Activities calendar

04 April 2018

21:56 - April 4, 2018

ఢిల్లీ : ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక్క స్థానానికి మాత్రమే పోటీచేయాలన్న ప్రతిపాదనలకు ఎన్నికల కమిషన్ మద్దతు తెలిపింది. దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. రెండు స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఒక స్థానానికి రాజీనామా చేస్తున్నారు. దీంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించండం అదనపు ఖర్చుగా మారిందని ఈసీ పేర్కొంది. ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా పరిమితం చేయాలంటూ దాఖలైన పిల్‌కు ఈసీ సమర్థించింది. 

 

21:49 - April 4, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమ సెగలు ఢిల్లీని తాకాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. లెఫ్ట్‌పార్టీలతో కలిసి చేపట్టబోయే ఆందోళనలతో  కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సిందే అన్నారు.  ఢిల్లీలో టీడీపీ, వైసీపీలు చేస్తున్న హంగామా వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు లెఫ్ట్‌పార్టీ నేతలు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు రాజకీయ ప్రయోజనాలకోసమే డ్రామాలాడుతున్నాయని ధ్వజమెత్తారు. జనసేనతో కలిసి ఈనెల ఆరున రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపడతామని  కమ్యునిస్టు నేతలు ప్రకటించారు. 
ఐక్యంగా ఉద్యమం 
ఏపీకి ప్రత్యేక హోదా, విభజనహామీలపై పోరాటాన్ని ఉధృతం చేయడానికి లెఫ్ట్ పార్టీలు, జనసేనపార్టీలు కార్యచరణ ప్రకటించాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఐ, సీపీఎం రాష్ట్రకార్యదర్శులు రామకృష్ణ, మధుతో విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం... భవిష్యత్‌  ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.  
టీడీపీ, వైసీపీ విమర్శలతోనే కాలక్షేపం 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తే.. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిని మరిచిపోయి.. పరస్పరం విమర్శలకు దిగుతున్నాయని జనసేన అధినేత పవన్‌  విమర్శించారు.  ప్రత్యేక హోదా సాధనలో భాగంగా  ఏప్రిల్‌ 6న రాష్ట్ర వ్యాప్తంగా  జాతీయ రహదారులపై పాదయాత్రలు నిర్వహిస్తున్నమన్నారు. రాబోయే రోజుల్లో వామపక్షాలతో కలిసి నిర్వహించే  ప్రత్యేక హోదా పోరు సెగలు ఢిల్లీనీ తాకుతాయన్నారు పవన్‌ కల్యాణ్‌.   
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని బలహీనపర్చే కుట్రలు
కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని వామపక్షాల నేతలు ఆందోళన వెలిబుచ్చారు.  చట్టాలను బలహీనపరుస్తూ .. దళితులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  ఏపీ అంటే అమరావతి,పోలవరం అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీ అంటే అనంతపురం నుంచి పార్వతీపురం అని ఆయన తెలుసుకోవాలన్నారు. అభివృద్ధిని అమరావతి చుట్టే కేంద్రీకృతం చేస్తూ.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని లెఫ్ట్‌ నేతలు విమర్శలు గుప్పించారు. అటు విపక్ష వైసీపీ కూడా రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రత్యేకహోదా, పార్లమెంటులో అవిశ్వాసం అంటూ డ్రామాలు మొదలు పెట్టిందని వామపక్షనేతలు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల వైఖరిని ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా  సభలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మేధావులు, యువతను సమన్వయం చేస్తూ ఉద్యమాన్ని నడిపిస్తామని తెలిపారు. మొత్తానికి జనసేనానితో కలిసి  ఉమ్మడి కార్యాచరణ ప్రకటించిన కమ్యూనిస్టుపార్టీలు.. ఏపికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లతామని స్పష్టం చేశారు. 

 

21:44 - April 4, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయసభల్లో తీరు మారలేదు. రోజు మాదిరిగానే వాయిదాల పర్వం కొనసాగింది. లోక్‌సభలో కావేరీ జలాలపై.. అన్నాడీఎంకే, రాజ్యసభలో ఏపీకి న్యాయం చేయాలంటూ టీడీపీ, కాంగ్రెస్‌ ఆందోళనకు దిగాయి. దీంతో అవిశ్వాసంపై చర్చ జరగకుండానే ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారిగా ఆందోళనలు చేపట్టారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
లోక్‌సభలో అన్నాడీఎంకే ఆందోళన  
లోక్‌సభలో పదకొండో రోజూ తీరు మారలేదు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే.. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆ వెంటనే కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను సభలో చదివారు. సభ్యులు ఆందోళన విరమించి అవిశ్వాసంపై చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్‌ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.
పెద్దల సభలోనూ వాయిదాల పర్వం 
అటు పెద్దల సభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది. ఏపీని ఆదుకోవాలంటూ టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఆందోళన విరమించాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసినా.. సభ్యులు వినిపించుకోలేదు. 
సజావుగా సాగేందుకు కేంద్ర ప్రయత్నించడం లేదు : గులాంనబీ ఆజాద్‌  
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం లేదని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు గులాంనబీ ఆజాద్‌ అన్నారు. సభలో అన్ని అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ప్రభుత్వం ఇందుకు చొరవ తీసుకోవాలన్నారు. దేశంలో అనేక సమస్యలున్నాయని.. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అంశంపై మాట్లాడాల్సి ఉందన్నారు. 
రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన 
వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేయడంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను గురువారానికి వాయిదా వేశారు. 
టీడీపీ ఎంపీలు ఆందోళన 
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంతో పాటు విభజన చట్టం హామీలన్నీ నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ దోబీ వేషధారణలో ఆందోళనలో పాల్గొన్నారు.
టీడీపీ డ్రామాలు : వైసీపీ 
మరోవైపు చంద్రబాబు ఢిల్లీకి వచ్చి సాధించేమిటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అవిశ్వాసానికి మద్దతు కూడగట్టేందుకు వచ్చి అధికార పార్టీ భాగస్వాములనే కలిశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఇక్కడే టీడీపీ డ్రామాలు బయటపడ్డాయన్నారు. తాము చిత్తశుద్ధితో విపక్ష పార్టీ నేతలను కలిసి అవిశ్వాసానికి మద్దతు కూడగట్టామన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలోని అందరు ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందన్నారు. పార్లమెంట్‌ వద్ద చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఏపీ పరువు తీశారని.. మరో ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 
ఢిల్లీలో వైసీపీ ఒకరోజు దీక్ష   
వైసీపీ ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదా పడ్డ తర్వాత వైసీపీ ఎంపీలు చేపట్టే దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలపనున్నారు. ఒక రోజు ఢిల్లీలో వైసీపీ చేపట్టే దీక్షలో పాల్గొంటారు. మొత్తానికి ఏపీ ఎంపీల ఆందోళనలు ఢిల్లీలో మరింత హీట్‌ను పెంచాయి. అయితే టీడీపీ- వైసీపీ పరస్పర ఆరోపణలతోనే కాలం గడుపుతారా... లేక హోదా అంశంపై పట్టుబడుతారో చాడాలి. 

 

ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

 ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. అంతకముందు హస్తినలో బిజీబిజీగా గడిపారు. పలువురు నేతలతో భేటీ అయ్యారు. 

 

21:34 - April 4, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల సాధనకు.. న్యాయపోరాటం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించడం ద్వారా కాంగ్రెస్‌ అన్యాయం చేస్తే, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీజేపీ దగా చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల న్యాయమైన హక్కులు సాధించే వరకు  కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు ఢిల్లీలో స్పష్టం చేశారు. 
కేజ్రీవాల్‌తో చంద్రబాబు భేటీ 
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రెండో రోజు కూడా బిజీబిజీగా పడిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలులో ఎన్డీయే ప్రభుత్వ వైఖరిని వివరించి,  టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. 
విభజనతో ఏపీకి అన్యాయం  
అనంతరం చంద్రబాబు... విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంటులో విభజన చట్టాన్ని హడావుడిగా ఆమోదించింది మొదలు.. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రుల రాజీనామా, ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టడం వరకు అన్నిఅంశాలను ప్రస్తావించారు. హోదా ఇస్తారని, విభజన హామీలు అమలు చేస్తారని నాలుగేళ్లపాటు నమ్మకంగా ఎదురు చూస్తే, చివరికి నమ్మక ద్రోహం మిగిలిందన్న ఆవేదనతో ఎన్డీయే నుంచి బయటకొచ్చినట్టు చెప్పారు. 
బీజేపీ నాటకాలు
ప్రధాని మోదీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని చంద్రబాబు మండిపడ్డారు. హోదా ఉన్న రాష్ట్రాలకు దీనిని పొడిగిస్తూ... ఏపీకి ఇవ్వకపోడం ఏంటని ప్రశ్నించారు. అవినీతి మకిలి అంటుకొన్న వైసీపీని అడ్డుంపెట్టుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరస్థులకు ప్రధాని కార్యాలయం ఆశ్రయం కల్పించడం ఏంటని చంద్రబాబు నిలదీశారు. బీజేపీతో దూరంగానే ఉంటామని చెప్పిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మరింత విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామన్నారు. 

 

ఏలూరు ఈపీఎఫ్ ఆఫీస్ పై సీబీఐ దాడులు

ప.గో : ఏలూరు ఈపీఎఫ్ ఆఫీస్ పై సీబీఐ దాడులు చేసింది. రూ.40వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఈపీఎఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి ఆనందరావు పట్టుబడ్డారు. 

21:14 - April 4, 2018

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత బలోపేతం చేసి చిత్తశుద్ధిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని దళిత ఉద్యమకారుడు ప్రొ.శ్రీపతి రాముడు అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. దళితులపై దాడులు పెరుగుతున్నా సత్వర న్యాయం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కారణమని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు...'మా చట్టం..మా హక్కు' అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీపతిరాముడు పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'నేరాల రూపం మారుతూ వచ్చింది. దళితులపై క్రూయల్ గా శిక్షలు వేస్తున్నారు. మూత్రం తాగించడం, మల తినిపించడం, మహిళలను వివస్త్రను చేయడం జరుగుతుంది. ఇది కుల సమాజం. కారంచేడు ఊచకోత. 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు వచ్చింది. 1995లో చట్టం అమల్లోకి వచ్చింది. చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు. చట్టంలో మూడు అంశాలున్నాయి. ఒకటి అత్యాచారాలను నిరోధించాలి, రెండు అత్యాచార బాధితులకు రిలీఫ్, రిహాబిలిటేషన్ ఇవ్వాలి, మూడోది స్పీడ్ జస్టిస్ (సత్వర న్యాయం). కేసులను మూడు నెలల్లోపు క్లియర్ చేయాలి. దళితులు అభద్రతా భావానికి గురవుతున్నారు' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:46 - April 4, 2018

ఎగిరిన తెలంగాణ జన సమితి జెండా...నీలం రంగుల నింగికెగిరేశిన కొదండ, వరంగల్ జిల్లా జోరుగైన టీకాంగ్రెస్ యాత్ర...సర్కారు ధుమ్ము దుల్పుతున్న రేవంత్, రాజ్యసభల ఇమానం దిన్న కొత్త ఎంపీలు.. సప్పట్లతోని స్వాగతించిన తోటి సభ్యులు, గడ్డాలు వెంచుకుంటే ముఖ్యమంత్రులు కారు...దళితులను చేస్తాంటే అయితరు గదా..?, కేటీఆర్ను అడ్డుకున్నమైనింగ్ విద్యార్థులు...తెలంగాణల సుర్వైన జనం తిరుగుబాటు, పయ్యకాండ్ల పైకం మింగిన అధికార పార్టోళ్లు.. ప్రకాశం జిల్లా కణిగిరి కాడ స్వచ్చా గోల్మాల్... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:27 - April 4, 2018

గుంటూరు : నారాకోడూరులో వైసీపీ అధినేత జగన్ తో ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ సమావేశం అయ్యారు. ప్రత్యేకహోదా ఉమ్మడి ఉద్యమంపై జగన్, చలసాని చర్చించారు. వైసీపీ ఎంపీల నిరాహార దీక్షలకు చలసాని సంఘీభావం ప్రకటించారు. 

20:20 - April 4, 2018

ఢిల్లీ : టీడీపీపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు అయ్యారు. ప్రజలను దగా, మోసం చేయొద్దన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని..కేవలం రాజకీయాలపై ధ్యాస పెడితే రాష్ట్రం నష్టపోతుందన్నారు. ఇచ్చిన నిధులకు తగట్టు నిధులు వెచ్చించారా అని ప్రశ్నించారు. బ్యాక్ వర్డ్ ఏరియా గ్రాంట్ కింద వెయ్యి కోట్ల నిధులు ఇస్తే ఇంకా దాదాపు వంద కోట్ల వరకు ఖర్చు పెట్టలేదన్నారు. ఖర్చు పెట్టినవాటి గురించి వివరణ ఇవ్వలేదన్నారు. 2015లో అమరావతి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కోసం వెయ్యి కోట్లు ఇస్తే అందులో 230కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. నిధులను ఖర్చు పెట్టే సామర్థ్యం లేదని.. నిధులు వాడడం పట్ల జవాబు దారితనం లేదన్నారు. 

 

19:55 - April 4, 2018

ఒకరిపైమరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుంటున్న టీడీపీ, వైసీపీ ? అసలు ఎజెండా పక్కన పెట్టి, రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీలు, ప్రత్యేకహోదాపై పోరు పక్కదారి పడుతుందా ? రాష్ట్రమా...రాజకీయమా...అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, బీజేపీ నేత ఆర్ డీ విల్సన్, వైసీపీ నేత గోపీరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల మీరా పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం...

మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి గుండెపోటు

ఢిల్లీ : మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆర్ ఎంఎల్ ఆస్పత్రి ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు. రేపు ఉదయం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. 

 

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి

రంగారెడ్డి : కొత్తూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పగిలి కారు లారీ కిందికి దూసుకెళ్లింది. దీంతో తల్లి, కూతురు మృతి చెందారు. మృతులు నాగర్ కర్నూలు వాసులుగా గుర్తించారు. 

19:44 - April 4, 2018

ఖమ్మం : చిన్నారి తన్విత కేసు సుఖాంతం అయింది. తన్విత కేసులో జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. పెంచిన తల్లికే తన్వితను అప్పగించాలని తీర్పు ఇచ్చింది. ఇల్లందుకు చెందిన తన్వితను అధికారులు బాలల సదన్ నుంచి పెంచిన తల్లికి అప్పగించారు. కన్నతల్లి, పెంచిన తల్లి వివాదంలో అక్టోబర్ 24న తన్విత బాలల సదన్ కు చేరింది.

 

19:43 - April 4, 2018

ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేస్తాం : ప్రకాశ్ జవదేకర్

ఢిల్లీ : ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. ప్రతి రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టిందని చెప్పారు. స్నేహం కంటే దేశ ప్రజలు, అభివృద్ధికి ఎక్కువ విలువ ఇస్తామని చెప్పారు.

19:41 - April 4, 2018

ఢిల్లీ : ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. ప్రతి రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టిందని చెప్పారు. స్నేహం కంటే దేశ ప్రజలు, అభివృద్ధికి ఎక్కువ విలువ ఇస్తామని చెప్పారు.

19:02 - April 4, 2018

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన ముగ్గురు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే.. చైర్మన్‌ వెంకయ్యనాయుడు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముగ్గురు సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. వెంకయ్యనాయుడుకు ముగ్గురు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమపార్టీ అధినేత కేసీఆర్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను సభలో ప్రతిభావంతంగా వినిపిస్తామని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు తెలిపారు. 

 

18:42 - April 4, 2018

మధ్యప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వివాదస్పద నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్‌ బాబా సహా ఐదుగురు హిందూ సాధువులకు కాబినెట్‌ హోదా కల్పిస్తూ శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం తీర్మానం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నర్మదానంద్‌ మహరాజ్‌, హరిహరానంద్‌ మహరాజ్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూ మహరాజ్‌, పండిత్‌ యోగేంద్ర మహంత్‌లు  క్యాబినెట్‌ హోదా పొందారు. ఈ హోదా కల్పించడానికి నాలుగు రోజుల ముందు వీరికి నర్మదా పరిరక్షణ కమిటీలో సభ్యులుగా నియమించడం గమనార్హం. నర్మదా నది పరిరక్షణను శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కాంగ్రెస్‌ విమర్శించింది. కాబినెట్‌ హోదా పొందిన బాబాలు నర్మదా నది ఒడ్డున ఆరుకోట్ల మొక్కలు నాటారో లేదో తేల్చాలని సూచించింది. మరోవైపు నదిని కాపాడుకునేందుకే సాధువులకు మంత్రి హోదా ఇవ్వడం జరిగిందని బిజెపి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 

 

చిన్నారి తన్విత కేసులో జిల్లా కోర్టు తీర్పు

ఖమ్మం : చిన్నారి తన్విత కేసులో జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. పెంచిన తల్లికే తన్వితను అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. బాలల సదన్ నుంచి తన్వితను అధికారులు పెంచిన తల్లికి అప్పగించారు. కన్నతల్లి, పెంచిన తల్లి వివాదంలో అక్టోబర్ 24న తన్విత బాలల సదన్ కు చేరింది.

18:11 - April 4, 2018

ప.గో : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏలూరులో కాంగ్రెస్‌ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న ఈ  దీక్షల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నాయకుల దీక్షలకు సీపీఐ సంఘీభావం ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ, బీజేపీ, వైసీపీ ఘోరంగా విఫలమయ్యాయని ఈ సందర్భంగా రఘువీరారెడ్డి విమర్శించారు. 

 

18:09 - April 4, 2018

హైదరాబాద్ : భారత్‌ బంద్‌ సందర్భంగా దళితులపై జరిగిన కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ మాస్‌ ఛైర్మన్‌ కంచె ఐలయ్య అన్నారు. గో రక్షక దళాలు, ప్రైవేటు సైన్యం, ఆర్ఎస్‌ఎస్‌ జరిపిన కాల్పుల్లో 11మంది మృతి చెందారని.. దీన్ని టీమాస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలిచే... అట్రాసిటీ చట్టాన్ని సుప్రీం కోర్టు నీరుగార్చే ప్రయత్నం చేసిందని ఐలయ్య ఆరోపించారు. చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 

యాదగిరిగుట్టలో కార్మికుల ఆందోళన

యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికుల ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు పనులు చేస్తున్న సన్‌షైన్‌ కార్యాలయం ముందు కూలీలు ధర్నాకు దిగారు. దాదాపు 300 మంది కార్మికులు ట్రక్కులు, జేసీబీలు నిలిపివేసి ధర్నాలో పాల్గొన్నారు. వీరంతా ఒడిషా, జార్కండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబంగ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ తమగోడు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

 

18:04 - April 4, 2018

హైదరాబాద్ : కోదండరామ్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పైన పాలపిట్ట రంగు, కింద ఆకుపచ్చ రంగు, మధ్యలో చక్రందో జెండా రూపొందించారు. పాలపిట్ట విజయానికి సంకేతమైతే, ఆకుపచ్చ రంగు అభివృద్ధికి చిహ్నమని జెండా విశిష్టతను కోదండరామ్‌ వివరించారు. జెండా మధ్య అమరుల ఆకాంక్షను వ్యక్తం చేసే చక్రం అన్నారు. 

 

18:01 - April 4, 2018

యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికుల ఆందోళనకుదిగారు. కాంట్రాక్టు పనులు చేస్తున్న సన్‌షైన్‌ కార్యాలయం ముందు కూలీలు ధర్నాకు దిగారు. దాదాపు 300 మంది కార్మికులు ట్రక్కులు, జేసీబీలు నిలిపివేసి ధర్నాలో పాల్గొన్నారు. వీరంతా ఒడిషా, జార్కండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబంగ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ తమగోడు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

 

17:32 - April 4, 2018

హైదరాబాద్ : తెలుగు సినీ ప్రముఖులు, చిత్రపరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై టాలీవుడ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ... సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత పరిశ్రమను కించపరిచే విధంగా మాట్లాడుతున్న శ్రీరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టాలీవుడ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు. 

17:29 - April 4, 2018

ఢిల్లీ : ఏపీకి చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. సీఎం హోదాలో చంద్రబాబు ఢిల్లీకి వచ్చినా.. నిరాదరణకు గురయ్యారని.. ఇది తనను ఎంతో బాధించిందన్నారు. నీతి, నిజాయితీ లేనందువల్లే ఇలా జరిగిందని చెప్పారు. ఏదో ఓ కూటమిలో చేరి వైసీపీకి చెక్‌పెట్టాలని చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని అయితే ఆయనను ఎవరూ నమ్మడం లేదని మేకపాటి అన్నారు.   

 

17:26 - April 4, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని వామపక్షాలు, జనసేన విమర్శించాయి. విజయవాడలో  సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు , రామకృష్ణ, మధు.. పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేకహోదాతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం వైఖరిని నేతలు ఖండించారు. రాష్ట్రప్రయోజనాలు పట్టించుకుండా టీడీపీ, వైసీపీలు రాజకీయ డ్రామాలకు తెరతీశాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 6న జాతీయ రహదారులపై పాదయాత్రలు నిర్వహిస్తామని జనసేన-లెఫ్ట్‌పార్టీల నేతలు ప్రకటించారు.   ఈ పాదయాత్రల్లో తాను స్వయంగా పాల్గొంటానని జనసేన అధినేత పవన్‌ తెలిపారు. శాంతియుతంగా చేపట్టే నిరసన సెగలు ఢిల్లీని తాకాలన్నారు. అటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. దీనికి వ్యతిరేకంగా వామక్షాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. 

 

16:47 - April 4, 2018

ఢిల్లీ : ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి జాతీయ నేతల మద్దతు కోరేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలకు కలిసిన చంద్రబాబు మీడియాతో ఏపీ సమస్యల గురించి ప్రస్తావించారు. ఏపీకి న్యాయం చేయాలని కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. చిన్న చిన్న అంశాలు మినహా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని...రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలపై శ్వేత పత్రాన్ని విడుదల చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నాలుగేళ్లు ఎదురు చూసినా ఫలితంలేకనే.. ఎన్డీయే నుండి వైదొలిగామని తెలిపారు. ఏపీకి ఇవ్వని హోదాను కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారనీ..ఆఖరి బడ్జెట్ లో కూడా ఏపీ ప్రస్తావనే తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

విజయసాయి కోసం ట్రైనింగ్ సెంటర్..

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కొన్ని సూచనలు జారీచేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించే విజయసాయిరెడ్డి లాంటివారికి ఒక ట్రైబ్యునల్ ప్రారంభించాలని..అందులో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా మాట్లాడాలో 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పారు. ఏ పార్టీకి చెందిన నేతలు తప్పుగా మాట్లాడినా, వారందరినీ ట్రైనింగ్ కు పంపాలని అన్నారు.

16:36 - April 4, 2018

భద్రాద్రికొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటను సీఎల్పీనేత జానారెడ్డి, భట్టివిక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలన్నారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 

ఏడుగురి భారతీయు తలల్ని కాల్చిన ఐసిస్..

హైదరాబాద్ : ఇరాక్‌కు వలస వెళ్లిన 39 మంది భారతీయుల్ని అక్కడి ఐఎస్‌ ఉగ్రవాదులు దారుణంగా చంపేసిన ఘటన తెలిసిందే. ఎప్పటికైనా తిరిగిరాకపోరా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వారి కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. కాగా..వీరి మృతదేహాలను సోమవారం కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్‌ ఇరాక్‌లోని మోసుల్‌ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. అయితే 39 మంది భారతీయుల్లో ఏడుగురిని తలలో కాల్చి దారుణంగా చంపివేశారట. అధికారులు జారీ చేసిన మరణ ధ్రువపత్రాలలో ఈ విషయం వెల్లడైంది. 

మోదీ వీడియోలను బైటపెట్టిన చంద్రబాబు..

ఢిల్లీ : ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు వీడియోలను జాతీయ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రదర్శించారు. కేంద్రం ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయమంటున్నాం తప్ప గొంతెమ్మ కోరికలు కోరటం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన హామీలు నెరవేరుస్తామంటేనే ప్రజలు నమ్మి ఓట్లు వేశారని..గత నాలుగేళ్ళ నుండి కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. హామీల అమలు కోసం 29సార్లు ఢిల్లీ వచ్చినా కేంద్రం పట్టించుకోలేని ఆవేదన వ్యక్తం చేశారు. 

16:17 - April 4, 2018

ఢిల్లీ : చంద్రబాబు ఢిల్లీకి వచ్చి సాధించిందేమిటని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతామంటూ ఎన్డీఏ కూటమి నేతలను కలిశారని చెప్పారు. టీడీపీ డ్రామాలు బయటపడ్డాయన్నారు. విపక్ష నేతలను కలిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. హోదా కోసం తాము రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. ఏపీ ఎంపీలంతా రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందని చెప్పారు. చంద్రబాబు సినిమా నటులతో ఫొటోలు దిగేందుకే వచ్చారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు : చంద్రబాబు

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలు రెండంటికి సమ న్యాయం చేయాలని విభజన సమయంలో ఢిల్లీలో దీక్ష చేశానని సీఎం చంద్రబాబు జాతీయ మీడియాతో పేర్కొన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు మరోసారి స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఎదురుదాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు తగినట్లుగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే ఆరోజున నమ్మిన ఒప్పుకున్నామనీ..ఇప్పుడేమో స్పెషల్ పర్పస్ వెహికల్ అంటు కాలయాపన చేస్తున్న ఇచ్చిన మాటలను తప్పి ఏపీకి తీరని ద్రోహం చేస్తోందన్నారు.

కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు: చంద్రబాబు

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి జాతీయ నేతల మద్దతు కోరేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలకు కలిసిన చంద్రబాబు జాతీయ మీడియాతో ఏపీ సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. ఏపీకి న్యాయం చేయాలని కేంద్రానికి పదే పదే విజ్నప్తులు చేసిన పట్టించుకోలేదనీ..చిన్న చిన్న అంశాలు మినహా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తరువాత ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారనీ రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

15:59 - April 4, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని వామపక్షాలు, జనసేన విమర్శించాయి. ఈమేరకు వామపక్ష నేతలు మధు, రామకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. నమ్మక ద్రోహానికి నిరసనగా ఈనెల 6న జాతీయ రహదారులపై పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. విభజన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా ఈ పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే చర్యలను వామపక్షాలు, జనసేన సీరియస్ గా తీసుకున్నాయి. ఫిబ్రవరిలో వామపక్షాలు బంద్ కు పిలుపు ఇవ్వకపోతే దేశమంతా ఏపీ గురించి చర్చ జరిగేది కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అవిశ్వాసానికి పవన్ డిమాండ్ పెట్టి ఉండకపోతే దేశమంతా ఏపీ గురించి చర్చ జరిగేది కాదని వామపక్షాలు అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్నారు. టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శలతో కాలక్షేపం చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ, వైసీపీ సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడతాం : కోదండరామ్

హైదరాబాద్ : ప్రగతి భవన్ గడీని బద్దలు కొట్టేందుకు బయలుదేరుతామని తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యమంలో గెలిచాం..ఇక ఓట్ల పండుగలోను గెలుస్తామని కోదండరామ్ ధీమా వ్యక్తంచేశారు. ఈరోజు తెలంగాణ జన సమితి జెండా పోస్టర్ విడుదల చేసిన అనంతరం ఈ విషయంలను కోదండరామ్ స్పష్టం చేశారు. 

29వ తేదీన మా తడాఖా చూపిస్తాం : కోదండరామ్

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి మడమ తిప్పది లేదని పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. 29వ తేదీని మా తడాఖా చూపిస్తాం కోదండరామ్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సీఎం కావాలన్న ఆకాంక్ష లేదు..కుర్చీ ఎక్కాలన్న యావా తనకు లేదని మరోసారి కోదండరామ్ స్పష్టం చేశారు. 

15:44 - April 4, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. విపక్షాలు ఆందోళన చేపట్టాయి. రాజ్యసభలో మళ్లీ గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను మళ్లీ 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

 

కోదండరామ్ పార్టీ జెండా ఇలా వుంటుంది!..

కోదండరామ్ పార్టీ జెండా ఇలా వుంటుంది!..హైదరాబాద్ : జేఏసీ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ 'తెలంగాణ జన సమితి'అనే కొత్తపార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రొ.కోదండరామ్, జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఆకుపచ్చ,పాలపిట్ట రంగుల్లో పార్టీ జెండా వుండగా..నీలి రంగులో రాష్ట్ర చిత్రపటం, మధ్యలో అమరవీరుల స్థూపం వున్న పోస్టర్ ను కోదండరామ్ ఆవిష్కరించారు. 

ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యం కుట్ర : పవన్

విజయవాడ : ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు తీసుకున్న కుట్రను వామపక్షాలు, జనసేన పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈరోజు జనసేన కార్యాలయంలో వామపక్ష నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం పవన్ మాట్లాడుతు..టీడీపీపై నేను చేసిన విమర్శలు ప్రజల అభిప్రాయాలేననీ.. వారి అభిప్రాయాలను తాను చెప్పానన్నారు. 

విజయవాడ పాదయాత్రలో పాల్గొంటా : పవన్

విజయవాడ : ఈనెల 6వ తేదీని జాతీయ రహదారులపై చేపట్టనున్న పాదయాత్రలో తను కూడా పాల్గొంటున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం ప్రభుత్వానికి నిరసనగా ఈనెల 6న జాతీయరహదారులపై వామపక్షాలతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపడుతున్నట్లుగా పవన్ తెలిపారు. శాంతియుతంగా చేసే నిరసనలు ఢిల్లీని తాకాలని పవన్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే టీడీపీ, వైసీపీ పార్టీలు నష్టం కలిగిస్తున్నాయన్నారు. త్వరలో అనంతపురం, విజయనగరం, ప్రకాశం జిల్లాలోని మేదావులతో చర్చలు జరుపనున్నట్లుగా పవన్ తెలిపారు.

15:24 - April 4, 2018

భార్యభర్తలు..గొడవలు...డైవోర్స్.. డైవోర్స్ తీసుకోవడానకి ప్రాసెస్ ఏంటి? అనే అంశంపై మానవి మైరైట్ నిర్వహించిన లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే... మానసిక.. శారీరక హింస, వరకట్న వేధింపులు వచ్చినప్పుడు ఇక కలిసి ఉండలేమనుకున్నప్పుడు సామరస్యపూర్వకంగా విడిపోవడానికి నిర్ణయించుకున్నప్పుడు విడాకులు తీసుకుంటున్నారు. భార్య విడాకులు కావాలంటే భర్త ఒప్పుకోడు..ఒక వేల భర్త విడాకులు కావాలంటే భార్య ఒప్పుకోదు. కోర్టులో విడాకుల పిటిషన్ వేసుకుంటారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

ఈ పాదయాత్రలు కేంద్రానికి హెచ్చరికలు : మధు

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు జాతీయ రహదారులపైకి వచ్చి పాదయాత్రలను చేపడుతున్నట్లుగా సీపీఎం ఏపీ కార్యదర్శి మధు తెలిపారు. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సీపీఎం, సీపీఐ నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు తీసుకోవాల్సిన పలు అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో ఈనెల 6వ తేదీన జాతీయ రహదారులపై పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్రలు కేంద్రానికి హెచ్చరిక మాత్రమేననీ..కేంద్రానికి విభజన చట్టం చేసే సమయం లేదాని ప్రశ్నించారు.

15:14 - April 4, 2018
15:11 - April 4, 2018

ఢిల్లీ : పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన తర్వాత వైసీపీ ఎంపీలు చేపట్టే దీక్షకు ఎమ్మెల్యేలు సంఘీభావం తెలపనున్నారు. ఒకరోజు ఢిల్లీలో చేపట్టే దీక్షలో ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని వైసీపీ క్యాడర్ కు ఆదేశాలు జారీ చేశారు. రేపు వైసీపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లనున్నారు.

 

14:59 - April 4, 2018

"మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన తనకంటు ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న యువహీరో సాయి ధరమ్ తేజ్. ముద్దుగా తేజు అని పిలుచుకునే ఈ మెగా ఇంటి మేనల్లుడు కరుణాకరన్ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీకి సిద్ధమవుతున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు నిర్మించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అలా ఆయన బ్యానర్ నుంచి 45వ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకు పలు పేర్లు ప్రతిపాదించినా తాజాగా ఈ సినిమాకి 'అందమైన చందమామ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని అంటున్నారు. టైటిల్ ను బట్టే కరుణాకరన్ ఈసారి కూడా తనదైన స్టైల్లో రొమాంటిక్ లవ్ స్టోరీని మలుస్తున్నాడని అర్థమవుతోంది. మాస్ హీరోగా మార్కులు కొట్టేసిన తేజును ఆయన ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.   

14:49 - April 4, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు. ప్రశ్నాపత్రం లీకేజీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అంశంపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.

 

ఈ నెల 6నుండి పాదయాత్రలు : పవన్

విజయవాడ : ఈనెల 6 తేదీ నుండి జాతీయ రహదారులపై పాదయాత్రలను చేపడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉదయం 10గంటల నుండి పాదయాత్రలకు చేపడుతున్నట్లుగా పవన్ పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ఈ పాదయాత్రలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ద్రోహం చేస్తోందనీ..కేంద్రంపై టీడీపీ, వైసీపీ ఒత్తిడి తీసుకురాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు కాలక్షేపం చేస్తున్నాయని పవన్ విమర్శించారు.

అన్ని సమస్యలపై చర్చించాల్సిందే : ఆజాద్

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ మాట్లాడుతు..పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం లేదనీ.. దేశంలో అనేక సమస్యలున్నాయని.. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అంశంపై మాట్లాడాల్సి ఉందన్నారు. ఆ సమయంలోనే తెదేపా సహా ఇతర విపక్ష పార్టీల సభ్యులు ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ఎంతగా వారించినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఆయన సభను అరగంట పాటు వాయిదా వేశారు.

పశ్నాపత్రాలు లీక్ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..

ఢిల్లీ : సీబీఎస్‌ఈ పశ్నాపత్రాలు లీకేజీకి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. తిరిగి పరీక్షలు నిర్వహించే అంశంలో బోర్డు తీసుకునే నిర్ణయాల్లో కోర్టు జోక్యంచేసుకోదని స్పష్టంచేసింది. అలాగే ప్రశ్నాపత్రాల లీకైజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. పేపర్‌ లీకేజీలపై పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఇటీవల సీబీఎస్‌ఈ పదో తరగతి గణిత ప్రశ్నాపత్రం, పన్నెండో తరగతి ఆర్థిక శాస్త్రం ప్రశ్నాపత్రాలు లీకైన సంగతి తెలిసిందే. 

13:40 - April 4, 2018
13:38 - April 4, 2018

హైదరాబాద్ : సీపీఎం అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్‌లో బస్సు యాత్ర నిర్వహించారు. కుత్బుల్లాపూర్‌ సీపీఎం కార్యదర్శి లక్ష్మణ్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రజా సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు గురించి ప్రజలను చైతన్యం చేసే విధంగా మహాసభలు ఉపయోగపడతాయని సీపీఎం నేతలు చెప్పారు. 

13:36 - April 4, 2018

ఖమ్మం : అకాల వర్షంతో నష్టపోయిన పంటలను సీఎల్పీ నేత జానారెడ్డి పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో నష్టపోయిన వరి, మొక్కజొన్న, మిర్చి పంటలను పరిశీలించిన జానారెడ్డి... రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రవీడి రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు జానారెడ్డి. 

13:26 - April 4, 2018
13:16 - April 4, 2018
13:02 - April 4, 2018

మన దేశంలో, రాష్ట్రంలో సగం భాగం మహిళలు వున్నారు మీరు అంతా తలుచుకుంటే దేశ చరిత్ర,నిర్మాణం మారిపోతుంది తొలిఆధునిక సమాజం మొదలయిననాటికి స్వాతంత్ర్య పొందిన మొదటి దేశాలలో మహిళలకు సరైన గౌరవం దక్కలేదు, ప్రపంచం మొత్తంలో మన భారతదేశ స్త్రీలకు మాత్రమే రాజ్యాంగం రాసిన తొలినాటికే వారికీ సమానత్వం ఇవ్వబడింది. చరిత్రను ఒక్కసారి చుస్తే దాదాపు 215 సంవత్సరాల క్రితం అమెరికాలో రాజ్యాంగం వచ్చాక మహిళలకు ఓటు హక్కు పొందారు. బ్రిటన్ లో 500 సంవత్సరాల పోరాటంలో 1928 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు సాధించుకున్నారు.ప్రెంచ్ లో 1790లో స్వాతంత్ర్య వచ్చాక ఎంతో కాలం పాటు మహిళల సమానత్వం,హక్కుల కోసం పోరాటం చేసి వారి హక్కులను సాధించుకొన్నారు. అటువంటిది మనదేశంలో రాజ్యాంగం వచ్చిన తోలి రోజునే,కులం,మతం,భాష,ప్రాంతం,లింగ వివక్ష ఇవ్వని విస్మరించి వయోజన ఓటు హక్కు ఇస్తూ, మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. ప్రపంచ రాజ్యంగాలలో మహిళలకు రాజ్యంగం వచ్చిన తొలిరోజునే ఓటు హక్కు ఇచ్చినటూవంటి తోలి రాజ్యాంగం భారత రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కులను మాత్రం ఎప్పటికప్పుడు పోరాడి సాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి ఎనిమిది పోలీస్ స్టేషన్లలో ప్రభుత్వం మహిళా అధికారులను నియమించింది.

ముంబై 8 పీఎస్ లలో మహిళా అధికారులు..
మహిళా సాధికారత విషయంలో ముంబయి ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఈ సారి చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా... అక్కడ ఓ ఎనిమిది పోలీస్టేషన్లలో మహిళా అధికారుల్ని ఇంఛార్జిలుగా నియమించింది. దేశంలోనే ఇది తొలిసారి. ముంబయి పోలీసు విభాగానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్‌లో ఆ వివరాలూ, ఫొటో ప్రస్తుతం ప్రశంసలూ, అభినందనలు అందుకుంటోంది. నేరప్రవృత్తిని తగ్గించాలనీ, మహిళలకు అండగా ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబయి పోలీసు అధికారులు చెబుతున్నారు.

మహిళలపై దాడులు..బాధితుల ధైర్యం కోసం మహిళా అధికారులు..
మహిళలపై దాడుల సంఖ్య పెరుగుతున్నా, బాధితులు ధైర్యంగా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి ముందుకు రారు. అలాంటి వారికి అండగా ఉండటమే కాదు, ఆయా కేసులను త్వరగా పరిశోధించడానికి మహిళా పోలీసు అధికారులు అవసరం. ఇవన్నీ ఆలోచించే ఆ రాష్ట్ర పోలీసు విభాగం నగరంలోని ఎనిమిది ప్రధాన పోలీసు స్టేషన్లలో మహిళా ఆఫీసర్లను నియమించింది. ఇకపై మహిళలు ధైర్యంగా స్టేషన్లకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చనీ, అవసరం అయితే ఫిర్యాదు చేయొచ్చనీ... అక్కడి డిప్యూటీ కమిషనర్‌ దీపక్‌ దేవరాజ్‌ చెబుతున్నారు.

13:00 - April 4, 2018

నల్గొండ : జిల్లాలో మిర్యాలగూడలో లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నిర్భంద తనిఖీల్లో తాళ్ల ఏరియాలో 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 109 ద్విచక్రవాహనాలు, ఒక కారు, 14 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకోగా అక్రమంగా గ్యాస్ సిలిండర్ లను సైతం స్వాధీనం చేసుకున్నారుర. అనుమానితులుగా భావిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులుసూచించారు. మొత్తం 150 మంది పోలీసులతో ఈ నిర్భందం తనిఖీలు జరిగాయి. 

12:56 - April 4, 2018
12:55 - April 4, 2018
12:53 - April 4, 2018

హైదరాబాద్ : కాటేదాన్ పారిశ్రామిక వాడలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవలే ఓ కంపెనీలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా అశోక్ పాలిమర్స్ ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఓ ఆటో అదుపు తప్పి కరెంటు స్థంభానికి ఢీ కొట్టడంతో నిప్పురవ్వలు కంపెనీ వైపు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 20 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలుస్తోంది. మంటల్లో ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

కాటేదాస్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : నగరంలో అగ్రిప్రమాదం సంభవించింది. కాటేదాస్ పారిశ్రామిక వాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. అశోక్ పాలిమార్స్ ప్లాస్టిక్ కంపెనీలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వారికి సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 

12:28 - April 4, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలు కోసం టిడిపి..వైసిపి ఎంపీలు పోరాటం కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఈ రోజు వరకు పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. టిడిపి..వైసిపి ఎంపీలు పార్లమెంట్ లోపలా...వెలుపలా ఆందోళన కొనసాగిస్తున్నారు. గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక టిడిపి ఎంపీ శివప్రసాద్ వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బుధవారం చాకలి వేష ధారణలో వచ్చి తోటి సభ్యులతో నిరసనలో పాల్గొన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:21 - April 4, 2018

ఢిల్లీ : 12 రోజులు..పార్లమెంట్ ఉభయసభల్లో ఊహించిందే జరుగుతోంది. వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. శుక్రవారం నాడు సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనైనా 'అవిశ్వాస తీర్మానాన్ని' అనుమనిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సాధ్యం కాక పోవచ్చని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు పెద్ద పెట్టున సభలో ఆందోళన చేస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

బుధవారం నాడు ప్రారంభమైన లోక్ సభ కొద్దిసేపటికే వాయిదా పడింది. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు. తిరిగి సమావేశం కాగానే కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు...ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ టిడిపి..వైసిపి..కాంగ్రెస్..సభ్యులు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే కొన్ని బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అవిశ్వాస తీర్మానం తీసుకోవడానికి అవకాశం లేదని..సభ్యులను లెక్కించే పరిస్థితి లేదని స్పీకర్ తెలిపారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు రాజ్యసభ ప్రారంభం కాగానే నూతన సభ్యుల చేత ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ సభ్యులు ఆందోళన చేశారు. సభ్యులు తీరుపై వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తం చూస్తోందని..చర్చకు అధికారపక్షం ఒప్పుకున్నా సభ్యులు ఆందోళన చేయడం తగదన్నారు. సభలో ముఖ్యమైన బిల్లులు ప్రవేశ పెట్టాల్సి ఉందని..సభ్యులు సహకరించాలని కోరారు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

12:21 - April 4, 2018

అమ్మ గురించి చెప్పాలంటే ఎన్ని మాటలైనా సరిపోవు. అమ్మ ప్రేమ గురించి చెప్పాలంటే కవులకు కూడా సాధ్యం కాదు. బిడ్డలకు కాస్తంత నలత చేస్తే చాలు అమ్మ ప్రాణం అల్లాడిపోతుంది. అటువంటి అమ్మ కోసం బిడ్డలు ఏం చేస్తున్నారు? కన్నతల్లి కి పట్టెడు మెతుకులు పెట్టాల్సి వస్తుందని నడిరోడ్డుపై వదిలివేసిన ఘటనలు ఎన్నింటి గురించి విన్నాం, చూసాం. కానీ అమ్మ విలువ గురించి తెలిసిన వారు మాత్రం తమ ప్రాణాలకు కూడా అడ్డువేసి అమ్మ ప్రాణాలకు కాపాడుకుంటారు. అటువంటివారి గురించి వినే వుంటాం..కానీ అమ్మ కోసం ఓ క్రూర మృగంతో పోరాడి అమ్మను కాపాడుకున్న ఘటన గురించి విని వుండం. కానీ అటువంటి ఘటన అమ్మ ప్రాణాన్ని ఓ క్రూర మృగం నుండి కాపాడుకునేందుకు ఓ అమ్మాయి చేసిన సాహసం సాధారణమైనది కాదు అమ్మపై దాడి చేసిన ఓ చిరుతపులిపై ఆడ సింహంలా లంఘించి అమ్మను కాపాకున్న ఓ కుమార్తె సాహసం, తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఆ సాహస యువతి గురించి తెలుసుకుని తీరాల్సిందే..

అమ్మకోసం చిరుతతో పోరాడిన రూపాలీ..
చిరుతపులిని చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి. అటువంటిది తమ జీవనాధారాన్ని కాపాడుకునేందుకు, ప్రాణాన్ని పంచి ఇచ్చిన అమ్మను కాపాడుకునేందుకు ఓ కుమార్తె చేసిన ధైర్య సాహసాలు అనన్యసామాన్యమైనవి. అలాంటిది చిరుతతోనే 15 నిమిషాలు విరోచితంగా పోరాడి తనతో పాటు తల్లిని కూడా కాపాడింది రూపాలీ అనే యువతి. గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె మంగళవారం డిశ్చార్జీ కావడంతో విషయం బైటప్రపంచానికి తెలిసింది.

మేకల కోసం వచ్చి చిరుత..
మహారాష్ట్రలోని సాకోలీ తాలుకా పరిధిలోని ఉస్‌గావ్‌లో మార్చి 24 రాత్రి 10 గంటల సమయంలో మేకలను కట్టేసిన ప్రాంగణం నుంచి శబ్ధం రావడంతో జీజాబాయి, ఆమె కుమార్తె రూపాలీ అనే 21 సంవత్సరాల యువతి బయటకి వచ్చి చూడగా రక్తపుమడుగులో పడివున్న మేక పిల్లల్ని చిరుత తినటాన్ని గమనించారు. వీరిని గమనించిన చిరుత తల్లీకూతుర్లపై దాడికి తెగబడింది. భయపడకుండా రూపాలీ కర్రతో చిరుతపై ఎదురు దాడికి దిగింది. 15 నిమిషాల పాటు పోరాడింది. ఓవైపు చిరుతపై దాడిచేస్తూ, మరోవైపు తన తల్లిని రక్షించుకునేందుకు ఆమెను వెనక్కి నెడుతూ ఇంట్లోకి వెళ్లి ప్రాణాలను రక్షించుకున్నారు. అనంతరం చిరుత పలాయనం చిత్తగించింది. తీవ్రంగా గాయపడిన రూపాలీని నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్యవిద్యా కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొంది కోలుకున్న రూపాలీని మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.

11:59 - April 4, 2018

ఢిల్లీ :  ఎన్డీయే భాగస్వామిగా వున్న అకాలీదళ్ నేత అకాలీదళ్ నేత సుఖ్ దేవ్ సింగ్ చంద్రబాబును కలవనున్నారు. హస్తినలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పలువురు పార్టీల అధినేతలతో ఆయన భేటీ అవుతున్నారు. రాష్ట్ర విభజన అనంతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులు, కేంద్రం ఇచ్చిన హామీలు, మాట తప్పిన వైఖ్రరి గురించి నేతలకు చంద్రబాబు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఏపీ భవన్ లో కలిసారు. అలాగే ఎన్డీయే ప్రభుత్వంతో భాగస్వామిగా వున్న అకాలీదళ్ నేత అకాలీదళ్ నేత సుఖ్ దేవ్ సింగ్ చంద్రబాబును కలవనున్నారు. ఇలా పలువురితో భేటీ అనంతరం మ.3గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మీడియాకు ఏపీ సమస్యలను, విభజన హామీలను, ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన హక్కులను చంద్రబాబు మీడియాకు పవర్ పాయింట్ ద్వారా వివరించనున్నారు. కాగా మంగళవారం చంద్రబాబు పలు పార్టీల అధినేతలను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు. అవిశ్వాసానికి మద్దతును కోరారు. 

సభ్యులపై వెంకయ్య ఆగ్రహం..

ఢిల్లీ : రాజ్యసభలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని చైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వెంకయ్య ఆగ్రహం వెలిబుచ్చారు. దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆయా పార్టీల సభ్యులను ఉద్దేశించి వెంకయ్య వ్యాఖ్యానించారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని సభ్యులు నడుచుకోవాలని ఆయన సూచించారు. దేశం అభివృద్ధిని కోరుకుంటుందని వెంకయ్య తెలిపారు.

హస్తినలో బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్..

ఢిల్లీ : సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మీడియాకు ఏపీ సమస్యలను, విభజన హామీలను, ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన హక్కులను వివరిస్తారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. మంగళవారం పలువురు నేతలను కలిసిన చంద్రబాబు ఈరోజు ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్ ను కలిసారని అవిశ్వాసానికి మద్ధతును తెలుపుతామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని సీఎం రమేశ్ తెలిపారు. అన్ని విషయాలను మ.3గంటలకు జాతీయ మీడియా సమావేశంలో తెలుపుతారని సీఎం రమేశ్ తెలిపారు. 

11:35 - April 4, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిష్టంభన నెలకొంటోంది. లోక్ సభలో అవిశ్వాస తీర్మాన నోటీసులను స్పీకర్ పరిగణలోకి తీసుకోవడం లేదనే సంగతి తెలిసిందే. బుధవారం నాడు సేమ్ సీన్స్ రిపీట్ అయ్యాయి. లోక్ సభ ప్రారంభమైన అర నిమిషానికే వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆసీనులయ్యే సమయానికే అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ, కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అర నిమిషంలోనే సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

ఇక రాజ్యసభ సమావేశం కాగానే ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఇటీవలే ఎన్నికైన నూతన సభ్యుల చేత ప్రమాణం చేయించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌లు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్రపై స్పందించిన చంద్రబాబు?..

ఢిల్లీ : సీఎం చంద్రబాబు జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పలు విషయాలను వెల్లడించారు. గుజరాత్ అల్లర్ల తర్వాత మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అందరికన్నా ముందు మీరే కదా డిమాండ్ చేశారు అనే ప్రశ్నకు బదులుగా... అవునని చంద్రబాబు సమాధానం చెప్పారు. జరిగిన విషయాలను చరిత్ర రికార్డుల నుంచి ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మోదీతో చేతులు కలిపానని... కానీ, ఆయన ఇలా చేస్తారని తాను అనుకోలేదని చెప్పారు. అప్పట్లో మీరు అన్న మాటలను మోదీ గుర్తుంచుకున్నారేమో అనే ప్రశ్నకు బదులుగా... గుర్తుంచుకొని ఉండవచ్చేమో అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

అది మీడియా వారే చెప్పాలి : చంద్రబాబు

ఢిల్లీ : రాజధాని ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్న చంద్రబాబును మీడియా పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఏపీకి కేంద్రం సహాయం చేయటం విషయంలో మోదీ ఎందుకు వెనకాడుతున్నారు? అనే అంశంపై కొనసాగింది. ఈ క్రమంలో ఏపీకి కేంద్రం సాయం చేస్తే, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలను అధిగమిస్తుందనే భావనతో మోదీ మీకు సహాయం చేయడం లేదా అనే ప్రశ్నకు బదులుగా... ఆ విషయాన్ని మీరే గ్రహించాలని చంద్రబాబు అన్నారు. 

వామపక్ష నేతలో పవన్ భేటీ..

విజయవాడ : జనసేన కార్యాలయంలో వామపక్ష నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ ఇంకా ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ వంటి పలుఅంశాలపై నేతలు చర్చిస్తున్నారు. 

తెలుగులో ప్రమాణం చేసిన గులాబీ సభ్యులు..

ఢిల్లీ : రాజ్యసభలో కొత్తగా ఎన్నికయిన ఎంపీల ప్రమాణస్వీకారం కార్యక్రమం కొనసాగుతోంది. చైర్మన్ వెంకయ్యనాయుడు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ సభ్యులు సంతోష్ కుమార్,లింగయ్య యాదవ్,బండ ప్రకాశ్ తెలుగులో ప్రమాణం చేశారు. 

టీ.హోమ్ మంత్రికి అరుదైన పురస్కారం..

హైదరాబాద్ : డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా జీవితసాఫల్య పురస్కారాన్ని నేడు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ప్రదానం చేయనున్నారు. రవీంద్రభారతిలో జరుగనున్న ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని హోంమంత్రికి అవార్డును అందజేస్తారు. రామ్‌మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా లోహియా విచార్‌మంచ్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, ప్రముఖ రచయిత కత్తి పద్మారావు, లోహియా జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బాలకిషన్‌రావు తదితరులు పాల్గొననున్నారు.

కొనసాగుతున్న వాయిదాల పర్వం..

ఢిల్లీ : లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఇదే తంతుతో నడుస్తున్న ఉభయసభలు కొనసాగుతుండగా..ఈరోజు కూడా సభ ప్రారంభమయిన కొద్ది నిమిషాలకే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. రోజు వలెనే అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్టు ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సభను మ.12గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.

ఎదురు కాల్పుల్లో 5గురు మావోలు మృతి..

హైదరాబాద్ : జార్ఖండ్ లోని రితేహార్ లోని భార్గవ్ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. 

10:57 - April 4, 2018

విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా...విభజన హామీలపై ఆయన గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వామపక్ష పార్టీలతో కలిసి పోరాటం చేయాలని ఆయన నిర్ణయించారు. బుధవారం వామపక్ష నేతలను పవన్ కలువనున్నారు. ఉదయం 11గంటలకు జనసేన కార్యాలయానికి పవన్ చేరుకోనున్నారు. అక్కడ సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు..రామకృష్ణలతో పవన్ భేటీ కానున్నారు. అనంతపురం కేంద్రంగా ఆమరణ నిరహార దీక్షపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం భవిష్యత్ కార్యాచరణనను పవన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. 

నటి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..

హైదరాబాద్‌ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందంటు నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు ప్రసార మాధ్యమాల్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టాలీవుడ్‌ ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధి పవన్‌ కళ్యాణ్‌ రెండు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. వారి సలహా మేరకు కేసు నమోదు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

దంపతులు ఆత్మహత్యాయత్నం..

భూపాలపల్లి : కుటుంబంలో భార్యా భర్తలిద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవటం, సమస్యలను సానుకూలం చేసుకునేందుకు సరైన అవగాహన లేకపోవటం వంటి పలు చిన్ని విషయాలతో ఆత్మహత్యలకు పాల్పడే సందర్భాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం వీఐపీ ఘాట్ వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. హరినాథ్, శ్యామల దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త హరినాథ్ మృతిచెందగా.. భార్య శ్యామల అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మహిళను చికిత్స నిమిత్తం మహాదేవ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు భూపాలపల్లి జిల్లా కొంపెల్లి వాసులుగా గుర్తింపు.

10:47 - April 4, 2018

ఓఆర్‌ఆర్, స్మార్ట్‌సిటీ పనులపై కేటీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ వరంగల్, మహబూబాబాద్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు కేటీఆర్, చందూలాల్, కడియం శ్రీహరి హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లారు. పర్యటన సందర్భంగా మంత్రులు చారిత్రక నగరం వరంగల్ మాస్టర్ ప్లాన్‌పై, పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఓఆర్‌ఆర్, స్మార్ట్‌సిటీ పనులపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఇప్పటికే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఓఆర్‌ఆర్‌తో మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసింది. మాస్టర్ ప్లాన్ 20 ఏళ్లకు పైగా అమల్లో ఉండేవిధంగా రూపకల్పన వంటి పలు అంశాలపై మంత్రి సమీక్షించనున్నారు.

10:46 - April 4, 2018

ఢిల్లీ : హస్తినలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. లోక్ సభలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది ? ప్రతి రోజు జరిగినట్లుగానే ఈ రోజు కూడా అదే కొనసాగుతుందా ? గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఉభయసభలు సజావుగా జరగడం లేదనే సంగతి తెలిసిందే. ఏపీకి విభజన హామీలు...ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్..సీపీఎం..వైసీపీ..టిడిపి వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కానీ ఈ వాయిదా తీర్మానాలపై స్పీకర్ సుమిత్రా మహజన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేస్తుండడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శుక్రవారం నాటి వరకు జరిగే సమావేశాల లోపు చర్చకు అనుమతినిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. బుధవారం నాడు ప్రారంభమయ్యే సమావేశంలో సేమ్ సీన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలువురు జాతీయ నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. 

మ.3గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం..

ఢిల్లీ : హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్న సీఎం చంద్రబాబు పలు పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్ధతునివ్వమని నేతల మద్ధతును కోరుతున్నారు. ఇప్పటికే పలు పార్టీ అధినేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈరోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అలాగే అకాలీదళ్ నేత సుఖ్ దేవ్ సింగ్ చంద్రబాబును కలవనున్నారు. ఇలా పలువురితో భేటీ అనంతరం మ.3గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

వామపక్ష నేతలతో మరోసారి పవన్

విజయవాడ : జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి వామపక్ష నేతలతో భేటీ కానున్నారు. వామపక్ష నేతలతో జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ ప్రణాళికపై పవన్ చర్చించనున్నారు. 

అందుకే మోదీ మొహం చాటేశారు : ఆజనేయులు

అమరావతి : ఏపీని మోసం చేశారు కాబట్టే ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబుని చూడగానే మొహం చూపించలేక పక్కకు వెళ్లిపోయారని టీడీపీ నేత ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ప్రజాస్వామాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని విమర్శించారు.

హస్తినలో వేడెక్కిన ఏపీ రాజకీయం..

ఢిల్లీ : హస్తినలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఏపీ విభజన సాధన కోసం కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీలో పలు పార్టీల నేతలతో భేటీ అవుతు బిజీ బిజీగా గడుపుతున్నారు. జాతీయస్థాయి పార్టీలు, నేతల మద్దతును చంద్రబాబు కూడగడుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కేజ్రీవాల్ అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు పార్టీ అధినేతలలో చంద్రబాబు భేటీ అయ్యారు. విభజన హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అవలంభిస్తున్నా తీరును వివరిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఉభయసభలు అవలంభిస్తున్న తీరు ఈరోజుకూడా రిపీట్ కానుందా?

10:18 - April 4, 2018

ఢిల్లీ : విభజన హామీల అమలు..కేంద్రంపై వత్తిడి పెంచేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీకి వచ్చిన బాబు వివిధ జాతీయ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. బుధవారం ఆంధ్రా భవన్ లో బాబును ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రాలపై కేంద్రం ఎలా పెత్తనం చేస్తోంది....ఏపీ రాష్ట్రం పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తోంది..విభజన సమయంలో ఇచ్చిన హామీలు..నాలుగు సంవత్సరాల కాలంలో హామీల అమలు..ఇతరత్రా అంశాలపై కేజ్రీవాల్ కు బాబు సుదీర్ఘంగా వివరణనిచ్చారు. ఈ భేటీ ముగిసిన అనంతరం టిడిపి ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు.

సీఎం కేజ్రీవాల్ ఆంధ్రా భవన్ కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే దానిపై చర్చించారని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హామీల అమలు కోసం ఏపీ రాష్ట్రం చేస్తున్న పోరాటానికి తాము మద్దతిస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారని తెలిపారు. ప్రస్తుతం ఫ్రంట్ ఏర్పాట్లు ఏమీ చేయడం లేదని..ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయత్నాలు చేయడం జరుగుతోందన్నారు.

విభజన హామీల సాధన కోసం జాతీయ స్థాయి పార్టీలు, నేతల మద్దతును బాబు కూడగడుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని..ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రచురించిన బుక్ లెట్ ను వారికి అందిస్తున్నారు. బాబు పార్లమెంట్ హాల్ కు బుధవారం కూడా వెళ్లనున్నారు. పలువురు జాతీయ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా బీజేపీ కురువృద్ధుడు అద్వానీతో కూడా సమావేశమవుతారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిని సీఎం రమేష్ ఖండించారు. 

బాబుకు ఆప్ మద్దతు...

ఢిల్లీ : విభజన హామీల సాధన కోసం ఏపీ చేస్తున్న పోరాటానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలియచేయడం జరిగిందని టిడిపి ఎంపీ రమేష్ పేర్కొన్నారు. కాసేపటి క్రితం కేజ్రీ...బాబు భేటీ ముగిసింది. 

ఏపీ శాసనసభలో చర్చించే అంశాలివే..

అమరావతి : ఏపీ శాసనసభలో పలు అంశాలపై చర్చించనున్నారు. రైతు బంధు పథకం,రాష్ట్రంలో పెట్టుబడులు, వేతనాల్లో వ్యత్యాసం,ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంక్షేమం, దివ్యాంగులకు పెద్ద గ్రంధాలయాలు,జాతీయ ఉపకారవేతనం,జనరిక్ మందుల దుకాణాలు,వారసత్వ నిర్మాణాలు, విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ విద్యాసంస్థల స్థితిగతులు వంటి పలు అంశాలపై శాసనసభ చర్చించనుంది. 

ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు..

అమరావతి : నేడు ఏపీ శాసనసభలో ప్రభుత్వం నాలుగు బిల్లలు ప్రవేశపెట్టనుంది. పోలీస్ సంస్కరణలు, ప్రయివేటు వర్శిటీల బిల్లులు, సహకార సంఘాల సంస్కరణల బిల్లు,ఆర్థికాభివృద్ధి మండలి సంస్కరణల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.  

09:18 - April 4, 2018

ఢిల్లీ : విభజన హామీల సాధన కోసం కేంద్రంపై వత్తిడి పెంచేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోరు పెంచుతున్నారు. ఢిల్లీ వేదికగా ఆయన కేంద్ర వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ జాతీయ పార్టీ నేతలను కలిసి ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు..అమలు..ఇతరత్రా అంశాలను బాబు వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం తృణముల్ కాంగ్రెస్, ఎన్సీపీ, అకాలీదళ్, శివసేన, బీజేడీ, ఆర్జేడీ, సమాజ్ వాదీ, బీఎస్పీ, డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీలను బాబు కలిశారు. బుధవారం ఆంధ్రాభవన్ లో బాబును ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలిశారు. మధ్యాహ్నం మూడు గంటలకు బాబు జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది చూడాలి.

మరోవైపు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా ? లేదా ? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేస్తుండడం...సభ ఆర్డర్ లో లేదంటూ సభను స్పీకర్ సుమిత్రా మహజన్ వాయిదా వేస్తుండడం తెలిసిందే. బుధవారం కూడా ఇదే సీన్ పునరావృతమౌతుందని అంచనా. 

కేజ్రీవాల్ తో బాబు భేటీ...

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కలిశారు. ఆయన్ను బాబు అల్పాహార విందుకు ఆహ్వానించారు. విభజన హామీల సాధన కోసం జాతీయ స్థాయి పార్టీలు, నేతల మద్దతును బాబు కూడగడుతున్నారు. 

08:32 - April 4, 2018

టాన్సిల్స్ సర్జరీ వికటించి...

హైదరాబాద్ : కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో టాన్సిల్ సర్జరీ వికటించి బాలుడు మృతి చెందాడు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన నిర్వహించారు. 

08:29 - April 4, 2018

హైదరాబాద్ : కోఠి ప్రసూతి ఆసుపత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు..బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసూతి ఆసుపత్రిలో శిశువు మృతి చెందడం కలకలం రేగింది. మణెమ్మ అనే గర్భిణీ ప్రసూతి ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. కానీ శిశువు మృతి చెందిందని వైద్యులు పేర్కొనడంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అసలు పట్టించుకోలేదని టెన్ టివితో వాపోయింది. వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఎల్ బినగర్ లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : ఎల్ బినగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పుల్లారెడ్డి కాలనీలోని పిండి పుల్లారెడ్డి గార్డెన్ లో డెకరేషన్ నిల్వ చేసే గోదాంలో మంటలు చెలరేగాయి. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు యంత్రాలతో మంటలను ఆర్పారు. 

08:21 - April 4, 2018

హైదరాబాద్ : ఎల్ బినగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పుల్లారెడ్డి కాలనీలోని పిండి పుల్లారెడ్డి గార్డెన్ లో డెకరేషన్ నిల్వ చేసే గోదాంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు గార్డెన్ చుట్టూ వ్యాపించాయి. అక్కడనే ఉన్న సిబ్బంది గమనించి అగ్నిప్రమాద శాఖకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు యంత్రాలతో మంటలను ఆర్పారు. పక్కనే ఉన్న సెల్లార్ కు మంటలు వ్యాపించడంతో పార్కింగ్ చేసి ఉన్న ఆరు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించిందని తెలుస్తోంది. 

అదుపు తప్పిన లారీ...

కామారెడ్డి : బిచ్కుంద (మం) రాజుళ్లగేటు ఎన్ హెచ్ పై అదుపుతప్పిన ఓ లారీ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు రాజస్థాన్ పాలి జిల్లా సుశాల్ పూర్ వాసులుగా గుర్తించారు. 

ఏపీ శాసనసమండలిలో...

విజయవాడ : ఏపీ శాసనసమండలిలో పలు అంశాలపై చర్చ జరుగనుంది. రైతు బంధు పథకం, రాష్ట్రంలో పెట్టుబడులపై..వేతనాల్లో వ్యత్యాసం, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంక్షేమంపై, దివ్యాంగులకు పెద్ద గ్రంథాలయాలు, జాతీయ ఉపకార వేతన పథకం, జనరిక్ మందుల దుకాణాలు, వారసత్వ నిర్మాణాలు, విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ విద్యా సంస్థల స్థితిగతులపై చర్చ జరుగనుంది. 

ఏపీ శాసనసభలో...

విజయవాడ : ఏపీ శాసనసభలో నాలుగు బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. పోలీసు శాఖలో సంస్కరణలు, ప్రైవేటు వర్సిటీల బిల్లులు, సహాకర సంఘాల సంస్కరణల బిల్లులు, ఆర్థికాభివృద్ధి మండలి సంస్కరణల బిల్లులను ప్రవేశ పెట్టనుంది. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులపై చర్చ జరుగనుంది. 

08:10 - April 4, 2018
08:04 - April 4, 2018

తప్పుడు వార్తలు రాసినట్లు నిర్థారిస్తే జర్నలిస్టు గుర్తింపును రద్దు చేస్తామని కేంద్రం సరికొత్త ఆంక్షలు విధించింది. కేంద్ర సమాచార శాఖ నిర్ణయంపై మీడియా వర్గాలు, విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్), ఆచారి (బిజెపి), కాచం సత్యనారాయణ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:22 - April 4, 2018

ప్రస్తుతం ఎండాకాలం ఎండల కంటే పెట్రోల్‌ డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. నాలుగేళ్ల గరిష్టానికి పెట్రోల్‌ ధర చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర పెరగడమే దీనికి కారణమని పాలకులు చెబుతున్నారు. కానీ పాలకులు చెబుతున్న కారణాలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నింటికీ జీఎస్టీ వర్తించినప్పుడు.. పెట్రోల్‌, డీజిల్‌కు ఎందుకు వర్తించదని జనం నుంచి బలమైన వాదన వినిపిస్తోంది. అసలు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరగడానికి కారణాలేంటి ? తగ్గించడానికి పాలకులు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ? వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రానికి ఉన్న అభ్యంతరాలేంటి ? ఈ అంశంపై ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు శశికుమార్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:16 - April 4, 2018

కడప : జిల్లాలో పిడుగుపాటుకు తల్లీ, కూతురు మృతిచెందారు. చాపాడు మండలం వెదురూరు గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం కూలీ పనులకు వెళ్ళిన ఖాసింబీ, అయేషా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

07:15 - April 4, 2018

రాజన్న సిరిసిల్ల : గత రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదిహేను వందల ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని జిల్లా లెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు. ముస్తాఫాబాద్‌, ఎల్లారెడ్డిలో వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌, రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్యతో పాటు.. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. దెబ్బతిన్న పంట నష్టం గురించి ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు వివరించి... రైతులకు న్యాయం జిరిగేలా చూస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. 

 
07:13 - April 4, 2018

హైదరాబాద్ : ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుతో దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్తోన్న గులాబి బాస్‌.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. దేశవ్యాప్తంగా దళితులు నిర్వహించిన బంద్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దేశంలో జరుగుతున్న పరిణామాలను ఇప్పటి వరకు పట్టించుకోని కేసీఆర్‌... ఇప్పుడు దేశ రాజకీయాల్లో క్రీయశీలక పాత్ర పోషించాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

దేశ రాజకీయాల్లో పాగా వేయాలని భావిస్తున్న కేసీఆర్‌ అందుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దేశ పరిణామాలపై టీఆర్‌ఎస్‌ ఈ మధ్య స్పందిండచం మొదలు పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి ప్రధాని నరేంద్రమోదీ హవా తగ్గింపోతుందని అంచనా వేస్తున్న కేసీఆర్...కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా మరో వేదికను ఏర్పాటు చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగమే ఫెడర్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు. దీంతోపాటు దేశ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఆయన నిశితంగా గమనిస్తున్నారు.

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలను నిరసిస్తూ దళిత, గిరిజనలు ఇచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. భారత్ బంద్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలకు కాంగ్రెస్, బిజెపిలే బాధ్యత వహించాలని కేసీఆర్ వ్యాఖ్యానించడం దేశ రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తోంది. దేశంలో దళిత, గిరిజనల కోసం బ్రిటిష్ కాలం నుంచే ప్రత్యేక చట్టాలున్నాయని టీఆర్‌ఎస్‌ సీనియర్‌మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. వాటిని గత ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయకపోవడంతో దళిత, గిరిజనుల్లో మార్పు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ప్రతిఏటా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు హరీశ్‌.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాలపై స్పందించడంలో రాజకీయ వ్యూహం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు హరీశ్‌రావు కూడా నేషనల్‌ పాలిటిక్స్‌పై స్పందిండచం కేసీఆర్‌ వ్యూహమేనన్నది తేటతెల్లమవుతోంది. దేశ రాజకీయాలపై ఇక మీదట టీఆర్‌ఎస్‌ మరింత దూకుడుగా వ్యవహరించనుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి దేశ రాజకీయాల్లో గులాబి దళపతి ఎంత వరకు రాణిస్తారన్నది వేచి చూడాలి.

07:12 - April 4, 2018

కరీంనగర్ : మంథనిలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ దమనకాండను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ నేతలపై మాజీమంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నాయకులు అహంకార భావంతో కాంగ్రెస్‌ సమావేశాలకు వెళ్ళేవారిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా 30మందిని చంపేసినా... ఒక్క వేబిల్లుతో మూడు లారీలు తిరుగుతున్నా పట్టించుకోని టీఆర్‌ఎస్‌ నాయకులు... తమ పార్టీ మీటింగ్‌కు వచ్చే వారిని అడ్డుకుంటారా అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అభివృద్ధి పేరిట.. అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. మంథని చుట్టుపక్కల ప్రాంతాల్లాలో సాగునీరు అందక రైతాంగం నష్టపోతుంటే.. మంత్రి హరీశ్‌రావు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మా నీరు - మా హక్కు పేరుతో ఆందోళన చేస్తానని ప్రకటించారు. 

07:11 - April 4, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అధికారపార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అమాయకులైన రైతుల భూములను లాగేసుకుంటున్నారు. వడ్డీకి డబ్బులు ఇవ్వడం.. వాటిపై చక్రవడ్డీ, బారువడ్డీల పేరుతో డబ్బులు గుంజడం.... కట్టలేని వారి నుంచి భూములు లాగేసుకోవడం ఇక్కడి నేతలకు పరిపాటిగా మారింది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ రైతులకు డబ్బులిచ్చిన గులాబీ నేత... ఆ రైతుకు తెలియకుండానే అతని భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలోవెలుగు చూసింది.

ఎక్కల్‌దేవి సాయిలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని కొండాపూర్‌ స్వగ్రామం. కొన్నాళ్లుగా సాయిలు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయిలు కాలేయం దెబ్బతింది. ఆసుపత్రిలో చూపించుకుంటే భారీగా ఖర్చవుతుందని సూచించారు. తన దగ్గర అంత డబ్బులేకపోవడంతో ఫైనాన్స్‌ వ్యాపారి అయిన మురళీమోహన్‌ను ఆశ్రయించాడు. లక్ష రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... అసలు కథ ఇక్కడే మొదలైంది.

బొల్లి మురళీమోహన్‌ సోదరుడైన బొల్లి రాంమోహన్‌ అధికారపార్టీకి చెందిన నాయకుడు. రాంమోహన్‌కు టీఆర్‌ఎస్‌లోని యువమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అన్న రాజకీయ పలుకుబడిని ఆసరా చేసుకున్న బొల్లి మురళీమోహన్‌ అనేక అక్రమాలకు తెగబడుతున్నాడు. సాయిలు తీసుకున్న లక్ష రూపాయల అప్పుకింద అతని భూమిని లాగేసుకోవాలని ప్లాన్‌ చేశాడు. సాయిలుకుగానీ.. అతని కుటుంబ సభ్యులకుగానీ తెలియకుండా 56 గుంటల భూమి తనపేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.

తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు చేపట్టిన భూసర్వేలో సాయిలు పేరు లేకపోవడంతో బొల్లి మురళీమోహన్‌ అక్రమాల చిట్టా బయటపడింది. దీంతో సాయిలు కుటుంబ సభ్యులు మురళీమోహన్‌ను నిలదీశారు. దీంతో మరికొన్ని డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికాడు. అప్పటి నుంచి రేపుమాపు అంటూ తిప్పుకుంటున్నాడు తప్పా డబ్బులు ఇవ్వడం లేదని సాయిలు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుగా లక్ష రూపాయలు ఇచ్చి తమ భూమిని మురళీమోహన్‌ అక్రమంగా లాగేసుకున్నాడని సాయిలు వారు ఆరోపిస్తున్నారు.

బొల్లి మురళీమోహన్‌ ఇంటిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో సాయిలు కుటుంబ సభ్యులు అతడి ఇంటిముందు బైఠాయించారు. మీడియా కూడా అక్కడికి చేరుకోవడంతో సమస్య పరిష్కరించుకుందామంటూ మురళీమోహన్‌ సోదరుడు బొల్లి రాంమోహన్‌ అక్కడి నుంచి వారిని తరలించి మెల్లిగా జారుకున్నాడు. తమకు న్యాయం చేయకపోతే మురళీమోహన్‌ ఇంటి ముందు దీక్షకు దిగుతామని బాధితులు తేల్చి చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

07:09 - April 4, 2018

కొత్తగూడెం / కరీంనగర్ : తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ది మోసాల చరిత్రని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దే నన్నారు. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో ప్రగతిసభలో పాల్గొన్న కేటీఆర్‌ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ముల్కీ రూల్స్ విషయంలో ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలంతా తిరగబడితే తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ ఒరగబెట్టిందేమి లేదన్న కేటీఆర్‌... దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. పూర్వ ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని కేటీఆర్ వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. గత నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా కరీంనగర్‌జిల్లా మంథనిలో జరిగిన భారీ బహిరంసభలో ఉత్తమ్‌ మాట్లాడారు.  

07:07 - April 4, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కేసులో సర్కారుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి.. ప్రభుత్వ తీరుపై న్యాయస్థానం పదే పదే మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇప్పుడిక మూడు రోజుల్లోపు వీడియో ఫుటేజీతో కూడిన కౌంటర్‌ దాఖలు చేయకుంటే.. ఈకేసులో ఇక కౌంటరే ఉండదని భావించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అంటే.. రద్దయిన ఎమ్మెల్యే సభ్యత్వం పునరుద్ధరించాల్సిన పరిస్థితి తప్పేలా లేకపోవడంతో.. కేసీఆర్‌ సర్కారు ఇరకాటంలో పడింది.
అసెంబ్లీ వాయిదా పడినందున.. సభలో తీర్మానం చేయనిదే ఫుటేజీ ఇవ్వలేమంటూ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ఆగ్రహించిన న్యాయస్థానం, మీరు అసెంబ్లీ సెక్రెటరీ తరఫున వాదిస్తున్నారా అని నిలదీసింది. దీంతో తాను ప్రభుత్వం తరఫున మాత్రమే వాదనలు వినిపిస్తానని, కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. ఇప్పటికే మూడు వాయిదాలు తీసుకున్నందున.. వెంటనే వాదనలు ప్రారంభించాలని న్యాయస్థానం అదేశించింది. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ కేసులో కౌంటర్‌ దాఖలుకు చివరి అవకాశం ఇస్తున్నామంది. కేవలం మూడు రోజుల్లోపే అంటే.. ఈనెల ఆరవ తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని, ఒకవేళ ఆలోపు కౌంటర్‌ దాఖలు చేయకుంటే.. ఈ కేసులో ఇక కౌంటర్‌ ఉండదని భావించాల్సి ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది.

మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వ రద్దు విషయంలో.. సర్కారు ఇరకాటంలో పడ్డట్టే కనిపిస్తోంది. ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నందునే ప్రభుత్వం పదేపదే గడువు కోరుతోందని, న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా చేయడం సర్కారుకు ఒక దెబ్బకాగా.. తాజాగా కౌంటర్‌ దాఖలుకు కోర్టు మూడు రోజుల డెడ్‌లైన్‌ విధించడం మరో దెబ్బగా భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఆరోతేదీన వీడియో ఫుటేజీతో కూడిన కౌంటర్‌ దాఖలు చేస్తుందో లేదో వేచి చూడాలి.

07:03 - April 4, 2018

విజయవాడ : వైసీపీ పన్నిన రాజకీయ ఉచ్చులోపడి టీడీపీ విలవిల్లాడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామా నుంచి ఎన్డీయే నుంచి వైదొలగడం, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం వరకు వైసీపీ అజెండా నిర్దేశించిందన్నారు. ఈ విషయంలో వైసీపీ విజయం సాధించిందని చెప్పారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో టీడీపీ మరింత బలహీన పడిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు జాతీయ పార్టీ నేతలు ఆయన్ను కలుసుకోడానికి క్యూ కట్టేవారన్నారు. ఇప్పుడు చిన్నా చితక నేతలును కలిసి చంద్రబాబు.. తన స్థాయిని దిగజార్జుకున్నారని చెప్పారు.

 

07:02 - April 4, 2018

ఢిల్లీ : బీజేపీతో ఇక శాశ్వతంగా తెగదెంపులేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఆయన పలువురు జాతీయ పార్టీల నాయకులను కలిశారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేసిన మోసాన్ని వారికి వివరిస్తూ.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన దిశగా..... సీఎం చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రే ఢిల్లీ చేరిన చంద్రబాబు.. మంగళవారం ఉదయం నుంచే జాతీయ పార్టీల నాయకులను కలుసుకోవడం ప్రారంభించారు. తొలుత.. పార్లమెంటు భవన్‌కు చేరుకున్న చంద్రబాబు.. అక్కడి గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం.. పార్లమెంటు ప్రవేశమార్గంలోని మెట్లకు నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు.

పార్లమెంటు సెంట్రల్‌హాల్‌కు చేరుకున్న చంద్రబాబు.. వివిధ పార్టీల నాయకులను కలుసుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌జోషి, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌, ఎన్‌సీపీ నేతలు శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. అదే క్రమంలో.. టీఎంసీ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులను కలిసి మాట్లాడారు. ఈసందర్భంగా విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు. ఏపీ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షను వివరించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన 19 పెండింగ్‌ అంశాలను ఆయన మీడియా ముందు వివరించారు. పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన కేంద్రం తిరిగి వెనక్కి తీసుకున్న విధానాన్ని చంద్రబాబు వివరించారు. దాంతో పాటు బీజేపీతో ఇకపై ఎలాంటి సంబంధాలు ఉండబోవని చంద్రబాబు తేల్చి చెప్పారు. తన పర్యటన పూర్తిగా విభజన హామీల అంశంపైనే తప్ప రాజకీయ ఉద్దేశాలేమీ లేవన్నారు. బీజీపీ, వైసీపీల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, ఒక అవినీతి పార్టీని చేరదీసినందుకే కమలం పార్టీతో తెగదెంపులు చేసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా వివిధ రాజకీయపార్టీల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అయిందని టీడీపీ ఎంపీలు అంటున్నారు. బుధవారం పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాసానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందంటున్నారు. 

నేడు వర్షాలు ?

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం నుంచి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నట్లు సమాచారం. 

ఏపీ హైకోర్టు ఎన్నికలు...

హైదరాబాద్ : ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సీనియర్‌ న్యాయవాదులు పోటీ పడుతున్నారు. 

డబుల్ బెడ్ రూం నివాసాల ప్రారంభం...

నిర్మల్: నిర్మ‌ల్ మండ‌ల కేంద్రం ఎల్ల‌ప‌ల్లిలో డబుల్ బెడ్ రూం గృహాలను మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ప్రారంభించనున్నారు. 

యూ ట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద కాల్పులు...

వాషింగ్టన్ : అమెరికాలోని శాన్ బ్రూన్ లో ఉన్న యూ ట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద కాల్పులు కలకలం రేగాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. కాల్పులకు తెగబడిందని మహిళ అని, కాల్పులు చేసిన అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 

విజయవాడకు వెళ్లనున్న పవన్...

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు వెళ్లనున్నారు. వామపక్ష పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. అనంతరం పవన్ భవిష్యత్ కార్యాచరణనను ప్రకటించనున్నారు. 

కేజ్రీవాల్ తో భేటీ కానున్న బాబు..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో బాబు భేటీ కానున్నారు. ఉదయం 9గంటలకు ఏపీ భవన్ లో ఈ భేటీ జరుగనుంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కు బాబు అల్పాహార విందు ఇవ్వనున్నారు. 

Don't Miss