Activities calendar

05 April 2018

22:13 - April 5, 2018

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం కార్మిక లోకం కదం తొక్కింది.  ఉక్కు కర్మాగారం  ప్రైవేటీకరణకు జరుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కార్మికులు ఉద్యమబాట పట్టారు. తెన్నేటి విశ్వనాథంతోపాటు ఎందరో  మహనీయుల త్యాగాలతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీలో వాటాలు విక్రయిస్తే ప్రతిఘటిస్తామని ప్రతినపూనారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించే వరకు ఉద్యమాన్ని విరమించబోమని సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన వైజాగ్‌ స్టీల్‌ మార్చ్‌ స్పష్టం చేసింది. 

విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలన్న డిమాండ్‌తో కార్మికులు కదం తొక్కారు. ఈ ప్లాంట్‌  ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కార్మికులు మహోద్యమాన్ని ప్రారంభించారు. ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి నడుం బిగించారు. విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు.. అంటూ నినదించారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన వైగాజ్‌ స్టీల్‌ మార్చ్‌లో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులతోపాటు  నగర ప్రజలు పాల్గొన్నారు. 

కూర్మన్నపాలెంలోని స్టీల్‌ ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌  వద్ద ఉన్న అంబేడ్కర్‌, పూలే, ఇందిరాగాంధీ, తెన్నేటి విశ్వనాథం విగ్రహాలకు పూలమాలు వేసి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు వైజాగ్‌ స్టీల్‌ మార్చ్‌ని ప్రారంభించారు.  వేలాది మంది ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. వైజాగ్‌ స్టీల్‌ మార్చ్‌కి సంఘీభావంగా నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాహంలా  సాగిన పాదయాత్రలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ కార్మికలోకం చేసిన నినాదాలతో నగరం హోరెత్తింది. 

స్టీల్‌ ప్లాంట్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర జిల్లా కలెక్టరేట్‌ వరకు దాదాపు 26 కి.మీ. మేర సాగింది. కలెక్టరేట్‌ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన సీఐటీయూ నాయకులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై విరుచకుపడ్డారు. సొంత గనుల కోసం స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం చేసుకున్న ఏడు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడాన్ని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు తప్పుపట్టారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించే వరకు ఉద్యమాన్ని కొసాగిస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ స్పష్టం చేశారు. 

అంతకు ముందు వైజాగ్‌ స్టీల్‌ మార్చ్‌లో పాల్గొన్న కార్మికులు... స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలపై గళం విప్పారు.  ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీలు, కర్మాగారాలులేని గాలి జనార్దన్‌రెడ్డి వంటి వ్యక్తులకు ఇనుప ఖనిజ గనులు కేటాయిస్తున్న ప్రభుత్వాలు.. విశాఖ ఉక్కుకు కేటాయించకపోవడాన్ని కార్మికులు తప్పుపట్టారు.

సొంత గనులు కేటాయించకుండా విశాఖ ఉక్కును నీరుకారుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కార్మికులు విరుచుకుపడ్డారు. వాటాలు విక్రయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విశాఖ ఉక్కుకు భూములిచ్చిన నిర్వాసితులకు ఇంతవరకు ఉపాధి కల్పించని స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్య వైఖరిని కూడా కార్మికలోకం తప్పుపట్టింది. స్టీల్‌ ప్లాంట్‌ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని మహోధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. 
 

22:09 - April 5, 2018

కరీంనగర్‌ : జిల్లా కేంద్రంలో జరిగిన బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతోత్సవాలు రసాభాసగా మారాయి. కార్యక్రమానికి హాజరైన దళిత సంఘాల నాయకులు  ఇసుక మాఫియా ఆగడాలు, నేరెళ్లలో బలహీనవర్గాలపై అగ్రకులాల దురహంకారంపై ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేయడంతో గొడవ ప్రారంభమైంది. దీనిపై మంత్రి ఈటల రాజేందర్‌ వివరణ ఇచ్చుకోక తప్పలేదు. మరోవైపు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌... టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాల్‌కిషన్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు గొడవకు కారణమయ్యాయి. 
 

22:07 - April 5, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా.. రేపు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జనసేన, సీపీఎం, సీపీఐ పాదయాత్ర చేపట్టనున్నాయి. ఈ పాదయాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు. శాంతియుతంగా జరిగే ఈ పాదయాత్రకు ప్రజలంతా సహకరించాలని జనసేన అధికార ప్రతినిధి హరిప్రసాద్‌ కోరారు.  

22:05 - April 5, 2018

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన పుస్తకాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. విజయవాడంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌తోపాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హూజ్‌ క్యాపిటల్‌ అమరావతి? పేరుతో ఇంగ్లీషులో, ఎవరి రాజధాని అమరావతి ? పేరుతో తెలుగులో ఈపుస్తకాన్ని ప్రచురించారు. వడ్డే శోభనాద్రీశ్వరావుకు ఈ పుస్తకాలను అంకితం ఇచ్చారు.  మాజీ ఎంపీ ఉండవల్లి ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఏపీ రాజధాని అమరావతి ... మయన్మార్‌ కొత్త రాజధాని నైపైడ తరహాలో దెయ్యాల నగరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

 

22:04 - April 5, 2018

విజయవాడ : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ 111వ జయంతిని సీపీఎం ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని శిఖామణి సెంటర్‌లో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు ఆపాలంటే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. దళితుల రక్షణ కోసం పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామన్నారు. నేటి నుంచి అంబేద్కర్‌ జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మధు పిలుపునిచ్చారు. 

  

22:01 - April 5, 2018

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడిన తర్వాత టీడీపీ ఎంపీలు సభలోనే ఉండి ఐదు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర వైఖరిని నిరసిస్తూ రాజ్యసభలో నిరసన తెలుపున్న ఎంపీలను  రాత్రి 8 గంటల సమయంలో మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. రాజ్యసభ సభ్యుల నిరసనకు సంఘీభావంగా పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో టీడీపీ లోక్‌సభ సభ్యులు ఆందోళన చేశారు. వీరిని కూడా మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. 

21:58 - April 5, 2018

ఢిల్లీ : 12వరోజూ పార్లమెంట్‌లో తీరుమారలేదు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలూ రేపటికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ వాయిదాపడ్డా టీడీపీ ఎంపీలు అక్కడే ఉండి ఆందోళన చేపట్టడం ఉత్కంఠకు దారితీసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందని ఆరోపిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు మానవహారం చేపట్టాయి. రాజ్యసభ ఛైర్మన్‌ కార్యాలయం నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు  చేపట్టిన ఈ మానవహారంలో అన్నాడిఎంకే, వైసీపీ తప్ప అన్ని విపక్ష పార్టీలు పాల్గొన్నాయి. 
వాయిదాల పర్వం 
పార్లమెంట్‌ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. 12వ రోజు కూడా సభలో తీరు మారలేదు. ఉదయం 11 గంటకు లోక్‌సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ వారు స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. గంట వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మళ్లీ అదే సీన్‌ రిపీటైంది. అన్నాడీఎంకే సభ్యులు పట్టువీడకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. అవిశ్వాసం సహా అన్ని అంశాలపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ అన్నారు. ఎంపీల ఆందోళన మధ్యే అవిశ్వాసం నోటీసును స్పీకర్‌ చదివి వినిపించారు. సభ్యులు వినిపించుకోకపోవడంతో స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన
అటు పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ ... కావేరీ యాజమాన్య బోర్డుపై అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ పరిస్థితి మారలేదు. డిఫ్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభ్యులకు నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు. ఓ దశలో ఆందోళన చేస్తున్న సభ్యులను ఎందుకు సస్పెండ్‌ చేయకూడదని కురియన్‌ ప్రశ్నించారు. సభ్యులు ఎంతకూ వినకపోవడంతో కురియన్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 
టీడీపీ సభ్యులు సభలోనే కూర్చుని నిరసన 
ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు సభలోనే కూర్చుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. టీడీపీ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి మోహనరావు, కనకమేడల రవీంద్రకుమార్‌, సీతారామలక్ష్మిని సభ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రాజ్యసభ సిబ్బంది, మార్షల్స్‌ ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. సభ్యులకు బీపీ లెవల్స్‌ తగ్గడంతో.. వైద్యులు పరీక్షించారు. ఎంపీ అవంతి శ్రీనివాస్‌ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆర్ ఎమ్ ఎల్ ఆస్పత్రికి తరలించారు.  
విపక్షాలు మానవహారం 
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు పార్లమెంటు ప్రాంగణంలో మానవహారం చేపట్టాయి. రాజ్యసభ ఛైర్మన్‌ కార్యాలయం నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు  చేపట్టిన మానవహారంలో కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌, ఎన్సీపీ, వామపక్షాలు, డీఎంకే తదితర విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి అన్నాడీఎంకే, వైసీపీ గైర్హాజరయ్యాయి. సీబీఎస్‌ఈ పేపర్‌ లీక్‌, పీఎన్‌బీ కుంభకోణం, ఎస్సీ, ఎస్టీ చట్టం, కావేరీ బోర్డు ఏర్పాటు, ఏపీకి ప్రత్యేకహోదా వంటి అంశాలపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ, వైసీపీ ఆందోళన కొనసాగించాయి. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ డాక్టర్‌, లాయర్‌ వేషధారణలో వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
నిరవధిక నిరహార దీక్షలు చేస్తాం : వైసీపీ 
శుక్రవారం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖలు అందించాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు. ఆ తర్వాత ఏపీ భవన్‌కు వెళ్లి నిరవధిక నిరహార దీక్షలు చేస్తామని ప్రకటించారు. 
వైసీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదన్న టీడీపీ 
అటు పార్లమెంట్‌ముందు చేపట్టిన మానవహారంలో వైసీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని టీడీపీ ప్రశ్నించింది. సభ వాయిదా పడగానే.. లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తారన్న వైసీపీ.. రాజ్యసభ సభ్యులతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని టీడీపీ ఎదురుదాడికి దిగింది.  
చివరి రెండు రోజులూ... సమావేశాలకు హాజరు కాకూడదని టీఆర్‌ఎస్‌ నిర్ణయం 
మరోవైపు..  చివరి రెండు రోజులూ... లోక్‌సభ సమావేశాలకు హాజరు కాకూడదని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈమేరకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. పార్టీ ఎంపీలను ఆదేశించారు. దీంతో వారు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. మొత్తానికి ఇక ఒక్కరోజు మాత్రమే సమావేశాలకు అవకాశం ఉంది. ఇక అవిశ్వాసంపై చర్చ జరుగుతుందన్న నమ్మకం అందరిలోనూ ఆవిరైంది. ఇప్పటికే ఎంపీలతో రాజీనామాలు ఇప్పించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ప్రధాన పార్టీలు ఎలాంటి భవిష్యత్‌ నిర్ణయం తీసుకుంటాయోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 

 

21:52 - April 5, 2018

మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావుతో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం సమాఖ్య రాజ్యాంగమని తెలిపారు. కేంద్రానికి ఎక్కువ నిధులు వసూలు చేసుకునే హక్కును కల్పించారని పేర్కొన్నారు. ట్యాక్స్ ల నుంచి పది లక్షల నుంచి 15 లక్షల కోట్లు కేంద్రానికి ఆదాయం వస్తుందన్నారు. ఆర్టికల్ 280 ప్రకారం.. ఐదేళ్లకొకసారి ఆర్థిక సంఘాన్ని నియమించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఉత్తరాదిరాష్ట్రాల్లో అక్షరాస్యత తక్కువగా ఉందన్నారు. 

 

21:44 - April 5, 2018

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న యోచనను విరమించుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:39 - April 5, 2018

ఢిల్లీ : కేంద్రప్రభుత్వానికి నిరంకుశ ధోరణి పనికి రాదని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. హోదా కోసం గత కొంతకాలంగా ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా అని మండిపడ్డారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ఇస్తే.. అవిశ్వాస తీర్మానం రాకుండా చేస్తున్నారని చెప్పారు. భారతదేశంలో ఏపీ భాగంగా కాదా...మేము మనుషులం కాదా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ నుంచి తమను పశువుల్లాగా బయటికి తోసేస్తే ఎలా అర్ధం చేసుకోవాలని చెప్పారు. మేము మౌనంగా ఆందోళన చేస్తుంటే.... గ్లాస్ నీళ్లు ఇవ్వలేదని..బాత్ రూంకు కూడా వెళ్లనివ్వలేదని వాపోయారు. మార్షల్స్ తో పశువుల మాదిరి తమను బయటపడేశారని... ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

21:28 - April 5, 2018

కాంగ్రెస్కు రైతుల గురించి మట్లాడే అర్హతలేదు...అవును వాళ్లు బేడీలేశినోళ్ల ఏమన్న జేశినోళ్ల, పీజీ విద్యార్థిని ఎక్కిరిస్తున్న బీకాం ఫిజిక్సు...విజయసాయిరెడ్డి మీద జలీల్ ఖాన్ పంజా, పాదయాత్రకొస్తె వంద నోటు.. తినేంత బిర్యానీ... జనసమీకరణ కాడ దొర్కిపోయిన వైసీపీ, మిర్యాలగూడ టీఆర్ఎస్ పార్టీల కుమ్ములాట..ఫ్లెక్సీ కౌటట్ల కాడ ఇద్దరు ఆశవాహుల కయ్యం, ఖానాపూర్ కాంగ్రెసుల వర్గ పోరాటం సుర్వు..తీస్తున్నరు వీళ్లు పార్టీకున్న జర్రంత పర్వు, యాదాద్రి నర్సింహ స్వామీకి లేని తిప్పలు...గుడిగట్టబోమని కూసున్న కూలోళ్లు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

21:17 - April 5, 2018

చిత్తూరు : కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. హోదా సాధనకు సత్యమేవ జయతే పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో పాటు  జేడీ శీలం, సి. రామచంద్రయ్య తదితరులు తిరుపతిలో దీక్షా శిబిరాన్ని సందర్శించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీలో తాకట్టు పెట్టాడన్నారు రఘువీరా రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తొలి సంతకం హోదాపైనే ఉంటుందని చెబుతున్న రఘువీరా రెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. తిరుపతిలో రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తామని చెప్పారు.మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:13 - April 5, 2018

సంగారెడ్డి : జగ్ఙీవన్ రామ్ జయంతి ఉత్సవాలను దళిత సంఘాలు బహిష్కరించాయి. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు దళిత సంఘాల నాయకులు తెలిపారు. ప్రారంభమైన కొద్దిసేపటికే దళిత సంఘాల నాయకులు నిరసనకు దిగటంతో సభ అర్థాంతరంగా ముగిసింది. అనంతరం దళితులు బాబూ జగ్ఙీవన్ రామ్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఇటీవల భారత్ బంద్ నిర్వహించినప్పుడు దళితులపై దాడి చేసి చంపిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

 

21:08 - April 5, 2018

మహబూబ్ నగర్ : టెన్‌ టీవీ స్క్రోలింగ్‌ విభాగం ఉద్యోగి సురేష్‌ కేన్సర్‌తో బాధపడుతు ఇవాళ మృతి చెందారు. ముప్పై మూడేళ్ల వయసులోనే మరణించిన సురేష్‌కు చిన్న కూతురు ఉంది. సురేష్‌ మృతితో మహబూబ్‌నగర్‌లోని ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. నాలుగేళ్ల సురేశ్‌ కుమార్తెను చూసి వచ్చిన వారు కంటతడిపెట్టారు. 
 

21:04 - April 5, 2018

హైదరాబాద్ : దేశంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సికింద్రాబాద్‌లోని విక్టోరియా గార్డెన్స్‌ ఈ జాతీయ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోంది. దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్‌ ఓఫీర్.. నూతన పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల దేశంలో దళిత, క్రైస్తవ వెనకబడిన వారిపై దాడులను ఎదుర్కోవడంతో పాటు.. సమసమాజ నిర్మాణం కోసం ఈ జాతీయపార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అద్దంకి రంజిత్‌ ఓఫీర్ మాట్లాడుతూ చదువుకుంటే చంపుతారని.. మంచినీళ్లు అడిగితే కొడుతున్నారని అన్నారు. గుర్రం ఎక్కితే దళితున్ని కొట్టి చంపారని... అగ్రకులాలకే గుర్రం ఎక్కే హక్కు ఉందంటని అన్నారు. గుర్రం ఎక్కితే చంపుతారు, చదువుకుంటే చంపుతారు, మంచినీళ్లు అడిగితే కొడతారు... ఇలా అవమానాలకు, దమనకాండకు గురవుతున్న వాళ్లు హిందువులేనని...వాళ్లు క్రైస్తవులు కాదు..ముస్లీంలు కాదన్నారు. ముస్లీంలపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఒక తీర్పు ఇచ్చిందని... అదేమిటంటే.. దళితులు, అల్పసంఖ్యాక వర్గాల వారు తమ మీద దాడులు జరిగినప్పుడు తిరిగి దాడి చేయండని అది తప్పు కాదని.. మనుషులను రక్షించడానికి వంద కోట్లకు ఒక పోలీసును పెట్టలేము కదా..అందుకని స్వీయ రక్షణ కోసం తిరిగి దాడి చేయవచ్చు అని తెలిపిందన్నారు. దళితులు, క్రైస్తవులు, ముస్లీంలు, మహిళలపై ఇలాగే దాడులు జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ను ఆధారం చేసుకుని... ఈ బాధితులందరూ తిరగబడి మళ్లీ కొట్టడం మొదలు పెడితే అంతరం కలహాలు, అంతర్యుద్ధం వస్తుందన్నారు. చాలా ఘోరమైన పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. మతం మీ ఇష్టమని, మీరు ఏ దేవున్ని మొక్కినా అభ్యంతరం లేదన్నారు. నీకులమేటి, నీ మతమేమిటీ అనుకోకుండా తనకు తోచిన సహాయం చేశానని తెలిపారు. నాదొక వసుదైక కటుంబమని...తనను నాన్నగారు అని పిలిచిన వారిలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారని తెలిపారు. మతం అనేది నాకు ఎప్పుడూ అడ్డు రాలేదన్నారు. ఇవాళ మతం గురించి మాట్లాడడం లేదని..భారత సమాజం గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. ఒరిస్సాలో గ్రాహంస్టెయిన్ అతని ఇద్దరు కుమారులను దారా సింగ్ అనే వాడు సజీవ దహనం చేసి, చంపేరని తెలిపారు. నిస్వార్థపరున్ని గ్రాహంస్టెయిన్ ను చంపినందుకు అక్కడ కొంతమంది ప్రజలు దారాసింగ్ కు గుడి కట్టి పూజిస్తున్నారని మిషనరీని చంపినందుకు దారాసింగ్ ను దేవున్ని చేశారని అన్నారు. 
దేశంలో దుష్టశక్తి 
భారతదేశంలో దుష్టశక్తి పని చేస్తుంది... ఆ దుష్టశక్తి స్వాతంత్ర్యం పూర్వం నుంచే పని చేయడం ప్రారంభించిందన్నారు. స్వాతంత్ర్య పోరాటం నడుస్తున్నప్పుడు... బ్రిటీష్ వారిని వెళ్లగొట్టడం దేశభక్తి కానేకాదని...మన మతాన్ని మనంకాపాడుకుంటే చాలని ఒక సంస్థ బహిరంగంగా ప్రకటించిందన్నారు. ఆ సంస్థ భారత జాతీయ జెండాను తృణీకరించిందన్నారు. మూడు అనే సంఖ్య మనదేశ సనాతన ధర్మం ప్రకారం అశుభ సూచికమని..మూడు రంగుల జెండా ఉండకూడదని..ఆ సంస్థ దాన్ని ఈసడించింది. 

 

20:18 - April 5, 2018

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిని.. గోస్ట్ సిటీ గా చేయకండని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఐవైఆర్ కృష్ణారావు రంచించిన 'ఎవరి రాజధాని అమరావతి' అనే పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం ఉండవల్లి మాట్లాడుతూ 33వేల ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారని చంద్రబాబు అన్నారని ఆయన గుర్తు చేశారు. డెవలప్ మెంట్ పేరుతో తీసుకుని త్యాగం చేశారంటే ఎలా అని అన్నారు. త్యాగం అంటే డెవలప్ మెంట్ కు ఇచ్చిన ఇచ్చిన భూములు పోయినట్లేనని అన్నారు. రైతుల చేత భూములను చంద్రబాబు త్యాగం చేయించారని అన్నారు. 'కాకినాడ వెళ్లినా.. మాదీ ఉండవల్లే' అని... ఇక్కడి భూములు రిచ్ ల్యాండ్స్ అని తెలిపారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నట్లు జన్మభూమి అంటే మట్టికాదు..మనుషులు అని పేర్కొన్నారు. మయన్మార్ లోని న్యాపిడాలో పెట్టారని. న్యాపిడాలోని ఫొటోలు అమరావతి గ్రాఫిక్స్ లాగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచం మొత్తం న్యాపిడాకు గోస్ట్ సిటీగా పేరు పెట్టారని పేర్కొన్నారు. మయన్మార్ జనాభా మన జనాభా ఒకటేనని... మయన్మార్ పేరు తీసి అమరావతి పేరు పెడితే మనం కరెక్టుగా సరిపోతామని ఎద్దేవా చేశారు. అమరావతిని గోస్ట్ సిటీ గా చేయకండని వేడుకున్నారు. 33 వేల ఎకరాల్లో బిల్డింగులు కట్టినా...అందులో మనుషులుంటేనే దేశం అంటారని...బిల్డింగ్ లు, మట్టి ఉంటే దేశం అనరని తెలిపారు. రెండేళ్లలో మయన్మార్ లో 9 లక్ష 26 వేల జనాభా వచ్చిందన్నారు. 'నీవు చేస్తున్నది తప్పు అని శివరామకృష్ణ చంద్రబాబుకు చెప్పారని గుర్తు చేశారు. నిజాయితీగా ఉన్న వ్యక్తి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. కృష్ణారావుపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారని... నిజం మాట్లాడితేనే కోపం ఎవరికైనా కోపం వస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ఎం మాట్లాడినా సర్రుమని ఎగబాకుతుందన్నారు. అవిశ్వాస తీర్మానాలకు పవన్ కళ్యాణ్ కారణమని తెలిపారు. ఆయన మూలంగానే వైసీపీ, టీడీపీ పార్టీలు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయని తెలిపారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పెద్ద రిస్క్ తీసుకున్నారని.. ఇలాంటి వారికి మద్దతు ఇవ్వాలన్నారు. 

 

రాజ్యసభలో కొనసాగుతున్న ఎంపీల ఆందోళన

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడ్డా సభలోనే టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 3 గంటలుగా ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వారితో మాట్లాడారు. అయితే హోదాపై ప్రకటన వచ్చే వరకు సభను వీడేది లేదని టీడీపీ ఎంపీలు తేల్చిచెప్పారు. మరోవైపు పార్లమెంటు వైద్యుల.. సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

రాజ్యసభలో కొనసాగుతున్న ఎంపీల ఆందోళన

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడ్డా సభలోనే టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 3 గంటలుగా ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వారితో మాట్లాడారు. అయితే హోదాపై ప్రకటన వచ్చే వరకు సభను వీడేది లేదని టీడీపీ ఎంపీలు తేల్చిచెప్పారు. మరోవైపు పార్లమెంటు వైద్యుల.. సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

19:50 - April 5, 2018

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడ్డా సభలోనే టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 3 గంటలుగా ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వారితో మాట్లాడారు. అయితే హోదాపై ప్రకటన వచ్చే వరకు సభను వీడేది లేదని టీడీపీ ఎంపీలు తేల్చిచెప్పారు. మరోవైపు పార్లమెంటు వైద్యుల.. సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

 

17:56 - April 5, 2018
17:54 - April 5, 2018

కర్నాటక : బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి..! ఈ సామెత.. గనుల ఘనులు గాలిజనార్దనరెడ్డి బ్రదర్స్‌ విషయంలో అతికినట్లు సరిపోతోంది. ఒకప్పుడు కర్నాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి సోదరులు.. ఇప్పుడు సొంతపార్టీ బీజేపీలో అస్తిత్వం కోసం ఆపసోపాలు పడుతున్నారు. ఒకప్పుడు డమ్మీ అభ్యర్థులకూ టికెట్లు ఇప్పించి గెలిపించిన రెడ్డి బ్రదర్స్‌.. ఇప్పుడు సొంతానికి ఓ టికెట్‌ సంపాదించేందుకే ఆపసోపాలు పడుతున్నారు. కన్నడనాట మసకబారిన గాలి సోదరులు ప్రాభవంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
హరించుకుపోయిన రెడ్డి సోదరుల వెలుగులు
దశాబ్దం కిందట పట్టిందల్లా బంగారం.. వర్తమానంలో మసకబారిన ప్రాభవం.. ఇదీ కన్నడనాట.. గనుల ఘనులు.. గాలి జనార్దనరెడ్డి సోదరుల పరిస్థితి. కేవలం పదంటే పది సంవత్సరాల వ్యవధిలోనే రెడ్డి సోదరుల వెలుగులు హరించుకుపోయాయి. 2004, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో.. గాలి జనార్దనరెడ్డి హవా అంతా ఇంతా కాదు. తాము ప్రాతినిథ్యం వహించే బళ్లారి జిల్లాలోనే కాదు.. ఇరుగుపొరుగుల్లోని రాయచూరు, కొప్పళ్‌, గదగ్‌ సహా ఉత్తర కర్నాటక మొత్తం తమ హవాను కొనసాగించారు. ఆరోజుల్లో జనార్దనరెడ్డి చెప్పిన వారే ఎమ్మెల్యే అభ్యర్థి.. గెలిచేదీ ఆయన మద్దతు పొందిన అభ్యర్థే. 
పదేళ్లలో సీన్ రివర్స్ 
గాలి జనార్దనరెడ్డికి ఎదురు వెళ్లే సాహసాన్ని అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా చేయలేక పోయారంటే కన్నడ రాజకీయాల్లో గాలి సోదరుల ముద్ర ఏంటో అర్థమవుతుంది. రాష్ట్రస్థాయి నాయకులు కూడా బళ్లారిలోని గాలి సోదరుల కుటీరాన్ని వదిలి వెళ్లేవారు కాదు. ఇప్పుడీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. గాలి బ్రదర్స్‌ హవా తగ్గగానే, ఆప్తులు అనుకున్నవారు దూరమయ్యారు. కూడ్లిగి బి.రాగేంద్ర, హోసపేట బిఎస్‌ ఆనంద్‌ సింగ్‌ లాంటి ప్రముఖులు గాలి బ్రదర్స్‌నే కాదు.. ఏకంగా బీజేపీకే రాంరాం చెప్పి.. కాంగ్రెస్‌ శిబిరం చేరారు. 
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారు 
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వం కూడా గాలి జనార్దనరెడ్డి సోదరుల పట్ల ఏమంత సానుకూలంగా లేదు. ఆయన అనుచరులకు టికెట్ల సంగతి అటుంచి.. గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖరరెడ్డికి పార్టీ టికెట్‌ దొరకడమూ గగనమని అంటున్నారు. ఈ దశలో.. బీజేపీలో అవమానాలు పడుతూ ఉండేకంటే వేరే పార్టీలోకి మారితే ఎలా ఉంటుందని కూడా గాలి సోదరులు ఆలోచించినట్లు చెబుతున్నారు. 
వేరే పార్టీలోకి వెళ్లేందుకు గాలి బ్రదర్స్‌ ఆలోచన..?
గాలి జనార్డనరెడ్డి సోదరులు, ఓదశలో.. దేవెగౌడ నేతృత్వంలోని జెడి (ఎస్‌)లోకి చేరతారని ప్రచారం కూడా జరిగింది. అయితే.. జెడిఎస్‌ అధికారంలో ఉన్న రోజుల్లో.. గనుల లైసెన్సుల మంజూరు కోసం.. అప్పటి ముఖ్యమంత్రి, హెచ్‌డి కుమారస్వామి 150 కోట్లు లంచం తీసుకున్నారని గాలి జనార్దనరెడ్డి ఆరోపించారు. దానిపై కోపంతో రగిలిపోతున్న కుమారస్వామి.. గాలి ప్రవేశానికి అడ్డుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకూ.. గాలిజనార్దనరెడ్డికి తలుపులు మూసుకుపోయాయి. జనార్దనరెడ్డి గనుల అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా.. గతంలోకాంగ్రెస్‌ పార్టీ .. బెంగళూరు నుంచి బళ్లారి వరకూ పాదయాత్ర కూడా నిర్వహించింది. అట్లాంటి పార్టీ రెడ్డి బ్రదర్స్‌ను తమ పార్టీలో చేర్చకుంటుందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి
జేడీ(ఎస్‌)లోకి గాలి సోదరులు వెళతారని ప్రచారం 
ప్రస్తుత పరిస్థితుల్లో గాలిజనార్దనరెడ్డి సొంత పార్టీ పెట్టే పరిస్థితి కూడా లేదు. గతంలో జనార్దనరెడ్డి ఆత్మీయుడు మాజీ మంత్రి బి.శ్రీరాములు సొంత కుంపటి పెట్టి.. చేతులు కాల్చుకుని, మళ్లీ బీజేపీలో చేరారు. అప్పట్లో శ్రీరాములు వెనుక గాలి జనార్దనరెడ్డి ఉన్నారన్నది బహిరంగ రహస్యం.  ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జనార్దనరెడ్డి, అవమానాలు ఎదురైనా.. సీటు దక్కినా దక్కకున్నా.. బీజేపీలోనే కొనసాగుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 

17:49 - April 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో విద్యారంగం ఎటువెళ్లనుంది. విద్యార్థుల ప్రతిభాపాటవాలను పెంచాల్సిన ప్రభుత్వం వాటిని దిగజార్చి మరింత అదోగతిలోకి నెట్టుతుంది. ప్రపంచ విద్యాస్ధాయిలకు ధీటుగా విద్యార్థులను నిలపవలసిన ప్రభుత్వం వాటిని కాలరాస్తోంది. ఇదివరకు ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో కోర్సులను మూసివేసిన ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ తగ్గించనుంది. 
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లు తగ్గింపు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు తగ్గించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 25శాతం కంటే తక్కువ ప్రవేశాలున్న కోర్సులను మూసేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఉన్నత విద్యామండలి సమాలోచనలు చేస్తోంది. అయితే వచ్చే అకాడమిక్ ఇయర్ లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే దీనిపై విమర్శలు మొదలయ్యాయి. 
రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు కాలేజీలు
తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే పుట్టగొడుగుల్లా ప్రైవేటు కాలేజీలు పుట్టుకొచ్చాయని... గల్లికో కాలేజీ వెలసిందని అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్ చాలాసార్లు అన్నారు. అందుకే గత రెండేళ్ల నుంచి ప్రైవేటు విద్యాసంస్థల ప్రక్షాళన ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది టీ సర్కార్. అయితే తాజాగా ప్రభుత్వం డిగ్రీ కాలేజీల మీద దృష్టి సారించింది. నిజానికి ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచి కొత్త కోర్సులను ప్రవేశపెట్టాల్సిన ప్రభుత్వం డిగ్రీ కాలేజీల్లో 25శాతం కంటే తక్కువ ప్రవేశాలున్న కోర్సులను ముసేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. 
నకిరేకల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు సున్నా
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు తగ్గించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇప్పటికే ఉన్నతాధికారులతో సమాలోచనలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే 2017-18 విద్యాసంవత్సరంలో సున్నా ప్రవేశాలున్న కాలేజీలు 51 ఉన్నాయి.. 25 శాతం లోపు ప్రవేశాలున్న కాలేజీలు రాష్ట్రంలో 186 ఉన్నాయి. సున్నా ప్రవేశాలున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఒకటి ఉంది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో నకిరేకల్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఒక్కరూ చేరకపోవడం గమనార్హం. మరోవైపు 25 శాతం లోపు ప్రవేశాలున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 31 ఉన్నాయి. 31 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 9వేల 710 సీట్లుండగా.. 2017-18 విద్యా సంవత్సరంలో ఒకవెయ్యి 515 మంది విద్యార్థులే చేరారు. దీంతో 25 శాతం కంటే తక్కువ ప్రవేశాలున్న కోర్సులను రద్దు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆయా విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 9వేల 710 సీట్లు తగ్గే అవకాశముంది. ఇదిలావుండగా సున్నా ప్రవేశాలున్న 51 కాలేజీల్లో 10వేల 150 సీట్లు, 25 శాతంలోపు ప్రవేశాలున్న 186 కాలేజీల్లో 56వేల 285 సీట్ల చొప్పున మొత్తం 66వేల 435 సీట్లు తగ్గనున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం పట్ల విమర్శలు 
ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఈవిధమైన నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టాల్సిన టి సర్కార్ సీట్లలో కోత విధించడం సరైంద కాదని విద్యావేత్తలు మండిపడుతున్నారు. విద్యాసంస్థల్లో నాణ్యత ప్రమాణాలు లోపించడం వల్లే సీట్లు ఖాళీలుగా ఉంటున్నాయే తప్ప కోర్సులకు విలువ లేక కాదని విద్యార్థులంటున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

17:44 - April 5, 2018

వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించి అప్పులు తెచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదాయం ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపించి అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుందని చెప్పారు. కాంట్రాక్టర్ల కక్కుర్తి కోసం అప్పులు చేసిందని మండిపడ్డారు. 5392 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని కాగ్ నివేదిక తెలిపిందన్నారు.

 

17:39 - April 5, 2018

సింగపూర్‌ : సింగపూర్‌లో ఉగాది వేడుకులు ఘనంగా జరిగాయి. సింగపూర్‌లోని కల్లాంగ్‌ థియేటర్, వన్‌ థియేటర్‌ వాక్‌లో ఉగాది కల్చరల్‌ నైట్‌ నిర్వహించారు. ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో యాంకర్‌ శ్యామల, గాయనీగాయకులు సత్య యామిని, అనుదీప్‌, ప్రవీణ్‌కుమార్‌, వీఆర్‌ లక్ష్మి, హాస్యనటులు మాస్ అవినాశ్‌, కెవ్వు కార్తీక్‌, తాగుబోతు రాజమౌళి తదతరులు పాల్గొన్నారు. ఆట సందీప్‌ బృందం, ఢీ జోడి ఫేమ్‌ ప్రియాంక వినోదం పంచారు. ఆట, పాటలతో సింగపూర్‌ ఉగాది వేడుకులు ఉత్సాహభరితంగా సాగాయి. ఎఫ్‌టీవీ, గ్రీన్‌ఏకర్స్‌, ఆదిత్య బిల్డర్స్‌ స్పాన్సర్స్‌గా వ్యవహరించారు.

విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి..

హైదరాబాద్ : సౌత్ కొరియన్ మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఎఫ్-15 స్లామ్ ఈగల్ విమానం ఉత్తరజియాంగ్‌సాంగ్ ప్రావిన్స్ లోని చిల్గోక్ ప్రాంతం నుంచి డాగ్యూ ఎయిర్‌బేస్‌కు తిరిగొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దర పైలట్ల మృతదేహాలను గుర్తించామని, పైలట్ల పూర్తి వివరాలను తెలుసుకుంటున్నామని ఎయిర్‌ఫోర్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఎఫ్-16 డీ విమానం కుప్పకూలిపోగా..ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

17:19 - April 5, 2018

ఢిల్లీ : గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న బీజేపీ అనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లని ఒప్పించారని..కానీ పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలన్నారనీ చంద్రబాబు డిమాండ్వై చేసిన ఇప్పుటి వరకూ స్పందించకుండా ఎందుకు వున్నారని వైసీపీ ఎంపీ మేకపాటి ప్రశ్నించారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా బీజేపీ ఏపీకి రాజధాని కట్టిస్తామని మాట ఇచ్చిందన్నారన్నారని గుర్తు చేశారు. దాన్ని సాధించవలసిన బాధ్యత అధికారంలో వున్న టీడీపీ పార్టీదేనన్నారు. కానీ దానిపై ప్రభుత్వం ఏమాత్రం కృషి చేయాలేదని మేకపాటి విమర్శించారు. ఈ నేపథ్యంలో హోదా కాదు ప్యాకేజ్ ఇస్తామని ప్రకటిస్తే చంద్రబాబు ఒప్పుకున్నారనీ..కానీ దీన్ని వైసీపీ మొదటి నుండి వ్యతిరేకించిందన్నారు. ఆంధ్రా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు ప్రజలను పక్కదోవ పట్టిస్తు ప్రజాధన్నాన్ని దుర్వినియోగం చేశారని మేకపాటి విమర్శించారు. 

17:16 - April 5, 2018

హైదరాబాద్ : మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సామాజిక చైతన్యమూర్తి బాబూ జగ్జీవన్ రామ్ అని చంద్రబాబు కొనియాడారు. యాభై ఏళ్ళ కాలంలో ఎన్నో పదవులు చేపట్టి మచ్చలేని నాయకుడిగా ఆదర్శ జీవితం గడిపారని అలాంటి నాయకులే దేశానికి స్ఫూర్తి దాతలని అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహోన్నతుడి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. దళితులు, సమాజం కోసం జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌ అని చంద్రబాబు అన్నారు. 
 

17:04 - April 5, 2018

నల్గొండ : మంత్రి కేటీఆర్ మిర్యాలగూడ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తుండగా.. స్థానిక నేత అమరేందర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... పలువురు కార్యకర్తలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. 

17:03 - April 5, 2018

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడ్డా సభలోనే టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఎంపీలను బయటకు తీసుకెళ్లేందుకు మార్షల్స్‌ ప్రయత్నిస్తున్నారు. 

17:01 - April 5, 2018

మహబూబాబాద్‌ : జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన రసాభాసగా మారింది. కలెక్టర్‌ కార్యాలయ నిర్మాణంలో భవనాలు కోల్పోతున్న బాధితులు.. మంత్రిని కలిసేందుకు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలో  నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌కు తమ గోడును వినిపించేందుకు బాధితులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపించకుండానే  తమ ఇల్లు కూల్చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని భాదితులు ఆందోళన చెందుతున్నారు.

 

16:58 - April 5, 2018

ముంబై : కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ను దోషిగా తేల్చిన జోథ్‌పూర్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా  నలుగురు నటులు సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలి బింద్రే, నీలంలను మెజిస్ట్రేట్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్ష ప్రకటించింది. 1998 అక్టోబర్‌లో జరిగిన  హమ్‌సాథ్‌ సాథ్‌ హై షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలను హతమార్చినట్లు సల్మాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఇందులో సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ బెయిలుకు అవకాశం ఉండటంతో ఆయన లాయర్లు వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే బెయిల్‌పై నిర్ణయం రాకపోవడంతో.. సల్మాన్‌ను జోథ్‌పూర్‌ జైలుకు తరలించారు జైలులో ఆశారాం బాపూ గదికి సమీపంలో సల్మాన్‌కు ఉంచారు. 

 

రాహుల్ ప్రధాని కాగానే హోదాపైనే సంతకం..

చిత్తూరు : సత్యమేవ జయతే కార్యకర్యక్రమంలో కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. కర్నాటక ఎన్నికల అనంతరం తిరుపతిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తారని రఘువీరా తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ మీదనే సంతకం చేస్తారని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. దీని గురించి ఏఐసీసీలో తీర్మానం కూడా చేశామని రఘువీరా తెలిపారు.

 

రాజ్యసభ వాయిదా పడినా సభలోనే టీడీపీ ఎంపీలు..

ఢిల్లీ : రాజ్యసభ పలు నాటకీయ పరిణామాల మధ్య రేపటికి వాయిదా పడింది. కానీ టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్యసభలోనే ఏపీకి న్యాయం చేయాలంటు నినాదాలు చేస్తు అక్కడ బైఠాయించారు. దీంతో వారిని బైటకు పంపించేందుకు మార్షల్స్ శతవిధాలా యత్నిస్తున్నారు. మార్షల్స్ తో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి, రవీంద్రకుమార్, సీతారామలక్ష్మీ వాగ్వాదానికి దిగారు. కాగా ఇలా చేయమని సీఎం చంద్రబాబు ఎంపీలకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. 

బాబు సమర్ధతతోనే కియా మోటార్స్ ఏపీకి : అమర్ నాథ్ రెడ్డి

చిత్తూరు : కియా మోటార్ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయనీ..కానీ సీఎం చంద్రబాబు సమర్థతతో కియా మోటార్స్ ఏపికి వచ్చిందని మంత్రి అమర్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోము వీర్రాజు రాయలసీమలో జిల్లాకో విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందనీ..రాజీనామాల పేరుతో వైసీపీ డ్రామాలాడుతోందన్నారు. 

16:44 - April 5, 2018

హైదరాబాద్ : టెన్‌ టీవీ స్క్రోలింగ్‌ విభాగం ఉద్యోగి సురేష్‌ కేన్సర్‌తో బాధపడుతు ఇవాళ మృతి చెందారు. ముప్పై మూడేళ్ల వయసులోనే మరణించిన సురేష్‌కు ఆరు సంపత్సరాల కూతురు ఉంది. సురేష్‌ మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సురేష్‌ మృతికి నివాళిగా.. హైదరాబాద్‌లోని టెన్‌టీవీ ప్రధాన కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన సురేశ్‌ మృతి చాలా బాధాకరమని అన్నారు. ఇన్‌పుట్‌ ఎడిటర్‌ కృష్ణ సాయిరామ్‌ మాట్లాడుతూ.. ఎంతటి పని ఒత్తిడిలోనూ సంయమనం కోల్పోని సురేశ్‌.. సహోద్యోగులకు ఆదర్శనీయుడని అన్నారు. సురేశ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. ఆయన చిత్రపటానికి టెన్‌ టీవీ యాజమాన్యం, ఉద్యోగులు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.     

జగ్జీవన్ రామ్ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి : చంద్రబాబు

విజయవాడ : నగరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ 111 జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతు..భారత రాజకీయ రంగంలో అర్ధ శతాబ్దానికి పైగా అగ్రశ్రేణి నేతగా శాసన సభ్యత్వం మొదలుకొని దేశ ఉపప్రధాని వరకు ఎన్నో పదవులను అలంకరించి అసమాన ప్రజ్ఞా పాటవాలను కనబరచి, ఘన విజయాలు సాధించి మేరు పర్వతములా వెలిగిన మహోన్నత జాతీయ నాయకులు బాబూ జగజ్జీవనరామ్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. 

16:42 - April 5, 2018

మహబూబాబాద్‌ : జిల్లాలో మంత్రులు కే.టి.ఆర్, కడియం, చందూలాల్‌కు చుక్కెదురైంది. ప్రైవేట్‌ యూనివర్సిటీల  బిల్లును వ్యతిరేకిస్తూ.. పట్టణంలోని కంకరబోర్డ్‌ సమీపంలో అఖిలపక్ష విద్యార్థులు మంత్రుల కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

16:41 - April 5, 2018

చెన్నై : కావేరీ బోర్డు ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా తమిళనాడులో చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది. నిరసనల్లో భాగంగా పెద్దఎత్తున జనం బీచ్ రోడ్డుకు చేరుకున్నారు. వాలాజా రోడ్డు వద్దకు చేరుకున్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలు సందర్భంగా ఎక్కడా పెద్దఎత్తున జనం గుమిగూడకుండా మెరీనా బీచ్ సహా పలు కీలక ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు

 

16:38 - April 5, 2018

హైదరాబాద్ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. కావేరీ జలాలపై ఏఐడీఎంకే, ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. డిఫ్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభ్యులకు నచ్చజెప్పినా ఆందోళన విరమించసలేదు. ఓ దశలో ఆందోళన చేస్తున్న సభ్యులను ఎందుకు సస్పెండ్‌ చేయకూడదని కురియన్‌ ప్రశ్నించారు. సభ్యులు ఎంతకూ వినకపోవడంతో కురియన్‌ సభను రేపటికి వాయిదా వేశారు. 
లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి
లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి. ఉదయం సభ మొదలవగానే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగడంతో అరనిమిషంలోపే సభ వాయిదా పడింది. అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. కావేరు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. సభ ప్రారంభమైన కొన్ని సెకన్లకే సభ వాయిదా పడింది. గంట అనంతరం ప్రారంభమైన సభలోను గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు.

 

పేదరికం లేని సమాజమే నా ధ్యేయం : చంద్రబాబు

అమరావతి : పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ధ్యేయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ తనకు స్ఫూర్తని ఆయన అన్నారు. దళితులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతు.. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామనీ..ఏపీకి రావాల్సిన హక్కులను కేంద్రం నుండి వచ్చేంత వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సరైన సమయంలోనే నిర్ణయం : చంద్రబాబు

విజయవాడ: రామవరప్పాడు రింగ్‌ రోడ్డు వద్ద జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని, కేంద్రం సహకరించకపోవడం వల్లే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. 

16:26 - April 5, 2018

ఢిల్లీ : 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మీరాబాయ్‌ చాను సత్తా చాటింది. మహిళల 48 కేజీల విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది చాను. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా నిలిచిన చాను ప్రస్తుత కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి పసిడి తీసుకువచ్చింది.  మొత్తం 196 కేజీలు ఎత్తిన చాను కామన్వెల్త్‌ గేమ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 

 

మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత ..

నల్లగొండ : జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో స్థానిక నేత అమరేందర్ రెడ్డి వర్గీయులు అడ్డుకుని ఎమ్మెల్యే భాస్కర్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారిపోయింది. మరోపక్క మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కలెక్టరేట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులు తమ గోడు విన్నవించుకునేందుకు మంత్రిని కలవాలని యత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు.

16:24 - April 5, 2018

హైదరాబాద్ : రియల్‌ఎస్టేట్‌ వ్యాపార రంగంలో శతాబ్ది టౌన్‌షిప్‌ ప్రైవేటు లిమిటెడ్‌ దూసుకుపోతుందన్నారు ఆసంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె. శ్రీనివాస్‌ రెడ్డి. ఈ మేరకు రాజేంద్రనగర్‌ శివరాంపల్లిలోని ఎస్‌ఎన్సీ కన్వెన్షన్‌లో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థలో పని చేస్తున్న మార్కెటింగ్‌ సిబ్బందిని సన్మానించారు చైర్మన్‌. రానున్న రోజుల్లో మరిన్ని వెంచర్లు ఏర్పాటు చేసి కస్టమర్‌ల మన్ననలు పొందతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

సల్మాన్ జైలుశిక్ష రెండేళ్లు కాదు ఐదేళ్లు..

హైదరాబాద్ : కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ను జోథ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తక్కిన నలుగురు నటులు సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలి బింద్రే, నీలంలను మెజిస్ట్రేట్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సల్మాన్ కు జైలుశిక్ష ప్రకటించడంతో ఆయన జోథ్ పూర్ జైలుకు తరలించారు. కాగా గతంలో కూడా సల్మాన్ ఖాన్ అదే జైలులో శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే.

16:15 - April 5, 2018

హైదరాబాద్ : చిక్కడిపల్లి పీఎస్‌లో చిన్నారి మిస్సింగ్‌ కేసు నమోదైంది. మార్చి 29న ఇంటి నుండి బయటకు వెళ్లిన చిన్నారి మౌనిక అదృశ్యమైంది. పాప ఇంటి నుండి బయటకు వెళ్లిన సీసీ ఫుటేజీ లభ్యం అయింది. పాప ఆచూకి కోసం పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. అయితే వారం గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

 

మంత్రి కేటీఆర్ పర్యటన రసాభాసా..

మహబూబ్ నగర్ : జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన రసాభాసాగా మారిపోయింది. కలెక్టరేట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులు తమ గోడు విన్నవించుకునేందుకు మంత్రిని కలవాలని యత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో సభ రసాభాసగా మారిపోయింది. 

టాలీవుడ్ నటుడు మృతి..

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందారు. చంద్రమౌళి 200 పైగా చిత్రాల్లో నటించారు.

16:03 - April 5, 2018

కృష్ణవంశీని సక్సెస్ పలకరించి చాలా కాలం అయింది. క్రియేటివ్ డైరెక్టర్ గా ఒకప్పుడు కృష్ణవంశీ వరుస విజయాలను అందుకున్నాడు. కానీ గతకొంతకాలంగా సక్సెస్ ఆయనమీద అలిగినట్లుగా కనిపిస్తోంది. నాచ్యురల్ స్టార్ నానితో చేసిన పైసా సినిమా పేరు పరంగా మంచి టాక్ వచ్చినా..మొగుడు, గోవిందుడు అందరివాడేలే..ఇటీవల వచ్చిన కృష్ణవంశీ ఆఖరి సినిమా నక్షత్రం వంటి సినిమాలు కూడా ఆయనకు హిట్ తేలేకపోయాయి. అప్పటి నుంచి కూడా తదుపరి ప్రాజెక్టును గురించి ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఆయన నుంచి ఒక భారీ హారర్ థ్రిల్లర్ రానుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

40 కోట్లతో భారీ హర్రర్ థ్రిల్లర్..
'నక్షత్రం' సినిమాకి ముందే కృష్ణవంశీ ఒక హారర్ థ్రిల్లర్ చేయాలనుకున్నా కుదరలేదట. ఆ సినిమాకి 'రుద్రాక్ష' అనే పేరు పెడుతున్నట్టుగా కూడా అప్పట్లో వంశీ ప్రకటించారు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడా కథను పట్టాలెక్కించే పనిలో ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కథకు దాదాపు 40 కోట్లు ఖర్చు కావొచ్చని టాక్. దాంతో గట్టి నిర్మాత కోసం కృష్ణవంశీ ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి 'రుద్రాక్ష' కృష్ణవంశీకి గొప్ప సక్సెస్ ని ఇవ్వాలని ఆశిద్దాం..

హీరోల నటనను మెరుగుపరిచే కృష్ణవంశీ..
ఆయన హీరోలు ఆయన సినిమాలో నటించినన తరువాత అంతకు ముందు నటించిన సినిమాలను గమనిస్తే..నటనలో మెరుగుపడిన తీరును గమనించవచ్చు. నటుడిలో వుండే నటనను వెలికితీయటం కూడా క్రియేటివిటీలో భాగమే..కుటంబ కథా చిత్రాలలో నటించటం వేరు యాక్షన్ చిత్రాలలో నటించటం వేరు. సాధారణంగా కృష్టవంశీ కుటుంబాలలో వుండే సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే ఆయన సినిమాలో నటించిన తరువాత హీరోరు అసలైన నటనను కనబరుస్తారు. అందుకే దటీజ్ కృష్ణవంశీ అనే క్రియేటివిటీ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఆయన క్రియేషన్ ప్రతీ షాట్ లోను కనిపిస్తుంది. ప్రేక్షకులను అలరిస్తుంది. అటువంటి కృష్ణవంశీ హరర్ థ్రిల్లర్ వస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించి తీరుతుందని సినిమా అభిమానులు ఆశిస్తున్నారు. 

15:42 - April 5, 2018

ముంబై : కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ను జోథ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. సల్మాన్‌ కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా నలుగురు నటులు సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలి బింద్రే, నీలంలను మెజిస్ట్రేట్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్లు జైలు శిక్ష ప్రకటించింది. 1998 అక్టోబర్‌లో జరిగిన హమ్‌సాథ్‌ సాథ్‌ హై షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలను హతమార్చినట్లు సల్మాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఇందులో సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించినప్పటికీ బెయిల్ కు అవకాశం ఉండటంతో ఆయన లాయర్లు వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. బెయిల్ మంజూరైన పక్షంలో సల్మాన్ ఒక్కరోజు కూడా జైలు శిక్ష అనుభవించకుండా బయటపడే అవకాశాలుంటాయి. జోథ్‌పూర్ కోర్టు తీర్పుపై నెలరోజుల్లోగా సల్మాన్ పైకోర్టులో సవాలు చేసుకునే వీలుంది.

 

పార్లమెంట్ సభ డ్రామాను తలపించింది : జితేందర్ రెడ్డి

ఢిల్లీ : ప్రజాప్రయోజనాలపై పార్లమెంట్ లో చర్చిందామనుకుంటే సభ డ్రామాను తలపించిందనీ కాంగ్రెస్ నుండి టీఆర్ ఎస్ లోకి జంప్ అయిన ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో స్పష్టతరాకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందనీ, నాలుగేళ్లు పూర్తయినప్పటికీ తెలంగాణ సమస్యలు పరిష్కరించకపోవటం బాధాకరనమని జితేందర్ రెడ్డి విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ అని తామెప్పుడు చెప్పలేదనీ..ఫెడరల్ ఫ్రంట్ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. 

బాబు జగ్జీవన్ రామ్ కు సీపీఎం మధు నివాళి..

విజయవాడ : శిఖామణి సెంటర్ లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి మధు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోను, రాష్ట్రంలోను దళితులపై దాడులు పెరుగుతున్నాయనీ..మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని మధు విమర్శించారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు లేక రైతాంగం దివాళతీసే పరిస్థితి నెలకొందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన బంద్ లో 11మంది మృతి చెందారనీ..400ల మందికి గాయాలయ్యాయనీ దీనికి కారణం ఎన్డీయే ప్రభుత్వమేనని విమర్శించారు.

15:25 - April 5, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. విపక్ష ఎంపీలు పోడియం వద్దకు దూసుకవచ్చి ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని తెలుగు ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

 

సీబీఐ లక్ష్మీనారాయణ భార్యనంటూ మహిళ హల్ చల్ ..

అమరావతి : సీబీఐ అధికారిని అంటూ ఒకసారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనంటూ మరోసారి పొంతన లేకుండా సమాధానాలు ఇచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర స్వాధీనం చేకున్న ఓ పత్రంలో ఆమె పేరు ఎర్విన్ రీటాగా ఉంది. భర్త స్థానంలో వీవీ లక్ష్మీనారాయణ అని ఉంది. అనంతరం ఆమెను తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.

ఒడిశాపై 'షా'గురి...

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తాజాగా ఒడిశాపై గురిపెట్టారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండడంతో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై విమర్శలకు పదును పెట్టారు. అధికార పార్టీ బిజు జనతా దళ్ ఒడిశా ప్రజల సంక్షేమాన్ని పెడచెవిన పెట్టిందంటూ విరుచుకుపడ్డారు. రెండు రోజుల పాటు అమిత్ షా ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారనీ..రాష్ట్రాన్ని 18 ఏళ్ల పాటు పరిపాలించినప్పటికీ.. ప్రభుత్వం ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించలేకపోయిందని అమిత్ తీవ్రంగా విమర్శించారు.

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. విపక్ష ఎంపీలు పోడియం వద్దకు దూసుకవచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా పడింది.

 

లోక్ సభ రేపటికి వాయిదా

ఢిల్లీ : లోక్ సభ రేపటికి వాయిదా పడింది. సభలో విపక్ష ఎంపీలు ఆందోళన చేయడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

ఆధార్ అనుసంధానంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్ : వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై కీలకమైన కేసును విచారిస్తున్న అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో ఆధార్ బోర్డు ప్రజల రక్త నమూనాలను, డీఎన్ఏనూ, మూత్ర నమూనాలనూ సేకరిస్తామని కూడా చెబుతుందేమోనని వ్యాఖ్యానించింది. కోర్టులో వాదనలు జరుగుతున్న వేళ..ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది విధానపరమైన నిర్ణయం అయినందున న్యాయపరమైన సమీక్ష అవసరం లేదని కేంద్రం వాదనలు వినిపించిన వేళ, న్యాయమూర్తులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

హెచ్ సీయూలో దళిత సంఘాల ర్యాలీ..

హైదరాబాద్ : హెచ్ సీయూలో దళిత సంఘాలు ర్యాలీని చేపట్టాయి. ఎస్సీ, ఎస్టీ, అట్లాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళిత సంఘాలు ర్యాలీ చేపట్టాయి. ఎస్‌సి ఎస్‌టి యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్ కొన్నిచోట్ల హింసాత్మకంగా మారింది. పోలీసులు...ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో దేశవ్యాప్తంగా చూసుకుంటే తొమ్మిదిమంది మృతి చెందారు.

13:18 - April 5, 2018

ముంబై : కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ను దోషిగా తేల్చిన జోథ్‌పూర్‌ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా నలుగురు నటులు సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలి బింద్రే, నీలంలను మెజిస్ట్రేట్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష ప్రకటించింది. 1998 అక్టోబర్‌లో జరిగిన హమ్‌సాథ్‌ సాథ్‌ హై షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలను హతమార్చినట్లు సల్మాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఇందులో సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. సల్మాన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ బెయిలుకు అవకాశం ఉండటంతో ఆయన లాయర్లు వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. బెయిల్ మంజూరైన పక్షంలో సల్మాన్ ఒక్కరోజు కూడా జైలు శిక్ష అనుభవించకుండా బయటపడే అవకాశాలుంటాయి. జోథ్‌పూర్ కోర్టు తీర్పుపై నెలరోజుల్లోగా సల్మాన్ పైకోర్టులో సవాలు చేసుకునే వీలుంది.

జీతాలు తీసుకోమంటున్న కేంద్రమంత్రి..

ఢిల్లీ : ఒకపక్క పార్లమెంట్ సభలో సెగ పుట్టిస్తు మరోపక్క నీతులు వల్లించటం ఎన్డీయే ప్రభుత్వానికే చెల్లింది. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఉభయసభలు సజావుగా సాగనందుకు నిరసనగా తాము జీతాలు తీసుకోమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. బీజేపీ, ఎన్డీయే సభ్యులు 13 రోజుల పాటు జీతాలు తీసుకోమని..ఆందోళనలతో సభను సజావుగా విపక్షాలు జరగనీయనందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు.

జిల్లాలో హరీశ్, లక్ష్మారెడ్డి పర్యటన..

నాగర్ కర్నూల్ : జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, లక్ష్మారెడ్డి పర్యటిస్తున్నారు. కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లిలో కాలువ పనులను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. కాలువ పనులు వేగవంతంగా చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీచేశారు. 

నకిలీ పాస్ పోర్టు ముఠా అరెస్ట్..

హైదరాబాద్ : నగరంలో నకిలీ పాస్ పోర్ట్ తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ , డ్యూయల్ ఇండియన్ పాస్పోర్టులు తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి పలు డాక్యుమెంట్స్, నకిలీ పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. 

12:47 - April 5, 2018

సాధారణంగా రాగాలను సప్త స్వరాలనే విషయం తెలిసిందే. కానీ తల్లి తన బిడ్డల కోసం సరికొత్త రాగాన్ని కనిపెట్టం గురించి విన్నామా? అసలు అటువంటి సంప్రదాయం వుంటుందా? అంటే నిజమనే వాస్తవాలు కనిపిస్తున్నాయి. గర్భంతో వున్న యువతి పుట్టబోయే బిడ్డల కోసం స్వెట్లర్లను అల్లటం, కొత్త కొత్త పేర్లను సెలక్ట్ చేయటం గురించి విని వున్నాం. కానీ పుట్టబోయే బిడ్డ కోసం తల్లి ఓ సరికొత్త రాగాన్ని కనిపెట్టం బిడ్డ పుట్టిన తరువాత ఆ రాగాన్ని ఆలపించటం..ఆ రాగమే ఆ బిడ్డకు పేరుగా పెట్టటం చాలా విచిత్రంగానే కాదు కడు అబ్బురంగా వుంటుంది.

అమ్మ పాట పాపాయికి పేరుగా మారే సంప్రదాయం..
అమ్మ పాడే జోలపాట పాపాయికి హాయి కలిగిస్తుంది. కేర్ కేర్ మని బిడ్డ ఏడుపుకు అమ్మ పాడే లాలిపాట పాపాయిని నిద్రపుచ్చుతుంది. నిద్రలోకి జారుకున్న పాపాయి తీయని కలలు కంటు నిద్రలో బోసినవ్వులు విరబూయిస్తుంది. ఆ బోసినవ్వులు చూసిన ఆ మాతృ హృదయం ఆనంద డోలికల్లో తేలిపోతుంది. కమ్మగా అమ్మ పాడే జోలపాట పాపాయి నిద్ర నివ్వటమేకాక..ఆ జోలపాటే ఆ పాపాయికి పేరుగా మారే సంప్రదాయం విచిత్రంగానే కాదు..అమ్మ పాటంత కమ్మగా వుంటుంది. మరి ఆ సంప్రదాయం గురించి ఆ నేపథ్యం గురించి తెలుసుకుందాం..

మేఘాలయలోని కాంగ్‌థాంగ్‌ అనే ఊళ్లో తరతరాలు ఆచారం..
అక్కడ అమ్మ పాడే లాలి పాటే, ఆ చిన్నారికి పేరు అవుతుంది. మేఘాలయలోని కాంగ్‌థాంగ్‌ అనే ఊళ్లో తరతరాలుగా వస్తోన్న ఆచారమిది. జోలపాటనే పిల్లలకు పేరుగా పెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా కొనసాగుతోంది. అంటే.. అక్కడ ప్రతి వ్యక్తికీ ప్రత్యేకంగా ఓ రాగమే పేరుగా మారిపోతుందన్నమాట. ఒక రాగం మరో రాగాన్ని పోలి ఉండకపోవడం, అక్కడి వారి సృజనాత్మకతను ప్రతిఫలిస్తుంది. ఆ పిల్లల్ని అదే రాగంతో పిలుస్తారు. ఇలా వేలాది రాగాలు వేటికవే వాటి ప్రత్యేకత చాటుకుంటాయన్నమాట. ఆ ఊళ్లో నెల తప్పిన మహిళ పుట్టబోయే పాపాయి కోసం ప్రత్యేక రాగంలో జోలపాటను రూపొందించుకుంటుంది. అది గతంలో ఎవరూ పాడనిది అయ్యుండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. నెలలు నిండేవరకూ సాధన చేస్తుంది. పక్షుల రాగాల నుంచీ పేర్లు వెతుక్కుంటారు. అయితే ఇదంతా ప్రసవానికి ముందుగానే. బిడ్డ పుట్టాక ఆ రాగాన్ని ఇంట్లో అందరికీ చెబుతుంది. అప్పుడు మిగిలినవాళ్లు ఆ రాగాన్ని మూడుసార్లు పాడతారు అంతే పేరు పెట్టేసినట్లే. వారికిక జీవితాంతం ఆ రాగమే పేరవుతుంది. ఈ రాగం నిడివి ఆరు సెకన్ల నుంచీ నిమిషం వరకూ ఉండొచ్చు.

అమ్మ పాడే రాగానికి అత్యంత ప్రాధాన్యత..
అంతేకాదు పెళ్లి సమయంలోనూ ఈ రాగానికీ అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఓ పౌర్ణమి రాత్రి గ్రామంలో యువతులందరూ ఒక చోట చేరతారు. వారి ఎదురుగా పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలు ఒక్కొక్కరిగా తమ పేరులా ఉన్న రాగాలను పాడి వినిపించాలి. అలా ఎవరికి ఆ రాగం నచ్చుతుందో ఆ యువకుడిని భాగస్వామిగా ఎంచుకుంటారు. ఇదేదో బాగుంది కదూ...అమ్మ బిడ్డ కోసం ఓ సరికొత్త రాగాన్ని కనిపెట్టటం..ఆ రాగమే పేరుగా మారటం ఎంతోఅద్వితీయమైన ఆనందంగా వుంది కదూ!! అంటే తల్లి అంటేనే ఓ బాధ్యత, ఓ రక్షణ, ఓ నమ్మకం, ఓ ధైర్యం. ఓ భరోసా, ఇదీ అని చెప్పలేనీ..చెప్పేందుకు సాధ్యం కానీ తల్లి ప్రేమ,మమకారం, ఆదరణ ఇలా ఎన్ని పదాలు పేర్చినా..అక్షరాలను రాశులుగా పోసినా అమ్మ ప్రేమకు సాటిరావు. మరి ఇక్కడి అమ్మలకు బిడ్డ పుట్టకముందుకు నుండే సరికొత్త బాధ్యత, సరికొత్త సృజనాత్మకతకు అద్దంపట్టే ఆ తల్లుల సృజనాత్మకతకు సంగీత ప్రపంచమేకాదు..యావత్ లోకం అభినందనలు తెలపాల్సిందే!!

12:33 - April 5, 2018

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధపూర్ కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో కోర్టు పై విధంగా తీర్పును వెలువరించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ఆలీఖాన్, టబూ, నీలమ్, సోనాలి బింద్రేలు నిర్దోషులుగా ప్రకటించింది. జైలు శిక్ష పడడంతో సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. కానీ బెయిల్ కు సంబంధించిన దస్త్రాలు పూర్తి కావాలంటే సమయం పడుతుందని...దీనితో ఆయన జైలుకు వెళ్లాల్సిందేనని ప్రచారం జరుగుతోంది. కానీ ఎక్కువ కాలం జైలు శిక్ష పడుతుందని..దీనితో బాలీవుడ్ కు తీరని నష్టం కలుగుతుందని..సల్మాన్ జీవితంపై పెను ప్రభావితం చూపుతుందని భావించారు. రెండేళ్ల పాటు జైలు శిక్ష పడడంతో ఎలాంటి నష్టం లేదని..సల్మాన్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొంటున్నారు.

16 ఏళ్ళ క్రితం ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రం షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ పై ఆయుధాల చట్టం కింద స్థానిక లూని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

సల్మాన్ ఖాన్ కు రెండేళ్ల జైలుశిక్ష!

రాజస్థాన్ : కృష్ణ జింక కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ను దోషిగా న్యాయస్థానం తేల్చింది. సల్మాన్ ఖాన్ జోథ్ పూర్ కోర్టు కీలక తీర్పును వెలువరించి రెండేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. ఇదే కేసులో నిందుతులుగా వున్న సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, నీలం,టబులను నిర్ధోషులుగా భావించి జోథ్ పూర్ కోర్టు తేల్చింది. దీంతో సల్మాన్ ఖాన్ కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. సల్మాన్ ఖాన్ కు శిక్ష ఖరారు కావటంతో బాలివుడ్ కు వేలాది కోట్ల రూపాయలు నష్టం ఏర్పడింది. 

కామన్ వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం..

హైదరాబాద్ : కామన్ వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణానికి మీరాబాయి బోణీకొట్టింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో సాయి ఖోమ్ మీరాబాయి స్వర్ణం గెలుచుకుంది. 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి స్వర్ణం సాధించింది. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభాన్ని ఇచ్చింది. క్రీడలు ప్రారంభమైన తొలి రోజే మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్లో భారత అమ్మాయి సాయిఖోమ్ మీరాభాయ్ చాను స్వర్ణం గెలుచుకుంది. భారత తరఫున 2018 క్రీడల్లో పాల్గొని తొలి స్వర్ణం నెగ్గిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది.

12:22 - April 5, 2018

ఢిల్లీ : లోక్ సభలో యదావిధి పరిస్థితి నెలకొంది. ఎప్పటిలాగే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడం...సభ ఆర్డర్ లేదు..తీర్మానం నోటీసులు తీసుకోవడం లేదంటూ స్పీకర్ చెప్పడం..సభ వాయిదా పడుతూ వస్తున్నాయి. గురువారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం ప్రారంభం కాగానే అర నిమిషంలోపే వాయిదా పడింది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడంతో సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు. అనంతరం ప్రారంభమైన సభలో అధికార..విపక్షాల మధ్య విమర్శలు గుప్పించుకున్నాయి.

తాము అవిశ్వాస తీర్మానం..ఇతర అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. దీనికి ప్రతిగా అనంతకుమార్ స్పందించారు. అవిశ్వాసం నోటీసులు చర్చకు రాకపోవడానికి విపక్షమే కారణమంటూ దుమ్మెత్తి పోశారు. సభ జరగని కారణంగా బీజేపీ ఎంపీలు జీతాలు తీసుకోకూడదని నిర్ణయించామని సభలో వెల్లడించారు.

ఈ గందరోళ నడుమే స్పీకర్ సుమిత్రా మహజన్ అవిశ్వాస నోటీసులను చదివి వినిపించారు. సభ ఆర్డర్ లో లేదంటూ అవిశ్వాసం నోటీసులను పక్కన పెట్టారు. అన్నాడీఎంకే సభ్యులు స్పీకర్ వెల్ చుట్టుముట్టి ఆందోళన చేస్తుండడంతో అవిశ్వాసం నోటీసులు చర్చకు రాలేదు. చివరికి సభను శుక్రవారం వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. 

ప్రముఖ నటుడు మృతి..

హైదరాబాద్ : మలయాళం స్టార్ నటుడు అజిత్ తన 56 ఏళ్ళ వయస్సులో గురువారం ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన విలన్ పాత్రలకు అజిత్ పెట్టింది పేరుగా వుండేవారు.పది రోజుల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఆయన అడ్మిట్ ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. మూడు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఆయన కొనసాగారు. 500 లకు పైగా సినిమాల్లో నటించారు. మలయాళంలో పూర్తిగా, కొన్ని తమిళ్, హిందీ సినిమాల్లో కూడా అజిత్ నటించారు.

తీర్మానంపై చర్చ జరగాలి - విపక్షాలు...

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని లోక్ సభలో విపక్షాలు డిమాండ్ చేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 

12:06 - April 5, 2018

చెన్నై : కావేరీ యాజమాన్య మండలి రగడ ఇంకా చల్లారడం లేదు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో డీఎంకే నేతృత్వంలోని అఖిలపక్షం చేపట్టిన తమిళనాడు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. ఎక్కడికక్కడే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డీఎంకే నేతలు..ఇతరులు రోడ్లపైకి వచ్చి రోడ్ రోకో నిర్వహించారు. దీనితో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రైళ్లను నిలిపివేయడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెరీనా బీచ్ వైపు ర్యాలీగా వెళుతున్న డీఎంకే స్టాలిన్ తో సహా పలువురు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టాలిన్ రోడ్డుపై కూర్చొవడంతో పోలీసులు బలవంతంగా ఆయన్ను అరెస్టు చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక..అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు.  

లోక్ సభ తిరిగి ప్రారంభం...

ఢిల్లీ : వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభమైంది. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన మాత్రం కొనసాగిస్తున్నారు. గందరగోళ నడుమే సభకు సంబంధించిన కార్యకలాపాలను స్పీకర్ కొనసాగించారు. 

11:44 - April 5, 2018

ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణ జింకల వేటాడిన కేసులో కీలక తీర్పు వెలువడింది. సల్మాన్ దోషి అంటూ జోధ్ పూర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సల్మాన్ మినహా టబూ, సైఫ్ ఆలీఖాన్, నీలమ్, సోనాలి బింద్రేలను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.

16 ఏళ్ళ క్రితం ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రం షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ పై ఆయుధాల చట్టం కింద స్థానిక లూని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో సల్మాన్ నిర్దోషి అని రాజస్థాన్ హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాజస్థాన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ కిందికోర్టు తీర్పును అమలు చేయాలని సుప్రీంని కోరింది. ఈ కేసులో సల్మాన్ దోషి అని, కోర్టులో లొంగిపోయి శిక్షను పూర్తి చేసే విధంగా చూడాలని కోర్టును కోరింది. ప్రస్తుతం శిక్ష ఎంతకాలం అనేది తెలియాల్సి ఉంది. 

సల్మాన్ ఖాన్ ను దోషి గా నిర్ధారించిన కోర్టు!..

రాజస్థాన్ : కృష్ణ జింక కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ను దోషిగా న్యాయస్థానం తేల్చింది. సల్మాన్ ఖాన్ జోథ్ పూర్ కోర్టు కీలక తీర్పును వెలువరించి దోషిగా నిర్ణయించింది.  1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్ పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషేనని న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురు నిర్దోషులని, వారు వేటాడలేదని పేర్కొన్న న్యాయమూర్తి, సల్మాన్ ను మరికాసేపట్లో శిక్షను ఖరారు చేయనున్నారు.

11:26 - April 5, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో ఏ మాత్రం మార్పు లేదు. ఉభయసభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన లోక్ సభ అరనిమిషంలోపే వాయిదా పడింది. స్పీకర్ సుమిత్ర మహజన్ కుర్చీలో కూర్చొకముందే అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. కొద్దిసేపు చూసిన అనంతరం సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు. ఇక రాజ్యసభ కొద్దిసేపు కార్యకలాపాలు నడిచాయి. అనంతరం అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభను మధ్యాహ్నాం 2గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఏమాత్రం మారని ఉభయసభల తీరు..

ఢిల్లీ: 12వ రోజు ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో అదే పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం సభ మొదలవగానే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగడంతో అరనిమిషంలోపే సభ వాయిదా పడింది. అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. కావేరు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. సభలో టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళనకు దిగారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

11:21 - April 5, 2018

ఈ లోకంలో వింతలు, విచిత్రాలకు, అందాలకు, అద్భుతాలకు కొదవలేదు. మనకు తెలియని, మనిషి మేధస్సుకు అందని రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో. మనిషి యొక్క అద్వితీయమైన మేథస్సు ప్రతీకగా నిలుస్తాయి కొన్ని కట్టడాలు. ఎటువంటి టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలు లేని రోజుల్లో కేవలం మనషి మేథస్సు, శారీరక శ్రమను ఆధారం చేసుకుని నిర్మించిన, తీర్చిదిద్దిన ఆర్చిటెక్చర్ నిర్మాణాలు అదే మనుష్యులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అబ్బురపరుస్తున్నాయి. అటువంటి ఓ దేవాలయానికి వేల సంఖ్యలో భక్తులు, లక్షల సంఖ్యలో పర్యాటకు వస్తుంటారు. అ అద్భుతమైన కట్టడాన్ని చూసి అచ్చెరువెందుతారు. మరి ఇంతకీ ఆ కట్టడం ఎక్కుడుంది? దానికి వున్న ప్రత్యేక ఏమిటో తెలుసుకుందాం..

చైనాలోని షాన్సీ లోని అబ్బురపరిచే ఆలయం..
ప్రపంచంలో చిత్రవిచిత్రమైన నిర్మాణాలతో కూడిన ఆలయాలు కనిపిస్తుంటాయి. వాటిలో ఒకటే చైనాలోని షాన్సీ ప్రాంతంలోని ఆలయం. నిటారుగా ఉన్న కొండపై, గాలిలో ఊగుతున్నట్టు ఈ ఆలయాన్ని నిర్మించారు. దీంతో అటు భక్తులకు, ఇటు పర్యాటకులకు ఇది కేంద్రబిందువైంది.

15 వందల సంవత్సరాల నిర్మాణం..
చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని 15 వందల సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది బౌద్ధ, తావో, కన్ఫ్యూషియస్ నిర్మాణశైలి సమ్మిళితంగా ఉంటుంది. గాలిలో తేలుతున్నట్టు కనిపించే ఈ ఆలయం మానవ మేథస్సుకు, పనితనానికి, శ్రమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాదు ఎటువంటి భయకరమైన ప్రకృతి విపత్తులకు గురికాకుండా చెక్కుచెదరకుండి ఠీవీగా..రాజసంగా..వజ్రతుల్యంగా ఈ కట్టడం లక్షలాదిమందిని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 40కి మించిన గదులు, అద్భుతమైన మండపం ఉంది. దీనిని చూసేందుకు ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు తరలివస్తుంటారు అంటే దీనికి వున్ ప్రాశత్యం ఏమిటో ఊహించుకోవచ్చు. బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నవారు ఇక్కడికి తరచూ వస్తుంటారు.

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

విజయవాడ : బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసిన సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్‌ మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం, సేమ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, సంస్థకు మహాబలాన్ని చేకూర్చిపెట్టాయి. భారత రిపబ్లిక్‌ తొలి లోక్‌సభలో ప్రవేశించిన జగ్జీవన్‌రామ్‌ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచాడు. ముప్ఫైమూడు సంవత్సరాు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించాడు. మొదటి శ్రేణి పార్లమెంటే రియన్‌గా నిలిచాడు.

హస్తినలో మానవహారంతో నిరసనలు..

ఢిల్లీ : పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు మానవహారం నిర్వహించాయి. ఈ కాక్యక్రమంలో అన్నాడీఎంకే, వైసీపీ మినహా విపక్షాల సభ్యులందరు పాల్గొన్నారు. రాజ్యసభ చైర్మన్ భవనం నుండి ప్రధాని కార్యాలయం వరకూ మానవహారాన్ని నిర్మించారు. పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా విపక్షాలు మానవహారంతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా అవిశ్వాసన తీర్మానంపై చర్చ జరగనీయంకుండా వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్న కేంద్రం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తు విపక్షాలు ఈ మానవ హారంతో తమ నిరసనను వెలిబుచ్చుతున్నాయి. 

డీఎంకే నేత స్టాలిన్ అరెస్ట్..

తమిళనాడు : కావేరీ బోర్డు ఏర్పాటుచేయాలనే డిమాండ్ తో చేపట్టిన నిరసనల్లో భాగంగా డీఎంకే నేత స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో డీఎంకే నేత స్టాలిన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్ లో పాటిస్తున్న క్రమంలో మెరీనా బీచ్ వద్ద స్టాలిన్ ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటుచేయాలని విపక్షాలు చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ఈ బంద్లఓ డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు నల్ల బ్యాడ్జ్ లు కట్టుకుకుని బంద్ లో పాల్గొన్నాయి. బంద్ కు సంఘీభావంగా వ్యాపారవేత్తలు షాపులను మూసివేశారు. 

10:47 - April 5, 2018

ధైర్యానికి మారుపేరైన యూపీ యువతి నజియాఖాన్ గుర్తుందా? చిన్నవయసులోనే అరుదైన ఘనత సాధించింది. ఆమె ధైర్యసాహసాలు మెచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా నియమించింది. దీంతో పిన్నవయస్కురాలైన పోలీస్ ఆఫీసర్‌గా రికార్డులెక్కింది నజియా.

సాహస బాలిక నజియా ఖాన్..
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని సదర్‌భట్టీ ప్రాంతానికి చెందిన సాహస బాలిక నజియాఖాన్ సాహసాలకు తగిన గుర్తింపు లభించింది. ఎంతో ధైర్యంతో సంఘవిద్రోహ శక్తులను ఎదురించిన ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రభుత్వం కూడా ఫిదా అయింది. అందుకే 18 యేండ్లకే స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా నియమించింది. దీంతో పోలీస్ అధికారి అయిన పిన్న వయస్కురాలిగా నజియా ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 

మత కలహాల్లో బాలికను రక్షించిన నజియా ఖాన్..
మతకలహాల్లో కోరి కోరి కల్పించుకోవాలంటే ఉన్నతస్థాయి అధికారులే హడలెత్తిపోతారు. అటువంటిది అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి 2015లో ఆగ్రాలో చెలరేగిన మత ఘర్షణల్లో అల్లరిమూకల నుంచి ఓ బాలికను కాపాడి ధైర్యసాహసాలకు మారుపేరుగా పేరొందిన 'రాణి లక్ష్మీభాయ్' అవార్డు అందుకుంది నజియా ఖాన్. అంతేకాదు 2017లో జూదగాళ్లు, పందెం రాయుళ్ల మాఫియాను ఎదురించి, పోలీసుల సహాయంతో వారి ఆటకట్టించి ఎంతో ప్రతిష్టాత్మకమైన 'భారత్ అవార్డు'ను ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా అందుకున్నది. ఈ రెండు సంఘటనల్లో నజియా ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది. వెనకడుగు వేయని ఆ ధైర్యమే నజియాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అప్పటి నుంచి ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తున్న నజియా సాహసాలతో అందరి మన్ననలను అందుకుంటోంది. అటువంటి నజియా ఖాన్ యూపీ ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా నియమించింది. కరడుకట్టిన నేరగాళ్లను అదుపుచేయాలంటే నజియాలాంటి తెగువు ఉన్నవారు అవసరమని, అందుకే ఆమెకు ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని ఇచ్చామని యూపీ డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు.

10:45 - April 5, 2018

పెంచిన ప్రేమకు తాత్కాలిక ఉపశమనం..

హైదరాబాద్ : ఇద్దరు తల్లుల మాతృప్రేమ మధ్యలో నలిగిపోయిన పసి హృదయానికి, కనకపోయినా..కడుపులో పెట్టుకుని పెంచిన ప్రేమకు తాత్కాలికంగా ఉపశమనం దొరికింది. ఇద్దరు తల్లుల మధ్య గొడవ జరగడంతో 160 రోజులుగా బాలసదన్‌లో ఉంటున్న చిన్నారిని పెంచిన తల్లి చెంతకు చేర్చాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇద్దరు తల్లుల మధ్య నలిగిపోయిన చిన్నారి తన్విత ఇప్పటి వరకూ బాలసదన్ లో తల్లులిద్దరికీ దూరంగా వుండిపోవాల్సిన పరిస్థితుల్లో ఇద్దరు తల్లులకు కాకుండా బాలసదన్‌లో చేర్చారు. ఈ కేసు విషయమై బుధవారం కొత్తగూడెం 5వ అదనపు జిల్లా న్యాయస్థానం..

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌ బోణీ..

హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌ బోణీ అదిరింది. పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్‌ తన ఖాతాలో ఒక పతకాన్ని వేసుకుంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో భారత్‌కు కచ్చితంగా పతకాలు సాధిస్తుందని ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌ బోణీ కొట్టింది. మరిన్ని పతకాలు భారత్ కైవసం చేసుకోవాలని ఆశిద్దాం. 

ప్రారంభమైన 'స్టీల్ మార్చ్'..

విశాఖపట్నం : విశాఖలో కార్మిక లోకం కదం తొక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కూర్మపాలెం నుండి ప్రారంభమైన స్టీల్ మార్చ్ 25 కిలోమీటర్ల వరకూ కొనసాగి కలెక్టరేట్ కేచేరుకోనుంది. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని చేయాలని, స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేసే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేస్తు..వాటాల విక్రయాన్ని మానుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు హెచ్చరించారు. 

ప్రారంభమైన 'స్టీల్ మార్చ్'..

విశాఖపట్నం : విశాఖలో కార్మిక లోకం కదం తొక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కూర్మపాలెం నుండి ప్రారంభమైన స్టీల్ మార్చ్ 25 కిలోమీటర్ల వరకూ కొనసాగి కలెక్టరేట్ కేచేరుకోనుంది. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని చేయాలని, స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేసే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేస్తు..వాటాల విక్రయాన్ని మానుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు హెచ్చరించారు. 

10:21 - April 5, 2018

కండలవీరుడి కోసం కారాగారం..

రాజస్థాన్ : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఓ కారాగారం ఎదురు చూస్తోందా? అంటే నిజమనే చెప్పాలి. సల్మాన్‌ ఖాన్‌ కృష్ణ జింకను వేటాడిన కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే సల్మాన్‌ దోషి అని తేలితే జైల్లో పెట్టడానికి జోధ్‌పూర్‌ జైలు అధికారులు ముందుగానే ఓ కారాగారాన్ని సిద్ధం చేశారట.

ఎంపీలు పార్లమెంట్ కు హాజరుకావద్దు : కేసీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీలెవరు పార్లమెంట్ ఉభయసభలకు హాజరుకావద్దని సీఎం కేసీఆర్ ఎంపీలకు ఆదేశించారు. సభ జరుగుకుండా చేస్తున్న కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ లో సభా సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా అవుతున్నందున సభలకు హాజరుకావొద్దని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీంతో ఎంపీలెవరు పార్లమెంట్ ఉభయసభలకు హాజరుకావద్దని, హైదరాబాద్ కు వచ్చేయాలని టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. కాగా ఈరోజు కూడా అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు ఏర్పాటు కోసం ఆందోళన చేయనున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వాయిదాల పర్వం ఈరోజుకూడా జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

కాసేపట్లో కృష్ణ జింకల వేటాడిన కేసుపై తీర్పు...

జోధ్ పూర్ : కృష్ణ జింకలను వేటాడిన కేసుపై తీర్పు కాసేపట్లో వెలువడనుంది. జడ్జీ దేవ్ కుమార్ కోర్టుకు చేరుకున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ నటులు సైఫ్ ఆలీఖాన్, టబూ, సోనాలీ బింద్రే, నీలమ్ తదితరులు బుధవారం జోధ్ పూర్ కు చేరుకున్నారు. 

డీఎంకే రోడ్ రోకో...

చెన్నై : కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ డీఎంకే, ఇతర విపక్షాలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. డీఎంకే..ఇతర పక్షాల నేతలు పెద్ద ఎత్తున రోడ్ రోకో నిర్వహించారు. దీనితో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం...

రాజస్థాన్ : దేశంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుందని తెలుస్తోంది. 

09:20 - April 5, 2018

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. గత కొద్ది రోజులుగా పార్లమెంట్ స్తంభిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు పరచాలంటూ కాంగ్రెస్..టిడిపి..వైసిపి ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. అంతేగాకుండా ఏడు పార్టీలు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేస్తుండడంతో సభ స్తంభిస్తోంది. దీనితో తీర్మానం తీసుకోవడం లేదంటూ స్పీకర్ సుమిత్రా మహజన్ సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. గురువారం ప్రారంభమయ్యే సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులను సస్పెండ్ చేస్తారా ? తీర్మానం చర్చకు అనుమతినిస్తారా ? అనేది తెలియరావడం లేదు. ఇదిలా ఉంటే సభలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే పార్టీ ఎంపీలు హైదరాబాద్ కు రావాలని, సమయం వృధా కాకుండా ప్రజల్లో ఉండి వారి సమస్యలను తీర్చాలని ఆదేశించారు. దీనితో టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ కు పయనమయ్యారు. 

కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు...

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నాటికి పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. దీనితో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా ? లేదా ? అనేది ఉత్కంఠ నెలకొంది. 

కామన్వెల్త్ లో భారత్ బోణీ...

ఢిల్లీ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్ క్వీన్స్‌ లాండ్‌ లోని కర్రారా మైదానంలో అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్ పోటీల్లో ఇండియా తొలి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజ్ రజత పతకాన్ని సాధించి బోణీ కొట్టాడు. బ్యాడ్మింటన్ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో 3-0 తేడాతో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. 

తండ్రి..కొడుకును అపహరించిన ఉగ్రవాదులు....

జమ్మూ కాశ్మీర్ : బండిపూరలో ఓ కుటుంబంలోని తండ్రి..కొడుకును ఉగ్రవాదులు అపహరించారు. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. తండ్రి ఉగ్రవాదుల చెర నుండి తప్పించుకోగా కొడుకు ఆచూకి తెలియడం లేదు. తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

తమిళనాడు బంద్...

చెన్నై : కావేరో బోర్డు ఏర్పాటు చేయాలంటూ విపక్షాలు ఇచ్చిన బంద్ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎంకే నేతలు రహదారులపైకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

పంజాబ్ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన...

ఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆహార పదార్థాలపై విధించిన జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. 

08:23 - April 5, 2018

హైదరాబాద్ : ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ కొరడా ఝులిపించింది. సిటీలోకి ఎంట్రీ లేదని ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో ప్రైవేటు ట్రావెల్స్ అధికమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్స్ పార్కింగ్ చేస్తుండడం..ఆర్టీసీకి గండి కొడుతుండడంతో ఆర్టీఏ అధికారులు దీనిపై దృష్టి సారించారు. ప్రైవేటు ట్రావెల్స్ లను సిటీలోకి అనుమతించవద్దని, నగర శివార్లుకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ వెహికల్ ఇన్స్ పెక్టర్ భరత్ సింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని ట్రావెల్స్ యాజమాన్యాలకు సమాచారం అందించడం జరిగిందన్నారు. మరి ఆర్టీఏ అధికారుల ఆదేశాలు ఏ మాత్రం అమలవుతాయో వేచి చూడాలి. 

08:16 - April 5, 2018

నల్గొండ : ఎక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దు...ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేయాలి..ఇది మంత్రి కేటీఆర్..గతంలో పేర్కొన్న వ్యాఖ్యలు...కానీ గులాబీ నేతల పర్యటనలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. ఇదే ఫ్లెక్సీలు ఒక నిండు ప్రాణం తీశాయి. మంత్రి కేటీఆర్ గురువారం మిర్యాలగూడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఫ్లెక్సీలు కట్టడానికి ఆటోలో కొంతమంది వెళ్లారు. అక్కడ పార్కింగ్ లైట్లు వేసుకోకుండా ఫ్లెక్సీలను అమరుస్తున్నారు. అదే రోడ్డుపై వేణు అనే యువకుడు బైక్ పై వస్తున్నాడు. చీకట్లో ఆటో కనిపించకపోవడంతో వేణు బైక్ ఆటోను ఢీకొట్టింది. ఆటో ఉన్న కర్ర నేరుగా వేణు కడుపులోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న వేణును స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని అక్కడి వైద్యులు పేర్కొనడంతో నగరానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మార్గమధ్యలోనే వేణు కన్నుమూశాడు. వేణుకు 15 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తారా ? లేదా ? చూడాలి. 

07:25 - April 5, 2018

విశాఖపట్టణం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రెడీ అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ వాటాలు విక్రయించవద్దంటూ నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మహాపాదయాత్రకు సిద్దమయ్యారు. ఈ పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. ఇందులో 3వేలమంది కార్మికులు పాల్గొంటున్నారు. విశాఖ కూర్మనపాలెం నుంచి కలెక్టరేట్‌ వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఈ స్టీల్‌మార్చ్‌ జరుగనుంది. ఈ సందర్భంగా టెన్ టివి పలువురితో ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లక్ చేయండి...

మంత్రి కేటీఆర్ పర్యటన..యువకుడు మృతి...

నల్గొండ : మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఆగిఉన్న ఫ్లెక్సీల ఆటో ట్రాలీని బైక్ ఢీకొంది. ఫ్లెక్సీ కర్ర కడుపులోకి దూసుకెళ్లి యువకుడు వేణు మృతి చెందాడు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మిర్యాలగూడలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వేణుకు 15 రోజుల క్రితమే వివాహం జరిగింది. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

స్టీల్ ప్టాంట్ మార్చ్ ప్రారంభం...

విశాఖపట్టణం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రెడీ అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ వాటాలు విక్రయించవద్దంటూ నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మహాపాదయాత్రకు సిద్దమయ్యారు. ఈ పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. ఇందులో 3వేలమంది కార్మికులు పాల్గొంటున్నారు. విశాఖ కూర్మనపాలెం నుంచి కలెక్టరేట్‌ వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఈ స్టీల్‌మార్చ్‌ జరుగనుంది. 

కృష్ణ జింకలను వేటాడిన కేసులో...

జోధ్ పూర్ : కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తదితరులపై రాజస్థాన్ లోని జోధ్ పూర్ న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ తో పాటు బాలీవుడ్ నటులు సైఫ్ ఆలీఖాన్, టబూ, సోనాలీ బింద్రే, నీలమ్ తదితరులు బుధవారం జోధ్ పూర్ కు చేరుకున్నారు. 

06:49 - April 5, 2018

సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన బాట పట్టారు. అసలు సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికులే లేరన్న మంత్రి జగదీశ్‌రెడ్డిపై వారు మండిపడుతున్నారు. తమకు బోనస్‌లు, తమ న్యాయమైన కోర్కెల విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారి ఆందోళకు గల కారణాలు, కార్మికుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి, ప్రభుత్వ విధానాలపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నాయకులు మధు చర్చించారు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:46 - April 5, 2018

సంగారెడ్డి : జిల్లా.. జోగిపేటలోని డాన్‌ బాస్కో స్కూల్‌లో ఫీజు కట్టలేదనే నెపంతో విద్యార్థులను మండుటెండలో నిలబెట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్‌కి చేరుకుని ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు. SC కోట కింద ప్రభుత్వం ఫ్రీ సిట్ ప్రకటించిదని, అందుకే మీ స్కూల్లో మా పిల్లలను జాయిన్‌ చేసామని తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యాన్ని నిలదీసారు. తల్లిదండ్రులు నిలదీయడంతో పిల్లలను ప్రిన్సిపాల్‌ క్లాస్‌రూమ్‌లకు పంపారు. దళితులమనే పిల్లలను చిన్న చూపు చూస్తున్నారని విద్యార్థుల తలిదండ్రులు ఆరోపించారు. స్కూల్ యజమాన్యంపై స్థానిక ఎంఈఓకు ఫిర్యాదు చేయగా ఎంఈఓ స్పందిచలేదు. 

06:44 - April 5, 2018

నల్గొండ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు 10 వేల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్డీఓ కార్యలయం ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నకు దిగారు. అకాల వర్షానికి, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలని జూలకంటి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు.

06:42 - April 5, 2018

హైదరాబాద్ : సీపీఐ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా చాడ వెంకట్‌రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. రాష్ట్ర మహాసభల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొమ్మిది మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం ఏర్పడింది. హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు జరిగిన రాష్ట్ర మహాసభల్లో చివరి రోజు నూతన కమిటీని ఎన్నుకున్నారు. 133 మంది రాష్ట్ర కౌన్సిల్‌ను మహాసభలకు హాజరైన ప్రతినిధులు ఎన్నుకున్నారు. స్వతంత్రంగా బలోపేతం కావాలని, పార్టీ పునాది మరింత పెంచుకోవాలని మహాసభ తీర్మానించింది.

06:39 - April 5, 2018

హైదరాబాద్ : కోదండరామ్‌ అధ్యక్షతన కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి పార్టీ .. తన పతాకాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ ప్రజల ఆంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటైన టీజేఎస్‌... ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ నిరంకుశపాలనకు అంతం పలకడమే ధ్యేయంగా పనిచేయాలని తెలంగాణ జనసమితి నాయకులు ప్రతినపూనారు. ఆకుపచ్చ రంగుపై పాలపిట్ట రంగుతో టీజేఎస్‌ జెండా రూపొందించారు. పాలపిట్ట విజయానికి సంకేతమైతే, ఆకుపచ్చ రంగు అభివృద్ధికి చిహ్నంగా భావిస్తారు. జెండా మధ్యలో నీలిరంగు తెలంగాణ చిత్రపటంలో అమరవీరుల స్థూపంతో జెండా రూపొందించారు. టీజేఎస్‌కు తాడు బొంగరం లేదంటూ వ్యాఖ్యానిస్తున్న వారికి ముకుతాడు వేసే విధంగా శరవేగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 29న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో టీజేఎస్‌ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ నిరంకుశపాలనకు అంతం పలకడమే ధ్యేయంగా ఎన్నికలకు సిద్ధంగా కావాలని టీజేఎస్‌ నిర్ణయించింది. 2019 ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించిన టీజేఎస్‌... సొంతంగానే ముందుకు సాగాలని నిర్ణయించింది. అయితే కలిసివచ్చే వారిని కాదనకూడదన్న ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. 

06:37 - April 5, 2018

మహబూబాబాద్ : తెలంగాణ ఉద్యమంలో జగన్‌, చిరంజీవికి చుక్కల చూపిన గడ్డ మానుకోటని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మానుకోట వేదికగా సమైక్యవాదులను తరిమికొట్టిన ఘనత ఇక్కడి గిరిజన బిడ్డలకు దక్కుతుందన్నారు. ప్రతిపేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. గిరిజన తండాలను, ఆదివాసీ, కోయగూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కె దక్కుతుందన్నారు. మహబూబాబాద్‌లో పర్యటించిన కేటీఆర్‌... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మంత్రి కేటీఆర్‌ తొలిసారి ఆ జిల్లాలో పర్యటించారు. మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరావుతో కలిసి ఆయన పలు భవనాలకు శంఖుస్థాపన చేశారు. 35 కోట్ల వ్యయంతో నిర్మించే మహబూబాబాద్‌ సమీకృత కలెక్టర్ భవనానికి శంఖుస్థాపన చేశారు. 5 కోట్లతో నిర్మించే మున్సిపాల్‌ భవనానికి, 1.5 కోట్లతో నిర్మించే జల్లా ఎస్పీ కార్యాలయానికి కేటీఆర్‌ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న ట్రాక్టర్లను, హార్వెస్టర్లను 150 మంది లబ్దిదారులకు మంత్రులు పంపిణీ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో జగన్‌, చిరంజీవిలకు చుక్కలు చూపిన గడ్డ మానుకోట అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సమైకవాదులను తరిమికొట్టిన ఘనత ఇక్కడి గిరిజన బిడ్డలకు దక్కుతుందన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే... తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థల భాగస్వామ్యంతో గిరిజన విద్యార్థుల ఉద్యోగాల కోసం నెలకొల్పుతామన్నారు. మహబూబాబాద్‌ను జిల్లాగా చేసిన ఘనత TRSకే దక్కుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తండాలను, ఆదివాసీ, కోడగూడేలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌, ఇంటింటి తాగునీరు ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మంత్రి కేటీఆర్‌ ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి మిర్యాలగూడలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు. కేటీఆర్‌ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

నల్గొండకు మంత్రి కేటీఆర్...

నల్గొండ : మంత్రి కేటీఆర్‌ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి మిర్యాలగూడలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు. కేటీఆర్‌ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

06:32 - April 5, 2018

విశాఖపట్టణం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రెడీ అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ వాటాలు విక్రయించవద్దంటూ నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మహాపాదయాత్రకు సిద్దమయ్యారు. ఈ పాదయాత్ర గురువారం జరుగనుంది. ఇందులో 3వేలమంది కార్మికులు పాల్గొననున్నారు. విశాఖ కూర్మనపాలెం నుంచి కలెక్టరేట్‌ వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఈ స్టీల్‌మార్చ్‌ జరుగనుంది.

2010 నవంబర్‌ 10న నవరత్న హోదాపొందిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ తన ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 50 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆరువేల మంది అధికారులను కలిగి ఉంది. 12వేల మంది పర్మినెంట్‌ కార్మికులు, 9700 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు 25వేల మందికిపైగా ఉద్యోగులు విశాఖ ఉక్కులో విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు.. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకావడంతో దాని అనుబంధంగా 1950 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. విశాఖలో భెల్‌ పరిశ్రమకు అనుబంధంగా రెండు ఆటోనగర్లు ఏర్పాటు చేశారు. వాటిల్లో 200కుపైగా చిన్నచిన్న పరిశ్రమలు నెలకొల్పారు. పోర్ట్‌సిటీగా ఉన్న విశాఖ స్టీల్‌ సిటీగా మారింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రతినెల దాదాపు 3వేల కోట్ల రూపాయలు పన్నుల రూపేనా ప్రభుత్వానికి చెల్లిస్తోంది.

ప్రభుత్వం తన విధానాలతో స్టీల్‌ప్లాంట్‌ను నష్టపరిచే చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ విధానాల వల్ల 2015-16లో స్టీల్‌ప్లాంట్‌కు 1420 కోట్ల నష్టం వచ్చింది. స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు సొంతంగా గనులు లేకపోవడమే కారణం. స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభించి 26 సంవత్సరాలైనా ఇంతవరకు ప్రభుత్వం గనులు కేటాయించలేదు. దీంతో ఐరన్‌ ఓర్‌ బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకు 350 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సొంత గనుల కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 28 అప్లికేషన్లు పెట్టుకుంది. ప్రకాశం జిల్లాలోని గనులను కేటాయించాలని ఏడు దరఖాస్తులు చేసింది. కాని రాష్ట్ర ప్రభుత్వం గనులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో మూడు సంవత్సరాలుగా సంస్థకు నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో నష్టాల బూచిచూపి స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్ర జరుగుతోంది.

స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు యూపీఏ ప్రభుత్వం కంటే మోదీ ప్రభుత్వమే ఎక్కువగా ప్రయత్నిస్తోంది. మెగా స్ట్రాటజిక్‌ సేల్‌ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నీతి ఆయోగ్‌ ద్వారా కట్టగట్టి అమ్మేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. స్టీల్‌ప్లాంట్‌లో 10శాతం షేర్లు విక్రయించడానికి ప్రభుత్వం పూనుకుంది. స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న 20 ఎకరాల భూమిని, ఇతర ఆస్తుల విలువ దాదాపు రెండు లక్షల కోట్లు ఉంటుంది. కాని బుక్‌ వ్యాల్యూ పేరుతో కేవలం 5000 కోట్ల రూపాయలుగా ధర నిర్ణయించారు. అందులో 10శాతం షేర్ల విలువ 490 కోట్ల రూపాయలుగా నిర్ణయించి... వాటిని కారుచౌకగా అమ్మే ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని కార్మికులు నిరసిస్తున్నారు. అందుకే భారీ ఉద్యమానికి సిద్దమవుతున్నారు. 25 కిలోమీటర్ల మేర స్టీల్‌మార్చ్‌ను నిర్వహించేందుకు రెడీ అయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్‌. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయవద్దని కార్మికలోకం కోరుతోంది. ఏపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌పై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రైవేటు ఆసుపత్రుల బంద్...

విజయవాడ : నేడు ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల బంద్ కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చింది. యాక్ట్ ను అసెంబ్లీ ఆమోదించడాన్ని నిరసిస్తూ బంద్ పాటించనున్నారు. 

అశోక్ గజపతి రాజుకు మాతృవియోగం...

విజయనగరం : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాతృమూర్తి కన్నుమూశారు. ముంబైలో ఆయన తల్లి కుసుమ (95) తుదిశ్వాస విడిచారు. 1955 లో గజపతినగరం శాసనసభ్యురాలిగా పనిచేశారు. అశోక్ గజపతి రాజు తల్లి మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కళా వెంకట్రావులు సంతాపం తెలియచేశారు. 

వైసీపీ ఎమ్మెల్యేలు హస్తిన బాట...

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదా పడ్డ తర్వాత వైసీపీ ఎంపీలు చేపట్టే దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలపనున్నారు. ఒక రోజు ఢిల్లీలో వైసీపీ చేపట్టే దీక్షలో పాల్గొంటారు.

నిలిచిన యాదాద్రి పనులు..!

యాదాద్రి : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికుల ఆందోళనకుదిగారు. కాంట్రాక్టు పనులు చేస్తున్న సన్‌షైన్‌ కార్యాలయం ముందు కూలీలు ధర్నాకు దిగారు. దాదాపు 300 మంది కార్మికులు ట్రక్కులు, జేసీబీలు నిలిపివేసి ధర్నాలో పాల్గొన్నారు.

అభ్యర్థి ఒక స్థానానికి మాత్రమే పోటీ...

ఢిల్లీ : ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక్క స్థానానికి మాత్రమే పోటీచేయాలన్న ప్రతిపాదనలకు ఎన్నికల కమిషన్ మద్దతు తెలిపింది. దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

హిందూ సాధువులకు కేబినెట్ హోదా...

మధ్యప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వివాదస్పద నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్‌ బాబా సహా ఐదుగురు హిందూ సాధువులకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం తీర్మానం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నర్మదానంద్‌ మహరాజ్‌, హరిహరానంద్‌ మహరాజ్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూ మహరాజ్‌, పండిత్‌ యోగేంద్ర మహంత్‌లు క్యాబినెట్‌ హోదా పొందారు.

ఈ ఏడాది సాధారణ వర్షాలే...

ముంబై : ఈ ఏడాది సాధారణ వర్షాలు కురియనున్నాయని వాతావరణంపై ముందస్తు అంచనా వేసే స్కైమెట్‌ తెలిపింది. స్కైమెట్ అంచనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 55 శాతం సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్‌లో రికార్డ్‌ స్థాయిలో వర్షం కురుస్తుందని, జులైలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని, ఆగస్టులో అతిసాధారణంగా ఉంటుందని, సెప్టెంబర్‌లో వర్షాలు భారీగా పుంజుకుంటాయని స్కైమెట్‌ అంచనా వేసింది.

మంటగలిసిన పాక్ ప్రతిష్ట...

ముంబై : ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్‌ ప్రతిష్ట మంటగలిసింది. ఐక్యరాజ‍్యసమితి తాజాగా వెల్లడించిన ఉగ్రవాదుల జాబితాలో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌తో పాటు 139 మంది పాకిస్తాన్‌ టెర్రరిస్టులకు చోటుదక్కింది. 

క్రీడా సంబరం...ప్రారంభం...

ఢిల్లీ : క్రీడా సంబరం...21వ కామన్వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌ కోస్ట్‌లో ప్రారంభమయ్యాయి.19 క్రీడల్లో 275 ఈవెంట్లలో నిర్వహిస్తోన్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో 71 దేశాలు బరిలోకి దిగాయి. ఆరంభ వేడుకల్లో పీవి సింధు సారధ్యంలో జాతీయ పతాకధారిగా వ్యవహరించగా భారత అథ్లెట్లు పరేడ్‌లో పాల్గొన్నారు. 15 ఏప్రిల్‌తో ఈ ప్రతిష్టాత్మక గేమ్స్‌కు తెరపడనుంది.

Don't Miss