Activities calendar

11 April 2018

22:26 - April 11, 2018
22:19 - April 11, 2018
22:16 - April 11, 2018

హైదరాబాద్ : బడుగువర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన జ్యోతిరావు పూలే జయంతోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగిగాయి. బలహీనవర్గాలకు ఆ మహనీయుడు చేసిస సేవలను అందరూ స్మరించుకున్నారు. పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని నేతలు పిలుపు ఇచ్చారు. 

జీవితాంతం బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన జ్యోతిరావు పూలే జయంతోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యలో జరిగిన ఈ ఉత్సవాల్లో పాలకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. 

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన పూలే జయంతోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు.. పూలే చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పూలే సేవలను కొనియాడారు. పూలే ఆశయ సాధన కోసం టీడీపీ కృషి చేస్తోందని చంద్రబాబు చెప్పారు.  

 

కర్నూలులో జరిన పూలే జయంతి వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. 

విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద జరిగిన పూలే జయంతి వేడుకల్లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు, కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రం కరీంనగర్‌లో జరిగిన పూలే జయంతోత్సవాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పూలే చిత్రపాటానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. పూలే ఆశయసాధన కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి ఈటల చెప్పారు. 

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో జరిగిన పూలే జయంతోత్సవాల్లో సీపీఎం తెలంగాణ కార్యదర్శి, బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రంతోపాటు ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూల మాలలువేసి నివాళలర్పించారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. 

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో జరిగిన పూలే జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరతరలు పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో జరిగిన పూలే జయంతోత్సవాల్లో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి.హనుమంతరావుకు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

22:12 - April 11, 2018

హైదరాబాద్ : బాలికా విద్యపై ఎమ్ హెచ్ ఆర్ డీకి పలు సూచనలు చేసినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఎన్ సీఈఆర్ టీ 55వ కౌన్సిల్‌ సమావేశానికి కడియం హాజరయ్యారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను 12వ తరగతి వరకు పొడిగించాలని కేంద్రాన్ని కోరామన్నారు. దీని వల్ల బాల్యవివాహాలను అరికట్టవచ్చాన్నారు. దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌... తనను నియమించినట్లు కడియం తెలిపారు. 

 

22:09 - April 11, 2018

విజయవాడ  : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మహోధృతంగా నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి హోదా ఇచ్చే వరకు పోరాటం కొనసాగించాలని తలపెట్టాయి. దీనిలో భాగంగా గురువారం నుంచి ఈనెల 20 వరకు నిర్వహించే ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. మోదీ దీక్షలకు నిరసనగా గురువారం విజయవాడలో దీక్ష చేపట్టాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. 

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యలో విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరిగింది. వామపక్షాలు, వైసీపీ, జనసేన, లోక్‌సత్తా, ఆప్‌, ముస్లింలీగ్‌ తోపాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రత్యేక హోదా ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మహోధృతంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించారు. గురువారం ప్రధాని మోదీ చేపట్టే నిరాహార దీక్షకు నిరసనగా విజయవాడలో దీక్షలు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈనెల 16న సాయంత్రం 7 నుంచి 7.30 గంటల వరకు లైట్లు ఆపివేసి చీకటి దినం పాటిస్తారు. హోదా ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేక్రమంలో ఈనెల 17న అన్ని మండల కేంద్రాల్లో కేంద్రంపై అవిశ్వాసం ప్రకటిస్తూ ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 20న రాజమండ్రిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ పన్నుతున్న కుయుక్తులను  ఓ వైపు పరిశీలిస్తూనే, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని  అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ఏపీని మోసం చేసిన బీజేపీని కర్నాటక ఎన్నికల్లో ఓడించాలని ఆ రాష్ట్ర ఓటర్లకు అఖిలపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఓ బృందాన్ని కర్నాటక పంపాలని నిర్ణయించారు. 

లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రధాని మోదీ గురువారం చేపట్టే  దీక్షను నిరసిస్తూ  అదే సమయంలో విజయవాడలో దీక్షలు చేపట్టాలని తలపెట్టారు. హోదా సాధన సమితి, వామపక్షాలు చేసే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. హోదా సాధన కోసం ఈనెల 16న రాష్ట్ర బంద్‌ నిర్వహించే అంశంపై గురువారం తుది నిర్ణయం తీసుకొంటామని అఖిలపక్ష  నేతలు ప్రకటించారు. 

22:06 - April 11, 2018

విజయవాడ : ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం హోరెత్తుతోంది. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన  ఉధృతమైంది. నిన్న జాతీయ రహదారుల దిగ్బంధంతో నిరసన తెలిపిన... వైసీపీ ఇవాళ రైల్‌రోకోలు చేపట్టింది. పలు రైళ్లను అడ్డుకుని  వైసీపీ నేతలు కేంద్రానికి తమ నిరసన తెలియజేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా ఉద్యమం ఉధృత రూపం దాల్చుతోంది. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రైల్‌రోకో చేపట్టాయి.  విజయవాడ రైల్వేస్టేషన్‌లో వైసీపీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా... వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్టేషన్‌బయటే వందలాది మంది వైసీపీ శ్రేణులు బైఠాయించి నిరసన తెలిపాయి.

గుంటూరు రైల్వే స్టేషన్‌లో వైసీపీ చేపట్టిన రైల్‌రోకో ఉద్రిక్తతకు దారి తీసింది. రైళ్లను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.  దీంతో స్టేషన్‌ ఆవరణలో బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.తెనాలి, రేపల్లెలోనూ నిరసనలు కొనసాగాయి.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైల్‌రోకోను వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు.  ప్రధాన రైల్వేస్టేషన్లలో రైళ్లను అడ్డుకున్నారు.  వెంకటగిరి రైల్వేస్టేషన్‌లో కృష్ణాఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. గూడూరు, సూళ్లూరుపేట, కావలి, నెల్లూరులో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  
అనంతపురం జిల్లాలో పలుచోట్ల వైసీపీ రైల్‌రోకో కార్యక్రమం జరిగింది. అనంతపురంతోపాటు గుంతకల్‌ స్టేషన్‌లో వైసీపీ శ్రేణులు రైల్‌రోకో నిర్వహించాయి.

కడపలో వైసీపీ చేపట్టిన రైల్‌రోకో  తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  రైల్వేస్టేషన్‌కు భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు బారీకేడ్లను తోసుకుని లోనికి వెళ్లారు.  చెన్నై నుంచి వచ్చిన పలు రైళ్లను అడ్డుకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. (KDP YCP RAIL ROKO, 
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రకాశం జిల్లాలో రైల్‌రోకో జరిగింది. విజయవాడ, గూడూరు మధ్య తిరుగుతున్న పలు రైళ్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విజయనగరంలో వైసీపీ రైల్‌రోకో ఉద్రిక్తతకు దారితీసింది. రైల్‌రోకోకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. 

కర్నూలు జిల్లాలోనూ పలుచోట్ల రైల్‌రోకో నిర్వహించారు. కోట్ల రైల్వేస్టేషన్‌లో వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ ఆధ్వర్యంలో రైల్‌రోకో  నిర్వహించారు. పలుస్టేషన్లలో ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రైల్‌రోకోకు బయలుదేరిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలుచోట్ల రైళ్లను అడ్డుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం, విశాఖ, చిత్తూరుతోపాటు అన్ని జిల్లాల్లోనూ వైసీపీ చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమం విజయంతంగా జరిగింది. వైసీపీ శ్రేణులు రైళ్లను అడ్డుకుని తమ నిరసన కేంద్రానికి తెలియజేశారు. 

21:59 - April 11, 2018

దేశంలో ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా మోదీ ఒకరోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. మోదీతో పాటు బీజేపీ ఎంపీల దీక్ష చేపట్టనున్నారు. పార్లమెంటును ప్రతిపక్షాలు స్థంభింపచేయడంపై నిరసన. దేశంలో మార్పు కోసం నిర్ణయాలు తీసకుంటుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ బీజేపీ ఆరోపణ. మోడీ దీక్షపై ప్రతిపక్షాలు గరంగరం. పార్లమెంట్ సాక్షిగా చట్టాలను కాలరాసి...దీక్షంటూ నాటకమాడుతున్నారని విమర్శ. ఇప్పటి వరకు నోట్లరద్దు, జీఎస్టీపై పార్లమెంట్ లో నోరెందుకు మెదపలేదని ప్రశ్న. ఉత్తరాదిలో 11 మంది దళితులు చనిపోతే కనిపించడం లేదా అని మండిపాటు. స్పందించనిది ప్రతిపక్షాలా? మోదీయా అని ప్రశ్న. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకుడు లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. మోడీ, అమిత్ షాలు అభద్రతా భావంలో ఉన్నారనడానికి ఈ దీక్ష స్పష్టమైన సంకేతమన్న ప్రముఖ విశ్లేషకుడు లక్ష్మీనారాయణ అన్నారు. మార్పు మార్పు అంటూ నోట్ల రద్దు, జీఎస్టీతో ఏం సాధించారు. కోట్లు కొల్లగొట్టాల్సినవారు కొట్టుకుంటూ పోతున్నారు. సామాన్యుడి బతుకులో ఎలాంటి మార్పులేదన్నారు. అవినీతి ఏమాత్రం తగ్గలేదన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:24 - April 11, 2018

తల్గుదెంపు కున్న అంబర్ పేట అన్మంతు...పూలే జయంతి కాడ తోటోళ్ల మీద గంతు, దగ్గుపాటి సురేష్ బాబు కొడ్కు బాగోతం...ముద్దుల పోట్వ రిలీజ్ జేశ్న శ్రీ రెడ్డి, మోడీని కాల్చి సంపుతాంటున్న కత్తి మహేష్...అనంతపురం జిల్లాల రాజ్యంగ రక్షణ సభ, దళితుల భూమి మీద మున్సిపాలిటీ గద్ద...మహబూబాబాద్ కాడ దళిత జనం ధర్నా, బోధన్ కాడ బోరుగొట్టేశిన టీఆర్ఎస్ సభ...ఖాళీ కుర్చీలే ఇన్న నేతల ప్రసంగాలు, కుత్కె గోశెతట్టు జేశిన ఐపీఎల్ క్రికెట్... టీవీ ఛానల్ మార్పుకాడ పంచాది... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:12 - April 11, 2018

మళ్లీ మొదటికి వచ్చిన అగ్రిగోల్డ్‌ కేసు. ఆస్తులు కొనుగోలు చేస్తానని ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్న జీఎస్సెల్‌ గ్రూప్‌. నిరాశలో 30 లక్షల మంది బాధితులు. అగ్రిగోల్డ్‌ ఆస్తులకన్నా నాలుగింతల అప్పులు ఉన్నాయన్న జీఎస్సెల్‌ గ్రూప్‌. రాజకీయ దురుద్దేశంతో జాప్యం చేస్తున్నారంటున్న బాధితులు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌. కోర్టు సూచనల మేరకే వ్యవహరిస్తామంటున్న ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ ఆత్మహత్య. సుమారు రూ.కోటి పాలసీలు చేయించిన కోటేశ్వరరావు. డబ్బులు తిరిగి చెల్లించాలని అగ్రిగోల్డ్‌ బాధితుల ఒత్తిడి. బాధితుల ఒత్తిడి, అప్పుల బాధతో కోటేశ్వరరావు మనస్తాపం. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డు బాధితుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వర్ రావు, అగ్రిగోల్డు బాధితుడు తిరుపతిరావు, సిద్దార్థ లా కాలేజీ ప్రిన్సిపల్ దివాకర్ బాబు పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:04 - April 11, 2018

ఢిల్లీ : హస్తినలో వైసీపీ ఎంపీల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వైసీపీ ఎంపీలు అవినాష్‌, మిథున్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో వారిని బలవంతంగా రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. బలవంతంగా వారికి ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. తమ దీక్షను అడ్డుకున్నా... కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. 

ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ... ఢిల్లీలో ఆరు రోజులుగా వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారికి వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు...

వైసీపీ ఎంపీలకు ఉదయం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్‌ లెవల్స్‌  ప్రమాదస్థాయికి  పడిపోయాయని వైద్యుల ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దీక్ష విరమించాలని సూచించారు. అందుకు వారు నిరాకరించడంతో  ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది. వైసీపీ ఎంపీల దీక్షను భగ్నం చేసి.. వారిని రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు...

ఎంపీల దీక్షను పోలీసులు భగ్నం చేసినా ప్రత్యేకహోదా కోసం తమ ఆందోళన కొనసాగుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారు. యూపీఏ ప్రభుత్వం ప్రత్యేకహోదా ప్రకటిస్తే.... దాన్ని అమలు చేయకుండా బీజేపీ- టీడీపీ కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశాయని మండిపడ్డారు.

అంతకుముందు వైసీపీ ఎంపీల దీక్షా శిబిరానికి వచ్చిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వారికి సంఘీభావం ప్రకటించారు.  ప్రత్యేకహోదాకు ప్రత్యేక ప్యాకేజీ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. మోదీ దక్షిణ భారతీయులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.  ప్రత్యేకహోదాపై కేంద్రం తన తీరుమార్చుకోకుంటే ప్రజలే బుద్దిచెప్తారని హెచ్చరించారు. కేంద్రం ప్రత్యేహోదా ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వైసీపీ స్పష్టం చేసింది. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేకహోదా సాధిస్తామని తేల్చి చెప్పింది

21:00 - April 11, 2018

విశాఖ : జిల్లాలోని గోవాడ బీసీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తొమ్మిదోతరగతి చదువుతున్న జి.కొండలరావు, ఏడోతరగతి చదువుతున్న ఎన్‌. గోవింద్‌, ఈ. గణేశ్‌లు నిన్న ఉదయం నుండి కనిపించడంలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల అదృష్యంపై చౌడవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

 

20:54 - April 11, 2018

గుంటూరు : జిల్లా మంగళగిరిలో జరుగుతున్న ఆనంద నగరాల సదస్సులో విద్యుత్‌ బైక్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చందన సంస్థ అవెరా  ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రదర్శిస్తోంది. అమరాతిని కాలుష్యరహిత రాజధానిగా నిర్మిస్తున్న నేపథ్యంలో విద్యుత్‌ బైక్‌లకు ప్రాధాన్యత పెరిగింది. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

20:51 - April 11, 2018

హైదరాబాద్ : హైకోర్టులో ఏపీ న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ప్రత్యేక హోదాపై  వైసీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు.  ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. హోదా వచ్చేంతవరకు  వైసీపీ పోరాటానికి తమ మద్దతు  ఉంటుందని తెలిపారు. 

 

20:49 - April 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కుటుంబానికి వ్యతిరేకంగా ఒక నిశ్శబ్ధ విప్లవం వీస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్‌ తన బంగారు కుటుంబాన్ని నిర్మించుకుంటున్నారని ఆయన విమర్శించారు. చట్ట వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు శాసనసభ సభ్యత్వం రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాలికా విద్యపై సూచనలను ఎంహెచ్ ఆర్డీకి అందజేశాం : కడియం

ఢిల్లీ : ఎన్ సీఈఆర్ టీ 55వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. బాలికా విద్యపై సూచనలను ఎంహెచ్ ఆర్డీకి అందజేశామని చెప్పారు. కేజీబీవీలను 12వ తరగతి వరకు పొడిగించడం సంతోషకరమన్నారు. దేశవ్యాప్తంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాలని కోరామని తెలిపారు.

కృష్ణ ట్రిబ్యునల్ లో మొదటిరోజు ముగిసిన క్రాస్ ఎగ్జామినేషన్

ఢిల్లీ : కృష్ణ ట్రిబ్యునల్ లో మొదటిరోజు క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. 

ఆర్మీ విమాన ప్రమాదంలో 257మంది దుర్మరణం

అల్జీర్స్ : అల్జీరియాలో ఆర్మీ విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 257కు చేరింది. అల్జీర్స్ లోని బౌఫారిక్ ఎయిర్ పోర్ట్ సమీపంలో విమానం కూలింది. 14 అంబులెన్స్ లు, 10 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎయిర్ పోర్టు సమీపంలోని రోడ్లను మూసివేశారు.

19:02 - April 11, 2018

అల్జీర్స్ : అల్జీరియాలో సైనిక విమానం కుప్ప కూలింది. ఈ ఘటనలో సుమారు 257 మంది మరణించి ఉంటారని అల్జీరియన్‌ అధికార టీవీ ప్రకటించింది. వందలాదిగా ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ ఆర్మీ విమానం.. అల్జీర్స్‌లోని బౌఫారిక్‌ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూలిపోయిందని స్థానిక రేడియో ప్రకటించింది. విమానం కూలగానే పెద్ద ఎత్తున నల్లని పొగ వెలువడిందని పేర్కొంది.  బెచర్‌ నగరానికి సైనికులతో బయలుదేరిన విమానం ఉదయం 8 గంటలకు క్రాష్‌ అయింది. సమాచారం అందుకున్న అల్జీరియా ఆర్మీ సహాయకచర్యలను చేపట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే 14 అంబులెన్స్‌లు, 10 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని రోడ్లను మూసేశారు. 

బ‌ల్దియాలో ఉన్నతాధికారుల పర్యవేక్షణా వైఫల్యం...

హైదరాబాద్ : బ‌ల్దియాలో ఉన్నతాధికారుల పర్యవేక్షణా వైఫల్యం మరోసారి బయటపడింది. నకిలీ సర్టిఫికెట్ల స్కాంలో..ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసినా... తమకేం తెలియదంటూ... వారిని మళ్లీ పోస్టింగుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. బల్దియా ఆఫీసులో పోలీసులు కంప్యూటర్లు, హార్డ్‌ డిస్కులు సీజ్ చేసినా కూడా తమకు తెలియదని ఉన్నతాధికారులు చెప్పడం, అరెస్టైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా.. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. నార్త్ జోన్లో 2013 నుండి ఫేక్ సర్టిఫికెట్ల దందా కొన‌సాగుతుండడం గమనార్హం.

18:34 - April 11, 2018

విజయవాడ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో.... విజయవాడ నుండి గుంటూరు డీఎమ్‌ఏ కార్యాలయం వరకు మున్సిపల్ కార్మికులు పాదయాత్ర చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్‌ నుండి ప్రారంభమైన పాదయాత్ర మూడు రోజుల పాటు జరగనుంది. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గఫూర్‌, సీఐటీయూ నేతలు పాల్గొన్నారు. 
గఫూర్
మున్సిపల్ కార్మికులే కాదు.. ఏ వర్కర్ పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని సీఐటీయూ రాష్ట్ర నాయకులు గఫూర్ అన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సమస్యలు పరిష్కారించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా దున్నపోతు మీద వానకురిసినట్లుగా ఉందన్నారు. 35 మంది నడుచుకుంటూ వెళ్లి గ్రామగ్రామాన ప్రజలకు చెబుతామని చెప్పారు. 
నాగేశ్వర్ రావు 
పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పారు.

 

18:18 - April 11, 2018

హైదరాబాద్ : బ‌ల్దియాలో ఉన్నతాధికారుల పర్యవేక్షణా వైఫల్యం మరోసారి బయటపడింది. నకిలీ సర్టిఫికెట్ల స్కాంలో..ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసినా... తమకేం తెలియదంటూ... వారిని మళ్లీ పోస్టింగుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. బల్దియా ఆఫీసులో పోలీసులు కంప్యూటర్లు, హార్డ్‌ డిస్కులు సీజ్ చేసినా కూడా తమకు తెలియదని ఉన్నతాధికారులు చెప్పడం, అరెస్టైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా.. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. నార్త్ జోన్లో 2013 నుండి ఫేక్ సర్టిఫికెట్ల దందా కొన‌సాగుతుండడం గమనార్హం.

 

18:13 - April 11, 2018

జయశంకర్‌ భూపాలపల్లి : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఆర్‌డీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌..... పలిక రఘునాచారి అనే రైతు వద్ద నుండి 50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భూపాలపల్లి శివారులో రఘునాచారికి చెందిన 320, 321 సర్వే నంబర్‌లో గల భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారు. తమ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆ రైతు గతంలో ములుగు ఆర్డీవోకు అప్పీలు చేశారు.తనకు న్యాయం చేయాలని సీనియర్‌ అసిస్టెంట్‌ను కోరగా... 50వేలు లంచం అడిగారు. ఈ విషయాన్ని రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా లంచం తీసుకునే సమయంలో అధికారులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్‌ కోర్టుకు పంపుతామని అధికారులు తెలిపారు. 

 

18:10 - April 11, 2018

హైదరాబాద్ : ఈనెల 13 నుండి 22 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ ఫెస్ట్‌ జరగనుంది. ఈ సందర్భంగా అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14వ రోజున మహిళలకు సంబంధించి ప్రత్యేక సభా కార్యక్రమాలు, చర్చా గోష్టులు ఈ ఫెస్ట్‌లో జరుపుతామని ఐద్వా నేతలు తెలిపారు. మహిళలపై జరుగుతున్న హింస, దాడులు, మహిళా హక్కులు, రాజకీయంలో మహిళలు అనే అంశాలపై సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల్లోని ప్రముఖులు పాల్గొంటారని ఐద్వానేతలు తెలిపారు. 

 

17:43 - April 11, 2018

బీహార్ : తనను, తన కుటుంబాన్ని హతమార్చేందుకు నితీష్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఆరోపించారు. పట్నాలో లాలు నివాసం వద్ద పహారా కాసే 32 మంది పోలీసులను బిహార్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై రబ్రీ మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు లేఖ రాశారు. తమ కుటుంబానికి ఎలాంటి నష్టం జరిగినా, దానికి హోంశాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని  ఆమె ఆ లేఖలో స్పష్టం చేశారు. తమని చంపాలన్న కుట్రలో భాగంగా సెక్యూర్టీని ఎత్తేశారని... నితీశ్, సుశీల్ మోదీలు ఈ కుట్రకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. లాలూ జైలులో ప్రతి రోజు చస్తూ బతుకుతున్నారని..., ఆయనకు షుగర్ లెవల్స్ పెరిగాయని రబ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లు ఖాళీ చేయమని చెబితే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని రబ్రీదేవి తెలిపారు. 

 

17:41 - April 11, 2018

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే సిద్ధాంతాలు, ఆశయాలు బడుగులకు అండగా నిలిచియని టీ మాస్ చైర్మన్ కంచ ఐలయ్య అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 192వ జయంతి సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్ వీకేలో జయంతి సభ జరిగింది. కంచ ఐలయ్యతోపాటు పలువురు నేతలు పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చైతన్యవంతులు కావడంతో పాటు కుల, వర్ణవ్యవస్థ రద్దుకు పోరాడాలని కంచ ఐలయ్య సూచించారు. అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కుల, వర్ణవ్యవస్థ రద్దుకు పోరాడాలని పిలుపునిచ్చారు.

 

17:32 - April 11, 2018

ఢిల్లీ : ప్రత్యేకహోదా కోసం తమ ఆందోళన కొనసాగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి బీజేపీ - టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. హోదాపై చంద్రబాబు చేస్తున్న డ్రామాలను ఆపాలంటున్న విజయసాయిరెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. నాలుగేళ్లుగా హోదాపై వైసీపీ పోరాడుతోందన్నారు. ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

17:28 - April 11, 2018

తమిళనాడు : చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లకు కావేరీ సెగ తగిలింది. చెన్నై నగరంలో జరగాల్సిన మ్యాచ్‌లను వేరే చోట నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో చెపాక్ స్టేడియం వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగడం.. స్డేడియంలో ఓ వ్యక్తి చెప్పు విసరడంతో.. మ్యాచులు చెన్నైలో నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. 

 

17:21 - April 11, 2018

ఢిల్లీ : అల్జీరియాలో సైనిక విమానం కుప్ప కూలింది. ఈ ఘటనలో సుమారు 105 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 120 మందికి పైగా ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ ఆర్మీ విమానం.. అల్జీర్స్‌లోని బౌఫారిక్‌ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూలిపోయిందని స్థానిక రేడియో ప్రకటించింది. విమానం కూలగానే పెద్ద ఎత్తున నల్లని పొగ వెలువడిందని పేర్కొంది.  బెచర్‌ నగరానికి సైనికులతో బయలుదేరిన విమానం ఉదయం 8 గంటలకు క్రాష్‌ అయింది. సమాచారం అందుకున్న అల్జీరియా ఆర్మీ సహాయకచర్యలను చేపట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే 14 అంబులెన్స్‌లు, 10 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని రోడ్లను మూసేశారు. 

ఐపీఎల్ కు కావేరీ సెగ..

తమిళనాడు : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కు కావేరీ సెగ తగిలింది. చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ల వేదికలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో కావేరీ బోర్డు కోసం తమిళనాడులో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో మరో ప్రాంతానికి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

16:41 - April 11, 2018

ఇటీవల కొందరి పెండ్లి 'శుభలేఖ'లు చాలా వినూత్నంగా ముద్రిస్తున్నారు. కొందరు తమ హోదాను చాటుకునేందుకు, మరికొందరు ఆర్భాటంకోసం, ఇంకొందరు సృజనాత్మకతను ప్రతిబింభించుకునేదుకు ఇలా ఎవరికి వారు తమ వివాహ 'శుభలేఖ'లను వినూత్నంగా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రమే బాధ్యతాయుతంగా..అదీ కూడా సామాజిక బాధ్యతను మేళవించేలా ఆలోచించేలా వ్యవహరిస్తుంటారు. అటువంటి ఒక వివాహ పత్రిక పలువురిని ఆలోచింపజేస్తోంది.

సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మహిళా పోలీసు సబ్ఇన్‌స్పెక్టర్..
సామాజిక బాధ్యత ప్రతీ ఒక్కరి బాధ్యత. దీనికి అధికారం వుందా?లేదా? అనే తేడా వుండదు. సమాజం పట్ల ప్రతీ పౌరుడు బాధ్యతగా వ్యవహరించవచ్చు. కాకపోతే దీనికి వుండాల్సిందల్లా సమాజానికి మనవంతు ఏదైనా చేయాలనే ఆలోచన మాత్రమే. అలాగే తన బాద్యతను అత్యంత వినూత్నంగా,సృజనాత్మకంగా చేసిన చూపించింది ఓ మహిళా పోలీసు అధికారిణి.

తన పెండ్లి కార్డుతో సందేశాన్నిచ్చిన మంజు ..
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌నకు చెందిన మహిళా పోలీసు సబ్ఇన్‌స్పెక్టర్ మంజు తన పెళ్లికార్డులో ట్రాఫిక్ రూల్స్ ముద్రింపజేశారు. మంజుకు ఈనెల 19న వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలామంది యువకులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడాన్ని గమనించాను. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవించడం జరుగుతుంటుంది. అందుకే నా ఉద్యోగ బాధ్యతల విషయంలో నిబద్ధతతో పనిచేస్తుంటాను. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి, వాటిపై అవగాహన కల్పిస్తుంటాను. దీనిలో బాగంగానే నా పెళ్లి కార్డులో కూడా ట్రాఫిక్ రూల్స్ ముద్రింపజేశాను’ అని చెప్పారు. మంజు తండ్రికూడా కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. అయితే ఒక దుర్ఘటనలో మృతిచెందారు. మంజూ సోదరుడు కూడా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మంజు తల్లి తన కోరికమేరకు చదువుకుని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించారు.

16:37 - April 11, 2018

శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన తెలియజేయవచ్చా..? అనే అంశంపై మానవి మైరైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెక్స్ వల్ అరాస్ మెంట్స్ ప్రతి రంగంలో ఉందన్నారు. శ్రీరెడ్డి తీవ్ర నిరాశనిస్పృహలకు లోనయ్యారని ఉంటారని తెలిపారు. నిరసన అనేది అనేక రూపాల్లో చేయవచ్చు అన్నారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

16:11 - April 11, 2018

గుంటూరు : జిల్లాలోని మంగళగిరిలో జరుగుతున్న ఆనంద నగరాల సదస్సులో ఏపీ రాజధాని అమరావతి ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాజధాని పరిధిలోని 29 గ్రామాల నమూనాల తోపాటు పరిపాలనా నగరంలో నిర్మించే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం డిజైన్లు అందర్నీ ఆకట్టకొంటున్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అమరావతి ఆకృతులపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

16:08 - April 11, 2018

విజయవాడ : రాష్ట్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడుగడునా మోసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. హోదా, ప్యాకేజీ అంటూ ప్రజలను మభ్యపెట్టి చిరికి రిక్తహస్తం చూపించారని విజయవాడలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతోత్సవ సభలో మండిపడ్డారు. హోదా ఇవ్వకుండా నాలుగేళ్లు మభ్య పెట్టారని మండిపడ్డారు. ప్యాకేజీ అంటూ కాలయాపన చేశారని అన్నారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామన్న మోదీ.. మాట తప్పారని విమర్శించారు. 

16:05 - April 11, 2018

చాలామంది జీవితం చాలా సాదా సీదా సాగిపోతుంటుంది. మరికొందరి జీవితాలు సంచలనంగా మారుతుంటాయి. కానీ అందరు అలా వుండకపోవచ్చు. కానీ కొన్ని సంఘటనలు, ఘటనలు వ్యవస్థను కదిలిస్తాయి. ఆలోచింపజేస్తాయి. ప్రభుత్వాలను సైతం గడగడలాడిస్తుంది. ఒక్కొ సందర్భాలలో అయితే అధికాక పీఠాన్ని వణికిస్తుంది. కొన్ని పెను మార్పులకు కారణమవుతాయి. అటువంటి మనదేశంలో 16 డిసెంబర్‌ 2012న చోటుచేసుకుంది. 'నిర్భయ' ఘనటతో దేశ మొత్తం చిన్నా పెద్దా తేడా లేకుండా..ఆడ మగా తేడా లేకుండా దేశం యావత్తు నిర్భయ ఘటనతో పెను ప్రవాహంలా కదిలింది. న్యాయం కోసం రేయింబగళ్లు తేడా లేకుండా రోడ్లపై నిలబడి న్యాయం కోసం నినదించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయక న్యాయం కోసం పోరాడారు. ఒక సాధారణ అమ్మాయికి జరిగిన ఘోరానికి అల్లాడిపోయారు. ఆక్రోసించారు. నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ ఒక్క ఘటనతో భారత్ యావత్తు ఒక్క త్రాటిపై నిలిచింది. ఆ ఘటనతో 'నిర్భయ' యాక్ట్ కు శ్రీకారం చుట్టింది. అనంతం దేశంలో ఆడవారిపట్ల హింస తగ్గకపోయినా ఆ ఘటన ఆడవారి భద్రత గురించి ఆలోచించేలా చేసింది. చట్టాలలో ఎన్నో మార్పులకు కారణమయ్యింది.

నిర్భయ.. భారతదేశం మరో దశాబ్దం దాకా మరచిపోలేని పదం!..
నిర్భయ.. భారతదేశం మరో దశాబ్దం దాకా మరచిపోలేని పదం! ఆ సంఘటన తర్వాత మహిళల భద్రతపై రేకెత్తిన చైతన్యం ప్రభుత్వాలని, కంటితుడుపుగానైనా సరే, కొన్ని మంచి పనులు చేపట్టేలా చేసింది. దేశవ్యాప్తంగా మహిళా పోలీసు స్టేషన్ల సంఖ్య పెంచడం అందులో ఒకటి. నిర్భయ తర్వాతే వెయ్యికిపైగా మహిళా పోలీసుస్టేషన్లు ఏర్పాటయ్యాయి. అమ్మాయిలు తమకు జరిగిన అవమానాలూ, వేధింపులని ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులతో చెప్పుకుంటారన్నదే వీటి వెనకున్న లక్ష్యం. ఇవి అంతకంటే పెద్ద సేవలే అందిస్తున్నాయి. కుటుంబ కలహాలపై ఓ కౌన్సెలింగ్‌ కేంద్రాలుగా మారిపోయాయి! లాఠీలతో కాఠిన్యం చూపకుండా ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతున్నాయి.

ఇండియాస్‌ లేడీ కాప్స్‌’ అనే ఈ వార్తాచిత్రం...
లాఠీలతో కాఠిన్యం చూపకుండా ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతున్న వైనాన్నే చక్కటి నిర్మాణ విలువలతో చూపిస్తోంది ‘ఇండియాస్‌ లేడీ కాప్స్‌’ అనే ఈ వార్తాచిత్రం. అల్‌ జజీరా ఆంగ్ల ఛానెల్‌ కోసం దర్శకురాలు రుహమీద్‌ దీన్ని రూపొందించింది. దిల్లీకి యాభై మైళ్ల దూరంలో ఉన్న, హరియాణాలోని సోనాపోట్‌ మహిళా పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్మిళా దలాల్‌ ఒకరోజు జీవితాన్ని చూపిస్తుందీ డాక్యుమెంటరీ.

అద్భుతంగా కళ్లకుగట్టిందీ చిత్రం ‘ఇండియాస్‌ లేడీ కాప్స్‌’..
ఆమె యూనిఫారం వేసుకోవడంతో మొదలవుతుంది. స్టేషన్‌కి వెళ్లాక ఆమెకొచ్చే కేసులూ, ఆమెని ఓ పోలీసులా కాకుండా ఓ చక్కటి మానసిక నిపుణురాలిలా తీర్చే విధానాన్ని నలభైనిమిషాలపాటు అద్భుతంగా కళ్లకుగట్టిందీ చిత్రం. నేటితరం అమ్మాయిలు ఒకనాటి కుటుంబవిలువలపై చేస్తున్న పోరాటాన్నీ చూపిస్తుంది. అంతర్జాలమంటే కేవలం కాలక్షేపం కోసమే కాదని భావించేవాళ్లు చూడాల్సిన డాక్యుమెంటరీ ఇది!

16:03 - April 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే తమ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. సభలకు అనుమతివ్వకుండా ప్రభుత్వం నిరంకుశ పోకడలు పోతోందని విమర్శించారు.  పొల్యూషన్‌ సాకు చూపుతూ సభను అనుమతి నిరాకరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎల్‌బీ స్టేడియంలో ఓ సినిమా వేడుక నిర్వహించినప్పుడు పొల్యూషన్‌ ఏర్పడలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తమకు ఇష్టంలేనివారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. సభలు, మీటింగ్‌లు పెట్టుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని... ఆ హక్కునే కేసీఆర్‌ కాళరాస్తున్నారని మండిపడ్డారు. 

 

16:00 - April 11, 2018

కర్నాటక : వచ్చే నెల 12న జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ సహా అన్ని పార్టీల నేతలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మే 15న ఓట్ల లెక్కింపు జరుగనుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

15:57 - April 11, 2018

ఢిల్లీ : అల్జీరియాలో సైనిక విమానం కూలిన ఘటనలో సుమారు వంద మందికి పైగా మరణించారు. 200మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం.. బౌఫారిట్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూలిపోయిందని.. స్థానిక రేడియో ప్రకటించింది. సమాచారం అందుకున్న అల్జీరియా ఆర్మీ సహాయకచర్యలను చేపట్టింది.

 

15:55 - April 11, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపులు, ధర్మాసనాల ఏర్పాటుపై మార్గదర్శకాలు రూపొందించాలన్న న్యాయవాది అశోక్‌ పాండే వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసులను కేటాయించడం, బెంచ్‌లను ఏర్పాటుచేయడంపై నిర్ణయం తీసుకునే హక్కు ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పారదర్శక పనితీరు కోసం సిజెఐకు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని... ఆయన బాధ్యతలపై అవిశ్వాసం తగదని...ఇది సిజెఐ పదవికే అపకీర్తి తెచ్చేలా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ సరిగా లేదని ఆరోపిస్తూ నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి ఛలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌లు మీడియా సమావేశం ఏర్పాటుచేసి సీజేఐపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

15:53 - April 11, 2018

గుంటూరు : ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు చిలకలూరిపేట మార్కెట్‌యార్డ్‌ నుంచి కోటప్పకొండకు పాదయాత్రగా బయల్దేరారు.  హార్టీకల్చర్‌ బోర్డ్‌ సభ్యులు పోకూరి శివరామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.  వందమందితో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 

 

15:51 - April 11, 2018

చిత్తూరు : రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌ హబ్‌గా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతిలో సెల్‌ఫోన్‌ విడిభాగాల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఈమేరకు చైనాకు చెందిన షియోమియా సంస్థంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్న పారిశ్రామిక వేత్తలకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలో ఏపీ ముందున్నదని ముఖ్యమత్రి తెలిపారు. 

 

15:20 - April 11, 2018

కృష్ణా : విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం రణరంగంగా మారింది. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య రాజీనామాలపై మాటల యుద్ధం జరిగింది. వైసీపీ కార్పొరేటర్లైన పాల ఝాన్సీ, చందన సురేష్‌, షేక్‌ అసిఫ్‌, మద్దా శివ శంకర్‌లను మేయర్‌ కోనేరు శ్రీధర్‌ సభ నుండి సస్పెండ్‌ చేశారు. బలవంతంగా వీరిని బయటకు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో కార్పొరేటర్‌ ఝాన్సీ అస్వస్థతకు గురయ్యారు. మేయర్‌ తీరును నిరసిస్తూ కౌన్సిల్‌ బహిష్కరించి  వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు.

పేదరికం లేని సమాజం కోసం: బాబు

విజయవాడ : పేదరికం లేని సమాజం కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పూలే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు సభలో మాట్లాడుతు..సమస్యలు ఎన్ని ఉన్నా పేదవారికోసం శ్రమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. బీసీ మహిళల పెళ్లికి రూ.35వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. బీసీ ఉప ప్రణాళిక కింద రూ.12వేల కోట్లు ఖర్చుచేస్తున్నట్లు సీఎం చెప్పారు. ‘‘ఆదరణ పథకం కింద అనేక కార్యక్రమాలు చేపట్టాం.

15:18 - April 11, 2018

హైదరాబాద్ : టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. తన తప్పులను విపక్షాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  ప్రభుత్వ పథకాల్లో నిధులన్నీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారని రోజా ఆరోపించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని రోజా అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే సీఎం చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని నెత్తికెత్తుకున్నారని రోజా విమర్శించారు. 30సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఒక్కసారైనా ప్రత్యేక హోదాను అడగలేదన్నారు.

 

జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం : చంద్రబాబు

విజయవాడ: జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పూలే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు సభలో సీఎం మాట్లాడుతూ..జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు కొనియాడారు. వెనుకడిన వర్గాల సంక్షేమం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా కొత్త ఒరవడి సృష్టించిందన్నారు.

వెనుకబడిన వర్గాలకు టీడీపీ వెన్నెముక : చంద్రబాబు

విజయవాడ: వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని, వెనుకబడిన వర్గాలు టీడీపీకి వెన్నెముక అని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందిని, కేంద్రంతో విభేదాలు ఉన్నంత మాత్రాన సంక్షేమం, అభివృద్ధి ఆగదని, మోదీ ఏపీకి సాయం చేయకపోతే కేంద్రం నుంచి వడ్డీతో సహా ఎలా సాధించుకోవాలో మాకు తెలుసని సీఎం చంద్రబాబు తెలిపారు.మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. పూలే జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా హాజరయ్యారు. 

15:15 - April 11, 2018

ఢిల్లీ : ఆరురోజుల పాటు నిరాహార దీక్ష చేసినా కేంద్రం నుంచి స్పందన రాలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎంపీల దీక్షను కేంద్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తీరువల్లే ఢిల్లీలో ఏపీకి విలువ లేకుండా పోయిందని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో చంద్రబాబు కుమ్మక్కై ఎంపీల దీక్షలను భగ్నం చేశారని ఆరోపించారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. రాష్ట్రంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా జగన్మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమన్నారు.

 

కుప్పకూలిన విమానం, 100మందికి పైగా మృతి..

హైదరాబాద్: అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలిన ఘటనలో 105 మంది వరకు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదం అల్జీరియా రాజధాని అల్జీర్స్ కు సమీపంలో ఉన్న బౌఫారిక్ ఎయిర్ పోర్టు వద్ద ఈ రోజు సంభవించింది. విమానంలో 200 మందికి పైగా మిటలరీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 26 మంది వెస్టర్న్ సహారాకు చెందిన వారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. 14 అంబులెన్స్ లు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించాయి. సహాయక చర్యలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు... ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ఉన్న అన్ని రోడ్లను మూసేశారు.

వైసీపీ ఎంపీల దీక్ష భగ్నం..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న నిరాహార దీక్షలో భాగంగా వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డిల ఆరోగ్యం క్షీణించింది. దీంతో వారిని వైద్యుల సూచన మేరకు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో వారి దీక్ష భగ్నమయ్యింది. కాగా దీక్ష విరమించేందుకు మిధున్, అవినాశ్ రెడ్డిలు ససేమిరా అంటున్నారు. కాగా ఈనెల 6వ తేదీ నుండి ఎంపీలు ఏపీ భవన్ లో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. 

13:32 - April 11, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. అంతా ఇచ్చేశారంటూ మోడీ..జైట్లీని ఆకాశానికెత్తేసి అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసింది ప్రభుత్వమయితే తమపై ఎందుకు బురద చల్లుతున్నారని, విభజన హోదా అమలు కోసం వెళ్లేలేదని..వెళితే వినతిపత్రాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. లోక్ సభలో వైసీపీ ఎంపీలు ధైర్యంగా రాజీనామాలు చేశారని, ప్రత్యేక హోదా సాధించడమే వైసీపీ లక్ష్యమయితే హోదాకు వెన్నుపోటు ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఓ పత్రికలో పథకాలపై 71 శాతం సంతృప్తిగా ఉన్నట్లు ఓ వార్త ప్రచురితమైందని..ఇది అసత్యమని తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వాయిదా..

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కోర్టులో పిటీషన్ దాఖలయ్యింది. ఈ పిటీషన్ పై ఎన్ జీటీ త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటీషన్లపై కమిషన్ వేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో పిటీషనర్ న్యాయవాది తరపున ఎన్టీజీ ఏకీభవించింది. అనంతరం విచారణను మే 10కి వాయిదా వేసింది.

లాఠీ దెబ్బలకు వెరువరు కమ్యూనిస్టులు : ఉండవల్లి

తూర్పుగోదావరి : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి రచించిన 'ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమం అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడారు. కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు రాకపోయినా..లాఠీ దెబ్బలకు ఎదురెళ్లి ప్రజా ఉద్యమాలు చేసే సత్తా వుండని ఉండవల్లి పేర్కొన్నారు. కమ్యూనిస్టుల ఉద్యమాలకు యువత అండగా వుండాల్సిన అవుసరముందన్నారు. 

13:21 - April 11, 2018

విజయవాడ : మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకల్లో పలు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో వీహెచ్, ఆయన అనుచరులు సీపీఎం శ్రేణులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్రంలో విజయవాడ తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం వద్దనున్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడానికి కాంగ్రెస్ నేతలు వచ్చారు. కానీ అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారంటూ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. వెంటనే నేతలను బలవతంగా అక్కడి నుండి తరలించి పీఎస్ కు తరలించారు. పోలీసుల చర్యను కాంగ్రెస్ నేతలు ఖండించారు. 

తాజ్ మహల్ మాదన్న అంశంపై సుప్రీం రెస్పాన్స్..

ఢిల్లీ : తాజ్ మహల్ తమకు చెందుతుందంటూ ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తాజ్‌ మహల్‌ తమకు చెందుతుందని, షాజహాన్ దానిని తమకు రాసిచ్చాడని సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కలుగజేసుకుని...తాజ్‌ మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? అని సున్నీ బోర్డును ప్రశ్నించారు. ఇలాంటి కేసుల వల్ల విలువైన కోర్టు సమయం వృథా అవుతోందని మండిపడ్డారు.

13:12 - April 11, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీల దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. గత ఆరు రోజులుగా చేస్తున్న దీక్షలు సమాప్తమయ్యాయి. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరహార దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా చేస్తున్న దీక్షలతో నేతల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్షలు కొనసాగిస్తే ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆర్ఎంఎల్ వైద్యులు దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. బలవంతంగా ఇద్దరు ఎంపీలను అంబులెన్స్ లోకి ఎక్కించారు. పోలీసుల చర్యలను వైసీపీ నేతలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కార్యకర్తలను చెదరగొట్టి ఆసుపత్రికి తరలించారు. 

ప్రధానోపాధ్యాయురాలిపై కత్తితో దాడి..

మహబూబ్‌నగర్ : పాఠశాలలోనే మహిళా హెడ్‌మాస్టర్‌పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో హెడ్‌మాస్టర్ కన్యాకుమారి తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు బాధితురాలని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో భర్త రమణారెడ్డి భార్యపై దాడి చేసినట్లుగా సమాచారం.

ఫూలే జయంతి ఉత్సవ వేడుకలు రసాభాసా..

విజయవాడ : బడుగు నేత జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవ వేడుకలు విజయవాడలో రసాభాసగా మారాయి. ఇక్కడి జ్యోతీరావు విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడానికి వచ్చిన వేళ, అదే సమయంలో సీఎం చంద్రబాబు వస్తున్నారని పోలీసులు వారిని అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు తదితరులు అక్కడికి వచ్చారు. పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలూ నిరసనకు దిగగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.

12:48 - April 11, 2018

మానాన్నకు పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి..తెలుగు ప్రేక్షకులను గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ప్రభావితం చేసిన కథానాయికలలో సిమ్రాన్ ఒకరు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన అవలీలగా చాన్స్ లు కొట్టేసి గ్లామర్ గాల్ గా మెప్పించి 'సమర సింహా రెడ్డి' .. 'కలిసుందాం రా' .. 'నరసింహనాయుడు' .. 'మృగరాజు' వంటి సినిమాలు ఆమె అగ్రకథానాయకులతో చేసింది. అటువంటి సిమ్రాన్ వివాహం తరువాత తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. కానీ తమిళంలో కొంతకాలం క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, అక్కడ ముఖ్యమైన పాత్రలను చేస్తోంది.

గ్లామర్ గా కనిపిస్తున్న అమ్మ,అత్త పాత్రలు..
ప్రస్తుతం తెలుగు తెరపై అమ్మ, అత్త క్యారక్టర్లంటే హీరోయిన్ కు అక్కల్లాగా కనిపించేంత గ్లామర్ గా కనిపిస్తున్నాయి. ప్రగతి,రాశి,తులసి,రోహిణి వంటి మంచి నటీమణులు అత్తలుగా, అమ్మలుగా మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో సిమ్రాన్ కూడా అత్త పాత్రలో తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక తెలుగు సినిమాను కూడా సిమ్రాన్ అంగీకరించిందనీ .. అందులో అత్త పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఇది అత్తకి తగిన అల్లుడు తరహాలో కొనసాగే కథనట. అందువల్లనే అత్త పాత్ర కోసం సిమ్రాన్ ను ఓకే చెసినట్టు తెలుస్తోంది. వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది .. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.        

12:35 - April 11, 2018

హోటల్‌ కి వెళ్లాంటే జేబులు, పర్సులో వున్న డబ్బుల్ని లెక్కచూసుకుంటాం. ఒకవేళ డబ్బులు బాగా వున్నవారైనా, లేనివారైనా డబ్బులుంటేనే హొటల్ కు వెళ్లి ఏమైనా తింటారు. కానీ హొటల్ కి వెళ్లి ఇష్టమైనవన్నీ తిని డబ్బులు కట్టకపోతే ఏం చేస్తారు? హొటల్లో పిండి రుబ్బిస్తారు, లేదా ప్లేట్లు కడిగిస్తారు వంటి ఎన్నో సంఘటనల గురించి విని వున్నాం, సినిమాల్లో చూసి వున్నాం. కానీ హొటల్ వెళ్లి ఫుల్ గా తినేసినా డబ్బులు అడగని హొటల్ కి మీరెప్పుడన్నా వెళ్లారా? పోనీ కనీసం విన్నారా? ఆ మాట వింటే ఆశ్చర్యపోతున్నారా? ఏంటీ జోకులేస్తున్నారు అనుకుంటున్నారా? లేకుంటే పరాచికాలాడుతున్నాననుకుంటున్నారా? అటువంటిదేమీ లేదండీ బాబు చెప్పేది అక్షర సత్యం అంటే నమ్మండి!!. ఏంటి నమ్మరా? అయితే ఆ హొటల్ ఎక్కడుందో ఆ విషయాలేమిటో? విశేషాలేమిటో చెప్పేస్తాను. అప్పుడైనా నమ్ముతారు కదా? మీరు అటుకేసి వెళితే తప్పకుండా తినిరండి..వీలైతే డబ్బులు కూడా ఇచ్చిరండి. అదికూడా మీకు ఇష్టమైతేనే సుమండీ!!.

జనాదరణ మెండుగా పొందుతున్న ‘జనకీయ భక్షణశాల’..
భోజనం తినాలంటే ముందు జేబులో డబ్బులున్నాయా లేదా చూసుకుంటాం. కానీ కేరళలోని ‘జనకీయ భక్షణశాల’ హోటల్‌లోకి అడుగుపెట్టాలంటే ఆ భయమే లేదు. హాయిగా వెళ్లి కడుపునిండా తినేసి రావొచ్చు. అక్కడ టోకెన్లు ఇచ్చే కౌంటరు కానీ... బిల్లు వసూలు చేసుకునే సర్వర్లు కానీ ఉండరు. ఇవ్వాలని మీ మనసుకు అనిపిస్తే మాత్రం ఇచ్చిరావొచ్చు. అలాని ఇదేదో ఆషామాషీ హోటల్‌ అనుకునేరు. సుమారు రెండువేలమంది తినే సామర్థ్యం ఉన్న ఈ హోటల్‌.

శుభ్రమైన,రుచికరమైన పదార్ధాల ‘జనకీయ భక్షణశాల’..
నిమిషాల్లో వంటను పూర్తిచేసే స్టీమ్‌కిచెన్‌, శుభ్రమైన నీటిని అందించే వాటర్‌ప్లాంట్‌, వ్యర్థాలను ఉపయోగంలోకి తెచ్చే వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌తో సహా ఉన్నాయి. ‘కావల్సినంత తినండి... ఇవ్వాలనిపించేంత ఇచ్చిపొండి’ అనే థీమ్‌తో కేరళ స్టేట్‌ ఫైనాన్షియల్‌ ఎంటర్‌ప్రైసెస్‌ సంస్థ సామాజిక బాధ్యతగా ఈ హోటల్‌ని ప్రారంభించింది. చేతిలో పైసా లేకుండా కూడా ఈ హోటల్‌లో అడుగుపెట్టి అద్భుతమైన రుచులని ఆరగించవచ్చని అంటున్నారు హోటల్‌ నిర్వహకులు. అలెప్పూజాకు వెళ్లే దారిలో ఈ హోటల్‌ ఉంటుందండీ..మరి అటుగా వెళినప్పుడు మీరు కూడా ఆ హొటల్ ని దర్శించి..తిని వీలైతే డబ్బులిచ్చి..అదీకూడా మీకిష్టమైతే సుమండీ బలవంతం ఏమీ లేదండీ..అస్సలు మొహమాట పడకండీ!. ఏది ఏమైనా అటువంటి నిర్వాహకులను మెచ్చుకోకుండా వుండలేం కదా! అందుకే అటువంటి వారిని అభినందించాల్సిన అవుసరం కూడా చాలా వుంది. అందుకే మన అభినందనలు మన టేస్ట్ ను బట్టి, సహకారాన్ని ఏదొక రూపంలో 'ఇచ్చి' తెలుపుకుందాం..

 

మణిపూర్ మణిపూసకు ఈసారి స్వర్ణమా?రజతమా?

ఢిల్లీ : ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్ వెల్త్ పోటీల్లో ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి, రాజ్యసభ ఎంపీ మేరీకోమ్ ఫైనల్ కు చేరుకోవడంతో మరో పతకం ఖరారైంది. మహిళల 48 కిలోల విభాగంలో పోటీ పడుతున్న ఆమె సెమీస్ లో శ్రీలంకకు చెందిన అనూషను 5-0 తేడాతో ఓడించి ఫైనల్లోకి వెళ్లింది. గతంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన మేరీ కోమ్, ఒలింపిక్ పతకాన్ని సైతం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మేరీ కోమ్ కామన్ వెల్త్ పోటీల్లో పాల్గొనడం మాత్రం ఇదే మొదటి సారే కావటం విశేషం. అయినా పతకాన్ని మాత్రం మేరీ ఖాయం చేసుకుంది.

12:07 - April 11, 2018

పువ్వులో రాణి గులాబీ,కూరల్లో రాజా వంకాయ, మరి పండ్లల్లో మహారాజు ఎవరయా అంటే ఇట్లే చెప్పేస్తారు. అదేనండీ! మామిడి పండు. అందుకే అది మన జాతీయ ఫలం అయ్యింది. ప్రపంచంలోని, ఉష్ణమండదేశాల్లో, విస్తారంగా పండించబడే అతి ముఖ్యమైన ఫల పంట మామిడి యొక్క పండు శరీరానికి ఎంతోమేలు చేసే పండు ఇది. నేరుగా పండులా తినవచ్చు లేదా ఊరగాయలు మొదలైన వాటికి పచ్చడి మామిడి కాయలను ఉపయోగించవచ్చు. దీనిలో రసం కలిగిన పండు విటమిన్లు ఎ, సి, డి లను పుష్కలంగా కలిగి ఉంది. భారతదేశంలో వంద రకాలకు పైగా మామిడి ఎన్నో రకాల సైజుల్లో లభ్యమౌతుంది. చిరకాలం నుండి మామిడి భారతదేశంలో సాగు చేయబడుతుంది. ప్రముఖ కవి కాళిదాసు, తన కవిత్వంలో ఈ పండు యొక్క ప్రాశస్యాన్ని ఘనంగా కీర్తించాడు. జగజ్జేతగా పేరొందిన అలెగ్జాండరు, చైనీయుల యాత్రికుడైన హ్యూయాన్ ల్సాంగ్ కూడా దీని రుచిని ఆస్వాదించి మైమరచిపోయారు. మొఘల్ చక్రవర్తి అక్బర్, 1,00,000 మామిడి చెట్లను బీహార్ లోని దర్భాంగా లో నాటించాడు. ఇప్పుడు ఆ తోట, లఖీబాగ్ అని పిలవబడుతుంది. మరి దీని ఘనతో ఏమిటో తెలుసుకున్నాం..మరి దీని ఉపయోగాలేమిటో..లాభాలేమిటో..ఆ ఆస్వాదన ఏమిటో తెలుసుకుందాం..

రుచిలోనే కాదు ఆరోగ్యానికి ఎంతో అవసరమండీ..మామిడిపండు..
మార్కెట్‌లోకి ఇప్పుడిప్పుడే మామిడి పండ్లు ప్రవేశిస్తున్నాయి. కనిపిస్తే చాలు కాలు కదలనివ్వని మామిడి పండులో విటమినులూ, ఖనిజాలూ యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఇది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. మామిడి కాయల్లోని పాలీఫినాల్స్‌ లక్షణాలు పలురకాల కాన్సర్లను నిరోధిస్తాయి.

చక్కెర స్థాయిలను మామిడి అదుపుచేస్తుందంటున్న పరిశోధకులు..
ఊబకాయుల్లో చక్కెర స్థాయిలను మామిడి అదుపుచేస్తుందని పరిశోధనల్లో తేలింది. మామిడిలో ఐరన్‌ పుష్కలంగా దొరుకుతుంది. ఇది రక్త హీనతను నివారించేందుకు దోహదపడుతుంది. ఎసిడిటీ, అజీర్తిలతో బాధపడేవారికి మామిడి మంచి మందులా పనిచేస్తుంది. డయేరియా, ఎండదెబ్బ, కాలేయవ్యాధులు, ఆస్తమా, నెలసరి సమస్యలు, మొలలు, ఇలాంటి అన్ని సమస్యలకూ మామిడిపండు మంచి టానిక్‌గా ఉపకరిస్తుంది. మానసికంగా బలహీనులైనవారికి దీని రసం ఉత్తేజాన్నిస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్‌ ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం..మామిడి పండ్ల రుచిన ఆస్వాదిద్దాం..ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం..

12:02 - April 11, 2018

శ్రీకాకుళం : టెక్కలిలో విషాదం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఏజెంట్ కోటేశ్వరరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుమారు కోటి రూపాయల వరకు పాలసీలు చేయించినట్లు తెలుస్తోంది. డబ్బులు తిరిగి చెల్లించాలని అగ్రీగోల్డ్ బాధితులు తీవ్ర వత్తిడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం..కంపెనీ నుండి ఎలాంటి సహాయం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేకూర్చలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అగ్రీగోల్డ్ కు సంబంధించిన కేసు ఇంకా విచారణలో సాగుతున్న సంగతి తెలిసిందే. 

అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్య..

శ్రీకాకుళం : మరో అగ్రిగోల్ట్ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు కోటి రూపాయలు పాలసీలు వేయించిన ఓ వ్యక్తి బాధితులు తమ డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయటంతో ఏం చేయాలోపాలు పోక కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టెక్కలిలో చోటుచేసుకుంది. హరిశ్చంద్రాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని రైలుకింద పడి కోటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఇప్పటికే పలువురు అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. 

తాజ్ మహల్ మాదేనంటు ఆధారాలు!!..

ఉత్తరప్రదేశ్ : భారతదేశానికి తలమానికంగా నిలిచిన అపురూప ప్రేమ కట్టడం మాదేనంటు సున్నీ వక్ఫ్ బోర్డు. ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ తమదేనని సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టుకు విన్నవించింది. తాజ్ నిర్మాత షాజహాన్ తమకు రాసిచ్చాడని ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు వాదిస్తోంది. మంగళవారం కోర్టుకు హాజరైన సున్నీ బోర్డు ఈ మేరకు తన వాదనలను వినిపించింది. కాగా దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ షాజహాన్ రాసిచ్చిన పత్రాలను చూపాలని సున్నీ బోర్డుకు సూచించింది. ఆధారాలను సమర్పించేందుకు వారం రోజుల గడువు కేటాయించింది.

ఫ్లిప్ కార్ట్ లో కళ్లు చెదిరే ఆఫర్లు!..

హైదరాబాద్ : దేశీ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ ఫ్లిప్ కార్ట్ శాంసంగ్ కార్నివాల్ పేరిట ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకూ ప్రత్యేక విక్రయాలు చేపట్టింది. ఇందులో భాగంగా శాంసంగ్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలు, పలు ఆఫర్లను అందిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐపై కొనుగోలుకు వీలు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ తగ్గింపునకు గాను కనీసం కొనుగోలు విలువ రూ.5,990 ఉండాలన్న షరతు విధించింది. అలాగే, గరిష్ట తగ్గింపు రూ.1,000కి పరిమితం చేసింది.

కామ్ న్వెల్త్ ల్లో భారత్ పంట..

హైదరాబాద్ : కామ్ న్వెల్త్ క్రీడల్లో భారత్ కు పతకాల పంట పండుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కు మరో పసిడి పతకం దక్కింది. డబుల్ టాప్ షూటింగ్ లో శేయాసి సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. ఇప్పటి వరకూ భారత్ ఖాతాలో 12 స్వర్ణ పతకాలు, 4 రజత పతాకలు, 7 కాంస్య పతకాలతో పాటు మొత్త 23 పతకాలను భారత్ సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో వుంది. 

రూ.4వేల కోట్లతో ఏపీలో షియామీ సంస్థ..

చిత్తూరు : ప్రముఖ కంపెనీ షియామీ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. షియామి సంస్థ ఏపీలో ఏర్పాటుపై చంద్రబాబు షియామి సంస్థ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రూ.4వేల కోట్లతో సెల్ ఫోన్ పరికరాల తయారీ సంస్థ పరిశ్రమను శ్రీ సిటీ, తిరుపతి ఈఎంసీ 2 ప్రాంతాల్లో షియామి సంస్థ ఏపీలో ఏర్పాటు చేయనుంది. ఈ విషయంగా తిరుపతిలోని మారస్ సరోవర్ హోటల్ లో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు. 

11:31 - April 11, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీలు చేపడుతున్న దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరహార దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా చేస్తున్న దీక్షలతో నేతల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్షలు కొనసాగిస్తే ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఈ సందర్భం పార్టీ నేత పార్థసారధి మీడియాతో మాట్లాడారు. ఎంపీల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, బీపీ, షుగర్స్ లెవల్స్ తగిపోతున్నాయన్నారు. కేవలం రాష్ట్రానికి హోదా కల్పించాలని కోరుతూ దీక్షలు చేపట్టడం జరుగుతోందని, కానీ కేంద్రం మాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. ఎంపీలు దీక్ష విరమించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏ క్షణమైనా ఎంపీలను ఆసుపత్రికి తరలిసాతరని తెలుస్తోంది. దీక్ష చేస్తున్న ఎంపీలను జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరామర్శించారు. ఇదిలా ఉంటే ఎంపీలు చేపట్టిన దీక్షా స్థలిని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పరామర్శించారు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందున్నాం :చంద్రబాబు

చిత్తూరు : తిరుపతిలో ఈ జ్ఆప్ డూయింగ్ బిజినెస్ లో ముందున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో రియల్ టైమ్ గవర్నెన్స్ తో ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని తెలిపారు. ఏపీలోపెట్టుబడులు పెట్టేవారికి వెంటనే స్థలాన్ని ఏర్పాటుచేసిన విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతిలోని మారస్ సరోవర్ హోటల్ లో ప్రముఖ కంపెనీ షియామి సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు ఈ వివరాలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్, తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ ఎక్స్ ప్రెస్ ను అడ్డుకున్న వైసీపీ..

చిత్తూరు : రేణిగుంట రైల్వే స్టేషన్ లో బాలాజీ ఎక్స్ ప్రెస్ ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో చెన్నై ఎక్స్ ప్రెస్ ను తిరుపతిలో అధికారులు నిలిపివేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఎంపీలు ఢిల్లీ చేస్తున్న దీక్షకు సంఘీభావంగా ఏపీలో వైసీపీ కార్యకర్తలు రైల్ రోకో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో హోదా హోరు ఉదృతం చేశారు. రైల్ రోకోకు పిలుపునిచ్చిన జగన్ ఈరోజు రైల్ రోకోను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో పోలీసులు భారీగా మోహరించారు. రైల్వే స్టేషన్ లోకి వెళ్ళకుండా పోలీసులు వైసీపీ కార్యకర్తలనుఅడ్డుకుంటున్నారు.

కొనసాగుతున్న పీఎస్ ఎల్వీ కౌంట్ డౌన్..

నెల్లూరు : పీఎస్ ఎల్వీ 41 ప్రయోగానికి సుమారు 32 గంటలపాటు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ కౌంట్ డౌన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. పీఎస్ ఎల్వీ వీయ41 రేపు ఉగయం 4 గంటలకు నింగిలోకి వెళ్ళనుంది. దీనికి సంబంధఙంచిన 

11:10 - April 11, 2018

చిత్తూరు : ఏపీ బెస్ట్ ప్లేస్ అని చెప్పడం జరిగిందని, దీనికి కంపెనీ వాళ్లు సానుకూలంగా స్పందించారని తెలిపారు. తిరుపతి - చెన్నై - నెల్లూరు ప్రాంతాలు పెద్ద ఇండస్ట్రీయల్ హబ్ గా మారబోతోందని, తద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రాయలసీమ, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం అభినందనీయమని, దేశంలో తాము పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు షియామీ కంపెనీ ప్రతినిధి తెలిపారు. దీనిద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. 

భద్రతాదళాలకు చిక్కిన ఉగ్రవాదులు..

జమ్ము కశ్మీర్ : కుల్గాం జిల్లా కుద్వానీ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు పట్టుకున్నాయి. 

కాంగ్రెస్ నేత వీహెచ్ ఓవరాక్షన్..

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత సీపీఎం, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఓవరాక్షన్ చేశారు. అంబర్ పేటలో మహాత్మాజ్యోతిరావు పూలె విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పిస్తున్ సీపీఎం నేతలతో వీహెచ్ ఘర్షణకు దిగారు. దీంతో సీసీఎం, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. జ్యోతిరావు పూలె విగ్రహానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీ.మాస్ చైర్మన్ కంచ ఐలయ్య, జాన్ వెస్లీ, ఇంకా ఇతర సీపీఎం నేతలు పాల్గొన్నారు. 

10:27 - April 11, 2018

చిత్తూరు : తిరుపతికి షియామీ కంపెనీ తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఆ కంపెనీ ప్రతినిధులతో బాబు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో మంత్రులు నారా లోకేష్, అమర్ నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎంపీలు..ఎమ్మెల్యేలు..ఇతర ప్రజాప్రతినిధులకు ఈ చర్చల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వలేదు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన..అవకాశాలపై బాబు వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తిరుపతిలో కంపెనీ ఏర్పాటు చేయాలని షియామీ కంపెనీని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. వంద మంది షియామీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం తిరుపతికి చేరుకున్నారు. వారు బస చేసిన హోటల్ కు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుని చర్చలు ప్రారంభించారు. శ్రీసిటీ, తిరుపతి ఈఎంసీ 2 ప్రాంతాల్లో పరిశ్రమ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రూ. 4వేల కోట్లతో సెల్ ఫోన్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని షియామీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. యూపీ, ఏపీ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. 

యూపీ, ఏపీ రాష్ట్రాల్లో షియామీ పెట్టుబడులు...

చిత్తూరు : శ్రీసిటీ, తిరుపతి ఈఎంసీ 2 ప్రాంతాల్లో షియామీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రూ. 4వేల కోట్లతో సెల్ ఫోన్ పరికరాల తయారీ పరిశ్రమను షియామీ ఏర్పాటు చేయనుంది. యూపీ, ఏపీ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది. 

09:34 - April 11, 2018

నిజామాబాద్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. మార్కెట్ యార్డులో సద్ధిమూట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మార్కెట్ యార్డుల్లో మార్కెట్ కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయడం జరుగుతోందని, వచ్చే వానంకాలం నాటికి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరంలో మూడు షిప్టుల్లో పనులు వేగంగా జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్లు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. 

షియామీ కంపెనీ ప్రతినిధులతో బాబు..

చిత్తూరు : షియామీ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మంత్రులు నారా లోకేష్, అమర్ నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. 

09:23 - April 11, 2018

విజయవాడ / ఢిల్లీ : ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరహార దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా చేస్తున్న దీక్షలతో నేతల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్షలు కొనసాగిస్తే ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఎంపీల దీక్షలకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గాల్లో నిరసనలు..ఆందోళలు చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం రహదారుల నిర్భందం చేసిన వైసీపీ బుధవారం రైల్ రోకో నిర్వహిస్తోంది. విజయవాడలోని ప్రధాన రైల్వే స్టేషన్ కు చేరుకున్న వైసీపీ నేతలు రైల్ రోకో నిర్వహించడానికి యత్నిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో నేతలు రైల్ రోకోలు నిర్వహించడానికి సన్నద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

09:13 - April 11, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్..ఆయన అనుచరుల వీరంగంపై టీ మాస్ ఛైర్మన్ కంచె ఐలయ్య స్పందించారు. అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్..ఆయన అనుచరులు ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కంచె ఐలయ్య మాట్లాడారు. పూలే అంటే ఇష్టం లేదా ? మానవత్వం ఉండకూడదా ? అని ప్రశ్నించారు. బిసీ, ఎస్సీ, ఎస్టీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పే వారు పూలేకు దండలు వేయాలని డిమాండ్ చేశారు. పూలే ఒక మహత్తరం పోరాటం చేశారని, అగ్రకులాల వారు రోడ్డు మీదకొచ్చి 11 మంది తమ వారసులను చంపేశారని తెలిపారు. కాంగ్రెస్ రెడ్ల చేతుల్లో ఉందని..వెలమలు అధికారంలో ఉన్నారని, సామాజిక న్యాయం కోరుకుంటే టీ మాస్ తో పనిచేయాలని సూచించారు. 

ఫైనల్ లో మేరీకోమ్...

ఢిల్లీ : కామన్వెల్త్‌ లో బాక్సింగ్‌ పోటీలో మేరీకోమ్‌ ఫైనల్‌ కు చేరుకుంది. సెమీఫైనల్‌లో శ్రీలంక క్రీడాకారిణిపై మేరికోమ్‌ విజయం సాధించింది. 45-48 కిలోల విభాగంలో మేరీకోమ్‌ కు రజతం ఖాయం.

ఏపీలో రైల్ రోకో...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ రైల్ రోకోకు పిలుపునిచ్చింది. పలు ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తలు రైళ్లను అడ్డుకుంటున్నారు. గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు తదితర ప్రాంతాల్లో పట్టాలపైకి చేరిన వైకాపా కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు.

09:00 - April 11, 2018

బీహార్ : ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి కష్టాలు తప్పడం లేదు. తాజాగా రైల్వే హోటళ్ల టెండర్ల కేసులో లాలు భార్య మాజీ సిఎం రబ్రీదేవీ నివాసంలో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించి లాలు కుమారుడు తేజస్వి యాదవ్‌ను సిబిఐ అధికారులు 4 గంటలకు పైగా ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీ అనే రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ళను సుజాత హోటల్‌కు చట్ట విరుద్ధంగా కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ హోటళ్లను కొచ్చర్లకు కట్టబెట్టడానికి లాలు పదవిని దుర్వినియోగం చేసినట్లు సిబిఐ ఆరోపించింది. ఈ హోటళ్లను కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా అత్యంత విలువైన భూమిని లాలు స్వీకరించారని పేర్కొంది. ఇప్పటికే దాణా స్కాంలో లాలు జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

08:31 - April 11, 2018

ఢిల్లీ : 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌ 6వ రోజు పోటీల్లోనూ భారత్‌ రెండు పతకాలు సాధించింది. ఉమెన్స్‌ 25 మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌ విభాగంలో భారత్‌ స్టార్‌ షూటర్‌ హీనా సిద్దు అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. ఫైనల్‌రౌండ్‌లో ఆస్ట్రేలియన్ షూటర్‌ ఎలీనా గలియాబోవిచ్‌ను ఓడించిన హీనా సిద్దు స్వర్ణం సాధించింది. పారా పవర్‌ లిఫ్టర్‌ సచిన్‌ చౌదరి మెన్స్‌ హెవీ వెయిట్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో మెడల్‌ సాధించిన అతి కొద్దిమంది పారా అథ్లెట్ల లిస్ట్‌లో సచిన్‌ చౌదరి చేరి...అరుదైన ఘనతను సొంతంచేసుకున్నాడు.

08:28 - April 11, 2018

 

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, ఆయన అనుచరులు సీపీఎం శ్రేణులపై దాడికి దిగడం సంచలనం సృష్టించింది. అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్..ఆయన అనుచరులు ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీపీఎం శ్రేణులు..కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

పూలే అందరి వాడని ఎవరైనా నివాళులర్పించవచ్చని, తాము నివాళులర్పించడానికి రావడం జరిగిందని ఎంబీసీ నేత ఆశయ్య తెలిపారు. అక్కడకు వచ్చిన వీహెచ్ దీనిని జీర్ణించుకోలేకపోయి..అనుచరులతో తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఒక బీసీ నేత అయిన వీహెచ్..ఎంబీసీ రాష్ట్ర నేత అయిన తనపై దాడికి దిగడం సబబు కాదన్నారు. వీహెచ్ ఒక రౌడీ..గూండాలాగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. 

వీహెచ్ ఓవర్ యాక్షన్...

హైదరాబాద్ : సీపీఎం శ్రేణులపై వీహెచ్, ఆయన అనుచరులకు దాడికి పాల్పడ్డారు. తనపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని ఎంబీసీ నేత ఆశయ్య పేర్కొన్నారు. ఒక గూండా..రౌడీలాగా వ్యవహరించారని తెలిపారు. 

పూలేకు తమ్మినేని నివాళి...

హైదరాబాద్ : అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పూలమాల వేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకట్, టీ మాస్ కన్వీనర్ జాన్ వెస్లీ, ఇతర సీపీఎం నేతలు పాల్గొన్నారు. 

ఇద్దరు ఉగ్రవాదుల పట్టివేత...

జమ్మూ కాశ్మీర్ : కుల్గాం జిల్లా కుద్వానీ ప్రాంతంలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు పట్టుకున్నారు. 

రాజస్థాన్ రాయల్స్ - ఢిల్లీ డేర్ డెవిల్స్...

ఢిల్లీ : నేడు రాజస్థాన్ రాయల్స్ - ఢిల్లీ డేర్ డెవిల్స్ ఢీకొననున్నాయి. జైపూర్ వేదికగా రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

07:31 - April 11, 2018

తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్ర ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. 15వ ఆర్థికసంఘం సిఫారసులపై దక్షిణాది రాష్ట్రాల మంత్రులు మండిపడ్డారు. కలిసి పోరాడుదాం అన్న కేరళ ప్రభుత్వ ఆహ్వానం మేరకు కేరళ, ఆంధ్రప్రదేశ్‌, పాండిచేరి, కర్నాటక రాష్ర్టాల మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉపవాస దీక్ష చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై టెన్ టివి ప్రత్యేక చర్చలో మానవతా రాయ్ (కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ), డి.వి.కృష్ణ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

జగన్ 134వ రోజు...

గుంటూరు : నేడు 134వ రోజు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగనుంది. అంబేద్కర్ సర్కిల్ నుండి నవులూర, ఎర్రబాలెం, పెనుమాకలో పాదయాత్ర జరుగనుంది.

 

మంగళగిరిలో హ్యాపీ సిటీస్ సదస్సు...

గుంటూరు : జిల్లా మంగళగిరిలో ఆనంద నగరాల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు కొనసాగనుంది. 

07:18 - April 11, 2018

హైదరాబాద్‌లో 13 నుంచి 22 వరకు పది రోజుల పాటు ఎన్‌టీఆర్‌ స్టేడియంలో పెద్ద ఎత్తున హైదరాబాద్‌ ఫెస్ట్‌ జరుగబోతోంది. ఇది మన హైదరాబాద్‌ నగరానికి వేసవికాలంలో పండుగ వాతావరణం నింపనున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. విజ్ఞానం, వినోదంతో కలగలిపిన బాలోత్సవం, ఫుడ్‌ ఫెస్టివల్‌, బుక్‌ పెస్టివల్‌, ఎడ్యుకేషన్‌ ఇలా అన్నిరంగాలకు సంబంధించి అంశాలతో ఈ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నారు. ఈ హైదరాబాద్‌ ఫెస్ట్‌ విషయాలను మనతో పంచుకునేందుకు హైదరాబాద్‌ ఫెస్ట్‌ ప్రధాన కార్యదర్శి కె. చంద్రమోహన్‌ టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:53 - April 11, 2018

కేరళ : తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్ర ఆర్థికమంత్రులు సమావేశమయ్యారు. 15వ ఆర్థికసంఘం సిఫారసులపై దక్షిణాది రాష్ట్రాల మంత్రులు మండిపడ్డారు. కలిసి పోరాడుదాం అన్న కేరళ ప్రభుత్వ ఆహ్వానం మేరకు కేరళ, ఆంధ్రప్రదేశ్‌, పాండిచేరి, కర్నాటక రాష్ర్టాల మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. 2011 జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకోని నిధులు కేటాయించాలన్న ఆర్థిక సంఘం సిఫార్సులపై మండిపడ్డాయి. మరోసారి విశాఖలో భేటీ అయిన తర్వాత.. కార్యాచరణ రూపొందించుకునేందుకు సిద్దమవుతున్నాయి. రాష్ట్రాల హక్కులను హరించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణం మానుకోవాలని దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్‌ చేశారు. ఈ దిశలో 15వ ఆర్థికసంఘానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించిన పరిశీలనాంశాలను మార్చాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా 15వ ఆర్థికసంఘం సిఫార్సులు చేస్తే రాష్ట్రాల హక్కులకు పెద్దఎత్తున గండిపడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం కేరళ రాజధాని తిరువనంతపురంలో సీఎం పినరయి విజయన్‌ ప్రారంభించారు.

దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో... 15వ ఆర్థికసంఘం పరిశీలనాంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఆర్థిక సంఘం కేటాయింపుల్లో అసమతుల్యతను తీవ్రంగా వ్యతిరేకించాలని సదస్సు నిర్ణయించింది. రుణాలు పొందడంలో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించరాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రాలు అమలు చేసేటప్పుడు ఇచ్చే గ్రాంట్లను నిర్ధిష్టం చేయాలని తీర్మానించింది. ప్రోత్సాహాకాలు మాత్రమే ఇస్తూ గ్రాంట్లకు ఎగనామం పెడితే అంగీకరించేది లేదని స్పష్టీకరించింది. కేంద్ర పన్నుల్లో వాటా నిధులను వివిధ రాష్ట్రాలకు కేటాయించే సమయంలో 2011 జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. జనాభా ప్రాతిపదిక 1971 లెక్కల మేరకే ఉండాలని స్పష్టం చేసింది.

రాష్ట్రాల హక్కులను కబళించడానికే కేంద్రం యత్నిస్తుందని ఈ సమావేశం అభిప్రాయపడింది. 15వ ఆర్థికసంఘం తీరు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరోసారి చర్చించేందుకు వచ్చే నెల తొలివారంలో విశాఖలో భేటీ కావాలని నిర్ణయించారు. అయితే.. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా అహ్వానించాలని నిర్ణయించారు. ఈ భేటీ రాష్ట్రపతికి సమర్పించాల్సిన నివేదికను ఖరారు చేయనున్నారు. ఈ మెమోరాండం ముసాయిదా తయారు చేసే బాధ్యతను గులాటీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ టాక్సేషన్‌ సంస్థకు అప్పగించారు. ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల ప్రభుత్వాలను వేధింపులకు గురిచేసే రాజకీయ అజెండాతో కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందన్నారు కేరళ సీఎం పినరయి విజయన్‌. రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను పరిమితం చేసేందుకే 15వ ఆర్థిక సంఘాన్ని ప్రతిపాదించారన్నారు. ఈ సంఘ పరిశీలనాంశాలను మార్చాలన్నారు.

కుటుంబ నియంత్రణ సమర్దవంతంగా అమలు చేయడం వల్లే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని...అందువల్ల 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఆర్థికమంత్రులు. జనాభా నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత అని... దీనిని అమలు చేసేవారిని ప్రోత్సహించాలే తప్ప.. శిక్షించకూడదన్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు. 2011 విధానాన్ని అమలు చేస్తే మరికొన్ని రాష్ట్రాలు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందన్నారు. మొత్తానికి కేంద్రం తీరుపై దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమవుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలను మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

06:49 - April 11, 2018

విజయవాడ : వైసీపీ నుంచి టీడీపీకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. నలుగురు మంత్రులతో సహా 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.

06:46 - April 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ స్పీడ్‌ పెంచింది... కేసీఆర్‌ విధానాలన్నీ ప్రజావ్యతిరేకంగా ఉన్నాయంటూ వాయిస్‌ పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒడిసి పట్టుకునేందుకు.. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్నా బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లింది. అయితే... ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కాంగ్రెస్‌ అన్ని పక్షాలను ఒక్కతాటిపైకి తేగలదా ? దాని కోసం హస్తం పార్టీ వ్యూహం ఏంటి ? ప్రస్తుత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రచారం ముందుగానే మొదలుపెట్టింది. ప్రజల్లోకి వెళ్తూ కేసీఆర్‌ విధానాలను ఎండగడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని.. కేసీఆర్‌ తన మాటల గారడీతోనే ప్రజలను మోసం చేస్తున్నారని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. ఇదే ఎజెండాగా తీసుకుని... జనంబాట పట్టిన కాంగ్రెస్‌ నేతలు.... క్షేత్రస్థాయిలో గులాబీ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ దూకుడు పెంచారు. బస్సుయాత్రతో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో.. తమ ప్రణాళికలకు మరింత పదును పెడుతూ దూసుకెళ్తున్నారు.

కేసీఆర్‌ సర్కార్‌పై ప్రజల్లో తీవ్రవైన వ్యతిరేకత ఉందంటున్న హస్తం పార్టీ... క్షేత్రస్థాయిలో ప్రజల నాడీ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా... ప్రజల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేతను తమవైపు మలుచుకునేందుకు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా హస్తం పార్టీ ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలంటే.. ప్రతిపక్ష పార్టీలన్నింటిని కాంగ్రెస్ ఏకతాటిపైకి తీసుకురావాలి. అయితే... ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, ఎంఐఎంలు కాంగ్రెస్‌తో కలిసొచ్చే పరిస్థితి లేదు. ఇక మిగిలింది వామపక్షాలు. వాటిలో సీపీఎం లాల్‌ నీల్‌ జెండాతో స్వతంత్రంగా ముందుకెళ్లేందుక సిద్దమైంది. దీంతో సీపీఎం దోస్తీపై క్లారిటీ లేదు. ఇక మిగిలిన సీపీఐ కాంగ్రెస్‌తో వచ్చేందుకు సిద్దంగా ఉన్నా... ఆ పార్టీని కాంగ్రెస్‌ ఇంతవరకు సంప్రదించిన సందర్భమే లేదు. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలిగే లాభనష్టాలేంటి ? అనే విషయంలో హస్తం పార్టీలోనే భిన్న వాదనలున్నాయి. ఇదిలావుంటే టీడీపీ అసలు ఆ దిశగా ఆలోచిస్తుందా ? లేదా ? అనేది అసలు ప్రశ్న. టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ముఖ్యం కాబట్టి.... చంద్రబాబు అక్కడి రాజకీయ ప్రయోజనాలు బేరీజు వేసుకోకుండా ఇక్కడ పొత్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశమే లేదు.

ఇక తాజాగా ఏర్పడిన తెలంగాణ జనసమితి పార్టీతో కాంగ్రెస్‌ పొత్తుపై ఎలాంటి స్పష్టత లేదు. తాము ఒంటరిగా పోటీ చేస్తామని కోదండరామ్‌ ప్రకటించడంతో... ఆ పార్టీ స్టాండ్‌ అలాగే ఉంటుందా ? లేక మారుతుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. కోదండరామ్‌తో కలిసి నడిచే విషయంలో కూడా పార్టీ ఎలాంటి ముందడుగు వేయలేదు. ఇదిలావుంటే...ఎన్నికల నాటికి పొత్తుల విషయంలో క్లారిటీ వస్తుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నప్పటికీ... లైక్‌ మైండెడ్‌ పార్టీలతో సానుకూల వాతావరణాన్ని క్రియేట్‌ చేసుకోవాల్సింది కాంగ్రెస్‌ పార్టీయే. మరి కాంగ్రెస్‌ పార్టీ ఆ పని చేస్తుందా ? రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా.... వ్యతిరేక ఓట్లు చీలిపోతే కాంగ్రెస్‌ ఏ మేరకు లబ్ధి చేకూరుతుందనేది ప్రశ్న. మరోవైపు గులాబీ అధినేత వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక బీజేపీ, సీపీఎం, టీడీపీ, కోదండరామ్‌ పార్టీలు అన్ని స్థానాలకు పోటీ చేస్తే... టీఆర్‌ఎస్‌కు మరింత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని కాంగ్రెస్‌ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నా... అందకనుగుణంగా వ్యూహాలు పదును పెట్టడంలో బాగా వీక్‌గా ఉందనేది సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలన్నింటికి హస్తం నేతలు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది. 

06:44 - April 11, 2018

హైదరాబాద్ : ఈనెల 27న నిర్వహించనున్న ప్లీనరీని గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓవైపు ప్రస్తుత అధికారంలో ఇదే చివరి ప్లీనరీ కావడం.. మరోవైపు జాతీయ రాజకీయాలవైపు కేసీఆర్‌ దృష్టి సారించడంతో.. ప్లీనరీలో ఎలాంటి రాజకీయ తీర్మానం చేస్తారోనన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. ఇక ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్లీనరీ కావడంతో... నాలుగేళ్లుగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు.

టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న ఐదో ప్లీనరీపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఈనెల 27న జరగనున్న ప్లీనరీకి అన్ని నియోజకవర్గాల నుంచి క్రియాశీల కార్యకర్తలు హాజరుకానున్న నేపథ్యంలో... ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రతినిధుల సభను విజయవంతం చేసేందుకు పార్టీ పరంగా పలు కమిటీలను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సభ జరుగుతుండడంతో... ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు కమిటీల్లో పెద్ద పీట వేశారు.

ప్రభుత్వపరంగా ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి, సక్షేమంపై పలు తీర్మానాలను ఈ సభ ద్వారా ఆమోదించడంతో పాటు.. రాజకీయ తీర్మానాలను కూడా ఆమోదించేందుకు పార్టీ సిద్దమవుతోంది. పార్టీ జనరల్‌ సెక్రటరీ కేకే ఆధ్వర్యంలో కమిటీ తీర్మానాలను సిద్దం చేస్తోంది. జాతీయస్థాయి రాజకీయాలపై కూడా కేసీఆర్‌ దృష్టి సారించడంతో... ఈ ప్లీనరీ వేదికగా మరింత స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టిన కేసీఆర్‌... ప్రతినిధుల సభకు కూడా ఇతర రాష్ట్రాల నేతలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను దృష్టిలో ఉంచుకుని... ఈ ప్లీనరీ ద్వారానే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌ వైఖరిని స్పష్టం చేయనున్నారు.

మొత్తానికి ఈ ప్లీనరీ టీఆర్‌ఎస్‌కు చాలా కీలకంగా మారింది. ప్రస్తుత అధికారంలో ఇదే చివరి ప్లీనరీ కావడం.. మరోవైపు జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్‌ దృష్టి సారించిన నేపథ్యంలో... ప్లీనరీలో ఏయే నిర్ణయాలు ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

06:40 - April 11, 2018

రంగారెడ్డి : ఉగ్రవాదుల ఏరివేతలో కీలకపాత్ర పోషిస్తున్న జాతీయ భద్రతా దళ కమాండో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఎన్నో ఉగ్రవాద దాడులను తిప్పికొట్టిన ఎన్‌ఎస్‌జీ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రతిపాదించింది. ఉగ్రవాదులకు సింహస్వప్నంగా మారిన ఎన్‌ఎస్‌జీ కమాండోల సేవలు ఎవరెస్టు పర్వతం కంటే మహోన్నతమైనవని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్‌ఎస్‌జీ నూతన సముదాయం ప్రారంభోత్సవంలో ..దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో ఎన్‌ఎస్‌జీ ప్రాధాన్యత పెరిగిందని రాజ్‌నాథ్‌ చెప్పారు.

2008 నవంబర్‌ 26న ముంబైలో ఉగ్రవాద దాడుల తర్వాత ఎన్‌ఎస్‌జీ సేవల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2009లో ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఎన్‌ఎస్‌జీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సికింద్రాబాద్‌లోని మిలటరీ ఏరియాలో కొనసాగిన ఎన్‌ఎస్‌జీకి ఇప్పుడు కొత్త సముదాయం అందుబాటులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో ఎన్‌ఎస్‌జీ కేంద్రం ఏర్పాటైంది. ఉగ్రవాద దాడులను అరికట్టడంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ కమాండోలు చేసిన సాహసోపేతమైన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సందేశమిస్తూ... దేశ అంతర్గ భద్రత పరిరక్షణలో ఎన్‌ఎస్‌జీ కమాండోల పాత్ర కీలకంగా మారిందన్నారు. ఇబ్రహీంపట్నం ఎన్‌ఎస్‌జీ కేంద్రాన్ని అన్ని విధాల అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులను రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు. 

06:38 - April 11, 2018

గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... చేనేత కార్మికులను నిలువునా ముంచారని వైసీపీ అధినేత జగన్‌ విమర్శించారు. నేతన్నలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు. చేనేతలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. నేతన్నలకు రెండువేల రూపాయల పెన్షన్‌ ఇస్తామన్నారు. అందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీనిచ్చారు.

 

06:34 - April 11, 2018

విజయవాడ : ఏపీలో పలు నామినెటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. టీటీడీ సహా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కాగా చాలా వరకు ముందు అనుకున్న వారినే పదవులు వరించగా.. మరికొందరికి ఆఖరి క్షణంలో అదృష్టం వరించింది. అయితే ఆశావహులకు మాత్రం చివరికి నిరాశే మిగిలింది. టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఆర్టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్య, ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌రావు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నల్లారి కిషోర్‌ కుమార్‌లను నియమించారు. ఇక మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌గా జియావుద్దీన్‌, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హిదాయత్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నామన రాంబాబు, శాప్‌ చైర్మన్‌గా పి. అంకమ్మ చౌదరి, కనీస వేతన బోర్డు చైర్మన్‌గా రఘుపతుల రామ్మోహన్‌రావు, గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా దాసరి రాజారావు, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా డా. దివి శివరాం, గొర్రెల పెంపకాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా వై.నాగేశ్వరరావు యాదవ్‌లను నియమించారు.

నేడు వైసీపీ రైల్ రోకో...

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నేడు రైల్‌రోకోలు చేపట్టాలని వైసీపీ పిలుపునిచ్చింది. మరోవైపు వైసీపీ ఎంపీల దీక్షలు కొనసాగుతున్నాయి. 

టెన్ టివి జనపథం చూసి...

విశాఖపట్టణం : స్టీల్‌ప్లాంటుకు ఇనుప ఖనిజ గనులు కేటాయించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంపై ఇటీవల 10 టీవీ జనపథం కార్యక్రమంలో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం చూసిన మెట్ట చంద్రశేఖర్‌రావు... ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. కేసు విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతోపాటు స్టీల్‌ ప్లాంట్‌ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

13-22 వరకు హైదరాబాద్ ఫెస్ట్...

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఫెస్ట్‌ను విజయంతం చేయాలని స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ చైర్మన్‌ నంద్యాల నర్సింహారెడ్డి కోరారు. ఈనెల 13 నుంచి 22 వరకు.. ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ను ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఫెస్ట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఇతర నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ ఫెస్ట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. 

లాలూ ఫ్యామిలీకి కష్టాలు...

బీహార్ : ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి కష్టాలు తప్పడం లేదు. తాజాగా రైల్వే హోటళ్ల టెండర్ల కేసులో లాలు భార్య మాజీ సిఎం రబ్రీదేవీ నివాసంలో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించి లాలు కుమారుడు తేజస్వి యాదవ్‌ను సిబిఐ అధికారులు 4 గంటలకు పైగా ప్రశ్నించారు.

భారత్ బంద్ హింసాత్మకం...

బీహార్ : రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ పలు కుల సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ కూడా హింసాత్మకంగా మారింది. బిహార్‌లోని అరా పట్టణంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 12 మంది గాయపడ్డారు. రిజర్వేషన్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంలో పోలీసులు లాఠీ చార్జ్‌ జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మహారాష్ట్రలో ప్రమాదం..17 మంది దుర్మరణం...

మహారాష్ట్ర : సతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది కూలీలు దుర్మరణం చెందారు. ముంబయి- బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణ కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు ఉదయం 4.30 గంటల ప్రాంతంలో సతారా జిల్లా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.

ఉన్నావ్ లైంగిక దాడి..సుప్రీంలో పిటిషన్...

ఉత్తరప్రదేశ్‌ : కలకలం రేపిన ఉన్నావ్‌ లైంగిక దాడి కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బాధితురాలికి పరిహారంతో పాటు ఆమె కుటుంబానికి భద్రత కల్పించాలని పిటిషనర్‌ డిమాండ్‌ చేశారు. రేప్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధికార పార్టీకి చెందినవారు కావడంతో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపలేరని న్యాయవాది ఎమ్ ఎల్‌ శర్మ పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ప్రయాణికుడిని దింపేసిన ఇండిగో...

ఢిల్లీ : ఇండిగో విమానం నుంచి ఓ ప్రయాణికుడిని బలవంతంగా దింపివేశారు. విమానంలో దోమలున్నాయని చెప్పినందుకు తనను కొట్టి గెంటేశారని బెంగళూరుకు చెందిన సౌరభ్‌ రాయ్‌ ఆరోపించాడు. లక్నో నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఆయన ఇండిగో విమానాన్ని బుక్‌ చేసుకున్నారు. విమానంలోకి ఎక్కగానే దోమలు ఎక్కువగా ఉండటంతో సిబ్బందికి ఫిర్యాదు చేశారు. విమాన సిబ్బంది ఫిర్యాదును పట్టించుకోకపోగా... తనపై చేయిచేసుకున్నారని సౌరభ్‌ ఆరోపించారు.

కామన్ వెల్త్ లో భారత్ జోరు...

21వ కామన్వెల్త్‌ గేమ్స్‌ 6వ రోజు పోటీల్లోనూ భారత్‌ రెండు పతకాలు సాధించింది. ఉమెన్స్‌ 25 మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌ విభాగంలో భారత్‌ స్టార్‌ షూటర్‌ హీనా సిద్దు అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. ఫైనల్‌రౌండ్‌లో ఆస్ట్రేలియన్ షూటర్‌ ఎలీనా గలియాబోవిచ్‌ను ఓడించిన హీనా సిద్దు స్వర్ణం సాధించింది. 

Don't Miss