Activities calendar

24 March 2018

21:23 - March 24, 2018

విజయనగరం : ప్రభుత్వంలో అవినీతి జరిగిందని జనసేన అధినేత పవన్‌కు అనిపిస్తే ముందు దాన్ని రుజువు చేయాలన్నారు మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక గజపతిరాజు. ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో పవన్‌ ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీని... కేంద్రం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇస్తుందో పవన్‌కే తెలియాలన్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి విజయనగరం వచ్చిన అశోక గజపతిరాజుకు... టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు నుండి విజయనగరం వరకు భారీ ర్యాలీగా వచ్చి.. విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

 

పలు బిల్లులకు టి. అసెంబ్లీ ఆమోదం...

హైదరాబాద్ : ఐదు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలుగును టెన్త్‌ వరకు తప్పనిసరి చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు...డీజీపీ నియామకం చట్టసవరణ బిల్లు...పీజీ మెడికల్ విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. పనిచేయాలనే నిబంధనలు తొలగిస్తూ చట్టసవరణ బిల్లు...న్యాయవాదులు, క్లర్కుల సంక్షేమ నిధి చట్టసవరణ బిల్లు.. అసైన్డ్ భూముల చట్టసవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

షాకు రామకృష్ణ లేఖ...

విజయవాడ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌‌షాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.

బాబును అభినందించిన మమతా...

విజయవాడ : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీటైన సమాధానం ఇచ్చారంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాబుకు సందేశం పంపారు.

ఇక తెలుగు తప్పనిసరి..

హైదరాబాద్ : తెలుగు భాషను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేస్తూ అందుకు సంబంధించిన బిల్ ను తెలంగాణ‌ శాసనసభ ఆమోదించింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ఇతర భాష పాఠశాలల్లో కూడా తెలుగు తప్పనిసరి అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్ తీసుకొచ్చామ‌ని తెలంగాణ‌ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 

21:13 - March 24, 2018

ముంబై : బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో.. మదుపరులు.. తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువ కావడంతో పసిడి ధర ఏడాది గరిష్ఠానికి చేరింది. శనివారం 10 గ్రాముల బంగారం ధర 31వేల 835 రూపాయలకు చేరింది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. వెండి ధర కిలోకు 50 రూపాయలు పెరగడంతో.. 39వేల 600 రూపాయలకు చేరింది. చైనాపై అమెరికా వాణిజ్య ఆంక్షలు పెట్టడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. దీంతో మదుపర్లు రక్షణాత్మక ధోరణిలో వ్యవహరిస్తూ బంగారంలో పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 1.37శాతం పెరిగి 1347డాలర్లు పలికింది.

21:12 - March 24, 2018

హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తెలుగు బోధన తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై జరిగిన చర్చలో వివిధ పక్షాల సభ్యులు పాల్గొన్నారు. ఆంగ్ల భాష వ్యామోహంలో పడి, మాతృ భాషను మర్చిపోతున్న తరుణంలో తల్లి భాషను కాపాడేందుకు ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందని.. బిల్లు లక్ష్యాలను కడియం శ్రీహరి వివరించారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్రవేసింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న వివిధ పక్షాల సభ్యులు.. తెలుగు అమలు కోసం పలు సూచనలు చేశారు. ప్రభుత్వ జీవోలు తెలుగులో జారీ కావడంలేదన్న అంశాన్ని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. పాఠశాలల్లో తెలుగు బోధన తప్పనిసరి చేయడానికి ముందే ఉపాధ్యాయులకు పునఃశ్చరణ శిక్షణా తరగతులు నిర్వహించాలని టీడీపీ సభ్యుడు కృష్ణయ్య సూచించారు. అన్ని స్థాయిల్లో తెలుగు సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య సూచించారు. చర్చలో పాల్గొన్న అన్ని పక్షాల సభ్యులు బిల్లుకు మద్దతు ఇవ్వడంతో మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. పాఠశాలల్లో తెలుగు బోధన తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి సభను ఆదివారానికి వాయిదా వేశారు.

21:10 - March 24, 2018
21:07 - March 24, 2018

విజయవాడ : కేంద ప్రభుత్వం ఏపీకి ఎక్కువ సహాయం చేసిందని, విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖపై చంద్రబాబు అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు. అమిత్‌ షా లేఖలో అసత్యాలు, అర్థసత్యాలు ఉన్నాయని మండిపడ్డారు. అమిత్‌ షా లేఖ హుందాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను కించపరిచేలా, రెచ్చగొట్టే విధంగా అమిత్‌ షా లేఖ ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు కేంద్రంతో పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

విభజన చట్టంలోని హామీల అమలు, కేంద్ర ప్రభుత్వ ఏపీకి చేసిన సాయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. లేఖలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించి, కేంద్రం ఏం చేసిందో వివరించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, రెవెన్యూ లోటు భర్తీ, రోడ్లకు నిధులు, రైల్వే లైన్ల మంజూరు, రాజధాని నిధులు, పోలవరం.. ఇలా అమిత్‌ షా లేఖలో ప్రస్తావించిన ప్రతి విషయంపై వివరణ ఇచ్చిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకంగా చేసిందేమీలేదన్నారు.

అమిత్‌ రాసిన 9 పేజీల లేఖలో ఎదురు దాడి మినహా ఏమీలేదని చంద్రబాబు విమర్శించారు. కట్టు కథలు, అసత్యాలు, అర్థసత్యాలతో ఏపీ ప్రజలను కించపరిచేటలా, రెచ్చగొట్టేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం టీడీపీ ఏకపక్షంగా ఎన్డీయే నుంచి బయటకొచ్చిందని లేఖలో అమిత్‌ షా చేసిన ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. అమిత్‌ షా రాసిన లేఖలో వాడిన భాష, ప్రయోగించిన పదాలు దుర్మార్గంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిన కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో బీజేపీ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ కంటే బీజేపీనే ఏపీకి ఎక్కువ అన్యాయం చేసిందన్న భావం ప్రజల్లో ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, విభజన చట్టంలోని హామీలన్నీ అమలుచేసి, ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కేంద్రంతో రాజీలేని పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు మళ్లిస్తోందని... లేఖలో అమిత్‌ షా ప్రస్తావించడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. అమిత్‌ షా వాస్తవాలను వక్రీకరించాలని, నిధులు మళ్లించాల్సిన అవసరం తమకులేదని స్పష్టం చేశారు. 

21:02 - March 24, 2018

అవిశ్వాసం అనే ఆటల పోటీలు ఏమన్న వెట్టిండ్రా...సూశిండ్రా ప్రధాన ప్రతిపక్షాలు లేకుంట అసెంబ్లీలు ఎంత అద్భుతంగ నడుస్తున్నయో..ఈ ప్రత్యేక హోదా కోసం పార్టీలతోని పోటీవడి పరేషాన్ అయితున్నరుగదా పబ్లీకు..ఇంక ఎన్ని పీన్గెలు లేవాలే సారో ఓ మంత్రి కేటీఆర్ సారు.. దొంగలకు గూడ బాగనే ఎర్కైనట్టుంది.. అసెంబ్లీల పశుల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ సారు ఏమంటున్నడంటే.. పబ్లీకు కొంతమంది ఎంత ఎడ్డోళ్లున్నరేమయ్యా..?ఈ దేవుండ్లు సల్లగుండ.. గిసొంటి ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

21:00 - March 24, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 13వేల కోట్ల స్కాంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సిబిఐ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. నీరవ్‌కు చెందిన ముంబయిలోని సముద్ర మహల్‌ లగ్జరీ రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌లో ఈనెల 22న తనిఖీలు చేశారు. ఈ సోదాలో 15 కోట్ల విలువ చేసే ప్రాచీన ఆభరణాలు, ఖరీదైన వాచీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 10 కోట్లు విలువ చేసే డైమండ్‌ రింగ్‌తో పాటు, 1.40 కోట్ల విలువ చేసే వాచీ ఉంది. వీటితో పాటు 10 కోట్లు విలువ చేసే ప్రముఖ చిత్రకారులు అమృత షేర్‌గిల్‌, ఎంఎఫ్‌ హుస్సేన్‌ గీసిన చిత్రాలను గుర్తించారు. పిఎన్‌బి స్కాంలో నీరవ్‌మోది ఆయన మామ గీతాంజలి జెమ్స్‌ యజమాని మెహుల్‌ చోక్సీపై సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. వీరికి సంబంధించి ఇప్పటివరకు 251 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం 7 వేల 368 కోట్ల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

20:59 - March 24, 2018

ఉత్తర్ ప్రదేశ్ : రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమిపై బిఎస్పీ అధినేత్రి మాయావతి బిజెపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్పీ-బీఎస్పీలు పరస్పర అవగాహనతో ఓటింగ్‌లో పాల్గొంటే.. సీటు కోల్పోతామన్న భయంతోనే బీజేపీ మా ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేసిందని మాయావతి ఆరోపించారు. ఎస్పీ-బిఎస్పీల మధ్య చిచ్చు పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎస్పీ-బీఎస్పీ మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే ప్రసక్తే లేదన్నారు. 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి బిజెపికి తగిన గుణపాఠం చెబుతాయని మాయావతి స్పష్టం చేశారు. యోగి ప్రభుత్వం తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిజెపికి ఓటేసిన అనిల్‌కుమార్‌ సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు మాయావతి వెల్లడించారు.

20:57 - March 24, 2018

హైదరాబాద్ : ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగే సీపీఎం అఖిల భారత 22వ మహాసభల ప్రచారం ఊపందుకుంది. ఒకవైపు జీపు జాతాలు, మరోవైపు పాటలతో సీపీఎం ప్రచారం నిర్వహిస్తోంది. మహాసభల విజయంతమే లక్ష్యంగా రెండు జీపు జాతాలను సీపీఎం ప్రారంభించింది. అంతేకాదు మహాసభ పాటలనూ విడుదల చేసింది. వచ్చేనెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం అఖిల భారత 22వ మహాసభలు జరుగనున్నాయి. ఈ మహాసభల ప్రచారాన్ని రాష్ట్ర కమిటీ ఉధృతం చేసింది. మహాసభల ప్రాధాన్యతను పల్లెపల్లెనా వివరించేలా సీపీఎం ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా రెండు బస్సు జాతాలను ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్లలో ఓ బస్సుజాతాను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రారంభించారు.

ఆరుట్లలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన రాఘవులు.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించనున్నట్టు రాఘువులు స్పష్టం చేశారు.

కేసీఆర్‌ నియంతృత్వ పోకడలు పోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ పోలీస్‌రాజ్యంగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కునూ కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ తీరు మార్చుకోకుంటే ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. భువనగిరిలో మరో బస్సుజాతా ప్రారంభమైంది. ఈ జాతాను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారమే సీపీఎం లక్ష్యమని తమ్మినేని వీరభద్రం అన్నారు. అందుకోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భవించిందన్నారు. రానున్న ఎన్నికల్లో 119 స్థానాల్లోనూ బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సీపీఎం 22వ అఖిల భారత మహాసభల పాటలు కూడా విడుదలయ్యాయి. సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో తమ్మినేని వీరభద్రం పాటల సీడీని ఆవిష్కరించారు.

తెలంగాణ అసెంబ్లీ వాయిదా...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. 10వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. అడ్వకేట్స్, క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. 

18:59 - March 24, 2018

విశాఖపట్టణం : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ పూర్ణామార్కెట్‌ సమీపంలోని ఎంవీడీఎం స్కూల్‌ దగ్గర గీతం వైద్య విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్షయ వ్యాధి గురించి ప్రజలకు అర్థమయ్యేలా నాటకం ప్రదర్శించారు. ఈ నాటకం ద్వాయా క్షయ వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కలగడమేకాకుండా.. తమకూ అనుభవం వస్తుందని గీతం వైద్య విద్యార్థులు చెబుతున్నారు. క్లాస్‌ వర్క్‌కన్నా.. ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. క్షయ వ్యాధి రోగులు పోషకాహారంతోపాటు.. 6 నుంచి 9 నెలలపాటు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడితే ప్రయోజనం ఉంటుందన్నారు. 

18:57 - March 24, 2018

విశాఖపట్టణం : విభజనతో నష్టపోయిన ఏపీలో ప్రత్యేకహోదా కోసం మహా ఉద్యమం చేపట్టాలన్నారు ప్రజా నాయకుడు పరుచురి భాస్కరావు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కోసం అనకాపల్లి ఎమ్మర్వో ఆఫీస్ వద్ద కళ్లకు నల్లరిబ్బన్ కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద మానవహరం నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:55 - March 24, 2018

రంగారెడ్డి : బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. మనుధర్మ శాస్త్రాన్ని బీజేపీ అమలు పరచాలని ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వంలో దళితులు, మైనార్టీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్నారు. సీపీఎం అఖిలభారత మహాసభలను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్లలో బస్సు ప్రచార జాతాను ఆయన ప్రారంభించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభల్లో చర్చించనున్నామని తెలిపారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్‌ పోలీస్‌ రాజ్యంగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కునూ కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ నియంతృత్వ పోకడలు మానుకోకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అవసరసమైతే మరో తెలంగాణ పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించారు. అంతకుముందు అంబేద్కర్‌ విగ్రహానికి సీపీఎం నేతలు పూలమాలవేసి నివాళులు అర్పించారు. 

18:52 - March 24, 2018

విజయవాడ / ఢిల్లీ : కాంగ్రెస్‌ కంటే బీజేపీయే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా లేఖపై అసెంబ్లీలో వివరణ ఇస్తూ.. ఈ భావం ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్‌ కంటే బీజేపీయే ఎక్కువ మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు మళ్లిస్తోందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. దురుద్దేశాలను ఆపాదించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న అన్ని ప్రయోజనాలను ఏపీకి కూడా వర్తింపచేసే వరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు.

టీడీపీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అమిత్ షా రాసిన లేఖను ఖండిస్తూ.. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. బాబు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధికార ప్రతినిధి GVL నరసింహారావు.. తప్పుపట్టారు. ఏపీని బీజేపీ అన్ని విధాలా ఆదుకుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

వేములవాడలో 25న రాములోరి కళ్యాణం...

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరగనుంది. ఉదయం 9.26 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామి వారి కల్యాణం జరగనుంది.

17:38 - March 24, 2018

భద్రాద్రి : రాములోరి కల్యాణం ఘడియలు దగ్గర పడ్డాయి. సీతారాముల కల్యాణానికి భద్రాద్రి ముస్తాబయింది. 26న రామయ్య కళ్యాణం, 27న శ్రీరామ మహాపట్టాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. విళంబి నామ సంవత్సరంలోనే శ్రీరాముడు జన్మించాడని, ఈ ఏడాది రాములోరి కల్యాణాన్ని తిలకించడం మహా అదృష్టమని భక్తులు భావిస్తున్నారు. 60 ఏళ్ళకోసారి వచ్చే ఈ విళంబి నామ సంవత్సరాన జరుగుతున్న కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో భద్రాద్రికి తరలిరానున్నారు.

భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కల్యాణానికి ముస్తాబయింది. రామాలయ పరిసరాలు, మిథిలా స్టేడియం, కల్యాణ మండప ప్రాంగణం, గోదావరి నదీతీరం. విస్తా కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను చేపట్టారు.. స్టేడియం ప్రాంగణంలో సెక్టార్ల విభజన చేసి.. వాటికి ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాల పంపిణీకీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 26న రామయ్య కల్యాణం, 27న శ్రీరామ మహా పట్టాభిషేకం జరగనుంది. విళంబి నామ సంవత్సరంలో శ్రీరామ కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ఆలయాధికారులు భావిస్తున్నారు.

ఆలయం చుట్టూ విశాలమైన వాతావరణం కనిపించాలని వైదిక పండితులు భావిస్తున్నారు.. ప్రధాన కోవెల నుంచి రెండు ప్రాకారాలతోపాటు మాడవీధిని ఏర్పాటు చేయనున్నారు. కానీ అనుకున్న స్థాయిలో పనులు వేగంగా జరగడం లేదు. మండపం ప్రాంగణంలో చాందినీ వస్త్రాలతో పందిరి నిర్మాణ పనులు ఇంకా ఒక దశకు చేరుకోలేదు. బూర్గంపాడు మండలంలో కూలిపోయిన స్వాగత ద్వారాలను తిరిగి ఏర్పాటు చేయడంలో తాత్సారం చేశారు. తాత్కాలిక ద్వారాలకు బదులు శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.. దీనిపై అధికారులు దృష్టి సారించలేదు. ఆన్‌లైన్‌తో పాటు ఆలయ కౌంటర్లలో సెక్టార్‌ టికెట్‌ల విక్రయాలపై ప్రచారం కరువైంది. రెండున్నర లక్షలకుపైగా లడ్డూలను తయారు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటికి సుమారు 70 వేల లడ్డూలు మాత్రమే సిద్ధం చేశారు.. వసతి గదులు సామాన్య భక్తులకు కేటాయించే అవకాశం ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని భక్తులు విమర్శిస్తున్నారు. రామాలయం అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని అంటున్నారు.. నిధులిచ్చామని ఒకరు.. ఇస్తామని ఇంకొకరు చెబుతున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి జాడే కనిపించడంలేదు. ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, మరింతగా శోభిల్లాలంటే నిధుల ఆవకశ్యత ఎంతో ఉంది.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. కేంద్రం కూడా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 11 ప్రాంతాలను రామాయణ వలయంగా చేయాలని భావించింది. కాని ఇంత వరకు ఒక్కపైసా ఇవ్వలేదు.

రాష్ర్ట ప్రభుత్వం యాదాద్రికి మొత్తంగా వెయ్యి కోట్ల రూపాయలు పైగా వ్యయం చేయాలని నిర్ణయించింది.. ఇప్పటికే కొంత మొత్తంలో కేటాయింపులు కూడా జరిగాయి. ఈ బడ్జెట్‌లో 250 కోట్ల రూపాయలు కేటాయించారు. వేములవాడకు వంద కోట్లు, బాసరకు యాభై కోట్లు, ధర్మపురికి యాభై కోట్ల రూపాయలు కేటాయించింది.. ఎంతోకాలంగా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధికి వంద కోట్లు కేటాయించింది.

మావోయిస్టుల కదలికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఈ ఉత్సవాలకు వచ్చే వీఐపీల రక్షణపై ద్నష్టి పెట్టారు.వరంగల్ రేంజి ఐజీ నాగిరెడ్డి పర్యవేక్షణలో... భద్రాద్రి ఎస్పీ అంబర్‌ కిషోర్‌జా ఆధ్వర్యంలో భారీఎత్తున బందోబస్తు చేపడుతున్నారు. గతంలో ఇక్కడ 20 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 150 మంది ఎస్సైలు, 400 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లతో కలిపి రెండువేల మందితో బందోబస్తు నిర్వహించారు. వీరికి అదనంగా బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌, ఏరియా డామినేషన్ పార్టీలతో తనిఖీ, కూంబింగ్‌ నిర్వహించారు. 24 గంటలు సాయుధ పోలీసు బలగాలతో గస్తీ నిర్వహించారు.. ఈసారి అంతకంటే అధికంగా.. భద్రత చర్యలు చేపట్టాలన్న యోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం..

తెలంగాణకు సరిహద్దున ఉన్న చత్తీస్‌గఢ్‌తో పాటు.. సుక్మా జిల్లా కిష్టారం పోలీసు స్టేషన్ సమీపంలోని పలోడి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌, మావోయిస్టులు మందుపాతర పేల్చిన సంఘటనలతో ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ప్రతీకారేచ్చతో ఉన్న మావోయిస్టులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు నిఘావర్గాలు హెచ్చరించాయి.. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రత ఏర్పాట్లు కీలకంగా మారాయి.

17:33 - March 24, 2018

విశాఖపట్టణం : టిడిపి..బిజెపి పార్టీలు ఇచ్చిన విభజన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని సీపీఎం పేర్కొంది. విశాఖ రైల్వే జోన్ కై సీపీఎం మహా పాదయాత్ర నాలుగో రోజు గాజువాకకు చేరుకుంది. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు వారికి స్వాగతం పలికారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని గత ఎన్నికల్లో చెప్పడంతో నమ్మి ఓటేసిన విశాఖ వాసులకు మొండి చెయ్యి చూపారని నగర కార్యదర్శి గంగారావు పేర్కొన్నారు. 

17:26 - March 24, 2018

అనంతపురం : సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే దౌర్జన్యంగా వ్యవమరిస్తే తమ గోడు ఎవరికి చెప్పు కోవాలని పుట్టపర్తి హంద్రీనీవా కాల్వకు భూములిచ్చిన రైతులు పేర్కొంటున్నారు. శుక్రవారం వారు మీడియాతో తమ బాధలు..గాధలను చెప్పుకున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ ధిక్కరిస్తూ పోలీసులతో వచ్చి భయపెట్టిస్తే తాము ఏం చేయాలని ప్రశ్నించారు. 2015 భూ సేకరణ ప్రకారం భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వాపోయారు. 50 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 

17:18 - March 24, 2018
17:16 - March 24, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నోట్లరద్దు, జిఎస్‌టి నిర్ణయాలపై మోది ప్రభుత్వాన్ని మళ్లీ టార్గెట్‌ చేశారు. మైసూర్‌లోని మహారాణి ఆర్ట్స్‌ వుమెన్స్‌ కళాశాలలో విద్యార్థినిలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వారితో సెల్ఫీ కూడా దిగారు. మోది ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోవడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగిందని రాహుల్‌ అన్నారు. ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక సలహాదారు, ఆర్థికమంత్రికి తెలియకుండానే ప్రధాని మోది నోట్లరద్దును అమలు చేశారని మండిపడ్డారు. నోట్లరద్దు, జిఎస్‌టి అమలు తీరును ఆయన తప్పు పట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకే రకమైన జిఎస్‌టి అమలు చేస్తామని రాహుల్‌ చెప్పారు. నీరవ్‌ మోది 22 వేల కోట్లతో విదేశాలకు పారిపోయాడని.. ఆ డబ్బులు యువతకు ఇచ్చినట్లయితే... కొత్త వ్యాపారాలు మొదలయ్యేవని, ఎందరికో ఉపాధి అవకాశాలు కలిగేవని రాహుల్‌ అన్నారు. దేశంలో 15-20 మంది వద్దే డబ్బులు పోగవ్వడం పెద్ద సమస్యగా మారిందని రాహుల్‌ వెల్లడించారు.

17:12 - March 24, 2018

విశాఖపట్టణం : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో జీపు యాత్ర ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జిల్లాలోని 21 మండలాల పరిధిలో యాత్ర సాగుతోందని సీపీఎం నేతలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు వివరించడమే యాత్ర లక్ష్యమని పార్టీ ప్రతినిధులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలకు హానికరమైనదని రాష్ట్రరైతు సంఘల ప్రధాన కార్యదర్శి బెండి తులసిదాస్‌ ఆరోపించారు.

17:09 - March 24, 2018

విజయవాడ : బీజేపీ అధ్యక్షులు అమిత్‌షాపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదన్నారు రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. లేఖలో అమిత్‌షా పేర్కొన్న అంశాలపై చంద్రబాబు ప్రభుత్వమే స్పందించాలన్నారు. ప్రజలను పక్కదారిపట్టిచ్చేందుకే కేంద్రంపై పోరాటం అంటూ టీడీపీ నాటకాలు ఆడుతోందని సత్యనారాయణ విమర్శించారు.

17:07 - March 24, 2018

రంగారెడ్డి : తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారమే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అందుకోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భవించిందన్నారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం అఖిలభారత 22వ మహాసభలు జరుగనున్న నేపథ్యంలో భువనగిరిలో ఆయన బస్సు ప్రచార జాతాను ప్రారంభించారు. కేంద్రంలో మోదీ గద్దెనెక్కినప్పటి నుంచి దేశంలో మతవిద్వేశాలు పెరిగిపోయాయన్నారు. భారతదేశంలో లౌకికతత్వాన్ని కాపాడేందుకు సీపీఎం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు. బీజేపీ సర్కార్‌... రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కాషాయీకరణ చేస్తోందని మండిపడ్డారు. అంతకుముందు భువనగిరిలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, పోతినేని సుదర్శన్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు జాన్‌వెస్లీతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

17:02 - March 24, 2018

మనిషికి జిహ్వ చాపల్యం ఎక్కువే. అలాఅని కంటికి ఇంపుగా కనిపించినవల్లా తినేస్తుంటే కడపు డస్ట్ బిన్ లా తయారవుతుంది. తరువాత అల్సర్లు, అజీర్ణం వంటి పలు ఆరోగ్యం సమస్యపాలవుతాం. అంతేకాదు..అవి ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం కూడా లేకపోలేదు..అందులోను ఎండలు మండే వేసవిలో మరింత జాగ్రత్తగా వుండాల్సిన అవసరముంది. అలాగే ఘనపదార్ధాలు తక్కువగా..ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటుండాలి. దీంతో శరీరంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా తేమ మనల్ని కాపాడుతుంది. మరి ఎండల వేసవిలో ఏమేమి తినకూడదో తెలుసుకుందాం..

ఘాటెక్కించే పదార్ధాలు..
ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలాల మోతాదును చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటు మందగించడానికి కారణమవుతాయి.

అజీర్తి సమస్యల మాంసాహారం..
వేడి వాతావరణంలో మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్.... వంటివి ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యల్నీ పెంచుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు, మలబద్దకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ తిన్నా..మంచినీరు ఎక్కువ శాతం తప్పకుండా తీసుకోవాలి. లేదంటే శరీరంలో వుండే తేమను మాంసాహారం హరించివేసి విరేచనాలు అయి డీ హైడ్రేషన్ బారిన పడే ప్రమాదం లేకపోలేదు..తస్మాత్ జాగ్రత్త..

కాఫీలు, టీలు..
వేసవిలో ప్రధానంగా బాధించేది డీహైడ్రేషన్. కొంతమందికి ఉదయం లేవగానే కాఫీ, టీలు తప్పకుండా తాగే అలవాటు వుంటుంది. కానీ వేసవిలో వాటిని సాధ్యమైనంత వరకూ తగ్గించి తీసుకుంటే మంచిది. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని నీటి శాతం తగ్గిపోయే ప్రమాదముందని నిపుణులు చెబుతుంటారు. డీహైడ్రేషన్ తో శరీరం కూడా తేమటమే కాక శరీరం కాంతిని కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.

డీప్ ఫ్రైలతో డీప్ ప్రాబ్లమ్స్..

నూనెలో వేయించినవి తగ్గించాలి. వేపుళ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటి వాటిని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటి జోలికి వెళ్లకుండా వుంటే మరీ మంచిది. లేదంటే ఒకపక్క ఎండ తీవ్రతతో వికారం, అతిగా దాహం,నోరు పిడచకట్టుకుపోవటం వంటి సమస్యలు వస్తాయి.

జంక్ ఫుడ్స్..
ప్రస్తుత కాలంలో చాలామంది జంక్ ఫుడ్ బారిన పడి ఒబెసిటీబారిన పడటం చూస్తున్నాం, వింటున్నాం. కడుపు నింపడం తప్ప దేనికీ పనికి రాని ఈ ఫుడ్ మాత్రం ఒకదానికి బాగా పనికి వస్తుంది.అదేమంటి మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టటం. జంక్ ఫుడ్ కు ఎంత దూరంగా వుంటే అంత మంచిది..అందులోను వేసవిలో అస్సలు మంచిది కాదు. ఇందులో అధికంగా కేలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. పైగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటివి ఎదురవుతాయి.దీంతో తీసుకున్న అరగక, వాటర్ కూడా తాగలేకక ఆయాసం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి.

మన ఆరోగ్యం మనచేతిలోనే..
ఏ కాలంలోనైనా ప్రకృతి సహజమైన ఆహారం తీసుకుంటే ఇంటికి, ఒంటికి కూడా మంచిది. ఏ కాలంలో మనిషి ఏం తినాలో ప్రకృతే నిర్ణయించింది. అందుకే ఏకాలం తినాల్సిన పండ్లను, కూరగాయలను ఆ కాలంలో అందుబాటులో వుంటుంటాయి. అలాగే వేసవిలో లభించే పండ్లలో ఎక్కువ శాతం నీరు వుంటుంది. ఉదా: పుచ్చ,ద్రాక్ష,నిమ్మ, చెరకు, ఖర్బూజ వంటివి లభిస్తుంటాయి. అమ్మలాంటి ప్రకృతి మాత అందించే ఆహారాన్ని తీసుకుని వేసవిలో వచ్చే సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకుందాం..

 

16:50 - March 24, 2018

రంగారెడ్డి : సీపీఎం మహాసభల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందిస్తామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో బస్సు జాతాలు ప్రారంభమయ్యాయి. బస్సు జాతాలను ప్రారంభించిన రాఘవులుతో టెన్ టివి ముచ్చటించింది.

మహసభల కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవలే వెల్లడించిన థర్డ్ ఫ్రంట్ తో ఉపయోగం లేదని, కాంగ్రెస్ బిజెపిలు అనుసరిస్తున్న విధానాలను కేసీఆర్ అవలింబిస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో జరిగిన లాంగ్ మార్చ్ లాగే తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు చేయాల్సినవసరం ఉందన్నారు. 

16:25 - March 24, 2018

గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు ప్రతీ ఏడాది పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి శాతం పెరిగిపోతోంది. దీంతో రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవటం..దాంతో పగలు నీరసం, పనిపై ఏకాగ్రత లేకపోవటం వంటి అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. మరి వేసవిలో రాత్రి సమయంలో ప్రశాంతంగా, హాయిగా నిద్రపోవాలంటే ఇంటిలో వాతావరణ చల్లగా వుండాలి. మరి చల్లగా వుండేందుకు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఉపయోగిస్తుంటాం..వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, కరెంట్ చార్జీలు అదనంగా భరించాల్సిందే. పేదలు, మధ్య తరగతి వారు ఏసీలు, కూలర్లు కొనలేని పరిస్థితి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఖర్చు లేకుండానే.. ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. దీంతో ఇల్లు చల్లగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఒకవేళ ఆర్థికంగా స్థోమత కలిగినవారు వాటిని కొన్నా కరెంట్ ఖర్చులు తగ్గించుకోవచ్చు..మరి అవేమిటో తెలుసుకుందామా..?

ఇంటి పైకప్పుకు కోటింగ్..
ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్ మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు వేడెక్కి ఆ వేడికి ఇంట్లో వుండలేని పరిస్థితి. పైకప్పు వేడెక్కినప్పుడు సీలింగ్ ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పుకు కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించుకోవాలి. కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి, సాధారణ సిమెంటు మిశ్రమం. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని తీసుకోదు...అందువల్ల పైకప్పు వేడెక్కదు. పైగా ఇంటి లోపల చల్లగా ఉంటుంది.

నార తెర చాపలతో చల్లదనం..

ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద నారతోచేసిన చాపలను, నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా..చాపలు అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు రక్షణగా చేసుకుని..వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండడం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చాపలు, మ్యాట్ లు కూడా మార్కెట్ లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి. ఇవి కాకుంటే కాస్త మందమైన బెడ్ షీట్లను కూడా నీటితో తడిపి తలుపులు, కిటికీల వద్ద కట్టుకోవచ్చు.

మొక్కలు పెంచితే అందం, ఆరోగ్యం, రక్షణ..ఎన్నో ప్రయోజనాలు
ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే మొక్కలు పెంచడం వల్ల చల్లదనం పరుచుకుంటుంది. అపార్ట్ మెంట్లు అయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని.. వాటిలో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి, చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక ఇండివిడ్యువల్ ఇల్లు అయి ఉండి.. ఇంటి చుట్టూగానీ, ముందు, వెనుకగానీ ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటి వల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా.. ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేగాకుండా మనకు కావాల్సిన కూరగాయలు, పూలు వంటివీ మనమే పండించుకున్నట్లూ ఉంటుంది. మొక్కలు, చెట్లు ఉన్న ఇళ్లు, పరిసరాల్లో.. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనం..
గదిలో నేలను నీటితో కడగడం వల్ల ఆ నీరు మెల్లగా ఆవిరవుతూ గదిలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంట్లో అవసరం లేనప్పుడు లైట్లు ఆర్పేయడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫ్ చేయడం మంచిది. లేకుంటే వాటిని వాడుతున్నంతసేపూ వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అంతేకాదు కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. ఇంట్లో నేరుగా ఎండ పడని దిశల్లో ఉన్న కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి గాలి ప్రవాహం పెరుగుతుంది. దానివల్ల కూడా చల్లదనం కలుగుతుంది. సాయంత్రం వాతావరణ చల్లబడిన తరువాత కిటికీలను తెరిచి ఉంచాలి. అందువల్ల ఇంట్లోని వేడి బయటికి వెళ్లిపోయి.. చల్లగాలి లోపలికి వస్తుంది.

వంటగదిలో జాగ్రత్తలు..
ఇక ఇంట్లో ఎక్కువ వేడిని ఉత్పత్తి అయ్యేది వంట గదిలోనే. వంట గదిలోని వేడి బయటికి వెళ్లిపోయేలా వంట గదికి వెంటిలేటర్ ఉండేలా చూసుకోవాలి. ఈ వెంటిలేటర్లకు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్లు అమర్చుకోవాలి. లేకుంటే వంట గదిలోని వేడి ఇంట్లో నిండిపోతుంది.

మంచు గడ్డలు, నీటితో మ్యాజిక్..
ఏసీ లేకున్నా.. ఇంట్లోని ఏదైనా గదిలో బాగా చల్లదనం కావాలనుకుంటే మంచు గడ్డలు, చల్లని నీటితో సులువుగా వేడిని తగ్గించుకోవచ్చు. ఫ్రిజ్ లోంచి తీసిన ఐస్ క్యూబ్ లను గానీ, చల్లటి నీటినిగానీ ఏదైనా వెడల్పాటి పాత్రలో పెట్టి.. నేరుగా ఫ్యాన్ గాలి తగిలేలా అమర్చాలి. కొద్దిసేపటిలోనే గదిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవడం గమనించవచ్చు. అయితే ఆ గదిలోకి బయటి నుంచి వేడి గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. అప్పుడు చల్లదనం ఎక్కువ సేపు ఉంటుంది. ఐసు లేకున్నా..మామూలు నీటిని వెడల్పాటి పాత్రలో పోసి.. నేరుగా ఫ్యాన్ గాలి తగిలేలా పెట్టినా కూడా ఆ గదిలో రెండు మూడు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు.

శరీరాన్నీ చల్లగా ఉంచుకునే పదార్ధాలు తీసుకోవటం ద్వారా..
మనం ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మన శరీరం వేడిగా ఉంటే ప్రయోజనం ఉండదు. అటు ఇంటిని చల్లగా ఉంచుకునే పని చేస్తూనే.. శరీరాన్ని చల్లబరిచేందుకు చల్లటి నీళ్లు, నిమ్మరసం, జ్యూస్ ల వంటివి తాగడం బెటర్. దీంతోపాటు రుమాలు వంటి దానికి చల్లటి నీటిలో తడిపి.. శరీరంలో రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉండే మణికట్టు, మెడ వంటి ప్రాంతాల్లో పెట్టుకోవడం ద్వారా శరీరం చల్లబడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మేలు. అంతేగాకుండా వస్త్రాలు కొంచెం వదులుగా కూడా ఉండేలా చూసుకోవాలి. కాటన్ వస్త్రాల వల్ల గాలి బాగా ఆడి, చెమట ఆరిపోతుంది. తద్వారా శరీరం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. అందువల్ల నీరు ఎక్కువగా తాగాలి. తగినంత నీరు శరీరానికి అందితే.. చెమట కూడా ఎక్కువగా పట్టి శరీరం చల్లగా ఉంటుంది.

పడుకునే ముందు జాగ్రత్తలు..
రాత్రి పడుకునేందుకు కూడా బెడ్ పై కాటన్ దుప్పట్లు, తలగడలకు కాటన్ గలీబులు వేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందుగానీ తల స్నానం చేయడంతో శరీరంలోని వేడి తగ్గి ఒకటి రెండు గంటల వరకు హాయిగా ఉంటుంది. నిద్రపోయే ముందు స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడడంతోపాటు..హాయిగా వుండి నిద్ర కూడా బాగా పడుతుంది. ఇంట్లో చల్లదనాన్ని కలిగించేలా ఇటీవలే శాస్త్రవేత్తలు కొత్త తరహా పాలిమర్ ను అభివృద్ధి చేశారు. అది సూర్యరశ్మిని చాలా వరకు పరావర్తనం చెందించే ఈ పాలిమర్ ధర కూడా తక్కువే ఉంటుందని వారు చెబుతున్నారు. ఇళ్లు,కార్యాలయాలు, దుకాణాలు వంటి వాటిలో అన్ని చోట్లా ఈ పాలిమర్ పొరను వినియోగించుకోవచ్చని సైంటిస్టులు పేర్కొంటున్నారు. మరి అవి సామాన్యుడికి అందుబాటులో వుంటే వేసవికాలంలో కూడా ప్రశాంతమైన, హాయిగొలిపే జీవితాలను అందరూ ఆస్వాదించవచ్చు..

16:23 - March 24, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు -బిజెపి జాతీయ అధ్యక్షుడి మధ్య లేఖ చిచ్చు పెట్టింది. గత కొన్ని రోజులుగా ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి..బిజెపి పొత్తు వికటించింది. ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాశారు. ఈ లేఖలో పేర్కొన్నవన్నీ అవాస్తవాలేనని బాబు అసెంబ్లీలో ఎండగట్టారు. 09-02-2018లో నాలుగో ఇన్ స్టాల్ మెంట్ కింద రూ. 350 కోట్లు ఇచ్చిందని, కానీ ఆర్ బిఐ 15-02-2018లో రూ. 350 కోట్లు రివర్స్ చేశారని తెలిపారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం మంజూరు చేశామని చెబుతున్నారని, అయితే ఈ నాలుగేళ్లలో రూ.11,672 రావాల్సి ఉంటే రూ.576 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. చెన్నై-విశాఖపట్నం కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, రాష్ట్రంలో కొత్త రహదారులు కేటాయించామని పేర్కొంటున్నారని దీనిపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజలను అవమానపర్చే విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఇంకా ఏమన్నారో వీడియో క్లిక్ చేయండి. 

కిడ్నాప్అయిన 100మంది బాలికలు సురక్షితం..

ఢిల్లీ : నైజీరియాలో నెల రోజుల క్రితం బోకో హరామ్ ఉగ్రవాదులు 100 మంది బాలికలను ఓ స్కూల్ నుంచి అపహరించారు. ఈశాన్య రాష్ట్రమైన యోబో నుంచి వాళ్లను అపహరించుకుపోగా..ఎట్టకేలకు వారిని తీవ్రవాదులు రిలీజ్ చేశారు. అపహరణకు గురయిన బాలికలను దేశరాజధాని అబుజలోని దేశాధ్యక్ష కార్యాలయంలో నైజీరియా అధ్యక్షుడు మొహమ్మద్ బుహరి కలిశారు. అనంతరం అపహరించిన బాలికలందరినీ ఉగ్రవాదులు ఎటువంటి షరతులు లేకుండానే విడిచిపెట్టటం విశేషం. 

15:47 - March 24, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ తీరును అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎండగట్టారు. గత కొన్ని రోజులుగా ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి..బిజెపి పొత్తు వికటించింది. ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాశారు. లేఖలో ఉన్న అంశాలపై అసెంబ్లీలో బాబు వివరణ ఇచ్చారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెబుతారా ? అంటూ ప్రశ్నించారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని, ఈశాన్య రాష్ట్రాలకు అన్నీ ఇస్తున్నారు కానీ ఏపీకి ఏమి చేయడం లేదని ఏపికి ఒక రూల్..ఇతర రాష్ట్రాలకు మరొక రూలా అని ప్రశ్నించారు.

కేంద్ర ప్ర‌భుత్వ తీరు ఎలా ఉందంటే.. క‌ష్టం మ‌నది.. అంటే మ‌న‌ ద‌గ్గ‌ర ట్యాక్సుల రూపంలో తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మ‌న‌కి క‌ష్టాలు ఉన్న‌ప్పుడు డ‌బ్బులు మాత్రం ఇవ్వ‌కుండా ట్యాక్సులు మాత్రం వ‌సూలు చేసుకుంటారని విమర్శించారు. అని ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని చెప్పారని, హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారని గుర్తు చేశారు. అది కూడా స‌రిగ్గా అమ‌లు చేయడం లేద‌ని అన్నారు. రాష్ట్ర హ‌క్కుల‌పై కేంద్ర మంత్రుల‌కు చాలా లేఖ‌లు రాశామ‌ని, ఢిల్లీకి కూడా ఎన్నోమార్లు వెళ్లడం జరిగిందని, కష్టాలపై తాను సవివరంగా చెప్పడం జరిగిందన్నారు.

పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన చట్టంలో పెట్టినవి ఎందుకు ఇవ్వరని మరోసారి ప్రశ్నించారు. రావాల్సినవి అడుగుతుంటే ఎదురుదాడి చేస్తున్నారని, కేంద్ర మంత్రులు అస‌త్యాలు ఎందుకు చెబుతున్నార‌ని నిల‌దీశారు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని ఇటీవలే భారత ప్రధాని మోడీ లోక్ స‌భ‌లో గుర్తు చేయడం జరిగిందని, అలాంటి పార్టీ ఇప్పుడు తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోస‌మే పోరాడితే త‌ప్పేంటని చంద్రబాబు పేర్కొన్నారు. చివ‌రి బ‌డ్జెట్ లోనూ రాష్ట్రానికి సాయం చేయ‌లేద‌ని, దీనితో తాము పోరాటానికి దిగామ‌ని స్పష్టం చేశారుర. మిత్ర పక్షంగా చేయాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వం చేయలేదని బాబు వ్యాఖ్యానించారు. 

పెద్దలసభలోను కాషాయం కళకళ..

ఢిల్లీ: ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో భాజపాకు ఊహించని దెబ్బ తగిలింది. అయితే నిన్న వెలువడిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ఊరట కలిగించాయి. అత్యధిక స్థానాలను గెలుచుకొని, రాజ్యసభలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 245 మంది సభ్యులున్న పెద్దల సభలో పూర్తి స్థాయి ఆధిక్యం రానప్పటికీ విపక్ష కాంగ్రెస్‌ కన్నా సంఖ్యాబలంలో మాత్రం మెరుగైన స్థితికి వచ్చింది. తాజా ఫలితాలతో భాజపా ఖాతాలో మరో 11 స్థానాలు అదనంగా వచ్చి చేరాయి.

ఇవ్వాల్సినది అడిగితే ఎదురు దాడా? : చంద్రబాబు

అమరావతి : రాష్ట్ర హ‌క్కుల‌పై కేంద్ర మంత్రుల‌కు చాలా లేఖ‌లు రాశామ‌ని, రాష్ట్రానికి వున్న హక్కులను అడిగితే మాపై ఎదురు దాడి చేస్తారా? అని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన చట్టంలో పెట్టినవి ఎందుకు ఇవ్వరని ఇక్కడి నుంచి తాను మ‌రోసారి అడుగుతున్నానని అన్నారు. కేంద్రం ప్రకటించిన 9పేజీల లేఖలో అన్ని అసత్యాలనే ప్రస్తావించారని..ఉన్నతస్థానంలో వ్యక్తులు అలా ఎలా అసత్యాలు ప్రస్తావిస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీకి ఒక రూల్, ఇతర రాష్ట్రాలకు వేరే రూలా?:బాబు

అమరావతి : ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి మాకెందుకు ఇవ్వరని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాలకు వర్తించిన రూల్ మాకెందుకు వర్తించదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరు ఎలా ఉందంటే.. క‌ష్టం మ‌నది.. అంటే మ‌న‌ ద‌గ్గ‌ర ట్యాక్సుల రూపంలో తీసుకుంటున్నారు. మ‌న‌కి క‌ష్టాలు ఉన్న‌ప్పుడు డ‌బ్బులు మాత్రం ఇవ్వ‌రు.. ట్యాక్సులు మాత్రం వ‌సూలు చేసుకుంటారు' అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న శాస‌న‌స‌భ‌లో మాట్లాడుతూ...

అమిత్ షా లేఖ అన్నీ అసత్యాలే : చంద్రబాబు

అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీఎం చంద్రబాబుకి 9పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతు..అమిత్ షా లేఖ అన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని లేఖలో ప్రస్తావించారనీ..కానీ ఏవీ పూర్తిగా నెరవేర్చారో తెలపలేదన్నారు. ఉన్నతస్థాయిలోవున్న వ్యక్తులు అసత్యాలు మాట్లాడతారా? అని ప్రశ్నించారు.

ఉద్యోగుల ఆరోగ్య పథకం కొనసాగుతుంది:లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కొనసాగుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని శాసన మండలిలో ప్రశ్నోత్తరాలలో భాగంగా ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. పరిపాలన సంబంధిత అంశాల్లో భాగంగానే సీఈవోను మార్చామని తెలిపారు. త్వరలో ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి సీఈవోను నియమిస్తామని చెప్పారు. అదనంగా ఈవో గోపీనాథ్‌ను కూడా నియమిస్తున్నామని పేర్కొన్నారు. 

ప్రాజెక్టుల పేరుతో బలవంతపు భూసేకరణ : తమ్మినేని

భువనగిరి : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ సంతోషంగా లేరని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్వి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం ప్రజల నుండి బలవంతంగా లాక్కుంటోందని విమర్శించారు. 2013 భూసేకరణ, అటవీ హక్కుల చట్టాలను కేసీఆర్ సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. 

బీజేపీని ఎదుర్కొనే సైద్దాంతి శక్తి సీపీఎంకే వుంది : తమ్మినేని

భువనగిరి : బీజేపీని ఎదుర్కొనే సైద్ధాంతిక శక్తి సీపీఎంకే వుందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధీమా వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ జాతీయ మహాసభ సందర్భంగా భువనగిరిలో ప్రారంభించిన బస్ జాతాలో పాల్గొన్నా సందర్భంగా తమ్మినేని మాట్లాడుతు.. దేశంలో లౌకిక వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని ఆయన సూచించారు. దానికోసం ఎంతటి పోరాటానికైనా సీపీఎం సిద్ధంగా వుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలలో కూడా ప్రధాని మోదీ మొండి చేయి చూపారన్నారు. దీంతో దేశంలోనిరుద్యోగం తాండవిస్తోందని విమర్శించారు. 

మోదీ మాటలు నీటిమూటలే : తమ్మినేని

హైదరాబాద్ : ప్రధాని మోదీ మాటలన్నీ నీటిమూటలను తేలిపోయిందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఎం పార్టీ జాతీయ మహాసభ సందర్భంగా భువనగిరిలో ప్రారంభించిన బస్ జాతాలో పాల్గొన్నా సందర్భంగా తమ్మినేని మాట్లాడుతు.. నల్లధన్నాన్ని వెలికి తెస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలేనని ఆయన విమర్శించారు. 

యథావిధిగా వెల్ సెల్ కేంద్రాలు : మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : వెల్‌నెస్ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయి.. ఆరోగ్యశ్రీలో కలపడం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, వెల్‌నెస్ కేంద్రాలు ప్రజారోగ్యంలో రెండు వేర్వేరు సేవా కేంద్రాలు అని మంత్రి తెలిపారు. వెల్‌నెస్ కేంద్రాల్లో మందుల కొరత త్వరలో తీరుతుందన్నారు. ఇప్పటి వరకు 4 వెల్‌నెస్ కేంద్రాలు పని చేస్తున్నాయని గుర్తు చేశారు. మరో 4 వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మిగతా చోట్ల కూడా వెల్‌నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

14:48 - March 24, 2018

విజయవాడ : ఓవైపు దిగుబడి అంతంత మాత్రమే. మరోవైపు పండిన పంటకు గిట్టుబాటు ధర శూన్యం. ఇక డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు పంటను ఎగుమతి చేసేందుకైనా ప్రోత్సాహం కల్పించమంటే అదీ కూడా లేదు. దీంతో ఆరుగాలం శ్రమించి పంటను పండించిన రైతన్న కష్టాలు ఎదుర్కొంటున్నాడు. అధికారుల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో అనేక విధాలుగా నష్టపోతున్నామని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమ్మర్‌ అంటేనే మనకు గుర్తుకు వచ్చేది మామిడిపండ్లు. కానీ... ఈ సమ్మర్‌లో మామిడి పంట అంతగా ఆశించిన మేర ఉండకపోవచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా మామిడి పండిస్తారు. కృష్ణా జిల్లాలో దాదాపు 65 వేల హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఆలస్యంగా మామిడి పూత వచ్చింది. మరోవైపు ప్రతి ఏడాది పెట్టుబడి పెరగడం, చీడపీడలు సోకడంతో దిగుబడి నామమాత్రంగానే ఉంటోంది. ఒకవేళ ఒక ఏడాది మంచిగా దిగుబడి వచ్చినా మరో ఏడాది ఖచ్చితంగా నష్టం తప్పదని రైతులంటున్నారు. కృష్ణాజిల్లాలో ప్రతి ఏడాది 6.5 లక్షల టన్నుల నుంచి 7.20 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. వీటిలో ప్రధానంగా బంగినపల్లి మామిడి ఉంటుంది. వీటి ఎగుమతులు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. రాష్ట్రం నుంచి ముంబై, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, బెంగళూరు, హర్యానా వంటి ప్రాంతాలకు 50 నుంచి 65 శాతం వరకు విక్రయిస్తున్నారు. మిగిలిన పంటను విదేశాలకు ఎగుమతి చేసేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయి. అయితే అధికారుల ప్రోత్సాహం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు.

ఇక ప్రభుత్వం గానీ, అధికారుల ప్రోత్సహం లేకపోవడం వల్ల అన్ని విధాల నష్టపోతున్నామంటున్నారు రైతులు. ఎగుమతి చేయాల్సిన బంగినపల్లి మామిడికాయలు పరిపక్వతకు వచ్చాక ఆరబెట్టాల్సి ఉంటుంది. సైజును బట్టి వేరుచేయాలి. ఆ తర్వాత వాటిని వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌కు పంపాలి. అక్కడ కాయలను ఎలాంటి రసాయనలు వాడని వేడినీటిలో కడిగి మళ్లీ ఆరబెడతారు. ఆ సమయంలో గది ఉష్ణోగ్రత, తేమ శాతం సమపాళ్లలో ఉండేలా చూస్తారు. ఇలా వేపర్‌ హీట్‌ చేసిన మామిడికాయలను సైజులవారీగా ప్లాస్టిక్‌ క్రేట్‌లలో పేర్చుతారు. అపెడా సహకారంతో సబ్సిడీపై అందించే కొరిగేటెడ్‌ బాక్సుల్లో ఉంచి ప్యాక్‌ చేస్తారు. మామిడికాయలను ఎగుమతి చేయాలంటే ఇంత పెద్ద ప్రాసెసింగ్‌ ఉంటుంది. అయితే... నూజివీడులోని వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ మూతపడడంతో రైతులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇంత పెద్ద ప్రాసెసింగ్‌కు రైతులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు మార్కెట్లకు కాయలు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.

మామిడి రైతులకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తే బంగినపల్లి మామిడికాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చని రైతులంటున్నారు. అధికారుల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచి డిమాండ్‌ మామిడిని ఎగుమతి చేసేందుకు సహకరించాలని కోరుతున్నారు. 

జర్మన్ నియంతే పోయాడు బీజేపీ ఎంత : ప్రకాశ్ రాజ్

హైదరాబాద్ : బీజేపీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ధ్వజమెత్తారు. తప్పుడు హామీలతో దేశ ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందనీ..ధిక్కార ధోరణి ఎంతోకాలం కొనసాగదనీ..జర్మన్ నియంత హిట్లర్ లాంటి వారి ఆధిపత్యమే కూలిపోయిందని... ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంత అంటూ ఎద్దేవా చేశారు. 

14:39 - March 24, 2018

హైదరాబాద్ : వచ్చే నెలలో జరగనున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల పాటల సీడీని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో తమ్మినేని పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం జాతీయ మహాసభలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది అన్నారు. మహాసభల విజయవంతం కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారజాతా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా దేశంలో చోటు చేసుకుంటున్న సంఘటలపై తమ్మినేని ఆందోళన వెలిబుచ్చారు. తెలంగాణలో బహునులకు రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తోందన్నారు తమ్మినేని వీరభద్రం. 

14:37 - March 24, 2018

బీహార్ : దాణా స్కాంకు సంబంధించిన నాలుగో కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సిబిఐ కోర్టు శిక్షను ఖరారు చేసింది. రెండు వేర్వేరు సెక్షన్ల కింద లాలూకు ఏడేళ్ల చొప్పున 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 60లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించనట్లయితే మరో ఏడాది శిక్ష పెరుగుతుంది. నాల్గవ దాణా కేసులో లాలూను దోషిగా తేలుస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గత సోమవారం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. దుమ్కా ట్రెజరిరి నుంచి అక్రమంగా 3.13 కోట్లు విత్‌డ్రా చేసినట్లు లాలూతో పాటు 29 మందిపై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన మిగతా మూడు కేసుల్లోనూ లాలూకు శిక్ష పడిన విషయం తెలిసిందే.

14:32 - March 24, 2018

విజయవాడ : తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని వ్యాఖ్యానించారు. అవినీతిని కిందిస్థాయికి తీసుకెళ్లిన పార్టీ టీడీపీ ఒక్కటేనన్నారు. నీరు-చెట్టు పథకంలో మట్టిని అమ్ముకున్నారని, రాష్ట్రంలో పాలన గాడి తప్పుతోందని అన్నారు. ఎమ్మెల్యేలను అదుపులో పెట్టే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఉన్న మెకానిజం ఏంటి అని, స్పిల్‌ వే పనులకు రూ.1400కోట్లు ఎందుకు ఖర్చు అయిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నడుస్తోందా... లేదా అధికారపార్టీ నేతల వ్యాపారం నడుస్తోందా అని ప్రశ్నించారు... బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు. పోలవరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతే జరుగుతోందన్నారు. అటు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల్లో అవినీతి పేరుకుపోయిందన్నారు. ఉపాధి హామీ పనుల దగ్గర నుంచి సర్వశిక్షా అభియాన్‌దాకా ప్రతి కార్యక్రమంలోనూ అధికాపార్టీ నేతలు కోట్లరూపాయలు దండుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. 

14:29 - March 24, 2018

అమిత్ షాకు లోకేశ్ కౌంటర్..

అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఏపీ మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా సీఎం చంద్రబాబుకు రాసిన లేఖపై లోకేశ్ స్పందించారు. ఈ లేఖను మంత్రి నారా లోకేష్ ఖండించారు. రాజకీయా లబ్ధితో ముందుకు వెళుతున్నది టీడీపీ కాదని, బీజేపీనే అని అన్నారు. రాజకీయ కారణాలతోనే ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందించడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారని చెప్పారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని... యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు 19 హామీలను నెరవేర్చకపోవడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

13:07 - March 24, 2018

హైదరాబాద్ : సత్య హరిశ్చంద్రుడి గురించి పురాణాలలో చదువుకున్నాం. ఇచ్చిన మాట కోసం కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను నడిరోడ్టుమీద వేలం వేసిన విక్రయించిన ఘటన గురించి చదువుకుని అంతటి గొప్పవాడు లేడని సత్యం కోసం కుటుంబాన్నే త్యాగం చేసిన గొప్ప రాజు అని గొప్పలు చెప్పేసుకుంటాం. అదే ఆధునిక సమాజంలో జరుగుతుంటే మాత్రం పాలకులు దానిపై చర్యలు తీసుకున్న సందర్భాలు బహు అరుదుగా కనిపిస్తుంటాయి.

యదేచ్ఛగా సాగిపోతున్న మహిళల అక్రమ రవాణా, విక్రయాలు:
దేశంలో యువతులు, మహిళలు, బాలికలు అక్రమ రవాణా, విక్రయాలు యదేచ్ఛంగా కొనసాగుతున్నాయి. కానీ ఇవేవీ పాలకుల దృష్టికి రావు. ఎన్నికల్లో మాత్రమే మహిళా సాధికారత గురించి ఊకదంపుడు ఉపన్యాలు ఇచ్చేస్తుంటారు. మహిళలను ఓటు బ్యాంకులుగా మాత్రమే వినియోగించుకునే పాలకులు వారిపై జరుగుతున్న దారుణమైన హింసలపై మాత్రం నోరు మెదపదు..ఈ నేపథ్యంలో ఓ యువతిని పంతలో పశువుని విక్రయించినట్లుగా విక్రయించిన ఘటన మహిళల అక్రమ విక్రయాలకు అద్దం పడుతోంది.

ఉత్తరప్రదేశ్‌లో యువతిని విక్రయించిన ప్రబుద్ధలు :
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా, సురోర్‌పూర్ కలాన్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కొందరు ఏజెంట్లు వేలంపాటలో పశువును అమ్మినట్లుగా అమ్మేశారు. ఈ నెల 16న చోటుచేసుకుంది.

రూ.22వేలకు యువతి విక్రయం
ఈ ఘటన వివరాల్లోకెళితే, ఇటుక బట్టీలో కూలీగా పనిచేసే ముకేశ్ అనే వ్యక్తికి సదరు యువతిని రూ.22 వేలకు బ్రోకర్లు వేలంపాటలో విక్రయించారు. అడ్వాన్సు కింద ముకేశ్ వారికి రూ.17,500 చెల్లించి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ, మిగిలిన మొత్తాన్ని అతను వారికి చెల్లించలేదు. దీంతో వారు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో మనస్తాపానికి గురైన ముకేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని యూపీ పోలీసులు తెలిపారు. ముకేశ్ ఆత్మహత్య కేసును విచారిస్తుండగా యువతి వేలంపాట విక్రయ ఘటన తమ దృష్టికి వచ్చిందని బాగ్‌పత్ సర్కిల్ అధికారి దిలీప్ సింగ్ తెలిపారు.

నిందుతులపై కేసు నమోదు ..
ముకేశ్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టవిరుద్ధంగా యువతుల అక్రమ రవాణా, విక్రయం వ్యాపారం చేస్తున్న సోనూ, మోను అనే ఇద్దరు ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. నిందితులు అమ్మాయిలను అసోం నుంచి తీసుకుచ్చి బాగ్‌పత్‍‌లో వేలంపాటలో విక్రయిస్తుంటారని ఆయన తెలిపారు. కాగా ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి మహిళల, యువతులు, బాలికల అక్రమ రవాణాలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసం ఎంతైనా వుంది.

12:52 - March 24, 2018

ఢిల్లీ : అమెరికా, చైనా మధ్య ఎకనమిక్ వార్.. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను వణికిస్తోంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలకు ఈ ఎఫెక్ట్ తగలడంతో.. దేశీయంగా దలాల్ స్ట్రీట్ మరోసారి బేర్ మంది. ఉదయం నుంచి బేరిష్ ట్రెండ్‌లో ఉన్న సెన్సెక్స్... చివర్లో 410 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టి 10వేల కంటే దిగువకు పడిపోయింది. మొత్తం మీద.. లక్షా 57వేల కోట్ల మదుపరుల సంపద తుడిచిపెట్టుకుపోయింది.

అమెరికా, చైనా మధ్య వాణిజ్యయుద్ధం స్టాక్‌ మార్కెట్‌ను బెంబేలెత్తించింది. చైనాపై ట్రంప్‌ వాణిజ్య ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లు డీలా పడ్డాయి. మరోవైపు అమెరికాకు చెందిన 128 వస్తువులపై చైనా కూడా పన్ను విధిస్తోందన్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు సెల్లింగ్ ప్రెషర్‌కు లోనయ్యారు. దీంతో మార్కెట్ మరోసారి విలవిలలాడింది. ఉదయం నుంచి బేరిష్ ట్రెండ్‌లోనే ఉన్న సెన్సెక్స్‌ 410 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ ఈ ఏడాదిలోనే తొలిసారిగా 10,000 మార్క్‌ కిందకు పడిపోయింది.

వాణిజ్య యుద్ధ ఆందోళనల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. జపాన్ నిక్కీ 974 పాయింట్లు నష్టపోగా.. హాంగ్‌సెంగ్ 762 పాయింట్లు కోల్పోయింది. ఇక దేశీయంగా... సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనమైన సూచీ.. చివరకు 410 పాయింట్లు కోల్పోయి...32వేల 596 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 10వేల దిగువకు పడిపోయింది. 117 పాయింట్ల నష్టంతో 9వేల 998 వద్ద ముగిసింది. అంతర్జాతీయ భయాలకు తోడు.. దేశీయంగా బ్యాంకులకు నిరర్థక ఆస్తులు పెరుగుతున్న వార్తలు రావడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను హరించింది. దీనికి తోడు వీకెండ్ కూడా కావడంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తపడ్డారు.  బ్యాకింగ్, మెటల్, ఆటోమోబైల్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లలో అమ్మకాలు
జోరుగా సాగాయి. 

నిఫ్టీలో మెటల్ కంపెనీలైన ... వేదాంతా, హిందాల్కో షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక్కో షేరు విలువ 5శాతానికి పైగా పడిపోయింది. వీటితో యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, లుపిన్‌ షేర్లు కూడా నష్టాలను చవిచూడగా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు కాస్త లాభపడ్డాయి. మొత్తంగా మీద.. శుక్రవారం లక్షా 57వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. BSE షేర్ల విలువ 140.87లక్షల కోట్ల నుంచి 139.3లక్షల కోట్లకు పడిపోయింది. మరోవైపు 10వేల మైలురాయి కంటే దిగువకు పడిపోయిన నిఫ్టీకి.. 9వేల 900 వద్ద మద్దతు దొరికే అవకాశముందని నిపుణులు అంచనావేస్తున్నారు. 

12:47 - March 24, 2018

హైదరాబాద్ : కొత్త మున్సిపాలిటీలు, నగర పాలక పట్టణాలను ఏర్పాటు చేసేక్రమంలో గ్రామాలను విలీనం చేసేటప్పుడు ప్రజా అభిప్రాయాన్ని సేకరించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కొత్త మున్సిపాలిటీలు, నగర పాలక పట్టణాలను ఏర్పాటు చేసేందుకు న్యాయ పరమైన అవరోధాలు రాకుండా పక్కా ప్రాణాళికతో ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలన్నారు. గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. కొత్త మున్సిపాలిటీలు, నగర పాలక పట్టణాలుగా ఏర్పాటు చేసినప్పుడు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నామని.. పన్నులు పెరుగుతాయని గ్రామ ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. చాలా మున్సిపాటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొత్త మున్సిపాలిటీలు, నగర పాలక పట్టణాల్లోనేకాకుండా పాత మున్సిపాలిటీల్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలన్నారు. సీపీ రోడ్డు, డ్రైనేజీ పనుల్లో క్వాలిటీ ఉండే విధంగా చూడాలన్నారు. క్వాలిటీ వర్క్ చేయాలని తెలిపారు. వార్డ్ మెంబర్ల్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూలీ వెళ్లే పరిస్థితి ఉందని..కాబట్టి వారికి గౌరవవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

పెద్దపల్లి మున్సిపల్ సమావేశం రసాభాస..

పెద్దపల్లి : రామగుండం నగర పాలక సంస్థ సమావేశం రసాభాసగా మారింది. కార్యాలయంలో జరుగుతున్న సమావేశంలో సాధారణ, బడ్జెట్ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ప్రజా సమస్యలు పట్టించుకోని పాలక వర్గం వద్దంటూ..పోడియం ఎదుట అధికార టీఆర్ఎస్ కార్పొరేట్లు బైఠాయించారు. వారికి పోటీగా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు నినాదాలతో సమావేశం రసాభాసగా మారిపోయింది. 

12:30 - March 24, 2018

హైదరాబాద్ : సీసీకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దేవరకద్ర నియోజకవర్గంలోని విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశారని..దానిపై డిమాండ్ సర్వే చేయించామని తెలిపారు. సీసీకుంట మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ జూ.కళాశాల, దేవరకద్ర మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు పాలిటెక్నిక్ కు సంబంధించిన మూడు అసెస్ మెంట్ సర్వే చేయించామని తెలిపారు. అవన్నీ అనుకూలంగా వచ్చాయని... అక్కడ ఏర్పాటు చేయాలని సర్వేలో తేలిందన్నారు. ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని...త్వరగా ముఖ్యమంత్రి ఆమోదంతోని వీలైతే ఈ విద్యా సంవత్సరమే సీసీకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

పవన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..

అమరావతి : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ప్రశ్నలు గుప్పించారు. ప్రశ్నించటానికే జనసేన వచ్చిందన్న పవన్ కల్యాణ్ అసలు ఎవరిని ప్రశ్నించాలో వాళ్లను వదిలేసి, అభివృద్ధి కోసం ఆరాటపడుతున్న టీడీపీని విమర్శిస్తున్నారని పవన్ పై మండిపడ్డారు. టీడీపీపై ఏదో ఒక కేసు ఉందని చూపెట్టేందుకే బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనని, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాగా ఇటీవల టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. 

12:16 - March 24, 2018

ఢిల్లీ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖరాశారు. చంద్రబాబు రాసిన లేఖకు సమాధానంగా 9 పేజీల లేఖను అమిత్‌షా పంపించారు. ఏపీ అభివృద్ధికి టీడీపీ, బీజేపీ కట్టుబడి ఉన్నాయని లేఖలో పేర్కొన్న కలమదళపతి.. చంద్రబాబుకు  ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ, బీజేపీ యే ఏపీ ప్రజలకు నిజమైన స్నేహితులు అన్నారు. రాజకీయపరమైన అంశాలతోనే ఎన్డీయే నుంచి బయటికి వెళ్లారని పిస్తోందని తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిస్థాయిలో నెరవేర్చిందని చెప్పారు. రాష్ట్రంలో 3 ఎయిర్‌పోర్టులను అంర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చామని తెలిపారు. ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాయం అందించిందని పేర్కొన్నారు. ఎన్డీయే నుంచి బయటికి వెళ్లడంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏపీకి 3 కేంద్ర విద్యాసంస్థలు వచ్చాయని చెప్పారు. కేంద్రం కొత్త రైల్వేలైన్లకు అనుమతి ఇచ్చిందన్నారు. 

 

40 బీపీ టాబ్లెట్స్ మింగి బాధితురాలి ఆత్మహత్య!..

హైదరాబాద్ : మెట్టుగూడ ప్రాంతానికి చెందిన ఓ యువతి బీపీ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాధితురాలు నామాలగుండులోని తన అమ్మమ్మ ఇంటికి గురువారం వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇంటిలోని సుమారు 40 బీపీ టాబ్లెట్లను మింగేసింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రాణాలు విడిచింది. కాగా, ఈ నెల 13న సదరు బాలికను మహ్మద్ అస్లాం 22ఏళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారం చేశాడు.

దాణా కుంభకోణం కేసులో లల్లూకి శిక్ష ఖరారు..

జార్ఖండ్ : సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ కు ఎట్టకేలకు శిక్ష ఖరారయ్యింది. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు 14ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ  రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గత సోమవారం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో నేడు న్యాయస్థానం ఆయనకు శిక్ష ఖరారు చేసింది. దీంతో పాటు రూ. 60లక్షల జరిమానా విధించింది. కాగా.. ఇదే కుంభకోణానికి సంబంధించిన మిగతా మూడు కేసుల్లోనూ లాలూకు శిక్ష పడిన విషయం తెలిసిందే.

పేదల సమస్యలు ఉన్నంత కాలం ఎర్రజెండా : రాఘవులు

రంగారెడ్డి : దేశంలో పేదవారు, వారి సమస్యలు ఉన్నంత వరకూ ఎర్రజెండా వుంటుంది. వారికోసం పోరాటాలు కొనసాగిస్తునే వుంటుందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు పేర్కొన్నారు. ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై..మహాసభల్లో ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఈసందర్భంగా రాఘవులు డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దళితుల రక్షణకై దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని తెలిపారు. పేదల నుండి కమ్యూనిస్టులను ఎవ్వరూ దూరం చేయలేరని రాఘవులు పేర్కొన్నారు. 

ప్రారంభయిన సీపీఎం బస్ జాతా..

రంగారెడ్డి : సీపీఎం జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా మంచాల మండలం ఆరుట్ల లో సీపీఎం బస్ జాతా ప్రారంభమయ్యింది. బస్ జాతాను సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, జాతీయ నాయకులు అరుణ, జూలకంటి, వెంకట్ లు ప్రారంభించారు. ఈ జాతాలో సీపీఎం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

11:42 - March 24, 2018

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబుకు 9 పేజీల లేఖ రాశారు. చంద్రబాబు లేఖకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీ అభివృద్ధి టీడీపీ, బీజేపీ కట్టుబడి ఉన్నాయన్నారు. 

11:38 - March 24, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి అంత చిన్నచూపా..? అని మోదీ ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు సూటిగా  ప్రశ్నించారు. పార్లమెంట్ లో పరిణామాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో పోరాటం మరింత ఉధృతం చేయాలని సూచించారు. సభ లేనప్పుడు ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఆందోళనలు జరుగుతున్న ఏపీకి ఇవ్వడం లేదు.. ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం రూ.3 వేల కోట్లు ఇచ్చారని చెప్పారు.

అన్ని హామీలు నెరవేర్చాం : అమిత్ షా

ఢిల్లీ : ఏపీకి ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను పూర్తిస్ధాయిలో నెరవేర్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఏపీకి ఇచ్చిన కేంద్రం విద్యాసంస్థలు ఎయిమ్స్ వంటి అంశాలను, విభజన చట్టంలోని అంశాలను లేఖలో అమిత్ షా ప్రస్తావించారు. మూడు విమాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చినట్లు లేఖ అమిత్ షా ప్రస్తావించారు. 

టీడీపీకి నిజమైన మిత్రులు బీజేపీనే : అమిత్ షా

ఢిల్లీ : టీడీపీ పార్టీకు నిజమైన మిత్రులు బీజేపీ మాత్రమేనని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు అమిత్ షా రాసిన లేఖలు పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో టీజీపీ నిజమైన మిత్రులు బీజేపీయేనని పేర్కొన్నారు. అభివృద్ధి కంటే రాజకీయపరమైన అంశాల వల్లనే ఎన్డీయే నుండి టీడీపీ వైదలగినట్లుగా తాను భావిస్తున్నానన్నారు. 

బీజేపీ అంటే బ్రేక్ జనకా ప్రామిసస్ పార్టీ : బుద్దా

అమరావతి : బీజేపీ అంటే బ్రేక్ జనకా ప్రామిసస్ పార్టీ అని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా అదేస్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పాముకు పాలు పోసి పెంచినట్లుగా మా ఓట్లు వేసి సోమును ఎమ్మెల్సీని చేశామని విమర్శించారు. మాద్వారా గెలిచి మాపై విషయం చిమ్ముతున్నాడని తీవ్రస్థాయిలో సోముపై బుద్దా వెంకన్న మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదని హెచ్చరించారు. 

సోముకు సవాల్ విసిరిన టీడీపీ నేత..

అమరావతి : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు టీడీపీ నేత బీద రవిచంద్ర సవాల్ విసిరారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయమాల్యా కుంభకోణాలపై కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి విచారణకు సిద్ధమా అని బీద రవిచంద్ర బీజేపీకి సవాల్ విసిరారు. వైసీపీతో కలిసి ఏపీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమలో అవినీతి జరిగిందంటే రైతులే బీజేపీని ఉరితీస్తారని హెచ్చరించారు. 

బీజేపీ జోకర్ల పార్టీ : బీద రవిచంద్ర

అమరావతి : టీడీపీ పార్టీ అంటే డ్రామా పార్టీ అని బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత కూడా అదే స్థాయిలో స్పందించారు. బీజేపీ పార్టీ అంటే జోకర్ల పార్టీ అని టీడీపీ నేత బీద రవిచంద్ర కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ జరుగుతుంటే సోము ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. సోము వీర్రాజు వల్లనే టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరిగిందన్నారు. ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన నిధులు రాకుండా చేశారని ఆరోపించారు. టీడీపీ వల్లనే సోముకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని బీద రవిచంద్ర డిమాండ్ చేశారు.

టీడీపీ అంటే డ్రామా పార్టీ : సోము వీర్రాజు

అమరావతి : టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీపై సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి పట్టిసీమ పరాకాష్ట అని విమర్శించారు. పరిపాలన గాడి తప్పిందనీ..ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదన్నారు. ప్రతీ ప్రాజెక్టులోని అవినీతి తాండవం చేస్తోందనీ..నరేగా నిధులు పక్కదోవ పడుతున్నాయన్నారు. బాత్రూమ్ లు కట్టకుండా వేల కోట్లు దిగమింగేసారనీ తీవ్రస్థాయిలో సోము వీర్రాజు ఆరోపించారు. 

పవన్ కరెక్ట్ గా లేరన్న శివాజీ..

హైదరాబాద్ : ఎమ్మార్వో వనజాక్షిపై ఎప్పుడో దాడి జరిగితే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారేంటి? ఫస్ట్ మీరు కరెక్టుగా లేరు..నిజాయతీగా లేరు. నిబద్ధతతో వ్యవహరించడం లేదు. ఏపీకి రావాల్సిన ‘యాపిల్’, చైనా కంపెనీలు రాకుండా తరలిపోయాయి. ప్రధాని మోదీ తనకు చాలా క్లోజ్ అని పవన్ చెబుతున్నారు కదా!, మోదీతో పవన్ మాట్లాడి ఏపీకి రాకుండా పోయిన ఆ కంపెనీలను ఇక్కడికి రప్పించాలి’ అని పవన్ పై విమర్శలు గుప్పించారు.

10:43 - March 24, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ వ్యాపార సంస్థలుగా బిహేవియర్ చేస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడంకుళం ఎన్ టీపీసీ దగ్గర విద్యుత్ అడిగితే యూనిట్ కు పది రూపాయలు చెప్పారని... మూడు నెలల అడ్వాన్స్ ఇవ్వమన్నారని గుర్తు చేశారు. ప్రైవేట్ సంస్థలు అడిగిన దానికంటే అధికంగా అడుగుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తున్నామని చెప్పారు. టెండర్లు కూడా వారు చెప్పిన పద్ధతుల్లో వేస్తున్నామని చెప్పారు. ఓపెన్ టెండర్లను పిలుస్తున్నామని తెలిపారు. 

జనసేనానికి అవినీతి ఇప్పుడు కనిపిస్తోందా? శివాజీ

హైదరాబాద్ : ఏపీలో అవినీతి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కనపడుతోందా? అని హీరో శివాజీ ప్రశ్నించారు. శివాజీ ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక, మట్టి విషయంలో జరుగుతున్న అవినీతి విషయమై తాను గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘ప్రజల్లోకి పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు వచ్చారు? రోజూ ట్వీట్లు చేసే పవన్, ప్రభుత్వ అవినీతి గురించి ఇన్నాళ్లూ ఎందుకు ప్రశ్నించలేదు? లోకేశ్ అవినీతి చేశారని ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు?

భాగ్యనగర పెట్రోల్ బంక్ లో ట్రాన్స్ జెండర్లు..

హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల పరంగా సమాజంలో విపక్షతకు గురవుతున్న ట్రాన్స్‌జండర్లు తమ బతుకు బండిని నడిపించడానికి భిక్షాటన, వ్యభిచారం లాంటి వృత్తులను ఆశ్రయిస్తున్నారు. జైళ్ల శాఖ పుణ్యమా అని వారికి కూడా మంచి రోజులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ వారికి లాభదాయక ఉపాధిని కల్పించడానికి నడుం బిగించింది. హైదరాబాద్ నగరంలో త్వరలో ఏర్పాటుకానున్న ఐదు పెట్రోల్ బంకుల్లో వారికి ఉపాధి కల్పించనుంది. ఈ ఐదింటిని ప్రత్యేకించి ట్రాన్స్‌జండర్లే నిర్వహించనుండటం గమనార్హం. ఇలాంటి ఉపాధి వల్ల వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలరని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు అమిత్ షా లేఖ : చంద్రబాబు

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల 9 పేజీల లేఖ రాశారు. ఎన్డీయే నుండి బైటకు వస్తు చంద్రబాబు అమిత్ షాకు రాసిన ఏఖకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుందని ఆ లేఖలో అమిత్ షాప పేర్కొన్నారు. ఎన్డీయే నుండి బైటకు వెళ్లడాన్ని ఏకపక్ష నిర్ణయంగా భావిస్తున్నానని ఆయన లేఖలో వెల్లడించారు. ఏపీకి సంబంధించిన ఏ విషయంలోను తాము నిర్లక్ష్యం చేయలేదనీ..మీ నిర్ణయం మాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆయన లేఖలోపేర్కొన్నారు. అలాగే ఉగాది శుభాకాంక్షలు చంద్రబాబుకు లేఖలో తెలిపారు. 

10:29 - March 24, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణంలో నిధులు గోల్ మాల్ అయ్యాయని అన్నారు. పట్టిసీమకు 1660 కోట్ల రూపాయలు ఎందుకని ప్రశ్నించారు. స్పిల్ వే నిర్మాణంలో 1400 కోట్ల రూపాయల ఖర్చు ఎలా అయిందని నిలదీశారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 

 

10:08 - March 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో వివిధ సమస్యలపై చర్చించడానికి విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింట్‌ ఉద్యోగుల సమస్యలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

 

కార్డన్‌ సెర్చ్‌

హైదరాబాద్‌ : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో  నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో 19 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాచారం పీఎస్‌ పరిధిలోని దుర్గాబాబా నగర్‌లో  జరిగిన ఈ తనిఖీల్లో 13 బైక్‌లు, 8గ్యాస్‌ సిలిండర్లు, 30 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 270 మంది పోలీసులు ఈ సెర్చ్‌ ఆపరేషన్  నిర్వహించారు. 

10:03 - March 24, 2018

హైదరాబాద్‌ : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో  నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో 19 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాచారం పీఎస్‌ పరిధిలోని దుర్గాబాబా నగర్‌లో  జరిగిన ఈ తనిఖీల్లో 13 బైక్‌లు, 8గ్యాస్‌ సిలిండర్లు, 30 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 270 మంది పోలీసులు ఈ సెర్చ్‌ ఆపరేషన్  నిర్వహించారు. 

 

నేడు ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో పలు అంశాలపై చర్చ

గుంటూరు : నేడు ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో పలు అంశాలపై చర్చ జరుగనుంది. ఏకీకృత ఉపాధ్యాయ విద్యా కోర్సులు, అనావృష్టి పీడిత మండలాల్లో రైతులకు అండ, వలసదారులకు రేషన్ కార్డులపై చర్చించనుంది. ఫార్మా.. డి కళాశాలలు, రైతుల ఆత్మహత్యలపై సాంస్కృతిక వారసత్వంపై పెంపు, ఆసరా కార్యక్రమం, ఇంటర్ విద్యలో గ్రేడింగ్ విధానం, అత్యవసర ప్రజా ప్రయోజన నోటీసుపై చర్చించనున్నారు. సంక్షేమ రంగంపై లఘు చర్చ జరుగనుంది. 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : అనంతనాగ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల ఎదురు కాల్పులు జరిగాయి.  భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హత మార్చారు. 

నేడు ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు

గుంటూరు : నేడు ఏపీ శాసనమండలిలో పలు అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగనుంది. టీటీడీ ద్వారా పాత దేవాలయాల పునర్ నిర్మాణం, విద్యుత్ శాఖ కంప్యూటరీకరణ, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల నిర్వహణపై చర్చ జరుగనుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో గ్రామ పంచాయతీల విలీనం, పురపాలక ఉపాధ్యాయుల భవిష్య నిధి, జలమార్గాల ద్వారా రవాణా, వెలిగొండ ప్రాజెక్టు పనుల జాప్యం, రహదారులపై మద్యం దుకాణాలు, కొల్లేరు సరస్సు సంరక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు. 

08:37 - March 24, 2018

రాజకీయాలు పతనమవుతున్నాయని వక్తలు అన్నారు. 'రాజ్యసభ ఎన్నికలు' అనే అంశంపై న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్, టీకాంగ్రెస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ ఎస్ నేత సత్యనారాయణ గుప్తా పాల్గొని, మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి అర్థం లేకుండా పోయిందని తెలిపారు. ఆ చట్టాన్ని సరవణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

08:28 - March 24, 2018
08:26 - March 24, 2018

నల్లగొండ : జిల్లాలోని చండూర్‌ మండలం గట్టుప్పల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం పరకాలను  డివిజన్‌గా ప్రకటించి.. గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించకపోవడంతో గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అధికార పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దహనం చేశారు. 500 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరసన తెలిపారు. గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 

 

08:22 - March 24, 2018

రాజమండ్రి : ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్టు ప్రత్యేక హోదా సాధన సమితి ప్రకటించింది. ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 28న విద్యార్థి, యువజన సంఘాలతో జేఏసీని ఏర్పాటు చేయనున్నట్టు నేతలు ప్రకటించారు. 27న అంబేద్కర్‌ విగ్రహాల దగ్గర  రాజ్యాంగ పరిరక్షణ  దినాన్ని పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హోదా ఉద్యమంలో ఇప్పటి వరకు కలిసిరాని వారు ఇకనైనా పాల్గొనాలని ప్రత్యేకహోదా సాధన సమితి చైర్మన్‌ చలసాని శ్రీనివాస్‌ కోరారు. ఇక నుంచి ఉమ్మడిగా ఉద్యమించాలని... ఐక్య ఉద్యమాల్లో కలిసిరాని పార్టీలను, నేతలను ఆంధ్రా ద్రోహులుగా పరిగణిస్తామన్నారు. రహదారుల దిగ్బంధంతో ప్రత్యేకహోదాపై ప్రజల ఆకాంక్ష వెల్లడైందని... ఇప్పటికైనా కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు.  లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకే ఎంపీలు శిఖండి పాత్రపోషిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా టీఆర్‌ఎస్‌ ఎంపీలు సైంధవుల్లా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

 

08:14 - March 24, 2018

ఢిల్లీ : దేశంలోని 17 రాష్ట్రాల్లో 59 రాజ్యసభ స్థానాలకు కొత్తగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. 10 రాష్ట్రాల్లో 33 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగతా 26 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌.. అనంతరం కౌంటింగ్‌ జరిగింది. మొత్తం స్థానాల్లో బీజేపీ 28, కాంగ్రెస్‌ 10 స్థానాలు దక్కించుకున్నాయి. 

ముఖ్యంగా ఈ మధ్య యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్‌ సీట్లను పోగొట్టుకున్న బీజేపీ... రాజ్యసభ ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకుని హవా చాటింది. సీఎం యోగీ వ్యూహంతో ఇక్కడ బీఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నట్లు ముందే ప్రకటించారు. ఇక 9వ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి తలపడిన బీమ్‌రావ్‌ అంబేద్కర్‌ గెలుస్తారని అంతా ఆశించారు. కానీ.. అనూహ్యంగా ఆ సీటును కూడా బీజేపీ దక్కించుకుంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన జయాబచ్చన్‌ గెలిచారు. ఆమె ఇక్కడి నుంచి గెలవడం రెండోసారి. ఇక బీజేపీ గెలిచిన 9 సీట్లలో తెలుగువారైన జీవీఎల్‌ నరసింహారావు కూడా ఉన్నారు. నిన్నటివరకు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్‌... ఇక రాజ్యసభలో తన వాణిని వినిపించనున్నారు. ఇక యూపీ నుంచి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా విజయం సాధించారు. 

కేరళ నుంచి... జనతాదళ్ యునైటెడ్ శరద్ యాదవ్ వర్గం ఎంపీ, కేరళ జేడీయూ అధ్యక్షుడు వీరేంద్ర కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. అధికార సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ మద్దతుతో ఆయన ఈ విజయం సొంతం చేసుకున్నారు. వీరేంద్ర కుమార్‌కు 89 ఓట్లు పోలయ్యాయి. విపక్ష యూడీఎఫ్ ఫ్రంట్ అభ్యర్థి బి.బాబు ప్రసాద్‌కు కేవలం 40 ఓట్లు పోలయ్యాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో చేతులు కలపడంపై నిరసన వ్యక్తం చేస్తూ వీరేంద్ర కుమార్ పెద్దల సభకు రాజీనామా చేశారు. తిరిగి కేరళ నుంచి పోటీ చేసి వీరేంద్ర కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రాజ్యసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ మరోసారి సత్తా చాటుకున్నారు. పశ్చిమబెంగాల్‌ నుంచి రాజ్యసభకు తృణమూల్ నాలుగు స్థానాల్లో పోటీ చేసి నాలుగింటినీ  కైవసం చేసుకుంది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు నడిముల్ హక్, తొలిసారి నామినేషన్ వేసిన సుభాషిస్ చక్రవర్తి, అభిర్ బిస్వాస్, సంతను సేన్ విజయం సాధించారు. ఐదో స్థానానికి టీఎంసీ బలపరిచిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి గెలుపొందారు. 

ఇక కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 3 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 1 స్థానం గెలుచుకుంది. అలాగే కర్నాటకలో కాంగ్రెస్‌, బీజేపీ చెరో స్థానం గెలుచుకుంది. ఇక మహారాష్ట్రలో బీజేపీ 3, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఒక్కొక్క స్థానంలో గెలిచాయి. ఈ ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాలతో రాజ్యసభలో బీజేపీ బలం 86కు చేరింది. 

జూబ్లీహిల్స్ లో డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపన 24 మందిపై కేసు నమోదు చేశారు. 10 బైక్ లు, 3 ఆటోలు, 2, కార్లను సీజ్ చేశారు.

ఒంటిమిట్టలో నేటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

కడప : ఒంటిమిట్టలో నేటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 

జగన్ 119 వ రోజుకు చేరుకున్న సంకల్పయాత్ర

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర 119 వ రోజుకు చేరుకుంది. నేడు కావూరు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 

 

Don't Miss