Activities calendar

16 April 2018

22:07 - April 16, 2018

హైదరాబాద్‌ : భగవంతుని ముందు అందరూ సమానులే... అని రుజువు చేస్తూ.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకులు రంగరాజన్‌ మరోసారి చాటారు. హైదరాబాద్‌ జియాగూడలోని రంగనాథస్వామి ఆలయంలో దళిత యువకుణ్ని భుజాలపై ఎక్కించుకుని గుడిలోనికి తీసుకెళ్లారు. మునివాహనసేవ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అర్చకులు రంగరాజన్‌పై ప్రశంశలు కురిపించారు. 

22:03 - April 16, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో వేయి కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ ప్రగతిభవన్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మైనార్టీ వ్యవహారాలు, పాతబస్తీ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్‌కే జోషి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అధికారులు హాజరయ్యారు. పాతబస్తీలో అభివృద్ధిపనులకు తానే శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే పాతబస్తీలో పర్యటించి అభివృద్ధి పనుల ప్రకటన చేస్తామని సీఎం తెలిపారు. వరదలకు ఆస్కారం లేకుండా పాతబస్తీని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మూసీ ప్రక్షాళనకు 1600కోట్లు ఖర్చు చేస్తామని కూడా కేసీఆర్ తెలిపారు. 

 

22:00 - April 16, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు భాగ్యనగరం ముస్తాబైంది. హైదరాబాద్‌ ఆర్టీసీ కల్యాణ మండలంలో ఈనెల 18 నుంచి జరగనున్న మహాసభలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మహాసభల ఏర్పాట్లను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరిశీలించారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. ఈ సభకు 840 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని బీవీ రాఘవులు తెలిపారు. 22న జరిగే మహాసభకు 3 లక్షల మంది హాజరవుతారని.. ఈ మహాసభ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందన్నారు. 

 

21:59 - April 16, 2018

జగిత్యాల : జిల్లాలోని కొండగట్టులో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరి కూతుళ్లను గొంతు పిసికి చంపాడు. అసిఫాబాద్‌ జిల్లాకు చెందిన లక్ష్మీ అశోక్‌ అనే దంపతులు వారి పిల్లలు హన్సిక, హర్షితలతో కలిసి ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చారు. ఆదివారం ఇద్దరి పిల్లలకు నీళ్లు తాగిస్తానని భార్యతో చెప్పి పిల్లలను దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి గొంతు పిసికి చంపి పారిపోయాడు. తల్లి వెతకగా పిల్లలు, భర్త కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అడవిలో గాలించగా ఒక పాప మృతదేహం లభ్యమైంది. మరొక పాప కోసం, పారిపోయిన తండ్రి గురించి పోలీసులు వెతుకుతున్నారు. 

 

21:56 - April 16, 2018

గుంటూరు : కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆగ్రహం బంద్‌ రూపంలో వ్యక్తమైంది. ఉదయం నుంచే స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించి బంద్‌ను సక్సెస్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంద్‌ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి.. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు. బంద్‌ సక్సెస్‌ కావడంతో ఆందోళనలు ఉధృతం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన సమితి సిద్దమవుతోంది. ఈనెల 24న బ్లాక్‌డేగా పాటించాలని పిలుపునిచ్చారు. 20న సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్‌ 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో వామపక్షాలు, జనసేన, ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు రోడ్లపైకి వచ్చి బంద్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా బంద్‌ నిర్వహించారు. వ్యాపారసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, సినిహా హాళ్లు మూసివేసి బంద్‌కు సహకరించారు. బంద్‌ నేపథ్యంలో అన్ని పార్టీల కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు తెలిపారు. మానవ హారాలు నిర్వహించి తమ నిరసనలు తెలిపారు. ఇక బంద్‌ నేపథ్యంలో ఏపీలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు... పరీక్షలను వాయిదా వేశారు. 
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం 
ఇక రాష్ట్రానికి కేంద్రం చేసిన మోసాన్ని నిరసిస్తూ విజయవాడలో జనసేన నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కడపలో వామపక్ష నేతలు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి అప్సర సర్కిల్‌, కృష్ణా సర్కిల్‌మీదుగా బైక్‌ ర్యాలీ నిర్వహించి బంద్‌ నిర్వహించారు. బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని వామపక్ష నేతలలన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌, జనసేన నేతలు బంద్‌ నిర్వహించారు. బంద్‌ సక్సెస్‌ అయితే... కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందన్నారు. రాజమండ్రి అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలు.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, మోదీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట బస్టాండ్‌ ఎదుట కేంద్రం వైఖరిని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు మానవహార నిర్వహించారు. శ్రీకాకుళంలో బంద్‌ చేస్తున్న నేతలు పోస్టాఫీసులో ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు బంద్‌ నిర్వహించాయి. విభజన హామీలు నెరవేర్చాలంటూ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు బంద్‌ నిర్వహించాయి. మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు.. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  విజయనగరం జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బంద్‌ నిర్వహిస్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ కర్నూలులో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపైనే కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. 
ఉద్యమాన్ని అణిచివేసేందుకు చంద్రబాబు యత్నం 
విజయవాడ బస్టాండ్‌ వద్ద బంద్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి ఛైర్మన్‌ చలసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. బంద్‌లో ప్రజలందరూ పాల్గొంటుంటే.. పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు. 
పలుచోట్ల అరెస్టులు 
శాంతియుతంగా బంద్‌ చేస్తున్నవారిని పలుచోట్ల అరెస్టులు చేయడం దారుణమన్నారు చలసాని శ్రీనివాస్‌. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 24న బ్లాక్‌డే పాటించాలని పిలుపునిచ్చారు. అదేరోజు రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు లైట్లన్నీ ఆర్పివేసి చీకటిమయం చేయాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని... ఇందుకోసం 20న భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు మరోసారి స్పష్టం చేశారు. 

 

21:42 - April 16, 2018

కథువా ఘటన ఏం సూచిస్తుంది ? మతోన్మాదానికి ఇంత వికృత రూపం ఉంటుందా ? రేపిస్ట్ మనవాడైతే మహిళలు కూడా మద్దతు పలకొచ్చా ? మతోన్మాదం వెర్రితలలు.. అనే అంశంపై వీక్షణం...వేణుగోపాల్ తో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'అత్యాచారం, హత్య క్రూరమైన నేరం. మనుషులున్నా దేశమేనా అన్న అనుమానం కల్గుతుంది. మతోన్మాదం అథమస్థాయికి దిగజారింది. హిందూ మతోన్మాదం క్రూరమైంది. చట్టాల కంటే సామాజిక అవగాహన జరగాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:23 - April 16, 2018

అగ్గిరాసుకుంటున్న ప్రత్యేక హోదా పంచాది...సంపూర్ణ బందుకు సహకరించిన జనాలు, టీఆర్ఎస్ పార్టోళ్లు పాత చెప్పుల దొంగలు..జగదీశ్వర్ రెడ్డి మీద రేవంత్ షూటింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కమ్మదనం జెప్పినమంత్రి..అనవుసర ఖర్చుల లెక్కమాత్రం జెప్పలే, ఉప్పెన లెక్క లేశిన దళిత శక్తి పొగ్రాం సభ..భారత రాజ్యాంగానికి బహుజన పట్టాభిషేకం, మళ్లొక భూమిల ఏలువెట్టిన జనగామ ఎమ్మెల్యే...ఇంకెన్ని కబ్జాలు వెడ్తవయ్యో ముత్తిరెడ్డి..?, నిజామాబాద్ జిల్లాల ఆగిన రైతు గుండే...రైతు ఆత్మహత్యల తెలంగాణలెక్కైన రాష్ట్రం.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

మక్కామసీదు పేలుళ్ల కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి రాజీనామా

హైదరాబాద్ : మక్కామసీదు పేలుళ్ల కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపారు. 

 

20:46 - April 16, 2018

హైదరాబాద్ : మక్కామసీదు కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపారు. 

 

20:43 - April 16, 2018

రంగారెడ్డి : జిల్లాలోని మంచాల మండలంలోని  అరుట్ల గ్రామంలో.. జమ్మూకశ్మీర్‌లోని ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన దారుణాన్ని ఖండిస్తు ర్యాలీ నిర్వహించారు. కథువా హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమ్మాయిలపై జరుగుతోన్న దాడులను నియంత్రించేలా చర్యలు తీసుకోవలని వారు ప్రభుత్వాన్ని కోరారు.  ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల నేతలు పాల్గోన్నారు. 

 

20:40 - April 16, 2018

సంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును బాత్‌రూంలో వదిలి వెళ్లారు. ఆసుపత్రి సిబ్బంది చూసి సూపరింటెండెంట్‌ పద్మజకు తెలిపారు. అప్పటికే శిశువు మరణించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రామచంద్రాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

20:22 - April 16, 2018

విజయవాడ : 2017-18 సంవత్సరం..రంగస్థల పురస్కార అవార్డులకు 65 మందిని ఎంపిక చేసినట్లు ఏపీ రాష్ట్ర ఫిల్మ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అంబికా కృష్ణ తెలిపారు. కందుకూరి వీరేశలింగం 171వ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 21న ఏలూరులో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఉత్తమ షార్ట్‌ ఫిలిమ్స్‌లకు కూడా అవార్డులు అందజేస్తామని అన్నారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌కు మద్దతుగా విజయవాడలో .. త్వరలో సినీ, టీవీ నటీనటులు ర్యాలీ నిర్వహిస్తారని అంబికా కృష్ణ చెప్పారు.  

 

20:20 - April 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 29న సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సమావేశాన్ని నిర్వహించనుంది. సభ కోసం అనుమతి ఇవ్వాలని జనసమితి నేతలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సభకు అనుమతి ఇవ్వలేమని ఇటు పోలీసు శాఖ, అటు సరూర్‌నగర్‌ గ్రౌండ్‌ నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో  తెలంగాణ జన సమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. 

 

20:17 - April 16, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా, విభజనచట్టంలోని హామీల అమలు డిమాండ్‌తో.. విపక్షాలు చేపట్టిన బంద్‌ ప్రభావం.. ఏపీ సచివాలయంపైనా కనిపించింది. ఉద్యోగులు, సందర్శకులు బంద్‌ కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఏపీ బంద్‌ ప్రభావం.. రాష్ట్ర సచివాలయంపైనా పడింది. బంద్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీంతో సచివాలయం సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు బాగా ఇబ్బందులు పడ్డారు. ఆటోలపై కార్యాలయాలకు తరలివచ్చారు. ఇదే అదనుగా ఆటోల డ్రైవర్లు.. 50 రూపాయలున్న చార్జీలను.. ఏకంగా 150 రూపాయలకు పెంచేశారు. పైగా ఆటోల్లో ఎక్కువమందిని కూరి తీసుకువచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని.. హోదా కోసం తాము ఇలాంటి చిన్న చిన్న కష్టాలు ఎన్నైనా ఎదుర్కొంటామని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. 
సచివాలయానికి తగ్గిన సందర్శకుల తాకిడి 
మరోవైపు బంద్‌ ప్రభావంతో.. సచివాలయానికి సందర్శకుల తాకిడి రోజుకన్నా కూడా కొంత తగ్గింది. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా.. మంత్రులు అధికారులు తరలిరావడంతో.. వారిని కలిసేందుకు వచ్చిన వారు.. కొంతమేర ఇబ్బందులు పడ్డారు. 

 

20:15 - April 16, 2018

విజయవాడ : బంద్‌ సంపూర్ణంగా జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అంటున్నారు. ప్రత్యేక, విభజన హామీలపై ప్రతి ఒక్కరూ తమ వంతుగా బంద్‌లో పాల్గొని సంపూర్ణం చేశారంటున్నారు. అయితే టీడీపీ, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసమే ఆరాట పడుతున్నారంటున్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలకు మోసం చేశాయని విమర్శించారు. భవిష్యత్‌లో ఉద్యమం ఉధృతం చేస్తామంటున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:05 - April 16, 2018

ఉత్తరప్రదేశ్ : యూపీకి చెందిన బిజెపి ఎంపి, సాధువు సాక్షి మహారాజ్‌ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. లక్నోలో ఓ బార్‌ అండ్‌ నైట్‌ క్లబ్‌ను ప్రారంభించడం వివాదస్పదమైంది. యూపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే మేనల్లుడు అలీగంజ్‌లో ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌కు ఉన్నావ్‌ ఎంపి సాక్షి మహారాజ్‌ను ఆహ్వానించారు. సాక్షి మహారాజ్ రిబ్బన్‌ కట్‌ చేసి నైట్‌ క్లబ్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు బహూకరించిన గణేషుడి ప్రతిమతో వెనుదిరిగారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ సాధువై ఉండి బార్‌ను ప్రారంభించడమేంటని విమర్శలు వెల్లువెత్తడంతో సాక్షి మహారాజ్‌ స్పందించారు. అది బార్‌ అన్న విషయం తనకు తెలియదని, తప్పుడు సమాచారంతో తనని మోసం చేశారని చెప్పారు. తన గౌరవానికి భంగం కలిగించిన మహేంద్రనాథ్‌ పాండేపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపి వెల్లడించారు.  

 

20:02 - April 16, 2018

హర్యానా : దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. కథువా, సూరత్‌లో జరిగిన రేప్‌ మర్డర్ ఘటనలు మరవకముందే హర్యానాలోని రోహతక్‌లో మరో ఘటన వెలుగు చూసింది. రోహతక్‌లో టిటౌలి గ్రామ సమీపంలోని పంట కాలువలో పదేళ్ల బాలిక శవం కలకలం రేపింది. బాలిక శవాన్ని ఓ బ్యాగులో కట్టేసి పంట పొలాల కాలువలో పారేశారు. ఓ చేయి సంచిలో నుంచి బయటకు కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంచిని విప్పి చూడగా బాలిక శవం కుళ్లిపోయి కనిపించింది. 4, 5 వారాల క్రితం బాలికను చంపేసి ఉంటారని భావిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తుల పేరిట కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టు కోసం కోసం బాలిక శవాన్ని రోహతక్‌కు పంపారు. రిపోర్టు వస్తేనే నిజాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు. 

 

19:58 - April 16, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆసిఫా కుటుంబానికి, ఆమె తరపు వాదిస్తున్న లాయర్‌కు రక్షణ కల్పించాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ నుంచి చండీగఢ్‌కు తరలించాలని కోరుతూ ఆసిఫా తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు జమ్ముకశ్మీర్‌ ట్రయల్‌ కోర్టులో విచారణ జరిగింది. 8 మంది నిందితులు తమని తాము నిర్దోషులుగా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తమకు నార్కో పరీక్ష నిర్వహించాలని కూడా వారు న్యాయమూర్తిని కోరారు. కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ కాపీలను నిందితులకు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి రాష్ట్ర క్రైం బ్రాంచిని ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్‌ 28కి వాయిదా వేశారు. ఈ ఏడాది జనవరిలో కథువాలో 8 ఏళ్ల బాలికను అపహరించి మత్తు మందిచ్చి వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

 

19:53 - April 16, 2018

ఆదిలాబాద్‌ : ఎమ్మెల్యే తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో సమస్యలన్నీ తీరి అభివృద్ధి చెందుతుందని భావించారు గ్రామస్తులు. కానీ, నాలుగేళ్లు గడిచినా కనీసం ఎమ్మెల్యే గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవని ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గంలోని తేజాపూర్‌ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధే తప్ప ఇంతవరకు జరిగిందేమీ లేదంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:50 - April 16, 2018

నిర్మల్‌ : ఖానాపూర్‌ మండలంలోని నడింపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నిర్మల్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ఖానాపూర్‌ ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైన ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే కోర్టు ద్వారానైనా గ్రామ పంచాయితీని సాధించుకుంటామని గ్రామస్థులు స్పష్టం చేశారు. చిన్న చిన్న తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామాన్ని చిన్న చూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

బీజేపీ మతోన్మాదాన్ని ఎండగడతాం : తమ్మినేని

హైదరాబాద్ : బీజేపీ మతోన్మాదం కేవలం రాజకీయరంగంలోనే కాదు... కల్చరల్ రంగంలోనూ ప్రభావం ఎక్కువగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తు వివిధ పార్టీలతో కాదని..ప్రజలతో పెట్టుకోవాలన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి పూనుకోవాలని తెలిపారు. సుస్థిరమైన విధానాలు లేకుండా రాజకీయ అవసరాల కోసం ఏర్పడే ఫ్రంట్ లో తాము చేరబోమని చెప్పారు. థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ లలో చేరేందుకు సీపీఎం సిద్ధంగా లేదన్నారు. గతంలో ఇలాంటి అవకాశవాద ఫ్రంట్ లను చాలా చూశామని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు విధానాల్లో అవకాశవాదం కన్పిస్తుందన్నారు.

19:33 - April 16, 2018

హైదరాబాద్ : బీజేపీ మతోన్మాదం కేవలం రాజకీయరంగంలోనే కాదు... కల్చరల్ రంగంలోనూ ప్రభావం ఎక్కువగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తు వివిధ పార్టీలతో కాదని..ప్రజలతో పెట్టుకోవాలన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి పూనుకోవాలని తెలిపారు. సుస్థిరమైన విధానాలు లేకుండా రాజకీయ అవసరాల కోసం ఏర్పడే ఫ్రంట్ లో తాము చేరబోమని చెప్పారు. థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ లలో చేరేందుకు సీపీఎం సిద్ధంగా లేదన్నారు. గతంలో ఇలాంటి అవకాశవాద ఫ్రంట్ లను చాలా చూశామని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు విధానాల్లో అవకాశవాదం కన్పిస్తుందన్నారు. అఖిల భారతస్థాయిలో ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు తమ విధానం కాదన్నారు. లెఫ్ట్ ఫ్రంట్ బలపడటానికి ఈ మహాసభలు తోడ్పడతాయన్నారు. చివరి రోజు జరుగనున్న బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సూచిస్తుందన్నారు.  

 

19:11 - April 16, 2018

హైదరాబాద్ : పదకొండు సంవత్సరాల సుధీర్ఘ విచారణ తర్వాత మక్కా మజీద్ బాంబుపేలుళ్ల కేసులో నిందితులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. ఎన్ఐఏ సరైన ఆధారాలు చూపించక పోవడంవల్లే నిందితులను కోర్డు నిర్ధోషులగా ప్రకటించిందంటున్న సీనియర్ న్యాయవాది అమర్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:03 - April 16, 2018

పెద్దపల్లి : శ్రీరాంపూర్‌ మండలం కునారంలో నిజాం కాలం నాటి భూములను కబ్జా కోరల్లో నుంచి కాపాడి పేదలకు పంచాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రెండు వేల ఎకరాల భూమిని రాజకీయ నాయకులు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కబ్జాకు గురైన భూమి నిరుపేదలకు చెందుతుందని.. గ్రామస్థులు పారా, గొడ్డళ్లు చేత పట్టి భూములను చదును చేసి ఆక్రమించుకునే కార్యక్రమం చేపట్టారు.

18:58 - April 16, 2018

విజయవాడ : బీజేపీ అబద్ధాల ప్యాక్టరీగా తయారైందని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్ రావు విమర్శించారు. 24 పేజీల పుస్తకం కాదు..64 పేజీల పుస్తకం వేసిన బీజేపీ నేతల మాటలు నమ్మరని అన్నారు. ఏపీ ప్రజలు బీజేపీకి సమాధి కడతారని పేర్కొన్నారు. విపక్షాలు చేస్తున్న పోరాటాలపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. బంద్ లో ప్రజలు రాజకీయాలకతీతంగా స్పందించారని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. నిర్బంధాలకు, కేసులకు భయపడబోమని చెప్పారు. నిర్బంధం ప్రయోగిస్తే, అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని.. తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బిజిలీ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 
జనపేన నేత  
'కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయొద్దు. 2014 నుంచి బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వంలో ఉన్నాయి. హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ ఇవ్వలేదు. ఐదుకోట్ల ఆంధ్రుల హక్కలను చంద్రబాబు కాపాడలేకపోయారు. ఢిల్లీలో ప్రజలు హక్కు కోల్పోయారు'.

 

18:39 - April 16, 2018

విజయవాడ : ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం దిగిరావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని...పార్లమెంట్ లో చేసిన చట్టాలను అమలు చేయాలని చెప్పారు. 2014 ఏప్రిల్ 20న ఏ హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీ నేతలు అర్ధసత్యాలు, అవాకులు, చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. ఏపీ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో ఆ పార్టీ నేతలు చదువుకోవాలని.. మ్యానిఫెస్టోను అమలు చేయాలన్నారు. లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని, విజయవంతం చేసినందకు అభినందలు తెలిపారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకమాట..లేకుంటే మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆధ్వాన్నంగా మాటమార్చుతున్నారని చెప్పారు. మాటమార్చుకోవడం మానుకోవాలని హితవుపలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తమను ప్రశ్నిస్తున్న చంద్రబాబు ఏపీలో దీక్ష ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు. మోడీ, చంద్రబాబు పాపాలు చేశారని చెప్పారు. ఈ  పాపంలో వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉందన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రజలను తప్పుదోవపట్టించారని... మభ్య పెట్టారని మండిపడ్డారు. ఇద్దరి పాపాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. మోడీకి దిమ్మతిరిగే విధంగా బ్లాక్ డే పాటిస్తామని చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు బిజిలీ బంద్ పాటించాలన్నారు.

 

18:12 - April 16, 2018

నెల్లూరు : ప్రత్యేక హోదా కోరుతూ తలపెట్టిన బంద్‌ నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలు, వైసిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, పలు ప్రజాసంఘాలు బంద్ పాటించి  వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నాయి. జిల్లాలో బస్సులన్నీ డిపోలకే  పరిమితం అయ్యాయి. విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. జిల్లాలో కొనసాగుతోన్న బంద్‌పై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

18:10 - April 16, 2018

కర్నూలు : జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. బంద్‌తో ప్రజారవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:53 - April 16, 2018

రంగస్థలం సినిమాతో తన కెరీర్ లోను అత్యధిక రికార్డులు సాధించిన జోష్ లో వున్న చరణ్ నెక్ట్స్ మూవీ టైటిల్ పై కసరత్తు జరుగుతోంది. తన కెరీర్ లో మగధీర తరువాత చరణ్ కు అంతటి హిట్ రాలేదు. కానీ మగధీరను మించిన ఉత్సాహంతో చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రిక్డార్డ్ సాధించిన చరణ్ బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేశారు. త్వరలోనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ నుంచి చరణ్ షూటింగులో జాయిన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో కథకి తగినట్టుగా ఈ సినిమాకి 'రాజవంశస్థుడు' అనే టైటిల్ అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నాడట. ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తే, అదే టైటిల్ ను చరణ్ వాళ్లు ఓకే చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మరి ఇదే టైటిల్ ఖరారవుతుందో .. మరో కొత్త టైటిల్ తెరపైకి వస్తుందో చూడాలి.      

17:46 - April 16, 2018

విజయవాడ : బంద్ ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం యత్నించిందని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా బంద్ విజయవంతమైందన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 24న చీకటిరోజుగా పాటించాలన్నారు. భవిష్యత్ లో ప్రత్యేకహోదా కోసం చేసే ఆందోళనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. 'మీరు తెలుగు వారేనని గుర్తుంచుకోవాలి' అని ఏపీ బీజేపీ నేతలను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. గుజరాత్ గీతాలను గుజరాత్ వెళ్లి పాడుకోండని సలహా ఇచ్చారు. బీజేపీ నేతల భాష బాగానే ఉంది... భావం ఘెరంగా ఉందని ఎద్దేవా చేశారు. చర్చా వేదికకు రండి అన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. 

17:38 - April 16, 2018

కర్నూలు : జిల్లాలో విషాదం ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని దిన్నదేవరపడులో గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పులబాధతో ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి.. బోయ మధు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్యా ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం వీరిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. 

 

17:36 - April 16, 2018

తూ.గో : ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. హోదా కోసం చేపట్టిన బంద్‌ను కాకినాడలో కొనసాగుతోంది. వామపక్షాలు, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని విపక్షాల డిమాండ్‌ చేశాయి. బీజేపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

17:34 - April 16, 2018

కడప : రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోరుతూ అఖిలపక్షం పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కడప జిల్లాలో ప్రశాతంగా కొనసాగుతోంది.  ఉదయం 4 గంటల నుండి నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి అప్సర సర్కిల్, కృష్ణా సర్కిల్ మీదుగా వామపక్ష నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:30 - April 16, 2018

హైదరాబాద్ : నగరంలో ఈనెల 18 నుంచి 22వరకు సీపీఎం జాతీయ మహాసభలు జరుగనున్నాయి. ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం జాతీయ మహాసభల ఏర్పాట్లను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు నేతలు పరిశీలించారు. ఈ మహాసభల్లో దేశ రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతాంగ, కార్మికుల సమస్యలపై చర్చిస్తామంటున్న సీతారాం ఏచూరితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

17:07 - April 16, 2018

మెదక్ : ఉమ్మడి మెదక్‌ జిల్లా జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ జడ్పీటిసీ సభ్యుడు సంగమేశ్వర్‌ మంచినీటి ఎద్దడిపై ప్రశ్న లేవనెత్తగానే టిఆర్‌ఎస్‌ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.  మరోవైపు జడ్పీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది.  టీఆర్‌ఎస్‌పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి నిరసకు దిగారు. దీంతో టీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకుని ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు. 

 

17:03 - April 16, 2018

సంగారెడ్డి : జిల్లాలో సీఐ రెచ్చిపోయాడు. దళిత సర్పంచ్‌ పై దాడి చేశాడు. జడ్పీ కార్యాలయం ముట్టడిలో పాల్గొన్న హరిదాస్‌పూర్‌ సర్పంచ్‌ నర్సింహులుపై సి.ఐ. రామకృష్ణారెడ్డి  చేయిచేసుకున్నాడు. కులంపేరుతో దూషిస్తూ  సి.ఐ. తనపై దాడిచేశాడని సర్పంచ్‌ నర్సింహులు ఆరోపించారు. సి.ఐ.తీరుకు నిరసనగా దళితసంఘాలు సంగారెడ్డి పోలీస్టేషన్‌ ముందు ఆందోళనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  పీఎస్‌ ముందు పోలీసులు భారీ మోహరించారు. ఆందోళన కారుల్ని అరెస్టు చేశారు. 

 

17:00 - April 16, 2018

ప్రకాశం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన బంద్‌ ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార సంస్థలు  స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. జిల్లాలో జరగుతోన్న బంద్‌పై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

16:56 - April 16, 2018

చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలో ఏపీ బంద్‌ కొనసాగుతోంది. వామపక్షాలు, జనసేన, వైసీపీ, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేస్తున్నారు. జిల్లాలో కొనసాగుతోన్న బంద్‌పై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

16:55 - April 16, 2018

హైదరాబాద్‌ : మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు కొట్టినవేసిన నేపథ్యంలో పాతబస్తీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులతో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పాతబస్తీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయంటున్న దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

'రేపిస్టులను ఉరి తీసేందుకు 'తలారీ'నవుతా : ఆనంద్ మహేంద్రా

ఢిల్లీ: ముక్కుపచ్చలారని చిన్నారులపై ఇటీవల చోటుచేసుకుంటున్న అకృత్యాలపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలను బలిగొంటున్న రేపిస్టులు, హంతకులను ఉరితీసేందుకు తాను తలారి అవతారం ఎత్తేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. క్రూరంగా అత్యాచారం చేసి, చిన్నారుల ఉసురు తీస్తున్న రేపిస్టులు, హంతకులను ఉరితీసేందుకు నేను స్వచ్ఛందంగా తలారి పని చేయాలనుకుంటునని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రత్యేకించి గుజరాత్‌లోని సూరత్‌లో ఓ బాలిక మృతదేహంపై 86 గాయాలున్నట్టున్న విని ఆయన తీవ్ర ఆవేదనకు, కలవరానికి గురయ్యారు.

ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్య!..

కర్నూలు: దిన్నెదేవరపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుంటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు పిల్లలతో సహా దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త మద్దిలేటి చనిపోగా మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మక్కా మసీదు బాధితులకు న్యాయం దక్కలేదు: ఒవైసీ

హైదరాబాద్ : మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ రోజు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అభ్యంతరం తెలిపారు. ఎన్‌ఐఏపైనా, ప్రధాని మోదీ సర్కారుపై మండిపడ్డారు. ఈ తీర్పు వంద శాతం అన్యాయమైనదని అన్నారు. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన 9 మంది కుటుంబాలకు న్యాయం దక్కలేదని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్‌ఐఏలు వ్యవహరించాయని ఆయన ఆరోపించారు.

అంబానీలకు సుప్రీంలో చుక్కెదురు..

ఢిల్లీ : అంబానీ సోదరుల డీల్‌కు మరోసారి అవరోధం ఎదురైంది. అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు చెందిన టవర్ల విక్రయానికి వీలుగా జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన అనుమతులపై సుప్రీంకోర్టు నేడు స్టే విధించింది. దీనికి సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ డైరీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ వాటాదార్లు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా తీర్పు వెల్లడించింది.

16:30 - April 16, 2018

డిస్కో శాంతి 1980వ దశకపు ప్రముఖ తెలుగు నృత్యతార. ఈమె తెలుగు సినీరంగంలో రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న శ్రీహరిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్న అనంతరం సినిమాలకు దూరంగా వుంది. శ్రీహరి మరణంతో ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. ఒక దశలో శ్రీహరి చనిపోలేదనీ..ఫామ్ హౌస్ లోనే వున్నాడనీ రోజు ఆహారం తీసుకెళ్లి పెట్టి అక్కడ ఎక్కువ సమయం గడిపేస్థాయికి ఆమె వెళ్లిపోయింది. కానీ కాలం అన్ని గాయాలను..ఎటువంటి గాయాలనైనా మాన్పేగుణం కాలానికి వుంది. అలా కాలం చేసిన గాయాన్ని ఆ కాలానుగుణంగా కోలుకున్ డిస్కోశాంతి ఇప్పుడిప్పుడే శ్రీహరి చనిపోయిన గాయం నుండి కోలుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ చానల్ కుమాట్లాడుతు తన 'రీ ఎంట్రీ'కి సంబంధించిన ప్రస్తావనను బైటపెట్టారు. తెలుగు తెరపై మళ్లీ నన్ను చూసే అవకాశాలు వున్నాయి. గుంపులో గోవింద అనిపించే పాత్రలు మాత్రం చేయను .. అంత అవసరం లేదు కూడా. ప్రాధాన్యత కలిగిన మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా వున్నాను. పిల్లలు పెద్దవాళ్లయ్యారు .. అందువలన ఇప్పుడు చేయవచ్చని అనుకుంటున్నాను. మళ్లీ నటన వైపుకు వెళ్లడం వలన నలుగురిని కలవడం .. మాట్లాడటం జరుగుతుంది. మనసుకి కాస్త ఊరట కలుగుతుందనే ఉద్దేశంతోనే అటుగా ఆలోచిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.   

స్వల్పంగా తగ్గిన పసిడి..

ముంబై : బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.100 తగ్గి రూ.32,000కు చేరింది. స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా పరిస్థితుల కారణంగా ఈ రోజు బంగారం ధర తగ్గిందని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర కూడా పసిడి ధర బాటలోనే పయనించి రూ.100 తగ్గి కేజీ ధర రూ.39,900గా నమోదైంది. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 0.13 శాతం తగ్గి ఒక్క ఔన్స్‌కు 1,343.79 డాలర్లుగా నమోదయ్యాయి.

ఆసిఫా ఫ్యామిలీకి,న్యాయవాదికి రక్షణ కల్పించండి : సుప్రీంకోర్టు

ఢిల్లీ : కథువా అత్యాచార ఘటనకు సంబంధించి వాదిస్తున్న మహిళా న్యాయవాది దీపిక ఎస్.రాజావత్ కు,ఆసిఫా కుటుంబానికి రక్షణ కల్పించాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా కథువా రేప్‌ కేసులో బాధితుల పక్షాన వాదిస్తున్న న్యాయవాది దీపిక ఎస్.రాజావత్ తన ప్రాణాలకు హాని ఉందని, తనను కూడా రేప్ చేసి చంపేందుకు కుట్ర జరుగుతున్న విషయాన్ని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. కాగా దీపిక తమకు రక్షణ కల్పించాలని చిన్నారి అసిఫా తండ్రి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

16:22 - April 16, 2018

హీరోగా తన ప్రస్థానాన్ని ముగించి విలన్ క్యారక్టర్లలో ఒదిగిపోయి విభిన్నంగా విలనిజాన్ని పండిస్తున్న జగపతిబాబు పలు భాషల్లో నటించి శభాష్ అనిపించుకుంటున్నాడు. తెలుగులో విభిన్నమైన విలనిజానికి కేరాఫ్ అడ్రెస్ గా జగపతిబాబు మారిపోయిన జగ్గుభాయ్ తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఆయన విలన్ పాత్రలను చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి బాలీవుడ్ నుంచి ఛాన్స్ వచ్చింది .. అదీ సల్మాన్ సినిమాలోనని టాక్.

ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3?..
సల్మాన్ హీరోగా చేసిన 'దబాంగ్' .. 'దబాంగ్ 2' సినిమాలు ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి వాళ్లు 'దబాంగ్ 3' కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం. సల్మాన్ కి .. ప్రభుదేవాకి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రకి గాను ఆయన జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇక జగపతిబాబు విలన్ గా బాలీవుడ్ లో ఏ స్థాయిలో విజృంభిస్తాడో చూడాలి.  

15:53 - April 16, 2018

మానవ మేథస్సు ఎంత పదును పెడితే అంత చరిత్ర వెల్లడవుతుంది అనటానికి ఓ ఉదాహరణ ఇప్పుడు కనిపిస్తోంది. మనిషి సృష్టించిన చరిత్రను తృటిలో తుడిచిపెట్టివేసే శక్తి ప్రకృతికి మాత్రమే వుంది. ప్రకృతి చేసిన కరాళ నృత్యానికి ఎంతటి ఘనత కలిగిన చరిత్ర అయినా కూలిపోవాల్సిందే. భూస్థాపితం కావాల్సిందే. కానీ చరిత్రను తవ్వి వాస్తవాలను విశదీకరించే మేధస్సు మాత్రం మనిషికి వుంది. అలా ప్రకృతి చేసిన కరాళ నృత్యానికి భూస్థాపితం అయిపోయిన 'ఘన(త)చరిత్ర'ను మనిషి తన తెలివితేటలతో వెలికితీశాడు. ప్రకృతిని మనిషి శాసించలేకపోయినా..అది చేసే విలయానికి ప్రాణ, ఆస్తి నష్టాలను ఎక్కువ కాకుండా నియంత్రించుకోగలుగుతున్నాడు. కానీ అది అన్ని సమయాలలోను, అన్ని ప్రాంతాలలోను, అన్ని కాలాలలోను సాధ్యం కాకపోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే అంటున్నారు ఖరగ్ పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు.

భారతదేశ చరిత్రను, పురావస్తు శాస్త్రగతిని మార్చివేసిన ఘటన..
ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా 4,350 సంవత్సరాల క్రితం భాసిల్లిన సింధునాగరికత అంతరించిపోవడానికి గల కారణం ఇప్పటి వరకూ రహస్యంగా వుండిపోయింది. క్రీ.శ 1921లో జరిగిన ఒక సంఘటన భారతదేశ చరిత్రనే కాకుండా పురావస్తు శాస్త్ర గతిని కూడా మార్చివేసింది. రాయ్ బహద్దూర్ దయారాం సహాని 1921లో ప్రసిద్ధి చెందిన 'హరప్పా నగరాన్ని' సింధు నదికి ఉపనది అయిన 'రావి' నది ఒడ్డున వుందని కనుక్కున్నాడు. 1922లో ఆర్ .డి.బెనర్జి సింధునది కుడిపక్కన ఒడ్డున ఉన్న మెహంజోదారోను కనుక్కున్నాడు.

సింధు నాగరికతకు వివిధ రకాల పేర్ల ప్రతిపాదన..
సింధు నాగరికతకు పురావస్తు శాస్త్రజ్నులు వివిధ రకాల పేర్ల ప్రతిపాదించారు. క్రీ.పూర్వం సుమేరియా నాగరికతతో హరప్పా నాగరికతకు వున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా దీన్ని మొదట ఇండో సుమేరియా నాగరికతగా పిలిచేవారు. ఇది సింధు నది లోయలో అభివృద్ధి చెందటం వల్ల దీన్ని సింధు నాగరికత అని కూడా అన్నారు. సర్ జాన్ మార్షల్ దీన్ని హరాప్పా నాగరికతగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఏ ప్రదేశంలోనైనా ఒక నాగరికతను మొదట కనుక్కుంటారో ఆ నాగరికతను ఆ పేరు పెట్టటం పురావస్తు శాస్త్ర పంప్రదాయం. అలాగే సింధు లోను ప్రాంతంలో అంటే హక్ర ఘగ్గర్ నదీ ప్రాంతంలో కనుక్కోవటం వల్ల దీన్ని సింధు నాగరికతగా నామకరణం చేయబడింది.

పలు నాగరికతలకు తీసిపోయిన నాగరికత సింధు, హరప్పా.
కాగా వేద సాహిత్యం ప్రకారం క్రీ.పూర్వం భారతదేశ చరిత్ర వున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. అయితే మొహంజోదారో, హరస్పా, చాన్హుదారో, ఇతర సింధు లోయ ప్రాంతాల్లో జరిపిని తవ్వకాల ఆధారంగా క్రీ.పూర్వం శతాబ్ధాల క్రితం సమాధి అయిపోయిన చరిత్ర వెలుగులోకి వచ్చింది. సేమేరియా, అక్కడ్,బాబిలోనియా, ఈజిస్టు, అస్సీరియా వంటి గొప్ప ప్రాచీన నాగరికతలకు ఏమాత్రం తీసిపోని నాగరికత హరప్పా ప్రాంతంలో ఉన్నట్లుగా పరిశోధకులు నిర్ధారించారు.

గుర్తించిన ఖరగ్ పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు..
ఐఐటీ ఖరగ్‌ పూర్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుదీర్ఘంగా వేధించిన కరవు కారణంగా సింధు నాగరికత అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. 4,350 సంవత్సరాల క్రితం రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కరవు ప్రారంభమైందని. కొన్నేళ్ల తరువాత అది తీవ్రరూపం దాల్చి సుమారు 900 సంవత్సరాలు కొనసాగిందని ఐఐటీ ఖరగ్ పూర్ భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

ఆధారాలు ఉన్నాయి : శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా..
దీంతో అక్కడి ప్రజలు గంగా, యమునా లోయగుండా ప్రయాణిస్తూ, ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, దక్షిణ వింధ్యాచల్, దక్షిణ గుజరాత్ లలోని మైదాన ప్రాంతాలకు చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చి. అది తీవ్రమైన కరవుకు దారితీసిందని అన్నారు. దీంతో సిరిసంపదలతో విలసిల్లిన సింధునాగరికత ప్రాభవం కోల్పోయిందని తెలిపారు. దీనికి ఆధారంగా లడఖ్‌ లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను జతచేశారు.

సింధు నాగరికత, హరప్పా నాగరికత, ఖరగ్ పూర్, ఐఐటీ, శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా,

15:22 - April 16, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయ్యారు. ఈనెల 20న విజయవాడలో చంద్రబాబు చేపట్టే నిరసన దీక్షపై చర్చిస్తున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు చేయనున్నారు. 13 జిల్లాల్లో 13 మంది మంత్రులు దీక్షలు చేయనున్నారు. మిగిలిన మంత్రులు చంద్రబాబుతోపాటు దీక్షలు చేయనున్నారు. ఈనెల 21 నుంచి టీడీపీ సైకిల్ యాత్రలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 15 నుంచి 20 రోజుల పాటు సైకిల్ యాత్రలు చేయనున్నారు. ఈనెల 30న తిరుపతిలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ తప్పుడు రాజకీయ పార్టీ అని విమర్శించారు. 

 

బంద్ వల్ల పలు ఇబ్బందులు, నష్టాలు : చంద్రబాబు

అమరావతి : ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు బంద్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. బంద్ వల్ల ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం వచ్చిందని, 65 లక్షలమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దుకాణాల మూత వల్ల ఈ రోజు చాలా మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. రాష్ట్రానికి ఎంత నష్టమో విపక్షాలు ఆలోచించాలని, రాష్ట్రానికి నష్టం చేకూర్చకూడదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

సైకిల్ యాత్రలతో కదలికలు తీసుకురావాలి : చంద్రబాబు

అమరావతి : చరిత్రలో గతంలో జరగని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేశామని, ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలపాలని, సైకిల్ యాత్ర ప్రజల్లో కదలిక తీసుకురావాలని అన్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని సమన్వయ కమిటీలో చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లడుతు..కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా ఈ నెల 21 నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్‌ యాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

13:33 - April 16, 2018

జలం ప్రాణాధారం, జలం జీవాధానం, జలమే జీవం, జలమే ప్రాణం. జలం లేకుంటే ప్రాణికోటి సమస్తం అంతం!! ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ నీటితోనే పని. అది లేకుంటే అన్ని పనులు బంద్! అసలు మానవ మనుగడే బంద్!! మనిషి బతకాలన్నా, పంట పండాలన్నా, జీవకోటి మనుగడ సాగించాలన్నా నీరే ఆధారం! అది లేకుంటే ? అసలు ఆ మాట తలచుకునేందుకే ధైర్యం చాలదు కదూ? నీటి కోసం గ్రామాలకు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కొట్టుకుంటున్నాయంటే కారణం మనుగడ, బ్రతికేందుకు ఆధారం? జీవాధానం. నీటి యుద్ధాలతో దేశాలకు దేశాలకు కొట్టుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. సాధారణంగా నీటికొరత అనేది చాలా ప్రాంతాలలో వుంది. అదీ వేసవి వచ్చిందంటే ఇక చెప్పేదేముంది. స్నేహితులుగా వుండే ఇరుగు పొరుగు వారు కూడా శతృవుల్లా మారిపోతారు. కారణం నీరు.

ప్రాణి మనుగడకు నీరు..
భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, ద్రవ రూపం వాయు రూపంలో అటే మేఘాలు, ఆవిరి రూపాలలో అన్నమాట. మరి నీరు ప్రాణి మనుగడను సాసిస్తోంది. 

నీటికోసం మైళ్ల దూరం కాలినడక..
నీటికోసం మైళ్లకొద్దీ దూరాలు వెళ్లి తెచ్చుకునే దుస్థితి నేటి కంప్యూటర్ యుగంలో కూడా వుంది అంటే పరిస్థితులు ఎంతటి దారుణంగా వున్నాయో ఊహించుకోవచ్చు..హలో అంటే పొలో మంటు ఇంటి ముంగిట్లో వచ్చి పడిపోయే పదార్ధాలు, వస్తువులు. కానీ వేసవి వచ్చిందంటే మాత్రం లీటరు నీరు రూ.100లు పెట్టి కొనుకునే పరిస్థితులు. బీటలు వారిని నేలమ్మ తల్లి. గంగమ్మ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పంటే వేసిన రైతన్న వరుణుడి కోసం ఎదురు చూస్తున్నట్లు..దాహార్తితో కటకటలాడిపోతున్న నేలమ్మను అభిషేకించేందుకు వానమ్మ కానరాని దుర్భర పరిస్థితులు.

వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు..
నడి వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మంచి నీటి కోసం అలమటించే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం... 404 జిల్లాల్లో గతేడాది అక్టోబర్ తర్వాత వర్షాల్లేకపోవడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో 140 జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మరో 109 జిల్లాల్లో ఓ మోస్తరు కరువు ఉంది.

156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు..
156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు ఉంది. నిజానికి ఏటా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితులు వేసవిలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ ఏడాది శీతా కాలంలో అసలు వర్షాలే లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా 63 శాతం వర్షాభావం ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజర్వాయర్లలో తక్కువ నీటి లభ్యత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.

13:14 - April 16, 2018

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి ఆసీమానంద, భరత్ భాయి, రాజేందర్ చౌదరిలపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

పూర్వాపరాలు..
చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు ఆవరణలోల గల బాంబు పేలడంతో 9మంది మృతి చెందారు. 58మంది గాయపడ్డారు. 2007 మే 18వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు అనంతరం జరిగిన అలర్లను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 9 మంది మృతి చెందారు. ఘటన తీవ్రతతో దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ నేపథ్యంలో 2011 ఏప్రిల్ 4వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థకు భారత హోం మంత్రిత్వ శాఖ అప్పగించింది. మొత్తం పదిమంది నిందితులను ఎన్ఐఏ గుర్తించింది. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. నవంబర్ 19వ తేదీన కీలక నిందితుడు నాబకుమార్ సర్కార్ అలియాస్ ఆసీమానంద చిక్కడంతో కుట్రకోణం వెలుగు చూసినట్లైంది. ఈ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న రతేశ్వర్ అలియాస్ భారత్ భాయి, మధ్యప్రదేశ్ కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ పోలీసులకు చిక్కారు. సందీప్ వి డాంగే, రామచంద్ర కల్సంగ్రా రాంజీ లు ఇంకా దొరకలేదు. మరో నిందితుడు సునీల్ జోషి పేలుడు జరిగిన ఏడాదే హత్యకు గురయ్యాడు. 

13:08 - April 16, 2018

ఏలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము. పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా యాలకులు ప్రాచుర్యంలో వున్నాయి. యాలకులను సుగంధద్రవ్యాల రాణిగా కూడా పేరుంది. వీటిని బ్రిటీష్ వారు పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించేవారట!

తెలుసుకుంటే వంటిల్లే వైద్యశాల..
మన వంటిల్లే ఒక వైద్యశాల. అందులో మనం వాడే వస్తు వులు సమస్తం ఆరోగ్యహేతువులే. వాటిలో అత్యధికంగా వాడబడేది ఇలద్వయ. అంటే వాడుకలో దీనినే యాలకులు అని అంటాం. దీని శాస్త్రీయనామం ఇలటేరియా కార్డిమమ్‌. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో యాలకులదే ప్రథమ స్థానం అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది సిటామినేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది సాధారణ మొక్కలకి భిన్నంగా రసాయ నాలు, మనసుకి ఉల్లాసాన్ని కలిగించే తైలంతో చాలా విల క్షణంగా ఉండే ఔషధ మొక్క ఇలద్వయం. వీటిలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు, తెల్ల యాలకులుగా, పచ్చ యాలకులుగా కూడా లభిస్తుంటాయి. ఇవి ఏ రంగులో వున్నా, ఏ సైజ్ లో వున్నా ఒకే విధమైన ఔషధగుణాలు కలిగివుంటాయి.

యాలకుల వినియోగం..
యాలకులను ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ ప్రెష్ నర్ గా వాడుతుంటారు. టీ తయారీలో యాలకులను ఉపయోగిస్తుంటారు. రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. యాలకులు కఫ్ఫం, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులతో పాటు కడుపులో మంటను నివారిస్తుందట.
ఆరోగ్యానికి యాలకులు..
హృదయ ఆరోగ్యానికి సహకరించడంతో పాటు మానసిక ఒత్తిడిని నియంత్రిస్తాయిట. మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తాయి. ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులను తీసుకోవడం ఉత్తమం. పొట్ట పెరిగిపోయి ఇబ్బందిగా తయారైనప్పుడు యాలకుల వైద్యం దానికి చక్కని పరిష్కారమార్గం.

యాలకుల్లో వుండే సద్గుణాలు..
ఇందుకోసం పడుకునే ముందు రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి. అలాగే యాలకులలోని ఫైబర్, కాల్షియంలు శరీర బరువును నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నాయి.

12:59 - April 16, 2018

విశాఖపట్టణం : ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నేతలు ఆందోళన కొనసాగించారు. వామపక్ష నేతలతో పాటు, వైసీపీ, జనసేన నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో మద్దిపాలెం జాతీయ రహదారిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో 2004-2014 వరకు అధికారంలో లేని సమయంలో ఎన్ని బంద్ లకు పిలుపునిచ్చారో చెప్పాలని, ఎందుకు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

పాతబస్తీలో పోలీసుల భారీ బందోబస్తు..

హైదరాబాద్ : ఇక మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు నిందితులకు అనుకూలంగా రావడంతో, హైదరాబాద్ చుట్టుపక్కలా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాతబస్తీ పరిసరాల్లో పొద్దుటి నుంచి 2 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు శాఖ, తీర్పు తరువాత మరిన్ని దళాలను రంగంలోకి దించింది. ఈ కేసులో సాక్ష్యాలు లేవంటూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. దీంతో పాతబస్తీలో అల్లర్లు జరగవచ్చన్న ఆందోళన నెలకొనగా, పలు చౌరస్తాల్లో మోహరించిన పోలీసులు, అనుమానితులను తనిఖీలు చేస్తున్నారు.

భావితరాల కోసం ఈ బంద్ : చలసాని

విజయవాడ : కేంద్రం వైఖరికి నిరసనగా,ఏపీకి ప్రత్యేక హోదా సాధన డిమాండ్ తో ఏపీలో చేపట్టిన రాష్ట్ర బంద్‌కు విశేష ఆదరణ లభించింది. ఈ సదర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ మాట్లాడుతు..భావితరాల కోసమే ఈ పోరాటమని స్పష్టం చేశారు. చిన్న చిన్న ఇబ్బందులున్నా సహకరించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని బంద్ పాటిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని చలసాని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విద్వేశాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

అందరికీ ధన్యవాదాలు : చలసాని

విజయవాడ: ఏపీ విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టిన రాష్ట్ర బంద్‌కు స్వచ్చంధంగా ముందుకు వస్తున్న ప్రజలకు, అన్ని పార్టీలకు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ముందు ముందు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చలసాని తెలియజేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి.

బాధితులకు నిరాశ..మక్కా నిందుతులు నిర్ధోషులన్న కోర్టు..

హైదరాబాద్: ఎంతో మందని అమాయకులను పొట్టన పెట్టుకున్న మక్కామసీదు పేలుళ్ల కేసులో నేడు తుదితీర్పు వెలువడింది. నిందితులను కోర్టు కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేస్తుందన్న భావనలో ఉన్న బాధితులకు చివరకు నిరాశే మిగిలింది. నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాషిక్యూషన్ విఫలమైందని చెబుతూ నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు ఈ కేసును కొట్టేసింది. నిందితులందరినీ నిర్ధోషులుగా ప్రకటించింది.

మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత..

హైదరాబాద్ : 2007 మే 18న మక్కా మసీదులో పేలుళ్లు కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తరువాత ఈరోజు నాంపల్లి కోర్టు తుది తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో తీర్పు వెలువరించుతుందనే ఉత్కంఠకు తెరపడింది. నిందితులపై వున్న నేరాన్ని రుజువు చేసేందుకు సరైన ఆధారాలు నిరూపించకపోవటంతో నిందితులను నిర్ధోషులుగా భావించిన కోర్టు కేసును కొట్టివేసింది. ఆధారాలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యిందని కోర్టు భావించింది. 

12:12 - April 16, 2018

హైదరాబాద్ : మక్కా మసీదు పేలుళ్లు..11 ఏళ్ల తరువాత తీర్పు వచ్చేసింది. సోమవారం నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది విచారణ జరిపింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఐదుగురు నిందితులు నిర్దోషులుగా ప్రకటించేసింది. దీనితో ఏ 1 దేవేందర్ గుప్తా, ఏ 2 లోకేశ్ శర్మ, ఏ 6 స్వామి ఆసీమనందా, ఏ7 భరత్ భాయ్, ఏ 8 రాజేందర్ లు విడుదల కానున్నారు. సందీప్ డాంగే, రామచంద్ర కళా సంగ్రా, అమిత్ చౌహాన్ లు పరారీలో ఉన్నారు. ఆధారాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంటూ నిందితుందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు వద్ద మీడియాను అనుమతించలేదు.

మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో... 2007 మే 18న పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల తర్వాత పాతబస్తీలో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 58 మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

సీఎం దీక్షకు మద్దతుగా స్పీకర్ సైకిల్ యాత్ర..

అమరావతి : సీఎం చంద్రబాబు ఈనెల 20 చేపట్టనున్న దీక్షకు మద్దతుగా స్పీకర్ కోడెల రామకృష్ణ సైకిల్ యాత్ర చేపట్టారు. నరసరావు పేట నుండి కోటప్పకొండ వరకూ స్పీకర్ కోడెల సైకిల్ యాత్ర చేపట్టారు. 20న నసరరావు పేట, సత్తెనపల్లిలో వేలాదిమంది ఉద్యోగులు,ప్రజలు, నాయకులతో కలిసి దీక్షలో కోడెల పాల్గొననున్నారు.  కాగా ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖిరికి నిరసనగా సీఎం చంద్రబాబు ఈ నెల తన పుట్టినరోజు నాడు దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే.

భేటీ కానున్న టీడీపీ సమన్వయ కమిటీ..

అమరావతి : కాసేపట్లో సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరుగనుంది. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు పుట్టినరోజు దీక్ష చేపట్టనున్నారు. ఈ అంశం, ఈనెల 30న తిరుపతిలో దళిత తేజం, తెలుగుదేశం అనే పేరుతో జరగనున్న ముగింపు సభ టీడీపీ నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు వంటి పలు కీలక అంశాలపై సమన్వయ కమిటీ భేటీ చర్చించనుంది. 

ఆందోళన బాటలో నిరుపేదలు..

పెద్దపల్లి : కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరుపేదలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ సీలింగ్, అసైన్డ్ భూములను కబ్జా కోరల నుండి రక్షించాలంటు పేదలు ఆందోళన బాట పట్టారు. స్వాధీనం చేసుకున్న భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తు ఆందోళన బాట పట్టారు. గతంలో ఆ భూములను పేదలు చదును చేసిన సాగుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ భూములను స్వాధీనంచేసుకోవటం తో వారు ఆందోళన బాట పట్టినట్లుగా తెలుపుతున్నారు. 

అతను యోగి కాదు భోగి : కాంగ్రెస్ నేత

కర్ణాటక : కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేశ్ గుండూ రావు యూపీ సీఎం ఆదిత్యనాథ్ కర్ణాటకకు వస్తే చెప్పులతో కొట్టాలంటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉన్నావ్, కతువా లైంగికదాడి బాధితులకు సంఘీభావంగా శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకకు వచ్చి ప్రజలకు నీతులు చెబుతున్న యూపీ సీఎం యోగి ఓ వేషధారి.. అబద్ధాలకోరు.. ఆయన్ను అడుగుపెట్టనివ్వొద్దు. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్.. కాదు.. యోగి అని పలుకనవసరం లేదు. భోగి రాష్ట్రంలోకి వస్తే చెప్పులతో కొట్టి పంపండి అని అన్నారు.

11:49 - April 16, 2018

పశ్చిమగోదావరి : ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపర్చాలంటూ ప్రత్యేక హోదా సాధన సమితి ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు వామపక్ష నేతలు, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. దీనితో ఉదయం నుండే బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు, వ్యాపారులు, ఇతరులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఏలూరులోని వ్యాపార కూడళ్లు బోసిపోయాయి. ఆర్ఆర్ పేట దుకాణాలన్నీ బంద్ అయ్యాయి. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:45 - April 16, 2018

ప్రకాశం : జిల్లాలోని బంద్ కొనసాగుతోంది. ఉదయం 4గంటల నుండే అన్ని డిపోల ఎదుట వామపక్ష, వైసీపీ నేతలు బైఠాయించారు. దీనితో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లా కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 840 బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఎనిమిది ఆర్టీసీ డిపోల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:44 - April 16, 2018

ఢిల్లీ : జమ్ము కశ్మీర్‌ లోని కథువాలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను చంపిన వారిని ఉరి తీయాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు.

మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని బాధిత కుటుంబం పేర్కొంటోంది. ఆసిఫా అత్యాచారం, హత్య కేసును కథువా కిందిస్థాయి కోర్టు స్వీకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ నుండి చండీగడ్ కు ఈ కేసును తరలించాలంటూ బాలిక తండ్రి సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసుపై మధ్యాహ్నం సుప్రీం విచారించనుంది. కేసును తరలిస్తారా ? లేదా ? అనేది చూడాలి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

నీతులు చెప్పిన బీజేపీ ఎంపీ నైట్ క్లబ్ ప్రారంభించటమా!..

ఉత్తరప్రదేశ్ : ఓ వైపు యూపీలోని ఉన్నావో ఎమ్మెల్యే అత్యాచారం చేసి సీబీఐ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్న వేళ, ఉన్నావో పార్లమెంట్ సభ్యుడు, వివాదాస్పద నేత సాక్షీ మహారాజ్, ఓ నైట్ క్లబ్ ను ప్రారంభించడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న జీత్ ప్లాజా రెండో ఫ్లోర్ లో నైట్ క్లబ్ 'లెట్స్ మీట్'ను సాక్షీ మహారాజ్ ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఈ వార్త టీవీ చానళ్లలో, పత్రికల్లో ప్రముఖంగా రావడంతో విపక్షాలతో పాటు ఎంతో మంది ఆయన వైఖరిని తప్పుబడుతున్నారు.

అసిఫా కేసును ఛండీగఢ్ కు తరలించాలని పిటీషన్..

జమ్ము కశ్మీర్ : చిన్నారిపై హత్యాచారం కేసును ఛండీగఢ్ కు తరలించి విచారించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం మధ్యాహ్నాం విచారించనుంది. అసిఫా అత్యాచారం, హత్య కేసును కతువా కింది స్థాయి కోర్టు విచారించింది. దీంతో కతువా సెషన్స్ కోర్టు ఏప్రి ల్ 28న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ కేసును కతువా కోర్టులో కాక తన కుమార్తెపై జరిగిన దారుణంపై కేసును ఛండీగఢ్ కు తరలించి విచారించాలని అసిఫా తండ్రి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. 

కోర్టుకు హాజరైన మక్కా మసీదు నిందితులు..

హౌదరాబాద్ : మక్కామసీదులో పేలుళ్లు ఘటనలో నిందితులుగా పేర్కొంటున్న ఐదుగురు ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 11 ఏళ్లు నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఏ 1 నిందితుడు దేవేందర్ గుప్తా, ఏ2 నిందుతుడు లోకేశ్ శర్మ, ఏ6 నిందితుడు స్వామీ అసీమానందా,ఏ7 నిందితుడు భరత్ బాయ్, ఏ8 రాజేందర్ చౌదరి లు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఎన్ఐఏ 10 మందిని నిందితులుగా గుర్తించింది. అందులో ఒకరు మృతి చెందగా, నలుగురిపై విచారణ కొనసాగుతోంది.

‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాపై కేటీఆర్ ఆగ్రహం..

హైదరాబాద్‌: ఇటీవల సినిమాల పేరు చెబితే వెంటనే వినిపించేది 'పైరసీ'. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శన చేయటంతో తీవ్ర కలకలం రేగింది.ఈ విషయంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సిబ్బంది బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యువ కథానాయకుడు నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని విడుదలైన మరుసటి రోజే గరుడ బస్సులో ప్రదర్శించడంపై సునీల్ అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడ బస్సులో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారంటూ టీవీ స్క్రీన్‌షాట్‌ను కేటీఆర్‌కు పంపించాడు.

ఫెస్ట్ లో సృజన స్వరం..

హైదరాబాద్ : ఫెస్ట్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో పలు కార్యక్రమాలతో సందర్శకులను ఫెస్ట్ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు మఖ్దుం మొహియుద్దీన్ వేదికపై సృజన స్వరం కథపై చర్చ జరుగనుంది. ఈ కార్యక్రమంలో కొలకులూరి ఇనాక్, ఆడెపు లక్ష్మీపతి, పెద్దింటి అశోక్‌కుమార్, దేవులపల్లి కృష్ణమూర్తి, సమ్మెట ఉమాదేవి పాల్గొననున్నారు. 

వాహన రాకపోకలను అడ్డుకున్న వైసీపీ..

కడప : ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు కడప జిల్లా మైదుకూరులో బంద్ కొనసాగుతోంది. వైసీపీతో పాటు జనసేన సంయుక్త ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. ఉదయం 8గంటల నుంచి కార్యకర్తలు వారివారి పార్టీ జెండాలతో పట్టుకుని పట్టణంలోని దుకాణాలు మూసివేయించారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బంద్‌లో పాల్గొన్నారు.

బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : నగరంలోని లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి వికారాబాద్‌లో శవమై తేలింది. తాండూరులోని అమ్మమ్మ ఇంటికని బయలుదేరిని జ్యోతి దారుర్ మండలం తరిగోపుల రైల్వే స్టేషన్ లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

లారీ, బైక్ ఢీ..ఇద్దరు మృతి..

నాగర్‌కర్నూల్: అమ్రాబాద్ మండలం ఈదులబావి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ - ద్విచక్రవాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పదర గ్రామానికి చెందిన 20 సంవత్సరాల గణేశ్, 16 సంవత్సరాల మురళిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

11:05 - April 16, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ మక్కా మసీదు పేలుళ్ల కేసులో తుది తీర్పు కాసేపట్లో వెలువడనుంది. పదహారు మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. నిందితులను కోర్టుకు తీసుకొచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేసు దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ... హిందూ రైట్‌ వింగ్‌ సభ్యులు పేలుళ్లకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో... 2007 మే 18న పేలుళ్లు జరిగాయి. ఆనాటి ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల తర్వాత పాతబస్తీలో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 58 మంది గాయపడ్డారు. చికిత్సపొందుతూ వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసమానంద, లక్ష్మణ్‌దాస్‌ మహరాజ్‌, శ్రీకాంత్‌ పురోహిత్‌ సహా 11 మందిపై ఎన్‌ఐయే కేసు నమోదు చేసింది. అభినవ్‌ భారత్ సంస్థ నిర్వాహకులు స్వామి అసమానంద, లోకేశ్‌శర్మ పేలుళ్లకు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మరో నిందితుడు జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొత్తం 226 మంది సాక్షులను విచారించింది. సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నిందితులు కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

ఫెస్ట్ లో ప్రత్యామ్నాయ సంస్కృతి పై చర్చ..

హైదరాబాద్ : నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలోకొనసాగుతున్న ఫెస్ట్ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గం.కు ప్రత్యామ్నాయ సంస్కృతి అనే పేరుతో చర్చా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రులు పీఏ దేవి, విజయా బి., ఓల్గా, కొండేపూడి నిర్మల, శిలాలోహిత పాల్గొంటున్నారు. 

శివసత్తుల పూనకాలతో సీపీఎం వినూత్న నిరసన..

చిత్తూరు : ఏపీ బంద్‌లో పాల్గొంటున్న వామపక్షాల నేతలు, కార్యకర్తలు తిరుపతిలో వినూత్న నిరసనకు దిగారు. సీపీఎంకు చెందిన మహిళా కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళనలు చేశారు. మానవహారంగా ఏర్పడి శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఎలిగెత్తారు. మరోప్రాంతంలో సీపీఎం శ్రేణులు ఆ పార్టీ నేతలు కబడ్డీ ఆడుతూ నిరసన తెలియజేశారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలను నెరవేర్చాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. అలాగే ప్రత్యేక హోదా, విజభన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ వామపక్ష కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

లాలూచీ రాయకీయాల వల్లనే ఈ పరిస్థితి : విజయసాయి

విశాఖపట్నం: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా మద్దిలపాలెంలో విజయసాయి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు లాలూచీ రాజకీయాల వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దన్నవారు ఇప్పుడు కావాలంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారన్నారు. అవిశ్వాసం చర్చకు రాకుండా కేంద్రంతో లాలూచీ పడ్డారని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

మక్కా మసీదు పేలుళ్ల కేసు తుది తీర్పు..

హైదరాబాద్ : ఈరోజు మక్కా మసీదు పేలుళ్ల కేసులో తుది తీర్పువెలువడనుంది. ఈ నేపథ్యంలో పాతబస్తీలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తరువాత ఈరోజు నాంపల్లి కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. 2007 మే 18న మక్కా మసీదులో పేలుళ్లు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్ఐఏ 10మంది నిందితులను అరెస్ట్ చేసిన ఎన్ఐఎన్ పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. పదహారు మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది.

11:00 - April 16, 2018

అనంతపురం : జిల్లాలో బంద్ ప్రభావం ఉదయం నుండే కనిపించింది. కేంద్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు భిన్నంగా మాట్లాడుతున్నారని నేతలు విమర్శించారు. పలువురు నేతలు టెన్ టివితో మాట్లాడారు. కేంద్రానికి టిడిపి వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తామనడం ఒక డ్రామా అని..సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశ..శ్వాస అయిన హోదాకు విలువ లేకుండా చేశారని, ప్రజలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేశారని..ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. 

10:59 - April 16, 2018

చిత్తూరు : తిరుపతిలో బంద్ ప్రశాంత కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్ జరుగుతోంది. ఈ బంద్ కు వామపక్ష నేతలు, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి..వామపక్షాలు..ఇతర నేతలు బంద్ లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. బాబు ఏడుపు మొసలి కన్నీరు ఒక్కటే అని భూమన ఎద్దేవా చేశారు. బంద్ నిర్వహించవద్దంటూ హెచ్చరికలు చేశాడని, బంద్ ఇక్కడ చేయవద్దని..ఢిల్లీలో చేయాలని చెప్పడం కరెక్టు కాదని వామపక్ష నేతలు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:56 - April 16, 2018

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండే నేతలు పలు బస్టాండుల ఎదుట బైఠాయించడంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. దీనితో ప్రజా రవాణా స్తంభించి పోయింది.

గుంటూరు లో ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. నేతలు వినూత్నంగా నిరసనలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణ్ రావు టెన్ టివితో మాట్లాడారు. బీజేపీ ఎంత మోసం చేసిందో టిడిపి కూడా అంతే మోసం చేసిందన్నారు. బాబు చేపట్టే దీక్ష ఒక నాటకంగా అభివర్ణించారు.

నెల్లూరు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కావలి, గూడురు, వెంకటగిరి, ఇతర ప్రాంతాల్లో ఉదయం నుండే బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కావలి బస్టాండు వద్ద వామపక్ష నేతలు బైఠాయించారు. బస్సులను అడ్డుకోవడంతో ప్రజా రవాణా స్తంభించింది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండు వద్ద నేతలు ధర్నా నిర్వహించారు. 

రహదారిపై బైఠాయించిన వైసీపీ నేతలు..

విజయవాడ : విజయవాడ,హైదరాబాద్ జాతీయ రహదారిపై వైసీపీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణు, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 

బ్యూటీషియన్ దారుణ హత్య ..

వికారాబాద్ : ఈ మధ్య కాలంలో హత్యలు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపత్యంలో ఓ బ్యూటీషియన్ దారుణ హత్యకు గురయ్యింది. లింగంపల్లి గ్రీన్ ట్రెన్స్ లో జ్యోతి అనే యువతి బ్యూటీషియన్ గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి దారుణ హత్యకు గురయ్యింది. కాగా మైలారంలో బ్యూటీషియన్ జ్యోతి ఫోన్ లభ్యమయ్యింది. దీనికి సబంధించిన ఆధారాలు పూర్తిస్థాయిలో తెలియాల్సివుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

10:21 - April 16, 2018

గుంటూరు : రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే గుంటూరు జిల్లాలో బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండే నేతలు పలు బస్టాండుల ఎదుట బైఠాయించడంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. దీనితో ప్రజా రవాణా స్తంభించి పోయింది.
జిల్లాలోని రోడ్లన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. నేతలు వినూత్నంగా నిరసనలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణ్ రావు టెన్ టివితో మాట్లాడారు. బీజేపీ ఎంత మోసం చేసిందో టిడిపి కూడా అంతే మోసం చేసిందన్నారు. బాబు చేపట్టే దీక్ష ఒక నాటకంగా అభివర్ణించారు. 

09:33 - April 16, 2018

విశాఖపట్టణం : పట్టణంలో ఏపీ బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ కు పిలుపునిచ్చింది. వామపక్షాలు, జనసేన, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. కానీ బంద్ కు టిడిపి దూరంగా ఉండడంపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు జరుగుతున్న బంద్ కు ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. బస్సు డిపోల ఎదుట నేతలు బైఠాయించడంతో బస్సులు బయటకు రాలేదు. దీనితో ప్రజా రవాణా స్తంభించింది. గుంటూరులో బంద్ సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ప్రజలను వంచించారు - గఫూర్...

కర్నూలు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ కు పిలుపునిచ్చింది. వామపక్షాలు, జనసేన, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో సీపీఎం నేత గఫూర్, ఇతర నేతలు టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, ప్రజలను వంచించారని తెలిపారు.

కృష్ణాలో బంద్...

కృష్ణా : జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు వామపక్షాలు, జనసేన, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. తెల్లవారుజాము నుండే ఆర్టీసీ డిపోల ఎదుట నేతలు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.

09:17 - April 16, 2018

కృష్ణా : జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు వామపక్షాలు, జనసేన, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. తెల్లవారుజాము నుండే ఆర్టీసీ డిపోల ఎదుట నేతలు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. దీనితో బస్సులు నిలిచిపోయాయి. ఆవనిగడ్డ, బందర్ నుండి వచ్చే వాహనాలను నేతలు అడ్డుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్త స్థంభించిపోయింది.

కర్నూలులో బంద్...
కర్నూలు :
జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ కు పిలుపునిచ్చింది. వామపక్షాలు, జనసేన, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో సీపీఎం నేత గఫూర్, ఇతర నేతలు టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, ప్రజలను వంచించారని తెలిపారు. గతంలో ఇచ్చిన బంద్ కు ప్రస్తుతం కొనసాగుతున్న బంద్ కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. ప్రజల తీవ్ర ఆగ్రహాన్ని చూసిన బాబు టర్న్ తీసుకున్నారని, కానీ దంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. 

08:26 - April 16, 2018
08:25 - April 16, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో ఏపీ బంద్ కొనసాగుతోంది. కాకినాడ బస్ డిపో ఎదుట వామపక్ష నేతలు, జనసేన, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు నేతలు బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని, మేలు కలుగుతుందని ప్రజలు ఆశించారని తెలిపారు. కానీ ఐదు కోట్ల ప్రజలను మోసం కేంద్రం, ఏపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. బాబు కొంగజపం చేస్తూ దొంగ నాటకాలు ఆడుతున్నారని, ఆయన ఆటలు కొనసాగవన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:24 - April 16, 2018

విజయవాడ : ఏపీ బంద్ లో టిడిపి ఒకవైపుగా ఉంటే..జనాలు మరోవైపు ఉన్నారని ఏపీ సీపీఎం నేత బాబురావు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్రత్యేక హోదా సాధన సమితి

బంద్ ను విఫలం చేయాలని టిడిపి..బంద్ పై దుష్ర్పచారం చేయాలని చూసిన బీజేపీ..వీరి పాచికలు ఏమీ పారలేదని సీపీఎం నేత బాబురావు పేర్కొన్నారు. పండింట్ నెహ్రూ వద్ద ఆయన ఆందోళనలో పాల్గొన్నారు. ప్రజా క్షేత్రంలో బీజేపీని ముద్దయిగా నిలబెట్టి హోదాను సాధించుకుంటామన్నారు. ప్రజలు ఇక్కడ ప్రేక్షకులు కాదని..సుదీర్ఘ పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఏపీలో బంద్ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్చదంగా బంద్ పాటిస్తున్నారు. విపక్ష నేతలు డిపోల వద్ద బైఠాయించడంతో ఆర్టీసీ బస్సులు కదలలేదు. దీనితో ప్రజా రవాణ స్తంభించింది. దీనితో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు ప్రజా సంకల్ప పాదయాత్రకు జగన్ ఒక రోజు బ్రేక్ ఇచ్చారు. 

తిరుపతిలో బంద్...

చిత్తూరు : తిరుపతిలో ఏపీ బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్ కొనసాగుతోంది. అందులో భాగంగా తెలుగు తల్లి కూడలి వద్ద జనసేన, వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే బస్టాండ్ వద్ద బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 

07:06 - April 16, 2018

ఢిల్లీ : అస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన 21వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ముగిశాయి. ఈ క్రీడల్లో మొత్తం 66 మెడల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది భారత్‌. చివరి రోజు గోల్డ్‌తో పాటు 3రజతాలు, 2 క్యాంసాలు లభించాయి. కామన్వెల్త్‌లో పతకాలు సాధించిన విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21 వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ముగిశాయి. చివరి రోజు భారత్‌కు తన ఖాతాలో మరో 6 పతకాలు జమచేసుకుంది. మొత్తం 66 మెడల్స్‌ సాధించిన భారత్‌ ఓవరాల్‌ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. పోటీల్లో 26స్వర్ణాలు, 20రజతాలు, 20 కాంస్య పతకాలను భారత్‌ గెలుచుకుంది. 198పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, 136 పతకాలతో ఇంగ్లాండ్‌ రెండో స్థానంలో నిలిచాయి.

గేమ్స్‌ చివరి రోజు బ్యాడ్మింటన్ ఉమెన్స్‌ సింగిల్స్‌లో... స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణిలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ మధ్య ఫైనల్‌ పోరు హోరాహోరీగా ముగిసింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో చివరకు సైనాదే పైచేయిగా నిలిచింది. రెండు వరుస గేమ్స్‌లో ఉత్సాహంగా ఆడిన సైనా 21-18, 23-21తేడాతో సింధుపై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్ స్టార్ పీవీ సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కామన్వెల్త్‌ క్రీడల్లో సైనాకిది రెండో స్వర్ణం. 2010లో దిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లోనూ సైనా గోల్డ్‌ మెడల్ గెలుచుకుంది.

బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే ఎదురైంది. ఫైనల్‌ పోరులో మలేషియా ఆటగాడు లీ చాంగ్‌ వీతో తలపడిన శ్రీకాంత్‌ 21-19, 14-21, 14-21 తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో శ్రీకాంత్‌ 21-17, 21-14 తేడాతో లీ చాంగ్‌ వీని ఓడించడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీకాంత్‌కు ఇదే తొలి పతకం. మహిళల డబుల్స్ స్క్వాష్ ఫైనల్స్‌లో దీపిక పల్లికల్, జోష్నా చిన్నప్పలు రజతంతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. న్యూజిలాండ్‌కు చెందిన జోయెల్లె కింగ్, అమంద లాండెర్స్-మర్ఫీ జంటతో తలపడి ఓడారు. పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లోనూ భారత్‌కు రజతమే దక్కింది. రంకిరెడ్డి సాత్విక్- షెట్టి చిరాగ్‌ జోడి ఇంగ్లండ్‌ జట్టుపై... 13-21 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. మహిళల మిక్‌డ్‌ డబుల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌లో మనికాబాత్రా-జ్ఞానశేఖరన్‌ జోడి కాంస్యం దక్కించుకుంది. అలాగే పురుషుల సింగిల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌లో ఆచంట శరత్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు మరింత మెరుగ్గా రాణించాలని ట్వీట్‌ చేశారు వీరేంద్ర సెహ్వాగ్‌. 

07:04 - April 16, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు ఎర్రదండు సిద్ధం అవుతోంది. ఊరూవాడా అరుణపతాకాలు కవాతు తొక్కుతున్నాయి. హైదరాబాద్ బహిరంసభకు ప్రజలు తరలిరావాలని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగురాష్ట్రాల్లో సీపీఎం శ్రేణులు ర్యాలీలు హోరెత్తుతున్నాయి. ఇటు హైదరాబాద్‌లో మహాసభల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీపీఎం జాతీయ మహాసభలకు తెలుగు రాష్ట్రాల్లో పార్టీశ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఈనెల 22న భారీ బహిరంగసభకు తరలి రావాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ఎర్రజెండాలు చేతబూనిన పార్టీ శ్రేణులు వాడవాలా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.

ఈనెల 18 నుంచి 22వరకు హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సన్నద్ధం అవుతోంది. జాతీయ మహాసభలకు ఆర్టీసీ కల్యాణమండపంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 18న ఉదయం 10 గంటలకు సీపీఎం సీనియర్‌ నేత కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం అరుణపాతకను ఆవిష్కరించనున్నారు. మహాసభల వేదికకు కామ్రేడ్‌ మహ్మద్‌ అమీన్‌ పేరును పెట్టామన్నారు.. పార్టీ పొలిటిట్‌బ్యూరో సభ్యులు బి.విరాఘవులు.

ఐదు రోజుల పాటు జరగనున్న జాతీయ మహాసభలకు 764 మంది ప్రతినిధులు, 74 మంది పరిశీలకులు, మరో 8 మంది సీనియర్‌ నేతలు కూడా హాజరవనున్నారు. వీరితోపాటు ఐదు వామపక్షాల నుంచి జాతీయ నేతలు ప్రారంభసభలో పాల్గొంటారని బి.వి.రాఘవులు తెలిపారు. జాతీయస్థాయిలో వామపక్ష రాజకీయ వేదిక ఏర్పాటు, రైతులు, కార్మికులు, మహిళల సమస్యలపై మహాసభల్లో చర్చలు జరుగుతాయన్నారు. దాంతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు..రాష్ట్రాలకు దక్కాల్సిన నిధుల లాంటి అంశాలపై కూడా చర్చిస్తామన్నారు. ప్రస్తుతం అన్నిపార్టీలు సామాజిక న్యాయం గురించే మాట్లాడుతున్నాయంటే అది వామపక్షాల ఘనతే అన్నారు. సీపీఎం నేతృత్వంలో జరిగిన మహాజన పాదయత్ర ఫలితంగా ప్రజల్లో సామాజిక న్యాయంపై అవగాహన వచ్చిందన్నారు.

మహాసభల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు కదం తొదక్కుతున్నాయి. ఊరూవాడా ప్రదర్శనలు జోరుగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా మునగాలలో జరిగిన సెమినార్‌లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యం అవుతుందన్నారు. పార్టీ మహాసభలకు తరలి రావాల్సిందిగా సీపీఎం శ్రేణులకు పిలుపు నిచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో అతిపెద్ద అరుణపతాకాన్ని ప్రదర్శించారు. 22వ జాతీయ మహాసభల సందర్భంగా 22మీటర్ల ఎర్రజెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అటు మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభకు తరలి రావాలని ప్రజలకు సూచించారు.

రైతు ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలు, దళితులు, మైనార్టీలపై దాడులు, మహిళలపై అకృత్యాలతో దేశంలో అరాచకం రాజ్యంమేలుతోందని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారాయంటున్నారు. ఈపరిస్థితిని ఎదుర్కోడానికి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఆపార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధం అయ్యామని మార్క్సిస్టుపార్టీ నాయకత్వం అంటోంది. 

07:01 - April 16, 2018

హైదరాబాద్‌ : ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన సుఖీభవ ప్రాపర్టీ స్టాల్ నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సందర్శకులు ఈ స్టాల్‌ను ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు అందమైన, విశాలమైన ఇళ్లు నిర్మిస్తూ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇప్పటికే సుఖీభవ మంచి పేరు సంపాదించింది. దీంతో ఆసక్తి ఉన్న వారు అక్కడికక్కడే ప్లాట్స్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రావడమే తమ సంస్థ అభివృద్ధికి కారణమని సుఖీభవ ప్రాపర్టీస్‌ చైర్మన్‌ గురురాజు తెలిపారు. 

06:59 - April 16, 2018

హైదరాబాద్‌ : ఫెస్ట్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీఫెన్‌ హాకింగ్‌ సైన్స్‌హబ్‌ చిన్నారులను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలను ఇందులో ఏర్పాటు చేశారు. విద్యార్థులే తమ ఐడియాలతో రూపొందించిన విజ్ఞాన ప్రదర్శనలు ఇందులో ఉంచారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:57 - April 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలతోపాటు వినోదం, విజ్ఞానాన్ని ప్రజలకు అందించే లక్ష్యంగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఫెస్ట్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌కు నగర ప్రజలు బారులు తీరుతున్నారు. కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో ఫెస్ట్‌ను సందర్శిస్తున్నారు. చిన్నారులు, పెద్దలతో ఫెస్ట్‌ సందడిగా మారింది. కళాకారుల ప్రదర్శనలు, విజ్ఞాన విశేషాలు నగర ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న హైదరాబాద్‌ ఫెస్ట్‌ మూడోరోజు జనంతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో నగర వాసులు హైదరాబాద్‌ ఫెస్ట్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా ఫెస్ట్‌ను సందర్శించారు. దీంతో ఎన్టీఆర్‌ స్టేడియం సందడిగా మారింది.

సుద్దాల హన్మంతు కళ వేదికపై ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, జానపద ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. లంబాడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. వీధినాటకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. బృందగానాలు, గురవయ్యలు, అందెనృత్యం, వెస్ట్రన్‌ డ్యాన్స్‌లు ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తన తండ్రి పేరును కళావేదికకు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఒకే వేదికపై అన్ని అంశాలను ప్రదర్శించడం ఓ వినూత్న ప్రయత్నమన్నారు.

హైదరాబాద్‌ ఫెస్ట్‌ తమను ఎంతగారొ ఆకట్టుకుంటోందని సందర్శకులు చెప్తున్నారు. ప్రత్యేకంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బాలోత్సవ్‌, స్టీఫెన్‌హాకింగ్‌ సైన్స్‌ హబ్‌ అందరినీ ఆలోచింప చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల సైన్స్‌ ప్రదర్శనలు, ఆవిష్కరణలు ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన పుస్తకప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తమకు ఇష్టమైన పుస్తకాలన్నీ ఒకే దగ్గర.. తక్కువ ధరకు లభిస్తుండడంతో సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాహిత్య గోష్టులు, కవితలు, రచనలు, జానపద పద్యాలను నేటి తరానికి పరిచయం చేసి.. ఔత్సాహిక కవులను గుర్తించేందుకు ఫెస్ట్‌లో ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై చర్చ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సృజన స్వరంతో ఓ వేదిక ఏర్పాటు చేశారు. నూతన రచయితలకు ఈ వేదిక స్వాగతం పలుకుతోంది.

ప్రముఖ కవి కొండేపూడి నిర్మల రచించిన మృదంగం పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. సబల పేరుతో మహిళల సమస్యలపై రోజూ వివిధ అంశాలపై చర్చలు, చర్చాగోష్టులు నిర్వహిస్తున్నారు. ప్రసార సాధనాలు - మహిళలు అనేఅంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పెద్ద సంఖ్యలో మహిళానాయకులు పాల్గొన్నారు. మీడియాలో మహిళలను అసభ్యకరంగా చూపించడం ఎక్కువైందని.. దీంతో వారిపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఈనెల 22 వరకు కొనసాగుతుంది. రోజుకు రోజుకు సందర్శకుల తాకిడి ఎక్కువవ్వుతుండడంతో నిర్వాహకులు అందుకుతగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బాబు యూటర్న్ కూడా మోసమే - పార్థసారధి...

విజయవాడ : నాలుగు సంవత్సరాలుగా హోదా వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రజాగ్రహం చూసి..ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం చూసి బాబు యూ టర్న్ తీసుకున్నారని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. పండింట్ నెహ్రూ బస్టాండు వద్ద జరిగిన బంద్ లో ఆయన పాల్గొన్నారు. కానీ టర్న్ కూడా మోసమని ప్రతిపక్షాలకు ఇచ్చిన నోటీసులను బట్టి అర్థమైందన్నారు. బాబు చేపడుతున్న కార్యక్రమాలు మరోసారి మోసం చేయడానికనేని తెలిపారు.  

మోడీ మెట్టు దిగాల్సిందే - సీపీఐ రామకృష్ణ...

విజయవాడ : ప్రత్యేక హోదా సాధన సమితిల పిలుపు మేరకు ఏపీలో బంద్ కొనసాగుతోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. పండింట్ నెహ్రూ బస్టాండు వద్ద జరిగిన బంద్ లో ఆయన పాల్గొన్నారు. మూడేళ్లుగా సుదీర్ఘంగా జరుగుతున్న పోరాటం ఇదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెట్టు దిగాలని..హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో కూడా పోరాటం చేసి హోదా సాధించి తీరుతామన్నారు. 

బంద్ లో పాల్గొన్న మధు...

విజయవాడ : సీఎం చంద్రబాబు అవకాశవాద వైఖరి మరోసారి బట్టబయలైందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పండింట్ నెహ్రూ బస్టాండు వద్ద జరిగిన బంద్ లో ఆయన పాల్గొన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే కేంద్రంతో ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని మధు పేర్కొన్నారు. రెండు నాల్కల ధోరణి అవలింబిస్తోందనడానికి ఇది ఒక ఉదహారణ అని, వెంటనే కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున్న పాల్గొంటున్నారని, ఇందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

06:48 - April 16, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. పండిట్ నెహ్రూ వద్ద జరుగుతున్న బంద్ లో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో పలువురు నేతలు మాట్లాడారు.

సీపీఎం మధు..
అవకాశవాద వైఖరి మరోసారి బట్టబయలైందని, గతంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే కేంద్రంతో ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని మధు పేర్కొన్నారు. రెండు నాల్కల ధోరణి అవలింబిస్తోందనడానికి ఇది ఒక ఉదహారణ అని, వెంటనే కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున్న పాల్గొంటున్నారని, ఇందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

సీపీఐ రామకృష్ణ...
ప్రత్యేక హోదా సాధన సమితిల పిలుపు మేరకు ఏపీలో బంద్ కొనసాగుతోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మూడేళ్లుగా సుదీర్ఘంగా జరుగుతున్న పోరాటం ఇదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెట్టు దిగాలని..హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో కూడా పోరాటం చేసి హోదా సాధించి తీరుతామన్నారు.

వైసీపీ పార్థసారధి..
నాలుగు సంవత్సరాలుగా హోదా వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రజాగ్రహం చూసి..ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం చూసి బాబు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. కానీ టర్న్ కూడా మోసమని ప్రతిపక్షాలకు ఇచ్చిన నోటీసులను బట్టి అర్థమైందన్నారు. బాబు చేపడుతున్న కార్యక్రమాలు మరోసారి మోసం చేయడానికనేని తెలిపారు.

వీరితో పాటు ఇతర నేతలు మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:44 - April 16, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధనకోసం చేపడుతున్న బంద్‌కు మద్ధతుగా నెల్లూరులో సీపీఎం, సీపీఐ పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. తెల్లవారుజామున నాలుగు గంటలనుంచే.. ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకున్న వామపక్ష పార్టీల నాయకులు బస్సులను నిలిపేశారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ఎక్కడి బస్సులను అక్కడే అడ్డుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బంద్‌ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

కడప జిల్లాలో ఆర్టీసీ బస్టాండు వద్ద విపక్ష నేతలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

గుంటూరు జిల్లాలో ఎక్కడికక్కడ బంద్ కొనసాగుతోంది. విపక్ష నేతలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. ఉదయం 5.30 గంటల నుండే ఆర్టీసీ బస్టాండుల వద్ద నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీనితో బస్సులు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి. 

06:33 - April 16, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా సాధన కోసం నేడు ఏపీ రాష్ట్ర బంద్ జరుగుతోంది. రాష్ట్ర బంద్ కు ప్రత్యేక సాధన సమితి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కానీ నేడు జరుగుతున్న ఏపీ బంద్ కు టిడిపి దూరంగా ఉంది. ఎంచుకున్న బంద్ అంశాలకు టిడిపి మద్దతు పలికింది. ఢిల్లీలో చేపట్టే ఆందోళనలకు మద్దతిస్తామని ఆ పార్టీ ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై వివిధ పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నష్టం కలిగించని నిరసనలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. అరాచకశక్తుల పట్ట పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

నెల్లూరు జిల్లాలో బంద్...

నెల్లూరు : ప్రత్యేక హోదా సాధన కోసం నేడు జిల్లా బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

కడప జిల్లాలో బంద్...

కడప : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల్లో బస్సులను సీపీఎం, వైసీపీ, ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు.

విజయవాడ ఆర్టీసీ బస్టాండు వద్ద...

విజయవాడ : ఆర్టీసీ బస్టాండు వద్ద సోమవారం ఉదయం వైసీపీ, జనసేన, వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన నిర్వహించాయి. ఆర్టీసీ డిపోల వద్ద బస్సులను కార్యకర్తలు అడ్డుకున్నారు. 

జగన్ పాదయాత్రకు విరామం...

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన పాదయాత్ర ఒక రోజు బ్రేక్ పడింది. నేటి ఏపీ బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించడంతో జగన్ పాదయాత్ర నిలిపివేయనున్నారు. 

నేడు ఏపీ బంద్...

విజయవాడ : ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం తీవ్రతరం అయింది. ప్రత్యేకహోదా సాధన సమితి ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపునకు వామపక్షాలు-జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌పార్టీలు పూర్తిమద్దతు ప్రకటించాయి. ప్రత్యేకహోదాపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరాటం ఆపేది లేదని విపక్షపార్టీలు తేల్చి చెబుతున్నాయి. 

సీపీఎం మహాసభలకు చురుగ్గా ఏర్పాట్లు...

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు ఎర్రదండు సిద్ధం అవుతోంది. ఊరూవాడా అరుణపతాకాలు కవాతు తొక్కుతున్నాయి. హైదరాబాద్ బహిరంసభకు ప్రజలు తరలిరావాలని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగురాష్ట్రాల్లో సీపీఎం శ్రేణులు ర్యాలీలు హోరెత్తుతున్నాయి. ఇటు హైదరాబాద్‌లో మహాసభల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 

సెన్సార్ బోర్డుపై వామపక్ష నేతల ఆగ్రహం...

హైదరాబాద్ : తెలంగాణ సెన్సార్‌బోర్డుపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు సమస్యలు- రైతు ఆత్మహత్యలపై ఆర్‌.నారాయణమూర్తి నిర్మించిన 'అన్నదాతసుఖీభవ ' సినిమాను అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

బీజేపీ మంత్రుల రాజీనామాలు ఆమోదం...

ఢిల్లీ : కశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫాను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి.. హతమార్చిన ఘటనలో.. ఇద్దరు బీజేపీ మంత్రులు చౌదరీ లాల్ సింగ్, చంద్రశేఖర్ గంగ రాజీనామాలను ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆమోదించారు.

ముగిసిన కామన్ వెల్త్ గేమ్స్...

ఢిల్లీ : అస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన 21వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ముగిశాయి. ఈ క్రీడల్లో మొత్తం 66 మెడల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది భారత్‌. చివరి రోజు గోల్డ్‌తో పాటు 3రజతాలు, 2 క్యాంసాలు లభించాయి. కామన్వెల్త్‌లో పతకాలు సాధించిన విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. 

రష్యా తీర్మానం ఆమోదానికి ఐరాస నిరాకరణ...

ఢిల్లీ : సిరియాపై అమెరికా, యూకే, ఫ్రాన్స్ దాడులను ఖండిస్తూ రష్యా చేసిన తీర్మానాన్ని ఆమోదించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిరాకరించింది. ఈ మూడు పశ్చిమ దేశాల దాడులను ఖండిస్తూ తీర్మానం చేయడంతోపాటు భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడి చేయకుండా చూడాలన్న రష్యా డిమాండ్‌కు 15 దేశాల భద్రతా మండలిలో కేవలం చైనా, బొలీవియా మద్దతే లభించింది.

 

వైమానిక దాడులపై ప్రజల ఆగ్రహం...

ఢిల్లీ : సిరియాలో అమెరికా వైమానిక దాడులపై ఆ దేశం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వద్దంటూ.. శాంతి ప్రేమికులు వైట్ హౌస్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమెరికా, దాని మిత్ర దేశాల దాడులకు అమాయక ప్రజలు బలైపోవడం బాధాకరమన్నారు. 

సిడ్నీ శివారులో మంటలు...

ఢిల్లీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం శివార్లలోని అడవుల్లో మంటలు అంటుకున్నాయి. ఇప్పటివరకు వేయి హెక్టార్లు అగ్నికి ఆహుతైంది. ఎండవేడికి తోడు... ఉధృతంగా వీస్తున్న గాలులతో మంటలు భారీగా వ్యాపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న హోల్స్‌వర్తీ మిలిటరీ స్థావరం కూడా మంటల్లో చిక్కుకుంది. సుమారు 500మంది ఫైర్ ఫైటర్లు.. మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. 

Don't Miss