Activities calendar

18 April 2018

21:29 - April 18, 2018

విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన గన్‌మెన్లను వెనక్కి పంపారు. నెలరోజుల క్రితమే తనకు భద్రత కల్పించాలని కోరుతూ పవన్‌కల్యాణ్‌ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పవన్‌కు నలుగురు గన్‌మెన్లను కేటాయించింది. రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్‌మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు. అయితే పవన్ తన గన్‌మెన్లను వెనక్కి పంపించారు. పార్టీ వ్యవహారాలు చేరవేసేందుకు ప్రభుత్వం గన్‌మెన్లను వాడుకుంటోందని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకోసమే వారిని వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. 

21:27 - April 18, 2018

విజయవాడ : అమరావతిలో 'చంద్రన్న పెళ్లి కానుక' జీవోను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. భారంగా మారిన అమ్మాయిల పెళ్లికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం కింద వెనకబడిన వర్గాల వారికి 50వేలు, వికలాంగులకు లక్ష రూపాయలిస్తామన్నారు. పెళ్లి అయ్యాక ఇంటి సామాన్ల కోసం.. ఆడబిడ్డలకు అన్నగా యాబై వేలు ఇస్తామన్నారు చంద్రబాబు. 

21:24 - April 18, 2018
21:23 - April 18, 2018

హైదరాబాద్ : దేశంలో మతోన్మాద విధానాలు ప్రజ్వరిల్లుతున్నాయని సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తోన్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలపై కూడా కమ్యూనిస్టు అగ్ర నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కల్యాణమంటపం ప్రాంగణం వేదికగా మహాసభలను.. సీపీఎం సీనియర్‌ నాయకురాలు, సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం.. పార్టీ పతాకను ఆవిష్కరించి ప్రారంభించారు. పతాకావిష్కరణ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అమరుల స్తూపం వద్ద.. నేతలు నివాళులు అర్పించారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పరిశీలకులు మొత్తం 846 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు.

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ అధ్యక్షతన ప్రారంభమైన మహాసభల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వం నిర్ణయాలు ప్రజలను ఇక్కట్లపాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి, జీఎస్‌టీ అమలు తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏచూరి అన్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు సమాజంలో అసమానతలను పెంచుతున్నాయని, విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమన్న ఏచూరీ, పార్టీ 22వ జాతీయ మహాసభల్లో ఈ దిశగా నిర్దిష్ట రాజకీయ విధానంతో ముందుకు వస్తామన్నారు. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ఈ మహాసభలు దోహదం చేస్తాయని ఏచూరి ఆశాభావం వ్యక్తం చేశారు. మహాసభల ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌.. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విభజించు పాలించు విధానాలతో దేశ ప్రజలు నడిరోడ్డు మీదకు వచ్చారని ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యోద్యంలో ఏరకమైన పాత్ర పోషించని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శుక్తులు విశానకర విధానాలకు తెరతీశాయని మండిపడ్డారు.

బీజేపీ పాలనలో బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో స్వాగతోపన్యాసం చేస్తూ... దేశంలో మహిళలు,బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దళితులపై దాడులను ప్రస్తావించారు. ఇలాంటి దాడులు తెలుగు రాష్ట్రాల్లో తక్కువేమీ కాదన్నారు. పార్టీకి దశాబ్దాలుగా విశేష సేవలందించిన కురు వృద్ధులు తొంభై ఏడేళ్ల శంకరయ్య, తొంభై నాలుగేళ్ల వి.ఎస్‌.అచ్యుతానందన్‌లను మహాసభల సందర్భంగా సన్మానించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వారికి జ్ఞాపికలను అందించి గౌరవించారు. 

21:18 - April 18, 2018

ఎర్రజండెర్రజండెన్నీయలో.. ఎర్రెర్రనిదీజెండెన్నీయలో.. ఈ పాటవాడుతుంటే చేతిమీద రోమాలు లేస్తలేవు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి.. సంపత్ కుమార్కు అనుకూలంగ కోర్టు తీర్పువచ్చిందని పాటాకులు గాలుస్తున్నరు కాంగ్రెస్ పార్టోళ్లు జబ్బలు సరుస్తున్నరు..ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, గిరిజన ఆదివాసీలు సమరశంఖం పూరించె తందుకు తయ్యారైతున్నరు..ఆరంభం ఆర్భాటం.. అంతం.. అంటె ఏదైనా ప్రారంభించుడు.. దాన్ని పెద్దగ ప్రచారం జేస్కునుడు.. విశారధన్ మహారాజ్ మొన్న అంత ముద్దుగ జెప్పిండు.. అవ్వయ్య ఆస్తి వంచుకునెందుకు ఎగవడ్తరు ఇయ్యాళ రేపు పిల్లలు గని..పస్పు కుంకుమ గుడిలె సూస్తె తీశి బొట్టువెట్టుకుంటరు.. గీ గరం గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:37 - April 18, 2018

ఇండస్ట్రీ ఒక కుటుంబం - రామ్ చరణ్...

హైదరాబాద్ : కాస్టింగ్ టచ్ పై తెలుగు సినీ ప్రపంచంలో ప్రకంపలు సృష్టిస్తోంది. దీనిపై మెగా హీరో రామ్‌ చరణ్‌ తేజ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించారు. 'అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాప్యులర్ అవ్వాలని చూడటం చవకబారుతనంగా ఉంటుంది' అని ట్వీట్ చేశారు. 

18:58 - April 18, 2018

విజయవాడ : అన్నదాత సుఖీభవ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. సినీ నటుడు నారాయణ చిత్రీకరించిన అన్నదాత సుఖీభవ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ బోర్డు అడ్డుకోవడం నియంతృత్వ పాలన కిందకే వస్తుందని తెలిపారు. జీఎస్టీ, నోట్ల రద్దు..రైతుల సమస్యలపై చిత్రాలు తీస్తే ప్రదర్శనకు అనుమతించకపోవడం ఏమాత్రం కరెక్టు కాదని, వెంటనే సర్టిఫికేట్ ఇవ్వాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. 

పాలకుల పనితీరు సరిగ్గా లేదన్న కోదండరాం...

మహబూబ్ నగర్ : సుదీర్ఘపోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకుల పనితీరు సరిగా లేదని జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ అన్నారు. మహబూబ్‌ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన జనసమితి పార్టీ కార్యలయాన్ని ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం గందరగోళం...

ప్రకాశం : జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. జడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు, సీఈవో కైలాష్‌ మధ్య వివాదం చెలరేగింది. సీఈవో నిబంధనల ప్రకారం వేదికపై కూర్చునే అర్హత లేదని ఈదర హరిబాబు అన్నారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

మహాసభల్లో ఎమ్మెల్యే తరిగామి...

హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌లో గత నాలుగేళ్లుగా బిజెపి అధికారంలో ఉండడంతో అక్కడి పరిస్థితి మరింత దిగజారిందని సిపిఎం ఎమ్మెల్యే యూసఫ్ తరిగామి విమర్శించారు. సీపీఎం అఖిల భారత మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. 

బ్రిటన్ ప్రధానితో మోడీ భేటీ...

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోది బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో సమావేశమయ్యారు. ఈ భేటితో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడనుందని మోది అన్నారు. వాతావ‌ర‌ణ మార్పుల‌పై పోరాడ‌డం మాత్రమే కాదు.. భ‌విష్యత్తు త‌రాల కోసం త‌మ బాధ్యత‌ను గుర్తిస్తుంద‌ని మోది పేర్కొన్నారు.

కథువా ఘటనపై రాష్ట్రపతి స్పందన...

జమ్మూ కాశ్మీర్ : కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచారంపై భారతీయులందరూ సిగ్గు పడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌ కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా కోవింద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్ క్షమాపణలు...

చెన్నై : మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ క్షమాపణ చెప్పారు.

18:52 - April 18, 2018

చెన్నై : మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ క్షమాపణ చెప్పారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే చెంపను తాకానని... దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని గవర్నర్‌ కోరారు. బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ మహిళా అసిస్టెంట్‌ లెక్చరర్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా గవర్నర్‌ ఆమె చెంపను తాకారు. ఈ చర్యపై తోటి జర్నలిస్టులంతా అవాక్కయ్యారు. గవర్నర్‌ చర్యను ట్విట్టర్‌ ద్వారా ఆమె తీవ్రంగా ఖండించారు. మీరు నాకు తాతయ్యలాంటి వారే కావచ్చు కానీ...మీ చర్య నాకు తప్పుగా అనిపిస్తుందని మండిపడ్డారు.

18:49 - April 18, 2018

జమ్మూ కాశ్మీర్ : కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచారంపై భారతీయులందరూ సిగ్గు పడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌ కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా కోవింద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మన సమాజం ఎటువైపు పోతోందో ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్రపతి తెలిపారు. ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికం చూపడం అత్యంత దారుణమైన చర్యగా పేర్కొన్నారు. 

18:48 - April 18, 2018

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోది బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో సమావేశమయ్యారు. ఈ భేటితో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడనుందని మోది అన్నారు. వాతావ‌ర‌ణ మార్పుల‌పై పోరాడ‌డం మాత్రమే కాదు.. భ‌విష్యత్తు త‌రాల కోసం త‌మ బాధ్యత‌ను గుర్తిస్తుంద‌ని మోది పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేద్దామని బ్రిటిష్‌ ప్రధాని అన్నారు. బ‌స‌వేశ్వరుడి జ‌యంతి రోజున బ్రిట‌న్ లింగాయత్‌ ప్రజ‌ల‌ను క‌లుసుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని మోదీ అన్నారు. లండన్‌లో ప్రధానికి బ్రిటన్‌ విదేశాంగమంత్రి బోరిస్‌ జాన్సన్ ఘనస్వాగతం పలికారు. భారత సంతతీయులు కూడా మోదిని స్వాగతించారు. కామన్‌వెల్త్‌ హెడ్స్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ సమావేశంలో మోది పాల్గోనున్నారు.

18:44 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు హిమాచల్‌ ప్రదేశ్‌ సిపిఎం ఎమ్మెల్యే రాకేశ్‌ సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ప్రత్యేకంగా ముచ్చటించింది. దళితులు, మహిళల హక్కుల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో గత 20 ఏళ్లుగా బూర్జువా పార్టీలు కాంగ్రెస్‌, బిజెపి అధికారాన్ని పంచుకుంటున్నాయని, దీంతో ప్రజల సమస్యలు తీరడం లేదన్నారు. ప్రస్తుతం బిజెపి అధికారంలోకి రావడంతో మతతత్వం మరింత పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యంతో ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు విద్యను కాషాయికరణం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రాకేశ్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

18:42 - April 18, 2018

ప్రకాశం : జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. జడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు, సీఈవో కైలాష్‌ మధ్య వివాదం చెలరేగింది. సీఈవో నిబంధనల ప్రకారం వేదికపై కూర్చునే అర్హత లేదని ఈదర హరిబాబు అన్నారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్మన్‌కు కొంతమంది, సీఈవోకు మరికొంత మద్దతు ఇవ్వడం గందరగోళం నెలకొంది. ఎవరూ చెప్పినా వినకపోవడంతో... జడ్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. 

18:40 - April 18, 2018

ఐఐటీ చేయడం మీ జీవిత లక్ష్యమా....? 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులు ఎప్పటినుంచి ఐఐటీకి ప్రిపేర్‌ అవ్వాలి. ఏ విధగా ప్రిపేర్‌ అవ్వాలి..? ఐఐటీకి సిద్ధమయ్యే వారు..ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలి...? అనేదానిపై టెన్ టివి చర్చను చేపట్టింది. ఇందులో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నెలకొల్పబడిన VELOCITY -IIT డైరెక్టర్‌ వంశీకృష్ణ మరియు నటరాజ్‌ లు ఐఐటీ ప్రిపరేషన్‌కు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:38 - April 18, 2018

మహబూబ్ నగర్ : సుదీర్ఘపోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకుల పనితీరు సరిగా లేదని జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ అన్నారు. మహబూబ్‌ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన జనసమితి పార్టీ కార్యలయాన్ని ప్రారంభించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కారించే విషయంలో టీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుటుంన్నారని అన్నారు. ఈ నెల 29 న జనసమితి పార్టీ అవిర్భావ సభకు పాలమూరు నుంచి పెద్ద ఎత్తున జనం తరలి రావాలని కోదండరామ్‌ పిలుపునిచ్చారు.

18:36 - April 18, 2018

భద్రాచలం : కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం, స్పీకర్‌లకు తమ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. భద్రాచలంలో సీతారామ స్వామిని దర్శించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న హామీని కేసీఆర్ మరిచిపోయారని ఉత్తమ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చని తర్వాత కూడా భద్రాచలం అభివృద్ధికి నోచుకోలేదని...గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం వదలటం లేదని ఉత్తమ్ ఆరోపించారు. భద్రాచలం ప్రస్తుతం అక్రమ ఇసుక దందాకు మారు పేరుగా మారుతుందని.. ప్రజల సొమ్ముని, సహజ వనరులను అడ్డంగా దొచుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. 

16:33 - April 18, 2018

విజయవాడ : జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం..హత్య ఘటనతో యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకోవాలని, వెంటనే నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. బుధవారం ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదిర్శ ఫారూక్ చేపట్టిన 48 గంటల పాటు చేపట్టే దీక్షకు రామకృష్ణ హాజరయి మద్దతు పలికారు. 

16:18 - April 18, 2018

రాచకొండ సీపీ...ఏఆర్ ఏసీపీలపై హెచ్చార్సీలో ఫిర్యాదు...

హైదరాబాద్ : రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఏఆర్ ఏసీపీ కృష్ణయ్యలపై హెచ్ ఆర్సీకి అదనపు డీసీపీ పులిందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు విధులు కేటాయించకుండా వేధిస్తున్నారని తెలిపారు. పులిందర్ పిటిషన్ పై 26న విచారణ చేపట్టనుంది. 

బాబును కలిసిన స్వర్ణ పతక విజేత...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడిని వెయిట్ లిఫ్టర్ వెంకట రాహుల్ కలిశారు. కామన్ వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ 85 కిలోల విభాగంలో రాహుల్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అభినందించిన బాబు రాహుల్ కు సన్మాన సభ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

15:32 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరుగుతోన్న ఈ సభలకు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ హాజరయ్యారు. మహిళలపైన జరుగుతోన్న దాడులను నివారించేందుకు ఈ మహాసభల్లో తీర్మానాలు చేస్తామంటున్న బృందాకరత్‌తో టెన్ టివి మాట్లాడింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:27 - April 18, 2018

హైదరాబాద్ : దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఫార్వర్డ్‌ బ్లాక్‌ కార్యదర్శి జీఆర్‌ శివశంకర్‌ విమర్శించారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోదీ... అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఆశలు ఒమ్ము చేశారని మండిపడ్డారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రారంభోత్సవానికి హాజరైన శివశంకర్‌... మోదీ విధానాలు దేశానికి నష్టదాయకంగా పరిణమించాయని విమర్శించారు. 

15:25 - April 18, 2018

హైదరాబాద్ : దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ప్రతిఘటించేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ ఎంఎల్‌ నేత దీపాంకర్‌ భట్టాచార్య పిలుపు ఇచ్చారు. ఈ విషయంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించాలన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభోత్సవానికి హాజరైన దీపాంకర్‌.. ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడ్డారు. 

15:23 - April 18, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ పాలన దేశాన్ని వినాశనం వైపుగా తీసుకెళ్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మతోన్మాదంతో సర్వవ్యవస్థలను భ్రష్టుపట్టిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభోత్సవానికి హాజరైన సురవరం... బీజేపీ సర్కారు విధానాలపై విరుచుకుపడ్డారు. మేధావులు, శాస్త్రవేత్తలు, రచయితలు, విద్యావేత్తలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందన్నారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

15:20 - April 18, 2018

హైదరాబాద్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతోన్న కాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఇండస్ట్రీ అమ్మాయిలను ఆటవస్తువుగా చూడదని.....అలా చూస్తే తన కూతురిని ఎందుకు ఇండస్ట్రీకి తీసుకువస్తానన్నారు. మా అసోసియేషన్‌లో సభ్యులకు సమస్యలు వస్తే కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. అయితే మాలో సభ్యత్వం ఉచితంగా ఇవ్వడం కుదరదన్నారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు తాను వ్యతిరేకమన్నారు నాగబాబు. పవన్‌ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడం తప్పెలా అవుతుందన్నారు. ఎవ్వరు వేధించినా చెప్పుతో కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అంతే కాని మెగా ఫ్యామిలీని వేలెత్తి చూపిస్తే ఊరుకోమన్నారు

15:16 - April 18, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ అనుసరిస్తున్న విభజించి పాలించు విధానాలతో దేశ ప్రజలు నడిరోడ్డు మీదకు నెట్టివేయబడ్డారని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ సభలకు అధ్యక్షత వహించిన మాణిక్‌ సర్కార్‌... దేశ స్వాతంత్ర్యోద్యంలో ఏ రకమైన పాత్ర పోషించని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు వినాశకర విధానాలకు తెరతీశాయని మండిపడ్డారు. ధనికులు, పేదల మధ్య ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యానంతరం ఇలాంటి అభివృద్ధి నిరోధక శక్తులను చూడలేదని...బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై మాణిక్‌ సర్కార్‌ మండిపడ్డారు. 

15:13 - April 18, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు ప్రతిఘటించేందుకు ఐక్యపోరాటాలు అవసరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపు ఇచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల్లో సీతారాం ఏచూరి.. దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు ఆందోళన వ్యక్తం చేశారు. 

15:10 - April 18, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ పాలనలో దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో ఆహ్వానం సంఘం కన్వీనర్‌ హోదాలో రాఘువులు స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలపై విరుచుకుపడ్డారు. మతోన్మాదం చేశానికి ప్రమాదకరంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో బలహీనవర్గాలకు రక్షణ కరువైందన్నారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో స్వాగతోపన్యాసం చేస్తూ... దేశంలో మహిళలు,బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దళితులపై దాడులను ప్రస్తావించారు. ఇలాంటి దాడులు తెలుగు రాష్ట్రాల్లో తక్కువేమీ కాదన్నారు. 

జీహెచ్ఎంసీ ఉద్యొగి లంచగొండి...

హైదరాబాద్ : శేరిలింగంపల్లిలోని జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ శేరిలింగంపల్లి ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మన్‌ రావు ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో లక్ష్మణ్‌ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు సంబంధించిన వివరాలను కాసేపట్లో ఏసీబీ అధికారులు వెల్లడించనున్నారు.

కాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై నాగబాబు స్పందన...

హైదరాబాద్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతోన్న కాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఇండస్ట్రీ అమ్మాయిలను ఆటవస్తువుగా చూడదని.....అలా చూస్తే తన కూతురిని ఎందుకు ఇండస్ట్రీకి తీసుకువస్తానన్నారు. మా అసోసియేషన్‌లో సభ్యులకు సమస్యలు వస్తే కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. అ

14:38 - April 18, 2018

దేశంలో నగదు కొరత పాపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని వక్తలు అన్నారు. నగదు కొరతపై అనే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత సత్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఆర్ఎస్ఎస్ చేతుల్లో కేంద్రం కీలు బొమ్మ - ఏచూరి...

హైదరాబాద్ : దేశం ఇప్పుడు క్రాస్ రోడ్డులో ఉందని ఆర్ఎస్ఎస్ చేతుల్లో కేంద్రం కీలు బొమ్మ అని, విభజించు..పాలించు విధానాన్ని అమలు చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని, అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చారిత్రకనగరం హైదరాబాద్ లో మహాసభలు జరుగుతున్నాయని, ప్రజలు..ప్రజాస్వామ్యవాదులు సవాళ్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అమెరికాకు జూనియర్ పార్ట్ నర్ గా దేశాన్ని మార్చేశారని, నాసిక్ నుండి ముంబై వరకు ర్యాలీ నిర్వహించిన రైతులకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. 

14:32 - April 18, 2018

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు. సమస్యలు ఉంటే పోలీస్ స్టషన్ కు వెళ్లండి అని చెప్పిన పవన్ గారి మాటలను అనుసరిస్తానని అన్నారు. 

కార్పొరేట్ శక్తులకు అనుకూలం మోడీ - రాఘవులు...

హైదరాబాద్ : మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. సీపీఎం అఖిల భారత మహాసభల్లో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. సామాజిక న్యాయం కోసం ఏపీ, తెలంగాణలో పోరాటం చేస్తామని, సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్ర శాఖ మహాజన పాదయాత్ర చేసిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నేటికి స్పూర్తి అన్నారు. 

14:24 - April 18, 2018

హైదరాబాద్ : మహాసభలు పార్టీకి చాలా కీలకమైనవని త్రిపుర మాజీ సీఎం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ అన్నారు. జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. ప్రతి మూడేళ్లకు ఓసారి పార్టీ మహాసభలు నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. దేశం కీలక కూడలిలో నిలిచి ఉందన్నారు. ఆర్ ఎస్ ఎస్ నియంత్రణలో ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధ్వంసక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ప్రజా సమీకరణ ప్రధాన లక్ష్యం కావాలన్నారు. సామాన్యుడి ఆశలను నెరవేర్చే దిశగా కమ్యూనిస్టులు కృషి చేస్తారని తెలిపారు. 

14:20 - April 18, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్ కార్ఖానాలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. స్థానికంగా ఉన్న వారు భయబ్రాంతులకు గురయ్యారు. ఓ ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్ఖానాలో ఆయిల్ గోదాంలో బుధవారం మధ్యాహ్నం మంటలు అంటుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో నుండి మంటలు పైకి ఎగబాకాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమించారు. ఈ ఘటనతో స్థానికులు, ఇతరులు భయబ్రాంతులకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కార్ఖానాలో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : సికింద్రాబాద్ కార్ఖానాలో ఓ ఆయిల్ గోదాంలో మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

14:14 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ మహాసభల్లో పార్టీకి చెందిన వయోవృద్ధులకు సన్మానం చేశారు. కా.ఎన్.శంకరయ్య (97), కా.అచ్యుతానందన్ (94)లను ఘనంగా సన్మానం చేశారు. పార్టీ కురువృద్ధులకు సీతారాం ఏచూరి జ్ఞాపికలు అందజేశారు. లాల్ సలాం నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. 

 

14:05 - April 18, 2018

హైదరాబాద్ : మతత్వ శక్తుల దూకుడును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఎస్ యూసీఐసీ నేత అశిష్ భట్టాచార్య ఉందన్నారు. సీపీఎం జాతీయ మహాసభల్లో ఆయన సందేశం వినిపించారు. దేశంలో రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక పరిస్థితులు ఆందోళనకరమన్నారు. దేశంలో మనుగడే కష్టంగా ఉందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మతత్వశక్తుల దూకుడును అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో లౌకిక వాదాన్ని హరించే ప్రయత్నం జరుగుతుందన్నారు. మతతత్వ శక్తులు పేట్రేగి పోతున్నాయని చెప్పారు.

 

13:54 - April 18, 2018

హైదరాబాద్ : మతాన్ని రాజకీయ చేసే పరిస్థితులను చూస్తున్నామని ఆర్ ఎస్ ఎపీ నేత మనోజ్ భట్టాచార్య  చెప్పారు. సీపీఎం జాతీయ మహాసభల్లో ఆయన సందేశం వినిపించారు. 73 శాతం సంపదను ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో ఉందన్నారు. సామాన్యుల హక్కులనూ హరిస్తున్నారని అన్నారు. సామాన్యుడి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమబెంగాల్ లో మమతకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు. పాలస్తీనా ప్రజల హక్కులు హరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. 

13:42 - April 18, 2018
13:39 - April 18, 2018
13:32 - April 18, 2018

హైదరాబాద్ : బీజేపీ ఫాసిస్టు విధానాలకు త్రిపుర ఎన్నికలు నిదర్శనమని సీపీఐ జాతీయ మహాసభల్లో జాతీయ కార్యదర్శి సురవం సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల్లో సురవం సౌహార్ద సందేశం ఇచ్చారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో నేరాలు బాగా పెరుగుతున్నాయని అన్నారు. ప్రజలకు ఆహార భద్రత కరువైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అసహనం పెరుగుతోందన్నారు. మేధావులను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేశ్ లాంటి వారిని హత మార్చారని చెప్పారు. ప్రశ్నించే జర్నిలిస్టులనూ టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడుల చేసే వారిపై చర్యలు శూన్యమన్నారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, గుజరాత్ లాంటి చోట్ల నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. మీడియాను సంఘ్ పరివార్ తమ చేతుల్లోకి తీసుకుందన్నారు. లంచగొండితనం బాగా పెరిగిపోయిందన్నారు. నిరుద్యోగిత పెరగడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నారని అన్నారు. నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. ధరల పెరుగుదలకు తగ్గట్లుగా ప్రజల జీవన ప్రమాణం పెరగడం లేదన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని తెలిపారు. అన్ని రకాల హక్కులను కేంద్రం హస్తగతం చేసుకుంటోందన్నారు. మహిళలపై దాడుల్లో సంఘ్ పరివార్ శక్తులే ఉంటున్నాయని..ఇది చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా అక్కడక్కడా ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. 

13:13 - April 18, 2018

హైదరాబాద్ : దేశంలో గోరక్షణ పేరిట హింసకు పాల్పడుతున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న జాతీయ మహాసభల్లో ఆయన ప్రసంగించారు. మహాసభలకు హాజరైన వారికి ఆహ్వానం పలికారు. చారిత్రక నగరంలో సమావేశం అయ్యామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో కళాకారులు పని చేశారని తెలిపారు. ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కింటున్న తరుణంలో మనం ఈ జాతీయ మహాసభలు జరుపుకుంటున్నామని తెలిపారు. కల్బుర్గి, గౌరీ లంకేశ్ లాంటివారిని హత మార్చారని అన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లపై నిర్బంధం విధిస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రను ధ్యంసం చేస్తున్నారని మండిపడ్డారు. అమానవీయ ఘటనలు దేశంలో పెరిగిపోయాయని అన్నారు. కఠువా, ఉన్నావ్ తరహా ఘటనలు సిగ్గుచేటన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. అప్రజాస్వామిక విధానాలకు తెగబడుతున్నారని చెప్పారు. దేశంలో డీమానిటైజేషన్ దుష్ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయని తెలిపారు. దేశంలో కోట్లాది మంది నగదు ఆధారితంగానే లావాదేవీలు చేస్తారని చెప్పారు. 

 

తెలంగాణ సాయుధ పోరాటం నేటికీ మాకు స్ఫూర్తి : బివి.రాఘవులు

హైదరాబాద్ : మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఆ పార్టీ 22వ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసేవారందరికీ రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నట్లు తెలిపారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలూ పోరాడాల్సిన తరుణమిదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నేటి తమకు స్ఫూర్తి అన్నారు.

12:32 - April 18, 2018

హైదరాబాద్ : మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఆ పార్టీ 22వ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసేవారందరికీ రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నట్లు తెలిపారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలూ పోరాడాల్సిన తరుణమిదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నేటి తమకు స్ఫూర్తి అన్నారు. సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్ర శాఖ మహాజన పాదయాత్ర నిర్వహించిందన్నారు.

 

మహాసభల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన మాణిక్ సర్కార్

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కళ్యాణమండపంలో సభలు ప్రారంభం ప్రారంభం అయింది. త్రిపుర మాజీ  సీఎం మాణిక్ సర్కార్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అమరుల త్యాగాలను కొనియాడారు. అనంతరం సభలో అందరూ లేచి ఒక్క నిమిషం అమరవీరులకు మౌనం పాటించారు.  

12:08 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కళ్యాణమండపంలో సభలు ప్రారంభం ప్రారంభం అయింది. త్రిపుర మాజీ  సీఎం మాణిక్ సర్కార్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అమరుల త్యాగాలను కొనియాడారు. అనంతరం సభలో అందరూ లేచి ఒక్క నిమిషం అమరవీరులకు మౌనం పాటించారు. 

12:03 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభలకు పరిశీలకులుగా సీపీఎం కరువృద్ధులు మల్లుస్వరాజ్యం, రుద్రరాజు సత్యనారాయణ, శంకరయ్యలు హాజరయ్యారు. రుద్రరాజు సత్యనారాయణ అన్ని జాతీయ మహాసభలకు హాజరైన  తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం, పార్టీ వ్యవస్థపాక సభ్యులు తమిళనాడు చెందిన శంకరయ్యలు సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  22వ మహాసభలు పార్టీ పటిష్టతకు దోహదం చేస్తాయన్నారు. 
మల్లుస్వరాజ్యం 
హైదరాబాద్ లో సభలు జరగడం చాలా సంతోషంగా ఉంది. మార్క్సిస్టు సిద్ధాంతంపై అనేక దాడులు జరిగాయి. వీర తెలంగాణ సాయుధ పోరాటం వారసత్వంలో సభలు జరుగుతున్నాయి. ప్రజలను ఏకం చేసి...ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడే వామపక్షాలే.
రుద్రరాజు సత్యనారాయణ 
అన్ని ఆలిండియా మహాసభలను చూశాను. 70 సం.రాలు గా పార్టీలో ఉన్నాను. అని అన్నారు. 

 

11:45 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం అయ్యాయి. పార్టీ జెండాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాటు మల్లుస్వరాజ్యం ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు అరుణ పతాకం పాటలను ఆలపించారు. అంతకముందు మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభ సభ ఆహ్వానితులను ఆహ్వానించారు. 

సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం అయ్యాయి. పార్టీ జెండాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాటు మల్లుస్వరాజ్యం ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు అరుణ పతాకం పాటలను ఆలపించారు. అంతకముందు మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. 

11:38 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. పార్టీ జెండాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాటు మల్లుస్వరాజ్యం ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు అరుణ పతాకం పాటలను ఆలపించారు. అంతకముందు మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:33 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఐక్యతకు కృషి చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:28 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ మాట్లాడుతూ మహాసభల్లో రాజకీయ తీర్మానంతోపాటు ప్రజా సమస్యలపై చర్చిస్తారని తెలిపారు. 

 

09:50 - April 18, 2018

హైదరాబాద్ : నేటి నుంచి ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం జాతీయ మహాసభలు జరుగనున్నాయి. సీపీఎం జాతీయ మహాసభల్లో బీజేపీ మతోన్మాదంపై ప్రధాన చర్చ ఉంటుందని పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. పార్టీ మహాసభల రాజకీయ తీర్మానంలో ఇదే ప్రధాన అంశమన్నారు. రాజకీయ తీర్మానాన్ని సీపీఎం సెంట్రల్‌ కమిటీ ఆమోదించి.. పార్టీ శ్రేణులు, ప్రజల్లో చర్చకు ఉంచిందంటున్న తమ్మినేనితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. దేశానికి బీజేపీ మతోన్మాదం ప్రమాదకరంగా తయారైందని అన్నారు.

 

09:43 - April 18, 2018

హైదరాబాద్ : భద్రత పేరుతో ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందన్న అనుమానంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనకు కల్పించిన సెక్యూరిటీని సరెండర్‌ చేశారు. తనకు కేటాయించిన నలుగురు నగ్‌మెన్లను మాన్స్‌ను తిప్పిపంపారు. ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీతో పార్టీ అంతర్గత విషయాలు లీక్‌ అవుతున్నాయని పవన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

 

సీసీఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్న మల్లు స్వరాజ్యం

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో  హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మహాసభల్లో పాల్గొనేందుకు కమ్యూనిస్టు యోధులంతా నగరానికి చేరుకున్నారు. నాలుగు రోజులు పాటు జరిగే మహాసభలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. 

కొద్దిసేపట్లో సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మహాసభల్లో పాల్గొనేందుకు కమ్యూనిస్టు యోధులంతా నగరానికి చేరుకున్నారు. నాలుగు రోజులు పాటు జరిగే మహాసభలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. మతోన్మాదం, రైతాంగ సమస్యలు సహా పలు తీర్మానాలను మహాసభలు ఆమోదించనున్నారు. ఈనెల 22న సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

09:34 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మహాసభల్లో పాల్గొనేందుకు కమ్యూనిస్టు యోధులంతా నగరానికి చేరుకున్నారు. నాలుగు రోజులు పాటు జరిగే మహాసభలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. మతోన్మాదం, రైతాంగ సమస్యలు సహా పలు తీర్మానాలను మహాసభలు ఆమోదించనున్నారు. ఈనెల 22న సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:30 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడారు. సీపీఎం మహాసభలకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని చెప్పారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ప్రజా ఉద్యమాలను చేసే విధంగా సన్నద్ధం చేస్తామని తెలిపారు. మొదటి రోజు రాజకీయ తీర్మానంపై చర్చ ఉంటుందని తెలిపారు. బీజేపీని ఎలా ఓడించాలి.... ప్రాంతీయ బూర్జువా పార్టీలు..అవకాశవాదం ప్రదర్శిస్తున్నాయి..  వారితో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై చర్చ ఉంటుందన్నారు. కమ్యూనిస్టులు ప్రజల నుంచి నేర్చుకుంటారని చెప్పారు. కేంద్ర స్థాయిలో తీర్మానం ఏర్పాటు చేసి..కింది శాఖల వరకు చర్చ పెడుతుందన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని.. అప్పుడే పార్టీ సజీవంగా ఉంటుందన్నారు. మెజారిటీ నిర్ణయాన్ని ఆమోదిస్తారని తెలిపారు. కొంతమంది కావాలని సీపీఎం పార్టీపైన దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో వ్యక్తుల సమప్య కాదు.. విధానాలు ముఖ్యమన్నారు. నాయకులు ఎవరైనా విధానాలను అమలు చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ మహాసభలకు ఏర్పాట్లు బాగా చేసిందని అభినందరించారు.

 

09:19 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో  హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మహాసభల్లో పాల్గొనేందుకు కమ్యూనిస్టు యోధులంతా నగరానికి చేరుకున్నారు. నాలుగు రోజులు పాటు జరిగే మహాసభలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. మతోన్మాదం, రైతాంగ సమస్యలు సహా పలు తీర్మానాలను మహాసభలు ఆమోదించనున్నారు. ఈనెల 22న సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:32 - April 18, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియం సాయంత్రమైందంటే చాలు జనసంద్రంగా మారుతోంది. హైదరాబాద్‌ ఫెస్ట్‌తో కిటకిటలాడుతోంది. ఐదవ రోజూ హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఉత్సాహంగా సాగింది. సాహిత్యం, విజ్ఞానం, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను కట్టిపడేసింది. హైదరాబాద్‌ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ స్టాల్స్‌కూ.. కమర్షియల్‌, ప్రాపర్టీ స్టాల్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. 

చిన్నారుల ఆటపాటలు..... అందరినీ ఆలోచింపచేసే విజ్ఞాన విశేషాలు... వినోదభరిత కార్యక్రమాలు..  మనసును ఊర్రూతలూగించే ప్రసంగాలు.. ఆహుతుల మనసులు ఆహ్లాదపరిచే సాంస్కృతిక సంబరాలు.. అంతేకాదండోయ్‌... ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకే దగ్గర కొలువుదీరిన ప్రాంతం.. కమర్షియల్‌, ప్రాపర్టీలకు సంబంధించిన స్టాల్స్‌ కలగలిసిన సెంటర్‌...  ఇవన్నీ సంయుక్తంగా ఒకేదగ్గర ఏర్పాటు చేసిన వేదికే హైదరాబాద్‌ ఫెస్ట్‌... 

హైదరాబాద్‌ ఐదవరోజూ జోష్‌గా సాగింది. ఎన్టీఆర్‌ స్టేడియం జనసంద్రంగా మారింది. రోజురోజుకు సందర్శకుల తాకిడి పెరగడంతో... హైదరాబాద్‌ సందడిగా మారింది. హైదరాబాద్‌ ఫెస్ట్‌లో మంగళవారం నిర్వహించిన పలు కార్యక్రమాలు నగరవాసులను ఎంతగానో అలరించాయి. సృజన స్వరం పేరుతో నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలు అందరిలో జిజ్ఞాన కలిగిస్తోంది. ప్రతిరోజూ సాహిత్య సమాలోచనలు, చర్చగోష్టులు నిర్వహిస్తున్నారు. నూతన రచయిత పుస్తకాలను ఆవిష్కరిస్తూ అందరిలో స్పూర్తి నింపుతున్నారు.

ఇక సబల పేరుతో ఏర్పాటు చేసిన మహిళా వేదికలో పలు అంశాలపై రోజూ చర్చ జరుగుతోంది. ఈ చర్చా కార్యక్రమాలకు మహిళలతోపాటు పురుషులూ, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు హాజరవుతున్నారు. మహిళా సమస్యలపై తమ అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్నారు. మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులు, ప్రసారమాధ్యమాల్లో మహిళలను అశ్లీలంగా చూపిస్తున్న తీరును ఎదుర్కొనే తీరుపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

పైడిరాజ్‌ థియేటర్‌ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ను ప్రతిరోజూ ప్రదర్శిస్తున్నారు. యువ థియేటర్లు, ఆర్టిస్టులు కలిసి చేసిన ఎన్నో షార్ట్‌ఫిల్మ్‌లు ఈ వేదికపై ప్రదర్శిస్తున్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు తీయడమే కాదు.. దాని ద్వారా సమాజానికి యువ డైరెక్టర్లు ఏదో ఒక మెసేజ్‌ ఇస్తున్నారు. పైడిరాజ్‌ థియేటర్‌ పక్కనే ఫోటోగ్రఫీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్‌గ్యాలరీ విశేషంగా ఆకట్టుకుంటోంది. యువ ఆర్టిస్టులు వేసిన చిత్రాలు వీక్షులను ఆలోచించ చేస్తున్నాయి.

సాహిత్యం, విజ్ఞానం, వినోదంతోపాటు నగర వాసుల అభిరుచికి తగ్గట్టుగా వాణిజ్యస్టాల్స్‌ను హైదరాబాద్‌ ఫెస్ట్‌లో ఏర్పాటు చేశారు. వంటింట్లో అవసరమయ్యే వస్తువులు మొదలుకొని...ఇళ్ల స్థలాల వరకు ప్రతీ అంశంపైనా కమర్షియల్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. మానవ జీవితానికి అవసరమైన వస్త్రాలు, ఆహారపదార్థాలు ఈ స్టాల్స్‌లో సరసమైన ధరలకు లభిస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడేలా పిండివంటలు, ప్రెష్‌జ్యూస్‌లు హైదరాబాద్‌ ఫెస్ట్‌లో లభిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తోంది సుద్దాల హన్మంతు కళావేదిక. ఈ వేదికపై ప్రతిరోజూ కళాకారులు ఆటపాటలతో అలరిస్తున్నారు. క్లాసికల్‌, వెస్ట్రన్‌,ఫోక్‌ డాన్సులు, ఏకపాత్రాభినయాలు, గ్రూప్‌ సాంగ్స్‌, వీధినాటికలు... ఇలా కళారంగంలోని ఉన్న వివిధ రకాల ఆటపాటలతో సుద్దాల హన్మంతు కళావేదిక ఆహుతలను ఆలరింప చేస్తోంది. మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలకు విశిష్ట అతిథులుగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌, ప్రముఖ గాయకుడు గద్దర్‌ హాజరయ్యారు.

కేరళ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు హైదరాబాద్‌ ఫెస్ట్‌ను సందర్శించారు.  ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌తోపాటు కేరళ అభివృద్ది నమూనాను సందర్శించారు. అన్ని రంగాలకు ఒకేవేదికపై తీసుకొచ్చిన స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ కృషికి ప్రముఖుల నుంచి ప్రశంసల లభిస్తున్నాయి. 

08:10 - April 18, 2018

విజయవాడ : జమ్మూకశ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫా పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కథువా హంతకులను కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.   
విజయవాడలో
ఆసిఫాపై జరిగిన ఆత్యాచార ఘటనను నిరసిస్తూ విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుల దిష్టిబొమ్మలకు బాణాలు  ఎక్కుబెట్టారు. దిష్టిబొమ్మ దగ్ధం చేసి కొవ్వొత్తుల ప్రదర్శనతో  అసిఫాకు నివాళి అర్పించారు.
కడపలో 
కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథువా ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైదని విమర్శించారు. బేటీ బచావో అంటే ఇదేనా అని ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు ఊడ్చడం కాదని బీజేపీలోని కేంద్ర మంత్రులు ఏంపీలు కూడా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. 
రాజమండ్రిలో
రాజమండ్రిలోనూ ఆసిఫా హంతకులని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేస్తూ మహిళలు కదం తొక్కరు. ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించలేని మోదీ ప్రభుత్వం తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ నేతలూ పాల్గొన్నారు. 
అనంతపురంలో 
చిన్నపిల్లల పై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ అనంతపురంలో ఎస్ కేయూ విద్యార్థులు నిరసన చేపట్టారు. అసిఫా హంతకులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిందితులని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  
మేడ్చల్ లో
మేడ్చల్ జిల్లా జర్నలిస్టు సంఘాల  ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్ ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ అసమర్థత వల్లే ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని జర్నలిస్టులు విమర్శించారు. 
తూర్పుగోదావరిలో 
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోనూ..  అసిఫా హత్యోదంతాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి దుశ్చర్యలకు ఇంకెవ్వరూ పాల్పడకుండా హంతకులను ఉరితీయాలని డిమాండ్‌ చేశారు.  

 

07:59 - April 18, 2018

విశాఖ : సింహాచలేశుని చందనోత్సవం నేటి నుంచి ప్రారంభం కానుంది. లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 
సింహాచల శ్రీ నృసింహుడి చందనోత్సవ సంరంభం 
సింహాచల శ్రీ నృసింహుడి చందనోత్సవ సంరంభం మొదలైంది. బుధవారం తెల్లవారు జామునుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో సింహాచలం తరలి వస్తున్నారు. సింహాచలం అప్పన్న ఆలయంలో ఏడాదికి 12 గంటలు మాత్రమే స్వామి నిజరూపంలో దర్శనమిస్తారు. మిగిలిన రోజుల్లో విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచుతారు. అక్షయ తృతీయ రోజున మాత్రమే లభించే నిజరూప దర్శనం కోసం భక్తులు అప్పన్న సన్నిధికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు 
గంగాజలాలతో అభిషేకం
చందనోత్సవం రోజున స్వామి వారి మూల విరాట్టును గంగాజలాలతో అభిషేకిస్తారు. దీనికోసం 108 వెండి కలశాలను వినియోగిస్తారు. ఆస్థానమంటపంలో వీటిని ఉంచి.. ప్రత్యేక పూజలు చేశాక.. నిజరూపంలోని శ్వేత వరాహ స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. భక్తులకు నిజరూప దర్శనానంతరం.. తిరిగి స్వామి వారి మూలవిరాట్టును చందనంతో అలంకరిస్తారు. 
ఎలాంటి ఇబ్బందులూ రాకుండా.. ఏర్పాట్లు 
చందనోత్సవానికి తరలి వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా.. అప్పన్న ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తోపులాటలు జరగకుండా బారికేడ్లు నిర్మించారు. వేసవి కావడంతో.. భక్తుల దాహార్తిని తీర్చేందుకూ ఏర్పాట్లు చేశారు. 

 

07:52 - April 18, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు వ్యవహారం అధికార టీఆర్‌ఎస్‌లో కాక రేపుతోంది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించడంపై టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై విపక్షాల ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలన్న డైలమాలో టీఆర్‌ఎస్‌ పడింది.
ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాలను రద్దు చేసిన టీసర్కార్ 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. సభలో రభస సృష్టించారన్న కారణంగా ఇద్దరు కాంగ్రెస్‌ నేతల సభ్యత్వాన్ని టీఆర్‌ఎస్‌ రద్దు చేసింది. మిగతా సభ్యులందరినీ బడ్జెట్‌ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేసింది. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి గాయమైందంటూ.... కాంగ్రెస్‌ ఆందోళనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నిబంధనల ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇద్దరు సభ్యుల సభ్యత్వాలను రద్దు చేసి తన పంతం నెగ్గించుకుంది. 
అధికార పార్టీలో తర్జన భర్జనలు 
కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. టీఆర్‌ఎస్‌ తీరుపై న్యాయపోరాటాన్ని ఎంచుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు... ఈ అంశంతో టీఆర్‌ఎస్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై కోర్టు తలుపులు తట్టి అధికార పార్టీ నిర్ణయం తప్పని తేల్చింది. ఇప్పుడు ఇదే అంశం గులాబీదళంలో హాట్‌టాపిక్‌గా మారింది. కోర్టు ఆదేశాలపై ఎలా వ్యవహరించాలన్నదానిపై అధికార పార్టీలో తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సమయంలోనే పార్టీలో భిన్న వాదనలు వినిపించినా కోర్టు ఆదేశాలతో అధికారపార్టీ మరోసారి ఆత్మరక్షణలో పడ్డట్టు అయ్యింది. ప్రభుత్వపరంగా ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది.
కోర్టు తీర్పుతో టీఆర్ ఎస్ కు మరిన్ని చిక్కులు 
కోర్టు తీర్పుపై మరోసారి అప్పీల్‌కు వెళ్లే అంశాన్ని అధికార పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే కోర్టు ఆదేశాలపై అధికార పార్టీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించలేక.... కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టలేక సతమతమవుతున్నారు. ఈ కేసు విచారణ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా చేయడం అధికారపార్టీని ఇరుకున పడేలా చేసింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో మరిన్ని చిక్కులు వచ్చిపడ్డట్టు అయ్యింది. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి, విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపై గులాబీపార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

07:43 - April 18, 2018

హైదరాబాద్ : రైతు బంధుపథకం ద్వారా రైతులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ వచ్చేనెల 10న ప్రారంభించనున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. చెక్కులతోపాటు పాస్‌పుస్తకాలను అదే రోజు ప్రారంభించనున్నారు. రోజుకొక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో చెక్కుల పంపిణీ, పాస్‌పుస్తకాల పంపిణీ జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
చెక్కులతోపాటు అదేరోజు పాస్‌పుస్తకాల పంపిణీ 
రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అందించే ఆర్థికసాయం చెక్కుల పంపిణీకి ముహూర్తం ఖరారు అయ్యింది. వచ్చేనెల 10వ తేదీని ఇందుకు ఖరారు చేసింది. చెక్కులతోపాటు రైతులకు అదేరోజు పాస్‌పుస్తకాలనూ పంపిణీ చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అధికారులు రోజుకొక గ్రామాన్ని ఎంచుకుని చెక్కులతోపాటు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాలని ఆదేశించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల పాస్‌పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యాచరణను రూపొందించేందుకు ఈనెల 21న కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు కేసీఆర్‌ ప్రకటించారు.  ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. ఈమేరకు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీపై కార్యాచరణను ఖరారు చేశారు. 
రాష్ట్ర వ్యాప్తంగా 2,761 బృందాలు
చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,761 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందాలు రోజుకు 1546 గ్రామాసల్లో చెక్కులు, పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తాయి. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి పోచారం రెవెన్యూ, వ్యవసాయ, భూపరిపాలనశాఖ అధికారులతో కూడిన బృందం ప్రతీరోజూ నాలుగైదు జిల్లాల్లో పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యేవేక్షించనున్నారు. పంపిణీ కార్యక్రమం ఎక్కడ ఎప్పుడు నిర్వహించాలో కలెక్టర్లు నిర్ణయిస్తారు.  300 పాస్‌పుస్తకాలకు ఒక బృందాన్ని నియమించి ఒకేరోజు వారందరికీ పంపిణీ చేపడుతారు. రైతులకు పంపిణీ చేయగానే వారి నుంచి సంతకాలు తీసుకుంటారు. చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీలో ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 
ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాలు 
పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన కార్యాచరణను వైద్య, ఆరోగ్యశాఖ రూపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా అధికారయంత్రంగా విజయంతం చేయాలని ఆదేశించారు.

 

07:39 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు.. నేటి నుంచి హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈనెల 22 వరకూ జరిగే సభల్లో దాదాపు పాతిక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటి ఆతిథ్యమిస్తోన్న ఈ మహాసభల నిర్వహణ కోసం.. పార్టీ వాలంటీర్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రతినిధుల సభ జరిగే ఆర్టీసీ కల్యాణ మండపాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం అరుణపతాక ఆవిష్కరణతో మహాసభలు ప్రారంభంకానున్నాయి. 
సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సిద్ధం...
సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సిద్ధం...అరుణ వర్ణాన్ని సంతరించుకున్న  హైదరాబాద్‌ వీధులు..సీపీఎం 22వ జాతీయ మహాసభలు బుధవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. స్థానిక ఆర్టీసీ కల్యాణ మంటపంలో.. ఉదయం పది గంటలకు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం.. సభల ప్రారంభ సూచికగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ప్రారంభ సభలో.. వివిధ వామపక్ష పార్టీల అగ్రనేతలు సౌహర్ద్ర సందేశం వినిపిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే మహాసభల్లో మొత్తం 25 అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మహాసభల ఎజెండాపై.. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ.. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల సభ్యులు సమావేశమై చర్చించారు. 
846 ప్రతినిధులు
మహాసభల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు 764 మంది, 74 మంది పరిశీలకులు, ఎనిమిది మంది సీనియర్‌ నాయకులు ఇప్పటికే హైదరాబాద్‌ తరలివచ్చారు. పదహారు సంవత్సరాల తర్వాత పార్టీ జాతీయ మహాసభలకు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. దీంతో సీపీఎం వాలంటీర్లు  నగరమంతటా అరుణ పతాకాలు, తోరణాలు, వాల్‌రైటింగ్స్‌తో నింపేశారు. ప్రధాన చౌరస్తాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మహాసభల విజయవంతానికి మొత్తం 21 పార్టీ కమిటీలు పనిచేస్తున్నాయి. 
విస్తృత ఏర్పాట్లు 
అటు.. సభా ప్రాంగణం ఆర్టీసీ కల్యాణ మంటపం వద్ద కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ద్వారాన్ని ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. శ్రామిక వర్గ స్పూర్తిని, అలనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టాన్ని చాటేలా ఏర్పాటు చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అమర వీరుల స్మారకం, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ల చిత్రాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పార్టీ నేత సుందరయ్య పాల్గొన్న ఘట్టాలతో కూడిన పెయింటింగ్‌లు ఏర్పాటు చేశారు.  తెలంగాణ చరిత్రకు చిహ్నంగా భాసించే కాకతీయుల కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈనెల 22న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో మహాసభలు ముగుస్తాయి. 

 

రంగారెడ్డి జిల్లా టాటానగర్ అగ్నిప్రమాదం

రంగారెడ్డి : టాటానగర్ అగ్నిప్రమాదం జరిగింది. రెండు ప్లాస్టిక్ గోదాముల్లో మండలు ఎగిసిపడుతున్నాయి. ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. 

నేటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలు

హైదరాబాద్ : నేటి నుంచి 22వరకు సీపీఎం జాతీయ మహాసభలు జరుగనున్నాయి. ఆర్టీసీ కళ్యాణ మండపంలో మహాసభలు జరుగనున్నాయి. నేడు పార్టీ పతాకాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభ సభ నిర్వహించనున్నారు. మహాసభలకు 845 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 25 ముఖ్యమైన తీర్మానాలపై మహాసభల్లో చర్చ జరుగనుంది. 

నేడు విశాఖ జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

విశాఖ : నేడు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కార్మికులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు.

నేడు స్టడీ ఇండియా పోర్టల్ ఆవిష్కరణ

ఢిల్లీ : నేడు స్టడీ ఇండియా పోర్టల్ ఆవిష్కరణ జరుగనుంది. పోర్టల్ ను కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఆవిష్కరించనున్నారు.  

Don't Miss