Activities calendar

08 April 2018

21:27 - April 8, 2018

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌కు సీపీఎం మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఈ నెల 18 నుంచి 22 వరకు సీపీఎం అఖిల భారత మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభల్లో దేశంలో పలు అంశాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అభివృద్ధి నమూనాలపై చర్చిస్తామన్నారు. మతోన్మాద, కార్పొరేట్ అనుకూల వైఖరితో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా.. వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావాలన్నారు. ఇవే అంశాలపై ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే సీపీఎం అఖిల భారత మహా సభల్లో చర్చిస్తామని చెప్పారు. ఈ మహా సభల ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు సహకరించాలని హైదరాబాద్‌లో జరిగిన మీడియా ఎడిటర్స్‌ మీట్‌లో కోరారు.

ప్రజా వ్యతిరేక విధానాల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తుందని.. బీవీ రాఘవులు అన్నారు. కుల, మత వైషమ్యాలతో సమగ్రత, అభివృద్దికి ఆటంకం కలిగించేలా మోదీ చర్యలు ఉన్నాయని విమర్శించారు.. అమెరికా జోక్యంతో మేకిన్ ఇండియాకు అర్ధమే లేకుండా పోయిందన్నారు.

రాష్ర్టంలో అనేక అంశాలపై పోరు సలుపుతున్న తరుణంలో సీపీఎం మహాసభలు జరగడం... ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అమలు కావాలంటే రాజకీయ జోక్యం తప్పనిసరన్నారు. అందుకోసమే ఆ కోణంలో నుంచే బీఎల్ఎఫ్ పుట్టుకొచ్చిందని తెలిపారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం సామాజిక సహాయం అవుతుందే కానీ సమాజిక న్యాయం కాదని తమ్మినేని అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభతో పాటు.. 25 వేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహిస్తామని తమ్మినేని అన్నారు. కోదండరాం, పవన్‌ కళ్యాణ్‌లతో కలిసి పని చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. 

సోమవారం మోస్తారు వర్షాలు...

హైదరాబాద్ : సోమవారం కూడా తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.

టిడిపి ఎంపీల మౌన దీక్షలు...

ఢిల్లీ : టిడిపి ఎంపీలు సోమవారం కూడా ఢిల్లీ వేదికగా నిరసనలు తెలియచేయనున్నారు. ఉదయం 10గంటలకు గాంధీ సమాధి వద్ద ఎంపీలు మౌనదీక్ష చేయనున్నారు. తెల్లని వస్త్రాలు ధరించి ఉదయం మౌన దీక్ష చేపట్టనున్నారు.

ఏపీ కాంగ్రెస్ లో దీక్షలు...

విజయవాడ : రేపు ఉదయం 10.30గంటలకు గాంధీ భవన్ లో ఉత్తమ్..కుంతియా ఆధ్వర్యంలో దీక్షలు జరుగనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దీక్షలు చేపట్టనున్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ దాడులను ఖండిస్తూ ఈ దీక్షలు చేపట్టనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టనున్నారు.

తమ్ముడ్ని చంపేసిన అన్న...

కర్నూలు : జిల్లా కోవెలకుంట్ల మండలం జొలదరాసిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో అన్న శ్రావణ్‌.. తన తమ్ముడ్ని రోకలిబండంతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. విషయం బయటకు పొక్కకుండా శవాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టాడు.

21:22 - April 8, 2018

మహబూబాబాద్ : గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడంలో విఫలమైన టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి తరిమికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. టీపీసీసీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మహబూబాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్‌ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్లు పెంచడం సహా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. 

21:20 - April 8, 2018

కడప : ఏపీకి ప్రత్యేక హోదా విస్మరించిన బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు అన్నారు. కడపలో సీపీఐ 26వ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ నెల 15న సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాయలసీమ వ్యాప్తంగా సభలు నిర్వహించి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా హోదాను సాధించుకుంటామని, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

మహబూబాబాద్ లో టి.కాంగ్రెస్ బస్సు యాత్ర...

మహబూబాబాద్ : గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడంలో విఫలమైన టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి తరిమికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. టీపీసీసీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మహబూబాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్‌ పాల్గొన్నారు. 

21:14 - April 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. పలు చోట్ల వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. తెలంగాణలో అకాల వర్షానికి పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకులో పంట నష్టపోవడంతో రైతు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదిరెడ్డి పొలం కౌలుకు తీసుకొని వరి పంట వేశాడు. రాత్రి కురిసిన వర్షానికి పది ఎకరాల పంట పనికి రాకుండా పోవడంతో తీవ్రమనస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడూరు పరిసర మండలాల్లో తెల్లవారుజాము నుండి కురిసిన భారీవర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవడంతో.. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి.. అప్పు చేసి పండించిన పంట నీరుగారిపోయిందని విలపించారు. చాలీచాలని టార్పాలిన్లు అందించారని.. మార్కెట్ సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో గాలి వానకు పెద్ద మొత్తంలో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వేడుకున్నారు. కనీసం ఒక్కొక్క రైతుకు 20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు ఆందోల్‌, పుల్కల్‌, వట్పల్లి, మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌, అల్లాదుర్గం, మండలాల్లోని రైతులు భారీగా నష్టపోయారు. రాలిన మామిడి కాయలను చూసి రైతన్నలు కంట తడిపెట్టారు. ప్రభుత్వం ద్వారా తమకు ఆర్థిక సహాయం కల్పించాలని రైతులు వేడుకున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో గాలి వానకు మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 300 ఎకారాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న తోటలను కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్థానిక అధికారులు పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బొల్లారం ఏరియాలో 7.3సెంటీమీటర్లు, కూకట్‌పల్లి, బాలానగర్‌లో 6సెంమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు సోమవారం కూడా తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.

21:10 - April 8, 2018

హైదరాబాద్ : వందేళ్ల వట వృక్షం కింద ఓన‌మాలు దిద్దుకున్న విద్యార్థులంతా ఒక్కట‌య్యారు.. విద్యార్ధి ద‌శ‌లోని తమ మధుర స్మృతులను తలచుకుంటూ.. ఒకరినొకరు అత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ శ‌త జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా... ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పూర్వ విద్యార్ధుల స‌మ్మేళనం క‌న్నుల పండ‌ుగగా జ‌రిగింది.. పూర్వ విద్యార్ధుల స‌మ్మేళనంతో ఓయూ సెంట్రల్ లైబ్రరీ సందడిగా మారింది..

ఓయూ వందేళ్ళు పూర్తి చేస్తున్న సంద‌ర్బంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాలతో సాగింది. ఓయూ విద్యార్ధి ఉద్యమాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కీల‌క భూమిక పోషించిన పూర్వ విద్యార్థులంతా ఒక్క చోట చేరారు. ఓయూ సెంట్రల్ లైబ్రరీలో వీరి భేటీతో పండుగ వాతావరణం నెలకొంది. ఓయూలో ఓనమాలు నేర్చుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు నేడు దేశవ్యాప్తంగా ఉన్నత పదవుల్లో స్థిరపడ్డారు. వారంతా ఒకచోట చేరి ఆలింగనం చేసుకుంటూ.. సంతోషంతో ఉప్పొంగిపోయారు. తాము చదువుకునే రోజుల్లో ఒకే ప్లేట్‌లో తింటూ... ఒకరితో ఒకరు షేర్‌ చేసుకున్న మరపు రాని మధుర స్మృతులను తలచుకున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. తానిక్కడికి అధికార పార్టీ ఎమ్మెల్సీగానో.. మండలి విప్‌గానో రాలేదన్నారు. కేవలం ఒక ఎస్ఎఫ్ఐ విద్యార్ధిగా మాత్రమే హాజ‌ర‌య్యానని చెప్పారు. తనను రాజ‌కీయాల వైపు న‌డిపించింది ఎస్‌ఎఫ్ఐనే అని చెప్పారు. విద్యార్ధుల స‌మ‌స్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప‌రిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పుడు కలిసిన లాల్ నీల్ జెండా... ఇరవై ఐదేళ్ళ క్రితకమే కలిసి ఉంటే చాలా బాగుండేంద‌న్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఓ.యూలో చదువుకున్నా... చదువుకోకపోయినా... ప్రతి ఒక్కరికీ ఎస్ఎఫ్ఐతో అనుబంధం ఉంటుంద‌న్నారు న‌వ‌తెలంగాణ సంపాదకులు వీర‌య్య. గత నలభై ఏళ్ళలో ఓయూలో చదివిన వారిలో చాలామంది క‌మ్యూనిస్టు సిద్ధాంతాల‌ వైపు మొగ్గు చూపిన వారే ఉన్నార‌న్నారు. వారంతా వృత్తిరీత్యా ప్రపంచంలో ఏ మూల‌న ఉన్నా.. మార్క్సిస్టు సిద్ధాంతాల‌ను మరిచిపోరన్నారు. మ‌తోన్మాద శ‌క్తుల చేతుల్లో నుంచి దేశాన్ని ర‌క్షించుకునేందుకు మ‌రోసారి పూర్వ విద్యార్ధులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు..-

ఎస్ఎఫ్ఐలో తాను త‌క్కువ కాలమే ప‌ని చేసినా.. ఎస్‌ఎఫ్‌ఐని బ‌లోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా... విస్తృతంగా తిరిగానన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ నాగేశ్వర్. స‌మాజంలో ఉన్నత విలువులు గ‌ల వ్యక్తిని తీర్చిదిద్దడంలో ఎస్ఎఫ్ఐ కీలక పాత్ర పోషింస్తుంద‌ని చెప్పారు. భవిష్యత్తులో సంఘ‌టితంగా పోరాటాలు చేసేందుకు ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్ధులు క‌లిసిరావాల‌ని పిలునిచ్చారు.

ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ ఓయూ పూర్వ విద్యార్ధుల స‌మ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. విద్యార్థి ఉద్యమాల్లో నేటి యువత కీలక పాత్ర పోషించడం లేదన్నారు. ఎక్కడో కొందరు మాత్రమే... ఎస్ఎఫ్‌ఐ భావ జాలాన్ని అందిపుచ్చుకుని విద్యార్ధి ఉద్యమాల‌ను నిర్మిస్తున్నార‌ని చెప్పారు.. టెక్నాలజీ మోజులో ప‌డి సామాజిక స్పృహను కోల్పోతున్నార‌న్నారు., బ‌ల‌మైన ఉద్యమాలు నిర్మించడం కేవలం ఎస్ఎఫ్ఐతోనే సాధ్యవుతుంద‌న్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ తిరిగిరాని.. మరపురాని అపురూపమైన ఘట్టం విద్యార్థి దశ.. అలాంటి పూర్వ విద్యార్ధుల స‌మ్మేళ‌నానికి క్షణ కాలంకూడా తీరికలేని స్పీడ్‌ యుగంలో... దూరాభారాలను లెక్కచేయకుండా హాజరయ్యారు. వారంతా తమ అనుభ‌వాల‌ను పంచుకుని ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోయారు.

21:07 - April 8, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని తుగ్లక్‌ రోడ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద బస్సులోనే దాదాపు మూడు గంటలపాటు నిరసన తెలిపిన ఎంపీలను మధ్యాహ్నం రెండున్నర గంటలకు పంపించివేశారు. టీడీపీ ఎంపీల ఉద్యమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంఘీభావం ప్రకటించారు. ఏపీ ఎంపీల ఆందోళన న్యాయమైనదే అని ఆయన అన్నారు.

ప్రధాని నివాసం ముట్టడికి బయలుదేరడానికి ముందు టీడీపీ ఎంపీలు.. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌందరి నివాసంలో సమావేశమై, కార్యాచరణపై చర్చించారు. ప్లకార్డులు పట్టుకుని సుజనాచౌదరి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి.. మోదీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాని నివాసం వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటుకొని క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎంపీలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ చర్యకు నిరసనగా ప్రధాని నివాసం వద్ద బైఠాయించిన టీడీపీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా బస్సులోకి ఎక్కించారు. అనంతరం వీరిని తుగ్లక్‌ రోడ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తుగ్లక్‌ రోడ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించిన తర్వాత టీడీపీ ఎంపీలు బస్సులోనే నిరసన కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించడాన్ని ఎంపీలు తప్పుపట్టారు. హోదా ఇచ్చే వరకు పోరాటం కొనాగుతుందని స్పష్టం చేశారు. ఏపీ న్యాయమైన హక్కులను కాలరాస్తున్న బీజేపీ భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ ఎంపీలు హెచ్చరించారు. తుగ్లక్‌ రోడ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించిన టీడీపీ ఎంపీలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కలిసి.. సంఘీభావం ప్రకటించారు. ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఆందోళనకు ఆప్‌ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. తుగ్లక్‌ రోడ్ పోలీసు స్టేషన్‌ వద్ద బస్సులోనే మూడు గంటలకుపైగా ఆందోళన చేసిన టీడీపీ ఎంపీలను మధ్యాహ్నం రెండున్నర గంటలకు విడిచిపెట్టారు.

21:03 - April 8, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం ఢిలీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ఎంపీల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇప్పటికే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ ఆస్పత్రి పాలయ్యారు. మిగిలిన ముగ్గురి ఆరోగ్యం పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీక్ష చేస్తున్న ఎంపీలతోపాటు, ఆస్పత్రిలో చేరిన ఇద్దర్నీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పరామర్శించారు. వైసీపీ ఎంపీల దీక్షకు సీపీఐ ఎంపీ రాజా మద్దతు ప్రకటించారు.

ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, రాజంపేట ఎంపీ విథున్‌రెడ్డి దీక్షలు కొనసాగిస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మేకపాటిని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పరామర్శించారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలను విజయమ్మ పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా దీక్షలు కొనసాగిస్తున్న ఎంపీలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.

దీక్ష చేస్తున్న తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరతో బాధపడుతూ డీ హైడ్రేషన్‌కు గురికావడంతో ..రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకంగా ఉందని, దీక్ష విమించాలని వైద్యులు సూచించినా.. వరప్రసాద్‌ వినిపించుకోలేదు. దీంతో వైద్యుల సమాచారంతో దీక్షా శిబిరానికి చేరుకున్న పోలీసులు.. వరప్రసాద్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం కూడా క్షీణిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో నీరసించిపోతున్నారు. అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఆరోగ్యంలో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. దీక్షా శిబిరం వద్ద ఉన్న వైద్యులు వీరికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, షుగర్‌ లెవెల్స్‌ను పరిశీలిస్తున్నారు. వైసీపీ ఎంపీల దీక్షకు పలు పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఢిల్లీలోని తెలుగు సంఘాలు ఏపీ భవన్‌కు తరలివస్తూ, దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. సీపీఐ ఎంపీ రాజా... దీక్షా శిబిరానికి వచ్చి, వైసీపీ ఎంపీను పరామర్శించారు. దీక్షలో కూర్చుని ఎంపీలతో కలిసి నినాదాలు చేశారు. దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీల ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని రాజా డిమాండ్‌ చేశారు. ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు దీక్షా శిబిరం వద్దే ఉండి ఎంపీల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. 

20:45 - April 8, 2018

సురేష్ రెడ్డి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. 2004లో 12వ శాసనసభకు స్పీకర్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ? టి.కాంగ్రెస్ ఎలాంటి వ్యూహం అనుసరించబోతోంది ? తదితర విషయాలు తెలుసుకోనేందుకు మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. స్పీకర్ అధికారాలు దుర్వినియోగం అవుతున్నాయా ? కోమటిరెడ్డి, సంపత్ లు చేసింది తప్పు కాదా ? ఫిరాయింపులను ఏమీ చేయలేమా ? కాంగ్రెస్ తో పదవికి లాబీయింగే అర్హతా ? ఇలాంటి ఎన్నో విషయాలపై ఎలాంటి విషయాలు..వెల్లడించారు ? తదితర వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఉచిత పాఠ్యపుస్తకాలు అందచేయాలన్న మంత్రి గంటా...

విజయవాడ : జూన్ 12 కల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందచేయాలని మంత్రి గంటా ఆదేశాలు జారీ చేశారు. ఉచిత పుస్తకాల ముద్రణ ఎప్పుడో అన్న పత్రిక కథనాలపై మంత్రి గంటా స్పందించారు. ఎట్టి పరిస్థుతుల్లో స్కూళ్లు తెరిచే నాటికి ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు, విద్యాసంస్థలు తెరిచేలోగా ప్రైవేటు పాఠశాలలకు మార్కెట్ లోకి అందుబాటులోకి పుస్తకాలు తేనున్నట్లు తెలిపారు. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరితగతిన పాఠ్యపుస్తకాలు ముద్రణ ప్రక్రియను చేపట్టి పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

20:29 - April 8, 2018

'సుకుమార్' దర్శకత్వంలో 'రామ్ చరణ్' నటించిన సినిమా 'రంగస్థలం'. ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇందులో నటించిన చరణ్ తో పాటు ప్రతొక్కరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాంటి వారిలో నటుడు 'శత్రు' చేసిన ఫుల్ లెంగ్త్ రోల్ కూడా ఒకటి. ఈ సందర్భంగా టెన్ టివి 'శత్రు'తో ముచ్చటించింది. ఈ సినిమా సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు..ఇతరత్రా వాటిని తెలియచేశారు. సినిమా మొదట్లో హీరోతో గొడవపెట్టుకునే పాత్ర అతనిది. కానీ ఎన్నికల్లో హీరోకి..అతని అన్నకు సపోర్టు చేసే శత్రు నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. గతంలో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న 'శత్రు' 'బాహుబలి-2’, 'లెజెండ్’, 'ఆగడు’ వంటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన తమిళ హీరో 'కార్తీ' చేయనున్న ఓ సినిమాలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇంకా పూర్తిగా విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:10 - April 8, 2018

ఇంకా ఎన్నికలకు సంవత్సరం మాత్రమే ఉంది..ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో అన్ని పార్టీలకు భిన్నంగా కామ్రేడ్లు ముందుకొస్తున్నారు..తెలంగాణకు ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను కామ్రేడ్లు చూపిస్తున్నారు..సామాజిక న్యాయం - సమగ్ర అభివృద్ధి నినాదంతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్...బహుజన ఎజెండాతో ఎర్రజెండా ముందుకొస్తున్నాయి..హైదరాబాద్ లో ఈనెల 18 నుండి 22 వరకు సీపీఎం జాతీయ మహాసభలు జరుగుతున్నాయి..ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ కన్వీనర్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రంతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలు వెల్లడించారు. అలాగే వివిధ కాలర్స్ తో ఆయన మాట్లాడారు.

భ్రష్టు పట్టిన రాజకీయాలు 
రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని..తుచ్చమైన రాజకీయాలు నడుస్తున్నాయని తెలిపారు. డబ్బు ప్రభావం..కండబలం తగ్గించకుండా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగడం అసాధ్యమన్నారు. మోడీ నాయకత్వంలోని పాలనలో భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు..ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని స్వయంగా ఆర్థిక వేత్తలు..బీజేపీ నేతలే పేర్కొంటున్నారని తెలిపారు. సాధారణమైన సామాన్యుడికి భద్రత లేదని తెలిపారు. మతం..కులం పేరిట..ఆహార నియామాల పేరిట దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో మంది మేధావులను చంపేశారని..ఎవరు చంపారనేది ఇంతవరకు తెలియలేదన్నారు. ఈ తరుణంలో జాతీయ మహాసభలు జరుగుతున్నాయని ఈ సభలకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. మతోన్మాదానికి..ఆర్థిక విధానానికి లింక్ ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. గోవధ నిషేధం వెనుక ఆర్థిక కోణంగా దాగి ఉందని, ఆర్థిక ప్రయోజనం కోసం మతాన్ని ముందుకు తీసుకవస్తున్నారని తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్...
ఫెడరల్ ఏదైనా కాంగ్రెస్..బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పడడమని..కేసీఆర్ ఈ మాట మాట్లాడడం మంచి విషయమన్నారు. కానీ మాట వరుసకు వ్యతిరేకిస్తే మాత్రం స్థిరంగా ముందుకు సాగదని తమకు గత విషయాల బట్టి అర్థమైందన్నారు. ప్రాంతీయ అవసరాల కోసం..ప్రభుత్వాల మనుగడ కోసం..కేంద్రంలో ఉన్న బిజెపి..కాంగ్రెస్ జత కలవడం జరుగుతోందన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ఒకసారి బలపర్చడం..మరొక్కసారి వ్యతిరేకించడం సరిపోదన్నారు. ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు రావాలని..విధాన స్పష్టత లేకుండా అది సక్సెస్ కాదని తెలిపారు. ప్రస్తుతం మూడో ఫ్రంట్ లో భాగస్వాములు కాబోమని తేల్చిచెప్పారు.

బహుజనులకే రాజ్యం...
బహుజనులకే రాజ్యాధికారంగా పనిచేయడం జరుగుతోందని, కొన్ని కులాలకు సంబంధించిన వారు ఇంత వరకు అసెంబ్లీ మెట్లు ఎక్కలేదని..మంగళివాడు ఎక్కడా అని ప్రశ్నించారు. ఈ తరుణంలో తాము అన్ని పార్టీలకు భిన్నమైన ఎజెండాతో ముందుకెళుతున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి అనేది అందరూ మాట్లాడుతున్నారని కానీ చేతల్లో చూపించాలని..వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వనున్నట్లు..ఇతర పార్టీలు ఇస్తాయా ? అని సూటిగా ప్రశ్నించారు. మరింత విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

మరో రూపంలో మనుధర్మ శాస్త్రం...
ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారని..పేద విద్యార్థి ఎలా చదువుతాడని ప్రశ్నించారు. రాబోయే కాలంలో దేశంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్య..వైద్యం..మొత్తం ప్రైవేటు వారికి అమ్మేయాలని నీతి ఆయోగ్ లో రూపొందించడం జరిగిందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మరోరూపంలో మనుధర్మ శాస్త్రం నడుస్తోందని తెలిపారు. కోదండరాం..సీపీఐ..చంద్రకుమార్...పవన్ కళ్యాణ్ తో ఇతరులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. 2019 ఎన్నికల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని..మార్పులు చోటు చేసుకోవల్సిందేనని తెలిపారు. బీఎల్ఎఫ్ రాజ్యాధికారం చేజిక్కించుకొనే విధంగా ముందుకు సాగుతామని, ప్రజల ఆదరణ ఉండాలన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:32 - April 8, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆయన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ పై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అభిప్రాయం తెలిపారు. టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఫెడరల్ ఏదైనా కాంగ్రెస్..బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పడడమని..కేసీఆర్ ఈ మాట మాట్లాడడం మంచి విషయమన్నారు. కానీ మాట వరుసకు వ్యతిరేకిస్తే మాత్రం స్థిరంగా ముందుకు సాగదని తమకు గత విషయాల బట్టి అర్థమైందన్నారు. ప్రాంతీయ అవసరాల కోసం..ప్రభుత్వాల మనుగడ కోసం..కేంద్రంలో ఉన్న బిజెపి..కాంగ్రెస్ జత కలవడం జరుగుతోందన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ఒకసారి బలపర్చడం..మరొక్కసారి వ్యతిరేకించడం సరిపోదన్నారు. ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు రావాలని..విధాన స్పష్టత లేకుండా అది సక్సెస్ కాదని తెలిపారు. ప్రస్తుతం మూడో ఫ్రంట్ లో భాగస్వాములు కాబోమని తేల్చిచెప్పారు. మరింత విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఫెడరల్ ఫ్రంట్..విధానంలో స్పష్టత ఉండాలి - తమ్మినేని...

హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్..థర్డ్ ఫ్రంట్..ఇలా ఏ ఫ్రంట్ అయినా విధానంలో స్పష్టత ఉండాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. టెన్ టివి జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అవసరాల కోసం ఒకసారి బలపర్చడం..మరొక్కసారి వ్యతిరేకించడం సరిపోదని..ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు రావాలని సూచించారు.విధాన స్పష్టత లేకుండా అది సక్సెస్ కాదని..ప్రస్తుతం ఫ్రంట్ లో భాగస్వాములు కామని తేల్చిచెప్పారు. 

మహాసభలకు ప్రాధాన్యత – తమ్మినేని...

హైదరాబాద్ : నగరంలో జరిగే సీపీఎం ఆలిండియా మహసభలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. టెన్ టివి జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ నాయకత్వంలో జరిగిన పాలనలో భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు..ఆర్థిక వ్యవస్త చిన్నాభిన్నమైందని స్వయంగా ఆర్థిక వేత్తలు..బీజేపీ నేతలే పేర్కొంటున్నారని తెలిపారు. 

18:29 - April 8, 2018

సంగారెడ్డి : రాష్ట్ర మంత్రి హరీష్ రావు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 406 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. జహీరాబాద్ పట్టణాభివృద్ధికి రూ. 60 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సైకిల్..బుల్లెట్ పై తిరిగిన హరీష్ పలు కాలనీలను సందర్శించారు. జిల్లాలో ఐదు డయాగ్నిస్టిక్ సెంటర్లు ఉన్నాయని, అవసరమైతే నారాయణఖేడ్ కు కూడా డయాగ్నిస్టిక్ సెంటర్ కేటాయిస్తామన్నారు. 

బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్...

ఢిల్లీ : కాసేపట్లో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లు కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. 

కామన్ వెల్త్ లో భారత్ ఏడు స్వర్ణ పతకాలు...

ఢిల్లీ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తాజాగా మరో గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ వచ్చింది. ఫైనల్లో సింగపూర్‌పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. 7 స్వర్ణ పతకాలతో భారత్ ప్రస్తుతం పతకాల పట్టికలో నాలుగోస్థానంలో ఉంది.

బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మా..చౌహాన్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లు బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. కాసేపట్లో జరిగే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో వీరు పాల్గొననున్నారు. 

కేంద్ర మంత్రికి చేదు అనుభవం...

గుజరాత్ : సూరత్ లో కేంద్ర మంత్రి రామ్ దాస్ కు చేదు అనుభవం ఎదురైంది. ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సమయంలో మంత్రిపై ఓ వ్యక్తి నల్లబట్ట కప్పే ప్రయత్నం చేశాడు. వెంటనే అతడిని బయటకు లాక్కెళ్లారు. 

ఢిల్లీలో తమిళనాడు వాసుల ఆందోళన...

ఢిల్లీ : కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఆందోళన ఉధృతమౌతోంది. ఢిల్లీలో ఉంటున్న తమిళులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెంటనే కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

అంబేద్కర్ విగ్రహాలకు గ్రిల్స్...

ఉత్తర్ ప్రదేశ్ : అంబేద్కర్...ఇతర విగ్రహాల ధ్వంస ఘటనలు వెలుగు చూస్తునే ఉన్నాయి. ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో పోలీసులు అంబేద్కర్..ఇతర విగ్రహాలకు గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 

16:44 - April 8, 2018
16:42 - April 8, 2018

విజయవాడ : తెలుగుదేశం హాయంలో సాగునీటి ప్రాజెక్టలో అవినీతి జరిగిందని వైసీపీ..బిజెపి నాయకులు ఆరోపించడాన్ని మంత్రి దేవినేని తప్పు పట్టారు. కాగ్ ప్రస్తావించిన అవకతవకలన్నీ కాంగ్రెస్ లో జరిగినవేనని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు..కరవు రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేయడం జరుగుతోందన్నారు. 

16:40 - April 8, 2018

నిర్మల్ : అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు నిర్మల్ జిల్లాలోని భైంసాలో ఘనంగా జరిగాయి. వేలాది బహుజనులతో పాటు అంబేద్కర్ మనువడు రాజా రతన్ అంబేద్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేయ్యేళ్లుగా కొన్ని వర్గాల చేతుల్లోనే దేశం ఉందని..అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఆయుధమైన ఓటును రాబోయే ఎన్నికల్లోనైనా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని మోడీ అవహేళన చేస్తున్నారని, మనుస్మృతిని అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శరణం గచ్చామి సినిమాను ప్రదర్శించారు. 

16:35 - April 8, 2018

కామారెడ్డి : దళితులపై దాడులు చేస్తే సహించం..కఠిన చర్యలు తీసుకుంటాం..దళితులపై జరుగుతున్న దాడులు బాధాకరమంటూ పాలకులు చెబుతున్నా వారి రాష్ట్రంలోనే దళితులుపై దాష్టీకాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో దేశాయిపేటలో 12 దళిత కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా డప్పు కొట్టలేదనే కారణంతో పనులను తొలగించడం..బహిష్కరించడం చేశారని దళితులు పేర్కొన్నారు. బాన్సువాడ సీఐ స్పందించి ఇరువర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించారు. దళితులపై దాడులు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

నీరవ్ మోడీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ...

ముంబై : నీరవ్ మోడీతో పాటు మరొకరి వ్యక్తిపై సీబీఐ స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పీఎన్ బీ స్కాంలో వారెంట్లు విడుదల చేసింది. 

16:20 - April 8, 2018

వరంగల్‌ : జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రంలో గందరగోళం చోటు చేసుకుంది. జిల్లాలో ఒకే పేరుతో రెండు రాయపర్తిలు ఉండటంతో హాల్ టికెట్ల ముద్రణలో తప్పుజరిగింది. పరకాల మండలం రాయపర్తిగ్రామ ప్రభుత్వ పాఠశాలకి బదులుగా వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి హై స్కూల్‌ అని ఉండటంతో 200 మంది విద్యార్థులు, వారి తల్లి దండ్రులు రాయపర్తి హై స్కూల్‌ ఉదయమే చేరుకున్నారు. కాగా ఆదివారం కావటంతో హై స్కూల్‌ మూసి వుండటం పరీక్ష సమయం 11 గంటలకే వుండటంతో దిక్కు తోచని స్తితిలో రాయపర్తి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి విద్యార్థులు ఆందోళన చేప్పటారు. తమ సమస్యను పరిష్కరించాలని విద్యా అధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తక్షణం స్పందించిన పోలీసులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమీపంలో ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో పరీక్ష రాయడానికి అనుమతి తీసుకొని విద్యార్థులను పరీక్ష కేంద్రానికి పంపించారు. 

27న టీఆర్ఎస్ ప్లీనరీ...

హైదరాబాద్ : ఈ నెల 27న టీఆర్‌ఎస్ ప్లీనరీ ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లాలోని కొంపల్లిలో ప్లీనరీ ఉంటుందని, ప్లీనరీ సందర్భంగా ప్రతినిధుల సభ, బహిరంగ సభ ఉంటాయన్నారు. ప్లీనరీకి సంబంధించి అనేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అధ్యక్షతన తీర్మానాల కమిటీ ఏర్పాటు చేశామన్నారు.

వైసీపీ దీక్షా స్థలికి సీపీఐ నేతలు...

ఢిల్లీ : వైసీపీ ఎంపీలు చేపట్టిన దీక్షకు పలువురు మద్దతు తెలియచేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుపరచాలంటూ వైసీపీ ఎంపీలు ఆంధ్రా భవన్ ఎదుట ఆమరణ నిరహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సీపీఐ నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి వైసీపీ నేతలకు మద్దతు తెలిపారు.

16:08 - April 8, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీలు చేపట్టిన దీక్షకు పలువురు మద్దతు తెలియచేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుపరచాలంటూ వైసీపీ ఎంపీలు ఆంధ్రా భవన్ ఎదుట ఆమరణ నిరహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సీపీఐ నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి వైసీపీ నేతలకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని..పార్లమెంట్ లో అవిశాస్వ తీర్మానంపై చర్చ జరగకపోవడం సబబు కాదని సీపీఐ నేత రాజా తెలిపారు. రెండో విడత బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని, ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ఈ సెంటిమెంట్ ను కర్నాటక రాష్ట్రం గుర్తించాలని సూచించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, వెంటనే సమస్య పరిష్కరించే విధంగా చూడాలన్నారు. 

15:52 - April 8, 2018
15:36 - April 8, 2018

హైదరాబద్ : డీమార్ట్‌లో కల్తీ వస్తువుల చలామణి జోరుగా సాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో డీమార్ట్ షోరూంలో... కిషోర్‌ అనే వినియోగదారుడు త్రోపికన్‌ జ్యూస్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూడగా... జ్యూస్‌ డబ్బాలో ఫంగస్‌, పురుగులు, దుర్వాసన రావడంతో సదరు వినియోగదారుడు ఢీ మార్ట్‌ దృష్టికి తీసుకెళ్లడు. షాపింగ్‌ మాల్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ... పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. విసుగు చెందిన బాధితుడు పుడ్‌ ఇన్స్‌స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పుడ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ జ్యూస్‌డబ్బా శాంపుల్స్‌ తీసుకొని ల్యాబ్‌కు పంపిచారు. ఆహార పదార్ధాల్లో ఫంగస్‌ ఉందని తెలిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

15:34 - April 8, 2018

హైదరాబాద్ : చిక్కడపల్లిలో గత నెల 29వ తేదీన చిన్నారి మౌనిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పార్సిగుట్టలో రమేష్ అనే వ్యక్తి బాగ్ లింగంపల్లిలో ఉంటున్న అక్కకు పెంచుకోవడానికి చిన్నారి మౌనికను ఇచ్చాడు. అయితే మార్చి 29వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు మౌనికను కిడ్నాప్ చేశారు. ఈవిషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపులు చేపట్టారు. పిల్లలు లేకపోవడంతో మౌనికను సునీత కిడ్నాప్ చేసిందని పోలీసులు గుర్తించారు. సిసీ టివి ఫుటేజ్ లను పరిశీలించగా తూర్పుగోదావరి జిల్లాలో తన బంధువుల ఇంట్లో మౌనికను దాచారని గుర్తించారు. దీనితో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మౌనికను క్షేమంగా రక్షించారు. దీనితో వారు కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

15:28 - April 8, 2018

ఢిల్లీ : అమరావతి నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కూడా త్యాగాలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగాలు చేస్తే సరిపోదని, మూడేళ్లలో వచ్చే లాభాలను రాజధాని నిర్మాణ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేశారు.

15:18 - April 8, 2018
15:12 - April 8, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి ఎంపీలు చేపడుతున్న ఆందోళనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎంపీలు ఆందోళన..నిరసనలు తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేజ్రీవాల్ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయి మద్దతు కోరిన సంగతి తెలిసిందే. కానీ కేంద్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో ఆదివారం టిడిపి ఎంపీలు ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని వారిని నిలువరించారు. అనంతరం బలవంతంగా వారిని అదుపులోకి తీసుకుని తుగ్లక్ రోడ్డులోని పీఎస్ కు తరలించారు. కానీ బస్సులోనే వారు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎంపీలు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. వారితో మాట్లాడి తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడారు. పార్టీ చేస్తున్న ఆందోళనకు ఇప్పటికే మద్దతు తెలియచేశామన్నారు. ప్రధానితో కలవాలని అనుకొని వస్తే వారిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించడం బాధాకరమన్నారు. 

తెలంగాణలో నమోదై వర్షపాతం వివరాలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వికారబాద్ 6.5 సెం.మీ., ఆసంపర్తి 4.5 సెం.మీ., కమలాపూర్ 4 సెం.మీ, సిరికొండ 3.8 సెం.మీ, మాచారెడ్డి 3.7 సెం.మీ, దామెరా 3.3 సెం.మీ, యాదాద్రి 3.2 సెం.మీ, భువనగిరి 3.2 సెం.మీ, యాలాల్ 3.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

సోమవారం కూడా వర్షాలు...

హైదరాబాద్ : నేడు, సోమవారం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయని, తెలంగాణ వ్యాప్తంగా కూడా బలమైన ఈదురు గాలులు..రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. 

తిరుపతిలో రోడ్డు ప్రమాదం..చిన్నారులకు గాయాలు...

చిత్తూరు : హార్లీహిల్స్ ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. కొండను జేఎంజే స్కూల్ బస్సు ఢీకొంది. 10 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

14:53 - April 8, 2018

హైదరాబాద్ : స్ఫూర్తి ప్రోగ్రెసివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 22 వరకు హైదరాబాద్ బుక్‌ఫెస్ట్ జరగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఈ ఫెస్ట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ సంస్కృతులన్నిటినీ ఒకే వేదికపై చూపించే ప్రయత్నం చేస్తున్నామంటున్న బుక్‌ఫెస్ట్‌ కన్వీనర్‌ నంద్యాల నర్సింహారెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:51 - April 8, 2018

యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. స్వామివారి ప్రసాదంలో కలుషితాలను చూసి భక్తులు విస్మయం చెందారు. పులిహోర ప్యాకెట్‌లో ఐరన్‌ వేస్ట్‌, తుప్పు ముక్కలు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఈవో స్పందించారు. సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిందా ? ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై విచారణ జరుపుతామని, విచారణలో తేలిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. 

14:50 - April 8, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీల ఆందోళన ఉధృతమౌతోంది. ప్రత్యేక హోదా.. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటూ వారు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్ని ఆందోళనలు..నిరసనలు చేపట్టినా కేంద్రం స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఆదివారం ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ఎంపీలు ప్రయత్నించారు. దీనితో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం బలవంతంగా నేతలను బస్సుల్లో ఎక్కించి తుగ్లక్ రోడ్ పీఎస్ కు తరలించారు. కానీ బస్సులోనే ఎంపీలంతా ఆందోళన చేపడుతున్నారు. ప్రధాని వెంటనే స్పందించాలని, ప్రశాంతంగా చేస్తున్న ఉద్యమం చేపడుతుంటే అరెస్టులు చేశారని తెలిపారు. 

కావేరీ నది బోర్డు ఏర్పాటు చేయాలన్న నటులు...

చెన్నై : తమిళ నటీనటుల సంఘం నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్రం కావేరీ నదీ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ నేతృత్వంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్, సూర్య, కార్తీ, విజయ్ తో పాటు ఇతర నేలు పాల్గొన్నారు.

 

సీపీఎం జాతీయ మహాసభలపై ఎడిటర్స్ మీట్...

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలపై గొల్కొండ హోటల్ లో ఎడిటర్స్ మీట్ జరిగింది. ఈ మీట్ లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర నేతలు హాజరయ్యారు. 

యాదాద్రిలో ప్రసాదంలో ఇనుప ముక్కలు...

యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పులిహోర ప్రసాదంలో ఇనుప ముక్కలు దర్శనం ఇవ్వడంతో భక్తులు షాక్ కు గురయ్యారు. ఓ భక్తుడు కొనుగోలు చేసిన ప్రసాదంలో ఇవి బయటపడ్డాయి.

 

డబారిసింగిలో ఆపరేషన్ గజ...

శ్రీకాకుళం : ములియాపుట్టి (మం) గొడ్డ, డబారిసింగిలో ఎనిమిది ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగులను తరలించేందుకు ఆపరేషణ్ గజ నిర్వహించారు. 

క్షీణించిన ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం...

ఢిల్లీ : హస్తినలో వైసీపీలు ఎంపీల దీక్ష కొనసాగుతోంది. దీక్ష చేస్తున్న ఎంపీల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. నిన్న ఎంపీ మేకపాటి ఆరోగ్యం విషమించగా ఆదివారం వైసీపీ ఎంపీ వర ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీనితో వైద్యులు ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. 

కొనసాగుతున్న వైసీపీ ఎంపీల నిరాహార దీక్ష

ఢిల్లీ : హస్తినలో మూడోరోజు కొనసాగుతున్న వైసీపీ ఎంపీల నిరాహార దీక్ష కొనసాగుతోంది. రాత్రి నుంచి ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది. ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో.. కాసేపటి క్రితం ఆసుపత్రికి తరలించారు. 

18 నుంచి 22 వరకు సీపీఎం జాతీయ మహాసభలు : తమ్మినేని

హైదరాబాద్ : 18 నుంచి 22 వరకు సీపీఎం జాతీయ మహాసభలు జరుగుతాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో సభలు జరుగుతాయన్నారు. సభలకు దేశవ్యాప్తంగా 850 ప్రతినిధుల హాజరవుతారని తెలిపారు. కేరళ సీఎం, బెంగాల్, త్రిపుర మాజీ సీఎంలు, పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, బృందాకరత్ తోపాటు మిగిలిన పొలిట్ బ్యూరో సభ్యులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. సభ మొదటిరోజు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవం సుధాకర్ రెడ్డితోపాటు వామపక్షాల నేతలు సౌహార్ధ సందేశాలు ఇస్తారని పేర్కొన్నారు. చివరిరోజు బహిరంగ సభ ఉంటుందని..

13:53 - April 8, 2018

ఢిల్లీ : కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ దూసుకు పోతోంది. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఇప్పటికే వెయిట్‌ లిఫ్టింగ్‌లో 5స్వర్ణాలు సాధించగా.. ఇపుడు షూటింగ్‌లో పతకాల పంట పండుతోంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం సాధించగా.. ఇదే విభాగంలో హీనా సిద్దూ రజిత పతకం సొంతం చేసుకుంది.   

 

13:51 - April 8, 2018

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ దర్శించుకొన్నారు. ఇవాళ ఉదయం విఐపి దర్శనం ద్వారా ఆమె శ్రీవారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సినిమా విజయవంతం కావడంతో మొక్కుబడిగా శ్రీవారిని దర్శించినట్లు కాజల్‌ తెలిపారు.  

 

13:49 - April 8, 2018

హైదరాబాద్ : మోదీ సర్కార్ ఉధృతంగా అమలు చేస్తున్న ఆర్థిక విధానాలతో దేశ ప్రగతి ప్రమాదంలో పడిందన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీరాఘవులు. ఈనెల 18న హైదరాబాద్‌లో సీపీఎం ఆలిండియా మహాసభల నేపథ్యంలో... పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎడిటర్స్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవులు.. పార్టీ రాజకీయ తీర్మానాన్ని విడుదల చేశామని... రాబోయే మూడేళ్లలో పార్టీ అనుసరించనున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచామన్నారు.  ప్రజల మధ్య కుల, మత తేడాలు సృష్టించే కుట్రలను అడ్డుకోడానికి వ్యూహాలను కూడా పార్టీ రూపొందించిందన్నారు. దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనని అన్నారు. ఈకార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పార్టీ నేతలు బి.వెంకట్‌, సాగర్‌, రఘు, డిజీ నర్సింగరావు.. వివిధ పత్రిక, టీవీఛానెళ్ల ఎడిటర్లు పాల్గొన్నారు.  

 

13:47 - April 8, 2018

ఢిల్లీ : హస్తినలో మూడోరోజు కొనసాగుతున్న వైసీపీ ఎంపీల నిరాహార దీక్ష కొనసాగుతోంది. రాత్రి నుంచి ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది. ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో.. కాసేపటి క్రితం ఆసుపత్రికి తరలించారు. 

 

13:45 - April 8, 2018

చెన్నై : తమిళనాడులో కావేరి జలాలకు మద్దత్తుగా తమిళచిత్రసీమ  దీక్ష చేపట్టింది. దీక్షలో కోలీవుడ్‌కు చెందిన 24 క్రాప్ట్స్‌ పాల్గొన్నాయి. స్థానిక వల్లువర్‌ కొట్టం వద్ద జరుగుతున్న ఈ దీక్షలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, విశాల్, కార్తీ, విక్రమ్‌తో పాటు.. దర్శకులు నిర్మాతలు తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమిళుల కనీస హక్కుగా కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కు మద్దత్తుగా మౌన దీక్షలో పాల్గొంటున్నామని సీనియర్‌ నటుడు నాజర్‌ తెలిపారు. మరోవైపు రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో.. చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచులు నిర్వహించడం సరికాదన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు కనీసం నల్ల బ్యాడ్జీలను ధరించాలన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరారు.

మా పార్టీ చిన్నదే.. ఎజెండా బలమైంది : తమ్మినేని

హైదరాబాద్ : బహుజనులకు రాజ్యాధికారం రావడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజికన్యాయం చట్ట పరంగా, రాజ్యాంగపరమైన హక్కు కావాలన్నారు. బహుజనులు కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు కావాలని ఆకాంక్షించారు. గోల్కొండ క్రాస్ రోడ్ లోని బీఎల్ ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎడిటర్స్ మీట్ లో ఆయన మాట్లాడారు. గతంలో అగ్రకులాలు రాజ్యాధికారంలో ఉన్నాయని...ఇప్పుడు బహజనులు రాజ్యాధికారంలోకి రావాలన్నారు. తమ పార్టీ చిన్నదే.. కానీ ఎజెండా బలమైందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం నినాదాలతో సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టిన తర్వాత..

13:39 - April 8, 2018

ఢిల్లీ : హస్తినలో వైసీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష మూడురోజుకు చేరుకుంది. ఎంపీ వరప్రసాద్‌కు నిద్రలేమితో వాంతులయ్యాయి. మరో ఎంపీ సుబ్బారెడ్డి షుగర్ లెవల్స్‌లో స్వల్ప తరుగుదల కనిపించింది. మరోవైపు దీక్షాశిబిరాన్ని పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సందర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక హోదా కోసం ..ప్రతి ఒక్కరి కదిలిరావాలని విజయమ్మ సూచించారు.

13:38 - April 8, 2018

ఢిల్లీ : టీడీపీ ఎంపీల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రత్యేక హోదా,  రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసం వద్ద నిరసనకు దిగారు. ప్రధాని దిగి వచ్చి ప్రత్యేక హోద ప్రకటించేవరకు పోరాడతామని చెప్పారు. మోదీ హామీలు మరిచారని మండిపడ్డారు. దీంతో పోలీసలు టీడీపీ ఎంపీలను అరెస్టు చేశారు. తుగ్లక్‌రోడ్‌ పీఎస్‌కు టీడీపీ ఎంపీల తరలించారు. దీంతో అక్కడు ఉద్రిక్తత నెలకొంది. 

 

13:18 - April 8, 2018

హైదరాబాద్ : బహుజనులకు రాజ్యాధికారం రావడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజికన్యాయం చట్ట పరంగా, రాజ్యాంగపరమైన హక్కు కావాలన్నారు. బహుజనులు కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు కావాలని ఆకాంక్షించారు. గోల్కొండ హోటల్ లో ఏర్పాటు చేసిన ఎడిటర్స్ మీట్ లో ఆయన మాట్లాడారు. అంబేద్కరిస్టులను, కమ్యూనిస్టులను ఐక్యం చేయాలని మహాజన పాదయాత్ర ముగింపు సభలో సీతారాం ఏచూరి చెప్పారని.. అఖిల భారత మహాసభల డైరెక్షన్ తో లాల్, నీల్ శక్తుల ఐక్యత కోసం కృష్టి చేస్తున్నామని తెలిపారు. గతంలో అగ్రకులాలు రాజ్యాధికారంలో ఉన్నాయని...ఇప్పుడు బహజనులు రాజ్యాధికారంలోకి రావాలన్నారు. తమ పార్టీ చిన్నదే.. కానీ ఎజెండా బలమైందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం నినాదాలతో సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టిన తర్వాత.. అన్ని పార్టీల ఎజెండా సామాజిక న్యాయం అయిందన్నారు. అందరూ సామాజిక న్యాయం కావాలంటున్నారని తెలిపారు. సామాజిక న్యాయం మాటల్లో కాదని... చేతల్లో చూపాలన్నారు. టిక్కెట్లు ఇచ్చేటప్పుడు సామాజిక న్యాయాన్ని పాటించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ, సామాజికంగా, ఆర్థికంగా అణచివేయడిన వారందరూ బహుజనులే అన్నారు. అగ్రకులాలు, బ్రాహ్మహణులలో కూడా పేదవారు, అణచివేతకు గురయ్యేవారున్నారని వారూ కూడా బహుజనుల కిందికి వస్తారని అన్నారు. రాష్ట్రంలో 98 శాతంగా ఉన్న ప్రజలు బహుజనులేనని అన్నారు. గొర్రెలు, బర్రెల పంపిణీ ద్వారా సామాజిక న్యాయం రాదన్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు బహుజనులను అగ్రకులాలు పిలవాలని, వారితో సమాన హోదా ఇవ్వాలన్నారు. రోటీన్ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. ప్రజల ప్రయోజనాల కోసమే గతంలో ఇతర పార్టీలతో కలిశామని, అనేక ప్రయోగాలు చేశామని తెలిపారు. ఇతర పార్టీలతో కయికల వల్ల తమ పార్టీ బలం తగ్గిందన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కోల్పోయామన్నారు.  ఇప్పుడు ప్రజలతో కలవాలనుకుంటున్నామని తెలిపారు. దూరమైన ప్రజలను దగ్గరికి తీసుకోవడం ముఖ్యం అన్నారు. 
18 నుంచి 22 వరకు జాతీయ మహాసభలు 
18 నుంచి 22 వరకు సీపీఎం జాతీయ మహాసభలు హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతాయన్నారు. సభలకు దేశవ్యాప్తంగా 850 ప్రతినిధుల హాజరవుతారని తెలిపారు. కేరళ సీఎం, బెంగాల్, త్రిపుర మాజీ సీఎంలు,  అగ్రనాయకులు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, బృందాకరత్, బివి.రాఘవులుతోపాటు 16 మంది పొలిట్ బ్యూరో సభ్యులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. సభ మొదటిరోజు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవం సుధాకర్ రెడ్డితోపాటు వామపక్ష నేతలు సౌహార్ధ సందేశాలు ఇస్తారని పేర్కొన్నారు. చివరిరోజు బహిరంగ సభ ఉంటుందని..జాతీయ నేతలు మాట్లాడుతారని..  25 వేల మందితో రెడ్ షర్ట్ కవాతు ఉంటుందన్నారు. 
హైదరాబాద్ ఫెస్ట్... 
13 నుంచి 22 వరకు నడుస్తుందని హైదరాబాద్ ఫెస్ట్ ఉంటుందని... చుక్కా రామయ్య అధ్యక్షులుగా ఉన్నారని తెలిపారు. ఫెస్ట్ కు సినీ రంగ ప్రముఖులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఫెస్ట్ లో బుక్ ఫెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్, తెలంగాణ కల్చర్ వంటి పలు అంశాలు ఉంటాయన్నారు.

 

 

12:51 - April 8, 2018

సంగారెడ్డి : మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అకాలవర్షం భారీనష్టం మిగిల్చింది. భారీగా వీసిన ఈదురు గాలులకు సంగారెడ్డి జిల్లా ఆందోల్‌, పుల్కల్‌, వట్పల్లి, మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌, అల్లాదుర్గం, మండలాల్లోని రైతులు భారీగా నష్టపోయారు. రాలిన మామిడి కాయలను చూసి రైతన్నలు కంట తడిపెట్టారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సందర్శించి... ప్రభుత్వం ద్వారా తమకు ఆర్థిక సహాయం కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. 

12:49 - April 8, 2018

యాదాద్రి భువనగిరి : అకాల వర్షానికి జిల్లాలో భారీనష్టం వాటిల్లింది. జిల్లాలోని మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడూరు పరిసర మండలాల్లో తెల్లవారుజాము నుండి కురుస్తున్న  భారీవర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవడంతో.. రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం అప్పు చేసి పండించిన పంట నీరుగారిపోయిందని విలపిస్తున్నారు. చాలీచాలని టార్పాలిన్లు అందించారని.. మార్కెట్ సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

12:39 - April 8, 2018

ఆదిలాబాద్ : కేంద్రం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ... మనుస్మృతిని అమలుచేసేందుకు పావులు కదుపుతోందని అంబేద్కర్ మనువడు రాజరతన్ అంబేద్కర్‌తో విమర్శించారు. భైంసాలో రాజారతన్ అంబేద్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ 125 యేళ్ల జయంతి పేరుతో ఉత్సవాలు చేస్తున్నాయి కానీ...ఆయన ఆదర్శాలు పట్టించుకోవడం లేదని అన్నారు. బాబా సాహెబ్‌ను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

 

12:28 - April 8, 2018

సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్‌లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రాత్రి అక్కడే బస చేశారు. ఈరోజు ఉదయం సైకిల్ పై పట్టణంలోని వివిధ బస్థీలలో తిరుగుతూ పారిశుద్ధ్యంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎం.పి. బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉన్నారు.

 

12:00 - April 8, 2018

ఢిల్లీ : టీడీపీ ఎంపీల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రత్యేక హోదా,  రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసం వద్ద నిరసనకు దిగారు. దీంతో పోలీసలు టీడీపీ ఎంపీలను అరెస్టు చేశారు. తుగ్లక్‌రోడ్డులోని పీఎస్‌కు వారిని తరలించారు. అరెస్టు సందర్భంగా ఎంపీలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఎంపీలను పోలీసులు ఈడ్చిపాడేశారు. 
ఎంపీ రామ్మోహన్ నాయుడు 
'ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలి. కేంద్రం దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది. ప్రత్యేకహోదాపై ప్రధాని స్పందించాలి. ఏపీకి న్యాయం చేయాలి.
తోట నర్సింహ్మ
శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్నాం. అక్రమంగా అరెస్టు చేశారు. బస్సులో పడేసి గుద్దారు. బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తాం.
అనంత శ్రీరామ్..
ఇది కేంద్రం నిరంకుశ వైఖిరికి పరాకాష్ట. ప్రజల ప్రయోజరనాలను కేంద్రం గుర్తించాలి. హోదా మా హక్కు, మా డిమాండ్' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

11:55 - April 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి.. తెలంగాణలోని రాజకీయ పార్టీలకు ఒక వేదిక కాబోతుందా..? అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి టీజేఎస్‌ ప్రయత్నాలు చేస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి టీజేఎస్‌ వర్గాలు. ఎలాగూ  కాంగ్రెస్‌ వ్యూహం కూడా ఇదే కావడంతో టీజేఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు పొడుపుకు అడుగులు పడుతున్నాయి. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితితో  దోస్తీ కోసం పలుపార్టీలు ఎదురు చూస్తున్నాయి. 
టీజేఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ తహతహ
టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో ఈ మధ్య తెలంగాణ జన సమితి పురుడుపోసుకుంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కోదండరాం టీజేఎస్‌ను ఏర్పాటు చేశారు. తమ ఒక్కరితోనే అది సాధ్యంకాదని .. కలిసొచ్చే పార్టీలతో రాజకీయ లక్ష్యాన్ని సాధిస్తామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీచేయబోమని ఆపార్టీ వర్గాలు స్పష్టపరుస్తున్నాయి. అంటే  పొత్తు దిశగా టీజేఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.  టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పనిచేయాలని నిర్ణయించారు.  అన్ని పార్టీలు విడివిడిగా పోటీచేస్తే టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు చీలుతుందని..తద్వారా టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ఆ పార్టీలు భావిస్తున్నాయి.  అందుకే టీఆర్‌ఎస్‌ శక్తులన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఒకవైపు టీజేఎస్‌, మరోవైపు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
కోదండరాం పార్టీపై కాంగ్రెస్‌లో లోతైన విశ్లేషణలు
కొత్తగా పెట్టిన కోదండరాం పార్టీ తమకు కలిసోస్తుందా లేక నష్టం చేకూరుస్తుందా అనే దానిపై ఇప్పటికే కాంగ్రెస్‌లో లోతైన విశ్లేషణలు జరిగాయి. పార్టీ అధిష్టానం సైతం ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను తెలుకుంటోంది. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లను దూరం చేసుకోకుండా  సంప్రదింపులు జరపాలని అధిష్టానం నుంచి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి సూచనలు అందుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఉత్తమ్‌ కుమారే స్వయంగా కోదండరాంతో భేటీ అయినట్టు తెలుస్తోంది.  కోదండరాం పార్టీ పెట్టడంతో ఓటుబ్యాంక్‌ చీలే అవకాశం ఉందని... అది అంతిమంగా అధికారపార్టీకే లాభిస్తుందని కోదండకు ఉత్తమ్‌ సూచించినట్టు సమాచారం. యువత, విద్యార్థులు, జేఏసీ నేతలు తనపై తీవ్ర ఒత్తిడి తేవడంతోనే పార్టీ పెట్టాల్సి వచ్చిందని కోదండరాం ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. 
పొత్తుల దిశగా తెలంగాణ జన సమితి
టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఒక సామాజిక వర్గం సైతం కాంగ్రెస్‌, టీజేఎస్‌లకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార పార్టీకి వ్యతిరేకంగా సీపీఐ కూడా వీరికి మద్దుతు ప్రకటించింది. ఇక సీపీఎం....  ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించింది. బీఎల్‌ఎఫ్‌తోనే పోటీ చేస్తామని చెబుతోంది. సీపీఎం - బీఎల్‌ఎఫ్‌పైనా కోదండరాం - ఉత్తమ్‌ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే పొత్తులపై ఎన్నికల నాటికి స్పష్టత రావచ్చని కోదండరాం అనడంతో చర్చల ప్రక్రియకు ప్రస్తుతం బ్రేక్‌పడింది. 

 

సంగారెడ్డి అకాలవర్షం భారీనష్టం...

సంగారెడ్డి : అకాలవర్షం భారీనష్టం మిగిల్చింది. భారీగా వీసిన ఈదురు గాలులకు సంగారెడ్డి జిల్లా  ఆందోల్‌, పుల్కల్‌, వట్పల్లి, మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌, అల్లాదుర్గం, మండలాల్లోని రైతులు భారీగా నష్టపోయారు. రాలిన మామిడి కాయలను చూసి రైతన్నలు కంట తడిపెట్టారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీనష్టం

యాదాద్రి భువనగిరి : అకాల వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీనష్టం వాటిల్లింది. జిల్లాలోని మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడూరు పరిసర మండలాల్లో తెల్లవారుజాము నుండి కురుస్తున్న  భారీవర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవడంతో.. రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం అప్పు చేసి పండించిన పంట నీరుగారిపోయిందని విలపిస్తున్నారు. చాలీచాలని టార్పాలిన్లు అందించారని.. మార్కెట్ సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్ : తెలంగాణలో పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి భారీవర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రోడ్లపై వర్షపునీరు భారీగా నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అకాలవర్షంతో తెలంగాణలో పంటలకు భారీనష్టం వాటిల్లుతోంది. యాదాద్రి జిల్లా మోత్కూరు, ఆత్మకూరు మండలాల్లో వర్షాలకు ధాన్యం తడిసి రైతులకు భారీనష్టం వాటిల్లింది. అటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాలకు మామిడికాయలు నేలరాలాయి. 

11:08 - April 8, 2018

కోల్ కతా : పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు బరితెగించారు. సీపీఎం సీనియర్‌ లీడర్‌, మాజీ ఎంపీ బాసుదేవ్‌ ఆచార్యపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. పురూలియాల జిల్లా కాశీపూర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వెళుతుండగా తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు దాడిచేశారు. ఈ దాడిలో బాసుదేవ్‌ ఆచార్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటనలో మరికొందరు సీపీఎం కార్యకర్తలు కూడా గాయపడ్డారు. తృణమూల్‌ దాడిని సీపీఎం నేతలు ఖండించారు.  దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్లో  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కాగా మే 1, 3, 5 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా తృణమూల్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా ఆరోపిస్తున్నాయి. 

 

11:03 - April 8, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు సమావేశమై భవిష్యత్ ఉద్యమ వ్యూహరచనపై చర్చించారు. సుజనా చౌదరి నివాసంలో ఈ భేటీ జరిగింది. సమావేశం అనంతరం... ఎంపీలు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 

11:00 - April 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి భారీవర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రోడ్లపై వర్షపునీరు భారీగా నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అకాలవర్షంతో తెలంగాణలో పంటలకు భారీనష్టం వాటిల్లుతోంది. యాదాద్రి జిల్లా మోత్కూరు, ఆత్మకూరు మండలాల్లో వర్షాలకు ధాన్యం తడిసి రైతులకు భారీనష్టం వాటిల్లింది. అటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాలకు మామిడికాయలు నేలరాలాయి. 
యాదాద్రి భువనగిరి
అకాల వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీనష్టం వాటిల్లింది. జిల్లాలోని మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడూరు పరిసర మండలాల్లో తెల్లవారుజాము నుండి కురుస్తున్న  భారీవర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవడంతో.. రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం అప్పు చేసి పండించిన పంట నీరుగారిపోయిందని విలపిస్తున్నారు. చాలీచాలని టార్పాలిన్లు అందించారని.. మార్కెట్ సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
సంగారెడ్డి, మెదక్..
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అకాలవర్షం భారీనష్టం మిగిల్చింది. భారీగా వీసిన ఈదురు గాలులకు సంగారెడ్డి జిల్లా  ఆందోల్‌, పుల్కల్‌, వట్పల్లి, మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌, అల్లాదుర్గం, మండలాల్లోని రైతులు భారీగా నష్టపోయారు. రాలిన మామిడి కాయలను చూసి రైతన్నలు కంట తడిపెట్టారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సందర్శించి... ప్రభుత్వం ద్వారా తమకు ఆర్థిక సహాయం కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. 

 

10:57 - April 8, 2018

కామారెడ్డి : జిల్లాలో మూడు గోదాముల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. 

10:42 - April 8, 2018

నిజామాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో చిన్నారిపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. డొంకేశ్వర్ గ్రామంలో తాగిన మైకంలో సాయన్న అనే వ్యక్తి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు నిందితుడిని చితకబాదారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

బెంగాల్ లో సీపీఎం నేత బాసుదేవ్ ఆచార్యపై దాడి

ప.బెంగాల్ : సీపీఎం సీనియర్ నేత బాసుదేవ్ ఆచార్యపై తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బాసుదేవ్ ఆచార్యపై దాడి చేశారు.   

 

ఢిల్లీలో టీడీపీ ఎంపీల ఆందోళన

ఢిల్లీ : ఢిల్లీలో టీడీపీ ఎంపీల ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీ నివాసాన్ని ఎంపీలు ముట్టడించారు. ఎంపీలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్రధాని నివాసం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

నేడు రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎంపీలు

ఢిల్లీ : నేడు టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవనున్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేదని కేంద్రంపై ఫిర్యాదు చేయనున్నారు. 

ఎల్బీనగర్‌ సితారహోటల్లో మంటలు

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌ భారీ అగ్నిప్రమాదం జరిగింది. సితారహోటల్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నట్టు హోటల్‌ నిర్వహకులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. 

08:54 - April 8, 2018

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సితారహోటల్లో  మంటలు ఎగిసిపడ్డాయి. విద్యతు్‌ షార్ట్‌సర్క్యూట్‌తో  మంటలు అంటుకున్నట్టు హోటల్‌ నిర్వహకులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. 

08:53 - April 8, 2018

హైదరాబాద్‌ : నగంరలో జూబ్లీహిల్స్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ యువజంట చుక్కలు చూపించింది. మద్యం మత్తులో కారులో జాలీగా ట్రిప్‌ వేస్తున్న జంటను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువతి రెచ్చిపోయింది. ప్రియుడికి బ్రీత్‌అనలైజర్‌తో టెస్ట్‌ నిర్వహించకుండా బండబూతులు తిడుతూ, ళ్లు విసురుతూ హల్‌చల్‌ చేసింది. కొద్దిసేపు తంటాలు పడిన పోలీసులు ఆ ఇద్దరికీ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. కాగా ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 103 బైక్‌లతో సహా45కార్లు, రెండు ఆటోలను పోలీసులు సీజ్‌ చేశారు. 

 

08:51 - April 8, 2018

హైదరాబాద్‌ : నగరలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. బొల్లారం ఏరియాలో 7.3సెంటీమీటర్లు, కూకట్‌పల్లి, బాలానగర్‌లో 6సెంమీటర్ల  వర్షం కురిసింది. రామచంద్రాపురం, బీహెచ్‌ఇఎల్‌ ప్రాంతాల్లో భారీ వర్షపడుతోంది. మెడ్చల్‌, మల్కాజ్‌గిరి, ఈసీఐఎల్‌, మౌలాలీ, తార్నాక, విద్యానర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. 

 

08:47 - April 8, 2018

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వక్తలు అన్నారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, అవిశ్వాస తీర్మానాలు, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న విధానం సరికాదన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సీహెచ్.బాబూరావు, వైసీపీ నేత మన్నెం సుబ్బారావు, టీడీపీ నేత మండల హనుమంతరావు పాల్గొని, మాట్లాడారు. బీజేపీ మొండి వైఖరి అవలంభిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని రాష్ట్ర ప్రయోజనాలను చూసుకుంటున్నారని... ఇది సరికాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:39 - April 8, 2018

ముంబై : రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఐపీఎల్‌ 11వ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. ఐపీఎల్‌ ఆరంబ మ్యాచ్‌లో అదరగొట్టింది. అభిమానులకు అసలైన టీ20 మజాను అందించింది. ముంబైతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్ల ధాటికి 105పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ చెన్నైని.. ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో మెరుపు ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. 68 పరుగులు చేసిన బ్రావో 18వ ఓవర్లో ఔటయ్యాడు. రిటైర్డ్‌హర్ట్‌గా క్రీజు వదిలి వెళ్లిన కేదార్‌ జాదవ్‌ మళ్లీ బ్యాటింగ్‌  దిగి చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు. ముంబయి బౌలర్లలో మర్కాండే, హర్దిక్‌ పాండ్యా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ను ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యా  ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.  చెన్నైకి అద్భుత విజయాన్ని అందించిన బ్రావోకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.

 

08:34 - April 8, 2018

మెదక్‌ : జిల్లాలోని నర్సాపూర్‌లోని లైన్స్‌క్లబ్‌ సామాజిక సేవలో దూసుకుపోతోంది. యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణనిస్తూ ప్రోత్సహిస్తోంది. నేత్ర వైద్యాలయం ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. లైన్స్‌క్లబ్‌ చేస్తున్న సామాజిక సేవకు  అరబిందో ఫార్మా తనవంతు ఆర్థికసాయం అందించింది. అందరి సూచనలు, సలహాలతో సామాజిక సేవలో తరిస్తోన్న నర్సాపూర్‌ లైన్స్‌క్లబ్‌ స్నేహబంధుపై కథనం....
అగ్రపథంలో లైన్స్‌క్లబ్‌ స్నేహబంధు  
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని లైన్స్‌క్లబ్‌ స్నేహబంధు సామాజిక సేవలో అగ్రపథంలో పయనిస్తోంది. సామాజిక సేవే లక్ష్యంగా ఏర్పడిన లైన్స్‌క్లబ్‌ స్నేహబంధు ఆ లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళ్తోంది. ప్రజలకు మంచి పనులు చేస్తూ... వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ అందరి ఆదరాభిమానాలు చూరగొంటోంది.
కుట్టుమిషన్‌ శిక్షణ ఏర్పాటు
లైన్స్‌క్లబ్‌ స్నేహబంధు ఆధ్వర్యంలో కొన్నాళ్ల క్రితమే కుట్టుమిషన్‌ శిక్షణ ఏర్పాటు ఏర్పాటైంది. లైన్స్‌క్లబ్‌ ప్రతినిధులు సమీప గ్రామాల్లోని మహిళలకు టైలరింగ్‌ నేర్పిస్తున్నారు. అంతేకాదు.. మరికొంత మందికి అల్లికలు నేర్పిస్తున్నారు. వీటితోపాటు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ కూడా ఇస్తున్నారు. అందరికీ వివిధ విభాగాల్లో ట్రైనింగ్‌నిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటునందిస్తోంది నర్సాపూర్‌ లైన్స్‌క్లబ్‌ స్నేహబంధు.
కంటి ఆసుపత్రి ఏర్పాటు 
కొన్ని నెలల క్రితమే కంటి ఆసుపత్రి ఏర్పాటు చేశారు. కంటి ఆసుపత్రిలో అవసరమయ్యే యంత్ర పరికరాలు, వస్తు సామాగ్రి కోసం అరబిందోఫార్మా సహకారం కోరారు. దీంతో అరబిందో ఫార్మా వారికి దాదాపు 40 లక్షల ఆర్థికసాయం అందించింది. కంటి ఆస్పత్రికి కావాల్సిన ఎక్విప్‌మెంట్‌ను అందజేసింది. దీంతో కంటి ఆస్పత్రిలో సమీప గ్రామాల్లోని పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు  500 పైగా కంటి ఆపరేషన్లు, 4000 మందికి కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు.
దాతలు ఆర్థికసాయం
నర్సాపూర్‌ లైన్స్‌క్లబ్‌ స్నేహబందు చేపట్టే కార్యక్రమాలకు పలువురు దాతలు ఆర్థికసాయం అందజేస్తున్నారు. ఎంతోమంది చేయూతనిస్తున్నారు. వారి కృషితో పేదలకు లైన్స్‌క్లబ్‌ ప్రతినిధులు వైద్యసేవలు అందిస్తున్నారు. లైన్స్‌క్లబ్‌ స్నేహబంధు  మరింత ప్రజలకు సేవలు అందించాలని అందరూ కోరుతున్నారు.

 

08:25 - April 8, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో చేపల చెరువుల అక్రమ తవ్వకం యథేచ్చగా కొనసాగుతోంది. వందల ఎకరాల్లో చెరువులను తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులను తవ్వడంతోపాటు.. మట్టిని సైతం అమ్మేసుకుంటున్నారు.  కాళ్ల మండలంలో జోరుగా సాగుతున్న చేపల చెరువుల అక్రమ తవ్వకాలపై 10టీవీ ప్రత్యేక కథనం...
పచ్చని పంటపొలాలు కనుమరుగు
పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది ధనార్జనకు పచ్చని పంటపొలాలు కనుమరుగవుతున్నాయి. చేపల చెరువుల పేరుతో  పంట పొలాలను యధేచ్చగా తవ్వేస్తున్నారు. ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు పండుతున్న వరి పొలాలన్నీ ఇప్పుడు చేపల చెరువులుగా మారిపోతున్నాయి. 
పచ్చని పంట పొలాలు ధ్వంసం
కాళ్ల మండలంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చేపల చెరువులు తప్ప పంటపొలాలు కనిపించడం లేదు. కాళ్లలంకలో కొంతమంది ధనార్జన కోసం పచ్చని పంటపొలాలను ధ్వంసం చేస్తున్నారు. వాటిని చేపల చెరువులుగా మార్చివేస్తున్నారు. పోనీ అవన్నా నిబంధనల ప్కారం జరుగుతున్నాయా అంటే అదీలేదు.  అక్రమంగా చేపల చెరువులను తవ్వేస్తున్నారు. వందల ఎకరాల్లో ఈ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి.
200 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం
కాళ్లలంకలో దాదాపు 200 ఎకరాల్లో చేపల చెరువులు అక్రమంగా తవ్వుతున్నారు. మీరు చూస్తున్న ఈ చెరువు.. భీమవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు గ్రంథి శ్రీనివాస్‌కు చెందినదిగా స్థానికులు చెపతున్నారు. ఇక్కడ తవ్వకాలను ఎలాంటి అనుమతులు లేవు.  చెరువులు తవ్వడానికి రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్‌, మైనింగ్‌, పొల్యూషన్‌తోపాటు 11శాఖలు అనుమతులు ఇవ్వాలి. మరి ఎవరి అనుమతి తీసుకోకుండానే యథేచ్చగా చెరువులు తవ్వేస్తున్నారు. 
మట్టిని తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్న అక్రమార్కులు
చెరువుల కోసం తవ్విన మట్టిని  అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  లారీలు, ట్రాక్టర్లలో ఈ మట్టిని తరలిస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు పగలు - రాత్రి అన్న తేడాలేకుండా మట్టిని తరలిస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీలు నడిపే వారిలో సగానికిపైగా డ్రైవర్లు మైనర్లే ఉన్నారు. వారికి ఎలాంటి లైసెన్స్‌లు లేవు.  వేగంగా డ్రైవింగ్‌ చేస్తూ రోడ్లపై ఎదురొచ్చిన జంతువులపై వాహనాలు ఎక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా కోళ్లు, కుక్కలు  చనిపోయాయి. 
రెండు నెలలుగా మట్టి తరలింపు
రెండు నెలలుగా మట్టి తరలింపు జరుగుతోంది. వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు పగలు - రాత్రి తిరుగుతుండడంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అంతేకాదు. వాహనాలు గ్యాప్‌ లేకుండా తిరుగుతుండడంతో దుమ్ము, ధూళి లేవడంతో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. వాహనాల శబ్దానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
అధికారులకు అందుతున్న ముడుపులు!
ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. అధికారులకు ఇదంతా తెలిసే జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముడుపులు పుచ్చుకుని మిన్నకుండిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమంగా సాగుతున్న చెరువుల దందాపై కలెక్టర్‌ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కాళ్లలంక గ్రామస్తులు కోరుతున్నారు.

 

08:13 - April 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవానికి రెడీ అవుతోంది. ఈనెలలోనే పార్టీ ప్లీనరీ, బహిరంగ సభను జరుపుకోవాలని భావిస్తోంది. 27న బహిరంగ సభ నిర్వహించి... విపక్షాలకు తమ పాలనపై ధీటైన సమాధానం ఇవ్వాలని డిసైడ్‌ అయ్యింది.
ఈ నెలలోనే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ
టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ముహూర్తం దాదాపు ఖరారు అయ్యింది. 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది.  ఏప్రిల్‌ 27న ప్రతిఏటా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను ఘనంగా జరుపుతోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా పార్టీ ఆవిర్భావ  దినోత్సవాన్ని గ్రాండ్‌గా జరిపేందుకు గులాబీబాస్‌ రెడీ అయ్యారు. 
ప్లీనరీ ఘనంగా నిర్వహించాలని డిసైడ్‌ 
ఈసారి నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ, ప్లీనరీకి ఓ ప్రత్యేకత ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇక సంవత్సరం కూడా సమయం లేదు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే పార్టీ ప్లీనరీ ఘనంగా నిర్వహించాలని డిసైడ్‌ అయ్యింది. ప్లీనరీ వేదికగా తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ ప్రజలకు వివరించనుంది. 
రెండు రోజులపాటు ప్లీనరీ సమావేశాలు
ప్లీనరీని రెండు రోజులపాటు నిర్వహించే అవకాశముంది. ఈనెల 23 24న  ప్లీనరీని నిర్వహించాలన్న యోచనలో టీఆర్‌ఎస్‌ ఉంది. పార్టీ ఆవిర్భావ దినమైన ఈనెల 27న బహిరంగ సభను నిర్వహించనుంది. ప్లీనరీతోపాటు బహిరంగ సభా వేదికలు ఇంకా ఖరారు కాలేదు. బహిరంగ సభకు జనసమీకరణ భారీగా చేయాలని టీఆర్‌ఎస్‌ డిసైడ్‌ అయ్యింది. 20 లక్షల మందిని సమీకరించి.. తమ సత్తాచాటుకోవాలని గులాబీదళం పావులు కదుపుతోంది. అయితే బహిరంగ సభను జింఖానా గ్రౌండ్స్‌లోనా లేక.. ఔటర్‌రింగ్‌కు సమీపంలోనా అన్నది ఇంకా ఖరారు కాలేదు. మరో రెండు మూడు రోజుల్లో ప్లీనరీకి సంబంధించిన తేదీలు అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ప్లీనరీతోనే  ఎన్నికల శంఖారావం పూరించేందుకు కేసీఆర్‌ పావులుకదుపుతున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

 

07:57 - April 8, 2018

హైదరాబాద్‌ : నగరంలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రోడ్లపై వర్షపునీరు భారీగా నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల చెట్టు నేలకూలాయి. తెలంగాణలో రేపు కూడా  వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. క్యూమిలోనింబస్‌ మేఘాల ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం తేలికపాటి నుంచి ఓ మోస్తారు కురుస్తుందని తెలిపింది. 

 

07:51 - April 8, 2018

గుంటూరు : ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం అయింది. రాష్ట్రవ్యాప్తంగా  పార్టీలన్నీ పోరుబాట పట్టాయి. వైసీపీ, టీడీపీ, వామపక్ష పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీలో ఆందోళనలు హోరెత్తుతున్నాయి.  పార్టీలన్నీ పోరుబాట పట్టాయి. టీడీపీ, వైసీపీ, వామపక్షాలు, జనసేన ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. 
విశాఖ 
విశాఖ ఏయూ కాలేజీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ విద్యార్ధి విభాగం నిరవధిక నిరాహర దీక్ష చేపట్టింది. దీక్ష వద్ద టెంట్ వేసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎండలోనే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని విద్యార్థులు తెలిపారు.
కడప
కడప జిల్లా పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వైసీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యక్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని వైసీపీ ఎంపీలు అన్నారు. హోదా కాదు ప్యాకేజీ కావాలన్న చంద్రబాబు నాలుగేళ్ల తరువాత మళ్లీ హోదా అడుగుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. 
ఢిల్లీ 
ఢిల్లీలో వైసీపీ ఎంపీల దీక్షకు మద్దతుగా, గుంటూరు జిల్లా పత్తెనపల్లి సెంటర్‌లో వైసీపీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇచ్చేవారందరూ దీక్షకు రావొచ్చని నేతలు తెలిపారు. హోదా ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు.
కృష్ణా 
కృష్ణా జిల్లా నందిగామ గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ పార్టీలు వేర్వేరుగా ఆందోళన నిర్వహించాయి. ఒకే ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది. జగన్, విజయసాయి రెడ్డి లను లక్ష్యంగా టీడీపీ నాయకులు నినాదాలు చేయ్యగా, చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తంత నెలకొంది. 

 

07:46 - April 8, 2018

గుంటూరు : ప్రజల మనోభావాలను కేంద్రం పట్టించుకోవడం లేదని.. హోదా విషయంలో మొండిచెయ్యి చూపిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేంద్రం తీరుపై మండిపడ్డారు. అఖిల పక్ష భేటీకి ప్రధాన రాజకీయపార్టీలు హాజరుకాకపోవడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.  విపక్షపార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలపట్ల చిత్తశుద్ధి లేదన్నారు. మరోవైపు చంద్రబాబు వైఖరిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
మోదీ మాట తప్పారు : చంద్రబాబు 
ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పారని.. ఈ విషయాన్ని జాతీయస్థాయిలో వివరించానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో అఖిలపక్ష భేటీకి హాజరైన వివిధ సంఘాల నేతలతో చంద్రబాబు మాట్లాడారు.  జాతీయ స్థాయిలో బీజేపీ తప్ప అందరూ రాష్ట్రానికి  అనుకూలంగా ఉన్నారని చెప్పారు. కాగా ఆల్‌పార్టీ మీటింగ్‌కు పిలిచినా ప్రధాన పార్టీలు హాజరుకాకపోవడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. వారికి రాష్ట్ర ప్రయోజనాలపట్ల చిత్తశుద్ధి లేదన్నారు. 
సీఎంపై అంబటి విమర్శలు 
అటు అఖిలపక్షం భేటీకి దూరంగా ఉన్న రాజకీయపార్టీలు సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించాయి. చంద్రబాబును ఎవరూ నమ్మరని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ లబ్ధికోసమే సీఎం  అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. 
మోదీని ప్రశ్నించని జగన్‌ : సోమిరెడ్డి
అటు విపక్షాల వైఖరిని టీడీపీ ఖండించింది. ప్రధాని మోదీని ప్రశ్నించాల్సిన జగన్‌ చంద్రబాబును ప్రశ్నించడం ఏంటన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి . ప్రధాని మోదీ మీద పోరాడేందుకు విపక్షాలు భయపడుతున్నాయని, వారికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు.
నవతరం పార్టీ, ముస్లీంలీగ్‌ పార్టీల అనుమతి నిరాకరణ  
మరోవైపు అఖిల పక్షం భేటీలో పాల్గొనేందుకు వచ్చిన నవతరం పార్టీ, ముస్లీంలీగ్‌ పార్టీల ప్రతినిధులను లోపలికి అనుమతించలేదు. దీనికి ఆ పార్టీల నేతలు సచివాలయం ముందే నిరసనకు దిగారు. సమావేశానికి పిలిచి... లోపలికి పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
సొంత అజెండాలొద్దు 
రాజకీయపార్టీలన్నీ తమ సొంత అజెండాను పక్కనపెట్టి.. రాష్ట్ర ప్రయోజనాలకోసం కలిసి రావాలని..ఉత్తరాంధ్ర హక్కుల వేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అఖిలపక్షం భేటికి రాని పార్టీలతో మరోసారి మాట్లాడాలని సూచించారు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మరోసారి సంప్రదింపులు జరపాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కోరానన్నారు.
పునరాలోచనలో టీడీపీ 
మొత్తానికి అఖిల పక్షాల సమావేశానికి ప్రధాన పార్టీలన్నీ హాజరు కాకపోవడంతో .. టీడీపీ పునరాలోచనలో పడింది. రాష్ట్ర ప్రయోజనాలకోసం ఉమ్మడిగా కేంద్రంపై పోరాడాలని పిలుపు నిస్తున్న చంద్రబాబు ఏ వైఖరి తీసుకుంటారన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

తెలంగాణలో నేడు జేఈఈ మెయిన్స్ పరీక్ష

టీఎస్ : నేడు జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జేఈఈ పరీక్షకు 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబద్, ఖమ్మం, వరంగల్ లో 116 సెంటర్లు ఏర్పాటు చేశారు. 

జూబ్లీహిల్స్ లో డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 151 మందిపై కేసు నమోదు అయ్యాయి. 103 బైక్ లు, 46 కార్లు, రెండు ఆటోలను సీజ్ చేశారు.

ఫిలింనగర్ లో మద్యం మత్తులో యువతి హల్ చల్

హైదరాబాద్ : ఫిలింనగర్ లో మద్యం మత్తులో యువతి హల్ చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులతో యువతి వాగ్వాదానికి దిగింది. కవరేజ్ చేస్తున్న మీడియాపై రాళ్ల దాడి చేసింది.

హైదరాబాద్ లో భారీ వర్షం.. విద్యుత్ సరఫరా నిలిపివేత

హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోకి నీరు చేరింది. మేడ్చల్, మల్కాజ్ గిరి, అల్వాల్, ఉప్పల్, బొల్లారంలో 7.3 మిల్లిమీటర్ల వర్షపాత నమోదు అయింది. సరూర్ నగర్, ఎల్బీ నగర్ లో 6.3 మిల్లిమీటర్ల వర్షపాతం, కూకట్ పల్లి, బాలనగర్ లో 6.0 మిల్లిమీటర్ల వర్షపాతం, రామచంద్రాపురం, బీహెచ్ ఈఎల్ లో 5.8 వర్షపాతం నమోదు అయింది. 

Don't Miss