Activities calendar

19 April 2018

19:25 - April 19, 2018

తెలంగాణ రాష్ట్రంల కేసీఆర్ సారు పార్టీ దుక్నం బందైతదని చెప్పెతందుకు పెద్దగ కష్టపవడవల్సిన పనేంలేదు..చెర్వుమీద కొంగల్గినట్టే ఉన్నదేమయ్యో చంద్రాలు ముచ్చట గూడ..కేసీఆర్ కుటుంబాన్ని.. ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి గట్టేశి రాళ్ల తోని గొట్టి సంపితె గూడ తప్పులేదు అంటున్నడు కాంగ్రెస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డి.. ఒకప్పుడు సర్కారు దావఖానకు వోవాల్నంటే జనం భయపడ్తుండెనట.. ఆశావర్కర్లు ఆంధ్ర రాష్ట్రంల పిట్టెలొర్రినట్టు ఒర్రుతున్నరు మమ్ములను ఆదుకోండ్రి సారూ..చంద్రబాబునాయుడు ఒకరోజు దీక్ష జేస్తాని అంటుంటే అది దొంగ దీక్ష అని జగన్ మోహన్ రెడ్డిగారు అంటున్నడు.. అయ్యో పాపం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల సారు కింద వడ్డడు.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా ఈరన్న మళ్లొక కుందనం మోపు జేశిండు ఇయ్యాళ.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:23 - April 19, 2018

ఇంటర్ నెట్ టెక్నాలజీ..కొత్తగా కనుగొనలేదా ? ఇవన్నీ మహాభారతం నుండే ఉన్నాయా ? ఈ కాలంలోనే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందా ? త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ వ్యాఖ్యలతో చర్చ పరిధిని పెంచుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై శాస్త్రవేత్తలు, హేతువాదులు మండిపడుతున్నారు. మూఢనమ్మకాలను అభూతకల్పన పాలకులే జనంలోకి తీసుకెళ్లడం ఏంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో గిరిధర్ (ప్రజ్ఞాభారతి కార్యదర్శి), రమేష్ (జేవీవీ జాతీయ ఉపాధ్యక్షులు), బాబు గోగినేని (హేతువాది) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కొత్తపేట పోలీసుల పైశాచికం...

గుంటూరు : కొత్తపేట పోలీసుల పైశాచికం బయటపడింది. సెల్ ఫోన్ దొంగిలించాడంటూ చిరు వ్యాపారి షేక్ అబ్బూర్ ను పోలీసులు చితకబాదారు. తీవ్రగాయాలతో అబ్బూర నడవలేని స్థితిలో ఉన్నాడు. దీనిపై ముస్లిం సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 

18:48 - April 19, 2018

అనంతపురం : ఏటీఎంలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. అనంతపురం మడకశిర ప్రాంతంలోని ఓ బ్యాంకు ఏటిఎంలో డబ్బులు రావడం లేదంటూ ప్రత్యక్షంగా మీడియాకు చూపించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న నోట్ల సమస్యలకు ప్రధాన మంత్రి కారణమని, క్యాష్ లెస్ సొసైటీకి ఛైర్మన్ గా ఉంటూ తన ఉత్తరం వల్లే నోట్ల రద్దు జరిగిందని..ఇది తన ఘనతే అని చెప్పుకున్న బాబు ధర్మ దీక్ష చేయడానికి సిద్ధమవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన ముద్దాయి బాబే అని, ఈనెల 21 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటీఎంల వద్ద ఆందోళనలు చేస్తామన్నారు. 

18:25 - April 19, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తిట్టాలని తానే సూచించానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు తాను శ్రీరెడ్డికి రూ. 5 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చానని, శ్రీరెడ్డి ఉద్యమం పెద్ద ఎత్తున అందరిలో వెళ్లాలనే చేశానన్నారు. కానీ శ్రీరెడ్డిని ప్రభావితం చేసినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు వర్మ పేర్కొన్నారు. ఈ విషయంపై కమెడియన్ పృథ్వి, క్యారెక్టర్ నటుడు శివ బాలాజీలతో టెన్ టివి మాట్లాడింది.

తెలుగు సినిమాను ఏం చేద్దామని అనుకున్నారు ? మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలను చూసి తాము ఇండ్రస్టీకి రావడం జరిగిందని సినీ నటుడు పృథ్వీ పేర్కొన్నారు. మంచి పనులు చేయాలని రాజకీయాల్లో వచ్చారని తెలిపారు. ఏదో ఒక ఫొటోలు ఉన్నాయని..ఏదో చెబుతూ వస్తున్నారని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతారా ? అని ప్రశ్నించారు. ఇది కరెక్టు కాదు ? అని దీనికి ప్రజలు మాత్రమే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. అమ్మాయి వెనుక ఉండి ఒక డిఫరెంటింగ్ ఇలా వ్యవహరిస్తారా అంటూ శివబాలాజీ తీవ్రంగా విమర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:33 - April 19, 2018

హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు మరింత పెరిగిపోయాయని సీపీఎం సీనియర్ మహిళా నేత సుభాషిణి ఆలీ పేర్కొన్నారు. సీపీఎం 22వ అఖిల భారత మహాసభల్లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా టెన్ టివి ముచ్చటించింది. కథువా, ఉన్నావ్ ఘటనల్లో బీజేపీ హస్తం ఉండడం శోచనీయమని, మహాసభల్లో ప్రత్యేక తీర్మానం తీసుకొస్తామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

మంచిర్యాలలో 42 డిగ్రీలు..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతున్నది. మంచిర్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 

పంజాగుట్ట పీఎస్ ను సందర్శించిన పినరయి...

హైదరాబాద్ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థను పరిశీలించారు. 

16:59 - April 19, 2018
16:51 - April 19, 2018

ఎన్జీవోలు, మహిళా సంఘాలతో కమిటీ : అరవింద్

హైదరాబాద్: లైంగిక వేధింపులపై కమిటీ వేయాలని నిర్ణయించామని, కమిటీలో 50శాతం ఎన్జీవోలు, 50శాతం సినీ పరిశ్రమ వారుంటారని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే రహస్యంగా విచారణ జరిపి బాధ్యులు అని తేలితే ఆయా సంస్థల నుంచి తొలగిస్తామని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. శ్రీరెడ్డి వివాదంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు బాధాకరమని చెప్పారు. శ్రీరెడ్డి చెప్పిన అంశాలపై పాజిటివ్‌గా ఉన్నామని వెల్లడించారు. పరిశ్రమలో రెండు రకాల పరిష్కారాలను ఆలోచించామన్నారు.

16:49 - April 19, 2018

హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమ ఉడుకుతోంది. కాచింగ్ కాస్ట్ పై శ్రీరెడ్డి లేవనెత్తిన వివాదం మరింత ముదురుతోంది. సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ మాట్లాడాలని తానే పేర్కొన్నట్లు వర్మ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీపై పలు విమర్శలు వస్తుండడంతో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు స్పందిస్తున్నారు. మొన్న నాగబాబు స్పందించగా గురువారం నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. సినీ ఇండస్ట్రీ అంటే తమకు ఎంతో గౌరవమని, పరిశ్రమ అనేది తమకు తల్లిలాంటిదన్నారు. పరిశ్రమలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయని, మూడు తరాలుగా సినీ ఇండస్ట్రీనే నమ్ముకున్నామని పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీలో తాను సీనియర్ మెంబర్ అని, కొంతమంది మీడియాలో ఎంతమంది మాట్లాడినా నిగ్రహంగా ఉంటూ వచ్చానన్నారు. కానీ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై స్పందించాల్సి వస్తోందని, తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లైంగిక వేధింపులపై ఎన్జీవోలు, మహిళలతో కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వేధింపులపై ఫిర్యాదులు వస్తే ఈ కమిటీ విచారించి చర్యలు తీసుకుంటుందన్నారు.

ఇక తన టార్గెట్ రామ్ గోపాల్ వర్మ అని, ఇతను ఎంత నికృష్టుడో చెప్పడానికే తాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారుర. సినీ పరిశ్రమలో పెరిగి..గొప్ప సినిమా తీసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి ముంబాయిలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడన్నారు. రాంగోపాల్ వర్మకు సంబంధించిన ఒక వీడియో చూడడం జరిగిందని, వీడియో చూడటానికంటే ముందు తాను తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండే హీరో..ఇద్దరు దర్శకులతో మాట్లాడినట్లు తెలిపారు. పవన్ ను ఉద్ధేశిస్తూ ఒక అసభ్యకరమైన మాట మాట్లాడించే విధంగా చేయడం...పవన్ ను టార్గెట్ చేయాలని వర్మ పేర్కొనడం దుర్మార్గమన్నారు. నికృష్టుడు అయిన వర్మ శ్రీరెడ్డి కి రూ. 5 కోట్లు ఇప్పించాలని ప్రయత్నించినట్లు, సురేష్ ఒప్పుకోలేదని పేర్కొనడం దారుణమన్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు, రూ. 5కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడని తెలిపారు. వర్మ చేస్తున్న కుట్రలో ఎవరు వెనుక ఎవరున్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. వర్మ వెనుక ఏ పార్టీ ఉందో తెలిస్తే వారినే ప్రశ్నించే వాడినని పేర్కొన్నారు. వర్మలాంటి కుట్రలు పీఆర్పీలోనే తమకు ఎదురయ్యాయని, ఇలాంటి కుట్రల పట్ల పవన్ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

16:46 - April 19, 2018

తమ కుటుంబం తమ సౌలభ్యం అనుకునేవారు ఎంతోమంది. తమతోపాటు సమాజం కూడా బాగుండాలనుకునేవారు కొంతమంది. కానీ సమాజంలో కోసం, మాతృదేశానికి సేవల చేయాలని, కష్టాలలో వున్న వారికి అండగా నిలబడాలని అనుకునేవారు మాత్రం అతి కొద్దిమందే వుంటారు. ఈ క్రమంలో వారి ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడవచ్చు. అయినా లెక్కచేయక..బెదిరింపులకు బెదరక..నమ్మిన ఆశయం కోసం నిలబడే ధీరలు అతి కొద్ది మంది మాత్రమే వుంటారు. అటువంటి ధీర దీపికా సింగ్ రజావత్.

సమాజాన్ని కదిలించిన అసిఫా ఘటన..
కొన్ని ఘటనలో సమాజాన్ని కదిలిస్తాయి. మరికొన్ని సంఘటనలో సమాజానికి చైతన్యాన్ని కలిగిస్తాయి. అటువంటి ఘటన నిర్భయ ఘటన..ప్రస్తుం ఇప్పుడు చిన్నారి అసిఫా ఘటన కూడా ఇంచుమించు అటువంటిదే. ముక్కుపచ్చలారని అసిఫాను అత్యంత పాశవికంగా చంపివేసిన ఘటనతో యావత్ భారతం మరోసారి ఉలిక్కిపడింది. దేశం మొత్తం అసిఫా బానో కోసం విలపిస్తోంది. ఆ పసికందు లేతదేహంపై కామ పిశాచాలు, కక్షల దెయ్యాలు.. దేవుడి గుడి సాక్షిగా చేసిన గాయాలు మనసున్న ప్రతి మనిషినీ కదిలిస్తున్నాయి. ఎనిమిదేళ్ల అసిఫాపై హిందువుల గుడిలో వారం పాటు సాగిన సామూహిక అత్యాచారం, మాటల్లో చెప్పలేని విధంగా జరిగిన ఘటనకు మాటలు చాలవు. డ్రగ్స్ ఇచ్చి వారంరోజులపాటు జరిగిన ఆ హింసాకాండకు చిన్నారి ఛిద్రమైపోయింది. ఆ తల్లి గుండె పగిలిపోయాయి. తండ్రి ఆవేదనకు అంతులేకుండా పోయింది. దీనికంతటికీ కారణం మనోన్మాదం అంటే అంతకంటే సిగ్గుపడే విషయం మరొకటి వుంటుందా? ముస్లింలపై కక్ష సాధించేందుకు ఓ చిన్నారిని ఛిద్రం చేసిన పశుసంస్కృతికి నిదర్శనంగా కనిపిస్తోంది. కానీ బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు అండగా నిలబడింది ఓ మానవ మాతృమూర్తి..

యావత్‌దేశాన్ని కదిలించింది ఘటన కథువా ఘటన..
యావత్‌దేశాన్ని కదిలించింది కథువా ఘటన. నిర్భయ ఘటనను మరోసారి గుర్తు చేసింది. అసీఫా ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ల కుటుంబంతోపాటు పోరాడుతోంది మహిళా న్యాయవాది దీపికా సింగ్‌ రజావత్‌. ఈ కేసును వదిలేయమని జమ్మూ కశ్మీర్‌ బార్‌ అసోసియేషన్‌ నుంచి బెదిరింపులూ, అవమానాలు ఎదురైనా ఆమె ఏ మాత్రం జంకకుండా నిందితులకి శిక్ష పడే వరకూ పోరాటం చేయాలనే నిర్ణయించుకుంది. ఓ సాధారణ న్యాయవాది అయిన దీపిక ఈ సంచలన కేసును తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా...జమ్మూ కశ్మీర్‌కి చెందిన దీపిక న్యాయవాది మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా. సైన్యంలో పనిచేసిన భర్త ప్రస్తుతం బెహ్రెయిన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను బెహ్రెయిన్‌ వచ్చేయమని అడిగినా మాతృదేశానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఐదేళ్ల కూతురితో కలిసి జమ్మూకశ్మీర్‌లోనే వుండిపోయింది దీపిక.

స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన దీపికా..అసిఫా తల్లిదండ్రులకు అండగా నిలిచిన దీపిక..
దీపిక మహిళలూ, చిన్నారులకు పలు రకాలుగా సాయపడటానికి ఓ స్వచ్ఛంద సంస్థనూ ప్రారంభించింది. దీంతో ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా పలు రకాలుగా సాయమందిస్తుంటుంది. దీపికకు అసీఫా గురించి తెలియగానే ఆ పాప తండ్రిని సంప్రదించింది. ఆ కేసును తానే వాదిస్తానని చెప్పింది.

దీపికాపై దాడులు చేసిన బార్ అసోషియేషన్..
ఎప్పటికప్పుడు పోలీసుల చర్యలూ.. క్రైంబ్రాంచీ వారి నేర పరిశోధన గురించి తెలుసుకుంటూనే ఉండేది. అయితే ‘ఒకానొక దశలో పాప శవం మీద ఉన్న దుస్తుల్ని కొందరు తెలియకుండా తీసి ఉతికి పెట్టారు. ఆ సమయంలో నేరస్తులు దొరకరేమోనని చాలా ఆందోళన పడింది. కానీ కాస్త ఆలస్యమైనా... నిజం నిలకడ మీద తెలిసింది’ అంటుంది దీపిక. ఈ కేసు విషయంలో దీపిక మీద బార్‌ అసోషియేషన్‌లోని న్యాయవాదులు దాడులు చేయడమే కాదు.. కేసు ఉపసంహరించుకోకపోతే ప్రాణం తీస్తామని బెదిరించారు. అయినా ఆమె పట్టించుకోలేదు. పోలీసుల రక్షణ కోరింది. వారి సహకారంతోనే ప్రస్తుతం ముందడుగు వేస్తోంది.

నిస్సహాయులకు అండగా నిలిస్తున్న న్యాయవాది దీపిక..
అయితే ఆమె మాత్రం అసీఫా తల్లిదండ్రులకోసం ఎంతో బాధపడుతోంది. కూతురి మరణం జీర్ణించుకోలేక.. రాజకీయ నాయకుల బెదిరింపులు తట్టుకోలేక అనుక్షణం బిక్కుబిక్కుమంటున్న ఆ నిస్సహాయులకు తీర్పుతోనైనా సాంత్వన అందించాలని పట్టుదలగా ఉంది దీపిక. గంటకు ఇంత అనే పేపెంట్ కోసం దేశంపై దాడి చేసిన ఉగ్రవాదుల తరపున కూడా వాదించే న్యాయవాదులున్నారు. అసలు వారిని న్యాయవాదులు అనుకోవాలా. న్యాయాన్ని అమ్ముకునే వాదులు అనటం సరైన పదమే నయం. ఇదే భారతంలో దీపికవంటి అసలైన న్యాయవాదులు అంటే న్యాయం కోసం నిలబడి న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు వుండటం మంచి పరిణామం. దీపిక వంటి న్యాయవాదులకు ప్రతీ ఒక్కరూ మద్దతు పలకాల్సిన అవుసరం వుంది. అప్పుడే సామాన్యులకు న్యాయం జరిగే అవకాశం వుంటుంది. అందుకే దీపికా ధీరకాకమ మేరేమిటి? అసిఫా జీవితాన్ని మొగ్గలోనే చిదిమేసిన పశువులకు కఠిన శిక్ష పడాలనీ..దీపిక చేస్తున్న న్యాయం పోరాటం ఫలించాలని ఆశిద్దాం..

వర్మ నీచత్వం చెప్పేందుకే వచ్చా : అరవింద్

హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నిర్మాత అల్లు అరవింద్ మండిపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమ ద్వారా పేరు సంపాదించిన వరమ్ తెలుగు సినీ పరిశ్రమను కించపరుస్తున్నారని అరవింద్ మండిపడ్డారు. క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి పోరాటం పక్కదాని పట్టిన నేపథ్యంలో హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై తీవ్రమైన వ్యతిరేకత కొనసాగుతోంది.దీన్ని అలుసుగా తీసుకున్న వివాదాస్పద వర్మ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయమని శ్రీరెడ్డికి తాను చెప్పానని అనే విషయంపై నిర్మాత అల్లు అరవింద్ మండిపడ్డారు.

మోదీ ట్వీట్ కు కౌంటరిచ్చిన లోకేశ్..

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆధారాలు లేకుండానే తనపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీనికి లోకేశ్‌ స్పందిస్తూ... చట్టంలో పొందుపర్చిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని ప్రశ్నించినందుకు ఎలాంటి ఆధారాలు లేకుండానే బీజేపీ నాయకులు మాపై బురద జల్లుతూ, అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు’ అని ప్రధాని ట్వీట్‌కు లోకేష్ కౌంటర్‌ ఇచ్చారు.

15:50 - April 19, 2018

హైదరాబాద్ : జస్టిస్ లోయా మృతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని, అన్ని పిటిషన్లలను రద్దు చేయాలన్న సుప్రీం తీర్పును అంగీకరించడం జరగదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. సీపీఎం జాతీయ మహాసభలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభలకు సంబంధించిన వివరాలను ఏచూరి మీడియాకు తెలియచేశారు. జస్టిస్ లోయా మృతి కేసులో సరియైన న్యాయం జరగాలని కోరుతున్నామన్నారు. ఈ అంశాన్ని ఉన్నత ధర్మాసనం సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కేసులో సరియైన న్యాయం జరగాలని కోరుతున్నామన్నారు.

ఇక సభల విషయానికొస్తే...రెండు నెలల క్రితమే రాజకీయ తీర్మానం ప్రతిపాదించడం జరిగిందని, మహాసభల్లో ఈ తీర్మానంపై చర్చించడం జరిగిందన్నారు. అన్ని భాషల్లో రెండు నెలల క్రితమే ముసాయిదను రిలీజ్ చేయడం జరిగిందన్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించినట్లు, తీర్మానానికి సంబంధించి గతంలో బిన్నాభిప్రాయాలు వచ్చాయన్నారు. పార్టీ సభ్యుడు ఎవరైనా తమ అభిప్రాయాలను పార్టీకి అందించవచ్చన్నారు. ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. 13 మంది చర్చల్లో పాల్గొన్నారని, రేపు మధ్యాహ్నం వరకు చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రత్యేక రాజకీయ నివేదికపై మహాసభ చర్చించినట్లు తెలిపారు. 21 వపార్టీ కాంగ్రెస్ లో తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలు చేశారు.? రాబోయే రోజుల్లో ఎలాంటి పంథా అనుసరించాలి ? అనే దానిపై చర్చించడం జరిగిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులను అడ్డుకోవాలని..మొట్టమొదట దీనిని దించాలనే దానిపై భిన్నాభిప్రాయాలు లేవన్నారు. ప్రస్తుతం దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు.

నేతలు కాదు..విధానాలు కావాలని, బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడం ఎలా అన్నదే చర్చనీయాంశమన్నారు. పొత్తు విషయమై ఊహాజనిత వార్తలు రాస్తున్నారని, పాలకవర్గ పార్టీలతో ఎన్నికల పొత్తుకు వెళ్లడం ఎన్నడూ లేదన్నారు. గతంలో ఓసారి మద్దతు ఇచ్చింది కూడా బయటి నుండేనని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నలోని బీజేపీ ప్రభుత్వం నుండి ప్రజలను విముక్తి చేయడమే ప్రాధాన్యత అంశమన్నారు. పొత్తు విషయంపై ఊహాజనిత వార్తలు రాస్తున్నారని, కాంగ్రెస్ తో పొత్తా ? వేరే ఫ్రంట్ కు వెళ్లాలా అన్నది అంశమే కాదన్నారు. వామపక్ష పోరాటాలను బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్ష ఉద్యమాల ద్వారానే దేశ ఐక్యత పరిరక్షణకు వీలుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో తాము అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఎలాంటి అధ్యయనం చేయకుండా చేస్తున్నారని తాము చెప్పడం జరిగిందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మీ వల్ల 'మా'పరువు పోతోంది : మంచు విష్ణు

హైదరాబాద్ : నటి శ్రీరెడ్డి విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవహరించిన తీరు పట్ల హీరో మంచు విష్ణు అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 'మా' తీరును విమర్శిస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. అసోసియేషన్ లో సభ్యత్వం లేని ఓ వ్యక్తి విషయంలో 'మా' వ్యవహరించిన తీరు గందరగోళంగా ఉందని లేఖలో పేర్కొన్నాడు. అసోషియేషన్ లో సభ్యత్వం ఉన్న 900 మందిలో ఏ ఒక్కరూ కూడా ఆమెతో కలసి నటించకూడదంటూ నిషేధం విధించారని... ఆ 900 మందిలో తాను, తన తండ్రి, తన సోదరుడు, తన సోదరి కూడా ఉన్నామని... మమ్మల్ని కూడా కలిపే ఆ నిషేధం విధించారా? అని ప్రశ్నించాడు.

ఎన్నికల పొత్తుపై స్పష్టతనిచ్చిన ఏచూరి..

హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో సీపీఎం ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది? అనే విషయంపై మీడియా ఊహాజనితమైన వార్తలు కొనసాగుతున్నాయనీ..పాలకవర్గ పార్టీలతో ఎన్నికల్లో పొత్తుపెట్టుకోవటం అనేది సీపీఎం చరిత్రలో ఎన్నడూ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. గతంలో ఒకసారి మద్దతునిచ్చామనీ అదికూడా బైటనుండి ఇచ్చామని తెలిపారు. సీపీఎం పార్టీకి ఓటు వేయమని ప్రజలకు విజ్నప్తి చేస్తున్నానమ్నారు. తాము పోటీ లేని ప్రాంతంలో బీజేపీని ఓడించమని ప్రజలను సీపీఎం కోరుతోందన్నారు.

బీజేపీని ఓడించటమే సీపీఎం కర్తవ్యం : ఏచూరి

హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించటమే సీపీఎం ప్రధాన ఎజెండా అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ అంశంపైనే ప్రధానంగా సీపీఎం మహాసభ చర్చిస్తోందని తెలిపారు. సీపీఎం 22వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో రెండరోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ ఏచూరి మాట్లాడుతు. ఆర్ఎస్ ఎస్ కున్నసన్నల్లో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం నుండి ప్రజలన విముక్తం చేసేందుకు సీపీఎం పార్టీ ప్రధాన కర్తవ్యమనీ..దీనిపై సీపీఎం ప్రాధాన్యతనిస్తోందని ఏచూరి తెలిపారు. 

జస్టిస్ లోయా మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం : ఏచూరి

హైదరాబాద్ : జస్టిస్ లోధా మృతిపై దేశ అత్యున్నత న్యాయంస్థానం అయిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ ఏచూరి పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో సరైన న్యాయం జరగాలని సీపీఎం కోరుకుంటోందని తెలిపారు. ఈ కేసును సుప్రీంకోర్టు పున:సమీక్షించాలని సీపీఎం డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. అన్ని పిటీషన్లను రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును తాము అంగీకరించామన్నారు. కాగా సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు కొట్టివేసింది.

రాజకీయ తీర్మానంపై సభ్యుల అభిప్రాయాలను చర్చించాం : ఏచూరి

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో రెండరోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ ఏచూరి మాట్లాడుతు..జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం గురించి చర్చించామని తెలిపారు. దీనికి సంబంధించి పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను రెండు నెలలకు ముందే రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించామనీ..ఈ క్రమంలో తీర్మానంపై పలు భిన్నాభిప్రాయాలు వచ్చాయన్నారు. ప్రత్యేక రాజకీయ నివేదికపై మహాసభ చర్చించామని తెలిపారు. తీర్మానానికి సంబంధించి పార్టీ సభ్యులుగా వున్న ఎవరైనా తమ అభిప్రాయాలను తెలిపే హక్కువుందని ఏచూరి పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టు వెబ్ సైట్ హాకింగ్?!..

ఢిల్లీ: భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. హైటెక్ బ్రెజిల్ హ్యాక్ టీమ్‌గా చెప్పుకుంటున్న సైబర్ దొంగలు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ను చెరబట్టేందుకు ప్రయత్నించినట్టు సమచారం. దీనిపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ... వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంపై ట్విటర్ సహా సోషల్ మీడియాలో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెబ్‌సైట్ హ్యాకింగ్‌కి గురైందని చెబుతూ హ్యాకర్లు ఆకు ఆకారంలో ఓ లోగోను పోస్టు చేసినట్టు చెబుతున్నారు.

15:08 - April 19, 2018

ఢిల్లీ : కర్ణాటక పీఠం ఎక్కేదెవ్వరు..? మోదీ అమిత్‌ షా మంత్రం కర్ణాటకలో పని చేస్తుందా.? సిద్దరామయ్య పథకాలు ఓటర్లను ఆకర్షిస్తాయా..? రాహుల్‌ ప్రచారం కాంగ్రెస్‌కు కలిసి వస్తుందా..? ఇలాంటి ప్రశ్నలతో కన్నడ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. దీంతో దేశమంతా ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తోంది. రాజకీయ సమీకరణలు మారుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా మారుతుంది.

కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 12న ఎన్నికలు జరగనుండగా.. 15న ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో అందరి దృష్టి కన్నడ రాజకీయాల వైపు మళ్లింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాక ముందు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారంతో హీటెక్కిస్తే.. ఇక షెడ్యూల్‌ వచ్చాక నువ్వానేనా అనే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగునుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌పై బీజీపీ పైచేయి సాధిస్తుందని ప్రచారం జరుగుతున్నా. సిద్దరామయ్య ప్రభుత్వం పథకాల జోరు పెంచడంతో ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది.

ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న బీజేపీ చీఫ్ అమిత్‌ షా.. కర్ణాకటపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. గుజరాత్‌ ఫార్ములానే కర్ణాటకలో ప్రయోగిస్తూ..ఆలయాలు, పీఠాధిపతులను సందర్శిస్తూ హిందూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. మరో వైపు లింగాయతులను ప్రత్యేక మతస్తులుగా గుర్తిస్తూ సిద్దరామయ్య సర్కార్‌ నిర్ణయం తీసుకోవడం, కావేరి జలాలపై కర్ణాటక రాష్ట్రానికి ఊరటనిచ్చేలా తీర్పు రావడం కూడా కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో దెబ్బతిన్న జేడీఎస్‌ సీఎం సిద్దరామయ్యకు గట్టి గుణపాఠం చెప్పాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో లోపాయకారీ ఓప్పందం కుదుర్చుకోనుందని తెలుస్తోంది. అయితే మతతత్వ పార్టీగా ముద్ర పడిన బీజేపీతో చేతులు కలిపితే మైనరిటీ ఓట్లు చీలుతాయని భావిస్తున్న జేడీఎస్ కర్ర విరగకుండా.. పాము చావకుండా ద్విముఖ వ్యూహాన్ని ప్రదర్శించాలని చూస్తోంది.

మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత యడ్యూరప్ప ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో యెడ్డీ పాలనపై అవినీతి ముద్ర పడడంతో అవనీతిపరుడు కావాలా..? సిద్దరామయ్య లాంటి పనిచేసే వ్యక్తి కావాలా..? అంటూ కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే మూడు దశబ్దాలుగా అధికార పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన చరిత్ర కర్ణాటకలో లేదు. కానీ దీనిని సిద్దరామయ్య అధిగమిస్తారని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత.. అత్యంత అవినీతి సర్కార్‌ యడ్యూరప్పదే అంటూ నోరు జారిన అమిత్‌ షా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ విస్తృతంగా వాడుకుంటూ ఆ విడియోను వైరల్‌ చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ఒకే దశలో మే 12న పోలింగ్‌ నిర్వహించి, 15న కౌటింగ్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 24 నామినేషన్‌ ఫైనలింగ్‌ తేదీగా ఉండగా.. ఏప్రిల్‌ 27ని ఉపసంహరణ తేదీగా నిర్ణయించారు. ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీని కన్నడ ప్రజలు అధికార పీఠంపై కుర్చోబెడతారో తెలియాలంటే మే15న వెలువడే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

నేనైతే శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వనన్న నటుడు, ఎంపీ...

హైదరాబాద్ : హీరోయిన్ శ్రీరెడ్డి వ్యవహరిస్తున్న తీరును నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ తప్పుబట్టారు. నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని... అయితే అర్ధనగ్న ప్రదర్శన మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. క్రమశిక్షణ లేని వారికి 'మా'లో సభ్యత్వం ఇవ్వరని చెప్పారు. మా అధ్యక్షుడిగా తాను ఉంటే... ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు సభ్యత్వం ఇవ్వనని ఆయన తేల్చి చెప్పారు.

14:59 - April 19, 2018

ఢిల్లీ : కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. కర్నాటకలో సాధారణ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్న జాతీయ పార్టీలు కర్నాటక పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కర్నాటక రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌గా వ్యవహరిస్తున్న జేడీయస్ పార్టీ మరోసారి అధికారం కోసం పావులు కదుపుతోంది. కర్నాటక ఎన్నికల రణరంగంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ...

కర్నాటకలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకుల్లో అలజడి రెట్టింపవుతోంది. నువ్వా- నేనా అన్న రీతిలో పోటా పోటీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తుంటే.. మరికొందరు ఆశావాహులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించిన మొదటి విడత జాబితాలో టికెట్‌ దక్కనివారిలో కొందరు అసమ్మతిని వెళ్లగక్కుతుంటే... మరికొందరు పార్టీ ఆఫీసులోని ఫర్నీచర్ ధ్వంసం చేసి, దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు.. ఈ సారి కాంగ్రెస్, బీజేపీల్లో దేనికీ సంపూర్ణ మెజారిటీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పీఠం దక్కించుకోవడంలో జేడియస్ పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించే ఆవకాశం కనబడుతోందని అంటున్నారు.

కన్నడలో మే12న పోలింగ్‌ జరుగనుంది. అదేనెల 15న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తానికి కర్నాటక పీఠం కాషాయానిదా లేక కాంగ్రెస్‌దా అన్నది ఫలితాలు వెలుడితేగాని తేలదు. ఆరున్నర కోట్ల జనాభాలో.. నాలుగు కోట్ల తొంభై ఆరు వేల మంది ఓటర్లకు గాను... 56,696 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. 224 శాసన సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నూటా పదమూడు స్థానాల్లో విజయం సాధించిన పార్టీకే అధికారం దక్కనుంది. కర్నాటకలో లింగాయితులు ఇరవై ఏడు శాతం ఉన్నారు. వీరి మద్ధతు ఏపార్టీకి ఉంటే వారిదే విజయం.

ఈ సారి అన్ని ప్రధాన పార్టీల అగ్రనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.. నామినేషన్ల దాఖలుకు 24వతేది ఆఖరు కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడియస్‌లు అభ్యర్థుల ఎంపికపై కరత్తును ముమ్మరం చేశాయి. మైసూర్ జిల్లాలోని వరుణ నియోజక వర్గంలో పోటీ ఆసక్తికరంగా మారనున్నాయి. వరుణ నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్దారామయ్య కుమారుడు యతీంద్ర, బిజేపి ముఖ్యమంత్రి అభ్యర్థి బీ.ఎస్.యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఇక్కడి నుంచే పోటికి దిగనున్నారు. 

మరోవైపు రాజకీయ పార్టీల్లో  కుటుంబ పాలనపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నాటక రాజకీయాల్లో చక్రం తిప్పతున్న  జేడియస్‌లో కుటుంబ పాలన కొనసాగుతోందంటూ.. ఆ పార్టీ నేతలే అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు.. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు దేవేగౌడ తన మొదటి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి గౌడకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రెండో కుమారుడైన రేవణ్ణగౌడ కుమారుడు ప్రజ్వల్ గౌడకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నందున ఈసారి ప్రజ్వల్ గౌడకు ఎమ్మెల్యేగా పోటీ  చేసేందుకు అవకాశం ఇవ్వాలని కొందరు నాయకులు కోరుతున్నారు. ఒక వేళ ప్రజ్వల్ గౌడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి అడుగుతారన్న ఆలోచనతో... కుమారస్వామి గౌడ సిఎం పదవికి ఎసరుపెట్టకుండా ముందుచూపుతోనే మనుమడైన ప్రజ్వల్ గౌడను ఈసారి పార్లమెంట్  అభ్యర్థిగా ప్రకటించి.. పార్టీలో అసమ్మతితోపాటు..  కుటుంబ కలహాలకు కూడా అడ్డుకట్ట వేశారని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.

ఇక సుమారు వంద స్థానాల్లో లింగాయితులు గెలుపును శాసించగలరన్న విషయం గత ఎన్నికల్లో రుజువైంది.. వీరి తర్వాత స్ధానం ఎస్సీ. ఎస్టీ సామాజిక వర్గాలదే. ఇరవైఐదు శాతం ఉన్న  ఎస్సీ, ఎస్టీలు ప్రధాన పార్టీల జయాపజయాలను  ప్రభావితం చేయనున్నారు. దీంతో  బీజేపీ ఎస్టీలకు  ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే బళ్లారి జిల్లా మొలకాల్మూరు నియోజక వర్గం నుంచి శ్రీరాములును దింపి... ఆ వర్గం ఓటర్లకు గాలం వేస్తోంది.. కానీ..  సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని కాదని.. బళ్ళారి ఎంపిగా ఉన్న శ్రీరాములుకు టికెట్టు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.  ప్రచారం చేస్తున్న ఎం.పి శ్రీరాములుపై చీపురులు, చెప్పులతో దాడులు కూడా జరిగాయి. ఇక కాంగ్రెస్‌లో పదకొండుమంది సిట్టింగులకు చోటు దక్కలేదు. జాబితాలో  పేర్లు లేని నేతలు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. బెంగళూరులోని కర్నాటక కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. కర్నాటకలో ఎక్కువ భాగం  ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉండటంతో...  తెలుగువారి ఓట్లు సైతం కర్నాటక ఎన్నికల్లో  కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని అస్ర్తంగా చేసుకుని తెలుగు ఓటర్లకు గాలం వేయాలని చూస్తోంది కాంగ్రెస్. కాగా.. బీజేపీ మాత్రం  కర్నాటక  అభివృద్దికి భారీగా నిధులు కేటాయిచామన్న అంశాన్ని ప్రచారం చేయాలని చూస్తోంది.  మొత్తానికి హోరాహోరీగా సాగుతున్న కర్నాటకలో అధికారపీఠం ఎవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. అది తెలియాలంటే మే 15 వరకు వేచి చూడాల్సిందే.

14:42 - April 19, 2018

హైదరాబాద్ : దేశంలోనే రెండవ అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌ అవార్డు పొందిన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను కేరళ సీఎం పినరయి విజయన్‌ సందర్శించనున్నారు. కేసులో పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, ఫ్రెండ్లీ పోలిసింగ్...విధానాల అమలును పరిశీలించనున్నారు. కేరళ సీఎం రాకతో పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. 

14:39 - April 19, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు చేయబోయే దీక్షకు మద్దతుగా స్పీకర్‌ కోడెల చేపట్టిన సైకిల్ యాత్రలో ప్రమాదం జరిగింది. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు చేపట్టిన యాత్రలో యలమంద వద్ద కోడెల సైకిల్‌పై నుండి జారిపడ్డారు. దీంతో ఆయన తలకి స్వల్ప గాయం అయింది. గాయంతోనే స్పీకర్‌ యాత్రను కొనసాగిస్తున్నారు. 

14:38 - April 19, 2018

హైదరాబాద్ : క్యాస్టింగ్‌ కౌచ్‌పై టాలీవుడ్‌లో చెలరేగిన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు చిత్ర పరిశ్రమ అన్ని చర్యలు తీసుకొంటోందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్య పరిష్కారం కోసం కమిటీ సభ్యులను త్వరలో ప్రకటిస్తామన్నారు. శ్రీరెడ్డి వ్యవహారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సమస్యను పరిష్కరించుకోవాలని కాని రాద్ధాంతం చేయొద్దని అన్నారు. సినీ ఇండస్ర్టీపై దుష్ర్పచారం మంచిది కాదు అన్నారు.

శ్రీరెడ్డి వివాదంపై ఎంపీ మురళి మోహన్‌ ఘాటుగా స్పందించారు. ఏదైనా సమస్య వస్తే ఇండస్ట్రీలోని పెద్దలను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి సమస్య పరిష్కారించుకోవాల్సింది అన్నారు. అంతే కాని అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం సరికాదన్నారు. ఇండస్ట్రీలో పని చేస్తున్నవారు క్రమశిక్షణతో మెలగాలని, లేని వారికి ఇండస్ట్రీలో ఉండే అర్హత లేదన్నారు మురళి మోహన్.

ఇండస్ట్రీలో ఒకరు తప్పు చేసారని మొత్తం సినీ ఇండస్ట్రీని నిందించటం సరైన పద్దతి కాదని నటి శ్రీరెడ్డిపై నడిగర్‌ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్ మండిపడ్డారు. శ్రీరెడ్డికి అన్యాయం జరిగితే సాక్షాధారాలతో నిరూపించాలే, కానీ ఎంతో ఘనత ఉన్న తెలుగు చిత్రసీమను బజారుకు ఈడ్చటం మంచి పద్దతి కాదన్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలో వరలక్ష్మీ, అమలాపాల్‌లకు అన్యాయం జరిగితే తమ సహకారం అందించి న్యాయం చేశామని తెలిపారు. ఏ నటి అయిన నిజంగా తమకు అన్యాయం జరిగితే ఆధారాలతో నటీనటుల సంఘాన్ని ఆశ్రయిస్తే తప్పక న్యాయం జరుగుతుందని, బజారున పడితే తమ జీవితాలకే నష్టమని హితవు పలికారు. ఇప్పటికైన చిత్రసీమ బాగుండాలనే ఆకాంక్షతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విశాల్‌ పిలుపునిచ్చారు.

పంజాగుట్ట పీఎస్ ను సందర్శించనున్న కేరళ సీఎం...

హైదరాబాద్ : పంజాగుట్ట పీఎస్ ను కేరళ సీఎం సందర్శించనున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారుర. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందిన సంగతి తెలిసిందే. 

13:55 - April 19, 2018

హైదరాబాద్‌ : నరగంలో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానంపై చర్చిస్తున్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఎలా ఓడించాలన్న అన్న అంశంపై  ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. మహాసభలకు ముందే విడుదల చేసిన ముసాయిదా రాజకీయ తీర్మానంపై వచ్చిన అభిప్రాయలకు రాజకీయ తీర్మానంలో స్థానం కల్పించే అంశంపై చర్చిస్తున్నామంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శనరావుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మైనారిటీలు, దళితులపై దాడులు పెరిగిపోయాయని వాపోయారు. మోదీ ఆర్థిక విధానాలు దేశానికి నష్టం అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లో విచ్చల విడిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారని చెప్పారు.

 

13:51 - April 19, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు చేయబోయే దీక్షకు మద్దతుగా స్పీకర్‌ కోడెల చేపట్టిన సైకిల్ యాత్రలో ప్రమాదం జరిగింది. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు చేపట్టిన యాత్రలో యలమంద వద్ద కోడెల సైకిల్‌పై నుండి జారిపడ్డారు. దీంతో ఆయన తలకి స్వల్ప గాయం అయింది. గాయంతోనే స్పీకర్‌ యాత్రను కొనసాగిస్తున్నారు. 

13:48 - April 19, 2018

రాజమండ్రి : శ్రీరెడ్డి వివాదంపై ఎంపీ మురళి మోహన్‌ ఘాటుగా స్పందించారు. ఏదైనా సమస్య వస్తే ఇండస్ట్రీలోని పెద్దలను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి సమస్య పరిష్కారించుకోవాల్సింది అన్నారు. అంతే కాని అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం సరికాదన్నారు. ఇండస్ట్రీలో పని చేస్తున్నవారు క్రమశిక్షణతో మెలగాలని, లేని వారికి ఇండస్ట్రీలో ఉండే అర్హత లేదన్నారు.

 

13:47 - April 19, 2018

గుంటూరు : మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు నిర్వహించబోయే ధర్మ దీక్షపై చర్చిస్తున్నారు.  రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలపైనా చర్చింనట్టు తెలుస్తోంది.  

 

13:38 - April 19, 2018

హైదరాబాద్ : నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి రవీందర్‌రెడ్డి రాజీనామాలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నాంపల్లి ఎన్ ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి రవీందర్‌రెడ్డి రాజీనామాలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకొంది. మక్కా మసీదు పేళ్లు కేసులు తీర్పు తర్వాత రవీందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. రవీందర్‌రెడ్డి రాజీనామాను ఆమోదించలేదు. రవీంద్‌రెడ్డి పెట్టకున్న తాత్కాలిక సెలవుకు కూడా రద్దు చేశారు. దీంతో విధులకు హాజరయ్యారు. 
 

13:35 - April 19, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు చేయబోయే దీక్షకు మద్దతుగా స్పీకర్‌ కోడెల చేపట్టిన సైకిల్ యాత్రలో స్పీకర్‌ గాయపడ్డారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు చేపట్టిన యాత్రలో యలమంద వద్ద కోడెల సైకిల్‌పై నుండి జారిపడ్డారు. దీంతో ఆయన చేతికి స్వల్ప గాయం అయింది. అయినప్పటికీ గాయంతోనే స్పీకర్‌ యాత్రను కొనసాగిస్తున్నారు. 

 

13:33 - April 19, 2018

హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులను ఓడించేందుకు ప్రజాస్వామ్య లౌకిక శక్తులు ఏకం కావాల్సి ఉందని సీపీఎం నేత ఎంఏ బేబీ సూచించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీసీఎం 22వ జాతీయ మహాసభల్లో ఈ అంశంపై చర్చిస్తున్నామని బేబీ చెబుతున్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మోదీ పాలనలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలను బీజేపీ రాజకీయ సాధనంగా వాడుకొంటోందని విమర్శించారు. మోదీ పాలనలో మతోన్మాద శక్తులు పెచ్చరిల్లిపోతున్నాయన్నారు. ప్రజల ఆహార అలవాట్లను కూడా సంఘ్‌ పరివార్‌ నియంత్రిస్తుందని అన్నారు. 

 

క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన నటుడు విశాల్..

తమిళనాడు : చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై ప్రస్తుతం హాట్ హాట్ వార్తలు కొనసాగుతున్నాయి. దీనిపై పలువురు పలు విధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అభిప్రాయపడుతున్నారు. ఈ నేపత్యంలో నటు విశాల్ కూడా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ అనే మాటను సింపుల్ గా అనేయొద్దని నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ, సినీ నటుడు విశాల్ తెలిపాడు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ జరిగిందని ఆధారాలతో నిరూపించాలని సూచించాడు. అప్పుడు కచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశాడు. ఎవరో ఒకరిద్దరు చేసే నీచపు పనులను సినీ పరిశ్రమ మొత్తానికి అంటించవద్దని విశాల్ సూచించాడు.

13:27 - April 19, 2018

ఢిల్లీ : జస్టిస్ లోయ మృతిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును జస్టిస్‌ లోయ విచారించారు. తీర్పు వెలువడానికి ముందు 2014 డిసెంబర్‌ 1న జస్టిస్‌ లోయ మహారాష్ట్రలోని నాగపూర్‌లో మరణించారు. అయితే జస్టిస్‌ లోయ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. లోయ మృతిపై విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

స్పీకర్ తలకు గాయం..

గుంటూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టనున్న దీక్షకు సంఘీభావంగా శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు గురువారం సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆయనకు చిన్నపాటి గాయం అయింది. యలమంద వద్ద సైకిల్ పై నుండి కోడెల జారిపడ్డారు. దీంతతో ఆయన తలకు గాయమయ్యింది. అయినా కోడెల తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. నర్సారావుపేట పట్టణంలోని స్వగృహం నుంచి ఉదయం 8:45 గంటలకు సభాపతి స్వయంగా సైకిల్‌ తొక్కుతూ కోటప్పకొండకు బయలుదేరారు. సత్తెనపల్లి రోడ్‌, బైపాస్‌ రోడ్‌, పెద్ద చెరువు మెయిన్‌ రోడ్‌లో ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనేక చోట్ల మహిళలు హారతులు పట్టారు.

13:23 - April 19, 2018

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ను తిట్టమని శ్రీరెడ్డికి తానే చెప్పినట్లు రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్‌ చేశారు. ఇందుకోసం శ్రీరెడ్డికి 5 కోట్లు ఇచ్చినట్లు కూడా ఒప్పుకున్నారు. శ్రీరెడ్డి ఉద్యమం పెద్ద ఎత్తున అందరిలోకి వెళ్లాలనే అలా చెప్పానన్నారు. ఈ విషయంలో శ్రీరెడ్డిని ప్రభావితం చేసినందుకు పవన్ కల్యాణ్‌కు, ఆయన అభిమానులకు ఆర్జీవీ క్షమాపణలు చెప్పారు. 

 

13:16 - April 19, 2018

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ను తిట్టమని తనకు చెప్పింది రామ్‌గోపాల్‌ వర్మనే అని శ్రీరెడ్డి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ తమన్నతో ఫోన్‌లో సంభాషించింది. ఇందుకోసం తనకు 5 కోట్లు ఇచ్చినా తాను తీసుకోలేదని చెప్పింది శ్రీరెడ్డి. రామ్‌గోపాల్ వర్మ, వైసీపీ తనపై పెద్ద ప్లాన్‌ వేశారని చెప్పుకొచ్చింది. పవన్‌ను తిట్టినందుకు ఉద్యమం అంతా నీరుగారిపోయిందని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. మళ్లీ ఎజెండా తయారు చేసి పోరాటం చేద్దామని ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పింది. తన చివరి నెత్తుటి బొట్టు వరకు పవన్‌ను ఓడించేందుకే ప్రయత్నం చేస్తానంది. 

13:08 - April 19, 2018

కొంతమందికి అన్నీ వున్నా ఏదో వెలితిగా వుంటుంది. ఎన్ని లక్షలు వున్నా తమకిష్టమైనది చేస్తేనే తృప్తి లభిస్తుంది. రొటీన్ జీవితాల కంటే..విభిన్న జీవితాలనుకోరుకునే ఓ జంట గురించి తెలుసుకుందాం..పేరున్న కంపెనీలో ఉద్యోగం,లక్షల్లో జీతం ఇవేమీ వారికి సంతృప్తినివ్వలేదు. ఇద్దరికీ కామన్ గా ఇష్టపడే దారిని వారు ఎంచుకున్నారు. ఉదయం లేవంగానే దాంతోనే చాలామంది దినచర్య ప్రారంభమవుతుంది. అది తాగకుంటే ఏదో వెలితిగా ఫీలవుతుంటారు చాలామంది. అదేనండి 'చాయ్' అది గొంతులో పడితేనే గానీ కొందరికి స్థిమితపడరు. అది తాగితేనే గాని ఉత్సాహం రాదంటారు మరికొందరు. జీవితంలో ఒక భాగం అయిపోయిన '‘ఛాయ్‌ విల్లా.. రీఫ్రెష్‌ యువర్‌సెల్ఫ్‌’ ని ప్రారంభించారు పుణెకు చెందిన నితిన్‌ బియానీ, పూజ దంపతులు.

రొటీన్ జీవితం వద్దనుకున్న దంపతులు..
రోజూ పొద్దున్నే లేచి ఠంచనుగా ఆఫీస్‌కు వెళ్లడం.. రావడం ఇదే జీవితం కాదనుకున్నారు ఆ భార్యాభర్తలు. రొటీన్‌ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి.. కాస్త విభిన్నంగా ఉండాలనుకున్నారు. అందుకే లక్షల జీతాన్ని వదులుకుని సొంతంగా టీ దుకాణం ప్రారంభించారు. పుణెకు చెందిన నితిన్‌ బియానీ, పూజ దంపతులు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. ఐబీఎం, కాగ్నిజెంట్‌ లాంటి ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసి నెలకు రూ. 15లక్షల వేతనం అందుకున్నారు. అయితే ఆ జీవితం వారికి సంతృప్తినివ్వలేదు. తమకంటూ ఏదో ప్రత్యేకత కావాలనుకున్నారు. దాని కోసం ఉద్యోగాలను కూడా వదులుకున్నారు.

ఇద్దరి ఇష్టాన్ని వ్యాపారంగా మలచుకున్న దంపతులు..
అయితే వీరికి టీ అంటే చాలా ఇష్టం. ఆ వ్యాపారమే ఎందుకు చేయకూడదు అనుకున్నారు. అలా ఐదు నెలల కిందట నాగ్‌పూర్‌లో ‘ఛాయ్‌ విల్లా.. రీఫ్రెష్‌ యువర్‌సెల్ఫ్‌’ పేరుతో టీ దుకాణాన్ని ప్రారంభించారు. ‘ఈ ఛాయ్‌ విల్లాలో 15 రకాలకు పైగా టీ, కాఫీలను విక్రయిస్తున్నాం. సోషల్‌మీడియా ద్వారా కూడా ఆర్డర్లు తీసుకుంటాం. బ్యాంకులు, ఆఫీస్‌లు, హాస్పిటల్‌ వంటి వాటికి టీ డెలివరీ చేస్తుంటాం. త్వరలోనే మా వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నాం’ అని నితిన్‌ చెబుతున్నారు. 

ఫేమస్ గా మారిపోయిన చాయ్ విల్లా రీ ఫ్రెష్..

కొద్ది కాలంలోనే ఈ ఛాయ్‌ విల్లా నాగ్‌పూర్‌లో ఎంతగానో ఫేమస్‌ అయ్యింది. సోషల్‌మీడియా, టెక్నాలజీని ఉపయోగించుకోవడం, అందుబాటు ధరల్లో విక్రయిస్తుండటంతో యువత నుంచి మంచి డిమాండ్‌ వస్తోంది. ఈ ఛాయ్‌విల్లాతో ప్రస్తుతం నెలకు రూ. 5లక్షల దాకా సంపాదిస్తున్నామని నితిన్‌ చెప్పారు.

13:05 - April 19, 2018

హైదరాబాద్ : మహబూబ్ నగర్ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు జడ్జి కే.రంగారావ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. వికారాబాద్ నుండి బదిలీ అయి బాధ్యతలు స్వీకరించిన అరగంటకే సస్పెండ్ ఆర్డర్‌ తీసుకున్నారు. అవినీతికి పాల్పడుతున్నారని 36 మంది న్యాయవాదులు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జడ్జి రంగారావుని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

 

12:43 - April 19, 2018

మేడ్చల్ : కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... మేడ్చల్‌ జిల్లా శమిర్‌పేట్‌ మండలం బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ ధర్నా నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు సీఐటీయూ నేతలు తరలి వచ్చారు. దీంతో పోలీసులు సీఐటీయూ నేతలను అరెస్ట్‌ చేశారు. 

12:41 - April 19, 2018

హైదరాబాద్ : ఇవాళ ఉదయం తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ను  కేరళ ఆర్థిక మంత్రి తామస్‌ ఐజాక్‌ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.  ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన అనంతరం మంత్రులు వారి చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తచేసుకున్నారు.

12:38 - April 19, 2018

హైదరాబాద్ : నగరంలో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ కూడా రాజకీయ తీర్మానంపై చర్చిస్తారు. రాజకీయ తీర్మానంపై మహాసభల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీని ఓడించడమే లక్ష్యమని రాజకీయ తీర్మానంలో ప్రతిపాదించారు. 

12:35 - April 19, 2018

హైదరాబాద్ : ఇండస్ట్రీలో ఒకరు తప్పు చేసారని మొత్తం సినీ ఇండస్ట్రీని నిందించటం సరైన పద్ధతి కాదని నటి శ్రీరెడ్డిపై నడిగర్‌ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్ మండిపడ్డారు. శ్రీరెడ్డికి అన్యాయం జరిగితే సాక్షాధారాలతో నిరూపించాలే, కానీ ఎంతో ఘనత ఉన్న తెలుగు చిత్రసీమను బజారుకు ఈడ్చటం మంచి పద్దతి కాదన్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలో వరలక్ష్మీ, అమలాపాల్‌లకు అన్యాయం జరిగితే తమ సహకారం అందించి న్యాయం చేశామని తెలిపారు. ఏ నటి అయిన నిజంగా తమకు అన్యాయం జరిగితే ఆధారాలతో నటీనటుల సంఘాన్ని ఆశ్రయిస్తే తప్పక న్యాయం జరుగుతుందని, బజారున పడితే తమ జీవితాలకే నష్టమని హితవు పలికారు. ఇప్పటికైన చిత్రసీమ బాగుండాలనే ఆకాంక్షతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విశాల్‌ పిలుపునిచ్చారు.

 

చంద్రబాబు 'ధర్మ దీక్ష' అందుకేనంటున్న మంత్రి గంటా!..

విశాఖ: సీఎం చంద్రబాబు నాయుడు ధర్మదీక్షపై మంత్రి గంటా శ్రీనివాస్ స్పందించారు. ఈరోజు సింహాచలం అప్పన్నను దర్శనం చేసుకున్న మంత్రి గంటా మాట్లాడుతు...రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా మాత్రమే కాకుండా విభజన చట్టంలోని హక్కుల సాధన కోసం సీఎం చేస్తున్న ధర్మ పోరాటం దేశ రాజకీయ చరిత్రలోనే అనిర్వచనీయమని అభివర్ణించారు.

12:26 - April 19, 2018

హైదరాబాద్ : క్యాస్టింగ్‌ కౌచ్‌పై టాలీవుడ్‌లో చెలరేగిన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు చిత్ర పరిశ్రమ అన్ని చర్యలు తీసుకొంటోందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్య పరిష్కారం కోసం కమిటీ సభ్యులను త్వరలో ప్రకటిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో క్యాస్టింగ్‌ కౌచ్‌  కమిటీని వేస్తామని తెలిపారు. శ్రీరెడ్డి వ్యవహారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సమస్యను పరిష్కరించుకోవాలని కాని రాద్ధాంతం చేయొద్దని అన్నారు. సినీ ఇండస్ట్రీపై దుష్ర్పచారం మంచిది కాదు అన్నారు. సినీ ఇండస్ట్రీ నీచమైంది అయితే తమ పిల్లలను ఎందుకు తీసుకొస్తామన్నారు. సమస్య పరిష్కరానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లమని పవన్‌ చెప్పడంలో తప్పేముందని చెప్పారు. పవన్‌ వ్యాఖ్యలను శ్రీరెడ్డికి ఎందుకు తప్పుగా అనిపించాయని తెలిపారు. 

12:25 - April 19, 2018

కొంతమందికి రోజు అదే పనిచేయటం బోర్ గా ఫీల్ అవుతారు. కొత్తదనాన్ని కోరుకుంటారు. మరికొందరు కొత్తగా చేయటం ఇష్టపడరు. ఒకవేళ చేసినా అది తమ కెరీర్ కు ఆటంకం కలుగుతుందనే భయపడుతుంటారు. అందుకే వారు కొత్తదనానికి యత్నించరు. మరి బోర్ కొట్టేస్తుందని కొత్తదనం కావాలనేవారెవరు? కొత్తదనం వద్దు..పాతదే ముద్దు అనే వారెవరో తెలుసుకుందాం..

ముకుంద సినిమాతో అందరినీ అకట్టుకున్న పూజా హెగ్డేకు ప్రతీరోజు కొత్తదనం కావాలట..అలాగే ఇండ్రస్ట్రీలో ప్రిన్స్ గా పిలుకునే మహేశ్ బాబు మాత్రం ప్రయోగాలు చేయను అంటు సినిమాల పరంగా ప్రయోగాలకు సిద్ధపడను అంటున్నాడు ప్రిన్స్ మహేశ్ బాబు..

రొటీన్ గా ఒకే పని చేయడం తన వల్ల కాదంటోంది అందాలభామ పూజా హెగ్డే. 'ప్రతి రోజూ కొత్తగా వుండాలని కోరుకుంటాను. అందుకే చేసిన పనే చేయడం అంటే నాకిష్టం వుండదు. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. అందుకే కొత్తగా వుండే పాత్రలనే ఒప్పుకుంటాను. రొటీన్ గా ఒకటే పని చేయమంటే మాత్రం నాకు బోర్ కొట్టేస్తుంది' అని అంటోంది పూజ.

సినిమాల పరంగా ప్రయోగాలు చేసే ఉద్దేశం ఇక తనకు అసలు లేదని చెప్పాడు మహేశ్ బాబు. 'ప్రయోగాలు చేసే ఓపిక లేదు. అయినా సినిమాల పరంగా ఏవైనా ప్రయోగాలు చేసినా, నాన్నగారి అభిమానులు ఊరుకోరు. డైరెక్టుగా మా ఇంటికొచ్చి నా మీద ఎటాక్ చేసినా చేస్తారు' అంటూ చమత్కరించాడు.

నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'శైలజా రెడ్డి గారి అల్లుడు' చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం చైతూ, కొంతమంది ఫైటర్లపై యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తోంది.

12:19 - April 19, 2018

హైదరాబాద్ : ప్రత్యేకహోదా కోసం పోరాటాలు చేస్తుంటే టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల విమర్శిస్తున్నారని సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. 'హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే నీవు ఎవడు ఆందోళన చేయడానికి అని తెలుగుదేశం ప్రతినిధి అంటున్నారని అన్నారు. మరో టీడీపీ ప్రతినిధి బట్టలు ఊడదీసి కొడతా అంటున్నాడని...హోదా కోసం దీక్ష చేపట్టే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా బట్టలు ఊడదీసి కొడతారా అని తమ్మారెడ్డి అన్నారు. తెలుగు వాళ్లంతా పిచ్చివాళ్లు అనుకుంటున్నారా అని మండిపడ్డారు. దరిద్రులను పార్టీలో పెట్టుకుంటే నష్టం వస్తుందని..చంద్రబాబుకు సూచించారు. 

 

బాబు 'ధర్మ పోరాట దీక్ష'కు భారీ ఏర్పాట్లు..

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టబోతున్న నిరాహారదీక్షకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దీక్ష కొనసాగనున్న నేపథ్యంలో దీక్ష విరమణ తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. నగరంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా ఉండవచ్చని అంచనా వేస్తున్న క్రమంలో దీక్షాస్థలికి వచ్చే టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ కూలర్లు, స్టేడియం మొత్తాన్ని తెల్లటి బట్టలతో టెంట్ లాగా ఏర్పాటు చేసి దాదాపు 250 మంది నేతలు కూర్చునేలా భారీ వేదికను ఏర్పాటు చేశారు.

చంద్రబాబు దీక్షకు మద్దతు : తమ్మారెడ్డి

అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం ఏపీపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తన పుట్టినరోజు నాడు అంటే 20 తేదీన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతు తెలుపుతున్నామని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. అడ్డమైన వారిని వెంట పెట్టుకోవటం చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు. మీరు వ్యవహరించే తీరు కొన్ని సందర్బాలలో బాధ కలిగిస్తోందని..ఇకనైనా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఐకమత్యంగా పనిచేయాలని చంద్రబాబుకు తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. 

మేం ఓట్లేస్తే గెలిచి రాజుల్లా ప్రవర్తిస్తే ఊరుకోం : తమ్మారెడ్డి

అమరావతి : ఏపికీ మీరు మేలు చేస్తారనే ఆశతోనే మేము మిమ్మలను గెలిపించామనీ..దీంతో మీరు రాజుల్లా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాన సీఎం చంద్రబాబును ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిథులు అనే విషయం మరిచిపోయి రాజుల్లా ప్రవర్తిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కొన్ని సందర్భాలలో చంద్రబాబు ప్రవర్తించిన తీరుకు బాధపడ్డామని తమ్మారెడ్డి తెలిపారు. 

12:00 - April 19, 2018

హైదరాబాద్‌ : సీపీఎం జాతీయ మహాసభలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ కూడా రాజకీయ తీర్మానంపై చర్చిస్తారు. రాజకీయ తీర్మానంపై మహాసభల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీని ఓడించడమే లక్ష్యమని రాజకీయ తీర్మానంలో ప్రతిపాదించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

జస్టిస్ రవీందర్ రెడ్డి రాజీనామాలో ట్విస్ట్..

హైదరాబాద్ : నాంపల్లి ఎన్ఐఏ జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామాలో కొత్త మలుపు చోటుచేసుకుంది. మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పునిచ్చిన జస్టీస్ రవీందర్ రెడ్డి తీర్పునిచ్చిన అనంతరం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినా రవీందర్ రెడ్డి రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టీస్ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో సెలవును రవీందర్ రెడ్డి తీసుకున్నారు. అయినా ఆ సెలవులను కూడా చీఫ్ జస్టిస్ రద్దు చేశారు. దీంతో విధిలేని పరిస్థితులలలో రవీందర్ రెడ్డి ఈరోజు విధులకు హాజరయ్యారు. కాగా కాగా మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో... 2007 మే 18న పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే.

వైసీపీపై శ్రీరెడ్డి సంచలన ప్రకటన..

హైదరాబాద్ : రోజుకోరకం వ్యాఖ్యలు చేస్తు వివాదాస్పందంగా మారిన నటి శ్రీరెడ్డి వైసీపీ పార్టీపై మరో సంచలన ప్రకటన చేసింది. సినీ ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ ఇప్పుడు రాజకీయపరంగా కలకలం రేపుతోంది. తన స్నేహితురాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తమన్నాతో ఆమె ఫోన్ లో మాట్లాడుతూ, సంచలన విషయాన్ని వెల్లడించింది. వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేశారని... పోరాటం చేస్తున్న తనను వాడుకోవాలని ప్రయత్నించారని... వీలైతే మరింతగా నన్ను ఈ వివాదంలో ఇరికిద్దామని యత్నించారని చెప్పింది.

11:39 - April 19, 2018

మంచిర్యాల : జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫారెస్ట్‌ కలప డిపో సమీపంలో రోడ్డు దాటుతున్న గొర్రెల మందపై టిప్పర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. 

 

11:37 - April 19, 2018

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు. శంషాబాద్‌ జోన్‌ డీసీపీ పద్మజా రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్‌, బాబానగర్‌, మహమూద్‌నగర్‌, హసన్‌నగర్‌లో ఈ కార్డన్‌ సర్చ్‌ చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు రెండు వందల మంది పోలీసులు పాల్గొన్నారు. 50 బైక్‌లు, 48 ఆటోలు సీజ్‌ చేశారు. 12 మంది అనుమానితులను, ఆరుగురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు చెక్‌ పెట్టేందుకే కార్డన్‌ సర్చ్‌ నిర్వహించినట్లు డీసీపీ పద్మజా రెడ్డి తెలిపారు. 


 

ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని వ్యవహార తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రవర్తన వల్ల ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. గురువారం వచ్చి తనను కలవాల్సిందిగా చింతమనేనికి చెప్పాలని పార్టీ నాయకులను ఆయన ఆదేశించారు. ఒక ఆర్టీసీ బస్సుపై ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలో ముఖ్యమంత్రి చిత్రం చిరిగి ఉండటాన్ని గమనించిన చింతమనేని... ఆ బస్సుని అక్కడే నిలిపివేసి, డ్రైవర్‌, కండక్టర్లను దుర్భాషలాడారు.

11:30 - April 19, 2018

హైదరాబాద్ : రెండో రోజు సీపీఎం జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. రాజకీయ తీర్మానంపై చర్చ జరుగనుంది. ప్రకాశ్ కరత్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ నిన్న రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని... నేడు తీర్మానంపై ప్రతినిధులు చర్చిస్తారని తెలిపారు. దేశంలో బీజేపీ మతోన్మాదం పెచ్చరిల్లుతోందన్నారు. దేశంలో, రాష్ట్రంలో కూడా పార్టీకి సానుకూల పరిస్థితి ఉందన్నారు. బీఎస్ ఎఫ్ తరపున119 స్థానాలకు పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులను కలుపుకుని పోరాటాలు చేస్తామని తెలిపారు. పోడు సాగుదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులను ప్రారంభించాయన్నారు. భూముల నుంచి గిరిజనులను వెళ్లగొడుతున్నారని పేర్కొన్నారు. 

300ల మందికి ఉరిశిక్ష !..

హైదరాబాద్ : ఐఎస్ఐఎస్ లో చేరి, ఉగ్రవాదులుగా మారిన వారితో పాటు, వారి కార్యకలాపాలకు సహకరించిన వారందర్నీ ఇరాక్ లోని సంకీర్ణ సేనలు అదుపులోకి తీసుకోగా, వారిలో సుమారు 300 మందికి న్యాయస్థానాలు మరణశిక్షను ఖరారు చేశాయి. 2016 డిసెంబర్ లో ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధీనంలో ఉన్న నగరాలను హస్తగతం చేసుకున్న అనంతరం ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇరాక్ న్యాయస్థానాలు పలువురికి కఠిన శిక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షలు పడిన వారిలో పదుల సంఖ్యలో విదేశీయులు కూడా వుండడం విశేషం. ఈ వివరాలను బుధవారం ఇరాక్ న్యాయ వర్గాలు వెల్లడించాయి.

11:24 - April 19, 2018

హైదరాబాద్ : రెండో రోజు సీపీఎం జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. రాజకీయ తీర్మానంపై చర్చ జరుగనుంది. ప్రకాశ్ కరత్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ నిన్న రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారని... తీర్మానంపై నేడు చర్చలు జరుగుతాయని.. రేపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆర్ ఎస్ ఎస్ అధిపత్య ధోరణిలో బీజేపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. బీజేపీని గద్దెదించాలి...అంందుకు ఏ ఏ శక్తులను ఏకం చేయాలనే అంశంపై చర్చ జరుగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో అక్కడున్న పరిస్థితులను బట్టి, పార్టీ నిర్ణయానికి లోబడి ఎత్తుగడులు ఉంటాయన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మహాజన పాదయాత్ర చేశామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదన్నారు. వర్గ ఉద్యమాలతోపాటు సామాజిక ఉద్యమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ మేరకు తెలంగాణలో టీమాస్, బీఎల్ ఎఫ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. వర్గ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలను కలిపి జమిలి ఉద్యమాలను చేయాలనుకున్నామని పేర్కొన్నారు. దేశంలో మహిళలు, బాలికపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. వీరికి ఊతమిచ్చేది ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతమన్నారు. బాలికపై అత్యాచారం చేసి మతం రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మహాసభల్లో రాజకీయ, పార్టీ నిర్మాణతోపాటు అనేక అంశాలు చర్చకు వస్తాయన్నారు. తమ పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఉంటుందని... దీనిపై పార్టీ నడుస్తుందన్నారు.
 

అనుమానాస్పద వ్యక్తుల సంచారంతో ..పఠాన్ కోట్ హై అలర్ట్..

ఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపటంతో పఠాన్‌కోట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. కాగా 2016లో ఇదే ఎయిర్‌బేస్ వద్ద ఉగ్రవాదులు దాడి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఆ ప్రాంతంలో సెక్యూర్టీని పెంచేశారు. అనంతరం సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు. రెండు ఏళ్ల క్రితం ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోయిన విషయం తెలిసిందే.

పవన్ పై వ్యాఖ్యలు చేయమన్నది నేనే : వర్మ

హైదరాబాద్ : కాస్టింగ్ కౌచ్‌పై సినీ నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలోకి పవన్ కల్యాణ్‌ను లాగమని చెప్పింది తానేనని సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అంగీకరించాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా ఉద్యమం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే ఆ సలహా ఇచ్చానన్నాడు. ఈ విషయంలో పూర్తి బాధ్యత తనదేనని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా మహేశ్ కత్తి పాప్యులర్ అయ్యాడని శ్రీరెడ్డికి చెప్పానని వర్మ పేర్కొన్నాడు. ఇలా చేస్తే నువ్వు కూడా పాపులర్ అవుతామని నేనే శ్రీరెడ్డికి చెప్పానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. 

జస్టిస్ లోయా మృతిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

ఢిల్లీ: సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మెరిట్ ప్రాతిపదికగా పిటిషన్లు కొట్టివేస్తున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో తెలిపారు. స్వప్రయోజనాలను ఆశిస్తూ దాఖలైన పిటిషన్లను ఎంతమాత్రం ఆమోదించేది లేదంటూ స్పష్టం చేశారు. కింది కోర్టుకు చెందిన నలుగురు జడ్జిల స్టేట్‌మెంట్లను అనుమానించేందుకు ఎలాంటి కారణాలు కనబడటం లేదని, లోయాది సహజమరణమేనని కోర్టు విశ్వసిస్తోందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొంటూ స్వతంత్ర దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్లను కొట్టివేశారు.

జడ్జిపై ఫిర్యాదు చేసిన న్యాయవాదులు..జడ్జి సస్సెండ్?!!..

హైదరాబాద్ : జడ్జ్ రంగారావుని సస్సెండ్ చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ ఎస్సీ,ఎస్టీ స్పెషల్ కోర్టు జడ్జి కే.రంగారావు ను సస్సెడ్ చేస్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ నుండి బదిలీ అయిన బాద్యతలు స్వీకరించిన అరగంటకే జడ్జ్ రంగారావుని సస్సెండ్ చేయటం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడుతున్నారని 36మంది న్యాయవాదులు హైకోర్టుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీచేసినట్లుగా తెలుస్తోంది. 

ప్రియమైన అమ్మను కోల్పోయాం : బుష్

ఢిల్లీ : తల్లి మరణవార్తను ధ్రువీకరిస్తూ మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రియమైన అమ్మను కోల్పోయాం’ అని అందులో పేర్కొన్నారు. బార్బారా బుష్ భర్త సీనియర్ బుష్ 1989-1993 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో బార్బారా అక్షరాస్యత పెంపు కోసం దేశమంతా పర్యటించారు. ప్రతి కుటుంబానికి అక్షరాస్యత అనే నినాదంతో విస్తృత ప్రచారం నిర్వహించారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు రాసిన ఆమె 2003లో తన ఆత్మకథను విడుదల చేశారు.

సీనియర్ బుష్ సతీమణి మృతి..

ఢిల్లీ : అమెరికాలో అక్షరాస్యత కోసం విశేష కృషి చేసిన ఆ దేశ మాజీ ప్రథమ మహిళ, సీనియర్ బుష్ సతీమణి బార్బారా బుష్ తన 92వ ఏట కన్నుమూశారు. టెక్సాస్‌లోని హోస్టన్‌లో తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బార్బారా బుష్ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. 

చంద్రబాబు దీక్ష రోజున జగన్ సంచలన ప్రకటనట?!..

ఢిల్లీ : తన పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు దీక్షతో ఒత్తిడి పెరుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎంపీలతో అత్యవసర సమావేశవయి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేయడంతో మైలేజీ వచ్చిందని భావించిన జగన్, సీఎం దీక్ష రోజు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

10:52 - April 19, 2018

హైదరాబాద్ : నగరంలో నేడు రెండో రోజు సీపీఎం జాతీయ మహాసభలు జరుగున్నాయి. రాజకీయ తీర్మానంపై చర్చ జరుగనుంది. ప్రకాశ్ కరత్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. మొదటిరోజు మహాసభలో రాజకీయ అంశాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎత్తుగడలు, విధానాలను పేర్కొన్నారని తెలిపారు. నేడు వాటిపై చర్చ ఉంటుందన్నారు. మహాసభల కంటే ముందే తమ పార్టీ రాజకీయ నివేదిక విడుదల చేసిందని...ప్రజల ముందు ఉంచామని..8 వేలకు పైగా సలహాలు, సూచనలు వచ్చాయని... మహాసభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

10:39 - April 19, 2018

మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు దుర్మార్గమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత క్రిషాన్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు పెరిగాయని అన్నారు. రేపిస్టులకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:24 - April 19, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై ఏపీ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం, హత్య దుర్మార్గమని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:17 - April 19, 2018

హైదరాబాద్ : విజ్ఞానం, వినోదాల కలబోతగా సాగుతోన్న హైదరాబాద్‌ ఫెస్ట్‌కు నగర ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తున్నారు. విజ్ఞాన విశేషాలను తెలుసుకుంటున్నారు. పుస్తక ప్రియులు బుక్‌స్టాల్స్‌లో ఇష్టమైన బుక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. రోజురోజుకు నగర ప్రజల నుంచి విశేష స్పందన పొందుతోన్న హైదరాబాద్‌ ఫెస్ట్‌పై కథనం..
6వ రోజూ ఫెస్ట్‌కు సందర్శకులు  
ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ ఫెస్ట్‌ గ్రాండ్‌గా జరుగుతోంది. 6వ రోజూ ఫెస్ట్‌కు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఫెస్ట్‌ ఈనెల 22న ముగియనుండడంతో సందర్శకులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీఫెన్‌హాకింగ్‌ సైన్స్‌ హబ్‌ అందరినీ అలరిస్తోంది. ఈ సైన్స్‌హబ్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శిస్తోన్న సైన్స్‌ ఎగ్జిబిట్స్‌ అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ బుధవారం ఈ ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముళ్లకిరీటంపై కూర్చుని అందులో అంతర్లీనంగా ఇమిడిఉన్న సైన్స్‌ సూత్రాన్ని అడిగి తెలుకున్నారు.
మహిళా వేదిక
సబల పేరుతో ఏర్పాటు చేసిన మహిళా వేదికపై మహిళలు ఆరోగ్యం అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యురాళ్లు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యంపై తమ విలువైన అభిప్రాయాలను వీక్షకులతో పంచుకున్నారు.
సుద్దాల హన్మంత కళావేదిక
సుద్దాల హన్మంత కళావేదికపై జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిలోనూ ఉత్తేజాన్ని నింపాయి.  విశాఖ కళాకారులు ప్రదర్శించిన మన్యంవీరులు వీధినాటకం అందరినీ ఆలోచింపజేసింది. విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన క్లాసికల్‌, ఫోక్‌, వెస్ట్రన్‌ డ్యాన్సులతో హైదరాబాద్‌ ఫెస్ట్‌ హోరెత్తింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ దర్శకుడు శంకర్‌, నటుడు శివాజీరాజా ఫెస్ట్‌ నిర్వాహకులను అభినందించారు. సృజన స్వరం వేదికపై తెలంగాణ భాషా సాహిత్యం- వికాసంసై సదస్సు జరిగింది. మొత్తానికి హైదరాబాద్‌ ఫెస్ట్‌కు నగర ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

10:14 - April 19, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ పాలన దేశాన్ని విచ్ఛిన్నం వైపుగా తీసుకు వెళుతోందని.. వివిధ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు ఆరోపించారు. మతోన్మాద చర్యలతో మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకీ పెచ్చరిల్లుతోన్న బీజేపీ ఫాసిస్టు విధానాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రగతిశీల, వామపక్ష, ప్రజాసంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. 
వామపక్ష పార్టీల అగ్ర నేతలు.. సౌహార్ద సందేశం 
సీపీఎం 22వ జాతీయ మహాసభలు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా.. వివిధ వామపక్ష పార్టీల అగ్ర నేతలు.. సౌహార్ద సందేశం వినిపించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. మేధావులు, శాస్త్రవేత్తలు, రచయితలు, విద్యావేత్తలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందన్నారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ విఫలం : జీఆర్ శివశంకర్  
మహాసభల్లో మాట్లాడిన ఫార్వర్డ్‌ బ్లాక్‌ కార్యదర్శి జీఆర్‌ శివశంకర్‌.. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. గోరక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయన్నారు.  ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోదీ... అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఆశలు ఒమ్ము చేశారని మండిపడ్డారు. మోదీ విధానాలు దేశానికి నష్టదాయకంగా పరిణమించాయని విమర్శించారు. 
బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలి : దీపాంకర్‌ భట్టాచార్య 
దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ప్రతిఘటించేందుకు బలమైన ప్రజా  ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ ఎంఎల్‌ నేత దీపాంకర్‌ భట్టాచార్య పిలుపు ఇచ్చారు. సీపీఎం మహాసభల్లో సౌహార్దంగా ప్రసంగించిన దీపాంకర్‌, ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవడంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించాలన్నారు. 
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తుల ఆగడాలను అరికట్టాలి : ఆశిష్‌ భట్టాచార్య  
దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు ఆగడాలను అరికట్టేందుకు కమ్యూనిస్టులు ఐక్య పోరాటలకు సిద్ధం కావాలని ఎస్ యూసీఐసీ నేత ఆశిష్‌ భట్టాచార్య పిలుపు ఇచ్చారు. మోదీ పాలనలో కార్పొరేట్లు మినహా ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన వామపక్ష ఉద్యమాలు అవసరమని ఆశిష్‌ భట్టాచార్య చెప్పారు
మోదీ ఆర్థిక విధానాలతో ప్రమాదం అంచుల్లో దేశం : మనోజ్‌ భట్టాచార్య   
ప్రధాని మోదీ ఆర్థిక విధానాలతో దేశం ప్రమాదం అంచుల్లోకి చేరుకుంటోందని ఆర్‌ఎస్‌పీ నేత మనోజ్‌ భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ అనుసరిస్తున్న స్వతంత్ర ఆర్థిక, విదేశాంగ విధానాలు దేశాభివృద్ధికి చేటుగా పరిణమిస్తున్నాయన్నారు. కమ్యూనిస్టులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థలను మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ నియంత్రిస్తున్నారని విమర్శించారు. ఈనెల 22 వరకూ జరిగే సీపీఎం జాతీయ మహాసభలు.. దాదాపు 25 అంశాలపై తీర్మానాలు చేయనున్నాయి. 22న ఆదివారం, హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభతో మహాసభలు ముగుస్తాయి. 

 

08:50 - April 19, 2018

చెన్నై : తమిళ సినీ పరిశ్రమ సమ్మెకు తెరపడింది.. గత 48 రోజులుగా కొనసాగుతున్న బంద్‌కు ముగింపు పలుకుతున్నట్లు నిర్మాతల మండలి అద్యక్షుడు విశాల్ ప్రకటించారు. ఇండస్ర్టీలోని  ఇబ్బందులకు న్యాయం జరిగేలా సమ్మె సాగిందన్నారు. శుక్రవారం నుంచి సినిమా థియేటర్లతోపాటు, షూటింగులు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. చిత్రసీమ పూర్వ వైభవం సంతరించుకునే దిశగా సమ్మె విరమణకు సహకరించిన సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, తదితర నటులు, చిత్రనిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యాలతోపాటు సినీపరిశ్రమలోని 24 క్రాఫ్ట్ లకు విశాల్ ధన్యవాదాలు తెలిపారు. 

 

08:48 - April 19, 2018

హైదరాబాద్ : క్యాస్టింగ్‌కౌచ్‌.. ఈ అంశం ఇపుడు టాలీవుడ్‌ను కుదిపివేస్తోంది. నటి శ్రీరెడ్డి యాక్షన్‌ సీన్లు.. దానికి మిగతా నటుల రియాక్షన్స్‌... ఇలా ఫిల్మ్‌నగర్‌లో నెలరోజులుగా కలర్‌ఫుల్‌ చిత్రం నడుస్తోంది. ముఖ్యంగా శ్రీరెడ్డి చేస్తోన్న ఆరోపణలపై సినీతారాలోకం ఫైరవుతోంది. పవన్‌పై శ్రీరెడ్డి ఆరోపణలను నాగబాబు ఖండించగా.. తన ఫ్యామిలీపై శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలను  జీవితా రాజశేఖర్‌ కూడా తిప్పికొట్టారు. తన వ్యాఖ్యలపై అందరూ విమర్శలు చేస్తుండడంతో.. శ్రీరెడ్డి పవన్‌ కల్యాణ్‌ తల్లికి, పవన్‌కల్యాణ్‌కు ట్విట్టర్‌ మూలంగా క్షమాపణలు చెప్పారు. 
కార్చిచ్చులా రగులుతున్న కాస్టింగ్‌ కౌచ్‌  
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ అంశం... కార్చిచ్చులా రగులుతూనే ఉంది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ఫిల్మ్‌నగర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నటి మాధవీలత.. పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. ఫిల్మ్‌ చాంబర్‌ ఎదుట మౌన దీక్షకు కూర్చున్నారు. అయితే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి.. అదుపులోకి తీసుకున్నారు. శ్రీరెడ్డి వ్యాఖ్యలను మాధవీలత తీవ్రంగా తప్పుబట్టారు. 
కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన మెగా బ్రదర్‌ నాగబాబు 
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌పై మెగాబ్రదర్‌ నాగబాబు కూడా స్పందించారు. ఇండస్ట్రీ అమ్మాయిలను ఆటవస్తువుగా చూడదని.....అలా చూసేట్లుంటే..  తన కూతురిని ఎందుకు ఇండస్ట్రీకి తెస్తానని ప్రశ్నించారు. మా అసోసియేషన్‌లో సభ్యులకు సమస్యలు వస్తే కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. పవన్‌ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడం తప్పెలా అవుతుందన్నారు. పరిశ్రమలో  ఎవరు వేధించినా చెప్పుతో కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అంతే కాని మెగా ఫ్యామిలీని వేలెత్తి చూపిస్తే ఊరుకునేది లేదన్నారు నాగబాబు.  
శ్రీరెడ్డి విషయంలో నాపై తప్పుడు ఆరోపణలు ప్రచారం : జీవితారాజశేఖర్‌  
మరోవైపు శ్రీరెడ్డి విషయంలో ఓ చానల్‌ తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసిందని జీవితారాజశేఖర్‌ ఫైరయ్యారు. క్యాస్టింగ్‌కౌచ్‌పై వేయబోయే కమిటీలో తన పేరు ఉన్నట్టు తెలుసుకుని పథకం ప్రకారం తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తనపై తన ఫ్యామిలీ మెంబర్స్‌పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని జీవిత హెచ్చరించారు. 
ట్విట్టర్‌ లో శ్రీరెడ్డి విచిత్రమైన పోస్టులు.. కలకలం
ఇదిలావుంటే నటి శ్రీరెడ్డి ఇవాళ ట్విట్టర్‌ మూలకంగా కొన్ని విచిత్రమైన పోస్టులు చేసి కలకలం సృష్టించాయి. పవన్‌ కల్యాణ్‌పై ఒంటికాలిపై లేచి.. దుర్భాషలాడిన శ్రీరెడ్డి.. బుధవారం.. ట్విట్టర్‌ మూలకంగా పవన్‌కు, ఆయన తల్లికీ క్షమాపణలు చెప్పారు. అంతేలోనే.. ఈ వ్యవహారంలో తాను ఒంటరినయ్యానని.. సహకరించిన వారికి ధన్యవాదాలు అనీ పోస్ట్‌ చేశారు. దీంతో ఆమె మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. అంతలోనే.. స్టేషన్‌లో కేసు పెట్టాలన్న పవన్‌ మాటలను పాటిస్తానని, నటి జీవితా రాజశేఖర్‌ నుంచే కేసుల పర్వం ప్రారంభిస్తానని మరో ట్వీట్‌ చేశారు. మొత్తానికి శ్రీరెడ్డి లేవనెత్తిన కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇప్పుడు భాషలకు అతీతంగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. 

 

08:43 - April 19, 2018

గుంటూరు : చంద్రన్న పెండ్లి కానుక వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం చంద్రన్న పెండ్లి కానుక ప్రభుత్వ ఉత్తర్వులతోపాటు.. లోగోను ఆవిష్కరించారు.  ప్రతిమహిళనూ పారిశ్రామికవేత్తగా మార్చేందుకు సహాయ, సహకారాలు అందిస్తానన్నారు.
పెండ్లికానుక ఉత్తర్వులతోపాటు లోగో ఆవిష్కరణ
సీఎం చంద్రబాబు తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌ దగ్గర..చంద్రన్న పెండ్లి కానుక వెబ్‌సైట్ ను ప్రారంభించారు. అనంతరం ఉత్తర్వులతోపాటు లోగోను కూడా ఆవిష్కరించారు. చంద్రన్న పెండ్లి కానుక పథకంలో కళ్యాణ మిత్రలు సీఎం ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. కర్నూలు, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల కళ్యాణ మిత్రలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు ముఖ్యమంత్రి. చంద్రన్న పెండ్లి కానుక పేదలపాలిట గొప్పవరమని కళ్యాణ మిత్రలు పేర్కొన్నారు. ఈ పథకం అమలులో ముఖ్యమంత్రితోపాటు తాము కూడా ముందుంటామన్నారు.
అన్నగా అండగా ఉండేందుకే చంద్రన్న పెండ్లికానుక
సమాజంలో ఆడపిల్లలపట్ల వివక్ష చూపే తీరు క్రమంగా కనుమరుగవుతోందన్నారు. అన్నగా అండగా ఉంటూ పెండ్లి చేసేందుకే చంద్రన్న పెండ్లికానుక పథకాన్ని తెచ్చానని వెల్లడించారు. అన్ని మతాలు, కులాలవారిని గౌరవించడంతోపాటు... కులాంతర వివాహాలకు ప్రోత్సాహాలు అందిస్తామన్నారు. కులాంతర వివాహం చేసుకున్నవారికి  డెబ్బై ఐదు వేలు, వెనుకబడినవారికి యాభై వేలు,  ఎస్సీ, ఎస్టీలకు డెబ్బైఐదు వేలు, దివ్యాంగులకు లక్షరూపాయల  చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చెప్పారు. 
వధూవరులకు పెండ్లికానుక
వివాహం చేసుకునేవారు 15రోజుల ముందే తమ పేర్లు రిజిష్టర్‌ చేసుకోవచ్చన్నారు. సీఎం ప్రతినిధిగా కళ్యాణ మిత్రలు పెండ్లికి హాజరై వధూవరులకు పెండ్లికానుకను అందిస్తారు. వధూవరుల ఫోటోలను వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసిన వెంటనే వధువు బ్యాంకు ఖాతాలోకి  నగదు జమ అవడంతోపాటు.. వారి ఫోన్‌కు సందేశం కూడా వస్తుంది. ప్రతి మహిళా నెలకు పదివేలరూపాయలు సంపాదించాలని, అందుకు మహిళలకు అండగా ఉంటానని సీఎం అన్నారు. సహకార తనది.. సాధించే బాధ్యత మహిళలది అన్నారు. మహిళలు కేవలం పదివేల రూపాయల సంపాదనతో ఆగిపోకుండా.. పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దుకుంటారన్నారు సీఎం. తాను పాదయాత్ర చేపట్టిన సమయంలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని ముఖ్యమంత్రి చెప్పారు.. అందుకే ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని సీఎం వివరించారు. 

 

08:35 - April 19, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 20న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టే  ధర్మపోరాట దీక్షను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ప్రజల ఆందోళన కేంద్రానికి తెలిసేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. దీక్ష కు అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పరంగాకూడా అఖిల పక్షాలు, సంఘాలకూ ఆహ్వానాలు పంపుతున్నారు. 
దీక్షకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం 
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేయనున్న ధర్మపోరాట దీక్షకు మద్దతు కూడగట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీక్ష పర్యవేక్షణను కళావెంకట్రావ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఈనెల  20న ధర్మపోరాట దీక్షను చంద్రబాబు చేపడుతున్నారు. 
పుట్టిన రోజున చంద్రబాబు నిరశన దీక్ష 
తన పుట్టినరోజున రాష్ట్ర ప్రయోజనాలకోసం చంద్రబాబునాయుడు ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ నిరసన దీక్షలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు మద్దతివ్వాలని టీడీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న 'ధర్మపోరాట దీక్ష' నిర్వహణకు ఆయా శాఖల అధికారులకు మంత్రుల ఉప సంఘం దిశానిర్దేశం చేసింది. 
రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది అప్రమత్తం 
ధర్మదీక్షకు అఖిలపక్ష నేతలు హాజరవుతున్నందున   రెవెన్యూ, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు.  ఒకదానిపై సీఎం  చంద్రబాబు దీక్షకు కూర్చుంటే.. మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అలాగే వేదికగా ఎదురుగా 10 వేల మంది సభికులు ఆశీనులయ్యేలా కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని.. ఎత్తిచూపేలా వేదికను  రూపొందిస్తున్నారు. సభా స్థలితో పాటు స్టేడియం బయట కూడా ఎల్ఈడీ స్క్రిన్లను ఏర్పాటు చేస్తున్నారు.  

 

రెండోరోజు సీపీఎం జాతీయ మహాసభలు

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు నేడు రెండోరోజు జరుగనున్నాయి. నిన్న సభలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం అరుణపతాక ఆవిష్కరణతో మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 22 వరకూ జరిగే సభల్లో దాదాపు పాతిక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.  

 

నేడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల సైకిల్ యాత్ర

గుంటూరు : నేడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైకిల్ యాత్ర చేయనున్నారు. ఏపీపై కేంద్రం తీరుకు నిరసనగా సీఎం చంద్రబాబు దీక్షకు మద్దతుగా సైకిల్ యాత్ర చేయనున్నారు. 

 

నేడు షిర్డీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నేడు సీఎం కేసీఆర్ షిర్డీ వెళ్లనున్నారు. 3 గంటలకు కుటుంబసభ్యులతో కలిసి సీఎం షిర్డీ వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్నారు. 

Don't Miss