Activities calendar

14 April 2018

21:53 - April 14, 2018

అగ్రరాజ్యపు వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశపు సార్వభౌమాధికారాన్ని మోదీ విదేశీయులకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు ప్రధాని మోదీ అని ఎంసీపీఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ విమర్శించారు. ప్రపంచ సామ్రాజ్య వాదానికి నిలువెత్తు నిరద్శనంగా వున్న అమెరికాకు మోదీ మోకరిల్లుతున్నారని గౌస్ పేర్కొన్నారు. నాలుగేళ్ళ ప్రధాని మోదీ పాలన ఎలా వుంది? దేశంలో ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులు ఎలా వున్నాయి? వంటి వివిధ అంశాలపై ఎంసీపీఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ ఫేస్ టూ ఫేస్..

21:37 - April 14, 2018

జమ్ము కశ్మీర్‌ : లోని కథువాలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను చంపిన వారిని ఉరి తీయాలని చిన్నారి- కన్నతల్లి కన్నీరుమున్నీరైంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి సైతం కథువా ఘటనపై స్పందించింది. చిన్నారిని చంపిన వారిని ఉరితీయాలని భారత్‌ను కోరింది. కథువా ఘటనను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఖండించారు. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మౌనప్రదర్శన చేపట్టారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌
విద్వేషం, కక్ష సాధింపు అభం శుభం తెలియని ఓ చిన్నారిని బలితీసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికపై మానవ మృగాలు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాయి. కథువా ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

హత్య చేసిన వారిని ప్రాణాలతో వదిలి పెట్టవద్దని తల్లి డిమాండ్
తన కూతురుపై అకృత్యానికి పాల్పడి హత్య చేసిన వారిని ప్రాణాలతో వదిలి పెట్టవద్దని చిన్నారి తల్లి కోరింది. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను ప్రమాదాల్లో కోల్పోయానని.. ఇప్పుడు మూడో పాప ఇలా దూరమైందని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. తన బిడ్డను చంపిన వారిని ఉరితీయాలని బాధితురాలి తల్లి డిమాండ్‌ చేశారు.

కథువా చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి
కథువా చిన్నారి హత్యాచార ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. దీనిని భయానక ఘటనగా అభివర్ణించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.. ఘాతుకానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. మీడియాలో వచ్చిన కథనాలు తనను కదిలించాయన్న గుటెర్రెస్‌... పసి ప్రాణాన్ని చిత్రవధ చేసి చంపేసిన మానవ మృగాన్ని క్షమించకూడదు.. వారిని తక్షణమే ఉరి తీసి ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కథువా ఘటనను ఖండించిన పవన్‌కల్యాణ్‌
కథువా ఘటనను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. ఆడపిల్లల జోలికి వెళ్తే వారి తోలు తీయాలని అన్నారు. కథువా ఘటనను ఖండిస్తూ హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పవన్‌ మౌన ప్రదర్శన చేపట్టారు. ఆడ పిల్లల్ని వేధించే ఈవ్‌ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టే వాళ్లని బహిరంగంగా శిక్షించాలన్నారు. సింగపూర్‌ తరహాలో శిక్షలు అమలు చేయాలని అప్పుడే అందరికీ భయం పుడుతుందన్నారు.

కథువా ఘటనను తలుచుకుంటూ సన్నీలియోన్ ట్వీట్‌..
సినీనటి సన్నీ లియోన్‌ కథువా ఘటనను తలుచుకుంటూ.. చేసిన ఓ ట్వీట్‌ అందరినీ కదిలించి వేస్తోంది. తన దత్త పుత్రిక నిషా కౌర్‌ను ఒడిలో పెట్టుకుని ఓ ఫోటో దిగి.. ఓ సందేశాన్ని ఆమె ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. 'తల్లీ.. నీకు ప్రామిస్‌ చేస్తున్నా. నా హృదయం, ఆత్మ, దేహం... ఇవన్నీ నిన్ను రక్షించుకునేందుకే. ఈ లోకంలో చెడు పెరిగిపోయింది. అందుకే నీ కోసం నేను ఎల్లవేళలా కృషి చేస్తుంటా. నీ రక్షణ కోసం నా ప్రాణాలైన పణంగా పెడతా అంటూ సన్నీలియోన్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ అందరినీ కదిలిస్తోంది.

రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఖండన
కథువా ఘటనను ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఖండించారు. పలు చోట్ల జస్టిస్‌ ఫర్‌ ఆసిఫా అంటూ క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించారు. 

21:05 - April 14, 2018

హైదరాబాద్ : బీజేపీ పాలన వల్ల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో హత్యాచారం చేసిన ఎమ్మెల్యే కుల్దీఫ్‌ సింగ్‌ను కఠినంగా శిక్షించాలని కవిత డిమాండ్ చేశారు. దేశంలో ఎస్టీ ఎస్టీ చట్టాలను నిర్వర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపించారు. 

21:03 - April 14, 2018

తూ.గోదావరి : ఈనెల 16న విపక్షపార్టీలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో బంద్‌ నిర్వహించుకోవాలన్నారు. శాంతియుత పద్దతిలో నిరసనలు తెలిపితే ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు ఏపీ హోం మంత్రి. 

20:56 - April 14, 2018

విజయనగరం : జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండో పంటకు అధికారులు నీటిని విడుదల చేయకపోవడంపై ఆగ్రహించిన రైతాంగం మూకుమ్మడిగా ప్రాజెక్టును ముట్టడించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అయిన శత్రుచర్ల విజయరామరాజు, మరో ఎమ్మెల్సీ అయిన ద్వారపురెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు ప్రాజెక్టును ముట్టడించి... అనధికారికంగా కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రెండో పంటకు సాగునీటిని విడుదల చేయాలని గత కొంతకాలంగా ఇంజనీరింగ్ అధికారులను అడుగుతున్నారు. అయితే, ప్రాజెక్టు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ దీనికి నిరాకరిస్తూ వస్తున్నారు. దీంతో రైతులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి... ప్రాజెక్టును ముట్టడించారు. 

20:54 - April 14, 2018

రంగారెడ్డి : రాష్ట్రంలో 50శాతంగా ఉన్న బీసీలకు 19 అసెంబ్లీ సీట్లు మాత్రమే కేటాయించిన టీఆర్‌ఎస్‌ పాలకులు... సామాజిక న్యాయం అంటూ డైలాగులు కొడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్వి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా మతోన్మాద శక్తులు దళితులపై దాడులకు తెగబడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శించారు. సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ఈనెల 22న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో బహిరంసభకు తరలి రావాలని తమ్మినేని ప్రజలకు పిలుపునిచ్చారు. 

20:50 - April 14, 2018

హైదరాబాద్‌ : నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న దివ్యాంగుల నేషనల్‌ టీ 20 క్రికెట్‌ టోర్నమెంట్‌ను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌కు 24 రాష్ట్రాల నుండి దివ్యాంగులు పాల్గొంటున్నారు. దివ్యాంగులకు సహాయం చేసేందుకు తానెప్పుడు ముందుంటానని జనేసన అధినేత పవన్‌ తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌ కోసం 5 లక్షలు నగదును బహుకరించారు. మరో 25 లక్షలు సైతం అందిస్తున్నట్లు పవన్‌ ప్రకటించారు.

20:47 - April 14, 2018

ఆస్ట్రేలియా : గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతున్న 21వ కామన్వెల్త్‌ పోటీల్లో ఇవాళ భారత్‌కు ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. శనివారం ఒక్కరోజే ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. భారత మహిళా బాక్సింగ్ సంచలనం మేరీకోమ్‌, బాక్సర్ గౌరవ్ సోలంకి స్వర్ణ పతకాలతో శుభోదయం పలకగా... తర్వాతి వంతు సంజయ్ రాజ్‌పుత్‌కి వచ్చింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో రాజ్‌పుత్ బంగారు పతకం సాధించాడు. అదే పంథాలో పయనించిన భారత జావెలిన్ సంచలనం నీరజ్ చోప్రా సైతం చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ జావెలిన్ త్రో పోటీల్లో భారత్‌కు స్వర్ణపతకం అందించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వీరితో పాటు రెజ్లర్లు సైతం అద్భుత ప్రదర్శన కనబర్చారు. మహిళల విభాగంలో వినేశ్ ఫోగాట్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా... పురుషుల విభాగంలో సుమిత్ మాలిక్ బంగారు పతకం దక్కించుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 23 బంగారు పతకాలు వచ్చి చేరాయి. ఇక బాక్సర్లు మనీష్ కౌశిక్, అమిత్ ఫాంగల్ రజత పతకాలతో మెరిశారు. దీంతో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఇప్పటివరకు 52కు చేరాయి. 

20:43 - April 14, 2018

ఢిల్లీ : గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశంతో సిరియాపై అమెరికా, మిత్రదేశాలు మెరుపు దాడులు చేపట్టారు. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌కు వ్యతిరేకంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఫ్రాన్స్‌, యూకే దళాలు కూడా అమెరికాతో చేతులు కలిపి సిరియాపై సైనిక దాడులు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సిరియాలో జరిగిన రసాయన దాడులపై ఆగ్రహంతో, దానికి ప్రతీకార చర్యగా అమెరికా ఈ దాడులు చేస్తోంది. అసద్‌ రసాయన ఆయుధాలను వాడినందుకు శిక్షగా, మరోసారి రసాయన ఆయుధాలు వాడకుండా ఆపేందుకు సిరియాపై వైమానిక దాడులు చేస్తున్నామని ట్రంప్‌ శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఆ తరువాతే.. ఈ దాడులు మొదలయ్యాయి. 

20:20 - April 14, 2018

విశాఖ : నర్సీపట్నం బలిగట్టంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. నిన్న విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తీవ్ర మనస్తాపం చెంది ఉరివేసుకొని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తల్లిదండ్రుల ఒత్తిడి, పిల్లల తొందరపాటు మనస్తత్వమే... ఇలాంటి ఘటనలకు కారణమని మానసిక వేత్తలు చెబుతున్నారు. 

19:55 - April 14, 2018

హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 127వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు పలువురు నేతలు నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి దేశంలో పాలన సాగాల్సిన అవరం ఉందని నేతలు అన్నారు. బహునులకే రాజ్యాధికారం రావాలి.. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలు సాధించాలి.. జైభీమ్‌ అంటూ నినాదాలు మార్మోగాయి. తెలుగు రాష్ట్రాల్లో బి.ఆర్‌.అంబేద్కర్‌ 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతివనం : చంద్రబాబు
బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగస్ఫూర్తిని అనుసరిస్తూ దేశంలో పాలన సాగాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్‌ గొప్పతనం భావితరాలకు తెలియాలనే రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతివనం నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

ఆశయాలను సాధించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అంబేద్కర్‌కు నిజమైన నివాళి అంటే ఆయన ఆశయాలను సాధించడమే అన్నారు. రాష్ట్రంలో దళితులు పారిశ్రామిక వేత్తలు గా ఎదగడానికి టి-ప్రైడ్‌ ప్రోగామ్‌ను అమలు చేస్తున్నామన్నారు.

బలహీన వర్గాలకు మోదీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోంది - బి.వి.రాఘవులు

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ లిబర్టీ వద్ద సీపీఎం నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బలహీన వర్గాలకు మోదీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందన్నారు సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు రాఘువులు.

ఓయూలో 127 కేజీల భారీకేక్‌ కట్‌చేసిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
ఉస్మానియా వర్సిటీలో బాబాసాహెబ్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 127 కేజీల భారీ కేక్‌ను కట్‌చేసి విద్యార్థులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీమాస్‌ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్‌కు నివాళులర్పించారు. కులవ్యవస్థ నశించినపుడు దేశంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తుందన్నారు.

ట్యాంక్‌బండ్‌పై 'రన్‌ ఫర్‌ క్యాస్ట్‌ ఫ్రీ ఇండియా' కార్యక్రమం
దళిత చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో... 127వ అంబేద్కర్‌ జయంతి సందర్బంగా ట్యాంక్‌బండ్‌పై 'రన్‌ ఫర్‌ క్యాస్ట్‌ ఫ్రీ ఇండియా' కార్యక్రమం నిర్వహించారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జేపీ, టీఎస్పఈఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

టీడీపీ ప్రభుత్వం దళితులపై దాడులకు తెగబడుతోంది: సీపీఎం కార్యదర్శి మధు
అంబేద్కర్‌ జయంతి సందర్భంగా.. గుంటూరులో వామపక్షాలు, దళిత-ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలి జరిగింది. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులపై మధు ఆందోళన వ్యక్తం చేశారు.

అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం జనసేన కృషి: పవన్
హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో జరిగిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు.

దేశంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి : రఘువీరా
గుంటూరులో జనసేన, కాంగ్రెస్‌, వైసీపీ, దళిత-ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచే దేశంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

సామాజికన్యాయ సాధనకు అంబేద్కర్‌ చూపిన మార్గంలో సాగాలి : వామపక్షాలు
బాబాసాహెబ్‌ ఆశయాల సాధనలో ముందుకు సాగుతామని రాజకీయపార్టీలు ప్రకటించగా.. సామాజికన్యాయ సాధనకు అంబేద్కర్‌ చూపిన మార్గంలో సాగాలని వామపక్షాలు, దళితసంఘాలు పిలుపు నిచ్చాయి.

 

19:27 - April 14, 2018

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధం సినిమాలో రియల్ స్టార్ నానితో డ్యుయల్ రోల్ చేయించి మరో బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో చిత్తూరు జిల్లా యాసతో నాని చితక్కొట్డాడు. ఆ యాసతో ఇప్పటివరకూ పెద్దగా సినిమాలు రాలేదు. దాన్ని గమనించిన గాంధీ తన స్థానిక యాసతో మరో హిట్ ను కాదు కాదు బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ప్రముఖ సినీ రచయిత మేర్లపాక మురళికి గాంధీ కుమారుడు కూడా. చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం, వెదుళ్ళచెరువు గ్రామంలో జన్మించిన గాంధీ..సినిమాలపై వున్ ఆసక్తితో చెన్నైలోని ఎల్. వి. ప్రసాద్ సంస్థలో సినిమా రంగానికి చెందిన మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చి 2013 లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో దర్శకుడిగా ప్రయానం ప్రారంభించి తన ప్రతిభతో వరుస హిట్స్ ను అందుకుంటున్నాడు. తండ్రి మేర్లపాక మురళి ప్రముఖ రచయిత మరియు విలేఖరి. ప్రముఖ వార్తా పత్రిలకు పనిచేశాడు. ఆయన రాసిన 24 నవలలు స్వాతి వారపత్రికలో ప్రచురించబడ్డాయి. ఈయనకు చే గువేరా అంటే అభిమానం ఉండటంతో కుమారుడికి అదే పేరు పెట్టాడు, కానీ ఊర్లోని వాళ్ళకి ఆ పేరు పలకడం చేతకాకపోవడంతో అతని ఐదో యేట గాంధీ అని పేరు మార్చాడు. 

19:07 - April 14, 2018

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా లెక్కకు మించి వెంచర్లను పూర్తి చేసుకుని ఎందరో కష్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ సుఖీభవ ప్రాపర్టీస్‌. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్-వరంగల్‌లో కొత్త వెంచర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వనమాలి వెంచర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సుఖీభవ ప్రాపర్టీస్‌ సంస్థ 'సీఎండీ ... రియల్ ఎస్టేట్‌ రంగంలో 29 సంవత్సరాల అనుభవం ఉన్న గురురాజుగారు చెప్పే విశేషాలు.

19:02 - April 14, 2018

సంగారెడ్డి : నగరంలో జరుగుతున్న ప్రధాన రోడ్డు అభివృద్ధి పనులు ఇంకా పూర్తికాకపోవటంతో ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తుందని జనం ఆరోపిస్తున్నారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి హరీష్‌ రావు నాణ్యత లోపం పై జోక్యం చేసుకున్నా కూడా కాంట్రాక్టర్లు, అధికారుల్లో చలనం లేదు.

సంగారెడ్డి ప్రధాన రహదారి పనుల నాణ్యత లోపంతో జనం ఆవేదన

మండలం కేంద్రంగా ఉన్నప్పటి కంటే జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని సంగారెడ్డి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ అభివృద్ధి పనుల్లో ఏ మాత్రం నాణ్యత కనిపించడం లేదని జనం ఆవేదన చెందుతున్నారు. 2016 డిసెంబర్‌లో ప్రధాన రహదారి విస్తరణ పనులను జిల్లా ఇంచార్జ్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అయితే 2018 మార్చి నాటికి రోడ్డు విస్తరణ పనులు పూర్తికావల్సింది. కానీ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో రోడ్డు విస్తరణ పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు.

రూ.14.50 లక్షలతో చేపట్టిన పనులను పర్యవేక్షిస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు
14 కోట్ల 50 లక్షలతో చేపట్టిన ఈ పనులను హెచ్‌ఎండీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కాంట్రాక్టర్లు పనుల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పూర్తయిన పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదిన్నర కాలం పూర్తవుతున్నా పనులు అసంపూర్తిగా ఉండడంతో సంగారెడ్డి పట్టణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణలో కాంట్రాక్టర్లు ఒక్కో చోట ఒక్కోలా పనులు చేపట్టడంతో ప్రజలు తరుచు ప్రమాదాలకు గురవుతున్నారు.

5 కిలోమీటర్ల పొడవున జరుగుతున్న రోడ్డు విస్తరణ,అస్తవ్యస్తంగా ఫుట్‌పాత్, డ్రైనేజీ నిర్మాణాలు
సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి మహబూబ్‌సాగర్‌ వరకు మొత్తం 5 కిలో మీటర్ల పొడవున పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో డివైడర్‌ నిర్మాణం, ఫుట్‌పాత్, డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టారు. అయితే ఫుట్‌పాత్, డ్రైనేజీ నిర్మాణాలను అస్తవ్యస్తంగా నిర్మించారు. వర్షం కురిస్తే రోడ్డుపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా అధికారుల తీరుపై మంత్రి అసంహనం వ్యక్తం చేశారు. పనుల్లో జోక్యం చేసుకుని కాంట్రాక్టర్‌ను పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయిన కాంట్రాక్టర్‌లో చలనం లేదు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సాక్షాత్తు మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకున్న పనులపై కాంట్రాక్టర్‌లో కదలికలేక పోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులపై విచారణ జరిపి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. జరక్క జరక్క జరుగుతున్న రోడ్డు పనుల్లో కనీస ప్రమాణాలు పాటించకపోవడంపై అధికారులు ఇకనైన స్పందించాలని సంగారెడ్డి వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

18:58 - April 14, 2018

హైదరాబాద్‌ : జూనియర్‌ ఇంటర్‌ ఎంఈసీ పరీక్షా ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్ మార్కులు సాధించింది మాస్టర్‌మైండ్స్‌. స్టేట్‌ ఫస్ట్‌ మార్కులతో పాటు ఇంటర్‌ ఎంఈసీ ఫలితాలలోనే ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేశారు మాస్టర్‌మైండ్‌ విద్యార్థులు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులకు మాస్టర్‌మైండ్స్‌ యాజమాన్యం అభినందనలు తెలిపింది. అత్యుత్తమ విద్యాబోధన, సీనియర్‌ ఫ్యాకల్టీచే తరగతుల నిర్వహణ వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని మాస్టర్‌మైండ్స్‌ యాజమాన్యం తెలిపింది. 

18:52 - April 14, 2018

ఢిల్లీ : అత్యాచార ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఘాతుకానికి పాల్పడిన వారిని ఉరితీయాలని యూఎన్‌ సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ భారత ప్రభుత్వాన్ని కోరారు. ఓ పసిప్రాణాన్ని భయంకరమైన రీతిలో చిత్రహింసలకు గురిచేసి హత్యచేయడం మానవత్వానికికే మచ్చ అన్నారు. మీడియాలో వచ్చిన కథనాలు తనను ఎంతగానో కలచి వేశాయని.. ఇలాంటి మానవ మృగాలను క్షమించకూడదని గుటెర్రెస్‌ అన్నట్టు ఆయన ప్రతినిధి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా జమ్మూకశ్మీర్‌లోని కథువా గ్యాంగ్‌ రేప్‌ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కథువా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండనే సరైన శిక్షగా పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మేనకాగాంధీ తెలిపారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతుండడంతో బాధితురాలి కుటుంబం గ్రామం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

18:40 - April 14, 2018

హైదరాబాద్ : కూకట్‌ప్లల్లి అంబేద్కర్‌ జయంతోత్సవాల్లో రసాభాస నెలకొంది. ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభలో కలెక్టర్‌పై తీరుపై మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మండిపడ్డారు. జిల్లా కలెక్టర్‌ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దీంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే కృష్ణారావు కల్పించుకొని ఇది రాజకీయ సభ కాదని దేశం గర్వించదగ్గ మహానీయుడి సభలో ఇలా మాట్లాడ్డం సరికాదన్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని శాంతింజేసేందుకు ప్రయత్నించారు. వారిని అక్కడి నుండి పంపించి వేశారు. 

ప్రెస్ మీట్ లో భోరుమని ఏడ్చిన 'వైగో'..

హైదరాబాద్ : కావేరీ జలాల చిచ్చు ప్రాణాలను హరించివేస్తోంది. అయినా కేంద్రం మాత్రం తన రాజకీయ లబ్దికోసం కావేరీ జలాలపై ఏవిధంగా స్పందించటంలేదు. ఈ నేపథ్యంలో ఆత్మాహుతికి యత్నించి..చికిత్స పొందుతు మరణించిన మేనల్లుడిని తలచుకునిఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో బోరున విలపించారు. పాత్రికేయుల సమక్షంలో కూడా వెక్కివెక్కి ఏడ్చారు. మధురైలోని అపోలో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శరవణను చూసి తలబాదుకుంటూ విలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావేరి వ్యవహారంలోనే కాకుండా మరే విషయంలో కూడా ఇంకెవరూ బలిదానాలు చేయవద్దని కోరారు.

18:15 - April 14, 2018

విజయవాడ : సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. రాజధాని నిర్మాణానికి కోట్ల రూపాలయిలు ఖర్చు చేసే చంద్రబాబు అసలు రాజధాని నిర్మాణాన్ని కట్టే ఉద్ధేశం వుందా? లేదా? అని ప్రశ్నించారు. ఒకసారి రాజధాని అమరావతిని బాహుబలి సెట్ లాంటి రాజధాని నిర్మిస్తామనీ.. మరోసారి సింగపూర్ లాంటి రాజధాని అంటారని అసలు రాజధానిని చంద్రబాబు నిర్మిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతా? లేక భ్రమరావతిగా మిగిలిపోతుందా? అంటు జగన్ చంద్రబాబును ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం అంటు కాంట్రాక్టర్ల కు మాత్రం నాలుగేళ్లగా చంద్రబాబు కోట్లాది రూపాయలను దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి దాని స్థానంలో ప్యాకేజీ ప్రకటిస్తే హోదా కోసం పోరాడకుండా ప్యాకేజ్ తీసుకున్నారని జగన్ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. 

18:02 - April 14, 2018

కరీంనగర్ : ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ ఫలితాల్లో కరీంనగర్‌ జిల్లాలోని ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్‌ కాలేజి ఆవరణలో విద్యార్థులతో కలిసి యాజమాన్యం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కాలేజీ చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి అభినందించారు. ఆల్ఫోర్స్‌ కాలేజీ అందించిన మెరుగైన విద్యాబోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహకాల వల్లే తాము ఉత్తమ ఫలితాలు సాధించామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. 

17:59 - April 14, 2018

గుంటూరు : రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్‌.అంబేద్కర్‌ 127 జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా చంద్రబాబు అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. శాఖమూరులో 20 ఎకరాలలో రూ.100కోట్లతో అంబేద్కర్ స్ఫూర్తిని చాటేలా అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని నిర్మాణం చేపడతామని చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగస్ఫూర్తిని అనుసరిస్తూ దేశంలో పాలన సాగాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్‌ గొప్పతనం భావితరాలకు తెలియాలనే రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతివనం నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 

17:52 - April 14, 2018

హైదరాబాద్ : ఆడ పిల్లల్ని వేధించే ఈవ్‌ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టే వాళ్లని బహిరంగంగా శిక్షించాలన్నారు. ఆడపిల్లల జోలికి వెళ్తే వారి తోలు తీయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై మానవ మృగాల సామూహిక అత్యాచారం, హత్య ఘటన తనను ఎంతో బాధించిందన్నారు. కథువా ఘటనను ఖండిస్తూ హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పవన్‌ మౌన ప్రదర్శన చేపట్టారు. నిర్భయ చట్టం కూడా.. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే వచ్చిందన్న పవన్‌... సింగపూర్‌ తరహాలో శిక్షలు అమలు చేయాలని అప్పుడే అందరికీ భయం పుడుతుందన్నారు. జనసేన తరఫున.. ఆడపిల్లల్ని రక్షించుకునేందుకు కఠినమైన శిక్షలు పడేలా చట్టాలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. చట్టం బలహీనుల విషయంలో బలంగా, బలవంతుల విషయంలో బలహీనంగా పనిచేస్తోందని పవన్‌ అన్నారు. ఈ విధానంలో మార్పు వచ్చేలా పోరాడతామన్నారు. 

17:45 - April 14, 2018

అమరావతి : ఏపీ విషయంలో కేంద్ర అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 20న తన పుట్టినరోజున ఒక్కరోజు నిరసన తెలుపుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈనెల 20న తన పుట్టినరోజున ..సాయంత్రం వరకు దీక్ష చేస్తానని... . ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. టీడీపీ అంటే ఏంటో కేంద్రానికే కాదు.. మొత్తం దేశానికి తెలిసే విధంగా చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 25 మంది ఎంపీలున్న రాష్ట్రాన్ని బీజేపీ కాదనుకుంటోందని... ఆ 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఢిల్లీని శాసించేది మనమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. కాగా ఏపీ ప్రత్యేక హోదాపై నిరసనల గళం హోరెత్తుతోంది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల అనతరం హోదాకోసం వైసీపీ ఎంపీలు నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి ఏపీ వ్యాప్తంగా అన్ని పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఇదిలా వుండగా..పార్లమెంట్ లో విపక్షాలు వ్యవహరించిన తీరుకు ప్రధాని మోదీ దీక్షచేశారు. ఇప్పుడు తాజాగా సీం చంద్రబాబు నాయుడు కూడా ఈనెల 20 తేదీన తన పుట్టినరోజు నాడు చంద్రంబాబు దీక్ష చేపట్టబోతున్నాను. 

17:37 - April 14, 2018

10 తరువాత అవకాశం వున్న వివిధ కోర్సుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంఈసీ, సీఏ కోర్సుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సీఏ కోర్సులో పాస్ పర్సెంటేజ్ ఎంతుంటుంది? సీఏ చేయాలంటే ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకోవాలి? మాస్టర్స్ మైండ్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, మరియు ఎంఈసీ, సీఏ కోర్సుల గురించి సలహాలు, సూచనల గురించి తెలుసుకోవాలంటే మాస్టర్ మైండ్స్.. 

17:28 - April 14, 2018

హైదరాబాద్ : కేంద్రంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్ట్ ఫ్రంట్ కు యత్నిస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాల ఆధ్వర్వంలో బహుజన ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధం లేదని రాఘవులు పేర్కొన్నారు. జాతీయ ఫ్రంట్ యొక్క విధివిధానాలు పూర్తిగా ప్రకటించిన తరువాతనే జాతీయ ఫ్రంట్ లో తాము  చేరేది లేనిది నిర్ణయించుకుంటామని పేర్కొన్నారు. ఏప్రిల్ 18 నుండి 22 వరకూ నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతాయని రాఘవులు తెలిపారు. కథువా ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటుంటే..బీజేపీ మాత్రం జరిగిన ఘటనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. గతంలో 2002లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయనీ..రాష్ట్ర విభజన అనంతరం ఇదే మొదటిసారిగా జరుగుతున్నాయని రాఘువులు పేర్కొన్నారు.  సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ఈ నెల 22న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. ఈ సందర్భంగా సరూర్‌ నగర్‌ స్టేడియంలో సభ ఏర్పాట్లను సీపీఎం నాయకులు పరిశీలించారు. సభ ప్రాంగణంలో భారీ బెలూన్‌ను ఎగురవేశారు. ఈ బహిరంగ సభలకు ప్రజలు తరలివస్తారంటున్న బీవీ రాఘవులు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..

అనంతపురం : కదిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులు గణేష్,చంద్రశేఖర్, హరీష్ లుగా గుర్తించారు. 

100కోట్లతో అంబేద్కర్ స్మృతివనం ఆకృతి ప్రాజెక్ట్ : చంద్రబాబు

గుంటూరు : తుళ్లూరు మండలం శాఖమూరులో బాబా సాహెబ్ అంబేద్కర్ 127 జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. శాఖమూరులో 20 ఎకరాలలో రూ.100కోట్లతో అంబేద్కర్ స్ఫూర్తిని చాటేలా అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని నిర్మాణం చేపడతామని చంద్రబాబు తెలిపారు. 18 నెలలలో స్మృతివనం ఆకృతి ప్రాజెక్టును పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దళితులకు తొలిసారి పక్కా ఇళ్లు కట్టించింది టీడీపీయే నని తెలిపారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించేందుకు జంసీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 

పసిడి పతకాన్ని సాధించిన మేరీకోమ్..

హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పంట కొనసాగుతోంది. ఈ క్రమంలో మహిళల బాక్సింగ్‌ విభాగంలో మేరీకోమ్‌కు స్వర్ణం సాధించింది. 48 కేజీల బాక్సింగ్‌ విభాగంలో మేరీకోమ్‌ పసిడి పతకాన్ని దక్కించుకుంది. మేరీతో పాటు మరిందరి విజయాలతో భారత్‌ ఖాతాలో మొత్తం పతకాల సంఖ్య మరింత పెరిగింది. అలాగే... పురుషుల బాక్సింగ్‌ 49 కేజీల విభాగంలో అమిత్‌ రజతం సాధించారు. దీంతో ఇప్పటివరకు భారత్‌కు 23 స్వర్ణాలు, 13 రజతాలు, 16 కాంస్యాలు లబించడంతో పతకాల పట్టికలో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.

సిరియాపై అమెరికా దాడి, 60మంది మృతి..

ఢిల్లీ : సిరియాపై తాజాగా అమెరికా మెరుపు దాడులకు దిగింది. రెబల్స్‌పై సిరియా సైన్యం చేపట్టిన వైమానిక దాడిలో 60 మంది అమాయక పౌరులు మృతి చెందారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. వీరి మరణానికి రసాయన దాడే కారణమని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేేపథ్యంలో రంగంలోకి దిగిన అమెరికా ఫ్రెంచ్, బ్రిటన్ సేనలతో కలిసి డమాస్కస్‌పై బాంబుల వర్షం కురిపించింది. సిరియా రసాయన దాడులు ఆపేంత వరకు తమ దాడులు కొనసాయగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.  

అమ్మాయిని వేధించారని కర్ర పట్టుకున్నా : వపన్

హైదరాబాద్ : ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు 200 మంది యూనిట్ సభ్యులం ఉన్నామని... అయినా బయటివారు వచ్చి, సినిమాకి సంబంధించిన అమ్మాయిలను వేధించారని... అప్పుడు తాను కర్ర పట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మాయిలను రక్షించుకునేందుకు కఠినమైన చట్టాలు ఉండాలని జనసేన డిమాండ్ చేస్తోందని చెప్పారు. మన వ్యవస్థలో మార్పుల కోసం పోరాడుతామని తెలిపారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే వారిని వేధింపుల నుంచి రక్షించుకోవడం ఎంత కష్టమో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తనకు తెలుసని పవన్ చెప్పారు. అమ్మాయిలు ఇంటికి చేరేంత వరకు భయపడుతూ ఉండే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. 

కథువా ఘటన కలచివేసింది : పవన్

హైదరాబాద్ : కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తనను ఎంతో కలచివేశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో కథువా ఘటనే మొదటిది కాదని ఆయన అన్నారు. ఏదైనా దారుణం జరిగితే కానీ, మనలో చలనం రావడం లేదని చెప్పారు. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని తెలిపారు. 

వారిని సింగపూర్ తరహాలో శిక్షించాలి : పవన్

హైదరాబాద్ : అత్యాచారం, ఈవ్ టీజింగ్ లకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటివారికి సింగపూర్ తరహాలో బలమైన చట్టాలను తీసుకురావలనీ..దేశంలో జరుగుతున్ అత్యాచారాలపై ప్రధాని మోదీ స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుంది..కానీ మనుష్యులకు అది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. 

16:46 - April 14, 2018

ప్రస్తుతం హీరోయిన్ క్యారెక్టర్లు గ్లామర్ కే పరిమితంగా వున్న ఈరోజుల్లో గ్లామర్ తోపాటు నటనలో కూడా ప్రతిభ కనబరిచి నటీమణులు కూడా మనకు అక్కడక్కడా కనిపిస్తున్నారు. అటువంటి నటీమణుల్లో కీర్తి సురేష్ కు ఒకరు. అలనాటి అందాల నటి, మహానటి సావిత్రి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటనకు విమర్శకులు కూడా ప్రశంసల్ని కురిపించారు. ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఆమె జీవిత కథను చిత్రంగా రూపొందించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు తెరకి నిండుదనం ... నవరస నటనతో పండుగదనం తీసుకొచ్చిన కథానాయిక సావిత్రి. విశాలమైన కళ్లతో ఆమె చేసిన హావభావ విన్యాసానికి అభిమానులు ఎందరో. అలాంటి సావిత్రి జీవితంలో ఎన్నో ఆనందాలు .. మరెన్నో విషాదాలు వున్నాయి. ఆమె జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది.

సావిత్రి సినిమా ఫస్ట్ లుక్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులు..
సావిత్రి లుక్ లో కీర్తి సురేశ్ ఎలా వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సావిత్రిగా కీర్తి సురేశ్ ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఒక్కసారిగా చూస్తే నిజంగానే ఇది సావిత్రి ఫోటోనే అనుకునేట్టుగా ఈ ఫస్టులుక్ వుంది. సావిత్రి లుక్ తో కీర్తి సురేశ్ ను సగ భాగం మాత్రమే చూపించినా, ఈ పాత్రకి ఆమె కరెక్టుగా సరిపోయిందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. మరికొంత సేపటిలో ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను కూడా వదలనున్నారు. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

కథువా రేప్ కేస్ పై మహిళా న్యాయవాదికి బెదిరింపులు..

జమ్మూకశ్మీర్ : బాధితులకు సరైన న్యాయం చేసేందుకు సిద్ధపడినవారికి, పోరాటం చేసేవారికి బెదిరింపులు సర్వ సాధారణమే. ఈ నేపథ్యంలో కథువా రేప్ కేస్ తరపున వాదించడం వదిలేయమని కొందరు తనను బెదిరిస్తున్నారని...మహిళా న్యాయవాది దీపిక రజావత్ ఆరోపించారు. వాయిస్ ఫర్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలైన దీపిక కఠువా కేసు తరపున వాదిస్తున్నారు. జమ్మూ బార్ అసోసియేషన్ సభ్యురాలు కానందున ఈ కేసు వదిలివేయాలని జమ్మూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు స్లాతియా తనను బెదిరించారని దీపిక ఆరోపించారు. తాను క్లయింట్ కు తప్ప ఎవరికి సమాధానం చెప్పాల్సిన పనిలేదని, ఇలాంటి బెదిరింపులకు తాను లొంగేది లేదని దీపిక స్పష్టం చేశారు.

భారీగా గంజాయి తరలింపు, పట్టుకున్న పోలీసులు..

కామారెడ్డి : రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీనిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి రవాణా కొనసాగుతునే వుంది. ఈ క్రమంలో జిల్లాలోని గాంధారి మండలంలో తరలిస్తున్న 54 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నారు.

గిరిజన మహిళలకు మోదీ చెప్పులు?!..

హైదరాబాద్ ప్రధాని నరేంద్ర మోదీ.. ఓ గిరిజన మహిళకు పాదరక్షకాలు బహుకరించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పర్యటనలో ఉన్న మోదీ.. చరణ్ పాదుకా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ.. గిరిజన మహిళకు పాదరక్షకాలు అందించారు. ఈ సమయంలో సభలో చప్పట్లు మార్మోగాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తొలి వెల్‌నెస్ సెంటర్ నిర్మాణానికి, పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానని వెల్లడించారు. బీజాపూర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని..

కేంద్ర వైఖరికి నిరసనగా సీఎం చంద్రబాబు దీక్ష!..

విజయవాడ: ఏపీ ప్రత్యేక హోదాపై నిరసనల గళం హోరెత్తుతోంది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల అనతరం హోదాకోసం వైసీపీ ఎంపీలు నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి ఏపీ వ్యాప్తంగా అన్ని పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఇదిలా వుండగా..పార్లమెంట్ లో విపక్షాలు వ్యవహరించిన తీరుకు ప్రధాని మోదీ దీక్షచేశారు. ఇప్పుడు తాజాగా సీం చంద్రబాబు నాయుడు కూడా దీక్ష చేపట్టబోతున్నాను. ఏపీ విషయంలో కేంద్ర అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 20న ఒక్కరోజు నిరసన తెలుపుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అంటే ఏంటో కేంద్రానికే కాదు..

మాజీ కేంద్రమంత్రికి హితవు పలికిన ఎమ్మెల్యే..

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ ప్రసంగిస్తూ... జిల్లా కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కృష్ణారావు అంబేద్కర్ సభలో రాజకీయాలు వద్దని హితవు పలుకుతూ వాగ్వివాదానికి దిగారు. అక్కడ ఉన్న టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ హోరెత్తించారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది.

కథువా రేప్ ఘటనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి..

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో ఓ గుడిలో కొందరు మృగాళ్లు చిన్నారిపై అత్యాచారం చేసి గొంతునులిమి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించి దీన్ని భయానక ఘటనగా అభివర్ణించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ దారుణ ఘటనపై మాట్లాడుతూ... ఆ చిన్నారిపై ఇటువంటి దారుణానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. మీడియాలో వచ్చిన కథనాలు తనను కదిలించాయని, ఓ పసి ప్రాణాన్ని అతి భయంకరంగా హింసించి, హత్య చేశారని, అటువంటి వారిని క్షమించకూడదని అన్నారు.

దిల్ రాజుపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు..

హైదరాబాద్ : టాలీవుడ్‌లో కొత్త అమ్మాయిలపై జరుగుతోన్న వేధింపులపై సినీ పెద్దలను ప్రశ్నిస్తూ సంచలనంగా మారిన శ్రీరెడ్డి.. 'నిర్మాత దిల్‌ రాజు గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. దిల్ రాజు ప్రాభవం నుంచి ఎప్పుడయితే థియేటర్లు బయటకు వస్తాయో అప్పటివరకు నేను శ్రీశక్తిగానే ఉంటాను. ఎవరి దగ్గరయితే మెజారిటీ థియేటర్లు ఉండిపోయాయో వారందరి చేతుల నుంచి బయటపడాలి. నేను చేసే ఉద్యమం ఇంత ఉద్ధృతం అవుతుందని నేను ఊహించలేదనీ.. ఇంకొంత మంది అమ్మాయిలు బయటకు వచ్చి వారి ఆడపిల్లలు తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఈ ఉద్యమంలో ఓయూ విద్యార్థులను కలుపుకువెళతామని తెలిపింది.

పేరు మార్చుకున్న నటి శ్రీరెడ్డి..

హైదరాబాద్ : టాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడుల గురించి గళమెత్తి పోరాటాన్ని చేస్తున్న నటి శ్రీరెడ్డి ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. తన పేరులో 'రెడ్డి' అనే పదాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుందట. ఇక నుంచి తనపేరు శ్రీరెడ్డి కాదు 'శ్రీశక్తి' అని తన గురించి వార్తలు రాసేటప్పుడుగానీ, చదివేటప్పుడుగానీ శ్రీశక్తి అనే రాయండి, చదవండి' అని నటి శ్రీరెడ్డి పేర్కొంది. 

100కోట్లతో అంబేద్కర్ స్మృతివనం ఆకృతి ప్రాజెక్ట్ : చంద్రబాబు

గుంటూరు : తుళ్లూరు మండలం శాఖమూరులో బాబా సాహెబ్ అంబేద్కర్ 127 జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. శాఖమూరులో 20 ఎకరాలలో రూ.100కోట్లతో అంబేద్కర్ స్ఫూర్తిని చాటేలా అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని నిర్మాణం చేపడతామని చంద్రబాబు తెలిపారు. 18 నెలలలో స్మృతివనం ఆకృతి ప్రాజెక్టును పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దళితులకు తొలిసారి పక్కా ఇళ్లు కట్టించింది టీడీపీయే నని తెలిపారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించేందుకు జంసీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 

శ్రీరెడ్డి వివాదంపై పవన్ స్పందన ?

హైదరాబాద్ : టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి వివాదంపై సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే పీఎస్ లేదా కోర్టులను సంప్రదించాలని, టీవీల్లో కూర్చొవడం వల్ల సమాజానికి మెసేజ్ వెళుతుంది కానీ ఉపయోగం ఉండదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాను మద్దతిచ్చినా లీగల్ గా వెళ్లకపోతే ఏమీ జరగదని వ్యాఖ్యానించినట్లు టాక్. 

ఐనవోలులో అంబేద్కర్ స్మృతివనం...

విజయవాడ : ఐనవోలు అంబేద్కర్ స్మృతివనం వద్దకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు, గుంటూరుకు చెందిన లబ్దిదారులకు ఇన్నోవా కార్లు..ట్రాక్టర్లు..లారీలను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్మృతివనం నమూనాను బాబు ఆవిష్కరించారు. రూ. 100 కోట్లతో శాఖమూరులో 20 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు కానుంది. 

సింగపూర్ తరహాలో శిక్షలుండాలి - పవన్...

హైదరాబాద్ : ఆడపిల్లల జోలికొస్తే తోలుతీయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈవ్ టీజింగ్, అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు వేయాలని, సింగపూర్ తరహాలో శిక్షలు అమలు చేయాలని సూచించారు. కథువా అత్యాచార ఘటనను హృదయాన్ని కదిలించివేసిందని పేర్కొన్నారు.

 

గౌతంరెడ్డి సస్పెన్షన్ ఎత్తివేత...

విజయవాడ గౌతంరెడ్డిపై విధించిన సస్పెన్షన్ ను వైసీపీ అధిష్ఠానం ఎత్తి వేసింది. వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలు మాట్లాడుతూ, గౌతంరెడ్డి ఇచ్చిన వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి చెందిందని, అందుకే సస్పెన్షన్ ను ఎత్తివేసిందని తెలిపారు. 

12:18 - April 14, 2018

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగనుతోంది. శనివారం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా భారీగా కార్యకర్తలు..నేతలు..ప్రజలు చేరుకున్నారు. దీనితో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కనకదుర్గ వారధి ఫ్లై ఓవర్ బ్రిడ్జీ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. గంటల తరబబడి వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ మొత్తం జనాలతో నిండిపోయింది. జగన్ పాదయాత్రకు జనాలు భారీగా రావడంతో పోలీసులు చేతులేత్తిసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత అయిన జగన్ కు ఎలాంటి భద్రత కేటాయించడం లేదని...జగన్ పాదయాత్రకు భారీగా జనాలు వస్తారని తెలిసినా బారికేడ్లు..తదితర ట్రాఫిక్ చర్యలు చేపట్టలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

12:18 - April 14, 2018

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని కథువా గ్యాంగ్‌ రేప్‌ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కథువా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటనను తీవ్రంగా నిరసిస్తూ నిరసలను పెల్లుబికుతున్నాయి. శనివారం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాలిక అసిఫాపై హత్యాచారం ఘటనను పవన్ ఖండించారు. ఘటనను నిరసిస్తూ కాసేపట్లో ఇందిరా గాంధీ స్టేడియం వద్దకు చేరుకుని మౌన దీక్ష చేపట్టనున్నారు.
మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతుండడంతో బాధితురాలి కుటుంబం గ్రామం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

విజయవాడకు చేరుకున్న జగన్...

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవాడకు చేరుకుంది. కృష్ణా జిల్లా ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రెండు గంటలకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పవన్ మౌన దీక్ష...

హైదరాబాద్ : సినీ నటుడు పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. బాలిక ఆసిఫాపై హత్యాచార ఘటనను పవన్ ఖండించారు. కాసేపట్లో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేయనున్నారు. 

నిజామాబాద్ లో ఎంపీ కవిత...

నిజామాబాద్ : అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా ఎంపీ కవిత వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. 

అంబేద్కర్ కు పవన్ నివాళి...

హైదరాబాద్ : జనసేన పార్టీ ఆఫీసులో అంబేద్కర్ 127 జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పవన్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పై సుప్రీంకోర్టు తీర్పు బాధాకరమని, చట్ట సవరణకు జనసేన పూర్తిగా వ్యతిరేకమన్నారు. 

ఆందోళనకరంగా ఆనం వివేకా ఆరోగ్యం...

హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వివేకా ప్రస్తుతం కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయన్ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. 

బీజేపీ ఎంపీలను అడ్డుకొనేందుకు యత్నించిన జిగ్నేష్...

అహ్మదాబాద్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ కు నివాళులర్పించేందుకు వచ్చిన బీజేపీ ఎంపీలు..ఇతరులను అడ్డుకొనేందుకు ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ..ఇతరులు ప్రయత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి జిగ్నేష్ ను అడ్డుకున్నారు. 

అంబేద్కర్ సేవలను స్మరించుకున్న కేసీఆర్...

హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబేద్కర్ ఎప్పటికీ స్పూర్తి ప్రదాతగానే నిలుస్తారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎప్పటికీ స్పూర్తి ప్రదాతగానే నిలుస్తారని, భవిష్యత్ మార్గనిర్దేశం చేస్తారన్నారు. వ్యత్యాసాన్ని గుర్తించి భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారన్నారు. 

10:34 - April 14, 2018

హైదరాబాద్ : బలహీన వర్గాలకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. లిబర్టి వద్దనున్న ట్యాంక్ బండ్ విగ్రహానికి సీపీఎం నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు మీడియాతో మాట్లాడారు. దేశంలో దళితులు, మైనార్టీలు, మహిళలు వారి ఆత్మగౌరవాన్ని కోరుకొనే వారు మతోన్మాద సంఘ్ పరివార్ శక్తులతో పోరాడాల్సినవసరం ఉందని తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం సాధిస్తే అప్పుడే అంబేద్కర్ కు అసలైన నివాళి అని తమ్మినేని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారం సాధించేందుకు బిఎల్ఎఫ్ కృషి చేస్తోందన్నారు. 

10:10 - April 14, 2018

ఖమ్మం : డీహెచ్ఎంవో కొండల్ రావ్ వ్యవహర శైలిపై టెన్ టివిలో ప్రసారమైన కథనాలకు లభించింది. మంత్రి లక్ష్మారెడ్డి ఈ విషయంపై ఆరా తీశారు. అసలు డిపార్ట్ మెంట్ లో ఏం జరుగుతోంది ? వెంటనే వివరాలు అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. స్టాప్ నర్సు జ్యోతిపై కేసు నమోదు చేయడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీహెచ్ఎంవో కొండల్ రావ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ వైద్య ఆరోగ్య శాఖలో స్టాప్ నర్సుగా పనిచేస్తున్న జ్యోతి మానవ హక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో కలకలం రేపింది. కొంతకాలంగా కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని, వ్యతిరేకిస్తుండడంతో బదిలీలు చేస్తూ వేధిస్తున్నాడంటూ ఆమె పేర్కొంటోంది. ఈ ఘటనపై శుక్రవారం టెన్ టివిలో కథనాలు ప్రసారమయ్యాయి. దీనితో మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. కొండల్ రావ్ పై డిపార్ట్ మెంటల్ విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. కొండల్ రావ్ మరికొంతమందిని వేధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఖమ్మం..టెన్ టివి కథనానికి స్పందన...

ఖమ్మం : డీఎంహెచ్ ఓ కొండల్ రావ్ పై మంత్రి లక్ష్మారెడ్డి ఆరా తీశారు. స్టాఫ్ నర్సు జ్యోతిపై కేసు నమోదు చేయడం పై సీరియస్ అయ్యారు. కొండల్ రావ్ పై డిపార్ట్ మెంటల్ విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. 

గుంటూరుకు బాబు..

గుంటూరు : గుంటూరు జిల్లాకు సీఎం చంద్రబాబు రానున్నారు. అంబేద్కర్ 127 జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్‌ నమూనా విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. 

09:44 - April 14, 2018

హైదరాబాద్ : గొర్రెనో..బర్రెనో..ఇస్తే సామాజిక న్యాయం కల్పించినట్లు కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ఇవి కేవలం సామాజిక సహాయాలు సంక్షేమాలు మాత్రమేనని, గత ప్రభుత్వాలు అన్ని సంక్షేమ పథకాలు అమలు పరిచాయన్నారు. కొంత లబ్ధి జరిగినా అవి బతుకులు మార్చిన స్కీంలు కాదని, బతుకులు మారాలంటే సామాజిక న్యాయం జరగాలన్నారు. చట్టబద్ధమైన అధికారాలు...రక్షణలు ఉండాలని, రాజ్యాంగపరమైన రక్షణాలుండాలన్నారచు. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని పేర్కొన్నారు. అంతిమంగా అసెంబ్లీలో..పార్లమెంట్ లో బహుజనులందరికీ వారి వారి జనాభాను బట్టి వాటాలు లభించాయని, ఇది నెరవేరినప్పుడే సామాజిక న్యాయం అమలైనట్లు భావించాలన్నారు. సామాజిక న్యాయం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని, 119 అసెంబ్లీ సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై చెప్పడం లేదన్నారు. 65-70 తక్కువ కాకుండా బీసీలకు సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించామన్నారు. బీఎల్ఎఫ్ చేస్తున్న పని తీరును గమనించి మద్దతివ్వాలని కోరారు. 

ట్యాంక్ బండ్ పై రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా..

హైదరాబాద్ : అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. 

09:30 - April 14, 2018

ఉత్తర్ ప్రదేశ్ : ఉన్నావ్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో బిజెపి ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ను సిబిఐ అదుపులోకి తీసుకుంది. లక్నోలోని సిబిఐ కార్యాలయంలో సెంగార్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం ఆయనను సిబిఐ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. బాలికపై అత్యాచారం, ఆమె తండ్రి కస్టడీలో మరణించడం లాంటి మూడు కేసులు సెంగార్‌పై నమోదు చేశారు. ఎమ్మెల్యే సెంగార్‌న్‌ కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్‌ చేసింది. ఈ కేసుకు సంబంధించి సెంగార్‌ను అరెస్ట్‌ చేయాల్సిందేనని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. రేప్‌ కేసులో సిబిఐ విచారణ చేపట్టడాన్ని ఎమ్మెల్యే స్వాగతించారు. తాను మెడికల్‌ టెస్టుకు కూడా సిద్ధమేనని...దీంతో నిజాలు వెలుగు చూస్తాయని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఉన్నావ్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. అవినీతి, అత్యాచారాల విషయంలో తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్‌ నీతినే అవలంబిస్తుందని ఆయన పేర్కొన్నారు. అత్యాచారం కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ను సిబిఐ ఇప్పటికే అరెస్ట్‌ చేసిందని తెలిపారు. ఈ కేసు వెలుగులోకి రాగానే సిట్‌ వేసి దర్యాప్తు ప్రారంభించామని, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసును సిబిఐకి అప్పగించామని యోగి తెలిపారు.

09:25 - April 14, 2018

ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని కథువా గ్యాంగ్‌ రేప్‌ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కథువా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండనే సరైన శిక్షగా పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మేనకాగాంధీ తెలిపారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతుండడంతో బాధితురాలి కుటుంబం గ్రామం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

09:02 - April 14, 2018

 

అనంతపురం : పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇచ్చే సెంటర్‌ నిర్వాహకుడు వక్రబుద్ది ప్రదర్శించిన ఘటన అనంతపురంలో జరిగింది. ఉన్నత విద్య ప్రవేశం కోసం కోచింగ్‌కు వచ్చే విద్యార్థినుల దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. ఇందుకోసం బాత్‌రూమ్‌లో కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఇది గమనించిన విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి విద్యార్థినుల బంధువులు... కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సంజీవరాయుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. 

 

08:55 - April 14, 2018

హైదరాబాద్: మందుబాబులను నిలువరించలేమా ? మందు తాగి వాహనం నడపొద్దు..నష్టం కలిగించవద్దు..అంటూ అధికారులు పేర్కొంటున్నా..మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీకెండ్ డేస్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 121 మందిపై కేసు నమోదు చేశారు. 48 ద్విచక్రవాహనాలు, 28 కార్లను సీజ్ చేశారు. 

08:12 - April 14, 2018

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై అడుగులు వేస్తున్నారు. బెంగళూరుకు వెళ్లి దేవెగౌడతో భేటీ అయ్యారు. మరొకవైపు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఏపీ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలపై కాకుండా తదితర అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), ఇందిర శోభన్ (టి.కాంగ్రెస్), విష్ణు శ్రీ (బిజెపి), మన్నె గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

సిరియాపై అమెరికా మెరుపు దాడులు...

అమెరికా : సిరియాపై అమెరికా మెరుపు దాడులు జరుపుతోంది. దాడులు కొనసాగుతున్నాయని ఆదేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా, బ్రిటీష్, ఫ్రెంచ్ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహిస్తున్నాయి. సిరియాలో రసాయన దాడుల నేపథ్యంలో అమెరికా ఈ చర్యలకు ఉపక్రమించింది. రసాయన దాడుల వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా పేర్కొంటోంది. 

ఐనవోలులో అంబేద్కర్ స్మృతివనం ఆకృతి...

విజయవాడ : నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐనవోలులో అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. 

ఈస్ట్ విజయవాడ నియోజకవర్గంలోకి జగన్...

విజయవాడ : నేడు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. కనకదుర్గ వారధి ఫ్లై ఓవర్ బ్రిడ్జీ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. 

ఈస్ట్ విజయవాడ నియోజకవర్గంలోకి జగన్...

విజయవాడ : నేడు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. కనకదుర్గ వారధి ఫ్లై ఓవర్ బ్రిడ్జీ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. 

పోషణ్ అభియాన్...

హైదరాబాద్ : నేటి నుండి పోషణ్ అభియాన్ కార్యక్రమం జరుగనుంది. నేటి నుండి 24 వరకు కార్యక్రమం కొనసాగనుంది. మహిళల్లో రక్త హీనత తగ్గించడం, చిన్నారులకు ఎత్తు..బరువు లక్ష్యాలతో కార్యక్రమం జరుగనుంది. 

07:03 - April 14, 2018

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది కూడా. చిన్ననాటి నుంచి ప్రయోజకుడయ్యే వరకు అంబేద్కర్‌ సవర్ణ హిందువుల నుంచి అంటరానివాడిగా అవమానాలు ఎదుర్కొన్నాడు. గ్లాసుడు నీళ్లు తాగేందుకు, తోటి విద్యార్ధులతో కలిసి చదువుకునేందుకు, రోడ్లపై నడిచేందుకు, ఆలయాల్లోకి ప్రవేశించేందుకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అసమానతలను అంబేద్కర్‌ భరించాడు. అస్పృశ్యుల దీనస్థితికి హిందూమతం, మనువు ధర్మాలేనని బలంగా విశ్వసించాడు. వేదాలు,ఉపనిషత్తులు,ఇతిహాసాలు చదివి మనువు అసలు రూపాన్ని తెలుసుకున్న అంబేద్కర్‌ దురదృష్టవశాత్తూ నేను హిందువుగా పుట్టాను.. కానీ హిందువుగా మాత్రం మరణించను అంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నట్లుగానే 1956 అక్టోబర్‌ 14న నాగపూర్‌లో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ బౌద్ధం స్వీకరించారు.

బాబాసాహెబ్‌ అంబేద్కర్ జీవించినంత కాలం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే జీవించారు. వెలివాడల్లోని దళితులకు సముచిత స్ధానాన్ని కల్పించేందుకు అవిశ్రాంత పోరాటం చేశాడు. తాను నమ్మిన సిద్ధాంతం, తన ప్రతిపాదనలను వైరివర్గానికి సహేతుకంగా వివరించేందుకు నిద్రను త్యాగం చేశాడు. మానవుని కళ్లు విజ్ఞానపు వాకిళ్లని చెప్పిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ భవిష్యత్‌ తరాలు చరిత్రను పుక్కిట పట్టాల్సిన అవసరాన్ని తన రచనల్లో నొక్కి చెప్పారు. పీడితవర్గాలు ప్రగతి పథంలో నడవాలంటే కుల, వర్గ దోపిడీ లేని రాజ్యం కావాలని అంబేద్కర్‌ ఆశించాడు. అయితే పోరాటాల ద్వారానే ఇది సాధ్యపడుతుందని అంబేద్కర్‌ చెప్పారు. రాజ్యాధికారమే పీడిత, వర్గాల సామాజికాభివృద్ధికి ఏకైక మార్గం, రాజ్యాధికారం లేకుండా దళితుల అభివృద్ధి అసంభవం, అసాధ్యం అని చెప్పిన మహిళల అభివృద్ధి కోసం తపించారు. ప్రతి స్త్రీని శాస్త్ర దాస్యం నుండి విముక్తి చేయాలనే లక్ష్యంతోనే హిందూకోడ్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాడు. అయితే ఆనాటి సనాతన, సాంప్రదాయ అగ్రకుల పాలకులు హిందుకోడ్‌ బిల్లుకు అడ్డుపడ్డారు. ఆ బిల్లు ఆమోదానికి తోడ్పడని ప్రధాని నెహ్రూ వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేసిన భారతరత్న అంబేద్కర్‌.

మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నింటికి కారణం. అందుకే డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ క్రూరత్వం కంటే నీచత్వమే హీనమైనదన్నారు. కులం, మతం పునాదుల మీద ఒక జాతిని కాని ఒక నీతిని కాని నిర్మించలేరనే నిజాన్ని నిర్భయంగా చెప్పారు. అందుకే అంబేడ్కర్‌ కులరహిత సమాజాన్ని కాంక్షించేవారికి అనుసరణీయుడు.. సదా స్మరణీయుడు. 

06:59 - April 14, 2018

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్ధ భరతం పట్టాలంటే అధ్యయనం అవసరమని గ్రహించి అవిశాంత అధ్యయనం చేశాడు. 32 ఏళ్ల వయస్సులో డా.అంబేద్కర్, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. న్యాయశాస్త్రం చదివి తిరుగులేని ఉత్తీర్ణతా శాతంతో పట్టా పొందాడు. ఇక దళిత జాతి కోసం ఏదైనా చేయాల్సిందేనని భావించిన ఆయన మేధస్సునంతా దళిత జాతి అభ్యున్నతి కోసం వినియోగించారు. మూక్‌నాయక్, బహిష్కృత భారతి అనే పత్రికలు స్ధాపించి దళితగొంతుకను నిర్భయంగా విన్పించారు. దళిత జాతి ప్రయోజనాలకోసం వెన్ను చూపని ధైర్యాన్ని ప్రదర్శించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌.

దళితులను పంచములుగా, అస్పృశ్యులుగా జంతువుల కంటే హీనంగా పరిగణించడాన్ని తట్టుకోలేకపోయిన అంబేద్కర్‌ కులవ్యవస్ధపై శూలాన్ని ఎక్కుపెట్టాడు. ఇందుకు మనుస్మృతి కారణమని నమ్మిన అంబేద్కర్‌ 1927 డిసెంబర్‌ 25న మనుస్మృతిని బహిరంగంగా తగులబెట్టాడు. మనుధర్మాలను, దళితులను హీనంగా చూసే కట్టుబాట్లను చీల్చి చెండాడాడు.1913లో అమెరికావెళ్ళి నీగ్రోల పరిస్థితిని చూసాడు. ఆఫ్రికాలో పుట్టిన నీగ్రోలను, అమెరికన్లు బానిసలుగా కొనుగోలు చేయటం చూసి సహించలేకపోయాడు. ఇంచుమించు నీగ్రోల పరిస్ధితే అప్పట్లో కులవ్యవస్ధ శాసిస్తున్న భారతదేశంలో దళితజాతికి ఉండేది. అందుకే భారత రాజ్యాంగాన్ని తయారు చేసే బృహత్తర బాధ్యతను భుజాలకెత్తుకున్నాక అంబేద్కర్‌ దళితుల శ్రేయస్సు కోసం ప్రతిక్షణం తపించాడు.

దళితులు అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక నియోజకవర్గాలు అవసరమని భావించిన అంబేద్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వం ముందు సమర్థంగా వాదనలు విన్పించాడు. యావత్‌ దేశం సైమన్‌ గో బ్యాక్‌ అంటూ నినదిస్తుంటే, నిర్భయంగా సైమన్‌ కమిషన్‌ ముందు హాజరై దళితజాతి అనుభవిస్తున్న దుర్భర పరిస్ధితులను కళ్లకు కట్టినట్లు వివరించాడు. దేశద్రోహి అనే నిందలు భరిస్తూనే ఎన్నో రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో స్పెషల్‌ ఎలక్ట్రోరేట్స్, రిజర్వేషన్‌ ప్రాధాన్యతను వివరించారు. సోదాహరణగా అంబేద్కర్‌ వివరణను విన్న బ్రిటిష్‌ ప్రభుత్వం 1932లో కమ్యూనల్‌ అవార్డును ప్రకటించింది. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీ ఎరవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. నా ప్రాణాలు కావాలో లేక దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలో తేల్చుకోమంటూ అంబేద్కర్‌ను బెదిరించినంత పని చేశాడు. విధిలేని పరిస్ధితుల్లో అంబేద్కర్‌ తీవ్ర మనోవేదనతో 1932లో జరిగిన పూనా ఒడంబడిక పై సంతకం చేశాడు. తన జాతికి ద్రోహం చేస్తున్నాననే బాధతోనే అంబేద్కర్‌.. ఎందరో మహాత్ములు వచ్చారు, వెళ్లారు కానీ అస్ప్రుశ్యులు మాత్రం ఇంకా అంటరాని వారుగానే ఉన్నారని వ్యాఖ్యానించారు.

06:56 - April 14, 2018

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి గుండెల్లో కొలువుదీరాడు. మనువు రాసినట్లుగా భావించే చాతుర్వర్ణ వ్యవస్ధ భారతదేశాన్ని శాసిస్తుండేది. వేదాలు ఘోషించిన కట్టుబాట్లు మంచేదో, చెడు ఏదో తెలుసుకోగల్గిన మనుషుల మధ్యే అంతరాల దొంతరలు సృష్టించాయి. వర్ణవ్యవస్ధను, మనుధర్మాలను తూచ తప్పకుండా పాటించే రోజుల్లో 1891 ఏప్రిల్‌ 14వ తేదిన మహారాష్ట్రలో రాంజీ సక్‌పాల్, భీమాబాయి దంపతుల 14వ సంతానంగా అంబేద్కర్‌ మహర్‌ కులంలో జన్మించారు. సైనిక కుటుంబంలో పుట్టినప్పటికి అంబేద్కర్‌... మహర్‌ కులానికి చెందిన వాడు కావటంతో చిన్ననాటి నుంచే ఎన్నో అవమానాలకు గురయ్యాడు. ఎంతో ప్రతిభావంతుడైనప్పటికి అంటరాని వాడనే కారణంగా ఛీత్కారాలు చవిచూశాడు.

అంబేద్కర్‌ చిన్నతనంలో ఓ సారి మండు వేసవిలో బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. స్టేషన్‌ నుంచి కిలోమీటర్ల దూరం ఉన్న ఆయన మామయ్య ఇంటికి చేరుకోవాలంటే ఏదో వాహనం తప్పనిసరి. కాని అంబేద్కర్‌ అంటరానివాడని తెల్సిన వాళ్లెవరు బండి ఎక్కించుకునేందుకు ఒప్పుకోలేదు. చివరకు మండుటెండలో గొంతు తడారిపోతున్నా గుక్కెడు మంచినీరు కూడా ఇవ్వలేదు. ఇక చదువుకునే రోజుల్లో బహుమతులు, ప్రశంసాపత్రాలు అన్నీ అంబేద్కర్‌కే దక్కేవి. ఇదేకోవలో బహుమతి ప్రధానోత్సవానికి వచ్చిన ఓ నేత అంబేద్కర్‌కు ప్రశంసాపత్రాన్ని ఇచ్చేందుకూ ససేమిరా అన్నాడు. అంటరానితనపు కత్తి చేసిన ఇలాంటి ఎన్నో గాయాలకు కుమిలిపోయాడు.

ఎన్నో అవమానాలు దిగమింగిన అంబేద్కర్‌ కులవ్యవస్థ రక్కసి కోరలకు బలవుతూనే ఉన్నత చదువులు చదివాడు. బరోడా మహారాజు ఇచ్చిన వేతనంతో 1912లో బి.ఏ. పాసయ్యాడు. పట్టభద్రుడైనప్పటికి చదువుకోవాలనే కోరికతో కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అనే పేరుతో ప్రచురితమైంది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశానికి వచ్చినా ఇక్కడి అంటరానితనపు జాడ్యం ఆయన్ను మరింతగా వేధించింది.

06:36 - April 14, 2018

హైదరాబాద్ : స్పూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌లో హైదరాబాద్‌ ఫెస్ట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. 10 రోజులపాటు జరగనున్న ఈ ఫెస్ట్‌ను ప్రారంభించిన మంత్రి ఈటల... మన సంస్కృతి, సాంప్రదాయాలు కనమరుగవుతున్న నేటికాలంలో... ఇలాంటి ఫెస్ట్‌లు నిర్వహించడం గర్వకారణమన్నారు. సమ్మర్‌ హాలీడేస్‌లో సందడి చేస్తున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌పై ప్రత్యేక కథనం. ఆధునిక కాలంలో నగరాల్లో కనుమరుగైపోతున్న ప్రజా కళలను నేటి యువతకు పరిచయం చేసేందుకు ఒకే వేదికపై విజ్ఞానం, వినోదాలను అందించేందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌లో స్ఫూర్తి ప్రోగ్రెస్‌ సొసైటీ ఆధ్వర్యంలో 'హైదరాబాద్‌ ఫెస్ట్‌' ప్రారంభమైంది. 10 రోజుల పాటు జరగనున్న ఫెస్ట్‌ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఫెస్ట్‌ పతాకాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సినీ నటుడు ఎల్బీ శ్రీరామ్‌తో కలిపి ఆవిష్కరించారు.

అన్ని రకాల కళలను ప్రతిబింబించేలా తొలిసారి భాగ్యనగరంలో ఇలాంటి ఫెస్ట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు ఈటల. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ ఫెస్ట్‌ నిర్వహించడం సాధారణ విషయం కాదన్నారు. అంతరించిపోతున్న కళలను ఒకే వేదికపై 10 రోజులపాటు కనువిందు చేసేలా ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఓవైపు విదేశీ సంస్కృతి మోజులో పడి మన సాంప్రదాయాలను యువత మరిచిపోతున్న తరుణంలో... ఇలాంటి ఫెస్ట్‌లు మరెన్నో జరగాల్సిన అవసరముందన్నారు. దేశంలో దళితులు, మహిళలపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. తెలంగాణలో ఇలాంటి దాడులకు ఆస్కారం లేదన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

హైదరాబాద్‌ ఫెస్ట్‌ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఇలాంటి ఫెస్ట్‌లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు చుక్కా రామయ్య. దేశంలోని భిన్న సంస్కృతులకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అని... నగరంలో ఏదో ఒకచోట చరిత్రను ప్రతిబింబించే కార్యక్రమాలు జరుగుతాయని.. కానీ హైదరాబాద్‌ ఫెస్ట్‌కు చాలా ప్రత్యేకత ఉందన్నారు. నేటి యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ ఫెస్ట్‌ కీలక భూమిక పోషిస్తుందన్నారు.

మూఢనమ్మకాలను ప్రధాని సహా కేంద్రమంత్రులంతా మాట్లాడుతున్నారని.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. మతాలను రెచ్చగొడుతున్నారని.. అసహన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. దళితులు, మహిళలపై దాడులను అల్లం నారాయణ ఖండించారు.

హైదరాబాద్‌ ఫెస్ట్‌లో ఏదో ఒక్క విషయానికి మాత్రమే పరిమితం కాకుండా.. బాలోత్సవం, సైన్స్‌ ఫెయిర్‌, బుక్‌ ఫెయిర్‌తో పాటు ఇండస్ట్రియల్‌ స్టాల్స్‌, షార్ట్‌ ఫిలిం ప్రదర్శన, మహిళల సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఫెస్ట్‌ అధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలపై ఈ పెస్ట్‌లో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది.. ఆనంతరం మంత్రి ఈటెల ఫెస్ట్‌లోని జనవిజ్ఞాన వేదిక, ఇతరు అంశాల పై ఏర్పాటు చేసిన స్టాలను తిరుగుతూ సందర్శించారు.-

06:34 - April 14, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడిట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ సారి ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఫస్టియర్ లో 4 లక్షల 55వేల 789 మంది విద్యార్దులు పరీక్షలు రాయగా అందులో 2 లక్షల 84 వేల 224 మంది విద్యార్దులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో 4 లక్షల 29 వేల 378 మంది విద్యార్ధులు హాజరుకాగా 2 లక్షల 88 వేల 772 మంది విద్యార్దులు పాస్ అయ్యారు. మొత్తంగా ఫస్టియర్ లో 62.73 శాతం , సెకండ్ ఇయర్ లో 67.06 శాతం ఫలితాలు నమోదయ్యాయి.

ఈసారి కూడా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 69 శాతం, బాలురు 55.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ లో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 73.25 శాతం, బాలురు 61 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో కొమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు 80శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా....రంగారెడ్డి జిల్లా 77 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మహబూబాబాద్ జిల్లా 40 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

ద్వితీయ సంవత్సర ఫలితాల్లో గిరిజన గురుకులాలు సత్తా చాటాయి. గిరిజన గురుకుల పాఠశాలలు అత్యధికంగా 87 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్స్ 86 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో నిలిచాయి. 69 శాతంతో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు చివరిస్థానంలో నిలిచాయి. విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు ఈ నెల 20వ తేదీ వరకు గడువును విధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు మే నెల 14వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 లోగా సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు విధించారు. మే 22వ తేదీన సప్లమెంటరీ పరీక్షలు ముగియనున్నాయి. మొత్తానికి గతేడాది కంటే ఇంటర్ ఫలితాల .06 శాతం పెరిగినట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. ఇకనుంచి రెగ్యులర్ సిలబస్ తో పాటు జేఈఈ, నీట్ లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ఇంటర్ బోర్డు దృష్టి సారించిందన్నారు

06:30 - April 14, 2018

విజయవాడ : తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీకి రాజీనామాచేసి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. టీడీపీలో గుర్తింపు, గౌరవం లేకపోవడంతోనే ఆపార్టీని వీడుతున్నానని రవి చెప్పారు. 

06:28 - April 14, 2018

హైదరాబాద్ / విజయవాడ : జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూసుకుపోతున్నారు. త్వరలో జరిగే కర్నాటక ఎన్నికల ద్వారానే తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. తెలంగాణా సీఎం కేసిఆర్ పొరుగు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటానని ప్రకటించారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పులు అవసరమంటూ తెరపైకి వస్తున్న జాతీయ కూటమి పై ముఖ్యమంత్రి కేసిఆర్ మరో అడుగు ముందుకు వేశారు. పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉంటున్న జేడీఎస్‌కు మద్దతు ప్రకటించారు. జాతీయ కూటమిలో జేడీఎస్‌ను భాగస్వామ్యం చేసేందుకు కేసిఆర్ రంగంలోకి దిగారు. జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవగౌడను బెంగుళూరులో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన వీరి భేటీలో టీఆర్‌ఎస్‌, జేడీఎస్‌ లకు చెందిన నేతలు కూడా ఉన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీల పాలన సుమారు 65 ఏళ్లు జరిగిందని అయినా పెద్దగా మార్పులు లేవన్న అభిప్రాయాన్ని ఇరు పార్టీల నేతలు వ్యక్తం చేశారు.

కర్నాటకలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయన్న పరిస్థితుల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కర్నాటకలో పర్యటించి జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతు పలికారు. జేడీఎస్‌ తరపున పొరుగు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కూడా చేస్తానని వెల్లడించారు. తెలుగు ప్రజలు జేడీఎస్‌కు మద్దతుగా నిలువాలని కోరారు.

ఇక ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కర్నాటక ఎన్నికలపై సీరియస్‌గానే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోక పోవడంతో బీజేపీకి వ్యతిరేకంగా తెలుగు ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. తెలుగు ప్రజలు సుమారు 5 లక్షల వరకు కర్నాటకలో ఉండడంతో తెలుగు ఓటర్లతో కర్నాటక రాజకీయాల్లో తమ ప్రభావాన్ని చాటి చెప్పాలని ముఖ్యమంత్రులు ఇద్దరు పావులు కదుపుతున్నారు.

దివ్యాంగులతో గడుపనున్న పవన్...

హైదరాబాద్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు జనసేన కార్యాలయంలో దివ్యాంగులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గడుపనున్నారు. ఎల్బీ స్టేడియంలో దివ్యాంగుల క్రికెట్ పోటీలకు పవన్ హాజరు కానున్నారు. 

జూబ్లీహిల్స లో డ్రంక్ అండ్ డ్రైవ్...

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 76 మందిపై కేసు నమోదు చేశారు. 48 ద్విచక్రవాహనాలు, 28 కార్లను సీజ్ చేశారు. 

వైసీపీలోకి యలమంచిలి రవి...

విజయవాడ : తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీకి రాజీనామాచేసి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. టీడీపీలో గుర్తింపు, గౌరవం లేకపోవడంతోనే ఆపార్టీని వీడుతున్నానని రవి చెప్పారు. 

అగ్రిగోల్డ్ బాధితులు చలో సెక్రటేరియట్...

విజయవాడ : ఆందోళన ఉధృతం చేయాలని అగ్రిగోల్డ్‌ బాధితులు నిర్ణయించారు. విజయవాడలో జరిగిన అగ్రిలోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. దీనిలో భాగంగా శనివారం చలో సెక్రటేరియట్‌కు పిలుపు ఇచ్చారు. 

గ్యాంగ్ రేప్ పై సీఎం యోగి స్పందన...

ఉత్తర్ ప్రదేశ్ : ఉన్నావ్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. అవినీతి, అత్యాచారాల విషయంలో తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్‌ నీతినే అవలంబిస్తుందని ఆయన పేర్కొన్నారు. అత్యాచారం కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. 

గ్యాంగ్ రేప్ పై ఆగ్రహావేశాలు...

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని కథువా గ్యాంగ్‌ రేప్‌ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కథువా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణ దండనే సరైన శిక్షగా పేర్కొన్నారు. 

నవాజ్ షరీఫ్ కు సుప్రీం షాక్...

ఢిల్లీ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. భవిష్యత్తులో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈ నిషేధం సరైనదేనని చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది.

కామన్ వెల్త్ లో భారత్ కు 11 పతకాలు...

ఢిల్లీ : 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌ 9వ రోజు పోటీల్లో భారత్‌ రికార్డ్‌ లెవల్లో 11 పతకాలు సాధించింది.65 కేజీల మెన్స్‌ ఫ్రీ స్టైల్‌ రెజ్లింగ్‌ విభాగంలో బజ్‌రంగ్ పూనియా,మెన్స్‌ 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో అనిష్‌ భన్వాలా,ఉమెన్స్‌ 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ షూటింగ్ విభాగంలో తేజస్విన్‌ సావంత్‌ స్వర్ణ పతకాలు సాధించారు.

 

Don't Miss