Activities calendar

22 April 2018

22:15 - April 22, 2018

అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్‌గా తన నియామకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తన కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం ఇష్టం లేదని లేఖలో రాశారు. తాను హిందువునని, తన ఇష్టదైవం వేంకటేశ్వర స్వామి అని ఆమె స్పష్టం చేశారు. అయితే తన నియామకం ... వివాదాస్పదం కావడం తనకు ఇష్టం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి, పార్టీకి సమయం కేటాయించాల్సి ఉన్నందున.. తన టీటీడీ సభ్యత్వం నియామకాన్ని వెనక్కు తీసుకోవాలని లేఖలో చంద్రబాబును కోరారు.

22:13 - April 22, 2018

నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ.. మంత్రి నారాయణ రెండో రోజు సైకిల్‌ యాత్రలో పాల్గొన్నారు. నెల్లూరులోని మైపాడు గేటు సెంటర్ నుంచి మొదలైన సైకిల్‌ యాత్ర మూడు, నాలుగు, ఐదో వార్డుల గుండా సత్యనారాయణపురం దాకా సాగింది. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు మంత్రి నారాయణ. నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు పలువురు టీడీపీ శ్రేణులు యాత్రలో పాల్గొన్నారు.   

22:11 - April 22, 2018

అమరావతి : ప్రత్యేక హోదా, విభజనచట్టంలోని అంశాలు అమలు చేయాలన్న డిమాండ్‌తో.. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడలోని బందర్‌రోడ్డులో ధర్నా నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బందర్ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్పవ్యక్తి నందమూరి తారకరామారావు అని మంత్రి దేవినేని ఉమా అన్నారు. మైలవరం చెరువులో నీళ్ళు లేవని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హమీల అమలు చేయాలంటూ సీఎం 29 సార్లు ఢిల్లీవెళ్ళినా అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు.  

22:08 - April 22, 2018
22:05 - April 22, 2018

గుంటూరు : జైసింహా శతదినోత్సవ వేడుకలకు గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చిన బాలకృష్ణ క్యాస్టింగ్‌ కౌచ్‌పై సినీపెద్దలంతా ఏకతాటిపైకి రావడం మంచి పరిణామం అన్నారు. ప్రధాని మోదీపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందన్నారు. 

22:01 - April 22, 2018

విజయవాడ : గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ పర్యటన ముగించుకున్న గవర్నర్‌ నేరుగా హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనలో మార్పులు చేసి విజయవాడ చేరుకున్నారు. నగరంలోని గేట్‌ వే హోటల్‌లో గవర్నర్‌తో చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించారు. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ చంద్రబాబు 20న చేపట్టిన ధర్మపోరాట దీక్ష సహా రాష్ట్రంలో నెలకొన్న కీలక పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.

21:57 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో 95 మందితో కూడిన కేంద్ర కమిటీ ఏచూరిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొంది. మతోన్మాద శక్తుల ముప్పు నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రత్యామ్యాయ విధానాలతో ముందుకెళ్లాలని సీపీఎం మహాసభల్లో తీర్మానించారు. బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా భవిష్యత్‌లో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.

ఐదు రోజుల పాటు సీపీఎం 22 జాతీయ మహాసభలు..
హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు జరిగిన సీపీఎం 22వ జాతీయ మహాసభలు ముగిశాయి. సీపీఎం జాతీయ కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నికయ్యారు. మహాసభల్లో చివరి రోజు సీపీఎం కేంద్ర కమిటీలోపాటు పొలిట్‌ బ్యూరోను ఎన్నుకున్నారు. కొత్తగా సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు.

సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్, ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై..
సీపీఎం మహాసభల్లో 17 మందితో పొలిట్‌ బ్యూరోను కేంద్ర కమిటీ ఎన్నుకొంది. సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్, ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బిమన్‌ బసు, మాణిక్‌ సర్కార్‌, బృందాకరత్‌, పినరాయి విజయన్‌, హసన్‌ ముల్లా, కొడియార్‌ బాలకృష్ణన్‌, ఎం.ఎ.బేబీ, సూర్యకాంత మిశ్రా, మహ్మద్‌ సలీం, సుభాషిణి అలీ, బి.వి. రాఘవులు, జి.రామకృష్ణన్‌, తసన్‌సేన్‌, నీలోత్పల్‌ బసుతో పొలిట్‌ బ్యూరో ఏర్పాటైంది.

ప్రత్యేక ఆహ్వానితురాలుగా మల్లు స్వరాజ్యం..
ఇంతకుముందు 92 మందితో ఉన్న కేంద్ర మిటీని ఇప్పుడు కొత్తగా మరో ముగ్గురితో విస్తరించారు. కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్‌.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, నాగయ్యలకు స్థానం దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం నియమితులయ్యారు. ఏపీ నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌, పుణ్యవతి, వి.శ్రీనివాసరావుకు స్థానం దక్కింది. మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నికయ్యారు.

బాసుదేవ్‌ ఆచార్య అధ్యక్షతన సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌
సీపీఎం మహాసభల్లో ఐదుగురు సభ్యులతో సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ ఎన్నికైంది. ఈ ఐదుగురు సభ్యులూ సమావేశమై బాసుదేశ్‌ ఆచార్యను సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. పి.రాజేంద్రన్‌, ఎస్‌.శ్రీధర్‌, జి.రాములు, బి.బిశ్వాస్‌ సభ్యులుగా ఉన్నారు. సీపీఎం సెంట్రల్‌ కంట్రోల్ కమిషన్‌కు ఎన్నికైన జి.రాములు తెలంగాణ వాసి. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన తర్వాత సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పారు. పార్టీ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తానన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన ప్రజా పోరాటాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలి పిలుపు ఇచ్చారు. ప్రత్యామ్నాయ విధానాలతో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తుందని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. సీపీఎం 22వ జాతీయ మహాసభలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సీతారాం ఏచూరి ధన్యవాదాలు తెలిపారు. 

బీజేపీ విభజించు పాలించు పద్ధతి : మాణిక్ సర్కార్..

హైదరాబాద్ : దేశంలో ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు విభజించు-పాలించు సిద్ధాంతాన్ని బీజేపీ-ఆర్ఎస్‌ఎస్ శక్తులు అమలు చేస్తున్నాయని.. వాటిని సమైక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్. దేశంలో బీజేపీ అనే శత్రువు మన తలుపుతడుతోంది... దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు.. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. 22వ సీపీఎం జాతీయ మహాసభల్లో ఇదే విషయంపై రాజకీయ శంఖారావం పూరించినట్లు మాణిక్ సర్కార్ తెలిపారు. 

బీజేపీని ఓడించాలంటే ప్రజాపోరాటాలే : కేరళ సీఎం పినరాయి

హైదరాబాద్ : దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్న బీజేపీని ఓడించేందుకు ప్రజా పోరాటాలే కీలకమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిస సీపీఎం జాతీయ మహాసభల్లో ప్రసంగించిన విజయన్‌.. ప్రజా పోరాటాల్లో సీపీఎం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 

బీజేపీ సర్కార్ నేరస్థుల రక్షకులు : బృందా

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభల బహిరంగ సభలో పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్  ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు..దేశంలో మహిళలపై, చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయనీ..చిన్నారి అసిఫా పై జరిగిన అన్యాయానికి మతం రంగు పులిమి పాలిస్తున్న వీరు నేరస్థుల రక్షకులని బృందా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మతతత్వ శక్తులను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మక్కా మసీదు ఘటనకు పాల్పడినవారిని నిర్ధోషులుగా విడుదల చేసేసారని విమర్శించారు.

తెలంగాణ వచ్చింది? ఏమి వచ్చింది? : తమ్మినేని

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ప్రజలకు ఏమిచ్చిందని సీపీఎం జాతీయ భారీ బహిరంగ సభలో తమ్మినేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే నీరు, నియామకాలు, నిధులు వస్తాయని ప్రజలు ఆశించారనీ కానీ ప్రభుత్వం వచ్చింది. కానీ నీరిచ్చిందా? నిధులిచ్చిందా? నియామకాలిచ్చిందా? అని అధికార పక్షాన్ని తమ్మినేని ప్రశ్నించారు. ప్రతీ గిరిజనుడికి మూడెకరాల భూమినిస్తామన్నారనీ..కానీ ఓట్లు వేసిన గిరిజను భూములను కూడా పాలకులు లాక్కుంటున్నారని..అమాయక గిరిజనులకు ఎర్రజెండా అండగా పోరాడిందని తెలిపారు.

మోదీ కలలు కనటం మానుకో : బృందాకరత్

హైదరాబాద్ : ఎర్రజెండాను అంతం చేయటం ఎవ్వరికి సాధ్యంకాదని..ఎర్రజెండా ఎప్పటికీ శాశ్వతంగా వుంటుందనీ..ఈ విషయంలో మోదీ కలలు కనటం మానుకోవాలని సీపీఎం జాతీయ మహాసభలో పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ ప్రధాని నరేంద్ర మోదీని హెచ్చరించారు. మోదీ హఠావ్..దేశ బచావ్ అనే నినాదంతో దేశమంతటా వినిపిస్తోందనీ..మోదీని గద్దె దింపేందుకు మహాసభ గట్టి నిర్ణయం తీసుకుందని సీపీఎం జాతీయ మహాసభ బహిరంగ సభలో పొలిట్ బ్యూరో బృందాకరత్ పిలుపునిచ్చారు. 

పాలన బీజేపీది పెత్తనం ఆర్ఎస్ఎస్ : మాణిక్ సర్కార్

హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో  వున్నది బీజేపీ ప్రభుత్వమే అయినా దాన్ని లీడ్ చేసేది మాత్రం ఆర్ఎస్ఎస్ దేనని సీపీఎం బహిరంగ సభలో త్రిపుర మాజీ సీఎం, పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకేనాణానికి రెండు ముఖాలని ఇది ప్రజలు గుర్తించాల్సిన అవుసరముందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని మహాసభ చర్చించిందన్నారు. అవినీతి పెరుగతోందని దీనిపై ప్రజలు అవగాహన పెంచుకుని ప్రజతంత్ర శక్తులను బలపరచాలని కేరళ సీఎం మాణిక్ సర్కార్ సీపీఎం 22వ జాతీయ మహాసభ బహిరంగ సభలో పిలుపునిచ్చారు. 

తెలంగాణ ఉద్యమాలు దేశానికి స్ఫూర్తి : కేరళ సీఎం పినరాయి

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాట్లాడుతు పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ఉద్యమాలు దేశానికి స్ఫూర్తినిస్తాయని పినరాయి విజయన్ తెలిపారు. భారీ సభకు హాజరయిన అందరికీ తన ధన్యవాదాలను తెలిపారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య వంటి పలువురు కామ్రేడ్స్ లకు పినరాయి విజయన్ నివాళులర్పించారు.  

సరళీకరణపై సీపీఎం హెచ్చరించింది : కేరళ సీఎం పినరాయి

హైదరాబాద్ : మోదీ అధికారంలోకి వచ్చాక సరళీకరణ విధానాలు పెరిగాయనీ..వీటి వల్ల ప్రజలకు నష్టం వాటిల్లితుందనీ, ప్రజల్లో అసమానతలు పెరుగుతాయని సీపీఎం పార్టీ ముందుచూపుతో ఎప్పుడు చెప్పిందని పినరాయి విజయన్ గుర్తు చేశారు. సంపదను పేదల అభివృద్ధికోసం వెచ్చించకుండా జాతీయ సంపదలో 55 శాతం సంపదనను సంపన్నులే అనుభవిస్తున్నారని వారికోసం మోదీ ప్రభుత్వం కట్టబెడుతోందని కేరళ సీఎం పినరాయి విజయన్ విమర్శించారు. దీంతో సామాన్యులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పినరాయి.

గోరక్షణ పేరుతో దాడులు : ఏచూరి

హైదరాబాద్ : సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సీపీఎం జాతీయ మహాసభ సందర్భంగా సరూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతు.. గోరక్షణ పేరిట ముస్లింల మీద దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన వేసుకునే దుస్తులు, ఆహారపు అలవాట్లను పాలకులే నిర్ధేశిస్తున్నారనీ ఇది ఎంతమాత్రం సరికాదన్నారు. రాముడు పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారనీ..రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారన్నారు.

మన కష్టాన్ని కూడా మోదీ దోచుకుంటున్నాడు : ఏచూరి

హైదరాబాద్ : మనం కష్టపడి సంపాదించుకున్న మన అకౌంట్లలోని డబ్బును కూడా ఎన్డీయే ప్రభుత్వం దోచుకుంటోందని సీపీఎం జాతీయ మహాసభ బహిరంగ సభలో జాతీయ కార్యదర్శిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయిన సీతారాం ఏచూరి విమర్శించారు. విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు యువతకు ఇస్తే నూతన భారతం ఆవిషృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల్లో రాజకీయ స్వార్థం కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణలు పెంచుతున్నారనీ..మన అక్క చెల్లెళ్లమీద, చిన్నారుల మీద దాడులు చేస్తున్న,చేయిస్తున్నవారంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలేనన్నారు.

చంద్రబాబుకి ఎమ్మెల్యే అనిత లేఖ..

అమరావతి : టీటీడీ బోర్డులో టీడీపీ ఎమ్మెల్యే అనిత నియామకాన్ని పలువురు విమర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను క్రిస్టియన్ అంటూ అనిత చెప్పిన ఓ వీడియో బయటకు రావడంతో దానిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనిత మాత్రం తాను హిందువునే అని మీడియాకు వివరణ ఇచ్చారు. అయితే, అనూహ్యంగా, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే అనిత లేఖ రాసి తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

21:01 - April 22, 2018

హైదరాబాద్ : గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల అంశంపై అవిశ్వాస తీర్మానంపై బీజేపీ ప్రభత్వం చర్చ జరగనువ్వకుండి చేసిందనీ.. తెలంగాణలో ఎర్రచొక్కా వాలంటీర్ల ప్రదర్శన, జనసమీకరణే మోదీ సర్కారుకు అభిశంసన తీర్మానమని సీపీఎం జాతీయ మహాసభల బహిరంగ సభలో పొలిట్ బ్యూరో సభ్యులు మహ్మద్ సలీం ఎద్దేవా చేశారు. అమిత్ షా, మోదీ కంపెనీ లూఠీ, అబద్ధాలు, ప్రజలను విభజించడంపై దృష్టిసారించారని పొలిట్ బ్యూరో సభ్యులు మహ్మద్ సలీం విమర్శించారు. దళితులు, రైతుల సమస్యలపై చర్చను పార్లమెంట్ లో రానివ్వటం లేదు రోడ్లమీదనే చర్చించుకోమని బీజేపీ ప్రభుత్వం ప్రజలను రోడ్లపై కూర్చోబెడుతోందని మమ్మద్ సలీం విమర్శించారు. 

20:47 - April 22, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజారాజ్యం సాధించి తీరతాం సీపీఎం జాతీయ మహాసభల బహిరంగ సభలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వచ్చి ఏమిచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే నీరు, నియామకాలు, నిధులు వస్తాయని ప్రజలు ఆశించారనీ కానీ ప్రభుత్వం వచ్చింది. కానీ నీరిచ్చిందా? నిధులిచ్చిందా? నియామకాలిచ్చిందా? అని అధికార పక్షాన్ని తమ్మినేని ప్రశ్నించారు. ప్రతీ గిరిజనుడికి మూడెకరాల భూమినిస్తామన్నారనీ..కానీ ఓట్లు వేసిన గిరిజను భూములను కూడా పాలకులు లాక్కుంటున్నారని..అమాయక గిరిజనులకు ఎర్రజెండా అండగా పోరాడిందని తెలిపారు. ప్రాజెక్టులకు సీపీఎం వ్యతిరేకంగా కాదనీ..భూ నిర్వాశితుల చట్టం ప్రకరాం పరిహారం కోరితే ప్రభుత్వం ఏమ్రాతం పట్టించుకోవటం లేదనీ తమ్మినేని విమర్శించారు. విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందినప్పుడే అభివృద్ధి తప్ప విమర్శించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్, సీపీఎం కలిసి పోటీ చేస్తాయని వదంతులు వచ్చాయని అది ఎప్పటికీ జరగదని తమ్మినేని స్పష్టం చేశారు. ప్రజల కోసం సీపీఎం పోరాడుతుంటే వారు దబ్బనాలు, సూదుల పార్టీఅని ఎద్దేవా చేశారని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో సీపీఎం ముందుకొస్తోందని తెలిపారు. తెలంగాణలో 93 శాతం మంది ప్రజలు అట్టడుగున వున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే వ్యవసాయం బాగుడుతుందనీ..అటువంటి విధానాలు రైతులనుకాపాడేవన్నారు. ఖమ్మం మిర్చియార్డులో రైతులకు సంకెళ్లు వేయించిన ప్రభుత్వమిది అని విమర్శించారు.

బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర: తమ్మినేని
బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కచ్చితంగా ఇచ్చి తీరుతుందని హామీ ఇచ్చారు. బహుజనులకు అధికారంలోకి తేవటమే బీఎల్ఎఫ్ లక్ష్యమన్నారు. బీసీలకు 60 స్థానాలను కేటాయిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ దృష్టిలో గొర్రెలను, పందులను పంచటమే సామాజిక న్యాయమని భావిస్తోందని తమ్మినేని ఎద్దేవా చేశారు. కేంద్రం ధాన్యం బస్తాకు రూ.1550 లు నిర్ణయిస్తే దానికి కేరళ ప్రభుత్వం రూ.800లు కలిపి గిట్టుబాటు ధర కల్పించిందని తెలిపారు.

పార్టీలోకి యువరక్తం: తమ్మినేని
ఈరోజు రెడ్ షర్ట్ వలంటీరే రేపటి ఎర్రజెండా వారసులనీ..వారు పార్టీ యువ కిశోరాలని పేర్కొన్నారు. పార్టీలో యువరక్తం కొనసాగుతోందన్నారు. వారే తెలంగాణ రథసారధులని ఉత్సాహపరిచారు. 

20:10 - April 22, 2018

హైదరాబాద్ : మోదీ హఠావ్..దేశ బచావ్ అనే నినాదంతో దేశమంతటా వినిపిస్తోందనీ..మోదీని గద్దె దింపేందుకు మహాసభ గట్టి నిర్ణయం తీసుకుందని సీపీఎం జాతీయ మహాసభ బహిరంగ సభలో పొలిట్ బ్యూరో బృందాకరత్ పిలుపునిచ్చారు. ఎర్రజెండాను అంతం చేయటం ఎవ్వరికి సాధ్యంకాదని..ఎర్రజెండా ఎప్పటికీ శాశ్వతంగా వుంటుందనీ..ఈ విషయంలో మోదీ కలలు కనటం మానుకోవాలని బృందాకరత్ హెచ్చరించారు.

త్రిపురలో ధనబలంతోనే అధికారంలోకి : బృందా
త్రిపురలో ధనం, బలప్రయోగంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని బృందా తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఓటమికోసం ఎర్రజెండాలను చేబూని నినదిస్తున్నామన్నారు. దేశంలో మహిళలపై, చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయనీ..చిన్నారి అసిఫా పై జరిగిన అన్యాయానికి మతం రంగు పులిమి పాలిస్తున్న వీరు నేరస్థుల రక్షకులని బృందా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మతతత్వ శక్తులను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మక్కా మసీదు ఘటనకు పాల్పడినవారిని నిర్ధోషులుగా విడుదల చేసేసారని విమర్శించారు. బహిరంగ సభవేదికపై వున్న లెనిన్ ఫోటో చూడండి కామ్రేడ్స్..ఈరోజు లెనిన్ పుట్టినరోజు ఇది మనకు చాలా చాలా శుభదినమని ఉత్సాహపరిచారు. సామ్యాద కలను నిజం చేసిన మహనీయుడు లెనిన్ మహనీయుడని కొనియాడారు బృందాకరత్.  

19:48 - April 22, 2018

హైదరాబాద్ : దేశంలో పరిస్థితులు దిగజారుతున్నాయని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని తెలిపారు. నిత్యావసర వస్తువులు సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నాయని.. రైతుల ఆత్మహత్యలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయనీ..కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారని..దుర్భర పరిస్థితుల్లోకి సామాన్యులు, పేదలు నెట్టివేయబడుతున్నారని మాణిక్ సర్కార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులు నెలకొనే ప్రమాదం వస్తుందని సీపీఎం పదే పదే హెచ్చరిస్తునే వున్నామని తెలిపారు. రోజురోజుకీ అవినతి తీవ్రస్థాయికి చేరుకుంటోందన్నారు. రూపాయి విలువ గడచిన 72 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోతోందని తెలిపారు. కేంద్రంలో వున్నది బీజేపీ ప్రభుత్వమే అయినా దాన్ని లీడ్ చేసేది మాత్రం ఆర్ఎస్ఎస్ సే నని మాణిక్ సర్కార్ ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకేనాణానికి రెండు ముఖాలని ఇది ప్రజలు గుర్తించాల్సిన అవుసరముందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని మహాసభ చర్చించిందన్నారు. అవినీతి పెరుగతోందని దీనిపై ప్రజలు అవగాహన పెంచుకుని ప్రజతంత్ర శక్తులను బలపరచాలని కేరళ సీఎం మాణిక్ సర్కార్ సీపీఎం 22వ జాతీయ మహాసభ బహిరంగ సభలో పిలుపునిచ్చారు. 

బీజేపీవి మతతత్వ రాజకీయాలు : పినరాయి

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభల బహిరంగ సభలో మాట్లాడుతున్న సందర్భంగా పినరాయి మాట్లాడుతు..బీజేపీ మతతత్వ ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు సీపీఎం పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. వాటిపై సీపీఎం పార్టీ మహాసభ చర్చించిందని తెలిపారు. అందుకే సీపీఎం పార్టీ అంటే భూస్వామ్య పార్టీలకు కంటగింపుగా వుంటుందని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో సీపీఎం పార్టీ బలపడితే ప్రజాస్వామాన్యాన్ని అపహాస్ం చేస్తారని కానీ ఎటువంటి పరిస్థితుల్లోను పార్టీలో అటువంటి పరిస్థితి రాదనీ..రానివ్వమని ధీమా వ్యక్తం చేశారు.

దేశం నిండా మోసపు మోదీలే : ఏచూరి

హైదరాబాద్ : భారీ బహిరంగ సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతు..ఈ సభను చూస్తుంటే తెలంగాణలో ఎర్రజెండా మళ్లీ విజయవంతంగా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీని గద్దెనుండి దింపుతామని ప్రజలకు సీపీఎం వాగ్దానమని ధీమా వ్యక్తం చేశారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వాగ్ధానం చేశారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే మోదీ ప్రభుత్వాన్ని దించి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. నరేంద్రమోదీ, లలిత్ మోదీ, నీరవ్ మోదీ వంటి మోదీలు దేశం నిండా ఛీట్ చేసే మోదీలే వున్నారని సీతారాం ఏచూరి చమత్కరించారు. మోసం చేసేవారంతా మోదీలేనన్నారు.

19:28 - April 22, 2018

హైదరాబాద్ : సామాజిక భద్రతను కల్పించే విధంగా చర్యలను కేరళ ప్రభుత్వం పనిచేస్తోందనీ..ప్రత్యేక ఆర్థిక విధానాలను కేరళ ప్రభుత్వం యత్నిస్తోందని సీపీఎం జాతీయ మహాసభ బహిరంగ సభలలో కేరళ సీఎం పినరాయి విజయన్ తెలిపారు. తెలిపారు. మా విధానాల వల్ల కేరళ విద్యార్ధులు ప్రపంచ స్థాయిలో పోటీపడగలుగుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను సమర్థవంతంగా నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు కేరళ సీఎం పినరాయి విజయన్ తెలిపారు. మా ప్రభుత్వం మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నామని ధీమాగా తెలిపారు. వ్యవసాయ అనుబంధ సంస్థలను పునరుద్ధరిస్తున్నామన్నారు. వాటిపై ఆధారపడి జీవిస్తున్నవారికి ఉపాధిని కేరళ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

బీజేపీవి మతతత్వ రాజకీయాలు : పినరాయి
బీజేపీ మతతత్వ ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు సీపీఎం పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. వాటిపై సీపీఎం పార్టీ మహాసభ చర్చించిందని తెలిపారు. అందుకే సీపీఎం పార్టీ అంటే భూస్వామ్య పార్టీలకు కంటగింపుగా వుంటుందని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో సీపీఎం పార్టీ బలపడితే ప్రజాస్వామాన్యాన్ని అపహాస్ం చేస్తారని కానీ ఎటువంటి పరిస్థితుల్లోను పార్టీలో అటువంటి పరిస్థితి రాదనీ..రానివ్వమని ధీమా వ్యక్తం చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక సరళీకరణ విధానాలు పెరిగాయనీ..వీటి వల్ల ప్రజలకు నష్టం వాటిల్లితుందనీ, ప్రజల్లో అసమానతలు పెరుగుతాయని సీపీఎం పార్టీ ముందుచూపుతో ఎప్పుడు చెప్పిందని పినరాయి విజయన్ గుర్తు చేశారు. సంపదను పేదల అభివృద్ధికోసం వెచ్చించకుండా జాతీయ సంపదలో 55 శాతం సంపదనను సంపన్నులే అనుభవిస్తున్నారని వారికోసం మోదీ ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు. దీంతో సామాన్యులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పినరాయి. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మోదీ ప్రభుత్వం యదేచ్ఛంగా అనుమతులను ఇచ్చేసిందని తెలిపారు. కార్మికుల ఆదాయం తగ్గిందని ప్రశ్నించే కార్మికుల గొంతులను పాలకులు నొక్కివేస్తున్నారని విమర్శించారు. అలాగే వ్యవసాయం రంగం సంక్షోభంలో పడిపోవటంతో దేశంలో ప్రతీ అరగంటలు ఓ రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ..రోజు రోజుకీ పెరిగిపోతున్న వ్యవసాయ సంక్షోభంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి రైతన్నలకు సీపీఎం పార్టీ అండగా నిలబడుతోందని తెలిపారు. దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయన్నారు. బేటీ పడావో బేటీ బచావో పథకం ఏమాత్రం పనిచేయటం లేదనీ..దానికి కథువా, ఉన్నావ్ ఘటనలే ఉదాయరణలన్నారు.

కామ్రేడ్లకు పినరాయి నివాళులు :

కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు భారీ సభకు హాజరయిన అందరికీ తన ధన్యవాదాలను తెలిపారు. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ఉద్యమాలు దేశానికి స్ఫూర్తినిస్తాయని పినరాయి విజయన్ తెలిపారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య వంటి పలువురు కామ్రేడ్స్ లకు పినరాయి విజయన్ నివాళులర్పించారు.  

18:58 - April 22, 2018

హైదరాబాద్ : భారీ బహిరంగ సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతు..ఈ సభను చూస్తుంటే తెలంగాణలో ఎర్రజెండా మళ్లీ విజయవంతంగా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీని గద్దెనుండి దింపుతామని ప్రజలకు సీపీఎం వాగ్దానమని ధీమా వ్యక్తం చేశారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వాగ్ధానం చేశారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే మోదీ ప్రభుత్వాన్ని దించి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. నరేంద్రమోదీ, లలిత్ మోదీ, నీరవ్ మోదీ వంటి మోదీలు దేశం నిండా ఛీట్ చేసే మోదీలే వున్నారని సీతారాం ఏచూరి చమత్కరించారు. మోసం చేసేవారంతా మోదీలేనన్నారు. మన డబ్బు దోచేసి దేశాలు దాటేశారని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాలను ప్రజలకు అనుకూలంగా మార్చే విధానాలపై మహాసభ చర్చించిందని ఏచూరి తెలిపారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని వాగ్ధానాలకు విస్మరించిందన్నారు. దేశంలోఆర్థిక దోపిడీకి మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మనం కష్టపడి సంపాదించుకున్న మన అకౌంట్లలోని డబ్బును కూడా ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు యువతకు ఇస్తే నూతన భారతం ఆవిషృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల్లో రాజకీయ స్వార్థం కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణలు పెంచుతున్నారనీ..మన అక్క చెల్లెళ్లమీద, చిన్నారుల మీద దాడులు చేస్తున్న,చేయిస్తున్నవారంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలేనన్నారు. నేరం చేసిన నేరస్థులకు ఎటువంటి శిక్షలు లేవుకానీ బాధితులపైనే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. గోరక్షణ పేరిట ముస్లింల మీద దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన వేసుకునే దుస్తులు, ఆహారపు అలవాట్లను పాలకులే నిర్ధేశిస్తున్నారనీ ఇది ఎంతమాత్రం సరికాదన్నారు. రాముడు పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారనీ..రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారన్నారు. పెద్ద పెట్టుబడి దారులకు రూ.3లక్షల కోట్లు రుణమాఫీ చేశారని కానీ పేదలకు మాత్రం ఒట్టి చేతులు చూపుతున్నారనీ కానీ మహాసభలో ఎర్ర కవాతు చేసిన ఈ 'ఎర్ర సైన్యమే' ప్రజలకు అండగా వుంటుందని ధీమా వ్యక్తం చేశారు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి. 

18:34 - April 22, 2018

హైదరాబాద్ : సరూర్ నగర్ అంతా అరుణ వర్ణం దాల్చింది. స్టేడియంలోని సభా వేదికపైకి ఎర్రదండు ఉత్సాహంగా ఉరికి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ కొత్త పొలిట్ బ్యూరో సభ్యులు వేదికను అలంకరించారు. బీవీ రాఘవులుగారి అధ్యక్షతన సీపీఎం జాతీయ భారీ బహిరంగ సభ ప్రారంభమయ్యింది. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండవ సారి ఎన్నికయిన సీతారాం ఏచూరి , ప్రకాశ్ కరత్,పిళ్లై, బిమాన్ వాస్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేరళ సీఎం పినరాయి విజయన్, మహిళా కామ్రేడ్ బృందాకరత్, అన్నె ముల్లా, బాలకృష్ణన్, ఎంఏ బేబీ, సూర్యకాంత్ మిశ్రా, సుభాషిణీ అలీ, మహ్మద్ సలీం, మల్లు స్వరాజ్యం, తమ్మినేని వీరభద్రం, మధు, వీరయ్య, నాగయ్య, సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్శింహారెడ్డి, జి.రాములు,సి, రాములు వంటి అగ్ర నేతలు వేదికను అలంకరించారు.

18:03 - April 22, 2018
17:58 - April 22, 2018

సభా ప్రాంగణానికి చేరుకున్న మాణిక్ సర్కార్..

హైదరాబాద్ : సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన స్టేజ్ పైకి త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేరళ సీఎం పినరాయి విజయన్ చేరుకున్నారు. సీపీఎం జాతీయ మహాసభలకు సంబంధించిన భారీ బహిరంగ సభ జన సముద్రాన్ని తలపిస్తోంది. ఇప్పటికే మహాసభ డెలిగేట్స్ పలువురు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మరికొంత సేపట్లో భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. 

సరూర్ నగర్ చేరుకున్న ఎర్ర కవాతు..

హైదరాబాద్ : సరూర్ నగర్ లోని సభా ప్రాంగణానికి రెడ్ షర్ట్ కవాతు చేరుకుంది. ఐదు వేలమందితో కొనసాగిన ఈ కవాతు సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉత్సాహ వాతావరణం మధ్య కవాతు సభ ప్రాంగణానికి చేరుకుంది. రెడ్ టీ షర్ట్ వాలంటీర్ల ఎర్రదండును సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మలక్ పేట టీవీ టవర్ నుండి కవాతుగా కొనసాగి సరూర్ నగర్ స్టేడియంకు చేరుకుంది. దీంతో అప్పటికే అరుణ వర్ణంగా వున్న స్టేడియం మరింత ఎరుపురంగుకు నంతరించుకుంది. 

బీజేపీ మెగా కూటమి : అమిత్ షా

ఢిల్లీ : 2019లో జరుగనున్న ఎన్నికలకు బీజేపీ కసరత్తులను ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో మెగా కూటమిని ఏర్పాటు చేయబోతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పార్టీలన్నీ కూటమిలో కొనసాగుతాయని... కొత్త పార్టీలు కూడా వచ్చి చేరబోతున్నాయని ఆయన తెలిపారు. అయితే, కొత్తగా వచ్చి చేరే పార్టీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ పార్టీలన్నీ మోదీ నేతృత్వంలో ఎన్నికల బరిలోకి దిగుతాయని అమిత్ షా తెలిపారు.

రికార్డు స్థాయిలో పెట్రోల్ ధరలు..

ఢిల్లీ: వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచేశాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పెట్రోల్, డీజిల్‌పై 19 పైసలు పెంచాయి. దీంతో పెట్రోల్ ధరలు 55 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 74.40, లీటర్ డీజిల్ రూ. 65.65గా ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ రేట్లు పెరగడంతో పెట్రోల్‌పై రూ. 13 పైసలు, డీజిల్‌పై రూ. 15 పైసలు పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం పెట్రోల్ రేట్లు ఇలా ఉన్నాయి. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.

17:08 - April 22, 2018

భారీగా గంజాయి స్వాధీనం..

కామారెడ్డి: గాంధారి మండలం జెమిని తండాలో 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. 

కదిలిన ఎర్రదండు..

హైదరాబాద్ : ఎర్రదండు కదిలింది. రెండు నెలలుగా శిక్షణ పొందిన రెడ్ టీ షర్ట్ వాలంటీర్ల ఎర్రదండును సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు ఐదువేలవందితో కూడిన ఎర్రదండు మలక్ పేట టీవీ టవర్ నుండి బహిరంగ సభ ప్రాంగణమైన సరూర్ నగర్ స్టేడియం వరకూ కొనసాగనుంది. జాతీయ నేతలు, తెలుగు రాష్ట్రాల నేతలు ముందు నడువగా రెడ్ టీ షర్ట్స్ కవాతు క్రమశిక్షణగా కొనసాగుతోంది. చూసేందుకు ఆ ప్రాంతమంతా అరుణవర్ణం దాల్చింది. పోరాటాల పోరు సలిపే ఎర్రజెండా మయంగా మలక్ పేట, దిల్ సుక్ నగర్ ప్రాంతమంతా అరుణ వర్ణం గా మారిపోయింది.

16:51 - April 22, 2018

హైదరాబాద్ : ఎర్రదండు కదిలింది. రెండు నెలలుగా శిక్షణ పొందిన రెడ్ టీ షర్ట్ వాలంటీర్ల ఎర్రదండును సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు ఐదువేలవందితో కూడిన ఎర్రదండు మలక్ పేట టీవీ టవర్ నుండి బహిరంగ సభ ప్రాంగణమైన సరూర్ నగర్ స్టేడియం వరకూ కొనసాగనుంది. జాతీయ నేతలు, తెలుగు రాష్ట్రాల నేతలు ముందు నడువగా రెడ్ టీ షర్ట్స్ కవాతు క్రమశిక్షణగా కొనసాగుతోంది. చూసేందుకు ఆ ప్రాంతమంతా అరుణవర్ణం దాల్చింది. పోరాటాల పోరు సలిపే ఎర్రజెండా మయంగా మలక్ పేట, దిల్ సుక్ నగర్ ప్రాంతమంతా అరుణ వర్ణం గా మారిపోయింది. నేటితో సీపీఎం జాతీయ మహాసభలు ముగియనున్నాయి. సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు మహాసభకు హాజరవుతున్నారు. సుమారు ఐదు వేలమంది రెడ్ టీ షర్ట్ వలంటీర్లతో కవాతు ప్రారంభమయ్యింది.

కళ్లల్లో కారం చల్లి, హత్య!..

హైదరాబాద్ : ఓ రౌడీషీటర్ కళ్లల్లో కారం చల్లి అతన్ని హతమార్చిన సంఘటన సికింద్రాబాద్ లోని రెతిఫైలీ బస్సు స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ హత్య గురించి గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. పరికి బస్తీలో దుండగులు తమ వెంట తెచ్చుకున్న కారంను రౌడీషీటర్ ఫరీద్ కళ్లల్లో చల్లారు. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. కత్తి పోట్లతో ప్రాణాలు కోల్పోయి పడి ఉన్న ఫరీద్ ను గమనించిన పాదచారులు ఈ మేరకు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రపంచ అత్యంత వృద్ధురాలు మృతి..

హైదరాబాద్ : జపాన్ కు చెందిన 117 ఏళ్ల వయసున్న వృద్ధురాలు కన్నుమూశారు. ఈ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఈమేనని అంచనా. నబి తజీమా 1900 సంవత్సరంలో జన్మించారు. నైరుతి ప్రాంతంలోని కికైజిమాలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. 

ప్రపంచ అత్యంత వృద్ధురాలు మృతి..

హైదరాబాద్ : జపాన్ కు చెందిన 117 ఏళ్ల వయసున్న వృద్ధురాలు కన్నుమూశారు. ఈ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఈమేనని అంచనా. నబి తజీమా 1900 సంవత్సరంలో జన్మించారు. నైరుతి ప్రాంతంలోని కికైజిమాలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. 

గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ ..

మహారాష్ట్ర : గడ్చిరోలి జిల్లాలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీస్థాయిలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎటపల్లి బొరియా అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కదిలకలు కనుగొన్న భద్రతాదళాలు వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

16:22 - April 22, 2018

హైదరాబాద్ :  సీపీఎం జాతీయ కార్యదర్శిగా రెండోసారి సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. 95 మంది సభ్యులతో నూతన కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. గత కమిటీలో 92 మంది సభ్యులు వుండగా .. ఈసారి అదనంగా ముగ్గురికి అవకాశమిచ్చారు. ఈ కమిటీలో సభ్యులుగా సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, రామచంద్రన్ పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్, బృందాకరత్, సుభాషిణీ అలీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, హాస్ మొల్ల, కొడియార్ బాలకృష్ణన్, ఎంఏ బేబి, సూర్యకాంత మిశ్రా, మహ్మద్ సలీం, బీ.వీ రాఘవులు, జి.రామకృష్ణన్ లు వీరితో పాటు ఈ మహాసభలో కేంద్ర కమిటీలోకి  తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, వీరయ్య, చెరుపల్లి సీతారాములు, నాగయ్యకు అవకాశమిచ్చారు. మల్లు స్వరాజ్యంకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశమిచ్చారు. ఏపీ నుంచి మధు, గఫూర్‌, శ్రీనివాసరావులు చోటు కల్పించారు. పాటూరి రామయ్యకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. ఇక పొలిట్‌బ్యూరోలో 17 మందికి అవకాశం కల్పించారు. కొత్తగా తపన్‌సేన్‌, నీలోత్పల్‌ బసులకు చోటు కల్పించారు. మొత్తం కలిపి 95 మందితో కూడిన జాతీయ కమిటీని మహాసభ ఎన్నుకుంది. 

 

16:08 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ప్రారంభం కానున్న భారీ బహిరంగ సభకు ఎర్రదండు కదలనుంది. ఈ నేపథ్యంలో సుమారు 6 కిలో మీటర్ల దూరం కొనసాగనున్న ఈ రెడ్ టీ షర్టుల కవాత మలక్ పేట నుండి సరూర్ నగర్ స్టేడియం వరకూ చేరుతుంది. అనంతరం అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు..రెండు నెలల నుండి చక్కటి శిక్షణ పొందిన రెడ్ షర్టు వలంటీర్లు గత రెండు రోజుల క్రితమే నగరానికి చేరుకున్నారనీ వారి కవాతు బహరంగ సభను నిండుదనం చేకూరుస్తుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. సుమారు రెండు వేలమంది రెడ్ షర్టు వలంటీర్ల కవాతు ప్రారంభం కానుందని తమ్మినేని పేర్కొన్నారు. జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు ముందుండి నడిపించగా వెనుక ఎర్రసేన క్రమ శిక్షణగా సరూర్ నగర్ స్టేడియంకు చేరుకోనున్నారని తమ్మినేని తెలిపారు. 

16:07 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు విజయవంతంగా కొనసాగాయనీ..మిగిలిన బహిరంగ సభతో ఈ మహాసభలు ఘనంగా ముగుస్తాయనీ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. మహాసభ తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు బహిరంగ సభలో తెలిపి అపోహలకు తెరదించుతామన్నారు. సభలో అన్ని విషయాలను కూలకషంగా చర్చలు జరిగిన అనంతరం రాజకీయ తీర్మానాన్ని ఆమోదించామన్నారు. అలాగే బీజేపీని ఢీ కొట్టేందుకు సీపీఎం సిద్ధంగా వుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చిన తరువాత ఆయా ప్రాంతపు పరిస్థితులను, స్థితిగతులను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. 

15:41 - April 22, 2018
15:40 - April 22, 2018

రెండసారి కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు : ఏచూరి

హైదరాబాద్ : పార్టీ ప్రధాన కార్యదర్శిగా నన్ను రెండవసారి ఎన్నుకున్నందుకు ధన్యవాదాలను తెలిపారు సీతారాం ఏచూరి. తనపై వున్న నమ్మకంతో ఈ బాధ్యతను రెండసారి ఇచ్చినందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వాగ్ధానం చేశారు. పార్టీ ఐక్యమత్యతను ఈ మహాసభలు మరోసారి రుజువుచేశాయన్నారు. ఈ మహాసభలతో తాము మరింతగా బలోపేతమయ్యామని ఆనందం వ్యక్తం చేశారు. శ్రామిక కార్మిక పాలన తీసుకురావటమే సీపీఎం లక్ష్యమన్నారు. దేశ సమైక్యను, రాజ్యాంగాన్ని కాపాడుకోవటమ మన కర్తవ్యమన్నారు.

కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇంత పెద్ద దేశంలో ఏవో ఒకటి రెండు అత్యాచార కేసులు జరిగితే వాటిని మరీ అంత పెద్దవి చేసి రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అత్యాచార ఘటనలు దురదృష్టకరం. అయినప్పటికీ కొన్ని సమయాల్లో మనం వాటిని ఆపలేం. ప్రభుత్వం అంతటా అప్రమత్తతతోనే ఉంటోంది. దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే వాటిని అంత పెద్దవి చేయకూడదు’’ అని గంగ్వార్ వ్యాఖ్యానించారు కాగా మంత్రి వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. 

పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం : ఏచూరి

హైదరాబాద్ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నికయ్యారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ఏచూరి మాట్లాడుతు..పార్టీ నిర్ణయమే మాకందరికీ శిరోధార్యమనీ, మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించటమే సీపీఎం పార్టీ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. మహాసభ తీసుకున్న నిర్ణయాలను అమలుచేసేందుకు కృషి చేస్తామని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. 

15:02 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నికయ్యారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ఏచూరి మాట్లాడుతు..పార్టీ నిర్ణయమే మాకందరికీ శిరోధార్యమనీ, మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించటమే సీపీఎం పార్టీ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. మహాసభ తీసుకున్న నిర్ణయాలను అమలుచేసేందుకు కృషి చేస్తామని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సీపీఎం పార్టీముందు నాలుగు ఛాలెంజ్ లున్నాయని వాటిని తట్టుకోవటమే కాదు వాటిని నియంత్రించేందుకు, నిర్మూలించేందుకు సీపీఎం పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా మనోత్మాద శక్తులు పెచ్చరిల్లుతున్నాయనీ..దీంతో మతోన్మాద దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయన్నారు. ఒకవైపు నుండి ఆర్థిక దోపిడీ, మరోవైపు పార్లమెంట్ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నారనీ..ప్రపంచ సామ్రాజ్యవాదానికి ఒక తోలు బొమ్మలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఏచూరి విమర్శించారు. వీటిని తట్టుకుని ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ప్రజా ఉద్యమాన్ని బలపరిచేందుకు పార్టీ కృషి చేస్తుందని ఏచూరి పేర్కొన్నారు. బీజేపీని గద్దె దించేందుకే సీపీఎం పార్టీ శతవిధాలా కృషి చేస్తుందని ఏచూరి స్పష్టం చేశారు.

జాతీయ మహాసభల ముగింపు వేడుక..
కాగా, జాతీయ మహాసభల ముగింపు వేడుక ఈ రోజు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మలక్ పేట నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతును ప్రారంభించనున్నారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతులో 20 వేల మంది పాల్గొంటారని సమాచారం. సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుంది. సభా ప్రాంగణంలో, ఎల్బీనగర్ చౌరస్తాలో 12 ఎల్ ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.

14:14 - April 22, 2018

హైదరాబాద్ : ప్రజల కోసం సీపీఎం పోడుతూనే ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. ముందు ముందు చాలా యుద్ధాలున్నాయన్నారు. పార్టీలో చీలిక వచ్చినట్లు వచ్చిన వార్తలకు ఏచూరి సమాధానం చెప్పారు. తాము మరింత బలోపేతం అయ్యామని తెలిపారు. తమ చిత్తశుద్ధి మరింత బలోపేతమైందన్నారు. 'మా శత్రువులారా బహు పరాక్...మీ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం పోరాడుతుందన్నారు. తమ లక్ష్యాలను సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.

 

14:02 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం ముగిసింది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. 17మందితో సీపీఎం పోలిట్ బ్యూరోను ఎన్నుకున్నారు. పోలిట్ బ్యూరోలోకి కొత్తగా తపన్ సేన్, నీలోత్పల్ బసులకు చోటు దక్కింది. 95 మందితో కేంద్రకమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, నాగయ్యలు, ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లుస్వరాజ్యం ఎన్నికయ్యారు. ఏపీ నుంచి 
మధు, గఫూర్, వి.శ్రీనివాస్ రావు, ప్రత్యేక ఆహ్వానితులుగా పాటూరి రామయ్యను ఎన్నుకున్నారు. గతంలో 92 మందితో కేంద్ర కమిటీ ఉంది. 

13:50 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం ముగిసింది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. 95 మందితో కేంద్రకమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, నాగయ్యలు, ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లుస్వరాజ్యంను ఎన్నికయ్యారు. ఏపీ నుంచి మధు, గఫూర్, వి.శ్రీనివాస్ రావు, ప్రత్యేక ఆహ్వానితులుగా పాటూరి రామయ్యను ఎన్నుకున్నారు. గతంలో 92 మందితో కేంద్ర కమిటీ ఉంది.

 

13:42 - April 22, 2018

హైదరాబాద్ : నేటితో సీపీఎం జాతీయ మహాసభలు ముగియనున్నాయి. రాజకీయ నిర్మాణంపై మహాసభల్లో సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు మహాసభకు హాజరవుతున్నారు. బహిరంగ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

13:40 - April 22, 2018

హైదరాబాద్ : నేటితో సీపీఎం జాతీయ మహాసభలు ముగియనున్నాయి. రాజకీయ నిర్మాణంపై మహాసభల్లో సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు మహాసభకు హాజరవుతున్నారు. ఈ మేరకు నంద్యాల నర్సింహ్మారెడ్డి టెన్ టివితో మాట్లాడారు. సభకు మూడు లక్షల మందికిపైగా వస్తారని అంచనా ఉందన్నారు. స్టేడియం బయట 12 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎల్ బీ నగర్ నుంచి వీఎం మెట్రో స్టేషన్ వరకు మైకులు ఏర్పాటు చేశామని తెలిపారు. 20 వేల కుర్చీలు ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రౌండ్ లో ప్లేస్ సరిపోకపోవడంతో ఒక సైడ్ రోడ్డును పూర్తిగా వినియోగించుకుంటున్నామని తెలిపారు.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక

హైదరాబాద్ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం ముగిసింది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. 95 మందితో కేంద్రకమిటీని ఎన్నుకున్నారు.

 

13:20 - April 22, 2018

హైదరాబాద్ : నేటితో సీపీఎం జాతీయ మహాసభలు ముగియనున్నాయి. రాజకీయ నిర్మాణంపై మహాసభల్లో సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు మహాసభకు హాజరవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:05 - April 22, 2018

హైదరాబాద్ : నేటితో సీపీఎం జాతీయ మహాసభలు ముగియనున్నాయి. సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు మహాసభకు హాజరవుతున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సీపీఎం రాష్ట్ర నాయకులు భూపాల్ అన్నారు. మహాసభలో అగ్రనేతలు కేరళ సీఎం పినరయ విజయన్, జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యే తరిగామి, సీతారాం ఏచూరీ, ప్రకాశ్ కరత్, బివి.రాఘవులు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రసంగించనున్నారు. పోలీసులు బాగా సహకరిస్తున్నారని చెప్పారు. గ్రౌండ్ సరిపోకపోవడం వలన బయట జనం కూర్చోవడానికి వీఎంఎం హోమ్ నుంచి ఎల్ బీనగర్ వరకు ఫోర్ లైన్ రోడ్డును వినియోగించుకోవడానికి పోలీసులు అనుమంతించారని తెలిపారు.

 

12:49 - April 22, 2018

హైదరాబాద్ : నేటితో సీపీఎం జాతీయ మహాసభలు ముగియనున్నాయి. సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు మహాసభకు హాజరవుతున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నంద్యాల నర్సింహ్మారెడ్డి అన్నారు. తెల్లవారుజాము నుంచే ప్రజలను గ్రౌండ్ కు తరలివస్తున్నారని..3 లక్షల మంది హాజరవుతారని పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీతోపాటు రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి ప్రజలు తరలివస్తారని చెప్పారు. 3 గంటల నుంచి కళా రూపాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. వాటర్ కోసం 200 వందల డ్రమ్ములు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

పోక్సో చట్ట సవరణ ఆర్టినెన్స్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ ఆమోదం

ఢిల్లీ : పోక్సో చట్ట సవరణ ఆర్టినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఈ చట్టం ద్వారా ఇకపై 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణదండన విధిస్తారు. గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోవడంతో... నిన్న కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ విడుదల చేశారు. దీనికి ఇవాళ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 

12:43 - April 22, 2018

ఢిల్లీ : పోక్సో చట్ట సవరణ ఆర్టినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఈ చట్టం ద్వారా ఇకపై 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణదండన విధిస్తారు. గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోవడంతో... నిన్న కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ విడుదల చేశారు. దీనికి ఇవాళ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధిస్తారు. ఇక ఈ కేసు దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తి చేయాలి. ఇందుకోసం అన్ని పోలీస్‌స్టేషన్లకు, ఆస్పత్రులకు ఫోరెన్సిక్‌ కిట్లను అందించాలని నిర్ణయించారు. ఇక 12 నుంచి 16 ఏళ్ల బాలికలపై లైంగికదాడులకు పాల్పడితే గతంలో కంటే కఠిన శిక్ష విధించనున్నారు. అలాగే మహిళలపై లైంగికదాడులకు పాల్పడితే శిక్షను ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని నిర్ణయించారు. 

 

గవర్నర్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

కృష్ణా : విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వీరిరువురు చర్చించారు.  

12:36 - April 22, 2018

హైదరాబాద్ : ప్రశ్నించడంలో ముందుండే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కుట్రలు జ‌రుగుతున్నాయా..? రాజకీయంగా ఎదుర్కోలేని పవన్‌ ప్రత్యర్థులు తెర వెనుక పన్నాగాలు పన్నుతున్నారా...? ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. అవుననిపించేలా ఉన్నాయి. ఇంతకూ పవర్‌ స్టార్‌ పవన్‌పై కుట్రకు కార‌కులెవ‌రు.. 

పూర్తి స్థాయి రాజ‌కీయాలపై  ఇప్పుడిప్పుడే దృష్టి సారించిన జ‌న‌సేన అధినేత‌పై  ముమ్మరంగా కుట్రలు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే  ప్రత్యేక హోదా అంశాన్ని భుజ‌ాన వేసుకున్న పవన్‌... కొంతవరకూ ప్రజ‌ల‌ను త‌న‌వైపుకు తిప్పుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏకులా వచ్చిన పవన్‌ కళ్యాణ్‌  అధికార పార్టీ పాలిట మేకులా మారాడన్న వాదనావినిస్తోంది.  రాజకీయంగా ఎదుర్కోలేకనే జనసేనానిని ఇర‌కాటంలో పెట్టేందుకు  ఆంధ్రప్రదేశ్‌  కేంద్రంగా కుట్రకు రచన సాగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

చినికి చినికీ గాలివానలా మారిందన్న చందంగా... ఇటీవ‌ల తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌ను కుదిపెస్తోంది క్యాస్టింగ్ కౌచ్.. అంశం సినీ ప‌రిశ్రమ‌లో పెను దుమారం రేపుతోంది..  ఓ సినిమా ఆరిస్టు ప్రవర్తనపై  ప‌వ‌న్ ఘాటుగా స్పందించారు.  ఓ ఆర్టిస్టు తీరుపై పవన్ ఘాటుగా స్పందించడం.. హాట్‌ టాపిక్ గా మారింది.. సినిమా ఇండస్ర్టీ వివాదం కాస్తా.. ..ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుటుంబ వివాదంగా రూపుదాల్చింది. సినీపరిశ్రమ‌లోని ఓ పెద్ద మ‌నిషితోపాటు.. మరో ఆర్టిస్టును తనపై  ఉసిగొల్పారంటూ..  ఘాటు వ్యాఖ్యలు చేశాడు.. త‌న త‌ల్లిపై  వ్యాఖ్యలు చేయించిన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకొవాలంటూ మెగా కుటుంబంతో కలిసి ప‌వన్ ఫిల్మ్ చాంబ‌ర్‌లో  హల్‌చల్‌ చేశాడు.  త‌న‌కు  ఫిల్మ్ పెద్దలు న్యాయం చేయ‌క పోతే న్యాయ పోరాటానికి దిగుతానంటూ హెచ్చరించారు.

త‌న‌పై పన్నిన కుట్రలో ఏపీ అధికార పార్టీ కి చెందిన పెద్ద హ‌స్తం ఉంద‌ంటూ ట్విట‌ర్ లో ఘాటుగా స్పందించాడు పవన్... అధికార పార్టీకి  తోడు కొన్ని మీడియా సంస్ధలు.. తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌లో మ‌హిళ‌ల‌ను అస‌భ్యంగా చూపిస్తూ రేటింగ్ ల కోసం త‌హ‌త‌లాడుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు...అటు మీడియా..ఇటు అధికార పార్టీ వెనుక ఉన్న అజ్ఝాత వాసి  ఎవ‌రంటూ తాజాగా ప‌వ‌న్  చేసిన  ట్వీట్‌లో తెలుగు రాష్ట్రాల్లో  తీవ్ర దుమారాన్నే రేపాయి.. మెగా కుటుంబంపై జ‌రుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాడు పవన్.  నిన్న ఫిల్మ్ చాంబర్ లో రెండు ప్రైవేట్ ఛాన‌ల్ వాహానాల‌పై దాడి చేసిన వారిపై కేసులు పెట్టి.. జైళ్లు కెళ్లి.. బైయిల్ పై తిరిగి వ‌చ్చిన వారితో ప‌వ‌న్ మాటా మంతీ చేశారు..అనేక అంశాల‌పై అభిమానుల‌కు క్లారిటి ఇచ్చారు.. 

త‌న‌ను రాజ‌కీయంగా ఎదుర్కొనే దైర్యం లేక.. అసత్యప్రచారాలు చేసేవారిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. గ‌త  కొంత‌కాలంగా తెలుగు రాష్ట్రాల్లో సినీ ప‌రిశ్రమ వ‌ర్సెస్..రాజ‌కీయ పార్టీ తో జ‌రుగుతున్న ప‌రిణామాలను ఇరు రాష్ట్రాల ప్రజ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు..

12:33 - April 22, 2018

చిత్తూరు : కాస్టింగ్‌ కౌచ్‌పై ఎమ్మెల్యే రోజా స్పందించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రోజా... 27 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న తనకు ఎవరూ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే వ్యక్తిగత లాభం కోసం ఇండస్ట్రీలోని వారిపై.. పవన్‌ కల్యాణ్‌పై దూషణలకు దిగడం సరికాదన్నారు. 

 

సీపీఎం మహాసభలకు అత్యంత ప్రాధాన్యత : భూపాల్

హైదరాబాద్ : బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని సీపీఎం రాష్ట్ర నాయకులు అన్నారు. ఆర్ ఎస్ ఎస్ సూచనలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. బీజేపీ మతోన్మాదాన్ని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులను ఏకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. సభలో పార్టీ అగ్ర నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, బివి. రాఘవులు, బృందాకరత్, కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తోపాలు పలువురు నేతలు ప్రసంగించనున్నారని తెలిపారు.

 

 

12:03 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నేటితో ముగియనున్నాయి. మహాసభల ముగింపు సందర్భంగా సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మలక్‌పేట నుంచి రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. టీవీ టవర్‌ నుంచి ర్యాలీగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. సీపీఎం అగ్రనాయకత్వమంతా ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు భూపాల్ మాట్లాడుతూ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. సభ వేదిక ముందు భాగంలో పదివేల మంది కూర్చోవడానికి వీలుగా చైర్లు ఏర్పాట్లు చేశామని తెలిపారు. 12 ఎల్ సీడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. వీఎం హోం వరకు మైకులు ఏర్పాటు చేశామని చెప్పారు. బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆర్ ఎస్ ఎస్ సూచనలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. బీజేపీ మతోన్మాదాన్ని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులను ఏకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. సభలో పార్టీ అగ్ర నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, బివి. రాఘవులు, బృందాకరత్, కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తోపాలు పలువురు నేతలు ప్రసంగించనున్నారు.  

11:53 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నేటితో ముగియనున్నాయి. మహాసభల ముగింపు సందర్భంగా సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మలక్‌పేట నుంచి రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. టీవీ టవర్‌ నుంచి ర్యాలీగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. సీపీఎం అగ్రనాయకత్వమంతా ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీమాస్ చైర్మన్ కంచ ఐలయ్యలు డప్పుకొట్టి, డ్యాన్స్ చేశారు.

సరూర్ నగర్ స్లేడియంలో సీపీఎం బహిరంగ సభ

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నేటితో ముగియనున్నాయి. కాసేపట్లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం జరగనుంది. ఇవాళ నూతన కమిటీని, కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. మహాసభల ముగింపు సందర్భంగా సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మలక్‌పేట నుంచి రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. టీవీ టవర్‌ నుంచి ర్యాలీగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. సీపీఎం అగ్రనాయకత్వమంతా ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 

11:46 - April 22, 2018

విజయవాడ : ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు (98) కన్నుమూశారు. ఆకాశవాణిలో తొలితరం స్వరకర్త, గీత రచయిత. ఆకాశావాణిలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. తొలి తరం సంగీత దర్శకుల్లో రజనీకాంతరావు ఒకరు. సంగీత, సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. రజనీకాంతరావు 20వ శతాబ్దంలో గొప్ప పుస్తకాల్లో రజనీకాంతరావు పుస్తకం ఒకటి. రజనీకాంతరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.  

 

11:42 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నేటితో ముగియనున్నాయి. కాసేపట్లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం జరగనుంది. ఇవాళ నూతన కమిటీని, కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. మహాసభల ముగింపు సందర్భంగా సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మలక్‌పేట నుంచి రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. టీవీ టవర్‌ నుంచి ర్యాలీగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. సీపీఎం అగ్రనాయకత్వమంతా ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 

 

జూబ్లీహిల్స్‌లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్‌

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని డైమండ్ హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 31 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక లారీ, 13 కార్లు, 2 ఆటోలు, 18 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

11:35 - April 22, 2018

విజయవాడ : ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు (98) కన్నుమూశారు. ఆకాశవాణిలో తొలితరం స్వరకర్త, గీత రచయిత. ఆకాశావాణిలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. తొలి తరం సంగీత దర్శకుల్లో రజనీకాంతరావు ఒకరు. సంగీత, సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. రజనీకాంతరావు 20వ శతాబ్దంలో గొప్ప పుస్తకాల్లో రజనీకాంతరావు పుస్తకం ఒకటి. 

 

11:27 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నేటితో ముగియనున్నాయి. కాసేపట్లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం జరగనుంది. ఇవాళ నూతన కమిటీని, కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. మహాసభల ముగింపు సందర్భంగా సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మలక్‌పేట నుంచి రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. టీవీ టవర్‌ నుంచి ర్యాలీగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. సీపీఎం అగ్రనాయకత్వమంతా ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 

11:24 - April 22, 2018

ఢిల్లీ : వివాదాస్పద ఆధ్యాత్మక గురువు ఆశారాంపై ఉన్న అత్యాచారం అభియోగం కేసులో ఏప్రిల్‌ 25న జోధ్‌పూర్‌ ప్రత్యేక కోర్టు కీలకమైన తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జోథ్‌పూర్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నెల 30వ తేదీ వరకూ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ఎస్పీ దినేష్‌ త్రిపాఠి తెలిపారు. ఆశారాంపై ఫిర్యాదు చేసిన బాధితురాలి నివాసం వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. 2012లో జోధ్‌పూర్‌ సమీపంలోని ఆశ్రమంలో మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. పోస్కో చట్టం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆశారాం 2013 ఆగస్టు 31 నుంచి జోథ్‌పూర్ జైలులోనే ఉన్నారు. అత్యాచారం కేసులో ఆయన దోషిగా తేలితే గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది.
 

 

11:21 - April 22, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని డైమండ్ హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 31 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక లారీ, 13 కార్లు, 2 ఆటోలు, 18 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

11:14 - April 22, 2018

హైదరాబాద్ : న్టీఆర్‌ స్టేడియంలో 9వరోజూ హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఉత్సాహభరితంగా సాగింది. హైదరాబాద్‌  ఫెస్ట్‌కు జనం భారీగా తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలు సందర్శకులను కట్టిపడేశాయి. విజ్ఞానంతోపాటు వినోదాన్ని హైదరాబాద్‌ ఫెస్ట్‌ నగర ప్రజలకు పంచుతోంది. శనివారం ఫెస్ట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ  వీసీ ఎస్వీ సత్యనారాయణ.. మనసున్న మనుషులను కలవడానిక ఫెస్ట్‌కు కొచ్చానని చెప్పారు.

హైదరాబాద్‌ ఫెస్ట్‌... ఎన్టీఆర్‌ స్టేడియంలో ఉత్సాహంగా సాగుతోంది. 9వ రోజైన శనివారం సందర్శకులకు హైదరాబాద్‌ విజ్ఞానంతోపాటు వినోదాన్ని అందించింది. సుద్దాల హన్మంతు కళావేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఉర్రూతలూగించాయి.

ఢిల్లీకి చెందిన జననాట్య మంచ్‌ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు.. పాటలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు సైతం వారితోపాటు పాటలకు డ్యాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్‌ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్రపై కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకం అందరినీ ఆలోచింప చేసింది.

హైదరాబాద్‌ ఫెస్ట్‌కు ముఖ్య అతిథులుగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ ఎస్వీ సత్యానారాయణ, ప్రముఖ సినీనటుడు అజయ్‌గోష్‌, ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర హాజరయ్యారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ పేరుతో జరుగుతున్న జన జాతరను ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఎస్వీ సత్యనారాయణ అన్నారు. మనుషులంతాకలిసి ఒకచోట చేరి మమతలు పంచుకోవాలన్నారు. ఆ మనుషులను కలవడానికే తాను హైదరాబాద్‌ ఫెస్ట్‌కు వచ్చినట్టు ఎస్వీ సత్యనారాయణ చెప్పారు.  ఇలాంటి ఉత్సవాలు నగరంలో మరిన్ని జరగాలని అభిప్రాయపడ్డారు. 

మానవ విలువలు మాయమైపోతున్న వేళ.. కులం, మతం పేరుతో మనుషులను విడదీస్తున్న వేళ.. హైదరాబాద్‌ ఫెస్ట్‌ నిర్వహించడం గొప్ప ప్రయత్నమని సినీ నటుడు అజయ్‌ ఘోష్‌ అన్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ అంటే విజ్ఞానం, వినోదమే కాదు.. ఒక ప్రత్యామ్నాయ వేదిక అన్నారు. మనిషిని మనిషి దోపిడీచేసే సంస్కృతి పోవాలంటే జనాన్ని చైతన్యం చేయాలని.. అందుకోసం ఇలాంటి ఫెస్ట్‌లు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

అనంతరం హైదరాబాద్‌ ఫెస్ట్‌ విజయవంతానికి కృషి చేసిన వారందరికీ ఫెస్ట్‌ నిర్వాహకులు మెమొంటోలు అందజేశారు.  సుద్దాల హన్మంతు కళావేదికపై అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫెస్ట్‌లో స్టాళ్లను ఏర్పాటు చేసిన వారందరికీ సర్టిఫికెట్స్‌ ప్రదానం చేశారు. సాంస్కృతిక వేదికపై కళాకారులు ఆటపాటలతో అందరిలోనూ ఉత్తేజం నింపారు. ఫెస్ట్‌ నేటితో ముగియనుంది.

11:02 - April 22, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి గోరక్షణపై ఉన్న శ్రద్ధ అత్యాచార బాధితుల రక్షణపై లేదని.. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆరోపించారు. పాలకులే రేపిస్టులకు రక్షకులుగా వ్యవహరిస్తున్న సందర్భంలో.. పోక్సో చట్ట సవరణ వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరుతుందని భావించడం లేదన్నారు. 
మహిళలు, చిన్నారులపై అత్యాచారాలను ఖండించిన బృందాకరత్
సీపీఎం 22వ జాతీయ మహాసభలు.. నాలుగోరోజూ హైదరాబాద్‌ ఆర్టీసీ కళాభవన్‌లో కొనసాగాయి. శుక్రవారం రాత్రి రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన పార్టీ.. ఈరోజు మరిన్ని అంశాలపై తీర్మానాలను ఆమోదించింది. ఈ వివరాలను మీడియాకు వివరించిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌.. దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను తీవ్రంగా ఖండించారు. గోరక్షణపైని శ్రద్ధ, మహిళల రక్షణపై లేదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. 
రాజకీయ తీర్మానంపై ఎలాంటి సందిగ్ధత లేదు : బృందాకరత్‌ 
శుక్రవారం పార్టీ మహాసభ ఆమోదించిన..  రాజకీయ తీర్మానంపై ఎలాంటి సందిగ్ధతకూ అవకాశం లేదని బృందాకరత్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అండతో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రధాన లక్ష్యమని బృందాకరత్‌ చెప్పారు. కాంగ్రెస్‌ ఎన్నికల పొత్తు ఉండబోదని స్పష్టం చేసిన బృందా..  మతతత్వ బీజేపీని ఓడించేందుకు రీజనల్‌ సెక్యులర్‌ పార్టీలను కలుపుకు పోతామని వెల్లడించారు. 
పార్టీ పనితీరును సమీక్షించుకున్నాం : బృందాకరత్ 
గడచిన మూడేళ్లలో పార్టీ పనితీరును సమీక్షించుకున్నామని బృందాకరత్‌ చెప్పారు. పార్టీలోని వివిధ విభాగాల కింద 5కోట్లకు పైబడి సభ్యులున్నారని, తమ పార్టీలో మిస్డ్‌కాల్‌ విధానం ఉండదని, సభ్యుల పనితీరు ఆధారంగానే రెన్యూవల్‌ ఉంటుందని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషిపై మహాసభ చర్చించిందన్నారు. కేరళలో హింస రహిత పాలన అందించాలన్నదే తమ ధ్యేయమని, 1970 నుంచి పరిశీలిస్తే.. ఆ రాష్ట్రంలో జరిగిన హింస వెనుక ఆర్ఎస్‌ఎస్‌ శక్తులే ఉన్నాయని తేలిందన్నారు. ఈ కుట్రలను సీపీఎం నిలువరిస్తూ ప్రజారక్షణకు కట్టుబడి ఉందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలని, ఖతువా, ఉన్నవ్‌ ఘటనలకు నిరసనగాను, వికలాంగుల హక్కులు, చట్టాల అమలు కోరుతూ మూడు తీర్మానాలను సీపీఎం జాతీయ మహాసభలు ఆమోదించినట్లు బృందాకరత్‌ చెప్పారు.

 

10:59 - April 22, 2018

ఢిల్లీ : చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. పోక్సో చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కథువా, సూరత్‌, ఎటా, ఛత్తీస్‌గఢ్‌, ఇండోర్‌...దేశంలో ఎక్కడో ఓ చోట చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.  ఈ ఘటనలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుండడంతో . ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం జరిపింది.

సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో పోక్సో చట్టాన్ని సవరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే దోషులకు మరణశిక్ష విధించేలా మోది ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ కేసుల్లో విచారణ 2 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 ఏళ్ల బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారి శిక్షను పదేళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు.

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టం కింద కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదును విధించే అవకాశం ఉంది. లైంగిక దాడి తర్వాత బాధితురాలు మృతి చెందినా, అచేతనంగా మారినా ముద్దాయికి మరణదండన విధించేలా పోక్సో చట్టంలో నిబంధనలు మార్చనున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపనున్నారు. వర్షాకాల సమావేశాల్లో ఈమేరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. 

10:57 - April 22, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నాయకులు సైకిల్ యాత్ర చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

విజయవాడ ఎంపీ కేశినేని నాని సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే బోండా ఉమతో కలసి ఆయన యాత్ర చేపట్టారు. జాతీయ పార్టీలు రెండూ నాటకాలాడుతున్నాయిని, హోదాతో పాటు, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని నాని డిమాండ్‌ చేశారు. 

విజయనగరం జిల్లా బొబ్బలికోటలో మంత్రి క్రిష్ణరంగారావు సైకిల్ యాత్రను ప్రారంభించారు. బొబ్బలి కోటలో టీడీపీ జెండాను ఆవిష్కరించి..ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాల వేసి సైకిల్ యాత్రను ప్రారంభించారు. సుమారు 40 కిలో మీటర్లు  సైకిల్ యాత్ర చేసి కోమటిపల్లిలో ముగిస్తాన్నారు.

కర్నూలులో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలతో బైకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేపట్టిన దీక్ష విజయవంతమైందన్నారు. రాష్ట్ర ఆభివృద్దికి మోడీ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఎమ్మెల్యే మోహన్ రెడ్డి మండిపడ్డారు.

రాజమండ్రిలో మేయర్‌ రజనీశేషసాయి నేతృత్వంలో సైకిల్‌ యాత్రనుచేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటూ మోసం చేసిందని మేయర్ మండిపడ్డారు. కావాలని కొన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబును తిట్టటమే పని పెట్టుకున్నాయని రజనీశేషసాయి మండిపడ్డారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్రను ప్రారంభించారు.15 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని అయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదాను మన సీఎం చంద్రబాబు సాధిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ టీడీపీ శ్రేణులు సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి.

10:55 - April 22, 2018

విజయవాడ : ఏపీలో పీకే వర్సెస్‌ టీడీపీ వార్‌ పతాక స్థాయికి చేరుకుంది. పవన్‌ను టార్గెట్‌ చేస్తూ టీడీపీ పావులు కదుపుతోంది. రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే టీడీపీ తనపై అసత్య ప్రచారం చేస్తోందని.. టీడీపీ కుట్రను ఆధారాలతో సహా బయటపెడతానని జనసేనా అంటున్నారు. ఇంతకు పవన్‌ మాటల్లో నిజమెంత? పవన్‌ దగ్గరున్న ఆధారాలేంటి ?
రాజకీయ రంగు పులుముకున్న శ్రీరెడ్డి ఎపిసోడ్‌
రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో పాలిటిక్స్‌ హీటెక్కాయి. శ్రీరెడ్డి ఎపిసోడ్‌ కాస్తా... పొలిటికల్‌ రంగు పులుముకుంది. ఎక్కడో స్టార్ట్‌ అయిన వ్యవహారం.. చివరకు పవన్‌ వద్ద వచ్చి ఆగింది. దీంతో ఇప్పుడు ఈ వ్యహారంలో  టీడీపీ - జనసేన మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. శ్రీరెడ్డిని వెనుక నుంచి నడిపిస్తోంది టీడీపీయేనని పవన్‌ గట్టిగా ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఆయన బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. జనసేన దగ్గర వాటికి సంబంధించిన ఆడియో క్లిప్‌లు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. అయితే వాటిని త్వరలో పవన్‌ బయటపెట్టనున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు, లోకేష్‌పైనా పవన్‌ విసుర్లు
తనపైనా... తన కుటుంబ సభ్యులపైనా మాటలదాడి, ఆరోపణలు చేయడంపై పవన్‌ గుర్రుగా ఉన్నారు. ఇందుకు సహకరిస్తోన్న మీడియా సంస్థలను , వాటి అధినేతలను ఒక్కొక్కరిగా ట్విట్టర్‌లో పోస్టులు పెడుతూ కడిగిపారేస్తున్నారు. మొన్న అర్ధరాత్రి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు , ఆయన తనయుడు లోకేష్‌ పేర్లు పెడుతూ పవన్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై కుట్రకు టీడీపీ 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆరోపించారు.
న్యాయపోరాటానికి పవన్‌ రెడీ
శ్రీరెడ్డి మొత్తం వ్యవహారంపై పవన్‌ న్యాయ పోరాటానికి రెడీ అవుతున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా అదే స్థాయిలో పవన్‌పై విరుచుకుపడుతున్నారు. పవన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని విమర్శిస్తున్నారు. తాను దీక్ష చేసిన రోజునే ఫిల్మ్‌ ఛాంబర్‌లో కూర్చోవడం కుట్రని చంద్రబాబు ఆరోపించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ మరెన్ని మలుపులు తిరగబోతోందో వేచి చూడాలి.

10:53 - April 22, 2018

ఏపీ రాజకీయాలపై వాడీ వేడి చర్చ జరిగింది. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణు శ్రీ, జనసేన నేత రాజేష్ పాల్గొని, మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా, సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షతోపాటు పలు అంశాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:52 - April 22, 2018

హైదరాబాద్ : నేటితో సీపీఎం జాతీయ మహాసభలు ముగియనున్నాయి. కీలక తీర్మానాలను మహాసభ ఆమోదించనుంది. నూతన కమిటీని, కార్యదర్శిని ప్రతినిధులు ఎన్నుకోనున్నారు. ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు నిర్వహించనున్నారు. మలక్ పేట్ టీవీ టవర్ నుంచి కవాతు ప్రారంభం కానుంది. బహిరంగ సభ ప్రధాన వేదికపై 50 మంది నేతలు ఉండనున్నారు. మహాసభ ప్రతినిధులు, వీఐపీలు, మీడియా కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

08:35 - April 22, 2018

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం నియామకాల్లో తెలుగుదేశం పార్టీ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది.  మొన్నటికి మొన్ననే టీటీడీ ఛైర్మన్‌గా పుట్టాసుధాకర్‌ నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రిస్టియన్‌ సభల్లో పాల్గొన్న పుట్టా సుధాకర్‌ను ఎలా చైర్మన్‌ చేస్తారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఎపిసోడ్‌  మరవకముందే.. ఇప్పుడు  టీటీడీ బోర్డ్‌ మెంబర్‌గా ఎమ్మెల్యే అనిత నియామకం వివాదానికి దారితీసింది.  హిందువులు పవిత్రంగా భావించే.. టీటీడీలో అన్యమతస్థులను ఎలా నియమిస్తారంటూ విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. 
టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నియామకంపై తీవ్ర దుమారం
టీటీడీ నియామకాల విషయంలో.... టీటీడీ వివాదాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. హిందువులు పవిత్రంగా భావించే  తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులను ఎలా నియమిస్తారంటూ ప్రతిపక్షాలతోపాటు.. పలువర్గాలు టీడీపీపై విరుచుకుపడుతున్నాయి. టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నియామకం తీవ్ర దుమారాన్నే రేపింది... టీటీడీ బోర్డ్‌మెంబర్‌ హోదాలో ఆయన ఉన్నప్పుడు  క్రిస్టియన్‌ మహాసభలకు హాజరయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్నే విపక్షాలు అస్త్రాలుగా చేసుకుని విమర్శలు కురిపించాయి.
ఎమ్మెల్యే అనిత నియామకంపై వివాదం
టీటీడీ బోర్డులో ఎమ్మెల్యే అనితను సభ్యురాలుగా నియమించడం వివాదానికి దారి తీసింది. ఆమె నియామకాన్ని విపక్షాలతోపాటు ధార్మిక సంస్థలు తప్పుపడుతున్నాయి. గతంలో అనిత ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియన్‌గా చెప్పుకున్నారని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. క్రిస్టియన్‌ అయిన అనితను హిందూ ధార్మిక సంస్థగా ఉన్న టీటీడీలో సభ్యురాలిగా ఎలా నియమిస్తారని టీడీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టీటీడీ బోర్డు మెంబర్‌గా అన్యమతస్తులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హిందువులకు క్షమాపణలు చెప్పాలని  బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్‌ చేశారు. పాలకమండలి నుంచి అనితను తొలగించి చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని  డిమాండ్‌ చేశారు.
విపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయి : ఎమ్మెల్యే అనిత 
టీటీడీ బోర్డు మెంబర్‌గా తన ఎంపికను విపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు.  తాను హిందువును కాదని నిరూపిస్తే... ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు. తాను హిందువునే అని చెప్పుకోవలసిన దుస్థితి వచ్చినందుకు బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.  సీఎం చంద్రబాబు తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని అనిత స్పష్టం చేశారు. అనిత తాను క్రిస్టియన్ని అంటూ చెప్పిన వీడియోను ప్రభుత్వం పరిశీలించింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నివేదికను  బట్టి చర్యలు  తీసుకునే అవకాశముంది. 

08:27 - April 22, 2018

హైదరాబాద్ : ప్రత్యేకహోదా సాధనకు వైసీపీ అధినేత జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ సాయంత్రం ఈ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నారు.
ప్రత్యేకహోదాపై పోరును ఉధృతం చేసే దిశగా జగన్‌ అడుగులు 
ప్రత్యేకహోదాపై పోరును మరింత ఉధృతం చేసే దిశగా వైసీపీ అధినేత జగన్‌ అడుగులు వేస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. హోదా ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే  ఇవాళ పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో ఆయన భేటీ కావాలని నిర్ణయించారు. తన పాదయాత్ర శిబిరానికి రావాలని జగన్‌.. పార్టీ నేతలను ఆదేశించారు.
కలిసొచ్చే పార్టీలతో వైసీపీ కార్యాచరణ 
ప్రత్యేక హోదా కోసం ఉధృతంగా ఉద్యమించేందుకు  వైసీపీ సన్నద్ధమైంది.. కలిసొచ్చే పార్టీలతో కార్యాచరణ రూపొందించి... ప్రత్యేక హోదా పోరాటాన్ని తీసుకొని వెళ్లాలన్నది వైసీపీ వ్యూహం.  అందుకోసం .. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులతో దీక్షలు చేయించాలన్న ఆలోచనలో వైసీపీ ఉంది. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడంతోపాటు...  నియోజకవర్గాల్లో వారితో దీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.   గత నాలుగేళ్లుగా కేంద్రంతో అంటకాగిన సీఎం... ఇప్పుడు ప్రత్యేక హోదాపై చేస్తున్న ఆందోళనను ఎలా ఎదుర్కోవాలన్నది  చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశం లో ప్రభుత్వ  వైఫల్యాలను ఎండ గట్టేందుకు  ఒక్కో సమస్యపై  బృందాలను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నేతల సమావేశంలో వైసీపీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 

08:23 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నేటితో ముగియనున్నాయి. మహాసభల్లో చివరి రోజు నూతన కమిటీని, కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. మహాసభల ముగింపు సందర్భంగా  సీపీఎం సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు  రాష్ట్ర  ప్రజలు తరలివస్తున్నారు. 
నేడు పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలుపనున్న మహాసభ  
నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరుగుతున్న సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ పలు కీలక తీర్మానాలకు మహాసభ ఆమోదం తెలుపనుంది. అంతేకాదు.. కార్యదర్శి నిర్మాణ నివేదికకూ ప్రతినిధులు ఆమోదం తెలుపనున్నారు. ఇక చివరగా.. సీపీఎం నూతన కమిటీని, కార్యదర్శిని ఎన్నుకోనుంది. కమిటీ ఎన్నికతో మహాసభలు ముగుస్తాయి.
నేటి సాయంత్రం భారీ బహిరంగ సభ
మహాసభల ముగింపు సందర్భంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో సీపీఎం బహిరంగ సభను ఏర్పాటు చేసింది. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. శనివారం బహిరంగ సభ ఏర్పాట్లను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యుడు నంద్యాల నర్సింహ్మారెడ్డి పరిశీలించారు. ఇక జిల్లాల నుంచి బహిరంగ సభకు జనాన్ని భారీగా తరలించనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు
మహాసభల సందర్భంగా మలక్‌పేట్‌ టీవీ టవర్‌ నుంచి రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల ప్రదర్శన జరుగనుంది.  మూడు గంటలకు రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. ఇందులో వేలాది మంది రెడ్‌షెర్ట్‌ వాలంటీర్లతోపాటు సీపీఎం అగ్రనాయకత్వమంతా  ప్రదర్శనలో పాల్గొంటుంది. టీవీ టవర్‌ నుంచి ర్యాలీగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు.
బహిరంగ సభ ప్రధాన వేదికపై 50మంది నేతలు
బహిరంగ సభ  ప్రధాన వేదికపై యాభైమంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మహాసభలకు హాజరైన ప్రతినిధులు, వీఐపీలు, మీడియా కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభను అందరూ వీక్షించేలా స్టేడియంలో ఆరు , స్టేడియం బయట ప్రధాన రహదారిపై మరో ఆరు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కళాకారుల ఆటపాటల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ, కేరళ సీఎం పినరయి విజయన్‌, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌సర్కార్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కారత్‌, బృందాకారత్‌, బీవీ రాఘవులుతోపాటు తమ్మినేని వీరభద్రం, మధు పాల్గొననున్నారు. సీపీఎం సభలు దేశ రాజకీయాలపై పెను ప్రభావం చూపెడుతాయని తమ్మినేని అన్నారు. మొత్తానికి మహాసభలు విజయంతం అయినట్టుగానే.. బహిరంగ సభను విజయంతం చేసేందుకు సీపీఎం శ్రేణులు శ్రమిస్తున్నాయి. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నాయి.  

 

జూబ్లీహిల్స్ లో డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 31 మందిపై కేసులు నమోదు చేశారు. 18 బైకులు, 2 ఆటోలు, 13 కార్లను సీజ్ చేశారు. 

 

నేటితో ముగియనున్న సీపీఎం 22వ జాతీయ మహాసభలు

హైదరాబాద్ : నేటితో సీపీఎం 22వ జాతీయ మహాసభలు ముగియనున్నాయి. నూతన కార్యదర్శి, పోలిట్ బ్యూరో, కేంద్రకమిటీని మహాసభ ఎన్నుకోనుంది. 

Don't Miss