Activities calendar

20 April 2018

21:09 - April 20, 2018

హైదరాబాద్ : బీజేపీ ఓటమికి అవసరమైన విధివిధానాలపై సీపీఎం జాతీయ మహాసభ చర్చిస్తోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ తెలిపారు. పొలిట్‌బ్యూర్‌ ఆర్గనైజేషనల్‌ రిపోర్ట్‌పై శనివారం చర్చిస్తామన్న కరత్‌.. పార్టీ రాజకీయ తీర్మానం తుది దశకు వచ్చిందన్నారు. సీపీఎం జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో మూడోరోజు కొనసాగాయి. వివిధ అంశాలపై సభ తీర్మానాలు చేసింది. మహాసభలో అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం తుది రూపుకొచ్చింది. శనివారం పొలిట్‌బ్యూరో ఆర్గనైజేషనల్‌ రిపోర్ట్‌పై చర్చ ఉంటుంది. మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో సాగే బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా రాజకీయ తీర్మానంపై చర్చలు సాగుతున్నాయి.

రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చతో పాటే సీపీఎం జాతీయ మహాసభ.. వివిధ అంశాలపై తీర్మానాలనూ ఆమోదించింది. ముఖ్యంగా.. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలపై సమావేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలోని సమాఖ్య స్పూర్తికి... ఆర్థిక సంఘం విధివిధానాలు విఘాతంగా పరిణమించాయని, జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలు ఈ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతాయని మహాసభ అభిప్రాయపడింది.

కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ.. స్వల్పకాలిక పరిమితి కలిగిన ఉద్యోగాలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోందని.. దీనికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని సీపీఎం జాతీయ మహాసభ డిమాండ్‌ చేసింది. దీంతోపాటే.. త్రిపుర రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసను మహాసభ ఖండించింది. సిరియాపై అమెరికా దాడులకు వ్యతిరేకంగానూ మహాసభ తీర్మానం చేసింది. మహాసభల వివరాలు మీడియాకు వివరించిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌.. ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. పార్లమెంటు ప్రసంగాలతో రూపొందిన.. పీపుల్స్‌ స్ట్రగుల్‌ అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

21:07 - April 20, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కదిలాయి. జిల్లాకేంద్రాలు, నియోజకవర్గాలు, పట్టణాల్లో దీక్షలు చేపట్టారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీల సాధన కోసం ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తమైంది. పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి పోరాటానికి మద్దతుగా ఉపవాస దీక్షలు చేపట్టారు.

గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు దీక్షను చేపట్టారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చంద్రబాబు దీక్షకు మద్దతుగా నిరశన చేపట్టారు. సెలైన్‌ ఎక్కించుకుంటూనే కోడెల దీక్షలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ధర్మదీక్షకు సంఘీభావం ప్రకటించారు. విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దీక్షకు దిగారు. విజయనగరం పట్టణంలో కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజు, రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణరంగారావు దీక్షల్లో పాల్గొన్నారు. విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు దీక్ష చేశారు. అటు నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న పాత్రుడు నేతృత్తంలో పెద్ద ఎత్తున నిరశన దీక్షలు చేపట్టారు. నెల్లూరులోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మంత్రి నారాయణ నిరశన చేపట్టారు. చంద్రబాబు ధర్మదీక్షకు సంఘీభావం ప్రకటించారు. పట్టణంలోని తల్పగిరి రంగనాథుడి ఆలయంలో పూజలు చేశారు. సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా చంద్రబాబు ధర్మదీక్షకు టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు. కర్నూలు పట్టణంలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎంపీ టీజీ వెంకటేశ్‌ దీక్షలో పాల్గొన్నారు. పత్తికొండలో టీడీపీ నేతలు శ్యాంబాబు నేతృత్వంలో దీక్ష చేపట్టగా.. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర్‌రెడ్డి దీక్షకు దిగారు. అంతకు ముందు పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ధర్మపోరాట దీక్షలు చేపట్టారు. మండపేటలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు దీక్షను చేపట్టగా.. రంపచోడవరంలోజరిగిన నిరశనలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. అటు కాకినాడరూరల్‌ సర్పవరం సెంటర్‌లో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దీక్షలో పాల్గొన్నారు. రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్‌ వద్ద జరిగిన దీక్షలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. అటు రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాదయాత్ర నిర్వహించారు. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం వరకు సాగిన యాత్రలో పెద్దసంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విభజన చట్టం హామీలను నెరవేర్చకుండా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని నాయకులు విమర్శించారు.

చంద్రబాబు దీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరిలో పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టారు. నర్సాపురంలో ఎమ్మెల్యే బండారు మధవనాయుడు ఆధ్వర్యంలో ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. అటు కడపజిల్లా వ్యాప్తంగా చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతూ ర్యాలీలు నిర్వహించారు. కడప పట్టణంతో పాటు బద్వేలు, మైదుకూరులో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టారు. కడపలో మంత్రి ఆదినారాయణ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చంద్రబాబు ధర్మదీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సూర్యనారాయణ దీక్షను చేపట్టారు. అటు హిందూపురంలోని సద్భావనా సర్కిల్‌లో ఎంపీ నిమ్మల కిష్టప్ప దీక్ష నిర్వహించారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్మదీక్షలో పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. 

21:03 - April 20, 2018

విజయవాడ : తన జీవితంలో పుట్టినరోజు నాడు దీక్ష చేయాల్సి వస్తుందని ఏనాడూ ఊహించలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ధర్మపోరాట దీక్ష చేసిన చంద్రబాబు... చిన్నారులు నిమ్మరసం ఇవ్వగా దీక్ష విరమించారు. రాష్ట్రం కోసం... తనను నమ్ముకున్న వారి కోసం దీక్ష చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తన పోరాటం సాగుతుందన్నారు చంద్రబాబు. కేంద్రానికి నేను దాసోహం చేయాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని బలహీనం చేయాలనే చూస్తే సహించేది లేదన్నారు చంద్రబాబు. నన్ను భయపెడితే.. భయపడే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు. నేను భయపడే వ్యక్తినైతే మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేసేవాడినా అని ప్రశ్నించారు. పోరాటానికి దిగాం.. ముందుకెళ్తాం... వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు. బీజేపీ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు ఈనెల 30న తిరుపతిలో సభ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి ఎంతో సాయం చేశామని కేంద్రం అవాస్తవాలు చెబుతుందన్నారు చంద్రబాబు. నేను చిట్టా విప్పితే ఎన్నో విషయాలు బయటకు వస్తాయన్నారు. ఒక్కసారి నిర్ణయించే అది సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు. ప్రజల సహకారం ఉంటే.. ప్రత్యేక హోదా సాధించి తీరుతానన్నారు.

దీక్షకు రాని పార్టీల అజెండాలు వేరే ఉన్నాయి..పార్టీ అధ్యక్షుడిగా కాదు.. 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న సీఎంగా దీక్ష చేశాననన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనప్పుడు సీఎం వెంట నడవాలని, తాము కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు తగ్గుతాయని తెలుసు..ఎన్డీయే గెలుస్తుంది.. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని పేర్కొన్నారు. టీడీపీకి దేశరాజకీయాలు కొత్తేమీ కాదు

ఎన్టీఆర్‌ వీపీసింగ్‌ను ప్రధానిగా చేశారని, యుపీఏ హయాంలో ఇద్దరు ప్రధానుల ఎంపికలో తనది కీలక భూమిక అన్నారు. రాష్ట్రానికి న్యాయం కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామని, ఎన్నికల సభల్లోనూ.. ప్రధాని అయ్యాక మోదీ చెప్పిన మాటలేంటి..?

నేను కొత్త విషయాలు అడగడం లేదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. మిగిలిన అంశాలపైనా క్లారిటీ ఇచ్చారని..విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చమనే అడుగుతున్నానన్నారు. రాజ్యసభలో మీరు అడిగిన ప్రత్యేక హోదా అంశాన్నే అడుగుతున్నట్లు, పోలవరం ఏడు మండలాలు ఇవ్వకుంటే ప్రమాణ స్వీకారం చేయను అన్నారని తెలిపారు. నేను 1995లోనే సీఎంని. మోదీ ఆర్వాతే సీఎం అయ్యారు

మీకోసమే ఓపిక పట్టానన్నారు. మనకు కాకుండా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఫలాలు ఇచ్చారని, మనల్ని మాత్రం స్పెషల్‌ ప్యాకేజీతో సరిపెట్టుకొమ్మంటారని తెలిపారు. ఆ రాష్ట్రానికి ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తే జవాబే లేదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

దీక్ష పేరిట రూ. 20కోట్ల ప్రజాధనం దుర్వినియోగం - బాబు...

విజయవాడ : హోదా వల్ల ఏం జరుగుతుందన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీక్ష చేయడం వల్ల ఏం ప్రయోజనమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. దీక్ష పేరిట ప్రజాధనం రూ. 20 కోట్లు దుర్వినియోగం చేశారని, బాబు దృక్ష అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పేర్కొన్నారు. విద్యార్థులని ప్రజలని బలవంతంగా దీక్షకు తరలించారని, రాజకీయ ప్రయోజనాల కోసమే విద్యార్థులను దీక్షకు పిలిచారని విమర్శించారు. వామపక్షాలు దీక్ష చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారని, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి పోతాయన్న సీఎం ఆయన దీక్ష చేయడంలో ఆంతర్యం ఏమిటనీ నిలదీశారు. 

ఫ్యాన్స్ కు పవన్ సూచన...

హైదరాబాద్ : టీవీ9 శ్రీని రాజుల ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆయనపై జనసేన అధినేత పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ మరో ట్వీట్ చేశారు. శనివారం శ్రీని రాజు తనపై పరువునష్టం దావా వేస్తున్నారని, తన ఫ్యాన్స్‌ శాంతియుతంగా ఉండాలని, ఎటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడకూడదని కోరారు. అలాగే, తాను కూడా ఆ ఛానెల్‌ హెడ్‌లపై సుదీర్ఘంగా న్యాయపరమైన యుద్ధం చేస్తానని ప్రకటించారు.  

20:28 - April 20, 2018

విజయవాడ : తన కోసం పోరాటం చేయడం లేదని, ఐదు కోట్ల ప్రజల కోసం తాను పోరాటం చేస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన ధర్మ పోరాట పేరిట దీక్ష చేపట్టారు. సాయంత్రం ఆయన దీక్ష విరమించిన అనంతరం సభను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రంలో ఉండే వారు తెలివి తేటల్లో తక్కువేమి కాదని, గత కొన్ని దశాబ్దాల కింద విభజన సమయంలో ఎపీ రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందని తెలిపారు. నా జన్మదినం రోజున నిరహార దీక్ష చేయాలని అనుకోవాలని..ఇలాంటి రోజు వస్తుందని తాను ఊహించలేదన్నారు. అన్ని సంఘాల వారు దీక్షలో పాల్గొన్నారని, కానీ ఇతర రాజకీయ పార్టీలు పాల్గొనలేదని విమర్శించారు. విభజన జరిగిన విధానం ప్రజలకు నచ్చలేదని, ఇక్కడ ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో తాము 8 శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగిందన్నారు. తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టవద్దని తాను విన్నవించడం జరిగిందని తెలిపారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు తగ్గుతాయని, ఎన్డీయే గెలుస్తుంది..రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఉద్ధేశ్యంతోనే పొత్తు పెట్టుకోవడం జరిగిందని ప్రజలకు తెలిపారు. అధికారం కోసం టిడిపి ముందుకెళ్లలేదని పేర్కొన్నారు.

విభజన చట్టంలో పేర్కొన్న హామీలు..కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అందులో ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ ప్రజల తరపున అడుగుతున్నానని..డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వమో చెప్పాలని కేంద్రాన్ని నిలదీస్తున్నానన్నారు. ఏడు మండలాలను ఏపీకి ఇవ్వకపోతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని ఆనాడే ప్రధాన మంత్రికి చెప్పానన్నారు. తాను భయపడే వ్యక్తిని కాదనని..ఐదు కోట్ల ప్రజలకు మాత్రమే భయపడుతానని, వారు మాత్రమే తనకు హై కమాండ్ అని మరోసారి స్పష్టం చేశారు. పూర్తి ప్రసంగం కోసం వీడియో క్లిక్ చేయండి. 

టిటిడి బోర్డు సభ్యులు...

విజయవాడ : టిటిడి బోర్డు సభ్యులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. టిటిడి ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. సభ్యులుగా రాయపాటి సాంబశివరావు, జీఎస్ఎస్ శివాజీ, బోండా ఉమ, అనిత, పార్థసారధి, చల్లా రాంచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, రుద్రరాజు పద్మరాజు, మేడ రామచంద్రారెడ్డి, డొక్కా జగన్నాథం, ఇనుగాల పెద్దిరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సుధా నారాయణమూర్తి, స్వప్నలను ప్రభుత్వం నియమించింది. 

కేంద్రాన్ని నిలదీస్తున్నా - బాబు...

విజయవాడ : విభజన చట్టంలో పేర్కొన్న హామీలు..కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అందులో ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ ప్రజల తరపున అడుగుతున్నానని..డిమాండ్ చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వమో చెప్పాలని కేంద్రాన్ని నిలదీస్తున్నానన్నారు. 

 

అందుకే బిజెపితో పొత్తు పెట్టుకున్నాం - బాబు...

విజయవాడ : ఎన్డీయే గెలుస్తుంది..రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఉద్ధేశ్యంతోనే పొత్తు పెట్టుకోవడం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధికారం కోసం టిడిపి ముందుకెళ్లలేదని పేర్కొన్నారు. 

బర్త్ డే రోజున దీక్ష చేస్తానని అనుకోలేదు - బాబు...

విజయవాడ : రాష్ట్రంలో ఉండే వారు తెలివి తేటల్లో తక్కువేమి కాదని, గత కొన్ని దశాబ్దాల కింద విభజన సమయంలో ఎపీ రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కాసేపటి క్రితం ఆయన ధర్మపోరాట దీక్షను విరమించారు. నా జన్మదినం రోజున నిరహార దీక్ష చేయాలని అనుకోవాలని..ఇలాంటి రోజు వస్తుందని తాను ఊహించలేదన్నారు. 

18:09 - April 20, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఫెస్ట్‌లో కేఎల్‌ యూనివర్సిటీ ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు విజయవాడకే పరిమితమైన ఈ యూనివర్సిటీ హైదరాబాద్‌లోనూ బ్రాంచ్‌ ఏర్పాటు చేయనున్నట్టు సిబ్బంది చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:05 - April 20, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఫెస్ట్‌ జనంతో కిటకిటలాడుతోంది. ఫెస్ట్‌ ముగియడానికి సమయం దగ్గరపడుతుండడంతో జనం భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన బ్రిల్లియంట్‌ స్కూల్‌ స్టాల్‌ సందర్శకులను ఆకట్టుకుంటోంది. తమ పిల్లలకు నాణ్యమైన విద్యనందించడానికి బ్రిలియంట్‌ స్కూల్‌ స్టాల్‌లో ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:02 - April 20, 2018

హైదరాబాద్‌ : నగర ప్రజలను హైదరాబాద్ ఫెస్ట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఫెస్ట్‌కు ప్రజల తాకిడి ఎక్కువైంది. ఈ ఫెస్ట్‌లో గీతం యూనివర్సిటీ తన స్టాల్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:00 - April 20, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫెస్ట్‌ ఏడవరోజు ఉత్సాహంగా సాగింది. కళాకారుల ఆటపాటలు వీక్షకులను ఉర్రూతలూగించాయి. సృజనస్వరంలో నిర్వహించిన పాటలపై చర్చ ఆలోచింపచేసింది. సైన్స్‌హబ్‌ అందరిలోనూ ఆకస్తిని రేకెత్తించింది. హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ ఫెస్ట్‌లో బాలూ హెర్బల్స్‌ ఏర్పాటు చేసిన స్టాల్‌ సందర్శకులను ఆకట్టుకుంటోంది. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

17:58 - April 20, 2018

ఢిల్లీ : అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబైలోని దావూద్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆస్తుల స్వాధీనంపై దావూద్‌ సోదరి హసీనా పార్కర్‌, తల్లి అమినా వేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ముంబైలోని నాగ్‌పడాలో దావూద్‌కు కోట్లాది రూపాయల విలువ ఏడు రెసిడెన్షియల్‌ ఆస్తులున్నాయి. 2 ఆస్తులు దావూద్‌ తల్లి అమినా పేరిట మరో 5 ఆస్తులు సోదరి హసీనా బదలాయించుకున్నారు. దావూద్‌ తల్లి, సోదరి వీరిద్దరు కూడా మృతి చెందారు. దావూద్‌ ఆస్తులను 1988లో సఫెమా చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

17:24 - April 20, 2018

గుజరాత్‌ : నరోదా పటియాలో జరిగిన అల్లర్ల కేసులో గుజరాత్‌ హైకోర్టు తీర్పు వెల్లడించింది. బిజెపి మాజీ మంత్రి మాయా కొద్నానీ నిర్దోషిగా ప్రకటించింది. సంశయ లాభం కింద కొద్నానిని నిర్దోషిగా ప్రకటిస్తున్నాట్లు హైకోర్టు పేర్కొంది. కొద్నాని 2014లో బెయిలుపై విడుదలయ్యారు. కాగా ఈ కేసులో భజరంగ్‌దళ్‌ నేత బాబు భజరంగీని దోషిగా తేల్చింది. 2012లో ప్రత్యేక కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను హైకోర్టు ఖరారు చేసింది. మరో 29 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. నరోదా అల్లర్ల బాధితులకు పరిహారం ఇవ్వాలన్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. 2002లో నరోదా నరమేథంలో 100 మంది ముస్లింలు సజీవదహనమయ్యారు. వృత్తి రీత్యా వైద్యురాలైన కొద్నానీ అల్లర్లకు పురిగొల్పారని ఆరోపణలతో అరెస్ట్‌ అయ్యారు. ప్రత్యేక కోర్టు ఆమెకు 28 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

17:20 - April 20, 2018

అది మరో జలియన్ వాలా బాగ్... అడవిబిడ్డలను ఆదుకోవాల్సిన సర్కార్‌ పాశవికంగా దాడి చేసింది... అన్నె పున్నెం ఎరగని అమాయక గిరిజనులను పిట్టల్లా కాల్చిచంపింది... కూటికోసం, భూమికోసం గొంతెత్తడమే వారు చేసిన నేరం..ఆనాటి ప్రజా సభే వారి పాలిట వల్లకాడుగా మారింది. ఇంద్రవెల్లిలో గిరిజనులపై పోలీసులు జరిపిన మారణకాండకు ముప్పైఎనిమిదేళ్ళు నిండిన సందర్భంగా ప్రత్యేక కథనం.

అణచివేత ఉన్నచోట పోరాటం, అన్యాయం ఉన్నచోట ఆందోళన,. దోపిడీ, పీడన ఉన్నచోట ఉద్యమం తప్పదు.... ఆ తిరుగుబాటు, పోరాటం, ఆందోళన అనేక రూపాల్లో ఉంటుంది. ఫ్రెంచ్ విప్లవం నుంచి చైనా విప్లవం దాకా చరిత్ర అదే చాటి చెప్పింది. ప్రతి క్షణం చస్తూ బతకడం కంటే.. తిరగబడి చచ్చినా ఫర్వాలేదనే తెగింపు... తిరుగుబాటుకు ప్రతిరూపమే ఇంద్రవెల్లి ఘటన. 1981 ఏప్రిల్ 20.. చరిత్ర పుటలను నెత్తురుతో తడిసిన రోజది.. జలియన్‌వాలా బాగ్‌ దురాగతాన్ని తలపించిన రోజది.. పచ్చని అడవి ఆదివాసీల నెత్తుటితో తడిసి ఎర్రబడ్డ రోజు .అరణ్యం నెత్తురు మడుగైన రోజు. ఇంద్రవెళ్లి అరుణారుణమైన రోజు. నిరాయుధులైన ఆదివాసీలను పోలీసులు విచక్షణా రహితంగా కాల్చి చంపిన రోజు.. అన్ని రంగాల్లో వెనకబడ్డ ఆదిలాబాద్ జిల్లాలో.. ఆదివాసీల జనాభా ఎక్కువ. కడు దరిద్రంలో మగ్గుతున్న ఆదివాసీలకు సహకరించారు ఇప్పుడు మావోయిస్టులుగా పిలవబడుతున్న అన్నలు.

ఆదివాసీల తలరాత మారాలంటే పోరాటమే మార్గమన్నారు మావోయిస్టులు. పేదరికం పోవాలంటే పోరుబాట తప్పదని చెప్పారు. దున్నే వాడికే భూమి అన్న అన్నల నినాదం ఆదివాసీలను ఆకట్టుకుంది.. ఆదివాసీలు అధికంగా ఉన్న అడవి ప్రాంతంలోని ఇంద్రవెల్లి 1981ఏప్రిల్ 20న నక్సలైట్లు గిరిజన సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఇంద్రవెల్లితో పాటు.. దాని చుట్టు పక్కల ఉన్న యమికుంట, తోషం, ఖానాపూర్, సైద్పూర్, ఖండాల, హత్తిగుట్ట , తిప్పల, ఉట్నూర్, తిర్యాని వంటి ప్రాంతాలనుంచి అడ్డవి బిడ్డలు హాజరయ్యారు. ఎర్రజెండాలతో గిరిజనులు వేలాదిగా తరలిరావడం మొదలు పెట్టారు.. పోటెత్తుతున్న జన సంద్రాన్ని చూసి పాలకుల్లో కలవరం మొదలైంది. దీంతో వందలాదిగా పోలీసులను మోహరించారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిరాయుధులైన అడవిబిడ్డలపై పోలీసులు తుపాకులు పేల్చారు. భయం తో పారిపోతున్న ఆదివాసీలను వెంటాడి వెంటాడి కాల్చి చంపారు.

ఎటు చూసినా గిరిజనుల శవాలే... గుట్టలుగా పడ్డ గిరిజనుల శవాలతో పల్లెలన్నీ వల్లకాడులయ్యాయి. అ రోజు ఏం జరిగిందో ఇప్పటికీ గిరిజనుల కళ్ళలో కదలాడుతోంది అంటున్నారు.. ఆ తర్వాత రైతు కూలి సంఘం అమరులైన గిరిజనుల స్మారక స్థూపాన్ని నిర్మించింది. 1996లో పోలీసులు అ స్తూపాన్ని కూల్చేశారు. అ తరువాత గిరిజనులు పోరాటంతో సర్కార్‌ దిగొచ్చింది. తిరిగి స్తూపాన్ని నిర్మించింది. కానీ ఇంతవరకూ బాధితులకు పరిహారం అందలేదు. ఈ మూడు దశాబ్దాల్లో జెండాలు మారాయి... పార్టీలు, పాలకులు మారారు.. కానీ ఆదివాసీల బతుకుల్లో ఎలాంటి మార్పులేదు. సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఉన్నా లేనట్లే. వారి అబివృద్దికి కేటాయిస్తున్న వందలు వేల కోట్ల నిధులు ఎటు పోతున్నాయో ఏలిన వారికే తెలియాలి.గతంలో ఏప్రిల్ 20 వచ్చిందంటే చాలు ఏజెన్సీలో అడుగడుగునా ఆంక్షలే. ఇంద్రవెల్లి పోలీసుల నిర్బంధంలో ఉండేది. అమరుల స్తూపం వద్ద భారీ బందోబస్తు కనిపించేది. చుట్టూ 20కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు 144 సెక్షన్ అమలయ్యేది. దీంతో ఆదివాసీల్లో ఏదో తెలియని ఆందోళన నెలకొనేది. అమరులకు కనీసం నివాళులర్పించుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ 38ఏళ్ల పాటు ఏప్రిల్ 20న కొనసాగిన ఖాకీ నిర్బంధాన్ని సొంత రాష్ర్టంలో సర్కారు ఎత్తేసింది. దీంతో శాంతియుత వాతావరణంలో నివాళులర్పించేందుకు గిరిజను సిద్ధమవుతున్నారు. ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపం వద్ద ఏప్రిల్ 20 న విధిస్తున్న ఆంక్షలు, స్వరాష్ట్రంలో తొలగిపోవడంతో గిరిజనులు, ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. 

16:54 - April 20, 2018

ఫుడ్ బిజినెస్ అంటే అన్నం,పప్పు, సాంబార్,చట్నీ, పాపడ్స్ వంటి సాధారణ రెస్టారెంట్ల నుండి వేల రకాల విభిన్న వంటకాల వరకూ రెస్టారెంట్లు నేడు సర్వసాధారణం అయిపోయాయి. మరి ఈపోటీ వ్యాపారంలో నెగ్గుకురావాలంటే తమకంటు ఓ వినూత్న తరహా పద్దతులను ప్రవేశపడుతుండాలి. ఆఫర్లు, డిస్కౌంట్లు అంటు రెస్టారెంట్లు ఊదరగొడుతుంటాయి. కానీ కాసేపు చచ్చిపోండి ఓ కూల్ డ్రింక్ లో డిస్కౌంట్ ఇస్తామన్న రెస్టారెంట్ కు వెళ్లారా? అటువంటి రెస్టారెంట్ గురించి విన్నారా? పోనీ కనీసం ఊహించారా? కానీ ఏంటి జోక్ అనుకుంటున్నారా? కాదండీ బాబు నిజంగా వుంది. మరి అది ఎక్కడ వుందో? ఆ రెస్టారెంట్ అటువంటి ఆఫర్ ఎందుకు పెట్టిందో? అనే ప్రశ్నలు బుర్రలో గిరగిరా తిరిగేస్తున్నాయి కదూ? మరి ఆ విశేషాలేమిటో మనం కూడా తెలుసుకుందాం..

విచిత్రమైన ఆఫర్లతో వినూత్న రెస్టారెంట్ ..
రెస్టారెంట్‌లోకి వెళ్లి కూర్చోగానే, నవ్వుతూ ఎదురొచ్చే సర్వర్లు ఉంటారు. వాళ్ల అందించే మెనూకార్డ్‌లో రకరకాల ఆహార పదార్థాలు నోరూరిస్తూ ఉంటాయి. ఎంత తింటే అంత బిర్యానీ ఫ్రీ, అని రెండు బిర్యానీలకు ఒక బిర్యానీ ఫ్రీ...! ఇలా రకరకాల ఆఫర్లు నోరూరిస్తూ ఉంటాయి. కానీ, ‘శవపేటికలో జస్ట్‌ కొంచెం సేపు పడుకోండి.... మీకు డ్రింక్‌ ధరలో డిస్కౌంట్‌ ఇస్తాం’ అనే రెస్టారెంట్‌ గురించి ఎక్కడైనా విన్నారా? థాయ్‌లాండ్‌లోని ఓ రెస్టారెంట్‌ దీన్ని ఆఫర్‌ చేసింది. ఈ విచిత్రమైన రెస్టారెంట్‌ పేరు ‘కిడ్‌ మాయి డెత్‌ కేఫ్‌’.

రెస్టారెంట్ లో స్పెషల్ మెనూకార్డ్..
ఈ రెస్టారెంట్‌ మెనూకార్డ్‌ తెరవగానే ‘డెత్‌’, ‘పెయిన్‌ఫుల్‌’ అనే డ్రింక్స్‌ కూడా దర్శనమిస్తాయట. ఇంతకీ ఇలాంటి ఆఫర్‌ పెట్టడం వెనక ఓ సదుద్దేశమే ఉందట. మానవతా విలువలు కరువైపోతున్న నేటి సమాజానికి బుద్ధుడి సిద్ధాంతాలు ఎంతో అవసరమని థాయ్‌లాండ్‌కి చెందిన అధ్యాపకుడు గ్రహించాడు. మరణం ఎలా ఉంటుందో తెలిస్తే, మనిషిలో నానాటికీ పెరిగిపోతున్న కోపం, అసూయాద్వేషాలు తగ్గుతాయన్న ఆలోచన ఆయనకు వచ్చింది. ఓ శవపేటికను తయారు చేయుంచాడు. అందులో కొంచెంసేపు నిద్రపోతే చాలు, డ్రింక్‌ ధరలో డిస్కౌంట్‌ అని ప్రకటించాడు. కానీ, అసలు విషయం తెలిసి, ‘వాట్‌ యాన్‌ ఐడియా’ అనుకొని, ఈ ఆఫర్‌ను స్వీకరిస్తున్నారు. ఈ శవపేటికలో పడుకోగానే, హోటల్‌ సిబ్బంది దాన్ని మూసేస్తారట.

పేరుతగ్గట్లే కస్టమర్ల తాకిడితో రెస్టారెంట్ ఫుల్..
ఆ అంధకారంలో నిజమైన జీవితానికి అర్థం ఏంటో తెలుస్తుందని ఆ ప్రొఫెసర్‌ అభిప్రాయం. అందుకు తగ్గట్టే దీనికి డిమాండ్‌ పెరిగి, కస్టమర్లు పోటెత్తుతున్నారని హోటల్‌ నిర్వాహకులు ఖుషీ అయిపోతున్నారు.

16:40 - April 20, 2018

హైదరాబాద్ : ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కలిశారు. తెలంగాణలో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు, తాము చేపట్టిన బస్సుయాత్రపై రాహుల్‌తో చర్చించినట్లు టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బస్సుయాత్రలో రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నట్లు తెలిపారని... దానిపై షెడ్యూల్‌ రూపొందిస్తామన్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దై... న్యాయస్థానంలో పోరాడి గెలిచిన కోమటిరెడ్డి, సంపత్‌లను రాహుల్‌ అభినందించినట్లు ఉత్తమ్‌ తెలిపారు. 

అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అసెంబ్లీ బహిష్కరణకు గురైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్డులో ఊరట లభించిన విషయాన్ని రాహుల్‌కు వివరించినట్లు చెప్పారు. న్యాయస్థానంలో పోరాడి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను ఆయన అభినందించినట్లు తెలిపారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని కేసీఆర్‌ను ఉద్దేశించి ఉత్తమ్‌ హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్‌ మధుసూదనాచారి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ అప్రజాస్వామికంగా వ్యవహరించారని విమర్శించారు. పదవులను దుర్వినియోగ పరిచిన కేసీఆర్‌, మధుసూదనాచారి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మాజీ చీఫ్ జస్టిస్ రాజేందర్ సచార్ మృతి..

ఢిల్లీ : మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేందర్ సచార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేందర్ సచార్ తన 94వ ఏట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సచార్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు లోధి రోడ్‌లో జరగనున్నాయి. 1985, ఆగస్టు 6 నుంచి అదే ఏడాది డిసెంబర్ 22 వరకు చీఫ్ జస్టిస్‌గా సచార్ సేవలందించారు. 

16:36 - April 20, 2018

విజయవాడ : దేశమంతా మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఏపీకి అన్యాయం చేసిన మోది ఒక ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడదీసి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని విమర్శించారు. మోదీకి తెలుగు వారి ఘోష వినిపించడంలేదా అని బాలకృష్ణ ప్రశ్నించారు. 

సీపీఎం చరిత్రలో రహస్య ఓటింగ్ లేదు : కరత్

హైదరాబాద్ : జాతీయ మహాసభ ఇప్పటికే పలు తీర్మానాలను ఆమోదం పలికిందని ఈ నేపథ్యంలో త్రిపురలో ఎన్నికల అనంతరం పెచ్చరిల్లిన హింసను ఖండిస్తు తీర్మానం, రాజకీయ తీర్మానంపై ఈ రాత్రికి నిర్ణయం తీసుకుంటామన్నారు. మాలో ఎవరైనా రహస్య ఓటింగ్ అడిగితే పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని కరత్ తెలిపారు. సీపీఎం చరిత్రలో ఇంతవరకూ రహస్యఓటింగ్ అనే ప్రస్తావనే రాలేదనీ..పని విభజనలో భాగంగానే తీర్మానాలను ప్రవేశపెడుతుంటామనీ ఇందులో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని కరత్ స్పష్టం చేశారు. సిరియా అంతర్యుద్ధంతో అల్లాడిపోతోంది.

బీజేపీని ఓడించేందుకు చర్యలు :కరత్

హైదరాబాద్: మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అవసరమైన విధివిధానాలను మహాసభలోచర్చిఇస్తున్నామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు కరత్ పేర్కొన్నారు. ఆర్థిక సంఘం విధి విధానాలను దక్షిణాది రాష్ట్రాలకు చేటు చేస్తాయన్నారు.1971 జనాభా ప్రాతిపదికన కాకుండా తాజా లెక్కలను తీసుకోవాడం సరికాదని కరత్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయించామన్నారు. 

మాపార్టీలో చీలికలను ఆశించినవారికి అసంతృప్తే : కరత్

హైదరాబాద్ : సీపీఎం పార్టీలో చీలికలు వస్తే చూడాలని ఆశపడేవారికి ఎప్పటికీ అసంతృప్తే మిగులుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. రేపు పొలిటికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ పై మహాసభ చర్చిస్తుందని కరత్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘంపై తీర్మానం చేశామనీ, రాజకీయ ముసాయిదాపై చర్చ కొనసాగుతోందన్నారు. దీనిపై వందల సంఖ్యలో సవరణలు వచ్చాయన్నారు. ఇప్పటికే పలు తీర్మానాలకు మహాసభ పలికిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు కరత్ పేర్కొన్నారు. 

15:48 - April 20, 2018

నిజామాబాద్ : భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఎండలు విపరీతంగా పెరగడంతో బయటకు రావాలంటే ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. ఏప్రిల్‌ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు ఉంటే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని నిజామాబాద్‌ జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఎండ తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

15:47 - April 20, 2018

పెద్దపల్లి : నియోజకవర్గంలోని రైతాంగానికి తాగు, సాగు నీరు అందించకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే విజయరమణ. పెద్దపల్లిలో రైతులు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేసి నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. పాదయాత్రలో పాల్గొనకుండా విజయరమణను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ప్రభుత్వమే స్పందించి పెద్దపల్లికి సాగు, తాగు నీరందించాలని డిమాండ్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయరమణతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:44 - April 20, 2018

ఢిల్లీ : కుట్రపూరితంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి. ఈ మేరకు ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ నేతలు కలిశారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ కోర్టు తీర్పును ఎన్నికల సంఘానికి వివరించినట్లు శశిధర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీకి లేఖ రాయాలని కోరగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం చెప్పినట్లు కాంగ్రెన్ నేతలు తెలిపారు. 

15:25 - April 20, 2018

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ధర్మ పోరాట దీక్ష కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగనుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు కూర్చున్నారు. చంద్రబాబు దీక్షకు పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. చంద్రబాబు దీక్షకు మద్దతుగా 13 జిల్లాల్లోనూ మంత్రులు దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా టిడిపి నేత మాట్లాడుతూ...చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మద్దతు తెలియచేస్తున్నామని ఈ సందర్భంగా తమకు కొన్ని సమస్యలు ఉన్నాయని, పరిష్కారమయితే దివ్యాంగుల ఓట్లు అన్ని టిడిపికే పడుతాయన్నారు. దివ్యాంగులకు సమస్యలు నెలకొన్నాయని, బీసీలకు 33 శాతం ఇస్తున్నారని, ఇందులో తమకు కూడా కల్పించాలన్నారు. 

'మా' ఆఫీసు నుండి వెళ్లిపోయిన పవన్...

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ నుండి వెళ్లిపోయారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిపై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేస్తూ మా ఛాంబర్ లో బైఠాయించారు. పవన్ కు మద్దతుగా మెగా కుటుంబం, ఇతర సినీ ప్రముఖులు విచ్చేశారు. దీనితో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావించి పవన్ తో చర్చలు జరిపారు. అనంతరం పవన్ అక్కడి నుండి వెళ్లిపోయారు. 

15:01 - April 20, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ లో ప్రకంపనాలు జరుగుతూనే ఉన్నాయి. క్యాస్టింగ్ టచ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. ఏకంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడం...దీనివెనుక తానున్నట్లు వివాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొనడంతో మెగా ఫ్యామిలీ తీవ్రంగా స్పందించింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఏకంగా ఫిల్మ్ ఛాంబర్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. పవన్ వచ్చారన్న విషయం దావానంలా వ్యాపించడంతో 'మా' అసోసియేషన్ సభ్యులు, అభిమానులు చేరుకున్నారు. తన తల్లికి న్యాయం జరిగేవంతవరకు ఇక్కడి నుండి కదిలి వెళ్లనని పవన్ భీష్మించుకూర్చొవడంతో ఉత్కంఠ రేగింది. పవన్ కు మద్దతుగా మెగా కుటుంబం నుండి అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ లు చేరుకున్నారు. కాసేపు నిరసన తెలిపిన పవన్ అక్కడి నుండి వెళ్లిపోయారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పవన్ కు పోలీసులు నచ్చచెప్పడంతో ఆయన వెళ్లిపోయినట్లు సమాచారం. కానీ తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. కాసేపట్లో 'మా' కార్యాలయానికి మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

14:58 - April 20, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు మూడో రోజు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ సభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేతలు వివిధ అంశాలపై చర్చిస్తూ పలు తీర్మానాలను ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా  ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ మీడియాతో మహాసభల వివరాలను వివరించారు. మహాసభల కీలక అజెండా రాజకీయ తీర్మానమేనని, రాజకీయ తీర్మానంపై ఈ రాత్రికి నిర్ణయమౌతుందన్నారు. ప్రస్తుత తరుణంలో ఇంతకు మించి ఏమీ చెప్పలేమని, రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చ జరుగుతోందని, సవరణలు ఎక్కువగా వచ్చాయని..వాటిని పరిశీలించి తుది రూపునిస్తామన్నారు.

వందల్లో సవరణలు వచ్చాయన్నారు. రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చ జరుగుతోందని, గడిచిన మూడేళ్లలో తమ పనితీరుపై సమీక్షిస్తామన్నారు. శనివారం పొలిటికల్ ఆర్గనైజేషనల్ రిపోర్టుపై చర్చను చేపడుతామన్నారు. ఇప్పటికే కొన్ని తీర్మానాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘంపై తీర్మానం చేయడం జరిగిందని, ఆర్థిక సంఘం విధి విధానాలు సమాఖ్య స్పూర్తికి దెబ్బ అని అంతేగాక దక్షిణాది రాష్ట్రాలకు చేటన్నారు. ఇప్పటి వరకు రహస్య ఓటింగ్ అన్న ప్రస్తావనే రాలేదని, పని విభజనలో భాగంగానే తీర్మానాలను ప్రవేశ పెడుతుంటామన్నారు. తమలో ఎవరైనా రహస్య ఓటింగ్ అడిగితే పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి వెళ్లడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు రహస్య ఓటింగ్ అన్న ప్రస్తావనే లేదని, తమ పార్టీలో చీలిక ఊహిస్తే అందరికీ అసంతృప్తే ఎదురవుతుందని మీడియానుద్ధేశించి వ్యాఖ్యానించారు.

1971 జనాభా ప్రాతిపదిక కాకుండా తాజా లెక్కలను తీసుకోవడం అసమంజసమన్నారు. దీనిపై ప్రజాభిప్రాయాన్నీ సేకరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిమితకాల ఉద్యోగాల విధానంపై..సిరియాపై అమెరికా దాడులను ఖండిస్తూ..త్రిపురలో ఎన్నికల అనంతరం హింసను ఖండిస్తూ తీర్మానాలు చేసినట్లు జరిగిందని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:50 - April 20, 2018

హైదరాబాద్ : 'మా' అధ్యక్షపదవికి శివాజీరాజా రాజీనామా చేశారు. ఫిల్మ్ ఛాంబర్ కు మెగా ఫ్యామిలీ చేరుకుంది. న్యాయ పోరాటానికి పవన్ కళ్యాణ్ దిగారు. తన తల్లికి న్యాయం కలిగే వరకు ఛాంబర్ నుంచి కదిలేదని తెలిపారు. 'మా' చర్యలు తీసుకుంటుందా ? నేను కార్యాచరణకు దిగాలా' అని అన్నారు. పవన్ కళ్యాణ్ పోరాటానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ మద్దతు తెలిపారు. కాసేపట్లో చిరంజీవి కూడా ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చే అవకాశం ఉంది. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 

13:39 - April 20, 2018

హైదరాబాద్ : బీజేపీ, టీడీపీ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో సీపీఎం మహాసభలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా రాజకీయ తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశ రాజకీయాలు, వివిధ రాష్ట్రాల్లోని రాజకీయాలతోపాటు కార్యకలాపాలపై చర్చిస్తామని చెప్పారు. నేటి మధ్యాహ్నంతో రాజకీయ తీర్మానంపై చర్చ ముగుస్తుందన్నారు. పార్టీ దశ, దిశపై నిర్ణయం జరుగుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యలు, విభజన హామీలపై కూడా చర్చ ఉంటుందన్నారు. మధ్యాహ్నం రాజకీయ తీర్మానం ఆమోదం పొందనుందని తెలిపారు. చంద్రబాబు ప్రత్యేకహోదా సాధించలేకపోయారని విమర్శించారు. విభజన చట్టంలోని హామీల అమలులో చంద్రబాబు విఫలం అయ్యారని పేర్కొన్నారు. చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏ ఒక్క హామీ ప్రస్తావన లేదన్నారు. హోదా కోసం వాపమక్షపాలు పోరాటాలు చేస్తుంటే టీడీపీ ప్రభుత్వం ఆరెస్టు చేస్తుందన్నారు. బంద్ లు చేస్తే ప్రజలకు నస్టం జరుగుతుందని చంద్రబాబు అంటున్నారని.. అయితే ఆయన దీక్ష చేస్తే నష్టం జరుగుదా అని ప్రశ్నించారు. కానీ హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుది అవకాశం వాదమని విమర్శించారు. టీడీపీ దివాళ తీసిందన్నారు. హోదా కోసం వామపక్షాలు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తుంటే..చంద్రబాబు ఇప్పుడు ఆందళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు సం.రాలుగా ప్రజల ఆందోళనలు, ప్రత్యేకహోదాను టీడీపీ పట్టించుకోలేదన్నారు. బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలు దెబ్బతినడానికి కారణం అయ్యాయయని.. వీరి మాటలను ప్రజలు నమ్మరని అన్నారు.

 

పవన్ సార్ మీవల్లే మేం ఆగిపోయాం,సెల్యూట్ అన్న డైరెక్టర్..

హైదరాబాద్ : 48 గంట‌లు నా జీవితంలో అత్యంత క‌ష్టమైన సమయం, మీరు క్షోభపడుతున్నారనీ తెలిసినా..మీరు ఆప‌డం వ‌ల్ల‌ మేం స్పందించ‌లేదు. కానీ, ఇప్పుడు జ‌రుగుతున్న‌ది చూస్తున్న త‌ర్వాత న‌న్ను నేను నియంత్రించుకోలేక‌పోతున్నా. నాకు క‌న్నీళ్లు ఆగ‌డం లేదు అంటు పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి  `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌` సినిమా డైరెక్ట‌ర్ బాబి కన్నీటిపర్యంతంగా తెలిపారు. మీరు ఆడ‌వారికి మీరు ఎంత‌ ర‌క్ష‌ణ‌గా ఉంటారో మీతో క‌లిసి ప‌నిచేసిన నాకు తెలుసు. మీరు మీ త‌ల్లికి మాత్ర‌మే బిడ్డ కాదు.. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. మీకు నా సెల్యూట్‌. జైహింద్‌` అంటూ బాబీ ట్వీట్ చేశాడు.

13:22 - April 20, 2018

పురుషులు చేసే పనికి ఏమాత్రం తీసిపోకుండా మహిళలు కూడా చేస్తున్నారు. పురుషుల కంటే మహిళలు భౌతికంగా బలహీనులు అనే మాటను కాలగర్భంలో కలిపేస్తున్నారు నేటి నారీ మణులు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైపోయిన మహిళలు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఎంతటి కష్టసాధ్యమైన పనినైనా ఛలెంజ్ గా తీసుకుని విజయవంతంగా చేసి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి సమస్యలు వచ్చిన అధిగమిస్తున్నారు. అమలు చేసిన తీరుతున్నారు. 'గ్యాంగ్ మెన్స్' స్థానంలో 'వి'మెన్ గ్యాంగ్ హవాకు శ్రీకారం చుట్టారు.

మహిళా దినోత్సం రోజున మహిళా బృందం శ్రీకారం..
రైల్వేశాఖలో రైలుపెట్టెలను క్రమబద్ధీకరించడం, నిర్వహణ, మరమ్మతులతోపాటు రైలు పట్టాల పర్యవేక్షణలో ఇప్పటివరకు పురుషులే ఉండేవారు. వాళ్లను గ్యాంగ్‌మెన్‌ అనేవారు. కానీ, ఇప్పుడా విభాగంలో మహిళలు కూడా మేమున్నామంటూ అడుగుపెట్టారు. దీంతో ఇప్పుడది విమెన్‌ గ్యాంగ్‌ అయ్యింది. ఈశాన్య రైల్వే విభాగం, గువహటి మహిళా కార్మికుల బృందానికి తొలిసారిగా ఈ అవకాశాన్ని వచ్చింది. అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల ఎనిమిదో తేదీన మొట్టమొదటిసారి 20 మంది మహిళా బృందం ఈ విధులు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. గత 165 ఏళ్ల చరిత్రలో ఈ విభాగంలో పురుషులు మాత్రమే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మహిళలు ప్రవేశించారు.

ఈశాన్య రైల్వే విభాగం గువహటి సంచలన నిర్ణయం..
గతంలో ఈ మహిళా కార్మికులంతా రైల్వేశాఖలో రకరకాల విభాగాల్లో పనిచేసేవారు. నిజానికి ఇలాంటి విభాగాల్లో మహిళసంఖ్య తక్కువే. దాదాపు పదేళ్లకు పైగా అనుభవం సాధించిన ఆ మహిళలందరినీ ఒకే విభాగంలో ఉంచాలని, ఈశాన్య రైల్వే విభాగం గువహటి నిర్ణయించింది. గువహటిలోని రైలుపెట్టెల నిర్వహణా విభాగం కింద ఆరు రైల్వే లైన్లు, 1,300 రైలు పెట్టెల పర్యవేక్షణ ఉంటుంది. ఇక్కడ వెయ్యిమంది కార్మికులు పనిచేస్తుంటే, వీరిలో 200 మంది మహిళలున్నారు. ఆ మహిళల్లో ఎంపికైన 20 మందికి మూడు వారాలపాటు రైల్వేశాఖ అదనపు శిక్షణనిచ్చింది. రైలుపట్టాల పరిశీలన, భద్రతా, పర్యవేక్షణ వంటి అంశాల్లో అవగాహనను కల్పించింది. ఈ 20 మంది మహిళాకార్మికులు ఇకపై షిఫ్టులవారీగా పనిచేస్తారు. గతంలో రైలు పెట్టెలకు రంగులు వేయడం, వెల్డింగ్‌ వంటి చిన్నచిన్న మరమ్మతులను మాత్రమే చేసేవారు. ఇప్పుడు సాంకేతికపరంగా అభివృద్ధిని సాధించి, పురుషులతో సమానంగా పైలెట్‌ ప్రాజెక్టుల నిర్వహణలో భాగస్వాములయ్యారు. ఆ నైపుణ్యాలను గుర్తించే అవకాశం ఇచ్చామని రైల్వేశాఖ పేర్కొంది.

13:10 - April 20, 2018

ఇష్టమైనదేదీ ఎప్పటికీ కష్టం కాదు. పట్టుదల వుంటే సాధించలేదనిదంటు లేదు అని నిరూపించింది మన భారతీయ యువతి. ప్రపంచ వ్యాప్తంగా 20 వేల మంది పోటీపడి ఆ ఘనతను సాధించింది భారతీయ అమ్మాయి. 191 దేశాలు..20వేల మందితో పోటీ..కానీ నిలిచింది, గెలిచింది మాత్రం మన భారతదేశపు అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆమె సాధించిన ఘనత ఏమిటి? ఏ అంశంపై సాధించింది? ఎక్కడ అనే విషయాలను తెలుసుకుందాం..

ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్‌కు ఎంపికైన ప్రీతి..
ప్రీతి హర్మాన్ ఛేంజ్ డాట్ ఓఆర్జీ సంస్థకు గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. గ్లోబల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌పై సోషల్ చేంజ్ అనే అంశం మీద ప్రపంచ వ్యాప్తంగా 20 వేల మంది పోటీపడగా ప్రీతి ఈ అవకాశాన్ని దక్కించుకున్నది. ఒరాక్ ఒబామా స్థాపించిన ఒబామా ఫౌండేషన్ చికాగో కేంద్రంగా సేవలందిస్తున్నది. ఈ ఏడాదికిగానూ ఒబామా ఫెలోషిప్ అందుకోబోయే సభ్యుల పేర్లను ఆ సంస్థ వెల్లడించింది. అమెరికా, లండన్, హంగేరి, సౌతాఫ్రికా వంటిదేశాల నుంచి విద్యార్థులు ఎంపికయ్యారు. మన దేశం నుంచి ప్రీతి ఒక్కరికే ఈ ఛాన్స్ వచ్చింది. నూతన ఆవిష్కరణల మీద పనిచేస్తున్న విద్యార్థులకు ప్రోత్సహించి వాళ్లనుంచి మరిన్ని ఆవిష్కరణలు చేయించడమే ఈ ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశం. రెండేళ్ల పాటు వసతి కల్పించి భవిష్యత్తులో చేయాల్సిన ప్రణాళికలను, సమాజం పట్ల అనుసరించాల్సి విషయాలను నేర్పిస్తారు. ప్రీతి ఇంతకు ముందే నీతి ఆయోగ్ ప్రకటించిన మార్పుకోసం ప్రయత్నిస్తున్న మొదటి 25 మంది మహిళల్లో ఒకరిగా నిలిచింది. ఛేంజ్ డాట్ ఓఆర్జీ ద్వారా మహిళా సాధికారత, మహిళల హక్కులు, వారి సమస్యల పరిష్కారం మీద పోరాడుతున్నది. ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్‌కు ఎంపికయిన తొలి భారతీయ యువతిగా ప్రీతి రికార్డు సృష్టించింది.

 

పవన్ నిరసన..మెగా ఫ్యామిలీ హీరోల మద్దతు..

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగంగా పోస్ట్‌లు పెట్టిన గంటల వ్యవధిలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఫిలించాంబర్‌లో న్యాయవాదులతో పవన్ సమావేశమయ్యారు. అనంతరం పవన్ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లుగా సమాచారం. పవన్ వెంట నాగబాబు కూడావచ్చారు. అనంతరం కొద్ది సేపటికి మెగా కుటుంబంలోని మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్,సాయిధరమ్ తేజ్ లు ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. కాగా ‘మా’ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

12:35 - April 20, 2018

ఢిల్లీ : జస్టిస్ లోయ మృతి కేసులో పిటిషన్లు కొట్టివేసినందుకు జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకులతో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ భేటీ కానున్నారు. అభిశంసన తీర్మానంపై సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ, ఎస్పీ సభ్యుల నుండి 60 మంది సంతకాలను ఆజాద్ సేకరించారు. అభిశంసన తీర్మానానికి 100 మంది లోక్ సభ, 50 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరముంది. అభిశంసన తీర్మానాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెరపైకి తీసుకొచ్చారు. అభిశంసన తీర్మానానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

దావూద్ ఆస్తులను జప్తు చేయమంటు సుప్రీం ఆదేశాలు..

ఢిల్లీ : అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహింకు చెందిన ముంబయి ఆస్తులను వెంటనే జప్తు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆస్తుల స్వాధీనంపై దావూద్ తల్లి అమినా బీ కస్కర్‌, సోదరి హసీనా పార్కర్‌వేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ఆ ఆస్తులు దావూద్‌కు చెందినవేనని, వాటిని జప్తు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా పిటీషన్లు వేసిన వారిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందటం విశేషం. 

క్యాస్టింగ్ కౌచ్ కొత్తేమీ కాదు: కృష్ణంరాజు

హైదరాబాద్ : సినీ పరిశ్రమలోకి క్యాస్టింగ్ కౌచ్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదని... గతంలో కూడా దీని గురించి విన్నామని నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే లేదని... అన్ని చోట్లా ఉందని అన్నారు. విమర్శించడానికి సినీ పరిశ్రమే దొరికిందా? అని ప్రశ్నించారు. ఎక్కడో తప్పు జరిగిందని... మొత్తం వ్యవస్థనే తప్పుబట్టడం దారుణమని అన్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్నది తెల్ల పేపర్ పై ఒక మచ్చ వంటిదని... త్వరలోనే ఆ మచ్చను తొలగిస్తామని చెప్పారు.

12:27 - April 20, 2018

తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అను ఇమ్మానుయేల్ స్లైలిష్ స్టార్ బన్నీని ఓ కోరిక కోరిందట. ఆ కోరికను కాదనలేక బన్నీ తీర్చేసాడట. ఆమె కోరిన కోరిక ఏమిటో? బన్నీ ఆకోరికను ఎలా తీర్చాడో చూద్దాం..

ర‌చ‌యిత వ‌క్కంతం వంశీని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చేసిన సినిమా `నా పేరు సూర్య‌`. వ‌చ్చే నెల నాలుగో తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్త‌యింది. అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వ‌యం విశాల్ శేఖ‌ర్ స్వ‌రాలందించారు. తాజాగా త‌న సినిమాకు సంబంధించిన విశేషాల‌ను బ‌న్నీ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సినిమా షూటింగ్ పూర్త‌యింద‌ని, చాలా మంచి యూనిట్‌తో ప‌నిచేశాన‌ని, చాలా సంతోషంగా షూటింగ్ పూర్తిచేశామ‌ని బ‌న్నీ ట్వీట్ చేశాడు. అలాగే ఈ చిత్రం కోసం ప‌నిచేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. అలాగే హీరోయిన్ అనూ ఇమ్మానుయేల్ కోరిన కోరిక గురించి కూడా మ‌రో ట్వీట్ చేశాడు. `నా హీరోయిన్ అనూ ఇమ్మానుయేల్ న‌న్ను అడిగిన మొద‌టి, చివ‌రి కోరిక ఓ సెల్ఫీ. సో స్వీట్‌. షూటింగ్ పూర్త‌యిపోయిన త‌ర్వాత అనుతో దిగిన మొద‌టి సెల్ఫీ ఇదే` అంటూ ఓ ఫోటోను బ‌న్నీ పోస్ట్ చేశారు.

అభిశంసన తీర్మానానికి పావులు కదుపుతున్న కాంగ్రెస్..

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన అంశం మరోసారి ప్రతిపక్షాల మధ్య చర్చకు రానుంది. కాంగ్రెస్ పార్టీ నేత గులాంనబీ అజాద్ పార్లమెంట్ చాంబర్ లో పలు పార్టీల నేతలు ఈ రోజు సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చ జరగనుంది. జడ్జి బీహెచ్ లోయా మృతి సహజమేనని, దీనిపై పిటిషన్లు దురుద్దేశంతో కూడినవని, న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చేవిగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. లోయా మృతిపై సుప్రీం తీర్పు తర్వాత బీజేపీ నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సహా ఇతర నేతలపై మాటల దాడి మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

12:13 - April 20, 2018

రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మరోసారి తెలుగు తెరపై కనిపించనున్నారు. అదీకూడా మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో విలన్ గా. ధృవతో మంచి హిట్ అందుకుని రంగస్థలం సినిమా సక్సెస్ మూడ్ లో వున్న చరణ్ మంచి నటుడిగా ప్రేక్షకాదరణ పొందాడు. అటువంటి చరణ్ తో మంచి దాతృత్వం వున్న నటుడు వివేక్ ఒబేరాయ్. ఎంతోమంది జీవితాలలో విషాదాన్ని నింపిన సునామీలో కొట్టుకుపోయిన ఊరును తిరిగి నిర్మించిన మంచి హృదయమున్న వివేక్ కు రెడ్ అండ్ వైట్ బ్రేవరీ అవార్డును కూడా వరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున వివేక్ పొగాకు వ్యతిరేక ప్రచారానికి అంబాసిడర్ గా కూడా పనిచేసే వివేక్ ఒబెరాయ్ మంచి నటుడే కాదు మంచి మనసున్న మనిషిగా పేరొందిన వివేక్ చరణ్ సినిమాలో రాజకీయ విలన్ గా నటిస్తున్నారు.

ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్..
చరణ్ హీరోగా బోయపాటి కొంతకాలం క్రితమే ఒక సినిమాను మొదలుపెట్టాడు. చరణ్ బిజీగా ఉండటంతో ఆయన ప్రమేయం లేని సన్నివేశాలను ప్లాన్ చేసుకుని కొంత భాగం చిత్రీకరణ జరిపాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ నిన్న హైదరాబాద్ లో మొదలైంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.

చరణ్ జోడీగా కైరా అద్వానీ..
చరణ్ జోడీగా కైరా అద్వానీని తీసుకున్నారు. ఈ సినిమాలో రాజకీయ నాయకుడైన విలన్ గా వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. రాజకీయ నేపథ్యంతో కూడిన డ్రామాతో ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తోంది. చరణ్ సినిమాల నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా బోయపాటి శ్రద్ధ తీసుకున్నాడట. ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్టు సమాచారం.    

12:10 - April 20, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తనపై జరుగుతున్న అసత్యప్రచారంపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. పవన్ తోపాటు నాగబాబు ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్నారు. నల్లదుస్తులు ధరించి పవన్ నిరసన తెలుపుతున్నారు. మీడియా వ్యవహార శైలిపై ఆయన నిరసన తెలుపుతున్నారు. మెగా ఫ్యామిలీపై రామ్ గోపాల్ వర్మ చేసిన విమర్శలతో 'మా' అధ్యక్షుడు శివాజీరాజా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. తన రాజీనామాను కాసేపట్లో అధికారికంగా ధృవీకరించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మహిళలపై నేరాల్లో ఎక్కువగా వున్నది బీజేపీ నేతలేనట!..

ఢిల్లీ : దేశవ్యాప్తంగా మొత్తం 1,580 అంటే 33% మందిపై క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. వారిలో ముగ్గురు ఎంపీలు సహా 48 మంది వరకు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. వీరిలో అత్యధికులు బీజేపీకి చెందిన వారని ఈ నివేదిక వెల్లడించింది. 12 మంది బీజేపీ నేతలు, ఏడుగురు శివసేన నేతలు, ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ కు చెందిన వారు ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.

1580 మంది ప్రజాప్రతినిధులు క్రిమినల్సేనంట!..

ఢిల్లీ : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో ఎక్కువ మంది బీజేపీ ప్రజాప్రతినిధులేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మహిళలపై అకృత్యాలకు పాల్పడిన ఘటనల వెనుకనున్న ప్రజాప్రతినిధులపై నేషనల్ ఎలక్షన్ వాచ్ అంటే ఎన్ఈడబ్ల్యూతో కలిసి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను తయారు చేసేందుకు ఎన్నికల సమయంలో 768 మంది ఎంపీలు, 4077 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన మొత్తం 4,845 ప్రమాణ పత్రాలను విశ్లేషించింది.

 

11:45 - April 20, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్నారు. పవన్ తోపాటు నాగబాబు వచ్చారు. నల్లదుస్తులు ధరించి పవన్ నిరసన తెలిపారు. మీడియా వ్యవహార శైలిపై ఆయన నిరసన తెలుపుతున్నారు.మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:44 - April 20, 2018

ఢిల్లీ : ప్రపంచంలోనే ప్రజాస్వామ్యదేశం అని భారతదేశానికి పేరు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ప్రజాస్వామ్యానికి అసలు అర్థం వుందా? అసలు భారత్ లో ప్రజాస్వామ్యం వుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితులు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితులు. ఒకపక్క మృగాళ్ల చేతుల్లో చిద్రమైపోతున్న చిన్నారులు. వివిధ కారణాలతో అంతులేని హింసలకు బలైపోతున్న ఆడబిడ్డలు. పెరిగిపోతున్న మతోన్మాదం,యేరుల్లా పారుతున్న మద్యం మనిషిలో వుండే విచక్షణను కూని చేస్తు ఆడబిడ్డలపై జరుగుతున్న హింసాత్మక మారణ కాండకు సమిధల్లా మాడిపోతున్న అభాగ్యులు. పశుత్వ కాంక్షలకు బలైపోతున్న చిన్నారులు. వయస్సుతో సంబంధం లేకుండా అంతులేని అత్యాచారాలకు గురయి ఊహించేందుకే భయపడేంత హింసలను అనుభవిస్తు కూలిపోతున్న, కాలిపోతున్న మహిళ జీవితాలు మరోపక్క. ఇవేవీ పట్టనట్లుగా ప్రజాప్రతినిధులు తమ ఓటు బ్యాంకులకు మాత్రం మహిళలను వినియోగించుకుంటున్నారు. అనంతరం అధాకారాన్ని అడ్డంపెట్టుకుని కొందరు ప్రజాప్రతినిధులు మహిళలపై హింసలకు, దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

వీరా ప్రజాప్రతినిధులు?..
ప్రజా ప్రనిధులు అంటే ప్రజలను రక్షించేవారు, ప్రజలు బాగోగులు చూసేవారు. కానీ వీరా ప్రజాప్రతినిధులు అని సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు నేడు భారత దేశంలో వున్నాయి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి రాజ్యాంబద్ధంగా పాలన సాగించాల్సిన వీరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై సాగిస్తున్న అరాచాలకు అంతులేకుండా పోతోంది.

48 మంది ప్రజాప్రతినిధులు మహిళలపై జరిగిన నేరాలకు పాల్పడ్డారన్న ఏడీఆర్ నివేదిక..
మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 48మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ మహిళపై బీజేపీ ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం, జమ్ముకశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి, హత్యకు పాల్పడిన సంఘటన వెలుగుచూసిన నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓ నివేదికను విడుదల చేసింది.

1580 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరాభియోగాలు ..
ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 1580 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరాభియోగాలు ఉండగా, అందులో 48 మంది మహిళలపై నేరాలకు పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 45 మంది ఎమ్మెల్యేలు కాగా, మిగతా ముగ్గురు ఎంపీలు. ఇందులో 12 మంది బీజేపీకి చెందిన వాళ్లే. తర్వాత స్థానాల్లో శివసేన (7), తృణమూల్ కాంగ్రెస్ (6) ఉన్నాయి. రాష్ర్టాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 12 మందిపై అభియోగాలుండగా, తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్ (11), ఒడిశా (5), ఆంధ్రప్రదేశ్ (5) ఉన్నాయి. ఈ 48 మందిపై మహిళల కిడ్నాప్, లైంగికదాడి, అపహరణ, గృహహింస, అక్రమ రవాణా, దాడి, పెండ్లి చేసుకోవాలంటూ బలవంతం చేయడం లాంటి కేసులు నమోదయ్యాయి.

11:39 - April 20, 2018

విజయవాడ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఏపీ జర్నలిస్టు ఫోరం నేత కృష్ణాంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ డీఏ ది ద్రుతరాష్ట కౌగిలి అని అభివర్ణించారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో ఆయన ప్రసంగించారు. బీజేపీ నేతలు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, మోడీ, అమిత్ షా అంటే ప్రజలకు కోపం లేదని...వారు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు కోసం ఉందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఐదు సం.రాలు కాదు.. పది సం.రాలు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి.. ఈరోజు మిమ్మల్ని నిలదీస్తున్నామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు హోదా ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం కూడా అభివృద్ధి జరిగేదని అన్నారు. ఏపీకి ప్రత్కేహోదా సంజీవని అన్నారు. భరత మాత దాస్య శృంఖలాలను తెంచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, తెలుగు వారికి రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఆమరణనీరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించారని తెలిపారు. ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్ టీఆర్ అని కొనియాడారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు జెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండాపై పోరాటం చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ముస్లిం పోరాట హక్కుల సమితి నేత ఫారూఖ్ డిమాండ్ చేశారు. రాష్ట్రం బాగుండాలంటే ప్రత్యేకహోదా కావాలన్నారు.
 

11:27 - April 20, 2018

విజయవాడ : ఎందరో మహానుభావులను కన్నది తెలుగు నేల అని టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారని అన్నారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో బాలకృష్ణ ప్రసంగించారు. 1982 లో ఎన్ టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో, తెలుగువాన్ని మద్రాసువాడిగా చూసే తరుణంలో తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడడం కోసం, తెలుగువారికి గుర్తింపు తీసుకురావడం కోసం ఎన్ టీఆర్ టీడీపీని స్థాపించారని.. పార్టీని స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారని గుర్తు చేశారు. పేదవారి గుండె చప్పుడు ఎన్ టీఆర్ అని అన్నారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని.. దాని వల్ల ఎన్నో కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో రాజధాని లేని అనాథ రాష్ట్రంగా ఏపీని  మిగిల్చారని మండిపడ్డారు.

 

11:17 - April 20, 2018

హైదరాబాద్ : ఏపీ సెక్రటేరియట్ వేదికగా తనపై కుట్ర పన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా టీడీపీపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తన తల్లిని నడిరోడ్డుపై అనరాని మాటలు అనిపించారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న అసత్యప్రచారానికి లోకేశ్ కారణమన్నారు. 'ఏపీ ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఇదా మీరిచ్చే ప్రతిఫలం' అని వాపోయారు. తనపై కుట్రలు రచించి ఇప్పుడు దీక్షకు రమ్మంటారా అని ప్రశ్నించారు. 

 

మోదీపై హిందీలో బాలయ్య ఫైర్..

అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేపట్టిన 'ధర్మ పోరాట దీక్ష' వేదికపై ఆయన ప్రసంగిస్తూ 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అంటూ నినదించారు. అనంతరం హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ 'హమారా ఆంధ్రప్రదేశ్ భీ ఆప్ కా గుజరాత్ నహీ.. ఆప్ కా హుకుం నహీ చలా సక్తే అంటే మా ఆంధ్రప్రదేశ్ కూడా మీ గుజరాత్ కాదు... మీ పెత్తనం ఇక్కడ కొనసాగదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఆంధ్రరాష్ట్రం ఉత్తరాది కాదు, మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగించడానికి అంటూ మండిపడ్డారు. 

ఫిలిం చాంబర్ లో పవన్ నిరసన..

హైదరాబాద్ : నగరంలోని ఫిలిం అసోసియేషన్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అతని సోదరుడు నాగబాబు చేరుకోనున్నారు. నల్లదుస్తులు ధరించి పవన్ దీక్ష తెలుపనున్నారు. కాగా నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని అనుచిత వ్యాఖ్యలతో దూషించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తీవ్ర ఆవేదన చెందిన వవన్ నల్లని దుస్తులతో తన నిరసనను తెలుసనున్నారు. కాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగిన సంగతి కూడా తెలిసిన విషయమే. కాగా పవన్ కళ్యాణ్ కు మద్ధతుగా ఆయన అభిమానులు ఫిలిం చాంబర్ కు భారీగా చేరుకున్నారు. 

వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తా : వపన్

హైదరాబాద్ : నాపై నిందలు ఆరోపణలు చేస్తున్నవారికి, చేయిస్తున్నవారికి ఇంట్లో మహిళలే వున్నారనీ..కానీ వారు మాత్రమే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్‌పీలు, రాజకీయ లాభాల కోసం పెద్దవయస్సులో వున్న 70 ఏళ్ల నా తల్లిని దూషిస్తున్నారు, నిందిస్తున్నారుకదా.. మీరంతా టీఆర్‌పీల కోసం షోలు నిర్వహిస్తున్నారు కదా? మంచిది. వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను. నేను నటుడి కంటే ముందు, రాజకీయ నేత కంటే ముందు ఓ అమ్మకు బిడ్డను.

కాసేపట్లో ఆయేషా కేసుపై కోర్టుకు నివేదిక..

హైదరాబాద్: ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి ఏపీ పోలీసులు మరి కాసేపటిలో హైకోర్టుకు దర్యాప్తు నివేదిక అందజేయనున్నారు. ఇప్పటి వరకు కేసులో ఎలాంటి దర్యాప్తు జరిపింది అనే వివరాలను కోర్టుకు తెలపనున్నారు. డిఐజి శ్రీకాంత్ దర్యాప్తు రిపోర్ట్‌ను హైకోర్టుకు సమర్పించనున్నారు.

మీవంటివారు వున్నప్పుడు ఆ నీచులు ఎందుకుండరు?: వవన్

హైదరాబాద్ : భర్త, పిల్లలు, కుటుంబం తప్ప మరో ప్రపంచం తెలియని నా తల్లిని రోడ్డుకీడ్చి..అనరాని మాటలతో ఆవేదనకు గురిచేసిన మీవంటి వారు వున్న సమాజంలో "అసిఫా" లాంటి ముక్కుపచ్చలారని పసిపిల్లలను, అభం శుభం తెలియని పసిపిల్లలపై దారుణమైన అత్యాచారాలు చేసే నీచులు నికృష్టులు ఎందుకు ఉండరు? కొల్లలుగా ఉంటారు... మీరందరు కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా... మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, కుటుంబాలకు చెందిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు' అంటూ పవన్ ట్వీట్ చేశారు.

తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్..

హైదరాబాద్ : ట్వీట్ వేదికగా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 'మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కాచెల్లెళ్లు ఉండి, కోడళ్లు, కూతురులు ఉండి పేరు ప్రఖ్యాతలు ఉండి, సంపదను కూడబెట్టుకొని అన్నింటికి మించి సమజాన్ని ప్రభావితం చేసే స్థాయిల్లో మాధ్యమాలల్లో ఉన్న మీరు అందరు కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను, భర్త, పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్నతల్లిని...

చంద్రబాబు 'ధర్మదీక్ష'..

ఆమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టిన ధర్మదీక్ష ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొనసాగుతోంది. మహాత్మాగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాల వేసిన చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బాబు దీక్ష రాత్రి 7గంటల వరకూ కొనసాగనుంది. ఏపీపై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా చంద్రబాబు ఈ దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు దీక్షకు మద్దతుగా జిల్లాలో మంత్రులు కూడా దీక్షలను కొనసాగిస్తున్నారు. 

3వ రోజు సీపీఎం జాతీయ మహాసభలు కార్యక్రమాలు..

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు మూడవరోజు కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు రాజకీయ ముసాయిదా తీర్మానంపై రాజకీయ నిర్మాణ నివేదిక, పార్టీ పరిస్థితి, గత జాతీయ మహాసభ నుండి ఈ మహాసభ వరకూ పార్టీ నిర్వహించిన పోరాటలపై చర్చ జరుగనుంది. కాగా ఈ జాతీయ మహాసభకు దేశ వ్యాప్తంగా వున్న సీపీఎం జాతీయ నాయకులు దాదాపు  700ల మంది డెలిగేట్స్ ఈ మహాసభలో పాల్గొన్నారు. 

టీడీపీకి నాకిచ్చిన ప్రతిఫలం ఇదే : పవన్

ఢిల్లీ : టీడీపీ పార్టీకి అండగా నిలబడినందుకు నాకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాపై అసత్య ప్రచారం చేయటమే కాకుండా తన తల్లిని కూడా రోడ్డుకీడుస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెర వెనుక కుట్రలు చేస్తు ఇప్పుడు దీక్షకు ఆహ్వానిస్తారా అంటు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీ సెక్రటేరిట్ వేదికగా ఆరు నెలల నుండి నాపై కుట్ర చేస్తున్నారంటు పవన్ ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్, అతని స్నేహితుడు రాజేఫ్ నాపై కుట్ర పన్నుతురన్నారని ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ ఆరోపించారు.

09:41 - April 20, 2018

చంద్రబాబుది ధర్మ పోరాటమా..రాజకీయ పోరాటమా.. ఏపీ రాజకీయాలు అనే అంశంపై ప్రముఖ సామాజిక, ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...రాజకీయాలు చేసినా ప్రజలకు న్యాయం జరగాలి. పోరాటం చేయడం తప్పుకాదు. దీక్షలు తప్పుకాదు.. దీక్ష చేస్తున్న నాయకుడు ఎలాంటి వాడని చూడాలి. చంద్రబాబు పోరాటాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ప్రజలను ఢిల్లీలో పోరాటాలు చేయమని.. చంద్రబాబు మాత్రం విజయవాడలో దీక్ష చేస్తున్నారు. ప్రత్యేకహోదాపై పోరాటాలు చేసినవారిపై టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. వారిపై కేసులు తొలగించి దీక్ష ప్రారంభిస్తే బాగుండేది. చంద్రబాబు చేస్తే దీక్ష...ఇతరులు చేస్తే అసౌకర్యం కలుగుతుందా ? హోదా కోసం ప్రజలు పోరాటాలు చేస్తే అసౌకర్యం కలుగుతుందా ? మరి చంద్రబాబు దీక్ష వలన ఎలాంటి అసౌకర్యం కలగడం లేదా...? ప్రజలు జపాన్ తరహా దీక్ష చేయాలా.. చంద్రబాబు ఇండియా తరహా దీక్ష చేయాలా..? ప్రత్యేకహోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం పెడితే టీడీపీ హాజరుకాలేదు..కానీ బాబు దీక్షకు అందరూ రావాలని పిలుస్తున్నారు.. ప్రత్యేకహోదా అనేది సంజీవిని కాదని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ, డీమానిటైజైషన్ ను చంద్రబాబు సమర్థించారు.. దీక్ష చేయడం తప్పుకాదు... ఏపీ చేస్తున్న డిమాండ్లు న్యాయమేనా..లేదా అనేది ముఖ్యం. ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేస్తే పెద్ద ఎత్తున ప్రభావం చూపేది. జగన్... మోడీని తిట్టడం లేదు.. చంద్రబాబును మాత్రమే తిడుతున్నాడు అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

స్వశక్తి ఆత్మగౌరవంతో జీవిస్తున్నా : పవన్

హైదరాబాద్ : తనపై టీడీపీ అసత్య ప్రచారం చేయిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దీని వెనుక మంత్రి లోకేష్ కుట్ర ఉందన్నారు. స్వశక్తి ఆత్మగౌరవంతో జీవిస్తున్నానని తెలిపారు.

 

09:29 - April 20, 2018

హైదరాబాద్ : తనపై టీడీపీ అసత్య ప్రచారం చేయిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దీని వెనుక మంత్రి లోకేష్ కుట్ర ఉందన్నారు. స్వశక్తి ఆత్మగౌరవంతో జీవిస్తున్నానని తెలిపారు.

09:24 - April 20, 2018

విజయవాడ : సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభంకానుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్ష చేపట్టారు. ధీక్ష స్థలికి చేరుకున్న చంద్రబాబు మహాత్మగాంధీ, అంబేద్కర్, పూలే, ఎన్టీఆర్ చిత్రపటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం దీక్ష ప్రారంభించారు. ఇప్పటికే దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు. చంద్రబాబు దీక్షకు లక్ష మందికిపైగా తరలించేందుకు ప్రణాళిక రచించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రబాబు దీక్షకు కూర్చుంటున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దుతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ దీక్షలు జరుగనున్నాయి. చంద్రబాబు దీక్షకు మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షలు చేపట్టారు. ధర్మ పోరాట దీక్షకు వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఏపీకి కేంద్రం అన్యాయం : ఏపీ కేశినేని    
'ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది. రెండు జాతీయ పార్టీలు ఏపీని మోసం చేశాయి. రాష్ట్రాలను హీనంగా చూడడం జాతీయ పార్టీలకు ఆనవాయితీగా మారింది. చంద్రబాబు పోరాటం ఐదు కోట్లు ఆంధ్రుల పోరాటం' అని అన్నారు. 

 

09:18 - April 20, 2018

లండన్ : కతువా, ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఘటనలపై విమర్శలు వెల్లువెత్తుతుండడంత ప్రధాని మోదీ లండన్ పర్యటనలో ప్రస్తావించారు. సెంట్రల్ లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చిన్న పిల్లలపై అత్యాచారం జరగడం ఎంతో బాధను కలిగిస్తుందన్నారు.  అత్యాచారం లాంటి ఘటనలను ప్రభుత్వాలతో పోల్చలేమని, రేప్‌ను రేప్‌గానే పరిగణించాలని, ఇలాంటి వాటిని ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు. దీనిపై రాజకీయాలు చేయడం తగదన్నారు. అత్యాచారాల విషయంలో ఎర్రకోట నుంచే తల్లిదండ్రులకు తాను సందేశమిచ్చానని తెలిపారు. కూతురు ఇంటికి ఆలస్యంగా వస్తే ఎక్కడికెళ్లావని ప్రశ్నించే పేరెంట్స్...అదే కుమారుడు కూడా ఆలస్యంగా వస్తే ప్రశ్నించాలన్నారు. 

09:12 - April 20, 2018

ఢిల్లీ : సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్‌ లోయాది సహజ మరణమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లోయా మరణంపై సిట్‌ విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు తీర్పుపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. దర్యాప్తు జరపకుండా లోయాది సహజమరణమని ఎలా ధృవీకరిస్తారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం తిరిగి రివ్యూ చేపట్టాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి బి.హెచ్‌ లోయా మృతిపై సిట్‌ ఏర్పాటు చేసి స్వతంత్ర విచారణ జరపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో స్వతంత్ర విచారణ అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. లోయాది సహజ మరణమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ విభేదాలను పరిష్కరించుకునేందుకు కోర్టులు వేదిక కాకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. లోయా మృతి కేసులో నలుగురు జడ్జిలు సందేహాలు వ్యక్తం చేయడం కారణంగా చూపలేమని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

సుప్రీం తీర్పుపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ స్పందించారు. ఇవాళ మాకు బ్లాక్‌ డే లాంటిదని పేర్కొన్నారు. లోయా గుండెపోటుతో మృతి చెందినట్లు ఈసీజీ రిపోర్టులో లేదన్నారు. లోయా మృతిపై సిట్‌ విచారణ జరిపించాలన్న పిటిషన్లను కోర్టు తిరస్కరించడాన్ని సిపిఎం తప్పుపట్టింది. లోయా మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసును పెద్ద ధర్మాసనం ముందుంచి రివ్యూ జరపాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

భారతదేశ చరిత్రలో ఈరోజు విచారకరమైన దినమని సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. సోహ్రాబుద్దీన్ కేసులో విచారణ జరుపుతున్న జడ్జి లోయా మృతిపై అనేక అనుమానాలున్నాయని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. దర్యాప్తు జరగకుండా సహజమరణమని ఎలా చెబుతారని ప్రశ్నించింది. సుప్రీం తీర్పుపై బిజెపి తీవ్రస్థాయిలో స్పందించింది. బిజెపిని అభాసుపాలు చేసేందుకే రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్‌ కోర్టును వేదికగా చేసుకుందని విమర్శించింది. ఇందుకు రాహుల్‌ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

సొహ్రాబుద్దీన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసుకు జస్టిస్‌ లోయా విచారణ న్యాయమూర్తిగా ఉన్నారు. తుది తీర్పు మరికొద్ది రోజుల్లో వెలువడుతుందనగా లోయా 2014 డిసెంబర్‌లో  అకస్మాత్తుగా చనిపోయారు. ఈ కేసులో బిజెపి చీఫ్‌ అమిత్‌ షా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. లోయాది సహజ మరణం కాదని, ఆయన మృతి వెనుక కుట్ర ఉన్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించడం సంచలనం సృష్టించింది. లోయా మరణం తర్వాత కేవలం నెల రోజుల్లోనే సోహ్రబుద్దీన్‌ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అమిత్‌ షాను సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల చేయడం గమనార్హం. దీంతో లోయా  మృతిపై స్వతంత్ర విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. 

 

09:09 - April 20, 2018

హైదరాబాద్ : గులాబీ బాస్‌ కేసీఆర్‌ లక్ష్యానికి ఆ పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో... ఆ పార్టీలోని కొందరు నేతలపై అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌లో కొందరి వ్యవహార శైలి రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. నేతలు, వారి తనయుల ఘనకార్యాలతో... సీఎం కేసీఆర్‌కు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.. 
గులాబీ బాస్‌కు తలనొప్పిగా మారిన నేతల ప్రవర్తన
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో... ఆ పార్టీలోని కొందరు నేతలతోపాటు.. వారి తనయుల వ్యవహార శైలి పార్టీ  అధినేత కేసీఆర్‌కు తలనొప్పిగా మారింది. ఓవైపు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందంటూ ఉపన్యాసాలు దంచుతుంటే.. మరోవైపు అధికార పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు నేతల వ్యవహారం ప్రజాక్షేత్రంలో వివాదాస్పదం అవుతోంది.. గత కొన్ని రోజులుగా ఏదోక చోట నేతలపై అక్రమ ఆరోపణలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సహా అమాత్యులపై కూడా వివాదాలు ముసురుతున్నాయి.
ప్రభుత్వ చీఫ్ విప్, విప్, మండలి సభ్యుడు, మంత్రులపై అవినీతి ఆరోపణలు
ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ గంపా గోవర్దన్, మండలి సభ్యుడు సలీం, మంత్రులు జగదీశ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి..   కొప్పుల ఈశ్వర్ భూకబ్జా వ్యవహారం వెలుగుచూడటంతో.. రాజకీయంగా దూమారం రేగుతోంది.  గంపా గోవర్ధన్ మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కడం, మండలి సభ్యుడు తమ పార్టీకే చెందిన నేతలపై చేసిన దౌర్జన్య కాండ వంటి సంఘటనలతో సీఎం కేసీఆర్‌ తలపట్టుకుంటున్నారు.. కొత్త కలెక్టరేట్ సముదాయం నిర్మాణానికి చేసిన భూసేకరణలో మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. 
మంత్రి జూపల్లి  తనయుడుపై అక్రమాల ఆరోపణలు
మరో మంత్రి జూపల్లి  తనయుడు బ్యాంకునుంచి తీసుకున్న రుణం ఎగ్గొట్టాడంటూ వార్తలు రావడంతో... విపక్షాలు విరుచుకుపడ్డాయి.. ఈ వ్యవహారంలో మంత్రి కూడా తన పుత్రరత్నాన్ని వెనకేసుకు రావడం మరింత చర్చనీయాంశమైంది. అప్పు తీసుకోవడం తప్పు కాదంటూనే.. తాము రుణం చెల్లించకుంటే.. కాంగ్రెస్‌ నేతలకేమైనా నష్టమా అంటూ ఎదురుదాడికి దిగారు. చాలా జాగ్రత్తగా, నేర్పుతో నెట్టుకురావాలని సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తుంటే... కొందరు నేతలు ఆయన ఆశయానికి తూట్లుపొడుస్తున్నారన్న చర్చ పార్టీలో సాగుతోంది.  

 

09:06 - April 20, 2018

ఢిల్లీ : దేశంలో ఆయా రాష్ట్రాల్లో నగదు కొరత సమస్య రేపటికల్లా పరిష్కారమవుతుందని ఎస్‌బిఐ ఛైర్మన్ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. ఏయే ప్రాంతాల్లో నగదు కొరత అధికంగా ఉందో ఆయా ప్రాంతాలకు డబ్బు రవాణా జరుగుతోందని... ఈరోజు సాయంత్రానికి ఆయా రాష్ట్రాలకు చేరుకుంటుందని చెప్పారు. రేపటిలోగా డబ్బు అందుబాటులోకి వస్తుందన్నారు.   డబ్బు కొరత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదని... తెలంగాణ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో సమస్య అధికంగా ఉందని రజనీష్‌ వెల్లడించారు.. ఎటిఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే తిరిగి మళ్లీ ఆ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్‌ అవుతుంటేనే నగదు రొటేషన్‌ సజావుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  ప్రజలు డిపాజిట్‌ చేయకుండా తమ వద్దే ఉంచుకుంటే.. బ్యాంకులు ఎంత డబ్బు సరఫరా చేసినా సరిపోదన్నారు. డబ్బు కొరత తీర్చేందుకు ఇప్పటికే బ్యాంకులు అధిక నగదు నిల్వలు ఉన్న రాష్ట్రాల నుంచి విమానాల ద్వారా తరలిస్తున్నారు.

 

09:01 - April 20, 2018

సిద్దిపేట : భదాద్రి శ్రీరాముడి సాక్షిగా కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. భద్రాచలం పట్టణాన్ని టీఆర్‌ఎస్ పట్టించుకోవడం లేదన్నది సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయంలో 7 మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు బీజేపీ బిల్లు పెట్టిందని.. దానికి కాంగ్రెస్ మద్దతిచ్చిందని హరీష్‌ గుర్తు చేశారు. నాడు అధికారంలో ఉండి చోద్యం చూసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారన్నారు.

 

08:56 - April 20, 2018

హైదరాబాద్ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థను పరిశీలించారు. కేసుల పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును  పరిశీలించారు. అనంతరం పోలీసులను విజయన్ అభినందించారు. హైదరాబాద్ పోలీస్ సాంకేతిక పరిజ్ఞానం, సేవలు తెలుసుకోవడానికి వచ్చానని  విజయన్‌ అన్నారు.  తెలంగాణ పోలీసులు పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని  ఆయన కొనియాడారు.

 

08:54 - April 20, 2018

హైదరాబాద్ : తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా రామ్‌గోపాల్‌ వర్మ తీరు ఉందంటూ... నిర్మాత అల్లు అరవింద్‌ చేసిన విమర్శలపై వర్మ స్పందించాడు. నా రొమ్ము నేనే గుద్దుకున్నాను తప్ప ఇంకెవరి రొమ్మూ గుద్దలేదన్నారు వర్మ. పవన్‌ కల్యాణ్‌ విషయంలో  వేగంగా స్పందించిన అల్లు అరవింద్‌ శ్రీరెడ్డి విషయంలో  చిన్న కామెంట్‌ కూడా ఎందుకు చేయలేదని వర్మ ప్రశ్నించారు. అభిరామ్‌ వ్యవహారంలో  దగ్గుబాటి సురేష్‌తో డబ్బు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని అన్నట్లు వర్మ పేర్కొన్నారు.. తాను ఇప్పిస్తానన్న ఐదు కోట్లరూపాయలతో పవన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను చేసింది నూరు శాతం తప్పేనంటూ... పవన్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు, కుటుంబ సభ్యులకు వర్మ సారీ చెప్పారు . ఆకాశమంత ఎత్తున్న సూపర్‌స్టార్‌, లీడర్‌ పవన్‌.. ఆయన స్థాయి తగ్గించేందుకు   నేనెవరు? ఎంతటి వాడిని? అన్నారు వర్మ. అల్లు అరవింద్‌ విమర్శలకు వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా సమాధానం ఇచ్చాడు. 

 

08:49 - April 20, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఏడవరోజు ఉత్సాహంగా సాగింది. కళాకారుల ఆటపాటలు వీక్షకులను ఉర్రూతలూగించాయి. సృజనస్వరంలో నిర్వహించిన పాటలపై చర్చ ఆలోచింపచేసింది. సైన్స్‌హబ్‌ అందరిలోనూ ఆకస్తిని రేకెత్తించింది. హైదరాబాద్‌ ఫెస్ట్‌ ... ఎన్టీఆర్‌ స్టేడియంలో కన్నుల పండుగగా సాగుతోంది. 7వ రోజూ ఫెస్ట్‌కు నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ అన్నీ సందడిగా మారాయి.

విజ్ఞానం, వినోదంతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలకు ఈ హైదరాబాద్‌ ఫెస్ట్‌లో పెద్దపీట వేశారు. అంతేకాదు.. తెలంగాణ సాహిత్య సమాలోచనలు జరుగుతున్నాయి. సృజన స్వరం వేదికపై నిర్వహించిన తెలంగాణ పాట ప్రాధాన్యత అనే చర్చా కార్యక్రమంలో  ప్రజాయుద్ధనౌక గద్దర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో ఆటపాటలకు... కళాకారులకు ఒక విశిష్ట స్థానం ఉందని చెప్పారు. తెలంగాణలో పాట సాహితీ సంస్కృతి ఉందికాబట్టే ఉద్యమాలకు వేదికైందని తెలిపారు.

సుద్దాల హన్మంతు కళావేదిక ఆటపాటలతో హోరెత్తింది. కళాకారుల ఆటపాటలు, యువతీయువకుల వెస్ట్రన్‌ డ్యాన్సులతో దుమ్మురేపింది. ఏడవరోజు సాంస్కృతిక కార్యక్రమాలకు అతిథులుగా విమలక్క, సినీ నటుడు కాశీ విశ్వనాథ్‌ హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది కళాకారుల ఆటపాటలేనని విమలక్క అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారుల వీధినాటికలు, డ్యాన్సులు, పాటలు వీక్షకులను కట్టిపడేశాయి. ఫెస్ట్‌ ముగియడానికి మూడే రోజులు మిగిలి ఉండడంతో ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

08:31 - April 20, 2018

హైదరాబాద్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై మొదలైన రగడ అనేక మలుపులు తిరుగుతోంది. శ్రీరెడ్డి మొదలుపెట్టిన వ్యవహారం టాలీవుడ్‌లోని పెద్దల మధ్య వైరం పెంచుతోంది. పవన్‌కల్యాణ్‌పై ఉన్న కసితోనే శ్రీరెడ్డి వ్యవహారాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు రామ్‌గోపాల్‌వర్మ కుట్ర పన్నాడన్నారు అల్లు అరవింద్‌. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వ్యవహరిస్తున్న వర్మకు సమాజం, సినీ పెద్దలు బుద్ది చెప్పాలన్నారు. 

రామ్‌గోపాల్‌వర్మపై నిర్మాత అల్లు అరవింద్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎదిగి.. తల్లిలాంటి పరిశ్రమకు వర్మ ద్రోహం చేస్తున్నాడని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న శ్రీరెడ్డి వ్యవహారాన్ని.. వర్మ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కుట్ర పన్నాడన్నారు. తన టార్గెట్‌ రామ్‌గోపాల్‌వర్మ అన్న అల్లు అరవింద్‌... తాజాగా జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు. 

పవన్‌కల్యాణ్‌ను దూషించాలని శ్రీరెడ్డికి తానే చెప్పినట్లు వర్మ చెప్పడం దారుణమన్నారు. వర్మ కుట్ర గురించి శ్రీరెడ్డి వీడియో రిలీజ్‌ చేస్తారని ముందే తెలుసుకుని.. క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్‌ చేశాడన్నారు. రామ్‌గోపాల్‌ వర్మ అండ్‌ కో హడావుడిగా నీచమైన నాటకమాడారన్నారు. సురేష్‌ ఫ్యామిలీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇప్పిద్దామని ప్రయత్నించానని.. అందుకు శ్రీరెడ్డి ఒప్పుకోలేదని వర్మ చెప్పాడని... దీనిపై సురేష్‌బాబుకు ఫోన్‌ చేస్తే చట్టంపై గౌరవం ఉందని చెప్పారన్నారు అల్లు అరవింద్‌. అసలు పవన్‌కల్యాణ్‌ను తిట్టిస్తే ఐదు కోట్లు ఇస్తామన్నది ఎవరని.. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారని ప్రశ్నించారు అరవింద్‌. పవన్‌కల్యాణ్‌పై కసి మీద వర్మ... శ్రీరెడ్డి వ్యవహారాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కుట్ర పన్నాడన్నారు. సాఫ్ట్‌ మర్డర్స్‌ చేయించే క్రిమినల్‌ మైండ్‌ వర్మది అని.. ఇలాంటి నీచుడిని ఏం చేస్తారో ఇండస్ట్రీ పెద్దలకే వదిలేస్తున్నానన్నారు. 

ఇదిలావుంటే.. పీఆర్పీలో కూడా తమకు ఇలాంటి అనుభవాలే ఎదరయ్యాయన్నారు అల్లు అరవింద్‌. ఇలాంటి కుట్రలకు ఎవరూ మద్దతివ్వొద్దని.. పవన్ జాగ్రత్త ఉండాలన్నారు. 

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై మహిళలు, ఎన్జీవోలతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు అల్లు అరవింద్‌ తెలిపారు. సినీ పరిశ్రమలో ఎవరైనా వేధింపులకు గురైతే ఈ కమిటీ విచారించి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. 

మరోవైపు శ్రీరెడ్డిపై పలు ప్రాంతాల్లో పోలీస్‌కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో సినీ నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేశారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాగే మరో అభిమాని పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇక శ్రీరెడ్డి వ్యవహార శైలిపై సీనియర్‌ నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ తప్పుపట్టారు. ఇబ్బందులు ఉంటే సినీ పెద్దల వద్దకు రాకుండా... ఇలా అర్ధనగ్నంగా ఆందోళనలు తెలపడం సరికాదన్నారు. క్రమశిక్షణ ఉన్నవారికే 'మా'లో సభ్యత్వం ఇస్తారని.. తాను 'మా' అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉంటే శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేవాడిని కాదన్నారు. 

అటు సీనియర్‌ దర్శక, నిర్మాత తమ్మినేని భరద్వాజ కూడా శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించారు. అన్యాయం జరిగితే అప్పుడే పెద్దల దృష్టికి తీసుకురావల్సిందన్నారు. ఐదేళ్ల క్రితం అన్యాయం జరిగిందని... ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం ఏంటన్నారు. 

మొత్తానికి క్యాస్టింగ్‌ కౌచ్‌ రగడ తెరపైకి వచ్చినా... తెర వెనక సినీ పెద్దల మధ్య వైరానికి తెరలేసింది. మరి పవన్‌కల్యాణ్‌ను టార్గెట్‌ చేసిన వర్మపై అల్లు అరవింద్‌ ఫైర్‌ కావడంతో... ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.  

08:26 - April 20, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలను బీజేపీ విమర్శించిందంటే.. అది తమకు కితాబిచ్చినట్లేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు.  సీపీఎం 22వ జాతీయ మహాసభలు రెండో రోజుకు చేరుకున్న సందర్భంగా.. సభ పలు కీలక అంశాలపై చర్చిందని రాఘవులు తెలిపారు. ప్రధానంగా మహారాష్ర్ట, గుజరాత్‌ రాష్ర్టాల్లో జరిగిన కిసాన్‌ ఉద్యమంపై చర్చసాగిందన్నారు.. ఈ మహాసభల్లో మరిన్ని కీలక అంశాలపై చర్చిస్తామంటున్న రాఘవులుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రధాన ప్రత్యామ్నాయం సీపీఎం పార్టీనేనని స్పష్టం చేశారు. 

08:24 - April 20, 2018

హైదరాబాద్ : బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. పొత్తులపై మీడియాలో ఊహాజనిత వార్తలు వస్తున్నాయన్న ఏచూరీ.. పాలకవర్గ పార్టీలకు కొమ్ము కాసే పొత్తులకు తమ పార్టీ ఎన్నడూ వెళ్లదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోని బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తం చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని... దానిపైనే దృష్టి సారించామన్నారు. 
రాజకీయ ముసాయిదా తీర్మానంపై విస్తృత చర్చ 
హైదరాబాద్‌లో సీపీఎం 22వ జాతీయ మహాసభలు రెండోరోజూ కొనసాగాయి. ఇందులో పార్టీ రాజకీయ ముసాయిదా తీర్మానంపై విస్తృతంగా చర్చించారు. చర్చల వివరాలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, గురువారం మీడియాకు వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం నుండి ప్రజలను విముక్తం చేయడం ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తుల లక్ష్యమన్న ఏచూరి.. తమ చర్చలు ఆదిశగానే సాగుతున్నాయన్నారు. ఇక ఎన్నికల పొత్తుల అంశంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఏచూరి... మీడియాలో అనేక రకాలైన ఊహాజనిత వార్తలొస్తున్నాయన్నారు. పాలకవర్గ పార్టీలకు కొమ్ము కాసేలా..  ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం సీపీఎం చరిత్రలోనే లేదన్నారు. తాము ఎన్నికల బరిలో ఉన్నచోట తమకు ఓటేయాల్సిందిగా కోరతామని, తాము బరిలో లేనిచోట, బీజేపీని ఓడించమంటూ ప్రజలను కోరతామనీ ఏచూరి చెప్పారు.  
ఏపీకి ప్రత్యేక హోదాపై మహాసభల్లో తీర్మానం ! 
ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపైనా మహాసభల్లో తీర్మానం ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే తమ పార్టీ  వైఖరిని స్పష్టం చేశామని... రాష్ట్రానికి పదేళ్లు హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు.. అనంతరం కాలంలో ఎందుకు మాట నిలుపుకోలేదని ప్రశ్నించారు. 
జస్టిస్‌ లోయా మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం : ఏచూరి
మరోవైపు.. జస్టిస్‌ లోయా మృతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని ఏచూరి వ్యాఖ్యానించారు. లోయా మృతిపై దాఖలైన అన్ని పిటిషన్లనూ రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేమని, ఉన్నత ధర్మాసనం దీన్ని మరోసారి సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇక కేసీఆర్‌ ఫ్రంట్‌పై కూడా స్పందించిన ఏచూరి... ఇప్పటినుంచే వాటిపై చర్చలు అనవసరమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోని బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 

 

08:17 - April 20, 2018

విజయవాడ : చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు భారీగా జనాన్ని సమీకరించి పెద్ద ఉద్యమంగా చిత్రీకరించే ప్రయత్నం చేయబోతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ధర్మాన్ని రక్షించేందుకు ఏనాడు ప్రయత్నించని చంద్రబాబు.. ఆయన చేయబోయే దీక్షకు ధర్మదీక్షగా నామకరణం చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా 15ఏళ్ళు సాధిస్తామని చెప్పి ఆ తరువాత ప్యాకేజీ పేరుతో ప్లేటు ఫిరాయించారని అంబటి మండిపడ్డారు. మ్యానిప్లేట్‌ రాజకీయాలు చేయటం తప్ప చంద్రబాబుకు పోరాటాలు చేతకాదని అంబటి రాంబాబు విమర్శించారు. 

 

08:15 - April 20, 2018

విజయవాడ : చంద్రబాబు నాలుగేళ్ళ పాటు కేంద్రంలో భాగస్వామిగా ఉండి ఇప్పుడు కేంద్రంపై పోరాటం చేయడం హాస్యాస్పదమని వైపీసీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని.. హోదా కోసం పోరాటం చేయాల్సిన సమయంలో మౌనంగా ఉండి కేంద్రంతో లాలూచీ పడ్డారన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకే ప్రస్తుతం చంద్రబాబు హోదా అంశాన్ని భుజాన వేసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకోసం కాదని వరప్రసాద్ ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని వరప్రసాద్‌ తెలిపారు.

కేంద్రం, మోడీ దిగిరావాలి : దేవినేని

విజయవాడ :  ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం, మోడీ దిగిరావాలని..ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల గుండె చప్పుడు వినిపించడం కోసమే చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపట్టారని తెలిపారు. దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలందరూ హాజరవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలే వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

 

08:11 - April 20, 2018

విజయవాడ : కాసేపట్లో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఇప్పటికే దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు. చంద్రబాబు దీక్షకు లక్ష మందికిపైగా తరలించేందుకు ప్రణాళిక రచించారు.  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రబాబు దీక్షకు కూర్చుంటున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దుతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ దీక్షలు జరుగనున్నాయి. 
ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం, మోడీ దిగిరావాలని..ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల గుండె చప్పుడు వినిపించడం కోసమే చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపట్టారని తెలిపారు. దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలందరూ హాజరవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలే వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
విజయవాడ మేయర్ శ్రీధర్ 
పార్లమెంట్ లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని బీజేపీ అమలు చేయాలని విజయవాడ మేయర్ శ్రీధర్ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం సీఎం చంద్రబాబు దీక్ష చేపట్టారని తెలిపారు. 65 ఏళ్ల వయస్సులో చంద్రబాబు దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. ఐదు కోట్ల మంది కోసం దీక్ష చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు లక్షల మంది మద్దతు పలుకుతున్నారని చెప్పారు. 

 

07:59 - April 20, 2018

గుంటూరు : ప్రత్యేహోదా సాధన లక్ష్యంగానే తాను  ధర్మ పోరాట దీక్ష చేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. హోదా కోసం తాను చేస్తున్న పోరాటానికి ప్రజలంతా బాసటగా నిలవాలని కోరారు. మరోవైపు చంద్రబాబు దీక్షపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నాలుగేళ్లుగా హోదాపై నోరుమెదపని చంద్రబాబు... ఎన్నికల కోసమే డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తాయి. చంద్రబాబు డ్రామాలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మబోరని తెలిపాయి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ధర్మ పోరాట దీక్షపై ప్రజలకు బహిరంగ లేఖరాశారు.  ఆ లేఖలో తాను ఎందుకు దీక్ష చేపడుతున్నారో వివరించారు.  ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలు , హామీలు, విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చలేదని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.  విభజన సమయంలో పార్లమెంట్‌లో నాటి ప్రధాని చేసిన  హామీలను ఎన్డీఏ సర్కార్‌ తుంగలో తొక్కిందన్నారు.  మోదీ ప్రభుత్వం ఆఖరి బడ్జెట్‌లోనూ ఏపీకి అన్యాయమే  చేసిందన్నారు.  అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్థికసాయం చేయాల్సి ఉండగా ... నామమాత్రపు నిధులు విదిల్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. రాష్ట్రానికి రైల్వేజోన్‌, ఉక్కు కార్మాగారం, ఓడరేవు, పెట్రో కెమికల్‌ పరిశ్రమతోపాటు ఇతరాత్రా హామీలను సైతం నెరవేర్చలేదన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన కూడా నత్తనడకన సాగుతోందన్నారు.  విజయవాడ, గుంటూరు పట్టణాలకు డ్రైనేజీకి ఇచ్చిన నిధులను కూడా రాజధాని అమరావతికి ఇచ్చినట్టు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చినా.. ఇవ్వలేదన్నట్టు ప్రకటనలు గుప్పించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

ఏపీకి మొదట్లో ప్రత్యేకహోదా ఇస్తామని ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఏపీపట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. చట్టంలో లేనివి, ప్రధాని హామీలలో లేవిని తామేమీ కోరడం లేదన్నారు. తమవి చట్టబద్దమైన డిమాండ్లని వివరించారు.  ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్లను గుర్తించి.. వాటిని సంపూర్ణంగా నెరవేర్చేవరకు పోరాటం కొనసాగించాలని కోరారు. కేంద్రంపై పోరాటం శాంతియుతంగా, చట్టబద్దంగా కొనసాగాలన్నారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని.. జన్మభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల తరపున తాను చేస్తున్న పోరాటానికి బాసటగా నిలవాలని, కలిసి నడవాలని విజ్ఞప్తి చేశారు. 

చంద్రబాబు దీక్షపై విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి.  వైసీపీ ఎంపీలు ఢిల్లీలో దీక్ష చేస్తే నిరుపయోగమన్న చంద్రబాబు.. ఇప్పుడు అదే దీక్షను ప్రభుత్వ ఖర్చుతో చేపడుతున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు దీక్షతో 20కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు.  నాలుగేళ్లుగా హోదా ఉద్యమాన్ని అణచివేసిన చంద్రబాబు.. ఇప్పుడు దీక్షకు దిగితే ప్రజలు నమ్మబోరని తెలిపారు. 

ఏపీ ప్రజలకు చంద్రబాబు ముందు క్షమాపణలు చెప్పి దీక్షకు కూర్చోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌నేత సి. రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు.  కేంద్ర ప్రభుత్వంతో నాలుగేళ్లపాటు జతకట్టి.. ఇప్పుడు ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతుంటే ప్రజలు నమ్మబోరన్నారు. మొత్తానికి చంద్రబాబు హోదా దీక్షపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

07:54 - April 20, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ ధర్మపోరాట దీక్షకు కూర్చోబోతున్నారు. తన పుట్టినరోజున.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్‌తో.. దాదాపు పన్నెండు గంటల పాటు.. ఆయన దీక్ష చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ.. విజయవాడ మునిసిపల్‌ గ్రౌండ్స్‌లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 

ప్రత్యేక హోదా అంశంపై పోరులో భాగంగా.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. శుక్రవారం విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షలో కూర్చోనున్నారు. ధర్మపోరాట దీక్ష కోసం.. విజయవాడ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేదిక ప్రాంగణం మొత్తం టెంట్లు వేశారు.  స్టేడియంలో రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేదికపై చంద్రబాబు దీక్ష , మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు, సుమారు 200 మంది ఆసీనులైయ్యేలా దీక్షా వేదిక ముస్తాబైంది. వేదిక ముందు 10వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. పుట్టినరోజు సందర్భంగా.. ఎలాంటి వేడుకలూ జరుపుకోకుండా.. హోదా, రైల్వేజోన్‌, పోలవరం తదితర విభజన హామీల అమలు కోసం తమ నేత పన్నెండు గంటల పాటు దీక్షలో కూర్చుకుంటున్నారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ధర్మ పోరాట దీక్ష ద్వారా రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. 

విజయవాడలో ముఖ్యమంత్రి చేపట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి దీక్షకు సంఘీభావంగా వచ్చే వారిని.. ఉదయం ఏడు నుంచి పదకొండు, పదకొండు నుంచి మూడు, మూడు నుంచి ఏడు గంటల వరకూ మూడు విభాగాల్లో దీక్షకు అనుమతిస్తారు. దీక్షాస్థలి వద్ద.. అత్యవసర సేవల కోసం వైద్య సిబ్బందిని, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతున్నారు. దీక్షను అందరూ వీక్షించే విధంగా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సిద్ధం చేశారు. కార్యక్రమానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతోన్న ధర్మపోరాట దీక్షకు.. టీడీపీ శ్రేణులు వివిధ వర్గాల  మద్దతును కూడగడుతున్నారు. ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. 

మరోవైపు.. ముఖ్యమంత్రి శుక్రవారం నాటి దీక్షకు సంఘీభావంగా.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్నారు. సైకిల్‌ ర్యాలీలో ద్విచక్రవాహనదారుడు తగలడంతో.. స్పీకర్‌ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో శివప్రసాద్‌ తొంటికి, తలకు గాయమైంది. స్పీకర్‌ తుంటి నొప్పి అధికం కావడంతో.. నరసరావుపేటలోని సాయితిరుమల ఆస్పత్రికి తరలించారు. 

కాసేపట్లో సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం

అమరావతి : సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష స్థలికి చేరుకున్నారు. కాసేపట్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు.

 

ధర్మ పోరాట దీక్ష స్థలికి చేరుకున్న సీఎం చంద్రబాబు

అమరావతి : సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష స్థలికి చేరుకున్నారు. కాసేపట్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒకరోజు దీక్ష చేపట్టారు. 

 

నేడు ధర్మ పోరాట దీక్ష చేయనున్న సీఎం చంద్రబాబు

అమరావతి : నేడు సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేయనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒకరోజు దీక్ష చేపట్టారు. 

 

Don't Miss