Activities calendar

23 March 2018

21:28 - March 23, 2018

హైదరాబాద్ : విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లోని పేదలకు లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కట్టిస్తామన్నారు. మున్సిపాలిటీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని హరీశ్‌రావు ఫైరయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఆర్థికపద్దుపై చర్చ సందర్భంగా పలువురు మంత్రులు విపక్షాలపై విమర్శలకు దిగారు. మరోవైపు ప్రభుత్వాన్ని సీపీఎం, టీడీపీలు ప్రజాసమస్యలపై నిలదీశాయి.

అసెంబ్లీలో శుక్రవారమూ ఆర్థిక పద్దులపై చర్చ జరిగింది. సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు.... కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కోర్టులు, గ్రీన్‌టిబ్యునల్‌లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అక్కడ వారి ఆటలు చెల్లకపోవడంతో చివరికి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. తమది రైతు ప్రభుత్వం కాబట్టే రాష్ట్రంతో రైతుల ఆత్మహత్యలు గతేడాది కంటే 53శాతం తగ్గాయన్నారు.

అంతకుముందు... మున్సిపల్‌శాఖ పద్దుపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌... మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం 43 పట్టణాల్లో వెయ్యికోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రహదారులు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. హైదరాబాద్‌లోని పేదలకు లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు.

పంచాయతీరాజ్‌ పద్దుపై మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 5300 కోట్లతో 39 లక్షల మందికి ఆసరా ఫించన్లు అందజేస్తున్నామన్నారు. గడిచిన మూడేళ్లలో 1460 కోట్లతో హరితహారం కార్యక్రమం చేపట్టామన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా 22వేల గ్రామాలకు తాగునీరు అందించబోతున్నామని చెప్పారు.

తెలంగాణ సర్కార్‌ అధికారంలోకి వచ్చిందే నీళ్లు -నిధులు - నియామకాళ్ల హామీతోనని... ఇప్పుడు అవే మరచిపోయారని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య విమర్శించారు. నాలుగేళ్లవుతున్నా గ్రూప్స్‌తోపాటు ఇతర పోస్టులను భర్తీ చేయకపోవడంపట్ల ఆయన మండిపడ్డారు. కొలువుల నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని... వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం, వాజేడులో ఫైర్‌ స్టేషన్‌లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 100 కిలోమీటర్ల నుంచి ఫైర్‌ సిబ్బంది రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే వెంకటాపురంలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రవాణా, కమర్షియల్‌ ట్యాక్స్‌, రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించిన పద్దులను సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

21:26 - March 23, 2018

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై టీ కాంగ్రెస్‌ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేసిన ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌, కేంద్ర ఎన్నికల కమిషన్‌లకు ఫిర్యాదు చేసింది. అలాగే పార్టీ ఫిరాయింపులపై మరోసారి స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది హస్తం పార్టీ. రాజ్యసభ ఎన్నికలను టీ కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటోంది. గెలిచేందుకు సరిపడా సంఖ్యాబలం లేకపోయినా ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్‌.... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తన పంథం నెగ్గించుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌కు ఓటు వేయాలని పోలింగ్‌ ముందే విప్‌ జారీ చేసిన కాంగ్రెస్‌....పోలింగ్‌ మొదలయ్యాక తాను రచించిన వ్యూహాన్ని అమలు పరిచింది.

కాంగ్రెస్‌ పార్టీ నుండి ఇప్పటికే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, భాస్కర్‌రావు, రెడ్యానాయక్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, కోరం కనకయ్య, కాలె యాదయ్య, విఠల్‌ రెడ్డి.. మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. వీరిపై ఇప్పటికే పలుమార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌... ఫిరాయింపులపై హై కోర్టు, సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే వారిపై వేటు వేయడంలో స్పీకర్‌ కాలయాపన చేయడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో విప్‌ ధిక్కరించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లను పరిగణలోకి తీసుకోవద్దని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇన్ని రోజులు కావాలనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించిన కాంగ్రెస్‌....ఇప్పుడు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఏడుగురు ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. ఆధారాలతో సహా కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదులపై స్పీకర్‌, కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

కాంగ్రెస్ మూడు స్థానాలు కైవసం..

ఢిల్లీ : కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 3 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 1 స్థానం గెలుచుకుంది.

రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ ఏకగ్రీవం...

ఢిల్లీ : ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టిడిపి ప్రభుత్వం అవినీతి లేకుండా పరిపాలన చేస్తోందని, లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించారు. 

మహారాష్ట్ర గవర్నర్ తో జేడీ...

మహారాష్ట్ర : స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావును సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది క్లారిటీ రావడం లేదు. 

21:10 - March 23, 2018

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో జరిగిన మూడు రాజ్యసభ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, బండా ప్రకాశ్‌ విజయం సాధించారు. బండా ప్రకాశ్‌కు 33 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు చెరో 32 ఓట్లు పోలయ్యాయి.

రాజ్యసభ అభ్యర్థుల కోసం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 108 మంది ఎమ్మెల్యేలు ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే ఇందులో స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఓటును ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. కాంగ్రెస్‌ ఏజెంట్‌కు చూపించి మాధవరెడ్డి ఓటు వేశారు. దీంతో ఆయన ఓటుపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం దొంతి మాధవరెడ్డి ఓటును ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.

కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలో నిలిచిన బలరాం నాయక్‌ ఓటమి పాలయ్యారు. ఆయనకు కేవలం 10 ఓట్లే పోలయ్యాయి. దీంతో ఆయన ఓటమి చవి చూశారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్‌ పలు అభ్యంతరాలను లేవనెత్తినప్పటికీ వాటిని ఈసీ పట్టించుకోలేదు.

తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 108 మంది ఎమ్మెల్యేలే ఓటింగ్‌లో పాల్గొన్నారు. బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఆర్‌. కృష్ణయ్యతో పాటు కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ సభ్యత్వం రద్దు కారణంగా ఓటింగ్‌లో పాల్గొనలేదు. మొత్తానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుతో గులాబీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. 

ప్రపంచ స్టాక్ మార్కెట్లు వణుకుతున్నయి...

ఢిల్లీ : అమెరికా-చైనా మధ్య ఎకనమిక్ వార్.. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను వణికిస్తోంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలకు ఈ ఎఫెక్ట్ తగలడంతో.. దేశీయంగా దలాల్ స్ట్రీట్ మరోసారి బేర్ మంది. ఉదయం నుంచి బేరిష్ ట్రెండ్‌లో ఉన్న సెన్సెక్స్... చివర్లో 410 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టి 10వేల కంటే దిగువకు పడిపోయింది.

21:03 - March 23, 2018

ఢిల్లీ : ఆరో రోజు కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదాపడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌, ఏఐడీఎంకే సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రామహజన్‌ ప్రకటించారు. వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలో ప్రతిష్టంభన యథాతధంగా కొనసాగింది. కావేరి జలాలపై- ఏఐఏడీఎంకే, రిజర్వేషన్ల పెంపు, విభజన హామీలపై టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది. నిరసనల మధ్యే టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ప్రస్తావించారు. సభ సజావుగా సాగితేనే అవిశ్వాసంపై ఓటింగ్‌ సాధ్యమవుతుందని.. ఆందోళన చేస్తున్న ఎంపీలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌, ఏఐఏడీఏంకే ఎంపీలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్‌ సుమిత్రామహజన్‌ మంగళవారానికి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అటు రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. చైర్మన్‌ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలన్నింటీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీల అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. తీవ్ర గందరగోళం మధ్య సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

మరోవైపు ఎన్డీయే ప్రభుత్వంపై ఈ నెల 27న అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కార్యాలయానికి పంపారు. మంగళవారం సభా కార్యకలాపాలకు సంబంధించిన జాబితాలో తమ అవిశ్వాస నోటీసును చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పెట్టబోయే అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ధీమా వ్యక్తం చేశారు. సభలో ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్‌, ఏఐఏడీఎంకే సభ్యులతో చర్చలు జరిపి అవిశ్వాసానికి మద్దతు కూడగడుతామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని జేడీ శీలం విమర్శించారు.

పార్లమెంటు ముందు టీడీపీ, వైసీపీ ఎంపీలు ఎవరికి వారుగా ఆందోళన కొనసాగించారు. ఏపీకి ప్రత్యేహోదా, విభజన చట్టం హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సభలో అవిశ్వాస తీర్మానం చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ పార్లమెంటు ముందు రైతు వేషధారణలో నిరసకు దిగారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఏడోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. ప్రత్యేక హోదాపై చర్చ జరిగే వరకూ తమ పోరు కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చజరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో టీడీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని అన్నారు.

కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కలిశామన్నది అవాస్తవమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజ్యసభలో నమస్కారం మినహా ఆయనను ఎప్పుడూ కలవలేదన్నారు. పార్టీ డైరెక్షన్స్‌ లేకుండా జైట్లీని కలిసేది లేదన్నారు. తమపై ఆరోపణలు చేయడమే వైసీపీ పనిఅని సుజనాచౌదరి మండిపడ్డారు.

మరోవైపు బీజేపీతో కలిసి కావాలనే సభలో ఆందోళన చేస్తున్నారన్న ఆరోపణలను టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఖండించారు. రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ అన్నారు. మెజార్టీ ఉన్న బీజేపీ తమను సస్పెండ్‌ చేసి అవిశ్వాసంపై ఓటింగ్‌ జరుపుకోవచ్చని ఆయన అన్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల సమస్యలు పార్లమెంట్‌ను స్థంభింపచేస్తున్నాయి. మంగళవారం కేంద్రంపై కాంగ్రెస్‌ ప్రవేశపెట్టే అవిశ్వాసం చర్చకు వస్తుందో లేదో చూడాలి.

20:42 - March 23, 2018

నేడు భగత్ సింగ్ 87వ వర్ధంతి...దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని నెమరువేసుకున్నారు. ఆయన చూపిన స్థైర్యం..ధైర్యం కొనియాడారు. ఆయన చూపించిన మార్గంలో నడువాలని పలువురు సూచించారు. అంతేగాకుండా రాజ్ గురు..సుఖ్ దేవ్ ల వర్ధంతి కూడా. భగత్ సింగ్ నేర్పించిన స్పూర్తి ఏంటీ ? ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది ? నేటి తరం ముందుకు తీసుకెళ్లాలి ? తదితర అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో దివికుమార్ (జనసాహితి అధ్యక్షులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:40 - March 23, 2018

కాంగ్రెస్ పార్టీ మళ్లొక బహుజనుడిని బలిపశువును జేశింది.. నేను జెప్పలే మొన్న నాగం జనార్దన్ రెడ్డి సారు పార్టీ మారవోతున్నడు మారవోతున్నడు అని.. గవర్నర్ నర్సింహన్ సారును అడ్డగోల్గ తిట్టిండుగదా..? పొన్నం ప్రభాకర్..నిండు అసెంబ్లీలనేమో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం జెప్తున్నడు.. కేసీఆర్ అసొంటి తీస్మార్కాండ్లను మస్తుగ జూశిండ్రు ఈ తెలంగాణ ప్రజలు..రాచకొండ పోలీసు కమీషనర్ సారు.. నీకు హ్యాట్సాఫ్.. పోలీసులు అంటే.. నేరాలు గాకుంట.. ఓ పల్లె టూర్లె గాలిమోటర్ దిగితె ఎట్లుంటది..? ఎన్నడు గాలి మోటర్ను దగ్గరికెళ్లి సూడని జనం ఎంత పని ఉన్నా ఇడ్సిపెట్టి..ప్రజాలారా ఈ ముచ్చట మీరు బాగ ఇనాలే.. సిరిసిల్ల కాడ ఒకామెకు ముగ్గురు ఆడోల్లు గల్చిండ్రట.. సర్కారు దావఖాన ఏడున్నదని అడ్గిండ్రట..గిసొంటి ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:32 - March 23, 2018

దేశంలో రోజుకో ఆర్థిక కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఒకటి హైదరాబాద్ కేంద్రంగా తొట్టెం ఇన్‌ ఫ్రా కంపెనీ కాగా.. మరొకటి విశాఖకు చెందిన ఆన్‌రాక్. హైదరాబాద్‌ కేంద్రంగా తొట్టెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ నిర్మాణ సంస్థ... యూనియన్‌బ్యాంక్‌కు ఏకంగా ఒకవేయి 394 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టింది. మొత్తం ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంకు ఈ మొత్తం ఎగవేసినట్టు బయటపడింది. ఈ కుంభకోణంతో 400 కోట్ల ఆదాయ పన్నుకు తూట్లు పొడిచినట్టు వెల్లడయింది. తొట్టెం ఇన్‌ఫ్రా ప్రమోటర్లు తొట్టెంపూడి లలిత్‌, కవితకు వ్యతిరేకంగా యూనియన్‌బ్యాంకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. టోటెమ్‌ ఇన్‌ఫ్రా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మరోవైపు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఆన్‌ రాక్‌ సంస్థ.. రుణాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. పెన్నాగ్రూప్, రస్‌ అల్ ఖైమాల భాగస్వామ్యంతో.. ఏర్పాటు చేసిన ఆన్‌రాక్ అల్యూమినియం కంపెనీ.. బ్యాంకుల నుంచి తీసుకున్న 3వేల 461కోట్ల రుణాన్ని చెల్లించలేమంటూ చేతులెత్తిసింది. మొత్తానికి దోపిడి, సొమ్ము ఎగవేయడం, పక్కాగా మోసం చేయడం.. కొందరికి విజయ సూత్రాలుగా మారిపోయాయి. ఈ చేతగాని తనానికి బాధ్యులెవరు... పరిస్థితిని అదుపులోకి తేలేమా.. దీనిపై 10టీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో రాంబాబు (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి), రామ్ శర్మ (కాంగ్రెస్), శ్రీధర్ రెడ్డి (బిజెపి) పాల్గొని అభిప్రాయాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:28 - March 23, 2018

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తం 108 ఓట్లు పోలయ్యాయి. అందులో 107 ఓట్లు చెల్లింపయ్యాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. దీనితో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుండి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాష్, కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ బరిలో నిలిచారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. సంతోష్ కుమార్ కు 32 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్ కు 32 ఓట్లు బండ ప్రకాష్ కు 33 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు 10 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఏజెంట్ కు ఓటును స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చూపించడంతో ఆయన ఓటును పరిగణలోకి తీసుకోవద్దని ఎన్నికల కమిషన్ సూచించింది. ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:27 - March 23, 2018

మళయాళంలో 'ఆనందం' అనే పేరుతో అంతా కొత్త వాళ్లతో ఒక జర్నీ బేస్డ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి ఘనవిజయం అందుకున్న సినిమాని తెలుగులో అదే పేరుతో అనువదించారు ప్రముఖ నిర్మాత గురురాజ్. ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ..
కథ విషయానికొస్తే..ఇండస్ట్రియల్ విజిట్ కోసం బయలుదేరుతుంది ఒక స్టూడెంట్ బ్యాచ్. అయితే నాలుగు రోజుల ఈ టూర్ లో వివిద ప్లేసుల్లో ఆ స్టూడెంట్స్ మధ్య జరిగే రియలిస్టిక్ ఇన్సిడెంట్స్, పర్సనాలిటీ ఎక్స్ ప్లోరింగ్స్, బిహేవియర్ ఛేంజ్ ఓవర్స్ ని చూపిస్తూ సాగే... లైటర్ విల్ యూత్ డ్రామా ఈ ఆనందం. టెక్నీషియన్స్ విషయానికొస్తే..ఈ సినిమా డైరెక్టర్ గణేష్ రాజ్ ..యూత్ కి చాలా దగ్గరగా ఉండేలా జనరలైజ్డ్ బిహేవియర్ ని తన సినిమాలోని పాత్రలకు అనుసంధానం చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు. కథగా చెప్పుకోడానికి పరమ రొటీన్ లైన్ లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ , డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియర్స్, మూడ్స్ కాప్చర్స్ ని ఇన్ సర్ట్ చేసి ఈ సినిమాని తీర్చి దిద్దారు. అందుకే ఈ సినిమా అక్కడ ఓ మోస్టరు బడ్జెట్ లో తెరకెక్కి ఘనవిజయం అందుకుంది. అయితే తెలుగు వర్షన్ కు వచ్చేసి నేటివిటీ, సినిమా రిలీజ్ టైమ్ స్పీడ్ బ్రేకర్స్ గా మారాయి. పైగా నటీనటులంతా కొత్తవారు కావడం కూడా సినిమాకు కాస్త డిజ్ ఎడ్వాంటేజ్. అయితే కెమెరా మెన్. ఆనంద్ సి. చంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్ సచిన్ వారియర్ ల కృషి ఫలితంగా 2 గంటల సేపు చూడదగ్గ సినిమాగా మారింది ఆనందం. సినిమా రన్ టైమ్ ఈసినిమాకి పెద్ద పాజిటివ్.

నటీ నటులు...
నటీనటుల విషయానికొస్తే.. అంతా కొత్త వాళ్లు అయినా కూడా డైరెక్టర్ మైండ్ లో ఉన్న క్యారెక్టరైజేషన్ కి మాగ్జిమమ్ జస్టిస్ చేశారు. క్యూట్ అండ్ ఫ్రెష్ స్క్రీన్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రేమమ్ హీరో నివిన్ పోలీ... గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకు ప్లస్ పాయింట్. ఓవరాల్ గా చెప్పాంటే మన కళ్లముందు జరిగే కొంతమంది జీవితాల్లోని కొన్ని సంఘటనలను చూసిన ఫీల్ తీసుకొస్తంది ఆనందం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్స్ పరిచయం, వాళ్ల బిహేవియర్స్ ని ఎలివేట్ చేయడం లాగింగ్ గా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ నుంచి ఎమోషన్స్, ఫీల్ ఓరియంటెడ్ గా నడవడంతో.. ఓ ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది.

ప్లస్
లొకేషన్స్
ఆర్టిస్టుల సహజనటన
డైలాగ్స్, రన్ టైమ్
కెమెరా, మ్యూజిక్

మైనస్
జనరల్ స్టోరీ లైన్
స్క్రీన్ ప్లే లాగ్స్
ఓవర్ డ్రమటిక్ సెన్స్

పదో తరగతి పరీక్ష యదాతథం...

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష యదాతథంగా జరుగనుంది. సోమవారం శ్రీరామనవమి సెలవు ప్రకటించినా పరీక్షలో ఎలాంటి మార్పు లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. 

టి.డాక్టర్ల మెరుపు సమ్మె...

హైదరాబాద్ : తెలంగాణ డాక్టర్ల అసోసియేషన్ మెరుపు సమ్మె దిగనున్నట్లు ప్రకటించింది. ఇన్ సర్వీస్ కోటాను రద్దు చేసే జీవోలు 21, 22 రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. 

19:40 - March 23, 2018

అమెరికా : ఆస్ట్రేలియా విదేశీ ఐటి నిపుణులకు ఉద్దేశించిన 457 వీసాను రద్దు చేసింది. దీని స్థానంలో టెంపరరీ స్కిల్‌ షార్టేజ్‌ వీసాను తీసుకు వచ్చింది. మార్చి 18 నుంచి ఈ కొత్త వీసా పద్ధతి అమలులోకి వచ్చింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం భారతీయ ఐటి నిపుణులకు నిరాశ కలిగించనుంది. ఆస్ట్రేలియాలో 90వేల మంది విదేశీ ఉద్యోగుల్లో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం. నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల్లో అర్హులైన ఆస్ట్రేలియన్లు లేనిపక్షంలో వారి స్థానంలో విదేశీయులను నాలుగేళ్ల పాటు వివిధ కంపెనీలు నియమించుకునేందుకు 457 వీసా వీలు కల్పిస్తుంది. ఈ వీసా రద్దుతో అక్కడ శాశ్వత నివాసంకోసం చూస్తున్న భారతీయులకు నిజంగా చేదువార్తే. తమ దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు విదేశీయులు ఉపయోగించే వర్క్ వీసాలను రద్దు చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత‍్వం నిర్ణయించింది. 

19:34 - March 23, 2018

ముంబై : దాడుల మాస్టర్‌ మైండ్‌, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తన నేర సామ్రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న డి-కంపెనీ మెక్సికన్‌ డ్రగ్‌ కంపెనీల తరహాలో పలు అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తోంది. మాదక ద్రవ్యాల సరఫరాతో పాటు భారీ నేర సామ్రాజ్యాన్ని ఇతర రంగాలకూ విస్తరించిందని జార్జ్‌ మాసన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్‌ లూయీస్‌ షెలి అమెరికా సెనెటర్లకు వివరించారు. పలు దేశాల్లో డ్రగ్స్‌ అక్రమ వ్యాపారంతో డి-కంపెనీ శక్తివంతంగా మారిందన్నారు. మాదక ద్రవ్యాలతో పాటు ఆయుధాల సరఫరా, నకిలీ డీవీడీలు, హవాలా వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోందని షెలి పేర్కొన్నారు. దావూద్‌ కరాచీలో ఉన్నాడని భారత్‌ చెబుతుండగా... పాకిస్తాన్‌ మాత్రం తమ దేశంలో లేడని చెబుతోంది.

19:18 - March 23, 2018

వరుసగా వైవిద్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రామిసింగ్ హీరోగా మారుతున్న శ్రీ విష్ణు 'నీది నాది ఒకే కథ' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టీజర్ లోనే విభిన్న మైన సినిమా అనే పేరుతెచ్చుకున్న నీది నాది ఒకే కథ థియేటర్ లోకొచ్చింది. ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకూ రీచ్ అయ్యింది ?

కథ..
కథ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి చదువు అంటే విరక్తితో, చదవలేక ఒక పూర్ స్టూడెంట్ గా ఉంటాడు సాగర్. అయితే అతని తండ్రి స్కూల్ మాస్టర్ కావడంతో ఆయన పేరు నిలబెట్టడానికి పాస్ అవ్వాలనే పట్టుదలతో పరీక్షలు రాసి తప్పుతుంటాడు. అలా సాగిపోతున్న అతని జీవితంలోకి ధార్మిక వస్తుంది. అతన్ని మార్చడానికి ట్రై చేస్తుంది. ధార్మిక వచ్చిన తర్వాత సాగర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? చివరికి తన తండ్రి పేరు నిలబెట్టాలనే కోరిక నెరవేరిందా లేదా..వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీ నటులు..
నటీనటుల విషయానికొస్తే..4 క్యారెక్టర్స్ పిల్లర్స్ గా నటించిన ఈ కథలో శ్రీ విష్ను యాక్టింగ్ బావుంది. అతను రాయలసీమ యాసను పలికిన తీరు ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా బ్లాంక్ ఎక్స్ ప్రెషన్స్, స్లాంగ్ కంటిన్యుటీ మిస్టేక్స్ మినహా యిస్తే.. శ్రీ విష్ను డీసెంట్ పర్ ఫామెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్రలో ఉన్నంతమేర తన ఇంప్రెషన్ క్రియేట్ చెయ్యడానికి ట్రై చేసింది సాట్నాటైటిస్. ఇక హీరో తండ్రి పాత్రలో మొదటిసారి కెమెరా ముందుకొచ్చిన దేవిశ్రీప్రసాద్.. పరవాలేదని పించాడు. కాకపోతే కొన్ని చోట్ల ఇంపాక్ట్ తగ్గింది. ఇక మిగతావాళ్లంతా సినిమా మూడ్ కి తగ్గట్టు నేచురల్ పార్ ఫామెన్స్ ఇచ్చారు. టెక్నీషియన్స్ విషయానికొస్తే.. ఒక వైవిధ్య భరితమైన కథాంశాన్ని, దానిక తగ్గ బ్యాక్ డ్రాప్ ని ఎఫెక్టివ్ నెస్ చూపించే స్టార్ కాస్ట్ ని ఎంచుకునే డైరెక్టర్ కథని విస్తరించడంలో మాత్రం తడబడ్డాడు. స్క్రీన్ ప్లేలో చాలా చోట్ల మిస్టేక్స్ ఉండడంతో గందరగోళ పరిస్తితి నెలకొంది. అలానే కొన్ని చోట్ల డైరెక్టర్ అనుభవ రాహిత్యం కూడా కనిపించింది. మాటల పరంగా కూడా పరవలేదనిపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలా సౌండింగ్ బావుంది. కాకపోతే..డైరెక్టర్ ఆలోచనకు లోబడి ఆర్.ఆర్ అందించడంతో కొన్ని చోట్ల ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. సినిమా ఆద్యంతం ఒకేఫీల్ మెయిన్ టెన్ చేశాడు సినిమాటోగ్రాఫర్. నిర్మాణ విలువల్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఒక విభిన్న కథాంశంతో తెరకెక్కిన నీది నాది ఒకేకథ ఎక్కువగా హీరో క్యారెక్టర్ మీద డిపెండ్ అవ్వడం, కథనం పరంగా జరిగిన మిస్టేక్స్ వల్ల ఓ సగటు సినిమాగా నిలిచింది. మాస్ అప్పీల్ కూడా పెద్దగా లేని ఈ డిఫరెంట్ సబ్జెక్ట్ ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాల్సిందే.

ప్లస్
కాన్సెప్ట్
హీరో స్లాంగ్
మాటలు, సినిమాటోగ్రఫీ

మైనస్..
స్క్రీన్ ప్లే లోపాలు
సీన్ లాగ్స్
రొటీన్ క్లైమాక్స్
హీరో క్యారెక్టర్ గ్రాఫ్
 

19:11 - March 23, 2018

ఈ మధ్య హీరోగా కొంత గ్యాప్ ఇచ్చి ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయిన కళ్యాణ్ రామ్ మళ్లీ m.L.A అనే కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కాజల్ హీరోయిన్ గా నటించడం, టీజర్, ట్రైలర్స్ లో కామెడీ టచ్ కనిపించడం, సినిమా అంతగా భారీతనం ఉందని కన్వే అవ్వడంతో ఈసినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అలానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. రిలీజ్ కు ముందే ఇలా అంచనాలు పెంచేసిన m.L.A కి ఆడియన్స్ యునానిమస్ హిట్ ని కట్టబెట్టారా..? లేదా ఓడించారా..? అసలు ప్రేక్షకుల తీర్పు ఏంటీ ?

కథ...
కథ విషయానికొస్తే.. m.L.A మంచి లక్షణాలున్న అబ్బాయిగా అందరి చేత పిలిపించుకునే గుడ్ బిహేవియర్ ఉన్న అబ్బాయి కళ్యాణ్ ఇందుని చూడగానే ఇష్టపడతాడు. అయితే ఆమె తన బాస్ కూతురని తెలిసినా కూడా ఆమెను లవ్ లోకి దింపడానికి తన ట్రయల్స్ ను కంటిన్యూ చేస్తుంటాడు. ఆ ట్రయల్స్ లో భాగంగా కంపెనీ సైట్ ను కబ్జా చేసిన మార్దాలిని కొట్టి సైట్ ని విడిపిస్తాడు. ఆ టైమ్ లో ఇందు అతని బాస్ కూతురు కాదని తెలుస్తుంది. మరి ఇందు ఎవరు..? బాస్ కూతురిగా ఎందుకు నటించింది..? ఆమె కథ విన్న కళ్యాణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు..? అసలు m.L.A టైటిల్ కి జస్టిఫికేషన్ లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీ నటుల యాక్టింగ్...
నటీనటుల విషయానికొస్తే... చాలా కాలం తర్వాత హీరోగా కనిపించిన కళ్యాణ్ m.L.A క్యారెక్టరైజేషన్ కోసం మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్ గా మారాడు. లుక్స్ పరంగా ఎనర్జీ పరంగా సూపర్ అనిపించుకున్న కళ్యాణ్ రామ్ కామెడీ టైమింగ్ పరంగా మాత్రం తన వీక్ నెస్ ని కవర్ చెయ్యలేకపోయాడు. డాన్స్ పరంగా అలరించడానికి ట్రై చేశాడు. ఇక ఒక సగటు సినిమాలో హీరోయిన్ ఎలా బిహేవ్ చేస్తుందో... అదే లైన్ ని ఫాలో అయ్యింది కాజల్. తన యాక్టింగ్ స్కిల్స్ కి టెస్ట్ పెట్టేంత సీన్స్ ఈ సినిమాలో లేవు. గ్లామర్ పరంగా కాస్త కో ఆపరేట్ చేసింది. ఇక విలన్స్ గా రవి కిషన్, అజయ్ లుక్స్ తో, డైలాగ్స్ తో ఎఫెక్టివ్ నెస్ తీసుకురాగలిగారు. ఇక పోసాని, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, పృద్వి, ప్రభాస్ శ్రీను ఇలా టాప్ అరడజను మంది కమెడియన్స్ తమ శక్తిమేర కామెడీ పండించి m.L.A కి సపోర్ట్ అందించారు. లాస్యకి లెన్తీ రోల్ దక్కలేదు. మిగతా నటీనటులందరూ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. టెక్నీషియన్స్ విషయానికొస్తే.. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాదవ్ ఎలాంటి రిస్క్ లేకుండా పక్కా ఫార్ములా సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. ఫస్ట్ సినిమానే అయినా.. విజువలేషన్ పరంగా మెచ్యూరిటీ చూపించాడు. అయితే కథలో కానీ, కథనంలో గానీ పెద్దగా మెరుపులు కనిపించలేదు. అలా అని ఇరిటేటింగ్ అవుట్ పుట్ కూడా లేదు. తన వరకూ తాను ఓ మోస్తరు మార్కులు వేయించుకున్నాడు ఉపేంద్ర మాధవ్. మణిశర్మ తన స్తాయికి తగ్గ సంగీతాన్ని అందించలేదు. ఆర్.ఆర్ కు మాత్రం న్యాయం చేశాడు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే మొదటి నుంచి ఇది కమర్షియల్ సబ్జెక్ట్ అంటూ హింట్స్ ఇచ్చిన టీమ్, ఒక పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ ను అందించింది. కథా పరంగా వీక్ గా ఉన్న m.L.A కామెడీ పండడం వల్ల, ఫైట్స్ బావుండడం వల్ల, బీ, సీ సెంటర్స్ లో కాస్త్ స్ట్రాంగ్ గా నిలబడే చాన్సులున్నాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రం ఒక రెగ్యులర్ సినిమాగానే అనిపిస్తుంది.

ప్లస్...
స్టైలిష్ అవుట్ పుట్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు

మైనస్..
రొటీన్ కథా,కథనాలు
పెద్దగా పేలని కామెడీ
పాటలు

300 ఎలక్ట్రిక్ వాహనాలు...

విజయవాడ : ఈఈఎస్ఎల్ భాగస్వామ్యంతో పైలట్ ప్రాజెక్టుగా 300 ఎలక్ర్టిక్ వాహనాలను వినియోగించనున్నారు. 10 వేల ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీకి ఈఈఎస్ఎల్ తో ఇటీవలే ఒప్పందం కుదిరింది. వీలైనంత త్వరగా వాహనాలను సమకూర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. 

టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం...

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. సంతోష్ కుమార్ కు 32 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్ కు 32 ఓట్లు బండ ప్రకాష్ కు 33 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు 10 ఓట్లు పోలయ్యాయి. 

18:23 - March 23, 2018

ఢిల్లీ : ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు అన్నా హాజారే...ఏడేళ్ల తరువాత నిరాహార దీక్ష చేపట్టారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై మోడీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. రామ్ లీలా మైదానంలో ఆయన నిరహార దీక్ష ప్రారంభించారు. వేదికపై ఆయనొక్కరే దీక్ష చేపట్టారు. దీక్షా స్థలికి భారీగా రైతులు చేరుకుంటున్నారు. లోక్ పాల్ బిల్లు...రైతులు పండించిన మంటకు గిట్టుబాటు ధర..రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీక్ష చేపట్టారు. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుండి భారీగా రైతులు తరలివస్తున్నారు. ఆందోళనకారులను ఢిల్లీకి రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏడు సంవత్సరాల అనంతరం అన్నా దీక్ష చేపట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ ప్రభుత్వానికి 42 సార్లు లేఖలు రాసినా స్పందించకపోవడంతో దీక్ష చేపట్టారు. మరి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

కృష్ణమూర్తికి దేవాదాయ శాఖ...

విజయవాడ : ఏపీ డిప్యూటి సీఎం కృష్ణమూర్తికి దేవాదాయ శాఖ కేటాయించారు. బీజేపీ మంత్రులు రాజీనామా చేసిన తరువాత సీఎం వద్దే దేవాదాయ శాఖ, ఆరోగ్య శాఖలున్న సంగతి తెలిసిందే. 

18:08 - March 23, 2018

అనంతపురం : హంద్రీనీవా కాల్వ పనులు...తమకు నష్టపరిహారం చెల్లించాలి...అన్యాయం చేయవద్దని రైతులు వేడుకుంటున్నారు. కానీ అక్కడి అధికార యంత్రాంగం పనులు చేపట్టేందుకు పలుమార్లు సిద్ధమౌతోంది. దీనితో రైతులు ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. పరిహారం చెల్లించేదాక పనులు చేపట్టవద్దని సూచించింది. కానీ అధికారులు మాత్రం కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఉభయ రాష్ట్రాల గవర్నర్ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ హంద్రీనీవా వద్దకు చేరుకున్నారు. కాల్వ పనులు చేపట్టడంతో నిర్వాసితులు అడ్డుకున్నారు. అధికారులను నిలదీశారు. నష్టపరిహారం ఇవ్వకుండా పనులు మొదలు పెట్టవద్దని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారని విమర్శించారు. 

హంద్రీనీవా పనులను అడ్డుకున్న రైతులు...

అనంతపురం : జిల్లా పుట్టపర్తిలో హంద్రీనీవా కాలువ పనులను రైతులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు మొదలు పెట్టవద్దని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారని విమర్శించారు. 

 

కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్...

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాసేపట్లో ఫలితాలు వెలువడి కానున్నాయి. పది రాష్ట్రాల్లో 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవం కాగా ఆరు రాష్ట్రాల్లో ఓటింగ్ జరిగింది. 

ఏపీ పట్ల చిన్న చూపు - యనమల...

విజయవాడ : ఈశాన్య రాష్ట్రాలపై ప్రేమ చూపుతూ ఏపీ పట్ల కేంద్రం చిన్న చూపు చూపిస్తోందని మంత్రి యనమల పేర్కొన్నారు. ఏపీకి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని, పోలవరానికి రూ. 1400 కోట్లు ప్రకటించి రూ. 300 కోట్ల కోత విధించారని విమర్శించారు. 

17:57 - March 23, 2018

యాదాద్రికి అతి సమీపంలోని హైదరాబాద్-వరంగల్ హైవేకి దగ్గరలో.. బచ్చన్నపేటలో... 26 మలబారు, 12 ఎర్రచందనం, 12 శ్రీగంధం చెట్లతో.. 18 సంవత్సరాల మెయింటెన్స్‌తో... వెంచర్ సిద్ధమైంది. భారతీ రియల్ ఎస్టేట్ సీఎండీ జైపాల్‌రెడ్డి మరిన్ని వివరాలు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:50 - March 23, 2018
17:48 - March 23, 2018

పశ్చిమగోదావరి : నన్నయ్య యూనివర్సిటీ తమను కావాలనే పరీక్షలలో ఫెయిల్‌ చేస్తోందని ఆరోపిస్తూ.... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏలూరు-చింతలపూడి రహదారిపై ఆందోళనకు దిగారు. చింతలపూడి డిగ్రీ కళాశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2015లో వర్సిటీ సెమిస్టర్‌ విధానాన్ని ప్రారంభించిన నాటి నుండి ఫస్ట్‌ క్లాస్‌ విద్యార్థులు కూడా పరీక్షల్లో ఫెయిల్‌ అవుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రీవాల్యుయేషన్‌కు డబ్బులు కట్టితే పాస్‌ మార్కులు వేస్తున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని దీనిపై యూనివర్సిటీ వారికి తెలియజేస్తామని ప్రభుత్వ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ తెలిపారు. 

17:46 - March 23, 2018

హైదరాబాద్ : దేశంలో మరో అతి పెద్ద ఆర్థిక స్కామ్‌ బయటపడింది. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా తొట్టెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ నిర్మాణ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. యూనియన్‌ బ్యాంక్‌కు ఏకంగా ఒకవేయి 394 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టింది. మొత్తం ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంకు ఈ మొత్తం ఎగవేసినట్టు బయటపడింది. తొట్టెం ఇన్‌ ఫ్రా రుణాల ఎగవేతపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:44 - March 23, 2018

విజయవాడ : ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన కంపెనీ హీరో మోటార్స్ పరిశ్రమ శాఖ.... ఏపీలో ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దక్షిణ భారతదేశంలోనే హీరో మోటో కార్ప్ లాంటి ప్లాంట్ మరెక్కడా లేదన్నారు. ఈ పరిశ్రమ రాకతో... వేలమందికి ఉపాధి లభించనుందన్నారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు మండలం మాదనపాళెంలో నూతనంగా ఏర్పాటు కానున్న హీరో మోటార్స్ ప్లాంటుకు ముఖ్యమంత్రి ఇవాళ భూమి పూజ చేశారు. సత్యవేడు మండలం మాదన్నపాలెం గ్రామంలో 600 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సంస్థ 1,600కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. అదనంగా మరో 1,600కోట్లను సంస్థకు అనుబంధ పరికరాల తయారీ యూనిట్లపై ఇన్వెస్ట్ చేయనుంది. దీనిద్వారా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపు 15,000మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమానికి హీరో మోటర్స్ చైర్మన్ పవన్ ముంజాల్, మంత్రి అమరనాథ్ రెడ్డి హాజరైనారు.

17:42 - March 23, 2018

హైదరాబాద్ : పార్లమెంట్‌లో గందరగోళం మధ్యే విభజనచట్టం ఆమోదించినప్పుడు.... అవిశ్వాసంపై చర్చించేందుకు స్పీకర్‌ సిద్ధం కాకపోవడం అన్యాయం అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. ఉద్దేశపూర్వకంగానే అవిశ్వాసంపై చర్చించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంలేదన్నారు. ఏపీ ఎంపీలంతా ఒక్కరోజైనా కలిసి స్పీకర్‌ దగ్గరకు వెళ్లాలని సూచించారు. సినీనటుడు శివాజీ మాటల్లో వాస్తవం ఎంతమాత్రం లేదన్నారు ఉండవల్లి. శివాజీ చెప్పింది కేవలం సినిమాలకే పరిమితం కాని నిజ జీవితంలో జరగవన్నారు. 

16:55 - March 23, 2018

ఉత్తర్ ప్రదేశ్ : రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆ పార్టీ ఎమ్మెల్యే అనీల్ సింగ్ ఝలక్ ఇచ్చారు. తాను బీజేపీకి ఓటు వేసినట్లు స్వయంగా ఆయన మీడియాకు చెప్పడం గమనార్హం. తాను సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంట ఉన్నట్లు వెల్లడించారు. మిగతా వారు ఎవరికి ఓటు వేశారో తనకు తెలియదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఎస్పీ రాజ్యసభ సీటుకు గండి పడింది. ఒక రాజ్యసభ సీటు దక్కించుకోవడానికి 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అనీల్ సింగ్ ఓటు బీజేపీకి వెళితే బీఎస్పీకి 36 మంది మద్దతు మాత్రమే ఉంటుంది. బీఎస్పీకి ఎస్పీ, కాంగ్రెస్, అజీత్ సింగ్ మద్దతు తెలిపారు. యూపీలో పది రాజ్యసభ స్థానాలకు గాను 8 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ ధీమాతో ఉంది. 9 సీటె కొల్లగొట్టాలని చూస్తోంది. ఎస్పీ ఒక సీటు గెలుచుకోనుందని తెలుస్తోంది. 

16:33 - March 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ అన్ని మున్సిపాల్టీల్లో స్వయం సమృద్ధి మున్సిపాల్టీలుగా తయారు చేస్తున్నామని, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ శాసనసభలో మున్సిపల్ పద్దుపై ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లోని పేదలకు లక్ష ఇళ్లు కట్టిస్తామని మరోసారి స్పష్టం చేశారు. 18 ప్రాంతాల్లో బస్తీ...దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు, గండిపేటను వంద కోట్ల రూపాయలతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని..నగరంలో 280 కోట్లతో 20 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

16:29 - March 23, 2018

హైదరాబాద్ : రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాసేపట్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. పది రాష్ట్రాల్లో 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవం కాగా ఆరు రాష్ట్రాల్లో ఓటింగ్ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వస్తే మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగగా 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ముగ్గురు టీఆర్‌ఎస్‌ నుంచి ఒకరు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యే సంఖ్యాబలంను బట్టి మూడు స్థానాలు సునాయసంగా గెలిచే అవకాశం ఉంది. అయితే... కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని నిలపడంతో పోలింగ్‌ అనివార్యమైంది. 108 మంది సభ్యులు ఓటింగ్ వేసినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ సొంతంగా 65 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి చేరినవారిని కలుపుకుంటే మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఎంఐఎం కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం టీఆర్‌ఎస్‌ బలం 97. 

15:57 - March 23, 2018

వేసవికాలం వచ్చేసింది..వేడి వేడి ఎండలతో మనలోవుండే శక్తిని స్ట్రాతో లాగేసి నిస్సత్తువను కలిగించేస్తుంది. ఎర్రగా మండిపోతున్న ఎండలకు శరీరంలో వున్న తేమ అంతా హరించుకుపోతుంది. ఎంత నీరు తాగినా మళ్లీ మళ్లీ దాహం వేసి నాలుక పిడచకట్టుకుపోతుంది. దాహానికి తట్టుకోలేక శీతల పానీయాలను ఆశ్రయిస్తుంటారు. కానీ ప్రకృతి కాలాలకు అనుగుణం మనుషులకిచ్చిన పండ్లను మాత్రం మరిచిపోతుంటాం. తాత్కాలికంగా స్వాంతన కలిగించేవాటిని అధిక డబ్బులు పోసి మరీ కొనుకుని లేని పోని సమస్యలను కొని తెచ్చుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. వేసవి తాపాన్ని తగ్గించుకోవాలన్నా..హరించుకుపోతున్న శక్తిని తిరిగి పొందాలన్నా ప్రకృతికే సాధ్యం. అందుకే మనిషి శరీరానికి ఏ కాలంలో ఏ పండు ఉపయోగమో ఆకాంలో ఆపండ్లను అందించేది ప్రకృతి..మరి వేసవి కాలంలో ఏం పండ్లు తినాలో ఎలా తినాలో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వేడిని తట్టుకునేందుకు ఏం చేయాలి?..
తాపాన్ని తగ్గించుకునేందుకు పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి. నీటిని సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో నీరు హరించుకుపోతే డీ హైడ్రేషన్ వస్తుంది. అలా కాకుండా వుండాలంటే ఎక్కువగా నీరు తాగుతుండాలి. అలా డీ-హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. ఇందుకు గాను ఈ పండ్లను రోజు వారీ డైట్‌లో వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తరచు చెబుతుంటారు. అవి ఏ పండ్లో, ఎలా తీసుకోవాలో చూద్దాం..

కీరదోస ఉపయోగాలు :
కీరదోసను తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులోని లో-కెలోరీలు, ఫైబర్, యాంటీ-యాక్సిడెంట్లు, నీటి శాతం మధుమేహాన్ని తగ్గిస్తుంది. వేసవిలో రోజూ కీరదోసను తీసుకోవడం మరిచిపోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ద్రాక్ష రసం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మైగ్రేన్‌ను తగ్గించే వీటిలో పొటాషియం పుష్కలంగా వుంటుంది.
పెరుగులో ముంచిన ద్రాక్షలు కలిగించే మేలు :
పెరుగు, ద్రాక్షలకు కలిపి తీసుకుంటే పెరుగులో వుండే కాల్షియంతో పాటు ద్రాక్షలో వుండే నీరు, సిట్రిక్ యాసిడ్ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. రెండు కలిపి తీసుకోవటం వల్ల వృద్ధాప్య ఛాయలను ఇది పోగొడుతుంది. పెరుగులో ముంచిన ద్రాక్షలను స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటితో పాటు ఆరెంజ్, పుచ్చకాయ, ఆపిల్, స్ట్రాబెర్రీ, కివీ పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా వేసవికాలంలో డీ-హైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు.

శరీరం యొక్క ఆలనా పాలనా చూసేవ ఆకుకూరలు :
అలాగే వేసవిలో ప్రతి రోజు తినే ఆహారంలో ఆకుకూరలు, పెరుగు, గుడ్డు, పాలు వంటివి ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే వెల్లుల్లి వంటల్లో అధికంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి వీటిని తీసుకుని ఎంతటి ఎండనైనా మన శరీరం లెక్కచేయదు. మరి రసాయనాలు కలగలిసిన శీతల పానీయాల కంటే ప్రకృతి సహజం గా లభించే పండ్లను తీసుకుని వేసవిలో వచ్చే సమస్యలను ఎదుర్కొందాం..

15:41 - March 23, 2018
15:40 - March 23, 2018

విజయవాడ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిశామనడం అబద్ధమని టిడిపి ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. కేవలం నమస్కారమే చెబుతున్నట్లు, తమపై ఆరోపణలు చేయడం వైసీపీ పని అని విమర్శించారు. పార్టీ డెరక్షన్ లేకుండా ఎలా కలుస్తామని ప్రశ్నించారు. 

15:34 - March 23, 2018

ఆ విషయం మాకు తెలుసు : సోమిరెడ్డి

అమరావతి : మిత్ర ధర్మాన్ని పాటించటం ఎలాగో మాకు తెలుసనీ..రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే నాలుగేళ్ల అవమానాలను భరించామే తప్ప మిత్ర ధర్మం గురించి బీజేపీ మాకు చెప్పవలసిన పనిలేదని అది మాకు తెలుసని మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలకు కల్పిస్తామని మాట ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. కేంద్రానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని జగన్ విమర్శిస్తే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. 

అపరేషన్ `గరుడ'కట్టుకథ : సుధీష్ రాంబొట్ల

నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కమార్ స్పందించారు. ఆపరేషన్ గరుడ అంటు శివాజీ వ్యాఖ్యలు కట్టుకథలని బీజేపీ అధికార ప్రతినిథి సుధీష్ రాంబొట్ల పేర్కొన్నారు. ఆపరేషన్ గరుడు, ద్రవిడ అంటు హీరో శివాజీ ఊహాజనిత స్క్రిప్ట్ లను వల్లెవేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. కేంద్ర కుట్రదారులు మన రాష్ట్రంలోనే వున్నారని సుధీష్ రాంబొట్ల విమర్శించారు.  

స్పీకర్ మాటలు విడ్డూరం : ఉండవల్లి

తూ. గోదావరి : ఎంపీలను అదుపుచేయలేకపోతున్నామని స్పీకర్ అనటం విడ్డూరంగా వుందన్నారు. సభ్యులను కట్టడి చేసే అధికారం స్పీకర్ వుందన్న సంగతి స్పీకర్ కు తెలీదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన గందరగోళం మధ్యనే తీర్మానం ఆమోదించిన విషయం ఎన్డీయే ప్రభుత్వం మరిచిపోయిందా? అని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్రప్రభుత్వం అడ్డుకుంటోందనీ ..ఇదంతా వ్యూహాత్మకంగానే ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉండవల్లి విమర్శించారు.

15:15 - March 23, 2018

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. వేటు పడుతున్న వారందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇటీలే దేశ రాజధానిలో అధికారంలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంశాలను రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పార్లమెంటరీ సెక్రటరీలుగా ఉంటున్నారని తెలిపింది. దీనిపై సవాల్ వేస్తూ ఎమ్మెల్యేలు హైకోర్టు మెట్లు ఎక్కారు. శుక్రవారం ఇచ్చిన తీర్పుతో ఆప్ ఎమ్మెల్యేలు సంబరాలు జరుకున్నారు. 

ఏపీ ఆటో మొబైల్ హబ్ గా లక్ష్యం : చంద్రబాబు

అనంతపురం : రాష్ట్రాన్ని ఆటో మొబైల్ హబ్ గా మార్చాలను లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దాని కోసం అపోతో టైర్స్ తో పాటు అశోక్ లైలాండ్ కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. పెట్టుబడి పెట్టే సంస్థలకు అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రంలో నీటి కొరత లేదనీ..దీంతో పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడదని స్పష్టం చేశారు. 

15:04 - March 23, 2018
14:59 - March 23, 2018

హైదరాబాద్‌ : మహానగరంలో ఓపెన్‌ లాండ్స్‌ను వినియోగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. నిరూపయోగంగా ఉన్న ప్రైవేట్‌ ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ ఏర్పాటుకు యోచిస్తోంది. అలాగే ఓపెన్‌ ప్లాట్స్‌ ఉన్నవారు తమ స్థలాల్లో పార్కింగ్‌ కల్పించేందుకు అవకాశమిస్తోంది. ఖాళీ స్థలాలను వినియోగంలోకి తేవడమే కాకుండా... తక్కువ రుసుముతో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతోంది బల్దియా. భాగ్యనగరంలో చెత్త సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్న 11 వేలకుపైగా ఓపెన్‌ గార్బెజ్‌ పాయింట్స్‌ను తొలగించిన బల్దియా అధికారులు... ఇతర ప్రాంతాలపై దృష్టి సారించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, నిర్మాణాలు చేయకుండా ఉన్న ప్లాట్లలో భారీ ఎత్తున చెత్త పేరుకుపోతుంది. ఇలాంటి ప్రాంతాల్లో చిరు వ్యాపారులు... స్థానికులు సైతం చెత్తను వేయడంతో ప్రజలు దుర్వాసనతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు గ్రేటర్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

నగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి. ఎక్కడ అయితే చెత్త సమస్య ఉందో.. అక్కడ సామాజిక స్పృహ ఉన్నవారిని స్వచ్ఛ అంబాసిడర్లుగా నియమిస్తామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బల్దియాకు చెందిన సూపర్‌వైజర్లను నియమించి అక్కడ చెత్త వేయకుండా స్థానికులకు కౌన్సిలింగ్‌ ఇస్తామన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు పెంచడం లేదా చిన్న చిన్న గేమ్స్‌కు వినియోగించే అవకాశాలను పరిశీలించనున్నారు.

ఇక నగరంలో రోజురోజుకు ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజు దాదాపు 45 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇక అనేక ప్రాంతాల్లో పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ఫుట్‌పాత్‌లపై కూడా వాహనాలు నిలపడంతో పాదాచారులు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్యపై దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ... గ్రేటర్‌లో ఖాళీగా ఉన్న వివిధ స్థలాలను పార్కింగ్‌ యార్డులుగా ఉపయోగించాలని యోచిస్తున్నారు. గతంలో మల్టీలెవల్‌ పార్కింగ్‌ భవనాల నిర్మాణాల కోసం ప్రణాళికలు రూపొందించినా... సక్సెస్‌ కాకపోవడంతో కొత్త తరహా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

నగరంలో పార్కింగ్‌ యార్డులకు 56,660 స్థలాలు అనుకూలంగా ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. 41,550 ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, 15,110 ప్రాంతాల్లో ఫోర్‌వీలర్స్‌ వాహనాలు పార్క్‌ చేయవచ్చు. వివిధ ప్రాంతాల్లో ఈ స్థలాలు ఉండడంతో ఆయా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన స్థలాల్లో కూడా పార్కింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. టూవీలర్స్‌కు 2 గంటల వరకు 10 రూపాయలు, తరువాత ప్రతి రెండు గంటలకు ఐదు రూపాయలు వసూలు చేసుకునేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు. అదేవిధంగా ఫోర్‌ వీలర్స్‌కు మొదటి రెండు గంటలకు 20 రూపాయలు, తరువాతి ప్రతి రెండు గంటలకు ఐదు రూపాయలు వసూలు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పార్కింగ్‌కు అనుకూలంగా ఉన్న ప్రైవేట్‌ వ్యక్తుల స్థలాల్లో పార్కింగ్‌కు ప్రత్యేక లైసెన్స్‌ విధానాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈవిధంగా పార్కింగ్‌ ఏర్పాటు చేసేవారికి ఆస్తిపన్నులో కూడా మినహాయింపు ఇస్తామంటున్నారు అధికారులు.

అయితే... జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా స్పందన ఉండడం లేదు. ఇదిలావుంటే... కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతున్న వారు.. తమకు అదనపు అంతస్తులు నిర్మించుకోవడం కోసం అనుమతులు ఇస్తే పార్కింగ్‌కు తమ స్థలం కేటాయిస్తామని నగరవాసులంటున్నారు. అయితే దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. 

14:56 - March 23, 2018

హైదరాబాద్ : దేశంలో ఆర్థిక నేరగాళ్ల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా టొటెమ్‌ ఇన్‌ఫ్రా అనే కాంట్రాక్ట్‌ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. యూనియన్‌ బ్యాంక్‌కు ఏకంగా 1394కోట్లకు కుచ్చుటోపీ పెట్టింది. మొత్తం ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంకు ఈ మొత్తం ఎగవేసినట్టు బయటపడింది. ఈ కుంభకోణంతో 400 కోట్ల ఆదాయ పన్నుకు తూట్లు పొడిచినట్టు వెల్లడయింది. టొటెమ్‌ ఇన్‌ఫ్రా ప్రమోటర్లు తొట్టెంపూడి లలిత్‌, కవితకు వ్యతిరేకంగా యూనియన్‌బ్యాంకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. టోటెమ్‌ ఇన్‌ఫ్రా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. 

14:54 - March 23, 2018

విజయవాడ : దేశంలో వందశాతం మోబైల్స్‌ తయారయితే అందులో 20 శాతం ఏపీలోనే తయారవుతున్నాయన్నారు మంత్రి లోకేష్‌. రిలయన్స్‌ పెట్టుబడులతో ఈ సంఖ్యను 50 శాతానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రానికి అనేక కొత్త కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. తిరుపతిలో 100 ఎకరాలలో ఎలక్ట్రానిక్‌ తయారీ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 

14:53 - March 23, 2018

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు మరోసారి ఫిర్యాదు చేశామన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. తాము పార్టీ ఫిరాయించినట్టు కొందరు ఎమ్మెల్యేలు సభలోనే ప్రకటించినా.. వారిపై స్పీకర్‌ ఎందుకు చర్యలు తీసుకోవాడంలేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు. 

ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట..

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 20మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును ఢిల్లీ హైకోర్టు పక్కనపెట్టింది. లాభదాయక పదవుల వ్యవహారంలో ఆప్ ఎమ్మెల్యేలపై గతంలో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీనిపై విచారణను కోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది.

14:50 - March 23, 2018

న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానం..ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు తదితర సమస్యలు పరిష్కరించాలంటూ వైసీపీ..టిడిపి అవిశ్వాస తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా లోక్ సభలో ఇతర విపక్ష పార్టీలు ఆందోళన చేపడుతుండడంతో సభ ఆర్డర్ లేకపోవడంతో తీర్మానం టేకప్ చేయడం లేదని స్పీకర్ ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం ఏపీ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. లోక్ సభా సెక్రటరీ జనరల్ కు అవిశ్వాస నోటీసును పంపించింది. మంగళవారం నాడు జరిగే సభా కార్యకలాపాల్లో అవిశ్వాసం నోటీసు చేర్చాలని కాంగ్రెస్ కోరింది. ఏపీ సమస్యలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందని, ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చేలా ఇతర పార్టీలను ఒప్పిస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా టెన్ టివితో జేడీ శీలం మాట్లాడారు. ఏ నాడు పార్లమెంట్ లో అభివృద్ధిపై ప్రధాన మంత్రి మోడీ మాట్లాడలేదని, కేవలం కాంగ్రెస్ నేతలను తిట్టడమే పని పెట్టుకున్నారని విమర్శించారు. ఏం చేశారో ? ఎలాంటి అభివృద్ధి చేశారో పార్లమెంట్ లో చెబితే గౌరవిస్తామన్నారు. పార్లమెంట్ లో రభస..రగడ జరుగుతుంటే అఖిలపక్ష సమావేశాన్ని స్పీకర్ పిలుస్తుంటారని, సమస్య పరిష్కరించే విధంగా చొరవ తీసుకొంటారని పేర్కొన్నారు. 

పార్లమెంట్ కు కాంగ్రెస్ అవిశ్వాసం..

ఢిల్లీ : అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ సమావేశాలలో నోటీసులిచ్చింది. ఆందోళనల మధ్య గత నాలుగు రోజుల ఉభయసభలలోను కొనసాగతున్న వాయిదాల పర్వం ఈరోజుకూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారానాకి రాజ్యసభ, మంగళవారానికి లోక్ సభలు వాయిదా పడ్డాయి. కాగా ఇప్పటి వరకూ టీడీపీ,వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవిశ్వాసన తీర్మానాన్ని స్పీకర్ కు అందజేశారు.

13:57 - March 23, 2018

అనంతపురం : మహిళలు అచ్చంగా మణులే... కృషి, పట్టుదల ఉంటే సాదించలేనిది లేదని నిరూపించారు అనంతపురం జిల్లా మహిళామణులు. ఆటో డ్రైవింగ్‌తో  నెలకు  పది వేలరూపాయల సంపాదనతో... తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆదర్శంగా నిలుస్తున్నారు.. వారి ఉత్సాహాన్ని పసిగట్టిన ప్రభుత్వం, అధికారులు రెట్టింపుస్థాయిలో ప్రోత్సహిస్తున్నారు... మంత్రి పరిటాల సునీత స్వయంగా షీ ఆటోలో ప్రయాణించి మహిళా డ్రైవర్లలో మరింత ఆత్మస్థైర్యం నింపారు.
షీ ఆటో డ్రైవింగ్ శిక్షణ 
 ఆటో డ్రైవింగ్‌తో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు అనంతపురం మహిళలు..  వారి ఆసక్తిని గుర్తించిన ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. డ్వాక్రా సంఘాల్లో చేరిన మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్న ప్రభుత్వం...  డ్రైవింగ్ శిక్షణపట్ల  మహిళలు ఆసక్తి చూపడంతో.. వారికి  డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పిస్తోంది.  మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత ఆదేశాల మేరకు 32 మందికి  డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా షీ ఆటో డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. పరిటాల సునీత షీ ఆటోలో ప్రయాణించి మహిళా డ్రైవర్లలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. 
శిక్షణ పొందే మహిళలకు ఉచిత భోజనం
డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవింగ్ శిక్షణ పొందిన పలువురు డ్వాక్రా మహిళలు ఆటో నడుపుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.పేదరికం వల్ల రోజువారీ కూలీ పనులతో పాటు...ఇళ్ళలో పాచిపనులు చేసే మహిళలు ఆటో డ్రైవింగ్‌పై మక్కువ చూపుతున్నారు. దీనివల్ల తమకెంతో గౌరవం దక్కుతోందని అంటున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్... బ్యాంకు రుణం.. ఆటో 
మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు అధికారులు సైతం తోడ్పడుతున్నారు. ఆటో డ్రైవింగ్‌ పై ఆసక్తి చూపుతున్న మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు... బ్యాంకు రుణంతో ఆటో కూడా  ఇప్పిస్తున్నారు. ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల  సంపాదన ఉండాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా షీ ఆటోలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పేదరికంలో మగ్గుతున్న తమకు ఆటో డ్రైవింగ్‌ ఎంతో ఆసరగా ఉందంటున్నారు మహిళలు... పాచిపనులపై ఆధారపడ్డతమకు ఆటోడ్రైవింగ్‌తో గౌరవప్రదమైన జీవితం దక్కిందంటున్న అనంతపురం మహిళ ఆదర్శనీయం.

13:51 - March 23, 2018

హైదరాబాద్ : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఈ ప్రశ్నకు అవునన్న సమాధానమే వస్తోంది. దీనికి నేపథ్యంగానా అన్నట్లు.. ఆయన తన పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకుంటున్నారు. ఈమేరకు, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు అనుమతి లభించింది. ఏ క్షణంలో అయినా.. ఆయన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. 
ఉద్యోగ హోదాతోనే పాపులర్‌ అయిన జేడీ
జేడీ లక్ష్మీనారాయణ..! తెలుగువారందరికీ చిరపరిచితమైన పేరు. జగన్‌ అక్రమాస్తుల కేసుతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన లక్ష్మీనారాయణ.. తన ఉద్యోగ హోదాతోనే పాపులర్‌ అయ్యారు. ఎంతో ఉన్నతస్థాయికి చేరే అవకాశం ఉన్న లక్ష్మీనారాయణ.. అనూహ్యంగా స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయం తీసుకున్నారు. 
మహారాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా జేడీ
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన లక్ష్మీనారాయణ.. ప్రస్తుతం ఆ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. తన స్వచ్చంద పదవీ విరమణకు అనుమతించాలంటూ మహారాష్ట్ర డీజీపీకి లక్ష్మీనారాయణ రాసిన లేఖకు సానుకూల స్పందన కూడా లభించింది. ఈ విషయాన్ని లక్ష్మీనారాయణ వాట్సాప్‌ ద్వారా.. 10టీవీకి ధ్రువీకరించారు. 
రాజకీయాల్లో చేరతారంటూ ప్రచారం 
ఉద్యోగ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత.. లక్ష్మీనారాయణ రాజకీయాల్లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. లక్ష్మీనారాయణకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయంపై లక్ష్మీనారాయణ ఇంకా స్పందించలేదు. 

13:47 - March 23, 2018
13:46 - March 23, 2018

నిర్మల్‌ : జిల్లాలో ఖానాపూర్‌ మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షా పేపర్‌ లీకయింది. ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రశ్నాపత్రాలను ప్రింట్ చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ పాఠశాలపై దాడి చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నుండి సెల్‌ఫోన్‌ ద్వారా పేపర్‌ వచ్చిందని విచారణలో తేల్చారు. వ్యాపారవేత్తను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రశ్నాపత్రాల లీక్‌పై పలువురు మండిపడుతున్నారు. పేపర్‌ లీక్‌కు పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

13:44 - March 23, 2018

ఢిల్లీ : పార్లమెంటు ముందు టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగించారు. ఏపీకి ప్రత్యేహోదా, విభజన చట్టం హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సభలో అవిశ్వాస తీర్మానం చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. 

13:42 - March 23, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం  ప్రారంభమైన లోక్‌సభలో  ప్రతిష్టంభన యథాతధంగా కొనసాగింది. 12 గంటలకు సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకే సభ్యులు స్పీకర్‌ పోడియం వైపు దూసుకెళ్లారు. కావేరి జలాల వివాద పరిష్కారానికి బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నిరసన తెలపగా.. రిజర్వేషన్ల పెంపు, విభజన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యులు అరుపులు, కేకలతో లోక్‌సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది.  నిరసనల మధ్యే అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ప్రస్తావించారు. అవిశ్వాస తీర్మానానికి ఎంపీల మద్దతు లెక్కించడానికి సహకరించాలని స్పీకర్‌  పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా  టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకే సభ్యులు పట్టించుకోలేదు. సభ్యులు శాంతించాలని.. సభాకార్యక్రమాలను అడ్డుకోవద్దని స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ సూచించినా నిరసనలు ఆగలేదు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 
రాజ్యసభలో యథావిధిగా గందరగోళం 
రాజ్యసభలో యథావిధిగా గందరగోళం కొనసాగింది. వివిధ సమస్యలపై పలు రాష్ట్రాల ఎంపీలు నిసనకు దిగారు. చైర్మన్‌ పోడియంను చుట్టుముట్టిన టీడీపీఎంపీలు ప్లకార్డులు పట్టుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలన్నింటీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీల అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. తీవ్ర గందరగోళం మధ్య సభను సోమవారానికి  వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 

`షీ ఆటో డ్రైవింగ్ శిక్షణ'ను ప్రారంభించిన మంత్రి సునీత ..

అనంతపురం : `షీ ఆటో డ్రైవింగ్ శిక్షణ'ను మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. ఆటో డ్రైవింగ్ తోఅనంతపురంలో ఓ మహిళ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో పరిటాల సునీత సదరు మహిళతో మరికొందరి మహిళలకు ఆటో డ్రైవింగ్ లో శిక్షణనిప్పిస్తున్నారు. డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపి వస్తున్న మహిళలకు మంత్రి ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పలువురు మహిళలు ఆటో డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై మహిళలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీక్ ల పరంపర..

ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మండల కేంద్రంలో 10వ తరగతి ప్రశ్నా పత్రం లీక్ కలకలం సృష్టించింది. ఓ వ్రైవేటు స్కూల్లో ప్రశ్నాపత్రం లీక్ అవుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం క్వశ్చన్ పేపర్ ను ప్రింట్ తీస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

13:21 - March 23, 2018

హైదరాబాద్ : యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగుచూసింది. యూనియన్ బ్యాంక్ కన్సార్టియంకు టొటెమ్ ఇన్ ఫ్రా సంస్థకు కుచ్చుటోపీ పెట్టింది. టొటెమ్ ఇన్ ఫ్రా కాంట్రాక్ట్ కంపెనీ రూ.1394 కోట్లను ఎగవేసింది. రూ. 400 కోట్ల ఆదాయపన్నుకు తూట్లు పొడిచింది. యూనియన్ బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది. టొటెమ్ ఇన్ ఫ్రా ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేసింది. తొట్టెంపూడి లలిత్, కవితలను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.  

 

13:14 - March 23, 2018

సోనియాకు అస్వస్థత..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు లోనయ్యారు. కుమార్తె ప్రియాంకతో కలసి సిమ్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలవడంతో రాత్రికి రాత్రే ఆమెను చండీగఢ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ తీసుకువచ్చారు. ఆమె ఆరోగ్యపరిస్థితిని పరీక్షించన వైద్లుయు పరిస్థితి నిలకడగానే ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ రమేష్ చంద్ స్పష్టం చేశారు. 

13:03 - March 23, 2018

హైదరాబాద్ : విప్ ధిక్కరించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎన్నికల రిటర్నినింగ్ అధికారికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లను పరిగణలోకి తీసుకొవద్దని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేయాలని సీఈసీకి విన్నవించారు. 

12:54 - March 23, 2018

హైదరాబాద్ : భారతదేశంలోనే అతిపెద్ద జౌళి పార్కును వరంగల్ లో సీఎం చేతుల మీదుగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. టీశాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మెడికల్ డివైజెస్ పార్కులు, ప్లాస్టిక్ పార్కులు, సీడ్స్ పార్కులు ఏర్పాటవుతున్నాయని.. వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. డ్రైపోర్టుకు సంబంధించి అధ్యయనానికి ఈఎన్ వై సంస్థకు అప్పజెప్పామని తెలిపారు. ఆ సంస్థల నాలుగు ప్రాంతాలను సూచించారని చెప్పారు. భువనగరి.. చిట్యాల ప్రాంతం, జడ్చర్ల, జహీరాబాద్, జక్రాన్ పల్లి సూచించారని తెలిపారు. నాలుగింటిలో మొదటి ప్రాధాన్యత విజయవాడ రోడుకు ఇస్తూ..మిగతా వాటిని సూచించారు. డ్రైపోర్టు విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. చందన్ వెళ్లిలో వెల్ స్పన్, పశుపతి కంపెనీలు పెట్టేందుకు ముందుకు వచ్చారు. జహీరాబాద్ నిమ్జ్ కు 3500 వందల ఎకరాలు సేకరించామని తెలిపారు. ఎల్ ఆండ్ టీ ద్వారా మాస్టర్ ప్లాన్ చేయించామని తెలిపారు. 15 ఐటీ, ఎస్ ఈజెడ్ పార్కులు ఉన్నాయి.

 

పోలవరంపై నిర్వాశితులు సంతృప్తి : మసూద్ కమిటీ

అమరావతి : పోలవరం ప్రాజెక్టు నిర్వాశితులు సంతృప్తి వ్యక్తం చేశారు మసూద్ కమిటీ తన అభిప్రాయాన్ని తెలిపింది. ప్రాజెక్టు నిర్వాశితుల ప్రాంతమైన పైడిపాకలో కమిటీ సభ్యులు పర్యటించిన నేపథ్యంలో నిర్వాశితులనుండి సంతృప్తి వ్యక్తంమయిందని తెలిపింది. నవయుగ సంస్థ పనులు చేపట్టాక కాంక్రీటు పనుల్లో వేగం పుంజుకుందని కమిటీ తెలిపింది. రోజుకు 4800 క్యూబిక్ మీటర్ల పని జరుగుతోందని నివేదికలో పేర్కొంది. లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని పేర్కొంది. నిర్వాశితులకు పునరావాసం కల్పించటంలో అవకతవకలు జరిగాయనీ..కాంక్రీటు పనులు నాణ్యంగా జరుగుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. 

12:34 - March 23, 2018

హైదరాబాద్ : టీఅసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గుండంబా తయారీ, కొనుగోలు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనపై చర్చ జరిగింది. గుడంబా తయారీ, కొనుగోలు వృత్తి నుంచి తప్పించిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి, వారిని ఆదుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఎమ్మెల్యే సతీష్ బాబు కోరారు. సతీష్ బాబు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో 56 తండాలు ఉన్నాయి. సీఎం పిలుపుమేరకు గుడంబా తయారీ, కొనుగోలుకు స్వస్తి పలికారు. గుడంబా రహిత నియోజకవర్గంగా తయారు చేశామన్నారు. ఇప్పుడు వారికి ఉపాధి లేకుండా పోయిందని... వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరముందన్నారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ గుడంబా తయారీ, విక్రయ కుంటుబాలకు ప్రత్యామ్నాయంగా గుడంబా ప్రభావిత కుటుంబానికి 2 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదని ఆ రెండు లక్షలను సబ్బిడీ కింద ఇస్తున్నామని తెలిపారు. 

 

ఉభయసభల్లో వాయిదాల పర్వం..

ఢిల్లీ : లోక్ సభలో ఆరవరోజు కూడా వాయిదా పర్వం కొనసాగింది. ఈ క్రమంలో లోక్ సభలో సభ్యులు ఆందోళనలు కొనసాగటంతో లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారానికి వాయిదా వేశారు. ప్రారంభమయిన కొద్దిసేపటికే ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన ఉభయసభలు కొద్దిసేపటికే వాయిదాలు పడటం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఐదురోజుల నుండి ఇదే తంతు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా అదే జరిగింది. లోక్ సభ 12గంటకు వాయిదా పడగా రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.  

పోలవరంపై మసూద్ కమిటీ నివేదిక..

అమరావతి : రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపై నిరంతరం సమీక్షలను కూడా సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ నివేదికను సమర్పించింది. పనులను సమీక్షించేందుకు మసూద్ కమిటీ పైడిపాక గ్రామంలో పర్యటించింది. ప్రాజెక్టు నిర్వాశితులతో కమిటీ పలు విషయాలను అడిగి తెలుసుకుంది.అనంతరం దీనిపై ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. 

12:04 - March 23, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై రోజురోజుకూ పోరు ఉధృతం అవుతోంది. మోడీ ప్రభుత్వంపై అన్నాహజారే పోరుకు సిద్ధమయ్యారు. రైతు సమస్యలు, లోక్ పాల్ బిల్లు అంశాలపై నేటి నుంచి ఆమరణ దీక్ష చేయనున్నారు. రాజ్ ఘాట్ లో గాంధీజీకి, షహీద్ పార్క్ లో అమరవీరులకు హజారే నివాళులు అర్పించనున్నారు. రామ్ లీలా మైదాన్ లో ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. అన్నా హజారేతోపాటు దీక్షలో 6 వేల మంది పాల్గొననున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్నా హజారే తిరిగి మద్దతు కోరారు.  దీక్షకు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారని కేంద్రంపై అన్నా హజారే మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చనిపోవడానికైనా సిద్ధమే అన్నారు. 

 

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీఈసీకి కాంగ్ ఫిర్యాదు..

హైదరాబాద్ : విప్ ధిక్కరించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీలో గెలుపొంది టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే ల ఓట్లు పరిగణనలోకి తీసుకోవద్దని టీ.కాంగ్రెస్ ఎన్నికట రిటర్నింగ్ అధికారికి విజ్నప్తి చేసింది. ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేయాలని సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాగా తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు గాను ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.

యూనియన్ బ్యాంక్ లో భారీ కుంభకోణం!..

ఢిల్లీ : ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న యూనియన్ బ్యాంక్ లో భారీ కుంభకోణం బయటపడింది. యూనియన్ బ్యాంక్ కన్సార్టియంకు టొటెమ్ఇన్ ఫ్రా సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. రూ.1349 కోట్లను ఎగవేసి టొటెమ్ ఇన్ ఫ్రా కాంట్రాక్ట్ కంపెనీ యూనియన్ బ్యాంక్ కుచ్చుటోపీ పెట్టింది. రూ.400కోట్ల ఆదాయపన్నుకు తూట్లు పొడించింది సదరు సంస్థ. దీనిపై సీబీఐకు యూనియన్ బ్యాంకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టొటెమ్ ఇన్ ఫ్రా ప్రయోటర్ల ఇళ్లల్లోను, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు ప్రారంభించింది. తొట్టెంపూడి లలిత్, కవితలను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

సునజా, యనమల మధ్య ఏం జరిగింది?!..

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఎంపీ సుజనాచౌదరి, మంత్రి యనమల రామకృష్ణుడు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. రైల్వే జోన్, ఇతర అంశాలపై స్పష్టత ఇస్తామని.. తన ఛాంబర్ కి రావాలని అరుణ్ జైట్లీ తమకు సమాచారం ఇచ్చారని.. దీనిపై ఏం చేయమంటారు?అని సుజనాచౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబుని అడిగారు. దీనిపై యనమల స్పందిస్తూ.. పోరాటం చేసే సమయంలో కేంద్ర మంత్రులను కలిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డారు. హోదాతో పాటు అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్రమే అని చంద్రబాబు స్పష్టం చేశారు.

11:35 - March 23, 2018

టాలీవుడ్ లో వారసుల హవా కొత్తేమీ కాదు. ఇంచుమించుగా ప్రతీ నటుడి కుటుంబాల నుండి వారసులు వస్తునే వున్నారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే మొత్తంగా లెక్కవేస్తే ఐదుగురు హీరోలుగా నాగబాబు కుమార్తె నిహారికా హీరోయిన్ గా వచ్చిన విషయం తెలిసిందే..ఒక అక్కినేని ఫ్యామిలీలో నలుగురుహీరోలుగా కాదా ఒక హీరోయిన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇలా టాలీవుడ్ లో వారసుల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ కానున్నట్లుగా టాలీవుడ్ వర్గాల సమాచారం.

హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్న జయకృష్ణ,, అశోక్ 

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు అగ్రకథానాయకుడిగా కొనసాగుతున్నాడు. వివిధ భాషల్లో సైతం ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతూ ఉండటం విశేషం. ఇక మహేశ్ బాబు బావ అయిన సుధీర్ బాబు కూడా హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఒక వైపున మహేశ్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకైన జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో మహేశ్ బాబు మేనల్లుడు అంటే గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైపోయింది. గతంలో సుధీర్ బాబు హీరోగా 'ఆడు మగాడ్రా బుజ్జి' సినిమా చేసిన కృష్ణారెడ్డి, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాను, మే లో లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు.   

11:33 - March 23, 2018
11:31 - March 23, 2018

ఢిల్లీ : రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. ప్రారంభమైన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. సభలో విపక్షాలు ఆందోళనలు చేయడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

11:27 - March 23, 2018

ఢిల్లీ : ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్ సభ వాయిదా పడింది. అంతకముందు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు లోక్ సభ నివాళులర్పించారు. సంతాప సూచకంగా సభ్యులు లేచి నిలబడి మౌనం పాటించారు. అనంతరం విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

ఉభయసభల్లో వాయిదాల పర్వం..

ఢిల్లీ : ప్రారంభమయిన కొద్దిసేపటికే ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన ఉభయసభలు కొద్దిసేపటికే వాయిదాలు పడటం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఐదురోజుల నుండి ఇదే తంతు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా అదే జరిగింది. లోక్ సభ 12గంటకు వాయిదా పడగా రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. 

ప్రారంభమైన`పెద్దలసభ' పోలింగ్..

హైదరాబాద్ : తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు గాను ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మొత్తం మూడు స్థానాలకు గాను టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. అయితే, మూడు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రాజ్యసభ అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు రావాల్సి ఉంది. టీఆర్ఎస్ కు 80 మంది సభ్యుల బలం ఉంది. ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ లో చేరగా..ఎంఐఎం కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నటుగా తెలుస్తెంది.

11:00 - March 23, 2018

ఢిల్లీ : పార్లమెంటులో అవిశ్వాసం పోరు కొనసాగుతోంది. వరుసగా ఆరోసారి టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ప్రత్యేకహోదా, విభజన హామీలపై టీడీపీ అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. సభ ఆర్డర్ లో ఉందని భావిస్తేనే స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించనుంది. టీఆర్ ఎస్, అన్నాడీఎంకే సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని టీడీపీ అంటుంది. అవిశ్వాసానికి కేంద్రం భయపడుతోందని టీడీపీ, వైసీపీ చెప్పాయి. అవిశ్వాసానికి సీపీఎం, కాంగ్రెస్, ఇతర విపక్షాలు మద్దతు ఇవ్వనున్నాయి. తమ డిమాండ్లపై ఆందోళన కొనసాగిస్తామని టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే చెప్పాయి. 

10:59 - March 23, 2018

గుంటూరు : పార్లమెంట్ పరిణామాలపై ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎంపీంల పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఏకతాటిపై ఎంపీలంతా నిలబడాలి..రాష్ట్ర గౌరవాన్ని కాపాలాన్నారు. మనకు ఇవ్వాల్సిన వాటిలో కేంద్రం కోత పెడుతోందని తెలిపారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నదే తన బాధ అన్నారు. 

టీ.పెద్దలు వీరే..

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌కు టీఆర్‌ఎస్ ప్రతినిధిగా రమేశ్‌రెడ్డి వ్యవహరిస్తుండగా కాంగ్రెస్ తరపు ప్రతినిధిగా రేగా కాంతారావు ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులైన సంతోష్ కుమార్ ఏజెంట్‌గా గట్టు రామచంద్రరావు, బండా ప్రకాశ్ ఏజెంట్‌గా శ్రవణ్ రెడ్డి, లింగయ్య యాదవ్ ఏజెంట్‌గా రాజేశ్ వ్యవహరిస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఏజెంట్లుగా కోదండరెడ్డి, సీతక్క, మల్లు రవి ఉన్నారు.

ప్రారంభమయిన టీ.అసెంబ్లీ..

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. 

థర్డ్ ఫ్రంట్ అంత ఈజీ కాదు : ప్రకాశ్ కరత్

ఢిల్లీ : జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ గురించి సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కరత్ స్పందించారు. బీజేపీకి, కాంగ్రెస్ కు అతీతంగా మూడో కూటమిని నిర్మించడం అంత ఈజీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీల మధ్య విధానాలు, ప్రాయోజనాల్లో ఎన్నో వైరుధ్యాలు ఉంటాయని... ఇవన్నీ వాటివాటి ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తాయని తెలిపారు.ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే గొడుకు కిందకు రావడం అంత సులువు కాదని చెప్పారు. ఒకవేళ బీజేపీని ఓడించాలనుకుంటే...

యూపీఏ పతనానికి నాంది పలికిన దీక్షకుడు అన్నా..

ఢిల్లీ : కేంద్రంలో లోక్‌ పాల్‌ బిల్లు అమలు కోసం దీక్ష చేపట్టిన అన్నా హజారే ఆనాటి ప్రభుత్వం యూపీఏ పతనానికి నాంది ఆయన దీక్ష తోనే ప్రారంభమయింది. అటువంటి అన్నా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఏడేళ్ల క్రితం అవినీతిని కూకటి వేళ్లతో పెకలించాలని పేర్కొంటూ, లోక్ పాల్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. దీంతో స్కాములతో ప్రతిష్ఠ మసకబారిపోయిన యూపీఏ పెద్దలు వణికిపోయారు. దీంతోనే యూపీఏ పతనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై పోరు అనే ఎజెండాతో ప్రారంభమవుతున్న అన్నా దీక్షతో మోదీ ప్రభుత్వానికి చరమగీతం పాడనుందా?

10:38 - March 23, 2018

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 రాష్ట్రాల్లో 33 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 

అన్నా హజారే ఆమరణ దీక్ష..

ఢిల్లీ : గతంలో సుదీర్ఘకాలం దీక్ష చేసిన దేశప్రజలను ఆకట్టుకున్న అన్నా హజారే మరో దీక్షకు పూనుకున్నారు. ప్రధాని మోదీ ప్రభత్వం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అన్నాన హజారే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అన్నా తో పాటు దీక్షలో మరో ఆరువేలమంది పాల్గొననున్నారు. దీక్షకు మద్దతు కోసం ఇప్పటికే అన్నా దేశవ్యాప్తంగా అని రాష్ట్రాల్లో తిరిగి మద్దతు కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నా పేర్కొన్నారు. దీక్షకు ప్రజలనురాకుండా చేసేందుకు మోదీ ప్రజభుత్వం ప్రయత్నిస్తోందని అన్నా ఆరోపించారు.

ఎంపీలంతా ఏకతాటిపై నిలబడాలి : చంద్రబాబు

అమరావతి : రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలంతా ఏకతాటిపై నిలబడాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో దిశానిర్ధేశం చేశారు. టీడీపీ ఎంపీల పోరాటం ప్రజల్లో బలంగా వెళ్లిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన నిధులను కావాలనే కేంద్రం కోతపెడుతోందని వివరించారు. వివిధ రకాలుగా వ్యవహరించి కొందమంది రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్నారనీ..రెండు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నదే తన బాధ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

09:57 - March 23, 2018

ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

గుంటూరు : పార్లమెంట్ పరిణామాలపై ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎంపీంల పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఏకతాటిపై ఎంపీలంతా నిలబడాలి..రాష్ట్ర గౌరవాన్ని కాపాలాన్నారు. మనకు ఇవ్వాల్సిన వాటిలో కేంద్రం కోత పెడుతోందని తెలిపారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నదే తన బాధ అన్నారు. 

 

09:53 - March 23, 2018

గుంటూరు : పార్లమెంట్ పరిణామాలపై ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎంపీంల పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఏకతాటిపై ఎంపీలంతా నిలబడాలి..రాష్ట్ర గౌరవాన్ని కాపాలాన్నారు. మనకు ఇవ్వాల్సిన వాటిలో కేంద్రం కోత పెడుతోందని తెలిపారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నదే తన బాధ అన్నారు. 

 

వరుసగా ఆరోసారి టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మాన నోటీసులు

ఢిల్లీ : పార్లమెంటులో అవిశ్వాసం పోరు కొనసాగుతోంది.  వరుసగా ఆరోసారి టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ప్రత్యేకహోదా, విభజన హామీలపై టీడీపీ అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. సభ ఆర్డర్ లో ఉందని భావిస్తేనే స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించనుంది. టీఆర్ ఎస్, అన్నాడీఎంకే సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని టీడీపీ అంటుంది. అవిశ్వాసానికి కేంద్రం భయపడుతోందని టీడీపీ, వైసీపీ చెప్పాయి. అవిశ్వాసానికి సీపీఎం, కాంగ్రెస్, ఇతర విపక్షాలు మద్దతు 
ఇవ్వనున్నాయి. తమ డిమాండ్లపై ఆందోళన కొనసాగిస్తామని టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే చెప్పాయి. 

 

09:44 - March 23, 2018

ఢిల్లీ : పార్లమెంటులో అవిశ్వాసం పోరు కొనసాగుతోంది.  వరుసగా ఆరోసారి టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ప్రత్యేకహోదా, విభజన హామీలపై టీడీపీ అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. సభ ఆర్డర్ లో ఉందని భావిస్తేనే స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించనుంది. టీఆర్ ఎస్, అన్నాడీఎంకే సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని టీడీపీ అంటుంది. అవిశ్వాసానికి కేంద్రం భయపడుతోందని టీడీపీ, వైసీపీ చెప్పాయి. అవిశ్వాసానికి సీపీఎం, కాంగ్రెస్, ఇతర విపక్షాలు మద్దతు ఇవ్వనున్నాయి. తమ డిమాండ్లపై ఆందోళన కొనసాగిస్తామని టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే చెప్పాయి. 

09:35 - March 23, 2018

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 రాష్ట్రాల్లో 33 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

రాజ్యసభ ఎన్నికలు ప్రారంభం

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 రాష్ట్రాల్లో 33 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
 

08:39 - March 23, 2018

పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానంపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు.  పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై అనే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, బీజేపీ నేత విష్ణుశ్రీ, టీడీపీ నేత సూర్యప్రకాశ్ పాల్గొని, మాట్లాడారు. కేంద్రం... రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కాసేపట్లో రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్

హైదరాబాద్ : కాసేపట్లో రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు.  టీఆర్ ఎస్ నుంచి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య, బండ ప్రకాష్, కాంగ్రెస్ నుంచి బలారాం నాయక్ పోటీ చేస్తున్నారు. 

 

నేడు రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 58 రాజ్యసభ స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరగనుంది. 10 రాష్ట్రాల్లో 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా... 6 రాష్ట్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా గత మూడు రోజుల నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌  జరగనుంది. అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. 

 

08:13 - March 23, 2018

ఢిల్లీ : తాజ్‌మహల్‌ సంరక్షణకు సంబంధించి 4 నెలల్లోపు విజన్‌ డాక్యుమెంట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజ్‌మహల్‌ సంరక్షణపై కోర్టు విచారణ జరిపింది. తాజ్‌మహల్‌ సంరక్షణకు విజన్‌ డాక్యుమెంట్‌ పనులు జరుగుతున్నాయని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. గత విచారణలో తాజ్‌మహల్‌ను మరో వందేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంచేందుకు విజన్‌ డాక్యుమెంట్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు యోగి ప్రభుత్వాన్ని ఆదేశించింది.  దీనిపై 4 నెలల సమయం ఇవ్వాలని యూపి ప్రభుత్వం  సుప్రీంకోర్టును కోరింది. తాజ్‌ ట్రెపిజియం జోన్‌ 6 జిల్లాలకు విస్తరించడంతో విజన్‌ డాక్యుమెంట్‌ అద్భుత కట్టడాన్ని సంరక్షించేందుకు విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేయాలని యోగి ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

 

08:11 - March 23, 2018

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై మరో సంచలన విషయం వెలుగు చూసింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సిసిటీవీ  కెమెరాలు పనిచేయలేదు. ఈ విషయాన్ని అపోలో ఛైర్మన్ సి.ప్రతాప్‌రెడ్డి మీడియాకు స్వయంగా వెల్లడించారు. జయలలిత చికిత్సకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జస్టిస్ ఏ. ఆర్ముగస్వామి దర్యాప్తు కమిషన్‌కు సమర్పించినట్లు ఆయన తెలిపారు. జయలలిత చికిత్సకు సంబంధించిన సీటీవీ ఫుటేజ్‌ను కూడా సమర్పించారా? అని మీడియా ప్రశ్నించినపుడు సిసిటీవీలను స్విచ్‌ ఆఫ్‌ చేసిన విషయం వెలుగు చూసింది. జయలలిత చికిత్స పొందిన 75 రోజులు సీసీటీవీలను స్విచ్ ఆఫ్ చేసినట్లు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఎవరూ చూడకూడదన్న ఉద్దేశంతోనే సీసీటీవీ కెమెరాలను స్విచ్‌ ఆఫ్ చేశారని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యంత సన్నిహితులను తప్ప ఎవరినీ అనుమతించలేదన్నారు. 
 

08:09 - March 23, 2018

ఢిల్లీ : ఫేస్‌బుక్‌ సమాచారం లీకేజీ వివాదంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. ఉద్దేశ పూర్వకంగా ఈ అవాస్తవపు అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. ఇరాక్‌లో 39మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంలో కేంద్రం అబద్ధాలు ఆడుతూ దొరికిపోయిందని... ఆ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బిజెపి కాంగ్రెస్‌పై అవాస్తవ డాటా చోరీ ఆరోపణలు చేస్తోందని రాహుల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.  ఫేస్‌బుక్ డేటా ప్రైవసీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థతో రాహుల్‌ గాంధీకి సంబంధముందని బిజెపి ఆరోపించిన విషయం తెలిసిందే.

 

08:07 - March 23, 2018

ఢిల్లీ : హస్తినలో రెండు రోజులపాటు జరిగన దళిత శోషణ ముక్తి మంచ్‌ జాతీయవర్గ సమావేశాలు ముగిశాయి. దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, పెరుగుతున్న వివక్ష, ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌ యాక్ట్‌పై సుప్రీం కోర్టు తీర్పు, దళిత సమస్యలపై పోరాటాలు, భవిష్యత్తు కార్యాచరణపై డీఎస్ఎంఎం చర్చించింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ను డీఎస్ఎంఎం నేతలు రామచంద్ర డోమ్, సోమప్రసాద్, సుష్మితా బౌరి కలిశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ బలోపేతం, దళిత సమస్యల పరిష్కారం వంటి 12 డిమాండ్లతో కూడిన నివేదికను కేంద్రమంత్రికి  అందిచినట్లు డీఎస్ఎంఎం జాతీయన నాయకులు శ్రీనివాసరావు, రామచంద్రడోమ్‌ తెలిపారు. దళితుల పట్ల పెరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.

 

08:02 - March 23, 2018

హైదరాబాద్ : నీరే అన్నింటికి ప్రధానం. రోజురోజుకి అడుగంటుతున్న నీటినిల్వలను ఒడిసి పట్టుకోవాలంటే... సంరక్షణ ఒక్కటే మార్గమంటున్నారు నిపుణులు. వరల్డ్‌ వాటర్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లో 'నేచర్‌ ఫర్‌ వాటర్‌' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నీటి వినియోగంపై అవగాహన పెంచుకొని.. జాగ్రత్తగా వినియోగించుకోవాలని పలువురు సూచించారు. 
తగ్గిపోతున్న నీటి వనరులు 
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు నీటి వనరులు తగ్గిపోతున్నాయి. దీంతో నీటిని సంరక్షించుకునేందుకు ఐక్యరాజ్యసమితి 1993 నుండి ప్రతి ఏడాది మార్చి 22న వరల్డ్‌ వాటర్‌ డేగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నీటి సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేచర్‌ ఫర్‌ వాటర్‌ అనే అంశంపై హైదరాబాద్‌లోని ఇంజనీర్స్‌ ఇనిస్టిట్యూల్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 
కలుషిత నీరు..ఆరోగ్య సమస్యలు 
21వ శతాబ్ధంలోనూ లక్షలాది మందికి రక్షిత మంచినీరు అందుబాటులో లేదని.. దీంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశుద్ధ్యలోపంతో పాటు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మూడున్నర మిలియన్ల ప్రజలు చనిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రక్షిత మంచినీరు లేకపోవడం వల్ల ప్రతి 21 సెకన్లకు ఒక బిడ్డ మృత్యువాత పడుతున్నట్లు సమాచారం. ప్రపంచంలో చాలామంది వాటర్‌ రిలేటెడ్‌ డిసిజెస్‌ వల్లే ఆస్పత్రి పాలవుతున్నారు. ఇంత ప్రాధాన్యమున్న అంశాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని.. భాగ్యనగరంలోనూ రక్షిత మంచినీరు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
ఇంకుడు గుంతలు ఏర్పాటు 
ఇక హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నుండి త్రాగునీరు సరఫరా చేసేందుకు ఎంతో ఖర్చు అవుతుందని.. ఇందుకోసం నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని పలువురు సూచించారు. రోజురోజుకు అడుగంటుతున్న భూగర్భజలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జలం జీవం కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. నీటిని పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్‌లో నీటి కష్టాలు రాకుండా ఉంటాయని సదస్సుకు హాజరైన పలువురు సూచించారు. 

 

07:58 - March 23, 2018

నాగర్ కర్నూలు : నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పారు. తన అనుచరులతో కలిసి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగర్ కర్నూలులో  అనుచరులతో నిర్వహించిన సమావేశంలో  తన నిర్ణయాన్ని పక్రటించారు.  టీఆర్‌ఎస్‌ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు బీజేపీ నాయకుల అండదండలు లేవన్న బాధతోనే రాజీనామా చేసినట్టు చెప్పారు. 2013లో టీడీపీని వీడి బీజేపీలో చేరిన నాగం... అప్పటి నుంచి  కమలదళంలో కొనసాగారు.  బీజేపీకి రాజీనామా చేసిన నాగం.. కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. నాగర్‌కర్నూలు నుంచి ఐదుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాగం.. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 

 

07:55 - March 23, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో మారు మూల ప్రాంతాల ప్రజల్నిసైతం చైతన్యంతో శక్తివంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకోసం ఏర్పాటు చేసిన నైపుణ్య రథాన్ని సెక్రటేరియట్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు....  టెక్నాలజీ ఆన్ వీల్స్‌ అన్న పేరుతో..  వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
నైపుణ్యరథాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ పరంగా మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు పాటుపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆందులో భాగంగానే... వీల్స్‌ ఆన్‌ టెక్నాలజీ అన్న పేరుతో...  ఏర్పాటు చేసిన నైపుణ్యరథాన్ని సెక్రటేరియట్‌ వద్ద పచ్చజెండా ఊపి ప్రారంభించారు సీఎం. హ్యులెట్ ప్యాకర్డ్, ఎంట్రపెన్యూర్షిప్ డెవలప్‌ మెంట్ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, గైడ్ ఫౌండేషన్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ సంయుక్త నిర్వహణలో రాష్ర్టవ్యాప్తంగా ఈ నైపుణ్య రథం పరుగులు తీస్తుందన్నారు... 13 జిల్లాల్లోని 28 స్మార్ట్‌ గ్రామాల్లో ప్రాథమికంగా ప్రారంభం కానున్న ఈ నైపుణ్య రథం.. దశలవారీగా రాష్ర్టంలోని గ్రామాలకు వెళ్తుందన్నారు. 
ప్రజలవద్దకే డిజిటల్‌ ప్రయోగశాల-సీఎం చంద్రబాబు
ఇంటర్‌నెట్‌ ఆధారిత డిజిటల్‌ ప్రయోగశాలను ప్రజలవద్దకే పంపడం ద్వారా... అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో  సేవలందిస్తామన్నారు. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు సీఎం. స్మార్ట్‌ విలేజ్, స్మార్ట్‌ వార్డ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో డిజిటల్‌ లిటరసీ, డిజిటల్‌ నైపుణ్యాలు, జీవనోపాధి నైపుణ్యాలు పెంపొందిస్తామన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు కూడా ఇది దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.ఈ నైపుణ్య రథం ఒక్కో గ్రామంలో ఆరు రోజులపాటు ఉంటుంది... అక్కడ ప్రతి రోజు నాలుగు గంటలు పాఠశాల విద్యార్థులకు, మూడు గంటలు యువతకు, ఒక గంట ప్రజలకు అవసరమైన ఆధార్, మీ సేవ వంటి సేవలందిస్తుంది. మరో రెండు గంటలు ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, వాటిని పొందే విధానాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తారు..
పది లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ 
2018-2019 ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ అందించున్నారు.. ఇందుకోసం 300 కోట్ల రూపాయలను కేటాయించి, వెయ్యి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. 34 సాంకేతిక నైపుణ్య సంస్థలు, ఆరు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ కార్యక్రమాలను జర్మనీకి చెందిన సీమెన్స్‌ సంస్థ భాగస్వామ్యంతో లక్షమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం విద్యార్థులకు సాంకేతిక అంశాలపై బోధన, మధ్యాహ్నం యువకులకు నైపుణ్య శిక్షణ, సాయంత్రం ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించన సేవలు, రాత్రి వేళల్లో వినోద, ఆహ్లాదకరమైన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మేనాటికి ఇలాంటివి మరో 13 రథాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ ఏర్పాటుతోపాటు.. ప్రతి ఒక్క ఇంటికీ ఇంటర్నెట్‌, వైఫై అందిస్తూ..వీడియో కాన్ఫరెన్స్ వంటి అధునాతన సౌకర్యాలతో టెక్నాలజీ పరంగా రాష్ర్టాన్ని  వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం అంటోంది.

 

07:48 - March 23, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 58 రాజ్యసభ స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరగనుంది. 10 రాష్ట్రాల్లో 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా... 6 రాష్ట్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా గత మూడు రోజుల నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌  జరగనుంది. అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. 
58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు 
వచ్చే నెలలో ఖాళీ అవుతున్న 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. మొత్తం 16 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 58 మంది, కాంగ్రెస్‌కు 54 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా బీజేపీ తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికలు 16 రాష్ట్రాల్లో జరుగుతుండగా... 11 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక 10 రాష్ట్రాల్లో 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా... మిగతా 6 రాష్ట్రాల్లో పోలింగ్‌ జరుగుతుంది. 
ఉదయం 9 గంటలకు ఓటింగ్‌ ప్రారంభం
ఇవాళ ఉదయం 9 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన ప్రతినిధులు ఓటు వేస్తారు. సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓటుతో దామాషా ప్రకారం పరోక్ష పద్ధతిలో ఓటు వేస్తారు. ప్రతి ఓటరు తన ప్రాధాన్యతను తెలియజేస్తూ ఓటు నమోదుచేస్తారు.  ఓటింగ్‌ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. 
తెలంగాణ.. 3స్థానాలు.. 4అభ్యర్థులు పోటీ 
ఇక తెలంగాణలో మూడు స్థానాలకు గాను నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముగ్గురు టీఆర్‌ఎస్‌ నుంచి ఒకరు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యే సంఖ్యాబలంను బట్టి మూడు స్థానాలు సునాయసంగా గెలిచే అవకాశం ఉంది. అయితే... కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని నిలపడంతో పోలింగ్‌ అనివార్యమైంది. మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లపై బహిష్కరణ వేటు పడడంతో ఆ ఇద్దరు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండాపోయింది. టీఆర్‌ఎస్‌ సొంతంగా 65 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి చేరినవారిని కలుపుకుంటే మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఎంఐఎం కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం టీఆర్‌ఎస్‌ బలం 97. 
టీఆర్‌ఎస్‌ మాక్‌పోలింగ్‌ 
ఇక మూడు రోజులుగా ఎమ్మెల్యేలు ఏ అభ్యర్థికి ఓటు వేయాలో టీఆర్‌ఎస్‌ మాక్‌పోలింగ్‌ నిర్వహించింది. ఒక్కో అభ్యర్థికి 33, 32, 32 మంది చొప్పున ఓట్లు వేసే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సూచనలు చేసింది. ప్రతిపక్ష పార్టీ విప్‌ జారీ చేసినా... అధికార పార్టీలో చేరి ఎమ్మెల్యేల ఓట్లను వినియోగించుకునేందుకు టీఆర్‌ఎస్‌ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ, బీజేపీలు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి.  మొత్తానికి రాజ్యసభ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 10 రాష్ట్రాల్లో 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక యూపీ, పశ్చిమబెంగాల్‌, కర్నాటక, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో పోలింగ్‌ జరగనుంది. 

 

నేడు అనంతపురం వెళ్లనున్న గవర్నర్

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ నేడు అనంతపురం వెళ్లనున్నారు. పుట్టపర్తిలో సత్యసాయి మహా సమాధిని సందర్శించుకోనున్నారు.  

 

నేటి నుంచి ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాలు

తిరుపతి : నేటి నుంచి ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాలు జరుగనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

 

నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

చిత్తూరు : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. హీరో పరిశ్రమకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దామినేడులో గృహ సముదాయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.

 

నేడు బీజేపీ చలో అసెంబ్లీ

హైదరాబాద్ : రైతు సమస్యలపై నేడు చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. 

 

శంషాబాద్ విమానాశ్రయం సేవలు ప్రారంభమై నేటితో పదేళ్లు

రంగారెడ్డి : శంషాబాద్ విమానాశ్రయం సేవలు ప్రారంభమై నేటితో పదేళ్లు. నేడు వార్షికోత్సవానికి సీఎం, మంత్రులు హాజరుకానున్నారు. 

Don't Miss