Activities calendar

13 April 2018

21:43 - April 13, 2018

ఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌లో ఏపీ సాక్షిని ప్రశ్నించడం పూర్తైంది. మూడు రోజుల పాటు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కొనసాగింది. ఏపీ సాక్షి, వ్యవసారంగ నిపుణుడు పీవీ సత్యనారాయణను తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. సమాధానాలు వేగంగా చెప్పాలని ఒకదశలో సత్యనారాయణకు ట్రైబ్యునల్‌ సూచించింది. తదుపరి విచారణ వచ్చే నెల 7 నుంచి 9 వరకు జరుగుతుంది. 

21:39 - April 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌, బీజేపీ కబంద హస్తాల నుంచి దేశ ప్రజలను కాపాడేందుకే ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ముందుకు తీసుకువెళ్తున్నట్లు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మూస రాజకీయ విధానాలతో దేశ సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కాంగ్రెస్‌, బీజేపీ పాలనే కారణమని కేసీఆర్‌ విమర్శించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాల మధ్య సాగునీటి యుద్ధాలు సృష్టించి తమాషా చూస్తున్నాయని మండిపడ్డారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయిన కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి
కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా బెంగళూరు వెళ్లిన కేసీఆర్‌.. జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్‌ వెంట నటుడు ప్రకాశ్‌రాజ్‌, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయతలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఇరువురు నేతలు చర్చించారు.

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ
దేవెగౌడతో జరిపిన భేటీలో కేసీఆర్‌.. తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించారు. తన ఉద్దేశాలను దేవెగౌడకు వివరించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రజా సమస్యలతోపాటు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతల ఆత్మహత్యలు వంటి అంశాలపై చర్చించారు. డెబ్బై సంవత్సరాలుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్‌, బీజేపీయే కారణమన్న అంశంపై సమాలోచనలు జరిపారు. కర్నాటక-తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల వివాదంపై చర్చించారు. అలాగే కృష్ణా జలాల పంపిణీకి 2004లో ఏర్పాటు చేసిన జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మోదీ నేతృత్వంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చినా మెరుగైన పాలన అందించలేకపోయిందని, 2019 ఎన్నికల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్‌ అన్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ రాజకీయ పార్టీనైనా చేరవచ్చని మాజీ ప్రధాని దేవెగౌడ ఆహ్వానించారు.

గుణాత్మక మార్పుల కోసం : కేసీఆర్
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి భేటీ కావాలని కేసీఆర్‌, దేవెగౌడ నిర్ణయించారు

21:33 - April 13, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నగదు కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఏ ఏటీఎం వద్ద చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకులకు వెళ్లినా... నగదు లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు వినియోగదారులు.

ఏనీటైమ్ నో మనీ కేంద్రాలు
హైదరాబాద్ మహా నగరంలో ఎంటీఎం కేంద్రాలకు నిర్వచనం మారిపోతుంది. ఏనీటైమ్ నో మనీ కేంద్రాలుగా మారాయి. నగరవాసులు కరెన్సీ కరవుతో అల్లాడుతున్నారు. ఏటీఎంల చుట్టూ గంటల తరబడి తిరిగినా క్యాష్‌ మాత్రం దొరకడం లేదని వాపోతున్నారు. ఓవైపు బ్యాంకులలో క్యాష్‌ లేక.. మరోవైపు ఏటీఎంలలో డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత మూతపడిన ఎటీఎంలు
పెద్దనోట్ల రద్దు తర్వాత నగరంలో చాలా ఏటీఎంలు మూతపడ్డాయి. కస్టమర్ల నుండి డిపాజిట్లు తగ్గడంతో బ్యాంకులకు సరిపడ నగదు అందుబాటులో ఉండడం లేదు. గతంలో ఉద్యోగులు తమ జీతంలో కొంత మొత్తాన్ని మాత్రమే డ్రా చేసుకునే వారు... కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది, ఒకేసారి జీతమంతా డ్రా చేసుకోవడంతో.. ఏటీఎంలలో పెట్టిన క్యాష్‌ క్షణాల్లోనే ఖాళీ అవుతోంది.

నగదు కొరత తీవ్రంగా ఉందంటున్నారు బ్యాంక్‌ అధికారులు..
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత తీవ్రంగా ఉందంటున్నారు బ్యాంక్‌ అధికారులు. ఈ ఏడాది జనవరిలో నగదు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆర్బీఐ నుండి 2 వేల నోట్ల సరఫరా సెప్టెంబర్‌ నుండి ఆగిపోయిందని... కస్టమర్ల నుండి డిపాజిట్ల రూపంలో కరెన్సీ రాలేదంటున్నారు. నగదు కొరత నేపథ్యంలో ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చేందుకు బ్యాంక్‌ అధికారులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. గత 2, 3 నెలలుగా కేరళ, మహారాష్ట్రల నుండి తెలంగాణ బ్యాంకులు నగదు తెచ్చుకుంటున్నాయి. ఆర్బీఐ అనుమతితో మహారాష్ట్ర, తిరువనంతపురం నుంచి నగదు తీసుకువచ్చి ఏటీఎంలలో క్యాష్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జనవరి, ఫిబ్రవరిలో పక్క రాష్ట్రాల నుంచి నగదును తీసుకువచ్చిన బ్యాంక్‌ అధికారులు... తాజాగా మళ్లీ నగదు తీసుకురాలేదు. దీంతో తిరిగి నగదు కష్టాలు మొదలయ్యాయి. నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులు పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించినా.. ఆర్బీఐ నుంచి తగినంత నగదు సరఫరా లేకపోవడంతో ఏటీఎం కేంద్రాల ముందు నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంకులకు తగినంత నగదు అందించి కరెన్సీ కష్టాలు తీర్చాలని సామాన్యులు కోరుతున్నారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తాను ముందే వ్యతిరేకించినట్లు ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మోది ప్రభుత్వానికి ముందుగానే సూచించానని ఆయన వెల్లడించారు. నోట్ల రద్దు చర్యకు ముందు ప్రభుత్వంతో ఆర్‌బీఐ సంప్రదింపులు చేయలేదంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. కేంబ్రిడ్జిలోని హార్వర్డ్‌ కెన్నెడీ స్కూలులో ప్రసంగిస్తూ రాజన్ ఈ విషయాలు చెప్పారు. దేశంలో చలామణిలో ఉన్న 87.5 శాతం నోట్లను రద్దు చేస్తున్నప్పుడు ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమని... మోది ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్లే ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందని రాజన్‌ పేర్కొన్నారు. కొత్త నోట్లు అందుబాటులోకి లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అసంఘిటిత రంగంలో ఆర్థిక ప్రగతి కుంటుపడడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జిఎస్‌టిని కూడా సమర్థంగా అమలు పరచడం లేదన్నారు. 

అత్యాచార ఘటనలు సిగ్గుచేటు : మోదీ

ఢిల్లీ : అంబేద్కర్ స్మారక కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతు..ఉన్నావ్, కథువా ఘటనలపై స్పందించారు. అత్యాచార ఘటనలు సిగ్గుచేటనీ..బాధితులకు న్యాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాగా కథువాలో ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత జనవరిలో బాలికను అపహరించిన ఆరుగురు దుండగులు ఓ చిన్న గ్రామంలో వారం రోజులపాటు నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకి రాళ్లతో కొట్టి చంపే ముందు మరోసారి ఆమెకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. 

ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా..

జమ్ము కశ్వీర్ : ఓ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. జమ్ము కశ్మీర్ కథువా రేప్  ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులు రాష్ట్ర కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.  

దేవాదాయ భూముల విషయంలో చర్యలు : మంత్రి ఇంద్ర

హైదరాబాద్: దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షా సమావేశం జరిపారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతన చెల్లింపులు, కామన్ గుడ్ ఫండ్, ధూప దీప నైవేద్యం పథకంపై మంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..దేవాదాయ భూములు పరాధీనం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ భూములకు సంబంధించి ఏమన్నా వివాదాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. ఆయా ఆలయాల పేరు మీద పట్టా పాస్ బుక్ లు తీసుకోవాలన్నారు.

ముగిసిన ట్రిబ్యునల్ వాదనలు..

ఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో వాదనలు ముగిసాయి. ఏపీ వ్యవసాయ రంగ నిపుణులు సత్యనారాయణను తెలంగాణ న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేశారు. దానికి సంబంధించిన సమాధానాలు వేగంగా చెప్పాలని ధర్మాసనం సూచించింది. అనంతరం తదుపరి విచారణను మే 7,8,9 తేదీలకు వాయిదా వేసింది. 

20:55 - April 13, 2018

ఏ పార్టీ అధికారంలో వున్నా గత 25 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు జపం పట్టిస్తున్నాయి. ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ పదాలు ఏదైనా, రూపం ఏదైనా సామాన్యులే అన్నింటికీ బలయ్యేది. సామాన్యుల జీవితాలే చిద్రమయ్యేది. కానీ మధ్య తరగతి జీవన ప్రమాణాలు పెరిగాయనీ, దేశీయ స్థూల జాతీయోత్పత్తి నేది మెరుగైందనేది ప్రభుత్వాల వాదన. ఇది ఎంత వరకూ వాస్తవం? అసలు సంస్కరణలంటే ఏమిటి? దీనిలో వున్న మతలబు ఏమిటి? సంస్కరణ పేరుతో సాగిన వాస్తవిక పరిస్థితులు ఎలా వున్నాయి? సీపీఎం 25వ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన బీవీ రాఘవులు గారితో సంస్కరణ సాధించిందేమిటి? అనే అంశంపై చర్చ..సంస్కరణలే సర్వరోగ నివారిణి అంటున్నాయి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చేవి నిజమైన సంస్కరణలేనా? లేదీ సామాన్యులపై ప్రభుత్వాలు చేసే రణమా? అనే అంశాలను సీపీఎం 25వ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన బీవీ రాఘవులు గారి విశ్లేషణలో చూద్దాం..

ఫెస్ట్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల..

హైదరాబాద్ : స్ఫూర్తి ప్రొగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫెస్ట్ ను మంత్రి ఈటల రాజేందర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సినీ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ ప్రారంభించారు. ఫెస్ట్ జెండాను మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవిష్కరించారు. సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ప్రారంభించిన ఈ ఫెస్ట్ ఈనెల 22 వరకు ఈ ఫెస్టివల్‌ కొనసాగనుంది. 

భగీరథ పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్..

భద్రాద్రి : సీఎం స్పెషల్ సెక్రటరీ స్మితా సభర్వాల్ ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అశ్వాపురం మండలం రథం గుట్ట వద్ద మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆమె వాటర్ గ్రిడ్ పనులపై సమీక్ష నిర్వహించారు.

కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి..

కామారెడ్డి: జిల్లాలోని పెద్దకొడప్గల్ మండలంలోని బేగంపూర్‌లో దారుణం జరిగింది. రెచ్చి పోయిన పిచ్చికుక్కలు గొర్రెలపై దాడికి తెగబడ్డాయి. దీంతో పిచ్చి కుక్కల దాడిలో 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

20:24 - April 13, 2018

తెలుగు రాష్ట్రాలలో నో క్యాష్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఏ బ్యాంక్ కు వెళ్లినా, ఏ ఏటీఎంకు వెళ్లినా..నో క్యాష్ బోర్టులు దర్శమిస్తున్నాయి. ఆర్బీఐ నుండి రూ.2వేల నోట్లు ఆగిపోయాయని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏటీఎం సెంటర్లు మూత పడిన విషయం తెలిసిందే. మళ్లీ అదే కష్టాలు సామాన్యులను వెంటాడుతున్నాయి. దీంతో సామాన్యులంతా నగదు కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ నగదు కష్టాలు రావటానికి కారణాలేమిటి? దీనికి ప్రధాన కారకులు ఎవరు? ఈ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి. అనే అంశాలపై చర్చనుచేపట్టింది 10టీవీ.ఈ చర్చలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు, కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్, బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. 

19:07 - April 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... దళితులంటే గౌరవం లేదన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కుల వివక్షతో దళితులను అంటరానివారిగా చూస్తున్నాడని ఆయన ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. అంబేద్కర్ జయంతిలో పాల్గొనేందుకు ఇష్టపడని.. కేసీఆర్.. 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతున్నానని.. దళితులపై కపటప్రేమ చూపుతున్నారని పొన్నం ఆరోపించారు. 

19:05 - April 13, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా కోసం ఈనెల 16న జరిగే రాష్ట్ర బంద్‌లో ప్రజలందరూ స్వచ్చంధంగా పాల్గొనాలని హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. బంద్‌ బాధాకరమైన తప్పని సరిస్థితుల్లోనే పిలుపు ఇచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో జరిగిన అవినీతిలో టీడీపీ, బీజేపీలకు సమాన బాధ్యత ఉందని చలసాని విమర్శించారు. 

19:02 - April 13, 2018

అనంతపురం : ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందని హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అవిశ్వాసంపై చర్చించకుండా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌ను వాయిదా వేయించారని మండిపడ్డారు. సభలను వాయిదా వేయించి దీక్ష చేయడం ప్రధాని అసమర్థతేనన్నారు. వైఎస్‌ జగన్‌ కేంద్రంతో ఒప్పందం చేసుకుని ఎంపీలతో రాజీనామా చేయించారని.. వారి రాజీనామాలు ఆమోదం పొందవని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఎవరు రాజీనామాలు చేసినా.. చేయకపోయినా మోదీ ప్రభుత్వంతో ఏపీకి న్యాయం జరగదన్నారు. అనంతపురం జిల్లా కౌకుంట్లలో మాజీ ఎమ్మెల్యే పయ్యావుల వెంకటనారాయణప్ప సంస్మరణ సభలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కర్నాటక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. 

19:00 - April 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో దీక్ష కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా మాదాపూర్‌లోని కాలేజీ ఆవరణలో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సౌమ్యశ్రీ, నితీష్, కీర్తితో పాటు పలువురు విద్యార్థులను కాలేజీ యాజమాన్యం అభినందించింది. తెలంగాణలోనే మొదటి సారిగా ఏర్పాటు చేసిన తమ కళాశాలలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందన్నారు దీక్ష కాలేజీ ఎండీ జి.శ్రీధర్‌. తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది సహకారంతోనే మంచి ఫలితాలు సాధించగలిగామన్నారు. మున్ముందు కూడా ఇదే స్థాయిలో తమ కళాశాల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి మొదటి స్థానంలో నిలుస్తామన్నారు. 

18:56 - April 13, 2018

అమరావతి : పాలన చేతకాక దద్దమ్మలా మోదీ దీక్ష చేశారని ఆరోపించారు విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌. పార్లమెంట్‌ సభలను సజావుగా నడిపించలేని మోదీ రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్షనేతగా జగన్‌ నాలుగేళ్ల నుండి రాష్ట్రం కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పాదయాత్రలో గాని బహిరంగ సభలో గాని జగన్‌.... బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిందని ఒక్కసారైనా అంటే.... తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు జలీల్‌ఖాన్‌. 

18:53 - April 13, 2018

హైదరాబాద్ : వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ మినీ గురుకులం ఉపాధ్యాయులు హైదరాబాద్‌లో సీఎం క్యాంప్‌ ఆఫీసును ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ 21 జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు తరలివచ్చారు. వీరికి లోనికి అనుమతి లేదంటూ పంజాగుట్ట పోలీసులు దాదాపు 200 మంది టీచర్లను అరెస్ట్‌ చేసి బషీర్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

18:49 - April 13, 2018

హైదరాబాద్ : సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలను బేస్ చేసుకొని తమపై తప్పుడు వార్తలు రాయడం అనైతికమన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు. వార్తలు రాసేముందు నిజమేంటో తెలుసుకోవాలన్నారు. పార్టీలో ఒకరిపై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు వేయడం పార్టీకే నష్టమన్నారు. ఈ కరపత్రాలపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తానని, కరపత్రాలు ప్రచురించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వీహెచ్‌ తెలిపారు. 

18:46 - April 13, 2018

మహబూబ్ నగర్ : బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎల్‌ఎఫ్‌ పనిచేస్తుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ బాడీ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో 65 సీట్లు బీసీలకు ఇస్తామని అన్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కూడా ఇస్తాయా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయం బీఎల్‌ఎఫ్‌ మాత్రమేనన్నారు. సామాజిక న్యాయం కోరుకునే వారంతా బీఎల్‌ఎఫ్‌తో కలిసి పనిచేయాలని తమ్మినేని కోరారు. 

ఆ బీజేపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి : హైకోర్టు

ఉత్తరప్రదేశ్ : 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఉదయమే ఆయనను సీబీఐ తమ నిర్బంధంలోకి తీసుకొని ప్రశ్నించింది. ఈ రేప్ రేసులో విచారణను తాము పరిశీలిస్తుంటామని ఈ సందర్భంగా కోర్టు స్పష్టంచేసింది. సీబీఐ కుల్‌దీప్‌పై నమోదైన మూడు కేసులను విచారించనుంది. కఠినమైన పోస్కో చట్టం కింద కుల్‌దీప్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేయాల్సిందిగా గురువారం రాత్రి యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేయగా..

మార్పు కోరుకునే ప్రజలు తమతో రావాలి : ప్రకాశ్ రాజ్

కర్ణాటక : దేశంలో మార్పు కోరుకునే ప్రజలు తమతో కలిసిరావాలని నటుడు ప్రకాశ్‌రాజ్ కోరారు. జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు జనతాదళ్ అధినేత దేవెగౌడతో సీఎం కేసీఆర్ ఇవాళ బెంగళూరులో సమావేశమయ్యారు. ఈ భేటీలో నటుడు ప్రకాశ్‌రాజ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రకాశ్‌రాజ్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూసి తానెంతో బాధపడుతున్నట్లు తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎవరు హామీలు ఇచ్చి మోసం చేశారో.. ఎవరు న్యాయం చేస్తారో యోచించాలన్నారు.

16:43 - April 13, 2018

కర్నూలు : నగరంలో ఓ ప్రయివేటు ఆసుపత్రి నిర్లక్ష్యానికి రోగులు పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా చేయాల్సి ఆపరేషన్లను దానికి సంబంధించిన నగదు రాలేదనే కారణంతో రోగుల పట్ల ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలో పలు ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలులోని బాలాజీ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ పథకం కింద జాయిన్ అయిన పేషెంట్ ను ఆసుపత్రి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన ఘటన బైటకు వచ్చింది. డయాబెటిక్ పేషెంట్ అయిన రోగి హేమకాంత్ రెడ్డికి ఉదయం ఆపరేషన్ చేయాల్సి వుండగా ఆరోగ్య శ్రీ రాలేదని ఆపరేషన్ చేయకుండా..ఎటువంటి ఆహారం ఇవ్వకుండా పలు విధాల ఇబ్బందులకు గురించేశారు. దీంతో హేమకాంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య శ్రీ కార్డులకు ప్రయివేటు ఆసుపత్రి వారు విలువ ఇవ్వటంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. 

16:20 - April 13, 2018

హైదరాబాద్‌ : ఫెస్ట్‌కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానుంది. 22 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమాన్ని భాగ్యనగర వాసులకు మరపురాని అనుభూతిని మిగిల్చే విధంగా నిర్వహించబోతున్నారు.

నిత్య జీవితంతో సైన్స్ కున్న ప్రాధాన్యత ఏమిటి?..
నిత్య జీవితంతో సైన్స్ కున్న ప్రాధాన్యత ఏమిటి? మనిషికి సైన్స్ వున్న సంబంధమేమిటి? వంటి పలు శాస్త్రీయపరమైన అంశాలను ఈ ఫెస్ట్ లో చోటుచేసుకోనున్నాయి. ఈ 10రోజుల్లో దాదాపు 400 ల రకాల ఎగ్జిబిట్ ను ప్రదర్శించబోతున్నామన్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సైన్స్ కార్యక్రమంలో ప్రదర్శించబోతున్నామన్నారు. అలాగే కల్చరల్ ప్రోగామ్స్, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి పలు వినోదాత్మక కార్యక్రమాలు, మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టి కార్యక్రమాలు వంటి సామాజిక అంశాలను ఈ ఫెస్ట్ లో నిర్వహించనున్నారు.

అలరించనున్న విజ్ఞాన, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు..
విజ్ఞాన, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మత సామరస్యం, విభిన్న సంస్కృతులకు ప్రతీకగా నిలిచే భాగ్యనగరిలో స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈనెల 13 నుంచి 22 వరకు జరిగే హైదరాబాద్‌ ఫెస్ట్‌ ప్రేక్షకులను వింత అనుభూతి కలిగించే విధంగా జరిపేందుకు అన్ని సిద్ధమయ్యాయి. బాలోత్సవం, సైన్స్‌ ఎగ్జిబిషన్‌, సాహిత్య సభలకు వేర్వేరు స్టేజీలు,మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమాలు, విజ్ఞాన, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థలు తమ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. కేరళ అభివృద్ధి నమూనాను వివరించే ప్రత్యేక స్టాల్‌ కూడా ఏర్పాటుచేశారు. భాగ్యనరి జీవనశైలి, ఆహార వ్యవహారాలపై ఏర్పాటు చేసే స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

ప్రకాశ్ రాజ్ రియల్ హీరో :కేసీఆర్

కర్ణాటక : సినీ నటుడు ప్రకాష్ రాజ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు మధ్యాహ్నం బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం, మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రకాష్ రాజ్ 'హీరో' అని ప్రశంసించారు. ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసని, సమాజం కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నానని కేసీఆర్ అన్నారు. కాగా, సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, శేఖర్ రెడ్డిలతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు.

15:42 - April 13, 2018

కర్ణాటక : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ తరుపున ప్రచారం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుపై దేవెగౌదతో చర్చలు జరిపిన కేసీఆర్‌.. ఎన్నికల ప్రచారం గురించిన మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించారు. జేడీఎస్‌ ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రచారం చేస్తానని చెప్పారు. హైదరాబాద్ సంస్థానం నుంచి వేరుపడి కర్నాటకలో ప్రచారం చేయమన్నా చేస్తానన్నారు.

కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డ కేసీఆర్..
దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. దేశాన్ని 65 సంవత్సరాలకుపైగా పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజా సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై బెంగళూరులో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చలు జరిపిన కేసీఆర్‌.. కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలు తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కేసీఆర్‌ విమర్శించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ రాజకీయ పార్టీలైనా చేరవచ్చని మాజీ ప్రధాని దెవెగౌడ ఆహ్వానించారు. 

15:37 - April 13, 2018

హైదరాబాద్ : గడచిన నెలరోజుల వ్యవధిలోనే ముగ్గురు జడ్జిలు అవినీతి కేసుల్లో చిక్కుకోవడం న్యాయవ్యవస్థలో సంచలనంగా మారింది. తాజాగా నాంపల్లి 1వ మెట్రోపాలిటన్‌ అదనపు న్యాయమూర్తి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటూ తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై కఠిచర్యలు ఉండాలంటున్న అడ్వోకేట్‌ శ్రీరంగారావు పలు ఆసక్తిక విషయాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

మాజీ సీఎం 'ఐటెం'ను తెచ్చారన్న బీజేపీ ఎంపీ..

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ భార్య గురించి బీజేపీ ఎంపీ మనోహర్ ఉంత్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ కు ఇప్పటివరకు దిగ్విజయ్ చేసిందేమీ లేదని... ఢిల్లీ నుంచి ఒక ఐటెంను మాత్రం పట్టుకొచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా టీవీ యాంకర్ అమృత రాయ్ ను ఆయన రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మోదీ దీక్షకు మద్దతుగా చేపట్టిన దీక్షలో మనోహర్ మాట్లాడుతూ, రెండు సార్లు మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ దిగ్విజయ్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు కలకలం రేపుతున్నాయి. 

పాలనలో మార్పులు అవరసరం : కేసీఆర్

కర్ణాటక : మాజీ ప్రధాని, జనతాదళ్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. అనతరం కేసీఆర్ మాట్లాడుతు..దేశంలో గొప్ప మార్పులు సంభవించాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని 65 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాలించాయని... దేవేగౌడ, వీపీ సింగ్, చంద్రశేఖర్, కరణ్ సింగ్, మొరార్జీ తదితరులు కొంత కాలం దేశాన్ని పాలించారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు పరిపాలనలో దారుణంగా విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. కావేరీ జలాల కోసం దశాబ్దాలుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందని కేసీఆర్ ప్రశ్నించారు.

బాహుబలికి అవార్డుల పంట..

హైదరాబాద్ : 65వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ లలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం బాహుబలి 2కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీల్లో బాహుబలి 2 అవార్డులు దక్కించుకుంది.

అవినీతి ఆరోపణలతో జడ్జి అరెస్ట్..

హైదరాబాద్: మెట్రోపాలిటన్ అదనపు సెషన్స్ జడ్జి రాధాకృష్ణమూర్తిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఇవాళ జడ్జి రాధాకృష్ణమూర్తితో పాటు మరో ఇద్దరు న్యాయవాదుల ఇండ్లలో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు రూ. 7 లక్షలు లంచం తీసుకున్నట్లు న్యాయమూర్తిపై ఆరోపణలు. కేసులో నిందితుడికి, జడ్జికి మధ్యవర్తులుగా వ్యవహరించిన న్యాయవాదులపైన కేసు నమోదైంది. న్యాయవాదులు శ్రీనివాస్‌రావు, సతీష్‌కుమార్‌లను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

దేవగౌడతో భేటీ అయిన కేసీఆర్..

హైదరాబాద్: జనతాదళ్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చలు చేపట్టారు. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు.

నవాజ్ షరీష్ కు పాక్ సుప్రీం షాక్..

పాకిస్థాన్ : మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఆ దేశ సుప్రీంకోర్టు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. అంతేకాదు ఎలాంటి బహిరంగ సభల్లో కూడా పాల్గొనకూడదని ఆదేశించింది. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ నిషేధం సరైనదేనని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది.

13:29 - April 13, 2018
13:21 - April 13, 2018
13:19 - April 13, 2018

బెంగళూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై మెల్లిగా అడుగులు వేస్తున్నారు. పలువురు జాతీయ నేతలతో ముచ్చటించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీతో చర్చించిన ఆయన తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవేగౌడతో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట నటుడు ప్రకాష్ రాజ్, ఎంపీలు వినోద్, సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్ లున్నారు. కాసేపటి క్రితం బెంగళూరుకు చేరుకున్న కేసీఆర్ నేరుగా దేవేగౌడ నివాసానికి వెళ్లారు. ఈసందర్భంగా కేసీఆర్ కు దేవేగౌడ స్వాగతం పలికారు. ఫెడరల్ ఫ్రంట్ పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:15 - April 13, 2018

ఢిల్లీ : ప్రతిష్టాత్మక 65వ జాతీయ అవార్డుల ప్రకటన కాసేపటి క్రితం వెలువడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 2017లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వచ్చిన చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డులను ప్రకటిస్తున్నారు.

 • ఉత్తమ నటి : శ్రీదేవి (మామ్)
 • ఉత్తమ తెలుగు చిత్రం : ఘాజీ
 • ఉత్తమ హిందీ చిత్రం : న్యూటన్
 • ఉత్తమ మలయాళీ చిత్రం : టేకాఫ్
 • ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్
 • ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నింబూ
 • ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క
 • ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి
 • ఉత్తమ యాక్షన్ చిత్రం : బాహుబలి 2
 • ఉత్తమ సంగీత దర్శకుడు : ఏ.ఆర్.రెహమాన్ (మామ్), (కాట్రు వెలియిదామ్)
 • ఉత్తమ కొరియాగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయ్ లెట్, ఏక్ ప్రేమ్ కథా)
 • ఉత్తమ దర్శకుడు : జయరాజ్ (మలయాళ చిత్రం భయానకం)
 • ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాసిల్ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
 • బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. 

శ్రీదేవికి జాతీయ అవార్డు...

ఢిల్లీ : 65వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటన కాసేపటిక్రితం ప్రకటించారు. 'మామ్' సినిమాలో నటించినందుకు గాను ఫిమేల్ సెక్షన్ లో స్వర్గీయ శ్రీదేవికి ఉత్తమ బెస్ట్ యాక్టర్ అవార్డును ప్రకటించారు. 

వైసీపీలోకి యలమంచిలి రవి...

విజయవాడ : తెలుగుదేశం పార్టీ నేత యలమంచిలి రవి వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు స్వయంగా పిలిపించుకుని బుజ్జగించే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది.

 

65వ జాతీయ చలన చిత్ర అవార్డులు...

ఢిల్లీ : మరాఠీ చిత్రం మౌర్ఖ్యకు స్పెషల్ మెన్షన్, ఒరియా చిత్రం హలో ఆర్.సికి స్పెషల్ మెన్షన్ అవార్డు, మలయాళీ చిత్రం టేక్ ఆఫ్ స్పెషల్ మెన్షన్ అవార్డు, ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా సింజర్, మరాఠీలో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా కచ్చానింబు, తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఘాజీ, ఉత్తమ పోరాట సన్నివేశ చిత్రంగా బాహుబలి 2, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ అవార్డుకు బాహుబలి 2, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్, హిందీలో ఉత్తమ చిత్రంగా న్యూటన్ కు పురస్కారం, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భాషా లదాక్ ఎంపికయ్యింది. 

దేవెగౌడతో కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరు రాష్ట్రానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం దేవెగౌడతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. 

'బాహుబలి'కి అవార్డు...

హైదరాబాద్ : బాహుబలి చిత్రానికి నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అబ్బాస్ ఆలీ మొఘుల్ కు అవార్డు దక్కింది. 

12:22 - April 13, 2018

బాబును కలిసిన సచిన్...

సింగపూర్ : సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిశాడు. మర్యాద పూర్వకంగాను సచిన్ కలిసినట్లు తెలుస్తోంది. 

12:18 - April 13, 2018

విజయవాడ : అగ్రిగోల్డ్ మళ్లీ మొదటకొచ్చింది. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న బాధితులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. లక్షల మంది డిపాజిటర్ల ఆశలను అడియాసలు చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ డిపాజిట్లు ఎప్పటికైనా వస్తాయని ఆశించిన డిపాజిట్ దారులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఇదిలా ఉంటే భవిష్యత్ లో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడం..తదితర విషయాలపై చర్చించేందుకు విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుండి బాధితులు, ఏజెంట్లు హాజరయ్యారు.

ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం..సీఐడీ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీ గ్రూపు అనుకోని రీతిలో వెనక్కి వెళ్లింది. సుభాష్ చంద్ర ఫౌండేషన్ అమర్ సింగ్ మధ్యవర్తిత్వంగా తీసుకోవాలనే విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. ఎలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాన్ని అనుమతించబోమని పేర్కొంది. ఈనెల 25వ తేదీన విచారణ చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది. 

11:19 - April 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ బాట పట్టారు. దేశ రాజకీయాల్లో గుణత్మాక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫ్రంట్ పై ఆసక్తి ఉన్న జాతీయనేతలతో ఆయన కలిసి చర్చిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో కేసీఆర్ బెంగళూరుకు బయలుదేరారు. మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవేగౌడతో భేటీ కానున్నారు. ఈ భేటీ మధ్యాహ్నం 2గంటలకు జరుగనుంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి దేవగౌడతో చర్చలు జరుపనున్నారు. దేశ రాజకీయాలు..ఫెడరల్ ఫ్రంట్ అవశ్యకత..విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 

సింగపూర్ లో బాబు...

విజయవాడ : సింగపూర్ లీడర్ షిప్ సమ్మిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని, సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకెళుతున్నామన్నారు.

 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై మరో భూ వివాదం ?

జనగామ : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మరో భూ వివాదంలో చిక్కుక్కున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తన భూమిలో ఇళ్లు కట్టుకోకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

టి.ఇసుక పాలసీపై సిద్ధూ ప్రశంసలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసలు కురిపించారు. అమలవుతున్న ఇసుక పాలసీ అద్భుతంగా ఉందని, అక్రమాలు అరికట్టడంలో ఈ ఉపయోగం ఉపయోగపడుతుందన్నారు. ఇదే విధానాన్ని పంజాబ్ లో అమలు చేయాలని అనుకుంటున్నట్లు, రెండు నదులున్న తెలంగాణ రాష్ట్రంలో రూ. 1300 కోట్లు ఉంటే నాలుగు నదులున్న పంజాబ్ రాష్ట్రానికి రాబడి ఎంత వస్తుందో ఊహించుకోవచ్చన్నారు. 

10:44 - April 13, 2018

బెంగళూరుకు కేసీఆర్...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బెంగళూరు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 9.45 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవగౌడతో సీఎం సమావేశం కానున్నారు.

రూ. 4కోట్లను స్వాధీనం చేసుకున్న ఈసీ...

కర్నాటక : నాలుగు కోట్ల డబ్బును ఎలక్షన్ కమీషన్ స్వాధీనం చేసుకుంది. ఇందులో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. 

బ్రిడ్జిపై నుండి పడిన బస్సు...

ఒడిషా : కలహండి ప్రాంతంలో బ్రిడ్జిపై నుండి ఓ బస్సు పడిపొయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. 30 అడుగుల ఎత్తుపై నుండి పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జైంది. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

10:08 - April 13, 2018

ఉత్తర్ ప్రదేశ్ : బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. 16ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అత్యాచారం ఎదుర్కొంటున్న కుటుంబం ఆందోళన చేపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం యోగి నివాసం ఎదుటే కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో సంచలనం సృష్టించింది. కానీ ఎమ్మెల్యే ఆత్యాచారం చేశాడన్న దానిపై ఎలాంటి ఆధారాలు లేవని ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు తెలపడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. శుక్రవారం పోలీసులు ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ను అరెస్టు చేసి సీబీఐ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అలహాబాద్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. ఉన్నావ్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో సిబిఐ విచారణకు యోగి ప్రభుత్వం సిఫారసు చేసింది. 

రోడ్లపై టమాట...

మధ్యప్రదేశ్ : పండించిన టమాట పంటకు గిట్టుబాలు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ధర రాక పోవడంతో టమాటలను రోడ్లపై పారబోస్తున్నారు. 

జడ్జి ఇంట్లో సోదాలు...

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు హైదరాబాద్ ఒకటో అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ రాధాకృష్ణమూర్తి రూ. 7.5 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గత అర్థరాత్రి నుంచి ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

సింగపూర్ కు బాబు..

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు.

09:19 - April 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ మీడియట్ ప్రథమ..ద్వితీయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి కూడా బాలికలే పై చేయి సాధించారని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 62.35, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 67.25గా ఉందన్నారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా, కొమరం భీం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచాయని, రెండో స్థానంలో రంగారెడ్డి 77 శాతంతో, మహబూబాబాద్ జిల్లా 40 శాతంతో మూడో స్థానంలో నిలిచాయన్నారు. ఇక మొదటి సంవత్సరం ఫలితాల్లో కూడా మేడ్చల్ జిల్లా ప్రథమ, రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచాయన్నారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 4,55,789 విద్యార్థులు హాజరయ్యారని, అందులో 2,84,224 పాస్ అయ్యారని తెలిపారు. మొత్తంగా 62.35 శాతం వచ్చిందన్నారు.

ఇంటర్ ద్వితీయ పరీక్షకు 4,29,378 విద్యార్థులు హాజరయ్యారని అందులో 2,88,772 పాస్ అయ్యారని మొత్తంగా 67.25 శాతం ఉందన్నారు. ఇక మొదటి..ద్వితీయ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారని తెలిపారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 69 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 65.66 శాతం సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 73.25 శాతం సాధించగా బాలురు 61.00 శాతం సాధించారని తెలిపారు. రీ కౌంటింగ్ కోరే విద్యార్థులు 20 ఏప్రిల్ లోపు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఇందుకు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీ వెరిఫకేషన్ కాపీలు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు తగిన ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

14 మే ఇన్ స్టంట్ పరీక్ష నిర్వహించనున్నట్లు, 20 ఏప్రిల్ చివరి తేదీగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. 2016లో 62 శాతం, 2017లో 65 శాతం వచ్చిందన్నారు. 

తెలంగాణ ఇంటర్ మీడియట్ ఫలితాలు...

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ మీడియట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు.

 

భారత్ కు మరో రెండు పతకాలు...

ఢిల్లీ : కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో స్వర్ణం..రజతం వచ్చాయి. తేజస్విని సావంత్ స్వర్ణం గెలుచుకోగా అంజూమ్ మోద్గి రజత పతకం గెలుచుకున్నారు. 

అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం...

విజయవాడ : నేడు అగ్రిగోల్డ్ బాధితులు సమావేశం కానున్నారు. 13 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ఏజెంట్లు..బాధితులు పాల్గొననున్నారు. 

07:32 - April 13, 2018

ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇంకా సెగలు పుట్టిస్తోంది. హోదా ఇవ్వాల్సిందేనంటూ రాజకీయ పార్టీలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై పలు విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అధికారం కావాలనే కాంక్ష అక్కడి పార్టీల్లో ఉందని..ప్రజలను ఏదీ ఆకర్షిస్తుంది ? తదితర విషయాలపై రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా ఉపయోగపడుతుందని అనుకున్న పార్టీలు ఆ దిశగా వ్యూహాలు రచించాయన్నారు. ప్రస్తుతం హోదాపై మాట్లాడుతున్న పార్టీలు నాలుగేళ్లు ఎందుకు మాట్లాడలేదు ? అని ప్రశ్నించారు. ఇక్కడ వైసీపీ..టిడిపి రెండు పార్టీలు బీజేపీతో మితృత్వం మెంటేన్ చేశాయని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడా ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన తరువాత కూడా మద్దతినిచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ వద్దు..హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

హోదా అన్న వారిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని, కానీ ఇదే ప్రభుత్వం హోదా కావాలంటూ ప్రజాప్రతినిధులు రోడ్లపైకి వస్తున్నారన్నారు. టిడిపికి కోరిక కలిగినప్పుడే అందరికీ కోరిక కలగాలనే విధంగా వ్యవహరిస్తోందన్నారు. హోదా ముగిసిన అధ్యాయం..అంతకన్నా గొప్పది ప్యాకేజీ అంటూ టిడిపి సవాలక్ష మాటలు చెప్పిందని గుర్తు చేశారు. వామపక్షాలిచ్చిన బంద్ విజయవంతం కాగానే టర్న్ తీసుకుందని తెలిపారు.

ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తున్నారని కానీ నరేంద్ర మోడీ దుర్మార్గం..అన్యాయం..నమ్మక ద్రోహం చేశాడని అనడం లేదన్నారు. కేంద్రం..బిజెపి అంటూ విమర్శలు గుప్పిస్తారని..ఎక్కడో ఒకసారి మోడీ అంటారని తెలిపారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది....ప్రామీస్ చేసింది మోడీ అని తెలిపారు. ఎక్కడైనా నరేంద్ర మోడీ ద్రోహం చేశాడని పవన్ కళ్యాణ్ అన్నాడా ? అని ప్రశ్నించారు.

కర్నాటకలో ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్ ఎందుకు పిలుపు ఇవ్వడని సూటిగా ప్రశ్నించారు. వైసీపీకి చంద్రబాబు నాయుడు మాత్రమే శత్రువు..బీజేపీ మాత్రం శత్రువు కాదన్నారు. స్వాతంత్రం ఇవ్వనని బ్రిటీష్...తెలంగాణ ఇవ్వదని కాంగ్రెస్...చెప్పిందని మరి ఎందుకు పోరాడారు ? ఏం చేస్తే హోదా వస్తుందో చెప్పాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఒత్తిడి పెడుతుంటే సాధ్యమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా వచ్చే ప్రభుత్వమైనా ఇవ్వాల్సి ఉంటుందని,

కర్నాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే మాత్రం జనతాదళ్ సెక్యూలర్ కాంగ్రెస్...బీజేపీతో కలిసే అవకాశం ఉంటుందని..ఇక్కడ కేసీఆర్ ఆశించింది జరగదు కదా ? అని తెలిపారు. ఆంధ్రా జేఏసీగా ఎందుకు ఏర్పాటు కాదు ? అని తెలిపారు. ఇంకా మరింత విశ్లేషణ కోసం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

టి.ఇంటర్ ఫలితాలు...

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి గత నెలలో నిర్వహించిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది.

06:43 - April 13, 2018

ఢిల్లీ : ఒకే ఒక వికెట్‌ చేతిలో ఉండగా రెండు బంతుల్లో.. 2 పరుగులు చేయాల్సిన పరిస్థితి. వికెట్‌ పడితే విజయం ముంబైదే. ఒక్క పరుగు చేస్తే సూపర్‌ ఓవర్‌... ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో ఒకటే టెన్షన్‌. నరాలు తెగే ఉత్కంఠ. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించే క్లైమాక్స్‌. అందరూ ఊపిరి బిగపట్టుకుని చూస్తుండగా.. స్టాన్‌లేక్‌ బాదిన బౌండరీతో కథ సుఖాంతమైంది. సన్‌రైజర్స్‌ ఖాతాల్లో మరో విజయం చోటు చేసుకోగా... ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. గురువారం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సన్‌రైజర్స్‌ ఒక వికెట్‌ తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ అలవోకగా విజయాన్ని సాధిస్తుందని అందరూ భావించారు. కానీ.. 18వ ఓవర్‌ పరిస్థితిని తారుమారు చేసింది. 15 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన సమయంలో... యూసుప్‌ పఠాన్‌, రషీద్‌ఖాన్‌లను వరుస బంతుల్లో బుమ్రా ఔట్‌ చేశాడు. ఆ తర్వాత 12 బంతులకు 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఈసమయంలో ముస్తాఫిజుర్‌ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు మాత్రమే చేసింది. ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవర్‌లో తొలిబంతిని సిక్సర్‌గా బాదాడు హుడా. తర్వాత నాలుగు బంతులకు నాలుగు పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఒక పరుగు చేయాల్సి వుండగా... స్టాన్‌లేక్‌ ఫోర్‌ కొట్టి సన్‌రైజర్స్‌కు విజయం అందించాడు. 

06:41 - April 13, 2018

పశ్చిమ బెంగాల్ : ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఈ నెల 16 వరకు సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసు జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియలో ప్రతిపక్షాలు చేసే ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ ఓ నివేదికను ఈ నెల 16న సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అధికార తృణమూల్ హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని విపక్షాలు ఆరోపించాయి. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ సస్పెండ్‌ కావడం పశ్చిమ బెంగాల్‌లో ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు మే 1, 3, 5 తేదీల్లో జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్‌ 2న ప్రారంభమై 10తో ముగిసింది.

 

06:38 - April 13, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ భావోద్వేగానికి గురయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అధికారాలను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు తిరస్కరించారు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాల రీత్యా తాను ఈ పిల్‌ను విచారించలేనని పేర్కొన్నారు. తాను ఇచ్చిన తీర్పును 24 గంటల్లో మరోసారి మార్చబడకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు. మరో రెండు నెలల్లో తాను రిటైర్‌ అవుతున్నట్లు చలమేశ్వర్‌ పేర్కొన్నారు.

 

06:36 - April 13, 2018

ఉత్తర్ ప్రదేశ్ : ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఎలాంటి ఆధారాలు లేవని ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఎమ్మెల్యే సెంగార్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ హైకోర్టు యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరైన ఆధారాలు లేనందువల్లే ఆయనను అరెస్టు చేయలేదని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సరైన ఆధారాలుంటే విచారణ కొనసాగుతుందని కోర్టుకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అలహాబాద్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. ఉన్నావ్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో సిబిఐ విచారణకు యోగి ప్రభుత్వం సిఫారసు చేసింది. ఎమ్మెల్యే సెంగార్‌ను కోర్టు దోషిగా తేల్చేవరకు అరెస్ట్‌ చేసే ప్రసక్తే లేదని...అప్పటివరకు ఆయన ఆరోపితుడేనని యూపీ పోలీసులు పేర్కొన్నారు.

06:33 - April 13, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఫెస్ట్‌కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 13 నుంచి 22 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమాన్ని భాగ్యనగర వాసులకు మరపురాని అనుభూతిని మిగిల్చే విధంగా నిర్వహించబోతున్నారు. విజ్ఞాన, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. హైదరాబాద్‌ ఫెస్ట్‌పై 10 టీవీ ప్రత్యేక కథనం...ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మత సామరస్యం, విభిన్న సంస్కృతులకు ప్రతీకగా నిలిచే భాగ్యనగరిలో స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈనెల 13 నుంచి 22 వరకు జరిగే హైదరాబాద్‌ ఫెస్ట్‌ ప్రేక్షకులను వింత అనుభూతి కలిగించే విధంగా జరుపనున్నారు.

హైదరాబాద్‌ ఫెస్ట్‌ కోసం ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. బాలోత్సవం, సైన్స్‌ ఎగ్జిబిషన్‌, సాహిత్య సభలకు వేర్వేరు స్టేజీలు నిర్మిస్తున్నారు. మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌లో విజ్ఞాన, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థలు తమ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. కేరళ అభివృద్ధి నమూనాను వివరించే ప్రత్యేక స్టాల్‌ పెడుతున్నారు. భాగ్యనరి జీవనశైలి, ఆహార వ్యవహారాలపై ఏర్పాటు చేసే స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

బాలబాలికల్లో మేధో వికాసాన్ని పెంపొందించే విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు హైదరాబాద్‌ ఫెస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో జానపదాలు, వివిధ రకాల నృత్యరూపకాలు ప్రదర్శించనున్నారు. గజల్స్‌, కవ్వాలి, ముషాయిరా వంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మేధావులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, సినీనటులు హైదరాబాద్‌ ఫెస్ట్‌లో పాల్గొనబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. 

06:31 - April 13, 2018

విజయవాడ : ఏపీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలు విడులయ్యాయి. పరీక్షలు పూర్తైన 24 రోజుల్లో ఫలితాలు ప్రకటించడం ద్వారా ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. ఈఏడాది ఇంటర్‌లో 73.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా... 59 శాతం ఫలితాలతో కడప జిల్లా చివరిస్థానంలో నిలించింది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా బాలికలు అగ్రస్థానంలో నిలిచారు.

ఇంటర్‌ పరీక్షలు పూర్తైన 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేశారు. మొత్తం మీద 73.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 4,84,889 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,41,359 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 48,530 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. కృష్ణా జిల్లా 84 శాతం ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. 77 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా రెండో స్థానం సాధించగా... 76 శాతం ఫలితాలతో గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలిచింది. 59 శాతం ఫలితాలతో కడప జిల్లా చివరి స్థానం దక్కించుకొంది.

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లను మంత్రి గంటా ప్రకటించారు. ఎంపీసీ విభాగంలో 992 మార్కులతో కూనం తేజవర్ధన్‌రెడ్డి మొదటి స్థానం సాధించారు. 991 మార్కులతో అఫ్రాన్‌ షేక్‌ రెండో స్థానం సాధించగా, వాయలపల్లి సుష్మ 990 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిశారు. బైపీసీలో ముక్కు దీక్ష, నారపనేని లక్ష్మీకీర్తి, కురుబ షిన్యత... ఈ ముగ్గురూ 990 మార్కులు సాధించడంతో వరుసగా మూడు స్థానాలు కేటాయించారు. ఎంఈసీ విభాగంలో 992 మార్కులతో నిశాంత కృష్ణ ప్రథమ స్థానంలో నిలిచారు. మీనా, గుడివాడ నాగవెంకట అభిషేక్‌ 981 మార్కులు సాధించగా... వీరికి ద్వితీయ, తృతీయ స్థానాలు కేటాయించారు. సీఈసీలో 968 మార్కులతో కాదంబరి గీత మొదటి స్థానం సాధించారు. ఆదులాపురం సెల్వరాజ్‌ ప్రియ 966 మార్కులతో రెండో స్థానం సాధించగా, 964 మార్కులతో కాస శివరాం మూడో స్థానంలో నిలిశారు. హెచ్‌ఈసీ విభాగంలో 966 మార్కులతో గీత ప్రథమ స్థానం సాధించారు. 952 మార్కులతో లావణ్య రెండో స్థానంలో నిలువగా... 949 మార్కులతో సత్యనారాయణ మూడో స్థానం దక్కించుకున్నారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫెయిలైన విద్యార్థులకు వచ్చే నెల 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 21వ తేదీ లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

06:28 - April 13, 2018

హైదరాబాద్ : బల్దియాలో అక్రమార్కులకు అందలం అంటూ 10టీవీ ప్రసారం చేసిన కథనానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి స్పందించారు. అక్రమ బర్త్‌ సర్టిఫికెట్లు ఇచ్చారంటూ అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టిన హెల్త్‌ అసిస్టెంట్లను మళ్లీ అదే కుర్చీలో కూర్చోబెట్టారు. ఉద్యోగుల అరెస్ట్‌ విషయం తమకేమీ తెలియదంటూ అక్రమార్కులకు అడ్డదారిలో పోస్టింగులు ఇచ్చారు. ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో.. ఏడుగురిని విధుల్లోంచి టెర్మినేట్‌ చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎలాంటి ఆధారాలు లేకుండా.. అక్రమంగా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన ముఠాను జనవరిలో రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందులో బల్దియాకు చెందిన పలువురు హెల్త్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉన్నారు. వీరిలో అల్వాల్‌ సర్కిల్‌కు చెందిన కన్నారావు, సికింద్రాబాద్‌ సర్కిల్‌కు చెందిన అడపరెడ్డి రాజు, రామకృష్ణ, బాపునాయుడుతో పాటు కుత్బుల్లాపూర్‌కు చెందిన నాని బాబు ఉన్నారు. వీరికి సహకరించిన భానుప్రకాశ్‌, కిరణ్‌కుమార్‌ అనే హెల్త్‌ అసిస్టెంట్లను కూడా అరెస్ట్‌ చేశారు. వీరిపై 120(బి), 406, 420, 467, 468, 471, 472 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఒక్కరిద్దరు మినహా అందరూ దాదాపు రెండు వారాల పాటు జైల్లో ఉండి వచ్చారు. అయితే.. వీరంతా విధులకు గైర్హాజరు అయ్యారని.. ఎక్కడికి వెళ్లారో తెలియదంటూ ప్రధాన కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు వీరిని విధుల్లోకి తీసుకున్నారు. హెల్త్‌ అసిసెంట్ల బాగోతాన్ని రాచకొండ కమిషనర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పినా సంబంధిత విభాగం అధికారులకు తెలియకపోవడం విశేషం.

బల్దియాలో జరిగిన అక్రమ నియమాకాలను వివరాలతో సహా మీడియా బయటపెట్టడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ స్పందించారు. అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లినవారిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. బర్త్‌ అండ్‌ డెత్‌ విభాగంలోని ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులను అక్రమంగా నియమించడమే కాకుండా... అరెస్ట్‌ అయి 53 రోజులు విధులకు హాజరుకాకపోయినా వేతనాలు విడుదల చేశారు. అయితే దీని వెనక ఎవరి పాత్ర ఉన్నా వదిలేది లేదంటున్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌.

ఇదిలావుంటే ఔట్‌సోర్సింగ్‌ కార్మికులనే కాకుండా.. తప్పుచేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. అయితే... ప్రస్తుతం ఉన్న సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే రెండేళ్ల నుండి ఆరేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇలాంటి అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ మెమోలు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న కార్మికులను సమకూరుస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

06:24 - April 13, 2018

హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంలా ఉంది తెలంగాణ టీడీపీ పరిస్థితి. అసలే తెలంగాణలో టీడీపీ లేదని ప్రచారం జరుగుతుండగా.. ఉన్న నాయకులు తలోదారి చూసుకుంటున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు కరుణించి ఏవైనా నామినేటెడ్‌ పదవులు ఇస్తారని తెలుగు తమ్ముళ్లు ఆశించారు. అయితే... తాజాగా టీటీడీ బోర్డు సభ్యులుగా యువతకే చంద్రబాబు అవకాశమిస్తారని ప్రచారం జరుగుతుండడంతో సీనియర్లు నిరాశకు గురవుతున్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పుకుంటున్న టీడీపీ సీనియర్‌ నేతలు.. పదవులు దక్కలేదన్న ఆందోళనలతో అసంతృప్తికి గురువుతున్నారు. పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. అధినేత చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నామినేటెడ్‌ పదవులు కూడా దక్కడం లేదని సీనియర్‌ నేతలు వాపోతున్నారు. ఇప్పటికే నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న దేశం నేతలకు.. టీటీడీ బోర్డు సభ్యుల నియామకం మరింత చిచ్చు రేపుతోంది.

తెలంగాణలో టీడీపీ కనుమరుగైందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఉన్న కొంతమంది నేతలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కీలకంగా మారే అవకాశం లేకపోలేదంటూ నేతల్లో ధీమా కల్పిస్తున్నారు. అవసరమైతే ప్రధాన పార్టీలతో పొత్తు కూడా ఉంటుందని సంకేతాలిచ్చారు. ఈ తరుణంలో భర్తీ చేస్తున్న టీటీడీ బోర్డు సభ్యుల కోసం.. తెలంగాణ నేతలు తీవ్రంగానే పోటీ పడుతున్నారు. అయితే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో.. ముందు నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న యువ నేతలతో పాటు.. ఓ ఎమ్మెల్యేకు టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం దక్కుతుందన్న సమాచారం సీనియర్‌ నేతలకు అందింది. దీంతో సీనియర్లు కొంతమంది చంద్రబాబు దగ్గర తమ ఆవేదనను వ్యక్తం చేయడంతో.. బోర్డు సభ్యుల నియామకంలో తెలంగాణ నేతల పేర్లు తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టీడీపీలో సీనియర్లంతా తలోదారి చూసుకుంటున్నట్లు ట్రస్ట్‌భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో సీనియర్లు అడ్డుపడడంతో కార్యకర్తలు సీనియర్లపై సీరియస్‌గా ఉన్నారట. నేతలు పార్టీ మారినా.. పార్టీ కోసం పని చేస్తున్నవారికే పదవులు ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. మరి.. తమ్ముళ్ల కోరికను చంద్రబాబు ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి. 

06:23 - April 13, 2018

హైదరాబాద్ : పార్టీ మారుతారంటూ ఒకరోజు... లేదు లేదు ఆయనే పార్టీలోనే ఉన్నారంటూ మరో రోజు. గ్రేటర్‌ కాంగ్రెస్‌లో ఎవరినోట విన్నా ఆయన చర్చనే... ఆయనే దానం నాగేందర్‌. పార్టీలో ఒకరోజు హడావుడి చేయడం, మళ్లీ సైలెంట్‌ కావడం దానం స్టైల్‌. అయితే తాజాగా దానం ఇచ్చిన విందు పార్టీలో హీట్‌ పుట్టిస్తోంది. ఇంతకీ దానం విందు రాజకీయాల వెనక మతలబు ఏంటి ? రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పుంజుకుంటోంది.. కానీ, గ్రేటర్‌లో మాత్రం స్తబ్ధత నెలకొంది. గ్రేటర్‌ కాంగ్రెస్‌ దిక్కుమొక్కులేని అనాధలా మారింది. గ్రేటర్‌ ఫలితాల తరువాత గ్రేటర్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దానం నాగేందర్‌.. ఆ తరువాత అంటీముట్టనట్లు వ్యవహరించడంతో పార్టీని నైరాశ్యంలోకి నెట్టింది. పార్టీ హైకమాండ్‌ గ్రేటర్‌ విషయంలో ఓ స్పష్టం ఇవ్వకపోవడం... దానంతో ఎవరూ మాట్లాకడపోవడం.. ఇక ఇతర సిటీ నేతలెవరూ పట్టించుకోకపోవడం ఇవన్నీ గ్రేటర్‌ కాంగ్రెస్‌కు స్తబ్ధతకు కారణమయ్యాయి.

దానం నాగేందర్‌ పార్టీ మారుతాడంటూ మధ్యమధ్యలో వస్తున్న వార్తలు పార్టీ కేడర్‌లో మరింత కలవరానికి గురి చేశాయి. దీనికితోడు దానం పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరించడంతో.. వస్తున్న వార్తలకు బలం చేకూరింది. దానం సైలెంట్‌గా సైడైపోవడం, అంతలోనే ఏదో ఒక కార్యక్రమంలో హడావుడి చేయడం ఇటీవల పార్టీలో సర్వసాధారణంగా మారింది. ఈ పరిణామాలు గ్రేటర్‌లో పెద్ద కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేశాయి.

అయితే... తాజాగా దానం నాగేందర్‌ నేతలకు, కార్యకర్తలకు ఇచ్చిన విందు.. పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దానం ఉన్నట్లుండి ఇప్పుడు ఇంత పెద్ద దావత్‌ ఎందుకిచ్చినట్లు అని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే దానం కార్యకర్తల వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొడుతున్న కరపత్రం కారణంగానే ఈ విందు ఇచ్చినట్లు పలువురు చెప్పుకుంటున్నారు. అసలు ఈ కరపత్రంలో ఏముందంటే.. సిటీ నేతలపై కార్యకర్తలు తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా బాగా సంపాదించుకుని ఇప్పుడు హాయిగా పేకాట ఆడుతూ కూర్చున్నారు. ఇప్పటికైనా పని చేయండి లేకుంటే వెళ్లిపోండి.. అంటూ వెలువడిన ఈ కరపత్రం రాష్ట్ర కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకుందాం.. ఇట్లు రగిలిపోతున్న జంటనగరాల కాంగ్రెస్‌ కార్యకర్తలు అంటూ కరపత్రాల్లో ప్రచురించారు. గ్రేటర్‌కు చెందిన ఏడుగురు నేతలే టార్గెట్‌గా ఈ కరపత్రాలు వెలువడ్డాయి. గత నాలుగు రోజులుగా వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ కరపత్రం ఎఫెక్ట్‌తోనే దానం మళ్లీ యాక్టివ్‌ అయ్యారని పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు దానంను తప్పించాలని మర్రి శశిధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డిలు గళం వినిపిస్తున్న తరుణంలో... వాటినుంచి బయటపడేందుకు దానం ఈ విందు రాజకీయాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

06:20 - April 13, 2018

విజయవాడ : ప్రత్యేకహోదా పోరును మరింత ఉధృతం చేసే దిశగా లెఫ్ట్‌పార్టీలు, జనసేన అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలో సంయుక్తంగా పాదయాత్ర నిర్వహించిన ఈ పార్టీలు.... మరోపోరుకు సిద్ధమవుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నాయి. ఈనెల 16న జరిగే రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు, జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించిన లెఫ్ట్‌ ,జనసేన పార్టీలు మరో పోరుకు సిద్ధమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌తో సీపీఎం, సీపీఐ నేతలు భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏం చేయాలన్నదానిపై వీరు చర్చించారు. విజయవాడలో లెఫ్ట్‌, జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో అదే తరహాలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. భవిష్యత్‌లో ఉమ్మడిగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్‌ అయ్యారు. ఈ నెల 16న జరిగే ఏపీ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్‌ను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు.

అనంతపురం, ఒంగోలు, శ్రీకాకుళంలో ప్రత్యేకహోదా కోరుతూ నిర్వహించిన బహిరంగ సభలు వాయిదా వేశారు. ఈనెల 15న జరుగనున్న సభనూ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర బంద్‌ తర్వాత తేదీలను ప్రకటించనున్నారు. విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. మేధావులతోనూ సమావేశాలు నిర్వహించాలని ఇరుపార్టీల నేతలు నిర్ణయించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ద్రోహం చేసిందని లెఫ్ట్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. ప్రధానమంత్రి మోదీ ఎవరిమీద దీక్ష చేస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని దీక్ష ఓ నాటకమని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా సాధనకు టీడీపీ, వైసీపీతోపాటు బీజేపీ నేతలపైనా ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రజల్లో హోదా ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టేందుకు వ్యూహరచన చేశారు. 

16న బంద్ కు వామపక్షాలు..జనసేన మద్దతు..

హైదరాబాద్ : ప్రత్యేకహోదా పోరును మరింత ఉధృతం చేసే దిశగా లెఫ్ట్‌పార్టీలు, జనసేన అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలో సంయుక్తంగా పాదయాత్ర నిర్వహించిన ఈ పార్టీలు.... మరోపోరుకు సిద్ధమవుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నాయి. ఈనెల 16న జరిగే రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు, జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 

హైదరాబాద్ ఫెస్ట్...

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఫెస్ట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 13 నుంచి 22 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమాన్ని భాగ్యనగర వాసులకు మరపురాని అనుభూతిని మిగిల్చే విధంగా నిర్వహించబోతున్నారు. విజ్ఞాన, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.

భారీ వర్షాలు..15 మంది మృతి...

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లో భారీవర్షాలు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలులతో వర్షం కురియడంతో యూపీలో 15 మంది మృతి చెందారు. తాజ్‌ మహల్‌ వద్ద ఓ పిల్లర్‌ కూలిపోయింది. రాజస్థాన్‌లో వర్షాలకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

'ఎమ్మెల్యే కుల్దీప్ పై ఎలాంటి ఆధారాలు లేవు'...

ఉత్తర్ ప్రదేశ్ : ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఎలాంటి ఆధారాలు లేవని ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఎమ్మెల్యే సెంగార్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ హైకోర్టు యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరైన ఆధారాలు లేనందువల్లే ఆయనను అరెస్టు చేయలేదని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. 

ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం లిఖిత పూర్వక సమాధానం...

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లిఖిత పూర్వకమైన సమాధానాన్ని సమర్పించింది. మార్చి 20న ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఎస్‌సి ఎస్‌టి చట్టంపై కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల దేశానికి చాలా నష్టం జరిగిందని పేర్కొంది.

 

మమత బెనర్జీకి ఎదురు దెబ్బ...

పశ్చిమ బెంగాల్ : ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఈ నెల 16 వరకు సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసు జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియలో ప్రతిపక్షాలు చేసే ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ ఓ నివేదికను ఈ నెల 16న సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

బెంగళూరుకు కేసీఆర్...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 9.45 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవగౌడతో సీఎం సమావేశం కానున్నారు.

భావోద్వేగానికి గురైన జస్టిస్ జాస్తి...

ఢిల్లీ : సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ భావోద్వేగానికి గురయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అధికారాలను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు తిరస్కరించారు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాల రీత్యా తాను ఈ పిల్‌ను విచారించలేనని పేర్కొన్నారు.

Don't Miss