Activities calendar

31 March 2018

21:32 - March 31, 2018

ఏప్రిల్ నెలల మాత్రమే ఫూల్స్ గాని జనాలు...అన్నినెలలళ్ల జేశేస్తున్న రాజకీయ పార్టీలు, లక్ష రూపాలళ్ల పెండ్లి కార్యమంత జేయొచ్చట... కట్నంలేని సమాజం తయ్యారు గావాలె సారు,  ప్రత్యేక హోదా పంచాది కప్చర్ జేశ్న చంద్రాలు.. బీజేపీ, వైసీపీకి పెండ్లిగాక ముందే విడాకులు, కరీంనగర్ జిల్లాల జోరుగైతున్న ఉశ్కె దందా...అధికారులు, నాయకులు, పోలీసోళ్ల దోపిడి, గాలివానకు రాములవారి పెండ్లి ఆగమాగం...ఒంటిమిట్టకాడ ఉర్ముడు వానకు నల్గురు బలి, పోతుంటే జీపెక్కి కూసున్న చిరుత పులి... భయంతోని శవంలెక్క తయ్యారైన మన్షి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

21:29 - March 31, 2018

బీజింగ్ : చైనాకు చెందిన మానవ నిర్మిత అంతరీక్ష కేంద్రం తీయాంగాగ్‌-1.. ఇపుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇవాళో రేపో భూమిపై కూలిపోయే అవశాశం ఉండటంతో .. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా స్కైలాబ్‌ ప్రపంచాన్ని వణికించగా .. ఇపుడు చైనాకు చెందిన తియాంగాంగ్‌-1 అదేతరహాలో భయపెడుతోంది. 
భయపెడుతున్న తియాంగాంగ్‌-1
చైనాకు చెందిన తొలి అంతరిక్ష పరిశోధనా కేంద్రం టియాంగాంగ్‌-1 పేరు వింటేనే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నిర్దేశిత ప్రదేశం నుంచి గతితప్పిన చైనా స్పేస్‌ల్యాబ్‌.. భూమివైపు వేగంగా దూసుకు వస్తోంది.  ఇవాళో రేపో అది భూవాతావరణంలోకి ప్రవేశించనుంది. దీంతో అది ఎక్కడ కూలుతుందోనని చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒకింత ఆందోళనకు గురువుతున్నారు. 
39ఏళ్ల క్రితం భయపెట్టిన స్కైలాబ్‌
దాదాపు 39ఏళ్ల క్రితం స్కైలాబ్‌ భయంతో జనం వణికిపోయారు. 1979 జూలైనెలలో పట్టణాలు, పల్లెలు అనే తేడాలేకుండా ఆకాశంవైపు చూస్తూ బిక్కుమంటూ గడిపారు.  అమెరికాకు చెందిన స్కైలాబ్‌.. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా భయంగొలిపి చివరికి 1979 జూలై11న హిందూమహాసముద్రంలో కూలిపోవడంతో ప్రపంచంఅంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈనేపథ్యంలో ఇపుడు మరోసారి ప్రపంచదేశాలను వణికిస్తోంది.. చైనాకు చెందిన స్పేస్‌ల్యాబ్‌ తీయాన్‌గాంగ్‌-1. 
2011 సెప్టెంబర్‌లో తియాంగాంగ్‌-1ను ప్రయోగం 
2011 సెప్టెంబర్‌లో తియాంగాంగ్‌-1ను ప్రయోగించారు. దీని పొడవు10.4 మీటర్లు,  చుట్టుకొలత  3.35 మీటర్లు. మొత్తం బరువు 8,506 కిలోలు.. అంటే ఎనిమిదిన్నర టన్నులుగా ఉంది. 2018 మార్చి 26 వరకు దాదాపు 6సంవత్సరాల 178రోజులు తీయాంగాంగ్‌-1 కక్ష్యలోనే  ఉంది. తన జీవితికాలంలో ఆర్బిట్‌లో   37, 287 సార్లు పరిభ్రమించింది. రెండేళ్ల జీవిత కాలానికి రూపొందించిన తీయాంగాంగ్‌-1.. షెన్జో-8, షెన్జో-9, షెన్జో-10  ఇలా మూడు మిషన్లకు బేస్‌స్టేషన్‌గా సేవలందించింది. 2013లో షెన్జో-10 తిరిగి భూమికి చేరుకోవడంతో దీనికి అప్పగించిన ప్రధాన లక్ష్యం పూర్తయింది. 
భూమిచుట్టూ అంతరిక్షంలో చక్కర్లు
నిర్దేశిత లక్ష్యాన్ని నెవేర్చిన తియాన్‌గాంగ్‌-1 ఇపుడు గతితప్పి భూమిచుట్టూ అంతరిక్షంలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఇది భూమికి అతి సమీపానికి  వచ్చిందని,  భూవాతావరణంలోకి ప్రవేశించగానే పూర్తిగా మండిపోతుందని చైనా మ్యాన్‌డ్‌ స్పేస్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయం వెల్లడించింది. అయితే ఏ ప్రదేశంలో ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందనే విషయాన్ని చివరి రెండు గంటల్లో మాత్రమే నిర్దారించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. భూవాతావరణంలోకి రాగానే.. స్పేస్‌ల్యాబ్‌లో కొద్ది మొత్తంలో ఉన్న ఇంధనం మండిపోతుందని.. దీంతో అందులోని ఇతర భాగాలు కూడా కాలిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల భూమికి ఎలాంటి హానీ జరగదని.. ఎలాంటి ప్రమాదకరమైన విషవాయువులు కూడా వెలువడవని భరోసా ఇస్తున్నారు. 
మార్చి 16 నుంచి నో సిగ్నల్స్‌ 
మార్చి 16 నుంచి తియాంగాంగ్‌-1 నుంచి సమాచారం అందడం లేదని చైనా అంతరిక్ష ఇంజనీరింగ్‌ అధికారి సోమవారమే తెలిపారు. భూ వాతావరణంలోకి ఇవాళో రేపో ప్రవేశించనున్న తియాంగాంగ్‌-1.. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 4 తేదీల మధ్య కూలిపోయే అవకాశం ఉందని  చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే తీయాంగాంగ్‌ భూమిపై కూలిపోయే అవకాశం ఉంది..దీంతో తియాంగాంగ్‌-1 ఎక్కడ కూలిపోనుంది..? శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు ప్రమాదమేమి ఉండదా..? ఇపుడు ఇవే ప్రశ్నలు జనసామాన్యంలో ఉత్కంఠ రేపుతున్నాయి.  

 

21:19 - March 31, 2018

ఢిల్లీ : త్వరలో జరగనున్న రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ యువనేత సచిన్‌ పైలెట్‌కు మార్గం సుగమమైంది. రాజస్థాన్‌ మాజీ సిఎం అశోక్‌ గెహ్లాట్‌కు ఎఐసిసిలో స్థానం కల్పించడం ద్వారా సచిన్‌కు పూర్తి స్వేచ్ఛ లభించినట్లయింది. జనార్ధన్‌ ద్వివేది స్థానంలో అశోక్‌ గెహ్లాట్‌ను కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాహుల్‌ నియమించారు. దీంతో ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. అశోక్‌ గెహ్లాట్‌ కొత్త పదవి చేపట్టడం ద్వారా రాజస్థాన్‌ రాజకీయాలతో ఆయనకిక సంబంధం ఉండదు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ముందుకు నడిపించే బాధ్యత సచిన్‌ పైలెట్‌పైనే ఉంటుంది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పార్టీ బాధ్యతలను సచిన్‌ పైలెట్‌కు అప్పగించారు. రాహుల్‌ పార్టీ పగ్గాలు చేపట్టాక యువతకు ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే.

 

21:08 - March 31, 2018

ప్రకాశం : జిల్లాలోని చీరాలలో విషాదం చోటుచేసుకుంది. సంతానం కలగడం లేదని తీవ్ర మనస్తాపం చెంది భార్యాభర్త ఆత్యహత్య చేసుకున్నారు. స్థానికంగా ఉండే శ్రీనివాస్‌ మూర్తి నాగమణికి 18ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు కలగడం లేదని కొద్దికాలంగా మానసిక క్షోభకు గురయ్యారు. ఇవాళ చనిపోయే ముందు స్థానిక పోలిసులకి, సోదరునికి లెటర్స్ వ్రాసి చనిపోయారు.

 

20:59 - March 31, 2018

ఢిల్లీ : సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై నిరసనలు హోరెత్తుతున్నాయి. ఢిల్లీలోని సిబిఎస్‌ఈ కార్యాలయం ముందు విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పలుచోట్ల రహదారులను దిగ్బంధం చేశారు. ప్రీత్‌ విహార్‌లో వాహనాలను విద్యార్థులు అడ్డుకోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జార్ఖండ్‌లో ఓ కోచింగ్‌ సెంటర్‌ యజమాని, ఇద్దరు టీచర్లతో పాటు 9 మంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. కోచింగ్‌ సెంటర్‌ యజమాని సతీష్‌ పాండే విద్యార్థుల వద్ద భారీగా డబ్బు వసూలు చేసి వాట్సాప్‌ ద్వారా పేపర్‌ లీక్‌ చేశారని  చతరా జిల్లా ఎస్పీ అఖిలేష్‌ బి వారియర్‌ తెలిపారు. పది వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు‌ లీకయ్యాయని.. ఇప్పటి వరకూ 60 మందిని విచారించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు  సిబిఎస్‌ఈ ప్రశ్నపత్రాల లీకేజీపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విచారణ పూర్తి కాకముందే తిరిగి పరీక్షలు రాయాలనడం విద్యార్థుల మౌలిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

20:52 - March 31, 2018

తూర్పుగోదావరి : ఏపీలో కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారని, అసలు వారు దేనికోసం ధర్నాలు చేస్తున్నారో తమకు అర్ధం కావటంలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. స్పెషల్ స్టేటస్ అనేది ఒక ఆర్ధిక అంశమని... స్పష్టంగా దేనికి ఎంత కావాలో చెప్పి నిధులు పొందాలన్నారు. అలాకాకుండా... రోడ్డెక్కి ఆందోళనలు చేయటం హాస్యాస్పదమన్నారు.

 

20:46 - March 31, 2018

హైదరాబాద్ : మే 12న జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు తరలిస్తున్న నకిలీ రెండువేల నోట్ల కట్టలను డీఆర్ఐ ఆధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో నకిలీ నోట్లను తరలిస్తున్న ఇద్దరు బెంగళూరుకు చెందిన వ్యక్తులను విశాఖ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10లక్షల 20 వేల రూపాయల నకిలీ కరెన్సీని డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ్‌బంగా మీదుగా కరెన్సీ తరలిస్తున్నట్టు డీఆర్ఐ విచారణలో తేలింది. ఎన్నికల్లో సులువుగా మార్పిడి చేయవచ్చన్న ఉద్దేశంతో తీసుకొస్తున్నట్లు నిందితులు చెప్పినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ కరెన్సీ నోట్లు పాకిస్థాన్‌లో ముద్రించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

 

మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత

హైదరాబాద్ : మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో శేషన్ బాధపడుతున్నారు. ఎన్నిక కమిషనర్ గా శేషన్ ఎన్నికల్లో అనేక మార్పులు తెచ్చారు. 

 

20:30 - March 31, 2018

అనంతపురం : ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ కార్యకర్త శివారెడ్డిని హత్య చేసినవారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... డీఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని వైసీపీ నేతలతో చర్చలు జరిపారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలు హత్యలు చేస్తున్నారని వైసీపీ నేతలన్నారు. 

ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. శుక్రవారం రాత్రి వైసీపీ కార్యకర్త శివారెడ్డిని దుండగులు అత్యంత దారుణంగా నరికి చంపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివారెడ్డి హత్యను నిరసిస్తూ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. శివారెడ్డి మృతదేహంతో ఎస్పీ కార్యాలయం వరకు వైసీపీ కార్యకర్తలు శవయాత్ర నిర్వహిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై భారీగా మోహరించారు. 

మోహరం పండుగ సందర్బంగా ఇరువర్గాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. శివారెడ్డి హత్యతో ప్రశాంతంగా ఉన్న కందుకూరులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలావుంటే... ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్‌ అండదండలతోనే శివారెడ్డి హత్య జరిగిందని వైసీపీ నేతలంటున్నారు. సీఐని వెంటనే సస్పెండ్‌ చేయాలని వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో ఎదుగుతున్న వైసీపీ నేతలను టీడీపీ హత్య చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. గతంలో కూడా మంత్రి పరిటాల సునీత అండదండలతో వైసీపీ నేతలను హత్య చేశారని... నిందితులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నిందితులను అరెస్ట్‌ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 

ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... డీఎస్పీ వెంకటేశ్వరరావు వైసీపీ నేతలతో చర్చించారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వైసీపీ నేతలు ఆందోళన విరమించారు. అయితే... నిందితులను అరెస్ట్‌ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని... శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామన్నారు వైసీపీ నేతలు. టీడీపీ రాజకీయ హత్యలపై భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏదిఏమైనా రాజకీయ హత్యతో..ప్రశాంత వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మరి ఈ పరిస్థితులన్నీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. 

20:21 - March 31, 2018

ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియాకు ఢిల్లీ కోర్టు ఏప్రిల్‌ 13 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. పీటర్‌కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడంతో ఆయనను ఇవాళ ముంబై తరలించనున్నారు. ఈ కేసులో పీటర్ ముఖర్జియా విచారణాధికారులకు సహకరించడంలేదనీ సిబిఐ పటియాలా హౌస్‌కోర్టుకు తెలిపింది. పీటర్‌ను కార్తీ, చార్టెడ్ అకౌంటంట్ ముందు కూర్చోబెట్టలేమని సీబీఐ పేర్కొంది. తదుపరి విచారణలో ముంబై జైలు నుంచి పీటర్ ముఖర్జియాను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రవేశపెడతామని సిబిఐ తెలిపింది. మార్చి 31 వరకు పీటర్ ముఖర్జియాను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఇటీవల ఢిల్లీ కోర్టు నిర్ణయించింది. నేటితో ఆయన కస్టడీ ముగుస్తుండడంతో మరో రెండు వారాల కస్టడీ కావాలంటూ సీబీఐ కోరింది.  ఇదే కేసులో మార్చి 23న కార్తీ చిదంబరానికి ఢిల్లీ కోర్టు 10 లక్షల పూచీకత్తుపై బెయిల్ ముంజూరు చేసింది. పీటర్ ముఖర్జియాకి చెందిన ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ ఎఫ్ఐపీబీ అనుమతుల కోసం కార్తీ చిదంబరానికి లంచం ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి.

 

20:18 - March 31, 2018

పాట్నా : బిహార్‌ టాపర్‌ స్కాం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు భారీ విజయం లభించింది. బిహార్‌లో చర్చనీయాంశంగా మారిన ఇంటర్‌ టాపర్స్‌ కుంభకోణంలో మాస్టర్‌ మైండ్, వైశాలీలో విష్ణుదేవ్‌ రాయ్‌ కాలేజీ డైరెక్టర్ బచ్చారాయ్‌కు చెందిన 4 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది. అయోగ్యులైన పిల్లల వద్ద టాప్‌ ర్యాంక్‌ పేరిట డబ్బులు వసూలు చేశాడని బచ్చారాయ్‌పై ఆరోపణలున్నాయి. బచ్చారాయ్‌ తన భార్య, పిల్లల పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. హాజీపూర్ రెండస్తుల భవనంతో పాటు భగవాన్‌పూర్, మహువా, పట్నా లోని 29 ప్లాట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. పది బ్యాంక్‌ ఖాతాలను సీజ్‌ చేసింది. బచ్చారాయ్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బిహార్‌లో 2016లో టాపర్‌ స్కాం బయటపడింది.

 

20:14 - March 31, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని దమ్మపేట మండలం రాచూరపల్లిలో గిరిజన బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 21వ తేదీన బాలికపై 12 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విచారించిన పోలీసులు అందరినీ అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు మైనర్‌ బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

 

19:59 - March 31, 2018

విజయవాడ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అట్రాసిటీ చట్టంలోని నిబంధనలను సవరించడం సరికాదన్నారు. విజయవాడలోని అంబేద్కర్ భవన్‌లో దళిత, గిరిజన ప్రజాసంఘాల నేతలు ఐక్యవేదికగా ఏర్పాటై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 

 

19:53 - March 31, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ థ‌ర్డ్ గ్రేడ్ పార్టీ అన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై మండిప‌డ్డారు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెపిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క. కేటీఆర్ అవ‌గాహ‌న లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇకనుంచైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని  హెచ్చరించారు. కాగ్ నివేదిక‌తో కేసీఆర్ పాల‌న నిర్వాకం తెలిసిపోయింద‌న్నారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతి జరిగిందని... దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మల్లు భట్టి డిమాండ్ చేశారు.

 

19:50 - March 31, 2018

కడప : ఒంటిమిట్ట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని... భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కడప రిమ్స్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు... మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డవారికి 3 లక్షల రూపాయలతో పాటు... మెరుగైన వైద్య చికిత్స అందిస్తామన్నారు. 

ఒంటిమిట్ట సీతారామ కల్యాణంలో జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. కడప జిల్లా మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మండిపడ్డారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం భారీ వర్షం కారణంగా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం వీక్షించేందుకు వచ్చిన నలుగురు భక్తులు మృతి చెందగా.. 32 మంది భక్తులకు గాయాలయ్యాయి. వడగళ్లతో వర్షం పడడంతో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, రేకుల షెడ్లు ఎగిరి భక్తులపై పడ్డాయి. కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మహిళలు, చిన్నపిల్లలు పరుగులు తీయడంతో పలువురికి గాయాలయ్యాయి. సీతారాముల కల్యాణం అనంతరం చంద్రబాబు కడప రిమ్స్‌లో బాధితులను పరామర్శించారు. ఘటన బాధాకరమని.. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు సీఎం. మృతి చెందిన కుటుంబాలకు 15 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షల రూపాయలతో పాటు మెరుగైన వైద్య చికిత్స, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా... ఒంటిమిట్టలో శాశ్వత మండపం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

19:42 - March 31, 2018

హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వం అవినీతిమయం అయిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని కోసం సేకరించిన భూములు మంత్రులుకు వరంగా మారాయన్నారు. నాలుగేళ్లలో దోచుకున్న లక్షకోట్ల రూపాయలు తెచ్చి అమరావతి నిర్మిస్తే.. దేశంలోనే మంచి రాజధాని నిర్మాణమవుతుందని బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అవినీతిని గత ఎన్నికల భాగస్వామి పక్షాలే చెబుతున్నాయని అన్నారు.   

18:42 - March 31, 2018

విజయవాడ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలరవాణా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.  సాగరమాల ప్రాజెక్ట్ లో కీలకమైన కాకినాడ-తడ మార్గంలో పనులు ప్రారంభమైనా సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. 
సాగర మాల ప్రాజెక్ట్‌ వ్యయం రూ. 1,30,762 కోట్లు
జలరవాణాను అందుబాటులోకి తెచ్చేందుకు సాగరమాల ప్రాజెక్ట్‌ కోసం  రూ. 1,30,762 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు రూపొందించింది. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సాగర తీరం జల రవాణా, పర్యాటకానికి అనువుగా వుందని  అంచనా వేశారు అధికారులు. కానీ పనుల జాప్యం కారణంగా భూ సేకరణ ఇబ్బందికరంగా మారింది. 
తీరం వెంబడి అవసరమైన వంతెనల నిర్మాణం
అయితే తీరం వెంబడి వంతెనల నిర్మాణం, ఇతర నిర్మాణాలకు అవసరమైన భూమిని  కొనేందుకు ప్రాజెక్ట్‌ కు కేటాయించిన నిధుల నుండి ఖర్చుచేయనున్నారు. ఇందులోనే కేంద్రం వాటా రూ. 3,500 కోట్లు ఉండగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరించాల్సి ఉంది. 
కాకినాడ-విజయవాడ ఖర్చు రూ. 7 వేల కోట్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి భాగస్వామ్యంతో మూడు దశల్లో జలరవాణా మార్గాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు. తొలి దశలో కాకినాడ-విజయవాడ మార్గాన్ని ఎంచుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై మొత్తం 315 కిలోమీటర్ల జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సుమారు రూ. 7 వేల కోట్ల మేర ఖర్చువుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి కేంద్రం రూ. 7015 కోట్లు కేటాయించింది. జల రవాణాను అభివృద్ధి  చేసే మార్గంలో మొదటి విడత మార్గంలో ముక్త్యాల-విజయవాడకు రూ. 100 కోట్లతో జలమార్గాన్ని అభివృద్ధి చేసేలా నిధులు కేటాయించి 82 కిలోమీటర్ల మేర మొత్తం 7 టెర్మినల్‌లు నిర్మించనున్నారు.
వేగవంతం కాని జలరవాణా పనులు 
2018 డిసెంబర్‌ నాటికి తొలిదశ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే ప్రాజెక్ట్‌ కు సంబంధించిన కీలక ఆమోదం ఇంతవరకు పొందలేదు. ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో వస్తువుల రవాణాకు రోడ్డు, రైలు మార్గాలు, గగన మార్గంతో పోల్చితే జలమార్గం అనువుగా ఉండడమే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకోవడంతో త్వరితగతిన జలమార్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా జలరవాణా పనులు వేగవంతం కావడంలేదు.
భారత దేశ ప్రతిష్టగా రూపొందించాలన్న స్థానిక నేతలు 
జల రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు . కానీ ప్రభుత్వం ఆచరణ ప్రణాళిక బద్దమైన కార్యక్రమాలు ఇంత వరకు ప్రకటించలేదని జల రవాణా ను చైన, సింగపూర్‌ వంటి ప్రాజెక్ట్‌ తో పోల్చకుండా భారత దేశ ప్రతిష్టగా రూపొందించాలని అంటున్నారని స్థానిక నేతలు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలరవాణా పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయో లేదో వేచి చూడాలి.

18:21 - March 31, 2018

హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. 4 గంటల సమయంలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌజ్, మోహిదీపట్నం, గుడిమల్కాపూర్‌తో పాటు సిద్ధిపేట పట్టణంలో వడగళ్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. 

 

18:18 - March 31, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని మోటకొండూరులోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జాయింట్‌ కలెక్టర్‌ రవినాయక్‌ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. 

 

18:07 - March 31, 2018

హైదరాబాద్ : ఏప్రిల్ 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సభ్యత్వకు జనసేన ఏర్పాట్లు చేస్తోంది. ఆండ్రాయిడ్ యాప్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సభ్యత్వ నమోదు చేయబోతున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇప్పటికే యాప్‌ ద్వారా... 15 రోజుల్లో 17 లక్షల మంది సభ్యత్వాలు నమోదు చేసుకున్నారని జనసేన ఐ.టి విభాగం తెలిపింది. సభ్యత్వంలో 16శాతం యువతే ఉన్నారని పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు.

17:54 - March 31, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం అబద్ధాలు, అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తండ్రీ కొడుకుల మధ్యే పాలన నడుస్తోందని.. మంత్రులకు స్వేచ్ఛలేదని ఆయన మండిపడ్డారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న సోము వీర్రాజు.. రాయలసీమపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ కనబరుస్తున్నారన్నారు. స్కూల్‌ పిల్లల యూనిఫామ్‌లు కుట్టించడంలో, మరుగుదొడ్లు నిర్మించడంలో.. వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్లో అవినీతి జరిగిందన్నారు. ఏపీకి ప్యాకేజీ కావాలన్న చంద్రబాబు ఇప్పుడు మాటమారుస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. టీడీపీ- బీజేపీ బంధం తెగిపోవడం తమకు దేవుడు చేసిన మేలని వీర్రాజు అన్నారు. 

17:51 - March 31, 2018

కడప : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించామని, గండికోట పరిహారం త్వరగా ఇచ్చేలా సీఎం చూస్తామన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ సోమిరెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. అధికారులు, మంత్రులతో సమీక్ష జరిపారు. జిల్లాలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రులు తెలిపారు. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ప్రకటించారు. సంస్కారం లేకుండా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను చూసి.. ప్రజలు అసహించుకుంటున్నారని మంత్రులు మండిపడ్డారు.

 

17:34 - March 31, 2018

హైదరాబాద్ : తాము అధికారంలో ఉన్నప్పుడు మీలాగా బంధువులను తీసుకొచ్చి క్యాబినెట్ లో పెట్టుకోలేదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను ఉద్దేశించి కాంగ్రెస్ నేత మల్లుభట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ కూడా ఈ దేశ అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలతో ఎల్ టీటీఈకి సంబంధించిన వ్యక్తులు చంపితే తప్పనిసరి పరిస్థితుల్లో నాయకత్వం వహించిన సోనియాగాంధీ కూడా ప్రధాని కమ్మని అంటే కూడా పదవి తీసుకోలేదని గుర్తు చేశారు. పదేళ్లు ఈదేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశమున్నా కూడా సోనియాగాంధీ ప్రధాని కాలేదని.. మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసిందన్నారు. ఈ పదేళ్లకాలంలో రాహుల్ గాంధీ మంత్రి కావడానికి, కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు ఆయన ప్రధాని కావాలని అడిగితే కూడా ప్రధానమంత్రి పదవే కాదు.. మంత్రి పదవి కూడా తనకు వద్దని దూరంగా ఉండి పార్టీ కోసం, ప్రజల కోసం రాహుల్ పని చేశారని తెలిపారు. 'నీవు వాళ్లతో పోల్చుకుంటే ఎట్లా అని' అన్నారు. దేశంలో ఈ భూమి పొరల కింద ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రక్తం ప్రవహిస్తుందన్నారు. దేశం కోసం వాళ్లు ప్రాణాలిచ్చారని పేర్కొన్నారు. 'మీరు వాళ్లతో పోల్చుకుంటే ఎట్లా అని' అన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడా...నీవెక్కడ అని అన్నారు. మీనాయన ముఖ్యమంత్రి, నీవు మంత్రి, మీ బావ మంత్రి, మీ అక్క పార్లమెంట్ సభ్యురాలు, ఇంకో బంధువు రాజ్యసభ సభ్యుడు ... ఇదంతా నాలుగేళ్లలోనే జరిగిందన్నారు. ఇదంతా చేసుకుంటూ వేరే వారిపై మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ల ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేది అనిపిస్తుందన్నారు. వీళ్ల వారసత్వం గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. థర్డ్ రేట్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిందని, పంచవర్ష ప్రణాళికలిచ్చిందని, గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చింది.. వైట్ రెవల్యూషన్ ఇచ్చింది, పారిశ్రామికీకరణ తీసుకొచ్చింది, మిక్స్ డ్ ఎకనామిక్ తీసుకొచ్చిందని, చివరికి ఈ కాంగ్రెస్ పార్టే తెలంగాణను ఇచ్చిందన్నారు. తాను నీకంటే ఎక్కువగా మాట్లాడతానని...కానీ సంస్కారం అడ్డువస్తుందన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. 'మీరు చేసే పనులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయన్నారు. ప్రజలు తగిన శాస్తి చేస్తారని హెచ్చరించారు. 

 

 

హెచ్ సీయూ వీసీ అప్పారావు హత్యకు కుట్ర!!.

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ అప్పారావును హత్య చేసేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. భద్రాచలం-చర్ల రోడ్డుపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పృథ్వీరాజ్, చంద్రన్ మిశ్రా అనే వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకుని, విచారించగా అప్పారావు హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగు చూసింది.

ఆటో మొబైల్ హబ్ గా ఏపీ : చంద్రబాబు

అమరావతి : ఏపీని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద బస్సుల తయారీదారు అశోక్ లేల్యాండ్ అని తెలిపారు. నవ్యాంధ్ర రాజధానికి మరో పరిశ్రమ చేరింది. మల్లపల్లిలో అశోక్ లేల్యాండ్ బస్సుల తయారీ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు..ఏపీని మొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇండియాలో తమ ఎనిమిదవ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను ఇక్కడ పెడుతున్నారని చెప్పారు. ఈ ప్లాంట్ లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని తెలిపారు. రూ. 135 కోట్ల వ్యయంతో ఈ యూనిట్ ను అశోక్ లేల్యాండ్ నెలకొల్పుతోంది.

16:41 - March 31, 2018

ఢిల్లీ : ఎస్ ఎస్ సి పేపర్ లీక్ పై ఢిల్లీలో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ అక్రమాలపై 3 నెలల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యత వహించి కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. 2013..2017 మధ్య జరిగిన ఎస్ ఎస్ సి పరీక్షలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

 

ఏపీలో కొత్త రాజకీయ కూటమి?!..

అమరావతి : దేశ రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ స్ఫూర్తితో మూడవ ఫ్రంట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా మరో కొత్త రాజకీయ కూటమికి సన్నాహాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వచ్చే పరిస్థితు కనిపిస్తున్నాయి. జనసేన, సీపీఐ, సీపీఎంలతో కలసి సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈమేరకు వివరించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యలపై తమ కూటమి పోరాటం చేస్తుందని చెప్పారు.

భాగ్యనగరంలో వడగళ్ల వాన..

హైదరాబాద్ : ఎండలతో హైరానా పడుతున్న భాగ్యనగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఎండలతో ఉక్కపోతను చవిచూసిన నగరవాసులు ప్రస్తుతం చల్లని వాతావరణంలో సేద తీరుతున్నారు. మరోవైపు హైద‌రాబాద్‌లోని పలు చోట్ల వడగాళ్ల వాన పడుతోంది. నగరంలోని ఆసిఫ్ న‌గ‌ర్, లంగ‌ర్ హౌస్, మెహిదీ ప‌ట్నం, గుడిమ‌ల్కాపూర్ ప్రాంతాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌తో కూడిన వ‌ర్షం పడుతోంది. హైద‌రాబాద్ శివారులోని ఇబ్ర‌హీం ప‌ట్నంలో ఈదురుగాలుల‌తో కూడిన వ‌డ‌గ‌ళ్ల వాన కురుస్తోంది. తెలంగాణలోని సిద్ధిపేట ప‌ట్ట‌ణంలోనూ వ‌డ‌గ‌ళ్ల వాన పడుతోంది.

వార్నర్ అవుట్..అలెక్స్ హేల్స్ ఇన్..

హైదరాబాద్ : బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా 12నెలల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఇంగ్లాండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ను తీసుకున్నట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం ప్రకటించింది. న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్‌ జట్టు పగ్గాలు అప్పగించింది. జనవరి చివరి వారంలో నిర్వహించిన వేలంలో హేల్స్‌ కోటి రూపాయలతో వేలంలోకి వచ్చాడు. అప్పుడు ఎవరూ అతడ్ని కొనుగోలు చేయకపోవడం గమనార్హం.

గరుకుల పాఠశాలలో 30మంది విద్యార్ధినులకు అస్వస్థత..

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని మోటకొండూరులోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో 30మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రవినాయక్, వైద్యాధికారులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థినులపై ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారు.

ఏపీ అంటే కొత్త అర్థం చెప్పిన చంద్రబాబు..

కృష్ణా : నవ్యాంధ్ర రాజధానికి మరో పరిశ్రమ చేరింది. మల్లపల్లిలో అశోక్ లేల్యాండ్ బస్సుల తయారీ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు..'ఎ' అంటే అమరావతి అని 'పి' అంటే పోలవరం అని ఏపీకి కొత్త అర్థాన్ని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి తీరతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

16:22 - March 31, 2018

కృష్ణా : అయేషామీరా హత్య కేసులో అసలైన నిందితులను పట్టుకోవాలని సామాజిక కార్యకర్త దేవి అన్నారు. విజయవాడలో అయేషా మీరా న్యాయపోరాట కమిటీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశాబ్ధకాలంగా విచారణ జరుగుతున్నా దోషులను పట్టుకోకపోవడం ప్రభుత్వం వైఫల్యమని విమర్శించారు. కొందరి స్వార్థం కారణంగా యవ్వనమంతా జైల్లో గుడిపానని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్ధికసాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా, ప్రజా, దళిత సంఘాలు పాల్గొన్నాయి. 

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో నకిలీ నోట్లు..

హైదరాబాద్ : ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో డీఆర్ఐ నకిలీ నోట్లు కలకలం రేగింది. హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుండి రూ.10.20వేల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లను పశ్చిమ బెంగాల్ నుండి తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులకు అరెస్ట్ చేసి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

15:57 - March 31, 2018

వివాహం అంటే ఇరువురి జీవితాలను ఒకటిగా చేసేది. రెండు వేర్వేరు కుటుంబాలను బంధువులగా చేసేది. ఈ వివాహానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యతవుంది. భారతదేశంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యత వుంది. మరి అటువంటి వివాహాలు ఎవరి మతాలను, ఆచారాలను, పద్ధతులను అనుసరించి వారు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో వివాహం జరపాలని అనుకున్నప్పటి నుండి ఎన్నో విషయాలను నమ్మకాలుగా అనుసరిస్తుంటారు. అదే వివాహం జరిపించే విషయాలలో కూడా పలురకాల భిన్న పద్ధతులకు పాటిస్తుంటారు. వీటిని నమ్మకాలు అనేకంటే వివాహం చేసుకున్న దంపతులు సుఖంగా, సంతోషంగా, వారికి ఎటువంటి కష్టం రాకూడదనే సెంటిమెంట్ తో పలు విధాల పద్ధతులను, సంప్రదాయాలను, అనవాయితీలుగా కొనసాగిస్తుంటారు. అటువంటి ఓ వింత ఆచార వివాహాం గురించి తెలుసుకుందాం.. ఫిజీ దేశంలో ‘తబువా’ పేరుతో కొనసాగే ఆచారం.. కొంతమంది వివాహం సమయంలో జరిపే తంతు విచిత్రంగా వుంటుంది. అది అక్కడి ఆచారమైనా తెలియని వారికి మాత్రం అది విచిత్రంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లలో వింత ఆచారాలు అమలువుతుంటాయి. అటువంటిదే ఫిజీ దేశంలో ‘తబువా’ పేరుతో కొనసాగే ఆచారం. ఇక్కడ అమ్మాయిని పెళ్లాడేముందు అబ్బాయి... అతిపెద్ద తిమింగలం దంతాన్ని ఆ అమ్మాయి తండ్రికి అంటే మామగారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆచారం కారణంగా ఫిజీ దేశం పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఈ ఆచారాన్ని ఇక్కడివారు తరతరాలుగా అమలుచేస్తున్నారు. దీనిని పాటించడం వలన పెళ్లి కుమార్తెకు మంచి జరుగుతుందని భావిస్తారు. అలాగే ఆ ఆచారాన్ని, ప్రేమను నిరూపించుకునేందుకు ప్రతీకగా కూడా భావిస్తారు. ఈ నేపధ్యంలోనే ఇక్కడి యువకులు ఎంతకష్టమైనా సరే తిమింగలం దంతాన్ని సంపాదించి పెళ్లి కుమార్తె తండ్రికి అందిస్తుంటారు.మరి ఎంతోమంది ఎన్నో ఆచారాలను పాటిస్తుంటారు. ఫిజీదేశంలో వారి వివాహ అచారంలో తప్పకుండా తిమింగలం దంతం వుండాల్సిందేనట. చూశారా వివాహ ఆచారాలు, సంప్రదాయాలు, ఆనవాయితీలు ఎంత విభిన్నంగా..విభిన్నంగా వుంటాయో కదా!!..

15:50 - March 31, 2018

విజయనగరం : జిల్లాలోని ఎస్‌.కోట కొత్తూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో.. ఇద్దరు స్కూల్ విద్యార్థులు సహా ముగ్గురు మృతి చెందారు. మృతులు ఇద్దరు ఎస్.కోటలోని రామన్‌ స్కూల్‌ విద్యార్థులుగా గుర్తించారు. 

15:48 - March 31, 2018

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా.....ఇదే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. హోదా కోసం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఉద్యమ బాట పడుతోంది. ఈ తరహాలోనే నడుస్తున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. హోదా నినాదంతో లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హోదా కోసం తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిలిచిన ఆమరణ దీక్ష అస్త్రాన్ని పవన్‌ సంధించబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 
ప్రత్యేక హోదా అంశంపై ముందుకెళ్తోన్న పవన్‌
ప్రత్యేక హోదా...ఇప్పుడిదే అంశం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు ఎన్నికల అస్త్రంగా మారింది. హోదా అంశాన్ని భుజాన వేసుకొని ప్రతి ఒక్క పార్టీ తన రాజకీయ భవిష్యత్‌ను చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ బాటలోనే అడుగులేస్తున్న  జనసేన అధినేత పవన్‌ కూడా హోదా ఉద్యమంతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభతో అధికార పార్టీపై దుమ్మెత్తి పోసిన పవన్‌...హోదా అంశంతో రాజకీయంగా ఎదిగేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హోదా అంశంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్‌ స్థానిక ఉద్యమాల్లో బలంగా పని చేస్తున్న లెఫ్ట్‌ పార్టీ నేతలతో ఇప్పటికే తన ఉద్యమ కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు అడుగులు  వేస్తున్నారు. 
ఏప్రిల్‌ 4న విజయవాడలో సమావేశం
ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 4న పవన్‌ విజయవాడలో సమావేశం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, కడప, ఆంధ్రా రాయలసీమ అంతటా పర్యటించి, బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. చివరగా అనంతపురంలో ఆమరణ దీక్షకు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో తెలుగు ఎంపీలు పార్లమెంట్‌ కేంద్రంగా చేస్తున్న డ్రామాలకు పవన్‌ తెర పెట్టనున్నారు. హోదా అంశంపై ఏపీలో అధికార, విపక్షాలు చేస్తున్న డ్రామాలను నేరుగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్‌. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకంగా ఉన్న ఆమరణ దీక్ష తరహాలోనే ప్రత్యేక హోదా అంశంలో కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే సీనియర్‌ రాజకీయ నాయకులు, మేధావుల సలహాలు, సూచనలు తీసుకున్నట్లు సమాచారం. 
పవన్‌ దీక్షకు లెఫ్ట్‌ పార్టీల మద్దతు 
పవన్‌ ఆమరణ దీక్షకు ఇప్పటికే లెఫ్ట్‌ పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా అంశమే కాకుండా ఇతర అంశాల్లోనూ జనసేనతో కలిసి పని చేయబోతున్నట్లు లెఫ్ట్‌ నేతలు తెలిపారు. అయితే ప్రత్యేక హోదా అంశంపై పలు రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు వీరిని నమ్మే పరిస్థితిలో లేరు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో పవన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొంత కాలంగా స్తబ్ధంగా ఉన్న పవన్‌...2019  ఎన్నికలే లక్ష్యంగా తన ప్లాన్‌ను సిద్ధం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రత్యేక హోదా అంశంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.  

 

15:43 - March 31, 2018

జగిత్యాల : లక్ష్యానికి మించి అదనంగా ప్రసూతిలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించిన ఘనత జిగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి  ఉంది.  ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. మరో వైపు తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు లేక ఆసుపత్రికి వచ్చే  రోగులు నానా అవస్థలు పడుతున్నారు. వచ్చిన రోగులు, బంధువులు నీళ్ల బాటిళ్లు పట్టుకొని రోడ్లపై తిరుగుతున్నారు.  నీళ్ల కష్టాలను భరించలేక ప్రైవేటు ఆస్పత్రులను  ఆశ్రయించి వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. 
మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి కష్టాలు
జగిత్యాల జిల్లా.. మెట్‌పల్లిలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లక్ష్యానికి మించి ప్రసూతిలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించింది. అలాంటి ప్రభుత్వ ఆసుపత్రికి నేడు రోగులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తాగునీటి కష్టాలతో వచ్చిన రోగులు రోడ్లపై బాటిల్లు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో వైద్యులకు మంచి పేరుడంతో.. చికిత్స కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లోని జనం ఆసుపత్రికి తరలి వచ్చేవారు. కానీ ఎండలు మండుతుండడంతో ఆసుపత్రి వారు రోగుల దాహాన్నితీర్చలేకపోతుడడంతో రోగులు ఆసుపత్రికి రావడం మానేస్తున్నారు.
తాగునీరు లేక బాలింతలు, సిబ్బంది అవస్థలు
మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రిలో చేతి పంపుతో పాటు నాలుగు బోర్లు ఎండిపోయాయి.  ఒక బోరు నుంచి వచ్చే నీటిని పట్టుకొని రోగులు ఇన్నిరోజులు తమ దాహార్తిని తీర్చుకున్నారు. ప్రస్తుతం ఈ బోరు నుంచి కూడా నీళ్లు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వారం రోజుల నుండి రోగులు తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. వీరితో పాటు ఆసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బంది కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక బాలింతల పరిస్థితి దారుణంగా తయారైంది. బాలింతలు, వారి బంధువులు మూత్రశాలలకు వెళ్లాలంటే నీరు లేక అవస్థలు పడుతున్నారు.  
ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
ప్రభుత్వ ఆసుపత్రిలో నీళ్ల కష్టాలతో రోగులు వైద్యం కోసం ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దొరికిందే ఛాన్సుగా ప్రవేటు ఆసుపత్రులు రోగుల నుంచి వేలకు వేలకు లాగేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం, ప్రసూతులు చేయించుకోవాలని చెప్తున్న ప్రభుత్వం ఆసుపత్రిలో కనీస అవసరాల కల్పనను మాత్రం గాలికి వదిలేసింది. మెట్‌పల్లి ఆసుపత్రిలో తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. 

 

అయేషా కేసులో అసలైన నిందుతుడ్ని పట్టుకోవాలి : దేవి

విజయవాడ : సంచలనం సృష్టించిన అయేషా మీరా కేసులో అసలైన నిందుతులను పట్టుకోవాలని సామాజిక కార్యకర్త దేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో అయేషా మీరా న్యాయపోరాట కమిటీ సభలో పాల్గొన్న దేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయేషా మీరా కేసులో అసలైన నిందితుడ్ని పట్టుకోవటంలో విఫలమయ్యారని దేవి విమర్శించారు. ఈ కేసును పెడదారి పట్టించిన పోలీసలు దళిత యువకుడైన సత్యంబాబును నేరస్థుడిగా పేర్కొని పలు చిత్రహింసలకు గురిచేసారు. ఈ క్రమంలో సత్యంబాబు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. దీంతో అతడి ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు. ఈ సభలో పలు మహిళా సంఘాలు,దళిత సంఘాలు పాల్గొన్నాయి.

15:33 - March 31, 2018

కర్నూలు : విద్యార్థులు సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని దేశ ప్రధానమంత్రి మోదీ సూచించారు. కర్నూలులోని పెద్దటేకూరు సమీపంలోని బృందావన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2018 కార్యక్రమంలో.... ప్రధాని వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. దైనందిన సమస్యలు, సాఫ్ట్‌వేర్‌ పరిష్కారాలను రూపొందించేవిధంగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ ఉండాలన్నారు. దేశాభివృద్ధికి విద్యార్థులే కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో 51 బృందాలుగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని విద్యార్థులు కోరారు. 

 

15:30 - March 31, 2018

హైదరాబాద్ : కాగ్‌ నివేదికపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి. తెలంగాణలో పరిపాలన సరిగ్గా జరగడంలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థలే తేల్చాయన్నారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి కారణమైన ఆర్థిక అధికారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. లోటు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌గా చూపించి....బ్యాంకుల్లో వేలకోట్ల రూపాయలు రుణాలు తెచ్చి....కమీషన్లు ఇచ్చే కంపెనీలకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

 

15:27 - March 31, 2018

మలేసియా : ఉపాధి కోసం మలేసియా వెళ్లాలనుకునే వారిపై మోసగాళ్లు వల వేస్తున్నారు. మలేసియాకి మనుషుల్ని రవాణా చేస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్నారు. నమ్మి వచ్చిన వారిని కౌలాలంపూర్‌లోని సంస్థల్లో పనికి కుదురుస్తున్నారు. పనిలో చేరింది మొదలుకొని యాజమాన్యాలు బాధితులకు నరకం చూపిస్తున్నాయి. దీంతో చేతిలో డబ్బుకూడా లేకుండా తెలుగువారు మలేసియాలో అవస్థలు పడుతున్నారు. తెలుగు వారి అవస్థను గుర్తించిన కాంగ్రెస్‌ అనుబంధ గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం బాధితులకు అండగా నిలిచింది. కౌలాలంపూర్‌లో తెలుగుబాధితుల పక్షాన పనిచేస్తున్న శాంతిప్రియ సహకారంతో వందలాది మంది తెలుగువారికి విముక్తి కలిగించింది. గల్ఫ్‌ బాధితులను స్వదేశానికి రప్పించాలని కాంగ్రెస్‌ అనుబంధ గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 
 

15:22 - March 31, 2018

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కలిసి పోరాడదామని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే.. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై.. రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఈ విషయంలో.. తమకెలాంటి క్రెడిట్ అవసరం లేదని.. రాష్ట్రం కోసం టీడీపీతో కలిసి పోరాడేందుకు సిద్ధమన్నారు. చంద్రబాబుకు ఈ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. 

శోభాయాత్రలో 'కత్తి' కలకలం..

హైదరాబాద్ : నేడు నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శోభాయాత్రలో కత్తి కలకలం సృష్టించింది. గౌలిగూడ వద్ద ప్రారంభయిన శోభాయాత్రలో ఓ భజరంగ్ దళ్ కార్యకర్త వద్ద వున్న కత్తి వున్నట్లుగా గ్రహించిన డీసీపీ అవినాశ్ మహంతి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ యాత్ర నగరంలో 12 కిలోమీటర్లపాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని 400ల సీసీ కెమెరాలతో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలో జరగకుండా వుండేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంది.

15:16 - March 31, 2018

తూర్పుగోదావరి : పాపికొండలు విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో పడి నలుగురు మృతి చెందారు. మృతులు ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లా జగదల్‌ గ్రామానికి చెందిన వాళ్లు. పాపికొండలు విహార యాత్రకు వచ్చిన వీళ్లు నిన్న రాత్రి శివగిరి ప్రైవేటు రిసార్ట్స్‌లో బస చేశారు. ఉదయాన్నేగోదావరి నదిలో స్నానానికని వెళ్లి గల్లంతయ్యారు.  మృతులు మోహన్‌రాఠీ, జగదీష్‌రాఠీ, అంకిత్‌రాఠీ, శివంగ్‌రాఠీగా గుర్తించారు.

బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్..ముగ్గురు మృతి..

విజయనగరం : జిల్లాలోని ఎస్.కోట కొత్తూరు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ ను ఓ ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.ఈ ఘటనలో ఇద్దరు స్కూల్ విద్యార్ధులతో సహా ముగ్గురు మృతి చెందారు. స్కూలు విద్యార్ధులిద్దరు లోకేష్, విజయ్ లు ఎస్.కోటలోని రామన్ స్కూల్ విద్యార్ధులుగా,మరో వ్యక్తి భోగాపురం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

15:04 - March 31, 2018

వివాహం విశ్వజనీన సామాజిక - సాంస్కృతిక విధానం. దీని ద్వారా స్త్రీ, పురుషులిద్దరూ కుటుంబ జీవితానికి నాంది పలుకుతారు. కుటుంబ వ్యవస్థకు ఆధారం వివాహమే. ఇది సమాజ అనుమతితో స్థిరమైన లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకునే ఓప్రక్రియ. సమాజం నిరంతరం కొనసాగడానికి మూలాధారానికి ఇదే ఆరంభం. మరణాల ద్వారా ఏర్పడే లోటును జననాల ద్వారా భర్తీ చేయడానికి వివాహమే ఆధారం. వివాహం అన్ని సమాజాల్లోనూ ఉంది. కానీ, దీని నియమాలు వివిధ సమాజాల్లో విభిన్న రీతుల్లో ఉన్నాయి. దాంట్లో భారతీయ వివాహ వ్యవస్థపై ఎంతోమంది ఎంతో గొప్పగా చెబుతుంటారు. ఇద్దరు వ్యక్తులను, ఇరు కుటుంబాలను కలిపే వారధిగా వివాహ వ్యవస్థ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు ప్రారంభించే కొత్త జీవితం ఎలా వుండాలి? వారు ఎలా మసలుకోవాలి? ఒక అభిప్రాయాలను మరొకరు ఎలా గౌరవించుకోవాలి? కష్టసుఖాలలో ఒకరికొకరు ఎలా చేదోడు వాదోడుగా వుండాలి? అని విషయాలపట్ల పూర్తి అవగాహన వుంటేనే ఆ సంసారం పూలనావలా సాగిపోతుంది. కానీ భర్త భార్యను బానిసగా భావిస్తే..భార్యను తన స్వంతఆస్తి అన్నట్లుగా ప్రవర్తిస్తే..తను చెప్పిందే చేయాలి..తన మాటే నెగ్గాలి అనే అహానికి భర్త వ్యవహరిస్తే..భార్యను లైంగిక బానిసగా భావిస్తే..ఆమెపై హక్కు, అధికారంగా వ్యవహరిస్తే?..అటువంటి నేపథ్యంలో భారతీయ వివాహ వ్యవస్థకు బీటలువారే ప్రమాదం వుంది. ఈ క్రమంలో దేశంలో ఎంతోమంది భార్యలు వివాహ అత్యాచారాలకు గురవుతున్నారు. భర్త సాగించే లైంగిక హింసాకాండపై కేసులుండటం లేదంటున్న సర్వే.. ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేస్తే కేసు పెట్టవచ్చు...కానీ భార్యకు ఇష్టం లేకుండానే భర్త సాగించే లైంగిక హింసాకాండపై వివాహం మాటున నిందితులైన భర్తలపై కేసులుండటం లేదని ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. భర్తల లైంగిక దాష్టీకానికి ఎందరో భార్యలు బాధలు పడుతున్నా వారి కన్నీళ్లు తుడిచే వారు కరవయ్యారు. భర్త పెట్టే లైంగిక హింసాకాండను పంటి బిగువన భరించుకుంటు మౌనంగా 'పరువు' కోసం దుర్భర జీవనం సాగిస్తు భార్యలు ఎందో ఈ భారతదేశంలో. భర్త పెట్టే లైంగిక హింసలకు అధిక రక్తస్రావాలకు గురయిన భార్యలు కొందరు వైద్యులను సంప్రదిస్తే మరికొందరు పలు రకాల ఆరోగ్య సమస్యలకు లోనయి ప్రాణాలు కోల్పోన సందర్భాలు కూడా లేకపోలేదు. వారి మృతి ఏదో తెలియని జబ్బు చేసిన చనిపోయిందనే మాటలతో వాస్తవాలన్నీ సమాధి అయిపోతుంటాయి. మరికొందరు మహిళలపై రుతుస్రావం సమయంలోనూ భర్తలు సాగించే అత్యాచారకాండతో భరించలేదని బాధతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. భర్త అత్యాచారంచేస్తున్నాడంటున్న ఓ అభాగ్యురాలి ఆవేదన.. ప్రతీరోజూ భర్త తనపై బలవంతంగా అత్యాచారం చేస్తున్నా సామాజిక పెళ్లి బంధనాల మధ్య ఉన్న తాను పెదవి విప్పలేక పోతున్నానంటూ 42 ఏళ్ల వివాహిత ఆవేదనగా చెప్పింది. ‘‘నా భర్త జంతువులాగా ప్రతీ రాత్రి తనను లైంగికంగా హింసిస్తుండటం వల్ల గర్భస్రావం కూడా అయింది’’ అంటూ మరో బాధిత వివాహిత ఆందోళన వ్యక్తం చేసింది. గృహ హింసే కాదు లైంగిక హింసకు గురవుతున్న ఎందరో అభాగినులు.. గృహ హింసే కాదు లైంగిక హింసకు గురవుతున్న ఎందరో అభాగినులు తమ పడకగదుల్లో భర్తల బాగోతాలను బట్టబయలు చేసేందుకు ముందుకు రావడం లేదని సామాజికవేత్త మధుగార్గ్ పేర్కొన్నారు. కొందరు భర్తలు సాగిస్తున్న అసహజ లైంగికకాండపై భార్యలు పెదవి విప్పేందుకు నిరాకరిస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. మైనర్ బాలికలను పెళ్లాడిన యువకులు పెళ్లి ముసుగులో వారిని లైంగికంగా వేధిస్తున్నా బాలల హక్కులు, చట్టాలు పనిచేయడం లేదని సాచిసింగ్ అనే స్వచ్ఛంద సేవకుడు చెప్పారు. భార్యపైనా బలవంతంగా సాగించే అత్యాచారం మన దేశంలో నేరంగా గుర్తించడం లేదని రేణు మిశ్రా అనే న్యాయవాది ఆరోపించారు. ఎందరో బాధిత భార్యల ఆక్రందనలపై ఇకనైనా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సేవకులు కోరుతున్నారు.

వైష్ణోదేవి యాత్ర నిలిపివేత..

జమ్మూకశ్మీర్ : వైష్ణో దేవి యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. శుక్రవారం భారీ స్థాయిలో భక్తులు పోటెత్తడంతో ఇవాళ ఆ యాత్రకు బ్రేకేశారు. కట్రా బేస్ నుంచి వస్తున్న భక్తులను ప్రస్తుతానికి నిలిపేసినట్లు సమాచారం. భక్తుల తాకిడి అధికంగా ఉందని, నిన్న రాత్రి 8 గంటలకు టికెట్ కౌంటర్‌ను మూయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మాతా వైష్ణో దేవి దర్శనం కోసం సుమారు 41 వేల మంది భక్తులు క్యూకట్టినట్లు తెలుస్తోంది. కట్రా బేస్ దగ్గర మరో 20 వేల మంది వేచి ఉన్నట్లు సమాచారం. సగటున ప్రతి రోజు 40 వేల మంది భక్తులు ఆలయానికి వస్తున్నట్లు అంచనా.

సీబీఎస్‌ఈ పేపర్ లీక్..9మంది అరెస్ట్..

ఢిల్లీ : సీబీఎస్‌ఈ పేపర్ లీకేజీ ఘటనలో జార్ఖండ్ పోలీసులు 9 మంది మైనర్లను అరెస్టు చేశారు. ఆ మైనర్లను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు చెప్పారు. ఐపీసీ చట్టం కింద ముగ్గుర్ని అరెస్టు చేశామని, జువెనైల్ చట్టం ప్రకారం మరో 9 మంది విద్యార్థులు అరెస్టు చేసినట్లు ఛత్రా ఎస్పీ తెలిపారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్‌తో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు ఇవాళ ఢిల్లీలో సీబీఎస్‌ఈ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్..

హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పలుచోట్ల వాహనాలను దారి మళ్లించారు. అశోక్‌నగర్‌లో దారి మళ్లింపులో పొరపాటు వల్ల ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు భారీగా వాహనాలు వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ వరకు భారీగా ట్రాఫిక్‌జాం సంభవించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పశువుల గ్రాసం కొరకు చర్యలు : మంత్రి తలసాని

హైదరాబాద్ : ఎండాకాలంలో మూగజీవాలకు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 75 శాతం రాయితీపై ఇస్తున్న గడ్డి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంచార పశువైద్యశాలలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. పశువులకు సరైన సమయంలో వైద్యం అందుతుందన్నారు. గొర్రెల పంపిణీతో గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపామని తెలిపారు. ఇప్పటికే 53 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. పాడి, గొర్రెల పెంపకం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి తలసాని యాదవ్ పేర్కొన్నారు.

ప్రాజెక్టులపై సీఎంతో చర్చించాం : సోమిరెడ్డి

కడప : సాగునీటి ప్రాజెక్టులపై సీఎంతో అన్ని విషయాలు చర్చించామని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గండికోట పరిహారం త్వరగా వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సోమిరెడ్డి ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని సోమిరెడ్డి పేర్కొన్నారు. రైతులకు టీడీపీ ఏం చేసిందని ఆరోపించటం అర్థరహితమన్నారు. ఇన్ పుట్ సబ్సిటీ కింది రూ.125 కోట్లను రైతులకు ఇచ్చామని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. 

13:33 - March 31, 2018

మంచిర్యాల : ఆహ్లాదాన్ని పంచాల్సిన నదీ తీరం చెత్తా చెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. నెలల తరబడి చెత్తా చెదారం, మురుగు నీరుతో నిండిపోయి... కాలుష్య మాటున చిక్కుకుపోయింది. ఇది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని స్థానిక గోదావరి నది తీరం పరిస్థితి. పవిత్రమైన గోదావరి తీరం చెత్తా చెదారంతో నిండిపోయింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని గోదావరి ఎల్లంపల్లి జలాశయం నీటిని లక్షెట్టిపేట, ఉత్కూర్‌, మోదెలా, ఇటిక్యాల మేజర్‌ గ్రామపంచాయితీల తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారు. కాని ఇప్పుడు ఈ జలాశయం మురుగు, వ్యర్థాలతో అపరిశుభ్రంగా మారిపోయింది. నదీ తీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉన్నా పంచాయితీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దయణీయంగా తయారైంది.

ఉపాధి హామీ పథకంలో భాగంగా నది సమీపంలో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేశారు. దీంతో ఊరిలో పోగుచేసిన చెత్తను ఇక్కడే నిల్వ చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం పూర్తిగా నిండడంతో చెత్త మొత్తం నదిలో కలుస్తుంది. దీంతో పవిత్ర జలాలు కలుషితంగా మారుతున్నాయి. మరోవైపు డంప్‌ యార్డ్‌ నిండడంతో రోడ్డుపైనే చెత్త వేస్తున్నారు. అది కాస్తా నదలో కలిసి నీరు కలుషితం అవుతోంది.

గత నెల నిర్వహించిన రుద్రసహిత శతచండీ మహాయాగం సందర్భంగా పూజ అనంతరం చండిమాత, శివపార్వతుల విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జం చేసి 40 రోజులు గడుస్తున్నా అందులోని వ్యర్థాలను పంచాయితీ సిబ్బంది తొలగించలేదు. విగ్రహాల తయారీకి ఉపయోగించిన కొబ్బరి పీచు, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, ఇతర రసాయన పదార్థాలు రోజుల తరబడి నీటిలో ఉండటంతో దుర్వాసన వస్తోంది. స్నానఘట్టాల వద్ద ఎక్కడ చూసినా వ్యర్ధాలు కుప్పలు తిప్పలుగా పేరుకుపోయాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరికి వస్తే పుణ్యం ఏమో గాని రోగాలు తప్పవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా గోదావరి నది సమీపంలోనే దహన సంస్కారాలు చేపడుతున్నారు. వెంట తీసుకువచ్చే వస్తువులను అక్కడే వదిలేసి వెళ్తున్నారు. సాయంత్రం అయితే చాలు మందుబాబులు నదీ తీరంలో పార్టీలు చేసుకుంటున్నారు. వ్యర్థాలను గోదావరి తీరంలోనే పారేస్తుండడంతో గాజు పెంకులు, పాలిథిన్‌ కవర్లు, విస్తారాకులతో ఆ ప్రాంతం అంతా చెత్త పేరుకొని పోయి అపరిశుభ్రంగా తయారైంది. పవిత్ర గోదావరి కలుషితం కావడంపై ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అపరిశుభ్రంగా ఉన్న గోదావరిని అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పరిశుభ్రంగా మార్చాలని కోరతున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తుల కారణంగానే ఈ సమస్య తలెత్తిందని ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ విషయమై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నో రోజుల నుండి కలుషితంగా మారిన గోదావరి తీరాన్ని పరిశుభ్రంగా మార్చుతామని స్థానిక ప్రజా ప్రతినిధులు చెబుతున్నా... అది ఏమేరకు అమలు చేస్తారో వేచి చూడాలి. 

13:30 - March 31, 2018

హైదరాబాద్ : అంగట్లో బొమ్మల్లా అమ్మేస్తున్నారు మైనర్‌ బాలికలను.. అభంశుభం తెలియని వారంతా వ్యభిచార కూపంలో నరకయాతన అనుభవిస్తున్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ.. వింటుంటే కడుపు తరుక్కుపోతుంది... అప్రయత్నంగానే కన్నీరు పెల్లుబుకుతుంది.. రెండు తెలుగురాష్ర్టాల్లోనూ వేలాదిగా సాగుతున్న మైనర్‌ బాలికల అక్రమరవాణాపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం..

తెలుగు రాష్ర్టాల్లో మైనర్‌ బాలికలను అంగడి బొమ్మల్లా అమ్మేస్తున్నారు. పనిచూపిస్తామంటూ తీసుకెళ్ళి వ్యభిచార ఊబి దించేవారు కొందరైతే.. బంధువులే లైంగికంగా వేధించడంతోపాటు అమ్మేస్తున్న ఘటనలూ అనేకం చోటు చేసుకుంటున్నాయి. మరికొందరు ప్రేమపేరుతో వంచించి.. పెళ్ళిచేసుకున్నాక అంగట్లో బొమ్మాల్లా వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. ఇలా ఒక్కో బాధిత మైనర్‌ బాలిక గాథ ప్రతిఒక్కరి గుండెలను పిండివేస్తుంది. ఒకవేళ పోలీసులు, ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారుల చొరవతో నరక కూపంనుంచి బయటపడ్డా... కోర్టు మెట్లెక తప్పదు... మైనార్టీ తీరేదాకా వారంతా ప్రభుత్వ హోమ్‌ల సంరక్షణలో ఉండాల్సిందే.. ఇలా కన్నవారికి దూరమైన బాలికలు తాము నరక యాతన అనుభవిస్తున్నమని కన్నీటి పర్యంతమౌతున్నారు.

వ్యభిచార గృహాలనుంచి కొందరు మైనర్‌ బాలికలను ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు రక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తాజ్‌బంజారాలో బాలికల అక్రమ రవాణా చేపట్టాల్సిన చర్యలు- మీడియా చేయూత లాంటి అంశాలపై సెమినార్‌ నిర్వహించారు. బాధితులను ఎక్కువగా ఫోకస్‌ కాకుండా.. అక్రమ రవాణాకు పాల్పడే బ్రోకర్ల అరాచకాలను వెలుగులోకి తీసుకురావాలన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.

ఇలాంటి కేసులను సంవత్సరాల పర్యంతం సాగదీయకుండా... ఏడాదిలోపు పూర్తయ్యేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఛైల్డ్‌ వెల్ఫేర్‌ ప్రతినిధులు సూచించారు. బాధితులు మైనార్టీ తీరి.. వివాహం చేసుకున్నాక కోర్టుల చుట్టూ తిరుగుతుంటే.. కట్టుకున్నవారితో ఇబ్బందులు తలెత్తితాయన్నారు. దీంతో వారు మరింత మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుందన్నారు. ఒక సమస్యనుంచి బయటపడ్డవారికి.. మరో సమస్య తలెత్తకుండా.. త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు చైల్డ్‌వెల్ఫేర్‌ సంస్థ ప్రతినిధులు.. అలాగే సమాజంలో వారి వివరాలను ఎంత గోప్యంగా ఉంచాలన్నారు. 

విహారయాత్రలో విషాదం..

పశ్చిమగోదావరి : విహారయాత్రలో విషాదం నెలకొంది.  విహారయాత్రకని వెళ్లిన నలుగురి ప్రాణాలు  అనంతవాయువుల్లో కలిసిపోయాయి.  ఈ ఘటన పోలవరం మండలం శివగిరిలో చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి నలుగురు మృతి చెందారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న శివగిరి గ్రామస్థులు మృతదేహాలను వెలికి తీసి అధికారులకు సమాచారమందించారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌వాసులుగా అనుమానిస్తున్నారు. పాపికొండలు సందర్శనకు వెళ్లి శివగిరి కాటేజీల్లో బసచేసిన వీరు ఉదయం స్నానం కోసం గోదావరి నదిలో దిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

13:27 - March 31, 2018

హైదరాబాద్ : ఉపాధి కోసం మలేసియా వెళ్లాలనుకునే వారిపై మోసగాళ్లు వల వేస్తున్నారు. మలేసియాకి మనుషుల్ని రవాణా చేస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్నారు. నమ్మి వచ్చిన వారిని కౌలాలంపూర్‌లోని సంస్థల్లో పనికి కుదురుస్తున్నారు మోసగాళ్లు. పనిలో చేరింది మొదలుకొని యాజమాన్యాలు బాధితులకు నరకం చూపిస్తున్నాయి. దీంతో చేతిలో డబ్బుకూడా లేకుండా తెలుగువారు మలేసియాలో అవస్థలు పడుతున్నారు. తెలుగు వారి బాధను గుర్తించిన కాంగ్రెస్‌ అనుబంధ గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం బాధితులకు అండగా నిలిచింది. కౌలాలంపూర్‌లో తెలుగు బాధితుల పక్షాన పనిచేస్తున్న శాంతిప్రియ సహకారంతో వందలాది మంది తెలుగువారికి విముక్తి కలిగించింది. గల్ఫ్‌ బాధితులను స్వదేశానికి రప్పించాలని కాంగ్రెస్‌ అనుబంధ గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

ఎస్పీ ఆఫీస్ ముట్టడికి వైసీపీ యత్నం, ఉద్రిక్తం..

కడప : ఎస్పీ కార్యాలయం ముట్టడికి యత్నించిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నాయకుడు శివారెడ్డి హత్యకు నిరసనగా శివారెడ్డి మృతదేహంతో వైసీపీ నేతలు ఎస్పీ కార్యాలయం ముట్టడికి యత్నించటంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హత్యకు సహకరించిన ఇటుకల పల్లి సీఐ యాదవ్ ను సస్పెండ్ చేసేంత వరకూ ఆందోళన విరమించేది లేదన్న వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆక్కడ పోలీసులు భారీగా మోహరించారు.

తెలుగువారికి అండగా శాంతిప్రియ..

ఢిల్లీ : మలేసియా రాజధాని కౌలాంపూర్ లో తెలుగు వారి పక్షాల శాంతిప్రియ అనే మహిళ పోరాడుతోంది. శాంతిప్రియ సహకారంతో వందలాదిమంది తెలుగువారు విముక్తి పొందుతున్నారు. ఉపాధి కోసం మలేసియా వెళ్లాలనుకునేవారిపై మోసగాళ్లు వలపన్ని మనుషులను రవాణా చేసే ముఠాలుగా తయారయి వేలాది రూపాయలను దండుకుంటున్నారు. మోసం చేసినవారిని కౌలాలంపూర్ లోని పలు సంస్థల్లో పనికి కుదురుస్తు డబ్బులు దండుకుంటున్నారు. వీరి వలలో చిక్కి తెలుగువారు బానిసలుగా మారుతున్నారు. పనిలో చేరింది మొదలు వారికి యజమానులు నరకం చూపిస్తున్నారు. దీంతో మలేషియాలో తెలుగువారి కష్టాలు వర్ణనాతీతంగా వున్నాయి.

13:04 - March 31, 2018

మహబూబ్ నగర్ : వేసవి మొదలయిందో లేదో తెలంగాణ వ్యాప్తంగా తాగునీకష్టాలు ప్రారంభమయ్యాయి. గుక్కెడు మంచినీటీ కోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. పట్టణాలు దాహంతో విలవిల్లాడుతున్నాయి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి పాలమూర్ జిల్లా తాగునీటి కష్టాలపై టెన్‌టీవీ ఫోకస్‌.

పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరొందిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. జూరాల పై ఆధాపడిన జలాశయాలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి.. దీంతో జిల్లా వాసులకు తాగునీటి కష్టాలు ముంచుకొచ్చాయి. 42 లక్షల జనాభా గల ఉమ్మడి పాలమూర్ జిల్లాలో సగానికి పైగా జూరాల ప్రాజెక్ట్ ఆధారంగానే తాగునీటి సరఫరా జరుగుతోంది. కానీ జూరల జలాశయంలో నీరు అడుగంతుండంతో రామన్ పాడు, కోయిల్ సాగర్, జమ్ములమ్మ రిజర్వాయర్ల పరిస్దితి ఆందోళనకరంగా మారింది.

ఉమ్మడి జిల్లాలో 4 మున్సిపాలిటీలు, 4 నగర పంచాయతీలున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల , వనపర్తి, నారాయణపేట, షాద్ నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, అయిజ, కల్వకుర్తి మున్సిపాలిటీలు , నగర పంచాయతీలకు వివిధ వాటర్ స్కీంల ద్వారా నీటి సరఫరా అవుతోంది. జూరాల, రామన్ పాడు, కోయిల్ సాగర్ రిజర్వాయర్ల ద్వారా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి జములమ్మ రిజర్వాయర్ తో గద్వాల మున్సిపాలిటీకి రామన్ పాడు రిజర్వాయర్ నుంచే వనపర్తి తో పాటు నాగర్ కర్నూల్, అచ్చంపేట నగరపంచాయతీలకు నీటి సరఫరా జరుగుతోంది. నారాయణపేట మున్సిపాలిటీ, కల్వకుర్తి, షాద్ నగర్ మున్సిపాలిటీలకి మాత్రం బోర్లే దిక్కుగా మారింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బోర్లు ఎండిపోవటంతో తాగునీటి కటకటగా మారింది.

కల్వకుర్తి జనాభా 35 వేలు. పట్టణంలో బోర్లు ఎండిపోవటంతో జనానికి నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయిజ మున్సిపాలిటీ పరిధిలో 35 వేల జనాభా ఉండగా.. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్ళు సరిపోవట్లేదు. అచ్చంపేట జనాభా 25 వేలుంటే ఈ మున్సిపాలిటీకి కూడా రామన్‌పాడు ప్రాజెక్టు ఆధారం. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర్లోనే ఉన్నా క్రిష్ణానది పక్కనే పారుతున్నా అచ్చంపేటకు నీరు సప్లయ్ కావడం లేదు.

అటు వనపర్తి పట్ట ప్రజలను తాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. తాగునీటి అవసరా కోసం రెండు స్కీంలు పెట్టామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా.. వీటిలో ఒకటి పడకేసి ఏడాదైంది. రెండో దానికి ఎప్పుడూ ఏదో సమస్య వస్తూనే ఉంది. ఇక్కడి తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన రామన్‌పాడు పాత స్కీం గత ఏడాది కాలంగా నిరుపయోగకంగా మారింది. ఇంటెక్విల్, ఎర్రగట్టు, కానాయపల్లి వద్ద పనిచేయాల్సిన మూడు మోటార్లు చెడిపోయినా వాటి గురించి పట్టించుకునే వారు లేరు. కొత్త మోటారుల కొనుగోలుకు రూ. 40 నుంచి 50 లక్షలు వెచ్చిస్తే పథకం దారిలో పడుతుందని స్ధానికులు అంటున్నారు. నాయకులు, అధికారులు ఎప్పటికప్పడు హామీల వరదలు పారిస్తున్నా.. గొంతు తడుపుకోను గుక్కెడు నీరులేక పాలమూరుజిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. 

మలాలా భావోద్వేగం..

పాకిస్థాన్ : తాను పుట్టిన పెరిగిన స్థలం అయిన స్వాట్ వ్యాలీకి మలాలా యూసఫ్ జాయ్ చేరుకునంది.2012లో తాలిబన్ల మలాలాను షూట్ చేసింది ఆమె పుట్టిన ప్రదేశంలోనే. ఆ ఘటన జరిగిన అయిదేళ్ల తర్వాత మళ్లీ ఆ ప్రాంతానికి మలాలా వెళ్లడం విశేషం. స్వంత ఊళ్లోని స్వంత ఇంటికి చేరుకోగానే మలాలా ఒక్కసారి భావోద్వేగానికి లోనై కన్నీళ్లపర్యంతమైంది. దీంతో తన తండ్రి ఆమెను ఓదార్చాడు. ఇస్లామాబాద్ నుంచి మింగోరా వరకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మలాలా వెళ్లింది. పాక్ ఆర్మీ ఆ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. మళ్లీ సోమవారం ఆమె బ్రిటన్‌కు తిరుగు ప్రయాణమవుతుంది.

12:50 - March 31, 2018

విజయవాడ : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో రోడ్లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. నిజాబామాద్‌ జిల్లాలో మార్చి నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంలో జనాలు బెంబేలెత్తుతున్నారు.

వేసవి కాలం ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు మూడు డిడ్రీల ఉష్ణోగ్రతలు పెరిపోయాయి. నిజామబాద్, కామారెడ్డి జిల్లాలో ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ నెల 26న ఏకంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం వచ్చేసరికి వాతావారణం అగ్నిగుండంగా మారుతోంది.

2013 మే నెలలో 45.6 డిగ్రీలు, 2014లో మార్చిలో 43.6 డిగ్రీలు, 2016లో ఏప్రిల్‌లో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 13వ తేదీన 36,14న 36, 15న 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి 26వ తేదీ నాటికి 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఇలా మండిపోతుంటే రాబోయే రోజులను తలుచుకొని జనం భయపడుతున్నారు. భౌగోళిక పరిస్థితులరిత్యా వేసవి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావారణ నిపుణులు అంటున్నారు. ఎండ తీవ్రతను తప్పించుకునేందుకు ప్రజలు కొబ్బరిబొండాలు, నిమ్మరసం, శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.

12:47 - March 31, 2018

ఢిల్లీ : జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకొంటున్న ముఖ్యమంత్రి కేసిఆర్.... అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల 4న ఢిల్లీ వెళ్లి పలు పార్టీల నేతలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. జాతీయ స్థాయి సమస్యలపై జెండా రూపొందించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు.

పీపుల్స్ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా ఏర్పాటుపై కేసీఆర్‌ ప్రకటన కూడా చేశారు. ఫ్రంట్‌కు మద్దతు కూడగట్టే పనిలో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కేసీఆర్‌ ప్రతిపాదనను స్వాగతించారు. అలాగే జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ కేసీఆర్‌ను కలిసి ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ముఖ్యమంత్రితో భేటీ అయిన టాలీవుడ్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ కూటమిపై చర్చించారు.

తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు వచ్చే నెల 4న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి... ఆరోజు పలు జాతీయ పార్టీల నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చిస్తారు. ఈ విషయంలో సీనియర్ల అభిప్రాయాలు తెలుసుకుంటారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలను కూడా కేసీఆర్‌ సిద్ధం చేసుకున్నారు. రైతు సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే... జాతీయ స్థాయిలో కూడా తనదైన రాజకీయ ముద్ర వేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. 

హైకోర్టుకు ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్..

ఢిల్లీ : సీబీఎస్ఈ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది. పన్నెండో తరగతి ఎకనమిక్స్ పేపరు, పదో తరగతి మ్యాథ్స్ పేపర్లు లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్షను ఈ నెల 25న తిరిగి నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. పదో తరగతి మ్యాథ్స్ పరీక్షను కూడా తిరిగి నిర్వహించాలా? లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. అయితే, దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.

12:42 - March 31, 2018

కడప : పులివెందుల మార్కెట్ యార్డులో అక్రమాలు బయటపడుతున్నాయి. మార్క్ ఫెడ్ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వం వరమిచ్చినా అధికారి కనికరించడం లేదు. కడప జిల్లాలో శనగ రైతులను దళారులే కాకుండా అధికారులు కూడా నిలువు దోపిడి చేస్తున్నారు. క్వింటాలు రూ. 4,400 కొనుగోలు చేయాలని చెప్పినా మార్క్ ఫెడ్ అధికారులు కమిషన్ కక్కుర్తితో రైతులను దోచేస్తున్నారు. కమిషన్ ఇస్తేనే పంట కొనుగోలు చేస్తామని ఓ అధికారి డిమాండ్ చేస్తున్నాడు. మొత్తంగా రూ. 6లక్షలకు పైగా అధికారి దండుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఎవరో కావాలని కుట్ర చేసి ఇరికించారని ఆ అధికారి పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

శివతేజ ఆత్మహత్య కేసు విచారణకు కమిటీ..

హైదరాబాద్ : నిమ్స్ డాక్టర్స్ క్లబ్ లో పీజీ విద్యార్థి శివతేజ ఆత్మహత్యపై విచారణ కోసం త్రిసభ్య కమిటీ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో డీఎంఈ రమేశ్ రెడ్డి, నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మంజుల సభ్యులుగా నియామకం అయ్యారు. కాగా ఈ కమిటీని జూనియర్ డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. కమిటీలో రిటైర్డ్ జడ్జ్ లేదా..ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వుండాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. గత ఆదివారం శివతేజ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

12:18 - March 31, 2018

అనంతపురం : వైసీపీ నాయకుడు శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు నిరసనగా ఆసుపత్రి మార్చురీ ఎదుట వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాప్తాడు సమన్వయకర్త ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. టిడిపి నాయకులే ఈ హత్యకు కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎస్ఐ ను సస్పెండ్ చేయాలని..హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. 

12:15 - March 31, 2018

అందమైన ప్రకృతిలో అద్భుతాలెన్నెన్నో! మనం గమనించాలే కానీ ప్రతీదీ ఒక రహస్యమే! ప్రతీదీ ఒక వింతే.. ఆ రహస్యాలను, వింతలను ఛేదించేందుకే మనిషి తన మేధస్సును పదునుపెట్టాడు. ఆ పొరలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి, విచ్చుకుంటున్నాయి. కానీ అంతటి మానవ మేథస్సుకు కూడా అంతుచిక్కకుండా సవాలుగా నిలిచేవి ఎన్నో!ఎన్నెన్నో!!మానవ మేధకు అందని అపూర్వమైన మిస్టరీలు కొన్ని అలాగే మిగిలిపోయాయి. వాటిని బైటపెట్టాలనే తపన మనిషికి పెరుగుతునే వుంది. ఆ నిరంతర తపోశోధన అజరామరంగా కొనసాగుతూనే ఉంది. కాలచక్రంలో తెలియకుండా మిగిలిపోయిన మిస్టరీలు కొన్నింటిని కనుక్కోవడానికి ఎన్నో యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనదేశంలోనే కాదు ప్రపంచ మంతటా ఉన్న ఇలాంటి మిస్టీరియస్‌ మిస్టరీలు మానవ మేధస్సును సవాల్‌ విసురుతున్న మిస్టరీ ట్రీని చూద్దాం..మరి ఆ చెట్టు పేరు ఏమిటో..దానిలో వున్న అద్భుతమేమిటో..ఎటువంటి మిస్టరీ ఆ చెట్టులో దాగుందో తెలుసుకుందాం..

డ్రాగన్‌ బ్లడ్‌ ట్రీ గా పిలిచే యొమెన్ ట్రీ..
యెమెన్‌ చెట్టును డ్రాగన్‌ బ్లడ్‌ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు దాదాపు 32 అడుగులు పెరుగుతుంది. దీని ఆకారం మామూలు చెట్టులా కాక విభిన్నంగా ఉంటుంది. గొడుగులా వుంటుంది. పొడగాటి కాండం ఉండి చెట్టుపైన ఒక పళ్లెంలా కనిపిస్తుంది. సంవత్సరంలో ఒక్క ఫిబ్రవరి నెలలో ఈ చెట్టు వికసిస్తుందట. అసలింతకీ ఈచెట్టుకు డ్రాగన్‌ బ్లడ్‌ ట్రీ అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయాన్ని తెలుసుకుందాం..

చెట్టు కాండాన్ని కోస్తే ఎర్రటి ద్రవం ..
చెట్లకు ఎక్కడన్నా రక్తం కారుతుందా? చెట్టుకు ప్రాణం వుంటుంది. నీటి సదుపాయం వుంటే ఏపుగా పెరుగుతుంది. కొన్ని చెట్టు వర్షం పడినప్పుడు నీటిని నిలువ చేసుకుని అక్కరకు వచ్చినప్పుడు ఆ నీటిని సద్వినియోగం చేసుకునే గుణం కూడా వుంటుంది. కానీ ప్రాణం వున్న జంతువులకు,ప్రాణులకు, మనుషుల శరీరంలో వుండే రక్తం చెట్టకు కూడా వుంటుందా? అంటే ఆలోచించాల్సిన వస్తుంది. కానీ అటువంటి చెట్లు వున్నాయంటే అది ఖచ్చితంగా వింతే అయి వుంటుంది. అటువంటి చెట్టే 'డ్రాగన్ బ్లడ్ ట్రీ'.. ఈ చెట్టు కాండాన్ని కోస్తే 'రక్తవర్ణ ద్రవం' స్రవిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

పలు విధాలుగా ఉపయోగపడే డ్రాగన్ చెట్టు ద్రవం..
అంతేకాక ఈ చెట్టునుంచి వచ్చే ఈ ఎర్రని ద్రవాన్ని రకరకాలుగా ఉపయోగిస్తారు. పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో వయోలిన్‌కి వార్నిష్‌ చేయడానికి ఈ ద్రవాన్ని ఉపయోగించేవారట!. ప్రస్తుత కాలంలో మనిషి వేస్టేజ్ తో వస్తువులను తయారు చేసిన రీసైక్లింగ్ పద్ధతిని వినియోగిస్తున్నారు. మరి అటువంటి ప్రకృతి సిద్ధం దొరికే పదార్ధాలను కూడా వివిధ రకాలుగా వినియోగిస్తున్నాడు. అటువంటివాటిలో ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ ద్రవాన్ని కూడా వినియోగిస్తున్నాడు మానవుడు. ఈ చెట్టులో ఇమిడి వుండే ఎర్రని ద్రవాన్ని నేడు వైద్యంలో ఉపయోగిస్తున్నారు. డయేరియా, చేతిపుండ్లు, బ్లీడింగ్‌, అల్సర్స్‌, విరోచనాలు, జ్వరంలాంటివి తగ్గించేందుకు వాడతారట. కేవలం వైద్యానికే కాక వస్త్రాలకు వేసే రంగుల్లోను. వార్నిష్‌, అగరవత్తుల వంటి సుగంధ ద్రవ్యాల్లోను, లిప్‌స్టిక్‌ వంటి సౌందర్యసాధనాలలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ద్రవానికి ఎరుపురంగు రావడం ఆ చెట్టు స్వాభావిక గుణం అని కొందరు చెప్పినా ఈ చెట్టును కోసినప్పుడు ఎందుకు ఎరుపు రంగులో ఉంటుందన్న విషయం మాత్రం ఇప్పటివరకు కారణం తెలుసుకోలేకపోయారు.

12:02 - March 31, 2018
12:00 - March 31, 2018

చిత్తూరు : పదవికి రాజీనామా చేసిన సీబీఐ జేడీ లక్ష్మినారాయణ తిరుపతికి చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవలే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడుతారని మీడియాలో ప్రచారం జరిగింది. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని ఆయన తెలిపారు. తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత... భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారా ? వస్తే ఏ పార్టీలో చేరుతారు ? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. 

ఆసుపత్రి మార్చురి వద్ద వైసీపీ ఆందోళన..

అనంతపురం : వైసీపీ నేత శివారెడ్డి హత్యకు నిరసనగా..ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి ఎదుట వైసీపీ ఆందోళన చేపట్టింది. రాప్తాడు సమన్వకర్త ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసలు భారీగా మోహరించారు. కాగా కందుకూరు గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివారెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని టీడీపీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు దుండగులు కాపుకాసి వేటకొడవళ్లతో నరికిచంపారు.

ఒంటిమిట్ట ఘటనపై చంద్రబాబు ఆగ్రహం..

కడప : ఒంటిమిట్ట రాములోకి కళ్యాణం నేపథ్యం ఏర్పాటుచేసిన షెడ్స్ కూలిపోయిన ఘటనపై అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవంలో అధికారులు విఫలం అయ్యారనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్ష పూర్తయిన అనంతరం ఆయన అధికారులపై ఆగ్రహించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా ఒంటిమిట్టలో శాశ్వత మండపం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.

11:16 - March 31, 2018

కడప : ప్రమాదం జరిగిన అనంతరం పాలకులు మేల్కొంటుంటారు. ప్రాణ..ఆస్తి నష్టం జరిగిన అనంతరం అధికారులు పలు ఏర్పాట్లు చేస్తుంటారు. ఒంటిమిట్టలో జరిగిన ప్రమాదం అనంతరం అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు భారీ వర్షానికి చలువ పందిళ్లు కూలిపోయాయి. దీనితో నలుగురు మృతి చెందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. వీరిలో 32 మందికి తీవ్రగాయలయ్యాయి. దీనిపై శనివారం ఉదయం మంత్రులు..జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో శాశ్వత ప్రాతిపదికన మండపం ఏర్పాటు చేయాలని బాబు సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందచేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఖైదీల మానవ హక్కుల ఉల్లంఘనపై సుప్రీం సీరియస్..

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లు సామర్థ్యానికి మించి ఖైదీలతో కిక్కిరిసిపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఖైదీల మానవ హక్కుల విషయంలో ఇంత అలసత్వమేంటని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను సూటిగా ప్రశ్నించింది. జైళ్లలో ఖైదీల రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలను రూపొందించి వాటిని రెండు వారాల్లోగా నివేదించని యెడల కోర్టు ధిక్కార నేరం కింద చర్య తీసుకోవాల్సి ఉంటుందని జైళ్ల డైరెక్టర్ జనరళ్లను హెచ్చరించింది. జైళ్ల వాటి నిర్దిష్ట సామర్థ్యానికి మించి 150 శాతం మేర అధికంగా ఖైదీలతో కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో కోర్టు ఈ మేరకు కన్నెర్ర చేయడం గమనార్హం.

యూపీ బీజేపీ పరిస్థితిపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్య!..

హైదరాబాద్ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 30 సీట్లు తగ్గే అవకాశం ఉందని కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైన అథవాలే ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు వల్ల బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 25 నుంచి 30 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని మంత్రి రామ్ దాస్ అథమాలే జోస్యం చెప్పారు.

శాంతికి భంగం కలగకుండా 'శోభా'ర్యాలీ : కమిషనర్

హైదరాబాద్ : హైదరాబాద్ : నగరంలో వైభవంగా నిర్వహించే హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో నగర పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతికి భంగం కల్గకుండా ప్రశాంతంగా ర్యాలీని సా గించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకు ప్రతి ఏరియాకు ఓ పోలీసు ఉన్నతాధికారిని ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించమని కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

జనసేన పార్టీలో చేరికపై స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ..

హైదరాబాద్ : సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కథనాలపై తాజాగా ఆయన స్పందించారు. జనసేనలో చేరుతున్నట్టు తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని ఆయన చెప్పారు. ఇవన్నీ మీడియా సృష్టించిన కథనాలని ఆయన కొట్టిపారేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే, తన దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని ఆయన తెలిపారు. తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత...

ఒంటిమిట్ట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష..

కడప : జిల్లాలో సీఎం చంద్రబాబు రెండవ రోజు పర్యటిన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఒంటిమిట్ట ఘటనపై ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ బాబూరావు నాయుడు, కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా ఒంటిమిట్టలో రాములోకి కళ్యాణానికి ఏర్పాటు చేసిన హెడ్స్ కూలి నలుగురు వ్యక్తులు చనిపోయిన ఘటనపై చంద్రబాబు ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. 

మరో సరికొత్త రంగంలోకి ఓలా..

హైదరాబాద్ : ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణం గతంలో కంటే సౌకర్యవంతంగా మారిందని చెప్పవచ్చు. హలో అంటే చాలు పొలో అంటు పలికే ఓలా సంస్థ ఓలా సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది. దేశంలోని అతిపెద్ద క్యాబ్ హైరింగ్ సంస్థ అయిన ఓలా.. తాజాగా జర్నలిజంలోకి ప్రవేశించింది. ‘ఓలా న్యూస్ నెట్‌వర్క్’ పేరుతో బ్రాడ్‌కాస్టింగ్ సేవలు ప్రారంభించింది. పది లక్షల మంది డ్రైవర్లతో దేశంలోని 110 నగరాల్లో సేవలు అందిస్తున్న ఓలా స్థానికంగా నాణ్యమైన వార్తలను వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది.

ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ప్రయాణీకుడి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి బంగారం అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఇద్దరి వద్ద నుంచి 1.243 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

'హేరామ్' పదంపై ఉమాభారతి వ్యాఖ్య...

ఢిల్లీ : బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఉమాభారతి తాజాగా గాంధీ మరణం సమయంలో ఉచ్చరించాడని చెబుతున్న హేరామ్ పదంపై వ్యాఖ్యానించారు. గాంధీజీ స్మృతి మందిరంపై ఉన్న హే రామ్ పదాన్ని తొలగించాలని కేంద్ర మంత్రి ఉమాభారతి డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ అంబేద్కర్ పేరు మార్పును రాజకీయం చేయకూడదని సూచించారు. అంబేద్కర్ అసలు పేరులో రామ్ జీ ఉందని, దానిని కొందరు కావాలనే తొలగించారని ఆమె ఆరోపించారు. తాము గతంలో ఉన్న అంబేద్కర్ పేరునే పెట్టామని ఆమె యూపీ నిర్ణయాన్ని సమర్థించారు.

హనుమాన్ శోభాయాత్ర..మద్య దుకాణాలు బంద్..

హైదరాబాద్ : ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని మద్యం దుకాణాలన్నీ బంద్ చేయబడ్డాయి. శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నగవాసులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ యాత్రలో దాదాపు 30వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీంతో 11వేలమంది పోలీసుతో భారీ బందోబస్తు, 400 వందల సీసీ కెమెరాలతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హనుమాన్ శోభాయాత్ర కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. గౌలిగూడ నుండి ప్రారంభమయిన ఈ శోభాయాత్ర లాడ్ బండ్ హనుమాన్ దేవాలయం వరకూ కొనసాగనుంది. 

10:11 - March 31, 2018

విజయవాడ : అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను వణికించాయి. వడగండ్ల వాన ధాటికి రాష్ర్టవ్యాప్తంగా పలుచోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఒంటిమిట్టలో నలుగురు మృతి.. యాభైమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కడప రిమ్స్‌లో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన సీఎం.. వారికి నష్టపరిహారాన్ని ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలుప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కడప జిల్లా ఒంటిమిట్టను వడగండ్ల వాన ముంచెత్తింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆలయందగ్గరలోని చెట్లు, రేకుల షెడ్‌ నేలమట్టంకాగా.. బద్వేలువాసి చెన్నయ్య, పోరుమామిళ్ల వాసి వెంగయ్య, వెంకటసుబ్బమ్మ మతిచెందగా... మరో వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. యాభైమందికి పైగా గాయపడ్డారు.విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఒంటిమిట్టలో అంధకారం అలుముకుంది. మరో వైపు అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది. చిత్తూరు జిల్లా కురుబలకోటలో పిడుగు పాటుకు రెండు ఆవులు చనిపోయాయి.

సీఎం చంద్రబాబు కడప రిమ్స్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించి 15 లక్షలు ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు. అలాగే.. క్షతగాత్రులకు ఒక లక్ష రూపాయల ఎక్స్‌గ్రేసియాతోపాటు.. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, కడప, అనంత జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు.  

10:08 - March 31, 2018

హైదరాబాద్ : నేడు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా గౌలిగూడ నుండి తాడ్ బండ్ హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ శోభాయాత్ర జరుగనుంది. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఈ శోభాయాత్ర జరుగనుంది. యాత్రలో సుమారు 30వేల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 11వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. 400 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను పర్యవేక్షించనున్నారు. అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మద్యం షాపులను మూసివేశారు. 

09:42 - March 31, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కొండగట్టు అంజేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జై శ్రీరామ్‌, జై హనుమాన్‌ భక్తుల నామస్మరణతో కొండగట్టు పరిసరాలు ఆధ్మాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయ పరిసరాలలో 20 చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. గతం కంటే ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు పేర్కొంటున్నారు. 

09:41 - March 31, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీ అండతోనే ఈ మాఫియా బరితెగిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు కుతెగబ డుతున్నారు.. ఈ నేపథ్యంలో జగన్నాధపురం నవాబుపాలెం రహదారి మధ్యలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. సమాచారం ఇచ్చినా స్పందించని పోలీసులు చివరినిమిషంలో వచ్చారు. లారీలతోపాటు రికార్డులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.

 

09:39 - March 31, 2018

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం శివారు ప్రాంతం కొంతమూరులో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంది. కొంతమూరు శానిటోరియం సమీపంలోని ఖాళీ ప్రదేశంలో.. రౌడీ షీటర్‌ షేక్‌ నూర్‌ మహ్మద్‌ను అతని ప్రత్యర్థులు దారుణంగా హత్యచేశారు. మృతుడు రెండేళ్ళక్రితం జరిగిన ఓ హత్యకేసులో ఇటీవలే నిరపరాధిగా విడుదలయ్యాడు. 

08:51 - March 31, 2018
08:27 - March 31, 2018

రంగారెడ్డి : మైలార్ దేవుపల్లి పీఎస్ పరిధిలోని శాస్త్రీపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ పార్కులో మహిళ మృతదేహం కలకలం రేగింది. అత్యాచారం చేసినట్లు సమాచారం. అనంతరం దుండగులు బండరాళ్లతో మోది అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డాగ్ స్వ్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు. మృతి చెందిన మహిళ వివరాలు...హత్య చేసింది ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

08:14 - March 31, 2018

రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ కాగ్‌ ఇచ్చిన నివేదికపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో చోటు చేసుకుంటున్న లోపాలను కాగ్‌ నివేదిక ఎత్తి చూపింది. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలో రాజ్యమేలుతున్న అవినీతిని కాగ్‌ బట్టబయలు చేసింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శివకుమార్ (టీఆర్ఎస్), వీరయ్య (విశ్లేషకులు), శ్రీకాంత్ (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

08:09 - March 31, 2018

కడప : ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం నాడు భారీ వర్షానికి చలువ పందిళ్లు కూలిపోయాయి. దీనితో నలుగురు మృతి చెందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. వీరిలో 32 మందికి తీవ్రగాయలయ్యాయి. ఈదురు గాలులకు కల్యాణవేదిక వద్ద ఉన్న రేకులు ఎగిరి పడ్డాయి. గాయపడ్డవారిని తిరుపతి రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆలయంలో వసతుల ఏర్పట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. మృతుల కుటుంబాలకు 15లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డవారికి 3లక్షల రూపాయలు అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి రిమ్స్‌లో అర్ధరాత్రి బాధితులను చంద్రబాబు పరామర్శించారు. మృతి చెందిన వారిలో చెన్నయ్య, వెంగయ్య, వెంకట సుబ్బమ్మ, మీనాగా గుర్తించారు.

 

అత్యచారం చేసి తగులబెట్టారు...

రంగారెడ్డి : మైలార్ దేవులపల్లి పీఎస్ పరిధిలోని శాస్త్రీపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మహిళపై అత్యాచారం చేసి బండరాళ్లతో మోది దుండగులు చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. 

07:17 - March 31, 2018
07:16 - March 31, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌లో హీరో రామ్ చరణ్ సందడి చేసారు. థియేటర్‌లో ప్రేక్షకులతో కలసి రంగస్థలం సినిమాను వీక్షించారు. రామ్ చరణ్‌ను చూసిన అభిమానులు కేరింతలు పెట్టారు. తమ అభిమాన హీరోతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.

07:14 - March 31, 2018

కరీంనగర్ : జిల్లాలో ఇసుక వ్యాపారం మూడు లారీలు...ఆరు ట్రాక్టర్లుగా సాగుతోంది. ఓ వైపు గోదావరి,మరోవైపు మానేరు, ఇంకో వైపు వాగులు ఇవన్ని అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డాగా మారాయి. అక్రమ రవాణాలను అరికట్టాల్సిన అధికారులు మొక్కుబడిగా కేసులు పెట్టి అందిన కాడికి దండుకునే పనిలో పడ్డారనే ఆరోపణలొస్తున్నాయి.ఖద్దరు చొక్కాలు, ఖాకీడ్రెస్‌లు కుమ్మక్కై ఇసుక మాఫియాను జోరుగా సాగిస్తున్నట్టు కరీంగనర్‌ జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.

జిల్లాలోని ఖాజీపూర్, బొమ్మకల్‌ తోపాటు తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి,రేణుకుంట,నేదునూర్,గొల్లపల్లి, సుస్తులాపూర్ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. అటు మానకోండుర్ మండలం పరిధిలోని శ్రీనివాస నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, వేగురుపల్లి, ఊటూరు గ్రామాల నుంచి వందల లారీల్లో ఇసుక తరలి పోతునే ఉంది. ఒక్కో లారీలోడ్ కు 25 వేల ధర పలుకుతుందంటే కరీంనగర్ జిల్లాలో లభించే ఇసుకకు ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇసుకను పరిమితికి మించి ఎక్కువ లోతుకు తీయడంతో భూ గర్బ జలాలు అడుగంటి పోతున్నయని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. మానేరు,గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధిక లోతులో ఇసుక లోడేస్తుండడంతో బావుల్లో నీరు లేకుండా పోతోంది. కరీంనగర్ -హైదరాబాద్ మార్గంలో నిర్మించిన కొత్తపల్లి వంతేన వద్ద ఇసుకను ట్రాక్టర్లలో తరలింలిస్తుండడంతో వంతెన పిల్లర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకోంటున్నాయి.

మరో విషయం ఎంటంటే.. ఇసుక దందా కొనసాగే ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం పోలీస్‌, రెవెన్యూ అధికారులు పోటీపడుతున్నారు. లక్షల్లో చేతులు తడిపి ఇక్కడే పోస్టింగ్‌ వేయించుకుంన్నారనే ఆరోపణలొస్తున్నాయి. మానకోండుర్,తిమ్మాపూర్,ఎల్ ఎండి, కొత్త పల్లి పోలీస్ స్టేషన్ల పోస్టింగ్ లు పోందాలంటే దాదాపు 10లక్షల పైనే ఖర్చు చేయాల్సి వస్తుందనేది పోలీస్ శాఖలో ఉన్న ప్రచారం. గతంలో మంత్రి కెటిఆర్ ఇసుక అక్రమ రవాణా పై కఠినంగా వ్యవహరించాల్సిందిగా అధికారును ఆధేశించిన ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే ఇసుక దందా వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న వాళ్లంతా అధికార పార్టీకి చెందిన నేతలే కావడంతో ఇసుక రవాణకు అడ్డు లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక దందా బహిరంగంగానే జరుగుతున్నా.. రెవెన్యు, మైనింగ్, విజిలెన్స్ శాఖలతో పాటు పోలీస్ శాఖ సైతం చూసి చూడనట్లు ఉంటున్నారు. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే అక్రమ ఇసుకవ్యాపారం జరగుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ప్రభుత్వ ఖజానాకు, పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

07:13 - March 31, 2018

వికారాబాద్ : జిల్లా కొడంగల్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దవాళ్లు అంగీకరించలేదన్న మనస్తాపంతో... ప్రేమికులు పురుగుల మందు తాగారు. పొలాల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఇద్దరినీ స్థానికులు తాండూరు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ప్రియురాలు రోజా మృతిచెందగా... ప్రియుడు రాజు పరిస్థితి విషమంగా ఉంది. మరో 15రోజుల్లో వేరే వ్యక్తితో రోజాకు ఎంగేజ్‌మెంట్‌ ఉండటంతో... ఇరువురు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని.. స్థానికులు చెబుతున్నారు.

07:11 - March 31, 2018

అనంతపురం : రూరల్‌ మండలం కందుకూరులో దారుణం జరిగింది. వైసీపీ నాయకుడు శివారెడ్డి.. ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు శివారెడ్డిపై దాడి చేసి వేటకొడవళ్లతో అత్యంత పాశవికంగా నరికి చంపారు. ఈ హత్య వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

07:10 - March 31, 2018

హైదరాబాద్‌ : నల్లకుంట పోలీస్టేషన్‌ పరిధిలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. రాత్రి ఏడున్నర నుంచి 9గంటల వరకు నిర్బంధ తనిఖీలు నిర్వహాంచారు. కాచిగూడ, సుల్తాన్‌బజార్‌ ఏసీపీల ఆధ్వర్యంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. వడ్డెరబస్తీ, అజయ్‌నగర్‌ ప్రాంతాను జల్లెడ పట్టిన 150 మంది పోలీసులు... 30 ద్విచక్రవాహనాలు, 3ఆటోలను సీజ్‌చేశారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

ముగియనున్న ఆర్థిక సంవత్సరం..

ఢిల్లీ : నేటితో 2017-18 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ సందర్భంగా నేడు రాత్రి 8గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. అర్ధరాత్రి వరకు డిజిటల్ లావాదేవీలు చేసుకొనే అవకాశం కల్పించారు. 

హనుమాన్ జయంతి...

హైదరాబాద్ : నేడు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరుగనుంది. నగరంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గౌలిగూడ నుండి తాడ్ బండ్ వరకు శోభాయాత్ర జరుగనుంది. ఇందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రిమ్స్ లో బాధితులకు బాబు పరామర్శ...

కడప : జిల్లాలోని ఒంటిమిట్టలో వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్ల వాన కోదండరాముడి కల్యాణంలో విషాదాన్ని నింపింది. భారీ వర్షంతో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. ఈదురు గాలులకు కల్యాణవేదిక వద్ద ఉన్న రేకులు ఎగిరి పడి... నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. తిరుపతి రిమ్స్‌లో బాధితులను చంద్రబాబు  పరామర్శించారు. 

13-22 వరకు హైదరాబాద్ ఫెస్ట్...

హైదరాబాద్ : వచ్చే నెల 13 నుంచి 22 వరకు స్ఫూర్తి ప్రొగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఫెస్ట్‌ నిర్వహించనున్నారు. విజ్ఞానం, వినోదంతోపాటు విభిన్న సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌ ఫెస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

కొనసాగుతున్న వసంతోత్సవాలు...

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభంగా జరుగుతున్నాయి. వేసవితాపం నుంచి స్వామివారికి ఉపశమనం కలిగించేందుకు ప్రతి ఏటా వసంతోత్సవాలు నిర్వహిస్తారు. రెండో రోజు ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శనివారం కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. 

అట్టుడుకుతున్న బీహార్...

బీహార్ : మత ఘర్షణలతో బీహార్‌ అట్టుడుకుతోంది. గత రెండు వారాలుగా భాగల్‌పూర్, ఔరంగాబాద్, సమస్తీపూర్‌, ముంగేర్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజాగా అల్లర్లు నావాదా జిల్లాకు వ్యాపించాయి. రామనవమి తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలు ఇంకా చల్లారలేదు.

ముగిసిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు...

ఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పార్టీ సమీక్షించింది. త్రిపురలో బిజెపి అధికారంలోకి వచ్చాక వామపక్షాలపై దాడులు పెరిగిపోయాయని... సిపిఎం కార్యాలయాలను బిజెపి ఆక్రమిస్తోందని, కార్యకర్తల ఇళ్లను లూటీ చేస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 

దేవరియాలో దారుణం...

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో దారుణం చోటు చేసుకుంది. తనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు అడిగిన పాపానికి కొందరు వ్యక్తులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ వీడియో కాస్తా వైరల్ అయింది.

సిద్దూకు ఐటీ షాక్..

ఢిల్లీ : మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూకు ఆదాయ పన్ను శాఖ వలలో చిక్కుకున్నారు. ట్యాక్స్‌ రిటర్న్స్‌కు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా సిద్ధూకు చెందిన రెండు బ్యాంక్‌ అకౌంట్లను అధికారులు సీజ్‌ చేశారు.

Don't Miss