Activities calendar

28 March 2018

22:17 - March 28, 2018

యూపీ : రిజర్వేషన్ల అంశంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే సొంత పార్టీపైనే తిరుగుబాటు చేశారు. రిజర్వేషన్లను మంగళం పాడేందుకు పార్టీలో కుట్ర జరుగుతున్నా...ప్రభుత్వం మౌన ప్రేక్షకుడి మాదిరిగా వ్యవహరిస్తోందని ఆమె దుయ్యబట్టారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పార్టీలోని సభ్యుల తీరుకు నిరసనగా ఏప్రిల్ 1న లక్నోలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు సావిత్రి చెప్పారు. రాజ్యాంగం, రిజర్వేషన్లను సమీక్షించాలంటూ బిజెపి చర్చిస్తూనే ఉందన్నారు. ఇదంతా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నమేనని ఆమె పేర్కొన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే ఎలాంటి శక్తులతోనైనా తాను పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు సావిత్రి స్పష్టం చేశారు. 

 

22:10 - March 28, 2018

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేయడానికే తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎస్వీకేలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ తీరును బీఎల్ఎఫ్ నేతలు ఖండించారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడానికే తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుకు ఆమోదం తెలిపిందన్నారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఆమోదించే బిల్లులను ప్రజా వ్యతిరేక బిల్లులుగా పరిగణించాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అగ్రకుల దురహంకారంతో వ్యవహరిస్తున్నారని నల్లా సూర్యప్రకాష్ ఆరోపించారు.

 

22:05 - March 28, 2018

హైదరాబాద్ : యూనివర్సిటీలను ప్రైవేట్‌ పరం చేసే యోచనను కేసీఆర్‌ విరమించుకోవాలని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ అన్నారు. గత నాలుగేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చని కేసీఆర్‌.. ఇప్పుడు యూనివర్సిటీలను ప్రైవేట్‌ పరం చేయాలనుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరుపై విద్యార్థులంతా ఐక్యం కావాలని.. పోరాటానికి  కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు.

22:02 - March 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చిన తర్వాత పంచాయతీలకు ప్రత్యక్షంగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఐదేళ్లకు ఒకసారి ఉన్న రిజర్వేషన్ల మార్పును పదేళ్లకు పెంచుతున్నారు. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌కు కలిపి జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు. గ్రామ పంచాయతీలకు ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులను నియమించే విధానం తీసుకొస్తున్నారు. కొన్ని అధికారాలను పంచాయతీలకు బదాయిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. 

 

21:59 - March 28, 2018

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు పారేసుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ముప్పేట దాడి మొదలుపెట్టింది. విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను చంద్రబాబు సహా మంత్రులు, పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.  విజయసాయిరెడ్డి సంస్కారంలేకుండా మాట్లాడారని చంద్రబాబు మండిపడ్డారు. ఆర్థిక నిందితుడి అనుచిత ప్రవర్తన బాధించిందన్నారు. విజయసాయిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉండటం దురదృష్టకరమని వర్ల రామయ్య అన్నారు. 

21:54 - March 28, 2018

ఢిల్లీ : రోజు మారింది.. కానీ ఆందోళనలు మాత్రం తగ్గలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో పార్లమెంట్‌ ఆవరణలో తెలుగు ఎంపీల నిరసనలు చేపట్టారు. పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదా పడుతుందేమోనని రాజీనామా లేఖలతో హాజరైన వైసీపీ ఎంపీలు... సభ సోమవారానికి పడడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఢిల్లీలో ఎంపీల ఆందోళనలు
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఢిల్లీలో ఎంపీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ... వైసీపీ, టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేపట్టి.. నినాదాలు చేశారు. 
ఇది తమ జీవిత సమస్య : వైసీపీ ఎంపీలు 
పార్లమెంట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడకపోవడం మంచి పరిణామమన్నారు వైసీపీ ఎంపీలు. పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడతాయోమోనని తాము రాజీనామాలతో సభకు హాజరయ్యామని.. కానీ సభ సోమవారానికి వాయిదా పడిందన్నారు. సోమవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందన్న విశ్వాసం తమకుందన్నారు. సభలో ఆందోళనలు చేస్తున్న అన్నాడీఎంకే ఎంపీలను తాము కలిశామని.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా సహకరించాలని కోరామన్నారు.. కానీ... ఇది తమ జీవిత సమస్య అని... తమ సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు విరమించేది లేదన్నారని వైసీపీ ఎంపీలు తెలిపారు. అయితే... గురువారం కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో... అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనలు విరమించవచ్చని తాము భావిస్తున్నామన్నారు. సోమవారం సభ సజావుగా జరుగుతుందని... అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందన్న ఆశాభావం ఉందన్నారు వైసీపీ ఎంపీలు. 
టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో ఆందోళనలు
ఇక టీడీపీ ఎంపీలు కూడా ప్లకార్డులతో ఆందోళనలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రోజుకో విధంగా వినూత్న వేషధారణతో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీ శివప్రసాదరావు... బుధవారం నారదుడి వేషధారణతో హాజరయ్యారు. మొత్తానికి పార్లమెంట్‌లో తెలుగు ఎంపీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే... పార్లమెంట్‌ సమావేశాలు సోమవారానికి వాయిదా పడడంతో ఏం చేయాలనే దానిపై ఎంపీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇదిలావుంటే.. సోమవారం నాడైనా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా ? లేదా ? అనే ఉత్కంఠ అందరినీ వెంటాడుతోంది. 


 

21:47 - March 28, 2018

గుంటూరు : అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చామని డిమాండ్‌ చేస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోదీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలను సభలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ప్రదర్శించారు. కేంద్రంపై పోరాటానికి అన్ని సంఘాలను కలుపుకుని ముందుకెళ్తామన్నారు. గతంలో అఖిల సంఘాల సమావేశానికి రాని పార్టీలకు మరోసారి ఆహ్వానం పంపిస్తామని... వచ్చే నెల ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తామన్నారు సీఎం. 
ఎదురుదాడి చేస్తున్నారన్న సీఎం చంద్రబాబు
విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని అడుగుతుంటే... తమపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు... ప్రధాని అభ్యర్థిగా రాష్ట్రానికి వచ్చినప్పుడు మోదీ ఇచ్చిన హామీలను సభలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శించారు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రాన్ని ఓ జాతీయపార్టీ రోడ్డున పడేస్తే... ఇప్పుడు మరో పార్టీ అన్యాయం చేసిందన్నారు చంద్రబాబు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అనేక హామీలిచ్చి విస్మరించారన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి హామీ ఇస్తే నెరవేరుస్తారని ఆశపడితే.. నిరాశే ఎదురయ్యిందన్నారు. తాము ధర్మపోరాటం చేస్తున్నామని... ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చాలని... కొత్త డిమాండ్లు కోరడం లేదన్నారు. ఇక ప్రత్యేక హోదా, విభజన హామీలపై కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రానికి సాయం చేయాల్సిందిపోయి... రాష్ట్రాన్ని కావాలనే ఇబ్బంది పెడుతుందన్నారు. తాము తప్పుడు యూసీలు ఇచ్చామంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేయడాన్ని ఏమనాలి ? చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పాలన్నారు. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య విషయమని, పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడొద్దన్నారు చంద్రబాబు.
అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం : సీఎం చంద్రబాబు 
బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే తమకు అదనంగా మరో 15 సీట్లు వచ్చేవన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. కేంద్రం తీరుపై భవిష్యత్‌ కార్యాచరణ కోసం అఖిల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అందరూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. పోరాటంలో భాగంగా నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరయ్యామన్నారు సీఎం. సమయాభావం వల్ల అఖిల సంఘాల భేటీకి అన్ని సంఘాలను పిలవలేకపోయామని... మరోసారి అన్ని పార్టీలను సమావేశాలకు పిలుస్తామన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీ వెళ్లి తమ పోరాటం చేస్తామన్నారు. 
అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ 
అంతకుముందు.. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. పలు పథకాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులపై పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆర్థికమంత్రి యనమల వివరణ ఇచ్చారు. ఇక చంద్రబాబు ప్రసంగం అనంతరం అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు. 

 

20:43 - March 28, 2018

15 వ ఆరిక్థసంఘం విధివిధానాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమా..? నిజంగా కొన్ని రాష్ట్రాలకకు నష్టమా..? మరి వెనుకబడిన రాష్ట్రాల సంగతేమిటి..? ఇదే అంశంపై ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లాంతో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు.  

20:37 - March 28, 2018

అసెంబ్లీల అవద్దం జెప్పిన సీఎం..మేనిఫెస్టో బుక్కుతోని బుక్కైండు, కూలిచ్చి తిట్టిచ్చుకున్న చంద్రాలు...చంద్రాలే అసలైన మోసగాడన్నరు, రైతు ఆత్మహత్యలు తక్వైనయన్న కేసీఆర్.. నిజాంబాదు జిల్లాల మరో రైతు ఆత్మహత్య, ఒకే దేశం ఒకే ఎన్నిక కాదు మోడీగారు...ఒకే దేశం ఒకే చదువు గావాలె అంటుర్రు, దోమల నివార కోసం కార్పొరేటర్ ధర్నా... ఈగెల మోత బరించలేక ఆడోళ్ల ఆందోళన, తెలంగాణల రోడ్డెక్కుతున్న బిందెలు...ఎండకాలం చర్యలు ఎన్నడు సుర్వు సార్లు?.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

మంత్రి కేటీఆర్ తరపున అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి తుమ్మల

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ తరపున అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ బిల్లును ప్రవేశపెట్టారు. 41 పట్టణ స్థానిక సంస్థల్లో కొత్తగా 71 పురపాలక సంస్థల ఏర్పాటు వీలుగా చట్ట సవరణను ప్రభుత్వం ప్రతిపాదించింది. 173 గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 

 

టీఎస్ అసెంబ్లీలో పురపాలక బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి తుమ్మల

హైదరాబాద్ : టీఎస్ అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ పురపాలక బిల్లును ప్రవేశపెట్టారు.  41 పట్టణ స్థానిక సంస్థల్లో 136 గ్రామాల విలీనాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్తగా 71 పురపాలక సంస్థల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం చట్ట సవరణ ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పాటు చేసే మున్సిపాలిటీల్లో 173 గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

సీఎం కేసీఆర్ ను కలిసిన హేమంత్ సోరెన్

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కలిశారు. జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ తదితర అంశాలపై చర్చించారు. 

రెండు పేపర్లకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని సీబీఎస్సీ నిర్ణయం

ఢిల్లీ : రెండు పేపర్లకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని సీబీఎస్సీ నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి ఎకానామిక్స్ పేపర్, టెన్త్ మ్యాథ్స్ పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. త్వరలో పరీక్షా తేదీలను సీబీఎస్సీ ప్రకటించనుంది. 

19:47 - March 28, 2018

ప్రైవేట్ యూనివర్సిటీలు అవసరం లేదని వక్తలు అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలతో ప్రమాదం పొంచివుందని..విద్యా వ్యాపారీకరణ అవుతుందని...పేదవారికి విద్య దూరమవుతుందని అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీఆర్ ఎస్ నేత చంద్రశేఖర్ పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని, వాటిని బలోపేతం చేయాలన్నారు. విద్యావ్యాపారీకరణ సరికాదన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల ప్రభుత్వానికి, పేద విద్యార్థులకు ఎలాంటి లాభం లేదని చెప్పారు. అసెంబ్లీలో ఏకపక్షంగా ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం తెలిపిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కొత్వాల్ గూడ ఓఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి : శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ ఓఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులు రవికాంత్, భ్రమరాంబ శంషాబాద్ వాసులు. 

19:32 - March 28, 2018

హైదరాబాద్ : కూకట్ పల్లి ప్రగతి నగర్‌లో పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఉచిత సేవా కార్యక్రమాలను నిర్వహించింది. నిరుపేద పిల్లలకు ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య, పీపుల్స్ ఆసుపత్రి పేరుతో ఉచిత వైద్యం అందించడం, వృద్ధశ్రమాలు నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. మానవ సంపద ద్వారానే యోగ్యత కలిగిన ఉపాధి దొరుకుతుందని చుక్క రామయ్య తెలిపారు.

 

19:29 - March 28, 2018

అనంతపురం : మద్యం దుకాణాల నిర్వహణలో తీవ్రంగా నష్టపోతున్నామని అనంతపురం జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్ యజమానులు వ్యాపారాలను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా 246 మద్యం దుకాణాలు, 40 బార్లు మూతపడ్డాయి. ఇవాళ్టి నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసి వేయడంతో... మద్యం అమ్మకాలు స్తంభించిపోయాయి. అనంతతో పాటు పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. మద్యం అమ్మకాలపై కేవలం 7శాతమే మార్జిన్ వస్తోందని.. దానిని 21శాతానికి పెంచాలంటున్న వ్యాపారులతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:26 - March 28, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని కాళ్లమండలం జువ్వలపాలెం చేపల చెరువుల తవ్వకాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. 4రోజుల నుండి గ్రామస్థులంతా అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఇవాళ పోలీసుల సాయంతో తవ్వకాలను ప్రారంభించారు. దీంతో గ్రామస్థులు మరోసారి అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. కొందరు మహిళలకు గాయాలయ్యాయి. గ్రామస్థులకు అండగా నిలిచిన సీపీఎం, ఐద్వా నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

19:21 - March 28, 2018

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్‌ కాలేజీల్లో వసూలు చేస్తున్న లక్షల ఫీజులపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇంటర్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రెండు వేల రూపాయలలోపే ఉంటే... కార్పొరేట్‌ కాలేజీలు మూడున్నర లక్షల రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని వివిధ పక్షాల సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. కార్పొరేట్‌ కాలేజీలు యథేచ్చలా దోపిడీ చేస్తున్నా.. ప్రభుత్వ నియంత్రణ కరువైందంటూ.. ప్రశ్నోత్తరాల సమయంలో ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్‌  బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై గురువారం చర్చ చేపడతారు.
కార్పొరేట్‌ కాలేజీల ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు : విపక్షాలు
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కార్పొరేట్‌ కాలేజీల ఫీజులపై వాడీవేడి చర్చ జరిగింది. అధికార టీఆర్‌ఎస్‌ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌ లేవనెత్తిన ఈ అంశంపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో కూడా రెగ్యులర్‌ క్లాసుల నిర్వహణ, అనుమతిలేకుండా హాస్టళ్ల ఏర్పాటు, సౌకర్యాలు కొరత, కోచింగ్‌ పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ వంటి అంశాలను సభ్యులు ప్రస్తావించారు. ర్యాంకుల కోసం విద్యార్థులతో బట్టీ పట్టిస్తూ, మానసికంగా కుంగిపోయే విధంగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ కాలేజీల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని వివిధ పక్షాల సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. 
వ్యాపార వస్తువుగా మారిపోయిన విద్య : ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌
కార్పొరేట్‌ కాలేజీలు వచ్చిన తర్వాత విద్యను వ్యాపార వస్తువుగా మారిపోయిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. ఈ విద్యా సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సభ దృష్టికి తెచ్చారు. 
ఇది ఆత్మహత్యలకు దారితీస్తోందన్న : ఆర్‌ కృష్ణయ్య 
పిల్లలను చదవిస్తే కార్పొరేట్‌ కాలేజీల్లోనే చదివించాలనే భ్రమల్లో ఉన్న తల్లిదండ్రులు... స్థోమతకు మించి అప్పులు చేస్తున్నారని, ఇది ఆత్మహత్యలకు కూడా దారితీస్తోందని టీడీపీ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 
చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడం లేదన్న ప్రభాకర్‌  
విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ కాలేజీలు.. సిబ్బందికి మాత్రం చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడం లేదని బీజేపీ సభ్యులు ప్రభాకర్‌ సభ దృష్టికి తెచ్చారు. 
కడియం శ్రీహరి సమాధానం
కార్పొరేట్‌ కాలేజీల్లో ఫీజులపై సభలో జరిగిన చర్చకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇచ్చారు. మొత్తం 194 కాలేజీల్లో తనిఖీలు చేస్తే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తెలిందన్న విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే నెల 2 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో జేఈఈ, నీట్‌ కోచింగ్‌ మినహా, రెగ్యులర్‌గా క్లాసులు నిర్వహించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంతి కడియం శ్రీహరి  హెచ్చరించారు. కాలేజీలకు అనుంబంధంగా ఏర్పాటుచేసే హాస్టళ్లకు అనుమతులు లేకపోయినా, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోయినా, సెలవుల్లో  కూడా విద్యార్ధులను హాస్టళ్లలో ఉంచే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని సభ దృష్టికి తెచ్చారు. ఫీజుల నియంత్రణపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. మరోవైపు మధ్యాహ్నం జరిగిన సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్‌ బిల్లును ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో ప్రవేశపెట్టారు. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ తరుపున రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..  మున్సిపల్‌ చట్టాల సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈరెండు బిల్లుపై గురువారం చర్చ ఉంటుందని స్పీకర్‌ మధుసూదనాచారి ప్రకటించి, సభను గురువారానికి వాయిదా వేశారు. 

 

19:09 - March 28, 2018

ఢిల్లీ : రాష్ట్రపతితో ప్రతిపక్ష పార్టీలు, ఎస్సీ-ఎస్టీ కమిషన్ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, డీఎంకే, బీఎస్పీ నేతలు హాజరయ్యారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో సుప్రీంతీర్పుపై... కేంద్రం రివ్యూ పిటిషన్ వేసేలా కేంద్రానికి సూచించాలని రాష్ట్రపతిని నేతలు కోరారు. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసుల నమోదు విషయంలో చట్టం నిర్వీర్యం అవుతోందని.. కేసుల విషయంలో దర్యాప్తు జరిపి.. అరెస్ట్ చేయాలని.. ఇందుకు ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చని.. గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల దళితులపై దాడులు పెరుగుతాయని దళిత సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. 

రాష్ట్రపతితో ప్రతిపక్ష పార్టీలు, ఎస్సీ-ఎస్టీ కమిషన్ సభ్యుల సమావేశం

ఢిల్లీ : రాష్ట్రపతితో ప్రతిపక్ష పార్టీలు, ఎస్సీ-ఎస్టీ కమిషన్ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, డీఎంకే, బీఎస్పీ నేతలు హాజరయ్యారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో సుప్రీంతీర్పుపై... కేంద్రం రివ్యూ పిటిషన్ వేసేలా కేంద్రానికి సూచించాలని రాష్ట్రపతిని నేతలు కోరారు. 

మేము అధికారంలోకి వస్తే బ్యాంకు రుణాలు మాఫీ : ఉత్తమ్

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు 3 వేల రూపాయల అలవెన్స్ ఇస్తామన్నారు. బస్సు యాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మీడియా మిత్రులను కోరారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడారు. 

18:53 - March 28, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు 3 వేల రూపాయల అలవెన్స్ ఇస్తామన్నారు. బస్సు యాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మీడియా మిత్రులను కోరారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:48 - March 28, 2018

హైదరాబాద్ : వేతన సవరణ కోసం ఎల్‌ఐసీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్‌ఐసీ హైదరాబాద్‌ డివిజన్‌ కార్యాలయంలో ఉద్యోగులు గంటపాటు పెన్‌డౌన్‌ చేసి, నిరసన తెలిపారు. ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ క్లాస్‌ వన్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌,  ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేన్‌  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేతనాలు సవరించి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరసనలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడంతోపాటు సత్వర పదోన్నతి విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. వారంలో ఐదు రోజుల పని  విధానం ప్రవేశపెట్టడంపై మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. క్లాన్‌ వన్‌ ఆఫీసర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భగంకలిగించే విధంగా ఉన్న 368 సర్క్యులర్‌ను ఉపసంహరించాలని కోరారు. తమ డిమాండ్లపై ఎల్‌ఐసీ యాజమాన్యం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. 

 

18:46 - March 28, 2018

ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఇచ్చిన బంగారు తెలంగాణ నినాదం పేదల బతుకుల్లో మార్పు తీసుకురాలేక పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వచ్చే నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే సీపీఎం జాతీయ మహాసభల ప్రచారం కోసం బస్సు యాత్రను తమ్మినేని ప్రారంభించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లు పథకాలను గాలికొదిలేశారని విమర్శించారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని తమ్మినేని వీరభద్రం చెప్పారు. 

 

18:42 - March 28, 2018

సంగారెడ్డి : హైదరాబాద్‌ శివారు రుద్రారంలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో విజేతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ-తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నూకల నరేందర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలకు ఎంపికైన ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు నియామకపత్రాలు అందచేశారు.  యూనివర్సిటీలో కోర్సులు పూర్తి చేసిన బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ విద్యార్థుల్లో 82 శాతం మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దాదాపు వంద దేశీయ, బహుళజాతి కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించాయి. పలు కంపెనీలు  11 లక్షల నుంచి ఆరున్న లక్షల రూపాయల వార్షిక వేతన ప్యాకేజీతో విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. గీతం యూనిర్సిటీ ప్రో చాన్సలర్‌ ఎన్‌.శివప్రసాద్‌, రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ సంజయ్‌.. .తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

18:37 - March 28, 2018

నెల్లూరు : త్వరలో 10 రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. రేపు శ్రీహరికోటలో జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా అతిపెద్ద ఎస్-బ్యాండ్‌తో కూడిన జీశాట్-6ఏ అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనున్నారు. మరో 15 రోజుల్లో పీఎస్ఎల్‌వీ-సీ 41రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 1-9 అనే ఉపగ్రహాన్ని పంపనున్నారు. రేపటి ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ నెల్లూరు జిల్లా శ్రీచెంగాళమ్మ ఆలయంలో శివన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

18:32 - March 28, 2018

కర్నూలు : ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్షల విలువైన ప్రింటింగ్ మెటీరియల్ కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రెస్ సిబ్బంది ప్రమాదానికి కారణాలు చెప్పడం లేదు. లక్షల్లో ఆస్తినష్టం జరిగితే.. వెస్ట్ పేపర్లు నిల్వ చేసిన చోట మాత్రమే ప్రమాదం జరిగిందని బుకాయించడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. 

 

కర్నూలు ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లో మంటలు

కర్నూలు : ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్షల విలువైన ప్రింటింగ్ మెటీరియల్ కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

18:26 - March 28, 2018

జగిత్యాల : జిల్లా మెట్‌పల్లి మండలం వెంకట్రావ్ పేట గ్రామస్తులు రోడ్డెక్కి నిరసనలకు దిగారు. డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, మెట్‌పల్లి మున్సిపాలిటీలో వెంకట్రావుపేటలను కలపొద్దంటూ.. 118 రోజులుగా వీరు ధర్నా చేస్తున్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు కావడం లేదంటూ గ్రామ మహిళలంతా రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. 'ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించేవరకు.. దీక్షలు కొనసాగిస్తామంటున్న బాధితులతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. 118రోజులుగా దీక్షలు చేస్తున్నా... ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. 2రోజుల క్రితం దీక్ష కోసం వేసిన టెంట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. సమస్యలు పరిష్కరించేవరకు దీక్ష కొనసాగిస్తాం. మమ్మల్ని కాల్చినా కూడా ఆందోళనలు విరమించేది' లేదు అని మహిళలు తేల్చి చెప్పారు.

 

18:18 - March 28, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో సోమవారం అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశముందని ఆశిస్తున్నామన్నారు వైసీపీ ఎంపీలు. పార్లమెంట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడకపోవడం మంచి పరిణామమన్నారు. అన్నాడీఎంకే సభ్యుల సమస్య అయిన కావేరీ అంశం.. గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో... సోమవారం సభ సజావుగా జరుగుతుందని తాము భావిస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా నిద్రపోయిన చంద్రబాబు ఇప్పుడు అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో డబ్బులు వెనకేసుకోవచ్చని భావించిన సీఎం... ఇప్పుడు మళ్లీ హోదా అంటూ యూటర్న్‌ తీసుకున్నారన్నారు.

 

18:11 - March 28, 2018

గుంటూరు : విజయసాయిరెడ్డిపై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. తనను, తన తల్లిదండ్రులను కించపరిచేవిధంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు. ఇది పద్ధతేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరినీ కించపర్చలేదని... ఎప్పుడూ హుందాగానే ప్రవర్తించానన్నారు. 

 

18:10 - March 28, 2018

చిత్తూరు : తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోటులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. 

18:08 - March 28, 2018

గుంటూరు : ప్రత్యేక హోదా హక్కుల గురించి అడిగితే మా పైనే దాడి చేస్తారా అని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో... హోదా కోసం తాము చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా.. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శించారు. నిన్న అఖిలపక్షాలు, సంఘాలతో జరిగిన భేటీ వివరాలను బాబు సభకు వివరించారు. బీజేపీ, వైసీపీ, జనసేన మినహా అన్ని పార్టీలు సమావేశానికి హాజరయ్యాయని తెలిపారు. మరోసారి జరిగే సమావేశానికి వారికి కూడా ఆహ్వానిస్తామన్నారు. అప్పుడు కూడా రాకపోతే.. వారు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పార్టీలకు ఏపీ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని చంద్రబాబు ఆరోపించారు. 
కావాలనే రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోన్న కేంద్రం 
కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని కావాలనే ఇబ్బంది పెడుతోందన్నారు. కేంద్రం అడిగిన విధంగా లెక్కలు చెప్పాలని అధికారులకు సూచించానన్నారు. అయితే... తప్పుడు యూసీలు ఇచ్చారంటున్న బీజేపీ నేతలను ఏమనాలి... అంటూ పేర్కొన్నారు. యూసీలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పాలన్నారు. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య విషయమని, పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడొద్దన్నారు.
పోలవరం, అమరావతిలను ఖచ్చితం పూర్తి చేస్తాం...
పోలవరం, అమరావతి నిర్మాణాలను ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నగరాలను పరిశీలించి అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని గతంలో.. ప్రధాని కూడా సూచించారన్నారు. కానీ, ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రెండు వేల 500 కోట్ల రూపాయలు సరిపోవా.. అని సూటిపోటి మాటలు మాట్లాడడం బాధాకరమన్నారు. తెలుగువారికి మంచి నగర అవసరమా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

 

17:51 - March 28, 2018

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖకాన్‌ అబ్బాసీకి అమెరికా ఎయిర్‌పోర్టులో అవమానకర పరిస్థితి ఎదురైంది. న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని అబ్బాసీని సామాన్య పౌరుడిలా దుస్తులు తీయించి సిబ్బంది తనిఖీలు చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పాకిస్తాన్‌లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎయిర్‌పోర్టులో అబ్బాసీ కోటు, బెల్టు తీయించి సిబ్బంది తనిఖీలు చేసిన వీడియో పాకిస్థాన్‌ టీవీ ఛానళ్లలో ప్రసారమైంది. అబ్బాసి వ్యక్తిగత పర్యటనకు అమెరికా వెళ్లారని...అక్కడ సామాన్య పౌరుడిలా స్వచ్ఛందంగా సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను పాటించారని జియో న్యూస్‌ పేర్కొంది. ప్రధాని అబ్బాసీ నిరాడంబరత్వానికి ఇది నిదర్శనమని ప్రశంసించింది.

 

17:49 - March 28, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్‌ కసరత్తు ప్రారంభించింది. ఈ అంశంపై స్పందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిరాకరించింది. చీఫ్‌ జస్టిస్‌పై అభిశంసన కోసం వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీల నుంచి కాంగ్రెస్‌ పార్టీ సంతకాలు సేకరిస్తోందని ఎన్సీపీ నేతలు పేర్కొన్నారు. సంతకాలు చేసిన వారిలో ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల ఎంపీలు ఉన్నారని, కొందరు కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా సంతకం చేశారని ఎన్సీపీ ఎంపీ డీపీ త్రిపాఠీ తెలిపారు. ఇప్పటికే 20 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్లు ఎన్సీపీకి చెందిన మరో నేత మజీద్ మెమన్ వెల్లడించారు.  సీజేఐకి వ్యతిరేకంగా పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే నోటీసుపై లోక్‌సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలు అవసరం. 

 

17:44 - March 28, 2018

ఢిల్లీ : కేంద్రం ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఈమేరకు మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉన్న నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలకు ఉన్న ఆయుధం అవిశ్వాసం... అయితే దీనిపై చర్చించేందుకు కేంద్రం వెనకడుగు వేస్తుందన్నారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని చర్చించకపోవడం దారుణమని చెప్పారు. ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తుందని పేర్కొన్నారు. కేంద్రం తీరును దేశ ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు. రోజురోజుకు బీజేపీ అపఖ్యాతి పాలవుతోందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ఏపీ సమస్యలపై చర్చిస్తామని చెప్పారు.

తిరుమల బూందీపోటులో భారీగా మంటలు

చిత్తూరు : తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోటులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. 

 

విజయసాయిరెడ్డిపై చంద్రబాబు ఫైర్‌

గుంటూరు : విజయసాయిరెడ్డిపై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. తనను, తన తల్లిదండ్రులను కించపరిచేవిధంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు. ఇది పద్ధతేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరినీ కించపర్చలేదని... ఎప్పుడూ హుందాగానే ప్రవర్తించానన్నారు.

తిరుమల బూందీపోటులో భారీగా మంటలు

చిత్తూరు : తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోటులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. 

రాష్ట్ర ప్రజల మనోభావాలతో అడుకుంటున్న కేంద్రం : సీఎం చంద్రబాబు

గుంటూరు : బీజేపీ తమతో డిఫర్ అయిన తర్వాత పట్టిసీమపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలతో అడుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తాత్కాలికంగా లాభం వస్తుందేమో కానీ. దేశానికి శాశ్వతంగా నష్టం జరుగుతుందన్నారు. 'మీకు నచ్చిన విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి' అని ప్రజలను కోరారు. పోలవరం తెలుగు వారి వరమని, జీవనాడని.. సాధించి తీరుతామని చెప్పారు.  

 

రాష్ట్రంలో అన్ని ఇళ్లకు గ్యాస్ ఇచ్చాం : సీఎం చంద్రబాబు

గుంటూరు : రాష్ట్రంలో అన్ని ఇళ్లకు గ్యాస్ ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. వందశాతం ఓడీఎఫ్ ఇవ్వడానికి ముందుకు పోయామన్నారు. 
వందశాతం ఓడీఎఫ్ సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. ఒక్కో టాయిలె ట్ కు 15 వేలు ఇచ్చామని తెలిపారు. కేంద్రం 8 వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 7 వేలు ఇచ్చి మొత్తం 15 వేలు చెల్లించామని తెలిపారు. నీటి ఎద్దడి లేకుండా చేశామన్నారు. నీటి భద్రత కల్పించామని చెప్పారు. 

ఏపీకి కేంద్రం మొండి చెయ్యి : సీఎం చంద్రబాబు

గుంటూరు : రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది ముష్టి కాదని...రాష్ట్ర హక్కు అని సీఎం చంద్రబాబు అన్నారు. అడ్డంకులు సృష్టించాలనకునుకుంటే అది వారికే నష్టం అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి జరుగకూడదని కేంద్రం ఉద్దేశంగా ఉందని ఆరోపించారు. ఏపీకి కేంద్రం మొండి చెయ్యి చూపించిందని విమర్శించారు.

 

మన హక్కుల గురించి అడిగితే దాడి చేస్తారా ? : సీఎం చంద్రబాబు

గుంటూరు : ప్రత్యేకహోదా ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని సీఎం చంద్రబాబు అన్నారు. 'మన హక్కుల గురించి అడిగితే దాడి చేస్తారా ? 
వారిచ్చిన హామీలు అమలు చేయమని కోరడం తప్పా... అని ప్రశ్నించారు. నమ్మిన వాళ్లే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలన్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. హోదా కోసం తాను చేపట్టిన చర్యలు చంద్రబాబు వివరించారు. 

16:29 - March 28, 2018

గుంటూరు : కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ఘాటుగా విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నిన్న అఖిలపక్షాలు, సంఘాలతో భేటీ అయ్యామని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల అందరూ చర్చించారని, కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలో సలహాలు తీసుకున్నామని... మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హోదాపై మోదీ ఇచ్చిన హామీల వీడియోను సభలో ప్రదర్శించారు.
ప్రత్యేకహోదా ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అన్నారు.
హక్కుల గురించి అడిగితే దాడి చేస్తారా ? 
'మన హక్కుల గురించి అడిగితే దాడి చేస్తారా ? వారిచ్చిన హామీలు అమలు చేయమని కోరడం తప్పా... అని ప్రశ్నించారు. నమ్మిన వాళ్లే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలన్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. హోదా కోసం తాను చేపట్టిన చర్యలు చంద్రబాబు వివరించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్వంత డబ్బులు ఇవ్వడం లేదని..ట్యాక్స్ లు ఇస్తున్నామని చెప్పారు. ఏ రాష్ట్ర ప్రజలను విస్మరించడం కేంద్రానికి తగదని చెప్పారు. రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఆగదన్నారు. దేశంలో సుపరిపాలనకు నాంది పలికింది తానేనని తేల్చి చెప్పారు. అనుభవం లేని వ్యక్తులు తన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై బురదజల్లే ప్రయత్నం చేయొద్దని హితవుపలికారు. 
ఏపీకి కేంద్రం మొండి చెయ్యి 
రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది ముష్టి కాదని...రాష్ట్ర హక్కు అన్నారు. అడ్డంకులు సృష్టించాలనకునుకుంటే అది వారికే నష్టం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరుగకూడదని కేంద్రం ఉద్దేశంగా ఉందన్నారు. ఏపీకి కేంద్రం మొండి చెయ్యి చూపించిందన్నారు. రాష్ట్రంలో అన్ని ఇళ్లకు గ్యాస్ ఇచ్చామని తెలిపారు. వందశాతం ఓడీఎఫ్ ఇవ్వడానికి ముందుకు పోయామన్నారు. వందశాతం ఓడీఎఫ్ సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. ఒక్కో టాయిలె ట్ కు 15 వేలు ఇచ్చామని తెలిపారు. కేంద్రం 8 వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 7 వేలు ఇచ్చి మొత్తం 15 వేలు చెల్లించామని తెలిపారు. నీటి ఎద్దడి లేకుండా చేశామన్నారు. నీటి భద్రత కల్పించామని చెప్పారు. బీజేపీ తమతో డిఫర్ అయిన తర్వాత పట్టిసీమపై ఆరోపణలు చేస్తున్నారు. పోలవరం తెలుగు వారి వరమని, జీవనాడని.. సాధించి తీరుతామని చెప్పారు. 
ప్రజల మనోభావాలతో అడుకుంటున్న కేంద్రం 
కేంద్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలతో అడుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తాత్కాలికంగా లాభం వస్తుందేమో కానీ. దేశానికి శాశ్వతంగా నష్టం జరుగుతుందన్నారు. మీకు నచ్చిన విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. 

 

సభలో హోదాపై మోదీ ఇచ్చిన హామీల వీడియో ప్రదర్శన

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నిన్న అఖిలపక్షాలు, సంఘాలతో భేటీ అయ్యామని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల అందరూ చర్చించారని, కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలో సలహాలు తీసుకున్నామని... మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హోదాపై మోదీ ఇచ్చిన హామీల వీడియోను సభలో ప్రదర్శించారు.

ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నిన్న అఖిలపక్షాలు, సంఘాలతో భేటీ అయ్యామని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల అందరూ చర్చించారని, కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలో సలహాలు తీసుకున్నామని... మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

 

15:34 - March 28, 2018

ఢిల్లీ : లోక్ సభలో సేమ్ సీన్ రిపీట్ అయింది. అన్నాడీఎంకే సభ్యులు తీరు మార్చుకోలేదు. స్పీకర్ వారించినా అన్నాడీఎంకే సభ్యులు పట్టించుకోలేదు. కావేరి జలాలపై సభలో పట్టు పట్టారు. స్పీకర్ సుమిత్రామహాజన్ అవిశ్వాస తీర్మానాలను చదివి వినిపించారు. సభ ఆర్డర్ లో లేదంటూ అవిశ్వాసంపై స్పీకర్ చర్చ చేపట్టారు. సోమవారానికి సభను వాయివా వేశారు. 

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఆగదు : సీఎం చంద్రబాబు

గుంటూరు : ఎట్టిపరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఆగదని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో సుపరిపాలనకు నాంది పలికింది తానేనని తేల్చి చెప్పారు. అనుభవం లేని వ్యక్తులు తన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై బురదజల్లే ప్రయత్నం చేయొద్దని హితవుపలికారు. 

కేంద్రం స్వంత డబ్బులు ఇవ్వడం లేదు : సీఎం చంద్రబాబు

గుంటూరు : రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్వంత డబ్బులు ఇవ్వడం లేదని..ట్యాక్స్ లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏ రాష్ట్ర ప్రజలను విస్మరించండం కేంద్రానికి తగదని చెప్పారు.

13:52 - March 28, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఏపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. టీడీపీ , వైసీపీ ఎంపీలు ఏపీకి జరిగిన అన్యాయంపై నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్రానికి తమ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ ఇవాళ కూడా వినూత్న రీతితో నిరసన చేపట్టారు. నారదుడి వేషధారణతో కేంద్రానికి నిరసన తెలియజేశారు.

13:49 - March 28, 2018

అమరావతి : చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆదినారాయణరెడ్డి విరుచుకుపడ్డారు. రాజ్యసభకు వెళ్లకుండా కోర్టుల చుట్టూ తిరిగే విజయసాయిరెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మోడీ కాళ్లు పట్టుకున్నా మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని అన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఉరి వేసుకుంటానంటున్న మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. మనిషై పుట్టిన వారెవరు విజయసాయి రెడ్డిలా మాట్లాడరని మండిపడ్డారు. 

13:45 - March 28, 2018

హైదరాబాద్‌: ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. బషీర్‌బాగ్ కూడలి నుంచి ర్యాలీగా వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐడీఎస్‌ఓ, టీవీవీ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. పోలీసులను కొద్దిసేపు పరుగు పెట్టించారు. చివరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ వద్ద ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తీసుకొస్తే పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ విద్యను బలపేతం చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

13:43 - March 28, 2018

కర్నూలు : శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామయ్య మలుపు దగ్గర బస్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

13:42 - March 28, 2018

పశ్చిమ గోదావరి : కాళ్ల మండలం జువ్వలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. చేపల చెరువుల తవ్వకాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. జువ్వలపాలెంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు బంధువు చెరువులు తవ్వుతున్నారు. గ్రామంలో చేపల చెరువుతో ఇబ్బందుల తలెత్తుతున్నాయంటూ గ్రామస్తులు నాలుగు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. అయినా పోలీసుల సాయంతో చెరువులు తవ్వేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళకు గాయాలయ్యాయి. గ్రామస్తుల ఆందోళనకు సీపీఎం, ఐద్వా నాయకులు మద్దుతు తెలిపారు. దీంతో నాయకులతోపాటు గ్రామస్తులను పోలీసులను అరెస్ట్‌ చేశారు. 

13:39 - March 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి, ఎన్‌ఆర్‌ఐలాంటి కార్పొరేట్‌ కాలేజీలపై వాడివేడీగా చర్చ సాగింది. విద్యార్థుల జీవితాలతో కార్పొరేట్‌ కాలేజీలు ఆటలాడుకుంటున్నాయని విపక్షాలు ధ్వజమెత్తాయి. విద్యార్థుల నూరేళ్ల జీవితాలను చిదిమేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 17 వందల నుంచి 19 వందలుగా ట్యూషన్‌ ఫీజు నిర్ణయిస్తే.... ఒక్కో విద్యార్థి నుంచి 40వేల నుంచి మూడున్నర లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు విద్యాపారాన్ని యధేచ్చగా చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం కార్పొరేట్‌ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ఓ చట్టం తీసుకురావాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. విచ్చలవిడిగా కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని.. ఒక్కో యాజమాన్యానికి ఒక్క కాలేజీ అనుమతి మాత్రమే ఇవ్వాలని కోరారు. 

12:56 - March 28, 2018

ఆనం సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..

ఢిల్లీ : ఎన్నో సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో నలుగుతున్న వీఆర్ విద్యాసంస్థల కమిటీపై ఏబీవీపీ పూర్వ విద్యార్థులు వేసిన కేసులో ఆనం సోదరులకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. విద్యాసంస్థల ఆస్తులు, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, విద్యా సంస్థల కమిటీల నియామకం సక్రమంగా లేదంటూ పూర్వ విద్యార్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు వారికి అనుకూలంగానే వచ్చింది. ఆపై జడ్జిమెంట్ ను సవాల్ చేస్తూ, ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అసెంబ్లీ ముట్టడికి విద్యార్ధి సంఘాల యత్నం..ఉద్రిక్తత..

హైదరాబాద్‌: ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. బషీర్‌బాగ్ కూడలి నుంచి ర్యాలీగా వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐడీఎస్‌ఓ, టీవీవీ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. పోలీసులను కొద్దిసేపు పరుగు పెట్టించారు. చివరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ వద్ద ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

12:25 - March 28, 2018
12:20 - March 28, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని మనసారా ఆస్వాదించానని సభ్యుల మద్దతును ఆస్వాదించానని పదవి నుండి రిటైర్ అవుతున్న సందర్భంగా డిప్యూటీ చైర్మన్ కురియన్ సంతోషాన్ని వ్యక్తంచేశారు. సభ నాయకుడి వద్ద నుండి పూర్తి మద్దతు లభించిందని తెలిపారు. ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడికి విశ్రాంతి అనేది వుండదనీ..రిటైర్ మెంట్ వుండదన్నారు. ప్రభుత్వం ప్రజలకు పూచీకత్తుగా, జవాబుదారిగా వుండాలని సూచించారు. రాజకీయనాయకుడి పాత్ర రిటైర్అయిన తరువాత మారుతుందన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ గా తనకు లభించిన ఈ అవకాశం పట్ల కురియన్ సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తంచేశారు. 

లోక్ సభలో వాయిదాల పర్వం..

ఢిల్లీ: లోక్‌సభలో ఈరోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ దశలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కలుగజేసుకుని సభ నిర్వహణకు సహకరించాలని కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభయిన సభలో ఆందోళనలు కొనసాగటంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. 

రిటైర్ ఎంపీలకు చైర్మన్ వెంకయ్య వీడ్కోలు..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాజ్యసభలో రిటైర్ అవుతున్న ఎంపీలను ఉద్ధేశించి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈరోజుతో 60మంది ఎంపీలు రిటైర్ కాబోతున్న సందర్భంగా వారు సభలో వ్యవహరించిన తీరుకు, వారు అందించిన సహకారం గురించి చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 

కురియన్ సేవలు ఎనలేనివి : ప్రధాని మోదీ

ఢిల్లీ : రాజ్యసభలో రిటైర్ అవుతున్న ఎంపీలను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. 17 రాష్ట్రాలకు చెందిన 60మందికి ఎంపీలు రిటైర్ అవుతున్నవారిలో రాజ్యసభ వైస్ చైర్మన్ గా వ్యవహరించిన కురియన్ కూడా వారిలోవున్నారు. వారిని ఉద్ధేశించి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతు..వైస్ చైర్మన్ గా కురియన్ సేవలు వెలకట్టలేనివని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన విశ్రాంత జీవితం సుఖ సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

11:59 - March 28, 2018

ల్లీ : రాజ్యసభలో రిటైర్ అవుతున్న ఎంపీలను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. 17 రాష్ట్రాలకు చెందిన 60మందికి ఎంపీలు రిటైర్ అవుతున్నవారిలో రాజ్యసభ వైస్ చైర్మన్ గా వ్యవహరించిన కురియన్ కూడా వారిలోవున్నారు. వారిని ఉద్ధేశించి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతు..వైస్ చైర్మన్ గా కురియన్ సేవలు వెలకట్టలేనివని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన విశ్రాంత జీవితం సుఖ సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందించిన సభ్యులకు మోదీ అభినందనలు తెలిపారు. రిటైర్ అయిన సభ్యులు సమాజంలో తమ పాత్రను మరింత పదిలంచేసుకుంటారనే నమ్మకం తనకుందన్నారు. కాగా 17 రాష్ట్రాలకు చెందిన 60మందికి ఈరోజుతో పదవీకాలం ముగిసిన నేపథ్యంలో వారి స్పందనలను పంచుకున్నారు. 

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ: లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ దశలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కలుగజేసుకుని సభ నిర్వహణకు సహకరించాలని కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

11:19 - March 28, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాజ్యసభలో రిటైర్ అవుతున్న ఎంపీలను ఉద్ధేశించి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈరోజుతో 60మంది ఎంపీలు రిటైర్ కాబోతున్న సందర్భంగా వారు సభలో వ్యవహరించిన తీరుకు, వారు అందించిన సహకారం గురించి చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. సభలో జరిగిన చర్చల్లో సభ్యుల భాగస్వామ్యం కీలకమనీ..సభ హుందాతనం,గౌరవం పెంచేందుకు సభ్యులు కృషి చేశారని రిటైర్ అవుతున్న సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు అభినందించారు. 17 రాష్ట్రాలకు చెందిన 60మందికి ఈరోజుతో పదవీకాలం ముగిసిన నేపథ్యంలో వారి స్పందనలను పంచుకున్నారు. 

11:09 - March 28, 2018

అమరావతి : ఏపీ భవన్ ను సమన్వయ వేదికగా వినియోగించుకోవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో దిశానిర్ధేశం చేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించనని హెచ్చరించారు. రహస్యంగా ఎవరితోను మంతనాలు సాగించవద్దనీ..తెలిసి చేసినా..తెలియక చేసినా తప్పు తప్పేనన్నారు. ఐదు కోట్ల ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమనీ..వారి మనోభావాలను దెబ్బదీసే విధంగా ఎంపీలు వ్యవహరించవద్దని సూచించారు.

తెలుగువారికి సహకరించకుంటే సహించను : చంద్రబాబు
అధికారంలో వుండి ఢిల్లీలో తెలుగువారికి సహకరించకుంటే సహించేదిలేదని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో హెచ్చరించారు. టీడీపీ ఎంపీలతో ఈరోజు కూడా సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటంలో వెనుకంజ వేసేది లేదన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో లోక్ సభ సభ్యులు, శాసనసభ వ్యూహరచన ప్రతినిథులు పాల్గొన్నారు. ఢిల్లీ వచ్చిన తెలుగువారిని ఎంపీలు పట్టించుకోవటం లేదని అఖిలపక్షానికి హాజరైన కొందరు ప్రస్తావించారనీ చంద్రబాబు ఎంపీలకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వచ్చిన తెలుగువారికి సహకరించటం ఎంపీల బాధ్యత ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఏప్రిల్ 6 తేదీ వరకూ అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలని సీఎం చంద్రబాబు టెలీకాన్ఫనెన్స్ లో సూచించారు.

చనిపోయినవారిని కూడా నిందిస్తారా అంటు విజయసాయిరెడ్డిపై బాబు మండిపాటు..
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. చనిపోయిన నా తల్లిదండ్రులను నిందించటం దారుణం అన్నారు. ఎవరికైనా తల్లిదండ్రులు దైవంతో సమానమనీ..దేవుళ్లతో సమానంగా చనిపోయినవారిని పూజిస్తాం..అటువంటివారిపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దార్మార్గానికి పరాకాష్టలా వున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగితే నాపై బురుద చల్లుతారా? అని ప్రశ్నించారు. కాగా నిన్న పార్లమెంట్ ఆవరణలో సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

11:02 - March 28, 2018

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. సభలో స్పీకర్ మధుసూధనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మానవ తప్పిదాల వల్లనే చెరువులు కలుషితం అవుతున్నయని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో పరిశ్రమలు వ్యర్ధాలను చెరువుల్లో వదులుతున్నారనీ దీని వల్ల హుస్సేన్ సాగర్ తీవ్రమైన కలుషితంగా తయారయిపోతోందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ మధ్య సమన్వయ లోపం వుందని అది మాపరిధికాదని ఇరువురు తప్పించుకోవటంపై లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. చెరువుల పరిరక్షణ, నాలాల శుద్ధి, కాలుష్య కారక పరిశ్రమల తరలింపు వంటి అంశాలపై సభ్యులడిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 3,132 చెరువులు ఉన్నట్లు తెలిపారు. మురుగు నీరు వల్ల చెరువులు కలుషితమయ్యాయన్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలోపల 40 చెరువులను శుద్ధి చేస్తున్నామన్నారు. నగరంలోని చెరువులు శిఖం పట్టాల్లో ఉన్నయని చెప్పారు. 1,234 కాలుష్య కారక పరిశ్రమలు ఉన్నయని.. కాలుష్య కారక పరిశ్రమలను నగరం అవతలికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మూడు నెలల్లో 100 కాలుష్య కారక పరిశ్రమలను తరిలిస్తమని వెల్లడించారు. ఫార్మా సిటీకి మరో 400 పరిశ్రమలను తరలిస్తామన్నాని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

10:47 - March 28, 2018

ఢిల్లీ : సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ అనైతికంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. దేశంలో అనేక సమస్యలున్నాయనీ..సమస్యలను చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. అవిశ్వాసంపై కేంద్రం చర్చించి తీరాలని ఈ విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోకపోతే..పార్లమెంటరీ వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందన్నారు. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత స్పీకర్ పై వుందన్నారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని సుజనాచౌదరి డిమాండ్ చేశారు. కాగా క్షమాపణలు చెప్పాలా లేదా అనేది ఆయన విజ్నతకే వదిలేస్తున్నామన్నారు. టాటాలు, బిర్లాలు అందరూ బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుంటుంటారనీ..కానీ ఆర్థిక నేరం వేరు, ఆర్థిక ఇబ్బంది వేరు అని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. దీన్ని తప్పు పట్టటం సరికాదన్నారు. 

10:39 - March 28, 2018

ఢిల్లీ : ప్రజలకు వుండే సమస్యలను రాజ్యాంగానికి అనుగుణం పరిష్కరించవలసిన దేశ అత్యున్న వ్యవస్థ పార్లమెంట్. కానీ నేడు పార్లమెంట్ ఉభయసభలు పొలిటికల్ 'రంగస్థలం'గా మారిపోయాయా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలోను తలెత్తుతున్న ప్రశ్న. గత వారం రోజుల నుండి పార్లమెంట్ ఉభయసభల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎంపీలు ప్రతీరోజు ఇస్తున్న అవిశ్వాస తీర్మానాలపై చర్చ వస్తే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలపై ఫలితాలపై ప్రభావం పడే అవకాశంతో సభను వాయిదాలతోనే ముగించాలనే యోచనలో ఎన్డీయే ప్రభుత్వం వున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 8 పార్టీలు 13 అవిశ్వాస తీర్మానాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

సీన్ రిపీట్ కొనసాగనుందా?
గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో కొనసాగుతున్న సీన్ రిపీట్ కానుందా? నేడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అకాశం వుందా అనే విషయంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎంపీలపైనే అందరి దృష్టి వుంది. కావేరీ బోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో గత వారం రోజుల నుండి సభను ఆర్డర్ లో లేకుండా చేస్తున్న అన్నాడీఎంకే ఎంపీల గందరగోళాన్ని సాకుగా చూపిస్తు స్పీకర్ సుమిత్రా మహాజన్ , ఇటు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు అదే తీరును అవలంభిస్తున్న తీరు సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వాయిదాలతోనే సభను ముగించేలా ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

స్పీకర్ తీరు అనైతికం : ఎంపీ సుజనా

ఢిల్లీ : సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ అనైతికంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. దేశంలో అనేక సమస్యలున్నాయనీ..సమస్యలను చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. అవిశ్వాసంపై కేంద్రం చర్చించి తీరాలని ఈ విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోకపోతే..పార్లమెంటరీ వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందన్నారు. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత స్పీకర్ పై వుందన్నారు. 

విజయసాయి వ్యాఖ్యలపై బాబు మండిపాటు..

అమరావతి : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. చనిపోయిన నా తల్లిదండ్రులను నిందించటం దారుణం అన్నారు. ఎవరికైనా తల్లిదండ్రులు దైవంతో సమానమనీ..దేవుళ్లతో సమానంగా చనిపోయినవారిని పూజిస్తాం..అటువంటివారిపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దార్మార్గానికి పరాకాష్టలా వున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగితే నాపై బురుద చల్లుతారా? అని ప్రశ్నించారు. కాగా నిన్న పార్లమెంట్ ఆవరణలో సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

ఏప్రిల్ 6 వరకూ నల్ల బ్యాడ్జీలు: చంద్రబాబు

అమరావతి : ఏప్రిల్ 6 తేదీ వరకూ అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలని ఎంపీలకకు సీఎం చంద్రబాబు టెలీకాన్ఫనెన్స్ లో సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటంలో వెనుకంజ వేసేది లేదన్నారు. 

సమన్వయ వేదికగా ఏపీభవన్ : చంద్రబాబు

అమరావతి : ఏపీ భవన్ ను సమన్వయ వేదికగా వినియోగించుకోవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో దిశానిర్ధేశం చేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించనని హెచ్చరించారు. రహస్యంగా ఎవరితోను మంతనాలు సాగించవద్దనీ..తెలిసి చేసినా..తెలియక చేసినా తప్పు తప్పేనన్నారు. ఐదు కోట్ల ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమనీ..వారి మనోభావాలను దెబ్బదీసే విధంగా ఎంపీలు వ్యవహరించవద్దని సూచించారు. 

తెలుగువారికి సహకరించకుండే ఊరుకోను : బాబు

అమరావతి : అధికారంలో వుండి ఢిల్లీలో తెలుగువారికి సహకరించకుంటే సహించేదిలేదని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో హెచ్చరించారు. టీడీపీ ఎంపీలతో ఈరోజు కూడా సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో లోక్ సభ సభ్యులు, శాసనసభ వ్యూహరచన ప్రతినిథులు పాల్గొన్నారు. ఢిల్లీ వచ్చిన తెలుగువారిని ఎంపీలు పట్టించుకోవటం లేదని అఖిలపక్షానికి హాజరైన కొందరు ప్రస్తావించారనీ చంద్రబాబు ఎంపీలకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వచ్చిన తెలుగువారికి సహకరించటం ఎంపీల బాధ్యత ఎంపీలకు చంద్రబాబు సూచించారు. 

ఇంటర్ విద్యా కమిషనరేట్ పై మంత్రి గంటా ఆగ్రహం..

అమరావతి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఇచ్చినా రాత్రికి రాత్రే పదోన్నతులు కల్పించటంపై ఇంటర్ విద్యా కమిషనరేట్ పై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు ఉత్తర్వులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని..ఇంటర్ విద్యా కమిషన్ కు మంత్రి ఆదేశాలు జారీచేశారు. మంత్రి జోక్యంతో ప్రిన్సిపల్ పోస్టుల ప్రమోషన్లు నిలిచిపోయాయి. 

09:43 - March 28, 2018

పశ్చిమ గోదావరి : పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్‌ ఆటోను ఢీ కొట్టడంతో ఆటో వెళ్లి పంటపొలాల్లో బోల్తా పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. గాయపడినవారిని వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.కాగా గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమిమంగా వున్నట్లు తెలుస్తోంది. 

09:37 - March 28, 2018

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న కళ్యాణమహోత్సవం... కన్నుల పండుగగా సాగింది. ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు చేతులమీదుగా ప్రారంభమైన కళ్యాణోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ.. అంగరంగ వైభవంగా ఉత్సవాలు సాగాయి. కల్యాణోత్సవానికి పెద్దెత్తున భక్తులు తరలి వచ్చారు. 

టిప్పర్ ను ఢీ కొన్న ఆటో,ఇద్దరు మృతి..

.గోదావరి : పోడూరు మండలం జగన్నాథపురం దగ్గర బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా వస్తున్న ఓ టిప్పర్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.

రైల్వేలో ఉద్యోగాలు..భారీగా దరఖాస్తులు..

ఢిల్లీ : రైల్వేల్లో గ్రూప్ సీ, డీ ఉద్యోగాలకు నిరుద్యోగులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. తాజాగా రైల్వే శాఖ 90,000 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా, దానికి వచ్చిన స్పందన చూసి రైల్వే అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో ఉద్యోగానికి 222 మంది చొప్పున రెండు కోట్లకు పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఇంకా చివరి తేదీకి గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఎన్డీయే సర్కార్ కు ముస్లిం మహిళలు షాక్..

ఢిల్లీ : ఎన్డీయే సర్కార్ కు ముస్లిం మహిళలు షాకిచ్చారు. ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు వ్యతిరేకంగా రాజస్థాన్‌లోని ఫతేపూర్‌లో వందలాదిమంది మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినదించారు. ముస్లిం చట్టాల్లో జోక్యం చేసుకోవడం మానాలని హితవు పలికారు. ఏ మతం వారు ఆ మతాన్ని ఆచరించుకోవచ్చని రాజ్యాంగం పేర్కొందని, ఇప్పుడు దానిని ప్రభుత్వం ఉల్లంఘించాలనుకోవడం తగదని మహిళలు పేర్కొన్నారు. తాము కనుక పురోగతి సాధించాలని ప్రభుత్వం కోరుకుంటే వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

09:20 - March 28, 2018

హైదారబాద్ : మరికొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవబోతున్నాయి.ఈ నేపథ్యంలో సభలో నేటి అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై బీజేపీ, నిరుద్యోగ సమస్యలపై టీడీపీ వాయిదా తీర్మానాలను ఇవ్వనున్నాయి. ప్రయివేటు యూనివర్శిటీలపై బీజేపీ వైఖరి ఏమిటో తెలిపే అవకాశముంది.

09:13 - March 28, 2018

ఢిల్లీ : గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో కొనసాగుతున్న సీన్ రిపీట్ కానుందా? నేడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అకాశం వుందా అనే విషయంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎంపీలపైనే అందరి దృష్టి వుంది. కావేరీ బోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో గత వారం రోజుల నుండి సభను ఆర్డర్ లో లేకుండా చేస్తున్న అన్నాడీఎంకే ఎంపీల గందరగోళాన్ని సాకుగా చూపిస్తు స్పీకర్ సుమిత్రా మహాజన్ , ఇటు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు అదే తీరును అవలంభిస్తున్న తీరు సంగతి తెలిసిందే.ఈ నేపత్యంలో వాయిదాలతోనే సభను ముగించేలా ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత వారంరోజులుగా ఇదే తీరు కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజుకూడా పలు పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు సిద్ధంగా వున్నాయి. ఒకపక్క అవిశ్వాస తీర్మానంపై చర్చకు మేము సిద్ధమే అంటు మరోపక్క సభలో ఆర్డర్ లేదనే సాకుతో తీర్మానాలపై నిర్లక్ష్యం వహిస్తున్న ఎన్డీయే ప్రభుత్వం తీరు ఈరోజుకూడా అదే కొనసాగే వాతావరణం కనిపిస్తోంది. కాగా మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాలలో ఏం జరుగనుందో వేచి చూడాలి.

08:59 - March 28, 2018

హైదరాబాద్‌ : మంగళవారం అర్ధరాత్రి... పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హకీమ్‌ పేట్‌ ప్రాంతంలో... 605 ఇళ్ళలో సోదాలు చేపట్టారు. 40 మంది పాతనేరస్తులతోపాటు..అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో... ముగ్గురు ఏసీపీలు, 12మంది సీఐలతోపాటు... 300 మంది సిబ్బంది పాల్గొన్నారు.  

08:55 - March 28, 2018

అమరావతి : నేడు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. స్వర్ణముఖి నది బ్యారేజీకి నీటి సరఫరాపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు చేపట్టనుంది. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై చర్చ, కోస్తా ప్రాంతంలో మడ అడవులు, వనం మనం కార్యక్రమం, చంద్రన్న ముందడుగు కార్యక్రమం అమలు, చిన్న దేవాలయాల నిర్వహణ, ఐటీడీఏల పట్టిష్టం,రాజమహేంద్రవరం, ధవళేశ్వరం పరిధిలో వ్యవసాయ భూములపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసు, ఉత్తర విశాఖ సెక్షన్ 22ఏ పరిధిలో భూముల తొలగింపు, క్రమబద్దీకరణపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసు వంటి పలు అంశాలపై ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను చేపట్టనుంది. అలాగే నేడు ద్రవ్యవినిమయ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలుపనుంది. ఈ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. 

08:52 - March 28, 2018

ఢిల్లీ : లోక్‌సభలో అవిశ్వాసం చర్చపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు 8 పార్టీలు..13 అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. సభలో గందరగోళం ఉన్నందున స్పీకర్‌ సభను వాయిదా వేస్తున్నారు. అయితే నేడు అవిశ్వాసం చర్చకు వస్తుందని అందరు భావిస్తున్నారు. మరో వైపు ఢిల్లీలో తెలుగు ఏంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. అవిశ్వాసపై చర్చ జరిగితే సహకరించాలని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. కానీ అన్నాడీఎంకే ఏంపీలు మాత్రం స్పీకర్‌ విజ్ఞప్తిని వ్యతిరేకిస్తున్నారు. కావేరి బోర్డును ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ప్రేమిస్తున్నానంటు బాలికపై లైంగికదాడి..

హైదరాబాద్ : ప్రేమ పేరుతో అమ్మాయిలను వంచన చేసే వారు రోజురోజుకు పెరిగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రేమిస్తున్నానంటూ ఓ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమావతిపేట్‌కు చెందిన సన్నిశ్యామ్ అనే 25 సంవత్సరాల యువకుడు ప్రేమిస్తున్నానంటు 17 ఏళ్ల బాలికపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్‌ ఠాణాలో సన్నిశ్యామ్‌పై ఫిర్యాదు చేశారు.

నేడు ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు..

అమరావతి : నేడు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. స్వర్ణముఖి నది బ్యారేజీకి నీటి సరఫరాపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు చేపట్టనుంది. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై చర్చ, కోస్తా ప్రాంతంలో మడ అడవులు, వనం మనం కార్యక్రమం, చంద్రన్న ముందడుగు కార్యక్రమం అమలు, చిన్న దేవాలయాల నిర్వహణ, ఐటీడీఏల పట్టిష్టం,రాజమహేంద్రవరం, ధవళేశ్వరం పరిధిలో వ్యవసాయ భూములపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసు, ఉత్తర విశాఖ సెక్షన్ 22ఏ పరిధిలో భూముల తొలగింపు, క్రమబద్దీకరణపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసు వంటి పలు అంశాలపై ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను చేపట్టనుంది. 

122వ రోజుకు చేరిన జగన్ యాత్ర..

గుంటూరు : వైసీపీ అధినేత చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 122వ రోజు చేరింది. నేడు సత్తెనపల్లి నుండి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. రామకృష్ణాపురం, నందిగామ్, గుడిపూడి వరకూ ఈ యాత్ర కొనసాగనుంది.  

జీఎస్ఎల్వీ ఎఫ్ 08 రాకెట్ కౌంట్ డౌన్..

నెల్లూరు : నేడు జీఎస్ఎల్వీ ఎఫ్ 08 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభకానుంది. మ.1.56 నిమిషాలకు రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ కౌంట్ డౌన్ 27 గంటలపాటు కొనసాగనుంది. 

భేటీ కానున్న టీ.కేబినెట్..

హైదరాబాద్ : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.సంచాయితీరాజ్, ప్రయివేట్ యూనివర్శిటీల ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం పలకనుంది. 

07:46 - March 28, 2018

సీఎం చంద్రబాబు అధ్యక్షత నిర్వహించిన అఖిల పార్టీల,సంఘాల సమావేశం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. నాలుగేళ్లుగా బీజేపీతో మిత్రత్వాన్ని పాటించి..అనంతరం ఎన్డీయే నుండి వైదొలగి..ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న ఎన్డీయే ప్రభుత్వానికి తలవంచి..ఇప్పుడు హోదా గురించి చంద్రబాబు మాట్లాడటం..దానిపై  రాష్ట్ర విభజన జరిగిన నాలుగేళ్ళకు అఖిలపక్ష సమావేశం నిర్వహించటాన్ని పలు పార్టీలు,నేతలు తప్పుపట్టారు. జరగాల్సిన నష్టం జరిపోయిన తరువాత ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయటాన్ని వామపక్షాలు సైతం తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో సమావేశానికి హాజరైన నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అందరం కలిసి ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తున్నామనడాన్ని తాము విశ్వసించడం లేదని వామపక్షాలు కుండబద్దలు కొట్టాయి. కాంగ్రెస్‌ కూడా ఇదే తరహా భావనను వ్యక్తం చేసింది. అయితే.. విపక్షాల అభ్యంతరాలకు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబు.. హోదా ఫైట్‌పై వచ్చే నెల మూడున, ఢిల్లీ వెళ్లి, జాతీయ పార్టీల నేతలకు వివరిస్తానని తెలిపారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తారా? లేదా రాజకీయ ఎత్తుగడతో ఇటువంటి విధానాన్ని అలవంభిస్తున్నారా? అని అంశాలపై న్యూస్ మార్నింగ్ లోచర్చను చేపట్టింది 10టీవీ. ఈచర్చలో ఏపీ వైసీపీ నేత రాజశేఖర్, ఏపీ బీజేపీ నేత అంబటి రామకృష్ణారెడ్డి, సీపీఎం పార్టీ సీనియర్ నేత రమాదేవి, టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ చర్చలో పాల్గొన్నారు. 

07:42 - March 28, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని... మున్సిపాలిటీలను కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. మరి వారికి ఎలాంటి హామీలను అమలు చేయాల్సి ఉంది, వారి ఆందోళనకు కారణం ఏమిటి..? అనే అంశం పై మనతో మాట్లాడేందుకు ఏపీ మున్సిపాల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎమ్‌ప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు ఉమామహేశ్వర రావు గారు పొల్గొన్నారు. 

07:38 - March 28, 2018

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగమవుతుందన్న పిటిషన్‌ నేపథ్యంలో .. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలని టీ-మాస్‌ చైర్మన్‌ కంచ అయిలయ్య డిమాండ్‌ చేశారు. "ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలు, సుప్రీంకోర్టు తీర్పుపై' సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీ-మాస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ నేతలు హాజరయ్యారు. దళితులంటే బీజేపీ వివక్ష ఎందుకో స్పష్టం చేయాలని కంచ ఐలయ్య డిమాండ్‌ చేశారు. రాజ్యాధికారమే లక్ష్యంగా టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు నల్లా సూర్యప్రకాశ్‌. 

07:36 - March 28, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ బంధువుల భూముల విలువ పెంచేందుకే మెట్రో రైలు పొడిగిస్తున్నారని ఆరోపించారు. 2003లో ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఎయిర్‌పోర్ట్‌కు రవాణా వ్యవస్థను జీఎమ్మార్ సంస్థనే ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ..ఎల్ అండ్ టీతో కేసీఆర్‌ బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. తన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోతే... కోర్టును ఆశ్రయిస్తామన్నారు రేవంత్‌రెడ్డి. 

07:34 - March 28, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ సభ్యత్వం రద్దు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరగా.. అంత సమయం ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆలస్యమైందని అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు... వచ్చే నెల 3 వ తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణకు స్వీకరించిన రోజే.. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో దృశ్యాలను సమర్పించాలని ఆదేశించింది. అయితే వీడియోలు లేవని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ చెప్పడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

07:32 - March 28, 2018

హైదరాబాద్ : భర్త నుంచి విడాకులు కావాలంటూ హైదరాబాద్‌ తార్నాకలో మహిళ హల్‌చల్‌ చేసింది. కొంతకాలంగా భర్తతో ఘర్షణ పడుతున్న మహిళ.. భర్తను తార్నాకుకు రావాల్సిందిగా ఫోన్‌చేసింది. భర్త అక్కడకు చేరుకోగానే డైవోర్స్‌ పేర్లపై సంతకం పెట్టాలంటూ పట్టుబట్టింది. సంతకం పెట్టకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించింది. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు కల్పించుకున్నారు. భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని ఓయూ పీఎస్‌కు తరలించారు. 

నగరంలో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని హకీంపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో  ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో  సరైన పత్రాలు లేని 60 బైక్లను, రెండు ఆటోలను పోలీసులు సీజ్ చేసి 40మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలలో దాదాపు 300ల మంది పోలీసులు పాల్గొన్నారు. 

ఫోన్ కోసం గొడవ..బాలుడు ఆత్మహత్య..

హైదరాబాద్ : సెల్‌ ఫోన్‌ కోసం అక్కతో గొడవపడిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడడం కుత్బుల్లాపూర్ లో విషాదం నింపింది. సెల్ ఫోన్ విషయంలో సోదరి మౌనికతో గొడవ పడిన శివరోహిత్‌ అనే బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. ఇద్దరి మధ్యవాగ్వాదం చోటుచేసుకోగా..ఫోన్ కిందపడి పగిలిపోయింది. దీంతో మౌనికను కొట్టిన శివరోహిత్, ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Don't Miss