Activities calendar

27 March 2018

21:48 - March 27, 2018

హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వివిధ పార్టీల సభ్యులు లేవనెత్తిన సందేహాలను సీఎం కేసీఆర్‌ నివృత్తి చేశారు. సీఎం ప్రసంగం అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీంతో చట్టసభల్లో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం లభించింది.

ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈటల
తెలంగాణ అసెంబ్లీ 2018-19 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి... చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. నిధులు భారీగా ఉంటున్నా.. ఖర్చులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని విపక్షాలు ఆరోపించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక విద్యార్థులు, ఉద్యోగాలు లేక యువత, పీఆర్సీ బకాయిలు లేక ఉద్యోగులు, రుణమాఫీ, గిట్టుబాటు ధర రాక రైతులు, భూమి రాక దళితులు, ఇళ్లు లేక పేదలు, భద్రతలేక మహిళలు, కనీస వేతనాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో... వారి ఆకాంక్షలు నెరవేర్చే దివలో బడ్జెట్‌ లేదన్నారు.
అప్పుల కుప్పగా రాష్ట్రం : సండ్ర వెంకటవీరయ్య
రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, డీఎస్సీ, టీచర్ల సమస్యలు, పాత పెన్షన్‌ విధానం సమస్యలను పరిష్కరించాలన్నారు. మరోవైపు బడ్జెట్‌లో ఏర్పడిన లోటును ఏ విధంగా పూడ్చుతారో ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరముందన్నారు.

కేటాయింపులే తప్ప వినియోగం లేదు : సున్నం రాజయ్య
ఇక అనేక సంక్షేమాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నా వాస్తవంగా ఖర్చు చేయడం లేదన్నారు సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం సరిగా జరగడం లేదన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు ఇవ్వాలన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 15 వేల ఇళ్లు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

విప‌క్షాల అభ్యంత‌రాల‌కు తప్పు పట్టిన సీఎం కేసీఆర్
అయితే విప‌క్షాల అభ్యంత‌రాల‌కు సీఎం కేసీఆర్ త‌ప్పుబ‌ట్టారు. విపక్షాలు అవాస్తవాలను చెబుతున్నాయన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. తమ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న వార్తలు అవాస్తవమన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యాలు తగ్గాయని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారన్నారు.

ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ కేంద్ర పరిధిలోనిది : కేసీఆర్‌
ఇక ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ కేంద్ర పరిధిలోనిది అన్నారు కేసీఆర్‌. సంక్షేమం, సంపద సృష్టిలో అ్రగస్థానంలో ఉన్నామన్నారు. అవినీతి లేకుండా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. మిషన్‌భగీరథ ప్రాజెక్టుల కోసమే అప్పులు చేస్తున్నామన్నారు. ఇక వరంగల్‌ను సింగపూర్‌ చేస్తామని చేయలేదన్న విపక్షాల విమర్శలపై స్పందించిన కేసీఆర్‌.. తాము వరంగల్‌ను సింగపూర్‌ చేస్తామనలేదని.. కరీంనగర్‌ను లండన్‌ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇక అప్పులపై స్పందించిన సీఎం... రాష్ట్రం కంటే కేంద్రమే ఎక్కువ అప్పులు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని సాకే ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్రానికి రాష్ట్రం 50 వేల కోట్లకు పైగా పన్నులు చెల్లిస్తుంటే... రాష్ట్రానికి కేంద్రం కేవలం 24 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తుందన్నారు.

థర్డ్‌ ఫ్రంట్‌ గురించి ప్రస్తావించిన సీఎం కేసీఆర్
ఇక టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేయబోయే థర్డ్‌ ఫ్రంట్‌ గురించి కేసీఆర్‌ సభలో ప్రస్తావించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరముందన్నారు. ప్రజలంతా మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. సీఎం సమాధానం తర్వాత... విపక్షాలు క్లారిఫికేషన్‌ ఇవ్వకుండానే ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. అయితే.. ప్రభుత్వం తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. సర్కార్‌ సభా సాంప్రదాయాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించాయి. 

21:40 - March 27, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టే వారికి రాజకీయాల పార్టీల పట్ల విశ్వాసం లేదని జీవీఎల్ నరసింహరావు అన్నారు. ప్రత్యే హోదా ఒకటే నినాదం కాదని కేంద్రం ఆర్ధికంగా ఆదుకోవాలని విభజన చట్టంలో ఉందని తెలిపారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఏ రాష్ట్రనికి ఇవ్వని నిధులను ఏపీకి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం భయపడుతున్నాయని,.. నరసింహారావు ఎద్దేవా చేశారు.

21:37 - March 27, 2018

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చంద్రబాబు నిర్వహించిన అఖిల సంఘాల భేటీ.. సీఎం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగిన తెలుగుదేశం.. ఇప్పుడు హోదా ఫైట్‌ చేస్తున్నామనడాన్ని తాము విశ్వసించడం లేదని వామపక్షాలు కుండబద్దలు కొట్టాయి. కాంగ్రెస్‌ కూడా ఇదే తరహా భావనను వ్యక్తం చేసింది. అయితే.. విపక్షాల అభ్యంతరాలకు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబు.. హోదా ఫైట్‌పై వచ్చే నెల మూడున, ఢిల్లీ వెళ్లి, జాతీయ పార్టీల నేతలకు వివరిస్తానని తెలిపారు.

భేటీకి వైసీపీ, బీజేపీ, జనసేన డుమ్మా..
ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల అమలు, కేంద్ర సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్‌ నాయకులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతంతోపాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. వైసీపీ, బీజేపీ, జనసేన ఈ భేటీకి దూరంగా ఉన్నాయి.

అఖిలపక్ష నేతలకు విషయాలను వివరించిన సీఎం చంద్రబాబు
ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిపక్ష భేటీకి దారితీసిన పరిస్థితులు, హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం చేసిన అన్యాయాన్ని నేతల దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రానున్న పది రోజుల్లో ప్రతి ఒక్కరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని చంద్రబాబు కోరారు. వచ్చే నెల 2న ఢిల్లీ వెళ్లి, 3 వ తేదీ పలు పార్టీలతో నేతలతో సమావేశమై.. కేంద్రం చేసిన అన్యాయాన్ని వారికి వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యమాన్ని ఉధృతం చేసే విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు అనడాన్ని వామపక్షాలు ఎద్దేవా చేశాయి. అఖిలపక్ష భేటీ కోసం నాలుగేళ్లుగా చేస్తున్న డిమాండ్‌ను చంద్రబాబు పెడచెవిన పెట్టిన విషయాన్ని వామపక్ష నాయకులు ప్రస్తావించారు. ప్యాకేజీ ప్రకటించిన రోజే వ్యతిరేకించి ఉంటే.. రాష్ట్రానికి దుర్గతి పట్టివుండేదికాదన్నారు.

విమర్శలు, సూచనలు..
హోదా, ప్యాకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలు రాష్ట్రానికి నష్టం కలిగించాయని ఏపీసీసీ నాయకులు విమర్శించారు.హోదా ఉద్యమంపై అందర్నీ కలుపుకొని వెళ్లే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని అఖిలపక్ష భేటీకి హాజరైన ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ సూచించారు.

జపాన్‌ తరహాలో కేంద్రానికి నిరసన తెలుపుతాం : అశోక్‌బాబు
హోదా కోసం జరిగే పోరాటానికి ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు ఇస్తారని, జపాన్‌ తరహాలో గంట ఎక్కువగా పని చేయడం ద్వారా కేంద్రానికి నిరసన తెలుపుతామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హామీ ఇచ్చారు. ఈ భేటీకి గైర్హాజరైన వైసీపీ, బీజేపీ, జనసేన నేతలతో ప్రత్యేకంగా మాట్లాడాలని కొన్ని పార్టీలు, సంఘాల నాయకులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. భవిష్యత్‌ కార్యచరణపై చర్చించేందుకు మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. 

21:31 - March 27, 2018

ఢిల్లీ : ఏడవ రోజూ పార్లమెంట్‌లో మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. అవిశ్వాసంపై చర్చ జరగకుండానే ఉభయసభలు వాయిదా పడ్డాయి. అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనతో లోక్‌సభను స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ బుధవారానికి వాయిదావేశారు. మరోవైపు టీడీపీ, వైసీపీ ఎంపీల విమర్శలు.. ప్రతివిమర్శలతో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది.

ఉభయ సభలు వాయిదా..
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ.. ఎన్డీఏ సర్కార్‌పై వివిధ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే.. ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే..కావేరీ జలాలపై అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్‌ సుమిత్రా మేహజన్‌ వాయిదా వేశారు. వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో అన్నాడీఎంకే ఎంపీలు నిరసన కొనసాగించారు. సభ ఆర్డర్‌లో లేకుండా అవిశ్వాసం నోటీసులను ప్రవేశపెట్టబోనని స్పీకర్‌ అన్నారు. దీంతో విపక్షాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇంకా ఎన్నిరోజులు ఇలా వాయిదా వేస్తారని విపక్షాలు ప్రశ్నించాయి. అవిశ్వాసానికి మద్దతుగా ఇంత మంది నిలబడ్డా కనిపించడంలేదా? అంటూ నినాదాలు చేశారు. అధికార విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో.. సభలో గందరగోళం నెలకొంది.

ఉభయ సభల్లో వాయిదాల పర్వం..
సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని.. అప్పుడే అవిశ్వాసం నోటీసు సభ ముందుకు తెస్తానని స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ స్పష్టం చేశారు. సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేసినా.. వినిపించుకోకపోవడంతో లోక్‌సభను బుధవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోను ఇదే తీరు కొనసాగింది. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేయడంతో సభలో ఆందోళన నెలకొంది. సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను తొలుత 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇలా అయితే సభను నడపడం కష్టమంటూ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. సభను బుధవారానికి వాయిదా వేశారు.

శివప్రసాద్‌ వినూత్న రీతిలో నిరసన
మరోవైపు పార్లమెంట్‌ వెలుపల వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చేనేత కార్మికుడి రూపంలో ఆయన నిరసనను వ్యక్తం చేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత చేనేత రంగంపై జీఎస్టీ విధించడంతో వారి బతుకులు భారంగా మారాయన్నారు.

విజయసాయి తీరుపై మండి పడ్డ సీఎం రమేశ్
అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందన్న భయంతోనే బీజేపీ చర్చను అడ్డుకుంటోందని టీడీపీ ఎంపీలు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో టీడీపీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అన్నారు. వైసీపీ ఓ పక్క కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ.. మరోవైపు రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ కాళ్లకు మొక్కడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని సీఎం రమేష్‌ ప్రశ్నించారు.

టీడీపీ నాయకుల తీరుపై వైసీపీ నేతలు మండిపాటు
మరోవైపు టీడీపీ నాయకుల తీరుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ప్రధానికి నమస్కారం మాత్రమే చేశానని అందుకు ఆయన ప్రతినమస్కారం చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌ ఆర్థిక నేరగాళ్లని విమర్శించారు. సీఎం చంద్రబాబును చార్లెస్‌ శోభరాజ్‌తో పోల్చవచ్చని విజయసాయి అన్నారు. రాజ్యసభలో జరిగిన కార్యకలాపాలపై పుటేజ్‌ ఇవ్వాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు విజయసాయి లేఖ రాశారు. వీడియో ఫుటేజ్‌ వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అవిశ్వాస పరీక్షకు సిద్ధమంటూనే కేంద్రం వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు ఏపీలోని అధికార ప్రధాన ప్రతిపక్షం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హోదా విషయాన్ని పక్కనపెడుతున్నారని జనం అంటున్నారు. 

20:47 - March 27, 2018

భారతదేశంలో దళితులకు, యువకులకు ప్రతీకగా, ప్రతినిథిగా రోహిత్ వేముల బలిదానం అనంతరం అన్నింటిని మించి మోదీకి గుజరాత్ ఎన్నికల కుదుపు అనంతరం భారత్ లో ఒక సరికొత్త చైతన్యానికి ప్రతినిథిగా..సామాజిక న్యాయానికి ప్రతిధ్వనిగా వెలుగొందుతున్నయువనేత, గుజరాత్ వడగాం ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..

19:58 - March 27, 2018

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్ డే బాయ్ రామ్ చరణ్ గిఫ్ట్స్ అందుకోవాల్సింది పోయి తనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రజెంట్ టాలీవుడ్  సెన్సేషన్ సుకుమార్ రంగస్థలం సినిమాకు రైటర్స్ గా పనిచేసిన  శ్రీనివాస్, కాశీ,బుచ్చిబాబులకు ఓ పెద్ద అమౌంట్ గిఫ్ట్ ఇచ్చాడట. సుకుమార్ స్ట్రెంథ్ ఈ ముగ్గురు రైటర్సే అని రీసెంట్ గా చెర్రీ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో..సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా వున్న మెగా పవర్ స్టార్..తన హ్యాపీ నెస్ ను ఇలా షేర్ చేసుకున్నాడు.  

19:57 - March 27, 2018

కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కర్నాటకలో 4.96 కోట్ల మంది ఓటర్లకు గాను..56,696 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. దీంతో నేటి నుండే ఎన్నికల నియామావళి అమలులోకి రానుంది. మే 12న పోలింగ్, 15న ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక పీఠం ఎవరిని వరించనుంది? కాషాయానికా? కాంగ్రెస్ కా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈచర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ ప్రధానకార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

19:04 - March 27, 2018

హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఖైదీల వార్డు దగ్గర విధులు నిర్వహిస్తున్న సాయినాథ్‌ దగ్గర గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. దీంతో సాయినాథ్‌ ఎడమవైపు ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. తీవ్రగాయాలైన సాయినాథ్‌ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుల్లెట్‌ శబ్ధంతో ఆస్పత్రిలోని వారందరూ ఉలిక్కిపడ్డారు. మిస్‌ఫైర్‌ సమాచారం తెలుసుకుని... చిలకలగూడ పోలీసులు గాంధీ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. డ్యూటీలో ఉన్న మరో కానిస్టేబుల్‌ నుంచి వివరాలు సేకరించారు. 

19:00 - March 27, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీ విజయసాయి ఆంధ్రుల గౌరవాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరించారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ విమర్శించారు. ఏపీ ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే.. వైసీపీ దానికి తూట్లు పొడుస్తోందని సీఎం రమేశ్‌ విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ కాళ్లపై పడి నమస్కారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యసభలో ప్రధాని వస్తుంటే నమస్కారం చేయడం సహజమేనని.. అయితే విజయసాయిరెడ్డి ఏకంగా ప్రధాని వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారన్నారు. వైసీపీ ఓ వైపు అవిశ్వాసం అంటూనే మరోవైపు ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీఎం రమేష్‌ ఆరోపించారు.

మమతను మర్యాదపూర్వకంగా కలిసాం : సుజనా

ఢిల్లీ : తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంతి మమతా బెనర్జీని తాము మర్యాదపూర్వంగానే కలిసామని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. తాము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఎంసీ మద్దతునిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా థర్డ్ ఫ్రంట్ గురించి ఆమెతో చర్చించలేదని సుజనా స్పష్టం చేశారు.  

టీ. పోలీస్ కొలువుల జాతర..

హైదరాబాద్ : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్స్ జారీకానున్నాయి. పోలీస్ విభాగంలో దాదాపు 22వేల కానిస్టేబుల్స్ పోస్టులు, ఎస్సై పోస్టులకు త్వరలో నోటిఫికేషన్స్ జారీకానున్నట్లుగా సమాచారం. 

ఆ మూడు పార్టీల వైఖరి అర్థమయ్యింది : పయ్యావుల

అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశానికి జనసేన, బీజేపీ, వైసీపీ పార్టీలు గైర్హాజరయ్యాయి. దీంతో వారి వైఖరి ఏమిటో ప్రజలకు అర్థమయ్యిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అఖిల పార్టీల సమావేశంలో అందరూ తమ అభిప్రాయాలనుతెలిపారన్నారు. ప్రత్యేక హోదా కోసం చేసే ఉద్యమంలో విద్యార్థి, ఉద్యోగ సంఘాలను కలుపుకుని వెళ్తామన్నారు. 

విజయసాయి క్షమాపణ చెప్పాలి : సుజనా

ఢిల్లీ : సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని సుజనాచౌదరి డిమాండ్ చేశారు. విజయసాయి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా వున్నాయన్నారు. తెలుగు ప్రజల ఖర్మకొద్దీ విజయసాయిరెడ్డి వంటివారు పార్లమెంట్ సభ్యులుగా వుంటారని ఎంపీలు కావటం అని సుజనాచౌదిరి మండిపడ్డారు.టాటాలు, బిర్లాలు అందరూ బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుంటుంటారనీ..కానీ ఆర్థిక నేరం వేరు, ఆర్థిక ఇబ్బంది వేరు అని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు.  

18:30 - March 27, 2018

ఢిల్లీ : సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని సుజనాచౌదరి డిమాండ్ చేశారు. విజయసాయి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా వున్నాయన్నారు. తెలుగు ప్రజల ఖర్మకొద్దీ విజయసాయిరెడ్డి వంటివారు పార్లమెంట్ సభ్యులుగా వుంటారని ఎంపీలు కావటం అని సుజనాచౌదిరి మండిపడ్డారు. టాటాలు, బిర్లాలు అందరూ బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుంటుంటారనీ..కానీ ఆర్థిక నేరం వేరు, ఆర్థిక ఇబ్బంది వేరు అని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. న్యూస్ ను న్యూసెన్స్ చేయవద్దని..రాజ్యసభ సభ్యులు మర్యాదగా మాట్లాడాలని అంతే తప్ప నోటికొచ్చినట్లల్లా మాట్లాడకూడదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి సూచించారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడుగారి విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. కాగా ఈరోజు విజయసాయి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

18:14 - March 27, 2018
18:11 - March 27, 2018
18:01 - March 27, 2018

అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీసీసీ విమర్శించింది. ముఖ్యంత్రి చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్ష భేటీకి హాజరైన కాంగ్రెస్‌ నాయకులు రుద్రరాజు, గౌతం.. హోదా, ప్యాకేజీపై చంద్రబాబు చేసిన రకరకాల ప్రకటనలను ప్రస్తావించారు. చంద్రబాబు పొంతనలేని ప్రకటనటు, నిలకడలేని నిర్ణయాలతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విమర్శించారు.

17:58 - March 27, 2018

నిజామాబాద్ : లోలం గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. చేతికందే పంటకు నీరు అందక పోవడంతో గుట్టు పెద్ద గంగారాం అనే రైతు మానసికంగా కృంగిపోయాడు. రెండు బోర్ బావులు అడుగట్టిపోవడంతో తీవ్ర మనస్తాపనికి గురై గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. గంగారం మరణంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి కుటుంబానికి 10లక్షలు ఇవ్వాలని స్థానిక అధికారులు కోరారు.  

17:54 - March 27, 2018

మహబూబ్ నగర్ : పాలమూరు ఉమ్మడిజిల్లా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలకు అంతేలకుండా పోయింది. ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ప్రజల అవసరాలను తీర్చడం లేదు. రక్షిత తాగు నీటి పథకాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యమే ప్రస్తుత దయనీయ స్థితికి కారణమవుతోందని . ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే నీటి కష్టాలు ..
ముందు చూపులేని నాయకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే.. మహబూబ్‌నగర్‌ ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా దాహం కేకలు వినిపిస్తున్నాయి. మండుతున్న ఎండలతో.. అక్కడక్కడా ఉన్న బావుల్లో కూడా నీరు ఇంకిపోతుండం.. పల్లె ప్రజలను ఆందోళనకు గురిచేస్తుండగా.. ఎంతకీ పూర్తికాని తాగునీటి పథకాలతో పట్టణవాసులకు దాహార్తితో విలవిల్లాడిపోతున్నారు. పొలాల్లో బోర్ల వద్ద జనం పడిగాపులు

14 బోర్లు వేసినా కనిపించని నీటి జాడ
జడ్చర్ల మండలంలో రాత్రీ పగలూ తేడా లేకుండా తాగునీటి కోసం పొలాలు, బోర్లు, నల్లాల దగ్గర జనం పడిగాపులు పడుతున్నారు. వల్లూరుగ్రామ పంచాయతీ వారు 14 బోర్లు వేసినా నీటి జాడ కనిపించలేదు. దీంతో రెండు రోజులకోసారి నల్లా నీళ్లు సరఫరా చేస్తున్నారు. కాని అవి ఏమూలకూ సరిపోవడం లేదు. ఒక్కొక్కరికి 2-3 బిందెల నీళ్ళు మాత్రమే దొరుకుతున్నాయని జనం గోసపడుతున్నారు.

బీకె ఉప్పునుంతలలో దాహం కేకలు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కు 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న బీకే ఉప్పునుంతల గ్రామంలో ప్రజలు, మూగజీవాలు దాహంతో అల్లాడిపోతున్నారు. ఊరికి దూరంగా అడవిలోని పురాతన బావిలోని నీళ్లే వీరికి ఆధారం. సంవత్సరాలు గడిచిపోతున్నా .. నీటి ఎద్దడి పరిష్కారం కావడం లేదు. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్ధితి లేదని బీకే ఉప్పునుంతల ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

2019నాటి ప్రతి ఇంటికీ నీరు అనుమానమే
ఇంటింటికీ తాగునీరు ఇవ్వకుంటే 2019 ఎన్నికల్లో ఓట్లు అడమని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చిన సందర్బంగా ఘనంగా ప్రకటించారు. కాని.. వట్టిపోయిన బావుల మాదిరగానే ముఖ్యమంత్రి మాటలు వట్టిపోయాయి. తాగునీటి పథకంలో చేపట్టిన క్లస్టర్ల నిర్మాణమే ప్రారంభించలేదు. ఇప్పటికీ పైపులైన్ల నిర్మాణమే కొనాసాగుతోంది. వాటర్‌ గ్రీడ్‌ ద్వారా 2019 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాని పనులు జరుగుతున్న తీరు చూస్తే నాలుగు ఏళ్లు అయినా పనులు పూర్తయ్యే అవకాశాలు లేవంటున్నారు పాలమూరు జిల్లా జనం.

దప్పికతో రోదిస్తున్న మూగజీవాలు,గ్రామాల్లో 4రోజులకు ఓసారే నీరు
మరోవైపు గ్రామాల్లో మూగా జీవాల పరిస్ధితి అరణ్యరోదనగా మారింది. పల్లెల్లో రోజురోజుకు బోర్లు ,బావులు ఎండిపోతున్నాయి. జిల్లా కేంద్రంలో సైతం తాగునీటికి జనాలు తంటాలు పడుతున్నారు.నాలుగు రోజులకు ఒకసారి కూడ నీళ్లు అందని పరిస్ధితి నెలకొంది.. ఈ ఏడాది వేసవిలో ఎలా బయటపడతామోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చేతులెత్తేస్తుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. పాలమూరు ,నాగర్ కర్నూలు,జొగుళాంబ గద్వాల ,వనపర్తి మొదలు.. అన్ని ప్రాంతాలలో ఎక్కడ చూసినా దాహం కేకలే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోసను పట్టించుకుని.. తాగునీటి కష్టాలను తీర్చాలని పామూరు జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

17:49 - March 27, 2018

నెల్లూరు : పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నెల్లూరులో జిల్లా రైతాంగం ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద జిల్లా రైతాంగం ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. జిల్లాలో వరి ధాన్యం ధరలు రోజురోజుకి పతనమైపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతు సంఘాలు ఆరోపించాయి. మిల్లర్లు మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రకరకాల కారణాలు చూపుతూ.. తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. తక్కువ ధరకు ధాన్యాన్ని కొనె మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. 

17:47 - March 27, 2018

రాజన్న సిరిసిల్ల : కలెక్టర్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు రాస్తారోకో చేశారు. వేములవాడ నియోజకవర్గంలో 318 మంది బీడీ కార్మికులకు 18 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. వాటిని రద్దు చేయోద్దంటూ వివిధ పార్టీల ఆధ్వరంలో ఆందోళన చేశారు. వీలైతే అక్కడే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులు కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ స్పందించి వారివద్ద నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు. కార్మికుల నిరసన వల్ల సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  

రాజకీయాలా?రాష్ట్రమా? : ఏపీ ఎన్జీవో అశోక్ బాబు

అమరావతి : రాజకీయాలు కావాలా? లేక రాష్ట్రం ముఖ్యమా? అనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు తేల్చుకోవాలని ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి న్యాయం చేయాలని రాజకీయ పార్టీలన్నీ ఏకమైతే ఉద్యోగులందరమూ పోరాడేందుకు సిద్ధమని, సీఎం చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరు కాని పార్టీలను మళ్లీ ఆహ్వానించాలని అశోక్ బాబు సూచించారు.

విజయసాయి బాబును విమర్శింటమా : చినరాజప్ప

అమరావతి : సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ2 నిందితుడు అయిన విజయసాయిరెడ్డి చంద్రబాబునాయుడిని దొంగ అని అనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. విజయసాయిరెడ్డిని అడ్డుపెట్టుకుని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో జగన్ లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించారు.

సెక్రటరీ జన్ రల్ కు విజయసాయి లేఖ ..

ఢిల్లీ : రాజ్యసభ సెక్రటరీ జన్ రల్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రాజ్యసభలో జరిగిన కార్యకలాపాల పుటేజ్ ను ఇవ్వాలంటు లేఖలో పేర్కొన్నారు. టీడీపీ నేతలు తన పరువుకు భంగం కలింగించేలా వ్యవహరిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరువురు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానికి నమస్కారం పెట్టిన విషయంలో పలు విమర్శలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ, వైసీపీ ఎంపీలు నమస్కారం పెట్టిన విషయంలో రగడ రగిలింది. ఈనేపథ్యంలో రాజ్యసభ సెక్రటరీ జన్ రల్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. 

తుపాకీ మిస్‌ఫైర్‌..కానిస్టేబుల్ కుగాయాలు..

హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆస్పత్రి జైలు వార్డు వద్ద కానిస్టేబుల్‌ సాయినాథ్‌ తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఛాతిలోకి బుల్లెట్‌ దూసుకుపోవడంతో కానిస్టేబుల్‌ను వెంటనే ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆస్పత్రికి వచ్చి కానిస్టేబుల్‌ను పరామర్శించారు. చిలకలగూడు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నటి జయంతికి అస్వస్థత..

హైదరాబాద్ : సీనియర్‌ నటి జయంతి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్తమా సమస్య ఉన్న జయంతిని ఆసుపత్రిలోని అత్యవసర చికిత్సా విభాగంలో కృత్రిమ శ్వాస అందిస్తూ వైద్యం చేస్తున్నారని ఆమె కుమారుడు కృష్ణ కుమార్‌ పేర్కొన్నారు.

17:13 - March 27, 2018

ఢిల్లీ : ఈ ఉదయం రాజ్యసభ 15 నిమిషాలపాటు వాయిదా పడిన సమయంలో... సభలో ఉన్న నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి, ఆయన కాళ్లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొక్కారంటూ వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డితో పాటు వైసీపీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మోదీ కాళ్లు మొక్కి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారంటూ విమర్శిస్తున్నారు. ఈ వార్తలను ఇప్పటికే విజయసాయి ఖండించారు. మోదీకి తాను నమస్కరించానే తప్ప, కాళ్లు మొక్కలేదని చెప్పుకొచ్చారు. తాజాగా పార్లమెంటు సెక్రటరీ జనరల్ కు ఆయన లేఖ రాశారు. వీడియో ఫుటేజీని బయటపెట్టాలని ఆ లేఖలో ఆయన కోరారు.

 

విజయసాయికి కౌంటరిచ్చిన లోకేష్ ..

అమరావతి : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. కేసుల నుంచి బయటపడటానికి విజయసాయిరెడ్డి తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నది ఎవరో? ఇదే సమయంలో మోదీని నిలదీస్తున్నది ఎవరో? ప్రజలకు పూర్తిగా తెలుసనన్నారు. కాగా సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

16:56 - March 27, 2018

కర్ణాటక: బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నోరు జారారు. కర్ణాటక మాజీ సిఎం యడ్యూరప్పను అవినీతి పరుడిగా పేర్కొంటూ వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్న షా...ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో యడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిమయమైందని చెప్పారు. ఆ సమయంలో షా పక్కనే ఉన్న యడ్యూరప్ప కంగుతిన్నారు. వెంటనే పక్కనున్న మరోనేత షా చెవిలో ఈ విషయం చెప్పగా...యడ్యూరప్ప కాదు...సిద్ధరామయ్య అని సవరించుకున్నారు. అమిత్‌ షా నిజమే మాట్లాడారంటూ కాంగ్రెస్‌ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

16:53 - March 27, 2018

ఢిల్లీ : టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తనను విజయ్‌మాల్యాతో పోల్చుతారా అంటూ సీఎంతో పాటు టీడీపీ నేతలపై విజయసాయి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుజనాచౌదరి బ్యాంకులను మోసం చేశారని.. ఇలాంటి వాళ్లా తనపై విమర్శలు చేసిది అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ చార్లెస్‌ శోభరాజ్‌ అంటూ విజయసాయి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

16:50 - March 27, 2018

కృష్ణా జిల్లా : ఎ కొండూరులో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రసాదం, పానకాలు కల్తీ కావడంతో సుమారు 200 వందల మందికి పైగా భక్తులు అస్వస్థత గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు భాదితులను హుటా హుటిన మైలవరం ప్రభుత్వాస్పత్రికి , కొందరిని తిరువూరు ఆస్పత్రికి తరలించారు. ప్రసాదం కల్తీ అవ్వడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అస్వస్థతకు గురైన భక్తులకు సీపీయం పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు సాయం అదించారు.

16:49 - March 27, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో అఖిలపక్షాలు నిరసన దినం నిర్వహించాయి. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వామపక్షాలు, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీశ్‌ అందిస్తారు. 

16:45 - March 27, 2018

ఢిల్లీ : ఖాప్ పంచాయతీ తీర్పులపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇద్దరు మేజర్లు ఇష్టపడి చేసుకున్న పెళ్లిని పంచాయతీలు రద్దు చేయడం చట్ట విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాహంలో ఎవరూ జోక్యం చేసుకోలేరని కోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో పాటు జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపై ఓ చట్టాన్ని తయారు చేసి.. ఖాప్ పంచాయతీల ఆగడాలను అడ్డుకోవాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఖాప్ పంచాయతీల వల్ల జరుగుతున్న హత్యలను అడ్డుకోవాలంటూ శక్తి వాహిని వేసిన పిటిషన్‌పై ముగ్గురు సభ్యలు ధర్మాసనం వాదనలు వినిపించింది. ఆనర్‌ కిల్లింగ్‌ను ఆపడానికి మార్గదర్శకాలు రూపొందించాలని, ప్రతి జిల్లాలో స్పెషల్‌ సెల్‌ ఏర్పాటు చేసేందుకు కోర్టు ఆదేశించాలని కేంద్రం పేర్కొంది. 

16:42 - March 27, 2018

విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. జోన్‌ కోసం విశాఖ నుంచి ఇచ్ఛాపురం వరకు రైల్‌ యాత్ర నిర్వహించాలని నిర్వహించినట్టు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్‌ చెప్పారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 24 గంటల రైలు దిగ్బంధం ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. రైల్వే జోన్‌ కోసం ఉత్తరాధ్ర రక్షణ వేదిక చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమంపై మా ప్రతినిధి జార్జ్‌ మరింత సమాచారం అందిస్తారు.

16:39 - March 27, 2018

హైదరాబాద్ : నగరంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదనే కోపంతో బాలికపై కిరోసిన్ సోసి నిప్పంటించిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది. అంబర్ పేట పీఎస్ పరిధిలోని గంగానగర్ బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంలో బస్తీలోని సొహైల్ అనే యువకుడు సదరు యువతిని ప్రేమించిమంటు వేధిస్తున్నాడు. కాగా ఆమె ఒప్పుకోకపోవటంతో కోపం పెంచుకున్న యువకుడు ఈరోజు సదరు బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.దీంతో మంటలకు తాళలేక బాధితురాలు వీధిలోకి పరిగెత్తింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. కాగా నిందితుడు సొహైల్ పరారీలు వున్నట్లుగా తెలుస్తోంది. 

ప్రేమోన్మాది ఘాతుకం..

హైదరాబాద్ : నగరంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదనే కోపంతో మైనర్ బాలికపై కిరోసిన్ సోసి నిప్పంటించిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది. అంబర్ పేట పీఎస్ పరిధిలోని గంగానగర్ బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందిన స్థానికులు బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. కాగా ఆమె పరిస్థితి విషయంగా వున్నట్లుగా తెలస్తోంది.  

మత ఘర్షణల్లో 60మందికి గాయాలు..

హైదరాబాద్ : శ్రీరామ నవమి నేపథ్యంలో నిన్న ఔరంగాబాద్‌లోని నవాదిహ్ ప్రాంతంలో రెండు మతాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంది. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 150మందిని అరెస్ట్ చేసినట్లు బీహార్ పోలీసులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని, ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అల్లరి మూకలు విధ్వంసం సృష్టించి జామా మసీదుకు సమీపంలో సుమారు 50 దుకాణాలకు నిప్పంటించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో 60 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పోలీసులు కూడా ఉన్నట్లుగా సమాచారం.  

నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం..

హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రోజురోజుకీ డ్రగ్స్ కల్చర్ నగరంలోపెరుగుతోంది. ఈ నేపథ్యంలో చింతలకుంటలో డ్రగ్స్‌ను విక్రయిస్తున్న రవికుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 7 గ్రాముల కొకైన్, 10 ఎల్‌ఎస్‌డీ, 2 కిలోల గంజాయి, బైకును స్వాధీనం చేసుకున్నారు. కొకైన్, ఎల్‌ఎస్‌డీని గోవా నుంచి తెచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

భారీగా గుట్కా స్వాధీనం..

నల్గొండ: మిర్యాలగూడలో భారీ మొత్తంలో గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విలువ రూ.4.5 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు బీహార్ నుంచి గుట్కాను తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

16:08 - March 27, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి చెప్పారు. విభజన చట్టంలోని హామీలు అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకొంటోందంటుదని తులసి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

16:06 - March 27, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయం తామేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నగరంలో ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు సీపీఎం జాతీయ మహాసభలు జరగనున్నాయి. మహాసభల విజయవంతానికి విస్త్రత ప్రచారం చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏప్రిల్‌ 22న వేలాదిమందితో రెడ్‌ వాలంటీర్ల కవాతు, పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌లు ఏర్పాటు చేస్తామంటున్న నేతలు.. ఆ పార్టీల ఆర్థిక విధానాలనే అమలు చేస్తున్నారన్నారు. బీఎల్‌ఎఫ్‌కు విశేష ఆదరణ లభిస్తుందని తమ్మినేని పేర్కొన్నారు.

16:00 - March 27, 2018

హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరముందన్నారు సీఎం కేసీఆర్‌. ఇందుకోసం దేశంలో ప్రత్యామ్నాయ ఆలోచనలు జరుగుతున్నాయన్నారు. తాము ఏర్పాటు చేయబోయే పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా రెండు, మూడు పార్టీలను చేర్చుకొని ముందుకు పోయేది కాదని... దేశవ్యాప్తంగా ప్రజలను ఏకీకృతం చేసేందుకు దోహదపడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి బయల్దేరే ముందు కూడా తనను చాలామంది అవహేళన చేశారని... ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా చివరకు సత్యమే గెలుస్తుందన్నారు కేసీఆర్‌.

15:56 - March 27, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వం రద్దుపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీసీటీవీ వీడియోల సమర్పణపై ఇప్పుడు మేము ఏమీ చెప్పలేమని అడిషనల్ అడ్వకేట్ జనరల్... హైకోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం.. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదాపడింది. కాగా మండలి చైర్మన్ స్వామిగైడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసిన ఘటనను సీరియస్ గా తీసుకున్న టీ.సర్కార్ కోమటిరెడ్డి తోపాటు సంపత్ ను కూడా శాసనసభ నుండి శాస్వతంగా రద్దు చేసింది. ఈ విషయంపై న్యాయస్థానాన్ని కోమట్టిరెడ్డి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

15:43 - March 27, 2018

అమరావతి : గత నాలుగేళ్ల నుండి సీఎం చంద్రబాబు అఖిలపక్షం మీటింగ్ పెట్టి వుంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ కు ఈ పరిస్థితి వుండేదికాదని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యంగా టీడీపీ స్పందించిందని అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం రామకృష్ణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అని మాట మార్చి మోసం చేస్తే దానిపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా ప్యాకేజీ ఒప్పుకోవటం చంద్రబాబు చేసిన ఘోరమైన తప్పిదమని రామకృష్ణ విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఎందుకు కొనసాగవలసి వచ్చిందో..ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో ..ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకోవాల్సివచ్చిందో చంద్రబాబు తెలిపారని కొత్త విషయాలేమి చెప్పలేదని ఏదిఏమైనా టీడీపీ అలసత్వంతో జరగాల్సిన నష్టం రాష్ట్రానికి జరిగిందనీ..రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటాలు కొనసాగతుంటాయని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. 

15:43 - March 27, 2018

అమరావతి : ఏపీ పరిస్థితికి బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలే కారణమని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్షం సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో సమావేశం ముగిసిన అనంతరం మధు మీడియాతో మాట్లాడుతు..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేస్తే..రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అలసత్వం వహించిందనీ..కాబట్టి ప్రస్తుతం ఏపీ పరిస్థితులకు బాధ్యత టీడీపీ వహించి తీరాలన్నారు. ఈ విషయాన్ని తను చంద్రబాబు నాయుడితో సమక్షంలోనే తెలిపారనన్నారు. సమావేశంలో భాగంగా అన్ని పార్టీలను అభిప్రాయలు చెప్పమని సీఎం చంద్రబాబు కోరారని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు తెలిపారు. అఖిల పక్షం మీటింగ్ పెట్టమని తరచు అడిగినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదనీ..ప్రత్యేక హోదా అంశంపై పోరాటాలు చేస్తే అడ్డుకుని అరెస్ట్ లు కూడా చేసి అవమానించారని సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీ, టీడీపీ పార్టీలు మినహా అన్ని పార్టీలతోను కలిసి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ఇచ్చిన మాటలను ఎన్డీయే ప్రభుత్వం నిలుపుకోలేదు..
అన్ని విద్యాసంస్థలు హైదరాబాద్ లో వుండిపోయినందుకున ఉమ్మడి రాష్ట్రంలోవుండిపోయిందనీ..రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్ ఏపీకి మిగిలిపోయిందన్నారు. రాజధాని నిర్మాణానికి, 11 జాతీయ విద్యాసంస్థలను కూడా విభజన చట్టం లో పేర్కొన్నారని..దానికి నిధులు కోత పెట్టారన్నారు. అలాగే విశాఖ రైల్వే జోన్ కూడా పెండింగ్ లోనే పెట్టారన్నారు. ఎంత తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్న మాటను కూడా నిలబెట్టుకోలేదన్నారు. పార్లమెంట్ లో ప్రధానిమంత్రి చేసిన చట్టాన్ని కూడా అమలుచేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చులు, పునరావాస ఖర్చులు కూడా కేంద్రం ఇవ్వాల్సినవుందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పునరావాస ఖర్చులు తమకు సంబంధం లేదనీ బీజేపీ తప్పించుకుందని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలపై అఖిల పక్షం తరుపున తీర్మానం పెడదామని సీఎం చంద్రబాబు కోరారని దానికి తాము సమ్మతించలేదని సీపీఎం కార్యదర్శి మధు పేర్కొన్నారు.  

సమంతకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు : కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సినీనటి సమంతాకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో సంక్షేమానికి స్వర్ణయుగమన్నారు. తెలంగాణలో ఉన్న మగ్గాలకు జియో ట్యాగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చేనేత రుణమాఫీని పక్కా ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్లు చెప్పారు. 

మాది చేతల సర్కారు: కేటీఆర్

హైదరాబాద్: మాది చేనేతల, చేతల సర్కారు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేత రుణాలు-చేనేత రంగానికి సహాయం అనే అంశంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడ చేనేత రంగంలో చూసినా మనవారే ఉన్నారన్నారు. వ్యవసాయం తర్వాత తెలంగాణలో కీలక రంగం చేనేత రంగమని తెలిపారు.

14:46 - March 27, 2018

సినిమా అంటే చాలా మందికి వినోదం. అది చాలా మందికి ఉపాధి కూడా. అవకాశాల కోసం ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారు. స్టూడియోల దగ్గర పడిగాపులు కాస్తారు. ఇలా ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. అవకాశం వచ్చే వరకు వారి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇలా అవకాశాల కోసం వచ్చిన మహిళలను కొంతమంది తమ అవసరాల కోసం వేధిస్తున్నారా? ఇప్పుడు ఇవే ఆరోపణలు టాలీవుడ్‌లోని కొంతమంది నటీమణులు వినిపిస్తున్నారు. ఒక్క టాలీవుడే కాదు... మన పక్కనే ఉన్న కోలీవుడ్‌, బాలీవుడ్‌లో కూడా ఇలాంటి ఆరోపణలే చాలా మంది చేశారు. అవకాశాలు చూపిస్తామని మహిళలపై లైంగిక దాడి చేస్తున్నారని వీరు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి. దీనికి పరిష్కారం ఏంటి. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలేంటి. ఈ అంశాలపై సామాజిక కార్యకర్త దేవి ఎటువంటి విషయాలను వెల్లడించారో చూద్దాం..

14:42 - March 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థి వేదిక.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఇంటర్‌ బోర్డు ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థులు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఒత్తిడితో పిట్టల్లా రాలిపోతుంటే చర్యలెందుకు తీసుకోవడం లేదని విద్యార్థినేతలు ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్‌ అందిస్తారు.

14:35 - March 27, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై నేనెప్పుడు కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడలేదని అఖిల పక్షం సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీకి రెండు జాతీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 49 సార్లు ఢిల్లీలకి వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించానని తెలిపారు. రూ. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక లోటు గురించి పదే పదే గుర్తు చేసిన కేంద్రం నుండి ఎటువంటి స్పందన రాలేదన్నారు.

ఏ రాష్ట్రానికి జరగని అన్యాయం ఏపీకి జరిగింది : సీపీఎం మధు

ఈ సమావేశానికి హాజరైన సీపీఎం పార్టీ ఏపీ కార్యదర్శి మధు మాట్లాడుతు.. భారతదేశంలో ఏ రాష్ట్రానికి జరగని అన్యాయం ఏపీకి జరిగిందన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయటంలేదన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీఎం చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ గురించి కూడా మధు మాట్లాడారు. అమిత్ షా లేఖ రాజకీయ స్కోరు కోసం రాసినదేనన్నారు. చంద్రబాబు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి వామపక్ష పార్టీలు హాజరు కాగా..బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు హాజరుకాలేదు. 

13:37 - March 27, 2018
13:35 - March 27, 2018

పథకాలు ఓట్ల కోసం కాదు - ఈటెల...

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి చేసిన విమర్శలపై ఆయన సమాధానం ఇచ్చారు. 

ఓట్ల కోసమే పథకాలు - కిషన్ రెడ్డి...

హైదరాబాద్ : టి.శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసమే కొన్ని పథకాలు ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. 

13:02 - March 27, 2018
13:01 - March 27, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యుల శాసనసభ సభ్యత్వం రద్దుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో కాంగ్రెస్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం కోర్టు విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే సోమవారం అనూహ్యంగా తెలంగాణ ఏజీ ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వంతో విబేధాలే కారణమని వార్తలు వెలువడ్డాయి. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు వాదనలు వినిపించారు. మధ్యాహ్నం 2.30కి కోర్టు వాయిదా వేసింది. తీర్పు ఎలా వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

శాసనసభ సభ్యత్వంపై రద్దుపై విచారణ...

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యుల శాసనసభ సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 2.30కి కోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు వాదనలు వినిపించారు. 

12:41 - March 27, 2018

ఢిల్లీ : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం..నాటకీ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపడుతుండడంతో అవిశ్వాస తీర్మానం పరిగణలోకి తీసుకోవడం లేదని స్పీకర్ పేర్కొంటూ సభను వాయిదా వేస్తున్నారు. కానీ మంగళవారం టీఆర్ఎస్ సభ్యులు తమ తమ స్థానాల్లో నిలిచొని నిరసన వ్యక్తం చేశారు. కానీ అన్నాడీఎంకే సభ్యులు మాత్రం స్పీకర్ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. నినాదాలతో హోరెత్తించారు. దీనితో సభను 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు. తిరిగి ప్రారంభమైనా సభలో పరిస్థితిలో మార్పు రాలేదు. సభ ఆర్డర్ లో ఉంటేనే తీర్మానాన్ని సభ ఎదుట ప్రవేశ పెట్టవచ్చని స్పీకర్ పేర్కొనగా తీర్మానానికి తగిన సంఖ్యాబలం ఉందని..వెంటనే చర్చను చేపట్టాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే కోరారు. కానీ స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్..అన్నాడీఎంకేల సభ్యులు బాహాబాహికి దిగారు. అన్నాడీఎంకే సభ్యులను సోనియా గాంధీ వారించారు. మార్షల్ రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పారు. 

ఉభయసభలూ వాయిదా...

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ వాయిదా పడ్డాయి. రాజ్యసభ..లోక్ సభలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పరిగణలోకి తీసుకోవడం లేదని స్పీకర్ వెల్లడించారు. సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. 

12:20 - March 27, 2018

ఢిల్లీ : లోక్ సభలో మళ్లీ గందరగోళం...సభ ఆర్డర్ లో లేదు..కాబట్టి సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తీసుకోవడం లేదు..సభను వాయిదా వేస్తున్నాం..అని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ చెప్పడం పరిపాటై అయిపోయింది. ఏపీ విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ..టిడిపి..కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. సీపీఎం, ఆర్ఎస్పీ నోటీసులు ఇచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు లభించింది. కానీ తమిళనాడుకు చెందిన సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనలు చేపట్టారు. దీనితో సభను ప్రతి రోజు వాయిదా పడుతూ వస్తోంది.

కానీ మంగళవారం నాడు ప్రారంభమయ్యే సభలో అవిశ్వాస తీర్మానం నోటీసులను పరిగణలోకి తీసుకుంటారని మీడియాలో ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు పలికారు. కానీ సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. దీనితో సభను 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు. అనంతరం తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన సంఖ్యాబలం పూర్తిస్థాయిలో ఉందని చర్చకు అనుమతినివ్వాలని కాంగ్రెస్ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ భయపడుతోందని..విమర్శించారు. దీనికి అనంతకుమార్ స్పందించారు. తాము చర్చకు సిద్ధమని..ఎక్కడకు పారిపోవడం లేదన్నారు. సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారని..కానీ సభ ఆర్డర్ లో లేకపోవడంతో తీసుకోవడం లేదని పేర్కొంటూ సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
ఇక రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. బుధవారం మళ్లీ ఇదే పునరావృతమౌతుందా ? లేదా ? అనేది చూడాలి. 

టి.అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 11గంటలకు ప్రారంభం కాగానే మంత్రి ఈటెల ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశ పెట్టారు. 

11:39 - March 27, 2018

ఢిల్లీ : రాజ్యసభ సమావేశాల్లో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పాడయి. విపక్ష సభ్యులు కూడా ఆందోళన చేస్తుండడంతో సభను పలు మార్లు వాయిదా పడుతూ వస్తోంది. మంగళవారం ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు ఏర్పాటుపై సభ్యులు నినాదాలు చేశారు. దీనితో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనితో సభ ను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెల్లడించారు. సభ తిరిగి ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేశారు. చివరకు సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

11:29 - March 27, 2018

ఢిల్లీ : లోక్ సభలో పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రారంభమైనప్పటి నుండి విపక్ష సభ్యులు ఆందోళన చేపడుతుండడంతో సభ వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు చేయాలంటూ టిడిపి, వైసిపి పార్టీలు అవిశ్వాస వాయిదా తీర్మానాలిచ్చాయి. కానీ సభ ఆర్డర్ లో లేకపోవడంతో తీర్మానం అటాచ్ మెంట్ చేయడం లేదని స్పీకర్ పేర్కొంటున్నారు. కాంగ్రెస్ తీర్మానం నోటీసు ఇవ్వగా సీపీఎం, ఆర్ఎస్ పి నోటీసులు అందచేశాయి. పలు పార్టీలకు చెందిన ఎంపీలు తీర్మానానికి మద్దతు ప్రకటించాయి.

కానీ మంగళవారం సభ ప్రారంభం కాగానే కావేరి బోర్డు పై అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడంతో సభను మధ్యాహ్నాం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

11:19 - March 27, 2018

ఢిల్లీ : కర్నాటక ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ అధికారులు విడుదల చేశారు. మే 26తో కర్నాటక అసెంబ్లీ ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ అధికారులు మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. 224 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నియావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

మొత్తం ఓటర్లు 4,96,82,357 ఉన్నారని, 95 శాతానికి పైగానే ఓటర్ల కార్డులను పంపిణీ చేసినట్లు తెలిపారు. 56,696 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల వద్ద మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ఉపయోగించనున్నట్లు, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ లను ఉపయోగించ కూడదన్నారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎన్నికల వ్యయం పరిధి రూ. 28 లక్షలుగా నిర్ధారించినట్లు సమాచారం. అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్...
ఏప్రిల్ 17న ఎన్నికల నోటిఫికేషనష్...
ఏప్రిల్ 24 నుండి నామినేషన్ల స్వీకరణ...
నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 27 చివరి తేదీ...
మే 12 పోలింగ్...
మే 15న ఓట్ల లెక్కింపు...

కర్నాటక ఎన్నికల షెడ్యూల్...

ఢిల్లీ : కర్నాటక ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ అధికారులు విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 4,96,82,357 ఉన్నారని, 95 శాతానికి పైగానే ఓటర్ల కార్డులను పంపిణీ చేసినట్లు తెలిపారు. 

లోక్ సభ సమావేశాల ప్రారంభం...వాయిదా...

ఢిల్లీ : లోక్ సభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. పలువురు ఎంపీలు వెల్ లోకి వెళ్లి ఆందోళన కొనసాగించారు. దీనితో స్పీకర్ మధ్యాహ్నానికి 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

'అఖిలపక్ష సమావేశం టిడిపిది రాజకీయ ఎత్తుగడ'...

విజయవాడ : ఏపీ ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం తెలుగు దేశం పార్టీ అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడ అని జనసేన పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అఖిలపక్ష సమావేశంలో సంకల్పం లోపించిందని, తొలుత అఖిల సంఘాల సమావేశం అని ప్రకటించి..పనిలో పనిగా రాజకీయ పార్టీలను కలిపేశారని విమర్శించింది. 

10:50 - March 27, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అడ్మిట్ అవుతుందా ? లేదా ? అనేది ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం నాడు ప్రారంభమయ్యే సమావేశంలో స్పీకర్ తీర్మానానికి అనుమతినిస్తారా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఈ సందర్భంగా టిడిపి లోక్ సభా పక్ష నేత తోట నర్సింహంతో టెన్ టివి మాట్లాడింది. ఏపీకి ఎలా అన్యాయం చేశారనే దానిపై పూర్తి వివరాలతో సన్నద్ధంగా ఉన్నామన్నారు. కేవలం వాగ్ధానాలు ఇవ్వడమే తప్ప ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదని, పైగా ఇబ్బంది కలిగించే విధంగా చేశారని విమర్శించారు. ఇలాంటి విషయాల్లో బిజెపి భయపడి ఉండవచ్చునని, అందుకే తీర్మానం విషయంలో అలాంటి వైఖరి కనబరుస్తోందన్నారు. హక్కులు సాధించే దాక తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. 

అవిశ్వాస తీర్మానం అడ్మిట్ అయ్యే ఛాన్స్...

విజయవాడ : కేంద్ర ప్రభుత్వంపై పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం క్లైమాక్స్ కు చేరుకుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు బిజెపి సై అంటున్నట్లు సమాచారం. మంగళవారం తీర్మానం అడ్మిట్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది. 

టిడిపి ఎంపీలతో బాబు...

విజయవాడ : టిడిపి ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత తానని, ముందుగా తాను సీఎం అయ్యాననే గుర్తు చేయాలని ఎంపీలకు సూచించారు. గతంలోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన నేతను తానని పేర్కొన్నారు. చిన్న మచ్చ కూడా లేని నేతపై దాడి ఏంటీ అని ప్రశ్నించాలని సూచించారు. 

10:14 - March 27, 2018

ఢిల్లీ : ఏపీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వైసీపీ, కాంగ్రెస్ విభజన ఆయుధ తీర్మానం అందచేసిశారు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తీర్మానం తీసుకోవడం లేదంటూ స్పీకర్ పేర్కొంటున్నారు. సీపీఎం..ఆర్ఎస్పీ పార్టీలు నోటీసులను పంపారు. మొత్తంగా 80 మందికిపైగానే ఎంపీల మద్దతు లభించినట్లు సమాచారం.

ఎన్డీయే ప్రభుత్వం నుండి తాము ఎందుకు బయటకు వచ్చామో అర్థం చేసుకోవాలని ఎంపీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ఏపీని పట్టించుకోకపోవడం..ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే బయటకు వచ్చామన్నారు.

 

బయటకు ఎందుక వచ్చామరో అర్థం చేసుకోవాలి - ఎంపీ తోట...

ఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం నుండి తాము ఎందుకు బయటకు వచ్చామో అర్థం చేసుకోవాలని ఎంపీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ఏపీని పట్టించుకోకపోవడం..ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే బయటకు వచ్చామన్నారు. 

09:51 - March 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 11 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. మంగళవారం నాడు ప్రారంభం కాగానే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఈ చర్చలో అన్ని పక్షాల సభ్యులు పాల్గొంటారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేదనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ కూడా రద్దు చేశారు. ఆమోదం పొందితే చట్ట సభలో వార్షిక బడ్జెట్ కు ఆమోద ముద్ర పడనుంది. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం మధ్యాహ్నం మండలిలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. 

ఇదిలా ఉంటే రాష్ట్ర బడ్జెట్ లో 70 శాతం ఆదాయం హైదరాబాద్ నుండే వస్తుందని, మౌలిక సదుపాయల కల్పన చేయడం లేదని బిజెపి వాయిదా తీర్మానం ఇచ్చింది. పంచాయతీ రాజ్, కొత్త మున్సిపాల్టీ, ప్రైవేటు యూనివర్సిటీ బిల్లులను సభ ముందుకు తీసుకరావాలని..ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. మధ్యాహ్నం బీఏసీ సమావేశం ఉంటుందని..ఇందులో సమావేశాల పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 

09:44 - March 27, 2018

తిరుమలలో అపశృతి ?

చిత్తూరు : తిరుమలలో అపశృతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఉత్సవమూర్తులను ఆలయంలోకి తీసుకెళుతుండగా అర్చకుడి చేతి నుండి అమ్మవారి విగ్రహం జారి పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఏకాంతంగా అర్చకులు శాంతి హోమం చేసినట్లు సమాచారం. 

09:12 - March 27, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వం నుండి అఖిల సంఘ సమావేశానికి హాజరు కావాలని తనకు ఆహ్వానం అందిందని సినీ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి నేత శివాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో తాను సమావేశానికి హాజరు కావడం లేదని, ఏపీ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయానికి..అప్పగించే బాధ్యతలకు ప్రాణాలకు తెగించి పోరాడుతానన్నారు. ప్రతొక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 

అఖిల సంఘ సమావేశానికి బీజేపీ గైర్హాజర్..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే అఖిల సంఘ సమావేశానికి బిజెపి గైర్హాజర్ కానుంది. ప్రత్యేక హోదాపై చర్చను జరపాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు తప్పుబట్టారు. 

గుడిసెలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ...

హైదరాబాద్ : హైటెక్ సిటీ పత్రికానగర్ లో గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో 15 ఏళ్లకు పైగా 320 నిరుపేదల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. 

08:58 - March 27, 2018

ఏపీకి ప్రత్యేక హోదా..విభజన సమస్యలు పరిష్కరించాలంటూ పోరాటాలు ఉధృతమౌతున్నాయి. పార్లమెంట్ లో టిడిపి..వైసిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలకు మద్దతు పెరుగుతోంది. సీపీఎం..ఆర్ఎస్పీ నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ..జనసేన పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉండగా కాంగ్రెస్, సీపీఎం, ఇతర సంఘాల నేతలు సమావేశానికి హాజరవుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో రామకృష్ణ (కాంగ్రెస్), విష్ణు శ్రీ (బిజెపి), దుర్గా ప్రసాద్ (టిడిపి), పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:31 - March 27, 2018

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ...

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సర పిఎసి నివేదికను సభకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమర్పించనున్నారు. 2011-12, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పురపాలక శాఖ కాగ్ నివేదిక ప్రవేశ పెట్టనున్నారు. 2012-13 సంబంధంచి జలవనరుల శాఖ కాగ్ నివేదికను సమర్పించనుంది. 

08:28 - March 27, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానం..కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహాని అనుసరించబోతోంది ? ఇప్పటి వరకు సభ ఆర్డర్ లో లేదని చెబుతూ వాయిదాలు వేస్తూ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతుండడంతో కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా...విభజన హామలు అమలు చేయాలంటూ టిడిపి..వైసిపి..కాంగ్రెస్..పార్టీలు అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా సీపీఎం..ఆర్ఎస్పీ పార్టీలు నోటీసులు ఇచ్చాయి. దీనితో అవిశ్వాస తీర్మానం పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విపక్షాలన్నీ ఒక్కటి కావడంతో కేంద్రం తప్పించుకోలేని స్థితి నెలకొందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల అంశంపై వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు వ్యూహాన్ని మార్చారు. వెల్ లోకి వెళ్లకుండా నిరసన తెలుపాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రంతో కలిసి పోరాటం చేద్దామని టీఆర్ఎస్ ఎంపీలు సూచించారు.

మొత్తానికి ఏడు అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు రానున్నాయి. దీనితో తీర్మానాన్ని పరిగణలోకి తీసుకుని వచ్చే వారం చర్చ...ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి మొత్తం 80 మందికి పైగా ఎంపీల మద్దతు ఉందని సమాచారం. కాంగ్రెస్ 48, టిడిపి 15, సీపీఎం 9, వైసీపీ 8, ఆర్ఎస్పీ 1 బలంగా ఉంది. 

టి.అసెంబ్లీ...11గంటలకు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం మధ్యాహ్నం మండలిలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశ పెడుతున్న దృష్ట్యా నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు..జీవో అవర్ రద్దు చేశారు. 

08:17 - March 27, 2018

విజయవాడ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విడిపోయి నాలుగేళ్లు దాటుతోంది. కానీ విభజన సమస్యలు ఇరు రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. ప్రధానంగా ఏపీ రాష్ట్రానికి పునర్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు కావడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీ ఇంతవరకు అమలు కాకపోవడంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగేళ్లు దాటిన అనంతరం టిడిపి..బిజెపితో పొత్తు వదులుకుంది. ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో టిడిపి..వైసిపి..కాంగ్రెస్..సీపీఎం అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అఖిల సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై గణాంకాలతో సహా ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. అయితే ఈ సమావేశానికి వైసిపి..జనసేన పార్టీలు దూరంగా ఉన్నాయి. లెఫ్ట్ నేతలు..కాంగ్రెస్..ఇతర సంఘాల నేతలు హాజరు కానున్నారు. ఒక్కో సంఘం నుండి ఇద్దరు ప్రతినిధులు హాజరు కానున్నారు. బిజెపి మాత్రం సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

అఖిల సంఘ సమావేశానికి వైసిపి దూరం...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో జరిగే అఖిల సంఘానికి వైసీపీ దూరంగా ఉంది. జనసేన కూడా హాజరు కావొద్దని నిర్ణయం తీసుకుంది. లెఫ్ట్ నేతలు..కాంగ్రెస్..ఇతర సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 

కాసేపట్లో అఖిల సంఘాల సమావేశం...

విజయవాడ : ఉదయం 11గంటలకు అఖిల సంఘాల సమావేశం జరుగనుంది. రాష్ట్రం కోసం పోరాడే అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. ఒక్కో సంఘం నుండి ఇద్దరు ప్రతినిధులు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో జరిగే ఈ సమావేశం జరుగనుంది.  

కాసేపట్లో అఖిల సంఘాల సమావేశం...

విజయవాడ : ఉదయం 11గంటలకు అఖిల సంఘాల సమావేశం జరుగనుంది. రాష్ట్రం కోసం పోరాడే అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. ఒక్కో సంఘం నుండి ఇద్దరు ప్రతినిధులు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో జరిగే ఈ సమావేశం జరుగనుంది.  

07:02 - March 27, 2018

ఉపాధి హామీ పథకం..దేశంలో చాలా మందికి ఆకలి తీరుస్తున్న పథకం..కానీ ప్రస్తుతం ఈ పథకం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. దీనికి కేటాయించిన నిధులు కూడా దారి మళ్లుతున్నాయి. పని దినాలు తగ్గుతున్నాయి. క్రమంగా ఈ పథకం పట్ల నిర్లక్ష్యపూరిత వైఖరిని పాలకులు అవలింబిస్తున్నారు...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి పథకాన్ని అటకెక్కిస్తున్నారు. ఒకవైపు దేశంలో ఉపాధి కనుమరగువుతున్న వేళ ఉపాధి కల్పించే ఇలాంటి పథకంపై అశ్రద్ధ కనబరుస్తుండడంపై ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:38 - March 27, 2018

ఢిల్లీ : క్రికెట్‌ దిగ్గజాలు, క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు కంగారూ క్రికెటర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. స్టీవ్‌ స్మిత్‌, బాంక్రాఫ్ట్‌ చేసిన బాల్‌ టాంపరింగ్‌ గురించే ఇప్పుడు అంతటా చర్చ. ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ ,ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఇప్పటికే స్మిత్‌ , బాంక్రాఫ్ట్‌ మీద చర్యలు తీసుకున్నా....క్రికెట్‌ దిగ్గజాలు, క్రికెట్‌ విశ్లేషకులు మాత్రం బాల్‌ టాంపరింగ్‌ చేసిన వారిని మరింత కఠినంగా శిక్షించాల్సిందేనంటూ విమర్శిస్తున్నారు. స్టీవ్‌ స్మిత్‌పై ఒక టెస్ట్‌, బాంక్రాఫ్ట్‌కు వార్నింగ్‌ మాత్రమే ఇచ్చిన ఐసీసీ నిర్ణయాన్ని క్రికెట్‌ ప్రపంచం విభేదిస్తోంది. స్టీవ్‌ స్మిత్‌తో పాటు ఇకపై బాల్‌ టాంపరింగ్ చేసే వారిని మరింత కఠినంగా శిక్షించాలని వాపోతున్నారు.

 

06:36 - March 27, 2018

ఢిల్లీ : రష్యాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. కెమెరోవొలోని రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో.. అదివారం రాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో ఇప్పటి వరకూ 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతులో చాలా మంది చిన్నారులే ఉన్నారు.

రష్యాలోని.. బొగ్గు గనుల నగరం.. కెమెరోవోలోని.. చెర్రీ షాపింగ్‌ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 64 మందిని పొట్టన పెట్టుకుంది. చెర్రీ షాపింగ్‌ మాల్‌లో మల్టిప్లెక్స్ సినిమా థియేటర్లు, స్పా, బౌలింగ్ తదితర సౌకర్యాలు ఉండడం... వీకెండ్‌ కావడంతో.. చాలామంది ఈ మాల్‌కు తరలివచ్చారు. ఉన్నట్టుండి చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే షాపింగ్‌ మాల్‌ను చుట్టుముట్టాయి. ఎం జరుగుతోందో అర్థమయ్యే లోపే చాలా మంది అగ్నికి ఆహుతి అయ్యారు. తొలుత షాపింగ్ మాల్‌లోని ఓ సినిమా థియేటర్‌ నుంచి మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భద్రత సిబ్బంది దాదాపు 120 మందిని మంటల నుంచి బయటకు తీసుకొచ్చారు. వీరిలో చాలా మందికి కాలిన గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరికొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియడంలేదు. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

06:35 - March 27, 2018

ఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికాలో తుపాకుల సంస్కృతుని వ్యతిరేకిస్తూ.. సుమారు 10 లక్షల మంది రోడ్లపై ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు. గత నెల ఫ్లోరిడాలోని డగ్లస్‌ ఉన్నత పాఠశాలలో ఓ ఉన్మాది జరిపిన విచ్చలవిడి కాల్పుల్లో 17 మంది విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో గన్‌ కల్చరును రద్దు చేయాలంటూ యువత వైట్‌ హౌస్‌కు చేరుకునే ప్రధాన రహదారుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.

06:34 - March 27, 2018

ఢిల్లీ : ప్రపంచంలోని పలు దేశాలు రష్యాపై దౌత్య యుద్ధాన్ని ప్రకటించాయి. బ్రిటన్‌లోని శాలిస్‌బరీలో రష్యా మాజీ గూఢచారిపై ఆ దేశం విషప్రయోగం చేసిందన్న ఆరోపణలపై దౌత్యపరమైన ఆంక్షలు విధిస్తున్నాయి. తమ దేశంలో గూఢచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై 60 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. బహిష్కరణకు గురైన దౌత్యవేత్తలంతా వారం రోజుల్లో అమెరికా విడిచివెళ్లాలని కోరింది. సియాటల్‌లోని రష్యా కాన్సులేట్‌ కార్యాయాలన్ని మూసివేయాలని ఆదేశించారు. జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, లిథూనియా, పోలండ్‌ కూడా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌లోని 14 దేశాలు కూడా రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ వేటు వేశాయి. ఈనెల 4న 13 మంది రష్యా దౌత్యవేత్తలను బ్రిటన్‌ బహిష్కరించింది. 

06:32 - March 27, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌, బీజేపీ మధ్య సోషల్‌ మీడియాలో యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ యాప్‌ల నుంచి సింగూర్‌, అమెరికా కంపెనీలకు సమాచారం వెళ్తోందంటూ రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి కాంగ్రెస్‌ తన యాప్‌ను తొలగించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధికార యాప్‌ నమో యాప్‌ ద్వారా వ్యక్తిగత సమాచారం అమెరికా కంపెనీలకు లీక్‌ అవుతోందని ఫ్రెంచి హ్యాకర్‌ ఎలియట్‌ అల్డర్‌సన్‌ ట్వీట్‌ ద్వారా ఆరోపించారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన విత్‌ ఐఎన్‌సీ యాప్‌ నుంచి కూడా వ్యక్తిగత సమాచారం సింగపూర్‌ కంపెనీలకు వెళ్తోందని అల్డర్‌సన్‌ చేసిన ట్వీట్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. రెండు పార్టీల నేతలు చేసుకున్న పరస్పర ఆరోపణలు రాజకీయ వివాదానికి దారితీశాయి.

నమో యాప్‌ నుంచి సమాచారం అమెరికా కంపెనీలకు చేరుతోందన్న ఎలియట్‌ అల్డర్‌సన్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యంగంగా చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. నమో యాప్‌ రహస్యంగా ఆడియోలు, వీడియోలు రికార్డు చేస్తోందని రాహుల్‌ ఆరోపిస్తూ.. నమో యాప్‌ను డిలీట్‌ చేయాలని పిలుపునిస్తూ డిలీట్‌ నమో యాప్‌ అని హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టారు. రాహుల్‌ ట్వీట్‌కు బీజేపీ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ యాప్‌ నుంచి వ్యక్తిగత సమాచారం సింగపూర్‌ కంపెనీలకు వెళ్తోందని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జ్‌ అమిత్‌ మాల్వియా ట్విట్టర్‌లో ఆరోపించారు. ఐఎన్‌సీ అధికార యాప్‌లోని భద్రతా లోపాలపై ఫ్రెంచ్‌ హ్యాకర్‌ ఎలియట్‌ అల్డర్‌సన్‌ ట్వీట్‌ చేసిన నేపథ్యంలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తన యాప్‌ను కాంగ్రెస్‌ తొలగించింది. దీనిపై బీజేపీ స్పందిస్తూ... నమో యాప్‌ను డిలీట్‌ చేయాలని డిమాండ్‌ చేసిన రాహుల్... చివరకు కాంగ్రెస్‌ యాప్‌నే తొలగించారంటూ ఎద్దేవా చేసింది. 

06:31 - March 27, 2018

సిద్దిపేట : జిల్లా చిన్న చంద్లాపూర్ వద్ద రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో అధికారులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు తొందరగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. 

 

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా ?...

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. బీజేపీ చర్చకు సిద్ధపడాల్సిన అనివార్యత ఏర్పడింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం క్లైమాక్స్‌కు చేరినట్లయింది. మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా ? లేక బీజేపీ మరో ఎత్తుగడ వేస్తుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హోదా కోసం జనసేన..వామపక్షాల పోరు ఉధృతం...

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జనసేన, వామపక్షాలు నిర్ణయించాయి. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద ప్రజాస్యామ్య పరిరక్షణ దినం పాటించాలని, హోదాపోరులో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు మార్చి 28న విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 4న విజయవాడలో జరిగే జనసేన, వామపక్షాల భేటీలో ప్రత్యేక హోదా ఉద్యమంపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. 

నేడు బహిష్కృత ఎమ్మెల్యేల కేసు విచారణ...

హైదరాబాద్ : మంగళవారం హైకోర్టులో బహిష్కృత ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. అసెంబ్లీ నుండి టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

నేడు పట్టాభిషేకం...

ఖమ్మం : సోమవారం సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భద్రగిరి శ్రీరామ స్మరణతో మార్మోగింది. రాములవారి కల్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో భద్రాద్రి ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. మంగళవారం రాములవారి పట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది.

హుజూర్ నగర్ కు చేరుకున్న సీపీఎం బస్సు యాత్ర...

నల్గొండ : ఏప్రిల్ 18 నుండి 22 వరకు జరిగే 22వ అఖిల భారత మహాసభల సందర్భంగా చేపట్టిన బస్సుయాత్ర సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి చేరింది. హైదరాబాద్‌లో జరిగే ఈ మహాసభలకు సుమారు వెయ్యి మంది మేధావులు పాల్గొంటారని సీపీఎం నేతలు తెలిపారు. ప్రజా సమస్యలపై ఈ మహాసభల్లో చర్చిస్తామన్నారు.

 

కాంగ్రెస్..బిజెపి మధ్య సోషల్ మీడియా వార్...

ఢిల్లీ : కాంగ్రెస్‌, బీజేపీ మధ్య సోషల్‌ మీడియాలో యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ యాప్‌ల నుంచి సింగూర్‌, అమెరికా కంపెనీలకు సమాచారం వెళ్తోందంటూ రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి కాంగ్రెస్‌ తన యాప్‌ను తొలగించింది. 

రష్యాలో అగ్ని ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య...

ఢిల్లీ : రష్యాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. కెమెరోవొలోని రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో.. అదివారం రాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో ఇప్పటి వరకూ 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతులో చాలా మంది చిన్నారులే ఉన్నారు.

రష్యాపై దౌత్య యుద్ధం...

ఢిల్లీ : ప్రపంచంలోని పలు దేశాలు రష్యాపై దౌత్య యుద్ధాన్ని ప్రకటించాయి. బ్రిటన్‌లోని శాలిస్‌బరీలో రష్యా మాజీ గూఢచారిపై ఆ దేశం విషప్రయోగం చేసిందన్న ఆరోపణలపై దౌత్యపరమైన ఆంక్షలు విధిస్తున్నాయి. తమ దేశంలో గూఢచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై 60 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. 

Don't Miss