Activities calendar

24 April 2018

21:56 - April 24, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా పోరాటాన్ని విపక్షపార్టీలు తీవ్రతరం చేశాయి. ప్రత్యేకహోదా సాధన సమితి పిలుపుమేరకు వామపక్షాల నేతలు విజయవాడలో కొవ్వొత్తులు చేతబట్టి ఆందోళనకు దిగారు. నాలుగేళ్లపాటు ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు ఇవాళ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేకహోదా అంటూ హడివిడి చేస్తున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఏపికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

స్వచ్చందంగా బిజిలీ బంద్‌లో వ్యాపార సంస్థలు
ఏపీలో ప్రత్యేకహోదా పోరు ఉధృతం అయింది. కేంద్రం దిగివచ్చేవరకు ఉద్యమం ఆగదన్న లెఫ్ట్‌పార్టీలు, విపక్షాలు వివిధ రూపాల్లో ఆందోళనకు దిగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా బిజిలీ బంద్‌ నిర్వహించారు. ప్రత్యేకహోదా సాధన సమితి పిలుపుమేరకు విపక్షపార్టీలు బిజిలీ బంద్‌కు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. వామపక్షాల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి అరగంట పాటు ప్రజలు లైట్లు ఆపేసి నిరసన తెలిపారు. వ్యాపారసంస్థలు స్వచ్చందంగా బిజిలీ బంద్‌లో పాల్గొని.. మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలపై నిరసన ప్రకటించారు. ఇప్పటికైన నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతాం : వామపక్షాలు
ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా.. మోదీ ప్రభుత్వం వంచన మానుకోలేదని సీపీఎం, సీపీఐ, వైసీపీ, ఆమ్‌ఆద్మీపార్టీ నేతలు విమర్శించారు. గవర్నర్‌ ను చంద్రబాబువద్దకు రాయబారిగా పంపించి ప్రత్యేకమోదా డిమాండ్‌ను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని... ఈ కుట్రలను ప్రజలు అడ్డుకుంటారని సీపీఎం నేత బాబురావు స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు మేల్కోవాలని విపక్షపార్టీలు డిమాండ్‌ చేశాయి. ప్రత్యేకహోదా సాధనలో ప్రజలతో కలిసిరాకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రత్యేకహోదా సాధన పోరాటాన్ని రాష్ట్రంలోని గ్రామగ్రామని విస్తరించి.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని వామపక్ష నేతలు తేల్చిచెప్పారు. 

21:52 - April 24, 2018

తూర్పుగోదావరి : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీ అమలుపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరం మరింత పెంచారు. ఏపీకి న్యాయం చేస్తారని బీజేపీతో పొత్తు పెట్టుకొంటే ప్రధాని మోదీ అన్యాయం చేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైసీపీతో ప్రధాని మోదీ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారని తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి సభలో ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్‌ కలుపుతున్నారని జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు స్పందిస్తూ... గవర్నర్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా టీడీపీ పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. look.

చంద్రక్రాంతి పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ద్వారపూడిలో జరిగిన పంచాయతీరాజ్‌ దినోత్సవంలో పాల్గొన్న బాబు.. చంద్రక్రాంతి పథకాన్ని ప్రారంభించారు. దేశంలో వంద శాతం ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చిన మొదటి జిల్లాగా తూర్పుగోదావరిని ప్రకటించారు. రైల్వే స్టేషన్‌ వద్ద నిర్మించిన వంతెనను ప్రారంభించారు.

టీడీపీని దెబ్బ కొట్టేందుకు ఆర్థిక నేరస్థులతో కేంద్రం ఎత్తులు..
ద్వారపూడిలో జరిగిస సభలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రానికి న్యాయం చేస్తుందని బీజేపీతో పెట్టుకొంటే.. చివరికి మోదీ కూడా మోసం చేశారని మండిపడ్డారు. దగా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపుచేస్తున్న టీడీపీని దెబ్బ కొట్టేందుకు ఆర్థిక నేరస్థులకు నిలయమైన వైసీపీ నాయకులతో మోదీ చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

బీజేపీ ఆటలు ఏపీలో సాగవు : చంద్రబాబు
కేసులు ఉన్న వైసీపీ నాయకులు ప్రధాని లొంగతీసుకొని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు బడ్జెట్లలో మోసం చేసిన కేంద్రంపై ధర్మపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్‌ కలుపుతున్నారని జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు స్పందిస్తూ.. గవర్నర్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా టీడీపీ పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్న బీజేపీ ఆటలు ఏపీలో సాగవన్నారు.

మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రక్షణ లేదు : చంద్రబాబు
మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మతసామరస్యం మృగ్యమైందని.. జమ్ము-కశ్మీర్‌లోని కథువా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అచారకాలు, అకృత్యాలు, దురుగతాలను చంద్రబాబు ప్రస్తావించారు. ఆర్థిక నేరస్థులు, అవినీతిపరుల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడంతోనే బ్యాంకు మోసాలు పెరిగిపోయి, దివాలాతీసే స్థాయికి దిగజారాయని ప్రధాని మోదీ సర్కారుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. 

21:40 - April 24, 2018

రాజస్థాన్ : వివాదాస్పద ఆధ్యాత్మక గురువు ఆశారాంపై ఉన్న అత్యాచారం అభియోగం కేసులో జోధ్‌పూర్‌ ప్రత్యేక కోర్టు రేపు కీలకమైన తీర్పు వెలువరించనుంది. తీర్పు నేపథ్యంలో డేరా బాబా లాంటి ఘటన జరగకుండా రాజస్థాన్, గుజరాత్, హర్యానాలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. జోధ్‌పూర్‌ పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఆశారాంపై ఫిర్యాదు చేసిన బాధితురాలి నివాసం వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. 2012లో జోధ్‌పూర్‌ సమీపంలోని ఆశ్రమంలో మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. పోస్కో చట్టం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆశారాం 2013 ఆగస్టు 31 నుంచి జోథ్‌పూర్ జైలులోనే ఉన్నారు. అత్యాచారం కేసులో ఆయన దోషిగా తేలితే గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది.

21:39 - April 24, 2018

ఆంధ్ర రాష్టంల అంగవాడీల ఆందోళన..హామీలు అమలు జేయాల్నని డిమాండ్.కరెంటి కథలు జెప్పిన నీళ్ల మంత్రిగారు..అసలు కథ బైటవెట్టిన సద్వుకున్నోళ్లు..ముఖ్యమంత్రి జిల్లాల తాగునీళ్ల తన్లాట..మాటలు కోటలు దాటే.. కాళ్లు తంగెళ్లు..పెండ్లి పిలగాని తాన పోలీసాయిన కట్నం..చెక్ పోస్టు కాడ అడ్డంగ బుక్కైన అధికారి. వరంగల్ జిల్లా పొంటి వడగండ్ల వానలు..మార్కెట్ల పొంట మోసపోయిన రైతులు.కంపిని కాలినంకొచ్చిన కార్మిక మంత్రి..ఉచిత సలహా ఇచ్చి అవుతలవడ్డడు గిసువంటి మస్తు ముచ్చట్లు మీకోసమే మల్లన్న తాత మోసుకొచ్చిండు..మరి చూడుండ్రి..

21:38 - April 24, 2018

కెనడా : సెంట్రల్‌ టొరంటోలో ఓ ట్రక్కు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పాదచారుల్ని ఢీకొట్టిన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. పోలీసులు సదరు వాహనాన్ని వెంబడించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను టొరొంటోలోని రిచ్‌మండ్‌హిల్‌కు చెందిన పాతికేళ్ల ఎలెక్‌ మినాసియన్‌గా గుర్తించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌కు ఉగ్రవాదంతో సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు, వీడియో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

21:24 - April 24, 2018

ఢిల్లీ : సోషల్‌ మీడియాను కూడా హిందుత్వవాదం ప్రభావితం చేస్తోందా? అంటే ఔననే చెప్పాలి. కథువా ఘటనపై సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. స్వరభాస్కర్‌ హిందువులను అవమానిస్తున్నారంటూ కొందరు వ్యతిరేక ప్రచారం చేశారు. దీనికి భయపడ్డ ఈ కామర్స్‌ కంపెనీ అమేజాన్‌-- బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న స్వరభాస్కర్‌ను తప్పించింది. ఇంతకీ సోషల్‌ మీడియాలో ఆమె చేసిన పోస్ట్‌ ఏంటి?

సోషల్‌ మీడియాలో పోస్టర్‌ ఫోటో షేర్‌ చేసిన బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యోదంతం భారత దేశాన్ని కుదిపేసింది. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించారు. ఇందులో భాగంగా బాలీవుడ్ తారలు పోస్టర్‌ ఫోటో షేర్‌ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ కూడా కథువా ఘటనపై సోషల్‌నెట్‌వర్క్‌లో స్పందించారు. 'నేనో హిందుస్థానీని... దేవీ ఆలయంలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సిగ్గు పడుతున్నానంటూ' పోస్టర్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేశారు.

స్వరభాస్కర్‌ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
స్వరభాస్కర్‌ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పోస్ట్‌లో దేవి స్థానం అని రాయడాన్ని సెంటిమెంట్‌గా భావించిన నెటిజన్లు తప్పుపట్టారు. అంతటితో ఊరుకోలేదు...ఆమె నటించిన 'వీరే దీ వెడ్డింగ్‌' సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు.

ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ 'అజ్‌నబీ షహర్‌ కి గుగ్‌లీ'కి స్వర ప్రచారం

స్వరభాస్కర్‌పై వ్యతిరేక ప్రచారం ఈ కామర్స్‌ సంస్థ అమేజాన్‌పై కూడా ప్రభావం పడింది. స్వరభాస్కర్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ 'అజ్‌నబీ షహర్‌ కి గుగ్‌లీ'కి ప్రచారం చేస్తున్నారు. తాజాగా స్వరభాస్కర్ ఓ మ్యూజిక్ సిస్టం కొనాలని ఉందంటూ చేసిన ట్వీట్‌కు అమెజాన్ రిప్లయ్ ఇస్తూ రీట్వీట్ చేసింది. దీనిపై కొందరు అమేజాన్‌ను టార్గెట్‌ చేశారు. హిందువులను అవమానిస్తూ మాట్లాడిన స్వర భాస్కర్‌ను ప్రమోట్ చేసినంతకాలం అమెజాన్‌ను వాడమంటూ హెచ్చరించారు. ఏళ్ల తరబడి యాప్ వాడుతున్నవారు కూడా బై చెప్పేస్తూ డిలిట్ మెసేజిలు పంపుతున్నారు. దీంతో అమెజాన్ వెంటనే స్వరభాస్కర్ రిప్లయ్‌ ట్వీట్‌ను డిలిట్ చేసేసింది. నెటిజన్లు మాత్రం బాయ్ కాట్ అమెజాన్ పేరిట క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. దీంతో అమేజాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా స్వరభాస్కర్‌ను తప్పించింది.

స్వరభాస్కర్‌కు వ్యతిరేక ప్రచారమంటు విమర్శలు..
కొందరు మాత్రం స్వరభాస్కర్ చేసినదానిలో తప్పేం లేదన్నారు. స్వర భాస్కర్‌కు అమేజాన్‌ మద్దతుగా నిలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కొంతమంది కస్టమర్లు దూరమైనంత మాత్రాన కంపెనీకి నష్టం జరగదన్నారు. ఓ పథకం ప్రకారమే హిందుత్వవాదులు స్వరభాస్కర్‌కు వ్యతిరేక ప్రచారం మొదలెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

21:08 - April 24, 2018

నల్లగొండ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పూర్తయితే మొదటగా ఫలితం పొందేది సూర్యాపేట జిల్లానే అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. వాయువేగంతో కాళేశ్వరం, మెడిగడ్డ ప్రాజెక్ట్‌ పనులు జరుగుతున్నాయని రోజుకు 25 వేల మంది కార్మికులతో 7 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేస్తూ ప్రపంచ రికార్డ్‌ సృష్టించామని హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డితో కలిసి.. సూర్యాపేట జిల్లా పరిధిలోని ఎస్ఆర్ఎస్ పీ కాలువలను హరీష్‌రావు పరిశీలించారు. అంతకు ముందు ఆయన.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్‌ గ్రామంలో గోదాంల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

20:59 - April 24, 2018

హైదరాబాద్ : జాతీయ మహాసభలు విజయవంతం కావడంతో సీపీఎంలో జోష్‌ కనిపిస్తోంది. ముఖ్యంగా బహిరంగ సభకు జనం ఊహించని విధంగా ప్రజలు తరలిరావడంపై మార్క్సిస్ట్‌ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇదే ఊపుతో రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని కామ్రేడ్స్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంతోపాటు బీఎల్‌ఎఫ్‌ లక్ష్యాలను గ్రామస్థాయిల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
ప్రజల్లోకి దూసుకెళుతున్న ఎర్రజెండా పార్టీ
హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం జాతీయ మహాసభలు విజయవంతం కావడంతో... నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం ప్రజల్లోకి సీపీఎం దూసుకెళుతోందని.. ఈ విషయం హైదరాబాద్‌ బహిరంగసభ ద్వారా ప్రస్ఫుటంగా కనిపించిందని మార్క్సిస్ట్‌ నేతలు అంటున్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికలకు కార్యాచరణ రూపొందించే పనిలో కామ్రేడ్లు బీజీగా మారారు.

సీపీఎంపై బీజేపీ అక్కసు !సీపీఎంకు బలం లేకుంటే బీజేపీకి భయం ఎందుకు ?
సీపీఎం జాతీయ మహాసభలు విజయవంతం కావడంతో.. బీజేపి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని కామ్రేడ్లు విమర్శిస్తున్నారు. సీపీఎంకు భవిష్యత్‌ లేదంటూ కమలంపార్టీనేతలు విమర్శలు చేయడంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివిరాఘవులు మండిపడ్డారు. బలం లేని సీపీఎం గురించి బీజేపీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. బహిరంగసభకు యువత భారీగా తరలిరావడమే సీపీఎం బలం పెరిగిందన్న దానికి నిదర్శనమని రాఘవులు స్పష్టం చేశారు.

సీపీఎం సభకు ప్రజల నుంచి భారీ స్పందన
సరూర్‌నగర్‌ బహిరంగసభకు అనుకున్న దానికంటే ప్రజల నుంచి భారీస్థాయలో స్పందన కనిపించిందని కామ్రేడ్లు అంటున్నారు. ఇదే ఊపుతో గ్రామస్థాయలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ నెల 28 ,29 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాల్లో కార్యాచరణ రూపొందిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో పార్టీబలోపేతానికి నాంది
ఈ మహాసభలు విజయవంతం కావడం తెలుగురాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఉపయోగ పడుతుందని సీపీఎం నేతలు భావిస్తున్నారు. మహాసభల స్ఫూర్తితో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించడానికి పార్టీ నేతలు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణలో బీల్‌ఎల్‌ఎఫ్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తామంటున్నారు. 

20:05 - April 24, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ హీరోలతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి హీరోలతో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో బాలకృష్ణ, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అరవింద్, నాగబాబు, నానిలతో పాటు 20మంది పెద్ద హీరోలతో చిరంజీవి పాల్గొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై కలకలం రేగిన సంగతి తెలిసిందే. కాగా మీడియాకు సినిమాకు సంబంధించి కంటెంట్ ను అంటే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ వంటి కీలక అంశాలను ఇవ్వకూడదనే విషయంలో ఈ భేటీలో చర్చిస్తున్నట్లుగా సమాచారం. కాగా గతకొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ విషయంలో మీడియాలు చేసిన రాద్ధాంతంతో సినిమా పరిశ్రమలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం ఇంకా కొనసాగుతునే వుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి పెద్ద హీరోలతో రహస్య సమావేశం జరపటంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

హీరోలతో మెగాస్టార్ చిరంజీవి భేటీ?!..

హైదరాబాద్ : టాలీవుడ్ హీరోలతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి హీరోలతో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో బాలకృష్ణ, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అరవింద్, నాగబాబు, నానిలతో పాటు 20మంది పెద్ద హీరోలతో చిరంజీవి పాల్గొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై కలకలం రేగిన సంగతి తెలిసిందే.

19:46 - April 24, 2018

ఢిల్లీ గవర్నర్ నరసింహన్ ఏం చెప్పనున్నారు?..

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అయిన నరసింహన్ ఢిల్లీకి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు ఢిల్లీ రావాలని కేంద్రం పిలుపు మేరకు నరసింహన్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోను, హోంశాఖ మంత్రితోను నరసింహన్ సమావేశం కానున్న తరుణంలో మూడు రోజు పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. దీంతో తెలుగురాష్ట్రాల గురించి నరసింహన్ ఎటువంటి విషయాలను తెలుపనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

19:30 - April 24, 2018
19:26 - April 24, 2018

జమ్ముకశ్మీర్‌ : నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాకిస్తాన్‌కు భారత బలగాలు దీటైన జవాబు చెబుతున్నాయి. సోమవారం పాకిస్తాన్‌ సైన్యం పూంఛ్‌ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో భారత పోస్టులే లక్ష్యంగా కాల్పులు జరిపాయి. దీనికి బదులుగా భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్‌ రేంజర్లు హతమయ్యారు. పాకిస్తాన్‌ పోస్టులు, బంకర్లకు భారీగా నష్టం సంభవించింది. ఓవైపు కాల్పుల జరుపుతూ మరోవైపు సరిహద్దు నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్‌ చేసిన పన్నాగాన్ని ఆర్మీ భగ్నం చేసింది. 

19:22 - April 24, 2018

హైదరాబాద్‌ : జంట నగరాలైన హైదరాబాద్ , సికింద్రాబాద్‌లో బాలకార్మికులతో పనిచేస్తున్న సంస్థలపై ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫైర్‌ డిపార్ట్‌మెంట్ అధికారులు... రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ భవాని నగర్‌లోని గాజుల పరిశ్రమలో 19 మందిని, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బీహార్‌ నుంచి వచ్చిన 17 మంది బాలకార్మికులతో పాటు మరో ఐదుగురిని కలిపి మొత్తం 43 మంది చిన్నారులను పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. వీరిని వారి కుటుంబసభ్యుల వద్దకు చేర్చేందుకు... సికింద్రాబాద్‌ నుండి దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా బీహార్‌కు తీసుకెళ్లారు.

19:19 - April 24, 2018

విశాఖపట్నం : కథువాలో జరిగిన దారుణాన్ని ఖండిస్తూ విశాఖలో ప్రగతి శీల మహిళ సంఘం అధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఫోక్సో చట్టాన్ని హడావుడిగా ఆర్డినెన్స్‌ల ద్వారా మార్పు చెయ్యడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని ఆరోపించారు. మహిళలకు రక్షణగా ఉన్న చట్టాలను సమగ్రంగా అమలు చేస్తే అర్డినెన్సులు తీసుకు రావల్సిన అవసరం లేదన్నారు. జస్టిస్ వర్మ కమిషన్ రికమెండెషన్స్‌ను ప్రభుత్వం ఎందుకు అమలు చెయ్యడం లేదని మహిళా నేతలు ప్రశ్నించారు.

బెజయవాడలో బిజిలీ బంద్ ..

విజయవాడ : ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీలో వివిధ సంఘాల, పార్టీలు బిజిలీ బంద్ ను పాటిస్తున్నాయి. రాత్రి 7.00 నుండి 7.30 వరకూ అంటే అరగంటపాటు అందరూ స్వచ్ఛంధంగా లైట్లు ఆర్పి నిరసన తెలిపాలని వామపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ పార్టీలు, సంఘాలు బిజిలీ బంద్ లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఈ బ్లాక్ డే ను నిర్వహిస్తున్నామని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు పేర్కొన్నారు.

19:15 - April 24, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీలో వివిధ సంఘాల, పార్టీలు బిజిలీ బంద్ ను పాటిస్తున్నాయి. రాత్రి 7.00 నుండి 7.30 వరకూ అంటే అరగంటపాటు అందరూ స్వచ్ఛంధంగా లైట్లు ఆర్పి నిరసన తెలిపాలని వామపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ పార్టీలు, సంఘాలు బిజిలీ బంద్ లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఈ బ్లాక్ డే ను నిర్వహిస్తున్నామని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు పేర్కొన్నారు. వివిధ రకాల రూపంలో నిరసనలను కొనసాగిస్తామని మధు స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాలు పాటు పాలకులు ప్రజలను మభ్య పెట్టిందనీ..నిరసన తెలిపిన వారిపై నిర్భంధ చర్యలు చేసిందని మధు విమర్శించారు. అటువంటి పాలకులను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. బీజేపీ దిగి వచ్చేంతవరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. నరేంద్రమోదీ నక్క నిరసన చేశారని ఎద్దేవా చేశారు.ప్రత్యేక హోదా పట్ల చంద్రబాబు నాయుడుకి చిత్రశుద్ధి లేదనీ..రూ.30 కోట్లు ప్రజల ధనం ఖర్చుపెట్టి చంద్రబాబు నాయుడు దీక్ష చేశారనీ..కాగ్ అక్షింతలు వేసినా చంద్రబాబుకు బుద్ధిరాదని విమర్శించారు. కాగా బిజిలీ బంద్ కు లైట్లు ఆర్పి నగరవాసులు మద్ధతు తెలిపారు. 

19:01 - April 24, 2018
18:59 - April 24, 2018
18:57 - April 24, 2018

శ్రీకాకుళం : టీడీపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మోదీతో మిలాఖత్ అయ్యిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్‌కు, మోదీకి మధ్య రాయబారిగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ లోక్‌సభ ఎంపీలతో రాజీనామా డ్రామా అడించి, రాజ్యసభ ఎంపీలను రాజీనామాలు చేయించకుండా రాయబారాలు నడుపుతున్నారని మంత్రి మండిపడ్డారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ మాస్టర్‌ ఆఫ్ డిస్ట్రాయింగ్‌ ఇండియాగా అభివర్ణించారు. కర్నాటక ఎన్నికల కారణంగా బీజేపీ ఏపీలోని ఏటియంలలో కరెన్సీ కొరత సృష్టించిందని కేఈ ఆరోపించారు. ఇలా టీడీపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని తమ స్టైల్లో విమర్శిస్తున్నారు.  

18:54 - April 24, 2018

నెల్లూరు : ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించే వారిని చంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. బీజేపీ కొన్నాళ్లు కొనసాగితే ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లినట్లేనని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ మాస్టర్‌ ఆఫ్ డిస్ట్రాయింగ్‌ ఇండియాగా అభివర్ణించారు. కర్నాటక ఎన్నికల కారణంగా బీజేపీ ఏపీలోని ఏటియంలలో కరెన్సీ కొరత సృష్టించిందని కేఈ ఆరోపించారు.

బీజేపీకి కన్నా బై బై..

హైదరాబాద్ : మాజీ మంత్రి కన్నాలక్ష్మినారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రామ్ మాధవ్, సతీష్ జీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. రేపు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్ష పదవిపై కన్నా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకానొక సమయంలో అధ్యక్షుడి రేసులో ఆయన పేరు కూడా వినిపించింది. అయితే, ఆ తర్వాత ఆయనను దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో నిరాశకు గురైన కన్నా... చివరకు బీజేకి గుడ్ బై చెప్పారు. కన్నా రాజీనామాపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

పోలీసుల నిర్ణయం అభినందనీయం: శ్రీకాంత్

హైదరాబాద్ : క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని నటుడు శ్రీకాంత్ తెలిపారు.నగరంలో వెస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ను సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్ మాట్లాడుతు.. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న వెస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్ణయం అభినందనీమని శ్రీకాంత్ పేర్కొన్నారు. కాగా ఈ టోర్నమెంట్ లో 74 జట్లు పాల్గొంటున్నాయి.

ఓడి గెలిచినవాడే అసలైన ఛాంపియన్: సీపీ

హైదరాబాద్ : ఛాంపియన్ అంటే కేవలం గెలిచినవాడు కాదని.. ఓటమి తరువాత గెలిచినవాడే అసలైన ఛాంపియన్ అని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నగరంలో వెస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ను సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతు..ఛాంపియన్ అంటే కేవలం గెలిచినవాడు కాదని.. ఓటమి తరువాత గెలిచినవాడే అసలైన ఛాంపియన్ అని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ మొత్తం అభినందిస్తోందనీ..ప్రజలే మా పోలీసులకు బలమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్, మాజీ క్రికెటర్ అర్షద్ ఆయూబ్ పాల్గొన్నారు.

భారత్ కు ఇన్కాయిస్ హెచ్చరికలు..భయంలో విశాఖ!

విశాఖపట్నం : బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఆఫ్రికా తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల వల్ల మన దేశ తూర్పు తీరంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచండ అలలు తీర ప్రాంతాలపై విరుచుకుపడేందుకు దూసుకొస్తున్నాయి. 3 నుంచి 4 మీటర్ల ఎత్తులో ఈ రాకాసి అలలు విరుచుకుపడతాయని భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ ప్రాంతాలపై ఈ అలలు ప్రభావం చూపుతాయని తెలిపింది. 26వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుందని చెప్పింది.

17:59 - April 24, 2018

విజయనగరం : ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పేరొందిన పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వనం గుడిలో పైడితల్లి అమ్మవారికి పంచామ్రుతాభిషేకం జరిపించిన అనంతరం హుకుంపేట నుంచి అమ్మవారి ఘటాలను ఊరేగింపుగా చదురుగుడికి తీసుకువచ్చారు. విచిత్ర వేషధారణలతో, డప్పుల సందడితో ఉత్సాహంగా జరిగిన దేవర ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

17:52 - April 24, 2018

శ్రీకాకుళం : వేసవి తాపానికి అల్లాడిపోయిన శ్రీకాకుళం జిల్లా వాసులకు ఉపశమనం లభించింది. గరిష్ట ఉష్ణోగ్రతలతో అట్టుడికిపోయిన వారంతా అనుకోని అతిధి రూపంలో వచ్చిన వర్షంతో ఊరట చెందారు. ఒకేసారి వాతావరణం మారి జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటంతో సిక్కోలు వాసులు సేదతీరారు. శ్రీకాకుళంతో పాటు పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.  

17:47 - April 24, 2018

హైదరాబద్ : బీజేపీ నేతలు కమ్యూనిస్టులపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాంగ్రెస్‌ అవినీతిలో కమ్యూనిస్టులకు వాటా వుందని బీజేపీ అనడం హాస్యాస్పదమన్నారు. 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఒక్క కమ్యూనిస్ట్‌ ముఖ్యమంత్రిపైన, మంత్రులపైన అవినీతి ఆరోపణలు లేవన్నారు. మోదీ ప్రభుత్వం అవినీతిపరులను అందలమెక్కిస్తుందని... కర్నాటక ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈరోజు రాత్రి 7 గంటల నుండి ఏడున్నర వరకు ఏపీలోని ప్రజలంతా తమ ఇళ్లలో కరెంట్‌ బంద్‌ చేసి నిరసన తెలపాలన్నారు రామకృష్ణ. 

17:42 - April 24, 2018

నెల్లూరు : సిటీ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సైకిల్ యాత్రలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. విభజన హామీల అమలు విషయంలో కుట్రలను ఎండగట్టి ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే సైకిల్ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా, బీజేపీ మానిఫెస్ట్‌లో పెట్టిన అంశాలు, విభజన చట్టంలో హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన మండిపడ్డారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఆంధ్ర ప్రజలను మోడీ ద్రోహం చేశారని నారాయణ విమర్శించారు. 

17:40 - April 24, 2018

నెల్లూరు : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిపై సర్వేపల్లి వైసీపీ MLA కాకాని గోవర్దన్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సోమిరెడ్డి తన ధన దాహానికి నెల్లూరు జిల్లాలోని విలువైన ప్రకృతి సిద్ధమైన అటవీ సంపదను దోచుకుంనేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని మండిపడ్డారు. రెండు వేల రెండు వందల ఎకరాల విలువైన సిలికా భూములను కాజేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని కాకాని ఆరోపించారు.  

17:38 - April 24, 2018

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్రం తేల్చి చెప్పిన తర్వాత ఉద్యమాలు చేయడం వృధా అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు చేస్తున్న హోదా ఉద్యమంలోకి ఉద్యోగులను లాగొద్దన్నారు. హోదా కోసం ఉద్యమిస్తున్న పార్టీలు 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని ఒప్పించి స్టేటస్‌ సాధిస్తామని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నాయని అశోక్‌బాబు ప్రశ్నించారు. 

17:35 - April 24, 2018

వరంగల్ : వర్థన్న పేట, రాయపర్తి మండల కేంద్రాల్లోని పలు గ్రామాల్లో అకాల వర్షంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. మామిడి, వరి, దాన్యం, మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయారు. వర్థన్నపేట మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడవడంతో... అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేపట్టారు.  

17:33 - April 24, 2018

పశ్చిమగోదావరి : ఏలూరు కలెక్టరేట్‌ వద్ద 104 కాంట్రాక్ట్‌ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన ఎనిమిదో రోజుకు చేరింది. 151 జీవోను అమలు చేయాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 104 సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు. 8 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 104 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 104 సేవలు నిలిచిపోయాయి. 180 రోజుల పాటు ప్రసూతి సెలవులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న మాకు ఎటువంటి భద్రతా లేదని వారు వాపోయారు. వారి డిమాండ్స్ అమలు చేయకుంటే మా ప్రాణాలను కూడా పణంగా పెట్టేందుకు సిద్ధంగా వున్నామని వారు స్పష్టం చేశారు. 

వివాహితపై అత్యాచారం..

గుంటూరు : గురజాలలో ఓ వివాహితలపై సైదులు అనే యువకుడు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో స్థానికంగా సంచలనం రేగింది. ఇంట్లో ఒంటిరిగా వుంటున్న ఓ వివాహితకు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్ర రక్త స్రావంతో పడి వుండగా గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా సదరు మహిళ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు పేర్కొంటున్నారు. పరారీలో వున్న సైదులుకోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వివాహితపై అత్యాచారం..

గుంటూరు : గురజాలలో ఓ వివాహితలపై సైదులు అనే యువకుడు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో స్థానికంగా సంచలనం రేగింది. ఇంట్లో ఒంటిరిగా వుంటున్న ఓ వివాహితకు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్ర రక్త స్రావంతో పడి వుండగా గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా సదరు మహిళ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు పేర్కొంటున్నారు. పరారీలో వున్న సైదులుకోసం పోలీసులు గాలిస్తున్నారు. 

17:22 - April 24, 2018

గుంటూరు : జిల్లాలోని గురజాలలో ఓ వివాహితపై అత్యంత పాశవిక చర్యలకు పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒంటిరిగా వుంటున్న ఓ వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్తతో వచ్చిన మనస్పర్ధతలతో విడిగా ఇద్దరు పిల్లలతో వుంటున్న ఓ వివాహితపై సమీపంలోవుంటున్న 18 సంవత్సరాల  షేక్ సైదులు అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా వున్న సదరు మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్త స్రావంతో పడి వున్న ఆమెపై ఆయుధంతో దాడికి తెగబడ్డాడు. అనంతరం సైదులు పరారయ్యాడు.  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ఆమెను చికిత్సన నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్కా సైదులు కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కాగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా వుందని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా గత కొంతకాలంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు పెరుగుతండటం ఆందోళన కలిగిస్తోంది. 

17:03 - April 24, 2018

విశాఖపట్నం : ఆఫ్రికా నుంచి వీస్తున్న ప్రచండ గాలులు ఇప్పుడు తీర ప్రాంత రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో రాకాసిఅలల తాకిడి ఉండొచ్చని 3రాష్ట్రాలను సునామి హెచ్చరికల సంస్థ హెచ్చరిస్తుంది. ప్రస్తుతం అండమాన్‌ తీరం నుంచి రాకాసి అలలు దూసుకు వస్తుండగా.. కేరళలో ఇప్పటివరకు వంద ఇళ్లు ధ్వంసమయ్యాయి.

తూర్పుతీరంలో అలజడి
ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా భారత తూర్పు తీరంలో భారీ అలలు ఎగసి పడే ప్రమాదముందని సునామీ హెచ్చరికల సంస్థ ..ఇన్ కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి 26 తేదీల వరకూ సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. భారత తూర్పు తీరంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌బంగా తీర ప్రాంతాల్లోని సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్ కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది.

అండమాన్‌ నుంచి దూసుకు వస్తున్న రాకాసి అలలు
ప్రస్తుతం అండమాన్ సముద్రం నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని ఇన్‌కాయిస్‌ వెల్లడించింది. అలలు దాదాపు 4 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశముందని స్పష్టం చేసింది. ఇవి తీరానికి చేరుకునే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలిపింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని.. తీరప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రత్యేకించి తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు అలలు చొచ్చుకువచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. సముద్ర తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఆఫ్రికాలో ప్రచండమైన గాలులు
ఆఫ్రికా సమీపంలో ప్రచండమైన గాలుల కారణంగా సముద్రంలో రాకాసి అలలు ఏర్పడ్డాయని.. ఇప్పటికే అలలు పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను తాకాయని ఇన్ కాయిస్ వెల్లడించింది. అరేబియా సముద్రంలోని ఆయా ప్రాంతాల్లో 4-5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లో పలు లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. కేరళలో వందకు పైగా ఇళ్లు సముద్రపు అలలు కారణంగా ధ్వంసమయ్యాయి.

రెండు రోజుల పాటు ప్రచండ అలల ప్రభావం
రాకాసి అలల ప్రభావం రెండురోజుల పాటు ఉంటుందని ఇన్‌కాస్‌ సంస్థ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల పాటు సముద్ర స్నానాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని తీరప్రాంత జిల్లాల యంత్రాంగానికి హెచ్చరికలతో కూడిన సూచనలు ఇచ్చింది. అదే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది.

16:46 - April 24, 2018

ఢిల్లీ : ప్రస్తుతం సినిమా పరిశ్రమాలో 'క్యాస్టింగ్ కౌచ్' సంచలనం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ పరిమితం కాలేదనీ..చట్టసభల్లో వంటి అన్ని రంగాలలోను క్యాస్టింగ్ కౌచ్ వుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి తెలిపారు. అత్యాచారాల విషయంలో ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే ప్రజాప్రతినిధులు చట్టాలను తీసుకొస్తున్నామనీ ఎన్ని చట్టాలు చేసిన మనుష్యులు మారటంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ చట్టాల వల్ల సమాజం మారదనీ చైతన్యంతోను..మహిళల పట్ల గౌరవభావం రావాలని ఆమె కోరారు. నోరు మూసుకుని మహిళలు వెళ్లిపోతున్నారని దాన్ని ఆసరాగా తీసుకుని వేధింపులు, హింసలకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆడపిల్ల గడప దాటి బైటకు వెళితే కించపరిచే లక్షణాలు సమాజంలో నెలకొన్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కనీసం తెలియని మహిళలపై కూడా మీడియా బురద చల్లి ఆనందం పొందుతోందని విమర్శించారు. రేప్ గురించి మీరేమనుకుంటున్నారని మమ్మల్ని అడుగుతుంటారని..కానీ దీనిపై వారికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. మహిళలు, ఆడపిల్లలు మీడియాకు ఎంటర్ టైన్ మెంట్స్ మా అని రేణుకా చౌదరి ప్రశ్నించారు.బిడ్డల్ని కనే యంత్రాలుగానే మహిళలు వుండాలా?అదేనా మహిళకున్న బాధ్యత అదేనా? అని ప్రశ్నించారు.

క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమించాల్సిన అవుసరముంది : రేణుకా చౌదరి
క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినిమా పరిశ్రమ లోనేకాదు చట్టం సభలైన పార్లమెంట్ లోను లేదా పనిప్రదేశాలలోను క్యాస్టించి కౌచ్ వుందంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక సినిమా పరిశ్రమకే పరిమితం కాలేదని చట్టసభల్లో కూడా పని ప్రదేశాలలో ఇటువంటివి జరుగుతుంటాయన్నారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం తీసుకురావాల్సిన అవుసముందని రేణుకా చౌదరి పేర్కొన్నారు.  

పార్లమెంట్ లో 'క్యాస్టింగ్ కౌచ్'!!..

ఢిల్లీ : ప్రస్తుతం సినిమా పరిశ్రమాలో 'క్యాస్టింగ్ కౌచ్' సంచలనం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలోనేకాదు చట్టం సభలైన పార్లమెంట్ , పనిప్రదేశాలలోను క్యాస్టించి కౌచ్ వుందంటు మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక సినిమా పరిశ్రమకే పరిమితం కాలేదని పని ప్రదేశాలలో ఇటువంటివి జరుగుతుంటాయన్నారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం తీసుకురావాల్సిన అవుసముందని రేణుకా చౌదరి పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ లోకి 'గద్దర్'కుమారుడు!!..

హైదరాబాద్ : ప్రజా గాయడకుడు గద్దర్ కుమారుడు కాంగ్రెస్ లో చేరనున్నారు. రేపు ఉదయం 11.30లకు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో గద్దర్ కుమారు సూర్యం కాంగ్రెస్ లోకి చేరనున్నారు. తన పాటలతో నృత్యాలతో రాష్ట్ర ఉద్యమంలో చైతన్యాన్ని రేకెత్తించిన గద్దర్ పాటు ఎంతటి ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. 

తుచ్ఛ రాజకీయాలు కాదు,స్వచ్చ రాజకీయాలు కావాలి : తమ్మినేని

హైదరాబాద్: సీపీఎం జాతీయ మహాసభలు విజయవంతమయిన సందర్భంగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతు..తుచ్చ రాజకీయాలు కాదు... స్వచ్ఛ రాజకీయాలు కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అందుకే బీజేపీ నాయకులు కలవరపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే బీఎల్‌ఎఫ్‌ అజెండా చాలా బలమైనదని, బహుజన రాజ్యాధికారమే మా అజెండా అన్నారు. వచ్చే మూడునెలల్లో మా అజెండాను గ్రామగ్రామానికి తీసుకెళ్తామని, ఎన్నికల అభ్యర్థులను సిద్ధం చేస్తామని తమ్మినేని పేర్కొన్నారు.

15:45 - April 24, 2018

ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ సంజయ్ దత్ జీవిత కథను ఆధారం చేసుకుని తీస్తున్న సంజూ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సంజయ్ దత్ రోల్‌ను రణ్‌బీర్ కపూర్ పోషిస్తున్నాడు. ఈ ఫిల్మ్‌ను రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంజయ్ తన జీవితంలో ఎదుర్కొన్న భిన్న పరిస్థితులను ఈ ఫిల్మ్‌లో చూపించనున్నారు. సినీ లైఫ్‌ను ఎలా ఎంజాయ్ చేశాడో.. అక్రమ ఆయుధాల కేసులో ఎలా జైలుకు వెళ్లాల్సి వచ్చిందో ఈ ఫిల్మ్‌లో ప్రజెంట్ చేయనున్నారు. దత్ జీవితంలోని వివిధ కోణాలను నవ్వుకునే రీతిలో తెరకెక్కించారు. ఈ సినిమాలో పరేశ్ రావల్, మనీషా కోయిరాలా, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్, దియా మీర్జా, విక్కీ కౌశల్, జిమ్ సార్బా, బోమన్ ఇరానీలు కూడా ఉన్నారు. 

ఆ ఘటన రిపీటవుతుందన్న సోము, చంపేస్తారా అన్న కేఈ..

అమరావతి : బీజేపీ నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు అలజడి రేపుతున్నాయి. 2004లో అలిపిరి ఘటన 2019లోనూ అదే రిపీట్ అవుతుందని బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తుండగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నిప్పులు చెరిగారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? బెదిరింపులకు దిగుతారా? అంటూ మండిపడ్డారు. ఈ ఉదయం కర్నూలులో విలేకరులతో మాట్లాడిన కేఈ, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే, అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.

భారత తీరంలో ప్రచండ గాలులు..

విశాఖపట్నం : భారత తూర్పు తీరంలో ప్రచండగాలులు వీస్తున్నాయి. ఆఫ్రికా నుండి సముద్రం వైపు వీస్తున్న ప్రచండ గాలులతో ఇప్పటికే అరేబియా సముద్రంలో 4 నుండి 5 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర,కర్నాటక తీర ప్రాంతాలల్లో నీరు భారీగా వచ్చి చొచ్చుకు వస్తోంది. ఈ ప్రచండ గాలలకు కేరళలో వందకు పైగా ఇళ్లు ధ్వంసం కాగా అరేబియా, హిందూ మహాసముద్రాలలో అలజడి సృష్టిస్తోంది. 

10టీవీ కథనానికి స్పందించిన ఎక్సైజ్ శాఖ..

హైదరాబాద్: 10టీవీ కథనానికి ఎక్సైజ్ స్పందించింది. అప్లాజ్ బార్ కు ఎక్సైజ్ శాక నోటీసులు పంపించింది. కుషాయిగూడలో పుట్ పాత్ పై కారు సృష్టించిన బీభత్సానికి ఓ నిరుపేద వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మద్యం సేవించిన యువతులు కారును ర్యాష్ గా నడిపి ఓ చిరువ్యాపారి మృతికి కారణమైన ఘటనలో 10టీవీ అప్లాజ్ బార్ లో నిబంధనలకు వ్యతిరేకంగా 19 సంవత్సరాల వయస్సువారికి మద్యం విక్రయిస్తున్న నేపథ్యాన్ని 10టీవీ సీసీ టీవీ పుటేజ్ ఆధారాలతో బార్ వద్ద నుండి ప్రసారం చేసిన నేపథ్యంలో స్పందించిన ఎక్సైజ్ శాఖ సదరు బార్ కు నోటీసులు పంపించింది.

15:14 - April 24, 2018

హైదరాబాద్ : 10టీవీ కథనానికి ఎక్సైజ్ స్పందించింది. అప్లాజ్ బార్ కు ఎక్సైజ్ శాక నోటీసులు పంపించింది. కుషాయిగూడలో పుట్ పాత్ పై కారు సృష్టించిన బీభత్సానికి ఓ నిరుపేద వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మద్యం సేవించిన యువతులు కారును ర్యాష్ గా నడిపి ఓ చిరువ్యాపారి మృతికి కారణమైన ఘటనలో 10టీవీ అప్లాజ్ బార్ లో నిబంధనలకు వ్యతిరేకంగా 19 సంవత్సరాల వయస్సువారికి మద్యం విక్రయిస్తున్న నేపథ్యాన్ని 10టీవీ సీసీ టీవీ పుటేజ్ ఆధారాలతో బార్ వద్ద నుండి ప్రసారం చేసిన నేపథ్యంలో స్పందించిన ఎక్సైజ్ శాఖ సదరు బార్ కు నోటీసులు పంపించింది. కాగా శ్రీనిధి కాలేజ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న నలుగురు అమ్మాయిలు మద్యం సేవించి కారును ర్యాష్ గా డ్రైవింగ్ చేసిన ఓనిరుపేద చిరువ్యాపారి మృతికి కారణమయ్యారు. ఈ నలుగురు యువతులలో ఒక అమ్మాయి నగరంలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐ కుమార్తె కావటంతో కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 

14:57 - April 24, 2018

సిద్ధిపేట : జిల్లాలో విషాదం జరిగింది. జిల్లాలోని కొత్తబస్టాండ్‌లో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఇద్దరినీ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రియుడు సంతోష్‌ రెడ్డి మృతి చెందగా, ప్రియురాలు రాణి పరిస్థితి విషమంగా ఉంది. అయితే వీరి కులాలు వేరు అయినందున తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

14:54 - April 24, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల సాధన కోసం ఈ రోజు బ్లాక్‌డేను నిర్వహిస్తున్నట్లు సీపీఎం ఏపీ కార్యదర్శి మధు తెలిపారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఏడున్నర వరకు అన్నివర్గాల ప్రజలు విద్యుత్‌ను నిలిపివేసి నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. హోదా, విభజన హామీల అమలు కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తామంటున్న మధు పేర్కొన్నారు. 

14:48 - April 24, 2018

మ‌హారాష్ట్ర : రాష్ట్రంలోని ని గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఇంద్రావతి నది వద్ద మరో 11 మంది నక్సల్స్ మృతదేహాలను గుర్తించారు. దీంతో గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారి సంఖ్య 33కు పెరిగింది. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టుల మృతిచెందగా.. ఆ ఎన్‌కౌంటర్ జరిగిన కొద్ది గంటల్లోనే అహేరీ తాలూకా రాజారాంఖన్లా అటవీప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. సోమవారం రాత్రి ఏడు-ఎనిమిది గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. మృతుల్లో దామన్ దళ కమాండర్ నందు ఉన్నట్టు తెలుస్తోంది.

14:26 - April 24, 2018

తు.గో : ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకొచ్చామని  సీఎం చంద్రబాబు అన్నారు. చంద్రకాంతి పథకం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 'మీ ఇంటికి నీళ్లు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్కూల్ బిల్డింగ్, అంగన్ వాడీలకు కాంపౌడ్ వాల్ నిర్మిస్తామని చెప్పారు. 2014 లో రాష్ట్ర విజభన జరిగిందని..హేతుబద్దత లేదని.. ఆదాయం లేదని..కష్టాలుతో ఉన్నామని చెప్పారు. డబ్బులను అనుసంధానం చేశామని చెప్పారు. అప్పటికంటే ఆదాయం తక్కువ..కానీ పనులు ఎక్కువగా చేశామన్నారు. పంటలు ఎండిపోకుండా కాపాడుతున్నామని చెప్పారు. కరెంట్ కొరత లేదన్నారు. భవిష్యత్ లో కరెంట్ రేట్లు పెంచబోమని చెప్పారు. కరెంట్ సమర్థ పెంచుతామన్నారు. ఆడబిడ్డలందరికీ వంట గ్యాస్ ఇచ్చామని తెలిపారు. అన్ని గ్రామాల్లో ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేశామని చెప్పారు. నీటి భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రూపాయికి కిలో బియ్య ఇస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే.,.. భీమా పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని. చెప్పారు. సహజ మరణం అయితే రెండు లక్షలు ఇస్తున్నామన్నారు. పెళ్లి కానుక కింద ఎస్సీ, మైనార్టీలకు 50 వేలు, ఎస్టీలకు 40 వేలు.., బీసీలకు 35 వేలు ఇస్తున్నామని చెప్పారు.

 

14:20 - April 24, 2018

హైదరాబాద్ : తమ మహాసభల తీర్మానాలు బీజేపీని కలవర పెట్టాయని...అందుకే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తాము బీజేపీపై రాజకీయ విమర్శలు చేశామని తెలిపారు. బూజు పట్టిన సీపీఎం గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. మహాసభ కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుందని..20 మంది కొత్త కార్యకర్తలను తీసుకుందన్నారు. 95 మంది కేంద్రకమిటీ, 17 మందితో పొలిట్ బ్యూరో ఎన్నుకుందని తెలిపారు. మతోన్మాదాన్ని ఓడించేందుకు అందరూ కలిసిన రావాలని పిలుపునిచ్చారు.

 

14:18 - April 24, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎర్రజెండాలదే భవిష్యత్ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాసభలు అద్భుతంగా జరిగాయని తెలిపారు. సభలు బాగా నిర్వహించారని తమకు పల్లెల నుంచి ఫోన్ లు వస్తున్నాయని చెప్పారు. యువత కమ్యూనిస్టుల వైపు ప్రధానంగా సీపీఎం వైపు చూస్తుందని...అందుకు రెడ్ షెర్ట్ వాలంటీర్ల కవాతులో పాల్గొన్న యువత నిదర్శనం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మహాసభల విజయవంతానికి ప్రజలతోపాటు ప్రతి పత్రిక, ప్రతి చానెల్ బాగా సహకరించాయని కొనియాడారు. మహాసభల జయప్రదానికి ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించిందన్నారు. హామీలు అమలులో, పరిపాలనలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు  వైఫల్యం చెందాయని విమర్శించారు. కేంద్రలోని బీజేపీ చేయరాని పనులు చేస్తోందన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కదిలిరావాలన్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో తుచ్చమైన రాజకీయాలు ఉన్నాయన్నారు. స్వచ్ఛ రాజకీయ వ్యవస్థను తీసుకావాలన్నారు. 28న తమ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గం సమావేశం ఉంటుందని, 29న రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందని.. బివి.రాఘవులు పాల్గొంటారని తెలిపారు. బీఎల్ ఎఫ్ బలోపేతానికి మే, జూన్, జులై మాసాల్లో కార్యాచర, ప్రణాళికను రచిస్తామన్నారు. రాబోయే కాలంలో బీఎల్ ఎఫ్ అధ్వర్యంలో కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడు బీఎల్ ఎఫ్ బలంగా లేదని...క్రమేణాబలం పుంజుకుంటుందన్నారు. అయితే బీఎల్ ఎఫ్ బలంగా లేకపోవచ్చు కానీ.. ఎజెండా చాలా బలైమందన్నారు. తమ నినాదం ప్రజల్లోకి చేరాలన్నారు. అన్ని పల్లెల్లోకి బీఎల్ ఎఫ్ నినాదం చేరే విధంగా కార్యక్రమాలు చేస్తామని అన్నారు.  

13:58 - April 24, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని గోపాలపురం మండలం భీమోలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పంచాయితీ ప్రెసిడెంట్‌, టీడీపీ నాయకులు తమ వర్గీయులతో దళితులు, బీసీలపై దాడికి దిగారు. నిన్న అర్ధరాత్రి అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దళితులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో 16 మంది గాయపడ్డారు. గాయపడ్డవారు గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇరు వర్గాల మధ్య కొంత కాలంగా భూ విషయంలో వివాదం నడుస్తుంది. ఈ వివాదంలో ఉన్న భూమి ఇరు వర్గాలకు చెందినట్లు పట్టాలు ఉండటమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. 

 

13:55 - April 24, 2018

హైదరాబాద్‌ : జడిమెట్ల పారిశ్రామికవాడలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్‌ గోదాంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సాల్వెంట్‌ డ్రమ్ములకు నిప్పు అంటుకొని  మంటలు  వ్యాపిస్తున్నాయి.

13:53 - April 24, 2018

సంగారెడ్డి : జిల్లా పటాన్‌చెరు మండలం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి రెండు గంటల నుంచి అగర్వాల్‌ రబ్బర్‌ పరిశ్రమ మంటల్లో కాలిపోతోంది. టైర్లకు మంటలు అంటుకోవడంతో అవి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. దాదాపు ఏడు ఫైరింజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.  పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. అగర్వాల్ పరిశ్రమ గోదాంలో జనవరిలో కూడా అగ్నిప్రమాదం సంభవించగా అప్పుడు ఛైర్మన్‌ గుండెపోటుతో చనిపోయారు. ఇపుడు అదే పరిశ్రమలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా కిలోమీటరు‌ మేర దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇప్పటి వరకు 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఎందరో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అగర్వాల్‌ రబ్బరు పరిశ్రమ అగ్నిప్రమాదంలో బుగ్గి కావడం పట్ల తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సంస్థ గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.30కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. దాని నుంచి తేరుకునేలోపే మరో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా వీలైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఐటియు రాష్ర్ట అధ్యక్షులు చుక్కా రాములు పరిశ్రమను సందర్శించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

పవన్‌ కళ్యాణ్ వరుస ట్వీట్లు

హైదరాబాద్ : ట్విట్టర్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడుతున్నారు. హిట్లర్ కాలంలో మారిన్ నిమోలర్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సినీ పెద్దలపై ఘాటుగా స్పందించారు. కమ్యూనిస్టుల జోలికి  వస్తే మాట్లాడలేదు..కారణంనేను కమ్యూనిస్టును కాదని, సోషలిస్టుల జోలికి వస్తే మాట్లాడలేదు కారణం నేను నోషలిస్టును కాదని, కార్మిక నేతల జోలికి వస్తే మాట్లాడలేదు కారణం నేను కార్మిక నేతను  కాదని, నా జోలికి వచ్చారు..అప్పుడు మాట్లా డేందుకు ఎవరూ లేరని... అన్న మార్టిన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెద్దల నిశ్శబ్ధాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా విమర్శించారు.

 

13:49 - April 24, 2018

హైదరాబాద్ : ట్విట్టర్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడుతున్నారు. హిట్లర్ కాలంలో మారిన్ నిమోలర్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సినీ పెద్దలపై ఘాటుగా స్పందించారు. కమ్యూనిస్టుల జోలికి  వస్తే మాట్లాడలేదు..కారణంనేను కమ్యూనిస్టును కాదని, సోషలిస్టుల జోలికి వస్తే మాట్లాడలేదు కారణం నేను నోషలిస్టును కాదని, కార్మిక నేతల జోలికి వస్తే మాట్లాడలేదు కారణం నేను కార్మిక నేతను  కాదని, నా జోలికి వచ్చారు..అప్పుడు మాట్లా డేందుకు ఎవరూ లేరని... అన్న మార్టిన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెద్దల నిశ్శబ్ధాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా విమర్శించారు.

 

13:46 - April 24, 2018

ఢిల్లీ : శుశ్రుత ట్రామా సెంటర్‌ ఆస్పత్రిలో డాక్టర్‌ నిర్వాకం వెలుగు చూసింది. తలకు గాయమై ఆస్పత్రిలో చేరిన ఓ రోగికి సీనియర్‌ వైద్యుడొకరు పొరపాటుగా కాలికి శస్త్ర చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి వర్గాలు రోగికి సరైన చికిత్సను అందించారు. అనంతరం సీనియర్‌ వైద్యుడిపై చర్యలు చేపట్టారు. పర్యవేక్షణ లేకుండా శస్త్ర చికిత్సలు చేయకూడదని సీనియర్‌ వైద్యుడిపై చర్యలు తీసుకున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపారు.  

 

13:42 - April 24, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలోని ఏజెన్సీప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. వేసవి ప్రారంభంలోనే... గిరిజనానికి చెలిమల నీరే దిక్కైంది.  గుక్కెడు మంచినీటి కోసం గిరి గ్రామాలు... పుట్టెడు కష్టాలు పడుతున్నాయి.  బిందెడు నీటికోసం మహిళలు మైళ్లదూరం నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రజల నీటికష్టాలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పచ్చని అడవి అందాలకు నెలవు. ఈ జిల్లా కోనసీమను తలపిస్తుంది.  ప్రాణహిత, పెనుగంగా, పెద్దవాగు లాంటి నదులు ఉన్నాయి. ప్రజల తాగునీరు, సాగునీరు కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు నియోజకవర్గ ప్రజలకు మాత్రం నీటికష్టాలు తప్పడం లేదు. ఎన్నో నదులున్నా  ప్రజల తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. 

వేసవికాలం ఇప్పుడిప్పుడే మొదలైంది. కానీ ఏజెన్సీ ప్రాంతం మాత్రం తాగునీటితో అల్లాడుతోంది. బెజ్జూరు మండల కేంద్రంతోపాటు జైహింద్‌పూర్‌, తలాయి, కుష్నేపల్లిలో నీటికష్టాలు వర్ణనాతీతం. గుక్కెడు నీటికోసం ప్రజలు వాగులలో సెలిమలు తోడుకుని తెచ్చుకుంటున్నారు. కౌటాల మండలం పాత కన్నెపల్లిలో గ్రామం మొత్తానికి ఒకే వ్యవసాయ బావి దిక్కైంది. గ్రామంతా ఆ బావి నుంచే తాగునీరు తెచ్చుకుంటున్నారు. మూరుమూల మండలమైన దహేగాంలోని మొట్లగూడ, రాంపూర్‌ గ్రామప్రజల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. మంచినీటి కోసం మహిళలు 3 నుంచి 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి పెద్దవాగులో చెలిమలు తోడుకుని నీరు తెచ్చుకుంటూ దాహం తీర్చుకుంటున్నారు. 
 
మార్చి మాసం నుంచే ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఈ గ్రామాల్లో బోర్లు వేసినా పనిచేయడం లేదు.  వాగులో చెలిమల ద్వారా తెచ్చుకున్న నీటిని తాగి తరచూ రోగాల బారిన పడుతున్నారు. పలువురు చనిపోయారు కూడా. తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారుల దృష్టికి గ్రామస్తులు పలుమార్లు తీసుకెళ్లారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరెలా ఉంటుందో తలచుకుని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బోథ్‌ నియోజకవర్గంలోనూ తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి గుక్కెడు నీరు లేక అవస్థలు పడుతున్నారు. ప్రతి వేసవికాలంలోనూ ఇక్కడ నీటిఎద్దడి ఉంటోంది.  బోర్లు ఉన్నా.. అందులో నీరులేక పనిచేయవు.  పొచ్చెర్లలో ఎడ్లబండ్ల ద్వారా శివారులోని బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోనూ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.  జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని ఖండాల, ఖానాపూర్‌ గ్రామాల్లో చుక్కనీరు దొరకని పరిస్థితి నెలకొంది. తాగునీటి కోసం ప్రజలు  గుట్టలు దిగి మరీ తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మాంగ్లి, కేబీ కాలనీ, ధర్మూగూడలో మంచినీటి కటకట ఏర్పడింది.  మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి ఇప్పటికే మొదలైంది.

ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గుక్కెడు నీటికోసం మనుషులే అల్లాడుతోంటే.. ఇక మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. వాగులు, కుంటలు ఎండిపోవడంతో మూగజీవాలు నీరులేక అల్లాడుతున్నాయి. కొంతమంది వాటిని అమ్మేస్తున్నారు. గ్రామాల్లో నీటితొట్టెలు నిర్మించినా వాటిలోనీరు లేకపోవడంతో పశువుల దాహార్తి తీరడం లేదు.  

తాగునీటి కష్టాలపై ప్రజలు పలుమార్లు అధికారులకు విన్నవించారు. వాటర్‌ ట్యాంకర్ల ద్వారా వేసవికాలం మంచినీటి సరఫరా చేయాలని కోరారు. అయినా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

13:35 - April 24, 2018

ప్రకాశం : జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతుండడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు మంచినీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. బావులు, చెలిమేల వద్ద బారులు తీరుతున్నారు. పట్టణాల్లోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. దీంతో మహిళలకు నీటి ట్యాంకర్ల దగ్గర బిందెల యుద్ధం తప్పడం లేదు. 

వేసవి ప్రారంభంలోనే ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వర్షాభావానికి తోడు, ముందు చూపు లేని అధికారుల నిర్వాకంతో  ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.  ఇక గ్రామాల్లోనైతే నీటి కోసం చెలిమెలు, బావుల వద్ద జనం బారులు తీరుతున్నారు. 

పట్టణాల్లోనూ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రమైన  ఒంగోలుతోపాటు ఇతర పట్టణాల్లోనూ  మంచినీటి కటకట ఏర్పడింది. చాలా కాలనీలకు మంచినీటి సరఫరానే లేదు. వారానికి ఒకసారి ట్యాంకర్లతో నీటిసరఫరా చేస్తున్నారు. దీంతో ట్యాంకర్‌ రాగానే జనం నీటికోసం ఎగబడుతున్నారు. మహిళలు బిందెలతో యుద్ధమే చేస్తున్నారు. సరిపడ నీరుదొరకక అధికారులపై మహిళలు మండిపడుతున్నారు. పలుచోట్ల ఖాళీ బిందెలతో నిరసన తెలియజేస్తున్నారు. 

ప్రకాశం జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. సాధారణం కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది.  ఉదయం 10 గంటల నుంచి జనం బయటికి రావలంటే భయపడుతున్నారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరెలా ఉంటుందోన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో బలంగా వీస్తున్న వడగాలులకు వృద్ధులు చనిపోతున్నారు. 

వర్షాభావ పరిస్థితులతో ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ప్రాజెక్ట్‌లు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి.  దీంతో కోట్లు వెచ్చించి నిర్మించిన రక్షిత మంచి నీటి పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. అయితే జనం వాటర్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడిపై ఎలాంటి ముందుచూపు లేకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు అంటున్నారు. తమ తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. 

12:53 - April 24, 2018

విజయనగరం : జిల్లాలో ప్రజాప్రతినిధుల అండతో కబ్జారాయుళ్లు చేలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములు యథేచ్చగా కబ్జాకు గురవుతున్నాయి. అధికారులకు ముడుపుల ఎర చూపుతూ...కబ్జాల పర్వం కొనసాగిస్తున్నారు. పార్వతీపురంలో  ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న తీరుపై 10టీవీ కథనం..

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. రెవెన్యూ డివిజన్‌ హెడ్‌ క్వార్టర్‌గా ఉన్న పార్వతీపురం ఏజెన్సీ ముఖద్వారం కూడా.  ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న ఈ పట్టణంలో భూముల ధరలు అమాంతం  పెరిగాయి. భవిష్యత్‌లో పార్వతీపురం కేంద్రం నూతన జిల్లా ఏర్పడనుందన్న ప్రచారంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అటు ఒడిషాను, ఇటు ఏపీని కలుపుతున్న పార్వతీపురం వాణిజ్యకేంద్రంగానూ అభివృద్ధి చెందుతోంది. దీంతో ఈ ప్రాంతంలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని జనం తలుస్తున్నారు. సామాన్యుడి సొంతింటి కలను కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. భూముల ధరలు విపరీతంగా పెంచేశారు.  మూడేళ్ల కిందట 1500 రూపాయలున్న గజం భూమి... ఇప్పుడు ఏకంగా 20వేలకు  పెరిగిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదే అదనుగా రియల్టర్లు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములనూ కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. 

పార్వతీపురం నడిబొడ్డునున్న కామయ్యబంద భూమిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. పురపాలక సంఘానికి చెందిన కామయ్యబందలో  సర్వేనంబర్‌... 337లో 13.57 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో వీఆర్వోగా పనిచేసిన ఓ వ్యక్తి కబ్జా చేశాడు.  కబ్జా చేసిన భూమిని వేరే వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించాడు. ఇది గమనించిన మున్సిపల్‌ యంత్రాంగం ఆక్రమణలను అడ్డుకుంది. కబ్జాదారుడు మాత్రం ఆ భూమి  తనదేనంటూ కోర్టుకు వెళ్లాడు. కానీ అతడికి కోర్టులో చుక్కెదురైంది. అయినా మున్సిపల్‌ అధికారులు మాత్రం కబ్జాకు గురైన భూమిని తిరిగి వెనక్కి తీసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.  

కబ్జాకు గురైన  భూముల్లో నిర్మాణాలు కూడా జరిగాయి.  అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా అధికారులు వారికి ఇప్పటి వరకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు.  వాస్తవానికి ఇళ్లులేని నిరుపేదలకు ఆ భూములను కేటాయించాలని సీపీఎంతోపాటు ప్రజాసంఘాలు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.  కానీ అధికారులు మాత్రం అసలు ఆ భూముల జోలికి పోయేందుకే వెనుకాడుతున్నారు. కామయ్యబంద కబ్జాపై ఎప్పటికప్పుడు వివాదాలు,  ఆరోపణలు వెల్లువెత్తుతున్నా... మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు మాత్రం కిమ్మనడం లేదు. రాజకీయ నేతల అండదండలతోపాటు... అవినీతి అధికారులు కబ్జాదారులకు కొమ్ముకాస్తుండటంతోనే కబ్జాకు గురైన కామయ్యబందకు విముక్తి కలగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మరో కబ్జాపర్వంపైనా అధికారులు కిమ్మనకుండా ఉంటున్నారు. వరహలాగెడ్డ సర్వేనంబర్‌ 363,364లో సుమారు 3ఎకరాల భూమిని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కబ్జాచేసి ప్లాట్లుగా మార్చేశాడు. ఈ కబ్జా వ్యవహారంలో ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్‌ ఉద్యోగి గంజి లక్ష్మినాయుడు పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. రహదారికి ఆనుకొని ఉన్న మున్సిపల్‌ క్వార్టర్స్‌ ఉద్యోగులు నివాసం ఉండటానికి ప్రభుత్వం ఇచ్చింది. ఉద్యోగ విరమణ పొందిన వెంటనే ఆ క్వార్టర్స్‌ను ఉద్యోగులు మున్సిపాలిటీకి అప్పగించాలి. కానీ చాలామంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత కూడా సొంత ఆస్తిలా అనుభవిస్తున్నారే తప్ప మున్సిపాలిటీకి అప్పగించడం లేదు. దాదాపు పార్వతీపురంలో 30 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే రక్షించుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని సీపీఎం నాయకులు మండిపడుతున్నారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణల వెనుకు ఓ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.  రిటైర్డ్‌ వీఆర్వో కుమారుడైన ఆయన ప్రస్తుతం పురపాలక సంఘంలో ఓ కీలక పదవిలో ఉన్నారు.  పార్వతీపురంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కబ్జా అయినా.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఆయనగారి ప్రమేయం ఉంటుందన్నది ప్రజల ఆరోపణ. కామయ్యబంద కబ్జాలోనూ ఆయనగారిదే ప్రధానపాత్రని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని వాటిని పేదలకు పంపిణీ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

12:41 - April 24, 2018

చిత్తూరు : జననేత అధినేత పవన్‌ కల్యాణ్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఆధిపత్యానికి తెరదించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. 
చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయ పర్యటన 
గుంటూరులో నిర్వహించిన ఆవిర్భావ సభ తర్వాత జోష్‌ మీద ఉన్న పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టూర్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
పవన్‌ వ్యూహాత్మక అడుగులు
ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన పవన్‌... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటున్నారని.. ఆయకు వ్యతిరేకంగా గళం విప్పారు. అటువంటి చంద్రబాబు సొంత జిల్లా నుంచి తన రాజకీయ పర్యటనను చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన కొందరు జనసేన నేతలు.. పవన్‌తో భేటీ అయ్యారు. వీరిలో భూబాధితులు కూడా ఉన్నారు.  జిల్లాలో చోటుచేసుకొంటున్న రాజకీయ పరిణామాలు, టీడీపీ నాయకల పోకడలు గురించి వపన్‌ దృష్టికి తెచ్చారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు సాగిస్తున్న భూందందాల ఆధారాలను పవన్‌కు అందచేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై చలించిన పవన్‌ కల్యాణ్‌..  టీడీపీ నేతల భూదందాలను ఎట్టగట్టేందుకు చిత్తూరు జిల్లా పర్యటనకు ప్రణాళికు సిద్ధం చేసుకొంటున్నారు. 
పవన్‌ కల్యాణ్‌... నేరుగా విమర్శనాస్త్రాలు 
టీడీపీపై అప్పుడప్పుడూ ప్రత్యక్షంగా, ఎక్కువసార్లు ట్వీట్ల ద్వారా విరుచుకుపడుతున్న పవన్‌ కల్యాణ్‌... ఇప్పుడు నేరుగా విమర్శనాస్త్రాలను సంధించేందుకు సన్నద్ధమవుతున్నారు. హోదా పోరులో భాగంగా వామపక్షాలతో కలిసి... అనంతపురం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని  ముందుగా నిర్ణయించినా... ఈనెల 16న హోదా సాధన సమితి బంద్‌తో ర్యాలీలను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జనసేన బలోపేతం కోసం జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. 

 

దంపతలు ఆత్మహత్య

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు రమణయ్య, సరస్వతి ఒకే తాడుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

 

12:22 - April 24, 2018

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది.  వృద్ధ దంపతులు రమణయ్య, సరస్వతి  ఒకే తాడుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

 

12:20 - April 24, 2018

హైదరాబాద్ : సీఎంతో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి భేటీ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం సీఎంతో అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి భేటీ కానున్నారు. శోభానాగిరెడ్డి వర్ధంతి కావడంతో ఈ రోజు సమావేశానికి హాజరు కాలేనని అఖిల ప్రియ తెలిపారు. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య రోజురోజుకూ విభేదాలు ముదురుతుండటంతో.. ఇద్దరిని అమరావతి రావాలని సీఎం ఆదేశించారు. 

 

ఇద్దరు చిన్నారులు కిడ్నాప్

కరీంనగర్‌ : జిల్లా జమ్మికుంటలో కిడ్నాప్‌ వ్యవహారం కలకలం రేపింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కవలపిల్లలు ఇంటి ముందు ఆడుకుంటుండగా కొందరు వ్యక్తులు వీరిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. చిన్నారులను ఎత్తుకొని పరుగులు తీస్తుండగా చిన్నారులు అరవడంతో గ్రామస్థులు అప్రమత్తమై కిడ్నాపర్‌లలో ఒకరిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్‌ను విచారించగా పిల్లలను వేరే రాష్ట్రానికి తరలిస్తున్నట్లు చెప్పాడు. 

 

బాలానగర్‌లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : బాలానగర్‌ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. టిబ్‌కాన్‌ కంపెనీలో ప్రమాదవశాత్తు కెపాసిటర్‌ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కంపెనీలో పని చేస్తున్న యువతికి మంటలు అంటుకున్నాయి. మంటల్లో 80 శాతం కాలిపోయింది యువతి. దీంతో గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ యాజమాన్యం యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీ నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మంటల్లో కాలిపోయిందని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

 

12:08 - April 24, 2018

కరీంనగర్‌ : జిల్లాలోని జమ్మికుంటలో కిడ్నాప్‌ వ్యవహారం కలకలం రేపింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కవలపిల్లలు ఇంటి ముందు ఆడుకుంటుండగా కొందరు వ్యక్తులు వీరిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. చిన్నారులను ఎత్తుకొని పరుగులు తీస్తుండగా చిన్నారులు అరవడంతో గ్రామస్థులు అప్రమత్తమై కిడ్నాపర్‌లలో ఒకరిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్‌ను విచారించగా పిల్లలను వేరే రాష్ట్రానికి తరలిస్తున్నట్లు చెప్పాడు. 

 

12:06 - April 24, 2018

హైదరాబాద్ : బాలానగర్‌ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. టిబ్‌కాన్‌ కంపెనీలో ప్రమాదవశాత్తు కెపాసిటర్‌ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కంపెనీలో పని చేస్తున్న యువతికి మంటలు అంటుకున్నాయి. మంటల్లో 80 శాతం కాలిపోయింది యువతి. దీంతో గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ యాజమాన్యం యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీ నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మంటల్లో కాలిపోయిందని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

 

12:05 - April 24, 2018

సంగారెడ్డి : పటాన్‌చెరు పారిశ్రామకవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అగర్వాల్‌ రబ్బరు పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడు శబ్దాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. కిలోమీటరు మేర దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

11:39 - April 24, 2018

గుంటూరు : ఉండవల్లిలోని నివాసంలో ఈ రోజు సాయంత్రం చంద్రబాబుని పార్టీ నేతలు ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియ భేటీ కానున్నారు. రెండు రోజుల క్రితం ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఇరువురితో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ నెల 30న తిరుపతి సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో చర్చించనున్నారు. 

 

ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్ర : దండకారణ్యంలో మావోయిస్ట్‌లకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గడ్చిరోలీ జిల్లా అహెరి పోలీస్ డివిజన్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. రాజారాం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారు. రెండు రోజుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు.

 

11:35 - April 24, 2018

మహారాష్ట్ర : దండకారణ్యంలో మావోయిస్ట్‌లకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గడ్చిరోలీ జిల్లా అహెరి పోలీస్ డివిజన్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. రాజారాం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారు. రెండు రోజుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు.

 

11:32 - April 24, 2018

సూర్యాపేట : జిల్లాలో టీఆర్‌ఎస్‌.. తలంగాణ జాగృతి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. హరీష్‌రావు పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ అనుచరులు చించివేశారు. తిర్మలగిరి, ఆర్వపల్లి, వెలిశాల, తుంగతుర్తిలో ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. 

11:26 - April 24, 2018

హైదరాబాద్ : బాలానగర్‌ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. టిబ్‌కాన్‌ కంపెనీలో ప్రమాదవశాత్తు కెపాసిటర్‌ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కంపెనీలో పని చేస్తున్న యువతికి మంటలు అంటుకున్నాయి. మంటల్లో 80 శాతం కాలిపోయింది యువతి. దీంతో గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ యాజమాన్యం యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీ నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మంటల్లో కాలిపోయిందని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 
రాందేవ్‌గూడలో అగ్ని ప్రమాదం
గోల్కొండ పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని రాందేవ్‌ గూడలో అగ్నిప్రమాదం జరిగింది. కార్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు కారు అంతటా వ్యాపించాయి. దీంతో రోడ్డుపైనే కారు దగ్ధమైంది. 

 

11:23 - April 24, 2018

సంగారెడ్డి : పటాన్‌చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అగర్వాల్‌ రబ్బరు పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడు శబ్దాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. కిలోమీటరు మేర దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

 

11:19 - April 24, 2018

ఏపీ రాజకీయాలపై వక్తలు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా.. టీడీపీ, వైసీపీ పోరాటంపై చర్చించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైఎస్ ఆర్ సీపీ నేత కొండా రాఘవరెడ్డి, టీడీపీ నేత సూర్యప్రకాశ్, జనసేన అధినేత శ్రీధర్ 
పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:54 - April 24, 2018

వచ్చే నెలల్లో ప్రతి రైతుకు కొత్త పాస్ పుస్తకాలతో పాటు... ఎకరానికి నాలుగు వేల రూపాయలు సహాయం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం వల్ల ప్రస్తుతం రైతు పడుతున్న కష్టాలు గట్టెక్కిపోతాయాని, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరి దీనిలో ఉన్న వాస్తవం ఎంత? వ్యవసాయం లాభసాటిగా మారాలి అంటే, తీసుకోవలసిన చర్యలేంటి? అనే అంశంపై తెలంగాణ రైతు సంఘా నాయకులు బొంతల చంద్రారెడ్డి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

09:48 - April 24, 2018

ఢిల్లీ : ఐపీఎల్‌ 11లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మరో పరాజయం ఎదురైంది. రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఢిల్లీకి ఇది ఐదో ఓటమి.   మరోవైపు పంజాబ్‌ వరుసగా 4వ విజయం సాధించింది. టార్గెట్‌ చిన్నదైనా కీలక వికెట్లు చేజారడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. పంజాబ్‌ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఏ దశలోనూ నిలబడలేకపోయింది. స్వల్ప పరుగులకే టాప్ ఆర్డర్‌ కుప్పకూలింది. దీంతో ఐదో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

 

09:45 - April 24, 2018

ఢిల్లీ : భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌ ఓ పోస్ట్‌ చేశారు. పుట్టబోయే బిడ్డకు  మీర్జా మాలిక్‌ అనే పేరును ఖరారు చేసినట్టు తెలిపారు. ఈ పోస్ట్‌ను అభిమానుల నుంచి తెగ లైక్స్‌, కామెండ్స్‌ వచ్చాయి.  సానియా ఆ విషయాన్ని పంచుకున్నలోపే... 54 వేలమంది లైక్‌ చేశారు. మరో 1502 మంది కామెంట్స్‌ చేశారు. సానియాను అభిమానులు శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తారు. 

 

09:42 - April 24, 2018

హైదరాబాద్ : మద్యం మత్తులో నలుగురు యువతులు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి ఫుల్లుగా తాగి కారును ఓవర్‌స్పీడ్‌గా నడిపి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించారు. అక్కడే పడుకున్న ఓ వ్యక్తిపైకి కారు ఎక్కించడంతో అతను మృతి చెందాడు. మరోవ్యక్తికి గాయాలయ్యాయి. నలుగురు యువతులను తప్పించే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

హైదరాబాద్‌ కుషాయిగూడ డీఏఈ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 12గంటల ప్రాంతంలో ఏఎస్‌రావ్‌ నగర్ కాలనీలోని అప్‌ లాంజ్‌ బార్‌లో ఓ పార్టీకి హాజరైన ఈశాన్య రెడ్డి, సృజ‌న‌, అమృత‌, హారికారెడ్డి కారుని వేగంగా నడుపుతూ.. కుషాయిగూడ సమీపంలోని డీఎఈ కాలని వద్ద పుట్‌పాత్ పైకి ఎక్కించేశారు. ఆ సమయంలో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అశోక్, అత‌ని కుమారుడిపైకి కారు దూసుకెళ్లడంతో అశోక్‌ స్పాట్‌లోనే మృతి చెందాడు. షాపులో నిద్రిస్తున్న  అతని కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

కర్ణాటకకు చెందిన అశోక్‌... 12 ఏళ్లక్రితం కుటుంబసభ్యులతో కుషాయిగూడకు వచ్చి.. చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. రాత్రి పనిముగిసిన తర్వాత అక్కడే నిద్రించేవాడు. ఈక్రమంలో రాత్రి అతివేగంగా దూసుకు వచ్చిన కారు పుట్‌పాత్‌పై పడుకున్న అశోక్‌పైకి దూసుకెళ్లింది. తల వెన్ను భాగంలో తీవ్ర గాయాలు కావడంతో కొడుకు కళ్ల ముందే తండ్రి మృతి చెందాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఈశన్య రెడ్డి, సృజన, అమృత, సిఐ గంగారెడ్డి కూతురు హారికారెడ్డి ఉన్నట్లు కుషాయిగూడ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో ఒకరు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామన్నారు. డ్రైవింగ్ చేస్తున్న ఈశాన్య రెడ్డి మద్యం మత్తులో లేదని... కారు ఆ జాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించామన్నారు. నిందితులపై 304 ఏ సెక్షన్ కింద కేసునమోదు చేశామన్నారు.

మరోవైపు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలంలో కారు ప్రమాదం తర్వాత యువతులంతా తూగుతూ..సరిగా మాట్లడలేని స్థితిలో ఉన్నారని...పత్యక్ష సాక్షి మృతుడి కుమారుడు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారిది తప్పో.. అర్థరాత్రి వరకు మద్యం విక్రయాలు సాగించేందుకు అనుమతులు ఇస్తున్న ఏలికలది తప్పో తెలియదు కానీ.. డ్రంక్‌  అండ్‌ డ్రైవ్‌ ఓ నిండు ప్రాణాన్ని తీసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. 
 

08:45 - April 24, 2018

హైదరాబాద్ : కన్నడ నాట రాజకీయం హీటెక్కుతోంది. అక్కడి ప్రధాన పార్టీలు కత్తులు దూస్తుంటే.. బీజేపీని దెబ్బకొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మోదీని దెబ్బతీసేందుకు ఏ ఒక్క అవకాశం వచ్చినా వదల కూడదని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ
కర్నాటకలో అత్యధిక సంఖ్యలో తెలుగు వారు నివసిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువ. ఎన్నికల్లో వీరు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆంధ్రుల సత్తా ప్రధాని నరేంద్ర మోదీకి చూపాలని చంద్రబాబు ఇప్పటికే పావులు కదిపారు. 
నరేంద్రమోదీని టార్గెట్‌ చేసిన చంద్రబాబు
ఇటీవలే ప్రత్యేక హోదా విషయంలో కర్నాటకలోని తెలుగు వారు చంద్రబాబును కలువగా బీజేపీని ఓడించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నమ్మించి ద్రోహం చేసిన నరేంద్రమోదీకి కర్నాటక ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా గెలిచే వారికి ఓటు వేయాలని చెప్పారే కానీ ఏ పార్టీకి ఓటు వేయాలో మాత్రం చంద్రబాబు స్పష్టంగా చెప్పలేదు. అయితే గెలిచే వారికి ఓటు వేయమని చెప్పడం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని సూచించినట్లయింది. టీడీపీకి వ్యతిరేక పార్టీయైన కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు కానీ బీజేపీ ఓడిపోవాలనేదే చంద్రబాబు అభిమతం. బెంగళూరు సిటీ, ఏపీ బోర్డర్‌లోని జిల్లాల్లో తెలుగువారు, వారి బంధువులు అధికంగానే ఉన్నారు వీరందరిని ఉపయోగించి మోదీకి తన సత్తా చూపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పురందేశ్వరిని రంగంలోకి దింపిన బీజేపీ
మరోవైపు  కర్నాటకలో తెలుగు వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకుగాను ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ నేతలు రంగంలోకి దింపారు. దాదాపు నాలుగు నెలలుగా కర్నాటకలో మకాం వేసిన పురందేశ్వరి..... ఎన్టీఆర్‌ అభిమానుల ఓట్లు బీజేపీ పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు వంటి సెంట్‌మెంట్‌లతో తెలుగు వారికి కళ్లెం వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇటువంటి  ప్రయత్నాలన్నీ ఎన్డీఏ నుండి వైదొలగక ముందునుంచే చంద్రబాబు చేస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. గుజరాత్‌లో కూడా బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని మంత్రి నారా లోకేష్‌, తన ఇద్దరు మిత్రులకు డబ్బులు ఇచ్చి గుజరాత్‌కు పంపారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.  
ఆంధ్రులు ఎవరిని అందలం ఎక్కిస్తారో ? 
ఏది ఏమైనా చంద్రబాబు అక్కడి తెలుగువారికి బీజేపిని ఓడించమని సూచించటం బహిరంగ రహస్యమే... ఏపీ ప్రజల్లో కూడా ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ బాగా ఉండటంతో కాగల కార్యం గందర్వులే తీర్చినట్లు భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ప్రభుత్వ పరంగా వైఫల్యాలు, ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న బీజేపికి కర్నాటకలోని తెలుగువారి ఓట్లు మింగుడుపడటం లేదు. మరి కర్ణాటకలో ఆంధ్రులు తమ సత్తా ఏమాత్రం చూపుతారో ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి. 

 

08:36 - April 24, 2018

విశాఖ : సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలతో ఉత్తరాంధ్రకు తలమానికంగా నిలుస్తున్న విమ్స్‌ ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ను కార్పొరేట్‌ ఆస్పత్రులకు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందుకు కోసం కన్సల్టెంట్స్‌ను నియమించేందుకు ప్రభుత్వం జారీ చేసిన 33వ నంబర్‌ జీవో  వివాదాస్పదమవుతోంది. 
ప్రభుత్వరంగలో ప్రతిష్టాత్మక ఆస్పత్రి విమ్స్‌
విశాఖపట్నంలో కేజీహెచ్‌ తర్వాత.. ప్రభుత్వరంగలో ప్రతిష్టాత్మక ఆస్పత్రి విమ్స్‌. సూపర్‌ స్పెషాలిటీ వైద్యంతో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు సేవలు అందిస్తున్న విమ్స్‌ను ఇప్పుడు ప్రైవేటీకరించే దిశగా పాలకులు పావులు కదుపుతున్నారు. విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 32 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు  ఉన్నాయి. వీటిలో ఎనిమిది విభాగాలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై అధ్యయనానికి కన్సల్టెంట్లను నియమించేందుకు వైద్యారోగ్య శాఖ జారీ చేసిన 33వ నంబర్‌ జీవో ఆధారంగా ఈనెల 1న టెండర్లు పిలిచారు. ఏప్రిల్‌ 11తో టెండర్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో.. ఈనెల 26న తెరవనున్నారు. ఇప్పుడు ఈ అంశం వివాదాస్పదంగా మారింది. 
విమ్స్‌ లో ప్రస్తుతం 500 పడకలు 
కేజీహెచ్‌పై ఒత్తిడి తగ్గేందుకు విమ్స్‌ నిర్మించారు. ప్రస్తుతం 500 పడకలు అందుబాటులో ఉన్నాయి. వందలాది మందికి సేవలు అందిస్తోంది. విమ్స్‌ ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఇది మొదటిసారికాదు. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా కన్సల్టెంట్లను నియమించింది. అప్పట్లో దీనికి వ్యతిరేంగా విపక్షాలు భారీ స్థాయిలో ఉద్యమించడంతో ఈ ప్రయత్నాలను విరమించుకుంది. ఇప్పుడు మరోసారి కూడా ప్రైవేటీకరణ ప్రయత్నం చేయడంపై ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీని వెనుక  కొందరు ప్రభుత్వ పెద్దలతోపాటు అధికార టీడీపీ నేతల హస్తం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విమ్స్‌లో ఖాళీగా ఉన్న 90 ఎకరాల విలువైన భూమిపై కొన్ని కార్పొరేట్‌ సంస్థలు కన్నేశాయి. దీని విలువ 2,400 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ భూమిని లీజు పేరుతో చౌకగా కొట్టేసేందుకు కొందరు బడా బాబులు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకొని, పావులు కదపడంతో ప్రైవేటీకరణ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 
విమ్స్‌ను ప్రైవేటీకరిస్తే పేదలకు కార్పొరేట్‌ ఆరోగ్యం దూరం
విమ్స్‌ను ప్రైవేటీకరిస్తే పేదలకు కార్పొరేట్‌ ఆరోగ్యం దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విమ్స్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోపోతే తీవ్రపరిణామాలు తప్పవని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. విమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులంతా డిప్యుటేషన్‌పై వచ్చినవారే. వైద్య సిబ్బందిది కూడా ఇదే పరిస్థితి. పూర్తి స్థాయి వైద్యారోగ్య సిబ్బందిని నియమించి... ప్రభుత్వరంగంలోనే దీనిని కొనసాగించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 
విమ్స్‌ను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదు : టీడీపీ ప్రజాప్రతినిధులు 
మరోవైపు విమ్స్‌ను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని టీడీపీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామంటున్నారు. విమ్స్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకొంటుదా? లేదా మొండికేసి ముందుకెళ్తుందో చూడాలి.

 

08:32 - April 24, 2018

జగిత్యాల : వారుండేది పూరి గూడిసెల్లో.. నిత్యం ఊర్లూ తిరుగతూ కుంటుంబాన్ని పోషించుకుంటారు. అయినా వారి గుడిసెలు ఏసీ ఉన్నంత చల్లగా ఉంటాయి. గుడిసెల్లో ఏసీలేంటనీ ఆశ్చర్యపోతున్నారా.. మండుతున్న ఎండలకు గుడిసెల్లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో మనమూ ఓ లుక్కేద్దాం.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని సాయిరాం కాలనీలో నిరుపేద కుటుంబాలు నివాసముంటున్నాయి. ఊరూరూ తిరుగుతూ బెలూన్లు అమ్ముకుంటూ ఉపాధి పొందుతుంటారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఎండ తీవత్రను తట్టుకునేందుకు వారు అష్టకష్టాలు పడుతున్నారు.

ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు వీరు బీడి కంపెనీలతో పాటు రైతుల వద్ద గన్నీసంచులను సేకరించి వాటిని గుడిసెలపై ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల ఇంట్లో చల్లదనం  ఉండేలా చూసుకుంటున్నారు. వడదెబ్బ నుంచి వారి పిల్లలను కాపాడుకుంటూ హాయిగా ఉంటున్నారు. 

ప్రభుత్వం స్వచ్ఛతను పాటించాలని పదేపదే చెబుతుండటంతో వీరు స్వచ్ఛభారత్‌లో భాగస్వాములుగా  చేరి.. గుడిసెల ముందు మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించుకొని స్వచ్ఛతకు పాటుపడుతున్నారు. విన్నూత ఆలోచనతో గన్నీ సంచులతో తయారు చేసిన గుడిసెలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గుడిసెలకు గన్నీ సంచులు ఏర్పాటు చేసుకుని ఎండ నుండి రక్షణను కల్పించకుంటూనే..స్వచ్ఛతకు పాటుపడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

08:25 - April 24, 2018

తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళన చేపట్టారు. తమ సొమ్ము తక్షణం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను జప్తుచేసుకున్న ప్రభుత్వం... తమ డిపాజిట్లను చెల్లించడంలో జాప్యం చేస్తోందని బాధితులు ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం బినామీల పేరుమీద ఉన్న ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవడంలేదంటూ ప్రశ్నించారు. తక్షణం తమకు న్యాయం చేయకుంటే.. సీఎం ఇంటిని, సచివాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

 

08:19 - April 24, 2018

కర్నూలు : రాష్ట్ర బీజేపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం కర్నూలులో సైకిల్‌ ర్యాలీ నిర్వహించిన మోహన్‌రెడ్డి... బీజేపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకుల వైఖరిని ఎస్వీ మోహన్‌రెడ్డి తప్పుపట్టారు. 

08:05 - April 24, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఇవాళ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఇవాళ, రేపు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో నరసింహన్‌ భేటీ అవుతారు.  ఏపీలోని పాలన, రాజకీయ పరిస్థితులపై ఆయన కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.  ఈనెల 26న ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.  కేంద్రంలో, ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

07:59 - April 24, 2018

తూర్పుగోదావరి : రాష్ట్ర విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటేనే బీజేపీతో కలిసి పనిచేశామని ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు  అన్నారు. హోదా కుదరదు.. ప్యాకేజీ ఇస్తామంటే రాష్ట్ర భవిష్యత్‌ దృష్టిలో ఉంచుకుని ఒప్పుకున్నామని తెలిపారు. కానీ బీజేపీ ప్రభుత్వం హోదా, ప్యాకేజీ ఇవ్వకుండా 5 కోట్ల మంది తెలుగువారిని మోసం చేసిందని విమర్శించారు.  కాకినాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..  తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు ఏ పార్టీకి లేదని చెప్పారు. 

07:56 - April 24, 2018

కర్నూలు : ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి మీద రాళ్ల దాడిపై టీడీపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య ఎన్నిసార్లు రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయిందని హైకమాండ్‌ భావిస్తోంది. సుబ్బారెడ్డిపై దాడిని చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇవాల అమరావతి రావాల్సిందిగా అఖిలప్రియ, సుబ్బారెడ్డిలను చంద్రబాబు ఆదేశించారు. 

 

నేడు సూర్యపేటలో మంత్రులు హరీష్, జగదీష్ రెడ్డి పర్యటన

సూర్యపేట : పట్టణంలో నేడు మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

నేడు సూర్యపేటలో మంత్రులు హరీష్, జగదీష్ రెడ్డి పర్యటన

సూర్యపేట : పట్టణంలో నేడు మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

నేడు చిత్తూరు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ

అమరావతి : నేడు చిత్తూరు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. 30న నిర్వహించనున్న తిరుపతి బహిరంగ సభపై చర్చించనున్నారు. 

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ విజయం

ఐపీఎల్ 11 : ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ విజయం సాధించింది. ఢిల్లీ నిర్దిష్ట 20 వోవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్దిష్ట 20 వోవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 

 

Don't Miss