Activities calendar

02 April 2018

22:04 - April 2, 2018

హైదరాబాద్ : ప్రధాని నేతృత్వంలో దేశంలో సాగుతున్న అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలందరూ ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సమరశీల పోరాటాలు  చేయాల్సిన అవసరమని ఉందన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే బలమైన ఉద్యమాలతోనే మోదీ పాలనలో జరుగుతున్న మోసాలకు ముగింపు పలకొచ్చని సీపీఐ తెలంగాణ మహాసభల ప్రారంభోత్సవంలో సురవరం చెప్పారు. 
సీపీఐ తెలంగాణ 2వ మహాసభలు
హైదరాబాద్‌లో సీపీఐ తెలంగాణ 2వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఈ మహాసభల్లో  పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అమరులకు నివాళులర్పించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 
సురవరం ప్రారంభోపన్యాసం
ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. వ్యవసాయరంగ సంక్షోభం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, రైతులు ఆత్మహత్యలు, ఆర్థిక అసమానతల వరకు పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక నేరాలు, మోసాలు పెరిగిపోయాయని  సురవరం సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటన్నింటికీ వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. 
రాజ్యాధికారం బహుజనులకు దక్కితేనే సామాజిక న్యాయం : తమ్మినేని
ప్రస్తుతం కులాలకే పరిమితమైన రాజ్యాధికారం బహుజనులకు దక్కితేనే సామాజిక న్యాయం సాధమవుందని మహాసభలకు హాజరైన సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. 
ప్రజా సమస్యలపై వామపక్షాలు సమరశీల పాత్ర : రామకృష్ణ  
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో నెలకొన్న ప్రజా సమస్యలపై వామపక్షాలు సమరశీల పాత్ర పోషిస్తున్నాయని, వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో  ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. రాజకీయ, ఆర్థిక అంశాలతోపాటు పలు విషయాలపై తీర్మానాలు చేస్తారు. 
 

21:57 - April 2, 2018

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం ఎస్సీఎస్టీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని దళిత నేతలు విమర్శిస్తున్నారు. సీపీఎంతోపాటు దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తాయి. 
ఏపీలో దళిత సంఘాలు నిరసనలు 
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేయాలన్న  సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో... ఏపీలో దళిత సంఘాలు నిరసనలు చేపట్టాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దళితసంఘాలు జాతీయరహదారిని దిగ్బంధించాయి. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఎస్సీ,ఎస్టీల రక్షణకు గొడ్డలిపెట్టుగా మారాయని  మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆందోళ వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ  ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా మారుతోందని విమర్శించారు. దళితులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలో భాగమేనని సీపీఎం నేతలు ఆరోపించారు. 
ఎంతటి పోరాటమైన చేస్తాం
పశ్చిమగోదావరి జిల్లాలోనూ దళిత సంఘాలు ఆందోళన నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చవద్దంటూ... ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనలో సీపీఎం నేతలు కూడా పాల్గొన్నారు. చట్టం విధివిధానాల్లో మార్పులు చేస్తే ఊరుకోబోమని.. అందుకోసం ఎంతటి పోరాటమైన చేస్తామని దళిత నాయకులు ప్రకటించారు.
దుర్మార్గంగా వ్వవహరిస్తోన్న కేంద్రం  
ఎస్సీ, ఎస్టీలకు రక్షణగా ఉన్న చట్టాన్ని నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్వవహరిస్తోందని విజయవాడలో దళితసంఘాల నేతలు విమర్శించారు. దళిత, ప్రజాసంఘాలు, సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ మహాశయుడి ఆశయాలతో రూపొందిన చట్టానికి  మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. 
నల్లగొండలో దళిత సంఘాలు నిరసన  
సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నల్లగొండలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. దళితుల ఆగ్రహానికి ప్రధాని మోదీ గురికాక తప్పదని.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో దళిత సంఘాలు హెచ్చరించాయి. ఎస్సీ ఎస్టీ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని దళిత నేతలు మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలన్నారు. 
దళితులు, ఆదివాసీల పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష : భాస్కర్ 
దళితులు, ఆదివాసీల పట్ల మోదీ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని .. తెలంగాణ కులవవివక్ష వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు భాస్కర్‌ విమర్శించారు. గతంలో ట్రిపుల్‌ తలాక్‌ కేసులో  రివ్యూపిటిషన్‌ వేసి ఉత్సాహంగా పనిచేసిన మోదీ ప్రభుత్వం ..  ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు.  
రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి : వామపక్షాలు  
ఇప్పటికైనా కేంద్రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని భవిష్యత్తులో జుడిషియరీ కూడా ప్రశ్నించని విధంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని దళితసంఘాలతోపాటు వామపక్షాలు  డిమాండ్‌ చేస్తున్నాయి. ఇటు రాజకీయ పార్టీల వైఖరిని కూడా దళితసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మాట ఎత్తితే ఎస్సీ,ఎస్టీల పేరు జపించే పొలిటికల్‌ లీడర్లు .. దళితులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలన్నారు. లేదంటే భవిష్యత్తులో పార్టీలన్నీ దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. 

 

21:49 - April 2, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో తెలంగాణ జనసమితి ఏర్పాటైంది. టీజేఎస్‌ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్‌ కూడా గుర్తింపు ఇవ్వడంతో సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడంలో కీలకపాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో తెలంగాణ జనసమితి ఏర్పాటైంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో టీజేఎస్‌ను అధికారికంగా ప్రకటించారు. 
ఏప్రిల్‌ 29 తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ 
టీజేఎస్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ గుర్తింపు ఇవ్వడంతో ఈనెల 4న పార్టీ జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు. జెండా రూపకల్పనకు కళాకారుల సహకారం తీసుకున్నారు.  పార్టీ విధానాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏప్రిల్‌ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, సదస్సులు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్‌ 29 హైదరాబాద్‌లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ నిర్వహిస్తారు.  సభ ఏర్పాట్లు చూసేందుకు 12 కమిటీలు వేశారు. టీజేఎస్‌ ఆవిర్భావ సభకు భారీగా జన సమీకరణ చేయాలని  నిర్ణయించారు. 
తీరుతెన్ను, దిశాదశ లేకుండా సాగుతున్న పాలన 
నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుతెన్నులను పరిశీలించిన తర్వాతే.. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ జనసమితి ఏర్పాటు చేసినట్టు అభిమానులు, నాయకుల మధ్య కోదండరామ్‌ ప్రకటించారు. తీరుతెన్ను, దిశ, దశ లేకుండా సాగుతున్న పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు మార్పును కోరుకొంటున్నారన్న అభిప్రాయంతో టీజేఎస్‌ నాయకులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలకు విలువులేకుండా అప్రజాస్వామికంగా సాగుతున్న పాలనను కూలదోయడమే తెలంగాణ జనసమితి ధ్యేయమని కోదండరామ్‌ ప్రకటించారు. తెలంగాణలో ఏ వ్యవస్థకు సరైన గౌరవలేకుండా పోయిందని టీజేఎస్‌ సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. అన్ని నిర్ణయాలు సంకుచిత, స్వార్థపూరిత నిర్ణయాలే అన్న విషయాన్ని కాగ్‌ రిపోర్టు ద్వారా వెల్లడైందన్న విషయాన్ని కోదండరామ్‌ ప్రస్తావించారు. 
మంత్రులు లేకుండానే కేసీఆర్‌ సమీక్షలు 
ప్రజలను కలుసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరి వలన సమస్యలు పరిష్కారంకావడంలేదన్న అంశాన్ని కోదండరామ్‌ లేవనెత్తారు. మంత్రులు లేకుండా అన్ని శాఖల సమీక్షలూ కేసీఆర్‌ నిర్వహిస్తున్న వైనాన్ని తప్పుపట్టారు. దేశంలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరూ ఉండరని విమర్శించారు. తెలంగాణ జనసమితిలో చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారన్న కోదండరామ్‌..  వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగానే అన్ని సీట్లకు పోటీ చేయాలనుకొంటున్నామని చెప్పారు. తెలంగాణ జనసమితి సభ్యత్వ నమోదుపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 2019 ఎన్నికల నాటికి టీజేఎస్‌ను బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దే లక్ష్యంతో నాయకులు ముందుకు సాగుతున్నారు. 

 

21:45 - April 2, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయసభల్లో మళ్లీ అదే సీన్‌. విపక్షాల ఆందోళనతో అవిశ్వాసంపై చర్చ జరగకుండానే ఉభయసభలు వాయిదా పడ్డాయి. మరోవైపు పార్లమెంట్‌ వెలుపల టీడీపీ, వైసీపీలు ఆందోళన కొనసాగించాయి. ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచారు. 
ఉభయ సభలు వాయిదా 
పార్లమెంట్‌ ఉభయ సభల్లో పరిస్థితి మారలేదు. లోక్‌సభలో ఏఐడీఎంకే.. రాజ్యసభలో కాంగ్రెస్‌, టీడీపీ సభ్యుల ఆందోళనతో అవిశ్వాసం అంశం చర్చకు రాకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే.. కావేరీ జలాల అంశంపై అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వారించినా సభ్యులు వినకపోవడంతో.. సభను మధ్నాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా సభలో పరిస్థితి మారలేదు. సభ ఆర్డర్‌లో లేకపోతే.. అవిశ్వాసంపై చర్చ జరపడం కుదరని, చర్చకు ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్‌ కోరారు. ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్నాడీఎంకే సభ్యులు మాత్రం వెనుకకు తగ్గలేదు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండానే మంగళవారానికి లోక్‌సభను వాయిదా వేశారు.
పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి 
అటు పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు పొడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభ్యులను వారించే ప్రయత్నం చేసినా.. సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను చైర్మన్‌ మంగళవారానికి వాయిదా వేశారు. 
వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆందోళన 
పార్లమెంటు ఆవరణలో వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గాంధీ విగ్రహం ఎదుట ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఆందోళనలో పాల్గొన్నారు.
చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం 
చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్‌మాల్యాను చంద్రబాబు లండన్‌లో కలవలేదా అని ప్రశ్నించారు. 2009, 2014 ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్‌ కింద మాల్యా నుంచి చంద్రబాబు 150 కోట్ల రూపాయలు తీసుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తనపై కేసులు రాకుండా ఉండేందుకే ఢిల్లీకి వస్తున్నారని మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.   
ఎంపీ విజయసాయిరెడ్డిపై సీఎం రమేష్‌ ఆరోపణ 
సీఎంపై అవాకులు చెవాకులు పేలితే మీడియాలో హైలెట్‌ కావొచ్చని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆరోపించారు. చంద్రబాబుని తిట్టే అర్హత విజయసాయి రెడ్డికి లేదన్నారు. కొన్ని కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కేసుల మాఫీ కోసం పెద్దల కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతల రాజీనామాలు అంతా డ్రామా అని మరో ఎంపీ మురళీమోహన్‌ మండిపడ్డారు.
బీజేపీ కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్ : ఎంపీ తంబిదొరై 
మరోవైపు అవిశ్వాసం చర్చకు రాకుండా బీజేపీ కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఏఐడీఎంకే ఎంపీ తంబిదొరై ఆరోపించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కావేరీ జలాలపై చర్చ జరగకుండా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలున్నాయి కాబట్టే అవిశ్వాసం చర్చకు రాకూడదని కాంగ్రెస్‌ బీజేపీ భావిస్తున్నాయన్నారు.
ఆమరణ నిరాహారదీక్ష చేస్తాం : వైసీపీ
మరోవైపు ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీలు రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌ను కోరారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన వెంటనే రాజీనామా చేసి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని తెలియచేస్తానని రెసిడెంట్ కమిషనర్ తెలిపారు. 

 

21:36 - April 2, 2018

ఆయన హస్తినలో అడుగుపెడుతున్నారు...ఒకానొకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన... నేడు కమలం పార్టీతో టీడీపీ కటీఫ్ చెప్పేసిన తర్వాత జాతీయంగానూ చాలా మార్పులే వచ్చాయి. పార్లమెంట్ నడవడం లేదు... రోజువారి అవిశ్వాసాలు..ఎప్పటికప్పుడు అటకెక్కెస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తుతూవచ్చిన చంద్రబాబునాయుడు ఢిల్లీలోనే తేల్చుతానంటూ రెండు రోజులు మకాం వేయబోతున్నాడు. అన్నిపార్టీలను ఏకం చేసి, ఆంధ్రాకు జరిగిన అన్యాయంపై నిలదీస్తానంటున్న సీఎం పర్యటన కేవలం రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితం అవుతుందా ? ఆందులోనూ రాజకీయం దాగి వుందా? మూడో ఫ్రంట్, సెక్యులర్ ఫ్రంట్ పేరిట చర్చోపచర్చలు చేసుకుంటున్న ఈ తరుణంలో ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు యాత్ర ఈ దిశలో నూతన దిశ నిర్ధేశం చేస్తుందా..? కమలాన్ని ఏకాకి చేసి కాంగ్రెస్ ను కలుపుకుంటుందా ? ప్రాంతీయ, ప్రజాతంత్ర లౌకితత్వ కూటమికి తొలి అడుగు పడుతుందా? అన్నీ ప్రశ్నలే. కాంగ్రెస్ అన్యాయం చేస్తే బీజేపీ మోసం చేసిందంటున్న చంద్రబాబు మాటల్లోనే ప్రథమ శత్రువు బీజేపీ అన్నమాట ధ్వనిస్తోంది. ఢిల్లీలో ఇక ముఖాముఖినే..ఆందోళన తీవ్రతరమవుతుందా? కేంద్రం దిగివస్తుందా...? అండదండలు ఇచ్చేవారు ఎవరు..? అయిననూ పోయిరావెలను హస్తినకు అన్నట్లుగా ముగిసిపోతుందా..? ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

21:08 - April 2, 2018

తెలంగాణ జన సమతి పార్టీ ప్రకటన...రాజరికం మీద ప్రజాస్వామ్యం ఫైటింగ్, అవూపులి కథ లెక్కనే ఐన హోదా లొల్లి..ఇయ్యాళ గూడ అదే సీను సభ వాయిదా, కాంగ్రెస్ గెలిస్తె రెండు లక్షల రుణ మాఫీ..రెండో దఫా బస్సు యాత్రల టీ కాంగ్రెస్, కేసీఆర్ అంత నీచుడు లేడన్న సీపీఐ...తెలంగాణ సీఎంను తిట్టిపోశిన నారాయణ, జేఏసీ సభరోజు సర్కారు సమర్పిత సభ...గొల్లకుర్మోళ్ల మీటింగుకు ప్రభుత్వం ప్లాన్., పిట్రోల్, డీజిల్ ధరలను సర్కార్ల మద్దతు...దేశంలనే పిరమైన రాష్ట్రంల తెలంగాణ... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

జర్దా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ మారుతీనగర్ లో జర్దా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. రూ.కోటి విలువైన జర్దా స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు సుధాకర్, నరసింహులు అరెస్టు చేశారు.

అనంతపురం జిల్లాలో గాలి వాన బీభత్సం

అనంతపురం : సింగనమల మండలం గురుగుంట్లలో గాలి వాన బీభత్సం సృష్టించింది. 2 వేల అరటి చెట్లు నేలకొరిగాయి. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది. రైతులు ఆందోళనలో ఉన్నారు.

 

20:34 - April 2, 2018

ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్యానాయక్, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, కేవీపీఎస్ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు, ప్రముఖ విశ్లేషకులు మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొని, మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పును సుప్రీంకోర్టు పున:సమీక్షించాలన్నారు. తీర్పును వెనక్కి తీసుకోవాలని తెలిపారు. కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కులను పరిరక్షించాలన్నారు. చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

20:24 - April 2, 2018

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలని కోరామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ హక్కులకు భంగం కలగకుండా, ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం కాకుండా కేంద్రం చూడాలని అన్నారు. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 

19:53 - April 2, 2018

ఢిల్లీ : ఎస్‌సి ఎస్‌టి యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్ కొన్నిచోట్ల హింసాత్మకంగా మారింది. పోలీసులు...ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం బలహీనపడి దళితులపై దాడులు పెరిగే అవకాశముందని దళిత సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. 
భారత్‌ బంద్‌ విజయవంతం
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై దురాగతాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. బంద్‌ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 
విద్యార్థి నేతతో పాటు నలుగురు మృతి 
మధ్యప్రదేశ్‌లో మొరేనాలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ విద్యార్థి నేతతో పాటు నలుగురు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆర్మీని రంగంలోకి దింపారు. గ్వాలియర్‌లో ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు.
తీవ్రంగా బంద్‌ ప్రభావం 
పంజాబ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిషాలో బంద్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఆందోళనకారులు  రైలురోకో, రాస్తోరోకో నిర్వహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్‌ జరిపారు. 
పంజాబ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు
పంజాబ్‌లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలు 32 శాతం ఉన్నారు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దీంతో అక్కడ భద్రతను పెంచారు. రాష్ట్రంలో పాఠాశాలలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, దుకాణాలు మూసివేశారు. ఇవాళ జరగాల్సిన సిబిఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేశారు. మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేశారు. బస్సులు నడప లేదు.
మీరట్‌లో రైళ్ల నిలిపివేత 
యూపీలోని మీరట్‌లో ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. గ్వాలియర్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో 4 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు..
సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్‌
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారంటూ దళిత సంఘాలు దేశ్యాప్తంగా భారత్ బంద్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్‌సి ఎస్‌టి యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. 
బూటకపు కేసులు ఉంటున్నాయని సుప్రీంకోర్టు 
ఎస్టీ, ఎస్టీ చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో చాలా వరకు బూటకపు కేసులు ఉంటున్నాయని సుప్రీంకోర్టు మార్చి 20న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కులం ఆధారంగా అమాయకులను వేధించేందుకు ఉపయోగించరాదని పేర్కొంటూ.. ఈ చట్టం అమలు విషయంలో పలు మార్పులు సూచించింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులపై కేసు నమోదైన పక్షంలో వారిని అరెస్ట్‌ చేయాలంటే ముందుగా ఉన్నతాధికారుల అనుమతి అవసరమని కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు తప్పనిసరి అని పేర్కొంది. 
దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం 
సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టం బలహీనపడుతుందని... దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎస్సీ, ఎస్టీ చట్టం-1989 ప్రకారం.. దళితులపై వేధింపుల ఘటనల్లో అరెస్టులు, కేసు నమోదు వెనువెంటనే జరగాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా అరెస్టులు, కేసుల నమోదు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దళిత సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు మద్దతు పలికాయి.

 

19:39 - April 2, 2018

విశాఖ : ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులు విశాఖ కార్మిక శాఖ ఆఫీసును ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వం బహుళజాతీ కంపెనీలకు అనుగుణంగా చట్టాలను మారుస్తూ... కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మెడికల్ రిప్రజెంటేటీవ్స్ వాపోయారు. కేంద్ర కార్మిక చట్టాలను మార్చి,  ఫస్ట్ టర్మ్ ఎంప్లాయిమెంట్  పేరుతో ఉద్యోగులను నియమించడం హేయమైన చర్య అని వారు ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేఖ చట్టాలను ఉపంహరించుకోకపోతే పెద్ద ఎత్తున  ఆందోళన  చేస్తామని వారు హెచ్చరించారు.

 

19:36 - April 2, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లా ముంపు గ్రామ మహిళలు కలెక్టరేట్ ముందు మండుటెండలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం చేవెళ్ళప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా మాన్వాడ వద్ద మిడ్ మానేరు జలాశయాన్ని నిర్మిస్తోంది. అందులో భాగంగా మాన్వాడను ముంపు గ్రామాన్ని ప్రకటించింది. కొంతమందికి  నష్ట పరిహారం రాకపోవడంతో డీఆర్ఓ శ్యాం ప్రసాద్ లాల్‌కు తెలపగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు.  కొలతల సమయంలో పరిహారం కోసం... అధికారులు, సర్పంచ్‌కు సుమారు 20వేల వరకు ముట్టజెప్పామని బాధితులు పేర్కొన్నారు. 

ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న వైసీపీ ఎంపీలు

ఢిల్లీ : ఆమరణ నిరాహార దీక్షకు వైసీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా.. ఇవాళ ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో సమావేశమైయ్యారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన వెంటనే రాజీనామా చేసి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని తెలియచేస్తానని రెసిడెంట్ కమిషనర్ తెలిపారు. 

19:33 - April 2, 2018

నల్లగొండ : జిల్లాలో ఈదురుగాలుతో  వచ్చిన అకాల వర్షానికి రైతాంగానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలో నష్టపోయిన పంటలను, ధ్వంసమైన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సీపీఎం, రైతుసంఘల నేతలు పరిశీలించారు. మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి, నకిరేకల్ మండలాల పరిధిలో వేలాది ఎకరాల వరి పంటలు ఈదురు గాలులకు నేలకు వాలాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగానికి నష్ట పరిహారం అందజేయాలని జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.

19:31 - April 2, 2018

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీలకు రక్షణగా ఉన్న చట్టాన్ని నీరుగార్చేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు కులవివక్ష వ్యతిరేక పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌. అట్రాసిటీ ఫిర్యాదులో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కేసు నమోదు చేయరాదన్న తీర్పుతో.. ఎస్సీఎస్టీలకు  రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. 

 

19:28 - April 2, 2018

నల్గగొండ : అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నల్లగొండలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి.  క్లాక్‌టవర్‌ సెంటర్‌లో నుంచి భాస్కర్‌ థియేటర్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

19:26 - April 2, 2018

ఢిల్లీ : ఆమరణ నిరాహార దీక్షకు వైసీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా.. ఇవాళ ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో సమావేశమైయ్యారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన వెంటనే రాజీనామా చేసి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని తెలియచేస్తానని రెసిడెంట్ కమిషనర్ తెలిపారు. 

19:22 - April 2, 2018

ఢిల్లీ : అవిశ్వాసం చర్చకు రాకుండా బీజేపీ- కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఏఐడీఎంకే ఎంపీ తంబిదొరై ఆరోపించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కావేరీ జలాలపై చర్చ జరగకుండా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలున్నాయి కాబట్టే అవిశ్వాసం చర్చకు రావద్దని కాంగ్రెస్‌ బీజేపీ భావిస్తున్నాయన్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు పై కేంద్రం ప్రకటన చేసే వరకు తమ ఆంగదోళన కొనసాగిస్తామని తంబిదొరై స్పష్టం చేశారు. 

19:20 - April 2, 2018

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 9వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్‌మాల్యాను లండన్‌లో కలవలేదా అని ప్రశ్నించారు. 2016 మార్చి 2న విజయ్‌మాల్యా దేశం విడిచి పారిపోయాడని.. సరిగ్గా 10 రోజుల తర్వాత లండన్‌ వెళ్లిన చంద్రబాబు మాల్యాను కలిశారని అన్నారు. 2009, 2014 ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్‌ కింద మాల్యా నుంచి చంద్రబాబు 150 కోట్ల రూపాయలు తీసుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.   

19:12 - April 2, 2018

మేడ్చల్ : జిల్లాలో విషాదం నెలకొంది. ప్రహరీగొడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. శామీర్ పేట మండలం లాల్ గుడి మలక్ పేటలో నిన్న కురిసిన వర్షాలకు నాని ప్రహరీ గొడ కూలింది. దీంతో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా జోత్స్నప్రియ (5), శిరీష (4) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

 

మేడ్చల్ జిల్లాలో విషాదం

మేడ్చల్ : జిల్లాలోని శామీర్ పేట మండలం లాల్ గుడి మలక్ పేటలో విషాదం నెలకొంది. నిన్న కురిసిన వర్షాలకు నాని ప్రహరీ గొడ కూలింది. ఈఘటనలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా జోత్స్నప్రియ (5), శిరీష (4) మృతి చెందారు. 

18:58 - April 2, 2018

కరీంనగర్ : జిల్లాలోని ఆరెపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కరీనంగర్ కార్పోరేషన్‌లో ఆరెపల్లి గ్రామాన్ని విలీనం చేయొద్దంటూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కార్పొరేషన్‌లో విలీనం చేస్తే... తమ గ్రామానికి ఉపాధి హామీ పథకం రద్దవుతుందని.. 500 మందికి పైగా నష్టపోతారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

 

18:54 - April 2, 2018
18:50 - April 2, 2018

వరంగల్ రూరల్ : దళితుల ఆగ్రహానికి ప్రధాని మోదీ గురికాక తప్పదని.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో దళితులు సంఘాలు హెచ్చరించాయి. ఎస్సీ ఎస్టీ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేతలు మండిపడ్డారు. పరకాలలో జరిగిన ఆందోళనలో దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

 

18:47 - April 2, 2018

విజయవాడ : ఎస్సీ, ఎస్టీలకు రక్షణగా ఉన్న చట్టాన్ని నీరుగార్చేలా  కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్వవహరిస్తోందని విజయవాడలో దళితసంఘాల నేతలు విమర్శించారు. దళిత, ప్రజాసంఘాలు, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ మహాశయుడి ఆశయాలతో రూపొందిన చట్టానికి  మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. 
రాజమండ్రిలో
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో... ఏపీలో దళిత సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దళితసంఘాలు జాతీయరహదారిని దిగ్బంధం చేశాయి. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఎస్సీ,ఎస్టీలకు రక్షణకు గొడ్డలిపెట్టుగా మారాయని  మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆందోళ వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ  ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా మారుతోందని వారు విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలో భాగంగానే దళితులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారని సీపీఎం నేతలు ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రబుత్వం వెంటనే రివ్యూపిటిషన్‌ వేసి.. దళితులకు అండగా ఉన్న అట్రాసిటీ చాట్టాన్ని కాపాడాలని  డిమాండ్‌ చేశారు. 
పశ్చిమగోదావరిలో 
పశ్చిమగోదావరి జిల్లాలోనూ దళిత సంఘాలు ఆందోళన నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుకార్చవద్దంటూ... ఆందోళన చేపట్టాయి. భీమడోలు మండలం నుంచి అర్జావారిగూడెం నుండి దళితులు భారీ ర్యాలీ నిర్వహించారు. భీమడోలు జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ ఆందోళనలో సీపీఎం నేతలు కూడా పాల్గొన్నారు. చట్టం విధివిధానాల్లో మార్పులు చేస్తే ఊరుకోబోమని.. అందుకోసం ఎంతటి పోరాటమైన చేస్తామని దళిత నాయకులు ప్రకటించారు.

 

18:41 - April 2, 2018

హైదరాబాద్‌ : వాసవీ ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం 97 వేల రూపాయల ఫీజు చెల్లించినా.. ఎక్కువ కట్టాలని కాలేజీ యాజమాన్యం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షా 60 వేల రూపాయల ఫీజు చెల్లించకపోతే పరీక్ష రాయనీయమని యాజమాన్యం బెదిరించడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడాన్ని తప్పుపడుతున్నారు.

 

18:39 - April 2, 2018

హైదరాబాద్ : కాగ్‌ నివేదిక విషయంలో కాంగ్రెస్ నేతల వైఖరి రెండు నాలుకల ధోరణిలా ఉందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోని నేతలు కాగ్‌ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే.. తెలంగాణలో మాత్రం తప్పుడు వివరాలను ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారనన్నారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీపై కూడా కాగ్‌ అవినీతి ఆరోపణలు చేసిందని హరీష్‌రావు గుర్తుచేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అప్పులను ఆదాయంగా చూపితే కాగ్ అభ్యంతరం చెప్పలేదని.. బీజేపీ యేతర పాలిత ప్రాంతాల్లో మాత్రం తప్పుబడుతోందని హరీష్‌రావు అన్నారు. 

 

18:36 - April 2, 2018

కడప : రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని హైకోరు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జనచైతన్యవేదిక ఆధ్వర్యంలో కడపలో జరిగిన అభివృద్ధి వికేంద్రీకరణ-రాయలసీమలో హైకోర్టు అనే అంశంపై ఆయన మాట్లాడారు. పరిపాలనా వికేంద్రీకరణ జరగాలన్న శివరామకృష్ణన్‌ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని జస్టిస్‌ లక్ష్మణ్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని 5జిల్లాలకే సీఎంగా వ్యవహరిస్తున్నారని సదస్సులో పాల్గొన్న సీపీఎం నేతలు విమర్శించారు. ఈనెల 4న రాయలసీమ హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

 

18:29 - April 2, 2018

జగిత్యాల : జిల్లాలోని మల్లాపూర్‌ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు ధర్నా నిర్వహించారు. తమ పంట పొలాల్లో మొక్కజొన్న పంటను అధికంగా సాగు చేస్తోన్న ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించట్లేదని రైతులు ఆందోళ చేస్తూ మల్లాపూర్‌ రోడ్డుపై బైఠాయించారు. పలు మార్లు నాయకులకు, అధికారులకు విన్న వించుకున్న తమను పట్టించుకొన్న వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

18:27 - April 2, 2018

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం.. భారీనష్టం మిగిల్చింది. భారీవర్షం, ఈదురుగాలులకు భద్రాద్రిలో నవమికి ఏర్పాటు చేసిన స్వాగత ద్వారాలు కూలిపోయాయి. కూనవరం రోడ్డులో 5 ఎకరాల్లో వేసిన అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. స్థానికంగా ఉన్న మామిడి తోటలు, వరి పంటల రైతులు కూడా భారీగా నష్టపోయారు. అకాల వర్షంతో లక్షల్లో నష్టం వచ్చిందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

 

18:25 - April 2, 2018

విశాఖ : విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. విశాఖ నుంచి పలాస వరకు రైల్‌ యాత్ర చేపట్టాయి. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

18:23 - April 2, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో తెలంగాణ జనసమితి ఏర్పాటైంది. రాష్ట్రంలో ప్రజల ఆంక్షలు, నిరంకుశపాలకు మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఉద్యమ ఆంక్షను నెరవేర్చేందుకు తెలంగాణ జనసమితి ఏర్పాటు చేశామంటున్న కోదండరామ్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ప్రత్యేక తెలంగాణలో ప్రజలు కోరుకున్న పాలన సాగడంలేదని పేర్కొన్నారు. నిరంకుశపాలనను కూలదోయడమే తెలంగాణ జనసమితి ధ్యేయమన్నారు. 

18:18 - April 2, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానాలపై కేంద్రం తప్పించుకునే థోరణిలో వ్యవహరిస్తోందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తన రాజకీయ భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకే చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నట్లున్నారని మేకపాటి విమర్శించారు. నాలుగేళ్లు కేంద్రంలో ఉండి సాధించలేని వాళ్లు ఇప్పుడు ఎలా సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాల కోసం వైసీపీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందంటున్న మేకపాటితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:53 - April 2, 2018

ఢిల్లీ : చంద్రబాబు ఢిల్లీకి వచ్చేది తనపై కేసులు రాకుండా చూసుకోవడానికో.. లేక ఏపీ ప్రయోజనాల కోసమో చూడాల్సి ఉందన్నారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేసి నిరహార దీక్షకు కూర్చోవాలన్నారు. రాష్ట్రంలో 23 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం ఖచ్చితంగా దిగి వస్తుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

17:50 - April 2, 2018

ఢిల్లీ : సీఎంపై  అవాకులు చెవాకులు మాట్లాడితే మీడియాలో హైలెట్‌ కావొచ్చని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అలా మాట్లాడుతున్నారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆరోపించారు. రాజ్యసభలో సభ్యులు అందరూ వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే విజసాయిరెడ్డి మాత్రం హౌస్‌లో ఉండి కూడా ఆందోళన చేయడం లేదన్నారు. చంద్రబాబుని తిట్టే అర్హత విజయసాయి రెడ్డికి లేదన్నారు. కొన్ని కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కేసుల మాఫీ కోసం పెద్దల కాళ్లు మొక్కుతున్నారన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకి తీసుకోవాలని కేంద్రానికి మనసులో లేదని మరో ఎంపీ మురళీ మోహన్‌ అన్నారు. వైసీపీ నేతల రాజీనామాలు అంతా డ్రామా అని ఆయన మండిపడ్డారు. 

 

17:41 - April 2, 2018

అనంతపురం : జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. నల్లమడ మండలం పేమలకుంటపల్లిలో పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా భారీ వర్షం పడింది. దీంతో చింతచెట్టుకిందకు వెళ్లారు. పిడుగుపడడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

పిడుగుపడి ఇద్దరి మృతి

అనంతపురం : జిల్లాలోని నల్లమడ మండలం పేమలకుంటపల్లిలో విషాదం నెలకొంది. పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పొలం పనులకు వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.

17:15 - April 2, 2018

ఢిల్లీ : ఎస్‌సి ఎస్‌టి యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు జరుపుతున్న భారత్‌ బంద్‌ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు దేశంలోని పలు రాష్ట్రాల్లో  రైలురోకో, రాస్తోరోకో నిర్వహించారు. పంజాబ్‌లో దళితులు అత్యధిక శాతంలో ఉండడంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన సిబిఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేశారు. మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేశారు. బస్సులు నడవడం లేదు. బిహార్‌, ఒడిషా, రాజస్థాన్, పంజాబ్, యూపీలోని మీరట్‌లో ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. రోడ్లను దిగ్బంధం చేశారు. గ్వాలియర్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో 4 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. భారత్‌ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు మద్దతు పలికాయి.

 

16:51 - April 2, 2018

రంగారెడ్డి : దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ పిలుపు ఇచ్చారు. దేశంలో ఒకశాతం ఉన్న సంపన్నుల చేతిలో 65 శాతం సంపద కేంద్రీకృతం కావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదంతో రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయని విమర్శించారు. భారత్‌ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం - సవాళ్లు అన్న అంశంపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన సదస్సులో పాల్గొన్న బృందా కరత్... ప్రధాని మోదీ సర్కారు విధానాలపై విరుచుకుపడ్డారు.  

16:49 - April 2, 2018

ఢిల్లీ : కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీలో అన్ని పార్టీల నేతలను కలిసి ఏపీకి న్యాయం చేయాలని కోరుతామని చెప్పారు. ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటున్న ఎంపీ అవంతి శ్రీనివాస్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:46 - April 2, 2018

హైదరాబాద్ : ప్రజలకు మరింతగా సేవచేయాలనే ఉద్దేశంతోనే తాను స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు సిద్ధమైనట్టు సీబీఐ మాజీ జేడీ... లక్ష్మీనారాయణ చెప్పారు. ముఖ్యంగా అబ్దుల్‌కలాం  బాటలో యువతకు మార్గదర్శనం చేస్తానంటున్నారు.  తన వీఆర్‌ఎస్‌ అప్లికేషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. రాజకీయాల్లోనా, స్వచ్ఛంద సేవలోనా అనేది ఇపుడే చెప్పలేనని అన్నారు. తన మీద కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీలో చేరతారన్న ప్రచారం మీడియానే చేస్తోందని చెప్పారు.

టీటీడీలో డిపాజిట్లు గోల్‌మాల్‌ వ్యవహారం

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో డిపాజిట్లు గోల్‌మాల్‌ వ్యవహారం వెలుగుచూసింది. నిబంధనలకు విరుద్ధంగా 4 వేల కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. సీల్డ్‌కవర్‌ టెండర్లను ఆహ్వానించకుండా ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. డిపాజిట్ల గోల్‌మాల్‌పై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు చేరాయి. 7.66 శాతం వడ్డీకి ఇండస్‌ బ్యాంకులో వెయ్యి కోట్లు డిపాజిట్‌ చేసిన టీటీడీ అధికారులు.. 7.33 శాతం వడ్డీ ఇస్తానన్న విజయాబ్యాంకును కాదని.. 7.32 శాతం వడ్డీకి ఆంధ్రా బ్యాంకులో 3 వేల కోట్లు డిపాజిట్‌ చేశారు. ఘటనపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. 

 

16:26 - April 2, 2018

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో డిపాజిట్లు గోల్‌మాల్‌ వ్యవహారం వెలుగుచూసింది. నిబంధనలకు విరుద్ధంగా 4 వేల కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. సీల్డ్‌కవర్‌ టెండర్లను ఆహ్వానించకుండా ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. డిపాజిట్ల గోల్‌మాల్‌పై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు చేరాయి. 7.66 శాతం వడ్డీకి ఇండస్‌ బ్యాంకులో వెయ్యి కోట్లు డిపాజిట్‌ చేసిన టీటీడీ అధికారులు.. 7.33 శాతం వడ్డీ ఇస్తానన్న విజయాబ్యాంకును కాదని.. 7.32 శాతం వడ్డీకి ఆంధ్రా బ్యాంకులో 3 వేల కోట్లు డిపాజిట్‌ చేశారు. ఘటనపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. 

 

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రాలేదని ఇద్దరు గిరిజనులు ఆత్మహత్యాయత్నం

ఖమ్మం : జిల్లాలో మంత్రి తుమ్మల ఇలాకాలో..డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రాలేదని మనస్థాపం చెందిన.. ఇద్దరు గిరిజనులు ఆర్డీవో కార్యాలయంలో.. పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

16:21 - April 2, 2018

ఖమ్మం : జిల్లాలో మంత్రి తుమ్మల ఇలాకాలో..డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రాలేదని మనస్థాపం చెందిన.. ఇద్దరు గిరిజనులు ఆర్డీవో కార్యాలయంలో .. పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం రూరల్‌ మండలం ఆర్యకోడు పంచాయితీలో ఇటీవల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు అయ్యాయి. అయితే వీటిలో... 16 ఇళ్లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేటాయించారు. తమకు అన్యాయం జరిగిందని... ఇద్దరు గిరిజనులు స్థానిక తహశీల్దార్‌కు, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ఇద్దరు గిరిజనులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. 

 

16:16 - April 2, 2018

ఆయేషా మీరా హత్య కేసుకు నేటికి పదేళ్లు.. వాకాపల్లి దళిత మహిళ హత్య..ఈనేపథ్యంలో మహిళలకు ఉన్న రక్షణ ఎంత ? అంశంపై మానవి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి పాల్గొని, మాట్లాడారు.
ఆ వివరాలను ఆమె మాటల్లోనే..
'మహిళలపై అత్యాచారాలు 83 శాతం పెరిగాయి. శిక్షలు పడడం తగ్గుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని పోలీసుల్లో 4 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:11 - April 2, 2018

కరీంనగర్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో అన్ని నియోజకవర్గల్లో అధికార, ప్రతిపక్ష నేతలు అప్పుడే ప్రచారానికి దిగుతున్నారు. పోటీపడి  ఓటర్లను ఆకట్టుకునేందుకు  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే దళితులకు డప్పు పంపిణీ చేయడం స్థానికంగా దుమారం రేపుతోంది.  ఈ వివాదానికి అధికార పార్టీ బీజం వేయగా, ప్రతిపక్షపార్టీలు ఆజ్యం పోశాయి. 
పల్లె బాట పట్టిన అధికార, ప్రతిపక్ష నేతలు
కరీంనగర్‌ జిల్లాలో రాజకీయలు వేడెక్కాయి. ఇంతకాలం నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలంతా ఇప్పుడు పల్లెబాట పడుతున్నారు.  ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లుందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తోంటే...  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు  ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెలుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇటు అధికారపార్టీ.. అటు విపక్షపార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే బోడిగే శోభ ఇందులో ఒక అడుగు ముందుకేశారు. తన సామాజిక వర్గానికి చెందిన వారికి ఏకంగా డప్పులు పంపిణీ చేశారు. మల్యాల, రామడుగు మండలాల్లో ఈ డప్పుల పంపిణీ చేపట్టారు. 
దళితులకు డప్పు పంపిణీపై దళిత సంఘాలు అభ్యంతరం
చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ తన సామాజిక వర్గ పేదలకు డప్పులు పంచడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తీరుపై దళిత సంఘాలతోపాటు... ప్రతిపక్షపార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డప్పులు పంపిణీ చేసి దళితులను  ఎమ్మెల్యే అవమానించారంటూ విమర్శలకు దిగాయి. 
ఎమ్మెల్యే చేసిందేమీ లేదని స్థానికులు ఆగ్రహం 
నాలుగేళ్లలో చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేసిందేమీ లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. దళిత ఎమ్మెల్యేగా చెప్పుకుంటూనే.. అంబేద్కర్‌ ఆశయానికి ఆమె తూట్లుపొడుస్తున్నారని మండిపడుతున్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడం తప్పులేదు. కానీ నేటి సమాజంలో యువతకు ఉపాధి కల్పించి వెనుకబడిన జాతి అభ్యున్నతికి పాటు పడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉన్నది. అది మరిచి వారి ఓట్లకోసం కుల రాజకీయాలు చేయడం తగదని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. 

 

15:56 - April 2, 2018

నిజామాబాద్ : అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.... నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని జిరాయత్‌ నగర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. సర్వే నంబర్‌ 401 ప్రభుత్వ భూమిలో అర్హులైన వారికి తాత్కాలిక గుడిసెలు వేశారు. ఈ భూములకు సంబంధించిన పత్రాలను ప్రభుత్వం వెంటనే పేదలకు పంచాలని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

15:54 - April 2, 2018

కడప : జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయం వద్ద శుక్రవారం  ప్రకృతి ప్రకోపానికి గురై 15 షెడ్లు కూలిపోయాయి. ఆ షెడ్ల కింద చిక్కుకుపోయిన వృద్ధురాలిని సజీవంగా బయటకు తీశారు. మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి ఈ రోజు బయటపడిన ఆమెను చూసి ఆధికారులు ఆశ్చర్యపోయారు. గాయాలతో ఉన్న వృద్ధురాలిని చికిత్సం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

 

15:51 - April 2, 2018

ఢిల్లీ : ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటన ఉత్కంఠ రేపుతుంది. వివిధ పార్టీల నేతలు, ఎంపీలను చంద్రబాబు కలువనున్నారు. పూర్తి వివరాలతో ఢిల్లీకి బాబు వెళ్లనున్నారు. పుస్తకాలు, ప్రజెంటేషన్లు సిద్ధం చేశారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే చంద్రబాబు మకాం వేయనున్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివిధ పార్టీల నేతలకు  సీఎం వివరించనున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు ఏకమవుతున్నాయి. కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. ఢిల్లీతో ఢీకొట్టేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. హస్తినలో చంద్రబాబు కేంద్రంతో తేల్చుకోనున్నారు. భవిష్యత్‌ పోరాటానికి చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అక్కడి  షెడ్యూల్‌, చంద్రబాబు లేవనెత్తే అంశాలపై ఎంపీ సీఎం రమేశ్‌తో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో విడిపోయామని తెలిపారు. 

 

తీవ్ర సంక్షోభంలో వ్యవసాయరంగం : సురవరం

హైదరాబాద్ : మోదీ అధికారంలోకి వచ్చాక అదానీ, అంబానీ ఆస్తులు 80 శాతం పెరిగాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ నాలుగేళ్లలో దేశంలో నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం అసాధారణంగా పెరిగాయని చెప్పారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక దళారుల దోపిడీతో నష్టపోతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతు పోరాటాలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. 

 

రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఐక్య పోరాటాలు : తమ్మనేని

హైదరాబాద్ : ఇటీవల కాలంలో తెలంగాణలో కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాటాలు చేస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం అన్నారు. అణుఒప్పందం విషయంలో యూపీఏతో విభేదించి వామపక్షాల మద్దతు ఉపసంహరించుకుని బయటకొచ్చాయని తెలిపారు. సామాజిక న్యాయ సాధనకు సీపీఐ బస్ యాత్ర, సీపీఎం 4200 కి.మీ పాదయాత్ర నిర్వహించిందన్నారు. సామాజిక న్యాయం సాధనకు వామపక్షాలు ఐక్య పోరాటాలు నిర్వహించాలన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

 

13:40 - April 2, 2018

అనంతపురం : హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నివాసం ఎదుట లమహిళ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఉదయం 8గంటల నుండి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ వివాదాలతోనే రామాంజనేయులను పదవి నుండి తొలగించారని ఆరోపిపస్తున్నాయి. వెంటనే రామాంజనేయులను విధుల్లోకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని వారు ప్రజలకు ఏం న్యాయం చెస్తారని ప్రశ్నించారు. 

13:32 - April 2, 2018
13:31 - April 2, 2018
13:23 - April 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జనం కోసమే 'జనసమితి' పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి రావడంపై రాజనీతిజ్ఞులతో మాట్లాడడం జరిగిందని 'తెలంగాణ జనసమితి పార్టీ'ని ప్రకటిస్తున్నట్లు, తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థకు గౌరవం లేకుండా పోయిందని, అన్ని నిర్ణయాలు సచివాలయం నుండే జరుగుతున్నాయన్నారు. తెలంగాణ కోసం అనేక మంది బలిదానాలు చేసుకున్నారని, బతుకుదెరువు..ఆత్మగౌరవం కోసం బలిదానాలు చేసుకున్నారన్నారు. ఏ వర్గానికి కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదని విమర్శించారు. పార్టీ పతాకం రూపకల్పనకు కళాకారుల సహాయం తీసుకోవడం జరిగినట్లు ఈనెల 4న పార్టీ పతాకం ఆవిష్కరిస్తామన్నారు. 29వ తేదీన హైదరాబాద్ లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ ఉంటుందని, సమన్వయ కమిటీ అన్ని కమిటీలను సమన్వయపరుస్తుందన్నారు. 12 సబ్ కమిటీలు పనులు మొదలు పెట్టాయని, ఆవిర్భావ సభ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈనెల 5 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు..సమావేశాలు..సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రొ.కోదండరాం ప్రకటించారు. 

దంపతుల ఆత్మహత్య...

మెదక్ : కొల్చారం (మం) చినఘన్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. విషం తాగి వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. 

4న పార్టీ పతాకావిష్కరణ - కోదండరాం...

హైదరాబాద్ : రాజకీయాల్లోకి రావడంపై రాజనీతిజ్ఞులతో మాట్లాడడం జరిగిందని తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకులు ప్రో.కోదండరాం వెల్లడించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోయిందని, రాష్ట్రంలో ఏ వ్యవస్థకు గౌరవం లేకుండా పోయిందన్నారు. అన్ని నిర్ణయాలు సచివాలయం నుండే జరుగుతున్నాయన్నారు. తెలంగాణ కోసం అనేక మంది బలిదానాలు చేసుకున్నారని, బతుకుదెరువు..ఆత్మగౌరవం కోసం బలిదానాలు చేసుకున్నారన్నారు. ఏ వర్గానికి కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదని విమర్శించారు. పార్టీ పతాకం రూపకల్పనకు కళాకారుల సహాయం తీసుకోవడం జరిగినట్లు ఈనెల 4న పార్టీ పతాకం ఆవిష్కరిస్తామన్నారు.

హోదా ఏపీ హక్కు - జగన్ ట్వీట్...

విజయవాడ : ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ ట్విట్టర్ లో వైసీపీ అధ్యక్షుడు జగన్ ట్వీట్ చేశారు. హోదా ఇవ్వకుండా సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని, ఏపీ భవన్ ఎదుట నిరహార దీక్షకు కూర్చొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని టిడిపి ఎంపీలు రాజీనామా చేసి హోదా కోసం పోరాడాలని సూచించారు. హోదా వస్తేనే యువత భవిష్యత్ బాగుంటుందని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో నిరసన తెలుపాలన్నారు. 

మధ్యప్రదేశ్ లో బంద్ ఉద్రిక్తం...

పాట్నా : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా మధ్యప్రదేశ్ లో బంద్ కొనసాగుతోంది. భిండ్ ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లు విసరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

12:32 - April 2, 2018

ఢిల్లీ : విభజన చట్టం హామీల అమలుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విభజన చట్టం సక్రమంగా అమలు కావటం లేదంటూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఏపీ, తెలంగాణ తరపున న్యాయవాదులు హాజరయ్యారు. కేంద్రం నుంచి ఎవరూ హాజరు కాకపోవడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

విభజన హామీలపై సుప్రీంలో విచారణ...

ఢిల్లీ : విభజన చట్టం హామీల అమలుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విభజన చట్టం సక్రమంగా అమలు కావటం లేదంటూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఏపీ, తెలంగాణ తరపున న్యాయవాదులు హాజరయ్యారు. కేంద్రం నుంచి ఎవరూ హాజరు కాకపోవడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

12:28 - April 2, 2018

ఢిల్లీ : కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం చర్చకు వస్తుందా ? లేదా ? అనే ఉత్కంఠ ఇంకా కంటిన్యూ అవుతోంది. సభ ఆర్డర్ లో లేదంటూ లోక్ సభ స్పీకర్ సభను వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక విభజన..విభజన హామీలు అమలుపర్చాలంటూ సీపీఎం, కాంగ్రెస్, టిడిపి, వైసిపి ఎంపీలు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. కానీ అదే సందర్భంలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. దీనితో సభ ఆర్డర్ లో ఉంటే తీర్మానం చర్చకు తీసుకొనే అవకాశం ఉంటుందని...ఆందోళనలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడిస్తున్నారు. నాలుగు రోజుల అనంతరం సోమవారం పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు 'వి వాంట్ కావేరీ బోర్డు' అంటూ నినాదాలు చేశారు. వెంటనే స్పీకర్ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సభ్యులు ఇచ్చిన నోటీసులు తనకు అందాయని, కానీ సభ ఇలా ఉంటే చర్చకు తీసుకోలేమని తేల్చిచెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి అనంతకుమార్ జోక్యం చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధమని, ఆందోళన చేస్తున్న సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చొవాలని సూచించారు. కానీ సభ్యులు వినిపించుకోలేదు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడారు. అవిశ్వాసంపై చర్చకు అనుమతినివ్వాలని, ఎన్నో ప్రజా సమస్యలు చర్చించాల్సి ఉందని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం సుప్రీంలో రివ్యూ పిటీషన్ దాఖలు చేసిందని అనంతకుమార్ తెలిపారు. ఇక మంగళవారం కూడా యదావిధిగా కొనసాగుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

12:09 - April 2, 2018

ఢిల్లీ : 2011లో చైనా ప్రయోగించిన తియాంగాంగ్‌ స్పేస్‌ ల్యాబ్‌-1 మరో స్కైలాబ్‌గా మారింది. అయితే ఎలాంటి ప్రమాదంలేకుండానే ఈ స్పేస్‌ లాబ్‌ తిరుగు ప్రయాణం జరిగింది. దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించిన స్పేస్‌ లాబ్‌ మండిపోయినట్లు చైనా అంతరిక్ష అధికారులు తెలిపారు. అయితే స్పేస్‌ లాబ్‌ ఎక్కడ కూలుతుందో అని ప్రజలు భయపడిన నేపథ్యంలో అది మండిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

12:07 - April 2, 2018

సూర్యపేట : జిల్లా హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ఈదురుగాలులు, వర్షాల బీభత్సానికి దాదాపు వంద ఎకరాల పంట నేలమట్టం అయింది. ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడితోటలు, బత్తాయి తోటలు కాయరాలిపోయి తీవ్ర నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు కొంత ఉపశమనం కలిగించాలని రైతులు కోరుతున్నారు. 

11:39 - April 2, 2018

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బీహార్, ఒడిషా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ లో రోడ్లపై రైల్వే ట్రాక్ లపై దళితులు చేరుకుని ఆందోలన చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నిర్వీర్యమయ్యేలా సుప్రీం తీర్పు ఉందని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేంద్ర రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:35 - April 2, 2018

మరో స్టైల్లో శివప్రసాద్ నిరసన...

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వివిధ రూపాల్లో నిరసన తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం బ్రిటీష్ వారిని గడగడలాడించిన సాయుధ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు వేషధారణలో వచ్చిన ఎంపీ శివప్రసాద్ పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలతో కలిసిన నిరసన తెలియజేశారు.

11:16 - April 2, 2018
11:13 - April 2, 2018

ఢిల్లీ : నాలుగు రోజుల అనంతరం పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వంపై టిడిపి..వైసిపి..సీపీఎం..కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ సభ ప్రారంభం కానేగా అన్నాడీఎంకే సభ్యులు యదావిధిగానే ఆందోళన చేపట్టారు. దీనితో తీర్మానంపై చర్చకు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. స్పీకర్ సుమిత్రా మహజన్ తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. 'వి వాంట్ కావేరీ బోర్డు' అంటూ అన్నాడీఎంకే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేటాయించిన సీట్లలో కూర్చొవాలని స్పీకర్ సూచించినా సభ్యులు వినిపించుకోలేదు. చివరకు సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

మరోవైపు రాజ్యసభ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనూహ్యంగా సభను డిప్యూటి ఛైర్మన్ వెంకయ్య నాయుడు మంగళవారానికి వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళన చేపట్టారు. వి వాంట్ స్పెషల్ స్టేటస్ అంటూ తెలుగు ఎంపీలు ఆందోళన చేపట్టారు. దేశమంతా చూస్తోందని వారి వారి సీట్లలో కూర్చొవాలని డిప్యూటి ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించినా సభ్యులు వినిపించుకోలేదు. దీనితో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 

రాజ్యసభ మంగళవారానికి వాయిదా...

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ వెల్లడించారు. మరోవైపు రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అనూహ్యంగా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెంకయ్య నాయుడు వెల్లడించారు. 

రాజ్యసభలో అదే గందరగోళం...

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ వెల్లడించారు. మరోవైపు రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల ఎంపీలు..ఇతర సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. 

లోక్ సభ ప్రారంభం..వాయిదా...

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. దీనితో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ వెల్లడించారు. 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..ఆందోళన..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

అన్నాడీఎంకే ఆందోళన చేస్తుందా ? ఉత్కంఠ...

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలుపరచాలంటూ కేంద్ర ప్రభుత్వంపై టిడిపి..వైసిపి..కాంగ్రెస్..సీపీఎంలు వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనలు చేస్తుండడంతో సభ ఆర్డర్ లో లేదని స్పీకర్ తీర్మానంపై నిర్ణయం తీసుకోవడం లేదు. నాలుగు రోజుల అనంతరం పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అన్నాడీఎంకే ఆందోళన చేస్తుందా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. 

ఆర్జేడీ, కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మాన నోటీసు...

ఢిల్లీ : ఆర్జేడీ ఎంపీ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ సుష్మిత దేవ్ లు లోక్ సభలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. సీబీఎస్ఈ పేపర్ లీక్ పై వారు వాయిదా తీర్మానం ఇచ్చారు. 

ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి - బాబు...

విజయవాడ : ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల సాధనపై దృష్టి సారించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వివిధ పార్టీల సభాపక్షనేతలను కలుస్తానని తెలిపారు. 

అన్నాడీఎంకే సభ్యుడు రాజీనామా...

ఢిల్లీ : అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ ముత్తు కరుప్పన్ రాజీనామా చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయనందుకు నిరసనగా రాజీనామా చేశారు. 

10:15 - April 2, 2018
10:11 - April 2, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమై రోజులు గడుస్తున్నాయి. కానీ ఏ ఒక్క రోజు సభ సజావుగా జరగలేదు. విపక్షాల ఆందోళనతో సభలు అట్టుడికాయి. ఏపీకి ప్రత్యేక హోదా...విభజన హామీలు అమలు చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ఎంపీలు...కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకేలు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసిపి..టిడిపి..కాంగ్రెస్..సీపీఎం పార్టీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. కానీ సభ ఆర్డర్ లో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం తీసుకోవడం లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ పేర్కొంటూ సభ వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో నాలుగు రోజుల అనంతరం సోమవారం ప్రారంభమయ్యే సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతినిస్తారా ? అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన కొనసాగిస్తారా ? అనే ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రంపై వత్తిడి పెంచేందుకు...వివిధ జాతీయ పార్టీల నేతలను ఆయన కలువనున్నారు. పార్లమెంట్ సభలు నిరవధికంగా వాయిదా పడితే వెంటనే రాజీనామాలు చేయాలని జగన్ సూచించారు. అంతేగాకుండా ఆమరణ నిరహార దీక్షకు దిగాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రాభవన్ కాకుండా ప్రధాని నివాసం ఎదుట దీక్షలు చేయాలని టిడిపి ఎద్దేవా చేస్తోంది. 

విప్ జారీ చేసిన టిడిపి..వైసిపి..

ఢిల్లీ : పార్లమెంట్ లో అవిశ్వాసంపై ప్రతిష్టంభన నెలకొంది. నాలుగు రోజుల అనంతరం పార్లమెంట్ ఉభయసభలు నేడు ప్రారంభం కానున్నాయి. టిడిపి..వైసిపి..సీపీఎంలు అవిశ్వాస తీర్మానా నోటీసులను అందచేశారు. ఈ సందర్భంగా టిడిపి..వైసిపి పార్టీలు విప్ జారీ చేశాయి. సభ్యులందరూ తప్పకుండా సభకు హాజరు కావాలని విప్ లో పేర్కొన్నాయి. 

టిడిపి ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : టిడిపి ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, చట్టంలో ఉన్న అంశాలే అమలు చేయాలని కోరుతున్నామని బాబు తెలిపారు. 

09:15 - April 2, 2018

బీహార్ బంద్...

పాట్నా : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా బీహార్ లో బంద్ కొనసాగుతోంది. ఆందోళనకారులు టైర్ల కు నిప్పు పెట్టారు. పలు రైళ్లను ఆపివేశారు. 

08:22 - April 2, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో జరిగిన ఓ వివాహ వేడుక రణరంగంగా మారిపోయింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందడం కలకలం సృష్టించింది. పోలీసుల ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వివాహ సమయంలో భోజనం దగ్గర వాగ్వాదం చోటు చేసుకుందని, ఈ సమయంలో వాగ్వాదానికి దిగిన వ్యక్తి తన తోటి స్నేహితులకు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. సుమారు 10-15 మంది యువకులు వివాహ వేడుకకు వచ్చి ఘర్షణకు దిగారని తెలిపారు. కత్తితో పొడవడంతో అన్వర్ అనే యువకుడు మృతి చెందాడని, మరికొందరు గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘర్షణలో రౌడీషీటర్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. 

ఏపీ అసెంబ్లీలో నేడు...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఫైబర్ ఫోరెన్సిక్ శిక్షణ కేంద్రం స్థాపన..హై సైక్యూర్టీ నెంబర్ ప్లేట్లు, నీరు - చెట్టు పథకం అమలు, హెచ్ వీడీఎస్ పథకం అమలు, అనిధికార లే అవుట్లు క్రమబద్ధీకరణ అంశాలు ప్రశ్నోత్తరాల్లో రానున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసుపై చర్చ, వంతెనల స్థితిగతులపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసుపై చర్చ జరుగనుంది. నేడు నాలుగు బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

07:58 - April 2, 2018

పార్లమెంటులో ప్రత్యేకహోదా పోరు మరింత హీటెక్కుతోంది. సోమవారం తిరిగి సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని మరోసారి ప్రయోగించనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో సహా వామపక్షాలు, టీడీపీ, వైసీపీ ఎంపీలు అవిశ్వాసం కోసం మరోసారి పట్టుబట్టనున్నాయి. మరోవైపు జాతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లుతున్నారు. ఇప్పటికే రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన వైసీపీ ఎంపీలు టీడీపీకి సవాల్‌ విసురుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చంద్రబాబుకూడా టీడీపీ ఎంపీల చేత రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆయా అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), దుర్గా ప్రసాద్ (టిడిపి), రమేష్ (వైసీపీ), విష్ణు (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కుప్పకూలిన చైనా అంతరిక్ష కేంద్రం...

ఢిల్లీ : దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో చైనా అంతరిక్ష కేంద్రం కుప్పకూలింది. టియాంగాంగ్-1ను చైనా 2011లో కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ స్పేస్ ల్యాబ్‌కు అప్పగించిన పని 2016 మార్చిలో పూర్తయ్యింది. మిషన్ పూర్తయ్యాక ఇది తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

07:10 - April 2, 2018

తెలంగాణలో మున్సిపల్‌ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాటానికి సిద్ధమయ్యాయి. తమకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్మికులను మేయర్లకు చైర్మన్‌లకు అప్పజెప్పి బలి చేయవద్దని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇవే డిమాండ్లతో ఏప్రిల్‌ 11న హైదరాబాద్‌ ముట్టడికి కూడా సిద్ధమవుతున్నారు. ఇంతకీ వారి ఆందోళనకు కారణాలేంటి, వారి డిమాండ్ల నేపథ్యం వారిపట్ల ప్రభుత్వ విధానంపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నాయకులు పాలడుగు భాస్కర్‌ చర్చించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:09 - April 2, 2018

విజయవాడ : ఏపీ పర్యాటక శాఖ ప్రస్తుతం నష్టాల బాటలో నడుస్తోంది. టూరిస్టులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ చేపట్టిన కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. పర్యాటకుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ నిధులు వృధా అవడం తప్ప ఎలాంటి లాభం చేకూరడంలేదు. ఇప్పటివరకు నిర్వహించిన బెలూన్‌ ఫెస్టివల్, సౌండ్‌ ఆన్‌ శాండ్స్‌, విశాఖ ఉత్సవ్‌... ఇప్పుడు యాచింగ్‌ ఫెస్ట్‌ వరుసగా ఫెయిల్‌ కావడంతో పర్యటక శాఖపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. విశాఖ టూరిజం పర్యటకులను ఆకర్షించేందుకు చేపట్టిన ఫెస్ట్‌లు అంతగా సక్సెస్‌ అవడంలేదు. విశాఖ సాగర తీరంలో దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన యాచింగ్‌ ఫెస్టివల్‌కు పర్యటకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కేవలం విదేశాల్లో మాత్రమే నిర్వహించే ఈ ఫెస్ట్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌ వేదికగా విస్తృత ప్రచారం కల్పించారు. ఆరు లక్షల మందికి ఆహ్వానం పంపగా 15 వందల మంది మాత్రమే ఆసక్తి చూపారు. చివరకు 16 మంది మాత్రమే ఈ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. ఆన్‌లైన్‌ ప్రచారం ద్వారా పర్యటకానికి 3 కోట్లు ఖర్చు కాగా ఆదాయం మాత్రం 2.50 లక్షలు మాత్రమే వచ్చింది.

అయితే మొదటి నుండి యాచింగ్‌ ఫెస్ట్‌ అయోమయంగానే ఉంది. పడవల పండగకు యాచింగ్‌ బోట్లు వస్తాయో, రావో తెలియని పరిస్థితి. అసలు ఫెస్ట్‌ జరుగుతుందో లేదో అన్న అనుమానం ఇటు అధికారులతో పాటు అటు జనంలోనూ నెలకొంది. మార్చి 28 నుండి 31 వరకు జరగాల్సిన ఫెస్ట్‌... గోవా, చెన్నైలతో పాటు థాయిలాండ్‌ నుండి యాచ్‌ బోట్లు రావడం ఆలస్యమవడంతో ఏప్రిల్‌ 1 వరకు ఫెస్ట్‌ను పొడగించారు. ముఖమంత్రి చంద్రబాబు ఈ ఫెస్ట్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఉన్న యాచ్‌లతోనే తూతూ మంత్రంగా పోటీలు నిర్వహించడంతో పర్యటకులను అంతగా అలరించలేకపోయాయి. సముద్రంలో కనీసం 10 కిలో మీటర్లైనా విహారం చేద్దామనుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. దీంతో ఇలాంటి ఫెస్టివల్స్‌ మాటలకే పరిమితం గాని పర్యటకానికి పనికి రావని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పద్దతి వల్ల ప్రజా ధనం వృధా అవడం తప్ప మరేమీలేదంటున్నాయి.

భవిష్యత్‌లో విశాఖ యాటింగ్‌కు అనుకూల నగరమని ప్రపంచ పర్యటకులకు తెలియజేసేందుకు ఈ ఫెస్ట్‌ నిర్వహించారు. కాని అది ఇప్పుడు నీరుగారిపోయింది. అయితే ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాల ఇవ్వకపోవడానికి కారణం...కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ ఫ్యాక్టర్స్‌ సంస్థ నిర్వహనలోపమనే చెప్పాలి. గతంలో కూడా ఈ ఫ్యాక్టర్స్‌ సంస్థ...ప్రభుత్వం తలపెట్టిన విశాఖ ఉత్సవ్‌, శాండ్‌ ఆఫ్‌ సౌండ్స్‌, బెలూన్‌ ఫెస్ట్‌ ఇలా అనేక కార్యక్రమాల నిర్వహన బాధ్యత చేపట్టింది. ఇందులో ఏ ఒక్క కార్యక్రమం సక్సెస్‌ అవలేదు. దీంతో ప్రతి సారి అదే ఈవెంట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

ఇదిలా ఉంటే యాచింగ్ ఫెస్టివల్ కోసం విశాఖ పోర్ట్ చైర్మన్ క్రిష్ణబాబు తన సహాయ సహకారాలు అందించడమే కాకుండా యాచింగ్ ఫెస్టివల్ సక్సస్ అయితే విశాఖ పోర్టులోనే ఒక టెర్మినల్ నిర్మించి పర్యాటక శాఖకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. తద్వారా విశాఖ ఆర్థికంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పోర్ట్ చైర్మన్ క్రిష్ణబాబు రాష్ట్రఅభివృద్దికి అందిస్తానన్న సాయం అభినందనీయం. కాని నిర్వహన లోపంతో యాచింగ్ ఫెస్టివల్ నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇవన్నీ ఒక ఎత్తయితే స్థానికంగా ఉన్న సెంటిమెంట్‌ను వాడుకుంటోంది పర్యటక శాఖ. గతంలో బెలూన్‌ ఫెస్ట్‌ నిర్వహించినప్పుడు వచ్చిన ఆదాయాన్ని గిరిజనులకు ఇస్తామని చెప్పి... వారి ప్రాంతాల్లో తిష్టవేసారు గాని మళ్లీ వారివైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రస్తుతం యాచింగ్‌ ఫెస్ట్‌ను అదే రీతిలో కొనసాగించారు. ఫెస్ట్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మత్స్యకారులకు ఇస్తామని చెప్పినా....అది కూడా చేయలేకపోయారు. ఇలా పర్యటక శాఖ తన విధానాలతో ఇటు పర్యటకుల్లోనూ, అటు ప్రజల్లోనూ అభాసుపాలవుతోంది. 

తెలుగు యాంకర్ సూసైడ్...

హైదరాబాద్ : మానసిక ఒత్తిడి ఓ యాంకర్‌ ప్రాణాలు బలితీసుకుంది. భర్తకు దూరంగా ఉండడం, ఒక్కగానొక్క కుమారుడు మానసికంగా ఎదగకపోవడం ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. ఓ ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానల్‌లో పనిచేస్తోన్న వెంకనగారి రాధిక రాత్రి పదిన్నరకు ఆత్మహత్య చేసుకున్నారు. 

06:40 - April 2, 2018

హైదరాబాద్ : మానసిక ఒత్తిడి ఓ యాంకర్‌ ప్రాణాలు బలితీసుకుంది. భర్తకు దూరంగా ఉండడం, ఒక్కగానొక్క కుమారుడు మానసికంగా ఎదగకపోవడం ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. ఓ ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానల్‌లో పనిచేస్తోన్న వెంకనగారి రాధిక రాత్రి పదిన్నరకు ఆత్మహత్య చేసుకున్నారు. మూసాపేట్‌లో నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ 5వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమె... భవనంపై నుంచి దూకి ప్రాణం తీసుకుంది. తన మృతికి ఎవరూ కారణం కాదని... తన మైండే తన శత్రువంటూ ఓ సూసైడ్‌ నోట్‌రాసి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మూసాయిపేటలో విషాదం నెలకొంది. రాధిక కొద్ది నెలల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. కుమారుడు మానసికంగా ఎదగకపోవడం, భర్తతో విడిపోవడంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆ డిప్రెషన్‌తోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

06:38 - April 2, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ అవినీతి పరులను కాపాడుతూ.. అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధారక్‌రెడ్డి విమర్శించారు. కార్పొరేట్‌ శక్తులకు మోదీ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న ఎన్డీయే సర్కార్‌ను గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ ఐక్యత సాధిస్తామన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగసభకు సురవరం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అవినీతి ద్వారా పోగేసిన డబ్బుతోనే త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. మహాసభ ప్రారంభం రోజున నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఎర్రదండు నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సురవరం సుధాకర్‌రెడ్డి ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ.. కార్పొరేట్లకు వంతపాడుతోందని విమర్శించారు. ఎన్డీయేను గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ ఐక్యత సాధిస్తామన్నారు. గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతిపేదవాడికీ 15 లక్షలు పంచుతామన్న మోదీ.. ఒక్క రూపాయికూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. అడ్డంగా అబద్దాలు చెప్పిన మోదీ... దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ సర్కార్‌పై సీపీఐ జాతీయ నాయకుడు నారాయన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విపక్షపార్టీలన్నీ కేంద్రంపై అవిశ్వాసానికి పట్టుబడుతుంటే.. టీఆర్‌ఎస్‌ మాత్రం పార్లమెంట్‌లో శిఖండిపాత్ర పోషిస్తోందని మండిపడ్డారు. అవిశ్వాసం చర్చకు రాకుండా టీఆర్‌ఎస్‌ బీజేపీకి సహకరిస్తోందన్నారు. ఒకవైపు మోదీతో అంటకాగుతూ... మరోవైపు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కేసీఆర్‌ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయింపులతో రాష్ట్రాన్ని కేసీఆర్‌ భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. కేసీఆర్‌లాంటి దిగజారుడు సీఎం దేశంలో ఎక్కడా లేరని ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్‌కు.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

సీపీఐ మహాసభలు 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపంలో ప్రతినిధుల సభ జరుగనుంది. ఇక బహిరంగసభ వేదికపై నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి కాసేపు కళాకారులతో కలిసి కోలాటమాడి అందరినీ ఉత్సాహపరిచారు. కళాకారులు పాడిన పాటలు అందరినీ అలరించాయి. 

06:35 - April 2, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ది మాటల ప్రభుత్వమే కానీ.. చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు సీఎల్పీనేత జానారెడ్డి. రాష్ట్ర బడ్జెట్‌లో లోటును కూడా మిగులుగా చూపిస్తూ.. కేసీఆర్‌ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. రాష్ర్టం అప్పుల బాటలో నడుస్తోందని కాగ్ నివేదిక తేట తెల్లం చేసిందన్నారు. విపక్షాలు, ప్రజాసంఘాలపై ప్రభుత్వం అణచి వేత ధోరణిని అవలంబించడం మానుకోవాలని జానా సూచించారు. 

నేడు కోదండరాం అధికారిక ప్రకటన...

హైదరాబాద్ : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించనుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త పార్టీ పెడతామన్న తెలంగాణ JAC ఛైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. కొత్త పార్టీ కోసం JAC దరఖాస్తు చేసుకున్న తెలంగాణ జనసమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇవాళ కోదండరామ్‌ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. 4న పార్టీ పతాకం ఆవిష్కరించి, పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఈనెల 29న భారీ బహిరంగ సభ ఏర్పాటుకు JAC నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

06:32 - April 2, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇవాళ రాత్రి ఆయన హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆరుగుర సభ్యులునన బృందం పర్యటనను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. రేపు, ఎల్లుండి చంద్రబాబు ఢిల్లీలో వివిధ పార్టీల నేతలు, ఎంపీలను కలుస్తారు. విభజన హామీల అమలు సాధనకు కేంద్రంతో పోరాడేందుకు పార్టీల మద్దతుకూడగట్టనున్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివిధ పార్టీలకు చంద్రబాబు వివరించనున్నారు. కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని పార్టీలకు వివరించడానికి అవసరమైన సమగ్ర వివరాలతో పుస్తకాలను తయారు చేయించారు. ప్రజెంటేషన్లను సిద్ధం చేశారు. కొందరు నిపుణులతో సమావేశమై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. ఎంపీలకు అందజేయడానికి ఒక పుస్తకం కూడా సిద్ధం చేయించారు. విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, దాని భర్తీకి కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, అంతేకాదు... పార్లమెంట్‌ వేదికగా ఏపీకి ఇచ్చిన వాగ్దానాలు... అవి అమలైన తీరుతోపాటు పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు.

రేపు, ఎల్లుండి చంద్రబాబు హస్తినలోనే మకాం వేస్తున్నారు. వివిధ పార్టీల నాయకులు, ఎంపీలతో ఆయన వరుసగా భేటీ కానున్నారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు తెలిపిన పార్టీల నాయకులు, ఆయా పార్టీల ఎంపీలను కలిసి వారికి కృతజ్ఞతలు చెబుతూ మరిన్ని వివరాలు వారికి అందించాలన్నది సీఎం యోచనగా కనిపిస్తోంది. ఆయన ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలవడం, ఏపీకి జరిగిన అన్యాయం వివరించడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హస్తినలో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఎన్డీయేకు టీడీపీ గుడ్‌బై చెప్పిన తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో పూర్తిస్థాయి కదలిక వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి గంటలోపే పదకొండు పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌, సీపీఎం స్వయంగా అవిశ్వాస నోటీసులు ఇచ్చాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాటానికి సిద్ధమయ్యాయి. ఎన్నికల పొత్తుల గురించి ఆలోచించకుండా... ఇప్పటికైతే కేంద్రాన్ని టార్గెట్‌ చేయడానికి ఏకమవుతున్నాయి.

ఏపీ విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధన కోసం ఢిల్లీతో ఢీకొట్టడానికి సిద్ధమని చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీలోనే ప్రకటించారు. తిరుపతిలో ప్రత్యేకహోదా ఇస్తామన్న మోదీ హామీని, ఢిల్లీని మించేస్థాయిలో అమరావతిని నిర్మిస్తామని చెప్పిన హామీల వీడియోలను ప్రదర్శించి జాతీయ స్థాయిలో తన విధానానికి క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కేంద్రంపై పోరాడటానికి వెనుకాడేదిలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను చెప్పే మాటలకు ఆధారాలతో సహా ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు, అమలు తీరును హస్తినలో తేల్చుకోనున్నారు. భవిష్యత్‌ పోరాటానికి సంబంధించి వ్యూహాత్మక అడుగులు వేయనున్నారు.

వేడెక్కిన అవిశ్వాస రాజకీయం...

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు నేడు కొనసాగనున్నాయి. నేడు లోక్‌సభ ముందుకు మరోసారి అవిశ్వాస తీర్మానాలు ముందుకు రానున్నాయి. దీనితో స్పీకర్ చర్చకు అనుమతినిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

భారత్ బంద్ కు దళిత సంఘాల పిలుపు...

ఢిల్లీ : నేడు భారత్ బంద్ కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. 

స్టెరిలైట్ ప్లాంట్ బాధితులకు కమల్ మద్దతు...

చెన్నై : తమిళనాడులో తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ ప్లాంట్‌ బాధితులకు మక్కల్‌ నీది మయమ్‌ పార్టీ అధినేత నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలిపారు. ప్లాంట్‌ను మూసివేయాలని బాధితులు గత 52 రోజులుగా నిరవదిక దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతు పలికిన కమల్‌ హాసన్‌ నేరుగా తూత్తుకుడి వెళ్లి వారితో దీక్షలో పాల్గొన్నారు.

అన్నాడీఎంకే దీక్షలకు పిలుపు...

చెన్నై : కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే తమిళనాడులో ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పార్లమెంట్‌లో అన్నాడిఎంకె, ఎంపీలు ఆందోళనలు చేస్తుండగా... వివిధ పార్టీలు, రైతు సంఘాల ఆందోలనతో తమిళనాడు భగ్గుమంటోంది. ఇదే విషయంపై అన్నాడిఎంకే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలకు పిలుపునివ్వగా డిఎంకే ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో పోలీసులు పలుచోట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

భగ్గుమన్న పెట్రోల్..డీజిల్ ధరలు...

హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఆదివారం పెట్రోల్‌ ధర నాలుగేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. డీజిల్ ధర కూడా అదే విధంగా పెరిగి అత్యధిక స్థాయికి చేరింది. ఇవాళ ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్ ధర లీటరుకు ఏకంగా 18పైసలు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 73 రూపాయల 73 పైసలుగా ఉంది. 2014 సెప్టెంబరు 14 తర్వాత ఇదే అధిక ధర. ఇక డీజిల్ కూడా అమాంతం పెరిగి అల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. 

జీతం మొత్తం విరాళం ఇచ్చిన సచిన్...

ఢిల్లీ : క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ‌ సచిన్‌ తెందుల్కర్‌ తన జీతం మొత్తం ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారు. గత ఆరేళ్లుగా ఎంపీగా ఉన్నందుకు... ఆయన దాదాపు 90లక్షలకు పైగా వేతనం, ఇతర అలవెన్సులు అందుకున్నారు. సచిన్‌ చేసిన సాయంపై పీఎంవో కార్యాలయం కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను విడుదల చేసింది.

కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

ఢిల్లీ : కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కువైట్‌ ఆయిల్‌ కంపెనీకి చెందిన రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడ్ద ఇద్దర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Don't Miss