Activities calendar

17 April 2018

22:05 - April 17, 2018

ఢిల్లీ : డబ్బుల్లేవు...డబ్బుల్లేవు...డబ్బుల్లేవు... దేశ వ్యాప్తంగా ఏ ఎటిఎంలో చూసినా ఇదే పరిస్థితి. బ్యాంకు అకౌంట్‌లో కావలసినంత డబ్బు జమ ఉన్నప్పటికీ డబ్బును డ్రా చేసుకోలేని  దుస్థితి.  ఏ బ్యాంక్‌ ఏటిఎం చూసినా నో క్యాష్‌ బోర్డు ఖాతాదారులను వెక్కిరిస్తోంది. డబ్బు కోసం జనం నానా ఇబ్బందులు పడుతున్న వైనాన్ని చూస్తుంటే  పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితిని తలపిస్తోంది. 

దేశంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయా? అప్పటికంటే పరిస్థితి ఇపుడు మరింత జటిలంగానే కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడా చూసిన ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తుండడమే ఇందుకు కారణం. చేతిలో సరిపడ నగదు లేక సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, బిహార్‌, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఎటిఎంలలో నగదు నిల్వలు  లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని బ్యాంకుల ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా నగదు లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు. 

ఎటిఎంలలో నగదు కొరతపై సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. 2016 నవంబర్‌లో ఎటిఎంలు ఖాళీ అయ్యాయి.  ప్రస్తుతం మరోసారి ఎటిఎంలు ఖాళీ అయ్యాయి... కేవలం ఒక్క బిజెపిలోనే ధనం ప్రవహిస్తోంది...ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని ఏచూరి ట్వీట్‌ చేశారు.

దేశవ్యాప్తంగా ఏటిఎంలలో ఏర్పడిన నగదు కొరతపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో కరెన్సీ పరిస్థితిపై సమీక్ష జరిపినట్లు తెలిపారు. ప్రస్తుతం అవసరం కన్నా ఎక్కువ నగదు చెలామణిలో ఉన్నట్లు జైట్లీ తెలిపారు. బ్యాంకుల వద్ద  కావాల్సిన నగదు కరెన్సీ ఉందన్నారు. కొన్ని రాష్ర్టాల్లో అనూహ్యంగా నగదు వినియోగం పెరగడం వల్ల కరెన్సీ సమస్య ఏర్పడిందని తెలిపారు. ఇది తాత్కాలికమేనని...దీన్ని త్వరలోనే పరిష్కరిస్తామని జైట్లీ ట్వీట్‌ చేశారు.

కేంద్రమంత్రి జైట్లీ ప్రకటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఏటిఎంలలో నగదు కొరత తాత్కాలికమైన సమస్య కాదని... హైదరాబాద్‌లో గత 3 నెలలుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. దీనిపై ఆర్బీఐ, ఆర్థిక శాఖ లోతుగా చర్చించాలన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని పొగొట్టొద్దని ట్వీట్‌ చేశారు.

 

22:02 - April 17, 2018

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఘనంగా జరుగుతోంది. భారీ ఎత్తున నగరవాసులు ఫెస్ట్‌కు తరలివస్తున్నారు. ఇవాళ కేరళ మంత్రులు హైదరాబాద్‌ ఫెస్ట్‌కు వచ్చారు. గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన అన్ని స్టాళ్లను కేరళ మంత్రులు పరిశీలించారు. నిర్వాహకులు దగ్గర ఉండి హైదరాబాద్‌ ఫెస్ట్‌, తెలంగాణసంస్కృతి, సాంప్రదాయాలు, కళలకు సంబంధించిన వివరాలను వివరించారు. ఏర్పాట్లు బాగా ఉన్నాయని మంత్రులు కొనియాడారు. 

 

22:01 - April 17, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు.. రేపటి నుంచి  హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈనెల 22 వరకూ జరిగే సభల్లో దాదాపు పాతిక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటి ఆతిథ్యమిస్తోన్న ఈ మహాసభల నిర్వహణ కోసం.. పార్టీ వాలంటీర్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. 
బుధవారం నుంచి మహాసభలు ప్రారంభం 
సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సిద్ధం. అరుణ వర్ణాన్ని సంతరించుకున్న  హైదరాబాద్‌ వీధులు.. సీపీఎం 22వ జాతీయ మహాసభలు బుధవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. స్థానిక ఆర్టీసీ కల్యాణ మంటపంలో.. ఉదయం పది గంటలకు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం.. సభల ప్రారంభ సూచికగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ప్రారంభ సభలో.. వివిధ వామపక్ష పార్టీల అగ్రనేతలు సౌహర్ద్ర సందేశం వినిపిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే మహాసభల్లో మొత్తం 25 అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మహాసభల ఎజెండాపై.. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ.. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల సభ్యులు సమావేశమై చర్చించారు. 
హైదరాబాద్‌ తరలివచ్చిన ప్రతినిధులు 
మహాసభల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు 764 మంది, 74 మంది పరిశీలకులు, ఎనిమిది మంది సీనియర్‌ నాయకులు ఇప్పటికే హైదరాబాద్‌ తరలివచ్చారు. పదహారు సంవత్సరాల తర్వాత పార్టీ జాతీయ మహాసభలకు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. దీంతో సీపీఎం వాలంటీర్లు  నగరమంతటా అరుణ పతాకాలు, తోరణాలు, వాల్‌రైటింగ్స్‌తో నింపేశారు. ప్రధాన చౌరస్తాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మహాసభల విజయవంతానికి మొత్తం 21 పార్టీ కమిటీలు పనిచేస్తున్నాయి. 
విస్తృత ఏర్పాట్లు 
అటు.. సభా ప్రాంగణం ఆర్టీసీ కల్యాణ మంటపం వద్ద కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ద్వారాన్ని ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. శ్రామిక వర్గ స్పూర్తిని, అలనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టాన్ని చాటేలా ఏర్పాటు చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అమర వీరుల స్మారకం, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ల చిత్రాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పార్టీ నేత సుందరయ్య పాల్గొన్న ఘట్టాలతో కూడిన పెయింటింగ్‌లు ఏర్పాటు చేశారు.  తెలంగాణ చరిత్రకు చిహ్నంగా భాసించే కాకతీయుల కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈనెల 22న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో మహాసభలు ముగుస్తాయి. 

21:54 - April 17, 2018

విజయవాడ : ఏపీలో ప్రత్యేక హోదా పోరు రసవత్తరంగా సాగుతోంది. 20న దీక్షకు చంద్రబాబు సిద్ధమవుతుంటే.. దీన్ని నాన్సెన్స్‌ రాజకీయమని బీజేపీ విమర్శించింది. దీనికి టీడీపీ కూడా ఘాటుగానే సమాధానమిచ్చింది. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ... ఢిల్లీలో రాష్ట్రపతి గుమ్మం తొక్కి.. హోదా కోసం అభ్యర్థించింది. 

ఏపీలో ప్రత్యేక హోదా పోరు తీవ్రతరం అవుతోంది. ఏపీకి హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 20న తన పుట్టిన రోజునాడు.. నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో దీక్షకు సన్నాహాలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు, మంగళవారం జరిగిన టీడీపీ ముఖ్యుల సమావేశంలో నిర్ణయించారు. 

చంద్రబాబు దీక్షపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నాన్సెన్స్‌ రాజకీయాలు నడుపుతోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణకుమార్‌రాజు విమర్శించారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా టీచర్లంతా నిరసనకు దిగాలంటూ.. ఉన్నతాధికారులతో మంత్రి గంటా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. 

బీజేపీ విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఏపీలో 99 శాతం మంది ప్రజలు బీజేపీని నమ్మడం లేదని, ఏపీకి అన్యాయం చేసిన బీజేపికి కర్నాటకలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. 

మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ.. వైసీపీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. విభజన చట్టం అమలు అంశాన్నీ రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. ఇచ్చిన హామీలను కేంద్రం ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ  కోవింద్‌కు వినతి పత్రం సమర్పించారు.

వైసీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రత్యేకహోదా పోరును నడపడంలో విఫలమైన వైసీపీ నేతలు... ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

అటు వైసీపీ కూడా టీడీపీని టార్గెట్‌ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. బీజేపీని నాలుగేళ్లపాటు వాడుకున్న చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి ఆరాటపడుతున్నారని జగన్‌ టీమ్‌ విమర్శిస్తోంది.  టీడీపీ నేతలపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని.. వారు చేసే దీక్షలను ప్రజలను నమ్మరని కామెంట్లు చేస్తున్నారు. 

అటు సామాన్య ప్రజలు కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరులో బుడగజంగాలు వినూత్న నిరసనకు దిగారు.  ఇదిలావుంటే టీడీపీ-బీజేపీ-వైసీపీల తీరును వామపక్షాలు-జనసేన తప్పుబట్టాయి. ప్రత్యేహోదా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో నేతలు ఇలా పార్టీల పరంగా విమర్శలకు దిగడం ఏంటని లెఫ్ట్‌, జనసేన నేతలు ప్రశ్నించారు. 

21:49 - April 17, 2018

పదకొండు సంవత్సరాలు.. వందలాది మంది సాక్షుల విచారణ.. అయినా తేలని దోషులు. సుదీర్ఘకాలం సాగిన మక్కామసీదు పేలుళ్ల కేసులో ముద్దాయిలందరూ నిర్దోషులుగా బటయపడ్డారు. 10 మంది నిందితుల్లో ఏ ఒక్కరికి వ్యతిరేకంగా ఎన్‌ఐఏ సాక్ష్యాలు సేకరించలేక పోయింది. దీంతో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి స్పెషల్‌కోర్టు తీర్పు వెలువరించింది. కాగా తీర్పు చెప్పిన కొద్దిగంటల్లోనే జడ్జి.. రవీందర్‌రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇదే అంశంపై ఆనాటి ఏసీపీ, మాజీ పోలీసు అధికారి రెడ్డన్నతో ప్రత్యేక కార్యక్రమం టెన్ టివి నిర్వహించింది.  
ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం... 

21:44 - April 17, 2018

హైకోర్టుల ఓడిపోయిన తెలంగాణ సర్కార్...కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలు సేఫ్,  పాతబస్తీ ఇస్తాంబులకు వెయ్యికోట్లు...గుణాత్మక పెట్టుబడే అంటున్న జనం, పాలన ఇడ్సి పాటవాడిన కవితమ్మ..దత్తత ఊరి జనం ఎదురుసూస్తున్నరమ్మా, పోరాటం జేశినోందే ముఖ్యమంత్రి కుర్చైతె..మరి భూమి పుత్రులదే భూమిగావాలెగదా?, ఇంటర్ పరీక్ష్ల వంద శాతం పాసైన పోరగాళ్లు...ఆసీఫాబాద్ అడ్వుల పొంట సర్కారు సద్వు, దళితున్ని బుజానికెత్తుకున్న చిల్కూరు జియర్..చిత్రంగ వార్తలు రాసుకొచ్చిన వార్తా పత్రికలు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

21:40 - April 17, 2018

పెద్దపల్లి : జిల్లా కూనారం గ్రామ నిరుపేదలు భూమికోసం గొంతెత్తి నినదిస్తున్నారు. ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని తమకు పంచాలని  కోరుతున్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో చెట్లు తొలగించి చదును చేశారు. ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంచాలంటూ నిరుపేదలు నినదిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాం పూర్ మండలం కునారం గ్రామంలోని నిరుపేదలు భూమికోసం కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు.. భూ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నా అధికారులు ఎవ్వరూ స్పందించలేదు. దీంతో అఖిల పక్షం ఆధ్వర్యంలో సుమారు మూడు వందలమంది గ్రామస్థులు రెండు వేల ఎకరాల సీలింగ్ భూముల్లో చెట్లను నరికి చదును చేశారు. 

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఆందోళన కారులకు మద్ధతుపలికారు. వారితోకలిసి ప్రభుత్వ భూమిలో చెట్లు తొలగించారు. ఈ సమస్యగురించి ఇదివరకే  కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళామన్నారు మాజీ ఎమ్మెల్యే. సక్రమంగా పనిచేసే అధికారులకు స్థానిక ఎమ్మెల్యే అడ్డుతగులుతున్నారని ఆయన ఆరోపించారు. భూమికోసం పోరాటం చేస్తున్న నిరుపేదలను పోలీసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు..

నిలువనీడలేక నిరుపేదలు ఇబ్బందులు పడుతుంటే... అక్రమార్కులు ప్రభుత్వభూమిని కబ్జాచేస్తున్నారని కునారం గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్‌ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు భూమినిచ్చి న్యాయం చేసేవరకూ పోరాడుతామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్‌  ప్రభుత్వం... తమకు భూములిచ్చే దాకా పోరాడుతామని ఆందోళన కారులు హెచ్చరిస్తున్నారు.


 

21:38 - April 17, 2018

మెదక్ : మెతుకుసీమ.. కాలుష్యపు కోరలకు చిక్కి విలవిలలాడుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలే. నీరు, గాలి, మట్టి.. ఇలా అంతటా కాలుష్యమే. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో కాలుష్యకారక పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాలుష్యంతో తల్లడిల్లిపోతున్న స్థానికులు.. కొత్తపరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. 

పారిశ్రామికంగా ఎదుగుతున్న సంగారెడ్డి జిల్లాలో.. అంతే స్థాయిలో కాలుష్యమూ విస్తరిస్తోంది. ఇప్పుడున్న వాటికి తోడు.. మరో కాలుష్యకారక పరిశ్రమ ఈ ప్రాంతానికి రాబోతోంది. ప్రజల అభీష్టంతో నిమిత్తం లేకుండానే ఈ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం యావాపూర్‌, మద్దికుంట సమీపంలో కొత్తగా ఓ ఫార్మా కంపెనీని స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు పదిహేడు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యంతో ఈ ఫార్మా కంపెనీని స్థాపిస్తున్నారు. ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడుతున్న ప్రజలు.. కొత్త ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. నిజానికి మార్చి 28న ఈ కంపెనీపై ప్రజాభిప్రాయ సేకరణకు సభ నిర్వహించాలని ప్రయత్నించారు. కారణాలేమో కానీ.. ఈ సభ రద్దయింది. మళ్లీ జనాభిప్రాయ సేకరణ సభ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియదు కానీ.. ఆ ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటిస్తామని స్థానికులు చెబుతున్నారు. 

యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ పేరిట ప్రారంభించబోతున్న పరిశ్రమకు వ్యతిరేకంగా ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవలే జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ దీనిపై వాడివేడిగా చర్చ జరిగింది.. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా.. పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ  స్థానిక ఎమ్మెల్సీ పోతూరి సుధాకర్‌ రెడ్డి కూడా అధికారులను జెడ్పీ సమావేశంలో గట్టిగా నిలదీశారు. 

సదాశివపేటలో.. 112 ఎకరాల్లో నెలకొల్పే ఈ పరిశ్రమలో 16 రకాల ఉత్పత్తులు బయటికొస్తాయి. వీటికోసం రోజుకు 863 లీటర్ల నీరు అవసరం అవుతుందని... సుమారు 1500 మందికి ఉపాధి లభించవచ్చని ప్రభుత్వం చెప్పుకొస్తోంది.  పరిశ్రమ వల్ల కలిగే లాభాలనే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. ఐతే పరిశ్రమల వల్ల వ్యాపించే కాలుష్యం గురించి ప్రభుత్వం కానీ,  అధికారులు కానీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.     బైట్ : 
నిజానికి ఈ ప్రాంతంలోని ఫార్మా కంపెనీలన్నింటినీ జనావాసాలకు దూరంగా ఒకే చోటికి తరలిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అయితే.. ఇప్పుడు మాట తప్పి.. కొత్తగా మరో ఫార్మా కంపెనీకి అనుమతినివ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. స్థానికుల అభిప్రాయాన్ని సేకరించి.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానిక కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. 

పరిశ్రమలు రావాలి.. ఉపాధి లభించాలి.. అయితే ఆ వంకతో ప్రజారోగ్యంతో చెలగాటమాడతామంటే మాత్రం సహించేది లేదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం.. జనాభిప్రాయ సేకరణను మొక్కుబడి తంతుగా నిర్వహించి చేతులు దులిపేసుకుంటే రోడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నెలకొల్పబోయే యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌కు గడ్డుపరిస్థితే కనిపిస్తోంది. 

21:27 - April 17, 2018

హైకోర్టులో కేసీఆర్‌ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దును కోర్టు కొట్టేసింది.  ఇద్దరి శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, అడ్వకేట్ వి.ఆర్ మాచవరం పాల్గొని, మాట్లాడారు. హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు
అని అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని..నియంతలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆ ప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

21:12 - April 17, 2018

హైదరాబాద్ : హైకోర్టులో కేసీఆర్‌ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దును కోర్టు కొట్టేసింది.  ఇద్దరి శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది. తమ విషయంలో.. కేసీఆర్‌.. తాను తీసిన గోతిలో తానే పడ్డారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. 
కోమటిరెడ్డి, సంపత్‌ లకు హైకోర్టులో ఊరట 
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన అసెంబ్లీ బహిష్కరణను ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. ఇద్దరు నేతల శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ తప్పు చేశారని ప్రభుత్వం భావిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ.. అసెంబ్లీ బహిష్కరణ సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన 
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేశారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్‌ఫోన్‌ను విసరగా అది శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లపై అసెంబ్లీ బహిష్కరణ వేటు వేశారు. అంతేకాదు.. వారి సభ్యత్వాలను రద్దు చేస్తూ.. తక్షణమే వారి స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలనీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ను కోరింది.
హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
ప్రభుత్వ నిర్ణయంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఘటన జరిగిననాటి అసెంబ్లీ ఫుటేజీ ఇవ్వాలన్న న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదు. అడ్వొకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా వెనుక ఈ ఫుటేజీ అంశమే కారణమన్న వార్తలూ వచ్చాయి. మొత్తమ్మీద.. ఈ కేసులో పలుమార్లు వాదనలు విన్న న్యాయస్థానం కాంగ్రెస్‌ సభ్యులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని.. కేసీఆర్‌ తాను తీసిన బొందలో తానే పడ్డాడంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలు పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎక్కడికక్కడ స్వీట్లు పంచుకుని.. బాణాసంచా పేల్చి సంబరం చేసుకున్నారు.

 

21:07 - April 17, 2018

హైదరాబాద్ : 2002 తర్వాత సీపీఎం అఖిల భారత మహాసభలు హైదరాబాద్ కు రావడాన్ని సంతోషిస్తున్నామని  ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ అన్నారు. మహాసభలను విజయవంతంగా, ప్రతిష్టాత్మకంగా జరపాలని ఆహ్వాన సంఘం భావించి 21 కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. మహాసభలు విజయవంతం కావడడమంటే ఘనంగా, ఆర్భాటంగా కాదని..ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పాలకవర్గాల విధానాలు ఎలా ఉన్నాయి.. అవి ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని చర్చిడం అనేది చాలా ముఖ్యమన్నారు. ఈ మహాసభలో ముఖ్యంగా రాజకీయ తీర్మానంపై చర్చ జరుగుతుందన్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర పరిణామాలు ఎలా ఉన్నాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విధానాలు అవిలంభిస్తున్నాయి.. వాటిపై ఎలాంటి ఆలోచనలు రావాలి...ప్రజల స్పందన ఎలా ఉంది అనే అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. ప్రజల సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ ఎజెండా, ప్రత్యామ్నాయ ప్రణాళికపై మహాసభలో చర్చించాలని పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. బూర్జువాపార్టీల్లో సిద్ధాంతాలు, నాయకత్వాన్ని నాయకులు నామినేట్ చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను టీఆర్ ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుందని విమర్శించారు. 

 

20:59 - April 17, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటున్నారు పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ. రాష్ట్రంలో టూరిస్ట్‌ ప్రాంతాలను అభివృద్ధి చేయడం చేసి... దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేలా చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామంటున్నారు. ఇందుకోసం సెప్టెంబర్‌ 6 నుంచి 8వ తేదీ వరకు 'ఇండియన్‌ టూర్‌ ఆపరేటర్స్‌' ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామంటున్న అఖిలప్రియతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

20:56 - April 17, 2018

గుంటూరు : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 20న 'ధర్మపోరాట దీక్ష' చేస్తారని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు... పుట్టిన రోజు వేడుకలకు దూరంగా 12 గంటలపాటు దీక్ష చేస్తారన్నారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు నిర్వహిస్తున్నామని.. 'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో తిరుపతి సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. 

 

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి పూర్తైన కసరత్తు

హైదరాబాద్ : ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కసరత్తు పూర్తయింది. నూతన అధ్యక్షుడిని రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉన్నత పదవి ఇచ్చేందుకే హరిబాబుతో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఇక అధ్యక్ష పదవి మొదటినుంచి పార్టీలో కొనసాగుతున్న వారికే ఇవ్వనున్నట్లు సమాచారం.

20:53 - April 17, 2018

హైదరాబాద్ : ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కసరత్తు పూర్తయింది. నూతన అధ్యక్షుడిని రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉన్నత పదవి ఇచ్చేందుకే హరిబాబుతో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఇక అధ్యక్ష పదవి మొదటినుంచి పార్టీలో కొనసాగుతున్న వారికే ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పదవి కోసం కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి పేర్లు వినిపించినప్పటికి.. మాణిక్యాలరావు, సోము వీర్రాజుకే పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. సామాజికవర్గాల ఆధారంగా అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత.. ఏపీలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారిచింది. ఇక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. జూన్‌ లేదా జులైలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి 2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 

 

20:51 - April 17, 2018
20:50 - April 17, 2018

హైదరాబాద్‌ : నగరంలో సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం జెండా ఆవిష్కరణతో సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభమవుతాయని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం మధ్యాహ్నం సెంట్రల్‌ కమిటీ ఆమోదించిన రాజకీయ తీర్మానాలపై 846 మంది ప్రతినిధులు చర్చిస్తారన్నారు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాల గురించి మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు. అలాగే జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల పొత్తుల గురించి ఈ మహాసభల్లో చర్చిస్తామన్నారు. బీజేపీని ఓడించడం ప్రధాన లక్ష్యం  అన్నారు. ఈనెల 22న జరిగే మహాసభ.. దేశ రాజకీయాలతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుందని చెప్పారు. బహిరంగ సభకు మూడు లక్షలమంది హాజరవుతారని తెలిపారు. 

20:42 - April 17, 2018

ఢిల్లీ : కేంద్రప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. దేశానికి ఒక న్యాయం రాష్ట్రాలకు ఒక న్యాయమా ? అని అన్నారు. జీఎస్టీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణ భారత రాష్ట్రాలు జనాభాను నియంత్రించాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను బాగా అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలన్నారు. పేద రాష్ట్రాలకు సపోర్టు చేయాలని చెప్పారు. గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రాలకు సపోర్టు చేయాలని చెప్పారు. ఏటీఎం, బ్యాంకుల్లో కరెన్సీ కొరత ఉన్న మాట వాస్తవమన్నారు. కరెన్సీ కోత లేకుండా చూస్తామని జైట్లీ హామీ ఇచ్చారని తెలిపారు. అనేక పెద్ద కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తున్నాయని అన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు బ్యాంకులను లూటీ చేశారని పేర్కొన్నారు.
 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో సంచలనం నెలకొంది. కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు చర్చి ఫాదర్‌ అస్థికల పంపకం జరిగింది. ఫాదర్‌ అస్థికల పంపకం కోసం 30 ఏళ్ల నాటి సమాధిని తవ్వారు. కొత్తగూడెం ఆర్‌సీఎం చర్చి ఫాదర్‌గా బాధ్యతలు నిర్వహించిన రెవరెండ్‌ స్ట్రో... మరణించడంతో చర్చి కాంపౌండ్‌లోనే సమాధి చేశారు. 30 ఏళ్లుగా ఫాదర్‌ అస్థికల కోసం ఎదురుచూస్తున్న కేరళీయులు... మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. చివరకు ప్రభుత్వం అంగీకరించడంతో... ఇవాళ సమాధిని తవ్వి అస్థికల పంపకాలు చేశారు. ఇందులోభాగంగా పాదాలు కొత్తగూడెంకు,.. తల, మొండెం భాగాలు కేరళ ఆర్‌సీఎం సభ్యులకు అప్పగించడం జరిగింది. 

20:00 - April 17, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో సంచలనం నెలకొంది. కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు చర్చి ఫాదర్‌ అస్థికల పంపకం జరిగింది. ఫాదర్‌ అస్థికల పంపకం కోసం 30 ఏళ్ల నాటి సమాధిని తవ్వారు. కొత్తగూడెం ఆర్‌సీఎం చర్చి ఫాదర్‌గా బాధ్యతలు నిర్వహించిన రెవరెండ్‌ స్ట్రో... మరణించడంతో చర్చి కాంపౌండ్‌లోనే సమాధి చేశారు. 30 ఏళ్లుగా ఫాదర్‌ అస్థికల కోసం ఎదురుచూస్తున్న కేరళీయులు... మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. చివరకు ప్రభుత్వం అంగీకరించడంతో... ఇవాళ సమాధిని తవ్వి అస్థికల పంపకాలు చేశారు. ఇందులోభాగంగా పాదాలు కొత్తగూడెంకు,.. తల, మొండెం భాగాలు కేరళ ఆర్‌సీఎం సభ్యులకు అప్పగించడం జరిగింది. 

 

19:58 - April 17, 2018

ఖమ్మం : సీపీఎం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మహాసభలకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చేలా సీపీఎం నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ వినూత్నంగా జోడు గుర్రాలబండిపై ప్రచారం నిర్వహించారు. ఈ మహాసభలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువస్తాయని నేతలంటున్నారు. మహాసభల విజయవంతం కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం... 

19:52 - April 17, 2018

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ స్టేడియలో జరుగుతున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌లో డాక్టర్‌ నారాయణ కాలేజ్‌ ఆఫ్ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాల్‌ విద్యార్థులను ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈరంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను స్టాల్‌ నిర్వాహకులు విద్యార్థులకు వివరిస్తున్నారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తే ఈ రంగంలోనే కాక..  వేర్వేరు రంగాల్లో స్థిరపడొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

19:22 - April 17, 2018

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌లో జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

19:19 - April 17, 2018

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఫెస్ట్‌లో చక్ర అమృత డెయిరీ ఫారం స్టాల్‌కు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. దేశవాళీ ఆవు పాలతోపాటు పాల ఉత్పత్తులు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తును వాడితే మంచి ఆరోగ్యం లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

19:16 - April 17, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌కు రోజు రోజుకు జనాదరణ పెరుగుతోంది. ఈ ఫెస్ట్‌ విజ్ఞాన, వినోదభరితంగా ఉండటంతో  విద్యార్థులు నుంచి వృద్ధుల వరకు అందరూ తరలివస్తున్నారు. పుస్తక ప్రదర్శనలు, సాహిత్య సమ్మేళనాలు, జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అందర్నీ అలరిస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞాన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోన్న ఫెస్ట్‌  
ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది. ఫెస్టివల్‌లోని వింతలు, విశేషాలను చూసేందుకు అందరూ తరలివస్తున్నారు. శాస్త్రీయ విజ్ఞాన నుంచి సంప్రదాయ నత్కయాల  వరకు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటంతో సాయంత్ర వేళ జనం విపరీతంగా వస్తున్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌కు వచ్చినవారు కొత్త అనుభూతితో ఆనందంగా తిరిగివెళ్తున్నారు.  
అందర్నీ ఆకర్షిస్తున్న పుస్తక ప్రదర్శనలు  
బాలోత్సవం, ఆహారోత్సవం, షార్ట్‌ ఫిల్మ్‌ ప్రదర్శనలు, పుస్తక ప్రదర్శనలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు, శిక్షణా సంస్థలు తమ స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ ఏర్పాటు చేసిన స్టాల్‌ విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. సివిల్‌ సర్వీసెస్‌కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశంపై విద్యార్థుల సందేహాలకు టీస్కా నిర్వాహకులు సమాధానాలు ఇస్తున్నారు.
రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ షోలు 
సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి హైదరాబాద్‌ ఫెస్ట్‌ బాగా ఉపయోగపడుతోంది. రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ షోలకు సంబంధించి 50కిపైగా స్టాళ్లు ఏర్పాటయ్యాయి. గ్రీన్‌ హోమ్‌, డ్యూక్స్‌ గెలాక్సీ, గ్రీన్‌ హిల్స్‌, యాదాద్రి హోమ్స్‌ వంటి దిగ్గజ సంస్థలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌ శివార్లలోని వెంచర్లకు మంచి డిమాండ్‌ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. తక్కువ  రేట్లకు ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయని సందర్శకులకు వివరిస్తున్నారు. ఈనెల 22 వరకు కొనసాగే హైదరాబాద్‌ ఫెస్ట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు నిర్వహకులు చర్యలు తీసుకొంటున్నారు.

 

19:10 - April 17, 2018

హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జాతీయ మహాసభలకు సర్వం సిద్ధమయ్యింది. ఈ మహాసభలకు బాగ్‌లింగంపల్లి ఆర్‌టీసి కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హైద్రాబాద్‌కు చేరుకున్నారు. రేపటి నుంచి జరగబోయే ప్రారంభసభకు ప్రధాన వేదిక కూడా ముస్తాబు అవుతోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు బి.వెంకట్ మాట్లాడుతూ 2002 సం.లో హైదరాబాద్ లో సీపీఎం జాతీయ మహాసభలు జరిగాయని... మళ్లీ 16 సంవత్సరాల తర్వాత తిరిగి హైదరాబాద్ కు అవకాశం వచ్చిందని అన్నారు. మహాసభల నిర్వహణను సంతోషంగా స్వీకరించామన్నారు. మహాసభలకు 848 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతున్నారని తెలిపారు. ఇప్పటికే 500 మంది ప్రతినిధులు హైదరాబాద్ కు చేరుకున్నారని చెప్పారు. మహాసభల నిర్వహణ ఏర్పాట్ల కోసం 21 కమిటీలు వేశామని తెలిపారు. సభలు జరుగనున్న ఆర్టీసీ కళ్యాణ మండపాన్ని పార్టీ చరిత్ర ప్రతిభింబించే విధంగా డెకరేషన్ చేశామని తెలిపారు. సభ ముఖద్వారం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతలు తెలుపుతూ ఏర్పాటు చేశామని తెలిపారు. సభలు జరిగే హాల్ ముఖద్వారం కాకతీయ కళా తోరణంతో డెకరేషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సీపీఎం సంబరం కాదు... ప్రజా సంబరం అని అన్నారు. బీజేపీని గద్దె దించడం, పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంతోపాటు పలు అంశాలపై సభలో చర్చిస్తారని పేర్కొన్నారు. రేపు ఉదయం 10 గంటలకు సభలు ప్రారంభం అవుతాయని చెప్పారు. పార్టీ జెండాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆవిష్కరిస్తారని తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మహాసభలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఐదు వామపక్ష పార్టీల నేతలు ప్రారంభ సభలో పాల్గొంటారని తెలిపారు. 

 

18:35 - April 17, 2018

హైదరాబాద్‌ : ఎంబీ భవన్‌లో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, మాణిక్‌సర్కార్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌లు హాజరయ్యారు. ఈ సమావేశంలో రేపటి నుంచి జరిగే సీపీఎం 22వ జాతీయ మహాసభల అజెండాపై చర్చిస్తున్నారు. 

17:00 - April 17, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కారుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఇద్దరు నేతల శాసనసభ్యత్వం రద్దు చెల్లదని తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. న్యాయం గెలిచిందన్నారు. తన గన్ మెన్లను తొలగించి సీఎం కేసీఆర్ పైశాచిక అనందం పొందారని అన్నారు. తనను మానసిక వేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

16:55 - April 17, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కారుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఇద్దరు నేతల శాసనసభ్యత్వం రద్దు చెల్లదని  తీర్పు ఇచ్చింది.  అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా వీరిద్దరు అనుచితగా  అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై శాసనసభ్యత్వం రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంతప్‌కుమార్‌ హైకోర్టులో వేసిన కేసుపై ఇవాళ తుది తీర్పు వెలువడింది. 

 

16:53 - April 17, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏటిఎంలలో ఏర్పడిన నగదు కొరతపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో ప్రస్తుతం అవసరం కన్నా ఎక్కువ నగదు చెలామణిలో ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. బ్యాంకుల వద్ద  కావాల్సిన నగదు కరెన్సీ ఉందన్నారు. కొన్ని రాష్ర్టాల్లో అనూహ్యంగా డిమాండ్ ఏర్పడడం వల్ల పాక్షికంగా నగదు లోటు ఏర్పడినట్లు జైట్లీ తెలిపారు. కరెన్సీ కొరత ఏర్పడిన ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు  జైట్లీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, బిహార్‌, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఎటిఎంలలో నగదు నిల్వలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
 

 

16:09 - April 17, 2018

బెంగళూరు : కర్నాటక రాష్ర్టం అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు ఏరులైపారుతున్నాయి. అనంతపురం జిల్లా కర్నాటక బార్డర్‌లో భారీ ఎత్తున నగదు పట్టుబడుతోంది. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో 120 కోట్ల రూపాలయను పట్టుకున్నారు పోలీసులు. వారం రోజుల క్రితం కూడా అనంతపురం కర్నాటక బార్డర్‌లో 20 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

 

16:07 - April 17, 2018

ఖమ్మం కార్పొరేషన్ సమావేశంలో గందరగోళం

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ సమావేశంలో గందరగోళం నెలకొంది. నగర సమస్యలపై చర్చించేందుకు కమిషనర్ మీటింగ్ హాల్ కు రాలేదు. దీంతో ఆగ్రహించిన కార్పొరేటర్లు మేయర్ ను నిలదీశారు.

15:44 - April 17, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై మానవి వేదిక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు హైమావతి, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య పాల్గొని, మాట్లాడారు. కథువా ఘటన చాలా దారుణమైన ఘటన అన్నారు. ఈ ఘటన మానవ సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:38 - April 17, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌కు విశేష ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు చెప్పారు. ఇప్పటి వరకు రెండు లక్షల మంది ఫెస్ట్‌ను సందర్శించారన్నారు. హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతిని ప్రజలకు తెలియచేయడంతోపాటు విజ్ఞానం, వినోదం అందించేందుకు దీనిని నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్‌ ఫెస్ట్‌ కన్వీనర్‌ నంద్యాల నర్సింహారెడ్డి, కమిటీ సభ్యుడు కె.వేణగోపాల్‌ చెప్పారు. ఫెస్ట్‌ కార్యక్రమాలతో పాటు స్టాళ్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయన్నారు.

 

ప్రారంభమైన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం

హైదరాబాద్ : ఎంబి భవన్ లో సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, మాణిక్ సర్కార్, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు.  

15:26 - April 17, 2018

తూర్పుగోదావరి : కాకినాడలో ప్రత్యేక హోదా కోసం వినూత్న నిరసన చేపట్టారు. కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో 100 బోట్లతో సముద్రంలో నిరసన ర్యాలీ తీశారు. ఏపీ ప్రజలకు మోదీ అన్ని విధాలుగా మోసం చేశాడని ఎమ్మెల్యే విమర్శించారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యక్తరలు భారీగా పాల్గొన్నారు.

15:18 - April 17, 2018

ఢిల్లీ : ప్రత్యేక పాకేజీ బాగుంటుందని చెప్పిన చంద్రబాబు.. నేడు యూటర్న్‌ తీసుకుని మా కంటే బాగా కేంద్రంతో ఎవరు పోరాడటం లేదని చెప్పుకోవడం సిగ్గుచేటని వైసీపీ ఎంపీలు అన్నారు. రాష్ర్టపతిని కలిసి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. విభజన చట్టంలోని హామీలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు.

15:11 - April 17, 2018

ఢిల్లీ : వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. విభజన చట్టం అమలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర వైఖరిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఎంపీలు వివరించారు. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను కేంద్రం ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ రాష్ట్రపతికి వైసీపీ ఎంపీలు వినతి పత్రం సమర్పించారు.

 

కేసీఆర్‌ సర్కారుకు గట్టి ఎదురు దెబ్బ

 హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కారుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఇద్దరు నేతల శాసనసభ్యత్వం రద్దు చెల్లదని  తీర్పు ఇచ్చింది.  అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా వీరిద్దరు అనుచితగా  అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై శాసనసభ్యత్వం రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు.

15:07 - April 17, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కారుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఇద్దరు నేతల శాసనసభ్యత్వం రద్దు చెల్లదని  తీర్పు ఇచ్చింది.  అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా వీరిద్దరు అనుచితగా  అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై శాసనసభ్యత్వం రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంతప్‌కుమార్‌ హైకోర్టులో వేసిన కేసుపై ఇవాళ తుది తీర్పు వెలువడింది. 

రాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీలు

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను వైసీపీ ఎంపీలు కలిశారు. విభజన చట్టం అమలు, ఏపీకి ప్రత్యేకహోదా అంశాలపై కేంద్ర వైఖరిని రాష్ట్రపతి రామ్ నాథ్ కు ఎంపీలు వివరించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ కేంద్ర అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏంపీలు రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.

 

రాచకొండ పోలీసుల కాల్ మనీ దందా..

హైదరాబాద్ : రాచకొండ పోలీసులు తమ మార్క్‌ను చూపిస్తున్నారు. వడ్డీలతో నడ్డి విరుస్తున్న బీజేపీ నేతకు వంతపాడుతూ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో సెటిల్‌మెంట్స్‌ చేస్తున్నారు. బీజేపీ నేత, వడ్డీల వ్యాపారి కొంతం బుచ్చిరెడ్డి ఓ బాధితుడు అప్పు తీర్చినా 2 సంవత్సరాలుగా తాకట్టు పెట్టిన భూమి కాగితాలు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. న్యాయం చేయాలని వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు షాక్‌కు గురయ్యేలా సెటిల్‌మెంట్‌ చేశారు సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ రవీందర్‌రెడ్డిలు.

12:32 - April 17, 2018

హైదరాబాద్ : రాచకొండ పోలీసులు తమ మార్క్‌ను చూపిస్తున్నారు. వడ్డీలతో నడ్డి విరుస్తున్న బీజేపీ నేతకు వంతపాడుతూ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో సెటిల్‌మెంట్స్‌ చేస్తున్నారు. బీజేపీ నేత, వడ్డీల వ్యాపారి కొంతం బుచ్చిరెడ్డి ఓ బాధితుడు అప్పు తీర్చినా 2 సంవత్సరాలుగా తాకట్టు పెట్టిన భూమి కాగితాలు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. న్యాయం చేయాలని వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు షాక్‌కు గురయ్యేలా సెటిల్‌మెంట్‌ చేశారు సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ రవీందర్‌రెడ్డిలు. బీజేపీ నేతకు అనుకూలంగా మళ్లీ 13 లక్షలు చెల్లించి భూమి కాగితాలు తీసుకెళ్లాలని తేల్చి చెప్పడంతో బాధితుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.  

పోలవరంపై ఏపీ, ఒడిశా వాదనలు..

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం వేసిన ఒరిజినల్ సూట్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులు వాదనలు జరిగాయి. గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పుకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం జరగడం లేదని, 36 లక్షల క్యూసెక్కులు నీటి కోసం కాకుండా 50 లక్షల క్యూసెక్కుల నీటి కోసం నిర్మాణం జరుగుతోందని వాదనలు వినిపించింది. పర్యావరణ, అటవీ అనుమతులకు అణుగుణంగా నిర్మాణం జరగడం లేదన్న ఒడిశా వాదించింది. సుప్రీం కోర్టు తదుపరి విచారణణు మే 2వ తేదీకి వాయిదా వేసింది.

12:14 - April 17, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తు సూట్ పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయంస్థానం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో గోదావరి ట్రైబ్యునల్ తీర్పుకు అనుగుణంగా నిర్మాణం జరగటంలేదని ఒడిశా ప్రభుత్వం వాదలను వినిపించింది. పర్యావరణ, అటవీ అనుమతులకు అనుగుణంగా నిర్మాణం జరగడంలేదని ఒడిశా వాదిస్తోంది. 36 లక్షల క్యూసెక్కులు కాకుండా 50 లక్షల క్యూసెక్యుల నీటి కోసం నిర్మాణం జరుగుతోందని ఒడశా తన వాదనలను వినిపించింది. కానీ అనుమతులకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వపు న్యాయవాది తెలిపారు. దీనిపై మూడు రోజుల్లో కేంద్ర జనవనరుల శాఖ కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను మే 2తేదీకి వాయిదా వేసింది. 

11:35 - April 17, 2018

ఢిల్లీ: విభజన సమస్యలు, ప్రత్యేకహోదా అంశంపై వైకాపా ఎంపీలు ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలన్నీ కేంద్రం అమలుచేసేలా ఆదేశించాలని కోరుతూ వారు రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు. ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర అవలంభిస్తున్న వైఖరిని రాష్ట్రపతికి ఎంపీలు తెలియజేయనున్నారు. 

11:22 - April 17, 2018

హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడతో సీఎం కేసీఆర్ సమావేశమై దేశ రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఇక మే నెల మొదటి వారంలో ఒడిశా వెళ్లేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటివారంలో బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయించారు. కాగా బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్నామ్నాయంగా దేశంలో థర్డ్ ఫ్రెంట్ కోసం దక్షిణాది రాష్ట్రాలవారు యత్నిస్తున్న విషయం తెలిసిందే. 

మమతా బెనర్జీ, దేవగౌడలతో భేటీ అయిన కేసీఆర్..

దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. దేశాన్ని 65 సంవత్సరాలకుపైగా పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజా సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై బెంగళూరులో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చలు జరిపిన కేసీఆర్‌.. కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలు తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కేసీఆర్‌ విమర్శించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ రాజకీయ పార్టీలైనా చేరవచ్చని మాజీ ప్రధాని దెవెగౌడ ఆహ్వానించారు. కాగా అంతకు ముందు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత, ప్రస్తుతం దేశంలోని రైతుల పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వీరి చర్చ జరిపిన విషయం తెలిసిందే. 

కథువా కేసులో మలుపు?!..

జమ్ము కశ్మీర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువాలో చిన్నారి హత్యాచార ఘటన సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది నిందితులూ తాము తప్పు చేయలేదని పోలీసుల విచారణలో స్పష్టంగా చెబుతున్నారని సమాచారం. కావాలంటే తమకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో నిందితులు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఎనిమిది మంది నిందితుల్లో పోలీసు అధికారులతో పాటు ఓ మైనర్ బాలుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

బహిరంగ సభలతో బిజీ కానున్న కమల్..

తమిళనాడు : నీలగిరి జిల్లాలలో ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ వచ్చే నెలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఆయన ఇటీవల మక్కల్‌ నీది మయ్యం పేరిట పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వరుసగా జిల్లాలవారీగా బహిరంగ సభల ద్వారా ప్రజలు, కార్యకర్తలను కలుసుకుంటున్నారు. ఇటీవలే తిరుచ్చిలో ఓ సభ జరిగింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కమల్‌ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కోవై, నీలగిరి జిల్లాలలో మూడు రోజుల ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 11, 12, 13వ తేదీల్లో పర్యటించనున్నారు. 

10:28 - April 17, 2018

హైదరాబాద్ : సీపీఎం పార్టీ జాతీయ మహాసభలకు సంబంధించి భారీ బహిరంగ సభ సరూర్ నగర్ గ్రౌండ్ లో జరగనుంది. ఈ బహిరంగ సభకు దాదాపు మూడు లక్షలమంది సీసీఎం కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వచ్చే క్యాడర్ కు తగినంతగా సరూర్ నగర్ స్టేడియం సరిపోదనే ఉద్ధేశ్యంతో పరేడ్ గ్రౌండ్ కోసం ప్రభుత్వానికి విజ్నప్తి చేసినా కక్షపూరితంగా వ్యవహరించిన ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభకు అనుమతిని ఇవ్వలేదని తమ్మినేని ఆరోపించారు. కాగా బీజేపీ అవలంభిస్తున్న విధానాలపై ఈ కాన్ఫరెన్స్ లో సీపీఎం నేతలు చర్చించనున్నారు.

మార్క్సిస్ట్‌ 22వ జాతీయ మహాసభలకు ముస్తాబైన భాగ్యనగరం
ఎర్రజెండా పండుగకు ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. భారత కమ్యూనిస్టుపార్టీ మార్క్సిస్ట్‌ 22వ జాతీయ మహాసభలకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతోంది. మహాసభల ప్రధాన వేదిక అయిన ఆర్టీసీ కల్యాణమండపం పరిసరాలు అరుణవర్ణాన్ని సంతరించుకున్నాయి. రేపటి నుంచి ప్రారంభమవుతున్న మహాసభల ఏర్పాట్లను సీపీఎం ఆగ్రనేతలు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 22న జరుగనున్న బహిరంగసభ ఏర్పాట్లు కూడా చకచకా పూర్తవుతున్నాయి. బహిరంగసభకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని సీపీఎం నేతలు చెబుతున్నారు. సిపిఎం 22వ అఖిల భారత మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ నలుమూలల నుండి వచ్చే ప్రతినిధులు నాలుగు రోజులపాటు సాగే మహాసభల్లో వివిధ తీర్మాణాలపై చర్చించనున్నారు. మహాసభల ముగింపు రోజు ఈ నెల 22న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు అందుకు తగ్గ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఆ పార్టీ నేతలంటున్నారు. నగరంలో జరిగే పార్టీ ఆలిండియా మహాసభలకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది సిపిఎం తెలంగాణ రాష్ట్ర శాఖ. అత్యంత వేగంగా సాగుతున్న పనులను పార్టీ అగ్రనాయకులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 8 వందలకు పైగా వాలంటీర్లు ఈ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీధివీధినా ఎర్రజెండాల రెపరెపలాడుతున్నాయి. ఇటు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఎర్రజెండాలు, తోరణాలు, వాల్ రైటింగ్‌లతో అరుణవర్ణం సంతరించుకుంది. ప్రధాన కూడల్లలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేసిన సీపీఎం కార్యకర్తలు మహాసభల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

స్వీడన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

ఢిల్లీ : స్వీడన్‌, జర్మనీ, యూకేలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్‌ చేరుకున్నారు. రాజధాని స్టాక్‌హోమ్‌ చేరుకున్న మోదీకి స్వీడన్‌ ప్రధాని స్టెఫాన్‌ లొఫ్‌వెన్‌ స్వయంగా విమానాశ్రమానికి వచ్చి స్వాగతం పలికారు. మోదీ బసచేసే హోటల్‌ వద్దకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. నేడు స్టెఫాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం రెండు దేశాలకు చెందిన దిగ్గజ వ్యాపారవేత్తలతో ఇరువురు ప్రధానులు సమావేశమవుతారు. స్వీడన్‌ పర్యటన అనంతరం జర్మనీ, యూకేలో ఏప్రిల్‌ 20వరకు మోదీ పర్యటించనున్నారు.

10:07 - April 17, 2018

అమరావతి : ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అమిత్‌షాకు పంపించారు. రాజీనామాకు దారి తీసిన పరిణామాలను లేఖలో వివరించారు కంభంపాటి. మరో కొత్త అధ్యక్షుని నియామకం కోసం కసరత్తు ముమ్మరం అయింది. రేసులో పార్టీ సీనియర్లు సోమువీర్రాజు, మాణిక్యాల రావు ఉన్నారు. కాగా గత కొంతకాలంగా సోము వీర్రాజు బీజేపీ గొంతును తనదైన శైలితో టీడీపీపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మద్ధతు వున్నవారికే బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చే సంస్కృతి వున్న తరుణంలో ఇటు మాణిక్యాలరావు, అటు సోము వీర్రాజులిద్దరికీ వున్న నేపథ్యంలోఅధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందోవేచి చూడాల్సిందే. 

10:01 - April 17, 2018

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా తమ వంతు పోరాటం చేస్తామన్న తెలుగువారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కర్నాటక ఎన్నికల్లో తెలుగువారి సత్తా చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని తెలుగువారు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు వారు ఎక్కడ వున్నా వారి రాష్ట్ర శ్రేయస్సును మరచిపోరనే వాస్తవం ఈ ఘటనతో మరోసారి రుజువయింది. తాము వున్నది పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని దానికోసం సీఎం చంద్రబాబుకు తమ మద్ధతును తెలిపారు కర్ణాటకలోని తెలుగువారు. ప్రత్యేక హోదా కోసం సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పోరాటంలో కర్ణాటకలో ఉన్న తెలుగువారు మద్దతిచ్చారు. సచివాలయంలో చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు. 

09:54 - April 17, 2018

కర్నూలు : బనగానపల్లిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలిటెక్నిక్ కళాశాల టాటా సుమో ఆటో ఢీ కొనటంతో వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు విద్యార్ధులు, ఆటో డ్రైవర్ వున్నారు. 

రైలు ఢీకొని గజరాజులు మృతి..

ఒడిశా: ఝార్సుగుడా జిల్లా కిర్‌మిరా సమితి భాగ్‌డిహి అటవీ రేంజ్‌ పరిధిలో రైలు ఢీకొనడంతో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భాగ్‌డిహి అటవీ పరిధిలోని ‘భాగ్‌డిహి- తెలిడిహి’ మధ్య ఏనుగుల గుంపు పట్టాలు దాటుతుండగా ముంబయి-హౌరా మెయిల్‌ రైలు ఢీకొనడంతో 4 ఏనుగులు అక్కడికక్కడే మృతిచెందాయి. వాటిలో రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. దీంతో ఘటనతో ఆ మార్గంలో సుమారు 5 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

రాష్ట్రపతిని కలవనున్న వైసీపీ ఎంపీలు..

ఢిల్లీ: విభజన సమస్యలు, ప్రత్యేకహోదా అంశంపై వైకాపా ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలన్నీ కేంద్రం అమలుచేసేలా ఆదేశించాలని కోరుతూ వారు రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు.

ఆటో, సుమో ఢీ..ముగ్గురు మృతి..

కర్నూలు : బనగానపల్లిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలిటెక్నిక్ కళాశాల టాటా సుమో ఆటో ఢీ కొనటంతో వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు విద్యార్ధులు, ఆటో డ్రైవర్ వున్నారు. 

రైల్వేజోన్ ఆంధ్రల హక్కు : ఎంపీ రామ్మోహన్

శ్రీకాకుళం: ఏపీపై కేంద్రం కుట్రలు చేస్తోందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం 12 గంటల పాటు ఎంపీ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో మాట్లాడుతూ హోదాతో పాటు రైల్వేజోన్‌ ఆంధ్రుల హక్కని అన్నారు. ఒడిశా అభ్యంతరం చెప్పకపోయినా రైల్వేజోన్‌కు కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పి...ఈశాన్య రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చారన్నారు. ఏపీ విషయంలో బీజేపీ రాజకీయ డ్రామా ఆడుతోందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అందుకే రాజీనామా : బీజేపీ హరిబాబు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు అనూహ్యంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. వచ్చేది ఎన్నికల సంవత్సరమని తన లేఖలో గుర్తు చేసిన కంభంపాటి, యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతమని, వారికి అవకాశాల కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తన స్థానంలో ఓ యువకుడిని నియమించాలని కోరారు.

08:22 - April 17, 2018

హైదరాబాద్ : పదకొండు సంవత్సరాలు.. వందలాది మంది సాక్షుల విచారణ.. అయినా తేలని దోషులు. సుదీర్ఘకాలం సాగిన మక్కామసీదు పేలుళ్ల కేసులో ముద్దాయిలందరూ నిర్దోషులుగా బటయపడ్డారు. 10 మంది నిందితుల్లో ఏ ఒక్కరికి వ్యతిరేకంగా ఎన్‌ఐఏ సాక్ష్యాలు సేకరించలేక పోయింది. దీంతో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి స్పెషల్‌కోర్టు తీర్పు వెలువరించింది. కాగా తీర్పు చెప్పిన కొద్దిగంటల్లోనే జడ్జి.. రవీందర్‌రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈచర్చలో సీపీఎం నేత నంద్యాల నర్శింహారెడ్డి, బీజేపీ నేత రమేశ్ నాయుడు, టీఆర్ ఎస్ నేత రాజా మోహన్ పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

08:18 - April 17, 2018

తెలంగాణలో అకాల వర్షాలకు అనేక పంటలు నేల మట్టమయ్యాయి. ఈ అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, మామిడి లాంటి పంటలు ధ్వంసం అయ్యాయి. వీటి ప్రభావం వల్ల తెలంగాణలో చాలా మంది రైతులు లబోదిబో మంటున్నారు. వీరిని ఆదుకోవాలని తెలంగాణలోని విపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదే అంశం పై మనతో మాట్లాడేందుకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగారెడ్డి డిమాండ్స్ ఏమిటో..ఈనాటి జనపథంలో చూద్దాం..

08:15 - April 17, 2018

ఢిల్లీ : కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చిన్నారి తరపు న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తాము నిర్దోషులమని, తమకు నార్కో టెస్టు చేయాలని ట్రయల్‌కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి హత్య
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ నుంచి చండీగఢ్‌కు బదలాయించాలని, తమకు, తమ న్యాయవాదికి భద్రత కల్పించాలని కోరుతూ బాధితురాలి తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎనిమిది నిందితుల్లో ఒకరైన మైనర్‌ నిందితుడిని ఉంచిన జువెనిల్‌ హోంలో భద్రతను పటిష్టం చేయాలని...ఈ హత్యోదంతంపై సమగ్ర విచారణ చేపట్టేలా ఆదేశించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

బాధితురాలి తండ్రి పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ
బాధితురాలి తండ్రి పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసును చండీగఢ్‌కు బదలాయిస్తున్నారా... లేదా...అన్న విషయాన్ని ఏప్రిల్‌ 27 లోగా సమాధానం ఇవ్వాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఎనిమిదేళ్ల చిన్నారి తరపు న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

8 మంది నిందితులను కోర్టుకు హాజరు
జమ్ముకశ్మీర్‌ కథువా జిల్లా ట్రయల్‌ కోర్టులో కూడా ఈ కేసుపై విచారణ జరిగింది. 8 మంది నిందితులను కోర్టుకు హాజరు పరిచారు. తాము నిర్దోషులమని.... ఈ కేసులో తమకు నార్కో పరీక్ష నిర్వహించాలని వారు న్యాయమూర్తిని కోరారు. కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ కాపీలను నిందితులకు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి రాష్ట్ర క్రైం బ్రాంచిని ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్‌ 28కి వాయిదా వేశారు.
బెదిరింపులు వస్తున్నాయి : దీపికా రజావత్‌
ఈ కేసులో తనకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి తరపు వాదిస్తున్న న్యాయవాది దీపికా రజావత్‌ తెలిపారు. తనపై కూడా అత్యాచారం, హత్య జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.బైట్‌ దీపికా రజావత్‌, బాధితురాలి తరపు న్యాయవాది.ఈ ఏడాది జనవరిలో కథువా జిల్లాలో 8 ఏళ్ల బాలికను అపహరించి గుడిలో నిర్బంధించారు. బాలికకు మత్తు మందిచ్చి వారం రోజుల పాటు దుండగులు లైంగిక దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  

08:10 - April 17, 2018

కొమరంభీం : ప్రభుత్వ కాలేజీలంటే అందిరికీ చిన్నచూపే.. వసతులలేమి, అధ్యాపకులు ఉండరనే భావన అందరిలోనూ ఉంది. మారుమూల మండలాల్లో వాటి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కానీ... అదంతా గతం.. నేడు మారుమూల ప్రాంతాల్లోనూ సర్కారీ జూనియర్ కాలేజీలో వంద శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలోనూ నిలిచాయి... ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్‌లో వంద శాతం ఫలితాల పై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..

ప్రభుత్వ కళాశాలల్లో అనూహ్య మార్పులు
ప్రభుత్వ కళాశాలలపట్ల విద్యార్థులతోపాటు.. తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపించరు. ఎందుకంటే.. సౌకర్యాలలేమి... అధ్యాపకుల కొరతతో చదువు సరిగా సాగదని వారి భావన.. కానీ.. నేడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ప్రభుత్వ కళాశాలలు సైతం ప్రథమ స్థానంలో నిలుస్తూ సత్తా చాటుతున్నాయి..

వందశాతం ఫలితాలతో సత్తా చాటుతున్న గవర్నమెంట్‌ కాలేజీలు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆయా కాలేజీల విద్యార్థులు సత్తా చాటారు. మారుమూల మండలాల్లోని బెజ్జూర్‌, దహేగాం, కౌటాలలో ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగజ్‌నగర్‌ జూనియర్ కాలేజీలో వోకేషనల్ కోర్సులోను వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సిర్పూర్ (టి) జూనియర్ కాలేజి లో 99.11% ఉత్తీర్ణత సాధించారు.

అధ్యాపకులు, తల్లిదండ్రుల్లో చైతన్యం
కుమురంభీం జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచిందంటే.. దానికి కారణం ఇక్కడి లెక్చరర్లు, తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పులే.. మంచి ఉన్నత విద్య చదివించాలన్న చైతన్యం తల్లిదండ్రుల్లో వచ్చింది. దీనికి తోడు.. కళాశాలల్లో వసతులు కూడా మెరుగు పడ్డాయి.. మంచి క్రమశిక్షణతో విద్యార్థులను లెక్చరర్లు ప్రోత్సహిస్తూ... క్రమం తప్పకుండా కాలేజికి వచ్చేందుకు కృషి చేస్తున్నారు. మరో వైపు మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థులకు సిర్ఫూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేయూతనందిస్తున్నారు. విద్యార్థులకు మద్యాహ్నం భోజనం పెట్టి వారు చదువులో ముందుండేందుకు తోడ్పాటు ఇస్తున్నారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కోనప్ప ఎనలేని సహకారం అందిస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

కాగజ్‌నగర్‌ జూనియర్ కాలేజీలో వోకేషనల్ కోర్సులో వంద శాతం
ఈ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సైతం వంద శాతం ఫలితాలు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.. మారుమూల ప్రాంతాల్లోని కాలేజీలపై ప్రభుత్వం దృష్టి పెట్టి సౌకర్యాలు కలిపిస్తే... ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు రాణిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.

 

08:03 - April 17, 2018

హైదరాబాద్: ఎర్రజెండా పండుగకు ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. భారత కమ్యూనిస్టుపార్టీ మార్క్సిస్ట్‌ 22వ జాతీయ మహాసభలకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతోంది. మహాసభల ప్రధాన వేదిక అయిన ఆర్టీసీ కల్యాణమండపం పరిసరాలు అరుణవర్ణాన్ని సంతరించుకున్నాయి. రేపటి నుంచి ప్రారంభమవుతున్న మహాసభల ఏర్పాట్లను సీపీఎం ఆగ్రనేతలు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 22న జరుగనున్న బహిరంగసభ ఏర్పాట్లు కూడా చకచకా పూర్తవుతున్నాయి. బహిరంగసభకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని సీపీఎం నేతలు చెబుతున్నారు.

సిపిఎం 22వ అఖిల భారత మహాసభలు
సిపిఎం 22వ అఖిల భారత మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ నలుమూలల నుండి వచ్చే ప్రతినిధులు నాలుగు రోజులపాటు సాగే మహాసభల్లో వివిధ తీర్మాణాలపై చర్చించనున్నారు. మహాసభల ముగింపు రోజు ఈ నెల 22న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు అందుకు తగ్గ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఆ పార్టీ నేతలంటున్నారు.

పార్టీ ఆలిండియా మహాసభలకు భారీగా ఏర్పాట్లు
హైదరాబాద్ నగరంలో జరిగే పార్టీ ఆలిండియా మహాసభలకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది సిపిఎం తెలంగాణ రాష్ట్ర శాఖ. అత్యంత వేగంగా సాగుతున్న పనులను పార్టీ అగ్రనాయకులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 8 వందలకు పైగా వాలంటీర్లు ఈ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీధివీధినా ఎర్రజెండాల రెపరెపలాడుతున్నాయి. ఇటు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఎర్రజెండాలు, తోరణాలు, వాల్ రైటింగ్‌లతో అరుణవర్ణం సంతరించుకుంది. ప్రధాన కూడల్లలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేసిన సీపీఎం కార్యకర్తలు మహాసభల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఆర్టీసీ కళ్యాణ మంటపం పరిసర ప్రాంతాలు అరుణవర్ణం
మహాసభల వేదికయిన ఆర్టీసీ కళ్యాణ మంటపం పరిసర ప్రాంతాలు అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. మహాసభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం అకట్టుకునేలా ఉంది. శ్రామిక వర్గ స్పూర్తిని, అలనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టాన్ని తెలియజెపుతూ ఏర్పాటు చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అమర వీరుల స్మారకం, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ల చిత్రాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పార్టీ నేత సుందరయ్య పాల్గొన్న ఘట్టాలతో కూడిన పెయింటింగ్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్రకు చిహ్నంగా భాసించే కాకతీయుల కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి. రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ముఖ్యనేతలు ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారు. మహాసభల విజవంతానికి ఏర్పాటు చేయడానికి పార్టీ రాష్ట్ర నాయకులతో 25 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. అన్ని కమిటీలు చక్కని సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. మహాసభలు విజయవంతంగా నిర్వహించి.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం పెద్ద ప్రభావాన్ని చూపాలని మార్క్సిస్ట్‌పార్టీ నేతలు బావిస్తున్నారు. 

07:56 - April 17, 2018

హైదరాబాద్ : పదకొండు సంవత్సరాలు.. వందలాది మంది సాక్షుల విచారణ.. అయినా తేలని దోషులు. సుదీర్ఘకాలం సాగిన మక్కామసీదు పేలుళ్ల కేసులో ముద్దాయిలందరూ నిర్దోషులుగా బటయపడ్డారు. 10 మంది నిందితుల్లో ఏ ఒక్కరికి వ్యతిరేకంగా ఎన్‌ఐఏ సాక్ష్యాలు సేకరించలేక పోయింది. దీంతో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి స్పెషల్‌కోర్టు తీర్పు వెలువరించింది. కాగా తీర్పు చెప్పిన కొద్దిగంటల్లోనే జడ్జి.. రవీందర్‌రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కామసీదు బాంబు పేలుళ్లు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కామసీదు బాంబు పేలుళ్ల కేసు మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరిగింది. స్థానిక పోలీసుల నుంచి సీబీఐ, ఎన్‌ఐఏ లాంటిసంస్థలు దర్యాప్తు చేశాయి. విచారణలో దాదాపు 226 మంది సాక్ష్యులను విచారించారు. ఒక్క ఎన్‌ఐఏ నే 411 డాక్యూమెంట్లను కోర్టుకు సమర్పించింది. వందల మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించింది. అయినా.. నిందితుల్లో ఏ ఒక్కరూ దోషులగా నిరూపణకాలేదు.

2007 మే 18 మక్కామసీదులో పేలుళ్లు ..
2007 మే 18 తేదీన మధ్యాహ్నాం సమయంలో మసీదులో అందరూ ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో జరిగిన పేలుళ్లలో 9 మంది మృతి చెందారు. అనంతరం ఘర్షణలు చెలరేగడంతో పోలీసు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 58 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఐఎస్‌ఐ ఏజెంట్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని మొదట్లో పోలీసులు భావించారు. తొలుత హుస్సేనిఆలం పోలీస్‌స్టేషన్‌ పేలుళ్ల ఘటనపై కేసు నమోదయింది. విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేసును సీబీఐకి బదిలీ చేస్తూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కేసును సీబీఐ నుంచి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి అప్పగించింది.

10మందిని నిందితులుగా గుర్తించిన ఎన్‌ఐఏ..
విచారణలో మొత్తం పదిమందిని నిందితులుగా గుర్తిస్తూ ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నిందితులుగా ఉన్న వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన సునీల్‌ జోషి కేసు విచారణలో ఉండగానే హత్యకు గురయ్యాడు. ఇక రాజస్థాన్‌కు చెందిన ఆరెస్సెస్‌ ప్రచారక్‌ దేవేంద్రగుప్తా, మధ్యప్రదేశ్‌కు చెందిన లోకేశ్‌శర్మ, గుజరాత్‌కు చెందిన స్వామి ఆసిమానంద, మోహన్‌లాల్‌ రాతేశ్వర్‌, రాజేందర్‌ చౌదరిపై చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ ప్రచారక్‌ సందీప్‌ వి డాంగే, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రామ్‌చంద్ర కల్‌సాంగ్రా ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘ దర్యాప్తులో మొత్తం 226 మంది సాక్షులను విచారించిన ఎన్‌ఐఏ .. 411 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. వాటి ఆధారంగా నాంపల్లిలోని నాలుగో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తుది రోజు తీర్పును వెల్లడించారు.

ఎలాంటి సాక్ష్యాలు సేకరించని దర్యాప్తు సంస్థలు..
కోర్టు తీర్పుతో తమ క్లయింట్లకు న్యాయం జరిగిందని నిందితుల తరపు న్యాయవాదులు అంటున్నారు. 11 ఎళ్ల పాటు విచారణ జరిపినా ఎలాంటి సాక్ష్యాలు కూడా న్యాయ స్థానం ముందు దర్యాప్తు సంస్థలు చూపించలేక పోయారన్నారు. నిందితులకు సంభంధం లేని ఆదారాలను మాత్రమే ఎన్ఐఏ కోర్టు ముందు ఉంచిందన్నారు. మరొ వైపు మక్కామసీదు పేలుళ్లలో బాధితులు మాత్రం కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీర్పు పై ఎన్‌ఐఏ హైకోర్టుకు వెళ్లాలని భాదితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తీర్పు వెలవరించిన అనంతరం సెషన్స్‌జడ్జి రవీందర్‌రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారంది. తన రాజీనమా లేఖను మెట్రోపాటిలన్‌ కోర్టు స్పెషల్ జడ్జికి పంపిన రవీందర్‌రెడ్డి..15రోజుల తాత్కాలిక సెలవులపై వెళ్లినట్టు తెలుస్తోంది. 

07:51 - April 17, 2018

నల్లగొండ : ప్రేమిస్తున్నానన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. బాసలు చేశాడు. ఆశలు రేకెత్తించి లోబర్చుకున్నాడు. తీరా పెళ్లిమాట ఎత్తేసరికి మొహం చాటేశాడు. అంతేకాదు... ఎంచక్కా మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ఆ దివ్యాంగ ప్రేమికురాలు తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. ఆమె ధర్నాకు గ్రామస్తులు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు.

గర్భవతిని చేసి మొహం చాటేసిన మోసగాడు..
ఇదిగో ఈ ఫోటోలో కానిస్టేబుల్‌ వేశంలో ఫోజులు గొడుతున్న ఇతగాడి పేరు పగడాల రమేష్‌. నల్లగొండజిల్లా మేళ్ల దుప్పలపల్లి గ్రామం స్వగ్రామం. రమేష్‌ కొన్నాళ్లుగా అదే గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన ప్రేమలతను ప్రేమిస్తున్నాడు. మొదటి నుంచి ఇద్దరూ క్లాస్‌మేట్స్‌. ప్రేమలతకు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు. నువ్వులేకుంటే బతకలేనంటూ నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన ప్రేమలత అతడి ప్రేమను అంగీకరించింది. దివ్యాంగురాలు కావడంతో ప్రేమలతకు ఉద్యోగం వస్తుందని.. లైఫ్‌ సెటిల్‌ అయిపోతుందని రమేష్‌ భావించాడు. ప్రేమ పేరుతో ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పెళ్లిచేసుకుంటానంటూ నమ్మబలికాడు. ఆ క్రమంలోనే అతడికి పోలీస్‌ ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని ప్లాన్‌ వేశాడు. పెళ్లెప్పుడని నిలదీస్తే మొహం చాటేశాడు. అంతేకాదు.. మరో యువతిలో పెళ్లికి సిద్ధపడ్డాడు.

ప్రియుడి ఇంటిముందు టెంట్ వేసి కూర్చున్న బాధితురాలు
రమేష్‌ మరో యువతిలో పెళ్లికి సిద్ధపడ్డాడని తెలుసుకున్న ప్రేమలత అతడి ఇంటిముందు టెంట్‌ వేసుకుని కూర్చుంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఆమె దీక్షకు గ్రామస్తులు, ప్రజాసంఘాల నాయకులు అండగా నిలిచారు. రమేష్‌ కుటుంబంతో సంప్రదింపులు కూడా జరిపారు. అయినా వారు ససేమిరా అనడంతో ప్రేమలత ధర్నాకు దిగింది. తనను ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించిన మోసం చేసిన రమేష్‌తోనే వివాహం జరిపించాలని ఆమె కోరుతోంది.
బాధిరాలికి అండగా నిలిచిన గ్రామస్థులు, ప్రజా సంఘాలు
ప్రేమలతకు న్యాయం జరిగే వరకు తాము ఆమె ఆందోళనకు అండగా ఉంటామని ఐద్వా నాయకురాలు స్పష్టం చేశారు. పోలీసులు రమేష్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఎస్సై రాములు హామీనిచ్చారు. అప్పటి వరకు ఆందోళన విరమించాలని ప్రేమలతను కోరారు. ప్రేమలత మాత్రం తనకు న్యాయం చేసిన తర్వాతనే ఆందోళన విరమిస్తానని తేల్చి చెబుతోంది. 

07:44 - April 17, 2018

విజయవాడ : చిన్నారి ఆసిఫాను అత్యంత దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులో భారీ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినులు, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. గుంటూరులోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర క్రొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. అభంశుభం తెలియని చిన్నారిని అత్యంత పాశవికంగా హత్యచేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదని వారు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. గోవధపై తక్షణం స్పందించిన మోదీ ప్రభుత్వం.. అమ్మాయిలను హత్యచేస్తుంటే ఎందుకు పెదవి విప్పడంలేదని ప్రశ్నించారు. చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు.

చట్టాల్లో మార్పులు చేయాలని కోరిన విద్యార్థినులు..
చిన్నారి ఆసిఫాకు న్యాయం చేయాలని విశాఖలో విద్యార్థిలోకం గొంతెత్తింది. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ దగ్గర ఈ ర్యాలీ జరిగింది. హంతకులెవరో తెలిసినా ఇంతవరకు వారికి ఎందుకు శిక్షించడం లేదని విద్యార్థినులు ప్రశ్నించారు. 

07:41 - April 17, 2018

మేడ్చల్ : మహిళలపై దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచారం, హత్యలను నిరసిస్తూ మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో సామాజిక,ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు. అక్కడ జరిగిన క్యాండిల్‌ ర్యాలీలో విమలక్క పాల్గొన్నారు. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్లపైకి రావాలన్నారు. ఆసిఫా హంతకులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

07:38 - April 17, 2018

హైదరాబాద్ : తెలంగాణలో అనధికారికంగా మిత్రపక్షంగా కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకే దారిలో నడుస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి సహకరిస్తున్న ఓవైసీ బ్రదర్స్‌... జాతీయ రాజకీయాల్లోనూ గులాబీ పార్టీని సమర్ధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

బలపడుతున్న టీఆర్‌ఎస్‌, ఎంఐఎం బంధం
టీఆర్‌ఎస్‌, ఎంఐఎం బంధం మరింత బలపడనుంది. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం పూర్తి సహకారం అందించేందుకు రెడీ అయ్యింది. ఫెడరల్‌ ఫ్రంట్‌తో టీఆర్‌ఎస్‌ తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ సహకారం అందించేందుకు ఓవైసీ బ్రదర్స్‌ రెడీ అయ్యారు. దీంతో నిన్న మొన్నటి వరకు తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎక్కడ జరిగినా స్వతంత్రంగా అభ్యర్థులను రంగంలోకి దించిన ఎంఐఎం పార్టీ... ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. ఒంటరిగా కొన్ని స్థానాల్లో పోటీచేసినా... గెలుపోటములపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే కర్నాటక ఎన్నికల్లో తమ పార్టీ 40 స్థానాల్లో పోటీ చేస్తుందని అసదుద్దీన్‌ ఓవైసీ గతంలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుందన్న సంకేతాలను ఇచ్చారు.

దేవెగౌడతో భేటీ అయిన కేసీఆర్
కేసీఆర్‌ ఇటీవలే కర్నాటకలో పర్యటించి జేడీఎస్‌ అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఈ చర్చల అనంతరం కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్‌ తరపున ప్రచారం చేస్తానని కేసీఆర్‌ వెల్లడించారు. దీంతో తెలంగాణలో గులాబీ పార్టీకి పూర్తి స్థాయి అండదండలు అందిస్తున్న ఎంఐఎం కూడా తమ నిర్ణయాన్ని మార్చుకుంది. కర్నాటక ఎన్నికల్లో తామ పోటీచేసేది లేదని స్పష్టం చూస్తూనే.. తమ పార్టీ మద్దతు దేవెగౌడకు ఉంటుందని అసదుద్దీన్‌ ప్రకటించారు. తానుకూడా కర్నాటకలో బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించాలని ముస్లింలకు పిలుపునివ్వనున్నట్టు అసదుద్దీన్‌ వెల్లడించారు.

దేశరాజకీయాలపై ఇరుపార్టీల దృష్టి
రాజకీయంగా పాతనగరంలో పట్టున్న పార్టీగా గుర్తింపు పొందినా... పొరుగురాష్ట్రాల్లో కూడా తమ పట్టు నిరూపించుకునేందుకు ఎంఐఎం పావులు కదుపుతోంది. జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పడితే ఎంఐఎం కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని గులాబీనేతలు అంటున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం కొత్తకూటమిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

07:33 - April 17, 2018

అమరావతి : పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన వ్యయంలో కేంద్రం చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగిచ్చేలా కేంద్ర మంత్రులకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పోలవరం సహా 53 ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పోలవరంకు సంబంధించి 52 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. కుడి ప్రధాన కాలువ పనులు 89 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 58 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. లక్ష్యానికి మించి పోలవరం పనులు సాగుతుండడంతో సీఎం చంద్రబాబు అధికారులను అభినందించారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవీనేని ఉమామహేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు పలు శాఖల సెక్రటరీలు పాల్గొన్నారు. 

07:31 - April 17, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ పాలసీకి ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అమరావతిలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో... విశాఖలో 40 ఎకరాల్లో యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ సిటీకి, ఆక్వా పాలసీకి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పట్టణాల్లో సీఎంఏవై కింద నిర్మించే ఇళ్లకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

07:28 - April 17, 2018

అమరావతి : హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి ఉద్యమాలు.. ఆందోళన కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ దీక్షను చేసే అవకాశముంది. హస్తినలో చేయబోయే దీక్షే కేంద్రంపై చివరి అస్త్రంగా ఉండాలని చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈనెల 21 నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్‌ యాత్రలు నిర్వహించాలని టీడీపీ సమన్వయ కమిటీలో చంద్రబాబు నిర్ణయించారు.

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు..
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జీలతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు హాజరయ్యారు. హోదా సాధించేదిశగా కేంద్రం ఒత్తిడి ఏలా తీసుకురావాలనేదానిపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 20న చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ సామూహిక దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గ దీక్షల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు పాల్గొనాలన్నారు. 13 జిల్లాల్లో జరిగే జిల్లా స్థాయి దీక్షల్లో 13 మంది మంత్రులు పాల్గొనాలని.. మిగిలిన మంత్రులు చంద్రబాబు దీక్షలో పాల్గొనాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ఈనెల 20న జరగాల్సిన దళిత తేజం ముగింపు సభను వాయిదా వేశారు. వచ్చేనెల పదో తేదీలోగా దాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పదిహేను నుంచి 20 రోజులపాటు అన్ని గ్రామాల్లో టీడీపీ సైకిల్‌ యాత్రలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ ఏడాదంతా నేతలంతా ప్రజల మధ్యనే ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీకి చెడ్డపేరు ఎవరు తీసుకొచ్చినా సహించేది లేదన్నారు.
వైసీపీ ఓ ఫేక్‌ పార్టీ : చంద్రబాబు
టీడీపీ సమన్వయ సమావేశంలో వైసీపీపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ఓ ఫేక్‌ పార్టీ అని.. ఆ పార్టీ రాజకీయమే ఓ ఫేక్‌ అని ధ్వజమెత్తారు. బీజేపీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. అహంభావం ఎంతటివారినైనా పతనంవైపు నడిపిస్తుందని పరోక్షంగా మోదీనుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మొన్నటిదాకా బీజేపీకి తిరుగులేదని అనుకున్నారని.. ఇప్పుడు రాజకీయ మొత్తం మారిపోయిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవలేదనే ముద్రపడిందని.. పదవి వినయం పెంచాలేతప్ప అహం పెంచితే ఎవరికైనా పతనం తప్పదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ లక్ష్యమని... ఐదుకోట్ల ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలన్నారు. త్తానికి ఏప్రిల్‌ నెలంతా వివిధ రూపాల్లో కేంద్రానికి నిరసన తెలియజేయాలని చంద్రబాబు సంకల్పించారు. మరి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్‌ను తెలుగు తమ్ముళ్లు ఎంతవరకు ఫాలో అవుతారో చూడాలి.

కిడ్నాప్ అయిన ఇంజనీర్ హత్య!..

ఛత్తీస్‌‌గఢ్‌ : సుకుమా జిల్లా పైదగూడ దగ్గర రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన తెలుగు ఇంజినీర్ బాలనాగేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. బాలనాగేశ్వరరావు సహా మరో ముగ్గురు కార్మికులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు అదే రోజు కార్మికులను వదిలిపెట్టారు. ఇంజినీర్‌ను తమతో పాటే ఉంచుకున్న వారు సోమవారం అతడిని అతి దారుణంగా చంపి పడేశారు.

నయా ఉస్మానియా..

హైదరాబాద్ : మూడు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ రూపురేఖలు మా రిపోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మార్చురీని నిర్మించాలని ఆదేశించారు. సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలోని మార్చు రీని సందర్శించి అక్కడి డీఫ్రీజర్‌ బాక్స్‌ను, మార్చురీ ద్వారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త మార్చురీ పాలసీలో భాగంగా ఉస్మానియా మార్చురీ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

కథువా ఘటనపై కదిలిన బాలీవుడ్..

ముంబై : ఉన్నావ్‌, కథువా అత్యాచార బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలీవుడ్‌ కదిలింది. ముంబైలోని కార్టర్ రోడ్ లో బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో సినీ నటి, రచయిత్రి ట్వింకిల్‌ ఖన్నా, సమీరా రెడ్డి, రాజ్‌ కుమార్‌ రావ్‌, పత్ర లేఖ, సీనియర్ నటి హెలెన్‌, నిర్మాత ఏక్తా కపూర్‌, అమైరా దస్తూర్‌, కల్కీ కొచ్లిన్‌, విశాల్‌ దద్లానీ, అదితి రావ్‌ హైదరీ తదితరులు ‘న్యాయం జరగాలి’ అన్న ప్లకార్డులు పట్టుకుని పాల్గొన్నారు. వారికి అభిమానులు, యువకులు తోడయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా జస్టిస్ ఫర్ అసిఫా నినాదాలతో హోరెత్తింది.

రంజాన్ పండుగపై సమీక్ష..

హైదరాబాద్‌ : మే నెలలో ప్రారంభం కానున్న రంజాన్‌ ఉపవాసదీక్షల సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టడానికి ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఏప్రిల్‌ 20న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంతి మహ్మద్‌ మహమూద్‌ అలీ తెలిపారు. సోమవారం రంజాన్‌ ఏర్పాట్లపై సమీక్షించేందుకు నగర ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు, ఇస్లాం మత పెద్దలతో సచివాలయంలో సమావేశమయ్యారు.

23న చంద్రబాబు పోలవరం పర్యటన..

అమరావతి : పోలవరం పనులను పర్యవేక్షించడానికి సీఎం చంద్రబాబు ఈనెల 23న ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నారు. ప్రతి నెలా మూడోవారంలో స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని గతంలోనే ప్రకటించారు. ఇటీవల ప్రత్యేక హోదా డిమాండ్‌, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర కారణా నేపథ్యంలో ప్రతివారం వర్చువల్‌ రివ్యూ మినహా స్వయంగా ప్రాజెక్టును సందర్శించడం వీలుకాకపోవటంతో 23న సీఎం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. వచ్చే నెలలో 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్కేంద్రానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్నారు. 

Don't Miss