Activities calendar

25 March 2018

21:36 - March 25, 2018

సీపీఎం 22వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలలో నెలకొన్న ముఖ్యమైన సమస్యలపై మహాసభలో చర్చించనుందా? 2019 ఎన్నికల్లో సీపీఎం కాంగ్రెస్ తో పొత్తు వుంటుందా? కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్ట్ ఫ్రంట్ గురించి కేసీఆర్ చూపిస్తున్న అత్యుత్సాహంపై ఆయన ఏమన్నారు? పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న అవిశ్వాస రాజకీయాలపై రాఘవులుగారి కౌంటర్ కామెంట్స్...కొత్తగా వచ్చే జనసేన పార్టీ విధి విధానాలు..పవన్ కళ్యాణ్ తీరుపై రాఘవులుగారి అభిప్రాయమేమిటి? ఇటువంటి పలు ప్రశ్నలకు సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు గారితో ఫేస్ టూ ఫేస్..

21:33 - March 25, 2018

హైదరాబాద్ : సబ్బండ వర్ణాల సమగ్రాభివృద్ధే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధని సీపీఎం స్పష్టం చేసింది. కొంతమంది సంపన్నుల అభివృద్ధిని.. రాష్ట్రాభివృద్ధిగా పరిగణించకూడదని తేల్చి చెప్పింది. తెలంగాణలో నేటికీ అణగారిన ప్రజల బతుకుల్లో వెలుగులు రాలేదని స్పష్టం చేసింది. దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని తెలిపింది. సీపీఎం అఖిల భారత 22వ మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాపై హైదరాబాద్‌లో సదస్సు సదస్సుల్లో నేతలు కీలక సూచనలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాపై సదస్సు
సీపీఎం అఖిత భారత 22వ మహాసభలు వచ్చేనెల 18 నుంచి జరుగనున్నాయి. ఆల్‌ ఇండియా మహాసభల సందర్భంగా... హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాపై సదస్సు నిర్వహించారు. వ్యవసాయం, పారిశ్రామిక విధానాలు పట్టణీకరణ, విద్య,వైద్యం , దళిత, గిరిజన, మైనార్టీ, ఎంబీసీ సంక్షేమం అనే అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ పత్యామ్నాయ అభివృద్ధి నమూనాపై మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ విపులంగా వివరించారు. తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్లలో 12శాతం పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు భారీగా ఆకర్షించామని గొప్పులు చెబుతున్న ప్రభుత్వం... రాష్ట్రంలో నూతన ఉద్యోగాల కల్పన ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్థిక, సామాజిక వర్గాల మధ్య అసమానతలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి జరినట్టని చెప్పారు. కొంతమంది ఆస్తులు పెరిగితే.. రాష్ట్రమంతా అభివృద్ధి జరిగినట్టు కాదన్నారు.

పాలకుల విధానాలతో రైతులు ఇబ్బందులు : ఏఐకెయస్‌ జాయింట్‌ సెక్రెటరీ విజ్జు క్రిష్ణన్‌
సదస్సులో పాల్గొన్న ఏఐకెయస్‌ జాయింట్‌ సెక్రెటరీ విజ్జు క్రిష్ణన్‌.. పాలకుల విధానాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కడుపు మండిన మహారాష్ట్ర రైతులు మహాపాదయాత్ర చేసి వారి హక్కులను సాధించుకున్నారన్నారు. నాసిక్‌ రైతుల స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణలో రైతుల నుంచి ప్రభుత్వాలు బలవంతంగా భూములు గుంజుకుంటున్నాయని ఆరోపించారు. హక్కుల సాధనకు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం పాఠశాల విద్యావిధానం నిర్వీర్యం : ఐలయ్య
ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వం పాఠశాల విద్యావిధానాన్ని నిర్వీర్యం చేస్తోందని టీమాస్‌ చైర్మన్‌, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య మండిపడ్డారు. తెలంగాణలో విద్యావిధానం పూర్తిగా వెనుకబడి పోయిందని విమర్శించారు. నేటికి గ్రామాల్లోని పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రస్తుత దుస్థితి పోవాలంటే బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి రావాల్సిన ఉందని అభిప్రాయపడ్డారు.
దళితుల అభివృద్దికి మత రాజకీయాలు ఆటంకం : కాకి మాధవరావు
దళిత సంక్షేమంపై మాట్లాడిన ప్రభుత్వ మాజీ సీఎస్‌ కాకి మాధవరావు... దళితుల అభివృద్దికి మత రాజకీయాలు ఆటంకంగా మారాయన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు మతం ముసుగు వేసుకున్నారని విమర్శించారు. దళితుల అభివృద్ధి జరగాలంటే మత రాజకీయాలు అంతమవ్వాలని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర అభివృద్ధికి సీపీఎం ప్రత్యామ్నాయాలు
మొత్తంగా ఈ సదస్సుల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. సదస్సులో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పోరాటాలను రూపొందించుకోనుంది. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యామ్నాయ నమూనాను సీపీఎం ప్రజల ముందుంచనుంది.

21:22 - March 25, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమోడాయి. తెలంగాణ, ఏపీలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మరోవైపు కర్నాటకలోని గుల్బర్గా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు.

14 మంది ప్రయాణికులతో ముప్కాల్‌ నుంచి మెండోరా వెళ్తున్న ఆటో
రోడ్డు ప్రమాదాలతో తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లాయి. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం మెండోరా వద్ద ఆటో అదుపుతప్పి బావిలో పడిన ఘటన పది మందిని బలితీసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరుగురు చిన్నారులు. మరో నలుగురు సుక్షితంగా బయపటపడ్డారు. 14 మంది ప్రయాణికులతో ముప్కాల్‌ నుంచి మెండోరా వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడింది. ఆటో నలుగురికి మించి ప్రయాణించకూడదు. ప్రమాదానికి గురైన ఆటోలో 14 మంది ఉన్నారంటే... డ్రైవర్‌ ఎంత నిర్లక్ష్యంగా ప్రయాణికులను చేరవేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. బావిలో పడిన ఆటోకు తాళ్లు కట్టి క్రేన్‌ సహాయంలో బయటకు తీశారు. మృత దేహాలను ఆర్మూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆటో డ్రైవర్‌ నిర్లక్షోయమే ప్రమాదానికి కారణమని బాధితులు చెబుతున్నారు.

కారు- ఆటో ఢీ
నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందంపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుండి రావులపాలెం వెళ్తున్న కారు- ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధమైంది.

పేరూరు మండలం పాతకాల్వ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లా పేరూరు మండలం పాతకాల్వ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రేణిగుంట -చంద్రగిరి మార్గంలో తమిళనాడు ఆర్టీసీ బస్సులు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతిలో పడిన ప్రమాదంలో డ్రైవర్‌సహా మరో ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ ఐదుగుర్ని ఆస్పత్రికి తరలించారు. క్రేన్‌ సహాయంతో పోలీసులు బస్సును పైకి తీశారు. తమిళనాడులోని సేలం నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది

కర్నాటకలోని గుల్బర్గా వద్ద రోడ్డు ప్రమాదం
మరోవైపు కర్నాటకలోని గుల్బర్గాలో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు. కాలకృత్యాల కోసం బస్సుదిగి రోడ్డు దాటుతున్న వారిని టిప్పర్‌ ఢీ కోవడంతో ఈ ఘటన జరిగింది. మృతులు సంగారెడ్డి జిల్లా నాగిలగిద్ద మండలం వల్లూరుకు చెందిన పద్మవ్వ, సునీత, లక్ష్మి, సాయిచరణ్‌గా గుర్తించారు. మొగల్‌కోటలో పిల్లల పుట్టువెంట్రుకల తీయించేందుకు వెళ్తూ ప్రమాదం బారినపడ్డారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

21:18 - March 25, 2018

అమరావతి : చంద్రబాబుకు అమిత్‌షా రాసిన లేఖపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. టీడీపీ - బీజేపీ మధ్య మాటల మంటలు జోరందుకున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. దీంతో హోదా రాజకీయం మరింత వేడెక్కింది.


ఏపీలో వేడెక్కుతోన్న హోదా రాజకీయం
ఏపీలో ప్రత్యేకహోదా రాజకీయం మరింత హీటెక్కింది. టీడీపీ - బీజేపీ నేతల మాధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖ మరింత ఆజ్యం పోసింది. అమిత్‌షా లేఖపై టీడీపీ శ్రేణులు విమర్శల దాడికి దిగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అమిత్‌షా లేఖపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు.. టీడీపీ ఎంపీలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమిత్‌షా లేఖకు అసెంబ్లీలోనే సమాధానం ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీడీపీ అడగటం బీజేపీకి నచ్చడం లేదన్నారు. హోదా లేదంటూనే ఈశాన్య రాష్ట్రాలకు 90:10 పద్దతిలో నిధులు కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవన్నీ ఏపీకి ఇవ్వడం బీజేపీకి ఇష్టంలేదని విమర్శించారు. గతంలో ప్రత్యేకహోదా ఏ రాష్ట్రాలకు ఇవ్వడంలేదని, హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని గుర్తు చేశారు. నాడు హోదా ఎవ్వరికీ ఇవ్వవద్దని ఆర్థికసంఘం చెప్పిందని కేంద్రం తమను వక్రీకరించిందన్నారు. ఈఏపీలకు నిధులు ఇస్తామని చెప్పి.. కనీసం మెమోకూడా ఇవ్వలేదని.. ఇప్పుడు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ అంటున్నారన్నారు. తొలి బడ్జెట్‌లోనే గొడవపడితే రాజకీయం అంటారనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ ఆగామని... కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ఇన్నాళ్లుగా అన్ని ప్రయత్నాలు చేసినట్టు వివరించారు. టీడీపీపై కేంద్రంసహా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు.

తెలుగు ప్రజలను అవమానిస్తోంది : ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను అవమానిస్తోందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఏపీకి ఏది ఇవ్వాలన్నది కేంద్రం నిర్ణయించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఓపికతో ఎదురు చూస్తున్నామని... తమ సహనాన్ని పరీక్షించవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని మోసం చేసిందని మరో మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా దగా చేసిందని ఆరోపించారు. బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే ఏపీకి అన్యాయం చేసిందని అమిత్‌షా లేక ద్వారా తెలుస్తోందని మరో మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.ప్రత్యేకహోదా అంశాన్ని పూర్తిగా అణగదొక్కేందుకు బీజేపీ కుట్రపన్నిందని ఆరోపించారు. మొత్తానికి ఏపీలో హోదా రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ , టీడీపీ పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. దీంతో నేతల మధ్య మాటలయుద్ధం మరింతగా పెరుగుతోంది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు..

హైదరాబాద్ : దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినందుకుగానూ ఆస్ర్టేలియా ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ ఆదివారం ఈ ఉదంతంపై విచారణ జరిపారు. అంతకుముందు శనివారం మ్యాచ్‌ అనంతరం విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఆస్ర్టేలియా కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌, ఓపెనర్‌ కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌ కీలక మ్యాచ్‌లో పట్టుసాధించేందుకు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకొన్న సంగతి తెలిసిందే.

20:00 - March 25, 2018

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించిన పోరు ఉదృతమవుతోంది. ఇప్పటికే వివిధ పద్దతుల్లో నిరసనలతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించిన ప్రత్యేక హోదా సాధన సమితి తాజాగా సినీ పరిశ్రమ మద్దతును కోరింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వారికి వివరించారు. ఈ సమావేశం అనంతరం ప్రత్యేక హోదా ఉద్యమానికి `మా' సంఘీభావాన్ని తెలిపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కాగా హోదా ఉద్యమంపై సినీ పరిశ్రమ స్పందించటంలేదంటు టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మా నుండి సంఘీభావం తెలపటం విశేషం.

19:43 - March 25, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నలుగురి పాలన సాగుతోందని, సంక్షేమ పథకాలను కొందరికే వర్తింప చేస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలతో తెలంగాణ అసెంబ్లీ హాట్‌హాట్‌గా జరిగింది. విపక్షాల ఆరోపణలను మంత్రి హరీశ్‌రావు తిప్పికొట్టారు. తమకు పర, తమ బేధంలేదని.. అందరికీ సమానంగా అన్ని పథకాలు వర్తింప చేస్తున్నామని అసెంబ్లీలో చెప్పారు.

పలు పద్దులకు ఆమోదముద్ర వేసిన అసెంబ్లీ
అసెంబ్లీలో ఆదివారం వివిధ పద్దులపై చర్చ జరిగింది. శాసనసభ వ్యవహారాలు, సమాచార, పౌర సంబంధాలు తదితర శాఖల పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న విపక్ష సభ్యులు ప్రభుత్వ విధానాల్లోని లోపాలను వేలెత్తి చూపారు. సంక్షేమ పథకల అమల్లో వివక్షత పాటిస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ సభ్యులను చేసిన విమర్శలను మంత్రి హరీశ్‌రావు తిప్పికొట్టారు.

బీజేపీ సభ్యుడు ప్రభాకర్‌ ఆందోళన
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించకపోడంతో పాలన కుంటుపడుతోందని బీజేపీ సభ్యుడు ప్రభాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

గవర్నర్‌ నరసింహన్‌ అపాయింట్‌మెంట్లు ఇవ్వడంలేదు : -రాజయ్య
సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య.. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ వ్యవహరిస్తున్న తీరును సభలో ప్రస్తావించారు. ప్రజా సమస్యలను విన్నవించేందుకు అపాయింట్‌మెంట్‌ కోరినా.. నిరాకరిస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు.

ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి హరీశ్‌రావు
వీటన్నింటికీ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశాల హృదయంలో పాలన సాగిస్తున్నారని, ప్రతిపక్షాలు పనికట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. శాసనసభ, సమాచార, పౌర సంబంధాలు తదితర శాఖ పద్దలకు ఆమోదముద్ర వేసిన తర్వాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ మధుసూదనాచారి అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. 

19:10 - March 25, 2018

నల్లగొండ : ప్రేమించి మోసం చేసిన ప్రియుడితో వివాహం జరిపించాలంటూ.. ఓ యువతి.. నల్గొండలో దీక్షకు దిగింది.నల్గొండకు చెందిన ఓ యువతి... ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో నర్సుగా పనిచేస్తోంది. అదే హాస్పిటల్‌లో ఉపేందర్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి మాట ఎత్తే సరికి కొన్నళ్లగా రకరకాల సాకులు చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితారాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఉపేందర్‌ ఇంటి ముందు దీక్ష కూర్చుంది. ఆమె దీక్షకు దళిత సంఘల నాయకులు మద్దతు తెలిపారు.      

19:07 - March 25, 2018

హైదరాబాద్ : ఆర్‌ ఆర్‌ పాన్‌ మసాల తయారీలో నిషేధిత పదార్థాలు వాడుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని యూనిక్‌ టుబాకో ప్రొడక్ట్స్‌ యాజమాన్యం తోసిపుచ్చింది. బండ్లగూడలోని ఆర్‌ ఆర్‌ పాన్‌ మసాల ఫ్యాక్టరీపై ఈనెల 17, 18 తేదీల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత గుట్కాలు తయారు చేస్తున్నట్టు ఓ ప్రాంతీయ చానల్‌లో ప్రసారమైన కథనంలో నిజంలేదని కంపెనీ యాజమాన్యం చెప్పింది. ఆర్‌ ఆర్‌ పాన్‌ మసాలలో ఎలాంటి నికోటిన్‌ లేదని... స్టేట్ ఫుడ్ లేబొరేటరీ పరీక్షల్లో తేలిందని యూనిక్‌ టుబాకో ప్రొడక్ట్స్‌ స్పష్టం చేసింది.

19:05 - March 25, 2018

కడప : శ్రీరామ నవమి సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్టి కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజల అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోదండరాముని దర్శనానికి భక్తులు తరలివచ్చారు. 

19:00 - March 25, 2018

రాజన్న సిరిసిల్ల  : శ్రీరామనవమి సందర్భంగా మేములవాడ దేవాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దైవదర్శనానికి వచ్చిన భక్తులుపై తమ ప్రతాపం చూపారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా నెట్టి వేయడం విమర్శలకు తావిచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ కాల్యాణోత్సవాన్ని తిలికించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. 

18:56 - March 25, 2018

భద్రాద్రి : సీతారాముల కల్యాణానికి భద్రాద్రి ముస్తాబయింది. 26న రామయ్య కళ్యాణం, 27న శ్రీరామ మహాపట్టాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. విళంబి నామ సంవత్సరంలోనే శ్రీరాముడు జన్మించాడని, ఈ ఏడాది రాములోరి కల్యాణాన్ని తిలకించడం మహా అదృష్టమని భక్తులు భావిస్తున్నారు. 60 ఏళ్ళకోసారి వచ్చే ఈ విళంబి నామ సంవత్సరాన జరుగుతున్న కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో భద్రాద్రికి తరలివస్తున్నారు. 

18:54 - March 25, 2018

అమరావతి : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేసిందని ఏపీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా దగా చేసిందని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ... ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రయోగించిన పదజాలంపై నక్కా ఆనంద్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమిత్‌ షా ఏ హోదాలో చంద్రబాబుకు లేఖ రాశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలిపై మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన హీరోయిన్ ను ఆదుకుంటానన్న సల్మాన్..

ముంబై : క్షయ వ్యాధితో గత ఆరు నెలలుగా బాధపడుతున్న 'వీర్ ఘటి' హీరోయిన్ పూజ దడ్వాల్‌ని ఆదుకుంటానని ఆ సినిమాలో హీరోగా చేసిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. 1995లో విడుదలయిన ఆ చిత్రంలో ఆమె సల్మాన్ సహ నటిగా నటించింది. అందులో అతుల్ అగ్నిహోత్రికి జంటగా ఆమె యాక్ట్ చేసింది. ఆమె తన దయనీయ పరిస్థితి గురించి మీడియా ముఖంగా తెలిపింది. దీనిపై తొలుత స్పందించిన బోజ్‌పురి స్టార్ రవి కిషన్ ఆమెకు తనవంతు సాయం చేసిన విషయం తెలిసిందే.

హీరో శివాజీపై కేసు నమోదు..

నల్లగొండ : ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో శివాజీపై ఫిర్యాదు చేశారు. ‘ఆపరేషన్ ద్రవిడ’ పేరిట బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన శివాజీ, మోదీని ‘ఇడియట్’ అని దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మోదీ ప్రతిష్టకు భంగం వాటిల్లే వ్యాఖ్యలు చేసిన శివాజీపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు. కాగా దీనిపై శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.

'హోదా`కు `మా' సంఘీభావం..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన సమితి ఉద్యమానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ `మా 'సంఘీభావం తెలిపింది. ‘మా’ అధ్యక్షుడు, సభ్యులను ప్రత్యేక హోదా సాధన సమితి ప్రతినిధులు కలిశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితిని ‘మా’ సభ్యులకు సాధన సమితి సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అనంతరం, ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉద్యమానికి ‘మా’ సంఘీభావం తెలిపినట్టు చెప్పారు. కాగా హోదా ఉద్యమంపై సినీ పరిశ్రమ స్పందించటంలేదంటు టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన విషయం తెలిసిందే.

18:16 - March 25, 2018
18:10 - March 25, 2018

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సారథి.. రాహుల్‌ గాంధీ జపిస్తున్న యువమంత్రంతో... తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో గుబులు పట్టుకుంది... సెవెంటీ ప్లస్‌ ఏజ్‌ ఉన్న నేతలు.. తమ పదవులను వీడాలన్నది కాంగ్రెస్‌ ప్రిన్స్‌ రాహుల్ సందేశం. ఇంతకూ ఇది టీ కాంగ్రెస్‌లో ఎవరికి గండంగా మారనుంది.. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది...
తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో గుబులు
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు తీసుకున్నాక.. పార్టీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది.. తొలి ప్లీనరీలో అధ్యక్షుడిగా రాహుల్‌... డెబ్బై ఏళ్ళు పైబడిన నేతలు తప్పుకోవాలన్న సందేశం ఇచ్చారు... ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. కాంగ్రెస్‌ చీఫ్‌ సందేశం సొంత పార్టీలోనే కాకుండా బయటి పార్టీల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా టీ కాంగ్రెస్‌ నేతల్లో గుబులు పట్టుకుంది.. ఇంతకూ తెలంగాణలో సీఎం రేస్‌లో ఉన్న సీనియర్లు రాహుల్‌ మాటకు లోబడతారా... లేక డోంట్‌ కేర్‌ అంటారా... కాదూ కూడదూ అంటే... అధిష్టానమే వారిని బలవంతంగా బయటికి పంపిస్తుందా...? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా తప్పుకుంటున్న సీనియర్లు
కాంగ్రెస్‌ పార్టీలో యవ నాయకత్వాన్ని పెంచాలన్నది రాహుల్‌ ఉద్దేశం.. అందుకే.. డెబ్బై ఏళ్ళు పైబడిన నేతలంతా పదవులు వీడి.. తమ అనుభవాన్ని పార్టీకి అందించాలని రాహుల్‌ సందేశమిచ్చిన విషయం తెలిసిందే... పార్టీ అధ్యక్షుడు అలా అన్నారో లేదో.. అంతలోనే దేశవ్యాప్తంగా కొందరు నేతలు స్వచ్ఛందంగా పార్టీ పదవులను వదులుకుంటున్నారు. యూపీ పీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌, గోవా చీఫ్‌ శాంతారామ్‌ నాయక్, గుజరాత్‌ పార్టీ అధ్యక్షులు భరత్‌ సింహ సోలంకీలు పదవులను వీడి ఇతర నేతలకు ఆదర్శంగా నిలిచారు. దీంతో ప్రస్తుతం తెంలగాణ కాంగ్రెస్‌లో మరింత ఉత్కంఠ రేగుతోంది..

టీ కాంగ్రెస్‌లో సెవెంటీ ప్లస్‌ నేతలంతా ముఖ్యులే
టీ కాంగ్రెస్‌లో డెబ్బైఏళ్ళకు పైబడిన వారి జాబితాలో అంతా ముఖ్యనేతలే ఉన్నారు. అందులో జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌ ఉన్నారు. జానారెడ్డి సీఎల్పీ నేతగా ఉండగా... గీతారెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక జైపాల్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు వచ్చే ఎన్నికల్లో పోటీ పడేందుకు.. ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. కానీ... వీహెచ్‌ మాత్రం.. తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఐనప్పటికీ పార్టీలో కీలక పదవి కోసం లాబీయింగ్‌ చేసుకుంటున్నట్లు సమాచారం. వీరంతా కూడా వచ్చే ఎన్నికల్లో సీఎం రేస్‌లో ఉండే నేతలే కావడం విశేషం..
సెవెంటీ ప్లస్‌ నేతలు తప్పుకోవాలన్న కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌
కాంగ్రెస్‌ హై కమాండ్‌ రాహుల్‌ ఆదేశాలమేరకు తెలంగాణలో నేతలు తప్పుకోవాల్సి వస్తే.. అందులో మొదటివరసలో ఉండేది ఈ ఐదుగురు నాయకులే... అందులోనూ.. ప్రస్తుతం పదవుల్లో ఉన్న జానారెడ్డి, గీతారెడ్డిలే ముందువరసలో ఉంటారు. మరి దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ నేతలు తమ పదవులను స్వచ్ఛందంగా వదులుకుంటున్న నేపథ్యంలో.. తెలంగాణలో ఈ ఐదుగురు నేతలు ఏంచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎల్పీగా, పీఏసీ ఛైర్మన్‌లుగా ఉన్న జానారెడ్డి, గీతారెడ్డి తమ పదవులను త్యాగం చేసి... రాహుల్‌ కోరికమేరకు యువతకు అవకాశం కల్పిస్తారా...? సీఎం రేస్‌లో నిలిచేందుకు రెడీ అవుతున్న జైపాల్, పొన్నాల, వీహెచ్‌లు రాహుల్‌ మెసేజ్‌ను పట్టించుకుంటారా...? అన్నదానిపై ఇప్పటివరకూ టీ నేతలెవ్వరూ స్పందించడంలేదు.

మౌన ముద్రలో వున్న నేతలు..
ఓ వైపు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని... దేశవ్యాప్తంగా పార్టీలోని సీనియర్స్‌ తమ పదవులను త్యాగం చేస్తుంటే... ఈ జాబితాలో ఉన్న టీ నేతలు మాత్రం మౌనముద్రలో ఉన్నారు. ఇంతకూ వీరు రాహుల్‌ మెసేజ్‌ను లైట్‌గా తీసుకున్నారా...? మరి అదే జరిగితే.. అధిష్టానమే వారిని బలవంతంగా బయటికి పంపిస్తుందా. అన్నది ఆసక్తికరంగా మారింది..

17:58 - March 25, 2018

మేడ్చల్‌ : దుండిగల్‌లో పోలీసులు భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక రాష్ట్రం బీదర్‌ నుంచి కొంపల్లికి మారుతి వ్యాన్‌లో గుట్కా, తంబాకు ప్యాకెట్లను కొంతమంది అక్రమంగా తరలిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న బాలానగర్‌ ఎస్‌వోటీ, దుండిగల్‌ పోలీసులు కాపుకాసి వాహనాన్ని పట్టుకున్నారు. సుమారు 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. జెస్సారాం అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

17:52 - March 25, 2018

హైదరాబాద్ : దళిత అభివృద్ధికి మతం అడ్డుగోడగా మారిందని ప్రభుత్వ మాజీ సీఎస్‌ కాకి మాధవరావు అభిప్రాయపడ్డారు. మతం సమస్య రోజురోజుకు మరింత జఠిలం అవుతోందన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలో వచ్చాక మతం ముసుగు వేసుకున్నారని అన్నారు. దళితాభివృద్ధి జరగాలంటే మత రాజకీయాలు అంతమవ్వాలన్నారు. మత రాజకీయాలపై దళితులు మాత్రమే పోరాడితే సమస్య పరిష్కారం కాదని.. అందరూ ఐక్యంగా కలిసికట్టుగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఎం అఖిల భారత 22వ మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రత్యామ్నాయ అభివృద్ధి నామూనా అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న కాకి మాధవరావు దళిత సంక్షేమంపై మాట్లాడారు. 

17:51 - March 25, 2018

నిజామాబాద్‌ : ఎంపీ కవిత జిల్లా అభివృద్ధికి అవరోధంగా పరిణమించారని బీజేపీ ఆరోపించింది. బోధన్‌, ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణకు కవిత మోకాలు అడ్డుతున్నారని బీజేపీ నాయకుడు, డీఎస్ కుమారుడు అరవింద్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌ చొరవ తీసుకొని.. ఈ ఫ్యాక్టరీలను తెరిపించాలని కోరారు. నాలుగేళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న కవిత... జిల్లాకు ఒక పెద్ద ఫ్యాక్టరీ అయినా తీసుకొచ్చారా... అని.. అరవింద్‌ ప్రశ్నించారు. 

17:48 - March 25, 2018

హైదరాబాద్ : దూల్‌పేట నుండి ప్రారంభమైన శోభాయాత్ర... సికింద్రాబాద్ గౌలిగూడ హనుమాన్ టెంపుల్‌ వరకు కొనసాగనుంది. రాత్రి 9 గంటల వరకు శోభయాత్ర గౌలిగూడకు చేరుకుంటుందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. యాత్రలో భద్రత కోసం . 20వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు.. యాత్ర జరిగే రహదారిలో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మొద్దని.. అలా ప్రచారం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 

17:45 - March 25, 2018

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి ఇచ్చిని నిధుల లెక్కలను బయటపెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ జేడీ శీలం డిమాండ్‌ చేశారు. చెప్పినదానికంటే ఏపీకి ఎక్కువే సాయం చేశామన్న అమిత్‌షా వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏపీ రాజధాని శంకుస్థాపన సమయంలో మట్టి, నీరు ఇచ్చిన రోజే చంద్రబాబు నోరువిప్పి ఉంటే.. ఈరోజు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేదికాదన్నారు. అవినీతి కారణంగా చంద్రబాబు పరిపాలన మీద పట్టుకోల్పోయారని జేడీ శీలం ఆరోపించారు. బీజేపీకి వైసీపీ మద్దతు ఇచ్చేలా మాట్లాడటం సరికాదన్నారు. 

17:42 - March 25, 2018

తూ.గోదావరి : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోము వీర్రాజు వ్యాఖ్యలతోనే టీడీపీ - బీజేపీ మైత్రి చెడిందన్నారు. తప్పుడు లెక్కలు కేంద్రానికి చెబుతూ వారిని తప్పుదోవ బట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గోద్రా అల్లర్ల సమయంలో మోదీ తప్పుచేశారని చంద్రబాబు అన్నందుకే.. ఆయనపై ప్రధాని కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు. నీతి ఆయోగ్‌ను ప్రధాని చేతుల్లో పెట్టుకుని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధులు ఎక్కువిస్తున్నారని మండిపడ్డారు.

17:40 - March 25, 2018

కర్నూలు : కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను అవమానపరుస్తోందన్నారు ఏపీ ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి. రాష్ట్రంలో ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఆందోళనలను కేంద్రం ఇకనైనా గుర్తించాలన్నారు. అసలు మోదీ ప్రభుత్వం ఏపీకి ఏమి ఇవ్వాలన్నది నిర్ణయించుకోవాలని సూచించారు. పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న తమ ఎంపీలను ప్రధాని పిలిచి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. కర్నూలులోని అతిథిగృహంలో ఓడియస్‌ ప్లస్‌ స్కీమ్‌ కింద చెంబుకు టాటా - ఆరోగ్యానికి బాట కార్యక్రమ బోచర్‌ను ఆయన విడుదల చేశారు. టీడీపీ అవిశ్వాసం పెట్టిన గంటలోపే 46 పార్టీలు మద్దుతు తెలిపాయని... చంద్రబాబు శక్తి ఏంటో తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎదురుచూస్తున్నామని... తమ సహనాన్ని పరీక్షించవద్దని కేఈ హెచ్చరించారు.

17:37 - March 25, 2018

తమిళనాడు : తూత్తుకుడి జిల్లాలోని స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు ఆమరణ నిరాహార దీక్షకు దిగటం సంచలనం సృష్టిస్తోంది. కలుషిత నీటితో సమీప గ్రామ ప్రజలు మృత్యువాత పడటం.. ఇతర గ్రామాలలో పంటలు నాశనమవుతున్నాయని 12 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో నటుడు కమలహాసన్‌, ఎండిఎంకే నేత వైగో మద్దతు పలకటమే గాక, ఆందోళనకారులతో దీక్షలో కూర్చునేందుకు బయలుదేరారు. వీరిని తమిళనాడు ప్రభుత్వం అరెస్ట్‌ చేయడంతో, తూత్తుకుడి జిల్లా ప్రజలు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని దీక్షలో కుర్చున్నారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఫ్యాక్టరీ మూసి వేసివేసేంత వరకు పోరాటం చేస్తామని ప్రజలు భీష్మించుకు కూర్చున్నారు.

టీఆర్ఎస్,బీజేపీ మధ్య ఘర్షణ..ఉద్రిక్తత..

హైదరాబాద్ : విద్యానగర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, కేటీఆర్, ఎమ్మెల్యే లక్ష్మణ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేకుంది. 

బావిలో పడ్డ ఆటో..పెరిగిన మృతుల సంఖ్య..

నిజామాబాద్ : ఆటో బావిలో పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. వేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిన ఘటన ముప్కాల్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడు నుండి తొమ్మిదికి పెరిగింది. కాగా మృతుల సంఖ్యఇంకా పెరిగే అవకాశాలున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసలు సంఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో ఆటోను బైటకు తీసారు. 

16:35 - March 25, 2018

హైదరాబాద్ : దళిత మహిళలకు నేటికి భద్రత లేదని మాజీ సీఎస్ కాకి మాధవరావు పేర్కొన్నారు. సభల్లోను, సంఘాల్లోను పురుషులకు సమానంగా మహిళలు ఎందుకుండటంలేదని ప్రశ్నించారు. దీంతో మహిళల ఆలోచనా ధోరణి వేరుగా వుంటుందనీ..అందుకే వారు సభల్లోను, సమావేశాల్లో తప్పకుండా వుండాలన్నారు. దళితులు అనాదిగా అణచివేతకు గురవుతున్నారనీ..ఇప్పటికీ వారు వెనుకబాటుతనంలోనే మగ్గిపోతున్నారన్నారు. సీపీఎం 22 జాతీయ మహాసభల సందర్బంగా ఎస్వీకేలో జరుగుతున్న సెమినార్ లో కాకి మాధవరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన దళితుల సంక్షేమం అనే అంశంపై ఆయన మాట్లాడుతు.. దళితుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్నారు. మాల మాదిగ వర్గీకరణ వర్గీకరణ గురించి కేంద్రం పట్టించుకోవాల్సిన అవుసరముందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు నానాటికీ తగ్గిపోతున్నాయనీ దీనికి కారణం ప్రయవేటు సెక్టార్ పెరగటం వల్లనే నన్నారు. టెక్నాలజీ అందుకోలేకపోవటం వల్ల కూడా నిరుద్యోగులు రోజు రోజుకు పెరుగటానికి కారణమని కాకి మాధవరావు పేర్కొన్నారు. 

16:24 - March 25, 2018

నిజామాబాద్ : వేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిన ఘటన ముప్కాల్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా వున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోల 14 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆటో ముప్కాల్ నుంచి మెండోరా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

16:08 - March 25, 2018

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో వెంకటేష్. విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ కథానాయకుడిగా వస్తే..100 పర్సెంట్ గ్యారంటీ అనేది నిర్మాతలకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని అటు వెంటకేష్ ఇటు ప్రేక్షకులు వమ్ము చేసిన సందర్బాలు చాలా అరుదు. నవరసాలను అలవోకగా పండిస్తు ఎటువంటి కాంట్రవర్శీల్లో ఇరుక్కోకుండా మిస్టర్ పర్ ఫెక్ట్ వెంకటేశ్. మరి విక్టరీ వెంకటేశ్ మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ తో మల్టీస్టారర్ మూవీతో అలరించనున్నారు. స్టార్ ఫ్యామిలీల కుటుంబాల నుండి రానున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

హిట్ సినిమాలతో వరుణ్
'ఫిదా', 'తొలి ప్రేమ' చిత్రాలతో వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న యంగ్ హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు వీరిద్దరూ కలసి ఓ మల్టీ స్టారర్ లో కనువిందు చేయబోతున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఎఫ్ 2' అనే టైటిల్
ఈ సినిమాకు 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ఉపశీర్షిక 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా సక్సెస్ ను అందుకుంటారో లేదో వేచి చూడాలి.

బావిలో పడ్డ ఆటో..5గురు మృతి..

నిజామాబాద్ : వేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిన ఘటన ముప్కాల్ వద్ద చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆటోల 14 మంది ప్రయాణికులు ఉండగా వారిలో ఐదుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. కాగా వారు సురక్షింతంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆటో ముప్కాల్ నుంచి మెండోరా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై విమర్శల వెల్లువ..

దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ చేస్తూ ఆస్టేలియా క్రికెటర్ కేమరాన్ బాన్ క్రాఫ్ట్ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ నేపథ్యంలో, ఆటలో గెలుపు కోసం ఆస్ట్రేలియా ఎంతకైనా దిగజారుతుందంటూ ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆసీస్ ప్రధాని టర్న్ బుల్ దీనిపై స్పందిస్తూ, తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. ఇదే సమయంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో పాటు ఇందులో భాగస్వాములైన ఆటగాళ్లపై వేటు వేయాలని ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కమిషన్ ఆదేశించింది.

15:19 - March 25, 2018

సౌత్ ఆఫ్రికా : ఆసిస్ క్రికెట్ లో బాల్ ట్యాంపరింగ్ వివాదం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వివాదం కారణంగా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. మూడవ టెస్ట్ చివరి రెండు రోజులకు పైన్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. వివాదానికి సంబంధించి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రులియా స్పోర్ట్స్ కమిషన్ పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ కొనసాగుతుండగా మిగిన ఉన్న రెండు రోజులకు ఆసీస్‌ జట్టు మరో ఆటగాడు టిమ్‌ పైన్‌ సారథ్య బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో స్మిత్‌, వార్నర్‌ యథావిధిగా జట్టులోనే కొనసాగుతారు. 

119 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ : మంత్రి హరీశ్

హైదరాబాద్ : మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా పార్టీలకు అతీతంగా 119 నియోజకవర్గాల్లో చేపట్టామని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంగా .. సురక్షిత మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతీ గూడెం, గిరిజన తండా, గ్రామాల్లో పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు కావాలనే అడుక్కునే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రమంతటా ఒకటే పాలసీ. ప్రజలకు ఏం కావాలో సీఎంకు తెలుసు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ముందుకు కొనసాగుతున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. 

సున్నం రాజయ్య వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రి..

హైదరాబాద్ : రాష్ట్రంలో నలుగురి పాలన మాత్రమే నడుస్తోందని సీపీఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు బాధాకరమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శాసనసభలో ఆర్థికపద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, సున్నం రాజయ్య ఇది నలుగురి పాలన, నలుగురిలో ప్రజలు నలుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విశాలమైన హృదయంతో పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఒకటే పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. 

ఇంగ్లీష్ మీడియాన్ని బలోపేతం చేయాలి : కంచె ఐలయ్య

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని బలోపేతం చేస్తే..విద్యార్ధులు అభివృద్ధి బాటలో పయనిస్తారని సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్బంగా నిర్వహిస్తున్న సెమినార్ లో కంచె ఐలయ్య మాట్లాడుతున్న సందర్బంగా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాను బలోపేతం చేయాలన్నారు. ఉన్నతస్థాయి చదువుకు ఇంగ్లీష్ మీడియం దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియ అమలులో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వారికి తెలుగుపై వున్న ప్రేమ ఇంగ్లీష్ పై చూపడం లేదన్నారు. కేరళ అభివృద్ధిలో దూసుకెళ్లటానికి అక్షరాస్యులు అధికంగా వుండటమే కారణమన్నారు.  

రాష్ట్రం ఏర్పడ్డాక పలు పరిశ్రమలు మూతపడ్డాయి : నాగేశ్వర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో 12 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని ప్రొ. నాగేశ్వర్ ఆరోపించారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్బంగా నిర్వహిస్తున్న సెమినార్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో 12 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని ప్రొ. నాగేశ్వర్ ఆరోపించారు. కొత్త పాలసీలతో పరిశ్రమలు వస్తున్నాయంటున్న ప్రభుత్వం ఉద్యోగాల కల్పన ఎందుకు పెరగలేదని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. మిసన్ కాకతీయ లోప భూయిష్టంగా వుందనీ..పూడికలు, గట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

సీపీఎం 22వ జాతీయ మహాసభల సెమినార్..

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా ఎన్వీకేలో సెమినార్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అంశంపై సెమినార్ కొనసాగుతోంది. ఈ సెమినార్ కు తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ. నాగేశ్వర్, టీమాస్ కన్వీనర్ కంచె ఐలయ్య సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

14:28 - March 25, 2018

అమరావతి : బ్యాంకులకు వేలాది కోట్లు ఎగవేసిన విజయమాల్యాకు ఒక న్యాయము, రూపాయలు ఎగ్గొట్టి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్‌ చేరిపోయిన విజయ్‌మాల్యా వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఒక న్యాయమునా? అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఇద్దరు ఆర్థిక నేరస్థులే..మరి వారిమధ్య వ్యత్యాసం ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నించారు? బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటా టీడీపీపై ఎదురు దాడి చేస్తోందనీ..బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఖండిచాలనీ..వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని చంద్రబాబు నేతలకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోకూడదనీ...ఆదే సయమంలో ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వటమంటే రాష్ట్రానికి మద్దతివ్వటమేననీ..టీడీపీ నేతలకు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్ధేశం చేశారు. 

13:59 - March 25, 2018

హైదరాబాద్ : ఎప్రిల్‌ 30లోపు అర్హులైనవారికి రేషన్‌ కార్డులు అందిస్తామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌. రేషన్‌ కార్డుల కోసం 2లక్షల 56వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు.

13:57 - March 25, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల ను నేటి ప్రభుత్వం పరిష్కరించలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకోసారి పీఆర్‌సీ అందచేయాలని ఇంతవరకు పీఆర్‌సీ అందలేదని, సెంట్రల్‌ పెన్షన్‌ స్కీం ఉద్యోగులు కోరుకోవట్లేదని ఇదివరకు ఉన్న పెన్షన్‌ స్కీంను తెలంగాణ ఉద్యోగులు అడుగుతున్నట్లు తెలియజేశారు. అలాగే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

13:54 - March 25, 2018

నల్లగొండ : నకిరేకల్‌ మండలం చందంపల్లి స్టేజి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుండి రావులపాలెం వెళ్తున్న కారు ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా  మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధమైంది. 

 

13:52 - March 25, 2018

హైదరాబాద్ : ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాష్ట్రం సమతుల్యమైన అభివృద్ధి సాధించేవిధంగా ప్రణాళికలు రూపొందించే విధానాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదని నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య అన్నారు. కానీ అందుకు ప్రభుత్వాలు సిద్ధపడలేదన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల చుట్టే తిరిగారు తప్ప.. సాధారాణ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు వీళ్లకు పట్టలేదన్నారు. ఎస్ వీకేలో నిర్వహించిన సెమినార్ లో ఆయన మాట్లాడారు.  2015 లో విడుదల చేసిన రాష్ట్ర ఎకనమిక్ సర్వే వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ అత్యంత వెనుకబడి ఉన్నాయి...అక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగాలని చెప్పింది. హైదరాబాద్ చుట్టూ పారిశ్రామికీకరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు వలసలు ఎందుకు పెరుగుతున్నాయో ఆలోచించాలన్నారు. ప్రభుత్వం పాలమూరు వలసలు ఆపాలన్నారు. ఎక్కడ చూసినా పాలమూరు కార్మికులే కనిపిస్తారని తెలిపారు. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం అభివృద్ధి అయితే ఈ వలసలు ఉండవన్నారు. పాలమూరు వలసలు ఎందుకు పెరుగుతున్నాయో ఆలోచించాలన్నారు. ఎక్కడ చూసినా పాలమూరు కార్మికులే కనిపిస్తారని తెలిపారు. వ్యవసాయ పంటల ఆధారిత పారిశ్రామికీకరణ కూడా ఉండాలన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. నిజామాబాద్ లో పసుపు ఉత్పత్తి అధికంగా ఉందని..కానీ పసుపు పరిశ్రమ లేదన్నారు. 

 

13:32 - March 25, 2018

హైదరాబాద్ : దేశ అభివృద్ధిలో కేరళ మోడల్ బెస్ట్ మోడల్ అని టీమాస్ ఛైర్మన్ కంచ ఐలయ్య అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం నిర్వహించిన సెమినార్ లో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'అధికారం వారికి.. పోరాటం మనకు ఉందన్నారు. పోరాటాలు చేస్తూనే...ఏం చేప్తే మనకు అధికారంలోకి వస్తామో ఆలోచన చేయాలని అన్నారు. దేశంలో బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఎక్స్ పర్ మెంట్ జరిగిందన్నారు. ఒక డెవలప్ మెంట్ మోడల్ ను దేశం ముందుంచిందన్నారు. ఆ డెవలప్ మెంట్ మోడల్ తెలంగాణకు తెచ్చుకుంటామా లేదా ప్రజలను కన్వెన్స్ చేసి బీఎల్ ఎఫ్ అధికారంలోకి వస్తుందా అనే విషయాన్ని ఆలోచించాలన్నారు. తాను టీమాస్ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ బీఎల్ ఎఫ్ అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. తెలంగాణలో ఒక మోడల్ ను ప్రజెంట్ చేసి.. బీఎల్ ఎఫ్ అధికారంలోకి రాగలితే.. ఢిల్లీలో కూడా కమ్యూనిస్టు పార్టీలు, బహుజన శక్తులు ఐక్యమై అధికారంలోకి వచ్చే మోడల్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ చిన్న రాష్ట్రం అయినా.. బీఎల్ ఎఫ్ అధికారంలోకి రావడానికి స్కోప్ ఉందన్నారు. 'వేరే పార్టీల వారు ఐదు వందల నోట్లు ఇస్తారు...మనం ఒక విజన్ ను ఇవ్వాలి' అని అన్నారు. ఆ విజన్ ప్రజలను కన్వెన్స్ చేసే విధంగా ఉండాలని, ట్రూత్ బేస్డ్ గా ఉండాలన్నారు. బీజేపీ గుజరాత్ మాడల్ విజన్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన విజయాన్ని గుర్తు చేశారు.

 

12:53 - March 25, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ళ నిర్మాణ పనులు నత్త నడకన జరుగుతున్నాయి.  రెండేళ్ళు గడచినా  పనుల్లో పురోగతి కనిపించటం లేదు. కొన్ని చోట్ల కేవలం శంకుస్థాపనలతోనే సరిపెట్టారు. వీటిపై  అధికారులు, నాయకులు చొరవ చూపుతున్నా... కాంట్రక్టర్లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జూన్‌లోగా పనులు పూర్తి చేయాలన్నప్రభుత్వ ఆదేశాల అమలు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.
మంజూరై రెండేళ్ళైనా.. కనిపించని పురోగతి
నిజామాబాద్‌ జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాల్లో కదలిక లేదు. రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల శంకుస్తాపనలకే పరిమితమయ్యాయి... ఇళ్లు మంజూరై రెండేళ్ళైనా.. ఇప్పటికి నిర్మాణపనుల్లో పురోగతి కనిపించడం లేదు. లబ్దిదారులకు కొత్త ఇళ్లు మంజూరు చేయలేదు. జిల్లా అధికారులతో పాటు.. ప్రజా ప్రతినిధులు చొరవచూపుతున్నా... కాంట్రక్టర్ల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.. ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలో తప్ప మరెక్కడా  ఇళ్ల పంపిణీ కానీ..  ప్రారంభం కానీ జరగలేదు. ఇదిలావుంటే.. మంత్రి నియోజకవర్గ పరిధిలోని.. కోటగిరి, రుద్రురు మండలాల్లో మాత్రమే  పనులు మొదలయ్యాయి. కొన్ని ఇళ్లు పూర్తిచేసి.. లబ్దిదారులకు పంపిణీ చేశారు. రెండో విడతలో మంజూరైన  ఇళ్ళ నిర్మాణాలు మొదలయ్యాయి.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు మాత్రం ప్రారంభమయ్యాయి. 
ఇంకా పనులు ప్రారంభం కాలేదు..
డిచ్‌పల్లి మండలం గన్నారం, ఇందలవాయి గ్రామాల్లో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. బీబీపూర్ నడిపల్లిలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి.  దర్పల్లి మండల పరిధిలో దర్పల్లి దుబ్బాకా గ్రామాల్సో ఎర్త్ వర్క్ మాత్రమే మొదలైంది.. జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాల్లో ఇంకా పనులు మొదులకాలేదు. ఆర్మూరులోని పోచమ్మబస్తీలో ఎర్త్‌వర్క్‌ పూర్తికాగా.. పెర్కిట్‌, మామిడిపల్లిల, అలూరు, దేగాం, ఖానాపూర్‌,.. మాక్లూరు మండలంలోని మాక్లూరు, అడవి మామిడిపల్లి గ్రామాల్లో ఇంకా నిర్మాణాలు మొదలుకాలేదు. 
350 ఇళ్లకు మాత్రమే బేస్‌మెంట్‌ 
ఇక బోధన్‌ నియోజకవర్గంలో మొత్తం 1326 ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో కేవలం 350 ఇళ్లకు మాత్రమే బేస్‌మెంట్‌ వేశారు. మిగతావాటిని ప్రారంభించలేదు. ఆర్మూరు, నిజామాబాద్‌ రూరలో, బోధన్‌ నియోజవకర్గాల్లో ఒకే కాంట్రాక్టర్‌ ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణాల ఒప్పందం చేసుకున్నా ఇప్పటివరకు పనులు మాత్రం మొదలు కాలేదు. 
మెటీరియల్‌కు ప్రభుత్వం రాయితీలు
డబుల్‌ బెడ్‌ రూమ్‌లకు కావాల్సిన మెటీరియల్‌కు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది.  అదేసమయంలో నిర్మాణాల విషయంలో కొన్ని  నిబంధనలు విధించింది. 460 చదరపు అడుగుల్లో నిర్మించే ఇళ్ళలో... 2 బెడ్ రూంలు, హాల్,  కిచెన్,  2 బాత్రూమ్‌లు తప్పని సరిగా ఉండాలని  ప్రభుత్వం పేర్కొంది.  దీంతో  కొందరు కంట్రాక్టర్లు వెనుకాడుతున్నారు. మరి కొందరు నాసిరకంగా నిర్మాణాలు చేపట్టారు. ఎలాగైనా వచ్చే జూన్‌లోగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటి నుండి పనులు మొదలు పెడితే తప్ప ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదు. ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువస్తేనే ఇండ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశం ఉంది. 

 

12:49 - March 25, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని బస్తీలలో ఆస్పత్రిలను ప్రారంభించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆస్పత్రులను సమర్ధవంతంగా నిర్వహించడానికి సరైన ప్రాణాలికలు రూపొందిస్తున్నామని, ఈ ప్రభుత్వ  దావఖానలలో ఒక డాక్టర్‌, ఒక నర్స్‌ మరియు ఇతర సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. 

భారత బౌలర్‌ మహ్మద్‌ షమికి గాయాలు

ఢిల్లీ : భారత బౌలర్‌ మహ్మద్‌ షమి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఉదయం డెహ్రాడూన్‌ నుంచి డిల్లీకి వెళ్తుండగా.. షమి వాహనం అదుపుతప్పింది. దీంతో షమి తలకి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తలకు కుట్లు పడడంతో డెహ్రాడూన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. షమి భార్య హసీన్‌ జహాన్‌ సంచలన ఆరోపణలతో ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అనంతరం బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధికారులు షమిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించి ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తేల్చారు.

12:44 - March 25, 2018

ఢిల్లీ : భారత బౌలర్‌ మహ్మద్‌ షమి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఉదయం డెహ్రాడూన్‌ నుంచి డిల్లీకి వెళ్తుండగా.. షమి వాహనం అదుపుతప్పింది. దీంతో షమి తలకి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తలకు కుట్లు పడడంతో డెహ్రాడూన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. షమి భార్య హసీన్‌ జహాన్‌ సంచలన ఆరోపణలతో ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అనంతరం బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధికారులు షమిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించి ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తేల్చారు. ఏప్రిల్‌లో ప్రారంభమైయ్యే ఐపీఎల్‌లో షమి ఢిల్లీ తరుపున ఆడనున్నాడు.

 

రాష్ట్రంలో బాల్య వివాహాలు అధికం : ప్రొ.నాగేశ్వర్

హైదరాబాద్ : తెలంగాణ సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని ప్రొ.నాగేశ్వర్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని అనేక నివేదికలు తేల్చి చెప్పాయన్నారు. 18 ఏళ్లలోపు పెళ్లి అవుతున్నవారు చాలా ఎక్కువ ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉందని... అందులో యంగ్ వితంతువుల సంఖ్య అధికంగా ఉందన్నారు. మహిళలు స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయని వాపోయారు.

12:37 - March 25, 2018

హైదరాబాద్ : తెలంగాణ సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని ప్రొ.నాగేశ్వర్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని అనేక నివేదికలు తేల్చి చెప్పాయన్నారు. 18 ఏళ్లలోపు పెళ్లి అవుతున్నవారు చాలా ఎక్కువ ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉందని... అందులో యంగ్ వితంతువుల సంఖ్య అధికంగా ఉందన్నారు. మహిళలు స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయని వాపోయారు. సామాజిక స్థితిగతులు తెలంగాణ అభివృద్ధిని వెక్కిరిస్తున్నాయని చెప్పారు. సోషల్ డెవలప్ మెంట్ లో వెనుకబడి ఉన్నామని తెలిపారు. ఏటూరు నాగారంలో అధ్యయనం చేయగా తాగుడుకు ఎక్కువగా అలవాటు పడుతున్నారని తెలిపారు. భార్యభర్తలు మధ్య ఏజ్ డిఫరెంట్ ఉంటుందని చెప్పారు. సామాజిక, ఆర్థిక స్థితిగతులు బాగాలేవని తేలిందన్నారు. దేశంలో మూతపడ్డ పరిశ్రమల్లో తెలంగాణలో 12శాతం పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. పరిశ్రమల మూసివేత సామాజిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందన్నారు. 

డిజిటల్ క్లాస్ రూమ్ బోధనలు పటిష్టపరుస్తాం : మంత్రి కడియం

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ ఎంపికల ద్వారా ప్రభుత్వం, స్థానిక సంస్థల పాఠశాలల్లో 8792 ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. టీశాసనమండలిలో కడియం మాట్లాడారు. పుస్తకాలు, పోస్టర్లు వంటి విషయాలపై మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. అభ్యాసన ఫలితాలను క్రమం తప్పకుండా మదింపు చేయడానికి జాతీయ సాఫల్యత సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ బోధనలు పటిష్టపరుస్తామని చెప్పారు. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు, మోడల్ స్కుల్స్, కేజీబీవీలలో లభ్యంగా ఉన్న మౌళిక సదుపాయలను మెరుగు పర్చుతామని తెలిపారు. 

మెదక్ లో 40 వేల ఎకరాలకు నీళ్లిచ్చాం : హరీష్ రావు

హైదరాబాద్ : ఇరిగేషన్ పనులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ కోర్టును అశ్రయిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ జిల్లాలోని ఒక్క ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. వీలైనంత త్వరగా కోర్టులో స్టే వెకేట్ చేయించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. టీఅసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. సింగూరు ప్రాజెక్టు కింద మెదక్ లో 40 వేల ఎకరాలకు నీళ్లిచ్చామని తెలిపారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక వలసలు తగ్గిపోయాయని చెప్పారు. వలసలు వెళ్లిన వాళ్లు తిరిగి తమ గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. 

 

12:07 - March 25, 2018

హైదరాబాద్ : ఇంటింటికి ఇంటర్ నెట్ ఇస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఅసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. కోటి కుటుంబాలకు 15 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్ నెట్ అందిస్తామని తెలిపారు. విద్యా, వైద్యానికి లాభం చేకూరుతుందని కేటీఆర్ చెప్పారు. 

 

11:57 - March 25, 2018

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ ఎంపికల ద్వారా ప్రభుత్వం, స్థానిక సంస్థల పాఠశాలల్లో 8792 ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. టీశాసనమండలిలో కడియం మాట్లాడారు. పుస్తకాలు, పోస్టర్లు వంటి విషయాలపై మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. అభ్యాసన ఫలితాలను క్రమం తప్పకుండా మదింపు చేయడానికి జాతీయ సాఫల్యత సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ బోధనలు పటిష్టపరుస్తామని చెప్పారు. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు, మోడల్ స్కుల్స్, కేజీబీవీలలో లభ్యంగా ఉన్న మౌళిక సదుపాయలను మెరుగు పర్చుతామని తెలిపారు.

11:45 - March 25, 2018

హైదరాబాద్ : ఇరిగేషన్ పనులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ కోర్టును అశ్రయిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ జిల్లాలోని ఒక్క ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. వీలైనంత త్వరగా కోర్టులో స్టే వెకేట్ చేయించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. టీఅసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. సింగూరు ప్రాజెక్టు కింద మెదక్ లో 40 వేల ఎకరాలకు నీళ్లిచ్చామని తెలిపారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక వలసలు తగ్గిపోయాయని చెప్పారు. వలసలు వెళ్లిన వాళ్లు తిరిగి తమ గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. 

 

11:26 - March 25, 2018

హైదరాబాద్ : ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్ లో సీపీఎం జాతీయ మహాసభలు జరుగనున్నాయి. మహాసభల నేపథ్యంలో సీపీఎం సౌత్ కమిటీ 2కే రన్ నిర్వహించింది. చంచల్ గూడ చౌరస్తా నుంచి ఐఎస్ ఐ సదన్ వరకు 2కే రన్ సాగింది. ఈ సందర్భంగా సౌత్ కమిటీ కార్యదర్శి సోమయ్య మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యాయి. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. మహాసభల ప్రాముఖ్యతను వివరించారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.   
 

10:55 - March 25, 2018

ప్రకాశం : జిల్లాలోని చీరాల రైల్వే స్టేషన్ లో విషాదం నెలకొంది. కదులుతున్న రైలు ఎక్కబోయి రైలు కింద పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం కామాంతపూడికి చెందిన వెంకటశివ గుంటూరు జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చెన్నైలో జరగనున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ వెళ్తున్నాడు. చీరాల రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కబోయి రైలు కింద పడి మృతి చెందారు. సీపీ టీవీలో దృష్యాలు రికార్డు అయ్యాయి. 

టీఅసెంబ్లీలో వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : టీఅసెంబ్లీలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఎమ్ ఆర్ పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై హత్యాయత్నంపై వివరణకు బీజేపీ, టీడీపీ వాయిదా తీర్మానం, కందుల కొనుగోలు డబ్బుల చెల్లింపు జాప్యంపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

10:46 - March 25, 2018

హైదరాబాద్ : టీఅసెంబ్లీలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఎమ్ ఆర్ పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై హత్యాయత్నంపై వివరణకు బీజేపీ, టీడీపీ వాయిదా తీర్మానం, కందుల కొనుగోలు డబ్బుల చెల్లింపు జాప్యంపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు సబ్జెక్టు లేక గవర్నర్ పై దాడి చేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో లేరు.. ప్రజాక్షేత్రంలో లేరని విమర్శించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. 

రియల్టర్ పై కాల్పులు

విజయనగరం : జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేగింది. అప్పలరాజు అనే రియల్టర్ పై పాత నేరస్తుడు మోహన్ కుమార్ కాల్పులు జరిపారు. అప్పలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

10:34 - March 25, 2018

విజయనగరం : జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేగింది. అప్పలరాజు అనే రియల్టర్ పై పాత నేరస్తుడు మోహన్ కుమార్ కాల్పులు జరిపారు. అప్పలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:15 - March 25, 2018

చిత్తూరు : పేరూరు మండలం పాతకాల్వ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట చంద్రగిరి మార్గంలో కల్వర్టును ఢీకొని బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు  పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 10 మందికిగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి ఆస్పత్రికి తరలించారు.

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

చిత్తూరు : పేరూరు మండలం పాతకాల్వ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట చంద్రగిరి మార్గంలో కల్వర్టును ఢీకొని బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు  పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 10 మందికిగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి ఆస్పత్రికి తరలించారు.

వేములవాడ రాజన్న సన్నిధిలో నేడు శ్రీసీతారాముల కళ్యాణం

కరీంనగర్ : వేములవాడ రాజన్న సన్నిధిలో నేడు శ్రీసీతారాముల కళ్యాణం జరుగనుంది. తిథుల ఆధారంగా అర్చకులు నేడు కళ్యాణం జరుపనున్నారు

08:34 - March 25, 2018

ఏపీకి టీడీపీ, బీజేపీ రెండూ పార్టీలు మోసం చేశాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆరోపణలు, లేఖల పేరుతో బీజేపీ, టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. బీజేపీ, టీడీపీ లేఖలు... అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు రామకృష్ణప్రసాద్, వైసీపీ నేత హనుమంతరావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:30 - March 25, 2018

హైదరాబాద్ : కూకట్ పల్లి ముసాపేట మార్కెట్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ముసాపేటలోని జనతానగర్ సహా పలు బస్తీల్లో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ కార్డెన్ సెర్చ్ లో 250 మంది పోలీసులు పాల్గొన్నారు. 

08:29 - March 25, 2018

హైదరాబాద్ : మద్యం నడుపుతూ డ్రైవింగ్ చేస్తున్నవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, జూబ్లీచెక్ పోస్టు, డైమండ్ హౌజ్ సహా ఆరుప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 70మందిపై కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. 60 బైక్ లు, 35 కార్లను సీజ్ చేశారు. 

కూకట్ పల్లిలో పోలీసులు కార్డెన్ సెర్చ్

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని ముసాసేటలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 250 మంది కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్నారు. 

08:10 - March 25, 2018

జింబాబ్వే : నేరాలు చేశారు.. శిక్షలు పడ్డాయి. కానీ.. శిక్షాకాలం పూర్తి కాకుండానే కొందరు జైలు జీవితం నుంచి బయటపడ్డారు. ఖైదీలతో జైళ్లు కిటకిటలాడడంతో చిన్న చిన్న నేరాలతో స్వల్పకాల శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడిచిపెట్టింది జింబాబ్వే సర్కార్‌. 3 వేల మంది ఖైదీలను విడుదల చేసి జైల్లో ఖైదీల సంఖ్యను తగ్గించారు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్‌. 
3 వేల మందికి క్షమాభిక్ష 
సత్ర్పవర్తన కారణంగా గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం నాడు జైల్లోని ఖైదీలను విడుదల చేయడం మన దేశంలో చూస్తుంటం. కానీ... జైళ్లు ఇరుకుగా మారాయని 3 వేల మందికి క్షమాభిక్ష పెట్టిన సంఘటన మాత్రం జింబాబ్వేలో జరిగింది. మాంగాగ్వా జైళ్లన్నీ ఖైదీలతో కిటకిటలాడుతున్నాయని జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
వారికి మాత్రం క్షమాభిక్ష పెట్టలేదు..
జీవిత ఖైదును అనుభవిస్తున్న మహిళలను మినహాయించి మిగతా మహిళా ఖైదీలు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు, జువైనల్‌ ఖైదీలను విడుదల చేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నవారు, 60 సంవత్సరాలు పైబడిన ఖైదీలు అందులో ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు వీరికి క్షమాభిక్ష పెట్టారని జింబాబ్వే ప్రిజన్స్‌, కరెక్షనల్‌ సర్వీస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఖైదీలు ఎక్కువగా ఉండడంతో ఇరుకుగా మారిన జైళ్లను కొంతమేర ఖాళీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. 3 వేల మందిని విడుదల చేయడంతో ఆ దేశంలో ఖైదీల సంఖ్య 17 వేలకు తగ్గింది. హత్య, దేశద్రోహం, అత్యాచారం, కార్‌జాకింగ్‌, దోపిడీ వంటి నేరాల కింద శిక్షపడిన వారికి మాత్రం క్షమాభిక్ష పెట్టలేదు. 
ఉరిశిక్షలు విధించడాన్ని వ్యతిరేకించిన అధ్యక్షుడు 
ఇక మరణశిక్ష పడి పదేళ్లు గడిచిన ఖైదీలకు భవిష్యత్‌లో ఆ శిక్ష విధించమని.. అయితే వారు మిగిలిన జీవితం మొత్తం జైల్లోనే గడపాలని ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడు ఎమర్సన్‌ ఉరిశిక్షలు విధించడాన్ని వ్యతిరేకించారు. 2005 తర్వాత జింబాబ్వేలో ఇంతవరకు మరణశిక్ష విధించలేదు. 
గత రాబర్ట్‌ ముగాబే ప్రభుత్వం కూడా ఖైదీలను విడుదల 
ఇక గతంలో రాబర్ట్‌ ముగాబే ప్రభుత్వం కూడా గతంలో ఈ విధంగా ఖైదీలను విడుదల చేసింది. ఖైదీలకు నిత్యం ఆహారం, దుస్తులు అందించడానికి ఆర్థికలోటును ఉన్న జింబాబ్వే ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. సరైన సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఖైదీల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఈ కారణాల వల్ల 2013లో వంద మంది ఖైదీలు మరణించారు. ఈ సౌకర్యాల లేమి జైల్లో తరచూ ఘర్షణలకు కారణమవుతోంది. మొత్తానికి జైల్లో సరైన వసతులు లేకపోవడంతో ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిన్న చిన్న శిక్షలు పడ్డ 3 వేల మంది ఖైదీలు జైలు నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 

 

07:53 - March 25, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సారథి.. రాహుల్‌ గాంధీ జపిస్తున్న యువమంత్రంతో... తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో గుబులు పట్టుకుంది... సెవెంటీ ప్లస్‌ ఏజ్‌ ఉన్న నేతలు.. తమ పదవులను వీడాలన్నది కాంగ్రెస్‌ ప్రిన్స్‌ రాహుల్ సందేశం. ఇంతకూ ఇది టీ కాంగ్రెస్‌లో ఎవరికి గండంగా మారనుంది..  ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది...
సెవెంటీ ప్లస్‌ నేతలు తప్పుకోవాలన్న రాహుల్ 
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా  రాహుల్‌ గాంధీ బాధ్యతలు తీసుకున్నాక.. పార్టీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది.. తొలి ప్లీనరీలో అధ్యక్షుడిగా రాహుల్‌...  డెబ్బై ఏళ్ళు పైబడిన నేతలు తప్పుకోవాలన్న సందేశం ఇచ్చారు... ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంమైంది.  కాంగ్రెస్‌ చీఫ్‌ సందేశం సొంత పార్టీలోనే కాకుండా బయటి పార్టీల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా టీ కాంగ్రెస్‌ నేతల్లో గుబులు పట్టుకుంది.. ఇంతకూ తెలంగాణలో సీఎం రేస్‌లో ఉన్న సీనియర్లు రాహుల్‌ మాటకు లోబడతారా... లేక డోంట్‌ కేర్‌ అంటారా...  కాదూ కూడదూ అంటే... అధిష్టానమే వారిని బలవంతంగా బయటికి పంపిస్తుందా...? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
స్వచ్ఛందంగా తప్పుకుంటున్న సీనియర్లు
కాంగ్రెస్‌ పార్టీలో యవ నాయకత్వాన్ని పెంచాలన్నది రాహుల్‌ ఉద్దేశం.. అందుకే.. డెబ్బై ఏళ్ళు పైబడిన నేతలంతా పదవులు వీడి..  తమ  అనుభవాన్ని పార్టీకి  అందించాలని రాహుల్‌ సందేశమిచ్చిన విషయం తెలిసిందే... పార్టీ అధ్యక్షుడు అలా అన్నారో లేదో.. అంతలోనే దేశవ్యాప్తంగా కొందరు నేతలు స్వచ్ఛందంగా పార్టీ పదవులను వదులుకుంటున్నారు. యూపీ పీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌, గోవా చీఫ్‌ శాంతారామ్‌ నాయక్, గుజరాత్‌ పార్టీ అధ్యక్షులు భరత్‌ సింహ సోలంకీలు   పదవులను వీడి ఇతర నేతలకు ఆదర్శంగా నిలిచారు.  దీంతో  ప్రస్తుతం తెంలగాణ కాంగ్రెస్‌లో మరింత ఉత్కంఠ రేగుతోంది..
టీ కాంగ్రెస్‌లో సెవెంటీ ప్లస్‌ నేతలంతా ముఖ్యులే
టీ కాంగ్రెస్‌లో  డెబ్బైఏళ్ళకు పైబడిన వారి జాబితాలో అంతా ముఖ్యనేతలే ఉన్నారు.  అందులో జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌ ఉన్నారు.  జానారెడ్డి సీఎల్పీ నేతగా ఉండగా... గీతారెడ్డి  పీఏసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక జైపాల్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు వచ్చే ఎన్నికల్లో పోటీ పడేందుకు.. ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. కానీ... వీహెచ్‌ మాత్రం.. తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఐనప్పటికీ పార్టీలో కీలక పదవి కోసం లాబీయింగ్‌ చేసుకుంటున్నట్లు సమాచారం. వీరంతా కూడా వచ్చే ఎన్నికల్లో సీఎం రేస్‌లో ఉండే నేతలే కావడం విశేషం..
అందులో మొదటివరసలో ఆ ఐదుగురు నాయకులే... 
కాంగ్రెస్‌ హై కమాండ్‌ రాహుల్‌ ఆదేశాలమేరకు తెలంగాణలో నేతలు తప్పుకోవాల్సి వస్తే.. అందులో మొదటివరసలో ఉండేది ఈ ఐదుగురు నాయకులే... అందులోనూ.. ప్రస్తుతం పదవుల్లో ఉన్న జానారెడ్డి, గీతారెడ్డిలే ముందువరసలో ఉంటారు. మరి దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ నేతలు తమ పదవులను స్వచ్ఛందంగా వదులుకుంటున్న నేపథ్యంలో..  తెలంగాణలో ఈ ఐదుగురు నేతలు ఏంచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎల్పీగా, పీఏసీ ఛైర్మన్‌లుగా ఉన్న జానారెడ్డి, గీతారెడ్డి తమ పదవులను త్యాగం చేసి... రాహుల్‌  కోరికమేరకు యువతకు అవకాశం కల్పిస్తారా...? సీఎం రేస్‌లో నిలిచేందుకు రెడీ అవుతున్న జైపాల్, పొన్నాల, వీహెచ్‌లు రాహుల్‌ మెసేజ్‌ను పట్టించుకుంటారా...? అన్నదానిపై ఇప్పటివరకూ టీ నేతలెవ్వరూ స్పందించడంలేదు. 
మౌనముద్రలో టీ నేతలు  
ఓ వైపు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని... దేశవ్యాప్తంగా పార్టీలోని  సీనియర్స్‌ తమ పదవులను త్యాగం చేస్తుంటే... ఈ జాబితాలో ఉన్న టీ నేతలు మాత్రం మౌనముద్రలో ఉన్నారు. ఇంతకూ వీరు రాహుల్‌  మెసేజ్‌ను లైట్‌గా తీసుకున్నారా...?  మరి అదే జరిగితే.. అధిష్టానమే వారిని  బలవంతంగా బయటికి పంపిస్తుందా. అన్నది ఆసక్తికరంగా మారింది..

 

07:42 - March 25, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాసిన లేఖను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తప్పుపట్టారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకే అమిత్‌షా లేఖ రాశారని విమర్శించారు.  ఏపీకి తీరని అన్యాయం చేసిన బీజేపీ.. అన్ని హామీలు అమలు చేసినట్టుగా లేఖలో పేర్కొన్నారని మండిపడ్డారు. అభూత కల్పనలతో అమిత్‌షా లేఖను రాశారని దుయ్యబట్టారు. విభజన హామీలు నెరవేర్చకుండానే.. ఏపీకి నిధులిచ్చామంటూ అమిత్‌షా పేర్కొనడాన్ని రాజకీయపార్టీలు, ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

 

07:34 - March 25, 2018

గుంటూరు : టీడీపీ, బీజేపీ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు ఒకరికి ఒకరు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాము చెప్పదల్చుకున్నది లేఖల్లో వివరిస్తున్నారు. చంద్రబాబుకు లేఖకు సమాధానంగా అమిత్‌షా  మరో లేఖ రాశారు. మరోవైపు  అమిత్‌షా ఏమాత్రం అవగాహన లేకుండా  లేఖ రాశారని ఏపీ మంత్రి లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు.
లేఖాస్త్రాలు సంధించుకుంటున్న నేతలు
నిన్నమొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యద్ధం నడిచింది. ప్రత్యేకహోదాపై ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఏపీకి అన్నీ చేశామని బీజేపీ నేతలు చెబితే... నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేశారని టీడీపీ నేతలు దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు మాటల యుద్ధానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పడింది. రొటీన్‌ అనుకున్నారేమో ఇరుపార్టీల నేతలు రూట్‌ మార్చారు. ఒకరికొకరు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు.
చంద్రబాబు లేఖకు అమిత్‌షా సమాధానం
ఎన్డీయే నుంచి విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తు ఇంతకుముందే ఏపీ సీఎం చంద్రబాబు అమిత్‌షాకు లేఖ రాశారు. ఆ లేఖలో ఎన్డీయే నుంచి బయటకు రావడానికి గల కారణాలు, ఏపీకి జరిగిన అన్యాయాన్ని పూర్తిగా వివరించారు. అయితే చంద్రబాబు లేఖకు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగినట్టుగా లేఖలో పేర్కొన్నారు.  చంద్రబాబు నిర్ణయంలో అభివృద్ధి ఎజెండా కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని  లేఖలో దుయ్యబట్టారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున చేపట్టిన అనేక కార్యక్రమాలను, ఏపీకి ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను అమిత్‌షా తన 9 పేజీల లేఖలో వివరించారు. ఏపీకి సంబంధించిన ఏ చిన్న విషయంలోనూ వెనకడుగు వేయలేదని అమిత్‌షా లేఖలో తెలిపారు. ఏపీ అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించిందని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిస్థాయిలో నెరవేర్చిందని వెల్లడించారు. టీడీపీకి, ఏపీ ప్రజలకు బీజేపీనే నిజమైన మిత్రుడని తెలిపారు. ఏపీకి ఇచ్చిన విద్యాసంస్థలు, ఎయిమ్స్‌, ఇతరత్రా అంశాలు, విభజనచట్టంలోని అంశాలను అమిత్‌షా లేఖలో ప్రస్తావించారు. మూడు ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చినట్టు తెలిపారు.  అమరావతిలో రైల్‌రోడ్‌ నిర్మాణానికి, 180 కిలోమీటర్ల రింగ్‌రోడ్డుకు  నిధుల విషయాన్ని ప్రస్తావించారు. కొత్త రైల్వేలైన్‌ నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు లేఖలో స్పష్టం చేశారు. యూపీఏ సర్కార్‌తో పోల్చితే.. ఎన్డీఏ రెట్టింపులు నిధులు ఇచ్చిందని తెలిపారు.  నిధుల కేటాయింపులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వాదనలో ఏమాత్రం నిజం లేదన్నారు.  కొత్త రాజధాని నిర్మాణానికి 2,500 కోట్లు ఇచ్చామన్నారు. 
అమిత్‌షా లేఖకు నారా లోకేష్‌ కౌంటర్‌
అమిత్‌షా రాసిన లేఖకు  ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. అమిత్‌షా అవగాహన లేకుండా లేఖ రాశారన్నారు.  ఇప్పటి వరకు జరిగిన అన్ని పనులకు సంబంధించిన యూసీలు కేంద్రానికి అందజేశామని తెలిపారు.  యూసీ సర్టిఫికెట్‌కు... ప్రత్యేకహోదాకు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం ఆవేశపూరిత నిర్ణయంకాదన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అనేకసార్లు ప్రధాని దృష్టికి చంద్రబాబు  తీసుకెళ్లారని గుర్తు చేశారు.  త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో అమిత్‌షాకు లేఖ రాయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

 

హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర.. భారీ బందోబస్తు

హైదరాబాద్ : నేడు శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా నగరంలో 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. 

హైదరాబాద్ లో డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 70మందిపై కేసు నమోదు చేశారు. 60 బైక్ లు, 5 ఆటోలు, 5 కార్లను సీజ్ చేశారు.

 

నేడు తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల : నేడు శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీవారి దర్శనం ఉంటుంది. 

Don't Miss