Activities calendar

23 April 2018

21:59 - April 23, 2018

మేడ్చల్ : ఈనెల 27న జరగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొంపల్లిలో ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ప్లీనరీ నిర్వహణ కోసం 9 కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. ప్లీనరీకి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 

21:53 - April 23, 2018

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో వివాదస్పద ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. 2017 సెప్టెంబర్‌ వరకు మేఘాలయలో 40 శాతం ప్రాంతాల్లో ఈ చట్టం అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం భద్రతా బలగాలకు అధికారాలు ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఈ చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతూ ప్రజలు ఆందోళన చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూడా చాలా ప్రాంతాల్లో AFSPA చట్టాన్ని ఎత్తివేశారు. ప్రస్తుతం 8 పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనే ఈ చట్టం అమలులో ఉంది. లొంగిపోవాలనుకునే తీవ్రవాదులకు ఇచ్చే బహుమానాన్ని లక్ష రూపాయల నుంచి 4 లక్షలకు పెంచింది. ఏప్రిల్‌ 2018 నుంచి ఇది అమలులోకి రానుంది. గత నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో 63 శాతం తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని హోంశాఖ వెల్లడించింది.

21:49 - April 23, 2018

ఢిల్లీ : కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనల నేపథ్యంలో పాక్సో చట్టాన్ని మరింత పటిష్టం చేయడానికి కేంద్రం ఆర్డినెన్స్‌ తెచ్చినప్పటికి రేప్‌ ఘటనలు ఆగడం లేదు. తాజాగా గ్రేటర్ నోయిడాలో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయివేట్‌ స్కూళ్లో చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి నడుస్తున్న కారులో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు బాధితురాలి సమీప బంధువు కాగా మరొకడు సహ విద్యార్థి. స్కూలు బస్సు మిస్సవ్వడంతో కారులో లిఫ్ట్‌ ఇస్తామని నమ్మించిన ముగ్గురు మృగాళ్లు 11 గంటల పాటు రోడ్లపై తిరుగుతూ బాలికపై బలత్కారానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో బాధితురాలిని నాలేడ్జ్‌ పార్క్‌ వద్ద నిర్మాణుష్యంగా ఉన్న రోడ్డుపై పారేసి పారిపోయారు. ఏప్రిల్‌ 18న జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఇంతవరకు ఎవరిని అరెస్ట్‌ చేయలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పాక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

21:46 - April 23, 2018

ఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తిపై ప్రతిపక్ష పార్టీలు తీసుకొచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. న్యాయ నిపుణులతో చర్చల అనంతంరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది.

చీఫ్‌ జస్టిస్‌పై విపక్షాల అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించిన ఉపరాష్ట్రపతి
సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై ప్రతిపక్షాలు అభిశంసన కోసం ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో 7 ప్రతిపక్షపార్టీలు ఉపరాష్ట్రపతికి నోటీసు ఇచ్చాయి. ఈ అభిశంసన తీర్మానంపై వెంకయ్యనాయుడు న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. సంతకం చేసిన ఎంపీలకు తమ కేసుపై వారికే కచ్చితత్వం లేదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం తీసుకురావడం సరైంది కాదని పలువురు న్యాయమూర్తులు, రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.

అభిశంసనపై సుప్రీంకోర్టుకు ఆశ్రయించాలని కాంగ్రెస్‌ నిర్ణయం
అభిశంసన నోటీసును రాజ్యసభ ఛైర్మన్‌ తిరస్కరిస్తే ఏం చేయాలన్నదానిపై ప్రతిపక్ష పార్టీలు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై వారు సుప్రీంకోర్టు వెళ్లనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఉపరాష్ట్రపతి నిర్ణయంపై న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తీవ్ర అసంతృప్తి
అభిశంసన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి తిరస్కరించడంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 మంది కంటే ఎక్కువ ఎంపీలు సంతకాలు చేశారా...లేదా అన్నదే ఉపరాష్ట్రపతి చూడాలి కానీ...తిరస్కరించే అధికారం లేదని ఆయన ట్వీట్టర్‌ ద్వారా అభిప్రాఅభిశంసన నోటీసుపై విపక్షాలకు చెందిన 64 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, ఎస్‌పీ, బీఎస్‌పీ, ముస్లిం లీగ్, జెఎంఎం, సిపిఐ ఎంపీలు ఉన్నారు. జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై విపక్షాలు 5 తీవ్రమైన ఆరోపణలు చేశాయి. సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ సరిగా లేదని...కేసుల కేటాయింపులపై సిజెఐ వివక్ష చూపుతున్నారని ఆరోపించాయి. దీపక్‌ మిశ్రా తనకున్న మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారని మీడియా సమావేశంలో నలుగురు న్యాయమూర్తులు చేసిన ఆరోపణలను కూడా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసు తీసుకురావడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.

21:41 - April 23, 2018

అమరావతి : 2014లో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ చాలా నష్టపోయిందన్నారు ఆ పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు. పొత్తు లేకుండా ఉంటే.. ఇరవై ఎమ్మెల్యే, పది ఎంపీ సీట్లు గెలిచేవాళ్ళమన్నారు. టీడీపీ ఓ కుటుంబ పార్టీ అని విమర్శించారు. తెలుగుదేశం 2019లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. మే15 తరువాత టీడీపి నుంచి వైసీపీలోకి వలసలు ఉంటాయన్నారు విష్ణుకుమార్‌ రాజు. 

21:38 - April 23, 2018

కర్నూలు : సమస్యల పరిష్కారం కోసం అంగన్ వాడీ కార్యకర్తలు కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న విధంగా ఏపీ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచమని ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం చేస్తూ... కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

21:29 - April 23, 2018

హైదరాబాద్ : దేశంలో నేటికీ కనీస అవసరాలు తీరని దుస్థితికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే కారణమన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్‌ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మెదక్‌ ఉమ్మడి జిల్లాలో రైతు బంధు పథకం కింద చెక్కుల పంపిణీకి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నామని హరీశ్ తెలిపారు.

కాంగ్రెస్ పై ఫైర్ అయిన హరీశ్ రావు..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రైతుబంధ పథకం అమలుపై సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, తమకు మద్దతు తెలపని పార్టీలను బీజేపీకి అనుకూల పార్టీలుగా కాంగ్రెస్ చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢీల్లీ డేర్ డెవిల్స్..

ఢిల్లీ: ఐపీఎల్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో కింగ్స్ పంజాబ్ టీంతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఢిల్లీ తాను ఆడిన 5 మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలుపొందగా కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుండగా జోరు మీదున్న పంజాబ్ జట్టు మరో విజయాన్ని తన బుట్టలో వేసుకోవాలని చూస్తున్నది. కాగా పంజాబ్ జట్టులో ఓపెనర్ క్రిస్ గేల్‌కు బదులుగా ఆరోన్ ఫించ్ నేటి మ్యాచ్‌లో ఆడనున్నాడు. 

21:03 - April 23, 2018

ఢిల్లీ : రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించింది. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతో పాటు దళిత వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. రాజ్యాంగం, దళిత సమాజంపై దాడులు జరగడాన్ని కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. మోదీ పాలనలో దళితులకు రక్షణ కరువైందని తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి సంబందించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు.  

20:48 - April 23, 2018

ఎండను భయపెట్టిన ఎర్రదండు మీటింగు..జోర్దార్ గ అయిన సీపీఎం బహిరంగ సభ. కేసీఆర్ ఇంటికి వొయ్యిన కోఆర్డినేటర్లు..ఆనవాయితి ప్రకారం అరెస్టు జేశిండ్రు.. రుణమాఫీ గప్పాలు గొడ్తున్న మంత్రిగారు..వైఎస్ఆర్ రుణమాఫీ చేయొద్దని చెప్పిండట. నంద్యాల కాడ ఇద్దరు రెడ్ల ఆధిపత్య పోరు..బలిపశువులు అయితున్నబహుజనం. ఉపసర్పంజిని గుద్ది సంపిన ఉశ్కెలారీ..నేరేళ్ల తీర్గనే అయ్యిన మళ్లో పంచాది..ఫ్లేటు ఫిరాయించిన నందమూరి కాకయ్య..మోడీని నేను తిట్టలేదని తిర్రి మాటలు మరిగిసువంటి మస్తు మస్తు ముచ్చట్లన్నీ మన మల్లన్న తాత గీరోజు మోసుకొచ్చిండు.. మరి గీ ముచ్చట్లన్నీ చూడాలంటే గీ బొమ్మల పెట్టి క్లిక్ చేయుండ్రి..మస్సుగా ఖుషీ అయినరు..ఒట్టుమల్ల..

20:47 - April 23, 2018

హైదరాబాద్ : దేశంలో కమ్యూనిజానికి భవిష్యత్తు లేదని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. అస్థిత్వం కోసం పోరాడుతున్నారని విమర్శించారు. సీపీఎం నేతలు ప్రధాని నరేంద్రమోదీని, బీజేపీని, ఆరెస్సెస్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని ఇది మంచిపద్దతి కాదన్నారు. దేశంలో ఎక్కడ చిన్నచిన్న ఘటనలు జరిగినా.. వాటిని బీజేపీకే అంటగడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.

20:46 - April 23, 2018

విశాఖపట్నం : అంగన్ వాడీ కార్యకర్తలు మరోసారి కదం తొక్కారు. తమకు సరైన సౌకర్యాలు కల్పించాలంటూ.. విశాఖ డీఆర్‌డీఏ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. బయోమెట్రిక్ యంత్రాలను తమకు అందుబాటులో ఉంచడంతోపాటు.. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమతో వెట్టిచాకిరీ చేయిస్తూ... తక్కువ వేతనాలు ఇస్తున్నారని అంగన్‌ వాడీ కార్యకర్తలు ఆరోపించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేసే సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

20:44 - April 23, 2018

తూర్పుగోదావరి : అంగన్ కార్యకర్తలు మరోసారి కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ ముందు ఆందోళన చేపట్టారు. బయోమెట్రిక్‌ విదానాన్ని సెంటర్ పరిధిలోనే పెట్టడంతోపాటు.. కనీస వేతనాలు కల్పించి, పాతబకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. 

20:43 - April 23, 2018

సీపీఎం జాతీయ మహాసభలు ఐదురోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ మహాసభలలో పలు కీలకమైన నిర్ణయాలను మహాసభ తీసుకుంది. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండవసారి కూడా కామ్రేడ్ సీతారాం ఏచూరిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సీపీఎం పార్టీలో విభేదాలు తారాస్థాయిలో వున్నాయని గత రెండు నెలలు ప్రచారం జరుగుతున్న నేపథ్యానికి మహాసభ తెరదించింది. దీనిపై మహాసభ స్పష్టతనిచ్చింది. ఈ విషయంగా సీతారాం ఏచూరి స్వయంగా మాట్లాడారు. పార్టీ అంటే పలువురు పలు అభిప్రాయాలను వెల్లడిస్తారనీ ఏక పక్ష నిర్ణయం మాత్రం సీపీఎం పార్టీ లో వుండదనీ..పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని ఏచూరి స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. సీపీఎం పార్టీ చరిత్రలో ఏకపక్ష నిర్ణయం అనేది గతం ఎప్పుడు లేదని భవిష్యత్తులో కూడా వుండదనీ..వుండబోదని పలువురు సీపీఎం సీనియర్ నేతలు స్పష్టం చేశారు. మహాసభలు జరిగిన తీరు..పార్టీలో తీసుకున్న నిర్ణయాలు వంటి పలు అంశాలపై ప్రొ.నాగేశ్వర్ గారి విశ్లేషణను చూద్దాం.. 

19:46 - April 23, 2018

పశ్చిమగోదావరి : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సామ, దాన, భేదోపాయాలు అయిపోయాయని.. ఇక మిగిలివున్నది దండోపాయమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంపై తాను పూరించిన ధర్మపోరాట శంఖారావం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పోలవరం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి.. ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా ఏరియల్‌ సర్వే ద్వారా పనుల పురోగతిని పరిశీలించారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌ వే చానల్‌ కాంక్రీట్‌ పనులను ప్రారంభించిన చంద్రబాబు... డయాఫ్రంవాల్‌ పనులను పరిశీలించారు. గోదావరి నది మళ్లింపు పనులను దగ్గర నుంచి చూసిన చంద్రబాబు... నది నీటిని తలపై చల్లుకున్నారు. పనుల పురోగతని అధికారులు చంద్రబాబుకు వివరించారు.

రైతులు, విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి..
పోలవరంలో రైతులు, విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో చంద్రబాబు.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సామ, దాన, భేదోపాయాలు అయిపోయాయని.. ఇక మిగిలివున్నది దండోపాయమేనని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాండవులు ఐదూళ్లు ఇవ్వమని అడిగితే... కౌరవులు నిరాకరించినందుకే కురుక్షేత్రం యుద్ధం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంపై తాను పూరించిన ధర్మ పోరాట శంఖారావం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రాజకీయాల్లో తనకంటే జూనియర్‌ అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తిరుపతి వెంకన్నసాక్షిగా ఇచ్చిన హోదా హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

పోలవరం పనుల్లో 52.85 శాతం పూర్తి
ఇప్పటి వరకు 52.85 శాతం పనులు పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. వచ్చే నెలలో అండర్‌గ్రౌండ్‌ డ్యామ్‌ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది రాయలసీమకు 145 టీఎంసీల నీటిని తరలించిన అంశాన్ని గుర్తు చేశారు. ఎత్తిపోతల ద్వారా 200 టీఎంసీలు తోడిపోస్తున్న విషయాన్ని వివరించారు. పోలరవం కోసం చేసిన ఖర్చులో కేంద్రం ఇంకా 2,900 కోట్ల రూపాయాలు ఇవ్వాల్సి ఉన్న అంశాన్ని రైతుల దృష్టికి తెచ్చారు. పోలవరంకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్రల్లో భాగస్వాములు కావొద్దని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి, రాష్ట్రాన్సి సస్యశ్యామలంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

19:18 - April 23, 2018

పన్నెండేండ్ల లోపు బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా నేరశిక్షాస్మృతిని సవరిస్తూ శనివారం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సంతకం చేశారు. కతువా, సూరత్‌లలో మైనర్ బాలికలపై లైంగికదాడి, హత్య, ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ ఘటనలతో దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబికిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం శనివారం సమావేశమై.. లైంగిక దాడుల నుంచి బాలికల సంరక్షణ (పోక్సో) చట్టానికి సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో పోక్సో చట్టం పవరెంత? దానిలో ఎటువంటి నిబంధనలుంటాయి? దాని విధి విధానాలేమిటి? అనే అంశాలపై 10టీవీ చర్చ. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి, బీజేపీ నేత పద్మజా రెడ్డి, పీవోడబ్య్లు సంధ్య పాల్గొన్నారు. 

రేపిస్టులకు ఉరే సరి అంటున్న ఇండియన్ సర్వే..

ఢిల్లీ : చిన్నారులపై, బాలికలపై అత్యాచారం చేసే వారికి మరణశిక్షను విధించాలన్న ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆర్డినెన్సుకు సంబంధించి మెజారిటీ ఇండియన్స్ ఏమనుకుంటున్నారో ఓ సర్వే నివేదిక వెల్లడించింది. 76 శాతం మంది ప్రజలు రేపిస్టులకు ఉరి శిక్ష పడాల్సిందేనని చెప్పారు. జీవితఖైదు అదికూడా ఎటువంటి బెయిల్ లేని శిక్షను విధించాలని 18 శాతం మంది తెలిపారు. మూడు శాతం మంది మాత్రం చిన్నారులపై అత్యాచారం చేసే వారికి ఏడేళ్ల జైలు శిక్షను విధించాలని అభిప్రాయపడ్డారు. 40వేల మందికి పైగా ప్రజలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. 

మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామికి అరుదైన గౌరవం..

హైదరాబాద్ : భారత మహిళల క్రికెటర్ గులన్ గోస్వామికి అరుదైన గౌరవం లభించింది. మహిళల క్రికెట్ లో అ్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించిన గులన్ గోస్వామి గౌరవార్థం కలకత్తా స్పోర్ట్స్ జర్నలిస్ట్ క్లబ్ ఓ స్టాంప్ ను విడుదల చేసింది. ఈ స్టాంప్ ను మాజీ కెప్టెన్ గంగూలీ ఆవిష్కరించారు. మహిళల క్రికెట్ లో 2000 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా గులన్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఝులన్ ఇప్పటి వరకూ 10టెస్ట్ మ్యాచ్ లు, 169 వన్డే మ్యాచ్ లు ఆడింది. వరల్డ్ కప్ మ్యాచెస్ లో అత్యదిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ ఝలన్ కావటం విశేషం. 

18:00 - April 23, 2018

ఢిల్లీ : 70 ఏళ్ల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని చాలా అభివృద్ధి చేసిందని మోది అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే 70 ఏళ్ల శ్రమను వృథా చేశారని రాహుల్‌ ధ్వజమెత్తారు. తమ మనసుల్లో ఏముందో 2019లో ప్రజలు మన్‌కీ బాత్ ద్వారా వెల్లడిస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టుకు విలువ ఉందని, కానీ మోది పాలనలో ఆ ఖ్యాతి అపకీర్తి పాలైందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో 'రాజ్యాంగ పరిరక్షణ' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాహుల్‌- మోది ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి కానీ...అధికార పక్షమే సమావేశాలను అడ్డుకోవడం శోచనీయమన్నారు. నీరవ్‌మోది స్కాం, రాఫెల్‌ విమానాల కొనుగోలు స్కాంలపై పార్లమెంట్‌లో చర్చించడానికి ప్రభుత్వం సమయమివ్వడం లేదని విమర్శించారు. దేశంలో దళితులు, మైనారిటీలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని....మైనర్లపై అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. 

17:57 - April 23, 2018

నిజామాబాద్ : రైతులను సాగు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.. భూగర్భజలాలు పాతాళానికి పడిపోవడంతో సుమారు అరవై వేల బోరు బావులు అడుగంటాయి.. చేతికొచ్చిన పైరు ఎండి పోవడంతో రైతన్న భవితవ్యం ప్రశ్నార్దకంగా మారింది.కొందరు పంటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే... మరికొందరు ఎండిన పంటను పశువులకు మేతగా వేస్తున్నారు.. ఇంకొందరు పంటకు నిప్పు పెట్టి.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీటి కష్టాలు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు సాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం తొంభై వేల హెక్టార్లు కాగా.. 87 వేల హెక్టార్లలో వరి, 22 వేల హెక్టార్లలో మొక్క జొన్న సాగు చేశారు. బోరు బావులపై ఆధారపడ్డ రైతులకు సాగునీటి కష్టాలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది.. అరవై వేలకు పైగా బోరుబావులు అడుగంటాయి.. ఇరవై వేల హెక్టార్లలో వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ప్రధానంగా భీంగల్, ఇందల్ వాయి, కమ్మర్ పల్లి, మెర్తాడ్, ధర్పల్లి, వర్ని, జక్రాన్ పల్లి, డిచ్ పల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల్లో పరిస్ధితి మరీ దయనీయంగా మారింది.

పసిపాపలా కాపాడిన పైరు కళ్లముందే ఎండుతోంది..
పసిపాపలా కాపాడుకున్న పైరు కళ్ల ముందే ఎండుతుంటే రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు కొందరు బోర్లమీద బోర్లు వేస్తూ.. భగీరథ ప్రయత్నం చేస్తుంటే.. మరికొందరు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పారిస్తున్నారు. ఇంకొందరు పంటకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన పంటను చూసి.. ఇందల్ వాయి మండలం లోలం గ్రామానికి చెందిన రైతు గుండె తల్లడిల్లి చేను వద్దే కుప్పకూలి పోయాడు... ఇందలవాయి మండలం గన్నారం మెగ్యానాయక్ తాండాకు చెందిన లక్ష్యణ్, దర్పల్లి మండలం గొవింద్ పల్లి గ్రామానికి చెందిన రాకేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నీటి జాడలేని బోర్లు..
కొండంత ఆశతో సాగుచేసిన రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. పొట్ట దశకు చేరిన వరి పంటలు నీరందక పూర్తిగా ఎండిపోతుంటే అన్నదాతలు అంతులేని ఆవేదనలో మునిగిపోతున్నారు. నెలలోపు వెయ్యికి పైగా బోర్లు తవ్వితే.. సుమారు తొంభై శాతం బోర్లలో చుక్కనీరు పడలేదు. ఒక్క ఇందల్వాయి మండలం బీబీనగర్ తండాలో వంద బోర్లు వేస్తే.. అన్నీ ఎండిపోయాయి.. పంటతోపాటు.. బోర్లకోసం చేసిన అప్పులతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు రైతులు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకే కరువొచ్చిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు..ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

17:53 - April 23, 2018

విశాఖ : వేసవి కాలంలో భానుడి ప్రతాపంతో పాటే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. స్మార్ట్‌ సిటీ, పర్యాటకానికి కలికితురాయి అంటూ విశాఖను ఆకాశానికెత్తేస్తున్న పాలకులు ఇక్కడి తాగునీటి సమస్యను మాత్రం తీర్చలేకపోతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చాలన్న కనీస ధర్మాన్ని కూడా విస్మరించారు పాలకులు. నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

దాహంతో అలమటిస్తోన్న విశాఖ..
వేసవి వచ్చిందంటే చాలు నీటి ఎద్దడి విశాఖ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏజెన్సీతో పాటు విశాఖ నగర వాసులు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. జీవీఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరగడం లేదు. నర్సీపట్నంలో అయితే రెండు రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మంచినీటి పథకాలు నిరుపయోగంగా తయారయ్యాయి.

మంచినీరు లేక సుమారు 600 కుటుంబాలు
విశాఖలోని సీతమ్మధార ఏఎస్‌ఆర్‌ నగర్‌, పూర్ణమార్కెట్‌ ఇలా అనేక ప్రాంతాల్లో మంచినీరు లేక సుమారు 600 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో జీవీఎంసీకి నీటి సరఫరా జరగడంలేదు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆ ప్రాంతంలో ఓ కుళాయిని ఏర్పాటు చేశారు. కాని అది కూడా స్థానిక ప్రజల నీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు సీతమ్మధారలోనే నివాసముంటున్నారు. కాలనీ వాసులు నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా జీవీఎంసీ నుండి కొళాయి కనెక్షన్లు ఇవ్వడం కుదరదని ఆయన తేల్చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసినా అక్కడా నిరాశే ఎదురైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

150 బదులు 120 లీటర్ల నీటిని మాత్రమే అందిస్తోన్న జీవీఎంసీ
ఇప్పటికే విశాఖ నగర జనాభా 25 లక్షలపైకి చేరుకుంది. ఉపాధి కోసం వచ్చే కుటుంబాల సంఖ్య ప్రతి ఏటా 15వేలకు పైగా ఉన్నాయి. వీరికి రోజుకు 150 లీటర్ల నీటిని అందించాల్సిన జీవీఎంసీ 120 లీటర్లు మాత్రమే అందిస్తోంది. రోజూ 79 మిలియన్‌ గ్యాలన్లకు బదులుగా, 63 మిలియన్‌ గ్యాలన్లను సరఫరా చేస్తున్నారు. దీంతో నీటి ఎద్దడి తట్టుకోలేక చాలా ప్రాంతాల్లో ఇతర అవసరాల కోసం ప్రజలు భూగర్భజలాలను ఉపయోగిస్తున్నారు. నగర వ్యాప్తంగా 50 నుండి 60వేల బోర్లు ఉన్నట్లు జీవీఎంసీ లెక్కలు చెబుతున్నాయి. దీంతో కొన్ని మండలాల్లో ఉండాల్సిన పరిమాణం కంటే గ్రౌండ్‌ వాటర్‌ పరిమాణం తగ్గిందని అధికారులే చెబుతున్నారు.

నీటికోసం అల్లాడుతున్న జనం
విశాఖకు తగిన మోతాదులో నీటిని సరఫరా చేస్తున్నామంటున్న ప్రభుత్వం చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితికి ఎక్కడా పొంతన కుదరడంలేదు. దీంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. భూగర్భ జలాలు సైతం తగ్గుముఖం పట్టడం, చెరువులు, బావులు, ఎండిపోవడం ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ నీటి సమస్యను తీర్చాలని విశాఖ వాసులు కోరుతున్నారు. 

17:49 - April 23, 2018

తూ.గోదావరి : రాజమండ్రిలో అత్యాధునిక టెక్నాలజీతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ హౌసింగ్‌ గృహ సముదాయాలను నిర్మస్తున్నామని మున్సిపల్ శాఖమంత్రి నారాయణ అన్నారు. 15 నెలల్లో కట్టించి ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నిర్మాణాలను శరవేగంతో చేయిస్తున్నారని తెలిపారు. రెండు ఫేజుల్లో 268 కోట్లతో బొమ్మూరులో నిర్మాణం జరుగుతున్న గృహ సముదాయలను మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో 6లక్షల 81 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. 

17:46 - April 23, 2018

హైదరాబాద్ : కుటుంబ కలహాల వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. పద్మారావ్‌ నగర్‌కు చెందిన చంద్ర శేఖర్, లలిత మూడేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా.. తన భర్త వేధిస్తున్నాడంటూ.. లలిత ఈనెల 12న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు వెనక్కు తీసుకోకుంటే.. కిరోసిన్‌ పోసి చంపుతానంటూ.. తన అత్త, బావమరిదిని బెదిరించాడు చంద్రశేఖర్‌. ఆ సమయంలో ఆవేశానికి లోనైన చంద్రశేఖర్‌ తనపైనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తొంభై శాతం కాలిన గాయాలైన చంద్రశేఖర్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

17:44 - April 23, 2018

మంచిర్యాల : జిన్నారం మండలం కలమడుగు అటవీశాఖ చెక్‌ పోస్టు అవినీతికి ఆలవాలంగా మారింది. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నాయీమొద్దీన్‌ వసూళ్లకు పాల్పడుతూ కెమెరాకు చిక్కాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పెళ్లి బృందం బస్సులో ఉంచిన మంచానికి వెయ్యి రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. లేకపోతే కేసు పెడతానని బెందిరించాడు. పెళ్లి బృంద రెండు వందల రూపాయలు ఇవ్వబోతే తీసుకోకుండా... ఇబ్బందులు పెట్టాడు. 

17:42 - April 23, 2018

పెద్దపల్లి : ఇసుక మాఫియాను అరికట్టాలంటూ.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇసుక మాఫియా నడుస్తోందని గ్రామస్థులు ఆరోపించారు. ఆదివారం సాయంత్రం ఇసుక లారీ ఢీ కొన్నఘటనలో ఆదివారంపేట గ్రామ ఉపసర్పంచ్‌ ఏలుక రాజయ్య మృతి చెందారు. దీంతో ఆగ్రహానికి లోనైన మృతుడి బంధువులు, గ్రామస్థులు ఇవాళ ప్రధాన రదహదారిపై ధర్నాకు దిగారు. సుమారు వంద లారీలను ధ్వసం చేశారు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు... తమకు న్యాయం చేసేవరకూ కదలమని ఆందోళనకారులు బైఠాయించారు. చివరికి ఉన్నతాధికారులతో మాట్లాడిన డీసీపీ సుదర్షన్‌ గౌడ్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు...

శ్రీరెడ్డి వెనుక ఆ ముగ్గురు వున్నారు : బోండా

అమరావతి : మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ... సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిరసన తెలిపిన శ్రీరెడ్డి వెనుక రామ్ గోపాల్‌ వర్మ, కత్తి మహేశ్‌, వైసీపీ నేతలు ఉన్నారని అన్నారు. ఈ విషయంలో లోకేశ్‌పై ఆరోపణలు చేయడమేంటని నిలదీశారు. ఒక ఆరోపణ చేస్తున్నారంటే దానికి ఆధారాలు ఉండాలని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు.  

ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని ఎత్తివేసిన కేంద్రం..

హైదరాబాద్ : ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో వివాదాస్పద ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేశారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని కూడా సడలీకరించారు. 2017 సెప్టెంబర్ వరకు మేఘాలయాలో 40 శాతం వరకు ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం అమలులో ఉండేది. అయితే ఇటీవల ఆ రాష్ట్రంతో జరిపిన సంప్రదింపుల తర్వాత దాన్ని ఎత్తివేస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది. అరుణాచల్‌లోని కేవలం 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏఎఫ్‌ఎస్‌పీఏ అమలులో ఉంటుంది.

అత్యాచారాలకు కారణమేంటో చెప్పిన హోంమంత్రి..

మధ్యప్రదేశ్: దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలకు పోర్న్ సైట్సే కారణమట! ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ చెప్పారు. పోర్న్ సైట్స్ చూసి అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ చేసిన సర్వేలో వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. పోర్న్ సైట్స్‌ను నిషేధించాలని కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశామని తెలిపారు. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. 

16:09 - April 23, 2018

అమరావతి : పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతు.. 2019 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎన్ని ఇబ్బందులొచ్చినా ముందుకు పోతున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం 200ల టీఎంసీల గోదావరి నీరు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇస్తానన్న నిధులు కేంద్ర ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం నుండి బైటకొచ్చారని పోలవరం నిధులు నిలిపివేస్తే నిరసనలతో హక్కులను సాధించుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ల సహాయంతో వ్యవసాయంలో చీడపీడల నుండి కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

15:54 - April 23, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోది తీరు పట్ల ఎయిమ్స్‌ రెజిడెంట్స్‌ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ గడ్డపై నుంచి మనోబలం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పడుతూ వారు మోదికి లేఖ రాశారు. మంచి, చెడ్డ వ్యక్తులు అన్ని చోట్లా ఉన్నారు. మీ మంత్రి మండలిలో కూడా ఉన్నారు. అందర్నీ ఒకే రకంగా పోల్చడం సరికాదని వైద్యులు పేర్కొన్నారు. వైద్యులు ఖరీదైన మందులు రాయడం వెనక వైద్యులకు, ఫార్మాసూటికల్‌ కంపెనీల మధ్య ఒప్పందం ఉంటుందని లండన్‌ పర్యటనలో ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు మెడికల్‌ టూరీజానికి ముప్పు కలిగిస్తుందని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు. ప్రధాని హోదాలో విదేశీ గడ్డపై విమర్శలు చేయడం ఇదే తొలిసారని వారు తెలిపారు.

15:52 - April 23, 2018

శ్రీకాకుళం : ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే చట్టాలకు రాత్రి చీకట్లు కమ్మేస్తున్నాయి. కారు చీకట్లో ఇసుక మాఫియా తన పని తాను చేసుకుంటూ పోతోంది. శ్రీకాకుళం జిల్లాలో యాధేచ్ఛగా ఇసుకరవాణా కొనసాగుతోంది. ఏపిలో ఇసుక తవ్వకాలకు అధికారికంగా అనుమతులు లేకపోవడంతో రాత్రి వేళల్లో ఇసుక రవాణా జోరుగాసాగుతోంది.

శ్రీకాకుళంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు రాత్రి వేళల్లో ఇసుక తరలించి వేరు వేరు ప్రదేశాలలో నిలువలు ఉంచుతున్నారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకొని కోట్లు దండుకుంటున్నారు ఇసుకాసురులు.

పలాస మండలంలో జోరుగా సాగుతోన్న ఇసుక దందా..
పలాస నియోజకవర్గంలోను ఇసుక దందా పడగ విప్పింది. కంచిలి మండలం నుండి 25 లారీలు, 12 ట్రాక్టర్లను నెలవారీ లీజుకు తీసుకుని రాత్రివేళల్లో ఇసుకను తరలిస్తున్నారు. పలాస మండలం కోసంగిపురం కూడలి, అక్కుపల్లి రోడ్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో, లొద్దబద్ర, చిన్నబడాం ప్రాంతాల్లో నిల్వలు ఉంచి లారీ లోడు ధర పదిహేను వేల రూపాయలు, ట్రాక్టర్‌ ఇసుకలోడు ధర మూడు వేల రూపాలకు అమ్ముకుంటూ ప్రభుత్వానికి గండికొడుతున్నారు.

ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలంటున్న స్థానికులు..
జిల్లాకు చెందిన స్థానిక మంత్రలు , ఎంపీ, ఎమ్మెల్యేలు తమ ప్రమేయం లేదని బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఆయా ప్రజా ప్రతినిధులపై బహిరంగ ఆరోపణలు వినిపిస్తూనేఉన్నాయి. ఇసుక రీచ్‌లు నిలుపుదల చేస్తున్నట్లుగా గనుల శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ముందుగానే నిల్వలు పెట్టుకున్న ఇసుక మాఫియా కాసుల వర్షం కురిపించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే... ఇక నైనా విజిలెన్స్‌ అధికారులు మేల్కొని ఇసుక మాఫియాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతన్నారు.

15:47 - April 23, 2018

హైదరాబాద్‌ : తెలంగాణ కళాభారతిలో హైదరాబాద్‌ ఫెస్ట్‌ 2018 ఘనంగా ముగిసింది. స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సోసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తొలిరోజు నుండి ఫెస్ట్‌ సందర్శకులను బాగా ఆకట్టుకోవడంతో కళకళలాడింది.

ఘనంగా ముగిసిన హైదరాబాద్‌ ఫెస్ట్‌ 2018
చివరి రోజు హైదరాబాద్‌ ఫెస్ట్‌ను సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ సందర్శించారు. జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన సైన్స్‌లాబ్‌లో విద్యార్థుల ప్రదర్శించిన ప్రయోగ పరికరాలు భరద్వాజ ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు సైన్స్‌ అంటే భయపడుతున్నారని అందుకే విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేందుకు సైన్స్‌హబ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.

విజ్ఞానాన్ని అందించడంలో సైన్స్ హబ్ విజయవంతం
హైద్రాబాద్ ఫెస్ట్ విజయవంతమైందని నిర్వహకులు తెలిపారు. బుక్ ఫెయిర్, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన స్టాల్స్‌, కమర్షియల్ స్టాల్స్‌ ప్రజలను ఆకట్టుకున్నాయిని ఫెస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఫెస్ట్‌లో బాలోత్సవ్‌ పిల్లలను బాగా ఆకట్టుకుందని.. సైన్స్ హబ్ విజ్ఞానాన్ని అందించడంలో విజయవంతమైందన్నారు. ఫెస్ట్ ముగింపు రోజు పలువరు మీడియా ప్రతినిధులను నిర్వాహకులు సత్కరించారు. విభిన్న సంస్కృతులకు వేదికైన హైదరాబాద్‌ నగరంలో ఇలాంటి ఫెస్ట్‌ నిర్వహించడంపై నిర్వాహకులును పలువురు అభినందించారు.

2019 కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పనే లక్ష్యం : మంత్రి లోకేశ్

అమరావతి : సైబర్ సెక్యూరిటీ ఇండ్రస్ట్రీ కన్సల్టేషన్ పై మంత్రి నారా లోకేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ రూపకల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతు..రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అనేక పాలసీలు తీసుకొచ్చామన్నారు. 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 

పేపర్ లెస్ గవర్నెన్స్ తీసుకొచ్చేందుకు కృషి : మంత్రి లోకేశ్

అమరావతి : సైబర్ సెక్యూరిటీ ఇండ్రస్ట్రీ కన్సల్టేషన్ పై మంత్రి నారా లోకేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ రూపకల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతు..టెక్నాలజీ సహాయంతో ప్రజలకు అనేక సర్వీసులను అందిస్తున్నామనీ..పేపర్ లెస్ గవర్నెన్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్ అమలు చేస్తున్నామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో నెక్సట్ జనరేషన్ వారియర్స్ ను సిద్ధం చేసేందుకు కృషి చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. ప్రతీ నెలా హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నామన్నారు.

సీతారాం ఏచూరి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్..

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ స్టేడియంలో నిన్న జరిగిన సీపీఎం జాతీయ మహాసభల్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బీజేపీ నేతలని కౌరవులతో పోల్చిన విషయం తెలిసిందే. కౌరవులు తమకి బలం ఎక్కువగా ఉందనుకుంటున్నారని, కానీ పాండవులే చివరకు గెలుస్తారని ఆయన అన్నారు. సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ దేశం కోసం జాతీయత భావంతో పనిచేస్తోందని, మరోవైపు వామపక్షాలు చిన్న చిన్న పార్టీలతో కూటమిని ఏర్పాటు చేస్తున్నాయని, అవినీతిపరులతో, కులమత, భాషల పేరుతో కూటములు కడుతున్నాయని, అటువంటప్పుడు మీరు కౌరవులా?

తెలంగాణ యువత కోసం ఆర్మీ రిక్రూట్ మెంట్..

వరంగల్ : తెలంగాణ నిరుద్యోగ యువత కోసం మే నెల 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగనుంది. వరంగల్ పట్టణంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఎంపికలు జరుగుతాయి. సోల్జర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, ట్రేడ్స్ మ్యాన్ తదితర ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆర్మీ అధికారులు సూచించారు. 17 నుంచి 23 ఏళ్లలోపు వయస్సు ఉండి, 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలు ఉన్న వారు ఎంపికలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు.

15:11 - April 23, 2018

వికారాబాద్ : సినీమాక్స్‌ థియేటర్‌లో పార్కింగ్‌ వ్యవహారంలో వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మేనేజర్‌ రాఘవేందర్‌పై రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి చేయి చేసుకున్నాడు. దీంతో రాఘవేందర్‌ కిందపడి మృతి చెందాడు. ఘటనకు బాధ్యుడైన రాజేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

15:07 - April 23, 2018

విజయవాడ : దళితులపైన దాడులు.. మహిళ పై అత్యాచారాలు పెరిగాయన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. దళితులు చంద్రమండలంలోకి.. వెళ్లగలుగుతున్నాడు గానీ... గర్భగుడిలో పోలేకపోతున్నాడని మండిపడ్డారు. దళితులకు కేరళ ప్రభుత్వం గర్భగుడిలో వెళ్లాడానికి అవకాశం ఇచ్చిందని... అలాగే టీడీపీ కూడా దళితులకు గర్భగుడిలో ప్రవేశం కల్పించాలన్నారు. దళితులకు దేవాదాయ ధర్మదాయశాఖలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. త్వరలోనే సమావేశమై ప్రత్యేక హోదాపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు ఒక రోజు నిరాహార దీక్షకు ఎన్ని కోట్లు ఖర్చయిందో ప్రజలకు చెప్పాలని మధు డిమాండ్‌ చేశారు. 

15:04 - April 23, 2018

గుంటూరు : ప్రధాని మోదీ, అమిత్‌ షాలు చేస్తున్న కుట్రలను ఏపీ ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌. జనసేన, వైసీపీలు బీజేపీతో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకొని ఆంధ్రకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాంటూ టీడీపీ గుంటూరు తూర్పు నియోజక వర్గ ఇంచార్జ్‌ మద్దాల గిరి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు భారీ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 30 వరకు ఈ ర్యాలీలు కొనసాగుతాయని నేతలు తెలిపారు. 

15:01 - April 23, 2018

హైదరాబాద్ : కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వం రద్దుపై టీఆర్ఎస్‌ న్యాయపోరాటానికి దిగింది. కోర్టు తీర్పుపై 12 మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారు. సభ్యత్వం రద్దుపై కోర్టు సింగిల్‌బెంచ్‌ తీర్పును ఆపాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. 

పారిస్ ఉగ్రదాడి నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష..

ఢిల్లీ : ఫ్రాన్స్‌లోని పారిస్‌లో 2015లో ఉగ్రదాడికి పాల్పడిన సలేహ అబ్దెస్లామ్‌కు 20 ఏళ్లు జైలు శిక్షను ఖరారు చేశారు. బెల్జియం కోర్టు ఈ శిక్షను వేసింది. 28 ఏళ్ల అబ్దెస్లామ్‌తో పాటు సోఫియన్ అయ్యారి అనే మరో వ్యక్తికి కూడా ఆ కేసులో 20 శిక్షను ఖరారు చేశారు. ఉగ్రవాదంతో పాటు హత్యాయత్నం కేసుల్లో ఈ శిక్షను వేశారు. 2016లో బ్రసెల్స్‌లో జరిగిన సోదాల్లో ఈ ఇద్దరూ చిక్కారు. నిందితులిద్దరూ ఉగ్రదాడిలో పాల్గొన్నారని, ఇందులో ఏమాత్రం అనుమానం లేదని న్యాయమూర్తులు తమ తీర్పులో తెలిపారు. 2015లో జరిగిన పారిస్ దాడిలో సుమారు 130 మంది మృతిచెందారు.

ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ : కేటీఆర్

మేడ్చల్ : ఈ నెల 27న జరగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొంపల్లిలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ నిర్వహణ కోసం 9 కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. ప్లీనరీకి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన రాష్ట్ర వంటకాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 

స్పిల్ పనులు ప్రారంభించిన చంద్రబాబు..

అమరావతి : ప.గో: పోలవరం ప్రాజెక్టులో మరో అతికీలక నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్‌ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం స్పిల్‌ ఛానల్ కాంక్రీట్ పనులను ప్రారంభించారు. అనంతరం డయాఫ్రంవాల్‌ను సీఎం పరిశీలించారు. గోదావరి నది మళ్లింపును పరిశీలించిన చంద్రబాబు గోదావరి నీటిని తలపై చల్లుకున్నారు.

మోదీ ప్రభుత్వానికి మద్ధతు పలికిన నన్నపనేని!..

అమరావతి : 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే కామాంధులకు ఉరిశిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్వాగతం పలికారు. కామాంధులకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ తాను ప్రధాని మోదీకి గతంలో లేఖలు రాసినట్టు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన చట్టానికి స్వాగతం పలుకుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దీంతో కఠిన శిక్షలపై అక్కడి వారికి అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు.

పోలవరం వంటి ప్రాజెక్టును చూడలేం : చంద్రబాబు

అమరావతి : ఈరోజు సీఎం చంద్రబాబు పోలవారాన్ని నిర్వహించారు. ఈ సంరద్భంగా మాట్లాడుతు.. పోలవరం వంటి ప్రాజెక్టును ఇకముందు చూడలేరన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 52.85 శాతం పనులను పూర్తయ్యాయని చంద్రబాబు తెలిపారు. వచ్చే నెలలలో అండర్ గ్రౌండ్ డ్యామ్ పని పూర్తవుతుందీన..స్పిల్ బేస్ కు ఈరోజు కాంక్రీట్ పనులు ప్రారంభించామని తెలిపారు. వ్యవసాయానికి పుష్కలంగా నీరుంటే బంగారం పండించే రైతులున్నారని రైతులను చంద్రబాబు అభినందించారు.

నీటి భద్రత కోసం టెక్నాలజీ : చంద్రబాబు

అమరావతి : సీఎం చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారనే విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈరోజు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి అక్కడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రాష్ట్రంలో వున్న రెండు కోట్ల ఎకరాలను వ్యవసాయం కోసం ఉపయోగించేంత నీటి భద్రతను ఇచ్చేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నదుల అనుసంధానంతో నీటి ఎద్దడిని లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవుసరముందన్నారు. పోలవరం వంటి ప్రాజెక్టును ఇకముందు చూడలేరన్నారు.

14:38 - April 23, 2018

అమరావతి : కరవు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనేదే నా లక్ష్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రాష్ట్రంలో వున్ రెండు కోట్ల ఎకరాలను వ్యవసాయం కోసం ఉపయోగించేంత నీటి భద్రతను ఇచ్చేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నదుల అనుసంధానంతో నీటి ఎద్దడిని లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవుసరముందన్నారు. పోలవరం వంటి ప్రాజెక్టును ఇకముందు చూడలేరన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 52.85 శాతం పనులను పూర్తయ్యాయని చంద్రబాబు తెలిపారు. వచ్చే నెలలలో అండర్ గ్రౌండ్ డ్యామ్ పని పూర్తవుతుందీన..స్పిల్ బేస్ కు ఈరోజు కాంక్రీట్ పనులు ప్రారంభించామని తెలిపారు. వ్యవసాయానికి పుష్కలంగా నీరుంటే బంగారం పండించే రైతులున్నారని రైతులను చంద్రబాబు అభినందించారు. ఇటు పోలవరం ప్రాజెక్టు, అటు నదుల అనుసంధానం జరిగితీరాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. తిరుపతి వెంకన్నకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి భద్రతనిస్తామని రైతులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. వ్యవసాయంలో ఆధునీకరణను ప్రవేశపెట్టామన్నారు. 

ఘోర బస్సు ప్రమాదంలో 30 మంది మృతి..

హైదరాబాద్ : ఉత్తర కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హువాన్‌ఘై హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో 30 మంది మృతిచెందారు. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాతావరణం సరిగా లేని కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనీస్ ట్రావెల్ కంపెనీ సభ్యులు ఆ బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ కొరియాలో ఉన్న చైనీస్ ఎంబసీ ఈ విషయాన్ని దృవీకరించింది.

ఘోర బస్సు ప్రమాదంలో 30 మంది మృతి..

హైదరాబాద్ : ఉత్తర కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హువాన్‌ఘై హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో 30 మంది మృతిచెందారు. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాతావరణం సరిగా లేని కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనీస్ ట్రావెల్ కంపెనీ సభ్యులు ఆ బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ కొరియాలో ఉన్న చైనీస్ ఎంబసీ ఈ విషయాన్ని దృవీకరించింది.

13:22 - April 23, 2018

విజయవాడ : ఆళ్లగడ్డలో జరుగుతున్న పరిణామాలు టిడిపికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. మంత్రి భూమా అఖిల ప్రియ - ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విబేధాలు పొడచూపుతున్నాయి. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు తీర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రలు నిర్వహించాలని టిడిపి ఆదేశించింది. దీనితో ఏవీ సుబ్బారెడ్డి సోమవారం శిరువెల్లమండలంలో సైకిల్ యాత్రను చేపట్టారు. కానీ తమపై రాళ్ల దాడికి పాల్పడ్డారని, దీనివెనుక మంత్రి భూమా అఖిల ప్రియ ఉందని ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి ఘటనపై టిడిపి అధిష్టానం సీరియస్ అయ్యింది. అఖిల - సుబ్బారెడ్డి మధ్య ఎన్నిసార్లు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం లేకపోవడంతో టిడిపి విసుగెత్తుతున్నట్లు సమాచారం. పార్టీ ఇచ్చిన కార్యక్రమం చేపడుతోన్న సుబ్బారెడ్డిపై దాడులు చేయడాన్ని సీఎం బాబు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అమరావతికి రావాలని బాబు వీరిద్దరినీ ఆదేశించారు. 

ఆళ్లగడ్డ ఘటనపై బాబు సీరియస్...

విజయవాడ : ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి ఘటనపై టిడిపి అధిష్టానం సీరియస్ అయ్యింది. అఖిల - సుబ్బారెడ్డి మధ్య ఎన్నిసార్లు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం లేకపోవడంతో టిడిపి విసుగెత్తుతున్నట్లు సమాచారం. పార్టీ ఇచ్చిన కార్యక్రమం చేపడుతోన్న సుబ్బారెడ్డిపై దాడులు చేయడాన్ని సీఎం బాబు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. 

పోలవరంలో బాబు...

కృష్ణా : సీఎ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. స్పిల్ వే ఛానల్ పనులను బాబు ప్రారంభించారు. అధికారులతో బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

పోలవరంలో బాబు...

కృష్ణా : సీఎ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. స్పిల్ వే ఛానల్ పనులను బాబు ప్రారంభించారు. అధికారులతో బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఉనికి కోసమే బస్సు యాత్రలు - తలసాని...

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమే ఆ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

12:23 - April 23, 2018

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ మరోసారి ట్విట్టర్‌లో స్పందించారు. తన తల్లిని దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌లో నోటికొచ్చినట్లు తిట్టి... ప్రైవేట్‌గా క్షమాపణలు చెబుతున్నారన్నారు. మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచులను తిట్టే పేపరు ఎందుకు చదవాలి ? వాళ్ల టీవీలను ఎందుకు చూడాలి ? అన్నారు. జర్నలిజం విలువలతో ఉన్న చానెల్స్‌, పత్రికలకు మద్దతిస్తామన్నారు. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటువుతుందని... దీనికి జనసేన వీర మహిళ విభాగం అండగా ఉంటుందన్నారు పవన్‌కల్యాణ్‌.

 

12:21 - April 23, 2018

ఢిల్లీ : రాజ్యాంగం, దళితులపై దాడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ 'రాజ్యాంగ పరిరక్షణ' ఉద్యమాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీ... బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. 

రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం...

ఢిల్లీ : రాజ్యాంగం, దళితులపై దాడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ 'రాజ్యాంగ పరిరక్షణ' ఉద్యమాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ద

11:27 - April 23, 2018

పవన్ ట్వీట్స్...

విజయవాడ : టిడిపి సిద్ధాంతం తిట్ల దండకమేనని, ఈ విభాగానికి అధిపతి ఆర్కేనేనని పవన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆడపడుచుల కోసం త్వరలో 'ఆత్మగౌరవ పోరాట సమితి' ఏర్పాటు చేయనున్నట్లు, జనసేన వీర మహిళ విభాగం అండగా ఉంటుందని పవన్ ప్రకటించారు. మరోవైపు చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలను సాయంత్రంలోగా వెల్లడిస్తానని పవన్ పేర్కొన్నారు. 

11:17 - April 23, 2018

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. కొంతమంది వ్యక్తులు..మీడియాను టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్స్ చేస్తుండడం కలకలం రేపుతున్నాయి. క్యాస్టింగ్ టచ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఆయన వ్యాఖ్యల వెనుక తానున్నట్లు దర్శకుడు రాంగోపాల్ పేర్కొన్నట్లు వీడియో టాలీవుడ్ లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ నేరుగా ఫిలిం ఛాంబర్ వద్దకు వెళ్లి నిరసన తెలియచేశారు. తన తల్లిని తిట్టిన వారిపై...పదే పదే ప్రసారం చేసిన ఛానెళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అప్పటి నుండి పవన్ ట్విట్టర్ లో ట్వీట్స్ పెడుతున్నారు. తాజాగా కొన్ని ట్వీట్స్ చేశారు. టిడిపి సిద్ధాంతం తిట్ల దండకమేనని, ఈ విభాగానికి అధిపతి ఆర్కేనేనని తెలిపారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆడపడుచుల కోసం త్వరలో 'ఆత్మగౌరవ పోరాట సమితి' ఏర్పాటు చేయనున్నట్లు, జనసేన వీర మహిళ విభాగం అండగా ఉంటుందని పవన్ ప్రకటించారు. మరోవైపు చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలను సాయంత్రంలోగా వెల్లడిస్తానని పవన్ పేర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న వివాదం నడుమ ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు వెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

11:07 - April 23, 2018
11:06 - April 23, 2018

కర్నూలు : జిల్లా ఆళ్లగడ్డ టిడిపిలో విబేధాలు పొడచూపాయి. ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిల ప్రియ వర్గాలు సైకిల్ యాత్రలు నిర్వహించాయి. శిరువెల్లమండలం ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల సైకిల్ ర్యాలీని మంత్రి అఖిల ప్రియ వర్గీయులు అడ్డుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి సైకిల్ యాత్రలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిల ప్రియ వర్గాలు సైకిల్ యాత్రలు చేపట్టారు. వేర్వేరుగా సైకిల్ యాత్రలు నిర్వహించడంతో విబేధాలు బయటపడ్డాయని ప్రచారం జరుగుతోంది. కానీ అఖిలప్రియ ప్రోద్బలంతోనే దాడులు చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు. ఎవరెన్నీ చేసినా సైకిల్ యాత్ర ఆపేది లేదని ఏవీ సుబ్బారెడ్డి పేర్కొంటున్నారు. ఈ ఘటనపై మంత్రి అఖిల స్పందించారు. పోటాపోటీ సైకిల్ యాత్రలతో నష్టం లేదని పేర్కొన్నట్లు సమాచారం.

11:05 - April 23, 2018

హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీల నేతలు ఏ పార్టీలో చేరాలా ? ఏ పార్టీలో చేరితే టికెట్ వస్తుంది ? సొంత పార్టీలో ఉంటే టికెట్ వస్తుందా ? రాదా ? అంటూ నేతలు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు. బిజెపి పార్టీలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి కూడా పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. టిడిపిలో ఉన్న నాగం బీజేపీ తీర్థం తీసుకున్నారు. కానీ బీజేపీ పార్టీ తగిన విధంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని నాగం భావిస్తున్నట్లు సమాచారం. దీనితో అనచరులు..కీలక నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం కాంగ్రెస్ లో చేరడానికి నాగం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 25వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.

 

11:03 - April 23, 2018
11:02 - April 23, 2018

ఢిల్లీ : మావోయిస్టుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో గడ్చిరౌలీ  జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో మావోయిస్టులు ప్రతికార చర్య తీసుకుంటారని, ఎక్కడైనా దాడికి పాల్పడవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కూంబింగ్‌ ను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

శనివారం చత్తీస్‌గఢ్‌ సుక్మాజిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్‌ ఏఎస్సై మృతిచెందారు. ఈనేపథ్యంలో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్‌ జరిపాయి. బలగాలకు మావోయిస్టులు తారపసపడడంతో ఎదురుకాల్పు జరిగాయని అధికారులు తెలిపారు.

11:01 - April 23, 2018

పశ్చిమగోదావరి : జిల్లా నిడదవోలులో ప్రమాదం చోటు చేసుకుంది. కాలేజీకి చెందిన బస్సు ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెంది. శశి ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బస్సు సోమవారం ఉదయం ఓ ఆటోను ఢీకొంది. ఆటో ముందు భాగం నుజ్జునజ్జైంది. దీనితో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడనే చనిపోగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడనే ఉన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

11:00 - April 23, 2018

హైదరాబాద్ : ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తిపై ఓ కారు దూసుకపోయిన ఘటన కలకలం రేపింది. ఈఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది. కారు నడిపిన వారు యువతులని..వీరు మద్యంలో మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని కుషాయిగూడలో ఇంజనీరింగ్ చదువుతున్న నలుగురు యువతులు ఓ ఫంక్షన్ కు హాజరై ఏఎస్ రావ్ నగర్ నుండి తార్నాక వైపుకు వెళుతున్నారు. వేగంగా వెళుతూ..కారులోనే డ్యాన్స్ లు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని గోడను బలంగా ఢీకొట్టింది. అక్కడే నిద్రిస్తున్న అశోక్ అనే యువకుడిపైకి దూసుకెళ్లింది. అతనికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు యువతులను అదుపులోకి తీసుకుని అశోక్ ని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందాడు. యువతుల వివరాలు తెలియాల్సి ఉండగా, వారిని పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. తమకు ఇదే ఆధారమని, న్యాయం చేయాలని బాధిత కుటుంబం పేర్కొంటోంది. ఇదిలా ఉంటే నలుగురు యువతుల్లో హరిక ఓ సీఐ కూతురని తెలుస్తోంది. 

10:59 - April 23, 2018

ఢిల్లీ : 2019లో ఎన్నికలు...ఇప్పటి నుండే పలు రాజకీయ పార్టీలు వ్యూహాల్లో నిమిగ్నమై పోయాయి. ప్రజలను ఆకర్షించేందుకు హామీలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పేరిట దేశ వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతోంది. సోమవారం తాల్కటోరా స్టేడియ నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, వివిధ రాష్ట్రాల కార్యకర్తలు పాల్గొననున్నారు. 
దళితులు, అణగారిన వర్గాలపై దాడులు జరుగుతుండడంపై కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఎంచుకుంది. దేశంలోని 17 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. 

10:58 - April 23, 2018

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పై రాయల్స్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి విక్టరీ కొట్టింది. సంజూ శాంసన్‌52, బెన్‌ స్టోక్స్‌40 రన్స్‌ చేయగా.. కృష్ణప్ప గౌతమ్33 పరుగులతో నాటౌట్‌గా నిలిచి రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ లూయిస్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. మరో ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేశారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 129 పరుగులు జత చేశారు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. ఇషాన్‌ కిషన్‌ ;42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు సాధించాడు.

10:57 - April 23, 2018

ఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 48కి పెరిగింది. మరో 112 మంది గాయపడ్డారు. కాబుల్‌లోని దస్తేబార్చి ప్రాంతంలో ఉన్న ఓటు నమోదు కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండగుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అక్టోబర్‌లో ఆఫ్గాన్‌ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటు నమోదు చేయించుకుంటున్న పౌరులపై ముష్కరులు దాడికి పాల్పడ్డారని ఆఫ్గాన్‌ అధికారులు తెలిపారు. తాలిబాన్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

10:55 - April 23, 2018

ఢిల్లీ : చత్తీస్‌గడ్-మహారాష్ర్ట సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్పీఎఫ్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 16మంది మావోయిస్టులు మృతిచెందారు. గడ్చిరోలి జిల్లా బోరియా అటవీ ప్రాంతంలోని ఏటపల్లి వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. శనివారం చత్తీస్‌గఢ్‌ సుక్మాజిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్‌ ఏఎస్సై మృతిచెందారు. ఈనేపథ్యంలో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్‌ జరిపాయి. బలగాలకు మావోయిస్టులు తారపసపడడంతో ఎదురుకాల్పు జరిగాయని అధికారులు తెలిపారు.

 

10:55 - April 23, 2018

కృష్ణా : జిల్లాలో పచ్చదనం హరించిపోతోంది. అక్రమార్కుల చెరలో ఉన్న అటవీ భూముల్లో నానాటికీ పచ్చదనం తగ్గుముఖం పడుతోంది. ఆక్రమణదారులపై కేసులు పెట్టడం తప్ప చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నానాటికీ పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఏపీ నవ్యాంధ్ర రాజధానిలోని అటవీ భూముల విస్తీర్ణం గనణీయంగా పడిపోయింది. కృష్ణాజిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలోని అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న భూములు స్వాధీనం చేసుకోవడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండపల్లి, అడవినెక్కలం, ఎ. కొండూరు, జి.కొండూరు, తిరువూరు, తదితర ప్రాంతాల్లోని భూములు ఆక్రమణకు గురయ్యాయి. కబ్జా దారుల నుంచి భూములను విడిపించేందుకు అటవీ శాఖ కసరత్తు ప్రారంభించింది. అటవీ, రెవిన్యూ, సర్వే శాఖలు సమన్వయంతో పనిచేస్తే.. అటవీ భూములు సురక్షితంగా ఉండే ఆస్కారముంది.

జిల్లాలో మూడు అటవీ రేంజ్‌లలో కలిపి మొత్తం 49 వేల 716.87 హెక్టార్ల అటవీ భూములున్నాయి. నూజివీడు రేంజ్‌లో 12 వేల 708.8 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో మొత్తం 33.3 శాతం సాధారణ అటవీ, విస్తీర్ణంలో కేవలం 7.55 శాతం దట్టమైన అడవులున్నాయి. చెట్లను కొట్టేస్తే పర్యావరణానికి హాని తప్పదంటున్నారు పర్యావరణ నిపుణులు.

ముసునూరు మండలం కాండ్రెనిపాడులో దట్టమైన రిజర్వు అటవీ ప్రాంతం ఉంది. మొత్తం 1,857 హెక్టార్లకు గాను 1,594 హెక్టార్లు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. చాట్రాయి మండలంలో సుమారు 3 వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. మైలవరం, తిరువూరు, ఎ. కొండూరులోనూ అటవీభూములు ఆక్రమణలకు గురయ్యాయి. అటవీ చట్టం ప్రకారం ఆక్రమణదారులపై కేవలం కేసులు పెట్టడం తప్ప చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఆక్రమదారులకు కొంత మంది రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. అటవీ భూముల్లో మాఫియాగా ఏర్పడి భూములను కొల్లగొడుతున్నారు. ఏది ఏమైనా అటవీ భూమిని రెవన్యూ, ఫారెస్ట్ అధికారులు సంరక్షించాల్సిన అవసరం ఉంది. రికార్టుల ఆధారంగా సర్వేయర్లతో ఆ భూములను సమగ్రంగా కొలతలు వెయిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అంటున్నారు.

10:53 - April 23, 2018

హైదరాబాద్ : ఎర్రదండు కవాతుతో భాగ్యనగరం హోరెత్తింది. కిలోమీటర్ల పొడవునా రోడ్లన్నీ అరుణకాంతులతో మెరిసిపోయాయి. జాతీయ నేతలు ముందు నడవగా.. లాల్‌జెండాలు చేతపట్టిన ఎర్రసైన్యం కదం తొక్కింది. సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 25వేల మంది వాలంటీర్లు నిర్వహించిన కవాతు ఉర్రూత లూగించింది.. మలక్‌పేట నుంచి ప్రారంభమైన రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు.. సరూర్‌నగర్‌లోని బహిరంగ సభ వేదిక వరకు రోడ్లన్నీ అరుణ వర్ణం సంతరించుకున్నాయి. కమ్యూనిస్టుపార్టీల్లో యువతరం లేదన్న విమర్శలను తిప్పికొడుతూ ఏకంగా 25వేల మంది యువత నిర్వహించిన కవాతు సంబ్రమాశ్చర్యాలను కలిగించింది. బహిరంగసభకు యువత ఉప్పెనలా కదిలిరావడంతో సీపీఎం కామ్రేడ్లలో ఆనందం వెల్లివిరిసింది. దేశంలో కమ్యూస్టు పార్టీల్లో కొత్త నెత్తురు వచ్చి చేరిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దారి పొడవులనా కళాకారుల జోరు, రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల నినాదాలతో భాగ్యనగరం వీధులు మార్మోగాయి. అరుణ పతాకాలు చేపతపట్టి.. అడుగులో అడుగేసుకుంటూ సాగిన ఎర్రదండు సరూర్‌నగర్‌ బహిరంగసభ వేదికవైపు దూసుకుపోయింది. 

10:52 - April 23, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌, బీజేపీలు నాణేనికి రెండు ముఖాలని సీపీఎం జాతీయ నేతలు విమర్శించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చీలికలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మతోన్మాదశక్తులను ఓడించేందుకు జాతీయ మహాసభల ద్వారా రాజకీయ శంఖారావం పూరించామన్నారు. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు ఏకంకావాల్సిన సమయం వచ్చిందని సీపీఎం నేతలు పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం జాతీయ మహాసభలు దేశ రాజకీయాల్లో మార్పుకు దోహదం చేస్తాయని పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన సీపీఎం బహిరంగ సభకు అధ్యక్షత వహించిన రాఘవులు... ఈ మహాసభల్లో చర్చించిన అంశాలన్నీ ప్రజల కోసమేనని చెప్పారు. ప్రజల కష్టనష్టాలకు సంబంధించిన అంశాలనే చర్చించి, భవిష్యత్‌ పోరాటాలకు బాటలు చేస్తున్నామన్నారు.

దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్న బీజేపీని ఓడించేందుకు ప్రజా పోరాటాలే కీలకమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. ప్రజా పోరాటాల్లో సీపీఎం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు విభజించు-పాలించు సిద్ధాంతాన్ని బీజేపీ-ఆర్ఎస్‌ఎస్ శక్తులు అమలు చేస్తున్నాయని.. వాటిని సమైక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్. దేశంలో బీజేపీ అనే శత్రువు మన తలుపుతడుతోంది... దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు.. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. 22వ సీపీఎం జాతీయ మహాసభల్లో ఇదే విషయంపై రాజకీయ శంఖారావం పూరించినట్లు మాణిక్ సర్కార్ తెలిపారు. కుల, మత, ప్రాంతీయ వాదాలను రెచ్చగొడుతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీపీఎం నేతలు పిలుపునిచ్చారు. లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఐక్యం అయితే కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శకాన్ని ప్రారంభవవుతుందని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. 

10:51 - April 23, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌కు అధికారమిస్తే కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీల కంటే మెరుగైన పాలన అందిస్తుందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ విధానాలతో బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటైందన్నారు. సీపీఎం 22వ జాతీయ మహాభల సందర్భంగా సరూర్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. హైదరాబాద్‌లో 5 రోజుల పాటు జరిగిన సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం అనుసరించే విధానాలను పార్టీ కార్యదర్శి తమ్మినేని ప్రకటించారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుతం ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మారాల్సింది పార్టీలు ప్రభుత్వాలు కాదని, పరిపాలన విధానం అన్నారు. దీనికోసం సీపీఎం మరో 28 పార్టీలతో కలిసి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశామన్నారు.

బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేస్తుందని తమ్మినేని వీరభద్రం చెప్పారు. జనాభ ప్రతిపాదికన BC, SC, ST, OBC లకు సీట్లు కేటాయింపు ఉంటదన్నారు. సామాజిక న్యాయం అంటే ప్రతికులం వారు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు మంత్రులు కావడమే అన్నారు. అభివృద్ధి అంటే జీడీపీ, ద్రవ్యోల్బణ లెక్కలు కావని, అభివృద్ధి అంటే ప్రజల చెంతకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు చేర్చడం అన్నారు తమ్మినేని వీరభద్రం. తెలంగాణ రాక ముందు నుంచి ఉన్న రైతుల ఆత్మహత్యలు తెలంగాణ వచ్చాక కూడా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల విధానాలే కారణం అన్నారు. తెలంగాణలో ఎర్రజెండా ఉన్నంతకాలం కాషాయం పార్టీకి చోటే లేదని తమ్మినేని తేల్చి చెప్పారు. తెలంగాణలో సీపీఎంను అధికారంలోకి తెచ్చి, పుచ్చలపల్లి సుందరయ్యగారికి నివాలర్పిస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు.

10:50 - April 23, 2018

హైదరాబాద్ : కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామన్నారు సీపీఎం జాతీయ నేతలు. వామపక్షాల ఐక్యత, ప్రజా ఉద్యమాలతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలను అడ్డుకుంటామన్నారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ బహిరంగసభలో కమలం పార్టీపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యరదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ పాలనలో బడాబాబులు ప్రజల సొమ్మును లూఠీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో మోదీలు లూటీలకు పాల్పడుతున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. దేశంలో చోటుచేసుకున్న నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ కుంభకోణాలను ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ చేయని మోదీ... కార్పొరేట్లకు 3 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఏచూరి మండిపడ్డారు.

దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. గోరక్షక్‌లు అమాయకులపై దాడులు చేస్తుంటే.. రేపిస్టులకు ప్రభుత్వ పెద్దలు రక్షకులుగా మారారని ఆమె ఆరోపించారు. మోదీ హఠావో దేశ్‌ బచావో అని బృందాకారత్‌ నినదించారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య వ్వస్థకు పెనుముప్పుగా మారుతున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులను అడ్డుకునేందుకు .. వామపక్షా, ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసేందుకు కృషి చేస్తామని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. a

కాంగ్రెస్ దేశ వ్యాప్త ర్యాలీ.

ఢిల్లీ : దళితులు అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం చేపడుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏడాది పాటు ఈ కార్యక్రమం జరుపాలని కాంగ్రెస్ సూచించింది. తాల్కటోరా స్టేడియ నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, వివిధ రాష్ట్రాల కార్యకర్తలు పాల్గొననున్నారు. 

కాంగ్రెస్ దేశ వ్యాప్త ర్యాలీ.

ఢిల్లీ : దళితులు అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం చేపడుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏడాది పాటు ఈ కార్యక్రమం జరుపాలని కాంగ్రెస్ సూచించింది. తాల్కటోరా స్టేడియ నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, వివిధ రాష్ట్రాల కార్యకర్తలు పాల్గొననున్నారు. 

ఆనం వివేకా పరిస్థితి విషమం ?

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ’కిమ్స్‌’ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఆనం వివేకా పరిస్థితి విషమం ?

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ’కిమ్స్‌’ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ముంబై పై రాజస్థాన్ విజయం...

ఢిల్లీ : ఐపీఎల్‌లో రాజస్థాన్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పై రాయల్స్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి విక్టరీ కొట్టింది. 

'క్రీడలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి''...

చెన్నై : రాష్ర్టంలోని పరిస్థితుల వల్లే తమిళులకు క్రికెట్‌ దూరమైందని అభిప్రాయపడ్డారు నటుడు కమల్ హాసన్. క్రీడలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి... కానీ తమిళులు అందుకు భిన్నంగా స్పందించటం వల్లే ఐపీఎల్‌ మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చిందన్నారు. చెన్నైలో జరిగిన చర్చలో కమల్‌ పలు విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. భవిష్యత్‌లో తమిళులకు క్రికెట్‌తో అనుబంధం పెరిగే అవకాశం ఉందన్నారు. 

ముగిసిన సీపీఎం జాతీయ మహాసభలు...

హైదరాబాద్ : నగరంలో సీపీఎం 22వ జాతీయ మహాసభలు ముగిశాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఏచూరి ఎన్నికయ్యారు. 95 మందితో సీపీఎం కేంద్ర కమిటీ ఎన్నికైంది. తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్‌.వీరయ్య, చెరుపల్లి సీతారాములకు స్థానం దక్కగా నాగయ్యకు సీసీలో స్థానం దక్కింది. ప్రత్యేక ఆహ్వానితురాలుగా మల్లు స్వరాజ్యంలు నియమితులయ్యారు.

వైసీపీలోకి కన్నా లక్ష్మీ నారాయణ ?

గుంటూరు : మాజీ మంత్రి ,బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీమారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరులోని తన నివాసంలో అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఇప్పటికే కన్నాతో వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నారు. త్వరలో కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 

టిటిడి పదవి వద్దన్న ఎమ్మెల్యే అనిత...

విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్‌గా తన నియామకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తన కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం ఇష్టం లేదని లేఖలో రాశారు. తాను హిందువునని, తన ఇష్టదైవం వేంకటేశ్వర స్వామి అని ఆమె స్పష్టం చేశారు.

'పవన్ పై దూషణలకు దిగడం సరికాదు'...

చిత్తూరు : కాస్టింగ్‌ కౌచ్‌పై ఎమ్మెల్యే రోజా స్పందించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రోజా... 27 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న తనకు ఎవరూ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే వ్యక్తిగత లాభం కోసం ఇండస్ట్రీలోని వారిపై.. పవన్‌ కల్యాణ్‌పై దూషణలకు దిగడం సరికాదన్నారు రోజా. 

కరీంనగర్‌ టీఆర్ఎస్ సమావేశం రసాభాస...

కరీంనగర్‌ : జిల్లాలో టీఆర్ఎస్ సమావేశం పర్యటన రసాభాసగా మారింది. నిజామాబాద్ ఎంపీ కవిత పర్యటన సందర్భంగా రాయికల్‌ మండలం, మైలాపూర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో... ఎంపీపీ పడాల పూర్ణిమ, జడ్పీటీసీ మధ్య తోపులాట జరగడంతో... ఉద్రిక్తత నెలకొంది. 

13 మంది మావోయిస్టుల మృతి...

ఢిల్లీ : చత్తీస్‌గడ్ - మహారాష్ర్ట సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్పీఎఫ్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 13మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతులు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. గడ్చిరోలి జిల్లా బోరియా అటవీ ప్రాంతంలోని ఏటపల్లి వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 

Don't Miss