Activities calendar

21 April 2018

గడువు కోరిన టాలీవుడ్ ?

హైదరాబాద్ : టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు.. సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని రెండు రోజుల గడువు కోరినట్లు సమాచారం. తాను విధించిన గడువుపై.. సినీ ప్రముఖులు స్పందించి.. చర్చలు సాగిస్తున్న వేళ.. సంయమనం పాటించాలంటూ పవన్‌ కల్యాణ్‌ తన అభిమానులకు సూచించారు. 

ఆదివారం సీపీఎం బహిరంగ సభ...

హైదరాబాద్ : ఈనెల 18న ప్రారంభమైన సీపీఎం 22వ జాతీయ మహాసభలు.. తుది దశకు చేరుకుంటున్నాయి. నాలుగు రోజులుగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి.. తీర్మానాలు చేసిన మహాసభ.. శుక్రవారం రాత్రి.. పార్టీ రాజకీయ తీర్మానాన్నీ ఆమోదించింది. సభల చివరి రోజైన ఆదివారం నాడు.. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

 

అణుపరీక్షలు..లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్షలపై...

ఢిల్లీ : అణు పరీక్షలను, లాంగ్‌ రేంజ్‌ క్షిపణి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. అణు పరీక్ష ప్రాంతాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. అణ్వస్త్రాలను నిలిపేయాలని అమెరికా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య జరుగుతున్న చర్చల నేపథ్యంలో కిమ్‌ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అ

 

అబూ సలేం కు చుక్కెదురు...

ముంబై : పేలుళ్ల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌ స్టర్‌ అబూ సలేంకు చుక్కెదురైంది. రెండో పెళ్లి కోసం పెరోల్ దరఖాస్తు చేసుకోగా ముంబై జైలు అధికారులు తిరస్కరించారు.

 

ప్రచారంలో కాంగ్రెస్ తరపున స్టార్ నేతలు...?

ఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్‌ నేతలను ప్రచారంలోకి దింపాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్‌ క్యాంపెయిన్‌ నేతల లిస్టులో సొంత పార్టీ నేతలే కాకుండా మిత్ర పక్షాల నేతల పేర్లు కూడా ఉన్నట్లు, ప్రచార లిస్టులో 22 మంది నేతల పేర్లున్నాయని తెలుస్తోంది. 

ఆశారం..కీలక తీర్పు...

ఢిల్లీ : వివాదాస్పద ఆధ్యాత్మక గురువు ఆశారాంపై ఉన్న అత్యాచారం అభియోగం కేసులో ఏప్రిల్‌ 25న జోధ్‌పూర్‌ ప్రత్యేక కోర్టు కీలకమైన తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జోథ్‌పూర్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

21:18 - April 21, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు రేపటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో.. పార్టీ, భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈనెల 18న ప్రారంభమైన సీపీఎం 22వ జాతీయ మహాసభలు.. తుది దశకు చేరుకుంటున్నాయి. నాలుగు రోజులుగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి.. తీర్మానాలు చేసిన మహాసభ.. శుక్రవారం రాత్రి.. పార్టీ రాజకీయ తీర్మానాన్నీ ఆమోదించింది. సభల చివరి రోజైన ఆదివారం నాడు.. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో సీపీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

పార్టీ తెలంగాణ శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యుడు నంద్యాల నరసింహారెడ్డి తదితరులు.. ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభను వీక్షించేందుకు.. సభ ప్రాంగణంలో ఆరు, ఎల్బీనగర్‌ చౌరస్తా వరకు మరో ఆరు ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంలో బహిరంగ సభకు హాజరయ్యే మహాసభల ప్రతినిధులు, ప్రముఖులు, మీడియా కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు మలక్ పేట నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది.

మహాసభల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యార్శి సీతారం ఏచూరి, కేరళ సీఎం పినరాయి విజయన్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, బృందాకరత్‌, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, బీవీ రాఘవులు, తెలుగు రాష్ట్రాల సీపీఎం కార్యదర్శులు హాజరు కానున్నారు. ఎన్నికల సంవత్సరంలో జరిగిన పార్టీ మహాసభ తీసుకున్న నిర్ణయాలను.. వారీ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు.

21:13 - April 21, 2018

విజయవాడ : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విజయవాడలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నిరసనలకు దిగారు. బాలకృష్ణ దిష్టిబొమ్మలు దగ్ధంచేశారు. గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. విజయవాడలో చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు.

ప్రధాని మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌ విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో ఉన్న గవర్నర్‌ను కలిశారు. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతోనే బాలకృష్ణ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు ఫిర్యాదు చేశామన్నారు. రాజ్యాంగపదవిలో ఉన్న మోదీని అసభ్య పదజాలంతో దూషించిన బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు.

దేశంలో ప్రధాని మోదీపై విపరీతంగా కోపం పెంచుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రధానిని చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కి చుక్కలు చూపిస్తామని సోము వీర్రాజు అన్నారు. బాలకృష్ణపై హైదరాబాద్‌లోనూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద ఆందోళకు దిగారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాలకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఓయూ పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

అటు అనంతపురంలో బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేయబోయిన బీజేపీ కార్యకర్తలను బాలకృష్ణ అభిమానులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా మోదీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న చంద్రబాబు, బాలయ్యలను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నెల్లూరులో బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలను డిమాండ్‌ చేశారు. గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీనికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో కొద్ద సేపు ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. 

21:09 - April 21, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు.. సినీ పెద్దలు నడుం బిగించారు. శనివారం ఉదయం నుంచీ సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. అటు తెలంగాణ సినిమాటొగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోనూ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీలో కో-ఆర్డినేటర్ల వ్యవస్థ లేకుండా చేస్తామని, అన్ని వివాదాలను రెండు రోజుల్లోగా పరిష్కరిస్తామని వారు మంత్రికి తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందిస్తామని మంత్రి సినీ పెద్దలకు హామీ ఇచ్చారు.

నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదం.. పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు.. తెరవెనుక పాత్రధారిని తానేనన్న దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ప్రకటనల నేపథ్యంలో.. పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఫిల్మ్‌ చాంబర్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు . సమస్య పరిష్కారానికి సినీ పెద్దలకు 24 గంటల గడువిచ్చారు. ఈ నేపథ్యంలో.. సినీ పెద్దలు శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం.. మీడియాతో కలవకుండానే వారు వెళ్లిపోయారు. నేరుగా తెలంగాణ సినిమాటొగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో సమావేశమయ్యారు.

సినీరంగంలో లైంగిక వేధింపుల అంశంపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను వివరించాలంటూ అందులో కోరింది. ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాసయాదవ్‌తో సినీ ప్రముఖుల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. టాలీవుడ్‌లో ఇప్పుడు జరుగుతున్న ఘటనలు పునరావృతంకాకుండా చూస్తామని సినీ ప్రముఖులు మంత్రికి వివరించారు. ఇండస్ట్రీలో మధ్యవర్తులు, సమన్వయ కర్తలు లేకుండా చూస్తామని చెప్పారు. ఫిర్యాదుల కోసం ఎఫ్‌డీసీలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి వారికి తెలిపారు. వివాదాన్ని కొనసాగించకుండా ఇంతటితో ఆపాలని సినీ పెద్దలకు తలసాని శ్రీనివాస యాదవ్‌ సూచించారు.

టాలీవుడ్‌లోని సమస్యలను పరిష్కరించేందుకు.. సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని రెండు రోజుల గడువు కోరినట్లు సమాచారం. తాను విధించిన గడువుపై.. సినీ ప్రముఖులు స్పందించి.. చర్చలు సాగిస్తున్న వేళ.. సంయమనం పాటించాలంటూ తన అభిమానులకు పవన్‌ కల్యాణ్‌ సూచించారు. 

21:06 - April 21, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదం కాస్తా.. పవన్‌ కల్యాణ్‌కు... ఓ సెక్షన్‌ మీడియాకు మధ్య రూపాంతరం చెందింది. తమ పరువుకు నష్టం కలిగించారంటూ.. మీడియా ప్రముఖులు.. పవన్‌కల్యాణ్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. అటు పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ వ్యవహారంలో మీడియాతో సుదీర్ఘ పోరాటం సాగించాలనే నిర్ణయించుకున్నారు. వరుసగా రెండో రోజూ ట్వీట్లతో కలకలం సృష్టించారు. నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశం.. టాలీవుడ్‌లో పెను ప్రకంపనలనే సృష్టిస్తోంది. ఇష్యూ రకరకాలుగా రూపాంతరం చెంది.. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌.. ఓ సెక్షన్‌ మీడియా మధ్య వార్‌గా పరిణమించింది. పవన్‌ కల్యాణ్‌ తల్లికి తగిలేలా శ్రీరెడ్డి అన్న ఓ తిట్టు, అలా తిట్టించింది తానేనంటూ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వెల్లడించడంతో పరిస్థితి మొత్తం పరువు ప్రతిష్టల స్థాయికి చేరింది. శ్రీరెడ్డితో రామ్‌గోపాల్‌వర్మ తిట్టించిన తిట్టును పవన్‌ కల్యాణ్‌ చాలా సీరియస్‌గానే తీసుకున్నారు. శుక్రవారం ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ చాంబర్‌లో హల్‌చల్‌ చేసి.. విషయాన్ని తేల్చేందుకు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు 24 గంటల గడువిచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. జనసేన పార్టీ కార్యాలయానికి శనివారం ఉదయం నుంచే అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తనపైన, తన పార్టీపైన చేస్తున్న దుష్ర్పచారంపై న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని పవన్‌ కల్యాణ్‌ అభిమానులతో అన్నారు.

మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులుగా వరుస ట్వీట్లతో కలకలం సృష్టిస్తున్నారు. శ్రీరెడ్డి, రామ్‌గోపాల్‌ వర్మల వెనుక నారా లోకేశ్‌ ఉన్నారంటూ మండిపడ్డారు. స్పెషల్‌ స్టేటస్‌ కంటే వ్యభిచార చట్టబద్ధ అంశంపైనే ఆసక్తి అంటూ మీడియాపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డ్రీం టీం అంటూ.. టీవీ9 అధినేత శ్రీనిరాజు, సీఈఓ రవిప్రకాశ్‌, ఏబీఎన్‌ అధినేత వేమూరి రాధాకృష్ణలపై విరుచుకు పడ్డారు. తనపైన, తన తల్లిపైనా చేసిన వ్యాఖ్యలకు వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అంతేకాదు టీవీ9, టీవీ5, ఏబీఎన్‌లను బహిష్కరించాలనీ అభిమానులకు పిలుపునిచ్చారు. పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లు సినీ, మీడియాలతో పాటు.. రాజకీయం రంగంలోనూ కలకలం సృష్టించాయి. పవన్‌ ట్వీట్లతో ఆగ్రహం చెందిన టీవీ9 అధినేత శ్రీనిరాజు.. జనసేనానికి లీగల్‌ నోటీసులు పంపారు. పవన్‌ అభియోగాలన్నీ ఊహాజనితమేనని ఆ నోటీసులో కొట్టిపారేశారు. అటు ఏబీఎన్‌ అధినేత కూడా పవన్‌కు పరువు నష్టం నోటీసులు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌ శనివారం కూడా వరుస ట్వీట్లతో కలకలం సృష్టించారు. నిజాలను నిగ్గుతేలుద్దాం.. బట్టలు విప్పి మాట్లాడుకుందాం అంటూ ట్వీట్లు పోస్ట్‌ చేశారు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులు జాతీయ చేయాలన్న ఓ చానల్‌ స్లోగన్‌ వెనకాల కథ ఏంటి..? నిజమైన అజ్ఞాత వాసి ఎవరు..? ఆ అజ్ఙాతవాసి బ్లాక్‌మెయిలర్‌ అని సీఎం ఓ మంత్రితో అన్నారంటూ పవన్‌ ట్వీట్ల వర్షం కురిపించారు. అనంతరం కొంతసేపటికే అసలైన అజ్ఞాతవాసి టీవీ9 రవిప్రకాశ్‌ అని, శ్రీసిటీని ఇచ్చి ఆశీర్వదించిన పొలిటికల్‌ బాస్‌లతో శ్రీనిరాజు కుట్ర చేస్తున్నారంటూ విమర్శించారు. అంతేకాదు.. రవిప్రకాశ్‌ భార్యను ఉద్దేశించి.. మీ ఆయన మంచివాడు.. అయితే మీ పిల్లలను టీవీ9 చూడనివ్వకండి అంటూ పవన్‌ ట్వీట్‌ చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు.. పొలిటికల్‌ సర్కిల్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. 

21:03 - April 21, 2018

హైదరాబాద్ : రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించిన అంశాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై చర్చించారు. పాస్ బుక్స్‌ పంపిణీ, చెక్కుల పంపిణీ నిర్వహణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. అసైన్డ్ భూముల లబ్దిదారులు, ROFR పట్టాదారులు, ఏజెన్సీలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఆర్థిక సహాయం అందించే చెక్కులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త పట్టాదారు పాస్ బుక్స్‌ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.

ఈ నెలాఖరుకు 58 లక్షల పాస్ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుందని సీఎం స్పష్టం చేశారు. చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీతో అధికారులంతా తమ శక్తి మేరకు కృషి చేయాలన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇలాంటి భారాన్ని ఎవరూ ఎత్తుకోలేదని సీఎం తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని కార్యక్రమాలను మనమే రచించుకొని అమలు చేస్తున్నామని చెప్పారు.

పాస్‌బుక్స్ పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా 2762 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బృందం 300 పాస్ పుస్తకాల చొప్పున పంపిణీ చేస్తుందని సీఎం వెల్లడించారు. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల నుంచి నగదు పొందేలా ఏర్పాట్లు చేశామని సీఎం పేర్కొన్నారు. రైతులకు వెంటనే నగదు చెల్లించకపోతే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామన్నారు.

గ్రామాల్లోని పాఠశాలల్లో చెక్కులు, పాస్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఏ గ్రామంలో ఎప్పుడు పంపిణీ ఉంటుందో ప్రజలకు ముందే సమాచారం ఇవ్వాలని సూచించారు. పంపిణీ సమయంలో చెక్కులు, పాస్ బుక్స్ తీసుకోని వారికి తహసీల్దార్ ఆఫీస్‌లో ఇవ్వాలని చెప్పారు. రూ. 50 వేల కంటే ఎక్కువ ఉన్న వారికి రెండు చెక్కులు ఇవ్వాల్సి ఉంటుందని కేసీఆర్ తెలిపారు. పాస్ బుక్స్, చెక్కులు పొందిన వారి నుంచి రశీదు తీసుకోవాలని ఆదేశించారు. కొంతమంది రైతులు పెట్టుబడి మద్దతును స్వచ్చందంగా వదులుకుంటున్నారు. వదులుకున్న సొమ్మును రైతు సమన్వయ సమితి మూలధనంగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

20:33 - April 21, 2018

నువ్వు మన్షివా బాలకిష్ణవా అని జనం నిన్ను ఎంతకు తీస్కపోయి తిట్టుకుంటున్నరో సూశ్నవా బాలయ్యా...అవ్వలో ఈ తెలంగాణ గ్రూప్ టూ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అపాయింట్ మెంట్ గావాల్నంట.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారంట తెల్లారి మొఖం గడ్కకముందుకు సుర్వు జేస్తె.. రాత్రి నిద్రమత్తులకు వొయ్యెదాక అవద్దాలే మాట్లాడ్తడట.. చంద్రబాబు ఇంటి దంద హెరిటెజ్ సూపర్ మార్కెట్ల కిలో ఉల్లిగడ్డ ధర ఎంతనో తెల్సా..? పదమూడు రూపాల నర.. ఎద్గ తెలంగాణ రాష్ట్రమొచ్చినంక.. అండ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యినంక అన్యాయమైపోయిండ్రు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు..పోలీసోళ్లు ప్రజలను సార్ అని పిలిస్తె మనం గూడ పోలీసోళ్లను సార్ అనే పిల్వాలే.. ఇయ్యాళ రేపు బ్యాంకులళ్ల పైకం దాస్కుంటె మిత్తి దేవుడెరుగు గని..గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:24 - April 21, 2018

హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ శక్తులు కేరళలో హింస రగిలిస్తున్నాయని కేరళ రాష్ట్ర సీపీఎం నేత బాలకృష్ణన్ పేర్కొన్నారు. సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి. ఈ సభల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన బాలకృష్ణన్ తో టెన్ టివి ముచ్చటించింది. ఆర్ఎస్ఎస్ మతోన్మాదంతో దేశంలో లౌకిక, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. కేరళలో ఆర్ఎస్ఎస్ శక్తులు హింసను రగిలిస్తున్నాయని, ప్రజల మద్దతుతో ఆర్ఎస్ఎస్ గూండాయిజాన్ని ఎదుర్కొంటున్నామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తులుండవని తేల్చిచెప్పారు.

 

20:23 - April 21, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మహాసభలకు కర్నాటక సీపీఎం నేత వరలక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆమెతో ముచ్చటించింది. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఎన్నికల్లో మిగతా వామపక్ష పార్టీలతో కలిసి పోరాడుతామన్నారు. 

19:31 - April 21, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై కాషాయ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ధర్మపోరాట దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలయ్య ప్రధాని మోడీని ఉద్ధేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సరియైంది కాదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమని, వెంటనే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు బిజెపి నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. అక్కడనే ఉన్న పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా బాలకృష్ణ ఇంటి వద్ద రెండంచెల భధ్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. 

బాలయ్య ఇంటి వద్ద బీజేపీ నేతలు...

హైదరాబాద్ : బాలకృష్ణ ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. 

18:28 - April 21, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు కొనసాగుతున్నాయి. ఆదివారం ముగింపు సందర్భంగా సరూర్ నగర్ లో భారీ బహిరంగసభ జరుగనుంది. ఇందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం నేత నంద్యాల నర్సింహరెడ్డి, ఇతర నేతలు స్టేడియాన్ని పరిశీలించారు. స్టేడియంలో తీసుకోవాల్సిన దానిపై తమ్మినేని నేతలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని, నంద్యాలలు టెన్ టివితో మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపించే అవకాశాలున్నాయని తమ్మినేని పేర్కొన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడడం జరిగిందని..ఆ ఫ్రంట్ ఆవిర్భావాన్ని పార్టీ ప్రశసించిందని తెలిపారు. సీపీఎం నాయకుల మధ్య విబేధాలున్నాయని..పార్టీ రచ్చకెక్కపోతోందని..మీడియాలో పెద్ద ఎత్తున్న దుష్ర్పచారం జరిగిందన్నారు. దీనికంతటికి చెక్ పెట్టే విధంగా రాజకీయ తీర్మానం పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని..దీనితో పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషుల్లో పెద్ద ఉత్సాహం నెలకొందన్నారు. మూడు లక్షల మంది వస్తారని అంచనా వేయనున్నట్లు నంద్యాల తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:23 - April 21, 2018

హైదరాబాద్ : త్వరలోనే తెలంగాణ రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలు రానున్నాయి. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రగతి భవన్‌లో విడుదల చేశారు. రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించిన అంశాలపై ఆయన కలెక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా కొత్త పాస్ పుస్తకాలను విడుదల చేశారు. 

కొత్త రాజకీయ ఒరవడికి ప్రయత్నం - కోదండరామ్...

హైదరాబాద్ : కొత్త రాజకీయ ఒరవడికి ప్రయత్నం జరుగుతోందని, ప్రతి గ్రామానికి జనసమితి కరపత్రాలు వెళ్లాయని జనసమితి పార్టీ వ్యవస్థాకుడు కోదండరామ్ పేర్కొన్నారు. త్వరలోనే రెండు పాటల సీడీలు విడుదల చేయనున్నట్లు, కార్పొరేట్, పెద్ద సంస్థల చందాలు తీసుకోవద్దని సూచించడం జరిగిందని..చిన్న వ్యాపారులు..చిన్న కాంట్రాక్టర్ల నుండే నిధుల సేకరణ జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ బాధితులను వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు, అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదని తామే చిహ్నం ఏర్పాటు చేస్తామన్నారు. 

దీక్ష వల్ల ఎలాంటి ఆస్తి నష్టం లేదన్న కళా...

విశాఖపట్టణం : రాష్ట్ర విభజనలో బీజేపీకి భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏపీ ప్రజలకు నిలదీసే హక్కు ఉందని మంత్రి కళా వెంకట్రావ్ పేర్కొన్నారు. సీఎం దీక్ష వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆస్తి నష్టం లేదని, ఓ మాజీ మంత్రి రూ. 30 కోట్లు ఖర్చైందని లెక్కలు వేస్తున్నారని ఎలా లెక్కలు వేశారో చెప్పాలన్నారు. తమ పార్టీని కాపాడుకోవడానికి టిడిపిపై బురద జల్లుతున్నారని, ప్రతిపక్షం స్వలాభం కోసం పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో దిశానిర్దేశం లేని మరో పార్టీ ప్రతిపక్షం తయారైందన్నారు. చంద్రబాబు దీక్ష నుండి ప్రజలు..మీడియా దృష్టిని మళ్లించడానికి ముందు రోజు అర్ధరాత్రి నుండే ట్వీట్ లు మొదలయ్యాయన్నారు. 

ఉత్తమ్ కు రాహుల్ లేఖ...

హైదరాబాద్ : పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఇసుక విధానం అక్రమాలపై టిపిసిసి ఉద్యమాన్ని రాహుల్ అభినందించారు. కాంట్రాక్టర్లకే అనుకూలంగా ఉన్న ఇసుక విధానంపై సామాన్యులపై ఇసుక మాఫియా దౌర్జన్యాలపై పోరాటం కొనసాగించాలని సూచించారు. పంజాబ్ మంత్రి సిద్ధూ తెలంగాణ ఇసుక పాలసీని సమర్థించిన అంశంపై రాహుల్ కు ఉత్తమ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక...

చిత్తూరు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ కు రంగం స్ధిమైంది. ఈనెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 21న ఉప ఎన్నిక, మే 24న ఫలితాలు విడుదల కానున్నాయి. గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడి మృతితో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. 

17:52 - April 21, 2018

హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ టచ్ వేడి చల్లారడం లేదు. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి విమర్శలు చేయడం..దీనివెనుక రాంగోపాల్ వర్మ ఉన్నారనే ప్రచారం..తదితర పరిణామాలతో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై మీడియాపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మీడియాపై పవన్ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వివాదంపై మొదటిసారిగా పవన్ నోరు విప్పారు. గత 8 నెలలుగా తనపై కుట్ర జరుగుతోందని పవన్ పేర్కొన్నారు. ఇందుకు లీగల్ గానే వెళుతానని, సుదీర్ఘమైన న్యాయపోరాటం చేయడానికి సిద్ధమన్నారు. ఫ్యాన్స్ ఎవరూ కోపం తెచ్చుకోవద్దని సూచించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన అనంతరం నిగ్రహంగా ఉండాలని చెప్పడం కరెక్టేనా ? అని ప్రశ్నించారు. 

17:15 - April 21, 2018

విజయవాడ : తనతో విరోధం పెట్టుకోవడానికి ధైర్యం కావాలని, వేరే పార్టీతో లాలూచీ పడి తనతో బీజేపీ విరోధం పెట్టుకుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో సాధికార మిత్రలతో బాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పోరాడి సాధించి హక్కులు సాధించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని, అందులో భాగంగా తాను ధర్మ దీక్ష చేయడం జరిగిందన్నారు. ఈనెల 30వ తేదీన తిరుపతిలో నిర్వహించే సభలో గతంలో మోడీ ఇచ్చిన హామీలు విజువల్స్, ప్రసంగాల క్యాసెట్లను ప్రదర్శిస్తామన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక్కసీటు కూడా రాదని జోస్యం చెప్పారు. మోసం చేసిన బీజేపీకి ఏపీ ప్రజలు ఓట్లు వేయరని, వైసీపీ లాలూచీ వల్లే మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు. 

16:58 - April 21, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదిస్తోందని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు హేమలత పేర్కొన్నారు. సీపీఎం 22వ అఖిల భారత మహాసభల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆమెతో ముచ్చటించింది. పెట్టుబడి లాభాల కోసం కార్మికుల జీవితాలను బలి పెడుతున్నారని పేర్కొన్నారు. లేబర్ లా అమైండ్ మెంట్ తో 14 చట్టాలను సవరించారన్నారు. 44 కేంద్ర చట్టాలను 4 కోట్స్ గా కుదిస్తున్నారని, ఇప్పటికే కార్మికులకు చట్టాలు వర్తింప చేయడం లేదన్నారు. ఫిక్స్ డే టర్మ్ ఎంప్లాయిమెంట్ తో కారణం లేకుండానే పనిలో నుండి తీసేసే కుట్ర జరుగుతోందన్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో సంఘటిత, అసంఘటిత కార్మికులతో భారీ ర్యాలీ చేస్తామన్నారు. 

అత్యాచారాలపై నటీ,ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు..

ముంబై : మహిళలు, మైనర్ బాలికలపై పెచ్చుమీరుతున్న అత్యాచారాల విషయంలో ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే అలాంటి కేసులను లేవనెత్తుతున్నారని ఆరోపించారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అలాంటి కేసులకు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇలాంటి గతంలో అనేకం జరిగినప్పటికీ... వాటిని గురించి బయటికి తెలియలేదు. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం ‘పోస్కో’ని సవరిస్తూ కేంద్ర ఆర్డినెన్స్ తీసుకొస్తున్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

16:25 - April 21, 2018

విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తీసే విధంగా ప్రయత్నిస్తే కేంద్రాన్ని సైతం నిలదీయాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సాధికారమిత్రలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. తన పని తాను చేసుకుంటుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తీస్తున్నారని ఒక విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సహకరించే విధంగా చేస్తున్నారని విమర్శించారు. బంద్ లకు పిలుపునివ్వకుండా ప్రజల్లోకి వెళ్లి చైతన్యపరిచి సంఘటితపరంగా ఉండే విధంగా చూడాలన్నారు. భారతదేశంలో డబ్బులు దొరకని పరిస్థితి వచ్చిందంటే దుర్మార్గమని, ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో జరిగిన పరిణామాలతో కొంతమంది చనిపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందన్నారు. 

పిజ్జా ఇచ్చాడు..ఫిర్యాదు తీసుకుంది..

హైదరాబాద్ : అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కే వెళతాం. కానీ పిజ్జా కార్నర్ కు కాదు కదా. కానీ ఈ మహిళా పోలీస్ ఆఫీసర్ వద్దకు వెళితే పిజ్జా తెస్తేనే కానీ ఫిర్యాదు తీసుకోనంది. మరి అతను ఏం చేయాలి? తప్పనిసరి పరిస్థితుల్లో పిజ్జా ఇచ్చి ఫిర్యాదు ఇచ్చాడు. అదేమిటా అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి...తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేద్దామని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఓ రెస్టారెంట్‌ యజమాని రెస్టారెంట్‌ యజమాని రోహిత్‌ బేరీకి వింత అనుభవం ఎదురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నా..

16:09 - April 21, 2018

యాదాద్రి : భువనగిరి జిల్లాలో పట్టపగలే యువకుడిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. భువనగిరి - కిసాన్ నగర్ లో యువకుడిపై మరొక యువకుడు వేటకొడవలితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తి శివ అని, చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి సురేశ్ అని తెలుస్తోంది. సురేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ప్రేమ..ఆర్థిక వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. 

యువకుడిపై వేటకొడవలితో హత్యాయత్నం..

యాదాద్రి : పట్టపగలు ఓ యువకుడిపై మరో యువకుడు దాడికి తెగబడ్డాడు. వేటకొడవలితో సురేశ్ అనే యువకుడిపై శివ అనే మరో యువకుడు దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన భువనగిరి కిసాన్ నగర్ లో చోటుచేసుకుంది. సురేశ్ పరిస్థితి విషమంగా వుండటంతో హైదరాబాద్ కు తరలించారు. ఈ దాడికి ప్రేమ,ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

16:04 - April 21, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతున్న ఈ చర్చలో పార్టీ ప్రతినిధులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ శనివారం మీడియాకు తెలియచేశారు. రాజకీయ తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని, 17 ప్రతినిధులు నివేదిక అందచేయడం జరిగిందని, విశాఖపట్టణంలో జరిగిన మహాసభల నిర్ణయాలు..అమలు మూడేళ్ల తమ పని తీరుపై చర్చించినట్లు తెలిపారు. ఆదివాసీ, దళితులు, మైనార్టీలపై వివక్ష..దాడులు..ప్రజాస్వామ్యంపై దాడులు..ఇతరత్రా వాటిపై సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. వివిధ వర్గాల సమస్యలతో పాటు సామాజిక అంశాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ పార్టీలో వివిధ విభాగాల కింద 5 కోట్ల 39 లక్షల సభ్యులున్నారని, ప్రత్యామ్నాయ విధానాలపైనా చర్చించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా మూడు తీర్మానాలను శనివారం ఆమోదించడం జరిగిందన్నారు. మెజార్టీ ఉన్న బీజేపీ మహిళల రిజర్వేషన్ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మహిళా హక్కులకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందన్నారు. మహిళలపై పిల్లలపై అత్యాచారాలను ఖండిస్తూ మరో తీర్మానం ఆమోదించామన్నారు. భారతదేశంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను పార్టీ ఖండిస్తోందన్నారు. వికలాంగుల హక్కులకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించామన్నారు.

తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని, బలం లేని చోట బీజేపీని ఓడించగల అభ్యర్థిని బలపరుస్తామన్నారు. కేరళను హింసారహిత రాష్ట్రంగా పరిపాలించాలన్నది తమ ధ్యేయమని, ప్రజల సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. 1970 నుండి కేరళలో జరిగిన ప్రతి హింస వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని, ఈ హింస నుండి ప్రజలను రక్షించేందుకు సీపీఎం ప్రయత్నిస్తోందని, అత్యాచారాలను తాము మతాల కోణంలో చూడమని..బాధితులకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమన్నారు. 

బాధితులకు న్యాయమే సీపీఎం ధ్యేయం : బృందాకరత్

హైదరాబాద్ : ప్రజల సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని బృందాకరత్ పేర్కొన్నారు. సీపీఎం జాతీయ మహాసభలు నాలుగవరోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మాట్లాడుతు..1970 నుండి కేరళలో జరిగిన ప్రతి హింస వెను ఆర్ఎస్ఎస్ హస్తముందన్నారు. ఆర్ఎస్ఎస్ కొనసాగించే హింసనుండి ప్రజలను రక్షించేందుకు సీపీఎం ప్రయత్నిస్తోందని తెలిపారు. హింసలను,అత్యాచారాలను సీపీఎం మతాల కోణంలో చూడదనీ.. బాధితులు ఎవరైనా వారికి న్యాయం జరగాలన్నదే మా ధ్యేయమన్నారు. 

బీజేపీని గద్దె దించటమే సీపీఎం ప్రధాన లక్ష్యం: బృందాకరత్

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ లో పార్టీ పటిష్టత గురించి చర్చిస్తున్నామని సీపీఎం పొటిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు అనేది వుండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి మహాసభలో ఓ స్పస్టత వచ్చిందన్నారు. మాకు బలం లేని ప్రాంతంలో బీజేపీని ఓడింగల పార్టీకి తాము మద్దతునిస్తామని తెలిపారు. కేంద్రంలో బీజేపీని ఓడించటమే సీపీఎం ప్రధాన లక్ష్యమన్నారు. దానికి తీసుకోవాల్సిన చర్యలపై మహాసభ చర్చిస్తోందని తెలిపారు. లౌకిక శక్తులతో ఎలా సాగాలనే అంశంపై కూడా చర్చిస్తున్నామన్నారు.

పాలకులే రేపిస్టులకు రక్షకులు : బృందా కరత్

హైదరాబాద్ : మరణశిక్షకు సీపీఎం పార్టీ విరుద్ధం సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ పేర్కొన్నారు. పాలకులే రేపిస్టులకు రక్షకులుగా మారారని బృందా తీవ్రంగా విమర్శించారు. పోక్సో చట్టంపై కేంద్రం ఆమోదం పలకటంపై బృందాకరత్ మాట్లాడుతు..పోక్సో చట్టం సవరణ వల్ల ఎటువంటి ప్రయోజనం వుండబోదన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై,చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను పక్కదోవ పట్టించేందుకే పోక్సో చట్ట సవరణ తప్ప మరొకటి కాదన్నారు. కాగా బాలలను లైంగిక నేరాల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది.

మాది మిస్డ్ కాల్ మెంబర్ షిప్ కాదు : బృందా కరత్

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నాలుగవరోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ మాట్లాడుతు..సీపీఎం పార్టీలో వివిధ విభాగాల కింద 5కోట్ల  39 లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు. సీపీఎం పార్టీలో సభ్యులు కావాలంటే కేవలం మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చే పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రతీ సభ్యుడి పనితీరును కూలంకషంగా పరిశీలించాకనే సభ్వత్వం ఇస్తామనీ..ఒకసారి సభ్యత్వం వచ్చిన తరువాత అది అలాగే కొనసాగే అవకాశం కూడా లేదనీ..ప్రతీ ఏటా సభ్యుడి పనితీరును పరిశీలించిన తరువాతనే సభ్వత్వాన్ని రెన్యువల్ చేస్తామని తెలిపారు.

మహిళా హక్కుల తీర్మానానికి మహాసభ ఆమోదం : బృందకరత్

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నాలుగవరోజు నగరంలోని ఆర్టీసీ కళాభవనంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మాట్లాడుతు..మహిళా హక్కులకు సంబంధించిన తీర్మానాన్ని మహాసభ ఆమోదించిందని బృందా తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళలపైనా, చిన్నారులపైనా జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించామని తెలిపారు. అలాగే వికలాంగుల హక్కులకు సంబంధించిన తీర్మానాన్ని కూడా మహాసభ ఆమోదం పలికిందన్నారు. పార్టీ వివిధ వర్గాల సమస్యలతో పాటు సామాజిక అంశాలపైన కూడా సీపీఎం పోరాటాలు చేస్తుందన్నారు.

మంత్రి కేటీఆర్ సరదా ట్వీట్ చూడండి..

హైదరాబాద్ : ప్రస్తుతం టెక్నాలజీలో వస్తున్న వేగం మనుష్యులను కూర్చున్న చోటు నుండే ఎటువంటి సమాచారానైనా చేరవేస్తోంది. దీనిపై ప్రతీ ఒక్కరు ఫాలో అయిపోతున్నారు. ఈక్రమంలో తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీటు నవ్వులు పూయిస్తోంది. ఓ క్రికెట్‌ అభిమాని తనకు ఉచితంగా 3 ఐపీఎల్‌ టిక్కెట్లు కావాలంటూ కేటీఆర్‌కు సరదాగా ట్వీట్‌ చేశాడు. దానిపై కూడా స్పందించిన కేటీఆర్‌.. ‘నా వల్ల కాదు బాబూ..’ అంటూ దండం పెడుతున్నట్లు ఓ ఎమోజీ గుర్తును పోస్ట్‌ చేశారు.

పోక్సో చట్ట సవరణకు కేంద్రం ఆమోదం..

ఢిల్లీ: 12 ఏళ్ల లోపు వయస్సు కల్గిన చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణదండన విధించేలా కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై పెద్దఎత్తున దుమారం రేగుతోన్న వేళ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టం కింద కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదును విధించే అవకాశం ఉంది.

బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సంచలన నిర్ణయం..

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేతగా ఉన్న యశ్వంత్‌ సిన్హా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ రోజు నుంచి రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో పాటు భాజపాతో ఉన్న అన్ని బంధాలకు ముగింపు పలుకుతున్నట్టు తెలిపారు. కాగా గతంలో సిన్హా కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేశారు. గత కొంతకాలంగా బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్న 80ఏళ్ల ఆయన ఈ రోజు బిహార్‌లోని పట్నాలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ భాజపాతో తన అనుబంధాన్ని తెంచుకుంటున్నట్టు వెల్లడించారు.

మంత్రి తలసానితో భేటీ కానున్న సినీ పెద్దలు..

హైదరాబాద్: ఉదయం రామానాయుడు స్టూడియోలో భేటీ అయిన సినీ సమస్యలపై చర్చించిన సినీ పెద్దలు మరికాసేపట్లో తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో తెలుగు సినీ పెద్దలు భేటీ కానున్నారు. తాజాగా పరిశ్రమలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మంత్రితో చర్చించనున్నారు. సిని పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై 24 గంటల్లో స్పందించాలని జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ సినీ పెద్దలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అన్నపూర్ణ స్టూడియోలో సినీ పరిశ్రమలోని 24 విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశమయ్యారు.

14:40 - April 21, 2018

ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కొన్నేళ్లుగా విభేధిస్తున్న యశ్వంత్ సిన్హా పార్టీ నుంచి బయటకొచ్చేస్తున్నట్టు చెప్పారు. యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నసిన్హా కలిసి పొలిటికల్ యాక్షన్ గ్రూప్ రాష్ట్ర మంచ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాట్నాలో రాష్ట్ర మంచ్ ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. 

14:38 - April 21, 2018

విజయవాడ : విపక్షాలు ఒక రోజు బంద్‌ నిర్వహిస్తే ఆర్టీసీకి 12 కోట్ల నష్టం వచ్చిందన్న బాబు, 30 కోట్ల ప్రజాధనాన్ని పెట్టి ఎలా ధర్మ పోరాట దీక్ష చేసారని వైసీపీ నేత అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని, అధికార యంత్రంగాన్ని ఉపయోగించి వైభవంగా దీక్ష చేయడాన్ని అంబటి విమర్శించారు. చంద్రబాబుది ధర్మ పోరాట దీక్ష కాదని ఇదొక ఫోర్‌ట్వంటీ దీక్ష అని అన్నారు.

14:36 - April 21, 2018

హైదరాబాద్ : ధర్మపోరాట దీక్షలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ నేతలు మండిపడ్డారు. బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు.

 

14:34 - April 21, 2018

నెల్లూరు : బీజేపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ధర్మ పోరాట దీక్షలో ప్రధాన మంత్రిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద బీజేపీ నాయకులు బాలకృష్ణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు బీజేపీ కార్యకర్తలను చితకబాదారు. ఈ గొడవలో బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

14:31 - April 21, 2018

హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనాలు ఇంకా ఆగడం లేదు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. దీని వెనుక రాంగోపాల్ వర్మ ఉన్నాడని బయటకు రావడం..మా అసోసియేషన్ లో పవన్ నిరసన తెలియచేయడంతో ఒక్కసారిగా ఇది రాజకీయ రంగు పులుముకుంది.

ఇదిలా ఉంటే దీనిపై శనివారం అన్నపూర్ణ స్టూడియోలో సినీ పెద్దల సమావేశం జరిగింది. కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు క్యాస్టింగ్‌ కౌచ్‌, ఇండస్ట్రీలోని పలు సమస్యలపై చర్చించారు. కాసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలువనున్నట్లు సమాచారం.

మరోవైపు పవన్ వరుసగా చేస్తున్న ట్వీట్లు మరింత ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. నిజాలను నిగ్గు తేలుద్దాం పేరిట ట్వీట్లు చేస్తున్నారు. 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' అంటూ మీడియాపై విమర్శనాస్త్రాలు చేపట్టారు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలన్న ఓ చానల్‌ స్లోగన్‌పై సెటైర్‌ వేశారు. ఈ స్లోగన్‌కు వెనకాల కథ ఏంటి అంటూ పవన్‌ ప్రశ్నించారు. నిజమైన అజ్ఞాతవాసి ఎవరు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. అజ్ఞాతవాసిని బ్లాక్‌మెయిలర్‌ అని సీఎం కేబినెట్‌ ర్యాంక్‌ మంత్రితో అన్నారు..ఆ కేబినెట్‌ మంత్రి ఒకరితో ఆ మాట చెప్పారని..ఆ ముఖ్యమంత్రి ఎవరు..? కేబినెట్‌ మంత్రి ఎవరు..? ఆ ఒక్కరు ఎవరు..? నిజాలను నిగ్గు తేలుద్దాం కార్యక్రమం నుంచి పవన్‌ కల్యాణ్‌..! అంటూ పవన్ సెటైర్స్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

14:17 - April 21, 2018

విశాఖ : ధర్మపోరాట దీక్షలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ నేతలు మండిపడ్డారు. బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు.  

14:14 - April 21, 2018

హైదరాబాద్‌ : నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 22న భారీ బహిరంగ సభ జరగనుంది. అదే రోజున మహాసభలు ముగియనున్నాయి. మహాసభల ముగింపు రోజున హైదరాబాద్‌లో సీపీఎం కవాతు నిర్వహించనుంది. సుమారు 25 వేల మంది రెడ్‌షర్ట్‌ వాలంటీర్స్‌ ఈ కవాతులో పాల్గొననున్నారు. మహాసభల సందర్భంగా సీపీఎం చేపట్టనున్న కవాతుపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

 

14:10 - April 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కే.కే శైలజ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ-కేరళ రాష్ట్రాల్లో అమలవుతున్న వైద్య ఆరోగ్య పథకాలు, అభివృద్ధి మీద మంత్రులు చర్చించారు.

 

14:06 - April 21, 2018
13:54 - April 21, 2018

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోలో సినీ పెద్దల సమావేశం అయ్యారు. సినీ ఇండస్ర్టీలోని 24 విభాగాలతో ప్రత్యేక భేటీ అయ్యారు. పవన్‌ డిమాండ్లపై సినీ పెద్దలు చర్చించనున్నారు. అన్నపూర్ణ స్టూడియో బయట పవన్‌ అభిమానుల నినాదాలు చేశారు.

13:46 - April 21, 2018

నిజామాబాద్ : భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఎండలు విపరీతంగా పెరగడంతో బయటకు రావాలంటే ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. ఏప్రిల్‌ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు ఉంటే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని నిజామాబాద్‌ జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఎండ తీవ్రతపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:36 - April 21, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌తో ఎలాంటి రాజకీయ పొత్తు ఉండబోదని మహాసభలో తీర్మానం చేసినట్లు సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మరోసారి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటంలో అన్ని లౌకిక శక్తులను కలుపుకొని వెళ్తామని అన్నారు. మతోన్మాద పార్టీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యమంటున్న బీవీ రాఘవులుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌తో కలిసి పోరాటం చేస్తామన్నారు. మతోన్మాద సమస్యలు వచ్చినప్పుడు లౌకికవాద పార్టీలతో కలిసి పోరాడుతామని చెప్పారు.

 

13:33 - April 21, 2018

హైదరాబాద్‌ : నగరంలోని ఖరీదైన కార్లను తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ ఆకాష్‌ అండ్‌ గ్యాంగ్‌ ఘరానా మోసానికి పాల్పడ్డారు. 30% డిస్కౌంట్‌తో కార్లను ఇప్పిస్తామంటూ జనాలను బురిడి కొట్టించారు. కార్ల కొనుగోలుకు ఎగబడ్డ జనాల దగ్గర డబ్బులు వసూల్‌ చేసి, 30 కోట్ల రూపాయలతో ఉడాయించారు. బాధితులు పోలీసులక కంప్లైట్‌ చేయడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముగ్గురి అదుపులోకి తీసుకున్నారు. 

 

13:32 - April 21, 2018

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోలో సినీ పెద్దల సమావేశం అయ్యారు. సినీ ఇండస్ర్టీలోని 24 విభాగాలతో ప్రత్యేక భేటీ అయ్యారు. పవన్‌ డిమాండ్లపై సినీ పెద్దలు చర్చించనున్నారు. అన్నపూర్ణ స్టూడియో బయట పవన్‌ అభిమానుల నినాదాలు
చేశారు.

13:28 - April 21, 2018

గుంటూరు : జిల్లాలోని మాచర్ల మండలంలోని శివప్రియనగర్‌లో దారుణం జరిగింది. మానసిక వికాలాంగులైన తన ఇద్దరు చిన్నారులను కన్నతండ్రే కడతేడ్చాడు. పిల్లలను చంపిన అనంతరం తండ్రి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

ఎర్రజెండా పాతితే రైళ్లు ఆగిపోతాయ్ : శివాజీ

అమరావతి : ఏపీని అతలాకుతలం చేసి పాగా వేయాలనుకునే బీజేపీ కుట్రలకు తగిన బుద్ది చెబుదామని నటుడు శివాజీ పిలుపునిచ్చారు. దీనికి తగిన ఆందోళనలు కేంద్రానికి తగిలేలా చేద్దామన్నారు. ప్రతి వూరిలో రైలు ట్రాక్‌పై కూర్చొని ఆందోళన చేద్దామనీ..ఒకవేళ రైల్వే కేసులకు భయపడితే ప్రతి వూరిలో ఎర్రజెండా పాతితే రైళ్లు ఆగిపోతాయనీ ఆ రకంగా మన నిరసనను తెలిజేయాలని శివాజీ పిలుపునిచ్చారు. కాగా  ఆపరేషన్‌ గరుడ ఇంకా ఆగలేదని  శివాజీ మరోసారి స్పష్టం చేశారు. 

ఎర్రజెండా పాతితే రైళ్లు ఆగిపోతాయ్ : శివాజీ

అమరావతి : ఏపీని అతలాకుతలం చేసి పాగా వేయాలనుకునే బీజేపీ కుట్రలకు తగిన బుద్ది చెబుదామని నటుడు శివాజీ పిలుపునిచ్చారు. దీనికి తగిన ఆందోళనలు కేంద్రానికి తగిలేలా చేద్దామన్నారు. ప్రతి వూరిలో రైలు ట్రాక్‌పై కూర్చొని ఆందోళన చేద్దామనీ..ఒకవేళ రైల్వే కేసులకు భయపడితే ప్రతి వూరిలో ఎర్రజెండా పాతితే రైళ్లు ఆగిపోతాయి. ఆపరేషన్‌ గరుడ ఇంకా ఆగలేదని మరోసారి స్పష్టం చేశారు. 

ఆపరేషన్ 'గరుడ' కొనసాగుతోంది: శివాజీ

విజయవాడ: బీజేపీ దక్షిణాది రాష్ట్రాలో అధికారం కోసం ఆపరేషన్ 'గరుడ'ను ప్రారంభించిందని సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ మరోసారి గరుడు గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ 'గరుడ' ఆగలేదనీ..కొనసాగుతోందని మరోసారి స్పష్టం చేశారు. ఏపీలో అలజడి సృష్టించేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతోందని నొక్కి వక్కాణించారు. ఈ నెల 30న అన్ని విషయాలు చెబుతా’’ అని శివాజీ వెల్లడించారు. మరి శివాజీ వెల్లడించే ఆ విషయాలేమిటో 30 వరకూ ఎదురు చూడాల్సిందే. 

12:33 - April 21, 2018

హైదరాబాద్‌ : నగరంలో జరుగుతోన్న సీపీఎం జాతీయ మహాసభలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఈ మహాసభల్లో ఇవాళ పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. కోల్‌కతా ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించనున్నారు. నేడు పలు తీర్మానాలను మహాసభ ఆమోదించనుంది. ఇప్పటికే రాజకీయ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. నేడు కోల్‌కతా ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాల అమలుపై నేతలు చర్చించనున్నారు. 

 

12:31 - April 21, 2018

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ వ్యక్తం చేసిన నిరసనలపై విస్తృత సమావేశం నిర్వహించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకొంది. పవన్‌ డిమాండ్లపై చర్చించనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పవన్‌ కల్యాణ్‌ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

పవన్ కోసం షకలక హెచ్చరిక!..

శ్రీకాకుళం : జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై సినీనటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని జబర్దస్త్‌ ఫేం, సినీనటుడు షకలక శంకర్‌ హెచ్చరించారు. పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా జిల్లా పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌పై, ఆయన తల్లిపై కొందరి ప్రోద్బలంతో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పవన్‌ కల్యాణ్‌ డిమాండుపై ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధులు స్పందించి కఠిన నిర్ణయం తీసుకోవాలన్నారు.

12:29 - April 21, 2018

హైదరాబాద్ : మరోసారి పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్ల సంచలనం రేగింది. నిజాలను నిగ్గు తేలుద్దాం పేరిట ట్వీట్లు చేశారు. మీడియాపై విమర్శనాస్త్రాలు సంధించారు. 'ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలన్న' ఓ చానల్‌ స్లోగన్‌పై  సెటైర్‌ వేశారు. ఈ స్లోగన్‌కు వెనకాల కథ ఏంటి అంటూ పవన్‌ ప్రశ్నించారు. నిజమైన అజ్ఞాతవాసి ఎవరు అంటూ ప్రశ్నలు సంధించారు. 

నటుడు రాజ్ తరుణ్ తండ్రికి జైలుశిక్ష!..

విశాఖపట్నం : ప్రముఖ సినీ హీరో రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ, విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సన్నీ పర్విన్‌ సుల్తానాబేగం తీర్పిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్ గా 2013 ప్రాంతంలో పని చేసిన ఆయన, నకిలీ బంగారాన్ని కుదవపెట్టి రుణం పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన భార్య రాజ్యలక్ష్మి, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురి పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించిన ఆయన రూ. 9.85 లక్షల రుణం పొందారు.

కథువా ఘటన డీఎన్ఏ రిపోర్ట్ వెల్లడి..

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కతువా అత్యాచార ఘటనకు సంబంధించిన ల్యాబరేటరీ పరీక్షలను వెల్లడించారు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులే 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ మొత్తం 14 పరీక్షలను నిర్వహించింది. వ్జైనల్ స్వాబ్స్, హెయిర్ స్ట్రాండ్స్, నలుగురు నిందితుల బ్లడ్ శ్యాంపిళ్లు, మృతిచెందిన బాలిక విసెరా, ఆ అమ్మాయి ఫ్రాక్, సల్వార్, అక్కడున్న మట్టి, రక్తపు మరకలను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు. శ్యాంపిళ్లను పరీక్షించిన తర్వాత నిందితులు పాజిటివ్‌గా తేలినట్లు ఫోరెన్సిక్ అధికారులు తేల్చారు.

సినీ ప్రముఖుల సమావేశం..

హైదరాబాద్ : సీనీ ప్రముఖులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నిర్మాతల మండలి పాల్గొన్నారు. నటీ నటుల సంఘం, మా అధ్యక్షుడు శివాజీ రాజా పాల్గొన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలు, తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్, పవన్ కళ్యాణ్ వంటి పలు హాట్ హాట్ పరిణామాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులంతా సమావేశమయి సినీ పరిశ్రమలోని సమస్యలు, ఇబ్బందులు వంటి పలు అంశాలపై చర్చిస్తున్నారు. 

కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్ధేశం..

హైదరాబాద్: పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై చర్చించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు జరయ్యారు. పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన సమయంలో రైతులందరికీ అందేలా సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని ఏవిధంగా పంపిణీ జరుగాలనేదానిపై కూలంకషంగా చర్చించనున్నారు.

11:50 - April 21, 2018

ఆదిలాబాద్ : వర్షకాలం దగ్గర పడుతుడడంతో అప్పుడే పత్తి రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లోకి నకిలీ పత్తి విత్తనాలు కూడా ప్రవేశిస్తున్నాయి. ఏది నకిలీ.. ఏది అసలో తెలియక రైతులు వేలకువేలు ధారపోస్తున్నారు. విత్తు విత్తిన తర్వాత గంపెడాశలతో ఎదురు చూస్తే పూత, కాత రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అప్పుడే ఊరు, పేరు లేని పత్తి విత్తనాలు పోలీసులకు పట్టుబడ్డాయి.
సాధారణ సాగు 14.25 లక్షల ఎకరాలు
ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ సాగు 14.25 లక్షల ఎకరాలు. గతేడాది 12.45 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఇందులో 6.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ ఏడాది పత్తి సాగు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే పత్తి విత్తనాల కోసం రైతులు పూర్తిగా ప్రయివేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రయివేటు కంపెనీలు విచ్చలవిడిగా పత్తి విత్తనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో రైతులు ఏవి నకిలీ విత్తనాలు, ఏ విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. 
నకిలీ విత్తనాలతో వేల ఎకరాల పంట నష్టం
రైతుల చేత విత్తనాలను కొనుగోలు చేయించడానికి విత్తన కంపెనీలు గ్రామాల్లోని నిరుద్యోగ యువతను ఏజెంట్లుగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ ఏజెంట్లు కంపెనీ వాహనాల్లో కొనుగోలుదారులను ఇతర గ్రామాల్లోకి తీసుకెళ్లి.. గతంలో పంట సాగు చేసిన రైతు పొలం వద్ద రైతు అనుభవంతో పాటు పూత, కాత, దిగుబడులను చెప్పిస్తారు. కొన్ని రోజుల తర్వాత ముందస్తు బుకింగ్‌లు తీసుకుని రైతులకు విత్తనాలు సరఫరా చేస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా విత్తనం విత్తిన తర్వాత కాత, పూత రాకపోతే ఎవరు పట్టించుకోరు. ఇలా గత ఏడాది ఆదిలాబాద్‌ జిల్లాలో 50 వేల బస్తాల విత్తనాల వల్ల వేల ఎకరాల పంటను రైతులు నష్టపోయారు. ఇంత జరిగిన అధికారులు పట్టించుకోకపోవడంతో నష్ట పరిహారం ఇవ్వకుండా కంపెనీలు చేతులెత్తేశాయి. దీంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఇంత వరకు న్యాయం జరగలేదు.
ల్యాబ్‌లో ప్రయోగాలకే పరిమితమైన విత్తనాలను రైతులకు అంటగడుతున్న కంపెనీలు
జోరుగా నకిలీ విత్తనాల అమ్మకం
ల్యాబ్‌లో ప్రయోగాలకే పరిమితమైన విత్తనాలు అనుమతులు రాకుండానే వాటిని తీసుకొచ్చి రైతులకు అంటగడుతున్నారు. పత్తిలో ఇప్పటి వరకు బీటీ1, బీటీ2 రకాలకే అనుమతులు ఉన్నాయి. పురుగుల బెడద ఎక్కువగా ఉండే పత్తికి..లద్దె పురుగును నియంత్రించేందుకు బీటీ1 విత్తనాలు తీసుకురాగా.. కలుపు నివారణకు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు విత్తనాలను విడుదల చేశాయి. వీటి వల్ల గులాబీ పురుగు ఉధృతి ఎక్కువ కావడంతో రైతులు నష్టపోయారు. అయిన కంపెనీలు ఆదిలాబాద్‌లో జోరుగా అమ్మకాలు సాగిస్తున్నాయి. ఒక్కో విత్తన బస్తా ధర 800 రూపాయలు ఉంటే 1000 నుంచి 1200 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ ఏడాది కంపెనీలు బీటీ3 రకాన్ని కొత్తగా తీసుకొవచ్చాయి. బీటీ3 వల్ల మొలకలకు ఏమి కాదని చెపుతుడడంతో రైతులు బీటీ3 వైపు మొగ్గు చూపుతున్నారు.
అక్రమ పత్తి విత్తనాల దందా
కంపెనీలు ఏయే రకాల విత్తనాలు అమ్ముతున్నాయో వ్యవసాయ శాఖకు తెలుపాలి. తాజాగా దుకాణదారుల నుంచి ప్రతి రోజు ఏయే విత్తనాలు విక్రయించారనే సమచారాన్ని జిల్లా వ్యవసాయ అధికారులు సేకరించి ఉన్నతాధికారులకు పంపాలి. ఈ ఆదేశాలు మాత్రం కాగితాలకే పరిమితం అయ్యాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కంపెనీలు అక్రమ రవాణాతో నకిలీ విత్తనాలను నేరుగా ఏజెన్సీ ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ దందా  మంచిర్యాల, ఆదిలాబాద్‌ కేంద్రాలుగా సాగుతున్నట్లు తెలుస్తున్న  అధికారులు మాత్రం ఏమి పట్టించుకోకుండా అలాంటి దేమి లేదని చెపుతున్నారు.
తనిఖీల్లో పట్టుబడుతున్న నకిలీ పత్తి విత్తనాలు
దీంతో జిల్లా పోలీసులకు పలు చోట్ల తనిఖీలు నిర్వహించగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. గత నెల బెల్లంపల్లిలో 12 లక్షలు విలువ చేసే నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకోగా.. 13 మందిపై కేసు నమోదు చేశారు. తాండూరు మండలం రేపల్లెవాడలో ఉప్పులోడుతో వెలుతున్న లారీని తనిఖీ చేయగా అడుగున 52 క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బెల్లంపల్లిలోని ఓ ఆటో ట్రాలీలో 8 లక్షల విలువ గల 4 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుకున్న 2 టౌన్‌ పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేసి, ఆటో ట్రాలీని సీజ్‌ చేశారు. నకిలీ విత్తనాల కంపెనీలకు బలవుతున్న రైతులను పట్టించుకోకుండా ప్రభుత్వం పెట్టుబడి సాయం అంటూ హడావుడి చేస్తుంది. ఇప్పటికైన నకిలీ పత్తి విత్తన కంపెనీలపై ఉక్కుపాదం మోపకపోతే కుదేలైన రైతాంగం మరింత నష్టపోనుంది.  

 

కన్నవారే కడతేరుస్తున్నారు..

గుంటూరు : మాచర్ల పట్టణ శివారులో దారుణం చోటుచేసుకుంది. కన్నబిడ్డలను కడతేర్చిన ఓ కసాయి తండ్రి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు చిన్నారులను తండ్రి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. మానసిక వికలాంగులైన తన ఇద్దరు బిడ్డలకు తండ్రి హత్య చేసి పారారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో వున్న తండ్రి కోసం గాలింపు చేపట్టారు. 

11:45 - April 21, 2018

బెంగళూరు : కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి.  కర్నాటకలో సాధారణ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్న జాతీయ పార్టీలు  కర్నాటక పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కర్నాటక రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌గా వ్యవహరిస్తున్న జేడీయస్ పార్టీ మరోసారి అధికారం కోసం పావులు కదుపుతోంది. కర్నాటక ఎన్నికల రణరంగంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ... 
రాజకీయ నాయకుల్లో అలజడి 
కర్నాటకలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకుల్లో అలజడి రెట్టింపవుతోంది.  నువ్వా- నేనా అన్న రీతిలో  పోటా పోటీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తుంటే.. మరికొందరు ఆశావాహులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్  ప్రకటించిన మొదటి విడత  జాబితాలో టికెట్‌ దక్కనివారిలో కొందరు అసమ్మతిని వెళ్లగక్కుతుంటే... మరికొందరు పార్టీ ఆఫీసులోని ఫర్నీచర్ ధ్వంసం చేసి, దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు.. ఈ సారి కాంగ్రెస్, బీజేపీల్లో దేనికీ సంపూర్ణ  మెజారిటీ రాకపోవచ్చని
రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పీఠం దక్కించుకోవడంలో జేడియస్ పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించే ఆవకాశం కనబడుతోందని అంటున్నారు.
మే12న పోలింగ్‌ 
కన్నడలో మే12న పోలింగ్‌ జరుగనుంది. అదేనెల 15న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తానికి కర్నాటక పీఠం కాషాయానిదా లేక కాంగ్రెస్‌దా అన్నది ఫలితాలు వెలుడితేగాని తేలదు.  ఆరున్నర కోట్ల జనాభాలో.. నాలుగు కోట్ల తొంభై ఆరు వేల మంది ఓటర్లకు గాను... 56,696  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్.  224  శాసన సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.  నూటా పదమూడు  స్థానాల్లో విజయం సాధించిన పార్టీకే అధికారం దక్కనుంది. కర్నాటకలో లింగాయితులు ఇరవై ఏడు శాతం ఉన్నారు. వీరి మద్ధతు ఏపార్టీకి ఉంటే  వారిదే విజయం.
రంగంలోకి ప్రధాన పార్టీల అగ్రనేతలు వారసులు 
ఈ సారి అన్ని ప్రధాన పార్టీల అగ్రనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.. నామినేషన్ల దాఖలుకు 24వతేది ఆఖరు  కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడియస్‌లు అభ్యర్థుల ఎంపికపై కరత్తును ముమ్మరం చేశాయి. మైసూర్  జిల్లాలోని వరుణ నియోజక వర్గంలో పోటీ ఆసక్తికరంగా మారనున్నాయి.  వరుణ నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్దారామయ్య కుమారుడు యతీంద్ర, బిజేపి  ముఖ్యమంత్రి అభ్యర్థి బీ.ఎస్.యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఇక్కడి నుంచే పోటికి దిగనున్నారు. 
కుటుంబ పాలనపైనా విమర్శలు 
మరోవైపు రాజకీయ పార్టీల్లో కుటుంబ పాలనపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నాటక రాజకీయాల్లో చక్రం తిప్పతున్న  జేడియస్‌లో కుటుంబ పాలన కొనసాగుతోందంటూ.. ఆ పార్టీ నేతలే అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు.. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు దేవేగౌడ తన మొదటి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి గౌడకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రెండో కుమారుడైన రేవణ్ణగౌడ కుమారుడు ప్రజ్వల్ గౌడకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నందున ఈసారి ప్రజ్వల్ గౌడకు ఎమ్మెల్యేగా పోటీ  చేసేందుకు అవకాశం ఇవ్వాలని కొందరు నాయకులు కోరుతున్నారు. ఒక వేళ ప్రజ్వల్ గౌడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి అడుగుతారన్న ఆలోచనతో... కుమారస్వామి గౌడ సిఎం పదవికి ఎసరుపెట్టకుండా ముందుచూపుతోనే మనుమడైన ప్రజ్వల్ గౌడను ఈసారి పార్లమెంట్  అభ్యర్థిగా ప్రకటించి.. పార్టీలో అసమ్మతితోపాటు..  కుటుంబ కలహాలకు కూడా అడ్డుకట్ట వేశారని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.
గత ఎన్నికల్లో సుమారు వంద స్థానాల్లో లింగాయితులు గెలుపు
ఇక సుమారు వంద స్థానాల్లో లింగాయితులు గెలుపును శాసించగలరన్న విషయం గత ఎన్నికల్లో రుజువైంది.. వీరి తర్వాత స్ధానం ఎస్సీ. ఎస్టీ సామాజిక వర్గాలదే. ఇరవైఐదు శాతం ఉన్న  ఎస్సీ, ఎస్టీలు ప్రధాన పార్టీల జయాపజయాలను  ప్రభావితం చేయనున్నారు. దీంతో  బీజేపీ ఎస్టీలకు  ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే బళ్లారి జిల్లా మొలకాల్మూరు నియోజక వర్గం నుంచి శ్రీరాములును దింపి... ఆ వర్గం ఓటర్లకు గాలం వేస్తోంది.. కానీ..  సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని కాదని.. బళ్ళారి ఎంపిగా ఉన్న శ్రీరాములుకు టికెట్టు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.  ప్రచారం చేస్తున్న ఎం.పి శ్రీరాములుపై చీపురులు, చెప్పులతో దాడులు కూడా జరిగాయి. ఇక కాంగ్రెస్‌లో పదకొండుమంది సిట్టింగులకు చోటు దక్కలేదు. జాబితాలో  పేర్లు లేని నేతలు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. బెంగళూరులోని కర్నాటక కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. నాయకుల ముందే  
కర్నాటక ఎన్నికల్లో కీలకంగా తెలుగువారి ఓట్లు 
కర్నాటకలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉండటంతో...  తెలుగువారి ఓట్లు సైతం కర్నాటక ఎన్నికల్లో  కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని అస్ర్తంగా చేసుకుని తెలుగు ఓటర్లకు గాలం వేయాలని చూస్తోంది కాంగ్రెస్. కాగా.. బీజేపీ మాత్రం  కర్నాటక  అభివృద్దికి భారీగా నిధులు కేటాయిచామన్న అంశాన్ని ప్రచారం చేయాలని చూస్తోంది. మొత్తానికి హోరాహోరీగా సాగుతున్న కర్నాటకలో అధికారపీఠం ఎవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. అది తెలియాలంటే మే 15 వరకు వేచి చూడాల్సిందే.

 

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన గ్రూప్ 2 అభ్యర్ధులు..

హైదరాబాద్‌ : గ్రూప్‌-2 నియామక ప్రక్రియలో కొనసాగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేస్తూ గ్రూప్‌-2 సెలెక్టెడ్‌ అభ్యర్థులు శనివారం ఉదయం ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న అభ్యర్థులను పోలీసులు అరెస్ట్‌ చేసి గోషామహల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గ్రూప్‌-2 పరీక్షా నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని లాయర్ల కమిటీ చెప్పినా నియామకాలు జరపకుండా మా జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

అభిమాన సంఘాలను నిషేధించాలి : సరసింహారావు

హైదరాబాద్ : సినీనటుల అభిమాన సంఘాలను వెంటనే నిషేధించాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సి.నరసింహారావు పేర్కొన్నారు. అభిమాన సంఘాలకు గుర్తింపు అనేది వుండదనీ..దీంతో వారు ఎరికిష్టమొచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అభిమాన సంఘాలను నిషేధించాలని సూచించారు.  

పెండ్లి ఇంట్లో విషాదం..

వనపర్తి : తిమ్మాజీపేట మండలం కోడుపర్తిలో పెండ్లి ఇంట్లో విషాదం చోటుచేకుంది. పెండ్లి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 25 తులాల బంగారం చోరీకి గురయింది. దీంతో మనస్తాపం చెందిన పెండ్లి కమారుడి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న దుండగులు బంగారాన్ని ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. 

11:33 - April 21, 2018

హైదరాబాద్‌ : సీపీఎం జాతీయ మహాసభలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఈ మహాసభల్లో ఇవాళ పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. కోల్‌కతా ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించనున్నారు. ఇప్పటికే రాజకీయ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. 

ఆరునెలల పసిగుడ్డుపై హత్యాచారం!!..

హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న కొన్ని ఘోర సంఘటనలు చూస్తున్నా, వింటున్నా మానవత్వం మంటగలుస్తుందనే భయాందోళనలు నెలకొంటున్నాయి. ఆడ పుట్టకపై జరుగుతున్న హింసాకాండకు పసిగుడ్డులు కూడా బలైపోతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వింటేనే ఒళ్లు జలదరించే ఈ ఘటనకు పాల్పడిన వాడిని మనిషినా? లేక మృగమనాలా? ఆరునెలల పసిగుడ్డుపై హత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో చోటుచేసుకుంది. ఒక సెల్లార్ లో రక్తపుమడుగులో పడి ఉన్న శిశువు మృతదేహాన్ని పోలీసులు దానిపై దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆ శిశువు హత్యాచారానికి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు.

11:25 - April 21, 2018

హైదరాబాద్ : పవన్‌కళ్యా ణ్‌ వ్యక్తం చేసిన నిరసనలపై విస్తృత సమావేశం నిర్వహించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకొంది. పవన్‌ డిమాండ్లపై చర్చించనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పవన్‌ కల్యాణ్‌ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

 

బాలయ్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ..

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణపై గవర్నర్ నరసింహన్ కు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఉదయం నరసింహన్ ను వారు కలుసుకున్నారు. గవర్నర్ నరసింహన్ ను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ కలిశారు. మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం, మీడియాతో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, బాలకృష్ణపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరామని చెప్పారు.

మీడియాపై పవన్ ట్వీట్ల సంచలనం!..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ట్వీట్లతో సంచలనం రేకెత్తించారు. మీడియాను ఉద్ధేశించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఫ్యాక్షనిస్టుల ఆస్తులు జాతీయం చేయాలన్న ఓ ఛానల్ స్లోగన్ల వెనుక వున్న ఉద్ధేశ్యమేంటని?,నిజమైన అజ్నాతవాసి ఎవరు? అంటు పవన్ కళ్యాణ్వన్ ప్రశ్నించారు. శుక్రవారం ఫిలిం ఛాంబర్ లో నిరసన తెలిపిన అనంతర మీడియాను ఉద్శేశించి పవన్ ట్వీట్ చేయటం మరోసారి సంచలం రేకెత్తిస్తోంది. 

11:20 - April 21, 2018

హైదరాబాద్ : ఎల్‌బీ నగర్‌ ఆర్టీసీ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న జ్యూస్‌ పాయింట్‌లో సిలెండర్‌ లీక్‌ అయి పేలుడు సంభవించింది. దీంతో జ్యూస్‌ పాయింట్‌, మిర్చీ సెంటర్‌లలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ పేలుడు ధాటికి అక్కడే ఉన్న కారు ధ్వంసం అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. 

 

11:18 - April 21, 2018

హైదరాబాద్‌ : అసిఫ్‌నగర్‌ పోలిస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం నెలకొంది. దత్తాత్రేయ కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే అత్తింటి వారి వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

 

09:54 - April 21, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 36 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 22 ద్విచక్ర వాహనాలు, 16 కార్లను సీజ్ చేశారు.

 

09:51 - April 21, 2018

హైదరాబాద్ : సీసీఎం జాతీయ మహాసభలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. నేడు పలు తీర్మానాలను మహాసభ ఆమోదించనుంది. ఇప్పటికే రాజకీయ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. నేడు కోల్ కతా ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై నేతలు చర్చించనున్నారు. పార్టీ స్వతంత్ర బలం పెంచుకోవాలని మహాసభ తీర్మానం చేసింది. నిన్న పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీజేపీని ఓడించడమే ముఖ్యమైన కర్తవ్యమని అన్నారు. కమ్యూనిస్టుల మహానేతల్లో మావో ఒకరని పేర్కొన్నారు. వారి అనుభవాలు గొప్పగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఉద్యమాలు, పోరాటాలు ఉదృతస్థాయిలో సాగించాలనేదే ప్రధాన అంశమన్నారు. సరళీకరణ, ఆర్థిక విధానాలను వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పారు. కేంద్రం మతోన్మాదాన్ని అసరగా చేసుకుని సరళీకరణ, ఆర్ధిక విధానాలను అమలు చేస్తుందన్నారు. సరళీకరణ, ఆర్ధిక విధానాలు, మరోవైపు మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాలని, కలిసొచ్చే శక్తులను కలుపుకుని పోవాలన్నారు. తమ పార్టీ బలంగా ఉన్న చోట తామే పోటీలో ఉంటామని.. బీజేపీ వ్యతిరేక శక్తుల మద్దతు తీసుకుంటామని, బలంగా లేని చోట బీజేపీని ఓడించే శక్తులకు మద్దతు ఇస్తామని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ అనుసరించిన రాజకీయ విధానాలపై చర్చ ఉంటుందన్నారు. పార్టీ నిర్మాణం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని చెప్పారు.

 

09:43 - April 21, 2018

హైదరాబాద్ : సీసీఎం జాతీయ మహాసభలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. నేడు పలు తీర్మానాలను మహాసభ ఆమోదించనుంది. ఇప్పటికే రాజకీయ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. నేడు కోల్ కతా ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై నేతలు చర్చించనున్నారు. పార్టీ స్వతంత్ర బలం పెంచుకోవాలని మహాసభ తీర్మానం చేసింది. నిన్న పలు తీర్మానాలు చేశారు. 

నాల్గో రోజుకు చేరుకున్న సీసీఎం జాతీయ మహాసభలు

హైదరాబాద్ : సీసీఎం జాతీయ మహాసభలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. నేడు పలు తీర్మానాలను మహాసభ ఆమోదించనుంది. ఇప్పటికే రాజకీయ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. నేడు కోల్ కతా ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై నేతలు చర్చించనున్నారు. పార్టీ స్వతంత్ర బలం పెంచుకోవాలని మహాసభ తీర్మానం చేసింది. నిన్న పలు తీర్మానాలు చేశారు. 

 

09:37 - April 21, 2018

చెర్వుగట్టు మీద చంద్ర కొంగ హోదా దీక్ష.. మత్లావు బైటవెట్టేశిన ప్రొఫెసర్ నాగేశ్వర్, మీడియా మీద పవన్ ట్విట్టర్ యుద్దం...టీడీపీ కుట్రలను చెండాడిన జనసేనాని, షిర్డీ యాత్రకు వొయ్యిన కేసీఆర్ ఇంటోళ్లు..మార్పు ప్రసాధించుమని జనం వేడ్కోలు, ఎల్లి మీద మల్లి మల్లి మీద ఎల్లి లొల్లి...కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల కపట నాట్కం, మాపార్టీ ఎమ్మెల్యేగాదు మేము నిధులియ్యం...మంత్రి ఈటెల మీద సొంత పార్టీ నేత ఫైర్, హైద్రావాదుల పెట్రోలింగ్ పోలీసుల ఓవరాక్షన్..పోరన్ని పొర్కపొర్కగొట్టిండ్రు.. గాంధీల షెరీక్ .. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

09:20 - April 21, 2018

శ్రీరెడ్డి...కాస్టింగ్ కౌచ్ పై వక్తలు మాట్లాడారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, టీడీపీ నేత దాసరి రాజామాస్టర్, జనసేన నేత పార్థసారధి పాల్గొని, మాట్లాడారు. పలు అంశాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:45 - April 21, 2018
08:44 - April 21, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏడు రాజకీయ పార్టీలు ఉపరాష్ట్రపతికి నోటీసు అందజేశాయి. చీఫ్‌ జస్టిస్‌ మిశ్రా అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు విపక్షాలు ఆరోపించాయి.
ఏకతాటిపైకి వచ్చిన విపక్షాలు 
జస్టిస్‌ లోయాది సహజమరణమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఏడు ప్రతిపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి దీనికి సంబంధించిన నోటీసును అందజేశాయి. 
అభిశంసన నోటీసుపై 71 మంది ఎంపీలు సంతకాలు 
అభిశంసన నోటీసుపై 71 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో ఏడుగురి పదవీ కాలం ముగిసినందువల్ల ఈ నోటీసుపై సంతకాలు చేసినవారి సంఖ్య 64కి తగ్గింది. ఎన్‌సీపీ, ఎస్‌పీ, బీఎస్‌పీ, ముస్లిం లీగ్, జఎంఎం, సిపిఐ ఎంపీలు సంతకాలు చేశారు. మాజీ ప్రధాని కావడంతో మన్మోహన్‌సింగ్‌ సంతకం చేయలేదు. తీర్మానాన్ని అనుమతించేందుకు అవరమైనదానికన్నా ఎక్కువ మద్దతు తమకు ఉందని, అందువల్ల రాజ్యసభ చైర్మన్ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. 
జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై 5 తీవ్రమైన ఆరోపణలు 
వెంకయ్యనాయుడుకు అందించిన నోటీసులో విపక్షాలు జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై 5 తీవ్రమైన ఆరోపణలు చేశాయి.  సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ సరిగా లేదని...కేసుల కేటాయింపులపై సిజెఐ వివక్ష చూపుతున్నారని మీడియా సమావేశంలో నలుగురు న్యాయమూర్తులు చేసిన ఆరోపణలను కూడా ప్రస్తావించారు. చీఫ్‌ జస్టిస్‌ తన పదవిని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబ్బల్‌  ఆరోపించారు. 
అభిశంసన తీర్మానం ప్రక్రియ పార్లమెంట్‌కు సంబంధించిందిన్న కరత్ 
చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రక్రియ పార్లమెంట్‌కు సంబంధించినదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ అన్నారు. సిజెఐ అభిశంసనపై తమ పార్లమెంటరీ పార్టీ సభ్యులు సంతకం పెడితే సిపిఎం మద్దతిచ్చినట్లేనని కరత్‌ చెప్పారు.
ఇది న్యాయవ్యవస్థ స్వాతంత్రానికి ముప్పు : ఆరుణ్ జైట్లీ 
అభిశంసన అనే అస్త్రాన్ని ప్రయోగించి విపక్షాలు న్యాయమూర్తులను భయపెట్టే యత్నం చేస్తున్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. ఇది న్యాయవ్యవస్థ స్వాతంత్రానికి ముప్పని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
మహాభియోగంపై సమాజంలో చర్చ దురదృష్టకరం : సుప్రీంకోర్టు
మహాభియోగంపై సమాజంలో చర్చ జరగడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో సదభిప్రాయం సన్నగిల్లే ప్రమాదముందని హెచ్చరించింది. సీజేఐపై అభిశంసన తీర్మానానికి అనుమతి లభించాలంటే 100 మంది లోక్‌సభ సభ్యులు కానీ, 50 మంది రాజ్యసభ సభ్యులు కానీ మద్దతివ్వాలి. భారత దేశ చరిత్రలో ఏ ప్రధాన న్యాయమూర్తి కూడా ఇప్పటివరకు అభిశంసనకు గురికాలేదు.

 

08:38 - April 21, 2018

హైదరాబాద్‌ : నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌ ప్రజలకు విజ్ఞానంతోపాటు వినోదాన్ని అందిస్తోంది. కళాకారుల ఆటపాటలతో మనసును ఉత్తేజ పరుస్తోంది. వేసవికాలం సాయంకాలాన నగర వాసులకు ఆనందాన్ని పంచుతోంది. దీంతో హైదరాబాద్‌ ఫెస్ట్‌ను తిలకించడానికి జనం భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ 8వ రోజూ ఉత్సాహంగా సాగింది. కళాకారుల ఆటపాటలతో ఫెస్ట్‌ హోరెత్తింది. విజ్ఞానం, వినోదం కలగలుపుగా నిర్వహిస్తోన్న ఈ ఫెస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.
కళాకారుల ఆటపాటలు
సుద్దాల హన్మంతు కళావేదిక కళాకారుల ఆటపాటలతో హోరెత్తింది. నృత్యాలు, నృత్యరూపకాలు, వీధినాటికలు, క్లాసికల్‌, ఫోక్‌, వెస్ట్రన్‌ డ్యాన్సులతో వీక్షకులను కళాకారులు కట్టిపడేశారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమనేత పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్రను కళాకారులు కళ్లకుకట్టినట్టు చూపించారు. ఆయన బాల్యం నుంచి కమ్యూనిస్టునేతగా ఎదిగిని తీరును ప్రదర్శించారు. 
ఆకట్టుకున్న జననాట్యమంచ్‌ కాళాకారుల కళారూపం 
ఢిల్లీకి చెందిన జననాట్యమంచ్‌ కాళాకారుల కళారూపం ఆకట్టుకుంది. ఒగ్గుడోలు నృత్యం, చిన్నారుల క్లాసికల్‌ డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రదర్శించిన రైతు నాటిక అందరినీ ఆలోచింపచేసింది. సుద్దాల హన్మంత వేదికపై జరిగిన సాంస్కృతిక  కార్యక్రమాల్లో సినీనటుడు మాదాల రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాసమస్యలపై గళం విప్పడమే కళాకారుల పనిగా ఉండాలన్నారు. ప్రజల కష్టాల నుంచే పాటలు పుట్టుకొచ్చినప్పుడే అవి జనాదరణ పొందుతాయన్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ నిర్వాహకులను బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌ అభినందించారు.
ఆకట్టుకుంటోన్న ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీ   
హైదరాబాద్‌ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సేవ్‌ బేబి గర్ల్‌ కాన్సెప్ట్‌ అందరిలో కనువిప్పు కలిగిస్తోంది.  ఆడపిల్లలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఫర్జునాఖాన్‌ రూపొందించిన ఆర్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ ఫెస్ట్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనలో ఉత్తమ చిత్రాలను గీసిన వారికి సినీనటుడు మాదాల రవి బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
ప్రగతి సాధనకు ప్రభుత్వరంగం అవసరం : కె.వేణుగోపాల్‌ 
ప్రభుత్వరంగ స్టాల్స్‌ ప్రాంతంలో ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగం పాత్ర అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న ఎల్‌ఐసీ యూనియన్‌ నేత కె. వేణుగోపాల్‌.. దేశంలో ప్రగతి సాధనకు ప్రభుత్వరంగం అవసరమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు.
నీరాతో తయారు చేసిన వంటకాలు 
తెలంగాణ గీత కార్మిక సంఘం నీరాతో తయారు చేసిన వంటకాలను హైదరాబాద్‌ పెస్ట్‌లో ప్రదర్శించారు. నీరా ఉత్పత్తి అమ్మకానికి అవకాశాలు కల్పించాలంటూ ఆ సంఘం నేతలు కోరుతున్నారు.  నీరాతో తయారు చేసిన వంటకాలు.. నిత్యం చేసుకునే వంటకాలకంటే ఎక్కువ ఔషధ గుణాలు ఇందులో ఉంటాయన్నారు.  నీరా ఆరోగ్యానికి ఏవిధంగా మేలు చేస్తుందో ఫ్లెక్సీలతో వివరించారు.
ఇవాళ, రేపు కొనసాగనున్న హైదరాబాద్‌ ఫెస్ట్‌  
హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఇవాళ, రేపు మాత్రమే కొనసాగనుంది. అంటే మిగిలింది ఇక రెండు రోజులే. కాబట్టి ఇప్పటి వరకు ఫెస్ట్‌ను సందర్శించని వారు వెంటనే ఒకసారి చూసి వెళ్లాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

 

08:23 - April 21, 2018

హైదరాబాద్ : పవన్‌ తల్లిపై శ్రీరెడ్డి, వర్మ చేసిన వ్యాఖ్యలపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పవన్‌కు మద్దతుగా మెగా ఫ్యామిలీ, తారా లోకం కదలి వచ్చింది. పవన్‌ ఫ్యాన్స్‌ కూడా పెద్ద సంఖ్యలో ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలివచ్చారు. 
ఫిల్మ్ ఛాంబర్‌లో నిరసనకు దిగిన పవన్ 
శ్రీరెడ్డి వ్యాఖ్యలు.. దర్శకుడు రాంగోపాల్‌వర్మ వ్యూహాలపై.. పవన్‌ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో నిరసనకు దిగారు. పవన్‌కు సంఘీభావంగా.. సోదరుడు నాగబాబు, సాయిధరమ్‌ తేజ్‌, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ తదితరులు ఫిలిం ఛాంబర్‌ వద్దకు చేరుకున్నారు. మెగా ఫ్యామిలీతో పాటు, పవన్‌ అభిమానులు, ఆ కుటుంబాన్ని అభిమానించే సినీ ప్రముఖులూ ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలివచ్చారు. 
నాకు న్యాయం జరిగే వరకు ఫిలిం ఛాంబర్‌ వదిలి వెళ్లను : పవన్  
తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన, దానికి కుట్ర చేసిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ.. పవన్‌ కల్యాణ్‌ మా అసోసియేషన్‌, నిర్మాతల మండలిని ప్రశ్నించారు. శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానని రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించిన నేపథ్యంలో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. తనకు న్యాయం జరిగే వరకు ఫిలిం ఛాంబర్‌ వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా.. అల్లూ అరవింద్‌, పవన్‌ లాయర్లతో చర్చించారు. శ్రీరెడ్డి వ్యాఖ్యలు ఖండించకుండా టీఆర్పీ రేటింగ్‌ల కోసం కొన్ని ఛానళ్లు పాకులాడుతున్నాయని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
పవన్‌ నిరసనకు పూరీ జగన్నాథ్‌ మద్దతు 
ఇక పవన్‌ నిరసనకు మద్దతు ప్రకటిస్తూ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు బదులుగా రాంగోపాల్‌ వర్మ మరోసారి పవన్‌ కల్యాణ్‌కు ట్విట్టర్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు. మీ మనోభావాలను అర్థం చేసుకున్నా, తప్పు చేశాను, ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పాను అని ట్వీట్‌ చేశారు. 
24 గంటల్లో స్పందించకపోతే భవిష్యత్‌ కార్యాచరణ : పవన్‌ 
ఇండస్ట్రీ పెద్దలు, కుటుంబసభ్యులతో సమావేశం పూర్తయ్యాక పవన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ నుండి వెళ్లిపోయారు. తన డిమాండ్‌పై స్పందించేందుకు సినీ పెద్దలకు ఒక రోజు సమయం ఇచ్చారు. 24 గంటల్లో స్పందించకపోతే భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టనున్నట్లు పవన్‌ తెలిపారు. 
మీడియా వాహనాలపై రాళ్లు రువ్విన దుండగులు  
మరోవైపు.. ఫిల్మ్‌ చాంబర్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పవన్‌ అభిమానుల్లో కొందరు దుండగులు.. అక్కడే ఉన్న మీడియా వాహనాలపై రాళ్లు రువ్వారు. రెండు చానల్స్‌కు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా పవన్‌ ఫిల్మ్‌ చాంబర్‌కు తరలి రావడం.. ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో.. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు కూడా చాలా సేపటి వరకూ రాకపోవడంతో.. దుండగులు విధ్వంసానికి తెగబడ్డారు. 

 

08:01 - April 21, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన దీక్షను కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తప్పుపట్టారు. మోదీ దీక్షను విమర్శించిన బాబు.. ఇప్పుడు దీక్ష ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. దక్షిణాదికి అన్యాయం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కృష్ణం రాజు మండిపడ్డారు. కేంద్రం వల్లే ఏపీ అభివృద్ధి చెందుతుందని.. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందన్నారు. ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకుని ఇప్పుడు మాటమార్చడం ఘోరమని కృష్ణంరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నా..ఇవ్వడం లేదనడం సరి కాదని అన్నారు. 

 

07:59 - April 21, 2018

హైదరాబాద్ : ధర్మపోరాటం పేరుతో  చంద్రబాబు... దీక్షను అధర్మం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రధాని మోదీ దీక్షను విమర్శించిన బాబు.. ఇప్పుడు ఎలా దీక్ష చేశారని ప్రశ్నించారు. 20 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వనియోగం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.  విద్యార్థులు, ఉద్యోగులతో  దీక్ష చేపట్టడం దారుణమన్నారు. మోదీని విమర్శించే స్థాయి బాలకృష్ణకు లేదని.. వెంటనే అరెస్ట్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. 

 

నాల్గో రోజు కొనసాగనున్న సీపీఎం జాతీయ మహాసభలు

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నాల్గో రోజు కొనసాగనున్నాయి. నేడు పార్టీ నిర్మాణం, విశాఖ 21వ జాతీయ మహాసభ, ప్లీనంలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై చర్చించనున్నారు.

 

07:53 - April 21, 2018

విజయవాడ : చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు ఉద్యోగ, ప్రజా సంఘాలు.. పార్టీ శ్రేణులు మద్దతు పలికాయి. దీక్షా స్థలివద్దకు భారీసంఖ్యలో జనం తరలివచ్చారు. విభజన చట్టం హామీల అమలు, ప్రత్యేక హోదాపై నేతలు కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి న్యాయం జరిగేవరకూ అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన 12 గంటల దీక్షకు వివిధ మతపెద్దల ఆశీర్వాదాలు లభించాయి. వివిధ ప్రజాసంఘాలు, కులసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. 
మోదీపై ధ్వజమెత్తిన బాలకృష్ణ 
చంద్రబాబునాయుడు ధర్మదీక్షసందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాకృష్ణ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఏపికి అన్యాయం చేశారంటూ ఘాటుగా విమర్శించారు. ఇప్పటిదాకా సామ,దాన పద్దతిలో కేంద్రానికి రాష్ట్ర పరిస్థితిని వివరించామన్నారు. కాని మోదీ ప్రభుత్వం వినిపించుకోవడంలేదన్న బాలయ్య.. ఇక దండోపాయానికి దిగుతామని హెచ్చరించారు. నటుడు శివాజీ కూడా ఇదే తరహాలో హెచ్చరించారు
మోదీ ప్రభుత్వానికి మోసం :  ఏపీ ఉద్యోగసంఘాలు
విభజన చట్టం హామీలు నెరవేర్చడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసానికి పాల్పడిందనే తాము భావిస్తున్నామన్నారు.... ఏపీ ఉద్యోగసంఘాల నేతలు. న్యాయపోరాటంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తిగా సహకరిస్తామన్నారు.. 
రాష్ట్రాన్ని ఇష్టం వచ్చిన రీతిగా విభజించడం వల్లే ఏపీ అభివృద్ధిలో వెనుకంజవేసిందన్నారు ఎంపీ గల్లా జయదేవ్‌. విభజన చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేలా కేంద్రంపై తమపోరాటం కొనసాగుతుందన్నారు. 
చంద్రబాబు ధర్మదీక్షకు ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు మద్దతు  
ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మదీక్షకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మద్దతు తెలిపారని ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు అన్నారు. చంద్రబాబుతోపాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు కూడా దీక్షలో పాల్గొన్నవారు. రాష్ట్రప్రయోజనాల కోసం జరుగుతున్న  పోరాటంలో ముఖ్యమంత్రికి పూర్తిగా సహకరిస్తామన్నారు. 
పార్టీలవి స్వార్థ రాజకీయాలు : తమ్మారెడ్డి భరద్వాజ 
బీజేపీ మోసం చేసిందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలిసినా పార్టీలన్నీ స్వార్థ రాజకీయాలతోనే గడిపేస్తున్నాయని సినీనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.  ఏపీ ప్రజలందరి ప్రయోజనాలకోసమే చంద్రబాబు పోరాటం మొదలు పెట్టారని.. రాజకీయాలకు అతీతంగా అందరూ ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాలన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ధర్మదీక్షకు సందర్భంగా తరలి వచ్చిన కళాకారులు.. తమ పాటలు, పద్యాలతో ఆలోచన రేకెత్తించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ధర్మపోరాటంలో కలిసిసాగుతామని చాటి చెప్పారు. 

07:44 - April 21, 2018

హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని సీపీఎం ప్రకటించింది.  కాంగ్రెస్‌తో రాజకీయ పొత్తు ఉండబోదని స్పష్టం చేసింది. ప్రజాసమస్యలపై మాత్రమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ప్రకటించారు.  ఈ మేరకు సీపీఎం జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు.
రాజకీయ తీర్మానానికి మహాసభ ఆమోదం 
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయి. మహాసభల్లో మూడో రోజైన శుక్రవారం.. కీలకమైన రాజకీయ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. కాంగ్రెస్‌తో రాజకీయ పొత్తు ఉండబోదన్న తీర్మానాన్నే మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కాంగ్రెస్‌తో ప్రజాసమస్యలపై కలిసి పనిచేయనున్నట్టు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ స్పష్టం చేశారు.   కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించాలని మహాసభ అభిప్రాయపడినట్టు తెలిపారు.  పార్టీ ఐక్యతకు ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు  ప్రజాస్వామ్య పద్దతిలో వెళ్లామని చెప్పేందుకు సీపీఎం గర్విస్తోందని ఏచూరీ అన్నారు.
కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యం : ఏచూరీ
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడమే తమ లక్ష్యమని ఏచూరీ తెలిపారు. రాజకీయ తీర్మానానికి అనుగుణంగా పార్టీ సభ్యులంతా ఐక్యంగా కృషి చేయాలని, దేశ వ్యాప్తంగా ప్రజలను సమీకరించాలని ఆయన కోరారు. పార్టీని బలోపేతం  చేయాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌తో పొత్తులు ఉండవు : ఏచూరీ
కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ కూటమి ప్రతిపాదనను సీపీఎం జాతీయ మహాసభ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాలక వర్గాలకు చెందిన ఓ ప్రధాన పార్టీయైన కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడమనేది తప్పుడు సంకేతాలను ఇస్తుందని మహాసభ అభిప్రాయపడింది. పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాతిపదికనే భవిష్యత్‌ ఎన్నికల ఎత్తగడలుంటాయని తెలిపింది.  

 

నేడు చలనచిత్ర పరిశ్రమ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్ : నేడు చలనచిత్ర పరిశ్రమ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. చలనచిత్ర పరిశ్రమ 24 విభాగాల్లోని సమస్యలపై చర్చ జరుగనుంది. అన్ని అంశాలపై చలనచిత్ర పరిశ్రమ కార్యాచరణ ప్రకటించనుంది.
 

నేటి నుంచి ఓయూ పీజీ ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ

టీఎస్ : నేటి నుంచి ఓయూ పీజీ ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఓయూ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల అయింది. 

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : పెట్టుబడి పథకం చెక్కుల పంపిణీ కార్యాచరణపై నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం జరుగనుంది. 

జూబ్లీహిల్స్ లో డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 36 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 22 ద్విచక్ర వాహనాలు, 16 కార్లను సీజ్ చేశారు.

 

Don't Miss