Activities calendar

07 April 2018

జేఈఈ మెయిన్...పరీక్ష...

హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీలు, త్రిపుల్ ఐటీలు, ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్ డ్ లో అర్హత కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2018 రాత పరీక్ష ఆదివారం జరుగనుంది. 

ఎంసెట్ పరీక్ష...

హైదరాబాద్ : ఒక్క నిముషం ఆలస్యమైనా ఎంసెట్‌ పరీక్షకు అనుమతించేది లేదని జె.ఎన్.టీ.యూ వైస్ ఛాన్సలర్ గోవర్దన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందే ఎగ్జామ్‌ హాల్‌కి రావాలన్నారు. బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల వేలిముద్రలు, ఫోటోలు తీసుకుంటామని చెప్పారు.

స్వీట్లు పంచుకున్న సల్మాన్ ఫ్యాన్స్...

ఢిల్లీ : సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ లభించడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు సందర్భంగా శనివారం జోధ్‌పూర్‌ కోర్టు హాలు, పరిసరాలు హీరో అభిమానులతో కిక్కిరిసిపోయింది. ముంబైలోని సల్మాన్‌ ఇంటికి ఫ్యాన్స్‌ భారీగా చేరుకున్నారు. రోడ్లపై వెళ్లేవారికి మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. సల్మాన్‌కు బెయిల్‌ దక్కడంపై బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

సీబీఎస్ ఈ పేపర్ లీక్..అరెస్టులు...

ఢిల్లీ : సీబీఎస్‌ఈ పేపర్ లీకేజీ కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్ లీక్ కేసులో ఈ అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

21:18 - April 7, 2018

ఢిల్లీ : సీబీఎస్‌ఈ పేపర్ లీకేజీ కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్ లీక్ కేసులో ఈ అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు కూడా హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాకు చెందిన వారు. డావ్ స్కూల్ సూపరింటిండెంట్ రాకేశ్, క్లర్క్ అమిత్, అశోక్‌లను క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఉనా నుంచి తీసుకు వచ్చిన తర్వాత వాళ్లను విచారించామని, ఆ తర్వాత అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. 

21:16 - April 7, 2018

ముంబై : కృష్ణ జింకల కేసులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఊరట లభించింది. జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు సల్మాన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సాయంత్రం 6 గంటలకు సల్మాన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. సల్మాన్‌కు బెయిల్‌ రావడంతో అభిమానులు పండగ జరుపుకున్నారు. 50 వేల పూచీకత్తుపై కోర్టు సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. సల్మాన్‌ బెయిల్‌ లభించినప్పటికీ తదుపరి విచారణకు హాజరు కావాలని... కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవద్దని కోర్టు షరతు విధించింది.

గత రాత్రి రాజస్థాన్ ప్రభుత్వం 87 మంది జడ్జిలను అకస్మాత్తుగా బదిలీ చేసింది. అందులో సల్మాన్ కేసును విచారిస్తున్న జడ్జి రవీంద్ర కుమార్ జోషి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ బెయిలుపై విచారణ జరుగుతుందా....లేదా..అన్న ఉత్కంఠ నెలకొంది. జడ్జి ఉదయం విధులకు హాజరవ్వడంతో సందిగ్దత తొలగిపోయింది. సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపి బెయిలు మంజూరు చేశారు.

1998 అక్టోబర్‌లో 'హామ్‌సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా... సల్మాన్‌ఖాన్ జోధ్‌పూర్‌కు సమీపంలో గల కంకణి గ్రామంలో జింకలను వేటాడారు. ఇందులో రెండు కృష్ణ జింకలు హత్యకు గురైనట్లు సల్మాన్‌పై కేసు నమోదైంది. సల్మాన్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో జోధ్‌పూర్‌ కోర్టు ఏప్రిల్‌ 5న సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల జరిమానా విధించింది. సల్మాన్‌ను గురువారం జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇదే కేసులో సల్మాన్‌ 1998, 2006, 2007 సంవత్సరాల్లో మొత్తం 18 రోజులు జోధ్‌పూర్‌ జైల్లో గడిపారు. ఇప్పుడు మరో రెండ్రోజులు జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ లభించడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు సందర్భంగా శనివారం జోధ్‌పూర్‌ కోర్టు హాలు, పరిసరాలు హీరో అభిమానులతో కిక్కిరిసిపోయింది. ముంబైలోని సల్మాన్‌ ఇంటికి ఫ్యాన్స్‌ భారీగా చేరుకున్నారు. రోడ్లపై వెళ్లేవారికి మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. సల్మాన్‌కు బెయిల్‌ దక్కడంపై బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

21:14 - April 7, 2018

హైదరాబాద్ : ఒక్క నిముషం ఆలస్యమైనా ఎంసెట్‌ పరీక్షకు అనుమతించేది లేదని జె.ఎన్.టీ.యూ వైస్ ఛాన్సలర్ గోవర్దన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందే ఎగ్జామ్‌ హాల్‌కి రావాలన్నారు. బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల వేలిముద్రలు, ఫోటోలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థికి ఒక సిస్టంను కేటాయిస్తామన్నారు. హాల్ టికెట్ పైన ఉన్న యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలని తెలిపారు. పాస్‌వర్డ్ మాత్రం పరీక్ష ప్రారంభానికి పదినిమిషాల ముందు తెలియచేస్తామన్నారు. 

21:13 - April 7, 2018

హైదరాబాద్ : ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కలిశారు. ఈనెల 18 నుంచి ఐదు రోజులపాటు జరగననున్న సీపీఎం అఖిల భారత మహాసభలకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరగా.. కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశాలకు కేరళ సీఎంతో పాటు పశ్చిమబెంగాల్‌, త్రిపుర మాజీ సీఎంలు హాజరుకానున్నారని కేసీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఈ సమావేశంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగింది. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన నేపథ్యాన్ని కేసీఆర్‌ వివరించారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు సరైన విధానాలు పాటించకపోవడం వల్ల దేశం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని సీఎం తెలిపారు. ఇక మహాసభలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌కు సీపీఎం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. 

21:11 - April 7, 2018

హైదరాబాద్‌ : రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 176 మంది లబ్దిదారులకు ఈ ఇళ్ళను అప్పగించారు ఇదే సమయంలో 234 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ నియోజకవర్గం సింగం చెరువు తండాలో 14కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 176 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. జీ ప్లస్‌ త్రీ పద్ధతిలో.. మొత్తం పదకొండు బ్లాకుల్లో.. జీహెచ్‌ఎంసీ ఈ ఇళ్ళ సముదాయాన్ని నిర్మించింది. ఈ కాలనీలో అంతర్గత సీసీరోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, కంపోస్టింగ్‌ గుంతల నిర్మాణం, ఎల్ఈడీ లైటింగ్‌ సౌకర్యం కల్పించారు.

మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఇళ్లు అందుకున్న లబ్దిదారుల్లో 95శాతం గిరిజనులే. ఏప్రిల్‌ 2019 నాటికి రాష్ర్టంలో మూడు లక్షల ఇళ్ళు నిర్మిస్తామని ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఉప్పల్‌ ప్రాంతంలో మరో వెయ్యి ఇళ్లు, గ్రేటర్‌లోని మరిన్ని ప్రాంతాల్లో వందలాది డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ళు పేదలకు అందుబాటులోకి తేనున్నామన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా.. మంత్రి కేటీఆర్‌ 234 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

21:04 - April 7, 2018

ఢిల్లీ : రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వైసీపీ ఎంపీలు అన్నారు. ప్రత్యేక హోదా కోసం వీరు చేస్తున్న నిరాహార దీక్షకు అన్ని పక్షాల నుంచి మద్దతు పెరుగుతోంది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షాస్థలానికి వచ్చి వైసీపీ ఎంపీలకు సంఘీభావం తెలిపారు. మరోవైపు దీక్ష చేస్తున్న ఎంపీ మేకపాటి అస్వస్థతకు గురి కావడంతో... ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. రెండు రోజులుగా దీక్ష చేయడంతో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం నుంచి తీవ్రమైన తలనొప్పి, హైబీపీతో ఇబ్బంది పడ్డారు. దీక్షా స్థలంలోనే వాంతులు చేసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుత పరిస్థితుల్లో మేకపాటి దీక్ష చేయడం సరైంది కాదని సూచించారు. వైద్యుల సూచనతో పోలీసులు మేకపాటిని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు వైసీపీ ఎంపీల దీక్షకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే కేంద్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్ధం కావడం లేదని ఏచూరి అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. ప్రజా ప్రయోజనాలను సాధించడంతో విఫలమైన చంద్రబాబు.. తన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వైసీపీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎంపీల దీక్షకు మద్దతు తెలిపేందుకు ఆదివారం వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఢిల్లీ వెళ్లనున్నారు. 

అఖిల సంఘాల నిర్ణయం..

విజయవాడ : ఉద్యమానికి కలిసొచ్చే రాజకీయ పక్షాలు, సంఘాలతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కాసేపటి క్రితం అఖిలపక్ష సంఘాల సమావేశం ముగిసింది. పోరాటంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యేలా కార్యాచరణ ఉండాలని...రెండు కమిటీలు ఏర్పాటు చేసి, అన్ని వర్గాల ప్రజల సమన్వయం, ఉద్యమ మార్గాన్ని నిర్ణయించనున్నామని తెలిపారు. అలాగే, రాష్ట్రం కోసం నిజాయతిగా పోరాడే వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

20:45 - April 7, 2018

ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెట్రోల్..డీజిల్ ధరలు చేరుకుంటున్నాయి. విపరీతమైన పన్నులు బాదుతూ క్రూడాయిల్ ధరలను పాలకులు సాకుగా చూపుతున్నారు. పెట్రో ధరల ప్రభావంతో నిత్యావసర ధరలు..రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై టెన్ టివి బిగ్ డిబేట్ నిర్వహించింది. ఈ చర్చలో పాల్గొని శశికుమార్ (ఆర్థిక నిపుణులు), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), మందా జగన్నాథం (టీఆర్ఎస్), శ్రీధర్ రెడ్డి (బీజేపీ), రాజీవ్ (తెలంగాణ పెట్రోల్ సంఘం నేత) అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

రాజ్యసభ ఛైర్మన్ కు జైరాం రమేష్ లేఖ...

ఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ లేఖ రాశారు. మే..లేదా జూన్ లో రెండు వారాల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే విధంగా చూడాలని లేఖలో కోరారు. 

నివాసానికి చేరుకున్న సల్మాన్..

ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన నివాసానికి చేరుకున్నారు. కృష్ణ జింకల కేసులో ఆయన బెయిల్ పై విడుదలయిన సంగతి తెలిసిందే. 

ఆశారాం తీర్పు 25న..

ఢిల్లీ : మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై కీలక తీర్పును జోథ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు శనివారంనాడు రిజర్వ్ చేసింది. ఈనెల 25న తీర్పు వెలువరించనుంది.

అఖిల సంఘాల భేటీలో బాబు..

విజయవాడ : అఖిల సంఘ భేటీ కొనసాగుతోంది. హామీలు నెరవేర్చకపోవడంతో రాష్ట్రమంతా నిరసన వ్యక్తమౌతోందని సీఎం బాబు పేర్కొన్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్యాటలని ప్రయత్నించడం జరిగిందని, అవిశ్వాసంపై అన్ని పార్టీలు మద్దతు తెలపడం జరిగిందన్నారు. అవిశ్వాసంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించిందని, అభిప్రాయాలు తీసుకొనేందుకు అఖిలపక్షాలు..సంఘాలు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పక్షాలు ఏపీ హక్కులపై సానుకూలంగా ఉన్నాయని, హక్కుల కోసం పోరాడుతుంటే రాష్ట్రంపై విష ప్రచారానికి దిగుజారుతున్నారని విమర్శించారు.

కామన్ వెల్త్ లో భారత్...

ఢిల్లీ : కామన్ వెల్త్ లో భారత్ నాలుగు స్వర్ణాలు చేజిక్కించుకుంది. 85 కేజీల వెయిట్ లిఫ్టింగ్ మెన్స్ విభాగంలో రాగాల వెంకట్ కు గోల్డ్ మెడల్ సాధించాడు. ఇప్పటి వరకు నాలుగు స్వర్ణాలు..ఒక రజతం...ఒక కాంస్యం గెలుచుకుంది. ఇప్పటి వరకు ఆరు పతకాలూ వెయిట్ లిఫ్టింగ్ లోనే వచ్చాయి. 

ప్రజాస్వామ్యం పట్ల బీజేపీకి గౌరవం లేదు - టిడిపి ఎంపీలు..

ఢిల్లీ : తమ ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదని, ఏపీపై కేంద్రం కక్ష సాధిస్తోందని టిడిపి ఎంపీలు పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే బాధేస్తోందని, పార్లమెంట్ సభ్యులు కించపర్చడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంపట్ల బీజేపీకి గౌరవం లేదని పేర్కొన్నారు. 

ప్రజల మనోభావాలను గుర్తించడం లేదన్న బాబు..

విజయవాడ : ప్రత్యేక హోదాపై ప్రజల మనోభావాలను కేంద్రం గుర్తించడం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మోదీ మాట తప్పారనే విషయాన్ని జాతీయస్థాయిలో వివరించానని, జాతీయ స్థాయిలో బీజేపీ తప్ప అందరూ అనుకూలంగా ఉన్నారని చెప్పారు.

ఢిల్లీలో ల్యాండైన రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్...

ఢిల్లీ : రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్ పోర్టులో విమానం దిగింది. విమానంలో 345 మంది ప్రయాణీకులున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

18:33 - April 7, 2018

జగిత్యాల : విద్యార్థినికి అసభ్యకర మెసెజ్‌లు పంపిస్తూ వేధిస్తున్న ఓ టీచర్‌కు దేహశుద్ది చేసిన ఘటన జగిత్యాలలో జరిగింది. గత కొన్ని రోజులుగా ఓ విద్యార్థినికి వెంకటసాయి అనే టీచర్‌ వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా అసభ్యకర మెసెజ్‌లు పంపిస్తున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో... విద్యార్థిని బంధువులు వెంకటసాయిని నిలదీసి.. దేహశుద్ది చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్‌ ఈ విధంగా ప్రవర్తించడంపై మండిపడుతున్నారు. వెంటకసాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

18:30 - April 7, 2018

సంగారెడ్డి : జిల్లా ఎద్దుమైలారంలో ఇండియన్‌ నేషనల్ డిఫెన్స్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ మీట్‌ జరిగింది. ఈ మీటింగ్‌కు ఐన్‌టీయూసీ ఆలిండియా అధ్యక్షులు సంజీవరెడ్డి హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంలో కార్మికుల పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందంటున్న సంజీవరెడ్డి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:27 - April 7, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్..టీఆర్ఎస్ మధ్య తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. బస్సు యాత్రతో టీఆర్ఎస్ సర్కార్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా ప్రతిగా టీఆర్ఎస్ ప్రతి కౌంటర్ ఇస్తోంది. మరోవైపు కోదండరాం వెనుక కాంగ్రెస్ సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జైపాల్ రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. కేసీఆర్ అక్రమ సంపాదించడంతో మోడీకి భయపడుతున్నారని విమర్శించారు. సీపీఎం..సీపీఐ..ఇతర ప్రతిపక్షాలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చాయని ఈ విషయంలో టీఆర్ఎస్ ఎందుకు తటస్థంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానం రాకుండా కేసీఆర్ కుట్రలు పన్నాడని, థర్డ్ ఫ్రంట్ వెనుక ఏఐడీఎంకే ఉందని..పేర్కొన్నారు. కోదండరాంతో కలువలేదని కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదన్నారు. కాగ్ నివేదికలో ఈసారి కొత్తదనం ఉందని జైపాల్ తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఢిల్లీ ఐజీఐ ఎయిర్ పోర్టులో ఉత్కంఠ...

ఢిల్లీ : ఐజీఐ ఏయిర్ పోర్టులో ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం లేని ఓ విమాన డ్రైవర్ అత్యవసరంగా దిగడానికి పర్మిషన్ అడిగారు. దీనితో ఎయిర్ పోర్టుకు ఎనిమిది ఫైరింజన్లు చేరుకున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

విడుదలైన సల్మాన్...

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జైలు నుండి విడుదలయ్యారు. బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. రూ. 50వేల పూచికత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుండి విడుదలైన సల్మాన్ నేరుగా కారులో జోధ్ పూర్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. 

సౌమ్య హత్య కేసులో నిందితుడు అరెస్టు...

హైదరాబాద్ : ఎర్రగడ్డలో సౌమ్య హత్య కేసులో నిందితుడు ప్రకాశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీనివాస్ మీడియా ఎదుట నిందితుడిని హాజరు పరిచారు. సౌమ్యతో ప్రకాశ్ కు వివాహేతర సంబంధం ఉందని, బంగారు నగల కోసమే సౌమ్యను హత్య చేశారని తెలిపారు. ఇనుప రాడ్ తో సౌమ్య తలపై కొట్టి బ్లేడ్ తో గొంతు కోసి నిప్పంటించాడన్నారు. హత్య చేసి ప్రకాశ్ అనంతపురం పారిపోయాడని పేర్కొన్నారు. 

నేపాల్ ప్రధానికి పీఎం మోడీ హామీ...

ఢిల్లీ : నేపాల్‌ అభివృద్ధికి భారత్‌ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోది ఆ దేశ ప్రధాని కెపి ఓలికి హామి ఇచ్చారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని మోది, నేపాల్‌ ప్రధాని ఓలి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌-నేపాల్‌ సంయుక్తంగా చేపడుతున్న పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్‌ పనులను ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. 

18:11 - April 7, 2018

ఢిల్లీ : నేపాల్‌ అభివృద్ధికి భారత్‌ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోది ఆ దేశ ప్రధాని కెపి ఓలికి హామి ఇచ్చారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని మోది, నేపాల్‌ ప్రధాని ఓలి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌-నేపాల్‌ సంయుక్తంగా చేపడుతున్న పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్‌ పనులను ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. దీంతోపాటు ఇండియా-నేపాల్ సరిహద్దులో బీర్‌గంజ్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును కూడా ప్రారంభించారు. నేపాల్‌ అభివృద్ధిలో భారత్‌ చేసిన కృషికి సుదీర్ఘ చరిత్ర ఉందని, భవిష్యత్తులో ఆ దేశ అభివృద్ధికి తోడ్పాడు అందిస్తామని మోది చెప్పారు. నేపాల్‌తో జల, రైల్వే మార్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్నామని... భారత్‌-కాఠ్‌మాండూను కలిపే విధంగా కొత్త రైల్వే లైను వేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ప్రధాని తెలిపారు. భారత్‌తో సంబంధాలకు నేపాల్‌ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని...భారత ప్రజలు, ప్రయివేట్‌ సంస్థల నుంచి తాము మరింత మద్దతు ఆశిస్తున్నట్లు నేపాల్‌ ప్రధాని ఓలి పేర్కొన్నారు. ఓలి మూడు రోజుల భారత పర్యటనకు వచ్చారు.  

18:09 - April 7, 2018

ముంబై : కృష్ణ జింకల కేసులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరైంది. సల్మాన్‌ బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపిన జోధ్‌పూర్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 50 వేల పూచీకత్తుపై కోర్టు సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. సల్మాన్‌ఖాన్‌ ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు. గత రాత్రి రాజస్థాన్ ప్రభుత్వం 87 మంది జడ్జిలను అకస్మాత్తుగా బదిలీ చేసింది. అందులో సల్మాన్ కేసును విచారిస్తున్న జడ్జి రవీంద్ర కుమార్ జోషి కూడా ఉండడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ ఆయన ఉదయం విధులకు హాజరై సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపారు. 20 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌ కోర్టును ఎప్పుడూ కూడా అవహేళన చేయలేదని, ఆయనకు ఊరట కల్పించాలని విచారణ సందర్భంగా సల్మాన్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఘటనా స్థలంలో సరైన ఆధారాలు లభించలేదని సల్మాన్‌ తరపు న్యాయవాది హస్తీమాల్‌ సారస్వత్‌ అన్నారు. కాగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్‌ కోరింది. రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో 106 నంబరు ఖైదీగా ఉన్న సల్మాన్‌ఖాన్‌ భోజనం చేయకున్నా... క్రమం తప్పకుండా చేసే వ్యాయమాన్ని వదలలేదు. శుక్రవారం సాయంత్రం తాను ఉంటున్న వార్డ్‌ నెంబర్‌ 2లో సుమారు మూడు గంటలపాటు వ్యాయామం చేశారని జైలు అధికారులు వెల్లడించారు. క్రంచెజ్, పుశ్‌ అప్స్‌, స్కిప్పింగ్‌, జంపింగ్‌ లాంటి ఎక్సర్‌సైజ్‌లు చేశారు. సల్మాన్‌ జైలులో రాత్రి భోజనం ఖిచిడీ శెనగలు తినడానికి నిరాకరించారు. శుక్రవారం ఉదయం అల్పాహారం కింద బీన్స్‌, పాలను కూడా తీసుకోలేదు. దీనికి బదులు జైలు క్యాంటీన్‌ నుంచి పాలు బ్రెడ్‌ తెప్పించుకుని తిన్నారు. ఇందుకోసం సల్మాన్‌ కుటుంబం జైలు క్యాంటీన్‌లో 4 వందలు రూపాయలు చెల్లించింది. సల్మాన్‌ మధ్యాహ్నం పప్పు, చపాతి, మిక్స్‌డ్‌ వెజ్‌ తిన్నారు. సెలబ్రిటీ ఖైదీ అయినప్పటికీ సల్మాన్‌కు ప్రత్యేక వసతులు కల్పించడం లేదని జైలు సూపరింటిండెంట్‌ విక్రమ్‌ సింగ్‌ తెలిపారు. సల్మాన్‌ గదిలో కర్ర మంచం, రగ్గు, కూలర్‌ ఏర్పాటు చేశారు. జైలు దుస్తులు వేసుకోవడానికి సల్మాన్‌ నిరాకరించారు.

17:23 - April 7, 2018

విజయవాడ : దళితుల హక్కులపై చర్చించేందుకు ఈనెల 16వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై తీర్పుపై తీవ్ర విమర్శలు..చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం హర్షకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను కోరడం జరిగిందని, జాతి ప్రయోజనాల కోసం ముందుకు రావాలని కోరారు. దళితుల హక్కుల పట్ట చిత్తశుద్ధి ఉంటే సమావేశానికి హాజరవుతారని, విబేధాలు పక్కన పెట్టి జాతీ ప్రయోజనాల కోసం ముందుకు రావాలన్నారు.  

17:15 - April 7, 2018

విజయవాడ : ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ రాజకీయ క్రీడలని సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం కేంద్రంపై వత్తిడి పెంచేందుక అనుసరించాల్సిన దానిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అఖిల సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన పార్టీలు హాజరు కాలేదు. ఈ సమావేశానికి వచ్చిన శివాజీ టెన్ టివితో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితమే ఆందోళనలు చేస్తున్నామనడం తప్పని, తాము రెండేళ క్రితమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తే ఎందుకు చేయలేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీలు ఆందోళనలు చేస్తున్నారని, నిర్ధిష్ట కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. 

వాంతులు చేసుకున్న మేకపాటి...

ఢిల్లీ : ఆమరణ దీక్ష చేపడుతున్న మేకపాటి అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం నుండి ఆయన దీక్ష చేపడుతన్న సంగతి తెలిసిందే. శనివారం ఆయన వాంతులు చేసుకోవడంతో వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 

కామన్ వెల్త్ లో భారత్ కు మరో స్వర్ణం...

ఢిల్లీ : కామన్ వెల్త్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. 85 కిలోల వెయిట్ లిఫ్ట్ లో వెంకట్ రాహుల్ స్వర్ణ పతకం గెలిచాడు. 

16:40 - April 7, 2018

హైదరాబాద్ : నాచారంలోని సింగం చెరువు తండాలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను గిరిజనులు సత్కరించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం కార్యక్రమానికి హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, ఎమ్మేల్యేలు ప్రభాకర్, సుధీర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు.

16:32 - April 7, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటూ ఇరు పార్టీల నేతలు పోటా పోటీగా ఆందోళనలు..నిరసన తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యలో ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. శనివారం ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఎవరూ నమ్మలేని పరిస్థితి నెలకొందని..క్షణ క్షణం మనస్సు..మాటలను మార్చుతుంటారని ఎద్దేవా చేశారు. మాయల ఫకీరు..పిట్టల దొర..420గా అనుకుంటున్నారని, ప్రజలను నట్టేట ముంచుతున్నారని కాబట్టే ఎవరూ బాబును నమ్మరని విమర్శించారు. కానీ బాబును మాత్రం ఆయన తనయుడు లోకేష్ మాత్రం నమ్ముతారని తెలిపారు. రాజకీయ రణక్షేత్రంలో బాబు ఏకాకిగా మిగిలిపోతాడని, కుటుంసభ్యులు కూడా నమ్మరని జోస్యం చెప్పారు. 

16:27 - April 7, 2018

విజయవాడ : అఖిల సంఘాల సమావేశానికి తమను అనుమతించకపోవడం బాధాకరమని నవతరం, ముస్లిం లీగ్ పార్టీలు విమర్శించాయి. శనివారం అమరావతిలో అఖిల సంఘాల సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన అమలు సాధన కోసం కేంద్రంపై వత్తిడి పెంచేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొనేందుకు నవతరం..ముస్లింలీగ్ ప్రతినిధులు కూడా వచ్చారు. కానీ వారిని సెక్యూర్టీ అనుమతించలేదు. దీనితో వారు సచివాలయంలోనే బైఠాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అక్కడినుండి వెళ్లగొట్టారుర. ఈ సందర్భంగా వారితో టెన్ టివి ముచ్చటించింది. ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడుతామనే తమను లోనికి అనుమతించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అన్ని పార్టీలను కలుపుకొనే ఉద్ధేశ్యం లేదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ప్రధాని మోదీపై స్వంత పార్టీ ఎంపీ విసుర్లు..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి దళిత ఎంపీ షాక్ ఇచ్చారు. అది కూడా స్వంత పార్టీ ఎంపీ సొంత పార్టీకే చెందిన యశ్వంత్ సింగ్ నుండి షాక్ ఎదురయ్యింది. యశ్వంత్ సింగ్ ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. స్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. కేవలం రిజర్వేషన్ల వల్లే తాను ఎంపీని కాగలిగాననీ..దేశంలో ఉన్న 30 కోట్ల మంది దళితులకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల పాలనలో దళితుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభించిందని విమర్శించారు.

16:14 - April 7, 2018

ఢిల్లీ : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై టిడిపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రెస్ మీట్ లో ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశంచి జగన్..పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రమేష్ స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఎలాంటి వత్తిడి తేవాలనే దానిపై టిడిపి ఎంపీలు శనివారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు...రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే కుట్ర రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో సీఎం చంద్రబాబుపై జగన్ ప్రశ్నల వర్షం కురిపించడడం సబబు కాదని, బీజేపీని ఒక్క ప్రశ్న కూడా సంధించలేదన్నారు. తాము కేంద్రంతో పోరాడడుతుంటే వైసీపీ మాత్రం బిజెపితో లూలూచీ పడుతోందన్నారు. న్యాయం దక్కేంత వరకు పోరాటం చేస్తామన్నారు. 

16:10 - April 7, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీల దీక్ష కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ మేకపాటి ఆరోగ్యంపై టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అంతగా బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటూ రాజీనామా చేసిన ఐదుగురు వైసీపీ ఎంపీలు ఆంధ్రా భవన్ వద్ద ఆమరణ దీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుండి వీరు దీక్షలు కొనసాగిస్తున్నారు. 75 సంవత్సరాలున్న వైసీపీ ఎంపీ మేకపాటి దీక్షపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఆయన కూడా దీక్షలో పాల్గొన్నారు. శనివారం ఆయన ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుండి మేకపాటి నీరసంగా కనిపించారు. తీవ్రమైన తలనొప్పి..హై బీపీతో బాధ పడుతున్నారు. వాంతులు కూడా చేసుకోవడంతో ఆర్ఎంఎల్ వైద్యులు అక్కడకు చేరుకుని రెండు సార్లు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీక్ష చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు పోలీసులు ఆయన్ను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. కానీ దీక్ష చేస్తానని మేకపాటి పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆకాంక్షిస్తున్నారు. 

మేకపాటి ఆరోగ్య పరిస్థితి విషమం..

ఢిల్లీ : నిన్నటి నుండి నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్  ఆరోగ్యం పరిస్థితి విషమించింది. ఏపీ భవన్ లో నుండి నుండి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీఎంపీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఎంపీ మేకపాటికి ఆరోగ్యం విషమించింది. హైబీపీ, వాంతులతో మేకపాటి ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దీక్ష సరకాదని వైద్యులు సూచిస్తున్నారు. 

15:31 - April 7, 2018

సిరియా గురించి వినాలన్నా, చదవాలన్నా, తెలుసుకోవాలన్నా...గుండెలు చిక్కబట్టుకోవాల్సిన భయంకర స్థితి. లేడిలా గెంతులు వేస్తు ఆడుకోవాల్సిన పసికూనలు దుర్భర పరిస్థితుల్లో బ్రతుకీడుతున్నారు. ఆడుకోవటం, నవ్వుకోవటం తప్ప మరో లోకం తెలియని బాల్యం శిథిలాల మధ్య, శవాల కుప్పల ముందు, కడుపు మాడ్చుకుంటు..పట్టెడన్నం కోసం, అమ్మా నాన్నల కోసం, కూలిపోయిన శిథిలాల మధ్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆడుకుంటే ఒంటికి అంటుకునే దుమ్ముకు బదులు శరీరమంతా నెత్తురోడుతు.. గాజుముక్కల గాయాలతో, రాళ్ల మధ్య, రప్పల మధ్య అఘాదాల ఆర్తనాల్లా బ్రతుకుతున్నారు. అదృష్టవశాత్తు అమ్మా నాన్నలతో బ్రతికి వుంటే వారి కుటుంబం ఇళ్ల మధ్య గోతులు తీసుకుని జంతువుల కంటే హీనంగా, మౌనంగా, దీనంగా, జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నారు.

ఏడేళ్లుగా సిరియాలో హృదయవిదారక ఘటనలెన్నో...
సిరియాలోని ఘౌటా నగరం ఇప్పుడు పిల్లల పాలిట భూమి మీద నరకంలా మారిందనీ, ఇది అంతర్యుద్ధం కాదు, సిరియా పిల్లల మీద యుద్ధమనీ యునిసెఫ్‌ పేర్కొంది. అందుకు కారణం- గత ఏడాది వెయ్యి మంది దాకా చిన్నారులు మృతి చెందగా ఈ ఏడాది గత రెండు నెలల్లోనే వెయ్యిమంది ప్రాణాలు పోయాయి. మొన్న అలెప్పో... నిన్న ఇద్లిబ్‌... నేడు ఘౌటా. ఏడేళ్లుగా హృదయవిదారకమైన వార్తలెన్నో సిరియా నుంచి వస్తున్నాయి. తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉండడం ఘౌటా చేసిన నేరం. నాలుగు లక్షల మంది జనాభా ఉన్న ఆ నగరాన్ని చుట్టుముట్టిన సైన్యం పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండానే దాడులకు పాల్పడడంతో తీవ్రమైన ప్రాణనష్టం జరుగుతోంది.

వెలుగు చూసే పరిస్థితి లేక చీకటి కొట్టాల్లో బ్రతుకులు..
రాకెట్లూ బాంబు దాడులతో ఇళ్లు కూలిపోవడంతో చావగా మిగిలినవాళ్లు బేస్‌మెంట్లలో, భూగృహాల్లో, సొరంగాల్లాంటి చీకటికొట్లలో తలదాచుకుంటున్నారు. సాధారణంగా పౌరులెవరూ ఇళ్లలో భూగృహాలు కట్టించుకోరు. దాడులు మొదలయ్యాక కొందరు అప్పటికప్పుడు ఇళ్లకింద గోతులు తవ్వుకుని అందులో దాక్కుంటున్నారు. వాటి మీద ఇళ్లు కూలడంతో చాలాసార్లు అవి వారికి సజీవ సమాధులవుతున్నాయి. బతికి ఉన్నవారికి తిండిలేదు. గాయపడినవారికి చికిత్స లేదు. మందులు లేవు. పునరావాస శిబిరాలన్నీ నిండిపోవడంతో పార్కుల్లో, వీధుల్లో డేరాల కింద బతుకుతున్నారు చాలామంది. ఐక్యరాజ్యసమితి ద్వారా అందుతున్న సహాయమూ వారికి అందే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఒక్క ఘౌటాలోనే లక్షకు పైగా చిన్నారులు తక్షణసాయం కోసం వేచి చూస్తున్నారు.

15:28 - April 7, 2018

అఘ్నాతవాసితో దెబ్బతిన్న త్రివిక్రమ్.. కథతో, పవన్ కళ్యాణ్ నిర్మాణంలో యూత్ స్టార్ నితిన్ తన 25 వ సినిమాగా చేస్తున్నాడంటేనే..అందర్లో క్యూరియాసిటీ ఏర్పడింది. దానికి తగ్గట్టు గానే.. ఫస్ట్ లుక్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వరకూ ఫ్రెష్ రోమ్ క్యామ్ టచ్ తో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది సినిమా టీమ్. ప్రీ రిలీజ్ కు పవన్ రాకతో .. అన్ని రకాలుగా సినిమాకు కావల్సిన క్రేజ్ ఏర్పడింది. అలా అంచలంచెలుగా అంచనాలు పెంచి థియేటర్ లోకి వచ్చిన 'చల్ మోహన్ రంగ'.. హుషారుగా చల్ అన్నాడా.. లేక డల్ అయ్యాడా అన్నది తెలుసుకుందాం...

సినిమా కథ...
సినిమా కథ విషయానికొస్తే..పనీ పాటా, చదువూ సంధ్యా అంటూ ఏమీ లేకుండా లైఫ్ ని లైట్ గా లీడ్ చేసే మోహన్ రంగ చిన్నతనంలోనే ..మేఘ ను చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆమె కోసం అమెరికా వెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేసి చివరికి అమెరికా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సినిమాటిక్ గానే మేఘ తో పరిచయం, ప్రేమ, ఆ ప్రేమ ను వ్యక్తపరచలేని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. దాంతో మేఘ ఇండియా వచ్చేస్తుంది. ఆమెను వెతుక్కుంటూ ఇండియా వచ్చేసిన మోహన్ రంగ ఆమెను ఎలా కలుసుకున్నాడు..? తన ప్రేమను ఎలా వ్యక్తపరచాడు..? అతని ప్రేమను ఆమె యాక్సెప్ట్ చేసిందా..? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల అభినయం...
నటీనటుల విషయానికొస్తే..యూత్ స్టార్ నితిన్ ఈ సినిమాలో నటన పరంగా చాలా పరిణితి కనపర్చాడు. స్టైలింగ్ కూడా బావుంది. కాకపోతే తన గాడ్ అయిన..పవన్ కళ్యాణ్ ని చాలా ఎక్కువగా వాడేశాడు. చాలా చోట్ల ఇమిటేట్ కూడా చేశాడు. నితిన్ మిగతా సినిమాలతో పోలిస్తే.. కామెడీ టైమింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు. ఇక లై సినిమాలో తన లుక్స్ తో అందరినీ ఇంప్రెస్ చేసిన మేఘ ఆకాష్..ఈ సినిమాలో కూడా లుక్స్ తో ఆకట్టుకుంది. కానీ యాక్టింగ్ పరంగా మాత్రం చాలా పేలవంగా అనిపించింది. సిచ్యువేషన్ కి సింక్ గాని ఎక్స్ ప్రెషన్స్ తో కన్ ఫ్యూజ్ చేసింది. చాల రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన లిజి.. ఏ ప్రత్యేకతా లేని సాదాసీదా క్యారెక్టర్ లో కనిపించింది. నితిన్ ప్రెండ్స్ గా నటించిన మధు నందన్, పమ్మిసాయి, మంచి కామెడీ జనరేటర్స్ గా ఉపయోగపడ్డారు. ఇక రావు రమేష్, నరేష్, నర్రాశీను క్యారెక్టర్స్ సినిమాను సేవ్ చేసే ఎలిమెంట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో రావు రమేష్, నర్రాశీనుల మధ్య వచ్చే ఎపిసోడ్స్..సెకండాఫ్ మొత్తాన్ని కాపాడింది. సత్య కామెడీ అక్కడక్కడా...నవ్వించినా.. కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. మిగతా నటీనటులందరూ..డైరెక్టర్ చెప్పిన విధంగా ..తమపాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. టైటిల్స్ లో ఈ కథ త్రివిక్రమ్ దే అని వేశారు. సినిమా చూశాక మాత్రం అసలు ఈ కథ త్రివిక్రమ్ దేనా..అని డౌట్ రావడం కామన్. క్లారిటీ లేని క్యారెక్టరైజేషన్, సెంటర్ పాయింట్ లేని స్టోరీ.. త్రివిక్రమ్ ఇచ్చాడు అంటే నమ్మడం కష్టం. ఇక ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్ అయిన కృష్న చైతన్య ..స్క్రీన్ ప్లే లో ఎలాంటి మెరుపులు యాడ్ చెయ్యలేదు. ఫస్టాఫ్ లో u.s యాంబియెన్స్ వల్ల, కృష్ణ చైతన్య కామెడీ టైమింగ్ వల్ల సినిమా అలా అలా నడిచిపోతుంది. ఇంట్రవెల్ కార్డ్ తోనే సినిమాలో ఉన్న లోపాన్ని బయట పెట్టిన డైరెక్టర్, సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి ఫ్లాట్ గా స్టోరీ ని నడిపించేశాడు. మిత్ర క్యారెక్టర్ ఎంట్రీ వరకూ..సినిమా అసలు ఎటు పోతుందో అర్దం కాదు. సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పడంతో, స్టోరీలో కొత్తదనం లేకుండా పోవడంతో ఒక సగటు సినిమాగా నిలిచింది చల్ మోహన రంగ. అయితే సినిమాను నిలబెట్టడానికి..ఆర్.ఆర్ పరంగా బాగా హార్డ్ వర్క్ చేశాడు తమన్. కానీ సీన్స్ లో బలమైన కంటెంట్ లేకపోవడంతో ఆర్.ఆర్ కూడా ఓవర్ లౌడింగ్ అనిపిస్తుంది. నటరాజ్ సుబ్రమణ్యన్ సినిమాటోగ్రఫీ..చల్ మోహన రంగా టెక్నీషియన్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. U.S ని గానీ, ఊటీ అందాలను గానీ.. అతను ప్రజెంట్ చేసిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ఏరియల్ షాట్స్..విజువల్ ట్రీట్ గా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి ల నిర్మాణ విలువలు బావున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే జనరల్ స్టోరీలైన్, క్లారిటీ లేని స్క్రీన్ ప్లే, అసలు ఆకట్టుకోలేని ఎమోషన్స్, అనేక బలహీనతలతో తెరకెక్కిన 'చల్ మోహనరంగా' కి క్యామెడీ బ్యాకింగ్ ఒక్కటే అండగా నిలిచింది. ఆ కామెడీ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుంది అనే దానిపై మోహనరంగా బాక్సాఫీస్ స్టామినా ఆధారపడి ఉంది.

ప్లస్..
ఫస్టాఫ్
కామెడీ
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనస్
రొటీన్ కథ
స్క్రీన్ ప్లే
కనెక్ట్ కాని ఎమోషన్స్
కన్ ఫ్యూజింగ్ క్యారెక్టర్స్

రేటింగ్...విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...
 

15:18 - April 7, 2018

ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బెయిల్ లభించింది. దీనితో ఆయన ఫ్యాన్స్, కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను జోధ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించింది. బెయిల్ మంజూరు చేయాలని పెట్టుకున్న పిటిషన్ పై శనివారం కోర్టు విచారణ చేపట్టింది. రూ. 50వేల పూచికత్తుతో సల్మాన్ కు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు ఆయన నటించే..నటిస్తున్న సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీనితో ఫ్యాన్స్..కుటుంబసభ్యులు..డైరెక్టర్లు తీవ్ర ఆందోళనలో మునిగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం బెయిల్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ 'భారత్‌', 'రేస్‌ 3', 'కిక్‌ 2', 'దబాంగ్‌ 3' చిత్రాల్లో నటిస్తున్నారు. 'రేస్‌ 3' సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. జూన్‌ 15న సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 • 1998 అక్టోబర్‌లో 'హామ్‌సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా... సల్మాన్‌ఖాన్ జోధ్‌పూర్‌కు సమీపంలో గల కంకణి గ్రామంలో జింకలను వేటాడారు.
 • జిప్సీలో సల్మాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌ కూడా ఉన్నారు.
 • సల్మాన్‌ కృష్ణ జింకలపై కాల్పులు జరిపారు.
 • ఆ కాల్పుల శబ్దం విని బిష్ణోయ్‌ వర్గానికి చెందిన గ్రామస్థులు అక్కడికి రాగా రెండు కృష్ణ జింకలు చనిపోయి ఉన్నాయి.
 • కృష్ణ జింకలను బిష్ణోయి వర్గానికి చెందిన ప్రజలు దైవంగా భావిస్తారు.
 • దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సల్మాన్‌తో పాటు సహనటులపై వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
 • ఈ కేసులో 28 మంది సాక్షులుగా ఉన్నారు.
 • సల్మాన్‌ ఖాన్‌ తుపాకితో కృష్ణ జింకలను చంపినట్లు వారు ఆరోపించారు.
 • సల్మాన్‌ మాత్రం తన వద్ద ఎలాంటి ఆయుధం లేదని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు.
 • సెక్షన్‌ 51కింద సల్మాన్‌ ఖాన్‌పై కేసు నమోదు కాగా...ఇతర నటులపై ఐపిసి 149 సెక్షన్‌ కింద అభియోగాలు నమోదయ్యాయి.
 • ఈ కేసులో సల్మాన్‌ పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు.
 • ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలు మార్చి 28న పూర్తి కాగా ఏప్రిల్‌ 5న సల్మాన్‌కు శిక్ష ఖరారు చేసింది.
 • ఏప్రిల్ 7వ తేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

ఇంద్రాణి ముఖర్జీ అస్వస్థత,ఆసుపత్రికి తరలింపు..

ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను బైకుల్లా జైలు నుంచి జేజీ ఆసుపత్రికి తరలించారు. మోతాదుకు మించి మెడిసన్ తీసుకోవడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై జైలు అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కూడా ఎక్కువ మోతాదులో మెడిసన్ తీసుకోవడంతో ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కాగా, ఆసుపత్రిలో ఇంద్రాణి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

సల్మాన్ కు బెయిల్ మంజూరు..

ఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడుకి బెయిల్ మంజూరయ్యింది. కృష్ణజింకల కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన సల్మాన్ ఖాన్ కు ఎట్టకేలకే బెయిల్ మంజూరయ్యింది. గురువారం నాడు తుడి విచారణ జరిగిన ఈ కేసులో సల్మాన్ కు జోథ్ పూర్ కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది.  రూ.50వేల పూచీకత్తుతో జోథ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ ను ఈరోజు 8 గంటలకు బెయిల్ పై విడుదల చేయనుంది. 

14:55 - April 7, 2018

సినిమా పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖుల బయోపిక్ లతో వచ్చిన సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జీవితకథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ సందర్భంగా 'యాత్ర' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. రాజశేఖర్ ను మరిపించేలా వున్న ప్రముఖ నటుడు ముమ్ముట్టి పోస్టర్ రిలీజ్ అయ్యింది..
మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' ..
మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి వైఎస్ లాగా చేయి ఊపుతూ కనిపిస్తున్న పోస్టర్ లో 'కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది.. ' అనే వ్యాఖ్యలతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి అన్ని బయోపిక్స్ లా యాత్ర సినీ అభిమానులను అలరిస్తుందా? లేదా అనే అంశాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

14:49 - April 7, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షలు కొనసాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రాజీనామాలు చేసిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఆంధ్రా భవన్ ఎదుట ఆమరణ దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సందర్శించారు. ఎంపీల దీక్షకు సంఘీభావం తెలియచేశారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ...వైసీపీ ఆందోళనతో రాష్ట్రంలో ఉత్సాహం పెరిగిందని, రాష్ట్ర మేలు కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు సీపీఎం మద్దతిస్తుందని వెల్లడించారు. విభజన హామీలపై పార్లమెంట్ లో చర్చించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే కేంద్రం నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదన్నారు. 

'మా'పై మండిపడ్డ నటి శ్రీరెడ్డి..

హైదరాబాద్ : మా అసోసియేషన్ పై నటి శ్రీరెడ్డి మండిపడ్డారు. ఒక సినిమాలో నటించిన నటీనటులందరికీ ‘మా’ సభ్యత్వం కార్డు ఇచ్చేస్తారని, తాను మూడు సినిమాలు తీసినా తనకు కార్డు ఇవ్వరా? తెలుగు నటులు అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అసోసియేషన్ ఏం చేస్తోంది? అని ఆమె ప్రశ్నించారు. టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యత్వం ఇవ్వలేదంటూ ఈరోజు మధ్యాహ్నం ఫిల్మ్ చాంబర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

14:42 - April 7, 2018

కడప : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకట కిరణ్ మిస్ ఫైర్ అయ్యింది. దీనితో అతను అక్కడికక్కడనే మృతి చెందాడు. ఎస్పీ కార్యాలయంలో ఇతను విధులు నిర్వహిస్తున్నాడు. గన్ ను శుభ్ర పరుస్తుండగా ఒక్కసారిగా పేలింది. దీనితో బుల్లెట్ వెంకట కిరణ్ ఛాతిలోకి దూసుకపోడంతో కుప్పకూలిపోయాడు. ఈ శబ్దం విన్న ఇతరులు లోనికి వచ్చి చూసి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. విషయం తెలుసుకున్న వెంకట కిరణ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కానిస్టేబుల్ మృతికి మిస్ ఫైర్ కారణమా ? లేక ఇతరత్రా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. 

టీడీపీ ఎంపీలు సమావేశం..

ఢిల్లీ : టీడీపీ ఎంపీ సీఎం.రమేశ్ ఇంట్లో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. మరోపక్క వైసీపీ ఎంపీలు చేస్తున్న నిరాహాద దీక్షకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం తెలిపారు. 

ఇచ్చిన హామీలు ఎందుకు అమలుచేయరు : ఏచూరి

ఢిల్లీ : ఏపీ రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఏడాది ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అంటే కాదు ఐదేళ్లు ఇవ్వాలని ఆనాడు ప్రతిపక్షంగా వున్న బీజేపీ డిమాండ్ చేసిందని సీతామరాం ఏచూరి గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటు వైసీపీ ఎంపీలు చేపట్టిన నిరాహారదీక్షకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం తెలిపారు.

14:30 - April 7, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల కోసం ఆయా పార్టీలు పోరుబాట పట్టాయి. ప్రధానంగా ప్రతిపక్షం..అధికార పక్షం ఇందులో క్రెడిట్ తమకే దక్కాలనే ఆలోచనతో ముందుకెళుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ లో ఏం చేయాలి ? ఎలాంటి వ్యూహం అనుసరించాలి ? అనే దానిపై టిడిపి ప్రస్తుతం తర్జనభర్జనలు పడుతోంది. ఇటీవలే పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. విభజన హామీలు..ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ వెలుపలా..లోపల ఆందోళన చేసిన టిడిపి ఎంపీలు పోరును మరింత ఉధృతం చేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు వైసీపీ ఎంపీలు ముందడుగు వేసి ఏకంగా ఆమరణ నిరహార దీక్ష చేపట్టాయి. దీనితో భవిష్యత్ లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై టిడిపి ఎంపీలు సమాలోచనలు జరుపుతున్నారు. శనివారం మధ్యాహ్నం సీఎం రమేష్ నివాసంలో భేటీ అయిన ఎంపీలు తదుపరి కార్యచరణపై చర్చిస్తున్నారు. వీరికి ఏపీ సీఎం బాబు దిశా..నిర్దేశం చేస్తున్నారు. ప్రధాని ఇంటిని ముట్టడించాలని నిర్ణయం తీసుకొంటున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

విభజన సమస్యలను అప్పుడే ప్రశ్నించాం : సీతారాం

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటు వైసీపీ ఎంపీలు చేపట్టిన నిరాహారదీక్షకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..ఎంపీల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు. విభజన సమయంలో ఏపీ సమస్యలపై అధ్యయనం చేయకుండా తెలుసుకోకుండా ఎందుకు విభజిస్తున్నారనీ అప్పుడే సీపీఎం ప్రశ్నించిందనీ..ఇటువంటి విభజన చేస్తే రానున్న కాలంలో సమస్యలు వస్తాయని ఆనాటి ప్రధాని మన్మోహన్ కు చెప్పానని, రెవెన్యూ లోటును ఏవిధంగా భర్తీ చేస్తారని ప్రశ్నించామనీ ఈ సందర్బంగా సీతారాం ఏచూరి గుర్తుచేశారు. 

14:02 - April 7, 2018

గుంటూరు : టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలోనే ఉండాలని సీఎం ఎంపీలను ఆదేశించారు. ఇవాళ చంద్రబాబు తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాలని ఎంపీలను ఆదేశించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:57 - April 7, 2018

ఢిల్లీ : ఏపీ భనవ్ లో వైసీపీ ఎంపీల దీక్ష కొనసాగుతోంది. ప్రత్యేకహోదా కోరుతూ దీక్ష చేపట్టారు. దీక్ష చేస్తున్న ఎంపీలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, పల్స్ లెవల్స్ ను వైద్యులు పరీక్షించారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రానికి న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీలు అన్నారు. చివరి అస్త్రంగా రాజీనామా చేస్తామని ఎంపీలు అంటున్నారు. 

 

13:50 - April 7, 2018

ఢిల్లీ : భారతదేశంలో ఏపీ అంతర్భాగమా... కాదా కేంద్ర ప్రభుత్వం చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. దేశంలోని 125 కోట్ల ప్రజల్లో 5 కోట్ల మంది ఏపీ ప్రజలు భాగస్వాములా..కాదా అని ప్రశ్నించారు. దేశంలోని రాజ్యాంగ చట్టాలు ఏపీకి వర్తిస్తాయా లేదా... అని అడిగారు. పార్లమెంట్ లో చేసిన చట్టాలను ఏపీలో ఎందుకు అమలు జరుపరని ఆయన నిలదీశారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయని విమర్శించారు. టీడీపీ, బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ కలిసి రాష్ట్రాన్ని భ్రష్ఠుపట్టించాయని విమర్శించారు. వారికి కావాల్సిన రాజకీయాలు, అవినీతి కార్యక్రమాలు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రజలే వారి సంగతి తేల్చుతారని తెలిపారు. తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలే నటులని, డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం దురృష్టకరమన్నారు. 
నేను ఆరోగ్యంగానే ఉన్నా : మేకపాటి.. 
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వదని, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయరని అన్నారు. ఆందుకే తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. మనకు మంచి రోజులు వస్తాయన్నారు. మన అవసరం కూడా కేంద్రప్రభుత్వానికి పడుతుందన్నారు.

 

ఆటోలను ఢీకొన్న ట్రక్..10మంది మృతి..

ఢిల్లీ : ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఓ ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో 10మంది మృతి చెందారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లాలో జరిగింది. బద్వారా పోలీసు స్టేషన్ పరిధిలోని మజ్హగవాన్ గ్రామం వద్ద రెండు ఆటోలను ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లుగా సమాచారం.

ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ..

పెద్దపల్లి : ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. మంచిర్యాల గౌతమ్‌నగర్‌లోని ఎంపీ సుమన్ నివాసంతో పాటు మరో మూడు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో దొంగతనం జరగడం ఇది రెండోసారి. చోరీ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

13:30 - April 7, 2018

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా... నేటికీ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి కమిటీలు లేవు. రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసినా... చాలా జిల్లాలకు కమిటీలు లేవనే చెప్పాలి. దీంతో పార్టీలో పదవులు దక్కుతాయని ఆశిస్తున్న నేతలకు నిరాశే మిగులుతోంది.  
టీఆర్‌ఎస్‌కు పట్టని పార్టీ కమిటీలు
ప్రజాక్షేత్రంలో పార్టీ బలంగా రూపుదిద్దుకోవాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు ఏర్పడాలి. అంతేకాదు.. రాష్ట్ర కమిటీతోపాటు... దాని అనుబంధ సంఘాలను పార్టీలు నియమించుకుంటాయి. కానీ గులాబీ పార్టీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.  ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా పని చేసిన కార్యకర్తలు పార్టీకి ఉన్నా......వారికి  పార్టీ పదవులు కట్టబెట్టని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ పదవులకు ప్రాధాన్యత ఉంటుందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆశించినా.. పదవులు మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి.
కార్యకర్తల్లో మరో సారి ఆశలు కలిగిస్తున్న ప్లీనరీ
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గతంలో ఉన్న పార్టీ నిర్మాణాన్ని సవరించారు. దీంతో పార్టీ నియమావళి ప్రకారం పదవులు భర్తీ చేస్తామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించినా...ఆ పదవులు భర్తీకి నోచుకోవడం లేదు. ఈ నెలాఖరున జరిగే పార్టీ ప్లీనరీకి టీఆర్‌ఎస్ సిద్ధమవుతుండడంతో కార్యకర్తలకు మరో సారి ఆశలు చిగురిస్తున్నాయి.  గ్రామ, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో  సమన్వయ కమిటీల నియామకం ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడితో పాటు మరో కన్వీనర్ ను నియమించే విధంగా పార్టీ  నిబంధనలను అమలు చేయాల్సి ఉంది.
పదవులపై ఆశలు పెంచుకున్న నేతలకు  నిరాశే 
పదవులపై ఆశలు పెంచుకున్న నేతలకు  నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్లీనరీ నాటికి కూడా పార్టీ పదవులు భర్తీ చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో పార్టీ కంటే ప్రభుత్వ పనితీరుపైనే  కేసీఆర్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరుతో మరోసారి అధికార పగ్గాలు దక్కించుకోవాలని గులాబీ బాస్‌  భావిస్తున్నారు. దీంతో పార్టీ పదవులు ఇప్పట్లో భర్తీ చేసే సూచనలు కనిపించడం లేదు.
ప్రభుత్వ పనితీరే గీటురాయి 
రాష్ట్ర స్థాయిలో గతంలో ఉన్న పోలిట్ బ్యూరో, రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించాల్సి ఉన్నా...పార్టీ అవసరాల రీత్యా రాష్ట్ర స్థాయిలో ప్రధానకార్యదర్శులు, కార్యదర్శలను మాత్రమే కేసీఆర్ నియమించారు. అయితే పార్టీ పదవులకు ప్రాధాన్యత ఉన్నా... ప్రభుత్వ పనితీరే గీటురాయి అంటూ సీఎం కేసీఆర్‌ కార్యవర్గాల ఎంపిక పై దాటవేస్తున్నారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది.

ప్రమాదంలో 14మంది హాకీ ప్లేయర్లు మృతి!..

ఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో 14మంది హాకీ ప్లేయర్లు మృతి చెందిన తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఐస్ హాకీ ప్లేయర్లతో వెళ్తోన బస్సు ఓ హైవేపై ట్రక్కును ఢీకొన్నది. ఆ ఘటనలో సుమారు 14 మంది జూనియర్ హాకీ ప్లేయర్లు మృతిచెందారు. దీంతో కెనడాలో విషాద చాయలు అలుముకున్నాయి. సస్‌కచివాన్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. హమ్‌బోల్డ్ బ్రాంకోస్ టీమ్‌కు చెందిన ప్లేయర్లు ఆ ప్రమాదంలో మరణించారు. హాకీ బస్సులో సుమారు 28 మంది ప్లేయర్లు వుండగా..గాయాలపాలయిన మరో 14 మందికి హాస్పటల్‌లో చికిత్సను అందిస్తుండగా..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.

13:25 - April 7, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో అక్రమ చెరువు తవ్వకాల దందా కొనసాగుతోంది. వందల ఎకరాలను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు. మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు నెలల నుండి ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కాళ్లలంకలో జరగుతున్న అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

13:22 - April 7, 2018

ఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్, వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌లపై సీబీఐ లుకౌట్‌ సర్క్యూలర్‌ జారీ చేసింది. 2012 సంవత్సరంలో వీడియోకాన్‌కు 3వేల 250 కోట్ల రుణాన్ని మంజూరు చేయడంలో క్విడ్‌ప్రోకో జరిగిందా అనే అంశంపై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్న సీబీఐ... లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దీపక్‌ కొచ్చర్‌ సోదరుడు రాజీవ్‌ కోచర్‌ను ముంబై విమానాశ్రయంలో అరెస్ట్ చేసి... సీబీఐ కార్యాలయంలో విచారించారు. 

13:19 - April 7, 2018

హైదరాబాద్ : పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం నాయకుల మధ్య సమన్వయం ప్రజా సమస్యలపై వాయిస్‌ పెంచడం.. ఇదీ కాంగ్రెస్‌ బస్సుయాత్ర లక్ష్యం. అనుకున్నట్టుగానే జనం నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్రకు మంచి స్పందన కూడా లభిస్తోంది. కానీ పార్టీలోనే  బస్సుయాత్ర నాయకుల మధ్య వివాదాలకు పురుడుపోస్తోంది. ఈ యాద్ర పార్టీ సీనియర్ల మధ్య అగాథాన్ని పెంచుతోంది. సాఫీగా..  జోష్‌గా సాగుతున్న బస్సుయాత్రలో కుదుపులు ఎందుకు వస్తున్నాయి.. వాచ్‌దిస్‌ 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
ఆధిపత్యపోరుతో రగిలిపోతున్న నేతలు 
తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం, కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ రెండోదఫా బస్సుయాత్ర కొనసాగుతోంది.  కాంగ్రెస్‌ నాయకులకు ప్రజల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. క్షేతస్థాయిలో ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న హస్తంపార్టీ నేతలు.. ప్రజల మద్దతు కూడగట్టడంలో కొంతమేరకు సక్సెస్‌ సాధిస్తున్నారనే చెప్పాలి.  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న ఈ బస్సుయాత్రలో ఎంతజోష్‌ ఉందో... అదే స్థాయిలో నాయకుల మధ్య అంతరాలు సృష్టిస్తోంది. అందుకే  బస్సుయాత్రకు మధ్యమధ్యలో బ్రేకులు పడుతున్నాయి.
ఉత్తమ్‌పై సీనియర్ల ఆగ్రహం
పార్టీ సీనియర్లనంతా వెంటతీసుకుని యాత్ర ప్రారంభించిన ఉత్తమ్‌... మొదట్లో కొంత వారిమధ్య సమన్వయం సాధించారు. కానీ అంతలోనే ఆయనపై సీనియర్లు కారాలు- మిరియాలు నూరుతున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం బహిరంగ సభలు జరగకపోవడానికి ఉత్తమే కారణమంటున్నారు సీనియర్లు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు చొప్పున ఉన్న రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న వారు నేతలు ఉన్నారు. వీరిలో ఎవరిపేరు చెప్పకుండా కాంగ్రెస్‌ను అశీర్వదించాలని చెబితే బావుండేది. కానీ ఉత్తమ్‌... ఉన్న నేతల్లో ఒకరి పేరు ప్రకటించి.. వారిని గెలిపించాలని కోరుతున్నారు. దీంతో అసలు సమస్య వచ్చిపడుతోంది.  మిగిలిన ఆశావహులు ఉత్తమ్‌ ప్రకటనలపై కస్సుబుస్సుమంటున్నారు.
వివాదాస్పదమైన పాలకుర్తి బహిరంగసభ
పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్‌ సభ వివాదాస్పదమైంది. పాలకుర్తిలో కాంగ్రెస్‌ తరపున గత ఎన్నికల్లో పోటీచేసి స్వల్ప తేడాతో దుగ్యాల శ్రీనివాసరావు ఓడిపోయారు. అయితే ఉత్తమ్‌... అతని పేరు చెప్పకుండా.. జంగా రాఘవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం.. వివాదానికి కారణమైంది.  అనంతరం ప్రసంగించిన రవీంద్రనాయక్‌, రామ్మోహన్‌రెడ్డి, జంగారెడ్డి.. కాబోయే సీఎం ఉత్తమ్‌ అంటూ ప్రసంగాలుచేశారు. దీంతో అక్కడే ఉన్న సీఎల్పీనేత జానారెడ్డి చిన్నబోయారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలోనూ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన ఉత్తమ్‌
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో క్యామ మల్లేష్‌ గెలుపు ఖాయమని గాంధీభవన్‌ జరిగిన సభలో చెప్పారు. దీంతో మరునాడు మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరులు అనుచరులతో గాంధీభవన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో ఉత్తమ్‌ బయటకు వచ్చి టికెట్‌లను అధిష్టానం కేటాయిస్తుందని... చివరికి నా టికెట్‌ కూడా అధిష్టానమే కేటాయిస్తుందని చెప్పి వారిని శాంతింపచేశారు.
చేవెళ్లలో ప్రారంభం నుంచే అభ్యర్థులను ప్రకటిస్తున్న ఉత్తమ్‌ 
చేవెళ్లలో ప్రారంభం నుంచే ఉత్తమ్‌ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు.  అయితే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లకు ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీపడటం.. వారిలో ఒకరిపేరు ఎంచుకుని ప్రకటించడం వివాదాస్పదమవుతోంది.  మొత్తానికి బస్సుయాత్ర నాయకుల మధ్య ఐక్యత తీసుకొస్తుందని భావిస్తే.... వారి మధ్య దూరాన్ని మరింత పెంచుతుందన్న వాదన వినిపిస్తోంది. సీనియర్ల మధ్య పెరుగుతున్న దూరాన్ని రాబోయే రోజుల్లో ఉత్తమ్‌ ఎలా తగ్గిస్తారో వేచి చూడాలి.

 

13:14 - April 7, 2018

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడలో మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాల్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఉత్తమ్‌... వరంగల్‌ జిల్లాలో బస్సుయాత్రలో ఉన్న ఉత్తమ్‌..  టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకపోతే కేటీఆర్‌ రాజకీయ సన్యాసం తీసుకోవాలన్నారు. 

 

13:14 - April 7, 2018

ఈశాన్య రాష్ట్రాల నుంచి మెరిసిన మణిపూర్ మణిపూస ఎత్తిన బరువుల వెనుక ఎంతో కష్టం ఉంది. పుల్లలు ఏరుకునే స్థాయి నుండి భారతదేశపు ఉత్తమ పురస్కారమైన 'పద్మశ్రీ' స్థాయికి చేరుకుంది మణిపూర్ మణిపూస మీరాబాయి చాను..ఆరు నిమిషాలు... ఆరు లిఫ్ట్‌లు... ఆరు రికార్డులు... ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను తొలి బంగారు పతకాన్ని గెలుచుకుని దేశం యావత్తు గర్వపడేలా చేసింది ఈ పసిడి కొండ. 

పచ్చని కొండల మధ్య పుట్టిన పసిడి పతకం..

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మారుమూల గ్రామంలో ఈ బరువుల కొండ పుట్టింది. ఇంఫాల్‌ జిల్లాకు చెందిన నాంగ్‌పోక్‌ కక్చింగ్‌ పచ్చని కొండల మధ్య పుట్టింది చాను బంగారుకొండ. ఆ కొండ ప్రాంతాల్లో పెద్ద కుటుంబం..వ్యవసాయమే ఆధారం..వంట చేసుకోవాంటే చుట్టుపక్కల నుండి పుల్లలు ఏరుకుని తెచ్చుకోవాల్సిందే.. ఆరుగురు సంతానంలో చివరిగా పుట్టింది చాను. అన్నయ్య సాయిఖోమ్‌ సనటోంబా మీతీ కూడా చాను కూడా వంటచెరకు కోసం చెట్లమ్మట పుట్లమ్మటా తిరిగి పుల్లలను సేకరించేంది. అలా పుల్లలను ఏరుకుని నెత్తిన పెట్టుకుని వచ్చే చాను బరువులెత్తి బంగారు పతకాన్ని సాధించేస్థాయికి చేరుకుంది. బహుశా అప్పుడు ఆ అన్న తన చెల్లెలు పెద్దయ్యాక దేశం గర్వించే వెయిట్‌ లిఫ్టర్‌ అవుతుందని ఊహించలేదు. కానీ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది మీరాబాయి చాను.
వెయిట్‌లిఫ్టర్‌ కుంజరాణి దేవి స్ఫూర్తితో..
మీరాకు చిన్నప్పటి నుంచి వెయిట్‌లిఫ్టర్‌ కుంజరాణి దేవి అంటే ఎంతో అభిమానం, వల్లమాలిన ప్రేమ. వెయిట్‌లిఫ్టింగ్‌లో 50కి పైగా అంతర్జాతీయ పతకాలు సాధించి, 2006 కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించడంతో ఆమెను స్ఫూర్తిగా తీసుకుంది. మీరాబాయి తండ్రి పీడబ్ల్యూడి డిపార్ట్‌మెంట్‌లో టెంపరరీ ఉద్యోగిగా విధులు నిర్వహించేవారు. పెద్ద కుటుంబ కావటంతో వ్యవసాయం కూడా చేయాల్సిన పరిస్థితి. తండ్రికి పొలం పనుల్లో తనకు సాయం చేస్తున్న కూతురు మీరాబాయిలో ఒక వెయిట్‌లిఫ్టర్‌ ఉందని గుర్తించింది ఆయనే. తమ ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్‌, ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీత అనితా చానును తన కూతురుకు శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరాడు ఆ తండ్రి.

పది సంవత్సరాలు కఠోర శిక్షణ..
ఇంట్లోవాళ్లకు ఇష్టం లేకపోయినా మీరాబాయిని అనితా చాను ట్రైనింగ్‌ సెంటర్‌కు పంపారు. ఒకవైపు పొలంలో పనిచేస్తూనే 25 కిలోమీటర్లు వెళ్లి శిక్షణ పొందడం మొదలెట్టింది మీరాబాయి. కొన్ని రోజులకే మీరాలోని ప్రతిభను గుర్తించిన అనితా చాను ఆమెకు తన సెంటర్‌లోనే ఆశ్రయమిచ్చి, సుమారు పది సంవత్సరాలు కఠిన శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ మీరాను వరల్డ్‌క్లాస్‌ వెయిట్‌లిఫ్టర్‌గా తీర్చిదిద్దింది.

అభిమాన క్రీడాకారిణి రికార్డును దాటేసిన చాను ..
నాలుగేళ్ల క్రితం అంటే 2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో 48 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించి మీరాబాయి చాను తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పాటియాలాలో జరిగిన ‘రియో ఒలింపిక్స్‌ 2016’ ట్రయల్స్‌లో అప్పటిదాకా మహిళల జాతీయకోచ్‌ కుంజరాణి దేవి పేరిట ఉన్న రికార్డును తుడిపేసి సత్తాచాటింది.

అపజయం నుండి విజయం వైపు..
చానుపై పెరిగిన అంచనాలతో ఒలింపిక్స్‌లో ఒక పతకం గ్యారెంటీ అనుకున్నారంతా. అయితే రియో వేదికపై మీరాబాయి అడుగులు తడబడ్డాయి. ఒత్తిడికి గురైన చాను బరువులు ఎత్తడంలో విఫలమైంది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం నిరాశ, నిస్పృహలకు లోనయ్యాను. నాపై, నా కోచ్‌పై సోషల్‌ మీడియాలో వచ్చిన కామెంట్స్‌ తీవ్రంగా వేధించటంతో ఒకస్థాయిలో ట్రైనింగ్ ఆపివేద్దామనే నిర్ణయానికి వచ్చేసింది. కానీ తనను తాను మానసకంగా బలపరుచుకుంది. ఆటలో గెలుపోటములు సహజమేనని ఇనుమడించిన ఉత్సాహంతో విపరీతంగా కష్టపడింది.

గోల్డ్‌కో్‌స్ట కామన్వెల్త్‌ లో తొలి గోల్డ్ మెడల్..
గత ఏడాది ‘వరల్డ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో బంగారు పతకాన్ని చేజిక్కించుకుని భవిష్యత్తుపై ఆశలు రేపిన మీరాబాయి చాను రాత్రింబవళ్లు కఠోర శ్రమతో గోల్డ్‌కో్‌స్టలో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో మన దేశానికి తొలి బంగారు పతకాన్ని సాధించింది. అంతేకాదు... వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు రికార్డులను కూడా బ్రేక్‌ చేసింది.

చాను గ్రామంలో పండుగవాతావరణం..
కామన్వెల్త్‌ గేమ్స్‌లో మీరాబాయి చాను బంగారుపతకం సాధించిందని తెలియగానే ఆమె గ్రామస్థులు పండగ చేసుకున్నారు. ‘థాబల్‌ ఛోంగ్బా’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య కొండ ప్రాంతాల నుంచి భవిష్యత్తులో చాలామంది క్రీడాకారులు మెరుస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో శుక్రవారం (6న) నదేశానికి మరో బంగారు పతకాన్ని అందించిన సంజితా చాను కూడా మీరాబాయి చానుకు స్నేహితురాలు కావడం మరో విశేషం. 

12:43 - April 7, 2018

హైదరాబాద్ : ట్విట్టర్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ మరోసారి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. దేశంలో వాయుకాలుష్యంపై ప్రశ్నించారు. భారత్‌ ఆర్థికంగా దూసుకుపోతున్నా, భారత్ వెలిగిపోతున్నా.. దేశంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి లేదని అన్నారు. ఇందుకు నాయకుల చర్యలే కారణమని అన్నారు. స్వచ్ఛమై గాలి, నీరు దొరకడం లేదని తుందుర్రు యువత ప్రశ్నిస్తోందన్నారు.

 

12:35 - April 7, 2018

గుంటూరు : టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలోనే ఉండాలని సీఎం ఎంపీలను ఆదేశించారు. ఇవాళ చంద్రబాబు తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాలని ఎంపీలకు ఆదేశించారు.  

 

హోదా కోసం విద్యార్ధుల వినూత్న నిరసన..

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ తెలుగునాడు విద్యార్ధి సంఘం నేతలు శనివారం గుంటూరులో వినూత్నంగా నిరసన తెలిపారు. తెలుగు విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరితోపాటు మరో 12 మంది టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గుండు కొట్టించుకుని తమ నిరసనను తెలిపారు. స్థానిక మార్కెట్ సెంటర్‌లో గుండ్లు కొట్టించుకుని ప్లే కార్డులతో కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మీ హీరోలకు మీరే పిలుపునివ్వండి : నటుడు సుమన్

చిత్తూరు : తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన ర్యాప్సోడి-2కె 18 కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పెషల్ స్టేటస్ కోసం విద్యార్థులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు సుమన్ విద్యార్ధులకు సూచించారు. ఉద్యమంలో అన్ని రంగాలు కలిసేలా ప్రయత్నాలు జరగాలని ఆయన సూచించారు. ఫోన్ ద్వారా అభిమాన హీరోలకు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునివ్వాలని ఆయన సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.

12:24 - April 7, 2018

గుంటూరు : నేడు ఏసీ సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ప్రభుత్వం అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. సమావేశానికి హాజరుకాబోమని ప్రధాన పార్టీలు తెలిపాయి. సమావేశానికి లెఫ్ట్, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. ప్రజా సంఘాలతోనే అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. 

 

12:21 - April 7, 2018

ఢిల్లీ : ఏపీ భనవ్ లో వైసీపీ ఎంపీల దీక్ష కొనసాగుతోంది. ప్రత్యేకహోదా కోరుతూ దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీలు అన్నారు. చివరి అస్త్రంగా రాజీనామా చేస్తామని ఎంపీలు అంటున్నారు. 

 

చంద్రబాబుకు విష్ణుకుమార్ రాజు లేఖ..

అమరావతి : సీఎం చంద్రబాబు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశానికి రావటంలేదని లేఖలో చంద్రబాబుకు వెల్లడించారు. గతంలో కేంద్రం ప్రతిపాదలకు స్వాగతించి ఇప్పుడు చంద్రబాబు యూటర్న తీసుకుని కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారనీ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.  

ఫిల్మ్ ఛాంబర్ వద్ద నటి శ్రీరెడ్డి హల్ చల్ ..

హైదరాబాద్ : ఫిల్మ్ ఛాంబర్ వద్ద నటి శ్రీ రెడ్డి హల్ చల్ సృష్టించింది. టాలీవుడ్ ప్రముఖులు తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తున నటి శ్రీరెడ్డి అర్థనగ్నం ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసన తెలిపింది. సీఎం కేసీఆర్ కు సోషల్ మీడియా ద్వారా తన బాధను తెలిపింది. సీఎం కేసీఆర్ గారు నా బాధను అర్థం చేసుకోండి లేకుంటే నేను నిరాహార దీక్ష చేస్తాననీ..గతంలో మీరు పోరాడి సాధించుకున్న మార్గాన్నే నేను కూడా ఎంచుకున్నాననీ..ఇప్పటికీ మారు స్పందించకపోతే..పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతానని నటి శ్రీరెడ్డి హెచ్చరించింది. కేసీఆర్ గారిని ఎలా కలవాలో అర్థం కావడంలేదని వాపోయింది.

అక్కడే వుండండి రావద్దు : చంద్రబాబు

అమరావతి : ఎంపీలందరు ఢిల్లీలోనే వుండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలను జారీ చేశారు. ఈరోజు తదుపరి కార్యాచరణను చంద్రబాబు రూపొందించనున్నారు.దీంతో మరోమూడు రోజులపాటు ఢిల్లీలోనే వుండాలని చంద్రబాబు ఎంపీలకు ఆదేశించారు. 

12:00 - April 7, 2018

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండలోని ఫెర్టిలైజర్స్‌ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో  ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయారు.  వీరిని బయటకు తీయడానికి సింగరేణి రెస్క్యూటీమ్‌  సహాయక చర్యలు చేపట్టింది. రెండో అంతస్తుపై స్లాబ్‌పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

'షీ టీమ్' కృషి అభినందనీయం : జడ్జ్ లోకూర్

హైదరాబాద్ : మహిళల రక్షణ కోసం షీటీమ్ ద్వారా కమిషనర్ స్వాతీలక్రా చేస్తున్న కృషికి జడ్జ్ మదన్ లోకూర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ భవనానికి కూతవేటు దూరంలో వున్న హాకా భవన్ భరోసా కేంద్రంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ప్రారంభించారు. జడ్జి మదన్ బి లోకూర్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. బాలల హక్కులను గుర్తించి పరిరక్షించటం సమాజంలో ప్రతీ ఒక్కరి బాధ్యతగా వుండాలని న్యాయమూర్తి మదన్ లోకూర్ పేర్కొన్నారు.

 

ఛైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ మరో ముందడుగు : జడ్జ్ మదన్ లోకూర్

హైదరాబాద్ : చైల్డ్ ఫెండ్లీ కోర్టు ఏర్పాటు చేయటం అంటే తెలంగాణ పోలీసు శాఖలో గొప్ప ముందడుగు అని జడ్జి మదన్ బి లోకూర్ అన్నారు. అసెంబ్లీ భవనానికి కూతవేటు దూరంలో వున్న హాకా భవన్ భరోసా కేంద్రంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ప్రారంభించారు. జడ్జి మదన్ బి లోకూర్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. మారుతున్న సమాజంతోపాటు చట్టాలు, న్యాయస్థానాలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని జడ్జి మదన్ బి లోకూర్ పేర్కొన్నారు. లోక్ అదాలత్ కోర్టులు దీనికి ప్రధాన నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు.

11:46 - April 7, 2018

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై లోకేష్ మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం జగన్ మోడీ కాళ్లపై పడ్డారని వ్యాఖ్యాలు చేశారు. ప్రజల్ని మోసం చేసేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

భరోసాలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ..

హైదరాబాద్ : అసెంబ్లీ భవనానికి కూతవేటు దూరంలో వున్న హాకా భవన్ భరోసా కేంద్రంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ప్రారంభించారు. జడ్జి మదన్ బి లోకూర్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ప్రారంభించారు. 

11:36 - April 7, 2018

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసు మరో కీలక మలుపు తిరుగుతోంది. సినీప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు నాలుగు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన ఎక్సైజ్‌ శాఖ ఇద్దరు ప్రముఖులను నిందితులుగా తేల్చింది. ప్రముఖ దర్శకుడు, ఒకప్పటి యువ హీరోపై ఎక్సైజ్‌ పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశముంది.

 

హార్థిక్ పటేల్ సంచలన వ్యాఖ్య..

ఢిల్లీ : విద్యా,ఉద్యోగాల్లో పాటిదార్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఉద్యమం చేసిన హార్థిక్ పటేల్ మరో సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా అంటూ హార్థిక్ పటేల్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి జ్యోతిరాదిత్యకు తాము పూర్తిగా మద్ధతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. పదిహేనేళ్లపాటు పరిపాలించిన బీజేపీ సర్కారు ఓటర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, దీనిపై ఓటర్లలో చైతన్యం వచ్చిందని హార్థిక్ పటేల్ పేర్కొన్నారు.

మ.2గంటలకు అఖిలపక్షం..

అమరావతి : నేడి ఏపీ సచివాలయంలో సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని పార్టీలకు ఆహ్వానం పించారు. కాగా తామెవరం అఖిలపక్ష సమావేశానికి హాజరుకామని ప్రధానపార్టీలన్నీ వెల్లడించాయి. గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మూడు పార్టీలు మినహా అన్ని పార్టీలు, సంఘాలు హాజరయ్యాయి. ఇప్పటి సమావేశానికి మాత్రం హాజరుకామని ప్రధాన పార్టీలు వెల్లడించాయి. దీంతో ప్రజాసంఘాలతోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. 

సోమాలియాలో పేలుళ్లు!..

హైదరాబాద్ : సోమాలియాలోని మొగధీషులో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఆ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న చెక్ పాయింట్ దగ్గర మొదటి పేలుడు జరిగింది. చెక్ పాయింట్ దగ్గర ఓ వాహనాన్ని అడ్డుకున్న సమయంలో ఈ పేలుడు చోటుచేసుకున్నది. ఆ పేలుడు వల్ల ముగ్గురు సైనికులు గాయపడ్డారు. హోడన్ జిల్లాలో ఉన్న మరో చెక్ పాయింట్ దగ్గర రెండవ పేలుడు జరిగింది. సెక్యూర్టీ దళాలు జరిపిన దాడిలో ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారు.

11:04 - April 7, 2018

ప్రస్తుతం సినిమా పరిశ్రమల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మోరీకోమ్, ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫొగాట్, అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం దంగల్, క్రికెటర్స్ సచిన్ మహేంద్రసింగ్ ధోనీ, వంగవీటి మోహన్ రంగా, కిల్లింగ్ వీరప్పన్,మహానటి సావిత్రి, అలాగే మహానటుడు నందమూరి తారకరామారావు ఇలా బయోపిక్స్ హమీ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' ఆధారంగా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రంలో అనుప‌మ్ ఖేర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, రీసెంట్‌గా మ‌న్మోహ‌న్ లుక్‌లో అనుప‌మ్ ఖేర్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు విడుద‌ల చేశారు. ఇక చిత్రంలో కీల‌క పాత్ర అయిన సోనియా గాంధీ పాత్ర‌కి ఎవ‌రు తీసుకుంటారా అని జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్న టైంలో జ‌ర్మ‌న్ యాక్ట‌ర్ సుజానే బెర్నెర్ట్ తాను సోనియా గాంధీ పాత్ర‌లో వెండితెర‌పై క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సుజానే ప‌లు టీవిషోస్ తో పాటు భార‌తీయ సినిమాల‌లోను న‌టించింది. న‌టుడు అఖిల్ మిశ్రాని వివాహం చేసుకున్న ‘ప్రధానమంత్రి’ టెలివిజన్‌ సిరీస్‌లో కూడా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలిగా నటించారు. మ‌న్మోహ‌న్ సింగ్ బ‌యోపిక్ వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ మూవీని విజ‌య్ ర‌త్నాక‌ర్ గుత్తే తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రంలో సంజ‌య్ బారు పాత్ర‌లో అక్ష‌య్ ఖ‌న్నా న‌టించ‌నున్నాడు. సలీమ్‌-సలైమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో ఈ బయోపిక్‌ని విడుదల చేసేందుకు కూడా ప్లాన్‌ చేశారని తెలుస్తోంది.

రిజర్వాయర్ ప్రారంభించిన కేటీఆర్..

హైదరాబాద్: భాగ్యనగరంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైనిక్‌పురిలో మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.4.64 కోట్ల వ్యయంతో 7 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించారు. దీంతో వేల మందికి మెరుగైన మంచినీటి సరఫరా సౌకర్యం ఈ రిజర్వాయర్ ద్వారా కలుగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ జనార్థన్ రెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ దానకిశోర్ తదితరులు తదితరుల పాల్గొన్నారు. స్థానికులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రముఖ నటుడు రావుగోపాల రావు భార్య మృతి..

హైదరాబాద్ : ప్ర‌ముఖ సినీ న‌టుడు రావు ర‌మేష్ త‌ల్లి క‌మ‌లా కుమారి క‌న్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఈ రోజు కొండాపూర్ లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి ప‌లువురు ప్రముఖులు సంతాపం తెలియ‌జేశారు. రావు ర‌మేష్ అప్ప‌టి న‌టుడు రావు గోపాల‌రావు త‌న‌యుడు అన్న సంగ‌తి తెలిసిందే.

తెలుగు వర్శిటీలో 'ఆకాశం కోల్పోయిన పక్షి'..

హైదరాబాద్ : నగరంలో ప్రతీరోజు అనేక పుస్తకావిష్కరణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే ఈరోజుకూడా పుస్తక ప్రియుల కోసం పలు పుస్తకావిష్కరణలు జరుగనున్నాయి. ఈ క్రమంలో కృష్ణుడు రచించిన ‘ఆకాశం కోల్పోయిన పక్షి’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సాయంత్రం 6గం.లకు జరుగనుంది. ఈ పుస్తకాన్ని జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్టఅతిథులుగా ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్‌ కె. శ్రీనివాస్‌, ప్రముఖ రచయిత కె.శివారెడ్డి, నగ్నముని,దేవిప్రియ, కె.

నగరంలో ‘తుకానికి కన్నీళ్లు’..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మద్దాళి రఘురాం రచించిన ‘తుకానికి కన్నీళ్లు’ కవిత సంపుటి ఆవిష్కరణ-అంకితోత్సవం సాయంత్రం 6గంటలకు రవీంద్రభారతిలో జరుగనుంది.

నేటి నుండి ఐపీఎల్ సంబరాలు..

ముంబై : దశాబ్ద కాలంగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న ధనాధన్ ఫార్మాట్ ఐపీఎల్ టీ20 టోర్నీ నేడు ఆరంభం కానుంది. ఏటా ఏప్రిల్ లో ప్రారంభమై మేలో ముగిసే ఈ క్రీడా వినోదం కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఐపీఎల్ సమయంలో సినిమా ధియేటర్లు, క్రీడా మైదానాలు, ఇతర వినోద కార్యక్రమాలు వెలవెలబోతాయి. ప్రపంచంలోనే ధనిక క్రీడా సంస్థల్లో ఒక్కటైన బీసీసీఐకి కాసులు కురిపించే క్రికెట్ పండగ నేడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది.

స్వచ్ఛమైన గాలి కూడా లేని పరిస్థితి : పవన్

అమరావతి : దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశమంతా స్వచ్ఛమైన గాలి కూడా లేక ఇబ్బంది పడుతోందని జనసేన అధినేత ట్విట్టర్ వేదికగా  ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఏపీలోని తుండూరు ఆక్వా పార్కును తీసుకోవాలని అన్నారు. కనీసం స్వచ్ఛమైన గాలి, నీరు కూడా మాకు లేకుండా చేస్తున్నారని వారు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఈవిషయాన్ని తుండూరు ప్రాంత యువకులు తనకు తెలిపారని పవన్ పేర్కొన్నారు.

దేశ ప్రతిష్ట గురించి పవన్ కీలక వ్యాఖ్యలు!..

అమరావతి : భారతదేశ ఎకానమీ, వ్యవస్థ లోపాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుండవచ్చు. కానీ రాజకీయ వ్యవస్థలో నెలకొన్న అవినీతి దేశాన్ని దిగజార్చుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పట్ల, వ్యవస్థ పట్ల రాజకీయనేతలకు ఎలాంటి పట్టింపులు లేకపోవడం మన వ్యవస్థను నాశనం చేస్తోందన్నారు. 

జగన్ పై లోకేష్ ఫైర్..

అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. కేసుల మాపీ చేయించుకునేందుకు జగన్ ప్రధాని మోదీ కాళ్ళమీద పడ్డారనీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జనాల్ని మోసం చేసేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారనీ విమర్శించారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడానికి 5 కోట్ల తెలుగు ప్రజలు తమ రోషాన్ని చూపిస్తుంటే, మోదీని నిలదీసే దమ్ము, ధైర్యం లేని జగన్ మాత్రం ప్రజల్ని మోసం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు.

మరో మృతదేహం లభ్యం..

నల్లగొండ : కాలువలో ట్రాక్టర్ బోల్తా ఘటనలో మరో మృతదేహం లభ్యమయ్యింది. పడ్మటితండా వద్ద ఏఎమ్మార్పీ కాలువలో శుక్రవారం ఉదయం ట్రాక్టర్ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో మృతదేహం లభ్యమయ్యింది. ఘటనాస్థం నుండి దాదాపు 100 మీటర్ల దూరంలో బాబు అనే మహిళ మృతదేహంగా గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. కాగా పీఎ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఏఎంఆర్ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది కూలీలలున్న ట్రాక్టర్ బోల్తా పడిన విషయం తెలిసిందే. 

టాలీవుడ్ డ్రగ్ కేసులో చార్జ్ షీట్ నమోదు..

హైదరాబాద్ : టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్‌ కేసులో తొలి చార్జ్‌ షీట్ ను సిట్ దాఖలు చేసింది. టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ దందాపై ఐపీఎస్ అధికారి అకున్‌ సబర్వాల్‌ నేతృత్వంలోని సిట్‌ పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులను విచారించిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పరిశీలన నిమిత్తం పంపిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక రావడంతో వారిపై ఛార్జ్ సీటును సిట్ దాఖలు చేసింది.

భారత్ కు మూడవ స్వర్ణం..

హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ కు మరో స్వర్ణం వచ్చింది. నేటి ఉదయం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 77 కేజీల విభాగంలో సతీష్ కుమార్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోనే మీరాబాయి చాను తొలి స్వర్ణాన్ని అందించగా, మలి స్వర్ణాన్ని మరో వెయిట్ లిఫ్టర్ సంజిత చాను నిన్న భారత్ కు అందించింది. ఇక మూడో స్వర్ణాన్ని పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సతీష్‌ కుమార్ శివలింగం సొంతం చేసుకున్నాడు.

మధ్యాహ్నం 2 గం.లకు అఖిలపక్ష సమావేశం

గుంటూరు : నేడు ఏసీ సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ప్రభుత్వం అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. సమావేశానికి హాజరుకాబోమని ప్రధాన పార్టీలు తెలిపాయి. సమావేశానికి లెఫ్ట్, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. ప్రజా సంఘాలతోనే అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. 

 

మధ్యాహ్నం 2 గం.లకు అఖిలపక్ష సమావేశం

గుంటూరు : నేడు ఏసీ సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ప్రభుత్వం అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. సమావేశానికి హాజరుకాబోమని ప్రధాన పార్టీలు తెలిపాయి. సమావేశానికి లెఫ్ట్, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. ప్రజా సంఘాలతోనే అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. 

 

08:51 - April 7, 2018

గుంటూరు : నేడు ఏసీ సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ప్రభుత్వం అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. సమావేశానికి హాజరుకాబోమని ప్రధాన పార్టీలు తెలిపాయి. సమావేశానికి లెఫ్ట్, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. ప్రజా సంఘాలతోనే అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. 

 

08:43 - April 7, 2018

పార్లమెంట్ సమావేశాలు నిర్వహణ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని...నియంతృత్వ దోరణిలో జరిగాయని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, టీడీపీ నేత శ్రీరాములు పాల్గొని, మాట్లాడారు. సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరిపేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు.. స్పీకర్, చైర్మన్ సభను వాయిదా వేద్దామనే ఆలోచనలోనే ఉన్నారని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. ఈ ధోరణి డెమోక్రసీకి ప్రమాదమని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:36 - April 7, 2018

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామా...పవన్ పాదయాత్ర.. టీడీపీ సైకిల్ యాత్ర, సన్యాసానికి పోటీ వడ్తున్న కేటీఆర్, ఉత్తం....అధికారం మాదంటే మాదని అహంకారాలు, బాబు జగ్జీవన్ రాం సభల నేతల పోరాటం..మహనీయుని పర్వుదీస్తున్న నాయకులు, కాంగ్రెస్ సభకువోవొద్దని టీఆరేసోళ్ల బెదిరింపులు...పాలకుర్తి కాడ అడ్డంగ బుక్కైన కారు లీడర్, జగిత్యాల జిల్లాల మరోక అన్నదాత ఆత్మహత్య...భరోసా ఇయ్యలేకపోతున్న బంగారు ప్రభుత్వం, నల్లగొండ జిల్లాల కాల్వల వడ్డ ట్రాక్టర్...తొమ్మిది మంది సావుకు కారణమైన ఫోను..ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

08:27 - April 7, 2018

ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ లో వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వైసీపీ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం క్షీణిస్తోందని నిరాహార దీక్షను విరమించాలని వైద్యులు మేకపాటికి సూంచించారు. 

 

మేకపాటి రాజమోషన్ రెడ్డికి అస్వస్థత

ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ లో వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వైసీపీ దీక్ష రెండో రోజుకు చేరుకుకుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. మేకపాటికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

 

08:21 - April 7, 2018
08:20 - April 7, 2018

ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 11వ సీజన్ తొలి మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. వాంఖడే స్టేడియంలో మూడు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌... రెండు సార్లు చాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ధనా ధన్‌ ధోనీ సారధ్యంలోని చెన్న సూపర్‌కింగ్స్ రీ ఎంట్రీ మ్యాచ్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాణించాలని పట్టుదలతో ఉండగా....రోహిత్‌ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ 11వ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే  అసలు సిసలు సమరానికి వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమైంది. ధనా ధన్‌ ధోనీ సారధ్యంలోని చెన్న సూపర్‌కింగ్స్ జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు సవాల్‌ విసురుతోంది. 

రెండేళ్ల తర్వాత మూడు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌... రెండు సార్లు చాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని వేచి చూస్తున్నారు.

రెండేళ్ల నిషేదం తర్వాత తిరిగి ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతోన్న చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు ఏ స్థాయిలో రాణిస్తుందో  అని  అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టులో సురేష్‌ రైనా, హర్భజన్ సింగ్‌, అంబటి రాయుడు,మురళీ విజయ్‌ , కేదార్ జాదవ్‌, శార్డూల్‌ ఠాకూర్‌, డ్వేన్‌ బ్రావో,  శామ్‌ బిల్లింగ్స్‌, ఫాఫ్ డు ప్లెసి, షేన్ వాట్సన్‌, రవీంద్రజడేజా,ఇమ్రాన్ తాహిర్‌, కర్న్‌ శర్మ, లుంగీ ఎన్గిడీ వంటి మ్యాచ్‌ విన్నర్లున్నారు.

మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌ జట్టు ...డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతోంది.రోహిత్‌ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టులో హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, జస్ప్రీత్‌ బుమ్రా, కీరన్ పోలార్డ్‌, డుమినీ, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌, మిషెల్‌ మెక్‌లెనగన్‌, ఎవిన్‌ లెవిస్‌, ఇషాన్ కిషన్‌, బెన్‌ కట్టింగ్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, సూర్య కుమార్‌ యాదవ్‌ వంటి టాప్‌ క్లాస్‌  క్రికెటర్లున్నారు.

ముంబై ఇండియన్స్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.ఇక  ఇరు జట్ల మధ్య ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో ముంబైదే కాస్త పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 22 మ్యాచ్‌ల్లో పోటీ పడగా....ముంబై 12 మ్యాచ్‌ల్లో నెగ్గింది. చెన్నై 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

అసలే ధూమ్‌ ధామ్ ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌...అందులోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య సమరం, ఇంతకు మించి క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కావాల్సిందేముంటుంది. మరి ఐపీఎల్‌ 11వ సీజన్‌లో తొలి విజయం సాధించే జట్టేదో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్‌ చేయాల్సిందే. 

08:16 - April 7, 2018

హైదరాబాద్‌ : నగరంలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్‌శాఖ అధికారులు ముందస్తుగా సరఫరా నిలిపివేయడంతో చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రోడ్లపై వర్షపునీరు భారీగా నిలిచింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. చిలకలగూడలో భారీ వర్షం నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. క్యూమిలోనింబస్‌ మేఘాల ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం తేలికపాటి నుంచి ఓ మోస్తారు కురుస్తుందని తెలిపింది. 

 

08:09 - April 7, 2018

గుంటూరు : ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. హోదాపై చంద్రబాబు డ్రామాలు మానుకొని.. ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. ఐదుకోట్ల ప్రజల కోసం తమ ఎంపీలు రాజీనామా చేశారని.. తాము చెప్పింది చేశామన్నారు.  ఇక ప్రజలతో కలిసి నడవాల్సింది టీడీపీయేనని ... దాన్ని చంద్రబాబు తేల్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 
ప్రత్యేకహోదా కోసం మా ఎంపీలు పదవులు త్యాగం చేశారు : జగన్‌
ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపైనా.. ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో ప్రెస్‌ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రత్యకహోదా కోసం వైసీపీ ఎంపీలు పదవులు త్యాగం చేశారని... దేశంలో ఇలా ఎక్కడా జరిగిఉండదన్నారు. నాలుగేళ్లుగా వైసీపీ ప్రత్యేకహోదా కోసం అన్నిరకాల పోరాటాలు చేసిందని.. చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామాలు చేయించామని స్పష్టం చేశారు. ఈ అఖరి అస్త్రంలో టీడీపీ ఎంపీలు కూడా భాగస్వామ్యులు అయ్యుంటే ప్రత్యేకహోదా వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. వైసీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి.. అటునుంచి ఏపీ భవన్‌కు వెళ్లి నిరాహారదీక్షకు కూర్చుంటే దేశం మొత్తం చర్చనీయాంశమయ్యేదన్నారు. కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడి ఉండేదన్నారు.
మోదీపై మొట్టమొదటి అవిశ్వాసం పెట్టింది మేమే : జగన్‌
నరేంద్రమోదీ ప్రభుత్వంపై మొట్టమొదటిసారి అవిశ్వాస తీర్మానం పెట్టింది వైసీపీయేనని జగన్‌ అన్నారు. వైసీపీ అవిశ్వాస తీర్మానంపై ఇతర పార్టీల మద్దతు కూడగతుండడం గమనించిన చంద్రబాబు టీడీపీ కూడా అవిశ్వాసం పెడుతుందని యూటర్న్‌ తీసుకున్నారన్నాని విమర్శించారు. అవిశ్వాసం చర్చకు వచ్చేలా చేయడంలో చంద్రబాబులో చిత్తశుద్ది కరువైందన్నారు. చంద్రబాబు రెండోసారి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం పలికారని... దానికి ఎందుకు హాజరుకావాలని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే కుట్రలో తాము భాగస్వామి కావాలా అని ధ్వజమెత్తారు. హోదా కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు... ముఖ్యనేతలెవరినీ కలువలేదన్నారు. ఆయనను ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందన్నారు.  చంద్రబాబు బావి చూసుకుని దూకితే బెటర్‌ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
చంద్రబాబుకు ఏడు ప్రశ్నలు సంధించిన జగన్‌
ప్రత్యేకహోదా ఉద్యమాన్ని అణచివేసిన చరిత్ర సీఎం చంద్రబాబుదేనని  జగన్‌ విమర్శించారు. ఈ సందర్భంగా సీఎంకు ఏడు సూటి ప్రశ్నలు సంధించారు జగన్. 2014 డిసెంబర్‌ వరకు అమలులో ఉన్న ప్రణాళిక సంఘానికి చంద్రబాబు లేఖ ఎందుకురాయలేదో చెప్పాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని కేంద్రాన్ని , అరుణ్‌జైట్లీని చంద్రబాబు పొగడలేదా అని ప్రశ్నించారు.  ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్లుగా చంద్రబాబు ఏమిచేశారో చెప్పాలని, వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే చంద్రబాబు పెట్టేవారా అని నిలదీశారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే.. టీడీపీ ఎంపీలతో నిరసనలు చేయడం మోసం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు.
నాలుగేళ్లలో పవన్‌ ఏం చేశారు : జగన్‌
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పైనా జగన్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి నాలుగేళ్లుగా అన్యాయం జరుగుతుంటే పవన్‌ కల్యాణ్‌ ఏం చేశారని ప్రశ్నించారు.  పవన్‌ కల్యాణ్‌ హోదా కోసం ఏ కార్యక్రమాలు చేపట్టారని ప్రశ్నించారు.  అప్పుడప్పులు ట్వీట్‌ చేస్తారని.. అదీ లేకపోతే ప్రెస్‌మీట్‌లు పెట్టి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడతారని విమర్శించారు. సినిమా తక్కువ, ఇంటర్వెల్‌ ఎక్కువ అన్నచందంగా పవన్‌ తీరు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రత్యేకహోదాపై మొదటి నుంచి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.  తాము హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నామని.. ప్రజలకు ముందే చెప్పినట్టుగా తమ ఎంపీలతో రాజీనామాలు చేయించామన్నారు. 

 

130 వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర 130 వ రోజుకు చేరుకుంది. నేడు శేకూర్ గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 

130 వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర 130 వ రోజుకు చేరుకుంది. నేడు శేకూర్ గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 

07:45 - April 7, 2018

గుంటూరు : ప్రతిపక్షం లేకున్న ఏపీ అసెంబ్లీలో రాజకీయ వేడి తగ్గలేదు. 19 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని టీడీపీ...  కేంద్రం ఏపీకి చాలా ఇచ్చిందని బీజేపీ సభలో మాటల యుద్ధానికి దిగాయి. ఢిల్లీకి రాష్ట్ర అవసరాలు తెలిపేలా కీలక సందేశాలు ఈ సమావేశాల్లో పంపారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు మునుపెన్నడు జరగని రీతిలో సుదీర్ఘంగా జరిగాయి. సభ సాక్షిగా కేంద్ర వైఖరిని టీడీపీ ఎండగట్టింది. విభజన హామీలు, ప్రత్యేకహోదాను అధికారపక్షం లేవనెత్తింది.  అవకాశం దొరికిన ప్రతిసారి సీఎం చంద్రబాబు ఢిల్లీపై పోరుకు సిద్ధమన్న రేంజ్‌లో చేసిన ప్రసంగాలు రాజకీయ వేడిని రగిల్చాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖకు సీఎం సభ ద్వారానే ధీటైన సమధానం ఇచ్చారు. ప్రతిరోజు విభజన సమస్యలపై కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు అధికార పక్షం ప్రయత్నించింది.
అసెంబ్లీలో ప్రతిపక్షంగా మారిపోయిన బీజేపీ
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరుగడం... రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతుండడంతో టీడీపీ ఢిల్లీతో ఢీకొట్టేందుకు డిసైడ్‌ అయ్యింది. అందులో భాగంగానే ఇద్దరు కేంద్రమంత్రులతో రాజీనామా చేయించింది. ఆ తర్వాత ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. టీడీపీ కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేస్తే.. రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ మంత్రులు సైతం మంత్రిపదవులకు రాజీనామా చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో .. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్షంగా మారిపోయింది. 
ప్రతిపక్షపాత్రనూ పోషించిన టీడీపీ ఎమ్మెల్యేలు
ప్రధాన ప్రతిపక్షం వైసీపీ  సభలో లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష  పాత్ర పోషించారు.  శ్రీకాకుళం జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్ట్‌ల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ ఎమ్మెల్యే శివాజీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంతాల్లోని ప్రభుత్వ పథకాల అమలులో చోటు చేసుకున్న వైఫల్యాలను సభా వేదికగా తప్పుబట్టారు. 
133 గంటల 58 నిమిషాలపాటు సాగిన సభ
మొత్తంగా 133 గంటల 58 నిమిషాల పాటు  అసెంబ్లీ జరిగింది. ప్రతిపక్షం లేకున్న ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు రాజీ పడకుండా వ్యవహరించామని ప్రభుత్వం భావిస్తుంది. ఏదో అడ్డంకులు కల్పించి సభను స్తంభింప చేసే ప్రతిపక్షానికి ఈ సమావేశాలు చెంపపెట్టు లాంటిదని అధికార పక్షం అంటోంది. అయితే  బడ్జెట్‌తో పాటు కాగ్‌ నివేదికలు, పలు కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టినా.... హోదా రాజకీయ వాతావరణంతో వీటికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. 

 

07:41 - April 7, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన పాలనలో అనుసరించిన విధానాలను కాగ్‌ తీవ్రంగా తప్పుపట్టింది.  ఆర్ధిక నియమాలు, నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం వ్యవహరించిందంటూ ఆక్షేపించింది.  ఒకవైపు రుణాలపై అధిక వడ్డీ చెల్లిస్తూ... మరోవైపు భారీ మొత్తాలను పీడీఎఫ్‌ ఖాతాల్లో ఉంచడాన్ని ప్రభుత్వ వైఫల్యంగా ఎత్తిచూపింది.  2017 మార్చి 31 నాటికి 76వేల కోట్ల రుణ బకాయిలు తీర్చాల్సి ఉందని.. ఈ రుణభారం ప్రభుత్వ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. 
చంద్రబాబు పాలన అస్తవ్యస్తంగా ఉందన్న కాగ్‌
ఆంధప్రదేశ్‌ ప్రభుత్వానికి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అక్షింతలు వేసింది. చంద్రబాబు పరిపాలన ఎంత దారుణంగా ఉందో తన నివేదికతో బట్టబయలు చేసింది. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కాగ్‌ తన నివేదికలో తప్పుపట్టింది. 2014-16 మధ్యకాలంలో బడ్జెట్‌ కేటాయింపులకు మించి చేసిన 53,673 కోట్ల రూపాయల అధిక వ్యయాన్ని ఇప్పటి వరకు క్రమబద్దీకరించలేదని తేలిపోయింది. గ్రాంట్‌లకు అధికంగా ఖర్చు చేయడం నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుందని కాగ్‌ స్పష్టం చేసింది.
చాలా పద్దుల యూసీలు అసంపూర్తిగా ఉన్నాయన్న కాగ్‌
చాలా పద్దుల యూసీలు అసంపూర్తిగా ఉన్నాయని కాగ్‌ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ తోచవన్గ్‌ అన్నారు. నిర్ధిష్ట కాలపరిమితిలో చాలా పద్దులకు చంద్రబాబు ప్రభుత్వం యూసీలు చెల్లించలేదని తెలిపారు. 2017 మార్చి 31 నాటికి 76వేల కోట్ల రూపాయల రుణ బకాయిలు తీర్చాల్సి ఉంది. ఈ బకాయిలు బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపించే చాన్స్‌ ఉంది. 2017 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఆ తేదీ నాటికి ఒక్క ప్రాజెక్ట్‌ కూడా పూర్తికాలేదు. ప్రాజెక్టులకు సంబంధించి తొలి అంచనాల విలువను 28,036 కోట్ల రూపాయలు సవరించారు.  ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఖర్చులు పెరిగాయని కాగ్‌ తమ నివేదికలో వెల్లడించింది.
కేంద్ర సాయాన్ని వినియోగించుకోలేకపోయిన ఏపీ
డీపీఆర్‌ల తయారీ, ప్రాథమిక పనులు ఆరంభించకపోవడంతో 455 కోట్ల రూపాయల కేంద్ర సాయాన్ని రాష్ట్రం వినియోగించుకోలేకపోయింది.  ప్రభుత్వ హడావుడి ఖర్చులు 27 నుంచి 50శాతానికి పెరిగిపోయాయి. బోధనా వ్యవస్థపై సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ దారుణంగా ఉందని కాగ్ అభిప్రాయపడింది. పనులు పూర్తయినప్పటికీ 7పథకాలు ప్రారంభానికి నోచుకోకపోగా... మరో ఏడు పథకాల పనులు మధ్యలో ఆగిపోయాయని తెలిపింది. దీనివల్లో 491 కోట్లు వృథా అయినట్టు కాగ్‌ తన నివేదికలో వెల్లడించింది. మొత్తానికి కాగ్‌... ఏపీ ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించింది.

 

07:38 - April 7, 2018

గుంటూరు : ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.  ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఏం చేయాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. సెక్రటేరియట్‌లో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు.  అయితే ఈ సమావేశానికి హాజరు కాకూడదని ప్రధాన రాజకీయ పార్టీలు నిర్ణయించాయి.
అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపిన చంద్రబాబు 
ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వానాలు ఇప్పటికే అన్ని పార్టీలకు పంపించారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రధాన రాజకీయ పార్టీలు హాజరుకాకూడదని నిర్ణయించారు. లెఫ్ట్‌ పార్టీలతోపాటు వైసీపీ, కాంగ్రెస్‌, జనసేన, బీజేపీలు అఖిలపక్ష సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించాయి. దీంతో అఖిలపక్ష సమావేశంకాస్తా..  అఖిల సంఘాల సమావేశంగా మారే పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబుపై మండిపడ్డ పార్టీలు
గత నెల 27న కూడా చంద్రబాబు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీపైనా.. చంద్రబాబు తీరుపైనా విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రత్యేకహోదా కేంద్రం ఇవ్వకపోవడానికి చంద్రబాబు తీరే కారణమని వామపక్షాలు ఆరోపించాయి.  ఇంతకాలం బీజేపీ చెప్పినట్టు తలూపి.. ఇప్పుడు పోరాటం చేద్దామంటే ఎలా అని నిలదీశాయి. ఇక మీదట చంద్రబాబును నమ్మబోమని అఖిలపక్షం తర్వాత ప్రధాన పార్టీలు తేల్చి చెప్పాయి.
అఖిలపక్ష సమావేశ నిర్ణయాన్ని తప్పుపడుతున్న విపక్షాలు
చంద్రబాబు వ్యూహాత్మకంగా తీసుకున్న అఖిలపక్ష సమావేశ నిర్ణయాన్ని ఇతర పార్టీలన్నీ తప్పుపడుతున్నాయి. సమావేశానికి హాజరుకాబోమని ప్రకటించాయి. అఖిలపక్ష సమావేశానికి హాజరైతే.. చంద్రబాబు చేసిన మోసంలో తామూ భాగస్వాములం కాబోమని వైసీపీ లాంటి పార్టీలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి అఖిలపక్ష సమావేశంలో... ప్రజాసంఘాలు తప్ప పార్టీలు పాల్గొనే పరిస్థితి లేదు. 

రామగుండంలో ప్రమాదం

పెద్దపల్లి : రామగుండంలో ప్రమాదం జరిగింది. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో వాటర్ ప్లాంట్ కూలి ఏడుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. రెస్క్ టీమ్ సహాయక చర్యలు ప్రారంభించింది. 

కామన్ వెల్త్..నేడు భారత్ తో తలపడనున్న పాకిస్థాన్

గోల్డ్ కోస్ట్ : కామన్ వెల్త్ లో పురుషుల హాకీలో నేడు భారత్ తో పాకిస్థాన్ తలపడనుంది. ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

 

సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్స్ పై నేడు తీర్పు

రాజస్థాన్ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్స్ పై నేడు తీర్పు వెలువడనుంది. కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. జోథ్ పూర్ కు జైలుకు తరలింంచారు.

 

Don't Miss