Activities calendar

06 April 2018

21:25 - April 6, 2018

నల్గొండ : జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి ఏఎంఆర్‌ కాల్వలో పడిన ఘటనలో 9 మంది జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌లో 30 మందికిపైగా వ్యవసాయ కూలీలు ఉన్నారు. వీరంతా వద్దిపట్లలోని పడమటి తండా నుంచి పులచర్లలోని మిరపచేనులో పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుల ఆహాకారాలు విన్న స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలలను వెలికితీశారు.

సమాచారం తెలుసుకున్న మృతులు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రమాద స్థలానికి చేరుకుని విగతజీవులుగా పడివున్న తమ వారిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. గుండెలవిసేలా రోదించడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలముకున్నాయి. సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, బాధితుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ట్రాక్టర్‌ నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు. ఘటనా స్థలాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదం జరిగిన స్థలంలో గతంలో కూడా ఇలాంటివే కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. మలుపులు, ఇరుకురోడ్డును సరిచేయాలని అధికారులు, పాలకులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవడంతోనే మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

21:18 - April 6, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జనసేన, వామపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలతో పాటు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ మెడలు వంచి హోదా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని విజయవాడలో జరిగిన పాదయాత్ర సందర్భంగా జనసేన, వామపక్షాల నేతలు నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం.. జనసేన, వామపక్ష పార్టీలు పాదయాత్రను చేపట్టాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణల సారథ్యంలో.. మూడు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర స్పూర్తితో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా విషయంలో చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని జనసేన, వామపక్షాలు నిర్ణయించాయి.

బెజవాడ బెంజిసర్కిల్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పవన్‌ కల్యాణ్‌తోపాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణతోపాటు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెంజి సర్కిల్‌ నుంచి జాతీయరహదారి మీదుగా రామవరప్పాడు వరకు పాదయాత్ర సాగింది. భారీగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. మండువేసవి ఉక్కబోత వాతావరణంతో పవన్‌ కల్యాణ్‌, మధు, రాకమృష్ణ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. నేతల చొక్కలు తడిపోయాయి. దీంతో ఉక్కబోతను తట్టుకోలేదు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు చొక్కా విప్పారు. పవన్‌ కల్యాణ్‌ ఈ చొక్కను తన చేత పట్టుకుని.. మధుతో పాటు ముందుకు సాగడం కమ్యూనిస్టుల పట్ల పవన్‌ అభిమానానికి నిదర్శనంగా నిలిచిందని.. చూసినవారు వ్యాఖ్యానించారు.

హోదా ఉద్యమంలో భాగంగా మరో మూడు పాదయాత్రలు నిర్వహించాలని జనసేన, వామపక్షాలు నిర్ణయించాయి. ఈనెల 15న అనంతపురం, ఏప్రిల్‌ 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో పాదయాత్ర నిర్వహిస్తారు. వ్యక్తిగత స్వార్థం కోసం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ హోదాను తాకట్టు పెట్టాయని పాదయాత్ర అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మండిపడ్డారు. హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్వహించే అఖిలపక్ష సమావేశంతో ఎలాంటి ప్రయోజనంలేదని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. హోదా సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రకటించారు. ప్రధాని మోదీ మెడలు వంచి హోదా ఇచ్చి, విభజన హామీలు అమలు చేసేవరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. అధికార టీడీపీ కానీ, ప్రతిపక్ష వైసీపీ కానీ హోదా ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతో... ప్రస్తుత తరం నష్టపోయే పరిస్థితి వచ్చిందని జనసేన, వాపమక్ష నేతలు ఆక్షేపించారు. ప్రభుత్వాధినేతలో చిత్తశుద్ధి కనిపించేవరకూ.. ఆయన నేతృత్వంలోని అఖిలపక్షాలకు హాజరు కాబోమని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. 

21:13 - April 6, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లోనూ మండలస్థాయి వరకూ.. సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు కూడా.. అసెంబ్లీ వరకూ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి తన నిరసనను తెలియపరిచారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ.. ర్యాలీల్లో పాల్గొన్న నేతలు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంపై... కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగుదేశం పార్టీ.. ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతోన్న తెలుగు దేశం శ్రేణులు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా.. సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించాక, సచివాలయం వరకూ సైకిల్‌ తొక్కుతూ వెళ్లారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యే హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు నాయుడు సైకిల్‌ ర్యాలీ ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు.

తెలుగువారితో పెట్టుకున్న వారికి కాంగ్రెస్‌కు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం శ్రేణులు సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. అనంతపురం నగర మేయర్‌ స్వరూప, పాతవూరులోని గాంధీ విగ్రహాన్ని అభిషేకించి, పళ్లెంతో డప్పు కొడుతూ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదే జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రత్యేక హోదా హామీ అమలు కోరుతూ.. తెలుగుదేశం, వైసీపీ నాయకులు విడివిడిగా బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. కడప జిల్లాలో టీడీపీ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. పులివెందులలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

ఢిల్లీలోఅన్ని పక్షాల మద్దతు కూడగడుతున్న తమ అధినేతను, జగన్మోహన్‌రెడ్డి విమర్శించడంపై సతీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ప్రొద్దుటూరులో టీడీపీ ఇంఛార్జి వరదరాజులు రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు బైక్‌ ర్యాలీలు పాల్గొన్నాయి. హోదా కోసం ఎంతగానో శ్రమిస్తున్న చంద్రబాబును కేంద్రం వేధిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కాకినాడలోని ప్రధాన రహదారుల్లో టీడీపీ కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో పెద్దాపురం నుంచి సామర్లకోట వరకూ బైక్‌ర్యాలీ నిర్వహించారు.

రాజమండ్రి నగరంలో తెలుగుదేశం నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లు, ఇతర నాయకులు బైక్‌ ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో టీడీపీ శ్రేణులు బౌక్‌ ర్యాలీ నిర్వహించి, స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. కేంద్రం వైఖరికి నిరసనగా అంబేడ్కర్‌ సెంటర్‌లో అర్ధనగ్నంగా బైఠాయించారు. అనంతరం అదే సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులు భారీ బైక్‌ ర్యాలీ తీశారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడే, ఆర్టీసీ బస్సులను శుభ్రం చేయడం ద్వారా వినూత్నరీతిలో నిరసన తెలిపారు. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం నాయకులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎక్కడికక్కడ.. బీజేపీ వైఖరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 

21:10 - April 6, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా పోరును వైసీపీ మరో అంచెకు తీసుకెళ్లింది. కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని తీవ్రతరం చేసింది. పార్లమెంటులో పోరు ముగియడంతో.. ఢిల్లీ వేదికగా ఆమరణ దీక్షకు దిగారు వైసీపీ ఎంపీలు. కేంద్రం దిగివచ్చే వరకు దీక్ష ఆపేది లేదని ఎంపీలు తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఈ దీక్షను ప్రాంరంభించారు. లోక్‌సభలో అవిశ్వాస చేపట్టాలని శతవిధాల పోరాడినా.. కేంద్రం దిగిరాకపోవడంతో ఢిల్లీ వేదికగానే విషయాన్ని తేల్చుకుంటామంటున్న వైసీపీ ఎంపీలు.. ఆమరణ దీక్షను చేపట్టారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో భాగంగానే లోక్‌సభలో పట్టువదలకుండా వరుసగా అవిశ్వాస నోటీసులు ఇచ్చామని వైసీపీ ఎంపీలు అన్నారు. కాని.. తీర్మానానికి స్పీకర్‌ అనుమతించలేదన్నారు. దీనికి నిరసనగా తామంతా రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగామన్నారు. స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన అనంతరం మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అప్పటివరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

వైసీపీ ఎంపీల దీక్షకు ఢిల్లీ యూనివర్సిటీలోని తెలుగు విద్యార్థులు మద్దతు తెలిపారు. నాడు విభజనకు సహరించి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన కుట్రలో కాంగ్రెస్‌, బీజేపీలు చేతులు కలిపాయన్నారు. నాడు రాష్ట్ర విభజన బిల్లు పాస్‌అయ్యేందుకు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ కూడా సహకరించారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన తెలివితేటలను రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగిస్తున్నారని విమర్శించారు. అందుకే వైసీపీ పోరాటానికి మద్దతిస్తున్నామని తెలుగు విద్యార్థులు స్పష్టం చేశారు.

ఎంపీలు దీక్షకు దిగిన కొద్దగంటల్లోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరోవైపు ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు చెలరేగడంతో.. రోడ్లపై దుమ్మూధూళి కమ్మేసింది. ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీల దీక్షకు ఇబ్బంది ఎదురైంది. దీంతో ఏపీ భవన్‌ లోపల కూర్చొని వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తున్నారు. మొత్తానికి పార్లమెంటు నుంచి వైసీపీ ప్రత్యేక హోదా పోరు వేదిక ఏపీ భవన్‌కు చేరుకుంది. ప్రజాక్షేత్రంలోనే హోదా అంశాన్ని తేల్చుకుంటామని వైసీపీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం దిగివచ్చే వరకు తమ ఆమరణ దీక్షను కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. 

21:07 - April 6, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టు, జనసేన శ్రేణులు పాదయాత్రలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లోనూ పార్టీల నాయకులు, ఉత్సాహంగా పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలు కోరుతూ.. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు.. జనసేన శ్రేణులు కలిసి మహాపాదయాత్ర నిర్వహించారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సంయుక్తంగా జరిపిన పాదయాత్రకు మద్దతుగా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆయా పార్టీల శ్రేణులు పాదయాత్రలు నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురంలో వామపక్షాలు, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజల నోట్లో మట్టి కొట్టిందని ఈ సందర్భంగా నాయకులు ఆరోపించారు. ఇదే జిల్లాలోని పెనుమంట్ర మండలం మార్టేరు నుంచి పెనుగొండ వరకు, సీపీఎం, సీపీఐ, జనసేన కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. పాలకొల్లులోనూ వామపక్ష, జనసేన కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఆంధ్రులను మోసం చేసిన మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనంటూ నినదించారు.

కాకినాడలోనూ వామపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. బానుగుడి సెంటర్‌ నుంచి బాలాజీ చెరువు వరకూ పాదయాత్ర సాగించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై రాజీలేని పోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు. రాజమండ్రిలోనూ సీపీఎం, సీపీఐ, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బీజేపీ నాయకులు.. ఏపీ ప్రజలను వంచించారని నాయకులు ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ.. గుంటూరు నగరంలోనూ వామపక్షాలు, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియం వరకూ పాదయాత్ర నిర్వహించారు. అవిశ్వాస తీర్మానాల నుంచి మోదీ ప్రభుత్వం పారిపోయిందని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్యమాలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

నెల్లూరు జిల్లాలోనూ వామపక్షాలు, జనసేన నేతలు పాదయాత్ర నిర్వహించారు. నెల్లూరులోని ఆగ్మకూరు బస్టాండ్‌ నుంచి గాంధీ బొమ్మవరకూ పాదయాత్ర నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని కార్యకర్తలు నినదించారు. ఆత్మకూరులోనూ మూడు పార్టీలూ.. సీపీఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ డిపో వరకూ పాదయాత్ర నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోనూ జనసేన, వామపక్షాల నేతలు పాదయాత్ర నిర్వహించారు. చీరాలలో పాదయాత్ర అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం తాము ఉద్యమిస్తే.. అధికార పార్టీ జైలుకు పంపిందని విమర్శించారు. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కడప జిల్లాలోనూ సీపీఎం, సీపీఐ, జనసేన కార్యకర్తలు పాదయాత్ర చేశారు. జ్యోతిరావు ఫూలే విగ్రహం నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకూ పాదయాత్ర సాగింది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని పాదయాత్ర సందర్భంగా నాయకులు డిమాండ్‌ చేశారు. విభజన హామీలను నెరవేర్చాలని, ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. కర్నూలులో వామపక్ష, జనసే పార్టీలు పాదయాత్ర నిర్వహించాయి. జిల్లా పరిషత్‌ నుంచి జాతీయ రహదారి వరకూ పాదయాత్ర నిర్వహించారు. పార్లమెంటులో అవిశ్వాసం పెట్టినా... పార్లమెంటులో చర్చ రాకుండా డ్రామాలు ఆడిందని నాయకులు విమర్శించారు. ప్రత్యేక హోదా కోరుతూ జనసేన, వామపక్ష పార్టీల నాయకులు తిరుపతిలోనూ పాదయాత్ర నిర్వహించారు. నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై తిరుచానూరు నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న నేతలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.

విశాఖపట్టణంలోనూ సీపీఎం, సీపీఐ, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశాక, బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేస్తోన్న నమ్మక ద్రోహానికి నిరసనగా.. జాతీయ రహదారిపై శాంతియుత పాదయాత్ర చేపట్టారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా మోదీ సర్కారు చేసిన ప్రయత్నాన్ని వామపక్ష, జనసేన నేతలు తప్పుబట్టారు. ఏపికి ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు డిమాండ్లతో శ్రీకాకుళం జిల్లాలోనూ వామపక్షాలు, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. శ్రీకాకుళం, కాశీబుగ్గల నుంచి హైవేల దాకా పాదయాత్రలు కొనసాగాయి. టెక్కలిలోనూ అంబేడ్కర్‌ కూడలి నుంచి, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, ఆముదాల వలసలలోనూ పాదయాత్రలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నాయకులు ఈ సందర్బంగా తప్పుబట్టారు.

21:03 - April 6, 2018

ఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ఏ చర్చా లేకుండానే ముగిసిపోయాయి. ప్రత్యేక హోదా కోసం వివిధ పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం కూడా చర్చకు రాకుండానే సమావేశాలు ముగిసిపోయాయి. సమావేశాల చివరి రోజైన శుక్రవారం, ఎలాంటి ప్రకటనా చేయకుండానే స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ సభను నిరవధికంగా వాయిదా వేయడంతో.. టీడీపీ ఎంపీలు, సభలోనే ఆందోళనకు దిగారు. సభ వాయిదా తర్వాత కూడా పార్లమెంటులోనే ధర్నాకు కూర్చున్నారు. ఓదశలో సుమిత్రా మహాజన్‌ మాట్లాడతారంటూ స్పీకర్‌ కార్యాలయం నుంచి సమాచారం అందడంతో.. ఎంపీలు అక్కడి వెళ్లారు. అయితే.. ఎంపీలకు చేదు అనుభవమే ఎదురైంది. దీంతో కార్యాలయంలోనే సుమారు 6 గంటల పాటు నిరసన కొనసాగించారు. చివరకు టీడీపీ ఎంపీలను మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో స్పృహ కోల్పోయిన మురళీమోహన్‌ను ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రి ఐసీయూలో చేర్పించారు.

లోక్‌సభ వాయిదా పడినప్పటికీ టీడీపీ ఎంపీలు బయటకు వెళ్లకుండా ప్రధాన మంత్రి సీటు వద్ద ఆందోళన చేపట్టారు. హోదా కోసం నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీలను భద్రతా సిబ్బంది వారించినప్పటికీ వినిపించుకోలేదు. గంటకు పైగా ఆందోళన కొనసాగించిన తర్వాత భద్రతా సిబ్బంది.. లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం టీడీపీ ఎంపీలను బురిడీ కొట్టించారు. లోక్‌సభ స్పీకర్‌ మాట్లాడతారని చెప్పడంతో.. అందరూ పోలోమంటూ సుమిత్రా మహాజన్‌ కార్యాలయానికి వెళ్లారు. దీంతో భద్రతా సిబ్బంది లోక్‌సభ తలుపులు మూసేశారు. భద్రతా సిబ్బంది సందేశంతో స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ ఎంపీలకు చేదు అనుభవం ఎదురైంది. అప్పటికే సుమిత్రా మహాజన్‌ వెళ్లిపోవడంతో.. దీనిని అవమానంగా భావించిన టీడీపీ ఎంపీలు స్పీకర్‌ కార్యాలయంలోనే ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళన విరమించేందిలేదని భీష్మించారు. స్వచ్ఛందంగా బయటకు వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది చెప్పినా టీడీపీ ఎంపీలు వినిపించుకోలేదు.

దీంతో పార్లమెంటు భద్రతా సిబ్బంది టీడీపీ ఎంపీలను బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. స్పీకర్ కార్యాలయంలో గంటల తరబడి నిరసన వ్యక్తం చేయడంతో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ తీవ్ర అస్వస్థతకులోనయ్యారు. దీంతో ఆయన్ను రామ్‌మనోహరల్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసొచ్చిన తర్వాత పార్లమెంటు మెయిన్‌ గేట్‌ వద్ద టీడీపీ ఎంపీలు ధర్నా చేశారు.

అంతకు ముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద.. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు ఎపీ మాగంటి బాబు పార్లమెంటు ఆవరణలో సైకిల్‌ తొక్కి నిరసన వ్యక్తం చేశారు. రోజుకో వేషధారణలో అందర్నీ ఆకట్టుకొంటున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌.. చివరి రోజు విశ్రామిత్రుడి వేషంలో పార్లమెంటు మెయిన్‌ గేట్‌ వద్దకు వచ్చారు. హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రధాని మోదీని... టీడీపీ విశ్వామిత్రుడి వేషధారి శివప్రసాద్‌ శపించారు. మొత్తం మీద టీడీపీ, వైసీపీ ఎంపీలు గతనెల 5 నుంచి ఏప్రిల్‌ 6 వ తేదీ వరకు పార్లమెంటు లోపల, బయట తమదైన శైలిలో ఆందోళన చేసి, దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. 

20:50 - April 6, 2018

ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే కమ్యూనిస్టుల తపన అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. ప్రస్తుతం కార్మిక రంగం ఎలాంటి పరిస్థితిలో ఉంది ? కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు..పాలకులు అనుసరిస్తున్న తీరుపై టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. దక్షిణకొరియా, సింగపూర్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్రజాప్రయోజన రంగాలన్నీ పబ్లిక్ సెక్టార్ లోనే ఉన్నాయన్నారు. లేబర్ నిర్వచనం మార్చడం ద్వారా సామాన్యుడికి ప్రభుత్వాలు టోపి పెడుతున్నాయన్నారు. పారిశ్రామిక రంగంలో మార్పులు కార్మికులపై భారగంగా మారుతున్నాయని, బీజేపీ వచ్చాక కార్మిక జీవనభద్రత లోపిస్తోందన్నారు. దక్షిణ..రైల్వే విద్య..వైద్య రంగాల ప్రయివేటీకరణ దేశానికి చేటన్నారు. అటానమస్ అంటే ప్రైవేటీకరణకు ముద్దు పేరు అని వ్యాఖ్యానించారు. పీపీపీలో బాధలు ప్రభుత్వానివి..లాభాలు కార్పొరేట్లకు అని, నోట్ల రద్దు..జీఎస్టీతో అనియత రంగంలో ఉపాధి తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామికోత్పత్తి పడిపోయిందని పేర్కొన్నారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి...

20:30 - April 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కీలక అంశాలపై చర్చ లేకుండానే మలి విడత బడ్జెట్ సమావేశాలు అసంపూర్తిగా ముగిసాయి. వివిధ అంశాలపై విపక్షాలు ఆందోళనలకు దిగడంతో పార్లమెంట్‌ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగకపోవడానికి కారణం నువ్వంటే నువ్వని బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కావేరి బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడిఎంకే ఎంపీలు ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అవిశ్వాసంపై ఎలాంటి ప్రస్తావన లేకుండానే లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. మలివిడత బడ్జెట్‌ సమావేశాల తీరు అధ్వాన్నంగా ఉంది బడ్జెట్‌ తొలి విడత సమావేశాల్లో లోక్‌సభ పనితీరు 134 శాతం ఉండగా.... మలివిడతలో మాత్రం కేవలం 4 శాతం మాత్రమే పనితీరు కనబడింది. లోక్‌సభ 28 సార్లు సమావేశం కాగా 34 గంటలు మాత్రమే పనిచేసిందని స్పీకర్‌ వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 10 గంటలు, బడ్జెట్‌పై 12 గంటలు మాత్రమే చర్చ జరిగింది. ఆందోళనలు వాయిదాల కారణంగా 127 గంటల 45 నిముషాల సమయం వృథాగా పోయింది. సభలో 158 ప్రశ్నలను సభ్యులు లేవనెత్తగా 17 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు వచ్చాయి. ఈ సమావేశాల్లో ఫైనాన్స్‌, గ్రాట్యిట్యుటి తదితర 5 బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి.

మలి విడత బడ్జెట్‌ సమావేశాల్లో పెద్దల సభగా పేరొందిన రాజ్యసభ కూడా సజావుగా సాగలేదు. సభ్యుల నిరవధిక ఆందోళనతో ఏకంగా 120 గంటల విలువైన సభా సమయం వృధా అయింది. వాయిదాల పర్వం, సభ్యుల ఆందోళనలతో రాజ్యసభలో 27 రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టలేదని ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.. కేవలం 45 గంటల పాటే సభా సమయం సజావుగా సాగింది.

పిఎన్‌బి స్కాం, ఏపీకి ప్రత్యేక హోదా, కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటు, విగ్రహాల ధ్వంసం, ఎస్‌సీ ఎస్‌టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు వంటి పలు అంశాలపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం చెలరేగింది. టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌, సిపిఎం పార్టీలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా చర్చకు ఆస్కారం లేకుండా పోయింది.

జనవరి 29న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన తొలివిడత బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 9 ముగిసాయి. మలివిడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి5న ప్రారంభమై నేటితో ముగిసాయి. సమావేశాలు సజావుగా సాగకపోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కారణమని బిజెపి ఆరోపించగా.... కీలక అంశాలపై చర్చ జరగడం ఇష్టం లేకనే బిజెపి సమావేశాలను అడ్డుకుందని కాంగ్రెస్‌ ప్రత్యారోపణ చేసింది.

20:26 - April 6, 2018

గుంటూరు : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా..విభజన హామీలు కోరుతూ వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంగం జాగర్లమూడిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గత నాలుగేళ్లుగా పవన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఆరు నెలలకొకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్...ఒక ప్రెస్ మీట్ చేస్తారన్నారు. బాబుకు సపోర్టు ఇచ్చే విధంగా ఒక మీటింగ్ పెట్టి కనబడుతాడని..అనంతరం కనబడడని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. 2014లో బాబుకు... బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చి రాష్ట్రం ముంచెత్తడంలో పవన్ పాత్ర లేదా ? అని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇదే మేధావి భిన్నంగా స్పందిస్తున్నాడని తెలిపారు. హోదాపై జైట్లీ వ్యాఖ్యల అనంతరం పవన్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదని, ఆనాడు ఏం చేశాడని నిలదీశారు. 

20:21 - April 6, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏపీ ప్రభుత్వానికి ఏడు ప్రశ్నలు సంధించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సంగం జాగర్లమూడిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం..విభజన హామీల అమలు కోసం గత నాలుగేళ్లుగా ఏపీ సీఎం బాబు ఏం చేస్తున్నారు ? గాడిదలు కాస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీలు చర్చలు జరిపితే ఏం తప్పని ప్రశ్నించారు. ఆనాడు ప్యాకేజీని మెచ్చుకున్న బాబు ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను గొంగళి పురుగునైనా ముద్దాడుతానని కేసీఆర్ చెప్పారని..తెలంగాణ సాధించారా ? లేదా ?..ఇక్కడ సంకల్పం ముఖ్యమన్నారు. పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం అభినందనీయమని, టిడిపి ఎంపీలు కూడా రాజీనామా చేయాల్సి ఉండేదని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని, హోద అనేది ప్రజల అభిమతమన్నారు. వైసీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తునన్నామని, చివరి బడ్జెట్ లో న్యాయం దక్కకపోవడంతో ఆఖరి అస్త్రం ప్రయోగించామన్నారు.

1 ప్రశ్న : ప్లానింగ్ కమిషన్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్క లేఖ రాయలేదని, అప్పటి నుండి ఏమీ చేస్తున్నారు ? గాడిదలు ఏమైనా కాస్తున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

2వ ప్రశ్న : సెప్టెంబర్ 8, 2016 రోజున ప్రత్యేక హోదా..అబద్ధపు ప్యాకేజీ అంటూ అర్ధరాత్రి కేంద్ర మంత్రి జైట్లీ ప్రకటన చేశారని...బాబుతో చర్చలు జరిపిన అనంతరం ప్యాకేజీని ప్రకటించారని ప్రచారం జరిగిందని తెలిపారు. బాబు కోరిక మేరకు ప్యాకేజీని ప్రకటించామని జైట్లీ లేఖలో ఒక భాగమన్నారు. ప్యాకేజీని గొప్పగా ఉందని పేర్కొనలేదా ? ఢిల్లీకి వెళ్లి జైట్లీని సిన్మానించలేదా ? అసెంబ్లీలో మాట్లాడలేదా ? ఈ విషయంలో బాబు పలు వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు.

3వ ప్రశ్న : హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టకుండా..లేని జీఎస్టీ ఫిగర్స్ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే వేగంగా పరుగెత్తుతున్న రాష్ట్రం ఏపీ అని బాహ్య ప్రపంచానికి చెప్పలేదా ? విశాఖలో జరిగిన సమావేశాల్లో కోట్ల పెట్టుబడులు వచ్చాయని..ఉద్యోగాలు వచ్చాయంటూ చెప్పలేదా ? రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా ఎక్కువగా ఉందని..చెప్పలేదా ? అని నిలదీశారు.

4వ ప్రశ్న : హోదా పై టిడిపి ఎలాంటి పోరాటం చేసింది ? నాలుగేళ్లుగా వైసీపీ పోరాటం చేసిందన్నారు. ఆయా సమయాల్లో పోలీసుల చేత నిర్భందం ప్రయోగించారని, ప్రధాన మంత్రి వస్తున్నారని తాను చేపట్టిన దీక్షను భగ్నం చేయించారని...ఎన్నో ఆందోళనలు నీరు గార్చలేదా ? యువభేరీ కార్యక్రమం నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేశామని..ఈ కార్యక్రమానికి హాజరయితే పీడీ యాక్టు పెడుతామని హెచ్చరించలేదా ? అని ప్రశ్నించారు.

5వ ప్రశ్న : వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే బాబు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవారా ? అని ప్రశ్నించారు. సంఖ్యాబలం ఉంటేనే మద్దతిస్తానని చెప్పిన బాబు యూ టర్న్ తీసుకున్నారన్నారు. తాను రాసిన లెటర్ ను ఇతర విపక్ష నేతలకు చూపించి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారని, దీనితో అవిశ్వాస తీర్మానం పెడుతామని బాబు ప్రకటించారని తెలిపారు.

6వ ప్రశ్న : అఖిలపక్షం అని చెప్పి డ్రామాలుడుతున్నారని, నిరసనలు తెలియచేయవద్దని..విద్యార్థులను ఉద్యమంలోకి రావద్దని..ఉద్యమం పెద్దది అయితే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని..కేవలం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియచేయాలని బాబు కార్యచరణ ఉందని ..ఇది మోసం కాదా ? అని నిలదీశారు.

7వ ప్రశ్న : హోదా సాధ్యమౌతుందని తెలిసి..ఆఖరి బడ్జెట్ అని కూడా తెలిసి 25 మంది ఎంపీలు ఒక్కదగ్గరకు వచ్చి రాజీనామాలు చేసి..నిరహార దీక్ష చేస్తే కేంద్రం దిగి వస్తుందని తెలిసి వారి ఎంపీల చేత రాజీనామాలు చేయకపోవడం ధర్మమమేనా ? అని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మభ్య పెడుతున్న బాబు చరిత్ర హీనుడుగా నిలిచిపోతాడన్నారు. 

జగన్ ప్రెస్ మీట్...

గుంటూరు: వైసీపీ అధ్యక్షుడు జగప్ సంగం జాగర్లమూడిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రత్యేక హోదా కోరుతూ తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బాబుకు ఏడు ప్రశ్నలు సంధించారు. 

19:15 - April 6, 2018

ఢిల్లీ : ఏపీ టిడిపి ఎంపీల పోరాటం నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం నుండి టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన కొనసాగించారు. శుక్రవారం సభ నిరవధికంగా వాయిదా పడ్డా సభలో వారు ఉండిపోయారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పిలుస్తున్నారంటూ సమాచారం అందించి ఎంపీలు బయటకు రాగానే తలుపులకు తాళం వేశారు. స్పీకర్ కూడా కార్యాలయంలో లేకపోయేసరికి అక్కడనే ఆందోళన కొనసాగించారు. సాయంత్రం భారీగా మార్షల్స్ మోహరించారు. టిడిపి ఎంపీలను బలవంతంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఎంపీలు..మార్షల్స్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎంపీ మురళీ మోహన్ సృహ కోల్పోవడంతో ఆయన్ను ఆర్ఎమ్ ఎల్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ఎంపీలను పార్లమెంట్ గేట్ 1 వద్ద వదిలేశారు. అక్కడే వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. 

షాకు లోకేష్ కౌంటర్ ట్వీట్...

విజయవాడ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఐదు కోట్ల మంది ప్రయోజనాల కోసం పోరాడుతుంటే కుక్కలతో పోలుస్తారా? హక్కుల కోసం ఉద్యమిస్తుంటే పిల్లులు..పాములు..ముంగిసలంటారా? అంటూ ప్రశ్నించారు. ఏపీని నాలుగేళ్ల పాటు అంధకారంలో పెట్టిన బీజేపీ తలపొగరుతో జంతువులతో పోలుస్తోందని విమర్శించారు. బీజేపీకి వినాశకాలం దాపురించిందని, అందుకే విపరీత బుద్ధి ప్రదర్శిస్తోందన్నారు. 

టిడిఎల్పీ సమావేశం...

విజయవాడ : అసెంబ్లీ కమిటీ హాల్ లో టిడిఎల్పీ సమావేశం జరిగింది. ఢిల్లీ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఢిల్లీ పర్యటన విశేషాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. ఎంపీలు చేపట్టే బస్సు యాత్రపై, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీకి వెళ్లే అంశంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంతో పాటు ప్రభుత్వ సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లాలని బాబు సూచించారు. 

18:46 - April 6, 2018

తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ సివిల్‌ సర్వీస్‌ అకాడమీ 2015 మేలో ప్రారంభం అయింది. విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సివిల్స్‌లో శిక్షణతో పాటు అన్ని కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు శిక్షణ అందిస్తోంది. 10th మరియు ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్ధులు ఈ శిక్షణకు అర్హులు. దీనిపై టెన్ టివితో టిక్సా CEO, ప్రముఖ విద్యావేత్త విజయ్‌ సారభి నంబీ మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

టిడిపి ఎంపీలను బయటకు తీసుకొచ్చిన మార్షల్స్...

ఢిల్లీ : ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఛాంబర్‌లో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను మార్షల్స్ బలవంతంగా బయటకు తరలించారు. 

18:39 - April 6, 2018
18:37 - April 6, 2018

ఢిల్లీ : ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో.. రోడ్లపై దుమ్ము ధూళి కమ్మేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. మరోవైపు భారీ గాలులతో ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీల దీక్షకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఏపీ భవన్‌ లోపల కూర్చొని వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తున్నారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి. 

18:35 - April 6, 2018

ఢిల్లీ : వైసిపి ఎంపీల రాజీనామాలు రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందన్నారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చను చేపట్టలేదని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు నిర్వహించడంలో కేంద్రం వైఫల్యం చెందిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. అమలు పరచకపోవడంతో ప్రజలలో వ్యతిరేకత పెరిగిందన్నారు సీతారాం ఏచూరి. విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందన్నారు సీపీఐనేత డి రాజా. 

18:24 - April 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడినా టిడిపి ఎంపీలు నిరసన చేపడుతూనే ఉన్నారు. లోక్ సభలో ఆందోళన చేస్తున్న వీరిని స్పీకర్ పిలుస్తున్నారంటూ బయటకు వచ్చే విధంగా చేసి..లోక్ సభ తలుపులకు తాళాలు వేశారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లేసరికి స్పీకర్ లేకపోవడంతో టిడిపి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానపరిచారంటూ స్పీకర్ కార్యాలయంలోనే ఆందోళన చేపట్టారు. గత కొద్దిగంటలుగా వీరి ఆందోళన కొనసాగుతోంది. దీనితో వీరిని బయటకు తరలించేందుకు మార్షల్స్ సిద్ధమయ్యారు. కానీ స్పీకర్ వచ్చి తమ సమస్యలు వినాలని టిడిపి ఎంపీలు పేర్కొంటున్నారు. మహిళా ఎంపీలను తరలించేందుకు మహిళా మార్షల్స్ మోహరించారు.

ఇదిలా ఉంటే ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం సాయంత్రం ఉరుములు..మెరుపులు..ఈదురుగాలులతో భారీగా వర్షం కురిసింది. దీనితో ఆంధ్రా భవన్ వద్ద వైసీపీ ఏర్పాటు చేసిన దీక్షా స్థలి టెంట్ కూలిపోయింది.

 

18:22 - April 6, 2018

ఎగిరిపోయిన వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం..

ఢిల్లీ : నగరంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంపీలు దీక్ష శిబిరం ఎగిరిపోయింది. ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వాతావరణ నెలకొంది. దీంతో వైసీపీ ఎంపీలు దీక్షా శిబిరం ఎగిరిపోయింది. దీంతో వారు ఏపీ భవన్ కు చేరుకుని దీక్షను కొనసాగిస్తున్నారు. మరోపక్క సడెన్ గా మారిపోయిన వాతావరణంతో నగర ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. 

18:19 - April 6, 2018

నిజామాబాద్ : సమాజంలో చిన్న చూపుకు గురవుతున్న తమను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ను హిజ్రాలు కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం జిల్లా సీపీఎం నేతల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. తమకు ఎవరూ ఇళ్లు కిరాయికి ఇవ్వడం లేదని, తమను చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, తమకు ఇళ్లు కట్టించాలని కోరారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

అందుకే పార్లమెంట్ కు మొక్కా : చంద్రబాబు

అమరావతి : ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లటం..అక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల గురించి తెలిసిందే. ఈ విషయం గురించి చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో వివరించారు. అంబేద్కర్‌ ఏ ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాశారో ఈ రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసి మనకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మొక్కానని అన్నారు. అంతేగానీ కొంత మంది పేపర్లలో రాయిస్తున్నట్లు తాను వేరే ఉద్దేశంతో అలా చేయలేదని స్పష్టంచ చేశారు. ఢిల్లీ వెళ్లిన మొదటి రోజున పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి, అనంతరం పార్లమెంటుకి మొక్కి ముందుకు కదిలానని తెలిపారు.

18:14 - April 6, 2018
18:12 - April 6, 2018

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరుగనుంది. ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను యూనివర్సిటీ వీసీ ప్రొ. రామచంద్రం, రిజిష్ట్రార్ గోపాల్ రెడ్డిలు విడుదల చేశారు. ఓయూ వందేళ్ల పండుగ జరుగుతున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవంతం కావాలని వీసీ, రిజిష్ట్రార్ లు ఆకాంక్షించారు. యూనివర్సిటీ అభివృద్ధికి కార్యరూపం దాల్చే నిర్ణయాలు తీసుకోవాలని, పూర్వ విద్యార్థులు అందరూ హాజరై విజయవంతం చేయాలని సూచించారు. 

భారత రక్షణ శాఖ వెబ్ సైట్ హ్యాకింగ్!..

ఢిల్లీ : భారత రక్షణ శాఖకు చెందిన వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. కాసేపటి క్రితం వెబ్ సైట్ డౌన్ అయింది. వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే 'error' అనే మెసేజ్ వస్తోంది. 'మళ్లీ ట్రై చేయండి' అనే వాక్యం కనపడుతోంది. మరో వైపు సైట్ పైభాగంలో ఒక చైనీస్ అక్షరం సైట్లో కనపడుతోంది. దాని అర్థం 'హోం' అని చెబుతున్నారు. దీనిపై ఏఎన్ఐ స్పందిస్తూ, ఇది కచ్చితంగా హ్యాంకింగేనని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

స్పీకర్ కార్యాలయం వద్ద మార్షల్స్ హడావుడి..

ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కార్యాలయం వద్ద మార్షల్స్ హడావుడి చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌ సహా అన్ని గదులను సిబ్బంది మూసివేశారు. ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎంపీల దగ్గరకు మార్షల్స్‌ రాకుండా తాళ్లతో అడ్డుకున్నారు. సభ వాయిదా పడినప్పటి నుంచి టీడీపీ ఎంపీలు స్పీకర్ ఛాంబర్‌లో నిరసన తెలుపుతున్నారు. వారిని తరలించేందుకు మార్షల్స్ యత్నిస్తున్నారు. మహిళా ఎంపీలను తరలించేందుకు మహిళా సిబ్బంది చేరుకున్నారు.

18:08 - April 6, 2018

గుంటూరు : చిలకలూరి పేటలో ఆర్వీఎస్ హై స్కూల్ విద్యార్థులు 'హోదా' కోసం వినూత్న పోరాటం నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పోస్టుకార్డులు రాశారు. ఉద్యానవనపాలక మండలి సభ్యులు శివరామకృష్ణ ఆధ్వర్యంలో 'పోస్టుకార్డు' ఉద్యమం లేవనెత్తారు. కోటి కార్డులు రాయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శివరామకృష్న తెలిపారు. ఏపికి రావాల్సిన అన్ని సదుపాయాలు, ఐదు కోట్ల మంది ఆంధ్రుల హక్కు అని..ప్రధాన మంత్రి సత్వరంగా పరిష్కరించాలని ప్రిన్స్ పాల్ పేర్కొన్నారు. హోదా వస్తేనే తమకు ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.

 

17:58 - April 6, 2018

చిత్తూరు : ప్రత్యేక హోదా కోసం ఏపీ రాష్ట్రంలో శుక్రవారం పాదయాత్రలు జరిగాయి. జనసేన..లెఫ్ట్ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. తిరుపతిలో ఈ పాదయాత్ర విజయవంతంగా సాగింది. నాయుడు పేట - పూతలపట్టు జాతీయ రహదారిపై తిరుచానూరు నుండి తిరుపతి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో వామపక్ష నేతలతో పాటు జనసేన నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

తృణముల్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ..

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రంగా ఘర్షణ చోటుచేసుకుంది. పంచాయితీ రాజ్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. జలపాయ్ గురి,బీర్భూమ్ లో ఘర్షణలు చెలరేగాలి. దీంతో గర్షణలను అణిచివేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. 

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అసెంబ్లీలో తీర్మానం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని సభ ఆమోదం పలికింది. అలాగే ఏపీ విభజన హామీలకు సంబంధించి  కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. విభజన హామీల గురించి కేంద్ర ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన చట్టంలో వున్న హామీలు నెరవేర్చకుండా కేంద్రం ఏపీపై వివక్ష చూపుతోందనీ..దానిపై పోరాడి రాష్ట్ర హక్కులు సాధించుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు.

16:50 - April 6, 2018

ఏలూరు : ప్రత్యేక హోదా డిమాండ్ తో ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాలో విపక్షాలు పాదయాత్ర చేపట్టాయి. సీపీఎం, సీపీఐ, జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. ఏలూరు గడియారం స్తంభం నుండి ఫైర్ స్టేషన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేసిందని, ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. 

16:46 - April 6, 2018

ఎస్సీలకు పెళ్లి కానుకగా రూ.40వేలు : చంద్రబాబు

అమరావతి : ఎస్సీలకు పెళ్లి కానుకగా రూ.40 వేలు ఇస్తున్నామని... అలాగే ఎస్టీలకు పెళ్లి కానుకగా రూ.50వేలు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..దళితుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. దళితవాడల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేస్తున్నామని, ప్రభుత్వాలు సరిగా పనిచేయకుంటే అరాచకాలు జరిగే అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టులో రాబర్ట్ వాద్రాకు చుక్కెదురు..

ఢిల్లీ : సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును నిలిపేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తుకు వాద్రా వ్యక్తిగతంగా హాజరుకాకక తప్పదు. గతంలో ఆయన ఈ దర్యాప్తుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు తిరస్కరించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నాం : చంద్రబాబు

అమరావతి : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు.. అట్టడుగు వర్గాల ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలన్నారు. దళితుల కోసం పక్కా ఇళ్లకు శ్రీకారం చుట్టామన్నారు. దళితుల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేయడానికి భయపడేలా చర్యలుండాలన్నారు. దళితులపై అత్యాచారాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు చంద్రబాబు చెప్పారు.

దళితులకు టీడీపీ అండగా వుంటుంది : చంద్రబాబు

అమరావతి: అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు.. సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయన్నారు. కొన్ని వర్గాలు ఇంకా అట్టడుగున ఉన్నాయని, మొదటి నుంచి దళితులకు టీడీపీ అండగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. దళితులకు అన్యాయం జరిగేలా చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 

16:25 - April 6, 2018

ఢిల్లీ : వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్న పరిణామాలపై లెఫ్ట్ నేతలు ఆందోళన వెలుబుచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, స్వేచ్చగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ గడువు పొడిగించాలని, హైకోర్టుల్లో ఎన్నికలపై పిటిషన్ లు దాఖలయ్యాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్..రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడే విధంగా పోలీసులు చూడాలన్నారు.

మా ఎంపీలు కూడా నిరాహాద దీక్ష చేస్తారు : మోదీ

ఢిల్లీ : విజభన హామీలు నెరవేర్చలేదని ఢిల్లీలో ఏపీ ఎంపీలు గొంతు చించుకున్నా కనీసం సమాధానం కూడా చెప్పని ఎన్డీయే ప్రభుత్వం మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ లో ఎన్డీయే ప్రభుత్వం అవలంభించిన తీరు దేశమంతా గమనించింది. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరించిన పార్లమెంట్ ఉభయసభలు ఈరోజు ముగిశాయి. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త డ్రామాను అవలంభిస్తోంది. పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభనకు నిరసనగా ఈ నెల 12న తమ పార్టీ ఎంపీలు నిరాహార దీక్ష చేస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ప్రతిష్టంభనకు కారణం కాంగ్రెసేని ఘాటుగా విమర్శించారు.

బోగస్ ఈటీఆర్ పై కదిలిన విద్యాశాఖ..

హైదరాబాద్ : బోగస్ ఈటీఆర్ వ్యవహారంలో విద్యాశాఖ చర్యల్ని ముమ్మరం చేసింది. 8మంది ప్రభుత్వ పాఠశాలల ఉద్యోగులు, 14 ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాలపై విద్యాశాఖ కేసులు నమోదు చేసింది. కాగా చాలా ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న అక్రమ దందాలు కొనసాగిపోతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయి బోగస్ ఈటీఆర్ వ్యవహారంలో విద్యాశాఖ చర్యల్ని ముమ్మరం చేసింది. 

కలుషితాహారంతో విద్యార్థినులకు అస్వస్థత..

నిజామాబాద్‌ : మాలపల్లిలోని మదర్సాలో కలుషితాహారం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కామారెడ్డి జల్లా నస్రుల్లాబాద్‌కు చెందిన సుమయా ఫిర్దోషి అనే విద్యార్థిని మృత్యువాత పడింది. అయితే, ఇప్పటికి ముగ్గురు చిన్నారులు డిశ్చార్జి కాగా, మిగతా 11 మంది విద్యార్థినులు చికిత్సపొందుతున్నట్లు సమాచారం. 

అందుకే ప్రసవాల సంఖ్య పెరిగింది : కేటీఆర్

హైదరాబాద్ : కేసీఆర్ కిట్ పథకం అమలు చేసాక ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 30 నుండి 50 శాతానికి పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. మల్కాజ్‌గిరిలోని బీజేఆర్ నగర్‌లో బస్తీ దవాఖానను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ కలిసి ప్రారంభించినం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు ఈ విషయాలను తెలిపారు.  

15:55 - April 6, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం నమ్మకం మోసం చేసిందని..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన మాటలు..గతంలో ప్రభుత్వం ఇచ్చిన మాటలు అమలు కావడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ పునర్ విభజన సమయంలో ఇచ్చిన హామీలు...హోదా కల్పించాలంటూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం..వైసీపీ..ఇతర విపక్షాలపై ఆయన మండిపడ్డారు.

రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 13 రోజులు జరిగాయని, కానీ చివరి బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని బాబు తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా..విభజన హామీలు అమలు చేయాలని గవ్నరర్ ప్రసంగంలో పేర్కొనడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారని, వెంటనే తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేసింది టిడిపి పార్టీయేనన్నారు. కానీ అనంతరం జరిగిన పరిణామాలతో బిజెపితో తెగదెంపులు చేసుకోవడం జరిగిందని, తాము కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. చట్టాలను అమలు చేయకుండా ఇతర చట్టాలను తయారు చేయడం సబబు కాదన్నారు. ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏపీ హక్కులు..విభజన హక్కులు..హోదాపై చర్చించి ఏపీ సమస్యలు పరిష్కరించాలని తీర్మానం ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని, రాష్ట్రం మొత్తం ఆందోళన కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తాము సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో ఓ యువతి రూ. 5లక్షల విరాళం ఇచ్చారని, హోదా కోసం ముగ్గురు పిల్లలు హోదా కోసం పరుగెత్తారని సభకు తెలిపారు. తిరుపతి సభ..అమరావతి..గుంటూరు..విజయవాడ..సభలలో ప్రధాన మంత్రి ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలని, ఇవన్నీ అడిగితే ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యలపై చర్చించడానికి అఖిలపక్ష సమవేశం ఏర్పాటు చేయడం జరిగిందని కానీ ఈ సమావేశానికి బిజెపి రాలేదని..తప్పు చేయడడం బట్టే బిజెపి రాలేదన్నారు. ఇక వైసీపీది కూడా అదే బాటన్నారు. తాను జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తుంటే తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. 

వైద్యరంగంలో తెలంగాణ ఆదర్శం : కేటీఆర్

హైదరాబాద్ : వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతీ బస్తీలో ఆసుపత్రులను ఏర్పాటుచేస్తామని దీంతో లక్షలాదిమందికి ఉపశమనం కలుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోకి ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు, అలాగే క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

15:50 - April 6, 2018

బెంగళూరు : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కానీ గురువారం ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ మెడలో పూలమాల పడడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ కార్యకర్త అకస్మాత్తుగా పూలమాల విసిరారు. అది నేరుగా రాహుల్ మెడలో పడిపోయింది. పూలమాల విసిరిన కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమౌతోంది. 

మాకు పదవులు ముఖ్యం కాదు : చంద్రబాబు

అమరావతి : మాకు పదవులు ముఖ్యం కాదనీ..రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇద్దరు కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి తమ నిరసనలు తెలిపామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశౄలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తే మూడు పార్టీలు రాలేదని అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్న సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. 

15:44 - April 6, 2018

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా పేరొందిన వాటిలో ఒకటైన నారాయణ విద్యా సంస్థ డిజిటల్ విద్యా వ్యస్థకు శ్రీకారం చుట్టింది. కాలేజీ విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు ఎన్ లర్నింగ్ యాప్ ను విడుదల చేసింది. నారాయణ సంస్థ ఎండీ సింధూర నారాయణ హైదరాబాద్ లోని ప్రధాన బ్రాంచీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 40వ సంవవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దీనిని విడుదల చేసినట్లు తెలిపారు. డిజిటల్ ప్రాధానం పెరిగిందన్నారు. 

15:38 - April 6, 2018
15:37 - April 6, 2018

 

మహిళా క్రికెట్ ఐకాన్ మిథాలీ రాజ్ మరో అరుదైన రరికార్డును స్వంతం చేసుకుంది. మిథాలీ అంటేనే రికార్డుల రాణిగా పేరొందిన ఈ అరుదైన, అద్భుతమైన ఉమెన్ క్రికెటర్ వరల్డ్ రికారును సాధించింది. మహిళా క్రికెట్ కు ఓ గుర్తింపు తీసుకువచ్చిన మిథాలీ మహిళా క్రికెట్ కు కూడా ఐపీఎల్ కావాలని డిమాండ్ చేసిన మిథాలీ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2017లో మహిళా వరల్ట్ క్రికెట్ లో 6వేల పరుగులు మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా మిథాలీ ఘనత దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా వరల్డ్ రికార్డును సాధించింది.

మిథాలీ వరల్డ్ రికార్డ్..
అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మిథాలీ రాజ్‌.. ఎడ్వర్ట్స్‌ను దాటి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మహిళల మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ వన్డే మిథాలీ రాజ్‌కు 192వది. దీంతో అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది.

వన్డేల్లో కొత్త ప్రపంచ రికార్డు..
1999 జూన్‌లో మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. 192 వన్డేల్లో మిథాలీ 6,295 పరుగులు చేసింది. అంతేకాదు..10 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేసి 8 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్‌లో 6వేల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్‌గా కూడా మిథాలీ రాజ్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు భారత జట్టును ప్రపంచకప్‌ ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కావడం విశేషం.

15:36 - April 6, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా పోరు కొనసాగుతోంది. ఏపీకి రావాల్సిన హక్కులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో టెన్ టివి ముచ్చటించింది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు..పార్లమెంట్ లో జరిగిన పరిణామాలపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తామన్నారు. కేంద్రం మెడలు వంచి రాష్టారనికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటామని పేర్కొన్నారు.

రాజకీయ ప్రయోజనాలు ఆశించే అఖిలపక్ష సమావేశానికి విపక్షాలు రాలేదని మంత్రి జవహార్ పేర్కొన్నారు. మంత్రి జవహార్ తో టెన్ టివి ముచ్చటించింది. రాజీనామాల పేరిట వైసీపీ కొత్త డ్రామాకు తెరలేపిందని, ప్రత్యేక హోదా కోసం ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. 

15:09 - April 6, 2018

విజయవాడ: నాలుగేండ్ల అనంతరం ఒక అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతిలో శనివారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగనుంది. సమావేశానికి హాజరు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలకు లేఖలు రాశారు. కానీ ఈ సమావేశానికి లెఫ్ట్..వైసీపీ..బీజేపీ గైర్హాజర్ కానున్నాయి. ఎజెండా ప్రకటిస్తే అఖిలపక్షానికి సహకరిస్తామని లెఫ్ట్ పేర్కొంది. 

15:05 - April 6, 2018

విజయవాడ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వారికి నమ్మకాన్ని కలిపించాలని, అధైర్య పడకుండా మనోధైర్యంతో ముందుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద 8 లక్షల 5వేల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు, పకడ్బందిగా ఉండడం బట్టే ఎక్కడ దళితులపై అరాచకాలు జరగడం లేదన్నారు. 17-18 సంవత్సరం కింద రూ. 2,713 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని, దళిత వాడల్లో రూ. 1, 382 కోట్లతో రోడ్లు వేయడం జరిగిందన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. దళితులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం..తీర్మానం ప్రవేశపెట్టడం శుభ పరిణామమని యామిని బాల పేర్కొన్నారు. 

14:45 - April 6, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీలు చేస్తున్న పోరాటం..ఆందోళనను కేంద్రం తేలికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు చేయాలంటూ పార్లమెంట్..వెలుపలా..లోపల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం వాయిదా పడిన అనంతరం కూడా టిడిపి ఎంపీలు సభలోనే ఉండిపోయారు. శుక్రవారం లోక్ సభ నిరవధికంగా వాయిదా పడడంతో టిడిపి ఎంపీలందరూ సభలోనే ఉండిపోయి ఆందోళన నిర్వహించారు. వీరిని బయటకు పంపించేందుకు మార్షల్ పలు ప్రయత్నాలు చేసింది. చివరకు స్పీకర్ సుమిత్రా మహజన్ పిలుస్తున్నారంటూ కబురు పంపించడం...వెంటనే ఎంపీలు బయటకు రావడం జరిగిపోయాయి. ఇదే అదునుగా భావించిన మార్షల్స్ లోక్ సభ తలుపులు మూసివేశారు. స్పీకర్ కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ స్పీకర్ లేకపోడంతో ఎంపీలు అక్కడే ఆందోళన చేపట్టారు. వీరిని బయటకు తరలించేందుకు భారీగా మార్షల్స్ మోహరించారు.

 

14:42 - April 6, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు చేయాలంటూ వైసీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ లోక్ సభలో గందరగోళ పరిస్థితిలు ఏర్పడడంతో తీర్మానం సభ ముందుకు రాలేదు. దీనితో ముందుచెప్పినట్లుగానే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ను శుక్రవారం కలిసి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేశారు. అనంతరం ఆంధ్రా భవన్ వేదికగా ఐదుగురు వైసీపీ ఎంపీలు ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు..కీలక నేతలు హాజరయ్యారు. 

14:41 - April 6, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేకహోదా సాధించే వరకు పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. పాదయాత్ర ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో బోఫోర్స్ అంశంపై నిరవధికంగా పార్లమెంట్ గందరగోళంలో చిక్కుందని..మళ్లీ ఇప్పుడు అని అన్నారు. పవన్ కళాక్యణ్ చెప్పిన అవిశ్వాసం చుట్టు రాజకీయాలు తిరిగాయని అన్నారు. మోడీకి ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పై గౌరవ ఉంటే పార్లమెంట్ లో చేసిన చట్టాలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని చెప్పారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు సీపీఎం, సీపీఐ, కార్యాలయాలకు వెళ్లలేదన్నారు. ఏపీలో ఏపీ ఉద్యమమే జరగాలన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేమన్నారు.

 

14:34 - April 6, 2018

విజయవాడ : ప్రజా ఉద్యమాలతోనే ప్రత్యేక హోదా సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఇది ప్రత్యక్ష కార్యాచరణ అన్నారు. పాదయాత్ర ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు. యువతీయువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. మెజారిటీ ఉందని.. అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ నిరాకరించిందన్నారు. నలుగురు ఎంపీలను ఆకట్టుకుని అవిశ్వాస తీర్మానం రాకుండా చేశారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో అవిశ్వాసాన్ని చేపట్టాలని ఆలోచించామని చెప్పారు. ప్రజా ఉద్యమాలతనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోదా సాధించుకోవచ్చన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టంలోని అంశాలను కేంద్రం అన్యాయంగా నిరాకరించిందన్నారు. పెద్ద ఉద్యమం జరిగితే తప్ప విశాఖ ఉక్కు రాలేదని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలతోనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలను సమీకరించి పోరాటాలు చేస్తామని చెప్పారు. 24న అనంతపురంలో పాదయాత్ర చేస్తామని చెప్పారు. రాయలసీమకు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని కూడా వెనక్కి లాక్కున్నారని మండిపడ్డారు. ఒంగోలు, మే 6న విజయనగరంలో పాదయాత్రలు చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందన్నారు. మేధావులతో సభలు జరుపుతామన్నారు. 

14:26 - April 6, 2018

విజయవాడ : వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. స్పెషల్ స్టేటస్ కోసం చేపట్టిన పాదయాత్రకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్ర ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని మండిపడ్డారు. ఆస్తులు తెలంగాణకు...అపులు ఏపీకి ఉండిపోయాయని వాపోయారు. ఇచ్చిన హామీనలు బీజేపీ అమలు చేయడం లేదన్నారు. మొదటి సం.వేచి చూశామని తెలిపారు. హోదా అంశాన్ని ప్రతిపక్షం బలంగా తీసుకెళ్లలేకపోయిందని తెలిపారు. ఒత్తిళ్లకు లొంగి బలంగా తీసుకెళ్లలేకపోయారని చెప్పారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినవే ఏపీకి ఇచ్చిందని.. కొత్తగా ఏమీ ఇవ్వలేదన్నారు. అప్పుడే తాను పాచిపోయిన లడ్డులతో పోల్చానని..అందుకు తనపై టీడీపీ నేతలు విమర్శలు చేశారని తెలిపారు. ప్రతిపక్షం సమర్థవంతంగా పాత్ర పోషించినప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చామన్నారు. రాయలసీమ, ప్రకాశం, గుంటూరు లాంటి వెనుకబడి ప్రాంతాల్లో పాదయాత్రలు చేస్తామన్నారు. వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. జెఎఫ్ సీ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని తెలిపారు. అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలో పాదయాత్రలు చేస్తామని చెప్పారు. రెండు స.రాల క్రితం అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది...కాని ఇప్పుడు పిలిస్తే ఏం లాభమన్నారు. కాఫీలు, టీలు తాగడం తప్ప ఒరిగిదే ఏమీ లేదన్నారు. ప్రజా ఉద్యమాలతోనే కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని అనుకున్నామని తెలిపారు. 

 

14:16 - April 6, 2018

విజయవాడ : పవన్ కళ్యాణ్, వామపక్ష నేతల రామవరప్పాడుకు చేరుకుంది. పాదయాత్ర విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రత్యేకహోదా ఇస్తామని మోసం చేసిన మోదీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే హెచ్చరిక అని పేర్కొన్నారు. ఇది తొలి అడుగు మాత్రమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కార్యకర్తలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ, వైసీపీ పోరాటంలో చిత్తశుద్ధి లేదన్నారు. 

 

14:14 - April 6, 2018

ఢిల్లీ : స్పీకర్ కార్యాలయం ముందు టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పిలుస్తున్నారని టీడీపీ ఎంపీలకు సిబ్బంది చెప్పి..  ఎంపీలు లోపలికి వెళ్లిన తరువాత సిబ్బది తలుపులు మూసేసింది. టీడీపీ ఎంపీలు రాకముందే చాంబర్ నుంచి స్పీకర్ వెళ్లిపోయారు. నిరసనగా టీడీపీ ఎంపీలు అక్కడే ఆందోళన చేస్తున్నారు. 

వైసీపీ ఎంపీల ఆమరణ నిరహార దీక్ష...

ఢిల్లీ : రాజీనామాలు చేసిన అనంతరం వైసీపీ ఎంపీలు ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ ఆంధ్రా భవన్ ఎదుట వారు ఈ దీక్షలు చేపట్టారు. 

14:05 - April 6, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్ లో సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. 'మేము చెప్పింది చేశాం.. మా ఎంపీలు రాజీనామాలు చేశారు.. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించండి' అని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రజల తరపున నిలబడండి అని జగన్ ట్వీట్ చేశారు. 

 

13:58 - April 6, 2018

విజయవాడ : పవన్ కళ్యాణ్, వామపక్ష నేతల రామవరప్పాడుకు చేరుకుంది. పాదయాత్ర విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది తొలి అడుగు మాత్రమేనని అన్నారు. కార్యకర్తలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ, వైసీపీ పోరాటంలో చిత్తశుద్ధి లేదన్నారు.
మోదీకి రోజులు దగ్గరపడ్డాయి : మధు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రత్యేకహోదా ఇస్తామని మోసం చేసిన మోదీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే హెచ్చరిక అని పేర్కొన్నారు. 
 

 

వెనుకబడిన జిల్లాల నుండి పోరాటం : పవన్

విజయవాడ: రాబోయే రోజుల్లో వెనుకబడిన జిల్లాలో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కనీసం రెండు సంవత్సరాల ముందు అఖిలపక్షం చంద్రబాబు ఏర్పాటు చేసింటే బాగుండేదనీ..ఇప్పుడు ఆలస్యం జరిగాక పెట్టటం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. హోదా కోసం చేపట్టిన పాదయాత్ర పూర్తి అయిన తరువాత మాట్లాడిన సందర్భంగా పవన్ ఈ విషయాలను తెలిపారు. 

అధికార,ప్రతిపక్షాలకు హోదా పట్ల చిత్తశుద్ధి లేదు: పవన్

విజయవాడ : కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధితో పోరాటం చేయటం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ తమకు రాష్ట్ర ప్రయోజనాలుత తప్ప ఎటువంటి స్వార్థం లేదని పవన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజ్ కి ఒప్పుకుని చంద్రబాబు తప్పుచేశారన్నారు. అపార అనుభవం వున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోజు టీడీపీకి మద్దతునిచ్చానని తెలిపారు. హోదా కోసం చేపట్టిన పాదయాత్ర పూర్తి అయిన తరువాత మాట్లాడిన సందర్భంగా పవన్ ఈ విషయాలను తెలిపారు. 

సీపీఎం మధు అంగీ మోసిన పవన్ ..

విజయవాడ: సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అంగీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోసిన ఆసక్తికర సన్నివేశం ఈరోజు జనసేన, వామపక్షాలు చేపట్టిన పాదయాత్రలో చోటుచేసుకుంది. ఈ సన్నివేశం పలువురిని ఆహ్లాదపరిచింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ విభజన హామీలను, ప్రత్యేక హోదాను ఇవ్వనందుకు నిరసనగా జనసేన, వామపక్షాలు కలిసి ఈరోజు జాతీయ రహదారులపై పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

13:22 - April 6, 2018

విజయవాడ : పవన్ కళ్యాణ్, వామపక్ష నేతల పాదయాత్ర రామవరప్పాడుకు చేరుకుంది. పాదయాత్ర విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రత్యేకహోదా ఇస్తామని మోసం చేసిన మోదీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే హెచ్చరిక అని పేర్కొన్నారు.
ఇది తొలి అడుగు మాత్రమే : పవన్ 
ఇది తొలి అడుగు మాత్రమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కార్యకర్తలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ, వైసీపీ పోరాటంలో చిత్తశుద్ధి లేదన్నారు. 

ఏపీ ఎంపీలతో కేంద్రం దాగుడుమూతలాట..

ఢిల్లీ :  అటు న్యాయాన్ని, ఇటు తెలుగు ప్రజల మనోభావాలను కేంద్రం ప్రభుత్వం ఎంతగా అపహాస్యం చేస్తుందో అని విషయాన్ని కళ్లకు కట్టే సంఘటన చోటుచేసుకుంది. రాజ్యంగాపరంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యులను కేంద్ర ప్రభుత్వం ఎగతాళి చేసిన ఘటన ఎన్డీయే ప్రభుత్వం హయాంలో చోటుచేసుకుంది. స్పీకర్ కార్యాలయం ముందుకు టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ మిమ్మల్ని పిలిచారంటు సిబ్బంది చెప్పటంతో స్పీకర్ కార్యాలయంలోకి టీడీపీ ఎంపీలు వెళ్లగానే ఎంపీలను లోపల పెట్టి సిబ్బంది తలుపులు మూడసి వేశారు. దీంతో నిసనగా లోపలనే ఎంపీలు ఆందోళన వ్యక్తుం చేస్తున్నారు.

నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టులు: మంత్రి నాయిని

మెదక్ : త్వరలో మరో 4 వేల పోలీసు కానిస్టేబుళ్ల నియామకం చేపడుతామని  తెలంగాణ హోమ్ శాఖా మంత్రి నాయిని నర్శింహారెడ్డి తెలిపారు.  కానిస్టేబుళ్ల నియామాకాల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 45 పోలీసు స్టేషన్లు నిర్మించామని చెప్పారు. కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.

13:00 - April 6, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేకహోదా రావాలంటే రాజకీయ సంక్షోభం సృష్టించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. టీడీపీ ఎంపీలను వైసీపీ దీక్షకు రోజా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ ఎంపీలంతా రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడి కేంద్రం దిగివస్తుందన్నారు. రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని తెలిపారు. రాజకీయ సంక్షోభం తీసుకొస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ తరహాలోనే ఏపికి ప్రత్యేకహోదా సాధించుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ మొదటి నుంచి పోరాడుతోందన్నారు. చంద్రబాబు 23 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని..తమ ఐదుమంది ఎంపీలు రాజీనామా చేశారని పేర్కొన్నారు. 

 

సల్మాన్ బెయిల్ పిటీషన్ కేసు వాయిదా..

హైదరాబాద్ : కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌కు జోధ్‌పూర్‌ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను జోధ్‌పూర్‌ ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. దీంతో భాయిజాన్‌ మరో రోజు జైలులోనే గడపాల్సి ఉంటుందని ఆయన తరఫు న్యాయవాది మహేశ్ బోరా వెల్లడించారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో సల్మాన్‌ను గురువారం జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

ఇది తొలి అడుగు మాత్రమే: పవన్

విజయవాడ : ఏపీ ప్రత్యేక హోదా కోసం ఈ పాదయాత్ర తొలి అడుగుమాత్రమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపి విభజన హామీలను కేంద్రం నెరవేర్చనందుకు నిరసనగా జాతీయ రహదారులపై వామపక్ష నేతలతో కలిసి చేపట్టిన పాదయాత్రలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పవన్ కళ్యాణ్ నివాళులర్పించి పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగాఆ యన మాట్లాడుతు.. రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకుని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని దానికి ఇది తొలి అడుగు మాత్రమేనని పవన్ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు ఆస్తులు ఇచ్చి ఏపీకి మాత్రం అప్పులు ఇచ్చిందన్నారు.  

ఏపీ అసెంబ్లీలో కాగ్ నివేదిక..

అమరావతి: ఏపీ అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రభుత్వం  ప్రవేశపెట్టింది. 2017 మార్చి 31 నాటికి 76 వేల కోట్ల రుణ బకాయిలు తీర్చాల్సి ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది. 2017 మార్చి 31నాటికి పూర్తికావాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఒక్కటీ పూర్తికాలేదని.. అంచనాలు రూ.28 వేల కోట్లకు పెంచేశారని అభిప్రాయపడింది. డీపీఆర్‌లు తయారుకాకపోవడంతో రూ. 455 కోట్ల కేంద్ర సాయాన్ని వినియోగించుకోలేకపోయిందని తెలిపింది. 7 పథకాలు మధ్యలో ఆగిపోవడంతో రూ.491 కోట్లు వృథా అయ్యాయని కాగ్ అక్షింతలు వేసింది. హడావుడి ఖర్చులను 27 నుంచి 50 శాతానికి ప్రభుత్వం పెంచిందని పేర్కొంది.

12:29 - April 6, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేశారు. లోక్ సభ స్పీకర్ కు రాజీనామా పత్రాలను అందజేశారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ సభ్యులకు సూచించారు. రాజీనామాలను ఆమోదించాలని వైసీసీ సభ్యులు కోరారు. అనంతరం ఏపీ భవన్ లో ఆమరణ దీక్ష చేపట్టనున్నారు.   

 

ఎంపీలు రాజీనామా,జగన్ కేసు వాయిదా..

ఢిల్లీ : వైసీపీ లోక్ సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఆమె ఛాంబర్ లో కలసి తమ రాజీనామాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని సూచించారు. దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం వారు అక్కడ నుంచి ఏపీ భవన్ కు బయల్దేరారు. స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణదీక్షను వారు చేపట్టనున్నారు. కాగా ఇదిలా వుండగా అక్రమాస్తులపై జగన్ కేసును కోర్టు రేపటికి వాయిదా వేసింది. 

పిడుగులు, గాలులంటు వాతావరణశాఖ హెచ్చరిక!!..

హైదరాబాద్ : సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో నేడు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని, పెను గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. దక్షిణ మహారాష్ట్ర నుంచి మరాట్వాడా మీదుగా విదర్భ వరకూ కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

12:23 - April 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అవిశ్వాసంపై నోటీసులు ఇచ్చినా.. చర్చ జరగలేదు. కొన్ని రోజులుగా ఉభయసభల్లో అన్నాడీఎంకే ఆందోళన చేస్తోంది. ఇవాళ లోక్ సభలో ప్రధాని ముందు టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వాయిదా పడినా సభలోనే టీడీపీ సభ్యులు అందోళన చేపట్టారు. వైసీపీ ఎంపీలు స్పీకర్ ను కలిసి రాజీనామాలు ఇచ్చారు. అనంతరం ఏపీ భవన్ లో ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. 

రేపు అఖిలపక్ష సమావేశం : మంత్రి కళా

అమరావతి : ఏప్రిల్ ఏడవ తేదీన ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కొన్ని పార్టీలు హాజరుకాలేదనీ..ఈరోజు అక్రమాస్తుల కేసులో వైసీపీ నేత జగన్ కోర్టుకు వెళ్లారనీ..ఇతరు నేతలు కూడా పలు కార్యక్రమాలలో బిజీగా వున్నారన్నారు. అఖిలపక్ష భేటీకి పార్టీల నేతలకు ఫోన్ ద్వారా ఆహ్వానం పంపిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. 

సల్లూ భాయ్ ఫ్యామిలీకి సెలబ్రిటీల పలకరింపులు..

ముంబై : సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోథ్ పూర్ కోర్టు దోషిగా తేల్చి అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ముంబైలోని సల్మాన్ ఇంటికి తరలివచ్చారు. సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులను పలువురు నటీనటులు, బంధు,మిత్రులు పరామర్శించారు. దబాంగ్ సినిమాలో సల్మాన్ తో కలిసి నటించిన సోనాక్షి సిన్హా సల్మాన్ ఇంటికి వచ్చి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు.

టీ.సర్కార్ కు కోర్టులో చుక్కెదురు..

హైదరాబాద్ : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్రెదురయ్యింది. దుర్గం చెరువులో జీహెచ్ఎంసీ చేపడుతున్న అమ్యూజ్ మెంట్ పార్క్ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. కాగా అంద‌రూ ఇష్ట‌ప‌డే ఒక అద్భుత‌మైన‌ ప‌ర్యాట‌క కేంద్రంగా దుర్గం చెరవును అభివృద్ధి చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. చెరువుపై నాలుగు లేన్ల రోడ్ కం బ్రిడ్జ్ నిర్మాణం చేప‌ట‌నున్న‌ట్టు కేటీఆర్ ప్రకటించారు. దీనికోసం మొత్తం 184 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు గతంలో మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. సభలు ప్రారంభయిన కొద్ది సేపటీకే ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. లోక్ సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించింది అన్న విషయాన్ని స్పీకర్ సుమిత్రామహాజన్ చదివి వినిపించారు. రెండు విడతలుగా జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేవలం 9గంటలు మాత్రమే లోకసభలో సభాకార్యక్రమాలు జరిగాయని స్పీకర్ ప్రకటించారు. ముఖ్యమైన బిల్లులను కూడా పాస్ చేయలేకపోయినట్లు ఆవేదన చెందారు. ఆ తరువాత వెంటనే స్పీకర్ నిరవధకి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది.

11:31 - April 6, 2018

విజయవాడ : ప్రత్యేకహోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వామపక్ష నేతల పాదయాత్ర కొనసాగుతోంది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి రామర్పాడు రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీసీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు పాల్గొన్నారు. పాదయాత్రకు జనసేన, వామపక్ష పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. బెంజ్ సర్కిల్లో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

 

11:25 - April 6, 2018

ఢిల్లీ : లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగానే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీల నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తే అన్ని అంశాలపై చర్చిద్దామని స్పీకర్ సుమిత్ర మహాజన్ అన్నారు. వందేమాతరం గీతాలాపన తర్వాత సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.  

బౌలింగ్ లో భారత మహిళల దూకుడు..

హైదరాబాద్ : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మహిళల జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 21 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. భారత బౌలర్‌ పూనమ్‌ యాదవ్‌కు మూడు, ఏక్తా బిస్ఠ్‌కు రెండు వికెట్లు దక్కాయి. భారత్‌-ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య ఇటీవల ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్‌ ఓటములతో ఫైనల్‌ చేరలేకపోయిన భారత్‌ ఈ వన్డే సిరీస్‌ను ఎలాగైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో వుంది. 

బొడిగ శోభపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు..

కరీంనగర్: చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభపై కొడిమ్యాల తిరుపతి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే... దీనిపై స్థానిక పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు తిరుపతిపై కేసు నమోదు చేశారు. కాగా... ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

11:20 - April 6, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్, వామపక్ష నేతల పాదయాత్ర ప్రారంభం అయింది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి రామర్పాడు రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీసీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు పాల్గొన్నారు. పాదయాత్రకు జనసేన, వామపక్ష పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. బెంజ్ సర్కిల్లో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. 

పార్లమెంట్ నిరవధిక వాయిదా..

ఢిల్లీ : ఉభయసభలు ప్రారంభమయ్యాయి. యథాతథంగానే అన్నాడీఎంకే సభ్యులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కావేరీ బోర్టు ఏర్పాటు చేయాలని నినదిస్తు..స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే సభ్యుల ఆందోళన మధ్యలోనే లోక్ సభ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాసభను నిరవధిక వాయిదా వేశారు. దీంతో కేంద్రం ప్రభుత్వం నిరకుంశ, నిసిగ్గు వైఖరి బైటపడింది. 

భారత్ కు మరో స్వర్ణం..

హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. రెండో రోజు పోటీల్లో భారత్‌ మరో స్వర్ణాన్ని తన ఖాతాల్లో వేసుకుంది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 53 కేజీల విభాగంలో లిఫ్టర్‌ సంజిత చాను స్వర్ణం కైవసం చేసుకుంది. మొదటి రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాభాయి చాను స్వర్ణం, గురురాజ్ రజత పతకాన్ని సాధించి గోల్డ్‌కోస్ట్‌లో భారత పతాకాన్ని రెపరెపలాడించారు. వెయిట్‌ లిఫ్టర్‌ గురురాజా హోరాహోరీ పోటీలో రజతంతో దేశానికి తొలి పతకాన్ని అందించగా... అదే వేదికపై మీరాబాయి అనేక రికార్డులు కొల్లగొడుతూ స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది.

11:07 - April 6, 2018

ఢిల్లీ : నేటితో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. అవిశ్వాసంపై ఇంకా చర్చ రాలేదు. మధ్యాహ్నం వైసీపీ ఎంపీలు ఆందోళన చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల వాయిదా అనంతరం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయనున్నారు. అనంతరం ఏపీ భవన్ లో ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. గేమ్ ప్లాన్ తో టీడీపీ సిద్ధంగా ఉంది. నిన్న రాత్రి 8 గంటలకు వరకు పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు అందోళన చేశారు. 

 

జనసేనకు జనసేనాని పిలుపు..

విజయవాడ : రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపైనా పాదయాత్రలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన అభిమానులు, కార్యకర్తలకు సందేశమిచ్చారు. ఈ పాదయాత్రల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించాలని, జనసేన నినాదం కేంద్రానికి వినిపించాలని పవన్ కోరారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకోవాలని సూచించారు. నేడు ఏపీలో జాతీయ రహదారులపై జనసేన పాదయాత్రలు చేపట్టగా, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు పలికాయి. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం వైఖరికి నిరసనగా ఈ యాత్రలు చేపట్టినట్టు జనసేన ప్రకటించింది.

11:04 - April 6, 2018

గుంటూరు : వైసీపీది ద్వంద్వ వైఖరని ఏపీ మంత్రి జవహర్ విమర్శించారు. బీజేపీ జెండాను..వైసీపీ ఎజెండాగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. వైసీపీని బీజేపీలో కలిపేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయని విమర్శించారు. అన్ని పక్షాలు ఏకపక్షంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలుపుతామని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు. పార్లమెంట్, ప్రధాని కార్యాలయం ముందు వైసీపీ ఎంపీలు ఆందోళన చేయాలని సూచించారు. జగన్, విజయసాయిరెడ్డిలు మోడీని పల్లెత్తు మాట అనడం లేదన్నారు. వైసీపీని గంపగుత్తగా బీజేపీలో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఐవైఆర్ కృష్ణారావుకు గతంలో లోపాలు ఎందుకు గుర్తుకు రాలేదని..ఇప్పుడు ఎందుకు వస్తున్నాయా అని ప్రశ్నించారు. ఉండవల్లి ఏదేదో మాట్లాడుతున్నారు.

 

ప్రజల పోరాటానికి మోదీ దిగిరావాల్సిందే : అచ్చెన్నాయుడు

అమరావతి : 5కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటానికి మోదీ తప్పనిసరిగా దిగిరావాల్సిందే అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా అందరినీ కలుపుకుని టీడీపీ ముందుకువెళ్తోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వెంకటాయపాలెంలో సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఏబీఎన్‌తో మాట్లాడుతూ పార్లమెంటులో నిన్నటి పరిణామాలు చూస్తుంటే టీటీడీ ఎంపీల పోరాటాన్ని అణచివేయాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. చిన్న విషయాన్ని సాకుగా చూపి అవిశ్వాసంపై చర్చించకుండా కేంద్రం తప్పించుకుంటోందని మండిపడ్డారు.

పవన్ పాదయాత్ర, భారీగా పోలీసులు..

విజయవాడ : కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వామపక్ష నేతల పాదయాత్ర ప్రారంభమయింది. ఈ పాదయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణలు పాల్గొన్నారు. పాదయాత్ర  నేపథ్యంలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పవన్ పాదయాత్ర నేపథ్యంలో బెంజ్ సర్కిల్ కు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు.దీంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించిపోయింది. బెంజ్ సర్కిల్ వద్ద ప్రారంభమయిన పాదయాత్ర రామర్పాడు రోడ్డు వరకూ కొనసాగనుంది.

10:58 - April 6, 2018

విజయవాడ : టీడీపీ నేతలది జపాన్ తరహా పోరాటం అయితే..తమది ఆంధ్ర తరహా పోరాటం అని వామపక్ష నేతలు అన్నారు. విజయవాడలో జనసేన, వామపక్షాలు పాదయాత్ర నిర్వహిస్తున్నాయి. మరికాసేపట్లో పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్రలో పవన్, వామపక్ష నేతలు పాల్గొననున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సర్వీస్ రోడ్డులోనే పాదయాత్రకు అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు. పాదయాత్ర నేపథ్యంలో బెంజ్ సర్కిల్ కు వచ్చే వాహనాలను మళ్లించారు. 
రామకృష్ణ
​సీపీఐ, సీపీఐ, జనసేన, లోక్ సత్తా ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నాం. ఇది అంతిమపోరాటం... పోరాటాన్ని కొనసాగిస్తాం. 11వ తేదీన అందరినీ సంప్రదించి ఉధృతపోరాటానికి పిలుపునిస్తాం. ప్రత్యేకహోదా సాధించివరకు పోరాటం కొనసాగిస్తాం. మోడీ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంట్ ను గౌరవిచాలన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టాలను అమలు చేయాలని.. స్పెషల్ క్యాటగిరి స్టేటస్ ఇవ్వాలి. ఇచ్చేంతవరకు తమ పోరాటం కొనసాగుతుంది. చంద్రబాబు నాలుగేళ్లు నిద్రపోయాడు..ఇప్పుడు మేల్కొన్నాడు. సైకిల్ యాత్రలు అన్నాడు... సైకిల్ వాళ్ల సింబలే.. ఇది కూడా ఒకరకంగా ప్రచారమే అన్నారు. 
మధు..
సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్రకు అపూర్వమైన స్పందన వచ్చింది. కారణమేంటంటే పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేకుండా చేశారు. ఇది ప్రజల్లో అవిశ్వాసం వ్యక్తం చేసే కార్యక్రమం. అందుకని ప్రజా ఉద్యమం ద్వారా కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రకటించి, ప్రజాలను సమీకరించే ప్రత్యక్ష కార్యాచరణ. దీన్ని డైవర్ట్ చేయడానికి టీడీపీ సైకిల్ యాత్ర చేపట్టారు. సీఎం చంద్రబాబు సైకిల్ యాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు.
బాబురావు..
ఇది పార్టీల ఉద్యమమే కాదు...ప్రజా ఉద్యమం. 

టీడీపీ ఎంపీల పోరాటానికి ప్రశంసలు :చంద్రబాబు

ఢిల్లీ : టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల పోరాటాన్ని ఏపీలోని ఐదు కోట్లమంది ప్రజలు ప్రశంసింస్తున్నారనీ..టీడీపీ పోరాటంలో చిత్రశుద్ధి వుందని ప్రజలు ప్రశంసిస్తున్నారని ఎంపీలకు చంద్రబాబు తెలిపారు. బాధ్యతగా నిర్వహించినప్పుడు అనారోగ్యం దరిచేరదనీ..రాజ్యసభలో ఎంపీల మెరుపు ధర్నాతో జాతీయస్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. కేంద్రంపై జరుగుతున్న పోరాటంలో ఎంపీలే మన సైనికులని చంద్రబాబు పేర్కొన్నారు.నేటితో పార్లమెంట్ సమావేశాలు పూర్తవుతున్న సందర్భంగా మన పోరాటాన్ని ఉదృతం చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.  

కాలువలో పడిన ట్రాక్టర్,9మంది మృతి?!..

నల్గొండ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏఎంఆర్ కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో 10 మంది వరకూ గల్లంతయ్యారు. సుమారు 30 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ ఏఎంఆర్ కాలువలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించటంతో కొంతమంది ప్రాణాలను కాపాడగలిగారు. 

10:42 - April 6, 2018

గుంటూరు : అమరావతిలో హాట్ హాట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. టీడీపీ సైకిల్ ర్యాలీ ప్రారంభించింది. వెంకటపాలెం నుంచి సీఎం చంద్రబాబు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. నేటితో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్నాయి.

 

హస్తినలో వైసీపీ సరికొత్త డ్రామా..

ఢిల్లీ : ఇక నేటితో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో వైసీపీ  మరో సరికొత్త హైడ్రామాకు తెరతీసింది. లోక్ సభ నిరవధిక వాయిదా పడగానే వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లో సభాపతికి అందించనున్నారు. ఆపై నేరుగా ఏపీ భవన్ కు వెళ్లి అక్కడ ఆమరణ దీక్షను ప్రారంభించడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. తమ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తారని దాదాపు నెల రోజుల క్రితమే వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఎంపీల ఆమరణ దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతిని కూడా మంజూరు చేశారు.

నేటి ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు..

ఢిల్లీ : నేటితో పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. దాదాపు మూడు వారాలకు పైగా సాగిన సభలో కనీసం రోజు కూడా ఒక్క అంశంపైనైనా చర్చ జరగలేదు. ఎంపీల నిరసనల మధ్య తమకు కావాల్సిన కీలక బిల్లులను కేంద్రం ఆమోదింపజేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టగా అవసలు చర్చకే రాలేదు. రిజర్వేషన్ల కోటాను నిర్ణయించుకునే బాధ్యత రాష్ట్రాలకే ఇవ్వాలంటూ తెలంగాణ, కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే నేతలు వెల్ లో నినాదాలు చేస్తుండటంతో, సభ నిత్యమూ వాయిదా పడుతూ వచ్చింది.

తెలుగువారితో పెట్టుకోవద్దు : చంద్రబాబు

అమరావతి : కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలలను నెవరేర్చకుండా తెలుగువారికి తీరని అన్యాయం చేసిందనీ..తెలుగువారితో పెట్టుకోవద్దనీ..వారి పొట్ట కొట్టవద్దనీ..తెలుగు ప్రజలతో పెట్టుకుంటే కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని సీఎం చంద్రబాబు కేంద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపికి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేంతవరకూ పోరాటాన్ని కొనసాగిస్తామనీ..హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి సైకిల్ పై చేరుకున్నారు.

10:31 - April 6, 2018

విజయవాడ : ఏపీకి మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్రదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు విమర్శించారు. మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర ప్రారంభం కానున్నారు. నేపథ్యంలో బెంజ్ సర్కిల్ లో పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ అవిశ్వాసం తీర్మానంపై చర్చకు రాకుండా మోడీ పోరిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని చీకొడతారని అన్నారు. అన్ని రంగాల్లో కేంద్రం వైఫల్యం 
చెందిందని పేర్కొన్నారు. ఇదొక ప్రజా ఉద్యమమని.. మోడీ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అడ్డుకున్నా..పుట్టగతులుండవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తామని తెలిపారు.

సైకిల్ పై అసెంబ్లీకి చంద్రబాబు..

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి సైకిల్ పై చేరుకున్నారు. విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను కేంద్రం ఇవ్వటంలేదనీ..అందుకు నిరసనగా టీడీపీ సైకిల్ యాత్రను చేపట్టింది. సైకిల్ యాత్రంలో పాల్గొన్న చంద్రబాబు వెంకటాయపాలెం నుండి బయలుదేరి అసెంబ్లీ వరకూ సైకిల్ తొక్కుకుంటు వచ్చారు. 

ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే : సీఎం చంద్రబాబు

గుంటూరు : టీడీపీ సైకిల్ ర్యాలీ ప్రారంభం అయింది. వెంటకపాలెం నుంచి చంద్రబాబు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. సైకిల్ పై చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు అన్నారు. తెలుగువారితో పెట్టుకోవద్దు...తమ పొట్టకొట్టదన్నారు.

09:51 - April 6, 2018

గుంటూరు : టీడీపీ సైకిల్ ర్యాలీ ప్రారంభం అయింది. వెంటకపాలెం నుంచి చంద్రబాబు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. సైకిల్ పై చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు అన్నారు. తెలుగువారితో పెట్టుకోవద్దు...తమ పొట్టకొట్టదన్నారు.

 

09:51 - April 6, 2018

గుంటూరు : టీడీపీ సైకిల్ ర్యాలీ ప్రారంభం అయింది. వెంటకపాలెం నుంచి చంద్రబాబు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. సైకిల్ పై చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు అన్నారు. తెలుగువారితో పెట్టుకోవద్దు...తమ పొట్టకొట్టదన్నారు.

 

అసెంబ్లీ సమావేశాలకు సైకిల్ పై బయల్దేరిన చంద్రబాబు

గుంటూరు : టీడీపీ సైకిల్ ర్యాలీ ప్రారంభం అయింది. వెంటకపాలెం నుంచి చంద్రబాబు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. సైకిల్ పై చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

09:40 - April 6, 2018

టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత లాల్ వజీర్, వైసీపీ నేత రాజశేఖర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:35 - April 6, 2018

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పట్టారు. పనిష్మెంట్లు, జరిమానాలపై ఇచ్చిన సర్కులర్‌ 1/2018లో వీసీ అండ్‌ ఎండీ గైడ్‌లైన్స్‌కు భిన్నంగా ఉన్నశిక్షలు రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రయాణీకులు చేసే ప్రతి తప్పుకు మమ్మల్నే బాధ్యుల్ని చేసి.. తీవ్రమైన పనిష్మెంట్లు ఇవ్వడమేంటని వారు యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏపీ ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు సుందరయ్య  మాట్లాడారు. 
ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం... 

మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర ప్రారంభం

విజయవాడ : మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర ప్రారంభం కానున్నారు. నేపథ్యంలో బెంజ్ సర్కిల్ లో పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు. 

 

సైకిల్ యాత్ర ప్రారంభించిన సీఎం చంద్రబాబు

గుంటూరు : సీఎం చంద్రబాబ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు సీఎం సైకిల్ యాత్ర యాత్ర చేయనున్నారు. సైకిల్ యాత్రలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం సైకిల్ యాత్రకు మద్దతుగా జిల్లాల్లో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.  

08:52 - April 6, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు సీఎం సైకిల్ యాత్ర యాత్ర చేయనున్నారు. సైకిల్ యాత్రలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం సైకిల్ యాత్రకు మద్దతుగా జిల్లాల్లో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.  

 

08:49 - April 6, 2018

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అస్వస్థతకు గురయ్యారు. జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారని మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. 65 ఏళ్ల జైట్లీని ఇంతవరకు ఆసుపత్రిలో చేర్చలేదు. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు మంత్రి జైట్లీని బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. సోమవారం నుంచి ఆయన కార్యాలయానికి రావడం లేదు. యూపీ నుంచి రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన జైట్లీ ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు.

 

08:47 - April 6, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం హిందూ సాధువులకు కాబినెట్‌ హోదా కల్పించడంపై శంకరాచార్య స్వామి స్వరూపనంద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధ్మాత్మిక భావంతో ప్రజలు సాధువులను గౌరవిస్తారని.... శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం తమ స్వార్థం కోసం స్వాములకు మంత్రి హోదా కల్పించడాన్ని ఆయన దుయ్యబట్టారు. ప్రజలకు వారెవరో కూడా తెలియదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  ఐదుగురు సాధువులు నర్మదానంద్‌ మహరాజ్‌, హరిహరానంద్‌ మహరాజ్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూ మహరాజ్‌, పండిత్‌ యోగేంద్ర మహంత్‌లకు ఎంపి ప్రభుత్వం క్యాబినెట్‌ హోదా కల్పించింది. నర్మదా నది పరిరక్షణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎంపి ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల కోసమే సాధువులకు కెబినెట్‌ హోదా కల్పించిందని కాంగ్రెస్‌ విమర్శించింది.

08:45 - April 6, 2018

యూపీ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి దళిత ఎంపి ఛోటేలాల్‌ ఖర్వార్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను దళితుడిని అయినందుకు తన పట్ల సిఎం వివక్షత చూపుతున్నారని పేర్కొంటూ ఛోటేలాల్‌ ప్రధాని నరేంద్రమోదికి లేఖ రాశారు. నియోజకవర్గ సమస్యలపై సిఎంకు లేఖ రాస్తే బదులివ్వలేదన్నారు. స్వయంగా కార్యాలయానికి వెళ్తే యోగి లోపలికి అనుమతించకపోగా... తిట్టి బయటకు గెంటేశారని లేఖలో ఆరోపించారు. తన పరిస్థితే ఇలాగుంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. యూపీ ప్రభుత్వం దళితుల పట్ల విచక్షణ చూపుతోందని ఛోటేలాల్‌ ఆరోపించారు.

 

08:40 - April 6, 2018

నల్లగొండ : జిల్లాలో విషాదం నెలకొంది. వ్యవసాయపనులకు వెళ్తూ కూలీలు మృత్యువుఒడిలోకి చేరారు. ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది కూలీలు దుర్మణం చెందారు. వ్యవసాయ పనులకు ట్రాక్టర్ లో 30 మంది కూలీలు వెళ్తున్నారు. మార్గంమధ్యలో పీఏ పల్లి మండలం వద్దిపట్ల సమీపంలోని పడమటి తండా వద్ద ఏఎంఆర్ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో పది మంది కూలీలు మృతి చెందారు. 
 

08:27 - April 6, 2018

గుంటూరు : కాసేపట్లో సీఎం చంద్రబాబ సైకిల్ ర్యాలీ ప్రారంభించనున్నారు. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర యాత్ర చేయనున్నారు. సైకిల్ యాత్రలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. సీఎం సైకిల్ యాత్రకు మద్దతుగా జిల్లాల్లో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.  

 

కాసేపట్లో సీఎం చంద్రబాబ సైకిల్ ర్యాలీ ప్రారంభం

గుంటూరు : కాసేపట్లో సీఎం చంద్రబాబ సైకిల్ ర్యాలీ ప్రారంభించనున్నారు. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర యాత్ర చేయనున్నారు. సైకిల్ యాత్రలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. సీఎం సైకిల్ యాత్రకు మద్దతుగా జిల్లాల్లో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. 

08:16 - April 6, 2018

ఢిల్లీ : స్టాక్ మార్కెట్ మరోసారి అదరగొట్టింది. కీలక వడ్డీరేట్లను తగ్గించే విషయంలో రిజర్వ్ బ్యాంక్.. మొండిచేయి చూపినా.. వృద్ధిరేటు పెరుగుతుందన్న అంచనాలతో స్టాక్‌ మార్కెట్‌కు బూస్ట్ నిచ్చింది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. ఈ జోరుతో సెన్సెక్స్ 578 పాయింట్లు లాభపడింది. దీంతో మదుపరుల సంపద 2.6లక్షల కోట్లు పెరిగింది.
ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథం
ఈ ఆర్థిక సంవత్సరం తొలి సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌ నేతృత్వంలో సమావేశమైన ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చని కొందరు భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ప్రస్తుతం రెపో రేటును 6 శాతంగా, రివర్స్‌ రెపో రేటును కూడా 5.75శాతంగా ఉంది. ఇక నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌) 4శాతంగా ఉంది. 
ఆర్థిక వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంటుందని అంచనా 
వడ్డీరేట్ల విషయంలో నిరాశపరిచిన ఆర్బీఐ.. భవిష్యత్ ఆర్థిక వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. వృద్ధిరేటు ప్రథమార్ధంలో 7.3-7.4శాతంగా, ద్వితీయార్ధంలో 7.3-7.6గా అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం తొలి 6 నెలల్లో 4.7-5.1శాతం మధ్య, తరువాత 6 నెలల్లో 4.4 శాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. గతంలో దీన్ని 5.1-5.6శాతంగా అంచనా వేయగా ఈసారి అంచనాలను తగ్గించింది.
మిడ్ సెషన్ నుంచి భారీగా కొనుగోళ్లు 
వృద్ధిరేటు ఆశాజనకంగా ఉందన్న ఆర్బీఐ ప్రకటనతో... దేశీయ మార్కెట్లు‌ మెరిశాయి. ఉరకలేస్తున్న ఉత్సాహంతో పరుగులు పెట్టాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. ఆద్యంతం అదే జోరును సాగించిన సెన్సెక్స్.. 578 పాయింట్లు లాభపడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి ఈ సూచీ 33వేల 597 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 197 పాయింట్లు లాభపడి 10వేల 325 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, ఆయిల్ రంగాల్లో బైయింగ్ జోరుగా సాగింది. నిప్టీలో హిందాల్కో, వేదాంతా లిమిటెడ్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ తదితర షేర్లు రాణించాయి. ఒక్కో కంపెనీ షేరు విలువ సగటున 4 నుంచి ఆరున్నర శాతం లాభపడింది. అయితే సిప్లా, ఎయిర్‌టెల్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. మొత్తం మీద గురువారం ట్రేడింగ్‌లో మదుపరుల సంపద 2లక్షల 60వేల కోట్ల రూపాయలు పెరిగింది. 

 

07:59 - April 6, 2018

ముంబై : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను జోధ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. సల్మాన్‌ హీరోగా వెయ్యి కోట్లతో రూపొందుతున్న సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
సల్మాన్‌ఖాన్‌ కు ఐదేళ్ల జైలు శిక్ష 
కృష్ణ జింకలను వేటాడిన కేసులో 20 ఏళ్ల తర్వాత జోధ్‌పూర్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.  బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.
కృష్ణ జింకలపై సల్మాన్‌ కాల్పులు 
1998 అక్టోబర్‌లో 'హామ్‌సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా... సల్మాన్‌ఖాన్  జోధ్‌పూర్‌కు సమీపంలో గల కంకణి గ్రామంలో జింకలను వేటాడారు. జిప్సీలో సల్మాన్‌తో పాటు  సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌ కూడా ఉన్నారు. సల్మాన్‌  కృష్ణ జింకలపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల శబ్దం విని బిష్ణోయ్‌ వర్గానికి చెందిన గ్రామస్థులు అక్కడికి రాగా రెండు కృష్ణ జింకలు చనిపోయి ఉన్నాయి. 
సల్మాన్‌తోపాటు సహనటులపై కేసు నమోదు 
కృష్ణ జింకలను బిష్ణోయి వర్గానికి చెందిన ప్రజలు దైవంగా భావిస్తారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సల్మాన్‌తో పాటు సహనటులపై వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ఈ కేసులో 28 మంది సాక్షులుగా ఉన్నారు. సల్మాన్‌ ఖాన్‌ తుపాకితో కృష్ణ జింకలను చంపినట్లు వారు ఆరోపించారు. సల్మాన్‌ మాత్రం తన వద్ద ఎలాంటి ఆయుధం లేదని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు.
సెక్షన్‌ 51కింద సల్మాన్‌ ఖాన్‌పై కేసు 
వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద కృష్ణ జింకలను వేటాడటం నేరం. సెక్షన్‌ 51కింద సల్మాన్‌ ఖాన్‌పై కేసు నమోదు కాగా...ఇతర నటులపై ఐపిసి 149 సెక్షన్‌ కింద అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో సల్మాన్‌ పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలు మార్చి 28న పూర్తి కాగా ఏప్రిల్‌ 5న సల్మాన్‌కు శిక్ష ఖరారు చేసింది. విచారణ సందర్భంగా కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 
సల్మాన్‌కు శిక్ష ఖరారు...సినిమా ప్రాజెక్టులపై ప్రభావం 
సల్మాన్‌కు శిక్ష ఖరారు కావడంతో ఆయన నటించనున్న సినిమా ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల విలువ 1000 కోట్లు ఉంటుందని సినీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ 'భారత్‌', 'రేస్‌ 3', 'కిక్‌ 2', 'దబాంగ్‌ 3' చిత్రాల్లో నటిస్తున్నారు. 'రేస్‌ 3' సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. జూన్‌ 15న సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. 

 

07:51 - April 6, 2018

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం.. రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుస్తోంది. దీంతో వ్యాపార రంగాలు కూడా దెబ్బ తింటున్నాయి. ఎగుమతులకు, దిగుమతులకు ఆటంకాలు ఏర్పడుతూ ఉండడంతో లారీ యజమానులు, వ్యాపారులు లబోదిబోమంటున్నారు. తమ వ్యాపారాలు మూసుకోవల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
రూ.71.73కు చేరిన లీటర్ డీజిల్‌ ధర
పెరిగిన డీజిల్‌ ధరలతో లారీ చక్రాలకు బ్రేక్‌ పడుతోంది. లారీల వేగం మందగించింది. దేశ రవాణా రంగాన్నే శాసిస్తున్న విజయవాడలో లీటర్ డీజిల్‌ ధర 71 రూపాయల 73 పైసలకు  చేరడంతో   రవాణా వ్యవస్థ దిగజారింది. దీనికి తోడు టోల్ చార్జీలు కూడా లారీ ఓనర్స్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. పెరిగిన ధరల ప్రకారం కిలో మీటర్‌కు 20రూపాయల 40 పైసల చొప్పున డీజిల్‌ వ్యయం  అవుతుంది. అంతేకాదు.. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి పెంచిన టోల్‌ చార్జీలు కిలో మీటర్‌కు 9 రూపాయలు లారీ యజమానులు చెల్లించాల్సి వస్తోంది. వీటితో పాటు డ్రైవర్‌, సిబ్బంది జీతాలు, నిర్వహణ వ్యయం అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి. 
టోల్‌ చార్జీలు పెరగడంతో స్తంభించిన రవాణారంగం
కేంద్ర ప్రభుత్వం 2016లో డీజిల్‌పై 2 రూపాయలు ఎక్సైజ్‌ డ్యూటీని మినహాయింపును ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వం 22.25 శాతం పన్ను విధిస్తుండగా..  లీటర్‌ డీజిల్‌కు 4రూపాయల చొప్పున వ్యాట్‌ విధిస్తోంది. దీంతో దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువయ్యాయి. టోల్‌ చార్జీలు కూడ పెరగడంతో రవాణా రంగం స్తంభించే పరిస్థితి నెలకొంది. ఏపీలో దాదాపు 3 లక్షలకు పైగా లారీలు ఉండగా..ఒక్క కృష్ణా జిల్లాలోనే 45 వేల లారీలు ఉన్నాయి. సుమారు 5 లక్షల కుటుంబాలు రవాణారంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. 30 శాతం లారీలు నిలిచిపోవడంతో 1.50 లక్షల కుటుంబాల రోడ్డునపడే పరిస్థితి దాపురించింది.
తగిన విధానాన్ని రూపొందించాలి : లారీ యజమానులు
డీజిల్‌ ధర 62రూపాయల 50 పైసలకు పరిమితం చేసేలా కేంద్ర ప్రభుత్వం తగిన విధానాన్ని రూపొందించాలని లారీ యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. టోల్‌ చార్జీలను తగ్గించి, ఏడాదికి ఒక్కసారే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్‌లను పట్టించుకోకపోతే  దేశ వ్యాప్తంగా లారీల సమ్మెకు పిలుపునివ్వాలని లారీ యజమానులు భావిస్తున్నారు. 

నేడు రాజీనామాలు చేయనున్న వైసీపీ ఎంపీలు

ఢిల్లీ : నేడు రాజీనామాలు వైసీపీ ఎంపీలు చేయనున్నారు. పార్లమెంట్ నివధిక వాయిదా అనంతరం రాజీనామాలు చేయాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు ఇస్తామని వైసీపీ ఎంపీలు అన్నారు. ఏపీ భవన్ లో వైసీపీ ఎంపీల నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. 
 

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ సమావేశాలు

ఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రజల దృష్టిని మరల్చేందుకు పార్లమెంట్‌ సాక్షిగా పాలిటిక్స్‌ను రక్తికట్టిస్తున్నాయి.

విజయవాడలో నేడు జనసేన, సీపీఎం, సీపీఐ పాదయాత్ర

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా.. ఇవాళ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జనసేన, సీపీఎం, సీపీఐ పాదయాత్ర చేపట్టనున్నాయి. ఈ పాదయాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు. శాంతియుతంగా జరిగే ఈ పాదయాత్రకు ప్రజలంతా సహకరించాలని జనసేన అధికార ప్రతినిధి హరిప్రసాద్‌ కోరారు.  

 

07:31 - April 6, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా.. ఇవాళ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జనసేన, సీపీఎం, సీపీఐ పాదయాత్ర చేపట్టనున్నాయి. ఈ పాదయాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు. శాంతియుతంగా జరిగే ఈ పాదయాత్రకు ప్రజలంతా సహకరించాలని జనసేన అధికార ప్రతినిధి హరిప్రసాద్‌ కోరారు.  

 

07:29 - April 6, 2018

విజయవాడ : ఏపీ అభివృద్ధి అంతా అమరావతిలోనే టీడీపీ ప్రభుత్వం కేంద్రీకృతం చేస్తోందని విపక్షనాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ఎవరి రాజధాని అమరావతి పుస్తకావిష్కరణ జరిగింది. ఇందుల్లో పాల్గొన్న నేతలు అభివృద్ధి అంతా ఒకదగ్గరే జరిగితే...ఉద్యమాలు పుట్టుకొస్తాయని హెచ్చరించారు.
'ఎవరి రాజధాని అమరావతి' పుస్తకావిష్కరణ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఐవైఆర్‌ కృష్ణారావు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, వామపక్షపార్టీల నేతలు మధు, రామకృష్ణ హాజరయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
భవిష్యత్తు తరాలపై ప్రభుత్వం పాలసీలు తీవ్ర ప్రభావం
ప్రభుత్వం చేసిన పాలసీలు ఆ తరంపై ప్రభావం చూపకపోయినా.. భవిష్యత్తు తరలాపై తీవ్ర ప్రభావం చూపుతాయని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎప్పుడో  పాలకులు తీసుకున్న నిర్ణయాలు నేటి తరానికి తగలడం మనం చూస్తూనే ఉన్నామని... పాలకులు చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు.  ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వాములుగా చేయకపోతే అసమానతలకు దారితీస్తాయని... తద్వారా సామాజిక అలజడి తలెత్తుతుందన్నారు. అమరావతి నిర్మాణంలో అందరినీ కలుపుకొని పోవాలని... లేకుంటే రాయలసీమ  ఉద్యమానికి దారితీసే పరిస్థితులు తలెత్తుతాయన్నారు. అమరావతి అంటే అందరిదీ అనే భావన ప్రజల్లో ప్రభుత్వం కలిగించలేనప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
రాజధాని పేరుతో భారీ మోసం : ఉండవల్లి 
అమరావతి కోసం ఏపీ సీఎం చంద్రబాబు చేసిన డిజైన్లన్నీ గ్రాఫిక్సేనని.... రాజధాని పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. అమరావతిని దెయ్యాల నగరంగా మార్చవద్దని కోరారు. 
వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటి : రామకృష్ణ
చంద్రబాబు అభివృద్ధినంతా అమరావతిలోనే కేంద్రీకృతం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే జరిగితే ... రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి, లక్ష కోట్ల రూపాయలు ఎందుకు అవసరం అవుతాయో టీడీపీ చెప్పాలని ప్రశ్నించారు.
అమరావతి ఎంపిక వెనుక రహస్య ఎజెండా : ఐవైఆర్‌ కృష్ణారావు 
రాజధానిగా అమరావతి ఎంపిక వెనుక రహస్య ఎజెండా ఉందని ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ఆరోపించారు. కొందరికి లబ్ది చేకూర్చేందుకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారన్నారు.  పాలకవర్గ విధేయుల రియల్‌ ఎస్టేట్‌.. వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా అమరావతిని ఎంచుకున్నారన్నారు. అందుకే అమరావతి ఎంతమాత్రం ప్రజా రాజధాని కాదన్నారు. 

07:22 - April 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు ముగింపు దశకు చేరుకోవడంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రజల దృష్టిని మరల్చేందుకు పార్లమెంట్‌ సాక్షిగా పాలిటిక్స్‌ను రక్తికట్టిస్తున్నాయి.  విభజన హామీలపై ఏపీ ఎంపీలు కేంద్ర సర్కార్‌పై సంధించిన అవిశ్వాస అస్త్రం చర్చకురాకుండానే సమావేశాలు ముగుస్తున్నాయి. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ తమ ఆందోళనలకు కేంద్రం పట్టించుకోని కారణంగా చివరి రెండురోజులు సభకు హాజరుకాకూడదని నిర్ణయించింది.
విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లుతోన్న పార్లమెంట్‌
రెండోవిడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మొదటి రోజు నుంచి విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లుతోంది.  సమావేశాలు మొదలైన మొదటి రోజు నుంచి విపక్షాలు ఆందోళనలు చేపడుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ సమావేశాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన ఎంపీలు ఆందోళనను కొనసాగిసతున్నారు. విభజన హామీలు, ప్రత్యేకహోదాపై టీడీపీ సభలో నిరసన చెప్తుండగా....గిరిజన, ముస్లిం రిజర్వేషన్లపై సభను అడ్డుకుంటోంది. ఇక కావేరి నీటి యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇతర విపక్షపార్టీలు కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలు రోజూ ఇస్తూనే ఉన్నాయి. అయినా ఇంతవరకు స్పీకర్‌ వాటిపై చర్చ చేపట్టలేదు.
రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్‌ యత్నం
టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీరియస్‌గా లోక్‌సభలో నిరసన తెలిపారు. విభజన హామీలను తెరపైకి తెస్తూ... రిజర్వేషన్ల పెంపు అంశాన్ని రాష్ట్రాల పరిధిలో ఉంచాలన్న డిమాండ్‌ లేవనెత్తుతూ వచ్చారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు రిజర్వేషన్లపై.. అన్నాడీఎంకె ఎంపీలు కావేరి నదీ జలాలపై నిరసనలు కొనసాగించడంతో రెండు వారాలపాటు లోక్‌సభలో ఎలాంటి చర్చకు తావులేకుండా పోయింది.
ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఏపీ ఎంపీల ఒత్తిడి
 ఇక ఏపీకి చెందిన   ఎంపీలు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ అదుపులో లేని కారణంగా అవిశ్వాసాన్ని చర్చకు తీసుకోలేమంటూ స్పీకర్ ప్రకటనలు చేస్తూ సభను  ఎప్పటికప్పుడూ వాయిదా వేస్తూ వస్తున్నారు.  అయితే  టిఆర్ ఎస్  ఎంపీలు బిజెపి  పెద్దల సూచనలతోనే పార్లమెంట్ నిర్వహణకు సహకరించడం లేదన్న వాదన తెరపైకి రావడంతో గులాబి పార్టీ కూడా తమ వ్యూహాన్ని మార్చుకుంది. పార్లమెంట్ లో  అవిశ్వాసం చర్చకు వస్తే తాము సహకరిస్తామని తేల్చి చెప్పింది. అయినా  ఎంపీల  ఆందోళనలు తగ్గక పోవడంతో అవిశ్వాసం తీర్మానం సభలో   చర్చకు రాకుండా వాయిదాల పర్వం  కొనసాగుతోంది. 
నేటితోతో ముగియనున్న పార్లమెంట్‌ సమావేశాలు
పార్లమెంట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇక ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని మార్చుకుంది. కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో పార్లమెంట్‌కు హాజరుకాకుండా హైదరాబాద్‌ రావాలని వారికి సీఎం నుంచి ఆదేశాలు అందాయి.  దీంతో సమావేశాల చివరిరోజు టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావొద్దని నిర్ణయించారు. దీంతో ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎంపీలు సభకు హాజరుకావడం లేదు.

 

07:19 - April 6, 2018

గుంటూరు : విభజన హక్కుల సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేసేలా టీడీపీ సన్నద్ధమవుతోంది. పరిస్థితులకు అనుగుణంగ వ్యూహాలు మార్చుకుంటూ దశలవారీ పోరాటానికి రెడీ అయ్యింది. ఇవాళ సైకిల్‌ యాత్రలకు పిలుపునిచ్చింది. వెంకటపాలెం ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర సైకిల్‌యాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైకిల్‌యాత్ర నిర్వహించి కేంద్రానికి నిరసన తెలుపనున్నారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. దశలవారీగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సందర్భానుసారం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన టీడీపీ.. తదుపరి కార్యాచరణకు రెడీ అయ్యింది. నేటితో పార్లమెంట్‌ సమావేశాలు ముగియనుండడంతో ఏం చేయాలన్నదానిపై రాత్రి చంద్రబాబు పార్టీ ముఖ్యులతో సమావేశయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
నేడు సైకిల్‌, మోటార్‌సైకిల్‌ యాత్రలు
ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో సైకిల్‌, మోటార్‌సైకిల్‌ యాత్రలు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ వెంకటపాలెం వద్దనున్న ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర సైకిల్‌యాత్రను సీఎం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి అసెంబ్లీకి చంద్రబాబుతోసహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  సైకిళ్లతో వెళ్తారు. 
13 జిల్లాల్లో టీడీపీ ఎంపీల ఆత్మగౌరవయాత్ర
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆత్మగౌరవయాత్ర పేరుతో ఎంపీలు బస్సుయాత్ర నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్వహించారు. ప్రత్యేకహోదా సాధన కోసం ఎంపీలతోపాటు మిగతా ప్రజాప్రతినిధులంతా  ఆయా జిల్లా కేంద్రాల్లో పాల్గొననున్నారు. ఈ యాత్ర తేదీలు, విధివిధానాలు శనివారం ఖరారు చేయనున్నారు.   శనివారం మధ్యాహ్నం రెండున్నరకు మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అఖిలపక్ష సమావేశానికి జగన్‌నూ ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ జగన్‌ దగ్గరికి ప్రభుత్వం ప్రత్యేక దూతలను పంపనుంది. శాసనసభ సమావేశాలు పూర్తైన వెంటనే ఇద్దరు మంత్రులను జగన్‌ పాదయాత్ర దగ్గరికి పంపించి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. భవిష్యత్‌ కార్యాచరణను శనివారం ప్రకటించనున్నట్టు ఏపీమంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మొత్తానికి ప్రత్యేకహోదాపై భవిష్యత్‌ ఉద్యమానికి టీడీపీ సన్నద్దమవుతోంది. ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

 

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీఎ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఏఎంఆర్ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా కూలీలు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది కూలీలు ఉన్నారు. వద్దిపట్ల నుంచి వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

 

Don't Miss