Activities calendar

09 April 2018

21:28 - April 9, 2018

అనంతపురం : జిల్లా హిందూపురంలో ఏపీకి హోదా కల్పించాలని, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సోమవారం 420 మందితో శిరోముండనం చేయించి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారని YCP నేతలు ఆరోపించారు. 

21:22 - April 9, 2018

హిమాచల్‌ ప్రదేశ్‌ : కాంగ్రా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూలు బస్సు 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని 26 మంది విద్యార్థులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. ఘటనాస్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వజీర్‌ రామ్‌సింగ్‌ పఠానియా మెమోరియల్‌ పబ్లిక్ స్కూలు చెందిన విద్యార్థులు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నూర్‌పుర్‌ చంబా మార్గంలో గుర్చల్‌ గ్రామం వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 40 సీట్ల కెపాసిటి ఉన్న బస్సులో 60 మంది పిల్లలను తీసుకెళ్తున్నట్లు సమాచారం. బస్సులోని పిల్లలంతా ఐదవ తరగతి ఆ లోపు విద్యార్థులే. ఘటన జరిగిన వెంటనే సీఎస్, డీజీ, డిప్యూటీ కమిషనర్‌లను అప్రమత్తం చేశామని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు.  

ఇద్దరు చిన్నారుల గృహ నిర్భందం...

సిద్ధిపేట : జిల్లాలో వర్గల్‌ మండలం నాచారంలో ఇద్దరు చిన్నారులను గృహనిర్భందం చేశారు. భర్యాభర్తలుగా చలామణి అవుతున్నా ఓ జంట చిన్నారులను చిత్రహింసలకు గురి చేసింది. అయితే వారు భర్యాభర్తలు కాదని పోలీసుల విచారణలో తెలింది.

హిమాచల్ ప్రదేశ్..పెరగనున్న మృతుల సంఖ్య...

హిమాచల్‌ ప్రదేశ్‌ : కాంగ్రా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూలు బస్సు 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని 26 మంది విద్యార్థులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.

నారాయణ కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళన...

కర్నూలు : వేసవి సెలవుల్లో కూడా ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్న కర్నూలు నారాయణ కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో పాఠాలు చెప్పడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు తప్పుపట్టారు. 

వైసీపీ జాతీయ రహదారుల నిర్భందం...

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై కేంద్రం దిగివచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతోందని వైసీపీ స్పష్టం చేసింది. హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్టు ప్రకటించింది. రేపు జాతీయ రహదారుల నిర్బంధం, ఎల్లుండి రైల్‌రోకోలు చేపట్టాలని నిర్ణయించింది.

21:07 - April 9, 2018

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుకు నిరంత నిఘా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై వర్చువల్‌ ఇన్స్‌ఫెక్షన్‌ నిర్వహించిన చంద్రబాబు.. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు 52 శాతం పనులు పూర్తయినట్టు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సచివాలయంలో వర్చువల్‌ ఇన్స్‌పెక్షన్‌ నిర్వహించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు భద్రత కట్టుదిట్టం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుపై నిరంత నిఘా అవసరమన్నారు. ఫైబర్‌నెట్‌తో ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీలను అనుసంధానం చేయాలని చెప్పారు. డయాఫ్రమ్‌ వాల్‌, జెట్‌ గ్రౌంటింగ్‌ నిర్మాణాన్ని వేసవిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు పనులను 10 కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 52.10శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యిందన్నారు. కుడి ప్రధాన కాలువ 89.10శాతం, ఎడమ ప్రధాన కాలువ 58.30 శాతం పనులు పూర్తయ్యాయని సీఎంకు వివరించారు. 71.10శాతం మేర స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ తవ్వకం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ వారం రోజుల్లో 1.93 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా... 21వేల క్యూబిక్‌ మీటర్లమేర స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌ కాంక్రీట్‌ పనులు పూర్తయినట్టు అధికారులు చెప్పారు. డయాఫ్రమ్‌ వాల్‌ 38.4 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని సీఎంకు వివరించారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తంమీద 1,115.59 లక్షల క్యూబిక్‌ మీటర్లకుగాను.. ఇప్పటి వరకు 793.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి.

పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 13,364.98 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 8,229.11 కోట్లు ఖర్చుపెట్టినట్టు వివరించారు. ఇందులో 5,342.26 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసిందని... మరో 2,886.85 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని సీఎంకు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 53 ప్రాధాన్య ప్రాజెక్టులలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభంకాగా... మరో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పోలవరం పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని.. నిర్దేశిత గడువులో కంప్లీట్‌ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.-

21:06 - April 9, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల సభ్యత్వం రద్దుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తమకు లిఖితపూర్వకంగా తెలపకుండా శాసనసభ్యత్వాలను రద్దు చేయడం సరికాదని కాంగ్రెస్‌ సభ్యులు వాదించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో.. ప్రభుత్వం కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలను రద్దు చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వీడియో పుటేజీలను కోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రోజు వరకు వాటిని న్యాయస్థానికి అందజేయలేదు.

మరోవైపు తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన విషయం లిఖిత పూర్వకంగా తెలపలేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తాము కోర్టును ఆశ్రయించిన తర్వాత గత నెల 19న గవర్నర్‌ సంతకంతో అసెంబ్లీ వెబ్‌సైట్లో ఉత్తర్వులు పెట్టారని... అయితే అందులో కూడా బహిష్కరణకు కారణాలు వివరించలేదని కాంగ్రెస్‌ నేతలు నివేదించారు. గవర్నర్ ప్రసంగం శాసనసభ సమావేశాల పరిధిలోకి రాదన్నారు. మండలి ఛైర్మన్ కంటికి గాయమైనందున బహిష్కరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని.. అయితే దానికి సంబంధించిన వీడియో ఫుటేజీ అడిగితే ఇవ్వలేదన్నారు. కాబట్టి గతంలో సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుల ప్రకారం.. బహిష్కరణ ఉత్తర్వులు చెల్లుబాటు కావని వాదించారు.

అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి రాజీనామా తర్వాత.. అసెంబ్లీ తరఫున ఎవరూ వాదనలు వినిపించలేదు. ఈ తరుణంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. బహిష్కరణ వ్యవహారంలో ప్రభుత్వం ప్రమేయం లేదని చెప్పారు. ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని.. అయితే ఆరు వారాలు ఆగాలన్న మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించింది. 

21:05 - April 9, 2018

ఢిల్లీ : ప్రత్యేకహోదాపై కేంద్రం దిగివచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతోందని వైసీపీ స్పష్టం చేసింది. హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్టు ప్రకటించింది. రేపు జాతీయ రహదారుల నిర్బంధం, ఎల్లుండి రైల్‌రోకోలు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీలో ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు నాలుగోరోజూ కొనసాగాయి. వీరికి పలువురు జాతీయనేతలు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీల దీక్ష కొనసాగుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో... దీక్ష కొనసాగిస్తున్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఉదయమే బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు ఆయనను రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు.
ప్రస్తుతం దీక్షను వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి కొనసాగిస్తున్నారు. వీరి దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. వైసీపీ ఎంపీల దీక్షకు కేంద్ర మాజీ మంత్రి

శరద్‌యాదవ్‌ సంఘీభావం ప్రకటించారు. ఏపీకి యూపీఏ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉందన్నారు. ఉదయం సమయంలో వైసీపీ ఎంపీల దీక్షకు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సంఘీభావం తెలిపారు. ఎంపీలకు మద్దతుగా దీక్షాశిబిరంలో కూర్చొన్నారు. దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలపై టీడీపీ నేతలు చౌకబారు కామెంట్లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రధానితో వైసీపీ కుమ్మక్కైందన్న టీడీపీ ఎంపీల వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మోదీతో తాము కుమ్మక్కైతే దీక్షలెందుకు చేస్తామని ప్రశ్నించారు. ప్రధానితో కుమ్మక్కై రాజకీయాలు చేస్తోంది చంద్రబాబేనని ఆమె ఆరోపించారు.

వైసీపీ ఎంపీల దీక్షకు మద్దతు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే రోజా... టీడీపీ నేతలపై మండిపడ్డారు. ప్రత్యేకహోదా వస్తే ఏపీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్నారు. పబ్లిసిటీ కోసమే టీడీపీ ఎంపీలు ధర్నా చేస్తున్నారని విమర్శించారు. తిరుమల వెంకన్నసాక్షిగా మోదీ ఇచ్చిన హామీనే అమలు చేయాలని తాము ప్రశ్నిస్తున్నామన్నారు.

ప్రత్యేకహోదా కోసం ఆందోళనలు మరింత ఉధృతం చేయనున్నట్టు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్బంధం చేపడుతున్నట్లు తెలిపారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకోలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్రం దిగివచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని... ప్రత్యేకహోదా ఇవ్వకపోతే బీజేపీ, టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

వైసీపీ ఎంపీల ప్రత్యేకహోదా దీక్షపై జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ప్రత్యేకహోదాపై ప్రధాని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని జగన్‌ ట్విట్టర్‌లో కోరారు. మరోవైపు చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించకపోవడం మోసమేనని వైసీపీ ఆరోపించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజల అభిప్రాయానికి విరుద్దంగా రాజీనామాలు చేయకుండా కుంటిసాకులు చెబుతోన్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడే నిలదీయాలని వైసీపీ పిలుపునిచ్చింది.

21:04 - April 9, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం నెల రోజులకు పైగా ఢిల్లీలో పోరాడిన టీడీపీ ఎంపీలు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. హస్తినలో చేసిన పోరాటాన్ని తమ నియోజకవర్గ ప్రజలకు వివరించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసున్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఎంపీలు బస్సు యాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత బస్సుయాత్ర కార్యాచరణ ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభల స్తంభన, ప్రధాని నివాసం ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలతో ఢిల్లీని అట్టుడికించిన టీడీపీ ఎంపీలు.. చివరిగా జాతిపిత మహాత్మాగాంధీ సమాధి.. రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. దవళవస్త్రాలు ధరించి, నల్లబ్యాడ్జీలు పెట్టుకుని రాజ్‌ఘాట్‌ చేరుకున్న టీడీపీ ఎంపీలు గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేసే విధంగా పాలకులకు జ్ఞానోదయం కల్పించాలని మహాత్మున్ని కోరారు. హోదా సాధించే వరకు పోరాటం విరమించబోమని ప్రతిజ్ఞ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన అంసాయుత ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని హోదా సాధించే వరకు శాంతియుతంగా పోరాడాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. జాతిపిత ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విరమ్శించారు.

చట్టబద్దంగా, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత జాతీయ పార్టీలపై ఉందని విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన పోరాటపటమ దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించడంతోపాటు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. 

20:37 - April 9, 2018

వరుస బ్యాకింగ్ చట్టంలో వందల..వేల కోట్ల కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఇటీవలే ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణం ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కాం బ్యాంకింగ్ రంగంలో పెద్ద సంచలనం రేపుతోంది. కుంభకోణాలకు ప్రైవేటు..ప్రభుత్వ రంగస్థలాలంటూ తేడా లేదు. మరి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు భద్రత ఉందా ? అనే సందేహాలు సామాన్యుడి మెదల్లో మెదులుతున్నాయి. బి.ఎస్.రామరాజు (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేసన్ సెక్రటరీ) విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పిడుగులు పడే అవకాశం..జాగ్రత్త...

విజయనగరం : బొబ్బిలి, తెర్లాం మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, శ్రీకాకుళం, జి.సిగడాం, బూర్ణ, పాలకొండ, ఆమదాలవలస, సంతకమిటి, వంగం, రేగిడి మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

19:51 - April 9, 2018

అకాల వర్షం రైతన్న గుండెల మీద తన్నింది.. ప్రత్యేక హోదా లడాయి తమాం తొవ్వదప్పినట్టుందిగదా..? దళితులంత ఏకతాటి మీదికి.. రావాలే లేకపోతె ఈ ప్రభుత్వాలు మనల్ని తొక్కేస్తందుకు ప్రయత్నం జేస్తున్నయ్ అంటున్నడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సారు..బాబాసాహేబ్ అంబేద్కర్ను బీజేపీ గౌరవిస్తున్నంతగ.. ఎవ్వలు గౌరవిస్తలేరని మొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు అనెగదా.? బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీ ప్రజలారా..? రెండువేల పందొమ్మిది వర్కళ్ల తెలంగాణల రాజకీయం మొత్తం మార్చేస్తాంటున్నడు గద్దరన్న... డబుల్ బెడ్రూం ఇండ్ల గోడలను గిచ్చి సూస్తున్నరు కాంగ్రెస్ పార్టోళ్లు..పదిహేనేండ్లు గూడ నిండని ఆడివిల్లకు పెండ్లి జేస్తె.. కనీసం ఆమేందో ఆమెకు తెల్వని వైసు అది..గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో చూడండి. 

19:46 - April 9, 2018

మోది ప్రభుత్వంపై మిత్ర పక్షాల నుంచే తిరుగుబాటు మొదలైంది. సంకీర్ణ ధర్మాన్ని పాటించకుండా ఒంటెద్దు పోకడ పోతున్నారని...తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా బీజేపీ నేతలే మోదీపైనా.. సొంతపార్టీపైనా విమర్శలు ఎక్కుపెట్టడం చెప్పుకోదగ్గ పరిణామమే. సొంతపార్టీ కుంపట్లు ఇలాగే రగులుతూ పోతే.. 2019 ఎన్నికలు.. బీజేపీకి ఎదురీతే అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శ్రీపతి రాముడు (సామాజిక విశ్లేషకులు), ఆరేపల్లి మోహన్ రావు (కాంగ్రెస్), వి.శ్రీనివాసరావు (సీపీఎం), చింతా సాంబశివమూర్తి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:36 - April 9, 2018

మోది ప్రభుత్వంపై మిత్ర పక్షాల నుంచే తిరుగుబాటు మొదలైంది. సంకీర్ణ ధర్మాన్ని పాటించకుండా ఒంటెద్దు పోకడ పోతున్నారని...తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ యాక్టుపై మోది ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సొంత పార్టీ ఎంపీలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. భారత్‌ బంద్‌ తర్వాత దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఏకంగా ప్రధాని మోదికే లేఖలు రాశారు. ఎన్డీయే కూటమి సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదని.. మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. యూపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్‌ పార్టీ ఇదే ఆరోపణతో మోదీపైనా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దళితులను, వెనకబడిన వర్గాలను యోగి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తున్నారని యూపీ కేబినెట్‌ మంత్రి, ఎస్బీఎస్పీ నేత ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ చెబుతున్నారు. యూపీ మాధ్యమిక విద్యాబోర్డులో అగ్ర కులాలకు చెందిన బిజెపి సీనియర్‌ నేతల బందువులను బోర్డులో నియమిస్తున్నారని, ఎస్సీ, ఇతర కులాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేబినెట్‌ సమావేశంలో కూడా తమ మాటకు విలువే ఉండదని రాజ్‌భర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

బిజెపి దళిత ఎంపీలు ఛోటేలాల్‌ ఖర్వార్‌, అశోక్‌కుమార్‌ దోహ్రీ, యశ్వంత్‌ సింగ్‌, సావిత్రి బాయి పూలె... కూడా బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో దళితులకు మన ప్రభుత్వం చేసిందేమిటి? దేశంలోని 30 కోట్ల మంది దళితులకు ఒరింగిదేమిటని నగీనా ఎంపి యశ్వంత్‌ సింగ్‌ ప్రధాని మోదికి రాసిన లేఖలో నిలదీశారు. దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు చేయాలని... ఎస్‌సి ఎస్‌టి చట్టాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తాను దళితుడిని అయినందుకు తన పట్ల సిఎం వివక్షత చూపుతున్నారని పేర్కొంటూ మరో ఎంపి ఛోటేలాల్‌ ప్రధాని నరేంద్రమోదికి లేఖ రాశారు. నియోజకవర్గ సమస్యలపై యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాస్తే బదులివ్వలేదని... స్వయంగా కార్యాలయానికి వెళ్తే లోపలికి అనుమతించకపోగా... యోగి తిట్టి బయటకు గెంటేశారని ఆయన ఆరోపించారు.

భారత్‌ బంద్‌ తర్వాత దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయని... యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మరో బిజెపి ఎంపి అశోక్‌కుమార్‌ దోహ్రీ ప్రధాని మోదికి లేఖ రాశారు. కులం పేరుతో దూషించి ఇంట్లో నుంచి బయటకు గెంటేసి కొడుతున్నారని ఆరోపించారు. ఎస్‌, ఎస్‌టి వర్గాల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని బెహ్రయిచ్‌ దళిత ఎంపి సావిత్రిబాయి పూలే ఆరోపించారు.

మొత్తానికి మోదీ ప్రాభవం క్రమంగా మసకబారుతున్నట్లే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమిలోని పార్టీలతో పాటు.. స్వయంగా బీజేపీ నేతలే మోదీపైనా.. సొంతపార్టీపైనా విమర్శలు ఎక్కుపెట్టడం చెప్పుకోదగ్గ పరిణామమే. సొంతపార్టీ కుంపట్లు ఇలాగే రగులుతూ పోతే.. 2019 ఎన్నికలు.. బీజేపీకి ఎదురీతే అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

20 మంది విద్యార్థుల మృతి...

హిమాచల్ ప్రదేశ్ : కాంగ్రా జిల్లా నుర్పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన స్కూల్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది విద్యార్థులు మృతి చెందగా 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. 100 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. బస్సులోని వారంతా ఐదో తరగతి విద్యార్థులని తెలుస్తోంది.

 

మోడీపై యనమల ధ్వజం...

విజయవాడ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మంత్రి యనమల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ అంటే దేశం మొత్తానికి మొహం మొత్తిందని, మాటలే తప్ప మోడీ చేతలు శూన్యమన్నారు. నాలుగేళ్లలో పేదలకు మోడీ చేసిందేమి లేదని, ఏపీలో 2014లో వచ్చిన ఓట్లలో పదో వంతు కూడా బీజేపీకి రావని జోస్యం చెప్పారు. 

భారత్ కు పది స్వర్ణాలు...

ఢిల్లీ : కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు పదో స్వర్ణపతకం లభించింది. టేబుల్ టెన్నిస్ ఫైనల్ లో పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. బ్మాడ్మింటెన్ మిక్స్ డ్ టీం ఈవెంట్ లో మరో స్వర్ణం లభించింది. 

సివిల్ సప్లై డీఎం ఆత్మహత్యాయత్నం...

నెల్లూరు : సివిల్ సప్లై డీఎం కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టిస్తోంది. ఆఫీసులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఇతడిని తోటి ఉద్యోగులు కాపాడారు. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అంతకుముందే మంత్రి సోమిరెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సోమిరెడ్డి, కలెక్టర్ ముత్యాల రాజులు ఆయన్ను పరామర్శించారు. 

మార్కెట్ యార్డులకు ఛైర్మన్ ల నియామకం...

గుంటూరు : రెండు మార్కెట్ యార్డులకు ఛైర్మన్ ల నియామకం జరిగింది. తాడికొండ యార్డు ఛైర్మన్ గా గుంటుపల్లి మధు, ఫిరంగిపురం యార్డు ఛైర్మన్ నార్నే శ్రీనివాసరావును నియమిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

టి.డీజీపీగా ఎం.మహేందర్ రెడ్డి...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ (రెగ్యులర్)గా ఎం.మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నియామక ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీని నియమించుకొనే అవకాశం అధికారం కల్పిస్తూ ఇటీవలే కొత్త చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

18:40 - April 9, 2018

హైదరాబాద్ : సీపీఐ నేత చండ్ర రాజేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ ఫ్లాగ్‌ డే నిర్వహించింది. పార్టీ జెండాను ఎగురవేసి, చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు ఆ పార్టీ నేతలు. చండ్రరాజేశ్వరరావును ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేయాలని సూచించారు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి. కేరళలో జరిగే జాతీయ పార్టీ మహాసభల్లో దేశంలో కమ్యూనిస్టుల ముందున్న సవాళ్లు, భవిష్యత్‌ కార్యచరణపై చర్చిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

18:38 - April 9, 2018

నల్గొండ : దళితుల పట్ల వివక్ష..దాడులు ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దళితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రజాప్రతినిధుల పట్ల కూడా వివక్ష కొనసాగుతుందని అనడానికి ఈ ఘటనే నిదర్శనం. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. పందుల నర్సింహ రెడ్డి టీఆర్ఎస్ దళిత సర్పంచ్. తనను అసలు పట్టించుకోవడం లేదని...వివక్ష చూపిస్తున్నారంటూ ఆ సర్పంచ్ ఎమ్మెల్యేను నిలదీశారు. కనీసం తనను పరిగణలోకి తీసుకోవడం లేదని, గ్రామ పంచాయతీలో నామినెటెడ్ పోస్టులు..ఇతరత్రా వాటిపై కనీసం సమాచారం ఇవ్వడం లేదని నిలదీశారు. కేవలం దళితుడు అయ్యినందు వల్లే ఇలా చేస్తున్నారని, రెడ్డిలకు ఏమ్మెల్యే ప్రాతినిధ్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన సర్పంచ్...

నల్గొండ : తన పట్ల వివక్ష చూపిస్తున్నారని టీఆర్ఎస్ కు చెందిన దళిత సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మునుగోడు ఎమ్మెల్యేను ఆయన నిలదీశారు. 

18:31 - April 9, 2018

టిడిపి..వైసిపి ఎంపీలకు జనసేన సంఘీభావం..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా విషయంలో అధికార..ప్రతిపక్షాల్ని నిద్రపోనివ్వనమి జనసేన పేర్కొంది. కాసేపటి క్రితం జనసేన ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హోదా కోసం పోరాడే వాళ్లందరికీ అండగా ఉంటుందని, రాష్ట్రం కోసం నిరసనలు..ఆమరణ దీక్షలు చేస్తున్న పార్లమెంట్ సభ్యులకు సంఘీభావం తెలిపింది. 

18:22 - April 9, 2018

ఛత్తీస్ గడ్ : మళ్లీ అడవిలో అలజడి మొదలైంది. ఇటీవలే ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం పై చేయి సాధించేందు మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా ఆరుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కూట్రూ సమీపంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

18:17 - April 9, 2018
18:14 - April 9, 2018

ఖమ్మం : జిల్లా మధిరలో టీఆర్ఎస్‌ బహిరంగసభకు..డబ్బులు ఇచ్చి మరీ జనాన్ని తరలించారు. సభను సక్సెస్‌ చేసేందుకు నేతలు జనాన్ని ప్రలోభపెట్టి బస్సుల్లో తీసుకువచ్చారు. బస్సు దిగిన వెంటనే డబ్బులు పంపిణీ చేశారు. ఈ విజువల్స్‌ను టెన్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా సాధించింది. 

18:12 - April 9, 2018

కాకినాడ : ఆయిల్‌ మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌ ఆ పోర్ట్‌..ఇతర సరుకు రవాణాలో కూడా ఆ పోర్ట్‌లో మాఫియా రాజ్యమేలింది. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. మాఫియాలకు చెక్‌ పడుతోంది... ఎగుమతులు దిగుమతుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో ఆ పోర్ట్‌ ఆదాయంలో రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించింది. కాకినాడ పోర్టు..గడిచిన పదేళ్లుగా మాఫియా కనుసన్నుల్లో నడుస్తూ వచ్చిన పోర్టు. అధికారులు కళ్లు తెరవడంతో ఒక్క ఏడాదిలోనే 50 శాతం అదనపు ఆదాయాన్ని సంపాదించింది. సంస్థాగత నిర్ణయాల వలన మాఫియా ఆగడాలకు చెక్కు పడుతోంది. ఇన్నాళ్లు సొంత ప్రయోజనాలకు కొంత మంది అధికారులు మాఫియాతో కలసి ఆయిల్‌, తుక్కు, ఇనుములు బ్లాక్‌లో అమ్ముకొనేవారు. ఇప్పడు ఆ ఆయిల్‌, తుక్కు, ఇనుములే పోర్టుకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. దీంతో కాకినాడ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఒకే ఏడాదిలో 40 కోట్ల ఆదాయాన్ని సంపాదించి.. రాష్ట్రంలోనే నెంబర్‌ వన్ పోర్టుగా నిలిచింది.

రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టులకు 26 ఓట్ల ఆదాయం సమకూరగా.. కాకినాడ పోర్టు 40 కోట్లు సాధించింది. గతంతో పోలిస్తే 16 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరింది. రవాణా రుసుం ద్వారా 8 కోట్ల ఆదాయం వస్తే, స్ర్కేప్‌ వే స్టాయిల్‌, బంకర్‌ సప్లయిస్‌ ద్వారా మరో 8 కోట్ల ఆదాయం వచ్చింది. కాకినాడ పోర్టు కూడ ప్రపంచంలోని అన్ని పోర్టుల లాగే గ్రాస్‌ స్పేస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా నామినాల్‌ ఫీజు వసూలు చేస్తూ ఆదాయాన్ని గడిస్తుంది. నిఘా పెంచడం ద్వారా రాష్ట్ర ఖజానాలో 50 కోట్లు పోర్టు ఆదాయంగా ఉంచగలిగామని, అది మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగిస్తామని పోర్టు డైరెక్టర్‌ కోయా ప్రవీణ్‌ తెలిపారు.

కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో ఈ విధంగా ఆదాయం పెరగడంతో అందరూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1 కోటి 96 లక్షల మిలియన్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయగా 19 కోట్ల 74 లక్షలు ఆదాయం వచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల ఒక లక్ష మిలియన్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయడం ద్వారా 20 కోట్ల 14 లక్షల ఆదాయం సమకూరింది. అంటే ఎగుమతుల్లో 2 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. కానీ నిఘా ఫలితంగా, సంస్కరణల కారణంగా, వేస్ట్‌ ఆయిల్‌ వల్ల 14కోట్ల 5 లక్షల ఆదాయం పోర్టుకు లభించింది.

ఒక్క ఏడాదిలోనే వేస్ట్‌ ఆయిల్‌ రూ. 14 కోట్ల ఆదాయం వచ్చిందంటే, గడిచిన పదేళ్ల కాలంలో వందకోట్ల రూపాయల వరకు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందన్నది అక్షర సత్యం. అయితే అధికారుల పని తీరు వల్ల ఇంత ఆదాయం రావడంతో అందరూ హర్షిస్తున్నారు. అలాగే పోర్టుకు వచ్చిన ఆయిల్‌ పైపు లైను గుండా వెళుతున్న సమయంలో ఆయిల్‌ కాజేస్తున్న దొంగల విషయంలోనూ అధికారులు దృష్టి పెట్టి వాటిని అరికట్టాలని ప్రజలు అంటున్నారు. 

18:10 - April 9, 2018

శ్రీకాకుళం : ఉన్న ఊరిని కన్న తల్లిని మరువలేదు ఆ విద్యార్థులు.... విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత శిఖరాల్లో నిలబెట్టిన పాఠశాలను భావితరాలకు అందించారు. స్వీయ ప్రయోజనాలను పక్కన పెట్టి నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారా విద్యార్థులు. తమను.. తమ జీవితాలను ఉన్నత శిఖరాల్లో నిలిపిన ప్రాంతంపై మక్కువ వీడలేదు. స్వార్ధానికో.... ప్రశంసలకో కాదు రాబోయే యువతకు విద్యాబుద్దులు అందించడానికి ఫలితం ఆశించకుండా లక్షలాది రూపాయలు పోగుచేసి శిథిల విద్యాలయాన్ని నూతన భవనంగా మార్చారా పూర్వ విద్యార్థులు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని బ్రాహ్మణతర్లా గ్రామమిది. ఎప్పుడో దశాబ్దాల క్రితం చదువుకున్న తమ పాఠశాల నిర్లక్ష్యం నీడలో కూరుకుపోయింది. విద్యార్థులకు సరిపడా భవనాలు లేక సమస్యల వలయంలో చిక్కుకుంది. ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించలేదు.

పాఠశాల పునరుద్ధరణకోసం 1967వ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పూనుకున్నారు. ఊరిలో ఉన్న వారి నుండి దేశ స్థాయిలో పలుకుబడి కలిగిన వారంతా దాదాపు 60 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఆర్ధిక సహాయం అందించారు. పాఠశాలలో 430 మంది విద్యార్థులున్నా వారికి సరిపడా తరగతి గదులు లేవు. గ్రామ మాజీ సర్పంచ్‌ ఆనంద్‌ పిలుపు మేరకు పలువురు పూర్వ విద్యార్థులు సంఘటితమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య డైరెక్టర్‌ ఈ పాఠశాలలో ఓనమాలు దిద్దినవారే. అంతే కాదు ఈ పాఠశాలలో చదివిన వాళ్లు ప్రొఫెసర్లుగా, డాక్టర్లుగా, న్యాయవాదులుగా, వ్యాపారస్తులుగా, చార్ట్రడ్‌ అకౌంటెంట్‌లుగా స్థిరపడ్డారు. ఇప్పుడు వీళ్లంతా సంఘటితపై బ్రాహ్మణతర్లాలోని పాఠశాల అదనపు భవన నిర్మాణాన్ని చేపట్టారు. నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

రెండు నెలల్లోనే పన్నెండు లక్షల రూపాయల నిధులు పోగుచేసి పాఠశాల భవనాన్ని పూర్తి చేశారు. పూర్వ విద్యార్థుల ఔదార్యం బ్రాహ్మణతర్లలోని ఉన్నత పాఠశాలకు అదనపు భవనాలను నిర్మించగలిగింది. మరో వైపు భవన నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులే చూడటంతో పక్కా భవనం ఏర్పడింది. మొత్తం మీద పూర్వ విద్యార్ధులు నేటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు.

జవాన్లపై మావోయిస్టుల దాడి..

ఛత్తీస్ గడ్ : బీజాపూర్ జిల్లాలో జవాన్లు ప్రయాణించే వాహనంపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. కూట్రూ మార్గంలో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు జవాన్లు అమరవీరులవ్వగా ఆరుగురు జవాన్లకు గాయాలయ్యాయి. 

18:03 - April 9, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో మంత్రి హరీశ్‌ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్ట్‌లు కొనసాగాయి. నిజాం షుగర్‌ పరిరక్షణ కమిటీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారిని స్థానిక పీఎస్‌కు తరలించారు. కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణలో పోలీస్‌ రాజ్యం నడుపుతోందని అరెస్టైన నేతలు మండిపడ్డారు. నిజాం షుగర్‌ ప్యాక్టరీ కోసం ధర్నా నిర్వహిస్తే.. పోలీసులు అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమస్యలు తెలపడమే నేరమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

18:02 - April 9, 2018

అనంతపురం : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలసి నడిచేందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వీసీ రాజగోపాల్ తెలిపారు. వ్యక్తిగత కారణాలతో వీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మూడురోజుల క్రితం ప్రకటించారు. ఇవాళ వర్శిటీకి వచ్చిన ఆయన తన హయాంలో జరిగిన పనులు, రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఇన్నిరోజులు తనకు సహకరించిన పాలకమండలి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సీబీఐ మాజీ జేడీ వీఆర్ఎస్ తీసుకున్నారని.. ఆయన ప్రజలకు మరింత సేవ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారని చెప్పారు. ఆయనకు సాయం చేసేందుకే పదవికి రాజీనామా చేశానని.. లక్ష్మీనారాయణ ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియదన్నారు. 

18:01 - April 9, 2018

విజయవాడ : ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య రథాలను సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఆరోగ్య రథంలో 200 రకాల వైద్య పరీక్షలు ఈసీజీ, యూరిన్, రక్త పరీక్షలతో పాటు డిస్పెన్సరీ అందుబాటులో ఉంటాయని బాబు తెలిపారు. గిరిజనుల పాలిట ప్రాణదాతగా ఆరోగ్యరథం ఉంటుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మెరుగైన వైధ్య సేవలు అందిచాలనే ఉద్ధేశంతో వీటిని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. మలేరియా, షుగర్, టీబీ, క్యాన్సర్‌ వంటి వాటిని తొలిదశలో గుర్తించి వాటిని ఎన్డీఆర్ ఆరోగ్య వైద్య సేవకు బదలాయించడం జరుగుతోందని పేర్కొన్నారు.

 

18:00 - April 9, 2018

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్‌ స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారని హెచ్‌ఆర్డీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్‌..టీడీపీ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ అనుభవం ముందు జగన్‌.. సరిపోరన్నారు. 

గ్రీన్‌పార్క్ లో దొంగలు బీభత్సం..

హైదరాబాద్ : నగరంలో దోపిడీ దొంగల బీభత్సం నానాటికీ పెరిగిపోతోంది. దొంగతనాలకు ఎవరైనా అడ్డువస్తే ప్రాణాలు తీసేందుకు కూడా దొంగలు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో సరూర్‌నగర్ పరిధిలోని గ్రీన్‌పార్క్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో చొరబడి మహిళను కట్టివేసి చోరీకి పాల్పడ్డారు. మహిళను కట్టేసి బీరువాలోని బంగారం, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

16:51 - April 9, 2018

శ్రీకాకుళం : ఒక ఆలోచన.. ఆదివాసుల జీవిత విధానాన్ని మార్చేసేంది. వెదురు ఉత్పత్తుల తయారీలో శిక్షణ పొందిన సీతంపేట గిరిజన మహిళలు.. స్వయం ఉపాధి చేసుకుంటూ రాష్ట్రానికే ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. తమ ఉత్పత్తులను రాష్ట్రంలోనే కాకుండా.. దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ పరిధిలోని గిరిజనులు వెదురు ఉత్పత్తులు తయారు చేస్తూ గుర్తింపు పొందుతున్నారు. మేఖవ గ్రామంలో తొలుత పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఈ వస్తువుల తయారీ ప్రారంభమైంది. ఆర్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ.. నాబార్డ్ సహకారంతో మేకవలో గిరిజనులు వెదురు కలప ద్వారా అందమైన గృహోపకరణాలు, సోఫా సెట్లు లాంటివి తయారు చేస్తున్నారు.

తొలుత మొదటి బ్యాచ్‌లో 30 మంది గిరిజనులు ఈ తయారీ పట్ల శిక్షణ పొందారు. వెదురు కలపతో బొమ్మలు, ప్లవర్‌ బొకేలు, బుట్టలు, సెల్‌ఫోన్‌, అగరవత్తుల స్టాండ్లు, పూజాసామాగ్రి, బొమ్మ పడవలు, టీపాయ్‌లు తయారు చేస్తున్నారు. తొలుత కుటీర పరిశ్రమగా ప్రారంభమైన ఈ ప్రక్రియ.. తాజాగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది. మొదట వీరు భద్రాచలానికి చెందిన మారయ్య అనే వ్యక్తి దగ్గర శిక్షణ పొంది.. తర్వాత తామే సొంతంగా శిక్షణ ఇచ్చే స్థాయికి చేరారు.

తాము తయారు చేసే వస్తువులకు ఆయిల్‌ పెయింట్స్‌ వేయడం ద్వారా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ముడిసరుకు ఐటీడీఏ పూర్తిస్థాయిలో మార్కెటింగ్‌ సౌకర్యం అందిస్తే ఉత్పత్తుల తయారీని పెంచుతామంటున్నారు గిరిజనులు. ఆదివాసీలు తయారుచేస్తున్న ఉత్పత్తుల తయారీని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఆర్ట్స్‌ సేవా సంస్థ. అసోం, భద్రాచలం ప్రాంతాల నుండి తీసుకువచ్చి వెదురు సోఫాలు, టీపాయ్‌లు, గృహాలంకరణ వస్తువులను తయారుచేయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఉత్పత్తుల ద్వారా ఆదివాసీలకు జీవనోపాధితో పాటు.. ఆదాయ వనరులు పెంపొందే అవకాశముందంటున్నారు.

గిరిజనులు తయారు చేస్తున్న వెదురు ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ లభిస్తోంది. నిరుద్యోగ యువతకు ప్రత్యేక ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. మరోవైపు మేకవ గ్రామస్తులు తయారుచేసిన ఉత్పత్తులకు జిల్లాకు చెందిన 'ఫోరమ్‌ ఫర్‌ బెటమ్‌' ప్రత్యేక అవార్డు లభించింది. 

16:49 - April 9, 2018

పశ్చిమ బెంగాల్‌ : పంచాయితీ ఎన్నికలకు సంబంధించి బిజెపికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బిజెపి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు స్థానిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వెళ్లే స్వేచ్ఛ ఉందని బిజెపికి కోర్టు సూచించింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని బిజెపి ఆరోపించింది. అభ్యర్థులకు నామినేషన్లు కూడా వేయనివ్వకుండా బెదిరిస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ బిజెపి కోర్టులో పిటిషన్‌ వేసింది. మే 1,3, 5 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళ ఆఖరు తేది.

భారత్ ఖాతాలో మరో స్వర్ణం..

హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఉత్సాహంగా జరుగుతోన్న కామన్వెల్త్‌ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. వరుస పతకాలు సాధిస్తూ అదరహో అన్పిస్తున్నారు. తాజాగా భారత్‌ ఖాతాలోకి మరో పసిడి పతకం వచ్చి చేరింది. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. తుదిపోరులో భారత జట్టు నైజీరియాపై 3/0 తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్‌కు ఇది తొమ్మిదో స్వర్ణం కావడం విశేషం. ఈ ఒక్క రోజే భారత్‌ రెండు స్వర్ణాలు సాధించింది. తొమ్మిది పసిడి, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 18 పతకాలు సాధించిన భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.

బిడ్డ ఊపిరి తీసి తల్లి ఆత్మహత్య!..

గుంటూరు : రాజుపాలెం మండలం గణపవరంలో విషాదం నెలకొంది. రక్తాన్ని పాలగా మార్చి కన్నబిడ్డ కడుపు నింపిన తల్లే బిడ్డ ఉసురు తీసిన ఘటన చోటుచేసుకుంది. ఆ తల్లికి ఎటువంటి కష్టం ముంచుకువచ్చిందో గుండెను బండగా చేసుకుని బిడ్డకు పాలల్లో విషయం కలిపి ఇచ్చి అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. బిడ్డ పేరు ధనశ్రీలక్ష్మీ, తల్లి పేరు విజయలక్ష్మీగా గుర్తించారు. 

బీసీ కమిషన్ చైర్మన్ రాజీనామా..

అమరావతి : బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ తన పదవికి రాజీనామా చేశారు. కమిషనర్ పదవికి మంజునాథ రాజీనామా చేశారు. మంజునాథ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. 

16:31 - April 9, 2018

యాదాద్రి : ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీజేపీ సర్కార్‌ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఏ ఒక్క హామీ అమలు కావడం లేదన్న ఆయన.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అని అన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 18 నుంచి జరిగే సీపీఎం జాతీయ మహాసభల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తమ్మినేని వీరభద్రం కోరారు.  

16:29 - April 9, 2018

విజయవాడ :్ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై తప్పుడు నివేదికలు పంపుతూ ఏపీకి అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. గవర్నర్‌ అరాచకవాదిగా మారారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు చేయాలన్న డిమాండ్‌తో విజయవాడలో టీడీపీ నాయకులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద పేదలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్‌రావు... గవర్నర్‌ నరసింహన్‌ వ్యవహార శైలిపై మండిపడ్డారు. 

అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ కొరడా..

హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ కొరడా ఝుళిపించింది.సంగారెడ్డి జిల్లా అమాన్ పూర్లఓ అక్రమ నిర్మాణాలను హెచ్ఎండీయే అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతుల్లేకుండా నిర్మించిన అపార్ట్ మెంట్స్, షాపులు,కరెంట్ స్థంభాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమ వెంచర్లలో స్థలాలు కొని మోసపోవద్దని అధికారులు స్థానికులకు సూచించారు. కాగా అక్రమ నిర్మాణాలకు కొదవేలేదు. భూ కబ్జాదారులు దందాలకు పాల్పడుతు అమాకులను నకిలీ డాక్యుమెంట్స్ తో మాయచేసి అక్రమ లే అవుట్లలో నిర్మాణాలు చేపట్టి మోసాలకు పాల్పడే విషయం తెలిసిందే. 

16:27 - April 9, 2018

విజయవాడ : 9వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఫైబర్‌నెట్‌తో పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీలను అనుసంధానం చేయాలని సూచించారు. ఇవాళ సచివాలయంలో ఆయన పోలవరం పనుల పురోగతిపై సమీక్షించారు. ఇప్పటి వరకు 52.10శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కుడికాలువ 89.10శాతం, ఎడమ ప్రధాన కాలువ 58.30శాతం పూర్తి అయ్యిందని వివరించారు. 

మోదీ అంటే దేశానికి మొహం మొత్తింది : యనమల

అమరావతి : ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మోదీ అంటే దేశానికి మొత్తానికి మొహం మొత్తింది ఎద్దేవా చేశారు. మోదీకి మాటలే తప్ప చేతలు చేతకావని దేశానికి అర్థమయిపోయిందన్నారు., నాలేగేళ్ళలో పేదలకు మోదీ చేసిందేమీ లేదన్నారు. ఏపీలో 2014లోవచ్చిన ఓట్లలో పదోవంతు కూడా బీజేపీకి లేదన్నారు.డ్రామాలు, నాటకాల్లో బీజేపీది అందెవేసిన చేయి అని యనమల విమర్శించారు. టీడీపీని విమర్శించడానికి జీవీఎల్ ను రాజ్యసభకు పంపించారని విమర్శించారు. ఏపీకి రావాల్సినవన్నీ ఇస్తే ఏపీ దేశంలోనే అగ్ర రాష్ట్రం అవుతుంని మోదీ భయపడుతున్నారని యనమల ఆరోపించారు.

16:14 - April 9, 2018

సంగారెడ్డి : అమీన్ పూర్ లో హెచ్ఎండీఏ అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించారు. ఎన్ఆర్ఐ కాలనీ..తదితర కాలనీల్లో అక్రమంగా వెలిసిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. అనుమతులు ఏకుండా నిర్మించిన అపార్ట్ మెంట్లు, షాపులు, రోడ్లు, ఇతర వాటిని కూల్చివేశారు. ఈ సందర్భంగా అధికారులు మీడియాతో అక్రమ వెంచర్ లో స్థలాలు కొని ప్రజలు మోసపోవద్దని సూచిస్తున్నారు. 

16:13 - April 9, 2018

పశ్చిమగోదావరి : కాళ్ల మండలంలో చేపలు చెరువు తవ్వవద్దని జువ్వపాలెం గ్రామస్తులు కోరుతున్నా...కొంతమంది పెడచెవిన పెడుతూ ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్నారు. దీనితో గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్తులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీనితో ఇరువర్గాల మద్య జరిగిన తోపులాటలో ఓ మహిళ చేతికి గాయమైంది. అనంతరం గ్రామస్తులు ఆకివీడు మత్స్యశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 

16:04 - April 9, 2018

బీజేపీని గద్దె దించటమే లక్ష్యం : తమ్మినేని

యాదాద్రి : హైదరబాద్ నగరంలో జరగబోయే సీపీఎం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ం పిలుపునిచ్చారు. మహాసభల అనంతరం రాష్ట్రాల్లో పెను మార్పులు జరగనున్నాయని తమ్మినేని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో వున్ బీజేపీని గద్దె దించటమే ప్రధాన ఎంజెండా అని తెలిపారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాను రాను మోదీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. కేంద్రం స్ధాయిలో ఎటువంటి పొత్తులు లేకుండా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని తమ్మినేని తెలిపారు. 

15:51 - April 9, 2018

అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండేకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదటిసినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. మెచ్యూరిటీగా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దీంతో షాలిలీ పాండేకు ఆఫర్లు వస్తున్నా ఆచి తూచి వ్యవహరిస్తున్న ఈ మధ్యప్రదేశ్ భామకు ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం నుండి నాటకాలు వేసిన నటనలో ప్రావీణ్యం పొందిన షాలిని తన మొదటి సినిమాలోనే తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. అది కూడా తెలుగు రాకపోయినా తనదైన స్లైల్ లో డబ్డింగ్ చెప్పుకుంది. ఆ వచ్చీరానీ స్లాంగ్ సినిమాకు కూడా హైలెట్అయింది.

ఆచి తూచి సినిమాలు ఒప్పుకుంటున్న షాలినీ..
నిదానంగా ఆలోచిస్తు ఒక్కొక్కటిగా ఈ అమ్మాయి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 25వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ప్రస్తుతం 'భరత్ అనే నేను' సినిమాతో ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి మహేశ్ బాబు రెడీ అవుతున్నాడు. తన 25వ సినిమాను ఆయన వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను షాలినీ పాండేతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆమెను ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తితో ఆమె ఉందని అంటున్నారు. దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.   

సుబ్బారెడ్డికి విజయమ్మ పలకరింపు..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో వైవీ సుబ్బారెడ్డికి వైద్య సేవలందిస్తున్నారు. కాగా, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. విజయమ్మతో పాటు ఎమ్మెల్యే రోజా, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 

15:33 - April 9, 2018

నా భార్య నా ఇష్టం నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను నీకెందుకు అంటాడు ఓ తాగుబోతు భర్త. నా భార్యను చంపుతాను, నరుకుతాను నీకెందుకు అంటాడు ఓ కట్నపిశాచి. నీకిష్టం వున్నా లేకున్నా నాతో కాపురం చేయాలంటారు ఓ అహంభావి. ఇలా భార్యలను హింసిస్తు కుటుంబంలో బానిసలుగా మార్చివేసే భర్తలకు భారత్ లో కొదవలేదు. అధిక కట్నం కోసం ఒకడు, తాగి వచ్చి హింసించేవాడు మరొకడు. డబ్బు కోసం వ్యభిచారం కూపంలోకి నెట్టివేసే సోమరిపోతు మరొకడు. ఇలా భారత్ లో భర్తల చేతిలో ఇష్టం లేని కాపురాలు చేసే భార్యలు ఎంతోమంది. భార్య తన స్వంత ఆస్తి అన్నట్లుగా తమ ఎదుగుదల కోసం ఉన్నత స్థితి కోసం భార్యలను వినియోగించే భర్తలు కూడా భారతదేశంలో తక్కువ కాదనే సందర్భాలు కూడా లేకపోలేదు. భార్య తనకు విడాకులు ఇస్తే తన పరువు ఎక్కడ పోతుందోనని ఇంట్లో బలవంతంగా కాపురాలు చేయించుకునే పురుష పుంగవులకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. భార్య మీ అస్తికాదనీ..ఒక వస్తువు అసలే కాదనీ దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది.

భార్య అన్నది 'ఆస్తి' కాదు లేదా 'వస్తువూ' కాదు : సుప్రీంకోర్టు
భార్యకు కూడా ఓ మనస్సుంటుందనీ..దానికి ఆశలు, ఆశయాలు, కోరికలు, స్పందనలు వుంటాయని ఇంగిత జ్నానం లేని మూర్ఖత్వపు భర్తలకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. భార్య తన పెట్టుబడిగా భావించి కోరినంత కట్నం తెమ్మని బాధించే శాడిస్ట్ భర్తలకు ఇకపై ఆటలు చెల్లవని సుప్రీంకోర్టు భావించింది. తనకు ఇష్టం లేని భర్త నుండి విడిపోయే హక్కు భార్య వుందనీ..ఆమెను బలవంతం చేసిన కాపురం చేసేలా చేయటం నేరమని సుప్రీంకోర్టు పేర్కొంది. భార్య అన్నది 'ఆస్తి' కాదు లేదా 'వస్తువూ' కాదు. తనతో కలసి ఉండమని బలవంతం చేస్తే ఇకపై చెల్లదు’’ అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు..
వేధిస్తున్న తన భర్తతో కలసి ఉండలేనంటూ ఓ బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన భర్త తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా తాను మాత్రం అతనితో కలసి అడుగులు వేయలేనని ఆమె కోర్టుకు తెలిపింది. దీనిపై జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ఆమె ఆస్తి కాదు. ఆమె నీతో కలసి జీవించాలనుకోవడం లేదు. ఆమెతో కలసి ఉండాలని ఎలా చెబుతావు?’’ అంటూ బాధితురాలి భర్తను ప్రశ్నలతో కడిగేసింది.

భార్య ఆలోచించుకునే సమయం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు..
ఆమె కలసి జీవించేందుకు ఇష్టంగా లేకపోవడంతో మరోసారి పునరాలోచించుకోవాలని కోర్టు సూచించింది. అయితే, ఆమెను ఒప్పించేందుకు అవకాశం ఇవ్వాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అదే సమయంలో విడాకులు ఇప్పించాలని బాధుతురాలి తరఫు న్యాయవాాది కోరారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్ట్ 8కి వాయిదా వేసింది.

మాన్కాపూర్ లో ఆదివాసీల బహిరంగ సభ..

ఆదిలాబాద్ : నార్నూర్ మండలం మాన్కాపూర్ లో ఆదివాసీల బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభకు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు, కొమరం భీమ్ మనుమడు పోనేరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోనేరావు మాట్లాడుతు వలస లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 

15:16 - April 9, 2018

ఢిల్లీ : దేశంలో జరుగుతున్న దళితులపై జరుగుతున్న దాడులపై ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా నిరసించారు. అందులో భాగంగా ఆయన ఒక రోజు ఉపవాస దీక్షకు పూనుకున్నారు. రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులర్పించిన అనంతరం ఆయన దీక్ష చేపట్టారు. అంతేగాకుండా దేశ వ్యాప్తంగా దీక్షలు చేపట్టాలన్న రాహుల్ పిలుపు మేరకు ఆయా రాష్ట్రాల్లో నేతలు దీక్షలు చేపడుతున్నారు. అయితే దీక్ష వద్ద జగదీశీశ్ టైట్లర్, సచిన్ కుమార్ నుండి తొలగించడం వివాదాస్పదమైంది. వీరిద్దరిపై 1984లో సిక్కు అల్లర్ల ఆరోపణలు ఎదుర్కొవడమే కారణమని తెలుస్తోంది. ఇక రాహుల్ చేపట్టిన దీక్షపై బీజేపీ స్పందించింది. రాజకీయ స్టంట అంటూ అభివర్ణించింది.

ఏప్రిల్ 12న దేశ వ్యాప్తంగా నిరసన దినం పాటించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. వారి వారి నియోజకవర్గాల్లో నిరసనదినం పాటించాలని, పార్లమెంట్ సమావేశాలు అడ్డుకున్నాయని ప్రజలకు తెలియచేయాలని బీజేపీ సూచించింది. అంతలోనే కాంగ్రెస్ దీక్షలు చేపట్టడం గమనార్హం. ఏప్రిల్ 2వ తేదీన దళితులు ఇచ్చిన బంద్ హింసాయుత్మకంగా మారిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో పోలీసులు జరిపిన 11 మంది దళితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

మోదీ ఎన్నారై ప్రధాని : రేణుకా చౌదరి

ఢిల్లీ : మోదీ ఎన్ఆర్ఐ ప్రధాని అని... ఇక్కడ దేశంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఆయన స్పందించరని అన్నారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మరోసారి విమర్శలు గుప్పించారు. రైతులు, దళితుల పట్ల కూడా మోదీ ద్వేష భావంతో వ్యవహరిస్తున్నారని రేణుక విమర్శించారు. పార్లమెంటులో మోదీ చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆమె అన్నారు. తాను మహిళా ద్వేషిననే విషయాన్ని మోదీ నిరూపించుకున్నారని అన్నారు. రాజ్యసభలో రేణుక నవ్వడంపై మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మోదీ చెప్పారనే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటు బెంగాల్ వెళ్లారని ఆరోపించారు.

ఐపీఎల్ కు కావేరీ సెగలు..

తమిళనాడు : కావేరీ నదీ జలాలకు సంబంధించి కర్ణాటక, తమిళ రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కావేరీ నదీ జలాల వివాదంపై అల్లర్లు చెలరేగే అవకాశముందనే నిఘా వర్గాలు సమాచారం మేరకు రేపు చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనున్న క్రికెట్ మ్యాచ్ ను నిరసనకారులు అడ్డుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ కు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు, చెన్నై పోలీసులు అప్రమత్తమయ్యారు.

నీరవ్ మోదీ అరెస్ట్..

ఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 13 వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వర్తకుడు నీరవ్ మోదీ హాంకాంగ్ లో పట్టుబడ్డాడు. సోమవారం ఇతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతన్ని అరెస్టు చేసేందుకు హాంకాంగ్ ప్రభుత్వానికి చైనా అనుమతించింది. భారత దేశంలో ఈ మద్య బ్యాంకులకు భారీ స్థాయిలో కుచ్చు టోపి పెడుతున్న బడాబాబుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పటికే లిక్కర్ కింగ్ విజయ్ మాల్య భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ లో తలదాచుకున్నాడు. ఈ మద్య డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ, రొటమాట్ కొటారీ లు సైతం వేల కోట్లకు ముంచారు.

కావేరీ బోర్టు విషయంలో కేంద్రానికి సుప్రీం ఆదేశాలు..

ఢిల్లీ : కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 3 తేదీలోగా బోర్టు యొక్క ముసాయిదాను అందించాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో కావేరీ బోర్డుపై మే 3న సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి. తమిళనాడు, కర్ణాటకలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశించింది. కాగా పార్లమెంట్ సమావేశాలలో కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడు ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకుంది.

14:32 - April 9, 2018

చెన్నై : కావేరీ జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గత కొంతకాలంగా కావేరీ జలాల విషయంలో తమిళనాడు రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కర్నాటకకే ఎక్కువ శాతం నీరు కేటాయించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు నిరసన తెలియచేస్తున్నారు. ఇటీవలే సినీ ప్రముఖులు ఏకంగా నిరసనకు దిగారు. నీళ్లు లేవంటే ఐపీఎల్ కావాలా ? అంటూ వారు ప్రశ్నించారు. తమిళనాడులో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై తమిళనాడు రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. మేనేజ్ మెంట్ బోర్డు విషయంలో తమను ఎందుకు ప్రశ్నించలేదని కోర్టు ప్రశ్నించింది. మే మూడో తేదీలోగా కావేరి బోర్డు ముసాయిదాను అందించాలనిల కోర్టు ఆదేశించింది. 

14:02 - April 9, 2018

ఆదిలాబాద్ : సంకల్పానికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. దేశం కోసం ఏదో చేయాలనే తపనతో సైకిల్‌ యాత్ర చేపట్టాడు. స్వచ్ఛ భారత్, రోడ్డు భద్రతపై దేశం మొత్తం తిరుగుతూ యువతను చైతన్యవంతులను చేస్తున్నాడు. సైకిల్‌ యాత్రలో భాగంగా తెలంగాణలో ప్రవేశించాడు. జూన్‌ నెలాఖరుకు 15 వేల కిలోమీటర్లు పూర్తి చేసి ఇంటికి చేరుతానంటున్నాడు. ఇదిగో ఇతని పేరు ప్రదీప్‌కుమార్‌సేన్‌. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన ప్రదీప్‌కుమార్‌.. స్వచ్ఛభారత్‌, రోడ్డు భద్రత అనే నినాదంతో దేశవ్యాప్త సైకిల్‌ యాత్ర చేపట్టాడు. 

ప్రదీప్‌కుమార్‌ కొన్ని సంవత్సరాల క్రితం రైలు ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయాడు. డిగ్రీ వరకు చదివిన ప్రదీప్‌.. కాలు కోల్పోవడంతో తన ఆశలు, ఆశయాలను వదులుకున్నాడు. కానీ... దేశం కోసం ఏదో ఒకటి చేసి...తనకు గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించాడు. దీంతో... జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, అపరిశుభ్రతపై యువతలో చైతన్యం తీసుకురావాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం దాన్ని కార్యరూపంలో పెట్టి... దేశ పర్యటనకు బయల్దేరాడు. 

గత ఏడాది నవంబర్‌ 14న ప్రారంభమైన సైకిల్ యాత్ర ఇప్పటివరకు 10 రాష్ట్రాలను చుట్టింది.  ప్రదీప్‌ దాదాపు 6500 కిలో మీటర్లు పూర్తి చేశాడు. తాజాగా తెలంగాణలోని కాగజ్‌నగర్‌కు చేరుకుంది. ప్రదీప్‌కు స్థానికులు, పోలీస్ అధికారులు స్వాగతం పలికారు.  తన యాత్రకు ప్రతి గ్రామంలో అపూర్వ లభిస్తుందన్నారు ప్రదీప్‌. ప్రజలను, విద్యార్థులను చైతన్యవంతులు చేయాలని ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టానన్నాడు. మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, యూపీ, ఢిల్లీ వరకు మొత్తం 15 వేల కిలోమీటర్లు యాత్ర పూర్తి చేసి జూన్‌ చివరి కల్లా ఇంటి చేరుతానంటున్నాడు ప్రదీప్‌. 

మొత్తానికి సంకల్పం ఉంటే అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు ప్రదీప్‌. తనలాగా ప్రమాదాల్లో అవయవాలు పొగొట్టుకోవద్దని... అలాగే అందరూ పరిశుభ్రత పాటించాలని యువతకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ప్రదీప్‌ యాత్ర సక్సెస్‌ సాధించాలని మనమూ కోరుకుందాం. 

13:58 - April 9, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీల పోరు ముగిసింది. మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రధాని మోదీ స్పందించడం లేదని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తామని ఎంపీలు తెలిపారు. నియోజకవర్గాల్లో పర్యటించాలన్న సీఎం చంద్రబాబు సూచనతో ఎంపీలు రాష్ట్రానికి బయలుదేరారు. అటు ఢిల్లీలో వైసీపీ ఎంపీల దీక్షలపై టీడీపీ ఎంపీలు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ ఎంపీల పోరాటం రాజకీయ ఆరాటమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. 

 

13:54 - April 9, 2018

కృష్ణా : గత మూడున్నర ఏళ్లుగా ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధానిలో మెట్రోరైలు అదిగో ఇదిగో అంటుంది. కేవలం ఆర్భటాలకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితం అవుతున్నాయి. దీంతో అసలు  విజయవాడ మెట్రో రైలు కొలిక్కి వస్తుందా  అనుమానాలు నెలకొన్నాయి. కేంద్రం మెట్రోకు పైసా ఇవ్వకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం  మెట్రోరైలు పేరే పెత్తడం లేదు.

విజయవాడ మెట్రో ప్రాజెక్ట్‌పై సందిగ్దం నెలకొంది. తొలి నుంచి విజయవాడ మెట్రోకు అనేక అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. పాలకుల చిత్తశుద్ధి లోపంతో అమరావతి మెట్రో ప్రాజెక్ట్‌ ఊహలకే పరిమితమవుతోంది. నిధుల కేటాయింపుల్లో కేంద్రం వెనక్కు తగ్గడంతో, రాష్ట్ర ప్రభుత్వం సర్వేలకే పరిమితం అయ్యింది.  భూసేకరణలో స్పష్టత లేకపోవడంతో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కథ కంచికి చేరిందనే అనుమానాలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మెట్రోకు  నిధులు విడుదల చేయలేదు. దీంతో అసలు మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా లేదా అన్న సందేహం నెలకొంది. 

ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ 2014లో ఏలూరు, బందర్‌రోడ్డులో  సర్వే  నిర్వహించింది.  26.03 కిలోమీటర్ల మేర రెండు కారిడార్స్‌తో సమగ్ర నివేదిక రూపొందించి రాష్ట్ర  ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది.  ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఎల్‌ అండ్‌ టీ సంస్థకు 30 శాతం ఎక్కువ రేటుకు టెండర్లు ఇచ్చేందుకు డీఎంఆర్సీ సలహాదారు శ్రీధరన్‌ ససేమిరా అన్నారు. టెండర్లు ఎక్కువ కంపెనీలు పాల్గొనేందుకు వీలుగా తిరిగి టెండర్లు పిలవాలంటూ శ్రీధరన్‌ సూచించారు. దీంతో డీఎంఆర్సీని ప్రభుత్వం పక్కకు తప్పించింది.  కథ  మళ్లీ మొదటికి వచ్చింది. 

6వేల 7 వందల 69 కోట్ల వ్యయంతో లైట్‌ మెట్రోను ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. దీంతో మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణతో కలసి అధికారులు చైనాలో పర్యటించి లైట్‌ మెట్రో గురించి అధ్యయనం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మెట్రోరైల్‌ను లైట్‌ తీసుకుంది. దీంతో మెట్రోప్రాజెక్ట్‌ అటకెక్కినట్టు అయ్యింది. 

మెట్రో ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధుల సమీకరణకు  అధికారులు అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం జర్మనీకి చెందిన కే.ఎఫ్‌.డబ్య్లూ. కంపెనీ 2500కోట్లతో ముందుకొచ్చింది. జక్కంపూడి నుండి మూడు కారిడార్లకు లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ సమగ్ర నివేదికను తయారు చేసింది. లైట్‌ మెట్రోపై అనేక రూమర్లు, విమర్శలు రావడంతో కేంద్రం ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. దీంతో ఆ సంస్థ కూడా ముందుకు రావడం లేదనిన మెట్రో రైల్‌ కంపెనీ అధికార వర్గాలు ధృవీకరించాయి. మొత్తానికి మెట్రోపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి.

13:52 - April 9, 2018

హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం రోజున జరిగిన సంఘటనకు బాధ్యులను చేస్తు వీరి సభ్యత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. సభ్యత్వాలను రద్దు చేయడాన్ని కోమటి రెడ్డి, సంపత్‌లు హైకోర్టులో సవాల్‌ చేయగా విచారణ కొనసాగుతోంది. 
 

13:50 - April 9, 2018

ఢిల్లీ : ఏపీకి న్యాయం చేయాలని వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు దిగితే.. టీడీపీ ఎంపీలు ఢిల్లీ రోడ్లమీద పబ్లిసిటీ కోసం స్టంట్‌ చేశారని వైసీపీ నేతలు రోజా, విజయమ్మ విమర్శించారు. దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలపై టీడీపీ నేతల చౌకబారు కామెంట్లు చేస్తున్నారని విజయమ్మ అన్నారు. ప్రధాని మోదీతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తోందని చంద్రబాబేనని ఆరోపించారు. ఏపికి న్యాయం కోసం వైసీపీ నిజాయతీగా పోరాడుతోందన్నారు

 

13:47 - April 9, 2018

ఢిల్లీ : దీక్షచేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన్ను దీక్షా శిభిరం నుంచి ఆర్‌ఎల్‌ఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌కు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు ఇప్పటికీ ఏపీ భవన్‌ వద్ద  ఎంపీలు అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తమ దీక్షను కొనసాగిస్తున్నారు. 

13:45 - April 9, 2018

మనిషికి మనిషి తోడంటారు, బాధలు,సంతోషాలు పంచుకునేందుకు..ఒకరినొకరు తెలుసుకునేందుకు, అర్థం చేసుకునేందుకు, ఒకరి ఆలనా పాలనా మరొకరు చూసుకునేందుకు మనిషికి మనిషి దూరమైపోతున్న 'స్మార్ట్'ప్రపంచం. తనను తాను వెదుక్కునే క్రమంలో మనిషి 'స్మార్ట్'కు బానిసైపోతున్నాడు. అమ్మానాన్నా, భార్యా భర్తా, అన్నా తమ్ముడు, తల్లీ కూతురు ఇలా ఎవరికి వారు తమను 'స్మార్ట్'పలకరించుకుంటున్నారు. మొహం చూసుకుని పలకరించుకునేందుకు మొహం వాచిపోయి 'స్మార్ట్' అయిపోతున్నారు. మనిషి కనిపెట్టిన టెక్నాలజీ మనిషే బానిసైపోతున్నాడు. కుటుంబసభ్యుల మధ్య ‘స్మార్ట్‌’ నిశ్శబ్దం,జంటల మధ్య ‘యాక్టివ్‌’ స్టేటస్‌ చిచ్చు, దూరంగా వుండే మనుషుల్ని కలపేందుకు ఉపయోగపడే ఫోన్ పక్క పక్కనే వున్న మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. బాధ్యతలను, బంధాలను మరిచిపోయేలా చేస్తోంది. భార్యా భర్తల మధ్య మాటల్లేకుండా చేస్తోంది. పచ్చనికుటుంబాల్ని కూల్చేస్తోంది. కాపురాల్లో చిచ్చురేపుతోంది!! ఇవి పచ్చి వాస్తవాలు..సర్వేలో తేలిని భయంకరమైన 'స్మార్ట్' నిజాలు!!

భార్యా భర్త లమధ్య బంధాల్ని దూరం చేస్తున్న స్మార్ట్ ఫోన్..
చిన్నా లేదు.. పెద్దా లేదు! ఫేస్‌బుక్‌ లైకింగ్‌.. వాట్సప్‌ చాటింగ్, షేరింగ్‌.. యూట్యూబ్‌ వాచింగ్‌.. ఇప్పుడు అందరిదీ ఇదే పని. అలసిపోయి ఇంటికి వచ్చే భర్తను పట్టించునేందుకు భార్యకు ఆసక్తి వుండదు. ఇంటెడు చాకిరీ చేసే భార్యను పట్టించుకోని భర్త పొద్దున లేవగానే వాట్సాప్ లో అందరికీ గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌లు పెట్టేస్తాడు. కానీ అన్ని పనులు చేసే భార్య తిన్నదో లేదో తెలుసుకునేందుకు తీరికుండదు. ఇక యూత్ సంగతి చెప్పనే అక్కర్లా. చెవుల్లఓ ఇయర్ ఫోన్స్, తల ఎత్తి బాహ్య ప్రపంచాన్ని చూసే తీరికే లేదు. అంత బిజీ బిజీ..'స్మార్ట్ ఫోన్ లో మునిగిపోయి రోడ్డుకు అడ్డంగా నడుస్తుంటుందో అమ్మాయి. చుట్టుపక్కల జరిగేది గమనించే తీరికుండదు..చుట్టుముట్టబోయే ఆపదల గురించి అసలే ఆలోచించదు..పాప్‌ సాంగ్‌ హైపిచ్‌లో పెట్టి బైక్‌ మీద రయ్‌రయ్య్‌న దూసుకుపోతుంటాడో కుర్రాడు. వెనక నుంచి వచ్చే వాహనాలు చెవులు పగిలిపోయేలా హారన్‌ కొట్టినా వారికి వినపడదు. వాళ్ల లోకం వాళ్లది. రోడ్ల మీదే కాదు.. ఇళ్లల్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి. ఎవరి గోల వారిది. సరిగ్గా వాడుకుంటే మనుషుల్ని కలిపి ఉంచే స్మార్ట్‌ ఫోన్లు.. ఇప్పుడు అష్టమ వ్యసనంలా తయారై కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి! వాట్సప్‌, మెసెంజర్లలో యాక్టివ్‌ స్టేట్‌సలు.. అందమైన జంటల మధ్య అనుమానపు అగాథాలను, అసహనాన్ని సృష్టిస్తున్నాయి!!

స్మార్ట్ బానిసలుగా మారుతున్న వైనం ..
నిద్ర లేవంగానే స్మార్ట్ కోసం తడుముకుంటే లేవటం..ఎవరో పెట్టిన వాట్సప్‌ మెసేజ్‌ చూసుకోవాలి. రిప్లై ఇవ్వాలి..అదొక ప్రధమ కర్తవ్యం అన్నట్లుగా..ఆనక ఆదరాబాదరాగా లేచి ఫోన్‌లో ఫేస్‌బుక్‌ చూసుకుంటూనే పళ్లు తోముడు కార్యక్రమం, స్నానం చేయాలన్నా..కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా పాటలు హోరెత్తిపోవాల్సిందే. అప్పుడు గానీ పనులు పూర్తికావు స్మార్డ్ బిడ్డలకు. టిఫిన్‌ తినేటప్పుడూ అదే తంతు. వాట్సప్‌ మెసేజ్‌లకు రిప్లైలు.. ఫేస్‌బుక్‌లో లైకులు, షేర్లు. సాయంత్రం ఇంటికొచ్చాక కూడా అదే తంతు..ఎడతెగని ఫేస్‌బుక్‌ పోస్టులు, వాట్సప్‌ లో మెసేజ్‌ల వర్షం. అమ్మానాన్నలతో ముక్తసరి మాటలే. దీంతో తల్లితండ్రులకు పిల్లలకు మధ్య దూరం పెరుగటం..పిల్లలు ఏంచేస్తున్నారో పెద్దవారు పట్టికోరు. యువతకు పెద్దవారి నుండి దొరకాల్సిన దిశానిర్ధేశం కనుమరుగైపోతోంది. ఫలితంగా యూత్ పలు విధానల అలవాట్లకు బానిసలుగా మారిన వైనం కూడా లేకపోలేదు.

కుటుంబ వ్యవస్థకు స్టార్మ్ తూట్లు..
భారతదేశం బలం కుటుంబవ్యవస్థ. ఈ కుటంబాలలో స్మార్ట్ చిచ్చుపెడుతోంది. మంచిచెడులు మాట్లాడుకునే తీరికలేదు.. ప్రేమగా పలకరించుకుని నాలుగు మాటలు మాట్లాడుకునే ఆసక్తి లేదు..బంధాలు స్మార్ట్ బీటలువారుస్తోంది. నాతరు వాతే ఎవరైనా ఏమైనా అంటోంది స్మార్ట్. మనుష్యుల మధ్య మాట్లాడుకోవటం తగ్గిపోయి మెసేజ్ సంస్కృతి పెరిగిపోతోంది. అతిథి దేవో భవ! అనే నానుడి నుండి ఇంటికి వచ్చిన అతిథులను స్మార్ట్ గా పక్కకు నెట్టేస్తోంది స్మార్ట్ ఫోన్. వారిని పట్టించుకోకుండా మధ్యలో ఫోన్‌ చూసుకోవడం సాధారణ విషయమైపోయింది. వచ్చినవాళ్లదీ అదే తీరు! అలాగే.. గతంలో ఏదైనా పెళ్లికో పేరంటానికో వెళ్తే అందరూ సరదాగా మాట్లాడుకునేవారు. వరసైనవాళ్ల మధ్య చలోక్తులు..పలకరింపులు, పరామర్శలు. కానీ ప్రస్తుతం ఏ వేడుకలో చూసినా అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే. వాట్సప్‌ షేరింగ్‌లు.. మెసేజ్‌ల ఫార్వర్డ్‌లే. బంధాలు బలహీనపడటానికి మూలాధారంగా మారిపోతోంది స్మార్ట్. దీంతో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య మాటలు కరువైపోతున్నాయి. బందాలు, సంబంధాలు దెబ్బతింటున్నాయి, బీటలువారుతున్నాయి.

భార్యాభర్తల మధ్య స్మార్ట్ చిచ్చు..
భర్త తన మెసేజ్‌కు రిప్లై ఇవ్వకపోతే భార్యకు అనుమానం. భర్త ఫోన్‌ చేసినప్పుడు భార్య లిఫ్ట్‌ చేయకపోతే అనుమానం పెనుభూతమే! స్మార్ట్‌ఫోన్లలో మెసెంజర్‌ యాప్‌ల యాక్టివ్‌ స్టేట్‌స్ లు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. భార్త అంటే భార్యకు నమ్మకం,ధైర్యం,బాసట. భార్య అంటే భర్తకు ఓ బలం, మానసిక థైర్యం, తన కష్టసుఖాల్లో కలిసి నడుస్తుందనే ఓ బలమైన నమ్మకం. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కారణంగా ఇద్దరి మధ్య పొరపొచ్చాలు, అనుమానాలు, కొన్ని పరిస్థితుల్లో కుటుంబాలు కూలిపోతున్న దుస్థితికి కూడా దిగజారిపోతున్న పరిస్థితి. ఆన్‌లైన్‌లో భాగస్వామి స్టేటస్‌ ‘యాక్టివ్‌’లోనే ఉన్నా తమ కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించకపోవడం కొందరిలో మానసిక అశాంతికి, అంతిమంగా మానసిక సమస్యలకు సైతం దారితీస్తోంది.

డ్రగ్‌ పెడ్లర్స్‌ బారిన పిల్లలు..
స్మార్ట్‌ఫోన్ల వల్ల ఇటీవలికాలంలో వచ్చిపడిన మరో సరికొత్త ముప్పు.. డ్రగ్స్‌. కేవలం డ్రగ్స్‌ కొనుగోళ్లు, అమ్మకాల కోసమే కొన్ని వాట్సప్‌ గ్రూపులు ఏర్పడుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. వాట్సప్‌ సందేశాలు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ కావడం వల్ల నిఘా వర్గాలకు ఆ మెసేజ్‌లను ఇంటర్‌సెప్ట్‌ చేసి పట్టుకోవడం కష్టమవుతోంది. కెల్విన్‌లాంటి ముఠాలు పట్టుబడినప్పుడు నేరుగా వారి ఫోన్లలో వాట్సప్‌ గ్రూపులు తెరిచి చూడటం తప్ప మరేం చేయలేని పరిస్థితి. చిన్నారుల నుండి యూత్ అనే తేడా లేకుండా ఇంట్లోనే కూర్చుని ఈ వాట్సప్‌ గ్రూపుల ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నారు. దీనికి బానిసలుగా మారిన తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలలో డ్రగ్స్‌ కోసం వారు ఎంతటి పనికైనా సిద్ధపడి జీవితాలను పోగొట్టుకున్న వైనాలు ఎన్నో. ఎన్నెన్నో. డ్రగ్స్ కోసం తమ నగ్నచిత్రాలను పంపించేదుకు కూడా వెనుకాడటంలేదు. ఇంతటి దుర్భలత్వానికి దిగజార్చే డ్రగ్స్ కు వారిధిగా స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడుతున్నాయి. మత్తుకు బానిసైన అమ్మాయిలు అందుకూ సిద్ధమవుతున్నట్టు ఇటీవల బయటపడ్డ కేసుల్లో స్పష్టమైంది. నగ్న చిత్రాలు పంపించిన తరువాత లైంగిక కోర్కెలు తీర్చాలనీ కూడా షరతులు పెడుతున్నారు డ్రగ్స్ ముఠా సరఫరా దారులు. ఈ రెండో దశలోకి వెళ్లిన అమ్మాయిలు కూడా కొందరు ఉన్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని విశ్వసనీయవర్గాలు పేర్కొనడం ఆందోళనకరం.

విచక్షణ వుంటే చెడ్డే కాదు మంచి కూడా..
స్మార్ట్‌ఫోన్‌ వల్ల అన్నీ నష్టాలే కాదు.. కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. వేరే ఊళ్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు రాత్రిపూట ఎంతసేపటి దాకా మేలుకొని ఉంటున్నారన్నది తల్లిదండ్రులు.. వారి యాక్టివ్‌ స్టేటస్‌, వాట్సప్‌ లాస్ట్‌సీన్‌ వంటివాటి ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. పిల్లలకు ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా ఈ యాప్‌ల వల్ల సాధ్యమవుతోంది. అంతేకాదు.. జంటల మధ్య చిచ్చుపెడుతున్న ఈ యాప్స్‌నే అనుబంధాలు పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ప్రేమతో కూడిన కమ్యూనికేషన్..
భాగస్వామి మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేసే చిన్నచిన్న మెసేజ్‌లు.. అవి సొంతంగా రాయనక్కర్లేదు.. వచ్చినవాటిని ఫార్వర్డ్‌ చేసినా సరిపోతుందని వారు సూచిస్తున్నారు. అలాగే.. ఇంట్లో అన్నం తినేటప్పుడు డైనింగ్‌ టేబుల్‌ వద్దకు, పడగ్గదిలోకి ఫోన్‌ తీసుకెళ్లకుండా ఉండగలిగితే చాలావరకూ సమస్యలు సమసిపోతాయని వారు చెబుతున్నారు. పిల్లలు సోషల్‌ మీడియాలో ఎవరితో టచ్‌లో ఉంటున్నారో మధ్యమధ్య పర్యవేక్షించడం మంచిదని సూచిస్తున్నారు.

పెరుగుతున్న ‘స్మార్ట్‌’ రోగాలంటున్న నిపుణులు..
స్పాండిలైటిస్‌ లాంటి వి ఒకప్పుడు కొద్దిమందికే వచ్చేవి. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక చాలామంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. అదొక్కటే కాదు.. స్మార్ట్‌ఫోన్ల వల్ల ఎక్కువగా వస్తున్న ఆరోగ్య సమస్యలు చాలానే ఉన్నాయి. మచ్చుకు కొన్ని..పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌ వాడేవారికి వచ్చే సమస్య ఇది. మెడ నిటారుగా ఉన్నంతకాలం దానికి ఎలాంటి సమస్యలూ రావు. కానీ.. స్మార్ట్‌ఫోన్లు చూసేక్రమంలో మనం మెడను 60 డిగీల్ర మేర కిందికి వంచుతాం. ఇలా ఎప్పుడైనా చేస్తే ఫర్వాలేదుగానీ.. రోజూ గంటల తరబడి, అలా ఏళ్ల తరబడి చూస్తే మెడనొప్పితో మొదలై వెన్నుపూస సమస్యలకు దారితీస్తుంది. ఇలా అనేక విధాల దీర్ఘకాలిక వ్యాధులకు కూడా స్మార్ట్ ఫోన్ కారణంగా మారుతోంది. ఏది ఏమైనా టెక్నాలజీ మంచిదే..మంచి ఉపయోగించుకుంటే మంచిది. అతిగా వినియోగిస్తే జీవితాలను కూడా స్మార్ట్ గా కబళించేస్తుంది స్మార్ట్ ఫోన్!!తస్మాత్ జాగ్రత్త!!!

13:26 - April 9, 2018

సూర్యాపేట : జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. అర్వపల్లి మండలం కొమ్మల గ్రామంలో పెళ్లిపనులు చేస్తుండగా విద్యుత్‌షాక్‌ తగిలి ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొకుడు తండ్రి సత్యనారాయణ, పెళ్లికొడుకు బావ శోభన్‌బాబు అక్కడిక్కడే చనిపోయారు. కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

 

ఆరోగ్య రథాలను ప్రారంభించిన చంద్రబాబు..

అమరావతి : ఆరోగ్య రథాలను సీఎం చంద్రబాబు, మంత్రి కళా వెంకట్రావు ప్రారంభించారు. ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య రథాలు కొనసాగనున్నాయి. వీటిలో దాదాపు 200ల వైద్యపరీక్షలతో పాటు రిస్పెన్సరీ కూడా అందుబాటులోవుంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించినున్న ఆరోగ్య రథాలలో వైద్యఆరోగ్య సిబ్బంది అందుబాటులో వుంటారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

13:08 - April 9, 2018

ఢిల్లీ : హస్తినలో దీక్షచేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన్ను దీక్షా శిభిరం నుంచి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌కు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు ఇప్పటికీ ఏపీ భవన్‌ వద్ద  ఎంపీలు అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తమ దీక్షను కొనసాగిస్తున్నారు. 

గురజాలలో గోవుల మృత్యుఘోష..

గుంటూరు : గురజాల మండలం దైదాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో మేత మేస్తూ 56 ఆవులు మృతి చెందాయి. నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన ఓ రైతు మేత కోసమంటూ 100 ఆవుల మందను గురజాల తీసుకురాగా పొలంలో మొక్కజొన్న పిలకలను తిని ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. 56 ఆవులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా... మిగతావి అనారోగ్యంతో మృత్యువుఓ పోరాడుతున్నాయి. ఘటనకు స్పష్టమైన కారణం తెలియాల్సి ఉంది.

13:06 - April 9, 2018

ఢిల్లీ : సీఎం చంద్రబాబును రాజీనామా చేయాలన్న విపక్షనేతల డిమాండ్‌ను ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి  ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను మోసం చేసిన ప్రధాని మోదీ ముందుగా రాజీనామా చేస్తే.. సీఎం చంద్రబాబు రెండు నిముషాల్లో పదవి నుంచి తప్పుకుంటారని జేసీ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎంపీ అశోక్‌జగజపతి రాజు తీవ్రంగా దుయ్యబట్టారు. జాతీయ పార్టీలు బాధ్యతలేకుండా వ్యవహరించడం వల్లే రాష్ట్ర విభజన అస్తవ్యస్థంగా సాగిందన్నారు. 

13:04 - April 9, 2018

ఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తోందని టీడీపీ ఎంపీలు విమర్శించారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న ఎంపీలు.. మోదీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులతో ఈడ్చి పడేశారని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అటు పార్లమెంటులో ఏపీ సమస్యలను చర్చించడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వం.. ఇటు బయట నిరసన తెలుపుతున్నా.. పోలీసులతో జులుం ప్రదర్శిస్తోందని విమర్శించారు.  కేంద్రం వైఖరిని ఇక ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామంటున్నారు. దీనికోసం పోరాట వేదికను ఇక రాష్ట్రానికి మార్చేస్తామన్నారు. రాజ్‌ఘాట్‌లో మహాత్ముని సమాధివద్ద మౌన ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఎంపీలు  తమ భవిష్యత్‌ పోరాట నిర్ణయాన్ని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ఇక రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలను కదిలిస్తామని స్పష్టం చేశారు. 

 

ఢిల్లీలో ముగిసిన టీడీపీ ఎంపీల ఫైట్..

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఫైట్ కు ముగింపు పలికారు. ప్రజాక్షేత్రంలోనే బీజేపీని ఎండగట్టేందుకు స్వరాష్ట్రానికి బయలుదేరారు. బీజేపీ వైఖరిని ప్రజల మధ్యలోనే వుంటు ఎండగట్టేందుకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలను సీఎం చంద్రబాబు ఎంపీలకు ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చి ప్రజల మధ్యనే బీజేపీ తీరును వివరించేలా ఉద్యమం చేయాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. దీంతో ఎంపీలంతా ఏపీకి బయలుదేరారు.

12:47 - April 9, 2018

చిత్తూరు : మండే ఎండల్లో చెట్టునీడ స్వాంతన ఇచ్చినట్టే.. ఆకలిగొన్న వారికి అన్నప్రసాదంతో స్వాంతన కలిగిస్తోంది టీటీడీ. వ్యయ ప్రయాసలకోర్చి ఏడుకొండలవాడి సన్నిధికి చేరుకున్న భక్తులకు అన్నప్రసాదం వితరణ నిర్విఘ్నంగా సాగుతోంది. 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన అన్నదానం నిరాటంకంగా కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టు సేవలపై టెన్‌టీవీ స్టోరీ. 

తిరుమల శ్రీనివాసుని నిత్యాన్న ట్రస్టు 33 వసంతాలు పూర్తి చేసుకుంది. రోజుకు రెండు వేల మంది భక్తులకు వితరణ ప్రారంభించి... ప్రస్తుతం రోజుకు లక్షా 50 వేల మందివరకు అన్నప్రసాదం అందిస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉచితంగా భోజనం అందించాలనే ఆలోచనతో 1985, ఏప్రిల్‌ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకం మొదలైంది. అప్పటి ముఖ్యమంత్రి  నందమూరి తారకరామారావు ఈ పథకాన్ని ప్రారంభించారు. తరువాత 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టును ఏర్పాటు చేశారు.  

తిరుమలలో జనవరి 1 న్యూఇయర్‌ సందర్భంలో, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజుల్లో 2 లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదం అందిస్తోంది. భక్తులకు ప్రతి మూడు గంటలకోసారి అన్నప్రసాదం అందిస్తున్నారు. టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందించేందుకు రోజుకు 10 వేల లీటర్ల పాలను  కొనుగోలు చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున వితరణ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 

తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు చట్నితో కలిపి ఉప్మా, పొంగళి, సేమియా ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి 5 నుండి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగలి, చట్ని, అన్నం, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు.  అన్నప్రసాదాల తయారీకి రోజుకు 10 నుండి 12 టన్నుల బియ్యం, 6.5 నుండి 7.5 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. గత 33 ఏళ్లుగా భక్తులు విరాళాలతో అన్నదానం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ మార్చి నెలాఖరు వరకు  అన్నదాన ట్రస్టుకు రూ.937 కోట్ల డిపాజిట్లు చేరుకున్నాయి. 

స్వామివారి సన్నిధిలో ఆకలి మంటలు ఉండరాదన్న సత్‌సంకల్పంతో ప్రారంభమైన అన్నదానం.. భవిష్యత్తులో కూడా నిరాటంగా కొనసాగిస్తామని ట్రస్ట్‌ చెబుతోంది. వ్యయ ప్రయాసలకోర్చి ఏడుకొండల వాడిని దర్శించుకున్న భక్తులు.. అన్న ప్రసాదం స్వీకరించి తిరుమల యాత్రను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు.  

12:42 - April 9, 2018

విజయవాడ : ఏపీ నవ్యాంధ్రపదేశ్‌లో విస్తరిస్తున్న ఆక్వాసాగుతో ప్రమాద ఘంటికలు మోగుతోన్నాయి. కళకళలాడాల్సిన పచ్చని పంట పొలాలు ఆక్వా దెబ్బకు పొలాలు కకావికలమౌతున్నాయి. అనుమతులు లేనప్పటికీ విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతుండటంతో... పంటలు పండించే రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ అంశాలపై 10టీవి ప్రత్యేక కథనం.
ఆక్వాసాగుతో ప్రమాద ఘంటికలు 
ఆక్వా సాగు ఇతర పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో రైతులు గగ్గోలు పెడుతోన్నారు. పంటలు పండించే రైతులు సాగునీరు సకాలంలో సమృద్దిగా స్వదినియోగం చేసుకోలేక సతమతమౌతున్నారు. రోజురోజుకు ఆక్వా సాగు విస్తరించుకుంటూపోతుండడంతో ఇతర పంటలు పండించుకునే రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సారవంతమైన భూముల్లోకి పొలాల్లోకి ఆక్వా చేరడంతో చెరువులు కుంటలుగా మారుతోన్నాయి. భూగర్భ జలాలు సైతం ఆక్వా దెబ్బకు కలుషితమవుతున్న ఘటనలు పలు గ్రామాల్లో వెలుగు చూస్తున్నాయి. 
వంటి ప్రాతాలో ఉప్పునీటితో రొయ్యల సాగు 
జిల్లాలోని తీరు మండలాలైన పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, కోడూరు, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల ప్రాంతాల్లో ఆక్వాసాగు పెరిగింది. ఇక్కడ ఉప్పునీటి సాయంతో వనామీ రొయ్యల సాగు చేయడంతో సమీపంలోని వరి పొలాల్లోకి ఉప్పునీరు ప్రవేశిస్తున్నాయి. దీంతో ఎకరానికి 35 బస్తాలు పండే మాగాణి, మెట్ట భూములు సైతం చౌడు నేలలుగా మారుతున్నాయి. చల్లపల్లి, గూడూరు, పెడన, మచిలీపట్నం కోడూరు మండలాల్లో పలు గ్రామాలు ఇదే పరిస్థితి నెలకొంది.
ఊపందుకుంటున్న రొయ్యల సాగు
వరిసాగుకు అధికారులు సకాలంలో నీరు సరఫరా చేయకపోవడంతో రొయ్యలసాగు ఊపందుకుంది. దీనికితోడు  ధాన్యానికి గిట్టుబాటు ధర కరువవడంతో వనామీ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర పలుకుతుండటంతో... రైతులు ఆక్వాసాగు వైపు ఆసక్తి చూపుతున్నారు.
కలుషితమైన భూగర్భ జలాలు
పంట పొలాల చూట్టూ చెరువులు విస్తరించడంతో భూగర్భ జలాలు ఉప్పగా మారి పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. ఆక్వా చెరువుల్లో రసాయనాలు అత్యధికంగా వినియోగిస్తుండటంతో నీరు సహజత్వాన్ని కోల్పోయి కలుషితం అవుతోంది. మళ్లీ ఈ నీటినే డ్రెయిన్లలోకి వదుతుండటంతో ఆ నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.
ప్రత్యామ్నాయ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి : రైతులు 
ఈ పరిస్థితులపై పాలకులు, అధికారులు స్పందించాలని సాధారణ రైతులు కోరుతున్నారు. ఇతర పంటలకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని రైతులు కోరుతున్నారు. ఆక్వాను ఎంతవరకు ప్రోత్సహించాలో అంతమేరకు ప్రోత్సహించాలని, వరి కూరగాయల సాగు వంటి ప్రధాన పంటల్లోకి ఆక్వా చొచ్చుకువస్తే రాబోయే రోజుల్లో దుర్భర పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ ఆక్వాతో ఇతర పంటలకు నష్టలేకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాల్సి ఉంది. 

 

12:39 - April 9, 2018

ఢిల్లీ : హస్తినలో కొనసాగుతున్న వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ఎంపీలకు ప్రతి మూడు గంటలకు ఓసారి డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. ఎంపీల ఆరోగ్యంపై వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.  మరోవైపు ఎంపీల దీక్షకు వర్షంతో ఇబ్బందులు తలెత్తాయి. ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీలో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు దీక్షా శిభిరం వద్ద టెంట్లు ఎగిరిపోయాయి. దీంతో ఎంపీలు ఏపీ భవన్‌లోపలే దీక్షను కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర దిగి వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామంటున్నారు. 

సభ్యత్వ రద్దు కేసును రిజర్వులో పెట్టిన హైకోర్టు..

హైదరాబాద్ : ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వ రద్దు కేసును న్యాయస్థానం రిజర్వులో పెట్టింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్వత్యం రద్దు కేసు విషయంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ విషయంపై పిటీషన్ వేసిన కోమటిరెడ్డి,సంపత్ కుమార్ ల పిటీషన్ పై వాదనలు పూర్తయ్యాయి. అనంతరం కేసును న్యాయస్థానం కేసును రిజర్వులో పెట్టింది. కాగా ఈ కేసుకు సబంధించి వీడియోను కోర్టుకు సమర్పించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవటంపై కేసును రిజర్వులో పెట్టినట్లుగా తెలుస్తోంది.   

11:45 - April 9, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజ్ ఘాట్ వద్ద మహాత్మగాంధీ సమాధికి నివాళులర్పింంచారు. అనంతరం ఎంపీలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సుజనాచౌదరి మాట్లాడుతూ కేంద్రం మొద్ద నిద్ర...ప్రజాక్షేమం కాదన్నారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం నుంచి స్పందన వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఇన్ సెన్సిటివ్ గా ఉంటామనడం ప్రజాక్షేత్రంలో తప్పు అన్నారు. పార్లమెంట్ వ్యవహారం అంటే భిన్నాభిప్రాయం నుంచి ఏకాభిప్రాయం సాధించడం అన్నారు. మెజారిటీ ఉన్న వాళ్లు లెక్కలేనితనంగా ఉంటే మళ్లీ ప్రజాస్వామ్యంలో బతికి బట్టకడతారన్న నమ్మకం లేదని చెప్పారు. ఎవరివో డ్రామాలో ప్రజలకు బాగా తెలుసునన్నారు. మోడీని రాజీనామా చేయమని వైసీపీ ఎంపీలు ఎందుకు అడగలేదన్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఐదు మంది మాత్రమే రాజీనామా చేశారని.. మిగిలిన వైసీపీ లోక్ సభ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. హోదా ఇవ్వాల్సింది కేంద్రం అన్నారు. ప్రజలను చైతన్యం చేసి, పోరాటం చేస్తామని చెప్పారు. 
అశోక్ గజపతిరాజు...
కన్ ఫ్యూజన్ పడవద్దు.... జనాన్ని కన్ ఫ్యూజన్ లోకి తోయవద్దన్నారు. జాతీయ పార్టీలకు ఒక బాధ్యత ఉందన్నారు. ఆనాడు అన్ని జాతీయ పార్టీలు ప్రత్యేకహోదా అడిగాయన్నారు. తెలుగువారికి అవకాశాలిస్తే నిరూపిస్తారని చెప్పారు. తెలుగువారు దేశంలో భాగమన్నారు. కేంద్రం దేశం కోసం పని చేయాలని...రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదన్నారు.
అన్నిరాష్ట్రాలను అదుకునే బాధ్యత, బాగు చేసే బాధ్యతను కేంద్రం స్వీకరించాలన్నారు.
మురళీమోహన్
స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే వరకు, విభజన హామీలను పూర్తి అయ్యేవరకు పోరాటం ఆపబోమని మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ తీసుకున్నామని మురళీమోహన్ అన్నారు. ప్రతిజ్ఞను నూటికి నూరు శాతం పాటిస్తామన్నారు.
రామ్మోహన్ నాయుడు
గాంధీ విగ్రహం సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల కోసం పార్లమెంటో పోరాడామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నినాదంతో ముందుకు నడుస్తున్నామని...గాంధీ తమకు స్ఫూర్తినిస్తున్నారని తెలిపారు. స్వతంత్రదేశంలో మనం ఉన్నామంటే దానికి మహాత్మగాంధీ కారణమన్నారు.

 

మోదీ సరైన పద్ధతిలో పెరగలేదు : జేసీ

ఢిల్లీ : సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీపై తనదైన శైలిలో మండిపడ్డారు. నరేంద్ర మోదీది హృదయం కఠిన శిలవంటిదనీ, దానికి స్పందించే హృదయం లేదనీ... ప్రేమాభిమానాలు అంటే అతనికి తెలియవని పద్ధతిలో అతను పెరిగాడని జేసీ ఎద్దేవా చేశారు. ప్రేమంటే ఏమిటో తెలియని పద్ధతిలో ప్రధాని నరేంద్రమోదీ పెరిగారని జేసీ వ్యాఖ్యానించారు. 

అనాధపిల్లలను పెంచుకోని ప్రధానికి జేసీ సలహా..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ ఎంపీ సంచలనాత్మక సలహాలను ఇచ్చారు. ప్రేమతో పనిచేయడం నేర్చుకోమనీ..అనాధాశ్రమానికి వెళ్లి పిల్లలను తెచ్చి పెంచుకుంటే, ఆ ప్రేమ మాధుర్యమేంటో తెలుస్తుంది! ప్రేమంటే నీకేం తెలుస్తుందిలే అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అమ్మను ఒకచోట, భార్యను ఇంకొక ఆమెను ఇంకో చోట పారేశావు..అటువంటి నీకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది అన్ని ప్రశ్నించారు. 

రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టొదు : అశోక్ గజపతిరాజు

ఢిల్లీ : రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఇది సరైనది కాదని టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. జాతీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవుసరముందన్నారు.దేశమంటే మట్టికాదు..దేశమంటే మనుష్యులు అని కేంద్రం గ్రహించాలనీ, గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. 

క్షీణించిన వైవీ.సుబ్బారెడ్డి ఆరోగ్యం, ఆసుపత్రికి తరలింపు...

ఢిల్లీ : నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించటంతో ఆయనను ఆర్ఎల్ ఎం ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్షీణించటంతో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటు తలపెట్టిన వైసీపీ ఎంపీల నిరాహారదీక్ష నేపథ్యంలో సుబ్బారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

ఐదుగురితో చేయించి నాటకాలు : జేసీ

ఢిల్లీ : జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు ఏడుగురితోను రాజీనామాలు చేయించకుండా కేవలం ఐదుగురితో మాత్రమే చేయించిన వైసీపీ లాలూచీ రాజకీయాలు బైటపడ్డాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీని ఎద్దేవా చేశారు. ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ప్రశ్నించేదుకు అస్కారం వుండదని గతంలో అన్న జగన్ ఇప్పుడు కేవలం ఐదుగురితో మాత్రమే చేయించి నాటకాలాడుతున్నారని జేసీ విమర్శించారు. 

రాజీనామాలు చేసి పీఎంఓలో టీ తాగి హోదా దీక్షలా: మంత్రి కళా

అమరావతి : పగలు రాజీనామాలు చేసి..సాయంత్రం పీఎంఓలో టీ తాగితే ప్రత్యేకహోదా రాదంటూ వైసీపీపై టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆరునూరైనా విభజన హామీలు నెరవేర్చాల్సిందేనని, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగామని, తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తమ ఎంపీలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, పార్లమెంట్ లో ప్రధాని మోదీ విఫలమైనందునే ఆయన ఇంటిని ముట్టడించామని అన్నారు.

10:54 - April 9, 2018

ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాల అమలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని..వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, జనసేన నేత అద్దెపల్లి శ్రీధర్, వైసీపీ నేత రోశయ్య పాల్గొని, మాట్లాడారు. కేంద్ర తన మొండి వైఖరి విడనాడి ప్రత్యేక హోదా ఇవ్వాలని...ఏపీకి న్యాయం చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రైతన్నలకు విపత్తు సాయం త్వరితగతిన : చంద్రబాబు

అమరావతి : నిధుల విషయంలో ఏపీ పట్ల కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నాగానీ అధికంగా నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలనీ..రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలనీ, ప్రకృతి విపత్తు సాయం రైతులకు త్వరంగా అందేలాగా వెంటనే చర్యలు తీసుకోవాలని టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నరేగా నిధులు రూ.10వేల కోట్లు వినియోగించుకోవాలని సూచించారు. నరేగా నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలిపారు. ఏదో సాకుతో నిధులు నిలిపివేసే అవకాశం కేంద్రానికి ఇవ్వొద్దన్నారు. నరేగాలో అన్ని పనులను జియోట్యాగింగ్ చేయాలని సీఎం ఆదేశించారు.

వేసవి జాగ్రత్త కోసం అధికారులకు చంద్రబాబు ఆదేశాలు..

అమరావతి : వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చిన ప్రతి అర్జీని స్వీకరించాలని... త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యాన రంగాలలో లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు తెలిపారు. పశుగణాభివృద్ధి, ఆక్వా రంగాలలో ఆదాయం మరింత పెరగాలన్నారు. అర్హులైన ప్రతిరైతుకు రుణమాఫీ ప్రయోజనం అందించాలన్నారు. సామూహిక గృహ ప్రవేశాలను వేడుకగా నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను టెలాకాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.

ఏపీ హక్కులు,రాష్ట్ర అభివృద్ధి రెండు జరగాలి : చంద్రబాబు

అమరావతి: ఒకవైపు కేంద్రంపై మన హక్కుల కోసం పోరాడుతున్నామని, మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిర్విఘ్నంగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. మన ఎంపీలు కేంద్రంపై పోరాడుతున్నారని... అదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం పనిచేయాలని చంద్రబాబు అన్నారు. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రజలను చైతన్యపరచాలని తెలిపారు. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించాలని సీఎం సూచించారు.

కామన్వల్త్ లో భారత్ పతకాల పరంపర..

హైదరాబాద్ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత షూటర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. నిన్న మహిళా షూటర్లు 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకుంటే సోమవారం పురుషులు స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. అనంతరం పురుషుల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో జీతూరాయ్‌ స్వర్ణం గెలుచుకోగా ఇదే ఈవెంట్‌లో ఓమ్‌ మితర్వాల్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఆసీస్‌ షూటర్‌ కెర్రీ బెల్‌ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మెహులి ఘోష్‌, అపూర్వి చండేలా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

శివసేన నేతల హత్య కేసులో ఎమ్మెల్యే అరెస్ట్..

ఢిల్లీ :  ఇద్దరికి హత్యకు చేసిన కేసులో ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు.  మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన శివసేన నేతలు సంజయ్ కోట్కర్, వసంత్ ఆనంద్ ల హత్య కేసులో ఎన్సీపీ ఎమ్మెల్యే సంగ్రామ్ జగ్తాప్ తో పాటు ఓ షార్ట్ షూటర్ ను, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

రాష్ట్రం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం : టీడీపీ ఎంపీలు

ఢిల్లీ: ఏపీ అభివృద్ధి కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఎంపీ మురళీమోహన్‌ స్పష్టం చేశారు. మోదీ ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మరో ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. హోదా కోసం పోరాటం ఉధృతం చేసిన టీడీపీ ఎంపీలు సోమవారం ఉదయం రాజ్‌ఘాట్ వద్ద మౌనదీక్షకు దిగారు. గాంధీ స్ఫూర్తితో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, విభజన హామీలు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు.

వైసీపీ ఎంపీలకు అస్వస్థత..

ఢిల్లీ : దేశ రాజధానిలో వైసీపీ ఎంపీలు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ లో దీక్ష కొనసాగిస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో దీక్ష కొనసాగించేందుకే వారు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ తమ దీక్షను కొనసాగిస్తామని వైసీపీ ఎంపీలు పేర్కొంటున్నారు.

పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం..

సూర్యాపేట : అరవవల్లి మండలం కొమ్మలలో విషాదం నెలకొంది. వివాహం జరగాల్సిన ఇంట్లో మృత్యు ఘంటికలు మ్రోగాయి. వివాహం కోసం డెకరేషన్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృత్యువాత పడిన ఘటలో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. మృతులిద్దరు మామ, అల్లుడు కాగా వారి ఇల్లు శోకసముద్రంగా మారిపోయింది. మామ సత్యనారాయణ వయస్సు 55 కాగా , అల్లుడు శోభన్ బాబు వయస్సు 30 ఏళ్లు. ఈ నెల 12వ తేదీన సత్యనారాయణ కుమారుడి వివాహానికి ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తో మామ, అల్లుళ్లు మృతి చెందారు. దీంతో తీవ్ర విషాదం నెలకొంది.  

టీడీపీ ఎంపీల శాంతియుత దీక్ష..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ పోరుబాట పట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళన మరింత తీవ్రం చేశారు. సోమవారం ప్రధానమంత్రి నివాసం ముట్టడికి యత్నించి రాజధానిలో ఒక్కసారిగా హీట్‌ పెంచిన ఎంపీలు ఈరోజు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ఉదయం ప్రత్యేక బస్సులో రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ఎంపీలు జాతిపితకు నివాళులర్పించారు. ప్రత్యేక హోదా సాధనకు శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

కశ్మీర్ లో భూప్రకంపనలు..

ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌, పంజాబ్ రాష్ట్రాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపన 4.0గా నమోదైందని విపత్తు నిర్వహణా శాఖ ప్రకటించింది. ఉదయం 6.06కు ఈ భూకంపం వచ్చిందని దీని కేంద్రం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ సమీపంలో ఉందని అన్నారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్టు రిపోర్టులు రాలేదని అధికారులు వెల్లడించారు. భూకంపంపై మరింత సమాచారం తెలియాల్సి వుంది. 

ఢిల్లీలో వర్ష బీభత్సం..

ఢిల్లీ : ఈరోజు ఉదయం భారీగా ఈదురుగాలులు వీయడంతో పాటు వర్షం కురిసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలచిపోయింది. వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ ప్రకారం, ఈ రోజంతా వర్షం కురుస్తుందని, పిడుగులు పడే అవకాశాలున్నట్టు తెలిపింది. ఢిల్లీ, దక్షిణ హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఢిల్లీలో ఈరోజు కురిసిన వర్షం కారణంగా ఏపీ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ దీక్షా శిబిరం టెంట్లు కుప్పకూలిపోయాయి.

09:43 - April 9, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేకహోదా కోసం హస్తినలో పోరాటం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిన్న ప్రధాని నివాసం వద్ద నిరసన సందర్భంలో బలవంతంగా అరెస్టు చేయడంపై ఎంపీలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి మౌనదీక్షకు దీక్షకు సిద్ధమయ్యారు. ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రం దిగివచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని టీడీపీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. 
వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష 
హస్తినలో వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ఎంపీలకు ప్రతి మూడు గంటలకు ఓసారి డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. మరోవైపు నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన ఎంపీ వరప్రసాద్‌ను ఆర్‌ఎల్‌ఎమ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంపీల ఆరోగ్యంపై వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర దిగి వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామంటున్నారు. 

 

09:38 - April 9, 2018

ఢిల్లీ : ఆస్ట్రేలియాలో జరుగుతోన్న 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ సత్తా చాటుతోంది.ఆదివారం మూడు స్వర్ణాలను గెలుచుకుంది. సింగపూర్‌తో జరిగిన టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌ మహిళా జట్టు 3-1 తేడాతో విజయం సాధించి స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. తొలిసారిగా టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో మహిళల జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ 69 కేజీల విభాగంలో పూనమ్‌ యాదవ్‌ స్వర్ణ పతకం గెలవగా.. 10 మీటర్ల మహిళల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనూ భాకర్‌ స్వర్ణం సాధించింది. ఇదే విభాగంలో హీనా సిద్ధు రజత పతకం గెలిచారు. దీంతో 7 స్వర్ణాలు, 2 రజతం, 3 కాంస్య పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. భారత్‌ సాధించిన 6 స్వర్ణాల్లో ఐదు వెయిట్‌ లిఫ్టర్లవే కావడం విశేషం. ఇక సీడబ్ల్యూజీ బ్యాడ్మింటన్‌ మిక్సిడ్‌లో భారత్‌ తొలిసారిగా ఫైనల్స్‌కు చేరుకుంది. సోమవారం టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు మ్యాచ్‌ జరగనుంది.

 

09:33 - April 9, 2018
09:32 - April 9, 2018

హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కారు ప్రమాదానికి గురైంది. జౌరంగబాద్‌లో సభ ముగించికొని తన కారులో వెళుతుండగా దారి మధ్యలో కారును లారీ వెనక నుండి ఢీ కొట్టింది. డ్రైవర్‌ అప్రమత్తతో రాజాసింగ్‌ సురక్షితంగా బయట పడ్డారు. లారీ మరో కారును ఢీ కొట్టడంతో కారులోని పలువురికి గాయాలు కాగా.. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. దీంతో రాజాసింగ్‌ తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

 

ఎంపీ వరప్రసాద్‌ కు తీవ్ర అస్వస్థత.. చికిత్స

ఢిల్లీ : హస్తినలో కొనసాగుతున్న వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ఎంపీలకు ప్రతి మూడు గంటలకు ఓసారి డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన ఎంపీ వరప్రసాద్‌ను ఆర్‌ఎల్‌ఎమ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

09:05 - April 9, 2018

ఢిల్లీ : హస్తినలో కొనసాగుతున్న వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ఎంపీలకు ప్రతి మూడు గంటలకు ఓసారి డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. మరోవైపు నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన ఎంపీ వరప్రసాద్‌ను ఆర్‌ఎల్‌ఎమ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంపీల ఆరోగ్యంపై వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర దిగి వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామంటున్నారు. 

 

ఢిల్లీలో కొనసాగుతున్న వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష

ఢిల్లీ : హస్తినలో కొనసాగుతున్న వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ఎంపీలకు ప్రతి మూడు గంటలకు ఓసారి డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. మరోవైపు నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన ఎంపీ వరప్రసాద్‌ను ఆర్‌ఎల్‌ఎమ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

09:02 - April 9, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిన్న ప్రధాని నివాసం వద్ద నిరసన సందర్భంలో బలవంతంగా అరెస్టు చేయడంపై ఎంపీలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి మౌనదీక్షకు దీక్షకు సిద్ధమయ్యారు. ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రం దిగివచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని టీడీపీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. 

ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిన్న ప్రధాని నివాసం వద్ద నిరసన సందర్భంలో బలవంతంగా అరెస్టు చేయడంపై ఎంపీలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి మౌనదీక్షకు దీక్షకు సిద్ధమయ్యారు.  

ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిన్న ప్రధాని నివాసం వద్ద నిరసన సందర్భంలో బలవంతంగా అరెస్టు చేయడంపై ఎంపీలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి మౌనదీక్షకు దీక్షకు సిద్ధమయ్యారు.  

08:58 - April 9, 2018

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు.. దళిత గిరిజనుల హక్కుల పరిరక్షణ నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆందోళన బాట పట్టాయి. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 40 వేల మంది కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత కల్పించి వారి వేతనాలు పెంచి ఇవ్వాలని అదే సమయంలో అక్కడ పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ కార్మికుల హక్కులను కూడా పరిరక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో ఏప్రిల్‌ 11, 12, 13 తేదీల్లో పాదయాత్ర నిర్వహించి 13న చలో మున్సిపల్‌ డీఎంఏ ఆఫీస్‌ను ముట్టడించాలని వారు కార్యాచరణ ప్రకటించారు. ఇదే అంశంపై సీఐటీయూ నాయకులు ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:54 - April 9, 2018

హైదరాబాద్ : గ్రాండ్‌ ప్లీనరీకి టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఈనెల 27న కొంపల్లిలో ప్లీనరీని నిర్వహించనుంది. ఈ సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి 150 మంది చొప్పున మొత్తం 15 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి బహిరంగ సభను అక్టోబర్‌ లేదా నవంబర్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది గులాబీ పార్టీ. 

ఈనెల 27న పార్టీ ప్లీనరీ నిర్వహించబోతుంది టీఆర్‌ఎస్‌. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి కావడంతో గ్రామస్థాయి నుంచి క్రియాశీల కార్యకర్తలను ప్లీనరీకి ఆహ్వానించనుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 150 మంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సభకు హాజరయ్యే విధంగా చర్యలు చేపడుతున్నది. మొత్తం 15 వేల మంది ప్రతినిధులు సభకు హాజరవుతారని పార్టీ యోచిస్తోంది.   

ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు రాజకీయంగా పలు తీర్మానాలను ఈ ప్లీనరీలో ఆమోదించనున్నారు. అయితే.. ఈ తీర్మానాలను సిద్దం చేసే బాధ్యతను సీనియర్‌ నేత కేకేకు అప్పగించారు. ప్లీనరీని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలతో మరికొన్ని కమిటీలు వేశారు. ఇక పార్టీ ప్లీనరీతో పాటు బహిరంగసభ నిర్వహించడం ఆనవాయితీ. కానీ.. ఈసారి జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్‌ లేదా నవంబర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేలా బహిరంగ సభను నిర్వహిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభకు ప్రభుత్వం నుంచి లబ్ధిపొందినవారందరిని రప్పించేందుకు టీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. ఉద్యమ సమయంలో నిర్వహించిన బహిరంగ సభల కంటే ఎక్కువగా ఈ బహిరంగసభకు జనాన్ని సమీకరించాలని పార్టీ భావిస్తోంది. మొత్తానికి పార్టీ ప్లీనరీలో కార్యకర్తలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయడంతో పాటు... ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. అలాగే బహిరంగ సభతో జాతీయ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌  తన వైఖరిని స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. 

08:46 - April 9, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం కావాలని ఆదేశించారు సీఎం కేసీఆర్‌. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రంగంలోకి దిగాలని సూచించారు. 
తెలంగాణవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించాలని కేసీఆర్‌ అధికారులకు సూచించారు. 

గ్రామాలు, పట్టణాల్లో చాలామంది కంటి జబ్బులతో బాధపడుతున్నారు.. కంటి పరీక్షలు చేయించుకునే వెసులుబాటు లేకపోవడం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో, అవగాహన లేకపోవడం వల్లనో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. కంటి జబ్బు ఉన్నా గుర్తించకుండా నెట్టుకొస్తున్నవారూ ఉన్నారు. వాళ్లందరికి ముందు అవగాహన కల్పించాలని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అన్ని గ్రామాల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని... దీని కోసం విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు సీఎం. ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలు, యువజన సంఘాలను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. మొదట రాష్ట్రంలో ఎన్ని కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించాలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఒక రోజులో ఎంతమందికి కంటి పరీక్షలు చేస్తారు... దానికనుగుణంగా ఎన్ని వైద్య బృందాలు అవసరమవుతాయో చూడాలన్నారు. గ్రామంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని... గ్రామాలవారీగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. వారంలో ఐదు రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహించి.. శని, ఆది వారాలు వైద్య సిబ్బందికి సెలవు ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో పర్యటించే బృందాలకు రవాణా, భోజన, బస ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చేయాలన్నారు. 

కంటి పరీక్షలు నిర్వహించేందుకు వ్యూహాలు రచించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇవ్వాలన్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి కంటి వైద్యశాలలకు రిఫర్‌ చేయాలని... ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేట్‌ వైద్యశాలల్లో కూడా ఆపరేషన్లు నిర్వహించాలని కేసీఆర్‌ సూచించారు. 

రాష్ట్రంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందన్నారు కేసీఆర్‌. ఇది అత్యంత క్లిష్టమైన పనే అయినప్పటికీ... అధికార యంత్రాంగం చిత్తశుద్ది, అంకితభావంతో ఈ యజ్ఞాన్ని పూర్తి చేసి ఆరోగ్యతెలంగాణ నిర్మాణానికి ముందడుగు వేయాలని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

ఖమ్మం : జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

నేడు సన్ రైజర్స్ హైదరాబాద్..రాజస్థాన్ మ్యాచ్

ఐపీఎల్ 11 : నేడు సన్ రైజర్స్ హైదరాబాద్..రాజస్థాన్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు ఢిల్లీలో టీడీపీ నిరసనలు, ఆందోళనలు

ఢిల్లీ : నేడు కూడా ఢిల్లీ వేదికగా టీడీపీ నిరసనలు, ఆందోళనలు కొనసాగించనున్నారు. ఉదయం 10 గంటలకు గాంధీ సమాధి వద్ద టీడీపీ ఎంపీలు మౌన దీక్ష చేయనుంది. ఎంపీలు తెల్లని వస్త్రాలు ధరించి గాంధీ సమాధి వద్ద శాంతియుత నిరసన చేయాలని నిర్ణయించారు.

 

నేడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ దీక్షలు

హైదరాబాద్ : రాహుల్ గాంధీ ఆదేశాలతో నేడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ దీక్షలు చేయనుంది.  ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో ఉత్తమ్, కుంతియా ఆధ్వర్యంలో దీక్షలు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఖండిస్తూ దీక్షలు చేపట్టనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీపీ ఆధ్వర్యంలో
 దీక్షలు చేపట్టనున్నారు. 

 

Don't Miss