Activities calendar

26 March 2018

22:18 - March 26, 2018
22:08 - March 26, 2018
22:06 - March 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ దేశాయి ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ కేసులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు మనస్తాపంతో రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి తరుపున ప్రకాశ్‌రెడ్డి వాదించారు. కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు కోమటిరెడ్డి, సంపత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలపై ఆరు వారాలపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అలాగే అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల సీసీటీవీ దృశ్యాలను అందచేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైకోర్టులో జరిగే విచారణకు సుప్రీంకోర్టు న్యాయవాదిని పిలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రకాశ్‌రెడ్డి... తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే ప్రకాశ్‌రెడ్డి రాజీనామాను ఆమోదించే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతేడాది జులై 18 నుంచి ప్రకాశ్‌రెడ్డి అడ్వకేట్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

22:05 - March 26, 2018

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. ప్రజలను మోసం చేసిన బీజేపీ, దీనికి వంతపాడిన టీడీపీ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని జనసేన, వామపక్షాలు నిర్ణయించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాలపై బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలమైన ప్రతిపక్ష వైసీపీ వైఖరిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని...హైదరాబాద్‌లో నిర్వహించిన భేటీలో జనసేన, వామపక్షాల నేతలు నిర్ణయించారు.

పవన్‌ కల్యాణ్‌.. వామపక్ష నేతలతో భేటీ..
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో జరిగిన ఈసమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు, కేంద్ర కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, పార్టీ నాయకుడు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందించిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖ, హోదాపై ఉమ్మడిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.

హోదాపోరులో మేధావులు, విద్యావేత్తలు, ప్రజల భాగస్వామ్యం
ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జనసేన, వామపక్షాల భేటీలో నిర్ణయించారు. ఈ ఉద్యమంలో మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు, రైతులను భాగస్వాములను చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ముందుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాల్లో భారీ సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద ప్రజాస్యామ్య పరిరక్షణ దినం పాటించాలని, హోదాపోరులో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు మార్చి 28న విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 4న విజయవాడలో జరిగే జనసేన, వామపక్షాల భేటీలో ప్రత్యేక హోదా ఉద్యమంపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

మిత్‌ షా రాసిన లేఖపై స్పందించాల్సిన అవసరంలేదన్న నిర్ణయానికి జనసేనాని
ఏపీకి చేసిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖపై స్పందించాల్సిన అవసరంలేదన్న నిర్ణయానికి జనసేనాని వచ్చారు. ప్రధాని మోదీ లేదా ప్రభుత్వం నుంచి లేఖ వచ్చి ఉంటే ముందుగానే స్పందించేవాడినని పవన్‌ చెప్పారు. హోదా విషయంలో మొదటి నుంచి టీడీపీ అవలంబించిన రాజీ వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని పవన్‌ మండిపడ్డారు. టీడీపీ, బీజేపీలతో భవిష్యత్‌లో కూడా రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశంలేదన్న నిర్ణయానికి వచ్చిన జనసేన, వామపక్షాల నేతలు.. హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి.

నిధులను దుర్వినియోగం చేశారు : పవన్
ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు... గోదావరి, కృష్ణా పుష్కరాలకు ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేయడాన్ని పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల్లో చిన్న పిల్లల మరణాలను ప్రస్తావించారు. రాజధాని అమరావతిపై స్పందిస్తూ.. టీడీపీ నేతల కోసమే రాజధాని నిర్మాణం జరుగుతోందని, ప్రజా రాజధాని కాదని వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు... హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, వైసీపీలు అనుసరించిన వైఖరిని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడలువంచి హోదా సాధించే వరకు ఉద్యమాన్నకొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. హోదా ఉద్యమంలో భావసారూప్యత ఉన్న ప్రజా సంఘాలను కలుపుకుపోవాలని ఈ సమావేశంలో వామపక్షాలు, జనసేన నిర్ణయించాయి. 

22:04 - March 26, 2018

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను విస్మరించారంటూ కేంద్రంపై టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతోంది. నిన్న కాంగ్రెస్‌ తోడుకాగా... తాజాగా సీపీఎం, ఆర్‌ఎస్పీ కూడా అండగా నిలిచాయి. ఈ రెండు పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. మరోవైపు నిన్నటివరకు పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్‌.. కాస్త వెనక్కి తగ్గి వెల్‌లోకి వెళ్లకూడదని నిర్ణయింది. దీంతో అవిశ్వాసంపై కేంద్రం చర్చ పెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు... మంగళవారం అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉందని... టీడీపీ ఎంపీలంతా పార్లమెంట్‌కు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో రేపు పార్లమెంట్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

అవిశ్వాస తీర్మానానికి రోజురోజుకు పెరుగుతున్న మద్దతు
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. నిన్నటివరకు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లు అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా... తాజాగా సీపీఎం కూడా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చింది. సీపీఎం లోక్‌సభ పక్షనేత కరుణాకరన్‌, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలంటే 50 మంది ఎంపీల బలం కావలసి ఉండగా... ఇప్పటికే ఆ సంఖ్య 80 దాటింది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన పార్టీల్లో.. కాంగ్రెస్‌కు-48, టీడీపీకి-15, సీపీఎంకి-9, వైసీపీకి-8, ఆర్‌ఎస్పీకి-ఒకరు చొప్పున మొత్తం 81 మంది ఎంపీలు ఉన్నారు.

వ్యూహం మార్చుకున్న టీఆర్ఎస్
ఇప్పటివరకూ.. రిజర్వేషన్‌లపై అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ ఆందోళన చేస్తూ వచ్చిన టీఆర్ఎస్‌ వ్యూహం మార్చుకుంది. మంగళవారం నాడు.. అవిశ్వాస తీర్మానాల ప్రస్తావన వచ్చినప్పుడు.. వెల్‌లోకి వెళ్లరాదని నిర్ణయించుకుంది. తమ ఆందోళనల వల్లే.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండాపోతోందన్న ఏపీ నాయకుల ఆరోపణల నేపథ్యంలో.. తెలంగాణ భవన్‌లో సమావేశమైన టీఆర్‌ఎస్‌ ఎంపీలు... రిజర్వేషన్లపై చేస్తున్న పోరాటంపై కాస్త వెనక్కి తగ్గాలని నిర్ణయించారు. అయితే పార్లమెంట్‌లో నిరసనలు చేస్తామని.. కానీ వెల్‌లోకి వెళ్లకూడదని నిర్ణయించినట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలు తెలిపారు. తాము పార్లమెంట్‌ సమావేశాలు మొదలైనప్పటి నుంచి రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నా... అవిశ్వాస తీర్మానాన్ని తాము అడ్డుకుంటున్నామని ఏపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకోకుండా.. కలిసి పోరాటం చేస్తేనే విజయం సాధిస్తామన్నారు.

అవిశ్వాస తీర్మానంపై వైసీపీ మరో అడుగు
ఇక ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానంపై పోరాటం చేసిన వైసీపీ మరో అడుగు ముందుకేసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎంపీలతో సమావేశమైన జగన్‌... పార్లమెంట్‌ వాయిదా పడితే అదేరోజున రాజీనామాలు చేయాలని ఎంపీలకు ఆదేశించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపిస్తోన్న వైసీపీ... లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించింది. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఇప్పటికైనా చంద్రబాబు ఆలోచించుకోవాలని వైసీపీ నాయకత్వం పిలుపునిచ్చింది.

ఎంపీలంతా కచ్చితంగా పార్లమెంట్‌ హాజరవ్వాలి :
ఇదిలావుంటే టీడీపీ ఎంపీలతో చంద్రబాబు.. సోమవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంగళవారం ఎంపీలంతా కచ్చితంగా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. అందరూ పచ్చ కండువాలతో పార్లమెంట్‌కు వెళ్లాలన్నారు. సోమవారం అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశం ఉందని... లేకపోతే పదిరోజుల్లో చర్చకు తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల నేతలను కలిసి వివరించాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలని... ఏపీని ఒంటరి చేయాలనే బీజేపీ కుట్రను సమర్థంగా తిప్పికొట్టాలన్నారు చంద్రబాబు. ప్రత్యేక హోదాపై ఇంతకాలం ఒంటెత్తు పోకడలకు పోయిన టీడీపీ.. ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర పార్టీల సంఘాలనూ కలుపుకు పోవాలన్న భావనకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు అఖిల సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అవిశ్వాసంపై కేంద్రానికి అనివార్యంగా మారనుందా?
మొత్తానికి, అవిశ్వాస తీర్మానాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. బీజేపీ చర్చకు సిద్ధపడాల్సిన అనివార్యత ఏర్పడింది. తాము అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్దంగా ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం క్లైమాక్స్‌కు చేరినట్లయింది. అయితే... మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా ? లేక బీజేపీ మరో ఎత్తుగడ వేస్తుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

21:04 - March 26, 2018

జీహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడించిన కోతులు,వేటగాళ్లను రంగంలకు దించిన మేయర్..హోదా కోసం జనసేన ప్రత్యేక కూటమి..వామపక్షాలతోని కల్సి యుద్దానికి సై అంటున్న జనసేనాని..ఉద్యోగుల సభ ఆగమాగం పెంటపెంట,కేసీఆర్ మాటింటె మండుతున్నజనం..నల్లగొండ జిల్లా రైతుగోస రాస్తే రామాయణం,మద్దతు ధరలు లేవు.. బొర్లెండిపోయినయ్...కేసీఆర్ దేశానికి ప్రధానమంత్రి అయితడు..మల్కాజ్ గిరి మల్లారెడ్డి గారి మాట..కొమురం భీం ఊర్లె తాగునీళ్లు కర్వు, ముర్గినీళ్లు తాగి బత్కుతున్న జనం..

20:44 - March 26, 2018

అమెరికాలో గన్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.అమెరికాలో పెరుగుతన్న నేరాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలను పెంచుతున్నాయి. ఈ గన్ కల్చర్ కు ఒక్క అమెరికన్లే కాదు అనేక మంది భారతీయలు కూడా మృత్యువాత పడిన సంఘటనలు ఎన్నో వున్నాయి. అసలు అమెరికాలో గన్ కల్చర్ అమెరికా ప్రజల చేతుల్లోకి ఎలా వచ్చింది? దీన్ని ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతోంది? అమెరికాలో ఈ పరిస్థితికి కారణమేంటి? అనే అంశాలపై 10టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈచర్చలో సామాజిక విశ్లేషకులు రవిరామ్ గారు పాల్గొన్నారు. 

20:06 - March 26, 2018

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సీపీఎం, సీపీఐ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి రావాల్సిన హక్కులు, నిధులు, హామీలు, ప్రత్యేక హోదా వంటి పలు అంశాలపై నేతలు చర్చించారు. పార్లమెంట్ లో పలు పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టినా దానిపై కేంద్రం చర్చించకుండా దాటవేత ధోరణి అవలంభిస్తుండటంతో ఏపీ ప్రయోజనాల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలని నేతలు నిర్ణయించారు. జనసేన, సీపీఎం, సీపీఐ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు, ముగ్గురు కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి కలయికతో ఆంధ్రప్రదేశ్ హక్కులు సాధిస్తాయా? ప్రజాసమస్యలే మా పోరాటం అంటు ప్రజాసమస్యలపై పోరాడే ఎర్రజెండాలు, జనసేన జెండాలు కలిసి ఆంధ్ర హక్కులు నెరవేరుస్తాయా? వంటి పలు అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు, జనసేన అధికారర ప్రతినిథి పార్థసారధి, ఏపీ బీజేపీ అధికార ప్రతినిథి, విల్సన్, వైసీపీ నేత కొణిజేటి రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ పాల్గొన్నారు. 

20:05 - March 26, 2018

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం కోసం పోరాడే అన్ని పార్టీలకు చంద్రబాబు ఆహ్వానం పలికారు. అన్ని పార్టీల నుండి వచ్చే నేతలతో చంద్రబాబు రేపు ఉ.11 గంటలకు అఖిల సంఘాల సమావేశాన్ని నిర్వహించనున్నారు. అన్ని పార్టీలతోను, అన్ని సంఘాలతోను సమావేశమయి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు దాదాపు నెలరోజుల క్రితం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాగా అది ఈనాటికి వీలు పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలకు, సంఘాలకు కొరియర్లు, ఫోన్లు, ఫ్యాక్స్ ల ద్వారా ఆహ్వానాలను అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. ఒకొక్కొ సంఘం నుండి ఇద్దరు ప్రతినిధులకు ఆహ్వానం పలకనున్నారు. కాగా ఈ సమావేశంలో అన్ని పార్టీల వారు మాట్లాడిన మాటలకు సమావేశం రికార్డు చేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా పార్లమెంట్ లో టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి రోజురోజుకు మద్దతు పెరగుతున్న నేపథ్యంలో పలు పార్టీల నుండి అవిశ్వాసానికి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో రేపు పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చ చేపట్టి తీరవలసి అనివార్యత కేంద్రానికి తప్పేటట్లుగా లేదని తాజా రాజకీయ పరిణామాల వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అఖిల పక్షంతో సహా అన్ని సంఘాల నేతలతోను చంద్రబాబు రేపు సమావేశం ఏర్పాటు చేయటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

19:18 - March 26, 2018
19:15 - March 26, 2018

అమరావతి : ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా 18 హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు ఎంపీ కేశినేని నాని. కేంద్రంలో నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కాగ్‌ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తే.. ఇప్పుడు బీజేపీ నేతలు ఆ రిపోర్ట్‌తో కేసులు పెడతామని చెప్పడం స్వార్దపూరిత రాజకీయానికి నిదర్శనమని.. ఎవరు రాష్ట్రానికి మంచి చేస్తున్నారో.. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు కేశినేని నాని. 

19:13 - March 26, 2018

గుంటూరు : ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ ఎంపీలతో గుంటూరులో భేటీ అయ్యారు. హోదాపోరు, కేంద్ర తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యేకహోదా ఇచ్చే వరకు పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని సూచించారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే పార్లమెంట్‌ వాయిదా పడిన రోజునే రాజీనామా చేయాలని జగన్‌ సూచించారని ఎంపీలన్నారు. పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదా పడిన రోజున స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు చేస్తామని... టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే బాగుంటుందంటున్నారు మేకపాటి. 

చంద్రబాబు మరో కీలక నిర్ణయం!..

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం కోసం పోరాడే అన్ని పార్టీలకు చంద్రబాబు ఆహ్వానం పలికారు. అన్ని పార్టీల నుండి వచ్చే నేతలతో చంద్రబాబు రేపు ఉ.11 గంటలకు అఖిల సంఘాల సమావేశాన్ని నిర్వహించనున్నారు. అందరి అభిప్రాయాలను తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబు నిర్ణయించనున్నారు. 

19:01 - March 26, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. లోక్‌సభ స్పీకర్‌ వద్ద ఐదు అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లు అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా.. తాజాగా సీపీఎం, ఆర్‌ఎస్పీ కూడా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలంటే 50 మంది సభ్యుల మద్దతు కావలసి ఉండగా... ఇప్పటికి 81 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ కూడా వెల్‌లోకి వెళ్లి ఆందోళనలు చేయమని ప్రకటించింది. దీంతో పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చకు కేంద్రం అంగీకరించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీ ఎంపీలంతా వెంటనే ఢిల్లీ వెళ్లాలని ఆదేశించారు. రేపు సభకు అందరూ పసుపు పచ్చ కండువాలతో హాజరుకావాలని ఆదేశించారు. 

18:56 - March 26, 2018

నల్లగొండ : ఏప్రిల్ 18 నుండి 22 వరకు జరిగే 22వ అఖిల భారత మహాసభల సందర్భంగా చేపట్టిన బస్సుయాత్ర సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి చేరింది. హైదరాబాద్‌లో జరిగే ఈ మహాసభలకు సుమారు వెయ్యి మంది మేధావులు పాల్గొంటారని సీపీఎం నేతలు తెలిపారు. ప్రజా సమస్యలపై ఈ మహాసభల్లో చర్చిస్తామన్నారు.

18:54 - March 26, 2018

హైదరాబాద్ : సీపీఎస్‌ను రద్దు చేయాలి తెలంగాణ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి కోరారు. బదిలీలపై నిషేధం ఎత్తివేయాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో తెలంగాణ ఎంప్లాయిస్‌ జేఏసీ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభకు ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు భారీగా తరలివచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ డిమాండ్‌లను ప్రభుత్వం ముందు ఉంచారు. సీపీఎస్‌ను కేంద్ర ప్రభుత్వమే రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పడాన్ని ఉద్యోగులు తప్పుపట్టారు. రాష్ట్రంలోని లక్షా 30వేల మంది ఉద్యోగుల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలకు కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయాలు అంటగడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ నెల ఆఖరు నాటికి సమస్యను పరిష్కరించకుంటే.. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని సకల ఉద్యోగ జేఏసీ స్పష్టం చేసింది.

18:49 - March 26, 2018

వరంగల్ : భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని దళిత శక్తి ప్రోగ్రామ్‌ ద్వారా అణిచివేయబడ్డ దళితుల్లో జ్ఞానం ద్వారా వారిలో ఉన్న ఆత్మనూన్యత భావాన్ని పోగొట్టడానికి చేపట్టిన 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర వరంగల్‌ జిల్లాకు చేరుకుంది. ఇప్పటికే 4500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంది. దళిత సమాజం మొత్తం ఆత్మగౌరవంతో బ్రతికే జ్ఞానం వచ్చేంతవరకు దళితులకు రాజ్యాధికారం అసాధ్యమంటున్న దళిత శక్తి ప్రోగ్రామ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్‌ పేర్కొన్నారు.

18:44 - March 26, 2018

భద్రాద్ది : భద్రాద్రిలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సిగ్గులొలికే సీతమ్మ మెడలో అందాల రాముడు మూడుముళ్లు వేశాడు... సీతారాముల కల్యాణ అపురూప ఘట్టాన్ని చూసి భక్తులు పులకించి పోయారు.

భక్తజన సందోహంతో భద్రాచలం..
భద్రాచలం భక్తజన సందోహంతో కళకళలాడింది... మిథిలా మైదానంలో అట్టహాసంగా రాములోరి కల్యాణం జరిగింది.... స్వామివార్లకు ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు కల్యాణ మూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించారు అర్చకులు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్వామివారిని ఊరేగింపుగా మిథిలా మైదానానికి తీసుకువచ్చారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీ సీతారాముల కల్యాణ క్రతువు ఘనంగా జరిగింది.

అభిజిత్ లఘ్న సుముహూర్తాన వివాహం
అభిజిత్ లఘ్న సుముహూర్తాన వధూవరుల శిరస్సున జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం రాములోరు సీతమ్మకు మాంగళ్యధారణ చేశారు. తాళి, మెట్టలు , తలంబ్రాల ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు... భారతీయ వివాహ వైభవాన్ని తెలియజేస్తూ కార్యక్రమం పూర్తిచేశారు.. అంతకు మందు అమ్మవారికి చింతాకు పతకధారణ చేశారు. కల్యాణవేడుకలో కీలక ఘట్టమైన తలంబ్రాల వేడుకకూడా ఘనంగా నిర్వహించారు. భక్తులకు కౌంటర్లద్వారా తలంబ్రాలు పంపిణీ చేశారు..

భారీ సంఖ్యలో భక్తులు
రాములవారి కల్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.. సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భద్రగిరి శ్రీరామ స్మరణతో మార్మోగింది. అయితే సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో భద్రాద్రి ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. మంగళవారం రాములవారి పట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది...

18:40 - March 26, 2018

కొమురం భీం : తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీలు దాహార్తితో అలమటిస్తున్నారు. చెలిమల్లో నీటిని తాగుతూ రోగాల భారిన పడుతున్నారు కొమురంభీం జిల్లా కేరమేరి మండలం పెద్దకాల్లెగాం వాసులు. సంబంధిత అధికారులతో పాటు కలెక్టర్‌ను కలిసి నీటి కష్టలు వివరించినా సమస్య పరిష్కారం కావడం లేదంటున్న ఆదివాసీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

18:38 - March 26, 2018

హైదరాబాద్ : ప్రజా సౌకర్యార్థం గత ప్రభుత్వాలు తలపెట్టిన మెట్రో రైల్‌ నిర్మాణంలో.... కేసీఆర్‌ తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చూసుకొని నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి. లాభ సాటి వ్యాపారాలు చేసుకునేందుకు మెట్రో రైల్‌ నిర్మాణాలను కేసీఆర్‌ అనేక సార్లు వాయిదాలు వేశారన్నారు. ఈ వాయిదాల వల్ల మెట్రోనిర్మాణ వ్యయం 4వేల 6వందల కోట్లకు పెరిగిందని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి.  

18:35 - March 26, 2018

హైదరాబాద్ : రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తూనే... అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే పాల్గొంటామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నామన్న ఏపీ నాయకుల ఆరోపణలు సరికాదన్నారు. రిజర్వేషన్లపై మా పోరాటం కొనసాగుతుందని.. కానీ వెల్‌లోకి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే... విభజన చట్టం ప్రకారం కేంద్రం చేసిన మోసాన్ని ఎండగడుతామన్నారు. కేంద్రంపై పోరాటం చేయాలంటే ఇరు రాష్ట్రాలు ఆరోపణలు చేసుకోవడం కాకుండా... కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. 

రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చాలి : వినోద్

హైదరాబాద్ : రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చాలని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కోరారు. ఏపీ ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మేము అడ్డుకుంటున్నామని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనీ..తాము పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుండి తాము పోరాటాన్ని కొనసాగిస్తున్నామనీ..దీనిపై తమను విమర్శించటం సమంజసం కాదన్నారు. తామే కాదనీ..చాలా రాష్ట్రాల నేతలు వారి సమస్యలపై నిరసనలు తెలుపుతున్నారని తెలిపారు.  

రిజర్వేషన్ల అంశంపై పట్టు వదలం: కేశవరావు

హైదరాబాద్ : పార్లమెంట్ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల కోసం పోరాటం ఏస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఎంపీలతో కేసీఆర్ రిజర్వేషన్ల విషయంలో పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరుపై దిశా నిర్ధేశం చేశారు. అనంతం మీడియాతో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మాట్లాడుతు..రిజర్వేషన్ల విషయంలో తమ పట్టుదలతో వున్నామని తెలిపారు. సభలో తమ నిరసనలు తెలిపినా కేంద్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మాది న్యాయబద్దమైన పోరాటమని ఆయన పేర్కొన్నారు. 

16:57 - March 26, 2018

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు వంటి పలు అంశాలపై భవిష్యత్ కార్యాచరణపై జనసేన కార్యాలయంలో సీపీఎం, సీపీఐ నేతలు పవన్ తో భేటీ అయిన అనంతర రామకృష్ణ ఈ విషయాలను పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వామపక్ష నేతలతో భేటీ అయిన వపన్‌... ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ముందుగా రాయలసీమ నుంచి ఉద్యమమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా రాయలసీమ నుంచి ఉద్యమం ప్రారంభిస్తామని-రామకృష్ణ తెలిపారు. ఈనెల 27న అంబేద్కర్‌ విగ్రహాల వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణోద్యం చేపడతామనీ..మార్చి 28న విద్యార్థి జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని..ఏప్రిల్‌ 4న విజయవాడలో జరిగే భేటీలో హోదా ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామనీ రామకృష్ణ పేర్కొన్నారు.

16:49 - March 26, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలు, ప్రతిపక్ష నేత జగన్‌ వైఖరిపై మధు మండిపడ్డారు. హోదాపై చంద్రబాబు ప్రజలను మభ్యపెడితే, ప్రతిపక్షంగా వైసీపీ సరిగా పోరాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. హోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ తర్వాత... మీడియా సమావేశంలో మాట్లాడిన సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఈ వ్యాఖ్యలు చేశారు. 

16:45 - March 26, 2018

హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో రాజీధోరణి అవలంభించడం వలన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. వామపక్ష పార్టీలతో భేటీ అయిన పవన్‌... హోదా సాధన కోసం చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. దీనిపై వచ్చే నెల 4న విజయవాడలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. హోదా, ప్యాకేజీ అంటూ టీడీపీ ప్రజలను మభ్యపెట్టడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని పవన్‌ విమర్శించారు. 

16:39 - March 26, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాస్తోందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కేంద్ర పభుత్వాన్ని విమర్శించారు. ఎంపీలతో కేసీఆర్ భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ మాట్లాడుతు..కేంద్రప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగినంతకాలం తాము రిజర్వేషన్స్ పై పోరాటాన్ని కొనసాగిస్తునే వుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జనాభా పెరుగుతోందన్నారు. దీనికి అనుగుణంగా రిజర్వేషన్స్ ను అమలు చేయాల్సిన అవసరముందన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభయిన 5 తేదీ మార్చి నుండి రిజర్వేషన్స్ కోసం టీఆర్ఎస్ నిర్విరామంగా పోరాడతున్నామని ఎంపీ వినోద్ తెలిపారు. అలాగే కావేరీ బోర్టును ఏర్పాటు చేయాలని కర్నాటవాసులు కూడా పోరాడాతున్నారనీ..ఈ క్రమంలో మమ్మల్ని బూచిగా చూపించి ఏపీకి సమస్యలపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చింటంలేదన్నారు. ఒకే దేశం ఒకే చట్టం వుండాలని అందుకనే రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నామన్నారు. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని వినోద్ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్స్ అంశం గురించి పలు పార్టీ నేతల మద్దతును కోరామన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఈర్ తో టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్ల అధికారాలు రాష్ర్టాలకే అప్పగించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలకు సీఎం దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ భేటీలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కవిత, ప్రభాకర్‌రెడ్డి, సుమన్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావులు పాల్గొన్నారు. 

ఆసిస్ రథసారధిగా రహానే..

హైదరాబాద్ : బాల్ టాంప‌రింగ్‌కు పాల్ప‌డిన స్టీవ్ స్మిత్ ఐపీఎల్ టీమ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. దీంతో అత‌ని స్థానంలో అజింక్య ర‌హానేను కెప్టెన్‌గా నియ‌మించింది. బీసీసీఐ ఆదేశాల మేర‌కు స్మిత్ కెప్టెన్సీపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రాజ‌స్థాన్ టీమ్ తెలిపింది. 

ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఈర్ తో టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కవిత, ప్రభాకర్‌రెడ్డి, సుమన్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. రిజర్వేషన్ల అధికారాలు రాష్ర్టాలకే అప్పగించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలకు సీఎం దిశానిర్ధేశం చేస్తున్నారు.

మాల్ లో అగ్నిప్రమాదం..64మంది మృతి..

హైదరాబాద్ : షాపింగ్‌మాల్‌ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 64మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఈ ఘటన రష్యాలోని కిమిరోవ్ సిటీలో ఉన్న షాపింగ్‌మాల్‌లో సంభవించింది. మాల్‌లో ఉన్న సినిమా హాల్స్, ప్లే ఏరియాలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరణించిన వారిలో 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో 20 మంది ఆచూకీ లేరని అధికారులు తెలిపారు.

అలీవ్ కంపెనీలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : నగరంలో అగ్రిప్రమాదం సంభవించింది. కుకట్ పల్లి ప్రగతీనగర్ లో అ ప్రమాదం సంభవించింది. అలీవ్ కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి వుంది. 

15:39 - March 26, 2018

విజయనగరం : అమాయక గిరిజనుడిపై ఎస్సై తన ప్రతాపాన్ని కనబరిచాడు. గిరిజనుడైన పశువుల కాపరిని చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోర్రి అప్పలస్వామి అనే గిరిజనుడు పశువులు కాపరిపై ప్రభుత్వం భూములను అక్రమించుకున్నాడనే ఆరోపణతో ఎస్సై సన్యాసినాయుడు అప్పలస్వామిని దారుణంగా చితకబాదాడు. ఈ ఘటన పాచిపెంట మండలం కొండతాడూరులో చోటుచేసుకుంది. ఎస్సై చేసిన దాడిలో అప్పలస్వామి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ క్రమంలో సీపీఎం అప్పలస్వామికి అండగా నిలబడింది. ఎస్సై పై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. 

గిరిజనుడిపై ఎస్సై దాడి..

విజయనగరం : ఓ గిరిజనుడిపై ఎస్సై తీవ్రంగా దాడిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పాచిపెంట మండలం కొండతాడూరులో చోటుచేసుకుంది. ఎస్సై చేసిన దాడిలో అప్పలస్వామి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రభుత్వం భూములు ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణతో గిరిజనుడిపై ఎస్సై దాడికి పాల్పడ్డాడు.దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన సీపీఎం అప్పల స్వామికి అండగా నిలిచింది. దాడికి పాల్పడ్డ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. 

చంద్రబాబు డ్రామాలాడుతున్నారు : రామకృష్ణ

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు కేంద్రంపై పోరాడుతున్నట్లుగా డ్రామాలాడుతున్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీకి మోసం చేసినట్లుగానే అధికార, ప్రతిపక్షాలు ఏపీ ప్రజలను మోసం చేశాయన్నారు. సీపీఎం, సీపీఐ నేతలలో ఈరోజు జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన కార్యాక్రమాలు వంటి అంశాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వామపక్ష నేతలు పలువురు పాల్గొన్నారు. 

అనాధలా ఆంధ్రప్రదేశ్ : సీపీఎం మధు

హైదరాబాద్ : తల్లిదండ్రులు లేని అనాధలా ఆంధ్ర ప్రదేశ్ వుందనీ..దీనికి కారణం రాష్ట్ర విభజన సమయంలోఇచ్చిన హామీలు నెరవేరకపోవటం వల్లనేనన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం జనసేన,సీపీఐలతో కలిసి రానున్న రోజుల్లో పోరాటాన్ని ఉదృతం చేస్తామని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు పేర్కొన్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదనీ..రాయలసీమలో ప్రారంభించి ప్రకాశం జిల్లా వరకూ పోరాటాన్ని పెద్ద ఎత్తున ఉదృతం చేస్తామని మధు పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ నేతలలో ఈరోజు జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

అమరావతి టీడీపీ రాజధానిలా వుంది : పవన్

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి రాష్ట్రానికి రాజధానిలా కాక టీడీపీ పార్టీ రాజధానిలా వుందని జనసే అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. నిధులను టీడీపీ ఇష్టారాజ్యంగా ఖర్చుచేసిందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను పుష్కరాల కోసం ఖర్చు చేశారని పవర్ విమర్శించారు. సీపీఎం, సీపీఐ నేతలలో ఈరోజు జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన కార్యాక్రమాలు వంటి అంశాలపై నేతలు చర్చించారు.

15:01 - March 26, 2018

హైదరాబాద్ : అమిత్ షా లెటర్ ను పరిగణలోకి తీసుకోనవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుండి సందేశం వస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటాం తప్ప అమిత్ షా లెటర్ ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవుసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అమిత్ షా లెటర్ పై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షులుగా వుండా ఎంతో బాధ్యాయుతంగా మాట్లాడకుండా అనుచితంగా మాట్లాడం సమజంకాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా లేనందు వల్లనే ఏపీ ప్రజలు నష్టపోతున్నారన్నారు. రానున్న రోజుల్లో సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి జనసేన పోరాటం చేస్తుందని జనసేనాని స్పష్టం చేశారు. ఎటువంటి వ్యక్తి అయినా, ఎంతటి ఉన్నతస్థాయిలో వున్నా ప్రతీ వ్యక్తీ చట్టానికి,రాజ్యాంగానికి లోబడి వుండాలని పవన్ సూచించారు. జనసేన సభ పెట్టిన తరువాత కేంద్రం నుండి స్పందన వచ్చిందనీ..అడిగితేనే స్పందిస్తారా? ఇవ్వాల్సిన బాధ్యత వుండి కూడా ఏపీపై నిర్లక్ష్య వైఖరిని కేంద్రం అవలంభిస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పలు విషయాలలో వైఫల్యం చెందిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రంలో అనేక ఆర్థిక సమస్యలు వుంటే పుష్కరాలకు కోట్లాది రూపాలను దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు.

రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలను ఉదృతం : సీపీఎం, సీపీఐ
ప్రత్యేక హోదా సాధించేంత వరకూ తమ పోరాటాలను కొనసాగిస్తామని సీపీఎం, సీపీఐ నేతలు మధు, రామకృష్ణ స్పష్టంచేశారు. జనసేన పార్టీతో కలిసి తమ పోరాటాలను రాష్ట్ర ప్రయోజనాల కోసం రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉదృతం చేస్తామని లెఫ్ట్ నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ దిశగా తాము కార్యాచరణను రూపొందిస్తామని నేతలు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. రేపు 27 వ తేదీనాడు కలిసి వచ్చే అందరితో పాటు ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ, విభజన హామీలను సాధించేంత వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. జనసేన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సీపీఎం, సీపీఐ నేతల భేటీ ముగిసింది. భేటీ అనంతరం ప్రెస్ మీట్ లో నేతలు మాట్లాడారు. ఈసందర్భంగా పలు అంశాలపై నేతలు మాట్లాడారు. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ పార్టీల నుండి పలువురు నేతల పాల్గొన్నారు. 

13:32 - March 26, 2018
13:32 - March 26, 2018

రాజీనామాలతో ప్రయోజనం ఉందా - రామ్మోహన్ నాయుడు...

శ్రీకాకుళం : రాజీనామాలతో ఏపీకి ప్రయోజనం ఉందంటే తాము రాజీనామాలకు సిద్ధమని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయ్ మాల్యా, విజయసాయిరెడ్డిలపై కేంద్రం ధోరణి పలు విమర్శలకు తావిస్తోందన్నారు. 

13:14 - March 26, 2018

గుంటూరు : వైసీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం సభ ముందుకు తీసుకోకపోతే రాజీనామాలు చేయాలని పార్టీ ఎంపీలకు జగన్ సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో అవిశ్వాస తీర్మానం స్పీకర్ తీసుకోవడం లేదు. మంగళవారం నుండి తిరిగి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం..ఏపీలో జరుగుతున్న రాజకీయా పరిణామాలు తదితర పరిణామాలపై జగన్ పార్టీ ఎంపీలతో చర్చించారు. జిల్లాలోని ముప్పాళ్లలో ఎంపీలతో జగన్ భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంట్ వాయిదా పడిన రోజే రాజీనామాలు చేయాలని, అది కూడా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేయాలని జగన్ సూచించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

రాజీనామాలపై వైసీపీ కీలక నిర్ణయం...

గుంటూరు : పార్లమెంట్ వాయిదా పడిన రోజే రాజీనామాలు చేయాలని ఎంపీలకు జగన్ ఆదేశించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలను సమర్పించాలని సూచించారు. 

కర్నాటక కాంగ్రెస్ పార్టీ స్ర్కీనింగ్ కమిటీ...

కర్నాటక : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీ స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 

12:47 - March 26, 2018

హైదరాబాద్ : జనసేన...ఏపీ లెఫ్ట్ పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలే సభలో వామపక్ష నేతలతో సమావేశమవుతానని..ప్రత్యేక హోదా..ఇతర అంశాలపై చర్చించి ఉమ్మడిగా పోరాటం చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సోమవారం ఏపీ సీపీఎం, సీపీఐ నేతలు జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. సీపీఎం నుండి మధు, వై.వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సీపీఐ నుండి రామకృష్ణలు పవన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై కేంద్రం అనుసరిస్తున్న తీరు..ప్రత్యేక హోదాపై పోరాటం..ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. 

12:39 - March 26, 2018

29న టిడిపి ఆవిర్భావ దినోత్సవం...

గుంటూరు : ఈనెల 29వ తేదీన టిడిపి ఆవిర్భావ దినోత్సవం జరుగనుంది. జిల్లాలోని రాష్ట్ర కార్యాలయంలో బహిరంగసభ జరుగనుంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. 

భద్రాద్రిలో రాములోరి కల్యాణం...

భద్రాద్రి : మిథిలా స్టేడియంలో శ్రీరాముడి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. అభిజిత్ లగ్నంలో సీతమ్మతో రాములోరి కల్యాణం జరిగింది. 

పవన్ కు పర్మినెంట్ 2+2 భద్రత...

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పర్మినెంట్ 2+2 భద్రతను ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. గుంటూరు సభ సమయంలో సెక్యూర్టీ కావాలని ఏపీ డీజీపీని పవన్ కోరిన సంగతి తెలిసిందే. 

జనసేన ఆఫీసులో లెఫ్ట్ నేతలు...

హైదరాబాద్ : జనసేన కార్యాలయానికి ఏపీ సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, పి.రామకృష్ణలు చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ తో లెఫ్ట్ నేతలు సమావేశం కానున్నారు. 

పార్టీ ఎంపీలతో జగన్ భేటీ...

గుంటూరు : ముప్పాళ్లలో పార్టీ ఎంపీలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమావేశమయ్యారు. పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. 

ఢిల్లీకి చేరుకున్న మమత...

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ దేశ రాజధాని హస్తినకు చేరుకున్నారు. పలు పార్టీల నేతలతో ఆమె సమావేశం కానున్నారు. ఇటీవలే థర్డ్ ఫ్రంట్ ను ప్రకటించిన సీఎం కేసీఆర్, మమతతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 

ర్యాలీకి వస్తే డబ్బులు ఇస్తమని ఇవ్వలేదు'

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొంటే రూ. 350, భోజనం పెడుతామని చెప్పి తమకు ఇవ్వలేదని హర్యానాలోని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

కొనసాగుతున్న రాముడి కల్యాణోత్సవం...

భద్రాచలం : శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం..టిటిడి పట్టువస్త్రాలు సమర్పించింది. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాముల వారి కల్యాణోత్సవం జరుగనుంది. 

10:26 - March 26, 2018

11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి...

నిజామాబాద్ : మెండోరా వద్ద ఆటో బావిలో పడిన ఘటనలో ఆర్మూరు ఆసుపత్రిలో 11 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను వారి వారి బంధువులకు అప్పగించారు. 

కాసేపట్లో లెఫ్ట్ నేతలతో పవన్ భేటీ...

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు..తదితర అంశాలపై చర్చించనున్నారు. 

09:27 - March 26, 2018

సంగారెడ్డి : పాతబస్టాండు సమీపంలో ఉన్న రామాలయంలో శ్రీరాముడి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో జగ్గారెడ్డి మాట్లాడారు. కల్యాణోత్సవం సందర్భంగా ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నట్లు, ఇందుకు వంద కిలోల ముత్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:26 - March 26, 2018

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల భద్రాద్రి పర్యటన రద్దు అయ్యింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాముడికి ప్రభుత్వం తరపున కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించడడం అనవాయితీగా వస్తోంది. కానీ కేసీఆర్ దంపతులు రాకపోతుండడంతో జిల్లా వాసులు, భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రాకపోతుండడంతో దేవాదాయ శాఖ మంత్రి, తాను పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశవరరావు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు, ఎంపీ కవిత దంపతులు వస్తారని తెలుస్తోంది.

కేసీఆర్ హాజరు కాకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచల అభివృద్దికి రూ. 100కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించి భద్రాద్రికి పలు వరాలు కురిపిస్తారని జిల్లా వాసులు ఆశించారు. కానీ కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రిపై పెట్టిన దృష్టి భద్రాద్రిపై పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

09:12 - March 26, 2018
09:07 - March 26, 2018

సీఎం కేసీఆర్ భద్రాద్రి పర్యటన రద్దు...

ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో శ్రీరాముడు కల్యాణోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. ఆయన రాకపోవడంతో దేవాదాయ శాఖ మంత్రి, తాను పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 

09:04 - March 26, 2018

ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో శ్రీరాముడు కల్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 60 ఏళ్లకు ఒకసారి వచ్చే విళంబి నామ సంవత్సర ఉత్సవాలు ప్రత్యేకమైనవిగా భక్తులు భావిస్తున్నారు. శ్రీరాముని జన్మ సంవత్సరం కావడంతో ఈసారి కల్యాణా ఉత్సవాలకు భద్రాద్రి జనసంద్రంగా మారుతోంది. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మిథిలా స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెన్ టివితో మాట్లాడారు. కేసీఆర్ రాకపోవడంతో దేవాదాయ శాఖ మంత్రి, తాను పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తుమ్మల పేర్కొన్నారు. 

08:31 - March 26, 2018

సిరిసిల్ల : వేములవాడ ఆలయ ప్రాంగణంలో కోడెలు ఒక బాలుడి ప్రాణాలు తీశాయి. ఈ విషాదకర ఘటనతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆదివారం ఆయలంలో శ్రీరాముడి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుండి కల్యాణం వీక్షించేందుకు తరలివచ్చారు. రాత్రి సమయంలో ఆలయ పార్కింగ్ స్థలంలో కొంతమంది భక్తులు నిద్రించారు. గాఢ నిద్ర ఉన్న సమయంలో కోడెల గుంపు ఘర్షణ పడుతూ నిద్రిస్తున్న భక్తులవైపుకు వచ్చాయి. భక్తులను తొక్కుకుంటూ వెళ్లిపోయాయి. దీనితో మనీష్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడనే మృతి చెందాడు. 

08:27 - March 26, 2018

ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల అమల రగడ కంటిన్యూ అవుతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం నుండి వైసిపి..టిడిపి ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకోవడం..ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాసిన లెటర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భగ్గుమంటున్నారు. పార్లమెంట్ లో టిడిపి..వైసిపి పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సందిగ్ధత కొనసాగుతుండగా కాంగ్రెస్ మంగళవారం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), కోటేశ్వరరావు (బిజెపి), అద్దెపల్లి శ్రీధర్ (జనసేన), దుర్గా ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:20 - March 26, 2018
08:17 - March 26, 2018

రష్యా : సైబీరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 37 మంది సజీవ దహనమయ్యారు. కెమెరోవోలోని ఓ షాపింగ్ లో ఈ భారీ అగ్నిప్రమాదం జరగింది. 40మందికిపైగానే గాయాలయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

భద్రాద్రిలో ఘనంగా నవమి వేడుకలు..

 

భద్రాద్రి : శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 10.30గంటలకు సీతారాములావారి కల్యాణ ఘట్టం జరుగనుంది. తెల్లవారుజామున నుండే భక్తులు భారీగా తరలివస్తున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమం జరిగే మిథిలా స్టేడియాన్ని అందంగా అలంకరించారు. 

 

07:22 - March 26, 2018

దేశంలో పెరుగుతున్న దళితులపై దాడులకు కారణం పాలకులేనని ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల జరిగిన దాడులపై కేసులు నమోదు కావడం లేదని..కేసులు నమోదయినా సరియైన విచారణ జరుగకుండా సాక్ష్యాలు సేకరించడం లేదన్న వాదనలున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుతావలు శ్రద్ధ చూపడం లేదని దళిత సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవద్దని..విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకోవాలన్న వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఏపీ కేవీపీఎస్ నేత మాల్యాద్రి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:12 - March 26, 2018

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు ఆమరణ నిరాహార దీక్షకు దిగటం సంచలనం సృష్టిస్తోంది. కలుషిత నీటితో సమీప గ్రామ ప్రజలు మృత్యువాత పడటం.. ఇతర గ్రామాలలో పంటలు నాశనమవుతున్నాయని 12 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ పోరాటానికి నటుడు కమలహాసన్‌, ఎండిఎంకే నేత వైగో మద్దతు పలికారు. ఆందోళనకారులతో దీక్షలో కూర్చునేందుకు బయలుదేరిన నేతలను తమిళనాడు ప్రభుత్వం అరెస్ట్‌ చేయడంతో, తూత్తుకుడి జిల్లా ప్రజలు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని దీక్షలో కుర్చున్నారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఫ్యాక్టరీ మూసి వేసివేసేంత వరకు పోరాటం చేస్తామని ప్రజలు తేల్చి చెబుతున్నారు.

07:08 - March 26, 2018

అనంతపురం : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైకిల్‌పై సవారీ చేశారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే సైకిల్‌ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్ద ప్రారంభించిన సైకిల్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సైకిల్‌ తొక్కి అభిమానులను ఉత్సాహపరిచారు. లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా బాలకృష్ణ అధికారులను కోరారు. 

07:02 - March 26, 2018

కరీంనగర్ : జైలు గోడల మధ్య ఉన్న వారిని కలవాలంటే ములాఖత్‌ కోసం వెళ్లి కలవవచ్చని నిబంధనలు చెప్తున్నాయి. అయితే ఈ నిబంధనలను కరీంనగర్‌ పోలీసులు యథేచ్చగా తుంగలో తొక్కుతున్నారు. అక్రమ ఫైనాన్స్‌ వ్యవహారంలో 11 నెలలుగా జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ ఏఎస్‌ఐ బొబ్బల మోహన్‌రెడ్డిపట్ల ఎస్కార్ట్‌పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరైన సమయంలో.. ఓ హోటల్‌లో కొంతమందిని కలిసి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. యథేచ్చగా ఫోన్‌లో ఇతరులతో సంభాషిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సెటిల్‌మెంట్‌ చేస్తున్న సమయంలో ఎస్కార్ట్‌ పోలీసులు మోహన్‌రెడ్డిని వదిలేసి హోటల్‌ బయట వేచిఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే మోహన్‌రెడ్డికి పోలీసులు రాచమర్యాదలు జరిపినట్టుగా వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

 

07:01 - March 26, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగానిపల్లె గ్రామాల్లో కాల్వ పనులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ను కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు కూడా పనులను పర్యవేక్షించాలని హరీశ్‌రావు సూచించారు.  

07:00 - March 26, 2018

ఖమ్మం : సీతారాముల కల్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. ఇవాళ రామయ్య కళ్యాణం, రేపు శ్రీరామ మహాపట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 60 ఏళ్లకు ఒకసారి వచ్చే విళంబి నామ సంవత్సర ఉత్సవాలు ప్రత్యేకమైనవిగా భక్తులు భావిస్తున్నారు. శ్రీరాముని జన్మ సంవత్సరం కావడంతో ఈసారి కల్యాణా ఉత్సవాలకు భద్రాద్రి జనసంద్రంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు భద్రగిరికి చేరుకుంటున్నారు.

భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను చేపట్టారు.. స్టేడియం ప్రాంగణంలో సెక్టార్ల విభజన చేసి.. వాటికి ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాల పంపిణీకీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇవాళ సీతారాముల కల్యాణం, మంగళవారం శ్రీరామ మహా పట్టాభిషేకం జరగనుంది. విళంబి నామ సంవత్సరంలో శ్రీరామ కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ర్టాలనుంచి వేలాదిగా భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఈ ఉత్సవాలకు వచ్చే వీఐపీల రక్షణపై ద్నష్టి పెట్టారు. 

వేములవాడ ఆలయంలో విషాదం...

సిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. మొక్కులు చెల్లించుకుంటుండగా ఎద్దు పొడవడంతో బాలుడు మృతి చెందాడు. 

ఎంపీలతో భేటీ కానున్న జగన్...

విజయవాడ : అమరావతిలో ఉదయం 10 గంటలకు ముప్పాళ్లలో పార్టీ ఎంపీలతో జగన్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలు..అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ పదేళ్ల పండుగ కార్యక్రమం

విజయవాడ : ఉదయం 11గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ పదేళ్ల పండుగ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రారంభించనున్నారు. 

భద్రాదిలో రామయ్య కళ్యాణం...

ఖమ్మం : భద్రాద్రిలో నేడు రామయ్య కళ్యాణం జరుగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు భద్రాచలానికి పోటెత్తుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం అక్కడక్కడా నవమి వేడుకలు జరిగాయి. 

వేలాది మంది ప్రజల ఆమరణ నిరహార దీక్షలు...

చెన్నై : తమిళనాడు..తూత్తుకుడి జిల్లాలోని స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు ఆమరణ నిరాహార దీక్షకు దిగటం సంచలనం సృష్టిస్తోంది. కలుషిత నీటితో సమీప గ్రామ ప్రజలు మృత్యువాత పడటం.. ఇతర గ్రామాలలో పంటలు నాశనమవుతున్నాయని 12 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.

బాల్ టాంపరింగ్ వివాదం...

ఢిల్లీ : బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఆసీస్‌ ఆటగాళ్లపై చర్యలు మొదలయ్యాయి. తమ ఆటగాళ్ల తీరుపై క్రికెట్‌ ఆస్ట్రేలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలకు బాధ్యులుగా... స్మిత్‌, వార్నర్‌లు కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌‌ పదవుల నుంచి వైదొలిగారు.

Don't Miss