Activities calendar

10 April 2018

22:02 - April 10, 2018

కేరళ : తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్ర ఆర్థికమంత్రులు సమావేశమయ్యారు. 15వ ఆర్థికసంఘం సిఫారసులపై దక్షిణాది రాష్ట్రాల మంత్రులు మండిపడ్డారు. కలిసి పోరాడుదాం అన్న కేరళ ప్రభుత్వ ఆహ్వానం మేరకు కేరళ, ఆంధ్రప్రదేశ్‌, పాండిచేరి, కర్నాటక  రాష్ర్టాల మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి రాలేదు. 2011 జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకోని నిధులు కేటాయించాలన్న ఆర్థిక సంఘం సిఫార్సులపై మండిపడ్డాయి. 1971 జనాభా లెక్కల ప్రాతిపథికనే నిధులు కేటాయించాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణ రాష్ట్రాల్లో జనాభారేటు తగ్గుముఖం పట్టగా.. ఉత్తరాధి రాష్ట్రాల్లో మాత్రం జనాభా శాతం భారీగా పెరిగింది. దీంతో 2011 జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకుని నిధులు కేటాయిస్తే.. తాము భారీగా నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాల మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

21:59 - April 10, 2018

సిద్ధిపేట : 2019 ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివమ్స్‌ గార్డెన్‌లో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఈనెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభలు జరుగుతాయన్నారు. 22న భారీ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. అలాగే ఈ నెల 13 నుంచి 22 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో సైన్స్‌, బుక్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 
 

 

21:57 - April 10, 2018

హైదరాబాద్ : సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో... సింగరేణి గనులున్న ప్రాంతాల్లో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో ఈ భేటీకి సంస్థ సీఎండీ శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు. సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడం ద్వారా సమకూరిన ఆదాయం నుంచి.. డిస్ట్రిక్ట్ మినిరల్ ఫండ్ ట్రస్టు నిధులతో పాటు ఇతర నిధులతో రహదారులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. బొగ్గు రవాణాతో ఆ ప్రాంతాలు ఛిద్రమైపోతున్నాయని.. అందువల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు.

 

21:50 - April 10, 2018

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిని ఆనందమయ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంతోషకరమైన నగరంగా మలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలో నివాసయోగ్యమైన, సంతోష నగరాలను స్ఫూర్తిగా తీసుకొని.. అమరావతిని తీర్చిదిద్దుతున్నామని మంగళగిరిలో ప్రారంభమైన ఆనంద నగరాల సదస్సులో చంద్రబాబు చెప్పారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆనంద నగరాల సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ముఖ్మమంత్రి చంద్రబాబు, ఆధ్యాత్మికవేత్త జగ్గీవాసుదేవ్‌తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఔత్సాహిక  పారిశ్రామికవేత్తలు, మేధావులు, ఆర్కిటెక్ట్‌లు, నగర ప్రణాళికా నిపుణులు హాజరవుతున్నారు. 21వ  శతాబద్దంలో నగరాలను సంతోషకరంగా ఎలా తీర్చిదిద్దాలన్న అంశంపై చర్చిస్తున్నారు. జీవనప్రమాణాల మెరుగుదల, నివాసయోగ్యత, పరిశుభ్రత.. తదితర అంశాలపై చర్చగోష్టులు నిర్వహిస్తున్నారు. 

ఆనందమయ జీవితానికి ఫిన్‌లాండ్‌, సింగపూర్‌ పెట్టింది పేరని, అమరావతిని కూడా ఇదే తరహాలో తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఆనందమయ నగరాలంటే ఆకాశహార్మ్యాలు  కాదని, మొత్తం స్థలంలో 5 శాతం మాత్రమే భవనాలు నిర్మించాలని, మిగిలిన 95 శాతంలో హరితహారం, జలవనరులు, పార్కులు ఉండాలని ఆధ్మాత్మికవేత్త జగ్గీవాసుదేవ్‌ సూచించారు. సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని అమరావతి బృహత్‌ ప్రణాళిక రూపొందించాలని ఏపీ సీఆర్‌డీఏ నిర్ణయించింది. 
 

అమరావతిలో ఆనందమయ నగరాల సదస్సు ప్రారంభం 

21:48 - April 10, 2018
21:46 - April 10, 2018

ఢిల్లీ : హస్తినలో వైసీపీ ఎంపీల ఆమరణ నిరహార దీక్ష ఐదోరోజూ కొనసాగుతోంది. మిథున్‌రెడ్డి, అవినాశ్‌ రెడ్డిని పరీక్షించిన డాక్టర్లు షుగర్‌ లెవల్స్‌ పడిపోతున్నాయని .. వెంటనే దీక్ష విరమించుకోవాలని సూచించారు. దీక్ష చేస్తున్న ఎంపీలను వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరామర్శించారు. మరోవైపు ఎంపీలు ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తున్నా.. కేంద్రప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. రేపు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రైల్‌ రోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష మంగళవారం ఐదోరోజుకు చేరింది. ఐదు రోజులుగా దీక్షలో ఉండటంతో ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి బాగా నీరసించిపోయారు. దీంతో వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అవినాశ్‌రెడ్డి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 78కి పడిపోయింది. మిథున్‌రెడ్డి శరీరంలోనూ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 80కి పడిపోయాయి. ఇద్దరు ఎంపీలూ నీరసంగా ఉన్నారని దీక్ష విరమించుకోవాలని డాక్టర్లు సూచించారు. 

నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు సర్వత్రా మద్దతు వెల్లువెత్తుతోంది. ఆమరణ దీక్షలో ఉన్న ఎంపీలను వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరామర్శించారు. మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం వైసీపీ ఎంపీల దీక్షను చూసి గర్వపడుతుందని ఎంపీలను జగన్‌ అభినందించారు. 

వైసీపీ ఎంపీలు ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తున్నా.. కేంద్రప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ భారతదేశంలో అంతర్భాంగం కాదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు రోజులు దగ్గరపడ్డాయని ఆయన మండిపడ్డారు.     

కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ బుధవారం ఏపీ వ్యాప్తంగా రైలు రోకోలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. మరోవైపు.. వైసీపీ ఎంపీల దీక్షను టీడీపీ నేతలు అవహేళన చేయడంపై మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా లోక్‌సభలో చర్చకు రాలేదని.. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి తమతో కలిసి రావాలని, అందరూ కలిసికట్టుగా పోరాడితే కేంద్రం దిగివస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. 

సీనియర్లు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు : పార్టీ ముఖ్య నేతలు, అధికార ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ నేతలు, కేడర్ అంతా ఉద్యమంలోకి దిగాలని చంద్రబాబు అన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్లంతా సైకిల్ ర్యాలీల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. ఉద్యమం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సీరియస్ వ్యవహారాల్లో కూడా కొందరు సీనియర్లు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై నేతల పనితీరుపై రోజువారీ సమీక్షలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు.

 

రాష్ట్ర వ్యాప్త సైకిల్ ర్యాలీలకు టీడీపీ నిర్ణయిం

గుంటూరు : ఈనెల 16వ తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలకు టీడీపీ నిర్ణయించింది. ఈనెల 30న తిరుపతి బహిరంగసభ తర్వాత జిల్లాల వారీ సభలకు టీడీపీ సమాయత్తం అవుతుంది. 

21:31 - April 10, 2018

గుంటూరు : ఈనెల 16వ తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలకు టీడీపీ నిర్ణయించింది. ఈనెల 30న తిరుపతి బహిరంగసభ తర్వాత జిల్లాల వారీ సభలకు టీడీపీ సమాయత్తం అవుతుంది. పార్టీ ముఖ్య నేతలు, అధికార ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ నేతలు, కేడర్ అంతా ఉద్యమంలోకి దిగాలని చంద్రబాబు అన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్లంతా సైకిల్ ర్యాలీల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. ఉద్యమం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సీరియస్ వ్యవహారాల్లో కూడా కొందరు సీనియర్లు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై నేతల పనితీరుపై రోజువారీ సమీక్షలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు.

 

21:15 - April 10, 2018

నేటికీ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. వీటిని చట్టాలు ఆపలేకపోతున్నాయి. ఈ సమస్య లోతుల్లోకి వెళ్లి చర్చించి ప్రయత్నిస్తే తప్పా బాల్య వివాహాలు ఆగవని నివేదికలు చెబుతున్నాయి. ఇదే అంశంపై మానవి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య పాల్గొని, మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం... 

21:07 - April 10, 2018

రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలకు సంబంధి అన్ని పార్టీలు పోరాటబాట పట్టాయి. ముఖ్యంగా ఉన్నటువంటి ప్రత్యేకహోదా సాధించాలనే కాంక్ష బలంగా ఉండటం పార్టీలన్నీ గుర్తించాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ కేంద్రంగా అటు టీడీపీ, ఇటు వైసీపీలు చేసేటటువంటి పోరాటం, రాష్ట్ర ప్రయోజనాలా, రాజకీయ ప్రయోజనాలా, ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని పన్నెత్తిమాట అనుకుండా ఉద్యమం చేస్తున్న పార్టీలను రాష్ట్ర ప్రజలు ఏవిధంగా అర్థం చేసుకుంటారు. రాబోయే ఎన్నికలకు ఎజెండాగా చేసుకుని ఆయా పార్టీలు పోరాటబాట పడుతున్నాయా? దీంట్లో అంతరార్థమేమిటీ ? 'ఎవరి ఎజెండా...వారిదే' అనే అంశంపై సీనియర్ జర్నలిస్టు ఎస్.వెంకట్రావ్ విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ ప్రజలు రాష్ట్ర ప్రయోజనాలు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వామపక్షాలు ఇచ్చిన బంద్ పలుపు ప్రతిఫలించిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీల వైఖరులు చూస్తే రాష్ట్ర ప్రయోజనాలకంటే, రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ, టీడీపీ హోదాపై ఆందోళన చేస్తున్నాయని విమర్శించారు. ఆలిండియా లెవల్ లో మోడీ గ్రాఫ్ పడిపోతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

20:43 - April 10, 2018

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందా..? ఇక దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయా..? ఇక కేంద్రం దిగిరాక తప్పదా..? ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందా ? నిధులన్నింటినీ పందేరం చేస్తుందా ఉత్తరాదికి, తిరువనంతపురంలో జరుగుతున్న ఆర్థిక మంత్రుల సమావేశం ఎలాంటి సంకేతాలు పంపింది. 15 వ ఆర్థిక సంఘం సిపార్సులపై దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు మండిపడుతున్నాయి. 
నిజంగా నష్టం జరుగుతుందా..? ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ నేత దేవీప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కార్తీక్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి, సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

20:19 - April 10, 2018

కోదండరాం సభకు సర్కారు అడ్డుపుల్ల...సభకు అనుమతియ్యమన్న పోలీసోళ్లు, టీడీపీ పోరాటం కుండ వలగొట్టిన జేసీ... హోదా కోసం గాదంట.. డ్రామానంట, మా నాయిన కళలు గంటున్నడు....అప్పటి నుంచి కళలే గని.. అమలు లేదుగదా?, టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేకు పట్టవగటీలే సుక్కలు...నడిరోడ్డు మీద నిలవెట్టి నిలదీశిన జనాలు, నిజాంబాదుల రాందేవ్ బాబా యోగాసనాలు... ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అవస్థలు, తాగి తందనాలాడిన హయత్ నగర్ కార్పొరేటర్...వన్యప్రాణుల వనం.. చట్టాల ఉల్లంఘన... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

కామన్వెల్త్ లో ఆరోరోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు

కామన్వెల్త్ : ఆరోరోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హీనాసిద్ధుకు స్వర్ణం లభించింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హీనా సిద్ధు కామన్వెల్త్ గేమ్స్ రికార్డు సాధించింది. పారా పవర్ లిఫ్టింగ్ లో సచిన్ చౌదరి కాంస్యం గెలుచుకుంది. కామన్వెల్త్ పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో 11 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్య పతకాలు చేరాయి.  

నిర్మాణంలో ఉన్న వంతెనలు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : మేయర్, జీహెచ్ ఎంసీ, రైల్వే, ఇతర అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జీహెచ్ ఎంసీ పరిధిలో రైల్వేశాఖలో పెండింగ్ లో ఉన్న అంశాలపై సమీక్ష చేశారు. చర్లపల్లి రైల్వే టర్నినల్, నాగులపల్లిలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ నిర్మాణంపై చర్చ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెనలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి  కేటీఆర్ అన్నారు. 

బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు : బొత్స

ఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన వాగ్ధానాలు మరిచారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇష్టారాజ్యాంగా ప్రవర్థిస్తున్నారుని దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. గ్రామాల్లోకి వస్తే చంద్రబాబును నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిస్తే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, జయప్రదం చేశారని చెప్పారు. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కు అన్నారు. రేపు రైలు రోకో చేయాలని పిలుపునిచ్చామని.. అందరూ పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు. హోదా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 

19:42 - April 10, 2018

ఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన వాగ్ధానాలు మరిచారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇష్టారాజ్యాంగా ప్రవర్థిస్తున్నారుని దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. గ్రామాల్లోకి వస్తే చంద్రబాబును నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిస్తే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, జయప్రదం చేశారని చెప్పారు. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కు అన్నారు. రేపు రైలు రోకో చేయాలని పిలుపునిచ్చామని.. అందరూ పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు. హోదా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 

19:24 - April 10, 2018

శ్రీకాకుళం : జిల్లాలో గజేంద్రులు జిల్లా వాసులను గజ గజ వణికిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఏనుగులు.. నీటి అవసరాల కోసం కొత్తూరు, ఆముదాలవలస, టెక్కలి మైదాన ప్రాంతాలవైపు  వస్తుంటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా లోని ఆముదాలవలస మైదాన ప్రాంతానికి వస్తున్న ఏనుగుల గుంపులు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాటిని తిరిగి అటవీలోకి పంపేందుకు ప్రారంభించిన ఆపరేషన్ గజేంద్ర అలజడి సృస్టిస్తోంది. తర్ఫీదు పొందిన రెండు ఏనుగులతో బాణాసంచా కాలుస్తూ ఏనుగుల గుంపును ఒరిస్సా అడవుల్లోకి పంపించేందుకు ఆపరేషన్ గజేంద్ర ప్రయత్నాలు చేస్తోంది. 

గత నెల 29న శ్రీకాకుళం జిల్లాకేంద్రానికి ఆనుకొని ఉన్న ఆముదాలవలస మండలం కనుగులవలస పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు భారీ నష్టం చేకూర్చింది చెరుకు, మొక్కజొన్న పంటలను ధ్వంసం చెయ్యడంతో స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాలకు సమీపంలోకి ఏనుగులు రావడంతో స్థానికులు నిద్రాలేని రాత్రులు గడుపుతున్నారు. 

అటవీ శాఖ అధికారులు తర్ఫీదు  పొందిన రెండు ఏనుగులను  తీసుకొచ్చారు. వీటి ద్వారా ఏనుగుల గుంపును తిరిగి సీతంపేట ఏజెన్సీ మీదుగా ఒరిస్సా  అడవుల్లోకి పంపేందుకు ఆపరేషన్‌ గజేంద్ర ప్రయత్నిస్తోంది. ఇలా ఏనుగుల గుంపును మెళియాపుట్టి మండలం కేరాసింగి పంచాయితీ పరిధి వరకూ తీసుకువచ్చారు. అయితే ఇక్కడి నుంచి అధికారులకు కూడా సరైన మార్గం కనిపించలేదు. దీంతో సీతంపేట ఐటీడీఏ అధికారులు వారికి సాంకేతిక సహాయాన్ని అందించారు. జీపీఎస్‌ పరికరాలు ఏనుగులు వెళ్లాల్సిన మార్గాన్ని చూపిస్తూ ఆపరేషన్‌  గజేంద్రదన సులభతరం చేస్తున్నాయి. 

అయితే టెక్కలి, మెళియాపుట్టి, రామకృష్ణాపురం, బాగబంధ వంటి పలు గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరించడంతో గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాటి వెనుకే వస్తున్న అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రజలెవ్వరూ భయపడవద్దని... ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. వాటిని ఒరిస్సా అడవుల్లోకి చేర్చే వరకూ సంయమనం సాటించాలని కోరారు. మొత్తానికి ఆపరేషన్ గజేంద్ర విజయవంతం అయ్యేందుకు అటు అధికారులు, ఇటు గ్రామాల ప్రజలు సహకరిస్తున్నారు. ఏనుగుల గుంపులతో భయాందోళపకు గురవుతున్నా సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశతో ఉన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఇనుప ఖనిజ గనులు కేటాయించాలని హైకోర్టులో పిటిషన్‌

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ ప్లాంటుకు ఇనుప ఖనిజ గనులు కేటాయించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంపై ఇటీవల 10 టీవీ జనపథం కార్యక్రమంలో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం చూసిన మెట్ట చంద్రశేఖర్‌రావు... ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. కేసు విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతోపాటు స్టీల్‌ ప్లాంట్‌ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

19:19 - April 10, 2018

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు ముందుకు వచ్చిన జీఎస్సెల్‌ గ్రూప్‌ యూటర్న్‌ తీసుకోవడంతో.. 9 రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 30 లక్షల మంది బాధితులు నిరాశకు గురయ్యారు. ఆస్తులకన్నా అప్పులు నాలుగింతలు ఉన్నాయని అందుకే తాము అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొనుగోలు చేయడం లేదని జీఎస్సెల్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది. మరోవైపు అగ్రిగోల్డ్‌ కేసును కావాలనే రాజకీయ దురుద్దేశంతో జాప్యం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.  ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటున్న అగ్రిగోల్డ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌తో ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. 
ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

19:11 - April 10, 2018

పశ్చిమగోదావరి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వినూత్న రీతిలో నిరసన  తెలిపారు. పెదపాడు మండలం కలపర్రు వద్ద జాతీయ రహదారిపై టీ స్టాల్‌ ఏర్పాటు చేసిన, చాయ్‌ సరఫరా చేశారు. అనంతరం టీడీపీ మహిళా కార్యకర్తలను ఎక్కించుకొని... కలపర్రు  నుంచి ఏలూరు బస్టాండ్‌ వరకు బస్సు నడిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని మోదీపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

అవినాష్, మిథున్ రెడ్డిల షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి : డాక్టర్లు

ఢిల్లీ : హస్తినలో వైసీపీ ఎంపీల ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతోంది. అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలను డాక్టర్లు పరీక్షించారు. అవినాష్, మిథున్ రెడ్డిల షుగర్ లెవెల్స్ పడిపోతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. అందువల్లే అవినాష్ ,మిథున్ రెడ్డి నీరసంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ ఎంపీలు దీక్ష విరమించుకోవాలని డాక్టర్లు సూచించారు. కీటోన్స్ ఇతర పారామీటర్లు సాధారణంగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు.

 

ఢిల్లీలో కొనసాగుతోన్న వైసీపీ ఎంపీల దీక్ష

ఢిల్లీ : హస్తినలో వైసీపీ ఎంపీల ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతోంది. అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలను డాక్టర్లు పరీక్షించారు. అవినాష్, మిథున్ రెడ్డిల షుగర్ లెవెల్స్ పడిపోతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. అందువల్లే అవినాష్, మిథున్ రెడ్డి నీరసంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ ఎంపీలు దీక్ష విరమించుకోవాలని డాక్టర్లు సూచించారు. కీటోన్స్ ఇతర పారామీటర్లు సాధారణంగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు.

 

19:07 - April 10, 2018

ఢిల్లీ : హస్తినలో వైసీపీ ఎంపీల ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతోంది. అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలను డాక్టర్లు పరీక్షించారు. అవినాష్, మిథున్ రెడ్డిల షుగర్ లెవెల్స్ పడిపోతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. అందువల్లే అవినాష్ ,మిథున్ రెడ్డి నీరసంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ ఎంపీలు దీక్ష విరమించుకోవాలని డాక్టర్లు సూచించారు. కీటోన్స్ ఇతర పారామీటర్లు సాధారణంగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు.

 

18:47 - April 10, 2018

నిజామాబాద్ : జిల్లాలో నిత్య పెళ్లికొడుకు బాగోతం బయటపడింది. ఒకరికి తెలియకుండా మరికరితో ఇలా 3 పెళ్లిళ్లు చేసుకొని... ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్నపవన్ కుమార్... మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అమ్మాయిలతో, విజయవాడకు చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వేర్వేరుగా కాపురాలు పెట్టాడు. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమవుతుండగా మొదటి భార్యకు విషయం తెలిసింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఆమె పవన్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. బాధితురాలికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

 

18:44 - April 10, 2018

హైదరాబాద్‌ : సనత్‌నగర్‌లో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో భార్య.. భర్తను చంపించింది. సలేహ బేగం, ఖాజా భార్యా భర్తలు. అయితే సలేహా బేగానికి తబ్రేజ్‌ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన సలేహా బేగం.. సుపారీ కిల్లర్స్‌కు 2 లక్షల రూపాయలు ఇచ్చి భర్తను చంపించింది. హత్య తర్వాత భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేయించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి భార్య సలేహా బేగంతో సహా ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. 

 

18:41 - April 10, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీసీఎం ఆధ్వర్యంలో ప్రజా అవిశ్వాస బ్యాలెట్‌ కార్యక్రమం చేపట్టింది. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో  ప్రారంభమైన ప్రజా బ్యాలెట్‌ రెండు రోజుల పాటు  కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చించకుండా తప్పించుకున్న బీజేపీకి  ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా సీపీఎం నాయకులు హెచ్చరించారు. 
 

18:38 - April 10, 2018

కొమురంభీం : అడవుల్లో అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు. ఆదివాసీలను అరణ్యాలకు దూరం చేస్తున్నారు. ప్రభుత్వం సౌకర్యాలు, వసతులు కల్పించకపోయిన కన్నతల్లిలాంటి అడవులను నమ్ముకొని జీవస్తున్న అడవి బిడ్డలపై అటవీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. వాగులు, చెలిమలు ఎండి పోవడంతో పిల్లజల్లతో కలసి కొండలు దాటుకుంటూ నీళ్ల కోసం వెళుతున్నారు. తిరిగి తమ గూడాలకు చేరుకునే సరికి అక్కడ అటవీ అధికారులు, అక్రమార్కులు ఆదివాసీల భూములు లాక్కుంటున్నారు. దీంతో గత్యంతరం లేక ఇతర ప్రాంతాలక వలస వెళ్లాల్సిన పరిస్థితి ఆదివాసీలది. దీనిపై మరింత సమాచారం అందించడానికి ఆదివాసీలతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:35 - April 10, 2018

విశాఖ : విశాఖ స్టీల్‌ ప్లాంటుకు ఇనుప ఖనిజ గనులు కేటాయించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంపై ఇటీవల 10 టీవీ జనపథం కార్యక్రమంలో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం చూసిన మెట్ట చంద్రశేఖర్‌రావు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. కేసు విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతోపాటు స్టీల్‌ ప్లాంట్‌ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. జాతీయ సంపదైన గనులను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్‌ అన్నారు. 

మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి....

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు... సీఎస్‌ ను కలిశారు. ఉద్యోగుల బదిలీలు, పీఆర్సీ ఇతర అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఈనెల 30న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. 

18:28 - April 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు... సీఎస్‌ ను కలిశారు. ఉద్యోగుల బదిలీలు, పీఆర్సీ ఇతర అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఈనెల 30న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. 

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వెళ్లొద్దంటూ తమిళ సినీ నటులు పిలుపు

తమిళనాడు : చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కావేరి హీట్‌ తగులుతోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వెళ్లొద్దంటూ తమిళ సినీ నటులు అభిమానులకు పిలుపు నిచ్చారు. కేంద్రం కావేరి వాటర్‌బోర్డును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమిళనాడులో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రికి జరగనున్న మ్యాచ్‌కు  చెన్నైసూపర్‌ కిగ్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్‌ సందర్భంగా చెన్నై టీమ్‌ ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కోరారు. మరోవైపు మ్యాచ్ నిర్వహిస్తే.. స్టేడియంలో పాములు వదులుతామని పీఎంకే నేత వేల్ మురుగన్ హెచ్చరించారు.

18:26 - April 10, 2018

తమిళనాడు : చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కావేరి హీట్‌ తగులుతోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వెళ్లొద్దంటూ తమిళ సినీ నటులు అభిమానులకు పిలుపు నిచ్చారు. కేంద్రం కావేరి వాటర్‌బోర్డును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమిళనాడులో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రికి జరగనున్న మ్యాచ్‌కు  చెన్నైసూపర్‌ కిగ్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్‌ సందర్భంగా చెన్నై టీమ్‌ ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కోరారు. మరోవైపు మ్యాచ్ నిర్వహిస్తే.. స్టేడియంలో పాములు వదులుతామని పీఎంకే నేత వేల్ మురుగన్ హెచ్చరించారు. మరోవైపు మ్యాచ్‌ జరగనున్న ఎమ్‌ఏ చిదంబరం స్టేడియం దగ్గర నాలుగు వేల మంది పోలీసులతో నాలుగంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 

 

18:22 - April 10, 2018

లక్నో : అణువణువూ కాషాయాన్ని ఒంటబట్టించుకున్న హిందుత్వవాదులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా కాషాయంగా మార్చేశారు. దీనిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో విగ్రహానికి మళ్లీ నీలిరంగు వేశారు. ఉత్తరప్రదేశ్‌ బదయూ జిల్లాలో ఇటీవల అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించిన సందర్భంగా రాజకీయ రంగు పులుముకుంది. సాధారణంగా కోటు, ట్రౌజర్‌తో కనిపించే అంబేద్కర్‌ విగ్రహం వస్త్రాధారణ కూడా మార్చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి  షేర్వానీ వేసి కాషాయరంగులోకి మార్చడంతో దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిఎస్పీ నేత వీరేంద్ర యాదవ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి మళ్లీ నీలిరంగు పెయింట్‌ వేయించారు.

 

18:19 - April 10, 2018

ఢిల్లీ : ఫేస్‌బుక్‌ సంస్థ దిద్దుబాటుకు పూనుకుంది.. ఆ తప్పు నాదే.. నన్ను క్షమించండి... అంటూ  ఫేస్‌ బుక్‌ సీఈవో జుకర్‌ బకర్గ్‌ అమెరికా కాంగ్రెస్‌ ముందు క్షమాపణలు కోరారు. డేటా దుర్వినియోగాన్ని నియంత్రించలేకపోయాం.. లోపాలు అధిగమిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వినియోగదారులకు కూడా వివరణ ఇచ్చుకుంటోంది.. ఫేస్‌బుక్‌ సంస్థ...

సారీ.. తప్పు నాదే.. అంటూ ఫేస్‌ బుక్‌ సీఈవో జుకర్‌ బర్గ్‌  క్షమాపణలు కోరారు..  వ్యక్తిగత సమాచార ర్వినియోగమైందన్న ఆరోపణలతో డిఫెన్స్‌లో పడింది  ఫేస్‌బుక్‌.. ఈ నేపథ్యంలో.. ఫేస్‌ బుక్‌ సంస్థ కానీ, ఆ సంస్థ సభ్యులు కానీ డేటా ర్వినియోగాన్ని అడ్డుకోవడంలో విఫలమైనట్లు... ఎఫ్‌బీ సీఈవో జుకర్‌బర్గ్‌ చెప్పారు. సీఈవోగా ఆ తప్పు తనదే నంటూ సోమవారం అమెరికా కాంగ్రెస్‌కు ముందు  ఒప్పుకున్నారు. అది పెద్ద తప్పేనంటూ రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు.

ఫేస్‌బుక్‌ను ప్రారంభించింది.. నడుపుతున్నది నేనే...  కాబట్టి ఇక్కడ జరిగే ప్రతిదానికి బాధ్యత కూడా నాదేనన్నారు జుకర్‌బర్గ్..  అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని గుర్తించి... ప్రతిస్పందించడంలో ఫేస్‌బుక్‌ చాలా నిదానంగా ఉందని అంగీకరించారు. లాభాలు పెంచుకోవడం కంటే..  మన సమాజాన్ని రక్షించుకోవడమే ముఖ్యమని పేర్కొన్నారు జుకర్‌బర్గ్‌. పదిహేనువేల మంది భద్రత, కంటెంట్‌ సమీక్షపై పని చేస్తున్నారని.. ఈ ఏడాది చివరికి  ఆ సంఖ్య 20వేలకు చేరుతుందని వివరించారు. ఆలస్యమైనా  లోపాలను అధిగమించి... పనితీరు మెరుగు చేసుకుంటామని హామీ ఇచ్చారు.  

మరోవైపు...బ్రిటన్‌ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా  డేటాను చేజిక్కించుకున్నట్లు  వెల్లువెత్తిన నేపథ్యంలో.. వారికి ప్రత్యేక సందేశాలను పంపిస్తున్నట్లు ఫేస్‌బుక్‌  తెలిపింది. వారు ఉపయోగించిన యాప్‌లు, పంచుకున్న వివరాలను  తెలియజేస్తున్నట్లు ఆ సంస్థ  ప్రకటించింది.  వ్యక్తిగత సమాచారం సీఏకు పొరపాటున చేరిందా.. లేక మరేవైనా కారణాలున్నాయా..అనే విషయాలను  స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది. మొత్తానికి  ఫేస్‌బుక్‌ సంస్థ మాత్రం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.. ఎఫ్‌బీ సీఈవో మరోసారి  ఇవాళ, రేపు కూడా    కాంగ్రెష్ కమిటీల ముందు హాజరు కానున్నారు.

18:16 - April 10, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఫెస్ట్‌ను విజయంతం చేయాలని స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ చైర్మన్‌ నంద్యాల నర్సింహారెడ్డి కోరారు. ఈనెల 13 నుంచి 22 వరకు.. ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ను ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఫెస్ట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఇతర నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ ఫెస్ట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభిస్తారని... ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటుడు ఎల్‌బీ శ్రీరాం, విద్యావేత్త చుక్కా రాయ్య,  ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు. షార్ట్‌ఫిల్మ్‌, ఫోటోగ్రఫీలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్‌, వినోద, విజ్ఞాన అంశాలు ఉంటాయన్నారు. చిన్నారుల కోసం బాలోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

 

సభకు అనుమతి నిరాకరణపై హైకోర్టును ఆశ్రయించిన జేఎఫ్ ఎస్ నేతలు

హైదరాబాద్ : ఈనెల 29న తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు పోలీసుల అనుమతి నిరాకరణపై.. ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజ్‌లో ఏదో ఒక చోట...సభకు అనుమతి ఇవ్వడానికి కోరుతూ పిటిషన్ వేశారు. ఇప్పటికే సరూర్ నగర్ స్టేడియంలో సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అక్కడ సభ పెడితే.. ట్రాఫిక్ కాలుష్యం పెరుగుతుందని... పోలీసులు చెబుతున్నారు. 

 

18:10 - April 10, 2018

హైదరాబాద్ : ఈనెల 29న తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు పోలీసుల అనుమతి నిరాకరణపై.. ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజ్‌లో ఏదో ఒక చోట...సభకు అనుమతి ఇవ్వడానికి కోరుతూ పిటిషన్ వేశారు. ఇప్పటికే సరూర్ నగర్ స్టేడియంలో సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అక్కడ సభ పెడితే.. ట్రాఫిక్ కాలుష్యం పెరుగుతుందని... పోలీసులు చెబుతున్నారు. 

 

17:16 - April 10, 2018

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత పార్ధసారధి మండిపడ్డారు. చంద్రబాబు హ్యాపీ అమరావతి అంటున్నారని... కానీ అమరావతిలో ఒక్కరు కూడా సంతోషంగా లేరన్నారు. రాజధాని నిర్మాణం కోసం పెద్ద మనసుతో భూములిచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అమరావతిని చంద్రబాబు, ఆయన అనుయాయులు కలిసి రియల్‌ఎస్టేట్‌ మయంగా మార్చారన్నారు. రైతులిచ్చిన భూములను కార్పొరేట్‌ సంస్థలు, ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు మాత్రం ఇప్పటికీ కమర్షియల్‌ ప్లాట్లు కేటాయించలేదని ధ్వజమెత్తారు.

 

17:12 - April 10, 2018

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న ఆనంద నగరాల సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. అమరావతి విశిష్టతను వివరించారు. ఫిన్‌లాండ్‌, సింగపూర్‌ తరహాలో అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 
 

 

దయాచారిపై హత్యాయత్నం,, ముగ్గురి అరెస్టు

హైదరాబాద్ : ఈనెల 5న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌- ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దయాచారిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దయాచారి తమ్ముని చెల్లెలు మంజుల, ఆమె సోదరుడు కరుణాకర్‌తో ఆస్తి-భూ తగాధాలే ఈ హత్యాయత్నానికి కారణమని పోలీసులు తెలిపారు. నిందితులు మంజుల, కరుణాకర్‌ విజయవాడకు చెందిన సుపారీ గ్యాంగ్‌కు అడ్వాన్స్‌గా 15 వేల రూపాయలు ఇచ్చి హత్యకు స్కెచ్‌ వేశారని పోలీసులు చెప్పారు. సుపారీ గ్యాంగ్‌లో ముగ్గురిని అరెస్ట్‌ చేశామని... మరో ఇద్దరికోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

 

17:03 - April 10, 2018

హైదరాబాద్ : ఈనెల 5న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌- ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దయాచారిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దయాచారి తమ్ముని చెల్లెలు మంజుల, ఆమె సోదరుడు కరుణాకర్‌తో ఆస్తి-భూ తగాధాలే ఈ హత్యాయత్నానికి కారణమని పోలీసులు తెలిపారు. నిందితులు మంజుల, కరుణాకర్‌ విజయవాడకు చెందిన సుపారీ గ్యాంగ్‌కు అడ్వాన్స్‌గా 15 వేల రూపాయలు ఇచ్చి హత్యకు స్కెచ్‌ వేశారని పోలీసులు చెప్పారు. సుపారీ గ్యాంగ్‌లో ముగ్గురిని అరెస్ట్‌ చేశామని... మరో ఇద్దరికోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

 

16:50 - April 10, 2018

హైదరాబాద్ : ఖమ్మం నగరంలో భారీ అరుణపతాక రెపరెపలాడింది. సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలో అతిపెద్ద ఎర్రజెండాను ప్రదర్శించారు. 11వందల అడుగుల పొడవైన రెడ్‌ఫ్లాగ్‌ను చేతబట్టిన వందలాదిమంది .. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈనెల 18న  హైదరాబాద్‌లో జరిగే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ.. అదిపెద్ద రెడ్‌ఫ్లాగ్‌ను సీపీఎం కార్యకర్తలు ప్రదర్శించారు.

16:48 - April 10, 2018

హైదరాబాద్‌ : సీఎం క్యాంప్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. సూర్యాపేట జిల్లా పుప్పాలగూడ గ్రామానికి చెందిన సైదులు.. అప్పుల బాధతో... సీఎం కేసీఆర్ కలిసేందుకు క్యాంప్‌ ఆఫీస్‌కు వచ్చాడు. అయితే అనుమతి లేకుండా లోనికి పంపడం కుదరదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి సైదులు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అతడ్ని.. గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

16:46 - April 10, 2018

హైదరాబాద్ : ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబువి మాయమాటలని, ప్రజలను మభ్యపెట్టే డ్రామాలు ఆడుతున్నాడని వైసీపీ నేత పార్ధసారధి విమర్శించారు. నాలుగు సం.రాలుగా ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఆడిన డ్రామాలను ప్రజలు అసహ్యహించుకుంటున్నారని అన్నారు. ప్రజలు కొట్టేరోజు రోజు వచ్చిందని... ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్లు నటిస్తున్నారని..కానీ ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనే ఆయన చరిత్ర బెబుతుందన్నారు. ప్రత్యేకహోదా ముగిసిపోయిన అధ్యాయం, సంజీవిని కాదన్నారని అన్నారు. 'ప్రత్యేక హోదా కోసం అడిగితే జైల్లో పెడతానన్నావు.. మీ పిల్లల భవిష్యత్ పోతుందన్నావు.. అన్న నీవు ఇప్పుడు పిల్లల భివిష్యత్ కోసం నాటకాలు ఆడితే ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా' అని అన్నారు. రైతులు సంతోషంగా లేరన్నారు. ప్రజలందరూ తీవ్ర ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. 'బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి మా నెత్తిమీద శటగోపం పెట్టారు' అని అన్నారు. ప్రత్యేకహోదా అన్నారని..ఎన్నో కలలు చూపించారని...ఈరోజు ఏమీ లేక తమ భవిష్యత్ అంధకారంలో ఉందని ప్రజలు భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. 

16:31 - April 10, 2018

హైదరాబాద్ : ఈనెల 13 నుంచి పదిరోజులపాటు ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగనున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌కు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. హైదరాబాద్‌ ఫెస్ట్‌ నిర్వాహకులు ఫెస్ట్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్‌లో వివిధ రకాల వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ నిర్వాహకులు నాగేశ్వర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మధ్యాహ్నం  2గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫెస్ట్‌ ఉంటుందన్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌కు ప్రవేశం ఉచితం అన్నారు. 

 

16:18 - April 10, 2018

అనంతపురం : బీజేపీపై ఒత్తిడితెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. బీజేపీతో అంటకాగి విలువైన సమయాన్ని వృధా చేసిందని మండిపడ్డారు. బుధవారం విజయవాడలో జరిగే సమావేశంలో ప్రత్యేక హోదా ఉద్యమంపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి వామపక్షాలతోపాటు వివిధ పార్టీలు, హోదా సాధన సమితి హాజరయ్యారు.

 

16:12 - April 10, 2018

ఢిల్లీ : ఇండిగో విమానం నుంచి ఓ ప్రయాణికుడిని బలవంతంగా దింపివేశారు. విమానంలో దోమలున్నాయని చెప్పినందుకు తనను కొట్టి గెంటేశారని బెంగళూరుకు చెందిన సౌరభ్‌ రాయ్‌ ఆరోపించాడు. లక్నో నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఆయన ఇండిగో విమానాన్ని బుక్‌ చేసుకున్నారు. విమానంలోకి ఎక్కగానే దోమలు ఎక్కువగా ఉండటంతో సిబ్బందికి ఫిర్యాదు చేశారు. విమాన సిబ్బంది ఫిర్యాదును పట్టించుకోకపోగా... తనపై చేయిచేసుకున్నారని సౌరభ్‌ ఆరోపించారు. దీనిపై ఇండిగో కూడా వివరణ ఇచ్చింది. ప్రయాణికుడు హైజాక్‌ లాంటి పదాలు ఉపయోగించారని, తలుపులు మూసేసి ప్రయాణికులను రెచ్చగొట్టారని పేర్కొంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆయనను విమానం నుంచి దింపివేశామని ఇండిగో తెలిపింది.  వృత్తిరీత్యా గుండె నిపుణుడైన డాక్టర్ సౌరబ్‌ ఇండిగో సిబ్బంది తనపై దాడి చేసిందని ఫిర్యాదు చేశారు. దోమలున్నాయని సోషల్‌ మీడియాలో ప్రయాణికుల నుంచి ఆరోపణలు రావడంతో ఇండిగో క్షమాపణ చెప్పింది.


 

15:59 - April 10, 2018

కడప : మోదీ ప్రధాని రూపంలో నియంతలా వ్యవహరిస్తుంటే... సీఎం చంద్రబాబు కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారని సీపీఐ రాష్ర్టకార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పేదల సమస్యలపై ఈనెల 23న ప్రభుత్వాలు దద్దరిల్లేలా ఆందోళన చేపడతామని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల జీతాలు పెరిగాయి కానీ... పేదల బతుకులు మెరుగపడలేదన్నారు. పింఛన్లు, ఇళ్ళస్థలాలు, రేషన్‌ కార్డుల వంటి పేదల సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భారీస్థాయిలో ఆందోళన చేస్తామని తెలిపారు. భవిష్యత్‌ రాజకీయాల్లో వామపక్షాలదే కీలక పాత్ర అన్నారు.

 

మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ లో ఆనంద నగరాల సదస్సు

అమరావతి : మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ లో ఆనంద నగరాల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీవాస్ దేవ్, మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 

మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ లో ఆనంద నగరాల సదస్సు

అమరావతి : మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ లో ఆనంద నగరాల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీవాస్ దేవ్, మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 

ప్రగతి భవన్ ఎదుట పురుగులమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : ప్రగతి భవన్ ఎదుట పురుగుల మందు తాగి సూర్యపేటకు చెందిన సైదులు అనే రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని గాంధీ అస్పత్రికి తరలించారు.

15:49 - April 10, 2018

హైదరాబాద్ : వైసీపీ నుంచి టీడీపీకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.  నలుగురు మంత్రులతో సహా 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మూడు వారాల్లోగా సమాధాని ఇవ్వాలని హైకోర్టు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.

15:44 - April 10, 2018

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ.. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా రహదారులను దిగ్భందించారు. ఒంగోలులో 16వ నెంబరు జాతీయ రహదారిపై వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

15:22 - April 10, 2018

కర్నూలు : ప్రత్యేక హోదా పోరును వైసీపీ ఉధృతం చేసింది. ఆ పార్టీ నేతలు కర్నూలులో హైవేను దిగ్బంధించారు.   అడగాల్సివాళ్ళు అడక్కుండా.. ఇవ్వాల్సినవాళ్ళు ఇవ్వకుండా మోసం చేశారంటున్న వైసీపీ నేతలతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:19 - April 10, 2018

ఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసి దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు.  ఏపికి ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటం ఫలితం ఇవ్వదన్నారు. 2019లో రాబోయే ప్రభుత్వంలోనే  హోదా సాధ్యం అవుతుందన్నారు. ప్రధాని మోదీ తీరుపై జేసి తీవ్రవ్యాఖ్యలు చేశారు.  మోదీ అధికారంలో ఉన్నంతకాలం ఏపి కి న్యాయం జరగదన్నారు.  మోదీ తీరు కంచే చేనుమేసినట్టుగా ఉందన్నారు. తాము ఎన్డీయే నుంచి బయటికి వచ్చి.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నందున ప్రధాని మోదీ టీడీపీ నేతలపై సీబీఐతో దాడులు కూడా చేయించే అవకాశం  ఉందన్నారు. అటు వైసీపీ  ప్రత్యేక హోదా పోరాటాన్ని ఎద్దేవా చేసిన జేసి.. వారి ధర్నాలన్నీ దొంగ ధర్నాలే అని వ్యాఖ్యానించారు. 

 

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌.. హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : వైసీపీ నుంచి టీడీపీకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.  నలుగురు మంత్రులతో సహా 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మూడు వారాల్లోగా సమాధాని ఇవ్వాలని హైకోర్టు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.

 

ప్రగతి భవన్ ఎదుట యువకుడి ఆత్మహత్య యత్నం..

హైదరాబాద్: ప్రగతి భవన్ ఎదుట ఓయువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని గాంధీ అసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి వుంది. 

కేరళలో అవినీతి రహిత పాలన : ఉండవల్లి

తూ.గోదావరి : కేరళలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని..ఆ పాలనను  సీఎం చంద్రబాబు కేరళను ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. చంద్రబాబు తీరుతోనే ఏపీకి అన్యాయం జరుగుతోందని విమర్శించారు.దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని ప్రచారం చేసుకుంటే ప్రత్యేక హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఐదేళ్ళలో సాధించలేని ప్రత్యేక హోదాను వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.

కక్ష సాధింపు కోసం మోదీ ఏదైనా చేస్తారు : జేసి

ఢిల్లీ : కక్ష సాధింపు కోసం మోదీ ఏం చేసేందుకు కూడా వెనుకాడరని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీవి అన్నీ దొంగ ధర్నాలని విమర్శించారు. వైసీపీకి ఏడుగురు ఎంపీలుంటే ఐదుగురితోనే రాజీనామా చేయించారనీ..వారిద్దరూ రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని జేపీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం చేసే పోరాటం మొత్తం బూడిదలో పోసిన పన్నీరేనని స్పష్టం చేశారు. ఈ వాస్తవం తనకు తెలిసినా, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాన్ని శిరసావహిస్తూ హోదా పోరాటంలో భాగమవుతున్నానని ఆయన చెప్పారు.

మోదీ ఉన్నంతకాలం హోదా రాదు: జేసీ

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై పోరాడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఉన్నంత కాలం రాష్ట్రానికి న్యాయం జరగదని జేసీ వ్యాఖ్యానించారు. 2019 వచ్చే ప్రభుత్వంతో సాధించుకోవాలి తప్ప ఇప్పట్లో సాధ్యంకాదన్నారు. హోదా వస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందని మోదీ భయపడుతున్నారని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

12:39 - April 10, 2018
12:33 - April 10, 2018

తమిళనాడు : చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌కు సినీగండం ఎదురవుతోంది. మ్యాచ్‌ జరగకుండా తాము అడ్డుకుంటామని సినీ రంగ ప్రముఖులు హెచ్చరించారు. మ్యాచ్‌కు హాజరు కావద్దని సినీ ప్రముఖులు ప్రజలకు పిలుపునిచ్చారు. కావేరి వివాద పరిష్కారంలో కేంద్రం వైఖరితో పాటు.. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై నిరసనగానే తామీ నిర్ణయం తీసుకున్నట్లు సినీరంగ ప్రముఖులు స్పష్టం చేశారు. కావేరి బోర్డు ఏర్పాటు వ్యవహారం.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు అడ్డంకిగా మారనుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మంగళవారం చెన్నైలో చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను అడ్డుకోవాలని తమిళ సినీ పరిశ్రమ నిర్ణయించింది. ప్రజలు కూడా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కావేరి సమస్య రగులుతున్న తరుణంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

12:26 - April 10, 2018

కేరళ : రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది ఆర్థిక మంత్రుల సదస్సు ప్రాంభమయ్యింది. దక్షిణాది రాష్ట్రాల పాలిట 15వ ఆర్థికం సంఘం శాపంగా పరిణమించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఘం ప్రతిపాదనలను యథాతథంగా అమలు చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈదశలో... 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలు-దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు.. కీలక సమావేశం ప్రారంభయ్యింది. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను యథాతథంగా అమలుచేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అంశాన్నీ ఈ సమావేశంలో చర్చించనున్నారు. 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించటంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. దీంతో తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని కేంద్రం వహిస్తోంది. 1971తో పోలిస్తే 2011లో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది.....అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. నిరక్షరాస్యత, పేదరికం లాంటి కారణాలతో ఉత్తరాదిలో జనాభా పెరిగిపోయింది. దక్షిణాదిలో మాత్రం అక్షరాస్యత పెరుగుదల, పేదరికం తగ్గడం, కుటుంబని యంత్రణ విధానాలు పాటించడంతో జనాభా పెరుగుదల తగ్గింది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఆర్థికంగా సమ ప్రాధాన్యతను పొందే లక్ష్యంతో వ్యవహరించాల్సిన ఆర్థిక సంఘం.. ఈసారి, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

ఆర్థిక సంఘాన్ని ప్రముఖ ఆర్థికవేత్త ఎన్‌. కె. సింగ్‌ ఆధ్వర్యంలో
ఐదు సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్‌ కమిషన్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీని బాధ్యతను చేపట్టే ఈ సంఘంలో చైర్మన్‌, నలుగురు సభ్యులు ఉంటారు. ఈ సారి 15వ ఆర్థిక సంఘాన్ని ప్రముఖ ఆర్థికవేత్త ఎన్‌. కె. సింగ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రపతి ఏర్పాటు చేశారు. 2019 అక్టోబర్‌లో సంఘం తన నివేదికను కేంద్రానికి అందజేస్తుంది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన ఈ కమిషన్‌ సిఫార్సులు.. దక్షిణాది రాష్ట్రాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. 2020 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వచ్చే 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసులపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

1971 జనాభా లెక్కల ప్రకారం నిధులు
ఇప్పటి వరకు ఆర్థిక సంఘాలన్నీ 1971 జనాభాలెక్కల ప్రకారం రాష్ట్రాలకు నిధులు కేటాయించాయి. 14వ ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కలకు 17.5 శాతం ప్రాముఖ్యతను, 2011 జనాభా లెక్కలకు 10 శాతం వెయిటేజీ ఇచ్చింది.

2011 జనాభా ప్రాతిపదికగా తీసుకోవాలన్న కేంద్రం
ఈ సారి 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇది దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర తీవ్ర నష్టాన్ని కలిగించబోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం మరింత ఎక్కువగా చూపనుంది. కేంద్రం నుండి వచ్చే నిధుల బదిలీలు, మూలధన ఆదాయాలపైనే ఆధారపడి ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. అదీకాకుండా 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలు దేశ సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయన్న భావనా వ్యక్తమవుతోంది.

దక్షిణాది రాష్ట్రాలు సమైక్య గళాన్ని వినిపించేందుకు సమాయత్తం
దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక ఇక్కట్లను మిగల్చనున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలు సమైక్య గళాన్ని వినిపించేందుకు సమాయత్తమవుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆర్థిక సంఘం రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులకు తగిన ప్రాధాన్యతనివ్వాలన్న డిమాండ్‌ను దక్షిణాది రాష్ట్రాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కేరళ ఆర్థిక మంత్రి చొరవ తీసుకుని 15వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం కేరళలో జరగనున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరు కానున్నారు. తమిళనాడు రాష్ట్రం ఈ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించింది. తెలంగాణ వైఖరి ఇంకా స్పష్టం కాలేదు. కేరళలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ద్వారా.. 2011 జనాభా ల ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా లెక్కల ప్రాతిపదికగానే 15వ ఆర్థిక సంఘం సిఫారసులు ఇవ్వాలని ఒత్తిడిని పెంచున్నారు. 

12:12 - April 10, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో తలపెట్టిన వైసీపీ ఎంపీల దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది.ఈ నేపథ్యంలో ఎంపీలు మిధున్ రెడ్డి, అవినాశ్ రెడ్డిల ఆరోగ్యం క్షీణించింది. దీంతో వారికి వైద్యులు వైద్యపరీక్షలను నిర్వహించారు. వారి షుగర లెవెల్స డౌన్ అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. అయినా కేంద్రం స్పందించేంత వరకూ తమ దీక్షను కొనసాగిస్తామని ఎంపీలు పేర్కొంటున్నారు. కాగా ఏపికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

హ్యాపీ సిటీను సదస్సును ప్రారంభించిన చంద్రబాబు..

అమరావతి: మంగళగిరిలో ఆనంద నగరాల సదస్సు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీవాసుదేవ్‌ ఈ సదస్సును ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో 27 దేశాల ప్రతినిధులు, వివిధ నగరాల మేయర్లు హాజరయ్యారు. సదస్సులో మూడు రోజులపాటు వివిధ అంశాలపై చర్చలు జరుగనున్నాయి. ముగింపు సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

11:57 - April 10, 2018

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదికయింది. ఈరోజు నుండి మూడు రోజుల పాటు ఆనంద నగరాల సదస్సు జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా నిర్వహించే ఈ సదస్సును ఏపీలో మొదటిసారి జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. 27 దేశాల నుంచి నిష్టాతులైన ఆర్కిటెక్ట్‌లు, ప్రణాళికా నిపుణులు హాజరయ్యారు. రాష్ట్రంలోని అందరూ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లతోపాటు మున్సిపల్‌ కమిషనర్లను సదస్సుకు ఆహ్వానించారు. దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు. విజయవాడ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, నాగార్జున యూనివర్సిటీ ఆర్టిటెక్చర్‌ విద్యార్థులు, అమరావతికి భూములిచ్చిన రైతులను కూడా సదస్సుకు ఆహ్వానించారు. సదస్సులో విద్యార్ధులు కూడా ప్రసంగించనున్నారు. కాగా ఈనెల 12న జరిగే ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

11:42 - April 10, 2018

కడప : పసుపు గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పసుపు నిల్వలన్నీ కాలి బూడిదయిపోయాయి. ఈ ఘటనలో కడప జిల్లా ముద్దనూరులో సంభవించింది. యశ్వంత రూరల్ గోడౌన్ లో ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దాదాపు 7వేల బస్తాల పసుపు నిల్వలు అగ్నికి ఆహుతి అయినట్లుగా తెలుస్తోంది. కాగా గోడౌన్ కెపాసిటీ 1లక్షా 60వేల బస్తాల సామర్థ్యం కలిగివుండగా డి బ్లాక్ లో వున్న 30వేల బస్తాల పసుపు నిల్వ వుంది. దీంట్లో 7వేల బస్తాల పసుపు అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో రూ2కోట్ల రూపాయలు విలువ చేసే పసుపు కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావటంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. అధికారులు రైతులు వద్ద కొనుగోలు చేసిన గోడౌన్ లో భద్రపరిచారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.  

సీఎస్ ఎల్వీ సి 41 రాకెట్ కౌంట్ డౌన్..

నెల్లూరు : ఈనెల 12న సీఎస్ ఎల్వీ సి 41 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభంకానుంది. ఈరోజు రాత్రి 8గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

నిత్య పెండ్లి కొడుకు గుట్టు రట్టు..

నిజామాబాద్ : ఓ నిత్య పెళ్లి కొడుకు బండారం బట్టబయలయ్యింది. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటు ముగ్గురు యువతులను వివాహం చేసుకున్నాడు. పవన్ కుమార్ అనే వ్యక్తి గత కొంత కాలం నుండి యువతులకు మోసం చేస్తు వివాహాలు చేసుకుంటున్నాడు. ఈ విషయం బైటకు తెలియటంతో బాధితులు ముగ్గురు పవన్ కుమార్ ఇంటిముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయమంటు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పవన్ కుమార్ పరారయినట్లుగా తెలుస్తోంది. 

ఎక్కడ హామీ ఇచ్చారో అక్కడ అడుగుతా : చంద్రబాబు

చిత్తూరు : దాదాపు నాలుగున్నర సంవత్సరాల క్రితం తిరుమల వెంకన్న సాక్షిగా..తిరుపతిలో మోదీ ప్రజలకు ఎక్కడైతే ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ తదితరాంశాలపై హామీ ఇచ్చారో, అదే ప్రాంతంలో నిలబడి, హామీల అమలుకు నినదిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నాడు ఎన్నికల సభలో మోదీ ఇచ్చిన హామీని గుర్తు చేయడమే లక్ష్యంగా ఈనెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

నవ స్వర్ణాల భారత్..

హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఉత్సాహంగా జరుగుతోన్న కామన్వెల్త్‌ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. వరుస పతకాలు సాధిస్తూ అదరహో అన్పిస్తున్నారు. తాజాగా భారత్‌ ఖాతాలోకి మరో పసిడి పతకం వచ్చి చేరింది. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. తుదిపోరులో భారత జట్టు నైజీరియాపై 3-0 తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్‌కు ఇది తొమ్మిదో స్వర్ణం కావడం విశేషం. ఈ ఒక్క రోజే భారత్‌ రెండు స్వర్ణాలు సాధించింది. తొమ్మిది పసిడి, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 18 పతకాలు సాధించిన భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.

హోదాపై స్పందించిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం..

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలంటే, ఈ ఉద్యమాలు, ఈ నిరసనలు సరిపోవని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించారు. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉన్న రోశయ్యను కలిసేందుకు ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న వచ్చిన వేళ, రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న హోదా ఉద్యమానికి మద్దతివ్వాలని వెంకన్న కోరగా, హోదా ఉద్యమాన్ని ఎవరూ ఊహించనంత ఉద్ధృత స్థాయికి తీసుకు వెళితేనే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు నరేంద్ర మోదీ కట్టుబడి ఉండాలని హితవు పలికారు.

హోదాపై స్పందించిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం..

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలంటే, ఈ ఉద్యమాలు, ఈ నిరసనలు సరిపోవని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించారు. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉన్న రోశయ్యను కలిసేందుకు ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న వచ్చిన వేళ, రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న హోదా ఉద్యమానికి మద్దతివ్వాలని వెంకన్న కోరగా, హోదా ఉద్యమాన్ని ఎవరూ ఊహించనంత ఉద్ధృత స్థాయికి తీసుకు వెళితేనే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు నరేంద్ర మోదీ కట్టుబడి ఉండాలని హితవు పలికారు.

శ్రీవారి హుండీ ప్రయివేటు సంస్థలకు..

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కోట్లాది మంది భక్తులు నిత్యమూ వెంకన్నకు సమర్పించుకునే హుండీ కానుకలను లెక్కించే బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. పరకామణి లెక్కింపు బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించేందుకు రంగం సిద్ధం కాగా, భక్తులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రస్తుతం హుండీలో పడే కరెన్సీ, బంగారు, వెండి కానుకల మదింపును టీటీడీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు లెక్కిస్తుంటారు. స్వామివారి గర్భాలయం పక్కనే పరకామణిలో ఈ పనులు నిత్యమూ జరుగుతుంటాయి.

09:43 - April 10, 2018

మహారాష్ట్ర : రాష్ట్రంలోని ఖండాల వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం బోల్తా పడటంతో 18 మృతి చెందారు. మరో 15మంది గాయాలపాలయ్యారు. పూణె నుండి బెంగలూరుకు వెళ్లే దారిలో సతారా జాతీయ రహదారిపై అదుపు తప్పిన డీసీఎం బారికేడ్లను ఢీకొంది. గాయపడినివారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా డీసీఎంలో దాదాపు 40మంది వున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా కర్ణాటకలోని ఓ ఇండ్రస్ట్రియల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులుగా తెలుస్తోంది. 

పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి..

జమ్ము కశ్మీర్ : పాకిస్థాన్ కాల్పుల ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. సుందర్భని సెక్టార్ లో పాక్ సైనికులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భారత్ కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. పాకిస్థాన పదే పదే కాల్పుల ఉల్లంఘన చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కాల్పులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

కలెక్టర్ ఆత్మహత్య!..

మేడ్చల్‌ : బిల్‌కలెక్టర్‌ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీలో బిల్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న 30 సంవత్సరాల కరకభట్ల భాస్కర్ పూడూరు అనుబంధ గ్రామం అర్కలగూడ రెవిన్యూ పరిధిలో మర్రిచెట్టుకు ఓవ్యక్తి ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సదరు వ్యక్తిని భాస్కర్ గా గుర్తించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

09:16 - April 10, 2018

పవన్ రమ్మన్నా పార్టీ మారనన్నా : జేసీ

విజయవాడ : కొన్ని నెలల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరపున కొందరు నేతలు తన వద్దకు వచ్చి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారన్నారు. వారి ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని, పార్టీ మారేది లేదని తేల్చి చెప్పానన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి రావాలంటూ తనను ఆహ్వానించారని పేర్కొన్నారు. అయితే, ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానన్నారు. 

08:53 - April 10, 2018

మిర్యాలగూడ : అక్కడ అధికార పార్టీ నేతలదే హవా. వారి అండదండలతో చోటా నాయకులు రెచ్చిపోతున్నారు. మున్సిపాలిటీలు, పంచాయితీలలో ఇష్టారీతిన వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో స్వయం ఉపాధిని పొందాలనుకున్న యువతకు నిరాశే మిగులుతోంది.

ప్రహసనంగా మారిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్ల వ్యవహారం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్ల వ్యవహారం ప్రహసనంగా మారింది. అధికార పార్టీకి చెందిన నేతలే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రముఖ వాణిజ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది మిర్యాలగూడ. పదేళ్ల క్రితం ఇక్కడ మున్సిపాలిటీకి అనుబంధంగా ప్రధాన రహదారి వద్ద బస్టాండ్‌కు సమీపంలో వ్యాపార సముదాయాన్ని నిర్మించారు. మొత్తం 66 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దుకాణానికి 3వేలు కిరాయిగా నిర్ణయించారు. అంటే 66 దుకాణాలకు కలిపి మొత్తం లక్షా 98 వేల ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది.

పెరిగిన ధరల ప్రకారం ఒక్కో దుకాణానికి రూ. 8వేలు కిరాయి
అయితే ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం తాజాగా టెండర్లను ఆహ్వానిస్తే నెలకు ఒక దుకాణానికి 8వేల చొప్పున మొత్తం 5 లక్షల 28వేల ఆదాయం మున్సిపాలిటీకి చేరుతుంది. అంటే సుమారు 12 శాతం ఆదాయం పెరుగుతుంది. ఈ లెక్క ప్రకారం ఏడాదికి 63 లక్షల 36 వేల ఆదాయం మున్సిపాలిటీకి వచ్చే అవకాశం ఉండగా... కేవలం 23 లక్షల 76 వేల ఆదాయం మాత్రమే వస్తోంది. దుకాణాలను లీజుకు తీసుకున్న చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా సబ్‌లీజుకి ఇచ్చి భారీగా ఆదాయం పొందుతున్నారు. మున్సిపాలిటీకి ఒక షాపుకు ఏడాదికి 36వేలు మాత్రమే కడుతూ... సబ్‌ లీజు కింద 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. పైగా ఒపెన్ టెండర్లను పిలవకుండా లీజుదారులు అడ్డుపడుతున్నారు. దళారుల నిర్వాకం ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న ఎందరో నిరుద్యోగులకు భారంగా మారింది.

ప్రతి ఏటా 10-20 శాతం కిరాయి పెంచుతున్న దళారులు
దళారులు ప్రతి సంవత్సరం 10 నుండి 20 శాతం కిరాయి పెంచుతూ ఇష్టానుసారం కిరాయి వసూలు చేస్తున్నారు. టెండర్లు ఆహ్వానించి మార్కెట్‌ రేట్‌ ప్రకారం దుకాణాలు కేటాయించినా ఏడాదికి లక్ష రూపాయల లోపే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా తెలిసినప్పటికీ అధికారులు దళారులకు సహకరిస్తూ అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా వింటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెరిగిన ధరల ప్రకారం మున్సిపాలిటీకి అందని ఆదాయం
ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం మున్సిపాలిటీకి ఆదాయం అందడంలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా తాజాగా టెండర్లు నిర్వహిస్తే కిరాయి పెరిగి మున్సిపాలిటీకి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కాని అధికారులు పాలకవర్గం తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెండర్ల అంశాన్ని ఏదో సాకుతో దాటవేస్తూ వస్తున్నారు. వీటితో పాటు నాలుగేళ్లక్రితం ఇదే సముదాయంలో మొదటి అంతస్తులో దుకాణాలు నిర్మించారు. మొత్తం 90 దుకాణాలకు ఇప్పటికీ టెండర్లు లేక ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బహిరంగ వేలానికి టెండర్లు ఆహ్వానించినా కిరాయి ఎక్కువగా ప్రకటించడంతో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఈ టెండర్లను రద్దు చేశారు. అదే సమయంలో డిమాండ్‌ ఉన్న గ్రౌండ్‌ ఫ్లోర్‌ లోని దుకాణాలకు మాత్రం టెండర్లను వాయిదా వేస్తూ కాలం గడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి టెండర్లు
నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒక సారి దుకాణాలకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. మొదట టెండర్లు దక్కించుకున్న వారు పాలకవర్గం సహకారంతో కోర్టులను ఆశ్రయించి ప్రక్రియను పొడగించుకుంటూ వెళ్తున్నారు. కనీసం కోర్టుల్లో కూడా కౌంటర్‌ దాఖలు చేయకుండా ఐదేళ్లుగా మున్సిపల్‌ అధికారులు జాప్యం వహించడంతో స్థానికులు మండిపడుతున్నారు. తాజాగా జారీ చేసిన టెండర్ల ప్రకటనపైనా కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. అయితే లీజుదారులను వెంటనే ఖాళీ చేయించకుండా కొంత సమయం ఇవ్వాలని కోర్టు అనుమతిచ్చింది. అంతే కాని టెండర్లను రద్దు చేయాలని కాని నిలిపివేయాలని కాని కోర్టు ఆదేశాలివ్వలేదు. కాని దీనినే సాకుగా చూపి మొత్తం టెండర్లనే రద్దు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. టెండర్ల గడువు ముగిసినా ఇంతవరకు వాటిని ఒపెన్‌ చేయలేదని.... ఈ పేరుతో భారీగా డిపాజిట్లు చెల్లించిన ఆశావహులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులపై చర్యలు తీసుకొని టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టెండర్ల వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తోన్న మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నాగలక్ష్మి భర్త
ఈ టెండర్ల వ్యవహారంలో స్థానిక మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నాగలక్ష్మి భర్త భార్గవ్‌ టెండర్ల రద్దులో కీలక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ నుండి గెలిచిన చైర్‌ పర్సన్‌ పీఠాన్ని కాపాడుకోవడం కోసం కొంత కాలం క్రితం అధికార పార్టీలో చేరారు. ఇప్పుడు అధికారులను సైతం బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. లీజుదారులకు గడువు పొడగింపులో అధికారులు కోర్టును ఆశ్రయించకపోవడం...అదే విధంగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను అడ్డంపెట్టుకొని మొత్తం టెండర్ల ప్రక్రియను దారి మళ్లించడంలో ఆయన పాత్రే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సబ్‌ లీజుకి ఇచ్చిన చాలా మంది నుండి భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని టెండర్లను నిలుపు చేసినట్లు వ్యాపారులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.

కోర్టు ఆదేశాలతోనే వాయిదా వేశామంటున్న మున్సిపల్‌ కమిషనర్‌..
అసలు లీజుదారులను వెంటనే ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పాటు టెండర్లకు పెద్దగా స్పందన లేకపోవడం వల్లనే టెండర్లను వాయిదా వేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సత్యంబాబు చెబుతున్నారు. కోర్టు కేసు ముగిసిన వెంటనే టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందంటున్నారు. మొదటి ఫ్లోర్‌లో నూతనంగా నిర్మించిన వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ ధర నిర్ణయించామని.. వాటికి మరోసారి టెండర్లు పిలుస్తామన్నారు.

విధులు బహిష్కరించి ఆందోళన బాట పడుతోన్న కార్మికులు..
ఇదంతా ఒక ఎత్తయితే మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతిఏటా రెండు సార్లు కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పడుతున్నారు. కనీస వేతనాలు చెల్లించకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ ఆదాయం నుండే కార్మికుల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఆదాయంలేకే వేతనాలు ఆలస్యమవుతున్నాయిని అధికారులు చెబుతున్నారు. అయితే పాలకవర్గం కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్లను వాయిదా వేస్తూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇప్పటికైనా అధికారులు.... రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో కాకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వ్యాపారులు కోరుతున్నారు. దీనివలన మున్సిపాలిటీ ఆదాయం పెరగడంతో పాటు అసలు దుకాణాదారులకు అండగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. 

డీసీఎం బోల్తా ,18మంది మృతి..

మహారాష్ట్ర : రాష్ట్రంలోని ఖండాల వద్ద డీసీఎం బోల్తా పడింది. ఈఘటనలో 18 మృతి చెందారు. మరో 15మంది గాయాలయ్యాయి. పూణె నుండి బెంగలూరు హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడినివారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

08:26 - April 10, 2018

అమరావతి  : వైసీపీ హోదా ఉద్యమాన్ని ఉదృతం చేసింది. అటు ఢిల్లీ, ఇటు రాష్ట్రంలోను హోదా ఉద్యమాన్ని వైసీపీ హోరెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ టీడీపీ ఎంపీలను నిలదీయాలను ప్రజలకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై బైఠాయించాలనీ.. బుధవారం నాడు రైల్ రోకోలకు వైసీపీ రెడీ అవుతోంది. ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు సంఘీభావంగా ఈరోజు రాష్ట్రంలో రహదారులను దిగ్భంధం చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. 

బీజేపీ ఎమ్మెల్యే పై అత్యాచారం కేసు నమోదు..

ఉత్తరప్రదేశ్ : బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్, ఆయన సోదరులు ఏడాది క్రితం తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన 18 ఏళ్ల యువతి తండ్రి పోలీసుల కస్టడీలో మృతి చెందారు. ఎమ్మెల్యేపై కుట్ర అభియోగాలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి ఫిర్యాదు చేసినా కేసు పెట్టని పోలీసులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె తండ్రిని మాత్రం ఈనెల 5న అరెస్ట్ చేశారు. 

నగరంలో హోమియో వాక్‌..

హైదరాబాద్ : జేఎస్‌పీఎస్‌ హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆధ్వర్యంలో.. ప్రపంచ హోమియోపతి డే సందర్భంగా నగరంలోని రామంతాపూర్ లోని కాలేజీ ఆవరణలో ఉదయం 7 గంటలకు ‘హోమియో వాక్‌’ జరగనుంది. 

బీహార్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ..

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బిహార్‌లో పర్యటించనున్నారు. చంపారన్‌ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల ముగింపులో పాల్గొనడంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. పట్నా నగరానికి సంబంధించి రూ. 1111 కోట్లతో చేపట్టే 4 మురుగునీటి పారుదల పథకాలకు మోతీహరిలో శంకుస్థాపన చేస్తారు. అలాగే చంపారన్‌ సత్యాగ్రహ ఉత్సవాల్లో భాగంగా 20 వేల మంది స్వచ్ఛగ్రహిలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. వివిధ రైల్వే పథకాలను కూడా ఆయన ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

ఏపీలో ఆనందనగరాలు శిఖరాగ్ర సదస్సు..

గుంటూరు: ఆనంద నగరాల శిఖరాగ్ర సదస్సుకు అమరావతి రాజధాని నగరం ఘనంగా ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రప్రథమంగా జరగబోతోన్న ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్వహించేందుకు సీఆర్డీయే, గుంటూరు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశాయి. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు తరలి వస్తుండటంతో బందోబస్తు పరంగా గట్టి భద్రతా చర్యలు తీసుకొంటున్నారు. ఆనంద నగరాల్లో అమరావతి మేటిగా ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సు ద్వారా భవిష్యత్తు రాజధాని ఎలా ఉండబోతోందనేది కళ్లకు కట్టనున్నారు. 

07:58 - April 10, 2018

హైదరాబాద్ : 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాల పాలిట శాపంగా పరిణమించనుందా? . సంఘం ప్రతిపాదనలను యథాతథంగా అమలు చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈదశలో... 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలు-దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు.. మంగళవారం కేరళలో కీలక సమావేశం జరగబోతోంది. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను యథాతథంగా అమలుచేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అంశాన్నీ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈచర్చలో బీజేపీ అధికార ప్రతినిథి పీవీ.సుభాష్,టీఆర్ఎస్ నేత సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. దక్షిణాదికి సంబంధించిన ఆరు రాష్ట్రాలపై కేంద్రం ఎందుకు వివక్ష చూపిస్తోంది? ఉత్తరాది రాష్ట్రాలను దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో అధిగమిస్తాయనే భావన కేంద్రం ప్రభుత్వం వుందా? వంటి పలు కీలక అంశాలను ఈరోజు న్యూస్ మార్నింగ్ చర్చలో చూద్దాం..

07:45 - April 10, 2018

ప్రస్తుతం దేశంలో దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాలం మారింది, కులం పోయింది అన్న మాటలు వట్టివే అని జరుగుతున్న సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. వీటిని ఆపాల్సిన పాలకులు నిర్లక్ష్యం వహించడం దేశంలోని దళిత వర్గాలను బాధకు గురిచేస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా దేశంలోని దళిత మేధావులు, నాయకులు ఈ దాడులను ఆపాలని, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకీ దళితులపై దాడులు పెరగటానికి కారణాలేంటి? ఇవి ఆగాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సీనియర్‌ నాయకుడు జాన్‌వెస్లీ గతకొంతకాలంలో కుల విపక్షపై పోరాడతున్నారు. మరి ఈ అంశంపై ఆయన ఎటువంటి విశ్లేషణ చేయనున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

 

07:41 - April 10, 2018

హైదరాబాద్ : సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తాము కోరుకున్న రీతిలో ఐపీఎల్‌ను ప్రారంభించింది. ఎక్కడా ఎలాంటి తడబాటు లేకుండా అతి సునాయాసంగా తొలి విజయాన్ని అందుకుంది. పొదుపుగా బౌలింగ్‌ చేయడంలో తమ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. రాజస్థాన్‌ రాయల్స్‌పై అన్ని విధాలా ఆధిపత్యం చలాయించి.. 15.5 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. శిఖర్‌ ధావన్‌ 57 బంతుల్లో 77 పరుగులు చేసి మ్యాచ్‌ గెలుపునకు కీలకపాత్ర పోషించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శుభారంభం చేసింది. ఉప్పల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.

రెచ్చిపోయిన శిఖర్ ధావన్
రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ రెచ్చిపోయి ఆడడంతో 9 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది. 126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు.. వీరవిహారం చేయడంతో... 15.5 ఓవర్లలోనే విజయాన్ని చేరుకున్నారు. అయితే... సాహా ఐదు పరుగుల చేసి ఔట్‌ కావడంతో.. తర్వాత శిఖర్‌దావన్‌ రెచ్చిపోయి ఆడాడు. ధావన్‌కు మరో ఎండ్‌లో విలియమ్సన్‌కు అండగా నిలవడంతో స్కోర్‌ను పరుగులు పెట్టించారు. శిఖర్‌ ధావన్‌ 57 బంతుల్లో ఒక సిక్సర్‌, 13 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. ఇక విలియమ్సన్‌ కూడా 35 బంతుల్లో ఒక సిక్సర్‌, మూడు ఫోర్లతో 36 రన్స్‌ చేశాడు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో 4 ఓవర్లు ఉండగానే 127 పరులు చేసి విజయం సాధించింది.

రాజస్థాన్‌ రాయల్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయం
అంతకుమందు బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. రహానే, శాంసన్‌, త్రిపాఠి, గోపాల్‌లు మాత్రమే రెండంకెల స్కోర్‌ మాత్రమే చేయగలిగారు. రాజస్థాన్‌ అన్ని విభాగాల్లోనూ వైఫల్యం చెందడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ శిఖర్‌ ధావన్‌
మొత్తానికి తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడడంతో సునాయాసంగా విజయం నమోదు చేశారు. మ్యాచ్‌ గెలుపునకు కీలకపాత్ర పోషించిన శిఖర్‌ ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

07:36 - April 10, 2018

తమిళనాడు : చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌కు సినీగండం ఎదురవుతోంది. మ్యాచ్‌ జరగకుండా తాము అడ్డుకుంటామని సినీ రంగ ప్రముఖులు హెచ్చరించారు. మ్యాచ్‌కు హాజరు కావద్దని సినీ ప్రముఖులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కావేరి వివాద పరిష్కారంలో కేంద్రం వైఖరితో పాటు.. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై నిరసనగానే తామీ నిర్ణయం తీసుకున్నట్లు సినీరంగ ప్రముఖులు స్పష్టం చేశారు.

తమిళనాడులో కాకపుట్టిస్తోన్న కావేరి బోర్డు ఏర్పాటు వ్యవహారం
కావేరి బోర్డు ఏర్పాటు వ్యవహారం.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు అడ్డంకిగా మారింది. మంగళవారం చెన్నైలో చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను అడ్డుకోవాలని తమిళ సినీ పరిశ్రమ నిర్ణయించింది. ప్రజలు కూడా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కావేరి సమస్య రగులుతున్న తరుణంలో.. ఇలాంటి మ్యాచ్‌ల ద్వారా.. సమస్యను పక్కదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని సినీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు.

సమస్యలపై ఉద్యమించాలని సినీ ప్రముఖుల నిర్ణయం
తమిళనాడులోని వివిధ సమస్యలపై ఉద్యమించాలని తమిళనాడు సినీప్రముఖులు నిర్ణయించారు. దీనికోసం సోమవారం.. తమిళర్‌ ఆర్ట్‌ అండ్‌ లిటరేచర్స్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో ఏర్పాటైన ఈ వేదిక ద్వారా.. తమిళనాడుకు జరుగుతోన్న అన్యాయంపై దృష్టి సారించాలని, సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమించాలని నిర్ణయించారు.

తమిళనాడులో సెగలు పుట్టిస్తోన్న కావేరి బోర్డు ఏర్పాటు వ్యవహారం
కావేరి బోర్డు కోసం ఇంత ఆందోళన జరుగుతుంటే.. మీకు ఎంత ధైర్యముంటే అన్నా యూనివర్సిటీకి ఓ కన్నడిగుడిని వీసీగా వేస్తారు. మ్యూజిక్‌ అకాడమీకి కేరళ వ్యక్తిని నియమిస్తారు..? తమిళనాడులో సంగీత జ్ఞానం ఉన్న వాళ్లే లేరా..? ఇంకో యూనివర్సిటీకి ఆంధ్రా వ్యక్తిని వీసీగా నియమించారు. ఇది చూస్తే కావాలని చేసినట్లుగా లేదూ..? ఈ ప్రాంతాన్ని కొంచెం కొంచెంగా కబళించే ప్రయత్నం చేస్తున్నారు. 50 ఏళ్లుగా ఎవరూ తమిళనాడు వైపు చూసే సాహసం చేయలేదు.

తమిళనాడుతోపాటు దక్షిణాది రాష్ట్రాల సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయం
తమిళనాడు సమస్యలతో పాటు.. దక్షిణాది రాష్ట్రాల సమస్యలపైనా కదం తొక్కాలని, తమిళర్‌ ఆర్ట్‌ అండ్‌ లిటరేచర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ చొరబాటుపై నిగ్గదీయాలని తీర్మానించింది. మొత్తానికి తమిళనాట.. కావేరి బోర్డు ఏర్పాటు కోసం జరుగుతోన్న ఆందోళన ప్రభావం.. తక్షణమే ఐపీఎల్‌పై పడింది. యాభై సంవత్సరాలకు పైగా.. తమిళనాడువైపు చూసేందుకు ఏ జాతీయ పార్టీ సాహసించలేదని, అలాంటిదిప్పుడు పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం మోదీ కనుసన్నల్లో నడుస్తోందని సినీ, రాజకీయ ప్రముఖులు ఆరోపిస్తున్నారు. అందుకే.. ఎవరికివారుగా తమిళనాడు పరిరక్షణ పేరిట ఉద్యమ బాట పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరెన్ని రూపాలు సంతరించుకుంటుందోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. 

07:29 - April 10, 2018

హైదరాబాద్ : 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాల పాలిట శాపంగా పరిణమించనుంది. సంఘం ప్రతిపాదనలను యథాతథంగా అమలు చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈదశలో... 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలు-దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు.. మంగళవారం కేరళలో కీలక సమావేశం జరగబోతోంది. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను యథాతథంగా అమలుచేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అంశాన్నీ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

2019 అక్టోబర్‌లో కేంద్రానికి నివేదికను అందజేయనున్న సంఘం..
దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఆర్థికంగా సమ ప్రాధాన్యతను పొందే లక్ష్యంతో వ్యవహరించాల్సిన ఆర్థిక సంఘం.. ఈసారి, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్‌ కమిషన్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీని బాధ్యతను చేపట్టే ఈ సంఘంలో చైర్మన్‌, నలుగురు సభ్యులు ఉంటారు. ఈ సారి 15వ ఆర్థిక సంఘాన్ని ప్రముఖ ఆర్థికవేత్త ఎన్‌. కె. సింగ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రపతి ఏర్పాటు చేశారు. 2019 అక్టోబర్‌లో సంఘం తన నివేదికను కేంద్రానికి అందజేస్తుంది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన ఈ కమిషన్‌ సిఫార్సులు.. దక్షిణాది రాష్ట్రాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. 2020 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వచ్చే 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసులపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

1971 జనాభా లెక్కల ప్రకారం నిధులు..
ఇప్పటి వరకు ఆర్థిక సంఘాలన్నీ 1971 జనాభాలెక్కల ప్రకారం రాష్ట్రాలకు నిధులు కేటాయించాయి. 14వ ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కలకు 17.5 శాతం ప్రాముఖ్యతను, 2011 జనాభా లెక్కలకు 10 శాతం వెయిటేజీ ఇచ్చింది. 1971తో పోలిస్తే 2011లో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది.....అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. నిరక్షరాస్యత, పేదరికం లాంటి కారణాలతో ఉత్తరాదిలో జనాభా పెరిగిపోయింది. దక్షిణాదిలో మాత్రం అక్షరాస్యత పెరుగుదల, పేదరికం తగ్గడం, కుటుంబని యంత్రణ విధానాలు పాటించడంతో జనాభా పెరుగుదల తగ్గింది.

2011 జనాభా ప్రాతిపదికగా తీసుకోవాలన్న కేంద్రం..
ఈ సారి 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇది దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర తీవ్ర నష్టాన్ని కలిగించబోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం మరింత ఎక్కువగా చూపనుంది. కేంద్రం నుండి వచ్చే నిధుల బదిలీలు, మూలధన ఆదాయాలపైనే ఆధారపడి ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. అదీకాకుండా 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలు దేశ సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయన్న భావనా వ్యక్తమవుతోంది.

దక్షిణాది రాష్ట్రాల సమావేశం ఏర్పాటు చేయనున్న కేరళ ఆర్థిక మంత్రి..
దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక ఇక్కట్లను మిగల్చనున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలు సమైక్య గళాన్ని వినిపించేందుకు సమాయత్తమవుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆర్థిక సంఘం రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులకు తగిన ప్రాధాన్యతనివ్వాలన్న డిమాండ్‌ను దక్షిణాది రాష్ట్రాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కేరళ ఆర్థిక మంత్రి చొరవ తీసుకుని 15వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం కేరళలో జరగనున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరు కానున్నారు. తమిళనాడు రాష్ట్రం ఈ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించింది. తెలంగాణ వైఖరి ఇంకా స్పష్టం కాలేదు. కేరళలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ద్వారా.. 2011 జనాభా ల ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా లెక్కల ప్రాతిపదికగానే 15వ ఆర్థిక సంఘం సిఫారసులు ఇవ్వాలని ఒత్తిడిని పెంచున్నారు. 

07:21 - April 10, 2018

హైదరాబాద్ : సీనియర్‌ జర్నలిస్టు విరాహత్‌ అలీ ఉద్యమాల ప్రస్తానంపై రూపొందించిన కలం సైనికుడు డాక్యుమెంటరీ ఆవిష్కరణ జరిగింది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు సీడీని విడుదల చేశారు. ఎమ్మెల్యేలు గీతారెడ్డి, రసమయి బాల్‌కిషన్‌, సోలిపేట రామలింగారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత్రికేయవృత్తిలో విరాహత్‌ అలీ కృషిని ప్రశంసించారు. 

07:19 - April 10, 2018

హైదరాబాద్ : ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే గడువు ఉండడంతో ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ బాధ్యతలను తీసుకున్న గులాబీ నేతలు అసెంబ్లీ సమావేశాల అనంతరం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కీలక నేతలు సైతం అన్ని జిల్లాల్లో తమ పర్యటనలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
తెలంగాణలో మొదలైన ఎన్నికల హీట్‌..
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉండడంతో అధికార పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. జిల్లాలవారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటనలు కొనసాగిస్తున్నారు. తరచూ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఓవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ నేతలు బస్సుయాత్ర చేపట్టడంతో.. అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహంతో అన్ని జిల్లాల్లో కీలక నేతలు పర్యటిస్తూ రాష్ట్రంలో ఎన్నికల హీట్‌ పుట్టిస్తున్నారు.

ప్రతిపక్షాల బస్సుయాత్రకు పోటీగా టీఆర్‌ఎస్‌ నేతల పర్యటనలు..
ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌, హరీష్‌రావులు జిల్లాల పర్యటనలకు అధిక ప్రాధాన్యతిస్తున్నారు. వారంలో నాలుగైదు రోజులు జిల్లాల్లో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. తెలంగాణలో తమ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల అనంతరం స్పీడ్‌ పెంచిన గులాబీ నేతలు..
ఎన్నికలు ముందుగానే వస్తాయనే అంచనాతో ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తుండడంతో... ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు అధికార పార్టీ నేతలు కూడా అదే పంథాలో పయనిస్తున్నారు. ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టడమే కాకుండా.. సవాళ్లకు ధీటుగా ప్రతిసవాళ్లు విసురుతున్నారు. మొత్తానికి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల పర్యటనలో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హీట్‌ మొదలైనట్లు కనిపిస్తోంది.

07:15 - April 10, 2018

హైదరాబాద్ : వచ్చే నెల నుంచి రైతులకు పెట్టుబడి రుణం ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు రైతులకు చెక్కులు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చెక్కుల పంపిణీని పండుగలా నిర్వహించాలని మంత్రి పోచారం అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా 3,300 గ్రామాల్లో చెక్కులు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రైతుబంధు పథకంపై మంత్రి పోచారం సమీక్ష..
తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు బంధు పథకంపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్రస్థాయి బ్యాంక్‌ల కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు.

వచ్చే నెల నుంచి రైతులకు పెట్టుబడి రుణం అందజేత
రైతు బంధు పథకం అమలుకు రెవెన్యూ శాఖ ఇచ్చే డేటాను అధికారులు సమీక్షించి... చెక్కుల ముద్రణకు బ్యాంకులకు పంపుతారని పోచారం తెలిపారు. మొదటి విడతలో 3300 గ్రామాల వివరాలను చెక్కుల ముద్రణకు బ్యాంకులకు పంపామన్నారు. చెక్కుల పంపిణీని గ్రామంలో పండుగలా జరపాలన్నారు. చెక్కుల పంపిణీ కోసం రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్థానిక శాసనసభ్యుడు, ప్రజాప్రతినిధులు, అధికారులతో గ్రామసభ నిర్వహించి ప్రతి రైతుకు స్వయం చెక్కులు అందించాలన్నారు. గ్రామంలోని రైతులకు చెక్కులను అదేరోజు పంపిణీ చేయాలని సూచించారు.

గ్రామసభలో టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలి : పోచారం
ఎండాకాలం కావడంతో.. గ్రామసభలో టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడిపై రైతులందరూ సంతృప్తి వ్యక్తం చేయాలని.. ప్రతిపక్షాలు కూడా అభినందించాలన్నారు. రైతు బంధు పథకం అమలు పర్యవేక్షకుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తన జిల్లాలో ఒక నియోజకవర్గంలోని ఒక గ్రామం, ఏడీఏలు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పర్యవేక్షించి తనిఖీ చేయాలన్నారు. ప్రతి జిల్లాకు ఒక రాష్ట్రస్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలన్నారు. మొత్తానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం అమలుకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. 

07:08 - April 10, 2018

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదికవుతోంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఆనంద నగరాల సదస్సు జరగనుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆనంద సూచీలను తెలుసుకునే ఉద్దేశంతో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.

మంగళగిరిలో ఆనంద నగరాల సదస్సు..
అమరావతి వేదికగా ఆనంద నగరాల సదస్సు జరుగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈనెల 12న జరిగే ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఏపీలో మొదటిసారి ఆనంద నగరాల సదస్సు..
ఆనంద నగరాల సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా నిర్వహించే ఈ సదస్సును ఏపీలో మొదటిసారి జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. 27 దేశాల నుంచి నిష్టాతులైన ఆర్కిటెక్ట్‌లు, ప్రణాళికా నిపుణులు హాజరవుతున్నారు. రాష్ట్రంలోని అందరూ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లతోపాటు మున్సిపల్‌ కమిషనర్లను సదస్సుకు ఆహ్వానించారు. వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.

మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదికైన అమరావతి..
విజయవాడ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, నాగార్జున యూనివర్సిటీ ఆర్టిటెక్చర్‌ విద్యార్థులు సదస్సులో ప్రసంగిస్తారు. అమరావతికి భూములిచ్చిన రైతులను కూడా సదస్సుకు ఆహ్వానించారు. 

అధికార ప్రతినిధులతో చంద్రబాబు భేటీ..

అమరావతి : నేడు పార్టీ అధికార ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యచరణపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో ఆందోళన విరమించిన ఎంపీలు నేడు తమ నియోజకవర్గాలకు చేరుకోనున్నారు. దీంతో ప్రజల్లో ఎంపీలు తీసుకోవాల్సిన కార్యాచరణపై చంద్రబాబు చర్చించనున్నట్లుగా సమాచారం. 

నేడు ఐపీఎల్ కు సినీ గండం?..

తమిళనాడు : నేడు ఐపీఎల్ మ్యాచ్ ల కోలాహలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంల కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈరోజు రాత్రి 8.00గంటలకు చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ కు సినీ గండం ఎదురయ్యఏ అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మ్యాచ్ నిర్వాహకులు భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. 

ఆర్థిక మంత్రుల సమావేశం..

ఢిల్లీ : నేడు తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరగనుంది. 15 ఆర్థిక సంఘం నిబంధనలతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరుకానున్నారు. 

కావేరీ విషయంలో స్పందించిన సుప్రీంకోర్టు..

తమిళనాడు : కావేరీ జలాల విషయంలో తమిళనాడులో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా సుప్రీం కోర్టు స్పందించింది. మేనేజ్‌మెంట్‌ బోర్డు విషయమై ముందే తమను ఎందుకు సంప్రదించలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కావేరీ బోర్డు ఏర్పాటు అంశంపై కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. మే 3లోగా కావేరి బోర్డు ముసాయిదాను అందించాలని కోర్టు పేర్కొంది. అప్పటివరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని కోరింది.

11 నుండి గీతం వర్శిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్..

విశాఖపట్నం: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాలలో ఇంజనీరింగ్‌, ఫార్మశీ కోర్సులలో ప్రవేశానికి ఏప్రిల్‌ 11 నుంచి నిర్వహించనున్న గీతం అడ్మిషన్‌ టెస్ట్‌-2018కు దేశవ్యాప్తంగా 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, న్యూఢిల్లీ సహా దేశంలోని 48 పట్టణాలలో ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు అడ్మిషన్ల డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ కె.నరేంద్ర తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

భూపాలపల్లి : రోడ్డు ప్రమాదంలో రాయపల్లి మాజీ ఉప సర్పంచ్ అంకం శంకర్ మృతి చెందారు. అంకం శంకర్ బైకుపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు యజమానిని కఠినంగా శిక్షించాలని రాయపల్లి గ్రామస్తులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి వద్ద సిరొంచ-ఆత్మకూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

Don't Miss