Activities calendar

29 March 2018

22:20 - March 29, 2018

ఢిల్లీ : రెండో రోజు సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ నిర్మాణం, భవిష్యత్తు పోరాటాలు, కార్యాచరణ తదతర అంశాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పార్టీ నిర్మాణ నివేదికపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో చర్చించింది. ఈ నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం కేంద్రకమిటీ ఆమోదం తెలపనుంది. వచ్చే నెల హైదరాబాద్ లో జరిగే సీపీఎం 22వ అఖిల భారత మహాసభలలో ఈ నివేదికను ప్రవేశపట్టనున్నారు.

22:11 - March 29, 2018

తెలంగాణ ప్రభుత్వంపై కాగ్ మొట్టియాలు వేసింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, టీఆర్ స్ నేత మంద జగన్నాథం, కాంగ్రెస్ నేత కార్తీక రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

22:02 - March 29, 2018

సీసీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులుతో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. వ్యవసాయం..సంక్షోభం అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరైమన విషయాలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో వ్యవసాయ సంక్షోభానికి కీలకమైన, మూలమైన సమస్య పరపతి అని అన్నారు. రైతులకు కావాల్సిన పెట్టుబడులు ప్రభుత్వ వైపు నుంచి సక్రమంగానూ, సజావుగానూ, తగినంతగానూ ఈరోజు లేకపోవడం కీలకమైన అంశమన్నారు. బ్యాంకులు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పులు ఇస్తున్నాయి... రైతులకు మాత్రం మొండి చేయ్యి చూపిస్తున్నాయి. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. విధాన పరమైన దృక్పథంతో అన్యాయం జరుగుతుందన్నారు. 1991లో సరళీకరణ విధానాలు వచ్చాయని తెలిపారు. ప్రయారిటీ సెక్టార్ నిర్వచనమే మారిందన్నారు. ప్రయారిటీ సెక్టార్ పేరుతో తీసుకున్న రుణాలను ఎగ్గొడ్తున్నారు. బుక్ అడ్జెస్ట్ మెంట్ చూపిస్తున్నారని తెలిపారు. ఎఫ్ సీఐలను రద్దు చేశారని అన్నారు. ఎక్కడా పెట్టుబడిదారులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని..రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పది సంవత్సరాల కాలంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని..కానీ ధరలు పడిపోతున్నాయని తెలిపారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం దిగుమతులకు అనుమతిస్తుందన్నారు. ప్రభుత్వ ఎగుమతి, దిగుమతుల వల్ల కూడా వ్యవసాయం సంక్షోభం వస్తుందన్నారు. అండర్ ఎంప్లాయ్ మెంట్, అన్ ఎంప్లాయ్ మెంట్ తీవ్రస్థాయిలో ఉందన్నారు. బతకలేక గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు వలసలు వస్తున్నారని తెలిపారు. జాబ్ లెస్ ఎంప్లాయ్ మెంట్, జాబ్ లెస్ గ్రోత్ ఉందన్నారు. ఉపాధి కల్పించే పారీశ్రామికీకరణ జరగాలని చెప్పారు. వ్యవసాయంలో మౌళికసదుపాయాలు కల్పించాలన్నారు. పరపతి చట్టం తీసుకోవాలి... దున్నేవాడికి భూమి ఇవ్వాలన్నారు. కేరళ భౌతిక పరిస్థితులు వ్యవసాయానికి అంత అనుకూలంగా లేవు అయినా... వామపక్ష ప్రభుత్వ పరిపాలన వలన అభవృద్ధి సాధిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

21:46 - March 29, 2018

కేజీ టూ పీజీకి తలగోరి తయ్యార్...ప్రవేటు యూనివర్సిటీలకు పర్ద గుంజి, మీడియా మీద కోబ్రా పోస్టు స్టింగ్ ఆపరేషన్.. అడ్డంగ దొర్కిపోయిన టీవీలోళ్లు, పేపరోళ్లు, నేనే ఆదర్శమంటున్న ఎంపీ మల్లారెడ్డి...అవ్ పార్టీలు మారిన దాంట్లె నువ్వే మరి, మూడెకరాల భూమేది..? డబుల్ ఇండ్లేవి..వందరోజులు దాటిన మహిళల ధర్నా, ఎన్టీరామారావు మీద బాలయ్య సీన్మ సుర్వు.. వెన్నుపోట్లు సీన్లు వెట్టి తీశేవు బావ పర్వు, ఫోనుకోసం ఐదో తరగతి పోరని ఆత్మహత్య...ఇండ్లళ్ల సిచ్చువెడ్తున్న సెల్ ఫోన్లు...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:11 - March 29, 2018

సంగారెడ్డి : దేశ వ్యాప్తంగా పేద విద్యార్థుల కడుపు నింపుతున్న అక్షయ పాత్ర ఫౌండేషన్‌... తన సేవలను తెలంగాణలో  మరింత విస్తృతం చేయనుంది.ప్రభుత్వ పాఠశాలలతోపాటు.. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు భోజనం అందించేందుకు  హైటెక్‌ కిచెన్‌ను ప్రారంభిస్తోంది.. అత్యాధునిక హంగులతో.. రూపుదిద్దుకున్న అక్షయపాత్ర కిచెన్‌పై టెన్‌టెవీ ప్రత్యేక కథనం..
తెలంగాణలో హైటెక్‌ కిచెన్‌ నిర్మాణం
దేశవ్యాప్తంగా ముప్పైఎనిమిది వంటశాలలతో  పేదవిద్యార్థుల కడుపు నింపుతున్న అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ... తెలంగాణలో మరింత విస్తృతంగా  తన సేవలందించనుంది.. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని  కందిలో అత్యాధునిక కిచెన్‌ను నిర్మించింది.  ఇది  ఆ సంస్థ నిర్వహిస్తున్నముప్పై తొమ్మిదవ కిచెన్‌. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు  భోజనం లేకపోవడంతో చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో.. అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అరవై ఐదు వేల చదరపు గజాల్లో  నిర్మాణమై.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన హైటెక్‌ కిచెన్‌ ఇదే.. 
2గంటల్లో లక్షమందికి భోజనాల తయారీ
పూర్తి స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో... కేవలం రెండు గంటల్లోనే లక్షమందికి భోజనాలను తయారు చేయగల సామర్థ్యంతో ఈ కిచెన్‌ను నిర్మించారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో.. పన్నెండు వందలా ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో..  పదమూడు వందలా ఎనభై ఆరు అంగన్‌ వాడీ కేంద్రాల్లోని  పిల్లలకు రోజుకు లక్షా యాభై నాలుగు వేల ఆరువందల నలభై తొమ్మిది మందికి ఈ పౌండేషన్‌ ద్వారా భోజనం అందుతోంది. అక్షయపాత్ర ఫౌండేషన్‌ అధ్యక్షుడు సత్యగౌర దాస సేవలు ఈ కిచెన్‌ ద్వారా మరింత విస్తృతం కానున్నాయి. 
హైటెక్‌ కిచెన్‌కు చాలా ప్రత్యేకతలు
సంగారెడ్డి జిల్లా కందిలో బెంగుళూరు బైపాస్‌ పక్కన నిర్మించిన హైటెక్‌ కిచెన్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. దీని ద్వారా నాలుగు వందల మందికి ఉపాధి లభించనుంది. కిచెన్‌ ప్రాంగణంలో ఇజ్రాయిల్‌ టెక్నాలజీతో రోజుకు మూడు వందల కేజీల కూరగాయల దిగుబడి వచ్చేలా తోటను పెంచుతున్నారు. ఇక్కడ వంటలు చేయడంతో వచ్చే లక్ష లీటర్ల  వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి  అందించిన పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ కిచెన్‌ నిర్మాణం చేపట్టారు. అలాగే రాష్ర్ట ప్రభుత్వం కూడా తగినంత సహకారం అందించిందిని తెలిపారు నిర్వహకులు విఘ్నేశ్వర్‌ దాస. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీష్‌రావు, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి చేతుల మీదుగా ఈనెల 30న ప్రారంభం కానుంది.

 

20:07 - March 29, 2018

జగిత్యాల : జిల్లాలోని మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మినుముల కొనుగోలు కేంద్రంలో దళారులు అమ్మకానికి తేవడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామం నుంచి ఓవ్యక్తి 100 సంచుల వరకు మినుములను అమ్మకానికి తెచ్చి యార్డులో ఉంచారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేస్తూ మినుముల రైతులు మార్కెట్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. స్పందించిన మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ నల్లతిరుపతిరెడ్డి సంబంధిత అధికారులకు సమాచారం అందించి... ఆ మినుముల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

 

19:35 - March 29, 2018

గుంటూరు : కోర్టుధిక్కారణ కింద ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్యకు 2నెలల జైలు శిక్షతో పాటు 50వేల రూపాయల జరిమానా విధించింది. నరసరావుపేటలో నల్లపాటి లక్ష్మీనారాయణ బిల్డింగ్‌ను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడంతో.. బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం... ఇద్దరు అధికారులను దోషులుగా తేల్చింది. ప్రభుత్వ ఉద్యోగులు పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. 

19:25 - March 29, 2018

హైదరాబాద్ : 13 రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తంగా 61 గంటలపాటు చర్చ జరిగినట్లు సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. అన్ని పద్దులపై సంపూర్ణ చర్చ జరిగిందని అన్నారు. మొత్తంగా 11 బిల్స్‌ను పాస్‌ చేసుకున్నట్లు వివరించారు. ఇందులో అసైన్డ్‌ ల్యాండ్‌ బిల్‌, పంచాయతీరాజ్‌ బిల్‌తో పాటు పలు ముఖ్యమైన బిల్స్‌ ఉన్నాయన్నారు.

 

19:19 - March 29, 2018

హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీరాజ్‌ బిల్లుతో పాటు మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపై రాష్ట్రంలో నగర పంచాయతీలు ఉండవు. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు మాత్రమే ఉండే విధంగా బిల్లుల్లో ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక అధికారాలు బదలాయిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీకి కనిష్టంగా 3 లక్షల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఏర్పాటు చేశారు. ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 
పంచాయతీ రాజ్‌ బిల్లుపై సభలో చర్చ  
తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం తీసుకొచ్చింది. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పంచాయతీ రాజ్‌ బిల్లుపై సభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 12,751 పంచాయతీలు ఉంటాయి. వీటిలో 2,637 పంచాయతీలు గిరిజన ప్రాంతాలో ఉన్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు జనాభాను బట్టి నిధుల ఇచ్చే ఏర్పాటు చేశారు. కనిష్టంగా 3 లక్షల రూపాయలు అందుతాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల  ప్రకారం ఇచ్చే నిధులకు ఇవి అదనం. ఇందుకు కోసం బడ్జెట్‌లో 1500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ దృష్టికి తెచ్చారు. 
సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌.. నిధుల దుర్వినియోగం : ఆర్.కృష్ణయ్య
పంచాయతీ కార్యదర్శి నుంచి చెక్‌ పవర్‌ తొలగించి.. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇస్తే నిధుల దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని టీడీపీ సభ్యుడు కృష్ణయ్య వ్యక్తం చేయగా, అలాంటి అనుమానం అవసరంలేదని ముఖ్యమంత్రి  వివరణ ఇచ్చారు. 
బీసీ రిజర్వేషన్ల భద్రతపై కిషన్‌రెడ్డి ఆందోళన
బీసీ రిజర్వేషన్ల భద్రతపై బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేయకగా, అలాంటి భయం అవసరంలేదని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. 
కార్మికలకు వేతనాలు పెంచాలి : రాజయ్య 
పంచాయతీలు, మున్సిపాటిలీల్లో పనిచేస్తున్న కార్మికలకు వేతనాలు పెంచాలని సీపీఎం సభ్యుడు రాజయ్య సూచించారు. గ్రామ పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టమైనతే కార్మికులు జీతాలు పెంచుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు. 
మొత్తం 13 రోజుల పాటు సమావేశాలు 
పంచాయతీ రాజ్‌ బిల్లు, మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈనెల 12న ఉభయ సభల సంయుక్త భేటీలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మార్చి 15న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ 2018-19 బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తం 13 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. 60 గంటల 58 నిమిషాలు చర్చ జరిగింది. 11 బిల్లులకు ఆమోదం తెలిపింది. 
బడ్జెట్‌ సమావేశాలు తీరుపై ప్రతిపక్షాలు పెదవి విరుపు 
మరోవైపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరుపై ప్రతిపక్షాలు పెదవి విరిశాయి. అధికారపక్షం సమావేశాలను హైజాక్‌ చేసిందని విమర్శించాయి. విపక్షాల విమర్శలను టీఆర్‌ఎస్‌ తోసిపుచింది. అన్ని విషయాలపై సభలో అర్థవంతమైన చర్చ జరిగిందని సమర్ధించుకుంది. 
 

18:55 - March 29, 2018

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్..8 ప్రయోజగం విజయవంతమైంది. ఈ రాకెట్‌ ద్వారా జీశాట్‌ 6-ఏ ఉప్రగహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. 35,900 కి.మీ. దూరంలోని స్థిర కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించడంతో శాస్త్రవేత్తలు పరస్పరం అభినందించుకున్నారు. జీశాట్‌ 6 ఏ ఉపగ్రహం బరువు 2,140 కిలోలు. మన సైనిక సమాచార వ్యవస్థ విస్తృతికి ఈ ఉపగ్రహం దోహదం చేస్తుంది.  జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 8 విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం చేపట్టే చంద్రయాన్‌-2 కు ముందుకుసాగుతామని ఇస్రో చైర్మన్‌ శివన్‌, షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌ చెప్పారు.
 

 

18:43 - March 29, 2018

ఢిల్లీ : సిబిఎస్ టెన్త్ మాథ్స్, 12వ ఎకనామిక్స్ ప్రశ్నపత్రాల లీకేజీపై జాయింట్ కమిషనర్ నేతృత్వంలోని సిట్  విచారణ జరపనుంది. ఢిల్లీలో క్రైం బ్రాంచ్ పోలీసులు 8 చోట్ల దాడులు నిర్వహించారు. ప్రధాన సూత్రధారి కోచింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని విక్కీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిబిఎస్ టెన్త్ మాథ్స్, 12వ ఎకనామిక్స్ పేపర్ లీక్ పై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

18:32 - March 29, 2018

మహారాష్ట్ర : ముంబైలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైప్ లైన్ పేలడంతో బొలెరో వాహనం గాల్లోకి లేచి కిందపడింది. బొరివాలిలో ఘటన చోటుచేసుకుంది. పైప్ లైన్ పేలడంతో విధుల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. 

18:24 - March 29, 2018

మేడ్చల్ : కేజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పేద పిల్లలకు వైద్యం అందించడం కోసమే క్యాంప్ ఏర్పాటు చేశామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 

18:14 - March 29, 2018

కాప్ పంచాయతీలకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని సంచలనాత్మక తీర్పులను ఇచ్చింది. కాప్ పంచాయతీలు అనే అంశంపై మానవి నిర్వహించిన మైరైట్ కార్యక్రమంలో అడ్వకేట్ పార్వతి పాల్గొని, మాట్లాడారు.
ఆ వివరాలను ఆమె మాటల్లోనే..
కొన్ని కులాలకు సంబంధించిన సంస్థ కాన్వివండి, కొన్ని మతాలకు సంబంధించిన సంస్థ కానివ్వండి, ఒక సమూహాన్ని కాప్ పంచాయతీగా చెప్పబడింది. వీళ్లందరు ఒక పంచాయతీగా ఏర్పడి ఆ గ్రామాల్లో వాళ్లే న్యాయనిర్ణాయక వ్యవస్థగా వ్యవహరిస్తూ గ్రామంలో గ్రామస్తులపైన, గ్రామంలో జరిగే అనేక సంఘటనలపైన వీళ్లే తలదూర్చి, తీర్పులిచ్చి, ఓన్ గా డిక్లరేషన్ పెట్టి, ఓన్ గా శిక్షించేటట్టు పెట్టి రకరకాల పెత్తనాలు చేస్తున్నారు. కాబట్టి కాప్ పంచాయతీ అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అధికంగా కాప్ పంచాయతీ జరుగుతూ ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

నెల్లూరు : జీఎస్ ఎల్ వీ..ఎఫ్ 08 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. జీశాట్ 6 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 

17:40 - March 29, 2018

నెల్లూరు : జీఎస్ ఎల్ వీ..ఎఫ్ 08 రాకెట్ ప్రయోగం సఫలం అయింది. జీశాట్ 6 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 

17:34 - March 29, 2018

కరీంనగర్ : కలసి రాని కాలం.... అడుగంటుతున్న భూ గర్బ జలాలు రైతన్నలకు భారీగా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. రబీలో కాలువల ద్వారా పంటలకు పూర్తి స్థాయిలో నీరందిస్తామని ప్రభుత్వం  భరోసా ఇవ్వడంతో వేలాది ఎకరాల్లో వరిని సాగు చేశారు రైతులు. పంట కోతకు వచ్చే సమయానికి నీరందక పోవడంతో ఎండుతున్న పంటలకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ పంటలను రక్షించుకుంటున్నారు.  ఎండుతున్న పంటలను చూసి గుండె బరువెక్కుతుందంటూ  ఆవేదన వ్యక్తం చేస్తున్న కరీంనగర్‌ జిల్లాలోని రామడుగు మండలం వెలిచాలకు చెందిన రైతులతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌
నిర్వహించింది. వారు తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం... 

17:31 - March 29, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని నారాయణ గూడ చౌరస్తా వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు విద్యార్థి సంఘం నాయకులు. దీంతో విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం... 

 

17:28 - March 29, 2018

ఆదిలాబాద్ : సీపీఎం అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ... ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించిన సీపీఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడంపై సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

జీఎస్ ఎల్ వీ..ఎఫ్ 08 రాకెట్ ప్రయోగం విజయవంతం

నెల్లూరు : జీఎస్ ఎల్ వీ..ఎఫ్ 08 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. జీశాట్ 6 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. 

17:14 - March 29, 2018

భద్రాద్రి కొత్తగూడెం : వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీచేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు సీపీఎం జాతీయ మహాసభలను పురస్కరించుకొని చేపట్టిన బస్సుయాత్ర భద్రాద్రి కొత్తగూడెంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలమయ్యారని తమ్మినేని ఆరోపించారు. 

 

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎస్‌ 08 రాకెట్‌

నెల్లూరు : జీఎస్ఎల్వీ ఎస్‌ 08 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ ఎస్‌ 08 రాకెట్‌ జీశాట్ 6 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్తోంది. సాయంత్రం ఐదు గంటలకు జీఎస్ఎల్వీ ఎస్‌ 08 రాకెట్‌  ప్రయోగం ద్వారా.. కమ్యునికేషన్ వ్యవస్థకు ఉపకరించే జీశాట్ 6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చారు.

 

17:02 - March 29, 2018

హైదరాబాద్ : తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా ఇనుమడింప చేసిన మహానుభావుడు.. అభిమానుల పాలిట వెండితెర వేలుపు..  యుగపురుషుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా.. సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ పేరుతోనే రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో.. టైటిల్‌ రోల్‌.. ఎన్టీఆర్‌ నటవారసుడు బాలకృష్ణ పోషిస్తున్నారు. తేజ దర్శకత్వంలో వస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా.. రామకృష్ణా కల్చరల్‌ సినీ స్టుడియోలో ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. 
సెట్స్‌పైకి ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీ  
ఎన్టీఆర్‌ అభిమానుల నిరీక్షణకు నిర్దిష్ట రూపం.. అన్నగారి బయోపిక్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం.. నందమూరి అభిమానుల్లో అంతులేని ఆనందం.. అవును.. నందమూరి అభిమానులను ఆనంద డోలికల్లో ఓలలాడించే.. స్వర్గీయ నందమూరి తారకరాముడి బయోపిక్‌ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. అన్నగారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ, టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న ఈ సినిమా.. తేజ దర్శకత్వంలో రూపొందుతోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ టైటిల్‌తో వస్తోన్న సినిమా షూటింగ్‌.. గురువారం ఉదయం.. సరిగ్గా ఉదయం 9 గంటల 45 నిమిషాలకు.. అతిరథ మహారథుల సాక్షిగా.. రామకృష్ణా సినీ స్టుడియోస్‌లో ప్రారంభమైంది. 
ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు
ఎన్టీఆర్ బయోపిక్‌ ప్రారంభ వేడుకల్లో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని, ముహూర్తం షాట్‌కు క్లాప్‌ కొట్టారు. తెలుగువారి గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయిన నందమూరి తారకరామారావుతో.. తన అనుబంధాన్ని స్మరించుకున్న వెంకయ్య, ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా.. ఎన్టీఆర్‌ మాదిరిగానే, చరిత్ర సృష్టించి, ఓ చరిత్రగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో  మైలురాయిగా నిలిచిపోయిన లవకుశ, పాతాళభైరవి, దేశోద్ధారకుడు చిత్రాలు మార్చి 29నే రిలీజ్ అయ్యాయని ఈసందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు 
దుర్యోధనుడి పాత్రపై ముహూర్తం షాట్‌ చిత్రీకరణ
ఎన్టీఆర్‌కు చెరగని యశస్సును అందించిన దాన వీర శూర కర్ణ చిత్రంలోని దుర్యోధనుడి పాత్రపై ముహూర్తం షాట్‌ను చిత్రీకరించారు. కురుసభలో.. నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో ఎన్టీఆర్‌ పలికిన డైలాగ్‌ వెర్షన్‌తో.. బాలయ్య చేసిన అభినయాన్ని ఆహూతులు అభినందించారు. దుర్యోధనుడి పాత్రను ధరించిన బాలయ్యలో.. ఎన్టీఆర్‌ను చూసుకుని అభిమాన గణం మురిసిపోయింది.
సినిమా, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర : బాలకృష్ణ 
చలన చిత్ర రంగంలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్‌... యావద్భారతావని గుర్తుంచుకునే యశస్సును సముపార్జించుకున్నారని హీరో బాలకృష్ణ అభివర్ణించారు. ఎలాంటి వ్యతిరేక పరిస్థితుల్లోనూ.. మడమ తిప్పని ధీరత్వం ఎన్టీఆర్‌దని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి పాత్రను తానే పోషించడం పూర్వజన్మ సుకృతం అని అభివర్ణించుకున్నారు బాలయ్య. 
డైరెక్టర్‌ తేజ...
ఎన్టీఆర్‌ బయోపిక్‌ను, ఎన్.బి.కె ఫిల్మ్స్, వారాహి చలనచిత్రం, విబ్రీ  మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ సినీ జీవితం నుంచి రాజకీయ  రంగప్రవేశం దాకా అనేక కీలక ఘట్టాలను ఈ చిత్రంలో చూపించేందుకు దర్శకుడు తేజ సిద్ధంగా ఉన్నాడు. ఎంతో అదృష్టం చేసుకుంటేగాని ఎన్టీఆర్‌ సినిమాకు దర్శకత్వం వహించే అదృష్టం రాదన్నారు డైరెక్టర్‌ తేజ. 
సినిమా ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్‌..
సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌.. తాము మదరాసీలు కాదని, తెలుగు వారమని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనఖ్యాతి ఒక్క ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇటువంటి చరిత్ర సృష్టించిన మహనీయుడి జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావడం పెద్ద సాహసమని, ఇలాంటి యుగపురుషుడి  చరిత్రతో రూపొందే సినిమాలో నటించడానికి బాలకృష్ణ మాత్రమే అర్హుడని, దమ్మున్న వ్యక్తి అని అన్నారు. 
సంగీత దర్శకుడిగా కీరవాణి 
ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణిని ఎంపిక చేశారు. ఈ భారీ సినిమాలో.. ఎన్టీఆర్‌ పోషించిన రకరకాల పాత్రలను కూడా చూపనున్నారు. ఆయా పాత్రలకు సపోర్టింగ్‌గా నటించిన హీరోయిన్ల పాత్రలకు.. వర్తమాన నటీమణులను ఎంపిక చేయనున్నారు. హిందీ సహా పలు దక్షిణాది నటీనటులు ఈ సినిమాలో పాత్రధారులు కానున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఎన్టీఆర్‌ సినిమాను దసరాకి విడుదల కానుంది. 

 

16:45 - March 29, 2018

నెల్లూరు : జీఎస్ఎల్వీ ఎస్‌ 08 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతుంది. మరికాసేపట్లో జీఎస్‌ఎల్వీ ప్రయోగం ప్రారంభం కానుంది. 4.56 గంటలకు ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. జీఎస్‌ఎల్వీ ఎఫ్‌08 వాహకనౌక ద్వారా జీశాట్‌ 6ఏ ఉపగ్రహ ప్రయోగం చేయనున్నారు. జీశాట్‌ 6ఏ పదేళ్ల పాటు సేవలందించనుంది. జీశాట్‌ 6ఏ బరువు 2,140 కేజీలు. జీశాట్‌ 6ఏలో తొలిసారి 6 మీటర్ల వ్యాసార్థమున్న యాంటెన్నా వినియోగించనున్నారు.

 

మరికాసేపట్లో జీఎస్ఎల్వీ ఎస్‌ 08 రాకెట్‌ ప్రయోగం

నెల్లూరు : మరికాసేపట్లో జీఎస్ఎల్వీ ఎస్‌ 08 రాకెట్‌ను నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రయోగించే రాకెట్‌ ద్వారా.. కమ్యునికేషన్ వ్యవస్థకు ఉపకరించే జీశాట్ 6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనున్నారు.

16:11 - March 29, 2018

హైదరాబాద్ : సర్పంచ్, ఉప సర్పంచ్ కి ఉమ్మడిగా చెక్ పవర్ ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. టీఅసెంబ్లీలో సీఎం మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి చెక్ పవర్ ను తొలగించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టిన బిల్లుపై సభలో చర్చ జరిగింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్ ను సభ తిరస్కరించింది. విపక్షాల ప్రతిపాదించిన సవరణలను అసెంబ్లీ తిరస్కరించింది. 

 

15:58 - March 29, 2018

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం చేపట్టిన పాదయాత్ర ఇవాళ ముగిసింది. సీపీఎం విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగింది. నగర పరిధిలోని 72 వార్డులలో 200 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర నిర్వహించారు. సీపీఎం పాదయాత్రపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

15:55 - March 29, 2018

విశాఖ : జిల్లాలోని చీడికాడ మండలం కోణం వారాంతపు సంతలో దొంగ నోట్లను మారుస్తున్న మహిళను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహిళ వద్ద రూ. 3 లక్షల రెండు వేల నగదు రూ. 500 జిరాక్స్‌ నోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

15:53 - March 29, 2018

విశాఖ : ప్రజల ఆదాయం పెరగాలంటే ఐటీ వల్లే సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. మధువాడ ఐటీ పరిశ్రమలవాడ 2లో కాంన్డ్యూయెంట్ కంపెనీని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశాఖను నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

15:47 - March 29, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 11 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఈ నెల 12న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మార్చి 15న ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

 

15:42 - March 29, 2018

మెదక్ : తమకు ఇచ్చిన స్థలంలో డబుల్‌బెడ్రూం ఇళ్లకు శంఖుస్థాపన చేయడంపై ఆగ్రహం చెందిన మహిళలు.... శంఖుస్థాపన దిమ్మెను కూల్చివేశారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి శంఖుస్థాపన స్థాపన చేశారు. శిలాఫలకం వేసి డిప్యూటీ స్పీకర్‌ వెళ్లిన కొద్ది సేపటికే మహిళలు దాన్ని కూల్చేశారు. 10 సంవత్సరాల కింద తమకు ఇచ్చిన భూముల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించడమేంటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

15:40 - March 29, 2018

హైదరాబాద్ : వేగంగా అభివృద్ధి చెందుతూ.. సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతోనే ప్రయివేట్‌ యూనివర్శిటీ బిల్లును తీసుకొస్తున్నామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మండలిలో ప్రవేటు యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం  కడియం మాట్లాడారు. కార్పొరేట్‌ విద్యలో తెలంగాణ విద్యార్థులు వెనకబడకూడదనే.. సకల సదుపాయాలతో ప్రవేటు యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ యూనివర్శిటీలను కూడా బలోపేతం చేసి, ఖాళీలను భర్తీ చేస్తామని కడియం చెప్పారు.

 

తెలంగాణ అసెంబ్లీలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్ : ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశ పెట్టింది. ఇసుక కొనుగోలులో 18 కోట్లు అనుచిత లబ్ధి పొందడాన్ని నివేదికలో పేర్కొన్నారు. బడ్జెట్‌లో 256 కోట్లు రైతులకు వడ్డీలేని రుణాలు కేటాయించినప్పటికీ పథకం అమలు కాకపోవడంతో 12 లక్షలమంది రైతులు లబ్ధి పొందలేదు. టీ హబ్‌ రెండో దశ భవన్‌ నిర్మాణ ఎంపికలో అక్రమాల కారణంగా 18 కోట్ల ఆర్థిక భారం పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. 

15:35 - March 29, 2018

హైదరాబాద్ : ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశ పెట్టింది. ఇసుక కొనుగోలులో 18 కోట్లు అనుచిత లబ్ధి పొందడాన్ని నివేదికలో పేర్కొన్నారు. బడ్జెట్‌లో 256 కోట్లు రైతులకు వడ్డీలేని రుణాలు కేటాయించినప్పటికీ పథకం అమలు కాకపోవడంతో 12 లక్షలమంది రైతులు లబ్ధి పొందలేదు. టీ హబ్‌ రెండో దశ భవన్‌ నిర్మాణ ఎంపికలో అక్రమాల కారణంగా 18 కోట్ల ఆర్థిక భారం పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. 2015..16లో పాలమూరు రంగారెడ్డి పథకం
ప్రారంభమైంది. రూ.11 వేల కోట్ల వ్యయానికి గాను రూ.708 కోట్ల ఖర్చు పెట్టారు... ఇంకా పనులు పూర్తి కాలేదు. ఎమ్‌వోయూలో నిబంధనల మార్పు వల్ల ఇమేజ్‌ భవనంలో రూ. 5 కోట్ల  ఆర్థిక భారం పడింది. 

15:25 - March 29, 2018

హైదరాబాద్ : పంచాయతీరాజ్ బిల్లుకు ఆమోదం లభిచింది. పంచాయతీరాజ్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎలాంటి సరవరణలు లేకుండానే బిల్లుకు ఆమోదం లభించింది. 

15:23 - March 29, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడకముందు అనేక దుర్మార్గాలు, బాండెడ్ లేబర్ గా పని చేసే పరిస్థితి జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఅసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడారు. 2లక్షల 38వేల మందికి స్వల్ప వేతనం మీద పని చేసే ఉద్యోగులకు 1100 కోట్ల రూపాయల అదనపు భారం తీసుకుని తమ ప్రభుత్వం సహకరించిందని, జీతాలు పెంచిందని తెలిపారు. ఇంకొంతమందికి పెంచే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. కొత్త గ్రామపంచాయతీ వ్యవస్థ వస్తే, రివాల్వుయేషన్ ఫండ్ జరిగితే, ట్యాక్స్ కలెక్షన్ రెగ్యులర్ గా జరిగితే ఆ కార్మికులకు కూడా కొంత న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విషయంలో తప్పకుండా ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో చట్టం రానివ్వండి.. దాన్ని కూడా సానుభూతితో పరిశీలిస్తామని చెప్పారు. 

13:51 - March 29, 2018

ఆదిలాబాద్‌ : సిర్పూర్ పేపర్ మిల్ పునరుద్ధరణ ఆశలతో.. ఫ్యాక్టరీ వద్ద హడావుడి నెలకొంది. కొత్త యాజమాన్యానికి అన్ని రకాల రాయితీలు కల్పిస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది. మిల్లు తిరిగి ప్రారంభమవుతుందన్న ప్రకటనతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఫ్యాక్టరీ ఎప్పుడు తెరుచుకుంటుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏమన్నారో వీడియోలో చూడండి..

13:46 - March 29, 2018

అమరావతి : అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. వెల్‌లో వందల మంది ఉన్నప్పుడే ఏపీ రీఆర్గనైజేషన్‌ బిల్లు పాస్‌ అయినప్పుడు.... ఇప్పుడు బిల్లు పాస్‌ చేసేందుకు ఎందుకు స్పీకర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. అవిశ్వాసంపై చర్చ జరిగేలా స్పీకర్‌ చొరవ చూపాలన్నారు ఉండవల్లి

బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి : కేటీఆర్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణం చేపట్టినట్లు ఇందుకు సంబంధించిన టెండర్లు పూర్తి అయినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా శాసనమండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. రంగారెడ్డి జిల్లా అహ్మద్‌గూడ, కీసర దగ్గర 20 ఎకరాల్లో రూ.383 కోట్లతో 4428 డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. స్టీల్ ధర పెరిగిందని గుత్తేదారులు ఆందోళన చెందుతున్నారు. స్టీల్ కంపెనీలతో మాట్లాడి రూ. 52 వేల నుంచి రూ. 37 వేలకు టన్ను ఇచ్చేలా ఒప్పందం చేశాం. సిమెంట్ కూడా బస్తా ధర రూ.

13:34 - March 29, 2018

హైదరాబాద్ : పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టసవరణ బిల్లులను అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మంత్రి జూపల్లి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఏజెన్సీ ఏరియాలో వుండే గిరిజన గ్రామాలు 631 వుండేవనీ..ఇప్పుడు తాము 1958 కొత్త గ్రామ పంచాతీయలను ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రెండు కలిపి 2,637 గ్రామాలు గిరిజన సోదరుల ఏలుబడిలో వుంటాయని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో భారతదేశంలో పంచాయితీరాజ్ యొక్క నేపథ్యాన్ని కేసీఆర్ వివరించారు. నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయం వల్ల భారత దేశంలో ఆహార కష్టం రాలేదన్నారు. గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపాలన్నా అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో చట్టాలు వచ్చాయనీ..అదే నూతన చట్టంలోని గొప్పతనమన్నారు. కానీ 71ఏళ్లు అయినా గ్రామాలు ఎలా వున్నాయో అందరికీ తెలుసన్నారు. మున్సిపాలిటీ ఏర్పడాలంటే అసెంబ్లీ ద్వారానే ఏర్పడాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్ లకు ఉప సర్పంచ్ లకు కలిపి చెక్ పవర్ ఇస్తామన్నారు. గత పాలకులు పంచాయితీ రాజ్ వ్యవస్థకు తూట్లుపొడిచారని విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులు,ఎమ్మెల్యేకు తెలియకుండా కొత్త సంచాయితీ రాజ్ కు ఏర్పడటానికి వీల్లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నో చట్టాలు తెచ్చినా గ్రామీణ వ్యవస్థ పేదల జీవితాల్లో మార్పులు తేలేదన్నారు. 

పంచాయితీ రాజ్ బిల్లుపై హడావిడి చర్చా? : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో పంచాయితీ రాజ్ పురపాలక బిల్లులపై చర్చ కొనసాగుతోంది. నూతన పంచాయితీ రాజ్ బిల్లు ప్రతులు అర్థరాత్రి అందాయని..అర్థరాత్రి బిల్లు ప్రతులు ఇస్తే అధ్యయనం ఎప్పుడు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కొత్త పంచాయితీ రాజ్ బిల్లును ఆదరాబాదరాగా తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 275 పేజీల బిల్లుపై హడావిడిగా చర్చ చేపట్టటం సరికాదన్నారు. 

12:52 - March 29, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీలు రాబోతున్నాయి.. వర్సిటీలకు అనుమతులిచ్చే బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రైవేటు వర్సిటీల్లో ఫీజుతోపాటు.. ప్రభుత్వ జోక్యం ఏమేరకు ఉడనుంది...? రిజర్వేషన్లు అమలవుతాయా...? ప్రవేట్‌ వర్సిటీల బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వ యోచన
రాష్ర్టంలో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా కదులుతోంది. దీనికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రైవేటు వర్సిటీలకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి ఎలాంటి గ్రాంట్స్‌ ఉండవన్న అంశాన్ని బిల్లులో పొందు పరచింది. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందితే.. ఇక తెలంగాణలో ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఇబ్బడిమబ్బడిగా వెలవనున్నాయి.

ఫీజులు, కోర్సులు, సిలబస్‌, పరీక్షల నిర్వహణ ప్రైవేటు యజమాన్యాలకే
రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఏర్పాటు కానున్న ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో ఫీజులు, కోర్సులు, సిలబస్‌, పరీక్షలు, ఇలా అన్ని వ్యవహారాలను ఇక నుంచి ప్రైవేటు యజమాన్యాలే సొంతంగా నిర్వహించునే అవకాశంఉంది. అంతేకాదు.. గౌరవ డిగ్రీలు ఇచ్చుకోవడంతోపాటు.. ప్రపంచంలోని ఏ యూనివర్సిటీనుంచైనా... ఒప్పందం చేసుకునే వీలు కల్పించనున్నట్లు తెలుస్తోంది.. దాంతోపాటు నిధుల సేకరణ విషయంలో కూడా ఎలాంటి నిబంధనలు అడ్డుకోవు. యూనివర్సిటీని ఎక్కడికైనా విస్తరించుకునే వెసులు బాటు ఉండనుంది.

ఏర్పాటైన 5ఏళ్ళలోపు నాక్‌ గుర్తింపు పొందాలి
ప్రైవేట్‌ యాజమాన్యంతో ఏర్పాటయ్యే వర్సిటీ.. ఐదేళ్ళలోపు నాక్‌ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వం అనుమతి లేకుండా.. యూనివర్సిటీ మూసేయడానికి కూడా వీల్లేని విధంగా బిల్లులో నిబంధనలు రూపొందించనట్టు తెలుస్తోంది.

ప్రైవేటు వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాంతం సీట్లు
ప్రైవేటు వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాంతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఫీజులు, రిజర్వేషన్లపై కొత్త వర్సిటీలకు పూర్తి స్వేచ్ఛ కల్పించనున్నారు. దీంతో ప్రైవేట్‌ వర్సిటీలు ధనికుల కోసమే అన్న అభిప్రాయం విద్యార్థి సంఘాలు, విద్యావేత్తల్లో వ్యక్తమౌతోంది. ఇప్పుడున్న బడా విద్యాసంస్థలు, ప్రైవేటు వర్సిటీలుగా మారాలనుకుంటే మాత్రం.. ప్రస్తుతం అమలు చేస్తున్న ఫీజులు, రిజర్వేషన్లనే కొనసాగించాలి. అంటే కొత్తగా ఏర్పాటయ్యే వర్సిటీలకు వర్తించని ఫీజు నియంత్రణ, రిజర్వేషన్లు.. ప్రైవేటు వర్సిటీలుగా అప్‌గ్రేడ్‌ కావాలనుకుంటున్న విద్యాసంస్థలకు వర్తిస్తాయన్నమాట. మొత్తానికి ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇస్తే.. రాష్ట్రంలో ఉన్నత విద్యావవస్థ వ్యాపారంగా మారే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

పాలన పాదర్శకంగా వుండాలనే టీడీపీ : ఎల్.రమణ

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి పాలన పారదర్శకంగా ఉండాలనే సంకల్పంతోనే దివంగత నేత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని రమణ తెలిపారు. వచ్చే 2019ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. మంచి క్రమశిక్షణ కలిగిన లక్షలాది కార్యకర్తలు గల ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద రమణతో పాటు పలువురు పార్టీ నేతలు నివాళులర్పించారు.

12:46 - March 29, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. 12 వందల కోట్ల రూపాయలు విలువ చేసే రియల్ ఎస్టేట్ భూములు కేసీఆర్ బినామీ కంపెనీలకు దోచిపెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో నిర్మాణ స్థలాలు బినామీలుగా మారిపోయినవని రేవంత్ రెడ్డి విమర్శించారు. 12 వందల కోట్ల ఆస్థిని బినామీ కంపెనీలకు కేసీఆర్ ప్రభుత్వం దోచిపెట్టిందని విమర్శించారు. హైటెక్స్ లో ఎకరం భూమి ఎంత వుంటుందో అందరు ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ కంపెనీకి లీజ్ కిచ్చే ఆ కంపెనీ మరో కంపెనీకి లీజ్ కిస్తే అది రాష్ట్రానికి నష్టం కాదా. అని రేవంత్ ప్రశ్నించారు. మెట్రో రైల్ నిర్మాణంలో కేసీఆర్ కుటంబం భారీగా లబ్ది పొందుతోందని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. కేసీఆర్‌ బంధువుల భూముల విలువ పెంచేందుకే మెట్రో రైలు పొడిగిస్తున్నారని ఆరోపించారు. 2003లో ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఎయిర్‌పోర్ట్‌కు రవాణా వ్యవస్థను జీఎమ్మార్ సంస్థనే ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ..ఎల్ అండ్ టీతో కేసీఆర్‌ బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. 

ప్రయివేట్ స్కూల్స్ లో రిజర్వేషన్స్ అమలు లేదు : కాగ్

హైదరాబాద్ : ప్రయివేటు స్కూల్స్ లో విద్యాహక్కు చట్టం కింద..25 శాతం రిజర్వేషన్స్ అమలు కావటంలేదని కాగ్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సలహాసంఘాన్ని ఇంత వరకూ నియమించలేదని కాగ్ నివేదించింది. తగిన ప్రణాళిక పాలనా వ్యవస్థ లేదనీ..2శాతం క్రీడల రిజర్వేషన్ల నిబంధన పోలీసు శాఖలో మాత్రమే వుందని పేర్కొంది. 

సర్కార్ ఆసుపత్రుల్లో లోపాలు : కాగ్

హైదరాబాద్ : ఏడాదిలోపు పిల్లల్లో వ్యాధి నిరోధక వైద్యం విషయంలో రాష్ట్రం వందశాతం లక్ష్యం సాధించిందని కాగ్ పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును వివరించింది. ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత లోపం వల్ల ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 

12:11 - March 29, 2018

టీ.అసెంబ్లీలో కాగ్ నివేదిక వివరాలు..

హైదరాబాద్ : టీ.ఆసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు,సామాన్య, సామాజిక రంగాలపై కాగ్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక, రెవెన్యూ,స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఐటీ సంస్థలకు కేటాయించిన భూముల్లో కనీస వసతులు లేవనీ..టీహబ్ రెండో దశ ఇమేజ్ భవన నిర్మాణాల్లో ప్రభుత్వంపై అదరనపు భారం పడిందని కాగ్ పేర్కొంది. ఇందిరమ్మ వరద కాలువకు రూ.4711 కోట్లు ఖర్చు చేసినా..తగిన సాగునీటి వసతి కల్పన లేదని కాగ్ పేర్కొంది.

ప్రజాసేవకుడు, ప్రజనాయకుడు ఎన్టీఆర్ : జమున

హైదరాబాద్ : తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వెదజల్లిన ఎన్టీఆర్ ప్రజాసేవకుడు, ప్రజనాయకుడు ఎన్టీఆర్ అని అలనాటి ప్రముఖ నటి జమున పేర్కొన్నారు. ఆద్భుతమైన పాత్రల్ని ఆయన పోషించారనీ..ఆయన నటించని పాత్రలంటు వుండవేమోనన్నారు. బాలకృష్ణ వేషధారణ చూస్తుంటే ఎన్టీఆర్ గుర్తుకొచ్చారన్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్ కు సాటి ఇంకెవరూ వుండరని జమున పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించటం ఓ సాహమన్నారు. టీడీపీ పార్టీని స్థాపించటమే ఓ సాహసమైతే దాన్ని చరిత్రలో నిలపి చరిత్ర సృష్టించటం ఎన్టీఆర్ కే సాధ్యమయ్యిందని జమున అలనాటి జ్నాపకాలను గుర్తు చేసుకున్నారు.

అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేయండి : ఉండవల్లి

అమరావతి: అవిశ్వాసంపై చర్చ జరగకుండా ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అవిశ్వాసంపై చర్చ జరిగేలా స్పీకర్ చొరవ చూపాలన్నారు. గతంలో స్పీకర్ విచక్షణాధికారంతో మమ్మల్ని సస్పెండ్ చేశారని, ఆ అధికారాలతో అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేయవచ్చన్నారు. అలాగే రాష్ట్ర విభజన జరిగిన తీరును అప్పట్లో నరేంద్ర మోదీ కూడా తప్పుబట్టారని, తలుపులు మూసి ఏపీని విభజించారని ఉండవల్లి అన్నారు.

అగ్నిప్రమాదంలో 68మంది మృతి!..

హైదరాబాద్ : వెనెజులాలోని కరాబోబో స్టేట్‌లో దారుణం జరిగింది. వాలెన్సియా నగరంలోని ఓ జైలు నుంచి ఖైదీలు బయటపడేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ఖైదీల అల్లర్ల నేపథ్యంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 68 మంది ప్రాణాలు కోల్పోయారు. కరాబోబో స్టేట్ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ అధీనంలోని జైలు నుంచి కొందరు ఖైదీలు బుధవారం తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జైల్లోని పరుపులకు నిప్పంటించారు. దీంతో అగ్నిప్రమాదం జరిగి 68 మంది మృతిచెందారు. మృతుల్లో ఖైదీలను చూసేందుకు వచ్చిన మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. 

11:29 - March 29, 2018

ఢిల్లీ : సీఎం చంద్రబాబునాయుడు ఇకనైనా రాజకీయాలను పక్కన పెట్టిన రాష్ట్రం గురించి పోరాడాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి పేర్కొన్నారు. అవివిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా స్పీకర్ చొరవ తీసుకోవాలనీ..దీనిపై కౌంటర్ ఫైల్ చేసేందుకు చంద్రబాబు చొరవ చూసేందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. సభ జరగకుండా ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం విడుదల చేసే నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్ని విషయాలను ప్రజలకు తెలిపాలను గత నాలుగేళ్లుగా మొరపెట్టుకుంటున్నామనీ..ఇప్పటికైనా అన్ని విషయాలను బైటపెట్టాలని ఉండవల్లి సీఎం చంద్రబాబుని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చకు ఇదే సమయం అని ఉండవల్లి పేర్కొన్నారు. బాధ్యతనుండి తప్పించుకోకుండా రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు పూనుకోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మీ రాజకీయాలను పక్కన పెట్టమని ఉండవల్లి సూచించారు. తానే బలవంతుడినని చంద్రబాబు ప్రకటించుకునేందుకు యత్నిస్తున్నారని ఉండవల్లి విమర్శించారు. మిగిలి వున్న 9 నెలలు రాష్ట్రం గురించి ఆలోచించమని సూచించారు. నాలుగేళ్ల నుండి వాస్తవాలను ప్రజలకు తెలపకుండా గోప్యంగా వుంచారనీ..ఇప్పటికైనా స్పందించాలని ఉండవలి పేర్కొన్నారు. 

వారసత్వం కంటే జవసత్వం మిన్న : వెంకయ్యనాయుడు

హైదరబాద్ : తాను వారసత్వాలకు వ్యతిరేకరమనీ కానీ ఎన్టీఆర్ ఆశయాలను వారసత్వం కావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈరోజు ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన అన్న ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా పారంభోత్సవంలో పాల్గొన్న వెంకయ్య ఎన్టీఆర్ యొక్క ఆశయాలను గొప్పగా పేర్కొన్నారు. న్నారు. కాగా వారసత్వం కంటే జవసత్వం వుండాలన్నారు. అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో చరిత్ర సృష్టించారన్నారు. తెలుగువారిలో ఆయన పాత్రను ఎవ్వరూ మరిచిపోలేరన్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ సాహసం: తేజ

హైదరాబాద్ : విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ చరిత్రను సినిమా తీయటం ఓ సాహసమనీ..ఆ సాహసానికి దర్శకత్వం వహించటం తన అదృష్టమనీ తన శాయశక్తులా ఎన్టీఆర్ చరిత్రను ప్రతిబింభించేందుకు కృషి చేస్తానని దర్శకుడు తేజ పేర్కొన్నారు. కానీ ఇది సాహసవంతమైనదనీ..కానీ తనవంతుగా ఎన్టీఆర్ చరిత్రను నిలబెట్టేందుకు సినిమాద్వారా ప్రయత్నిస్తున్నామన్నారు. దసరాకు రిలీజ్ చేసేందుకు యత్నిస్తామని తేజ తెలిపారు. 

బాలకృష్టకే ఆ సత్తా వుంది : అల్లు అరవింద్

హైదరాబాద్ : ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించే సత్తా ఒక్క బాలకృష్ణకుమాత్రమే వుందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న అరవింత్ ఎన్టీఆర్ చరిత్రనుతిరిగి తెరమీదకు తీసుకురావటం చాలా సాహసవంతమైనదన్నారు. అటువంటి దమ్మున్న నటుడు బాలకృష్ణ మాత్రమేనన్నారు. కానీ ఇది సాధ్యమవుతున్నందుకు ఈ దర్శకుడు తేజగాకు తన అభినందనలు తెలిపారు.

ఎన్టీఆర్ పాత్ర పోషంచటం నా అదృష్టం : బాలకృష్ణ

హైదరాబాద్ : తెలుగు సమాజాన్ని మేలుకొలిపేందుకు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కారణజన్ముడిగా ఎన్టీఆర్ జన్మించారని..ఆయన పాత్రను నేను పోషించే అదృష్టం వచ్చినందుకు తాను అదృష్టం చేసుకున్నానని ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ తెలిపారు. తాను తొలిసారి కనిపించిన చిత్రం తాతమ్మకల సినిమా కూడా ఇదేస్థానంలో జరిగిందని అలనాటి సంగతులు, తను తండ్రి గుర్తులను పంచుకున్నారు. తనకు తండ్రి, గురువు, దైవం ఎన్టీఆరేనని చెప్పారు. ఈ భూమిపై ఎందరో పుడుతూ ఉంటారని, అందరినీ మహానుభావులుగా భావించలేమని, ఆ స్థానానికి తగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.

10:40 - March 29, 2018

హైదరాబాద్ : తెలుగు సమాజాన్ని మేలుకొలిపేందుకు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కారణజన్ముడిగా ఎన్టీఆర్ జన్మించారని..ఆయన పాత్రను నేను పోషించే అదృష్టం వచ్చినందుకు తాను అదృష్టం చేసుకున్నానని ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ తెలిపారు. తాను తొలిసారి కనిపించిన చిత్రం తాతమ్మకల సినిమా కూడా ఇదేస్థానంలో జరిగిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో పుట్టినందుకు తన జన్మ ధన్యమైందని అది తనకు భగవంతుడు ఇచ్చిన వరమన్నారు. తనకు తండ్రి, గురువు, దైవం ఎన్టీఆరేనని చెప్పారు. ఈ భూమిపై ఎందరో పుడుతూ ఉంటారని, అందరినీ మహానుభావులుగా భావించలేమని, ఆ స్థానానికి తగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, గౌతమీపుత్ర శాతకర్ణి, అంబేద్కర్, మహాత్మాగాంధీ వంటి వారి సరసన నిలిచే అర్హతున్న వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. 'ఎన్' అంటే నటనాలయం. ఆయన ఇల్లే నటనాలయం. ఆయన నటరాజు నటసింహుడు. 'టీ' అంటే తారా మండలంలోని ధ్రువతారకుడు. 'ఆర్' అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధరుడు... అని చెప్పారు. తెలుగు జాతి చరిత్రను ప్రతి విద్యార్థికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సినిమా రంగంలో ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ను అభిమానించారని గుర్తు చేశారు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయనున్నట్టు తెలిపారు.  సీఎంగా ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను అనేక రాష్ట్రాలు ప్రవేశపెట్టారన్నారన్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన అభిమానులకు,ముఖ్యంగా నందమూరి అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు దర్శకుడిగా ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించనున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించనున్నారు. 

10:33 - March 29, 2018

హైదరాబాద్ : సినియాల్లోను, రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ గారి జీవితచరిత్రను సినిమాగా తీస్తున్నందుకు.. ఈ కార్యక్రమంలోతాను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా వుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ సినిమా కేవలం సినిమాలా కాక ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణం ఈ సినిమాను చిత్రీకరించాలని కోరుకుంటునానన్నారు. తాను వారసత్వాలకు వ్యతిరేకరమనీ కానీ ఎన్టీఆర్ ఆశయాలను వారసత్వం కావాలన్నారు.  కాగా వారసత్వం కంటే జవసత్వం వుండాలన్నారు. అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో చరిత్ర సృష్టించారన్నారు. తెలుగువారిలో ఆయన పాత్రను ఎవ్వరూ మరిచిపోలేరన్నారు. రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే వుంటారనేలా ఆయన నటన వుండేదని గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషకోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. అందుకోసం తెలుగు భాషకోసం అందరు మాట్లాడటమే ఆయనకు నిజమైన నిజమైన నివాళి తెలుగు భాష కోసం మాట్లాడటమేనన్నారు. అందుకే మనకట్టు,బొట్టు, జుట్టు,భాష, యాస, అన్ని తెలుగు ఉట్టిపడేలా వుండాలని తాను ఎప్పుడు చెబుతుంటానన్నారు. ఎన్టీఆర్ అంటే అభిమానించినతెలుగు వారు లేరన్నారు. ఎన్టీఆర్ చరిత్రలో ఎలా నిలిచిపోయారో ఈ సినిమాకూడా నిలిచిపోయేలా చిత్రాన్ని చిత్రీకరించానలని ఆయన కోరుకుంటున్నానన్నారు. ప్రపంచంలో భారతదేశానికి పట్టువంటిది వసుదైక కుంటుంబమే భారతజాతికి నిదర్శనమన్నారు. భారతజాతికి పట్టుకొమ్మలా వుండేవి కుటుంబ వ్యవస్థ, ఆధ్యాత్మికత అని పేర్కొన్నారు. 

బాలకృష్టకే ఆ సత్తా వుంది : అల్లు అరవింద్
ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించే సత్తా ఒక్క బాలకృష్ణకుమాత్రమే వుందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న అరవింత్ ఎన్టీఆర్ చరిత్రనుతిరిగి తెరమీదకు తీసుకురావటం చాలా సాహసవంతమైనదన్నారు. అటువంటి దమ్మున్న నటుడు బాలకృష్ణ మాత్రమేనన్నారు. కానీ ఇది సాధ్యమవుతున్నందుకు ఈ దర్శకుడు తేజగాకు తన అభినందనలు తెలిపారు.
ఎన్టీఆర్ బయోపిక్ సాహసం: తేజ
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ చరిత్రను సినిమా తీయటం ఓ సాహసమనీ..ఆ సాహసానికి దర్శకత్వం వహించటం తన అదృష్టమనీ తన శాయశక్తులా ఎన్టీఆర్ చరిత్రను ప్రతిబింభించేందుకు కృషి చేస్తానని దర్శకుడు తేజ పేర్కొన్నారు. కానీ ఇది సాహసవంతమైనదనీ..కానీ తనవంతుగా ఎన్టీఆర్ చరిత్రను నిలబెట్టేందుకు సినిమాద్వారా ప్రయత్నిస్తున్నామన్నారు. దసరాకు రిలీజ్ చేసేందుకు యత్నిస్తామని తేజ తెలిపారు. 

టీడీపీకి 36 ఏళ్లు ..వేడుకలు..

హైదరాబాద్ : ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీకి నేటితో టీడీపీ పార్టీకి 36 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ శుభకార్యాన్ని పురస్కరించుకుని నేడు రాష్ట్ర నలువైపు టీడీపీ ఆవిర్భావ వేడుకలను టీడీపీ శ్రేణులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

జీఎస్ఎల్వీ ఎఫ్08 కౌంట్ డౌన్..

నెల్లూరు : ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నేడు జీఎస్ఎల్వీ ఎఫ్08 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 4.56 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్08 ను నింగిలోకి పంపేందుకు కౌంట్ డౌన్ ప్రారంభయ్యింది. జీశాట్‌-6ఏ ఉపగ్రహం మొబైల్ రంగానికి సంబంధించిన సమాచార వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో ఎస్ బాండ్, సి బాండ్ ట్రాన్స్‌పాండర్స్‌ ఎక్కువగా ఉన్న కారణంగా.. కమ్యునికేషన్ వ్యవస్థ మరింత మెరుగవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2140 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం.. దేశ రక్షణ రంగానికి కూడా సేవలు అందిస్తుందని సమాచారం.

నేడు చంద్రబాబు,లోకేష్ ల విశాఖ పర్యటన..

విశాఖపట్నం : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు నాలుగు ఐటీ కంపెనీలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. 

వెంకయ్య రేణుకాచౌదరి మధ్య ఆసక్తికర చర్చ..

ఢిల్లీ : మరికొద్ది రోజుల్లో తన రాజ్యసభ పదవీకాలాన్ని ముగించుకోనున్న కాంగ్రెస్ మహిళా నేత రేణుకా చౌదరి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడి మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. పదవీ విరమణ చేస్తున్న ఎంపీలకు వీడ్కోలు పలుకుతున్న వేళ, ప్రసంగించిన రేప్రసంగించిన రేణుక "ఆయన అంటే వెంకయ్య నన్ను ఎన్నో కిలోలుగా అంటే సంవత్సరాలుగా అన్న మాటకు బదులు రేణుక 'కిలో' పదాన్ని వాడారన్నమాట వాడారు. సార్, నా బరువు గురించి చాలా మంది బాధపడుతున్నారు.

09:34 - March 29, 2018

నెల్లూరు : ఇస్రో... మరోప్రయోగానికి సిద్దమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి.. జీఎస్ఎల్వీ ఎస్‌-08 రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రయోగించే రాకెట్‌ ద్వారా.. కమ్యునికేషన్ వ్యవస్థకు ఉపకరించే జీశాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనున్నారు.

జీఎస్‌ఎల్వీ ఎఫ్-08 రాకెట్ ద్వారా జీశాట్‌-6ఏ
ఇస్రో గురువారం మరో రాకెట్‌ను నింగిలోకి పంపునుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్వీ ఎఫ్-08 రాకెట్ ద్వారా జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని రోదశిలోకి పంపుతున్నారు. 2015 ఆగస్టులో ప్రయోగించిన జీశాట్‌-6 ఉపగ్రహం.. కాలపరిమితి తొమ్మిదేళ్లుగా భావించినప్పటికీ, సాంకేతిక పరిస్థితుల వల్ల.. బాగా ముందుగానే అది పనిచేయడం ఆపేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో.. జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.

2140 కిలోల బరువు కలిగిన ఉపగ్రహం..
జీశాట్‌-6ఏ ఉపగ్రహం మొబైల్ రంగానికి సంబంధించిన సమాచార వ్యవస్థలో కీలక పాత్ర  పోషించనుంది. ఇందులో ఎస్ బాండ్, సి బాండ్ ట్రాన్స్‌పాండర్స్‌ ఎక్కువగా ఉన్న కారణంగా.. కమ్యునికేషన్ వ్యవస్థ మరింత మెరుగవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2140 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం.. దేశ రక్షణ రంగానికి కూడా సేవలు అందిస్తుందని సమాచారం. దేశ సరిహద్దుల్లో 20 కిలోమీటర్ల దూరంలోని ప్రతి కదలికనూ ఫోటోల ద్వారా తెలిపే శక్తి సామర్ధాలు ఈ ఉపగ్రహానికి ఉన్నట్లుగా తెలుస్తోంది.

తిరుమలలోనూ ప్రత్యేక పూజలు..
జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 12వ ప్రయోగం. శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ వద్ద.. అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు, ఇస్రో చైర్మన్‌ శివన్‌.. ఆనవాయితీ ప్రకారం, ప్రయోగం విజయవంతం కావాలంటూ.. చెంగాలమ్మ ఆలయంలోను, తిరుమలలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

09:30 - March 29, 2018

విశాఖపట్నం : ఏసీబీ వలలో అవినీతి చేపపడింది. బ్లాక్ స్టోన్ సర్వే అనుమతులు కోసం దరకాస్తు చెసిన వ్యక్తి నుంచి 50 వేలరూపాయల లంచం తీసుకుంటూ తహసిల్దార్‌ దొరికిపోయాడు. కొయ్యూరు మండలం కౌనూరు గ్రామానికి చెందిన జి. రామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు.. ఏసీబీ జీకే వీధి తహశీల్దార్ చిరంజీవి పడాల్‌ను రెడ్ హ్యాండెట్ గా పట్టుకున్నారు.

 

కోలుకుంటున్న బాధితులు..

చిత్తూరు : శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చైతన్యనగర్‌లో నిర్వహించిన వేడుకలో పానకం తాగి అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య 344కు చేరింది. వీరందరూ తిరువూరు, మైలవరం, విజయవాడ, నూజివీడుల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నవారందరినీ విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ.. చాలామంది కడపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కొందరు తీవ్రమైన జ్వరం బారిన కూడా పడ్డారు. 14 మంది ఐసీయూలోచికిత్స పొందుతున్నారు. పానకం నమూనాలను సేకరించి.. పరీక్షల కోసం పంపించారు.

09:22 - March 29, 2018

హైదరాబాద్ : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దేశ రాజకీయాల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తిచాటిన మహనీయుడు నందమూరి తారకరామారావు జీవిత విశేషాలతో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ చిత్ర ప్రారంభోత్సవం నాచారంలోని రామకృష్ణ హార్టికల్చరల్‌ సినీ స్టూడియోలో ఉదయం 9.30 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా జరుగుతోంది. తేజ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా నటించనున్నారు. నటుడు బాలకృష్ణతోపాటు నందమూరి కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పెద్దసంఖ్యలో రానున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టూడియోలో ప్రధాన ద్వారం నుంచి చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడి వేషధారణలోని ఎన్టీఆర్‌ భారీ కటౌట్‌ ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు తేజీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి వహిస్తున్నారు. చిత్ర ప్రారంభానికి తారాలోకంతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు తరలివస్తున్నట్లుగా తెలుస్తోంది. రాముడు,కృష్ణుడు ఇలాగే వుంటారా అనిపించేలా ఆయన నటించిన పాత్రలు చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 

ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవం..

హైదరాబాద్ : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దేశ రాజకీయాల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తిచాటిన మహనీయుడు నందమూరి తారకరామారావు జీవిత విశేషాలతో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ చిత్ర ప్రారంభోత్సవం గురువారం నాచారంలోని రామకృష్ణ హార్టికల్చరల్‌ సినీ స్టూడియోలో ఉదయం 9.30 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా జరగనుంది. తేజ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా నటించనున్నారు. నటుడు బాలకృష్ణతోపాటు నందమూరి కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పెద్దసంఖ్యలో రానున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

09:13 - March 29, 2018

మూడో పెళ్లి చేసుకోనున్న మాల్యా?..

ముంబై : బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మూడో పెళ్లి చేసుకోబోతున్నారట. పింకీ లాల్వానీ అనే యువతితో మాల్యా డేటింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న మాల్యాకు తోడుగా పింకీ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. కోర్టు విచారణలకు కూడా ఇద్దరూ కలిసే వెళుతున్నారట. మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

క్రికెట్ పరువు తీసిన స్టీవ్ స్మిత్ ఘోర అవమానం..

హైదరాబాద్ : బాల్ ట్యాంపరింగ్ తో ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసిన స్టీవ్ స్మిత్ పై నిషేధం పడగా, ప్రస్తుతం కేప్ టౌన్ లో ఉన్న ఆయన, తిరిగి స్వదేశానికి బయలుదేరిన వేళ, ఎయిర్ పోర్టులో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఎయిర్ పోర్టులో ఉన్న ప్రయాణికులు, క్రికెట్ అభిమానులు స్మిత్ ను చూడగానే 'చీట్', 'చీటర్', 'చీటింగ్' అంటూ హేళనగా మాట్లాడారు. ఇదే సమయంలో స్మిత్ కు రక్షణగా వచ్చిన పోలీసులు సైతం ఆయనపై ఏ విధమైన గౌరవం లేకుండా ప్రవర్తించారు. ఏదో మొక్కుబడిగా పక్కన ఉండి, దాదాపు నేరస్తుడిని లాక్కుని వెళ్లినట్టుగా లాక్కెళ్లారు. ఎస్కులేటర్ ఎక్కనీయకుండా నడిపించుకుంటూ తీసుకెళ్లారు.

08:44 - March 29, 2018

తెలంగాణ అసెంబ్లీలో తీసుకొచ్చిన ప్రైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్ధి సంఘలు దీనిపై నిన్న ఎత్తున ఆందోళన నిర్వహించాయి. ఒక్క వైపు ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తూ మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకురావడం కోసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా జరిగితే ఉన్నత విద్య... సామాన్యునికి అందని ద్రాక్షగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి వీరు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు వల్ల విద్యా రంగానికి ఉన్న ప్రమాదం ఏంటి?  ప్రైవేటు యూనివర్సిటీకి బిల్లును వ్యతిరేకిస్తు ఆందోళన చేస్తున్నారు కదా... ఈ బిల్లును మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పేదవారికి విద్యకు, ప్రయివేటు వర్శిటీల బిల్లుకు గల సంబంధమేమిటి? అనే అంశాలపై ఈనాటి జనపథంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కోట రమేష్, పీడీఎస్ యూ నాయకులు రాము విశ్లేషణలతో మీ ముందుకు వచ్చింది ఈనాటి జనపథం..

08:38 - March 29, 2018

హైదరాబాద్ : బాల్ టాంపరింగ్‌ గేట్‌ వివాదాన్ని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ లైట్‌ తీసుకున్నా....ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ మాత్రం సీరియస్‌గా తీసుకుంది.కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌కు కారకులైన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌,వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌..బాల్ టాంపరింగ్‌ చేసిన బాంక్రాఫ్ట్‌పై కంగారూ క్రికెట్ బోర్డ్‌ కఠిన చర్యలు తీసుకుంది. స్టీవ్‌ స్మిత్‌,డేవిడ్‌ వార్నర్‌ యేడాది పాటు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఆడకుండా సస్పెండ్ చేసిన ....బాంక్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.

9 నెలల నిషేధం..
నిబంధనలు అతిక్రమించారు,క్రికెట్‌ క్రీడా స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించారు,కెమెరాకు చిక్కడంతో తప్పు ఒప్పుకున్నారు, కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌లో భాగమైన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌,వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌,బాంక్రాఫ్ట్‌పై ...కంగారూ క్రికెట్ బోర్డ్‌ కఠిన చర్యలు తీసుకుంది. 4వ టెస్ట్‌కు ముందే స్టీవ్‌ స్మిత్‌,డేవిడ్‌ వార్నర్‌, బాంక్రాఫ్ట్‌లను స్వదేశానికి పిలిపించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌....విచారణ తర్వాత సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా స్టీవ్‌ స్మిత్‌,డేవిడ్‌ వార్నర్‌లపై యేడాది పాటు నిషేదం విధించిన కంగారూ క్రికెట్‌ బోర్డ్‌....బాల్‌ టాంపరింగ్‌ చేసిన బాంక్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెన్షన్..
కోచ్‌ డారెన్‌ లీమన్‌కు క్లీన్‌ చిట్ ఇచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా....బాల్‌ టాంపరింగ్‌లో భాగమైన ముగ్గురు క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసింది.3 ఫార్మాట్లలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ,వైస్‌ కెప్టెన్‌గా ఉన్న స్మిత్‌,వార్నర్‌లపై ఏ మాత్రం కనికరం చూపలేదు. స్మిత్‌,వార్నర్‌ల ఆదేశాల మేరకే బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడటంతో బాంక్రాఫ్ట్‌ను 9 నెలలు మాత్రమే నిషేధించింది.

ఆసిస్ క్రికెట్ బోర్ట్ సంచలనాత్మక నిర్ణయం

ఐసీసీ స్మిత్‌పై ఒక టెస్ట్‌, బాంక్రాఫ్ట్‌కు మాత్రమే ఇవ్వగా...క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డ్‌ నియమ,నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటు, మరోసారి ఇటువంటి తప్పు చేయకుండా సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. స్మిత్ ,వార్నర్‌,బాంక్రాఫ్ట్‌లను దేశవాళీ క్రికెట్‌లో గ్రేడ్‌ లెవల్‌ టోర్నీలకు అనుమతినిచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా...ఐపీఎల్‌ 11వ సీజన్‌లో ఆడేందుకు అనుమతినిచ్చింది. నిషేధం ఎత్తివేయాలని ఈ ముగ్గురు క్రికెటర్లు ఐసీసీకి చాలెంజ్‌ చేసుకునే అవకాశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కల్పించింది.

జెంటిల్మెన్‌ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్‌లో వివాదం..
కంగారూ క్రికెట్ బోర్డ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడేందుకు అనుమతిచ్చినా....ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా మాత్రం స్మిత్‌, వార్నర్‌లు 11వ సీజన్‌ ఆడేందుకు అనర్హులని ప్రకటించాడు. నిషేధం కారణంగా స్టీవ్‌ స్మిత్‌ వంటి టాప్ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌, కెప్టెన్‌ లేకుండానే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఐపీఎల్ 11వ సీజన్‌లో బరిలోకి దిగబోతుండగా.... కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణించి ఐపీఎల్‌ 9వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన డేవిడ్‌ వార్నర్‌ సైతం ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌కు దూరయ్యాడు. జెంటిల్మెన్‌ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా ఇకపై ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే.   

08:29 - March 29, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి సన్నిహితుడు, ఫైర్‌స్టార్‌ గ్రూప్‌ ఫైనాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్యామ్‌ సుందర్‌ వాద్వాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. ఈడీ అధికారులు వాద్వాను ముంబైలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వాద్వా ఫైర్‌స్టార్‌ గ్రూప్‌ ఫైనాన్స్‌ ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మార్చి 24న ముంబైలో నీరవ్‌ మోదీకి చెందిన 36 కోట్లకు పైగా విలువైన సంపదను ఈడీ సీజ్‌ చేసింది. సీజ్‌ చేసిన వస్తువుల్లో 10 కోట్ల డైమాండ్‌ రింగ్‌, 15 కోట్ల పురాతన ఆభరణాలు, 1.40 కోట్ల హై-ఎండ్‌ వాచీలు, 10 కోట్ల పెయింటింగ్స్‌ ఉన్నాయి. నీరవ్‌మోది, ఆయన మామ గీతాంజలి జెమ్స్‌ లిమిటెడ్ యజమాని మెహుల్‌ చోక్సీలు పిఎన్‌బిలో 12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన విషయం తెలిసిందే.

08:22 - March 29, 2018

ఆదిలాబాద్ : ఉట్నూరు మండలం ఆందోలి సమీపంలో ప్రమాదం జరిగింది. అడవిపందిని ఢీకొని తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతులు కుమరం భీమ్ జిల్లా జైనూరు మండటం జంగావ్ వాసులుగా గుర్తించారు. అటవీప్రాంతం కావటంతో రోడ్డుపై అడవి జంతువులు సంచారం చేస్తుంటాయి. దీంతో రోడ్డుపై తిరుగాడుతున్న అడవిపందిని తప్పించబోయి వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్రంగా గాయలయ్యాయి.గాయపడినవారిలో ముగ్గురు చిన్నారులుకూడా వున్నారు. దీంతో జంగావ్ ప్రాంతంలో విషాదం నెలకొంది. మరోపక్క రిమ్స్ ఆసుపత్రి వద్ద బంధువుల రోదనతో విషాదం నెలకొంది. 

08:17 - March 29, 2018

ప్రయివేటు యూనివర్శిటీలకు సంబంధించిన బిల్లును తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి సభ నుండి ఆమోదం కూడా లభించింది.కానీ దీనిపై విద్యార్థి సంఘాలతో పాటు పలువురు ప్రొఫెసర్లు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజుల వసూలు చేస్తు దందా కొనసాగిస్తున్న సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయివేటు యూనివర్శిటీలకు అసెంబ్లీ ఆమోదం పలకటం..తీవ్రంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ప్రయివేటు విద్యాలయాలు పెరుగుతున్న క్రమంలో పేదవారికి విద్య అందేనా? దీనికి పరిష్కారమేమిటి? అనే అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈచర్చలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిథి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

07:58 - March 29, 2018

అమరావతి : ప్రత్యేక హోదా పోరును భుజనా వేసుకునేందుకు జనసేనాని సిద్ధం అయ్యారా..? వామపక్షాలు-లోక్‌సత్తాతో కలిసి ఉద్యమానికి కార్యాచరణ రూపొందించారా..? హోదా కోసం ఆమరణ దీక్ష అంటున్న పవన్‌.. వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారా..? ఈ ప్రశ్నలకు జనసేన వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.

హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకుంటున్న పవన్‌..
టీడీపీ, బీజేపీతో దోస్తీకి చెక్‌ చెప్పిన జనసేన అధినేత భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకోవాలని డిసైడయ్యారు. దీనికి సంబంధించి సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా పార్టీలతో కలిసి జిల్లాల వారిగా పర్యటన చేయాలి అని పవన్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాతంగా భారీ బహిరంగ సభలు పెట్టేందుకు జనసేనపార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

అనంతపురం, ఒంగోలు, కాకినాడ, వైజాగ్‌లో బహిరంగ సభలు..
అనంతపురం, ఒంగోలు, కాకినాడ, వైజాగ్ లలో సభలు నిర్వహించడానికి జనసేనపార్టీ సిద్ధం అవుతోంది. ఈ సభల ద్వారా ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వచ్చే లాభాలను ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు. ఉభయ మ్యూనిస్టుపార్టీలు, లోక్‌సత్తాతో కలి ఉద్యమాన్ని ఊరూవాడా విస్తరించాలని నిర్ణయించినట్టు జనసేన వర్గాలు అంఉటన్నాయి.

జిల్లా పర్యటన అనంతరం ఆమరణ దీక్ష..
జిల్లాలో పర్యటన ముగిసిన తర్వాత జనసేనాని ఇంతకు ముందే ప్రకటించినట్టు నిరాహార దీక్షకు దిగనున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ను చేస్తూ అనంతపురం జిల్లా కేంద్రంగా పవన్ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారని జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీని వల్ల క్షేత్త్ర స్థాయిలో జనసేన కూటమి బలపడుతుందని పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగడానికి ఇప్పటికే డిసైడైన జనసేన పార్టీ.. అనంతపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే పవన్‌ ఆమరణ దీక్షకు అనంపురాన్నే ఎంచుకున్నారన్న ప్రచారం జరగుతోంది.

హోదా సాధనలో టీడీపీ, వైసీపీ, బీజేపీ విఫలం!..
ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ వైఫల్యం, వైసీపీ దోబూచులాట, బీజేపీ నమ్మక ద్రోహం చేసింది అని ఇప్పటికే పవన్‌ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నిరాహార దీక్ష ద్వారా ప్రత్యేక హోదా సాదించే సత్తా జనసేనకు మాత్రమే ఉంది అనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలకు దీటుగా క్షేత్రస్థాయిలో బలపడాలని పవన్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పవన్‌ దీక్ష తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.  

కేంద్రం ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తోంది -మధు
కేంద్రం ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తుందన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు. ప్రభుత్వంపై ఉన్న నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలకు ఉన్న ఆయుధం అవిశ్వాసం... అయితే దీనిపై చర్చించేందుకు కేంద్రం వెనకడుగు వేస్తుందన్నారు. ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తుందన్నారు మధు. 

07:54 - March 29, 2018

అమరావతి : నీతి ఆయోగ్‌ సభ్యుడు విజయ్‌ కుమార్‌ సారస్వత్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కృష్ణా జిల్లాలోని నూజివీడు, పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి ప్రాంతాల్లో ఉన్న అపార బొగ్గు నిక్షేపాలను ఆదాయవనరుగా మలచుకునే అంశంపై చర్చలు జరిపారు. బొగ్గు నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేసే అంశంపై మాట్లాడారు. ఇథనాల్‌ను థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేయడం ద్వారా తక్కవ ఖర్చులో కరెంట్‌ ఉత్పత్తి చేయొచ్చని వీకే సారస్వత్‌ సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఇజ్రాయిల్‌ సాంకేతిక సహకారం కోరతామన్నారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించాలని చంద్రబాబు తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. 

07:51 - March 29, 2018

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి హైదరాబాద్‌ విచ్చిన ఇండిగో రన్‌వేపై దిగుతుండగా ఒక్కసారిగా టైర్‌ పేలిపోయింది. మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకూడా ఉన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్రత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

వాహనం బోల్తా..ముగ్గురు మృతి..

ఆదిలాబాద్ : ఉట్నూరు మండలం ఆందోలి సమీపంలో ప్రమాదం జరిగింది. అడవిపందిని ఢీకొని తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలవ్వగా వారిని రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతులు కుమరం భీమ్ జిల్లా జైనూరు మండటం జంగావ్ వాసులుగా గుర్తించారు. 

రోజాకు తప్పిన ప్రమాదం..

హైదరబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం ల్యాండవుతున్న సమయంలో టైరు పేలిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి వస్తున్న ఈ విమానంలో రోజా సహా 70 మంది ఉన్నారు. టైరు పేలిపోవడంతో ఒక్కసారిగా నిప్పు రవ్వలు లేచి విమానానికి అంటుకున్నాయి. రన్‌వే వద్ద ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తంకావటంతో ప్రమాదం తప్పింది.

Don't Miss