Activities calendar

15 April 2018

21:42 - April 15, 2018

విజయవాడ : ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం తీవ్రతరం అయింది. ప్రత్యేకహోదా సాధన సమితి ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపునకు వామపక్షాలు-జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌పార్టీలు పూర్తిమద్దతు ప్రకటించాయి. ప్రత్యేకహోదాపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరాటం ఆపేది లేదని విపక్షపార్టీలు తేల్చి చెబుతున్నాయి. 
రాష్ట్ర బంద్‌కు విపక్షాలు సన్నద్ధం
ఏపికి ప్రత్యేకహోదా కోసం ఉద్యమిస్తున్న విపక్షాలు సోమవారం రాష్ట్ర బంద్‌కు సన్నద్ధం అయ్యాయి. బంద్‌కు వామపక్షాలు-జనసేనతోపాటు వైసీపీ, కాంగ్రెస్‌పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఊరూరా నిరసనలకు రెడీ అయ్యాయి. 
పూర్తిస్థాయిలో బంద్‌
పల్లెలు, పట్టణాల్లో పూర్తిస్థాయిలో బంద్‌పాటిస్తామని జనసేన, సీపీఐ,సీపీఎం ప్రకటించాయి.  బీజేపీ, టీడీపీ తప్ప.. మిగతా పక్షాలన్నీ బంద్‌ పాటిస్తాయని వైసీపీ నేతలు అన్నారు. ఈ బంద్‌ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 
విపక్షాల నేతలు, కార్యకర్తలకు ఏపీ డీజీపీ నోటీసులు 
అయితే రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విపక్షాల నేతలు, కార్యకర్తలకు ఏపీ డీజీపీ నోటీసులు పంపారు. బంద్‌లో అవాంఛనీయ సంఘటలను జరిగితే పూర్తి బాధ్యత ఆయాపార్టీలదే అని నోటీసుల్లో పేర్కొన్నారు. 
డీజీపీ  నోటీసుల జారీపై విపక్షపార్టీల మండిపాటు
డీజీపీ నోటీసులు జారీచేయడంపై విపక్షపార్టీల మండిపడుతున్నాయి. బంద్‌ను అడ్డుకోడానికే   ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతోందని విపక్షపార్టీల నేతలు  విమర్శించారు. ఓవైపు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటున్న చంద్రబాబు ప్రభుత్వం .. ప్రత్యేక హోదాకోసం ఉద్యమిస్తున్న వారిని పోలీసులతో బెదిరిస్తోందని   సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉద్యమకారులను అరెస్టులు చేయించాలని చూస్తే ప్రతిఘటన తప్పదని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు.
ప్రత్యేహోదా ఇచ్చేవరకు పోరు : విపక్షపార్టీలు 
ఓవైపు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ.. దీక్షలకు సిద్ధం అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... తాము చేస్తున్న పోరాటంపై మాత్రం పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బంద్‌చేస్తే చర్యలు తప్పవంటూ ఏపీ ప్రభుత్వం బెదిరింపులకు తగ్గిది లేదని, రాష్ట్రానికి ప్రత్యేహోదా ఇచ్చేవరకు పోరాటం ఆపేది లేదని విపక్షపార్టీల నేతలు అంటున్నారు. సోమవారం బంద్‌ జరిపి తీరుతామని తేల్చి చెబుతున్నారు. 

 

పోలీసుల చర్య దుర్మార్గం : అరుణ్

తూ.గో : రేపు ఏపీ బంద్ నేపథ్యంలో పోలీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా నిరసనలు చేపట్టవద్దని ఆంక్షుల విధించారు. విపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల చర్య దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ అన్నారు. చంద్రబాబు ప్రజా ఆకాంక్షలను అణగదొక్కాలని చూస్తున్నారని ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. 

రేపు ఏపీ బంద్ నేపథ్యంలో పోలీసులు జారీ

తూ.గో : రేపు ఏపీ బంద్ నేపథ్యంలో పోలీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా నిరసనలు చేపట్టవద్దని ఆంక్షుల విధించారు. విపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

20:57 - April 15, 2018

హైదరాబాద్ : హైదరాబాద్ ఫెస్ట్ మూడోరోజు ఉత్సాహంగా సాగుతోంది. ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించేందుకు నగరవాసులు భారీగా హాజరయ్యారు. బాలోత్సవ్‌లో భాగంగా.. చిన్నారులకు చిత్రలేఖనం, కళలు, క్రాఫ్ట్స్‌ మేకింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. మరోవైపు సరికొత్త ఆవిష్కరణలతో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్‌ ఆకట్టుకుంటోంది. వీటితో పాటు 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రచురణల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన.. సాహితీప్రియులను అలరిస్తోంది. 

 

 

రేపటి ఏపీ బంద్ పై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

అమరావతి : రేపటి ఏపీ బంద్ పై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, హోం, ఆర్టీసీ, సీఎం ఫేషీ ఉన్నతాధికారులు టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్ర బంద్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని చంద్రబాబు అన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ వైఖరి : బాబురావు

విజయవాడ : ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రేపు ఏపీలో బంద్ నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ మినహా బంద్ లో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. బంద్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విపక్షపార్టీల నేతలకు పోలీసులు నోటీసులు పంపారు. కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల నోటీసులపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. బంద్ లు వద్దని...20న ఎందుకోసం బాబు దీక్ష చేస్తానన్నారని ప్రశ్నించారు.

ప్రతిఘటన తప్పదు : మధు

విజయవాడ : ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రేపు ఏపీలో బంద్ నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ మినహా బంద్ లో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. బంద్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విపక్షపార్టీల నేతలకు పోలీసులు నోటీసులు పంపారు. కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల నోటీసులపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను అరెస్టు చేయించాలని చూస్తే ప్రతిఘటన తప్పదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. ఉద్యమకారులను భయభ్రాంతులకు గురిచేసినా బంద్ అగదని అన్నారు. 

ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రేపు ఏపీలో బంద్

విజయవాడ : ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రేపు ఏపీలో బంద్ నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ మినహా బంద్ లో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. బంద్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విపక్షపార్టీల నేతలకు పోలీసులు నోటీసులు పంపారు. కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

20:34 - April 15, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రేపు ఏపీలో బంద్ నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ మినహా బంద్ లో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. బంద్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విపక్షపార్టీల నేతలకు పోలీసులు నోటీసులు పంపారు. కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల నోటీసులపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను అరెస్టు చేయించాలని చూస్తే ప్రతిఘటన తప్పదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. ఉద్యమకారులను భయభ్రాంతులకు గురిచేసినా బంద్ అగదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. బంద్ లు వద్దని...20న ఎందుకోసం బాబు దీక్ష చేస్తానన్నారని ప్రశ్నించారు.

 

20:14 - April 15, 2018

రంగారెడ్డి : జిల్లాలోని మల్లాపూర్‌లో తెలంగాణ జన సమితి పార్టీ చేరికలు జోరందుకున్నాయి. టీఆర్‌ఎస్‌ నాయకుడు మల్లారెడ్డితో వందలాది మంది కార్యకర్తలు టీజెఎస్‌లో చేరారు. తెలంగాణ కోసం పోరాడిన కోదండరాంతో కలిసి పని చేయాడానికి తెలంగాణ జన సమితిలో చేరతున్నట్లు అయన తెలిపారు. ఈసందర్భంగా కోదండరాం వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పాడి నాలుగు సంవత్సరాలు అయినా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోయిందని  విమర్శించారు.

20:11 - April 15, 2018

హైదరాబాద్ : హైదరాబాద్ ఫెస్ట్ మూడోరోజు ఉత్సాహంగా సాగుతోంది. ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించేందుకు నగరవాసులు భారీగా హాజరయ్యారు. బాలోత్సవ్‌లో భాగంగా.. చిన్నారులకు చిత్రలేఖనం, కళలు, క్రాఫ్ట్స్‌ మేకింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. మరోవైపు సరికొత్త ఆవిష్కరణలతో ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్‌ ఆకట్టుకుంటోంది. వీటితో పాటు 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రచురణల 

20:10 - April 15, 2018

అనంతపురం : జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి పెద్ద చెరువుకు గొల్లపల్లి రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలు చేరుకోవడంతో ప్రజలు జలహారతి చెపట్టారు. వైసీపీ దృష్టిలో రాజీనామా అంటే కేంద్రంతో రాజీ... ఏపీకి నామాలు పెట్టడమేనని మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. జగన్‌కు ఆరుతడి లెక్కలు తెలియవు కానీ తప్పుడు లెక్కలు చేసి జైలుకు వెళ్ళడం మాత్రం తెలుసని విమర్శించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి ప్రత్యేక పైప్‌ లైన్‌ ద్వారా జూన్‌ కల్లా హిందూపురం ప్రజల దాహార్తిని తీరుస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ  హామీఇచ్చారు.

20:08 - April 15, 2018

విశాఖ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అవకాశాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో పార్టీ శ్రేణుల దీక్షా శిబిరాన్ని విజయసాయి సందర్శించారు. టీడీపీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, మీకు హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్రమంత్రి పదవులకే కాకుండా... ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామాలు చేయించాలని.. అందుకు తాము సిద్ధమేనని..మీరు సిద్ధమా అంటూ విజయసాయి చంద్రబాబుకు సవాల్ విసిరారు. 

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. తిరుపతి వెళ్తున్న కాటమ్ రెడ్డి అనే వ్యక్తి వద్ద బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టు పోలీసులకు సీఐఎస్ ఎఫ్ అప్పగించింది. 

బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ విజయం

ఐపీఎల్ 11 : బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 19 పరుగుల తేడాతో బెంగళూరుపై రాజస్థాన్ గెలుపొందింది.

 

సీపీఎం బహిరంగ సభకు భారీగా తరలిరావాలి : తమ్మినేని

నల్గొండ : రాజకీయ ప్రయోజనాల కోసమే ఏర్పడే ఫ్రంట్ లలో సీపీఎం చేరదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో బీఎల్ ఎఫ్ ఆవిర్భావం అన్ని సామాజిక, ఆర్థిక విషయాలపై స్పష్టతతో ఏర్పడిందని తెలిపారు. సామాజిక న్యాయమంటే గొర్రెలు, చేపలు, బర్రెలు, పంచడం కాదని...చట్టపరమైన హక్కులు కావాలని చెప్పారు. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బహుజనులకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందుకు తెలంగాణలో బీఎల్ ఎఫ్ సిద్ధంగా ఉందన్నారు. 22న సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సీపీఎం బహిరంగ సభకు భారీగా తరలి రావాలన్నారు.

 

బీజేపీ దుర్మార్గ పాలన : తమ్మినేని

హైదరాబాద్ : నాలుగేళ్ల బీజేపీ దుర్మార్గ పాలన నేపథ్యంలో సీపీఎం మహాసభల ప్రాధాన్యత ఉందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్థిక విధానాల అమల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో ఎటువంటి తేడా లేదన్నారు. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అత్యంత కిరాతకమైన కథువా ఘటనలో మతం పేరుతో నిందితులకు మద్దతుగా నిలవడం బీజేపీ రాక్షస విధానాలకు నిదర్శనమన్నారు. యూపీలో ఎమ్మెల్యేనే అత్యాచారం చేస్తే బాధితురాలి తండ్రిని కొట్టి చంపారని పేర్కొన్నారు. 

 

నల్గొండలో సీపీఎం నేతల సమావేశం

నల్గొండ : సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నేతల సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు జూలకంటి రంగారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. 

18:47 - April 15, 2018

ఆస్ట్రేలియా : సిడ్నీ నగరం శివార్లలోని అడవుల్లో మంటలు అంటుకున్నాయి. ఇప్పటివరకు వేయి హెక్టార్లు అగ్నికి ఆహుతైంది. ఎండవేడికి తోడు... ఉధృతంగా వీస్తున్న గాలులతో మంటలు భారీగా వ్యాపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న హోల్స్‌వర్తీ మిలిటరీ స్థావరం కూడా మంటల్లో చిక్కుకుంది. సుమారు 500మంది ఫైర్ ఫైటర్లు.. మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. అధికారులు ఇప్పటికే సిడ్నీ శివార్లలో ఎమర్జెన్సీ ప్రకటించారు. స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఆస్తినష్టం జరిగనా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. 

 

18:44 - April 15, 2018

అమెరికా : సిరియాలో అమెరికా వైమానిక దాడులపై ఆ దేశం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వద్దంటూ.. శాంతి ప్రేమికులు వైట్ హౌస్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమెరికా, దాని మిత్ర దేశాల దాడులకు అమాయక ప్రజలు బలైపోవడం బాధాకరమన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికైనా.. సిరియాపై దాడులను ఆపేలా ఆదేశాలు జారీచేయాలని వారు డిమాండ్ చేశారు. సిరియా రసాయన ఆయుధాలు ప్రయోగిస్తుందని ఆరోపిస్తూ.. శుక్రవారం రాత్రి నుంచి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వైమానిక దాడులు చేపట్టాయి.

 

18:42 - April 15, 2018

హైదరాబాద్ : ఎల్బీనగర్‌లో 'ఆధునిక భారతదేశంలో మహాత్మాగాంధీ సిద్ధాంతాల ఆచరణ'పై చర్చా గోష్ఠి నిర్వహించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఛైర్మన్‌ రాజేంద్రర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం  జరిగింది. ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. గాంధీజీ కన్న కలలను నెరవేర్చాలని రాజేందర్ రెడ్డి సూచించారు. స్వరాజ్యం రావాలంటే గాంధీ మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని ఆయన అన్నారు.

 

18:40 - April 15, 2018

హైదరాబాద్‌ : రామంతపూర్‌ వెలాసిటీ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ మొదటి బ్యాచ్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాలలో ప్రభంజనం సృష్టించింది.  మొదటి బ్యాచ్‌లోని ముగ్గురిలో ఒకరు 99 శాతం,  ఇద్దరు 90 శాతం మార్కులను సాధించి రాష్ట్రంలో అద్భుత ఫలితాలను కనబర్చారు. ఇంటర్‌ మీడియట్‌ ఫలితాలే కాదు.. ఐఐటీ, జెఈఈల మెయిన్స్‌లోను అత్యంత అద్భుత ఫలితాలను కనబర్చిందని ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ రాధాకృష్ణ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండవ స్థానాలతో పాటు తొలి పది స్థానాలలో 25 మందికి పైగా విజయం సాధించారన్నారు. 

 

18:37 - April 15, 2018

కర్నూలు : హెల్త్ కేర్ నోబుల్ మల్టీ స్పెషాలిటి ఆసుపత్రిలో గర్భిణీ మృతి వివాదాస్పదమౌతోంది. జిల్లాలోని సి.బెళగల్లు మండలం పల్లదొడ్డికి గ్రామానికి చెందిన గర్భిణీ సావిత్రి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరింది. ఇవాళ సావిత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ... బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

 

కర్నూలు హెల్త్ కేర్ నోబుల్ మల్టీ స్పెషాలిటి ఆసుపత్రిలో గర్భిణీ మృతి

కర్నూలు : హెల్త్ కేర్ నోబుల్ మల్టీ స్పెషాలిటి ఆసుపత్రిలో గర్భిణీ మృతి వివాదాస్పదమౌతోంది. జిల్లాలోని సి.బెళగల్లు మండలం పల్లదొడ్డికి గ్రామానికి చెందిన గర్భిణీ సావిత్రి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరింది. ఇవాళ సావిత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ... బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

18:33 - April 15, 2018

స్యూర్యాపేట : స్యూర్యాపేట జిల్లాలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలం వివాదస్పదంగా మారింది. మంత్రి జగదీష్‌రెడ్డి తన అనుయాయులకు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే  కలెక్టరేట్‌ భవన సముదాయం నిర్మిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. జనసమ్మర్దం లేని ప్రాంతంలో నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో నిర్మించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

సూర్యాపేట కలెక్టరేట్‌ భవన నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య కలెక్టరేట్‌ నిర్మాణంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి జగదీష్‌రెడ్డి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే ప్రదేశంలోకాకుండా..  తన వర్గపు వారికి మేలు చేసేలా కలెక్టరేట్‌ నిర్మాణం చేపడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.  సూర్యాపేటకు 5 కిలోమీటర్ల దూరంలోని కుడకుడ సమీపంలో కలెక్టరేట్‌ కోసం ప్రభుత్వం.. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించింది. అయితే ఆ ప్రాంతంలో కలెక్టరేట్‌ ప్రతిపాదనలేవీ చేయకముందే మంత్రి జగదీష్‌ రెడ్డి తన బినామీ వ్యాపారులతో రైతుల దగ్గర తక్కువ ధరకే 25 ఎకరాల స్థలం  కొనుగోలు చేశారని కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.  రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన తర్వాత కలెక్టరేట్‌కు అక్కడ ప్రతిపాదనలు చేయించారని మండిపడుతున్నారు. దీంతో ఆఘమేఘాల మీద ఆ ప్రాంతంలోనే కలెక్టరేట్‌కు ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారని కోమటిరెడ్డి ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలో కలెక్టరేట్‌ నిర్మాణం చేపడితే ప్రజలకు ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి భూముల ధరలు పెంచుకుని వందల కోట్లు లబ్ది పొందేందుకే అక్కడ కలెక్టర్‌ కార్యాలయం నిర్మిస్తున్నారని మండిపడుతున్నారు. కలెక్టరేట్‌ భవన సముదాయ ప్రతిపాదనల వెనుక పెద్ద కుంభకోణమే ఉందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. 

18:14 - April 15, 2018

విజయనగరం : విజయనగరం మహరాజ కళాశాల ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను విరమించాలంటూ ఎస్.ఎఫ్. ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఎయిడెడ్‌ పోస్టుల భర్తీ చేపట్టడం లేదనే సాకుతో మహారాజ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మహారాజ కళాశాల మాన్సాస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మాన్సాస్‌ ఛైర్మన్‌గా వ్వవహరిస్తున్న మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు వెంటనే కల్పించుకుని కళాశాల ప్రైవేటీకరణను ఆపాలని విద్యార్థులు కోరారు.

 

18:13 - April 15, 2018

నల్లగొండ : జిల్లాలోని గుర్రంపోడు మండలం పోచంపల్లిలో ఆదివారం ఉదయం కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగిన కొద్దిసేపటికే వాంతులు కావడంతో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉందని ఐసీయూలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. మిగిత వారి ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు. బాధితులను పరామర్శించిన కలెక్టర్ గౌరవ్‌  దీనికి సంబంధించిన బాద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


 

17:52 - April 15, 2018

విశాఖ : జమ్ముకాశ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫాను హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలిన డిమాండ్‌ చేస్తూ ఏయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇంజినీరింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ నుండి జీవిఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అసిఫాకు న్యాయం చేయాలంటూ నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. చిన్నారిని నిర్బంధించి, అత్యాచారం చేసి హతమార్చడం మానవత్వానికే మచ్చని, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మానవ మృగాలను ఉరితీయాలన్నారు ఏయూ రిజిస్ట్రార్‌. ఈ దేశంలో ఆడవారికి భద్రత లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

17:50 - April 15, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని ఆలేరులో సీపీఎం కార్యకర్తలు 22 మీటర్ల అరుణపతాకంతో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించారు. 

 

17:49 - April 15, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని ఘట్‌కేసర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిగింది. సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించారు. గత ఎన్నికల్లో  ఇచ్చిన హామీలను నెరవేర్చేలా టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

17:45 - April 15, 2018

వరంగల్‌ రూరల్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతుల రుణమాఫీ, రుణ ముక్తి సర్టిఫికేట్‌ అందించేందుకు కేంద్రం పరిహారం అందించకపోయినా నాలుగు విడతలుగా 17వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. 

17:37 - April 15, 2018

హైదరాబాద్ : లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను సీపీఎం వ్యతిరేకించింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. రాష్ట్రాలను నియంత్రించేందుకే కేంద్రం జమిలి ఎన్నికల ప్రతిపాదన తీసుకొచ్చిందని విమర్శించారు. జమిలి ఎన్నికలకు సీపీఎం వ్యతిరేకమని స్పష్టం చేశారు.

 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మహిళా సంఘాల జేఏసీ సమావేశం

హైదరాబాద్ : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మహిళా సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, సామాజిక కార్యకర్త కార్యక్రమానికి హాజరయ్యారు.

 

16:49 - April 15, 2018

మంచిర్యాల : జిల్లాలోని కన్నెపల్లి మండల కేంద్రంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. విషజ్వరాల బారిన పడి కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందగా...30 మంది వరకూ మంచం పట్టారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోన్నా ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. 
వారం రోజుల్లోనే ఇద్దరు మృతి
విషజ్వరాలతో కన్నెపల్లి మన్నెంవాడ మంచం పట్టింది. వారం రోజుల నుండి విషజ్వరాలతో ఎస్టీ వాడ అల్లాడుతోంది. వారం రోజుల వ్యవధిలోనే విష జ్వరాల బారిన పడి ఇద్దరు మృతి చెందారు. 30 మంది వరకూ గిరిజనులు మంచం పట్టారు. 
ఆందోళనలో మన్నెం వాసులు
జ్వరంతో మంచం పట్టిన గిరిజనులు కొందరు స్థానికంగా ఉన్న ఏఎన్‌ఎమ్‌ వద్ద చికిత్స తీసుకోగా మరికొందరు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. చికిత్స చేయించుకున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మంచిర్యాల, కరీంనగర్‌ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన జ్వరంతో బాధపడుతోన్న వ్యక్తిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స చెందుతూ మృతి చెందాడు. దీంతో విషజ్వరాలు ఎక్కువవడంతో మన్నెం వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే పారిశుద్ధ్యం లోపం వల్లే ఈ విష జ్వరాలు వ్యాపిస్తున్నాయంటున్నారు గిరిజనులు. ఎస్టీ వాడలో ఎవర్‌ హెడ్‌ ట్యాంకు నుండి సరఫరా అయ్యే నీటి పంపు వద్ద బురద ఏర్పడి నీరు కలుషితం అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ వైపు ఓవర్‌ హెడ్‌ ట్యాంకుకు క్లోరినేషన్‌ చేయించడం లేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 
భయాందోళనలో గిరిజనులు
వారం రోజుల నుండి విష జ్వరాలు ప్రబలుతూ ఇద్దరు మృతి చెందినప్పటికీ వైద్యశాఖ ఒక్క శిబిరం కూడా ఏర్పాటు చేయకపోవడం ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. విషజ్వరాలతో ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని గిరిజనులు భయందోళనకు గురవుతున్నారు. ఇకనైనా గవర్నమెంట్‌, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి సరైన వైద్యం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

 

16:45 - April 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ సెన్సార్‌బోర్డుపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు సమస్యలు రైతు ఆత్మహత్యలపై ఆర్‌.నారాయణమూర్తి నిర్మించిన  'అన్నదాతసుఖీభవ ' సినిమాను అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ మగ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీపీఐ, పీపీఎంతో పాటు పలువురు వామపక్షాల నేతలు  ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రైతుల సమస్యలను తెరకెక్కిస్తే పాలకులకు ఎందుకు నొప్పికలుగుతోందని ప్రశ్నించారు. అన్నదాతల ఆత్మహత్యలను అడ్డుకోవడం చేతకాని ప్రభుత్వాలు .. వారిసమస్యలపై సినిమా తీస్తే మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నాయని లెఫ్ట్‌నేతలు మండిపడ్డారు.

 

16:43 - April 15, 2018

విజయవాడ : కేవలం ఓట్ల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, సీబీఐతో విచారణ జరిపిస్తే నిజమేంటో బయటపడుతుందన్నారు. ఈమేరకు విష్ణుకుమార్‌ రాజుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమలో అవినీతి జరగలేదని నిరూపిస్తే కోర్టుతో సంబంధం లేకుండా శిక్షార్హుడిని అవుతానన్నారు. మోదీ, జగన్‌ దీక్షలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

 

16:38 - April 15, 2018

విజయవాడ : ప్రధాన మంత్రిని వ్యక్తిగతంగా నిందించినా, కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేసిందని ఆరోపణలు చేసినా.... కేంద్రం నుండి ఏపీకి వచ్చే ప్రయోజనాలు ఆగిపోవన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. ఈ మేరకు విజయవాడలో ఏపీకి కేంద్రం సాయం..హరిబాబు బహిరంగ లేఖ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభం అర్థిక లోటు భర్తీ ద్వారా సమకూరుతుందన్నారు. ప్యాకేజీ కాదని హోదా కోరడానికి కారణమేంటో చంద్రబాబు ప్రజలకు వివరించాలన్నారు. 

 

16:35 - April 15, 2018

ఢిల్లీ : లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై క్రేంద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ అభిప్రాయం తెలుసుకునే పనిలో ఎన్డీయే ప్రభుత్వం నిమగ్నమైంది. 2019, 2014లో రెండు విడతలుగా జమిలి ఎన్నికలు జరిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్న ఆలోచనలో మోదీ సర్కారు ఉంది. 
జమిలి ఎన్నికలు 
జమిలి ఎన్నికల విషయంలో ఎలక్షన్‌ కమిషన్‌ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కేంద్రం భావిస్తోంది. త్వరలో లా కమిషన్‌ నివేదిక ఇవ్వనుంది. 2019, 2014లో రెండు దఫాలుగా లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపాలని లా కమిషన్‌ సిఫారసు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నీతి ఆయోగ్‌ కూడా జమిలి ఎన్నికలకు మొగ్గు చూపింది. ఈ మేరకు కేంద్రానికి పంపిన నివేదికను.... మోదీ సర్కారు  ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. లా కమిషన్‌ కూడా జంట ఎన్నికలకు సిఫారసు చేస్తే... దీనిపై అభిప్రాయం సేకరణను వేగవంతం చేయాలిన ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. 
అసెంబ్లీల కాలపమితి పొడిగింపు లేదా తగ్గింపు ?
2021 వరకు కాలపరిమితి ఉన్న అసెంబ్లీలకు 2019లో లోక్‌సభతో పాటు ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ సిఫారసు చేసే అవకాశం ఉందని  అధికార వర్గాల్లో వినిపిస్తోంది. మొదటి విడత జమిలి ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అసోం, బీహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో  ఉండే అవకాశం ఉంది. 2024 జమిలి ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటక, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలు ఉంటాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆయా రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలంటే అసెంబ్లీ కాలపరిమితిని పొడిగించడం లేదా తగ్గించడం చేయాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగంతో పాటు ప్రజా ప్రానిధ్య చట్టానికి సవరణలు చేయాలి. 
బీజేపీకి ఎదురుగాలి ?
జమిలి ఎన్నికలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందన్న విమర్శలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మెజార్టీ సాధించింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో  కూడా బీజేపీకి ఎదురు గాలి వీస్తోందని గ్రహించిన మోదీ సర్కారు.. దీనిని ఎదుర్కొనేందుకు  జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెస్తోందన్న వాదనలు ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నిలకల్లో వచ్చిన సీట్లు 2019లో రాకపోతే ఏంచేయాలన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్న బీజేపీ... జమిలి ఎన్నికల ద్వారా జాతీయ అంశాలను ప్రజల ముందుంచి... లబ్ధి పొందాలన్న ఆలోచనలో ఉందని విశ్లేషిస్తున్నారు. కమలనాథుల ఆలోచనలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో వేచి చూడాలి. 

16:31 - April 15, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని తాడేపల్లిగూడెం ఎఫ్ సీఐ కాలనీలో నారాయణరావు అనే రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి ఇంటి ముందు సూర్యవతి అనే మహిళ ఆందోళన చేపట్టింది. పదేళ్ల క్రితం తనను దొంగ పెళ్లి చేసుకొని పొలం, బంగారం, డబ్బు కాజేసి రోడ్డుపాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనలాగే తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాలకు చెందిన మరికొంత మంది మహిళలను కూడా నారాయణ వంచించి మోసగించాడని.. పోలీసులు తక్షణమే అతన్ని అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేసింది.

16:27 - April 15, 2018

హైదరాబాద్ : గులాబీబాస్‌ దేశ రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కార్యాచరణను ముమ్మరం చేయాలని యోచిస్తున్నారు. వచ్చే నెల నుంచి దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతూ హస్తిన కేంద్రంగా పావులు కదిపేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారు..  బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు వ్యతిరేకంగా ఆయన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాట్లలో ఉన్నారు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, కర్నాటకలో దేవగౌడను కలిశారు. జార్ఖండ్‌ మాజీ సీఎం సోరెన్‌తోనూ కేసీఆర్‌ సమావేశమై చర్చలు జరిపారు.  ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీల మద్దతు పెద్ద ఎత్తున పొందేందుకు కేసీఆర్‌ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన అన్ని పార్టీల మద్దతును జాతీయ కూటమికి కూడగట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.

2019 ఎన్నికల నాటికి  పార్లమెంట్‌తోపాటు... కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం కర్నాటకలో ఎన్నికల నగారా మోగడంతో అక్కడ జేడీఎస్‌ కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్‌ జేడీఎస్‌ నేత దేవెగౌడతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌, బీజేపీకి దూరంగా ఉన్న జేడీఎస్‌ కూడా టీఆర్‌ఎస్‌తో విభేదించలేదు కానీ... పూర్తిగా కలిసి వస్తామని కూడా చెప్పలేదన్న ప్రచారం నడుస్తోంది. మరికొన్ని పార్టీల నేతలను కూడా కేసీఆర్‌ కలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతునిచ్చే పార్టీల మధ్య సమన్వయం పెంచడం కోసం టీఆర్‌ఎస్‌లో ఓ కమిటీని కేసీఆర్‌ నియమించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఎంపీలకు, సీనియర్లకు ఈ కమిటీలో స్థానం కల్పించే చాన్స్‌ ఉంది. 20 మంది నేతలతో ఈ సమన్వయ కమిటీ ఏర్పడే అవకాశముంది. ఈ నెలాఖరులోగా ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా  ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించేందుకు గులాబి దళపతి కేసీఆర్‌ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

హైదరాబాద్ : టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. 

 

16:10 - April 15, 2018

హైదరాబాద్‌ : నగరంలోని ఆర్టీసీ కళ్యాణమండపంలో ఈ నెల 18 నుంచి 22 వరకు సీపీఎం జాతీయ మహాసభలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఆ పార్టీ జాతీయ మహాసభలు జరుగనున్న నేపథ్యంలో మహాసభల విజయవంతానికి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మహాసభల విజయవంతానికి చేస్తున్న ఏర్పాట్లపై మహాసభల ప్రచార కన్వీనర్‌ పోతినేని సుదర్శన్‌తో టెన్ టివి ఫేస్‌ టూ పేస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పాలనలో సరళీకరణ విధానాలు వేగవంతం అయ్యాయని అన్నారు. మతోన్మాద విధానాలను పెంచి పోషిస్తోందని పేర్కొన్నారు. చట్టబద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. విదేశాంగ విధానంలో కేంద్రం సామ్రాజ్యవాదానికి, అమెరికాకు లొంగుబాటుగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు. ప్రజల మీద పడుతున్న భారాలు లేదా సమస్యలను ప్రజల్లోకి తీసుకొనిపోవడం లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ప్రజల మీద పడుతున్న భారాలకు వ్యతిరేకంగా సీపీఎం చేస్తున్న కృష్టిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కార్యక్రమంగా పెట్టుకుని ప్రచారంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క వాగ్ధానాన్ని అమలు చేయలేదన్నారు.

 

15:25 - April 15, 2018

హైదరాబాద్ : బీజేపీ పాలనలో మతోన్మాదం పెరిగిపోయిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మతోన్మాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నారు. వ్యవస్థను నియంత్రించే స్థాయికి మతోన్మాదం చేరిందని పేర్కొన్నారు. 

ఏప్రిల్ 18 నుంచి 22 వరకు సీపీఎం జాతీయ మహాసభలు : బీవీ.రాఘవులు

హైదరాబాద్ : ఏప్రిల్ 18 నుంచి 22 వరకు ఆర్టీసీ కళ్యాణమండపంలో సీపీఎం జాతీయ మహాసభలు జరుగనున్నాయని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు తెలిపారు. 18న ఉదయం 10 గంటలకు సీనియర్ నేత మల్లు స్వరాజ్యం పార్టీ జెండా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. మహాసభ ప్రాంగణం పేరు మహ్మద్ అమీన్ నగర్, సభా వేదిక పేరు కగేమ్ దాస్, సుకుమోల్ సేన్ అని అన్నారు. 25 ముఖ్యమైన తీర్మానాలపై మహాసభలో చర్చ ఉంటుందన్నారు. 22న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. రాజకీయ తీర్మానం, రాజకీయ నిర్మాణ వేదికపై రెండు రోజులపాటు చర్చలు ఉంటాయని చెప్పారు. 

 

13:32 - April 15, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ మక్కా మసీదు పేలుళ్ల కేసులో సోమవారం తుది తీర్పు వెలువడనుంది. పదహారు మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. కేసు దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ... హిందూ రైట్‌ వింగ్‌ సభ్యులు పేలుళ్లకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. ఈ కేసులో సోమవారం తుది తీర్పు వెలవడనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు, విచారణ పూర్తి కావడానికి దాదాపు 11 సంవత్సరాలు పట్టింది. మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో... 2007 మే 18న పేలుళ్లు జరిగాయి. ఆనాటి ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల తర్వాత పాతబస్తీలో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 58 మంది గాయపడ్డారు. చికిత్సపొందుతూ వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మక్కా మసీదు పేలుళ్ల ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐయేకి అప్పగించారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న అభియోగంపై ఎన్‌ఐయే కొందరు మైనారిటీ యువకులను అరెస్టుచేసి, కోర్టులో చార్జ్‌షీటు వేసింది.

అయితే కేసు విచారించిన నాపంల్లి ప్రత్యేక న్యాయస్థానం.. మక్కా మసీదు పేలుళ్ల కేసులో వీరికి సంబంధంలేదని తీర్పు ఇవ్వడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆ తర్వాత మళ్లీ కేసు విచారణ చేపట్టిన ఎన్‌ఐయే.. హిందూ రైట్‌ వింగ్‌ సభ్యులు పేలుళ్లుకు పాల్పడినట్టు తేల్చింది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసమానంద, లక్ష్మణ్‌దాస్‌ మహరాజ్‌, శ్రీకాంత్‌ పురోహిత్‌ సహా 11 మందిపై ఎన్‌ఐయే కేసు నమోదు చేసింది. అభినవ్‌ భారత్ సంస్థ నిర్వాహకులు స్వామి అసమానంద, లోకేశ్‌శర్మ పేలుళ్లకు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మరో నిందితుడు జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొత్తం 226 మంది సాక్షులను విచారించింది. సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నిందితులు కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

16 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న కేసులో...

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ మక్కా మసీదు పేలుళ్ల కేసులో సోమవారం తుది తీర్పు వెలువడనుంది. పదహారు మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. 

13:28 - April 15, 2018

కడప : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ పోరాటాలు ఆపేదిలేదన్నారు కడప జిల్లా వామపక్ష నేతలు. ఉద్యమాలతోనే హోదా సాధ్యమవుతుందన్నారు. ఈ మేరకు హోదా కోరుతూ రేపటి బంద్‌కు సంఘీభావంగా వామపక్షాలు బైక్‌ ర్యాలీని నిర్వహించాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. రేపటి బంద్‌కు ప్రజలు సహకరించాలని వామపక్ష నేతలు కోరారు.

13:26 - April 15, 2018

గుంటూరు : ప్రతిపక్ష నేత జగన్‌ గుంటూరు జిల్లా పాదయాత్రతో రాజధాని అమరావతిలో భూముల ధరలు పడిపోయాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్‌కు మంతి భ్రమించి, అమరావతిని భ్రమరావతి అంటూ కించపరుస్తున్నారని మండిపడ్డారు. అమరావతికి అనుకూలమా... వ్యతిరేకమా.. అన్న ప్రశ్నకు జగన్‌ ఇంత వరకు సమాధానం చెప్పకపోవడాన్ని మంత్రి పుల్లారావు తప్పుపట్టారు. ప్రధాని మోదీతో జగన్‌ లాలూచీపడి... ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

13:09 - April 15, 2018

హైదరాబాద్ : సీపీఎం అఖిల భారత మహాసభల కోసం తాము కోరుకున్న స్థలం ఇవ్వలేదని..ఇది రాజకీయపరమైన తిరస్కరణ అని భావిస్తున్నామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలకు గ్రౌండ్ ఇవ్వాలని నిబంధన ఉందని, స్థానిక యాజమాన్యం..అధికారులు రికమెండ్ చేయలేదని తమకు ఉత్తరం రాశారని తెలిపారు. తాము గత్యంతరం ఏమి లేని పరిస్థితుల్లో సరూర్ నగర్ స్టేడియంలో సభ జరుగుతున్నామన్నారు. మహాసభలకు ప్రజలు జయప్రదం చేయాలని, జయప్రదం కోసం రాష్ట్ర వ్యాపితంగా కార్యకర్తలు విస్తృతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 17వ తేదీ సాయంత్రం వరకు ప్రతినిధులు నగరానికి చేరుకుంటారని తెలిపారు. 

12:51 - April 15, 2018

ఆంధ్రప్రదేశ్ కాస్తా సమరాంధ్రగా మారిపోయింది. ప్రత్యేక హోదా కల్పించాలంటూ వివిధ పార్టీలు రోడెక్కుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనలు..నిరసనలు పెల్లుబికుతున్నాయి. పార్లమెంట్ లో బీజేపీ అనుసరించిన నిరసనకు తీరుగా ప్రత్యేక హోదా సాధన సమితి, జనసేన, వామపక్షాలు 16వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో లక్ష్మీ పార్వతి (వైసీపీ), రఘునాథ్ బాబు (బిజెపి), చందూ సాంబశివరావు (టిడిపి), బాబురావు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:29 - April 15, 2018

గుంటూరు : తాళ్లాయపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిటిడి ఛైర్మన్ గా నియమించిన పుట్టా సుధాకర్ పై శివస్వామి చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. తాళ్లాయపాలెంలో ఉన్న శైవక్షేత్రాన్ని ముట్టడించేందుకు యాదవ సంఘం నేతలు ప్రయత్నించారు. దీనితో విషయం తెలుసుకున్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఉండవల్లి సెంటర్ లో కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాళ్లాయపాలెంలో భారీగా మోహరించారు. దీనితో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పుట్టా సుధాకర్ పై విమర్శలు చేసే స్థాయి శివస్వామికి లేదని వారు మండిపడుతున్నారు.

విజయవాడలో శివస్వామి గతంలో బంగారం వ్యాపారం చేసేవారు. అనంతరం శివస్వామిగా అవతారం ఎత్తిన ఇతను విజయవాడలో రోడ్డుకిరువైపులా ఉన్న దేవాలయాల తొలగింపుపై గతంలో ఆందోళనలు చేశారు. అన్యమత ప్రచార సభలకు వెళ్లిన పుట్టా సుధాకర్ యాదవ్ ను టిటిడి ఛైర్మన్ గా ఎలా నియమిస్తారని ఇటీవలే శివస్వామి ప్రశ్నించారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే టిటిడి ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. దీనిపై యాదవ సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. 

జనసేనాలో చేరాలని ఆహ్వానించారు - ముద్రగడ...

తూర్పుగోదావరి : జనసేనలో చేరమని తనను ఆహ్వాచించారని కానీ ఒక పార్టీలో చేరలేనని చెప్పడం జరిగిందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పేర్కొన్నారు. కాపులకు అన్యాయం చేసిన సీఎం చంద్రబాబు నాయుడికి బుద్ధి చెబుతామని, కాపులకు ఏ పార్టీ న్యాయం చేస్తే వారికి తమ మద్దతుంటుందని ప్రకటించారు. సినిమాలు మానేయాలని పవన్ కు తాను చెప్పలేదని, ఎన్టీఆర్ మాదిరిగా జనాల్లో ఉండడం ద్వారా ఆదరణ పొందే అవకాశం ఉంటుందని సూచించానన్నారు. 

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో...

ఢిల్లీ : కామన్ వెల్త్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో రంకిరెడ్డి సాత్విక్ - షెట్టి చిరాగ్ జోడీ పరాజయం పాలైంది. ఫైనల్ లో ఇంగ్లండ్ జోడీ చేతిలో 13-21, 16-21 తేడాతో ఒటమి పాలయ్యారు. దీనితో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఇద్దరు బాలికలపై అత్యాచారం...

గుంటూరు : తెనాలి పాండురంగపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై పానీపూరి బండి నిర్వాహకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలికలకు పానీపూరి ఆశచూపి కొద్దిరోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగు చూసింది. త్రీ టౌన్ పీఎస్ లో నిందితుడు నరసింహపై కేసు నమోదు చేశారు. 

శివస్వామి ముట్టడికి యాదవ సంఘం ప్రయత్నం...

గుంటూరు: శివస్వామి ఆశ్రమ ముట్టడికి యాదవ సంఘం నేతలు యత్నించారు. సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ ను టిటిడి ఛైర్మన్ గా ఎంపిక చేయడాన్ని శివస్వామి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శివస్వామి చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

11:07 - April 15, 2018
10:09 - April 15, 2018

మహబూబ్ నగర్ : నారాయణ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. యాదగిరి రోడ్డులో ఉన్న హరి హోం నీడ్స్ గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు మొత్తంగా వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న నానాలాల్ పటేల్ కు కూడా మంటలు అంటుకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. 

హరి హోం నీడ్స్ గోదాంలో అగ్నిప్రమాదం...

మహబూబ్ నగర్ : నారాయణపేట పట్టణంలోని యాదగిరి రోడ్డులో ఉన్న హరి హోం నీడ్స్ గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈఘటనలో నానాలాల్ పటేల్ అనే వ్యక్తి సజీవదహనమయ్యాడు. 

09:57 - April 15, 2018

ఐపీఎల్ లో నేడు...

హైదరాబాద్ : ఐపీఎల్ 11లో నేడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా సాయంత్రం 4గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

జగన్ 137 వ రోజు...

విజయవాడ : జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 137వ రోజు వైఎస్ఆర్ కాలనీ నుండి పాదయాత్ర జరుగుతోంది. అంబాపురం, జక్కంపూడి మీదుగా తాడేపల్లి వరకు పాదయాత్ర జరుగనుంది. 

08:05 - April 15, 2018

ఢిల్లీ : : కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరు...భారత స్టార్ క్రీడాకారిణిల మధ్య పోటీ..ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అనే ఉత్కంఠ కామన్ వెల్త్ గేమ్ లో చోటు చేసుకుంది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌లో తలపడ్డారు. నువ్వా..నేనా అన్నట్లుగా ఈ పోరు సాగింది. ఎవరికి స్వర్ణం దక్కుతుందా ? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. చివరికి సైనానే పై చేయి సాధించింది. సింధుపై 21-18, 23-21 తేడాతో సైనా విజయం సాధించింది. సైనాకు స్వర్ణం..సింధుకు రజత పతకం లభించింది. మొత్తంగా 62 పతకాలు సాధించిన భారత్ మూడో స్థానంలో నిలిచింది. 

సైనాకు స్వర్ణం...

ఢిల్లీ : కామన్ వెల్త్ మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు తలపడ్డారు. ఈ మ్యాచ్ లో సైనాకు గెలుపొంది స్వర్ణ పతకం సాధించింది. సింధుపై 21-18, 23-21 తేడాతో విజయం సాధించింది. 

06:42 - April 15, 2018

ఢిల్లీ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. కానీ, ఎవరికి స్వర్ణం దక్కుతుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇవాళ జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. 

06:40 - April 15, 2018

ఢిల్లీ : ఐపీఎల్‌ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా అతిథ్య జట్టు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో హైదరాబాద్‌ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్‌కతా నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సైన్‌రైజర్స్‌ ఇంకా ఒక ఓవర్‌ మిగిలిఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్‌ జట్టు సారథి కేన్‌ విలియమ్‌సన్‌ 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

06:37 - April 15, 2018

విజయవాడ : తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో మాఫియా చెలరేగి పోతోంది. కొండలు, కోనలు, నదులు ఇలా అన్నంటిని వరుసబెట్టి మింగేస్తోంది. అక్రమంగా తవ్వకాలు జరుపుతూ మాఫియా సొమ్ముచేసుకుంటోంది. ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతోంటే.. అధికారులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తూర్పు ఏజెన్సీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై 10టీవీ కథనం...తూర్పు ఏజెన్సీ విలువైన మైనింగ్‌కు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఆ మైనింగ్‌పైనే మాఫియా కన్నేసింది. ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు ప్లాన్‌ వేసింది. అక్రమంగా తవ్వకాలు జరుపుతూ ప్రకృతి సంపదైన మైనింగ్‌ను తరలించుకుపోతోంది. కూనవరం మండలం బొదనూరులో అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొంతమంది కాంట్రాక్టర్లు సహజ సంపదను దోచుకుంటున్నారు. లక్షల విలువచేసే తెల్లరాయిని గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.

తూర్పు ఏజెన్సీ నుంచి అక్రమంగా తరలిస్తున్న సున్నపురాయి టన్నుకు పదివేల రూపాయల వరకు పలుకుతుంది. దీంతో అక్రమార్కులకు మైనింగ్‌ వరంగా మారింది. ప్రకృతి సిద్దంగా ఏర్పడిన ఖనిజ సంపదపై కన్నేసిన మాఫియా.. అక్రమాలకు తెరలేపుతోంది. గుట్టుచప్పుడు కాకుండా సున్నపురాయిని తరలించేస్తోంది. తాడేపల్లిగూడేనికి చెందిన ఓ పొలిటికల్‌ లీడర్‌ సాయంతో సున్నపురాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. బొదునూరులో 500 టన్నులు, ఏటపాక మండలం కొత్తూరులో మరో 500 టన్నుల తెల్లరాయి రవాణాకు సిద్ధంగా ఉంచారు.

తెల్లరాయిని గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులు రాష్ట్రాలు దాటిస్తోంటే అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా... సున్నపురాయి తరలింపుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్తున్నారు. సున్నపురాయిని రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తూ సొమ్ముచేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

06:34 - April 15, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌కు రెండోరోజు నగర వాసులు క్యూకట్టారు. వీకెండ్‌ కావడంతో జనం భారీగా తరలివస్తున్నారు. విజ్ఞానం, వినోదం, సాహిత్యం, సాంస్కృతికం మేళవింపుగా ఈ ఫెస్ట్‌ జరుగుతోంది. ఒకే ఆవరణలో వివిధ అంశాలకు సంబందించిన స్టాల్స్‌ ఏర్పాటు చేయడంతో నగర వాసులు వీక్షించేందుకు తరలుతున్నారు. ఒకేచోట తమకు కావాల్సినవి అన్నీ దొరకుతుండడంతో సందర్శనకు ఆసక్తి కనబర్చుతున్నారు.

ఆటల జోరు.. పాటల హోరు... ఒకవైపు జానపదాలు ... మరోవైపు వెస్ట్రన్‌ డ్యాన్సులు... అంతేకాదు... కవితల ఝరి.... విజ్ఞాన సవ్వడి... అంతేనా... బాలోత్సవ్‌ సందడి.. ఇలా ఒకటేమిటి.... హైదరాబాద్‌ ఫెస్ట్‌లో సమస్త అంశాలు కొలువుదీరాయి. స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ ఫెస్ట్‌ జరుగుతోంది. ఇందులో ప్రతీది ఏర్పాటు చేశారు. కవిత్వం, వినోదం, విజ్ఞానం, చిన్నారుల కోసం బాలోత్సవ్‌, పెద్దల కోసం సాంస్కృతి కార్యక్రమాలు.. పుస్తక ప్రియుల కోసం బుక్‌స్టాల్స్‌, ప్రభుత్వ విభాగాల స్టాల్స్.. వాణిజ్య సముదాయాలన్నీ ఒకేచోట ఇందులో దర్శనమిస్తున్నాయి. దీంతో నగర వాసులు హైదరాబాద్‌ ఫెస్ట్‌ను తిలకించేందుకు బారులు తీరుతున్నారు. రెండోరోజైన శనివారం హైదరాబాద్‌ ఫెస్ట్‌కు క్యూకట్టారు.

ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచే ఫెస్ట్‌ ప్రారంభమవుతోంది. దీంతో జనాలు వారికి వీలైన సమయంలో సందర్శిస్తున్నారు. సృజన స్వరం పేరుతో ప్రతిరోజూ ఒక్కోఅంశంపై ప్రత్యేక చర్చా కంబంద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వేదికను ఆనుకుని బుక్‌ఫెయిర్‌ను ఏర్పాటు చేశారు. సినీ రచయిత పరుచూరి బ్రదర్స్‌ సృజన స్వరంలో పాల్గొన్నారు. అనంతరం పుస్తక ప్రదర్శను తిలకించారు. పుస్తకాలు ప్రతి ఒక్కరి నేస్తాలని.. పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ను విభిన్న రకాల అంశాలతో నిర్వహించడం సంతోషంగా ఉందని నందిని సిధారెడ్డి అన్నారు. శాస్త్రీయ దృక్పథంలో నిర్వహిస్తున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

హైదరాబాద్‌ ఫెస్ట్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీఫెన్‌ హాకింగ్‌ సైన్స్‌ హబ్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ సరికొత్త సైన్స్‌ ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. ఆడుతూ పాడుతూ చదువులెలా చదవాలో ఈ ఫెస్ట్‌లో ప్రధానంగా చూపుతున్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైన్స్‌కు సంబంధించిన ప్రయోగాలు తీసుకొచ్చి వాటిని అతిథులకు వివరిస్తున్నారు. మ్యాజిక్‌ చేయడంతోపాటు.. అందులో దాగున్న ట్రిక్కులను వివరిస్తున్నారు. వండర్‌ సైన్స్‌, హ్యూమన్‌ ఆర్గాన్స్‌, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ శాస్త్రవేత్తలతో మీట్‌ది సైంటిస్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహించి.. విద్యార్థులకు సైన్స్‌లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తున్నారు.

హైదరాబాద్‌ ఫెస్ట్‌లో తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఖైదీలు తయారు చేసిన వస్తువులు ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వంటింట్లో వాడే వస్తువుల దగ్గరి నుంచి ధరించే దుస్తుల వరకు ఇందులో లభ్యమవుతున్నాయి. ఇంటీరియల్‌ డెకరేషన్స్‌ ప్రదర్శనలో ఉంచారు. జైళ్లశాఖ తయారు చేసిన వస్తువులకు మంచి ఆదరణ లభిస్తోందని హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ సైదయ్య తెలిపారు. ఎడ్యుకేషన్‌తోపాటు... వివిధ వాణిజ్య సముదాయాలు ఇందులో కొలువుదీరాయి. నోరూరించే వంటలు, వస్త్రాలు, జూట్‌ బ్యాగ్‌లు, ప్రాపర్టీషోతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ డిపార్ట్‌మెంట్లు ఇందులో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

ప్రధాన వేదికపైన ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. నాటికలు, ఆటలు, పాటలు, డ్యాన్సుల, శాస్త్రీయ సంగీతం, నృత్యాలతో వేదిక మార్మోగుతోంది. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి రోజు కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రెండో రోజూ సాంస్కృతిక కార్యక్రమాలకు విశిష్ట అతిథిగా సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వచ్చారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఎంతో అద్భుతంగా జరుగుతోందన్నారు. బాలోత్సవ్‌ సందడిగా సాగుతోంది. చిన్నారుల ఆటపాటలు, కథలు, కాంపిటీషన్స్‌తో విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, సృజనాత్మకథను వెలికి తీస్తున్నారు. కన్నుల పండుగా జరుగుతున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌ను ఒకసారైనా సందర్శించాలని ప్రతిఒక్కరూ తరలి వస్తున్నారు.

06:31 - April 15, 2018

హైదరాబాద్ : సినీనటి శ్రీరెడ్డి హుమాయూన్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి, సత్యాచౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈనెల 4న ఓ టీవీచానల్‌లో డిబేట్‌ సందర్భంగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పెర్కొంది శ్రీరెడ్డి. పైగా తనను చంపుతామని బెదిరిస్తున్నారని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన హుమాయూన్‌గన్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీ డిబేట్‌ను పరిశీలించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని చెప్పారు. 

06:28 - April 15, 2018

హైదరాబాద్ : బీజేపీ పాలనలో మహిళలపై దారుణాలు పెరిగాయి. బీజేపీ నాయకులే మహిళలపై అత్యాచారాలు చేయడం సిగ్గుచేటు అని జానారెడ్డి అన్నారు. మహిళలపై దాడులను అరికట్టాలంటూ పీపుల్స్ ఫ్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ పాల్గొన్న జానారెడ్డి. ఇప్పటికైన ప్రభుత్వం కళ్లు తెరవాలని.. .మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్, షబ్బీర్ అలీ, పొన్నాల, వీహెచ్ దానం, డికె ఆరుణ, పొంగులేటి పాల్గొన్నారు.

06:26 - April 15, 2018

విజయవాడ : ఏపీపై కేంద్రం కక్ష సాధిస్తోందని టీడీపీ ఎంపీ రవీంద్రబాబు ఆరోపించారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదంటూనే.. ఇతర రాష్ట్రాలకు పొడిగించడం పుండుమీద కారం చల్లడమేనని ఆయన మండిపడ్డారు. కాకినాడలో పెట్టాల్సిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను రత్నగిరికి తరలించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. KG బేసిన్‌లోని క్రూడ్‌ ఆయిల్‌ను అక్కడే శుద్ధి చేస్తామని చెప్పి.. అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించడం సరికాదన్నారు. తమ రాష్ట్రం నుంచి తీసుకువెళ్లే గ్యాస్‌ను ఆపితే ఏమవుతుందని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తుందని రవీంద్రబాబు మండిపడ్డారు. దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలని కేంద్రం చూస్తోందా అని ఆయన ప్రశ్నించారు. 

నిరహార దీక్ష చేయనున్న బాబు...

హైదరాబాద్ : కేంద్ర వైఖరి నిరసిస్తూ తన పుట్టిన రోజున నిరాహార దీక్ష చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈనెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

16న బంద్ కు ప్రభుత్వం మద్దతు...

విజయవాడ : ఈనెల 16న విపక్షపార్టీలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో బంద్‌ నిర్వహించుకోవాలన్నారు. శాంతియుత పద్దతిలో నిరసనలు తెలిపితే ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు ఏపీ హోం మంత్రి.

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ...

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సులోని కంపార్టుమెంటులు మొత్తం భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మరోవైపు వసతి గదులు ఖాళీ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 

తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత...

విజయనగరం : జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండో పంటకు అధికారులు నీటిని విడుదల చేయకపోవడంపై ఆగ్రహించిన రైతాంగం మూకుమ్మడిగా ప్రాజెక్టును ముట్టడించారు. 

శనివారం ఆరు బంగారు పతకాలు...

ఢిల్లీ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతున్న 21వ కామన్వెల్త్‌ పోటీల్లో ఇవాళ భారత్‌కు ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. శనివారం ఒక్కరోజే ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.

శనివారం ఆరు బంగారు పతకాలు...

ఢిల్లీ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతున్న 21వ కామన్వెల్త్‌ పోటీల్లో ఇవాళ భారత్‌కు ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. శనివారం ఒక్కరోజే ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.

ఎవరికి స్వర్ణం...?

ఢిల్లీ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. 

Don't Miss