Activities calendar

03 April 2018

22:24 - April 3, 2018

ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు సరికాదని సీపీఎం కేంద్రదర్శివర్గసభ్యులు వి.శ్రీనివాస్ రావు అన్నారు. కోర్టు తీర్పుకు కేంద్రం వత్తాసు పలుకుతుందన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పీవో యాక్టు కింద కేసులు బుక్ అయ్యే అవకాశమే లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పీవో యాక్టు స్ఫూర్తికి భిన్నమైందన్నారు. తీర్పు పట్ల కేంద్రం నిర్లక్ష్యం మూలంగా ఆందోళనలు చెలరేగాయన్నారు. వెంటనే రివ్యూ పిటిషన్ వేసిఉంటే బాగుండేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఉన్న పునాదిని దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. పీవో యాక్డును నీరుగార్చుతున్నారని పేర్కొన్నారు. చట్టాన్ని కాపాడే వారే..చట్టాన్ని దిగజార్జితే అర్థం ఏముందన్నారు. చట్టాలకు రక్షణ లేదన్నారు. రాజ్యాంగపరమైన సంస్థలను హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9 వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పదవిలో కూర్చున్న వారికి బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లకు గౌరవం, మర్యాద ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రపతి పంజరంలోని పక్షి అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

22:14 - April 3, 2018

పార్లమెంట్ మెట్లు మొక్కిన చంద్రాలు గారు...ఆస్కార్లు.. నాల్గు సుట్టసుట్టి ఇచ్చిన సరిపోదు, తెలంగాణ సర్కారుకు హైకోర్టు సుర్కులు... కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్ మీద కండ్లెర్ర, సోషల్ మీడియా మీద టీ సర్కార్ కుట్ర...స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అడ్మీన్ అరెస్టు, కేటీఆర్కు శెప్రాశి పదవి గూడ ఎక్వనేనట...అడ్డగోళ్ల ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీల రాజీనామాలు సుర్వు...కోదండరాం కొత్త పార్టీలకు ఖమ్మం నేతలు, దున్నపోతు మీద ఎక్కితిర్గుతున్న బంగి...నారధముని ఏశంల తిర్గుతున్న శివప్రసాద్...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

21:59 - April 3, 2018

బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రంగస్థలం ఫైట్ మాస్టర్స్ రామ్..లక్ష్మణ్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు తమ సినిమా అనుభవాలను తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

పాలిటెక్నిక్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్లు నిరసన

హైదరాబాద్‌ : నగరంలో పాలిటెక్నిక్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఆందోళకు దిగారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంపైకి పెట్రోల్‌ బాటిళ్లతో ఎక్కి.. ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే దూకేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

 

17:37 - April 3, 2018

గుంటూరు : పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తోసిపుచ్చారు. పెద్దనోట్ల రద్దుతో ఇబ్బంది పడింది నల్లధనం ఉన్నవారేనని అసెంబ్లీలో చెప్పారు. 

17:30 - April 3, 2018

గుంటూరు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలు దేశ ప్రగతికి అవరోధంగా మారాయని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. పెద్ద రోడ్లు రద్దు తర్వాత జీడీపీ 2 శాతం పడిపోయిందని, ఇది మరో 2 శాతం దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ చట్టం కూడా ప్రగతికి అవరోధంగా ఉందని అసెంబ్లీలో చెప్పారు. 
 

17:28 - April 3, 2018

తమిళనాడు : కేంద్రం కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నిరాహార దీక్షలో కూర్చున్నారు.  అన్నాడీఎంకే చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షలో భారీగా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం మార్చి 29తో గడువు ముగిసిపోయింది. కానీ బోర్డును ఏర్పాను చేయకపోవడంతో తమిళనాడు నిరసన వ్యక్తం చేస్తోంది. ఏప్రిల్‌ 9న దీనిపై విచారణ జరగనుంది.

 

17:25 - April 3, 2018

ఢిల్లీ : చంద్రబాబు ఢిల్లీ పర్యటన వల్ల ఒరిందేంలేదని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విమిర్శించారు. పార్లమెంటు లాబీల్లో చంద్రబాబును విపక్షనేతలెవరూ పట్టించుకోలేదని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవాచేశారు. ప్రతిసారి యూటర్న్‌ తీసుకునే చంద్రబాబు తాజాగా ప్రత్యేక హోదపై కూడా మనసుమార్చుకుంటారేమోనని వైసీపీ ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటన ఉపయోగం లేదని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ రాజకీయ విన్యాసాలు చేయడం టీడీపీ అధినేతకు అలవాటేనని ఎద్దేవాచేశారు. చంద్రబాబురాకతో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుదని భావించినా.. నిరాశే ఎదురైందన్నారు. మోదీ ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి ఏమాత్రం పనిచేయలేదని మేకపాటి  కామెంట్‌ చేశారు.  

 

17:09 - April 3, 2018

ఢిల్లీ : సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా కాంగ్రెస్‌, బీజేపీ యేతర పక్షాల మద్దతు కూడగడుతున్నామని తెలిపారు. 

 

17:01 - April 3, 2018

ఢిల్లీ : హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఉదయం పార్లమెంటుకు చేరుకున్న ఆయన ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నమస్కరించి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంటు ద్వారానికి నమస్కరించి లోనికి వెళ్లారు. అనంతరం పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్‌లో వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.  అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌, ఎన్‌సీపీ నేతలు శరద్‌ పవార్‌, సుప్రియా సూలె, తారిక్‌ అన్వర్‌, టీఎంసీ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ, డెరిక్‌ ఒబ్రెయిన్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, తెరాస నేత జితేందర్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేకహోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 

16:58 - April 3, 2018

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చారంటూ సాగుతున్న ఆందోళనలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. మా తీర్పును ఆందోళనకారులు పూర్తిగా చదివారా అని ప్రశ్నించింది. నిరసనల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సుప్రీంకోర్టు వ్యతిరేకం కాదని.. కాని అమాయకులకు శిక్షపడరాదన్నదే తీర్పు ఉద్దేశమని వ్యాఖ్యానించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.  

 

ఆందోళనల వెనుక రాజకీయ దురుద్దేశాలు : సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చారంటూ సాగుతున్న ఆందోళనలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. మా తీర్పును ఆందోళనకారులు పూర్తిగా చదివారా అని ప్రశ్నించింది. నిరసనల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ చట్టానికి  సుప్రీంకోర్టు వ్యతిరేకం కాదని.. కాని అమాయకులకు శిక్షపడరాదన్నదే తీర్పు ఉద్దేశమని వ్యాఖ్యానించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.  

 

16:38 - April 3, 2018

హైదరాబాద్ : దేశంలో దళితులపై దాడుల పెరిగాయని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు అధికమయ్యాయని తెలిపారు. దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన జరిగిందన్నారు. గుణాత్మక మార్పు వస్తేనే అట్టడుగువర్గాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపైమరొకరు బురదజట్లుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నాయని తెలిపారు. నిన్న జరిగిన ఘటన తర్వాత కాంగ్రెస్, బీజేపీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపైమరొకరు విమర్శలు చేసుకుంటూ పైచేయి సాధించామని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భారత్ బంద్ కు పిలుపు ఇవ్వాలిన్సన పరిస్థితి ఎందుకు వచ్చిందో యోచించాలని, దానిపై దృష్టి పెట్టాలన్నారు.

 

16:23 - April 3, 2018

పెద్దపల్లి : పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యులపై విపరీతమైన భారాన్ని మోపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమకు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

15:54 - April 3, 2018

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వాహనదారుడి జేబులు ఖాళీ అవుతోంది. డీజిల్‌ గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయిని తాకగా.. పోట్రోల్‌  నాలుగేళ్ల గరిష్టానికి చేరింది. మరి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏమిటి? అసలు ఈ ధరలు ఎక్కడి వరకు వెళ్తాయి? పెట్రోవాతలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ....
నాలుగేళ్ల గరిష్టానికి పెట్రోల్‌ ధరలు
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.  డీజిల్‌ ధర గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్ట స్థాయిని తాకింది. ఇక పెట్రోల్‌ అయితే నాలుగేళ్ల గరిష్టానికి చేరింది. దీంతో పెట్రో ధరలు సగటు వ్యక్తిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
ప్రభావం చూపుతున్న అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రభావం చూపిస్తాయి. 2014 జూన్‌ నుంచి 2016 జూన్‌ వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతూ వచ్చాయి. కానీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మాత్రం మనకు తగ్గలేదు. పైగా  గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకు ధరలు ఏకంగా 47శాతం పెరిగాయి. దీనికితోడు ప్రభుత్వాల పన్నుల మోత పరిస్థితిని మరింత దిగజారుస్తున్నది. కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్‌లతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మనం కొనుగోలు చేస్తున్న  లీటర్‌ పెట్రోల్‌లో 48.2శాతం ఈ పన్నుల వాటానే చెల్లిస్తున్నామంటే మీరు నమ్మగలరా. ఇక డీజిల్‌ ధరలో  38.9 శాతం పన్ను కడుతున్నాం.
9సార్లు పెరిగిన ఎక్సైజ్‌ డ్యూటీ
నవంబర్‌ 2014 నుంచి జనవరి 2016 వరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఏకంగా 9సార్లు ఎక్సైజ్‌ డ్యూటీని పెంచారు. ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడి ఆ లోటును  ఇలా పన్నురూపంలో వసూలు చేశారు. అయితే ఆ తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నా ఎక్సైజ్‌ డ్యూటీని మాత్రం తగ్గించడం లేదు. పెట్రోల్‌ ధరలు తగ్గుతున్నాయంటే వెంటనే ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ను పాలకులు పెంచేస్తారు. ఆ తర్వాత పెట్రో ధరలు పెరుగుతున్నాయంటే మాత్రం వాటిని ఏమాత్రం తగ్గించదు. గతేడాది అక్టోబర్‌లో ఒక్కసారి మాత్రమే లీటర్‌కు రెండు రూపాయలు తగ్గించారు. ఆ తర్వాత 15 నెలల కాలంలో మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై 11 రూపాయల 77 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 13 రూపాయల 47పైసల మేర ఎక్సైజ్‌ డ్యూటీ పెంచి సామాన్యుడి నడ్డివిరిచారు. ఎక్సైజ్‌ డ్యూటీ పెంచడం వల్ల ప్రభుత్వానికి 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను 2,42,000 కోట్ల ఆదాయం లభించింది. 
సామాన్యుడిపై ధరల భారం
పెరిగిన ఎక్సైజ్‌ డ్యూటీకి తోడు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఆ భారమంతా సామాన్యుడిపై పడుతున్నది. పైగా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు ఏటికేడు పెరుగుతుండటం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర ఒక్క డాలర్‌ పెరిగితే మన మొత్తం దిగుమతుల విలువ 50 కోట్ల డాలర్లు పెరుగుతుంది. ఇది చాలా భారాన్ని మోపుతుంది. దీనివల్ల దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గడంతోపాటు వాణిజ్యలోటు కూడా భారీగా పెరిగిపోతోంది. అటు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపుతున్నాయి.  మొత్తానికి పెట్రో ధరలు సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నాయి. ఇతర దేశాల్లో తక్కువ ధరకే పెట్రోల్‌, డీజిల్‌ లభిస్తోంటే మన దేశంలో మాత్రం ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ల పేరుతో పన్నులు బాదుతూ సామాన్యుడి నడ్డివిరిస్తున్నారు. 

 

15:52 - April 3, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పాల్వంచలో జరుగుతున్న  మంత్రి కేటీఆర్‌ సభలో కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తమ కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని, లెక్చరర్‌ల కొరత ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను తీర్చాలంటూ విద్యార్థులు పట్టుబట్టారు. విద్యార్థుల నిరసనలతో కేటీఆర్‌ సభ నుండి వెళ్లిపోయారు.

 

15:47 - April 3, 2018

ఢిల్లీ : భారత్‌ బంద్‌ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. భారత్‌ బంద్‌ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో 8 మంది మృతి చెందినట్లు రాజ్‌నాథ్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, రాజస్థాన్‌లో ఒకరు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎస్‌సి ఎస్‌టి యాక్టులో మార్పు తేవాలన్న సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు రోడ్డుపైకి వచ్చారని మంత్రి పేర్కొన్నారు. ఎస్‌సి ఎస్‌టి వర్గాలకు రాజ్యాంగం కల్పించిన భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్‌సి ఎస్‌టి యాక్ట్‌ను మరింత బలోపేతం చేశామని చెప్పారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడడానికి అన్ని పార్టీలు సహకరించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

 

15:42 - April 3, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీలపై చంద్రబాబు ఢిల్లీబాట పట్టారు. ఉదయం పార్లమెంట్‌కు హాజరైన చంద్రబాబు... మహాత్మాగాంధీకి నివాళులర్పించి.. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లోకి వెళ్లారు. అనంతరం... విపక్షాలకు చెందిన అనేకమంది నేతలను కలిశారు. వీరిలో ప్రధానంగా మురళీ మనోహర్‌జోషి, శరద్‌పవార్‌, సుప్రియాసూలే, తారిఖ్‌అన్వర్‌, ఫారూఖ్‌ అబ్దూల్లా ఉన్నారు. అన్నాడీఎంకే నేత కేసీ వేణుగోపాల్‌, టీఎంసీ నేత సుదీప్‌ బందోపాధ్యాయను కూడా చంద్రబాబు కలిసి.. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసిన మోసాన్ని వివరించారు. ఇవాళ, రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న చంద్రబాబు... అనేకమంది నేతలను కలిసే అవకాశం ఉంది. 

 

ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు

ఢిల్లీ : ఏపీ విభజన హామీలపై చంద్రబాబు ఢిల్లీబాట పట్టారు. ఉదయం పార్లమెంట్‌కు హాజరైన చంద్రబాబు... మహాత్మాగాంధీకి నివాళులర్పించి.. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లోకి వెళ్లారు. అనంతరం... విపక్షాలకు చెందిన అనేకమంది నేతలను కలిశారు. 

13:29 - April 3, 2018
13:26 - April 3, 2018

సంగారెడ్డి : కలెక్టరంటే ఆఫీసులు ఏసీ రూమ్ లో కూర్చుని ఫైల్స్ లో మాత్రమే ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటారు. అది సర్వసాధారణం, కానీ ఈ కలెక్టర్ మాత్రం సైకిలెక్కి వీధుల్లో తిరుగుతు ప్రజాసమస్యల గురించి వివరాలను తెలుసుకుంటున్నారు. కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సైకిల్‌ ఎక్కి వీధుల్లో తిరిగారు. నేరుగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై స్పందించకుంటే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న కలెక్టర్‌ తెలిపారు.

13:20 - April 3, 2018

అనంతరపురం : నల్లమాడలో దారుణం చోటుచేసుకుంది. కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని అల్లుడిపై పగ పెంచుకున్న మామ అతన్ని కిరాతకంగా నరికి చంపాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురిని, అల్లుడిని ఆప్యాయంగా ఇంటికి పిలిచిన మామ తెల్లవారుజామున అల్లుడిని నరికి చంపాడు. 

13:19 - April 3, 2018

హైదరాబాద్ : టీ-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వ రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ కౌంటర్‌ దాఖలు చేయనందుకు ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. తదుపరి విచారణను ఆరో తేదీకి వాయిదా వేశారు. శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయకపోతే ఇంక కౌంటర్‌ ఉండదని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. 

13:08 - April 3, 2018

విజయవాడ : ఎస్‌సి ఎస్‌టి యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్ కొన్నిచోట్ల హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందారు. వారి మృతిని నిరసిస్తు సీపీఎం ర్యాలీ నిర్వహించింది. ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందనీ..దానికి సంబంధించిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు తీర్పునివ్వటం కేంద్రం ప్రభావమేనని దీనికి సంబంధించి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. వారి మృతికి కేంద్రం బాధ్యతవహించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. దేశంలో దళితులు హత్యలకు గురవుతున్నా ప్రధాని మోదీ ఏమాత్రం మౌనాన్ని వీడకుండా దళితులను మోదీ అవమానిస్తున్నారని సీపీఎం నీ..దేశవ్యాప్తంగా దళితులు హత్యలకు, అత్యాచారాలకు గురవ్వటాన్ని దారుణమన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని వామపక్షాలు డిమాండ్ చేశారు. బీజేపీ పాలిన ప్రాంతాల్లో పోలీసుల కాల్పుల్లో దళితుల మృతిని నిరసిస్తు..సీపీఎం ఆధ్వర్యంలో నిరసనచేపట్టింది. ఈ కార్యక్రమంలో సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి మధు వామపక్ష, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయం నుండి ప్రారంభమయిన ఈ నిరసన కార్యక్రమం బీసెంట్ రోడ్ లోని అన్సారీ పార్క్ వద్ద వరకూ కొనసాగనుంది. 

 

12:38 - April 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్న తమకు... తీరా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అన్యాయానికి గురయ్యామని నాటి ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడేందుకే టీఆర్‌ఎస్‌ను వీడి కోదండరామ్‌ పార్టీలో చేరుతున్నామంటున్న ఉద్యమకారులతో పేర్కొంటున్నారు. 

12:29 - April 3, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం ప్రారంభమయిన లోక్ సభలో అన్నాడీ ఎంకే సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఆందోళన మధ్యలోనే కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టుకు పిటీషన్ సమర్పించామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాన్ని నిర్వర్యం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో స్పష్టం చేశారు. దళితులకు ప్రభుత్వం అండగా వుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కావేరీ బోర్డు ఏర్పాటుచేయాలని స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లిన అన్నాడీఎంకే ఎంపీలు వీ వాంట్ జస్టిస్ అంటు ప్లకార్డులు ప్రదర్శిస్తు ఆందోళన చేపట్టారు. సభ్యులు ఆందోళనను విరమించాలని స్పీకర్ విజ్నప్తి చేసిన ఏమాత్రం వెనక్కితగ్గని విపక్షాలు ఆందోళన మధ్యలోనే ఏపీ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో ఆందోళన కొనసాగుతుండటంతో స్పీకర్ లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. కాగా ఎస్‌సి ఎస్‌టి యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్ కొన్నిచోట్ల హింసాత్మకంగా మారింది. పోలీసులు...ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం బలహీనపడి దళితులపై దాడులు పెరిగే అవకాశముందని దళిత సంఘాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కేంద్రం రివ్యూ పిటీషన్ వేయగా సుప్రీంకోర్టు విచారణకు ఆంగీకరించింది. ఈ పిటీషన్ పై మ.2గంటలకు విచారణ చేపట్టనుంది. 

12:11 - April 3, 2018

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో జారీచేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలని కేంద్రం పిటీషన్ లో పేర్కొంది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై ఓపెన్ కోర్టు విచారణకు సుప్రీం అంగీకారం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కీలక నిబంధనలు మార్చడంపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ చట్టంలోని ఏ నిబంధనలను సడలించినా ఈ తీర్పు రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘిస్తున్నదని కేంద్రం పేర్కొంది.

హింసాత్మకంగా మారిన బంద్..
ఎస్‌సి ఎస్‌టి యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్ కొన్నిచోట్ల హింసాత్మకంగా మారింది. పోలీసులు...ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం బలహీనపడి దళితులపై దాడులు పెరిగే అవకాశముందని దళిత సంఘాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కేంద్రం రివ్యూ పిటీషన్ వేయగా సుప్రీంకోర్టు విచారణకు ఆంగీకరించింది. ఈ పిటీషన్ పై మ.2గంటలకు విచారణ చేపట్టనుంది. 

12:02 - April 3, 2018

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. పార్లమెంట్ ఆవరణలో వున్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్ ప్రధానద్వారానికి చేరుకుని మెట్లకు నమస్కారం చేశారు. అనంతరం పార్లమెంట్ లోకి ప్రవేశించారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లను కలిసి చంద్రబాబు ధన్యవాదాలు తెలుపనున్నారు. అలాగే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కోరనున్నారు. విభజన చట్టం, హామీల అమలు, ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాన్ని అన్ని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు వెళ్లి అన్నాడీఎంకే ఎంపీ వేణుగోపాల్ తో మాట్లాడారు. ఏపీకి జరిగిన నష్టం గురించి వివరించి సహాయం చేయాలని చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయంపై హిందీ, ఇంగ్లీష్ లో నివేదికలను తయారుచేసి పలుపార్టీల ఎంపీలకు అందజేయనున్నారు. అలాగే అవిశ్వాసానికి మద్దతునిస్తున్న పార్టీ నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలుపనున్నారు. కాగా బుర్రకథ వేషంలో పార్లమెంట్ కు చేరుకుని ఎంపీ శివప్రసాద్ తన నిరసనను వినూత్నంగా కొనసాగిస్తున్నారు.

.11.00గంటలకు ప్రారంభమయిన ఉభయసభలు ..
రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు మంగళవారం సభలో ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ సభ్యులు  సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం రమేష్ ఇంగ్లీష్‌లో, రవీంద్రకుమార్ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు ఆర్జేడీ సభ్యులు మనోజ్‌కుమార్ ఝా, అహ్మద్ అశ్వాక్ కరీన్, జేడీయూ సభ్యులు డాక్టర్. మహేంద్రప్రసాద్, బషిశ్ట్ నారాయణ్‌ సింగ్, బీజేపీ సభ్యులు రవిశంకర్ ప్రసాద్, సరోజ్ పాండే, మన్శుక్ ఎల్ మండువియా, ఐఎన్‌సీ సభ్యులు అఖిలేష్ ప్రసాద్ సింగ్, నరన్‌భాయ్ చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారందరికీ చైర్మన్ వెంకయ్య కరచాలనం చేసి అభినందించారు. ప్రమాణస్వీకారం అనంతరం రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

11:59 - April 3, 2018

హైదరాబాద్ : సింగరేణి సంస్థ మరో రికార్డు నెలకొల్పింది. జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థ 5వ స్థానంలో నిలిచింది. ఈ రికార్డు కేవలం 18 నెలల్లోనే సాధించింది. సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలవడంపై ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్‌. శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు , కార్మికులకు అభినందనలు తెలిపారు.

జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచిన సింగరేణి..
2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ మరో సరికొత్త రికార్డు సృష్టించింది. మంచిర్యాల జైపూర్‌ దగ్గరి సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. మార్చి నెల నాటికి 91.1శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ను సాధించింది. దేశంలో దాదాపు 500 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉండగా... కేవలం 18 నెలల్లో సింగరేణి ఈ ఘనత సాధించింది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ జాతీయ స్థాయిలో విడుదల చేసిన అత్యుత్తమ 25 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల జాబితాలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 5వ స్థానంలో కొనసాగుతోంది. సుదీర్ఘకాలంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న ఏపీజెన్‌కో, టీఎస్‌జెన్‌కో, ఎన్‌టీపీసీ సంస్థలు సాధించలేని ఘనతను సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం సాధించింది. మార్చినెల నాటికి టీఎస్‌ జెన్‌కో 74.7శాతం, ఏపీజెన్‌కో 71.6శాతం, ఎన్‌టీపీసీ 78.5శాతం సాధించగా... సింగరేణి థర్మల్‌ విద్యుత్ కేంద్రం 91.1శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు.

జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలవడంపై సీఎమ్‌డీ ఎన్‌.శ్రీధర్‌ హర్షం..
సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జాతీయ స్థాయిలో 5వ స్థానానికి ఎదగడంపై సీఎమ్‌డీ ఎన్‌. శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇక్కడ నిర్మించనున్న మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి సన్నాహాలను వేగవంతం చేశామని, మే నెల నుంచి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. దీంతోపాటు మరో 500 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంటును కూడా నెలకొల్పనున్నట్టు ఆయన తెలిపారు. దీంతో వచ్చే ఐదేళ్లలో 2500 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మార్చినెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 9,575 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసి, 9004 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను గజ్వేలులోని పవర్‌గ్రిడ్‌కు సరఫరా చేసిందని సీఎమ్‌డీ ఎన్‌. శ్రీధర్‌ చెప్పారు. ఈ కేంద్రం సుమారు 400 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు వివరించారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఇతర విద్యుత్‌ సంస్థలకన్నా తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేయడంతో దాదాపు వెయ్యికోట్ల వరకు రాష్ట్ర డిస్కంలకు ఆదా అయినట్టు చెప్పారు. 24 గంటల విద్యుత్‌ సరఫరాకు సింగరేణి పూర్తిస్థాయి తోడ్పాటును అందిస్తోందని వివరించారు.

2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల లాభం..
సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1200 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 22,667 కోట్ల టర్నోవర్‌తో 6.2శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 608 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరుగగా... 2017-18లో 646 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి గత ఏడాదిపై 6.2శాతం వృద్ధిని నమోదు చేసింది. 2017-17లో 395 కోట్ల లాభాన్ని ఆర్జించగా... 2017-18లో 1200 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించి రికార్డు సృష్టించినట్టు సీఎమ్‌డీ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు. గతేడాదితో పోల్చితే ఇది 203శాతం అధికమని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 13 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం ద్వారా, ప్రస్తుతం చేస్తున్న 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. 850 లక్షల టన్నులకు పెరుగుతుందన్నారు. దీనివల్ల ప్రస్తుత 22,667 కోట్ల టర్నోవర్‌... వచ్చే ఐదేళ్లలో 34వేల కోట్లకు పెరుగుతుందన్నారు. కార్మికులకు అన్నిరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు శ్రీధర్‌ తెలిపారు.

11:44 - April 3, 2018

హైదరాబాద్‌ : ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని నందనగర్‌లో సౌమ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సౌమ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఇంటి బయటవైపు తలుపు గడియపెట్టి ఉండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... ఇంట్లో రక్తపు మరకలు, కెమికల్‌ పదార్థాలు గుర్తించారు. 

ఎస్సీ, ఎస్టీ చట్టం రివ్వ్యూ..అంగీకరించిన సుప్రీంకోర్టు..

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై ఓపెన్ కోర్టు విచారణకు సుప్రీం అంగీకారం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కీలక నిబంధనలు మార్చడంపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది.

పార్లమెంట్ మెట్లకు నమస్కరించి చంద్రబాబు..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. పార్లమెంట్ ప్రధానద్వారానికి నమస్కరించి పార్లమెంట్ ఆవరణలో వున్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పార్లమెంటుకు చేరుకున్నారు. ముందుగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంటు మెట్లకు నమస్కరించి లోపలికి వెళ్లారు.

మరో 'పరువు'హత్య!..

అనంతపురం : రాష్ట్రంలో పరువు హత్య ఉదంతం బైటపడింది. ప్రేమ పెండ్లి చేసుకున్న కుమార్తెను, అల్లుడిని ఇంటికి పిలిచి అల్లుడిని కత్తితో నరికి చంపి మామ ఉదంతం బైటపడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లమాడలో చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకుందనే కక్షతో మామ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. 

11:01 - April 3, 2018

అనంతపురం : అకాల వర్షాలు అనర్ధాలకు హేతువు అని పెద్దలు అన్న మాట ఊరికనే పోలేదు. తెలుగు రాష్ట్రాలలో వేసవిలో కురిసిన అకాల వర్షాలతో పుట్లూరు మండలం అరటివేములలో విషాదం నెలకొంది. రాత్రి పడిన వర్షాలకు పలు ప్రాంతాలలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. మృతి చెందిన ఇద్దరు రైతులు ఒకే గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. అకాల వర్షాలకు రాష్ట్రంలో జనం మృత్యువాత పడుతున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు నేలపాలవుతున్నాయి. ఈదురుగాలులకు వడగళ్లు తోడవడంతో అపార నష్టం వాటిల్లుతోంది. ఈ అకాల వర్షాలకు జిల్లాలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కాగా ఈదురు గాలులకు ఇళ్లమధ్య విద్యుత్ వైర్లు తెగిపడటంతో మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతకు గురయ్యారు. కాగా అకాలవర్షాల ధాటికి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు చంద్రన్న భీమా పథకం కింది ఒక్కొక్కరి కుటుంబానికి రూ.5లక్షల నష్టపరిహారం ఇస్తామని అధికారులు తెలిపారు. 

ఏపీ ప్రజలకోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన : టీడీపీ ఎంపీలు

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను చాటిచెప్పేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటనకు వచ్చారని తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. భాజపా, కాంగ్రెస్‌ తప్ప మిగిలిన పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమై అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంపై ఈరోజు కూడా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకూ పార్లమెంటు సాక్షిగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల సాధనే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.

ఉస్మానియా వైద్యులు, సిబ్బంది ఆందోళన..

హైదరాబాద్ : ఉస్మానియ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తు ఉస్మానియ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఓపీ సేవలను నిలిపివేసి ఆందోళన చేయటంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. 

10:22 - April 3, 2018

ఢిల్లీ : రాష్ట్ర ప్రయోజనాలకే ఎజెండాగా సీఎం చంద్రబాబు నాయడు ఢిల్లీ పర్యటనతో హస్తినలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు గాంధీ విగ్రహం నివాళులర్పించి పార్లమెంట్ కు వస్తారని ఎంపీలు పేర్కొన్నారు. ఏపీ భవన్ లో ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంట్ సభల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఈ భేటీకి మాజీ ఎంపీ కంభంపాటి రామ్మెహన్, సీఎం రమేశ్, బుట్టా రేణుక, గల్లా జయదేవ్,తోట నరసింహులు, రామ్మెహన్, సీతామహాలక్ష్మీలు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీలంతా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. కాగా మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు పార్లమెంట్ కు చేరుకోనున్నారు. కాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రాజకీయ ఎత్తుగడ అని వైసీపీ ఎంపీలు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన టీడీపీ ఎంపీలు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప మరే ఉద్ధేశ్యం లేదని స్పష్టం చేశారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లను కోరనున్నారు. విభజన చట్టం, హామీల అమలు, ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాన్ని అన్ని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎంపీలు స్పష్టం చేశారు. కాగా ఈరోజు కూడా అవిశ్వాసం తీర్మానాన్ని పార్లమెంట్ లో ఇచ్చి రాష్ట్ర హక్కులను సాధించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. కాగా పార్లమెంట్ కు చంద్రబాబు రాక దేశ రాజకీయాలు మరింత వేడిపుట్టించనున్నట్లు సమాచారం. 

ఏపీలో భారతీయ నృత్యోత్సవం..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తేదీ నుంచి 5వరకు నృత్యాంజలి పేరిట భారతీయ నృత్యోత్సవం నిర్వహి స్తున్నట్లు నాట్యాచార్య ఎం.సురేంద్రనాథ్‌ తెలిపారు. ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాల వేదికగా ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభమవు తాయని తెలిపారు. మొదటిరోజు నాట్యాచార్య సప్పా శివకుమార్‌ బృంద కూచిపూడి నృత్య విన్యాసాలు, కేరళకు చెందిన కరునాడ్‌ సెంటర్‌, సాయి ఆర్ట్స్‌ ఇంటర్నేషనల్‌ బృందాలు కథక్‌ నృత్యాంశంతో ఉమ్మాన్గ్‌ నృత్యరూపకం ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

బాబు ఢిల్లీ యాత్ర, పలువురు నేతలతో భేటీ..

ఢిల్లీ: విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా సాగనున్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సోమవారం  సాయంత్రం సీఎం ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు అల్పాహార విందు ఇచ్చారు. ఉదయం  పార్లమెంట్‌ చేరుకోనున్న చంద్రబాబు లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్లను కలవనున్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లను కోరనున్నారు.

09:41 - April 3, 2018

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారంటూ దళిత సంఘాలు దేశ్యాప్తంగా భారత్ బంద్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్‌సి ఎస్‌టి యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్టీ ఎస్టీ చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో చాలా వరకు బూటకపు కేసులు ఉంటున్నాయని సుప్రీంకోర్టు మార్చి 20న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కులం ఆధారంగా అమాయకులను వేధించేందుకు ఉపయోగించరాదని పేర్కొంటూ.. ఈ చట్టం అమలు విషయంలో పలు మార్పులు సూచించింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులపై కేసు నమోదైన పక్షంలో వారిని అరెస్ట్‌ చేయాలంటే ముందుగా ఉన్నతాధికారుల అనుమతి అవసరమని కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు తప్పనిసరి అని పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో సీపీఎం రాష్ట్ర వర్గ సభ్యులు జూలకంటి రంగారావు, టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, 

09:21 - April 3, 2018

ఢిల్లీ : పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ గత కొన్నిరోజుల నుండి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా పార్లమెంట్ ఉభయసభల్లో అవిశ్వాసన తీర్మానం జరుగుతుందా? లేదా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి యధావిధిగానే కొనసాగుతుందా? అనే ప్రశ్నలపై ఉత్కంట నెలకొంది. కాగా తాజాగా సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ చేరుకుని అవిశ్వాస తీర్మానంపై పలువురు పార్టీల నేతలను, ఎంపీలను కలిసి అవిశ్వాసంపై చర్చ జరిగేలా చూడాలని కోరనున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో చర్చ జరుగుతుందేమోననే ఆశలు నెలకొంటున్నాయి. మరోవైపు ఇన్ని రోజులుగా ఢిల్లీకి రాని చంద్రబాబు పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యం రావటంపై వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని వారు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా వివిధ పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజులుగా అన్నాడీఎంకే నేతలు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని చేస్తున్న డిమాండ్ తో తమ ఆందోళనలను కొనసాగిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వారితో చర్చలు జరిపే అవకాశమున్నట్లుగా కూడా తెలుస్తోంది. వివిధ పార్టీలు ఇస్తున్న అవిశ్వాస తీర్మానాలను ఇస్తున్నా అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనతో స్పీకర్ చర్చను చేపట్టలేకపోతున్నామనే వంకతో వాయిదాల పర్వాన్ని ఇరు సభల్లోను కొనసాగిస్తోంది. కానీ ఈరోజు సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎంపీలతో మాట్లాడి పరిస్థితిని చక్కబెడతారా? పరిస్థితులు అనుకూలిస్తే.. చర్చ జరుగుతుందా? అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఎన్డీయే కేబినెట్ నుండి టీడీపీ వైదొలగిన తరువాత సీఎం చంద్రబాబు ఢిల్లీకి రావటం ఇదే తొలిసారి కావటం విశేషం. కాగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా చంద్రబాబు ఢిల్లీ కి చేరుకున్నారని టీడీపీ స్పషం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏం జరుగనుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చంద్రబాబు హిందీ, ఇంగ్లీష్ భాషలలో నివేదికలను తయారు చేశారు.వాటిని పలువురు జాతీయ పార్టీ నేతలకు చంద్రబాబు ఇవ్వనున్నారు. 

నేడు ఏపీ శాసనసభ ప్రశ్నోత్తరాలు..

అమరావతి : నేడు ఏపీ శాసనసభలో పలు అంశాలలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టబోతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాయలసిస్ యంత్రాల కొరత, అనంతపురంలో ప్రభుత్వం కళాశాలలు, దామ నెల్లూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మినుము రైతులకు మద్ధతు ధర, ప్రభుత్వ పాఠశాలల్లో ఆనందలహరి కార్యక్రమం, రాష్ట్రంలో కొత్త డిగ్రీ కళాశాలల స్థాపన, మాంగనీసు ఖనిజం అక్రమ రవాణా, కార్పొరేట్ ఆసుపత్రులలో హృద్రోగుల చికిత్స, బీఈడీ కళాశాలల్లో లెక్చరర్ల కొరత, జీఎస్టీ అమలుతో రాష్ట్ర ఆర్థిక రంగంపై స్వల్పకాలిక చర్చ వంటి పలు అంశాలపై నేడు ఏపీ శాసనసభ చర్చ చేపట్టనుంది. 

విద్యుత్ వైర్లు తగిన ఇద్దరు మృతి..

అనంతపురం : పుట్లూరు మండలం అరటివేములలో విషాదం నెలకొంది. రాత్రి పడిన వర్షాలకు పలు ప్రాంతాలలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. 

పయ్యావులకు పితృ వియోగం..

అనంతపురం : రాష్ట్ర శాసనమండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ తండ్రి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే వెంకట నారాయణప్ప అనంతపురంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూశారు. తెదేపా ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరి తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. నారాయణప్పకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా పయ్యావుల కేశవ్‌ చిన్నవారుగా వున్నారు. నారాయణప్ప మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. 

మహిళ అనుమానాస్పద మృతి..

హైదరాబాద్‌ : ఎర్రగడ్డ నందనగర్‌లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి బయట గడియ పెట్టి ఉండటంతో స్థానికులు హత్యగా అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంట్లో ఉన్న ఏడాది బాబును రక్షించారు. ఇంట్లో రక్తపు మరకలు, కెమికల్‌ పదార్థాలు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

08:47 - April 3, 2018

హైదరాబాద్ : రోజురోజుకీ బాలికపై పెరుగుతున్న దాడులు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులు కామాంధులకు బలైపోతున్నారు. భద్రత అనేది బాలికలకు కరవైన క్రమంలో ఆడపిల్లలను కనాలంటేనే భయపడుతున్న పరిస్థితుల్లో ఆడపిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. బయటేకాదు ఇంటిలో కూడా చిన్నారులకు భద్రత లేకుండో పోతోంది. ఆడపిల్లల జీవితాలను చిద్రం చేస్తున్న కామాంధులు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యూషన్ చెప్పించుకునేందుకు వచ్చిన బాలికపై టీచర్ భర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌లో దారుణం జరిగింది. ట్యూషన్‌కు వచ్చిన ఓ బాలికపై, టీచర్‌ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు అశోక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి అని పోలీసులు చెప్పారు.

07:42 - April 3, 2018

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి. ఇదే డిమాండ్‌తో కార్మిక లోకం వైజాగ్‌ స్టీల్‌ మార్చ్‌కు సిద్ధమవుతోంది. ఖనిజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక లోకం పోరాటానికి సిద్ధమైంది. ప్రభుత్వ సంస్థల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మారాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వైజాగ్‌ స్టీల్‌ మార్చ్‌ చేపట్టడానికి గల కారణాలు వారి డిమాండ్స ఏమిటీ? ఏప్రిల్‌ 5న మీరు వైజాగ్‌ స్టీల్‌ మార్చ్‌ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. దీని ఉద్దేశం ఏమిటి? దీని ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్‌ చేయదలుచుకున్నారు.? అనేక ప్రైవేటు కంపెనీలకు గనులు కేటాయింపు జరిగినప్పుడు అతిపెద్ద సంస్థ అయిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఖనిజ సంపదను ప్రైవేటు పరం చేసే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అని మీరు ఆరోపిస్తున్నారు. ఎందుకు ప్రైవేటు సంస్థలపైన ప్రభుత్వాని ఇంత ప్రేమ? సొంత గనులు లేకపోవడం వల్ల వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు ఏ మేరకు నష్టం చేకూరుతుంది. ప్రస్తుతం ఆ నష్టం ఎంతమొత్తంలో ఉంది. ? వైజాగ్‌ నగరం పెద్దపెద్ద ప్రభుత్వరంగ సంస్థలకు పెట్టింది పేరు.. అలాంటి చోట ప్రైవేటీకరణ ఆలోచనలను ఎలా చూడాలి? వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుంది. ఈ ప్లాంట్‌ ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఇలాంటి పెద్ద సంస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎలా చూడాలి? మీ వైజాగ్‌ స్టీల్‌ మార్చ్‌ ద్వారా ప్రభుత్వాన్ని ప్రధానంగా ఏమి అడగదలుచుకున్నారు. మీ డిమాండ్ల సాధన కోసం ఎలాంటి భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధం కాబోతున్నారు.? ఇటువంటి అనేక ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో వైజాగ్ స్టీల్ మార్చ్ స్థితిగతులు, సమస్యలు, డిమాడ్స్ అనే అంశాలపై ఈనాటి జనపథంలో చూద్దాం..మరి వీటికి సమాధానం చెప్పేందుకు సీఐటీయూ నాయకులు నర్సింగరావు గారు చెప్పే విశ్లేషణలేమిటో చూద్దాం..

07:34 - April 3, 2018

ఢిల్లీ : ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో ఐసిస్‌ ఉగ్రవాదుల కిరాతకానికి బలైపోయిన 38 మంది భారతీయుల మృత దేహాలు భారత్‌కు చేరుకున్నాయి. పార్థివ అవశేషాలను తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి వికె సింగ్‌ ప్రత్యేక ఆర్మీ విమానంలో ఇరాక్‌ వెళ్లారు. 38 మంది మృత దేహాలను బాగ్దాద్‌ నుంచి అమృత్‌సర్‌కు తరలించారు. మృతుల్లో 27 మంది పంజాబ్‌కు చెందిన వారే. మొత్తం 39 మంది మరణించగా...మరో మృత దేహానికి డిఎన్‌ఏ పరీక్షలు పూర్తి కాలేదు. నాలుగేళ్ల క్రితం పొట్టకూటికోసం ఇరాక్‌కు వెళ్లిన 40 మంది భారతీయులు ఐసిస్‌కు బందీలుగా చిక్కారు. వీరిలో ఒకరు తప్పించుకోగా...39 మందిని ఉగ్రవాదులు కిరాతకంగా చంపారు. పంజాబ్‌ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం, ఓ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.

07:31 - April 3, 2018

ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఆయన సారీ చెప్పారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ అరుణ్ జైట్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తాము చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ కేజ్రీవాల్‌, ఆ పార్టీ నేతలు సంజయ్‌సింగ్‌, ఆశుతోష్ సంయుక్తంగా జైట్లీకి ఓ లేఖ రాశారు. కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పడంతో జైట్లీ కేసు వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు కూడా కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.  

07:24 - April 3, 2018

అమారావతి : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు జనజీవనాన్ని అతాలకుతలం చేస్తున్నాయి. ఈదురు గాలులకు ఇళ్లుకూలిపోయి నలుగురు మృతి చెందారు. వడగళ్లు, ఈదురుగాలులతో పంటలకు అపార నష్టం వాటిల్లుతోంది. మామిడి, అరటి, మునగతోటలు నేలకూలాయి. వేలాది ఎకరాల్లో చేతికి వచ్చిన ధాన్యం నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అకాలవర్షా వర్షానికి తెలుగు రాష్ట్రాల్లో నలుగురు మృతి..
అకాల వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో జనం మృత్యువాత పడుతున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు నేలపాలవుతున్నాయి. ఈదురుగాలులకు వడగళ్లు తోడవడంతో అపార నష్టం వాటిల్లుతోంది. తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం లాల్‌గుడి మలక్‌పేటలో విషాదం జరిగింది. వర్షంధాటికి పురాతన ప్రహరీగోడ కూలిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు జోత్స్నప్రియ, శిరీష ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.

పేమలకుంటపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి..
ఏపీలోని అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పేమలకుంటపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో పనిచేసుకుంటుండగా.. వర్షం పడింది. దీంతో నలుగురు చెట్టుకిందకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. మరోవైపు పొరుగునే ఉన్న కర్నాటక సరిహద్దుల్లోని కొత్తపల్లి గ్రామంలో కూడా పిడుగు పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతిచెందారు.

ఒంటిమిట్ట ఆలయం వద్ద కూలిన షెడ్లు  ..
అటు కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయం వద్ద శుక్రవారం ప్రకృతి ప్రకోపానికి గురై 15 షెడ్లు కూలిపోయాయి. షెడ్ల కింద చిక్కుకుపోయిన వృద్ధురాలు మూడు రోజులపాటు మృత్యుతోపోరాడి ప్రాణాలతో బయటపడింది. గాయాలతో ఉన్న వృద్ధురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో వడగండ్ల వాన విరుచుకుపడింది. గాలివానకు చెట్లు, విద్యుత్‌ స్తంబాలు నేలకూలాయి. గాలిధాటికి ఓ వైవేట్‌ స్కూల్‌ వ్యాను బోల్తాపడింది. ఈ ఘటనలో 5గురు విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి.

వడగళ్లు, ఈదురు గాలులకు నేలరాలిన మామిడి పంట
భద్రాచలం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం భారీనష్టం మిగిల్చింది. వడగళ్లు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కూనవరం రోడ్డులో 5 ఎకరాల్లో వేసిన అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. మామిడి తోటలు, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.

రైతాంగానికి నష్ట పరిహారం అందజేయాలి : జూలకంటి రంగారెడ్డి
నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో వచ్చిన అకాల వర్షానికి రైతాంగానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి, నకిరేకల్ మండలాల పరిధిలో వేలాది ఎకరాల వరి పంటలు ఈదురు గాలులకు నేల కూలాయి. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలో నష్టపోయిన పంటలను, ధ్వంసమైన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సీపీఎం, రైతుసంఘల నేతలు పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగానికి నష్ట పరిహారం అందజేయాలని జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.

రైతులను ఆదుకుంటామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
అకాల వర్షాల నష్టంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. సిద్ధిపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి హారీశ్‌రావు వడగళ్ల వానవల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చే పంటపెట్టుబడితోపాటు పంటనష్టాన్ని కూడా ఒకేసారి అందిస్తామన్నారు.

పరిహారం ప్రకటించడానికి ఇప్పటికే రెవెన్యూ అధికారు పర్యటన : గుత్తా
అటు వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించడానికి ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయ అధికారులు వివరాలు సేకరిస్తున్నారని రైతు సమన్వ సమితి అథ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండజిల్లాలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.

మరికొద్ది రోజులు వర్షాలు : వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రల్లో అకాల వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగండ్లు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకావశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

07:06 - April 3, 2018

ఢిల్లీ : దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారా..? రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టినప్పటు నుండి యువ మంత్రం జపిస్తూ సీనియర్లను పట్టించుకోవడం లేదా..? 50 ఏళ్లు దాటిన సీనియర్ నాయకులు కాంగ్రెస్‌కు అవసరం లేదా..? అసలు ఏఐసీసీ పదవులు ఎవరికి ఇస్తారు?

యువ మంత్రం జపిస్తోన్న రాహుల్‌ గాంధీ..
రాహుల్‌ గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచి, పార్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌లో దేశవ్యాప్తంగా యువ రక్తాన్ని నింపేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పార్టీ నియామాకాల్లో యువ మంత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో 50 ఏళ్లు దాటిన సీనియర్‌ నాయకులు.. తమకు పదవులు దక్కుతాయా, లేదా అని ఆందోళన చెందుతున్నారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టాక.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా 47 సంవత్సరాల జితేంద్రసింగ్‌ను నియమించారు. ఇక 35 ఏళ్ల అమిత్‌చావ్డాను గుజరాత్‌ పీసీసీ చీఫ్‌గా నియమించారు. గుజరాత్‌ ఇంచార్జీగా నియమింపబడ్డ రాజీవ్‌ సాతప్‌ వయస్సు 43 సంవత్సరాలు. ఇలా రాహుల్‌ గాంధీ జరిపిన నియామాకాలన్నీ 50 ఏళ్లలోపు వారితోనేనన్నది స్పష్టంగా తెలుస్తోంది.

రాహుల్‌ యువ మంత్రంతో డైలామాలో టీ కాంగ్రెస్‌ సీనియర్లు..
శ వ్యాప్తంగా రాహుల్‌ జరిపిన నియామాకాలు తెలంగాణలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీ అధికారంలో లేకపోవడంతో నేతలు ఢిల్లీ పదవుల కోసం తహతహలాడుతున్నారు. రాహుల్‌ టీమ్‌లో పదవులు ఆశిస్తున్న వారంతా సీనియర్‌ నేతలే. ఈ లిస్ట్‌లో దాదాపు డజన్‌ మంది దాకా ఉన్నారు. వీరంతా 70 ఏళ్ల పై బడిన వారే కావడం గమనార్హం. త్వరలో జరగనున్న సీడబ్ల్యూసీ నియామాకాల్లో తెలంగాణ నుంచి ఒకరికి మాత్రమే అవకాశం దక్కే ఛాన్స్‌ ఉంది. ఈ పదవి సీనియర్‌ నేతలకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 12 మంది సీనియర్లలో ఎవరిని ఆ పదవి వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

సీడబ్ల్యూసీ పదవి రేస్‌లో ఎస్‌.జైపాల్‌రెడ్డి, నంది ఎల్లయ్య..
సీడబ్ల్యూసీ పదవి రేస్‌లో మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి, ఎంపి నంది ఎల్లయ్యలు ముందున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక వేళ జైపాల్‌ రెడ్డికి సీడబ్ల్యూసీ పదవి వస్తే ఆయనకు ఎంపి టికెట్‌ దక్కే అవకాశం ఉంది. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుంటే నంది ఎల్లయ్యకు పదవి దక్కే చాన్స్‌ ఉంది. 12 మంది సీనియర్లు ఉంటే ఒక్కరికే పదవి ఎలా ఇస్తారన్న ఆందోళన మిగత నేతల్లో నెలకొంది. ఢిల్లీలో కీలక పదవులు దక్కించుకుని అధికారం చెలాయించాలని చూస్తున్న సీనియర్లకు రాహుల్‌ గాంధీ యువ మంత్రం మింగుడు పడడం లేదనే చెప్పాలి.

రాహుల్ యువ మంత్రంతో యువనేతల ఉత్సాహం..
ఇప్పటి వరకు ఢిల్లీ పదవులు అడగాటానికి మోహమాటపడ్డ యువ నేతలు రాహుల్‌ యువ మంత్రంతో ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. ఏకంగా కొద్ది మంది యువ నేతలు పదవులు కోసం తమ బయోడేటాలని ఏఐసీసీ కార్యాలయానికి ప్యాక్స్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఏఐసీసీ నియామాకాల్లో యువతను నియమించడంతో, ఏఐసీసీ మెంబర్స్‌గా జూనియర్లను ఎలా నియమిస్తారని పీసీసీపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇక మీదటైనా సీనియర్లకు పదవులు దక్కుతాయో లేదో వేచిచూడాలి. 

07:05 - April 3, 2018

హైదరాబాద్ : సాధరణ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారానికి దిగాయి. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీ జాక్‌ చైర్మన్‌ కోదండరాం తన కొత్త పార్టీని ప్రకటించారు. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల్లో కోదండరాం పార్టీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

తెలంగాణ జన సమితి పేరుతో కోదండరాం కొత్త పార్టీ..
మరో ఏడాదిలో ఎన్నికలు జరగనుండడంతో, ఇప్పటి వరకు విమర్శించుకున్న అధికార, ప్రతిపక్షాలు ఓటర్లకు గాలం వేసేందుకు జనాల్లోకి పరుగులు తీస్తున్నాయి. అయితే ఇప్పటి దాకా సాదా సీదాగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కాయి. ఉద్యమంలో తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీతో ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరాం ఇప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ జన సమితి అంటూ కొత్తపార్టీకి పురుడుపోశారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీ జేఏసీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి ఉద్యమించాయి. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుదంటూ కోదండరాం విమర్శించారు. దీంతో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా కోదండరాం కాంగ్రెస్‌ ఏజెంట్‌ అంటూ విమర్శిస్తూ వచ్చింది.

కోదండరాం పార్టీతో డైలామాలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌..
కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భవించడంతో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ డైలామాలో పడింది. ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్‌, బీజేపీతో తమకు ఏమి నష్టం ఉండదని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు... కోదండరాం కొత్త పార్టీతో టెన్షన్‌లో పడ్డారు. కోదండరాంకు జనాల్లో పలుకుబడి బాగా ఉందన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నిరుద్యోగులు, రైతులు, కార్మికులు కోదండరాం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి తోడుగా అధికార పార్టీలో గుర్తింపు దక్కని నేతలంతా తమ పార్టీ వైపు వచ్చే అవకాశాలున్నాయని కోదండరాం స్పష్టం చేస్తున్నారు. సరైన సమయంలో వారు తమ పార్టీలో చేరడం ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారు.

తెలంగాణ సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం కోసమే టీజేఎస్‌ అన్న కోదండరాం..
కోదండరాం పార్టీ పెట్టడం వల్ల తనను ఎదుర్కోవడం సులువని అధికార పార్టీ నేతలు బయటికి చెపుతున్నా.... కోదండరాంకు జనాల్లో ఉన్న ఫాలోయింగ్‌తో ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి, అంబేద్కర్‌ ఆశయాలకు లోబడి తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం టీజేఎస్‌ పోరాడుతుందని కోదండరాం స్పష్టం చేశారు. ఇందుకోసం తెలంగాణలోని అన్ని వర్గాలను సంఘటితం చేయాలని కోదండరాం భావిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ నేతల్లో తమ ఓట్లకు గండి పడుతుందన్న భయందోళనలు మొదలయ్యాయి.

కోదండరాం పార్టీ అధికారపార్టీ నేతల్లో కలవరం..
కోదండరామ్‌ పార్టీ పెట్టడంతో ప్రభుత్వం కూడా మేల్కొంది. ఇప్పటికే ఎన్నికల ప్లానింగ్‌లో భాగంగా నిరుద్యోగులను ఆకట్టుకునేందుక భారీగా నోటిఫికేషన్లును విడుదల చేసేందుకు కసరత్తు చేసింది. అందులో భాగంగానే కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ కింద ఇచ్చే మొత్తాన్ని పెంచింది. అలాగే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. మొత్తానికి కోదండరాం పార్టీ అధికారపార్టీ నేతల్లో కలవరం రేపుతోంది.

07:03 - April 3, 2018

అమరావతి : పీ ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా హోదా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇవాళ, రేపు వివిధ పార్టీల నేతలు, ఎంపీలతో కలిసి ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. వారి మద్దతును కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ప్రత్యేకహోదా సాధన ఎజెండాగానే చంద్రబాబు హస్తిన పర్యటన ఉంటుందని మంత్రులు స్పష్టం చేశారు.

హస్తిన చేరుకున్న చంద్రబాబు,నేడు, రేపు అక్కడే మకాం,బీజేపీయేతర నేతలతో భేటీ..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా హోదా సాధనకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఆయన ఇవాళ వివిధ పార్టీల నేతలు, ఎంపీలతో భేటీకానున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అన్ని విపక్షాలకు వివరించి... మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. పార్లమెంట్‌లోఎంపీలు, రాష్ట్రంలో ప్రజలు హోదాకోసం చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు ఢిల్లీ యాత్రకు శ్రీకారం చుట్టారు. రాత్రి పొద్దుపోయాక ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ, రేపు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. మోదీ సర్కార్‌ ఏపీకి చేసిన అన్యాయం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం గురించి ప్రతిపక్ష పార్టీల నేతలకు, ఎంపీలకు ఆయన వివరించనున్నారు. ఆయా నాయకులను పార్లమెంట్‌లోనే కలుస్తానని స్పష్టం చేశారు.

20కిపైగా పార్టీలతో చంద్రబాబు చర్చలు,పార్టీల మద్దతు కూడగట్టనున్న ఏపీ సీఎం..
సుమారు 20కిపైగా పార్టీల నాయకులను చంద్రబాబు తన రెండు రోజుల పర్యటనలో కలుస్తారు. ఏపీకి ఏవిధంగా అన్యాయం జరిగిందో వారికి వివరిస్తారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా సీఎం స్వయంగా ఢిల్లీకి వెళ్తే బాగుంటుందని ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో సూచనలు వచ్చాయి. దీనికి అనుగుణంగా చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నారు. మోదీ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి పలు పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఏపీ ఎంపీలు నిత్యం పార్లమెంట్‌ లోపలా, బయటా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి తమ పోరాటానికి ఆయా పార్టీల మద్దతు కూడగట్టనున్నారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. మోదీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ తమ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తున్న వైనాన్ని వివరించే అవకాశముంది. అంతేకాదు...తన పర్యటనలో భాగంగా ప్రతిపక్షాలకు చంద్రబాబు విందును కూడా ఏర్పాటు చేసే అవకాశముంది. మరోవైపు తమ ప్రత్యేకహోదా పోరుకు మద్దతిచ్చే పార్టీల ఫ్లోర్‌లీడర్లను కలవడానికి చంద్రబాబు హస్తినకు వెళ్లినట్టు ఏపీ మంత్రులు తెలిపారు. ప్రత్యేకహోదా సాధనే తమ ముందున్న లక్ష్యమన్నారు. బీజేపీ మిత్రధర్మ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా సాధనకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ప్రత్యేకహోదాపై జాతీయ స్థాయిలో చర్చ జరిగే అవకాశముంది.

 

హోదా ఉద్యమానికి సిద్ధమవుతున్న జనసేనాని..

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. 4న వామపక్షాలతో కలిసి హోదా పోరు ప్రణాళికపై సమావేశం నిర్వహించనున్న పవన్, 5న ఏపీ మాజీ సీఎస్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలకు మాత్రమే పరిమితమైన ప్రెసిడెంట్ కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న పవన్, అదే రోజు ప్రెసిడెంట్ కమిటీలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. 

బంద్ హింసాత్మకం..

మధ్యప్రదేశ్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో బంద్‌ హింసాత్మకంగా మారి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎస్పీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొనేవారి తక్షణ అరెస్ట్‌ను నిషేధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తుర్వు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వును వ్యతిరేకిస్తూ భారత్‌ బంద్‌కు పిలుపునివ్వగా ఉత్తరాది రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం తీవ్రంగా పడింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

నెల్సన్ మండేలా సతీమణి విన్నీ మండేలా మృతి..

హైదరాబాద్ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నోబెల్‌ బహుమతి గ్రహీత నెల్సన్‌ మండేలా సతీమణి విన్నీ మండేలా కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 81 సంవత్సరాలు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న విన్నీ జోహెన్నెస్‌ బర్గ్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికాలో తెల్లజాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆమెను మదర్‌ ఆఫ్‌ ద నేషన్‌గా పేర్కొంటారు. దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడు నెల్సన్‌ మండేలాను వివాహమాడిన విన్నీ..

చెట్టును ఢీకొన్న వాహనం..నలుగురు మృతి..

సంగారెడ్డి : ఆందోల్ మండలం దానంపిల్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన తుఫాన్ వాహనం చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా మృతులు నారాయణఖేడ్ వాసులుగా గుర్తించారు. 

Don't Miss