Activities calendar

01 April 2018

22:17 - April 1, 2018

తనపై కుట్రజరుతోందని చంద్రబాబు అంటున్నారు.. అలాంటిదేమీ లేదని సుజనా చౌదరి ఎందుకంటున్నారు ? సుజనా చౌదరి బీజేపీ కంటే టీడీపీకి దూరమా ? అయిష్టంగానే మంత్రి పదవికి రాజీనామా చేశారా ? కాంగ్రెస్ తో పొత్తు ప్రసక్తే లేదని సుజనా కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ? కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

22:13 - April 1, 2018

కువైట్‌ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కువైట్‌ ఆయిల్‌ కంపెనీకి చెందిన రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడ్ద ఇద్దర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేవోసీతో కాంట్రాక్టు కుదుర్చుకున్న సంస్థలు ఉద్యోగులను బర్గన్‌ చమురు క్షేత్రానికి చేరవేస్తున్న  సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి. శిథిలాల్లో చిక్కుకున్న నలుగుర్ని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు. 
 

22:11 - April 1, 2018

తమిళనాడు : కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే తమిళనాడులో ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పార్లమెంట్‌లో అన్నాడిఎంకె, ఎంపీలు ఆందోళనలు చేస్తుండగా... వివిధ పార్టీలు, రైతు సంఘాల ఆందోలనతో  తమిళనాడు భగ్గుమంటోంది. ఇదే విషయంపై అన్నాడిఎంకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలకు పిలుపునివ్వగా డిఎంకే ఇవాళే ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో పోలీసులు పలుచోట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

22:08 - April 1, 2018

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణ కశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు ఎన్‌కౌంటర్లలో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో టాప్‌ కమాండర్లు కూడా ఉన్నారు.  ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఎన్‌కౌంటర్లలో ఇద్దరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 
ఉగ్రవాదలు ఏరివేత 
జమ్ము-కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. షోపియాన్, అనంతనాగ్‌ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. షోపియాన్‌ జిల్లాలో రెండు ప్రాంతాల్లో భద్రతాదళాలు ఉగ్రవాదలు ఏరివేత చేట్టాయి. డ్రగద్‌, కచ్‌దూర గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్న భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని స్థానికులుగా గుర్తించారు. గత ఏడాది మేలో ఆర్మీ లెఫ్టినెంట్‌ ఉమర్‌ ఫయాజ్‌ను కిడ్నాప్‌చేసి హతమార్చిన ఉగ్రవాదులను కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు మట్టుపెట్టాయి.   డ్రగద్‌, కచ్‌దూరలో ఇద్దరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఘటనా స్థలాల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పౌరులు పెద్ద ఎత్తున అల్లర్లకు దిగడంతో వీరిని అదుపు చేసేందుకు భద్రతాదళాలు చేసిన పెల్లెట్ ప్రయోగంలో 25 మంది, బుల్లెట్ల ప్రయోగంలో ఆరుగురు గాయపడ్డారు. 
ఉగ్రవాది హతం
అనంతనాగ్‌ జిల్లా దియాల్గమ్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని భద్రతాదళాలు పట్టుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీనగర్‌-బనిహల్‌ మధ్య రైలు సర్వీసులను నిలిపివేశారు. దక్షిణ కశ్మీర్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. 

22:05 - April 1, 2018

ఖమ్మం : తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలు అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు -బీఎల్‌ఎఫ్‌ ఆవశ్యకత.. అన్న అంశంపై ఖమ్మంలో నిర్వహించిన సదస్సులో తమ్మినేని పాల్గొన్నారు.  బీఎల్‌ఎఫ్‌ ప్రతిపాదిస్తున్న సామాజిక న్యాయ  సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు ఇచ్చారు. ఏపీలో కంటే తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రమాదకరమని తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. 

 

22:03 - April 1, 2018

ఖమ్మం : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు దేశాన్ని మతోన్మాదం వైపు నడిపిస్తున్నాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ విమర్శించారు. ఈ రెండు శక్తుల పోకడలతో దేశ లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి ముప్పువాటిలే ప్రమాదం పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజకీయాలు -కమ్యూనిస్టుల కర్తవ్యం.. అన్న అంశంపై ఖమ్మంలో జరిగిన సదస్సుకు హాజరైన బృందా కరత్‌... మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నాలుగేళ్లలో దేశ ప్రజల మధ్య భారీగా ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. 

21:59 - April 1, 2018

హైదరాబాద్‌ : నగరంలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి ఆకాశం మేఘామృతమైంది. 4గంటల సమయంలో... ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. రామంతాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌ నగర్, ముషీరాబాద్‌, సికింద్రాబాద్, పంజాగుట్ట, తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌లో వడగళ్లు పడ్డాయి. రామంతాపూర్‌లోని పలు కాలనీల్లో నీళ్లు నిలిచిపోవడంతో.. స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరవాసులకు వేడి నుండి ఉపశమనం లభించినా.. వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వడగళ్ల వాన కురిసింది. శంషాబాద్, సిద్దిపేట, దిండి, సిరిసిల్ల, వేములవాడలోనూ భారీవర్షాలు పడ్డాయి. ఈ వర్షాలతో పాటు ఈదురుగాులులకు వరి, మొక్కజొన్న, మామిడితోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. 

 

21:57 - April 1, 2018

నెల్లూరు : ఇస్రో ప్రయోగించిన జీశాట్‌-6ఏ ఉపగ్రహ ప్రయోగం వికటించింది. ఈ ఉపగ్రహం  కర్నాటక హసన్‌లోని మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీతో  సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ ప్రయోగం దాదాపు విఫలమైనట్టుగానే ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జీశాట్‌ 6A తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓవైపు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నా.. మరోవైపు ఇది సాధ్యమయ్యే పనికాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఉపగ్రహానికి 270 కోట్లు ఖర్చు చేశారు. 

గత నెల 29న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్‌ 6ఏ ప్రయోగం జరిగింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 8 అంతరిక్షవాహక నౌక ద్వారా దీనిని కక్ష్యంలో ప్రవేశపెట్టారు. ఈ  ఉపగ్రహానికి సంబంధించి మూడో లామ్‌ ఇంజిన్‌ మండించే సమయంలో కర్నాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీతో  సంబంధాలు కోల్పోయింది. అప్పటి నుంచి జీశాట్‌ 6ఎఫ్ నుంచి ఎలాంటి  సంకేతాలు అందలేదు. 

జీశాట్‌ 6ఏ నుంచి ఎలాంటి సమాచారం అందడంలేదని ప్రయోగించిన 48 గంటల తర్వాత ఇస్రో ప్రకటించింది. ఈ ఉపగ్రహం మూడో లామ్‌ ఇంజిన్‌ మండించే సమయంలో అనుసంధానం కోల్పోయినట్టు ఇస్రో వెబ్‌సైట్‌లో పెట్టారు. దీని నుంచి చివరిసారిగా గత నెల 30వ తేదీ ఉదయం 9.22 గంటలకు సమాచారం అందింది. జీశాట్‌ 6ఏ కక్ష్య పెంచేందుకు మొదటిసారి చేసిన ప్రయత్నంలో సమాచారం చేరవేసింది. మార్చి 31న రెండో సారి  కక్ష్య పెంచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీతో సంబంధాలు కోల్పోయింది. ఈ ఉపగ్రహ ప్రయోగానికి 270 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 

ఇస్రో అభివృద్ధి చేసిన రెండో అతిపెద్ద రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 8 ద్వారా జీశాట్‌ 6ఏ ప్రయోగం జరిగింది. ప్రయోగించిన 17 నిమిషాలకు నిర్ణీత కక్ష్యంలో ప్రవేపెట్టారు. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది పన్నెండవది. ఈ ఉపగ్రహంలో విచ్చుకునే సామర్థ్యం ఉన్న 6 మీటర్ల ఎస్‌-బ్యాండ్‌ యాంటెన్నా, చేతిలో ఇమిడిపోయే భూతల టెర్మినళ్లు, నెట్టవర్క్‌ నిర్వహణ విధానాలు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా  ఉపగ్రహ ఆధారిత సమాచారవ్యవస్థ మరింత విస్తృతమవుతుందని భావిస్తున్న తరుణంలో ప్రయోగం విఫలం కావడం అందర్నీ బాధించే అంశం. 
ఏడు నెలల వ్యవధిలో ఇస్రోకి ఇది రెండో ఎదురుదెబ్బ. గతేడాది ఆగస్టు 31న పీఎస్‌ఎల్‌వీ  ఉపగ్రహవాక నౌక ద్వారా చేపట్టిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌.. ప్రయోగం విఫలమైంది. చంద్రయాన్‌ -2 ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతున్న తరుణంలో జీశాట్‌ 6ఏ ప్రయోగం కావడంపై శాస్త్రవేత్తలు అంతర్మథనం చెందుతున్నారు. వచ్చే నెల 12న పీఎస్‌ఎల్‌వీ సీ 41 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో జీశాట్‌ ప్రయోగం విఫలంకావడం శాస్త్రవేత్తలను బాధించే అంశం. 1997 అక్టోబర్‌లో కూడా ఇన్‌శాట్‌ -2డీ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన నాలుగు నెలలు మాత్రమే ఈ ఉపగ్రహం పనిచేసింది. 

21:52 - April 1, 2018

ఢిల్లీ : పార్లమెంటులో ప్రత్యేకహోదా పోరు మరింత హీటెక్కుతోంది. సోమవారం తిరిగి సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని మరోసారి ప్రయోగించనున్నాయి.  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో సహా వామపక్షాలు, టీడీపీ, వైసీపీ ఎంపీలు అవిశ్వాసం కోసం మరోసారి పట్టుబట్టనున్నాయి. మరోవైపు జాతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు  ఏపీ సీఎం చంద్రబాబు రెండురోజుల్లో ఢిల్లీకి వెళ్లుతున్నారు. ఇప్పటికే రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన వైసీపీ ఎంపీలు టీడీపీకి సవాల్‌ విసురుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చంద్రబాబుకూడా టీడీపీ ఎంపీల చేత రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా.. కేంద్రంపై అవిశ్వాసం అంశం మరోసారి పార్లమెంటులో మార్మోగనుంది. సోమవారం మరోసారి సమావేశాలు ప్రాంరంభం అవుతున్న నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస అస్త్రం ప్రయోగించడానికి కాంగ్రెస్‌ సహా పలు విపక్షపార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలను నెరవేర్చదిశగా కేంద్రంపై ఒత్తడి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీఅవుతున్నారు. దీనికోసమే ఈనెల 3 లేదా 4 తేదీల్లో ఆయన  ఢిల్లీ వెళ్లనున్నారు. విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర  ఇచ్చిన హామీల అమలు కోసం జాతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు చంద్రబాబు హస్తిన పర్యటనకు సమాయత్తం అవుతున్నారు.  ఇందులో భాగంగా ఢిల్లీలో పలువురు జాతీయ స్థాయి నేతలో బాబు భేటీలు నిర్వహిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

మరోవైపు విపక్ష వైసీపీ కూడా అధికారపార్టీకి దీటుగా ప్రత్యేక హోదా పోరును ఉధృతం చేస్తోంది.  ఇప్పటికే తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించిన వైసీపీ అధినేత..  ఆమరణ దీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈనెల ఆరున పార్లమెంటు మావేశాల చివరి రోజున ఎంపీల రాజీనామాల అనంతరం.. ఢిల్లీలోనే ఆమరణ దీక్షకు దిగుతారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. 

ఆమరణ దీక్షకు దిగుతారని చెబుతున్న వైసీపీ నేతలకు టీడీపీ స్ట్రాంగ్‌గా కౌంటర్‌ ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలపై నిజంగా ప్రేమఉంటే దిల్లీలో ప్రధాని ఇంటిముందు అమరణ నిరాహారదీక్ష చేయాలని  టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌ సవాల్ విసిరారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే కమలం పార్టీకీ పడుతుందని కంభంపాటి ఘాటుగా విమర్శించారు. మరోవైపు ప్రత్యక హోదా పోరును ఉధృతం చేసేందుకు మంత్రి పత్తిపాటి పుల్లారావు నేతృత్తంలో గుంటూరుజిల్లాలో టీడీపీ నేతలు పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. 

టీడీపీ విమర్శలను వైసీపీ గట్టిగా తిప్పికొడుతోంది. రాష్ట్రానికి ఈదుర్గతి పట్టడానికి  ప్రధాన కారణం చంద్రబాబు నాయుడేనని  వైసీపీ నేత పార్థసారథి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మీదకంటే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు వైఖరిపైనే పోరాటం చేయాలన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా టీడీపీ తమతో  కలిసి రావాలని సీనియర్‌ నేత బొత్ససత్యనారాయణ  డిమాండ్‌ చేశారు.  

లోక్‌సభలో టీడీపీ, వైసీపీలకు తోడు ఇపుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కూడా అవిశ్వాసానికి గట్టిగా మద్దతు ఇస్తోంది. ఎవరూ కలిసి రాకున్నా తామే సొంతంగా కేంద్రంపై అవిశ్వాసం పెడతామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్‌.. అవిశ్వానికి మద్దతు కూడగడతామంటోంది. మరోవైపు విపక్షాల రగడకు చెక్‌పెటేందుకు కేంద్రం దూకుడును పెంచుతోంది. అవిశ్వాస అంశంలో  తాడోపేడో తేల్చుకోవాలని కేంద్రం కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో  ఇప్పటిదాకా అన్నాడీఎంకే ఎంపీల నిరసనలకు సాకుగా చూపి అవిశ్వాస అంశాన్ని పక్కనపెట్టిన స్పీకర్‌... సోమవారం సమావేశాల్లో  నోకాన్ఫడెన్స్‌ మోషన్‌ను తప్పని సరిగా చేపట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని రాజకీయవర్గాల్లో అభిప్రాలు వ్యక్తం అవుతున్నాయి.

గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ

పెద్దపల్లి : గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు నేతలు బహిరంగసభలో పాల్గొన్నారు. 

 

సీపీఐ మహాసభలో పాల్గొన్న జాతీయ, రాష్ట్ర నాయకులు

హైదరాబాద్ : సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బహిరంగసభ నిర్వహించారు. మహాసభలో జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

రాగల 3గంటల్లో పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం

హైదరాబాద్ : రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మరోసారి వర్షం పడే అవకాశం ఉంది. జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంది.

 

21:01 - April 1, 2018

రంగస్థలం మూవీ సెట్ అందరినీ ఆకట్టుకుంటుంది. తమ సెట్ తో రామకృష్ణ, మౌనిక80 ఏళ్ల నాటి ఫీల్ తీసుకొచ్చారు. రంగస్థలం మూవీ ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మౌనికతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు తమ సినీ అనుభవాలను వివరించారు. 60 రోజుల్లో 35 ఎకరాల్లో సెట్ వేశామని తెలిపారు. సెట్ వేసినప్పడు తాను 9 నెలల గర్బవతినని మౌనిక చెప్పారు. రత్నవేలు లేనిది సినిమానే లేదన్నారు. చిరంజీవి సెట్ ను చూసి మెచ్చుకుని, ప్రసంశించారు. రంగస్థలం నిర్మాత రవిశంకర్, ఆర్టిస్ట్ నవీన్ ఫ్రాంక్ కాల్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

20:30 - April 1, 2018
20:28 - April 1, 2018

ఢిల్లీ : క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ‌ సచిన్‌ తెందుల్కర్‌ తన జీతం మొత్తం ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారు. గత ఆరేళ్లుగా ఎంపీగా ఉన్నందుకు... ఆయన దాదాపు 90లక్షలకు పైగా వేతనం, ఇతర అలవెన్సులు అందుకున్నారు. సచిన్‌ చేసిన సాయంపై పీఎంవో కార్యాలయం కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను విడుదల చేసింది. సచిన్‌ ఇచ్చిన విరాళాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తామని పీఎంవో తన లేఖలో పేర్కొంది. ఈనెల 28తో సచిన్‌ రాజ్యసభ ఎంపీ పదవీ కాలం ముగియనుంది. 2012 ఏప్రిల్‌లో సచిన్‌ రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. 

 

20:26 - April 1, 2018

కుమురంభీం ఆసిఫాబాద్ : ఎన్న చట్టాలు వచ్చినా... ఎన్ని ప్రభుత్వాలు మారినా.. దళితుల బతుకుల్లో మార్పు రావడం లేదు... వారి పట్ల వివక్ష మారడం లేదు. తక్కువ జాతి అని వారిపై వివక్షలు కొనసాగుతూనే  ఉన్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దళితులను దూరం పెడుతున్న అగ్రవర్ణాల పై స్పెషల్ స్టోరీ... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో నేటికి దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. గ్రామంలో దళితులకు జాబ్ కార్డులున్నా ఉపాధి హామీ పనికి రావద్దని అగ్రవర్ణాల ఆంక్షలు విధించారు. నాలుగు సంవత్సరాలుగా ఉపాధి హామీ కూలీ పనులకు దళితులను పిలవడం లేదు. 
మంచినీళ్లు కూడా పట్టుకోవద్దని కుల అహంకారం
ఇవే కాకుండా.. గ్రామంలో తమపై అనేక విధాలుగా ఆంక్షలు విధిస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. మంచినీటి బోరు వద్ద కూడా నీళ్లు పట్టుకోకుండా ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రోడ్లు, ఇతర సంక్షేమ పథకాలు మంజురైనా అవి కార్యరూపం దాల్చడం లేదని దళితులంటున్నారు. దళితవాడలో రోడ్లు, మరుగుదొడ్లు మంజూరైనా అగ్రవర్ణాలవారు నిర్మించడం లేదంటున్నారు. తమకు ఎలాంటి పనులు ఇవ్వడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక యుగంలో కూడా ఇంకా మూర్ఖత్వం భావజాలం కొనసాగుతుందంటున్నారు. సాటి మనిషిని కుల వివక్షతతో ద్వేషించే నీచ సంస్కృతి ఇంకా ఎన్నాళ్లు అని దళితులు ప్రశ్నిస్తున్నారు. పనులే కాకుండా కనీసం మనుషులు తాగేందుకు నీళ్లు కూడా పట్టుకోనీయకుండా సభ్యసమాజం తలదించుకునేలా అగ్రవర్ణాలు వ్యవహరించడం శోచనీయమని పలువురంటున్నారు. 

 

20:07 - April 1, 2018

హైదరాబాద్‌ : నగర పోలీస్ కమిషనర్‌ అంజనీ కుమార్ ఇంట్లో పాము కలకలం రేపింది. అంబర్ పేట్‌లోని ఆయన ఇంటి గేట్ ముందు 6అడుగుల జెర్రిపోతు సంచరించుతుండగా.... సెక్యూరిటి సిబ్బంది హుస్సేనీ అలం పోలీస్ ష్టేషన్‌లో పనిచేస్తున్న నాయక్‌కు సమాచారం అందించారు. నాయక్ పాముని పట్టుకొని స్నేక్‌ సోసైటీకి అప్పగించాడు.

19:23 - April 1, 2018

విశాఖ : జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో 30మందికి గాయాలయ్యాయి. ముంచంగిపుట్టు మండలం జోలపుట్ పంచాయతీ వద్ద గిరిజనులు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో.. 30మందికి గాయాలయ్యాయి. వీరిలో 10మంది పరిస్థితి విషమంగా ఉంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

19:04 - April 1, 2018

సంగారెడ్డి : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై సీఐటీయు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా... ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తమ బతుకు తాము బతకాలన్నా బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నారు. సీపీఎం అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన బస్సు యాత్ర సంగారెడ్డికి చేరుకున్న సందర్భంగా సభ నిర్వహించారు. రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ర్టాలకు అధికారం కావాలనే  కేసీఆర్‌... రిజర్వేషన్లే లేని యూనివర్సిటీలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. 

 

19:01 - April 1, 2018

హైదరాబాద్ : నీలోఫర్‌లో చిన్నారి మృతిపై వివాదం ముదురుతోంది. నీలోఫర్‌లో నిన్న 11నెలల సాహిల్ అనే చిన్నారి మృతిచెందాడు. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని... బంధువులు ఆందోళనకు దిగారు. ఉస్మానియాలో పోస్టుమార్టమ్ పూర్తి కాగానే.. ప్రగతి భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు మార్చురీ వద్దే అడ్డుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు.. ఆసుపత్రి సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:51 - April 1, 2018

నాగర్ కర్నూలు : భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రం.. ప్రకృతి ప్రేమికులకు పర్యాటక క్షేత్రం... ఉడుకు రక్తం ఉప్పొంగే యువతకు సాహస క్షేత్రం... ఔను.. అక్షరాల ఇది నిజమే.. ఈ భావనలన్నీ కలగలిసి... అచ్చం అమర్‌నాథ్‌ యాత్రను తలపిస్తుంది ఈ క్షేత్రం. తెలంగాణ అమర్ నాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం యాత్రపై టెన్‌ టీవీ  ప్రత్యేక కథనం.
సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర సలేశ్వరం
చుట్టూ విశాలమైన అడవి.. ఎత్తైన చెట్లు.. ప్రకృతి  అందాలు... పక్షుల కిలకిల రావాలు... పాముల పుట్టలు... వన్యప్రాణులు.. ఇవన్నీ దట్టమైన నల్లమల అడవిలో వెలసిన సలేశ్వరం క్షేత్రపు వాతవరణం. సాక్షాత్తూ శివుడే కైలాసాన్ని మరిచి  ఇక్కడే కొలువయ్యాడేమో అన్న భావన కలుగుతుంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తే.. ఇక్కడి రాయి, రప్ప, చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతతో పెనవేసుకుని ఉంటాయి.  
లోతైన లోయలో కొలువుదీరిన లింగమయ్య
లోతైన లోయలో కొలువుదీరిన లింగమయ్యను చేరుకోవాలంటే.. కాలినడకన ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..  కొండలూ, గుట్టలూ,, రాళ్ళూ రప్పలూ దాటుకుంటూ కాలినడకన అక్కడికి చేరుకోవడం ఓ సాహస యాత్రే...  గోరంత కష్టానికి తట్టుకుని దట్టమైన అడవిలో.. లోతైన లోయలోకి చేరుకుంటే... వెలకట్టలేని అపూర్వ అనుభూతిని తనివి తీరా ఆస్వాదిస్తారు.భక్తులు సలేశ్వరంగా పిలుచుకునే సర్వేశ్వర క్షేత్రం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో వెలసింది. అమ్రాబాద్ మండలం మన్ననూరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో.. దట్టమైన అడవిలోని ఒక లోతైన లోయలో ఉంది ఈ సలేశ్వరం..
ఈనెల 5న ఉత్సవాల ముగింపు
గత నెల 29న ప్రారంభమైన ఇక్కడి ఉత్సవాలు ఈనెల 5న ముగియనున్నాయి. ఈ అడవిలో వేలాది మంది భక్తులు లోయలోకి దిగి స్నానాలు ఆచరించి.. స్వామిని దర్శించుకుంటారు. శివాలయం ఎదురుగా దాదాపు వంద అడుగుల ఎత్తు రాతికొండ నుంచి పరవళ్ళు తొక్కే జలపాతం చూపరులను కట్టిపడేస్తుంది.  ఒక్క మనిషి మాత్రమే నడిచేంత బాటతో కూడిన లోయ అడుగుభాగానికి చేరుకోవడమంటే సాహసమే.. అంతకష్టమైనా వయసుతో ప్రమేయంలేకుండా ప్రతీ ఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు.  ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి కూడా భక్తులు వస్తారు.  
నైవేద్యంగా ఇప్పపువ్వు, సారాయి 
గుడిలోని శంఖుతీర్థంలో స్నానం చేయడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. గుండం జలాన్ని సర్వరోగనివారిణిగా నమ్ముతారు. లింగమయ్యస్వామికి, గంగమ్మకు భక్తులు వెండి వస్తువులతో మొక్కులు చెల్లించుకుంటారు. నాగదోశం ఉన్నవారు వెండి నాగును ఇస్తారు.. చెంచులు కొత్తగా పూసిన ఇప్పపువ్వు, సారాయి నైవేద్యంగా పెడతారు.  

 

18:47 - April 1, 2018

జగిత్యాల : జిల్లా కేంద్రంలోని సూతరిపేట్ 36వ వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి షార్ట్ సర్క్యుట్‌తో 100 ఇళ్లలో సుమారు 5 లక్షల విలువగల టీవిలు, ప్రీజ్‌లు, ఫ్యాన్‌లు కాలిపోయ్యాయి. పైర్ ఇంజన్‌కు ఫోన్ చేస్తే అందుబాటులో లేదని తెలపడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు.  కొంత సేపటి తరువాత స్థానికులు మట్టి, నీరు పోసి మంటలార్పేశారు. అకారణంగా తమకు ఆస్తినష్టం జరిగిందని ప్రభుత్వమే నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.

 

18:41 - April 1, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభల సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్‌ జరిగింది. పర్యావరణం- కాలుష్య నివారణ అంశంపై పలువురు వక్తలు మాట్లాడారు. నగరంలో  పెరిగిపోతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు మాయమాటలతో కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. అధికారం చేపట్టి మొదట్లో హుస్సేన్‌సాగర్‌ను మంచినీటి చెరువుగా మారుస్తామని కేసీఆర్‌ గొప్పలు చెప్పారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహారావు ఎద్దేవా చేశారు.  హుస్సేన్‌సాగర్‌లో  డాల్ఫిన్‌లు పెంచుతామని చెప్పిన  కేసీఆర్‌ ప్రభుత్వం.. మురుగును మరింతగా పెంచిందని పర్యావరణ నిపుణులు విమర్శించారు. 

 

18:35 - April 1, 2018

విజయవాడ : ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే కమలం పార్టీకీ పడుతుందని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలపై నిజంగా ప్రేమే ఉంటే దిల్లీలో ప్రధాని ఇంటిముందు అమరణ నిరాహారదీక్ష చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అరోపించారు.  ఏపీ ప్రజలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఎన్డీయేతో నాలుగేళ్లు కలిసి పనిచేశామన్నారు 

18:32 - April 1, 2018

బీజేపీ ప్రభుత్వంపై సురవరం ఫైర్

హైదరాబాద్ : మోడీ నాయకత్వంలో కేంద్రంలో అభివృద్ధి నిరోధక కార్పొరేట్ ప్రభుత్వం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఐదేళ్లకోసారి పార్టీలు అధికారం కోల్పోతాయని... ఒక బూర్జువపార్టీ స్థానంలో మరో బూర్జువపార్టీ వస్తుందనుకోవడం సరికాదన్నారు. మోడీ నాయకత్వంలో అత్యంత అభివృద్ధి నిరోధక కార్పొరేట్, మతతత్వ ప్రభుత్వం 
అధికారంలోకి వచ్చిందన్నారు. 

18:21 - April 1, 2018

హైదరాబాద్ : మోడీ నాయకత్వంలో కేంద్రంలో అభివృద్ధి నిరోధక కార్పొరేట్ ప్రభుత్వం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఐదేళ్లకోసారి పార్టీలు అధికారం కోల్పోతాయని... ఒక బూర్జువపార్టీ స్థానంలో మరో బూర్జువపార్టీ వస్తుందనుకోవడం సరికాదన్నారు. మోడీ నాయకత్వంలో అత్యంత అభివృద్ధి నిరోధక కార్పొరేట్, మతతత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. మోడీ ప్రభుత్వంపై ఆనాడు తమ పార్టీ నిర్వచనం చేసిందని... 3 సం.రాల కాలంలో మనకు ఆనాడు మనం చేసినటువంటి నిర్వచనం కరెక్ట్ అయిందన్నారు. బీజేపీ, మోడీపై ఆగ్రహంతో మోడీ ప్రభుత్వంపై ఈ రకమైన అవగాహనకు రాలేదని.... అది అనుసరిస్తున్న విధానాలపై స్పష్టమైన అవగాహనతోనే నిర్వచనం ఇచ్చామని తెలిపారు. ఎన్నికల ముందు మోడీ విమానాల్లో తిరుగుతూ వాగాడాంబరంతో అనేకరకాలైన వాగ్ధానాలు చేశారు... కానీ వాటిలో ఏవీ అమలు కాలేదన్నారు. విదేశాల్లో నల్లధనం మూలుగుతుందని...దాన్ని వెనక్కి రప్పించి దేశ ప్రజల అకౌంట్ లో వేస్తానని చెప్పారని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు ఎవరి అకౌంట్ లో డబ్బులు వేయలేదని విమర్శించారు.

 

18:09 - April 1, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఆదివారం పెట్రోల్‌ ధర నాలుగేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. డీజిల్ ధర కూడా అదే విధంగా పెరిగి అత్యధిక స్థాయికి చేరింది. ఇవాళ ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్ ధర లీటరుకు ఏకంగా 18పైసలు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 73 రూపాయల 73 పైసలుగా ఉంది.  2014 సెప్టెంబరు 14 తర్వాత ఇదే అధిక ధర. ఇక డీజిల్ కూడా అమాంతం పెరిగి అల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం  హైదరాబాద్‌లో లీటర్  పెట్రోల్ ధర రూ 77 రూపాయల 89 పైసలు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. ఎక్సైజ్ పన్నును తగ్గించాలని చమురు సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నా... కేంద్రం స్పందించడం లేదు. 

 

18:07 - April 1, 2018

అనంతపురం : జిల్లాలోని నాగసముద్రంలో వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 31 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు.  శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మ రథోత్పవం సందర్భంగా.. గుంతకల్లు నియోజక వర్గంలోని నాగసముద్రం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన వధువరులకు పెళ్లిబట్టలు, తాళిబొట్టు, మెట్టెలతో పాటు... పాడి ఆవును దానంగా ఇచ్చారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న... వైఎస్సార్‌ ట్రస్ట్‌ ఛైర్మన్ పేరుమాళ్ళ జీవానందరెడ్డి.. మారుమూల గ్రామాల ప్రజలకోసం అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితోపాటు పలువురు జిల్లా నేతలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

 

18:04 - April 1, 2018

ఒంగోలు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం దేశవ్యాప్తంగా పలు పార్టీల మద్దతు కూడగడుతున్నామన్నారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఏప్రిల్‌ ఆరున వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగుతామన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా పోరాటానికి కలిసి రావాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. 

నీలోఫర్ లో చిన్నారి మృతితో తల్లిదండ్రులు ఆందోళన

హైదరాబాద్ : నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి మృతితో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నీలోఫర్ లో నిన్న చిన్నారి మృతి చెందింది. ఇవాళ ఉస్మానియాలో చిన్నారికి పోస్టుమార్టం పూర్తి చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతదేహంతో ప్రగతిభవన్ వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.  

18:00 - April 1, 2018

గుంటూరు : ఏపీ ప్రభుత్వ రిటైర్ట్‌ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రాజధాని అమరావతిపై రెండు పుస్తకాలు రాశారు. ఇంగ్లీషులో హూజ్‌ క్యాపిటల్‌ అమరావతి.. తెలుగులో ఎవరి రాజధాని అమరావతి.. అన్న పేరుతో వీటిని ప్రచురించారు.  రాజధాని అమరావతి పరిపాలనా నగరంగా ఉండాలే తప్ప... మెగాసిటీగా ఉండరాదన్న అభిప్రాయాన్ని ఈ పుస్తకాల్లో ఐవైఆర్‌ వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈనెల 5న విజయవాడలో వీటిని ఆవిష్కరిస్తారు. అన్ని పార్టీల నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ఐవైఆర్ తెలిపారు.  శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు, మన దేశంలో ఉన్న రాజధానులు, అంతర్జాతీయంగా వివిధ దేశాల రాజధానుల సరిపోల్చుతూ ఈ పుస్తకం రాసినట్టు ఐవైఆర్‌ చెప్పారు. రాజధాని అమరావతిని మార్చాలనేది తన ఉద్దేశం స్పష్టం చేశారు.

 

17:40 - April 1, 2018

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తీవ్రమైన ఎండలకు ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షం పడింది. రామంతపూర్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, హయత్ నగర్, ముషీరాబాద్ లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాబ్, మల్కాజ్ గిరి, నేరెడ్ మెట్, సైనిక్ పురిలో వడగళ్ల వాన కురిసింది. వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:32 - April 1, 2018

హైదరాబాద్ : నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి మృతితో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నీలోఫర్ లో నిన్న చిన్నారి మృతి చెందింది. ఇవాళ ఉస్మానియాలో చిన్నారికి పోస్టుమార్టం పూర్తి చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతదేహంతో ప్రగతిభవన్ వెళ్లేందుకు యత్నించిగా పోలీసులు అడ్డుకున్నారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

17:15 - April 1, 2018


విజయవాడ : దోపిడీకి కాదేది అనర్హం అనేలా అక్కడి ట్రావెల్స్‌ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. సీజన్‌ల పేరుతో ప్రయాణికులను నిలువునా మోసం చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. 
సీజన్‌ల పేరుచెప్పి అధిక చార్జీలు
ఏపీలోప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకుల ఆగడాలకు అంతే లేదు. ఏదో రకంగా ప్రయాణికుల నుంచి అక్రమంగా చార్టీలు వసూలు చేస్తున్నారు. తాజాగా సీజన్‌ దోపిడీని మొదలుపెట్టారు. పండుగ సీజన్‌ వంకతో ప్రయాణికుల ముక్కుపిండి చార్టీలు వసూళ్లు చేస్తున్నారు ట్రావెల్స్‌ నిర్వాహకులు. ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. విజయవాడ కేంద్రంగా ఈ తంతు విచ్చల విడిగా సాగుతోంది.
13 జిల్లాలకు యాధేచ్చగా బస్సులు 
కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ 700 నుంచి 900 వరకు ఉంటాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు విజయవాడ, గుంటూరు నగరాల నుంచి ప్రైవేట్‌ బస్‌లు నడుస్తుండగా, విశాఖపట్నం తర్వాతి స్థానంలో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టీసికి సవాల్‌ విసురుతోంది. సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాదుకు రూ. 650 నుంచి రూ. 800 వరకు బస్ చార్జీ ఉండగా... సీజన్‌లో రూ. 1000 నుండి రూ. 1500ల పైబడి వసూళ్లు చేస్తున్నారు. అదేవిధంగా విజయవాడ-విశాఖపట్నం టిక్కెట్‌ ధర రూ. 800 నుంచి రూ.1000వరకు ఉండగా.. సీజన్‌లో టిక్కెట్‌ రూ. 1500 నుంచి రూ. 2000 వసూలు చేస్తున్నారు.
ఆర్టీసీ ఆదాయం రూ. 700 కోట్లు.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆదాయం రూ. 2,500 కోట్లు
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ప్రైవేట్‌ ఆపరేటర్ల అక్రమ దందాలతో ఆర్టీసీకి తీరని నష్టం వస్తోంది. ఏటా రూ. 1500 కోట్లపైబడి ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తోంది. అవరావతి నుంచి ఆర్టీసీకి ఏటా.. రూ. 700 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ ప్రైవేట్‌ ఆపరేటర్లు రూ.2,500 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నారు. 
ఇష్టానుసారంగా టిక్కెట్లు విక్రయం
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులకు కాంట్రాక్ట్‌ క్యారియర్లుగానే అనుమతి ఉండగా ... స్టేజ్‌ క్యారియర్లుగా తమ కార్యకలపాలు సాగిస్తున్నాయి. నిబంధనలను లెక్కచేయకుండా ఇష్టానుసారంగా టిక్కెట్లు ఆన్‌ లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. డ్రైవర్లు 8 గంటల పనిలో 5 గంటలే డ్రైవింగ్‌ చేయాలి. ఈ నింబంధనను కూడా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బేఖాతరు చేస్తున్నాయి. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారిపోతున్నాయి. ప్రయాణికుల సేవలో కాకుండా దోపిడీయే పరమావధి అన్నట్టుగా వ్యవహరిస్తున్న ట్రావెల్స్‌ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

 

16:59 - April 1, 2018

యాదాద్రి : జిల్లాలోని మోటకొండూరు గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పలువురు ఉన్నతాధికారులు, నాయకులు పరామర్శించారు. భువనగిరి ఏరియా ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌,  జిల్లా విద్యాధికారి సాంబశివరావు తదితరులు డాక్టర్లతో మాట్లాడారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో 13 మంది పరిస్థితి సీరియస్‌గా ఉందని, అధిక జర్వరంతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. తాగునీటి కలుషితం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. వాటర్‌శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపిచినట్టు అధికారులు తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

 

సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. సీతాఫల్ మండి, చిలకలగూడ, అడ్డగుట్ట, తుకారాంగేట్, చిక్కడపల్లి, కవాడిగూడ, ముషీరాబాద్, గాంధీనగర్, మల్కాజ్ గిరి, నేరెడ్ మెట్, సైనిక్ పురిలో వడగళ్ల వాన కురిసింది.   

16:41 - April 1, 2018

కర్నూలు : ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేశాయని.. విద్యార్థి జేఏసీ నేతలు విమర్శించారు. 5కోట్ల మంది ప్రజలను ఫూల్స్‌  చేశారంటూ  చెవిలోపూలు పెట్టుకుని వినూత్న నిరసనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్‌ ముందు ఆందోళన నిర్వహించిన విద్యార్థి జేఏసీ నేతలతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...  

 

16:22 - April 1, 2018

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో దళితుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణకు గురైన దళితుల భూములను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరిశీలించారు. దీని వెనుక అధికారులు, మంత్రి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు సీపీఎం అండగా నిలుస్తుందని మధు హామీ ఇచ్చారు. 

16:15 - April 1, 2018

కృష్ణా : పార్టీ మారాలని నిర్ణయించుకున్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించి బుజ్జగించారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి వచ్చిన యలమంచిలి రవితో దాదాపు గంటసేపు చంద్రబాబుతో  సమావేశమయ్యారు. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని.. సముచిత స్థానం కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ మారాలనుకున్న మాట వాస్తవమేనని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ ఆలోచన చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో జరిపిన చర్చలతో సంతృప్తి కలిగిందని.. దీంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు స్పష్టం చేశారు. 

16:11 - April 1, 2018

కడప : సాగునీటి ప్రాజెక్టుల రీ టెండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 60 C నిబంధన అవినీతిమయంగా మారిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఈ నిబంధనను అడ్డు పెట్టుకుని పాలకులు కమీషన్లు దండుకొంటున్నారని  మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన లక్షా 32 వేల కోట్ల రూపాయల నిధులు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు, ముడుపులకే సరిపోయాయని సోము వీర్రాజు ఆరోపించారు. 

 

16:05 - April 1, 2018

నెల్లూరు : భారత్‌ ప్రయోగించిన అధునాతన ఉపగ్రహం జీశాట్‌-6ఏతో సంబంధాలు కోల్పోయినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారులు వెల్లడించారు. దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని జీశాట్‌-6ఏను ప్రయోగించిన 48 గంటల తర్వాత ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహానికి సంబందించి చివరిదైన మూడో లామ్‌ ఇంజిన్‌ను మండించిన సమయం నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. చివరిసారిగా దాని నుంచి మార్చి 30న ఉదయం 9.22 నిమిషాలకు సమాచారం అందిందని ఇస్రో వెల్లడించింది. మొదటిసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టిన సమయంలో అది సమాచారాన్ని చేరవేసిందని పేర్కొంది. ఆ తర్వాత రెండోసారి కక్ష్య పెంపును మార్చి 31న చేపట్టినట్లు తెలిపింది. ఉపగ్రహంతో అనుసంధానం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇస్రో అధికారులు వెల్లడించారు.

 

16:01 - April 1, 2018

విశాఖ : ఏపీ పర్యాటక శాఖ ప్రస్తుతం నష్టాల బాటలో నడుస్తోంది. టూరిస్టులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ చేపట్టిన కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. పర్యాటకుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ నిధులు వృధా అవడం తప్ప ఎలాంటి లాభం చేకూరడంలేదు. ఇప్పటివరకు నిర్వహించిన బెలూన్‌ ఫెస్టివల్, సౌండ్‌ ఆన్‌ శాండ్స్‌, విశాఖ ఉత్సవ్‌... ఇప్పుడు యాచింగ్‌ ఫెస్ట్‌ వరుసగా ఫెయిల్‌ కావడంతో పర్యటక శాఖపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. 
పర్యాటకులను ఆకట్టుకోని ఫెస్టివల్స్‌
విశాఖ టూరిజం పర్యటకులను ఆకర్షించేందుకు చేపట్టిన ఫెస్ట్‌లు అంతగా సక్సెస్‌ అవడంలేదు. విశాఖ సాగర తీరంలో దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన యాచింగ్‌ ఫెస్టివల్‌కు పర్యటకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కేవలం విదేశాల్లో మాత్రమే నిర్వహించే ఈ ఫెస్ట్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌ వేదికగా విస్తృత ప్రచారం కల్పించారు. ఆరు లక్షల మందికి ఆహ్వానం పంపగా 15 వందల మంది మాత్రమే ఆసక్తి చూపారు. చివరకు 16 మంది  మాత్రమే ఈ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. ఆన్‌లైన్‌ ప్రచారం ద్వారా పర్యటకానికి 3 కోట్లు ఖర్చు కాగా ఆదాయం మాత్రం 2.50 లక్షలు మాత్రమే వచ్చింది. 
మార్చి 28 నుంచి జరగాల్సిన ఫెస్ట్‌
అయితే మొదటి నుండి  యాచింగ్‌ ఫెస్ట్‌ అయోమయంగానే ఉంది. పడవల పండగకు యాచింగ్‌ బోట్లు వస్తాయో, రావో తెలియని పరిస్థితి. అసలు ఫెస్ట్‌ జరుగుతుందో లేదో అన్న అనుమానం ఇటు అధికారులతో పాటు అటు జనంలోనూ నెలకొంది. మార్చి 28 నుండి 31 వరకు జరగాల్సిన ఫెస్ట్‌... గోవా, చెన్నైలతో పాటు థాయిలాండ్‌ నుండి యాచ్‌ బోట్లు రావడం ఆలస్యమవడంతో ఏప్రిల్‌ 1 వరకు ఫెస్ట్‌ను పొడగించారు. ముఖమంత్రి చంద్రబాబు ఈ ఫెస్ట్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఉన్న యాచ్‌లతోనే తూతూ మంత్రంగా పోటీలు నిర్వహించడంతో పర్యటకులను అంతగా అలరించలేకపోయాయి. సముద్రంలో కనీసం 10 కిలో మీటర్లైనా విహారం చేద్దామనుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. దీంతో ఇలాంటి ఫెస్టివల్స్‌ మాటలకే పరిమితం గాని పర్యటకానికి పనికి రావని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పద్దతి వల్ల ప్రజా ధనం వృధా అవడం తప్ప మరేమీలేదంటున్నాయి. 
ఫెస్ట్‌ ఫెయిల్యూర్స్‌కి కారణమైన ఈ ఫ్యాక్టర్స్‌ సంస్థ
భవిష్యత్‌లో విశాఖ యాటింగ్‌కు అనుకూల నగరమని ప్రపంచ పర్యటకులకు తెలియజేసేందుకు ఈ ఫెస్ట్‌ నిర్వహించారు. కాని అది ఇప్పుడు నీరుగారిపోయింది. అయితే ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాల ఇవ్వకపోవడానికి కారణం...కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ ఫ్యాక్టర్స్‌ సంస్థ  నిర్వహనలోపమనే చెప్పాలి. గతంలో కూడా ఈ ఫ్యాక్టర్స్‌ సంస్థ...ప్రభుత్వం తలపెట్టిన విశాఖ ఉత్సవ్‌, శాండ్‌ ఆఫ్‌ సౌండ్స్‌, బెలూన్‌ ఫెస్ట్‌ ఇలా అనేక కార్యక్రమాల నిర్వహన బాధ్యత చేపట్టింది. ఇందులో ఏ ఒక్క కార్యక్రమం సక్సెస్‌ అవలేదు. దీంతో ప్రతి సారి అదే ఈవెంట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. 
విశాఖ పోర్టులోనే టెర్మినల్ నిర్మాణం 
ఇదిలాఉంటే యాచింగ్ ఫెస్టివల్ కోసం విశాఖ పోర్ట్ చైర్మన్ క్రిష్ణబాబు తనసహాయ సహకారాలు అందించడమే కాకుండా యాచింగ్ ఫెస్టివల్ సక్సెస్ అయితే విశాఖ పోర్టులోనే ఒక టెర్మినల్ నిర్మించి పర్యాటక శాఖకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. తద్వారా విశాఖ ఆర్థికంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పోర్ట్ చైర్మన్ క్రిష్ణబాబు రాష్ట్రఅభివృద్దికి అందిస్తానన్న సాయం అభినందనీయం. కాని నిర్వహన లోపంతో యాచింగ్ ఫెస్టివల్ నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడింది.
సెంటిమెంట్‌ను వాడుకుంటున్న పర్యాటక శాఖ
ఇవన్నీ ఒక ఎత్తయితే స్థానికంగా ఉన్న సెంటిమెంట్‌ను వాడుకుంటోంది పర్యటక శాఖ. గతంలో బెలూన్‌ ఫెస్ట్‌ నిర్వహించినప్పుడు వచ్చిన ఆదాయాన్ని గిరిజనులకు ఇస్తామని చెప్పి... వారి ప్రాంతాల్లో తిష్టవేసారు గాని మళ్లీ వారివైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రస్తుతం యాచింగ్‌ ఫెస్ట్‌ను అదే రీతిలో కొనసాగించారు. ఫెస్ట్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మత్స్యకారులకు ఇస్తామని చెప్పినా....అది కూడా చేయలేకపోయారు. ఇలా పర్యటక శాఖ తన విధానాలతో ఇటు పర్యటకుల్లోనూ, అటు ప్రజల్లోనూ అభాసుపాలవుతోంది. 

 

15:55 - April 1, 2018

గుంటూరు : ప్రధాని మొండితనం వీడి ఏపీకి న్యాయం చేయాలంటూ.. ప్రత్యేక హోదా పోస్టుకార్డు ఉద్యమాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని ఉద్యాన విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు పోవూరు శివరామకృష్ణ ఆధ్వర్యంలో... ప్రత్యేక హోదా పోస్టుకార్డు ఉద్యమాన్ని మంత్రి ప్రారంభించారు. రాజధాని భూములు ఎడారి భూములు అన్న జగన్‌ సిగ్గుపడాలన్నారు. రాజధాని నిర్మాణం ఇష్టంలేకనే జగన్‌ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

 

15:50 - April 1, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌ స్ట్రీట్‌లో దళిత ఆదివాసీ సంఘాల జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఎస్టీ ఎస్సీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టులు వద్దంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తీర్పుకు నిరసనగా రేపు  దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. దళిత సంఘాల ఆందోళనపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

15:47 - April 1, 2018

తమిళనాడు : తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ ప్లాంట్‌ బాధితులకు మక్కల్‌ నీది మయమ్‌ పార్టీ అధినేత నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలిపారు. ప్లాంట్‌ను మూసివేయాలని బాధితులు గత 52 రోజులుగా నిరవదిక దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతు పలికిన కమల్‌ హాసన్‌ నేరుగా తూత్తుకుడి వెళ్లి వారితో దీక్షలో పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వ వ్యతిరేకంగా అన్ని పార్టీలు ప్రజాసంఘాలు బాధితులకు సంఘీభావం తెలుపుతుండటంతో తూత్తుకుడి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

ఇస్రోతో జీశాట్ 6 శాటిలైట్ సంబంధాలు తెగిపోయాయి...

నెల్లూరు : ఇస్రోతో జీశాట్ 6 శాటిలైట్ సంబంధాలు తెగిపోయాయి. లింక్ ను పునరుద్ధరిస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సీపీఐ బహిరంగ సభ

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సీపీఐ బహిరంగ సభ జరుగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు బహిరంగ సభకు చేరుకున్నారు.  

15:20 - April 1, 2018

నిర్మల్ : జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కడెం మండలం బెల్లాల్ లో అప్పుల బాధ తాళలేక చిట్యాల గంగరాజం ఆత్మహత్య చేసుకున్నారు. గంగరాజం మూడెకరాలు కౌలుకు తీసుకుని రూ.3 లక్షలు అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు కూతురి పెళ్లి కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పు దొరక్క మనస్తాపంతో గంగరాజం ఆత్మహత్య చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

నిర్మల్ జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

నిర్మల్ : జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కడెం మండలం బెల్లాల్ లో అప్పుల బాధ తాళలేక చిట్యాల గంగరాజం ఆత్మహత్య చేసుకున్నారు. మూడెకరాలు కౌలుకు తీసుకుని రూ.3 లక్షలు అప్పు చేసి గంగరాజం వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు కూతురి పెళ్లి కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి. అప్పు దొరక్క మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. 

13:33 - April 1, 2018

జమ్మూ కాశ్మీర్ : వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతం కాగా ఇద్దరు భారత జవాన్లకు గాయాలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న భారత బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనితో భారత సైన్యం ధీటుగా స్పందించింది. ఎదురు కాల్పులు జరపడంతో ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతనాగ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆయా ఘటనా ప్రదేశాల నుండి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రీ, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే షోపియాన్ లోని కచ్ దూర్ లో స్థానికులను బందీలుగా చేసుకుని ఉగ్రవాదులు నక్కినట్లు తెలుస్తోంది.

13:24 - April 1, 2018

నెల్లూరు : జీశాట్ 6ఎ శాటిలైట్ రెండో దశ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇస్రోతో జీశాట్ 6ఎ శాటిలైట్ సంబంధాలు తెగిపోవడంతో కలకలం రేగింది. వెంటనే శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. లింక్ ను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ రంగం..ఇతర రంగాలకు ఎంతో ఉపయోగపడే ఈ రాకెట్ ప్రయోగాన్ని మార్చి 29న ప్రయోగించిన సంగతి తెలిసిందే. మొదటి దశ విజయవంతంగా పూర్తయినా రెండో దశలో సాంకేతిక లోపం తలెత్తింది. త్వరలోనే లింక్ ను పునరుద్ధరిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

కరపత్రాలను స్వాధీనం చేసిన ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్...

కర్నాటక : రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ కరపత్రాలను సీజ్ చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీఎస్ పాటిల్ కు చెందిన కరపత్రాలని వార్తలు వస్తున్నాయి. ఈసీ అనుమతి తీసుకోకుండానే కరపత్రాలను ప్రింట్ చేయించారని ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు భావిస్తున్నారు.

ముదురుతున్న కావేరీ వివాదం...

చెన్నై : కావేరీ వివాదం మరింత ముదురుతోంది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆంళన చేస్తున్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

13:13 - April 1, 2018

వరంగల్ : సీపీఎం అఖిల భారత మహాసభల విజయవంతం కోసం సీపీఎం చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. వివిధ జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్ర ఆదివారం వరంగల్ రూరల్ జిల్లాల్లోకి ప్రవేశించింది. బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోందని సీపీఎం నేతలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం..సామాజిక న్యాయం కోసం బీఎల్ఎఫ్ ఏర్పాటయ్యిందని, 119 నియోజకవర్గాలత్లో బీఎల్ఎఫ్ పోటీ చేస్తుందని పేర్కొన్నారు.

12:41 - April 1, 2018

చెన్నై : ఇటీవలే మృతి చెందిన అందాల తార శ్రీదేవికి భారత రత్న ఇవ్వాలని సీనియర్ నటి శారద కోరారు. చెన్నైలోని ఆంధ్రా క్లబ్ లో శ్రీదేవి సంతాప సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న శారద...శ్రీదేవితో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన నటనతో శ్రీదేవి గుర్తింపు తెచ్చుకున్నారని, శ్రీదేవికి భారతరత్న వచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయి నివాళి అర్పించారు.

12:38 - April 1, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈసారి కేంద్ర పెద్దలతో కాకుండా ఇతర విపక్ష నేతలతో ఆయన భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఆయన పలువురు జాతీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. తొలుతో 2, 3 తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడి 3,4 తేదీల్లో పర్యటన ఖరారైంది. విభజన హామీలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం..తదితర విషయాలను జాతీయ పార్టీల నేతలకు బాబు వివరించి మద్దతు తెలియచేయాలని కోరనున్నారు. కానీ ఢిల్లీలో బాబు ఎవరెవరిని కలుస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

యలమంచిలికి బుజ్జగింపులు...

విజయవాడ : యలమంచిలి రవికి టీడీపీ బుజ్జగింపులు మొదలయ్యాయి. వైసీపీలో చేరేందుకు యలమంచిలి రవి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... రవిని వెంటబెట్టుకుని ఎంపీ కేశినేని చంద్రబాబు నివాసానికి వచ్చారు. పార్టీని వీడకూడదని రవికి నేతలు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

12:31 - April 1, 2018

విజయవాడ : ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీ సీటు ఇస్తుందా ? లేదా ? ఇతర పార్టీలోకి జంప్ కావాలా ? అనేదానిపై ఆలోచిస్తున్నారు. తాజాగా టిడిపి నేత యలమంచిలి పార్టీ మారనున్నారని ప్రచారం జరిగింది. తనకు సీటు కేటాయించరని..దీనితో వైసీపీలో చేరాలని యలమంచిలి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. యలమంచిలి రవికి టీడీపీ బుజ్జగింపులు మొదలయ్యాయి. వైసీపీలో చేరేందుకు యలమంచిలి రవి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... రవిని వెంటబెట్టుకుని ఎంపీ కేశినేని చంద్రబాబు నివాసానికి వచ్చారు. పార్టీని వీడకూడదని రవికి నేతలు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

12:27 - April 1, 2018

విజయవాడ : వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రభుత్వం వత్తిడి చేయడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆదివారం వైసీపీ నేతలు బోత్స సత్యనారాయణ, పార్థసారధిలు మాట్లాడారు. ఆఖరి అస్త్రంగా వైసీపీ ఎంపీలు చేపట్టే దీక్షకు టీడీపీ, రాష్ట్ర ప్రజలు మద్దతు పలకాలని కోరారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఈ మేరకు పార్లమెంట్‌ చివరి రోజున వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని నిర్ణయించామని...., టీడీపీ ఎంపీలు కూడా అదే రోజు రాజీనామా సమర్పించాలని కోరారు. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా అందరం కలసి ఢిల్లీలో పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు బొత్స సత్యనారాయణ. టీడీపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు వైసీపీ నేత పార్థసారధి. రాష్ట్ర ప్రజలు మోదీపై చేయాల్సిన పోరాటాన్ని అంతకంటే ఎక్కువగా చంద్రబాబు మీద చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి పట్టిన దుర్గతికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. హోదా కోసం కేంద్రం మెడలు వంచేందుకు పార్లమెంట్‌ సభ్యులు, వైసీపీ ఎంపీలు చేపట్టే రిలేదీక్షను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు పార్ధసారధి.

12:22 - April 1, 2018

తూర్పుగోదావరి: ఏపీకి హోదా కల్పించాలని ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. కాకినాడలోని కుంభాభిషేకం రేవులో ఎమ్మెల్యే కొండబాబు జలదీక్ష చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నట్టేట ముంచారని పేర్కొన్నారు. కొండబాబు చేసిన జలదీక్షకు స్థానిక మత్స్యకారులు మద్దతు పలికారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కుంభాభిషేకం రేవులో...

తూర్పుగోదావరి: ఏపీకి హోదా కల్పించాలని ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. కాకినాడలోని కుంభాభిషేకం రేవులో ఎమ్మెల్యే కొండబాబు జలదీక్ష చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నట్టేట ముంచారని పేర్కొన్నారు. కొండబాబు చేసిన జలదీక్షకు స్థానిక మత్స్యకారులు మద్దతు పలికారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఢిల్లీకి బాబు...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనం కానున్నారు. 3,4 తేదీల్లో ఆయన పర్యటన జరుగనుంది. కేంద్రంపై చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు ఈ పర్యటన చేస్తున్నారని తెలుస్తోంది.

నిమ్స్ లో వైద్యుల ఆందోళన...

హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆందోళన నిర్వహించారు. వైద్యుడు శివతేజారెడ్డి మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

11:45 - April 1, 2018

చిత్తూరు : తిరుమలకు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేశారు. ఆదివారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకున్నారు. ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులు..వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, యాంకర్ సుమ, ‘కృష్ణార్జున యుద్ధం' చిత్ర టీమ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం' సినిమా రిలీజ్ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, మొదటి టికెట్ శ్రీవారికి ఇచ్చినట్లు హీరో నాని పేర్కొన్నారు. సినీ ప్రముఖులతో ఫొటోలు దిగడానికి..కరచాలనం చేయడానికి అభిమానులు ఆసక్తి కనబర్చారు.

11:44 - April 1, 2018

సూర్యాపేట : హుజూర్ నగర్ మండలంలోని బురుగుగడ్డ గ్రామంలోని ఆది లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సందర్శించారు. స్వామి వారి తిరు కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

తిరుమలలో రాజకీయ..సినీ ప్రముఖులు...

చిత్తూరు : తిరుమలకు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేశారు. ఆదివారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకున్నారు. ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులు..వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, యాంకర్ సుమ, ‘కృష్ణార్జున యుద్ధం' చిత్ర టీమ్ శ్రీవారిని దర్శించుకున్నారు.

11:21 - April 1, 2018

కామారెడ్డి : జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం పిట్లం మహజనసభలో రభస చోటు చేసుకుంది. ప్రైమరీ అగ్రికల్చర్ మాజీ సీఈవో నారాయణరెడ్డిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడని, వెంటనే ఇతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బినామీ పేర్లతో కోట్లకు పడగలెత్తాడని, తన పరిధిలో లేని వారికి లోన్లు ఇస్తున్నాడని పేర్కొన్నారు. లక్ష రూపాయలకు పది వేల రూపాయలు కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఆర్టీఐ చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, ఇంత వెలుగు చూసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు.

కొండాపూర్ లో చిరుత...

మేడ్చల్ : ఘట్ కేసర్ మండలం కొండాపూర్ లో లేగదూడలపై చిరుత దాడి చేస్తుండడంతో రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శనివారం రెండు లేగదూడలను చిరుత హతమార్చింది.

10:28 - April 1, 2018

హైదరాబాద్ : మెహిదీపట్నంలోని విజయశ్రీ అపార్ట్ మెంట్ లో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సజీవ దహనం కావడం సంచలనం సృష్టిస్తోంది. ఆ గదిలోని వస్తువులు..ఫర్నీచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. సిగరేట్ తాగుతుండగా ప్రమాదవశాత్తు కర్టెన్స్ కు మంటలు అంటుకుని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లేదా ఎవరైనా సజీవ దహనం చేశారా ? అనేది తెలియాల్సి ఉంది. ఆసీఫ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మోహిదీపట్నంలో వ్యక్తి సజీవదహనం...

హైదరాబాద్ : మెహిదీపట్నంలోని విజయశ్రీ అపార్ట్ మెంట్ లో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సజీవ దహనం కావడం సంచలనం సృష్టిస్తోంది. సిగరేట్ తాగుతుండగా ప్రమాదవశాత్తు కర్టెన్స్ కు మంటలు అంటుకుని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆసీఫ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

10:20 - April 1, 2018

నాగర్ కర్నూలు : భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రం.. ప్రకృతి ప్రేమికులకు పర్యాటక క్షేత్రం... ఉడుకు రక్తం ఉప్పొంగే యువతకు సాహస క్షేత్రం... ఔను.. అక్షరాల ఇది నిజమే.. ఈ భావనలన్నీ కలగలిసి... అచ్చం అమర్‌నాథ్‌ యాత్రను తలపిస్తుంది ఈ క్షేత్రం. తెలంగాణ అమర్ నాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం యాత్రపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం. చుట్టూ విశాలమైన అడవి.. ఎత్తైన చెట్లు.. ప్రకృతి అందాలు... పక్షుల కిలకిల రావాలు... పాముల పుట్టలు... వన్యప్రాణులు.. ఇవన్నీ దట్టమైన నల్లమల అడవిలో వెలసిన సలేశ్వరం క్షేత్రపు వాతవరణం. సాక్షాత్తూ శివుడే కైలాసాన్ని మరిచి ఇక్కడే కొలువయ్యాడేమో అన్న భావన కలుగుతుంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తే.. ఇక్కడి రాయి, రప్ప, చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతతో పెనవేసుకుని ఉంటాయి. లోతైన లోయలో కొలువుదీరిన లింగమయ్యను చేరుకోవాలంటే.. కాలినడకన ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే.. కొండలూ, గుట్టలూ, రాళ్ళూ రప్పలూ దాటుకుంటూ కాలినడకన అక్కడికి చేరుకోవడం ఓ సాహస యాత్రే... గోరంత కష్టానికి తట్టుకుని దట్టమైన అడవిలో.. లోతైన లోయలోకి చేరుకుంటే... వెలకట్టలేని అపూర్వ అనుభూతిని తనివి తీరా ఆస్వాదిస్తారు. భక్తులు సలేశ్వరంగా పిలుచుకునే సర్వేశ్వర క్షేత్రం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో వెలసింది. అమ్రాబాద్ మండలం మన్ననూరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో.. దట్టమైన అడవిలోని ఒక లోతైన లోయలో ఉంది ఈ సలేశ్వరం.. గతనెల 29న ప్రారంభమైన ఇక్కడి ఉత్సవాలు ఈనెల 5న ముగియనున్నాయి. ఈ అడవిలో వేలాది మంది భక్తులు లోయలోకి దిగి స్నానాలు ఆచరించి.. స్వామిని దర్శించుకుంటారు. శివాలయం ఎదురుగా దాదాపు వంద అడుగుల ఎత్తు రాతికొండ నుంచి పరవళ్ళు తొక్కే జలపాతం చూపరులను కట్టిపడేస్తుంది. ఒక్క మనిషి మాత్రమే నడిచేంత బాటతో కూడిన లోయ అడుగుభాగానికి చేరుకోవడమంటే సాహసమే.. అంతకష్టమైనా వయసుతో ప్రమేయంలేకుండా ప్రతీ ఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి కూడా భక్తులు వస్తారు. గుడిలోని శంఖుతీర్థంలో స్నానం చేయడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. గుండం జలాన్ని సర్వరోగనివారిణిగా నమ్ముతారు. లింగమయ్యస్వామికి, గంగమ్మకు భక్తులు వెండి వస్తువులతో మొక్కులు చెల్లించుకుంటారు. నాగదోశం ఉన్నవారు వెండి నాగును ఇస్తారు.. చెంచులు కొత్తగా పూసిన ఇప్పపువ్వు, సారాయి నైవేద్యంగా పెడతారు.

సీబీఎస్ఈ పేపర్ లీక్..అరెస్టులు...

ఢిల్లీ : సీబీఎస్ఈ పేపర్ లీక్ లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇద్దరు టీచర్లు..ఒక కోచింగ్ సెంటర్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాటేదాన్ లో అగ్నిప్రమాదం...

రంగారెడ్డి : జిల్లా కాటేదాన్‌ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్‌ కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకుని ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగి.. మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.

09:39 - April 1, 2018

సిద్ధిపేట : పోరాటాల గడ్డ సిద్దిపేటలో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. దేశం కోసం, రాష్ట్రం కోసం అమరులైన వారందరికి హరీష్‌రావు జోహార్లు తెలిపారు. అమరుల త్యాగ ఫలితంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని... అందరూ కలిసి ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే అన్నారు. ఇక ఏప్రిల్‌ ఫూల్‌తో అందరూ సమయం వృధా చేసుకోకుండా... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. ఏప్రిల్‌ నెలను కూల్‌ నెలగా మార్చాలన్నారు హరీష్‌రావు.

09:36 - April 1, 2018

హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ప్రకాశ్‌రాజ్‌ కేసీఆర్‌ ఎందుకు కలిశారు.? జాతీయ స్థాయిలో రాజకీయంగా ఒకే వేదికపైకి వచ్చేందుకు కలిశారా? లేక కేసీఆర్‌ బయోపిక్‌ సినిమా కోసం కలిశారా ? వాచ్‌దిస్‌ 10టీవీ స్టోరీ..విలక్షణ నటుడు ఇప్పుడు ఏం చేసినా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌తో కలిసి ఒకరోజంతా ఆయన గడిపారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్నాటకలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్‌ కేసీఆర్‌ను కలవడం హాట్‌ టాఫిక్‌గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతను కలిసి చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో రాజకీయ శక్తులను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ కూడా బీజేపీకి వ్యతిరేకంగా కొన్నాళ్లుగా గళం విప్పుతున్నారు. మతోన్మాదం, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు కురిపిస్తున్నారు. దీంతో వీరిద్దరి భేటీ చర్చనీయాంశమైంది. రాజకీయ అవసరాల కోసమే వీరిద్దరి మధ్య చర్చ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రకాశ్‌రాజ్‌ ఒకరోజు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కేసీఆర్‌తోనే గడపడంతో మరో కొత్తవాదన కూడా వినిపిస్తోంది. కేసీఆర్‌తో కలిసి ప్రగతిభవన్‌ నుంచి అసెంబ్లీకి రావడం, అసెంబ్లీ జరుగుతున్నంతసేపు గ్యాలరీలో కూర్చొని పరిశీలించడం, అనంతరం సీఎంతోపాటే కలిసి ఒకే వాహనంలో వెళ్లడం ఆసక్తి రేపుతోంది. ఓ దర్శకుడు కేసీఆర్‌ బయోపిక్‌ తీయాలన్న నిర్ణయం తీసుకున్నాడు. అందులో కేసీఆర్‌ పాత్రను ప్రకాశ్‌రాజ్‌ పోషించే అవకాశాలున్నాయన్న ప్రచారం మొదలైంది. కేసీఆర్‌ను పూర్తిస్థాయిలో అనుకరించేందుకే ప్రకాశ్‌రాజ్‌ రోజంతా సీఎంతో కలిసి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అటు రాజకీయాల్లో.. ఇటు సినీవర్గాల్లో కేసీఆర్‌, ప్రకాశ్‌రాజ్‌ భేటీపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ రాజకీయంగా కలిసి పనిచేస్తారా? లేక కేసీఆర్‌ బయోపిక్‌లో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మృతుల కుటుంబాలకు చౌహాన్ పరిహారం..

మధ్యప్రదేశ్ : ఇండోర్ లో పురాతన హోటల్ భవనం కుప్పకూలిన ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేశారు. మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేలు అందచేయనున్నట్లు సీఎం చౌహాన్ వెల్లడించారు.

దళిత సంఘాల పార్లమెంట్ ముట్టడి...

ఢిల్లీ : నేడు పార్లమెంట్ ముట్టడికి దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దళిత సంఘాలు తప్పుపట్టాయి.

08:18 - April 1, 2018

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్ లో నాలుగంతస్తుల పురాతన హోటల్ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. శిథిలాల కింద చాలా మంది ఉంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు పది మంది మృతదేహాలను వెలికి తీశారు. శనివారం రాత్రి 9గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రద్దీ ప్రాంతంలో ఈ హోటల్ ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. తమ వారి ఆచూకి తెలియకపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

08:09 - April 1, 2018

ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీల రగడ ఇంకా కొనసాగుతోంది. దీనిపై వైసీపీ..టిడిపి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సభలు వాయిదా పడగానే రాజీనామాలు చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలంగాణలో టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శివశంకర్ (జనసేన), డా.రాకేష్ (టీఆర్ఎస్), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), చందూ సాంబశివరావు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

జగన్ పాదయాత్రకు విరామం...

గుంటూరు : ఈస్టర్ సందర్భంగా నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. పాదయాత్ర శిబిరం వద్దే జగన్ బస చేయనున్నారు. సోమవారం ఫిరంగిపురం (మం) పేరేచర్ల నుండి పాదయాత్ర కొనసాగనుంది.

నేటి నుండి రేషన్ పోర్టబులిటీ...

ఢిల్లీ : తెలంగాణలో నేటి నుండి రేషన్ పోర్టబులిటీ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుండైనా రేషన్ తీసుకొనే అవకాశం కల్పించనున్నారు.

07:35 - April 1, 2018

ఢిల్లీ : కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బాల్ టాంపరింగ్‌కు కారణమవ్వడం తన జీవితంలో పెద్ద తప్పు అని అన్నాడు కంగారూ క్రికెటర్‌...డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌. బాల్‌ టాంపరింగ్‌ చేయించినందుకు అపరాదభావంతో డేవిడ్‌ వార్నర్‌ కుంగిపోతున్నాడు. చేసిన తప్పుకు స్టీవ్‌ స్మిత్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. వైస్‌ కెప్టెన్‌గా క్షమించరాని తప్పు చేశానని అపరాద భావంతో కంటతడి పెట్టుకున్నాడు. ఇకపై ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడగలడో లేడో అన్న అభద్రతా భావంతో ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. కుటుంబసభ్యులే తనకు పెద్ద అండ అని....క్రికెటర్‌గా కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతానని వార్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ వైపు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో డేవిడ్‌ వార్నర్‌ కెరీర్‌కు దాదాపుగా ఫుల్‌స్టాప్‌ పడిట్టేనని విమర్శలు వినిపిస్తుండగా....వార్నరే స్వయంగా భవిష్యత్‌పై ఉన్న అభద్రతా భావాన్ని వ్యక్తం చేయడం క్రికెట్‌ ప్రపంచాన్నే కలవరపెడుతోంది.

07:33 - April 1, 2018

ఢిల్లీ : 2012లో ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్‌ గ్రూప్‌కు ఇచ్చిన 3,250 కోట్ల రుణాలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేపట్టనుంది. వీడియోకాన్‌కు రుణాలిచ్చినందుకు ఐసిఐసిఐ బ్యాంక్‌ సిఈఓ చందా కొచ్చర్ కుటుంబం ఆయాచిత లబ్ది పొందిందనే ఆరోపణలున్నాయి. చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌లను సీబీఐ అనుమానితులుగా పేర్కొంది. వీడియోకాన్‌ గ్రూప్‌ నుంచి కొచ్చర్‌ కుటుంబం లబ్ది పొందిందా లేదా అన్నదానిపై చందా కొచ్చర్ భర్త దీపక్‌ కొచ్చర్‌ను సిబిఐ ప్రాథమిక విచారణ జరపనుంది. ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్‌ గ్రూప్‌కు 3,250 కోట్ల రుణం ఇవ్వగా...2,810 కోట్లు బ్యాంకుకు చెల్లించలేదు. వీడియోకాన్ గ్రూప్‌ ఛైర్మన్ వేణుగోపాల్‌ ధూత్, దీపక్‌ కొచ్చర్‌ కలిసి 2008లో నుపవర్ రినెవెబుల్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పేరిట ఓ కంపెనీ పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌నకు కొచ్చర్‌ రుణాలిచ్చేందుకు తోడ్పాటు అందించారని, ఫలితంగా ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రామగుండంలో కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర...

కరీంనగర్ : కాంగ్రెస్‌ పార్టీ రెండోదశ ప్రజాచైతన్య బస్సుయాత్ర నేటి నుంచి ప్రారంభంకానుంది. రామగుండంలో సాయంత్రం 6 గంటలకు బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. నేటి నుంచి 10 రోజులపాటు 18 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగనుంది.

07:05 - April 1, 2018

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో వివాదాస్పద స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టెరిలైట్‌ కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నా...కర్మాగార నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతించడం శోచనీయమన్నారు. '47 రోజులుగా అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళన పట్టదా' అంటూ రజనీ ట్వీట్‌ చేశారు. స్టెరిలైట్‌ ఆందోళనకు మరో నటుడు కమల్‌హాసన్ కూడా తన మద్దతు ప్రకటించారు. ఏప్రిల్ 1న జరిగే నిరసన కార్యక్రమానికి కమల్ నాయకత్వం వహిస్తారు. 'తూత్తుకుడిలో మరో భోపాల్ తరహా విషాదం జరగనీయం' అని కమల్‌హాసన్ తెలిపారు. వేదాంత గ్రూప్ చేపడుతున్న స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా గత 48 రోజులుగా గ్రామస్థులు ఆందోళన సాగిస్తున్నారు. కాపర్ ప్లాంట్ కారణంగా తాము శ్వాససంబంధిత ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

07:03 - April 1, 2018

విశాఖపట్టణం : మెజార్టీ సీట్లు సంపాదించిన వాళ్లు ఏది చెబితే అది చెల్లుతుందనడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. ఎదురు మాట్లాడితే అరాచకవాది అని ముద్రవేయడం బాధాకరమన్నారు. విశాఖలో రాయిటర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ ఏబీకే ప్రసాద్‌ సన్మాన కార్యక్రమానికి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

06:42 - April 1, 2018

హైదరాబాద్ : న్యాయ స్థానాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సీనియర్ న్యాయ మూర్తులు లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు తేవాలనుకోవడంపై దళిత, వామపక్ష సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఏప్రిల్2న దళిత సంఘాల దేశవ్యాప్త నిరసనలకు సీపీఐ మద్దతు ఇస్తుందని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం గ్రామాల్లో వైషమ్యాలు తెచ్చేలా ఉందని ఆయన ఆరోపించారు. ఒక్క మహిళకూ తన మంత్రివర్గంలో స్థానం లేదు కేసీఆర్ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 1 నుంచి 4 వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయి అని తెలిపారు.

06:40 - April 1, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించనుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త పార్టీ పెడతామన్న తెలంగాణ JAC ఛైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. కొత్త పార్టీ కోసం JAC దరఖాస్తు చేసుకున్న తెలంగాణ జనసమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 2న కోదండరామ్‌ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఏప్రిల్‌ 4న పార్టీ పతాకం ఆవిష్కరించి, పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు ఏప్రిల్‌ 29న భారీ బహిరంగ సభ ఏర్పాటుకు JAC నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

06:37 - April 1, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పుడు హస్తినకు వెళ్తే అసలు విషయం పక్కకుపోయి... థర్డ్‌ ఫ్రంట్‌ అంశం తెరపైకి వస్తుందంటున్నారు సీనియర్లు. ఇదిలావుంటే.. సీఎం మాత్రం ఢిల్లీ వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయిలో వివిధ పార్టీల నేతలకు వివరించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, ప్రజంటేషన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయిలో ఎండగట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన అఖిలసంఘాల సమావేశంలో రెండు, మూడు తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. అయితే... తాజాగా బాబు ఢిల్లీ టూర్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా థర్డ్‌ ఫ్రంట్‌పై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో... ఇప్పుడు ఢిల్లీ వెళ్తే అసలు విషయం పక్కదారి పట్టే అవకాశముందని చంద్రబాబుకు పార్టీలోని సీనియర్లు సూచిస్తున్నారు. ఢిల్లీలో జాతీయపార్టీల నేతలు, ఎంపీలను కలిస్తే ఆ ఊహాగానాలకు ప్రాధాన్యం ఏర్పడే అవకాశముందంటున్నారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావడం... ఎన్డీయే కూటమికి టీడీపీ గుడ్‌బై చెప్పడం.. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైతం ఇదే సమయంలో థర్డ్‌ ఫ్రంట్‌ కోసం పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్తే థర్డ్‌ ఫ్రంట్‌ కోసమే వెళ్లారనే ఊహాగానాలు తెరపైకి వస్తాయంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతంగా జరుగుతుండడం... టీడీపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబడుతున్న సమయంలో ఢిల్లీ వెళ్లి జాతీయస్థాయి నేతలకు వివరించినా... అసలు విషయం మరుగునపడి కొత్త అంశాలు తెరపైకి వచ్చే ప్రమాదముందని చంద్రబాబుకు సీనియర్లు హెచ్చరిస్తున్నారు. అయితే... పార్టీ నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం హస్తిన టూర్‌కు వెళ్లేందుకు సిద్దమయ్యారు. రెండు రోజులపాటు ఢిల్లీలో జాతీయస్థాయి నేతలను కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు... విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికలను చంద్రబాబు సిద్దం చేసుకుంటున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ రూపంలో అందరికి తెలియజేయడంతో పాటు... కొన్ని పుస్తకాలను సిద్దం చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఎవరెవరిని కలవాలనే దానిపై ప్లాన్‌ చేసుకుంటున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్‌ సమావేశాలు చివరి దశకు చేరుకోవడంతో... ఢిల్లీలో జాతీయస్థాయి నేతలను కలిస్తే కేంద్రంపై ఒత్తిడి పెరిగే అవకాశముంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదిలావుంటే... చంద్రబాబు హస్తిన టూర్‌పై సీఎంవో వర్గాలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే... అంతా సిద్దం చేసుకుంటున్నారని మాత్రం అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు జాతీయస్థాయి నేతలతో ఫోన్‌లో సంప్రదించినట్లు సమాచారం. ఓవైపు సోమవారం నాడు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందో... లేదోనన్న టెన్షన్‌ కొనసాగుతుండగా... మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్తాడా ? లేడా ? అనే సందేహం కూడా కొనసాగుతోంది. ఏది ఏమైనా చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఆదివారం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

06:33 - April 1, 2018

అనంతపురం : రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించిన సీఎం.. లేపాక్షిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు.. పలువురు ప్రముఖులు, కళాకారులు హాజరయ్యారు. ఏపీ సీఎం చేతులమీదుగా ప్రారంభమైన లేపాక్షి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.. మరో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి... హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారంతా అనంతపురం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలపై వివరించారు. శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ వేదికమీద సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. లేపాక్షిబసవన్న, వీరభద్రస్వామి దేవాలయం మనందరికీ గర్వకారణమన్నారు సీఎం చద్రబాబు.. లేపాక్షిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అలాగే అనంతపురం జిల్లాలోని ప్రతి చెరువును నీటితో నింపుతామన్నారు. ఎన్టీఆర్‌కు ఇష్టమైన హిందూపురం ప్రాంతానికి.. బాలకృష్ణ ప్రాచుర్యం తెచ్చారని సీఎం చెప్పారు.. భవిష్యత్తులోరాయలసీమను అభివృద్ధి చేసితీరతామన్నారు. రాయలసీమ రాళ్ళసీమకాదు... రతనాలసీమగా చేస్తామన్నారు. విజయనగర చక్రవర్తుల కాలంలోప్రసిద్ధ క్షేత్రంగానూ, ఆర్థిక పట్టణంగానూ విరాజిల్లిన ప్రాంతం లేపాక్షి అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ... ఆధ్యాత్మికంగా కూడా ఈప్రాంతానికి ప్రాచుర్యం ఉందన్నారు. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి కూడా ఒకటని బాలకృష్ణ తెలిపారు. ఆధ్యాత్మికం, సాంస్కృతిక మేళవింపుగా రెండురోజులపాటు ఈ ఉత్సవాలు సాగుతాయని చెప్పారు. లేపాక్షిని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కోట్లాదిరూపాయలతో... లేపాక్షి అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ. ఉత్సవాలకు ముందు.. లేపాక్షి నంది విగ్రహం నుంచి సభావేదిక వరకు శోభాయాత్ర నిర్వహించారు. అశ్వరథంపై శ్రీకృష్ణుడి వేషధారణలో శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అలాగే... శివమణితోపాటు పలువురు కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఉత్సవాల వేదికమీద సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్‌, కె.రాఘవేంద్రరావు, రాళ్లపల్లితోపాటు పలువురు కళాకారులను సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సత్కరించారు.

06:29 - April 1, 2018

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండవ దఫా ప్రజాచైతన్య బస్సుయాత్రకు రెడీ అయ్యారు. మొదటి విడత ఇచ్చిన జోష్‌తో సెకండ్‌ సెషన్‌ నేటి నుంచి ప్రారంభించబోతున్నారు. బస్సుయాత్రతో ప్రజలతోపాటు పార్టీ క్యాడర్‌తోనూ కాంగ్రెస్‌ నేతలు మమేకంకాబోతున్నారు. కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతల బస్సుయాత్ర కొనసాగనుంది. హామీలు, వాటిని బుట్టదాఖలు చేసిన తీరును ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ రెడీ అయ్యింది. బస్సుయాత్రతో కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే మొదటి దఫా బస్సుయాత్రను పూర్తిచేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు రెండో దఫా పర్యటనకు సిద్ధమైంది. బస్సుయాత్రతో ప్రజల్లో కేసీఆర్‌ సర్కార్‌ నియంతృత్వ పోకడలను వివరించడంతోపాటు పార్టీ క్యాడర్‌లోనూ కాంగ్రెస్‌ నాయకులు జోష్‌ నింపారు. పార్టీనేతలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారు. బడ్జెట్‌ సమావేశాల కారణంగా యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన ఉత్తమ్‌... ఇప్పుడు సెకండ్‌ దఫా బస్సుయాత్రకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రెండోదశ ప్రజాచైతన్య బస్సుయాత్ర నేటి నుంచి ప్రారంభంకానుంది. రామగుండంలో సాయంత్రం 6 గంటలకు బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. నేటి నుంచి 10 రోజులపాటు 18 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగనుంది. మొదటి విడత చేవెళ్ల నుంచి ప్రారంభించిన బస్సుయాత్ర 17 నియోజకవర్గాల్లో పర్యటించింది. ప్రజలను చైతన్య పరిచేందుకు బస్సుయాత్రను కాంగ్రెస్‌ నాయకులు చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచారాస్త్రాలుగా బస్సుయాత్రలో కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు వివరించనున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్‌ చేయడం, కోమటిరెడ్డి, సంతప్‌కుమార్‌ సభ్యత్వం రద్దు, రైతుల ఆత్మహత్యలు, అవినీతి, అప్పులు, కాగ్‌ నివేదిక అంశాలను బస్సుయాత్రలో ప్రస్తావించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో కూడా కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు వివరించనున్నారు. మొత్తానికి మొదటి దఫా బస్సుయాత్ర ఇచ్చిన జోష్‌తో కాంగ్రెస్‌ నాయకులు రెండోదఫా యాత్రకు సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలే టార్గెట్‌గా సాగే బస్సుయాత్రలో కాంగ్రెస్‌ నాయకులు ఏమేరకు అనుకున్నది సాధిస్తారో చూడాలి.

సర్కార్ పై తలైవా ఆగ్రహం...

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో వివాదాస్పద స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టెరిలైట్‌ కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నా...కర్మాగార నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతించడం శోచనీయమన్నారు. '47 రోజులుగా అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళన పట్టదా' అంటూ రజనీ ట్వీట్‌ చేశారు.

3,250 కోట్ల రుణాలపై సిబిఐ దర్యాప్తు...

ఢిల్లీ : 2012లో ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్‌ గ్రూప్‌కు ఇచ్చిన 3,250 కోట్ల రుణాలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేపట్టనుంది. వీడియోకాన్‌కు రుణాలిచ్చినందుకు ఐసిఐసిఐ బ్యాంక్‌ సిఈఓ చందా కొచ్చర్ కుటుంబం ఆయాచిత లబ్ది పొందిందనే ఆరోపణలున్నాయి. చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌లను సీబీఐ అనుమానితులుగా పేర్కొంది.

బీహార్ లో టాపర్ స్కాంలో ఈడీ...

బీహార్ : రాష్ట్ర టాపర్‌ స్కాం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు భారీ విజయం లభించింది. బిహార్‌లో చర్చనీయాంశంగా మారిన ఇంటర్‌ టాపర్స్‌ కుంభకోణంలో మాస్టర్‌ మైండ్, వైశాలీలో విష్ణుదేవ్‌ రాయ్‌ కాలేజీ డైరెక్టర్ బచ్చారాయ్‌కు చెందిన 4 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది.

పీటర్ కు జ్యుడిషియల్ కస్టడీ...

ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియాకు ఢిల్లీ కోర్టు ఏప్రిల్‌ 13 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. పీటర్‌కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడంతో ఆయనను ముంబై తరలించనున్నారు. ఈ కేసులో పీటర్ ముఖర్జియా విచారణాధికారులకు సహకరించడంలేదనీ సిబిఐ పటియాలా హౌస్‌కోర్టుకు తెలిపింది.

సచిన్ పైలట్ కు మార్గం సుగమం...

ఢిల్లీ : త్వరలో జరగనున్న రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ యువనేత సచిన్‌ పైలెట్‌కు మార్గం సుగమమైంది. రాజస్థాన్‌ మాజీ సిఎం అశోక్‌ గెహ్లాట్‌కు ఎఐసిసిలో స్థానం కల్పించడం ద్వారా సచిన్‌కు పూర్తి స్వేచ్ఛ లభించినట్లయింది. జనార్ధన్‌ ద్వివేది స్థానంలో అశోక్‌ గెహ్లాట్‌ను కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాహుల్‌ నియమించారు.

Don't Miss