూపొందించిందని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కొత్తరాష్ట్రమైన తెలంగాణకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం మొండివైఖరి అవలంబిస్తున్నదని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఇక్కడ విమర్శలు చేసేకంటే కేంద్రంపై ఒత్తిడిచేసి నిధులు రాబట్టాలని సూచించారు. 
సభలో ప్రశ్నలు లేవనెత్తిన విపక్షాలు 
రేషన్‌కార్డులు, రైతు రుణాల రీషెడ్యూల్‌ తదితర అంశాలపై విపక్షాలు సభలో ప్రశ్నలు లేవనెత్తాయి. మొత్తానికి ప్రధాన ప్రతిపక్షం లేకుండానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 

 

07:54 - March 22, 2018

విజయవాడ : స్పెషల్ స్టేటస్‌ కోసం ఇవాళ ఏపీలో ప్రత్యేక హోదా సాధన నేతృత్వంలో జాతీయ రహదారుల దిగ్బంధం జరగనుంది. రాజకీయాలకు అతీతంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని వామపక్ష నేతలు కోరారు. విద్యార్థుల పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల దిగ్బంధం చేస్తామని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని వారు తెలిపారు.

 

07:50 - March 22, 2018

గుంటూరు : రాష్ట్రం కోసం ప్రతిపక్షాలతో సహా ఎవరు ఆందోళనలు చేపట్టినా.. సహకరిస్తామన్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు. అవిశ్వాసంపై చర్చిండానికి కేంద్రానికి ఏం ఇబ్బందని ప్రశ్నించారు. మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. కేవలం పార్లమెంటు సాక్షిగా జరిగిన చట్టం అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు. అమరావతిలో అంగన్‌ వాడీ కార్యకర్తల... సాధికార మిత్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

07:48 - March 22, 2018

ఢిల్లీ : నాలుగు రోజులు.. 8 అవిశ్వాసాలు.. నిర్ణయం మాత్రం మళ్లీ అదే. పార్లమెంట్‌లో నాలుగురోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు అవిశ్వాస తీర్మానాలు పెట్టడం.. సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్‌ వాయిదా వేయడం రిపీటవుతోంది. అవిశ్వాసంపై ఓటింగ్‌ జరిపే వరకు.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని టీడీపీ, వైసీపీ అంటుండగా.. కేంద్రం మాత్రం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపింది. 
పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదా 
అవిశ్వాసంపై చర్చ జరగకుండానే పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభంలోనే.. రిజర్వేషన్లపై-టీఆర్‌ఎస్‌, కావేరీ జలాలపై- ఏఐడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. పోడియాన్ని చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌. అనంతరం సభ ప్రారంభం కాగానే.. మళ్లీ టీఆర్‌ఎస్‌, ఏఐడీఎంకే ఆందోళన చేపట్టాయి. టీడీపీ ఎంపీ తోటనర్సింహులు, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస నోటీసులను స్పీకర్‌ చదివి వినిపించారు. సభ ఆర్డర్‌లో లేనికారణంగా చర్చను చేపట్టలేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌ కీలక ప్రకటన చేశారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి మోదీ సర్కార్‌ సిద్ధంగా ఉందని, ఓటింగ్‌లోనూ నెగ్గుతామన్నారు. చర్చ జరగాలంటే మాత్రం సభ ఆర్డర్‌లో ఉండాలన్నారు. సభ్యులు ఎవరిస్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ కోరినా ఫలితం లేకపోవడంతో.. సభను గురువారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ గందరగోళం 
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభం కాగానే.. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ నినదించారు. దీంతో చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను గురువారానికి వాయిదా వేశారు.
వైసీపీ, టీడీపీ ఎంపీలు ఎవరికి వారుగా ఆందోళన     
మరోవైపు పార్లమెంట్‌ వెలుపల వైసీపీ, టీడీపీ ఎంపీలు ఎవరికి వారుగా ఆందోళన చేపట్టారు. విభజన చట్టంలోని  హామీలను నెరవేర్చాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ హరిశ్చంద్రుని వేశంలో పార్లమెంట్‌కు వచ్చి నిరసన తెలిపారు. కేంద్రం హరిశ్చంద్రున్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. 
ఎన్డీయే కావాలనే సభ జరగకుండా చూస్తుంది : టీడీపీ ఎంపీలు 
నాలుగు రోజులుగా పరిణామాలను చూస్తుంటే ఎన్డీయే కావాలనే సభ జరగకుండా చూస్తుందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. తమ సహనాన్ని పరీక్షిస్తే... గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. కేంద్రానికి ధైర్యముంటే అవిశ్వాసంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. 
అప్పటివరకు నోటీసులు ఇస్తాం : వైసీపీ నేతలు 
అవిశ్వాసంపై చర్చజరిగేవరకూ నోటీసులు ఇస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. టీఆర్‌ఎస్‌, ఏఐడీఎంకే ఎంపీల ఆందోళలనను తప్పుపట్టలేమన్న వైసీపీ ఎంపీలు..  సభను ఆర్డర్‌లో పెట్టే బాధ్యత కేంద్రానిదే అన్నారు.
అవిశ్వాస తీర్మానం మాకు ప్రాధాన్యత కాదన్న టీఆర్‌ఎస్‌ 
అవిశ్వాస తీర్మానం తమకు ప్రాధాన్యత కాదని టీఆర్‌ఎస్‌ మరోసారి స్పష్టం చేసింది. పక్క రాష్ట్రం సమస్యల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. ఇతర రాష్ట్రాల ప్లకార్డులు పట్టుకోవడానికి తాము ఛీర్స్‌గర్ల్స్‌మా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
మనోజ్‌ తివారి లేఖను ఖండించిన విపక్షాలు  
సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న ఎంపీలకు నో వర్క్‌ నోపే కింద జీత, భత్యాలు నిలిపివేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనోజ్‌ తివారి కేంద్రానికి రాసిన లేఖను విపక్షాలు ఖండించాయి. తమ ప్రాంత సమస్యలపై పోరాడుతున్న తమకు ఇది వర్తించదని వైసీపీ, టీఆర్‌ఎస్‌ కొట్టిపారేశాయి.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. చెన్నై వెళ్తున్న ప్రయాణికుడు సీతారాం ఆంజనేయులు నుంచి సీఐఎఫ్ఎస్ పోలీసులు బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. సీతారాం ఆంజనేయులు ఖమ్మం వాసిగా గుర్తించారు. 

నేటి నుంచి మహిళల టీ20 ట్రైసిరీస్

హైదరాబాద్ : నేటి నుంచి మహిళల టీ20 ట్రైసిరీస్ జరుగనుంది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మధ్య టీ20 సిరీస్ కొనసాగనుంది. మార్చి 31 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 

నేటి జాతీయ రహదారుల దిగ్బంధానికి జనసేన మద్దతు

గుంటూరు : నేడు జాతీయ రహదారుల దిగ్బంధానికి వైసీపీ, అఖిలపక్షం పిలుపునిచ్చాయి. జనసేన మద్దతు తెలిపింది.

నేడు జాతీయ రహదారుల దిగ్బంధానికి వైసీపీ, అఖిలపక్షం పిలుపు

గుంటూరు : నేడు జాతీయ రహదారుల దిగ్బంధానికి వైసీపీ, అఖిలపక్షం పిలుపునిచ్చాయి. 

శాంతియుతంగా ఆందోళనలు జరపాలి : కళా వెంకట్రావు

ఢిల్లీ : ఎంపీల పోరాటానికి సంఘీభావంగా నేటి ఆందోళనలు శాంతియుతంగా జరపాలని టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. 

Don't Miss