Activities calendar

30 March 2018

సుదర్శన్ థియేటర్‌లో హీరో రామ్ చరణ్ సందడి

హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌లో హీరో రామ్ చరణ్ సందడి చేసారు. థియేటర్‌లో ప్రేక్షకులతో కలసి రంగస్థలం సినిమాను వీక్షించారు. రామ్ చరణ్‌ను చూసిన అభిమానులు కేరింతలు పెట్టారు. తమ అభిమాన హీరోతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.

 

 

22:03 - March 30, 2018

ఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశాలు నేటి ముగిసాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పార్టీ సమీక్షించింది. త్రిపురలో బిజెపి అధికారంలోకి వచ్చాక వామపక్షాలపై దాడులు పెరిగిపోయాయని... సిపిఎం కార్యాలయాలను బిజెపి ఆక్రమిస్తోందని, కార్యకర్తల ఇళ్లను లూటీ చేస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న మతపరమైన అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అల్లర్ల వెనక కేంద్రమంత్రుల ప్రమేయం ఉందని ఏచూరి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. వీటికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. 

 

21:59 - March 30, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో రెండు వారాలుగా అవిశ్వాస తీర్మానాలను చర్చకు రాకుండా చేయడం అప్రజాస్వామికని సిపిఎం తెలిపింది. కేంద్రం తప్పించుకునే ధోరణి అవలంబిస్తోందని మండిపడింది. హౌజ్‌ ఆర్డర్‌లో లేనపుడు ఫైనాన్స్‌ బిల్లు ఎలా పాస్‌ చేస్తారని కేంద్రాన్ని ఏచూరి ప్రశ్నించారు. అవిశ్వాసం పెడితే ఓటమి చెందుతామనే భయం బిజెపిలో నెలకొందని ఆయన అన్నారు. మమతా, కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఇపుడే ఏం చెప్పలేమని...ఎన్నికల సమయంలో పరిస్థితి వేరుగా ఉంటుందని చెప్పారు

21:56 - March 30, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ కాగ్‌ ఇచ్చిన నివేధిక విపక్షాలకు ఆయుధంగా మారింది. కాగ్‌ రిపోర్టును పట్టుకుని ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలు పెట్టాయి. కాగ్‌ ప్రస్తావించిన పాలకపక్షం తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అప్పులను కూడా ఆస్తులుగా బడ్జెట్‌లోచూపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ముందుకు సాగుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో చోటు చేసుకుంటున్న లోపాలను కాగ్‌ నివేదిక ఎత్తి చూపింది. ఇప్పుడు ఈ నివేదకను ఆయుధంగా చేసుకుని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిన విషయాన్ని కాగ్‌ ప్రస్తావించింది. నత్తనడకన సాగుతున్న పథకాలు, కాంట్రాక్టర్లకు అధిక చెల్లింపులు, జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలో రాజ్యమేలుతున్న అవినీతిని కాగ్‌ బట్టబయలు చేసిన విషయాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి గుర్తు చేస్తున్నారు.  

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కాగ్‌ వేలెత్తి చూపిన విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో తెస్తున్న అప్పుల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధమని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సవాల్‌ విసిరారు. కాగ్‌ రిపోర్టుపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ, మండలిని సమావేశపరచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులను కూడా ఆదాయంగా చూపిన టీఆర్‌ఎస్‌ సర్కారు వైఖరిని బీజేపీ తప్పు పట్టింది. ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిందని కాగ్‌  ప్రస్తావించిన విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ గుర్తు చేశారు. 


మిషన్‌ భగీరథ పనుల్లో నాణ్యత లోపించిందని కాగ్‌ ప్రస్తావించిన విషయాన్ని తెలంగాణ టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. కాగ్‌ నివేదిక రాష్ట్రానికి చెంపపెట్టని  ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తాము చేస్తున్న అవినీతి ఆరోపణలు వాస్తవమని నివేదిక ద్వారా రుజువైందని విపక్ష నేతలు చెబుతున్నారు. కాగ్‌ రిపోర్టుపై రేగుతున్న రాజకీయ దుమారాన్ని టీఆర్‌ఎస్‌ పాలకులు, నాయకులు ఎలా చల్లపరుస్తారో చూడాలి. 

21:50 - March 30, 2018

హైదరాబాద్ : గిరిజన తండాల్లో ఇక నుంచి మీరే నాయకులని లంబాడా ప్రతినిధులనుద్దేశించి అన్నారు సీఎం కేసీఆర్‌. తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించినందుకు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన పంచాయతీరాజ్‌చట్టం ప్రకారం రాష్ట్రంలో 3 వేల మంది గిరిజనులు సర్పంచులుగా ఉండే అవకాశం ఉందని... అందరూ కలిసి నూతన గిరిజన గ్రామపంచాయతీలను అభివృద్ధి చేసుకుంటే... పేదరికం తొలగిపోతుందన్నారు సీఎం. తెలంగాణలో గిరిజనులు గొప్పగా ఉన్నారనే పేరు తెచ్చుకోవాలన్నారు.

21:45 - March 30, 2018

ఢిల్లీ : సీబీఎస్‌ఈ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ అంశం.. దేశాన్ని అట్టుడికిస్తోంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. విద్యార్థులతో కలిసి.. ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. మరోవైపు.. ప్రశ్న పత్రాల లీకీజీ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిబిఎస్‌ఈ ఛైర్మన్‌కు ఈ మెయిల్‌ పంపిందెవరో తేల్చేందుకు పోలీసులు గూగ్‌ల్‌ని ఆశ్రయించారు. లీకైన పదవ తరగతి గణితం, 12 వ తరగతి అర్థశాస్త్రం పరీక్షలను సీబీఎస్ ఈ మళ్లీ నిర్వహిస్తోంది. 12వ ఎకనామిక్స్‌ ఎక్జామ్ ఏప్రిల్‌ 25న దేశవ్యాప్తంగా జరుగుతుంది. టెన్త్‌ మ్యాథ్య్‌ ఎక్జామ్‌ను కేవలం ఢిల్లీ, హర్యానాలో జులైలో నిర్వహించనున్నట్లు సిబిఎస్‌ఈ ప్రకటించింది.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై నిరసనలు హోరెత్తుతున్నాయి. సిబిఎస్‌ఈ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సిబిఎస్‌ఈ విఫలమైందని విద్యార్థులు ఆరోపించారు. సిబిఎస్‌ఈ చేసిన తప్పులకు తాము ఎందుకు బలిపశువులు కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.  

సీబీఎస్ ఈ పదవ తరగతి గణితం, 12 వ తరగతి అర్థశాస్త్రం ప్రశ్నపత్రాలు సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ అవడం.. మోదీ ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 28 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఇబ్బందుల్లో పడిందని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. 

ఇది పూర్తిగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ వైఫల్యమేనని, ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. మరోవైపు.. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఇంటి వద్ద భద్రత పెంచారు. 144 సెక్షన్‌ విధించారు.

ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఎస్‌ఈ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ను ఢిల్లీ పోలీసులు 4 గంటల పాటు ప్రశ్నించారు.  ఎగ్జామ్ ఇంచార్జీతో పాటు మరో ఇద్దర్ని పోలీసుల్ని విచారిస్తున్నారు.  ఈ కేసులో ఢిల్లీకి చెందిన కోచింగ్ సెంటర్‌లోని ట్యూటర్లు, విద్యార్థులతో పాటు మొత్తం 45 మందిని పోలీసులు విచారించారు. 2 డజన్ల మొబైల్‌ ఫోన్లను జప్తు చేశారు. దీంతోపాటే.. సీబీఎస్‌ఈకి వచ్చిన చేతిరాత ప్రశ్నాపత్రాలు ఏ ఈమెయిల్‌ ఐడీ ద్వారా వచ్చాయనే దానిపైనా క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు దృష్టి సారించారు. ఇ-మెయిల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. 

సుమారు 1000 మంది విద్యార్థులకు లీకైన పేపర్లు అంది ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. లీకైన ప్రశ్నా పత్రాలను విద్యార్థులకు 35 వేల రూపాయల దాకా విక్రయించినట్లు చెబుతున్నారు. పేపర్లు కొన్న పేరెంట్స్.. మళ్లీ వాటిని మరికొందరికి 5 వేలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఎగ్జామ్‌కు రెండు రోజుల ముందే సీబీఎస్‌ఈతో పాటు పోలీసులకు కూడా పేపర్లు లీకైనట్లు తెలుసని క్రైం పోలీసులు తెలిపారు.

21:39 - March 30, 2018
21:38 - March 30, 2018

కడప : ఒంటిమిట్టలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి ముగ్గురు మృతి చెందారు. పులువురికి గాయాలు అయ్యాయి. వడగళ్లు, ఈదురు గాలులతో రేకులు, చలువ పందిళ్లు ఎగిరిపడ్డాయి. వడగళ్ల వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కడప ఆర్ ఆండ్ బీ గెస్ట్ హౌజ్ లో సీఎం చంద్రబాబు ఉండిపోయారు. మృతుల్లో ఒంటిమిట్టకు చెందిన మహిళ, బద్వేలు పట్టణానికి చెందిన ఒకరు ఉన్నారు. 

ఒంటిమిట్టలో భారీ వర్షం

కడప : ఒంటిమిట్టలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి ముగ్గురు మృతి చెందారు. పులువురికి గాయాలు అయ్యాయి. వడగళ్లు, ఈదురు గాలులతో రేకులు, చలువ పందిళ్లు ఎగిరిపడ్డాయి. వడగళ్ల వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

21:00 - March 30, 2018

హైదరాబాద్ నడిబొడ్డున మైనర్ బాలిక ప్రేమోన్మాదానికి బలైంది... ఈ ఒక్క సంఘటనేకాదు ఈమధ్య కాలంలో భాగ్యనగరంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. చుట్టూ పోలీసుల పహారా, రక్షణకు షీటీమ్స్ ఉన్నా... రాజధానిలో మహిళలపై దాడులు జరుగుతున్నాయంటే ప్రేమోన్మాదం ఎంత సృతిమించుతుందో అర్థం చేసుకోవచ్చు... ప్రస్తుతం ఈ ఘటన స్త్రీకి ఉన్న రక్షణ ఎంత అని పాలకులను ప్రశ్నిస్తుంది. ఇదే అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ప్రేమోన్మాదుల దాడులపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి పాల్గొని, మాట్లాడారు. సమగ్రమైన యూత్ పాలసీ కావాలని సామాజిక కార్యకర్త దేవి అన్నారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని చెప్పారు.
ఆ వివరాలను ఆమె మాటల్లోనే...
బాలికలకు భ్రదత కల్పించడమంటే ఇంటికో కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయడం కాదు. చట్టం చేయడం కాదు.. వాటిని అమలు చేసి చూపించాలి. బాల్య వివాహాల చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. స్త్రీలకు సబంధించిన ఏ ఒక్క చట్టాన్ని అమలు చేయడం లేదు. సత్వరంగా జరగని న్యాయం... న్యాయం కాకుండా పోతుంది. ప్రతిస్థాయిలో రాజకీయ జోక్యం ఉంటుంది. పోలీసు స్టేషన్ లో రాజకీయ దళారులు కూర్చుంటారు. చట్టం దాదాపు పనిచేయకుండా ఉంటుంది. చట్టం గురించి జనం పట్టించుకోవడం లేదు. నేరస్తుడు, బాదితుడు చట్టాలను నమ్మడం లేదు. నీతిబోధల వల్ల సమాజం మారదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

జేపీ విమర్శలపై స్పందించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : జయప్రకాశ్ నారాయణ విమర్శలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. నిజనిర్ధారణ విషయంలో పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదన్న జేపీ వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. విభజన హామీలపై నిజనిర్ధారణకు మరో కమిటీ వేయాలన్న జేపీ నిర్ణయం హర్షణీయమన్నారు.

20:46 - March 30, 2018

తెలంగాణల పరిపాలన తెర్లు తెర్లు...లెక్కలతోని బైటవెట్టిన కాగ్ రిపోర్టు, జిల్లాల పొంట సుర్వైన రైతు ఉద్యమాలు..అప్పుల బాధకు మరో అన్నదాత ఉరి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ దీక్షలు విరమణ...మాటతప్పిన ప్రభుత్వం మీద మరో పోరు, ఏశిన అద్దగంటకే శిలాఫల్కం గూల్చిన జనం.. మెదక్ నియోజక వర్గంల తిర్గవడ్డ దళితులు, తాగునీళ్ల కోసం ప్రకాశం జిల్లాల తన్లాట...కోపంతోని రాత్రిపూట రోడ్డెక్కిన మహిళలు, ఉత్సవ విగ్రహాలే అయ్యిన ఎంపీటీసీలు...నిధిలియ్యలేదని సీఎం బొమ్మకు ఉరి...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:43 - March 30, 2018

కేంద్రం అలసత్వంతోనే సీబీఎస్ఈ ప్రశ్నపత్రాలు లీకేజీ అయినవని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విద్యరంగా నిపుణులు నారాయణ, ఎస్ ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర్ రావు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, హెచ్ ఎస్ పీఏ ప్రతినిధి కృష్ణ జక్క, బాధితుడు కార్తీక్ పాల్గొని, మాట్లాడారు. సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రి, బాధ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

20:02 - March 30, 2018

మెదక్‌ : జిల్లాలోని నర్సాపూర్‌ సమీపంలోని బీవీఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో 21వ వార్షికోత్సవం సందర్భంగా జీలాట్జ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ఐడల్ గాయకుడు రేవంత్‌ తన పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. అనంతరం సన్‌బర్న్‌ డీఏ ఎంకే షిఫ్ట్‌ పాటలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. సంగీతానికి అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఎంజాయ్‌ చేశారు. 

19:59 - March 30, 2018

విజయవాడ : సీపీఎం సీనియర్‌ నాయకురాలు, మహిళా ఉద్యమనేత దండమూరి భిక్షవతి అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుడూ భిక్షవతి కన్నుమూశారు. సీపీఎం కార్యాలయంలోని శ్రీశ్రీ భవన్‌లో ఉంచిన ఆమె భౌతికకాయాన్ని పార్టీ కార్యకర్తలు, మహిళలు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి కృష్ణలంకలోని స్మశానవాటికు అంతిమయాత్రగా వెళ్లి... అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా... భిక్షవతి ఆశయాల సాధన దిశగా కృషి చేస్తామని మహిళా నేతలు నినాదాలు చేశారు. 

 

19:57 - March 30, 2018

జనగామ : జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గుడ్‌ ఫ్రై డే సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య సిలువ యాత్రలో పాల్గొన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ లోని తలకాయల గుట్టపై ప్రతిఏట సిలువ పాతడం ఆనవాయితీ. అయితే అక్కడ మూడు సంవత్సరాలుగా నిషేధం ఉండడంతో ప్రభుత్వం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో గుట్టవైపు వెళ్లకుండా భక్తులను, ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి నియోజక వర్గంలో పోలీస్‌ ఎస్కార్ట్‌ లేకుండా పర్యటిస్తానన్నారు.

19:55 - March 30, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లోని ఎఎమ్సీలో... యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. సివిల్‌ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రైతులతో స్నేహపూరితంగా ఉండాలని మంత్రి రైస్‌ మిల్లర్లకు సూచించారు. మద్దతు ధర కన్న తక్కువ ధరకు కొనవద్దని చెప్పారుమంత్రి.

 

19:52 - March 30, 2018

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతోనే దేశ విదేశాల్లోని తెలుగువారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. దేశంలో కేంద్రప్రభుత్వంపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌ ఇందిరాగాంధీని ఢీ కొంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని ఢీ కొట్టాడన్నారు.

19:48 - March 30, 2018

విజయవాడ : రాజీనామాల పేరుతో వైసీపీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని టీడీపీ విమర్శించింది. గతంలో పలుమార్లు రాజీనామాలు ప్రకటించిన వెనక్కి తగ్గిన విషయాన్ని ఆ పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు గుర్తు చేశారు. 

19:44 - March 30, 2018

హైదరాబాద్ : విభజన హామీలపై పవన్‌కళ్యాణ్‌కు శ్రద్ధ తగ్గిందని.. జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. అందుకే తాను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మాజీ అధికార్లతో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశానని తెలిపారు. విభజన హామీలపై పవన్‌ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ -జెఎఫ్‌సీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి.. ఈరకంగా వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది. 
స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు 
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎస్‌ కాకి మాధవరావు, పద్మనాభయ్య, ప్రొఫెసర్‌ గలాబ్‌, రాఘవాచారీ, శాంతాసిన్హా, హెచ్‌ఏ దొరతో కలిసి 15 మంది ఉన్నారు. విభజన హామీల కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ మొదటి దశ అయితే... తాము ఏర్పాటు చేసిన ఈ కమిటీ రెండో దశ అన్నారు జేపీ. పవన్‌కల్యాణ్‌ మొదట చూపించినంత శ్రద్ద.. లెక్కలు తేలిన తర్వాత చూపించడం లేదని... అందుకే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు జేపీ వివరించారు. 
అమిత్‌షా లేఖను కమిటీ పరిశీలిస్తుందన్న జేపీ 
ఏపీకి 74 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు రావాల్సి ఉందని జేఎఫ్సీ తేల్చిందని... దీనిపై తమ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. విభజన చట్టం ప్రకారం చట్టబద్దంగా ఇంకా చాలా హామీలు అమలు చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంకెల తేడా కనిపిస్తోందన్నారు. అమిత్‌షా రాసిన లేఖపై కూడా తమ కమిటీ పరిశీలిస్తుందన్నారు. కేంద్ర పెద్దలు సమయమిస్తే ఢిల్లీ వెళ్లి అన్ని లెక్కలు అందజేస్తామన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి అనేది అన్ని రాష్ట్రాల సమస్య అని, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోయినా అందులో ఉన్న అంశాల సాధనకు కృషి చేయాల్సిన అవసరముందని... అందుకే రాష్ట్రానికి చెందిన నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు జేపీ. 
నెరవేర్చాల్సిన హామీలు చాలా ఉన్నాయి : జేపీ
ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొట్టమొదట తానే చెప్పానన్నారు జేపీ. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో కొన్ని హామీలు నెరవేర్చినా... ఇంకా చట్టబద్దంగా నెరవేర్చాల్సిన హామీలు చాలా ఉన్నాయని వాటిని సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. అయితే... ఇప్పుడు కావాల్సింది ఆరంభశూరత్వమో.. ఆవేశమో కాదని... ఆలోచించి సాధించుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ఆపి రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని జేపీ సూచించారు. మొత్తానికి విభజన హామీల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో... పవన్‌ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ -జెఎఫ్‌సీలో సభ్యుడిగా ఉన్న జేపీ.. ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది. 

 

19:39 - March 30, 2018

ఢిల్లీ : సీబీఎస్‌ఈ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ అంశం.. దేశాన్ని అట్టుడికిస్తోంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. విద్యార్థులతో కలిసి.. ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. మరోవైపు.. ప్రశ్న పత్రాల లీకీజీ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిబిఎస్‌ఈ ఛైర్మన్‌కు ఈ మెయిల్‌ పంపిందెవరో తేల్చేందుకు పోలీసులు గూగ్‌ల్‌ని ఆశ్రయించారు.  
సిబిఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఎన్‌ఎస్‌యూఐ నిరసన 
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై నిరసనలు హోరెత్తుతున్నాయి. సిబిఎస్‌ఈ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సిబిఎస్‌ఈ విఫలమైందని విద్యార్థులు ఆరోపించారు. సిబిఎస్‌ఈ చేసిన తప్పులకు తాము ఎందుకు బలిపశువులు కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.  
మోదీ ప్రభుత్వ వైఫల్యమే : విపక్షాలు 
సీబీఎస్ ఈ పదవ తరగతి గణితం, 12 వ తరగతి అర్థశాస్త్రం ప్రశ్నపత్రాలు సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ అవడం.. మోదీ ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 28 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఇబ్బందుల్లో పడిందని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ వైఫల్యమేనని, ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. మరోవైపు.. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఇంటి వద్ద భద్రత పెంచారు. 144 సెక్షన్‌ విధించారు.
ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం 
ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఎస్‌ఈ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ను ఢిల్లీ పోలీసులు 4 గంటల పాటు ప్రశ్నించారు.  ఎగ్జామ్ ఇంచార్జీతో పాటు మరో ఇద్దర్ని పోలీసుల్ని విచారిస్తున్నారు.  ఈ కేసులో ఢిల్లీకి చెందిన కోచింగ్ సెంటర్‌లోని ట్యూటర్లు, విద్యార్థులతో పాటు మొత్తం 45 మందిని పోలీసులు విచారించారు. 2 డజన్ల మొబైల్‌ ఫోన్లను జప్తు చేశారు. దీంతోపాటే.. సీబీఎస్‌ఈకి వచ్చిన చేతిరాత ప్రశ్నాపత్రాలు ఏ ఈమెయిల్‌ ఐడీ ద్వారా వచ్చాయనే దానిపైనా క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు దృష్టి సారించారు. ఇ-మెయిల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. 
1000 మంది విద్యార్థులకు లీకైన పేపర్లు ? 
సుమారు 1000 మంది విద్యార్థులకు లీకైన పేపర్లు అంది ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. లీకైన ప్రశ్నా పత్రాలను విద్యార్థులకు 35 వేల రూపాయల దాకా విక్రయించినట్లు చెబుతున్నారు. పేపర్లు కొన్న పేరెంట్స్.. మళ్లీ వాటిని మరికొందరికి 5 వేలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఎగ్జామ్‌కు రెండు రోజుల ముందే సీబీఎస్‌ఈతో పాటు పోలీసులకు కూడా పేపర్లు లీకైనట్లు తెలుసని క్రైం పోలీసులు తెలిపారు.

 

19:33 - March 30, 2018

సుకుమార్ లాంటి విలక్షణ డైరెక్టర్ ..రామ్ చరణ్ లాంటి మాస్ హీరోతో రంగస్తలం అనే క్లాసీ టైటిల్ ఎనౌన్స్ చెయ్యగానే అంతా ఆశ్చర్యపోయారు.ఇక మొదటి టీజర్ నుంచి  లాస్ట్ సాంగ్ వరకూ అన్నీ ఆడియన్స్ ఊహలకు మించి ఉండడంతో అంచనాలు తారా స్తాయికి చేరాయి. అలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకొచ్చింది రంగస్తలం. మరి అనుకున్నట్లుగా ఈ సినిమా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిందా..? లేక మిస్ ఫైర్ అయ్యిందా అన్నది ఇప్పుడు చూద్దాం. 
కథ..
సినిమా కథ విషయానికొస్తే..రంగస్తలం అనే ఊరిలో 30 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా ఉంటూ,,,అక్రమాలు, అన్యాయాలు చేస్తూ..అమాయక ప్రజలను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఎదురులేని వ్యక్తిగా చలామణి అవుతాడు ఫణీంద్రభూపతి. అతని మీద ప్రెసిడెంట్ గా పోటీ చేద్దామనుకున్నవాళ్లను దారుణంగా చంపేస్తాడు.  అయితే అదే ఊర్లో ఈ అక్రమాలను చూసిన చిట్టిబాబు అన్న కుమార్ బాబు..ప్రెసిడెంట్ పదవి కోసం నామినేషన్ వేస్తాడు.చిట్టిబాబు సాయంతో కుమార్ బాబు ఎన్నికలకు రెడీ అవుతాడు. కానీ  కుమార్ బాబును కూడా కొంతమంది హత్య చేస్తారు. ఇంతకీ కుమార్ బాబును చంపిందెవరు..? ఈమిస్టరీని చిట్టిబాబు ఎలా చేధించాడు..? చివరికి రంగస్తలానికి  కొత్త ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికయ్యారు వంటి ఆసక్తికర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు..
నటీనటుల విషయానికొస్తే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రంగస్తలం మెమరబుల్ గిఫ్ట్ గా మిగిలిపోయే సినిమా.  ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ జీవించాడనే చెప్పాలి.  చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. నటనలో ఈజ్, చిట్టిబాబు క్యారెక్టర్ని చరణ్ ఓన్ చేసుకున్న విధానం , సూపర్బ్ అనిచెప్పొచ్చు.  చిట్టిబాబు క్యారెక్టర్ ద్వారా రంగస్తలానికి ప్రాణం పోసిన చరణ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. ఇక రామలక్ష్మి పాత్రలో కనిపించిన సమంత.. పల్లెటూరి అమ్మాయి పాత్రలో  ఒదిగిపోయింది. చరణ్, సమంతల జోడీ మాత్రం బాగా సెట్ అయ్యింది. రంగమ్మత్తగా అనసూయ  ఫుల్ లెన్త్ స్ట్రాంగ్ రోల్ దక్కింది. అనసూయలోని అసలు నటి ఈ సినిమాలో కనిపించింది.  ఈ మధ్య విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో  మెప్పిస్తున్న ఆది పినిశెట్టి..ఈ సినిమాలో చేసిన కుమార్ బాబు పాత్ర సినిమాకు ప్లస్ అయ్యింది. చరణ్ కు అన్నగా, ఎడ్యుకేటెడ్ సిటిజన్ గా తన నటనతో మెప్పించాడు ఆది పినిశెట్టి. జగపతి బాబు తన విలనిజంతో 80 ల కాలం నాటి పాత ప్రతినాయక పాత్రలను గుర్తుకుతెచ్చాడు.  ఇక జబర్దస్త్ మహేష్ కి త్రూ ఔట్ క్యారెక్టర్ దక్కింది. జిగేల్ రాణి గా పూజా హెగ్డే  పర్ఫామెన్స్ ఓకే అనిపించినా,, మాస్ జనాలకుమాత్రం ఫుల్ గా కిక్కిచ్చేలా ఉంది. ఇక ప్రకాష్ రాజ్ తో సహా.. మిగతా నటీనటులంతా పాత్రల పరిధి మేరకు డీసెంట్ గా పర్ఫామ్ చేశారు.
టెక్నీషియన్స్..    
టెక్నీషియన్స్ విషయానికొస్తే..తన డీటెయిలింగ్ తో  పాత్రల డిజైనింగ్ తో , రియలిస్టిక్ అప్రోచ్ తో ..హీరోలకు ఫేవరెట్ డైరెక్టర్ గా మారిన సుకుమార్ ..ఈ సినిమా బ్యాక్ డ్రాప్ తోనే అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే పాత్రలు క్రియేట్ చేసి ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ తో  ఆడియన్స్ ని మెప్పించాడు. కాకాపోతే..సినిమా లెన్త్ మరీ ఎక్కువగా ఉండడంతో ఓవర్ డీటెయిలింగ్, సెకండాఫ్ లాగింగ్ సీన్స్, డ్రమటిక్ క్లైమాక్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలవాల్సిన రంగస్తలానికి స్పీడ్ బ్రేకర్స్ వేశాడు. 1980 నాటి సెటప్ ను రీ క్రియేట్ చెయ్యడంలో మాత్రం ఆర్ట్ డైరెక్టర్ అండ్ సుకుమార్ ల కృషిని మెచ్చుకుని తీరాల్సిందే. ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. ఫస్ట్ సింగిల్ నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు బిగ్గెస్ట్ సపోర్ట్ గా నిలిచాడు. పాటలతో ఆల్రెడీ జనాలను శాటిస్ఫై చేసిన దేవీ,, ఆర్,ఆర్ లో సైతం అదేరేంజ్ అఫర్ట్ పెట్టాడు.  ఇక కెమెరా మెన్ రత్నవేల్  ప్రతిభ, అంకితబావం ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. చిన్న చిన్న ఎమోషన్స ని కూడా అద్భుతంగా కాప్చర్ చేశాడు. ఎమోషన్స్ అన్నింటినీ పర్ ఫెక్ట్ గా ఎలివేట్ చెయ్యడంలో తన 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాడు. ఇక ఫైట్ మాస్టర్ రామ్, లక్ష్మణ్ లుకూడా ఎక్కడా ఓవర్ స్టెప్పింగ్ లేకుండా రియలిస్టిక్ ఫైట్స్ తో సినిమాకు ఫుల్ ఫిల్ మెంట్ ఇచ్చారు. ఎడిటర్ నవీన్ నూలి.. సినిమా నిడివి తగ్గించడానికి ఇంకాస్త్ ఫ్రీ హ్యాండ్ తీసుకుని ఉంటే బావుండేది. మిగతా టెక్నీషియన్స్ అందరూ..సుకుమార్ విజన్ లో రంగస్థలం రక్తి కట్టడానికి తమవంతు పని పర్ ఫెక్ట్ గా చేశారు. 
ఓవరాల్ గా...
ఓవరాల్ గా చెప్పాలంటే..ఒక మాసీ విలేజ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన రంగస్తలం..విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ..చాలా మంచి అనుభూతిని తిరిగి గుర్తు చేస్తుంది.  ఇంకో పక్క  క్లాస్ ఆడియన్స్..డిఫరెంట్ అటెంప్ట్ గా మాస్ ఆడియన్స్ కి చాలా చేరువగా.. రెండు విధాలుగా మెప్పించే విధంగా  రంగస్తలం ఉంది. కాకపోతే ఈసినిమా లెన్త్... రంగస్తలం సక్సెస్ రేషియోని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా మారడం  గమనించాల్సిన విషయం. బాక్సాఫీస్ పరంగా  టాలీవుడ్  కి కొత్త లెక్కలు  పరిచయం చేసే రేంజ్ లో రంగస్తలం ఉందనేది ఒప్పుకోవాల్సిన విషయం.
ప్లస్
రామ్ చరణ్ పర్ఫామెన్స్
1980 బ్యాక్ డ్రాప్
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
ఆర్ట్ వర్క్
మైనస్
సినిమా నిడివి
సెకండాఫ్ లాగ్స్

రేటింగ్.. 3.25

అవిశ్వాసంపై కేంద్రం భయపడుతోందన్న ఏచూరి

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనందుకే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 2 వారాలుగా టీడీపీ, వైసీపీలు కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను చర్చకు తీసుకురావడంలో కేంద్రం విఫలం అయిందన్నారు. అవిశ్వాసంపై కేంద్రం భయపడుతోందన్నారు. మిగతాపార్టీలతో పాటు తాము కూడా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇస్తున్నామని చెప్పారు. చర్చ జరిగితే ఏపీకి ప్రత్యేక హోదా హామీ సహా బీజేపీ వైఫల్యాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించలేదన్నారు. ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని తెలిపారు. 

ముగిసిన సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు

ఢిల్లీ : సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ముగిశాయి. పొలిట్ బ్యూరో రూపొందించిన పార్టీ సంస్థాగత ముసాయిదా నివేదికపై చర్చ జరిగింది. అఖిల భారత మహాసభల్లో నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ 18 నుంచి 22వరకు హైదరాబాద్ లో అఖిల భారత మహాసభలు జరుగనున్నాయి

ఒంటిమిట్ట చేరుకున్న సీఎం చంద్రబాబు

కడప : సీఎం చంద్రబాబు ఒంటిమిట్ట చేరుకున్నారు. సీతారాముల కళ్యాణంలో పాల్గొనేందుకు వెళ్లారు. కడప నుంచి రోడ్డుమార్గంలో సీఎం ఒంటిమిట్ట చేరుకున్నారు. 

18:50 - March 30, 2018

హైదరాబాద్ : గోల్నాకలో దారుణం జరిగింది. లాలాగూడ ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. తన ప్రేమను నిరాకరించిందని మూడు రోజుల క్రితం బాలికపై సొహైల్ అనే యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాలిక తీవ్రంగా గాయపడింది. 3 రోజులుగా ఉస్మానియాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.  

 

18:44 - March 30, 2018

నెల్లూరు : కపాడిపాలెంలో నిర్వహించిన గుడ్‌ ఫ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారాయణ. శాంతి, క్షమ, సోదర భావాలను ఏసుక్రీస్తు తన బోధనల ద్వారా ప్రపంచానికి సందేశామిచ్చారని మంత్రి అన్నారు. సంపాదించిన ప్రతి రూపాయిలో ఒక పైసా పేదలకు వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 

18:43 - March 30, 2018

సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయని అని అన్నారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ఆయన ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి.. మహదేవపూర్ మండలం మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు సోరెన్‌కు వివరించారు. అనంతరం అక్కడి నుంచి అన్నారం బరాజ్ పనులను కూడా సోరెన్ పరిశీలించారు. 

 

18:35 - March 30, 2018

కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీకి కోవర్టుగా మారారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు  విమర్శించారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సోనియాతో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలను ముందుకు రావడంలేదన్నారు. 

18:29 - March 30, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే.. గెలుస్తామో లేదోనన్న భయం.. కమలనాథుల్లో ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అందుకే పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరగకుండా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఎన్ డీఏ నుంచి ఇప్పటికే 2 పార్టీలు బయటకు వచ్చాయని.. మిగతా మిత్రపక్షాలు కూడా మోదీ పాలన పట్ల సముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. తమ అవిశ్వాస తీర్మానంపై సోమవారం నుండి పార్లమెంటులో చర్చకు పట్టుపడతామని ఏచూరి తెలిపారు. 

18:22 - March 30, 2018

ఢిల్లీ : సిబిఎస్‌ఈ పేపర్‌ లీక్‌పై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సిబిఎస్‌ఈ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ధర్నా చేపట్టింది. దీంతో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఇంటి వరకు విద్యార్థులు మార్చ్‌ నిర్వహించారు. పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న సిబిఎస్‌ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని పలు నగరాల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సిబిఎస్‌ఈ చేసిన తప్పులకు తాము ఎందుకు బలిపశువులు కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.  పేపర్‌ లీక్‌ వ్యవహారంలో సిబిఎస్‌ఈ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ను ఢిల్లీ పోలీసులు 4 గంటలు ప్రశ్నించారు. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ఇప్పటివరకు 30 మందిని పోలీసులు ప్రశ్నించారు. జార్ఖండ్‌లో ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. లీకైన పేపర్‌ 1000 మంది విద్యార్థులకు దొరికింది. మొదటి లీక్‌ పేపర్‌ను 35 వేలకు అమ్మారు. ఆ పేపర్‌ను ఇతరులకు 5 వేలకు అమ్ముకున్నారు. సీబీఎస్ ఈ పదవ తరగతి గణితం, 12 వ తరగతి అర్థశాస్త్రం ప్రశ్నపత్రాలు సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ అయిన విషయం తెలిసిందే. 

 

18:18 - March 30, 2018

ఢిల్లీ : క్రాంక్‌ఓక్స్‌ మౌంటెయిన్‌ బైకింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కెనడియన్‌ రైడర్‌ బ్రెట్‌ రీడర్ దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన మౌంటెయిన్‌ బైకింగ్‌ చాంపియన్‌షిప్‌గా పేరున్న క్రాంక్‌ఓక్స్‌లో బ్రెట్‌ రీడర్‌ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాణించాడు. ఏ మాత్రం తడబడకుండా కేవలం 3 ట్రయల్స్‌లోనే రికార్డ్ లెవల్లో రేటింగ్‌ పాయింట్స్‌ సాధించి టైటిల్‌ ఎగరేసుకుపోయాడు.  

18:15 - March 30, 2018

పంజాబ్ : మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూకు ఆదాయ పన్ను శాఖ వలలో చిక్కుకున్నారు. ట్యాక్స్‌ రిటర్న్స్‌కు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా సిద్ధూకు చెందిన రెండు బ్యాంక్‌ అకౌంట్లను అధికారులు సీజ్‌ చేశారు.  2014-15లో సిద్దూ దుస్తుల కోసం 28 లక్షలు, పర్యటన కోసం 38 లక్షలు, సిబ్బంది జీతాలకు 47 లక్షలు, పెట్రోల్‌,డీజిల్‌ కోసం 18 లక్షలు ఖర్చుపెట్టినట్లు ఐటీ రిటర్న్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆయా ఖర్చులకు సంబంధించిన బిల్లులను  సమర్పించడంలో సిద్ధూ విఫలమయ్యారు. ఈ అంశంలో సిద్ధూకు ఐటీ శాఖ మూడుసార్లు నోటీసులు జారీ చేసింది. బిల్లులను సమర్పించండి లేదా పన్ను కట్టండని ఆదాయపు పన్నుశాఖ స్పష్టం చేసింది.

 

17:55 - March 30, 2018

బీహార్ : మత ఘర్షణలతో బీహార్‌ అట్టుడుకుతోంది. గత రెండు వారాలుగా  భాగల్‌పూర్, ఔరంగాబాద్, సమస్తీపూర్‌, ముంగేర్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాజాగా అల్లర్లు నావాదా జిల్లాకు వ్యాపించాయి. రామనవమి తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలు ఇంకా చల్లారలేదు. అల్లరిమూకలు వాహనాలు, షాపులకు నిప్పు పెట్టాయి. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పది రౌండ్ల కాల్పులు జరిపారు. నావాదా జిల్లా కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ నియోజకవర్గం కావడం గమనార్హం. అల్లర్లు వ్యాపించకుండా అధికారులు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భద్రతా బలగాలను భారీగా తరలించారు.

17:52 - March 30, 2018

ఢిల్లీ : కర్నాటక ఎన్నికల్లో పోటీకి సీపీఎం సిద్ధమైంది. అభ్యర్థుల ఎంపిక తుదిదశకు చేరుకుంది. వామపక్ష కూటమిగా ఎన్నికల రంగంలోకి దిగుతోంది. బీజేపీని ఓడించడమే తమ  లక్ష్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. వామపక్ష కూటమి పోటీచేయని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించే అభ్యర్థులను బలపరుస్తామన్నారు. 
 

17:51 - March 30, 2018

ఢిల్లీ : సీబీఎస్ఈ పరీక్షల లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఉన్నత విద్యలో అవకతవకలు భారీగా జరిగాయని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఏచూరీ ఆరోపించారు.

 

17:47 - March 30, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. కాగ్‌ ఇదే విషయాన్ని బట్టబయలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న ఆర్థిక మోసాలను కాగ్‌ బయటపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. వివిధ ఏజెన్సీల నుంచి తెచ్చిన అప్పులను కూడా ఆదాయంగా చూపడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే చెల్లిందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. 

 

17:44 - March 30, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని టీపీసీసీ విమర్శించింది. ప్రాజెక్టుల పేరుతో తెస్తున్న అప్పుల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రాజెక్టుల్లోని డొల్లతనాన్ని కాగ్‌ వేలెత్తి చూపిందని, దీనిపై ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ సవాల్‌ విసిరారు. కాగ్‌ రిపోర్టుపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ, మండలిని సమావేశపరచాలని డిమాండ్‌ చేశారు.

 

17:42 - March 30, 2018

హైదరాబాద్ : బడ్జెట్‌ సమావేశాలు రాజ్యాంగబద్దంగా కాకుండా.. తూతూమంత్రంగా నిర్వహించారన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య. 40 పద్దులపై 30 రోజులపాటు చర్చ జరగాల్సి ఉండగా.. కేవలం ఒక్కరోజులోనే అనేక పద్దులపై చర్చ పెట్టారన్నారు. ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ప్రతిపక్షాలు ఏ సమస్యపై మాట్లాడినా.. ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు ఆర్‌.కృష్ణయ్య. 

17:40 - March 30, 2018

హైదరాబాద్ : జేఎఫ్ సీపై పవన్‌కళ్యాణ్‌ మొదట చూపించిన శ్రద్ధ తరువాత చూపించలేదని జయప్రకాశ్‌నారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన జేపీ... జేఎఫ్ సీపై మొదటి దశ అయితే.. స్వతంత నిపుణుల కమిటీ దానికి కొనసాగింపు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంకెల తేడా ఉందని.. వాటిని పరిష్కరించేందుకు సమాజంలోని నిపుణులైన వారితో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. చట్ట బద్దంగా అమలు కావాల్సిన హామీలు చాలా ఉన్నవని.. ప్రత్యేక హోదా రాకపోయినా అందులో ఉన్న అంశాల సాధనకు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఆవేశంగా కాకుండా... ఆలోచనతో అన్ని సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. దీనిపై అన్ని పార్టీలు ఎన్నికల డ్రామాలు ఆపాలన్నారు. 

 

గోల్నాకలో దారుణం

హైదరాబాద్ : నగరంలోని గోల్నాకలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని యువతికి ప్రియుడు నిప్పంటించాడు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ తబుస్సుమ్ మృతి చెందింది. ఎల్లుండి యువతి తబుస్సమ్ నిశ్చితార్థం. తబుస్సుమ్ తో మాట్లాడతానని వచ్చి అస్లామ్ నిప్పంచారు. కిరోసిన్ పోసి నిప్పంటించాడని తబుస్సుమ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. అస్లామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చే అవకాశం లేదన్న జేపీ

హైదరాబాద్ : జేఎఫ్ సీపై పవన్ మొదట చూపించిన శ్రద్ధ తర్వాత లేదని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. లెక్కలు వచ్చిన తర్వాత దానిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. అందుకే స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. జేఎఫ్ సీ మొదటి దశ అయితే.. స్వతంత్ర నిపుణల కమిటీ రెండో దశ అన్నారు. కేంద్రం సమయం ఇస్తే వెళ్లి కలుస్తామని చెప్పారు. ప్రత్యేకహోదాను తొలుత తెరపైకి తెచ్చింది తానేనని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదన్నారు. ప్రత్యేకహోదా రాదన్న విషయం రాజకీయ పార్టీలకు తెలుసు అన్నారు. అన్ని పార్టీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం పంప్ హౌస్ పనులను పరిశీలించిన మంత్రి హరీష్, హేమంత్ సోరెన్

పెద్దపల్లి : ధర్మారం మండలం నందిమేడారంలో కాళేశ్వరం పంప్ హౌస్ పనులను మంత్రి హరీష్ రావు, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ లు పరిశీలించారు. జాన్ నాటికి 3 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. 

16:49 - March 30, 2018

మహబూబ్ నగర్ : ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంబాలైన న్యాయవ్యవస్థ, పరిపాలన ఆధికార వ్యవస్థకు పాలమూరులో పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది. స్థల వివాదం వ్యవస్థల మధ్య చిచ్చుపెట్టింది. తమ తహశీల్దార్‌ కార్యాలయాన్ని కోర్టు భవనంగా మారిస్తే సహించేది లేదని రెవెన్యూ యంత్రాంగం ఆందోళన బాటపట్టింది. 
రెవెన్యూ యంత్రాంగం ఆందోళన బాట 
శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు తయారైంది పాలమూరు జిల్లా రెవెన్యూ సిబ్బంది పరిస్థితి. ప్రభుత్వ భూములను పరిరక్షించే రెవెన్యూ యంత్రాంగం ఇపుడు.. తమ కార్యాలయాన్ని కాపాడుకోడానికి ఆందోళనబాట పట్టింది. తమ తహశీల్దార్‌ ఆఫీసును కోర్టు భవనంగా మారిస్తే సహించేది లేదంటూ రెవెన్యూ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఇపుడు లాయర్లు వర్సెస్‌ రెవెన్యూ అధికారులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
లాయర్లు, రెవెన్యూ ఉద్యోగుల నిరసన
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద కోర్టు భవనలా సముదాయం ఉంది. దీనికి సమీపంలోనే అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం కూడా ఉంది. అయితే ఏన్నోఏళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు కార్యాలయ నిర్వహణ చాలిచాలని గదుల్లో నిర్వహిస్తూన్నారు. దీంతో ప్రక్కనే ఉన్న తహిల్దార్ కార్యలయాన్ని కోర్టుకు అప్పజేప్పాలన్న వాదనలు ఏన్నోఏళ్ళుగా కోనసాగుతు వస్తున్నాయి. ఆ వాదన తప్పుబడుతూ తమ కార్యలయాన్ని ఎట్టి పరిస్థితిలో అప్పగించేది లేదని రెవెన్యూ అదికారులు కూడ భిష్మించు కూర్చున్నారు. ఈ వివాదం తారస్థాయికి చేరడంతో అటు లాయర్లు.. ఇటు రెవెన్యూ ఉద్యోగులు నిరసనలకు దిగారు. లాయర్లు రెవెన్యూ ఆఫీసు ముందు ధర్నాకు దిగితే.. రెవెన్యూ ఉద్యోగులు కోర్టు కార్యాలయం ముందు ఆందోళనకు దిగడంతో.. వివాదం రచ్చకెక్కినట్టైంది. తహశీల్దార్‌ ఆఫీసు భవనాన్ని కోర్టుకు అప్పగించాలని లాయర్లు ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. 
రెవెన్యూ ఉద్యోగులు మెరుపు సమ్మె
లాయర్ల దీక్షకు కౌంటర్‌గా మహబూబ్‌నగర్‌ తహశీల్దార్‌ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు.  ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కార్యాలయాల ఏర్పాటు జరుగుతాయి కాని.. ఇలా ఫలానా ఆఫీసును తమకు కేటాయించాలని ఆందోళన చేయడం ఏంటని రెవెన్యూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరగకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన బాటపడతామని రెవెన్యూ యంత్రాంగం హెచ్చరిస్తోంది. మొత్తానికి సమస్యలను పరిష్కరించాల్సిన రెండు వ్యవస్థలు తమకు తామే సమస్యగా మారడం ఏంటన్న ప్రశ్నలు మహబూబ్‌నగర్‌ ప్రజల నుంచి వస్తున్నాయి. 
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయవ్యవస్థ, రెవెన్యూ డిపార్ట్‌ మెంట్‌ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.  

 

16:41 - March 30, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా పోరును భుజనా వేసుకునేందుకు జనసేనాని సిద్ధం అయ్యారా..? వామపక్షాలు లోక్‌సత్తాతో కలిసి ఉద్యమానికి కార్యాచరణ రూపొందించారా..? హోదా కోసం ఆమరణ దీక్ష అంటున్న పవన్‌.. వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారా..?  ఈ ప్రశ్నలకు జనసేన వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 
టీడీపీ, బీజేపీతో దోస్తీకి జనసేన చెక్‌ 
టీడీపీ, బీజేపీతో దోస్తీకి చెక్‌ చెప్పిన జనసేన అధినేత భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకోవాలని డిసైడయ్యారు. దీనికి సంబంధించి సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా పార్టీలతో కలిసి జిల్లాల వారిగా పర్యటన చేయాలి అని పవన్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాతంగా భారీ బహిరంగ సభలు పెట్టేందుకు  జనసేనపార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 
సభలు నిర్వహించడానికి జనసేన సిద్ధం 
అనంతపురం, ఒంగోలు, కాకినాడ, వైజాగ్ లలో సభలు నిర్వహించడానికి జనసేనపార్టీ సిద్ధం అవుతోంది. ఈ సభల ద్వారా ప్రత్యేక హోదా  వల్ల రాష్ట్రానికి వచ్చే లాభాలను ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు. ఉభయ మ్యూనిస్టుపార్టీలు, లోక్‌సత్తాతో కలి ఉద్యమాన్ని ఊరూవాడా విస్తరించాలని నిర్ణయించినట్టు  జనసేన వర్గాలు అంఉటన్నాయి. 
జిల్లా పర్యటన అనంతరం ఆమరణ దీక్ష 
జిల్లాలో పర్యటన ముగిసిన తర్వాత జనసేనాని ఇంతకు ముందే ప్రకటించినట్టు నిరాహార దీక్షకు దిగనున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ను చేస్తూ  అనంతపురం జిల్లా కేంద్రంగా పవన్ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారని జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీని వల్ల క్షేత్త్ర స్థాయిలో జనసేన కూటమి బలపడుతుందని  పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగడానికి ఇప్పటికే డిసైడైన జనసేన పార్టీ.. అనంతపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే పవన్‌ ఆమరణ దీక్షకు అనంపురాన్నే ఎంచుకున్నారన్న ప్రచారం జరగుతోంది. 
హోదా సాధనలో టీడీపీ, వైసీపీ, బీజేపీ విఫలం
ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ వైఫల్యం, వైసీపీ దోబూచులాట, బీజేపీ నమ్మక ద్రోహం చేసింది అని ఇప్పటికే పవన్‌ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో  తన నిరాహార దీక్ష ద్వారా ప్రత్యేక హోదా సాదించే సత్తా జనసేనకు మాత్రమే ఉంది అనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలకు దీటుగా క్షేత్రస్థాయిలో బలపడాలని పవన్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పవన్‌ దీక్ష తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.  

 

16:26 - March 30, 2018

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభంగా జరుగుతున్నాయి. వేసవితాపం నుంచి స్వామివారికి ఉపశమనం కలిగించేందుకు ప్రతి ఏటా వసంతోత్సవాలు నిర్వహిస్తారు.  ఇవాళ రెండో రోజు ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగారు.భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రేపు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. 

16:23 - March 30, 2018

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దంటూ ఆ సంస్థ కార్మికులు ఆందోళనకు దిగారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఏప్రిల్‌ 5వ తేదీన 2వేల 500 మందితో ర్యాలీ నిర్వహించనున్నట్లు కార్మికులు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు విలువైన పరిశ్రమలు, స్థలాలు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఈఏఎస్ శర్మ. ఈ మేరకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు మద్దతు తెలపాలని ఆయన సూచించారు. 

 

15:57 - March 30, 2018

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి వారు సంపూర్ణ మద్దుతు తెలిపారు. హోదాపోరులో బాసటగా నిలుస్తామన్నారు. అఖిలపక్షం పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఏప్రిల్‌ 6 వరకు టాలీవుడ్‌ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించింది. చంద్రబాబును కలిసిన వారిలో దర్శకులు కె.రాఘవేంద్రరావు, కెఎల్.నారాయణ, నిర్మాత అశ్వనీదత్ లు ఉన్నారు. 

15:53 - March 30, 2018

ఉత్తరప్రదేశ్‌ : దేవరియాలో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు అడిగిన పాపానికి కొందరు వ్యక్తులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ వీడియో కాస్తా వైరల్ అయింది. దేవరియాకు చెందిన బాధితుడు శంషాద్‌.. నాసిర్‌ అనే వ్యక్తికి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. తన బాకీ తీర్చాలని నాసిర్‌ను అడిగాడు. నాసిర్‌ నగదు తిరిగి చెల్లించకపోగా, అప్పు ఇచ్చిన శంషాద్‌ను ఇంటి నుంచి నగర శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి, చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు వీడియో ఆధారంగా నాసిర్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

15:41 - March 30, 2018

హైదరాబాద్ : వచ్చే నెల 13 నుంచి 22 వరకు స్ఫూర్తి ప్రొగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఫెస్ట్‌ నిర్వహించనున్నారు. విజ్ఞానం, వినోదంతోపాటు విభిన్న సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌ ఫెస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కరప్రతం, సీడీని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు. అనంతరం ప్రచార జాతాని ప్రారంభించారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌లో సాంస్కృతికోత్సవం, బాలోత్సవం, పుస్తక ప్రదర్శన, లఘు చిత్రాల ప్రదర్శన, ప్రభుత్వరంగ సంస్థల పెవిలియన్‌ ఉంటాయని చక్కా రామయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, హైదరాబాద్‌ ఫెస్ట్‌ గేయ రచయిత బాబ్జీ, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

15:39 - March 30, 2018

హైదరాబాద్‌ : నగరంలో నడిరోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. టోలీచౌక్‌ ఫ్లైఓవర్‌ నుండి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో ఇండికా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారులో నుంచి దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైర్‌ సిబ్బందికి సమాచారమివ్వడంతో... సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు. ఈ ఘటనలో కారు దగ్ధమైంది. 

15:37 - March 30, 2018

హైదరాబాద్ : ఉన్నత విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మహిళా విద్యాతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రాచీన కాలంలో కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని గుర్తు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన మహిళా దక్షత సమితి సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. మహిళ విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 

 

15:35 - March 30, 2018

విశాఖ : ఫిష్షింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫిష్షింగ్‌ హార్బర్‌ జెట్టి1లోని బోటు ఇంజన్‌ నుండి మంటలు చెలరేగడంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా బోటులో అగ్నిప్రమాదాలు జరగడంపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 

సీఎం చంద్రబాబును కలిసిన టాలీవుడ్ ప్రముఖులు

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబును టాలీవుడ్ ప్రముఖులు కలిశారు. ప్రత్యేకహోదాకు టాలీవుడ్ మద్దతు తెలిపింది. ప్రత్యేకహోదా పోరుకు సినీ పరిశ్రమ బాసటగా నిలచింది. విభజన హామీల అమలు కోసం చంద్రబాబు చేస్తున్న పోరుకు మద్దతు తెలిపింది. అఖిలపక్షం పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలతో టాలీవుడ్ నిరసన తెలిపింది. 

15:31 - March 30, 2018

విజయవాడ : ప్రత్యేకహోదాపై కేంద్రం దిగివచ్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు. బీజేపీ, టీడీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో ముఠా వర్కర్స్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ బైక్‌ ర్యాలీలో పాల్గొన్న బాబూరావును  ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.  ఎమ్మెల్యేల కుమారుల పుట్టినరోజు వేడుకలకు ర్యాలీలు తీసుకోవడానికి అనుమతించిన ప్రభుత్వం... ప్రత్యేకహోదా కోసం ర్యాలీ చేపడితే ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ప్రత్యేకహోదా కోసం ఎలాగో పోరాడటం లేదని.... తాము పోరాడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఉద్యమంలో చంద్రబాబు జీరో అని.... ప్రజలే అసలైన హోరోలన్నారు. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరచి హోదా కోసం చిత్తశుద్దితో పోరాటం చేయాలని డిమాండ్‌ చేశారు.

 

15:21 - March 30, 2018

హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్సిటీ బిల్లుపై విద్యార్థిలోకం భగ్గుమంటోంది. బిల్లును వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాంటూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలనే అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రైవేటు వర్సిటీ బిల్లుపై విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

15:11 - March 30, 2018

మంటల చెలరేగి కారు దగ్ధం

హైదరాబాద్ : నగరంలో నడిరోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నుంచి ప్రయాణికులు కారు దిగారు. మంటలు చెలరేగి కారు దగ్ధం అయింది. టోలీచౌకి ఫ్లైవోవర్ పై ఘటన చోటుచేసుకుంది.
ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలార్పారు. 

13:39 - March 30, 2018

విజయవాడ : సీపీఎం పార్టీ సీనియర్‌ నాయకురాలు, మహిళా ఉద్యమనేత దండమూడి భిక్షవతి ఇవాళ కన్నమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. భిక్షవతి పార్థీవదేహాన్ని సీపీఎం నేతల సందర్శనార్థం విజయవాడలోని శ్రీశ్రీ భవన్‌లు ఉంచారు. పలువురు సీపీఎం నాయకులు, వామపక్ష ఉద్యమ నేతలు ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మహిళా ఉద్యమంలో ఆమెపాత్ర మరువలేనిదంటూ కొనియాడారు. యువతులు, మహిళలు భిక్షవతి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. భిక్షవతి మహిళా ఉద్యమం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ఆమె భర్త డీవీ సుబ్బారావు కూడా ప్రజాఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు. 

13:38 - March 30, 2018

హైద‌రాబాద్ : మెట్రో రైల్ ప్రాజెక్టు.. మొదటి నుంచీ ప్రతి విష‌యం వివాదంగానే మారోతోంది. ఒక‌రు ప్రాజెక్టు హైద‌రాబాద్ హెరిటెజ్ ను ధ్వంసం చేసిందంటే... మ‌రోకరు ఇది అవీనీతికి కేరాఫ్ అడ్రస్ అంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆలైన్‌మెంట్‌ మార్చాలంటూ.... ఆస్తుల‌ను ర‌క్షించాలంటూ ఎవరికి వారు త‌మ ఆందోళ‌నలు నిర్వహించారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్టు వ‌ర‌కు మెట్రోను నిర్మిస్తామంటూ ప్రభుత్వం చేసిన నిర్ణయంతో మెట్రో మారో సారి కాంట్రవ‌ర్సీ అవుతోంది.

మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు చేసిన కేసీఆర్‌ ప్రభుత్వం
హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మొదటి నుంచీ ఎదో ఒక అంశంలో వివాదాలు వస్తూనే ఉన్నాయి. డిపిఆర్ రూప‌క‌ల్పన‌, ఆలైన్మెంట్ నిర్దార‌ణ‌లోనూ అన్ని అనుమాలే. ప్రభుత్వంపై నిత్యం విమర్శలే వస్తున్నాయి. కాంగ్రేస్ హ‌యంలో చెప‌ట్టిన హైదరాబాద్‌ మెట్రోరైల్ ప్రాజెక్టు.. అవీతినితీ అక్రమాల‌తో కూడుకున్నద‌ని అధికారంలోకి రాకముందు విమర్శించిన కేసీఆర్‌.. అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత పలు ప్రాంతాల్లో ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. దీనిపై రాజకీయపార్టీలు, ప్రజల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా 2వదశలో చేపట్టాల్సిన రూట్‌ను ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేసింది.

2 దశ మార్గాల అనుసంధానంపై సీటీఎస్ రిపోర్టు
కాంప్రెహెన్సీవ్ ట్రాన్ పోర్టు స్టడీ ప్రకారం రెండ‌వ దశ‌లో న‌గ‌రంలోని వివిధ మార్గాల‌ను మెట్రోతో అనుసంధానం చేయాలని గత ప్రభుత్వంలోనే నిర్ణయం జరిగింది. దీనివల్ల 2041నాటికి సిటిలోని ట్రాఫిక్ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని ప్లాన్స్‌ రూపొందించారు. అయితే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం మెట్రో అలైన్‌మెంటు అంటూ వారికి ఇష్టంమైన ఏరియాలకు రూట్‌ను మార్చేస్తున్నారని విపక్షపార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం జేబిజెస్ నుంచి ఫలక్‌నూమా వ‌ర‌కు ఉన్న మెట్రో కారిడార్‌లో సిబిఎస్ వ‌ర‌కు మాత్రమే నిర్మిస్తున్నారు. కాని సీబీఎస్‌ నుంచి పాతనగరం మీదుగా శంషాబాద్‌ వరకు నిర్మించాల్సిన మెట్రో మార్గాన్ని ఔట‌ర్ రింగ్‌ రోడ్డు వెంబ‌డి ఎందుకు నిర్మిస్తున్నారో ప్రభుత్వం స‌మాధానం చేప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు సిటీ నేతలు.

అధికారపార్టీ నేతల ప్రయోజనాలకే కొత్త రూట్‌ !
మెట్రో రైల్ రెండ‌వ దశ‌లో లేని మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నార‌నేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ప్రజలు ఎవరూ లేని.. ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో అధికారపార్టీ నేతలు, వారితాబేదార్ల ప్రయోజ‌నాలు త‌ప్పఇత‌రులేవ్వరికి ఉప‌యోగం లేదంటున్నారు సిటి నేత‌లు. ప్రభుత్వం ప్రక‌టించిన మెట్రో రెండ‌వ ద‌శ అవినీతి అక్రమాల‌కు చోటునిచ్చేలా ఉంద‌ని విమర్శలు వస్తున్నాయి. కొంద‌రు రియ‌ల్టర్లకు ల‌బ్ది చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ చ‌ర్యకు పూనుకున్నదనే ఆరోపణలు హైదరాబాద్‌ పబ్లిక్‌ నుంచి వస్తున్నాయి.  

13:37 - March 30, 2018

విజయవాడ : విజయవాడ నగరం త్వరలో గ్రేటర్ సిటీగా మారనుంది. నగర శివారు ప్రాంతాల్లోని 51 గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ విజయవాడగా రూపొందించడానికి ప్రభుత్వం తుది కసరత్తు చేపట్టింది. ప్రతిపాదిత పంచాయతీలు నోఅబ్జెక్షన్‌ తీర్మానాలతో సర్కార్‌కు నివేదికలు సమర్పించాయి. దీంతో త్వరితగతిన గ్రేటర్ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.

13 జిల్లాలకు సెంటర్‌ పాయింట్‌గా ఉన్న బెజవాడ..
ఏపీ నవ్యాంధ్ర రాజధానికి అత్యంత కీలకమైన బెజవాడను గ్రేటర్‌సిటీగా అవతరింపచేయాలని ప్రభుత్వ యంత్రాంగం శరవేగంగా పనులు చేస్తొంది. రాష్ట్రంలోనే 13 జిల్లాలకు విజయవాడ సెంటర్‌ పాయింట్‌గా ఉండడంతో రాకపోకలకు అనువుగా మారింది.

తగినంత జనాభా లేకపోవడంతో 51 గ్రామాల విలీనానిరి యత్నం..
గ్రేటర్‌ విజయవాడకోసం 29 గ్రామాలను విలీనం చేయాలని చూసినా.. గ్రేటర్ కార్పొరేషన్ స్థాయికి తగ్గ జనాభా లేకపోవడంతో 51 గ్రామాల విలీనానికి సర్కార్ మొగ్గుచూపుతోంది. ఈ అంశంపై 2018 మార్చి 24న మున్సిపల్ శాఖ మంత్రి గ్రేటర్ అంశాన్ని ప్రస్తావించారు. విజయవాడ నగరం ప్రస్తుతం విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీట్లర్లుండగా, ప్రతిపాదిత విలీన గ్రామాల విస్తీర్ణం 341.82 చదరపు కిలోమీటర్లుగా ఉంది. మొత్తం కలిపితే 403.7 చదరపు కిలోమీటర్లుగా మారుతుంది. దీంతో విజయవాడ మహానగరంగా మారుతుంది. విలీన గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు నగర యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. మరో వైపు గ్రేటర్‌ విజయవాడను అడ్డగోలుగా కాకుండా... శాస్ర్తీయంగా పద్ధతిలో ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు అంటున్నాయి.

బెజవాడలో కలువనున్న పలు మండలాలు..
ఇబ్రహీంపట్నం మండలంలోని.. ఇబ్రహీంపట్నంతోపాటు, కొండపల్లి, మల్కాపురం, గుంటుపల్లి, తుమ్మలపాలెం, పైడూరుపాడు గ్రామాలు గ్రేటర్‌లో విలీనం కానున్నాయి. అటు పెనమలూరు మండలంలోని.. పోరంకి, కానూరు, పెనమలూరు, గంగూరు, యనమలకుదురు, పెదపులిపాక గ్రామాలు గ్రేటర్‌లో భాగంకానున్నాయి. ఇక గన్నవరం మండలంలోని.. వేదురుపావులూరు, సవరగూడెం, జక్కులనెక్కలం, రామచంద్రాపురం, కేసరపల్లి, వి.నరసింహాపురం, అజ్జంపూడి, బుద్ధవరం, గన్నవరం, పురుషోత్తపట్నం, బీబీ గూడెం, చినఅవుటపల్లి, అల్లాపురం గ్రామాలు విలీనం జాబితాలో ఉన్నాయి. అటు కంకిపాడు మండలంలోని.. ఈడ్పుగల్లు, గోసాల, పునాదిపాడు, కంకిపాడు, వేల్పూరు, ఉప్పులూరు గ్రామాలు, విజయవాడ రూరల్ మండలంలోని.. గొల్లపూడి, రాయనపాడు, జక్కంపూడి, కొత్తూరు, షా బాద్, వేమవరం, తాడేపల్లిగ్రామాలు విలీనంకానున్నాయి. అలాగే విద్యాధరపురంలోని కొంతభాగం గ్రేటర్ లో కలపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సమస్యలు తలెత్తకుండా.. పటిష్ట చర్యలు..
వీఎంసీని గ్రేటర్ గా ప్రకటించిన తర్వాత పాలనాపరమైన సమస్యలు తలెత్తకుండా.. పటిష్ట చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. విజయవాడ సిటీని నాలుగు జోన్లుగాను.. అలాగే ప్రతిపాదిత విలీన గ్రామాల్లో ప్రధాన పంచాయతీలతోపాటు పరిసర గ్రామాలతో కలిపి మరో నాలుగు జోన్లుగానూ విభజించనున్నారు. కాగా...గ్రేటర్ లో గ్రామాలు విలీనమైతే పచ్చని పంట పొలాలు నాశనమవుతాయని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే .. గ్రేటర్ విజయవాడలో విలీనం అయిందుకు పలు శివారు గ్రామలు వ్యతిరేకిస్తున్నాయి.  

ఇదొక మెంటల్ సెల్ఫీ సూసైడ్..

విశాఖపట్నం : అనకాపల్లిలో ఓ విచిత్రమైన సెల్ఫీ సూసైడ్ జరిగింది. వివాహేతర సంబంధం బెడిసికొట్టిందని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని మనస్థాపంతో రాజశేఖర్ అనే యువకుడు సెల్ఫీ వీడియోలో అన్ని వివరాలనుతెలిపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ యువతితో వున్న వివాహేతర సంబంధం బెడిసికొట్టటంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపాడు. ఒక కుమారుడిగా, ఒక భర్తగా తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేకపోయాననీ..ఒక యువతి మాయలో పడి మోసపోయాననీ తల్లికి, భార్యకు వీడియోలో క్షమాపణలు తెలిపాడు. 

13:25 - March 30, 2018

పెద్దపల్లి : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనలో హరీశ్ రావు బిజీ బిజీగా గడిపారు. ఈ పర్యటనలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పనులను కూడా పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు సోరెన్‌కు వివరించారు.

13:15 - March 30, 2018

ఢిల్లీ : సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం పేపర్ లీక్ అవ్వటంతో విద్యార్ధులు పలు నగరాలలో ఆందోళన బాట పట్టారు. 1000మందికి పేపర్ లీక్ అయినట్లుగా సమాచారం. దీంతో సీబీఎస్ఈ కార్యాలయం ముందు విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. అనంతరం సీబీఎస్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్ధులు యత్నించటంతో పోలీసలు అడ్డుకుని వారిపై లాఠీచార్జ్ చేశారు. కాగా ఒకొక్క విద్యార్ధి వద్ద నుండి రూ.35వేలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 30మందిని సీబీఐ విచారించింది. సీబీఎస్ పదవ తరగతి గణితం, 12 వ తరగతి అర్థశాస్త్రం ప్రశ్నపత్రాలు సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ అవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పేపర్‌ లీక్‌ బయటపడడంతో లీకైన రెండు పేపర్లకు తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సిబిఎస్‌ఈ బుధవారం ప్రకటించింది. సిబిఎస్‌సి తీరును నిరసిస్తూ విద్యార్థులు జంతర్‌ మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.కాగా 12వ తరగతి అర్థశాస్త్రం పరీక్ష మార్చి 26న జరగ్గా, టెన్త్‌ గణితం పరీక్ష మార్చి 28న జరిగింది. పరీక్షలకు కొద్ది గంటల ముందుగా పదో తరగతి గణితం, పన్నెండో తరగతి అర్థశాస్త్రం ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియా ద్వారా లీక్ అయిన విషయం తెలిసిందే. ప్రశ్నాపత్రం లీక్ తో దేశంలోని పలు నగరాలలో విద్యార్దులు ఆందోళన బాట పట్టారు. జార్ఖండ్ లో ఆరుగురు విద్యార్ధులకు పోలీసులు అరెస్ట్ చేశారు. 

12:56 - March 30, 2018

కర్నూలు : టీడీపీలో అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి... మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి... తన పోరాటం అఖిలప్రియ మీదే అంటూ ఏవీ పబ్లిగ్గానే ప్రకటిస్తుంటే... తన తండ్రికి ప్రాణస్నేహితుడైన ఏవీ విషయంలో అఖిల ప్రియకూడా అంతే పట్టింపుతో ఉన్నారు.

అళ్ళగడ్డ టీడీపీలో విబేధాలు
కర్నూలు జిల్లా అళ్ళగడ్డ టీడీపీలో విబేధాలు రచ్చకెక్కాయి. మంత్రి అఖిలప్రియ వర్సెస్‌ ఏవీ సుబ్బారెడ్డి మధ్య కొంతకాలంగా అంతర్గత చిచ్చు ఇపుడు పతాక స్థాయికి చేరింది. తనను పిలవకుండా భూమా నాగిరెడ్డి వర్ధంతి సభ జరపడంపై ఏపీ సుబ్బారెడ్డి మండిపడుతున్నారు. భూమా కుటుంబానికి అత్యంత శ్రేయోభిలాషినైన తనను పలవకుంటే ఆయన ఆత్మకు శాంతించి ఉండదన్నారు ఏవీ. తన కుమార్తెతోపాటు పెరిగిన అఖిలప్రియ.. తనను గుంటనక్క అని సంబోధించడం బాధాకరమన్నారు.. ముప్పై ఐదేళ్ళుగా నాగిరెడ్డితో తనకున్న స్నేహాన్ని.. అఖిలప్రియ మూడు నిమిషాల్లోనే తెంచేసిందన్నారు. తన తండ్రి చనిపోతేనే ఏడవలేదన్న అఖిలప్రియను తానెలా ఏడిపించగలనంటూ ఎత్తిపొడిచారు.

పబ్లిక్‌ మీటింగ్‌ల్లో అఖిప్రియ సుబ్బారెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు..
ఈ పోరాటంలో మంత్రి అఖిలప్రియ కూడా ఏవీకి ఏమాత్రం తగ్గకుండా రాజకీయాన్ని రగిలిస్తున్నారు. వాస్తవానికి భూమా నాగిరెడ్డి మరణించినప్పటి నుంచే అఖిలప్రియ ఏవీని దూరంగా పెడుతూ వస్తున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లో ఇటు పబ్లిక్‌ మీటింగ్‌ల్లో కూడా అఖిప్రియ ఏవీ సుబ్బారెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి కర్నూలు టీడీపీలో భగ్గుమంటున్న అంతర్గతపోరుతో ఇటు టీడీపీతోపాటు అటు ప్రతిపక్షాల్లోనూ ఆసక్తికర చర్చకు తెరలేచింది. ఈ అంతర్గత చిచ్చును టీడీపీ ఆధిష్టానం ఎలా చల్లార్చుతుందనేది ఇపుడు కర్నూలు రాజకీయాల్లో ఆకస్తికగా మారింది.

12:55 - March 30, 2018

తమిళనాడు : కావేరి మేనేజింగ్‌ బోర్డును ఏర్పాటు చేసి తీరాల్సిందేనని నటుడు, మక్కల్‌ నీది మయ్యుం అధ్యక్షుడు కమల్‌ హసన్‌ స్పష్టం చేశారు. కావేరి నీటి విషయంలో కేంద్రంపై తమిళ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోతే జయలలితకు ద్రోహం చేసినట్లేనని అన్నారు. కావేరి బోర్డు విషయంపై త్వరలో ముఖ్యమంత్రి పళనిస్వామితో చర్చిస్తానని చెప్పారు. కావేరి బోర్డు ఏర్పాటు పై ఓటు రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. కావేరి బోర్డు కోసం రజనీకాంత్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. భోపాల్‌ ఉదంతం తమిళనాట చోటు చేసుకోవద్దంటే సెర్టిలైట్‌ ప్లాంట్‌ను అక్కడి నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

12:54 - March 30, 2018

వరంగల్‌ రూరల్‌ : వర్ధన్నపేటలో టీఆర్‌ఎస్‌ - కాంగ్రెస్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా రు. చెప్పులతో కొట్టుకున్నారు. వరంగల్‌ రూరల్‌లో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించడంతో వర్ధన్నపేటలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. బాణాసంచా పేల్చారు. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ ఏం అభివృద్ధి చేశారని క్షీరాభిషేకం చేస్తున్నారని కాంగ్రెస్‌ కార్యకర్త టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఓ టీఆర్‌ఎస్‌ కార్యకర్త కాంగ్రెస్‌ కార్యకర్తపై దాడికి దిగాడు. ఇష్టానుసారంగా చితకబాదాడు. దీంతో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య గొడవ చెప్పులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. అక్కడే ఉన్న నాయకులు ఇద్దరికి సర్థిచెప్పే ప్రయత్నం చెప్పినా వినిపించుకోలేదు. 

12:52 - March 30, 2018

శ్రీకాకుళం : ఎండ‌లు మండుతున్నాయి. గొంతులు ఎండుతున్నాయి. భానుడి భగభగ‌లకుకు ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు విల‌విల్లాడుతున్నారు. పేదోడి ఊటిగా పేరొందిన శ్రీ‌కాకుళం జిల్లా సైతం గ్రీష్మప్రతాపానికి మ‌ల‌మ‌ల‌మాడి పోతోంది. శ్రీ‌కాకుళం జిల్లాలో సూర్యుని తాపానికి జ‌నాలు అల్లాడి పోతున్నారు. ప‌గ‌టి ఉష్ణోగ్రత మునుపెన్నడూ లేనంత‌గా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉద‌యం 9గంట‌ల‌నుంచి సాయంకాలం 5గంట‌ల‌వ‌ర‌కు ప్రజ‌లు బ‌య‌ట‌కు రావాలంటే బ‌య‌ప‌డుతున్నారు.

38 డిగ్రీలకు పైగా ష్ణోగ్రతలు..
శ్రీ‌కాకుళంజిల్లా ఇచ్చాపురం, ప‌లాస‌, రాజాం, పాల‌కొండ‌, న‌ర‌స‌న్నపేట‌, కొత్తూరు, త‌దిత‌ర ప్రాంతాల‌లో సోమ‌,మంగ‌ళ‌, బుధవారాల్లో ఉష్టతాపం గ‌రిష్ఠంగా 38 డిగ్రీల‌కుచేరుకుంది. ఈ నేప‌ధ్యంలో మ‌ధ్యాహ్నం పూట‌ న‌గ‌రంలో క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ముఖ్యంగా ప‌రీక్షల కాలం కాడంతో.. విద్యార్థులు తప్పని సరిగా ఎండకు వెళ్లాల్సి పరిస్థి.. దీంతో పిల్లలకు ఎండదెబ్బ తుగులుందేమోనని తల్లిదండ్రులు హడిలిపోతున్నారు. ప‌రీక్షా కేంద్రాలు వ‌ద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని అధికారులను కోరుతున్నారు. మార్చి నెల‌లో స‌మ్మర్ ఎఫెక్ట్‌ ఇంతగా ఎక్కువ‌గా ఉంటే ఇక మేనెల‌లో పరిస్థిథి ఏంటని సిక్కోలు జిల్లా జనం ఆందోళనకు గురవుతున్నారు.  

12:50 - March 30, 2018

విశాఖపట్నం : అనకాపల్లిలో విషాదం నెలకొంది. మహిళ తనను అన్యాయం చేసిందండూ ఓ వ్యక్తి రైతుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చోడవరానికి చెందిన ఇలిశెట్టి రాజశేఖర్‌ అనే వ్యక్తి కొన్నాళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడు. ఇద్దరూ కలిసి వేరుగా కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లుగా వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో తనను రాజశేఖర్‌ వేధిస్తున్నాడంటూ ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనస్థాపం చెందిన రాజశేఖర్‌ అనకాపల్లి అండర్‌ బ్రిడ్జి దగ్గర రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణాలు వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రాజశేఖర్‌కు ఐదేళ్ల కిందటే రాణి అనే యువతిలో పెళ్లైంది. వీరిద్దరి పిల్లలు లేరు. దీంతో మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రాజశేఖర్‌ తనను క్షమించాల్సిందిగా తన అమ్మ, మామ, భార్యను కోరాడు.

12:49 - March 30, 2018

కరీంనగర్‌ : ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్‌ యూనివర్సిటీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

లల్లూను రైలెక్కించిన జార్ఖండ్ సర్కార్..

హైదరాబాద్ : పశుదాణా కుంభకోణం కేసులో జార్ఖండ్ లోని బిర్సాముండా జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించే వేళ, జార్ఖండ్ ప్రభుత్వ వైఖరి కొత్త వివాదానికి తెరలేపింది. లాలూకు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని వైద్యులు సలహా ఇచ్చిన తరువాత, ఆయన్ను విమానంలో పంపేంత డబ్బు తమ వద్ద లేదన్న జార్ఖండ్ ప్రభుత్వం, ఆయన్ను బలవంతంగా రైల్లో ఢిల్లీకి పంపింది. 

కాళేశ్వరం సందర్శనకు మంత్రి హరీశ్..

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు మంత్రి హరీశ్ రావు బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మంత్రి హరీశ్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు బయలుదేరారు. 

10:30 - March 30, 2018

హైదరాబాద్ : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేననే మాటలు ప్రస్తుత కాలంలో నిజమని రుజువు చేస్తున్నాయి. పవిత్రమైన భార్యాభర్తల బంధం కూడా దీనికి అతీతంగా లేదనే ఘటన నగరంలోని కుకట్ పల్లిలో చోటుచేసుకుంది. ఆస్తి తగాలతో తీవ్రంగా గొడపడిన ఓ భర్త భార్యనుఅతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశారు. హత్య చేసిన ఆనవాళ్లు దొరకకుండా వుండేందుకు సంఘటనాస్థలంలో కారంపొడి చల్లి పరారయ్యాడు. ఓ స్థలం విషయంలో తలెత్తిన తగాదా భార్య ప్రాణం తీసేంత వరకూ వెళ్లింది. గురువారం రాత్రి భార్య జయదేవి గొంతునులిమి భర్త శ్రీనివాస్ హత్య చేశారు. ఈ ఘటన రాఘవేంద్ర సొసైటీలో జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నట్లుగా తెలుస్తోంది. గతకొంతకాలం నుండి ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో వున్న భర్త శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

భార్యను హత్య చేసిన భర్త..

హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రాఘవేంద్రనగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య జయదేవి అలియాస్ దేవిని ఆమె భర్త శ్రీనివాస్ గొంతు నులిమి హత్య చేశాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మధ్య తగాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

దంపతుల ఆత్మహత్య..

జనగామ: అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈఘటన జనగామ మండలం సిద్దెంకి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆవుల నర్సిరెడ్డి, లక్ష్మి భార్య భర్తలు అప్పుల బాధతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిరుద్యోగుల దెబ్బకు రైల్వే పోస్టుల పెంపు..

ఢిల్లీ : దేశంలోని నిరుద్యోగులు చేసుకున్న దరఖాస్తులను చూసిన రైల్వే బోర్డు షాక్ అయ్యింది. దీంతో మరో 20 వేల పోస్టులను పెంచింది. ఫలితంగా మరికొంతమందికి నిరుద్యోగులకు ఊరట లభించినట్టు అయింది. రైల్వే నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రైల్వే బోర్డు ఇటీవల 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఉద్యోగార్థుల నుంచి ఏకంగా రెండు కోట్ల దరఖాస్తులు రావడంతో రైల్వే అధికారులు కంగుతిన్నారు. నిరుద్యోగులకు కొంత మేర అయినా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అదనంగా మరో 20 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.

ఈరోజు, రేపు మంటపెట్టనున్న ఎండలు..

హైదరాబాద్ : ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొడిగాలులు వీస్తుండటం, ఆకాశంలో మేఘాల జాడ లేకపోవడంతో నేడు, రేపు సాధారణ స్థాయికన్నా అధికంగా ఉష్ణోగ్రతలను నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సలహా ఇస్తున్నారు. హైదరాబాద్ లో నిన్న ఈ సీజన్ లోనే గరిష్ఠంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఆదిలాబాద్, మంచిర్యాల, రామగుండంలతో పాటు ఏపీలోని రెంటచింతల, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఎండ వేడిమి 40 డిగ్రీలను తాకింది. ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

దాదాపుగా పెన్నా బ్యారేజ్ పూర్తి : మంత్రి నారాయణ

శ్రీకాకుళం : పెన్నా బ్యారేజ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..పెన్నా బ్యారేజ్ దాదాపుగా పనులు పూర్తయ్యాయనీ..కాంక్రీటు పనులు, గేట్ల బిగించే పనుల్లో కొద్దిగా మిగిలివున్నాయన్నారు. మరో రెండు నెలల్లో బ్యారేజీని అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పరిస్థితిపైన పేచీ లోపల లాటూచి పడినట్లుగా తయారైందన్నారు. భారతీయ జగన్ పవన్ పార్టీలు రాష్ట్రాభివృద్ధికి సైంధవుల్లా తయారయ్యాయని మంత్రి నారాయణ విమర్శించారు. 

ఏనుగుల సంచారం..

శ్రీకాకుళం : బూర్జ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్న ఏనుగులు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కుప్పం నుండి రెండు ఏనుగులను తెప్పించి 'ఆపరేషన్' గజను అధికారులు ప్రారంభించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సూచించారు. 

09:36 - March 30, 2018

కడప : శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఒంటిమిట్ట రామాలయం ముస్తాబైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు.. పలువురు మంత్రులు హాజరుకానున్నారు. పుష్పాలు, విద్యుత్‌దీపాలతో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా చేసిన అలంకారాలు, స్వాగత తోరణాలు, రామనామ సంకీర్తనలతో మార్మోగుతోంది. ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి పదిగంటల మధ్య కళ్యాణం జరుగనుంది.

09:34 - March 30, 2018

అనంతపురం : ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంట్లో పెళ్ళి సందడి మొదలైంది. పరిటాల సునీత కుమార్తె స్నేహలత, మేనల్లుడు శ్రీహర్ష వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. గురువారం మంత్రి స్వగ్రామం వెంకటాపురంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో నిశ్చితార్థ జరిగింది. మే 5, 6 తేదీల్లో వివాహం జరగనున్న నేపథ్యంలో మంత్రి సునీత స్వగ్రామంలో ఇప్పట్నుంచే కళ్యాణ శోభనెలకొంది. 

09:25 - March 30, 2018

అమరావతి : ఏపీ అంటే అమరావతి, పోలవరమని... కొత్త భాష్యం చెప్పారు సీఎం చంద్రబాబు. ఏది ఏమైనా రాజధాని నిర్మాణాన్ని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతానన్నారు. పోలవరానికి అడ్డుపడితే మసైపోతారని విపక్షపార్టీలను చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరులో పార్టీ ఆవిర్భావ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు... జగన్‌, పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. 

09:04 - March 30, 2018

హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుట్ లో సెన్సేషనల్ రంగస్థలం సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే ట్రైలర్ తో, పాటలతో ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న రంగస్థలంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 5 గంటల నుండి బెనిఫిట్ షోలను ప్రదర్శిస్తున్నారు. దీంతో థియేటర్ల వద్ద మెగా అభిమానులు సందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం నుండి వెలువడిన ఈసినిమాలో హీరో హీరోయిన్లుగా మెగా వారసుడు రామ్ చరణ్, సమంతా నటించగా..కీలకపాత్రలో ప్రముఖ నటుడు జగపతిబాబు,ఆదిపినిశెట్టి, ప్రకాశ్ రాజ్ లు నటించారు. 

08:57 - March 30, 2018

ఢిల్లీ : నోబెల్‌ శాంతి పురస్కార విజేత యూసుఫ్‌జాయ్ మలాలా ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. 20 ఏళ్ల మలాలా భారీ భద్రత నడుమ తల్లిదండ్రులతో కలిసి ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ ఖాకన్‌ అబ్బాసీని మలాలా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను మళ్ళీ తన దేశానికి వస్తానని అనుకోలేదని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. పాకిస్థాన్ సైన్యానికి, రాజకీయ నేతలకు, పాకిస్థానీలందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. 2012లో తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి తర్వాత మలాలా పాకిస్తాన్‌కు రావడం ఇదే తొలిసారి. మలాలా నాలుగు రోజుల పాటు పాకిస్తాన్‌లో పర్యటించే అవకాశం ఉంది. బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలపై 2012లో తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మలాలా తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన మలాలా అక్కడే ఉండిపోయారు. బాలికల విద్య కోసం కృషి చేస్తున్న మలాలాకు 2014లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.

08:47 - March 30, 2018

పోలవరం ప్రాజెక్టుకు సంబంధంచి కేంద్రం నుండి నిధులు మంజూరు కావటంలేదనీ..దీంతో పనులు కొనసాగటంలేదనీ నిధులు మంజూరు చేస్తానని మాట ఇచ్చిన కేంద్రం నిధులను నిలిపివేసిందనీ..అలాగే విభజన హామీలను అమలుచేయటంలేదనీ..దీనిపై అవసరమైతే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఏపీ రీ ఆర్గనైజేషన్ కు సంబంధించి కాంగ్రెస్ మరో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమారు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈ రెండింటికీ సంబంధిచి ఏపీ తరుపున న్యాయపోరాటం చేస్తామని అసెంబ్లీలో చెబుతున్నారు తప్ప ఏపీ ప్రభుత్వం నుండి అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయటంలేదని దానికి చంద్రబాబు ఎందుకు ముందుకు రావటంలేదని ఉండవల్లి ప్రశ్నించారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు న్యాయస్థానంలో రాష్ట్రం గురించి పోరాటం చేస్తారా? లేదా కేంద్రంపై విమర్శల వరకే మిన్నకుండిపోతారా? దీనిపై చంద్రబాబు స్టాండ్ ఏమిటి? ఆయన వ్యూహం ఏమిటి? కేంద్రం తీరుకు సరైన బుద్ధి చెబుతామని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు ఎటువంటి స్ట్రాటజీని అమలు చేస్తారు? అనే అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో బీజేపీ నేత కొల్లి మాధవి,జనసేన పార్టీ నుండి అద్దెపల్లి శ్రీధర్, టీడీపీ అధికార ప్రతినిథి లాల్ వజీర్ పాల్గొన్నారు. ఈ చర్చపై మరింత సమాచారం తెలుసుకోండి..

అమిత్ షాకు మరో చేదు అనుభవం!!..

కర్ణాటక : ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ప్రచారంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మొన్న సొంత పార్టీ సీఎం అభ్యర్థి యాడ్యురప్పను దేశంలోనే అత్యంత అవినీతిపరుడని పేర్కొన్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగాన్ని అనువాదం చేస్తున్న వ్యక్ఇత ఘోర తప్పిదం చేశాడు. దేవనగిరి జిల్లా చల్లకెరెలో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో షా ప్రసంగాన్ని ప్రహ్లాద్ జోషీ అనువదిస్తూ.. ‘‘ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిందేమీ లేదు.

08:19 - March 30, 2018

కృష్ణా : కంచికచర్లలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి వ్యానును ఢీకొట్టింది. దీంతో బస్సు చెరువుకట్టపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడవైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన బస్ లో 40మంది ప్రయాణీకులున్నట్లుగా తెలుస్తోంది. గాయపడినవారిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా వుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రమాదం అనంతరం బస్ డ్రైవర్ పరారయ్యాడనీ..అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు పేర్కొంటున్నారు. కాగా సమాచారం అందుకున్న ప్రభుత్వం యంత్రాంగం వెంటనే స్పందించటంతో గాయపడినవారికి వెంటనే చికిత్స అందించటంతో గాయపడినవారి ఆరోగ్య పరిస్థితి అదుపులో వున్నట్లుగా తెలుస్తోంది. 

స్మిత్, వార్నర్ లపై సచిన్ సానుభూతి..

హైదరాబాద్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సానుభూతి వ్యక్తం చేశాడు. వీరి వ్యవహారంలో మీడియా వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టాడు. తప్పు చేసినందుకు వాళ్లిద్దరూ ఇప్పటికే బాధపడుతున్నారని, వారిని మరింత బాధపెట్టవద్దని ట్వీట్ చేశాడు. కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు తప్ప వారు ప్రతిసారీ తమ తప్పును గుర్తు చేసుకుంటూ ఉంటారని పేర్కొన్నాడు. కాబట్టి వారిని ఇకనైనా ప్రశాంతంగా వదిలేసి కొంత మానసిక ప్రశాంతత కల్పించాలని సూచించాడు.

08:01 - March 30, 2018

కొన్ని దశాబ్దాలుగా మన గ్రామాలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అని, బలమైన గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్మించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ చెప్పారు. అయితే ప్రస్తుతం కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుతో మన గ్రామపంచాయతీ వ్యవస్థ నిజంగా బలంగా తయారవుతుందా? అసలు గ్రామపంచాయతీ వ్యవస్థ బలంగా ఉండాలంటే తీసుకోవల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు స్థానిక సంస్థలకు నిధులు, అధికారాల కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తు్న్న చంద్రారెడ్డి ఏమంటున్నారో ఈనాటి జనపథంలో చూద్దాం..

07:57 - March 30, 2018

హైదరాబాద్ : బాల్ టాంపరింగ్‌ చేయడం తన జీవితంలో పెద్ద తప్పు అని అన్నాడు కంగారూ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో స్మిత్ తప్పు ఒప్పుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.

బాల్‌ టాంపరింగ్‌కు పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఒప్పుకున్న స్మిత్‌...
బాల్‌ టాంపరింగ్‌కు పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఒప్పుకున్న స్మిత్‌....భవిష్యత్‌లో ఇటువంటి పొరపాటు చేయనంటూ అపరాద భావంతో ఉద్వేగానికి లోనయ్యాడు.ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్‌,ఫ్యాన్స్‌ తన క్షమించాలని చెబుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు.

స్వదేశానికి పయనమైన స్టీవ్‌ స్మిత్‌కు సెక్యూరిటీగా ప్రవర్తన..
కంగారూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను దక్షిణాఫ్రికా పోలీసులు చేయకూడని అపరాదం చేసిన దోషిగా చూడటం, అసభ్యంగా ప్రవర్తించడం వివాదస్పదంగా మారింది. స్వదేశానికి పయనమైన స్టీవ్‌ స్మిత్‌కు సెక్యూరిటీగా వ్యవహరించిన దక్షిణాఫ్రికా పోలీసులు దురుసుగా ప్రయత్నించడంపై క్రికెట్‌ స్టార్స్‌, క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

07:53 - March 30, 2018

వెనిజులా : ఖైదీలు జైలు నుంచి తప్పించుకునేందుకు చేసిన యత్నం అగ్ని ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో 68 మంది మృతి చెందారు. కరాబోబో స్టేట్ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ అధీనంలోని జైలు నుంచి కొందరు ఖైదీలు బుధవారం తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జైలులోని పరుపులకు నిప్పంటించారు. దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి 68 మంది మృతిచెందారు. మృతుల్లో ఖైదీలను చూసేందుకు వచ్చిన మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలియగానే ఖైదీల బంధువులు జైలు వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. వెనెజులా జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు కిక్కిరిసిపోవడంతో అక్కడ తరచూ అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

07:47 - March 30, 2018

ఢిల్లీ : ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్షను విరమించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ దీక్షా శిబిరానికి విచ్చేసి అన్నాతో చర్చలు జరిపారు. వారి మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో ఫడ్నవీస్‌ అన్నా హజారేకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. లోక్‌పాల్‌ చట్టం తీసుకురావాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 23 నుంచి అన్నాహజారే నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆరు రోజులపాటు దీక్ష చేసిన అన్నా ఐదు కిలోల బరువు తగ్గారని, రక్త పోటు పడిపోయిందని హజారే సన్నిహితుడు దత్త ఆవారి తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే సెప్టెంబర్‌లో మళ్లీ నిరాహార దీక్ష చేస్తానని అన్నాహజారే హెచ్చరించారు.

07:44 - March 30, 2018

హైదరాబాద్ : మలక్‌పేట పీఎస్ పరిధిలోని శాలివాహన నగర్‌లో నకిలీ న్యూట్రిషన్ తయారీ కేంద్రం గుట్టు రట్టైంది. స్థానికంగా ఉండే మనీష్, అతని తండ్రి.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా.. 30 ఏళ్లుగా న్యూట్రీషన్ సిరప్‌లను తయారు చేస్తూ తెలంగాణ అంతటా భారీ ఎత్తున సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో... ఈస్ట్‌ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి... 25లక్షల విలువ చేసే నకిలీ సిరప్‌ ప్యాకెట్లను, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకొని.. తయారీకేంద్రాన్ని సీజ్ చేశారు.

మహిళా ఉద్యమ నేత బిక్షావతి మృతి..

విజయవాడ : సీపీఎం నాయకురాలు, మహిళా ఉద్యమ నేత దండమూరి భిక్షావతి మృతి చెందారు. ప్రజావైద్య శాలలో చికిత్సపొందుతు భిక్షావతి మృతి చెందారు. సీపీఎం ఏపీ కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం భిక్షావతి పార్ధివదేహాన్ని వుంచారు. సాయింత్ర 4 గంటలకు అంతిమయాత్ర జరుగునుంది. బిక్షావతి మృతికి సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వైవీ, బాబూరావు, ఎంఏ గఫూర్, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఏపీ ఐద్వా రాష్ట్రకార్యదర్శి రమాదేవి,కేవీపీఎస్ నాయకులు మాల్యాద్రి ఇంకా పలువురు సీపీఎం నాయకులు,ఐద్వా నేతలు నివాళులర్పించారు.

07:32 - March 30, 2018

హైదరాబాద్ : జిహెచ్ఎంసి ప‌నితీరును కంప్ట్రోలర్‌ అండ్‌ ఆటిటర్‌ జనరల్‌ క‌డిగిపారెసింది. అభివృద్ది పనులు, అవినీతి విష‌యంలో అధికారుల ప‌నితీరును తీవ్రంగా ఎండ‌గ‌ట్టింది. వ‌ర‌ద నీటి కాలువ‌లను ప‌టిష్టం చేసే ప‌నుల‌తో పాటూ.... బ‌ల్దీయాకు వ‌చ్చే ఆదాయాన్ని వ‌సూలు చేయక‌పోవ‌డాన్ని త‌ప్పప‌ట్టింది. ఆస్తి ప‌న్ను మ‌దింపులోనూ లోపాలు జ‌రిగిన‌ట్లు గుర్తించిన కాగ్‌

2013 నుంచి 2017 వ‌ర‌కు బల్దియా పనితీరుపై అసంతృప్తి..
హైద‌రాబాద్ కు ప్రధాన పాల‌న వ్యవ‌స్థ అయిన బ‌ల్దియాను కంట్రోపోల‌ర్ అండ్ అడిట‌ర్ జ‌ర్నల్.. రిపోర్టు క‌డిగిపారేసింది. జిహెచ్ఎంసి చేసిన త‌ప్పులను నిశితంగా ఎత్తి చూపింది. అధికారులల నిర్లక్ష్యం కార‌ణంగా కార్పొరేషన్‌ అదాయానికి తూట్లుపడ్డాయని క‌ళ్లకు క‌ట్టిన‌ట్లు చూపింది కాగ్ రిపోర్టు. 2013 నుండి 2017 వ‌ర‌కు జిహెచ్ఎంసి జారీ చేసిన భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు , ఆస్తి ప‌న్ను వ్యవ‌హారాలు, ఘ‌న వ్యర్థా నిర్వహ‌ణ‌తోపాటు వ‌ర‌దనీటి కాలువ‌ల మెరుగుదల లాంటి నాలుగు అంశాల‌్లో బల్దియా పనితీరును ఎండగట్టింది.

అస్తవ్యస్థంగా నిర్మాణాలు,బీఆర్ఎస్ పథకం ప్రకటించినప్పుడల్లా లక్షలాది దరఖాస్తులు!..
జిహెచ్ఎంసి ప‌రిధిలో నిర్మాణాలు అస్తవ్యస్థంగా ఉండ‌టంతో టౌన్‌ప్లానింగ్ పూర్తిగా కుదేలయిందని కాగ్‌ తన రిపోర్టులో స్పష్టం చేసింది. బిఆర్ఎస్ ప‌థ‌కం ప్రక‌టించినప్పుడ‌ల్లా ల‌క్షాలాది దర‌కాస్తులు వ‌స్తుండ‌టం చూస్తూంటే అక్రమ నిర్మాణాల ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చని పేర్కొన్నది. గ‌డిచిన ఐదేళ్లుగా చేస్తే అందులో 30,864ఆస్తులు అంటే 41శాతం భ‌వ‌నాల్లో అవ‌క త‌వ‌క‌లు జ‌రుగాయంది. అంతేకాదు ఏకంగా 10,460భ‌వ‌నాల‌కు అస‌లు నిర్మాణ అనుమ‌తులు లేవని కాగ్‌ కుండబద్దలు కొట్టింది.

చెత్త నిర్వహణలో లోపాలు,తడి పొడి చెత్త సేకరణ 27 శాతమే..
ఇక చెత్త సేకరించ‌డం దానిని శాస్త్రీయ ప‌ద్దతిలో డిస్పోస్ చేయడంలోని లోపాల‌ను సైతం కాగ్‌ ఎత్తి చూపింది. త‌డి పోడి పోడి చేత్త సేక‌ర‌ణలో కేవ‌లం 27శాతం మాత్రమే ఉంద‌ని స్పష్టం చేసింది. ఘన వ్యర్థాల‌నుంచి ఇంద‌నంగా త‌యారు చేసే ప్లాంట్లను కూడా ఎర్పాటుచేయ్యాడంలోనూ బ‌ల్దియా విఫ‌ల‌యం అయ్యింద‌ని కాగ్ అక్షింత‌లు వేసింది. అంతే కాకుండా న‌గ‌రంలో వ‌ర‌ద నీటి కాలువ‌ల నిర్వహ‌ణ‌లోనూ బ‌ల్దియా విఫ‌ల‌మైన విష‌యాన్ని కాగ్ గుర్తించింది. చెరువులను కాపాడ‌్డంలోనూ బ‌ల్దియా విఫ‌ల‌మైందని మొట్టికాయలు వేసింది. మొత్తానికి బల్దియా బాగోతాలన్నీటినీ కాగ్‌ బయటపెట్టిందని.. హైదరాబాదీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

07:27 - March 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ పని తీరుపై కాగ్‌ అక్షింతలు వేసింది. ప్రభుత్వంలో ఆర్థిక నిబంధనలు, పద్దతులు పాటించలేదని.. ఆర్థిక నియంత్రణ లోపించిందని తన నివేదికలో స్పష్టం చేసింది. వివిధ పథకాల కోసం డ్రా చేసిన నిధులకు యూసీలు సమర్పించలేదని.. కొన్ని పథకాలు చేపట్టకుండానే యూసీలు సమర్పించారని మండిపడింది. కేంద్రం ఇచ్చిన నిధులను కనీసం 50 శాతం కూడా ఖర్చు పెట్టలేకపోయిందని తెలంగాణ ప్రభుత్వంపై కాగ్ అసహనం వ్యక్తం చేసింది.

టీ.అసెంబ్లీలో కాగ్ నివేదిక..
దేశంలోనే పథకాల అమల్లో అగ్ర స్థానం..అన్నింట్లో పారదర్శకత అని ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వ సంస్థ కంప్ట్రోలర్ అండ్ అడిట్ జనరల్ నుంచి మొట్టి కాయలు తప్పలేదు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఫలితంగా రూ.5,820 కోట్ల భారం..
సంక్షేమ పథకాలు..రీ డిజైన్లు, మిషన్ భగీరథ, మైనింగ్‌ వంటి వాటిపై కాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదంది. ఇసుక కొనుగోళ్లు, అమ్మకం, టీహబ్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాగ్ సవివరమైన నివేదికను ఇచ్చింది. వివిధ పథకాల కోసం నిధులు డ్రా చేసుకున్నా వాటికి యూసీలు సమర్పించలేదని, కొన్ని చోట్ల మాత్రం నిధులు రాకుండానే యూసీలు సమర్పించేశారని వెల్లడించింది. అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేసి 5,820 కోట్ల రుపాయల భారం పడేలా తెలంగాణ సర్కార్ వ్యవహరించిందని కాగ్‌ తెలిపింది. డిస్కంలు వసూలు చేసిన విద్యుత్ చార్జీలు ప్రభుత్వ ఖజానాకు సరైన టైంలో చేరడం లేదని ఆక్షేపించింది.

ఇందిరమ్మ వరదకాలువ కోసం రూ.4,711 కోట్ల ఖర్చు..
ఇందిరమ్మ వరదకాలువ కోసం 4,711 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అయినా ఇప్పటి వరకూ ఆశించిన ఫలితం రాలేదని కాగ్‌ గుర్తించింది. ఇక, టీ హబ్ రెండో దశ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, తద్వారా ప్రభుత్వానికి 16.70 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్‌ వెల్లడించింది. ఇసుక కొనుగోళ్లలో అనుయాయులకు 18 కోట్ల రూపాయల మేర ఆయాచిత లబ్ది చేకూర్చారని పేర్కొంది. వాల్టా చట్టం నిబంధనలు పాటించడంలో ప్రభుత్వం విఫలమైందని కాగ్ స్పష్టం చేసింది.

రెవెన్యూ లోటు రూ. 5 వేల కోట్లు..
రెవెన్యూ లోటు 5 వేల కోట్ల రూపాయలని, అయితే అప్పు తెచ్చుకున్న నిధులనూ రెవెన్యూ రాబడిగా చూపించి ద్రవ్య లోటును కేవలం 2,500 కోట్ల రూపాయలుగా చూపించారని వివరించింది. ఇక కేంద్రం నుంచి వివిధ రూపాల్లో వచ్చిన నిధులను కూడా నియోగించుకోలేకపోయిందని ప్రభుత్వంపై కాగ్‌ చురకలు అంటించింది.

07:22 - March 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిశాయి. మొదటిరోజు హాట్ హాట్ గా ప్రారంభమైన భేటీ చివరకి కూల్ గా ముగిశాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ లేకుండానే సమావేశాలు పూర్తయ్యాయి.

ఏకపక్షంగా టీ.సమావేశాలు..
ఈనెల 12న గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యులు వ్యవహరించిన తీరుపై అధికార టీఆర్‌ఎస్‌ కన్నెర్ర చేసింది. ఆ రోజు స‌భలో చోటుచేసుకున్న పరిణామాలు ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ స‌భ్యత్వం ర‌ద్దుకు దారితీసింది. 11 మందిని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయడంతో దాదాపు ఏకపక్షంగా సమావేశాలు జరిగాయి.

సభలో 60.58 గంటల పాటు చర్చలు..
మొత్తం 13 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. సభలో 60 గంట‌ల 58 నిమిషాల‌పాటు వివిధ అంశాలపై చర్చలు జ‌రిగాయి. గ‌వ‌ర్నర్‌ ప్రసంగానికి ధ‌న్యవాదాలు తెలిపే తీర్మానంపై 5 గంట‌ల 19 నిమిషాలు స‌భ్యులు ప్రసంగించారు. బ‌డ్జెట్ పై సాధారణ చర్చ 6 గంట‌ల 43 నిమిషాలు, బడ్జెట్‌ ప‌ద్దుల‌పై 19 గంట‌ల 58 నిమిషాలపాటు చ‌ర్చ జ‌రిగింది. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులంతా క‌లిసి 25 గంట‌ల 45 నిమిషాల‌పాటు స‌భ‌లో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 20గంట‌ల 40 నిమిషాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గంటా 21 నిమిషాల పాటు స‌భా స‌మ‌యాన్ని ఉప‌యోగించుకున్నారు. ఎంఐఎం సభ్యులు 6 గంట‌ల 36 నిమిషాలు, బీజేపీ ఎమ్మెల్యేలు 8 గంట‌ల 3 నిమిషాలు, టీడీపీ శాసనసభ్యులు 4 గంట‌ల 15 నిమిషాలు, సీపీఎం 2 గంట‌ల 10 నిమిషాలు, సీపీఐ 8 నిమిషాలపాటు స‌భ‌లో మాట్లాడారు.

రెండో రోజే జానారెడ్డి సస్పెండ్‌..
సీఎం కేసీఆర్ ఒక్కరే 4 గంట‌ల 58 నిమిషాల పాటు స‌భ‌లో మాట్లాడారు. ప్రధాన ప్రతిప‌క్ష నేత జానా రెడ్డి రెండో రోజే సస్పెండ్ కావ‌టంతో ఒక్క సెక‌ను కూడా ఉప‌యోగించుకోలేదు. ఎమ్మెల్యేలు అడిగిన 80 ప్రశ్నలకు ఓర‌ల్ గా, 94 ప్రశ్నల‌కు లిఖిత పూర్వకంగా మంత్రులు స‌మాధానం ఇచ్చారు. ఈ బ‌డ్జెట్ సమావేశాల్లో క‌ళ్యాణ లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కం సహాయాన్ని 75 వేల రూపాయల నుంచి లక్షా నూట ప‌ద‌హారుకు పెంచుతూ సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్రకటించారు. కల్లుగీత కార్మికులకు వ‌రాలు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని నియమించుకునే బిల్లు..
బ‌డ్జెట్ అసెంబ్లీ స‌మావేశాల్లో మొత్తం 11 బిల్లుల‌కు స‌భ ఆమోదించింది. డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం నియ‌మించుకోవ‌టం.. మెడిక‌ల్ విద్యార్థుల పీజీ పూర్తవగానే రిజిస్టర్‌ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ బిల్లు స‌వ‌ర‌ణ‌, తెలంగాణ అడ్వకేట్స్‌ వెల్ఫేర్ ఫండ్ బిల్లు, ప‌ద‌ోత‌ర‌గ‌తి వ‌ర‌కు తెలుగును త‌ప్పనిస‌రి చేస్తూ బిల్లు, అడ్వకేట్స్‌ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ స‌వ‌ర‌ణ బిల్లుల‌కు స‌భ ఆమోదం తెలిపింది. అసైన్ భూముల క్రమబ‌ద్దీక‌ర‌ణ‌, ప్రైవేట్ యూనివ‌ర్శిటీ స్థాప‌న బిల్లు, పంచాయితీ రాజ్ చ‌ట్టం, మున్సిప‌ల్ చ‌ట్టంను స‌భ ఆమొదించింది. ప్రధాన ప్రతి పక్షం స‌భ‌లో లేక పోవడం బాధాకరమే అయినా అది కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేన‌ని మంత్రి హ‌రీష్ రావ్ వ్యాఖ్యానించారు.ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాలు కావ‌టంతో ప్రతిప‌క్షాలు అంశాల వారిగా ప్రభుత్వంతో విభేదించి వాక్ అవుట్ చేశాయి. మొత్తం మీద బ‌డ్జెట్ స‌మావేశాలు అధికార పార్టీ త‌న క‌నుస‌న్నల్లో పూర్తి చేసింది.  

హస్తిన ఎయిర్ పోర్ట్ లో గందరగోళం..

ఢిల్లీ : ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు తమ బ్యాగుల్లో పవర్ బ్యాంకులు, నిషేధిత వస్తువులు పెట్టుకోవడంతో బ్యాగేజ్ చెకింగ్ నత్తనడకన సాగింది. ఫలితంగా ప్రయాణికుల క్యూ చాంతాడంత పెరిగిపోయింది. అంతేకాదు, చెకింగ్ అనంతరం బ్యాగులు మారిపోవడంతో అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చెక్‌డ్-ఇన్ బ్యాగేజీ ఆలస్యం కావడంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి.

ఐడీబీ బ్యాంకులో భారీ కుంభకోణం..

విశాఖపట్నం : ఐడీబీఐ బ్యాంకులో చేపల పెంపకం రుణాల మంజూరులో భారీ కుంభకోణం జరిగింది. దాదాపు రూ.680 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు విశాఖ సీబీఐ కేసు నమోదు చేసింది. ఐడీబీఐ బ్యాంకు అప్పటి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.దామోదరన్‌, అప్పటి డీజీఎం బత్తు రామారావులతో పాటు 24 మంది మధ్యవర్తులు, 26 మంది వేల్యుయేటర్లు కుట్రదారులుగా కేసు నమోదు చేసినట్లు విశాఖ సీబీఐ ఎస్పీ వెల్లడించారు. కేవలం రూ.25లక్షలు మాత్రమే రుణపరిమితి ఉన్నవారికి రూ.5కోట్ల వరకు ఉద్దేశపూర్వకంగా రుణం మంజూరు చేసినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 18 చోట్ల కీలక డాక్యుమెంట్లను గుర్తించి సీజ్‌ చేశారు.

బస్, వ్యాను ఢీ..ఒకరు మృతి..

కృష్ణా : కంచికచర్లలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి వ్యానును ఢీకొట్టింది. దీంతో బస్సు చెరువుకట్టపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Don't Miss