Activities calendar

12 April 2018

20:44 - April 12, 2018

హైదరాబాద్ : శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళన జాతీయస్థాయిని కదిలించింది. శ్రీరెడ్డిని ఒక చిన్న సాధారణ ఆర్టిస్ట్ గా భావించిన 'మా' అసోసియేషన్ , జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించటంతో 'మా', దిమ్మ తిరిగిపోయింది. దీంతో కల్లబొల్లి బాసలతో శ్రీరెడ్డి మా కుటుంబ సభ్యురాలే అంటు చల్లటి పదాలను ఉపయోగించింది. ఇదే మా అసోసియేషన్ శ్రీరెడ్డికి సభ్యుత్వం ఇచ్చే ప్రసక్తే లేదని ఖరాకండీగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ హెచ్ ఆర్సీ స్పందనతో డిఫెన్స్ లో పడ్డ 'మా' కాస్టింగ్ కౌచ్ పై పరిశ్రమలోని సీనియర్ నటులు, అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా మా అసోసియేషన్ తెలిపింది. శ్రీరెడ్డితో రెండు సినిమాలు చేస్తానని దర్శకుడు తేజ హామీ ఇచ్చారని మా తెలిపింది. కాగా శ్రీరెడ్డిపై 'మా'అసోసియేషన్. నిషేదాన్ని ఎత్తివేసింది. నటి శ్రీరెడ్డి కూడా మా కుటుంబంలో సభ్యురాలేననీ..ఆమెపై మాకు కోపం లేదని పేర్కొంది. ఆమె ఎవరితోనైనా నటించవచ్చనీ, ఆమెతో కూడా ఎవరైనా నటించవచ్చని మా అసోసియేషన్ ప్రకటించింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు మానస్తాపం చెందామని మా అసోసియేషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు హెచ్ ఆర్సీ నోటిసులను జారీ చేసింది. 

20:25 - April 12, 2018

ఇప్పటికే చేశిన పనికి శిగ్గుపడకుంట.. ఇంక నేను అట్ల జేయలేదు ఇట్ల జేయలేదు.. అగో ఫలానోళ్లు డ్యాన్సు జేస్తె తప్పులేదు నేను జేస్తె తప్పా..? అంటున్నడు హయత్ నగర్ కార్పొరేటర్ తిర్మల్ రెడ్డి.. నిన్న ప్రెస్ మీటింగు వెట్టి.. నా అంత ప్రతివత లేదని ముచ్చట్లు జెప్తున్నడు సారు.. అయ్యా తిర్మల్ రెడ్డి ఈ తీట ముచ్చట్లు జెప్పుడు కంటె జర్ర నిన్ను నువ్వు అదుపుల వెట్టుకుంటె సమాజానికి మంచిగుంటది..

ఆ జనంల తిర్గుబాటు సుర్వైనట్టే ఉందిగదా..? టీఆర్ఎస్ పార్టీ మీద.. మొన్న మెదక్ నియోజకవర్గంల పద్మాదేవేందర్ రెడ్డి పనితనం మీద.. నిన్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద.. గాయాళ్ల పెద్దపల్లి ఎమ్మెల్యేను గెద్మిండ్రు.. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే పనిజేశిండ్రు పబ్లీకు.. నడి చౌరస్తాల నిలవెట్టి ఏందయ్యా నువ్వు జేశింది అని తిడ్తున్నరు..

సూడుండ్రి సర్కారు తమాష ఎట్లున్నదో.. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగ ఎవ్వలు మాట్లాడినా వాళ్లను సోషల్ మీడియా తిట్టుడు అడ్డగోలు మాటలనుడు.. ఇట్ల సర్కారోళ్లే కొంతమందికి జీతాలిచ్చి రాపిస్తున్నరన్న సంగతి జనానికి తెల్సిందేగని.. అయితే ఆడోళ్లను గూడ ఇష్టమొచ్చినట్టు తిట్టుడు మంచిదేనా.?? ఇగో గీమె తెలంగాణ జన సమితి పార్టీ నాయకురాలు ఆమెను ఎట్ల తిట్టిండ్రో సూడుండ్రి..

ఇప్పుడు వెయ్యిరూపాలిస్తె.. పదిరోజులళ్ల.. పద్నాలుగు వందల రూపాలిస్తాంటె.. ఎవ్వలికైనా ఆశ ఉంటదిగదా..? పదిరోజులకే నాల్గువందల రూపాల మిత్తిరావట్టే అని.. అయితె ఇట్ల కోట్ల రూపాలు జమజేశిన ఒక బాబాగాడు జనాన్ని నిండముంచి అవుతల వడ్డడు..మొత్తం మీద నెల్లూరు పోలీసోళ్లు వాన్ని దొర్కిచ్చుకున్నరు.. తెచ్చి మీడియాకు జూపెట్టిండ్రు..

20:20 - April 12, 2018
20:17 - April 12, 2018
20:15 - April 12, 2018
20:07 - April 12, 2018

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ , ఆయన సోదరుడు తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ తో పాటు సోదరుడు అతుల్ సెంగార్ ను కూడా సోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుపై ప్రభుత్వం సిట్ దర్యాప్తు కు ఆదేశించింది. నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కావటంతో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపలేరని ఉన్నావ్ లైంగిక దాడి కేసులో సిబీఐతో విచారణ జరిపించాలని సుంప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న నేరాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈచర్చలో టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిథి ఇందిరా శోభన్, పీవోడబ్ల్యు సంధ్య పాల్గొన్నారు.

కాస్టింగ్ కౌచ్ పై కమిటీ : మా అసోసియేషన్

హైదరాబాద్ : కాస్టింగ్ కౌచ్ పై పరిశ్రమలోని సీనియర్ నటులు, అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా మా అసోసియేషన్ తెలిపింది. శ్రీరెడ్డితో రెండు సినిమాలు చేస్తానని దర్శకుడు తేజ హామీ ఇచ్చారని మా తెలిపింది. కాగా శ్రీరెడ్డిపై 'మా'అసోసియేషన్. నిషేదాన్ని ఎత్తివేసింది. నటి శ్రీరెడ్డి కూడా మా కుటుంబంలో సభ్యురాలేననీ..ఆమెపై మాకు కోపం లేదని పేర్కొంది. ఆమె ఎవరితోనైనా నటించవచ్చనీ, ఆమెతో కూడా ఎవరైనా నటించవచ్చని మా అసోసియేషన్ ప్రకటించింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు మానస్తాపం చెందామని మా అసోసియేషన్ పేర్కొంది.

శ్రీరెడ్డికి సెల్యూట్ చేసిన 'వర్మ'..

హైదరాబాద్ : నటి శ్రీరెడ్డి అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. వందేళ్ల సినిమా చరిత్రలో నటి శ్రీరెడ్డిలా ఎవరూ పోరాటం చేయలేదని కితాబిచ్చారు. ఈ మేరకు వర్మ వరుస ట్వీట్లు చేశారు. గత వందేళ్లో క్యాస్టింగ్ కౌచ్ పై దుర్మార్గాలను ఎవరూ వెలుగులోకి తీసుకురానంతగా శ్రీరెడ్డి తీసుకొచ్చిందని, ఆమె చేస్తున్న పోరాటానికి తన సెల్యూట్ అని ప్రశంసించారు. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి ఆమె తల్లి గర్వపడాలని పేర్కొన్నారు.

నటి శ్రీరెడ్డిపై నిషేదాన్ని ఎత్తివేసిన 'మా'..

హైదరాబాద్ : నటి శ్రీరెడ్డిపై 'మా'అసోసియేషన్. నిషేదాన్ని ఎత్తివేసింది. నటి శ్రీరెడ్డి కూడా మా కుటుంబంలో సభ్యురాలేననీ..ఆమెపై మాకు కోపం లేదని పేర్కొంది. ఆమె ఎవరితోనైనా నటించవచ్చనీ, ఆమెతో కూడా ఎవరైనా నటించవచ్చని మా అసోసియేషన్ ప్రకటించింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు మానస్తాపం చెందామని మా అసోసియేషన్ పేర్కొంది. కాగా గత కొన్ని రోజులుగా నటి శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయంపైనా, తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలు లైంగిక దోపిడీకి గురవుతున్నారనీ అంశాలపై శ్రీరెడ్డి ఆందోళ చేస్తోంది. ఈ క్రమంలో మా అసోసియేష్ కార్యాలయం ముందు తన నిరసనను వ్యక్తం చేసింది.

19:28 - April 12, 2018

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఈసారి ఏకంగా డ్యూయల్ రోల్ లో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేశాడు.. నాని హీరోగా, రెండు హిట్లు ఇచ్చిన.. మెర్లపాక గాంధి డైరక్టర్ గా మంచి రైజింగ్ లో ఉన్న దిల్ రాజు.. రిలీజ్ అనగానే ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్.. మరి ఆ రేంజ్ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన కృష్ణార్జునుడు ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాడు.. వాళ్ల యుద్ధం లో ఎలాంటి సక్సెస్ సాధించాడు ఇప్పుడు చూద్దాం..

 

కథ విషయానికి వస్తే.. ఒక మారుమూల పల్లెటూరిలో ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడివేసే కృష్ణను అతని బిహేవియర్ వల్ల ఏ అమ్మాయి ప్రేమించదు..కాని హైదరాబాద్ నుండి వచ్చిన రియా కృష్ణను ప్రేమిస్తుంది... అలాగే యూరప్ లో రాక్ స్టార్ గా ఉన్న అర్జున్ ప్లే భాయ్.. కాని ఇండియా నుండి వచ్చిన సుబ్బలక్ష్మీని చూసి సిన్సియర్ గా లవ్ చేస్తాడు.. కాని ఆమె అర్జున్ ను రిజక్ట్ చేసి హైదరాబాద్ కి వస్తుంది... ఇక రియాతో కూడా కృష్ట నీకు కరెక్ట్ కాదు అని, ఆమెను బలవంతంగా హైదరాబాద్ కు పంపిస్తాడు వాళ్ళ తాత.. అలా హైదరాబాద్ వచ్చిన రియా, సుబ్బలక్ష్మీ ఇద్దరూ కనపడకుండా పోతారు.. అసలు వాళ్ళు ఏమైయ్యారు... కృష్ణ, అర్జున్ ఇద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారు.. చివరికి రియా,సుబ్బలక్ష్మీలను ఎలా కాపాడుకున్నారు.. లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవలసిందే..

 

నటీనటుల విషయానికి వస్తే.. మినిమమ్ కంటెంట్ ఉన్న సినిమాను కూడా తన నాచ్యూరల్ ఫర్ఫామెన్స్ తో నిలబెట్టేస్తాడు అనే పేరున్న నాని,... ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు.. కెరీర్ లో రెండో సారి డ్యూయల్ రోల్ చేసిన నాని రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ చూపిస్తూ.. ఆ రెండు పాత్రలను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి చాలా హర్డ్ వర్క్ చేశాడు.. అయితే... కృష్ట పాత్రలో కల్లకపటం లేని పల్లెటూరి.. అబ్బాయిగా ఒదిగిపోయి.. ఫుల్ ఫన్ ను జనరేట్ చేసిన నాని.. ప్లేబయ్ తరహా రాక్ స్టార్ గా మాత్రం అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.,. అతనికి ఉన్న నాచ్యూరల్ స్టార్ అనే టాగ్ వల్ల.. రాక్ స్టార్ క్యారక్టర్ లో ఉన్న నెగెటీవ్ టచ్.. అంతగా ఎలివేట్ కాలేదు.. ఇక స్టైలింగ్ కూడా చాలా సాధాసీదాగా అనిపిస్తుంది.. కృష్ట పాత్ర మాత్రం సినిమాను కాపాడే ఎలిమెంట్ గా నిలిచింది.. ఇక ఇప్పటి వరకు పర్ఫామెన్స్, క్యారక్టర్ లో అలరించిన అనుపమా పరమేశ్వరన్ లిమిటెడ్ ప్రజన్స్ ఉన్న రోల్ లో కనిపించింది... మరో హీరోయిన్ రుక్సార్ మీర్ కూడా స్క్రీన్ ప్రజన్స్ పరంగా, పర్ఫామెన్స్ పరంగా.. జస్ట్ ఓకే అనిపిస్తుంది.. ఇక గాంధీ సినిమాలకు కామెడీ బ్యాక్ బోన్ గా మంచి సపోర్ట్ ఇస్తున్న బ్రహ్మాజీ ఈ సినిమాలో కూడా హిల్లేరియస్ కామెడీని జనరేట్ చేసే క్యారక్టర్ పడటంతో, ఆ పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడు.. అతను చేసిన కామెడీ ఫస్ట్ ఆఫ్ కి హైలెట్ అని చెప్పవచ్చు.. ఇక యూట్యూబ్ స్టార్స్ కాస్త ఇంపార్టెట్స్ ఉన్న క్యారక్టర్స్ లో కనిపించి.. పర్వాలేదు అనేలా నవ్వించారు.. ఇక మిగతా నటీనటులు అంతా, పాత్రల పరిది మేరా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారు...

 

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. రైటర్ గా డైరక్టర్ గా మొదటి రెండు సినిమాలతో గ్రాండ్ హిట్స్ అందుకున్న గాంధీ ఈ సినిమాకు కూడా మంచి స్పానూ ఉన్న స్టాండెడ్స్ సెంట్రల్ పాయింట్ ను కథగా ఎంచుకున్నాడు.. కాని మొదటి రెండు సినిమాలలా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడం కాని, టెంపోను మెంటేయిన్ చేయడంలో కాని బాగా తడబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ సినిమాను నాని నిలబెట్టలేసినా... రెండో ఆఫ్ వచ్చేసరికి.. ఊహాజనితమైన కథ. సో సో గా సాగే స్క్రీన్ ప్లేతో సినిమా సైడ్ ట్రాక్ అయిపోయింది.. రచయితగా అక్కడక్కడా మెరిసిన గాంధీ..డైరక్టన్ పరంగా ఓకే అనిపించుకున్నాడు... స్క్రీన్ ప్లే పంరంగా మరింత కసరత్తు చేసి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది,.. ఇక డైరక్టర్స్ కి ఫుల్ సపోర్డ్ ఇచ్చే. వ్యూ ఉన్న కెమేరా మెన్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా విజ్యూవల్స్ పరంగా ఫుల్ క్రెడిట్ ఇవ్వచ్చు.. రెండు క్యారక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపించడంలో, యూరప్ అందాలను కెమేరాలో బంధించడంలో, క్యారక్టర్స్ లోని ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో.. అతను పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ పై కనిపించింది.. ఇక మ్యూజిక్ డైరక్టర్ హిప్ హాప్ తమిళ్ ఈ సినిమాకు కాస్త తమిళ్ టచ్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు.. దృవ సినిమాకు తన మ్యూజిక్ తో మంచి హైప్ తెచ్చిన హిప్ హాప్ తమిళ్ ఈ సినిమా వరకు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు.. పాటలలో తమిళ వాసన, ఆర్ ఆర్ లో రొటీన్ నెస్ కనిపించాయి.. ఆర్ట్స్ డైరక్టర్ సాయి సురేష్.. ఎడిటర్ సత్య తమ క్రాఫ్ట్స్ లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.. నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే.. ఒక క్యారక్టర్ తోనే సినిమాను నిలబెట్టేసే నాని.. ఈ సినిమాలో రెండు క్యారక్టర్స్ చేసినప్పట్టికీ.. పెద్దగా ఇంపాక్ట్ లేని కథ. ఊహాజనితమైన స్క్రీన్ ప్లే ఉండటంలో అక్కడక్కడ చూస్తూ ఉండిపోవలసి వచ్చింది.. తనకు స్కోప్ ఉన్నంతలో బెస్ట్ప్ పర్ఫమెన్స్ ఇచ్చిన నాని ప్రయత్నం.. ఎంత వరకు మైలేజ్ ఇస్తుందో, బాక్సీఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే..

 

 

ప్లస్ పాయింట్స్

కృష్ట క్యారక్టరైజేషన్

కెమెర వర్క్

బ్రహ్మాజీ కామెడి

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

అర్జున్ క్యారక్టర్

మెరుపులు లేని స్క్రీన్ ప్లే

పేలని విలేజ్ కామెడి

 

సింగపూర్ పర్యటను సీఎం చంద్రబాబు..

అమరావతి : హిందూస్థాన్‌ టైమ్స్‌-మింట్‌ ఆసియా లీడర్‌షిప్‌ సమ్మిట్‌-2018లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూర్‌ వెళ్లనుంది. ఈ రోజు రాత్రికి సింగపూర్‌ వెళ్లనున్న సీఎం బృందం 13వ తేదీ సదస్సులో పాల్గొంటుంది. ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార, వాణిజ్య పారిశ్రామిక సంస్థల సీఈవోలతో చంద్రబాబు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రేపు రాత్రి తిరుగు ప్రయాణం కానున్న సీఎం బృందం 14వ తేదీ ఉదయం విశాఖకు చేరుకుంటుంది. అక్కడి నుంచి అమరావతికి రానున్న చంద్రబాబు అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.

ప్రధానిగా వున్న వ్యక్తి దీక్ష చేయటం చరిత్రలో లేదు : బాబు

అమరావతి : ప్రధానిగా ఉన్న వ్యక్తి దీక్ష చేయడం దేశ చరిత్రలో లేదు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయ కారణాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరికొన్ని రాష్ట్రాలను ఇప్పుడు రెచ్చగొడుతున్నారు.. దీని వల్ల వారే నష్టపోతారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతే కేంద్రంలో మోదీ ఆనందపడతారు. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు మోదీ ఆనందపడేలా ప్రవర్తిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

జోరుమీదున్న స్టాక్ మార్కెట్లు..

ముంబై : భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ జోరు కొనసాగించాయి. ఫెడ్ రిజర్వ్ రేట్ల పెంపు సంకేతాలు, రష్యా-అమెరికాల మధ్య నెలకొన్న విభేదాలు తదిరతర కారణాలతో ఈ ఉందయం నీరసంగానే మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అయితే మధ్యాహ్నం నుంచి ఆటో, ఐటీ, టెక్, పవర్ షేర్ల అండతో మార్కెట్లు పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు లాభపడి 34,101కి పెరిగింది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 10,459కి చేరుకుంది.

ఏపీ బంద్ కు కాంగ్రెస్ మద్దతు : రఘువీరా

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం హోదా సాధన సమితి ఈ నెల16న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతున్నట్లు ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ప్రకటించారు. ఈ మేర‌కు విజయవాడలోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. "ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరాటాలు ఉద్ధృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలు ప్రారంభించాయి.

18:09 - April 12, 2018
18:01 - April 12, 2018

విజయవాడ : పార్లమెంట్‌ సమావేశాలు జరుగకుండా కాంగ్రెస్‌పార్టీ కుట్ర చేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ పంచన చేరారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే 2019లో టీడీపీకి పడుతుందంటున్న జీవీఎల్‌ నరసింహారావు చెప్పే మరిన్న వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:58 - April 12, 2018

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో అక్రమార్కులకు అందలం పేరుతో టెన్‌టీవీ ప్రసారం చేసిన కథనాలపై అధికారులు స్పందించారు. ఏడుగురు ఉద్యోగులను తొలగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వీరిలో ఐదుగురు హెల్త్‌ అసిస్టెంట్లు, మరో ఇద్దరు ఆపరేటర్లు ఉన్నారు. తప్పుడు జనన, మరణ ధృవపత్రాలు ఇచ్చిన ఐదుగురు హెల్త్‌ అసిస్టెంట్లు, ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను రాచకొండ పోలీసులు జైలుకు పంపించారు. తమకు వారు జైలుకు విషయం తెలియదంటూ తిరిగి విధుల్లోకి తీసుకున్నారు అధికారులు. ఐదుగురు హెల్త్‌ అసిస్టెంట్లు, ఇద్దరు ఆపరేటర్లు సస్పెండ్‌ అయ్యారు. 

విజయసాయి రెడ్డి వల్లే అగ్రిగోల్డ్ బాధితులు : కుటుంబరావు

అమరావతి : అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో వైసీపీ విమర్శలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ వల్లే జీ-ఎస్సెల్‌ గ్రూపు వెనక్కి పోయిందని ఆరోపించారు. దీనికి పరోక్షంగా విజయసాయిరెడ్డే కారణమన్నారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారం మళ్లీ మొదటికి రావడానికి కారణం వైసీపీయేనని ధ్వజమెత్తారు. సీబీఐ కేసులు పెడతామని వైసీపీ నేతలు జీ-ఎస్సెల్‌ గ్రూపును భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని... వాటిని సరైన సమయంలో బయటపెడతానని చెప్పారు. 18 లక్షల మంది ఖాతాదారుల ఉసురు వైసీపీ పోసుకుంటోందని ఆయన మండిపడ్డారు.

17:50 - April 12, 2018

అమరావతి : అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో వైసీపీ విమర్శలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ వల్లే జీ-ఎస్సెల్‌ గ్రూపు వెనక్కి పోయిందని ఆరోపించారు. దీనికి పరోక్షంగా విజయసాయిరెడ్డే కారణమన్నారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారం మళ్లీ మొదటికి రావడానికి కారణం వైసీపీయేనని ధ్వజమెత్తారు. సీబీఐ కేసులు పెడతామని వైసీపీ నేతలు జీ-ఎస్సెల్‌ గ్రూపును భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని... వాటిని సరైన సమయంలో బయటపెడతానని చెప్పారు. 18 లక్షల మంది ఖాతాదారుల ఉసురు వైసీపీ పోసుకుంటోందని ఆయన మండిపడ్డారు.

17:48 - April 12, 2018

హైదరాబాద్‌ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం హోదా సాధన సమితి ఈనెల 16న నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. వామపక్షాల నాయకులు మధు, రామకృష్ణ తదితరులు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లో భేటీ అయ్యారు. సంస్థాపరమైన అంశాలపై చర్చించారు. ఈనెల 16న ఏపీ బంద్‌ నేపథ్యంలో 15న అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన జనసేన, వామపక్షాల ర్యాలీని వాయిదా వేశారు. ఈనెల 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో నిర్వహించాల్సిన బహిరంగ సభలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని వామపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. 

17:45 - April 12, 2018

అమరావతి : సాంకేతిక కారణాల పేరుతో ఏపీకి ప్రత్యేక హోదాను తిరస్కరిస్తే సహించేదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. హోదా రాజకీయ నిర్ణయంతో ఇచ్చే అంశమన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌లో పోలీసు టెక్నికల్‌ టవర్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. 

వడగళ్ల వాన బీభత్సం..

జనగామ: బచ్చన్నపేట మండలంలో వడగళ్ల వాన కురిసింది. మండలంలోని సాల్వాపూర్, మన్సాన్‌పల్లి, లింగంపల్లిలో కురిసిన వడగళ్ల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. అకాల వర్షం పంటలను నాశనం చేయడంతో రైతులు వాపోతున్నారు. 

మాజీ ప్రధానితో భేటీ కానున్న కేసీఆర్..

హైదరాబాద్: సీఎం కేసీఆర్ రేపు బెంగళూరు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 9.45 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగలూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవగౌడతో సీఎం సమావేశం కానున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంతో కేసీఆర్‌ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో కేసీఆర్‌ సమావేశమవుతున్నారు.

రేపు టీ.ఇంటర్మీడియట్ ఫలితాలు..

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి గత నెలలో నిర్వహించిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఈ రోజు ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యాలయంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేస్తారని అందులో పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలను న్యూస్‌ పేపర్లలోనూ ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.

17:33 - April 12, 2018

డిఫెరెంట్ సినిమాలు తెరకెక్కించడం లో బాలీవుడ్ ఎప్పుడు ముందే ఉంటుంది.  వైవిధ్యమైన సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాలీవుడ్ లో ఎక్కువే.  ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తున్న ఒక ఇంటరెస్టింగ్ సినిమాలో పర్ఫెక్ట్ హీరోయిన్ ని ఫిక్స్ చేసారు..  ఎవరా హీరోయిన్.. ఏంటా.. సినిమా. బాలీవుడ్ లో పెర్ఫార్మన్స్ రోల్స్ తో పాటు కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న హీరోయిన్ అలియా భట్. తన అందం తో అభినయం తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది.  “బద్రీనాథ్ క దుల్హనియా” సినిమా లో ఎనర్జిటిక్ యాక్టింగ్ ని ప్రెసెంట్ చేసిన అలియా బట్ ఆ తరువాత సినిమాల్లో కూడా మంచి రోల్స్ తో మెప్పించింది. రెండు ప్రాంతాల మధ్య సాగే ప్రేమకథగా వచ్చిన “టు స్టేట్స్” సినిమా అలియా బట్ లో క్యూట్ యాక్టింగ్ ని స్క్రీన్ మీద చూపించింది.  అలియా భట్ కెరీర్ లో రియాలిటీ కి దగ్గరగా ఉన్న రోల్ చేసింది ఉడ్తా పంజాబ్ సినిమాలో అనే చెప్పవొచ్చు. పంజాబ్ లో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా గురించి చెప్పిన ఈ సినిమాలో అలియా రోల్ ఆడియన్స్ ని కంటతడి పెట్టిస్తుంది .అలియా మరో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ లో కనిపించింది.  అదే 1971 లో ఇండో పాక్ వార్ నేపధ్యంలో రిలీజ్ కాబోతోన్న చిత్రం "రాజి స్పై" గా అలియా భట్ ఇంత వరకు ఇలాంటి ప్రయోగాత్మకమైన పాత్ర చేయలేదు. గ్లామర్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసిన ఆమెకు ఈ క్యారెక్టర్ పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి.

17:18 - April 12, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా మరో అడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బెంగలూరుకు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవగౌడతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

విద్యాశాఖలో పోస్టుల భర్తీ..

హైదరాబాద్ : ఉన్నత విద్యాశాఖలో 1384 ఖాళీలను భర్తీ చేసేందుకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 115 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 15 ప్రిన్సిపల్ పోస్టులు, డీఎల్ 1214, ఫిజికల్ డైరోక్టర్స్ 67, లైబ్రేరియన్ 64, అడ్మినిస్ట్రేషన్ సర్వీసు 24 భర్తీలకు విద్యాశాఖ అనుమతులను జారీ చేసింది. 

17:17 - April 12, 2018

ఢిల్లీ : దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నిరసిస్తూ ఢిల్లీలో మహిళా లోకం కదం తొక్కింది. ఐద్వాతోపాటు పలు మహిళా సంఘాలు పార్లమెంటు స్ట్రీట్‌లో ధర్నా నిర్వహించాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో విఫలమైన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

17:16 - April 12, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రరూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16న ఏపీ బంద్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు పిలుపునిచ్చాయి. విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించిన నేతలు పార్లమెంట్‌లో మోదీ తీరుకు నిరసనగా బంద్‌ చేపడుతున్నట్లు తెలిపారు. బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నేతలు సూచిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

16:51 - April 12, 2018

హైదరాబాద్ : గత కొన్నిరోజులుగా సినీనటి శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాలకు హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీలపై నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరిచింది. అనంతరం తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాఖలకు హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. నాలుగు వారాలలో సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాఖలకు ఆదేశించింది. కాగా గత కొంత కాలంగా నటి శ్రీరెడ్డి తనకు అన్యాయం జరిగిందనీ, తనపై వివక్ష చూపుతున్నారనీ..తనకు మా అసోసియేషణ్ సభ్యత్వం కూడా ఇవ్వటంలేదనీ శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

16:27 - April 12, 2018

ప్రకాశం : ఒంగోలులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. స్థానిక మంగమూరు రోడ్డులోని కొత్తడొంకలో గుడిమెట్ల 8 ఏళ్ల నవదీప్, కట్టామణి, 9ఏళ్ల సింధే ప్రేమచంద్, మరియు సింధే ప్రేమ్ జ్యోతి మృతి చెందారు. పాఠశాలకు వెళ్లి తిరిగి తిరిగి ఇంటికి వచ్చి కలిసి ఆడుకుంటున్న సమయంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి వీరిపై పడింది. ఈ ప్రమాదంలో నవదీప్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మణి, ప్రేమ్ చంద్ ప్రాణాలు విడిచారు. ప్రేమ్ జ్యోతికి మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

16:25 - April 12, 2018

హైదరాబాద్ : గత కొన్నిరోజులుగా సినీనటి శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాలకు హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీలపై నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరిచింది. అనంతరం తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాఖలకు హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. నాలుగు వారాలలో సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాఖలకు ఆదేశించింది. కాగా గత కొంత కాలంగా నటి శ్రీరెడ్డి తనకు అన్యాయం జరిగిందనీ, తనపై వివక్ష చూపుతున్నారనీ..తనకు మా అసోసియేషణ్ సభ్యత్వం కూడా ఇవ్వటంలేదనీ శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

15:57 - April 12, 2018

హైదరాబాద్ : సీపీఎం అఖిల భారత 22వ మహాసభలు ఈనెల 18 నుంచి హైదరాబాద్‌లో జరుగనున్నాయి. మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో ఆ పార్టీ కార్యకర్తలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మహాసభలు జరిగే ప్రధాన వేదికైన ఆర్టీసీ కల్యాణ మండపాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. సీపీఎం మహాసభల ఏర్పాట్లపై మరిన్ని వివరాలను చూద్దాం..

15:54 - April 12, 2018

హైదరాబాద్ : సీపీఎం దివంగతనేత మాకినేని బసవపున్నయ్య గొప్ప కమ్యూనిష్టు ఉద్యమనేతని సీపీఎం నేతలు కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. హైదరాబాద్‌లోకి మాకినేని బసవపున్నయ్య భవన్‌లో ఆయన జయంతి సందర్భంగా సీపీఎం నేతలు నివాళులు అర్పించారు. ఎన్నో రైతంగా ఉద్యమాలు విజయవంతం కావడం ఎనుక మాకినేని బసవపున్నయ్య కృషి ఉందన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.

15:51 - April 12, 2018

హైదరాబాద్ : నగరం నడిబొడ్డున కాప్రాలో వెయ్యి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కనుసన్నల్లో మెదిలే పెద్దలే ఈ భూమిని కబ్జా చేశారని రేవంత్‌ చెప్పారు. దీని వెనుక పాలకులు హస్తముందని, ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. 

15:48 - April 12, 2018

విజయవాడ : ఏటీఎమ్‌లలో డబ్బులు లేక విజయవాడ నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల నుండి ఏటీఎమ్‌లలో డబ్బులు లేకపోవడంతో నిత్యం నరకం చూస్తున్నారు. ఖాతాదారుడి బ్యాంకు ఏటీఎమ్‌లలో డబ్బులు లేక వేరే ఏటీఎమ్‌లలో డబ్బు డ్రా చేస్తే 25 రూపాలయలు కోత విధిస్తున్నారు. దీంతో ఏటీఎమ్‌ల చుట్టూ తిరగలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయవాడలో నగదు కష్టాలపై ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం..

నటి శ్రీరెడ్డి వ్యవహారంపై హెచ్ఆర్ సీ రెస్పాన్స్..

హైదరాబాద్ : టాలీవుడ్ లో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డికి ఊహించని మద్దతు లభించింది. ఆమెకు మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలిచింది. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిని అడ్డుకోవడం ముమ్మాటికీ ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది. మరో విషయం ఏమిటంటే... కేంద్ర మానవ హక్కుల కమిషన్ ను శ్రీరెడ్డి ఆశ్రయించకపోయినప్పటికీ...

ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల..

తూర్పుగోదావరి : ఇంటర్ పరీక్షా ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ రావు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా మొదటిస్థానంలో వుండగా..కడప జిల్లా ఆఖరిలో వుంది. కృష్ణా 84, 77 శాతం ఉత్తీర్ణత సాధించి నెల్లూరు రెండు స్థానంలో నిలవగా..కడప59 శాతం సాధించి చివరిలో నిలిచిందని మంత్రి గంటా తెలిపారు. 

మోదీ చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పాలి : చంద్రబాబు

అమరావతి : ప్రధాని మోదీ ఏపీకి చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పాలని అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగు జాతి మొత్తం రగిలిపోయే పరిస్థితి వచ్చిందని ప్రధాని మోదీకి స్పష్టంగా చెబుతున్నానని చంద్రబాబు అన్నారు. బ్రిటీష్ వారికి కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఎవరైనా అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు నష్టపోతారని అన్నారు.కేంద్ర ప్రభుత్వానిది దుర్మార్గమైన చర్య అని, ఏపీ డబ్బు పంపామని చెబుతున్నారని, ఇతర రాష్ట్రాలకు ఎంతిచ్చారు? మాకెంతిచ్చారు? అని ప్రశ్నించారు. 

గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి..

ప్రకాశం : ఒంగోలు బైపాస్ రోడ్డులో నిర్మాణంలో వున్న గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులు నవదీప్, మణి, ప్రేమచంద్ లుగా గుర్తించారు. 

పోలీస్ టెక్ టవర్ ను ప్రారంభించిన చంద్రబాబు..

అమరావతి : ఏపీ పోలీస్ టెక్ టవర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.18 కోట్లతో మంగళగిరి డీజీపీ ఆఫీస్ లో పోలీసు టెక్ టవర్ ను చంద్రబాబు ప్రారంభించారు. 

13:34 - April 12, 2018

న్యూఢిల్లీ : ఏపీ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఘోరంగా అమలు చేస్తున్నారని సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు, దళిత్ శోషణ్ మంచ్ కన్వీనర్ వి.శ్రీనివాస్ రావు విమర్శించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో చట్టం ఘోరంగా అమలవుతోందని, 2017లో 785 కేసులు కొట్టిపడేశారని, 49 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయన్నారు. ఇంకా 5వేల కేసులు పెండింగ్ లో ఉండడడం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మొత్తంగా కేసులు నత్తనడకన సాగుతున్నాయని, మానిటరింగ్ కమిటీ ఆరు నెలలకొకసారి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుందని కానీ అలాంటిది ఏమీ చేయలేదన్నారు. ఏప్రిల్ 2వ తేదీ అనంతరం పలువురు దళిత యువకులను అరెస్టులు చేస్తున్నారని, ఉమ్మడి జాతీయ ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక తెలంగాణలో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ 14వ తేదీన రాజ్యాంగ పరిరక్షణ దినంగా పరిగణిస్తామన్నారు. 

ఇండియా ఖాతాలో మరో గోల్డ్...

ఢిల్లీ : కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీైస్టెల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన రాహుల్ ఆవారె స్వర్ణ పతకం గెలిచాడు. ఫైనల్లో కెనడాకు చెందిన స్టీవెన్ తకహషిపై 15-7 తేడాతో గెలిచాడు రాహుల్. 

జగన్ విరామం...

గుంటూరు : పాదయాత్రకు జగన్ స్వల్ప విరామం ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరారు. శుక్రవారం సీబీఐ కోర్టు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో, ముందుగానే ఆయన హైదరాబాదుకు పయనమయ్యారు. 

12:49 - April 12, 2018
12:30 - April 12, 2018

జనసేనానీతో వామపక్ష నేతలు...

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సీపీఎం, సీపీఐ నేతలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోద..ఇతర అంశాలపై ఎలాంటి వ్యూహం అనుసరించాలి..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన దానిపై చర్చిస్తున్నారు. 

12:27 - April 12, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టిడిపి వ్యూహాలు రచిస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ధీటుగా సమాధానం ఇవ్వాలని..ఇందుకు జనాల్లోకి వెళ్లాలని టిడిపి యోచిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు.., వ్యూహ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి, అఖిల ప్రియ, కొల్లు రవీంద్ర, వీవీవీ చౌరది, టిడి జనార్ధన్, కుటుంబరావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. 16 నుండి నియోజకవర్గాల్లో చేపట్టే సైకిల్ యాత్రలు, బహిరంగసభలు, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. 20, 30 తేదీల్లో రెండు టిడిపి భారీ బహిరంగసభలు...ఏప్రిల్ 20వ తేదీన బాబు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం - దళిత తేజం ముగింపు బహిరంగసభ...30న తిరుపతికి వేదికగా టిడిపి బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 

భవిష్యత్ కార్యాచరణపై బాబు చర్చలు...

విజయవాడ : సీఎం నివాసంలో మంత్రులు వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి, అఖిల ప్రియ, కొల్లు రవీంద్ర, వీవీవీ చౌరది, టిడి జనార్ధన్, కుటుంబరావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. 16 నుండి నియోజకవర్గాల్లో చేపట్టే సైకిల్ యాత్రలు, బహిరంగసభలు, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. 20, 30 తేదీల్లో రెండు టిడిపి భారీ బహిరంగసభలు...20న దళిత తేజం ముగింపు బహిరంగసభ...30న తిరుపతికి వేదికగా టిడిపి బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 

ప్రశ్నించడానికి వచ్చిన సీపీఐ నేతలపై దాడి...

విశాఖపట్టణం : ఎంపీ హరిబాబును ప్రశ్నించేందుకు వచ్చిన సీపీఐ నేతలపై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీనితో జీవీఎంసీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

11:51 - April 12, 2018

విశాఖపట్టణం : ఒకవైపు బీజేపీ ఉపవాస దీక్షలు..మరోవైపు ప్రత్యేక హోదా సాధన సమితి నిరసన దీక్షలతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. పార్లమెంట్ లో విపక్షాలు అనుసరించిన వైఖరిని నిరిసిస్తూ బీజేపీ ఉపవాస దీక్షలు చేపట్టగా..దీక్షలు చేపట్టే అర్హత బీజేపీకి లేదంటూ హోద సాధన సమితి నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. విశాఖలోనీ జీవీఎంసీ వద్ద ఎంపీ హరిబాబు ఉపవాస దీక్ష చేపట్టారు. అసలు రాష్ట్రానికి ఏం చేశారని దీక్షలు చేపడుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. హోదా ఇవ్వకుండా...పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా చేసిన బీజేపీ ఇప్పుడు ఉపవాస దీక్షలు అంటూ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని సీపీఐ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఎంపీ హరిబాబును ప్రశ్నించేందుకు భారీగా సీపీఐ నేతలు అక్కడకు చేరుకున్నారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీ సంఖ్యలో ఉన్న బీజేపీ నేతలు సీపీఐ నేతలపై కలియపడ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ..చెప్పులు విసిరారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆందోళన..నిరసన తెలియచేస్తున్న సీపీఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

11:30 - April 12, 2018

ప్రకాశం : ప్రత్యేక హోదా కోరుతూ సీపీఎం నేతలు చేపట్టిన ప్రదర్శనపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీపీఎం నేతలపై దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు అనుసరించిన వైఖరిని నిరసిస్తూ బీజేపీ దేశ వ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. అందులో భాగంగా భీమవరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రకాశం చౌక్ లో ఉపవాస దీక్ష చేపట్టారు. బీజేపీ చేపట్టిన ఉపవాస దీక్షను నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి నిరసన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతోంది. ఈ దీక్షల్లో వామపక్ష నేతలు, ఇతర ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. అందులో భాగంగా సీపీఎం నిరసన దీక్ష పేరిట ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ ప్రకాశం చౌక్ గుండా సాగుతోంది. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడనే ఉన్న బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. సీపీఎం నేతలపై కాషాయ మూకలు భౌతిక దాడికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. సీపీఎం నేతలపై జరిగిన దాడిని పార్టీ ఖండించింది. 

భీమవరంలో ఉద్రిక్తత...

ప్రకాశం : భీమరంలోని ప్రకాశం చౌక్ లో బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా కోరుతూ సీపీఎం ప్రకాశం చౌక్ గుండా ర్యాలీ చేపట్టారు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తట్టుకోలేని బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారు. 

11:16 - April 12, 2018

విజయవాడ : దేశ వ్యాప్తంగా బీజేపీ ఉపవాస దీక్షలు చేపట్టింది. దీనికి ప్రతిగా ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన సమితి దీక్షలు చేపడుతోంది. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు చేసిన వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఒక రోజు ఉపవాస దీక్షలు చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా దీక్ష చేస్తున్నారు. కర్నాటకలోని హుబ్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా, విజయవాడలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, విశాఖలో ఎంపీ హరిబాబు, భీమవరంలో ఎంపీ గోకరాజులు దీక్ష చేస్తున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ సమావేశాలు జరగనందున 23 రోజుల జీతాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు దీక్షల్లో పాల్గొంటున్నారు. వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాల నేతలు లెనిన్ సెంటర్ లో దీక్షల్లో పాల్గొన్నారు. హోదా ఇస్తామని మాటలు చెప్పి మోసం చేసిందని నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

11:09 - April 12, 2018

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కావేరి సెగ తగిలింది. తమిళనాడు రాష్ట్రమంతటా కావేరి సెగలు కక్కుతున్నాయి. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఓ రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం ప్రధాన మంత్రి మోడీ చెన్నైకి చేరుకున్నారు. ఈయన పర్యటనను నిరసిస్తూ తమిళనాడు సంఘాల ప్రతినిధులు నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. 'మోడీ గో బ్యాక్'అంటూ నినాదాలు చేశారు. మోడీ ప్రయాణించే కాన్వాయ్ మొత్తం నల్లజెండాలు ప్రదర్శించారు. ఇదిలా ఉంటే కావేరీ బోర్డును ఏర్పాటు చేసే నేపథ్యంలో కేంద్రం వైఖరి..మోడీ పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. ఇదిలా ఉంటే బుధవారం ఓ యువకుడు ట్రైన్ పైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకోవడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

కావేరీ బోర్డు ఏర్పాటుకై యువకుడు ఆత్మహత్య...

చెన్నై : కావేరి బోర్డు ఏర్పాటు చేయాలంటూ..మోడీ పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

కూలిన తాజ్ మహల్ మినార్...

ఉత్తర్ ప్రదేశ్ : గత రాత్రి ఆగ్రాలో కురిసిన భారీ వర్షానికి ప్రముఖ పర్యాటక క్షేత్రం తాజ్ మహల్ లో ఓ మినార్ కుప్పకూలింది. తాజ్ మహల్ ప్రవేశ ద్వారానికి ఈ పిల్లర్ కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. 

వామపక్ష నేతలతో జనసేనానీ భేటీ...

హైదరాబాద్ : కాసేపట్లో జనసేన కార్యాలయంలో వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అనంతపురం, ఒంగోలు, శ్రీకాకుళం సభలు నిర్వహించడంపై..భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. 

10:16 - April 12, 2018

జగన్ 135వ రోజు...

గుంటూరు: ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ 135వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా కొనసాగనుంది.

హామీలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్ విఫలం - తమ్మినేని...

కరీంనగర్ : సీపీఎం జాతీయ మహాసభలకు పెద్ద ఎత్తున ప్రజలను సమాయత్తం చేస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నాలుగేళ్ల పాలనలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని తెలిపారు. జీఎస్టీ, కొత్త నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోయిందన్నారు. దేశంలో మతోన్మాద చర్యలు అమలవుతున్నాయని, దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. 

చెన్నైలో మోడీ...

చెన్నై : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్, సీఎంలు మోడీకి స్వాగతం పలికారు. మరోవైపు కావేరి బోర్డు యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్న నిరసన కారులు మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. 

09:32 - April 12, 2018

ఢిల్లీ : సిరియాలో జరిగిన రసాయినక దాడిపై అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలు అమీ తుమీకి సిద్ధమయ్యాయి. సిరియాపై సైనిక చర్య తీసుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది మరోవైపు సిరియాపై మిలటరీ చర్యకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా హెచ్చరించింది. సిరియాలో జరిగిన రసాయనిక దాడిలో 5 వందల మంది అస్వస్థతకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సిరియాలోని గౌటా ప్రాంతంలోని డౌమా పట్టణంలో తిరుగుబాటుదారులే లక్ష్యంగా జరిగిన రసాయనిక దాడిలో వందలాది మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 500 మందికి పైగా పేషంట్లలో రసాయనిక దాడి లక్షణాలు కనిపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. రసాయినిక దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతించాలని డిమాండ్ చేసింది. గత శనివారం డమస్కస్‌ సమీపంలోని డౌమా పట్టణంలో జరిగిన రసాయినిక దాడిలో 70 మంది ప్రజలు మృతి చెందారు. చాలా మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.

ఈ దాడిలో నర్వ్‌ గ్యాస్‌ను వినియోగించారని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన రిపోర్టులో పేర్కొంది. ఈ రసాయనిక వాయువు వల్ల ప్రజలు ఊపిరి తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపింది. కెమికల్‌ ప్రభావంతో చర్మం నీలిరంగులోకి మారిపోవడం, నోటి నుంచి నురగలు రావడం తదితర లక్షణాలు కనిపించాయి. ఈ దాడి జరగగానే ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారని... ఆసుపత్రుల్లో పేషంట్లుగా చేరారని వాషింగ్టన్‌ పోస్ట్ పేర్కొంది. ఈ రసాయన పదార్ధం క్లోరిన్‌ కన్నా తీవ్రమైనదని మెడికల్‌ వర్కర్ మెుహమ్మద్‌ మర్‌హూమ్‌ వాషింగ్టన్‌ పోస్టుకు తెలిపారు.

సిరియాలోని బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వమే కెమికల్‌ దాడులకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను సిరియా ప్రభుత్వం ఖండించింది. తమకు రసాయన పదార్థాలు వినియోగించాల్సిన అవసరం లేదని సిరియా ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ సనా ప్రకటించింది. రసాయిన దాడి పట్ల రష్యా, అమెరికా దేశాలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. సిరియా ప్రభుత్వమే ప్రజలపై రసాయినిక దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపిస్తోంది. మిత్ర దేశాలు ఫ్రాన్స్‌, బ్రిటన్‌తో కలిసి సైనిక చర్య చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. సిరియాపై సైనిక చర్య చేపడితే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా అమెరికాను హెచ్చరించింది. సిరియా అంతర్యుద్ధంలో అమాయక ప్రజలు, పిల్లలు సమిధలవుతున్నారు. 

కాసేపట్లో చెన్నైకి మోడీ...నిరసనలు...

చెన్నై : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో చెన్నైకి చేరుకోనున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మోడీతో ప్రియాంక చోప్రా...

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సినీ నటీ ప్రియాంక చోప్రా కలిశారు. ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానపత్రాన్ని అందచేశారు. 

09:18 - April 12, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీలు..పలు ప్రజా సంఘాలు ఆందోళనలు..నిరసనలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు పోరాటాలను మరింత ఉధృతం చేస్తున్నాయి. పార్లమెంట్ లో విపక్షాలు అనుసరించిన వైఖరిని నిరసిస్తూ ప్రధాన మంత్రి మోడీ ఉపవాస దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. బీజేపీ దీక్షలను నిరసిస్తూ హోదా సాధన సమితి దీక్షలు చేపట్టనున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట మార్చిన బీజేపీపై వారు మండిపడుతున్నారు. సమితి చేపట్టే దీక్షల్లో సీపీఎం, సీపీఐ, రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ప్రజా సంఘాలు పాల్గొననున్నాయి. 

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యలో విజయవాడలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. మోదీ దీక్షలకు నిరసనగా గురువారం విజయవాడలో దీక్ష చేపట్టాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఈనెల 16న సాయంత్రం 7 నుంచి 7.30 గంటల వరకు లైట్లు ఆపివేసి చీకటి దినం పాటిస్తారు. హోదా ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేక్రమంలో ఈనెల 17న అన్ని మండల కేంద్రాల్లో కేంద్రంపై అవిశ్వాసం ప్రకటిస్తూ ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 20న రాజమండ్రిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. 

09:16 - April 12, 2018

ప్రత్యేక హోదా సాధన సమితి దీక్షలు...

విజయవాడ : ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్షలు జరుగనున్నాయి. పార్లమెంట్ లో విపక్షాలు అనుసరించిన వైఖరిని నిరసిస్తూ ప్రధాన మంత్రి మోడీ ఉపవాస దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. బీజేపీ దీక్షలను నిరసిస్తూ హోదా సాధన సమితి దీక్షలు చేపట్టనున్నాయి. 

నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు...

విజయవాడ : మధ్యాహ్నం 3గంటలకు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాజమండ్రిలో ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. 

బీజేపీ ఉప వాస దీక్షలు...

ఢిల్లీ : బీజేపీ నేతలు ఉప వాస దీక్షలు చేపట్టనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఉపవాస దీక్షలో పాల్గొననున్నారు. చెన్నైలో పర్యటిస్తూనే ఉపవాస దీక్ష చేయనున్నారు. హైదరాబాద్ లో ఎంపీ బండారు దత్తాత్రేయ దీక్ష చేయనున్నారు. 

 

07:32 - April 12, 2018

పార్లమెంట్ లో విపక్షాలు వైఖరిని నిరసిస్తూ ప్రధాన మంత్రి ఒక రోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. ఆయనతో పాటు బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా ఈ దీక్షలో పాల్గొననున్నారు. బీజేపీ చేపడుతున్న ఈ దీక్షలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ లో కేంద్రం సరియైన విధంగా వ్యవహరించలేదని, కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా చేసిందని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నంద్యాల నర్సింహ రెడ్డి (సీపీఎం), కిశాంక్ (కాంగ్రెస్), ఆచారి (బిజెపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

ఏపీలో ఉప రాష్ట్రపతి పర్యటన...

విశాఖపట్నం: నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖీ నిర్వహించనున్నారు. 

06:42 - April 12, 2018

తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. వెంటనే పీఆర్సీ ఏర్పాటు చేయాలని, బకాయిపడ్డ డీఏలను చెల్లించాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్‌స్కీమ్‌ నుంచి వైదొలిగేందుకు నిర్ణయం ప్రకటించాలని వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ అని చెప్పుకునే ప్రభుత్వం... తాము లేవనెత్తుతున్న సమస్యలపై మెతకవైఖరి ప్రదర్శించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలపై టెన్ టివి జనపథంలో యూటీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:40 - April 12, 2018

హైదరాబాద్ : సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌ జట్టు హోంగ్రౌండ్‌లో మరో సమరానికి సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 11వ సీజన్‌లో మూడు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో పోటీకి మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సై అంటోంది. కేన్‌ విలియమ్‌సన్‌ సారధ్యంలోని సన్‌రైజర్స్‌ టీమ్‌తో రోహిత్‌ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్...ఉప్పల్‌ రాజీవ్‌ గాందీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో కీలక పోటీకి సన్నద్ధమయ్యాయి. హోంగ్రౌండ్‌ ఉప్పల్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టిన హైదరాబాద్‌ టీమ్ సెకండ్‌ లీగ్‌ మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రాణించాలని పట్టుదలతో ఉంది. శిఖర్‌ ధావన్‌, కేన్‌ విలియమ్‌సన్‌, మనీష్ పాండే వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు యూసఫ్‌ పఠాన్‌, సకీబ్‌ అల్‌ హసన్‌,దీపక్‌ హుడా వంటి హార్డ్‌ హిట్టర్లతో బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌ బలంగా ఉంది. స్వింగ్ కింగ్‌ భువనేశ్వర్‌ కుమార్‌, మ్యాజిక్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ వంటి మేటి బౌలర్లతో బౌలింగ్‌లోనూ పదునుగా ఉంది.తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చిత్తు చేసిన సన్‌రైజర్స్‌ ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది.

మరోవైపు మూడు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్ జట్టు తొలి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ ఇచ్చిన షాక్‌తో ముంబై జట్టు ఢీలా పడింది. రోహిత్‌ శర్మ, ఇసాన్‌ కిషన్‌, కీరన్ పోలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, జస్ప్రీత్‌ బుమ్రా వంటి స్టార్‌ క్రికెటర్లతో పటిష్టంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే సన్‌రైజర్స్‌ను ఓడించడం పెద్ద సవాలేమీ కాదు. హోంగ్రౌండ్‌ ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తుందో లేదో చూడాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

06:37 - April 12, 2018

నల్గొండ : జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దామరచర్ల మండలం తాళ్ల వీరప్పగూడెంలో రైల్వేట్రాక్‌ క్రాస్‌ చేస్తుండగా విద్యుత్‌ వైర్లు తగిలి వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గడ్డితో సహా ట్రాక్టర్‌ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరో నలుగురు ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికులు మంటలను ఆర్పి డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

06:36 - April 12, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నగదు కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఏ ఏటీఎం వద్ద చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకులకు వెళ్లినా... నగదు లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు వినియోగదారులు. హైదరాబాద్ మహా నగరంలో ఎంటీఎం కేంద్రాలకు నిర్వచనం మారిపోతుంది. ఏనీటైమ్ నో మనీ కేంద్రాలుగా మారాయి. నగరవాసులు కరెన్సీ కరవుతో అల్లాడుతున్నారు. ఏటీఎంల చుట్టూ గంటల తరబడి తిరిగినా క్యాష్‌ మాత్రం దొరకడం లేదని వాపోతున్నారు. ఓవైపు బ్యాంకులలో క్యాష్‌ లేక.. మరోవైపు ఏటీఎంలలో డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత నగరంలో చాలా ఏటీఎంలు మూతపడ్డాయి. కస్టమర్ల నుండి డిపాజిట్లు తగ్గడంతో బ్యాంకులకు సరిపడ నగదు అందుబాటులో ఉండడం లేదు. గతంలో ఉద్యోగులు తమ జీతంలో కొంత మొత్తాన్ని మాత్రమే డ్రా చేసుకునే వారు... కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది, ఒకేసారి జీతమంతా డ్రా చేసుకోవడంతో.. ఏటీఎంలలో పెట్టిన క్యాష్‌ క్షణాల్లోనే ఖాళీ అవుతోంది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత తీవ్రంగా ఉందంటున్నారు బ్యాంక్‌ అధికారులు. ఈ ఏడాది జనవరిలో నగదు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆర్బీఐ నుండి 2 వేల నోట్ల సరఫరా సెప్టెంబర్‌ నుండి ఆగిపోయిందని... కస్టమర్ల నుండి డిపాజిట్ల రూపంలో కరెన్సీ రాలేదంటున్నారు. నగదు కొరత నేపథ్యంలో ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చేందుకు బ్యాంక్‌ అధికారులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. గత 2, 3 నెలలుగా కేరళ, మహారాష్ట్రల నుండి తెలంగాణ బ్యాంకులు నగదు తెచ్చుకుంటున్నాయి. ఆర్బీఐ అనుమతితో మహారాష్ట్ర, తిరువనంతపురం నుంచి నగదు తీసుకువచ్చి ఏటీఎంలలో క్యాష్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జనవరి, ఫిబ్రవరిలో పక్క రాష్ట్రాల నుంచి నగదును తీసుకువచ్చిన బ్యాంక్‌ అధికారులు... తాజాగా మళ్లీ నగదు తీసుకురాలేదు. దీంతో తిరిగి నగదు కష్టాలు మొదలయ్యాయి.

నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులు పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించినా.. ఆర్బీఐ నుంచి తగినంత నగదు సరఫరా లేకపోవడంతో ఏటీఎం కేంద్రాల ముందు నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంకులకు తగినంత నగదు అందించి కరెన్సీ కష్టాలు తీర్చాలని సామాన్యులు కోరుతున్నారు. 

06:34 - April 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితికి బాలారిష్టాలు తప్పడం లేదు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించి... ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ అడుగడుగున అవాంతరాలు ఎదుర్కొంటున్న టీ-జేఏసీ... ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరించినా అవే కష్టాలను ఎదుర్కొంటోంది. పార్టీ ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో టీజేఎస్‌ వర్గాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మొన్న కొలువుల కొట్లాట సభ... నిన్న మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభ. నేడు టీజేఎస్‌ ఆవిర్భావ సభ.. పేరు ఏదైనా ప్రతి సభకు ప్రభుత్వం నుంచి అనుమతి మాత్రం రావడం లేదు. ప్రజాస్వామ్యంలో సభలు పెట్టుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కానీ... తెలంగాణలో ప్రభుత్వ తీరు మరోలా ఉంది. సినీ నటుల సినిమా ప్రమోషన్లకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుమతిస్తున్న ప్రభుత్వం... కొత్తగా ఏర్పడిన తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభకు మాత్రం అనేక సాకులు చెబుతూ అనుమతి నిరాకరించారు. దీంతో అనుమతి కోసం టీజేఎస్‌ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే... టీ-జేఏసీ నేతలు కోర్టులకు వెళ్లడం.. అనుమతులు తెచ్చుకోవడం కొత్తేమీ కాదు... కానీ... పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

కొన్ని నెలల క్రితం నిరుద్యోగుల సమస్యపై 'కొలువుల కొట్లాట' పేరుతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కానీ.. అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. అయితే... జిల్లాల నుంచి తరలి వస్తున్న వారిని అడ్డుకుని సభకు నిరుద్యోగులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిలిచిన ట్యాంక్‌బండ్‌ మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభ పేరుతో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు సభ ఏర్పాటు చేయగా... ట్రాఫిక్‌ సమస్య పేరుతో సభకు అనుమతి నిరాకరించి.. నాయకులను ముందస్తు అరెస్టులు చేసి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది.

తెలంగాణ ఉద్యమం కోసం కీలకపాత్ర పోషించిన టీ-జేఏసీ అనంతరం తెలంగాణ జన సమితి పేరుతో పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌లో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో సభ కోసం నేతలు దరఖాస్తు చేసుకోగా... క్రీడామైదానం కాబట్టి అనుమతివ్వడం కుదరదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తేల్చిచెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే ట్రాఫిక్‌, వాతావరణ సమస్యలు తలెత్తుతాయని పోలీసులు సాకులు చెబుతున్నారు. దీంతో టీజేఎస్‌ నేతలు కోర్టు మెట్లు ఎక్కారు. ఇటీవల ఎల్బీ స్టేడియంలో ఓ సినిమాకు ప్రమోషన్‌ కోసం అనుమతిస్తే జరగని పొల్యూషన్‌.. తాము సభ నిర్వహిస్తే జరుగుతుందా అని టీజేఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమకు ఇష్టంలేనివారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. సభలు, మీటింగ్‌లు పెట్టుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని... ఆ హక్కునే కేసీఆర్‌ కాలరాస్తున్నారని మండిపడ్డారు. అయితే.. సభకు అనుమతి వస్తుందా ? లేదా ? అనేది తెలియాలంటే మరో కొన్ని రోజులు ఎదురుచూడాలి. తెలంగాణ ఉద్యమం కోసం ఆంధ్రా పాలకుల హయాంలో కోర్టులకు వెళ్లి సభలకు అనుమతి తెచ్చుకుంటే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే తంతు కొనసాగడంపై పలువురు ఉద్యమకారులు మండిపడుతున్నారు. 

06:32 - April 12, 2018

మహబూబ్ నగర్ : కాంగ్రెస్‌లో మళ్లీ పాలమూరు పంచాయతీ మొదలైంది. హస్తం పార్టీ నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా తమ ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. తాజాగా నాగం జనార్ధన్‌రెడ్డి పార్టీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుండడంతో... ఈ ఫైట్‌ మరింత పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ... కాంగ్రెస్‌ దూసుకుపోతుంది. ప్రభుత్వంపై వాడీవేడి విమర్శలు చేస్తూ... ప్రజాచైతన్య బస్సు యాత్రను కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ... ఇప్పటినుండే ఎన్నికల సమరశంఖారావం పూరిస్తోంది. దీంతో.. కార్యకర్తల్లో జోష్‌ పెరిగిందని అందరూ భావిస్తుండగా... నేతల సిగపట్లు పార్టీకి తలనొప్పిగా మారాయి.

ముఖ్యంగా... పాలమూరు జిల్లా నేతలు ఆధిపత్య పోరాటాన్ని ఉధృతం చేశారు. మొన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు... ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎవరికి వారు పార్టీలో తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజకీయంగా పాలమూరు కీలకం కావడంతో.. అందులోనూ సీనియర్లు, కీలక నేతలు ఇక్కడ ఉండడంతో ఎవరికీ వారు తగ్గకుండా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

జిల్లాలో జైపాల్‌రెడ్డి వర్సెస్‌ డీకే అరుణ మధ్య పాలిట్రిక్స్‌ సెగలు పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల నుండే జైపాల్‌రెడ్డి, డీకే అరుణ మధ్య విభేదాలు ఉండగా... హైకమాండ్‌ జోక్యంతో బ్రేక్‌ పడింది. అయితే... ఇప్పుడు మళ్లీ విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌లను తన వైపునకు తిప్పుకుని తనన ఒంటరి చేస్తున్నారని జైపాల్‌పై డీకే అరుణ రగిలిపోతున్నారు. దీనికితోడు ఇప్పుడు నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతుండడంతో డీకే అరుణ మరింత రగిలిపోతున్నారు. ఇక ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి సైతం.. జైపాల్‌పై ఫైర్‌ అవుతున్నారు. గతంలో తన ఓటమికి జైపాల్‌రెడ్డి రాజకీయాలు చేశారని... ఎంపీ నంది ఎల్లయ్య, డీకే అరుణతో కలిసి అధిష్టానానికి ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు.

అయితే... దామోదర్‌రెడ్డి వెనక డీకే అరుణ హస్తం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికతోడు డీకే అరుణ సైతం జైపాల్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు. పాలమూరు ఎంపీగా జైపాల్‌రెడ్డి పోటీ చేస్తే ఓడిస్తామని.. అంతేకాకుండా తన కూతురిని పోటీకి పెతానని కామెంట్స్‌ చేయడంతో ఇప్పుడు నేతల మధ్య కోల్డ్‌వార్‌ తారాస్థాయికి చేరింది. ఇదిలావుంటే ఈ వ్యవహారంపై ఈ మధ్యే పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడిప్పుడే పార్టీలో చేరిన తాను.. ఈ వ్యవహారంలో తల దూర్చడం ఎందుకని సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇంత జరుగుతున్నా పీసీసీ మాత్రం ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతోంది. ఓవైపు అందరూ సీనియర్‌ నేతలు, మరోవైపు రాజకీయంగా పట్టున్న నేతలు కావడంతో ఎవరిని మందలిస్తే ఏ చేటు జరుగుతుందోనన్న మీమాంసలో ఉంది. అయితే... పార్టీ స్పందించకుంటే... నేతల కుమ్ములాటలు పార్టీకి మరింత నష్టం తీసుకువచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులంటున్నాయి. మరి దీనిపై ఢిల్లీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.. ! 

06:28 - April 12, 2018

విజయవాడ : కేంద్రంపై మరోసారి ఫైర్‌ అయ్యారు సీఎం చంద్రబాబు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో భూధార్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేసిందన్నారు. సొంతంగా ఒక్కసీటు కూడా గెలవలేని బీజేపీ.. లాలూచీ రాజకీయాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలదీస్తే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో పాతిక ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపిస్తే.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. వాళ్లే దిగొస్తారు. మనం అనుకు్న ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. అప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలవుతాయన్నారు చంద్రబాబు. 

06:26 - April 12, 2018

నెల్లూరు : ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఉద్దేశించిన PSLV-C41 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరులోని శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ నుంచి ఉదయం 4 గంటల 4 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. 32 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 19.19 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం నిర్ణయించిన సమయానికి విడిపోయి.. కక్ష్యలోకి ప్రవేశించింది. దీని బరువు 1425 కిలోలు. ఈ ఉప గ్రహం ద్వారా దేశ దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఇస్రో 8 నావిగేషన్‌ శాటిలైట్లను నింగిలోకి పంపింది. తాజాగా రెండు వారాల వ్యవధిలోనే రెండు ప్రయోగాలను నిర్వహించింది. ఇస్రోకు విశ్వాసపాత్రగా నిలిచిన పీఎస్‌ఎల్వీ రాకెట్‌కు ఇది 43వ ప్రయోగం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నింగిలోకి PSLV-C41 రాకెట్‌...

ఢిల్లీ : ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఉద్దేశించిన PSLV-C41 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరులోని శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ నుంచి ఉదయం 4 గంటల 4 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. 32 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 19.19 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది. 

మోడీ దీక్షలకు నిరసనగా దీక్షలు...

హైదరాబాద్ : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మహోధృతంగా నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి హోదా ఇచ్చే వరకు పోరాటం కొనసాగించాలని తలపెట్టాయి. దీనిలో భాగంగా గురువారం నుంచి ఈనెల 20 వరకు నిర్వహించే ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. మోదీ దీక్షలకు నిరసనగా గురువారం విజయవాడలో దీక్ష చేపట్టాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు.

శుక్రవారం నుండి హైదరాబాద్ ఫెస్ట్...

హైదరాబాద్ : ఈనెల 13 నుండి 22 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ ఫెస్ట్‌ జరగనుంది. ఈ సందర్భంగా అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14వ రోజున మహిళలకు సంబంధించి ప్రత్యేక సభా కార్యక్రమాలు, చర్చా గోష్టులు ఈ ఫెస్ట్‌లో జరుపుతామని ఐద్వా నేతలు తెలిపారు. 

కావేరి మంటలు...

చెన్నై : తమిళనాడులో కావేరి మంటలు చల్లారడం లేదు. ఐపిఎల్‌కు వ్యతిరేకంగా పోరాడిన తమిళ సంఘాలపై కేసు నమోదు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఐపిఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖండించడంపై తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

'తమ కుటుంబాన్ని హతమార్చేందుకు నితీష్ కుట్ర'...

బీహార్ : తనను, తన కుటుంబాన్ని హతమార్చేందుకు నితీష్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఆరోపించారు. పట్నాలో లాలు నివాసం వద్ద పహారా కాసే 32 మంది పోలీసులను బిహార్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై రబ్రీ మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు లేఖ రాశారు.

న్యాయవాది వేసిన పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం...

ఢిల్లీ : సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపులు, ధర్మాసనాల ఏర్పాటుపై మార్గదర్శకాలు రూపొందించాలన్న న్యాయవాది అశోక్‌ పాండే వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసులను కేటాయించడం, బెంచ్‌లను ఏర్పాటుచేయడంపై నిర్ణయం తీసుకునే హక్కు ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బీజేపీ పార్టీని ఇరుకున పెట్టిన రైతు ఆత్మహత్య...

ఢిల్లీ : మహారాష్ట్రలో ఓ రైతు ఆత్మహత్య అధికార బిజెపి పార్టీని ఇరుకున పెట్టింది. తన చావుకు మోది ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుసైడ్‌ నోట్‌లో రైతు పేర్కొన్నాడు. యవత్‌మాల్‌ జిల్లా రాజుర్‌వాడి గ్రామానికి చెందిన 50 ఏళ్ల శంకర్‌ భావూరావు చాయ్‌రే రుణ భారంతో విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అమెరికా..రష్యా అమీ తుమీ...

ఢిల్లీ : సిరియాలో జరిగిన రసాయినక దాడిపై అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలు అమీ తుమీకి సిద్ధమయ్యాయి. సిరియాపై సైనిక చర్య తీసుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది మరోవైపు సిరియాపై మిలటరీ చర్యకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా హెచ్చరించింది. సిరియాలో జరిగిన రసాయనిక దాడిలో 5 వందల మంది అస్వస్థతకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 

Don't Miss